Activities calendar

23 February 2016

21:23 - February 23, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి బడ్జెట్‌ ప్రసంగంపై సిపిఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ప్రసంగంలో హెచ్‌సియు, జెఎన్‌యు వివాదం ప్రస్తావనకు రాకపోవడం శోచనీయమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ఓటింగ్‌ కోరతామని, అపుడు కేంద్రానికి మిత్రులెవరో, శత్రువులెవరో తేలిపోతుందని ఏచూరి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించినట్లు ఏచూరి తెలిపారు. పార్లమెంట్‌లో సామాజిక వివక్షపై చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం తెచ్చినట్టు నూతన రోహిత్‌ చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. రోహిత్‌కు న్యాయం జరగాలంటే దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు.

21:21 - February 23, 2016

హైదరాబాద్ :గ్రేటర్ ఎన్నికలలో ఫలించిన టీఆర్‌ఎస్‌ మంత్రాన్ని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లలోనూ అధికార పార్టీ జపిస్తోంది. భారీ మెజార్టీతో ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా కోలుకోని విధంగా దెబ్బ తీసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. రెండు కార్పోరేషన్ల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలకు వివరించారు.

వరంగల్‌పై పెద్దగా దృష్టి సారించాల్సిన అవసరం లేదనే యోచన.....

వరంగల్ జిల్లా పార్టీకి కంచుకోటగా ఉండడంతో.. ఆ జిల్లాపై హై కమాండ్ పెద్దగా దృష్టి సారించాల్సిన అవసరం లేదనే అంచనాతోనే ఉంది. అయితే ఖమ్మం విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తెలుగుదేశం, YSRCP పార్టీల ప్రభావం ఖమ్మం కార్పోరేషన్లో ఉంటుందనే అంచనాతో అధికార పార్టీ ఉంది.

హైదరాబాద్‌లోనే కీలక నిర్ణయాలు ....

ఈ పరిస్థితుల్లో ఆ రెండు కార్పోరేషన్ల ఎన్నికలను కూడా మంత్రి కేటిఆర్ పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు హైదరాబాద్ కేంద్రంగానే కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. స్థానిక ఎన్నికలే అయినా.. అభ్యర్థులను హైదరాబాద్ లోనే ఎంపిక చేస్తామనే సంకేతాలను అధికార పార్టీ నేతలు ఇస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబి దళంలో చేరిన నేతలకు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కడం ఖాయమనే ప్రచారం అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పార్టీలో చేరుతున్న నేతలు కూడా అభివృద్ధి నినాదాన్ని అందుకుంటున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ దక్కడంతో.. వరంగల్ లో గులాబి జెండా ఎగురవేయడం లాంఛనమే అన్న ధీమా అధికార పార్టీ నేతల్లో ఉంది. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలను మంత్రి తుమ్మల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

21:19 - February 23, 2016

కృష్ణా : విజయవాడలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సమావేశం సరికొత్త ఆలోచనలకు వేదికగా నిలిచింది. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి రాష్ట్రంలో నాలెడ్జ్‌ ఎకానమీ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు సమావేశంలో ప్రకటించారు. ఏపీ సర్కార్‌, సీఐఐ భాగస్వామ్యంతో అమరావతిలో కేఈజడ్‌ నెలకొల్పనున్నట్లు సీఎం తెలిపారు.                                                                                                                   

జూన్‌లో పనులు ప్రారంభం .....

ఇక ఈ పనులను జూన్‌లో ప్రారంభించి.. 2017 నాటికి తొలి ఫేజ్‌ను పూర్తి చేయాలని అధికారులకు బాబు నిర్దేశించారు. 10 ఎకరాలలో ఫేజ్‌-1ను పూర్తి చేసి 2019 నాటి 100 ఎకరాలకు విస్తరించే యోచనలో సర్కార్‌ ఉంది. దీని ఏర్పాటుకు హార్వర్డ్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహకారం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతి జిల్లాలోనూ కేఈజడ్‌లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌, టెలిఫోన్‌, కేబుల్‌ కనెక్షన్‌ ....

ఇక సమావేశంలో ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై చర్చించారు. అత్యంత వేగంతో తక్కువ ధరకే అందరికీ ఇంటర్‌నెట్‌ , టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ అందించాలన్నారు చంద్రబాబు. జూన్‌ నాటికి 23 వేల కిలోమీటర్ల కేబుళ్లు వేయడం పూర్తవుతుందని బాబు దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. 333 కోట్లతో ఫైబర్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం ఓ రికార్డ్‌ అవుతుందన్నారు చంద్రబాబు. ప్రభుత్వ శాఖలన్నీ ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ బ్యాండ్‌ విడ్త్‌నే ఉపయోగించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సరైన ప్రణాళికలు లేక వెనకబడ్డ శ్రీకాకుళం .....

అదేవిధంగా పర్యాటక రంగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటే అద్భుత ఫలితాలుంటాయన్నారు చంద్రబాబు. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా వెనకబడిందన్నారు. ఇక 1500 రూములు, హెలీప్యాడ్‌ కలిగివున్న 'విరాట్‌' నౌకను విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిందని.. ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తుందన్నారు సీఎం.

మార్చి నెలాఖరుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ .....

ఇక వచ్చే నెలాఖరుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి కానుందని.. ఏప్రిల్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు. ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులు, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ల భూసేకరణకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

అమరావతి-కర్నూలు, అమరావతి-అనంతపురం మధ్య వెయ్యి కి.మీ రహదారులు......

ఇదిలావుంటే.. అమరావతి-కర్నూలు, అమరావతి-అనంతపురం మధ్య వెయ్యి కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని నిర్ణయించారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని.. కేంద్రం 75 వేల కోట్ల రూపాయల మేరకు అనుమతిచ్చిందని చంద్రబాబు తెలిపారు. మరోవైపు అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డుకు డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇక విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌ విస్తరణకు భూములు సేకరించాలన్నారు చంద్రబాబు. నిర్ణీత కాలవ్యవధిలోపు పరిశ్రమలు స్థాపించకపోతే భూములు వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పలు అంశాలపై అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు .

2016 తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : 2016 తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. మార్చి మొదటి వారంలో టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫీజు చెల్లింపునకు మార్చి 7 నుంచి 17 వరకు గడువు ఉంది. మార్చి 8 నుంచి 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఏప్రిల్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 9 లేదా 10 తేదీల్లో టెట్ పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి.

20:32 - February 23, 2016

హైదరాబాద్ : గత సమావేశాల్లో సాధించిందేం లేదు. ఇప్పటి సమావేశాల్లో ఏం సాధిస్తారు.. పార్లమెంట్ ముందు అనేక సవాళ్లు. రాజకీయ రణరంగంలో వివిధ పార్టీల ఎత్తులు పై ఎత్తుల మధ్య మొదలు కాబోతున్న బడ్జెట్ సమావేశాలు ఏ తీరులో జరగబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్ధులు, రైతులు, మేధావులు, ఉద్యోగులు ఇలా అనేక రంగాల వారినుండి వ్యతిరేకత వ్యక్తమౌతున్న తరుణంలో మొదలవుతున్న సమావేశాలు అధికారపార్టీని టెన్షన్ పెడుతున్నాయా? విపక్షాలు సర్వాయుధాలతో రంగంలోకి దూకుతున్నాయా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

తెలంగాణకురూ.450 కోట్లు విడుదల చేసిన కేంద్రం...

హైదరాబాద్ : తెలంగాణలో వెనుకబడిన ఆరు జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం తొలివిడతగా రూ.450 కోట్లు విడుదల చేసింది. అయితే టీ. సర్కార్ మాత్రం తమకు రూ.700 కోట్లు ఇవ్వాలని కోరింది. కేంద్రం విడుదల చేసిన నిధులను ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో మిషన్‌ కాకతీయ, మిషన్ భగీరథకు తెలంగాణ ప్రభుత్వం వెచ్చించనుంది.

పెరిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రేటు..

హైదరాబాద్: ఈ సంవత్సరం రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. ప్రణాళికా అర్థగణాంక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత సంవత్సరం 8.8గా వృద్ధిరేటు నమోదవగా.. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2శాతానికి పెరిగింది. వృద్ధిరేటుతోపాటు ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరిగింది. గత సంవత్సరం తలసరి ఆదాయం రూ.1.27లక్షలు కాగా ప్రస్తుత తలసరి ఆదాయం రూ.1.44లక్షలకు చేరుకుంది.

20:11 - February 23, 2016

హైదరాబాద్ : బ్రహ్మంగారు జెప్పినయ్ అన్ని బరాబరే అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమం ఎట్లైందో.. అగో మిడ్ మానేరు లడాయి గూడ సేమ్ టూ సేమ్ అట్లనే, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గుత్తకు వట్టిన చిన్నముల్కనూరు గోస రాస్తె రామాయణం.. , నడిజాము రాత్రి భాగ్య నగరం సందర్శనకు బైలు దేరిండ్రు మన ప్రెండ్లీ పోలీసులు.. శీకట్ల ఎందుకు వోతురో తెల్సుగదా.. వొక పొల్లా పొలగాడు గాఢంగ ప్రేమించుకున్నరు.. పెండ్లి గుడ జేస్కున్నరు.. శిల్కా గోరింకలోలే కల్శి వుంటే..వో ఎస్సై సాబు ఎడవాపాల్నని జూస్తున్నడట... ,.మల్లో అవినీతి శాప దొర్కింది.. శాపంటే పెద్ద శాప గాదు..ఇప్పుడిప్పుడే ఈత నేర్సుకుంటుంది., ఐద్రావాద్ల ఇంతా ఇంత మల్లా పుంజుకుంటున్నది.. శైన్ స్నాచింగ్ యాగం..,చేతికి గడియారం ఉంటె ఏన్నితీర్ల పనిజేస్తది..? ఎప్పుడుగావాల్నంటే అప్పుడు టైము జూస్కోవచ్చు.. సోకుకు వెట్టుకోవచ్చు.. ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న వివరించిన మసాల ముచ్చట్లు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:46 - February 23, 2016

హైదరాబాద్: దేశంలో ఓవైపు రిజర్వేషనల్ గొడవ రగులుతుంటే, పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక రాష్ట్రం వివాదం తెరపైకి వచ్చింది. కూచ్‌ బేహార్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా ఆందోళన ఉధృతమైంది. ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు. రైళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపు చేయడానికి మమత సర్కార్‌ ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర వివాదం మమత బెనర్జీకీ రాజకీయంగా ఓ పరీక్ష లాంటిది.

19:44 - February 23, 2016

విజయవాడ : జస్ట్ 21 మంది సభ్యులుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని వైసిపి అధినేత జగన్ మొన్నీమధ్య ఓ వ్యాఖ్య చేశారు. ఇలా కామెంట్ చేసిన కొద్ది రోజులకే అంటే జస్ట్ నిన్ననే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏంటి.? అక్కడ వైసిపికి కష్టకాలం మొదలైందా.? పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తాజా పరిణామాలను ఎలా డీల్ చేయబోతున్నారు. మరికొందరు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు లైన్‌లో ఉన్నారన్న ఆ పార్టీ నేతల మాటల్లో వాస్తవమెంత.? టిడిపిని ఏదో చేయబోయి జగన్‌ తనకు తానే సెల్ఫ్‌గోల్ వేసుకున్నారా.?

ఖచ్చితంగా వైఎస్ జగనే అధికారంలోకి....

ఖచ్చితంగా వైఎస్ జగనే అధికారంలోకి వస్తారు. 2014 ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీతో పాటు అన్ని వర్గాల్లోనూ ఇదే చర్చ. కానీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. బాబు అధికారంలోకి వచ్చారు. బాబు నెలరోజుల్లో పవన్ ఫ్యాక్టర్‌ను తెరపైకి తెచ్చి పవర్‌లోకి వచ్చారు. ఆ పరిణామాలతో అప్పటిదాకా అధికారం మనదే మనకిక తిరుగులేదనుకుంటున్న వైఎస్ జగన్‌కు పరాభవం ఎదురైంది. రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా 2 శాతం లోపే. కానీ వైసిపి అధినేత జగన్ 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. పార్టీ అధినేత తీరే మమ్మల్ని అధికారానికి దూరం చేసిందని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.

మళ్లీ పార్టీలో కలకలం...

ఇది గతం.. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీలో కలకలం మొదలైంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి.. ఇది నైతికతకు సంబంధించిన అంశం.. కానీ వాళ్లు ఎందుకు జగన్‌పై నమ్మకం ఉంచడం లేదు.. జగన్‌తో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే భరోసా వాళ్లలో ఎందుకు కనిపించడం లేదు.? ఇలా అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీలో ఉంటే మైలేజీ ఉండదని ఆ పార్టీని వీడిన భూమానాగిరెడ్డి ప్రకటించారు. మరో వైపు భూమా, అతని కూతురు అఖిలప్రియ పార్టీ మారితే వారి నియోజకవర్గాల్లో వైసీపీ వర్గాల నుంచి వ్యతిరేకతే కనిపించడంలేదు. ఎందుకిలా.. ప్రస్తుతం వైసీపీలో దాదాపు అందరూ నేతల్లోనూ ఇదే అంశం చర్చలో ఉంది.

త్వరలో పార్టీవీడే ఆలోచనలో సీనియర్ ఎమ్మెల్యేలు...

త్వరలో సీనియర్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు, ఎమ్మెల్యేలు కళావతి, కోన రఘుపతితోబాటు కృష్ణా, ప్రకాశం, కర్నూలు, విశాఖ, గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని వైసీపీ కొట్టి పారేస్తున్నా... భూమా, జలీల్ ఖాన్ చేరికలపై కూడా గతంలో ఆ పార్టీ అలానే రెస్పాండ్ అయ్యింది. అయితే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతోంది ప్రలోభాలకా.. లేక పార్టీ అధినేత తీరుకా అనే చర్చ వైసీపీలో మొదలైంది. దీంతో మిగతా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పార్టీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ముందు పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేసిన బొత్సా ఇలాంటి కీలక పరిణామాల్లో మాత్రం కనిపించడం లేదు. ఇక జగన్ బొత్సాలాంటి నేతలకు అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.

సీనియర్ నేతలు చాలా మందే ఉన్నా...

ఇక వైసిపిలో ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి లాంటి సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో పార్టీ భవిష్యత్తుపై ఆ నేతలతో చర్చించవచ్చు. ఇదిలా ఉంటే మైసూరారెడ్డి పేరే ఈ మధ్య వినిపించడం లేదు. అసలు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారా లేదా అనే చర్చ కంటే పార్టీ అధినేతగా జగన్ తన పార్టీని ఎలా నెట్టుకొస్తున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలలుగా భూమా ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందనే విషయం వైఎస్ జగన్‌కు తెలుసు. కానీ వాళ్లేమీ పార్టీ మారబోరులే అన్న నిర్లక్ష్య ధోరణే కొన్ని సార్లు నష్టం కల్గిస్తోందనేది కొందరు వైసిపి నేతల ఫీలింగ్.

గంటలోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ....

ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయి, 21 మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే గంటలోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ జగన్ చేసిన ప్రకటనపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇలా కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దీంతో జగన్‌ శిబిరంలో కలకలం మొదలైంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే జగన్‌ ఢిల్లీలో రెండు రోజులకు మించి మకాం వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతనేది పక్కనబెడితే అటు పార్టీ పరంగా, ఇటు కేసుల పరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించాలంటే జగన్ పార్టీలో సీనియర్లపై విశ్వాసం ఉంచి కొన్ని బాధ్యతలు అప్పగించాలనేది ఇంకొందరి అభిప్రాయం.

జగన్ తీరులో కొంత మార్పును ఆశించవచ్చా....

అన్నీ తానై అన్నట్లుగా పార్టీలో ఉంటే సీనియర్లగా మేముండి ఎందుకనే భావన కొందరు నేతల్లో బలంగా నాటుకుపోయింది. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్ తీరులో కొంత మార్పును ఆశించవచ్చా అనేది పార్టీలో అంతర్గత చర్చ. చంద్రబాబు ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నా.. అది వైసీపీకి అనుకూలతగా మారడం లేదు. వైసీపీనే మరో ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో కల్పించడంలోనే పార్టీ సక్సెస్ ఉంటుందని.. దానిపైనే మా భవిష్యత్తు ఆధారపడి ఉందని వైసీపిలో సీనియర్లు అంటున్నారు.. లేకపోతే మేం కూడా ఏదో దారి చూసుకోవాలనేది మరికొందరి మాట..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటున్న వైసీపీ....

ఏపీలో పార్టీఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఒక పక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూనే .. మరో పక్క బై ఎలక్షన్ కి సవాల్ అంటూ టీడీపీ దాడికి దిగుతోంది. దీనిలో భాగంగానే ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలను కలిసి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు . ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో కొనసాగడం రాజ్యాంగ విరుద్దమంటున్నారు నేతలు. పార్టీ మారిన నేతలపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తోంది వైసీపీ.

తెలంగాణనేతలను తిట్టిన టీడీనీ ఏపీలో అదే చేస్తోందన్న వైసీపీ.....

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగిన టీడీపీ ఇప్పుడు ఏపీలో అదే చేస్తోందని వైసీపీ మండిపడుతోంది. మంత్రి పదవుల కోసమో అవినీతి సూట్ కేసుల కోసమో పార్టీ మారడం నీతిమాలిన చర్య అంటున్నారు నేతలు. అవసరమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఎలాంటి ప్రజాదరణ లేని వ్యక్తిని పోటీలో నిలబెడతామని దమ్ముంటే గెలవండని అధికార పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పార్టీ సిద్దంగా ఉంటుందని ఇందుకు టీడీపీ సిద్దమేనా అంటూ బాణాలు సంధిస్తున్నారు నేతలు.

మిగిలిన నేతలను బుజ్జగించే పనిలో వైసీపీ అధిష్టానం....

ఇదిలా ఉంటే మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి పెద్దలు రంగంలోకి దిగారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు నేతులు.అధికార పార్టీ ఎమ్మెల్యేలకే టీడీపీ లో సరైన గౌరవం లేదని.. తొందరపడి నేతలెవరు పార్టీ మారొద్దని పార్టీకి మంచికాలం ముందుందంటూ సూచిస్తున్నారు అధిష్టాన పెద్దలు. ఇది ఇలా ఉంటూ అటు వైసీపీ.. టీడీపీకి కౌంటర్ ఇవ్వాలని చూస్తోంది. టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలను తమ పార్టీకి లాగే ప్రయత్నాలను మొదలెట్టాలని ఆలోచిస్తోంది.

జగన్‌ ఆస్తుల కేసును నిగ్గు తేల్చే విషయంలోఈసీ దూకుడు...

వైసీపీ అధినేత జగన్‌ ఆస్తుల కేసును నిగ్గు తేల్చే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. విచారణ నిరంతరం కొనసాగుతోంది. సీబీఐ కోర్టు నుంచి ఈడీ కోర్టుకు, అక్కడ నుంచి హైకోర్టుకు చేరింది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆస్తుల కేసు ప్రస్తుత స్థితి ఎలా ఉందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వివిధ పద్ధతుల్లో జగన్‌ సంపాదించిన సొమ్ము ఎక్కడకు చేరిందో తేల్చేందుకు ఈడీ ప్రదర్శిస్తున్న దూకుడు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జగన్‌కు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు న్యాయస్థానం అనుమతి కోరే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్‌.... తన తరపున వాదనలు వినిపించేందుకు ఈడీ కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులతో సంప్రదింపులు జరుపున్నట్టు సమాచారం.

నేరారోపణల నమోదుకు సీబీఐ కోర్టు చర్యలు....

జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఇప్పటి కు 12 చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో వందమంది నిందితులు పేర్లు చేర్చింది. చార్జిషీట్లను విచారణకు స్వీకరించిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేరారోపణల నమోదును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. జగన్‌ ఆస్తుల కేసుతో తమకు సంబంధంలేదంటూ కొందరు నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ... వీటితోపాటు, సీబీఐ దాఖలు చేసిన 12 చార్చిషీట్లపై ప్రతి శుక్రవారం విచారణ జరపాలని న్యాయస్థానం నిర్ణయించింది. వీటిపై విచారణ పూర్త్యే వరకు జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డి కోర్టులో వాదనలు వినేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు హాల్లో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయి. దీంతో వీరు ప్రతి శుక్రవారం కోర్టు రోజంతా కోర్టులో గడపాల్సి ఉంటుంది.

రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఈడీ.....

జగన్‌ ఆస్తుల కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటి వరకు రెండు నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. అన్ని ఆధారాలతో మరో పది చార్జ్‌షీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈడీ ఇప్పటి వరకు 1800 కోట్ల ఆస్తులు ఎటాచ్‌ చేసింది.వీటిలో జగన్‌కు చెందిన మీడియా సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వివిధ మార్గాల్లో ఇక్కడ సంపాదించిన ఆస్తులు మనీలాండరింగ్‌ చట్టాలన్ని ఉల్లంఘించి అక్రమ పద్ధతుల్లో విదేశాలకు తరలింపు, అక్కడ నుంచి బినామీ పేర్లతో పెట్టుబడుల రూపంలో ఎలా వచ్చింది దర్యాప్తు చేసింది. ఆస్తులపై సీబీఐ విచారణ పూర్తవ్వకుండా ఈడీ కోర్టులో విచారణ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్‌... హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొసాగుతోంది.

ఈడీ నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేసిన పునీత్‌ దాల్మియా

జగన్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గంతో సీనియర్‌ న్యాయవాది రామ్‌జెఠ్మాలనీ, సుశీల్‌కుమార్‌ వాదనలు వినిపించారు. జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పునీత్‌ దాల్మియా ఈడీ న్యాయస్థానం దాఖలు చేసిన నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసులో కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి చిదంబరం వాదనలు వినిపించారు. జగన్‌ ఫెరా, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ తరుపున గోపాల్‌ సుబ్రహ్మణ్యం వాదనలు విపిపించారు. దీనిపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

మరోసారి ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి కోరనున్న ఈడీ

విచాణ కోర్టుకు హాజరు కావాలంటూ ఇప్పటికే జగన్‌కు నోటీసులు చేసీన ఈడీ కోర్టు... జగన్‌ను మరో ప్రశ్నించేందుకు అనుమతి కోరే అవకాశం ఉంది. జగన్‌ జైల్లో ఉండగానే వారంపాటు విచారించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ప్రశ్నించారు. ఈడీ అధికారులు జగన్‌ను మళ్లీ ఎన్నిసార్లు విచారిస్తారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్‌ ఈడీ కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

 

19:33 - February 23, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఆయన రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విభజన సమయంలో ఇచ్చిన హామీ, గోదావరి, కృష్ణా వాటర్ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఇదే అంశంపై ప్రధాని, హోంమంత్రి అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నా ప్రత్యేక హోదా పై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఆదివాసీల సలహా కమిటీ గురించి రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఏపీలో ఏడు ఆదివాసీ నియోజకవర్గాలకు ఆరు వైసీపీవేనని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారని మండి పడ్డారు. కోట్ల రూపాయల డబ్బులు, మంత్రి పదవులు ఎరచూపి నిస్సిగ్గుగా మా ఎమ్మెల్యేలను లాక్కురని జగన్ విమర్శించారు. భూమా కుటుంబాన్ని నా సొంత కుటుంబా భావించానని, నాగిరెడ్డి వైసీపీని వీడటం బాధగా ఉందన్నారు. నన్ను తప్ప అందర్నీ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు గురికాని ఎమ్మెల్యేలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముద్రగడ దీక్షలో అల్లర్లపై మాపై నెట్టివేశారన్నారు. ఈ అంశంలో చంద్రబాబు చేతగాని తనం వల్లే గొడవలు వచ్చాయన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చాడని వారు టీడీపీలో చేరారో చెప్పాలని, వారంతా ఎందుకు తమ పార్టీని వీడాల్సి వచ్చిందో ప్రజలకు, వారి మనస్సాక్షికి సమాధానం చెప్పాలని ఆయన సూచించారు.

ఘనంగా కృష్ణా పుష్కరాలు : చంద్రబాబు

విజయవాడ: కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలుశాఖల అధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..రాయలసీమకు కృష్ణాజలాలు అందిస్తున్న దృష్ట్యా ఆ ప్రాంత ప్రజలను పుష్కరాలలో భాగస్వామ్యుల్ని చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రధాన ఆలయాలు ఉన్న నగరాల్లో ప్రతి ఇంటికి టాయిలెట్స్ వుండాలని సీఎం చెప్పారు. పచ్చదనం-పరిశుభ్రానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు.

ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ గా సీహెచ్‌ నాగేశ్వరరావు నియామకం

విజయవాడ :ఏపీ జెన్‌కో డైరెక్టర్‌(హైడల్‌)గా సీహెచ్‌ నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఏపీ జెన్‌కో ఫైనాన్స్‌ అండ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా జి.ఆదినారాయణ, ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ (థర్మల్‌)గా ఎం.పి.సుందర్‌సింగ్‌ నియామించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన డైరెక్టర్లంతా రెండేళ్లపాటు పదవిలో కొనసానున్నారు.

19:08 - February 23, 2016

విజయవాడ: ఆయన ఒకప్పుడు... కింగ్‌ మేకర్‌. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు... సింగపూర్‌ నుంచి స్విట్జర్లాండ్‌ వరకు.. చక్కర్లు కొడుతున్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించి... రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చుకున్న ఘనుడు. ఇప్పుడు న్యాయపరంగా రావాల్సిన నిధులు రాబట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కాలికి బలపం కట్టుకుని దేశదేశాలు తిరుగుతున్నారు. ఎక్కే గడప, దిగే గడప అన్న తేడా లేకుండా అందరి తలుపు తడుతున్నారు. అయినా ఫలితం ఎంత అన్న ప్రశ్న వేసుకుంటే ... సమాధానం కష్టమే.. ఇంతకీ ఎవరా నేత... ఏమిటా కథ... వివరాలు స్టోరీ చూడండి.

దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ను ప్రధానిని చేయడంలో కీలక పాత్ర.....

బండ్లు ఓడలు, ఓడుల బండ్లు అవుతాయనే సామెత ఆయకు సెంట్‌ పర్సెంట్‌ వర్తిస్తుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కింగ్‌ మేకర్‌ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. దేవెగౌడ, ఐకీ గుజ్రాల్‌ వంటి నేతలను దేశ ప్రధానిగా చేడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకున్నారు. దక్షిణాదిలో పవర్‌ఫుల్‌ సీఎం అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా... నిధులు రాబట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. విభన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయించుకునేందుకు కేంద్రం దగ్గర సాగిల పడాల్సి వస్తోంది. కేంద్ర మంత్రులు చాంబర్ల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడంలేదు.

23 సార్లు ఢిల్లీ పర్యటన ....

2014 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఇప్పటి వరకు 23 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మొత్తం 27 రోజులు హస్తినలో గడిపారు. సగటున నెలకు ఒకరోజు దేశ రాజధానిలో గడిపారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీల కోసం ప్రధాని మోదీకి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం ఈ శాఖ మంత్రి సురేష్‌ ప్రభును దఫదఫాలుగా కలిశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వంటివారిని పలు దఫాలుగా కలిసిన రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజం ఎంత అంటే.. చెప్పడం ఎవరికైనా కష్టమే.

పారిశ్రామివేత్తల సదస్సులకు హాజరు....

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసిన చంద్రబాబు... ఏపీని కూడా అదే విధంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఎక్కడ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్నా... రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదక సదస్సుకు రెండుసార్లు హాజరయ్యారు. సింగపూర్‌, జపాన్‌, దక్షిణకొరియా వంటి దేశాలను సందర్శించారు. ఈ 20 నెలల పాలనాకాలంలో 29 రోజులు విదేశాల్లో గడిపారు. 2014 నవంబర్‌లో 3రోజుటు సింగపూర్‌, ఐదు రోజులు జపాన్‌ పర్యటించారు.

బహుళ జాతి సంస్థల కార్యాలయాల చుట్టు చక్కర్లు....

ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు చంద్రబాబు చేస్తున్న మార్కెటింగ్‌ స్ట్రాటజీలో ఎటువంటి లోపంలేకపోయినా.. లాభం మాత్రం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. బహుళజాతి సంస్థల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రతిఫలం దక్కని పరిస్థితి. పెట్టుబడులకు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నా... అవి కార్యరూపం దాల్చలేదు. 2014లో రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ లోటు 60.6 బిలియన్‌ రూపాయలుగా ఉంది. 2015-16లో ఇది 142.4 బిలియన్‌ రూపాలయకు చేరింది. రెవిన్యూలోటు ఏటేటా పెరుతున్నా... ఆర్ధిక కార్యక్రమాలు పెరగకపోవడంతో దీనిని పూడ్చుకునే మార్గం కనిపించడంలేదు.

తెలంగాణ టీడీపీలో అస్తిత్వ సమస్య .....

అటు కేంద్రం కరుణించకపోవడం.. ఇటు పెట్టుబడులు పెరగకపోవడంతో..చంద్రాబులో ఒకింత నైర్యాశ్య కనిపిస్తోంది. దీనికి తోడు తెలంగణాలో టీడీపీకి అస్తిత్వం సమస్యను ఎదుర్కొంటోంది. కాపుల నిజర్వేషన్లు, రాజధాని నిర్మాణం, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు.. ఇలాంటి సమస్యలతో చంద్రబాబు తలబొప్పికట్టినంత పని అవుతోంది. అధికార మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో అపరచాణక్యుడుగా పేరు పొందిన అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం కరుణించకపోతుందా... మంచి రోజులు రాకపోతాయా.. అన్న అశాభావంతో ఎదురు చూస్తున్నారు.

18:59 - February 23, 2016

హైదరాబాద్ : ఏపీ సిఎం చంద్రబాబు హైదరాబాద్‌లో మళ్ళీ తన నివాసాన్ని మార్చబోతున్నారు. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని భవనం నుంచి ఫామ్‌ హౌస్‌కు ఇంటిని షిఫ్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు అంతగా కలిసిరావడం లేదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా చంద్రబాబు విజయవాడలో ఉంటూ వారానికోసారి హైదరాబాద్‌కు వస్తున్నారు. వచ్చినప్పుడల్లా జూబ్లీహిల్స్‌లో తీసుకున్న కొత్త ఇంట్లో గడుపుతున్నారు. అయితే ఆ ఇంట్లోకి చేరిన దగ్గర్నుంచీ ఓటుకు నోటు కేసు, పుష్కరాల్లో తొక్కిసలాట, తెలంగాణ టిడిపిలో జరిగిన భారీ నష్టం, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోర పరాజయం లాంటివన్నీ జరిగాయి. ఇలా చాలా అవరోధాలు ఎదురవుతుండడంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఇంటిని మార్చి ఫామ్‌ హౌస్‌కు వెళ్లనున్నారు. నిజానికి పాత ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని గృహానికి మారినపుడే కొందరు సిద్ధాంతులు ఆ ఇంటి వాస్తు సరిగాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. 

18:56 - February 23, 2016

విజయవాడ : ఏపీలోనే అత్యంత ధనిక పార్లమెంట్ సభ్యుడిగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి రికార్డులకెక్కారు. సారీ యలమంచిలీ అంటే మీకు తెలీదు కదా.... అదేనండీ మన కేంద్రమంత్రి సుజనా చౌదరి అనగానే ప్రతిఒక్కరికి గుర్తుకు వస్తారు.అంతలా సుజనా చౌదరిగానే పాపులర్ అయ్యారు. 25 ఏళ్ల వ్యాపార సామ్రాజ్యంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలివిగా తప్పించుకుంటూ.. బురద అంటుకోకుండా బయటపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా...

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో చక్రం తిప్పుతుండేవారు. కాని కాలం మారింది.. భారీ ఎత్తున నిధులను మళ్లించిన కేసుల్లో ఆయనకు ఉచ్చు బిగుస్తూ వస్తోంది. ఒక పక్క ఆర్థిక నేరాల కోర్టు, మరోపక్క సిబిఐ దర్యాప్తు రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉక్కిబిక్కిరి అవుతున్నారు .

ప్రస్తుతం సుజనా సంస్థల్లో వేలకోట్ల టర్నోవర్....

ప్రస్తుతం సుజనా సంస్థలు వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ఉత్పత్తి, ట్రేడింగ్‌ రంగాల్లో సుజనా సంస్థలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. మారిషస్‌ నుంచి అడ్డదారిలో రుణాలు పొంది వాటిని తమ ఖాతాల్లో మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ సిబిఐ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావును కూడా పావుగా ఉపయోగించుకుని వందల కోట్లు తన ఖాతాల్లో జమ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కల్యాణరావు సుజనాచౌదరికి చెందిన సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేశారు. రెండు కేసుల్లో కలిపి 400 కోట్లకు పైగా బకాయిలు పడటంతో ఆర్‌బిఐ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

మారిషస్‌లోని కమర్షియల్‌ బ్యాంకులో ..

మారిషస్‌లోని కమర్షియల్‌ బ్యాంకులో హెస్ట్‌లా హోల్డింగ్స్‌ సంస్థ 2012లో 106 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. దీనికి సుజనా చౌదరి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించిన సుజనా యూనివర్శల్‌ ఇండస్ర్టీస్‌ సంస్థ ఈ రుణానికి హామీదారుగా ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో మారిషస్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. బకాయిలు చెల్లించకపోతే సంస్థ వేలానికి సిద్దం కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును నిలిపివేయాలంటూ సుజనా చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీనితో తాజాగా హైకోర్టు సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసింది.

మూడు బ్యాంకుల్లో కలిపి రూ. 304 కోట్ల అప్పులు.....

ఒకపక్క ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సిబిఐ డైరెక్టర్‌, విజయరామారావు కుమారుడు కల్యాణరావుపై మొత్తం మూడు బ్యాంకులను మోసం చేశాడని సిబిఐ కేసు నమోదు చేసింది. మూడు బ్యాంకుల్లో కలిపి 304 కోట్ల రూపాయల రుణాలు పొందారు. సెంట్రల్‌ బ్యాంక్ అఫ్‌ ఇండియా నుంచి 124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి 60 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి 120 కోట్లు రుణాలు పొందారు. అయితే సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వివరాలపై ఆరా తీసింది ఆర్ బీ ఐ .ఈ విచారణలో రుణాలు తీసుకునే సమయంలో దాఖలు చేసిన సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించింది. హైదరాబాద్‌, చెన్నయ్‌, ముంబైలలోని కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస కేసులతో సుజనా చౌదరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. కాని బాహాటంగా తనకు కంపెనీకి ఎటువంటి సంబంధాలు లేవని బుకాయిస్తున్నారు. తాను 15 ఏళ్ల కిందటే రిజైన్ చేశానంటున్నారు. కాని ఆయన 2 ఏళ్లక్రితమే కంపెనీ నుండి తప్పుకున్నట్లు రికార్డులలో ఉంది.  

18:53 - February 23, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ ఆస్తుల కేసును నిగ్గు తేల్చే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. విచారణ నిరంతరం కొనసాగుతోంది. సీబీఐ కోర్టు నుంచి ఈడీ కోర్టుకు, అక్కడ నుంచి హైకోర్టుకు చేరింది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆస్తుల కేసు ప్రస్తుత స్థితి ఎలా ఉందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వివిధ పద్ధతుల్లో జగన్‌ సంపాదించిన సొమ్ము ఎక్కడకు చేరిందో తేల్చేందుకు ఈడీ ప్రదర్శిస్తున్న దూకుడు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జగన్‌కు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు న్యాయస్థానం అనుమతి కోరే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్‌.... తన తరపున వాదనలు వినిపించేందుకు ఈడీ కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులతో సంప్రదింపులు జరుపున్నట్టు సమాచారం.

నేరారోపణల నమోదుకు సీబీఐ కోర్టు చర్యలు....

జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఇప్పటి కు 12 చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో వందమంది నిందితులు పేర్లు చేర్చింది. చార్జిషీట్లను విచారణకు స్వీకరించిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేరారోపణల నమోదును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. జగన్‌ ఆస్తుల కేసుతో తమకు సంబంధంలేదంటూ కొందరు నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ... వీటితోపాటు, సీబీఐ దాఖలు చేసిన 12 చార్చిషీట్లపై ప్రతి శుక్రవారం విచారణ జరపాలని న్యాయస్థానం నిర్ణయించింది. వీటిపై విచారణ పూర్త్యే వరకు జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డి కోర్టులో వాదనలు వినేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు హాల్లో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయి. దీంతో వీరు ప్రతి శుక్రవారం కోర్టు రోజంతా కోర్టులో గడపాల్సి ఉంటుంది.

రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఈడీ ...

జగన్‌ ఆస్తుల కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటి వరకు రెండు నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. అన్ని ఆధారాలతో మరో పది చార్జ్‌షీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈడీ ఇప్పటి వరకు 1800 కోట్ల ఆస్తులు ఎటాచ్‌ చేసింది.వీటిలో జగన్‌కు చెందిన మీడియా సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వివిధ మార్గాల్లో ఇక్కడ సంపాదించిన ఆస్తులు మనీలాండరింగ్‌ చట్టాలన్ని ఉల్లంఘించి అక్రమ పద్ధతుల్లో విదేశాలకు తరలింపు, అక్కడ నుంచి బినామీ పేర్లతో పెట్టుబడుల రూపంలో ఎలా వచ్చింది దర్యాప్తు చేసింది. ఆస్తులపై సీబీఐ విచారణ పూర్తవ్వకుండా ఈడీ కోర్టులో విచారణ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్‌... హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొసాగుతోంది.

ఈడీ నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేసిన పునీత్‌ దాల్మియా ....

జగన్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గంతో సీనియర్‌ న్యాయవాది రామ్‌జెఠ్మాలనీ, సుశీల్‌కుమార్‌ వాదనలు వినిపించారు. జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పునీత్‌ దాల్మియా ఈడీ న్యాయస్థానం దాఖలు చేసిన నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసులో కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి చిదంబరం వాదనలు వినిపించారు. జగన్‌ ఫెరా, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ తరుపున గోపాల్‌ సుబ్రహ్మణ్యం వాదనలు విపిపించారు. దీనిపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

మరోసారి ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి కోరనున్న ఈడీ ....

విచాణ కోర్టుకు హాజరు కావాలంటూ ఇప్పటికే జగన్‌కు నోటీసులు చేసీన ఈడీ కోర్టు... జగన్‌ను మరో ప్రశ్నించేందుకు అనుమతి కోరే అవకాశం ఉంది. జగన్‌ జైల్లో ఉండగానే వారంపాటు విచారించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ప్రశ్నించారు. ఈడీ అధికారులు జగన్‌ను మళ్లీ ఎన్నిసార్లు విచారిస్తారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్‌ ఈడీ కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. 

తిరుపతి లడ్డూలో పిన్నీసు...

తిరుమల : తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఓ భక్తుడికి పిన్నీస్ కనబడింది. శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు కౌంటర్‌లో లడ్డు ప్రసాదం తీసుకున్నాడు. అందులో పిన్నీస్ కనిపించడంతో ఉలిక్కిపడ్డాడు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు విషయాన్ని తెలియజేశారు. దీనిపై పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా హెచ్ ఎల్ దత్తు

ఢిల్లీ :ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు నియమితులయ్యారు.

17:59 - February 23, 2016

హైదరాబాద్ : జనాభాకనుగుణంగా సిబ్బంది లేకపోవడం..ఉన్న సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పెరగడం కారణంగా మెరుగైన సేవలు అందించలేకపోతోంది సైబరాబాద్ కమిషనరేట్. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు కమిషనర్ CV ఆనంద్.

3700 కి.మీ లో విస్తరించింది సైబరాబాద్ .....

3700 కి.మీ లో విస్తరించి దాదాపు 65 లక్షల మంది జనాభా కలిగిన సైబరాబాద్ కమిషనరేట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు సిద్దమయ్యారు కమిషనర్ సీవీఆనంద్. కమిషనరేట్ లో జనాభాకనుగుణంగా సిబ్బంది లేకపోవడం.. నిత్యం వస్తున్న కేసులకు న్యాయం చేయలేకపోతున్నామని..కొత్త టెక్నాలజీని అందిపుచ్చకోలేకపోతున్నామనే భావన సైబరాబాద్ కమిషనరేట్ లో ఉంది.

సైబరాబాద్ పరిధిలోనే ఐటీ కారిడార్ , ఆర్థిక మండళ్లు.....

సైబరాబాద్ పరిధిలోనే ఐటీ కారిడార్ , ఆర్థిక మండళ్లు ఉండడం.. దీనికి తోడు 7200 మందితో విధులు నిర్వర్తించాల్సి ఉండగా కేవలం 5200 మంది సిబ్బందితోనే సైబరాబాద్ కమిషనరేట్ పనిచేస్తోంది. దీంతో ఉన్న సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడిని తగ్గించేందుకు మెరుగైన భద్రత వ్యవస్థ తదితర అంశాలపై కమిషనరేట్ లో జరిగిన రీ ఆర్గనైజింగ్ మీటింగ్ లో చర్చించి పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారంచుట్టారు అధికారులు.

కనుమరుగవనున్న టాస్క్ ఫోర్స్ బృందాలు..

గతంలో కమిషనరేట్ పరిధిలో ఉన్న 5 జోన్లలో ఒక్కో జోన్ కు టాస్క్ ఫోర్స్ స్టేషన్లు ఉండగా.. రీ ఆర్గనైజేషన్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ బృందాలను తీసివేయాలని నిర్ణయించింది. వాటి స్థానాలలో సీఐ ఆధ్వర్యంలో SI ,ASI, హెడ్ కానిస్టేబుల్ ,10 మంది కానిస్టేబుల్స్, ఒక మహిళ కానిస్టేబుల్ , మేల్ హోంగార్డులు , 2 మహిళా హోంగార్డులు ఇలా మొత్తం 18 మందితో కూడిన ప్రత్యేక ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సీసీఎస్ పరిధిలోని ఏడు స్టేషన్లలో రెండింటిని రద్దు చేసి మిగతా వాటినిపటిష్ఠ పరచాలని చూస్తోంది.

సీసీఎస్ ,టాస్క్ ఫోర్స్ విభాగాలను....

వీటితో పాటు సీసీఎస్ ,టాస్క్ ఫోర్స్ విభాగాలను రీ ఆర్గనైజ్ చేసి అధిక పని భారంతో కొట్టుమిట్టాడుతున్న సిబ్బందికి శ్రమ తగ్గించాలని ప్లాన్ వేస్తున్నారు. దాంతో పాటు టోటల్ ఎఫ్ ఐఆర్ రిజిస్టర్డ్ -1 టోటల్ ప్రాపర్టీ, క్రైంరిపోర్టు, లా అండ్ ఆర్డర్ అండ్ బందోబస్తు.. డ్యూటీలాగా త్వరలోనే విభజించి శాఖ పనితీరునుమెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. 

17:56 - February 23, 2016

ఆదిలాబాద్ : ఒకప్పుడు పోలీసులంటే చేతిలో లాఠీ, బెల్ట్ కు పిస్తోల్ , గంభీరమైన స్వరం ఉండేది. కాని పోలీస్ అంటే మేమే అంటూ.. సరికొత్త అర్థం చెబుతున్నారు ఈ ఎస్సై. ప్రజలతో మమేకమవుతూ ప్రజల మెప్పు పొందుతున్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ.. గ్రామాల్లో రోడ్లువేయిస్తూ , వైద్యశిబిరాలు పెట్టిస్తూ.. శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.

ఒక సాధారణ కటుంబం నుండి వచ్చి..

ఒక సాధారణ కటుంబం నుండి వచ్చి.. ఎక్కడో చదువుకుని ఇక్కడికి ఎస్సైగా వచ్చి పీఎస్ పరిధిలోని గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చాడు. గ్రామాల్లో నాటుసారా బట్టీలు, గుడుంబా అమ్మకాలు లేకుండా చేశాడు. బెల్ట్ షాపులను మూయించి.. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు పెట్టించాడు.నిరుపేదలకు లేదనకుండా బియ్యం, దుప్పట్లు , బట్టలు పంపిణీచేశాడు. జిల్లాలోనే ఆదర్శ పోలీసుగా నిలుస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ (టి ) పరిధిలోని ఎస్సై రామారావు.

సిర్పూర్ మండలంలో ఇప్పుడు ఏ నోట విన్నా...

సిర్పూర్ మండలంలో ఇప్పుడు ఏ నోట విన్నా ఆయన పేరే వినిపిస్తోంది. నిత్యం కేసులతో సతమతమవుతున్నా.. అవేవిపట్టించుకోకుండా... ప్రజల్లో పోలీసులపై దురభిప్రాయాన్ని పారద్రోలాలని..స్టేషన్ అంటే ఆహ్లాదానికి మారుపేరుగా ఉండాలని కంకణం కట్టుకుని మార్చిచూపించాడు రామారావు. కుందేళ్లు, బాతులతో స్టేషన్ ను ఒక టూరిస్ట్ ప్లేస్ గా మార్చాడు. మారుమూల గ్రామాల్లో గిరిజన గిరిజనేతర గ్రామాల్లో వైద్యాశిబిరాలు పెట్టించాడు. దాంతో పాటు రోడ్డు లేకపోవడంతో వైద్య సేవలకు, విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో చీలపల్లి గ్రామస్థుల సహకారంతో రోడ్డు వేయించాడు.

సిర్పూర్ నుండి చీలపల్లి వెళ్లేందుకు కమ్ సే కమ్....

సిర్పూర్ నుండి చీలపల్లి వెళ్లేందుకు కమ్ సే కమ్ 40 నిమిషాలు పడుతుండడంతో తానే స్వయంగా రోడ్డు పనులను పరిశీలించి 10 రోజుల్లో పూర్తి చేయించి తన నిబద్థతను చాటుకుంటున్నారు. స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని సాధరంగా ఆహ్వానిస్తున్నారు. సగం సమస్యలను స్టేషన్ లోనే పరిష్కరిస్తూ అందరికి ఆదర్శప్రాయుడుగా మారారు. గ్రామాల్లో మద్యపానానికి వ్యతిరేకంగా శిబిరాలు పెట్టి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తూ .. ఆదర్శ ఎస్సైగా అవార్డు కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తమ పోలీస్ స్టేషన్ ను అందంగా తీర్చిదిద్ది.. పరిసర గ్రామాల ప్రజలలో పోలీసులపై నమ్మకాన్ని పెంచేందుకు అవగాహన కల్పించాలంటున్నారు ఎస్సై రామారావు.

నిరంతరం ప్రజల సేవ కోసమే ఉన్నామని..

నిరంతరం ప్రజల సేవ కోసమే ఉన్నామని.. పోలీస్ స్టేషన్ లంటే నందనవనాలని.. వీడేరా పోలీస్ అంటే.. అన్నట్లుగా తమ పీఎస్ పరిధిలో పేరు తెచ్చుకుని అందరికి ఆదర్శ ప్రాయుడిగా మారారు ఎస్సై రామారావు. 

17:52 - February 23, 2016

హైదరాబాద్: వరంగల్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి ఊపందుకుంది. ఆశావహులు టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేల చూట్టు తిరుగుతున్నారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యే కొండా సురేఖ నివాసం ముందు వందలాది మంది ఆశావహులు క్యూ కట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు టిక్కెట్‌ వచ్చేలా ప్రయత్నం చేయాలంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో కొండా సురేఖ నివాసం ఆశావహులతో సందడిగా మారింది. 23వ డివిజన్‌ నుంచి తమకు అవకాశం కల్పించాలని వందలాది మంది హిజ్రాలు కొండా సురేఖ దంపతులకు విజ్ఞప్తి చేశారు. 

నిర్భయ చట్టం లా రోహిత్ చట్టం తేవాలి: ఏచూరి

ఢిల్లీ : నిర్భయ చట్టం మాదిరిగానే.. కొత్తగా రోహిత్ చట్టం తీసుకురావాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. దళితుల కోసం కొత్త చట్టాలు చేయడంలేదన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కోరితే చట్టం తీసుకురాలేదు, రాష్ట్రపతి ప్రసంగంలో హెచ్ సియూ, జెన్ యూ, మతోన్మాదం అంశాలు లేవన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో ఓటింగ్ కోరుతామన్నారు.

ఉమర్ ఖలీద్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ : జేఎన్ యూ ఘటనలో ఉమర్ ఖలీద్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు పోలీసులకు లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. లొంగిపోయే ప్రదేశం చెబితే పోలీసులు అరెస్టు చేస్తారని కోర్టు పేర్కొంది. ఖలీద్ తరపు న్యాయవాదులు చెప్పిన ప్రదేశంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతపురం రుద్రంపేటలో పేదల ఆందోళన

అనంతపురం : రుద్రంపేటలో పేదలు ఆందోళనకు దిగారు. 4వ పట్టణ పోలీసు కార్యాయలం కోసం ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలు తొలగించారు. దీంతో 25 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా పేదలు చేస్తున్న ఆందోలన ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు తెలిపారు.

రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థత

హైదరాబాద్ : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఒంట్లో బాగుండలేదని చెప్పిన రజినీని చెన్నై మణప్పాకంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిన్న రాత్రి ఆయనను డిశ్చార్జ్ చేశారు. వరుస సినిమాల కారణంగా బిజీగా ఉన్న రజినీకాంత్ కు విశ్రాంతి లేకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రజినీ కాంత్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఎంథిరిన్ -2, కబాళి చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

గూడ్స్ రైలుకు నిప్పు పెట్టిన జాట్లు...

హైదరాబాద్ : రిజర్వేషన్లకోసం జాట్లు చేస్తున్న ఆందోళన కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలకు దారితీస్తోంది. ఈ రోజు జాట్‌ వర్గీయులు రాజస్థాన్‌లోని ఆందోళనకారులు హిలాక్‌ స్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలు ఇంజిన్‌ని తగలబెట్టారు. పప్రిరా స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్‌ని తగలబెట్టి స్టేషన్‌ మాస్టర్‌పై దాడి చేసి, రూ.5,000లు ఎత్తుకెళ్లారని రైల్వే అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారి 11పై రాస్తారోకో నిర్వహిస్తున్న ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, గాలిలోకి కాల్పులు జరిపారు.

ఏసీబీ వలలో పెందుర్తి క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్

విశాఖ: జిల్లాలోని పెందుర్తి క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్ దొర ఓ వ్యక్తిని లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. స్క్రాప్‌ యజమాని నుంచి రూ.18 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అయితే అతన్ని ఉద్యోగం సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : విద్యాశాఖ సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇవాళ జరిపిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఆర్థికస్థోమత కలిగిన వారి పిల్లలు మంచి స్కూళ్లలో చదువుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధత్య. పేద విద్యార్థుల చదువు కోసం పెట్టిన ఖర్చు బావితరాలకు ఉపయోగపడుతుంది. మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుంది.

16:49 - February 23, 2016

ముంబై : స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. 378 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ దెబ్బ తినగా.. 125 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కూడా కిందకు పడింది. క్రూడాయిల్‌ ధరల పతనంతో అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బ తినడంతో పాటు.. ఈ వారంలోనే కేంద్ర బడ్జెట్‌ కూడా రానుండటంతో.. షేర్‌ బజార్‌లో సేల్స్‌ జరిగాయని నిపుణులు అంటున్నారు.

16:47 - February 23, 2016

హైదరాబాద్ : లక్షలాది మంది డిపాజిటర్లను ముంచిన అక్షయగోల్డ్‌ ఆస్తులను అమ్మకుండా బాధితులకు ఎలా న్యాయం చేస్తారో తెలపాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసులను ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చిందో, ఏం చర్యలు తీసుకున్నారో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌తో పాటు ఈ సంస్థ వ్యవహారాన్ని కూడా కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 కి వాయిదా వేసింది.

సోమవారం విచారణ...

తాము చేసిన డిపాజిట్లను అక్షయగోల్డ్‌ యాజమాన్యం నుంచి ఇప్పించాలని అభ్యర్థిస్తూ అక్షయ గోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలిప్‌ బి బొసలే, జస్టిస్‌ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఐవి రాధా కృష్ణరావు, ఎన్‌ఎస్‌ అర్జున్‌ వాదనలు వినిపించారు. అక్షయ గోల్డ్‌ సంస్థ యాజమాన్యం ఎపి, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో 4.5 లక్షల మంది డిపాజిటర్లతో రూ. 600 కోట్లకు పై చిలుకు డిపాజిట్లు సేకరించిందని, ఆ డబ్బులు చెల్లించకుండా వేధిస్తోందని నివేదించారు. అవనిగోల్డ్‌, శ్రీగోల్డ్‌, శ్రీచక్ర, అభయగోల్డ్‌ పేర అనుబంధ సంస్థలను స్థాపించి డబ్బులు వసూలు చేశారని నివేదించారు. విజయవాడలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని, ఎపి సిఐడి పోలీసులు ఇప్పటి వరకు రూ. 10 కోట్లు రికవరీ చేసినప్పటికీ బాధితులకు అందజేయలేదని నివేదించారు. అగ్రిగోల్డ్‌ సంస్థ తరహాలోనే ఈ సంస్థ యాజమాన్యం కూడా డిపాజిటర్లను మోసం చేసిందని నివేదించారు. సంస్థ ఆస్తులు విక్రయించి బాధితులకు చెల్లించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

ఏపీ సిఐడి పోలీసులు తమకు అందజేయడం లేదు....

ఆ తర్వాత తెలంగాణ సిఐడి తరఫు న్యాయవాది శరత్‌కుమార్‌ వాదిస్తూ, అక్షయగోల్డ్‌ సంస్థ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ సిఐడి పోలీసులు తమకు అందజేయడం లేదని తెలిపారు. రికార్డులు లేకుండా తమ పరంగా దర్యాప్తును వేగవంతం చేయడంలో అవరోధం ఏర్పడుతోందని విన్నవించారు. జస్టిస్‌ బొసలే జోక్యం చేసుకుని, ఈ వ్యవహారంపై ఎందుకు సహకరించడం లేదని ఎపి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. లక్షలాది మంది డబ్బులను డిపాజిట్‌ రూపంలో తీసుకుని వారికి చెల్లించని యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మండిపడ్డారు. ఇలాంటి మోసాలపై కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.

16:45 - February 23, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కలెక్టరేట్ల వద్ద బాధితులు సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీలో...

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ స్వాధీనపర్చుకుని, ఖాతాదారులకు అసలు, వడ్డీతో సహా చెల్లింపులు చేపట్టేలా చూడాలని శ్రీకాకుళం కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగిన బాధితులు డిమాండ్‌ చేశారు. ఈనెల 27 వరకూ రిలే దీక్షలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డవారికి కొమ్ముకాస్తుంది ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు.

మచిలీపట్నంలో...

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు రావల్సిన డబ్బులను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ధర్నాకు సీపీఎం పార్టీ సంఘీభావం తెలిపింది. అగ్రిగోల్డ్‌ సంస్థ యాజమాన్యాన్ని అరెస్టు చేసి, డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించాలని కోరుతూ కర్నూలులో అగ్రిగోల్డ్‌ సంస్థ ఏజెంట్లు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం ఏజెంట్లు బాధితులతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు.

కడపలో...

అటు కడపలోనూ అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు కడప మేయర్‌ సురేష్‌బాబు మద్దతుతెలిపారు. జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, బాధితులు తమకు రావల్సిన డబ్బులు చెల్లించి న్యాయం చేయాలంటూ ఆందోళనలు నిర్వహించారు. 

16:43 - February 23, 2016

గుంటూరు : తమ భూమిని అన్యాయంగా వేరొకరు ఆక్రమించుకున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటూ గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామానికి చెందిన బాధితులు నిరసనకు దిగారు. మంగళగిరి మండలం నీరుకొండంలో ఉన్న సిఆర్‌డిఎ కార్యాలయానికి తాళమేసి ఆందోళన జరిపారు. తమ భూమికి ఉన్నత వర్గానికి చెందిన మువ్వా ప్రవీణ్‌ దొంగ దస్తావేజులు సృష్టించి ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారుల వద్దకు వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపినా విచారిద్దామంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. సిఆర్‌డిఎ అధికారులు దాసు, మువ్వా కిరణ్‌కు ఈ దందాలో భాగముందని తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు. 

16:41 - February 23, 2016

ఢిల్లీ :కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. యూనివర్సిటీల్లో కొత్త ఆలోచనలు వెలుగు లోకి రాకుండా కేంద్రం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. హెచ్‌సియూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ వేములకు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో రాహుల్‌ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అమలు చేస్తూ విద్యార్థుల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. భారత భవిష్యత్తుపై రోహిత్‌ ఎన్నో కలలు కన్నారని, కాని ఆ కలలను ఆర్‌ఎస్‌ఎస్‌ కల్లలు చేసిందని రాహుల్‌ విమర్శించారు. ప్రతి ఒకరికి వాక్‌ స్వాతంత్రం ఉండాలని, తన మనసులోని మాటను బయటకు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్న భారత్‌ కావాలని యువత కోరుకుంటోందని రాహుల్‌ పేర్కొన్నారు.

 

16:39 - February 23, 2016

ఢిల్లీ : జాతివిద్రోహ వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్‌యు స్టూడెంట్ ఉమర్‌ ఖలీద్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఉమర్ వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌ విచారణ చేపట్టింది. తమకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న ఉమర్ పోలీసు భద్రత కోరుతున్నారు. జాతి విద్రోహ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు జెఎన్‌యు విద్యార్థులు హఠాత్తుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ ఇద్దరూ కోర్టునుంచి యాంటిసిపేటరీ బెయిల్‌ అభ్యర్థించారు. దీనిపై పోలీసులు వ్యతిరేకించే అవకాశముంది. 

16:37 - February 23, 2016

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న రోహిత్‌ ఆత్మహత్య, జెఎన్‌యూ వివాదంపై రేపు రాజ్యసభలో చర్చ చేపట్టేందుకు అధికార, ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఈ సమావేశాల్లో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై సమావేశమైన నేతలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజ్యసభ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. 

త్వరలో ఇళ్లు మారనున్న చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారబోతున్నారు. హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన త్వరలో ఫాంహౌస్ కు వెళ్లనున్నారు. వాస్తు సమస్యల కారణంగా చంద్రబాబు కుటుంబం ఇప్పుడు ఉంటున్న ఇల్లు మారుతున్నట్లు సమాచారం. అలాగే నిర్మాణం పూర్తి కాగానే చంద్రబాబు ఫాంహౌస్ నుంచి సొంతింటికి వెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే.

15:54 - February 23, 2016

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సారయ్యకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, సారయ్య అనుచరులు పాల్గొన్నారు.

15:53 - February 23, 2016

హైదరాబాద్: ఉల్లి మరోసారి కళ్లలో నీరు తెప్పిస్తోంది. అయితే ఈసారి రైతులకు ఈ సమస్య చుట్టుకుంది. ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతుధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలోఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌లో 3రూపాయలు పలకడంతో మలక్‌పేట మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ధర పెరిగినప్పుడు ఉల్లిని కొన్న ప్రభుత్వం..ఇప్పుడు కూడా కొని తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

15:50 - February 23, 2016

హైదరాబాద్ : అభివృద్ధి నినాదంతో అధికారంలోకొచ్చిన మోడీ హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నారని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఐ కార్యాలయంలో వామపక్షాల నిరసన ధర్నా పోస్టర్‌ను వివిధ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతోందని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కన్హయ్యను విడుదల చేసి రోహిత్ మృతికి కారణమైనవారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఈ నెల 25న ఇందిరా పార్క్‌ వద్ద నిరసన ధర్నా చేపడతామన్నారు. 

15:48 - February 23, 2016

ఢిల్లీ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో విద్యార్ధి సంఘాల కార్యకర్తలు ఢిల్లీలో భారీ రాలీ నిర్వహించారు. జంతర్‌ మంతర్‌ దగ్గర జరిగిన ఈ ర్యాలీకి హెచ్‌సీయూలోని అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం నాయకులు నేతృత్వం వహించారు. ఢిల్లీలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధి సంఘాల నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకొచ్చే వరకు ఉద్యమం ఆగదని విద్యార్ధి నేతలు తేల్చి చెప్పారు. దీనిలో భాగంగా జంతర్‌ మంతర్‌ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. చలో పార్లమెంటు నిర్వహిస్తారు. రోహిత్‌ తల్లితో కలిసి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి రోహిత్‌ విద్యా చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరతారు. 

ఏపీలో కొత్తగా మరో 50 అసెంబ్లీ స్థానాలు..

విజయవాడ : ఏపీలో ఇప్పుడుండే అసెంబ్లీస్థానాలే కాకుండా కొత్తగా మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సుజనా..చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధిని కోరుకునేవారు టీడీపీలోకి రావచ్చని ఆయన మీడియాతో తెలిపారు.

15:30 - February 23, 2016

హైదరాబాద్ : రెండేళ్లుగా తీవ్రమైన కరువు. చుక్కనీరు లేదు! రిజర్వాయర్లు అడుగంటాయి. దీంతో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. కానీ..ఈసారి మాత్రం రైతులు నిర్భయంగా నాట్లు వేసుకోవచ్చని సూచిస్తోంది వాతావరణశాఖ. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతులకు వాతావరణశాఖ తీపి కబురు అందిస్తోంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని దాంతో రిజర్వాయలన్నీ జలకళతో ఉట్టిపడతాయని చెప్తోంది.

రెండేళ్లుగా తీవ్రమైన కరువుతో....

రైతులకు శుభవార్త..వర్షాల్లేక రెండేళ్లుగా తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి భారత వాతావరణశాఖ తీపి కబురు అందిస్తోంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్లో నైరుతి రుతుపవన వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని భూభౌతిక శాస్త్రశాఖ కార్యదర్శి ఎం.రంజీవన్‌ వెల్లడించారు. ప్రపంచాన్ని వణికించిన ఎల్‌నినో ప్రభావం తగ్గిపోతుందని..ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో మంచి వర్షాలు కురుస్తాయన్నారు. గతేడాది ఎల్‌నినో చాలా తీవ్రంగా ఉందని..ఇది రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌లో ప్రాథమిక నివేదిక విడుదల చేస్తామని తెలిపారు.

ఖరీఫ్‌లో ఆశాజనకంగా రుతుపవనాలు .....

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఊష్ణోగ్రతలు చల్లబడుతున్నాయని దీంతో..ఎల్‌నినో తీవ్రంగా క్రమేపి తగ్గుతుందని తెలిపారు. ఎల్‌నినో తీవ్రత తగ్గింది అని చెప్పడానికి వీలుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని,..పసిఫిక్‌ మహాసముద్రంలో ట్రేడ్‌ విండ్స్‌ బలంగా ఉన్నాయన్నారు. దీంతో వచ్చే 15 రోజుల్లో ఎల్‌నినో తీవ్రత మరింత తగ్గుతుందని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అంచనా వేసింది. బలమైన ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల తర్వాత 50శాతం వరకూ తటస్థ వాతావరణం నెలకొనే అవకాశాలుంటాయి. మరో 40 శాతం వరకూ లానినో ప్రభావం నెలకొంటుందని గత రికార్డులు చెప్తున్నాయి. లానినో పరిస్థితులు ఏర్పడితే సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు..లేదా అతివృష్టి, కుంభవృష్టి కురవవచ్చు. తటస్థ వాతావరణం నెలకొనే సమయానికి అనుకూలంగా మంచి వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో..ఈసారి జూన్‌ నుంచి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేస్తున్నారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో చల్లబడుతున్న ఉపరితల ఊష్ణోగ్రతలు .....

భారత్‌లో నైరుతి రుతుపవనాల సమయంలో వర్షాలకు పసిఫిక్‌ మహాసముద్రంలో వర్తక పవనాలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో బలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో వర్షాలు సకాలంలో కురిసి రిజర్వాయర్లు జలకళతో ఉట్టిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

15:27 - February 23, 2016

హైదరాబాద్ : ఇండియా చైనాను మించిపోయింది. ఆ దేశానికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. దశాబ్ధంగా దూసుకుపోతున్న భారత్‌..డ్రాగన్‌ను దాటేసింది. అయింతే ఇదంతా అభివృద్ధిలో కాదు... కాలుష్యంలో చైనాను క్రాస్‌ చేసేసి ముందు ముందుకు పరుగులు

చైనాతో అన్నిరంగాల్లో పోటీపడుతున్న భారత్‌... కాలుష్యంలో మాత్రం డ్రాగన్‌ను వెనక్కి నెట్టేసింది. చైనా కన్నా అధికంగా పొల్యూషన్‌ను విడుదల చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. పర్యావరణ పరిరక్షణపై కృషిచేస్తున్న గ్రీన్‌పీస్‌ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. నాసా ఉపగ్రహం ఇచ్చిన సమాచారం మేరకు నివేదిక తయారుచేసింది.

గ్రీన్‌పీస్‌ సంస్థ నివేదిక ప్రకారం...

గ్రీన్‌పీస్‌ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు చైనా కన్నా భారత్‌దేశంలోనే కాలుష్యం అధికంగా ఉంది. గత పదేళ్లుగా సగటున రెండు శాతం పొల్యూషన్‌ పెరుగుతూ 2015లో చైనాను దాటేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను కూడా గ్రీన్‌పీస్‌ సంస్థ ప్రస్తావించింది. WTO నివేదిక ప్రకారం ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న 20 పట్టణాల్లో 13 పట్టణాలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో పొల్యూషన్‌ ఎక్కువుగా ఉంది. దేశంలో 32 పట్టణాల్లో 23 పట్టణాలు జాతీయ ప్రమాణాలకు మించి 70 శాతం అధికంగా కాలుష్యం నమోదవుతోంది.

కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి చైనా ప్రభుత్వం కఠిన చర్యలు...

కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో పొల్యూషన్‌ను పరిమితుల్లో పెట్టగలుగుతోంది. ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇప్పటికీ ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. 

టిఆర్ఎస్ లో చేరిన బస్వరాజు సారయ్య

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సారయ్యకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, సారయ్య అనుచరులు పాల్గొన్నారు.

15:12 - February 23, 2016

ఢిల్లీ :పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. గతంలో వలె సభా సమయం వృధా కాకుండా విపక్షాలు సహకరిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

15:10 - February 23, 2016

కడప : రైల్వే బడ్జెట్‌లో కడప జిల్లాకు ఈసారి కూడా మొండిచెయ్యే మిగలనుందా ? రైల్వే బడ్జెట్‌పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలన్నీ అడిఆశలేనా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రతి బడ్జట్‌లో కడప జిల్లాకు ఎంగిలి మెతుకులు తప్ప ఎప్పుడూ సాయం చేసింది లేదు. జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లాగా మాటలు చెబుతున్నారే తప్ప కేంద్రం నుంచి మూటలు తీసుకరావటంలో విఫలం అవుతున్నారని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచి రైల్వే బడ్జెట్‌లో అన్యాయమే...

రైల్వే బడ్జట్‌పై కడప జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకోవటం మానేశారు. కారణం జిల్లాకు మొదటి నుంచి రైల్వే బడ్జెట్‌లో అన్యాయమే జరుగుతోంది. కడప-బెంగుళూరు లైను మూడు అడుగులు ముందుకు..ఆరడగులు వెనక్కి అన్న చందంగా జరుగుతోంది. ఎర్రగుంట్ల నుండి నంద్యాల లైను 30 ఏళ్లుగా పూర్తికాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కృష్ణపట్నం, ఓబులాపురం లైను పరిస్థితీ అంతే. కడప-భాకరాపేట-గిద్దలూరు లైను సర్వే కూడా పూర్తి కాలేదు.

కొలిక్కి రాని కడప-బెంగళూరు లైను...

నిర్మాణంలో ఉన్న లైన్‌లకే అతీగతి లేకుంటే కొత్త లైన్‌ల సంగతి ఇక చెప్పనక్కర్లేదని జిల్లావాసులు అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కడప నుండి విజయవాడకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు. కడప జిల్లా రైల్వే స్టేషన్‌లలో వసతులు ఏమీ లేవని..కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీ అవినాశ్‌రెడ్డి అన్నారు. వీటన్నింటిపై ఈ సారి బడ్జెట్‌లో గట్టిగా మాట్లాడతామని ఆయన అంటున్నారు.

ఏపీ, తెలంగాణకు రూ. 21,600 కోట్లు ...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 21, 600 కోట్ల రూపాయలు అవసరమని చెప్పిన రైల్వేమంత్రి,.కమిటీ రిపోర్టు మేరకే నిధుల కేటాయింపు ఉంటుందన్న ప్రకటనపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొద్దుటూరు-ఖమ్మం, భాకరాపేట-గిద్దలూరు రైల్వే మార్గాన్ని అప్పటి యూపీఏ-ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం మర్చిపోయింది. ప్రతి రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణం జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీల అసమర్థతవల్లే అని ఆరోపిస్తున్నారు. అయితే ఈసారైనా జిల్లాకు న్యాయం జరిగేలా ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారైనా త్రిమూర్తుల్లాంటి ముగ్గురు ఎంపీలు..నమ్ముకున్న ప్రజల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లకుండా రైల్వే బడ్జట్‌లో జిల్లాకు మేలు జరిగేట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

15:06 - February 23, 2016

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసింది.

బ్యాంకు మోసం కేసులో కేంద్ర మంత్రి సుజనాపై ఆరోపణలు....

కాగా ఈ కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు బయటికి రావడంతో కొత్త మలుపు తిరిగింది. కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ ఆరోపించారు. తన సోదరుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ సుజనా గ్రూప్‌లో గతంలో పనిచేశారని, అసలు తన సోదరుడికి అన్ని వందల కోట్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇదంతా రాజకీయ కుట్ర - విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ......

తన తండ్రి పార్టీ మారారన్న కక్షతోనే ఈ కేసులో నా సోదరుడిని ఇరికించారని ఆమె తెలిపారు. సుజనా చౌదరికి చెందిన ఆ కంపెనీపై సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అక్కడ పనిచేయొద్దని తన తండ్రి విజయరామారావు శ్రీనివాస్‌కు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు.

మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకులో వంద కోట్ల రుణం పొందిన సుజనా ?

ఇదిలా ఉంటే ఇప్పటికే సుజనా చౌదరిపై గతంలో రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. తనకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు.. తనపై వచ్చిన ఆరోపణలు ఆధారం లేనివని సుజనా కొట్టిపారేశారు. 

15:03 - February 23, 2016

హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైవైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ మండి పడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జ్యోతుల విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలను కట్టడి చేసుకోవాలని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆయన భగ్గుమన్నారు. కట్టడి చేసుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు జంతువులేమీ కాదని ఆయన అన్నారు. అయినా నిన్న టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు... ప్రభుత్వంతో టచ్ ఉన్నారు తప్పించి, టీడీపీతో కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జ్యోతు డిమాండ్ చేశారు.

14:59 - February 23, 2016

హైదరాబాద్ : సీఎంఏ ఇంటర్‌ సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులు సత్తా చాటారు. అఖిలభారత స్థాయిలో నిర్వహించిన పరీక్షలో అత్యధిక ర్యాంకుల్ని మాస్టర్‌మైండ్స్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ప్రతిభావంతులైన అధ్యాపకులతో విద్యాభోదన వల్లే అత్యధిక ర్యాంకులు విద్యార్థులు సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ మట్టుపల్లి ప్రకాశ్ తెలిపారు. ర్యాంకులు సాధించిన వారందరికి ఆయన అభినందనలు తెలిపారు. 

14:56 - February 23, 2016

ప్రకాశం : కనిగిరిలో విషాదం చోటుచేసుకుంది. శివరామయ్య, పద్మావతి అనే వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శివరామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శివరామయ్య భార్య పద్మావతి గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకతను హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మరో కుమారుడు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. కనిగిరిలో ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ధ దంపతులు అనారోగ్య కారణాల వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.

14:54 - February 23, 2016

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారో ప్రజలకు చంద్రబాబు చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... ఆనాడు తాము టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినప్పుడు రాజీనామలు చేసి ఎన్నికల్లో పోటీచేయాలన్న బాబు..ఇవాళ ఆయనేం చేస్తున్నారో చెప్పాలన్నారు. తాను చేస్తే నీతి...ఇతరులు అదే పనిచేస్తే అవినీతి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

డంపింగ్ యార్డ్ లో రెండు కోట్లు....

హైదరాబాద్ : జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో బ్యాగు కలకలం చెలరేగింది. బ్యాగులో 2కోట్ల రూపాయలు ఉన్నట్లు... పోలీసులకు సమాచారం అందింది. సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు పంచుకోవడంలో.... వివాదం చెలరేగి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో డంపింగ్ యార్డులోని 150మంది సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు.

 

14:50 - February 23, 2016

హైదరాబాద్ : సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఉక్కపోత, ఎండవేడి ఇవే కాదు జాలీని కలిగించే నెల కూడా ఇదే. ఎంత హాట్ ... హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండాలంటే ఎలా, చర్మాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న.. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానోపడుతూనే ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య వుండనే ఉంటుంది. సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మానవి కార్యక్రమంలో 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ డెర్మటాలజిస్టు జ్యోశ్న, న్యూట్రీషియనిస్టుజానకి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

కడప పెద దర్గాలో ఏఆర్ రెహ్మాన్

కడప : ప్రముఖ దర్గాలో ఒకటైన కడప పెద్ద దర్గా( అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ , ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. దర్గాలో రెహ్మాన్ ప్రార్థనలు చేశారు. రెహ్మాన్ చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

14:03 - February 23, 2016

హైదరాబాద్ : మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు టీపీసీసీ ప్రకటించింది. ఇవాళ సారయ్య టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమసక్షంలో సారయ్య గులాబీ గూటికి చేరనున్నారు.

14:00 - February 23, 2016

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. కన్హయ్య అరెస్టుపై నివేదిక ఢిల్లీ పోలీసులు  సమర్పించారు. ఫిబ్రవరి 9న జెఎన్ యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో కన్హయ్య అక్కడే ఉన్నాడన్న ఢిల్లీ పోలీసులు తెలిపారు. కన్హయ్య బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు రేపు నిర్ణయం ప్రకటించనుంది. మరోవైపు కన్హయ్యపై దాడి చేసిన లాయర్లపై సుప్రీంలో విచారణ జరిగింది. సుప్రీంలో ప్రశాంత్ భూషణ్  పిటిషన్ వేశారు. తాము కన్హయ్యపై దాడి చేశామని స్టింగ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు లాయర్లు  చెప్పారు. 
స్టింగ్ ఆపరేషన్ టేపు ఆధారంగా సుప్రీంకోర్టు  విచారణ జరపనుంది. 

 

13:54 - February 23, 2016

ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ ఈనెల 25న రిలీజ్ కాబోతున్నారు. 1993లో ముంబై పేలుళ్లు, అక్రమ ఆయుధాల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు ఎరవాడ జైలు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సంజయ్‌ దత్‌కు 60 నెలల శిక్ష పడగా.. 50 నెలలు పూర్తి చేస్తుకున్నారని తెలిపారు. జైలులో ఆయన సత్పవర్తనతో ముందుగానే విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 

13:51 - February 23, 2016

ఖమ్మం : లో నగరపాలక ఎన్నికల సందడి మొదలైంది. నగర పాలక ఎన్నికల్లో పోటిచేసే అభ్యర్ధుల జాబితాను సీపీఎం జిల్లా కమిటి వెల్లడించింది. మొదటి విడతలో 40 మంది అభ్యర్ధుల పేర్లలను ఖరారు చేసినట్లు జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికార బలాన్ని ప్రయోగిస్తూ..విపక్షాలపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. నీతి నిజాయిలతో బెటర్ ఖమ్మం రూపొందించడమే సీపీఎం లక్ష్యమని పోతినేని తెలిపారు. మచ్చలేని నీతివంతమైన పాలన అందించే అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎంది నిరంతర పోరుబాటేనని తెలిపారు. సీపీఎంను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

13:48 - February 23, 2016

​విశాఖ : విమ్స్‌ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలంటూ  విశాఖ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ప్రజల ఉద్యమానికి మద్దతుగా సీపీఎం నేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు ప్రారంభించారు. విమ్స్‌ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌
 చేశారు. 

13:45 - February 23, 2016

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి వైసిపి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు సర్కార్‌ అని రోజా విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల్ని టిడిపిలోకి చేర్చుకోవడం నీతిమాలిన రాజకీయాలని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం..ఇవాళ డబుల్‌ డిజిట్‌ గ్రోత్ సాధించామని ఎలా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని జేబులు నింపుకున్న చంద్రబాబు..అభివృద్ధి చేశానని ఎలా చెప్పుకుంటాడని ప్రశ్నించారు.  

 

13:09 - February 23, 2016

విశాఖ : ఏజెన్సీలోని కొయ్యూరు మండలం రేవులపాడు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో  ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఓఎస్ డీ బాపూజీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కొయ్యూరు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. 


 

12:52 - February 23, 2016

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజరుకృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన పాత్రధారులుగా ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం నిర్మిస్తున్న చిత్రం 'గుంటూరు టాకీస్‌'. శ్రీ చరణ్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. రఘుకుంచె, మధుర శ్రీధర్‌ పాటలను లహరి ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ సందర్భంగా మధురశ్రీధర్‌ మాట్లాడుతూ, 'ప్రవీణ్‌ సత్తారులాంటి దర్శకులు మరికొంత మంది వస్తే మరిన్ని మంచి సినిమాలొస్తాయి' అని అన్నారు. 'జాతీయ అవార్డు సినిమాను తీసిన ప్రవీణ్‌ సత్తారు చేసిన మరో కొత్త ప్రయత్నమిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అల్లరి నరేష్‌ తెలిపారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ, 'సిద్ధు చాలా బ్రిలియెంట్‌ యాక్టర్‌. ఈ చిత్రం కచ్చితంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది' అని చెప్పారు. ''ప్రొడ్యూసర్‌.కామ్‌' అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ సినిమాకు నిర్మాతలుగా మారే అవకాశాన్ని కలిగిస్తున్నాం. సినిమాను సాధారణ వ్యక్తికి దగ్గరగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నరేష్‌గారు స్థాపించిన కళాకారుల ఐక్య వేదిక ద్వారా మాకు కళాకారులను అందించారు. ఆయన సపోర్ట్‌ వల్లే సినిమా ఇంత త్వరగా పూర్తయ్యింది. హిందూపూర్‌ ప్రజల సహకారం మరువలేనిది. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని ప్రవీణ్‌ సత్తారు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, 'ఇది గుంటూరుకు మాత్రమే సంబంధించిన కథ కాదు. యూత్‌ అందరికీ నచ్చే కథ. థియేట్రికల్‌ రైట్స్‌ తీసుకుని సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత సాయి కొర్రపాటికి కృతజ్ఞతలు' అని చెప్పారు.

12:48 - February 23, 2016

రాఘవ లారెన్స్‌ హీరోగా బండ్ల గణేష్‌ నిర్మాతగా ఓ హర్రర్‌ చిత్రం తెరకెక్కనుంది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళంలో రూపొందిన హర్రర్‌ థ్రిల్లర్‌ 'గంగ' చిత్రంతో వంద కోట్ల కలెక్షన్లు రాబట్టిన దర్శకుడిగా ప్రశంసలందుకున్న రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మించబోతున్నాను. భారీ గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ఏకకాలంలో తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ సినిమాకు 'నాగభైరవ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నాం. అన్ని కుదిరితే ఏప్రిల్‌లో సెట్స్‌మీదకి తీసుకెళ్ళనున్నాం. భారీ చిత్రాల దర్శకుడు రాఘవ లారెన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం' అని అన్నారు.

12:46 - February 23, 2016

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీమూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న 'జనతా గ్యారేజ్‌' షూటింగ్‌ కార్యక్రమాలు సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ,'ఎన్టీఆర్‌ నటనకి, ఆయనకున్న మాస్‌ ఇమేజ్‌కి సరిపడే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న హైలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ను నేనెలా చూడాలనుకుంటున్నానో, అటువంటి క్యార్టెకర్‌ని ఈ చిత్రం కోసం తీర్చిదిద్దాను. ఆగస్ట్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశాం' అని చెప్పారు. 'మా బ్యానర్‌లో రెండో చిత్రంగా ఎన్టీఆర్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌లో తొలి చిత్రంగా 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివగారితో మళ్ళీ పని చేయడం విశేషంగా భావిస్తున్నాం. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాం. హైదరాబాద్‌, చెన్నై, ముంబైలతోపాటు కేరళలో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది' అని నిర్మాతలు చెప్పారు. 
మోహన్‌లాల్‌ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈచిత్రంలో సాయికుమార్‌, ఉన్ని ముకుందన్‌, అజరు, బ్రహ్మాజీ, బెనర్జీ, జాన్‌, గుణాజీ, సితార, దేవయాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : తిరు, ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ : ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌ : ఆణల అరసు, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు : నవీన్‌ యెర్నేవి, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం), రచన- దర్శకత్వం : కొరటాల శివ.

 

కన్హయ్య బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు, ఏఐఎస్ ఎఫ్ నేత కన్హయ్య బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కన్హయ్య అరెస్టుపై పోలీసులు నివేది సమర్పించారు.

రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి

నల్లగొండ : జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి చెందాడు. కటక్‌కు చెందిన పీవీసీ కుమార్ (25) హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు బైక్‌పై వెళుతున్నాడు. ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో కోదాడకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.

కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తున్నారు. గంగా ప్రక్షాళనకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పాల ఉత్పత్తిలో వృద్ధి రేటు సాధించామని తెలిపారు. 

'నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం కోసమే మేక్ ఇన్ ఇండియా'

ఢిల్లీ : నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం కోసమే మేక్ ఇన్ ఇండియా అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించామన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా 37 ఎఫ్ డీఐలు పెరిగాయన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా స్కూళ్లల్లో 4.7 లక్షల టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. యూరియాకు వేపపూత వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకతతో అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలో కూడా శానిటేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

11:57 - February 23, 2016

ఢిల్లీ : దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ప్రారంభ ఉపన్యాసం చేశారు. పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదల అభ్యున్నతి, యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రధాని జన్ ధన్ యోధన పథకం విజయవంతమైందన్నారు. అందరికీ ఇళ్లు, ఆహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. 
68 కోట్ల మందికి ఆహార భద్రత 
68 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామని చెప్పారు. రైతుల కోసం కౌశల్ బీమా యోజన పథకాన్ని తెచ్చామని వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగించే పంటల బీమా పథకం కల్పించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 2017 నాటికి రైతులకు భూసార కార్డులిస్తామని చెప్పారు.
2022 నాటికి అందరికీ ఇళ్లు 
2022 నాటికి దేశంలోని అందరికీ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తుందన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. మైనార్టీ బడ్జెట్ లో సగానికిపైగా స్కాలర్ షిప్స్ కే కేటాయించామని తెలిపారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించేందుకు ఈ-మార్కెట్లను ఏర్పాటు చేశామని వివరించారు. కొత్త  యూరియా విధానం ద్వారా సబ్బిడీ లీకేజీని నివారించామన్నారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కృష్టి చేస్తుందన్నారు. 
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం కోసమే మేక్ ఇన్ ఇండియా 
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం కోసమే మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించామన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా 37 ఎఫ్ డీఐలు పెరిగాయన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా స్కూళ్లల్లో 4.7 లక్షల టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. యూరియాకు వేపపూత వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకతతో అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలో కూడా శానిటేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

మార్చి 2017 నాటికి రైతులకు భూసార కార్డులు : రాష్ట్రపతి

ఢిలీ : మార్చి 2017 నాటికి రైతులకు భూసార కార్డులిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. 2022 నాటికి దేశంలోని అందరికీ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తుందన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. 

68 కోట్ల మందికి ఆహార భద్రత : ప్రణబ్

ఢిల్లీ : 68 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామని రాష్ట్రపతి ప్రణమ్ ముఖర్జీ చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగించారు. రైతుల కోసం కౌశల్ బీమా యోజన పథకాన్ని తెచ్చామని వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగించే పంటల బీమా పథకం కల్పించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నారు. పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

 

హైకోర్టును ఆశ్రయించిన జెఎన్ యూ విద్యార్థులు

 ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఉమర్ ఖలీద్ తోపాటు నలుగురు విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో లొంగిపోయేందుకు రక్షణ కల్పించాలంటూ పిల్ దాఖలు చేశారు. పిల్ దాఖలు చేసిన విద్యార్థులపై దేశం ద్రోహం కేసు ఆరోపణలున్నాయి. 

10:36 - February 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో టి.సర్కార్ అలర్టయింది. వేసవి మూలంగా జరిగే ప్రాణనష్టాన్ని నివారించేందుకు విపత్తుల నిర్వహణ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాంకేతిక అంశాలను ఉపయోగించుకుంటూ ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రెవెన్యూ శాఖ డ్రాఫ్ట్ పాలసీ రూపకల్పన
ఏప్రిల్‌లో భగభగలాడాల్సిన సూర్యుడు ఫిబ్రవరిలోనే రెచ్చిపోతున్నాడు. బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకేలా చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితినిబట్టి వేసవి తీవ్రంగా ఉండబోతోందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ వేసవి మరణాలను నివారించేందుకు ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ శాఖ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించింది. రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఐటీ, రవాణ, రిమోట్ సెన్సింగ్, సమాచార పౌరసంబంధాలు, 108, పశుసంవర్థక శాఖల అధికారులతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా సమీక్ష జరిపారు. ఈ శాఖలన్నీ ఉమ్మడిగా ఎండ తీవ్రత, వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నాయి. 
కలెక్టర్లకు వాతావరణశాఖ రిపోర్టులు 
ఐటీ శాఖ సేవలను ఉపయోగించుకొని సెల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపడం, ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేసి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పోస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్టులను ఐదు రోజుల ముందే జిల్లా కలెక్టర్లకు పంపించి జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించనున్నారు. 
పత్రికలు, టీవీలు, సెల్‌ఫోన్ల ద్వారా ప్రచారం
ఇక పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం, సెల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పంపించాలని నిర్ణయించారు. ఇక ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్‌ను డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తారు. ఎంత మంది వడదెబ్బతో ఆస్పత్రుల్లో చేరారు, వారికి అందుతున్న వైద్యసేవలు ఎలా ఉన్నాయో తెలుసుకునే విధంగా యాప్‌ను తయారు చేయబోతున్నారు. వచ్చే నెల 15 నాటికి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలను అమల్లోకి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఈ పాలసీపై తుది రూపం ఇచ్చేందుకు నాలుగైదు రోజుల్లో కమిటీ సమావేశం కానుంది.

 

10:33 - February 23, 2016

ఖమ్మం : కార్పొరేషన్‌కు ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్నీ అభ్యర్ధుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాల కోసం అనేక విధాలుగా అన్వేషిస్తున్నాయి. కొన్ని పార్టీలయితే ఇంటెలిజెన్స్‌ నివేదికలు సైతం తెప్పించుకుంటున్నాయి. కార్పొరేషన్‌ పీఠం కోసం రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలు చేస్తున్నాయి. దీంతో నగరంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. 
మొదలైన ఎన్నికల హడావుడి 
పోరాటాల ఖిల్లా ఖమ్మంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. అభ్యర్ధుల ఎంపికలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటే.. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో పీఠం దక్కించుకున్న సీపీఎం మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాన్నే ఇక్కడ కూడా రిపీట్‌ చేయాలని అధికార పార్టీ చూస్తుంటే.. మిగతా పార్టీలు కూడా ఎన్నికల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని తహతహలాడుతున్నాయి. 
ఖమ్మం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు 
ఖమ్మం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. మేయర్‌ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా ఎస్టీకి రెండు సీట్లు, ఎస్సీ జనరల్‌కు 3 సీట్లు, ఎస్సీ మహిళలకు మూడు, బీసీ జనరల్‌కు 9 సీట్లు, బీసీ మహిళలకు 8 సీట్లు, మహిళా జనరల్‌ సీట్లు 13, జనరల్‌ సీట్లు 12గా విభజించారు. దీంతో పార్టీలన్నీ ఉత్సాహవంతులైన, ప్రజల్లో పలుకుబడి ఉన్న అభ్యర్ధుల వేటలో పడ్డాయి. అయితే కొన్ని డివిజన్లలో తక్కువ ఓటర్లు, మరికొన్ని డివిజన్లలో ఎక్కువ ఓటర్లు ఉండడంతో అభ్యర్ధులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఎక్కువ ఓటర్లు ఉన్న డివిజన్లలో పోటీ చేస్తే ఖర్చుతో పాటు గెలుపు కష్టమని పలువురు అభ్యర్ధులు భావిస్తున్నారట. 
కార్పొరేషన్‌ దక్కించుకునేందుకు పార్టీలు యత్నాలు
ఇక పార్టీలయితే ఎవరికీ వారు కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాయి. సీపీఎం మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. గతంలో మంచి పాలన అందించాం.. నిత్యం ప్రజలతో ఉండే తమ అభ్యర్ధులను గెలిపించాలని సీపీఎం ప్రచారం చేస్తోంది. ఇక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌.. గెలుపు కోసం పువ్వాడ అజయ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంక్‌ మాతోనే ఉందన్న ధీమాలో టీడీపీ నేతలున్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ కూడా పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఖమ్మంలో బలంగా ఉన్న మైనారిటీల ఓట్లను దక్కించుకునేందుకు జిల్లా అధ్యక్షుడు బేగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇదిలావుంటే పార్టీ టికెట్లను ఆశించినవారే టీఆర్‌ఎస్‌లో చేరుతుండగా.. మిగతా పార్టీలు చివరి నిమిషంలో టికెట్లు ఇస్తే.. టికెట్లు రానివారు కూడా పార్టీ మారరనే అభిప్రాయంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఖమ్మం ఎన్నికలో ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు ? కుల, ఆర్ధిక బలం ఎంతవరకు పని చేస్తాయో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. 

 

10:24 - February 23, 2016

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు మరో శుభవార్త. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది జీహెచ్‌ఎంసీ. ఇప్పటికైనా నగరవాసులు పన్ను చెల్లించి బల్దియా అభివృద్ధికి పాటుపడాలంటున్నారు మేయర్‌. మార్చి 31లోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. 
పాత బకాయిలు రూ.619 కోట్లు 
బల్దియాకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్నుపై దృష్టి సారించింది జీహెచ్‌ఎంసీ. ఎలాగైనా పూర్తిస్థాయిలో పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు అధికారులు. గ్రేటర్‌ పరిధిలో కార్పొరేషన్‌కు మొత్తం రెండు వేల 78 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు 619 కోట్లు కాగా.. వడ్డీయే 474 కోట్లు ఉంది. ఈ ఏడాది వడ్డీ కూడా కలుపుకొని ప్రభుత్వం 532 కోట్లు వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఆరు లక్షల 24 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 
రూ.1100 కోట్లు ఆస్తిపన్ను వసూలు లక్ష్యం
ఇక ఈ ఏడాదికి ఆస్తిపన్ను వసూలు 1100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ.. ఇప్పటికి 575 కోట్లు వసూలు చేసింది. మిగిలిన మొత్తాన్ని వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డివిజన్ల వారీగా డిఫాల్టర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక పన్ను వసూలు ప్రక్రియను ప్రత్యేక బృందాలకు అప్పగించారు. దీంతో 707 కేసులు పరిష్కారానికి వచ్చాయంటున్నారు. మరోవైపు ఆస్తిపన్ను క్లియరెన్స్‌కు చాలామంది చెక్కులు ఇచ్చారని.. అందులో కొన్ని బౌన్స్‌ అయిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. చెక్‌ బౌన్స్‌ కేసులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ఇక నగరవాసులు మార్చి 31 వరకు వెయిట్‌ చేయకుండా వెంటనే ఆస్తిపన్ను కట్టాలని అధికారులు కోరుతున్నారు. 
ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలపై ప్రత్యేక దృష్టి 
ఇక నగరవాసులంతా ఆస్తిపన్ను చెల్లించి నగరాభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. బకాయిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సర్కార్‌.. బకాయిలపై వడ్డీ మాఫీ చేసిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బకాయిదారులంతా మార్చి 31లోగా ఆస్తిపన్ను చెల్లించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు మేయర్‌. మరి బల్దియాకు రావాల్సిన ఆదాయాన్ని వసూలు చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు నెరవేరుతాయో చూడాలి. 

10:15 - February 23, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌లతో పాటు అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగడంతో సైకిల్‌కు నట్లు బిగిస్తోంది తెలుగుదేశం తెలంగాణ శాఖ. ఈసారి ఎలాగైనా సవారీ మొదలుపెట్టి.. కారు జోరుకు బ్రేక్‌ వేస్తామంటున్నారు టీడీపీ నేతలు. ఇందుకోసం పక్కా వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. మరీ
గులాబీ పార్టీకి చెక్‌ పెట్టేందుకు టీడీపీ వ్యూహం 
తెలంగాణలో గత కొంతకాలంగా అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కక అవస్థలు పడుతున్న తెలుగుదేశం పార్టీ.. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీకి చెక్‌ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఖమ్మంలో పార్టీకి మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో.. కార్యకర్తల్లో భరోసా కల్పిస్తే గెలుపు సాధ్యమని నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు టీడీపీ నేతలు. యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేమీ కాదని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
కేడర్‌ను సమాయత్తం చేస్తున్న పార్టీ
ఇక ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది పార్టీ అధిష్టానం. ఇప్పటికే ఎన్నికల బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించారు. ఖమ్మం జిల్లా గెలుపు బాధ్యతలు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలకు అప్పగించారు. అదేవిధంగా వరంగల్‌ ఎన్నికల బాధ్యతలను రేవూరి ప్రకాష్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డితో పాటు.. సీతక్కలు పర్యవేక్షిస్తున్నారు. వీరికి స్థానికంగా మంచి ప్రజాధరణ ఉండడంతో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది.  ఇక అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతను రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
గెలుపు కోసం పావులు కదుపుతున్న టీడీపీ 
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ.. గెలుపు దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీ-టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డిలు కసరత్తు ముమ్మరం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో జిల్లాల్లో మకాం వేసి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ముందుకెళ్లినా ప్రస్తుతం పొత్తుపై నేతలు పెదవి విరుస్తున్నారు. అయితే.. పొత్తుపై బీజేపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే కలుపుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమేనని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇక బీజేపీతో పొత్తు లేకున్నా అధికార పార్టీ హవాకు ఖచ్చితంగా బ్రేక్‌ వేస్తామని తెలుగుదేశం తెలంగాణ శాఖ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సైకిల్‌ స్టాండ్‌ తీసి ముందుకెళ్తుందా లేదో వేచిచూడాలి. 

సంత్ నిరంకారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో క్లీన్ ఆండ్ గ్రీన్

హైదరాబాద్ : సంత్ నిరంకారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో క్లీన్ ఆండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో ఫౌండేషన్ కు చెందిన 400 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.  

10:07 - February 23, 2016

హైదరాబాద్ : సంత్ నిరంకారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో క్లీన్ ఆండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో ఫౌండేషన్ కు చెందిన 400 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.  

నేడు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ధర్నా

ఢిల్లీ : నేడు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టనున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలిరానున్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్ష నేతలు పాల్గొనున్నారు. 

09:30 - February 23, 2016

శ్రీనగర్ : ఉగ్రవాదులు-భద్రతా దళాలకు మూడు రోజులు భీకర పోరు తర్వాత జమ్ము-కశ్మీర్‌ ప్యాంపోర్‌ ఎన్‌కౌంటర్‌ ముగిసింది.  ప్యాంపోర్‌లోని జమ్ము-కశ్మీర్‌ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌ ఇనిస్టిట్యూట్‌ భవనంలో శనివారం  ప్రవేశించిన ముష్కరులను భద్రతా దళాలు మట్టు పెట్టాయి. ఈడీఐ భవనం నుంచి ఇద్దరు ఉగ్రవాదులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మూడో మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఆత్మహుతి దళ సభ్యులని అనుమానిస్తున్నారు.  ప్యాంపోర్‌ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బందితోపాటు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌ 48 గంటలపాటు కొనసాగింది. 
సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై కాల్పులు 
జమ్ము-కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు సమీపంలో ఉన్న ప్యాంపోర్‌ ఈడీఐ భవనంలో  చొరబడిన ఉగ్రవాదులను మన భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శనివారం ఈ భవనంలో ప్రవేశించిన ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై కాల్పులు జరిపాయి. ఆ రోజు ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగిన కాల్పులకు మన భద్రతా దళాలు స్వల్ప విరామం ప్రకటించి, మళ్లీ ఆదివారం పునఃప్రారంభించాయి. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం వరకు  మొత్తం 48 గంటలపాటు ఆపరేషన్‌ సాగింది.   ఈడీఐ భవనంలో ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు ఎదురు కాల్పుల్లో మరణించడంతో ఆపరేషన్‌ ప్యాంపోర్‌కు మన భద్రతా దళాలు ముగింపు పలికాయి. 
ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి 
ప్యాంపోర్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మరణించారు. ఐదంస్తుల ఈడీఐ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల ఏరివేతకు ప్రయత్నించే క్రమంలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో   ముగ్గురు ఆర్మీ కమాండోలు కెప్టెన్‌ తుషార్‌ మహాజన్‌, కెప్టెన్‌ పవన్‌కుమార్‌, లాన్స్‌నాయక్‌ ఓం ప్రకాష్‌ ప్రాణాలు కోల్పోయారు. పారా మిలటరీ బలగాలకు చెందిన ఇద్దరు జవాన్లు, ఈడీఐ ఇనిస్టిట్యూట్‌ ఉద్యోగి అబ్దుల్‌ గనీ మీర్‌ ఎదురు కాల్పుల్లో మరణించారు. ఈ భవనంలోని నేలమాళిలో నక్కిన ముష్కరులను మట్టుపెట్టేందుకు మన భద్రతా దళాలు భారీ ఆయుధాలతోపాటు, పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు  ఉపయోగించాల్సి వచ్చింది. బంకర్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులతో పోరు సల్పడం చాలా కష్టమైన వ్యవహారమని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈడీఐ భవనం చివరి అంతస్థు, పైకప్పు ఆదివారం కాలిపోయాయి. శ్రీగర్‌లో ఉగ్రవాదులు ఒక భవనంలో ప్రవేశించి, దీనిని తమ ఆధీనంలోకి తీసుకుని కాల్పులు జరపడం ఆరేళ్లలో ఇది మొదటిసారి. అలాగే  మూడు రోజులపాటు  కొనసాగిన ఎన్‌కౌంటర్‌ కూడా ఆరేళ్లలో ఇదే మొదటిది. 
దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఆత్మాహుతి దళ సభ్యులే :  భద్రతాదళాలు
ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఆత్మాహుతి దళ సభ్యులని మన భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వీరు మన జమ్ము-కశ్మీర్‌లోకి ప్రవేశించారు. వీరంతా పాకిస్థానీయులేనని అనుమానిస్తున్నారు. ఈడీఐ భవనం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. 

 

09:21 - February 23, 2016

హర్యానా : జాట్ల రిజర్వేషన్ల ఉద్యమంతో తొమ్మిది రోజుల పాటు అట్టుడికిన హర్యానాలో తిరిగి సాధారణ పరిస్థితులు నెకొటున్నాయి. జాట్‌ సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో  కమిటీ  ఏర్పాటు చేయడంతో  జాట్లు  మెత్తపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే జాట్ల రిజర్వేషన్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమణకు కొన్ని జిల్లాల   జాట్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు.  మరోవైపు రిజర్వేషన్ల ఆందోళన హింసతో హర్యానాకు  20 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్‌ అంచనావేసింది. 
రోహ్‌తక్‌లో పరిస్థితి ఉద్రిక్తం 
జాట్ల రిజర్వేషన్ల ఉద్యమంతో గృహ దహనాలు, లూటీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి దుశ్చర్యలతో తొమ్మిది రోజుల పాటు  అట్టుడికి హర్యాలో తిరిగి క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోహ్‌తక్‌లో పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.... మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పౌరజీవనం  నెలకొంటోంది.  రోహ్‌తక్‌, భివాని, జజ్జర్‌, సోనేపట్‌లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ప్రాంతోల్లో సోమవారం కూడా విద్యాసంస్థలను మూసివేశారు. జాట్‌ నేతలు కొన్ని ప్రాంతాల్లో ఆందోళన విరమించారు. 
ఖైతాల్‌, కలాయత్‌లో కర్ఫ్యూ తొలగింపు 
జాట్ల ఆందోళన దరిమిలా  హర్యానాలోని చాలా ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను క్రమక్రమంగా సడలిస్తున్నారు. ఖైతాల్‌, కలాయత్‌లో కర్ఫ్యూ పూర్తిగా తొలగించారు.  రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో కమిటీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత జాట్లు పునరాలోచనలో పడ్డారు.  వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ హామీ ఇచ్చారు.  
రహదారుల దిగ్బంధన ఉపసంహరణ 
ఉద్యమం సందర్భంగా జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధనను ఉపసంహరించుకున్నారు. దీంతో షహరాన్‌పూర్‌-అంబాలా, పవోంటాసాహెబ్‌-యమునానగర్‌, అంబాలా-ఖైతాల్‌, షరాన్‌పూర్‌-పిప్లి-కురుక్షేత, జీరక్‌పూర్‌-పర్వానో, లడ్వాషాబాద్‌ మార్గాలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాట్ల రిజర్వేషన్ల ఉద్యమం దరిమిలా ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు  న్యూఢిల్లీ, చండీగఢ్‌, జైపూర్‌, అమృత్‌సర్‌ నుంచి  అదనపు విమాన సర్వీసులను నడుపుతున్నారు. 
జాట్ల ఆందోళనతో హర్యానాకు భారీ నష్టం 
మరోవైపు జాట్ల ఆందోళన కారణంగా హర్యానాకు  భారీ నష్టం జరిగిందని  అసోసియేటెడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ... ఆసోచామ్‌ అంచనావేసింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో 20 వేట కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా తేలింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఎక్కువ భాగం, వ్యాపార,  పారిశ్రామిక వర్గాలే నష్టపోయాయి. బస్సులు, ప్రైవేటు వాహనాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు,  పోలీసు స్టేషన్లు, మాల్స్‌, హోటళ్లను ఆందోళనకారలు దహనం చేశారు. గురుగావ్‌, మనేస్వర్‌లలోని మారుతీ కార్ల తయారీ ఫ్యాక్టరీలను మూసివేయాల్సి రావడంతో ఉప్పత్తి నిలిచిపోయింది. ఐటీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనలు పెట్టుబడిదారులు విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయని అసోచామ్‌ ప్రకటించింది. 

 

మెదక్ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

మెదక్ : జిల్లా నంగునూర్ మండలలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి నంగునూర్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక లారీ సోదా చేయగా 200 ప్యాకెట్లలో ఉన్న గంజాయి బయట పడింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

నేడు కేఫ్‌ కాఫీ డే సంస్థలో ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌ : కేఫ్‌ కాఫీ డే సంస్థలో టీమ్‌ మెంబర్స్‌ ఉద్యోగాల నియామకాలకై ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఉపాధి అధికారి జి. విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18-25 సంవత్సరాలోపు వయస్కులై 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని చెప్పారు. సుమారు 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీరికి నెలసరి వేతనం రూ.7800 ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు మల్లేపల్లిలో గల జిల్లా ఉపాధి కార్యాలయం ఐటీఐ ప్రాంగణంలో జరిగే ఇంటర్యూలకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు.

టెన్త్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి : కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్షల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యలయంలోని తన చాంబర్‌లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకుగాను 351 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సుమారు 80 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ఉదయం 9.30గం టల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్స్...

హైదరాబాద్‌ : నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. చక్రిపురం క్రాస్‌రోడ్డులో బాలమణి అనే మహిళ మంగళవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుపోయారు. ఆమె తేరుకుని చుట్టు ప్రక్కల వారికి సమాచారం ఇచ్చే లోపల దుండుగులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

08:52 - February 23, 2016

పార్టీ పిరాయింపులు సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నగేశ్ కుమార్, టీడీపీ నేత పట్టాభీరామ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావులు పాల్గొని, మాట్లాడారు. మొరాలిటీ వాల్యూస్ పోయాయని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:48 - February 23, 2016

దేశ ఆర్థిక వ్యవస్థలో ఇన్స్యూరెన్స్ రంగానికి కీలకపాత్ర. దేశాభివృద్ధికి బాటలు వేసే మౌలిక వసతుల కల్పనకు నిధులు సేకరించడంలో ముఖ్యపాత్ర పోషించేది బీమా రంగమే. ఆకస్మికంగా సంపాదనపరుడు చనిపోతే, ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించే ఏకైక మార్గం ఇన్స్యూరెన్స్. ఇంతటి ప్రాధాన్యత వున్న ఈ రంగంలో మరింత వృద్ధి రేటు సాధించడానికి కేంద్ర బడ్జెట్ లో మరిన్ని ప్రోత్సహకాలు ప్రకటించాల్సిన అవసరం వుంది. 
ఆపదకాలంలో ఆదుకునే ఇన్స్యూరెన్స్
'నేను ఆకస్మికంగా మరణిస్తే నా సంపాదన మీదే ఆధారపడ్డ భార్యా పిల్లల పరిస్థితి ఏమిటి'? ఈ స్పృహ వున్నవారెవరైనా చేసే మొట్టమొదటి పని ఇన్య్సూరెన్స్ తీసుకోవడం. తన సంపాదనలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా ఇన్స్యూరెన్స్  ప్రీమియం గా చెల్లించడం. కుటుంబంలో సంపాదనపరుడు మరణిస్తే అతని మీదే ఆధారపడ్డ కుటుంబం దిక్కులేనిదవుతుంది.  కుటుంబ పోషణ, పిల్లల చదువులు, అమ్మానాన్నల వైద్య ఖర్చులు ఇవన్నీ ప్రశ్నార్ధకంగా మారతాయి.  ఇలాంటి ఆపదకాలంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఇన్స్యూరెన్స్ ఒక్కటే. 
ఇన్సూరెన్స్ ఆవశ్యకతను పెంచుతున్న ప్రమాదాలు 
రోజురోజుకీ భయంకర వ్యాధులు విజ్రుంభిస్తున్నాయి. ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పుణ్యామా అని వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. 40 ఏళ్లు నిండకముందే గుండె జబ్బులు ప్రాణాలు తీస్తున్నాయి. రోజురోజుకి యాక్సిడెంట్ లు పెరుగుతున్నాయి. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీలలో , వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతోంది. వ్యవసాయం చేసే వారి పరిస్థితి మరీ ఘోరం. ఎప్పుడు ఎవరికీ ఏ రూపంలో ఆపద ముంచుకొస్తుందో తెలియదు. ఏ క్షణంలో ఎంత నిష్కారణంగా ఎవరి ప్రాణం పోతుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా  వున్నా, , మన చుట్టూ నిత్యం ప్రమాదాలు,  మన ప్రాణాలకు హాని కలిగించే సందర్భాలు పొంచి వుంటాయి. క్షణ క్షణం మారుతున్న జీవన శైలి, అనుక్షణం వెన్నంటి వుండే ప్రమాదాలు ఇన్య్సూరెన్స్ ఆవశ్యకతను మరింత పెంచుతున్నాయి.
సమాజంలో ఇన్స్యూరెన్స్ స్పృహ చాలా తక్కువ
కానీ దురదృష్టవశాత్తు మన సమాజంలో ఇన్స్యూరెన్స్ స్పృహ చాలా తక్కువ. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో బీమా తీసుకుంటున్న వారి సంఖ్య చాలా స్వల్పం. తమ కోసం, తమ కుటుంబ సంక్షేమం కోసం కాకుండా, తమ ఇంటికి వచ్చిన ఏజెంట్ల కోసమే ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటున్నామన్న తప్పుడు భావన ఇప్పటికీ చాలామందిలో బలీయంగా వుంది. అందుకే ఏజెంట్లు ఒకటికి నాలుగుసార్లు తమ చుట్టూ తిరిగితే తప్ప, చాలామంది పాలసీ దరఖాస్తు మీద సంతకం చేయరు. బీమా రంగంలో ప్రభుత్వం ఏ సంస్కరణలు చేయదల్చుకున్నా ముందుగా ఈ నేపథ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 
సామాజిక భద్రత కల్పనలో బీమారంగం అత్యంత ప్రాధాన్యత 
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో మనది రెండవది. 130 కోట్ల జనాభా వున్న దేశం. 53 ఇన్స్యూరెన్స్ కంపెనీలున్నాయి. విస్తారమైన ఏజెంట్ల వ్యవస్థ వుంది. అయిన్నప్పటికీ మన దేశంలో 36 కోట్ల పాలసీలు కూడా లేవు.  2014 15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రయివేట్ రంగం పాలసీల  ప్రీమియంల మొత్తం విలువ  నాలుగు లక్షల కోట్లు కూడా లేదు. దీన్నిబట్టే అర్ధమవుతోంది మన దేశంలో జనం ఇన్స్యూరెన్స్ కి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో.  మన దేశంలో కేవలం 11శాతం మందికే పెన్షన్ సదుపాయం , 20శాతం మందికే బీమా  కవరేజీ వుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే ప్రకటించిన విషయాన్ని మరువకూడదు. అమెరికాలో 83శాతం మందికి హెల్త్ ఇన్స్యూరెన్స్ వుంటే మన దేశంలో కనీసం ఆరు శాతం మందికి కూడా లేదు. ఒక వైపు ఇన్స్యూరెన్స్ కవరేజీ వున్న వారి సంఖ్య చాలా తక్కువగా వుంది. మరోవైపు దేశాభివ్రుద్ధికి బాటలు వేసే మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత  పెద్ద సమస్యగా మారింది.  ఇంకో వైపు విదేశీ అప్పుల భారం పెరుగుతోంది. ఇంకో వైపు దేశీయ పొదుపు తగ్గుతోంది. ఇలాంటి సమయంలో   నిధులు సమీకరించి పెట్టడంలోనూ, పౌరులకు సామాజిక భద్రత కల్పించడంలోనూ బీమా రంగం అత్యంత ప్రాధాన్యత పోషిస్తుందన్న విషయాన్ని ఏ ప్రభుత్వమూ విస్మరించకూడదు. 
మౌలిక సదుపాయాల కల్పనకు ఊతంగా 
మన దేశంలో ప్రభుత్వ బీమా సంస్థలు సేకరించే సొమ్ము మౌలిక సదుపాయాల కల్పనకు ఊతంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.  అనేక ప్రతిష్టాత్మక సంస్థలకు లక్షల కోట్ల రూపాయల నిధులు సమకూర్చిపెట్టిన చరిత్ర మన బీమా కంపెనీలకుంది.   దేశ జనాభాలో బీమా స్ప్రుహను ఎంత ఎక్కువగా పెంచి, పాలసీదారుల సంఖ్యను ఎంత ఎక్కువగా పెంచితే, ఈ దేశానికీ, ఆయా కుటుంబాలకు అంత మేలు జరుగుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బీమా రంగ అభివ్రుద్ధికి ఆటంకాలవుతున్నాయి. తాము పోయినా, తమ కుటుంబం చల్లంగ వుండాలన్న కాంక్షతో పాలసీదారులు కట్టే ఇన్స్యూరెన్స్ ప్రీమియంల మీద పన్నులు పిండుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం బాధాకరం. ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై గతంలో 12.5 శాతం వున్న సర్వీస్ టాక్స్ ను గత బడ్జెట్ లో 14శాతానికి పెంచారు.  ఈ నెలాఖరున ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మరెంత పెంచుతారో తెలియదు. ఇలాంటి చర్యలు పాలసీదారులను నిరుత్సాహ పరుస్తాయన్న వాస్తవాన్ని కేంద్రం విస్మరించకూడదు. ప్రస్తుతం లక్షన్నర వరకు ఆదాయ పన్ను మినహాయింపులిస్తున్నారు. ఇన్స్యూరెన్స్లు, పిల్లల చదువులు, గ్రుహ నిర్మాణ రుణాలు , వైద్య ఖర్చులు, చిన్న మొత్తాల పొదుపులు ఇలాంటి వాటన్నింటికీ కలిపి ఈ మినహాయింపు ఇస్తున్నారు.  ఇన్స్యూరెన్స్ ప్రీమియంలకు ప్రత్యేకంగా  2 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇవ్వడం వల్ల మరింత ప్రయోజనం వుంటుందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. 

 

08:40 - February 23, 2016

ఇన్స్యూరెన్స్ పాలసీదారులపై సర్వీస్ టాక్స్ రద్దు చేయాలని ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రెజరర్ రవి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'కేంద్ర బడ్జెట్ రాబోతోంది. గత బడ్జెట్ లో ఇన్స్యూరెన్స్ పాలసీదారులపై సేవా పన్ను భారం పెంచారు. ఈ సారి దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నడుస్తోంది. ఎంపీలను కలుస్తున్నారు. ఇంతకీ ఇన్స్యూరెన్స్ పాలసీలపై సర్వీస్ టాక్స్ విధించడం వల్ల   పాలసీదారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది?  ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఇన్స్యూరెన్స్ రంగం మరింత వృద్ధి రేటు సాధించాలంటే ప్రభుత్వం అందిచాల్సిన ప్రోత్సాహకాలేమిటి? భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఇన్స్యూరెన్స్ రంగం పోషిస్తున్న పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై రవి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:30 - February 23, 2016

హైదరాబాద్ : లక్షలాది మంది డిపాజిటర్లను ముంచిన అక్షయగోల్డ్ ఆస్తులను అమ్మకుండా బాధితులకు ఎలా న్యాయం చేస్తారో తెలపాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసులను ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చిందో, ఏం చర్యలు తీసుకున్నారో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ తో పాటు ఈ సంస్థ వ్యవహారాన్ని కూడా కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 కి వాయిదా వేసింది.
పిల్‌ పై విచారణ
తాము చేసిన డిపాజిట్లను అక్షయగోల్డ్‌ యాజమాన్యం నుంచి ఇప్పించాలని అభ్యర్థిస్తూ అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలిప్‌ బి బొసలే, జస్టిస్‌ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఐవి రాధా కృష్ణరావు, ఎన్‌ఎస్‌ అర్జున్‌ వాదనలు వినిపించారు. అక్షయ గోల్డ్‌ సంస్థ యాజమాన్యం ఎపి, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో 4.5 లక్షల మంది డిపాజిటర్లతో రూ. 600 కోట్లకు పై చిలుకు డిపాజిట్లు సేకరించిందని, ఆ డబ్బులు చెల్లించకుండా వేధిస్తోందని నివేదించారు. అవనిగోల్డ్‌, శ్రీగోల్డ్‌, శ్రీచక్ర, అభయగోల్డ్‌ పేర అనుబంధ సంస్థలను స్థాపించి డబ్బులు వసూలు చేశారని నివేదించారు. విజయవాడలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని, ఎపి సిఐడి పోలీసులు ఇప్పటి వరకు రూ. 10 కోట్లు రికవరీ చేసినప్పటికీ బాధితులకు అందజేయలేదని నివేదించారు. అగ్రిగోల్డ్‌ సంస్థ తరహాలోనే ఈ సంస్థ యాజమాన్యం కూడా డిపాజిటర్లను మోసం చేసిందని నివేదించారు. సంస్థ ఆస్తులు విక్రయించి బాధితులకు చెల్లించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఆ తర్వాత తెలంగాణ సిఐడి తరఫు న్యాయవాది శరత్‌కుమార్‌ వాదిస్తూ, అక్షయగోల్డ్ సంస్థ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ సిఐడి పోలీసులు తమకు అందజేయడం లేదని తెలిపారు. రికార్డులు లేకుండా తమ పరంగా దర్యాప్తును వేగవంతం చేయడంలో అవరోధం ఏర్పడుతోందని విన్నవించారు. జస్టిస్‌ బొసలే జోక్యం చేసుకుని, ఈ వ్యవహారంపై ఎందుకు సహకరించడం లేదని ఎపి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. లక్షలాది మంది డబ్బులను డిపాజిట్‌ రూపంలో తీసుకుని వారికి చెల్లించని యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మండిపడ్డారు. ఇలాంటి మోసాలపై కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.

 

08:13 - February 23, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కలెక్టరేట్ల వద్ద బాధితులు సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. 
ఈనెల 27 వరకూ రిలే దీక్షలు 
ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ స్వాధీనపర్చుకుని, ఖాతాదారులకు అసలు, వడ్డీతో సహా చెల్లింపులు చేపట్టేలా చూడాలని శ్రీకాకుళం కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగిన బాధితులు డిమాండ్‌ చేశారు. ఈనెల 27 వరకూ రిలే దీక్షలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డవారికి కొమ్ముకాస్తుంది ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. 
ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు రావల్సిన డబ్బులను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ధర్నాకు సీపీఎం పార్టీ సంఘీభావం తెలిపింది.  
కర్నూలులో 
అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యాన్ని అరెస్టు చేసి, డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించాలని కోరుతూ కర్నూలులో అగ్రిగోల్డ్ సంస్థ ఏజెంట్లు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం ఏజెంట్లు బాధితులతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. 
కడపలో
అటు కడపలోనూ అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు కడప మేయర్‌ సురేష్‌బాబు మద్దతు తెలిపారు. జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు తమకు రావల్సిన డబ్బులు చెల్లించి న్యాయం చేయాలంటూ ఆందోళనలు నిర్వహించారు. 

 

08:04 - February 23, 2016

హైదరాబాద్ : సీబీఐ మాజీ డైరెక్టర్‌ కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారనే ఆరోపణలతో ఇప్పటికే కళ్యాణ్‌ శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యారు. సుజనా చౌదరి కారణంగానే తన సోదరుడు చిక్కుల్లో పడ్డారని కళ్యాణ్‌ శ్రీనివాస్‌ సోదరి ఆరోపించారు. 
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చిక్కులు ?
కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసింది. 
సుజనాపై ఆరోపణలు
కాగా ఈ కేసులో కేంద్ర మంత్రి సుజనా  చౌదరి పేరు బయటికి రావడంతో కొత్త మలుపు తిరిగింది. కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ ఆరోపించారు. తన సోదరుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ సుజనా గ్రూప్‌లో గతంలో పనిచేశారని, అసలు తన సోదరుడికి అన్ని వందల కోట్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన తండ్రి పార్టీ మారారన్న కక్షతోనే ఈ కేసులో తన సోదరుడిని ఇరికించారని ఆమె తెలిపారు. సుజనా చౌదరికి చెందిన ఆ కంపెనీపై సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అక్కడ పనిచేయొద్దని తన తండ్రి విజయరామారావు శ్రీనివాస్‌కు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు. 
మారిషస్ కమర్షియల్ బ్యాంక్ మోసం చేశారనే ఆరోపణలు 
ఇదిలా ఉంటే ఇప్పటికే సుజనా చౌదరిపై గతంలో రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ ను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు.  తనకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు ఆధారం లేనివని సుజనా కొట్టిపారేశారు. 

07:58 - February 23, 2016

హైదరాబాద్ : ఆర్ఎండ్ బీ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం తరహాలోనే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు నిర్మించాలని నిర్ణయించింది. వీటితోపాటు మండలిచైర్మన్,అసెంబ్లీ స్పీకర్, సీఎస్ లకు కూడా రాజధానిలో పర్మినెంట్ రెసిడెన్షియల్ ఇళ్లు కట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. 
మొత్తం నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో 
రాష్ట్రంలో ఏ ప్రభుత్వకార్యాలయం కట్టాలన్నా.. నిధులు కేటాయించడం, వాటికి టెండర్లు ఖరారు చేయడం ఇప్పటి వరకు ఆర్ అండ్ బీ చేస్తున్న పని. కాని అక్కడక్కడ చిన్న చిన్న నిర్మాణాలకు బాధ్యత వహిస్తున్నా.. మొత్తం నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది ఆ శాఖ. ఇక నుండి అలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించింది సర్కార్. 
ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుంచి ఆర్ అండ్ బీ ద్వారానే..
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్నా..ఇక నుంచి అర్అండ్ బీ ద్వారానే చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా.. శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా మండల కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగులైన్ల రోడ్లు ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా మంచి రహదారి ఉండేలా విధానపర నిర్ణయం తీసుకున్నందున ఆ రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న కళాభారతి నిర్మాణం ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టనున్నట్లు అధికారులకు సంకేతాలు ఇచ్చారు సీఎం. నగరంలో కళాభారతిని కన్వెక్షన్ కం కల్చరల్ సెంటర్ గా తీర్చిదిద్దాలని సూచించారు సీఎం.
అఖిల భారత సర్వీస్ అధికారులకు అధునాతన క్వార్టర్లు 
ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు అధికారిక నివాసాలు నిర్మించాలని అందకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. దాంతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ నిర్మాణాలకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలో ఆరుగురుసభ్యుల కమిటీని సీఎం ప్రకటించారు. సీఎస్ తో పాటు ఆర్ఎండ్ బీ కార్యదర్శి సీఎంఓ ముఖ్యకార్యదర్శి,ఆర్థిక శాఖకార్యదర్శి, ఆర్అండ్ బీకి చెందిన ఇద్దరు సభ్యులుగా ఉంటారు.
కార్యరూపం దాల్చని ప్రభుత్వ ప్రణాళికలు 
ఇప్పటి వరకు ప్రభుత్వం వేసిన ప్రణాళికలు ఒక్కడి కూడా కార్యరూపం దాల్చలేదు. కాని ప్రణాళికల లిస్ట్ మాత్రం పెరిగిపోతోంది. ప్రభుత్వం అధికారంలో ఉండేది  ఇంకా మూడేళ్లే.. ఈ లోగా ఎన్ని నిర్మాణాలు కార్యరూపం దాలుస్తాయో.. ఎన్ని నిర్మాణాలు పూర్తవుతాయో వేచి చూడాల్సిందే.

నేడు కాకినాడలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పర్యటన

తూర్పుగోదావరి : తమిళనాడు గవర్నర్ రోశయ్య ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

07:46 - February 23, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్నా .. అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలన్నా కలెక్టర్లు ముందుండి నడిపించాలంటూ.. సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో అన్నారు. ప్రాంతీయ అసమానతలు దూరం చేసేలా పాలన సాగించాలని సీఎం కలెక్టర్లకు దిశానిర్థేశం చేశారు. 
రాష్ట్రానికి వచ్చినవి రూ.2 వేల 300 కోట్లు మాత్రమే
సంక్షేమంలో రాజీపడని.. అభివృద్దిబడ్జెట్ ఈసారి ప్రవేశపెడుతున్నట్లు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. విభజన వల్ల చాలా రకాలుగా నష్టపోయామని.. ఆ లోటును భర్తీ చేస్తామని కేంద్రం చెప్పిందని.. అయితే 16 వేల కోట్లకుగాను 2 వేల 300 కోట్లు మాత్రమే వచ్చాయని మిగిలిన మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు సీఎం. 
అమరావతి కోసం 850 కోట్లు ఇచ్చిన కేంద్రం
రాయలసీమ  , ఉత్తరాంధ్రలోని 7 జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు 10 కోట్లు చొప్పున కేంద్రం ఇచ్చిందని అన్నారు. అమరావతి కోసం 850 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని.. మిగిలిన రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకునే వరకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరానన్నారు బాబు. 2018 నాటికి పోలవరం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలని నిర్థేశించారు. పట్టిసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా 80 నుండి 100 టీఎంసీ ల గోదావరి నీటిని తెచ్చి వచ్చే ఏడాదికి కృష్ణాడెల్టాకు తీసుకువస్తామన్నారు సీఎం.
రెయిన్ వాటర్ ను గ్రౌండ్ వాటర్ గా మలుచుకునే విధానం
పశ్చిమగోదావరి జిల్లాలో 17 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంపై ఆందోళనవ్యక్తం చేశారు. భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెయిన్ వాటర్ ను గ్రౌండ్ వాటర్ గా మలుచుకునే విధానాన్ని అభివృద్ది చేస్తామన్నారు సీఎం. రాబోయే రోజుల్లో కరువు అనే మాట వినిపించకూడదని అందుకు తగిన కృషి చేయాలని సీఎం అన్నారు. విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని..నరేగా నిధులను సమృద్దిగా వాడుకోవాలన్నారు బాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా పరిశుభ్ర వాతావరణాన్ని తీసురాగలమన్నారు. 
తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం 
జూన్  2వ వారంలోగా సచివాలయం నిర్మాణం పూర్తి చేసి పాలన కొనసాగిస్తామని సీఎం తెలిపారు. తలసరి ఆదాయంలో  9వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని.. మరింత ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్లకు సూచించారు బాబు. విశాఖలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ దిగ్విజయంగా జరిపామన్నారు.వ్యవసాయ రంగంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు ద్వారా సమూల మార్పులు తీసుకురాగలమన్నారు. నైపుణ్యాన్ని పెంచగలిగితే 2016-17లో ఉత్పాదకత అనూహ్యంగా పెరుగుతుందని సీఎం తెలిపారు.
ప్రతిభచాటిన కలెక్టర్లకు ప్రోత్సాహకాలు 
రాబోయే కాలంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కలెక్టర్లు కృషి చేయాలని.. ప్రతిభచాటిన కలెక్టర్లకు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు సీఎం. కరువురహిత రాష్ట్రంగా మార్చడమే మనముందు ఉన్న సవాల్ అని సంస్కరణలు చేపట్టి.. దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు బాబు.

 

నల్గొండ జిల్లా శూన్యపహాడ్ తండాలో దారుణం

నల్గొండ : నేరేడ్చర్ల మండలం శూన్యపహాడ్ తండాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడు సపావత్ జగదీష్ అనుమానస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి తండా శివారులోని గోతిలో జగదీష్ మృతదేహాన్ని తండా వాసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రికి రాత్రే ఖననం చేశారు. ఘటనపై తండా వాసులు అనుమానాలు వ్యక్తుం చేస్తున్నారు. ఇదిలావుంటే ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తామని పోలీసులు చెప్పారు. 

07:31 - February 23, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతి తుది బృహత్‌ ప్రణాళికను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విడుదల చేశారు. రహదారులపై అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిష్కరించామని ఆయన చెప్పారు. రహదారుల నిర్మాణంలో ఇళ్లు పోకుండా చూశామని మంత్రి నారాయణ అన్నారు. స్వల్ప మార్పులతో అమరావతి మాస్టర్‌ప్లానును ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ విడుదల చేశారు. ఉత్తర దక్షణ దిశలుగా ఉండే ఐదురోడ్లు, తూర్పు పడమరలుగా ఉండే ఒకరోడ్డును కొద్దిగా అటూ ఇటూ జరిపారు. దీంతోపాటు నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయాలనుకున్న రిజర్వాయర్‌ స్థలాన్ని, కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలనూ మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుత ప్లాన్‌లో గ్రామాల మీదుగా రోడ్లు వెళ్లడాన్ని దాదాపు నివారించినట్లు నారాయణ తెలిపారు. ఉండవల్లి గ్రామంలో గతంలో నాలుగురోడ్లను ప్రతిపాదించి వాటిని ఎత్తేశారు. అయితే సీడ్‌ డెవపల్‌మెంట్‌ ఏరియా ఉన్న మందడంలో రోడ్లను మార్చలేదు. రాయపూడి, తాళ్లాయపాలెం వద్ద నున్న సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా రోడ్లను స్వల్పంగా తూర్పుదిశకు మార్చారు. దీనివల్ల నష్టాన్ని చాలా వరకూ తగ్గించగలిగామని మంత్రి నారాయణ తెలిపారు. 
కృష్ణాయపాలెం వద్ద రోడ్డును డ్రాఫ్ట్‌లోంచి తొలగింపు
తుళ్లూరు తూర్పుభాగంలో ఉత్తర, దక్షిణ దిశలుగా ఉన్న రోడ్డును తూర్పువైపునకు మార్చారు. అయితే తూర్పు, పడమరలుగా ఉన్న రోడ్డును అలాగే ఉంచేశారు. సీఎం నివాసం నుండి పెనుమాక వరకూ వేసిన 150 అడుగుల రోడ్డును పూర్తిగా ఎత్తేశారు. కృష్ణాయపాలెం వద్ద రోడ్డును డ్రాఫ్ట్‌లోంచి తొలగించారు. అలాగే సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఉన్న మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులకు గతంలో ఎక్స్‌ప్రెస్‌ రహదారికి దక్షిణంగా కేటాయించిన ప్లాను ఉత్తరం వైపుకు కొద్దిగా మార్చారు. వాణిజ్య ప్రాంతాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ఐనవోలు గ్రామంలో ప్లాను అలాగే ఉంచారు. ల్యాండ్‌ పూలింగు నోటిఫికేషన్‌ను 28వ తేదీ నుండి జారీచేస్తామని 30 రోజుల అనంతరం గడువు తీరిన తరువాత ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతం నుండి ఎయిమ్స్‌కు వెళ్లేందుకు వీలుగా నవులూరు మధ్యలో నుండి రోడ్డును వేశారు. అయితే అక్కడ 15 ఇళ్లు మాత్రమే ఉన్నాయని, వారికి అవసరమైన పరిహారం కేటాయిస్తామని చెప్పారు. ఇంకా పూలింగుకు ఇవ్వాల్సిన భూమి మొత్తం 1200 ఎకరాలు మాత్రమే ఉందని, ఇప్పటికీ పూలింగుకు ఇచ్చేందుకు అవకాశముందని, లేకపోతే సేకరణ పద్ధతిలో తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు.

07:24 - February 23, 2016

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలయ్యాయి. ఒక్కరోజే నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అదే జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, కడపజిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సీఎం చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పుకున్నారు.  
ఆపరేషన్‌ ఆకర్షకు టిడిపి పదును
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఆపరేషన్‌ ఆకర్షకు పదును పెట్టింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డిపై పచ్చకండువా కప్పిన టీడీపీ ఆ తర్వాత చాలాకాలం ఆపరేషన్‌ ఆకర్షకు విరామం ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని టీడీపీలోకి ఆహ్వానించి ఆకర్ష పథకాన్ని మరొసారి తెరపైకి తెచ్చింది.      
ఐదుగురు టీడీపీలో చేరిక
ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్‌ , వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వీరంతా పచ్చకండువా కప్పేసుకున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్‌కు సొంతపార్టీ నేతలే ఝలక్ ఇచ్చినట్లైంది. 
ఆ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు 
గత కొద్దిరోజులుగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతారని వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు, కడప జిల్లాలకు చెందిన నంద్యాల, జమ్మలమడుగు నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని పార్టీలోకి చేర్చుకుంటామని ప్రకటించారు. జమ్మలమడుగుకు చెందిన తెలుగుదేశం నేత రామసుబ్బారెడ్డి.. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటామన్నారు. 
అభివృద్ధి జరుగుతుందనే టీడీపీలో చేరిక : భూమా 
టీడీపీలో చేరితే అభివృద్ధి జరుగుతుందనే వైసీపీని వీడామని భూమా నాగిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరామని వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వస్తారనేది కాలమే నిర్ణయిస్తుందని భూమా నాగిరెడ్డి చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని.. అభివృద్ధి జరగాలంటే అది ఒక్క టీడీపీకే సాధ్యమని..అందుకే టీడీపీలోకి చేరానని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి తెలిపారు. మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆది నారాయణ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి సైతం తెలుగు దేశం పార్టీతో నే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అందుకే చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే టీడీపీలోకి వెళుతున్నాన్నారు. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని కార్యకర్తలు కూడా వ్యతిరేకించలేదని అందుకే పార్టీ వీడాల్సి వచ్చిందని అఖిలప్రియ చెప్పారు. 
జగన్‌ సమాచాలోచనలు
ఇదిలా ఉంటే వారం క్రితం 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని పడగొడతానని ప్రతిపక్ష నేత జగన్‌ ప్రకటన చేశారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పక్కనపెడితే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలా అనే అంశంపై జగన్‌ సమాచాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య అరెస్ట్‌, పఠాన్‌కోట్‌ దాడి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశముంది. విపక్షాల అసహనానికి ప్రభుత్వ పక్షం సహనం వహించే ప్రయత్నానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. 

07:05 - February 23, 2016

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య అరెస్ట్‌, పఠాన్‌కోట్‌ దాడి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశముంది. విపక్షాల అసహనానికి ప్రభుత్వ పక్షం సహనం వహించే ప్రయత్నానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. 
బడ్జెట్‌ సమావేశాలకు సిద్ధమవుతున్న అధికార-విపక్షాలు
మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకుంటున్నాయి. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యంగా జెఎన్‌యు విద్యార్థి కన్హయ్యకుమార్‌ అరెస్ట్‌, హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. హర్యానాలో జాట్లు, ఏపిలో కాపు రిజర్వేషన్ల అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. హర్యానాలో శాంతి భద్రతలను కాపాడడంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశముంది. 
పెండింగ్‌లో కీలక బిల్లులు 
పార్లమెంట్‌ వర్షాకాల, శీతాకాల సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడంతో జిఎస్‌టితో సహా కీలక బిల్లులన్నీ పెండింగ్‌లోనే పడిపోయాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుతో  కొన్ని కీలక బిల్లులు ఆమోదించుకునేందుకు కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో బిజెపి ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేకపోవడంతో విపక్షాల నుంచి సహకారం లభించడం లేదు. జిఎస్‌టి బిల్లుకు కాంగ్రెస్ సూచించిన సవరణలను మోది ప్రభుత్వం అంగీకరిస్తే కనక ఈ బిల్లుకు మోక్షం లభించే అవకాశముంది. 
రెండుసార్లు అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో మోది ప్రభుత్వం రెండుసార్లు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. జెఎన్‌యు వివాదంతో పాటు అన్ని అంశాలపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. జిఎస్‌టి బిల్లుపై ప్రధాని నరేంద్రమోది ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించారని వెంకయ్య గుర్తు చేశారు. జిఎస్‌టి బిల్లుతో సహా పలు కీలక బిల్లులను బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి విపక్షాలు మద్దతివ్వకూడదని వెంకయ్య పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ 
కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. అయితే మొదటిది సగం బడ్జెట్ కాగా, మిగితా రెండు మాత్రమే పూర్తిస్థాయి బడ్జెట్‌లు. బీజేపీ అధికారంలోలేని ఐదు కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఆ రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేసే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న పార్లమెంటులో ప్రవేశపెడతారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది.

 

నేడు వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన

వరంగల్ : మంత్రి హరీష్ రావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు రాష్ట్రపతి, ప్రధానిలను కలవనున్న జగన్

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్ ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువు కేంద్రమంత్రులను కలవనున్నారు. పలు అంశాలను ఆయన వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Don't Miss