Activities calendar

25 February 2016

22:05 - February 25, 2016

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగుతోంది. సుమారు 150 మంది దేవాదాయశాఖ ఉద్యోగులు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొత్తం 479 హుండీలకు, మొదటి రోజు 140 హుండీలను లెక్కించారు. సుమారు కోటి 30 లక్షల రూపాయల నగదు వచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. రెండో రోజు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక వీడియోగ్రాఫర్‌ను నియమించి పకడ్బంధీగా హుండీలను లెక్కిస్తున్నారు.

21:30 - February 25, 2016

ఢిల్లీ : జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య అరెస్ట్, హెచ్‌సియు రిసెర్చ్‌ స్కాలర్ రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ అట్టుడికింది. సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి చర్చను ప్రారంభిస్తూ దేశంలోని అసహన ఘటనలపై విదేశీ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. బిజెపి, సంఘ్‌పరివార్‌ చర్యలపై వ్యతిరేకంగా మాట్లాడేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక దేశమని, భిన్న వ్యక్తులు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులను శిక్షించండి...అయితే అందరినీ ఒకే గాడిన కట్టవద్దని ఏచూరి హితవు పలికారు.

జెఎన్‌యు వివాదంలో మోది ప్రభుత్వం పక్షపాతంగా....

జెఎన్‌యు వివాదంలో మోది ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జాతీయవాదం పేరిట విశ్వవిద్యాలయాలపై దాడులు చేసే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా చెప్పుకునే బిజెపి సంఘ్‌పరివార్- దేశభక్తి గురించి మాకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఏచూరి ఎద్దేవా చేశారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, రాజ్‌నాథ్‌ ప్రసంగాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బిజెపి అద్దాలమేడలో ఉందని.....

సెక్యులరిజం, జాతీయవాదం అనే అంశాలకు సంబంధించి బిజెపి అద్దాలమేడలో ఉందని కాంగ్రెస్‌ సభ్యులు గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ విషయంలో మేము రాతితో నిర్మించిన ఇంట్లో ఉన్నామని, ఒక్క రాయి విసిరితే మీ అద్దాలమేడ కుప్పకూలుతుందని ఆజాద్‌ అన్నారు.

దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచనతో.....

దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచనతో ఉన్నవారికి విపక్షాలు మద్దతిస్తున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మండిపడ్డారు. ఉరితీసిన ఉగ్రవాదులు మక్బూల్‌భట్, అఫ్జల్‌గురూల స్మారక దినోత్సవం జరపడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. చాలా రోజులుగా అధికారంలో ఉన్నారు... మీ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉగ్రవాదానికి బలయ్యారు. ఈ విషయంలో మీరు మాకంటే ఎక్కువ ఆలోచించాల్సింది పోయి దేశవ్యతిరేకులకు సమర్థిస్తారా అంటూ కాంగ్రెస్‌ నుద్దేశించి జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ద్రోహులను శిక్షించండి...కానీ జాతీయవాదం పేరిట అమాయకులను కేసుల్లో ఇరికించొద్దని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి.

21:27 - February 25, 2016

ఢిల్లీ: హెచ్‌సీ‌యూ పీహెచ్‌డీ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం లోక్ సభలో చేసిన వ్యాఖ్యల్ని ప్రధాన వైద్యాధికారి ఖండించారు. రోహిత్‌ను కాపాడేందుకు డాక్టర్‌ను కూడా దగ్గరకు రానీవ్వలేదని, మరిసటి రోజు వరకు డాక్టర్ అక్కడకు వెళ్లలేకపోయారని స్మృతి ఇరానీ సభలో అన్నారు. అయితే హెచ్‌సీ‌యూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం రాజశ్రీ ఈ ఆరోపల్ని తోసిపుచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాSమిక నివేదిక ప్రకారం, జనవరి 17 సాయంత్రం 7 గంటల సమయంలో రోహిత్ తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట గమనించిన సెక్యూరిటీ సిబ్బంది 7:20 గంటలకు తనకు ఫోన్ చేసినట్లు డాక్టర్ రాజశ్రీ చెప్పారు. తాను అక్కడికి చేరేలోగా రోహిత్ శరీరాన్ని కిందకు దించారని, పరీక్షించిన తర్వాత పది నిమిషాలకు అతడు చనిపోయినట్లు నిర్థారించినట్లు డాక్టర్ వివరించారు. ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన సూచనతో తెల్లవారుజాము 3 గంటల వరకు తాను అక్కడే ఉన్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజశ్రీ తెలిపారు.

21:24 - February 25, 2016

విజయవాడ: కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడను రైల్వే జోన్ గా మారుస్తారనుకున్న కేంద్రం మొండిచేయి చూపించిందని నిరసనవ్యక్తం చేశారు సీపీఎం నేతలు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పి కేంద్రం హామీ ఇచ్చి ప్రజల ఆశలను నీరు గార్చిందన్నారు. అటు విశాఖలోను నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖనుజోన్ గా చేసి అరకుకు ప్రత్యేక రైలును కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ప్రకాశం జిల్లాను కేంద్రం మరిచిందని .. వెనకబడిన ఒంగోలుకు కొత్త ప్రాజెక్టులు కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినా కేంద్రం చిన్నచూపు చూసిందన్నారు. 

21:23 - February 25, 2016

హైదరాబాద్ : కేంద్రం మరోసారి తెలుగు రాష్ట్రాలపై సవతిప్రేమే చూపింది. రైల్వే బడ్జెట్‌తో అది తేటతెల్లమయింది. వేల కోట్ల ప్రతిపాదనలను పంపిన దక్షిణ మధ్య రైల్వేకి బడ్జెట్ లో దక్కిందెంత? ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు పూర్తవుతాయా? బడ్జెట్ లో చెప్పిన మాటలు ఆచరణ సాధ్యమేనా? వాచ్ దిస్ స్టోరీ.

తెలుగు రాష్ట్రాల పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం లేదు

ఎంతో ఆశగా ఎదురు చూసిన బడ్జెట్ రైలు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఆగీ ఆగకుండా వెళ్లిపోయింది. కరుణ చూపుతాడనుకున్న ప్రభు తెలుగు రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడలేదు. రెండు రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లోనూ మోక్షం కలగలేదు. కొన్ని పనులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల పరిధిలో ఉన్న పాత ప్రాజెక్టులకు ఈసారి కూడా అరకొర నిధులు విదిల్చారు. బడ్జెట్‌కు ముందు రైల్వే జీఎంతో ఇరు రాష్ట్రాల ఎంపిలు పార్టీలకు అతీతంగా సమావేశమై ప్రతిపాదనలు పంపినప్పటికీ రైల్వే మంత్రి మాత్రం వాటిని పట్టించుకోలేదు.

చర్లపల్లి శాటిలైట్ టర్మినల్‌కు కేటాయింపుల ప్రస్తావన లేదు....

సికింద్రాబాద్ స్టేషన్‌పై భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ ప్రతిపాదన చేశారు మంత్రి. ఎనభై కోట్లరూపాయలు అంచనా వేశారు. కానీ ఎంత కేటాయింపులు చేస్తామన్నది చెప్పలేదు. తెలంగాణ ఎంపిలంతా మూకుమ్మడిగా అడిగిన కాజీపేట వ్యాగన్ పరిశ్రమ గురించి బడ్జెట్‌లో ఊసే లేదు. దశల వారీ కేటాయింపులు చేస్తామని చెప్పారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనలను ఖాతరు చేయలేదు.

విశాఖ జోన్‌పై ఈసారీ నిరాశే.....

ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపిలంతా పార్టీలకతీతంగా అడిగిన విశాఖ జోన్‌పై ఈసారీ నిరాశే మిగిలింది. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల మంజూరు కూడా జరగలేదు. బల్లార్ష ఖాజీపేట మార్గంలో మూడో లైనుకు బడ్జెట్ లైన్ క్లియర్ కాలేదు. వాస్తవంగా బల్లార్ష- విజయవాడల మధ్య ఉన్న నాలుగు వందల తొంభై కిలోమీటర్ల మేర మూడో లైను సర్వే పూర్తయింది. అయితే ఇందులో ఇరవై కిలోమీటర్ల మేర మూడో లైను పూర్తయింది. ఈసారి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ఆశిస్తే చివరికి 31 కోట్లు కేటాయిస్తూ నిరాశే మిగిల్చారు. ఈ లెక్కన కేటాయింపులు చేస్తే ఇంకో ఇరవై సంవత్సరాలైనా ప్రాజెక్టు పూర్తికాదు. కానీ మంత్రిగారేమో రాబోయే మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటన చేశారు.

మేళ్ల చెర్వు పెండింగ్‌ లైనుకు రూ.110 కోట్లు

సర్వేలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందీ బడ్జెట్. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న మేళ్ల చెర్వు ప్రాంతంలోని పెండింగ్ లైను పూర్తికి తాము కూడా సహకరిస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. దీంతో 110 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే ఇది పూర్తయ్యే అవకాశముంది. మొత్తం పది పనుల సర్వేకు అనుమతించింది బడ్జెట్. అయితే పాత ప్రాజెక్టులకే అరకొర కేటాయింపులు చేస్తూ దశాబ్దాల తరబడి సాగదీస్తున్న రైల్వే శాఖ కొత్త ప్రాజెక్టుల సర్వే తెలుగు రాష్ట్రాలను శాంతింప చేసేందుకే అనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఒక్క కొత్త రైలు కూడా లేకుండా ప్రకటించిన బడ్జెట్ ఇదే అంటున్నారు నిపుణులు.

అత్యధిక ఆదాయం ఇస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌కి అన్యాయం ....

అత్యధిక ఆదాయం ఇస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌కి న్యాయం జరగదని రైల్వే బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమయ్యింది. మిత్రపక్షం అంటున్న తెలుగుదేశం అధినేత కానీ ఎంపిలు కానీ ఏం సాధించారు...మాకు పార్టీలు కాదు రైల్వే అభివృద్ది ముఖ్యమంటూ రాజకీయాలకతీతంగా విన్నపాలు చేసిన తెలంగాణ ఎంపిలు ఏం తెచ్చారనే ప్రశ్నను లేవనెత్తింది సురేష్‌ ప్రభు బడ్జెట్.

తెలంగాణ ఐసెట్ -2016 షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ ఐసెట్ -2016 షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 19న ఐసెట్ పరీక్షలు, 31న ఫలితాలు విడుదలవుతాయి. మార్చి 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది.

గ్రేటర్ వరంగల్ బరిలో 811మంది అభ్యర్థులు.

వరంగల్ : త్వరలో జరగబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో 56 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఎన్నికల బరిలో మొత్తం 811 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి 549, కాంగ్రెస్‌-170, బీజేపీ-140, టీడీపీ-88, ఇండిపెండెంట్లు -189, సీపీఐ-18, సీపీఎం-13, వైసీపీ-15, ఎంఐఎం-3, బీఎస్పీనుంచి ఒకరు, 19 మంది ఇతర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రాజ్యసభ రేపటికి వాయిదా...

ఢిల్లీ :హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలపై రాజ్యసభలో చర్చ జరిగింది. కేంద్రమంత్రి స్మృతిఇరానీ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. సభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో సభను రాజ్యసభ చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

స్మృతీ వ్యాఖ్యలను ఖండించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్

ఢిల్లీ: హెచ్‌సీ‌యూ పీహెచ్‌డీ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం లోక్ సభలో చేసిన వ్యాఖ్యల్ని ప్రధాన వైద్యాధికారి ఖండించారు. రోహిత్‌ను కాపాడేందుకు డాక్టర్‌ను కూడా దగ్గరకు రానీవ్వలేదని, మరిసటి రోజు వరకు డాక్టర్ అక్కడకు వెళ్లలేకపోయారని స్మృతి ఇరానీ సభలో అన్నారు. అయితే హెచ్‌సీ‌యూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం రాజశ్రీ ఈ ఆరోపల్ని తోసిపుచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాSమిక నివేదిక ప్రకారం, జనవరి 17 సాయంత్రం 7 గంటల సమయంలో రోహిత్ తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

20:39 - February 25, 2016

హైదరాబాద్ : ఏదేశ ప్రజలైనా ప్రశాంత జీవనాన్నే కోరుకుంటారు, కానీ మిన్ను విరిగి మీదపడుతుంటే, కాళ్ల కింద భూమి చీలుతుంటే, కట్టు బట్టలతో దిక్కుతోచకుండా పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిరియన్లు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇపుడు ఆ విధ్వంసానికి విరామం వచ్చినట్లేనా? అమెరికా, రష్యాల చొరవతో సిరియాలో పరిస్థితి మెరుగుపడుతుందా? నేటి వైడాంగిల్ లో ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:07 - February 25, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు తెడ్డు చూపెట్టిన కేంద్రం..రైల్వే బడ్జెట్ లో రాలని పైసలు.. పనులు, వరంగల్, ఖమ్మం ఓట్లల్లో గమ్మత్తి కత, పుట్టపుట్టక మునుపే కుల్లగుడుతున్న కారు,లలిత కళలల్లో ఆరితేరుతున్న లోకేశం.. నారా నందమూరిని మించిన యాక్టింగ్, తాగి బండి నడిపిండు... తరువాత ఇట్లయిండు, సర్కార్ తప్పుకు సామాన్యుడి బలి, ఆదిలాబాద్ జిల్లాలో అంటరాని ఆచారం.. కులం పేరుమీద పెద్ద మనుషుల అరాచకం, హిందూపురంలో ఇరగదీస్తున్న బాలకాకియ్య.. వుస్సేన్ బోల్టు అవతారంలో మరో దర్శనం, ఇతాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ఘరమ్ ఘరమ్ మాటలు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:38 - February 25, 2016

హైదరాబాద్ : పాత ప్రాజెక్టుల ప్రస్తావన లేదు, కొత్త వాటి వూసు లేదు, ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు లేవు, సాక్షాత్తూ కేంద్ర మంత్రులు హోరెత్తించిన విశాఖ జోను ప్రకటనా లేదు, ఖాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ లేదు. అమరావతి అంశమే రైల్వే ప్రకటనలో వినపడలేదు. వూరించి వూరించి ఊహల్లో ఊరేగించిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో సారి మొండి చేయి చూపింది. రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ , కొత్త లైను కానీ ప్రకటించలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న చెన్నై, పశ్చిమ బెంగాల్ కు కాసింత వరాలు ప్రకటించారు. ప్రతిపక్షాలు విమర్శించినట్లుగా సురేష్ ప్రభు కొత్త సీసాలో పాత సారా మాదిరి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా అంకెలు మార్చి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు, సేవలు, ఆధునీకత, స్వచ్ఛ రైలు వంటి అంశాలు ఎన్నో బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్... తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు అనే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు తెలకపల్లి రవి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి, టిఆర్ ఎస్ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి, ఏపీ బిజెపి నేతజగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:11 - February 25, 2016

హైదరాబాద్: తెలుగులో రికార్డులు సృష్టించిన శ్రీమంతుడు చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తను రాసిన నవలను కాపీ కొట్టి తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గురువారం సిటీ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి సింగారెడ్డి కేసు విచారించారు. 2012లో తాను రాసిన నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైందని ఆ నవల కథనే మైత్రీ మూవీ మేకర్స్ 'శ్రీమంతుడు' చిత్రంగా నిర్మాణం చేసిందని పిటిషన్ దారు పేర్కొన్నారు. ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు వీఆర్ మాచవరం, పవని శివకుమార్ వాదిస్తున్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివతోపాటు ఎర్నినేని నవీన్, హృతిక్ రోషన్లను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీమంతుడు చిత్రాన్ని హిందీ భాషలో తీయాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకు వేరే భాషలోకి వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును శరత్ చంద్ర కోరారు. దీంతో ప్రతివాదులకు అర్జంట్ నోటీసులను జారీ చేసిన కోర్టు.. విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది.

500ల కేజీల కల్తీనెయ్యి పట్టివేత...

హైదరాబాద్ : మీర్‌పేట్‌లోని బడంగ్‌పేట్‌ దగ్గర కల్తీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరాలపై గురువారం ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 500కేజీల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్ : ఒకరి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ బైక్ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృందిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

13 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్

హైదరాబాద్ : పదవీకాలం ముగుస్తున్న 13 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో మార్చి 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అస్సోం, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో 13 స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే.

18:41 - February 25, 2016

విజయవాడ: కడప పెద్ద దర్గాకు ప్రపంచ గుర్తింపు తీసుకొస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లతో కలిసి ఆయన దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటుడు ఆదిత్యారాయ్‌ కూడా కడప దర్గాను దర్శించుకున్నారు.

18:28 - February 25, 2016

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల ఆశలపై రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు నీళ్లు చల్లారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు విన్నపాన్ని సురేశ్‌ ప్రభు పక్కన పెట్టేశారు. రాజధాని అమరావతి ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు ప్రతిపాదననూ విస్మరించారు. పైగా కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ఓ రెండింటికి మాత్రమే అరకొర నిధులు కేటాయించారు. మొత్తానికి కేంద్ర రైల్వే బడ్జెట్‌ ప్రతిపాదనలపై.. ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

విభజన చట్టం హామీని ఈసారీ పట్టించుకోని సురేశ్‌ప్రభు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం కరుణ చూపలేదు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై ప్రకటన వస్తుందనుకున్న ఏపీ ప్రజల కలలు కల్లలే అయ్యాయి. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి.. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని రైల్వే మంత్రి ఈసారీ తుంగలో తొక్కారు. నడికుడి-బీబీనగర్‌ రైల్వే లైన్‌ను విస్తరించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు వినతినీ సురేశ్‌ప్రభు పట్టించుకోలేదు.

అమరావతికి కొత్త లైను ఏర్పాటు ప్రతిపాదన హుళక్కి...

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని అనుసంధానిస్తూ కొత్త లైను ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ వాసులకు రాజధాని అమరావతిని చేరేందుకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ బడ్జెట్‌లో ఆ ప్రతిపాదనే లేకపోవడంతో.. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కోటిపల్లి-నర్సాపురం లైనుకు రూ.200 కోట్లు...

కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు.. ఈబడ్జెట్‌లో కోటిపల్లి- నర్సాపురం లైనుకు రూ.200 కోట్లు, పిఠాపురం- కాకినాడ లైనుకు రూ.50 కోట్లు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లోని రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తామన్న సురేశ్‌ప్రభు.. తొలి దశ జాబితాలోనే తిరుపతి రైల్వే స్టేషన్‌ను చేరుస్తామని హామీ ఇచ్చారు. నిజానికి మోడల్‌ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు ఎంపికైన తిరుపతి ఆధునికీకరణ అంశం.. కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. అరకొర విదిలింపుల కారణంగా.. ఈ స్టేషన్‌ సమస్యలతో కునారిల్లుతూనే ఉంది.

కొత్తగా హమ్‌ సఫర్‌, తేజస్‌, ఓవర్‌నైట్‌ డబుల్‌డెక్కర్‌ రైళ్లు....

ఇక కొత్తగా హమ్‌ సఫర్‌, తేజస్‌, ఓవర్‌ నైట్‌ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లు, సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఏర్పాటు చేస్తామన్న రైల్వే మంత్రి.. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతామన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఉత్తర, దక్షిణ భారతాలను కలుపుతూ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్రైట్‌ కారిడార్లలో.. ఒకదాన్ని మాత్రం రాష్ట్రానికి కేటాయించారు. ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకూ ప్రతిపాదించిన ఈ కారిడార్‌ను అత్యంత ప్రాధాన్యత క్రమంలో.. నిర్దిష్ట కాలావధిలోగా పూర్తిచేస్తామని సురేశ్‌ ప్రభు తెలిపారు.

ప్రధాన పోర్టులకు రైల్వే కనెక్టివిటి పెంచుతామన్న సురేశ్‌ప్రభు.....

ఏపీకి బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యతనిచ్చామన్న సురేశ్‌ ప్రభు.. ఇక్కడి ప్రధాన పోర్టులకు రైల్వే కనెక్టివిటీని పెంచుతామని.. దీని వల్ల ఏపీలో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని.. తద్వారా ఏపీ ఆర్థిక ప్రగతిని సాధిస్తుందని సురేశ్‌ ప్రభు చెప్పారు. కొత్త రైళ్లను ప్రతిపాదించకుండా.. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే రైల్వే మంత్రి అధికా ప్రాధాన్యతనిచ్చారు. సురేశ్‌ ప్రభు బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

17:31 - February 25, 2016

నిజామాబాద్ : వేలాది ఎకరాల అటవీ భూమిని మాయం చేసేస్తున్నారు. తమ అబ్బ సొత్తులా సొంతం చేసేసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమై మూకుమ్ముడిగా మొత్తం ఊడ్చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని కబ్జాసురులు భక్షిస్తున్నారు. యథేచ్ఛగా భూ భోజనం చేస్తూ.. ఫారెస్ట్‌ను ఫలహారంగా మింగేస్తున్నారు.

బాన్సువాడ డివిజన్‌లో 20,372 ఎకరాలు హాంఫట్‌.....

నిజామాబాద్ జిల్లాలో అటవీ భూములను అడ్డగోలుగా కబ్జా చేసేశారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో బీర్కూరు,బాన్సువాడ,వర్ని గాందారి మండలాల్లో 20 వేల 372 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైంది. కామారెడ్డి డివిజన్ పరిధిలో దర్పల్లి,సిరికొండ,డిచ్ పల్లి,ఎల్లారెడ్డి,లింగం పేట్,మండలాల్లో వెయ్యి 790 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. నిజామాబాద్ డివిజన్‌ పరిధిలో భీంగల్,కమ్మర్ పల్లి,మండలాల్లో 870 ఎకరాలను భూ బకాసురులు ఆక్రమించుకుని పట్టాలు కూడ పొందారు.

జిల్లా వ్యాప్తంగా 23,032 ఎకరాలు కబ్జా....

మొత్తం జిల్లా వ్యాప్తంగా 23 వేల 32 ఎకరాల భూమి కబ్జాకు గురైంది.ఈ భూములకు రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా పట్టాలు ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని పట్టా కింద ఒక్కో లబ్ధిదారునికి 5 ఎకరాల లోపే కేటాయించాలి. ఐతే దీనికి విరుద్ధంగా వేలాది ఎకరాలను కొంతమంది బడాబాబులు కైవశం చేసేసుకున్నారు. బాన్సువాడ సబ్ డివిజన్లో కొంతమంది లబ్ధిదారులకు వందల ఎకరాలకు పట్టాలు పొందారు. వర్ని మండలం కూనీపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఒక వ్యక్తికి వెయ్యి 24 ఎకరాలు కేటాయిస్తూ పట్టా ఇచ్చారు .బీర్కురు మండలం బొమ్మనదేవసల్లి అటవీ బీట్‌లో వెయ్యి 225 ఎకరాలను ఒకరి పేరుతోనే పట్టా మంజూరు చేశారు. వర్ని మండలం జలాల్ పూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని మరో వ్యక్తికి 125 ఎకరాలను కేటాయిస్తూ పట్టా ఇచ్చారు. ఈ కబ్జాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కబ్జా భూములపై రెవెన్యూ అధికారులు నివేదిక....

జిల్లాలోని కబ్జాకు గురైన అటవీ భూములపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అటవీ శాఖ సేకరించిన భూములకు రెవెన్యూ శాఖ పట్టాలు ఇవ్వటం చెల్లదని..వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆయా డివిజన్ల ఆర్డీవోలు జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. 

17:29 - February 25, 2016

కరీంనగర్ : పూరిళ్లను మిద్దెలుగా మారుస్తామన్నాడు. మట్టిరోడ్లను తారురోడ్లుగా తీర్చిదిద్దుతామన్నాడు. 24గంటల విద్యుత్ వెలుగులతో గ్రామం సర్వంగా సుందరంగా మారుతుందన్నాడు. రెండు నెలల్లోనే గ్రామ స్వరూపాన్నే మార్చేస్తామన్నాడు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే తమ గ్రామన్ని దత్తత తీసుకోవడంతో తమ దశ దిశ మారిపోతుందని గ్రామస్తులంతా భ్రమపడ్డారు. కానీ..సీన్ రివర్స్ అయ్యింది. ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం కావడంతో ఊసురుమంటూ బతుకుతున్నారు కరీంనగర్ జిల్లా ముల్కనూర్ గ్రామస్తులు.

పూరిళ్లన్నంటిని రెండు నెలల్లో మిద్దెలుగా ....

పూరిళ్లన్నంటిని రెండు నెలల్లో మిద్దెలుగా మారుస్తామని స్వయానా ముఖ్యమంత్రే హామీ ఇవ్వడంతో..ఉన్న పాత ఇంటిని కాస్తా ఇలా కూలగొట్టుకున్నారు. ఇళ్లును కూల్చేసి రోజులు,.నెలలు గడుస్తున్నా..ఇంకా పునాది రాయి పడకపోవడంతో..ఇదిగో ఇలా నాలుగు రేకులు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

చిన్నముల్కనూర్ ను దత్తత తీసుకున్న కేసీఆర్‌ .....

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయానా దత్తత తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈ గ్రామం నుంచే కాబట్టి..కేసీఆర్‌ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా సంబరపడ్డారు. అయితే గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాదు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంతో పాటు, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల వెడల్పు, విద్యుద్దీకరణ పనులు, చెరువుల పునరుద్దరణ వంటి హామీలతో గ్రామ స్వరూపాన్నే మార్చేస్తాన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళను రెండు నెలల్లో పూర్తిచేసి..సంబరాలు చేసుకుందామని గతేడాది ఆగస్టులో గ్రామన్ని సందర్శించిన సందర్భంగా హామీ ఇచ్చారు.

247 మంది పేదలకు ఇళ్లు మంజూరు....

ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడంతో తమ గ్రామం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని గ్రామస్తులు సంబరపడ్డారు. గ్రామంలోని దాదాపు 247 మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరవడంతో..వారంతా పాత పెంకుటిళ్ళను కూల్చివేశారు. పాతింటి స్థానంలో కొత్త ఇంటిని చూసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ..సీఎం ముల్కనూరు గ్రామాన్ని సందర్శించి 6నెలలు గడిచినా..ఇంత వరకు ఇళ్ళకు ముహుర్తమే ఖరారు కాలేదు. దీంతో ఇండ్లను కూల్చుకున్న వారంతా ఇలా ఆరుబయటే జీవనాన్ని సాగిస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా....

ముల్కనూర్‌ గ్రామ స్వరూపాన్నే మార్చేస్తామన్న కేసీఆర్‌..ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఇటీవలే టి టిడిపి నేత రేవంత్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్‌ తన సొంత జిల్లాలో దత్తత తీసుకున్న రెండు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు తప్ప..ముల్కనూరును పట్టించుకోవడంలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

17:24 - February 25, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పలువురు జెడ్పీచైర్మన్లు గులాభికండువా కప్పుకున్నారు.ఉద్యమాలతో తెలంగాణను తెచ్చుకున్నామని.. తెలంగాణలో దయాకర్ రావు చేరడం, సారయ్య చేరడాన్ని రాజకీయ ఏకీకరణ కింద భావిస్తున్నామన్నారు కేసీఆర్. ఎవరు ఏ పార్టీలో చేరిన తెలంగాణ అభివృద్దికి కృషి చేయాలన్నారు కేసీఆర్ .

17:20 - February 25, 2016

తూర్పుగోదావరి : అన్నవరంలోని సత్యదేవున్ని వైసిపి ఎమ్మెల్యే రోజా దంపతులు దర్శించుకుని వ్రతం చేయించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదం అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ ధైర్యం లేని శాసనసభ్యులు మాత్రమే వైసిపిని విడిచి వెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పట్టిన చీడపురుగు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

17:19 - February 25, 2016

ఢిల్లీ : దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశాడన్న కేసులో జైల్లో ఉన్న కన్హయాను సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కన్హయ చాలా ధీమాగా ఉన్నాడని అన్నారు. తన విద్యాజీవితం పాడైనా యావత్‌ దేశం కోసం బిజెపి దౌష్ట్య విధానాలపై పోరాడతానని చెప్పినట్లు నారాయణ అన్నారు.

17:17 - February 25, 2016

హైదరాబాద్ : జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలకు నిరసనగా ఇందిరాపార్క్ లోవామపక్షపార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయకుండా కులాల పై చర్చ జరిపుతూ దేశాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు వామపక్షనేతలు. కన్నయ్యపైన మోపిన రాజద్రోహారోపణ పూర్తిగా అవాస్తవమన్నారు నేతలు. బీజేపీ కావాలనే విద్యార్థులపైన దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు నేతలు. దేశభక్తికి ద్వితీయ భాష్యం చెబుతూ.. మతోన్మాదాన్ని బీజేపీ పెంచి పోషిస్తుందంటున్నారు బీవీ.రాఘవులు .  

17:15 - February 25, 2016

ఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో ఈసారీ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఢిల్లీలో అన్నారు. రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశాజనకంగా ఉందని ప్రాజెక్ట్‌లను పీపీపీ పద్ధతిలో చేపట్టడం దారుణమని విమర్శించారు.

 

17:13 - February 25, 2016

హైదరాబాద్ : నేడు ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో వాగ్దానాలే కనిపిస్తున్నాయి తప్పించి కొత్తదనమేదీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు హైదరాబాద్‌లో అన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు రైలు సౌకర్యం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.

గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి...

హైదరాబాద్ : వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ ఎర్రబెల్లికి టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఎర్రబెల్లితో పాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి యత్నం..

రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం రాత్రి చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించడానికి ప్రయత్నించి అవి తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. బ్యాంకు అధికారులు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

16:50 - February 25, 2016

అనంతపురం : ఈనెల 27-28న అనంతపురంలో జరుగనున్న లేపాక్షి ఉత్సవాలు వైభవంగా జరగాలని కోరుతూ హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 5కే రన్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ఎంజిఎం గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన 5కే రన్‌లో బాలకృష్ణతో పాటు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విక్టరీ సింబల్‌ను చూపిస్తూ..వందలాది మంది విద్యార్థుల మధ్య ఎంతో ఉత్సాహంగా బాలకృష్ణ 5కిలోమీటర్లు పరుగెత్తారు. లేపాక్షి ఉత్సవాలు వైభవంగా జరిగేందుకు హిందూపురం ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. 

15:43 - February 25, 2016

ఢిల్లీ :సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్‌ను రూపొందించామని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. రైల్వేల ఆధునీకరణపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ వెన్నుముఖలాంటిదని సురేష్ ప్రభు అన్నారు. ప్రయాణిలకు సౌకర్యాలను పెంచేందుకు పెద్ద పీట వేశామని చెప్పారు.

15:42 - February 25, 2016

ఢిల్లీ : జేఎన్‌యు, హెచ్‌సియు ఘటనలపై ప్రభుత్వ తీరును సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగా అన్నారు. జేఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చూపుతున్నారని, యూనివర్సిటీల్లో వివక్షను నిర్మూలించాలని అన్నారు.

వాగ్దానాలే తప్ప కొత్తదనం ఎక్కడ : రాఘవులు

హైదరాబాద్ : నేడు ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో వాగ్దానాలే కనిపిస్తున్నాయి తప్పించి కొత్తదనమేదీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు హైదరాబాద్‌లో అన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు రైలు సౌకర్యం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.

15:39 - February 25, 2016

.గో :కాపుల్లో పేదరికాన్ని నిర్మూలించేంత వరకు టీడీపీ ప్రభుత్వం నిద్రపోదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కాపు రుణమేళాలో పాల్గొన్న చంద్రబాబు.. కాపులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్లో కాపులకు వెయ్యికోట్లను ఖచ్చితంగా కేటాయిస్తామన్నారు. సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థిక అసమానతల్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 

15:30 - February 25, 2016

ముంబై :బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ జైలు నుంచి విడుదలయ్యాడు. 1993లో ముంబై పేలుళ్లు, అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవించిన సంజయ్ దత్.. కాసేపటి క్రితం ఎరవాడ నుంచి విడుదలయ్యాడు. సంజయ్‌ దత్‌ 42 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో ఆయన సత్పవర్తనతో ముందుగానే విడుదల చేశారు. బయటకు వచ్చిన తరువాత సంజయ్.. జైలుపైనున్న జాతీయ జెండాకు సెల్యూట్ చేసి కారెక్కాడు. ముంబైకి చేరుకున్న సంజయ్‌దత్‌ ఇంటివద్ద మీడియా సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ సమయం కోసం 23 ఏళ్లుగా వేచి చూశానన్నారు. నా తండ్రి నన్ను ఇలా ఫ్రీగా చూస్తే ఎంతో సంతోషించేవారని, ఈ సమయంలో ఆయన లేకపోవడం తీరని లోటని సంజయ్ పేర్కొన్నారు. నా భార్య మాన్యత నాకు మంచి భాగస్వామి అని కొనియాడారు. తన పిల్లలిద్దర్నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. తాను జైలులో సంపాదించిన 450 రూపాయలను భార్యకు గిఫ్ట్‌గా ఇస్తున్నానని మున్నాభాయ్‌ తెలిపారు. తాను ఉగ్రవాదిని కానని, ఇకపై తన పేరును ప్రస్తావించినప్పుడు "1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయి..." అని అనవద్దని వినమ్రంగా కోరుతున్నట్టు సంజయ్ దత్ తెలిపారు. ఈ మధ్యాహ్నం అసంఖ్యాక అభిమానుల నినాదాల మధ్య స్వగృహానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ముంబైలో జరిగిన దారుణ ఘటనలకు, తనకు ఎంతమాత్రమూ సంబంధం లేదని, సుప్రీంకోర్టు కూడా అదే నిజమని తీర్పించ్చిందని గుర్తు చేసిన ఆయన, తెలిసీ తెలీని చిన్నతనంలో చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇకపై తనను పేలుళ్ల కేసుతో జతచేర్చవద్దని చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నాడు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన ఇప్పటి వరకు 42 నెలలపాటు కటకటాల్లో ఉన్నారు. జైలులో సంజయ్‌దత్‌ సత్ప్రవర్తనను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆయన శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో ఆయన ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారు.

తమిళనాడులో భారీ పేలుడు

తమిళనాడు: శివకాశి జిల్లా నారాయణపూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో దాదాపు వంద మంది కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫ్యాక్టరీలో పేలుడుకు గల కారణాల గురించి అధికారులు అన్వేశిస్తున్నారు.

15:20 - February 25, 2016

హైదరాబాద్ : అనేకానేక కారణాలతో ఈ తరంలో సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేసి, అంతిమంగా అద్దె గర్భాలకు వెళ్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో అద్దె గర్భాలకు వెళ్లొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:19 - February 25, 2016

హైదరాబాద్ : నిత్యం భౌతికదాడులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న గ్రామీణ దళిత మహిళల రోదనలు , ఆదివాసీ ఆడబిడ్డల వేదనలు ఎవరు వింటారు? వాళ్లు దేశ రాజధానిలో లేరు.. మెట్రో నగరాల్లో ఉండరు.. కెమెరాల కనిపించరు. అందుకే వారి కథనాలను వెలుగులోకి తెచ్చేవారు లేరు. అత్యాచారాలు దళిత మహిళ జీవనంలో నిత్య కృత్యాలుగా నమోదవుతుంటే మన వ్యవస్థ స్పందన మాత్రం అంతంతగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఆడబిడ్డలపై జరుగుతున్న అకృత్యాలు రోజువారీ కనిపించే సాధారణ వార్తలుగానే మిగిలిపోతున్నాయి. ఈ స్థితి మారాలని, మహిళకు భద్రతనిచ్చే సమాజం కావాలని మానవి కోరుకుంటోంది. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈవీడయోనుక్లిక్ చేయండి...

కడప దర్గాలో బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్

హైదరాబాద్ : కడప అమీన్ పీర్ దర్గాలో ఉరుసు ఘనంగా జరుగుతోంది. కులమతాలకు అతీతంగా మసీదును దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కడప దర్గాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

14:58 - February 25, 2016

హైదరాబాద్ : యాక్షన్, మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నారారోహిత్ ఇప్పుడు తనలో గాయకుడు కూడా ఉన్నాడని సావిత్రి సినిమాతో చూపిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పాటను పాడటం చాలా సంతోషంగా ఉందంటూ ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నారా హీరో.

ప్రజలకు జవాబు దారీగా రైల్వే బడ్జెట్‌ :మోదీ

ఢిల్లీ : రైళ్లల్లో సాంకేతికత వినియోగం పెంపొందించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రైల్వే బడ్జెట్‌పై ప్రధాని మాట్లాడుతూ... రైల్వే బడ్జెట్‌ దేశ నిర్మాణంలో కీలకం కానుందన్నారు. ప్రజలకు జవాబు దారీగా ఉండేలా రైల్వే బడ్జెట్‌ ఉందని వ్యాఖ్యానించారు. దేశ పునర్‌నిర్మాణానికి ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుందన్నారు.

శ్రీరంగం ట్రిపుల్ ఐటీ మూసివేత.. ఉద్రిక్తత

చెన్నై: తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగం ఐఐఐటీ నిరవధికంగా మూతపడింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం బుధవారం ప్రకటించింది. దీంతోపాటు విద్యార్థులు తక్షణమే హాస్టల్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐఐఐటీ స్థాయిలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయల కల్పనలో యాజమాన్య వైఖరికి నిరసనగా విద్యార్థుల పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హాస్టళ్లలో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల విద్యార్థులు ఉన్నారు.

తెలంగాణకు మరోసారి కేంద్రం మొండి చేయి

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి కేంద్రం మొండి చేయి చూపింది. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కొత్త రైల్వే ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కాజీపేట రైల్వే కోచ్ అంశాన్ని ప్రస్తావించనే లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రస్తావనే లేదు. పెద్దపల్లి - కరీంనగర్- నిజామాబాద్, మనోహరాబాద్ - కొత్తపల్లి, భద్రాచలం - సత్తుపల్లి కొత్త లైన్ల కల సాకారం కాలేదు. రైల్వే బడ్జెట్ తెలంగాణ ప్రజానీకాన్ని నిరాశపర్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వడోదరకు రైల్వే యూనివర్సిటీ

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఓ వరం ప్రకటించారు. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. ఈ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నగరానికి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే రైల్వే మంత్రికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తులు చేశారు. పరిశీలిస్తామని చెప్పినా.. చివరకు ప్రధాని సొంత రాష్ట్రానికే దాన్ని తరలించుకుపోయారు.

 

లోక్ సభ మధ్యాహ్నం 2.15 గంటల వరకు వాయిదా...

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా పడింది. రైల్వేమంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్-2016 ను ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేసింది. 

టికెట్ల బుకింగ్ కోసం అందుబాటులోకి మొబైల్ యాప్ : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెట్టారు. టికెట్ల బుకింగ్  కోసం అందుబాటులోకి మొబైల్ యాప్ తేనున్నట్లు చెప్పారు.

కొత్తగా 74 రైళ్లలో ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సేవలు : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెట్టారు. మిజోరం-మణిపూర్ రైల్వే లైన్ ను బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 74 రైళ్లలో ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సేవలు అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 దిగువ బెర్తులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు ఈ-బుకింగ్ రిజర్వేషన్, ఆన్ లైన్ లోనే రాయితీ టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రద్దీ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెంటర్లు : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెట్టారు. కొన్ని కీలక స్టేషన్లలో స్థానిక కళారూపాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు.  
ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెంటర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వారణాసి-ఢిల్లీకి కొత్త రైలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 100 స్టేషన్లకు వైఫై సౌకర్యం. కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

 

రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎల్ ఐసీ అంగీకారం : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెట్టారు. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎల్ ఐసీ అంగీకరించదని చెప్పారు. వచ్చే ఏడాదికి 9 కోట్ల పని దినాల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. భద్రతా ప్రమాణాల పెంపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మేకిన్ ఇండియా స్ఫూర్తితో రెండు లోకో ఫ్యాక్టరీలు ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు.

పారదర్శకత ప్రభుత్వ లక్ష్యం : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెట్టారు. 2020 నాటికి సామాన్యుడి ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో ముందున్నామని తెలిపారు. రాష్ట్రాలు, ఇతర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. వందశాతం పారదర్శకత తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పారదర్శకత కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 

వచ్చే ఏడాదికి రూ.1,84,280 కోట్ల ఆదాయం లక్ష్యం : సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.లక్షా 21 కోట్లతో రైల్వే బడ్జెట్-2016 ను ప్రవేశపెట్టారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 'దేశ సామాన్యుల ఆకాంక్షలను నా బడ్జెట్ ప్రతిబింభిస్తుందని' అన్నారు. ఆదాయ వనురులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రైల్వేకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాదికి రూ. 1,84,280 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇది గత ఏడాది కన్న పది శాతం అధికమన్నారు. ప్రతి రూపాయని ఆచితూచి ఖర్చు పెడుతున్నామని చెప్పారు.

12:49 - February 25, 2016

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.లక్షా 21 కోట్లతో రైల్వే బడ్జెట్-2016 ను ప్రవేశపెట్టారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 'దేశ సామాన్యుల ఆకాంక్షలను నా బడ్జెట్ ప్రతిబింభిస్తుందని' అన్నారు. ఆదాయ వనురులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రైల్వేకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాదికి రూ. 1,84,280 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇది గత ఏడాది కన్న పది శాతం అధికమన్నారు. ప్రతి రూపాయని ఆచితూచి ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 2020 నాటికి సామాన్యుడి ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో ముందున్నామని తెలిపారు. రాష్ట్రాలు, ఇతర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. వందశాతం పారదర్శకత తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పారదర్శకత కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 
రైల్వే బడ్జెట్... ముఖ్యాంశాలు.

 • రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎల్ ఐసీ అంగీకరం 
 • వచ్చే ఏడాదికి 9 కోట్ల పని దినాల ఉపాధి కల్పన 
 • భద్రతా ప్రమాణాల పెంపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగం 
 • ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యత  
 • మేకిన్ ఇండియా స్ఫూర్తితో రెండు లోకో ఫ్యాక్టరీలు ప్రారంభం
 • రోజుకు 7 కిమీ రైల్వేలైను నిర్మాణం.. 
 • ఢిల్లీ-చెన్నై-ఖరగ్ పూర్-విజయవాడ కారిడార్ పై దృష్టి
 • రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీని పెంపు.. 
 • పిపిపి ద్వారా 400 స్టేషన్ల ఆధునీకరణ.. 
 • కొన్ని కీలక స్టేషన్లలో స్థానిక కళారూపాల ప్రదర్శన 
 • ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెంటర్లు...
 • వారణాసి-ఢిల్లీకి కొత్త రైలు 
 • ఈ ఏడాది 100 స్టేషన్లకు వైఫై సౌకర్యం...
 • నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్..
 • బ్రాడ్ గేజ్ గా మిజోరం-మణిపూర్ రైల్వే లైన్...
 • కొత్తగా 74 రైళ్లలో ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సేవలు....
 • ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 దిగువ బెర్తులు...
 • జర్నలిస్టులకు ఈ-బుకింగ్ రిజర్వేషన్
 • జర్నలిస్టులకు ఆన్ లైన్ లోనే రాయితీ టికెట్లు...
 • రద్దీ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు... 
 • టికెట్ల బుకింగ్  కోసం అందుబాటులోకి మొబైల్ యాప్... 
 • 65 వేల ప్రత్యేక బెర్తులు ఏర్పాటు...
 • 1000 రైళ్లలో బయోటాయిలెట్స్ అభివృద్ధి...
 • ప్యాసింజర్ రైళ్ల వేగం పెంపు...
 • బడ్జెట్ ద్వారా రైల్వేలకు రూ.10 వేల కోట్లు...
 • వచ్చే ఏడాదికి 2800 కి.మీ రైల్వేలైన్లు..
 • రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు...
 • వడోదరాలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు..
 • ఇకపై ప్రతీ ప్రయాణికుడి నుంచి ఫీడ్ బ్యాక్....
 • డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్టాట్ ఫామ్ టికెట్లు కొనుక్కొనే సౌకర్య...
 • కాపలా లేని రైల్వే క్రాసింగ్ లు ఇక ఉండవు..
 • అహ్మదాబాద్-ముంబైకి హైస్పీడ్ రైలు కోసం జపాన్ తో ఒప్పందం..
 • అన్ని రైళ్లల్లో రైల్ బంధు సేవల విస్తరణ..
 • అధ్యాత్మిక కేంద్రాల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి.. 
 • అన్ని తత్కాల్ కౌంటర్లలో సీసీ కెమెరాలు 
 • ఎక్స్ ప్రెస్ రైలు వేగం 80 కిమీ పెంపు..
 • అధ్యాత్మిక స్టేషన్ల సుందరీకరణలో తిరుపతికి చోటు..
 • చిన్న పిల్లల కోసం స్టేషన్లలో పాలు, వేడినీళ్లు, ఆహారం..
 • గుజరాత్, తమిళనాడు, తెలంగాణల్లో సబర్బన్ సేవల వృద్ధి...
 • యాత్రికుల కోసం డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్..
 • కాలుష్యం నుంచి విముక్తి కోసం కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి..
 • ఎస్ ఎం ఎస్ చేస్తే చాలు బోగీలోని టాయిలెట్స్ క్లీనింగ్..
 • జనరల్ బోగీల్లోను డస్టుబిన్లు, చార్జింగ్ పాయింట్లు..
 • రైల్వే ఆటో హబ్ గా చెన్నై...
 • అన్ని ప్లాట్ ఫామ్స్ లపై టిక్కెట్ల విక్రయ యంత్రాలు...
12:22 - February 25, 2016

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 'దేశ సామాన్యుల ఆకాంక్షలను నా బడ్జెట్ ప్రతిబింభిస్తుందని' అన్నారు. ఆదాయ వనురులను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రైల్వేకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. రూ. 1,84,820 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇది గత ఏడాది కన్న పది శాతం అధికమన్నారు. ప్రతి రూపాయని ఆచితూచి ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 
 

రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సురేష్ ప్రభు

ఢిల్లీ : లోక్ సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ 2016 ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని తెలిపారు. 

 

మీ చర్యలను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అంటారా : ఏచూరీ

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రోహిత్ ఆత్మహత్య, జెఎన్ యూ ఘటనలపై రాజ్యసభలో సీపీఎం ఎంపీ ఏచూరీ మాట్లాడారు. దేశంలోని అసహన ఘటనలపై విదేశీ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. మీ చర్యలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తే దేశద్రోహులు అంటారా అన్ని ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామ్య, లౌకికదేశమని చెప్పారు. భిన్న వ్యక్తులు, భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారని తెలిపారు. యూనిర్సిటీల్లో పరిణామాలపై హౌస్ కమిటీ చేయాలని సూచించారు. 'మా నుంచి మీరు కోరని సహకారం లభిస్తుందని' ఏచూరీ హామీ ఇచ్చారు. దేశ వ్యతిరేక శక్తులను శిక్షించండి... అయితే అందరినీ ఒకే గాడిన కట్టవద్దని హితవు పలికారు. 

గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంట : ఏచూరీ

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చూపుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరీ మండిపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రోహిత్ ఆత్మహత్య, జెఎన్ యూ ఘటనలపై ఏచూరీ మాట్లాడారు. మహాత్మగాంధీని చంపిన నాతురాం గాడ్సే ను గొప్ప దేశభక్తుడుగా చిత్రీకరించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 'దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని' బీజేపీ, సంఘ పరివార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిత్ మృతిపై పార్లమెంట్ హౌస్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పటియాల కోర్టు ఘటనపై సుప్రీంకోర్టు స్పందించి...

11:52 - February 25, 2016

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చూపుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరీ మండిపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. రోహిత్ ఆత్మహత్య, జెఎన్ యూ ఘటనలపై రాజ్యసభలో ఏచూరీ మాట్లాడారు. మహాత్మగాంధీని చంపిన నాతురాం గాడ్సే ను గొప్ప దేశభక్తుడుగా చిత్రీకరించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 'దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని' బీజేపీ, సంఘ పరివార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిత్ మృతిపై పార్లమెంట్ హౌస్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పటియాల కోర్టు ఘటనపై సుప్రీంకోర్టు స్పందించి... నలుగురు న్యాయవాదులను విచారణకు పంపిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే దాడికి దిగారని పేర్కొన్నారు. దేశంలోని అసహన ఘటనలపై విదేశీ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. 
మీ చర్యలను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అంటారా..? 
'మీ చర్యలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తే దేశద్రోహులు అంటారా' అన్ని ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామ్య, లౌకికదేశమని చెప్పారు.  మన దేశంలోని ప్రజలు భిన్న వ్యక్తులు, భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారని తెలిపారు. యూనిర్సిటీల్లో పరిణామాలపై హౌస్ కమిటీ చేయాలని సూచించారు. 'మా నుంచి మీరు కోరిన సహకారం లభిస్తుందని' ఏచూరీ హామీ ఇచ్చారు. దేశ వ్యతిరేక శక్తులను శిక్షించండి, వారిపై చర్యలు తీసుకోండి.. కానీ అందరినీ ఒకే గాడిన కట్టవద్దని హితవు పలికారు. 

11:18 - February 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చింత‌ల‌ రామచంద్రా రెడ్డి....చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభ్యుడట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి నారాయణ స్వామి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారట. మరణించి ఏడాదిన్నర దాటిన వారు సైతం శాసనసభ్యులుగా చలామని అవుతున్నారట...ఏంటీ ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యం చేసి చూపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నమ్మశక్యంగా లేదా అయితే వాచ్ దిస్ స్టోరీ.
పాలనాధికారుల బాధ్యతా రాహిత్యం... 
పాలనాధికారుల అంతులేని బాధ్యతా రాహిత్యం... ఉద్యోగుల నిర్లక్ష్యం వెరసి అంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వింత చోటు చేసుకుంది. ప్రజలకు తమ ప్రజాప్రతినిధుల సమాచారం అందించడంలో అలసత్వం ఖరీదు... తెలంగాణ ప్రజాప్రతినిధిని అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యుడ్ని చేసింది. ఓడిపోయిన వారిని సైతం గెలిపించింది. చనిపోయిన వారిని బతికించింది... ఢిల్లీ పెద్దలను రాష్ట్ర ఎమ్మెల్యేలుగా చేసింది. అవును ఇదంతా నిజమే... ఆంధ్రప్రదేశ్‌ అధికారిక పోర్టల్... చూస్తే మనకే అర్ధమవుతుంది.
అధికారుల నిర్లక్ష్యం... ఘోర తప్పిదాలు      
ఇది ఏపీ ప్రభుత్వ అధికారిన వెబ్ సైట్... ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వ సమాచారంతో పాటు రాష్ట్ర శాసన సభ్యుల పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. కానీ సమాచారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా... ఘోర తప్పిదాలే జరిగాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ ఎమ్మెల్యేగా చూపారు అధికారులు. ఇదే జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే నారయణ స్వామి స్ధానంలో కాంగ్రెస్ సీనియర్ నేత... కేంద్ర మాజీ మంత్రి నారాయణ స్వామి ఫోటో పెట్టారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోకు బదులు.. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి ఫోటోను ఉపయోగిచారు. తంబళ్ళపల్లి నియెజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఫోటో స్థానంలో అపరిచితుని ఫొటో ఉంచారు.
రామకృష్ణారెడ్డి ఫొటో స్ధానంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫొటో 
ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో స్ధానంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే... ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫోటోని ఉంచారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే అనారోగ్య కారణాలతో మరణించిన.. చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ..కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌ రావు ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చూపించారు. ఇలా శాసన సభ్యుల లిస్ట్ ఆసాంతం తప్పుల తడకగా ఉంచారు.
అధికారులు అలసత్వం 
పొర్టల్స్ ను అప్‌డేట్ చేయడంలో అధికారులు మందు నుంచీ అలసత్వాన్ని వహిస్తూనే ఉన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా.. టెక్ ముఖ్యమంత్రిగా తనకు తాను అభివర్ణించుకునే చంద్రబాబు ఏలుబడిలో అధికార గణం చేస్తున్న ఇటువంటి తప్పిదాలతో ప్రభుత్వం పరువు పొగొట్టుకుంటోంది. ఇ గవర్నెన్స్...ఈ ప్రగతి... అంటు హైటెక్ మాటలు వల్లెవేసే సర్కారీ పెద్దలు.. ముందు ప్రభుత్వ అధికారిక వెబ్ పొర్టల్ సమస్యలు పరిష్కరిస్తే చాలనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

తేనెటీగలు దాడి... 30 మంది విద్యార్థులకు గాయాలు

కర్నూలు : నందికొట్కూరులోని కృష్ణవేణి స్కూల్ లో తేనె టీగలు దాడి చేశాయి. 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కడప జిల్లాలో జగన్, లోకేష్ బాబు మకాం

కడప : జిల్లాలో వైసిపి అధినేత జగన్, టీడీపీ నేత లోకేష్ బాబు మకాం వేశారు. ఇరు పార్టీల కార్యకర్తల హడావిడి చేస్తున్నారు. లోకేష్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించారు. తమ నేతలు జారిపోకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

మ.12 గం.లకు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి సురేష్ ప్రభు

ఢిల్లీ : మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన

విశాఖ : జిల్లా రైల్వే స్టేషన్ వద్ద నగర వాసలు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 

10:47 - February 25, 2016

హైదరాబాద్ : జగన్ తమ ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్‌ చెప్పి 24 గంటలు కాలేదు.. ఈలోపే మమ్మల్ని నమ్మినందుకు తమరికే హ్యాట్సాఫ్‌ అంటూ మరో ఎమ్మెల్యే ఇవాళ టిడిపిలోకి జంప్‌ అయ్యారు. త్వరలో కడప జిల్లా నుంచి మరికొందరు టిడిపి తీర్థం పుచ్చుకుంటారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. మిగిలిన జిల్లాల నుంచీ కొందరు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి ఆకర్ష్‌ గురవుతున్నారని టాక్. మరి ఈ వలసల పర్వానికి జగన్ బ్రేకేయగలుగుతారా.? ఆ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి..?
టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు
ఇలా చెప్పి ఎన్నో గంటలు కావట్లేదు.. కానీ ఆయన పార్టీ నుంచి గెలిచినవారు మాత్రం అయామ్ సారీ అంటూ అధికార పక్షంవైపు చెక్కేస్తున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు సిఎం చంద్రబాబును కలిసి పచ్చ కండువ ధరించారు. మొన్న భూమానాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డితో మొదలైన వైసిపి ఎమ్మెల్యేల ఫిరాయింపు పర్వం ఇలా కొనసాగుతూనే ఉంది. ఈ వలసలు ప్రతిపక్ష పార్టీని అంతకంతకు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. 
పార్టీ బలోపేతంపై లోకేష్ వ్యూహాలు 
ఇక చంద్రబాబు తనయుడు లోకేష్‌ కడప జిల్లాలో మకామేసి పార్టీ బలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు జరుపుతున్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌పాషా, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మైదుకూరుకు చెందిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డితోపాటు మరికొందరు ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మిగిలిన జిల్లాల్లోకూడా టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా త్వరలో టిడిపిలో చేరతారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖ నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతోపాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్‌రావు వైసిపికి టాటా చెబుతారని టాక్. ఇక కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా త్వరలో టిడిపి కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా నుంచి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌ కుమార్ వైసిపిపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణరంగారావు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, శ్రీకాకుళం నుంచి కలమట వెంకట రమణ, కంబాల జోగులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. 
లాభాల కోసమే టిడిపిలో చేరుతున్నారన్న వైసిపి నేతలు
అయితే పార్టీ మారే నేతలు స్వంత లాభాల కోసమే టిడిపిలో చేరుతున్నారని వైసిపి నేతలు మండిపడుతున్నారు. అభివృద్ధి పేరుతో బాబు పంచన చేరుతున్న వారు రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చూపాలని కోరుతున్నారు. 
వైసిపికి ఖేదం.. టిడిపికి మోదం 
మొత్తానికి ఏపీ రాజకీయాలు వైసిపికి ఖేదాన్ని టిడిపికి మోదాన్ని పంచుతున్నాయి. అయితే ఇంకా పార్టీ మారబోతున్నారంటూ టిడిపి నేతలు వినిపిస్తున్న కొందరి పేర్లు, వాళ్ల మాటలు ఎంతవరకు నిజం.. వారంతా టిడిపిలోకి వస్తారో లేదో స్పష్టత లేదు. కానీ మరో ఏడాదిలో టిడిపి వాళ్లే మా పార్టీలోకి వస్తారని చెబుతున్న జగన్ ఏ నమ్మకంతో ఆ మాట అన్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు.

 

10:38 - February 25, 2016

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళా అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడింది. చీరాలకు చెందిన శాంతమ్మ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో కలత చెందిన శాంతమ్మ రైల్వే స్టేషన్ వద్ద పట్టాల పై పడుకుంది. అదే సమయంలో పట్టాల పైకి రైలు రానుండడంతో స్థానికులు పెద్దగా కేకలు వేసారు. రైలు ఆపాలని అరిచారు. చివరకు ఇంజన్ భాగం వరకు రైలు శాంతమ్మ సమీపానికి వచ్చి ఆగింది. స్థానికుల సాయంతో రైలు కింద ఉన్న శాంతమ్మను సురక్షితంగా బయటకు తీసారు. శాంతమ్మ మృత్యుంజయురాలయ్యారు.

 

10:33 - February 25, 2016

మీర్పూర్ : ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న టీమిండియా.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
భారత్‌ బోణీ కొట్టింది
మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్‌ తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్‌ బోణీ కొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ శర్మ ఆదుకున్నాడు. వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో చెలరేగాడు. 55 బంతుల్లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అతనికి జతగా హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 31 పరుగులు చేయడంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది.
టీమిండియా 167 పరుగులు
టీమిండియా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో షబ్బీర్ రెహ్మాన్ 44 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రాకు మూడు వికెట్లు లభించగా, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌లకు తలో వికెట్ దక్కింది. విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను శనివారం పాకిస్తాన్‌తో ఆడనుంది.

 

 

 

09:53 - February 25, 2016

హైదరాబాద్ : సురేష్‌ ప్రభు రైల్వే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది హైదరాబాద్‌ మహానగరం. పాత పెండింగ్‌ క్లియరింగ్‌ కోసం ఎదురుచూస్తోంది. కొత్త వాటి కోసం ఆశిస్తోంది. ఎంఎంటీఎస్ విస్తరణపై సానుకూల కేటాయింపులిస్తారని భావిస్తోంది.
డిమాండ్‌కు సరిపడ సర్వీసుల్లేని ఎంఎంటీఎస్‌  
హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, కాలుష్యానికి దూరంగా ప్రతిరోజు కొన్ని వేలమందిని గమ్య స్థానాలకు చేరుస్తోంది. అయితే జనాభాకు, డిమాండ్‌కు సరిపడినంత ఎంఎంటీఎస్‌ సర్వీసులు లేవు.
2003లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ప్రారంభం
హైదరాబాద్‌లో వేగవంతమైన ప్రయాణానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఆలోచనతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో ప్రవేశపెట్టాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో 35 సర్వీసులతో ప్రారంభించగా, తర్వాత వాటి సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి, ఉందానగర్-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్ రూట్లలో ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తున్నాయి. దాదాపు లక్షా 50 వేలమందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో దశ పనులు ప్రారంభమైనా వేగం పుంజుకోలేదు. అయితే నిధుల కేటాయింపు నిరాశ కలిగిస్తోంది. సెకండ్‌ ఫేజ్‌ కోసం గత బడ్జెట్లలో అరకొర నిధులే ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని డిమాండ్‌ 
తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. దీంతో ఈ బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన పట్టాలెక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక సికింద్రాబాద్‌ను ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ది చేస్తామని ప్రకటించినా, పనుల్లో వేగం లేదు. దక్షిణమధ్య రైల్వేలో అతిపెద్ద స్టేషన్‌ అయిన సికింద్రాబాద్‌ మీదుగా ప్రతిరోజు లక్షా 50 వేలమంది ప్రయాణిస్తుంటారు. 240 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించి, 2011లో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఐదు వేల కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కన్సల్టెంట్ నియామకమే జరగలేదు.
ట్రాక్‌లపై బ్రిడ్జీలు లేకపోవడంతో ప్రమాదాలు 
సిటీలో చాలా చోట్ల రైల్వే ట్రాక్‌లపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. బ్రిడ్జీలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ జాంలు ఏర్పడుతున్నాయి. తుకారంగేట్, ఖైరతాబాద్‌తో పాటు పలు చోట్ల రైల్ ఓవర్, రైల్ అండర్ బ్రిడ్జీలు నిర్మించాలని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నా వాటికి మోక్షం లేదు. ఇక అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి నగరం శివార్లలో స్టేషన్లను అభివృద్ది చేయాలని ఎప్పటి నుంచో చెబుతున్నా రైల్వే శాఖ ఆలకించడం లేదు.
మౌలాలిలో ఆచరణకు నోచుకోని ఐఆర్‌ఐఎఫ్‌ఎం స్థాపన 
మూడేళ్ల క్రితం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించినా పురోగతి శూన్యం. మౌలాలిలో దీని కోసం ఆరెకరాల స్థలంలో 20 కోట్ల రూపాయల అంచనాతో ఐఆర్‌ఐఎఫ్‌ఎంను స్థాపించాలని భావించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇలా ఎన్నో ప్రాజెక్టుల కోసం భాగ్యనగరం ఎదురుచూస్తోంది. చూడాలి రాజధానిపై ఈసారైనా కేంద్రం ఆశించిన చర్యలు తీసుకుంటుందో, లేదో.

 

09:49 - February 25, 2016

పూణె : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993 పేలుళ్ల కేసులో సంజయ్ కు ఐదేళ్ల శిక్ష పడింది. 42 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. సత్ర్పవర్తన కారణంగా కేంద్రం ప్రభుత్వం సంజయ్ దత్ శిక్షా కాలాన్ని తగ్గించింది. ఈమేరకు ఉదయం ఎరవాడ జైలు నుంచి సంజయ్ ను విడుదల చేశారు. 

09:45 - February 25, 2016

రైల్వే బడ్జెట్ లో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం జరగాలని రైల్వే ఎంప్లాయీస్ యూనియన్  నేత శివకుమార్ ఆకాంక్షించారు. ఇదే అంశంపై జనపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఇవాళే రైల్వే బడ్జెట్ రాబోతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న రెండవ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో  చేయబోతున్న ప్రతిపాధనలపై వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మన రైల్వే రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి?  రైల్వేల ఎదుట వున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? వీటిని అధిగమించాలంటే ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు చేయాల్సి వుంటుంది? ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది? రైల్వేల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రైల్వే ఉద్యోగుల, సిబ్బంది సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై శివకుమార్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:41 - February 25, 2016

మన రైల్వే రంగం అనేక సమస్యలను , సవాళ్లను ఎదుర్కొంటోంది. రైల్వే రంగ అభివ్రుద్ధికీ, ఆధునికీకరణకు నిధులు సమీకరించడం ఇప్పుడో పెద్ద సవాలుగా మారుతోంది. 
ఆర్థికాభివృద్ధిలో రైల్వేలు కీలకం
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో రైల్వేలది అత్యంత ప్రధాన పాత్ర. రైల్వేలను కేవలం ప్రయాణ సాధనంగానో, సరుకు రవాణా సాధానంగానో మాత్రమే చూడకూడదు. దేశ సమైక్యత, సమగ్రతలకు, సామాజిక, ఆర్థికాభివ్రుద్ధికి అది వారధి.  పారిశ్రామిక ప్రగతి రైల్వేలతో ముడిపడి వుంది. 
మన దేశంలో  19 వేల రైళ్లు 
మన దేశంలో  19 వేల రైళ్లు తిరుగుతున్నాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్లు 12 వేలుకాగా, సరుకు రవాణా రైళ్లు 7వేల దాకా వున్నాయి.  రోజుకి రెండున్నర కోట్ల మంది  వీటిలో ప్రయాణిస్తున్నారు. 30 లక్షల టన్నుల సరుకులు రవాణా అవుతున్నాయి.  65 808 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం వున్న మనదేశంలో దాదాపు 8 వేల రైల్వే స్టేషన్లున్నాయి. 14 లక్షల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఇంత కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థలు ప్రపంచం మొత్తం మీద మరో ఏడు మాత్రమే వున్నాయి. 
రైల్వే రంగం.. అనేక సమస్యలు
ఇంత ప్రాధాన్యత వున్న రైల్వే రంగం అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటోంది. విద్యుదీకరణ, శుభ్రత, భద్రత, విస్తరణ, ఆధునికీకరణ లాంటి సవాళ్లు మనముందున్నాయి. మన రైల్వే వ్యవస్థను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి రాబోయే పదేళ్లలో 14 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుందన్న అంచనాలున్నాయి.  ఇన్ని నిధులను సమకూర్చుకోవడం ఇప్పుడు రైల్వేల ముందున్న అతి పెద్ద సవాలు. 
కొత్త ప్రాజెక్ట్ లు వచ్చే అవకాశం లేదు.. 
రైల్వేలు సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో 91 పైసలకు పైగా నిర్వహణ వ్యయానికి సరిపోతోంది. కాబట్టి కొత్త ప్రాజెక్ట్ లు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే  ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికే మరో 20 ఏళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. నిర్వహణా వ్యయాన్ని తగ్గించే పేరుతో ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు.  దీంతో సిబ్బంది మీద  పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. 
చార్జీలు పెంచాలన్న వాదనలు 
రైల్వేల ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయాణీకుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రయాణీకుల చార్జీలు పెంచితే ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి, అసలుకే కన్నం పడుతుందన్న ఆందోళనలు లేకపోలేదు. గత కొన్నేళ్లుగా నేరుగా రైల్వే చార్జీలు పెంచకపోయినా, తత్కాల్ పేరుతో భారీగానే వసూలు చేస్తున్నారన్న విషయాన్ని మరచిపోకూడదు. ఇక సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా వున్నాయన్న అభిప్రాయం వుంది. మన రైల్వేలు సరఫరా చేస్తున్న వాటిలో   ఎక్కువ భాగం బొగ్గు, సిమెంట్, ఆహార ధాన్యాలున్నాయి. వీటి మీద చార్జీలు పెంచితే,  అదే నిష్పత్తిలో ధరలు పెరుగుతాయి. చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ మీదే ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం వుంది.  కాబట్టి, సరకు రవాణా చార్జీలు పెంచడం కంటే సరకు రవాణా పరిమాణాన్ని పెంచుకునే మార్గాల మీద ద్రుష్టి పెట్టడం ఉత్తమం. ఆటోమొబైల్ లాంటి ఇతర రంగాలను ఆకర్షించాల్సి వుంటుంది. 
కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలి
దేశ ఆర్థికాభివృద్ధిలో, పారిశ్రామిక ప్రగతిలో కీలకపాత్ర పోషించే రైల్వే వ్యవస్థను మరింతగా విస్తరించాలన్నా, ఆధునికీకరించాలన్నా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సి వుంటుంది. ఆర్థికశాఖ వెన్నుదన్నుగా నిలవాల్సి వుంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి చొరవ కనిపించడం లేదు.  గత సంవత్సరం అరుణ్ జైట్టీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో రైల్వేలకు 40 వేల కోట్లు కేటాయించారు. చివరకు దానిని 32వేలకు కుదించారు. కేంద్రం ఏటా లక్ష కోట్లైనా సమకూర్చకపోతే మన రైల్వే వ్యవస్థ లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమయ్యే పనికాదు. 
విద్యుత్, డీజిల్ ధరలు రైల్వేలపై పెనుభారం
మరోవైపు విద్యుత్, డీజిల్ ధరలు రైల్వేల మీద పెనుభారం మోపుతున్నాయి. వీటికయ్యే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన బిల్లుల కోసమే రైల్వే శాఖ ఏటా 30వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.  విద్యుత్,  డీజిల్ చార్జీలను తగ్గించడం ద్వారా రైల్వేలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం వుంది. 

09:03 - February 25, 2016

విజయవాడ : డిక్టేటర్‌ తనదైన స్టైల్‌లో స్పందించారు. లేపాక్షి ఉత్సవాలకు అందరినీ పిలిస్తున్నారు.. మరి చిరంజీవిని పిలిచారా అంటే తాను ఎవరినీ నెత్తికెత్తుకోనంటూ సమాధాన మిచ్చారు. మెగాస్టార్‌ను వద్దని చెప్పకనే చెప్పేశారు. వైసీపీలో అసంతృప్తి ఉండటంతోనే టీడీపీలోకి వలసల బాట పట్టారని బాలయ్య చెప్పారు.
లేపాక్షి ఉత్సవాలకు చంద్రబాబును ఆహ్వానించిన బాలకృష్ణ 
లేపాక్షి ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించడానికి విజయవాడకు వెళ్లిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిరంజీవికి ఆహ్వానం పంపారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు లేదని బాలకృష్ణ సమాధానమిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో తనకు తెలుసని.. వారినే పిలిచానని చెప్పారు. తన పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారు.. వారితోనే కలిసి ప్రయాణిస్తానని బాలయ్య అన్నారు. తాను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోనని, అలాంటి వాళ్లు ఉన్నారని అందుకే పిలవలేదని చెప్పారు. తాను డిక్టేటర్ పద్దతిలోనే వెళ్తానని బాలయ్య అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. 
అందుకే టీడీపీలో చేరుతున్నారు : బాలకృష్ణ  
వైసీపీలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, అందుకే అలాంటి వారంతా అభివృద్ధిని కోరే టీడీపీలో చేరుతున్నారని బాలయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరికపై తమరి హస్తం ఉందా అని బాలయ్యను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. మొత్తానికి బాలయ్య లేపాక్షి ఉత్సవాలతో హడావుడి చేస్తూనే.. కాంగ్రెస్‌, వైసీపీలపై సెటైర్లు వేస్తున్నారు.
 

 

08:51 - February 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ 2016- 17 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలతో వరుసగా సమీక్షా సమావేశాలు చేపడుతున్నారు. వైద్యం, విద్య, పారిశ్రామిక, వ్యవసాయం ఇలా పలు కీలక రంగాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలసత్వం, నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగొద్దని సీఎం పలు శాఖలకు తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై కేసీఆర్‌ సమీక్ష
ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటామన్న పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖకు మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
కోరినన్ని నిధులు ఇస్తాం : కేసీఆర్‌ 
వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ సమీక్ష సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ వినోద్, సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ కోరినన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుకావాలన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్ష
అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా  ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం వుందని కేసీఆర్‌ అన్నారు. ఈ విధానంలో లోపాలను అరికట్టాల్సివుందన్నారు. అక్రమాలకు తావులేని విధంగా వ్యవస్థను మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విద్యుత్‌ శాఖపై సమీక్ష
అలాగే విద్యుత్‌ శాఖపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రంగ సంస్థలను ప్రోత్సహిస్తామని తెలిపారు. విద్యుత్‌ సంస్థలపై పడే భారం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మారుతుందని ఆశించారు. త్వరలోనే ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను ప్రవేశపెట్టాలని సూచించారు.

ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ విడుదల

పూణె : ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ విడుదలయ్యారు. 1993 పేలుళ్ల కేసులో సంజయ్ కు ఐదేళ్ల శిక్ష పడింది. 42 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. సత్ర్పవర్తన కారణంగా కేంద్రంప్రభుత్వం సంజయ్ దత్ శిక్షా కాలాన్ని  తగ్గించింది. 

08:24 - February 25, 2016

ఢిల్లీ : హస్తినలో విద్యార్థులపై పోలీస్‌లు జులుం ప్రదర్శించారు. ఇండియా గేట్‌ వద్ద రోహిత్‌కు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యా సంస్థల్లో సామాజిక వివక్షతను రూపుమాపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రోహిత్‌ ఆత్మహత్యకు గల కారకులపై చర్యలు తీసుకోవాలని, రోహిత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఇండియా గేట్‌ సాక్షిగా విద్యార్థులు నివాళులర్పించారు. స్టూడెంట్‌ యూక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 
మానవ హారం చేస్తున్న విద్యార్థులపై దాడి పోలీసులు 
అయితే ఒక్క సారిగా ఢిల్లీ పోలీసులు మానవ హారం చేస్తున్న విద్యార్థులపై దాడి చేశారు. దొరికిన వాళ్ళను దొరికినట్లుగా ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో కుక్కారు. సుమారు రెండు వందల మంది విద్యార్థుల్ని అరెస్టు చేసి స్థానిక తిలక్‌ మార్గ్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసిన విద్యార్థుల్ని విడుదల చేయాలని రోహిత్‌ వేముల తల్లి రాధిక, సోదరుడు రాజా ధర్నా చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పిల్లలు లేరని, అందుకే అమ్మ విలువ తెలియదని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్‌ చట్టం వచ్చేంతవరకు పోరాడతామని చెప్పారు. అలాగే రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
రోహిత్‌, కన్హయ్య విషయంలో ఆత్మరక్షణలో పడిన కేంద్రం : సీపీఐ 
రోహిత్‌, కన్హయ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్దుకోకపోతే తాము తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నారు. రోహిత్‌ తల్లి రాధిక, లెఫ్ట్ నేతల ఆందోళనతో చివరకు విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు. 

 

08:19 - February 25, 2016

ఢిల్లీ : రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అమీతుమీకి దిగారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై మాయావతి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సెంట్రల్ వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. హెచ్‌సీయూ, జెఎన్‌యు ఘటనపై రాజ్యసభలో గురువారం చర్చ జరగనుంది.
రోహిత్‌ ఆత్మహత్య దుమారం 
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య అశంపై రాజ్యసభలో దుమారం రేగింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ అంశాన్ని లేవనెత్తారు.  సెంట్రల్ వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రుల వైఖరి వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె మండిపడ్డారు. దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ అంశంపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చర్చకు అనుమతించినా మాయావతి శాంతించలేదు. దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. బీఎస్పీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాయవతి, స్మృతి ఇరానీల మధ్య మాటల యుద్ధం..
రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. ''పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయి'' అని మండిపడ్డారు. ఓ దశలో రోహిత్‌ వేముల ఆత్మహత్యపై మాయావతి, స్మృతీ ఇరానీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మాయావతి ప్రశ్నకు జవాబివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. 'నేనిచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే నా తల నరికి మీ పాదాల వద్ద ఉంచుతానని' స్మృతీ ఇరానీ ఆవేశంతో ఊగిపోయారు. పట్టువదలని మాయావతి- రోహిత్‌ ఆత్మహత్య ఘటన దర్యాప్తు బృందంలో దళిత సభ్యులను ఉంచడానికి మీకు ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.  
మాయావతి డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలి : ఏచూరీ 
రోహిత్‌ వేముల ఆత్మహత్య దర్యాప్తు విచారణ కమిటీలో దళిత సభ్యుడిని ఉంచాలన్న మాయావతి డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌కు సూచించారు. 
హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై వేర్వేరుగా చర్చించాలన్న విపక్షాలు 
హెచ్ సీయూ విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య, జెఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్టు ఘటనలపై  వేరు వేరుగా చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటీస్‌ ఇవ్వాలని డిప్యూటి చైర్మన్ కురియన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మీరిచ్చిన ఎజెండాలో ఈ రెండు అంశాలు కలిసే ఉన్నాయని కురియన్‌ స్పష్టం చేశారు. ఎట్టకేలకు ఈ రెండు అంశాలపై చర్చతోపాటు సమాధానాన్ని కూడా పూర్తి చేయాలని అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై గురువారం చర్చ ఉంటుందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజె.కురియన్‌ ప్రకటించడంతో సభ వాయిదా పడింది. 

08:03 - February 25, 2016

హైదరాబాద్ : కేటాయింపులు ఘనం మంజూరు హీనంగా మారింది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. వేలాది కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న దక్షిణ మధ్య రైల్వేకి కేటాయింపులు వందల కోట్లలోనే ఉంటున్నాయి. దశాబ్దాల తరబడి సాగుతున్న పెండింగ్ ప్రాజెక్టులు నత్తను తలపిస్తున్నాయి. బడ్జెట్ లో రెండు రాష్ట్రాలపై కొనసాగుతున్న వివక్షపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ.
రైల్వే కనెక్టివిటీలో వెనకబడి ఉన్న ఇరు రాష్ట్రాలు
ఉత్తర భారతంతో పోలిస్తే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రైల్వే కనెక్టివిటీలో అత్యంత వెనకబడి ఉన్నాయి. ఉత్తర భారతంలో సగటున 54 కిలోమీటర్లు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 9 కిలోమీటర్లే ఉంది. ఉన్న లైన్లు కూడా నిజాం కాలం, బ్రిటీష్ కాలంలో వేసిన లైన్లే తప్ప కొత్త లైన్లు నామమాత్రం. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్‌లోనూ మొండి చెయ్యే చూపెడుతున్నారు. తెలంగాణలో మూడు దశాబ్దాలుగా సాగుతున్న పెద్దపల్లి-నిజామాబాద్ మార్గానికి గత బడ్జెట్ లో 720 కోట్లు కేటాయించారు. ఆ ప్రాంత ఎంపిల ఒత్తిడి మేరకు 169 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో పనులు కొంత వేగంగా జరుగుతున్నాయి. జగ్గయ్య పేట-మేళ్లచెర్వు-జాన్‌పాడ్ మార్గానికి బడ్జెట్‌లో 256 కోట్లు కేటాయించగా  కేవలం 70 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఈ లైనును అతి త్వరగా పూర్తిచేయాలి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కొత్త, పెండింగ్ ప్రాజెక్టులకు 12,379 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే ఈ బడ్జెట్లో 1596 కోట్లు కేటాయించగా మంజూరు చేసింది కేవలం 475 కోట్లు మాత్రమే.
ఎపికి రైల్వే శాఖ రిక్త హస్తం 
కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు, వెంకయ్య నాయడులు ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ కు కూడా రైల్వే శాఖ రిక్త హస్తమే చూపిందని చెప్పొచ్చు. ప్రతిపాదనలు వేలకోట్లలో ఉంటే కేటాయింపులు వందల కోట్లలో ఉండటమే దీనికి నిదర్శనం. నంద్యాల-ఎర్రగుంట్ల మార్గానికి 788 కోట్లు కేటాయించగా మంజూరు చేసింది ఎనభై కోట్లు మాత్రమే. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం మార్గానికి 693 కోట్లు కేటాయించగా విడుదల చేసింది కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే. 
ఏపిలో 19 పెండింగ్ ప్రాజెక్టులకు రూ.882 కోట్లు మంజూరు
గుంతకల్లు రాయచూర్ మార్గానికి 390 కోట్లు కేటాయించగా విడుదల చేసింది ఆరు కోట్లు మాత్రమే. మొత్తంగా చూసినట్టయితే ఏపిలో పందొమ్మిది పెండింగ్ ప్రాజెక్టులకు 22,200 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపితే 2,200 కోట్లు కేటాయించి 882 కోట్లు మంజూరు చేశారు. ఇదీ తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రానికి, రైల్వే శాఖకు ఉన్న చిత్తశుద్ధి.

 

07:56 - February 25, 2016

ఢిల్లీ : కరిగిపోతున్న వనరులు, చార్జీల భారం మోపేందుకు సహకరించని పరిస్థితి. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న వేళ రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ముందున్న సవాళ్లు ఇవి. గత బడ్జెట్‌లో సురేష్‌ప్రభు సరుకు రవాణాతో పాటు రవాణాచార్జీ పెంచారు. అలాగే ప్రైవేటు పెట్టుబడులు లాంటి అంశాలు సైతం రైల్వే బడ్జెట్‌లో లేవనెత్తారు. మరి ఈసారి మోడీ సర్కారు రైలింజన్‌ ఏ దిశగా తీసుకెళ్తారో ఈ బడ్జెట్‌తో తేలిపోనుంది.  నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వే చార్జీలు, సరుకు రవాణా చార్జీలను ఈ సారి రైల్వే బడ్జెట్‌లో పెంచే పరిస్థితి లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
రైల్వేల్లో నిధుల కొరత 
రైల్వేలకు ఆశించిన మేర వసూళ్లు తగ్గడం.. కొత్త ప్రాజెక్టులపై వెచ్చించాల్సిన క్రమంలో రైల్వేల్లో నిధుల కొరత తీవ్రంగా ఉంది. అయితే ప్రయాణీకుల బుకింగ్‌లూ, గూడ్స్‌ లోడింగ్స్‌ ఇటీవల గణనీయంగా తగ్గాయి. ఈ పరిస్థితిలో ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలు పెంచితే అది రైల్వేలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అందుకే రైల్వే బడ్జెట్‌లో సురేష్‌ ప్రభు చార్జీల పెంపునకు దూరంగా ఉంటారని భావిస్తున్నారు. 
సేఫ్టీ సెస్‌ పై సందిగ్ధం 
ప్రమాద నివారణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన సేఫ్టీ సెస్‌ను ప్రవేశ పెడతారా లేదా అనే విషయం పైనా సందిగ్ధం నెలకొంది. ఇక పండుగ సమయాల్లో అధిక రేట్లతో ప్రధాన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించడంతో రైల్వేలు పరోక్షంగా చార్జీల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. డిమాండును బట్టి నడిచే సువిధా రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా 12 సువిధా రైళ్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 సువిధా రైళ్లు నడుస్తున్నాయి. ఇక లక్షా 25 వేల కోట్లతో సామర్థ్య పెంపు ప్రణాళికకు రైల్వే బడ్జెట్‌ ప్రధానంగా దృష్టి సారించనుంది. భద్రతా ప్రమాణాల పెంపు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులపైనా రైల్వే బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో కేటాయింపులో  ఉండే అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని రైల్వేల్లో ప్రోత్సహించేందుకు పెద్దపీట వేయనున్నారు. పలురైళ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటును ప్రకటించనున్నారు.

 

సచివాలయ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమావేశం

హైదరాబాద్ : నేడు సచివాలయ ఉన్నతాధికారులతో  ఎపి మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. అమరావతికి ఉద్యోగుల తరలింపుపై చర్చించనున్నారు. 

ఎపిలో నేటి నుంచి పొగాకు కోనుగోళ్లు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పొగాకు కోనుగోళ్లు జరుగనున్నాయి.తొలి దశలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 7 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈమేరకు శ్రీవారి సర్వదర్శనానికి 3గంటలు, కాలినడక భక్తులకు 2గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పడుతోంది.

నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సురేశ్ ప్రభు

హైదరాబాద్ : ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచాలా వద్దా అన్న ఊగిసలాట నడుమ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంటులో 2016-17 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తగ్గిన ఆదాయం, ప్రాజెక్టులకు నిధులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాల ఆవశ్యకత నేపథ్యంలో బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

నేడు టీ.సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో నేడు స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు ఇందిరాపార్కు వద్ద వామపక్షాల ధర్నా

హైదరాబాద్ : హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలను నిరసిస్తూ నేడు ఇందిరాపార్కు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.

Don't Miss