Activities calendar

27 February 2016

భారత్ ఘన విజయం..

ఢాకా : ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్ ను 83 పరుగులకే కుప్ప కూల్చింది. తదనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ధోని సేన ఖాత తెరవకుండానే ఓపెనర్ రోహిత్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద మరో ఓపెనర్ రహానే కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన రైనా 1 కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ తరుణంలో విరాట్, యూవీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు.
విరాట్ 'ఇన్నింగ్స్'

22:07 - February 27, 2016

ఢాకా : ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్ ను 83 పరుగులకే కుప్ప కూల్చింది. తదనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ధోని సేన ఖాత తెరవకుండానే ఓపెనర్ రోహిత్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద మరో ఓపెనర్ రహానే కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన రైనా 1 కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ తరుణంలో విరాట్, యూవీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు.
విరాట్ 'ఇన్నింగ్స్'..
ఒత్తిడిలో కోహ్లీ, యువరాజ్ (14) జంట బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ నిర్మించింది. నాలుగో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాయన్ని నెలకొల్పింది. ఈ తరుణంలో కోహ్లీ 49 పరుగులు చేసి తృటిలో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తదనంతరం వచ్చిన పాండ్య డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా కెప్టెన్ ధోని చివర్లో మ్యాచ్ ను ఫోర్ తో కూల్ గా ముగించాడు. 
రాణించిన బౌలర్లు..
పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ సర్ఫరాజ్ 25, మంజూర్ 10 తప్ప ఏ ఒక్కరు రెండంకెల స్కోర్ చేయలేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఖచ్చితమైన బౌలింగ్, పటిష్టమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో పాక్ ను గఢగఢలాడించింది. భారత బౌలర్లలో పాండ్య 3,  జడేజా 2 వికెట్లు తీయగా నెహ్రా, బుమ్రా , యువరాజ్ తలో వికెట్ తీసి పాక్ నడ్డి విడిచారు. 

పాండ్య డకౌట్.. : 76/5

ఢాకా : పాకిస్తాన్ తో జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ స్టార్ హార్దిక్ పాండ్య డకౌట్ గా వెనుదిరిగాడు. మరో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో భారత్ కోహ్లీ, పాండ్యల వికెట్లు వెంట వెంటనే కోల్పోయింది. 

కోహ్లీ ఆఫ్ సెంచరీ మిస్..

ఢాకా : పాకిస్తాన్ తో జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో టీమిండియా కోహ్లీ వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన కోహ్లీ సమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

21:50 - February 27, 2016

విజయవాడ : వంగవీటి చిత్రాన్ని రూపొందిస్తున్న డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ.. బెజవాడలో బిజీబిజీగా గడుపుతున్నారు. నాడు జరిగిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలను కలిసిన ఆయన.. ఇంకా పలువురిని కలిసే పనిలో ఉన్నారు. మరోవైపు సినిమా తీయకూడదని.. మాసిపోయిన గాయాన్ని మళ్లీ రేపవద్దని పలువురు వర్మను కోరుతున్నారు. 
ఫ్రీ పబ్లిసిటీ..
రాంగోపాల్‌ వర్మ. ఈ పేరు చెబితేనే సంచలనం. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏ సినిమా తీసినా కూడా ముందు నుంచే పబ్లిసిటీ పెంచుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక వంగవీటి సినిమా తీయనున్న వర్మ.. విజయవాడలో రెండో రోజు కూడా బిజీబిజీగా గడిపారు. నిన్న పలువురు రంగా అనుచరులతో భేటీ అయిన ఆయన.. నేడు పలువురు ప్రముఖులను కలిశారు. 
దేవినేని నెహ్రూతో..
కాంగ్రెస్‌ నేత మాజీమంత్రి దేవినేని నెహ్రూతో వర్మ భేటీ అయ్యారు. గంటకు పైగా వర్మ-దేవినేనిల చర్చ కొనసాగింది. సినిమాకు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. నాటి ఘటనలపై నెహ్రూ నుంచి వర్మ సమాచారం సేకరించారు. మరోవైపు సినిమా టైటిల్‌ సాంగ్‌లో కొన్ని పదాలు, సన్నివేశాలను తొలగించాలని వర్మను దేవినేని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా వర్మకు నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ సినిమాలో నెహ్రూది కీలక పాత్ర అని.. అందుకే ఆయనతో కథాపరంగా చర్చించినట్లు వర్మ తెలిపారు. 
వర్మ సంచలన వ్యాఖ్యలు..
ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో విద్యార్ధులతో జరిగిన సమావేశంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో జరిగిన హింస కంటే విజయవాడలోనే ఎక్కువ హింస జరిగిందన్నారు. మరోవైపు నాకు దేవుడంటే భయం లేదు.. నేనే ఒక దేవుడినని.. యముడు నా గొంతుపై కత్తి పెట్టినా అన్నమయ్య లాంటి సినిమాలు తీయనన్నారు వర్మ. ఇదిలావుంటే వర్మ వ్యాఖ్యలను పలువురు ఖండించడమే కాకుండా.. సినిమా తీయడాన్ని కూడా తప్పుపట్టారు. ఎప్పుడో జరిగిన ఘటనను సినిమాగా తీయడం సరికాదన్నారు ఎమ్మెల్యే బొండా ఉమా. మహాభారతంలో జరిగిన హింస కన్నా విజయవాడలో జరిగిన హింసే అని వర్మ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. ప్రస్తుతం అందరూ అభివృద్ధిపై దృష్టి సారిస్తే.. వర్మ ఇలాంటి సినిమా తీయడం వల్ల మళ్లీ గొడవలు తలెత్తే అవకాశముందన్నారు. 
నిషేధించాలి.. వర్మను అరెస్టు చేయాలి.. 
ఇక సీపీఐ నేత దోనెపూడి శంకర్‌ వర్మపై ఫైర్‌ అయ్యారు. తమ నేత చలసాని వెంకటరత్నాన్ని కత్తి పట్టిన రౌడీగా చిత్రీకరించడాన్ని ఖండించారు. వంగవీటి చిత్ర నిర్మాణంపై నిషేధం విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా ఉన్న బెజవాడలో.. తన చిత్రంతో అలజడి రేపేందుకు యత్నిస్తున్న వర్మను అరెస్ట్‌ చేయాలన్నారు. అంతకుముందు నగరంలో ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌రావును కూడా వర్మ కలిశారు. పలు కేసులకు సంబంధించి ఆయన నుంచి వర్మ సమాచారాన్ని సేకరించారు. ఏదిఏమైనా వర్మ సినిమా తీయకముందే ఫ్రీగా ఫుల్‌ పబ్లిషిటీ చేసుకుంటున్నారు. మరి.. ఈ సినిమా తెరకెక్కుతుందా.. లేదా చూడాలి.

21:45 - February 27, 2016

వరంగల్ : వీణవంక అత్యాచార నిందితులకు దేహశుద్దిచేశారు మహిళా సంఘాల నేతలు.. వరంగల్‌ ఎంజిఎంలో చికిత్స పొందుతున్న ఇద్దరిపై దాడి చేశారు. ఆడ పిల్లలంటే అంత అలుసా అంటూ నిలదీశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో ఓ యువతిపై ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బ్లాక్‌ మెయిల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితులను చితకబాదారు. గాయపడ్డ వీరిద్దరినీ చికిత్సకోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగాయి. 
నిర్భయ కేసు నమోదు చేయాలి..
అత్యాచారానికి పాల్పడిన నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నిందితులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆస్పత్రిలో చేర్పించారని.. జనరల్‌ వార్డులో ఇలాంటి నిందితులకు వైద్యం అందిస్తే మిగతా రోగుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు 

21:28 - February 27, 2016

మీరట్ లో ఓ జంట అబులెన్స్ లో పెళ్లి చేసుకుంది. ఎందుకో మరి? తన పెళ్లి ఫొటోల కలెక్షన్ ను వేలం వేసి 'ప్రీతిజింటా ఫౌండేషన్' కు విరాళంగా ఇస్తుందంట 'ప్రీతి'. వీటితో పాటు పలు అంశాలపైన కామెడీ విశ్లేషనను చూడాల్సిందే. అదే విధంగా గుజరాత్ లో సూరజ్ లో మొబైల్ లు వాడొద్దు. ఫొన్ వాడిన అమ్మాయికి 2000 ఫైన్, అమ్మాయి ఫోన్ వాడుతుందని తెలిపిన వ్యక్తికి 200 రూపాయల బహుమానం అందివ్వనున్నారు. ఆ వివరాలేంటి? స్వామి నారాయణ్ షా అమ్మాయిల సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. భర్తల కోసమే వాట్సప్ క్రియేట్ చేశారా? కాఫీ షాప్ కథా కామిషు ఏంటీ? మొదలైన అంశాలను వీడియోలో చూస్తేనే ఫన్నీగా ఉంటుంది.

రైనా ఔట్.. భారత్ 8/3..

ఢాకా : ఆసియాకప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న టి-20 మ్యాచ్ లో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా (1) అమీర్ బౌలింగ్ లో వహాబ్ రియాజ్ కు సులువైన క్యాచ్ ఇచ్చి ఫెవిలియన్ కు చేరుకున్నారు. 

భారత్ 2/2

ఢాకా : ఆసియాకప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న టి-20 మ్యాచ్ లో టీమిండియా తొలి ఓవర్ లోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్, రహానే ఖాతా తెరవకుండానే ఫెవిలియన్ కు చేరుకున్నారు. బౌలర్ మహ్మద్ ఆమీర్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీశాడు. కాగా ఇద్దరూ ఎల్బీడబ్ల్యూగానే వెనుదిరిగారు.

ఆదిలోనే రోహిత్ ఔట్..

ఢాకా : భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టి-20 మ్యాచ్ లో 84 పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా ఖాతా తెరువకుండానే ఓపెనర్ రోహిత్ వికెట్ కోల్పోయింది. 

20:31 - February 27, 2016

ఎన్నో సంచలనాలు సాధించిన మహేష్ బాబు చిత్రం శ్రీమంతుడు వివాదాస్పదమౌతోంది. తన కథను కాపీ కొట్టారంటూ రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారు. తాను సినిమా తీద్దామనుకుని హీరో నారా రోహిత్ తో మాట్లాడనని అప్పటిలోపే ఈ సినిమా 'శ్రీమంతుడు' రూపంలో బయటికి వచ్చిందని రైటర్ రోపించారు. అయితే ఇన్ని రోజుల పాటు తాను సినిమా చూడలేదని, తన మిత్రులు సినిమా చూసి చెప్పడంతో తాను కూడా 'శ్రీమంతుడు' సినిమా చూసి తన కథనే అని కన్ ఫర్మ్ అయ్యానని రచయిత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ తనకు ఒక్క రూపాయి కూడా వద్దని, రాబోయే హిందీ మరుయు ఇతర వెర్షన్ లో కథ స్థానంలో తన పేరును వేయాలని కోరారు. అయితే ఈయన వేసిన పిటీషన్ సరైనదేనా? కోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? ఇంతకు ఈ కేసులో ఎవరు నెగ్గనున్నారు అనే అంశంపై నిపుణులతో జరిపిన డిబేట్ ను వీడియోలో చూస్తేనే బాగుంటుంది. 

పాక్ 83 ఆలౌట్

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో పాక్ 83 పరుగులకు ఆలౌటయ్యింది. చివరి రెండు వికెట్లను పాండ్య వెంట వెంటనే తీయడంతో 17.3 ఓవర్లలోనే పాకిస్తాన్ ఇన్సింగ్స్ ముగిసింది. 17.2 రెండవ బంతికి మహ్మద్ సమి రైనా పట్టిన క్యాచ్ తో ఫెవీలియన్ చేరుకోగా.. 17.3వ బంతితో ఆమిర్ ను పాండ్య బౌల్డ్ చేశాడు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ సర్ఫరాజ్ 25, మంజూర్ 10 తప్ప ఏ ఒక్కరు రెండంకెల స్కోర్ చేయలేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఖచ్చితమైన బౌలింగ్, పటిష్టమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో పాక్ ను గఢగఢలాడించింది.

సర్పరాజ్ బౌల్డ్ : 70/8

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో పాకిస్తాన్ 8వ వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసి ఊపు మీదున్న సర్పరాజ్ ను జడేజా బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 15.1 ఓవర్లలో 70/8 పరుగులతో ఆడుతోంది. 

లేపాక్షి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

హిందూపూర్ : లేపాక్షి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, పరిటాల సునిత, పల్లె రఘునాథ రెడ్డి, కోడెల శివ ప్రసాద్, మినిస్టర్ కాల్వ శ్రీనివాస్, వివిధ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు మొదలైన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

 

జడేజాకూ ఒక వికెట్టు.. : 52/7

ఢాకా : భారత్ పాకిస్తాన్ మధ్య జరుగున్న టీ-20లో పాకిస్తాన్ టాప్, మిడిల్ ఆర్డర్ కుప్ప కూలిపోయింది. 52 పరుగుల వద్ద పాక్ 7వ వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో వాహాబ్ రియాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

ఆఫ్రిది రనౌట్ : పాక్ 42/6

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో పాకిస్తాన్ 6వ వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ డేంజరస్ బ్యాట్స్ మెన్ ఆఫ్రిది రెండో రన్ కోసం ప్రయత్నింస్తుండగా జడేజా వేసిన క్విక్ త్రోను ధోని కళాత్మకంగా వికెట్లను గిరాటేశాడు. దీంతో 42 పరుగుల వద్ద పాక్ 6వ వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లతో ఓ ఆటాడుకుంటున్నారు.

వికెట్ తీసిన యువీ

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో పాకిస్తాన్ 5వ వికెట్ కోల్పోయింది. యువీ చేతికి బంతినిచ్చిన ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మొదటిబంతికే ఉమర్ అక్మల్ ను యూవరాజ్ కు వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 7.1 ఓవర్లలో 35/5 పరుగులతో ఆడుతోంది.

మాలిక్ ఔట్

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో పాకిస్తాన్ 4వ వికెట్ కోల్పోయింది. షోయబ్ మాలిక్ (4) పాండ్య బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం పాకిస్తాన్ స్కోర్ 35/4.

కోహ్లీ త్రో కు మంజూర్ రనౌట్

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ మంజూర్ ను కోహ్లీ డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేశాడు. 

రెండో వికెట్ కోల్పోయిన పాక్..

ఢాకా : భారత్, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న టీ-20లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన షార్జీల్ బుమ్రా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

19:21 - February 27, 2016

విజయవాడ : చంద్రబాబు నాయుడికి తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన అంబటి ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని టీడీపీలో ఎలా చేర్చుకుంటారని అంబటి ప్రశ్నించారు.

తొలి వికెట్ కోల్పోయిన పాక్..

ఢాకా : ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ హఫీజ్ (4) కీపర్ క్యాచ్ గా అవుటయ్యాడు. 

ప్రమాదం నుంచి బయటపడ్డ 50 మంది ఉపాధ్యాయులు..

కరీంనగర్ : సిరిసిల్ల మండలం పెద్దూరులో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగిలాయి. బంస్సు నుంచి దూకి 50 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కాపాడుకున్నారు. 

బంజారాహిల్స్ లో బస్సు బీభత్సం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఓ ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఓ కారు, మరో ఆటోను ఆర్టీసి బస్సు ఢీకొంది. కాగా ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

సోనియాను కలిసిన రోహిత్ తల్లి..

న్యూ ఢిల్లీ : హెచ్.సి.యు విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక కాంగ్రేస్ అదినేత్రి సోనియాగాంధీని కలిశారు. రోహిత్ చట్టం తీసుకొచ్చేందుకు సహకరించాలని రాధిక సోనియాకు విజ్ఞప్తి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య పార్లమెంటును సైతం కుదిపేస్తున్న విషయం విదితమే.

లేపాక్షి ఉత్సవాలకు చంద్రబాబు..

అనంతపూర్ : లేపాక్షి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు, కళారూపాలతో ఆకట్టుకున్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే నినాదంతో ఈ ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

18:21 - February 27, 2016

మన్యం జాతరలో మన్‌పసంద్‌గా నిలుస్తున్న వంటకం బొంగు చికెన్‌.  మారెడుమిల్లికి వెళ్లి బొంగు చికెన్ తినకుండా రానివాళ్లు ఉండరు. నిఖచ్చిగా చెప్పాలంటే అసలు మారేడుమిల్లికి వెళ్లేదే బొంగుచికెన్‌ కోసం అంటారు పర్యాటకులు. అలాంటి బొంగు చికెన్‌ను రుచిచూపించిన కొండరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డిపై అధికారులు కక్షగట్టారు. మన్యం జాతరకు ఆహ్వానించకుండా అవమానిస్తున్నారు.
మన్యానికి ప్రత్యేకం..
తూర్పు కనుమల్లో పర్యాటకం పుంజుకుంది. ప్రకృతి అందాలు...ఆదివాసీల ఆటలపాటలు.. ఒక్కటేమిటి మన్యంలో అడుగుపెడితే చాలు మనసు  అలా అలాగాల్లో తేలిపోతుంది. అందుకే కూసింత సమమం దొరికినా గోదావరి జిల్లా పర్యాటకులు మారేడుమిల్లికి పయనమవుతారు. ప్రకృతి అందాలనే కాదు మన్యానికే ప్రత్యేకమైన బొంగు చికెన్‌ను ఆరగించేందుకు లొట్టలేసుకొని మరీ వెళ్తున్నారు పర్యాటకులు. ఇంతలా పర్యాటకులను మన్యంవైపు అడుగులు వేయిస్తోంది బొంగు చికెన్‌. నాటుకోడి మాంసంలో కూసింత ఉప్పు, కారం, మరి కాసింత మసాల దట్టించి వెదురు బొంగులో కూరి...కర్రల పొయ్యి మీద కాలుస్తుంటే అది ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా..ఎప్పుడెప్పుడు నాటికందుతుందా అని ఎదురుచూస్తుంటారు భోజనప్రియులు.
వెదురు బొంగులు మాయమౌతున్నాయంటూ.. 
 అలాంటి బొంగు చికెన్‌ సృష్టికర్త ఆదివాసీ తెగకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డిని విస్మరించారు అటవీశాఖాధికారులు. ఇది చాలదన్నట్టు అడవిలో వెదురు బొంగులు మాయమవదడానికి అమర్‌నాథ్‌రెడ్డియే కారణమంటూ కేసులు పెట్టారు. మూడు రోజుల పాటు జరగనున్న మన్యం జాతరకు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఆదివాసీ కళాకారులతో పాటు సరిహద్దు రాష్ర్టాల కళాకారులకు సైతం అధికారులు ఆహ్వానాలు పంపారు. కాని మారిడుమిల్లికి బొంగు చికెన్‌తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన అమర్‌నాథ్‌రెడ్డికి మాత్రం  కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారు.
ఖండించిన ఆదివాసులు.. 
ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు బొంగు చికెన్ రుచి చూపించి ప్రశంసలు అందుకున్న అమర్‌నాథ్‌రెడ్డిపై అధికారుల చిన్నచూపును  ఆదివాసీలు సైతం ఖండిస్తున్నారు. మరో వైపు బొంగుచికెన్‌ వంట పేటెంట్‌ హక్కులను తనకే కల్పించాలని అమర్‌నాథ్‌ డిమాండ్ చేస్తున్నాడు.

10టీవీ కథనానికి కదిలిన పోలీసులు..

కరీంనగర్ : 10టీవీ కథనానికి పోలీసు శాఖ స్పందించింది. వీణవంక యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలికి న్యాయం చేస్తామని డిఐజీ మల్లారెడ్డి తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన అన్నారు. 

టూరిజం అభివృద్ధి చెందాలి..

హిందుపురం : రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాల్సి ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. లేపాక్షి చేరుకున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. టూరిజం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాలు పెరుగుతాయని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఏపీ టూరిజం అభివృద్ధికి విమానయాన శాఖ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

ఈటెలను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ..

కరీంనగర్ : కలెక్టరేట్ వద్ద మంత్రి ఈటెల రాజేందర్ ను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అడ్డుకుంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్, పెండింగ్ స్కాలర్ షిప్పులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాన్వాయ్ ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకుని ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్టు చేశారు.   

29 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు...

హైదరాబాద్ : మార్చి 2 నుంచి 16 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 1,257 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,64,664 విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,56,655, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,009  విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ తెలిపారు. 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడుతారని తెలిపారు.

దిగ్విజయ్ కు బెయిల్

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు బెయిల్ మంజూరయ్యింది. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ నియామకాల స్కామ్ లో డిగ్గీ అరెస్టయిన విషయం తెలిసిందే. 

బుక్క పట్నం చేరుకున్న బస్సుయాత్ర

అనంతపురం : సీపీఎం, సీపీఐ బస్సు యాత్ర బుక్కపట్నం చేరుకుంది. రాయలసీమ అభివృద్ధి చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 

ముగిసిన వాటర్ బోర్డు కార్మిక సంఘం ఎన్నికలు..

హైదరాబాద్ : వాటర్ బోర్డులో గుర్తింపు కార్మక సంఘం ఎన్నికలు ముగిసాయి. నేటి రాత్రి 7 గం.లకు కౌంటింగ్ జరగనుంది. 

17:28 - February 27, 2016

హైదరాబాద్ : భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అభిమాని పాకిస్తాన్‌కు చెందిన ఉమర్‌ దరాజ్‌కు బెయిలు దొరికింది. ఉమర్‌ కేసు పాకిస్థాన్‌లోని ఒకరా అడిషనల్‌ జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. బెయిల్‌ ఇవ్వాల్సిందిగా అతను పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తూ  50వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. పంజాబ్‌ ప్రావిన్స్‌కి చెందిన 22 ఏళ్ల ఉమర్‌ దరాజ్‌ కోహ్లికి వీరాభిమాని. జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ  90 పరుగులు చేశాడు. ఆ సంతోషంతో ఉమర్‌ తన ఇంటిపై భారత తివ్రర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఈ నేపథ్యంలో దేశద్రోహానికి పాల్పడ్డాడన్న కారణంతో పోలీసులు ఉమర్‌ దరాజ్‌ను జనవరి 25న అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో అతనికి కోర్టు 10ఏళ్లు  జైలు శిక్ష విధించింది.  

17:25 - February 27, 2016

కాన్పూర్‌ : బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామిపై కాన్పూర్ లో దాడి జరిగింది. విఎస్‌ఎస్‌డి కళాశాలలో గ్లోబల్‌ టెర్రరిజంపై సెమినార్‌లో పాల్గొనేందుకు వచ్చిన స్వామి కారును కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఆయనపై కోడిగుడ్లు, టమాటలతో స్వామిపై దాడి చేశారు. నల్లజెండాలతో ఆయన ముందు నిరసన తెలిపారు. ఈ ఘటనలో సుమారు 50 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి యువమోర్చా కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పారిపోవడం పరిస్థితి సద్దుమణిగింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని బిజెపి నేతలు ఆరోపించారు.

17:17 - February 27, 2016

హిందూపూర్ : సాధారణంగా బాలకృష్ణ డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు.. లేపాక్షి ఉత్సవాల్లోమాత్రం ఓ చిన్నారి అదిరిపోయే ప్రదర్శనకు బాలయ్యే చప్పట్లు కొట్టారు. ఓ చిన్నారి ఏక బిగిన బాలయ్య సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ అన్నింటిని చక చకా చెప్పేసింది. అన్ని డైలాగ్స్ విని మురిసిపోయిన బాలయ్య.. 'చూడూ.. ఒకే వైపు చూడు.. రెండో వైపు చూడొద్దు' అనే డైలాగ్ కొట్టగానే బాలకృష్ణే ఆశ్చర్యం, ఆనందంతో చప్పట్లు కొట్టాడు. చిన్నారి ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన బాలకృష్ణ, పాప ప్రతిభను కొనియాడాడు. మీకు కూడా పాప బుజ్జి బుజ్జి డైలాగ్స్ వినాలని ఉందా? అయితే ఈ వీడియో చూడండి.. 

ముగ్గురు పిల్లలను గొడ్డలితో నరికి..

ఉత్తరప్రదేశ్ : యూపీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల పాలిట సొంత తండ్రే కాల యముడయ్యాడు. శియారామ్ మిశ్రా(28) అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలున్నారు. శుక్రవారం భార్య ఒక పిల్లాడితో పుట్టింటికి వెళ్లింది. మిగతా ముగ్గురు పిల్లలను భర్త వద్దే ఉంచింది. మానసిక స్థితి సరిగా లేని మిశ్రా తన పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు. ఈ తరుణంలో పిల్లలను చంపిన మిశ్రా పారిపోయేందుకు యత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17:00 - February 27, 2016

నిజామాబాద్‌ : ఓ ప్లెక్సీ వివాదంలో ఇద్దరు ప్రజా ప్రతినిదులు కొట్టుకున్నారు. తాము ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచిపోయి జనంలోనే బూతులు మాట్లాడుతూ... ఒకరినొకరు దూషించుకున్నారు. కాలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ప్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు నేతలు కాలర్లు పట్టుకుని బాహాబాహికి దిగారు. బాజిరెడ్డి, భూపతిరెడ్డిల మధ్య తోపులాట జరిగింది. అంతేకాకుండా ప్రజల ముందే ఇరువురు నేతలు దూషించుకుని కాలర్లు పట్టుకుని బాహాబాహికి దిగారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ ఘర్షనలో పోలీసులు జోక్యం చేసుకుని సద్దుమనిగేలా చేశారు. వీడియోలో మరిన్ని వివరాలు చూడొచ్చు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ప్లెక్సీ వివాదం..

నిజామాబాద్‌ : జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. కాలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన విషయంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు నేతలు బాహాబాహికి దిగారు. 

16:35 - February 27, 2016

టాలీవుడ్ చిత్ర రాజసం, జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా మరో అంతర్జాతీయ వేదికపై తన హవాను చాటుకోనుంది. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాటర్న్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి బాహుబలి ఎంపికయ్యింది. 'ది అకాడెమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ,ఫాంటసీ అండ్ హరర్ ఫిలిమ్స్' ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. అయితే 2016కు గాను బాహుబలి ఐదు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఉత్తమ ఫాంటసీ చిత్రం, సంగీతం, కళావిభాగం, సహాయ నటి, కాస్ట్యూమ్ డిజైన్  విభాగాల్లో నామినేట్ అయ్యారు. 

కాగా జూన్ లో కాలిఫోర్నియా లోని ‘బర్ బ్యాంక్’ లో సాటర్న్స్ అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అయితే ఈ విభాగంలో బాహుబలితో పాటు జురాసిక్ వరల్డ్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, ఎవెంజర్స్-ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, స్టార్ వార్స్-దిఫోర్స్ ఎవేకెన్స్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ అవార్డుల్లో బాహుబలి ఒక్క విభాగంలో అవార్డు దక్కించుకున్నా.. టాలీవుడ్ ఖ్యాతి అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పనుంది.

15:53 - February 27, 2016

ఖమ్మం : జిల్లాలో పాల్వంచ గట్టాయిగూడెంలో ఆరడుగుల ములక్కాయ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. టైలర్‌ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న సైదాబి తన ఇంటిముందున్న స్థలంలో ములక్కాయ విత్తనాలు వేసింది. రెండేళ్లలో ఈ చెట్టు పొడవైన ములగ కాయ కాసింది. అందులో ఒకటి ఆరడుగులవరకూ పెరిగింది. మిగతావి నాలుగు, ఐదు అడుగులవరకూ ఉన్నాయి. ఈ చెట్టుకు ఎలాంటి ఎరువులు వేయలేదని. కేవలం నీరు మాత్రమే పోశామని సైదాబి చెబుతున్నారు.

బంధాలను కాపాడుకుందాం : బాలయ్య..

అనంతపురం : మరుగున పడుతున్న కళలను, బంధాలను, బంధుత్వాలను కాపాడుకుందామని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందుపురంలో ప్రారంభం కానున్న లేపాక్షి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. లేపాక్షి కేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. 

15:49 - February 27, 2016

హైదరాబాద్ : పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అబద్ధాలు చెబుతూ.. దేశానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాత్రి 7.30 గంటలకు రోహిత్‌ మృతిని వైద్యులు, పోలీసులు నిర్ధారించారని.. ఈ ఘటలన్నింటికి తానే ప్రత్యక్ష సాక్షినని తమ్మినేని అన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర పోలీసులు మీద ఆరోపణలు వస్తే.. ఇప్పటివరకు ప్రభుత్వం, పోలీసులు ఖండించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ప్రాపకం కోసం కేసీఆర్‌ మానవత్వాన్ని కూడా తాకట్టు పెట్టారన్నారు. వర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

15:46 - February 27, 2016

హైదరాబద్ : తెలుగు సినీ పరిశ్రమ మరో నటిని కోల్పోయింది. సినీ నటి బండ జ్యోతి అనారోగ్యంతో మృతి చెందారు.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జ్యోతి పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచేశారు. ఈమె మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సంతాపం ప్రకటించింది. జ్యోతి మృతదేహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.. ఆయన మాటలు వీడియోలో చూడొచ్చు.

15:44 - February 27, 2016

విశాఖ : ఆ పూరి గుడిసెలో ఉన్నవి రెండు బల్బులు, ఒక ఫ్యాన్.. అయినా దాదాపు 18లక్షల బిల్లువేశారు విద్యుత్ అధికారులు.. విశాఖ జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికిచెందిన దేవుళ్లమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.. ప్రతి నెల మాదిరిగానే వంద రూపాయలు తీసుకొని కరెంటు బిల్లు కట్టేందుకు వెళ్లింది.. మీ సేవా కేంద్రంలో బిల్లుతోపాటు వంద రూపాయలు ఇచ్చింది.. అయితే బిల్లు వంద కాదని.. 18లక్షల 8వేల 26 రూపాయలని నిర్వాహకులు చెప్పడంతో అవాక్కయింది.. 18లక్షలన్న మాట వినగానే ఆమెకు గుండె ఆగినంత పనైంది.. రెండు బల్బులకు అంత బిల్లు ఎలా వచ్చిందంటూ లబోదిబోమంటోంది.. మరిన్ని వివరాలు వీడియోలో చూడొచ్చు. 

15:42 - February 27, 2016

కడప : జిల్లాలోని రాజంపేటలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లలను ముందుగా చెరువులోకి తోసేసిన రేఖ.. తాను కూడా దూకింది. దీన్ని గమనించిన స్థానికులు.. వెంటనే చెరువులోకి దూకి రేఖను పిల్లలను బయటకు తీశారు. అయితే పిల్లలిద్దరు మృతి చెందారు. మృతులు చిట్వేలి మండలం జెట్టివారిపాలెంకు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

నాపై దాడి రాజకీయ ప్రేరేపితమే : కన్హయ్య..

న్యూ ఢిల్లీ : తనపై జరిగిన దాడి రాజకీయ ప్రేరేపితమేనని జె.ఎన్.యూ ఎఐఎస్ఎఫ్ నేత కన్హయ్య కుమార్ ఆరోపించారు. పాటియాల కోర్టువద్ద ఫిబ్రవరి 17న జరిగిన ఘటనపై కన్హయ్య కుమార్ వివరణ ఇచ్చారు. న్యాయవాదుల దుస్తులు వేసుకున్న కొంతమంది తనను కొట్టారని కన్హయ్య వెల్లడించారు. తనపై దాడి చేస్తుంటే ఎస్కార్ట్ గా ఉన్న పోలీసులు సైతం అడ్డుకోలేదని ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించినా పోలీసులు వారిని అరెస్టు చేయట్లేదని ఆయన వాపోయారు. 

కోల్ వర్కర్స్ మహా సభలకు ఏర్పాట్లు..

కరీంనగర్ : ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ మహా సభలకు నగరం సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరగనున్న ఈ మహాసభలను ఉద్దేశించి బస్సు యాత్ర ప్రారంభించారు. కళాకారులు ఈ మహాసభలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.  

15:06 - February 27, 2016

రంగారెడ్డి : ఓ వింత భయం ఆ గ్రామాన్ని గజగజా వణికిస్తోంది. గ్రామంలో దెయ్యం తిరుగుతుందన్న వార్త దావానంల వ్యాపించడంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. తట్టాబుట్ట,.మూటా ముల్లె సర్దుకొని బతుకుజీవుడా అంటూ పక్క ఊళ్లకు పరుగెత్తుతున్నారు. ఇంతకీ ఎక్కడా గ్రామం. ఏంటా కథ? 

దెయ్యం భయంతో..
 గ్రామస్తులంతా ఒక్కొక్కరుగా ఊరొదిలి వెళ్లిపోతున్నారు. జీవనోపాధి కోసం కాదు దెయ్యం భయం పట్టుకొని పారిపోతున్నారు. గ్రామంలో ఓ దెయ్యం వీరవిహారం చేస్తోందట. మనుషులపై కూర్చొని మాట్లాడుతోందట. రాత్రి అయిందంటే చాలు.. ఏ మూలనుంచి దెయ్యం ఇంట్లోకి వచ్చి ఎవరినో ఒకరిని ఆవహించి నానా బీభత్సం చేస్తోందట.  

బిక్కుబిక్కుమంటూ..

రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉంది ఈ గ్రామం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వెంకటరమణకాలనీ, ముదిరాజ్‌బస్తీ, గంగపుత్రకాలనీ వాసులు దెయ్యం భయంతో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. రాత్రివేళల్లో దెయ్యం తమపైకి వచ్చి నానా రచ్చ చేస్తుందని.. గొంతెమ్మ కోరికలు కోరుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. మందు, బిర్యానీ కావాలని దెయ్యం వింత కోరికలు కోరుతుందని చెప్తున్నారు. 

వీడని మూఢ నమ్మకాలు.. 
గ్రామంలో ఈ మధ్యే చనిపోయిన ఓ మహిళే ఇలా దెయ్యం అయి తిరుగుతుందని గ్రామస్తులు మూఢంగా నమ్ముతున్నారు. దెయ్యాలు, భూతాలు లేవని ఓ వైపు జనవిజ్ఞాన వేధిక విస్త్రత ప్రచారం చేస్తున్నా..ఇలాంటి గ్రామాల్లో మాత్రం దెయ్యం భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.  

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి..

రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సనా అప్రా(21) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14:56 - February 27, 2016

హైదరాబాద్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తెలంగాణ ప్రభుత్వం తీరు. సంక్షేమశాఖ ఖాజానాలో నిధులు పుష్కలంగా ఉన్నా.. ఖర్చు చేయకపోవడంతో  ఇప్పుడా నిధులన్నీ మురిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీలాంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమయే ధ్యేయంగా ఆశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం కేసీఆర్‌.. అసలా శాఖను పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో బడుగు,బలహీన వర్గాల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. 

అంటీముట్టనట్లు..

తెలంగాణలో అణగారిన బడుగు, బలహీన వర్గాల అభివృద్దియే లక్ష్యంగా సంక్షేమ శాఖను తన వద్ద అంటిపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నిర్వహణలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో రెండు ఆర్ధిక సంవత్సరాలు ముగుస్తున్నా..సంక్షేమశాఖలో ఉన్న నిధుల్ని ఖర్చుపెట్టడంలేదు. సీఎం కేసీఆర్‌ కేవలం వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, మిషన్‌ భగీరథ, గుళ్లూ గోపురాలు, స్కై వేలు, ఆకాశ హర్మ్యాలు తప్ప మిగతా వాటిని పట్టించుకున్న దాఖాలాలు లేవనే విమర్శలు విన్పిస్తున్నాయి. కాకపోతే గుడ్డిలో మెల్లగా..షాదీ ముబారాక్, కళ్యాణ లక్ష్మి, సంక్షేమ హాస్టళ్ళకు సన్నబియ్యంతో కాస్తా ఉపశమనం కల్పించారు. కానీ..దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పినా..అది కూడా ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.  

సగం నిధుల్ని కూడా..

ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన బడ్జెట్లో సగం నిధుల్ని కూడా ఖర్చు చేయలేకపోయింది ప్రభుత్వం. 2014-15 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద 7,579 కోట్ల రూపాయాల్ని కేటాయించారు. ఇందులో దళితుల సంక్షేమం కోసం 2,407 కోట్లకు బడ్జెట్ రిలీజ్‌ ఆర్డర్ చేయగా అందులో 1,283 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా 4,559 కోట్లు కేటాయించారు. దీని ద్వారా తండాల్లో మురుగు కాల్వల నిర్మాణం, రోడ్లు, త్రాగు నీటి సౌకర్యం కోసం 1,386 కోట్ల రూపాయలకు బడ్జెట్ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినా కేవలం 643 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ఎస్సీ డెవలప్‌మెంట్‌కి కూడా 3036 కోట్లు కేటాయించి అందులో కేవలం 977 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఇవి కూడా ఎస్సీ వసతి గృహాలు, సన్న బియ్యం పంపిణి, దళిత వాడల్లో అక్కడక్కడ అభివృద్ది పనులు కోసం ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే  2015-16 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి 27 వేల కోట్లు కేటాయించారు. అందులో ఎస్సీ ఉప ప్రణాళికకు 8089 కోట్లు, ఎస్టీ  సబ్ ప్లాన్ కి 5035 కోట్లు కేటాయించారు. ఇప్పటికి ఎస్సీసబ్ ప్లాన్ కింద దళితుల కోసం 7 వేల కోట్ల వరకు బడ్జెట్ రిలీజ్‌ ఆర్డర్ ఇచ్చినా అందులో కేవలం 4,650 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2వేల కోట్లను రిలీజ్‌  చేయగా..అందులో కేవలం 800 కోట్ల రుపాయాలు మాత్రమే ఖర్చయ్యాయని గణంకాలు చెబుతున్నాయి. 

ఖజానాల్లో మూలుగుతున్న నిధులు.. 

ఇక దళితులకు మూడెకరాల భూమి పంపిణి కోసం వెయ్యి కోట్లు కేటాయించినా.. ఖర్చుపెట్టకపోవడంతో  ఖజానాల్లోనే ఆ నిధులు మూలుగుతున్నాయని అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల ఇచ్చినా  ఆభూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో.. ఇదంతా ప్రచార ఆర్భాటం కోసమే చేసిందనే విమర్శలు వస్తున్నాయి. మిగిలిపోయిన నిధులన్ని వచ్చే ఏడాదికి  క్యారీ పార్వర్డ్ చేయడానికి వీలు లేకపోవడంతో..అవన్నీ మురిగిపోయే పరిస్థితి నెలకొంది. 

14:50 - February 27, 2016

కరీంనగర్ : తోటి స్నేహితులని నమ్మి... నోరారా అన్నయ్యా అని పిలిచింది.. సొంత సోదరుల్లా చూసుకుంది.. సమస్యలన్నీ చెప్పుకొని సాయం చేయాలని అడిగింది.. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ మృగాళ్లు మాత్రం సమయంకోసం ఎదురుచూశారు. యువతిపై అఘాయిత్యం చేశారు.. సెల్‌ఫోన్‌తో వీడియో బ్లాక్ మెయిల్ చేశారు.. కాపాడాల్సిన పోలీసులు నిందితులకే అండగా నిలిచారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..

నమ్మించి..
పోలీసు కావాలన్న లక్ష్యం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. తోటి స్నేహితులే ఆమెపై అత్యాచారం చేశారు.. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది.. బాధితురాలి తల్లిదండ్రులు నిరుపేదలు.. పైగా నలుగురు కూతుళ్లు.. తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకుంది ఆ అమ్మాయి.. వీణవంక మండలంలో పోలీసులు ఏర్పాటుచేసిన శిక్షణా శిబిరంలో చేరింది.. ప్రతిరోజూ చల్లూరునుంచి ఈ క్లాసులకు హాజరయ్యేది.. ఈ తరగతుల్లో కేశవపట్నానికి చెందిన శ్రీనివాస్‌, అంజయ్య అమెకు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, పుస్తకాలు ఇస్తూ యువతికి సహాయం చేశారు. వారిని సొంత అన్నల్లా భావించిన బాధితురాలు ఎంతగానో నమ్మింది.

అన్నా వదిలేయాలంటూ ప్రాధేయపడినా..

తరగతులు కొనసాగుతుండగానే కొన్ని పుస్తకాలు కావాలని శ్రీనివాస్‌ను అడిగింది బాధితురాలు.. ఎందుకైనా మంచిదని తన స్నేహితురాలనికూడా తీసుకొని శ్రీనివాస్‌ బైక్‌పై బయలుదేరింది.. వీరిని అంజయ్య, రాకేశ్ మరో బైక్‌పై అనుసరించారు.. ఈ విషయం గమనించిన బాధితురాలి ఫ్రెండ్‌ బైక్‌నుంచి దూకి పారిపోయింది.. ఈ యువతి కూడా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ బైక్‌తో వెంబడించి పట్టుకున్నారు.. నిర్మానుష్య ప్రదేశంలో అఘాయిత్యం చేశారు.. 'అన్నా నన్ను వదిలేయాలంటూ' కాళ్లు పట్టుకున్నా దారుణంగా కొట్టారు.. అంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బాధితురాల్ని ఊర్లో వదిలేశారు..

నెట్ లో పెడతామంటూ..
జరిగిన అఘాయిత్యం తలచుకొని బాధితురాలు కుమిలిపోయింది.. ఏం చేయాలో అర్థం కాక తన అమ్మమ్మవాళ్లింటికి వెళ్లింది... ఇంతలో మళ్లీ ఆ రాక్షసులు యువతికి ఫోన్‌ చేయడం ప్రారంభించారు. తాము చెప్పిన ప్రదేశానికి రావాలని లేకపోతే అత్యాచారం వీడియో నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో జరిగింది కుటుంబసభ్యులు విషయం తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కువెళ్లి ఆ దుర్మార్గులపై ఫిర్యాదు చేశారు..

పోలీసులు.. గుచ్చి గుచ్చి ప్రశ్నలు
అసలే జరిగిన అవమానంతో కుంగిపోతున్న బాధితుల్ని పోలీసులు మరింత వేదనకు గురిచేశారు. బాధితురాల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఆమెను ఇబ్బందిపెట్టారు. మహిళా కానిస్టేబుల్‌తో అడిగించాల్సిందిపోయి స్వయంగా సీఐ ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేయడంతో యువతి మరింత కుంగిపోయింది. ఈ బాధలు భరించలేమని.. తమకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు పెట్టుకుంటున్నారు యువతి తల్లిదండ్రులు.

నిందితులు ఇలా చిక్కారు..
ఇక ఇలా వెళితే లాభం లేదని బాధితురాలి బంధువులు నిందితుల్ని పట్టుకునేందుకు ఒక ప్లాన్‌ వేశారు. యువతి ద్వారా ఫోన్‌ చేయించి ఓ ప్రదేశానికి రప్పించారు. అక్కడ గ్రామస్తుల సహాయంతో ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌ వీడియోలను సాక్ష్యంగా పోలీసుల ముందుంచారు. 
న్యాయం చేయండి..
అయితే నిందితుల్ని అరెస్టు చేయాల్సిన పోలీసులు ఆ పనిచేయకపోగా.. యువతి కుటుంబసభ్యుల్నే వేధించడం ప్రారంభించారు. ఓవైపు జరిగిన దారుణం.. మరోవైపు పోలీసుల తీరుతో ఈ కుటుంబం మరింత కుంగిపోతోంది.. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.. 

టెట్ షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు) షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 29న టెట్-2016 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ టెట్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు.

13:42 - February 27, 2016

నెల్లూరు : కృష్ణపట్నం విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవని ఏసీ సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరులో కృష్ణపట్నం పవన్ ప్లాంట్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర సహకారం వల్లే కృష్ణపట్నం విద్యుత్‌ రెండో యూనిట్‌ పూర్తయిందన్నారు. రాష్ట్రానికి విద్యుత్‌ విషయంలో కేంద్ర సహకారం మర్చిపోలేనదని చంద్రబాబు అన్నారు. 

 

విజయవాడలో పలువురితో వర్మ భేటీ

విజయవాడ : వంగవీటి చిత్రానికి కావల్సిన సమాచార సేకరణ పనిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బిజిబిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకున్న వర్మ.. ఇవాళ ఉదయం ముందుగా విజయవాడ మాజీ ఎంపీ, తన మిత్రుడు లగడపాటి రాజగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు. వంగవీటి సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ కోసం కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన నగరంలో సీనియర్ లాయర్ కర్నాటి రామ్మోహన్‌ రావుతో సమావేశమయ్యారు. 

13:38 - February 27, 2016

విజయవాడ : వంగవీటి చిత్రానికి కావల్సిన సమాచార సేకరణ పనిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బిజిబిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకున్న వర్మ.. ఇవాళ ఉదయం ముందుగా విజయవాడ మాజీ ఎంపీ, తన మిత్రుడు లగడపాటి రాజగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు. వంగవీటి సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ కోసం కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన నగరంలో సీనియర్ లాయర్ కర్నాటి రామ్మోహన్‌ రావుతో సమావేశమయ్యారు. 

 

ఓయూలో మరోసారి విద్యార్థులు ఆందోళన

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంపు, పరీక్ష తేదీ పొడిగించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఓయూ వద్ద భారీగా పోలీసులు
మోహరించారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.

13:34 - February 27, 2016

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంపు, పరీక్ష తేదీ పొడిగించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఓయూ వద్ద భారీగా పోలీసులు
మోహరించారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.

 

13:01 - February 27, 2016

అనంతపురం : మరుగున పడుతున్న కళలను, బంధాలను, బంధుత్వాలను కాపాడుకుందామని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందుపురంలో ప్రారంభం కానున్న లేపాక్షి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. లేపాక్షి కేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. 

 

12:54 - February 27, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసిపి నేత అంబటి రాంబాబు త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటుకు కేసులో కేసీఆర్ తో చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు. ఈమేరకు మీడియాతో మాట్లాడారు. టీడీపీని కేసీఆర్ పాదాల దగ్గర పెట్టారని విమర్శించారు. చంద్రబాబుది.. తప్పు చేసిన ముఖం... తప్పు చేయని ముఖం.. జగన్ ది అని చెప్పారు. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని మానసికంగా దెబ్బతీస్తున్నారని చెప్పారు. 67 సీట్లు గెలిచి.. ప్రతిపక్షంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ కష్టాల్లో నుంచి పుట్టిందని... పార్టీని నాశనం చేయడం చంద్రబాబు వల్ల ఆయన కుమారుడు లోకేష్ వల్ల కూడా కాదన్నారు. టీడీపీలో చేరే వైసీపీ ఎమ్మెల్యేలకు పదవులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. వైసిపి నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలతో లోకేష్ బాబుతో గిలక్కాయలు ఆడిస్తావా... అని చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడారు. 

 

ముద్రబ్యాంకు ద్వారా రూ. లక్ష కోట్ల రుణాలు : వెంకయ్యనాయుడు

నెల్లూరు : ముద్రబ్యాంకు ద్వారా లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. జిల్లాలోని కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ప్రారంభకార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. 

12:39 - February 27, 2016

నెల్లూరు : కృష్ణపట్నం విద్యుత్‌కేంద్రం వల్ల రాబోయే రోజుల్లో దక్షిణభారత దేశానికే తలమానికంగా నిలుస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం మూడో యూనిట్‌కు శంకుస్థాపన, రెండో యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి వెంకయ్యనాయుడు..కృష్ణపట్నం విద్యుత్‌ కేంద్రం వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ముద్రబ్యాంకు ద్వారా లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని తెలిపారు. అందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఎపికి లక్షా 93 వేల ఇళ్లను కేటాయించామని పేర్కొన్నారు. ఇందులో నెల్లూరు జిల్లాకు రూ. 20 వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. డబ్బు ఆడవారి చేతికి చేరితే పొదుపుగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు బ్యాంకు ఖాతాలకు చేరుతాయిని వివరించారు. 
 

 

రోడ్డు ప్రమాదంలో 15 కూలీలకు గాయాలు

హైదరాబాద్‌ : కమలాపూర్‌ మండలం మర్రివానిపల్లెలో ఆర్టీసీ బస్సు-ఆటోట్రాలీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 15 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కొనసాగుతున్న హైదరాబాద్ జల మండలి కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : జల మండలి కార్మిక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 3,966 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల బరిలో రెండు సంఘాలు పోటీలో నిలిచాయి.

12:23 - February 27, 2016

పార్టీ పిరాయింపులు సరికాదని.. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీడీపీ నేత షేక్ వజీర్, వైసీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి పాల్గొని, మాట్లాడారు. సమస్యలపై పోరాటం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యలపై ప్రతిపక్షాన్ని కలుపుకుపోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

దేవినేని నెహ్రూతో రామ్ గోపాల్ వర్మ సమావేశం

విజయవాడ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో సమావేశం అయ్యారు. పలు ఆంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

11:59 - February 27, 2016

హైదరాబాద్ : కొత్త పదవి.. కొత్త కార్యాలయం.. అదిరిందయ్యా రామ్మోహన్‌. ఏంటి ఇదేదో యాడ్‌లా ఉందా. అదేమీ కాదు. జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌కు కొత్త చాంబర్‌ ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు. మరి ఇప్పటివరకు ఉన్న చాంబర్‌ మేయర్‌కు సరిపోదా ? అంటే.. అదేమీ కాదు.. వాస్తులోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. 
చాంబర్‌కు వాస్తు లోపమని భావిస్తున్న రామ్మోహన్‌ 
జీహెచ్‌ఎంసీకి కొత్త పాలకమండలి వచ్చింది. మేయర్‌, డిప్యూటీ మేయర్లు బాధ్యతలు స్వీకరించారు. వారికి కార్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు అధికారులు. అయితే.. ఇన్నేళ్లుగా మేయర్‌ కోసం సౌత్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయానికి వాస్తు లేదని కొత్త మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భావిస్తున్నారు. దీంతో మేయర్‌ పేషీ మారబోతుంది. 
పలు మార్పులు సూచించిన వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజ
వాస్తుకు అనుకూలంగా ఏడో అంతస్తులోని హాల్‌ 
మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బొంతు రామ్మోహన్‌ తన కార్యాలయానికి వాస్తు సిద్ధాంతిని పిలుపించుకున్నారు. కార్యాలయాన్ని పరిశీలించిన వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజ పలు మార్పులు సూచించారు. ప్రస్తుతం ఉన్న చాంబర్‌ ట్యాంక్‌బండ్‌ ప్లైఓవర్‌ కంటే కిందకు ఉందని.. దానికంటే ఎత్తుగా చాంబర్‌ ఉండాలన్నారు. దీంతో కాంప్లెక్స్‌లోని కార్యాలయాలన్నీ పరిశీలించారు. ఏడో అంతస్తులో కొత్తగా నిర్మిస్తున్న హాల్‌ అన్ని విధాలా వాస్తుకు అనుకూలంగా ఉందన్నారు. దీంతో సౌత్‌బ్లాక్‌లోని కార్యాలయం ఏడో అంతస్తులోకి మార్చాలని మేయర్‌ ఆదేశించారు. ఇక డిప్యూటీ మేయర్‌కు కూడా కార్యాలయం కావాల్సి ఉండడంతో వారిద్దరికి ఇక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. 
కార్యాలయాలకు మార్పులు పరిపాటి
అయితే.. జీహెచ్‌ఎంసీలో వాస్తు పేరుతో కార్యాలయాలకు మార్పులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాస్తుపేరుతో పలువురు ఇప్పటికే మార్పులు చేసుకున్న సందర్భాలున్నాయి. గత మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ కూడా.. తాను వెళ్లిపోయే రెండు నెలల ముందు మేయర్‌ చాంబర్‌ను 10 లక్షలకు పైగా ఖర్చు చేసి మార్పులు చేయించారు. ఇప్పుడు కొత్త మేయర్‌ వచ్చి ఆ చాంబర్‌ వాస్తుకు అనుకూలంగా లేదంటూ పూర్తిగా మార్చేసే పనిలో పడ్డారు. 
మేయర్‌ చాంబర్‌ కోసం మరో రూ.25 లక్షలు 
ఇక మేయర్‌ మారనున్న హాల్‌కు ఇప్పటికే కోటి 50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు మేయర్‌ చాంబర్‌ కోసం మరో 25 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. అయితే.. ఈ హాల్‌లోకి మేయర్‌ చాంబర్‌ రావడంతో అధికారుల సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేసేందుకు హాల్‌ లేకుండా పోయి మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని పలువురంటున్నారు. మరోవైపు మూడ నమ్మకాల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా కార్యాలయాలు మార్పు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని నగర పౌరులు కోరుతున్నారు. 

 

11:55 - February 27, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో సౌత్‌జోన్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మొఘల్‌పురా, సుల్తాన్‌షాహి, ఛత్రినాక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 16మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 250మంది సౌత్‌జోన్‌ పోలీసులు పాల్గొన్నారు.

ముద్రగడ రియల్‌ పవర్‌ స్టార్ : వర్మ

విజయవాడ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రియల్‌ పవర్‌ స్టార్‌ అని వ్యాఖ్యానించారు. స్క్రీన్‌పై కనిపించే హీరోలు డమ్మీలని ట్వీట్ చేశారు. రాజకీయాలంటే తనకు నమ్మకం లేకున్నా... ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తి పార్టీ పెడితే అందులో చేరుతానని తెలిపారు. వంగవీటి సినిమా సమాచారం కోసం ప్రస్తుతం వర్మ విజయవాడలో ఉన్నారు.

 

11:48 - February 27, 2016

విజయవాడ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రియల్‌ పవర్‌ స్టార్‌ అని వ్యాఖ్యానించారు. స్క్రీన్‌పై కనిపించే హీరోలు డమ్మీలని ట్వీట్ చేశారు. రాజకీయాలంటే తనకు నమ్మకం లేకున్నా... ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తి పార్టీ పెడితే అందులో చేరుతానని తెలిపారు. వంగవీటి సినిమా సమాచారం కోసం ప్రస్తుతం వర్మ విజయవాడలో ఉన్నారు.

 

11:43 - February 27, 2016

కడప : రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం బస్‌ యాత్ర చేస్తున్న సీపీఎం, సీపీఐలు వచ్చే నెల 15న అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చాయి. వ్యక్తిగత స్వార్ధంతో  ఫ్యాక్షన్‌ రాజకీయాలను పెంచిపోషిస్తున్న రాయలసీమ రాజకీయ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేశారని వాపమక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా  రాయలసీమ అభివృద్ధికి చేసింది సున్నా... అని మండిపడ్డారు. 2016-17 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించాయి.   
ఈనెల 23న కడప జిల్లాలో ప్రవేశం 
రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో సీపీఎం, సీపీఐ నేతలు చేపట్టిన బస్‌ యాత్ర కడప జిల్లాలో ముగిసింది. తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర చిత్తూరు, అనంతపురం  జిల్లాల్లో పూర్తి చేసుకుని  ఈనెల 23న  కడప జిల్లాలోకి ప్రవేశించింది. మైదుకూరు, పొద్దుటూరు, పులివెందుల, వేంపల్లి, జమ్మలమడుగు తదితర  ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు కొనసాగింది. 
కడప కలెక్టరేట్‌ దగ్గర భారీ ధర్నా 
చివరిరోజు శుక్రవారం చివరిరోజు కడప కలెక్టరేట్‌ దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాల నేతలు.. ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. వెనుకబాటుతనం నినాదంతోనే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీలో రాయలసీమ,  ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి పాలకులు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. రాయలసీమకు సాగునీరు అందించేందుకు చేపట్టిన గాలేరు-నగరి సుజల స్రవంతి,  హంద్రీ-నీవా వంటి ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. 
బడ్జెట్‌లో సీమకు ప్రత్యేక నిధులు కేటాయించకపోతే ఉద్యమం : మధు 
వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించకపోతే మరోసారి ఉద్యమం తప్పదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో పాలకులు చెబుతున్నదొకటి ... చేస్తున్నది మరొకటని  ధర్నాల్లో పాల్గొన్న వామపక్ష నేతలు విమర్శించారు. దగాకోరు విధానాలతో రాయలసీమ ప్రజలను  ఎంతోకాలం  మభ్యపెట్టలేరని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాయలసీమలోని మూడు జిల్లాలో పూర్తైన సీపీఎం, సీపీఐ బస్‌ యాత్ర  శనివారం నుంచి కర్నూలులో కొనసాగుతుంది. 

 

11:29 - February 27, 2016

ఖమ్మం : పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. నామినేషన్ విత్‌డ్రా వేళ హైడ్రామా నడిచింది. మున్సిపల్ ఆఫీస్‌లో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు బాహాబాహీకి దిగినంత పనిచేశాయి. నేతలు గోడలు దూకి మరీ పోరును రక్తికట్టిస్తున్నారు. 
ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు 
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేకపోవడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పొత్తుల విషయంలో ముందు ఒకమాట అనుకుని తర్వాత నిర్ణయాలు మార్చుకోవడంతో సమీకరణల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 
ఉద్రిక్తతల మధ్య ముగిసిన నామినేషన్ల విత్‌డ్రా కార్యక్రమం 
శుక్రవారం నామినేషన్ల విత్‌డ్రా కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అధికార టిఆర్‌ఎస్‌ నుంచి మొత్తం 138 నామినేషన్లు దాఖలు కాగా చివరి నిమిషంలో రంగంలోకి దిగిన పెద్దలు రెబల్స్‌ను బుజ్జగించి పని పూర్తిచేశారు. దాదాపుగా రెబల్స్‌నందరినీ శాంతింపజేయడంలో సక్సెస్‌ అయిన టిఆర్‌ఎస్ వారిచేత నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసింది. అయితే విత్‌డ్రా గడువు ముగిసిన తర్వాత కూడా టిఆర్‌ఎస్‌ నేతలు అధికారులతో చర్చలు జరుపుతూ రెబల్స్‌ చేత విత్‌డ్రా చేయిస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే అజయ్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌కు చేరుకోగా గేట్లు మూసి ఉండడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ గేట్‌ దూకి ఆఫీసులోకి చొచ్చుకునిపోయి అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ హస్తం నేతలు ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు. కొంతమంది అభ్యర్థులు బిఫామ్‌ వస్తుందని మొదట నామినేషన్‌ దాఖలు చేసి తీరా చివరి సమయంలో ఫామ్ దక్కించుకోలేకపోవడంతో నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. అయితే బిఫామ్ దక్కలేదన్న బాధతో కొందరు మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. 
గెలుపుపై పలు పార్టీలు ధీమా..  
ఖమ్మం కార్పొరేషన్‌పై టిఆర్ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని ఆ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలే అఖండ విజయాన్ని అందిస్తాయని జోస్యం చెప్పారు. ఖమ్మంలో వామపక్షాలు బలంగా ఉన్నందున విజయంపై సిపిఎం ధీమా వ్యక్తం చేస్తోంది. తొలుత సిపిఐతో కలిసి పోటీచేయాలని భావించామని.. కాని ఆ పార్టీ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడం సరైన చర్య కాదని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ప్రచారంలో అభ్యర్థులు బిజీ 
నామినేషన్ విత్‌డ్రా పర్వం ముగియడం, సీట్లు కన్‌ఫామ్‌ అవడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీ అయ్యారు. నగర ప్రజలకు పలు హామీలు ఇస్తూ తమకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.  

 

11:17 - February 27, 2016

విజయవాడ : వంగవీటి చిత్రానికి కావల్సిన సమాచార సేకరణ పనిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బిజిబిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకున్న వర్మ.. ఇవాళ పలువురు నేతలు, నగర ప్రముఖులతో సమావేశం కానున్నారు. కాసేపట్లో వర్మ మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో భేటీ కానున్నారు. 

11:14 - February 27, 2016

నెల్లూరు : కృష్ణపట్నం పోర్ట్ కేంద్రంగా ఏపీలో మరోవెలుగుల కేంద్రం కొద్ది గంటల్లో జాతికి అంకితమయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతరాయం లేని విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్న ఏపీ జెన్ కో... 2 యూనిట్లను ప్రారంభించడంతో పాటు.. మరో ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 
ఉత్పత్తికి సిద్ధమైన ప్రాజెక్టులు 
భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఏపీ జెన్‌కో చేపట్టిన ప్రాజెక్టులు ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. కృష్టపట్నం పోర్టు కేంద్రంగా దామోదరం సంజీవయ్య థర్మల్ కేంద్రంలో 2 యూనిట్లను జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్, సుజనాచౌదరిల ఆద్వర్యంలో కొత్త యూనిట్లు ప్రారంభం కాబోతున్నాయి. 
2640 మెగావాట్ల థర్మల్ కేంద్రం
ఇక్కడ సుమారు 19వేల కోట్ల రూపాయలతో మొత్తం 2వేల 640 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని స్తాపిస్తున్నారు. ప్రస్తుతం 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 2 ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నారు. మరో 800 మెగావాట్ల సామర్థ్యమున్న మరో ప్లాంట్‌కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులను తొలిసారి జెన్ కో ఇక్కడ చేపట్టింది. ప్రపంచంలోని అగ్రగామి ఎనర్జీ సంస్థలు ఉపయోగించే కాలుష్య రహిత టెక్నాలజీని ఎపీ జెన్ కో ఇక్కడ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత, వాతావారణం, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ పవర్ ప్రాజెక్టులలో 175మీటర్ల ఎత్తున కూలింగ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఫ్లాంట్ నుంచి ప్లై యాష్, బాటమ్ యాష్ కాలుష్యం తప్పించేందుకు నాణ్యమైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. లోడింగ్ అన్ లోడింగ్ సమస్యలు తలెత్తకుండా పోర్టు నుంచి దాదాపు కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు నేరుగా ప్లాంట్ చేరుకుంటుంది. నాణ్యమైన బొగ్గు వినియోగంతో కేవలం 27 శాతం మాత్రమే యాష్ బయటికి వస్తోంది. ఇందులో 19 శాతం ప్లై యాష్ కాగా 8శాతం బాటమీ యాష్. ప్లై యాష్ ను ఎప్పటికప్పుడు తీసుకెళ్లే విధంగా సిమెంట్ కంపెనీలతో ఎపీ జెన్ కో ఒప్పందం కుదుర్చుకుంది. బాటమ్ యాష్ ను స్థానిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.
కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 
ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా 2400 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏపీ అవసరాలకు పోను మరో 500 మెగావాట్ల పవర్ ను సెంట్రల్ పవర్ కార్పొరేషన్ కు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో తొలిసారిగా విద్యుత్ ను కమర్షియల్ బిజినెస్ చేపట్టే తొలి రాష్టంగా ఏపీ అవతరించిందని ఆ సంస్థ ఎండి విజయానంద్ తెలిపారు. వచ్చే మార్చి చివరి నాటికి ఏపీలో పల్లెల్లో సైతం విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలని జెన్‌కో లక్ష్యంగా నిర్ణయించుకుంది. వీటితో పాటు వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ అందించేందుకు కృష్ణపట్నం ప్లాంట్ విద్యుత్ కీలకమవుతోంది. 

10:54 - February 27, 2016

మీర్పూర్ : ఆసియా కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరుకు మీర్పూర్‌ షేర్‌-ఎ-బాంగ్లా స్టేడియంలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టీ 20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్ రికార్డ్ ఓ సారి చూద్దాం.....
బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్
ఆసియా కప్‌లో బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. కోట్లాది క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న......అసలు సిసలు సమరానికి మీర్పూర్‌ షేర్‌-ఎ-బాంగ్లా స్టేడియంలో రంగం సిద్ధమైంది. 
టీమిండియాకు పాక్ జట్టు సవాల్
టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాకు.....సంచలనాలకు మారుపేరైన పాకిస్థాన్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అతిధ్య బంగ్లాదేశ్‌ జట్టును చిత్తు చేసిన ధోనీసేన జోరు మీదుండగా......టోర్నీని విజయంతో ఆరంభించాలని షాహిద్‌ అఫ్రీది నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టు పట్టుదలతో ఉంది.
ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్‌ ప్లేస్‌ 
టీ 20 ఫార్మాట్‌లో ఏ జట్టయినా టీమిండియా తర్వాతే. టీ20ల్లో భారత జట్టును మించిన జట్టు లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్‌ ప్లేస్‌లో ఉండగా...పాకిస్థాన్‌ జట్టు 6వ స్థానంలో ఉంది. 
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్ లోనూ భారత జట్టుదే పై చేయి
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్ లోనూ భారత జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 6 టీ 20 మ్యాచ్‌ల్లో పోటీపడగా....4 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పాకిస్థాన్‌ విజయం సాధించగలిగింది. ఒక్క మ్యాచ్‌ టైగా ముగిసినా.....భారతజట్టు బౌల్‌ ఔట్‌లో నెగ్గింది. 
భారత జట్టుకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు
ప్రస్తుత ఫామ్‌, ట్రాక్‌ రికార్డ్ ప్రకారం చూస్తే భారత జట్టుకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరోవైపు ఎప్పుడెలా ఆడుతుందో తెలియని  పాకిస్థాన్‌ జట్టును తక్కువ అంచనా వేయలేం. మరి చిరకాల ప్రత్యర్ధుల మధ్య జరుగనున్న ఈ ఆసియా కప్‌ సమరంలో ఏ జట్టు నెగ్గుతుందో చూడాలి.

10:48 - February 27, 2016

ఢిల్లీ : 2015-16 ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతేడాది ఆశించిన స్థాయిలో వృద్ది రేటు నమోదు కాలేదని సర్వే తెలిపింది. రాబోయే ఏడాదికి వృద్ది రేటును 7 నుంచి 7.5 శాతంగా అంచనా వేసింది. పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి మరిన్ని మార్గాలను అన్వేషించాలని సూచించింది.                                                                                                          
వృద్ధిరేటు 7 నుంచి 7.5 శాతంగా ఉంటుందని సర్వే అంచనా
సోమవారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ కీలకమైన 2015-16 ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభ ముందు ఉంచింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సర్వే రిపోర్టును సభకు సమర్పించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 నుంచి 7.5 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జిడిపిలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు బలహీనంగా ఉంటే... ఆ ప్రభావం భారత్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.
సర్వీస్‌ సెక్టార్‌లో 9.2 శాతం వృద్ది రేటు అంచనా 
ఏడో  పే కమిషన్ ద్వారా వస్తు వినియోగం పెరుగుతుందని కూడా అంచనావేసింది ఆర్థిక సర్వే. గత ఐదేళ్లతో పోల్చితే 8 శాతం వృద్దిరేటు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సర్వీస్‌ సెక్టార్‌లో 9.2 శాతం వృద్ది రేటు అంచనా కట్టింది. కరెంట్ ఖాతాలోటు 1 నుంచి 1.5 శాతం ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం 4.5శాతం నుంచి 5శాతంగా ఉండే అవకాశముందని అంచనా వేసింది.  ద్రవ్యోల్బణ నియంత్రణ ద్వారా ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని సూచించింది. 2017 మార్చినాటికి ద్రవ్యోల్బణాన్ని 5శాతం వద్ద నిరోధించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఏడో వేతన సంఘంతో ద్రవ్యోల్బణంపై స్వల్ప ప్రభావం ఉంటుందని తెలిపింది. 
పన్నుల ద్వారా 5.5శాతం రాబడి అంచనా 
పన్నుల ద్వారా 5.5శాతం రాబడి అంచనా వేసింది ఆర్థిక సర్వే. 2018-19నాటికి బ్యాంకుల వద్ద రూ.1.8 ట్రిలియన్‌ మూలధనం ఉండేందుకు చర్యలకు సూచించింది. ప్రస్తుత సంవత్సరంలో బ్యాంకుల వద్ద 700 బిలియన్‌ రూపాయాల నిధులు ఉండేలా బడ్జెట్‌లో కేటాయింపు చేయాలని ప్రతిపాదించింది. విద్య, వైద్యంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భవిష్యత్‌లో భారత్‌కు ఎఫ్‌డీఐలు విరివిగా వచ్చే అవకాశముందని తెలిపింది.
గోధుమ, వరి ఉత్పత్తి తగ్గుతోందని సర్వే ఆందోళన
గోధుమ, వరి ఉత్పత్తి తగ్గుతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశముందని తెలిపింది. వచ్చే రెండేళ్లలో విద్యుత్ కొనుగోళ్ల ద్వారా 2,342 కోట్ల రూపాయలను రైల్వే శాఖ పొదుపు చేసే అవకాశముందని అంచనా వేసింది.

అక్రమకట్టడాలపై జీహెచ్ ఎంసీ అధికారుల కొరడా

హైదరాబాద్ : దుర్గం చెరువులోని అక్రమకట్టడాలపై జీహెచ్ ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. ఓ రెస్టారెంట్, పబ్ ను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. నిర్వహకులు వారిని అడ్డుకున్నారు.  

 

నెల్లూరు చేరుకున్న సీఎం చంద్రబాబు

నెల్లూరు : సీఎం చంద్రబాబు నెల్లూరు చేరుకున్నారు. కాసేపట్లో విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. ప్లాంట్ ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. 

09:29 - February 27, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ సాక్షిగా అన్నీ అసత్యాలు చెప్పారని రోహిత్‌ తల్లి రాధిక అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడితే 12 గంటల వరకు ట్రీట్‌మెంట్‌ చేయకుండా పలువురు అడ్డుకున్నారని స్మృతి ఇరానీ చెప్పడం దారుణమన్నారు. రోహిత్‌ యాక్ట్‌ వచ్చే వరకు పోరాడుతామని రాధిక అన్నారు.
మరో ఇరకాటంలో ఎన్డీయే సర్కార్‌ 
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ మరో ఇరకాటంలో చిక్కుకుంది. ఇప్పటికే జేఎన్‌యూ, హెచ్‌సీయూ వివాదంలో విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించి అన్ని పక్షాల నుంచి విమర్శలను మూటకట్టుకున్న మోడీ సర్కార్‌.. లోక్‌సభలో మానవమనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రోహిత్‌ మరణంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముసురుకుంటోంది. పార్లమెంట్‌ సాక్షిగా స్మృతీ ఇరానీ అన్నీ అబద్దాలే చెప్పారని రోహిత్‌ తల్లి రాధిక అన్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి ట్రీట్‌మెంట్‌ చేయడానికి డాక్టర్లు వస్తే అడ్డుకున్నారని చెప్పడాన్ని ఆమె ఖండించారు. 
కేంద్రమంత్రుల లేఖల వల్లే రోహిత్‌ మృతి : రాధిక 
కుమారుడు చనిపోయిన దుఖంలో తాను ఉంటే రోహిత్‌ ఎస్సీ కాదంటూ రాజకీయం చేయడం సరికాదని రాధిక అన్నారు. ఎస్సీ అయితేనే న్యాయం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల లేఖల వల్లే రోహిత్‌ చనిపోయాడని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో రోహిత్‌ చట్టం చేసే వరకు పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.
స్మృతీ ఇరానీవి అన్నీ అసత్యాలే
రోహిత్‌తో పాటు ఇతర విద్యార్థులను సస్పెండ్‌ చేసిన కార్యనిర్వాహక మండలిలో దళిత ప్రొఫెసర్‌ ఉన్నాడన్న స్మృతీ వ్యాఖ్యలను రోహిత్‌ స్నేహితుడు ప్రశాంత్‌ ఖండించారు. 11 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా దళిత ప్రొఫెసర్‌ లేరన్నారు. పార్లమెంట్‌లో స్మృతీ ఇరానీ అన్నీ అసత్యాలే చెప్పారన్నారు. 
'భారతమాత బిడ్డపై దేశద్రోహం ముద్ర ఎందుకు వేశారు'
భారతమాత ఓ బిడ్డను కోల్పోయిందని.. ఇది తనను బాధించిందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రోహిత్‌ స్నేహితులు మండిపడ్డారు. భారతమాత బిడ్డపై దేశద్రోహం ముద్ర ఎందుకు వేశారని ప్రశ్నించారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

09:21 - February 27, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేసులను తమకు బదలయించాలని సీబీఐ కోర్టును ఈడీ కోరింది. కాగా ఒకే చార్జీషీటు ద్వారా కేసును బదలాయిస్తామని ఈడీకి తెలిపింది. మనీలాండరింగ్‌ చట్టం వర్తింపునకు పలు చార్జిషీట్లను సమర్పిస్తామన్న ఈడీ వాదనను సీబీఐ కోర్టు అంగీకరించలేదు. 
కేసులన్నింటినీ ఒకేసారి బదిలీ చేస్తాం : ఈడీ
అక్రమాస్తుల కేసు విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఉన్న మనీలాండరింగ్‌ కేసులన్నీ ఇప్పుడే బదిలీ చేయలేమని, అన్నింటినీ కలిపి ఒకేసారి బదిలీ చేస్తామని ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ కి సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. జగన్‌ సొంత సంస్థ జగతిలో మాధవ్‌ రామచంద్రన్‌, ఏకే దండమూడి, టీఆర్‌ కన్నన్‌ పెట్టుబడులపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. అనంతరం సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను తీసుకొన్న ఈడీ... ఇందులో మనీలాండరింగ్‌ జరిగిందని ఆర్థిక నేరాల కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 
సీబీఐ కోర్టులో ఈడీ అధికారుల పిటిషన్‌ 
మనీలాండరింగ్‌ చట్టం కింద విచారించేందుకు కేసును బదిలీ చేయాలంటూ ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. జగన్ మీడియా సంస్థల్లో పై ముగ్గురి పెట్టుబడులకు సంబంధించిన కేసును బదిలీ చేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సీబీఐ ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి 11 చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఈడీ కూడా అదేవిధంగా చేస్తోందన్నారు. జగన్‌పై ఉన్న మనీలాండరింగ్‌ కేసుల్లో మరిన్ని ఫిర్యాదులు దాఖలు చేస్తామన్న ఈడీ వాదనల నేపథ్యంలో అన్నీ దాఖలు చేశాక మరోసారి ఇక్కడ పిటిషన్ వేసుకోవాలని ఈడీకి సీబీఐ కోర్టు సూచించింది. ఇప్పట్లో కేసులు బదిలీ చేయలేమని స్పష్టం చేసింది.

09:09 - February 27, 2016

అనంతపురం : రాళ్లు కళ్లు విప్పితే లేపాక్షి... రాళ్లు రాగాలు పలికితే లేపాక్షి... రాళ్లు హొయలు పోతే లేపాక్షి... విజయనగర రాజ్యంలో శిల్పులు ఉలితో రాళ్లకు చక్కిలిగింతలు పెడుతూ ప్రాణం పోస్తారని వర్ణించారు కవులు. లేపాక్షి ఐదు శతాబ్దాలుగా విజయనగర సామ్రాజ్యం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. లేపాక్షి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా నేటినుంచి లేపాక్షి ఉత్సవాలు హిందూపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రపంచానికి తెలుగు జాతి వైభవం
తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని భావితరాలకు చాటిచెప్పేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాంస్కృతిక యజ్ఞంలో భాగంగా అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు జరిగే ఈ ఉత్సవాలు తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాగనున్నాయి. 
లేపాక్షి నంది
లేపాక్షి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది లేపాక్షి నంది. లేపాక్షి ఆలయం హిందూపురం నుంచి 15 కి.మీ, బెంగళూరు నుంచి 120 కి.మీ దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశ మార్గంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. లేపాక్షి బసవయ్య శిల్పం మెడలో పూసల హారాలు, గంటలు, రిక్కించిన చెవులు, లేవబోతూ కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమ, మెడలో గండభేరుండ హారం ఉన్న ఆ నంది చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. అందుకే ఈ పర్యాటక స్థలాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపజేసే కృషిలో భాగంగానే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.  
ఉత్సవాల నిర్వహణ బాధ్యత చూస్తున్న బాలకృష్ణ
ఉత్సవాల నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకున్న హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే పలు కేంద్ర, రాష్ట్ర ప్రముఖులను పలువురిని స్వయంగా ఆహ్వానించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అటు దేవాదాయశాఖా మంత్రి పి.మాణిక్యాలరావు పలు ఏర్పాట్లు చేశారు. అలాగే  ఎంతో చారిత్రక వారసత్వం కలిగిన లేపాక్షి ఆలయాన్ని ఏపీ ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్‌ జాబితాలో చేర్చేలా ప్రతిపాదనలు పంపింది. 
పలు సాంస్కృతిక కార్యక్రమాలు 
ఇక ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండనుండగా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య సందడి చేయనున్నట్టు సమాచారం. మన తెలుగు సంస్కృతిని, లేపాక్షి గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య చెప్పిన ఓ ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేసారు. 
ఉత్సవాల నిర్వహణకు రూ.4.19 కోట్లు మంజూరు
ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.19 కోట్లు మంజూరు చేసింది. అలాగే అనంతపురంలో లేపాక్షి, పుట్టపర్తి, పెనుగొండ పోర్టు, తిమ్మమ్మ మర్రిమాను వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఒక టూరిజం సర్క్యూట్‌గా చేసి, యాత్రికులకు ఒక ప్యాకేజీ తరహాలో అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్ర పర్యాటక శాఖ. ఇక లేపాక్షి ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు ఆంధ్రా, రాయల సీమ రుచులతో పాటు, వినోదాన్ని అందించనున్నారు.

 

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

కృష్ణా : జిల్లాలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాపులపాడు మండలం కొత్తపల్లిలో భూపతి రాజు, లక్ష్మీ దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. 

08:44 - February 27, 2016

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ఊరట కలిగించే  కీలక నిర్ణయాన్ని ఏపీ సర్కార్‌ తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే కేబినెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకోవడంతోపాటు.... వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని నిర్ణయించింది. 
వార్షిక బడ్జెట్‌పై యనమల కసరత్తు 
ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 వార్షిక బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులపై శాఖల వారీగా సమీక్షలు పూర్తి చేశారు. వచ్చే నెల 5 న నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో...  10న సాధారణ బడ్జెట్‌తోపాటు, వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ప్రభుత్వ, ప్రవేటు రంగాల్లో  ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో నదుల అనుసంధానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. 2015-16 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం బాగా పెరిగిన విషయాన్ని యనమల గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర  వ్యయాలపై తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని శాఖలకు సముచిత కేటాయింపులు జరపుతారు. 

 

08:40 - February 27, 2016

నెల్లూరు : జిల్లాలోని పెళ్లకూరు మండలం చావలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నాయుడుపేట-తిరుపతి రహదారిలో కృష్ణపట్నం నుంచి బొగ్గులోడుతో తిరుపతి వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొగ్గు లారీలో ఉన్న డ్రైవర్‌, మరో లారీలోని క్లీనర్‌ తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. 

 

 

08:08 - February 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ కథ ముగిసిందా అనే కథనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక‌ వైపు  తెలంగాణ‌లో వ‌రంగ‌ల్లు, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల ఎన్నిక‌లకు న‌గారా మోగినా అధిష్టానం  అటు క‌నీసం క‌న్నెత్తి చూడ‌డంలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అలాగే చినబాబు లోకేష్‌ తెలంగాణ వైపు ఆలోచించడం లేదు. దీంతో టీటీడీపీ కథ ముగిసినట్లేనా అనే అనుమనాలు బలంగా వ్యాపిస్తున్నాయి. 
టిటిడిపిని ప‌ట్టించుకోని చంద్రబాబు 
ఏపీ పాల‌న‌లో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నిన్న మొన్నటి వ‌ర‌కు ఒక‌క‌న్ను తెలంగాణ‌పై కూడా ఫోక‌స్ చేసేవారు. వీలైన‌ప్పుడ‌ల్లా టిటిడిపి నాయ‌కుల‌తో స‌మావేశాలు నిర్వహిస్తూ వారికి బూస్టప్‌  ఇచ్చేవారు. అయితే గ్రేట‌ర్ ఫ‌లితాల త‌ర్వాత బాబు వైఖ‌రిలో పూర్తిగా మార్పు వ‌చ్చింది. అస‌లు తెలంగాణ టిడిపి పార్టీని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. 
టీడీపీ బలహీనం...
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణ‌మాల‌కు దూరంగా లేక‌పోతే ఏపీలో కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌ని భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు ఆక‌ర్షితులు అవ్వడం మొదలయ్యాక ఇటు పార్టీ చాలా వీక్ అయిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితిపై ఎంత స‌మ‌యం వెచ్చించినా వేస్ట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వ‌చ్చేశారు.
టీటీడీపీ కార్యక్రమాల‌కు దూరంగా లోకేష్
నిన్న మొన్నటి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి హోదాలో ఇరు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను స‌మ‌న్వయం చేసిన లోకేష్ గ్రేట‌ర్ ఫ‌లితాల త‌రువాత ప్రస్తుతం తెలంగాణలో పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఒక్కసారి కూడా పార్టీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించ‌లేదు లోకేశ్. తెలంగాణ పార్టీని లోకేష్‌ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆ పార్టీ నేత‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప‌డుతూ లేస్తూ ఉన్న పార్టీని అటు అధినేత, ఇటు చిన‌బాబు వైఖ‌రి ప‌ట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సైకిల్‌ పార్టీ పెద్దలు ఇక్కడి రాజ‌కీయాల‌పై క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రించ‌క‌పోతే తెల‌ంగాణ‌లో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడతుందని విశ్లేషకులు అంటున్నారు. 

హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని శ్రీనగర్‌కాలనీలో పోలీసులు గడిచిన రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అతిగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 23 మందిపై కేసులు నమోదు చేశారు. 17 బైకులు, 4 కార్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి..మరో నలుగిరకి గాయాలు

మహబూబ్ నగర్ : జిల్లాలోని విజినపల్లి మండలం వట్టెంలో విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారాణం..

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

07:43 - February 27, 2016

హైదరాబాద్ : వైసీపీలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క ఫ్యాన్‌ గాలి తగ్గుతోంది... మరోవైపు సైకిల్‌ స్పీడ్‌ పెరిగిపోతుంది. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆపేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సైకిలెక్కేందుకు నేతల యత్నాలు మాత్రం ఆగడం లేదు. కొంతమంది నేతలు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం ఊపందుకోవడంతో.. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జగన్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 
టీడీపీ ఆకర్ష్‌ ప్రభావం
ఏపీలో టీడీపీ ఆకర్ష్‌ ప్రభావం బాగా పని చేస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కగా.. మరికొందరు అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకునేందుకు డిసైడైనట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టీడీపీ భావిస్తోంది. అందుకే వైసీపీ నేతలను చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 
జగన్‌ అలర్ట్
తమ ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కుతున్నారని ప్రచారం ఊపందుకోవడంతో జగన్‌ అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కడప జిల్లా నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత.. తాజాగా గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే సమావేశమయ్యారు. టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేతలకు ఆయన క్లాస్‌ పీకినట్లు సమాచారం. దీంతో  వైసీపీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారడం లేదని.. ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని.. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు జగన్‌తో భేటీకి సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్‌ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇదిలావుంటే.. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడాలని బాలినేనికి జగన్‌ సూచించారు. ఇక శ్రీకాకుళం, కడప జిల్లాలో కూడా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ గూటి నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు. 
టీడీపీపై రోజా ఫైర్‌
ఇదిలావుంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం.. టీడీపీపై ఫైర్‌ అయ్యారు. వాళ్ల ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారన్నారు. జగన్‌కు ప్రజల అభిమానం ఉందన్నారు. టీడీపీకి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి.. ప్రజాక్షేత్రంలో తమ సత్తా ఏంటో తెలుసుకునేందుకు సిద్ధపడాలన్నారు. 
జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదన్న పల్లె
మరోవైపు జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి. అవినీతి సంపదను కాపాడుకునేందుకు జగన్‌ రాజకీయాల్లో కొనసాగుతున్నారన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని జగన్‌ కలలు కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. 
హాట్‌ టాపిక్‌గా ఫిరాయింపుల పర్వం
మొత్తానికి ఏపీలో ఫిరాయింపుల పర్వం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తుండగా.. వాటిని అడ్డుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా బడ్జెట్‌ సమావేశాల్లోపు పలువురు ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. మరి.. జగన్‌ వీరి ప్రయత్నాలను ఎలా ఆపగలరో చూడాలి. 

07:35 - February 27, 2016

హైదరాబాద్ : 2017 డిసెంబర్‌ నాటికి మిషన్‌ భగీరథ పూర్తి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 9 నియోజకవర్గాలకు నీరివ్వాలని అందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్‌ భగీరథకు నిధుల కొరత లేదన్న సీఎం పనుల్లో నాణ్యత ఉండాలన్నారు.
గ్రామాలకు మంచినీళ్లు అందించే విధంగా కార్యాచరణ
ఈ ఏడాది చివరి నాటికే చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకొని వేగంగా పనులు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలతో సమన్వయం కుదుర్చుకుని పంప్‌హౌజ్‌, పైప్‌లైన్లు, ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 2016 ఏప్రిల్ నాటికి తొమ్మిది నియోజకవర్గాలకు మంచి నీరు అందించడానికి జరుగుతున్న పనుల పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
అధికార్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలన్న సీఎం 
అధికార్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. డిజైన్లు, అనుమతులు ఇవ్వడంలో జాప్యం నివారించాలన్నారు. అవాంతరాలను తొలగించడానికి ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రైతుల పొలాల గుండా వెళ్లే పైప్‌లైన్ల నిర్మాణం జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీళ్లు సరఫరా చేయడానికి ఉపయోగించే పైప్‌లైన్లు నాణ్యతతో ఉండాలన్నారు. రోగకారకమైన సిమెంట్ పైప్‌లైన్లు వాడొద్దు అని ఆదేశించారు. నాణ్యతతో కూడిన పైపులను మాత్రమే వాడాలన్నారు. పైప్‌లు, వాల్వ్‌లు సకాలంలో అందుబాటులోకి వచ్చేందుకు వ్యూహం రూపొందించాలన్నారు. తెలంగాణకు చెందిన సంస్థలు పైప్‌లు, వాల్వ్‌లు అందించే స్థితిలో లేకుంటే దేశంలోని ఉత్తమమైన సంస్థలకు పనులు ఇవ్వాలన్నారు. 
వేగంగా అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి చర్యలు
ఇన్‌టెక్ వెల్, డబ్ల్యూటీపీలతో పాటు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా చూడాలని కేసీఆర్‌ ఆదేశించారు. గ్రామాల్లో పైప్‌లైన్ల నిర్మాణం కోసం కందకాలు తవ్వే పనిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి పంపింగ్ కోసం అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, పవర్‌లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. 
నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే
మిషన్ భగీరథ పనులు పూర్తి అయిన తర్వాత వచ్చే ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే ఉంటుందని సీఎం అన్నారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసిన వారికిచ్చే 1.5 ఇన్సెంటీవ్‌ను అన్ని వర్కింగ్ ఏజెన్సీలు అందుకునేలా ప్రయత్నం చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

 

07:28 - February 27, 2016

విజయవాడ : ఇసుక విధానంపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో ఉచిత ఇసుక విధానంపై సర్కార్‌ క్లారిటీ ఇవ్వనుంది. ఇసుక కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు ఇచ్చినా.. వేలం పాటల ద్వారా కేటాయించినా ప్రజలకు కష్టాలు తప్పడం లేదని భావించిన సీఎం చంద్రబాబు చివరకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. 
జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్  
జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు, మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇసుకపై వచ్చే ఆదాయం ఏడాదికి రూ.200 కోట్లేనని.. దీని కోసం ఇంత హంగామా అవసరమా అని సీఎం ప్రశ్నించారు. జీపీఎస్‌ పద్ధతి, సీసీ కెమెరాలు, పర్యవేక్షణకు ఇంతమంది అధికారులు అవసరమా అని చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇళ్లు, భవన నిర్మాణాలకు, ప్రభుత్వ పనులకు అన్నింటికీ ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజలు రవాణా ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇసుకను నిత్యావసరాల జాబితాలోకి తెద్దామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. 
చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రులు
ఇసుకను అక్రమంగా నిల్వచేయడం, సరిహద్దులు దాటించడం, సిండికేట్లుగా ఏర్పడి రేవులపై ఆదిపత్యం చలాయించం వంటి వాటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. చంద్రబాబు నిర్ణయాన్ని మంత్రులు స్వాగతించారు. ఇసుకను ఉచితంగా అందిస్తే ప్రజలకు మేలు చేసిన వారమవుతామని పలువురు నేతలు అన్నట్లు సమాచారం. అయితే ఈ ఇసుక తవ్వకాలపై కూడా విధివిధానాలను రూపొందించనున్నట్లు సీఎం చెప్పారు. ఏయే రేవుల్లో ఇసుక తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ లభ్యత ఉందనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. దీనికి సంబందించిన విధివిధానాలపై రెండు రోజుల్లో మంత్రులు అధికారులు ఆలోచించి సూచనలు సిద్ధం చేయాలని కోరారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలనే నిర్ణయం మేరకు ఇప్పటివరకు వేసిన రేవుల వేలం ఇక రద్దవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ధరావత్తు సొమ్మును వేలం పాట దారునికి తిరిగి ఇచ్చేయనున్నారు.

నేడు భారత్, పాకిస్తాన్ ల మధ్య టీ-20 మ్యాచ్

మీర్పూర్ : ఆసియా కప్ టీ-20 లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ ల మధ్య టీ-20 మ్యాచ్ జరుగనుంది. మీర్పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

పాతబస్తీ సౌత్ జోన్ లో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : పాతబస్తీ సౌత్ జోన్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుల్తాన్ షాహీ, ఛత్రినాకలో 250 మంది పోలీసులతో సోదాలు నిర్వహించారు. పలువురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నెల్లూరు : సీఎం చంద్రబాబు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణపట్నం విద్యుత్కేంద్రాన్ని సీఎం జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయలె, వెంకయ్యనాయుడు పాల్గోనున్నారు. 

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు: జిల్లాలోని పెళ్లకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

నేడు వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన

వరంగల్ : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.   

నేడు, రేపు జీహెచ్ ఎంసీ మేయర్ బెంగుళూరులో పర్యటన

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు నేడు, రేపు బెంగుళూరులో పర్యటించనున్నారు. బెంగళూరు కార్పొరేషన్ పటిష్ట విధానంపై అధ్యయనం చేయనున్నారు. 

06:53 - February 27, 2016

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ... సీఎం కేసీఆర్ తన ఉపన్యాసంలో పేర్కొన్నాడు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సైతం మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటూ.. మీడియా సమావేశంలో మాట్లాడాడు.. తెలంగాణలో ప్రజల నీటి బాధలు... సమ్మక్క సారక్కల జాతర హుండీ డబ్బుల లెక్కింపు... లాంటి అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న పసందైన మాటలను చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి.

Don't Miss