Activities calendar

28 February 2016

21:29 - February 28, 2016

హైదరాబాద్‌ : నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.. తాగేందుకు చుక్కనీరులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.. శివారు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన రద్దు చేయాలన్నారు.. నీటి సమస్య తీర్చాలంటూ ఘట్‌కేసర్‌ మండలం బోడుప్పల్‌లో కాలనీవాసులు చేపట్టిన నిరాహరదీక్షకు మద్దతు ప్రకటించారు..

 

21:22 - February 28, 2016

హైదరాబాద్ : తనకు జరిగిన అన్యాయన్ని 'టెన్ టివి' డిస్కషన్‌లో వివరించింది వీణవంక బాధితురాలు.. తనకు న్యాయం చేయాల్సిందిపోయి పోలీసులు నిందితులకు అనుకూలంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది.. పోలీసు స్టేషన్ కు పిలిపించి రాత్రి 3.30 వరకు పోలీసు స్టేషన్లోనే ఉంచారని, సీఐ తననే కొట్టడానికి చేయి ఎత్తాడని బాధితురాలు వాపోయింది. ఇంటరాగేషన్ సమయంలో ఏ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేరని, సీఐ అడగకూడని ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టారని చెప్పారు. పోలీసు ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని.. కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తే ఇలాంటి అన్యాయం ఏ మహిళకూ జరకుండా చూస్తానని చెప్పింది. పూర్తి డిస్కషన్ వీడియోలో చూడండి.

21:20 - February 28, 2016

నెల్లూరు : వైసీపీ రోజా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆనం వివేకానందరెడ్డి తప్పుపట్టారు. రోజా స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రోజా ఐరన్‌ లెగ్‌ అని ఆనం వ్యాఖ్యానించారు. 

21:18 - February 28, 2016

హైదరాబాద్ : వరంగల్‌ మాజీ మేయర్‌ ఇంటి ముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ నేత బంక సంపత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సంపత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

20:32 - February 28, 2016

హైదరాబాద్ : టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 30శాతం జరిమానా విధించారు. ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో 49 పరుగులు వద్ద కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అంపైర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రీజులో నుంచే ఈ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. అలాగే క్రీజులోంచి పెవిలియన్ చేరుతుండగా అంపైర్ పై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని రిఫరీ నిర్ణయించారు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద కోహ్లీ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించినట్టు తెలిపారు. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ రాణించడంతో టీమిండియా సులభంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రామాంతపూర్ లో లారీ బీభత్సం : చిన్నారి మృతి

హైదరాబాద్ : రామంతపూర్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ జనాలపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందింది. స్థానికులు లారీని ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీపీఎం ఆధ్వర్యంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల భారీ ర్యాలీ

హైదరాబాద్ : వంశధార నిర్వాసితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పాడలి, దుగ్గుపురం నుంచి సీపీఎం ఆధ్వర్యంలో.. బాధితులు భారీ ర్యాలీ చేపట్టారు. వేలాదిగా తరలివస్తున్న బాధితులను పోలీసులు రిజర్వాయర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా నిర్వాసిత ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. 

20:14 - February 28, 2016

హైదరాబాద్: అర్థరాత్రి సమయంలో ఒక్క మహిళా పోలీసు కూడా లేకుండా సిఐ అడగకూడని ప్రశ్నలు అడిగి చాలా హింసించారు. పీఎస్ లో అడిగిన ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడి వేకువజామున 3.30 గంటలకు ఇంటికి పంపారు. ఇదీ వీణవంక అత్యాచార బాధితురాలి ఆవేదన... సీఐ నన్ను కొట్టడానికి చేయి పైకెత్తాడు. ఇప్పటికీ పోలీసు ఉద్యోగం చేయాలనుకుంటున్నా...నాలాగా ఎవరూ ఇబ్బంది పడకూదని కోరుకుంటున్నాని.. నిందితులను కఠినంగా శిక్షించాలని వీణవంక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే గంట క్రితం కూడా సిఐ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపారు. చట్టాలను అతిక్రమిస్తున్న అధికారులను ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం లేదా? ఘటనకు సంబంధించిన సెన్సిటివిటీ అధికారుల్లో లేకపోయింది. ఈ ఘటన 15 రోజుల తరువాత బయటకు వచ్చింది. 26 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాను అని మంత్రి ఈటెల రాజేంద్ర స్పష్టం చేశారు. కేసు నమోదు చేయడానికి పీఎస్ కు వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదా? పోలీసు అధికారుల కంటే గ్రామస్థులే బాధితురాలికి అండగా నిలిచారా? పోలీసులు ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారా? కాఖీ బట్టలు వేసుకునేది సెల్యూట్లు కొట్టడానికేనా? టెన్‌ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన... వీణవంక యువతిపై దాష్టీకానికి సంబంధించి.. ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎన్ కౌంటర్లే ప్రత్యామ్నాయమా? నిందితుల వెనుక ఒక ప్రజాప్రతినిధి వుండి కేసును మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలా? ఇత్యాది అంశాలపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, ఐద్వా నేత ఇందిర, వీణవంక బాధితురాలు, హ్యూమన్ రైట్స్ కన్వీనర్ కపిల్ వాయి, బాధితురాలి తల్లి, బాధితురాలి బాబాయ్ శ్యాంసన్, మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మరీ ఈ చర్చను మీరూ చాడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:44 - February 28, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై సమగ్ర నివేదిక తయారుచేసి... కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. కేంద్రం దీనిపై 2017 చివరి నాటికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు పెరిగే చాన్స్‌ ఉందనుకుంటున్న చంద్రబాబు....వైసీపీ ఎమ్మెల్యేల చేరికలకు అందుకే అడ్డు చెప్పడంలేదన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు....

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు దిశగా ఏపీ సర్కార్‌ చర్యలు చేపట్టింది. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే నివేదిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మరో 50 సీట్లు పెరగాల్సి ఉంది. సీట్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే... ఏపీలో అసెంబ్లీ స్థానాలు 225కు పెరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 4 సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

బలమైన నేతల చేరికలకు అడ్డు చెప్పొద్దని బాబు ఆదేశం....

పార్టీ అంతర్గత సమావేశాల్లో చంద్రబాబునాయుడు నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ ప్రయోజనాల దృష్ట్యా.... బలమైన నేతలు ఎవరు పార్టీలోకి వచ్చినా.... అడ్డు చెప్పొద్దని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా... ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఏ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల కంటే వైసీపీ శాసనసభ్యులు ఎక్కువగా ఉన్నారో... ఆయా జిల్లాల్లో వలసను ప్రోత్సహించే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇప్పటికీ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు. త్వరలోనే మరికొందరు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెంబ్లీ స్థానాల పెంపుపై పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. 

19:40 - February 28, 2016

హైదరాబాద్ : టెన్‌ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన... వీణవంక యువతిపై దాష్టీకానికి సంబంధించి.. ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. అత్యాచారానికి గురైన యువతిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. బాధితురాలిని పరామర్శించిన ఆయన ఈ కేసులో దోషులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు.. చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరు పరిచారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో.. అతణ్ణి జువైనల్‌ జైలుకు తరలించారు. మరోవైపు.. ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడింది. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆపార్టీ ఆరోపించింది.

పోలీసుల నిష్క్రియాపరత్వంపై విమర్శలు .....

కరీంనగర్‌ జిల్లా వీణవంకలో జరిగిన సాముహిక అత్యాచార ఘటనలో... పోలీసుల నిష్క్రియాపరత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధి అండదండలున్న అత్యాచార కేసు నిందితులను... పోలీసులు వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తమ పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో.. పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఘటనకు కారకులైన ముగ్గురు నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు నిందితులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో నిందితుడు మైనర్‌ కావడంతో అతణ్ణి కరీంనగర్‌ జువైనల్‌ హోంకు తరలించారు.

పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలపై విమర్శలు....

వీణవంక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌.. చల్లూరులో అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఆయనకు దళిత, మహిళా సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దళిత, మహిళా సంఘాల కార్యకర్తలు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. ఈటల గో బ్యాక్‌ అంటూ ఆందోళనకారులు నినదించారు. బాధితురాలికి న్యాయం చేసే వరకూ మంత్రిని వెళ్లనిచ్చేది లేదంటూ ఘొరావ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్‌... బాధితురాలిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో దోషులెవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

తప్పుపట్టిన కాంగ్రెస్....

వీణవంక ఘటనను విపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని దుయ్యబట్టింది. ఆపార్టీ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ... పోలీసులు వెంటనే స్పందించి ఉంటే దళిత యువతిపై అత్యాచారం జరిగేది కాదన్నారు. మృగాళ్లుగా ప్రవర్తించిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని మహిళా సంఘాలు.....

వీణవంక అత్యాచార ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యాచార ఘటనకు సంబంధించిన సాక్ష్యాలున్నా.. బాధితురాలిని గుచ్చిగుచ్చి ప్రశ్నించడం సరికాదని మహిళా సంఘాల నేతలు ఆక్షేపించారు. నిందితులకు ఓ ప్రజాప్రతినిధి అండదండలున్నాయని.. అందుకే పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మహిళాసంఘాలు అనుమానిస్తున్నాయి. నిందితులకు శిక్ష పడేవరకు పోరాడుతామని ప్రజా, మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. 

18:54 - February 28, 2016

అనంతపురం : రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ద్రోహి సీపీఎం ఏపీరాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. రాయలసీమ సమస్యలు పరిష్కరించాలంటూ లెఫ్ట్ చేపట్టిన బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిక సందర్భంగా హిందూపురం నుంచి పాదయాత్ర చేపట్టి గాలేరు, నగరి, హందీనీవా, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారని, అంతే కాకుండా రాయలసీమ అంతా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారని తెలిపారు. ఇంత వరకూ అతీగతీ లేదని మండి పడ్డారు. లేపాక్షి ఉత్సవాలకు వచ్చిన చంద్రబాబు అభివృధ్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన రిపోర్టు బాగా వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ అని తేల్చారని చెప్పారు. ఇకనైనా మేల్కొని బడ్జెట్ సమావేశాల్లో సీమకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాయలసీమ మండి పోతుందని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ తో ఒవైసీ సోదరులు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ ఎంఐఎం నేతలైన ఓవైసీ సోదరులు సమావేశమయ్యారు. విద్యార్థుల పాత బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా సీఎంకు ఒవైసీ సోదరులు విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్ లో మైనారిటీలకు రూ.2వేల కోట్లు పెంచాలని సీఎం కు విజ్ఞప్తి చేశారు.

17:32 - February 28, 2016

హైదరాబాద్ : ఖమ్మ ఖిల్లా మీద వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని 'టెన్ టివి'తో మాట్లాడుతప...21వ వార్డు లో మార్చి 6 జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీచేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తుందన్నారు. ప్రజలపక్షాన పోరాడాల్సిన ప్రతిపార్టీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ప్రజలు బుద్ధి చెపుతారని తెలిపారు. ఎంపి గా అత్యధిక నిధులు తీసుకొచ్చి నందనవంగా తీర్చిదిద్దుతామన్నారు. ఖమ్మం ఖిల్లా మీద వైసీపీ జెండా ఎగురుతుంది: ఎంపి పొంగులేటి

17:19 - February 28, 2016

హైదరాబాద్ : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఊపందుకున్నాయి. సీపీఎం పార్టీ తరపున31వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న తాలూరి వెన్నెల ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి'తో మాట్లాడుతూ... ప్రజల నుంచి మంచి స్పందన లిభిస్తోంన్నారు. పారిశుధ్యం, మంచినీటి సమస్య, ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. 

16:39 - February 28, 2016

నెల్లూరు : 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలవరం నిర్మాణం కోసం అమెరికా, జపాన్‌ దేశాల నుంచి యంత్రాలు తెప్పించామని తెలపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రాబట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కావలి కాలువ అభివృద్ధికి కేవలం రూ.17 కోట్లు ఖర్చుచేసి లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. హంద్రినీవా, గాలేరు ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తామని ఉమమహేశ్వరరావు అన్నారు.

16:37 - February 28, 2016

కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి ఈటెల కాన్వాయ్ ను మహిళలుఅడ్డుకున్నారు. మంత్రి గోబ్యాక్ అంటూ దళిత, మహిళా సంఘాలు నినాదాలు చేస్తూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ వెళ్లనిచ్చేది లేదని ఆందోళన చేపట్టారు. మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఈటెల బాధితురాలిని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

16:31 - February 28, 2016

హైదరాబాద్ : ఖమ్మం కార్పొరేషన్ కుజరుగుతున్న ఎన్నికల్లో మేయర్ స్థానం కైవసం చేసుకుంటామని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...24వ డివిజన్ అభ్యర్థి తరపున సండ్ర ప్రచారం టిడిపి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసం టిడిపి పాటుపడిందని స్పష్టం చేశారు. ఖమ్మం ప్రజలు విలక్షణమైన వారనిజజజ ఎన్టీఆర్ పెట్టిన టిడిపి కాపాడుకోవడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు పార్టీ మారినా ప్రజలు మాతోనే ఉన్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం వివిధ శక్తులను కూడకట్టుకుని మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని సండ్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

16:27 - February 28, 2016

హైదరాబాద్: వరంగల్ నగర అభివృద్ధి పై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ...వరంగల్ ను నిర్లక్ష్యం చేసింది ఎవరు.. వరంగల్ కోసం పాటుపడుతుంది ఎవరు అని ఆలోచించుకొని ఓట్లు వేయాలని ప్రజలుకు విజ్ఞప్తి చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్, టిడిపి తలుపులు తడుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ప్రజలకు తాగడానికి మంచినీటిని అందించలేని పరిపాలన టిడిపి, కాంగ్రెస్ ల 60ఏళ్ల పాలనా, 18 నెలల టిఆర్ ఎస్ పరిపాలనను చూసి గుండె మీద చేయి వేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రావడంలో ప్రధాన భూమిక పోషించింది వరంగల్ ప్రజలు అని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పేరు పెట్టి వరంగల్ పేరును సాకాం చేసింది టిఆర్ ఎస్ అని స్పష్టం చేశారు. వరంగల్ ను అభివృద్ధి పథకంలో నడుపుతున్న టిఆర్ ఎస్సే అని స్పష్టం చేశారు.

15:52 - February 28, 2016

చిత్తూరు : వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలు తీసింది.. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవంకోసం చేరింది శోభ... సీజేరియన్‌ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది.. మెరుగైన చికిత్సకోసం ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.. కొమాలోఉన్న బాధితురాలు మరుసటిరోజు కన్నుమూసింది.. అయితే ఆపరేషన్‌ సమయంలో మత్తుమందు ఎక్కువగా ఇవ్వడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి డాక్టర్లు స్పష్టం చేశారు.. దీంతో ఆగ్రహించిన బంధువులు కాళహస్తిలోని ప్రైవేటు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. బంధువులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.. 

15:50 - February 28, 2016

కరీనంగర్‌ :సిరిసిల్లలో జరుగుతున్న సెస్‌ సహకార విద్యుత్‌ సంస్థ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు అన్ని పక్షాల నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సిరిసిల్ల వైబీ నగర్‌లో ఉన్న మాజీ కౌన్సిలర్‌ దారం అశోక్‌ తన ఇంట్లోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. విషయం తెసుకున్న మీడియా ప్రతినిధులు అశోక్‌ ఇంటికి చేరుకునేసరికి.. డబ్బుకోసం వచ్చిన వారిని పంపించి వేశారు. ఓటర్లకు పంచేందుకు ఉంచి డబ్బు మీడియా కంట పడకుండా దాచి పెట్టారు. 

15:49 - February 28, 2016

విజయవాడ: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాటికి వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టిడిపిలో చేరతారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. అభివృద్ధిని కోరుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని ఆయన అన్నారు. 2019 నాటికి జగన్ పార్టీ ఉండదని పత్తిపాటి జోస్యం చెప్పారు.

15:47 - February 28, 2016

విజయవాడ : సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ప్రలోభాలతోనే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు టీడీపీలో చేరారని అంబటి విమర్శించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడ్డారు.

15:46 - February 28, 2016

కృష్ణా : విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. దీనిపై కేంద్ర మంత్రులతో ఎంపీలు చర్చించనున్నారు. జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నారని ఎద్దేవాచేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు పెడతామని సీఎం రమేష్‌ తెలిపారు. ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు నిర్ణయం హర్షించదగ్గ విషయమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడం హర్షణీయమన్నారు.

 

మంత్రి ఈటెల కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు

కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి ఈటెల కాన్వాయ్ ను మహిళలుఅడ్డుకున్నారు. మంత్రి గోబ్యాక్ అంటూ దళిత, మహిళా సంఘాలు నినాదాలు చేస్తూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ వెళ్లనిచ్చేది లేదని ఆందోళన చేపట్టారు. మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఈటెల బాధితురాలిని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

కారు- బైక్ ఢీ : ఇద్దరి మృతి

కరీంనగర్: జిల్లాలోని జగిత్యాల మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సాగరమాల ప్రాజెక్టుకు 10 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న సుదీర్ఘ సముద్రతీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావించిన భారతప్రభుత్వం, ప్రతిష్ఠాత్మకమైన సాగరమాల ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తోంది. ఇందులో 4 లక్షల కోట్ల రూపాయలను అవస్థాపన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్టు తెలుస్తోంది. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశాభివృద్ధిని వేగవంతం చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది.

14:44 - February 28, 2016

కరీంనగర్ : వీణవంక అత్యాచార బాధితురాలిని కాసేపట్లో మంత్రి ఈటెల రాజేందర్‌ కలవనున్నారు. మరోవైపు ఘటనపై నిందితుల తల్లిదండ్రులు స్పందించారు. తమ పిల్లలు పాపాత్ములని.. వారిని ఏ విధంగా శిక్షించినా అడ్డుపడమన్నారు. అయితే పోలీసులు ఎదుట ప్రవేశపెట్టిన మరో నిందితుడు రాకేష్‌ మాత్రం.. తాను అత్యాచారానికి పాల్పడలేదని.. వీడియో మాత్రమే తీశానంటున్నాడు. తాను తీసిన వీడియోతోనే ఘటన బయటపడిందంటున్నాడు. 

14:42 - February 28, 2016

విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడ క్యాంపు కార్యాలయంలోటిడిపి పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన టిడిపి ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన సమస్యలు చర్చకు వచ్చి పరిష్కారం లభించేలా చూడాలని ఎంపీలను సిఎం కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరు, రాష్ట్రం ఖర్చుచేసిన మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ జరిగేలా చూడాలని సిఎం కోరినట్లు తెలుస్తోంది. 

14:40 - February 28, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య. గతంలో నిర్మించిన ఇళ్లకే నిధులు కేటాయించలేని ప్రభుత్వం కొత్తగా ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు . టెండర్లు లేకుండా ..ప్రాజెక్టులు , రోడ్ల విస్తరణ పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శమన్నారు సండ్ర. కేవలం కార్పోరేషన్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు సండ్ర వెంకట వీరయ్య. తుమ్మల గతంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దీక్ష చేసిన ఆయన ఇప్పుడు జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు సండ్ర.   

14:39 - February 28, 2016

విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. పార్టీలు మారినా రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ నుంచి ఎంత మంది నేతలు వచ్చినా స్వాగతిస్తామన్నారు కళా వెంకట్రావు.

14:38 - February 28, 2016

హైదరాబాద్ : రాయలసీమ అన్నివిధాలుగా నిర్లక్ష్యానికి గురైందని.. ఎందరో నాయకులు రాయలసీమ నుండి గెలిచిన కేంద్ర మంత్రులు , ప్రధానులుగా పనిచేసినా అభివృద్ది జరగలేదన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను అభివృద్ది ఊసెత్తకుండా లేపాక్షి ఉత్సవాల పేరిట నాటకాలకు తెరదీసిందన్నారు. రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటూ పండగ చేసుకుందని ఎద్దేవా చేశారు మధు. తరతరాలుగా కరువు పీడిత ప్రాంతమైన సీమ సమస్యలపై అసెంబ్లీముట్టిడికి పిలుపునిచ్చామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 

14:36 - February 28, 2016

శ్రీకాకుళం : జి.సిగడాం మండలంలో పీటల మీద పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సిగడాం మండలం మధుపాం గ్రామంలో ఏ.ఆర్ కానిస్టేబుల్ రాజుకు శనివారం అర్ధరాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. శ్రీకాకుళంలో ట్రాఫిక్ హోం గార్డుగా పనిచేస్తున్న తులసి... తనను రాజు ప్రేమించి మోసం చేసాడంటూ కేసు పెట్టారు. దీంతో మంటపం వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు పెళ్లిని ఆపేయించారు. బాధితురాలు వరుడు రాజు ఇంటి ముందు బైఠాయించడంతో అతనితోపాటు అతని బంధువులు పరారయ్యారు.

14:34 - February 28, 2016

హైదరాబాద్ : ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు... ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై దృష్టి పెట్టారు. సభా వేదికగా ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.

అన్ని ఎన్నికల్లో వరుస ఓటములు ....

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వరుసగా ఎదురైన ఓటముల భారం నుంచి తేరుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ సర్కార్‌పై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్దమవుతున్నారు. త్వరలో ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వం పథకాల అమ్లలో చోటుచేసుకుంటున్న అవినీతి, సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వంటి అంశాలపై పాలకులను నిలదీసి ఉక్కిరి బిక్కిరి చేసుందుకు అవసరమైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు.

అభివృద్ధిపై పాలకులు చెబుతున్నదొకటి....

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 20 నెలలు పూర్తయ్యింది. తెలంగాణ అభివృద్ధికి పాలకులు చెబుతున్న విషయాలకు.... క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న దానికి పొంతనలేదన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వాదన. కేసీఆర్‌ హామీలు నీటి మూటలుగా మారాయని విమర్శిస్తున్నారు. మిషన్‌ భగీరధ ద్వారా ఇంటింటికి నల్లా నీరు సరఫరా హామీ అమలు ఏమయ్యిందని నిలదీయాలని నిర్ణయించారు. అలాగే చెరువులు పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయ పథకం అమల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను ప్రస్తావించి.. పాలకులు బండారాన్ని బయటపెట్టేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పు......

సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాలు తీసుకుంటున్నదన్న వాదాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ఆనకట్ట నిర్మాణం, తుమ్మిడిహట్టి వంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం విషయంలో సర్కారీ అసంబంద్ధ విధానాలను వేలెత్తిచూపేందుకు సిద్ధమవుతున్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో అవినీతి జరుగుతున్నదని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు... అంసెబ్లీ వేదిక సాక్ష్యాధారాలను బయటపెడతామంటున్నారు. ఈ అంశంపై నిపుణులను సంప్రదిస్తున్నారు.

రూ.1.15 లక్షల కేటాయింపుల్లో 43 వేల కోట్లే ఖర్చు.....

2015-16 బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉన్నా... ఖర్చు మాత్రం తక్కువగా ఉన్న అంశంపై సర్కార్‌ను నిలదీస్తారు. 1.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపినా... ఇప్పటి వరకు 43 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారాని కాంగ్రెస్‌ నేతలు లెక్కలు వేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 400 వందల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్‌ హామీ అమలుకు నోచుకోలేదన్న అంశంపై సర్కార్‌ను నిలదీసేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో తమ వ్యూహాన్ని అమలు చేసే విషయంలో కాంగ్రెస్‌ నేతలు ఎంతవరకు సమన్వయంలో వ్యవహరించి, సక్సెస్‌ అవుతారో చూడాలి. 

సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన డీజీపీ

హైదరాబాద్: డీజీపీ అనురాగ్‌శర్మ ఇవాళ రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌ను సందర్శించారు. విద్యార్థులు తాము తయారు చేసిన వైజ్ఞానిక వస్తువులతో చేపట్టిన సైన్స్ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులను అభినందించారు.

పరిటాల రవి ఘాట్ ను సందర్శించిన మోహన్ బాబు, సునీత

అనంతపురం:తమ్ముడు పరిటాల రవి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, పరిటాల రవి అడుగుజాడల్లో సునీత ధైర్యంగా నడుస్తోందని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆయన వెంకటాపురంలో పరిటాల రవి ఘాట్‌ను సందర్శించారు. ఘాట్‌ వద్ద మోహన్ బాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిటాల రవి కుటుంబాన్ని నమ్ముకున్న వారందరూ సంతోషంగా జీవిస్తూ, పరిటాల కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. రాయలసీమ ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

13:57 - February 28, 2016

ఖమ్మం : ఖమ్మం మున్సిపాలిటికి దేశవ్యాప్తంగా రికార్డు ఉంది. మున్సిపల్ పాలకవర్గంపై ఎర్రజెండాను ఎగురవేసిన ఏకైక సింహం చిర్రావూరి లక్ష్మీనర్సయ్య. వరుసగా నాలుగు సార్లు చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఖమ్మం  మున్సిపల్ ఎన్నికల్లో తనదైన శైలిలో అందరిని కలుపుకుంటూ ఎర్రజెండాను రెపరెపలాడించారు. 
తనదైన ముద్ర..
ఖమ్మం మున్సిపల్ డివిజన్ లో చిర్రావూరి పేరు తెలియని వారుండరు. ఖమ్మం మున్సిపల్ పాలకవర్గంలో తనదైన ముద్రవేసుకుని జిల్లాలో సీపీఎం జెండాను సగర్వంగా ఎగరేసిన నాయకుడు చిర్రావూరి లక్ష్మీనర్సయ్య. సీపీఎం ఉద్యమకారుడైన చిర్రావూరి అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారు. సాయుధ రైతాంగపోరాటం తదితర ఉద్యమాల కారణంగా చిర్రావూరిని అప్పటి ప్రభుత్వం జైళ్లో నిర్భందించినప్పటికీ అక్కడినుండే నామినేషన్ పత్రాలను అందజేయడం ఆయనకే చెల్లింది. 
ప్రజల మద్ధతుతో..
1952 , 1961 లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి చైర్మన్ గా ఎన్నికైనా అవిశ్వాసం కారణంగా పదవిని కోల్పోయారు. 1967, 72, 81 ,87 లలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి చైర్మన్ గా 1992 వరకు కొనసాగారు.  కాంగ్రెస్ అభ్యర్థులతో పోటీలో భాగంగా ఆయన ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. రాజకీయ పోరులో అనేక దఫాలుగా అవిశ్వాసానికి గురైనా...ప్రజలు, సభ్యుల మద్దతుతో గెలుపొందారు. 1958లో ముగ్గురు సీపీఎం సభ్యుల ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పివ్వడంతో మళ్లీ చిర్రావూరి పై అవిశ్వాసాన్ని ప్రకటించారు. దాంతో అప్పుడు గద్దె దిగాల్సి వచ్చింది. దానవాయి గూడెం, ఫిల్టర్ బెడ్ మున్నేటి పై చెక్ డ్యాం తో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు.
ఒక్క ఓటు తేడాతో..
ఖమ్మం మున్సిపల్ రెండోపాలకవర్గం 1961 లో ఏర్పాటైంది. అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగు భట్ల యజ్ఞనారాయణకు సీపీఎం అభ్యర్థి చిర్రావూరి కి మద్య పోటీ జరిగింది. దీంతో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో గెలుపొందారు లక్ష్మీనర్సయ్య. మూడేళ్ల తర్వాత చైర్మన్ పదవిని కోల్పోయారు. రంగుభట్ట యజ్ఞనారాయణ అధ్యక్షుడిగా , చౌడవరపు పాపారావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీ కాలం పూర్తి కాకముందే యజ్ఞనారాయణ మృతి చెందడంతో చౌడవరపు పాపారావును అధ్యక్షపదవి వరించింది. ఆ తర్వాత 1952 నుంచి 87 వరకు కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.  ఇంతటి ఘన చరిత్ర కలిగిన  చిర్రావూరి స్పూర్తితో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతోంది పార్టీ. పలు పార్టీల నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నా. మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

13:51 - February 28, 2016

విజయవాడ : తనకు జగన్ తో విబేధాలు లేవని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబుకు అండగా ఉండేందుకు మళ్లీ టీడీపీలో చేరానని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు తెలిపారు. చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరిన డేవిడ్ రాజుతో 10టీవీతో మాట్లాడరు. తన నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని డేవిడ్ రాజు వెల్లడించారు. పార్టీ మారితే కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాదా అని అడిగిన ప్రశ్నకు తమ కార్యకర్తలు తన వెన్నంటి ఉంటారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. 
కార్యకర్తల ఆగ్రహం..
యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు టిడిపిలో చేరడంపై వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్‌ రాజు చేసిన పని క్షమించలేనిదంటూ మండిపడ్డారు. యర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేశారు. 

13:47 - February 28, 2016

కరీంనగర్ : వీణవంక రేప్‌ ఘటనలో నిందితుడు రాకేష్‌ను హుజూరాబాద్‌ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశామని.. వారిలో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదేరోజు రాత్రి నిందితులపై నిర్భయ, ఐటీ యాక్ట్‌, ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారని డీసీపీ వెల్లడించారు. 

13:45 - February 28, 2016

శ్రీకాకుళం : జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పాడలి, దుగ్గుపురం నుంచి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వాసితులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిజర్వాయర్‌ వద్ద నిర్వాసితుల ర్యాలీని పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రాజెక్ట్‌ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ అమల్లో ఉంది.

శ్రీవారి సేవలో రకుల్..

తిరుమల :  హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. 

13:12 - February 28, 2016

ఒకప్పడు రాజులు అగ్రవర్ణాల జీవితాలే సాహిత్యంగా చెలామణి అయ్యింది. నిన్నమెున్నటిదాక  కళాఖండాలుగా పేరుపడ్డసినిమాల కథలన్నీ అగ్రవర్ణజీవితాల చుట్టూ అల్లబడినవే.. అయితే దళితబహుజనులు చదువుకొని సాహిత్యరంగంలో ప్రవేశించడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టుగా మారింది. ఇప్పడు దళితులు బహుజనులు కావ్యవస్తువులుగా కవితా వస్థువులుగా కథాపాత్రలుగా మారుతున్నారు.అలాంటి వారిలో సఫాయిలు కూడా ఉన్నారు. ఎవరూ పట్టించుకోని శ్రమజీవులైన సఫాయిలపై అద్భుతమైన కావ్యం రాశారు కొమ్ముసుధాకర్. దళిత బహుజన చైతన్య కెరటం కొమ్ము సుధాకర్ కవిత్వం గురించి ప్రముఖ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య  ఏమంటారో నేటి ధిక్కార స్వరంలో చూద్దాం...

13:10 - February 28, 2016

కొందరు కష్టపడకున్నా ప్రతిభలేకున్నా అనుచరగణసహకారంతో గొప్ప రచయితలుగా వెలిగి పోతుంటారు.మరికొందరు ఎంత కష్టపడినా...తమ కథలను కవితలను మార్కెటింగ్ చేసుకోలేక పోవడంవల్ల వెలుగులోనికి రాలేక పోతుంటారు.అలాంటి వాడే కథారచయిత గణపతిరావ్. ఆయన ఎన్నో కథలురాసినా, ఎన్నో కథాసంపుటాలు వెలువరించినా కుహనా కథారచయిలు ఆయన ప్రతిభను గుర్తించలేదు. పత్రికలు ఆయన కథలను ప్రచురించలేదు. అయినా ఆయన బాధపడలేదు. సమాజంలో జరిగే దుర్నీతిని, దురన్యాయాలను, మేడిపండు మేధావుల దుర్మార్గాలను తన కథల్లో ఎండగట్టాడు. కథాసంపుటాలుగా వెలువరించాడు.పట్టుబట్టి ప్రజలచేత చదివించాడు.అలాంటి కథారచయిత ,సీనియర్ పాత్రికేయులు  గణపతిరావ్ కథాప్రస్థానం పై ఓ  కథనం.

13:09 - February 28, 2016

`నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో `లాంటి చక్కని గేయాలతో సమాజంలో చైతన్యం వెల్లువెత్తించిన అభ్యుదయగేయకవి  చింతల యాదగిరి. ప్రచార పటాటోపాలకు దూరంగా ఉంటూ... సమాజంలోని ప్రతి దృశ్యానికి చలించిపోతూ పాటై కరిగిపోతుంటాడాయన. ఇటీవలే తీగో నాగో ఎన్నియలో అనే గేయసంపుటిని వెలువరించిన ప్రజాగేయ రచయిత ,గాయకులు చింతల యాదగిరి పై 10 టి.వి.ప్రత్యేక కథనం.

12:57 - February 28, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజన అంశం కేంద్రానికి సవాల్‌గా మారింది. రాష్ట్ర విభజన జరిగి 20 నెలలు పూర్తయినా.. ఉద్యోగుల కేటాయింపు పూర్తిస్థాయిలో జరగకపోవడంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమల్‌నాథ్‌ కమిటీ విభజన ప్రక్రియను నత్తనడకన కొనసాగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే.. కేంద్రం మాత్రం మార్చి నెలాఖరులోగా ఎలాగైనా విభజన ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది. 
కత్తిమీద సాము..
ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రభుత్వాలకు కత్తి మీద సాములా తయారైంది. మొత్తం 153 ప్రభుత్వ శాఖల్లో 88,232 మంది రాష్ట్ర స్థాయి కేడర్‌ ఉద్యోగులున్నారు. అయితే ఇందులో 58:42 నిష్పత్తిలో 32,019 ఉద్యోగులను ఇరు రాష్ర్టాలకు పంపాలని కేంద్ర డీవోపీటి గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. ఇక 21 డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులను వారు ఎంచుకున్న రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. మరో 18 శాఖల్లోని ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయింపులు చేసింది కమల్‌నాథ్‌ కమిటీ. మరో రెండు శాఖలకు సంబంధించిన ఫైల్స్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 
ఆ శాఖల్లో ఇంకా మొదలు కాలేదు..
ఇక ఇప్పటివరకు అతిపెద్ద శాఖ అయిన పోలీసు డిపార్ట్‌మెంట్‌,.. వైద్య ఆరోగ్యశాఖలో విభజన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇక 18 శాఖల్లోని ఉద్యోగుల విభజన జరిగినా చాలామంది ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. తమను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయాలని పలువురు ఉద్యోగులు కమల్‌నాథ్‌ కమిటీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు హోం, వైద్యశాఖలో ఉద్యోగుల పంపిణీతో పాటు 18 శాఖల్లో తాత్కాలిక ఉద్యోగుల విభజనతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కమల్‌నాథ్‌ కమిటీ విభజన విషయంలో పారదర్శకత చూపించడం లేదని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
20నెలలు దాటినా.. 
ఇదిలావుంటే ఎలాగైనా మార్చి నెలాఖరులోగా ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కమల్‌నాథ్‌ కమిటీకి కేంద్ర డీవోపీటీ స్పష్టం చేసింది. మరోవైపు జూన్‌ తర్వాత ఉద్యోగులంతా అమరావతికి రావాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో వారిలో ఆందోళన మొదలైంది. రాష్ట్రాలు ఏర్పడి 20 నెలలు దాటినా ఇంకా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగుల విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. 

12:52 - February 28, 2016

ఖమ్మం : నగరంలో కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం ఖిల్లాపై జెండా ఎగురవేసేందుకు అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీల కంటే సీపీఎం ప్రచారంలో దూసుకుపోతుంది. గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన సీపీఎం అభ్యర్ధి అఫ్రోజ్‌ సమీనా 30వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్నారు. తనకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆమె అంటున్నారు. తప్పకుండా సీపీఎం అఖండ విజయం సాధించడం తథ్యం అంటూ సమీనా ధీమా వ్యక్తం చేశారు. 

12:49 - February 28, 2016

కరీంనగర్‌ : జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి వినయశ్రీని హతమార్చి గంప కింద దాచిన అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. హోంగార్డు రాజస్వామి కుమార్తె వినశ్రీ శనివారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. కాగా రాజస్వామి ఇంటి పక్కనే ఉన్న వెంకటస్వామి ఇంట్లో గంప కింద చిన్నారి వినయశ్రీ మృతదేహం లభ్యమైంది. అయితే వెంకటస్వామి నిన్న సాయంత్రం నుంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్టు స్థానికులు గుర్తించారు. ఈ హత్యకు పాతకక్షలే కారణంగా తెలుస్తోంది. 

విషాహారం తిని 20 మంది విద్యార్థినిలు..

కడప : చిట్వేల్ కస్తూర్భా దారుణం చోటు చేసుకుంది. పాఠశాలలో విషాహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

12:42 - February 28, 2016

మిత్రులు త్రివిక్రమ్, సునీల్ కాంబినేషన్ లో మూవీ రాబోతునట్లు సమాచారం. సునీల్ కోసం,మాటల మాంత్రికుడు టైటిల్ తో సహా ఓ స్టోరీని సిద్దం చేసి పెట్టినట్లు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్ ఎప్పుడు తెరపై రాబోతోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమే లైఫ్ ఇచ్చాడు..

కొన్ని స్నేహాలు చూసేవాళ్లకు ముచ్చట కనిపిస్తాయి. అలాంటి స్నేహమే త్రివిక్రమ్ శ్రీనివాస్ - సునీల్ లది . ఈ ఇద్దరిది భీమవరమే అందులో ఇద్దరు ఒకే కాలేజీ చదువుకున్న వారే. అంతకు మించి ఇద్దరికి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చే వీరిద్దరి మధ్య మరింత క్లోజ్ నెస్ పెరిగేలా చేసింది. కెరీర్ ఆరంభంలో సునీల్ కి ఛాన్స్ లు రావడానికి త్రివిక్రమ్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడ్డ విషయాన్ని సునీల్ స్వయంగా చాలా సార్లు చెప్పాడు.

కథ రెడీ..

ప్రస్తుతం సునీల్ కామెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ ఇప్పుడు వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్నాడు. దీంతో సునీల్ తో మాటల మాంత్రికుడు ఎప్పుడు సినిమా చేస్తాడా అని ఆడియన్స్ కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను వమ్ముచేయకుండా త్రివిక్రమ్ ఆల్ రెడీ సునీల్ కోసం కథ రెడీ చేసి పెట్టినట్లు సమాచారం.

బత్తి సునీల్ కోసమే..

సునీల్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో హీరోగా చేయాలని ఎదురుచూస్తున్నాడు. ఆ కల ఛాన్స్ త్వరలో నెరవేరుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సునీల్ ఈ మధ్య స్వయంగా చెప్పడం విశేషం. బంతి అనే స్టోరీని త్రివిక్రమ్ ఈ కామెడి హీరోకోసం సిద్దం చేసి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇద్దరూ బిజీ బిజీ..

ప్రస్తుతం సునీల్ రెండు మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ స్టార్స్ తో కమిట్ అయిపోయాడు. వీరిద్దరూ తమ సినిమాలు కంప్లీట్ చేసి బత్తి సినిమా కోసం రెడీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే మరో ఎడాదిలో ఈ మిత్రుల కాంబినేషన్ లో మూవీ రానున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చేసే సినిమా సునీల్ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

12:14 - February 28, 2016

వివిధ సాహితీ వేదికల వేడుకల విశేషాల్లేంటో వీడియోలో చూడండి.. 

కరీంనగర్ లో మరో దారుణం..

కరీంనగర్: జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి వినయశ్రీని హతమార్చి గంప కింద దాచిన అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. హోంగార్డు రాజస్వామి కుమార్తె వినశ్రీ శనివారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. కాగా రాజస్వామి ఇంటి పక్కనే ఉన్న వెంకటస్వామి ఇంట్లో గంప కింద చిన్నారి వినయశ్రీ మృతదేహం లభ్యమైంది. అయితే వెంకటస్వామి నిన్న సాయంత్రం నుంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్టు స్థానికులు గుర్తించారు.

12:08 - February 28, 2016

రకూల్ ప్రీతిసింగ్ పై ఇండస్ట్రీలో హాట్ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తెలుగులో ఈ బ్యూటీకి యంగ్ హీరో దగ్గరుండి మారీ ఛాన్స్ లు ఇప్పిస్తున్నట్లు సమాచారం.  ఆ యంగ్ హీరో తో రకూల్ డేటింగ్ ఉన్నట్లు ఇండస్ట్రీ కోడైకూసుస్తోంది. ఇంతకీ రకూల్ ఏ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందో చూద్దాం.
రకూల్ హవా..
తెలుగులో ప్రస్తుతం రకూల్ హవా నడుస్తోంది. కేవలం రెండు సూపర్  హిట్స్ తో ఈభామ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అయితే లౌక్యం మూవీ తరువాత ఈ భామకు ఆ స్థాయి హిట్టు పడలేదు. అయిన కూడా రకూల్ కి  బడా ఛాన్స్ లు వచ్చిపడుతున్నాయి.  ఇలా ప్లాప్స్ వస్తున్నప్పటికి ఈ భామకు బడా ఛాన్స్ లు రావడానికి ఓ యంగ్ హీరో కారణమని తెలుస్తోంది. 
ఆ యంగ్ హీరోనే కారణం.. 
రకూల్ ఈ ఎడాది స్టార్టింగ్ లో నాన్నకు ప్రేమతో సినిమాతో మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ భామ అల్లుఅర్జున్ తో సరైనోడు సినిమా చేస్తోంది. దీనితో పాటు లేటేస్ట్ గా రామ్ చరణ్ తో మరోసారి తనిఒరువన్ రిమేక్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఛాన్స్ రావడానికి సదరు యంగ్ హీరోనే కారణమని వినిపిస్తోంది.
వీరు డేటింగ్ లో ఉన్నారా?
రానా, త్రిష.. ఇదంతా ఒకప్పటి మాట. ఎట్ ప్రజెంట్ రానా, రకుల్‌ ఇది లేటేస్ట్ న్యూస్. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. నిజానికి తనిఒరువన్ రిమేక్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలియానాను తీసుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ రానానే ఆ ఛాన్స్ రకూల్ కి వచ్చేలా చేశాడని వినిపిస్తోంది.
జిమ్ ప్లాన్ కూడా రానాదే..
ప్రస్తుతం రానా,రకూల్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ భామ ఇటీవలే హైద్రాబాద్ లో ఓ హైటెక్ జిమ్ ఒపెన్ చేసింది. ఈజిమ్ ప్లాన్ కూడా రానానే ఇచ్చినట్లు వినికిడి.  ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇండస్ట్రీలో ఇలాంటి న్యూసే వినిపిస్తోంది. మరి నిజంగానే వీరు డేటింగ్ లో ఉన్నరా లేక కావాలనే ఎవరైనా క్రియేట్ చేస్తున్నరా అనేది మాత్రం వీరు నిజం చెప్తేనే తెలుస్తోంది. లేకపోతే ఇలాంటి వార్తలు రన్ అవుతునే ఉంటాయి.

12:03 - February 28, 2016

హైదరాబాద్‌ : నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో.. బైక్‌ రేసింగ్‌కు పాల్పడుతూ.. వేగంగా వాహనాలు నడుపుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. 51 మంది మైనర్లు సహా వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు, మైనర్లకు ఈ కౌన్సింగ్ లో పోలీసులు చెప్పారు. 

11:57 - February 28, 2016

హైదరాబాద్ : సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రోట్‌కాన్‌ 10కే జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి, సినీ హీరో మంచు మనోజ్‌ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. 10కే రన్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. వంద శాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేస్తామని జగదీష్‌రెడ్డి అన్నారు. ఇక ప్రైవేట్‌ విద్యాసంస్థలు కూడా తాము ఆర్జించే సంపాదనలో 25 శాతం సమాజం కోసం ఖర్చు చేయాలని హీరో మంచు మనోజ్ అన్నారు. 

సీఎంకు తప్పిన ప్రమాదం..

తిరువనంతపురం : కేరళ సీఎం ఉమెన్ చాందీకి ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు కొట్టాయం వద్ద అదుపుతప్పింది. సీఎం ప్రయాణిస్తున్న కారు స్కిడ్ అయ్యి రోడ్డుప్రక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదం నుంచి చాందీ క్షేమంగా బయటపడ్డారు. 

నవ్యాంధ్రలో భాగస్వామ్యం అయ్యేందుకే..

జయవాడ : నవ్యాంధ్రలో భాగస్వామ్యం అయ్యేందుకే తాను టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు మీడియాతో మాట్లాడారు. ''చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాను. గతంలో 24 ఏళ్లు టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వహించాను. వ్యక్తిగత కారణాలతో గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరాను. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి మద్ధతుగా నిలవడం కోసమే మళ్లీ టీడీపీలో చేరాను. నవ్యాంధ్రలో అందరూ భాగస్వామ్యం కావాలి. మా నియోక వర్గ సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లాను.

ఎమ్మెల్యేపై కార్యకర్తల ఆగ్రహం

ప్రకాశం : వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై స్థానిక కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్లెక్సీలు చింపేశారు. మరో వైపు డేవిడ్ రాజు దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు కార్యకర్తలు పూనుకుంటున్నారు. 

11:11 - February 28, 2016

విజయవాడ : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ ఆపరేషన్ ఆకర్ష్ తో షేక్ అవుతోంది. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ గూటికి చేరాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల వలసల సంఖ్య ఆరుకు చేరింది. తమ ఎమ్మెల్యేలతో టీడీపీ బేరసారాలు ఆడిన టేపులు తమ వద్ద ఉన్నాయంటూ వైసీపీ నేతలు శుక్రవారం నుంచి చెబుతున్న నేపథ్యంలో మరో ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ అయ్యాడు. ఈ తరుణంలో మరి వైసీపీ ఆ టేపులను బయట పెడుతుందా? లేదా బెదిరింపులకోసమే ఈ డైలాగ్స్ చెబుతుందో తేలిపోతుందని కామన్ మ్యాన్ మాట్లాడుకుంటున్నాడు. 

19 ఏళ్ల జర్మన్ యువతిపై..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల జర్మనీ యువతిపై ఓ ఆటో డ్రైవర్‌తోపాటు కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ ఘటన గురించి వెల్లడించడానికి భయపడిన బాధితురాలు జర్మనీ వెళ్లిపోయక ఈమెయిల్ ద్వారా ఢిల్లీ మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీలో దొంగ బీభత్సం..

ఢిల్లీ : టోల్ ప్లాజాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తుపాకితో సిబ్బందిపై దాడిచేసి  రూ.2.5 కోట్లు అపహరించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

కఠినంగా శిక్షించండి..

కరీంనగర్ : వీణవంక సామూహిక అత్యాచారం ఘటనపై  మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. అత్యాచార ఘటనపై ఏఐసీసీ, దళిత వర్గాలు ఆరా తీశాయి. ఘటనను కాంగ్రెస్ నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులుకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా నేడు నిందితులను మీడియాముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

10:19 - February 28, 2016

థానే : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ యువకుడు ఉన్మాదిలా మారి కుటుంబసభ్యులనే అత్యంత పాశవికంగా హతమార్చాడు. థానే జిల్లాలోని కాసర్వాడవలి గ్రామానికి చెందిన హసన్‌ అన్వర్ వారేకర్‌ 14 మంది కుటుంబ సభ్యులను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం అదే కత్తిని చేతిలో పెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల్లో తల్లి, తండ్రి, భార్య, ముగ్గురు చెల్లెళ్లు, వారి పిల్లలు ఏడుగురు ఉన్నారు. ఆస్తి వివాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట మత్తు మందు కలిపిన పానీయం తాగించి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలోనే హత్యాయత్నానికి గురైన ఒక మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

వైసీపీకి మరో షాక్..

విజయవాడ : వైసీపీకి మరో షాక్ తగిలింది. వలసల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె ఎమ్మెల్యే డేవిడ్ రాజు మరికొద్ది సేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. డేవిడ్ రాజుతో కలిపి మొత్తం వలస ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.

09:42 - February 28, 2016

హైదరాబాద్ :చిట్టి పొట్టి చిన్నారులతోపాటు.. బాల బాలికలకు స్వీట్ న్యూస్ అందించింది జీహెచ్ఎంసీ ఎండాకాలం సెలవులు సద్వినియోగం చేసుకునేలా పాత ప్లాన్‌ మళ్లీ అమల్లోకి తెస్తోంది. నామ మాత్రపు ఫీజుతో వివిధ రకాల క్రీడల్లో శిక్షణకోసం ఏర్పాట్లు చేస్తోంది..  
సమ్మర్ క్యాంపుకు గ్రీన్ సిగ్నల్..
ఈ ఏడాది సమ్మర్‌ క్యాంపుల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది జీహెచ్ఎంసీ.. రెండ వేల కేంద్రాల్లో 55 రకాల క్రీడలకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. క్రీడావిభాగం ఈ బాధ్యతలు అప్పగించింది.. ఈ క్యాంపులకోసం గ్రౌండ్‌లను సిద్ధం చేసే పనిలో బిజీ బిజీగాఉన్నారు అధికారులు.
కొరత రాకుండా..
ఈ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌కోసం జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని క్రీడా స్థలాల్లో ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఎక్కువ ఆదరణ ఉన్న స్పోర్ట్స్‌ మెటీరియల్‌ కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. నామినల్‌ ఫీజుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నగరవాసులను కోరుతున్నారు.. 
గ్రౌండ్ ల అభివృద్ధి..
అటు గ్రేటర్‌ పరిధిలోఉన్న ఖాళీ స్థలాలనుకూడా క్రీడా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.. ఈ గ్రౌండ్‌ద్వారా ఆదాయం మరింత పెంచుకోవాలని చూస్తోంది.. ఇప్పటికే 120 గ్రౌండ్‌ల లీజు ద్వారా 33లక్షల ఆదాయం సమకూర్చుకుంది.. ఇతర గ్రౌండ్‌నుకూడా అభివృద్ధి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో గత ఏడాది సమ్మర్‌ క్యాంపులకు నో చెప్పింది జీహెచ్ఎంసీ దీంతో తల్లిదండ్రులనుంచి భారీగా విమర్శలొచ్చాయి. ఈసారి అలా జగరకుండా ముందునుంచి ప్లాన్‌తో ముందుకు వెళుతున్నామని అధికారులు చెబుతున్నారు.

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలీవుడు హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో అత్త రాణి సురీందర్ కపూర్‌లపేరు కూడా చేర్చింది. గత కొన్ని రోజులుగా తనని వారు మానసికంగా వేదిస్తున్నారంటూ ముంబై పోలీసులను ఆశ్రయించింది. కరిష్మా స్టేట్‌మెంట్‌ని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

50 మంది మైనర్ల అరెస్టు..

హైదరాబాద్  : నెక్లెస్ రోడ్డులో సెంట్రల్ జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న బైక్ రేసింగ్ లో 50 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 50 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 

09:03 - February 28, 2016

గుంటూరు : గుండె తడి ఆరడం లేదు. మనసు కుదుటపడటం లేదు. ఆ పిలుపు కోసం వారి హృదయాలు పరితపిస్తున్నాయి. ఏడ్చి ఏడ్చి వారి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. గుండెల నిండా బాధను వెల్లగక్కేందుకు కన్నీళ్లు కూడా సహకరించడం లేదు. కళ్లల్లో ఒత్తులెసుకుని ఎదురుచూస్తున్నా అతని సమాచారం తెలియడం లేదు. ఇది నైజిరియాలో కిడ్నాపైన గుంటూరు జిల్లా వాసి వెంకటపవన్‌ కుమార్‌ కోసం కుటుంబ సభ్యులు పడుతున్న తపన. 
ఐదు రోజులు గడిచినా..
కొడుకు కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు.. భర్త కోసం భార్య అరణ్య రోదనలు.. తండ్రి కోసం తల్లడిల్లుతున్న బిడ్డలు..  5 రోజులు గడిచినా ఎక్కడున్నాడో తెలియడం లేదు వీరి బాధ మాటలకందనిది. వీరి వ్యధ వర్ణించలేనిది. ఒకరి కోసం ఒకరు.. ఒక్కరి కోసం అందరూ అన్నట్లుగా ఉన్న ఈ కుటుంబంలో అలజడి రేగింది. 
గుండెలవిసేలా..
గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన అయ్యశెట్టి వెంకటపవన్‌ కుమార్‌ కిడ్నాపై ఐదు రోజులు గడిచినా ఏమయ్యాడో.. ఎక్కుడున్నాడో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. క్షణక్షణం గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఆ సమస్యలే కారణమా..?
ఎంఎస్సీ పూర్తి చేసిన అయ్యశెట్టి వెంకటపవన్‌ కుమార్‌.. నైజీరియాలోని అగ్‌బీడే అగ్రి ప్రాజెక్టు లిమిటెడ్‌లో గతేడాది ఆగస్ట్‌లో ఉద్యోగంలో చేరాడు. వేల ఎకరాల్లో సాగుచేస్తున్న పంటల నిర్వహణ చూసేందుకు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ భూముల వ్యవహారాలకు సంబంధించి పలువురితో సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 20న పవన్‌కుమార్‌తో పాటు మరో తొమ్మిది మందిని నైజీరియన్లు కిడ్నాప్‌ చేశారు. అదే రోజు తనను అపహరించిన విషయాన్ని సోదరుడు రాజాకు ఫోన్‌ చేసి చెప్పాడు పవన్‌. అంతలో ఫోన్‌ కట్‌ కావడంతో అప్పటి నుంచి పవన్‌ వివరాలు తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
భారీ డబ్బులు డిమాండ్..
కిడ్నాప్‌కు గురైన పవన్‌ను కాపాడాలని కుటుంబ సభ్యులు రాయబార కార్యాలయం, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌తో మొరపెట్టుకున్నారు. నైజీరియన్ల చెరనుంచి కాపాడాలని అక్కడి ప్రభుత్వానికి సందేశం పంపారు. గురువారం రాత్రి నైజీరియా ప్రభుత్వం నుంచి పవన్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందింది. కిడ్నాపర్లు కంపెనీ యాజమాన్యాన్ని భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అపహరణకు గురైన వారందరిని విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏదీ ఏమైనా క్షేమంగా తమ బిడ్డ తిరిగి రావాలని పవన్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు. 

08:48 - February 28, 2016

టీజర్ విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తీరా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ను చూసి వెనక్కు తగ్గారు. అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్ సరైనోడు చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ లో బన్నీ మాస్ డైలాగ్‌లతో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసాడు. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ నుండి ప్రక్కకు తప్పుకున్నట్టు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్థార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న విడుదల కానుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరైనోడు చిత్రాన్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు సన్నద్దమయ్యాయని ఇండస్ట్రీ టాక్. 

14 మంది కుటుంబ సభ్యుల్ని చంపేసి..

మహారాష్ట్ర : థానేలో దారుణం చోటు చేసుకుంది. 14 మంది కుటుంబ సభ్యులను హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

5కె రన్..

హైదరాబాద్ :  నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 5కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి రోటోకాన్ 5కే పరుగును ప్రారంభించారు. ఈ 5కె రన్ లో హీరో మంచు మనోజ్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

08:24 - February 28, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయా ? ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో అధికార పార్టీ నేతలు జరిపిన ఫోన్‌ సంభాషణలు వైసీపీకి అస్త్రాలుగా మారనున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. త్వరలోనే తమ దగ్గర ఉన్న కీలక ఆధారాలను బట్టబయలు చేసి అధికార పార్టీని ఇరుకున పెడతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
అప్పుడలా.. ఇప్పుడిలా..
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి టీడీపీ అడ్డంగా బుక్కైంది. టీడీపీ ప్రలోభాలను ముందే పసిగట్టిన గులాబీ పార్టీ ఆధారాలతో సహా వాటిని బయటపెట్టింది. దీంతో టీడీపీ వేసిన ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌ అయ్యింది. అంతేకాకుండా తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి అదే పరిస్థితి రాబోతుందని వైసీపీ నేతలు అంటున్నారు.
రికార్డ్ చేయించాము..
తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకోవడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ భాగంలో అధికార పార్టీ నేతలు తమ  ఎమ్మెల్యేలతో జరిపిన ఫోన్‌ సంభాషణలను రికార్డ్‌ చేయించామంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు చేసిన ప్రలోభాలకు సంబంధించి.. అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలతో ఏయే నేతలు మాట్లాడారో పూర్తి వివరాలను రాబట్టే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. త్వరలోనే ఇవన్నీ బయటపెడతామంటున్నారు. మరోవైపు భవిష్యత్‌లో అధికార పార్టీ నుండి గానీ అదేవిధంగా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు వైసీపీ నేతలు. 
ముదురుతన్న వివాదం..
మొత్తానికి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న వైసీపీ.. మరోవైపు టీడీపీ నేతలు తమ ఎమ్మెల్యేలతో చేసిన ఫోన్‌ సంభాషణలను బయటపెట్టే పనిలోపడింది. మరి వైసీపీ వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి..? అవి టీడీపీని ఏ విధంగా ఇరుకున పెడతాయో చూడాలి. 

08:19 - February 28, 2016

న్యూఢిల్లీ : కేంద్ర మానన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. హెచ్‌సీయూలో దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు సంబంధించి ఆమె పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధమయ్యాయి.
ఉద్దేశపూరితంగా తప్పుదారి..
జేఎన్‌యూ, హెచ్‌సీయూ వివాదాలపై జరిగిన చర్చలో ఇరానీ ఉద్దేశపూరితంగా సభ్యులను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్‌, సీపీఎం, జేడీయూ లు ఆరోపిస్తున్నాయి. రోహిత్‌ ఆత్మహత్యపై హెచ్‌ఆర్‌డీ మంత్రి అవాస్తవాలను ప్రవేశపెట్టడమే కాకుండా, పార్లమెంటును ఉద్దేశపూరితంగా తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. 
ఉభయ సభల్లో..
త్వరలోనే కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు. కాగా, సోమవారం తాము తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామని సీపీఎం నేత సలీం చెప్పారు. 
పచ్చి అబద్దాలు..
హెచ్‌ఆర్‌డీ మంత్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలనీ, బీజేపీ దళిత వ్యతిరేకి అని రోహిత్‌ తల్లి రాధిక చేసిన ఆరోపణలను విపక్ష నేతలు గుర్తు చేశారు. రోహిత్‌ను ఏ ఆధారంగా దేశద్రోహిగా ప్రకటించారో చెప్పాలని రాధిక శుక్రవారం డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 
స్పీకర్ ను కలిసిన యేచూరి..
సభ్యుల హక్కుల ఉల్లంఘన విషయంలో తాను లోక్‌సభ స్పీకర్‌ను కలిసి మాట్లాడుతానని సీపీఎం ప్రధాన కార్యదర్శి తెలిపారు. రాజ్యసభలో ఏచూరి ఇరానీకి వ్యతిరేకంగా పలు అంశాల్ని లేవనెత్తారు. ఏచూరితో పాటు సీపీఐ నేతలు సుధాకర్‌రెడ్డి, డి. రాజా రోహిత్‌ బంధుమిత్రులతో కలిసి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

08:14 - February 28, 2016

హైదరాబాద్ : సనత్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ముగ్గురు రౌడీ షీటర్లు సహా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సరైన ధృవపత్రాలు లేని  55 బైక్ లు, ఏడు ఆటోలు , రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

08:10 - February 28, 2016

న్యూఢిల్లీ : 'ఫ్రీడమ్ 251 ఫ్రీడమ్ 251' గత కొద్ది రోజులుగా మీడియా మాధ్యమాల్లో మోత మోగుతున్న పేరు. 251 రూపాయలకే స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని 'రింగింగ్‌బెల్స్‌' సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం లక్షలాది మంది బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 'రింగింగ్ బెల్స్' పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ ప్రారంభమైంది. నోయిడా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ నిర్మాణం గురించి నిజాలు నిగ్గు తేల్చే పనిని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. కాగా రింగింగ్‌బెల్స్‌ సంస్థ, దాని ప్రమోటర్లకు చెందిన ఆర్థిక వివరాలు, బ్యాంక్‌ ఖాతాలను ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణలో తేడా తేలితే మాత్రం 'ఫ్రీడమ్ 251' మొబైల్ కోసం బుక్ చేసుకున్న వారి డబ్బులు వెనక్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

 

08:04 - February 28, 2016

హర్యాన : జాట్ల ఉద్యమం సందర్భంగా హర్యానాలో మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వచ్చిన వార్తలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. దుస్తులు చిరిగిపోయి అస్తవ్యస్తంగా ఉండడాన్ని తాను చూశానని ట్రక్కు డ్రైవర్ నిరంజన్‌సింగ్‌ తెలిపారు. హర్యానా డిజిపి హసన్‌పూర్‌ను సందర్శించారు. దుస్తులు లేని మహిళలు కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని ఐజి రాజశ్రీసింగ్‌ తెలిపారు. ముర్తల్‌లో అత్యాచార ఘటనలపై స్థానికులు భిన్నమైన కథనాలు చెబుతున్నారని పేర్కొన్నారు. హర్యానా హైకోర్టు ఆదేశం మేరకు మహిళల సామూహిక అత్యాచారంపై ఖట్టర్‌ ప్రభుత్వం సిట్‌తో విచారణ జరిపిస్తోంది. ఘటనా స్థలంలో మహిళల దుస్తులను సిట్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన చోట ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జాట్ల ఉద్యమం నేపథ్యంలో ఈ నెల 22న సోనిపట్ వద్ద జాతీయరహదారిపై ఆందోళనకారులు 10 మంది మహిళా ప్రయాణికులను వాహనం నుంచి బలవంతంగా దింపారు.  సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

07:59 - February 28, 2016

న్యూఢిల్లీ : పోలీసుల సమక్షంలోనే పటియాల కోర్టులో తనపై దాడి జరిగిందని జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ పేర్కొన్నాడు. కోర్టు గేటు వద్ద జర్నలిస్టులు తనను చుట్టుముట్టారని కన్హయ్య తెలిపాడు. వారిని తప్పించి పోలీసులు తనను కోర్టులోకి తీసుకెళ్లారని, మధ్యలో లాయర్‌ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని, అతడు మరికొందరిని కూడా పిలిచాడని చెప్పాడు. దాడిలో తన దుస్తులు కూడా చినిగిపోయాయని, ఓ పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని కన్హయ్య చెప్పాడు. దాడి చేసిన వ్యక్తి దర్జాగా వెళ్లిపోతుంటే పోలీసులు పట్టించుకోలేదని కన్హయ్య తెలిపాడు. పటియాల కోర్టులో జరిగిన దాడిపై ఫిబ్రవరి 17న న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణకు సంబంధించి కన్హయ్య వీడియో ముందు చెప్పిన సాక్ష్యం మీడియాకు అందింది.

'సెస్' ఎన్నికలు ప్రారంభం..

కరీంనగర్ : సిరిసిల్లలో 'సెస్' ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ పోలింగ్ నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. 11 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 287 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.   

నేడు బంగ్లా Vs లంక..

హైదరాబాద్ : ఆసియా టి-20 కప్ లో భాగంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై గెలిచి టాప్ లో ఉంది. కాగా శ్రీలంక యుఎఇ పై అతి కష్టం మీద ఒక మ్యాచ్ గెలిచింది. నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

రెండో రోజు లేపాక్షి ఉత్సవాలు..

అనంతపురం : నేడు లేపాక్షి రెండో రోజు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొంటారు. కాగా టూరిజం అభివృద్ధి కోసం ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.  

తిరుమలలో రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, నడకదారి భక్తుల సర్వ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.  

మీడియా ముందుకు గ్యాంగ్ రేప్ నిందితులు..

హైదరాబాద్ : వీణవంకలో మాయమాటలు చెప్పి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని నేడు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కాగా వీరిపై నిర్భయ కేసు నమోదు చేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

07:32 - February 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అధికార పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పదవులు భర్తీ కాలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ పదవులను భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో ఆశావహుల్లో చర్చ మొదలైంది.
వలస నేతలకే ప్రాధాన్యం..!
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కృషి చేసి.. ఉద్యమంలో జెండా పట్టిన నేతలకు పార్టీలో ఇంకా గుర్తింపు దక్కడంలేదనే ఆందోళన పార్టీ నేతల్లో కనబడుతోంది. సాధారణ ఎన్నికల నాటి నుండి నేటివరకు వలస నేతలకే ప్రాధాన్యత దక్కుతుందన్న అనుమానాలు గులాబి పార్టీ నేతల్లో ఉన్నాయి. తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఏనాడు కనిపించని నేతలకు ప్రభుత్వపరంగా గుర్తింపు దక్కుతుందన్న ఆరోపణలను అధికారపార్టీ ఎదుర్కొంటోంది.
ఎదురు చూపులు..
పదవులు ఆశించిన నేతలతోపాటు.. సీఎం నుంచి హామీలు పొందిన పలువురు నేతలు కూడా పదువులకై ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుండి ఏదో ఒకరకంగా పదవుల భర్తీలో జాప్యం జరుగుతూనే ఉంది. ఇటీవల పలు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగడం ఎన్నికలకోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టలేదు. ఇదిలా ఉంటే ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. తమను పదవులలో భాగస్వాములను చేయాలంటున్నారు.
లాబీయింగ్ షురూ..
వరంగల్ ఖమ్మం, కార్పోరేషన్ ఎన్నికలు మినహా ప్రధాన అంశాలు ఏమి లేకపోవడంతో.. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలవుతుందనే ఆశాభావం నేతల్లో వ్యక్తమవుతోంది. మార్చిలో అసెంబ్లీ సమావేశాల అనంతరం  5 వేల వరకు పదవుల భర్తీ మొదలయ్యే అవకాశం ఉందనే సమాచారంతో.. ఇప్పటి నుంచే నేతలు లాబీయింగ్ లు మొదలుపెట్టారు. 

సనత్ నగర్ లో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : నగరంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కార్తీకేయ ఆధ్వర్యంలో సనత్ నగర్ లో ఈ సెర్చ్ నిర్వహించారు. 200 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇందులో ముగ్గురు రౌడీ షీటర్లతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55 బైకులు, ఏడు ఆటోలు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నేడే ఆస్కార్ అవార్డ్స్..

హైదరాబాద్ : సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నేడు జరగనుంది. లాస్ ఏంజెల్స్ వేధికగా జరగున్న ఈ ఉత్సవానికి హాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకలకోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

07:04 - February 28, 2016

ఖమ్మం : కార్పొరేషన్‌ ఎన్నికల్లో బహుముఖ పోరు కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రంగంలో 291 మంది అభ్యర్ధులు మిగిలారు. ఇంకా రెబల్స్‌గా ఉన్న అభ్యర్ధుల మద్దతు కోసం పలు పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఖమ్మం ఖిల్లాపై జెండా ఎగురవేసేందుకు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.  
తిరస్కరణ.. 
ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకు మొత్తం 587 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అధికార పార్టీ నుంచే 139 మంది నామినేషన్లు వేశారు. చాలామంది ఆశావహులు బీఫామ్‌ వస్తుందని ఆశించి భంగపడడంతో.. రెబల్స్‌గా బరిలోకి దిగారు. మొత్తం 587 నామినేషన్లలో 116 తిరస్కరణకు గురయ్యాయి.  471 మంది అర్హత సాధిస్తే.. అందులో 180 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక చివరకు 291 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. 
టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతం..
ఇక అధికార పార్టీ నుంచి టికెట్లు ఆశించి.. భంగపడ్డ పలువురు నేతలు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. చివరివరకు బీఫామ్‌ కోసం ఆరాటపడ్డారు. అయితే చాలామందికి నిరాశే మిగిలింది. ఇక రెబల్స్‌తో నామినేషన్లు ఉపసంహరించేందుకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రంగంలోకి దిగారు. చాలామందిని బుజ్జగించి పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇవ్వడంతో పలువురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం పార్టీ ప్రారంభం నుంచి కష్టపడ్డా తమకు టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమని నేతల ముందు కన్నీటిపర్యంతమయ్యారు. 
రెబల్స్ కు బుజ్జగింపులు..
ఇక ఇప్పటీకి మొత్తం 42 మంది రెబల్స్‌బరిలో ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు రంగంలోకి దిగి.. తమకు సహకరించాలని రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారపర్వంలో మునిగిపోయాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార పార్టీ.. ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. మరోవైపు కమ్యూనిస్టులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు పట్టున్న ఖమ్మంలో మరోసారి ఎర్రజెండా ఎగురవేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచారం జోరు పెంచారు. ఇక కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు కూడా తమ అభ్యర్ధుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఎవరికి వారు మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఖమ్మంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి.. ప్రజలు ఏ పార్టీకి మద్దతిచ్చి ఖమ్మం ఖిల్లాను కట్టబెడతారో చూడాలి. 

నేటి నుంచి ఎంసెట్ కు దరఖాస్తులు..

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 28వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. కాగా మే 2వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 12న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆన్లైన్ అప్లై చేసేందుకు https://www.tseamcet.in/ వెబ్ సైట్ ను సందర్శించగలరు.  

బెంగళూరులో రెండో రోజు..

బెంగళూరు : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బెంగుళూరు పర్యటన నేడు కూడా కొనసాగుతోంది. నగర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం నుంచి మేయర్ టీం బెంగుళూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

06:46 - February 28, 2016

హిందూపూర్ : లేపాక్షి జనసంద్రమైంది. కళాకారుల ఆటా పాటలతో అదిపోయింది. పలువురు ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్‌గా ఎమ్మెల్యే బాలకృష్ణ నిలిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు జెండా ఊపి ఉత్సవాలను ప్రారంభించారు. లేపాక్షి గొప్పతనాన్ని తెలిపే వివిధ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆటాపాటా అలరించాయి. రథంపై మంత్రులు పల్లె, పరిటాల సునీతతో కలిసి సందడి చేశారు.ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్, డైలాగులు, సినిమా దృశ్యాలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. 

06:42 - February 28, 2016

న్యూ ఢిల్లీ : కాషాయ ఉన్మాదం బెదిరింపులకు దిగింది. తమకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని బెదిరిస్తూ అసహనాన్ని వెళ్లగక్కుతున్నాయి. దేశంలోని అసహన వాతావరణాన్ని ప్రశ్నించేవారిని బెదిరింపులకు గురించేస్తున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బెదిరిస్తూ ఆగంతకులు, ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు. 
కొనసాగుతున్న బెదిరింపు కాల్స్.. 
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బెదిరింపు కాల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. చంపేస్తామంటూ ఆగంతకులు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. జెఎన్‌యూ, హెచ్‌సీయూ ఘటనలకు స్పందిస్తున్నందుకే అగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఏచూరికి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్‌, 500 బెదిరింపు టెక్ట్స్‌ మెసేజ్‌లు వచ్చాయి. తనకు వస్తున్న బెదిరింపులపై ఏచూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
ల్యాండ్ లైన్ నంబర్ కు సైతం..
ఇదిలా ఉంటే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ ఈ బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నెంబర్లు అన్నిటిని పోలీసులకు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 15 జేఎన్‌యూ ఘటన మొదలైనప్పటి నుంచి ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలోని ల్యాండ్‌ లైన్‌ నంబర్‌కు సైతం పలు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని తెలిసింది. ఇదిలా ఉంటే పోలీసులు వెంటనే ఆగంతకులను వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఏప్రిల్ 9న తెలంగాణ టెట్..

హైదరాబాద్ : తెలంగాణ టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు) షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 29న టెట్-2016 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ టెట్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం..

మెదక్: జిల్లాలోని చేగుంట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Don't Miss