Activities calendar

20 February 2016

సీఎం చంద్రబాబుతో ముగిసిన కర్నూలు జిల్లా టిటిపి నేతల భేటీ

విజయవాడ : సీఎం చంద్రబాబుతో కర్నూలు జిల్లా టిటిపి నేతల సమావేశం ముగిసింది. భూమా నాగిరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నామని వైసిపి నేత శిల్పా బ్రదర్స్ తెలిపారు. దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో కొనసాగుతున్న చంద్రబాబు భేటీ

విజయవాడ : కర్నూలు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. భూమా నాగిరెడ్డి వ్యవహారంపై... విజయవాడలో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం కేఈతో పాటు జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం.. రాత్రి 7గంటలకు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రాత్రికి భూమా నాగిరెడ్డి... చంద్రబాబును కలిసే అవకాశముంది.

17:20 - February 20, 2016

వరంగల్ : సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ మేడారం జాతరకు రాకపోవడం దారుణమని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క- సారక్క జాతరలో ఆయన పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. గిరిజనుల విశ్వాసాలను ఆచారాలను ప్రతిబింబించేలా ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జాతరను జాతీయ ఉత్సవంగా భావించి చరిత్రను, విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.     

 

జాట్ల ఆందోళన విరమింపజేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలం : సీపీఎం

ఢిల్లీ : హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారడంపై సిపిఎం పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసు కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, చాలామంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాలను సిపిఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. జాట్ల ఆందోళన కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో సామాన్య జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని పొలిట్‌ బ్యూరో పేర్కొంది. జాట్ల ఆందోళనను విరమింపజేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

హీటెక్కిన కర్నూలు జిల్లా రాజకీయాలు

కర్నూలు : జిల్లా రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. వైసిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపిలోకి వెళ్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భూమాను టిడిపిలోకి వెళ్లకుండా వైసిపి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాసేపటి క్రితమే భూమా నాగిరెడ్డితో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయి చర్చలు జరిపారు. అయితే పార్టీలో కొనసాగడంపై భూమా వైవీకి హామీ ఇవ్వలేదని సమాచారం. భూమా పార్టీ మారడంపై టిడిపి మైండ్ గేమ్‌ ఆడుతోందని ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. భూమా వైసిపిలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. టిడిపి చేసే దుష్పృచారాన్ని నమ్మోద్దని వైవీ అన్నారు.

17:08 - February 20, 2016

కర్నూలు : జిల్లా రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. వైసిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపిలోకి వెళ్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భూమాను టిడిపిలోకి వెళ్లకుండా వైసిపి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాసేపటి క్రితమే భూమా నాగిరెడ్డితో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయి చర్చలు జరిపారు. అయితే పార్టీలో కొనసాగడంపై భూమా వైవీకి హామీ ఇవ్వలేదని సమాచారం. భూమా పార్టీ మారడంపై టిడిపి మైండ్ గేమ్‌ ఆడుతోందని ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. భూమా వైసిపిలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. టిడిపి చేసే దుష్పృచారాన్ని నమ్మోద్దని వైవీ అన్నారు. జగన్‌ను భూమా ఎప్పుడైనా కలిసే స్వేచ్చ ఉందన్నారు. 

 

17:03 - February 20, 2016

ఢిల్లీ : హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారడంపై సిపిఎం పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసు కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, చాలామంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాలను సిపిఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. జాట్ల ఆందోళన కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో సామాన్య జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని పొలిట్‌ బ్యూరో పేర్కొంది. జాట్ల ఆందోళనను విరమింపజేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ప్రభుత్వ ద్వంద వైఖరి విధానం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడింది. బిజెపి నేతలు కుల, మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చే యత్నం చేస్తున్నారని ఆరోపించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేసింది.

16:46 - February 20, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు తలచుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అనేక మంది ఆపార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అవసరమయితే జగన్ ప్రభుత్వాన్ని కూలదోస్తామనడం వెనక సీఎం కావాలనే దురాశ ఉందని ఆరోపించారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. మరికొందరు వైసీపీ నేతలు టీడీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

నల్లగొండ జిల్లా నాగార్జున సమీపంలో అగ్నిప్రమాదం...

నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్‌ సమీపంలోని సుంకిశాల మూలతండ గ్రామం దగ్గర్లో శనివారం అడవికి నిప్పు అంటుకుంది.  సమాచారం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

జాట్‌ కులస్థుల ఆందోళనతో ప్రయాణికుల అవస్థలు

చంఢీఘడ్ : హర్యానాలో జాట్‌ కులస్థుల ఆందోళనతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలను ఆందోళన కారులు అడ్డగించడంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆందోళనకారులు పోలీస్‌ స్టేషన్‌ బిల్డింగ్‌లను కూడా వదిలిపెట్టడం లేదు. మెహం ప్రాంతంలో పోలీస్‌ భవనానికి నిప్పంటించారు. దీనితో పాటు ఓ పెట్రోల్‌ పంపుపై కూడా దాడికి పాల్పడ్డారు. రోహ్‌టక్‌, జింద్‌, హిసార్‌, పానిపట్‌, సోనీపట్‌ జిల్లాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి రోహ్‌టక్‌, బివానీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దానితో పాటు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను కూడా జారీ చేశారు.

విశాఖ జిల్లాలో పోలీసుల తనిఖీలు

విశాఖ : జిల్లాలో మాడుగుల ఘాట్‌రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల గంజాయి,  రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా సరిహద్దు నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం.

యూపీలో రైలు ప్రమాదం..

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ముఖల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రమాదం జరిగింది. అర్చనా ఎక్స్ ప్రెస్‌ జనరల్‌ బోగీ ఒకటి పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు ప్రయాణికులకు గాయలయ్యారు. ముఘల్‌ సరాయ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించిన సందర్భంగా ఓ బోగీ పట్టాలు తప్పడంతో గందరగోళం నెలకొంది. దాని కారణంగా జరిగిన తోపులాటలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గాయాల పాలైన వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి చేర్చారు. గాయపడిన వారిలో ఒక మహిళ, ఒక యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన అర్చనా ఎక్స్ ప్రెస్‌ పాట్నా నుంచి జమ్మూ తావి వెలుతోంది.

 

సీమ అభివృద్ధి చెందాలంటే నీళ్లు రావాలి : ప్రకాశ్ కారత్

తిరుపతి : రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సీమకు నీళ్లు రావాలని..ప్రాజెక్టులు రావాలని అవి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. రాయలసీమను పూర్తిగా విస్మరించారని చెప్పారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాల నుండి వస్తున్నా ఎందుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి  20 నెలలు గడుస్తున్నా రైతులకు నీటిని విడుదల చేయకుండా రాయలసీమను ఎండగడుతున్నారని ఆరోపించారు. 

 

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం లేదు : ఎస్వీ

కర్నూలు : జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం లేదని ఎస్వీ తెలిపారు. జగన్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. తమను సంప్రదించకుండా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయన్నారు. 

భూమాతో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి భేటీ

హైదరాబాద్ : భూమా నాగిరెడ్డితో వైవీ సుబ్బారెడ్డి భేటీ ముగిసింది.  పార్టీలో కొనసాగడంపై భూమా హామీ ఇవ్వలేదు. భూమా నాగిరెడ్డి పార్టీ మారుతున్నాడని  టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. భూమా పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. 

14:46 - February 20, 2016

కర్నూలు : జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారన్న ఊహాగానాలను...భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ మినహా మిగతా ఎమ్మెల్యేలు ఖండించారు. వైసీపీ జెండాపై గెలిచిన తాము...చివరి వరకు అందులోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు మైండ్‌ గేమ్ ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు.

 

13:46 - February 20, 2016

హైదరాబాద్ : త్వరలో ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తీసుకువస్తామన్నారు.. మంత్రి కేటీఆర్‌.. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారే అవకాశాలున్నాయని ప్రకటించారు.. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌లో బిట్స్‌ పిలానీ రెండో దశ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు కేటీఆర్‌.. క్యాంపస్‌లో సైక్లింగ్‌ క్లబ్‌ను ప్రారంభించారు..

13:44 - February 20, 2016

హైదరాబాద్ : డబుల్‌బెడ్‌రూంల ఇళ్లకు దరఖాస్తులు చేసుకునేందుకు జనాలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే అధికారులు వీరికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.  

13:43 - February 20, 2016

విజయవాడ : సీఆర్‌డీయే సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. అగ్రికల్చర్‌ జోన్‌ వివాదంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాదనలు జరిగాయి. అగ్రిజోన్‌ తొలగించాల్సిందేనని ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. రైతులకు వారి భూములపై స్వేచ్ఛనివ్వాల్సిందేనని వారు తేల్చి చెప్పారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు సైతం ఇదే వాదన వినిపించారు. అయితే ఈ విషయం తామేమీ చేయలేమని.. సీఆర్‌డీయే కమిషనర్‌ స్పష్టం చేశారు.

13:42 - February 20, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై వైసీపీ అధినేత ఆశలు వదులుకున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. భూమాకు వైసీపీలో ఏమి తక్కువ చేయలేదని అవకాశవాదులను ఏమి చేయలేమని కర్నూలు జిల్లా నేతలతో జగన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

13:38 - February 20, 2016

హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. జిల్లాలో వైసీపీ తరుపున ఎన్నికైన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వైసీపీని వీడుతున్నట్లు వార్తలను నేతలు ఖండించారు. వైసీపీ నేత జగన్ నాయకత్వం పై పూర్తి నమ్మకం ఉందని.. కొందరు కావాలనే మాపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు మావద్ద క్లారిఫికేషన్ తీసుకుని వార్తలు రాస్తే బాగుంటుందని తెలిపారు. టిడిపి క్రైసిస్ నుండి బయట పడటానికి మైండ్ గేమ్ ఆడుతుందని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నా...టిడిపిలో చేరినా ఒరిగేది ఏమి లేదన్నారు. వైసీపీ పట్ల ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టిడిపి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. టిడిపి పార్టీ సగం మునిగి పోయిందని... అలాంటి పార్టీలోకి ఎలా వెళతామని ప్రశ్నించారు. పార్టీ మారుతున్నామని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఇపుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకే పనులు జరగడం లేదని... ఏం టిడిపిలోకి వెళితే ఉపయోగం లేదని పేర్కొన్నారు. 

13:36 - February 20, 2016

తిరుపతి : రాయలసీమ ప్రజలు తీవ్ర అన్యాయం జరిగిందని...దానిని నిరసిస్తూ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. ఆయన రాయలసీమలో లెఫ్ట్ పార్టీలు బస్సు యాత్రను చేపట్టాయి. ఈసందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ... రైతులు పిట్టలు రాలినటుల్ రాలిపోతున్నా ప్రభుత్వానికి ఏమి పట్టడం లేదని మధు విమర్శించారు. నీరు లేదు, ఇన్ పుట్ సబ్సిడీ లేదు, పరిశ్రమలు పెడతామని చెప్పిన ఏ ఒక్క వాగ్ధానం అమలు కావడం లేదని మండి పడ్డారు. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చూపే శ్రద్ధ రాయలసీమలో తాగునీటి పై పెడితే బాగుంటుందని స్పష్టం చేశారు. రాయలసీమకు న్యాయం చేయాలని బస్సు యాత్ర చేపట్టామని ఈ ఆందోళన ప్రారంభమే అని ..వచ్చే కాలంలో అందర్ని కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. కేంద్రం రాయలసీమకు ఇస్తానన్న నిధులు కేటాయించి సీమను ఆదుకోవాలని,రాయలసీమలోనే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఫారెస్ట్ అధికారి రామేశ్వర్ రెడ్డి పై దాడి చేసిన వారిని శిక్షించాలి

మహబూబ్ నగర్ : ఫారెస్ట్ అధికారి రామేశ్వర్ రెడ్డి పై దాడికి నిరసనగా మూకుమ్మడిగా ఫారెస్ట్ ఉద్యోగులు సెలవు పెట్టారు. దాడి చేసిన వారిని శిక్షించాలంటూ అచ్చంపేటలో భారీ ర్యాలీ చేపట్టారు. శుక్రవారం రామేశ్వర్ రెడ్డి పై ఎమ్మెల్యే బాలరాజు దాడి చేసిన విషయం తెలిసిందే.

సీఆర్డీఏ సమావేశంలో గందరగోళం

విజయవాడ : సిఆర్డీఏ సమావేశలో గందరగోళం నెలకొంది. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అగ్రికల్చర్ జోన్ లను పూర్తిగా తొలగించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తమకు అధికారం లేనిదని సీఆర్టీఏ కమిషనర్ చెబుతున్నారు. రైతుల భూములపై వారికి స్వేచ్ఛ ఉండాలని, ప్రజలు వలస వెళ్లకుండా చూడాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. రూల్స్ ప్రకారమే నడుచుకుంటామని కమిషనర్ చెబుతున్నారు.

విద్యార్థి ఆచూకీ లభ్యం..కానీ పరిస్థితి విషమం

నల్లగొండ: జిల్లా హుజూర్‌నగర్‌లో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభించింది. ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద విద్యార్థి నాగార్జునరెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న హుజూర్‌నగర్‌లో గల చైతన్య పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యమైన విషయం తెలిసిందే.

హర్యానాలో 3 పాఠశాలలకు నిప్పు

హైదరాబాద్ : రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఉదయం జింద్‌ జిల్లాలోని బుద్ధా ఖేర్‌ రైల్వే స్టేషన్‌ కు నిప్పు పెట్టిన నిరసన కారులు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రోహ్ తక్ జిల్లా వ్యాప్తంగా నిరసనల జోరు పెరిగింది. గుహానా రోడ్ లోని మూడు పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక్కడి పెట్రోలు బంక్ లు, కమ్యూనిటీ హాళ్లు, దుకాణాలను కూడా ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారరు. కలనోర్ లో బీడీవో కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ప్రాంతంలో పలు బస్సులనూ దహనం చేశారు.

వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : వైద్యఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు మునిసిపల్‌శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష జరిపారు.

25 నుంచి కాపు కార్పొరేషన్ రుణాలు..

రాజమండ్రి : ఈ నెల 25 నుంచి తొలి విడత కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్ చినరాజప్ప మాట్లాడుతూ... 25 వేల మందికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చినరాజప్ప తెలిపారు.

12:36 - February 20, 2016

హైదరాబాద్ : ఊ కొడతారా.. బై చెబుతారా. భూమానాగిరెడ్డి టీడీపీ ఎంట్రీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. భూమానాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లకుండా ఆపేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌తో భేటీ అయిన అనంతరం సజ్జల మరోసారి భూమాతో భేటీ అయ్యారు. మరో వైపు లోటస్‌పాండ్‌లో జగన్ కర్నూలు జిల్లా నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

12:34 - February 20, 2016

తిరుపతి : రాయలసీమకు కేంద్రం సహాయం అందించి అభివృద్ధి చేయాలని .. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్‌ డిమాండ్ చేశారు.. విభజన చట్టంప్రకారం సీమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు..

 

12:32 - February 20, 2016

వరంగల్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం కావడం వెనక పోలీసులు పాత్ర ఎంత ఉంది. అమ్మవారు గద్దె నెక్కడం నుండి వన మహోత్సవం జరిగే వరకు జరిగిన పరిణామాలు, పోలీసులు తీసుకున్న చర్యలపై.. అక్కడక్కడ జరిగిన ఘటనలు మినహా, ట్రాఫిక్ సమస్యలను విజయవంతంగా అధిగమించామని.. జాతర నిర్వహణలో పోలీసుల వ్యూహాలు ఫలించాయంటూ డీఐజీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. 

12:30 - February 20, 2016

తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి లఘు దర్శనం గగన కుసుమంగా మారింది. రద్దీ తక్కువగా ఉన్నా... ఆమడ దూరం నుంచే దేవుడి దర్శనం చేసుకుని అసంతృప్తితో వెనుతిరగాల్సి వస్తోంది. వీఐపీల అడుగులకు మడుగులెత్తి అతిసమీపం నుంచి లఘు దర్శనం చేయించే టీటీడీ అధికారులు... సమాన్య భక్తులకు మాత్రం మహాలఘు దర్శనంతోనే సరిపెడూ చేతులు దుపులుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.                                                                           

సామాన్య భక్తులను ఇక్కట్లకు గురి చేస్తున్న టీటీడీ అధికారులు

దేవుడి ముందు అందరూ సమానులే అన్న సూత్రం ఎక్కడైనా వర్తిస్తుందేమో కానీ.... తిరుమలలో మాత్రం వర్తించదు. భక్తలను విభజించి దర్శనల కల్పించడే టీటీడీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుమల శ్రీవారిని అతీసమీపం నుంచి దర్శనం చేసుకుని తరించాలని భక్తులు భావిస్తుంటారు. కానీ టీటీడీ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహిరిస్తున్నారు. వీఐపీల సేవలో తరిస్తూ... సమాన్య భక్తులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడన్న చందంగా టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. రద్దీవున్నా... లేకపోయినా.. మహాలఘు దర్శనంతోనే సరిపెడుతున్నారు.

రద్దీ తక్కువగా ఉంటే రాములవారి మేడ వరకు అనుమతి ....

వీఐపీలకు ఆఖరు గడప వరకు ఆహ్వానించి హారతులిచ్చి ఇప్పించే అధికారులు... సమాన్య భక్తులను ఆమడ దూరం నుంచే గెంటేయిస్తున్నారు. గతంలో రద్దీ తక్కువగా ఉంటే రాములవారి మేడ వరకు సామాన్య భక్తులను అనుమతించి లఘు దర్శన భాగ్యం కల్పించేవారు. ఇప్పుడు జయవిజయల నుంచి మహాలఘు దర్శనంతోనే సరిపెడుతున్నారు. వీఐపీలు పది మీటర్ల దూరం నుంచి దేవుడిని దర్శనం చేసుకుని సంతృప్తిగా తిరిగివెళుతుంటే... సామాన్య భక్తులకు మాత్రం 70 మీటర్ల దూరం నుంచి దర్శనం కల్పించి అసంతృప్తితో తిప్పిపంపుతున్నారు. శ్రీవారి దర్శనం విషయంలో అయిన వారికి ఆకుల్లో... కానివారిక కంచాల్లో.. అన్న చందంగా టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న భక్తులు విమర్శిస్తున్నారు.

గతంలో గంటకు 6 వేల మందికి దర్శనం .....

కార్యనిర్వహణాధికారి మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి దర్శనం విధానంలో మార్పులు చేస్తున్నారు. గతంలో గంటకు ఆరువేల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఈ లెక్కన రోజుకు 65 వేల మందికి దర్శనం అవకాశం ఉండేది. ఇప్పుడు 80 వేల నుంచి లక్ష మంది భక్తులు అలవోకగా దర్శనం చేసుకుంటున్నారు. సామాన్య భక్తులు దూరం నుంచి స్వామివారిని దర్శించుకునే మహాలఘు దర్శన పద్ధతిని ప్రవేశపెట్టి న తర్వాత నుంచే ఇంత భారీ సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గతంలో గురువారం నుంచి ఆదివారం వరకు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో మాత్రమే మహాలఘు దర్శనాన్ని అమలు చేసేవారు. ఇప్పుడు వారంలో అన్ని రోజులూ మహాలఘు దర్శనాన్ని అమలు చేస్తుండటాన్ని భక్తులు తప్పుపడుతున్నారు.

20 అడుగుల దూరం నుంచి దర్శనం కల్పించాలి ....

రద్దీలేని రోజుల్లో గర్భగుడిలోని రాములవారి మేడ వరకు భక్తులను అనుమతిస్తే 20 అడుగుల దూరం నుంచి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని భక్తులు చేస్తున్న విన్నపాన్ని టీటీడీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. తాము పట్టుకున్న కుందేలుకు మూడుకాళ్లు అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. భక్తులను విభజించి దర్శనం కల్పించే విషయంలో టీటీడీ అధికారుల వైఖరిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఆ శ్రీవారికే తెలియాలి. 

జాట్‌లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం

హైదరాబాద్ : హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్‌లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జింద్‌ జిల్లాలోని బుద్ధా ఖేర్‌ రైల్వే స్టేషన్‌కు ఈరోజు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో స్టేషన్‌లోని ఫర్నీచర్‌, రికార్డు రూమ్‌, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.గత వారం రోజులుగా హరియాణాలో జాట్‌ల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్భందించారు. దీంతో దాదాపు 150 రైళ్లు రద్దయ్యాయి. పోలీసులు, భద్రత బలగాలు, సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించారు.

ముగ్గురు జేఎన్ యూ విద్యార్థులపై లుక్ అవుట్ నోటీసులు..

ఢిల్లీ : జేఎన్ యూ వివాదంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జేఎన్ యూలో ఫిబ్రవరి 9న జరిగిన ఘటనలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారని భావిస్తున్న ముగ్గురు విద్యార్థులపై తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పరారీలో ఉన్న ఆ విద్యార్థులను ట్రేస్ చేయాలంటూ దేశంలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు సంబంధిత అధికారులకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. అంతేగాక సంబంధిత విద్యార్థులను వెతికేందుకు, వారి స్నేహితులను ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ అధికారులు, పలు బృందాలు రంగంలోకి దిగాయి.

11:38 - February 20, 2016

విశాఖ : పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా తయారైంది గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిస్థితి. ప్రభుత్వం శీతకన్ను వేయడంతో జీవీఎంసీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను ఘనంగా నిర్వహించిన కార్పొరేషన్‌.. ఇప్పుడు ఆ నిధులు రాబట్టుకునేందుకు సర్కార్‌ వైపు దేహీ అంటూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీవీఎంసీని ఎవరు ఆదుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది.

పరిశుభ్రతలో దేశంలో ఐదో స్థానం.....

పరిశుభ్రతలో దేశంలోనే ఐదో స్థానం సొంతం చేసుకున్న వైజాగ్‌ కార్పొరేషన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. గొప్పకు పోయి అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను తాహతుకు మించి ఖర్చులు చేయడంతో కార్పొరేషన్‌ సంక్షోభంలో పడింది. ఉత్సవాల కోసం చేసిన 90 కోట్ల రూపాయలను సర్కార్‌ నుంచి రాబట్టుకునేందుకు అపసోపాలు పడుతోంది.

సర్కార్‌ విడుదల చేసిన నిధులు రూ.23 కోట్లు.....

ఫ్లీట్‌ రివ్యూ నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. కేవలం 23 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. హుదుద్‌ తుపాను దెబ్బకు నష్టపోయిన 1200 కోట్లు ఇప్పటివరకు కార్పొరేషన్‌కు అందలేదు. ఇదే తరుణంలో ఫ్లీట్‌ రివ్యూను ఘనంగా నిర్వహించేందుకు పలు సంస్థల నుంచి జీవీఎంసీ అప్పులు చేసింది. ఇప్పుడు సర్కార్‌ చేతులెత్తేయడంతో కార్పొరేషన్‌ ఆర్ధిక సంక్షోభంలో ఇరుక్కుంది. పలు సంస్థలకు కార్పొరేషన్‌ 300 కోట్ల రూపాయల మేర అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అప్పులకు వడ్డీ చెల్లించడం జీవీఎంసీకి తలకు మించిన భారంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి త్వరలోనే నిధులు వస్తాయంటున్నారు.

చేతులెత్తేసిన సర్కార్‌ ....

ఇప్పటికే హుదుద్‌ తుపాను నష్టపరిహారం రాక అల్లాడుతున్న జీవీఎంసీపై.. ఫ్లీట్‌ రివ్యూ నిధుల భారం పడింది. ఆ ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చిన సర్కార్‌ ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయకపోవడంతో.. సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టమనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమృత్‌ పథకం జాబితాలో ఉన్న విశాఖ.. మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద 250 కోట్లు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూస్తుంటే కార్పొరేషన్‌పై ఆర్ధిక భారం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు త్వరగా విడుదల చేయాలని నగరవాసులు కోరుతున్నారు. లేకపోతే తమపై పన్నులు భారం పడే అవకాశముందంటున్నారు. 

11:35 - February 20, 2016

హైదరాబాద్ : హెచ్‌సియు వివాదంపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చింది. యూనివర్సిటీలో వివాదం మొదలు రోహిత్ ఆత్మహత్య ఘటనకు వరకు కమిటీ నివేదిక ఇచ్చింది. హెచ్‌సియు వివాదంతో కేంద్రమంత్రులకు సంబంధం లేదని వెల్లడించింది. ఘటనకు పూర్తిగా యూనివర్సిటీ అధికారులదే బాధ్యతని నివేదికలో పేర్కొంది.

11:33 - February 20, 2016

హైదరాబాద్ : ఊ కొడతారా.. బై చెబుతారా. భూమానాగిరెడ్డి జగన్‌ చెప్పేదానికి ఊ కొడతారా.. లేదు చాలంటూ బై చెబుతారా. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. జగన్‌తో భూమా నాగిరెడ్డి భేటీ కావడంతో సస్పెన్స్‌ పెరిగిపోయింది. నేడు టీడీపీలో వెళ్లేందుకు బాబును కలుస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. భూమా ను వైసీపీ నేతలు కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అది కూడా విఫలం కావడంతో.. అధినేత జగన్‌ నేరుగా రంగంలోకి దిగారు. మరిప్పుడు ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. 

అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో జగన్ భేటీ..

హైదరాబాద్ : ఎమ్మెల్మేలు అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు, టీడీపీలోకి వలసలు వెళ్తున్నారన్న ప్రచారంతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మరోవైపు భూమా నాగిరెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. భూమా ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి, సజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయనతో మంతనాలు జరిపారు.

వృద్ధ దంపతులపై మారణాయుధాలతో దాడి

గుంటూరు :చిలకలూరిపేట తూర్పుమాలపల్లిలో వృద్ధ దంపతులపై మారణాయుధాలతో వ్యక్తి దాడిచేశాడు. దీంతో దంపతులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు స్థల వివాదమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు తాత్కాలిక సీజే

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఈవో సాంబశివరావు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

భూమాను బుజ్జగిస్తున్న జగన్

హైదరాబాద్ : ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి టిడిపిలోకి వెళ్తున్నట్లు సమాచారంతో వైసీపీ నేత జగన్ భూమాను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

తిరుమలలో సాంబారులో పడి కార్మికుడికి గాయాలు

చిత్తూరు : తిరుమల అన్న ప్రసాద తయారీ కేంద్రంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. వంట చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుడు ప్రమాదవశాత్తూ వేడి వేడి సాంబారులో పడ్డాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే స్పందించి... ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన అంబులెన్స్ లో తిరుపతి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు టీటీడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

10:24 - February 20, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో శాంతినికేతన్ స్కూల్ కు చెందిన బస్సు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.  

10:23 - February 20, 2016

నెల్లూరు : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక నెల్లూరు ఫైర్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. దళితుడైన తనను చలమయ్య అనే లీడింగ్‌ ఫైర్‌మెన్‌ తరచూ కులం పేరుతో దూషించేవాడని సుసైడ్‌ లేఖలో రాశాడు.. తనతోపాటు మరికొంతమంది కిందిస్థాయి ఉద్యోగులను ఎల్ ఎఫ్ ఇలాగే అవమానిస్తున్నాడని ఆరోపించాడు.. నోటికి వచ్చినట్లు తిడుతూ.. ప్రశ్నించినవారిని సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారని లేఖలో తెలిపాడు.. చలమయ్యను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశాడు..

10:21 - February 20, 2016

కర్నూలు : టీడీపీలో చేరేందుకు సిద్ధమైన భూమానాగిరెడ్డిని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల బుజ్జగిస్తున్నారు. వైసీపీలో భూమాకు ఎదురైన సమస్యలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

 

09:52 - February 20, 2016

విజయవాడ : టీడీపీలో చేరేందుకు భూమానాగిరెడ్డి సిద్ధమయ్యాడు. ఇవాళ విజయవాడలో చంద్రబాబును కలిసే అవకాశముంది. మరో వైపు కర్నూలు జిల్లా నేతలందరూ విజయవాడకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

09:50 - February 20, 2016

విజయవాడ : ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప‌నితీరు..రానున్న ఆర్ధిక సంవ‌త్సరానికి ప్రభుత్వ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక ..రెండంకెల అభివృద్ది ప్రధాన ఎజెండాగా విజ‌య‌వాడలో ఈ నెల 22, 23 తేదీల‌లో విజ‌య‌వాడ‌లో క‌లెక్టర్ల స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. ఇంతే కాకుండా ఈ స‌ద‌స్సులో పాల‌నాప‌రమైన సంస్కర‌ణ‌లు, పార‌ద‌ర్శక‌త పై ప్రత్యేకంగా చ‌ర్చించ‌నున్నారు.                                                                                                                                                                                              

22,23 తేదీల్లో...

ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క‌లెక్టర్ల స‌ద‌స్సు ఈ నెల 22, 23వ తేదీల‌లో విజ‌య‌వాడ‌లోని ఏ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ఈ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. గ‌త డిసెంబ‌ర్ 14,15 తేదీల్లో జ‌రిగిన క‌లెక్టర్ల స‌ద‌స్సులో నిర్దేశించిన ల‌క్ష్యాల పై ఈ స‌ద‌స్సులో స‌మీక్షించ‌నున్నారు.

తొలి రోజు సద‌స్సులో....

తొలి రోజు సద‌స్సులో భాగంగా పాల‌నా సంస్కర‌ణ‌లు ఇ-ప్రగ‌తి, గ‌వ‌ర్నెన్స్ లాబ్ అంశాలపై చ‌ర్చ ఉంటుంది. అనంత‌రం గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ఉపాధి హామీ ప‌ధ‌కం, నీటి నిర్వహ‌ణపై స‌మీక్షించ‌టంతో పాటుగా ఖ‌రీఫ్‌-ర‌బీల్లో అనుస‌రించిన‌, అమ‌లు చేయాల్సిన ప్రణాళిక‌లపై ప్రభుత్వం దిశానిర్ధేశనం చేయ‌నుంది.

రెండో రోజు మౌలిక వ‌స‌తులు పెట్టుబ‌డులు, ప‌రిశ్రమ‌ల పై...

ఇక‌ రెండో రోజు మౌలిక వ‌స‌తులు పెట్టుబ‌డులు, ప‌రిశ్రమ‌ల పై ప్రత్యేకంగా చ‌ర్చించనుంది ప్రభుత్వం. ప‌రిశ్రమ‌ల‌కు అవ‌కాశం, భూ కేటాయింపులపై వివ‌రించ‌టంతో పాటుగా ప్రభుత్వం క‌లెక్టర్లకు కొన్ని కీల‌క మార్గద‌ర్శకాలు జారీ చేసే అవ‌కాశం ఉంది.

స్కిల్ అప్‌గ్రేడేష‌న్ పై చ‌ర్చ ...

రెండో రోజు స‌దస్సులో భాగంగా ఉద్యోగుల‌కు స్కిల్ అప్‌గ్రేడేష‌న్ పై చ‌ర్చ చేప‌ట్టనుంది ప్రభుత్వం. ఒక మిలియ‌న్ ఉద్యోగాల క‌ల్పన కోసం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌-ప‌రిశ్రమ‌ల అనుసంధానంపై ప్రభుత్వం సూచ‌న‌లు చేయనుంది. సాధికారిక మిష‌న్ లోని కీల‌క అంశాలైన ఎస్సీ-ఎస్టీ స‌బ్‌ప్లాన్‌, బిసి-ఎస్సీ-ఎస్టీ-మ‌హిళా-శిశు అభివృద్ధిపై స‌మీక్షించ‌నున్నారు. రెండో రోజు చివ‌రి అంశంగా ఏపీలోని సీనియ‌ర్ పోలీసు అధికారుల‌తో పాటుగా..13 జిల్లాల SPల‌తో శాంతి భ‌ద్రత‌ల పై ముఖ్యమంత్రి స‌మీక్షించ‌ను న్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల ముందు జ‌ర‌గుతున్న స‌దస్సు కావ‌టంతో..శాఖ‌ల వారీగా అవ‌స‌రాలు..ఖ‌ర్చులు.. కేటాయింపుల పైనా ఈ స‌ద‌స్సులో ఆర్థిక శాఖ‌..ప్రత్యేకంగా దృష్టి సారించే అవ‌కాశం ఉంది.

09:48 - February 20, 2016

హైదరాబాద్ : ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ మూడోసీజన్లో...పాట్నా పైరేట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఆడిన పదిరౌండ్లలో అజేయంగా నిలవడం ద్వారా...సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. 46 పాయింట్లతో ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. రౌండ్ రాబిన్ లీగ్ లో పాట్నా పటాస్ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్......

పట్నా పైరేట్స్ దూకుడు చూస్తుంటే ....

దేశంలోని కోట్లాదిమంది అభిమానులను కదిపికుదిపేస్తున్న ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ అనగానే ...తొలిసీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్, రెండోసీజన్ చాంపియన్ యూ-ముంబా, రాహుల్ చౌదరి నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ లాంటి జట్లే అభిమానులకు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే..గత రెండుసీజన్లుగా..కబడ్డీలీగ్ లో ఈమూడు జట్లే అగ్రశ్రేణిజట్లుగా, అత్యంత జనాదరణ పొందినజట్లుగా గుర్తింపు తెచ్చుకొన్నాయి.

మూడోసీజన్లో మాత్రం...సీన్ ఒక్కసారిగా రివర్స్.....

అయితే...ప్రస్తుత మూడోసీజన్లో మాత్రం...సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. ఆల్ రౌండర్ మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని పట్నా పైరేట్స్...ఉరుములు లేని మెరుపులా దూసుకొచ్చింది. ప్రత్యర్థి ఎవరన్నది...ఎంత బలమైనది అన్నఅంశాలు పట్టించుకోకుండా...వరుస విజయాలతో సంచలనం సృష్టించి లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. గత రెండుసీజన్లలో...సెమీఫైనల్స్ వరకూ చేరిన పాట్నా పైరేట్స్...ప్రస్తుత మూడవసీజన్లో...ఒక్కసారిగా హాట్ ఫేవరెట్ స్థాయికి ఎదిగిపోయింది. సూపర్ రైడర్ సందీప్ నార్వాల్, దీపక్ నార్వాల్, కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ లతో రైడింగ్ లోనూ.... సురేశ్ కుమార్, అమిత్ హుడా, సునీల్, వినోద్ కుమార్,సందీప్ లతో బ్లాకింగ్ లోనూ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది.

విదేశీస్టార్లతో ....

ఇరాన్ కు చెందిన హాడీ ఓష్టోరాక్, నసీర్ అలీ, కొరియాకు చెందిన తాయ్ డెక్ ఎమ్ లాంటి విదేశీస్టార్లతో ఉరకలేస్తోంది.ఇప్పటి వరకూ ఆడిన పది రౌండ్ల పోటీల్లో...పాట్నా పైరైట్స్ అజేయంగా నిలిచిందంటే...ఆజట్టు జోరు, దూకుడు ఏస్థాయిలో ఉందో మరి చెప్పాల్సిన పనిలేదు. మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తో జరిగిన సీజన్ ప్రారంభమ్యాచ్ లో 29-28 పాయింట్ల విజయంతో శుభారంభం చేసిన పాట్నాకి..ఆ తర్వాత పోటీల్లో ఎదురేలేకుండా పోయింది.బెంగళూరు బుల్స్ పై 33-24, ప్రస్తుత చాంపియన్ యూ-ముంబా పై 40-26 పాయింట్ల విజయాలతో టాప్ గేర్ అందుకొంది.విశాఖ, కోల్ కతా, పాట్నా, బెంగళూరు, పూణే ..వేదిక ఏదైనా పాట్నా పైరేట్స్ విజయపరంపర కొనసాగించింది.చివరకు తెలుగు టైటాన్స్ లాంటి హాట్ హాట్ టీమ్ ను సైతం పాట్నా పైరేట్స్ 29-25 పాయింట్లతో కంగుతినిపించి తనకు తానే సాటిగా నిలిచింది. బెంగాల్ వారియర్స్ ను 36-31 పాయింట్లతో అధిగమించిన పాట్నాజట్టుకు...పూణేరీ పల్టాన్ తో ముగిసిన మ్యాచ్ లో మాత్రం 30-30 పాయింట్లతో టై తప్పలేదు. దబాంగ్ ఢిల్లీ పై 47-34, బెంగాల్ వారియర్స్ పై 32-27 పాయింట్లతోనూ, బెంగళూరు బుల్స్ పై 36-32 పాయింట్లతో నెగ్గడం ద్వారా..పాయింట్ల సంఖ్యను 43కు పెంచుకొంది.

10 వ రౌండ్ పోటీలో సైతం ....

పూణేరీ పల్టాన్ తో ముగిసిన 10 వ రౌండ్ పోటీలో సైతం పట్నా పైరేట్స్ అజేయంగా నిలిచింది. 28-28 పాయింట్లతో పోటీని టై గా ముగించడం ద్వారా..సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది.

పది రౌండ్లలో 8 విజయాలు, ....

మొత్తం పది రౌండ్లలో 8 విజయాలు, రెండు టై ఫలితాలతో 46 పాయింట్లు సాధించడం ద్వారా...పట్నా పైరేట్స్ లీగ్ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. 2016 సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 10 రౌండ్లలో ఎనిమిదివిజయాలు సాధించిన ఏకైక జట్టుగా పాట్నా పైరేట్స్ సంచలనం సృష్టించింది. పట్నా పైరేట్స్ దూకుడు చూస్తుంటే మూడోసీజన్ విజేతగా నిలిచినా ఆశ్చర్యంలేదు.

ఫైర్ కానిస్టేబుల్ అనిల్ ఆత్మహత్యాయత్నం...

నెల్లూరు : ఫైర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశారు. అగ్నిమాపక కార్యాలయలంలోనే పురుగుమందు తాగినట్లు సమాచారం. గమనించిన తోటి ఉద్యోగులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది.

బ్యాంకు పరీక్షల షెడ్యూల్ విడుదల...

హైదరాబాద్ : 2016 సంవత్సరానికి గాను వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అఫీషియల్ నోటిఫికేషన్ జూలైలో ప్రకటిస్తామని, అక్టోబర్ 16, 22, 23 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని ఐబీపీఎస్ వెల్లడించింది. మెయిన్ పరీక్ష నవంబర్ 20న జరుగుతుందని ప్రకటించింది. మరింత సమాచారం, అప్ డేట్స్ కోసం 'http://www.ibps.in' వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. 

బిట్స్ ఫిలానీ క్యాంపస్ లో ఫేజ్ -2 కు భూమి పూజ

రంగారెడ్డి : శామీర్ పేటలో బిట్స్ ఫిలానీ క్యాంపస్ లో ఫేజ్ -2 కన్ స్ట్రక్షన్ కు మంత్రి కేటీఆర్ భూమి పూజల చేశారు.

09:22 - February 20, 2016

హైదరాబాద్ : సిరియా సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్‌ తెగ ప్రజలపై టర్కీ అత్యంత పాశవికంగా దాడికి పాల్పడింది. సిరియా బోర్డర్‌లో ఉన్న పికెకె సభ్యులను లక్ష్యంగా చేసుకుని టర్కీ భద్రతా బలగాలు కొంతకాలంగా మారణహోమానికి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి అకృత్యాలకు ఒక్క రోజులోనే 150 మంది బలైపోయారు. సైజర్ జిల్లాలోని సర్నాక్ ప్రాంతంలో మానవుల తలలు, చేతులు, మొండాలు విడివిడిగా పడి ఉన్న భయానక దృశ్యాలు మీడియా ద్వారా వెలుగులోకొచ్చాయి. వివిధ శరీర భాగాలు, మృతదేహాలను భవనాల శిథిలాల కింద గుర్తించారు. గత ఏడాది జులైలో టర్కీ, పికెకె వర్గానికి మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. నాటి నుంచి సిరియా సరిహద్దుల్లోని ఊళ్లపై టర్కీ దాడులకు తెగబడుతోంది. గత ఏడాది డిసెంబర్ 14 నుంచి ఇప్పటివరకు సైజర్ జిల్లాలో 659 మంది పికెకె వర్గీయులను టర్కీ బలితీసుకుంది.  

హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

హైదరాబాద్ : హర్యానాలో జాట్ ల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆందోళనలు ఉధృతంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం బీఎస్ ఎఫ్ బలగాలను మోహరించింది. జాట్ల ఆందోళనలతో 400 రైళ్ల రద్దు, 231 రైళ్లు దారి మళ్లించారు. రోహ్ తక్ లో ముగ్గురు ఆందోళన కారులు మృతి చెందారు. రోహ్ తక్ లో పలు వస్త్ర దుకాణాలు, వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. మరో హర్యానా ఆర్థిక మంత్రి ఇంటిని జాట్ లు ధ్వంసం చేశారు. దీంతో రోహ్ తక్ లోని భివానీలో కర్ఫ్యూ విధించారు. రోడ్ల మీద కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలకు 22 వరకు సెలవులు ప్రకటించింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఐదు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈమేరకు శ్రీవారి సర్వదర్శనానికి 4గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు 2గంటల సమయం పడుతోంది. 

చరణ్ కిడ్నాప్ చేసిన కార్పొరేటర్ కుమారుడు

హైదరాబాద్ : ఎన్ ఎస్ యూఐ కార్యకర్త చరణ్ ను గోల్నాక కార్పొరేటర్ కాలేరు పద్మ కుమారుడు భరత్ కిడ్నాప్ చేశారు. చరణ్ తల్లి దండ్రులు అంబర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

చెట్టును ఢీ కొట్టిన శాంతినికేతన్ స్కూల్ బస్సు...

హైదరాబాద్: ఎల్బీనగర్ లో బ్రేక్ ఫెయిల్ కావడంతో శాంతి నికేతన్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

కర్నూలు : ఆదోని మండలం బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఈతకు వెళ్లి 7వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న షాబీర్, గిలానీలుగా గుర్తించారు.

నేటితో ముగియనున్న మేడారం జాతర..

వరంగల్ : నేటితో మేడారం మహాజాతర ముగియనున్నది. ఇవాళ సాయంత్రం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం జరుగుతోంది. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మను, పూనుకొండ్లకు పగిడిద్దరాజును, కొండాయికి గోవిందరాజులను గిరిజన పూజారులు తీసుకెళ్లనున్నారు.

07:33 - February 20, 2016

హైదరాబాద్ : ఏపీలో టిడిపి, వైసీపీ ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న జగన్‌ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ పాలకపక్షం ఎత్తుకు పైఎత్తుకు స్కెచ్ సిద్ధం చేసింది. ఓవైపు జగన్‌తో టచ్‌లో ఉన్న నేతలపై ఆరా తీస్తునే... మరోవైపు కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. వైసీపీలో సీనియర్‌ నేత.. భూమా నాగిరెడ్డి.. అనుచరులతో సమావేశమై.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. పదవులు, ముడుపులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులకు అధికార పార్టీ పాల్పడుతోందా? అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందా? ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత మాల్యాద్రి, వైసీపీ నేత శ్రీత బెనర్జీ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నగరంలో 12 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..

హైదరాబాద్‌: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా... పూర్తి స్థాయిలో నియంత్రణ కావడం లేదు. వారాంతాల్లోపబ్‌లు, హోటళ్లలో పొద్దుపోయే వరకు మద్యం సేవించిన యువత రాత్రిళ్లు రోడ్లపై ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీసులు జరిపిని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 12మంది పట్టుబడ్డారు. వారికి సంబంధించిన 8 కార్లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్: డిసెంబర్‌లో నిర్వహించిన 2015 మెయిన్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూలకు)కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. మెయిన్స్‌లో విజయం సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వెయ్యిమందికి పైగా ఉన్నారు.

చెర్వుగట్టులో ముగిసిన బ్రహ్మోత్సవాలు..

నల్లగొండ :నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిసాయి. భక్తజన సందోహం మధ్య గజవాహనసేవతో పాటు చెర్వుగట్టు, యల్లారెడ్డిగూడెం గ్రామాల్లో ఊరేగింపు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే సూర్య నమస్కారాలతో ప్రారంభమై దీక్షాహోమాలు, తెల్లవారు జామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, భిల్వార్చన, మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం జ్యోతిలింగార్చన, త్రిశూల స్నానం, వసంతోత్సవం, పుష్పోత్సవం, స్వామివారికి ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు.

జాట్ల ఆందోళన హింసాత్మకం: నలుగురు మృతి

హర్యానా : జాట్ల ఆందోళన హింసాత్మకమైంది. ఈ ఆందోళనలో నలుగురు నిరసనకారులు మృతి చెందగా బీఎస్ ఎఫ్ జవాన్ కు గాయాలయ్యాయి. రోహ తక్ లో పలు బట్టల దుకాణాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు.

క్రిస్ట్ చర్చ్ టెస్ట్ లో మెకల్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీ

హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో 2వ టెస్టులో క్రిస్ట్ చర్చ్ టెస్ట్ లో . 54 బంతుల్లోనే మెకల్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.

తాత్కాలిక సచివాలయానికి అదనం రూ.40.80కోట్లు

విజయవాడ :వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి అదనంగా రూ.40.80 కోట్లు ఖర్చు పెట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనం తాత్కాలికమైందే అయినప్పటికీ ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటామని సీఎం చెప్పిన విషయం విదితమే.

332 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కమ్యూనికేషన్స్‌లో 332 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. పోలీస్ శాఖలో ఇప్పటికే 9వేలకు పైగా కానిస్టేబుల్, 500 ఎస్‌ఐ పోస్టుల భర్తీ జరుపుతున్న విష యం తెలిసిందే. తాజాగా పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జే పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200గా దరఖాస్తు రుసుమును నిర్ణయించినట్టు తెలిపారు.

ఈపీఎఫ్ వో వడ్డీరేటును తగ్గించదు : దత్తాత్రేయ

న్యూఢిల్లీ : ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ) మధ్యంతర వడ్డీ రేటును సవరించబోదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న వడ్డీ రేటు 8.8 శాతం కన్నా తగ్గించబోమని తెలిపారు. ప్రజా భవిష్యనిధిపై 9శాతం వడ్డీ ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ నేపథ్యంలో ట్రస్టీల బోర్డు మరోసారి సమావేశమవుతుందని తెలిపారు. 

హరియాణాలో పేట్రేగిపోయిన జాట్లు

హైదరాబాద్ : మొన్న గుజరాత్‌లో పటేల్ కులస్తుల ఆందోళన.. నిన్న ఏపీలో కాపుల ఉద్యమం.. నేడు హర్యానాలో మళ్లీ మొదలైన జాట్‌ల నిరసనలు. ఈ మూడు వర్గాల అలజడి వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే. అదే రిజర్వేషన్లు. మాకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ తాజాగా హర్యానాలో జాట్లు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. హింసాత్మక చర్యలతో రాష్ట్రం మొత్తాన్నీ కుదిపేస్తున్నారు. మీకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం చెబుతున్నా వుయ్ డోంట్ కేర్ అంటున్నారు. 

07:02 - February 20, 2016

హైదరాబాద్ : మొన్న గుజరాత్‌లో పటేల్ కులస్తుల ఆందోళన.. నిన్న ఏపీలో కాపుల ఉద్యమం.. నేడు హర్యానాలో మళ్లీ మొదలైన జాట్‌ల నిరసనలు. ఈ మూడు వర్గాల అలజడి వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే. అదే రిజర్వేషన్లు. మాకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ తాజాగా హర్యానాలో జాట్లు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. హింసాత్మక చర్యలతో రాష్ట్రం మొత్తాన్నీ కుదిపేస్తున్నారు. మీకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం చెబుతున్నా వుయ్ డోంట్ కేర్ అంటున్నారు.

మళ్లీ ఆందోళనబాట పట్టిన జాట్లు..

నిన్నటిమొన్నటిదాకా కాస్తంత హడావుడి తగ్గించిన జాట్లు మళ్లీ ఆందోళనబాట పట్టారు. అదికూడా హైరేంజ్‌లోనే.. తమను ఓబీసీ కేటగిరీలో చేర్చాలంటూ హర్యానాలో జాట్‌ వర్గానికి చెందిన వేలాది మంది రోడ్డెక్కారు. శుక్రవారం వారి ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. జింద్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వారి ఆందోళన కాస్తా శృతిమించి హింసకు దారితీయడంతో పోలీసులు కాల్పులు జరపాల్సొచ్చింది. పోలీసు కాల్పుల్లో ఒకరు మృతిచెందగా 9మందికి గాయాలయ్యాయి. మరో రెండు సంఘటనల్లో ఇద్దరు చనిపోయారు.

ఆర్థిక మంత్రి కెప్టెన్‌ అభిమన్యు ఇంటికి నిప్పు....

రోహ్‌తక్‌లో ఆందోళనకారులు ఆర్థిక మంత్రి కెప్టెన్‌ అభిమన్యు ఇంటికి నిప్పుబెట్టారు. ఆర్‌ఎన్ అనే మాల్‌కు కూడా నిప్పుబెట్టారు. ఓ ప్రైవేట్ ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులను, మరికొన్ని మారణాయుధాలను కొల్లగొట్టారు. దీంతో రోహ్‌తక్‌లో కర్ఫ్యూ విధించారు. భివానీ ప్రాంతంలోనూ జాట్లు చెలరేగిపోవడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

రంగంలోకి ఆర్మీ....

రోహ్‌తక్, ఝజ్జర్‌, సోన్‌పాట్, భివాని, కర్నాల్, హిసార్‌లో పరిస్థితులు చేయిదాటిపోవడంతో ఆర్మీని రంగంలోకి దించారు. రోహ్‌తక్‌లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపేశారు. జాట్ల హింసాకాండ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసులతోపాటు పలు చోట్ల రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఏకంగా 500 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దీంతో ఉత్తర భారతదేశంలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో రహదారులనూ క్లోజ్ చేయడంతో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

ఓబిసి కోటాలో చేర్చాలని...

జాట్లు తమను ఓబిసి కోటాలో చేర్చాలని విద్యా ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కోరుతూ గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. 2014లో యుపిఎ సర్కార్‌ జాట్లకు రిజర్వేషన్లు కల్పించినా సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రస్తుత అక్కడి పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్, మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ సమీక్ష జరిపారు. హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు జాట్‌ వర్గానికి చెందిన నేతలతో చర్చలు జరిపారు. తక్షణమే ఆందోళన విరమించాలని జాట్‌ నేతలను కోరారు. 

06:59 - February 20, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వ పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న అన్ని రకాల రాయితీల సొమ్మును ఇకపై నేరుగా వారి అధికార బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీ కల్లా జీతాలు చెల్లిస్తున్న తరహాలోనే... పారిశ్రామికవేత్తలకు కూడా ప్రతి నెలా మొదటివారంలో ఇంటర్నెట్‌ ద్వారా రాయితీలు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పరిశ్రమశాఖ సమీక్ష సమావేశంలో తీసుకున్న ఈ విధాన నిర్ణయాన్ని వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తారు. పారిశ్రామిక అనుమతులకు ప్రస్తుతం ఉన్న 21 రోజుల కాలవ్యవధిని 15 రోజులకు తగ్గించే అవకాశాన్ని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో సింగపూర్‌ విధానాలను అమలు చేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అనుమతుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై వేటు తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పారిశ్రామిక, వ్యాపార అనుకూల విధానాల్లో గుజరాత్‌ను అధిగమించి, సింగపూర్‌తో పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. 

06:56 - February 20, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి ముంగిట్లోకి మరో భారీ మెడికల్ ప్రాజెక్ట్‌ వచ్చింది. దేశంలో ఉత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా పేరొందిన అమృత యూనివర్శిటీ అమరావతిలో భారీ స్థాయిలో క్యాంపస్‌ నెలకొల్పబోతోంది. ఇందుకు సంబంధించి ఏపీ సిఎం చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్ ఏర్పాటు....

భారత ప్రభుత్వం నిర్వహించే ప్రఖ్యాత సంస్థ ఎయిమ్స్‌తో పాటు మరో భారీ మెడికల్ యూనివర్శిటీ రాజధాని అమరావతిలో నిర్మాణం కాబోతున్నది. మొత్తం 2,500 కోట్ల రూపాయల అంచనాతో అమృత యూనివర్శిటీ వారు క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో నిర్మాణం జరుపుకునే ఈ మెడికల్ యూనివర్శిటీతోపాటు 2,250 పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా నిర్మించనున్నారు. ఇక యూనివర్శిటీకి అనుబంధంగా రీసెర్చ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

మాతా అమృతానందమయితో బాబు భేటీ.....

అమృత విశ్వవిద్యాలయం ప్రతినిధులు శుక్రవారం సిఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి యూనివర్శిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను అందించారు. వర్శిటీ ప్రో చాన్సెలర్ అభయమిత్ర చైతన్య, అమృత మెడికల్ అండ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నాయర్‌, అమ్మాజీ ల్యాబ్స్ డైరెక్టర్ భవాని బిజిలానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో యూనివర్శిటీ క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలని సిఎం చంద్రబాబు మాతా అమృతానందమయిని అభ్యర్థించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

మెడికల్ సిటీ ఏర్పాటుకు ఒప్పందం....

వినూత్న ప్లాన్‌తో నిర్మాణం కాబోతున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయి. కేంద్ర సహకారంతో బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ అమరావతిలో మెడికల్ సిటీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి ముఖద్వారం మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ ఎయిమ్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ కోణంలోనే తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న అమృత యూనివర్శిటీ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థకు కేరళ, కర్నాటకలో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి.

06:54 - February 20, 2016

కృష్ణా : తోట్లవల్లూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ భర్తపై భార్య రోకలిబండతో దాడి చేసింది. తోట్లవల్లూరుకు చెందిన బాణావత్ బాలనందినితో రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా మున్నంగి గ్రామానికి చెందిన సతీష్‌నాయక్‌కు వివాహమైంది. అతను నిత్యం తాగివచ్చి భార్యను హింసిస్తుండడంతో బాలనందిని కొద్ది నెలల క్రితం తల్లి ఇంటికొచ్చింది. ఐదు నెలల క్రితం యువతికి కుమారుడు జన్మించగా అతన్ని చూసేందుకు సతీష్‌ శుక్రవారం తోట్లవల్లూరుకు వచ్చాడు. పూటుగా మద్యం తాగివచ్చిన అతనికి భార్య పిల్లవాడిని చూపకపోవడంతో తగువుకు దిగాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ యువతి భర్త తలపై రోకలిబండతో మోదింది. దీంతో సతీష్‌నాయక్ తీవ్రంగా గాయపడి కిందపడిపోవడంతో స్థానికులు 108కి ఫోన్ చేశారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. 

06:53 - February 20, 2016

విజయవాడ : అది ఒకప్పుడు రతనాల సీమ. అభివృద్ధిలో అన్నిటికన్నా ముందుండే మహత్తర సీమ. నేడదే ప్రాంతం... కరువు, కక్షలు కార్పణ్యాలు, అన్నిటికి మించి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వాల చేత దగాపడ్డ ఆ ప్రాంత అభివృద్ధికి కరువు సీమ కష్టాలు ఏకరువు పెట్టేందుకు వామపక్షాలు నడుంబిగించాయి. ఆకలేస్తే నేల వైపు దాహమేస్తే ఆకాశంవైపు చూసే అభాగ్యులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించబోతున్నారు. సీమ సమస్యలు హస్తినకు వినిపించేలా నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

అభివృద్ధి నోచుకోకుండా....

దశాబ్దాల తరబడి రాయలసీమ జిల్లాలు అభివృద్ధి నోచుకోకుండా ఇలా కాలం గడుపుతూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది ఈ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే.అయితే మాత్రం ఏం లాభం. లక్షలాది మంది అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు. ఇటువంటి గడ్డు కాలంలో పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు సిపిఎం నడుం బిగించింది. పేదల గొంతుకగా మారి నిత్యం వారి సమస్యలపట్ల పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య మత్తు తొలగించేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు...

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

బస్సుయాత్రకు సిపిఎం జాతీయ మాజీ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్ ....

తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ బస్సుయాత్రకు సిపిఎం జాతీయ మాజీ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్ హాజరుకానున్నారు. ఆయనతోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ నేత నారాయణ పాల్గొంటారు. 20న ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 23వ తేదీన కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. 26న కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 27, 28, 29, మార్చి 1న అనంతపురం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. మార్చి 2 నుంచి 5 వరకు కర్నూలు జిల్లాలో బస్‌ యాత్ర నిర్వహిస్తారు. 

06:50 - February 20, 2016

హైదరాబాద్ : మొక్కుల చెల్లింపులు, శివసత్తుల భక్తిపారవశ్య నృత్యాలు.. పూనకాలు., అమ్మలకు జయజయ ధ్వానాలు.. గిరిజన మహా జాతర మేడారంలో అణువణువునా ఆధ్యాత్మిక శోభ ఫరిడవిల్లింది. చల్లంగ చూడమ్మా.. మళ్లీ వత్తం అంటూ గిరిజనులు తమ ఇష్టదైవాలకు మొరపెట్టుకున్నారు. నేడు జాతరలో చివరి రోజుకావడంతో సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేస్తారు.

కిక్కిరిసిపోయిన లైన్లు..

జాతర మూడో రోజైన శుక్రవారం లక్షలాది మంది బంగారంలా భావించే బెల్లాన్ని మొక్కులుగా చెల్లించుకున్నారు. విఐపీలు, వివిఐపీలు పెద్ద సంఖ్యలో సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చారు. విఐపీల రాకతో సాధారణ భక్తులకు అమ్మల దర్శనానికి ఇబ్బందులు తప్పలేదు. శుక్రవారం ఉదయం నుంచి పోటెత్తిన భక్తులు 3 గంటల వరకు అసంఖ్యాకంగా తరలిరావడంతో వారిని కట్టడి చేయలేక పోలీసులు అల్లాడిపోయారు. మూడు గంటల తర్వాత రద్దీ కొంత తగ్గడంతో పోలీసులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు....

పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. లక్షలాది మంది రాకతో జంపన్నవాగు జనవాగైంది. పిల్లలు, వృద్ధులనే తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ స్నానమాచరించారు. అయితే ఇంతమంది జనమున్నా వారినందరినీ దాటుకుని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం మహదానందంగా ఉందంటూ భక్తులు మురిసిపోయారు.

నేటితో ముగియనున్న జాతర...

బుధవారం ప్రారంభమైన సమ్మక్కసారలమ్మ జాతర నేటితో ముగియనుంది. గిరిజన వేలుపులు నేడు వన ప్రవేశం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 2, 3 గంటల వరకు మొక్కుల చెల్లింపు కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు పూజారులు గద్దెల వద్దకు చేరుకుని మళ్లీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం దేవతలను వన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. తమ ఇష్ట దైవాలకు వీడ్కోలు పలికే దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. అమ్మలూ మళ్లీ రెండేళ్లకు మిమ్మల్ని చూసేందుకు వస్తామంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతారు. 

06:47 - February 20, 2016

హైదరాబాద్: మనదేశంలో ఆరు రోజుల పర్యటనకు గాను నేపాల్‌ ప్రధాని KP శర్మ ఓలి న్యూఢిల్లీ చేరుకున్నారు. నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శర్మ మొదటి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని ఇక్కడకు వచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌... ఆయనకు స్వాగతం పలికారు. నేపాల్‌ ప్రధాని KP శర్మఓలి వెంట 77 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ద్వైపాక్షిక అంశాలపై మన ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ నేపాల్‌ ప్రధాని చర్చలు జరపుతారు. పలు రంగాల్లో భారత్‌-నేపాల్‌ సరస్పర సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీలతో నేపాల్‌ ప్రధాని భేటీ అవుతారు. ఆదివారం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ వెళ్లి తెహ్రీ జల విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. సోమవారం భారత్‌-నేపాల్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగిస్తారు. మంగళవారం గుజరాత్‌లోని భుజ్‌ను సందర్శించి, అదే రోజు ముంబై చేరుకుంటారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అవుతారు. నేపాల్‌ ప్రధాని KP శర్మ ఓలి ఈనెల 24న ముంబై నుంచి నేపాల్‌ బయలుదేరి వెళతారు. 

06:46 - February 20, 2016

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో వరుసగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉభయసభలను సజావుగా నడపేందుకు ప్రతిపక్షల సహకారం తప్పనిసారి కావడంతో ఈనెల 16న ప్రధాని మోదీ అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ చ్మైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఇవాళ అఖిలపక్షం నిర్వహించున్నారు. రాజ్యసభలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. సోమవారం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అఖిలపక్షం నిర్వహించనున్నారు. వరుస అంతరాయాలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టకుపోయిన నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలనైనా సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ కూడా ఇవాళ పార్టీ సీనియర్లతో సమావేశం అవుతారు. 

అరుణాచల్‌ప్రదేశ్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం

హైదరాబాద్ : రాష్ట్రపతి పాలన తొలగించిన వెంటనే అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ పరిణమాలు చకచకా మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కాంగ్రెస్‌ తిరుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

 

06:44 - February 20, 2016

హైదరాబాద్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో పాతిక రోజులపాటు కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరపడింది. కాంగ్రెస్‌ తిరుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత కలిఖో పుల్‌ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ రజ్‌ఖోవా ఆయనతో ప్రమాణం చేయించారు.

గవర్నర్‌ రజ్‌ఖోవాతో 32 మంది ఎమ్మెల్యేల భేటీ ....

అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడురోజుల్లోనే రాజకీయ పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్‌ నేతృత్వంలోని 32 మంది శాసనసభ్యుల ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రజ్‌ఖోవాతో భేటీ య్యింది. ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. అదేరోజు రాష్ట్రపతి పాలన రద్దుకు కేంద్ర కేబినెట్‌ సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాథాపూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేత, గత నెల 25 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నబమ్‌ టుకీ చివరి ప్రయత్నంగా చేసుకున్న అభ్యర్ధనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఆతర్వాత అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఈ ప్రకటన వెలవడిన అరుణచాల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రజ్‌ఖోవా... ప్రభుత్వం ఏర్పాటుకు కలిఖో పుల్‌ను ఆహ్వానించారు. గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందుకున్న కలిఖో పుల్‌.. తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఇటానగర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ రజ్‌ఖోవా... కాంగ్రెస్‌ తిరుబాటునేత కలిఖో పుల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

డిసెంబర్‌ 17 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు ....

అరుణాచల్‌ప్రదేశ్‌లో తగేడాది డిసెంబర్‌ 17న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీకి వున్న 47 మంది ఎమ్మెల్యేల్లో కలిఖో పుల్‌ నేతృత్వంలో 21 మంది శాసనసభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత కలిఖో పుల్‌కు 11 మంది బీజేపీ శాసనసభ్యులతోపాటు, ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇచ్చారు. అరుణాచాల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్వీకర్‌ నబమ్‌ రెబియా వీరిని అనర్హులగా ప్రకటించారు. దీంతో నబమ్‌ టుకీ సర్కార్‌ మైనారిటీలో పడటంతో గత నెల 26న రాష్ట్రపతి పాలన విధించారు. తదనంతర పరిణామాల్లో భాగంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యింది. 

Don't Miss