Activities calendar

29 February 2016

21:34 - February 29, 2016

ఢిల్లీ :దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఢిల్లీ హైకోర్టు మార్చి రెండుకు వాయిదా వేసింది. కన్హయ్య కుమార్‌ దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్టు తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. జెఎన్‌యులో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తుంటే ఐపిసి 124ఏ సెక్షన్ కింద విద్యార్థులపై నేరుగా కేసు నమోదు చేయకుండా- వీడియో కోసం ఎందుకు వేచి చూశారని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఫిబ్రవరి 9న జెఎన్‌యులో జరిగిన కార్యక్రమంలో కన్హయ్యకు సంబంధించి సిసిటివి ఫుటేజీ ఉందా... లేక ఛానల్స్‌లో వచ్చిన వీడియో ఆధారంగా ఆరోపణలు చేస్తున్నరా అంటూ కోర్టు నిలదీసింది. నినాదాలు జరిగేచోట ఉండడానికి... స్వయంగా నినాదాలు చేయడానికి చాలా తేడా ఉందని కోర్టు పేర్కొంది. కన్హయ్య ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని, ఆయనపై దేశ ద్రోహం కేసు వేయడానికి వీల్లేదని కన్హయ్య తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ స్పష్టం చేశారు.

21:32 - February 29, 2016

హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో జరిగిన దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఐదు రోజుల పర్యటన కోసం పంజాబ్ వెళ్లిన ఆయన కారుపై కొంతమంది దాడికి దిగారు. స్వల్పగాయాలతో కేజ్రీవాల్‌ బయటపడ్డారు. లూధియానాలో గుర్తుతెలియని దుండగులు తన కారుపై కారుపై కర్రలు, రాళ్లతో దాడిచేశారని ఆప్ అధినేత ట్విట్ చేశారు. ఈ దాడిలో తన కారు అద్దం పగిలిందని పేర్కొన్నారు. బాదల్ వర్గీయులు ఇలాంటి భౌతికదాడులతో తమను అడ్డుకోలేరని కామెంట్ చేశారు. బాదల్ గూండాలు తమ నేతపై దాడిచేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆప్ నేత అశిష్ ట్విట్టర్‌లో తెలిపారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ ఇతర పార్టీలకు ధీటుగా పోటీనిస్తోంది.

21:31 - February 29, 2016

ముంబై : బడ్జెట్‌ వేళ కూడా స్టాక్‌మార్కెట్‌ పతనం ఆగలేదు. జైట్లీ తాయిలాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో... సెన్సెక్స్ 152 పాయింట్లు పతనమైంది. బడ్జెట్‌ రోజు మార్కెట్ పతనం కావడం గత పదేళ్లలో ఇది ఏడోసారి.

పరేషాన్...

కేంద్ర బడ్జెట్‌ స్టాక్‌ మార్కెట్‌ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ప్రారంభంలో జైట్లీ వడ్డీంపులు-తాయిలాలు ఎలా ఉంటాయోనని మదుపరులు ముందు జాగ్రత్త పడ్డారు. దీంతో మార్కెట్ ప్లాట్‌గా ప్రారంభమైంది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే... ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఒక్కసారిగా 660 పాయింట్లు పతనమైంది. ఆ తరువాత మిడ్ సెషన్‌ నుంచి కోలుకుంది. నష్టాలను భర్తీ చేసుకుంది. చివర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడితో 152 పాయింట్లు పతనమైంది. దీంతో సెన్సెక్స్ 23వేల 2 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇవాళ 849 పాయింట్ల మేర కదలాడింది. అటు నిఫ్టీ 42 పాయింట్లు కుంగి 6వేల 987కు చేరింది. పన్నుల భారంతో ఆటో మొబైల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌గ్యాస్‌ వంటి ఇండెక్సులు నష్టపోగా.. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీలో ఐసీఐసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బీఐ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. 10శాతం నష్టపోయి ఓఎన్జీసీ టాప్ లూజర్‌గా నిలిచింది. మారుతీ సుజుకీ, కెయిర్న్‌ ఇండియా, బీహెచ్‌ఈఎల్‌, ఇన్ఫోసిస్‌ 3 నుంచి 5శాతం వరకు క్షీణించాయి. బడ్జెట్ రోజు మార్కెట్ కు కలిసొస్తుందని అంతా భావిస్తుంటారు. కానీ గత పదేళ్లలో మార్కెట్ 7 సార్లు నష్టాలే చూసింది. 2010, 2011, 2015లో సెన్సెక్స్ లాభపడింది. 2007, 2008, 2009, 2012, 2013, 2014, 2106లో నష్టాల్లోనే ముగిసింది. 

21:29 - February 29, 2016

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌ దిశానిర్దేశం లేకుండా ఉందని సీపీఎం ఆరోపించింది. ఓ విజన్ లేకుండా.. అభివృద్ధిపై దశా దిశా లేకుండా ఉందని పార్టీ పొలిట్ బ్యూరో విమర్శించింది. జైట్లీ బడ్జెట్‌లో వ్యవసాయ రంగం మరింత కుదేలై... దేశంలో నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బొగ్గు రంగంలో పన్ను విధించి విదేశీ బొగ్గు దిగుమతిచేసుకునేలా చేస్తున్నారని పార్టీ విమర్శించింది. 

21:26 - February 29, 2016

హైదరాబాద్ : ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మధ్యతరగతి నడ్డి విరిచారు. సిగరెట్‌ కాల్చేవారికి నోరు చుర్రుమనేలాషాకిచ్చారు. కారు కొనుక్కోవాలనుకువారికి బ్రేక్ వేశారు. బ్రాండెడ్‌ రెడిమేడ్ దుస్తులు మరింత భారం కానున్నాయి. రిఫ్రిజేటర్లు, గృహోపకరణాల వస్తువుల ధరలు తగ్గించినా...సర్వీస్‌ టాక్స్‌ పెంచడం ద్వారా దాదాపు అన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి.

2016కు గాను కేంద్రం సర్వీస్‌ టాక్స్‌ను....

2016కు గాను కేంద్రం సర్వీస్‌ టాక్స్‌ను 14.5 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. రైలు, విమానాల టికెట్లు పెరగడం ద్వారా ఈ ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి.

బ్రాండెడ్‌ రెడీమేడ్‌ దుస్తులు....

ఇకపై బ్రాండెడ్‌ రెడీమేడ్‌ దుస్తులు, అందం, ఆభరణాలపై మోజు తగ్గించుకోవాల్సిందే. వెండి తప్ప ఇతర నగలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. వెండిని మినహాయిస్తే బంగారం, వజ్రాభరణాల ధరలు మరింత పెరగనున్నాయి. మహిళలకు బ్యూటీ పార్లర్ల ఖర్చు బాగా పెరగనుంది. ఇకపై జిమ్‌కు వెళ్లేవారు కూడా డబ్బు బాగా చెల్లించాల్సి ఉంటుంది. రెడీమేడ్‌ దుస్తుల ధరలు కొండెక్కనున్నాయి.

సినిమాలు షికార్లు కూడా....

ఇకపై సినిమాలు షికార్లు కూడా కాస్త ఆలోచించాల్సి వెళ్లాల్సిందే. ఇక సరదాగా హోటల్‌ కెళ్లి లంచ్‌, డిన్నర్‌ చేద్దామంటే జేబుకు చిల్లు పడ్డట్టే. సినిమా, కేబుల్‌ టీవీలకు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కన్నా ఇపుడు మొబైల్‌, హోటల్‌ బిల్లు కూడా పెరగనుంది.

కారు కొనేవారికి మంత్రి బ్రేక్‌ ...

కారు కొనేవారికి మంత్రి బ్రేక్‌ వేశారు. అన్ని రకాల కార్ల ధరలు పెరగనున్నాయి. కోటికిపైగా ఆదాయం ఉన్న కంపెనీలకు 10శాతం సర్‌చార్జ్‌ విధిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో లగ్జరీకార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చిన్న పెట్రోలు కార్లు, ఎల్‌పిజి, సిఎన్‌జి కార్లపై 1 శాతం పొల్యూషన్‌ పన్ను వేయగా, డీజిల్ కార్లపై 2.5 శాతం ఇన్ ఫ్రా సెస్ విధించారు. అధిక సామర్థ్యం గల ప్యాసింజర్ వాహనాలు, ఎస్‌యువీలపై అదనంగా 4 శాతం లెవీని వడ్డించారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా హైబ్రిడ్ కార్ల వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యమన్నారు. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు బాగా తగ్గనున్నాయి.

పొగరాయుళ్ళకు షాకిచ్చారు...

పొగరాయుళ్ళకు షాకిచ్చారు ఆర్థికమంత్రి. పొగాకు ఉత్పత్తులన్నిటిపైనా ఎక్సైజ్ డ్యూటీని 10 నుంచి 15 శాతం పెంచారు. దీంతో చుట్టలు, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పతులు మరింత ప్రియం కానున్నాయి. అయితే బీడీ ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చారు. వికలాంగుల కోసం తయారు చేసే ఉత్పత్తులపై ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నామని మంత్రి చెప్పారు.గృహోపకరణాలు, రిఫ్రిజిరేటర్స్‌ ధరలు తగ్గించడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ఆర్థికమంత్రి కొంత ఊరట కల్పించారు. అరుణ్‌ జైట్లీ నిత్యావసర వస్తువుల ధరల ఊసే ఎత్తలేదు.

వరంగల్‌లో 20 ఎకరాల్లోఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌

హైదరాబాద్ : వరంగల్‌లో 20 ఎకరాల్లోఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ నిర్మించనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియాతో తెలిపారు. మార్చి 31లోపు మండలస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తిచేసి టీడీపీ బలోపితం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణలో డిలిమిటేషన్‌లో సీట్ల సంఖ్య పెరుగుతుంది 100 స్థానాలు యువతకు కేటాయిస్తామని నేతలతో చంద్రబాబు చెప్పారు.

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు :డీజీపీ రాముడు

విజయవాడ: ఏపీలో ఐపీఎస్‌లు బదిలీ కానున్నారు. సీఎం చంద్రబాబుతో డీజీపీ రాముడు సమావేశమయ్యారు. సమావేశంలో హోం సెక్రటరీ సతీష్‌చంద్ర, ఇంటెలిజెన్స్‌ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. జిల్లాల ఎస్పీలు, ఖాళీగా ఉన్న డీఐజీ పోస్టుల భర్తీకి రంగం సిద్దం చేసిందని ఆయన అన్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఉత్వర్తులు వచ్చే అవకాశం ఉందని రాముడు మీడియాతో తెలిపారు.

20:41 - February 29, 2016

హైదరాబాద్ : ఎవరి పక్షం.. ఎవరికి అనుకూలం, జైట్లీ బడ్జెట్ ఏ సంకేతాలు ఇచ్చింది. అంకెల గారడీ మాత్రమే ఉంటుందా? లేక ప్రజానుకూల ప్రకటనలు ఉన్నాయా? సామాన్యుడి పక్షమా... లేక కార్పొరేట్ల పక్షపాతమా?, వరాలా.. వడ్డనలా? సబ్సిడీలు ఎత్తేసే ప్రయత్నమా? మోడీ సర్కార్ ఎవరి పక్షాన నిలుస్తుందో ఈ బడ్జెట్ చెప్తోందా? ఇలా ఎన్నో ప్రశ్నలు... ఇదే అంశంపై నేటి వైడాంగిల్... పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:32 - February 29, 2016

హైదరాబాద్ : గజరాజుకు కోపం వస్తే..., రైలును ఆపిన కుక్క, చేపలు వేటలో పీటన్స్ బర్గ్, బాబు ఆలనా.. పాలన చూస్తున్న రామచిలుక, నీళ్లు అందక అవస్థలు, బీరు తాగిన కోతి, ఈత కొడుతున్న ఏనుగు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సాగర కన్య కనిపించిందట, ఆకులో కల్లు తాగిన విదేశీ వనిత, సౌదీకి పోయిన తెలుగు బిడ్డల ఘోష.. వివిధ సోషల్ నెట్ వర్క్ లో ముచ్చట్లతో నేటి 'మల్లన్న ముచ్చట్లు..' కార్యక్రమంలో మల్లన్న ఏఏ అంశాలను తెలిపారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

వీణవంక ఘటనకు బాధ్యులను వదలను : ఎస్పీ జోయల్ డేవిస్

కరీంనగర్ :వీణవంక మండలంలో యువతిపై సామూహిక అత్యారం కేసును తానే దర్యాప్తు చేస్తున్నానని ఎస్పీ జోయల్ డెవిస్ తెలిపారు. ఈ ఘటనలో నిందితులెవర్నీ వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసులను కూడా వదలనని ఆయన చెప్పారు. ఈ ఘటనలో బాధితురాలిని విచారించానని ఆయన తెలిపారు. నిందితుల ఆగడాల గురించి ఆమె వివరించిందని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో షీటీమ్స్ ను పటిష్ఠం చేస్తామని ఆయన అన్నారు. నిందితుల వయసు నిర్ధారణకు మెడికల్ టెస్టులు చేస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం అలసత్వం చేసే అవకాశం లేదని ఆయన తెలిపారు.

ట్రాక్టర్ బీభత్సం..నాలుగేళ్ల బాలుడు మృతి

కృష్ణా : నందిగామ మండలం మునగచర్లలో ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. ఆటోస్టాండ్‌లోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాడు. గాయాలపాలైన బాలుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా అలోక్‌ వర్మ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా అలోక్‌ వర్మ సోమవారం బాధ్యతలు చేపట్టారు. దిల్లీ పోలీస్‌ ప్రధానకార్యాలయంలో అధికారులు, పోలీస్‌ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వర్మ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తిహార్‌ జైలు డీజీగా పనిచేసిన వర్మ 17 నెలల పాటు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న బిఎస్‌.బస్సీ పదవీ కాలం ఇవాళ్టితో పూర్తయ్యింది. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది బస్సీకి వీడ్కోలు పలికారు.

19:56 - February 29, 2016

హైదరాబాద్ : పెట్టుబడులే లక్ష్యంగా అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ రూపొందింది. దేశంలో అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించారు. అనేక ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలోనే చేపట్టనున్నట్లు ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. గత సంవత్సరం విదేశీ పెట్టుబడుల సమీకరణలో విఫలమైన కేంద్రం..ఈ ఏడాది దానిపైనే కేంద్రీకరించింది. మేకిన్‌ ఇండియాలో స్టార్టప్‌ కంపెనీలకు వంద శాతం పన్ను మినహాయింపునిచ్చింది.అస్సలు ఈ బడ్జెట్ వల్ల లాభాలు- నష్టాలు అనే అంశం పై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సామాజిక, రాజకీయ విశ్లేషకులు నగేష్ కుమార్, బిజెపి నేత అల్జాపూర్ శ్రీనివాస్ రావు, ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాజేశ్వరరావు ప్యాప్సీ నేత పాల్గొన్నారు. బడ్జెట్ పై వారి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

18:49 - February 29, 2016

హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం కారణంగా పెట్రోల్‌ ధర లీటరుకు రూ.3.02 రూపాయలు తగ్గింది. అలాగే డీజిల్‌ ధర లీటరుకు రూ.1.47 పైసలు పెరిగినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన, తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

18:43 - February 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలను రెండు పూటలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ ద్వారానే జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలితే... ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు సభను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు... ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను పరిశీలించాలని భేటీలో నిర్ణయించారు. 

18:38 - February 29, 2016

కడప: ప్రొద్దుటూరు శాంతినికేతన్‌ స్కూల్‌లో విద్యుత్‌ షాక్‌తో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

18:37 - February 29, 2016

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను మున్సిపల్‌ మంత్రి నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. మార్చి చివరికి నాటికి పునాదుల పనులు పూర్చి చేస్తామని నిర్మాణ సంస్థలు ప్రతినిధులు.... మంత్రి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివచ్చే ఉద్యోగులు పిల్లల స్థానికత సమస్య 15 రోజుల్లో కొలిక్కి వస్తుందని నారాయణ చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై మార్చి 8న మరోసారి చర్చలు జరుపున్నట్టు మంత్రి నారాయణ చెబుతున్నారు. 

18:35 - February 29, 2016

విజయవాడ: ఆంధ్రా ప్రజలకు కేంద్రం మరోసారి మోసం చేసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రాయలసీమకు నిధుల కేటాయింపులపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజధానికి నిధులు కేటాయించలేదన్నారు. సీఎం, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం వల్లే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.

18:34 - February 29, 2016

హైదరాబాద్ : బడ్జెట్‌లో కేటాయింపులపై సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.. రైతులకు కేవలం 35వేల కోట్లు మాత్రమే కేటాయించారని... ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. గ్రామీణ ఉపాది హామీకి నిధులు పెంచాల్సిందిపోయి... తగ్గించారన్నారు..

18:32 - February 29, 2016

ఢిల్లీ : ఈసారి బడ్జెట్‌ చాలా బావుందని టిడిపి ప్రశంసించింది.. ప్రధానంగా ఈ బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు.. 

18:30 - February 29, 2016

ఢిల్లీ : బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. రైతులు, యువత, మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు.. 

18:29 - February 29, 2016

అనంతపురం : రాయలసీమ సమగ్రాభివృద్ది, సీమ జిల్లాలకు నికర జలాలను డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రస్తుతం బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. రెండో రోజులో భాగంగా పుట్టపర్తిలో ప్రారంభమైన బస్సు యాత్ర కొత్త చెరువు, ధర్మవరం, బత్తలపల్లి మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు, మదు, రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం అనంతపురంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన మరో బహిరంగ సభకూ ఇద్దరు నేతలు హాజరయ్యారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమ హక్కు...

కడప ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమ హక్కు అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా..ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు. జన్మ భూమి కమిటీల పేరుతో ప్రభుత్వం రాక్షస కమిటీలను ఏర్పాటుచేసిందని ఎద్దేవా చేశారు.

భవిష్యత్తులో చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా...

భవిష్యత్తులో చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని మధు విమర్శించారు. రాయలసీమ హక్కుల కోసం మార్చి 15న హైదరాబాద్‌లో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.రాయలసీమ అభివృద్ధి కోసం కేవలం 50 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 50 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు తీరుతుందా అని ప్రశ్నించారు.

సాగునీటి అవసరాల కోసం నదుల అనుసంధానం...

రాయలసీమ సాగునీటి అవసరాల కోసం నదుల అనుసంధానం జరగాలని రామకృష్ణ అన్నారు. తుంగభద్ర నుంచి ఒక్క చుక్క నీటి బొట్టునైనా చంద్రబాబు తీసుకురాలేకపోయారని మండపడ్డారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. 

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లపై సీఎం కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్‌.రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రాధాన్యాలు, కేటాయింపుల వల్ల రాష్ట్ర పథకాలపై ప్రభావం, కేంద్ర పథకాలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు తదితర అంశాలపై చర్చించారు.

బడ్టెజ్ అసంతృప్తిగా ఉంది: షబ్బీర్ అలీ

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్టెజ్ అసంతృప్తిగా ఉందని ఎమ్మెల్యే షబ్బీర్ అన్నారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఉందని తెలుసో.. తెలియదోనని.. ఎపుడూ ఏపీకి కేటాయింపులు ఉంటున్నాయని విమర్శించారు. ప్రాణహిత – చేవళ్లకు, తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు బడ్జెట్ లో కేటాయింపు లేవని మండి పడ్డారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

కొనసాగుతున్న టిడిపి పొలిట్ బ్యూరో భేటీ

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. రైల్వే బడ్జెట్ లో ఏపీ కి జరిగిన అన్యాయం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

అనంత ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో మంత్రుల సమీక్ష

అనంతపురం : ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో ఆ జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యపై అధికారులతో చర్చించించారు.

కాకినాడలో ముద్రగడ అనుచరుల ఆందోళన

తూ.గో : ముద్రగడ అనుచరులు మరోసారి చెలరేగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీటీసీ ఆఫీసు ఎదుట ముద్రగడ అనుచరుల ఆందోళనకు దిగారు. ముద్రగడపై ఎంవీఐ రవికుమార్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు చెబుతున్నారు. వెంటనే రవికుమార్ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

మైనింగ్ శాఖ పై మంత్రి హరీష్ రావు సమీక్ష..

హైదరాబాద్: మైనింగ్ శాఖపై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో జరిపిన సమావేశానికి పలువురు మైనింగ్‌శాఖ అధికారులు హాజరయ్యారు. నూతన మినరల్ పాలసీకి సంబంధించిన ముసాయిదా, 31 మినరల్ పాలసీపై సమీక్ష జరిపారు. పాలసీ రూపకల్పన పూర్తికాగానే కేబినెట్ ఆమోదానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖలో 425 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంపై సమీక్షించారు. మైనింగ్‌శాఖ కంప్యూటరీకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

కన్హయ్య బెయిల్ పిటిషన్ మార్చి2కు వాయిదా

హైదరాబాద్ : దేశద్రోహం కింద అరెస్టయిన జేఎన్ యూ విద్యార్థి కన్హయ్య మెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ మార్చి 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

17:21 - February 29, 2016

ఖమ్మం : ఖమ్మం మున్సిపాలిటికి దేశవ్యాప్తంగా రికార్డు ఉంది. మున్సిపల్ పాలకవర్గంపై ఎర్రజెండాను ఎగురవేసిన ఏకైక సింహం చిర్రావూరి లక్ష్మీనర్సయ్య. వరుసగా నాలుగు సార్లు చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాంటి పాలనను మరళా తీసుకువస్తానని ఖమ్మం 50వ డివిజన్ నుంచి సీపీఎం తరుపున పోటీ చేస్తున్న మల్లిక స్పష్టం చేశారు. ఈ డివిజన్ ప్రధానంగా ఇళ్ల ప్లాట్లు, రేషన్ కార్డులు లేవు, డ్రైనేజీల్లోనీళ్లు పోయే పరిస్థితి లేదని.. వాటిని పరిష్కరించే విధంగా పని చేస్తానన్నారు. జనం కోసం పని చేయాలని వచ్చానని, ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ.. ప్రజా సమస్యలపై తమ కుటుంబం గతం నుంచి పని చేస్తూ వచ్చిందని.. అదే బాటలో పయనిస్తానని డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. కనుక తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

17:14 - February 29, 2016

వరంగల్ : ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని వరంగల్ నగరం 44 డివిజన్ నుండి బిజెపి తరుపున పోటీ చేస్తున్న కోలన్ సంతోష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ... ఇతర పార్టీల్లో వున్న వ్యక్తులా మేం పార్టీ మారలేదని.... ప్రజలకు సేవ చేయాలనే భావనతో పోటీ చేస్తున్నాని... ప్రజలు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న కార్పొరేటర్ ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని.. అందుకే సంతోష్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు రవళి తెలిపారు.

16:58 - February 29, 2016

హైదరాబాద్ : ఆర్.పి.పట్నాయక్ స్వీయదర్శకత్వంలో కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం తులసీదళం మార్చి 11న విడుదలకానుంది. నిశ్చల్, వందనా గుప్తా జంటగా నటించారు. ఆర్.పి.పట్నాయక్ కీలక పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్ నేపథ్యంలో సాగే సంగీతభరిత ప్రేమకథా చిత్రమిది. హారర్ చిత్రాల్ని ఎక్కువగా చీకటిలో తీస్తారు. కానీ ఈ సినిమాను మాత్రం అమెరికాలోని ఆకర్షణీయ ప్రాంతమైన లాస్‌వేగాస్‌లో చిత్రీకరించాం. అనూహ్య మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రమిది. ఐదు పాటలుంటాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. బ్రహ్మానందం, అనితాచౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తిరుమన్ నాగ్, కెమెరా: శరత్ మండవ, సహనిర్మాత: దిలీప్ వడ్లమూడి, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.

16:53 - February 29, 2016

హైదరాబాద్ : బాలీవుడ్ లో ఇప్పుడు ఆలియా భట్, సిద్ధార్థ మల్ హోత్రా న్యూస్ మేకర్స్ అయ్యారు. వాళ్లు విచ్చలవిడిగా సాగించిన రొమాన్స్ పబ్లిక్ అయిపోయింది. బికినీలో ఉన్న ఆలియా సిద్ధార్థతో క్లోజ్ గా ఉన్న స్టిల్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ డీప్ లవ్ లో పడిపోయారు. ఆలియా అయితే సిద్దూను వదిలిపెట్టి ఉండలేని సిచ్యువేషన్ కు వచ్చారని సమాచారం..

జబర్దస్త్ గా హోళీ...

ఆలియా భట్ , సిద్ధార్థ మల్హోత్రా ఇటీవల జబర్దస్త్ గా హోళీ ఆడుకున్నారట. ఆ రోజు రంగులు పూసుకునే పేరుతో రెచ్చిపోయారట. వీళ్లిద్దరి వ్యవహారం గురించి అడిగిన వాళ్లకు ఆలియా జవాబివ్వడం లేదు. అదివరకు ఓసారి మీడియా వాళ్ళు అడిగితే ఆలియా ఫైర్ అయిపోయిందట. మరోసారి ... నా సొంత విషయాలు ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ కు చెబుతాను. అది నాకు ఇష్టమైనప్పుడే చెబుతాను. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు అని బదులిచ్చిందట ఆలియా.

ఓపెన్ రొమాన్స్ చేస్తూ...

ఆలియా, సిద్ధార్థ మధ్య హాట్ రొమాన్స్ నడుస్తోంది. బికినీల్లో అతనితో చాలా క్లోజ్ గా ఉంటోంది. ఆలియాను సిద్ధార్థ వీపు పై ఎక్కించుకుని తీసుకెడుతున్న ఫోటోలు సోషల్ సైట్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నాకెవరిష్టమైతే మీకెందుకు? ఎవరితో డేటింగ్ చేస్తున్నానో మీకు చెప్పాలా? అని చికాకు పడుతోంది ఆలియా. సిద్ధార్థ మాత్రం ఏం మాట్లాడడం లేదు. కెమెరా ఉందన్న సంగతి మరిచిపోయి వీళ్లు రీసెంట్ గా ఓపెన్ రొమాన్స్ చేస్తూ దొరికిపోవడం బీ టాప్ హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో రెండు డయాగ్నోసిస్ బ్లాక్ నిర్మాణం

విజయవాడ : ఏపీలో రెండు డయాగ్నోసిస్ బ్లాక్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు నిర్మాణాలకు గాను రూ.23.12 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల, కర్నూలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో డయగ్నోసిస్ బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు.

16:43 - February 29, 2016

హైదరాబాద్‌ : లోటస్ పాండ్ లో జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సమావేశానికి 13మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. భేటీకి గైర్హాజరైన వారిలో మణిగాంధీ, కలమట వెంకట రమణ, కిడారి సర్వేశ్వర్ రావు, సుజయ కృష్ణ రంగారావు, కొడాలి నాని, గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి, తిప్పారెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి బాల నాగిరెడ్డి, గౌరు చరిత రెడ్డి ఉన్నారు. 

16:42 - February 29, 2016

హైదరాబాద్ : టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీని వీడి వెళ్లేది లేదని, ఈ విషయాన్ని అధినేత జగన్‌కు చెప్పామని ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందు చెప్పారు. డబ్బుకు లొంగిపోయి పార్టీకి ద్రోహం చేసేవాళ్లము కాదని అన్నారు.

16:41 - February 29, 2016

హైదరాబాద్ : రాహుల్‌ గాంధీపై దేశద్రోహం కేసు వేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. దేశం కోసం ఎంతో సేవ చేసిన రాహుల్‌ కుంటుబంపై కేసు వేయడం పబ్లిక్‌ సంట్‌ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసు వేసిన అడ్వకేట్‌ బీజేపీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వ్యక్తని అన్నారు. అంతే కాకుండా అతను ట్రాన్స్‌కోలో ఏజీపీగా పనిచేస్తున్నారన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం కూడా ఉందా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. అఫ్జల్‌ గురూకి ఉరిశిక్ష వేసింది యూపీఏ ప్రభుత్వమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని శిక్షించాలని రాహుల్‌ కూడా కోరారని ఉత్తమ్‌ చెప్పారు.  

16:39 - February 29, 2016

విశాఖ: మధురవాడ పరిధిలోని పరదేశీ పాలెంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ రెవిన్యూ అధికారులు పలు నివాసాలను కూల్చేశారు. ఓ ప్రార్థనా మందిరాన్ని సైతం కూల్చివేయడంతో స్థానికులు ఆగ్రహించారు. నాలుగు సంవత్సరాలుగా ప్రార్థనా మందిరం ఇక్కడే ఉందని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం:తుమ్మల

ఖమ్మం :తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తుమ్మల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ..మా జిల్లా భవిష్యత్, నా జిల్లా ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. సీతారామ ఎత్తిపోతల పథకం నా జీవన సాఫల్యమని తుమ్మల అన్నారు.జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలు ఇవ్వాలనేది నా కోరిక ఆయన తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తుమ్మల హామీ ఇచ్చారు.

నాంపల్లి సీబీఐ కోర్టుకు ప్రభుదేవా...

హైదరాబాద్ : నాంపల్లి సీబీఐ కోర్టుకు సినీ హీరో, దర్శకుడు ప్రభుదేవా హాజరయ్యారు. ఆదాయపన్ను శాఖ అధికారి హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో ఆయన సాక్ష్యం ఇచ్చేందుకు వచ్చారు. గగన్ విహార్ లోని సీబీఐ కోర్టులో దాదాపు అర్ధగంట పాటు జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. మెదక్ జిల్లాలోని ఓ భూమిని గతంలో హరిప్రసాద్ నుంచి ప్రభుదేవా కొన్నారని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే సమన్లు అందుకున్న ఆయన ఇవాళ కోర్టుకు వచ్చారు. అయితే తన మేనేజర్ ద్వారానే ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, మిగతా విషయాలు తనకేమి తెలియవని ప్రభు కోర్టుకు చెప్పారు.

16:09 - February 29, 2016

గుంటూరు:తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు వీధి రౌడీల్లా తన్నుకున్నారు. ప్యానెల్‌ సభ్యుల ఎంపిక విషయంలో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మూడవ వార్డు సభ్యుడు గుమ్మడి రమేష్‌, 12వ వార్డు సభ్యుడు త్రిమూర్తులు పంతాలకు పోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతలో పసుపులేటి త్రిమూర్తులు, గుమ్మడి రమేష్‌ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి ఇద్దరు వీధిరౌడిల్లా ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో కౌన్సిల్‌ సమావేశాన్ని గంట పాటు వాయిదా వేశారు. సీన్‌ మల్లయుద్ధాన్ని తలపించింది. మిగతా సభ్యులు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇలాంటి వ్యక్తులను తాము ఎన్నుకున్నది అని తెనాలి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ సమావేశం

హైదరాబాద్ : లోటస్‌పాండ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ భేటీ ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ ఫిరాయింపులపై చర్చించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ భేటీకి ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. గైర్హాజరైన ఎమ్మెల్యేలలో సుజయ్‌కృష్ణ, మణిగాంధీ, గౌరుసుచరిత, శివప్రసాద్‌రెడ్డి, చిట్టెస్వామి, బాలనాగిరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు.

15:52 - February 29, 2016

ఢిల్లీ : పెట్టుబడులే లక్ష్యంగా అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ రూపొందింది. దేశంలో అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించారు. అనేక ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలోనే చేపట్టనున్నట్లు ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. గత సంవత్సరం విదేశీ పెట్టుబడుల సమీకరణలో విఫలమైన కేంద్రం..ఈ ఏడాది దానిపైనే కేంద్రీకరించింది. మేకిన్‌ ఇండియాలో స్టార్టప్‌ కంపెనీలకు వంద శాతం పన్ను మినహాయింపునిచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే సెజ్‌లకు కార్పొరేట్‌ పన్నులో రాయితీని ఇచ్చింది. గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలు వెలికి తీసే కంపెనీలకు మార్కెట్‌ ఫ్రీడమ్‌ని ఇచ్చి మరింతగా వెసులబాటును ఇచ్చింది. గృహ నిర్మాణ రంగంలో పలు పన్ను మినహాయింపులతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బూమ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఆర్ధిక సంస్థల అవకతవకలపై బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. మొండి బకాయిల సమస్యలపై ఇబ్బందిపడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనం కొరకు 25 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో కొన్ని కేటాయింపులు చేసినా.. రైతు పంటకు గిట్టుబాటు ధరపై ఎలాంటి చర్య కనపడలేదు. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణకు ఎలాంటి పటిష్టమైన చర్యలు ప్రకటించలేదు. నల్లధనం వెలికితీత వేగవంతానికి కూడా ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు చెప్పలేదు. 2018 మే 1 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.

వ్యవసాయాభివృద్ధికి...

35 వేల 900 కోట్ల రూపాయలను వ్యవసాయాభివృద్ధికి కేటాయించినట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. 141 మిలియన్ హెక్టార్ల భూమిలో వ్యవసాయం చేస్తుండగా 46 శాతం భూములకు మాత్రమే నీటి సదుపాయం ఉందని ఆ శాతాన్ని మరింత పెంచేందుకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

పాడిపరిశ్రమ అభివృద్ధికి....

పాడిపరిశ్రమ అభివృద్ధికి నాలుగు పథకాలు ప్రవేశపెడుతున్నట్లు, ఇదే సమయంలో తేనె పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. యానిమల్‌ హెల్త్ కార్డ్‌, మార్కెటింగ్, తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వాటిని రూపొందించినట్లు 850 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల అభివృద్ధికి...

గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల అభివృద్ధికి 2.87 లోక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. ఇది గత ప్రభుత్వ కేటాయింపుల కన్నా 228 శాతం అధికమని అన్నారు. సరాసరి ఒక్కో గ్రామపంచాయతీకి 80 లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.

అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం....

అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం తమ లక్ష్యమని జైట్లీ తెలిపారు. ఏప్రిల్‌ 1 2015 నాటికి దేశంలో 18,542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని కానీ ఫిబ్రవరి 2016 నాటికి 5,542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వెయ్యి రోజుల్లో అన్ని గ్రామాలకు కరెంట్ సదుపాయం కల్పిస్తామని గత ఆగస్ట్ 15న ప్రధాని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అర్బన్ ఏరియాల్లో స్వచ్ఛభారత్ అభియాన్‌కోసం 9 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను విస్తరించనున్నట్లు ఇందుకుగాను నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ విద్యను అభివృద్ధి చేస్తామన్నారు.

రోడ్ల అభివృద్ధి, విస్తరణకు....

2016-17 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణకు సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు జైట్లీ ప్రకటించారు. దేశాభివృద్ధిలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధికి....

జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధికి ఇప్పటికే 800 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని సాగరమాల తదితర పథకాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జైట్లీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 160 విమానాశ్రయాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు.

రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను జైట్లీ 19.78 లోక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రకటించారు. అందులో 5.50 లక్షల కోట్ల రూపాయలు ప్రణాళిక బడ్జెట్‌ కింద, 14.28 లక్షల కోట్ల రూపాయలు ప్రణాళికేతర బడ్జెట్ కింద ఖర్చు చేయనున్నారు. వ్యవసాయం, నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమం, సామాజికాభివృద్ధి తదితర రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 99వేల 600 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

బ్యాంకులను ఆదుకోవడానికి 25వేల కోట్ల....

కార్పొరేట్ కంపెనీలు భారీమొత్తంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నష్టాల్లో ఉన్న నేపథ్యంలో వాటిని ఆదుకోవడానికి 25వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. అయితే కంపెనీల నుంచి డబ్బు రాబట్టే భారాన్ని వాటిపైనే వేశారు తప్పించి ప్రభుత్వ పరంగా కల్పించుకునే ప్రయత్నాలు చేయబోవట్లేదన్నారు.

బంగారు నగలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం....

బంగారు నగలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. సిగరెట్ తదితర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. తద్వారా సిగరెట్ తదితర ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. అయితే బీడీ ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చారు. 

తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

గుంటూరు: మార్చి నాటికి తాత్కాలిక సచివాలయం పునాది పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తుళ్ళూరు మండలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను ఆయన పరిశీలించారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని నారాయణ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

తన్నుకున్న టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లు...

గుంటూరు:తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కొట్టుకున్నారు. ప్యానెల్‌ సభ్యుల ఎంపిక విషయంలో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మూడవ వార్డు సభ్యుడు గుమ్మడి రమేష్‌, 12వ వార్డు సభ్యుడు త్రిమూర్తులు పంతాలకు పోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సీన్‌ మల్లయుద్ధాన్ని తలపించింది. మిగతా సభ్యులు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కౌన్సిల్‌ సభ్యులతో పాటు అధికారులు అవాక్కయ్యారు

హాస్య నటుడు కుమార ముత్తుమృతి

చెన్నై : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ తమిళ హాస్యనటుడు కుమార ముత్తు(71) మృతి చెందారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. కుమారముత్తు మృతిపై తమిళ సినీ రంగంతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదు నమ్మ ఆలు, సహదేవన్ మహదేవన్, ఒరు వూర్ల ఒరు రాజకుమారి మొదలైన చిత్రాలు ఆయనకు నటుడిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి. కుమారముత్తు గతంలో డీఎంకే పార్టీ సభ్యుడిగా ఉన్నారు.

15:19 - February 29, 2016

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ని అభినందిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన సోమవారం బడ్జెట్ పై మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్ లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళలు, రైతులు, గ్రామీణ భారతంపై బడ్జెట్ లో దృష్టి పెట్టినట్లుతెలిపారు. గృహనిర్మాణ రంగంపై, ప్రతి భారతీయుడి సొంతింటి కల సాకారమయ్యేలా బడ్జెట్ ఉందని అభినందించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా బడ్జెట్ ఉందన్నారు.  అలాగే 2018 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. బీపీఎల్ కుటుంబాల్లో పొగ బారినపడి ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశామని ఆయన చెప్పారు. రిటైర్మెంట్ తరువాత సైనికులంతా 'ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్' అందుకుని అందరూ సురక్షితంగా ఉండాలని ఆ విధానం అమలు చేశామని ఆయన తెలిపారు. యువభారత్ మరింత దూసుకెళ్లేందుకు నైపుణ్య శిక్షణ అందించనున్నామని ఆయన చెప్పారు. పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు స్టార్టప్స్ ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రోజ్ గార్ యోజన ద్వారా మరిన్ని సౌకర్యాలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థలో స్టాండర్డ్స్ పెంచేందుకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా అందరూ మరింత బాగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అందరికీ ఒకే రకమైన ఫలాలు అందే దిశగా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో శ్రమ పడిన అరుణ్ జైట్లీని ఆయన ప్రశంసించారు. బడ్జెట్ లో సామాన్య ప్రజలకు పెద్దపీట వేశామని ఆయన చెప్పారు.


 

కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం.....

కరీంనగర్ :హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత,నియోజకవర్గ ఇన్ చార్జిగా కేతిరి సుదర్శన్ రెడ్డి(60) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన పని చేశారు. సుదర్శన్ రెడ్డి మృతితో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఆయనకు భార్య అరుణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అరుణ జూపాక గ్రామ సర్పంచిగా ఉన్నారు.

రోజా పిటిసన్ విచారణ వాయిదా...

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే.రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. తదనంతర విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై రోజా ఆ పిటిషన్ వేశారు. అయితే సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్టు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.

14:55 - February 29, 2016

హైదరాబాద్ : సందర్భానికి తగినట్లు అలంకరించుకునే మగువలు గాజులపై ప్రత్యేక శ్రద్ద చూపుతారు. అయితే డిజైన్ గాజులు ఒకప్పటి ట్రెండ్ అయితే థ్రెడ్ తో డిజైన్ చేసిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ ది ప్రస్తుత ట్రెండ్. అలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ్టి సొగసు లో సందీప తెలియచేశారు... మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

14:53 - February 29, 2016

హైదరాబాద్ : మనిషికి మనిషికి మధ్య బంధాలు బలహీనపడుతున్న సమయంలో మనీ సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య బంధాలు ఆస్తులతోనే పెనవేసుకుపోతున్న సామాజిక స్థితిలో ఒక అక్క తమ్ముడి కోసం సాహసమే చేసింది.

ఆమె పేరుకోసం సాహసం చేయలేదు..

ఆమె పేరుకోసం సాహసం చేయలేదు...కీర్తి ప్రతిష్ట కోసం పర్వతారోహణ చేయలేదు....ఇంకేదో ఆశించి రిస్క్ తీసుకోలేదు.....కేవలం తమ్ముడి మీద ప్రేమతో మాత్రమే ఆండిస్ పర్వతంపై జాతీయ పతాకాన్ని ఎగరేసింది.

తోడబుట్టిన వాడికోసం, కొండంత పర్వతాన్ని ఎక్కే సాహసం...

ఎవరికి వారే యమునా తీరుగా మారుతున్న సమాజంలో, తోడబుట్టిన వాడికోసం, కొండంత పర్వతాన్ని ఎక్కే సాహసం చేసిన మస్తానమ్మకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. వైద్యురాలిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది పాటు సస్పెన్షన్

హైదరాబాద్ : మార్చి 10 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ ఇవాళ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే ఏడాది పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సభలోకి ప్లకార్డుల అనుమతికి, ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనకు నిరాకరించింది. వారంలోగా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ కమిటీ నియామకం కానుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు పూటలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు నిర్వహించనున్నారు.

భారీ ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు...

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభవాన్ని చూపింది. పెను ఊగిసలాటల మధ్య దేశీయ సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతలోనే 300 పాయింట్ల వరకు కోలుకున్న సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో 22,769 పాయింట్ల దగ్గర, 116 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 6,913 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ గట్టి మద్దతు స్థాయిలకు కింద ట్రేడవుతూ ఇన్వెస్టర్లను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి.

14:31 - February 29, 2016

హైదరాబాద్ : కలువకళ్ల పిల్ల కాజల్ పెళ్లాడిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. కానీ అది నిజమైన పెళ్లి కాదు...పవర్ స్టార్ సరసన ‘సర్దార్’లో నటిస్తున్న ఈ అమ్మడుకి రామోజీఫిలింసిటీలో పెళ్లి సీన్ జరిగిందట. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో పవన్, కాజల్ వివాహం జరిగే సన్నివేశం చిత్రీకరించారట. ‘గబ్బర్ సింగ్’లో శృతిని పెళ్లాడే సీన్‌లానే సర్దార్‌లోనూ పవన్, కాజల్ మధ్య పెళ్లి సీన్ తెరకెక్కించారని సమాచారం. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు టాకీపార్ట్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రానికి రెండు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఆ రెండు పాటల కోసం చిత్రయూనిట్ యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుని... ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, కబీర్‌సింగ్, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీ రాయ్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, వేణు, రఘుబాబు వంటి భారీ తారాగణంతో రూపొందుతోంది.

రాహుల్ గాంధీపై కేసు సరికాదు : ఉత్తమ్

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉగ్రవాదులకు మద్దతిచ్చారంటూ హైదరాబాదులో కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాహుల్ పై కేసు సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ కుటుంబంపై కేసులా? అని ప్రశ్నించారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీసింది కాంగ్రెస్సేనని గుర్తించాలన్న ఉత్తమ్, దేశద్రోహులకు కాంగ్రెస్ ఎన్నడూ మద్దతు పలకదని స్పష్టం చేశారు. అమాయక విద్యార్థులపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడరని, కేవలం టీఆర్ఎస్ మైండ్ గేమ్ అని పేర్కొన్నారు.

అమెరికాలో కూలిన విమానం:నలుగురి మృతి

హైదరాబాద్ : అమెరికాలో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్ పోర్టు నుంచి టెక్సాస్ మీదుగా హ్యూస్టన్ వెళుతున్న విమానం నవసోటాలో ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఆకాశంలో ఎరుగుతున్న విమానం కన్నుమూసి తెరిచేలోగానే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఆ దేశ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

సైన్స్ ఫెయిర్ లో పేలుడు...

కడప : ప్రొద్దుటూరులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇక్కడి శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తుండగా, ఓ పెట్రోల్ పరికరం పేలింది. పెట్రోలుతో నింపిన ఓ పరికరంపై ప్రయోగాన్ని చేసి చూపిస్తుండగా ఈ ఘటన జరిగింది. పేలుడుతో, అక్కడే ఉన్న 10 మంది చిన్నారులపై పెట్రోల్ చిమ్మి వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. పెట్రోల్ గాయాలు కావడంతో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్కూలు పరిసరాల్లో విషాదం నెలకొని సైన్స్ ఫెయిర్ ఆగిపోగా, ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలవరంకు రూ.100 కోట్లు..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. దీనితో పాటు విజయవాడ మెట్రోకు రూ.100కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కేజ్రీ కారుపై దాడి..

పంజాబ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కర్రలు..రాళ్లతో దాడులు చేశారని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

అచ్చంపేటలో మంత్రి జూపల్లి ప్రచారం..

మహబూబ్‌నగర్: అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని ఇందిరానగర్, పదో వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

13:36 - February 29, 2016

లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నటుడు క్రిస్ రాక్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్ తారాగణం విచ్చేసింది. ఉత్తమ చిత్రం విభాగంలో 'స్పాట్ లైట్' ను ఆస్కార్ వరించింది. ఉత్తమ నటుడిగా 'ద రివెనంట్' హీరో ' లియోనార్డో డికాప్రియా, ఉత్తమ నటిగా 'రూమ్' కథానాయిక 'బ్రే లార్సన్' ఆస్కార్ అవార్డును అందుకున్నారు.

 • ఉత్తమ దర్శకుడు : అలోజాండ్రో గొంజాల్వెజ్ ఇనార్రిటు.
 • ఉత్తమ సహాయ నటుడు : మార్క్ రేలేన్స్ (బ్రిడ్జి ఆప్ స్పైస్)
 • ఉత్తమ సహాయ నటి : అలీసియా వికందర్ (ద డానిష్ గర్ల్)
 • ఉత్తమ ఛాయాగ్రహణం : ఎమ్మాన్యుయెల్ లుజెక్కి (ద రివెనంట్)
 • ఉత్తమ యానిమేషన్ చిత్రం : ఇన్ సైడ్ అవుట్
 • ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే : స్పాట్ లైట్.
 • ఉత్తమ సంగీతం : ద హేట్ ఫుల్ ఎయిట్ (మోరిక్ వన్)
 • ఉత్తమ పాట : రైటింగ్స్ ఆన్ ద వాల్ (స్పెక్టర్)
 • ఉత్తమ వస్త్రాలంకరణ : జెన్నీ బెవన్ (మ్యాడ్ మ్యాక్ ఫ్యూరి రోడ్)
 • ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ : ఇన్ సైడ్ అవుట్ (పీట్ డాక్టర్ అండ్ జోనస్ రివెరా)
 • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : ఎమీ (ఆసిఫ్ కపాడియా అండ్ జేమ్స్ గేరీస్)
 • ఉత్తమ షార్ట్ ఫిల్మ్ : షట్టరర్ (జెంజిమన్ క్లియరీ అండ్ సెరీనా అమృతేజ్)
 • ఉత్తమ విదేశీ చిత్రం : ఆన్ ఆఫ్ సాల్ (నీమ్స్ హంగరీ)
 • ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్) : బేర్ స్టోరీ (గ్రాబ్రియల్ ఒసోరియో అండ్ పటో ఎస్కాల)
 • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కొలిన్ గిబ్బన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్)
 • ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ : లెస్సీ వాండర్ వాల్ట్ ఎల్కా వార్టెగా, డేమియస్ మార్టిన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్)
 • ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : మార్క్ మంగిని అండ్ డేవిడ్ వైట్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్)
 • ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : మార్గరెడ్ సిజెల్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్)
 • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : ఎక్స్ మెకినా (అండ్రూ వైట్ హస్ట్, పాల్ నోరిస్, మార్క్ అర్డింగ్టన్ అండ్ సరా బెన్నెట్)

బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం..

ఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల మహిళలకు లబ్థి చేకూర్చేలా వారికి గ్యాస్ కనెక్షన్లు కల్పించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన బీపీఎల్ కుటుంబాలకు ఎల్ పీజీ సౌకర్యం కల్పించేందుకు 1000 కోట్ల రూపాయలను కెటాయిస్తున్నట్లు ప్రకటించారు.

13:15 - February 29, 2016

ఢిల్లీ : లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016-17 బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ 2వేల నుండి 5వేలకు పెంచారు. పన్ను రాయితీ ద్వారా కోటి మంది పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలగనుంది. అద్దె ఇళ్లలో నివాసం ఉండే వారికి అద్దె మినహాయించారు. రూ. 24 వేల నుండి రూ. 60 వేలకు పెంచారు. సొంత ఇళ్లు లేని హెచ్ఆర్ఏ పొందని ఉద్యోగులకు వర్తింపు కలగనుంది. స్టార్టప్ ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్ల పాటు నూరు శాతం పన్ను రాయితీ కల్పించారు. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు మరో రూ. 50 వేలు పెంచారు. 60 చ.అడుగుల మీటర్ల విస్తీర్ణం లోపు ఇళ్లు, ప్లాట్లపైనా సేవా పన్ను మినహాయించారు. రూ. కోటి ఆదాయం దాటిన ఆదాయంపై 15 శాతం సర్ చార్జీ విధించారు. విలాసవంతమైన కార్లపై ఒక శాతం అదనపు పన్ను విధించారు. రూ.10 లక్షల పైబడ్డ కార్లపై ఒక శాతం సర్వీస్ ట్యాక్స్ విధించగా రూ.2లక్షల వరకూ కార్ల పరికారాలు కొంటే సర్వీస్ ట్యాక్స్ ఒక శాతం అదనం కేటాయించారు. కార్లు, ఎస్వీయులు, డీజిల్ వాహనాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయించారు. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను 10 నుండి 15 శాతానికి పెంచారు. ఎక్సైజ్ పన్ను పెంపు నుండి బీడీలకు మినహాయించారు. వెండి తప్ప, ఇతర నగల మీద 1 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను విధించారు.

లోక్ సభ వాయిదా..

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగం తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభంకానుంది.

13:01 - February 29, 2016

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మనోహర్ (ఆర్థిక రంగం విశ్లేషకులు), శశికుమార్ (విశ్లేషకులు), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), పీఎస్ఎల్ రావులు (ఆర్థిక రంగం నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి. 

భారీ నష్టాల్లో సెన్సెక్స్..నిఫ్టీ..

ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ 400 పాయిట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 120 పాయింట్లకు చేరింది. 

12:55 - February 29, 2016

ఢిల్లీ : లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ, వ్యవ వివరాలను ఆయన వెల్లడించారు.

 • మొత్తం బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు.
 • ప్రణాళిక వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు.
 • ప్రణాళికేతర వ్యయం రూ. 14.28 కోట్లు.
 • ద్రవ్యలోటు 3.5 శాతం.
 • రెవెన్యూ లోటు 2.5 శాతం.
 • ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు కార్యాచరణ.
 • బ్యాంకుల మూల ధర సమీకరణకు రూ. 25 వేల కోట్లు.
 • ముద్రా బ్యాంకు ద్వారా రూ. లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు.
 • సెబీ ద్వారా కొత్తగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్.
 • గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు రాయితీలు.
 • పంటల బీమా పథకాలకు గత బడ్జెట్ కంటే నిధులు రెట్టింపు.
 • రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళిక వ్యయం 28 శాతం పెంపు.
 • ఆర్థిక సేవల విషయంలో ఆధార్ ను తప్పనిసరి చేస్తూ చట్టం.
 • కుటుంబానికి రూ. లక్ష మేర బీమా.
 • వయో వృద్ధులకు రూ. 30 వేలు అదనంగా ఆరోగ్య బీమా.
 • పశు సంవర్థక శాఖకు రూ. 850 కోట్లు.
 • ఉన్నత విద్యకు నిధులిచ్చేందుకు రూ.1000 కోట్లతో కార్పస్ ఫండ్.
12:46 - February 29, 2016

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లతో రూపకల్పన చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రణాళికా వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ. 14.28 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 3.5 శాతం. రెవెన్యూ లోటు 2.5 శాతం.

 • వ్యవసాయ రంగానికి రూ. 35,985 కోట్లు
 • పశు సంవర్థక శాఖకు రూ. 850 కోట్లు
 • పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ. 500 కోట్లు
 • సేంద్రియ వ్యవసాయానికి రూ. 412 కోట్లు
 • గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు
 • పంటల బీమా పథకం కోసం రూ. 5,500 కోట్లు
 • అణు విద్యుత్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు
 • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి రూ. 1700 కోట్లు
 • ఉన్నత విద్యకు నిధులిచ్చందేకు రూ. 1000 కోట్లతో కార్పస్ ఫండ్
 • పాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు
 • రూ. 900 కోట్లతో పప్పు ధాన్యాలకు మార్కెట్ స్థిరీకరణ నిధి
 • పంచాయతీలు, పురపాలక సంఘాల ఆర్థిక సాయానికి రూ. 2.87 లక్షల కోట్లు
 • రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలకు రూ. 2,21,246 కోట్లు
 • గ్రామీణా భివృద్ధికి రూ. 87,765 కోట్లు
 • వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు
 • ముద్రా బ్యాంక్ ద్వారా రూ. లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు
 • భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు
 • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు
 • స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం రూ. 9 వేల కోట్లు
 • సాగర్ మాల ప్రాజెక్టు కోసం రూ. 8 వేల కోట్లు
 • బ్యాంకుల మూలధన సమీకరణకు రూ. 25 వేల కోట్లు
 • రూ. 27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం
 • నాబార్డ్ ద్వారా రూ. 20 వేల కోట్లతో ఇరిగేషన్ ఫండ్

ప్రణాళికా వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లతో రూపకల్పన చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రణాళికా వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ. 14.28 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 3.5 శాతం. రెవెన్యూ లోటు 2.5 శాతం. 

12:36 - February 29, 2016

ఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అందులోని ముఖ్యాంశాలు..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించేలా చట్టాలకు సంస్కరణలు.

 • ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు కార్యాచరణ.
 • గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు మరిన్ని రాయితీలు.
 • సెబీ ద్వారా కొత్తగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్.
 • స్టాక్ ఎక్స్చేంజీలు, బీమా, పించన్ రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు.
 • మౌలిక రంగంలో సదుపాయాలకు కొత్త రేటింగ్ విధానం.
 • ఇన్ ఫ్రా రంగంలో పన్ను రహిత బాండ్ల జారీ.
 • దేశంలో తయారు చేసే ఆహార ఉత్పత్తుల సంస్థలకు నూను శాతం ఎఫ్ డీఐకి అనుమతి.
 • గ్రామీణాభివృద్దికి గత సంవత్సరంతో పోలిస్తే 288 శాతం అధిక నిధులు.
 • రుణ విధానం మరింత పారదర్శకం. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు చట్టానికి త్వరలో సవరణ.
 • అణు విద్యుత్ ఉత్పత్తికి రూ.3 వేల కోట్లు.
 • రవాణా రంగంలో లైసెన్స్ రాజ్ కు స్వస్తి.
 • చమురు నిక్షేపాల వెలికి తీతకు అత్యంత ప్రాధాన్యం.
 • పాసింజర్ బస్సుల నిర్వాహణకు కొత్త ప్రయోగం.
 • రైల్వేల అభివృద్ధికి రూ. 2.18 లక్షల కోట్లు.
 • చిన్న దుకాణాలకు వారంలో అన్ని రోజులూ వ్యాపారానికి అనుమతి.
 • ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజనకు రూ.1,700 కోట్లు.
 • స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలకు రూ.500 కోట్లు.
 • గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపునకు చర్యలు.
 • కొత్త ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై 8.33 శాతం వడ్డీ.
 • బహిరంగ మల, మూత్ర విసర్జన లేని గ్రామాలకు పురస్కారాలు.
 • తూర్పు, పశ్చిమ తీరాల్లో నౌకాశ్రయాల నిర్మాణానికి అనుమతులు.
 • మౌలిక రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు.
 • పంచాయతీలు, పురపాలక సంఘాలకు సాయంగా రూ.2.87 కోట్ల గ్రాంటు.
 • పదివేల కి.మీట జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం. ఇందుకు రూ.2.18 లక్షల కోట్లు కేటాయింపు.
 • దేశ వ్యాప్తంగా 1500 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు. వీటికి అదనంగా 5,700 మల్లీ స్కిల్ కేంద్రాలు.
 • పీపీపీ పద్ధతిలో నేషనల్ డయాలసీస్ సర్వీస్.
 • ప్రధాని ఔషధ యోజన పేరిట కొత్త పథకం. దీని ద్వారా దేశ వ్యాప్తంగా మూడు వేల మెడికల్ స్టోర్స్ ఏర్పాటు.
 • వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం.
 • పాడి రైతుల కోసం రూ. 850 కోట్లు.
 • నా బార్డు ఆధ్వర్యంలో రూ.20వేల కోట్లతో ఇరిగేషన్ నిధి.
 • రైతులకు రుణాలకు లక్ష్యం రూ. 9 లక్షల కోట్లు.
 • రైతు రుణాలపై రాయితీకి రూ. 15వేల కోట్లు.
 • భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు.
 • గ్రామీణాభివృద్ధికి రూ. 2.97 లక్షల కోట్లు.
 • జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు.
 • స్వచ్ఛ భారత్ కు రూ. 9వేల కోట్లు.
 • ప్రధాని గ్రామ సడక్ యోజన కోసం రూ. 19 వేల కోట్లు.
 • రహదారుల నిర్మాణానికి రూ. 15వేల కోట్లు.
 • ఇరిగేషన్ కోసం రూ. 17 వేల కోట్లు.
 • భూసార పరీక్షల కోసం రూ. 268 కోట్లు.
 • పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ. 500 కోట్లు.
 • వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు.
 • వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు. 

పేదల కోసం మూడు కొత్త పథకాలు - జైట్లీ..

ఢిల్లీ : పేదల కోసం మూడు కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలకు రూ.2.75 లక్షలు..దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు సహాయం చేస్తామన్నారు. 

వంట గ్యాస్ కనెక్షన్ల కోసం రూ.200 కోట్లు - జైట్లీ..

ఢిల్లీ : వంటగ్యాస్ సిలిండర్లు పేద కుటుంబాలకు పూర్తిస్తాయిలో అందడం లేదని, పేద మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్ల కొరకు 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్చందంగా వదిలేయాలన్న ప్రధాని విజ్ఞప్తికి మంచి స్పందన వచ్చిందన్నారు. రూ. లక్ష వరకు రోగ్య బీమా పేద కుటుంబాలకు అందిస్తామని తెలిపారు. 

స్వచ్ఛ భారత్ పథకానికి రూ. 9వేల కోట్లు - జైట్లీ..

ఢిల్లీ : స్వచ్ఛ భారత్ పథకానికి రూ. 9వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్..ప్రధాన మంత్రి పసల్ బీమా యోజనకు రూ.5500 కోట్లు, ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ కొనుగోళ్లు చేస్తామన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజనకు రూ.655 కోట్లు..పశు సంక్షేమానికి పశుధన్ సంజీవని, నకుల్ నిశ్వాస్ పత్ర పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ కిఒరకు ఈ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 62 నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 

జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం - జైట్లీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. గ్లోబల్ ఎకానమీ సంక్షోభంలో ఉన్న సమయం లో ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతోందని తెలిపారు. సవాళ్లు ఎదురైనా ముందుకెళుతున్నామని, వరల్డ్ ఎకానమిక్ ఫోరం భారత్ ఆర్థిక పరస్థితి మెరుగ్గా ఉందని చెప్పడం జరిగిందని, సంక్షోభంలో వచ్చిన సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటున్నట్లు తెలిపారు. ఎగుమతుల్లో 7 శాతం వృద్ధి, ద్రవ్యోల్బణం 5.4 శాతానికి అదుపు చేయడం జరిగిందన్నారు. జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం ఉందన్నారు. 

11:12 - February 29, 2016

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. గ్లోబల్ ఎకానమీ సంక్షోభంలో ఉన్న సమయం లో ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతోందని తెలిపారు. సవాళ్లు ఎదురైనా ముందుకెళుతున్నామని, వరల్డ్ ఎకానమిక్ ఫోరం భారత్ ఆర్థిక పరస్థితి మెరుగ్గా ఉందని చెప్పడం జరిగిందని, సంక్షోభంలో వచ్చిన సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటున్నట్లు తెలిపారు. ఎగుమతుల్లో 7 శాతం వృద్ధి, ద్రవ్యోల్బణం 5.4 శాతానికి అదుపు చేయడం జరిగిందన్నారు. జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం ఉందన్నారు.

9 అంశాలపై బడ్జెట్..
9 ముఖ్యమైన అంశాలపైన ఆధార పడిన ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. సామాజిక భద్రత, వైద్య సదుపాయాలు, విద్యా నైపుణ్యాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు, పన్నుల్లో మార్పులు తదితర అంశాలపై ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. స్థిరమైన రాజకీయ వాతావరణంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమానికి, ప్రత్యేకంగా పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం సహకరించకపోయినా సవాళ్లను ఎదురైనా ముందుకెళుతున్నామన్నారు.

పలు రంగాల్లో సంస్కరణలు..
నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. విదేశీ మార్కెట్లు బలహీన పడిపోయినా స్వదేశీ మార్కెట్ నిలబడిందని, ఏడో పే కమిషన్ సిఫార్సుల అమలుతో భారం పడిందన్నారు. సామాజిక పథకాల కింద ప్రధాన మంత్రి రైతు బీమా యోజన, ఆరోగ్య బీమా మూడవ వంతు ప్రజలను కవర్ చేసే విధంగా స్కీమ్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గ్రామీణ భారతంలో మౌలిక సదుపాయల కొరకు అదనపు కేటాయింపులు చేయడం జరిగిందని, సంక్షేమ పథకాలను లబ్దిదార్లకు ఆధార్ కార్డు ప్రాతిపదికన అందిస్తామన్నారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, 8 విభాగాల్లో సంస్కరణల వేగాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు చేస్తామన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచుతాం..
విదేశీ మారక ద్రవ్యం 350 మిలియన్ డాలర్లు ఉందన్నారు. భారతదేశాన్ని ఆహారాన్ని అందిస్తూ రైతు వెన్నెముకగా ఉన్నాడని, రైతుల ఆదాయాన్ని 2020 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 12517 కోట్లు నాబార్డు ద్వారా వ్యవసాయానికి అందిస్తామని, 14 కోట్ల వ్యవసాయ భూములన్నిటికి ఫెర్టిలైజర్స్ అందించేలా చూస్తామన్నారు. పరంపరాగస్ కృషి వికాస్ యోజన కింద మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఈ స్కీమ్ కింద ప్రోత్సాహిస్తామన్నారు. 

రైతు రుణపరిమితి లక్ష్యం..
ఆరోగ్య బీమా మూడో వంతు ప్రజలను కవర్ చేసే విధంగా స్కీమ్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గ్రామీణ భారతంలో మౌలిక సదుపాయాల కొరకు అదనపు కేటాయింపులు చేయనున్నట్లు, సంక్షేమ పథకాలను లబ్దిదార్లకు ఆధార్ కార్డు ప్రాతిపదికన అందిస్తామన్నారు. కృషి వికాస కేంద్రాల సామర్థ్యం పెంపునకు ఒక్కో కేంద్రానికి రూ. 50 లక్షలు అందిస్తామని, రైతు రుణ పరిమితి లక్ష్యం రూ. 9లక్షల కోట్లు పెట్టుకున్నట్లు తెలిపారు.

స్వచ్ఛ భారత్ కు రూ. 9వేల కోట్లు..
పేదల కోసం మూడు కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలకు రూ.2.75 లక్షలు..దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు సహాయం చేస్తామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38 వేల కోట్లు..గ్రామీణ సడక్ యోజన కింద రహదారులకు రూ.19 వేల కోట్లు..మిగిలిన 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛ భారత్ పథకానికి రూ. 9వేల కోట్లు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్..ప్రధాన మంత్రి పసల్ బీమా యోజనకు రూ.5500 కోట్లు, ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ కొనుగోళ్లు చేస్తామన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజనకు రూ.655 కోట్లు..పశు సంక్షేమానికి పశుధన్ సంజీవని, నకుల్ నిశ్వాస్ పత్ర పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ కిఒరకు ఈ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 62 నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 12 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కంప్యూటర్ సౌకర్యం అందుబాటులో లేదన్నారు. డిజిటల్ లిటరసీ కమిషన్ కింద ఆరు కోట్ల కుటుంబాలకు కంప్యూటర్ సౌకర్యం కల్పిస్తామన్నారు. జన ఔషదీ యోజన కింద జనరిక్ మందుల షాపులు 300 వరకు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తామని, నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ పీపీపీ కింద డయాలాసిస్ సర్వీసులను అన్ని జిల్లా కేంద్రాల్లో అందిస్తామన్నారు. డయలాసిస్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటి మినహాయింపు చేస్తున్నట్లు, స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీల్లో వ్యాపార వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.80 లక్షల నిధులు..
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.80 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు, స్వయం సహాయక బృందాలను మరింత ఎక్కువగా ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం చేయడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్సూరెన్స్ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, 15వేల కోట్లు రైతు రుణాల రీ షెడ్యూల్ కోసం కేటాయించినట్లు తెలిపారు.

జనరిక్ మందులు..
ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన కింద తక్కువ ధరకు జనరిక్ మందులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 38500 కోట్లు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు చేస్తున్నట్లు, 18542 గ్రామాలకు 2015 ఏప్రిల్ నాటికి విద్యుత్ సరఫరా లేదని, 23 ఫిబ్రవరి కల్లా 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. అన్ని గ్రామాలకు మే 1, 2018 కల్లా విద్యుత్ సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

ఆరోగ్య బీమా..
వంటగ్యాస్ సిలిండర్లు పేద కుటుంబాలకు పూర్తిస్తాయిలో అందడం లేదని, పేద మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్ల కొరకు 200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్చందంగా వదిలేయాలన్న ప్రధాని విజ్ఞప్తికి మంచి స్పందన వచ్చిందన్నారు. రూ. లక్ష వరకు ఆరోగ్య బీమా పేద కుటుంబాలకు అందిస్తామని తెలిపారు. 

బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న జైట్లీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ కు చేరుకున్నారు. 2016-17 బడ్జెట్ ను జైట్లీ ప్రవేశ పెడుతున్నారు. 

ఉత్తమ హీరో లియోనార్డో..

లాస్ ఏంజిల్స్ : ద రివెనంట్ చిత్ర కథానాయకుడు లియోనార్డో డికాప్రియా ఉత్తమ కథానాయకుడిగా ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. ద రివెనంట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అలోజాండ్రో గొంజాల్వెజ్ ఇనార్రిటును ఆస్కార్ అవార్డు వరించింది. 

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటిక్రితం ముగిసింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో సాగర్ బాబు, ప్రధాన అర్చకులు, వేద పండితులు ఉదయం 9.15గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, శివ సంకల్పం, చండీశ్వర పూజ తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 

పార్లమెంట్ కు చేరుకున్న జైట్లీ..

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లు పార్లమెంట్ కు చేరుకున్నారు. ఉదయం 11గంటలకు జైట్లీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

09:29 - February 29, 2016

లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండుగా జరుగుతోంది. నటుడు క్రిస్ రాక్ ప్రయోక్తగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాలీవుడ్ తారాగణం విచ్చేసింది. ఉత్తమ సహాయ నటిగా ఆలీషియా వికందర్ (ద డానిష్ గర్ల్) ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే విభాగంలో స్పాట్ లైట్ చిత్రం అకాడమీ అవార్డుకు ఎంపికైంది. 

నార్త్ బ్లాక్ లో జైట్లీ..

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లు నార్త్ బ్లాక్ కు చేరుకున్నారు. ఉదయం 11గంటలకు జైట్లీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

ఆస్కార్ అవార్డ్స్..

లాస్ ఏంజిల్స్ : ఆస్కార్స్‌లో ఎమాన్యువల్ లుబెజ్కి హ్యాట్రిక్ కొట్టారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఈసారి కూడా లుబెజ్కి ఆస్కార్‌ను అందుకున్నారు. ద రెవెనంట్ సినిమాకు ఆయన కెమెరామెన్‌గా వ్యవహరించారు. దీంతో లుబెజ్కి ఆస్కార్ హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో వరుసగా గ్రావిటీ, బర్డ్‌మాన్ చిత్రాలకు లుబెజ్కి సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్లను గెలుచుకున్నారు.

07:53 - February 29, 2016

కొంచెం కాఫీ సేవిస్తే ఎంత హాయిగా ఉంటుందో కాఫీ ప్రియులు తరచూ చెప్పే మాట ఇది. కాఫీ తాగడానికే కాదు దీనిలో సౌందర్య ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు.
కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మృత కనాలను సులభంగా తొలగిస్తుంది. దీంతో చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడిని ఎలా స్క్రబ్‌గా వాడుకోవాలంటే? స్నానం చేసే సమయంలో కొంచెం కాఫీ పొడిని తీసుకొని రుద్దుకుంటే సరిపోతుంది.
చర్మం ముడతలు పడకుండా ఉండాలని యాంటి ఏంజింగ్‌ క్రీంలను వాడుతూ ఉంటారు. అయితే కాఫీ మంచి యాంటి ఏజింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిలో, కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని బ్రష్‌ సాయంతో ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారటమే కాకుండా మృత కణాలు తొలగిపోతాయి.

07:51 - February 29, 2016

తియ్యని పుల్లని ద్రాక్ష పండ్లు తినడానికే కాదు, సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ద్రాక్షలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి. వయసు ఛాయలు కనిపించకుండా చేస్తాయి.
కొన్ని ద్రాక్ష పళ్లని చేతులతో ముద్దగా చేసుకుని, దానికి ఒక టేబుల్‌ స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై చర్మం కాంతిమంతం అవుతుంది.
పొడిచర్మం సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొనకు, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. కళ్ల చుట్టూ ముడతలు వస్తున్నప్పుడు ద్రాక్ష పండ్లతో వాటిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షను రెండు ముక్కలుగా చేసుకుని కంటి చుట్టూ కొన్ని క్షణాలు రాయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు తగ్గిపోతాయి.
ఐదు స్పూన్ల పెరుగుకి, మూడు స్పూన్ల ద్రాక్ష రసం, ఒక స్పూను నారింజ రసం కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు. ఇది వయసు పైబడిన ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
అంతేకాదు, ద్రాక్షలకు మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చల్ని తగ్గించే గుణం ఉంది. నాలుగైదు ద్రాక్ష పళ్లని మెత్తగా చేసి, దానికి చెంచాలో పావు వంతు గోధుమపిండిని, కాస్త బేకింగ్‌ సోడానీ కలిపి మొటిమలొస్తున్న ప్రదేశంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.

07:47 - February 29, 2016

జీవా, హన్సిక జంటగా రామ్‌ ప్రకాష్‌ రాయప్ప దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో సాయి గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోద్‌, శ్రీను సం యుక్తంగా 'పోకిరి రాజా' పేరుతో తెలుగులోకి అనువదిస్తు న్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'జీవా, హన్సిక జంటకి తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. వారిద్దరి కాంబి నేషన్‌లో వచ్చిన అన్ని చిత్రాలకూ మంచి స్పందన లభించింది. అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులకు అందించ బోతున్నాం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇమాన్‌ అందించిన మ్యూజిక్‌ ప్లస్‌ అవు తుంది. జీవా 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో సత్య రాజ్‌ తనయుడు సిబిరాజ్‌ విలన్‌గా నటించారు. త్వరలోనే ఆడియోతోపాటు సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.

07:46 - February 29, 2016

ఇటీవల 'మయారి' హర్రర్‌ చిత్రంతో అలరించిన నయనతార తాజాగా మరో హర్రర్‌ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్‌ రామస్వామి దర్శకత్వంలో మానస్‌ రుషి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై కె.రోహిత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సజ్జూభారు, రాంప్రసాద్‌ సహ నిర్మాతలు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నయనతార మాట్లాడుతూ, 'ఈ చిత్రం భయపెట్టేటట్టుగా భవిష్యత్‌లో మరే చిత్రం భయపెట్టలేదని భావిస్తున్నాను' అని అన్నారు. 'ఇదొక పూర్తి స్థాయి హర్రర్‌ ఎంటర్‌టైనర్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె కెరీర్‌లోనే ఈ చిత్రం ఒక కలికితురాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నాం' అని నిర్మాత కె.రోహిత్‌ తెలిపారు.

 

07:45 - February 29, 2016

'అభిమానుల కేరింతలు, ప్రేక్షకుల ప్రశంసలు నా ఆలసటను దూరం చేస్తాయి. వాళ్ళ నిస్వార్థమైన ప్రేమ చూస్తుంటే నాలో ఉత్సాహం ఉరక లేస్తుంద'ని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు హిమేష్‌ రేష్మియా. నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా ఏకకాలంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న హిమేష్‌ తాజాగా 'తేరా సరూర్‌ 2' చిత్రంలో నటించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 'ఉత్కంఠని రేకెత్తించే ఓ ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రమిది. సంగీతానికి ప్రాధాన్యముంటుంది. రఘు అనే పాత్రలో నటించాను. మత్తు పదార్థాలకి సంబంధించిన కేసులో ఇరికించే ప్రయత్న చేసిన దుండగుల బారి నుండి ప్రేయసిని కాపాడుకునే రఘు ప్రేమకథే ఈ చిత్రం. నన్ను ప్రేమకథల్లో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాని నాకు అమితాబ్‌ బచ్చన్‌లా యాంగ్రీయంగ్‌మ్యాన్‌ గుర్తింపు తెచ్చుకోవాలని, కమల్‌ హాసన్‌లా విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉంది. ఈ చిత్రానికి నేనే సంగీతం సమకూర్చాను. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన చాలా బాగుంది. నా ఆల్బమ్స్‌లో నటించిన దీపికా పదుకొనె, హన్సికలకి మంచి గుర్తింపు వచ్చింది. అదే తరహాలో ఈ చిత్రంలో నటించిన ఫరా కరిమికి కూడా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.

07:44 - February 29, 2016

ఆది, నమిత ప్రమోద్‌ జంటగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలకీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి.మూవీ హౌస్‌ పతాకాలపై రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. తాజా షెడ్యూల్‌ త్వరలో రాజమండ్రిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్‌ మాస్టర్‌ సారధ్యంలో 5 రోజులపాటు షూట్‌ చేశాం. మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభిస్తాం. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్‌ ఉంటుంది' అని చెప్పారు. 'రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో హీరోహీరోయిన్లు, విలన్‌పై ముఖ్యమైన సన్నివేశాలతోపాటు ఓ పాటను, ఫైట్‌ను కూడా షూట్‌ చేయనున్నాం. సినిమా కోసం తమన్‌ అద్భుతమైన బాణీలను అందించారు. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది' అని దర్శకుడు వీరభద్రమ్‌ అన్నారు.

07:43 - February 29, 2016

నాగార్జున, కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో పివిపి బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'ఊపిరి'. గోపీసుందర్‌ సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల రాసిన 'ఒక లైఫ్‌..' అనే మెలోడి సాంగ్‌ను ఎఫ్‌ఎం.రేడియోలో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి తమన్నా నేడు (సోమవారం) విడుదల చేయనున్నారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం ఆడియోను నోవాటెల్‌ హైటెక్స్ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

07:34 - February 29, 2016

రాజ్యసభలో దుర్గామాతపై తాను చెడుగా మాట్లాడానంటూ తనకు బెదిరింపు కాల్స్, టెక్ట్స్ మెసేజెస్‌ వచ్చాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. పార్లమెంట్‌లో తన ప్రసంగంలో ఎక్కడా దుర్గా మాతపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నేడు పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), వేణుగోపాల్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

రేవ్ పార్టీపై ఎస్ వోటీ పోలీసుల దాడులు..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో రవి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నేడు కన్హయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ..

ఢిల్లీ : జేఎన్ యూఎస్ యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. 

07:19 - February 29, 2016

మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వం స్పూర్తిదాయకమైన నినాదాలిస్తోంది. స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తానంటోంది. మరి భారతదేశ ఆర్థికాభివృద్ధిలో, సామాజిక బాధ్యతల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు ఏమివ్వబోతున్నది? అరుణ్‌ జైట్లీ ముచ్చటగా మూడో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ సహజంగానే ఈ ప్రశ్న ఉదయిస్తోంది. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో 1947కి పూర్వం మనదేశానికి చెప్పుకోదగ్గ చరిత్రేదీ లేదు. సామాజిక పరిస్థితులు అత్యంత ఘోరంగా వుండేవి. కనీసం రోడ్లు, విద్యుత్‌ లాంటి మౌలిక సదుపాయాలేవీ లేక కోటాను కోట్ల భారతీయులు అవస్థపడేవారు. సరికొత్త భారత్‌ను ఆవిష్కరించుకోవడం అప్పుడొక పెద్ద సవాల్‌. అలాంటి కఠిన సవాలును ఛేదించే లక్ష్యంతోనే ఏర్పాటయ్యాయి వివిధ ప్రభుత్వరంగ సంస్థలు. ఆనాటి కలలను సాఫ్యలం చేసుకోవడానికి అవసరమైన పెట్టుబడులు ప్రయివేట్‌ రంగం నుంచి రాలేదు. ప్రభుత్వరంగం నుంచే వచ్చాయన్నది ఎవరూ దాచిపట్టలేని వాస్తవం.

ప్రభుత్వ రంగ సంస్థలు..
మౌలిక సదుపాయాలు సమకూర్చడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, సందలను ఆదాయాలను ప్రజలకు పంపిణీ చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య సమతూకం సాధించడం, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించడం ఇలాంటి ఎన్నో మహోన్నత ఆశయాలను సాధించే లక్ష్యంతో ఏర్పాటైనవే ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ ఆ రోజుల్లో కరెంట్‌ లేదు. ఆయిల్‌ లేదు. స్టీల్‌ లేదు. భారీ యంత్రాలు లేవు. ఇలా ఈ సువిశాల భారతదేశంలో ఏ సౌకర్యం సమకూర్చుకోవాలన్నా తొలి అడుగువేసింది ప్రభుత్వరంగమే. భిలాయ్‌, రూర్కెలా, దుర్గాపూర్‌, సింద్రిలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో స్టీల్‌, ఎరువులు లాంటి భారీ పరిశ్రమలు పెట్టే సాహసం ప్రయివేట్‌ రంగం చేయగలదా? కానీ అత్యంత వెనుబడిన మారుమూల ప్రాంతాల్లో సైతం తమకు అప్పగించిన బాధ్యతలను మన ప్రభుత్వరంగ సంస్థలు ధైర్యంగా స్వీకరించాయి. రాళ్లు- రప్పలు, కొండలు -గుట్టలు, తేళ్లు పాములు తిరిగే ప్రాంతాల్లో గుడ్డి దీపాలైనా కురువైన రోజుల్లో, కనీసం మంచినీళ్లయినా దొరక్కపోయినా అలాంటి ఇబ్బందులేవీ లెక్కచేయకుండా మన ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి చక్కటి మౌలికవసతులు సమకూర్చిపెట్టారు.

29 కోట్ల రూపాయల పెట్టుబడులు..
ఒక్కొక్క ప్రభుత్వరంగ సంస్థను నిర్మించడానికి, దానిని బలోపేతం చేయడానికి నాటితరం తమ రెక్కలు ముక్కలు చేసుకున్న తీరు, తమ రక్తమాంసాలు ధారపోసినతీరు నేటి రాజకీయ నేతలకు తెలియకపోవచ్చు. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో కేవలం 29 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమైన మన ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులు ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మన ప్రభుత్వరంగ సంస్థలు కొన్ని లక్షల మందికి ఉద్యాగాలిచ్చాయి. ప్రయివేట్‌రంగంలోని అనేక నష్టజాతక సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకుని, మరికొన్ని లక్షల మంది ఉద్యోగాలను,జీవితాలను నిలబెట్టాయి. మనదేశంలోని మొత్తం పారిశ్రామిక రంగం కల్పించిన ఉద్యోగాల్లో రెండింటి మూడొంతుల ఉద్యోగాలను ప్రభుత్వరంగ సంస్థలే ఇచ్చాయి. . ఉద్యోగుల, కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడంలోనూ, పని పరిస్థితులు మెరుగుపరచడంలోనూ, భద్రత కల్పించడంలోనూ మన ప్రభుత్వరంగ సంస్థలు రోల్‌ మోడల్‌గా నిలిచాయి. అంతేనా, ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేశాయి. నీళ్లిచ్చాయి. పార్కులు ఏర్పాటు చేశాయి. విద్య, వైద్య సంస్థలు నెలకొల్పాయి. టౌన్‌ షిప్స్‌ ఏర్పాటు చేశాయి. ప్రతి ప్రభుత్వరంగ సంస్థ తన పెట్టుబడుల్లో కనీసం పది శాతం నిధులు ప్రజా సంక్షేమానికే వినియోగించాయి. వినియోగదారులకీ సరసమైన ధరలకే ఉత్పత్తులు అందించాయి. ఇలాంటి చరిత్ర తమకూ వుందని ఏ ఒక్క ప్రయివేట్‌ సంస్థ అయినా గుండెల మీద చేయి వేసి చెప్పగలదా?

విదేశీ మారక ద్రవ్యం..
ఎంఎంటీసీ, హిందుస్థాన్‌ స్టీల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌ఎంటీ లాంటి సంస్థలు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించిపెట్టడంలో పోషించిన పాత్రను ఎవరైనా విస్మరించగలరా? హిందుస్థాన్‌ యాంటీ బయోటిక్స్‌, ఐడీపీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లాంటి సంస్థలు దిగుమతుల భారాన్ని తగ్గించడంలోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలోనూ పోషించిన పాత్రను కాదనగలమా? మనదేశంలో వెలుగులు విరజిమ్మడంలో కోల్‌ఇండియా, ఎన్టీపీసీ సంస్థలు, ఆయిల్‌ గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీయడంలో ఓఎన్‌జీసీ పోషిస్తున్న పాత్రకు వెలకట్టగలమా? అంతెందుకు రైల్వేలలో ఎల్‌ఐసీ రాబోయే అయిదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందింటూ రెండు రోజుల క్రితమే రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు చెప్పింది.

1951లో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలోనూ, రీసెర్చి అండ్‌ డవలప్‌మెంట్‌ వింగ్‌లోనూ మన ప్రభుత్వరంగ సంస్థలు సత్తా చూపిస్తున్నాయి. వివిధ రకాల పన్నులు, డివిడెండ్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్షా 60 వేల కోట్ల రూపాయల ఆదాయం ముట్టచెబుతున్నాయి. మనదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల వార్షిక లాభాలు లక్ష కోట్ల పై మాటే. ఇన్ని రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల విషయంలో దేశభక్తి స్వభావం గల ఏ ప్రభుత్వామైనా ఏం చేస్తుంది? వాటిని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వరంగ సంస్థలకు తోడుగా మరికొన్ని సంస్థలను నెలకొల్పి జాతిరుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. 1990 వరకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. 1951లో అయిదు ప్రభుత్వ రంగ సంస్థలుండేవి. వాటిలో పెట్టిన పెట్టుబడుల మొత్తం 29 కోట్లు. 1961 నాటికి ప్రభుత్వరంగ సంస్థల సంఖ్య 47కి పెరిగితే, పెట్టుబడులు 950 కోట్లకు చేరాయి. 1990 నాటికి వీటి సంఖ్య 244కి చేరింది. కానీ ఆ తర్వాత అంటే 1991 లో నూతన ఆర్థిక సంస్కరణలు మొదలైన నాటి నుంచి ప్రభుత్వాలు బడ్జెట్‌ సపోర్ట్‌ ఇవ్వడం మానేశాయి.

బకాయిల వసూలు ఎక్కడ ? 
ప్రభుత్వరంగ ప్రాధాన్యత తగ్గించారు. కొత్త సంస్థలు స్థాపించకపోగా వున్న వాటినే మూసివేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వీటి సంఖ్య 220కి కుదించుకపోయింది. కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, సెయిల్‌ ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో వాటాలు అమ్మేస్తున్నారు. ఇలా అమ్ముకోగా వచ్చిన డబ్బులతో రోజువారీ ఖర్చులు వెళ్లదీస్తున్నాయి. దేశంలో సంక్షేమ, అభవృద్ధి పథకాలకీ నిధులు లేవంటున్న ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం ఏటా అయిదున్నర లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్నాయి. తమ శక్తి సామర్థ్యాలతో మన ప్రభుత్వరంగ సంస్థలు అందులో పనిచేసే కార్మికులు చెమటోడ్చి రూపాయి సంపాదించుకొస్తే, దానికి మరో నాలుగు రూపాయలు జత చేసి, కార్పొరేట్‌ సంస్థలకు నైవేద్యం పెడుతున్నాయి మన ప్రభుత్వాలు. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రయివేట్‌ , కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన మొండిబకాయిలు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. కేవలం పది కంపెనీలే 30 వేల కోట్లకు పైగా ఆరగించాయి. నిజానికి ప్రయివేట్‌ కార్పొరేట్‌ సంస్థలకిచ్చిన డబ్బులు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి వుంటే ఈ దేశానికెంతో మేలు జరిగి వుండేది. ఇవాళ బ్యాంక్‌లు నష్టభయంతో కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థల వాటాలు విక్రయించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో కార్పొరేట్‌ సంస్థలు బ్యాంక్‌లకు పెట్టిన గండిని పూడ్చాలని చూస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకునే బదులు కార్పొరేట్‌ సంస్థలు ఎగ్గొడుతున్న బకాయిలు వసూలు చేసేందుకు ఎందుకు ప్రయత్నించరో అర్ధం కాదు. 

07:14 - February 29, 2016

ఇవాళ కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది. అరుణ్‌ జైట్లీ ఎవరికేమిస్తారు? ఎవరి నుంచి ఎంతెంత తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ కేటాయింపులలో ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధికి, పరిశోధనకీ కేటాయిస్తున్న నిధులు తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాల ప్రతిపాదనలు తెస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్‌ కేటాయింపులు కుదించడం, వాటాలు విక్రయించడం వల్ల జరుగుతున్న నష్టాలేమిటి? మనదేశంలో ప్రభుత్వరంగ సంస్థలకున్న ప్రాధాన్యతమేటి? అవి ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నేత అజయ్‌ కుమార్‌ విశ్లేషించారు. విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు..

హైదరాబాద్ : నేటి నుంచి దేశ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించనున్నాయి. జేఎన్‌యూ ఘటనపై కేంద్ర వైఖరికి వామపక్ష విద్యార్థి నేతలు నిరసన తెలియచేయనున్నారు. 

06:44 - February 29, 2016

అనంతపురం : ఎన్నికల సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం,సీపీఐ డిమాండ్‌ చేశాయి. ఆ ప్రాంత హక్కుల కోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి. రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోరుతూ సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమ సమగ్రాభివృద్ది, సీమ జిల్లాలకు నికర జలాలను డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రస్తుతం బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. రెండో రోజులో భాగంగా పుట్టపర్తిలో ప్రారంభమైన బస్సు యాత్ర కొత్త చెరువు, ధర్మవరం, బత్తలపల్లి మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు, మదు, రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం అనంతపురంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన మరో బహిరంగ సభకూ ఇద్దరు నేతలు హాజరయ్యారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ..
కడప ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమ హక్కు అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా..ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు. జన్మ భూమి కమిటీల పేరుతో ప్రభుత్వం రాక్షస కమిటీలను ఏర్పాటుచేసిందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని మధు విమర్శించారు. రాయలసీమ హక్కుల కోసం మార్చి 15న హైదరాబాద్‌లో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాయలసీమ అభివృద్ధి కోసం కేవలం 50 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 50 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు తీరుతుందా అని ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి అవసరాల కోసం నదుల అనుసంధానం జరగాలని రామకృష్ణ అన్నారు. తుంగభద్ర నుంచి ఒక్క చుక్క నీటి బొట్టునైనా చంద్రబాబు తీసుకురాలేకపోయారని మండపడ్డారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. 

06:40 - February 29, 2016

ఢిల్లీ : ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ముచ్చటగా మూడోసారి సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. తొలి రెండు బడ్జెట్‌లలో సంస్కరణల సాకుతో..పలు రాయితీలకు కోత విధించారు. పన్నుల మినహాయింపులతో కార్పొరేట్ సంస్థలకు పంట పండించారు. మరి ఈసారి బడ్జెట్లో ఏయే రంగం ఏమేం ఆశిస్తోంది..సామాన్యుడి ఆలోచనలేంటి..ఆర్థిక సర్వే దిక్సూచిగా జైట్లీ జమా ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి. సామాన్యుల ఆశలకు జైట్లీ పెద్ద పీట వేస్తారా.. మళ్లీ కార్పొరేట్ మంత్రమే జపిస్తారా..?. ఈ రహస్యం తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తేలనుంది.

అంచనాలు..
ఎన్నో ప్రశ్నలతో అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్‌ కోసం ఇండియా ఎదురుచూస్తోంది. జైట్లీ అంకెలా మాయ ఎలా ఉంటుందో అంచనా వేసుకుంటూ ఉత్కంఠగా చూస్తోంది. మరిన్ని పన్ను రాయితీలు కల్పిస్తారా..ధరల అదుపుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..ఇలా సవాలక్ష ప్రశ్నలు, ఆకాంక్షలతో ఇండియా ఎదురుచూస్తోంది అరుణ్‌ జైట్లీ జమా ఖర్చుల కోసం. అయితే ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎంతగానో ఎదురుచూసే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం 2.5 లక్షలలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అంచనా. పన్ను శ్లాబ్‌లను యథాతథంగానే కొనసాగిస్తూ..కొన్ని మినహాయింపుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కార్మికులు అధికంగా ఉండే తోలు, ఆభరణాల రంగాలకు పన్ను రాయితీలు కల్పించొచ్చు. ఇక కార్పొరేట్ పెట్టుబడులను పెంచేందుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చనే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే ఈ పెట్టుబడులు 1.7 శాతంగా ఉండగా..దీన్ని వచ్చే ఏడాది 2 శాతం వరకూ పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు.

విదేశీ పెట్టుబడులు..
మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవొచ్చు. మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు చేపట్టవచ్చు. ఇక వరుసగా రెండేళ్లు కరువు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పంటల బీమా పథకాన్ని విస్తరించడం, సాగునీటి పారుదలకు కేటాయింపులు పెంచడం వంటివి ప్రకటించవచ్చు. గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. చిన్న సాగునీటి పథకాలు, వర్షపు నీటి నిల్వ సదుపాయాలకు కేటాయింపులు ఉండొచ్చు.

మేకిన్ ఇండియాకు పెద్ద పీట..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియాకు పెద్దపీట వేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక, అధికారిక అడ్డంకులు తొలగించేందుకు చర్యలు ప్రకటించవచ్చు. తయారీ రంగానికి నూరు శాతం ట్యాక్స్ క్రెడిట్‌ను ప్రకటించవచ్చని అంచనా. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను ప్రోత్సాహకాలిస్తూ సంస్కరణలు మరింత వేగంగా అమలు చేసే చర్యలు తీసుకోవచ్చు. ఇక సామాజిక పథకాలకు బడ్జెట్‌లో తప్పనిసరిగా నిధులను పెంచాల్సిన ఒత్తిడిని ఆర్థికమంత్రి జైట్లీ ఎదుర్కోనున్నారు. దేశంలో వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ భారతావని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటమే ఇందుకు ప్రధాన కారణం.

మౌలిక రంగం..
ఇప్పటికే 14.5 శాతానికి పెంచిన కేంద్రం ఈసారి బడ్జెట్‌లో మరింత పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను బిల్లు అమల్లోకి వస్తే సేవల పన్నును 18 శాతానికి పెంచాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్రంగా పడిపోయిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రూడ్, పెట్రోలు, డీజిల్‌లపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధింపునకు అవకాశం ఉంది. క్రూడ్ రేట్లు 100 డాలర్లకు చేరడంతో 2011లో దీన్ని తొలగించారు. బంగారం అధిక దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోవడం, రూపాయి బలహీనతల కారణంగా పుత్తడిపై దిగుమతి సుంకం మరింత పెంచేలా చర్యలు ఉండనున్నాయి. పారిశ్రామిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా పెరగనందున..మౌలిక రంగంలో పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ వ్యయాలను పెంచడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వ పన్ను వసూళ్లలో మందగమనం, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, ద్రవ్యలోటుకు కళ్లెం వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ జైట్లీకి బడ్జెట్ కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద ఈసారి తాయిలాల విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చని..కొంత కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందనేది అధిక శాతం మంది విశ్లేషకుల అభిప్రాయం.

06:35 - February 29, 2016

హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి.. తాము పార్టీ మారడంలేదంటూనే నేతలు సైకిల్‌ ఎక్కుతున్నారు.. తాజాగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.. తెలుగుదేశం పార్టీనుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన... మళ్లీ అదే పార్టీలో చేరారు.. సీఎం చంద్రబాబు.... రాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. డేవిడ్ రాజు తెలిపారు. జిల్లాలో వైసీపీకి ఆరుగురు శాసనసభ్యులున్నారు.. ఇందులో నలుగురు టిడిపి తో కాంటాక్ట్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. నేతలు మాత్రం అలాంటిదేమీలేదని స్పష్టం చేశారు.. రెండురోజులక్రితం డేవిడ్‌రాజు కూడా చాలాసార్లు ఇదే విషయం చెప్పాడు.. మరో అయిదుగురు ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌ ముందు కూడా పార్టీ మారడం లేదని చెప్పారు.. ఇది జరిగిన రెండు రోజుల్లోనే సైకిల్‌కు జై కొట్టారు.. తాను వెళ్లడమే కాకుండా ఎర్రగొండపాలెం ఎంపీపీలనుకూడా టిడిపిలోకి రప్పించేలా డేవిడ్‌ ప్లాన్‌ చేశారని సమాచారం.

పార్టీకి కష్టకాలం..
అటు డేవిడ్ రాజు తీరుపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.. రాజు ఫ్లెక్సీలు చించివేసి నిరసన తెలిపారు.. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  డేవిడ్‌ పార్టీ మార్పుపై వైసీపీ రియాక్టయింది.. చంద్రబాబు సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడింది. అయితే ఒక్క డేవిడ్‌ రాజేకాదు.. చాలామంది నేతలు ప్రవాహంలా తమ పార్టీలోకి వస్తారని టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు.. ఇప్పుడు డేవిడ్‌ రాజు పార్టీ మార్పుతో జిల్లాలో కంచుకోటగా ఉన్నా పార్టీకి కష్టకాలం మొదలైంది.. దీంతో మిగతావాళ్లను కాపాడుకోవడంపై దృష్టిపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు. 

06:31 - February 29, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీలోకి జంప్‌ చేస్తుండడంతో.. వైసీపీ హైరానా పడిపోతోంది.. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే... వలస వెళ్లిన వారిని ఇరుకున పెట్టాలని ప్లాన్‌ చేస్తోంది.. తమ పార్టీ నుంచి గెలిచి టిడిపిలో చేరినవారంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ సవాల్‌ విసురుతోంది.. అలాగే కండువా మార్చుకున్న వారిపై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధమవుతోంది.. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అవుతోంది.

అవిశ్వాస తీర్మానం..
స్పీకర్‌ తీరుపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉంది వైసీపీ... బడ్జెట్‌ సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సందర్భంగా.. పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయాలని వైసీపీ అధినేత జగన్‌ యోచిస్తున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిగితే తమ నుంచి వలస వెళ్లిన వారు కూడా పార్టీ విప్‌కు లోబడి తమకు అనుకూలంగానే ఓటు వేయాల్సి ఉంటుందన్నది జగన్‌ యోచనగా చెబుతున్నారు. ఒకవేళ పార్టీ మారినవారు విప్‌ను ధిక్కరిస్తే.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను కోరాలని భావిస్తున్నారు. ఒకవేళ స్పీకర్‌ స్పందించకుంటే.. ఈ వ్యవహారాన్ని కోర్టుకు తీసుకు వెళ్లాలని వైసీపీ అధినాయకత్వం యోచిస్తోంది. ఒకవేళ విప్‌కులోబడి టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసినా అధికార పార్టీకి ఎదురుదెబ్బే అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ అధిష్ఠానం. ఎలాగైనా టిడిపిలో చేరిన నేతల్ని ఉపేక్షించొద్దని జగన్‌ భావిస్తున్నారు.. విప్‌ ద్వారా వారికి చెక్‌ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.. వైసీపీ తాజా వ్యూహాన్ని పాలక టీడీపీ ఎలా ఎదుర్కొంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

06:28 - February 29, 2016

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై... పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ సర్కార్‌పై ఒత్తిడి పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని టిడిపిపి సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపు, ఏపీకి ప్రత్యేక హోదా... తదిరత అంశాలపై చర్చించారు.

బాబు దిశానిర్ధేశం..
పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విభజనతో భారీగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం ఎదుర్కొటున్నఆర్ధిక సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి... న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై కేంద్రాన్ని నిలదీయాలని.... టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు, విశాఖ రైల్వే జోన్‌ అంశాన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు.

మోడీకి లేఖ..
అసెంబ్లీలో సీట్ల పెంపుతోపాటు, ప్రత్యేక ఆర్ధిక మండళ్ల అంశంపైనా టీడీపీపీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 50 అసెంబ్లీ సీట్ల పెంచేందుకు వీలుగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లు తయారు చేస్తున్న విషయాన్ని మంత్రి సుజనాచౌదరి సమావేశం దృష్టికి తెచ్చారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ప్రత్యేక ఆర్ధిక మండలిగా ప్రకటిస్తే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని.. ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీని సాధన కోసం ఎంపీలు కృషి చేయాలని కోరారు. టీడీపీలోకి వైపీసీ ఎమ్మెల్యేల వలసలపైనా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. అడుగడుగునా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నజగన్‌ వైఖరితో విసుగు చెందిన వైపీసీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారంటూ చంద్రబాబు వివరించారు. త్వరలోనే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. టీడీపీ ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 

నేడు టి.ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ధర్నా..

హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మహా ధర్నా జరగనుంది. 

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కు రేపే ఆఖరు..

హైదరాబాద్ : అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండ్రోజులు మాత్రమే మిగిలాయి. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల గడువు మార్చి1తో ముగియనుంది.

నేటి నుండి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం నుంచి మార్చి 10వ తేదీ వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో సాగర్‌బాబు పేర్కొన్నారు. 

Don't Miss