Activities calendar

22 February 2016

21:25 - February 22, 2016

విజయవాడ :ఏపీ రాజధాని అమరావతి తుది మాస్టర్ ప్లాన్ ను మంత్రి నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ విడుదల చేశారు. ఈ సంద్భంగా నారాయణ మాట్లాడుతూ... రహదారుల నిర్మాణంలో ఇల్లు పోకుండా చూడాలని కోరారని.. 99శాతం ఇలాంటి అభ్యంతరాలు పరిష్కరించామన్నారు. 99శాతం రోడ్ల అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారు.

21:18 - February 22, 2016

విజయవాడ : వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ లు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీ లో చేరారు. కాగా, సీఎం నివాసం వద్ద టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.అంతకు ముందు రామసుబ్బారెడ్డితో చర్చించిన చంద్రబాబు..ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు. అటు కర్నూలు నేతలనూ బాబు భూమా రాకపై కన్విన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. జగన్ మా ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ ప్రగల్భాలు పలికినందుకే ఆయన పార్టీ నేతలను టిడిపిలో చేర్చుకుంటున్నామని మంత్రి అచ్చన్నాయుడు అన్నారు. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందని అందుకే జగన్‌ నుంచి ఏ సమస్యా రాకుండా ఉండేందుకు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, రామసుబ్బారెడ్డి టిడిపిలో చేరడంపై అచ్చన్నాయుడు స్పందించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి రావడం పట్ల ఆ ప్రాంతానికి చెందిన టిడిపి నేతల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని ఎంపి సిఎం రమేష్‌ అన్నారు. ముఖ్యంగా తమ పార్టీ నేత రామసుబ్బారెడ్డి పెద్దగా అభ్యంతరం తెలపడం లేదని చెప్పారు. 

టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ

విజయవాడ : వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీ లో చేరారు. కాగా, సీఎం నివాసం వద్ద టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

నార్కెట్ పల్లిలోని అయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ లాకౌట్

నల్గొండ : లాకౌట్ ప్రకటించిన నార్కెట్ పల్లిలోని అయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ (ఓసీటీఎల్) కంపెనీ. దీంతో 600 మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెండు రోజుల క్రితం కంపెనీకి, సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మస్తాన్ రావు మృతి చెందారు. సిబ్బందికి, మిషనరీకి భద్రత లేని కారణంగా పరిశ్రమను లౌకౌట్ చేస్తున్నట్లు... లాకౌట్ ఉన్నంత వరకు వేతనాలు చెల్లించబడవని నోటీసులు అంటించారు.

20:50 - February 22, 2016

''అసలే కోతి ఆ పైన దయ్యం పట్టింది.. ఆటుపైన తేలు కుట్టింది.. ఆపై కల్లుతాగింది'' అనే సామెత విని ఉంటరు కదా.. అచ్చం అలాగే ఓ కోతి మందు తాగిన కత్తి పట్టుకుని ఏం చేసింది..? ఎంతమందిని భయపెట్టింది?? 
ఓ వ్యక్తి ఓ విషయం దాచి పెళ్లి చేసుకున్నాడు.. తీరా శోభనం గదిలోకి వెళ్లే సమయానికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఇంతకు పోలీసులు ఎందుకు వచ్చారు?? అసలు ఏం జరిగింది??
వీటితో పాటు మల్లన్న ఘరం ఘరం ముచ్చట్లన్నీ సూడాలంటే వీడియో చూడాల్సిందే మరి.. 

చంద్రబాబుతో భేటీ అయిన ఆ నలుగురు

విజయవాడ: సీఎం క్యాంపు కార్యాలంలో సీఎం చంద్రబాబు నాయుడుతో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ, జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

3రోజుల్లో వైసీపీ ఖాళీ: మంత్రి అచ్చెన్న జోశ్యం...

విజయవాడ: రెండు మూడు రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా టీడీపీలో చేరే అవకాశం ఉందని, కర్నూలు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వొచ్చని ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు జోశ్యం చెప్పారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశల్లోపే భారీగా చేరికలుంటాయన్నారు. పార్టీలో చేరేవారి వల్ల పాతవారికి ఇబ్బందులు ఉండవని, ఇప్పటికే అందరినీ సమన్వయం చేశామని, దాంతో అందరం కలిసే పనిచేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో టీడీపీకి 50 అసెంబ్లీ స్థానాలు అధికంగా రాబోతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

20:37 - February 22, 2016

హైదరాబాద్ : వందలు, వేల కోట్లు ఉత్సాహంగా అప్పులిచ్చారు.ఇపుడు తెల్ల మొహం వేసి నీళ్లు నములుతున్నారు. రాజకీయ పరపతి వాడారు.. బ్యాంకులను కొల్లగొట్టారు. చివరికిచేతులెత్తేస్తున్నారు. ప్రజాధానం ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన సొమ్ముని అక్రమంగా వెనుకేసుకుని తప్పుడు లెక్కలతో మాజాలం చేస్తూ బ్యాంకుల అప్పులు ఎగవేస్తున్నారు. ఇదీ జరుగుతున్న సంగతి. లక్షల కోట్ల అప్పులు బ్యాంకులను పట్టి పీడిస్తున్న వైనం పై నేటి వైడాంగిల్ విశ్లేషణ చేశారు. మరి ఆ పూర్తి విశ్లేషణను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటా : రామసుబ్బారెడ్డి

విజయవాడ : కొద్ది సేపటిక్రితం చంద్రబాబు తో రామసుబ్బారెడ్డి భేటీ ముగిసింది. చంద్రబాబు నిర్ణయం మాకు శిరోధార్యం అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరేందుకు మార్గం సుగమం అయ్యినట్లు తెలుస్తోంది. అనంతరం చంద్రబాబు నివాసంలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియతో భేటీ కానున్నారు.

ధోనీకి గాయం, పార్థీవ్ పటేల్ కు పిలుపు

ఢిల్లీ : ఆసియా కప్‌కు ధోనీ దూరమయ్యాడు. దీంతో పార్థీవ్ పటేల్‌కు పిలుపువచ్చింది. కండరాల నొప్పి కారణంగా ధోనీకి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పార్థీవ్ పటేల్‌కు అవకాశం ఇచ్చారని సమాచారం. ఈ నెల 24న ప్రారంభమయ్యే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టోర్నీ మార్చ్ 6న ముగుస్తుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. అకస్మాత్తుగా ధోనీ తప్పుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

చంద్రగిరి మండలం లో పోలీసుల కూంబింగ్

తిరుపతి : చంద్రగిరి మండలం బండరాళ్ల పల్లి వద్ద టాస్క్ ఫోర్క్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

20:13 - February 22, 2016

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 104 ఏండ్ల ముసలవ్వ కాళ్లు మొక్కాడు.. కారణమేంటో? కోరుట్ల ఎమ్మెల్యే ముట్టడించిన బీడి వర్కర్స్ ఏం చేశారు.?  పోలీసోళ్ల మీద మంత్రి హారీష్ రావు ఎందుకు ఘరం ఘరం అయ్యిండు..? అర్థరాత్రి అంటుకున్న గుడిసెలు.. కారణం కారణం ఎవరు? పోలీస్ టౌన్ లో ఆత్మహత్యాప్రయత్నం.. కారణం సీఐ అంటున్న బందువుల వాదన నిజమేనా? రాముల వారి సన్నిధిలో రామచిలుక... ఏం చేస్తోంది? ఇత్యాది అంశాలపై 'మల్లన్నముచ్చట్లు' మల్లన్న చెప్పిన మసాలా ముచ్చట్లు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

విజయవాడ టిడిపి ఆఫీసుకు సీఎం చంద్రబాబు

విజయవాడ : నగరంలోని టిడిపి కార్యాలయానికి టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ పాటికే చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిల ప్రియతో చర్చించనున్నారు.

కాసేపట్లో చంద్రబాబును కలవనున్న భూమా...

విజయవాడ: కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు భూమా, అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరనున్నారు. టీడీపీ ఆఫీస్‌కు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. అయితే తమ వాదనను చంద్రబాబుతో వినిపించేందుకు జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, దివంగత శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మకార్యకర్తలతో తరలివచ్చారు.

19:30 - February 22, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిప‌క్ష వైసీపి నుంచి అధికార టిడిపికి వ‌ల‌స‌లు ప్రారంభమ‌య్యాయి. గ‌త నాలుగు రోజులుగా స్పష్టత రాని భూమా వ్యవ‌హారం కొలిక్కి వ‌చ్చింది. భూమా సైకిలెక్కడం దాదాపుగా ఖ‌రారైంది. ప్రస్తుతం పీఏసీ ఛైర్మెన్ గా ఉన్న భూమా ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. అంతేకాకుండా రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కార్యాల‌యానికి సైతం పంపించిన ఆయ‌న...ఇదే స‌మావేశం నుంచి గుడ్ బై అంటూ మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ప్రధాని పీవీపై పోటీ చేసేందుకు భూమా పేరు ప్రతిపాదన.....

1996లో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేరు భూమా నాగిరెడ్డి. ఆ ఏడాదిలో నంద్యాల పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేసింది. దీంతో అప్పట్లో భూమా పేరు మార్మోమోగింది.

1964 జనవరి 8 జన్మించిన భూమా.....

కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో నేపథ్యముంది. అంతేకాదు ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. 1964 జనవరి 8న జన్మించారు భూమా. తండ్రి బాలిరెడ్డికి స్థానిక నేతలతో శత్రుత్వం ఉండేది. దీంతో రాజకీయ కక్షల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నాగిరెడ్డిని చదివించారు తండ్రి. చెన్నైలో10+2 చదివించాడు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్య కోసం బెంగుళూరు వెళ్ళాడు. అయితే ఇదే సమయంలో తండ్రి బాలిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి మరణంతో తిరిగి వచ్చేశారు భూమా. ఈ సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు.

1998, 1999 నంద్యాల ఎంపీగా గెలుపు.....

1996లో టీడీపీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్ ఉపఎన్నిక ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేశారు భూమా నాగిరెడ్డి. 1998, 1999 నంద్యాల పార్లమెంట్ స్దానానికి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు భూమా నాగిరెడ్డి. తర్వాత సినీనటుడు చిరంజీవి స్దాపించిన ప్రజారాజ్యంలో వెళ్లారు భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభానాగిరెడ్డి. ఈ క్రమంలోనే భూమా దంపతులిద్దరూ పీఆర్పీని వీడి వైసీపీ గూటికి చేరారు. సతీమణి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందినా...2014 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించారు భూమా. జిల్లాలో 11 ఎమ్మెల్యేలు వైసీపీ దక్కడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

వైఎస్ జగన్‌తో కొంతకాలంగా విభేదాలు .....

అధికార తెలుగుదేశం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వైసీపీని గాడీలో పెట్టారు భూమా. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో భూమాకు విభేదాలు తీవ్రమయ్యాయి. మొన్న జగన్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా భూమా కలవలేదు. ఇదే సమయంలో టీడీపీ నుంచి మంత్రి పదవి ఆఫర్‌ రావడంతో వైపీపీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు భూమా.

19:25 - February 22, 2016

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వలసల పర్వం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు పార్టీలూ ఎత్తులు పైఎత్తులతో వలసల కాకను మరింత పెంచుతున్నాయి. టీడీపీ, వైసీపీల అధినేతలు చంద్రబాబు, జగన్‌లిద్దరూ రాయలసీమకు చెందినవారే. అయితే కడప, చిత్తూరు జిల్లాల్లోని వైరి పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా.. ప్రత్యర్థిని అతడి సొంత జిల్లాలోనే కోలుకోలేని దెబ్బతీయాలని.. రెండు పార్టీలూ వ్యూహరచన చేశాయి. టీడీపీ ఓ అడుగు ముందుకేసి.. వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాపైనా ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పర్యవసానాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వైసీపీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, ఆదినారాయణరెడ్డిలు టీడీపీ గూటికి?

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రం ప్రధాన పార్టీలు రెండింటిలోనూ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య సాగుతున్న మైండ్‌గేమ్‌ రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఆ మధ్యలో కృష్ణా, కడప జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. వైసీపీ అధినేత జగన్‌ దీనికి దీటుగా బదులిస్తూ.. పాలక పక్షం ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని లీక్‌ చేశారు. దీంతో టీడీపీ వర్గాల్లో కలకలం రేగింది. వైసీపీకి కోలుకోలేని కౌంటర్‌ ఇవ్వాలని టీడీపీ స్కెచ్‌ వేసింది. దీనిలో భాగమే ఆపరేషన్‌ భూమా అండ్ కో.

జగన్‌ సొంత జిల్లాలోనే ఝలక్‌ ఇవ్వాలని టీడీపీ ప్లాన్‌....

కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించారు. తద్వారా జగన్‌ సొంత జిల్లాలోనే వైసీపీకి ఝలక్‌ ఇవ్వాలని భావించారు. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత, తన వియ్యంకుడు కేశవరెడ్డిని కేసుల నుంచి కాపాడేందుకే ఆదినారాయణరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని.. వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. తమ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని లాక్కోవడం సహజంగానే వైసీపీ అధినేత జగన్‌కు నచ్చలేదని.. అందుకే.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగించి సఫలమయ్యారని సమాచారం. దీంతో అలర్ట్‌ అయిన టీడీపీ.. జగన్‌ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసేందుకు.. ఆ పార్టీ బలంగా ఉన్న కర్నూలుపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూమా నాగిరెడ్డికి వల వేసినట్లు చెబుతున్నారు.

టీడీపీతో సన్నిహితంగా ఎస్పీవైరెడ్డి....

కర్నూలు జిల్లాలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా మొదట్లో టీడీపీ గూటికి చేరుతున్నట్లు చెప్పి.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే.. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అఖిలప్రియ, ఐజయ్య, బుడ్డా రాజశేఖరరెడ్డి తదితరులు వస్తారని టీడీపీ అంచనా వేసింది. వారి అంచనాలు వంద శాతం నిజమవుతున్నాయి. భూమా నాగిరెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు.

వైసీపీ ఎమ్మెల్యేలు కచ్చితంగా వలస వస్తారని టీడీపీ నమ్మకం......

వైసీపీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారడం లేదని విస్పష్టంగ ప్రకటించినా..వారు కచ్చితంగా తమ దగ్గరకు వస్తారని సైకిల్‌ పార్టీ కాన్ఫిడెన్స్. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు.. ఉదయం చంద్రబాబు భేటీలో పాల్గొని.. రకరకాల సూచనలు చేసి.. గంటలోపే గులాబీ కండువా కప్పుకున్న వైనాన్ని వారు ఉదహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి చేరిక తర్వాత.. మిగిలిన వారూ తమ పార్టీలోకి రావడం ఖాయమన్న భావనలో వారున్నారు. టీడీపీకి.. వైసీపీ కంటిలో నలుసులా మారిందన్నది వాస్తవం. అసెంబ్లీలో జగన్ అండ్‌ కో దూకుడు ప్రదర్శించారు. ఇప్పటికే కాపు ఉద్యమం, రుణమాఫీ, తదితర అంశాల ద్వారా ప్రభుత్వాన్ని జగన్‌ బాగా ఇరుకున పెట్టారు. వచ్చేనెల్లో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా.. వైసీపీ తమను ఇరుకున పెడుతుందని టీడీపీ భావిస్తోంది. అందుకే.. ఆ సమావేశాల్లోగా వీలైనంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవాలని.. తెలంగాణలో కేసీఆర్‌ అనుసరించిన తరహాలోనే విపక్షాన్ని పూర్తిగా బలహీన పరచాలని పాలక టీడీపీ యోచిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాయలసీమలో బలహీనంగా టీడీపీ....

నిజానికి సీఎం చంద్రబాబు రాయలసీమ వాసే అయినా.. ఈ ప్రాంతంలో టీడీపీ బాగా బలహీనంగా ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే పార్టీ కాస్త బలంగా ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతంలోనూ పెద్దగా తేడా లేకపోవడం టీడీపీని కలవర పరుస్తోంది. అందుకే.. ముందుగా సీమలో వలసలను ప్రోత్సహించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని.. తర్వాత, రాష్ట్రంలోని విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై దృష్టి సారించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ ఏకీకరణ జరగాలని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. భావసారూప్యత ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.

అధినాయకత్వం నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి?

వలసలను ప్రోత్సహించాలన్న టీడీపీ అధినాయకత్వం నిర్ణయం.. ఆపార్టీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్న వారికి మింగుడు పడడం లేదు. పైగా కొత్తవారితో కలిసి పనిచేసుకోవాలన్న అధినేత సూచనా వారికి రుచించడం లేదు. అందుకే, కొత్త వారి రాకపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ వ్యూహాలు, కదలికలు కూడా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

భూమా బాటలోనే మ‌రికొంద‌రు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

భూమా బాటలోనే మ‌రికొంద‌రు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు సిద్దంగా ఉన్నట్లు స‌మాచారం. ఇప్పటికే కొంతమంది వైసీపి ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా అధికార పార్టీ ముఖ్యనేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలోని భూమా వ‌ర్గం ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి,కోడుమూరు ఎమ్మెల్యే కూడా సైకిలెక్కేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రకాశం, కృష్టా జిల్లాల‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు? ....

క‌డ‌ప జిల్లాలోనూ జగన్‌ పార్టీకి ఝలక్‌ తప్పదని తెలుస్తోంది. జ‌మ్ములమ‌గుడు ఎమ్మెల్యే అధినారాయ‌ణ‌ రెడ్డి కారెక్కడం కన్‌ఫామ్ కాగా, ఇంకా ప్రకాశం, కృష్టా జిల్లాల‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం. వీరితో పాటుగా ఉత్తరాంధ్ర నుంచి మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచ‌కు చేరుతార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది.

మిగతా ఎమ్మెల్యేల‌లైనా ఆపాల‌ని గ‌ట్టి ప్రయ‌త్నాలు....

అయితే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌నే వార్తలు రావ‌డంతో వైసీపి అధిస్టానం అలెర్ట్ అయ్యింది. భూమా ఫిరాయింపును అడ్డుకోలేక‌పోయిన పార్టీ అధిస్టానం మిగతా ఎమ్మెల్యేల‌లైనా ఆపాల‌ని గ‌ట్టి ప్రయ‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే అదినేత జ‌గ‌న్ తో పాటు పార్టీ ముఖ్య నేత‌లు ఆయా ఎమ్మెల్యేల‌తో సంప్రదింపులు జ‌రుగుపుతున్నారు. పార్టీపై అసంతృప్తికి గల కార‌ణాలేంటి, అధికార పార్టీవైపు వెళ్లేందుకు వ‌స్తున్న ఆఫ‌ర్లేంటి అనే విష‌యాల‌పై ఆరా తీస్తున్నారు. భ‌విష్యత్తులో అధికారంలోకి వ‌చ్చే పార్టీ మ‌న‌ది అని ఎమ్మెల్యేల‌కు భరోసా ఇచ్చే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చక‌పోడంతో ఇప్పటికే అధికార పార్టీపై ప్రజ‌ల్లో విశ్వాసం పోయింద‌ని అలాంటి పార్టీలోకి వెళితే రాజ‌కీయంగా ఇబ్బందులు ప‌డాల్సివ‌స్తుంద‌ని ఎమ్మెల్యేల‌కు న‌చ్చచెబుతున్నారు వైసీపి ముఖ్య నేత‌లు. అంతే కాకుండా టిడిపి కావాల‌నే అస‌త్యప్రచారాలు చేస్తోందని విమర్శిస్తోంది వైసీపీ. ఎవ‌రూ పార్టీని మారాల‌ని అనుకోవ‌డంలేద‌ని స్పష్టం చేస్తున్నారు. స్వార్ద ప్రయోజ‌నాల కోసం ఒక‌రిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పార్టీకి ఎలాంటి న‌ష్టం ఉండ‌దంటున్నారు వైసీపి నేత‌లు...మెత్తానాకి ఏపీలో అధికార పార్టీ ఇస్తున్న షాక్ ల‌కు వైసీపీ ఒకింత క‌ల‌వ‌ర ప‌డుతున్నా.. మ‌రోవైపు అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు పెరగకుండా గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సోనియా నివాసంలో కొనసాగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాసం సిడబ్ల్యూసీ సమవేశం కొనసాగుతుంది. రేపటి నుండి జరగనున్న పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఖమ్మం కార్పొరేషన్ ను కైవసం చేసుకుంటాం: మంత్రి తుమ్మల

హైదరాబాద్ : ఖమ్మం కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆశావహులు సహకరించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మేరకు అందరూ నడుచుకోవాలన్నారు. సీఎం ఇచ్చిన హామీలను పాలకవర్గం నెరవేస్తుందన్నారు.

ఆదినారాయణ రెడ్డి చేరిక వల్ల మార్పులు వస్తాయి: రామసుబ్బారెడ్డి

విజయవాడ : కర్నూలు టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జి రామసుబ్బారెడ్డి విజయవాడ టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరిక వల్ల నియోజకవర్గంలో మార్పులు జరగవచ్చన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి నా అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికి అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాన్నారు.

18:56 - February 22, 2016

అనంతపురం : మాఘ మాస పౌర్ణమి. ఈరోజు వస్తే చాలు ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. అగ్గిపాడు అనే ఆచారం పేరుతో గ్రామస్తులంతా ఇళ్లకు తాళం వేసి దర్గాలోనే వంటావార్పు చేసుకుని అక్కడే నిద్రిస్తారట. ఇలాంటి వింత ఆచారం ఆ గ్రామంలో అనాదిగా కొనసాగుతుందట. ఇంతకీ ఈ విచిత్ర ఆచారాన్ని పాటిస్తుంది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.                                                                                               

ఊరు బయట ఉన్న దర్గాలో వంటావార్పు....

చూశారా..! తట్ట.. బుట్ట పట్టుకుని పోతున్న వీరంతా వలస పోతున్న ప్రజలు కాదు. ఊరు బయట ఉన్న దర్గాలో వంటావార్పు చేసుకుని.. అక్కడే తిని.. నిద్ర చేసేందుకు బయల్దేరుతున్నారు. ఇది ఎక్కడో.. తెలుసా. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో. వీళ్లంతా ఇలా ఎందుకు చేస్తున్నారంటే గత 60 ఏళ్లుగా వస్తున్న ఆచారమట. మాఘమాస పౌర్ణమి రోజు ఊర్లో అగ్గిపాడు అనే ఆచారాన్ని పాటిస్తారట. ఈ రోజు ఎవరూ పొయ్యే వెలిగించకుండా ఊరి అవతల ఉన్న హాజీ వాలి దర్గాలో వంటావార్పు చేసుకుని.. అక్కడే నిద్రిస్తారట. ఇలా చేస్తే ఈ ఏడాది మొత్తం ఎలాంటి కరువు కాటకాలు రావని వీళ్ల నమ్మకం. అలాగే పిల్లాపాపలు, ముసలి ముతక సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం. అందుకే ప్రతి ఏడాది మాఘ మాస పౌర్ణమి రోజు ఇలాగే చేస్తుంటారట.

400 ఏళ్ల క్రితం ఓ బ్రాహ్మణుడు....

ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారని గ్రామస్తులను అడిగితే దీనికో స్టోరీ ఉందంటున్నారు. పూర్వం 400 ఏళ్ల క్రితం ఓ బ్రాహ్మణుడు ఈ ఊర్లో దొంగతనానికి వచ్చాడట. గ్రామస్తులందరూ పట్టుకుని చితకబాదడంతో చనిపోయాడు. అప్పటినుంచి ఆ ఊర్లో ఎవరికీ సంతానభాగ్యం లేదట. అంతేకాకుండా గ్రామస్తులంతా నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడేవారు. దీంతో ప్రజలందరూ ఓ పండితుడి దగ్గరకు తమ గోడును విన్నవించుకున్నారట. మాఘమాస పౌర్ణమి రోజు ఊరంతా ఖాళీ చేసి.. దగ్గరలోని దర్గాలో కుటుంబ సమేతంగా నిద్ర చేసి,.. మరుసటిరోజు వంటావార్పు చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి రావాలని చెప్పాడట. ఇలా చేయడం వల్ల గ్రామస్తుల కష్టాలన్నీ పోతాయట. అందుకే అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలంతా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు ఎలాంటి కష్టాలు రావని ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

మాస పౌర్ణమి రోజు ఊరులోని అన్ని ఇళ్లకు తాళాలే....

అందుకే మాఘ మాస పౌర్ణమి రోజు ఊరులోని అన్ని ఇళ్లకు తాళాలే దర్శనమిస్తాయి. 600 కుటుంబాలు దర్గా వద్దకు వెళ్తాయి. అక్కడే నిద్రిస్తారు. తెల్లవారుజామున వంటావార్పు చేసుకుని సాయంత్రం ఇళ్లకు తిరిగి వస్తారు. ఇది అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయమని.. అందుకే తాము కూడా పాటిస్తున్నామని గ్రామస్తులంటున్నారు. ఏదిఏమైనా శాస్త్రసాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినా.. మూడ నమ్మకాల పేరుతో ఊరు మొత్తం ఇళ్లను వదిలి రోజంతా ఊరు బయటే నిద్రించడం నిజంగానే విచిత్రం.

18:52 - February 22, 2016

తెనాలి : అతనొక ఖాకీ. నేను మోనార్క్‌ని... నన్నెవరూ ఏమీ చేయలేరంటూ డైరెక్ట్‌గా చెప్పకపోయినా అన్నంత పనీ చేస్తుంటారు. రౌడీలు, గూండాలు, దొంగలకు తప్పించి సామాన్యులందరికీ అతనంటే హడల్. డబ్బుల కోసం వేధించడం., దురుసుగా ప్రవర్తించడం, అప్పుడప్పుడు సస్పెండ్ అవడం అతని ట్రాక్‌ రికార్డ్. ఇక పెద్దపెద్ద నేతల ఆశీసులు ఉండడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అయింది. ఆయన వేధింపులు భరించలేక సామాన్యులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.

డబ్బు కోసం వేధింపులకు...

డబ్బు కోసం వేధింపులకు పాల్పడతారు.. సెటిల్‌మెంట్లు చేయడంలో మొనగాడు..తమను వేధిస్తున్నారంటూ ప్రజల నుంచి ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినా ఉన్నతాధికారుల నుంచి ఏ యాక్షనూ ఉండదు.. ఇవన్నీ ఈ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఉన్న ఆరోపణలు. ఇందుకు తగ్గట్టే ఈయన విధులు నిర్వహిస్తున్న ఏరియాలో ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి.

తెనాలి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా....

గుంటూరు జిల్లా తెనాలి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పేరు వై.శ్రీనివాసరావు. ఈ పోలీస్‌ అంటే పట్టణవాసులకు హడల్. లేనిపోని కారణాలు చూపించి స్టేషన్‌కు పిలిపించడం...మాటలతో చేష్టలతో వేధింపులకు గురిచేయడం లాంటి ఎన్నో ఆరోపణలున్నాయి. గతంలో విధులు నిర్వహించిన చోట స్థానికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుల రావడంతో కొంతకాలం ఖాకీ డ్రస్‌కు దూరమయ్యాడు. మరలా రాజకీయ నేతల అండదండలతో గుంటూరు జిల్లా తెనాలి సిఐగా పోస్టింగ్ తెచ్చుకున్నాడు.

విధుల్లో చేరినదగ్గర్నుంచీ మళ్లీ తన పాత బుద్ధినే...

అయితే సార్ విధుల్లో చేరినదగ్గర్నుంచీ మళ్లీ తన పాత బుద్ధినే కొనసాగిస్తూ వివాదాలకు తెరలేపారు. ప్రజలను పదేపదే పోలీస్ స్టేషన్‌కు పిలవటం ఏదైనా పాత కేసులకు సంబంధించి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరచకుండా డబ్బు కోసం వేధించడం లాంటి ఆరోపణలున్నాయి.

ఇదే తరహాలో గతంలో మణి అనే యువకుడిని ఓ కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించి వేధించారు. దీంతో అతను యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెలలు గడుస్తున్నా ఆ బాధితుడు మంచంపైనే పడున్నాడు.

కొద్ది రోజుల క్రితం ఓ న్యాయవాది పై దౌర్జన్యం....

కొద్ది రోజుల క్రితం ఓ న్యాయవాది రైల్వే స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా అతనిపై దౌర్జన్యంగా వ్యవహరించాడు. దీంతో న్యాయవాదులంతా సిఐ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. కోర్టు విధులను వారం రోజులపాటు బాయ్‌కాట్ కూడా చేశారు. ఇలా సిఐపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా అతనికి జిల్లాకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు అండదండలుండడంతో ఏ యాక్షనూ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

తెనాలి 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్‌ సోదరుడు...

తాజాగా తెనాలి 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్‌ సోదరుడు ఖాజాపై సిఐ కన్నేశారు. ఖాజాను కొన్ని నెలలుగా స్టేషన్‌కు పిలిపించుకుంటూ వేధింపులకు గురి చేశారు. దీంతో అతను మనస్తాపానికిగురై స్టేషన్‌లో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్‌కు ప్రయత్నించారు. ప్రస్తుతం అతను గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నా సిఐపై ఉన్నతాధికారులు ఏ చర్యా తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా సిఐ శ్రీనివాసరావును ఇష్టపడి తెచ్చుకోవడం అందులోనూ జిల్లాకు చెందిన మంత్రితో సంబంధాలు ఉండడంతో ఆయన ఆగడాలు నడుస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

అతనిపై ఏసిబి దర్యాప్తుకు డిమాండ్ ....

సిఐ శ్రీనివాసరావు పలు అక్రమాలకు పాల్పడుతూ భారీగా ధనం వెనకేసుకున్నాడని అతనిపై ఏసిబి దర్యాప్తుకు డిమాండ్ చేస్తామని బాధితులు అంటున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే పౌరుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఉన్నతాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం స్థానికులను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. 

18:48 - February 22, 2016

విజయవాడ : మారిషస్ బ్యాంక్ రుణం వ్యవహారంతో తనకెలాంటి సంబంధమూ లేదని కేంద్ర సహాయ మంత్రి, టిడిపి నేత సుజనాచౌదరి అన్నారు. ఆయన భాగస్వామిగా ఉన్న సుజనా గ్రూప్‌ మారిషస్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. అయితే తనకా సమన్లు రాలేదని ఆ గ్రూప్‌తో సంబంధం లేదని సుజనా అన్నారు. 

18:46 - February 22, 2016

విజయవాడ : అమరావతి తుది మాస్టర్‌ ప్లాన్‌ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. సీఎం చంద్రబాబు సంతకం చేసిన తర్వాత తుది ప్రణాళికను సీఆర్డీఏ రిలీజ్‌ చేస్తుంది. ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ను గతేడాది డిసెంబరు 26న సీఆర్డీఏ ప్రకటించింది. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు గడువు ఇచ్చింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సీఆర్డీఏ తుది మాస్టర్‌ ప్లాన్‌ను రెడీ చేసింది. సింగపూర్‌కు చెందిన సుర్బానా సంస్థ ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది.

సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో తుది ప్రణాళిక....

తుది ప్రణాళికను సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. పత్రికల్లో ప్రకటననూ జారీ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు.కొన్ని గ్రామాల మీదుగా రహదారుల్ని ప్రతిపాదించడంపైనే ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. సీడ్‌ కేపిటల్‌ పరిధిలోకి వచ్చే మూడు గ్రామాల రైతులు తమకు సీడ్‌ కేపిటల్‌ పరిధిలోనే అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అభ్యంతరాలపై సీఆర్‌డీఏ విస్తృత కసరత్తు...

రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై సీఆర్‌డీఏ విస్తృత కసరత్తు చేసింది. మార్పులపై సీఎంతో పాటు మంత్రులు, అధికారులు సింగ్‌పూర్‌ ప్రతినిధులతో చర్చించారు. ముసాయిదా ప్రణాళికలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూల్చాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో రహదారుల్ని కాస్త పక్కకు జరిపి తుది ప్రణాళికకు రూపకల్పన చేశారు. వీలైనంతవరకు రోడ్లు గ్రామాల్లోంచి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐనా కొన్ని రహదారులు గ్రామాల మీదుగా వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. కానీ తుది ప్రణాళిక ప్రకారం తక్కువ సంఖ్యలోనే ఇళ్లు పోతాయని అధికారులు చెబుతున్నారు.

మొత్తానికి తుది నివేదిక..

మొత్తానికి తుది నివేదిక.. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకే ఉంటుందా..? లేక తమ నమ్మకాలను వమ్ము చేసేలా ఉంటుందా అన్న అంశంపై అమరావతి ప్రతిపాదిత గ్రామాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మాత్రం.. ఉద్యమించాలన్న యోచనలో ఈ ప్రాంత ప్రజలున్నారు. 

18:25 - February 22, 2016

హైదరాబాద్ : ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ రెడీమెడ్ బ్లౌజెస్ ది. డైలీ వేర్ అయినా, పార్టీ వేర్ అయినా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ దే హవా. అలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

కాసేపట్లో అమరావతి తుది మాస్టర్ ప్లాన్ విడుదల

హైదరాబాద్: కాసేపట్లో అమరావతి తుది మాస్టర్ ప్లాన్ ను సీఆర్ డీఏ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ సీఆర్ డీఏ తన వెబ్ సైట్లో పెట్టనున్నట్లు సమాచారం. గత నెలలో విడుదల చేసిన ముసాయిదా లో వచ్చిన అభ్యంతరాలను సేకరించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలాగైతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి : మంత్రి హరీష్ రావు

ఢిల్లీ : జల్ మంథన్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల అనుమతల విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందన్నారు. ఇలాగైతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని మండి పడ్డారు. నీటి పారుదల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. ఏఐబీసీ పథకం కింద దేవాదుల ప్రాజెక్టు ఒక్కటే తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి మరో ప్రాజెక్టును ఎంపిక చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

17:52 - February 22, 2016

హైదరాబాద్ : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో ఓ టిఆర్ఎస్ నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన పూకంటి వనంరెడ్డి కొంతకాలంగా హన్మకొండ టిఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. త్వరలో వరంగల్ సిటీకి ఎన్నికలు జరగబోతుండడంతో వనంరెడ్డి కార్పొరేటర్‌ టికెట్ ఆశిస్తున్నారు. అయితే కార్పొరేటర్ ప్రాబబుల్స్‌లో వనంరెడ్డి పేరు లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. ఆ క్రమంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వనంరెడ్డిని పలువురు టిఆర్ఎస్ నేతలు పరామర్శించారు. 

రేపు ఎన్టీపీసీలో 5శాతం వాటాను విక్రయం

ఢిల్లీ : ఎన్టీపీసీలో 5శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది. వాటాకు రూ.122 చొప్పున కనిష్ట ధర నిర్ణయించింది.

ఆస్తి పన్ను పై వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించాం: మేయర్

హైదరాబాద్ : గ్రేటర్ లో ఆస్తిపన్ను చెల్లింపులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆస్తి పన్ను పై వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించినట్లు జీహెచ్ ఎంసీ మేయర్ తెలిపారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సీఎం అపాయింట్ మెంట్ కోరిన బస్వరాజు

వరంగల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బస్వరాజుసీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు. తన కుమారుడు శ్రీవాణ్, సోదరుడు కుమారస్వామికి కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఖాజీపేట, కాశిబుగ్గ, దేశాయిపేట, కరీమాబాద్ ప్రాంతాల్లో కార్యకర్తల అభిప్రాయాలను బస్వరాజు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

17:27 - February 22, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి పన్నులు బకాయిలు పేరుకుపోవడంతో.. మొండి బకాయిలను వసూలు చేసే ప్లాన్‌ను గ్రేటర్‌ కార్పొరేషన్‌ రూపొందిస్తోంది. బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తే దాదాపు రు.550 కోట్ల రూపాయల వరకు బకాయిదారులకు లబ్ది చేకూరుతుంది.

17:26 - February 22, 2016

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై మేడారంలో జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాడికి పాల్పడ్డ ఏ.ఎస్‌.పి, ఇతర పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని పాశం యాదగిరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని పోలీసులు మంత్రులు, ప్రజాప్రతినిధుల మాట కూడా వినడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు కూడా లేకుండా చేస్తున్నారని సిపిఎం కార్యదర్శి తమ్మినేని విమర్శించారు. 

17:24 - February 22, 2016

హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. జాట్‌ ఆందోళన నేపథ్యంలో సోనిపట్‌లోని మునాక్ కాలువ ద్వారా నీటి సరఫరాకు ఆందోళనకారులు ఆటంకాలు సృష్టించారు. దీంతో ఢిల్లీలో ఏర్పడ్డ నీటి సంక్షోభంపై ఆప్‌ సర్కార్‌ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హర్యానా ప్రభుత్వంతో చర్చించి మంచినీటి సమస్యను పరిష్కరించుకోవడానికి బదులు తమను ఆశ్రయించడమేమిటని ప్రశ్నించింది. ప్రతి సమస్యపైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ సులువైన మార్గాన్ని కనిపెట్టారంటూ ఆప్‌ మంత్రి కపిల్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడడంపై నివేదిక అందజేయాలని కేంద్ర, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మునాక్ కాలువ ద్వారా ఢిల్లీ నగరానికి మంచినీటి సరఫరాను పునరుద్ధరించినట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఇవాళ సాయంత్రానికి ఢిల్లీ నగరానికి నీరు అందుతుందని వివరించింది. తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది.

17:03 - February 22, 2016

విజయవాడ : వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా టిడిపిలోకి వెళ్లవచ్చన్న ఊహాగానాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నేటి సాయంత్రం కనీసం నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన వైసీపీ వర్గానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలతో పాటు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు చంద్రబాబుతో భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీకి ముందే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. సాయంత్రం మీడియాతో సమావేశమై భూమా తన 'మనసులో మాట'ను వెల్లడిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

గూడ్స్ రైలుకు నిప్పు పెట్టిన జాట్లు..

హర్యానా : రాష్ట్రంలోని గనవరు ప్రాంతంలో ఆగివున్న గూడ్స్ రైలు బోగీలకు జాట్లు నిప్పుపెట్టారు. ఆ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. జాట్ల ఆందోళన ఉదృతం అయ్యాక హార్యానాలో భారీగా రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి.

ఏపీలో యూనివర్సిటీలకు పాలకమండళ్ల నియామకం

విజయవాడ : ఏపీలో యూనివర్సిటీలకు పాలకమండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం- జేఎన్టీయూ, శ్రీకృష్ణదేవరాయ, తిరుపతి- పద్మావతి మహిళా వర్సిటీ, రాజమండ్రి- ఆదికవి నన్న,శ్రీకాకుళం-బీఆర్‌ అంబేద్కర్‌ వర్సిటీ, మచిలీపట్నం- కృష్ణా వర్సిటీ, కర్నూలు- రాయలసీమ నెల్లూరు- విక్రమసింహపురి, గుంటూరు- నాగార్జున వర్సిటీ, కడప- యోగి వేమన యూని వర్సిటీలకు ప్రభుత్వం పాలకమండళ్లు నియమించింది.

14వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణకు కమిటి...

హైదరాబాద్: 14వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. వాణిజ్య సంస్థల్లో నిధుల వినియోగాన్ని ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఐదేళ్లకు గాను స్థానిక సంస్థలకు రూ.5375 కోట్లను 14వ ఆర్థిక సంఘం కేటాయించింది. నిధుల పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.

కాశ్మీర్ లో ముగిసిన ఎన్ కౌంటర్...

కాశ్మీర్ : దాదాపు మూడు రోజులుగా కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ ముగిసింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో దాగుండి కాల్పులకు తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులనూ హతమార్చినట్టు సైనికాధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు ముగిసాయని, నిన్న ఓ ఉగ్రవాదిని, నేడు మరో ఇద్దరినీ హతమార్చినట్టు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలిలో సోదాలు జరుగుతున్నాయని, ఉగ్రవాదులు ఏవైనా పేలుడు పదార్థాలు అమర్చరా? మరెవరైనా దాగున్నారా? అన్న కోణంలో సోదాలు చేస్తున్నామని వివరించారు. భవంతిలోని ఒక అంతస్తు పూర్తిగా దహనమైందని తెలిపారు.

నిజమైన దేశద్రోహులు ఆర్ ఎస్ ఎస్, బిజెపినే :సురవరం..

హైదరాబాద్ : స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లు కమ్యూనిస్టుల దేశభక్తిని ప్రశ్నిస్తున్నారని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. మోదీని విమర్శిస్తే దేశం విడిచి వెళ్లాలని అంటున్నారని, నిజమైన దేశద్రోహులు ఆర్ ఎస్ ఎస్, బిజెపినే అని సురవరంవిమర్శించారు. ఇంత వరకు మైనార్టీలు, దళితులపై దాడులు చేశారని..ఇపుడు కమ్యూనిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. గాడ్చే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేసిన సాక్షి మహారాజ్ ను ప్రశ్నించే ధైర్యం లేదన్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలను నమోదుచేశాయి. 80 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 23,788 వద్ద, 24 పాయింట్లు లాభపడి నిఫ్టీ 7,234 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ అయ్యప్పనగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రమణ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ ఏఆర్ క్వార్టర్స్‌లో రమణప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబీకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

15:52 - February 22, 2016

హైదరాబాద్ : టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతోంది. పీఏసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన భూమా నాగిరెడ్డి.. నేడు బెజవాడలో చంద్రబాబును కలవనున్నారు. కడప నుంచి ఆదినారాయణరెడ్డి కూడా విజయవాడకు వెళుతున్నారు. దీంతో వలసల వేడి పెరుగుతోంది.

15:49 - February 22, 2016

గుంటూరు :గుంటూరు జెడ్పీ గ్రీవెన్స్‌లో ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ ఇంటిని పడగొట్టవద్దంటూ అధికారులకు ఫిర్యాదు చేయడానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గుంటూరు రూరల్ మండలం పల్లవరం గ్రామానికి చెందిన విజయమ్మ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలోని కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కొండపైన ఉన్న రాళ్లను తొలగించడానికి అధికారులు నిర్ణయించారు. కొండ కింద భాగంలో ఉంటున్న విజయమ్మ ఇంటిని ఖాళీచేయాలని అధికారులు చెప్పారు. తాను గత 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నానని బీ ఫామ్‌ కూడా ఉందని విజయమ్మ అధికారులకు చెప్పారు. గ్రామ సర్పంచ్‌ తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోలేదని ఈ నేపథ్యంలో గుంటూరు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిందని ఆమె కుమారుడు మరియదాస్‌ తెలిపారు. ఆయితే అధికారులు స్పందించకపోవడంతో తనకు న్యాయం జరగదని భావించి ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు.

15:47 - February 22, 2016

హైదరాబాద్ : యువకులు ఏదో ఓ కొత్తదనాన్ని సాధించినపుడే జీవితం సార్థకం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. బనారస్‌ హిందూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొన్న ప్రధాని విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు పరిష్కారం చూపడంలో భారత్ తన భూమికను ఎంతవరకు నిర్వర్తిస్తుందనే దానిపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మోది ప్రసంగం పూర్తయ్యే సమయంలో ఆశుతోష్‌ అనే విద్యార్థి ప్రసంగానికి అడ్డు తగిలాడు. బిహెచ్‌యూలో ఎన్నికలు జరిపించాలని విద్యార్థి సంఘం నేత ఆశుతోష్‌ సింగ్‌ సభలో డిమాండ్‌ చేశాడు. ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ వదిలేశారు.

టిడిపిలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు !

విజయవాడ : వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా టిడిపిలోకి వెళ్లవచ్చన్న ఊహాగానాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నేటి సాయంత్రం కనీసం నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన వైకాపా వర్గానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలతో పాటు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు చంద్రబాబుతో భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీకి ముందే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. సాయంత్రం మీడియాతో సమావేశమై భూమా తన 'మనసులో మాట'ను వెల్లడిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

పాక్ సరిహద్దుల్లో అమెరికా సైనికుల కాల్పులు..

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మళ్ళీ ఆమెరికా సైనికులు కాల్పులు ప్రారంభించారు. సరిహద్దు వెంట జరిపిన కాల్పుల్లో ఆఫ్ఘాన్ సరిహద్దులోని కుర్రమ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కాల్పులు... పాకిస్తాన్ వైపు నుంచి జరిగాయా, ఆఫ్ఘన్ వైపు నుంచా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడి ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ బీడీ కార్మికుల ఆందోళన

ఆదిలాబాద్ : బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న దాదాపు 100 మంది కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును చిన్నదిగా ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అధికారులకు వినతిప్రతం అందజేశారు.

రహదారులు, భవనాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : రహదారులు, భవనాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అర్‌అండ్‌బీ శాఖ నిర్మాణాలు భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడాలని సూచించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరసల రహదారులు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు 4 వరసల రహదారులుండాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి మంచి రహదారి ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏడాదిలోగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్శించాలన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ తరహాలో మరో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాల్సి ఉందని చెప్పారు.

ఆటో చిన్నారిని వదిలేసి భర్తకు ఫోన్ చేసిన మహిళ

నల్గొండ : సూర్యాపేట పాత బస్టాండ్‌ సమీపంలో ఓ తల్లి ఏడాదిన్నర బాబును ఆటోలో వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ఈ విషయాన్ని భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. భర్త వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాబును స్థానికులకు అప్పగించి భార్యను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. చిన్నారిని స్థానికులు సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళను పెన్‌పహాడ్‌ మండలం పెదసీతారాంతండా మహిళగా గుర్తించారు.

వైద్యశాఖను ప్రక్షాళన చేస్తాం : మంత్రి కామినేని

విజయవాడ: వైద్యశాఖను ప్రక్షాళన చేస్తామని, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో మరో నాలుగు కొత్త ఆస్పత్రులు నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాకు నాలుగు చొప్పున క్యాన్సర్ స్క్రీనింగ్‌ సెంటర్‌, డయాలసిస్‌ సెంటర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు.

టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటి అధికారి బదిలీ

హైదరాబాద్ : తితిదే చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి డి.నాగేంద్రకుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తక్షణమే రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించింది.

ప్రతిపక్షాలు సకహకరించండి : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్షాలను వెంకయ్య కోరారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 25న రైల్వే బడ్జెట్, 29 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

పటియాల ఘటనపై మార్చి 10న విచారణ

హైదరాబాద్ : పటియాల కోర్టులో జేఎన్ యూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే తమకు అన్ని విధాలైన నివేదికలు అందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై మార్చి 10న విచారణ చేపడతామని తెలిపింది. రాజద్రోహం కేసులో జేఎన్ యూ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని పటియాల కోర్టుకు తీసుకురాగా ఆ సమయంలో న్యాయవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

మోదీ సభలో కలకలం..

హైదరాబాద్ : మోదీ వారణాసిలో పర్యటిస్తున్న వేళ కలకలం చెలరేగింది. ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన అనంతరం, బీజేపీకి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బనారస్ హిందూ యూనివర్శిటీ విద్యార్థిని బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు. దేశంలో విద్యార్థులపై నమోదవుతున్న దేశద్రోహం కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఈ తరహా పాలన కూడదని అశుతోష్ సింగ్ నినాదాలు చేయగా, అతన్ని చుట్టుముట్టిన బీజేపీ కార్యర్తలు కొట్టారు. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

14:57 - February 22, 2016

కృష్ణా : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాల్‌మనీ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టించుకోవడంలేదని మహిళ ఆరోపిస్తోంది. 

14:55 - February 22, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. జీఎస్‌టీ సహా కీలక బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూతో పాటు అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం:శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్ : ఈ రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు...కలెక్టర్ల సమావేశంలో విభజన సమస్యల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

విద్యుత్‌షాక్‌కు గురై కార్మికుడు మృతి

నెల్లూరు : విద్యుత్‌షాక్‌కు గురై పవర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. టిపి గూడూరు మండలంలోని సీసీ పవర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మున్న యాదవ్ అనే కార్మికుడు విద్యుత్‌షాక్‌ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తోటి కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళన చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి ఫ్యాక్టరీపై దాడికి పాల్పడ్డారు. పదుల సంఖ్యలో బైకులకు నిప్పంటించి తగులపెట్టారు.

14:52 - February 22, 2016

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలయింది. నిధుల దుర్వినియోగం జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది. 

14:50 - February 22, 2016

కృష్ణా : విజయవాడ ఫ్రూట్ మార్కెట్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 కిలోల కార్బైడ్ తో పాటు మరిన్ని రసాయణాలు పట్టుబడ్డాయి. బొప్పాయి, పనస, అరటి పళ్లను కృత్రిమంగా పండించడంలో కార్బైడ్‌ ను వాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ దుకాణాలను సీజ్ చేసి కేసులు పెట్టినట్టు ప్రకటించారు. రానున్న మామిడి పళ్ల సీజన్ లో కార్బైడ్ వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

14:46 - February 22, 2016

పశ్చిమగోదావరి : జిల్లా పేరు చెప్తే..వెంటనే గుర్తొచ్చేవి పచ్చని పంటపొలాలు. కానీ ఇప్పుడా పచ్చటి పొలాలు కాస్తా ఎండిపోతున్నాయి. చుక్కనీరు లేక పొలాలన్నీ నెర్రెలిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు నీరు వదలండి బాబు అంటూ సర్కార్‌కు రైతులు మొరపెట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.                                                                                                                  

కాల్వల్లోకి నీరొలదకపోవడంతో..

పచ్చటి పంటపొలాలు కాస్తా నీళ్లు లేక ఎలా ఎండిపోతున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లాలో ఎప్పుడు పచ్చగా కళకళలాడే పంటపొలాలు కాస్తా ఇలా ఎండిపోతున్నాయి. కారణం..కాల్వల్లోకి నీరొలదకపోవడమే. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురిసి జలకళ ఉట్టిపడుతున్నా ..ప్రభుత్వం మాత్రం రైతుల పంటపొలాలకు నీరు వదడంలేదు. దీంతో పచ్చటి పొలాలన్నీ ఇలా నెర్రలిస్తూ ఎండిపోతున్నాయి.

చేపల చెరువులకు మాత్రం కావాల్సిన నీరు...

ఓవైపు పొలాలకు నీరు వదలకున్నా...చేపల చెరువులకు మాత్రం కావాల్సిన నీరు వదులుతున్నారు అధికారులు. పొలాలకు నీళ్లులేకుండా అన్నమో రామచంద్రా అని రైతులు గగ్గోలు పెడుతన్నా..ప్రభుత్వం వాటిని పెడచెవిన పెడుతోంది. నాట్లు వేసేటప్పుడే నీరివ్వలేమని ప్రభుత్వం చెప్పుంటే తాము నాట్లు వేసేవాళ్లంకాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ఎకరాలకు 20 నుంచి 25వేలు పెట్టుబడి పెట్టామని..తీరా ఇప్పుడు నీరులేకపోవడంతో పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరిపైరు పొట్టకొచ్చే దశలో...

వరిపైరు పొట్టకొచ్చే దశలో నీరులేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతుల విధానంలో ఇరిగేషన్‌వారు తమకు న్యాయం చేయడంలేదని...చేపలు, రొయ్యల చెరువులకు నీరు సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...వెంటనే తమ పంట పొలాలకు నీరు వదలాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

14:43 - February 22, 2016

ప్రకాశం : ఒంగోలులో రెండు ప్రభుత్వ విద్యాకేంద్రాల మధ్య స్థల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. భాగ్యనగర్ శివారులోని నవోదయ విద్యాలయానికి..నాగార్జున పీజీ స్టడీ సెంటర్‌కు మధ్య ప్రహరీ గోడ లేకపోవటంతో విద్యార్ధినులకు రక్షణ లేదని గతంలో పలుమార్లు నవోదయ ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రహరీ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అయితే ప్రహరీ నిర్మాణానికి నాగార్జున పీజీ సెంటర్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యార్ధులు రోడ్డెక్కారు. ఇరు సంస్థల మధ్య వివాదం జరుగుతుంటే..విద్యార్దులు ఎండలో నిరసన చేస్తున్నారన్న సమాచారం అందుకున్న 1098 చైల్డ్ లైన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. విద్యార్ధులను ఎండలో కూర్చో పెట్టడంతో నవోదయ ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14:41 - February 22, 2016

హైదరాబాద్ : హార్ట్‌లీ వెల్‌కమ్‌ అంటూ స్వాగతం పలుకుతారు. రాగానే రోజా పువ్వు ఇచ్చి సాదరంగా ఆహ్వానిస్తారు. చెరగని చిరునవ్వుతో సేవలకు సిద్ధంగా ఉంటారు. ఆర్డరివ్వండి.. అందిస్తామంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మర్యాదకు లోటు లేకుండా ప్రయాణికులను మురిపిస్తారు. అలా తమ విధులను ఎయిర్‌ హోస్టస్‌ వినమ్రంగా నిర్వహిస్తారు . ఇప్పుడిదే సీన్‌ రైల్వేలోనూ కనిపించబోతోంది. ట్రైన్‌ హోస్టెస్‌ ప్రతిపాదన ఈ రైల్వే బడ్జెట్‌లో పట్టాలెక్కనుంది.

రైల్వే బడ్జెట్‌లో ట్రైన్‌ హోస్టెస్‌ ప్రతిపాదన....

ట్రైన్‌ ప్రయాణాన్ని ఓ మధురానుభూతిగా మార్చాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. కొత్త హంగులతో రైళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ట్రైన్లలో ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేందుకు ప్లాన్‌లు రెడీ చేస్తోంది. అందులో భాగంగానే ట్రైన్‌ హోస్టెస్‌ను రైల్వే శాఖ పరిచయం చేస్తోంది. రైల్వే బడ్జెట్‌ సందర్భంగా ఈ ప్రతిపాదన పట్టాలకెక్కనుంది.

ప్రతి బోగికీ టీవీలు..ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌...

ఈ నెల 25న ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌లో ట్రైన్‌ హోస్టెస్‌ ప్రతిపాదనను రైల్వే మంత్రి ప్రస్తావించనున్నారు. వీటితో పాటు మరిన్ని హంగులను రైళ్లలో ఏర్పాటుచేయబోతున్నారు. మొదటిగా ఢిల్లీ- ఆగ్రా మీదుగా నడవనున్న గతిమాన్‌ సెమీ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏర్పాట్లు చేయబోతున్నారు. ట్రైన్‌ హోస్టెస్‌తో పాటు ప్రతి బోగికీ టీవీలు, జీపీఎస్‌తో కూడిన ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, స్లైడింగ్‌ డోర్‌ సిస్టం, ఆటోమెటిక్‌ ఫైర్‌ అలారం, మంద్రంగా వినిపించే సంగీతం ఇలా...అధునాతన సౌకర్యాలు గతీమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కల్పిస్తున్నారు. ఆ తరువాత మిగతా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకూ ఈ సౌకర్యాలు విస్తరిస్తారు. 

14:38 - February 22, 2016

హైదరాబాద్ : చదువుకున్న వాళ్ళు మాత్రమే రాణించే రంగం. సాంకేతిక పరిజ్ఙానం ఉంటేనే నిలబడగలిగే రంగం. నిరంతర పోటీని తట్టుకునే శక్తి ఉంటేనే గుర్తింపు సాధించే రంగం ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీలో పాతికేళ్లుగా పయనం సాగిస్తోంది ఓ గ్రామీణ అతివ. అననుకూలతను అధిగమిస్తూనే తనకంటూ ప్రత్యేకతను సాధిస్తోంది.

రెండు దశాబ్దాల క్రితం....

రెండు దశాబ్దాల క్రితం ఒక గ్రామీణ మహిళ ఫోటోగ్రఫీలోకి అడుగు పెట్టడం ఒక సాహసమే. ఎవరు ఏమన్నా, ఇప్పటికీ ఈ రంగంలో నిలదొక్కుకుని ఉండడం గొప్ప విషయమే. నిలదొక్కుకోవడమే కాదు, తన రంగంలోని పెద్దలం ప్రశంసలు అందుకోవడం ప్రత్యేక అంశం.

మానవి అభినందనలు..

సంకల్ప బలముంటే, సాధించాలనే తపనుంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా జయకేతనం ఎగరేయగలరని నిరూపిస్తున్నారు. శారద. ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు మానవి అభినందనలు తెలియచే్స్తోంది. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది. 

14:34 - February 22, 2016

యావజ్జీవ శిక్ష పడ్డ వ్యక్తినీ ఏ పదేళ్లో.. పన్నెండేళ్లకో విడుదల చేస్తారు. అందులోనూ.. సెలవులుంటాయి. వాటిని ఉపయోగించి పెరోల్‌పై బయటికి వచ్చే వీలూ ఉంటుంది. కానీ ఇలాంటివేవీ లేకుండా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 43 ఏళ్లపాటు.. ఇరుకు గదిలో దుర్భర ఏకాంతవాస శిక్షను అనుభవించాడు ఉడ్‌ఫాక్స్‌ అనే వ్యక్తి. అమెరికా పౌరసమాజం ఒత్తిళ్లతో ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు.                                                                            

ఆరడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల పొడవు ఉన్న ఇరుకు గది.....

43 సంవత్సరాలు.. ఆరడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల పొడవు ఉన్న ఇరుకు గది..... మనిషన్నవాడు కనిపించని ఏకాంతవాస శిక్ష..! రోజులో కేవలం ఒక్క గంట మాత్రం... బయటికి అనుమతి లభించే దుర్భర జీవనం. అమెరికాలోని ఫెడరల్‌ జైళ్లలో హత్యకేసు నిందితులను శిక్షించే అతి దారుణమైన శిక్షా విధానమిది. అత్యంత దుర్భరమైన ఇలాంటి ఏకాంతవాస కారాగార శిక్షను.. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు అనుభవించిన బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమకారుడు ఆల్బర్ట్‌ ఉడ్‌ఫాక్స్‌.. ఎట్టకేలకు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.

1972లో జైలుగార్డు బ్రెంట్‌ మిల్లర్‌ హత్య కేసులో..

1972లో జైలుగార్డు బ్రెంట్‌ మిల్లర్‌ హత్య కేసులో.. ఉడ్‌ఫాక్స్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు నిందితులు. తాను అమాయకుణ్ణని ట్రయల్‌ దశల్లో ఉడ్‌ఫాక్స్‌ వాదించాడు. పౌర సమాజమూ పాలకులపై ఒత్తిళ్లు పెంచింది. ఈ దశలో 2001లో ఒకరిని, 2013లో మరొకరిని జైలునుంచి విడుదల చేశారు. హత్యకేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఉడ్‌ఫాక్స్‌కు మాత్రం.. ఏకాంతవాస కారాగారశిక్షనుంచి విముక్తి లభించలేదు. గతేడాది నవంబర్‌లో న్యాయమూర్తి జేమ్స్‌ డెనిస్‌.. జైల్లోని ఉడ్‌ఫాక్స్‌ పరిస్థితి గురించి ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. తన విచక్షణాధికారాలను వినియోగిస్తూ.. అన్ని ఫెడరల్‌ జైళ్లలోనూ ఏకాంతవాస శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటి నేపథ్యంలో.. ఎట్టకేలకు తన 69వ పుట్టిన రోజు సందర్భంగా.. ఉడ్‌ఫాక్స్‌ జైలునుంచి విడుదలయ్యాడు. జైళ్లలో ఏకాంత కారాగార శిక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతానని ఉడ్‌ఫాక్స్‌ వెల్లడించాడు. 

ఢిల్లీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : నెహ్రూ ప్లేస్ లోని అన్సాయి టవర్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. 

40 గంటలు..ఇంకా కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాంపోర్ లో ఉగ్రవాదులకు..భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 40గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది మృతి చెందాడు. మరో ముగ్గురు భవనంలో ఉన్నట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.

 

జేఎన్ యూ, హెచ్ సీయూ వివాదాలపై చర్చ - వెంకయ్య..

న్యూఢిల్లీ : జేఎన్‌యూ, హెచ్‌సీయూ వివాదాలపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెంకయ్య నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లోనూ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

హర్యానాలో అదుపులోకి వస్తున్న పరిస్థితులు..

ఢిల్లీ: హర్యానాలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. బివాని, హిస్సర్ సహా మరో రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. ఢిల్లీ-చండీగఢ్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం తొలిగింది. మునక్ కెనాల్ దగ్గర ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

స్మార్ట్ సిటీ కార్యాలయం ప్రారంభం..

ఢిల్లీ: స్మార్ట్‌సిటీ కార్యాలయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అన్ని నగరాలు ఉన్నతస్థాయిలో వృద్ధి చెందాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసా నగరాలు, పురపాలికలు వినియోగించుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.

13:38 - February 22, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపి పార్టీలో చేరిక ఎపిసోడ్ కు ఇంకా తెరపడడం లేదు. గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన పీఏసీ సమావేశానికి ఛైర్మన్ హోదాలో భూమా హాజరు కావడం..వెంటనే రాజీనామా చేయడం రాజకీయాల్లో వేడిని పెంచింది. ఇక ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ భూమా మాత్రం మీడియాతో ఏ విషయాన్ని చెప్పలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని..ఇందుకు గంటలు..రోజులు పట్టవచ్చని భూమా పేర్కొనడం విశేషం. వైసీపీ నేతలు నిరంతరం భూమాతో మాట్లాడుతున్నట్లు సమాచారం. జగన్ తల్లి విజయమ్మ భూమాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించడం జరిగిందని, పార్టీ మారితే బాధిస్తుందని విజయమ్మ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూమా ప్రత్యర్థిగా పోటీ చేసిన శిల్పా బ్రదర్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టర్ల సమావేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు సాయంత్రం శిల్పా బ్రదర్స్ తో మరోసారి చర్చలు జరపనున్నట్లు సమాచారం. అనంతరం వచ్చే పరిణామాలతో భూమా నేరుగా విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం చంద్రబాబు నాయుడు సమక్షంలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు టిడిపి కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. 

13:32 - February 22, 2016

మెదక్ : విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కామంతో కళ్లుమూసుకపోయి అభం..శుభం తెలియని పసిపిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓ టీచర్ రెండో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంసభ్యులు స్కూల్ పై దాడికి దిగారు. ఈ ఘటన మిర్ దొడ్డి మండలం అక్బర్ పేటలో చోటు చేసుకుంది.
వికాస్ స్కూల్ లో పీఈటీగా రమేష్ వ్యవహరిస్తున్నాడు. రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గత రెండు రోజులుగా స్కూల్ కు వెళ్లనని మొరాయిస్తున్న విద్యార్థిని నుండి అసలు విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని..ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని..సంబంధిత అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో ఆగ్రహానికి గురైన విద్యార్థి బంధువులు స్కూల్ పై దాడికి పాల్పడ్డారు. స్కూల్ లో ఉన్న వ్యాన్ లను తగులబెట్టారు. కనీస ట్రైనింగ్ లేకుండా..విద్యార్థులతో ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ లేకుండానే అధ్యాపకులను ప్రైవేటు స్కూల్స్ నియమించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

పీఏసీ పదవికి భూమా రాజీనామా..

విజయవాడ : పీఏసీ పదవికి వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు జరిగిన పీఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

13:12 - February 22, 2016

హైదరాబాద్ : చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిందేమి లేదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల చిచ్చు తప్ప అభివృద్ధి లేదని పేర్కొన్నారు. విభజన సమస్యల గురించి బాబు ఇంకా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, నష్టాలన్నింటినీ మళ్లీ చెబుతున్నారని పేర్కొన్నారు. రెండంకెల వృద్ధి రేటు సాధించామని చెబుతున్న బాబు విభజన వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఏపీకి రూ. లక్ష కోట్ల నిధులు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. సీమకు ఏం చేశారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 

13:09 - February 22, 2016

విజయవాడ : మార్చి 5వ తేదీ నుండి శాసనసభా సమావేశాలు నిర్వహించనున్నట్లు, 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ మార్చి 10వ తేదీన శాసనసభలో ప్రవేశ పెట్టనున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. జీఎస్ డీపీ వృద్ధితోనే రెవెన్యూ పెరుగుతుందని యనమల తెలిపారు. 

రెండేళ్ల పాలనలో సాధించిందేమీ లేదు - వైసీపీ..

హైదరాబాద్ : చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిందేమి లేదని రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల చిచ్చు తప్ప అభివృద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి రూ. లక్ష కోట్ల నిధులు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. సీమకు ఏం చేశారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

 

ఢిల్లీ నీటి సమస్యపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : నీటి సమస్యపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హర్యానా, యూపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. సాయంత్రంలోగా ఢిల్లీకి నీటి సరఫరా చేస్తామని కోర్టుకు హర్యానా ప్రభుత్వం పేర్కొంది. విచారణను 25కి వాయిదా వేసింది. ప్రజలు నీరు లేకుండా ఇబ్బందులు పడుతుంటే మంత్రి కోర్టులో ఉండటాన్ని సుప్రీం ప్రశ్నించింది. పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి ప్రతి విషయానికి కోర్టును ఆశ్రయించడమేనా అని పేర్కొంది. 

ఒకటో తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు..

మెదక్ : మిర్ దొడ్డి (మం) అక్బర్ పేట వికాస్ హై స్కూల్ లో ఒకటో తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాలపై చిన్నారి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. స్కూల్ వ్యాన్ కు నిప్పంటించారు. 

12:48 - February 22, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో ప్రతొక్కరినీ హింసిస్తున్నారని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన ఆలోచనలు తమకు రావని, చేసేవన్నీ తప్పులని తెలిసినా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల వారీగా చిచ్చు పెడుతున్నారని, ఎందుకు ఇలా చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. రైతులకు, ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఏ మాత్రం మేలు జరగడం లేదన్నారు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాలి అంటే దానిపై పెదవి విప్పరని టిడిపి నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులు నరకయాతన అనుభవిస్తున్నారని, వీరిని క్రమబద్ధీకరిస్తామని టిడిపి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. 

12:45 - February 22, 2016

కర్నూలు : వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్టీ మారుతారా ? టిడిపి కండువా కప్పుకుంటారనే అనే విషయం సాయంత్రంలో తేలిపోతుందని ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. ఆయన టిడిపి పార్టీలో చేరుతారని గత నాలుగు రోజులగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరికపై భూమా స్పష్టంగా నిర్ణయం చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం పీఎసీ సమావేశానికి భూమా హాజరు కావడం చర్చనీయాంశమైంది. పీఏసీ ఛైర్మన్ గా భూమా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
నిన్న చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకున్న భూమా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. వైసీపీ నేతలు నిరంతరం భూమాతో మాట్లాడుతున్నట్లు సమాచారం. జగన్ తల్లి విజయమ్మ భూమాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించడం జరిగిందని, పార్టీ మారితే బాధిస్తుందని విజయమ్మ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూమా ప్రత్యర్థిగా పోటీ చేసిన శిల్పా బ్రదర్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టర్ల సమావేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు సాయంత్రం శిల్పా బ్రదర్స్ తో మరోసారి చర్చలు జరపనున్నట్లు సమాచారం. అనంతరం వచ్చే పరిణామాలతో భూమా నేరుగా విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం భూమా పార్టీలో చేరుతారా ? లేదా ? అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

12:38 - February 22, 2016

హైదరాబాద్: అక్షయ గోల్డ్ బాధితులు హైకోర్టు మెట్లు ఎక్కారు. తమకూ న్యాయం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. అధిక వడ్డీలు ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి తమను మోసం చేశారని పిటిషన్ లో బాధితులు పేర్కొన్నారు. 17 లక్షల మందికి రూ.600 కోట్లు మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. అగ్రిగోల్డ్ తరహానే తమకూ న్యాయం చేయాలని బాధితులు కోర్టును కోరారు. దీనికి సంబంధించిన సమాచారం ఏపీ రాష్ట్రం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నిందితులను అరెస్టు చేశారా ? ఆస్తులను జప్తు చేశారా ? అని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

12:37 - February 22, 2016

విశాఖపట్టణం : చిట్టివలస గ్రామంలో ఉన్న దివీస్ పరిశ్రమ విస్తరణ పనులు ఆపు చేయాలని, కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా 12 మంది సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీనిని గ్రామస్తులు తీవ్రంగా నిరసించారు. పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి వైసీపీ మద్దతు పలికింది. టెన్ టివితో వైసీపీ నేతలు మాట్లాడారు. గతంలో రెండు ప్లాంట్లు నెలకొల్పడం జరిగిందని, 15 సంవత్సరాల నుండి ఈ పరిశ్రమ నడుస్తోందని వైసీపీ జిల్లా కన్వీనర్ అమర్ పేర్కొన్నారు. భూగర్భజలాలు, మత్స్యసంపద, రోగాలతో పిల్లలు జన్మిస్తున్నారని తెలిపారు. కొత్త యూనిట్ నెలకొల్పాలని అనుకొనప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని, ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణిలో వెళుతోందన్నారు. స్థానిక ప్రజలను మంత్రి తెలుసుకోవడం లేదని, దివీస్ పై జరుగుతున్న పోరాటం ఆపేది లేదని మిత్రపక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్భందకాండను ప్రయోగించడానికి పూనుకొంటోందని మరో నేత పేర్కొన్నారు. ఎంత నిర్భందం చేసినా తమ పోరాటం ఆపేది లేదన్నారు. ఉద్యోగ అవకశాలు కల్పిస్తాం..మౌలిక సదుపాయాలు కల్పిస్తామని..పర్యావరణాన్ని కాపాడుతామని గతంలో హామీలు గుప్పించిందని తెలిపారు. కానీ 15 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. భూగర్భ జలాలు పూర్తిగా కలుషతమయ్యాయని, 471 రియాకర్టలతో ఉత్పత్తి చేస్తుందంటే కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మానస సంస్థ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివీస్ పరిశ్రమపై నెలకొన్న అనుమానాలు ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలతో కలిసి తాము పోరాటం చేస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 

12:31 - February 22, 2016

విజయవాడ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలు, అభివృద్ధి: తదితర అంశాలపై కలెక్టర్లకు బాబు మార్గనిర్ధేశనం చేశారు. కేంద్రం నుండి వివిధ రూపాల్లో నిధులను సమీకరిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మరోసారి పేర్కొన్నారు.
విభజన వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం హామీనిచ్చిందని పేర్కొన్నారు. రెండంకెల వృద్ధిరేటే లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. 2018 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది కల్లా 80 టీఎంసీల నీటిని గోదావరి నుండి కృష్ణా నదికి తీసుకొస్తామన్నారు. రెండు విద్యా సంస్థలు మినహా మిగతా వాటికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని తెలిపారు. కరవును అధిగించే దిశగా ముందుకెళుతున్నట్లు, పట్టిసీమను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయడం జరిగిందన్నారు. వ్యవసాయంలో వృద్ధి రేటు 7 శాతానికి పడిపోయిందని, కరవుకన్నా రెండంకెల వృద్ధి రేటు సాధించడం జరిగిందన్నారు. 

పీఏసీ సమావేశానికి హాజరైన భూమా..

కర్నూలు : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి భూమా హాజరయ్యారు. పార్టీ మారుతారనే జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఏసీ సమావేశానికి హాజరు కావడం చర్చనీయాశంమైంది.

హైకోర్టును ఆశ్రయించిన అక్షయ గోల్డ్ బాధితులు..

హైదరాబాద్: అక్షయ గోల్డ్ బాధితులు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. 17 లక్షల మందికి రూ.600 కోట్లు మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. అగ్రిగోల్డ్ తరహానే తమకూ న్యాయం చేయాలని బాధితులు కోర్టును కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

తాడేపల్లిలో టీ మాస్టర్ పై యాసిడ్ తో దాడి..

గుంటూరు : తాడేపల్లిలో టీ మాస్టర్ పై దుండగులు యాసిడ్ తో దాడికి పాల్పడ్డారు. విజయవాడ క్లబ్ లో టీ మాస్టర్ లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. 

విభజన వల్ల చాలా ఇబ్బందులు - చంద్రబాబు..

విజయవాడ : రాష్ట్ర విభజన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కూడా సరైన వేదిక లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభజన వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం హామీనిచ్చిందని పేర్కొన్నారు. రెండంకెల వృద్ధిరేటే లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. 2018 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది కల్లా 80 టీఎంసీల నీటిని గోదావరి నుండి కృష్ణా నదికి తీసుకొస్తామన్నారు. రెండు విద్యా సంస్థలు మినహా మిగతా వాటికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని తెలిపారు.

11:56 - February 22, 2016

నల్గొండ : అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పారు. కానీ నేడు మహిళలకు భద్రత లేకుండా పోతోంది. రోడ్డుపై వెళ్లే మహిళల పట్ల ఆకతాయిలు వేధింపులు చేస్తూనే ఉన్నారు. వీరి వేధింపులు భరించలేక ఎంతో మంది యువతులు తనువు చాలిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో పదో తరగతి చదువుతున్న భార్గవిని కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ సమస్య మాత్రం రాను రాను జఠిలమౌతోంది. దీనితో తాను తనువు చాలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారమని భావించింది. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వేధిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

ఢిల్లీకి బయలుదేరిన జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీకి బయలుదేరారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో జగన్ కలువనున్నారు. ప్రత్యేక హోదా, నిధులు, రైల్వే జోన్ లపై చర్చించనున్నారు. 

ఎన్ సీసీ పవర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత..

నెల్లూరు : ముతుకూరు (మం) వరకవి పూడి ఎన్ సీసీ పవర్ ప్రాజెక్టు ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కార్మికుడు మున్నా కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. 

ఆకతాయుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య..

నల్గొండ : ఆకతాయులు వేధింపులు తట్టుకోలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని వేములపల్లి మండలం శెట్టిపాలెంలో చోటు చేసుకుంది. 

11:28 - February 22, 2016

విశాఖపట్టణం : దివీస్ కంపెనీ ల్యాబ్స్ విస్తరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ పరిశ్రమ తమకు వద్దని..పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యంతో తమ ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సీపీఎం నేతల ముందస్తు అరెస్టు చేయడంప ట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ వద్దకు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెల్లవారుజామున దొంగలుగా వచ్చి తమ వారిని తీసుకెళ్లారని, ప్రస్తుతం వారు ఎక్కడున్నారో తమకు తెలియదని పేర్కొంటున్నారు. తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిట్టివలస గ్రామంలో ఉన్న దివీస్ యాజమాన్య మూడో ప్లాంట్ విస్తరణ పనులు ప్రారంభించింది. దీనివల్ల కాలుష్యం పెరగడంతో పాటు ఇతర సమస్యలు ఉత్నన్నమయ్యాయి. దీనితో సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఉద్యమం చేపట్టారు. కానీ పోలీసులు దీనిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విపరీతమైన కాలుష్యం వెదజల్లుతోందని, వంద ఎకరాల్లో మూడో యూనిట్ కు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. ఆందోళనకు నేతృత్వ వహిస్తున్న వారిని తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అక్రమంగా అరెస్టు చేశారని, తాము తప్పించుకని కలెక్టర్ వద్ద ఆందోళనలో పాల్గొన్నామన్నారు.

దివీస్ యాజమాన్యంతో పోలీసుల కుమ్మక్కు..
దివీస్ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కయ్యారని సీపీఎం నేత సీ.హెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ఆందోళనలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. తాము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతామని ముందే తెలియచేయడం జరిగిందని, అందులో భాగంగా కలెక్టర్ పిలవడం జరిగిందన్నారు. తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు భారీగా ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. దివీస్ యాజమాన్యం వల్ల స్థానిక ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు లేవని మంత్రి చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న వారంతా ఎక్కడనుండి వచ్చారని ప్రశ్నించారు. కంపెనీ ఏర్పడి 15 సంవత్సరాలైందని, ఇంతవరకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మరో నేత పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతామని, ఉపాధి కల్పిస్తామని యాజమాన్యం పేర్కొనడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ చేయలేదని విమర్శించారు. 

వరంగల్ రైల్వే స్టేషన్ లో బంగారం స్వాధీనం..

వరంగల్: రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా పోలీసులు అక్రమ బంగారాన్ని గుర్తించారు. కోయంబత్తూరు నుంచి తరలిస్తున్న 3 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. 

తుని ఘటనపై సీఐడీ దర్యాప్తు - చిన రాజప్ప..

విజయవాడ : తుని ఘటనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప స్పష్టం చేశారు. అమాయకులపై కేసులు పెట్టే ప్రసక్తే లేదని, ఘటనకు బాద్యులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

కలెక్టర్ల సమావేశం ప్రారంభం.

విజయవాడ : రెండు రోజుల క‌లెక్టర్ల స‌ద‌స్సు విజ‌య‌వాడ‌లోని ఏ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ప్రారంభమైంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప‌నితీరు.. రానున్న ఆర్ధిక సంవ‌త్సరానికి ప్రభుత్వ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక .. రెండంకెల అభివృద్ది ప్రధాన ఎజెండాగా ఈ స‌ద‌స్సులో పాల‌నాప‌రమైన సంస్కర‌ణ‌లు, పార‌ద‌ర్శక‌త పై ప్రత్యేకంగా చ‌ర్చించ‌నున్నారు. 

10:35 - February 22, 2016

వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరు పార్టీలతో బెటర్ వరంగల్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఐదు వామపక్ష పార్టీలు..లోక్ సత్తా పార్టీలు కలిసి ఈ ఫ్రంట్ ను ఏర్పాటు చేశాయి. ఈ ఫ్రంట్ నుండి ఎన్నికల్లో 40 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. అవినీతి రహిత పాలన, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతామని ఫ్రంట్ నేతలు పేర్కొన్నారు. 

10:24 - February 22, 2016

ఢిల్లీ : సెల్ ఫోన్..మానవ జీవితంలో విడదీయరాని భాగమై పోయింది. ప్రతొక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటోంది. కానీ భారత ప్రధాన మంత్రి సొంత జిల్లాలోని సూరజ్ గ్రామంలో బాలికలు..యువతులు..ఒంటరి మహిళలు సెల్ ఫోన్ ఉపయోగించకూడదంట. అవును గ్రామ పెద్దలు సెల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. మొబైల్ వాడటం ఒక సామాజిక పీడ అంటూ అభివర్ణిస్తున్నారు. మద్యం వల్ల జరుగుతున్న అనార్థలపై సమావేశమైన గ్రామ సభ మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. మొబైల్ ఫోన్లు చదువులు..ఇంటి పనుల నుండి వారిని దూరం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదే విధమైన నిషేధం త్వరలోనే పాఠశాలలకు వెళ్లే బాలురకు వర్తింప చేయనున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. ఎవరైనా ఫోన్ మాట్లాడితే రూ.2,100 జరిమానా, ఫోన్ మాట్లాడుతుంగా చూసి చెప్పిన వారికి రూ.200 బహుమానం ఇవ్వనున్నారు. ఒకవైపు టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకోవాలని భారత ప్రధాన మంత్రి మోడీ చెబుతుంటే సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు పెరిగే అవకాశం ఉంది. 

10:15 - February 22, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ కు మెగా బ్రదర్స్ హాజరౌతారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నటుడు నాగబాబులు ఒకే వేదికపై కనిపించి చాలా రోజులు అయింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఆడియో వేదికను మెగాబ్రదర్స్ కలయికకు వేదికగా చెయ్యాలని పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. పవన్ ప్రయత్నాలు ఫలిస్తే... ఈ మెగా బ్రదర్స్ ను చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై చూసే భాగ్యం మెగా ఫ్యాన్స్ కు దక్కనుంది. 

పాంపోర్ లో కొనసాగుతున్న ఆపరేషన్..

జమ్మూ కాశ్మీర్ : పాంపోర్ లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈడీఐ భవనం నుండి భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇప్పటి వరకు ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దాడి వెనుక పాకిస్తాన్, లష్కర్ - ఏ - తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

జేఎన్ యూలో ఉద్రిక్త పరిస్థితులు..

ఢిల్లీ : జేఎన్ యూలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీకి ఉమర్ ఖాలీద్ తో సహా ఐదుగురు విద్యార్థులు వర్సిటీకి తిరిగివచ్చారు. కన్హయ్య అరెస్టుతో ఈనెల 12 నుండి విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విద్యార్థుల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కానీ తాము కోర్టులో లొంగిపోతామని విద్యార్థులు వెల్లడించారు. మరోవైపు ఐదుగురు విద్యార్థులు వర్సిటీ వీసీతో భేటీ కానున్నారు.

 

ఢిల్లీలో నీటి కొరతపై సమీక్ష..

ఢిల్లీ : దేశ రాజధానిలో నెలకొన్న నీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అత్యవసర భేటీ నిర్వహించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

09:54 - February 22, 2016

దుబాయి : పర్యాటక శాఖ..హోం మంత్రి శాఖ..పురపాలక శాఖ..ఇలాంటివి ఇంకా కొన్ని శాఖలుంటాయి. కానీ ఈ 'సంతోషం' శాఖేంటీ ? అని కన్ ఫ్యూజ్ అవుతున్నారా ? అవునండి సంతోషం అనే కొత్త శాఖను ఏర్పాటు చేసి ఏకంగా ఓ మంత్రికి దీని బాధ్యతలు అప్పచెప్పారు. ఇది జరిగింది మన దేశంలో కాదులెండీ...ప్రపంచంలోనే తొలిసారిగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చదవండి..
ప్రజల సంతోషమే తమ ధ్యేయంగా పనిచేయాలని అక్కడి ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగా 'సంతోషం' అనే శాఖను సృష్టించింది. ప్రజల మంచి కోసమే ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని దుబాయి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. ఒహుద్ అల్ రౌమీ అనే మహిళ నూతనంగా కేబినెట్ లో చోటు కల్పించి 'సంతోషం' శాఖకు మంత్రి బాధ్యతలను అప్పచెప్పారు. దేశ భవిష్యత్..యువతకు తోడ్పాడు..ప్రజల సంతోషం..ఉన్నత విద్య అంశాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మినిస్టర్ ఆఫ్ హ్యాపినెస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అదండి అసలు సంగతి..

గిన్నిస్ బుక్ లో యూపీ..

ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తర్ ప్రదేశ్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఒక్క రోజులో అత్యధికంగా మొక్కలు నాటినందుకు రికార్డు దక్కిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. 

పాంపోర్ మృతులకు జవాన్లు నివాళి..

జమ్మూ కాశ్మీర్ : పాంపోర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన కెప్టెన్ తుషార్ మహజన్, లాన్స్ నాయక్ ఓం ప్రకాష్ లు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

09:27 - February 22, 2016

గుంటూరు : అమరావతి తుది మాస్టర్ ప్లాన్ ను సీఆర్డీఏ నేడు ప్రకటించనుంది. మాస్టర్ ప్లాన్ పై సీఆర్డీఏ ప్రణాళిక విభాగం కసరత్తులు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఫైల్ ను సమర్పించింది. సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేసిన తరువాత తుది ప్రణాళికను సీఆర్డీఏ విడుదల చేయనుంది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన సీఆర్డీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడవు కూడా విధించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సీఆర్డీఏ తుది మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. 

09:23 - February 22, 2016

విశాఖపట్టణం : దివీస్ పరిశ్రమ విస్తరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమౌతున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. నేడు నిర్వహించతలపెట్టిన చలో కలెక్టరేట్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. పది మంది సీపీఎం నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిప్పాడ, చిట్టినగర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దివీస్ పరిశ్రమలోని మూడో ప్లాంట్ విస్తరణనను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు గత కొద్ది రోజుల నుండి పోరాటాలు చేస్తున్నారు. మట్టి సంపదతో పోవడంతో పాటు కాలుష్యం వెదజల్లుతోందని..ఉపాధిలో స్థానిక యువతకు పెద్ద పీఠ వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కలెక్టర్ ను కలిసి సమస్యను విన్నవిస్తామని సీపీఎం ప్రకటించింది. దీనితో పోలీసులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దివీస్ కంపెనీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కై అయ్యారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ను కలవడానికి తాము వెళ్లడం జరుగుతోందని, శాంతియుతంగానే ఆందోళన చేస్తామని సీపీఎం నేతలు ప్రకటిస్తున్నారు. 

09:19 - February 22, 2016

ఢిల్లీ : జేఎన్ యూలో ఆదివారం రాత్రి టెన్షన్ చోటు చేసుకుంది. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు యూనివర్సిటీకి చేరుకున్నారు. క్యాంపస్ విద్యార్థులు వారికి సంఘీభావం తెలుపుతూ ధర్నా చేపట్టారు. నినాదాలు చేశారు. రాత్రంతా ఈ ఆందోళన కొనసాగింది. దీనితో వర్సిటీలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఉమర్ ఖలీద్, ఆశుతోష్, ఆనంద్ ప్రకాష్ నారాయణ్, రామనాగ, అనీర్ బాంగ్, భట్టాచార్యలపై ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పది రోజులుగా వీరు కనపించలేదు. అనంతరం ఆదివారం రాత్రి వీరంతా వర్సిటీకి చేరుకున్నారు. ఇక ఈ కేసులో అరెస్టయిన విద్యార్థి కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. 

జేఎన్ యూ వైస్ ఛాన్స్ లర్ ను కలువనున్న విద్యార్థులు..

ఢిల్లీ : దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు జేఎన్ యూ వైస్ ఛాన్స్ లర్ ను కలువనున్నారు. 

చందుస్నానం ఆచరించిన పల్లె..మండలి డిప్యూటి స్పీకర్..

కృష్ణా : హంసలదీవి సాగర సంగమం వద్ద భక్తులు పోటెత్తారు. నాగ పౌర్ణమి సందర్భంగా మంత్రి పల్లె, మండలి డిప్యూటి స్పీకర్ లు చందుస్నానం ఆచరించారు. వేలాదిగా భక్తులు చందుస్నానం ఆచరించేందుకు వస్తున్నారు.

ఆగని జాట్ల ఆందోళనలు..

హర్యానా : జాట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగు జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. 9 జిల్లాలో విద్యా సంస్థల బంద్ జరుగుతోంది. ఢిల్లీ - అమ్బాలా జాతీయ రహదారి ఇంకా దిగ్భందనంలోనే కొనసాగుతోంది.

 

ఈనెల 26న విజయవాడకు వర్మ..

హైదరాబాద్ : తాను ఈనెల 26వ తేదీన విజయవాడకు వెళ్లనున్నట్లు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. వంగవీటి చిత్రం కోసం కొంతమందితో మాట్లాడేందుకు తాను అక్కడకు వెళ్లనున్నట్లు వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

పాంపోర్ లో కొనసాగుతున్న ఆపరేషన్..

జమ్మూ కాశ్మీర్ : పాంపోర్ లో భారత భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు సమాచారం. 

08:17 - February 22, 2016

నల్గొండ : హుజూర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చైతన్య పాఠశాలలో నాగార్జున రెడ్డి 8వ తరగతి చదువుతున్నాడు. రూ. 500 కనిపించకపోవడంతో నాగార్జున రెడ్డిపై ఇతర విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రమనస్థాపానికి గురైన నాగార్జునరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఈనెల 18వ తేదీన అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా గొడవలు జరుగుతున్న స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలోని నిర్జీవ ప్రదేశంలో నాగార్జున రెడ్డి 80 శాతం మేర కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఇతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీనితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యమే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. 

విద్యార్థి నాగార్జున రెడ్డి మృతి..

నల్గొండ : హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన నాగార్జున రెడ్డి అనే విద్యార్థి సోమవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం పాఠశాల నుండి అదృశ్యమై కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద కాలిన గాయాలతో నాగార్జున రెడ్డి కనపడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

08:06 - February 22, 2016

ఏపీ రాష్ట్రంలో అధికారపక్షం, విపక్షాల మధ్య విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని పడగొడుతానని, టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనితో టిడిపి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపి పార్టీలోకి చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పార్టీల్లోకి వలసలు..ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విజయ్ కుమార్ (టిడిపి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), అంబటి రాంబాబు (వైసీపీ), చలసాని శ్రీనివాస్ (ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:23 - February 22, 2016

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. ఈ సినిమాలోని మొదటి పాట 'జాబ్రా ఫ్యాన్‌'ను షారూఖ్‌ తాను చదువుకున్న ఢిల్లీ కళాశాలలో విడుదల చేసిన విషయం విదితమే. విడుదలైన మరుక్షణం నుంచి ఇప్పటివరకు ఈ పాటకు యూ ట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. మనీశ్‌శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 15న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. షారూఖ్‌ఖాన్‌ ప్రస్తుతం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న 'రెయిస్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.

 

07:23 - February 22, 2016

'మైనే ప్యార్‌ కియా' చిత్రంతో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి స్టార్‌ డమ్‌ తీసుకొచ్చిన దర్శకుడు సూరజ్‌ బర్జాత్య. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాలు సంచలన విజయాలు సాధించి బాలీవుడ్‌ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొంది విడుదలైన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కుటుంబ కథా చిత్రం కాకుండా ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉండొచ్చని సమాచారం. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం 'సుల్తాన్‌' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

07:22 - February 22, 2016

అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా, చందు మొండేటి దర్శకత్వంలో సితార సినిమా పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి 'ప్రేమమ్‌' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ,' మలయాళంలో గతే డాది వచ్చి ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రానికిది రీమేక్‌. అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్‌, చందమొండేటిల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా 'ప్రేమమ్‌' అనే టైటిల్‌ని ఖరారు చేశాం. ఇది ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్యకావ్యం. ఇప్పటి వరకు 50శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి సమ్మర్‌లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'ప్రేమ కథలకు ముగిం పు ఉంటుంది. కాని అనుభూతు లకు ఉండదు' అనేది ఉప శీర్షికతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో సాగుతుంది. ఆ మూడు ఒక దాని కొకటి పాత్రోచితంగా భిన్నంగా ఉంటాయి. మూడు ప్రేమ కథల సమ్మే ళనమే ఈ చిత్రం' అని దర్శకుడు చందు తెలిపారు.

07:21 - February 22, 2016

దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకుపోతూ స్టార్‌ హీరోలతో సమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్‌ నయనతార. గతేడాది 'భాస్కర్‌ ద రాస్కెల్‌', 'తని ఒరువన్‌', 'మాయా', 'నానుమ్‌ రౌడీధాన్‌' వంటి భారీ బ్లాక్‌ బస్టర్స్‌ని తన ఖాతాలో వేసుకున్న నయనతార మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'మాయ' అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మలయాళంలోనూ వంద రోజులు పూర్తి చేసుకుని రికార్డును సృష్టించింది. విడుదలైన వారం రోజుల్లోనే సినిమాలను థియేటర్ల నుంచి తీసేస్తున్న ఈ రోజుల్లో ఒక మహిళా ప్రధానమైన హర్రర్‌ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోవడానికి కారణం అందం, అభినయంతో నయనతార చేసిన మాయే అని మాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ హర్రర్‌ చిత్రంలో ఆరి, నాయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రం 'మయూరి'గా విడుదలైంది.

07:20 - February 22, 2016

గతేడాది 'వేదాలమ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న తమిళ హీరో అజిత్‌ తాజాగా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. చోళ వంశం రాజు, పాపులర్‌ బృహదేశ్వర ఆలయాన్ని స్థాపించిన రాజ రాజ చోళ చరిత్ర నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో అజిత్‌ నటిస్తున్నట్లు చిత్ర రచయిత బాల కుమరన్‌ స్పష్టం చేశారు. విష్ణువర్థన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాలకుమరన్‌ కథ అందిస్తున్నారు. గతంలో హిందీలో షారూఖ్‌ ఖాన్‌ నటించిన 'అశోక' చిత్రంలోనూ అజిత్‌ చిన్న పాత్రలో నటించినప్పటికీ పూర్తి స్థాయి హీరోగా నటించే హిస్టారికల్‌ చిత్రం మాత్రం ఇదేనని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అజిత్‌, దర్శకుడు విష్ణువర్థన్‌ కాంబినేషన్‌ల్లో 'బిల్లా', 'ఆరంభం' వంటి హిట్‌ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అజిత్‌ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు.

07:19 - February 22, 2016

''సోగ్గాడే చిన్ని నాయన'తో కొత్త పాత్రల్లో నటించొచ్చని, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయోచ్చనే నమ్మకం కలిగింది' అని అంటున్నారు నాగార్జున. ఆయన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై యాభైకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, 'ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మూడవ వారానికి సినిమా కనిపించకుండా పోతున్నఈ రోజుల్లో మా సినిమా మంచి షేర్స్ ను సాధించడం ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు సినిమా ఎంత కలెక్ట్ చేసిందని నెంబర్స్ చూడను. ఈ సినిమా సక్సెస్‌ మాకు మోరల్‌ సపోర్ట్ నిచ్చింది. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ప్రతి డైలాగ్‌ జాగ్రత్తగా రాసుకున్నాడు. బంగార్రాజు పాత్ర ఎంత పాపులర్‌ అయ్యిందో మీకు తెలిసిందే. ఆ క్రెడిట్‌ అంతా కళ్యాణ్‌కే చెందుతుంది. ఈ చిత్రం విడుదలకు ముందే సీక్వెల్‌ చేయాలనుకున్నాం. ఇప్పుడు కచ్చితంగా సీక్వెల్‌ చేయాలని నిర్ణయించాం. అందుకు 'బంగార్రాజు' టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాం. ఈ సినిమాని కూడా ఏదొక పండగకి తీసుకొస్తాం. శనివారమే 'ఊపిరి' చిత్రం చూశాను. చాలా తృప్తిగా ఉంది. తమిళ్‌ డబ్బింగ్‌ కూడా నేనే చెబుతున్నాను. ఇక నా తదుపరి చిత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి చరిత్రకు చెందిన హాతిరాం బాబా పాత్రలో నటిస్తున్నాను. 18వ శతాబ్దానికి చెందిన కథ అది. ఏప్రిల్‌లోగాని, మే నెలలోగాని సినిమాను ప్రారంభించాలనుకుంటున్నాం. అలాగే దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ కథ వినాల్సి ఉంది. నచ్చితే ఆ సినిమా చేస్తాను. కళ్యాణ్‌ కృష్ణ మా బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 32 ఏండ్లవుతుంది. ఈ టైమ్‌లో కూడా 'సోగ్గాడే'తో విలువ కట్టలేని విజయాన్ని అందించారు' అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌ కృష్ణ, అనూప్‌ రూబెన్స్ పాల్గొన్నారు.

07:18 - February 22, 2016

ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని, పండ్లని మించినవి లేవన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అలాంటి వాటిలో కొన్ని కూరగాయలు ఎంతో ప్రాముఖ్యం కలవి ఉన్నాయి. వాటితో చేసిన కొన్ని జ్యూస్‌ల గురించి..
బీట్‌రూట్‌: తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ రసం తాగడం అలవాటు చేసుకోవాలి. కనీసం రెండు మూడు రోజులకోకసారైనా గ్లాసుడు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే చాలని అంటున్నారు నిపుణులు. దీని తాగడం వల్ల శరీరానికి చక్కెర సమపాళ్లలో అంది నీరసం దరిచేరదు. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. విటమిన్‌ బి, సి పుష్కలంగా ఉన్న ఈ బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో.
పుచ్చకాయ : రోజులో మనిషి కావాల్సిన ఖనిజాలు, ఇతర పోషకాలు.. ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే చాలు అందుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. డీ హైడ్రేషన్‌ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలనూ బయటకు పంపుతుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
కాకరకాయ : కాకర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేదు. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతారు కూడా చాలా మంది. కానీ ఇది శరీరానికి చేసే మేలు ఎంతో. ఇందులో షుగర్‌ ఉండదు కాబట్టి మధుమేహ రోగులకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది.
క్యారెట్‌: విటమిన్‌ 'ఎ' సమృద్ధిగా ఉండే కూరగాయ ఇది. చర్మ సమస్యలు, కళ్ల సమస్యలు ఉన్నవాళ్లు క్యారెట్‌ జ్యూస్‌ తాగితే ఉపశమనం కలుగుతుంది. రోజూ ఒక గ్లాసు క్యారెట్‌ జ్యూస్‌ తాగితే చాలు... చర్మం మిలమిల మెరిసిపోతుంది. 

07:17 - February 22, 2016

ఎంతో బిజీగా ఉండి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కొందరు చాలా చురుకుగా కనిపిస్తారు. దీనికి కారణం సమయపాలన, అధికశక్తి. మరి కొందరు ఎక్కువ పని చేయకపోయినా ఊరికే అలసినట్లు కన్పిస్తారు. వీరికి అధికశక్తి లేకపోవడమే ప్రథమ కారణమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే వయసు గలవారిలో కొందరికి శక్తి అధికంగా ఉండటం మరికొందరికి శక్తి లోపించడానికి వంశపారంపర్యం, హార్మోన్ల సమతుల్యత శరీరంలో కండరాల్లో ఉండే కొవ్వు తీవ్రత, వాడే మందులు... వంటి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అందుకే త్వరగా అలసిపోయే వారు అలసటకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు...
జీర్ణక్రియ సరిగా లేకపోవడం అలసటకు ప్రథమ కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం బాగా జీర్ణమయి ఒంటికి పడితే మంచి శక్తి వస్తుందని వారు సూచిస్తున్నారు. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు కావలసినంత నీటిని సేవించండి.
ఆకుకూరలు ప్రతిరోజు ఒక పూట వాడండి. నిద్రించేందుకు ముందుగా గ్లాసుడు పాలు, ఓ అరటి పండును తిని పడుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. ఆకుకూరలను సూప్‌ విధానంలో తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. కొత్తిమీర, అల్లం, జీలకర్రలను వంటల్లో అధికంగా చేర్చండి. సమయానికి తినడం చేస్తే జీర్ణ ప్రక్రియ సులభమై శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కొవ్వుతో కూడిన ఆహారపదార్థాలను తినడం మానేస్తే మంచిది. 

07:16 - February 22, 2016

కొబ్బరినూనె జుట్టుకి రాసుకునేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొబ్బరినూనెని వంటకాల్లో చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీన్ని కేరళలో తమ వంటకాల్లో తప్పకుండా ఉపయోగిస్తారు కూడా. కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే జీర్ణక్రియ వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి కూడా. శరీరారోగ్యాన్నే కాకుండా మానసిక ఒత్తిడినీ తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. రక్తంలో చక్కెరస్థాయిని స్థిరపరుస్తుంది. డయాబెటిస్‌కి ఇది మంచి మందు. గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే శాచురేటెడ్‌ కొవ్వులు శరీరానికి ఎలాంటి హాని చేయవు. చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేసి ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా కూడా ఉంటుంది.

07:15 - February 22, 2016

సాధారణంగా తీసుకునే ఆహారంతోపాటు.. హార్మోన్లు, ఒత్తిడి, పౌష్టికాహారం, కాలుష్యం, సూర్యరశ్మి, వాతావరణం.. ఇలాంటి చాలా విషయాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటి వల్లా కూడా వయసు తొందరగా మీద పడటం, పడకపోవడం ఉంటుంది. కాబట్టి, చిన్నతనంలోనే వయసు పెద్దగా కనిపించకుండా ఉండాలంటే.. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటంటే..
డ్రైఫ్రూట్లు: ముఖ్యంగా ఎండబెట్టిన ఆప్రికాట్లు, ఖర్జూరం, ఎండబెట్టిన రేగుపళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్లను పెంచుతాయి. మిగిలిన డ్రైఫ్య్రూట్స్‌లో కూడా ఫైటోఈస్ట్రోజన్‌ ఉంటుంది.
పీచుపదార్థాలు: పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్లు.. చిన్నతనంలో వచ్చే మెనోపాజ్‌ను దరిచేరకుండా చేస్తాయి కూడా.
సోయా: ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల్లో సోయా కూడా ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ అసలు ఉండదు. ప్రోటీన్లూ ఎక్కువే. ఇవి రెగ్యులర్‌గా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ కూడా దరిచేరదంటున్నారు నిపుణులు.
మొలకలు: మొలకెత్తిన పెసలు, శనగలు లాంటివి తినడం చాలా మంచిది. హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడానికి వాడే మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఇవి నిరోధిస్తాయి. 

విశాఖలో సీపీఎం నేతల ముందస్తు అరెస్టు..

విశాఖపట్టణం : భీమిలి (మం) చిప్పాడ, సిత్యానగర్ లో సీపీఎం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నేడు చలో కలెక్టరేట్ కు సీపీఎం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలవు..

ఢిల్లీ : దేశ రాజధానిలో నేడు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నీటి సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నేడు జరగాల్సిన అన్నీ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 

వెంకయ్య నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : నేడు వెంకయ్య నాయుడు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. 

నేడు ఏపీలో కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : రెండు రోజుల క‌లెక్టర్ల స‌ద‌స్సు ఈ నెల 22, 23వ తేదీల‌లో విజ‌య‌వాడ‌లోని ఏ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ఈ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప‌నితీరు.. రానున్న ఆర్ధిక సంవ‌త్సరానికి ప్రభుత్వ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక .. రెండంకెల అభివృద్ది ప్రధాన ఎజెండాగా ఈ స‌ద‌స్సులో పాల‌నాప‌రమైన సంస్కర‌ణ‌లు, పార‌ద‌ర్శక‌త పై ప్రత్యేకంగా చ‌ర్చించ‌నున్నారు.

06:45 - February 22, 2016

రైతుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. కంది, ఉల్లి, టమాటా వీటిని సాగుచేసిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. మొన్నటి దాకా రికార్డు స్థాయి ధరలను నమోదు చేసి, వినియోగదారులకు చుక్కులు చూపించిన వీటి ధరలు ఇప్పుడు రైతులను కుప్పకూలుస్తున్నాయి. ధరలు అమాంతం పడిపోవడంతో, కనీసం పెట్టుబడులైనా చేతికి తిరిగిరాని దుస్థితిలో రైతులు చిక్కుకున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వినియోగదారులు కొనేటప్పుడు ధరలు ఎందుకు ఆకాశానికి ఎగబాకుతున్నాయి? రైతులు అమ్ముకునేటప్పుడు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? ఇది ప్రక్రుతి వైపరీత్యమా? మార్కెట్ శక్తుల మాయాజాలమా? ప్రభుత్వాల ఉదాసీనతా? ఈ పరిస్థితికి కారణమేమిటి? బాధ్యులెవరు? ధరల ఆటు పోట్ల నుంచి రైతులను, వినియోగదారులను కాపాడే మార్గం లేదా? ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం నేత సాగర్ విశ్లేషించారు. విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:43 - February 22, 2016

నిన్న వినియోగదారులు. ఇవాళ రైతులు. మార్కెట్ శక్తుల మాయాజాలంలో విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు మార్కెట్ లో వినియోగదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులైనా తిరిగి రావడం లేదు. పత్తి, కంది, ఉల్లి, టమాటో, ఇలా ఏ పంట సాగు చేసిన రైతు ముఖంలోనూ సంతోషం లేదు. ఈ ఏడాది అన్నదాతకు ప్రకృతి ఏమాత్రం సహకరించలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. సాగు చేసిన కొద్ది పాటి పంటలను పరిరక్షించుకోవడానికి అన్నదాతలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం. అష్టకష్టాలకు ఓర్చి పండించిన కొద్దిపాటి పంటలనైనా సరసమైన ధర లభించని దుస్థితి. మొన్నటి దాకా పత్తి ని అమ్ముకోవడానికి రైతులు నానా అగచాట్లు పడ్డారు. తేమశాతం ఎక్కువగా వుందంటూ మార్కెట్ శక్తులు వెక్కిరించాయి. ఇప్పుడు కంది, ఉల్లి, టమోటా రైతులదీ అదే దుస్థితి.

పరిస్థితి రివర్స్..
దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సీజన్ లో కందిపప్పు ధర మండిపోయింది. కిలో పప్పు ధర 180 నుంచి 200 రూపాయల దాకా పలికింది. కిలో ఉల్లిగడ్డలు 60 నుంచి 80 రూపాయలకు దాకా వెళ్లాయి. టమాటాలదీ అదే పరిస్థితి. 40 నుంచి 60 రూపాయలు ధారపోస్తే తప్ప వినియోగదారులకు టమోటాలు దొరకలేదు. ఇప్పుడు పరిస్థితి రివర్సయ్యింది. చేతికొచ్చిన కంది పంట రైతులను వెక్కిరించింది. చాలా చోట్ల క్వింటా కందులు నాలుగైదు వేలకే రైతులు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ఓ వైపు రైతులకు అతి తక్కువ ధరలు ఆఫర్ చేస్తున్నా కందిపప్పు ధర మాత్రం 130కి తగ్గడం లేదు. రైతుల దగ్గర కొంటున్న ధరకీ, వినియోగదారులకి అమ్ముతున్న ధరకీ సంబంధమే లేదు. దీంతో కందిపంట మీద ఆశలు పెట్టుకున్న రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ఉల్లి, టమోటా రైతులకీ కన్నీళ్లు తప్ప మరేమీ మిగలడం లేదు. ఉల్లి రైతులకు వ్యాపారులు అయిదు రూపాయలకు మించి చెల్లించడం లేదు. ఒక్కొక్కరోజు క్వింటా ఉల్లిగడ్డలు మూడు వందల రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోంది. కనీసం క్వింటాకు 1100 రూపాయలైనా చెల్లిస్తేనే రైతులకు పెట్టుబడులు తిరిగొస్తాయన్నది ప్రభుత్వాలే వేస్తున్న అంచనా. అంటే ప్రభుత్వ అంచనాల ప్రకారమే రైతులు పెట్టిన ఖర్చులో సగం కూడా దక్కని పరిస్థితి ఇవాళ ఎదురైంది.

మార్కెట్ శక్తుల నియంత్రణ..
ఇక టమాటా రైతుల పరిస్థితి మరీ ఘోరం. కిలో టమోటాలకు ఇస్తున్నది ఒకే ఒక్క రూపాయి. దీంతో కూలీల ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా రాక రైతులు కుమిలిపోతున్నారు. కొన్ని చోట్ల పంటలను రోడ్లమీదనే పారబోస్తున్నారు. అంతులేని బాధతో పంటలు తగలబెట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులైనా దక్కక రైతులు కన్నీరు మున్నీరవుతుంటే ప్రభుత్వమూ, మార్కెటింగ్ శాఖ చోద్యం చూస్తున్నాయి. రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. కందిపప్పు, ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన సమయంలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి వినియోగదారులకు కాస్తంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి, చౌకదుకాణాల ద్వారా తక్కువ ధరకు విక్రయించారు. ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. వినియోగదారుల ఆదుకునేందుకో, ఆగ్రహాన్ని చల్లార్చేందుకో ఏవో కొన్ని ఉపశమన చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు రైతులను ఆదుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆరుగాలం పంటపండించిన రైతులను మార్కెట్ శక్తులు నిండా ముంచుతుంటే, ఈ మార్కెట్ మాయాజాలం నుంచి అన్నదాతను ఆదుకునేందుకు చేపడుతున్న చర్యలేమిటి? . ఓ వైపు ప్రక్రుతి, మరోవైపు మార్కెట్ శక్తులు, ఇంకో వైపు ప్రభుత్వాల ఉదాసీనత ఇన్ని శాపాల మధ్య రైతులు బతికేదెలా?

ధరల స్థిరీకరణ నిధి..
కనీసం పెట్టిన పెట్టుబడులైనా చేతికి రాకపోతే, వారి గతేం కావాలి? పంటలు చేతికొచ్చే రైతులు అమ్ముకునే సమయంలో ధరలు అమాంతం ఎందుకు పడిపోతున్నాయి? మళ్లీ కొద్ది రోజుల్లోనే వాటి ధరలు విజృంభించి, వినియోగదారులకు చుక్కలెందుకు చూపిస్తున్నాయి? సీజన్ లతో సంబంధం లేకుండా ధరలను స్థిరంగా వుంచి, ఇటు రైతులకీ, అటు వినియోగదారులకీ నష్టం రాకుండా, కష్టం కలగకుండా చూసే మార్గమే లేదా? రైతులనీ, వినియోగదారులనీ మార్కెట్ శక్తుల మాయాజాలం నుంచి రక్షించే ఉపాయాలే లేవా? బహిరంగ మార్కెట్ లో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఉల్లి సాగుకు ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించాయి. విత్తన సబ్సిడీ పెంచారు. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి, దిగుబడి పెరిగినా రైతులు నష్టపోకుండా చూస్తామంటూ హామీలిచ్చారు. కానీ అది అమలు కావడం లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందో, దానికి కేటాయించిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరికీ తెలియదు. 

06:37 - February 22, 2016

ఢిల్లీ : బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం దగ్గర పడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలు ఎన్డీఏ సర్కారుకు కత్తిమీద సాములా మారునున్నాయి. ఇప్పటికే ఓ వైపు జెఎన్‌యూలో విద్యార్థుల ఆందోళన, హర్యానాలో జాట్ల ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్రం ముంగిట ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాలు సవాలుగా నిలిచాయి. మరోవైపు కీలక బిల్లులు సైతం ఇదే బడ్జెట్‌ సెషన్‌లో ఆమోదం చేయించుకోవాలని మోడీ సర్కారు ఎదురుచూస్తోంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు జేఎన్‌యూలో విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ అరెస్టు, దేశ ద్రోహం కేసు నమోదు, హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్య, పఠాన్‌కోట్‌ ఉగ్రవాదుల దాడి, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరత లాంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి.

ఆరు వామపక్ష పార్టీల ఆందోళ...
ఇప్పటికే జేఏఎన్‌యూ తదితర అంశాలపై ఆరు వామపక్ష పార్టీలు దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వర్సిటీల్లో కాషాయీకరణకు ప్రయత్నిస్తోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడానికి సాగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 25 వరకు ఆందోళన నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా విపక్షాలు ఈ అంశంపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టే అవకాశాలున్నాయి.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై విపక్షాలు నిలదీశాయి. ప్రభుత్వం ప్రతిపక్షాల ఆందోళన ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా అజెండాలోని అంశాలు చేపట్టకుండానే ఆ సమావేశాలు ముగిశాయి. జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు కూడా అర్థాంతరంగా ముగిసే అవకాశం ఉందనే ఆందోళనతో ఈ నెల 16న ప్రధాని మోడీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

విపక్షాలు సహకరించాలన్న మోడీ..
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కాగా ప్రతిపక్షాలను ఎలాగైనా ఒప్పించి గట్టెక్కడానికి పాలక పక్షం ప్రయత్నిస్తోంది. పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేడు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా విపక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఇదిలా ఉంటే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ఈ నెల 29న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మొదటి దశ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 16 వరకూ నిర్వహిస్తారు. రెండో దశ సమావేశాలను ఏప్రిల్‌ 25నుంచి మే 13 వరకూ కొనసాగుతాయి.

06:32 - February 22, 2016

విశాఖపట్టణం : మన్యం అనంతగిరి మండలంలోని కటికి జలపాతం వద్ద ఆంధ్ర, తెలంగాణ అడ్వంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాపెల్లింగ్‌లో 23 ప్రపంచ రికార్డులను నమోదయ్యాయి. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ విన్యాసాల్లో 420 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న కటికి జలపాతం పై నుంచి కిందకు దిగినట్లు వివరించారు. గతంలో 135 అడుగులుగా ఉన్ని ఈ రికార్డును అధిగమించామని క్లబ్ నిర్వాహకులు తెలిపారు. అలాగే కటికి జలపాతానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేప్పట్టినట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో 34 మంది పురుషులు, ఆరుగురు మహిళలు పాల్గొన్నారు. 

06:30 - February 22, 2016

చిత్తూరు : రాయలసీమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్షాలు చేపట్టిన బస్‌ యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాయలసీమ నుంచి ఎన్నికై పలువురు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినా వారు స్వంత జిల్లాల అభివృద్ధికి చేసింది ఏమీ లేదని కమ్యూనిస్ట్ నేతలు విమర్శించారు. రాజధానికి వేలకోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు తన సొంత జిల్లా అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం సిపిఎం జాతీయ నేత ప్రకాష్‌కారత్‌ ప్రారంభించిన ఈ యాత్ర చిత్తూరు జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది.

నిలదీస్తున్న నేతలు..
ఆదివారం ఉదయం మదనపల్లి నుంచి ప్రారంభమైన బస్‌ యాత్ర పుంగనూరు, పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా చిత్తూరుకు చేరుకుంది. సాయంత్రం చిత్తూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీబాగ్ ఒప్పందం నుంచి నిన్న మొన్నటి రాష్ట్ర విభజన వరకు రాయలసీమ దగాపడుతూనే ఉందని వామపక్ష నేతలు ఆరోపించారు. ఏదశలోనూ రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని వివరించారు. దశాబ్దం పైగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో సీమ అభివృద్ధికి ఏం చేశారో వివరించాలన్నారు.

మార్చి 11న చలో అసెంబ్లీ..
కృష్ణానది నుంచి రాయలసీమకు న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లు రావడంలేదని గుర్తుచేశారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న భూములకే నీళ్లివ్వడానికి ఆసక్తి చూపుతున్న చంద్రబాబు శ్రీశైలం నుంచి సీమకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని అడిగారు. ఎప్పుడో ప్రతిపాదించిన గాలేరు, నగరి, హంద్రి నీవా లాంటి ప్రాజెక్ట్‌లు ఏమయ్యాయంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చి 11న జరగనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి హాజరై సీమ పౌరుషాన్ని చాటాలని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సిపిఎం, సిపిఐ నేతలు కోరారు. 

06:28 - February 22, 2016

విశాఖపట్టణం : ఇంజనీరింగ్‌ చదివి తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. ఇంతలోనే విధికి కన్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన ఆ యువకుని అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. సాయికుమార్‌. విశాఖ జిల్లా కేడీపేటకు చెందిన ఇతను నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదని.. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన 'గేట్ 2016' పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాల్‌టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు.

ఒక్కడే కొడుకు..
చంద్రశేఖర్‌, కోటలక్ష్మి దంపతులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. చెల్లెల్ని ఎమ్మెస్సీ చదివిస్తానని సాయికుమార్‌ చెబుతుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని కలలు కంటుండగా.. ఇంతలోనే విధికి కన్నుకుట్టింది. ఈనెల 19వ తేదీన సాయికుమార్ బైకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా.. ఫలితం దక్కలేదు. సాయికుమార్ బ్రెయిన్‌డెడ్ అయి బతకడని వైద్యులు తెలిపారు. ఒకపక్క పుట్టెడు దుఖంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేశాడు. సాయికుమార్‌ రెండు కిడ్నీలు, లివర్‌ను ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. కాలేజీలో సైతం అందరితో మర్యాదగా ఉండేవాడని.. మెరిట్‌ స్టూడెంటని లెక్చరర్స్ తెలిపారు. తమ స్నేహితుడు చనిపోయినా మరి కొంతమందిని బతికించాడని సాయికుమార్ ఎంతో గొప్పవాడని స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.  

06:24 - February 22, 2016

హైదరాబాద్ : మిషన్ కాకతీయలో జరిగిన అక్రమాలపై నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. చెరువుల పునరుద్దరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం మిషన్ కాకతీయపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మొదటి ఫేస్ పనులతో పాటు రెండో ఫేస్ పనుల పురోగతిపై చర్చించారు. దాంతో పాటు మిషన్ కాకతీయ బిల్లుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల ఆడిట్ సందర్భంగా వెలుగు చూసిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు. ఇద్దరు విచారణాధికారులను నియమించిన ఆయన మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక మిషన్ కాకతీయ ఫేస్ - I పనులను మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని డెడ్ లైన్ వింధించారు. మిషన్ కాకతీయ ఫేస్ - II అంచనాలను చీఫ్ ఇంజనీర్ ఆఫీస్‌కి ఈ నెలఖరులోపు పంపించాలని ఆదేశించారు. ఆ తర్వాత వచ్చిన అంచనాలను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్..
ఇరిగేషన్ ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్ రావు... కలెక్టర్లతో భూసేకరణ అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురగతిపై చర్చించారు. డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్‌కు సంబంధించిన తుది నివేదిక నెలాఖరులోగా సమర్పించాలని సూచించారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తికి సంబంధించిన 3259 ఎకరాల భూసేకరణపై స్పెషల్ డ్రైవ్‌తో సమీకరించి ఈ ఖరీఫ్ కల్లా ఆయకట్టు సాధించాలన్నారు. పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి టెండర్లు ఖరారు అవుతున్నందున వచ్చే నెల చివరినాటికి భూ సమీకరణను దాదాపు 12,500 ఎకరాలను పూర్తి చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని ఆయా కలెక్టర్లకు సూచించారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎఫ్‌ఎఫ్‌సి, ఎల్లంపల్లి, ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించిన భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను హరీష్‌రావు ఆదేశించారు.

06:23 - February 22, 2016

విజయవాడ : రెండు రోజుల క‌లెక్టర్ల స‌ద‌స్సు ఈ నెల 22, 23వ తేదీల‌లో విజ‌య‌వాడ‌లోని ఏ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ఈ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప‌నితీరు.. రానున్న ఆర్ధిక సంవ‌త్సరానికి ప్రభుత్వ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక .. రెండంకెల అభివృద్ది ప్రధాన ఎజెండాగా ఈ స‌ద‌స్సులో పాల‌నాప‌రమైన సంస్కర‌ణ‌లు, పార‌ద‌ర్శక‌త పై ప్రత్యేకంగా చ‌ర్చించ‌నున్నారు. ఏపీ ప్రభుత్వం గ‌త డిసెంబ‌ర్ 14,15 తేదీల్లో జ‌రిగిన క‌లెక్టర్ల స‌ద‌స్సులో నిర్దేశించిన ల‌క్ష్యాల పై ఈ స‌ద‌స్సులో స‌మీక్షించ‌నున్నారు. తొలి రోజు సద‌స్సులో భాగంగా పాల‌నా సంస్కర‌ణ‌లు ఇ-ప్రగ‌తి, గ‌వ‌ర్నెన్స్ లాబ్ అంశాలపై చ‌ర్చ ఉంటుంది. అనంత‌రం గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ఉపాధి హామీ ప‌ధ‌కం, నీటి నిర్వహ‌ణపై స‌మీక్షించ‌టంతో పాటుగా ఖ‌రీఫ్‌-ర‌బీల్లో అనుస‌రించిన‌, అమ‌లు చేయాల్సిన ప్రణాళిక‌లపై ప్రభుత్వం దిశానిర్ధేశనం చేయ‌నుంది. ఇక‌ రెండో రోజు మౌలిక వ‌స‌తులు పెట్టుబ‌డులు, ప‌రిశ్రమ‌ల పై ప్రత్యేకంగా చ‌ర్చించనుంది ప్రభుత్వం. ప‌రిశ్రమ‌ల‌కు అవ‌కాశం, భూ కేటాయింపులపై వివ‌రించ‌టంతో పాటుగా ప్రభుత్వం క‌లెక్టర్లకు కొన్ని కీల‌క మార్గద‌ర్శకాలు జారీ చేసే అవ‌కాశం ఉంది.

రెండో రోజు..
రెండో రోజు స‌దస్సులో భాగంగా ఉద్యోగుల‌కు స్కిల్ అప్‌గ్రేడేష‌న్ పై చ‌ర్చ చేప‌ట్టనుంది ప్రభుత్వం. ఒక మిలియ‌న్ ఉద్యోగాల క‌ల్పన కోసం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌-ప‌రిశ్రమ‌ల అనుసంధానంపై ప్రభుత్వం సూచ‌న‌లు చేయనుంది. సాధికారిక మిష‌న్ లోని కీల‌క అంశాలైన ఎస్సీ-ఎస్టీ స‌బ్‌ప్లాన్‌, బిసి-ఎస్సీ-ఎస్టీ-మ‌హిళా-శిశు అభివృద్ధిపై స‌మీక్షించ‌నున్నారు. రెండో రోజు చివ‌రి అంశంగా ఏపీలోని సీనియ‌ర్ పోలీసు అధికారుల‌తో పాటుగా..13 జిల్లాల SPల‌తో శాంతి భ‌ద్రత‌ల పై ముఖ్యమంత్రి స‌మీక్షించ‌ను న్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల ముందు జ‌ర‌గుతున్న స‌దస్సు కావ‌టంతో..శాఖ‌ల వారీగా అవ‌స‌రాలు..ఖ‌ర్చులు.. కేటాయింపుల పైనా ఈ స‌ద‌స్సులో ఆర్థిక శాఖ‌..ప్రత్యేకంగా దృష్టి సారించే అవ‌కాశం ఉంది.

06:07 - February 22, 2016

అనంతపురం : జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుండి బెంగళూరుకు వెళుతోంది. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. సోమందేవపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీనితో డ్రైవర్ తో సహా 20 మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. 108 వాహనంలో హిందూపురం ఆసుపత్రికి తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బస్సు అదుపు తప్పడానికి కారణాలు ఏంటీ అనేది తెలియరాలేదు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందా ? అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అర్ధరాత్రి కావడంతో ప్రయాణీకులు నిద్రలో ఉండడంతో ఏమి జరిగిందో తెలియరాలేదు. 

అనంతలో ఆర్టీసీ బస్సు బోల్తా..

అనంతపురం : సోమందేవపల్లి (మం) పాపిరెడ్డి పల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. బెంగళూరు నుండి తాడిపత్రి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నేడు గద్వాల్ కు మంత్రి పోచారం..

మహబూబ్ నగర్ : జిల్లా గద్వాల్ లో ఫీడ్ మిక్చర్ ప్లాంట్ ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ఆ జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. 

రేపటి నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ వివాదాలు తీవ్రంగా కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు.

 

గోదావరి నదిలో నలుగురు గల్లంతు...

కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మెట్‌పల్లి వద్ద నిర్మిస్తున్న అంతరాష్ట్ర వంతెన వద్ద పర్యాటక స్టీమర్(పడవ) బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. 

జాట్ ల ఆందోళనతో పలు రైళ్లు రద్దు..

హర్యానా : జాట్‌ల ఆందోళనలతో వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి బయల్దేరాల్సిన హైదరాబాద్-హజరత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, సోమవారం బయల్దేరే హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ తిరుపతి-హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆదివారం బయల్దేరిన విశాఖపట్నం-కాజీపేట హజరత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్ ప్రెస్‌ను కాజీపేట్‌లో నిలిపేశారు.

కస్తూర్బా గాంధీ పాఠశాలలో అగ్నిప్రమాదం..

ఆదిలాబాద్ : సిర్పూర్ (యూ) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంటశాల పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

Don't Miss