Activities calendar

24 February 2016

21:24 - February 24, 2016

ఢిల్లీ : జెఎన్‌యు వివాదంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందించారు. ఈ ఘటనలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో న్యాయ, అన్యాయాలను కోర్టులు నిర్ధారిస్తాయని మంత్రి తెలిపారు. నిర్దోషులైన విద్యార్థులకు పోలీసుల నుంచి ఎలాంటి వేధింపులుండవని తాను సభకు హామీ ఇస్తున్నట్టు రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పటియాల కోర్టులో జరిగిన దాడిపై దోషులను ఎవరిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కుపై ఎవరికీ అభ్యంతరం లేదని... అయితే దానిక్కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. దీన్ని అతిక్రమించే వారిని సమాజం క్షమించదని హోంమంత్రి చెప్పారు.. 

21:21 - February 24, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్ధి వేముల రోహిత్‌ ఆత్మహత్య, జేఎన్‌యూ ఘటనలపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. వివిధ పక్షాల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. హెచ్ సియూ, జేఎన్ యూ ఘటనలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. దేశంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నా ఏ కుటుంబాన్ని పరామర్శించని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.... హెచ్ సియూ ను రెండుసార్లు సందర్శించడంలోని ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

చర్చలో పాల్గొన్న వివిధ పక్షాల సభ్యులు..

హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలపై లోక్‌సభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. రోజంతా జరిగిన చర్చలో పాల్గొన్న వివిధ పక్షాల సభ్యులు.. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎన్డీయే ప్రభుత్వానిదే బాధ్యతని విపక్షాలు ఆరోపించాయి. వీటిని అధికార పక్షం తిప్పికొట్టింది. ఈ అంశాలపై రెండు పక్షాల వాదోపవాదనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలతో చర్చ చాలాసార్లు పక్కదారి పట్టింది. హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలకు ప్రధాని మోదీ ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ కలుషితమైపోయిందని సీపీఎం సభ్యుడు ఎంబీ రాజేష్‌ విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ను సంప్రదించానికి ప్రయత్నిస్తే....

హెచ్‌సీయూ ఘటన పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సంప్రదించానికి ప్రయత్నిస్తే ఆయన వేరు పనిలో బిజీగా ఉన్నారని సమాధానం వచ్చిందన్న విషయాన్ని హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీ ప్రస్తావించారు.

యూపీఏ హయాంలో నియమించిన వైస్‌ చాన్సలర్‌ పాలనలోనే....

యూపీఏ హయాంలో నియమించిన వైస్‌ చాన్సలర్‌ పాలనలోనే యూనివర్సిటీల దళితులకు న్యాయం జరగడంలేంటూ కాంగ్రెస్‌ ఎంపీ వీ హనుమంతరావు రాసిన లేఖలను స్మృతీ ఇరానీ ఉదహరించారు. జేఎన్‌యూ ఘటనను ప్రతిపక్షాలు సమర్ధించడాన్ని స్మృతీ ఇరానీ తప్పుపట్టారు.

మద్యం తాగించి గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం..

ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లిలో దారుణం జరిగింది. కొందరు దుండగులు గిరిజన యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మద్యం తాగించి ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలు కుటుంబీకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

హయత్ నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

20:47 - February 24, 2016

హైదరాబాద్ : చా ర్ షౌ పురానా షహల్.. ఎన్నో ప్రత్యేకతలు, ఎంతో ఘన చరిత్రలు కలిగిన నగరం, అలాంటి భాగ్యనగర్ సిగలో మరో కీర్తి కిరీటం చేరింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ సత్తా ఏంటో చాటి చెప్పింది. సువిశాల నగరం, సుందర నగరం, పూదోటల నగరం, దక్కన్ పీఠభూమిలో వెలుగుతున్న చారిత్రక మణిహారం, అపూర్వ కట్టడాలు, ఆ మాటకు వస్తే దేశంలోని మిగతా నగరాల కంటే చాలా మెరుగ్గా వుందని సర్వేలే చెబుతున్నాయి. తెలుగు వారంతా సంబరపడాల్సిన విషయం ఇది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ కథనం... పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:36 - February 24, 2016

హైదరాబాద్ : మరి కొద్ది గంటల్లో బడ్జెట్ రైలు కూత పెట్టనుంది. ఈ బడ్జెట్ రైలు తెలుగువారికి ఏం మోసుకొస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. రెండు రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు ఈ సారైనా మోక్షం కలుగుతుందా? వేలాది కోట్ల లాభాల్లో ఉన్న మన రైల్వే జోన్ కి కేటాయింపులు పెరుగుతాయా? వాచ్ దిస్ స్టోరీ

ప్రతి బడ్జెట్‌లోనూ దక్షిణ మధ్య రైల్వేకి అన్యాయమే

ఉత్తరాది మంత్రులున్నంత కాలం రైల్వే బడ్జెట్ లో తెలుగు వారికి అన్యాయమే జరిగిందనేది కాదనలేని సత్యం. దశాబ్దాలుగా అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండటమే దీనికి నిదర్శనం. కేంద్రంలో ఏ రాష్ట్రానికి చెందిన వారు మంత్రిగా ఉంటే రైళ్లు, రైల్వే ప్రాజెక్టులు ఆ రాష్ట్రాలకు క్యూ కట్టేవి. ఇదేంటని ప్రశ్నిస్తే సంకీర్ణ ప్రభుత్వాలు కావడమే అనే సమాధానం వచ్చేది. అత్యధిక లాభాలు తెస్తున్న దక్షిణ మధ్య రైల్వేకి ప్రతి బడ్జెట్‌లోనూ అన్యాయమే జరుగుతోంది. ఆశించిన నిధులు రాలేదు. కేటాయింపులు జరిపినా నిధుల విడుదలలో జాప్యమే. పోనీ కేటాయించిన నిధులైనా విడుదల చేశారా అంటే అదీ లేదు. కేటాయించిన నిధుల్లో కేవలం 40 శాతం మాత్రమే విడుదల చేశారంటే ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

దశాబ్దాలుగా పెద్దపల్లి-నిజామాబాద్-ఆదిలాబాద్ లైను పనులు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల్లో ప్రధానమైన వాటికి ప్రాధాన్యతల్లోనూ కేటాయింపులోనూ వివక్షే కొనసాగుతోంది. పెద్దపల్లి-నిజామాబాద్-ఆదిలాబాద్ లైను పనులు దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలో పెద్దపల్లి-మణుగూరు రైల్వే లేన్ కలగానే మారింది. అక్కన్న పేట - మెదక్, కడప - బెంగళూరు, నంద్యాల - ఎర్రగుంట్ల, నడికుడి-శ్రీకాళహస్తి లైన్ల పనులకు గతంలో మొండి చెయ్యే చూపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 13 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా.

190 రైళ్లు నడిచే లైనుపై 280-300 రైళ్లు

కొత్త ప్రాజెక్టుల మాటెలా ఉన్నా పాత లైన్లపై భారం పెరిగిపోయింది. ఆ భారం ఎంతగా పెరిగిందంటే 190 రైళ్లు నడిచే లైనుపై 280 నుండి మూడువందల రైల్లు నడుస్తున్నాయని అంచనా. మొత్తంగా 165 శాతం అధికలోడుతో నేడున్న లైన్లు రద్దీగా ఉన్నాయి. ఈ రద్దీ వల్ల రైల్వే లైన్ల కనీస మెయింటెనెన్స్ కూడా కష్టమవుతుందని వాపోతున్నారు సిబ్బంది. ఈ రద్దీ నివారణకు బల్లార్ష - ఖాజీపేట - విజయవాడ మార్గంలో మూడో లైను కోసం గత రెండు బడ్జెట్‌లలో కేవలం 80 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో బెల్లంపల్లి రామగుండం ఏరియాల్లో 20 కిలోమీటర్ల మేర లైను మాత్రమే పూర్తయింది. విజయవాడ నుంచి బల్లార్ష మధ్య దూరం 490 కిలోమీటర్లు. ఈ లెక్కన కేటాయింపులు చేస్తే మూడో లైను పూర్తవడానికి కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారత దేశాలను కలిపే ఈ మార్గం దేశంలోనే అత్యంత రద్దీ లైన్లలో ఒకటి. ఈ బడ్జెట్ లోనైనా మూడో లైనుకు నిధులు కేటాయింపులు పెరుగుతాయా అనేది సందేహమే?

సికింద్రాబాద్‌కు రావాలంటే శివారులో ప్రతి రైలు అరగంట ఆగాల్సిందే

ఇక రైల్వేకి ఆదాయం సమకూర్చడంలో ముందున్న దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వే శాఖ ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే చూపింది. జోన్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్‌ను రద్దీకి అనుగుణంగా విస్తరించాలని దశాబ్దాల తరబడి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ కు రావాలంటే శివారు ప్రాంతంలో ప్రతీ రైలు అరగంటకు తగ్గకుండా ఆపుతున్న పరిస్తితి ప్రస్తుతం నెలకొంది. ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా చాలా సేపు సమీప స్టేషన్లలో ఆగాల్సిన పరిస్థితి. దీన్నుండి బయట పడాలంటే రద్దీ తగ్గాలంటే మౌలాలి సహా మల్కాజ్‌గిరి, సనత్ నగర్ స్టేషన్లను అభివృద్ది చేయాల్సి ఉంది. ఢిల్లీ రద్దీని తగ్గించడానికి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ ను అభివృద్ది చేసిన విధంగా ఈ స్టేషన్లను అభివృద్ధి చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనికి అదనంగా నిధులు సమకూర్చడం కూడా పెద్దగా అవసరముండదు. అ స్టేషన్లను రైల్వే శాఖ ఆదర్శ రైల్వే స్టేషన్ల పథకం క్రింద అభివృద్ధి చేయొచ్చు.

దక్షిణ మధ్య రైల్వేకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16 వేల కోట్ల ఆదాయం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 16 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. దేశంలో ఉన్న 17 రైల్వే జోన్లలో అత్యధిక ఆదాయం వస్తున్న జోన్లలో సికింద్రాబాద్ జోన్ ఒకటి. కానీ వస్తున్న ఆదాయంతో పోలిస్తే చేస్తున్న కేటాయింపులు కేవలం 20 శాతం మాత్రమే. ఈ సంవత్సరం కేటాయించింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే. పోనీ బడ్జెట్ లో ప్రకటించిన వరాల అమలు జరిగిందా అంటే కేటాయించిన నిధుల్లో విడుదల చేసింది కేవలం 35 శాతమే. హైదరాబాద్ - చెన్నై, సికింద్రాబాద్ - నాగపూర్ హైస్పీడ్ రైళ్ల అంశం అధ్యయనం కూడా జరగలేదు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినా కేంద్రం నిధులు ఇవ్వలేదు. తిరుపతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అధికారులు నివేదిక ఇచ్చినా ఇప్పటికి అతీగతి లేదు. విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న 29 ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు కమిటీ వేస్తామన్న రైల్వే శాఖ ఆ విషయాన్నే మరిచిపోయింది. గత బడ్జెట్‌ను దక్షిణ మధ్య రైల్వేతో అనుబంధమున్న సురేష్ ప్రభు ప్రవేశపెట్టినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. మన తెలుగు ఎంపీలు రెండు రాష్ట్రాల్లో మీటింగ్ లు పెట్టి మరీ ప్రతిపాదనలు అందజేశారు. అయితే ఈ సారయినా మన జోన్‌పైన దయచూపుతారా లేదో చూడాలి.

ఉత్తర భారతంలో సగటున 54 కి.మీ., తెలుగు రాష్ట్రాల్లో కేవలం 9 కిలోమీటర్లే

ఉత్తర భారతంతో పోలిస్తే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రైల్వే కనెక్టివిటీలో అత్యంత వెనకబడి ఉన్నాయి. ఉత్తర భారతంలో సగటున 54 కిలోమీటర్లు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 9 కిలోమీటర్లే ఉంది. ఉన్న లైన్లు కూడా నిజాం కాలం, బ్రిటీష్ కాలంలో వేసిన లైన్లే తప్ప కొత్త లైన్లు నామమాత్రం. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్‌లోనూ మొండి చెయ్యే చూపెడుతున్నారు. తెలంగాణలో మూడు దశాబ్దాలుగా సాగుతున్న పెద్దపల్లి-నిజామాబాద్ మార్గానికి గత బడ్జెట్ లో 720 కోట్లు కేటాయించారు. ఆ ప్రాంత ఎంపిల ఒత్తిడి మేరకు 169 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో పనులు కొంత వేగంగా జరుగుతున్నాయి. జగ్గయ్య పేట-మేళ్లచెర్వు-జాన్‌పాడ్ మార్గానికి బడ్జెట్‌లో 256 కోట్లు కేటాయించగా కేవలం 70 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఈ లైనును అతి త్వరగా పూర్తిచేయాలి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కొత్త, పెండింగ్ ప్రాజెక్టులకు 12,379 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే ఈ బడ్జెట్లో 1596 కోట్లు కేటాయించగా మంజూరు చేసింది కేవలం 475 కోట్లు మాత్రమే.

నంద్యాల-ఎర్రగుంట్ల లైన్‌కు రూ. 788 కోట్ల కేటాయింపు, మంజూరు 80 కోట్లు

కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు, వెంకయ్య నాయడులు ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ కు కూడా రైల్వే శాఖ రిక్త హస్తమే చూపిందని చెప్పొచ్చు. ప్రతిపాదనలు వేలకోట్లలో ఉంటే కేటాయింపులు వందల కోట్లలో ఉండటమే దీనికి నిదర్శనం. నంద్యాల-ఎర్రగుంట్ల మార్గానికి 788 కోట్లు కేటాయించగా మంజూరు చేసింది ఎనభై కోట్లు మాత్రమే. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం మార్గానికి 693 కోట్లు కేటాయించగా విడుదల చేసింది కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే.

ఏపిలో 19 పెండింగ్ ప్రాజెక్టులకు రూ.22,200 కోట్ల ప్రతిపాదనలు

గుంతకల్లు రాయచూర్ మార్గానికి 390 కోట్లు కేటాయించగా విడుదల చేసింది ఆరు కోట్లు మాత్రమే. మొత్తంగా చూసినట్టయితే ఏపిలో పందొమ్మిది పెండింగ్ ప్రాజెక్టులకు 22,200 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపితే 2,200 కోట్లు కేటాయించి 882 కోట్లు మంజూరు చేశారు. ఇదీ తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రానికి, రైల్వే శాఖకు ఉన్న చిత్తశుద్ది.

 

మహబూబ్‌నగర్‌ జిల్లా కు ఒకప్పుడు పది రైళ్లు

మహబూబ్‌నగర్‌కు నిజాం నవాబుల కాలంలో వేసిన సింగిల్‌ రైల్వే లైనే దిక్కయ్యిందని ప్రజలను నిట్టూరుస్తున్నారు. ఒకప్పుడు ఈ మార్గంలో పదిరైళ్లు మాత్రమే నడిచేవి. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్లు కలిపి రోజు 60 వరకు తిరుగుతున్నాయి. ఈ రైల్వేలైనుపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సికింద్రాబాద్‌-కర్నూలు-డోన్‌-గుత్తి మార్గాన్ని డబ్లింగ్‌గా మర్చాలని ఎప్పటి నుంచే ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఇంతవరకు దీని అతీగతి పట్టించుకున్న వారులేరన్న విమర్శలున్నాయి. ప్రతి ఏటా రైల్వేబడ్జెట్‌ ముందు ప్రాంతం ఎంపీలు రైల్వే మంత్రికో, రైల్వే బోర్డు చైర్మన్‌లో మొక్కుబడిగా వినతి పత్రాలు అందచేసి, చేతులు దులుపుకోవడం మినహా.... చేస్తున్నదేమీలేదని ప్రజలు మండిపడుతున్నారు.

రాయచూరు-గద్వాల మధ్య డెమో రైలు

కర్నాటకలోని రాయచూరు నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైను నిర్మించాలని నిజాం కాలం నుంచి ఉన్న ప్రతిపాదనపై మూడుసార్లు సర్వే చేసినా.... ఇంతవరకు మోక్షంలేదు. రాయచూరు-గద్వాల మధ్య పూర్తిచేసిన మార్గంలో డీజిల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైలు నడుపుతున్నా... దీనికి ప్రజాదరణ అంతంత మాత్రమే. దీనిని మాచర్ల వరకు విస్తరిస్తే జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, దేవరకొండ, మల్లేపల్లికి రైలుమార్గం ఏర్పడుతుంది. కానీ దీని అతీగతి గురించి పట్టించుకున్నవారులేరు. జడ్చర్ల నుంచి నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మీదుగా నంద్యాల వరకు కొత్తలైను నిర్మాణం కాగితాలకే పరిమితం అయ్యింది. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేస్తామని ప్రకటించి నాలుగేళ్లైనా... ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. దేశంలోని అన్ని రైల్వే జోన్లతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేలోనే ఎక్కువ ఆదాయం వస్తున్న ఈ ప్రాంత ప్రాజెక్ట్‌లకు నిథుల కేటాయింపులో అన్యాయం జరుగుతోగుతోందని్న విమర్శలున్నాయి. ఈసారి బడ్జెట్‌లోనైనా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు ఎక్కువ నిధుల కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

డిమాండ్‌కు సరిపడ సర్వీసుల్లేని ఎంఎంటీఎస్‌

హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, కాలుష్యానికి దూరంగా ప్రతిరోజు కొన్ని వేలమందిని గమ్య స్థానాలకు చేరుస్తోంది. అయితే జనాభాకు, డిమాండ్‌కు సరిపడినంత ఎంఎంటీఎస్‌ సర్వీసులు లేవు.

2003లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ప్రారంభం

హైదరాబాద్‌లో వేగవంతమైన ప్రయాణానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో ప్రవేశపెట్టాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో 35 సర్వీసులతో ప్రారంభించగా, తర్వాత వాటి సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి, ఉందానగర్-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్ రూట్లలో ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తున్నాయి. దాదాపు లక్షా 50 వేలమందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో దశ పనులు ప్రారంభమైనా వేగం పుంజుకోలేదు. అయితే నిధుల కేటాయింపు నిరాశ కలిగిస్తోంది. సెకండ్‌ ఫేజ్‌ కోసం గత బడ్జెట్లలో అరకొర నిధులే ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని డిమాండ్‌

తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. దీంతో ఈ బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన పట్టాలెక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక సికింద్రాబాద్‌ను ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ది చేస్తామని ప్రకటించినా, పనుల్లో వేగం లేదు. దక్షిణమధ్య రైల్వేలో అతిపెద్ద స్టేషన్‌ అయిన సికింద్రాబాద్‌ మీదుగా ప్రతిరోజు లక్షా 50 వేలమంది ప్రయాణిస్తుంటారు. 240 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించి, 2011లో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఐదు వేల కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కన్సల్టెంట్ నియామకమే జరగలేదు.

ట్రాక్‌లపై బ్రిడ్జీలు లేకపోవడంతో ప్రమాదాలు

సిటీలో చాలా చోట్ల రైల్వే ట్రాక్‌లపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. బ్రిడ్జీలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ జాంలు ఏర్పడుతున్నాయి. తుకారంగేట్, ఖైరతాబాద్‌తో పాటు పలు చోట్ల రైల్ ఓవర్, రైల్ అండర్ బ్రిడ్జీలు నిర్మించాలని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నా వాటికి మోక్షం లేదు. ఇక అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి నగరం శివార్లలో స్టేషన్లను అభివృద్ది చేయాలని ఎప్పటి నుంచో చెబుతున్నా రైల్వే శాఖ ఆలకించడం లేదు.

మౌలాలిలో ఆచరణకు నోచుకోని ఐఆర్‌ఐఎఫ్‌ఎం స్థాపన

మూడేళ్ల క్రితం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించినా పురోగతి శూన్యం. మౌలాలిలో దీని కోసం ఆరెకరాల స్థలంలో 20 కోట్ల రూపాయల అంచనాతో ఐఆర్‌ఐఎఫ్‌ఎంను స్థాపించాలని భావించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇలా ఎన్నో ప్రాజెక్టుల కోసం భాగ్యనగరం ఎదురుచూస్తోంది. చూడాలి రాజధానిపై ఈసారైనా కేంద్రం ఆశించిన చర్యలు తీసుకుంటుందో, లేదో.

కోనసీమ రైల్వే లైన్‌ ....
కాకినాడ_ కోటిపల్లి_ నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణం ఒక్క అడుగూ ముందుకు పడటంలేదు... తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే కోనసీమ రైల్వే లైన్‌ పూర్తయితే రవాణా మెరుగుపడుతుంది.. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది.. కాకినాడ, పిఠాపురాలను మెయిన్ లైన్‌లో కలిపితే విశాఖ, విజయవాడ మధ్య దూరం తగ్గిపోతుంది.. ఈ రెండు ప్రాంతాలమధ్య ఎగుమతి, దిగుమతులు పెరుగుతాయి.. తక్కువ ఖర్చుతో కేజీబేసిన్ పరిధిలోని చమురు, గ్యాస్ నిక్షేపాల రవాణా సాధ్యమవుతుంది.. అలాగే పర్యాటకంగాకూడా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంటుంది.. ప్రతిసారి నేతలు ఈ రైల్వేలైన్‌ పేరుచెప్పి అధికారంలోకి రావడం... ఆ తర్వాత మరచిపోవడం జరిగిపోతోంది..

ఎన్‌డీయే హయాంలో రైల్వేలైన్‌ ప్రణాళిక రూపుదిద్దుకుంది

కొన్నేళ్లుగా ఈ రైల్వేలైన్‌కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.. పదిహేనేళ్లక్రితం NDA హయాంలో ఈ రైల్వేలైన్‌ ప్రణాళిక రూపుదిద్దుకుంది.. 57 కిలోమీటర్ల దూరంవరకూ బ్రాడ్‌గేజ్‌ లైన్‌కు అంచనాలు తయారు చేశారు.. అప్పటి రైల్వేమంత్రి మమతాబెనర్జీ 2000 సంవత్సరం నవంబరులో శంకుస్థాపన కూడా చేశారు.. లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఒత్తిడితో ప్రాజెక్టు పనుల్లో కదలికవచ్చింది.. భూసేకరణ పూర్తయింది... పనిలోపనిగా 2004లో అమలాపురం రైల్వే స్టేషన్‌కోసం రైల్వే సహాయమంత్రి వేలు శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత బాలయోగి మరణంతో ఈ పనులు ఆగిపోయాయి.. కేంద్రంపై ఒత్తిడిచేసే నేతలు లేక ఈ రైల్వే లైన్‌ అలాగే ఉండిపోయింది..

ప్రాజెక్టు వ్యయంలో 25శాతం రాష్ట్రం భరిస్తుందని లేఖ రాశారు వైఎస్‌

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాక ఈ లైన్‌పై కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపారు.. ప్రాజెక్టు వ్యయంలో 25శాతం రాష్ట్రం భరిస్తుందని లేఖ రాశారు.. అయినా కేంద్రంనుంచి ఎలాంటి స్పందనా రాలేదు.. తర్వాత ఎంపీలు ఈ ప్రాజెక్టుపై హామీలమీద హామీలిచ్చారు.. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే రాజీనామా చేస్తానంటూ సవాల్‌కూడా విసిరారు అప్పటి ఎంపీ హర్షకుమార్‌.. ఆయన పదవీకాలం పూర్తయింది.. ప్రాజెక్టు ఒక్క అడుగూ ముందుకుపడలేదు.. ఏపీనుంచి కేంద్రమంత్రి పళ్లంరాజు, ఎంపీలు హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఉన్నా రైల్వే లైన్‌కు సంబంధించి ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది.. ఇది ఇలా కొనసాగుతుండగానే ఆరు నెలలక్రితం రైల్వే ఉన్నతాధికారులు కాకినాడకు వచ్చారు... కోనసీమ రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టడం కుదరదని తేల్చి చెప్పారు..

ఒకేఒక్క బోగీతో రైల్ బస్ నడుస్తోంది

అటు కాకినాడ నుంచి కోటిపల్లివరకూ సింగిల్‌ రైల్వే లైన్‌ ఉన్నా దానిని పొడిగించడానికి ఏమాత్రం ఆసక్తిచూపడంలేదు ప్రభుత్వం.. ప్రస్తుతం ఈ లైన్‌లో ఒకేఒక్క బోగీతోరైల్ బస్ నడుస్తోంది.. గత బడ్జెట్‌లో ఈ లైన్‌ పొడిగింపుకు నిధులు కేటాయిస్తారని అంతా ఎదురుచూశారు.. చివరికి నిరాశే మిగిలింది.. ఇప్పుడు మళ్లీ రైల్వే బడ్జెట్‌ రాబోతోంది.. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా కోనసీమ రైల్వేలైన్‌ తీసుకువస్తానని పదే పదే చెబుతున్నారు ఎంపీ పండుల రవీంద్రబాబు..

కోనసీమలోని 16మండలాల ప్రజలు పాదయాత్ర

ఈ రైల్వే లైన్‌ కావాలంటూ కొన్నేళ్లుగా ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.. మూడు నెలలక్రితం కోనసీమలోని 16మండలాల ప్రజలు పాదయాత్రకూడా చేశారు.. మరోవైపు కాకినాడ, పిఠాపురం రైల్వే లైన్‌ను మెయిన్ లైన్‌లో కలపాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది.. విజయవాడ నుండి విశాఖ వెళ్ళే మార్గంలో సామర్లకోట నుండి కాకినాడ రైల్వే లైన్ చీలి పోతుంది... కాకినాడ నుండి పిఠాపురానికి రైల్వే లైన్ వస్తే అన్ని రైళ్ళు కాకినాడ మీదుగా వెళతాయని.. అప్పుడు ప్రయాణభారం తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు.. తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు.. ఏళ్లు గడుస్తున్నా కోటిపల్లి నర్సాపురం రైల్వేలైన్‌పై ఎవ్వరూ దృష్టిపెట్టడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించాలని కోరుతున్నారు..

కర్నూలు, ఆదోని, డోన్, నంద్యాల, మంత్రాలయం రైల్వే స్టేషన్లు

భారీగా ఆదాయం ఇస్తున్నా కర్నూలు జిల్లాపై చిన్న చూపే చూస్తోంది రైల్వే శాఖ.. జిల్లాలో ప్రధానంగా కర్నూలు, ఆదోని, డోన్, నంద్యాల, మంత్రాలయం రైల్వే స్టేషన్లున్నాయి.. జిల్లాలో ఎక్కువభాగం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. నంద్యాల, గుంటూరు, కర్నూలు రైల్వే స్టేషన్లుమాత్రం హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ప్రతి ఏడాది జిల్లానుంచి రైల్వేకు 30కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.. ఒక్క ఆదోని స్టేషన్‌నుంచే 10కోట్లు వసూలవుతున్నాయి.. ఈ స్థాయిలో ఇన్‌కం వస్తున్నా బడ్జెట్‌లో కేటాయింపులు జరపకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.. పెండింగ్ ప్రాజెక్టులు ఒక్క అడుగుకూడా ముందుకు పడవు... కొన్నింటికి నిధులే అందవు.. మరికొన్నింటికి అందినా పనులు నత్తనడక సాగుతాయి.. దీనికితోడు కొత్త ప్రాజెక్టులు అసలే రావు.. దీంతో జిల్లావాసులనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..

రైల్వే కోచ్ పరిశ్రమ కోసం సూర్యప్రకాశ్ రెడ్డి చొరవ

కర్నూలు సమీపంలో రైల్వే కోచ్ పరిశ్రమ కోసం గత రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు.. ఈ డబ్బుతో సర్వేపూర్తయింది.. పరిశ్రమకు అవసరమైన భూమి గుర్తించి సంబంధిత శాఖలకు అప్పగించారు.. పాట్నా రైల్వే అధికారులు ఈ భూమి పరిశీలించి పనుల ప్రారంభంపై సమీక్షించారు.. అప్పట్లో ఈ పరిశ్రమకు వందకోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు.. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అంచనావ్యయం పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్థాపనకు 281కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 12వందల మందికి ఉపాది దొరికే అవకాశముంది.. ఈ పనుల్ని ఆలస్యం చేయకుండా వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు..

మంత్రాలయం - కర్నూలు రైల్వే లైన్‌పై ఎన్నో ఆశలు

ఇక రాఘవేంద్రుడు కొలువైన... మంత్రాలయం, కర్నూలు రైల్వే లైన్‌పై పశ్చిమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 1999-2004 మధ్య ఈలైన్‌కోసం ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేసింది.. 110 కిలోమీటర్ల దూరం రైలు మార్గం నిర్మించాలని... ఒక్కో కిలోమీటరుకు 6కోట్ల రూపాయలు అవసరమని తేల్చింది.. ఈ నివేదిక సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ కార్యాలయంలో అలాగే ఉండిపోయింది.. మంత్రాలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఉన్న రైళ్లు సరిపోవడంలేదు.. ఈ బడ్జెట్‌లోనైనా ఈ లైన్‌కు మ్రోక్షం కలుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఈ లైన్‌ ఏర్పాటుచేస్తే ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజవర్గాల ప్రజలకుకూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

30ఏళ్ల క్రితం మంజూరైన నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రాజెక్టు

ఇవేకాదు.. జిల్లాలో ఏళ్ల తరబడి ముందుకు సాగని ప్రాజెక్లు ఎన్నో ఉన్నాయి. నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైను ప్రాజెక్టు 30ఏళ్ల క్రితం మంజూరైంది. ఎర్రగుంట్ల, బనగానపల్లెవరకూ 647 కోట్లు ఖర్చుతో 126 కిలోమీటర్ల వరకూ లైన్ వేశారు.. బనగానపల్లె-నంద్యాల మధ్య 35 కిలోమీటర్ల దూరం పనులు నత్తనడకన సాగుతున్నాయి.. కాచిగూడ, గుంతకల్లు మధ్య డోన్ మీదుగా 360 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇవన్నీ పూర్తవుతేనే కొత్త రైళ్లు కర్నూలుకు వచ్చే అవకాశం ఉంది. గుంటూరు గుంతకల్లు మధ్య నంద్యాల డోన్ రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం 2010-11లో సర్వేకి ప్రతిపాదించారు. సర్వే పూర్తయినా నిధులు రాలేదు. మద్దికెర-నంచర్ల మధ్య 5కిలోమీటర్ల బైపాస్ రైలు మార్గం నిర్మిస్తే కర్నూలు నుంచి డోన్, ఆదోని మీదుగా హైదరాబాద్‌కు వేగంగా చేరుకోవచ్చు.. గత బడ్జెట్‌లో ఈ పనులకు 15కోట్ల రూపాయలు కేటాయించారు.. ఇంకా టెండర్లు పిలవలేదు..

శ్రీశైలం సిద్దేశ్వరం మధ్య రైలు మార్గం కోసం ప్రతిపాదనలు

శ్రీశైలం నుంచి సిద్దేశ్వరం వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి రెండేళ్ల క్రితం సర్వే కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించారు.. ఇది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు.. గుంతకల్లు - రాయచూరు మధ్య కాపలాలేని లెవెల్ క్రాస్ గేట్లు చాలా ఉన్నాయి.. ఇక్కడ రైల్వే గేట్లు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది.. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా రైల్వే శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు.. ఇక సికింద్రాబాద్ నుంచి డోన్ మీదుగా గుత్తి వరకు డబల్ లైన్ నిర్మాణానికి 2013-14 బడ్జెట్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.. ఇప్పటీకి ఈ లైన్‌ పనులు మొదలుకాలేదు..

రాయచూరు-బెంగుళూరుకు వయా మంత్రాలయం

రాయచూరు-బెంగుళూరుకు మంత్రాలయం మీదుగా... గుంతకల్లు హైదరబాద్ మధ్య ఆదోని మీదుగా ప్యాసింజర్‌ రైళ్లు కావాలని కొన్నేళ్లుగా జిల్లా వాసులు కోరుతున్నారు.. బెంగళూరు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్, బెంగళూరు హైదరబాద్ గరీబ్‌రథ్ సూపర్ ఎక్స్ ప్రెస్‌లను ఆదోనిలో ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. అలాగే హైదరాబాద్ నుంచి డోన్ వరకు కర్నూలు మీదుగా ముంబైకి కొత్త రైళ్లు కావాలని కోరుతున్నా రైల్వే శాఖనుంచి ఎలాంటి సమాధానం రావడంలేదు.. తుంగభద్ర ఎక్స్ ప్రెస్ ను కర్నూలు నుంచి డోన్ వరకు పొడిగించాలన్న డిమాండ్‌ కూడా ఉంది.. ఇలా ఎన్నో ఏళ్లుగా కొత్త రైళ్లకోసం జిల్లా వాసులు ఎదురుచూస్తూనే ఉన్నారు.. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు..

దూర ప్రాంతాలు ప్రయాణించే రైళ్లన్నీ విశాఖకు వెళ్లి ఎక్కాల్సిందే

ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస లాంటి పెద్ద స్టేషన్లు ఉన్నా సౌకర్యాలు లేమితో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలు ప్రయాణించే రైళ్లన్నీ విశాఖకు వెళ్లి ఎక్కాల్సిందే. దాంతో పాటుగా ఒడిషాలోని ఖుర్దా డివిజన్ లో సగం స్టేషన్లు విలీనమయ్యాయి. ఇలాంటి సమస్యలతో శ్రీకాకుళం జిల్లా వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాదుపూడి, బారువా, మందస, సుమ్మాదేవి, హరిశ్చంద్రపురం, నౌపాడ, దూసి, పొందూరు లాంటి స్టేషన్లు పేరుకు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు. ఒకటో రెండో ప్యాసింజర్ర్ రైళ్ళు తప్ప మరేవీ ఆగవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిషా సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్ లు మరిన్ని రావడంతో పాటు పూర్తి స్థాయి లో అభివృద్ధి చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గడచిన రెండు దశాబ్దాలుగా కొత్త లైన్లు లేవు

గడచిన రెండు దశాబ్దాలుగా కొత్త లైన్లు లేవు. గుణుపూర్ నుండి నౌపాడ వరకూ కొత్తగా వేసిన బ్రాడ్ గేజ్ లైన్ పురోభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో ఈ బడ్జెట్ లో పూర్తి స్థాయి దృష్టి సారించి ఉత్తరాంధ్రకు మరిన్ని ప్రాజెక్ట్ లు రావాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆశిస్తున్నారు. రైల్వే జోన్ విషయం లో ఇప్పటికే స్పష్టమైన హామీ కేంద్రం నుంచి రావడంతో ఇకపై జిల్లాలో రైల్వే అభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి అనేక నివేదికలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని బడ్జెట్ లో ఆశాజనక కేటాయింపులు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే బడ్జెట్‌పై శ్రీకాకుళం భారీ ఆశలు

మొత్తానికి ఈసారి రైల్వే బడ్జెట్ పై పేదోడి జిల్లా శ్రీకాకుళం భారీగానే ఆశలు పెట్టుకుంది. విశాఖకు రైల్వే జోన్ అంచనా ఆనందం కలిగిచినప్పటికీ.. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎలాంటి కేటాయింపులు వస్తాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సంవత్సరం అయినా బడ్జెట్ రైలుకు శ్రీకాకుళం లో హాల్ట్ లభిస్తుందా.. లేక ఎప్పటిలాగే ఆగకుండా వెళ్లిపోతుందా అన్నది వేచి చూడాలి.

విజయవాడ-చెన్నై, నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గాల అనుసంధానం

విజయవాడ-చెన్నై, నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గాల అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కనిగిరి నుంచి కందుకూరు మీదుగా సింగరాయకొండ వద్ద రెండు మార్గాలను కలిపేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇది సాకారమైతే కనిగిరి, సింగరాయకొండ జంక్షన్లతో కందుకూరు డివిజన్‌ రైలు కళ సంతరించుకోనుంది.. ప్రకాశం జిల్లా రైలు రవాణాకు కేంద్రంగా మారుతోంది.

దొనకొండ నుంచి ప్రారంభమై పామూరు మండలం రావిపాడు వరకు సాగుతుంది

కనిగిరి-సింగరాయకొండ, నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గం జిల్లాలో గుండ్లకమ్మ నది సమీపంలో దేకనకొండ నుంచి ప్రారంభమై పామూరు మండలం రావిపాడు వరకు 8 మండలాల్లో 34 గ్రామాల మీదుగా సాగుతుంది. మొత్తం 105.60 కి.మీ ఉండే ఈ లైను భూసేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇందులో నడికుడి నుంచి కనిగిరి వరకు 153.30 కి.మీ దూరం ఉంది. ఇక్కడ నుంచి పెద్దఅలవాలపాడు, కందుకూరు మీదుగా సింగరాయకొండ దాకా 63 కి.మీ పొడవునా మరో రైలుమార్గం నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో కనిగిరి, సింగరాయకొండ రైల్వేస్టేషన్లు జంక్షన్లుగా మారతాయి. ఇక్కడ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

తీరంలోని ఏ ప్రాంతానికైనా రవాణా వేగవంతమవుతుంది

కనిగిరి-సింగరాయకొండ మీదుగా విశాఖపట్నం నుంచి చెన్నై దాకా తీరంలోని ఏ ప్రాంతానికైనా రవాణా వేగవంతమవుతుంది. చకచకా జాతీయ రహదారుల పనులు జాతీయ రహదారులు ప్రకాశం జిల్లాను చుట్టేస్తున్నాయి. మార్టూరు నుంచి తెట్టు వరకు విజయవాడ-చెన్నై మార్గం, ఈపురుపాలెం నుంచి త్రోవగుంట దాకా ఒంగోలు-దిగమర్రు రహదారి పనులు సాగుతున్నాయి. కొత్తగా కనిగిరి నుంచి కుంట దాకా నిర్మాణంలో ఉంది. అనంతపురం - గుంటూరు, కర్నూలు - గుంటూరు మార్గాలు కూడా కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. వీటికి రైలుమార్గాలు కూడా తోడైతే జిల్లాలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంటుందని వ్యాపారుల అభిప్రాయంగా ఉంది.

నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున సిమెంట్,ధాన్యం ఎగుమతులు,దిగుమతులు

రాష్ట్ర రాజధానికి సరిహద్దుగా ఉంది నల్లగొండ జిల్లా. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్ర నుంచి కేవలం గంటన్నర ప్రయాణంతో నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. జిల్లాలో పారిశ్రామికంగా సిమెంట్, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరుగుతాయి. అయినా కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో నల్లగొండ జిల్లాకు ప్రతిసారి మొండి చెయ్యే చూపుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపిలు రైలు మార్గాల్ని వేయించడం, నిధులిప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. వివిధ మార్గాలను కలుపుతూ జిల్లా నుంచి దాదాపు 15 ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి.

రైల్వే లైను లేని సూర్యాపేట,కోదాడ,హుజూర్‌ నగర్‌, నాగార్జునసాగర్‌

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌ నగర్‌, నాగార్జునసాగర్‌, దేవరకొండ,మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాలకు రైలు మార్గమే లేదు. నల్లగొండకు జిల్లాకు సంబంధించి దాదాపు 10కి పైగా ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దేవరకొండ-రాయచోటి, మాచర్ల - దేవరకొండ - రాయచూర్‌, ఖాజీపేట - నల్గొండ, నల్గొండ - హన్మకొండ, జనగామ - సూర్యాపేట - నాగార్జునసాగర్ - మాచర్ల, గద్వాల్ - దేవరకొండ - నాగార్జునసాగర్ - మాచర్ల కొత్త లైన్ల ఏర్పాటు, సూర్యాపేట - డోర్నకల్ కొత్త లైన్ ప్రతిపాదన, బీబీనగర్ - నల్లపాడు వరకు డబులింగ్‌, విద్యుద్దీకరణ పనులు, బీబీనగర్‌ జంక్షన్‌ అభివృద్ధి, మేళ్లచెర్వు - జాన్‌పహాడ్‌ వరకు లింకింగ్‌ లైన్‌ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. గత కొంతకాలంగా నల్గొండ - సూర్యాపేట - ఖమ్మం, మిర్యాలగూడ - సూర్యాపేట - వరంగల్‌ కలుపుతూ రైలు మార్గాల నిర్మాణం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ మార్గాల నిర్మాణం డిమాండ్ ఊపందుకుంది.

భువనగిరిలో రెండో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్

సికింద్రాబాద్‌-ఖాజీపేట, సికింద్రాబాద్‌ - నడికుడి రైల్వే లైన్ల మీద అనేక రైళ్లు రాకపోకల్ని సాగిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ లైను బీబీనగర్‌ వరకే రెండో లైనుగా ఉంది. అక్కడి నుండి ఖాజీపేట వరకూ సింగిల్‌ లైను మాత్రమే ఉంది. దీన్ని డబులింగ్‌ చేయాలని, భువనగిరిలో రెండో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రయాణికులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. సూర్యాపేట నుంచి వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదనను రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో చేశారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఆ లైను నిర్మాణంలో ఎలాంటి ప్రగతీ కనిపించడం లేదు. బీబీనగర్‌-నడికుడి రైలు మార్గంలో అనేక క్రాసింగ్‌లున్నాయి. వాటి వద్ద రక్షణ లేని కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని బీబీనగర్‌, నాగిరెడ్డిపల్లి, చిట్యాల, వలిగొండ, మిర్యాలగూడ, ఆలేరు రైల్వే స్టేషన్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. రైల్వే లైన్ల విస్తరణ, అభివృద్ధి విషయంలో ఎప్పటి నుంచో జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నా ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలు శ్రద్ధ చూపడం లేదని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

మాచర్ల-నల్లగొండ లైన్ నిర్మాణానికి రూ. కోటి విడుదల

ఇక దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న మాచర్ల-నల్లగొండ లైన్ నిర్మాణానికి రూ. కోటి విదిల్చారు. అది దానికి ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదు. పారిశ్రామికంగా అవసరమున్న విష్టుపురం-జాన్‌పహాడ్ లైన్‌కు రూ.5 కోట్లు, జగ్గయ్యపేట-మేళ్లచెర్వుకు రూ.100 కోట్లు, మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ లైన్ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో జగ్గయ్యపేట-మేళ్ళచెర్వు, మేళ్ళచెర్వు-జాన్ పహాడ్ నిర్మాణంలో కొంత ప్రగతి ఉందని, తాజా బడ్జెట్ లో మరో 100 కోట్ల చొప్పున కేటాయిస్తే అవి పూర్తవుతాయని జిల్లాకు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లాకు రైల్వే బడ్జెట్ లో కేటాయింపులపై అనుమానపు నీడలు మరింత కమ్ముకున్నాయని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకుంటేనే జిల్లాకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వ్యక్తమవుతోంది.

నిజామాబాద్‌ జిల్లాలో నత్తనడకన రైల్వే ప్రాజెక్టులు

నిజామాబాద్‌ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మరికొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి-నిజామాబాద్‌ మధ్య రైలు మార్గం నిర్మాణ పనులు 1993లో మొదలయినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. సికింద్రాబాద్‌- ముథ్కేడ్‌ డబ్లింగ్‌ పనులు, బోధన్‌-బీదర్‌ రైల్వేలైను, ఆర్మూరు- ఆదిలాబాద్‌ రైల్వేలైను, నిజామాబాద్‌ కేంద్రంగా రైల్వే డివిజను తదితర ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు.

సికింద్రాబాద్‌- నాందేడ్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు

సికింద్రాబాద్‌- నాందేడ్‌ మధ్య ప్రస్తుతం రోజూ 50 వరకు ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ఒకే మార్గం ఉండటంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యమవుతోంది. ఈ మార్గంలో డబ్లింగు పనులకు నాలుగేళ్ల క్రితం కేటాయింపులు జరిగాయి. నాందేడ్‌ నుంచి ముథ్కేడ్‌ మధ్య పనులు పూర్తికావస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మధ్య మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నిజామాబాద్‌కు మంజూరైన రైల్వే డివిజను నాందేడ్‌కు తరలిపోయింది. ఐతే తగిన న్యాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ డివిజను పరిధిలో ఉన్న కొన్ని రైల్వేస్టేషన్లను కలిపి నిజామాబాద్‌ రైల్వే డివిజను చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ను సికింద్రాబాద్‌ డివిజనులోకి చేర్చి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలను కలిపి నిజామాబాద్‌ కేంద్రంగా రైల్వే డివిజను ఏర్పాటు చేసే వీలుంది. ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ గాలికొదిలేసింది.

కాగితాలకే పరిమితమైన బోధన్‌, బీదర్‌ రైలు మార్గం

బోధన్‌, బీదర్‌ రైలు మార్గంప్రతిపాదన కూడా కాగితాలకే పరిమితమయ్యింది. 1938లో నిజాం హయాంలోనే ఈ ప్రాజెక్టుకు సర్వే పూర్తయ్యింది. ఆ తరువాత రైల్వే శాఖ కూడా సర్వే చేసింది. మూడేళ్ల క్రితం సర్వే పూర్తి అయ్యింది. రూ.699 కోట్ల మేర వ్యయం అవుతుందని ఇంజినీర్లు నివేదిక తయారుచేశారు. కాని జిల్లా నేతల అలసత్వం వల్ల రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుపైనా శీతకన్ను వేసింది.

కరీంనగర్ జిల్లాను పట్టించుకోని ప్రభుత్వాలు

కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రతి రైల్వే బడ్జెట్‌లో నిరాశే ఎదురవుతోంది. బడ్జెట్‌ వరకు ఎదురుచూడడం.. బడ్జెట్‌ చూసి నిరూత్సాహపడడం రొటీన్‌గా మారింది. అయితే జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట రైల్వే ప్రాజెక్టుల తర్వాత.. ప్రభుత్వాలు చేసిందేమీ లేదని జిల్లా వాసులంటున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా కొత్త రైల్వే లైన్లు వేయాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదంటున్నారు.

కొత్త మార్గాల నిర్మాణానికి 25 ఏళ్లు

ఇక జిల్లాలో కొత్త మార్గాల నిర్మాణానికి 25 ఏళ్లకు పైగా పడుతుందంటున్నారు ప్రజలు. పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ గత 25 ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉందంటున్నారు. ఇక రామగుండం-మణుగూరు ప్రతిపాదనలు ప్రతి ఏటా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల ప్రతిపాదనలను సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ముందుకు సాగని పెద్దపల్లి-మోర్తాడ్‌ పనులు

ఇక అరకొర నిధులతో పెద్దపల్లి-మోర్తాడ్‌ పనులు ముందుకు సాగడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెద్దపలి-జగిత్యాల వరకు ఉన్న పుష్‌పుల్‌ రైలును మెట్‌పల్లి వరకు నడపాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా వరంగల్‌కు కూడా రైలు వేయాలన్న డిమాండ్‌ కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయినా కూడా రైల్వేశాఖ ఈ జిల్లాపై దయ చూపడం లేదని పలువురంటున్నారు. ఇక అదేవిధంగా జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని కూడా అనేక ప్రతిపాదనలు పంపారు. అయినా కూడా ఇప్పటివరకు వాటికి మోక్షం లభించలేదు.

ఎన్నో ఏళ్లుగా కొత్తపల్లి-మనోహరాబాద్‌ ప్రతిపాదన

ఇదిలావుంటే.. కొత్తపల్లి-మనోహరాబాద్‌ లైను ప్రతిపాదన కేసీఆర్‌ ఇక్కడనుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ఉంది. మరోవైపు రామగుండం, మణుగూరు రైల్వేలైనుకు 1982లో 650 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమైనా.. ఆ తర్వాత పట్టించుకున్న నాధుడే లేడు. 2010లో అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్‌ మరోసారి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. అయినా కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. ఇలా జిల్లాలో ఒకట్రెండు ప్రతిపాదనలు కాదు.. చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు జిల్లావాసులు. ఇవన్నీ పూర్తి చేస్తే రెవెన్యూ కూడా బాగానే వస్తుందంటున్నారు. ఇక జిల్లాలో పలు రైల్వేపనులు నిధులు లేక నత్తనడకన కొనసాగుతున్నాయని.. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే ఆ పనులు ముందుకెళ్తాయంటున్నారు. ఎక్కువగా ఆర్టీసీపై ఆధారపడే ప్రజలకు కొత్త రైల్వే ప్రాజెక్టుల ద్వారా న్యాయం జరిగే అవకాశముందంటున్నారు. దీనిపై రైల్వేశాఖ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రతి ఏడాది బడ్జెట్‌ వరకు ఆశతో ఎదురుచూడడం.. బడ్జెట్‌ పూర్తయిన తర్వాత నిరూత్సాహపడడం సర్వ సాధారణంగా మారిందని ప్రజలంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరీ రైల్వేశాఖ ఈసారైనా కరీంనగర్‌ జిల్లా వైపు చూస్తుందా.. లేక ప్రతి ఏడాదిలాగా నిరూత్సాహపరుస్తుందో చూడాలి. 

20:17 - February 24, 2016

హైదరాబాద్: కాకతీయ చెర్వులల్లో తేలిన గంగరాళ్లు...దూపయితుందంటున్నయాద్రాది నర్సన్న, ఫాం హౌస్ కు దికానాలు మారుస్తున్న చంద్రాలు...అక్కడకెల్లి పాలన అద్భుతం కావచ్చు... దేశ నగరాలను తలదన్నేటట్టు హైదరాబాద్.. మూడేళ్లలో డల్లాసును మించుటే ఆదర్శం, మీరు చేస్తే సంసారం... మేం చేస్తే ఇంకోటా?, రాజకీయాలలో మారుతున్న నీతి, నియమాలు, గంగా నదిలో చిచ్చు పోసిన స్వచ్ఛ అధికారి.. గలీజు మనిషి అని తిడుతున్న సోషల్ నెట్ వర్క్ లు, ఎరవాడ జైలుకు కల తెచ్చిన సంజయ్ దత్...ఆడుతూ, పాడుతూ ఒడసకొట్టిన జైలు జీవితం ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ఘరం.. ఘరం మాటలను చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయి : స్మృతీఇరానీ

ఢిల్లీ : హెచ్ సియూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ రోహిత్‌ ఆత్మహత్యపై జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ పాల్గొన్నారని ఆమె తెలిపారు. అదే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 600 వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే అప్పుడు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.

హౌరా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

నెల్లూరు : హౌరా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ సమీపంలోకి రాగానే బుధవారం సాయంత్రం ఏసీ బోగీలోంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. వెంటనే డ్రైవర్ రైలును నిలిపివేయడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.

రాందేవ్‌బాబా కు కేటాయించిన స్థలం రద్దు..

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా కు లీజు కింద కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి యోగా ట్రస్ట్ సంస్థ కు ఫుడ్ ప్రాసెసింగ్, హెర్బల్ గార్డెన్‌తోపాటు ఆయుర్వేద మందులు, వైద్యశాల నిర్మాణం కోసం 2010లో రాష్ట్ర ప్రభుత్వం 21 ఎకరాలు కేటాయించింది. బాబా రాందేవ్‌కు భూమి కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా భూకేటాయింపులపై విచారణ జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూకేటాయింపులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంజయ్ దత్ విడుదలపై మళ్లీ పిటిషన్

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విడుదలను ప్రశ్నిస్తూ ముంబయి హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సంజయ్‌దత్‌ పుణెలోని ఎరవాడ జైలు నుంచి రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంపీ వినోద్, సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సర్కార్ దవాఖానకే పోయి వైద్యం చేయించుకుంటామనే పరిస్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాల్సిన అవసరం ఉంది. వైద్య, ఆరోగ్యశాఖ కోరినన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుకావాలన్నారు.

ముళ్ల పొదల్లో మగ శిశువు...

అనంతపురం : ధర్మవరం చెరువుకట్ట దగ్గర ముళ్లకంపలో పసికందు అరుస్తున్నట్లు శబ్ధం రావడంతో స్థానికులు అక్కడికెళ్లి పసికందును తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితమే మగశిశువు జన్మించినట్లు తెలిసింది. స్థానికులు శిశువును ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసులు

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేటకు చెందిన మహిళ, బాలుడికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధరించారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

మిర్ పూర్ : ఆసియా కప్ టోర్నీ తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. అటు భారత టీంలో రెహానే స్థానంలో కోహ్లీ రంగంలోకి దిగాడు.

18:47 - February 24, 2016

విజయవాడ : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై వైసిపిలో చర్చ మొదలైంది. భూమా నాగిరెడ్డి వైసిపికి గుడ్‌బై చెప్పిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఒకవైపు రాయలసీమ ఎమ్మెల్యేలు చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతుంటే మరోవైపు కోస్తా ఎమ్మెల్యేలు కాపు ఈక్వేషన్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇంతకీ భూమా తర్వాత పీఏసి చైర్మన్‌గా ఎవరు నియమితులు కాబోతున్నారు.? వైసీపీ అధిష్టానం ఎవరికి అవకాశమిస్తుంది.?

టీడీపీకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు....

ఏపీలో వైసీపీ నుంచి అధికార టీడీపీకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే మరోవైపు పిఎసి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ ఊపందుకుంది. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటుందో దానికి పిఎసి బాధ్యతలు అప్పగిస్తారు. నిన్నటిదాకా కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పబ్లిక్‌ ఎకౌంట్స్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన వైసిపికి రాజీనామా చేసి టిడిపిలోకి వెళ్లడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ పోస్ట్‌ ఎవరికి ఇవ్వాలనే విషయమై వైసీపీ ముఖ్యనేతల్లో చర్చ మొదలైంది.

పిఎసి చైర్మన్ పదవి కోసం కుల సమీకరణలు ....

పిఎసి చైర్మన్ పదవి కోసం కుల సమీకరణలు కూడా మొదలయ్యాయి. కాపు వర్గానికి చెందినవారికి ఆ పదవిని ఇవ్వాలన్న వాదన తెరపైకొచ్చింది. కోస్తా ప్రాంతానికి చెందిన సీనియర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఆ వర్గానికి చెందినవారు కావడంతో ఆయన పేరు వినిపిస్తోంది. ఇక రాయలసీమ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కాపు ఉద్యమ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూకి ఇవ్వటం సబబుగా ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నా రాయలసీమ నేతలు మాత్రం ససేమిరా అంటునట్లు సమాచారం..

కోస్తా వర్గం ఎమ్మెల్యేలతో అధినేత జగన్‌పై ఒత్తిడి ....

జ్యోతుల నెహ్రూ ఇప్పటికే తన సన్నిహిత కోస్తా వర్గం ఎమ్మెల్యేలతో అధినేత జగన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. అయితే పెద్దిరెడ్డికి చిత్తూరు సహా కడప, కర్నూలు ఎమ్మెల్యేలు గట్టిగా మద్దతు పలుకుతున్నారు. దీంతో అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారనేది చర్చనీయాంశంగా మారింది. 

18:39 - February 24, 2016

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులతో దోబూచులాడుతున్నాయని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఫోరం సభ్యులు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. మిడ్‌ డే మీల్స్‌ కార్మికులకు వేతన పెంపుతో పాటు పలు సమస్యలపై విజయవాడ లెనిన్‌సెంటర్‌లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై శాసనమండలిలో పోరాడుతామని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అదేవిధంగా ఈసారి మండలి సమావేశాల్లో విద్యారంగంపై చర్చ జరగాలని సభాపతికి నోటీసులిచ్చినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

 

18:38 - February 24, 2016

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం కింద 450 కోట్లు కేటాయించడం శుభపరిణామం తెలంగాణరాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు అన్నారు హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల అభివృద్ది పనులకుగాను వన్ టైమ్ అసిస్టెన్స్ కింద కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. 70 వేల కోట్లు అభివృద్ది పథకాల కోసం కోరితే కేవలం 450 కోట్లు ఇచ్చి సరిపెట్టుకుందని రామచంద్రు అన్నారు.

18:35 - February 24, 2016

ఢిల్లీ : హెచ్ సియూ విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్టు ఘటనలపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగుతుంది. చర్చతోపాటు సమాధాన్ని కూడా పూర్తి చేయాలన్న అంశంపై అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ రెండుపై చర్చకు ఒకే నోటీసు ఇచ్చిన ప్రతిపక్షాలు... చర్చను వేర్వేరుగా చేట్టాలని పట్టుపడ్డంతో అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపదాదలు జరగడంతో రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభించి, వాయిదాల పర్వానికి దారితీసింది. చివరకు అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి రావడంతో హెచ్ సియూ, జేఎన్ యూ ఘటనలపై గురువారం చర్చ ఉంటుందని సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పిజే కురియన్‌ ప్రకటించారు. 

18:33 - February 24, 2016

ఢిల్లీ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం ఎపి ఎంబీ రాజేష్‌ విమర్శించారు. హెచ్ సియూ, జేఎన్ యూ ఘటనలపై లోక్‌సభ జరిగిన చర్చలో రాజేష్‌ పాల్గొన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ కారణమన్నారు.

18:31 - February 24, 2016

హైదరాబాద్ : బెంగళూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఓ యువకుడిని వెంబడించి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. రెండు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఓ వర్గం ప్రత్యర్థివర్గానికి చెందిన ఓ యువకుడిని తరిమి తరిమి కొట్టారు. కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటనతో సంబంధమున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎంపిడీవో పై ఉపాధి హామీ కూలీల ఆగ్రహం

కొడంగల్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధిహామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో వీరబ్రహ్మాచారిపై దాడి చేశారు. ఉపాధిహామీ పనులకు వస్తున్నా రెండు నెలలుగా తమకు కూలీ డబ్బులు మాత్రం ముట్టడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఈ రోజు ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు. అంతేగాకుండా కార్యాలయంలోని కుర్చీలు, టేబుళ్లను ధ్వంసం చేశారు. తరువాత కూలీలపై ఎంపీడీవో కొడంగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కారుబోల్తా : ఇద్దరి మృతి

నిజామాబాద్‌ :జక్రాన్‌పల్లి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో డిచ్‌పల్లి మండలం గన్నారం వాసులు రవి, రమ్యలు మృతి చెందారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 321 పాయింట్లు నష్టపోయి 23,088 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి.. 7,018 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఏపీఎస్ ఆర్టీసీగుర్తింపు ఎన్నికల్లో ఎంఎన్ యూ గెలుపు

విజయవాడ: ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ విజయం సాధించింది. 709 ఓట్ల మెజార్టీతో ఎన్‌ఎంయూ గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనియన్‌గా ఎన్‌ఎంయూ మరోసారి రికార్డ్ సృష్టించింది. ఎన్‌ఎంయూ గెలుపుతో విజయవాడలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆర్టీసీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల్లో మొన్నటి వరకు డివిజన్, రీజియన్, డిపోల వారిగా ఎన్నికలు జరిగాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్ఎంయూ ఘన విజయం సాధించింది. మొత్తం 56437 ఓట్లు ఉంటే 5535 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎన్ఎంయూ 24708 ఓట్లు, ఎంప్లాయిస్ యూనియన్‌కి 24156 ఓట్లు వచ్చాయి. ఫోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకోగా 709 ఓట్లు మెజార్టీ దక్కింది.

17:15 - February 24, 2016

హైదరాబాద్ :కళ్యాణ్ శ్రీనివాసరావు నిర్దోషి అని, నా కుమారుడు ఏ తప్పు చేయలేదని మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు తెలిపారు. ఆయన హైదరాబాద్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ... నా కుమారుడు ఏ తప్పు చేయలేని అన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తామని,.. ఈకేసుకు సంబంధించి ఎవరి పేర్లూ బయటపెట్టదల్చుకోలేదని,... అన్ని ఆధారాలు కోర్టులో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. కళ్యాణ్ శ్రీనివాస్‌ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసిన విషయం తెలిసిందే...

16:57 - February 24, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఒక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు గడువు అయిపోయింది. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠగా ఆఖరి క్షణం వరకు కొనసాగింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ చివరిరోజే ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఆశావహులంతా నామినేషన్లు వేసి ఉన్నారు. పార్టీల లిస్టులో లేనివారు ఇక విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత మంది రెబెల్స్‌ బరిలో మిగులుతారో కూడా చూడాల్సి ఉంటుంది.

16:55 - February 24, 2016

ఢిల్లీ : రోహిత్‌ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు వివాదం అంశాలపై వేరు వేరుగా చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటీస్‌ ఇవ్వాలని డిప్యూటి చైర్మన్ కురియన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మీరిచ్చిన ఎజెండాలో ఈ రెండు అంశాలు కలిసే ఉన్నాయని పేర్కొన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్య దర్యాప్తు విచారణ కమిటీలో దళిత సభ్యుడిని ఉంచాలని మాయావతి డిమాండ్‌ చేస్తున్నారని, ఆమె డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి కురియన్‌కు సూచించారు. ఈ అంశంపై చర్చ పూర్తయ్యాకే సమాధానం చెబుతామని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్న కురియన్‌ సభను అరగంట వాయిదా వేశారు.

16:53 - February 24, 2016

ఢిల్లీ : రోహిత్‌ వేముల ఆత్మహత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అమీతుమీకి దిగారు. మాయావతి ప్రశ్నకు జవాబివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. నేనిచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే మీ పాదాల వద్ద మోకరిల్లుతానని ఆవేశంతో చెప్పారు. ముందు మీరు ఓపిక తెచ్చుకోండని మంత్రి అన్నారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటన దర్యాప్తు బృందంలో దళిత సభ్యులను ఉంచడానికి మీకు ఇబ్బందేంటని మాయావతి ప్రశ్నించారు. యూనివర్సిటీ విచారణ కమిటీలో దళిత ప్రొఫెసర్‌ ఉన్నారని దాన్ని ఎందుకు అంగీకరించరని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సమాధానం చెప్పాలని అధికారసభ్యులు మాయావతిని టార్గెట్‌ చేశారు. అంతకు ముందు కేంద్ర మంత్రుల వైఖరి వల్లే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని మాయావతి ఆరోపించారు. వర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. 

16:51 - February 24, 2016

ఢిల్లీ : రోహిత్‌ ఆత్మహత్య ఘటన విచారణ కమిటీలో దళిత సభ్యుడు కచ్చితంగా ఉండాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి, రాజ్యసభలో కాంగ్రెస్‌ సభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో రోహిత్, హెచ్ సియూ ఘటనలపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నా ఏచూరి, ఆజాద్ విచారణ బృందంలో దళిత సభ్యుడు ఉంటున్నారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. 

16:49 - February 24, 2016

విశాఖ : ఇప్పటికే విద్యను ప్రైవేటీకరించిన ప్రభుత్వాలు ఇప్పుడు వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించకుండా వదిలేసిన విమ్స్‌ను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. విమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విశాఖలో 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సిపిఎం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయడం అన్యాయమని ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో విమ్స్‌కు 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విమ్స్‌ను ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా ఇప్పటివరకూ ఆ హామీపై స్పందించకపోవడం విచారకరమన్నారు. 

16:47 - February 24, 2016

కరీంనగర్‌ : మెట్‌పల్లిలో ఎంపీ బాల్కా సుమన్‌ సోదరి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్‌ దంపతులు.. నూతన దంపతులైన స్వర్ణ-శ్రీకాంత్‌లను ఆశీర్వదించారు. అయితే వివాహానికి హాజరవుతున్న సీఎం కేసీఆర్‌ను చంపుతామంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు నిన్న ఓ ఆగంతకుడు నెట్ నంబర్‌ నుంచి  ఫోన్ చేసాడు . ఇవాళ కోరుట్ల వస్తున్న మీ ముఖ్యమంత్రిని చంపేయబోతున్నాం అంటూ వినిపించింది. అంతే ఎమ్మల్యే కోపంతో ఊగిపోతూ అవతలి వ్యక్తిపై మండిపడ్డారు. పక్కనే ఉన్న ఎస్సైకి ఫోన్ ఇచ్చి మాట్లామని ఇచ్చారు. ఎస్సైతోనూ అదే విధంగా మాట్లాడటంతో విషయాన్ని జగిత్యాల డీఎస్పీకి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ మెట్‌పల్లిలో జరిగే పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ చెల్లెలి వివాహానికి హాజరయ్యేందుకు కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.మెట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహ వేదిక వద్ద అడుగడుగున తనిఖీలు నిర్వహించారు. సీఎం దగ్గరకు ఎవరినీ వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు విద్యాసాగర్‌రావుకు వచ్చిన ఫోన్‌ కాల్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. 

16:46 - February 24, 2016

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కాంట్రాక్ట్‌లు దక్కించుకున్న ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లొంజీ సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17న తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ మరుసటి రోజు నుంచే నిర్మాణ సంస్థలు పనులు చేపట్టాయి. మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నారు. 201 కోట్ల రూపాయల వ్యయంతో ఆరు భవనాలను నిర్మిస్తున్నారు. నాలుగు బ్లాక్‌లను ఎల్ అండ్ టీ , రెండు బ్లాక్‌లను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ రెండు సంస్థల సిబ్బంది పని చేస్తున్నారు. సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వం ఇవ్వజూపిన ప్రోత్సహాలకు అందుకోవాలన్న కృత నిశ్చయంతో ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లొంజీ సంస్థలు ఉన్నాయి. వచ్చే జూన్‌ నుంచి అమరావతి నుంచి పాలన సాగించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. 

16:43 - February 24, 2016

అనంతపురం : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకధాటిగా 16 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు. కొడికొండ నుంచి లేపాక్షి వరకు ఈ యాత్ర కొనసాగింది. లేపాక్షి ఉత్సవాల ప్రమోషన్‌లో భాగంగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి సైకిల్ తొక్కారు. యాత్ర కొనసాగుతున్నంతసేపూ బాలయ్య ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ప్రజలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. లేపాక్షి ఉత్సవాలను తెలుగు పండుగలా ఘనంగా నిర్వహిస్తామని బాలకృష్ణ తెలిపారు. 

16:42 - February 24, 2016

హైదరాబాద్ : మాదిగల పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా..మార్చి 10నుంచి మాదిగల చైతన్య యాత్రను నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లె నుంచే ఈ యాత్రను ప్రారంభిస్తామన్నారు. 

16:41 - February 24, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ, , జేఎన్ యూ ఘటనలపై మూడు రోజుల నిరసన ప్రదర్శనలకు సీపీఎం పిలుపు ఇచ్చింది. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో జరిగిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ ఐక్యతకు భంగం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టడారు. 

16:39 - February 24, 2016

ఖమ్మం : సింగరేణి భూ నిర్వాసిత గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు. భూనిర్వాసితులైన గిరిజనులకు షరతుల్లేని ఉద్యోగాలు ఇవ్వవాలని చేపట్టిన ఈ దీక్షకు వివిధ సంఘాలు, పార్టీలకు చెందిన నాయకులు మద్దతు తెలిపారు. కాగా అర్ధరాత్రివేళ వారెవరూ లేనిసమయంలో బలవంతంగా రేగాను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని గిరిజన చట్టాలను తుంగలో తొక్కి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి, ప్రభుత్వ అధికారులు స్పందించి తమ డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. 

16:37 - February 24, 2016

హైదరాబాద్ : నేపాల్‌ పర్వతశ్రేణుల్లో అదృశ్యమైన విమానం కూలిపోయినట్టు ఆ దేశ అధికారులు ప్రకటించారు. దీనిలో ఉన్నవారంతా మరణించారు. వీరిలో 20 మంది ప్రయాణికులు, ముగ్గరు సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి జామ్‌సోమ్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన 8 నిమిషాలకేఉ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. తొలుత ఈ విమానం అదృశ్యమైందని భావించారు. అనంతరం పర్వతశ్రేణుల్లో కూలిపోయిందని ప్రకటించారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విమానం బయలుదేరిన పొఖారా నేపాల్‌ రాజధాని ఖాఠ్మండ్‌కు 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. నేపాల్‌లో 1949లో విమానయాన సేవలు ప్రారంభమైన తర్వాత ఇంతవరకు 70 విమానాలు కూలిపోయాయి. ఈ ఘటనల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశద్రోహులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది: అనురాగ్ ఠాకూర్

ఢిల్లీ: దేశ ద్రోహులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఎంపి అనురాగ్ శర్మ ఆరోపించారు. హెచ్ సియూ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై లోక్ సభలో రెండు గంటల పాటు చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ... పార్లమెంట్ పై దాడి చేసిన వారితో ఉన్నారా? పార్లమెంట్ ను రక్షించన వారితో ఉన్నారా అని కాంగ్రెస్ ను ఠాకూర్ ప్రశ్నించారు. నిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, రాహుల్ గాంధీ జేఎన్ యూకు వెళ్లారు కానీ... వీరమరణం పొందిన కెప్టెన్ పవన్ ఇంటికి వెళ్లలేదన్నారు. అఫ్ఝల్ గురూ ఉగ్రవాది కాడా? కాంగ్రెస్ నేతలు దేశ విభజన కోరుతున్న వారి వద్దకు వెళ్లారు.

తెలంగాణ ఎంసెట్ -2016 షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : ఎంసెట్ -2016 షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుంది. ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ. 5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 10000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. తమ దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 3 నుంచి అదే నెల 13 వరకు అవకాశం కల్పించారు.

15:38 - February 24, 2016

ఢిల్లీ : హెచ్ సియూ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై లోక్ సభలో రెండు గంటల పాటు చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మొదటగా కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాదిత్య చర్చలో పాల్గొన్నారు. వారి మాటల్లో 'రోహిత్ దళితుడా?... అనే దాని పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మండి పడ్డారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందన్నారు. చనిపోయిన విద్యార్థి దళితుడా? కాదా అని కేంద్ర మంత్రి సర్టిఫికేట్ ఇస్తుందా? యూనివర్శిటీల్లోదళితులకు స్థానం లేదని స్వయంగా ప్రొఫెసర్లే చెప్పారు. రోహిత్ దళితుడు కాదని, ఇది దళిత సమస్య కాదని స్మృతి ఇరానీ చెప్పారు. ఈ దళితులపై ప్రభుత్వం అత్యాచారం చేస్తోంది. ఈ ఘటనలు విశ్వవిద్యాలయాల చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలిపోతాయి. రోహిత్ దళితుడు కాకపోతే మంత్రులు తప్పుకుంటారా?, రోహిత్ కళాశాల బయట టెంట్ లో ఉండే పరిస్థితి కల్పించారు. రోహిత్ఘటనను కాంగ్రెస్ పై రుద్దే ప్రయత్నం చేశారు.

కన్హయ్యను అక్రమంగా అరెస్టు చేశారు : సింథియా

జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యను అక్రమంగా అరెస్టు చేశారిని కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాధిత్య సింధియా విమర్శించారు. జేఎన్ యూను ప్రభుత్వం మూసివేయాలని చూస్తోందని విమర్శించారు. యూనివర్శిటీలను ఆరెస్సెస్, బిజెపి కాషాయీకరణ చేస్తున్నాయని మండి పడ్డారు. విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెట్టారు, దేశ వ్యతిరేక నినాదాలతో సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేశారు' అని పేర్కొన్నారు.

కన్హయ్యను అక్రమంగా అరెస్టు చేశారు : సింథియా

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యను అక్రమంగా అరెస్టు చేశారిని కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాధిత్య సింధియా విమర్శించారు. లోక్ సభలో రోహిత్ ఆత్మహత్య, జేఎన్ యూ ఘటనలపై చర్చకు స్పీకర్ రెండు గంటల సమయం కేటాయించారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ యూనివర్శిటీలను ఆరెస్సెస్, బిజెపి కాషాయీకరణ చేస్తున్నాయని మండి పడ్డారు.

రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్ర మంత్రుల ప్రమేయం : జ్యోతిరాధిత్య

ఢిల్లీ : హెచ్ సియూ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై లోక్ సభలో రెండు గంటల పాటు చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మొదటగా కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాదిత్య చర్చలో పాల్గొన్నారు. వారి మాటల్లో 'రోహిత్ దళితుడా?... అనే దాని పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మండి పడ్డారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందన్నారు. చనిపోయిన విద్యార్థి దళితుడా? కాదా అని కేంద్ర మంత్రి సర్టిఫికేట్ ఇస్తుందా? యూనివర్శిటీల్లోదళితులకు దళితులపై ప్రభుత్వం అత్యాచారం చేస్తోంది' అని పేర్కొన్నారు. ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది.

రోహిత్ ఆత్మహత్య పై లోక్ సభలో చర్చ

ఢిల్లీ : హెచ్ సియూ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై లోక్ సభలో రెండు గంటల పాటు చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మొదటగా కాంగ్రెస్ ఈ చర్చలో పాల్గొంది. మరో వైపు రోహిత్ ఘటనపై రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ 3.30 గంటల వరకు వాయిదా వేశారు.

ఏపీలో బీసీ కమిషన్ సభ్యుల నియామకం

విజయవాడ: బీసీ కమిషన్ కమిషన్ లో ముగ్గురిని సభ్యులుగా నియమిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ వర్సిటీల్లో ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లు శ్రీమంతుల సత్యనారాయణ, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రారావులను ప్రభుత్వం కమిషన్ సభ్యులుగా నియమించింది. బీసీల్లో కాపులను చేర్చే విషయంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ నేతృత్వంలో కమిషన్ ను వేసిన సంగతి తెలిసిందే. తాజాగా సదరు కమిటీలో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం కేజ్రీవాల్ ను కలిసి రోహిత్ తల్లి, సోదరుడు

ఢిల్లీ : హెచ్ సియూలో ఇటీవలి ఆత్మహత్యకు పాల్పడిన హెచ్‌డీ స్కాలర్‌ తల్లి, సోదరుడు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిశారు. రోహిత్‌ సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని రోహిత్‌ తల్లి ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుభూతితో పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.

ఐఆర్ ఎస్ ఎంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడ :ఇండియన్ రోడ్ సర్వే వాహనం ఐఆర్ఎస్‌ఎంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. రహదార్ల నాణ్యత, సాంకేతికతను గుర్తించేందుకు ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో వాహనం రూపకల్పన చేశారు.

రాజ్యసభలో క్యాంపస్ సెగలు

న్యూఢిల్లీ : రాజ్యసభకు క్యాంపస్ సెగలు అంటుకున్నాయి. హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలపై రగడ కొనసాగుతుంది. సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఐదోసారి సభ వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని బీఎస్పీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

14:38 - February 24, 2016

హైదరాబాద్ : చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువయ్యాయి. ట్రాఫికింగ్ అంటే ఏమిటి? దానికి సంబంధించిన చట్టాలు ఏమిటి? ఈ అంశాలపై న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. వారు ట్రాఫికింగ్ కు సంబంధించి ఏఏ అంశాలు తెలియజేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:30 - February 24, 2016

విశాఖ : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం భారీ ర్యాలీని చేపట్టింది. ఆర్‌ఎస్సెస్‌, బీజేపి సంఘ్‌ పరివార శక్తులు కుట్రల వల్లే కన్నయ్య లాంటి వ్యక్తులు జైలుకెళ్లారని సీపీఎం నేతలు విమర్శించారు. ఇప్పటికైనా కన్నయ్యను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి జార్జ్‌ అందిస్తారు. 

14:29 - February 24, 2016

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. డబ్బు సంపాదన కోసమే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్రకార్యదర్మి రామకృష్ణ మండిపడ్డారు.

కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ఢిల్లీ  : జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు విచారణను ఈనెల 29 కి వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో స్టేటస్ రిపోర్టును దాఖలు చేశారు. 

 

తాయిలాల కోసమే ఎమ్మేల్యేలు పార్టీ పిరాయింపులు : బొత్స

హైదరాబాద్ : తాయిలాల కోసమే ఎమ్మేల్యేలు పార్టీ మారుతున్నారని వైసిపి అధినేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ఏం అభవృద్ధి చేసారో ప్రభుత్వం చెప్పాలన్నారు. 
 

13:58 - February 24, 2016

హైదరాబాద్ : తాయిలాల కోసమే ఎమ్మేల్యేలు పార్టీ మారుతున్నారని వైసిపి అధినేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ఏం అభవృద్ధి చేసారో ప్రభుత్వం చెప్పాలన్నారు. 

 

13:53 - February 24, 2016

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు విచారణను ఈనెల 29 కి వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో స్టేటస్ రిపోర్టును దాఖలు చేశారు. 

13:44 - February 24, 2016

ఢిల్లీ : రోహిత్‌ ఆత్మహత్య ఘటన విచారణ కమిటీలో దళిత సభ్యుడు కచ్చితంగా ఉండాలని సీపీఎం ఎంపీ  సీతారాం ఏచూరి, రాజ్యసభలో కాంగ్రెస్‌ సభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. విచారణ బృందంలో దళిత సభ్యుడు ఉంటున్నారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. 

13:34 - February 24, 2016

ఖమ్మం : నవాబులకు ఆ ప్రాంతం కేరాఫ్ అడ్రస్.. ఏళ్ల తరబడి అక్కడ వారి పాలన సాగింది. కాలం మారింది.. రాజులు.. రాజ్యాలు కాలగర్భంలో కలిసి పోయాయి. తరువాత క్రమంలో ఆ ప్రాంతం ఎర్రజెండా పరమైంది. చివరికి కమ్యూనిస్టులకు కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆ ప్రాంతంలో ఐదేళ్ల తర్వాత తొలి సారిగా జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. దీంతో రాష్ట్రం మొత్తం చూపు అటూవైపే పడింది. ఇంతకీ ఏంటా ప్రదేశం ఆప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంటీ ?.
ఖమ్మానికి చాలా పేర్లు 
స్తంబాద్రి పురం.. కంబాద్రిపురం.. కంభం ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మానికి చాలా పేర్లే ఉన్నాయి. 112 ఏళ్ల మహాప్రస్ధానంలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైంది ఖమ్మం ఖిల్లా. గ్రామం..తాలుకా..పట్టణంగా చివరికి జిల్లా కేంద్రంగా  ఏర్పాటైంది ఖమ్మం. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల్లో నాటి కమ్యూనిస్టులు పోరాడిన ఫలితంగా ఆది నుంచి ఖమ్మంలో కమ్యూనిస్టు పార్టీలు ముందజంలో నిలిచాయి. 
ఖమ్మం నగరంలో ఎన్నో మార్పులు 
ఖమ్మం నగరంలో ఎన్నో మార్పులు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిది నుంచి 18.53 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించి మున్సిపాలిటీగా రూపాంతంరం చెందింది. పురావస్తు శాఖ చెప్పే లెక్క ప్రకారం ఖమ్మానికి వెయ్యి ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం నగరంలో 35 వేల ఇళ్లు అధికారికంగా.. అనుమతిలేకుండా మరో 20 వేలు గృహాలు ఉన్నాయి. 1952 నుంచి గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మం ....1959లో రెండో గ్రేడు నుంచి ఒకటో గ్రేడుగా .. 2001లో ప్రత్యేక పురపాలకంగా ఏర్పడింది. 2012 లో కార్పొరేషన్‌గా అవతరించింది. 
1942లో ఖమ్మంలో మొట్టమొదటి నామినేషన్ బాడీ 
ఖమ్మంలో మొట్టమొదటి నామినేషన్ బాడీ 1942లో ఏర్పడింది.. 13 మంది నామినేటెడ్ సభ్యులు 8 మంది నాన్ అఫిషియల్ సభ్యులు ఐదుగురు అఫిషియల్స్‌తో ఏర్పడింది ఖమ్మం పురపాలకం. మొట్టమొదటి నామినేటెడ్‌ చైర్మన్‌గా అప్పటి డిప్యూటి కలెక్టర్‌ రామ్‌లాల్ వ్యవహరించారు. తర్వాత చైర్మన్‌గా కమ్యూనిస్టు పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య ఎన్నికయ్యారు. 1952 నుంచి 58 వరకు ఆయనే  చైర్మన్‌గా కొనసాగారు. రెండోసారి 1961లో ఎన్నికలు జరిగాయి.. అప్పుడు కూడా లక్ష్మీనర్సయ్యనే చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు, నాలుగో సారి కూడా చిర్రావూరి లక్ష్మీనర్సయ్యే చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1981 నుంచి 1986 వరకు కూడా ఆయనే ఛైర్మన్‌గా కొనసాగారు. అంటే ఏకంగా ఐదు పర్యాయాలు చిర్రావూరి లక్ష్మీనర్సయ్యనే ఛైర్మన్‌గా కొనసాగడం కమ్యూనిస్టు పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి, అభిమానానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. ఇక 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాపర్తి రంగారావు ఛైర్మన్ అయి 2000 సంవత్సరం వరకు కొనసాగారు. ఆ తరువాత ఎన్నికల్లో 2000 నుంచి 2005 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగమల్లిక చైర్మన్ పదవి చేపట్టి ఆ తరువాత తెలుగు దేశం పార్టీలో చేరారు. 2005 ఎన్నికల్లో సీపీఎం పార్టీకి చెందిన అఫ్రోజ్ సమీనా ఛైర్మన్ పదవి అలంకరించారు. అంటే ఖమ్మంలో 8 సార్లు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే ఆరు పర్యాయాలు కమ్యూనిస్టు పార్టీనే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లా కేంద్రం అన్నిటిలోనూ టాప్ ప్లేస్‌లోనే కోనసాగుతూ వచ్చింది.
హైదారాబాద్‌కు ఖమ్మం నగరానికి పోలికలు
హైదారాబాద్‌కు ఖమ్మం నగరానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సంస్కృతులకు ఖమ్మం జిల్లా వారదిగా నిలిచింది.. తెలంగాణ, ఆంధ్ర సంస్కృతుల సమ్మిళితం ఖమ్మం.. అంతే కాకుండా నగరానికి 100 కిలో మీటర్ల దూరంలోపే విజయవాడ మహానగరం ఉంది... అంత కంటే తక్కువ దూరంలోనే కృష్ణా జిల్లా సరిహద్దులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అన్నివర్గాల ప్రజలు, వివిధ రకాల భాషలు మాట్లాడే వారు ఉన్నట్లే ఖమ్మం నగరంలోనూ ఉన్నారు.
ఖమ్మంలో పట్టుసాధించేందుకు టీఆర్‌ఎస్‌ తహతహ
అంతే కాకుండా ఖమ్మం నగరానికి చేరువ అయ్యే వారికి సుదూరం నుంచి దుర్శనమిచ్చేది.. ఒకటి ఖిల్లా, రెండోది నర్సింహస్వామి గుట్ట. ఈ రెండు చారిత్ర క్షేత్రాలు ఖమ్మం చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నిజాం పాలన వరకూ స్తంబాద్రిపురం అనే పేరు ఉండగా ఆ తర్వాత స్తంబాద్రిగా.. కాలక్రమేణా ఖంభంగా అదికాస్తా ఖమ్మంగా మారింది. ఖమ్మం చారిత్రాత్మకంగానే కాకుండా విభిన్న రాజకీయాలకు నెలవు. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు పోరాడిన ఫలితంగా వామపక్షాలకు ఖమ్మం కంచుకోటగా ఉండేది. మారుతున్న  కాలగమనంలో కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఎన్ టిఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత టీడీపీ, మాజీ సీఎం వైఎస్ఆర్‌ మరణం తర్వాత వైసీపీ, తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం నగరంలో పట్టుసాధించేందుకు తహతహలాడుతున్నాయి. చారిత్రక నేపథ్యంలో ఇలా ఉంటే ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడిన తరువాత జరిగే మొదటి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ అభ్యర్ధులను గెలిపించుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. 

13:27 - February 24, 2016

కడప : వైసిపికి టీడీపీ షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. వైసీపీకి మరో షాక్ తగలింది. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టిడిపిలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో జయరాములు టిడిపిలో చేరారు. మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు జయరాములు బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల చివరి వరకు వైసిపికి చెందిన 
21 ఎమ్మెల్యేలను టిడిపిలోకి  తీసుకోవాలనే యోచనతో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం. 

 

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్రం కారణం కాదు : స్మృతి ఇరానీ

ఢిల్లీ : రోహిత్‌ ఆత్మహత్య ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. రాజ్యసభలో ఆమె మాట్లాడారు. రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్రం కారణం కాదని ఆమె అన్నారు. 

12:59 - February 24, 2016

ఢిల్లీ : రోహిత్‌ ఆత్మహత్య ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. రాజ్యసభలో ఆమె మాట్లాడారు. రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్రం కారణం కాదని ఆమె అన్నారు. 

 

12:51 - February 24, 2016

ఢిల్లీ : బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే హెచ్‌సీయూ, జేఎన్‌యూ వర్శిటీల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చ చేపట్టాలని విపక్ష నేత మల్లిఖార్జన ఖర్గే పట్టుపట్టారు. అయిదే దీనిపై స్పందించిన స్పీకర్‌..తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టిన తర్వాత ఈరోజే వర్శిటీల గొడవలపై చర్చిద్దామని హామీ ఇచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నోత్తరాలకు అభ్యంతరం చెప్పలేదు. ప్రభుత్వం తప్పకుండా జేఎన్‌యూ, హెచ్‌సీయూ గొడవలపై ఇవాళే చర్చ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కూడా హామీ ఇచ్చారు. 

 

జీడబ్ల్యుఎంసీ ఎన్నికల టికెట్ల కేటాయింపులపై ఆశావహులు గరం గరం

వరంగల్ : నగర మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. మొత్తం 58 డివిజన్లకుగాను ప్రస్తుతానికి 28 డివిజన్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 30 డివిజన్లపై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్‌లో కొత్త సభ్యులు భారీ ఎత్తున చేరడంతో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్న దానిపై గందరగోళం నెలకొంది. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ, వినయ్‌భాస్కర్‌, ఆరూరి రమేష్‌, ఎమ్మెల్సీ కొండా మురళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

 

12:39 - February 24, 2016

వరంగల్ : నగర మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. మొత్తం 58 డివిజన్లకుగాను ప్రస్తుతానికి 28 డివిజన్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 30 డివిజన్లపై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్‌లో కొత్త సభ్యులు భారీ ఎత్తున చేరడంతో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్న దానిపై గందరగోళం నెలకొంది. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ, వినయ్‌భాస్కర్‌, ఆరూరి రమేష్‌, ఎమ్మెల్సీ కొండా మురళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

12:33 - February 24, 2016

ఢిల్లీ : హెచ్‌సీయూ, జెఎన్‌యూ ఘటనలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో నిలదీస్తామని కాంగ్రెస్‌ నేత వీహెచ్ అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. జేఎన్‌యూ వివాదంలో అమాయక విద్యార్థులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రోహిత్‌ ఆత్మహత్య, న్యాయ స్థానంలో కన్నయ్యపై దాడి అంశాలను ప్రస్తావిస్తామని చెప్పారు. దేశభక్తి గురించి బీజేపీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కన్హయ్య దేశ ద్రోహి కాదని.. దేశ భక్తుడని స్పష్టం చేశారు. 

12:28 - February 24, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభం కాగాగే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. రోహిత్ ఆత్మహత్య అంశాన్ని బీఎస్ పీ అధినేత మాయావతి లేవనెత్తారు. వర్సిటీల్లో ఆర్ ఎస్ ఎస్ భావాజాలంలో వ్యాప్తి చెందుతోందని అన్నారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులను వేధిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దళిత విద్యార్థులకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరీ కలుగ జేసుకుని మాయావతి పేర్కొన్న అంశంపై కేంద్రం జవాబు చెప్పాలని కోరారు. ఈనేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. రోహిత్ ఆత్మహత్యపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయివా వేశారు. అనంతరం సభ తరిగి ప్రారంభం కాగానే రోహిత్ ఆత్మహత్యపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు మళ్లీ పట్టుబట్టాయి. రోహిత్ ఆత్మహత్య అంశంపై ఎజెండాగా ఉందని... ప్రశ్నోత్తరాల సమయం అనంతరం చర్చిద్దామని అధికార పక్ష సభ్యులు చెప్పారు. కానీ ప్రతిపక్షాలు వినిపించుకోవాలేదు. మాయావతి లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని.. రోహిత్ ఆత్మహత్యపై చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినిపించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సభలో మళ్లీ గందగోళం నెలకొంది. దీంతో సభను మళ్లీ పది నిమిషాలు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

 

11:58 - February 24, 2016

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. రోహిత్ ఆత్మహత్యపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ ప్రారంభం కాగాగే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. అయితే రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్య అంశాన్ని బీఎస్ పీ అధినేత మాయావతి లేవనెత్తారు. వర్సిటీల్లో ఆర్ ఎస్ ఎస్ భావాజాలంలో వ్యాప్తి చెందుతోందని అన్నారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులను వేధిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దళిత విద్యార్థులకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈనేపపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయివా వేశారు.   అనంతరం సభ తరిగి ప్రారంభం కాగానే రోహిత్ ఆత్మహత్యపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు మళ్లీ పట్టుబట్టాయి. రోహిత్ ఆత్మహత్య అంశంపై ఎజెండాగా ఉందని... ప్రశ్నోత్తరాల సమయం అనంతరం చర్చిద్దామని అధికార పక్షసభ్యులు చెప్పారు. కానీ ప్రతిపక్షాలు వినిపించుకోవాలేదు. మాయావతి లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని.. రోహిత్ ఆత్మహత్యపై చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినిపించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా

ఢిల్లీ : రోహిత్ ఆత్మహత్యపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినిపించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

11:38 - February 24, 2016

 ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై చర్చ జరుగుతోంది. రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. 
రోహిత్ ఆత్మహత్య అంశాన్ని బీఎస్ పీ అధినేత మాయావతి లేవనెత్తారు. వర్సిటీల్లో ఆర్ ఎస్ ఎస్ భావాజాలంలో వ్యాప్తి చెందుతోందని అన్నారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులను వేధిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దళిత విద్యార్థులకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 

 

11:30 - February 24, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై చర్చ జరుగుతోంది. రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈనేపపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయివా వేశారు. 

 

రాజ్యసభ పది నిమిషాలు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై చర్చ జరుగుతోంది. రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈనేపపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయివా వేశారు. 

 

బీజేపీలోకి వెళ్తానంటు వస్తున్న వార్తలు అవాస్తవం: చిరంజీవి

హైదరాబాద్ : పార్టీ మారుతారంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలపై చిరంజీవి పెదవి విప్పారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. బీజేపీలోకి వెళ్తానంటు వస్తున్న వార్తాలు అవాస్తవమని, రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.

 

10:56 - February 24, 2016

గుంటూరు : జిల్లాలోని ఎడ్లపాడు దగ్గర సీఆర్‌ కోల్డ్‌ స్టోరేజిలో అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న 33 వేల మిర్చి బస్తాలు తగులబడుతున్నాయి. దట్టంగా పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఆరా తీశారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

 

10:54 - February 24, 2016

హైదరాబాద్ : పార్టీ మారుతారంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలపై చిరంజీవి పెదవి విప్పారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. బీజేపీలోకి వెళ్తానంటు వస్తున్న వార్తాలు అవాస్తవమని, రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.

10:50 - February 24, 2016

మీర్పూర్ : ఆసియా దేశాల ధూమ్ ధామ్ ప్రారంభ టీ-20 సమరానికి బంగ్లాగడ్డపై రంగం సిద్ధమయ్యింది. 2016 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాకంగా ఈ టోర్నీని ఆసియా క్రికెట్ మండలి నిర్వహిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్ టీమిండియాతో పాటు ఆసియాదిగ్గజాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు పోటీకి దిగుతున్నాయి. మాజీ చాంపియన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతోంది. 
బంగ్లాదేశ్ లో కౌంట్ డౌన్ 
మొట్టమొదటి టీ-20 ఆసియాకప్ రికార్డుల్లో చేరడానికి రంగం సిద్ధమయ్యింది. టెస్ట్ హోదా పొందిన నాలుగుదేశాలున్న ఆసియాలో మొట్టమొదటి టీ-20 ఆసియాకప్ టోర్నీకి...బంగ్లాదేశ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆసియాకప్ టీ-20 టోర్నీ
భారత్ వేదికగా మార్చి 7 నుంచి జరిగే 2016 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా...ఈ ఆసియాకప్ టీ-20 టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆసియాక్రికెట్లో నాలుగు దిగ్గజ జట్లు టీమిండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు...క్వాలిఫైయర్ గా ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈటోర్నీ బరిలోకి దిగుతోంది.
మ్యాచ్ లు జరిగే తేదీలు...
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకూ 11 రోజులపాటు జరిగే ఈటోర్నీని రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ గా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు మీర్పూర్ లోని షేరే-ఏ- బంగ్లా నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. భారత కాలమానప్రకారం..పోటీల రోజున ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ఈ టీ-20 సమరం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 24న జరిగే ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్, మాజీ చాంపియన్ టీమిండియాకు ...ఆతిథ్య బంగ్లాదేశ్ సవాల్ విసురుతోంది.
ఫిబ్రవరి 25న జరిగే పోటీలో శ్రీలంకతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 26న ఎమిరేట్స్ తో బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 27న జరిగే కీలకసమరంలో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 28న జరిగే పోటీలో బంగ్లాదేశ్ తో శ్రీలంక, 29న పాకిస్థాన్ తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు ఢీ కొంటాయి. మార్చి 1న జరిగే మరో ప్రధాన సమరంలో టీమిండియాకు శ్రీలంక సవాలు విసురుతోంది. మార్చి 2న బంగ్లాదేశ్ తో పాకిస్థాన్, 3న టీమిండియాతో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు తలపడతాయి. మార్చి 4న జరిగే రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరిరౌండ్ పోటీలో పాకిస్థాన్ తో శ్రీలంక పోటీపడుతుంది. మార్చి 6న టైటిల్ సమరం నిర్వహిస్తారు. మొత్తం మీద...ఆసియాక్రికెట్ చరిత్రలో..మొట్టమొదటి టీ-20 ఆసియాకప్ రికార్డుల్లో చేరడానికి రంగం సిద్ధమయ్యింది.

 

ఫిల్మ్‌నగర్‌ లో మూడు కొత్త ఆలయాలు

హైదరాబాద్  : ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంలో మూడు కొత్త ఆలయాలను స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మూడు దేవతావిగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రత్యేక పూజల్లో సినీప్రముఖులు పాల్గొన్నారు.

10:37 - February 24, 2016

     పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌ మారర్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గుర్రాల మేళా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేస్తున్నాం. ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నాం. ఈ మేళా సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. గుర్రాలే కాకుండా కొన్ని పురాతన కార్లతోపాటు అధునాతన కార్లను కూడా చిత్రీకరణలో వాడుతున్నాం. సాంకేతిక విలువలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే బరోడా, రాజ్‌కోట, కేరళ, మల్‌షేట్స్‌ ఘాట్స్‌, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో జరిగింది. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మార్చిలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్‌ 8న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

10:33 - February 24, 2016

ఆస్కార్‌.. ప్రపంచ వ్యాప్తంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్‌. ఇటువంటి అత్యున్నత పురస్కారాల ప్రదానంలోనూ వివక్ష కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం తెల్ల జాతీయలకే ప్రయారిటీ ఇచ్చి నల్ల జాతీయుల ప్రతిభకు గుర్తింపు లేకుండా అవార్డుల ప్రదానం జరుగుతోందనే విమర్శలు ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని వ్యతిరేకించాలని నల్ల జాతీయుల నటీనటులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈనెల 28వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోయే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన వద్దని ఇప్పటికే నల్లజాతీయుల నటీనటులకు సంకేతాలు వెళ్ళాయి. ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల్లోనూ వివక్ష రాజ్యమేలటానికి కారణాలేమిటో 
ఓసారి చూద్దాం..
గత ఏడాది ఆస్కార్‌ బరిలో ఒక్క నల్ల జాతీయుడికి కూడా నామినేషన్‌ దక్కలేదు. దీనిపై అప్పట్లోనే చాలా మంది విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా అదే వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నీల్‌ ప్యాట్రిక్‌ హారిన్‌ అవార్డుల ప్రదానోత్సవం సాక్షిగా 'వైటెస్ట్‌ ఆస్కార్‌.. బ్రైటెస్ట్‌ ఆస్కార్‌' అంటూ వ్యాఖ్యానించి ప్రత్యక్షంగానే ఆస్కార్‌ కమిటీపై విమర్శ చేశాడు. అయినప్పటికీ ఆస్కార్‌ కమిటీ ఏమాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది కూడా నల్ల జాతీయులకు ఒక్క నామినేషన్‌ దక్కలేదు. వరుసగా రెండేళ్ళు నల్లజాతీయులకు ప్రాతినిధ్యం లభించకపోవడంతో ఆ జాతీయుల్లో అసంతృప్తి సెగ రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాల్లో భిన్నత్వం లోపిస్తోందని నల్ల జాతీయులు వాపోతున్నారు. వివక్ష వివాదానికి మూలం హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ వ్యాఖ్యలే. 
'అమెరికాలో నల్ల జాతీయులందరూ కూడా అంతర్భాగమే. కానీ ఆస్కార్‌ నామినేషన్ల విషయంలో దాన్ని గుర్తించినట్లు లేరు. ఆస్కార్‌ వేడుకకు వెళ్ళి అంతా బాగానే ఉందని చెప్పడానికి నాకు మనసొప్పదు. అందుకే ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకకు వెళ్ళడం లేదు' అని స్మిత్‌ బహిరంగంగా ప్రకటించాడు. ఆయన పంథాలోనే ఆయన భార్య నటి జడా పింకెట్‌ స్మిత్‌ కూడా ఆస్కార్‌ వేడుకను బహిష్కరించాలంటూ ట్విట్టర్‌ ద్వారా ఇతర నటీనటులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. 'ఆస్కార్‌ వేడుకల్లో విజేతలకు పురస్కారాలను బహూకరించడానికి నల్ల జాతీయులు కావాలి. వేదికపై వినోదాలు పంచడానికి నల్లజాతీయులు కావాలి. కాని నల్ల జాతీయుల్లోని ప్రతిభను మాత్రం గుర్తించరు. నల్లగా ఉన్నంత మాత్రానా పోటీలకు అనర్హులమా..?' అంటూ ఆమె ట్విట్టర్‌ ద్వారా ఆస్కార్‌ కమిటీని ప్రశ్శించారు. 
అలాగే 'ఆస్కార్‌ సో వైట్‌..' హ్యాష్‌ ట్యాగ్‌తో నల్లజాతి నటీనటులు సామాజిక మీడియాలో తీవ్ర నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగే ఆస్కార్‌ వేడుకకు ప్రయోక్తగా వ్యవహరిస్తున్న క్రిస్‌ రాక్‌ను ఉద్దేశించి నల్ల జాతి నటుడు డాన్‌ చెడిల్‌, 'క్రిస్‌.. ఆస్కార్‌ వేడుక రోజున నా కోసం వెతకొద్దు. ఎందుకంటే అక్కడ పార్కింగ్‌లో కార్లని నిలిపే పనిని నాకు అప్పగించారు' అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, నల్ల జాతీయుల్లోనూ కొంత అభిప్రాయ బేధాలున్నాయి. ఆస్కార్‌ పురస్కారాలపై అసంతృప్తిని వ్యక్తం చేయడంలో అర్థం లేదంటూ ఓ వర్గం నల్లజాతీయులు కొట్టి పడేయటం గమనార్హం. 
'నల్ల జాతీయులకు ప్రాతినిధ్యం లేని సినిమాలను ముందు మీరు చూడ్డం మానేయండి. అదే నిజమైన బహిష్కరణ' అంటూ నల్లజాతి నటి పూపి గోల్డ్‌బర్గ్‌ పేర్కొన్నారు. 
ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన శ్వేత జాతి నటి చార్లెట్‌ ర్యాంప్లింగ్‌ మాట్లాడుతూ,'వీరి వ్యాఖ్యలు శ్వేత జాతీయులపై వివక్ష చూపటమే. నిజానికి ఈ ఏడాది నల్లజాతీయులు నామినేషన్‌ సాధించడానికి తగిన సామర్థ్యం చూపలేదు. ఈసారి ఆస్కార్‌ వేడుకకి వ్యాఖ్యాతగా ఎంపిక చేసిన క్రిస్‌రాక్‌ కూడా నల్ల జాతీయుడే కదా. వివక్ష చూపితే ఆయన్ని ఎందుకు ఎంపిక చేస్తారంటూ' ఎదురు ప్రశ్నించారు. వివక్ష వివాదంపై ఎట్టకేలకు ఆస్కార్‌ అవార్డ్‌ కమిటీ డైరెక్టర్‌ చెరిల్‌బూనె ఇసాక్స్‌ స్పందించారు. 
'ఆస్కార్‌ నామినేషన్లలో భిన్నత్వం కనిపించకపోవడం పట్ల నాకూ బాధగానే ఉంది. ఇది సున్నిమతమైన విషయమే కాదు చర్చనీయాంశం కూడా. ఈ ధోరణిలో మార్పు కోసం అకాడమీ చర్యలు తీసుకుంటుంది. అకాడమి నిబంధనలు, సభ్యత్వం తదితర విషయాలపై త్వరలోనే సమీక్ష చేపట్టనున్నాం' అని చెరిల్‌బూనె తెలిపారు.ఏదిఏమైనా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానంలోనూ వర్ణ వివక్ష సమంజసం కాదంటున్నారు ప్రపంచ సినీ ప్రేక్షకులు.

నేడు ఢిల్లీ హైకోర్టులో కన్హయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ 11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కన్హయ్య అరెస్టుపై ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కన్హయ్యకు బెయిల్ ఇవ్వవద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. 

10:23 - February 24, 2016

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ 11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కన్హయ్య అరెస్టుపై ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కన్హయ్యకు బెయిల్ ఇవ్వవద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇదిలావుంటే పోలీసులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో కన్హయ్య దేశానికి వ్యవతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొనకపోవడంతో కన్హయ్యకు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జెఎన్ యూలో ఫిబ్రవరి 9 న జరిగిన అఫ్జల్ గురు వర్థంతి సభలో కన్హయ్య కూడా అక్కడ ఉన్నాడని.. ఫిభ్రవరి..12న జెఎన్ యూ లో దేశానికి వ్యతిరేకంకా కన్హయ్య నినాదాలు చేశారని ఆరోపణలున్నాయి. 

 

నేటితో వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్‌ల్లో పోటీచేస్తున్న  టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలిజాబితా విడుదల అయ్యింది. 15 మందితో తొలిజాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. వివిధ రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయనుండటంతో నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. 

 

09:51 - February 24, 2016

ఢిల్లీ : నేడు రాజ్యసభలో జెఎన్‌యూ, హెచ్‌సీయూ ఘటనలపై చర్చ జరగనుంది. హెచ్‌సీయూ, జేఎన్‌యూ, దేశంలో పెరుగుతున్న మతోన్మాద దాడుల గురించి చర్చించాలని ఎంపీ సీతారాం ఏచూరి నోటీసులు ఇచ్చారు. ఈ అంశాలపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ అంగీకరించారు. ప్రశ్నోత్తరాల తరువాత చర్చ మొదలవుతుంది. 

09:49 - February 24, 2016

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్‌ల్లో పోటీచేస్తున్న  టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలిజాబితా విడుదల అయ్యింది. 15 మందితో తొలిజాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. వివిధ రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయనుండటంతో నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. 

 

ఎంపీ బాల్క సుమన్ సోదరి పెళ్లికి హాజరుకానున్న సీఎం కేసీఆర్

కరీంనగర్ : జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మెట్టుపల్లిలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ బాల్క సుమన్ సోదరి పెళ్లికి సీఎం హాజరుకానున్నారు.  

గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం

గుంటూరు : ఎడ్లపాడు సీఆర్ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

జెఎన్ యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనీర్ బన్ అరెస్టు

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనీర్ బన్ అరెస్టు చేశారు. ఢిల్లీలో పోలీసుల ఎదుటు ఉమర్, అనీర్ బన్ లొంగిపోయారు. ఇద్దరు విద్యార్థులు దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్నారు. 

 

నేడు రాజ్యసభలో జె ఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై చర్చ

ఢిల్లీ : నేడు రాజ్యసభలో జె ఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై చర్చ జరుగనుంది. నేడు రాజ్యసభలో జె ఎన్ యూ, 
హెచ్ సీయూ ఘటన, మతోన్మాద దాడులపై చర్చించాలని  సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరీ నోటీసులు ఇచ్చారు. చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ అంగీకరించారు. ప్రశ్నోత్తరాల తరువాత అ ఆంశాలపై చర్చ మొదలు కానుంది. 

 

08:28 - February 24, 2016

స్వార్థం, స్వ ప్రయోజనాల కోసమే ప్రజా ప్రతినిధులు పార్టీ పిరాయింపులకు పాల్పడుతున్నారని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీడీపీ నేత రాజారామ్మోహన్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ఓట్లు, సీట్లు, పదవులు కావాలనే ఉద్దేశంతోనే పార్టీ పిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నైతిక విలువలు, కట్టుబాట్లు లేవన్నారు. ఏకపక్షంగా రాజ్యమేలుతున్నారని చెప్పారు.  
పార్టీలు వేరైనా వాటి ఎజెండా మాత్రం ఓట్లు, సీట్లు, పదవులని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టిడిపిలు గతంలో కూడా పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనికే పాల్పడ్డారని చెప్పారు. ఈ ధోరణి సమాజానికి నష్టం కల్గిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:12 - February 24, 2016

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు వుండవచ్చునేమో కానీ, మన దేశంలో వ్యవసాయ రంగంలో సంక్షోభానికీ, అన్నదాతల ఆత్మహత్యలకీ ఒకే ఒక్క కారణం వుంది. అదే బడ్జెట్ సపోర్టు లేకపోవడం. మరి ఈ సారైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తాయా?
58శాతం మందికి వ్యవసాయం జీవనాధారం
మన దేశంలో 58శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. వీరిలో 27శాతం మంది వ్యవసాయ కూలీలే. వ్యవసాయ యోగ్యమైన భూమిలో 35శాతం భూమికే నీటి పారుదల సౌకర్యం వుంది. 60శాతం భూమి బావులు, బోర్ల కిందనే సాగవుతోంది. దేశం మొత్తం మీద దాదాపు 96 లక్ష ల పంపు సెట్లున్నాయి. విద్యుత్ కోతలు వీరిని వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ రుతుపవనాలను నమ్ముకుని, ప్రక్రుతి దయాదాక్షిణ్యాల మీదనే వ్యవసాయం చేయాల్సి వస్తోంది. బడ్జెట్ రూపకల్పనలో ఈ వాస్తవాలను ఏ ప్రభుత్వమూ విస్మరించకూడదు.
ప్రాణాలను ఫణంగా పెడుతున్న రైతులు
ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా వ్యవసాయాన్ని బతికించుకోవడానికీ, భూమిని కాపాడుకోవడానికి మన రైతులు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. మన రైతుల్లో అత్యధికులకు వున్నది ఎకరంన్నర లోపు భూమి మాత్రమే. తమకున్న ఆస్తికి మించి అప్పులున్నవారెందరో. మనకు కడుపునిండా తిండి, వంటి నిండా బట్టలు, నిగనిగలాడే పండ్లు, తాజా కూరగాయలు, పొద్దున్నే మనం సేవించే తేనీరులో కలుపుకునే పంచదార, పాలు ఇలాంటి వన్నీ అందిస్తూనే వీరంతా అప్పుల పాలవుతున్నారనీ, తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారన్న బడ్జెట్ రూపకర్తలు మరచిపోకూడదు. కానీ దురద్రుష్టవశాత్తు మన ప్రభుత్వాలు అన్నదాతకిచ్చే సబ్సిడీలను భారంగా భావిస్తున్నారు.
పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానం
వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి, వేరుసెనగ, వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, పత్తి, వేరుసెనగ, పండ్లు, కూరగాయలు, పాలు ఉత్పత్తిలో మన దేశానిది ప్రపంచంలోనే ప్రథమ స్థానం. పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానం. సుగంద ద్రవ్యాల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1. దాదాపు 40వేల కోట్ల రూపాయల విలువైన సుగంధ ద్రవ్యాలను మన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మన వ్యవసాయ ఉత్పత్తుల విలువ దాదాపు లక్ష కోట్లు. భారతదేశ ఎగుమతుల్లో వ్యవసాయరంగం వాటా పది శాతం పై మాటే. కానీ , ఏం లాభం? దేశ ఆర్థికాభివ్రుద్ధిలో ఇంతగా శ్రమిస్తున్న అన్నదాత కష్టాల్లో , నష్టాల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించేవారుండరు. రైతుల ఆత్మహత్యలకు వక్రభాష్యాలు చెబుతున్న మంత్రులుండడం మన కర్మ.
రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య విత్తనాలు
నీటి సదుపాయాలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య విత్తనాలు. విత్తును బట్టే మొలక వస్తుంది. కానీ మనదేశంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. విదేశీ వంగడాలు రైతులను రుణగ్రస్తులుగా, శాపగ్రస్తులుగా మారుస్తున్నాయి. మన దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే విత్తనాల స్రుష్టించే పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వడం లేదు. దీంతో విదేశీ విత్తనాలు నిలువునా ముంచుతున్నాయి.
అందని బ్యాంక్ రుణాలు
ఇక రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య అవసరాలకు తగ్గట్టుగా బ్యాంక్ రుణాలు లభించకపోవడం. సాగు భూమిలో అత్యధికశాతం కౌలు రైతుల చేతుల్లో వుంది. కానీ, వీరికి బ్యాంక్ అప్పులు పుట్టడం లేదు. వ్యవసాయాన్ని బతికిస్తున్నవారికి రుణాలివ్వాలంటే మనసొప్పదు కానీ, కార్పొరేట్ సంస్థలకు, కేటుగాళ్లకు, మాయగాళ్లకు లక్ష కోట్ల రూపాయల అప్పులిస్తున్నారు. మనదేశంలో వివిధ బ్యాంక్ ల్లో మొండిబకాయిల విలువ 4 లక్షల కోట్ల రూపాయల దాకా వుందంటున్నారు. కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, వారి అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎగ్గొట్టినట్టుగా ఈ దేశంలో అసలైన రైతులెప్పుడూ రుణాలు ఎగ్గొట్టడం లేదు.
అనూహ్యంగా పడిపోతున్న ధరలు
ఇక రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య తాము ఉత్పత్తిచేసినవాటిని మార్కెట్ లో అమ్ముకోవడం. పంట చేతికొచ్చే సమయంలో ధరలు అనూహ్యంగా పడిపోతుంటాయి. పోనీ వాటిని నిల్వ చేసుకుందామంటే వసతులుండవు. కోల్డ్ స్టోరీ జీలు అందుబాటులో వుండవు. ధర వచ్చేంత వరకు దాచుకుందామన్నా అప్పిచ్చినవారు ఊరుకోరు. మార్కెట్ ఎగుడుదిగుడుల నుంచి రైతులను కాపాడేందుకు ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తామంటూ ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఎప్పుడూ ఆచరణ రూపం దాల్చడం లేదు. అందుకే బడ్జెట్ రూపకల్పనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అవలోకించాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల రాయితీలు, ఆఫర్ లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు మనల్ని బతికిస్తున్న అన్నదాతను బతికించడమే ఇకనైనా మొదటి ప్రాధాన్యతాంశంగా చేర్చాలి. వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడమంటే విదేశీ విత్తన కంపెనీలకు, ఎరువుల కంపెనీలకు , ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభాలు చేకూర్చిపెట్టే విధానాలకు రూపకల్పన చేయడం కాదు. అన్నదాత కళ్లలో ఆనందం నింపే విధానాలకు శ్రీకారం చుట్టడం.

 

 
08:02 - February 24, 2016

రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం నేత చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు  కేసీఆర్, చంద్రబాబులు కూడా చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లు ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ బడ్జెట్ లలో వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత లివ్వాలి? వ్యవసాయ రంగంలో సంక్షోభం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్న వేళ రైతుల, రైతు సంఘాల కోరికలేమిటి? మార్కెట్ శక్తుల మాయాజాలం నుంచి కాపాడాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై చంద్రారెడ్డి మాట్లాడారు. 
 

ఖమ్మం కార్పొరేషన్ కు టీఆర్ ఎస్ తొలి జాబితా విడుదల

ఖమ్మం : జిల్లా కార్పొరేషన్ కు టీఆర్ ఎస్ తొలి జాబితా విడుదల చేశారు. 15 మందితో తొలి జాబితాను ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి విడుదల చేశారు.  

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి పోచారం పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. కోరుట్లలో పశువైద్య కళాశాలను పోచారం ప్రారంభించనున్నారు. 

నేడు భారత్, బంగ్లాదేశ్ టీ-20 తొలి మ్యాచ్

మీర్పూర్ : ఆసియా కప్ టీ-20లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ జరుగనుంది. మీర్పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

07:47 - February 24, 2016

మహారాష్ట్ర : కాషాయ కూటమి మరో వివాదంలో చిక్కుకుంది. మహారాష్ట్రలోని లాతూరులో ఓ ముస్లిం పోలీస్‌ అధికారి చేత బలవంతంగా కాషాయ జెండా మోపిస్తూ ర్యాలీలో పాల్గొనేలా చేశారు. ఆ పోలీస్ తన డ్యూటీలో భాగంగా వివాదాస్పద స్థలంలో జెండా ఎగరేయకూడదన్నందుకు అతన్ని చితక్కొట్టారు. అనంతరం బలవంతంగా ఊరేగింపులో పాల్గొనేలా చేశారు.
ఏఎస్‌ఐపై కాషాయ మూక దాడికి 
షేక్‌ యూనస్‌ పాషామియా, మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా పన్‌గావ్‌ పట్టణంలో ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. శివాజీ జయంతి వేడుకల నేపథ్యంలో కాషాయ జెండాలతో చేపట్టిన ప్రదర్శనను అడ్డుకున్నాడనే కారణంతో కాషాయ మూక ఏఎస్‌ఐపై దాడికి తెగబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు జెండా కర్రలతో పాషామియాను చితకబాదారు. కాషాయ జెండాను మోపిస్తూ ర్యాలీలో పాల్గొనేలా చేశారు. 
ముస్లీం పోలీసు గడ్డాన్ని తొలగించేందుకు యత్నం 
సమస్యాత్మక ప్రాంతం కావడంతో.. పై అధికారుల ఉత్తర్వులు చూపుతూ ప్రదర్శన నిలిపివేయాలని పాషామియా కోరినట్లు తెలిసింది. దీంతో కోపోద్రిక్తులైన కాషాయ నేతలు, కార్యకర్తలు ఆయనపై దాడికి తెగబడ్డారు. కొందరు ఆయన గడ్డాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. కాషాయమూక దాడిలో గాయపడ్డ పాషామియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లాతూర్‌ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

07:40 - February 24, 2016

 ఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి సీపీఎం సవరణలు ప్రతిపాదించింది. రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం ఆమోదం సందర్భంలో రాజ్యసభలో  సవరణలతోపాటు ఓటింగ్‌ కోరాలని పార్టీ నిర్ణయించింది. గతేడాది కూడా రాష్ట్రపతి ప్రసంగానికి సీపీఎం ప్రతిపాదించిన సవరణలు ఆమోదం పొందిన నేథ్యంలో ఈసారి  కూడా ఇదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయంలో  గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్ డిఎ సర్కార్‌కు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 
సవరణలు ప్రతిపాదిస్తూ సీతారాం ఏచూరి సవరణలు 
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగానికి సీపీఎం సవరణలు ప్రతిపాదించింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న సీతారాం ఏచూరి రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ నోటీసులు ఇచ్చారు. దేశంలో చోటుచేసుకుంటున్న ప్రధాన పరిణామాలపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడాన్ని పార్టీ తప్పుపట్టింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల, జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్ట్, నిత్యావసర సరకులు ధరల పెరుగుదల, ప్రజలపై జరుగుతున్న దాడులు, దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని సీపీఎం తప్పుపట్టింది. వీటన్నింటిపైనా సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. 
గతేడాది సీపీఎం ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం 
రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ సీతారాం ఏచూరి ఇచ్చిన నోటీసులు ఎన్డీయే పాలకులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత ఏడాది కూడా సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపాదించిన సవరణలు రాజ్యసభలో  ఆమోదం పొందాయి. అప్పట్లో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనకు తీసుకున్న చర్యలను  రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఈ అంశాలపై ప్రతిపాదించిన సవరణలు కోసం ఆయన ఓటింగ్‌ కోసం పట్టుపట్టారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయడు... సవరణలపై ఓటింగ్‌ సాంప్రదాయమే లేదని, సవరణలను ఉపసంహరించుకోవాలని సీతారాం ఏచూరిని కోరారు. కానీ ఏచూరి ఓటింగ్‌కు పట్టుబట్టడంతో రాజ్యసభ  చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు బలం ఉండటంతో  సీపీఎం ప్రతిపాదించిన సవరణలు  ఆమోదం పొందాయి. దీంతో సీతారాం ఏచూరి ప్రతిపాదించిన సవరణలను రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాల్సి వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపాదించిన సవరణలు ఆమోదం పొందడం మన పార్లమెంటరీ చరిత్రలో  ఇదే మొదటిసారి. దీంతో ఈ  అనూహ్య పరిణామానికి  ఎన్డీయే ఖంగుతినాల్సి వచ్చింది.  మోదీ సర్కార్‌కు ఇది ఇబ్బందికరంగా మారింది. 
సవరణలను ఉపసంహరించుకోవాలని సర్కార్‌ కోరే అవకాశం 
గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి కూడా సీతారాం ఏచూరి రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ తర్వాత ఆమోదానికి వచ్చినప్పుడు సవరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని మోదీ సర్కార్‌ కోరుతుంది. కానీ  నోటీసులు ఇచ్చిన సీతారాం ఏచూరి ఓటింగ్‌కు పట్టుపడతారు.  సభలోని మిగిలిన ప్రతిపక్షాలు ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఈసారి కూడా  ఓటింగ్‌ చేపడితే... రాజ్యసభలో ఎన్డీయే కంటే ప్రతిపక్షాలు బలంగా  ఉండటంతో సవరణలు ఆమోదం పొందే అవకాశం ఉంది.  దీంతో మోదీ సర్కార్‌కు మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 

 

07:30 - February 24, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అమ‌లైన ప్రతిదీ కొత్త రాష్ట్రంలో అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ కోణంలో తెలంగాణ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని విధి విధానాలు ఖరారు చేయాలి.. ఇదీ టి సిఎం కెసిఆర్ నిర్ణయం. నిర్ణయమేగాదు ఆ దిశగా అధికారుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని సిఎం డిసైడ్ చేశారు. ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. 
స్పష్టమైన విద్యావిధానం 
తెలంగాణ విద్యా వ్యవస్థలో స‌మూల మార్పులు తేవాల‌ని టి సర్కార్‌ నిర్ణయించింది. ఆ దిశగా ప్రత్యేక సంస్కర‌ణ‌లు చేప‌ట్టాల‌ని భావిస్తోంది. విద్యారంగంపై పెట్టే ప్రతి పైసాకూ ప్రయోజ‌నం లభించేలా చూడాల‌ని, ఎల్‌.కే.జి నుంచి ఉన్నత చ‌దువుల వ‌ర‌కు స్పష్టమైన విద్యావిధానం రూపొందించాల‌ని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి క్యాంపు కార్యాల‌యంలో సిఎం కెసిఆర్, మంత్రులు, అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష జరిపారు. బడ్జెట్ సమీక్షల్లో భాగంగా వ‌చ్చే విద్యా సంవ‌త్సరానికి కేటాయించే నిధులపై చ‌ర్చలు జరిపారు.
దశలవారీగా రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్పు
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతర పేదవర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. ప్రతి ఏడాదీ 20 వేల కోట్ల రూపాయలకు పైగా విద్య కోసం ఖర్చుపెడుతున్నప్పటికీ ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఎల్.కె.జి. స్థాయి నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుగుణంగా విద్యా విధానం ఉండాలని, దానిని పరిగణలోకి తీసుకునే బడ్జెట్ ప్రతిపాదనలుండాలని సిఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖల ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని కెసిఆర్‌ సూచించారు.
అన్ని విభాగాలు ఒకే గొడుకు కింద‌కు 
మొత్తం ఎడ్యుకేష‌న్ సిస్టమ్‌లో 14 విభాగాలున్నాయని వాటి ద్వారా ప్రత్యేకించి ప్రయోజ‌నాలేవీ లేవ‌ని సిఎం ఆభిప్రాయ‌ప‌డ్డారు. చాలా విభాగాలు అధికారులు లేక నిష్ప్రయోజనంగా ఉన్నాయని వాట‌న్నింటిని ఒకే గొడుకు కింద‌కు తెచ్చేలా ప్రణాళిక‌లు సిద్ధం చేయాల‌న్నారు. ముఖ్యంగా ఆర్కైవ్స్, గ్రంథాలయాలు లాంటి విభాగాలను కల్చరల్ శాఖకు అప్పగించాలని వివిధ భాషల అకాడమీలను ఒకే అకాడమీగా మార్చాలని కెసిఆర్‌ డిసైడ్ చేశారు. ఐటిఐని కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకు బదిలీ చేయాలని ఏపీ నుంచి వారసత్వంగా వచ్చిన ప్రతి పథకాన్నీ, ప్రతి అంశాన్నీ మనం కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. విద్యాశాఖలో ప్రింటింగ్ ప్రెస్ అవ‌స‌రం లేద‌ని దాన్ని తొల‌గించాల‌ని సీఎం అన్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రస్తుతమున్న విద్యావిభాగాలెన్ని? వాటికింద ఉన్న స్కూళ్లు, కాలేజీలు వాటి నిర్వహ‌ణ ఎలా సాగుతుందో లోతుగా అధ్యయనం చేయాల‌న్నారు. అన్ని విద్యా విభాగాల ద్వారా నడుస్తున్న విద్యాసంస్థల గురించిన సమగ్ర సమచారం ఒకే దగ్గర ఉండాలని ఆ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. 
పంచాయతీలకు గ్రామాల నిర్వహణ బాధ్యతలు
విద్యా విభాగాల్లో అవసరం లేని చోట ఎక్కువ మంది సిబ్బంది ఉంటే వారిని వేరే చోటికి ఎలా తరలించాలో ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో నడిచే పథకాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి గ్రామాల్లోని పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ బాధ్యతను పంచాయతీల‌కు అప్పగించాలని ఆ మేరకు త్వర‌లోనే చ‌ట్టం తేవాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.

 

07:25 - February 24, 2016

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు సంఘీభావం ప్రకటిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన జరిగింది. జేఎన్‌యూ స్టూడెంట్స్, ఎన్ఎస్‌యూఐ, ఆప్ విద్యార్థి విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.
రోహిత్ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలి : రాహుల్
రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో కొత్త ఆలోచనలు వెలుగు లోకి రాకుండా కేంద్రం గొంతు నొక్కేస్తోందని ఆయన మండిపడ్డారు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే బిజెపి దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని రుద్దుతోందని ధ్వజమెత్తారు. భారత భవిష్యత్తుపై రోహిత్‌ ఎన్నో కలలు కన్నారని, కాని ఆ కలలను ఆర్‌ఎస్‌ఎస్‌ కల్లలు చేసిందని రాహుల్‌ విమర్శించారు. నేటి యువత స్వేచ్ఛాయుత భారత్‌ను  కోరుకుంటోందని రాహుల్‌ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రుల తీరే రోహిత్‌ ఆత్మహత్యకు కారణం : కేజ్రీవాల్‌ 
రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కేంద్ర మంత్రుల తీరే కారణమని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీని తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత విద్యార్ధుల గొంతు నొక్కేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. విద్యార్థులతో చెలగాటమాడొద్దని, వారు తలచుకుంటే మోది పీఠమే కదిలిపోతుందని కేజ్రీవాల్ హెచ్చరించారు.  
రోహిత్‌ చట్టాన్ని తీసుకురావాలి : ఏచూరి 
రోహిత్‌ వేముల ఆత్మహత్యపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని సిపిఎం పేర్కొంది. ఈ న్యాయ పోరాటంలో విద్యార్థులకు తాము అండగా ఉంటామన్నారు. నిర్భయ చట్టంలాగా రోహిత్‌ చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ఏచూరి అన్నారు.
దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు
అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్‌యూ విద్యార్ధులు ఉమర్‌ ఖాలీద్, అనిర్బన్‌ లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్ధులను అరెస్ట్ చేయవద్దన్న డిమాండ్‌ను కోర్టు తోసిపుచ్చింది. మీరెక్కడ లొంగిపోవాలని సూచిస్తారో పోలీసులు అక్కడే అరెస్ట్ చేస్తారని కోర్టు స్పష్టం చేసింది. భద్రత దృష్టా రహస్యంగా లొంగిపోతామని విద్యార్థులు కోర్టుకు విన్నవించారు.

 

నేడు ఢిల్లీలో హెచ్ సీయూ విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ..

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థులు నేడు ఢిల్లీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. 

నేడు రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ : నేడు రెండో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. పలు అంశాలపై చర్చించనున్నారు.

07:08 - February 24, 2016

ఢిల్లీ : దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న జెఎన్ యూ విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఉమర్‌ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్య.. అర్ధరాత్రి పోలీసులకు లొంగిపోయారు. వీరిని పోలీసులు రహస్య స్థలానికి తరలించారు. నేడు వీరిద్దరినీ ఢిల్లీ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు విద్యార్థిసంఘం నేత కన్హయ్యపై దాడి చేసిన లాయర్‌ యశ్‌పాల్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ఉమర్‌ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య లొంగుబాటు
కన్హయ్య కుమార్‌తో పాటు దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న జెఎన్ యూ విద్యార్థులు ఉమర్‌ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు తాము పోలీసులకు లొంగిపోతామని, కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వారిద్దరూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. పిటిషనర్లు తాము లొంగిపోవాలనుకుంటున్న తేదీ, సమయం, ప్రాంతాలను రహస్యంగా కోర్టుకు అందించాలని వారి తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే.. వారు లొంగిపోవటానికి ప్రతిపాదించిన ప్రాంతం పోలీసులకు అందుబాటులో లేదని డీసీపీ ప్రేమ్‌నాథ్ నిరాకరించారు. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది, డీసీపీతో న్యాయమూర్తి పది నిమిషాల పాటు తన చాంబర్‌లో ఆంతరంగికంగా చర్చించారు. అనంతరం ఈ అంశాన్ని బుధవారానికి వాయిదా వేశారు.
నేడు ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు 
అయితే.. అనూహ్యంగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉమర్‌ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్య.. రహస్య ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయారు. వెంటనే పోలీసులు వీరిని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఇద్దరినీ ఇవాళ ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌తో పాటు ఉమర్‌ఖలీద్, అన్బిరన్ భట్టాచార్య, అశుతోశ్‌కుమార్, రామనాగ, అనంత్‌ప్రకాశ్ నారాయణ్‌లు దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీన కన్హయ్య అరెస్ట్ తరువాత వీరు కనిపించకుండా పోయారు. ఆదివారం రాత్రి వీరు వర్సిటీ క్యాంపస్‌కు తిరిగి రావటంతో పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. వీసీ అనుమతి కోరుతూ పోలీసులు నిరీక్షించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు విద్యార్థులు పోలీసులకు లొంగిపోయారు.
భద్రతా కారణాల రిత్యా కనిపించకుండా పోయాం.. 
మరోవైపు తాము భద్రతా కారణాల రిత్యానే కనిపించకుండా పోయామని.. కన్హయ్యపై జరిగిన రీతిలోనే తమపైనా దాడి జరుగుతుందని ఆందోళన చెందామని జేఎన్‌ఎస్‌యూ ప్రధాన కార్యదర్శి రామనాగా తెలిపారు. పోలీసుల విచారణకు సిద్ధమని ఆయన స్పష్టంచేశారు. యూనివర్సిటీ యాజమాన్యంపై విశ్వాసం లేదని, వర్సిటీ విచారణ కమిటీ ఎదుట హాజరుకాబోమని రామనాగా చెప్పారు.
లాయర్‌ యశ్‌పాల్‌సింగ్‌ అరెస్ట్‌ 
అటు పటియాలా హౌజ్‌కోర్టులో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యపై దాడికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరైన లాయర్‌ యశ్‌పాల్‌సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కన్హయ్యతో పాటు జర్నలిస్టులపై దాడికి పాల్పడింది నిజమేనని ఇండియాటుడే స్టింగ్‌ ఆపరేషన్‌లో అంగీకరించిన ముగ్గురు న్యాయవాదుల్లో యశ్‌పాల్‌ కూడా ఒకరు. 

 

నేడు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల 'చలో విజయవాడ'

విజయనగరం : నేడు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తన సమస్యలు పరిష్కరించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. 

నేడు కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

కరీంనగర్ : సీఎం కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Don't Miss