Activities calendar

21 February 2016

ఎన్‌టీవీపీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటుయూనివర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో ఎన్‌టీవీపీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చేందుకు జరిగేప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంంలో విద్యారంగాన్ని నిర్వీర్యంచేస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

22:06 - February 21, 2016

చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు. అసమ్మతితో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్‌ ధనపాల్‌కు అందజేశారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా మహా కూటమి కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. 

 

22:05 - February 21, 2016

చిత్తూరు : గత ప్రభుత్వాలు, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే రాయలసీమ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని సిపిఎం నేత కృష్ణయ్య విమర్శించారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికై వామపక్షాలు చేపట్టిన బస్ యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పుంగనూరుకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధికి చేసింది ఏమీ లేదని సీపీఎం నేతలు విమర్శించారు.  

 

22:02 - February 21, 2016

హైదరాబాద్ : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యను కాషాయీకరణ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు. 25న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తమ్మినేని తెలిపారు. కేంద్రం తీరుపై వామపక్షాలు, ప్రజా, సామాజిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు.. బీజేపీ తీరును తప్పుపట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 23 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు.
 

21:56 - February 21, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆర్మీకి మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టెర్రరిస్టులు నిన్నటి నుంచి ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడి అక్కడినుంచే కాల్పులకు తెగబడుతున్నారు. 24గంటలు దాటిన ఈ ఆపరేషన్‌లో ఓ పౌరుడితో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.
సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై హఠాత్తుగా దాడి  
జమ్మూకాశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఆర్మీకి మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ ప్రారంభమై ఇప్పటికే 24 గంటలకు పైనే అయింది. శనివారం సాయంత్రం కొందరు ఉగ్రవాదులు జమ్మూ-శ్రీనగర్ రహదారిపై ఉన్న పాంపోర్‌లో సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై హఠాత్తుగా దాడికి పాల్పడ్డారు. అనంతరం టెర్రరిస్టులు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ భవనంలోకి చొరబడ్డారు. వెంటనే భద్రతా చర్యలు చేపట్టిన ఆర్మీ భవనంలోని పౌరులను సురక్షితంగా బయటకు పంపాయి. అయితే టెర్రరిస్టులు భవనంలో నక్కి కాల్పులు మొదలుపెట్టారు. 
ఆరుకు చేరిన మృతుల సంఖ్య 
ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ ఉదయం ఆర్మీ అధికారి పవన్‌కుమార్ వీరమరణం పొందారు. తర్వాత మరో జవాన్ కూడా దుర్మరణం చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఉగ్రవాదుల దాడి మొదలైన తర్వాత ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఓ పౌరుడు, ఓ జవాన్ మృతిచెందారు. ఈ రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పరస్పర కాల్పుల నేపథ్యంలో మధ్యాహ్నం ఓ భవనంలోని పై అంతస్తులో మంటలు వ్యాపించాయి. అయితే భవనంలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయంపై ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం లేదు. ఈడీఐ భవనంలోని సిబ్బందిని, పౌరులను సురక్షితంగా బయటకు పంపామని.. ఇద్దరు నుంచి నలుగురు ఉగ్రవాదులు బిల్డింగ్‌లో ఉండొచ్చని సీఆర్‌పీఎఫ్‌ పీఆర్‌వో భవేశ్‌కుమార్‌ తెలిపారు. ఎన్‌కౌంటర్ ఎప్పటికి ముగుస్తుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. 

21:49 - February 21, 2016

హర్యానా : జాట్‌ల ఆందోళన మరింత ఉధృతమైంది. తాజాగా చెలరేగిన అల్లర్లు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. దీంతో ఇప్పటివరకూ రిజర్వేషన్‌ల ఆందోళన వల్ల మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. మరోవైపు.. జాట్‌ల ఆందోళనను విరమింప చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. జాట్‌ ప్రతినిధులతో పాటు.. కీలక అధికారులతో భేటీ అయ్యారు. ఓ దశలో.. డిమాండ్‌లు నెరవేరాయని.. ఆందోళనను విరమించాల్సిందిగా జాట్‌ సంఘం నేత పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఆయన దాన్ని తోసిపుచ్చారు. మరోవైపు ఆందోళనలతో ఢిల్లీకి నీటి సమస్య ఏర్పడింది. 
మూడోరోజు ఆందోళనలకు వెనకాడని జాట్ వర్గీయులు
మూడోరోజు జాట్ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. పారా మిలిటరీ బలగాలు కవాతు జరిపినా, పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన జాట్ వర్గీయులు ఆందోళనలకు వెనుకాడటం లేదు. రోహ్‌తక్‌, జింద్‌, బివాని, జజ్జర్‌, సోనిపట్‌ జిల్లాల్లో ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతోంది. ఇప్పటికే వీరి ఆందోళనల కారణంగా రైళ్లు, బస్సులు తదితర వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ ఉద్యమంలో చెలరేగిన హింసలో మృతిచెందిన వారి సంఖ్య పదికి చేరింది. 150 మంది దాకా గాయపడ్డారని హర్యానా డీజీపీ యష్‌ పాల్‌ సింఘాల్ తెలిపారు. ఆదివారం కత్యాల్‌ నగరంలో కూడా కర్ఫ్యూ విధించడంతో.. కర్ఫ్యూ జాబితాలోని ప్రాంతాల సంఖ్య9కి చేరింది. 
ఢిల్లీకి చేరిన జాట్ ఉద్యమ సెగ
మరోవైపు జాట్‌ ఉద్యమ సెగ దేశ రాజధానిని తాకింది. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. ఢిల్లీకి వచ్చే నీటి సరఫరా పైప్‌ లైన్ ను జాట్లు అడ్డుకోవడంతో.... నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధానిలోని 7 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎండిపోయాయి. నీటి నిల్వలు అడుగంటడంతో... ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సోమవారం ప్రభుత్వ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు ఢిల్లీ శివార్లలోనూ ఉద్యమకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 
జాట్‌ ఉద్యమం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం 
జాట్‌ ఉద్యమం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోడ్డు రవాణాను ఉద్యమకారులు పూర్తిగా స్తంభింపచేశారు. దాదాపు 700 రైళ్లు రద్దవ్వగా.. వెయ్యికిపైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌, మిలీనియం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరంగల్‌ స్టేషన్‌లో నిలిచిపోయాయి. అటు హరియాణాలో ఇప్పటివరకు ఏడు రైల్వేస్టేషన్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో... విమాన ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌లకు విమాన ఛార్జీలు గతంలో ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోయాయి. చండీగఢ్‌, ఢిల్లీ మధ్య సాధారణంగా విమాన ఛార్జీలు 3 వేల నుంచి 4 వేల మధ్యలో ఉంటాయి. అయితే ఇప్పుడు వీటి కనీస ఛార్జీలు 16 వేలకు చేరుకున్నాయి. ఢిల్లీ-జైపూర్ టికెట్‌ కూడా 9 వేల నుంచి 24 వేల మధ్య ఉంది. 
హర్యానాకు హింసకారణంగా రూ. 20 వేల కోట్లునష్టం 
జాట్ల ఆందోళనల మూలంగా హర్యానా రాష్ట్రానికి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పారిశ్రామిక సంస్థ అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో స్తంభించిపోయిన పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా ఈ నష్టం వాటిల్లినట్లు అసోచామ్ తెలిపింది. ఇప్పటికే మారుతీ సుజ్‌ కీ సంస్థ హర్యానాలోని తన 2 ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసింది. ఈ ఉద్యమ ప్రభావం హర్యానాతోనే కాకుండా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లపై కూడా ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని అసోచామ్ తెలిపింది. పలు ముఖ్యమైన జాతీయ రహదారులు హర్యానా రాష్ట్రం గుండా వెళ్తుండటంతో ఆ ప్రాంతంలోని రవాణా అనుబంధ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించింది. 
జాట్ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెడతాం : హర్యానా ప్రభుత్వం  
జాట్ రిజర్వేషన్లపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని ఇప్పటికే హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తక్షణమే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని జాట్‌లు పట్టుబడుతున్నారు. మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్.. కూడా రంగంలోకి దిగారు. కీలక అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెంటనే ఆందోళన విరమించాలని జాట్ వర్గానికి విజ్ఞప్తి చేశారు.

 

జాట్‌ల రిజర్వేషన్లపై దిగొచ్చిన కేంద్రం

 
ఢిల్లీ : జాట్‌ల రిజర్వేషన్లపై కేంద్రం దిగొచ్చింది. జాట్ నేతలతో చర్చించేందుకు వెంకయ్యనాయుడు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ దీనిపై కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. 

 

21:43 - February 21, 2016

ఢిల్లీ : జాట్‌ల రిజర్వేషన్లపై కేంద్రం దిగొచ్చింది. జాట్ నేతలతో చర్చించేందుకు వెంకయ్యనాయుడు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ దీనిపై కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. 

21:39 - February 21, 2016

హైదరాబాద్ : ఏపీ రాజధాని పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే తాత్కాలిక సచివాలయానికి పునాది రాయి కూడా పడింది. నిర్మాణాలన్నీ వేగంగా పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాత్కాలిక సచివాలయ నిర్మాణంతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందంటున్నారు అధికారులు. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటి ? రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చే విధంగా ఉండే ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే మీరే చూడండి. 
రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు 
ఆంధ్రప్రదేశ్‌... రాష్ట్ర విభజన అనంతరం పేద మరియు ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. తాత్కాలిక సచివాలయం నిర్మాణంతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందంటున్నారు అధికారులు. ఇంతకీ ఆ గుర్తింపుకు కారణం.. ముఖ్యమంత్రి కార్యాలయంపై హెలిప్యాడ్‌ నిర్మించడమే అంటున్నారు అధికారులు. 
29 రాష్ట్రాల్లో లేని విధంగా నిర్మాణం 
అయితే.. సీఎం కార్యాలయంపై హెలిప్యాడ్‌ నిర్మిస్తే ఎలా గుర్తింపు వస్తుందని ఆలోచిస్తున్నారా ? అయితే చూడండి. ఇప్పటివరకు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ సీఎం తన కార్యాలయంపై హెలిప్యాడ్‌ నిర్మించుకోలేదట. ఇప్పుడు తాత్కాలిక సచివాలయంపై హెలీప్యాడ్‌ నిర్మిస్తే ఆ ఘనత ఏపీకే దక్కుతుందని అధికారులు అంటున్నారు. 
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే
ముఖ్యమంత్రి కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ  నిర్మాణమంటున్నారు సీఆర్‌డీఏ అధికారులు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటివి సాధారణమే అంటున్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు 
అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాధనాన్ని వృధా చేసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సీఎం ఇలాంటి పోకడలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా సీఎం కార్యాలయంపై హెలీప్యాడ్‌ నిర్మాణంతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. 

 

21:23 - February 21, 2016

పశ్చిమగోదావరి : కోడిపందెల గడ్డ భీమవరం జాతీయబాక్సింగ్ పోటీలతో కోలాహలంగా మారింది. జాతీయ యువజన బాక్సింగ్ పోటీలకు భీమవరం తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన 250 మంది యువబాక్సర్లు వివిధ విభాగాలలో పోటీపడుతున్నారు. ఈ పోటీల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ సంఘం విస్త్రుతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆసియా యువజన బాక్సింగ్ లో పాల్గొనే భారతజట్టును ఈ పోటీల నుంచే ఎంపిక చేస్తారు. ఈ పోటీలు ఫిబ్రవరి 23న ముగియనున్నాయి.

 

21:19 - February 21, 2016

హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ సాగర్ సంతాప సభ  హైదరాబాద్ లో జరిగింది. పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణ్ సాగర్ తో తమకున్న సన్నిహిత్యాన్ని పంచుకున్నారు. అరుణ్‌ సాగర్ కుటుంబానికి తమప్రగాఢ సానుభూతిని తెలిపారు. 10 టీవీ తో ఆయనకున్న బంధాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పంచుకున్నారు. అరుణ్ సాగర్ అకాలమరణం సాహితిలోకానికి తీరనిలోటన్నారు. మీడియాలో 10 టీవీకి సాగర్‌ ప్రత్యేక స్థానం కల్పించారని 10 టీవీ ఎండీ వేణుగోపాల్ కొనియాడారు. 

 

కర్నాటక సీఎంపై పేపర్ బ్యాగ్ విసిరిన వ్యక్తి

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యపై ఒక వ్యక్తి పేపర్ బ్యాగ్ విసిరిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధ రామయ్య ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా ఒక వ్యక్తి ఆయనపైకి పేపర్ బ్యాగ్ ను విసిరాడు. బ్యాగ్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో సాధారణమని.. ఇలాంటి విషయాల అనేక సార్లు చూసినట్లు సిద్ధ రామయ్య తెలిపారు.

రేపు వెంకయ్యనాయుడు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో రేపు ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్షం నేతలు సమావేశం కానున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.

రైలు ఢీకొని వ్యక్తి మృతి ..

కరీంనగర్‌ : కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు.. తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

20:59 - February 21, 2016

హైదరాబాద్ : మగ సంతానం కలగడం లేదంటూ భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న ఘటన రెయిన్ బజార్ లో చోటుచేసుకుంది. రెయిన్ బజార్ కు చెందిన ఫర్హా బేగం కు.. ఎల్ బీనగర్ కు చెందిన బైక్ మెకానిక్ అబ్ధుల్ రహీంతో 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం వీరికి ఇద్దరు కూతుళ్లు కలగడం.. మగ సంతానం కలగకపోవడంతో ఆమెను గదిలో బంధించి అత్త, మాత, భర్త చిత్రహింసలకు గురిచేశారు. ఫర్హా బేగం తప్పించుకుని పీఎస్ లో వారిపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. 

 

20:51 - February 21, 2016

ఢిల్లీ : దేశంలో రైతు ఆత్మహత్యలు పెచ్చుమీరిపోతున్నా.. ప్రభుత్వాలు కమిషన్‌ల పేరిట కాలయాపన చేస్తున్నాయే తప్ప.. అన్నదాతలకు ప్రయోజనం చేకూరే పనులు చేయడం లేదని.. ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ విమర్శించారు. దేశంలో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయాన్ని పెంచే విధంగా ఏ సర్కారూ ప్రయత్నించడం లేదన్నారు. 
ప్రభుత్వ అణచివేత విధానాలపై సాయినాథ్ చురకలు
ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో.. ఐక్య ఉద్యమం సాగిస్తున్న విద్యార్థులకు.. ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ అణచివేత విధానాలపై ఆయన చురకలు అంటించారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాల దుర్భర జీవనశైలిని గురించి విద్యార్థుల కళ్లకు కట్టినట్లు వివరించారు. రైతు ఆత్మహత్యలపై పాలకులు సత్యదూరమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు.
విద్యార్థులదే అంతిమ విజయం.. 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉంటున్నాయని విమర్శించారు. ఇటీవల బీఫ్‌ మాంస విక్రయాలను నిషేధించడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రసిద్ధ కొల్లాపూర్‌ చెప్పుల పరిశ్రమను కుదేలు చేసిందన్నారు.
అంగన్‌వాడీ వ్యవస్థను ప్రైవేటు పరం చేసే యత్నం 
అంగన్‌వాడీల వ్యవస్థను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. వయోభేదం లేకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారని సాయినాథ్‌ మండిపడ్డారు. జెఎన్‌యూ విద్యార్థులు భిన్న భావాలు, సిద్ధాంతాలు ఉన్నా.. ఒక కారణం కోసం సంఘటితంగా పోరాటం చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ సమరంలో విద్యార్థులదే అంతిమ విజయమని అభిప్రాయపడ్డారు. 

20:46 - February 21, 2016

హైదరాబాద్ : నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలను ట్రాఫిక్ పోలీసులు స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచారు. 'పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత మనందరి ఉందంటూ' మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ రామస్వామి ఆధ్వర్యంలో పోలీసులు, ఆటో డ్రైవర్స్ సహకారంతో రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. డివైడర్లకు పెయింట్ వేసి ఆకర్షనీయంగా మలిచారు. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయరాదంటూ పిలుపు నిచ్చారు. 

శ్రీనగర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఆర్మీ కెప్టెన్‌ తుషార్‌ మహాజన్‌ మృతి చెందారు. దీంతో కాల్పుల్లో మృతి చెందినవారి సంఖ్య ఇప్పటివరకు ఏడుకు చేరింది. మరోవైపు భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

20:38 - February 21, 2016

ఖమ్మం : జిల్లా కేంద్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. గతంలో మున్సిపాలిటీగా ఉన్న ఆ పట్టణం కార్పొరేషన్‌గా అప్‌ గ్రేడ్ అయిన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడీ డివిజన్లలో గెలుపు గుర్రాల ఎంపిక పార్టీలకు కత్తిమీద సాములా మారింది. తెలంగాణలో వరుస ఓటములతో విలవిల్లాడుతున్న ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు పెను సవాలుగా మారాయి. 
పోరాటాల ఖిలా ఎన్నికల హడావుడి
పోరాటాల ఖిలా ఖమ్మంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఇక్కడ మిగతా పార్టీలకన్నా వామపక్షాలు బలంగా ఉంటాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్‌ రిజల్ట్‌నే ఇక్కడా రిపీట్ చేయాలని అధికార పార్టీ, ఖమ్మంలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని మిగతా పార్టీలు బరిలో దిగుతున్నాయి. 
ఖమ్మం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు 
ఖమ్మం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. ఇక తమకు టికెట్ కన్‌ఫామ్ అనుకున్నవారు ఏకంగా ప్రచారమే మొదలుపెట్టారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఖమ్మం మున్సిపల్ పీఠంపై సిపిఎం జెండా ఎగరేసింది. మరోమారు ఖమ్మంలో గెలిచి సత్తా చాటుకోవాలని సిపిఎం ప్లాన్ చేస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందినవారు కావడంతో మేయర్ పీఠంపై కన్నేసి అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తోంది. ఇక టిఆర్ఎస్ ఖమ్మంలోనూ విజయబావుటా ఎగరేయాలని చూస్తోంది. ఇటీవల కెసిఆర్ పర్యటనతో పాటు పెరిగిన వలసలు ఆ పార్టీ నేతల్లో ఆశలు పెంచుతున్నాయి. సిపిఐ, టిడిపి, బిజెపిలు సైతం ఇతర పార్టీలతో కలిసి పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. 
పార్టీల వ్యూహ రచనలు 
నోటిఫికేషన్‌కు ముందునుంచే వ్యూహరచనలు చేస్తున్న పార్టీలు ఎవరెవరికి సీట్లిస్తాయన్నది చర్చనీయాంశమైంది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో అభ్యర్థుల ఎంపిక వారి ఆర్థిక సామర్థ్యం కీలకాంశాలుగా మారాయి. 

 

20:34 - February 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోబాటు అచ్చంపేట నగర పంచాయతీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ రేపు నోటిఫికేషన్‌ రిలీజ్ చేసి వెంటనే నామినేషన్లు స్వీకరించనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో స్థానికంగా ఎలక్షన్ వేడి మొదలైంది. కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు కార్యాచరణ మొదలు పెట్టాయి. 
ఎన్నికల సంరంబం 
తెలంగాణలో ఎన్నికల సంరంబం కొనసాగుతూనే ఉంది. సాధారణ ఎన్నికల తర్వాత వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అవి ముగియగానే నారాయణఖేడ్ ఉప ఎన్నిక జరిగిపోయాయి. అన్నిటిలోనూ అధికార టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. 
ఈ నెల 24 వరకు నామినేషన్ల స్వీకరణ
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోబాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీకి ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే వార్డుల వారిగా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం నుంచి ఈ నెల 24 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. 26 సాయంత్రం 3 గంటలలోపు అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించి అదే రోజు సాయంత్రం బరిలో నిలిచినవారి పేర్లు ప్రకటిస్తారు.
మార్చి 6న పోలింగ్
ఇక మార్చి 6న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురై పోలింగ్ నిలిచిపోతే అలాంటి వార్డులకు సంబంధించి 8న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక కౌంటింగ్‌ ప్రక్రియ మార్చి 9న ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. అయితే గతంలో 21 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించగా మున్సిపల్ చట్ట సవరణతో ప్రభుత్వం ఆ గడువును 15 రోజులకు కుదించింది. దీనికి అనుగుణంగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి రెండో వారంలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ఎన్నికలు ముగియనున్నాయి. 
సిద్దిపేట ఎన్నిక నిర్వహణకు ప్రయత్నం
వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికలతోపాటే మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. సిద్దిపేటలో ఆరు శివారు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొంతకాలంగా ఈ మునిసిపాలిటీ ఎన్నికలపై స్టే అమల్లో ఉంది. స్టే తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వేచిచూస్తే ఎన్నికలను బడ్జెట్ సమావేశాల కంటే ముందే నిర్వహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత సిద్దిపేటతో పాటు దుబ్బాక, కొల్లాపూర్, మేడ్చల్‌ మునిసిపాలిటీలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

 

భట్టివిక్రమార్కకు వీఎంసీ బాధ్యతలు...

వరంగల్ : పురపాలక ఎన్నికలు జరిగే మునిసిపల్ కార్పొరేషన్లకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ఇంచార్జ్‌లను నియమించారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, కోదండరెడ్డిలను, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌కు రాజ్‌గోపాల్ రెడ్డి, సంపత్‌లను ఇంచార్జ్లుగా నియమించారు.

వరంగల్ లో వ్యక్తిపై పీడీయాక్ట్‌ ప్రయోగం

హన్మకొండ : వరంగల్ పీఎస్ పరిధిలో తొలిసారిగా పీడీయాక్ట్‌ను అమలు చేశారు. 84గొలుసు చోరీలకు పాల్పడిన బోనోత్ రవి అనే వ్యక్తిపై పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించారు. ఈ సందర్భంగా వరంగల్ సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ భూకబ్జాలు , మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

జాట్ సోదరులు అలాంటి చర్యలకు దిగొద్దు : వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న జాట్ రిజర్వేషన్ల అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆందోళన చెందుతున్నాడు. రిజర్వేషన్ల కోసం హర్యానాలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్న జాట్ సోదరులను అలాంటి చర్యలకు దిగవద్దని సూచించాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో జాట్ సోదరులకు విజ్ఞప్తి అంటూ సందేశాలను పోస్ట్ చేశాడు. జాట్లు రక్షకులేగానీ, విధ్వంసకారులు కాదు అని పేర్కొన్నాడు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై తమ డిమాండ్లను వ్యక్తపరచాలని సూచించాడు. క్రీడలు, ఆర్మీ, తమకు ఇష్టమున్న రంగాల్లో మన సత్తాచాటి దేశం గర్వపడేలా చేయాలని హింసాత్మక పనులు చేయవద్దంటూ కోరాడు.

19:44 - February 21, 2016

విజయవాడ : మాదిగలకే న్యాయం చేయలేని చంద్రబాబు కాపులకు ఏం చేస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాదిగల సమస్యలపై చర్చించారు. అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నమ్మిన వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబని విమర్శించారు.  ప్రభుత్వంతో తాడొ పేడో తేల్చుకుంటామని ఏప్రిల్ 30న పదిలక్షల మందితో విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

 

19:40 - February 21, 2016

హైదరాబాద్ : మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసిపి నేతలు మండిపడ్డారు. సీఎం పదవిలో ఉండి... సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారని... వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మురికివాడల ప్రజలు ఓట్లు వేస్తేనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆయనకు మురికివాడల ప్రజలు గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును ఒక మానసిక వైద్యుడికి చూపించి చికిత్స చేయించడం మంచిదని కల్పన సూచించారు. 

 

19:30 - February 21, 2016

కర్నూలు : రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ విమర్శించారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిచిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని హామి ఇచ్చి మరిచిందని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.   

 

19:10 - February 21, 2016

కరీంనగర్ : మిడ్ మానేరుడ్యాంలో మునిగిపోయే గ్రామాల నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వేములవాడలో భిక్షాటన నిర్వహించారు గ్రామస్థులు. రాజన్నసాక్షిగా ముంపుగ్రామాల నిర్వాసితులకు పరిహారం ఇస్తానని డబుల్ బెడ్ రూం నిర్మించి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటిమూటలుగా మారాయని ధ్వజమెత్తారు. రేపు సంకెపల్లి గ్రామశివారు ప్రధానరోడ్డుపై వంటావర్పు నిర్వహించి ధర్నా చేపడతామని నిర్వాసితులు తెలిపారు.  

19:05 - February 21, 2016

వరంగల్‌ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపు రాష్ర్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేయనుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన,  26 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 6న పోలింగ్‌, మార్చి 9న కౌంటింగ్‌ ఉంటుంది.
గ్రేటర్ వరంగల్ పీఠం కైవసంపై ఆసక్తి  
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఈసీ. ఇప్పటికే అన్ని పార్టీలూ కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశాయి. సుమారు పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. గ్రేటర్‌ వరంగల్‌ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 
తెలంగాణలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ 
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటివరకు వరంగల్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌,  నారాయణఖేడ్‌ ఎన్నికలతో సందడిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు మరిన్న పురపాలికల ఎన్నికలకు సన్నద్ధమైంది. తాజాగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీని ప్రకారం.. సోమవారం నాడు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈనెల 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్లు పరిశీలన, 26 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది. మార్చి 6న పోలింగ్‌ నిర్వహించి.. 9న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. మొత్తం 58 డివిజన్లలో జరగనున్న ఎన్నికలకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
2005 సెప్టెంబర్‌.. ఓరుగల్లు మేయర్‌... కాంగ్రెస్‌ కైవసం
2005 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అప్పటి పాలక పక్షం కాంగ్రెస్‌... ఓరుగల్లు మేయర్‌ పదవిని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. గ్రేటర్‌గా మారడం.. గ్రామాల విలీనాన్ని సవాల్‌ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అనుమతులు లభించడంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఓరుగల్లు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ తహతహ
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో.. ఓరుగల్లు కార్పొరేషన్‌పై పార్టీ జెండాను ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ తహతహలాడుతోంది. ఇప్పటికే వరంగల్‌ ఉప ఎన్నికలో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని మరింత బలం పుంజుకుంది. ఇక్కడ తమ గెలుపు లాంఛనమేనని అధికార పార్టీ ధీమాగా ఉంది. అటు ఆశావహులు కూడా ఇప్పటికే అధికార పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి కేటీఆర్‌ టీఆర్ఎస్‌ను గెలుపు తీరాలకు చేర్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కార్పొరేషన్‌ పరిధిలో పర్యటించారు. 
ఎన్నికల్లో పాల్గోనున్న ఆరు వామపక్షాలు  
ఇక టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలు సైతం ఎన్నికలకు సిద్ధమయ్యాయి. 6 వామపక్ష పార్టీలు 'బెటర్‌ వరంగల్‌ ఫ్రంట్‌'గా ఏర్పడి ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. కలిసివచ్చే ప్రజాశక్తులను కలుపుకొని.. 40 స్థానాల్లో పోటీ చేసేందుకు కామ్రేడ్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పాలక పక్షానికి రెబల్స్‌ బెడద కూడా భారీగానే ఉండేటట్లు కనిపిస్తోంది. 

 

19:03 - February 21, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ శివార్లలోని హరిత వనస్థలిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రతకు పార్కులోని గడ్డికి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

 

కడప జిల్లా బాలపల్లి అడవుల్లో కూంబింగ్

కడప : రైల్వే కోడూరు మండలం బాలపల్లి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులపై తమిళ కూలీలు రాళ్లు రువ్వారు. ఇద్దరు తమిళ కూలీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.  వీరి నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

18:33 - February 21, 2016

జమ్మూకాశ్మీర్ : శ్రీనగర్‌లో ఉగ్రవాదులతో ఎన్‌ కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తాజాగా జవాను మృతి చెందాడు. సుమారు 20 గంటలుగా ఫైరింగ్ జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో దాక్కున్న తీవ్రవాదులను హతమార్చేందుకు ఆర్మీ ఆపరేషన్ ను ఉధృతం చేసింది. కాల్పుల్లో భవనం పైభాగానికి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇవాళ మరో జవాన్ చనిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. 

18:25 - February 21, 2016

మెదక్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్ ఆర్ ఐ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ముందుకొచ్చింది. 'జై కిసాన్‌ ప్రాజెక్టు' పేరిట మెదక్‌ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గంలో.. ఆత్మహత్యలు చేసుకున్న 10 మంది రైతు కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమకు ఫోన్‌ చేస్తే తమ వంతు సాయం అందించడమే కాకుండా.. వారికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఫోరం నిర్వాహకులు తెలిపారు. 

జాట్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు హర్యాన ప్రభుత్వం నిర్ణయం

చంఢీగడ్ : జాట్ల ఆందోళనకు హర్యానా ప్రభుత్వం దిగొచ్చింది. జాట్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 

 

18:08 - February 21, 2016

విజయవాడ : మే 15 నుంచి ఆర్టీసీ పరిపాలన వ్యవహారాలన్నీ విజయవాడ నుంచే నిర్వహిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. గత ఏడాది నష్టాలను బాగా తగ్గించామన్నారు. 30రోజుల్లో 64బస్‌స్టేషన్లను ఆధునికీకరిస్తామని వెల్లడించారు. 26కోట్ల వ్యయంతో ఆయా బస్‌స్టేషన్లలో సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. బస్టాండ్లకు కార్పొరేట్‌ సంస్థల పేర్లను పెట్టేందుకు వేలంపాట నిర్వహిస్తామని కూడా సాంబశివరావు పేర్కొన్నారు.

 

17:59 - February 21, 2016


చెన్నై : ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలోని తెలుగు సంఘాల ప్రతినిధులతో పల్లె సమావేశమయ్యారు. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వారి కష్టాలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. అయితే.. ఈ విషయంలో తెలుగు వారంతా ఒక్కతాటిపై నిలిచి పోరాడేందుకు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. 

17:57 - February 21, 2016

మెదక్:  ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లా సిద్ధిపేటలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామానికి చెందిన చామంతి అనే విద్యార్థిని మెదక్ జిల్లా సిద్ధిపేటలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మల్లేషం అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లిచేసుకోమని పలుమార్లు వేడుకున్నా మల్లేషం పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన చామంతి కూల్ డ్రింక్ లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స నిమ్తితం యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

17:48 - February 21, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని తందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును తక్షణమే నిలిపేసేలా ప్రభుత్వం ఆదేశించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాదిన్నరగా ఆ పార్కు నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో ఆ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో ఆనంద్‌ గ్రూప్‌ అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు. 

17:41 - February 21, 2016

కర్నూలు : ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా తమకు న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్లకొద్దీ ఎదురుచూస్తున్నా ఏ ప్రభుత్వమూ తమకు న్యాయం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పూర్తికాని పెండింగ్ ప్రాజెక్టులు
భారీగా ఆదాయం ఇస్తున్నా కర్నూలు జిల్లాపై రైల్వే శాఖ చిన్న చూపే చూస్తోంది. జిల్లాలో ప్రధానంగా కర్నూలు, ఆదోని, డోన్, నంద్యాల, మంత్రాలయం రైల్వే స్టేషన్లున్నాయి. జిల్లాలో ఎక్కువభాగం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. నంద్యాల, గుంటూరు, కర్నూలు రైల్వే స్టేషన్లుమాత్రం హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ప్రతి ఏడాది జిల్లానుంచి రైల్వేకు 30కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.. ఒక్క ఆదోని స్టేషన్‌నుంచే 10కోట్లు వసూలవుతున్నాయి.. ఈ స్థాయిలో ఇన్‌కం వస్తున్నా బడ్జెట్‌లో కేటాయింపులు జరపకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.. పెండింగ్ ప్రాజెక్టులు ఒక్క అడుగుకూడా ముందుకు పడవు... కొన్నింటికి నిధులే అందవు.. మరికొన్నింటికి అందినా పనులు నత్తనడక సాగుతాయి.. దీనికితోడు కొత్త ప్రాజెక్టులు అసలే రావు.. దీంతో జిల్లావాసులనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..
రైల్వే కోచ్ పరిశ్రమ కోసం సూర్యప్రకాశ్ రెడ్డి చొరవ
కర్నూలు సమీపంలో రైల్వే కోచ్ పరిశ్రమ కోసం గత రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు.. ఈ డబ్బుతో సర్వేపూర్తయింది.. పరిశ్రమకు అవసరమైన భూమి గుర్తించి సంబంధిత శాఖలకు అప్పగించారు.. పాట్నా రైల్వే అధికారులు ఈ భూమి పరిశీలించి పనుల ప్రారంభంపై సమీక్షించారు.. అప్పట్లో ఈ పరిశ్రమకు వందకోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు.. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అంచనావ్యయం పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్థాపనకు 281కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 12వందల మందికి ఉపాది దొరికే అవకాశముంది.. ఈ పనుల్ని ఆలస్యం చేయకుండా వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మంత్రాలయం - కర్నూలు రైల్వే లైన్‌పై ఎన్నో ఆశలు
ఇక రాఘవేంద్రుడు కొలువైన... మంత్రాలయం, కర్నూలు రైల్వే లైన్‌పై పశ్చిమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 1999-2004 మధ్య ఈలైన్‌కోసం ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేసింది.. 110 కిలోమీటర్ల దూరం రైలు మార్గం నిర్మించాలని... ఒక్కో కిలోమీటరుకు 6కోట్ల రూపాయలు అవసరమని తేల్చింది.. ఈ నివేదిక సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ కార్యాలయంలో అలాగే ఉండిపోయింది.. మంత్రాలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఉన్న రైళ్లు సరిపోవడంలేదు.. ఈ బడ్జెట్‌లోనైనా ఈ లైన్‌కు మ్రోక్షం కలుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఈ లైన్‌ ఏర్పాటుచేస్తే ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజవర్గాల ప్రజలకుకూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
30ఏళ్ల క్రితం మంజూరైన నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రాజెక్టు
ఇవేకాదు.. జిల్లాలో ఏళ్ల తరబడి ముందుకు సాగని ప్రాజెక్లు ఎన్నో ఉన్నాయి. నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైను ప్రాజెక్టు 30ఏళ్ల క్రితం మంజూరైంది. ఎర్రగుంట్ల, బనగానపల్లెవరకూ 647 కోట్లు ఖర్చుతో 126 కిలోమీటర్ల వరకూ లైన్ వేశారు.. బనగానపల్లె-నంద్యాల మధ్య 35 కిలోమీటర్ల దూరం పనులు నత్తనడకన సాగుతున్నాయి.. కాచిగూడ, గుంతకల్లు మధ్య డోన్ మీదుగా 360 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇవన్నీ పూర్తవుతేనే కొత్త రైళ్లు కర్నూలుకు వచ్చే అవకాశం ఉంది. గుంటూరు గుంతకల్లు మధ్య నంద్యాల డోన్ రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం 2010-11లో సర్వేకి ప్రతిపాదించారు. సర్వే పూర్తయినా నిధులు రాలేదు. మద్దికెర-నంచర్ల మధ్య 5కిలోమీటర్ల బైపాస్ రైలు మార్గం నిర్మిస్తే కర్నూలు నుంచి డోన్, ఆదోని మీదుగా హైదరాబాద్‌కు వేగంగా చేరుకోవచ్చు.. గత బడ్జెట్‌లో ఈ పనులకు 15కోట్ల రూపాయలు కేటాయించారు.. ఇంకా టెండర్లు పిలవలేదు.. 
శ్రీశైలం-సిద్దేశ్వరం మధ్య రైలు మార్గం కోసం ప్రతిపాదనలు
శ్రీశైలం నుంచి సిద్దేశ్వరం వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి రెండేళ్ల క్రితం సర్వే కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించారు.. ఇది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు.. గుంతకల్లు - రాయచూరు మధ్య కాపలాలేని లెవెల్ క్రాస్ గేట్లు చాలా ఉన్నాయి.. ఇక్కడ రైల్వే గేట్లు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది.. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా రైల్వే శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు.. ఇక సికింద్రాబాద్ నుంచి డోన్ మీదుగా గుత్తి వరకు డబల్ లైన్ నిర్మాణానికి 2013-14 బడ్జెట్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.. ఇప్పటీకి ఈ లైన్‌ పనులు మొదలుకాలేదు..
రాయచూరు-బెంగుళూరుకు వయా మంత్రాలయం
రాయచూరు-బెంగుళూరుకు మంత్రాలయం మీదుగా... గుంతకల్లు హైదరబాద్ మధ్య ఆదోని మీదుగా ప్యాసింజర్‌ రైళ్లు కావాలని కొన్నేళ్లుగా జిల్లా వాసులు కోరుతున్నారు.. బెంగళూరు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్, బెంగళూరు హైదరబాద్ గరీబ్‌రథ్ సూపర్ ఎక్స్ ప్రెస్‌లను ఆదోనిలో ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. అలాగే హైదరాబాద్ నుంచి డోన్ వరకు కర్నూలు మీదుగా ముంబైకి కొత్త రైళ్లు కావాలని కోరుతున్నా రైల్వే శాఖనుంచి ఎలాంటి సమాధానం రావడంలేదు.. తుంగభద్ర ఎక్స్ ప్రెస్ ను కర్నూలు నుంచి డోన్ వరకు పొడిగించాలన్న డిమాండ్‌ కూడా ఉంది. ఇలా ఎన్నో ఏళ్లుగా కొత్త రైళ్లకోసం జిల్లా వాసులు ఎదురుచూస్తూనే ఉన్నారు.. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. 

17:31 - February 21, 2016

నిజామాబాద్ : కుదిరితే కప్పు కాఫీ...వీలైతే నాలుగు మాటలు అంటాడు. వ్యాపారస్తులతో దోస్తీ చేస్తాడు. నైస్‌గా మాట్లాడి ఐస్‌ చేస్తాడు. మళ్లీ మళ్లీ కలిసి వారికి మరింత దగ్గరవుతాడు. నీడలా వారిని వెంటాడుతాడు. వారు చేసే ప్రతి పనిని కళ్లతోనే స్కానింగ్ చేస్తాడు. పక్కా సమాచారంతో పంజా విసురుతాడు. పార్టీ చేసుకుందామని బార్‌ తీసుకెళ్తాడు. ఆ తర్వాత అసలు పని మొదలెడతాడు. నిషాలోకి తీసుకెళ్లి నిండా దోచేస్తాడు.  ఇక్కడ కనిపిస్తున్న ఇతగాడు ఏ1 కిలాడీ. పేరు చిన్నారెడ్డి. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన ఇతగాడు ఓ సాధరణ రైతు. చదివింది ఐదో తరగతే అయినా... జనాలను బురిడీ కొట్టించడంలో మాస్టర్‌ డిగ్రీనే చేశాడు. మసిపూసి మారెడు కాయ చేయడంలో దిట్ట. ఎలాంటి వారినైనా ఈజీగా బుట్టలో పడేస్తాడు. మాటలతోనే గారడి చేస్తాడు. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయంతోనే వారిని బోల్తా కొట్టిస్తాడు. 
విలాసవంతమైన జీవితానికి అడ్డదారులు 
వ్యవసాయంలో నష్టాలు రావడంతో చిన్నారెడ్డి ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. జనాలకు ఎలా కుచ్చుటోపీ పెట్టాలో అక్కడే తర్పిదు పొందాడు. నాలుగేళ్ల తర్వాత సొంతూరు వచ్చిన చిన్నారెడ్డి ఈజీ మనీ వేటలో పడ్డాడు. విలాసవంతమైన జీవితం గడపాలంటే అడ్డదారులే బెస్ట్ అనుకున్నాడు. నిజామాబాద్, గోదావరిఖని, వేములవాడ, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించిన చిన్నారెడ్డి స్థితిమంతులు, వ్యాపారులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారి వ్యాపార లావాదేవీలను ఓ కంట కనిపెట్టాడు. అవకాశం దొరకగానే పంజా విసిరాడు. 
ఈజీమనీ కోసం అడ్డదారులు 
వరంగల్‌ జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి ప్రశాంత్‌ ఈనెల 11న రెండున్నర కేజీల బంగారు నగలతో హైదరాబాద్‌ వస్తున్నాడన్న విషయాన్ని చిన్నారెడ్డి తెలుసుకున్నాడు. సిటీకి రాగానే అనుక్షణం అతన్ని ఫాల్లో అయ్యాడు. ప్రశాంత్‌ పని పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణమయ్యే సమయంలో చిన్నారెడ్డి కలిశాడు. పాత పరిచయంతో ఇద్దరు కలిసి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ సమీపంలోని బార్‌లో మద్యం సేవించారు. గోల్డ్‌ వ్యాపారికి మద్యంలో మత్తుమందు కలిపి తాగించాడు. నిషాలోకి వెళ్లిన తర్వాత అసలు పని మొదలుపెట్టాడు. సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వరకు తీసుకెళ్లి ప్రశాంత్‌ దగ్గర ఉన్న బంగారు నగలు దోచేశాడు. తెల్లవారుజామున స్పృహవచ్చిన బాధితుడు లబోదిబోమంటూ సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
2.5 కేజీల బంగారు నగల దోపిడీ 
రంగంలోకి దిగిన పోలీసులు...ప్రశాంత్‌, చిన్నారెడ్డి కలిసి తిరిగిన ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. దీంతో అతగాడి బండారం బయటపడింది. చోరీకి ముందు చోరీ తర్వాత ఏం చేశాడో అన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఎస్కేప్‌ అవుతున్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. వీటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన వారు ఘరాన కేటుగాడిని వలపన్ని పట్టుకున్నారు. రెండున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
వెలుగులోకి వచ్చిన కిలాడీ మోసాలు 
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు చిన్నారెడ్డి. తోటి రైతులకు శఠగొపం పెట్టాడు. ఇప్పటికే ఇతగాడిపై 13 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. సో వ్యూవర్స్‌.. ఇలాంటి వారు మన మధ్య ఉన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి మాయగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడండి.  

పడవ బోల్తా.. నలుగురి గల్లంతు

కరీంనగర్ : జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో పడవ బోల్తా పడడంతో నలుగురు గల్లంతయ్యారు. 20 మంది ప్రయాణికులతో పడవ మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం వస్తుండగా మార్గంమధ్యలో మహదేవ్ పురం మండలం గట్టుపల్లిలో గోదావరి నదిలో పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న నలుగురు నదిలో పడి గల్లంతయ్యారు. 16 మంది సురక్షితంగా బయటపడ్డారు.
 

17:25 - February 21, 2016

కరీంనగర్ : మహదేవ్‌పురం మండలం మెట్టుపల్లి వద్ద గోదావరిలో ఓ నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ఉన్న 20 మంది నీటమునిగారు. అదే సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న మత్స్యకారులు 19 మందిని రక్షించారు. ఒకరు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి బయటపడినవారిలో 5 నెలల పసికందు పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్ర నుంచి పడవలో కాళేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

 

 

 

ఆదిలాబాద్‌ జిల్లాలో గాంధారి మైసమ్మ జాతర

ఆదిలాబాద్‌ : జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గాంధారి మైసమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివాసీలు, గిరిజనులు నాలుగు రాష్ర్టాల నుంచి భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ పురానం సతీశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దివాకర్‌రావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

16:55 - February 21, 2016

కేరళలో ఒక మగాడికి ప్రెగ్నెన్సీ వచ్చిందట.. శ్రీమంతం చేయమని గోల పెట్టేస్తున్నాడు. ఇంటర్నెట్ లో కొందరి ప్రముఖుల పేర్లతో ఫేక్ పోస్టులు వస్తున్నాయి. ఈ మధ్య రతన్ టాటా పేరుతో జె.ఎన్.యూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఓ ఫేక్ పోస్టు హల్ చేస్తోంది తస్మాత్ జాగ్రత్త... స్వచ్ఛ భారత్ లో నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చారట. ఆర్ బీఐ గవర్నర్ ను ఓ విద్యార్థి చిత్రమైన ప్రశ్న అడిగాడట.. వీటితోపాటు క్రేజీ క్రేజీ అప్డేట్స్ తో ఈ వారం క్రేజీ న్యూస్ మీ ముందుకు వచ్చింది.. ఆ 'క్రేజీ వార్తల్ని వీడియోలో చూద్దాం....

 

16:30 - February 21, 2016

ఆదిలాబాద్ : చెట్టు రసం తాగితే పిల్లలు పుడతారాట. ఓ కొమ్మ బెరడును నడుముకు కట్టుకుంటే సంతానం కలుగుతుందట. ఇదేమి వింత అని ఆశ్చర్యపోతున్నారా...ఏమిటీ ఈ విడ్డూరం అని అవాక్కవుతున్నారా. ఓ మంత్రగాడు...ఇదే ప్రచారంతో పబ్బం గడిపేస్తున్నాడు. చెట్టూ..రసం అంటూ పైసలు సంపాదిస్తున్నాడు. పిల్లల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో జరుగుతున్న  ఈ మాయగాడి లీలలపై స్పెషల్‌ స్టోరీ.. 
మాటలతో ఇట్టే మాయ చేసేస్తాడు
ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం కాల్వతండా గ్రామంలో మంత్రగాడు పుట్టుకొచ్చాడు. అలా ఇలా మంత్రగాడు కాదాయన. మాటలతో ఇట్టే మాయ చేసేస్తాడు. పిల్లల పేరుతో ఠక్కున బుట్టలో వేసేసుకుంటాడు. 
చెట్టు రసం..బెరడుతో సంతాపప్రాప్తి అంటూ మోసం
పిల్లలు లేని దంపతులే ఈ మంత్రగాడి టార్గెట్‌. సంతానం కలగలేదంటూ తన దగ్గరికి వచ్చే వారికి ఓ చెట్టు పేరు చెబుతాడు.  ఆ చెట్టు రసం తాగితే ఏడాది తిరిగేటప్పటికీ చేతిలో పండంటి పిల్లాడు ఉంటాడని చెప్పుకొస్తాడు. చెట్టు రసంతోనే పూర్తి పని కాదంటాడు ఈ వ్యక్తి. ఆ చెట్టులోని ఏదైనా కొమ్మ బెరడు తీసుకుని దానికి నడుముకు కట్టుకోవాలట. ఇంకేముంది..ఈ రెండు కార్యాలు పూర్తి చేస్తే...అనుకున్న కార్యం జరిగిపోతుందట. అదేనండి..పిల్లలు లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని సదరు వ్యక్తి అభయ హస్తం ఇచ్చేస్తాడు.
ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న చెట్టే కావాలట
చెట్టు పేరు తెలుసుకుని రసం తాగేస్తానంటే కుదరదు ఇక్కడ. వెళ్లి బెరడును తెచ్చేసుకుంటానంటే అసలు ఒప్పుకోడు. కండిషన్స్ అప్లై అంటూ అడ్డుపడుతాడు. ఏ చెట్టు పడితే ఆ చెట్టు రసం పనికిరాదని  చెబుతాడు. ఏదైనా చెట్టుకు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే..అటువంటి చెట్టు రసం తాగాలని..ఆ కొమ్మ బెరడును నడుముకు కట్టుకోవాలని కహానీలు కమ్మగా అల్లుతాడు. అటువంటి చెట్టు దగ్గరకు వెళ్లాలంటే సామాన్యులకు సాధ్యం కాదని చల్లగా చెబుతాడు. తన లాంటి మంత్ర బలం ఉన్న మొనగాళ్లకే  సాధ్యం అంటూ మాయమాటలు వినసొంపుగా వినిపిస్తాడు. అలా వెళ్లాలంటే తన చేతిలో పైసలు పెట్టాలని అసలు విషయం తేల్చేస్తాడు. సంతానం మీద ఆశతో ఈ కట్టుకథలకు  కనెక్ట్ అయిపోతున్నారు అక్కడికి వెళ్లిన ప్రజలు. 
మంత్రగాడి వలలో అమాయక జనం
ఏ రోజు పడితే ఆ రోజు మందు ఇవ్వడు సదరు మంత్రగాడు. అతగాడికి శుక్రవారమే లక్కీడే అట. ఆ రోజునే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుందట. చెట్టు కొమ్మ నరికే శక్తి పుట్టుకొచ్చేస్తుందట. మొత్తానికి ఈ మంత్రగాడి వలలో చాలా మందే చిక్కుకున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన మందుతో పిల్లలు కలిగారని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చెట్టు..రసం..బెరడు అంటూ అమాయకులను మోసం చేస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

16:20 - February 21, 2016

గుంటూరు : భూసేకరణకు ముందు ఎన్నో చెప్పారు.. పరిహారమేకాదు.. మీ పిల్లల భవిష్యత్తుకు దారి చూపుతామంటూ హామీలిచ్చారు.. రోజులకు రోజులు రాజధాని గ్రామాల్లోనే మకాం వేశారు.. ఊరూ వాడా తిరుగుతూ రైతులకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించారు.. ఇదంతా నిజమేనని నమ్మిన అన్నదాతలు భూములిచ్చారు.. ఇప్పుడు అవసరం తీరిపోయింది.. అందుకే ప్లేట్ ఫిరాయించారు.. అసలు తాము ఉద్యోగాలిప్పిస్తామని ఎక్కడా చెప్పలేదంటూ బుకాయిస్తున్నారు.. 
నైపుణ్యాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకున్న యువకులు
రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. భూములు తీసుకున్నప్పుడు మీ పిల్లల అర్హతను బట్టి ఉద్యోగాలిస్తామంటూ హామీలు గుప్పించారు నేతలు, అధికారులు.. నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఉపాది చూపుతామని రాజధాని గ్రామాల సదస్సులో పదే పదే ప్రకటించారు.. వీరి మాటలు నమ్మిన అన్నదాతలు బిడ్డలు బాగుపడితే చాలంటూ తమ భూముల్ని రాజధానికి ఇచ్చారు.. సీఆర్ డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈ రైతన్నల బిడ్డలంతా చేరారు.. మరికొందరైతే ఉన్న ఊళ్లో పని దొరుకుతుందని ఆశపడి తాము చేస్తున్న పనుల్ని వదిలేసి ఇక్కడ చేరారు.. శిక్షణకూడా పూర్తిచేసుకున్నారు.. ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టారు అధికారులు.. 
కోర్సు పూర్తయి 5 నెలలు దాటినా ఉద్యోగాల ఊసే ఎత్తలేదు.. బట్టల షాపుల్లో గుమస్తా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కొందరు.. మీకు అసలు ఉద్యోగాలిస్తామని ఎక్కడా చెప్పలేదని మరికొందరు ఎగతాళి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సీఆర్ డీఏ కార్యాలయం ముందు యువకుల ధర్నా
అధికారుల తీరుతో విసిగిపోయిన యువకులు.. సీఆర్ డీఏ కార్యాలయంముందు ధర్నా చేపట్టారు. భూములివ్వాలంటూ ఊరూవాడా తిరిగిన మంత్రులు నారాయణ, పుల్లారావును కలిసి సమస్య వివరించారు నిరుద్యోగులు.. అయినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఎంతో విలువైన భూమీ పోయింది.. ఇటూ ఉద్యోగం రాలేదు.. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలో తెలియక ఈ యువకులు ఆవేదన చెందుతున్నారు.. తాత్కాలిక సెక్రటేరియట్‌ నిర్మాణంలోనైనా పని చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. అదీ వీలుకాదంటే రాజధానికి ఇచ్చిన తమ భూముల్లో వ్యవసాయం మొదలు పెట్టాలని నిర్ణయించారు.. అన్ని గ్రామాల్లోని నిరుద్యోగులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించుకున్నారు.. 

 

ఎపిఎస్ ఆర్టీసీ నష్టాలను తగ్గించాం : ఎండీ సాంబశివరావు

విజయవాడ : ఎపిఎస్ ఆర్టీసీ నష్టాలను తగ్గించామని ఎపిఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. కార్మికుల జీతాలు పెంచినా రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 45 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని చెప్పారు. 795 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సులో 250 కిమీ ప్రయాణం చేసిన వారికి 2 గంటల పాటు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తామన్నారు. 52 బస్టాండ్లలో మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 

మాదిగలకే న్యాయం చేయని బాబు కాపులకు ఏం న్యాయం చేస్తాడు : మందకృష్ణ మాదిగ

విజయవాడ : మాదిగలకే న్యాయం చేయని చంద్రబాబు కాపులకు ఏం న్యాయం చేస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఒక రైలు తగలబెడితేనే కాపులకు న్యాయం చేస్తామంటే హింసాత్మక ఘటనలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. మాదిగలు శాంతికాములే కానీ.. చేతగాని వాళ్లు కారని చెప్పారు. ఎప్రిల్ 30 న 10 లక్షల మందితో మాదిగ విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 

విశాఖ ఏజెన్సీలో ఎన్ కౌంటర్...

విశాఖ : వైజాగ్ ఏజెన్సీలో ఎన్ కౌంటర్ జరిగింది. కొయ్యూరు మండలం రేపులపాడు అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

 

హైదరాబాద్ నాగోల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : నాగోల్ సీఎస్ ఐలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

15:14 - February 21, 2016

విశాఖ : ఏజెన్సీలో మావోయిస్టులు-పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. కొయ్యూరు మండలం రేవులపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఒక 303 రైఫిల్, డబుల్ బ్యారెల్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశముంది. ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. 

14:57 - February 21, 2016

ఢిల్లీ : ఎన్‌డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా..ఇంతవరకు హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ విమర్శించారు. జాట్‌ల ఆందోళనల వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే జాట్‌ ఉద్యమాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. 

 

జమ్మూకాశ్మీర్ లో ఆగని ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : ప్యాంపోర్ లో ఎన్ కౌంటర్ ఇంకా ఆగలేదు. నిన్నటి నుంచి ఉగ్రవాదులకు, భారత జవాన్లకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో జవాను మృతి చెందాడు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సీఆర్ పీఎఫ్ , ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఒక పౌరుడు మృతి చెందారు. 

ఏ అంశంపైనా చర్చకు సిద్ధం - హరీష్ రావు..

హైదరాబాద్ : జల విధానాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని, అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మంచి పనుల వల్లే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని హరీశ్ రావు వెల్లడించారు. 

బస్సు ఆటో ఢీ..9మందికి గాయాలు..

శ్రీకాకుళం : జిల్లా వీరఘట్టం మండలం వండవ జంక్షన్ వద్ద ఆదివారం బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు.

దంతెవాడలో మందుపాతర పేలి జవాన్ కి గాయం..

ఛత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

5 కోట్ల మంది పేదలకు ఇళ్లు - మోడీ..

నయా రాయ్ పూర్ : 2022 నాటికి దేశంలోని ఐదు కోట్ల మంది పేదలకు ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడదించారు. ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

13:38 - February 21, 2016

శ్రీకాకుళం : ఆడదానికి ఆడదే శత్రువు అని మరోసారి రుజువైంది. అనారోగ్యంతో ఉన్న అత్తను అక్కున చేర్చుకొని సపర్యలు చేయాల్సిన కోడళ్లు..రాక్షసత్వం ప్రదర్శించారు. ఆస్పత్రిలో ఉన్నన్నీ రోజులు ఎలాగు పట్టించుకోని వాళ్లు..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన ఆమెను లోపలికి రానీయరాకుండా ఇంటికి తాళాలు వేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన కోడలిద్దరికి స్థానికులు తగిన బుద్ది చెప్పారు. బొమ్మన విజయలక్ష్మి. భర్త చనిపోతే.. రాజాంలోని కుమారుల వద్దే ఉంటోంది. అయితే ఉపాధి నిమిత్తం ఇద్దరు కుమారులు వేరే ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో కోడళ్లిద్దరు అత్తను హింసించడం మొదలుపెట్టారు. వాళ్ల హింసను తట్టుకోలేని ఈమె.. గత నాలుగు నెలల క్రితం తన సొంత ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్లిపోయింది.

అనారోగ్యం..
గత కొద్దిరోజులుగా విజయలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను సోదరులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత సొంత ఇంటికి చేరుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అనారోగ్యంతో ఉన్న ఆమె పట్ల జాలి చూపాల్సిన కోడళ్లు.. ఆమె పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందోనని ఆమెను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా నానా దుర్భాషలాడి.. ఇంటికి తాళాలు వేసేశారు. ఇక చేసేదేమీ లేక ఆమె ఇంటి ముందే పడిగాపులు పడాల్సి వచ్చింది.

నిర్ఘాంతపోయిన స్థానికులు...
ఈ హేయమైన ఘటనను చూసి స్థానికులు నిర్ఘాంతపోయారు. అందరూ అక్కడకు చేరుకుని తాళాలు పగలగొట్టి.. కోడళ్లను మందలించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఇంట్లోకి చేర్చారు. కొంత కాలంగా కోడళ్లు తనను వేధిస్తున్నారని విజయలక్ష్మి వాపోయింది. కొడుకులు ఇంట్లో లేని సమయంలో.. అనారోగ్యంతో ఉన్న మహిళ పట్ల జాలి చూపించాల్సిన కోడళ్లు ఇలాంటి దుర్మార్గ చర్యకు పాల్పడడం దారుణమని స్థానికులంటున్నారు. 

13:34 - February 21, 2016

నెల్లూరు : పెళ్లి చూపుల్లో నువ్వు నాకు నచ్చావన్నాడు. పెళ్లి చేసుకొని ఆనందంగా ఉందామన్నాడు. అబ్బాయి బ్యాంక్‌ మేనేజర్‌ కావడంతో 7లక్షల కట్నమిచ్చి 10 లక్షల ఖర్చుతో ఘనంగా పెళ్లి చేశారు. కానీ..తీరా పెళ్లయ్యాకా..మాట మార్చాడు. పెళ్లైన మూడు నెల్లకే తన విశ్వరూపం చూపించాడు. అదనపు కట్నం తేస్తేనే కాపురం అంటూ మెలి పెట్టి పెళ్లి చేసుకున్న ఆలిని గెంటేశాడు. దీంతో తనకు న్యాయం కావాలంటూ అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది ఆ ఇల్లాలు. ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లై పట్టుమని 10నెలలు కూడా గడవలేదు. పెళ్లి చేసుకున్న 3 నెలలకే తనేంటో విశ్వరూపం చూపించాడు ఈ కట్న పిశాచి. ఇలా ఒక్క భర్తే కాదు..అత్త, మామ, ఆడపడుచులు అందరూ కలిసి నిత్యం ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. అత్తారింటిలో అడుగు పెట్టిన మూడో నెల నుండే ఈమెకు అత్తారింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తేస్తేనే నీకు ఇంట్లో స్థానం అంటూ చిత్రహింసలు పెట్టారు. చివరకు చంపేందుకు సైతం వెనకాడలేదని బాధితురాలు ప్రీతి చెప్తోంది.

ఏడు లక్షల కట్నం..
అబ్బాయి బాగ చదువుకున్నాడు. బ్యాంకులో ఉద్యోగం అనగానే అడిగినంత కట్నం ఇచ్చారు. 7లక్షలు నగదుతో పాటు 22 సవర్లు బంగారు ఆభరణాలు, ఒక ఫ్లాటు ఇచ్చి 10 లక్షల ఖర్చుపెట్టి మరీ ఘనంగా పెళ్లిచేసి అత్తారింటికి పంపారు. అయినా మళ్లీ అదనపు కట్నం తేవాలంటూ నిత్యం వేధించేవారని ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్న పెళ్ళిల్లపై విశ్వాసం లేకపోవడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పెద్దలు కుదిర్చి..పెద్ద మొత్తంలో కట్నకానుకలు ముట్టచెప్పి చేస్తున్న పెళ్లిల్లు సైతం ఇప్పుడు పెటాకులుగా మారుతున్నాయి. వివాహానికి ముందు నచ్చే అమ్మాయి,..పెళ్లైన తర్వాత మాత్రం నచ్చడం లేదు. ఇలాంటి పరిణామాలకు చెక్‌పెట్టకపోతే వరకట్న వేధింపుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

13:30 - February 21, 2016

నిజామాబాద్ : బీడీ కార్మికుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తెను ముద్రించాలన్న కేంద్రం నిర్ణయం పట్ల బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కరువుతో కొట్టుమిట్టాడుతూ బీడీలు చుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే.. కేంద్రం తమ పొట్ట కొడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి బీడీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బీడీ కట్టలపై 40 శాతం ఉన్న పుర్రె గుర్తును 85 శాతం ముద్రించాలన్న కేంద్రం నిర్ణయం పట్ల బీడీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీడీ కార్మికులు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లాలో రెండు లక్షల 70 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో లక్షా 14 వేల మంది పింఛన్లు పొందుతున్నారు. మిగతా బీడీ కార్మికులంతా చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వాలు వస్తే తమ బతుకులు మారుతాయోమన్న కార్మికులకు నిరాశే మిగులుతోంది.

15 నుండి పరిశ్రమల బంద్..
కేంద్రం నిర్ణయాన్ని సాకుగా చూపి బీడీ కంపెనీల యజమానులు ఈనెల 15 నుండి పరిశ్రమలు మూసివేశారు. దీంతో బీడీలు చుట్టడం తప్ప వేరే ఆధారం లేని వేల మంది కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఇదిలావుంటే ఏరులై పారుతున్న మద్యాన్ని పట్టించుకోని సర్కార్‌.. సిగరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చే విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు మండిపడుతున్నారు. గతంలో తమకు 20 రోజులు పని దొరికేదని.. తాజా నిర్ణయంతో 10 రోజులు కూడా పనులు దొరకడం లేదని కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అసలే చాలీ చాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న కార్మికులకు కేంద్ర నిర్ణయం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. దీంతో 727 జీవోను రద్దు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డెక్కారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు ఉపాధి లభించే విధంగా చూడాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

13:28 - February 21, 2016

చిత్తూరు : సినీ నటుడు సునీల్‌, నిర్మాత దిల్‌ రాజు ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్రిష్ణాష్టమి చిత్రం యూనిట్‌తో కలిసి వీరు తిరుమల వచ్చారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. క్రిష్ణాష్టమి చిత్రం తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం అవుతుందని సునీల్‌ అన్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, ప్యామిలీతో వెళ్లి హాయిగా చూడవచ్చని సునీల్ పేర్కొన్నారు. రెండు సినిమాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని దిల్ రాజు పేర్కొన్నారు. 

13:27 - February 21, 2016

బిక్కి కృష్ణ గారు రచించిన 'కాలం నది ఒడ్డున' పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఆ వివేశాలు వీడియోలో చూడగలరు. 

13:26 - February 21, 2016

నల్గొండ : జిల్లా మోత్కూరులో శ్రీరామలింగేశ్వర దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నించారు. శనివారం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు దేవాలయం తాళం పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు. శివలింగాన్ని పెకిలించే ప్రయత్నం చేశారు. చివరికి వారి ప్రయత్నం ఫలించకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. గుప్త నిధుల కోసమే దుండగులు తవ్వకాలు జరిపారని పోలీసులు భావిస్తున్నారు. 

ఢిల్లీ - హరిద్వార్ జాతీయ రహదారిపై జాట్ల ఆందోళన..

ఢిల్లీ : హర్యానా రాష్ట్రంలో జాట్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. ఢిల్లీ - హరిద్వార్ జాతీయ రహదారిని మూసివేసిన జాట్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. 

ఉపాధి పథకం పనిదినాలు పెంచే యోచన - దత్తాత్రేయ..

మహబూబ్ నగర్ : కరవు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కర్తాల్ లో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. 

అరుణ్ సాగర్ సంస్మరణ సభ...

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ సంస్మరణ సభ జరిగింది. జర్నలిజంలో అరుణ్ సాగర్ కొత్త ఒరవడిని తీసుకొచ్చారని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. గిరిజనులు, ఆదివాసీలపై అరుణ్ సాగర్ రచనలు చేశారని, ప్రతికల్లో వివిధ రంగాల వారికి చెందిన ఫీచర్స్ ను ప్రవేశ పెట్టేందుకు అరుణ్ సాగర్ కృషి చేశారని కొనియాడారు.

 

 

ఫోర్జరీ సంతకాలతో రైతుల భూములు ఆక్రమణ - సీపీఎం..

ప.గో : తుందుర్రులో అక్వా పార్కు నిర్మాణం పేరిట ఫోర్జరీ సంతాకాలతో రైతుల భూములు ఆక్రమించుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని, తీర ప్రాంతాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. భూ సమస్యలపై మార్చి 9వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు, పట్టణ ప్రజల సమస్యలపై మార్చి 16న చలో విజయవాడ తెలిపారు. 

కందిమడుగు వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్..

తిరుపతి : కందిమడుగు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

లకడీకపూల్ లో పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : లకడీకపూల్ లో పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. ప్రజా సంబంధాల శాఖను బలోపేతం చేస్తామని, ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి ప్రజా సంబంధాల శాఖ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

 

12:46 - February 21, 2016

కోరస్, నెత్తుటి వెన్నెల, అక్షర కవాతు లాంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చిన అభ్యుదయ కవిత్వపు చైతన్య కెరటం దామెర రాములు. వస్తు వైవిధ్యం,శిల్ప శోయగంతో ఆయన కవిత్వం రాస్తుంటారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి దామెర రాములుపై ప్రత్యేక కథనం. తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:42 - February 21, 2016

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇటీవల కాలంలో స్త్రీవాదం వెనుక బడిందన్న అపవాదును పటాపంచలు చేస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి సదస్సులు ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాంతాల మహిళల సమస్యలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబార్ లోని ఆంధ్ర మహిళా సభలో ప్ర.ర.వే. నిర్వహించిన జాతీయ సదస్సు విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హర్యానాలో 49 కంపెనీల పారా మిలటరీ ఫోర్స్..

హర్యానా : రాష్ట్రంలో జాట్ల ఆందోళనలు కొనసాగుతోంది. 49 కంపెనీల పారా మిలటరీ ఫోర్స్ ను మోహరించినట్లు డీజపీ వైపీ సింగట్ తెలిపారు. ఇప్పటికే 24 కంపెనీలు మోహరించాయని తెలిపారు. 

12:27 - February 21, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపు రాష్ర్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 25న నామినేషన్ల పరిశీలన, 26 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 6న పోలింగ్‌, మార్చి 9న కౌంటింగ్‌ ఉంటుంది. ఇప్పటికే ఖమ్మం, వరంగల్ వార్డుల రిజర్వేషన్ లను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపును ఖమ్మం..వరంగల్..అచ్చంపేటలో కొనసాగిస్తామని, విజయం తమదేనని గులాబీ క్యాడర్ పేర్కొంటోంది.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లలో మొత్తం 58 డివిజన్లు ఉండగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 వార్డులున్నాయి. ఖమ్మం పట్టణంలో మొత్తం 50 వార్డులకు గానూ బీసీ జనరల్‌ 9 వార్డులు, బీసీ, జనరల్‌ మహిళలకు 8చొప్పున, ఎస్సీ మహిళలకు 3, ఎస్సీ జనరల్‌ 3 సీట్లు కేటాయించారు. ఎస్సీ మహిళకు ఒక వార్డు కేటాయించారు. ఇక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లకు గానూ వరంగల్ ఎస్టీ జనరల్ కింద ఒక డివిజన్ కేటాయించారు. ఎస్సీ జనరల్, మహిళలకు 5 సీట్ల చొప్పున రిజర్వేషన్ ఖరారైంది. బీసీ జనరల్ కింద 10, బీసీ మహిళలకు 9 వార్డులు కేటాయించారు. 

12:23 - February 21, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. హర్యానాలో జాట్ల ఆందోళనలతో ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధానిలోని 7 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎండిపోయాయి. ఇవాళ్టికి సరిపడే నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్‌, ప్రధాని నివాసం, ఫైర్‌స్టేషన్లు, ఆస్పత్రులు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నివాసానికి యథావిధిగా నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

12:21 - February 21, 2016

హర్యానా : ఏడో రోజు కూడా జాట్ల ఆందోళన కొనసాగుతోంది. జాట్ల ఆందోళన కారణంగా వెయ్యి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 700 రైళ్లు రద్దయ్యాయి. 9 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూ విధించినా జాట్ల నిరసనలు ఆగలేదు. హర్యానా ఢిల్లీ జాతీయ రహదారులను జాట్లు నిర్బంధించారు. ఢిల్లీ-ఛండీగఢ్‌ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. దీంతో వేలాది వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. ఓబీసీ జాబితాలో తమని చేర్చి విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్‌ కులస్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం రాతపూర్వకంగా తమ డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు తెలపాలనీ, నోటిమాటతో ఇచ్చే హామీలను నమ్మబోమని వారు స్పష్టం చేశారు.

వరంగల్..ఖమ్మం..ఎన్నికల షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట పురపాల సంఘానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. సోమవారం నుండి ఈనెల 24 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 6న పోలింగ్ జరగనుండగా మార్చి 9 కౌంటింగ్ చేయనున్నారు. 

మాజీ సైనికోద్యుగుల మార్చ్ ఫర్ యూనిటీ..

ఢిల్లీ : జేఎన్ యూలో జరుగుతున్న వివాదాలపై మాజీ సైనికోద్యుగులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం మార్చ్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మాజీ సైనిక్యోదుగులు పాల్గొన్నారు. 

రైళ్లలో ట్రైన్ హోస్టెస్..

ఢిల్లీ : ట్రైన్ లలో కూడా ఎయిర్ హోస్టెస్ నియమితులు కానున్నారు. ఢిల్లీ - ఆగ్రా గటిమాన్ ఎక్స్ ప్రెస్ లో ఎయిర్ హోస్టెస్ త్వరలోనే రానున్నట్లు పీటీఐ వార్త సంస్థ ప్రచురించింది. 

కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : భారత భద్రతా దళాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారని భద్రతా అధికారి భవేష్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు..లేదా నలుగురు ఉగ్రవాదులు భవనంలో ఉన్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

11:52 - February 21, 2016

అతి పిన్న వయస్సులోనే ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన మేథో శిరోమణి. డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ ను నారాయణ అందిస్తున్నారు. ఎన్నో అవార్డులను..రివార్డులను..విద్యారంగ బిరుదులు పొందారు. తాజాగా గ్లోబల్ అచీవర్ అవార్డును అందుకున్నారు. నడిచే విశ్వ విద్యాలయం..మేనేజ్ మెంట్ గురు..ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్ మెంట్..మానవతా వాది..డాక్టర్ ఎస్.ఎల్.నారాయణ. టెన్ టివి నిర్వహించిన అంతరంగం కార్యక్రమంలో ఆయన పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. ఆయన ఎలాంటి విషయాలు తెలిపారో తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:44 - February 21, 2016

జేఎన్ యూ ఘటన దేశ వ్యాప్తంగా రగలుతోనే ఉంది. జాతి వ్యతిరక విధానాలు చేశాడని జేఎన్ యూ నేత కన్హయ్యతో పాటు ఇతర విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కన్హయ్యను విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏది దేశభక్తి ? ఏది దేశ ద్రోహం ? జేఎన్ యూ వివాదంలో కుట్ర ఎవరిది అనే అంశాలపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషణ చేశారు. జేఎన్ యు ఘటనను జాతి వ్యతిరేకత సమస్య..దేశ రాజకీయ..రాజకీయ సమస్యగా చిత్రీకరించేందుకు ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నాలు చేసిందన్నారు దుర్మార్గమైన అంతర్లీనమైన గంభీరమైన విషయాలు దాగి ఉన్నాయన్నారు. ఈ విశ్లేషణనూ మీరూ చూడాలని అనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి. 

ఎమ్మెల్యే సోని సోరిపై యాసిడ్ దాడి..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే సోని సోరిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ లాంటి రసాయనంతో కూడిన ద్రావణంతో దాడి చేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఏపీలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరం ప్రారంభం..

విజయవాడ : కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని పీసీసీ చీఫ్ రఘువీరా ప్రారంభించారు. రెండు రోజుల పాటు శిక్షణా శిబిరాలు కొనసాగనున్నాయి. క్యాడర్ లో నూతనోత్సాహం నింపేందుకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు రఘువీరా పేర్కొన్నారు. జగన్ పార్టీ పెట్టడం..కీలక నేతలు పార్టీని వీడడం..రాష్ట్ర విభజన వంటి అంశాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. 

ఢిల్లీలో విద్యా సంస్థలకు రేపు సెలవు..

ఢిల్లీ : దేశ రాజధానిలో తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చడంతో ఢిల్లీ ప్రభుత్వం సోమవారం అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. 

కేసీఆర్ పాలన వల్లే ఖేడ్ లో విజయం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన వల్లే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని రాష్ట్ర మంత్రి హరీస్ రావు పేర్కొన్నారు. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు.

11:10 - February 21, 2016

విజయవాడ : ఎయిర్ పోర్టు తమకు వద్దు..మా పొట్ట కొట్టద్దు..అని గ్రామస్తులు ఎంత వేడుకున్నా ఏపీ ప్రభుత్వం కనికరించలేదు. పోరాటాలు..ఆందోళనలు చేసినా అణిచివేసేందుకు ప్రయత్నాలు చేసింది. ప్రజల ఆందోళనలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడకు సమీపంలోని నవ్యాంధ్ర రాజధానికి కీలకంగా మారిన గన్నవరం ఎయిర్ పోర్టును విస్తరించేందుకు ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. 1,229 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. దీనితో 11 గ్రామాల పరిధిలోని 1,229 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలపేందుకు మార్చ 6వ తేదీ అని గడువు విధించింది. 

గన్నవరం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ..

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 1229 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చడంతో కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 

గుర్ గావ్ లో రైల్వే టికెట్ కౌంటర్ దగ్ధం..

హర్యానా : జాట్ల రిజర్వేషన్ కోరుతూ నిరసనకారులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బాసి ధన్ కోట్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ లోకి చొరబడిన ఆందోళన కారులు టికెట్ కౌంటర్ ను దగ్ధం చేశారు. 

10:58 - February 21, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతినడానికి మూడు కారణాలున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టడం..రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయడం..పార్టీలో దశాబ్దాలుగా అన్ని లబ్ది పొంది ఎదిగి ఉన్నఫలంగా ఇతర పార్టీల్లో నేతలు చేరడం..ఈ కారణాల వల్ల కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ బాగా దెబ్బతిన్నదని, పునర్ నిర్మాణం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. శక్తికి మించి పోరాటం చేస్తున్నామని, ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రఘువీరా తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తోంది - రఘువీరా..

విజయవాడ : కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టడం..రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయడం..పార్టీలో దశాబ్దాలుగా అన్ని లబ్ది పొంది ఎదిగి ఉన్నఫలంగా ఇతర పార్టీల్లో నేతలు చేరడం..ఈ కారణాల వల్ల కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు.

ఛత్తీస్ గడ్ లో మోడీ పర్యటన..

ఛత్తీస్ గఢ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్ గఢ్ లో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నయారాయ్ పూర్ లో సత్యసాయి విగ్రహాన్ని కూడా మోడీ ఆవిష్కరించారు. 

10:54 - February 21, 2016

విజయవాడ : కన్న కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే విషయం ఓ ఎస్ఐ జీర్ణించుకోలేక పోయాడు. ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తాను ఓ బాధ్యత గల పోలీసు అన్న విషయాన్ని మరిచిపోయాడు. రౌడీషీటర్లతో చేయి కలిపాడు. అల్లుడిని చంపేందుకు పథకం పన్నాడు. చివరిలో ఈ పథకం బెడిసికొట్టడంతో ఆ ఎస్ఐ ప్రస్తుతం కటకటాలెక్కిస్తున్నాడు. ఈఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. రామారావు ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. ఇతని కూతురు..ఓ వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంది. దీనిని రామారావు జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా అల్లుడిని చంపి తన కక్ష తీర్చుకోవాలని భావించి రౌడీషీటర్లతో మాట్లాడాడు. హత్య చేస్తే 1.5 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా కొంత డబ్బును కూడా ముట్టచెప్పాడు. చివరిలో ఈ ప్రయత్నం బయటపడడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని...

విజయవాడ : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఎస్ఐ రామారావు జీర్ణీంచుకోలేక అల్లుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. హత్యకు రూ.1.5 లక్షలు ఇస్తానని రౌడీ షీటర్లతో ఎస్ఐ రామారావు ఒప్పందం చేసుకున్నాడు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. 

10:47 - February 21, 2016

కర్నూలు : తలచుకుంటే ప్రభుతాన్ని గంటలో పడగొడుతానని..టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడలేకపోతున్నారు. పార్టీకి చెందిన నేత, కర్నూలు జిల్లాలో ప్రభావం చూపించే భూమ నాగిరెడ్డి టిడిపి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపులు ఏ మాత్రం ఫలించ లేదని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి భూమా నాగిరెడ్డి వెళుతున్నారు. దీనితో ఆయన టిడిపి కండువా కప్పుకోవడం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఇతని రాకను వ్యతిరేకించిన కర్నూలు తెలుగు తమ్ముళ్లకు బాబు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీకి 67 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంతో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ రాజ్యసభ సీటును గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా దెబ్బ తీసి నాలుగుకు నాలుగు రాజ్యసభ సీట్లను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

బాబు ఇంటికి భూమా..

కర్నూలు : వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి భూమా వెళుతున్నట్లు సమాచారం. 

10:42 - February 21, 2016

హైదరాబాద్ : ఆయనో మాజీ సీబీఐ అధికారి..అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన తనయుడు అడ్డదారులు తొక్కాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లాది రూపాయలను స్వాహా చేసేశాడు. ఇంతకు ఈ మాజీ సీబీఐ డైరెక్టర్ ఎవరనేగా మీ ప్రశ్న. ఆయనే సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామరావు. ఆయన తనయుడు శ్రీనివాస్ కళ్యాణ్ రావుపై ఆదివారం సీబీఐ కేసు నమోదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మూడు బ్యాంకు లనుండి రూ.304 కోట్ల రుణాలు పొందారని అభియోగాలున్నాయి. కళ్యాణ్ రావుపై 120 (బి), 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చెన్నై, హైదరాబాద్ లోని కళ్యాణ్ రావు ఇళ్లలో సీబీఐ సోదాలు జరిపింది. సెంట్రల్ బ్యాంకు రూ. 124కోట్లు..ఆంధ్రా బ్యాంకు నుండి రూ.60 కోట్లు..కార్పొరేషన్ బ్యాంకు నుండి రూ.120 కోట్లు తీసుకున్నారు.

సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు తనయుడిపై కేసు..

హైదరాబాద్ : సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామరావు తనయుడు శ్రీనివాస్ కళ్యాణ్ రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మూడు బ్యాంకు లనుండి రూ.304 కోట్ల రుణాలు పొందారని అభియోగాలున్నాయి. కళ్యాణ్ రావుపై 120 (బి), 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చెన్నై, హైదరాబాద్ లోని కళ్యాణ్ రావు ఇళ్లలో సీబీఐ సోదాలు జరిపింది. సెంట్రల్ బ్యాంకు రూ. 124కోట్లు..ఆంధ్రా బ్యాంకు నుండి రూ.60 కోట్లు..కార్పొరేషన్ బ్యాంకు నుండి రూ.120 కోట్లు తీసుకున్నారు. 

10:39 - February 21, 2016

హైదరాబాద్ : బేగం బజార్ లోని తోప్ ఖానాలో పోలీసులు నిర్భంద తనిఖీలు జరిగాయి. డీసీపీ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు సెర్చ్ లొ పాల్గొన్నారు. పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ప్రతి ఒక్క వ్యక్తిని తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 2 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్చన్ సెర్చ్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని డీసీపీ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసు శాఖకు సహకరించాలని, లక్ష కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

10:38 - February 21, 2016

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల జరిపిన దాడితో జమ్మూకాశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం పాంపోర్ లోని కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) వాహన శ్రేణిపై విరుచుకపడిన ముష్కరులు ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారు. వీరిని పట్టుకొనేందుకు భారత భద్రతా బలగాలు ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు..భారత జవాన్లకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం నుండి మొదలైన ఈ ఆపరేషన్ ఆదివారం కొనసాగుతోంది. ముష్కరులు జరిపిన దాడిలో ఆర్మీ కెప్టెన్ ఒకరు మృతి చెందారు. మొత్తంగా ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. 

ఆర్మీ కెప్టెన్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల జరిపిన దాడితో జమ్మూకాశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం పాంపోర్ లోని కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) వాహన శ్రేణిపై విరుచుకపడిన ముష్కరులు ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారు. వీరిని పట్టుకొనేందుకు భారత భద్రతా బలగాలు ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు..భారత జవాన్లకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం నుండి మొదలైన ఈ ఆపరేషన్ ఆదివారం కొనసాగుతోంది. ముష్కరులు జరిపిన దాడిలో ఆర్మీ కెప్టెన్ ఒకరు మృతి చెందారు. మొత్తంగా ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. 

హర్యానాలో కొనసాగుతున్న జాట్ల ఆందోళన.

హర్యానా : రాష్ట్రంలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళన ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడింది. వేయి రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడగా 700 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరోవైపు జాట్ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడింది. హర్యానా నుండి నిత్యావసరాల సరఫరాలు నిలిచిపోయాయి. రాబోయే ఒకటి రెండు రోజు ల్లో 60 శాతం మేర తాగునీటి సరఫరాకు కొరత ఏర్పడే సూచనలున్నాయి. దీనితో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు సీఎం కేజ్రీవాల్ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

10:36 - February 21, 2016

హర్యానా : రాష్ట్రంలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళన ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడింది. వేయి రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడగా 700 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరోవైపు జాట్ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడింది. హర్యానా నుండి నిత్యావసరాల సరఫరాలు నిలిచిపోయాయి. రాబోయే ఒకటి రెండు రోజు ల్లో 60 శాతం మేర తాగునీటి సరఫరాకు కొరత ఏర్పడే సూచనలున్నాయి. దీనితో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు సీఎం కేజ్రీవాల్ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. డిప్యూటి సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అత్యవసర ఉపశమన కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్..ఢిల్లీ జలమండలికి ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ విధించినా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో ఆరుగురు ఆందోళన కారులు మృతి చెందారు.
ఓబీసీ జాబితాలో తమని చేర్చి విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్‌ కులస్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం రాతపూర్వకంగా తమ డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు తెలపాలనీ, నోటిమాటతో ఇచ్చే హామీలను నమ్మబోమని వారు స్పష్టం చేశారు.

10:35 - February 21, 2016

ఢిల్లీ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధన విద్యార్ధి వేముల రోహిత్ అంశం రాజ్యసభలో చర్చకు రానుంది. రాజ్యసభ చైర్మన్‌ హమీద్ అన్సారీ అధ్యక్షతన జరిగిన అఖిపక్ష సమావేశంలో వేముల రోహిత్‌ ఆత్మహత్యపై చర్చించాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈనెల 23 నుంచి మార్చి 16 వరకు జరిగే మొదటి విడత భేటీలోనే వేముల రోహిత్‌ ఆత్మహత్యతోపాటు, జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్టుపై చర్చించనున్నారు. అలాగే ఢిల్లీలో శాంతిభ్రదతల పరిస్థితి, సాకేత్‌ కోర్టు కాంప్లెక్స్‌లో జర్నలిస్టుపై జరిగిన దాడి, అరుణచాల్‌ప్రదేశ్‌ రాజీకీయ వ్యవహారాలు, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను మొదటి విడత సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. మొదటి దఫా సమావేశాల్లో రాజ్యసభలో ప్రధాన బిల్లులేవీ చర్చకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో దఫా జరిగే సమావేశాల్లోనే GSTతోపాటు రియల్‌ ఎస్టేట్‌ ఇతర బిల్లులను చర్చకు చేపట్టాలని నిర్ణయించారు.

10:34 - February 21, 2016

హైదరాబాద్ : గోల్కొండ పీఎస్‌ పరిధిలో ఇరువురి మధ్య తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమైంది. టోలిచౌకిలోని మటన్‌ షాపు వ్యవహారంలో ఆసిఫ్‌.. వరుసకు సోదరుడైన రఫీక్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి.. తోపులాట జరిగింది. దీంతో కిందపడ్డ ఆసిఫ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రఫిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:32 - February 21, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్‌ పరిపాలనను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను హైదరాబాద్‌లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ పద్ధతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్, అధికారులు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో దేశంలోని ఉత్తమ మున్సిపల్‌ విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా నగరంలోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో సదస్సు నిర్వహించారు. మున్సిపల్‌ అధికారులు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, హైదరాబాద్‌, నిజామాబాద్‌ నగరాల మేయర్లు, డిప్యూటీ మేయర్లు హాజరైన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మెరుగైన ప్రజా రవాణ వ్యవస్థ, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, మురుగునీటిపారుదుల, మంచినీటి సరఫరా వంటి అంశాలపై చర్చించారు.

క్షేత్రస్థాయి పర్యటన..
దేశంలోని వివిధ మున్సిపల్‌ పట్టణాలు, నగరాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు క్షేతస్థాయి పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. నగరాల్లో అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు తమిళనాడలో ఏర్పాటు చేసిన పత్యేక ఆర్ధిక సంస్థ గురించి అధ్యయనం చేసేందుకు ఈనెల 27న కేటీఆర్‌ ఆధ్వర్యంలోని బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. టెండర్‌ ష్యూర్‌ విధానం ద్వారా బెంగళూరులో రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన సైనిక్‌ ట్రాక్‌లను పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం వచ్చే వారం అక్కడకు వెళుతుంది. వ్యర్ధాల నిర్వహణలో ఢిల్లీ పద్ధతులను అధ్యయనం చేస్తారు. నాగపూర్‌లో ప్రజలకు నిత్యం 24 గంటలూ మంచినీరు సరఫరా చేస్తున్న తరహాలోనే హైదరాబాద్‌లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. నిర్మాణ రంగంలో ఉత్తమ పద్ధతులు గురించి చర్చించేదుకు వచ్చే నెల మొదటివారంలో దేశంలోని ప్రముఖ నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్కైవేస్‌, మూసీనది వెంబడి ఆరు వరుసల రోడ్డు నిర్మాణం, ఐటీ పార్క్‌ల ఏర్పాటు వంటి అంశాలపై చర్చిస్తారు. మొత్తంమీద మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వనగర అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. 

10:31 - February 21, 2016

హైదరాబాద్ : రాయలసీమ అభివృద్ధి కోసం వామపక్ష పార్టీలు మరోసారి పోరుబాట పట్టాయి. అన్ని రంగాల్లో వెనకబడ్డ సీమను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ సీమ ప్రజలను చైతన్యవంతం చేసి,..ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి 15 రోజులపాటు బస్సు యాత్రను నిర్వహించబోతున్నాయి. తిరుపతి నుంచి మొదలైన బస్సు యాత్ర రాయలసీమలోని 4 జిల్లాల్లో మార్చి 5 వరకు కొనసాగనుంది. సీమను అభివృద్ధి చేసి మోడువారిన జీవితాలను చిగురింప చేయాలనే డిమాండ్‌తో బస్సు యాత్రను ప్రారంభించాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ తిరుపతిలో బస్సు యాత్రను ప్రారంభించాయి. వీరితో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బస్సు యాత్రలో పాల్గొన్నారు. వీరితో పాటు వేలాదిగా తరలివచ్చిన వామపక్షాల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుపతిలో వామపక్షాల బహిరంగ సభ..
బస్సు యాత్ర సందర్బంగా తిరుపతిలో వామపక్షాలు బహిరంగ సభను ఏర్పాటు చేశాయి. ఈ సభలో పాల్గొన్న వామపక్షాల నేతలు సీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం నుంచి వస్తున్నా... ఎందుకు పరిశ్రమలు కాని, ప్రాజెక్టులు రావడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా రైతులకు నీటిని విడుదల చేయకుండా రాయలసీమను ఎండగడుతున్నారని ఆరోపించారు. సీమ అభివృద్ది చెందాలంటే సీమకు నీళ్లు రావాలని..ప్రాజెక్టులు రావాలని అవి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రకాశ్ కరత్. శ్రీబాగ్‌ ఒప్పందం నుంచి మొదలుకొని రాష్ట్ర విభజన చట్టం వరకూ అడుగడుగునా రాయలసీమ వాసులకు మోసమే జరిగిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తూ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం సీమ పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

మార్చి5న ముగింపు..
అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతంగా మారుతుందని శాస్త్రవేత్తలు గొంతెత్తి అరుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విమర్శించారు. ఎందరు ముఖ్యమంత్రులు మారినా రాయలసీమ మాత్రం అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మూడు రోజులపాటు అన్ని నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర 22 వరకూ సాగనుంది. 23న కడప జిల్లాలో ప్రవేశిస్తుంది. కడప, అనంతపురాల్లో జరిగే బస్సు యాత్రలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, బీవీ రాఘవులు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు హాజరుకానున్నారు. కర్నూలులో మార్చి 5న జరిగే ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారు. 

10:29 - February 21, 2016

హైదరాబాద్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తెలంగాణ టీడీపీని హడలెత్తించిన టీఆర్‌ఎస్‌ అగ్రతనేతల దృష్టి ఇప్పుడు కాంగ్రెస్‌ పై పడింది. 2019 సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతోపాటు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్లాన్‌ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తెలంగాణ టీడీపీ నేతలను గుక్కతిప్పుకోకుండా చేసి.. కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అటు ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనం చేసే దిశగా గులాబీ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏకచత్రాధిపత్యం వహించాలన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ నేతలు పని చేస్తున్నారు.

డీకే అరుణను టార్గెట్ చేసిన గులాబీ..
మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరతాన్న ధీమా టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన డీకే అరుణతోపాటు ఆమె సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డిను గులాబీ దళం టార్గెట్‌ చేసింది. ఈనెల 17న జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొనడం చూస్తూంటే.... ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది. డీకే అరుణను పార్టీలో చేర్చుకుంటే పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసినట్టు అవుతుందన్న గులాబీ దళం భావిస్తోంది. ఆమెను కారెక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు... డీకే అరుణ చేరికను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితూ పార్టీ నాయలకులు జూపల్లి కృష్ణారావుకు నచ్చచెప్పే ప్రయత్నంలో ఉన్నారు.

టీఆర్ఎస్ లోకి పువ్వాడ ? 
టీఆర్‌ఎస్‌లో చేరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లాకు చెందినిపువ్వాడ అజయ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్లాన్స్ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కష్టకాలం వచ్చిందని మనసులోనే మదనపడటంతోపాటు, పార్టీ నాయకులు అంతర్గత సమావేశాల్లో కూడా వలసల అంశం చర్చనీయాంశంగా మారింది. పదవులు ఆశించో లేక మరో ఉద్దేశంతోనే పార్టీని వీడాలనుకునేవారిని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉందన్న అభిప్రాయం టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

సినీ నటుడు ప్రదీప్ శక్తి కన్నుమూత..

హైదరాబాద్ : సినీ నటుడు ప్రదీప్ శక్తి కన్నుమూశారు. అమెరికాలో గుండెపోటుతో ప్రదీప్ మృతి చెందారు. కొన్నేళ్లుగా అమెరికాలో ఆయన స్థిరపడ్డారు. మధురై మీనాక్షి, ఏప్రిల్ 1, చెట్టు కింద ప్లీడర్, అలాపన, గుణ, చిత్రాం భలారే విచిత్రం, అగ్గిరాముడు, కొడుకు దిద్దిన కాపురం, లేడీస్ టైలర్, నాయకుడు తదితర చిత్రాల్లో నటించారు. 

నేడు సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ సంస్మరణ సభ..

హైదరాబాద్ : ఉదయం పది గంటలకు ఎంసీఆర్ హెచ్ ఆర్డీఏలో సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ సంస్మరణ సభ జరగనుంది. 

ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

ఇస్లామాబాద్ : మతపెద్ద హత్య కేసులో పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీఅయింది. మార్చి 16న ముషార్రఫ్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఇస్లామాబాద్‌లోని స్థానిక కోర్టు అధికారులను ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

 

జమ్మూ కాశ్మీర్ లో ఎమ్మెల్యేపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దాడి..

జమ్ము కాశ్మీర్‌ : ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ పై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి జరిపారు. ఈ ఘటన శనివారం రియాసి జిల్లాలో చోటుచేసుకుంది. రియాసి నుంచి రాజౌరి వెళ్తుండగా బంలా పరిధిలోని జంక్షన్ వద్ద ఆరెస్సెస్, బజరంగ్‌దళ్ జెండాలు చేతపట్టిన సుమారు 22-25 మంది తన వాహనాన్ని ఆపివేసి దాడి చేశారని ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ ఆరోపించారు. 

Don't Miss