Activities calendar

26 February 2016

21:46 - February 26, 2016

హైదరాబాద్ : కాఫీ పెయింట్ అంటే ఆశ్చర్యమేస్తోందా.. అవి ఎలా వేయాలో ఇవాళ్టి 'సొగసు' లో మన గెస్ట్ అపర్ణ చూపించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:42 - February 26, 2016

హైదరాబాద్ : ఆడపిల్లలకు సింపుల్ టెక్నిక్స్ తో ఆకతాయిల ఆటకట్టించే ఆత్మరక్షణా పద్ధతులేంటో ఇవాళ్టి నిర్భయలో తెలియజేశారు... వాటిని మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:09 - February 26, 2016

హైదరాబాద్: మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి వీలైనంత ఎక్కువ గ్రామాలకు మంచినీరు అందించాలన్నారు. మరోవైపు విద్యుత్‌ శాఖ అధికారులు మిషన్‌ భగీరథలో కనీసం 10 రోజులైనా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఇంజనీరింగ్‌ పనుల్లో ఐటిఐ విద్యార్ధుల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు కేసీఆర్‌. 

21:00 - February 26, 2016

హైదరాబాద్: లవ్‌ సినిమాలో నటించిన హీరోయిన్‌ స్వాతిరెడ్డి ఇప్పుడు లవ్‌ వివాదంలో ఉంది. స్వాతిరెడ్డి కనపడటం లేదంటూ తల్లి నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తానెక్కడికీ పోలేదంటూ స్వాతిరెడ్డి పోలీసుల ముందు ప్రత్యక్షమయింది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు స్వాతిరెడ్డి చెబుతుండగా, ఆ శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే పెళ్లి అయి, పిల్లలు కూడా ఉన్నారని హీరోయిన్‌ తల్లి నాగేంద్రమ్మ చెబుతున్నారు.

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

హైదరాబాద్ : గ్రేటర్ ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. జికెఎంసి ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 188 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిడబ్ల్యూ ఎంసి లో 58 డివిజన్లకు గానూ బరిలో 422 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 389 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.   

19:54 - February 26, 2016

అనంతపురం: జిల్లా హిందూపురంలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. లేపాక్షి ఉత్సవాల్లోభాగంగా విద్యార్థులు, కళాకారులతోకలిసి హెరిటేజ్‌ వాక్ నిర్వహించారు. లేపాక్షి ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పేలా ఈ ఉత్సవాలు జరుపుతామని ప్రకటించారు.

గ్రూప్ -2 పరీక్షకు టీఎస్ పీఎస్సీ విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్ : గ్రూప్ -2 పరీక్షలకు టీఎస్ పీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. 5,64,431 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మాల్ ప్రాక్టీస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఆధార్ వివరాలను సేకరిస్తుంది. ఆధార్ వివరాలను ఓటీఆర్ లో నమోదు చేయాలని విద్యార్థులకు టీఎస్ పీఎస్సీ ఆదేశించింది.    

ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

హైదరాబాద్: వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి వారితో చర్చించనున్నారు.   

చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుల తడక- ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్: చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుల తడక అని వైసిపి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. పయ్యావుల కేశవులు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పయ్యావులకి జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలు ఎవరి పక్షమో తక్షణమే శాసనసభను రద్దు చేసి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కొనే క్యారక్టర్ చంద్రబాబుదని తెలిపారు. 130 ఏళ్ల కాంగ్రెస్సే జగన్ ఏం చేయలేకపోయిందని, 33 ఏళ్ల టిడిపి ఏం చేయ్యలేదన్నారు. రాజకీయ నైతిక విలువల గురించి జగన్ దగ్గర చంద్రబాబు నేర్చుకోవాలని సూచించారు.   

తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్

హైదరాబాద్ : తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయి మెంట్ యాక్ట్ 1994 లో సవరణలు చేస్తూ, ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయొచ్చని ప్రభుత్వం చట్టంలో చేర్చింది. 2014 జూన్ 2 కంటే ముందు నుంచి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు అవకాశం దక్కునుంది. 

18:34 - February 26, 2016

శ్రీకాకుళం: విద్యార్థులు, యువతీ యువకులకోసం మరో విలువైన యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఏయే కాలేజీలో ఎలాంటి కోర్సులున్నాయి? వాటి ఫీజులు, స్కాలర్‌షిప్‌ వివరాలేంటి? ఉపాది అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగావకాశాలు, ఇందుకోసం అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌లాంటి అంశాలు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ పూర్వ విద్యార్థిని లిజి కళాధర్ ఈ యాప్‌ను తయారుచేశారు.

18:27 - February 26, 2016

ఢిల్లీ: హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాజ్యసభ దద్దరిల్లింది. మంత్రి స్మృతీ ఇరాని అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ఆత్మహత్య కాదు... ముమ్మాటికి హత్యేనని ఏచూరి అన్నారు. రోహిత్‌ ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా దళిత విద్యార్థులతో కేంద్రం ఇంతవరకు చర్చలు జరపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శమన్నారు.

18:24 - February 26, 2016

ఖమ్మం: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశానికి తమ్మినేని హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్నారు. డబ్బుకోసం, స్వార్థంకోసం తాము పదవిని ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు. అన్నింటికీ తట్టుకొని ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

17:59 - February 26, 2016

హైదరాబాద్: గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమం, భూ సమస్య అంశాలపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో నేతలు మాట్లాడుతూ... అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇప్పటివరకు 30 శాతం భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదన్నారు. అటవీ భూములను రీసర్వే చేసి.. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు భూములు ఇవ్వాలన్నారు.  

17:46 - February 26, 2016

హైదరాబాద్: ఏపీలోనే కాదు నగరంలోనూ కాల్‌మనీ లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని చైతన్యపురిలో ఓ వడ్డీ వ్యాపారి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి కథనం ప్రకారం సాయి అనే వ్యక్తి స్థానికంగా 6 ప్యాక్‌ జిమ్‌ నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలు పార్వతమ్మ అతని వద్ద రెండున్నర సంవత్సరాల క్రితం నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. నాటి నుంచి క్రమం తప్పకుండా వడ్డీ కడుతోంది. ఇంతలో నీవు నాకు 17 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆమెపై వాగ్వాదానికి దిగాడు. అంతెందుకు కట్టాలని ప్రశ్నించినందుకు తనకు పెద్దల అండదండలున్నాయని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రస్తుతం బాధితురాలు సరూర్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

17:37 - February 26, 2016

అమెరికా: తూర్పు తీరంలో తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా వర్జీనియా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లూసియానా, మిసిసిప్పీ, ఫ్లోరిడా రాష్ట్రాల్లో తుపాను నష్టం అధికంగా ఉంది. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాను ముప్పు ఇంకా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది లక్షల మందిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

మంత్రి స్మృతి మాట నిలబెట్టుకోవాలి - మాయావతి

ఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన మాట నిలబెట్టుకోవాలని ఎంపి మాయావతి అన్నారు. రాజ్యసభలో మాయావతి మాట్లాడుతూ... తన సమాధనంతో సంతృప్తి చెందకపోతే ఏ త్యాగానికైనా సిద్ధమని స్మృతి ఇరానీ అన్నారని, తాను స్మృతి ఇరానీ సమాధానం పట్ల సంతృప్తిగా లేనన్నారు. కనుక మంత్రి తన మాట నిలబెట్టు కోవాలన్నారు. రోహిత్ మృతిపై విచారణ కమిటీలో దళిత సభ్యుడిని ఎందుకు నియమించలేదని మాయావతి ప్రశ్నించారు.   

రోహిత్ మృతికి కేంద్రం వైఖరే కారణం - సీతారాం ఏచూరి

ఢిల్లీ: రోహిత్ మృతికి కేంద్రం వైఖరే కారణమని సిపిఎం ఎంపి సీతారాం ఏచూరి రాజ్యసభలో పేర్కొన్నారు. కేంద్రం తీరువల్లే ఎచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మంత్రి స్మృతి ఇరానీ అన్నీ అవాస్తవాలే మాట్లాడారన్నారు.     

మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏడాది చివరికల్లా చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించేలా కార్యాచరణ రూపొందించుకుని, పనులు చేయాలని సీఎం పేర్కొన్నారు. మంచినీటి పంపింగ్ కు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్లు, పవర్ లైన్లు , సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పనుల్లో అధికార వికేంద్రీకరణ జరగలన్నారు. పనులు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు నిర్వహణ భాద్యత వర్కింగ్ ఏజెన్సీలకే ఉంటుందన్నారు.

హీరోయిన్ ప్రేమ పంచాయతీ

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయతీ ముదిరింది. ''లవ్'' సినిమా హీరోయిన్ శ్వేతా రెడ్డి, ఆమె తల్లి మద్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్లోనే తల్లీ కూతుళ్లు కొట్టుకున్నారు. గొడవ అనంతరం ఇష్టపూర్వకంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో శ్వేతారెడ్డి వెళ్లిపోయారు.     

టీడీపీ.. సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దింది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కన్నతల్లి లాంటి పార్టీని కొంతమంది మోసం చేశారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడారు. వరంగల్ కార్పొరేషన్  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఎంతో మంది సామాన్య పౌరులను కూడా పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిన పార్టీ టీడీపీయేనని చెప్పారు. గాలికి తిరిగేవాళ్లను కూడా టీడీపీ పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిందన్నారు. 

13:58 - February 26, 2016

ఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో ఎకానమిక్ సర్వే రిపోర్టు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సమర్పించారు. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు బలహీనంగా ఉంటే... ఆ ప్రభావం భారత్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.
ఏడో పే కమిషన్ ద్వారా వస్తు వినియోగం పెరుగుతుందని కూడా అంచనావేసింది. గత ఐదేళ్లతో పోల్చితే 8 శాతం వృద్దిరేటు పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. సర్వీస్‌ సెక్టార్‌లో 9.2 శాతం వృద్ది రేటు అంచనా కట్టింది. కరెంట్ ఖాతాలోటు 1 నుంచి 1.5 శాతం ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఏడో వేతన సంఘంతో ద్రవ్యోల్బణంపై స్వల్ప ప్రభావం ఉంటుందని తెలిపింది. విద్య, వైద్యంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భవిష్యత్‌లో భారత్‌కు ఎఫ్‌డీఐలు విరివిగా వచ్చే అవకాశముందని తెలిపింది.
 


 

13:56 - February 26, 2016

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ లో ఎపికి పూర్తిగా అన్యాయం చేశారని ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలో ఆందోళనలు జరుగున్నాయని తెలిపారు. ఈ నిరసనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెగలాంటిదన్నారు.

13:53 - February 26, 2016

 హైదరాబాద్ : కన్నతల్లి లాంటి పార్టీని కొంతమంది మోసం చేశారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడారు. వరంగల్ కార్పొరేషన్  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఎంతో మంది సామాన్య పౌరులను కూడా పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిన పార్టీ టీడీపీయేనని చెప్పారు. గాలికి తిరిగేవాళ్లను కూడా టీడీపీ పెద్ద నాయకులుగా తీర్చి దిద్దిందన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మధు ఫైర్...

కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. కడపలో వామపక్షాలు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర మంచి నీటి సమస్య ఉందన్నారు. తాగడానికి నీల్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్,  సోమశిల నుంచి వాటర్ వాటర్ తేవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. 

13:45 - February 26, 2016

హైదరాబాద్ : పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయంలో ఒమేగా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ చికిత్స అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.  రెండు రోజులు పాటు ఈ సదస్సును  నిర్వహిస్తున్నారు.

13:44 - February 26, 2016

కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. కడపలో వామపక్షాలు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర మంచి నీటి సమస్య ఉందన్నారు. తాగడానికి నీల్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్,  సోమశిల నుంచి వాటర్ వాటర్ తేవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు ప్రాజెక్టులు అటకెక్కాయని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులను పూర్తిగా తొలగించి...  వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికులను తీసుకుంటున్నారని చెప్పారు.

 

హైకోర్టులో అగ్రిగోల్డ్ పిల్‌పై విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో 70 ఆస్తులు బయటపడ్డాయని ఏపీ సీఐడీ తెలిపింది. మరింత విచారిస్తే పూర్తి ఆస్తులు బయటపడతాయని పేర్కొంది. విచారణలో బయటపడ్డ 70 ఆస్తులను రెండు రోజుల్లో... అచాట్ చేయాలని ఏపీ ప్రభుత్వాని హైకోర్టు ఆదేశించింది. 

 

13:16 - February 26, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకు బయటపడ్డ 70 ఆస్తులను అటాచ్ చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తులో 70 ఆస్తులు బయటపడ్డాయని ఏపీ సీఐడీ ఇవాళ హైకోర్టుకు వివరించింది. మరింత విచారిస్తే పూర్తి ఆస్తులు బయటపడతాయని తెలిపింది. సీఐడీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆస్తులను అచాట్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సంస్థ యాజమాన్యం ఆస్తుల వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంపై.. ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని సూచించింది. ఈ కేసులో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేయాలన్న హైకోర్టు.. విచారణను 2 వారాలను వాయిదా వేసింది. 

 

నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ముగియనున్న గడువు

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది. దీంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. వివిధ పార్టీల నేతలతో కార్పొరేషన్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. 

13:13 - February 26, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది. దీంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. వివిధ పార్టీల నేతలతో కార్పొరేషన్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. 

వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి : బివి. రాఘవులు

కడప : ప్రజలు ఎదురు తిరిగితేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు అన్నారు. సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సుయాత్ర కడపలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తే.. రాయలసీమ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రం వ్యాప్తంగా పారదర్శక పాలన అందించాలని.. సమానంగా పరిపాలన చేయాలని.. అయితే వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సివుంటుందన్నారు. 

13:01 - February 26, 2016

కడప : ప్రజలు ఎదురు తిరిగితేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు అన్నారు. సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సుయాత్ర కడపలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించన సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ ముఖ్యమంత్రులు అనుసరించిన విధానాల వల్లే రాయలసీమ వెనుకబడిందని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు ఫ్యాక్షన్‌ రాజకీయాలను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తే.. రాయలసీమ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రం వ్యాప్తంగా పారదర్శక పాలన అందించాలని.. సమానంగా పరిపాలన చేయాలని.. అయితే వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సివుంటుందన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ న్యాయం చేయాలని కోరారు. సీమ నేతలు ఫ్యాక్షన్ ను ప్రోత్సహిస్తున్నారు.. అభివృద్ధి కాదన్నారు. వారి స్వార్థ ప్రయోజనాలకు పని చేశారని... రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదని  ఆరోపించారు. సీమ ప్రజలు ఎదురుతిరిగే వరకు అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. సీమ ప్రజలు ప్రశ్నించే రాజకీయాలు నేర్చుకోవాలన్నారు. 1952 లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పండదాన్నారు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఆరుగురు సీఎంలు ఆయ్యారని.. కానీ సీమకు ఒరిగిందేమీ లేదన్నారు. అనంతపురం నుంచి నీలం సంజీవ్ రెడ్డి, కర్నూలు నుంచి విజయభాష్కర్ రెడ్డి, కడప నుంచి వైఎస్ రాజశేఖరెడ్డి, చిత్తూరు నుంచి చంద్రబాబు సీఎంలు అయ్యారని కానీ.. సీమ అభివృద్ధికి ఏం చేయలేకపోయారని విమర్శించారు. రాయలసీమకు అధికార పక్షం, ప్రతిపక్షం ఏం చేయలేకపోతున్నాయిని చెప్పారు. రాయలసీమలో 50 వేల భూసేకరణను ఆపేయాలని చెప్పారు. ప్రజలు ఎదురు తిరిగితేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. 

12:40 - February 26, 2016

విశాఖ : ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు..బోరుమంటున్నాయి. మండుతున్న గుండెలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఉడుకురక్తంతో ఒక ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా..ప్రభుత్వానికి వ్యతిరేకంగా..  తిరుగుబాటుజెండా ఎత్తాయి. అసలు ఏం జరుగుతోంది విశాఖ జిల్లాలో.
బీమిలి తీరం సుందరమైనప్రాంతం
బీమిలి తీరం.. విశాఖపట్నం జిల్లాలో అత్యంత సుందరమైనప్రాంతాలలో ఒకటి. విశాలమైన సముద్ర తీరం.. అన్ని మత్స్యకార కుటుంబాలే..చేపలు పట్టుకుంటూ రోజువారి కుటుంబపోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా ఉండే పల్లెల్లోకి 14 ఏళ్ల క్రితం దివీస్ భూతం ప్రవేశించింది. 
దివీస్ తొలి ప్లాంట్ 
తొలుత బీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఒక్కయూనిట్ తో ప్రారంభించి..విషవృక్షంగా మారింది. ఇప్పడు రెండో యూనిట్ ను ప్రారంభించి 40 బ్లాక్ లలో తమ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. అంతే ప్రశాంతంగా ఉండే  16 గ్రామపంచాయతీలు దివీస్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ప్లాంటును నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు. 
20 వేల మంది తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం
దివీస్ ఫ్యాక్టరీ కారణంగా బీమిలి పరిసర గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. 16 గ్రామలకు చెందిన 20 వేల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటూ ఉద్యమానికి తెరదీశారు.సాదారణంగా వాతావరణంలో 3 శాతం ఐరన్ ఉండాలని కాని దివిస్ కంపెనీ నుండి విడుదలయ్యే రసాయనాల కారణంగా 10 శాతానికి చేరిందని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయంటున్నారు గ్రామస్థులు. దీంతో 16 గ్రామాలు తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయాయని భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలు దెబ్బతింటున్నాయని..రసాయనాలు సముద్రంలో విడుదల చేయడం వలన మత్స్య సంపద దెబ్బ తింటోందంటున్నారు.
దివీస్ నుండి విడుదలవుతున్న విషపూరిత రసాయనాలు
దివీస్ కంపెనీ నుండి విడుదలవుతున్న ప్రమాదకర రసాయనాల కారణంగా మంచినీరు కలుషితం అవుతోందంటున్నారు. 16 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని.. పుట్టిన పిల్లలు శారీరక మానసిక వైకల్యంతో పుడుతున్నారంటున్నారు గ్రామస్థులు. ఇంతా జరుగుతున్నా అధికారులు కాని ప్రజాప్రతినిధులుకాని ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు. వారి సమస్యలేంటని ప్రశ్నించిన దాఖలాలు లేవు. మరోవైపు దివీస్ యాజమాన్యం పోలీసులకు ముడుపులు ఇచ్చి 16 గ్రామాలపై గత రాత్రి దాడి చేయించిందంటున్నారు గ్రామస్థులు.
నేతలు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు
అర్ధరాత్రి మత్స్యకార గ్రామాలపై దాడులు చేసి కనిపించినవారిని అరెస్టు చేశారు పోలీసులు.  దివీస్ కారణంగా ఉపాధిపెరుగుతుందని  నియెజకవర్గ ఎమ్మెల్యే.. మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు  కలెక్టరేట్ కు తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే అరెస్టు చేయించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ బీమిలి ప్రజలు స్టేషన్ ముందు ఆందోళనకు దిగి స్టేషన్ ను  ముట్డించారు. 
శరవేగంగా మూడో యూనిట్ పనులు
దివీస్ కంపెనీ యాజమాన్యం మూడో యూనిట్  పనులను శరవేగంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం కంచేరు పాలెం చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులను ఆపేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు.కాలుష్యం శాంపిల్స్ ను సేకరించి రసాయనాల విడుదలను ఆపాలంటున్నారు అప్పటి వరకు ఉద్యమంఆగదని హెచ్చరిస్తున్నారు.

 

వంగవీటి మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

హైదరాబాద్ : వంగవీటి మూవీ పోస్టర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్. సాయంత్రం విజయవాడ వెళ్తానని వర్మ ట్వీట్ చేశారు. రేపు ఉదయం దేవినేని నెహ్రూను కలవనున్నట్లు ఆయన తెలిపారు. దేవినేని కుమారుడు అవినాష్ కు ఫోన్ చేసి.. సమయం కావాలని వర్మ కోరారు. 

 

11:48 - February 26, 2016

హైదరాబాద్ : వంగవీటి మూవీ పోస్టర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్. సాయంత్రం విజయవాడ వెళ్తానని వర్మ ట్వీట్ చేశారు. రేపు ఉదయం దేవినేని నెహ్రూను కలవనున్నట్లు ఆయన తెలిపారు. దేవినేని కుమారుడు అవినాష్ కు ఫోన్ చేసి.. సమయం కావాలని వర్మ కోరారు. 

 

చిదంబరం వ్యాఖ్యలపై చర్చకు బిజెపి నోటీసులు

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అఫ్జల్ గురు మీద చిదంబరం వ్యాఖ్యలపై లోక్ సభలో చర్చకు బిజెపి నోటీసులు ఇచ్చింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని ప్రకాశ్ జవదేకర్ కోరారు. 

యూనివర్సిటీల వివాదంపై వాడివేడి చర్చ

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు  ప్రారంభం అయ్యాయి. యూనివర్సిటీల వివాదంపై రాజ్యసభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై రగడ జరుగుతోంది. స్మృతి ఇరానీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశారు. 

11:26 - February 26, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభలో రెండోరోజు స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. యూనివర్సిటీల వివాదంపై రాజ్యసభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది. వర్సిటీ ఘటనలపై నిన్న మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై రగడ జరుగుతోంది. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. అయితే విపక్ష ఆరోపణలను మంత్రి ఖండించారు. కావాలనే రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్మృతి ఇరానీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గుటాంనబీ ఆజాద్ పట్టుబట్టారు. 

 

 

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ...

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. లోటస్ పాండ్ లో  అందుబాటులో ఉన్న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. 

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక సర్వే పత్రాలు ఇప్పటికే పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థికసర్వే 2016-17 పత్రాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

 

 

పార్లమెంట్ కు చేరుకున్న ఆర్థిక సర్వే పత్రాలు

ఢిల్లీ : ఆర్థిక సర్వే పత్రాలు పార్లమెంట్ కు చేరుకున్నాయి. 2016 ఆర్థికసర్వే పత్రాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.

10:40 - February 26, 2016

ఉత్తరాఖండ్‌ : ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.
'ది గ్రేట్ ఖలీ షో'
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన 'ది గ్రేట్ ఖలీ షో'లో ప్రఖ్యాత రెజ్లర్‌ ఖలీ తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్‌ జరుగుతుండగా.. ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టారు. అంతటితో ఆగకుండా ముఖంపై బలంగా పంచ్‌ లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖలీ కోలుకోవాలని అభిమానుల ప్రార్ధలు
హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఖలీ 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెజ్లర్లకు దడపుట్టించేలా ఉంటాడు. ఖలీ అసలు పేరు దలిప్‌ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్‌ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు. భారత్‌ పేరును ఖలీ రెస్లింగ్‌లో కూడా ఖండాతరాలు దాటేలా చేశారు. ఖలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

 

10:34 - February 26, 2016

కర్నూలు : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్‌ తప్పుతోవపట్టాడు. పాఠాలు చెప్పాల్సిన ఆయన.. కిక్కుతో చిత్తైపోయాడు. పీకలదాకా తాగి రోడ్డుపై పడిపోయాడు.
ప్రాథమిక పాఠశాలలో ఎద్దుల రాజా ప్రధానోపాధ్యాయుడు
ఎద్దుల రాజా. పేరుకు దగ్గట్లుగానే ఫుల్లుగా మందుకొట్టి రోడ్డుపై పడిపోయాడు. ఇలాంటి వాళ్లను చాలామందినే చూశాం అనుకుంటున్నారా.. ? ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఈ సారువాడికి మద్యపానం ఓ వ్యసనం. రాత్రి, పగలు తేడా లేదు. లేచింది మొదలు పడుకునేదాకా.. సారీ పడిపోయేదాకా మందులో మునిగి తేలుతుంటాడు. తరచూ మందుకొట్టి స్కూల్‌కు రావడమే కాదు.. క్లాస్‌లో విద్యార్థుల ముందే మందు కొట్టిన సందర్బాలూ ఉన్నాయి. మద్యం సేవించి విద్యార్థులను, తోటి ఉపాధ్యాయులను నోటికొచ్చినట్లు తిట్టేవాడు. స్టూడెంట్లను చితకబాది.. ఎండలో నిల్చోబెట్టేవాడు. ఈ మందు మాష్టారుకి మద్యం మీద ఉన్న ప్రేమ విద్యాబోధనపై లేదు. పాఠాలు చెప్పమంటే చంపేస్తానంటూ బెదిరించేవాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాష్టారుతో నానా నరకం : తోటి ఉపాధ్యాయులు
గత కొంత కాలంగా తాగుబోతు మాష్టారుతో నానా నరకం అనుభవిస్తున్నామని తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు రాజాను ఇప్పటికే పలు మార్లు హెచ్చరించామని.. అయినా పద్ధతి మార్చుకోవడం లేదని ఎంఈవో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాగుబోతు సార్‌ సేవలు తమకు అక్కర లేదని గ్రామస్తులతో పాటు విద్యార్థులూ చెబుతున్నారు. రాజాను సస్పెండ్‌ చేయాలని కోరుతున్నారు.

 

10:26 - February 26, 2016

కడప : రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐలు చేపట్టిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. యువత, రైతులు, మహిళలు అన్ని గ్రామాల్లో వామపక్ష నేతలకు స్వాగతం పలుకుతున్నారు.
మూడోరోజు బస్సుయాత్ర విజయవంతం 
సీపీఎం, సీపీఐ చేపట్టిన రాయలసీమ బస్సు యాత్ర మూడో రోజు విజయవంతం అయ్యింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి బయలుదేరిన బస్సు యాత్ర జమ్మలమడుగు, ముద్దనూరు, తొండూరు, పులివెందుల, వేంపల్లె, వీరపునాయునిపల్లె మీదుగా ఎర్రగుంట్లకు చేరుకుంది. నేడు యర్రగుంట్ల నుంచి ప్రారంభం కానుంది.
నాయకులకు పూలమాలలతో ఘన స్వాగతం 
ఇదిలా ఉంటే  ప్రతి ప్రాంతంలో సీపీఎం, సీపీఐ నాయకులకు జనం పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పలకరింపులు, ఆత్మీయతలు, వినతిపత్రాల సమర్పణ, ప్రజానాట్యమండలి కళాకారుల గీతాలాపన మధ్య ఉత్తేజభరితంగా సాగిపోయింది. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. 
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న మధు
రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. 
సీపీఎం, సీపీఐ నేతలు ప్రజలకు సందేశం 
మార్పు కోసం, మెరుగైన భవిష్యత్తు, కరువు నుంచి విముక్తి, అభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం, సీపీఐ నేతలు ప్రజలకు సందేశమిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞ్ఞంలో పాలు పంచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. 
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే బాబుకు రాజకీయ సమాధి  
ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.

 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మెదక్ : జిల్లాలోని పటాన్‌చెరు మండలం లక్కారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు టిప్పర్ లారీలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

09:53 - February 26, 2016

హైదరాబాద్ : బడ్జెట్ రూపకల్పనలో కేసీఆర్ తన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. మంత్రులు ఉన్నా లేకున్నా శాఖల వారిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల హమీలు నేరవేర్చడమే లక్ష్యంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.  డబుల్‌ బెడ్రూం పథకం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అమలు చేయడమే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్‌ కూర్పు జరుగుతోందని అంచనాలు వెలువడుతున్నాయి.  
బడ్జెట్ రూపకల్పనలో సీఎం బిజీ 
బడ్జెట్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ బీజీ అయ్యారు. శాఖాధిపతులు అధికారులతో స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. గత వారం రోజులుగా కీలక శాఖలపై సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
శాఖల వారి సమీక్షలు 
సీఎం కేసీఆర్..శాఖల వారి సమీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యా, వైద్యం, రవాణ, విద్యుత్, సంక్షేమ, వ్యవసాయ, రోడ్డు భవనాలు, మున్సిపల్, పంచాయితి రాజ్, ఐటీ తో పాటు ఇతర శాఖ అధికారులతో బడ్జెట్ కసరత్తులు జరిపారు. ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు అమలు, బడ్జెట్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించే విధంగా జిల్లా అభివృద్ధి కార్డులను తీసుకొస్తున్నారు. ఏయే జిల్లాలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారనే విషయం దీని ద్వారా తేటతెల్లం కానుంది. దాంతో పాటు అన్ని శాఖలు దుబారాను తగ్గించుకోవాలని ఆదేశాలు జారి చేసారు. 
ఆయా డిపార్టమెంట్ల మూసివేత 
ప్రభుత్వానికి భారంగా మారిన నామమాత్ర పథకాలను కుదించడంతో పాటు ఆయా డిపార్టమెంట్లను మూసి వేయాలన్నారు. సంక్షేమ పథకాలు పక్క దారి పట్టకుండా కఠినంగా వ్యవహించేలా పలు సూచనలు చేస్తున్నారు సీఎం.  
ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నేరవేర్చేలా ఈ బడ్జెట్ లో అధిక ప్రధాన్యమివ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అందులో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, వాటర్ గ్రీడ్ వంటి పథకాలకు అధిక ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. 
భూముల అమ్మకాలు ఉపందుకుంటాయన్న సీఎం 
వచ్చే ఏడాది భూముల అమ్మకాలు ఉపందుకుంటాయని సీఎం ఆశాభావంగా ఉన్నారు. దాంతో పాటు ఐటి ఎగుమతులు, పెట్టుబడులు, రియల్ ఎస్టెట్ రంగం మెరుగుపడనున్నందున నిధుల కొరత ఉండదని చెబుతున్నారు. ఇలా ప్రతి రంగం, శాఖపై జరుగుతున్న సమావేశాల్లో స్వయంగా పాల్గొంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

 

09:46 - February 26, 2016

హైదరాబాద్ : టిడిపి అధికారంలోకొచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీలోకి కనిపించని వలసలు హఠాత్తుగా ఈ మధ్యే ఊపందుకున్నాయి. అసలు ఆప‌రేష‌న్‌ ఆక‌ర్ష్ ను టిడిపి ఇప్పుడే ఎందుకు ముమ్మరం చేసింది.? ప్రధాన ప్రతిపక్షం వైసిపిని బలహీనపరడమే లక్ష్యమా ఇంకేదైనా టార్గెట్ ఉందా.?
ఆపరేషన్ ఆకర్ష్ తో రాజకీయాలు టర్న్
ఏపీ రాజకీయాల్లో రెండు నెలల క్రితం ఏ హడావుడీ లేదు. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షంపై అధికార పక్షం విసుర్లు విమర్శలు తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గవి ఏవీ జరగలేదు. కానీ గత పక్షం రోజులుగా ఒకటే హడావుడి నెలకొంది. ఆపరేషన్ ఆకర్ష్ తో రాజకీయాలు షడన్‌గా టర్న్ తీసుకున్నాయి.  
టిడిపి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ముమ్మరం
గత కొన్ని రోజులుగా అధికార టిడిపి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పుడే ఇలా ముమ్మరం చేయడం వెనుక రెండు వ్యూహాలు ప్రధానంగా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. త్వర‌లో రాజ్యస‌భ‌కు ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఎపి నుంచి నాలుగు రాజ్యస‌భ సీట్లు ఖాళీ కానున్నాయి. టిడిపి, వైసిపి ఎమ్మెల్యేల బ‌లాబలాల‌ను బట్టి తెలుగుదేశానికి మూడు, వైసిపికి ఒక రాజ్యస‌భ సీటు ద‌క్కుతాయి. అయితే ఆ ఒక్క రాజ్యస‌భ సీటు కూడా జగన్‌ పార్టీకి దక్కకుండా ఉండేందుకు టిడిపి వ్యూహాలు ర‌చిస్తోందని టాక్. 
రాజ్యస‌భ సీటు గెలుచుకోవాలంటే 43 మంది ఎమ్మెల్యేల బ‌లం 
రాజ్యస‌భ సీటు గెలుచుకోవాలంటే 43 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉండాలి. ఈ లెక్కన టిడిపికి 102 మంది ఎమ్మెల్యేలు, వైసిపికి 67 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టిడిపి రెండు రాజ్యస‌భ‌, వైసిపి ఒక సీటు గెలుచుకోగలుగుతాయి. మ‌రో సీటు ద‌క్కించుకోవ‌డానికి ఏ పార్టీకీ స‌రైన మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలో నాలుగో స్థానాన్ని కూడా టిడిపి దక్కించుకునేందుకే ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసిందని తెలుస్తోంది. 
ఎపి సర్కార్ పై వైసిపి విమ‌ర్శలు ఉధృతం
అంతేకాక‌ ఏపిలో ప్రతిప‌క్షాన్ని బలహీనపరచడాన్నీ లక్ష్యంగా పెట్టుకుని వలసలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టిడిపి గవర్నమెంట్‌ చేప‌డుతున్న కార్యక్రమాలపై జగన్ పార్టీ విమ‌ర్శలు ఉధృతం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం ద్వారా వైసిపి ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని చెప్పే ప్రయత్నమూ జరుగుతోంది. ఇక త్వర‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌ంకానున్నాయి. ఈలోపు సాధ్యమైనంత ఎక్కువ మంది వైసిపి ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం ద్వారా శాస‌న స‌భ‌లో ప్రతిప‌క్షాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది. మొత్తానికి రాజ్యస‌భ ఎన్నిక‌ల నాటికి వైసిపిని నైతికంగా బ‌ల‌హీన‌ప‌రచి నాలుగు ఎంపీ స్థానాల‌ను టిడిపి ఖాతాలో వేసుకోవాల‌న్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో త్వరలో ఇంకెంతమంది వైసిపి ఎమ్మెల్యేలు సైకిలెక్కుతారో వైసిపి భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్నది చర్చనీయాంశమవుతోంది. 

09:36 - February 26, 2016

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాన్సస్‌లోని  ఓ ఫ్యాక్టరీలో దుండగుడు... తన సహచరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యాజమాన్యంతో విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందుతుడ్ని కాల్చిచంపారు. 

నేడు బంగ్లాదేశ్, యూఏఈల మధ్య టీ20 మ్యాచ్

మీర్పూర్ : ఆసియాకప్ టీ20లో భాగంగా నేడు బంగ్లాదేశ్, యూఏఈల మధ్య మ్యాచ్ జరుగనుంది. మీర్పూర్ వేదిగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

09:23 - February 26, 2016

దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఎన్ డిఎ పాలనలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య శక్తులపై దాడి జరుగుతోందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని  గొప్ప దేశభక్తునిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులను దేశద్రోహలుగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. బిజెపి, సంఘపరివార్ శక్తుల చర్యలను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:49 - February 26, 2016

బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'కరీంనగర్ జిల్లా రామ గుండంలో  ఈ నెల 28 నుంచి ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్  మహాసభలు జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో  బొగ్గు గని కార్మికులు ఎదుర్కొంటున్న  వివిధ సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోబోతున్నారు.   మన దేశంలో  ప్రస్తుతం కోల్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా వుంది? బొగ్గు గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ప్రత్యేకించి సింగరేణిలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి? ఇలాంటి అంశాలపై సాయిబాబు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నారాయణగూడలోని నారాయణ జూ.కాలేజీలో అగ్నిప్రమాదం....

 హైదరాబాద్ : నారాయణగూడలోని నారాయణ జూనియర్ కాలేజీలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నారాయణగూడ విఠల్ వాడీలోని నారాయణ జూనియర్ కాలేజీలోని స్టోర్ రూంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలానిక చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. షార్టు సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. 

08:45 - February 26, 2016

హైదరాబాద్ : నారాయణగూడలోని నారాయణ జూనియర్ కాలేజీలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నారాయణగూడ విఠల్ వాడీలోని నారాయణ జూనియర్ కాలేజీలోని స్టోర్ రూంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలానిక చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. షార్టు సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. 

 

08:36 - February 26, 2016

 హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులు దౌర్జన్యానికి దిగారు. తలసాని అండ చూసుకుని రెచ్చిపోయారు. ఓ జీహెచ్ ఎంసీ ఉద్యోగిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. జీహెచ్ ఎంసీ ఉద్యోగి సాయికుమార్... సికింద్రాబాద్ బోయిగూడ ఐడీఎల్ కాలనీలో నివాసముంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడితోపాటు అతని అనుచరులు నిన్న రాత్రి సాయికుమార్ పై కత్తులతో దాడి చేశారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని అస్పత్రికి తరలించారు. తలసాని సోదరుడితోపాటు అతని అనుచరులు పదిమంది దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. 
సాయికుమార్ తండ్రి..
శ్రీనివాస్ తనయుడు, కొడుకులు వారి బంధువులు పది, ఇరవై మంది తాగి వచ్చి నా కొడుకుపై, నాపై దాడి చేశారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. 
సాయికుమార్ సోదరుడు
శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు అతని అనుచరులు, వారి బంధువులు మా ఇంటికి వచ్చారు. మా అన్నయ్యను పిలిచి.. కత్తితో దాడి చేశారు. మమ్మల్ని బెదిరించారు. మాదిగొల్లంటే గిట్టదన్నారు. మా అమ్మను, పెద్ద అక్కను, చిన్న అక్కను కొట్టారు. నోటికి వచ్చినట్లు తిట్టారు.  
పోలీసు అధికారి.. 
వారి మధ్య పాత గొడవులున్నాయని.. ఈనేపథ్యంలో శ్రీనివాస్ తనయుడు వారి బంధువులు, సాయికుమార్ దాడులకు పాల్పడ్డారు. ఈదాడిలో సాయికుమార్ కు గాయాలయ్యాయి. అతను కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందరిపై కేసు నమోదు చేశాము. 

08:25 - February 26, 2016

కడప  : విద్యార్థులు విహారయాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి 30 మంది విద్యార్థులు కాలేజీ బస్సులో విహారనిమిత్తంగా అహోబిలం వెళ్తున్నారు. మార్గంమధ్యలో కడప జిల్లాలోని దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సు అధిక వేగమే ప్రమాదానికి కారణమని పలువురు అంటున్నారు.

 

08:05 - February 26, 2016

గుంటూరు : నెహ్రూనగర్ లో రైల్వేగార్డు ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. రైల్వేగార్డు షేక్ మహబూబ్ బాషా రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి భారీగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో బాషా ఇంటిపై సీబీఐ అధికారులు అర్ధరాత్రి దాడులు జరిపారు. పలు కీలక పత్రాలతోపాటు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. బాషాను అరెస్టు చేసి.. విశాఖ సీబీఐ కార్యాలయానికి తరలించారు. విశాఖ కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాలున్నాయి. 

 

07:58 - February 26, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎమ్మల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవడం నీతిమాలిన చర్య అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పాడాలన్నా.. పార్టీలు అభివృద్ది చెందాలన్నా ప్రజల మనసుల్లో చోటు సంపాదించాలని ఎద్దేవా చేశారు జగన్ . దమ్ముంటే పార్టీలోకి  చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా  చేయించి ఉప ఎన్నికలకు  రావాలని డిమాండ్ చేశారు. పార్టీ పెట్టినప్పుడు ఇద్దరమే ఉన్నామని.. నేడు 67 మంది మా వెనక ఉన్నారన్నారు జగన్. పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

అమెరికాలో కాల్పులు కలకలం

వాషింగ్టన్  : అమెరికాలో కాల్పులు ఘటన కలకలం రేపింది. కన్సాస్ లోని ఓ ఫ్యాక్టరీలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

కాలేజీ బస్సు బోల్తా... 20 మందికి గాయాలు

కడప  : దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు ప్రొద్దుటూరు నుంచి అహోబిలం వెళ్తుండగా ఘటన జరిగింది. 

గుంటూరు జిల్లా నెహ్రూనగర్ లో రైల్వేగార్డు ఇంటిపై సీబీఐ సోదాలు

గుంటూరు : నెహ్రూనగర్ లో రైల్వేగార్డు ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి షేక్ మహబూబ్ బాషా భారీగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో బాషా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భాషాను అరెస్టు చేసి.. విశాఖ సీబీఐ కార్యాలయానికి తరలించారు. 

07:42 - February 26, 2016

కడప : వైసీపీ నుంచి టీడీపీలోకి సునామీలా చేరుతున్నారని నారా లోకేష్ అన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ముక్తియార్‌తో పాటూ ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. జగన్ చేసిన అవినీతి, కుట్ర రాజకీయాలు చూసే ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వచ్చి చేరుతున్నారని లోకేష్‌ అన్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 11 సార్లు జిల్లాకు వస్తే జగన్ ఒక్క సారి కూడా రాలేదన్నారు. తాను ఒక్కసారి అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని లోకేష్‌ ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు  సంపాదించుకొన్నట్లుగా తాను చేయనన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకుపోతామని లోకేష్‌ అన్నారు.

 

07:39 - February 26, 2016

విజయవాడ : ఏపీ సాధార‌ణ బ‌డ్జెట్‌కు ముహూర్తం దగ్గర పడుతుంది. ఆర్ధికమంత్రి  య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు  బడ్జెట్‌ కసరత్తు మొదలుపెట్టారు. శాఖ‌ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కీల‌క శాఖ‌ల  స‌మీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు, రాజధాని నిర్మాణం ఇలా ప్రాధాన్యతా అంశాలతో బ‌డ్జెట్ కస‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ల‌క్షా 30 వేల కోట్ల బ‌డ్జెట్ ఉండ‌చ్చని అంచ‌నా.
బ‌డ్జెట్ పై య‌న‌మ‌ల క‌స‌ర‌త్తు 
ఆర్ధిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు బ‌డ్జెట్ పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మార్చి10న ఏపీ సాధార‌ణ బ‌డ్జెట్ ప్రవేశపెడ‌తారు. ఇప్పటికే కొన్ని శాఖ‌ల‌పై రివ్యూలు నిర్వహించిన య‌న‌మ‌ల నీటిపారుద‌ల‌, ర‌వాణా, దేవాదాయ శాఖ‌, బీసీ సంక్షేమం, రెవిన్యూ, రిజిస్ట్రేష‌న్ల‌పై క‌సర‌త్తు చేయ‌నున్నారు. నీటి పారుద‌ల రంగానికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు ఉండ‌నున్నాయి. 
బీసీ సంక్షేమానికి భారీగా నిధులు 
ఇక బీసీ సంక్షేమానికి కూడా భారీగా నిధులు కేటాయించ‌నున్నారు. ఇప్పటికే  బీసీ స‌బ్ ప్లాన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీసీల‌కు మంచి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ‌, ఉపాధి క‌ల్పించేందుకు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించ‌నున్నారు. ర‌వాణా రంగానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేలా బ‌డ్జెట్ కేటాయింపులు ఉండ‌నున్నాయి. దీనికి సంబంధించి మంత్రి శిద్ధారాఘ‌వ‌రావు ఉన్నతాధికారుల‌తో నివేదిక త‌యారు చేయించారు. 
ప్రాధమిక ఆరోగ్య రంగానికి భారీ నిధులు
ఇక ఏపిలో దారుణంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య రంగానికి భారీ నిధులు కేటాయించాలని, మంత్రి కామినేని శ్రీనివాసరావు..ఆర్ధిక మంత్రి యనమలను కోరారు. బడ్జెట్ కేటాయింపుల నివేదికను   యనమలకు అందజేసారు. విద్యశాఖ మంత్రి గంటా సైతం తన శాఖ ప్రపొజల్స్ యనమలకు అందజేసారు. కాగా మరో రెండు రోజుల్లో బ‌డ్జెట్ క‌స‌ర‌త్తులు పూర్తిచేసి, మరికొన్ని శాఖ‌ల‌పై మంత్రి య‌న‌మ‌ల సమీక్షలు చేయనున్నారు. దీనిపై సీఎంతో మంత్రి య‌న‌మ‌ల చ‌ర్చించి పూర్తి క్లారిటీ తీసుకుంటారు. 

ఆ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : జెఎన్ యూ వివాదంపై సిట్ తో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 

మంత్రి తలసాని శ్రీనివాస్ బంధువుల దౌర్జన్యం

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులు దౌర్జన్యానికి దిగారు. బోయిగూడ ఐడీఎల్ కాలనీలో జీహెచ్ ఎంసీ ఉద్యోగి సాయికుమార్ పై కత్తులతో దాడి చేశారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని అస్పత్రికి తరలించారు. ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. 

Don't Miss