Activities calendar

01 March 2016

22:44 - March 1, 2016

తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ టెన్ టివి నిర్వహించిన 'రచ్చబండ' కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు విషయాలను వివరించారు. రాజకీయ పరిస్థితులు, జీవిత విషేశాలను తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శ్రీలంకపై భారత్ విజయం..

బంగ్లాదేశ్ : భారత్ ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. ఆసియా కప్ టీ. 20లో భాగంగా శ్రీలంక, భారత్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. 
శ్రీలంక 138/9 , భారత్ 142/5.

22:26 - March 1, 2016

హైదరాబాద్ : కరీంనగర్ నిర్భయ ఘటనపై టెన్ టివి కథనాలకు టీసర్కార్ స్పందించింది. ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసింది.  

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

బంగ్లాదేశ్ : ఆసియాకప్ టీ20 భాగంగా భారత, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 125 పరుగుల వద్ద పాండ్య (2) ఔట్ అయ్యాడు. 

22:12 - March 1, 2016

ఖమ్మం : నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కలిసి ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఇంటింట ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీపీఎం గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తుందని అభ్యర్ధులతోపాటు, నేతలు హామీ ఇస్తున్నారు. 
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీఎం 
కమ్యూనిస్టుల కంచుకోటగా పేరు పొందిన ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలను సీపీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ  నేతలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. 
తమ్మినేని ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ 
తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తమ్మినేని ఫైర్
ఎన్నికల ప్రచారంలో తమ్మినేని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌ హామీ... నేటికీ కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. గతంలో ఖమ్మం మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేసిన సీపీఎం నేతలు చిర్రావురి, సమీనాలు అవినీతి రహిత పాలన అందించిన విషయాన్ని తమ్మినేని  గుర్తు చేశారు. ప్రస్తుత కార్పొరేన్‌ ఎన్నికల్లో సీపీఎంను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని  హామీ ఇచ్చారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

 

22:05 - March 1, 2016

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధ్రీశ్వరికి పోలవరం బడ్జెట్‌ ఎందుకు పెరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.. వివరణలు పంపినా పంపలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

 

22:01 - March 1, 2016

రింజుం రింజుం హైదరబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిర తిరగితె మోటరు కారు బలాదూర్.. ఈ పాట పనిఒడ్సిపోయిందిగ.. ఇప్పుడు లేటెస్టు పాటేందంటే.. రింజుం రిజుం హైదరబాద్ హెలికప్టర్ వాలా జిందాబాద్.. గాలిలో గిరగిర తిరుగుత వుంటే.. లష్కర్ లండన్, న్యూయార్క్ బలాదూర్ అని పాడుకోవాలె ఎందుకో ఎర్కేనా ఇగోంది..
 
ఓయమ్మో ఏమో అనుకున్నంగని.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఓట్లు గూడ.. ఇంత ఎక్వ తక్వ.. జీహెచ్ఎంసీ లెక్కనే అయితున్నయ్.. అదే ఊపు.. అదే కథ.. అదే లొల్లి.. అదే ఆగమాగం.. అదే చెందన చెందన..పబ్లీకుదిగాదు నేను జెప్పింది.. పార్టీలది.. ఇగ ఓటర్లను మల్పుకునెతందుకు వాళ్ల ఏశాలు జూడుండ్రి వాళ్ల కథలు జూడుండ్రి..

అయ్యో ఈ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోని గోసనే ఉన్నదిగదా..? సూస్తె పోరని లెక్కనే ఉంటడుగని.. గా నడ్మ.. చిట్టె రామ్మోహన్ రెడ్డిని గొట్టెనా..? మళ్ల మొన్నకపారి ఆయిన మంద వొయ్యి ఫారెస్టు ఆఫీసర్ల మీద వడేనా..? ఈ పంచాదులు ఇట్లుండంగనే మళ్ల అచ్చంపేట ఓట్లళ్ల ఇంకో లొల్లి తయ్యారు జేశిండట.. సూడుండ్రి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:57 - March 1, 2016

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు... పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి 
ఛత్తీస్‌గఢ్- తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. సౌత్ బస్తర్ ప్రాంతంలోని సుక్మాజిల్లా నిమ్మలగూడెం అటవీ ప్రాంతంలోని గొట్టిపాడు గ్రామ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులు, బ్లాక్ కోబ్రాలు మూడురోజులుగా ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు... పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతి చెందిన మావోయిస్టుల నుంచి ఏకే 47 వెపన్స్ తో పాటు... ఎస్ఎల్ఆర్...  303 రైఫిల్స్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. 
గొట్టిపాడు ఎన్‌కౌంటర్‌లో వెంకటాపురం దళ కమాండర్ లచ్చన్న మృతి 
గొట్టిపాడు ఎన్‌కౌంటర్‌లో వెంకటాపురం దళ కమాండర్ లచ్చన్న మరణించాడు. ఇతనిపై రూ.21 లక్షల రివార్డు వుంది. ఈ ఘటనలో ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ భార్య సోడి సోని కూడా మృతి చెందింది. ఇక ఈ ఎన్‌కౌంటర్ పై అనేక రకాల ఊహ గానాలు వెలువడ్డాయి. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్ మృతి చెందినట్లు, హారిభూషణ్‌కు గాయాలయినట్లు అనేక వదంతులు వ్యాపించాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలను తర్వాత తేలింది. ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, పక్కా సమాచారంతోనే కూంబింగ్‌ జరిపామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో లచ్చన్న, సోని, రమేష్‌లను గుర్తించామని.. మిగతావారిని గుర్తించాల్సి ఉందన్నారు.
తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్న నాయిని 
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి అడిగితే తనకు ఏం తెలుస్తుందన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 8 మంది మావోయిస్టుల మృతదేహాలను ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కుటుంబసభ్యులు వస్తే మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

21:38 - March 1, 2016

దేశ ద్రోహులెవరు..? దేశభక్తులెవరు..? ప్రశ్నించాల్సిన మీడియా తీర్పునిస్తోందా..?  ఆలోచింపచేయాల్సిన మీడియా ఉద్రేకపరుస్తోందా..? జెఎన్ యూ సందర్భంలో జాతీయ మీడియా.. అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:28 - March 1, 2016

విశాఖ : జిల్లాలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక భారీ సమావేశం జరిగింది. ఎంతో సస్యస్యామలంగా ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతం... ప్రభుత్వాల తీరువల్లే ఇలా తయారైందని మేధావులు అభిప్రాయపడ్డారు. ఉద్దానంలో చాలాఏళ్లనుంచి ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూసిన పరిశ్రమలను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్యలు తీర్చాలంటూ సీఎం చంద్రబాబును కలిస్తే తమపై అసహనం వ్యక్తం చేశారని ఎమ్మెల్సీ శర్మ విమర్శించారు. 

 

20:54 - March 1, 2016

గుంటూరు : జిల్లాల బొల్లాపల్లి మండలం వెల్లటూరులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. డిప్‌కట్‌ మేజర్‌ కెనాల్‌లో గుర్తు తెలియని ఇద్దరు యువకుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ రెండు డెడ్‌బాడీలపై గాయాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరిని హత్యచేసి కెనాల్‌లో పడేసిఉంటారని భావిస్తున్నారు. ఇందులో ఒక మృతదేహం చేతిపై ఆర్ హెచ్ యూ పచ్చబొట్టుంది. మృతుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

20:44 - March 1, 2016

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర బడ్జెట్‌తో తక్కువ నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు పురంధేశ్వరి విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌ డిజైన్‌లో లేని పట్టిసీమ  ఎత్తిపోతల పథకాన్ని... రాష్ట్రం చేపట్టడంపై కేంద్రం అడిగిన  ప్రశ్నలకు వివరణ ఇవ్వలేదని ఆమె చెప్పారు. ప్రాజెక్టకు ఎక్కువ నిధులు కేటాయించినా ఖర్చు చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్రం ఎంతఖర్చు చేసినా... కేంద్రం తిరిగి చెల్లిస్తుందని రాజమండ్రి  అర్బన్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు. 

 

ఏసీబీ వలలో ఏసీటీవో ఖాన్

కృష్ణా : జిల్లాలో ఏసీబీ వలలో ఎసిటివో ఖాన్ చిక్కారు. ఓ వ్యక్తి నుంచి 20వేలు లంచం తీసుకుంటుండగా.. ఖాన్‌తో పాటు అతని అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు. 

20:31 - March 1, 2016

కృష్ణా : జిల్లాలో ఏసీబీ వలలో ఎసిటివో ఖాన్ చిక్కారు. ఓ వ్యక్తి నుంచి 20వేలు లంచం తీసుకుంటుండగా.. ఖాన్‌తో పాటు అతని అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు. 

20:15 - March 1, 2016

సిజేరియన్స్ తో తల్లి, బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వక్తలు అన్నారు. మానవి వేదిక చర్చ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమాదేవి, గైనకాలజిస్టు విజయలక్ష్మీ పాల్గొని, మాట్లాడారు. కాస్త సంయమనంతో వ్యవహరిస్తే సాధారణ కాన్పులు సాధ్యమే అన్నారు. అనవసరమైన పరిస్థితుల్లో కూడా సిజేరియన్స్ ను ఎంచుకుంటున్న స్థితి నెలకొంటుందన్నారు. విధి లేని పరిస్థితులలో సిజేరియన్ మార్గం ఎంచుకోవాలన్నారు. సిజేరియన్స్ తో అనేక కుటుంబాలకు ఆర్థిక భారం పడుతుందన్నారు. సిజేరియన్స్ తో కార్పొరేట్ హాస్పిటల్స్ కు కాసుల పంట కురుస్తుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. సాధారణ కాన్పుతో కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:43 - March 1, 2016

నిజామాబాద్ : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదంటూ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది.. నర్సింగపల్లికి చెందిన శిరీష, సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన సాయిరాం వరుసకు బావా మరదళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. వీరి మైనర్లు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో మనస్తాపంచెందిన ఈ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. 

 

19:32 - March 1, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ తరహాలోనే గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థలో  కూడా ఇళ్లు, నల్లాల అనుమతికి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. కార్పొరేషన్‌లో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

 

19:21 - March 1, 2016

ఖమ్మం : 8 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. 

 

18:57 - March 1, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారంలో ఓ కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. 

 

18:54 - March 1, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రహదారి భద్రతా బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత రోడ్‌ రవాణ కార్మిక సహాఖ్య ఉపాధ్యక్షుడు ఆర్‌ లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. లేకపోతే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రహదారి భద్రతా బిల్లుతో ఆర్టీసీ దివాలాతీసే ప్రమాదం ఉందన్నారు. ఈ బిల్లు చట్టమైతే ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులు వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్ లన్నీ రద్దు అవుతాయన్నారు. గ్రామీణప్రాంతాలకు బస్సులు బంద్ అవుతాయన్నారు. విద్యార్థులకు, వికలాంగులకు బస్సు సౌకర్యం ఉండబోదన్నారు. 

 

18:48 - March 1, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్ ఈడీ బల్బుల పంపిణిపై క్యాంప్‌ ఆఫీస్‌లో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఎల్ ఈడీ బల్బులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సరఫరా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు ఇంటికి 2 చొప్పున ఎల్ ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నారు. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్....

బంగ్లాదేశ్ : ఆసియాకప్ టీ-20 లో భాగంగా కాసేపట్లో ఇండియా, శ్రీలంకల మధ్య మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

18:33 - March 1, 2016

ఢిల్లీ : కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద గ్రామీణబ్యాంకు యూనియన్లు ఆందోళన చేపట్టాయి. గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరించే చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనలో 8 గ్రామీణ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని.. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులను బంద్‌ చేస్తామన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఎకె. పద్మనాభన్‌, రాజ్యసభ సభ్యులు డి.రాజా, రాపోలు ఆనంద భాస్కర్‌ మద్దతు తెలిపారు. 
 

18:31 - March 1, 2016

 హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునే విషయంలో చంద్రబాబునాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం భారీగా పెంచి.. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న ముడుపులతోనే వైసిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 

 

స్టాక్ మార్కెట్లో బుల్ జోరు

ముంబై : బడ్జెట్‌పై నిరాశలో నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో... ఇవాళ బుల్ జోరు కనిపించింది. వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆర్బీఐ సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. భారీగా కొనుగోళ్లకు దిగడంతో... సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. ఈ సూచీ ఇవాళ 23వేల 779 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 7వేల 2వందల 22 వద్ద క్లోజైంది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా బైయింగ్ కనిపించింది. నిన్న నష్టపోయిన ఐటీసీ షేర్.. ఇవాళ 10శాతం పెరిగింది. నిఫ్టీలో మారుతీ, ఐసీఐసీఐ, హీరో, వేదాంతా 6 నుంచి 8శాతం వరకు పెరిగాయి.

18:26 - March 1, 2016

ముంబై : బడ్జెట్‌పై నిరాశలో నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో... ఇవాళ బుల్ జోరు కనిపించింది. వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆర్బీఐ సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. భారీగా కొనుగోళ్లకు దిగడంతో... సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. ఈ సూచీ ఇవాళ 23వేల 779 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 7వేల 2వందల 22 వద్ద క్లోజైంది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా బైయింగ్ కనిపించింది. నిన్న నష్టపోయిన ఐటీసీ షేర్.. ఇవాళ 10శాతం పెరిగింది. నిఫ్టీలో మారుతీ, ఐసీఐసీఐ, హీరో, వేదాంతా 6 నుంచి 8శాతం వరకు పెరిగాయి. ఓఎన్ జీసీ, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే నష్టాల్లో ముగిశాయి. 

 

టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తుల సస్పెన్షన్

గుంటూరు : తెనాలి కౌన్సిల్ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ సీరియస్ అయింది. టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులను టీడీపీ హైకమాండ్  సస్పెండ్ చేసింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులు కొట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

17:39 - March 1, 2016

 గుంటూరు : తెనాలి కౌన్సిల్ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ సీరియస్ అయింది. టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులను టీడీపీ హైకమాండ్  సస్పెండ్ చేసింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులు కొట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 

 

17:34 - March 1, 2016

ఢిల్లీ : జెఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాల కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ బట్టాచార్యలు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ పై జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమర్, అనిర్బన్ లు ఫిబ్రవరి 24 న పోలీసులకు లొంగిపోయారు.

చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ త్రీవంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

 

17:28 - March 1, 2016

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

17:13 - March 1, 2016

ముజఫర్ : బీహార్‌లో పరీక్షలంటే చూచి రాతలే. తమ పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యేందుకు పేరెంట్స్, బంధువులు పరీక్షా కేంద్రాల భవంతులపైకి ఎక్కి చీటీలు అందిస్తుంటారు. ఈ విషయం బాగా తెలిసిన ఆర్మీ అధికారులు వినూత్న రీతిలో టెస్ట్ నిర్వహించారు. ఆర్మీలో క్లరికల్ పోస్టుల కోసం 1150 మంది అభ్యర్థులు ఆదివారం ముజఫర్‌నగర్ సెలక్షన్ క్యాంప్‌కు హాజరయ్యారు. అధికారులు వారిని పై దుస్తులు తొలగించాలని ఆదేశించారు. కేవలం అండర్‌ వేర్‌తో మండుటెండలో నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

పాట్నా హైకోర్ట్ విచారణ...

మంగళవారం పాట్నా హైకోర్ట్ దీనిపై విచారణ జరిపింది. వివరణ ఇవ్వాలని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌ను ఆదేశించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆర్మీ చీఫ్ నుంచి దీనిపై నివేదిక కోరారు. అయితే నియామక బోర్డు దీన్ని సమర్దించింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో భారీ ఎత్తున మాస్ కాపీ జరిగిందని, అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వివరించింది.

17:02 - March 1, 2016

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గౌవరం దక్కింది. 2015వ సంవత్సరానికి గాను ఏసీఐ ప్రకటించిన అవార్డులలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవ ర్యాంకు దక్కింది. ఎయిర్-పోర్టు సర్వీస్ క్యాలిటీ (ASQ) అనే సర్వీసు ప్రకారం 5-15 మిలియన్ ప్రయాణికుల కేటగిరిలో ఈ అరుదైన గౌరవం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లభించింది. ఏసీఐ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ కేటగిరిలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మూడవ స్థానం దక్కిందని ఏసీఐ అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో మొదటి, రెండవ స్థానాలు విదేశాలు దక్కించుకోగా మూడవ స్థానం భారత్ కు చెందిన జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దక్కిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు మూడవ స్థానం దక్కడం వరుసగా ఏడవసారని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది.

 

16:59 - March 1, 2016

న్యూఢిల్లీ :మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించిన టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన వారే...

అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు విసిగిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు.

పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సెలవు

హైదరాబాద్ : ఖమ్మం, గ్రేటర్ వరంగల్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో 
ఆయా ప్రాంతాల్లో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 48 గంటల ముందు మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. అందుబాబులో ఉన్న ప్రభుత్వ వాహనాలను ఎన్నికల విధులకు వాడుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. 

 

ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టుల మృతి : డీజీపీ

ఖమ్మం : తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కూంబింగ్ నిర్వహించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. రాత్రి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మృత దేహాలను ఇంకా గుర్తించలేదన్నారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

16:44 - March 1, 2016

నిజామాబాద్‌ : జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విబేధాలు మరోసారి బయట పడ్డాయి. వీరిద్దరి అనుచరులు బాహాటంగా గొడవపడడం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. 
బాజిరెడ్డి, భూపతి రెడ్డి మధ్య అంతర్గత వైరం 
నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్య అంతర్గత వైరం మరోసారి బయట పడింది. కాలూరులో భూపతిరెడ్డి..బాజిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి నివేదికను  తెప్పించికునే పనిలో పడింది.
శ్రీనివాస్‌తోనూ బాజిరెడ్డికి అంతర్గత వైరం
గతంలో భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వడాన్ని బాజిరెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత భూపతిరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇది ఇలా ఉంటే డీ శ్రీనివాస్‌తోనూ బాజిరెడ్డికి అంతర్గత వైరం ఉంది. ఈ సమయంలో డీఎస్‌ వర్గీయులు బాజిరెడ్డి ప్రాబల్యానికి చెక్‌ పెట్టడంపై  దృష్టి సారించారు. భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో వీరికి అవకాశం దొరికినట్లు అయ్యింది. డీఎస్‌ వర్గీయులు ఎమ్మెల్సీకి దగ్గరై వెన్నుదన్నుగా నిలిచారు. కాలూరులో జరిగిన సంఘటనపై డీఎస్‌ వర్గీయులు భూపతిరెడ్డికి సంఘీభావం తెలిపారు. బాజిరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఇలా ఉంటే కాలూర్‌ పంచాయితీ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. మరోపక్క ఈ గొడవ వ్యవహరం ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు చేరింది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

 

16:41 - March 1, 2016

ఢిల్లీ : వరుస పరాజయాలతో నష్టపోతున్న కాంగ్రెస్‌కు చివరకు ఒక ఉపశమనం లభించింది. రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరైన ప్రశాంత్‌ కిశోర్‌ తన సేవలను కాంగ్రెస్‌కు అందజేసేందుకు అంగీకరించాడు. పంజాబ్‌, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ప్రచారంలో ఆయన తన సేవలను అందివ్వనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు ఆయన కీలకమైన వ్యూహాలను రూపొందించిన విషయం తెలిసిందే. బిహార్‌లో మహాకూటమి ఆయన సలహా మేరకు ఆవిర్భవించింది.

16:40 - March 1, 2016

విశాఖ : ఏపీలో మోటారు వాహనల రిజస్ట్రేషన్‌కు కొత్త విధానం ప్రవేశపెట్టారు. దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌లో  రిజస్ట్రేషన్‌ ప్రారంభించారు. రవాణ శాఖలో దళారుల బెడదను నివారించే ఉద్దేశంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విశాఖలోని వరుణ్‌ బజాజ్‌ షోరూమ్‌లో రవాణశాఖ కమిషనర్‌ సుబ్రహ్మణ్యం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రారంభించారు. కొత్త సిస్టమ్‌ను ప్రారంభించిన రవాణ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మోటారు వాహనాల  ఆన్‌లైన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని దశలవారీగా అన్నిజిల్లాలకు విస్తరించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. 

 

16:37 - March 1, 2016

హైదరాబాద్ : వీణవంక బాధితురాల్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జీవన్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు పరామర్శించారు. బాధితురాలిని అడిగి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉందని ఆరోపించారు. ఇంతటి దురాగతానికి పాల్పడ్డవారితోపాటు.. ఈ కేసుతో సంబంధంఉన్న సీఐ, ఎస్ ఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

16:14 - March 1, 2016

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే జంక్ ఫుడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలపై నిబంధనలు విధించింది. విద్యార్థులకు అనారోగ్యాన్ని కలిగించే అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను పాఠశాల క్యాంటీన్లలో అమ్మరాదంటూ రాజధాని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ ద్వారా....

ఢిల్లీ నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగించే దుష్ఫలితాలపై ఉదయం అసెంబ్లీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక పాఠశాలలకు ఓ సర్క్యులర్ పంపింది. అటువంటి ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మే పద్ధతిని పాఠశాల యాజమాన్యాలు కూడా నివారించాలని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారం అందేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆహార పదార్థాల జాబితాను నోటీసుబోర్డులో అతికించాలని, ప్రభుత్వ సూచనల మేరకు డ్రాయింగ్, పెయింటింగ్, స్లోగన్లు, డిబేట్ల వంటి కార్యక్రమాలతో ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన కలిగించడంలో పాఠశాల యాజమాన్యం శ్రద్ధ వహించాలని తెలిపింది.

ఆరోగ్యకర కూరగాయలతో....

ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్‌విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు.

15:53 - March 1, 2016

బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

అత్యంత సన్నిహితులు మాత్రమే...

ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్ లో ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్ లో ముంబైకు రానుంది. ఈ దిల్ సే హీరోయిన్ ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.  

15:49 - March 1, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

 

15:48 - March 1, 2016

ఢిల్లీ : రాజద్రోహం అని అంటున్నారు. అసలు రాజద్రోహం అంటే ఏంటో తెలుసా.? అంటూ ఢిల్లీ హైకోర్టు కన్హయకుమార్‌ కేసుకు సంబంధించి పోలీసులకు షాకింగ్ ప్రశ్నేసింది. రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ కన్హయను అరెస్ట్ చేసిన పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. అతని బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం కోర్టు తీర్పివ్వనుంది.  
దేశ విద్రోహ వ్యాఖ్యలు చేసింది ఒకరైతే అరెస్టయింది మరొకరు
దేశ విద్రోహ వ్యాఖ్యలు చేసింది ఒకరైతే అరెస్టయింది మరొకరు. ఆ మరొకరే జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయకుమార్. దేశ విద్రోహ వ్యాఖ్యలు చేసి రాజద్రోహానికి పాల్పడ్డాడన్న కోణంలో కొద్ది రోజుల క్రితం కన్హయకుమార్‌ అరెస్టయ్యారు. కాగా తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కన్హయ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఇప్పటికే రెండుసార్లు కోర్టు విచారణ జరిపింది. అతనికి బెయిల్ ఇచ్చేది లేనిది బుధవారం తేలనుంది. 
హైకోర్టులో ఢిల్లీ పోలీసులకు చుక్కెదురు
కన్హయ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఏదైనా వీడియో ఉందా అని కోర్టు ప్రశ్నించగా పోలీసులు లేదన్నారు. యూనివర్శిటీలో సమావేశం జరుగుతుండగా మీ పోలీసులు అక్కడే మఫ్టీలో ఉన్నారు.. వారెందుకు సమావేశాన్ని వీడియో తీయలేదని జడ్జి ప్రతిభారాణి పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు తెల్లమొహమేయాల్సొచ్చింది. కన్హయ నేరం చేసినట్లుగా ఏ ఆధారమూ లేదని, నేరం చేయని ఏ ఒక్కరూ అనవసరంగా జైళ్లలో శిక్ష అనుభవించకూడదని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కనుక కన్హయకు బెయిల్ ఇవ్వాలని కోరారు. 
ఉమర్‌ , అనిర్బన్‌ ల పోలీస్‌ కస్టడీ మరొక రోజుకు పొడిగింపు 
దీనికి సంబంధించి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలోనూ చేశారని ఇప్పుడు కన్హయకు బెయిలిస్తే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఇక దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్యల పోలీస్‌ కస్టడీని మరొక రోజుకు పొడిగించారు. వారిద్దరూ రాజద్రోహం ఆరోపణలతో గత మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసును ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ సెల్‌కు బదిలీ చేశారు. ఆ సెల్ ఉమర్, అనిర్బన్‌లకు ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అన్న దిశగా విచారణ జరుపుతుంది. 

 

ఉమర్, అనిర్బన్ లకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ : జెఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాల కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

15:41 - March 1, 2016

 ‘టైగర్’ సినిమాతో తెరమీదికొచ్చిన సందీప్ కిషన్ ఈ ఏడాది నాలుగు సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో పరుగు తీస్తున్నాడు. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా మిగతా రెండు అరవ సినిమాలు. ఆ తెలుగు సినిమాల్లో ఒకటైన 'రన్' ఈ నెల 23న విడుదల కానుంది. ఇది కూడా తమిళ ఓ రీమేక్ కావటం విశేషం. తమిళ, మళయాళ భాషల్లో 'నేరమ్' పేరుతో తెరకెక్కి విజయం సాధించిన ఈ సినిమాని ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర తెలుగు తెరపైకి తీసుకొస్తున్నారు. అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనీషా అంబ్రోస్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ గ్రహీత బాబీ సింహ, బ్రహ్మాజీ, పోసాని, మహత్ రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రధారులు.

15:37 - March 1, 2016

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ ఉన్నట్లు సమాచారం.  అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. 

 

15:36 - March 1, 2016

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో తన ఆస్కార్ అవార్డును హాలీవుడ్ లోని ఒక రెస్టారెంట్ లో మర్చిపోయాడు. ఈ విషయాన్ని టిఎంజెడ్.కామ్ అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేసింది. ‘రెవనంట్’ లో నటనకు గాను ఆస్కార్ అవార్డును పొందిన డికాప్రియో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. డికాప్రియో మద్యం తాగడమే కాకుండా ఈ-సిగార్ ను తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అనంతరం చిన్నగా బయటకు వచ్చి కారు ఎక్కిన డికాప్రియో తన పురస్కారాన్ని రెస్టారెంట్ లోనే వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెస్టారెంట్ లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మందు బాటిల్ ని, మరో వ్యక్తి ఆస్కార్ పురస్కారాన్ని ఆయనకు అందించినట్లు టీఎంజెడ్.కామ్ వెల్లడించింది. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

15:33 - March 1, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రి రామ్‌శంకర్‌ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభల్లో ఆందోళనకు దిగాయి. ఇటీవల ఆగ్రాలో హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్‌ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ముస్లింలను సైతానులు, రావణ సంతతిగా వర్ణించారు. 'పూజలు ముగించుకుని తిరిగి వస్తున్న అరుణ్ ను హత్య చేశారు. మనం శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మొదలు పెట్టాలి. పోరాటం ఆరంభించకపోతే ఈరోజు అరుణ్ కోల్పోయాం, తర్వాత మరొకరు బలౌతారు. మరొకర్ని కోల్పోక ముందే మన బలమెంతో చూపాలి. అదిచూసి హంతకులు పారిపోవాలని వ్యాఖ్యానించారు.  అయితే తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కతిరియా వివరణ యిచ్చారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బిఎస్పీ చీఫ్‌ మాయావతి తీవ్రంగా ఖండించారు.

 

15:32 - March 1, 2016

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే...! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్! ఇక అభిమాని రోల్ కోసం తన ముఖం పూర్తిగా మారిపోయేట్టు మేకప్ వేసుకునేందుకు రోజూ సుమారు 6 గంటలు పట్టేదని, ఆ తర్వాత అది రోజుకు మూడు, అనంతరం రెండున్నర గంటలకు తగ్గుతూ వచ్చిందని తెలిపాడు. షారుఖ్ కెరీర్ లోనే ఇది సరి కొత్త టైప్ మూవీ అంటున్నారు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు.

15:30 - March 1, 2016

ఢిల్లీ : రోహిత్ ఆత్మహత్య ఘటనపై లోక్‌సభలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. రోహిత్‌ అంశంపై మీడియా కూడా తనను టార్గెట్‌ చేసిందని తెలిపారు. హెచ్‌సియు ఘటనకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి రాసిన లేఖలో తాను రోహిత్‌ పేరును పేర్కొనలేదని స్పష్టం చేశారు. తాను వెనకబడిన తరగతులకు చెందినవాడినని, తన తల్లి ఉల్లిగడ్డలు అమ్ముకునేదని, అలాంటి పేద కుటుంబం నుంచి తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. తాను దళితులు, వెనుకబడిన తరగతుల కోసం ఎంతో కృషి చేశానని దత్తాత్రేయ చెప్పారు. 223 నిబంధన కింద నోటీసులివ్వడం ద్వారా జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టకు భంగం కల్పించారని ఆరోపించారు. 

 

15:24 - March 1, 2016

ఢిల్లీ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చామని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, దీనిపై కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌ లో స్మృతి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

 

15:10 - March 1, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్మృతీఇరానీ వ్యవహారంపై దుమారం చెలరేగింది. స్మృతీఇరానీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అందుకు స్పీకర్, చైర్మన్‌లు అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. దీంతో రాజ్యసభ, లోక్‌సభ 2 గంటలకు వాయిదా పడింది. వేయాల్సొచ్చింది. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. వేముల రోహిత్‌, జెఎన్‌యు వ్యవహారాలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని విపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్మృతిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.    

 

13:41 - March 1, 2016

బాలీవుడ్ మూవీ సరబ్ జిత్ లో అందాలనటి ఐశ్వర్య రణదీప్ హుడా జంటగా నటిస్తుండగా అతని సోదరి దల్బీర్ కౌర్ గా ఐష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్ ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐష్ కూడా పాల్గొనడం విశేషం. సరబ్ జిత్ చిత్రం షూటింగ్ సందర్భంగా ఐశ్వర్య ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భక్తులతో పాటు భోజనం చేసి వారు తిన్న పాత్రలను శుభ్రం చేయడం, చీపురుతో ఆలయాన్ని ఊడ్చడం, వంట చేయడం తెలిసిందే. షూటింగ్ లో ఇలా సహజ సిద్ధంగా నటించడం తనకు మరపు రాని అనుభూతి అని ఐశ్వర్య ఆ తర్వాత వ్యాఖ్యానించింది.

ఏపీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..

విశాఖపట్టణం : ఆన్ లైన్ లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. విశాఖ నగరంలోని సిరిపురంలో గల వరుణ్ మోటార్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

అవినీతిని ప్రారదోలుతాం - హరీష్ రావు..

వరంగల్ : టిడిపి, కాంగ్రెస్ హాయంలో పేరుకపోయిన అవినీతిని కూకటివేళ్లతో తొలగించేందుకు వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. 

13:31 - March 1, 2016

శ్రీకాకుళం : కొడుకు ఏమయ్యాడోనని మనసు నిండా ఆందోళన. గుండెల నిండా గూడుకట్టుకున్న దుఖం. ఏడునెలలు గడుస్తున్నా ఇసుమంతైనా సమాచారం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. దేశంకాని దేశంలో ఆచూకీ తెలియకుండా పోయిన తనయుడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు వస్తాడో రాడో తెలియక తీవ్ర ఆందోళనలో తల్లడిల్లిపోతున్నారు.

ఏడు నెలలు..
వీరి దుఖం మొదలై ఏడు నెలలవుతోంది. కాలప్రవాహంలో రోజులకు రోజులు కలిసిపోతున్నా ఆనందతీరాలు మాత్రం కనిపించడం లేదు. వ్యక్తిపేరు తిరివీధుల గోపీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీ లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఒకరు. ఏడు నెలల క్రితం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు గోపీని కిడ్నాప్‌ చేయగా ఇంతవరకు అతని సమాచారం తెలియలేదు. తమ బిడ్డ ఎప్పుడొస్తాడా అంటూ తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. మూడునెలల క్రితం గోపీకృష్ణ విడుదల కాబోతున్నారంటూ సమాచారం వచ్చినా అంతలోనే వారి ఆనందం ఆవిరైపోయింది.

సోమవారం గోపి జన్మదినం..
తమ కొడుకును విడిపించేందుకు ప్రయత్నించాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మొదలుకుని ఎందరో ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. వారు గోపీకృష్ణ వ్యవహారాన్నే పట్టించుకోవడం మానేశారు. కిడ్నాప్ జరిగి ఏడు నెలలవుతున్నా ప్రభుత్వం తమ కుమారుడిని విడిపించే ఆలోచనే చేయడం లేదంటూ అతని తల్లిదండ్రులు పద్మావతి, రమణమూర్తి వాపోతున్నారు. గోపీకృష్ణ తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తుండగా అతని భార్యాపిల్లలు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా లీప్‌ సంవత్సరంలో జన్మించినందున నాలుగేళ్లకోసారి వచ్చే గోపీ జన్మదినం సోమవారం వచ్చింది. అయితే అదే జన్మదినం వేళ గోపీ ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కల్పించుకుని తమ కుమారుడిని విడిపించే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

13:26 - March 1, 2016

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

13:24 - March 1, 2016

హైదరాబాద్ : బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. విభజన హామీలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంపై దృష్టి సారించని చంద్రబాబు... ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనే దృష్టి సారించారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు పార్ధసారధి. 

13:20 - March 1, 2016

మెక్సికోలో అత్యంత ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం దొంగతనానికి గురవడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఓ ట్రక్కు భారీ స్థాయిలో రేడియోయాక్టివ్ పదార్థాలతో వెళుతుండగా, దాన్ని అడ్డగించిన కొందరు దోచుకుపోయారని, దీంతో ఐదు రాష్ట్రాల్లో అత్యవసర అప్రమత్తతను విధించి, దానికోసం వెతుకుతున్నామని మెక్సికో నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ సివిల్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2006 సంవత్సరానికి చెందిన ఎర్రటి చవర్లెట్ సిల్వరాడో పికల్ వాహనంలో ఇరీడియం-192 ఉందని, దీన్ని సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అపహరించుకుపోయారని వెల్లడించారు. ఓ పసుపు రంగు కంటెయినర్లో ఇది ఉందని, దీని వాడకం తెలీని వారు తాకితే ప్రమాదకరమని, సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు తీసినా ప్రమాదం సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కంటెయినర్ కోసం వెతుతుకున్నామని, ఆ పదార్థం దానిలో ఉన్నంతవరకూ అంతా సురక్షితమేనని తెలిపింది.

లోక్ సభలో మాట్లాడనున్న మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు లోక్ సభలో మాట్లాడనున్నారు. విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలపై వివరణనివ్వనున్నారు. 

ఏ తప్పు చేయలేదు - దత్తాత్రేయ..

ఢిల్లీ : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాను హెచ్చార్డీకి రాసిన లేఖలో రోహిత్ గురించి ప్రస్తావించలేదని, తనపై కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. దళితులకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని చెప్పుకొచ్చారు. 

కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైది ఆత్మహత్య..

కడప : సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిమెంట్ గోడౌన్ లో కుమార్ ఉరి వేసుకున్నారు. హత్య కేసు లో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

మున్సిపాల్టీల్లో ఎల్ ఈడీ బల్పుల ఏర్పాటుపై సమీక్ష..

హైదరాబాద్ : మున్సిపాల్టీల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

12:49 - March 1, 2016

ఆసియా కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. వరుస విజయాలతో టైటిల్‌ వేటలో దూసుకుపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు సవాల్‌ విసురుతోంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టును చిత్తు చేసి ధోనీ సేన జోరు మీదుండగా బంగ్లాదేశ్‌ ఇచ్చిన షాక్‌తో లంక జట్టు డైలమాలో పడింది. ఆసియా కప్‌లో కీలక సమరానికి మీర్పూర్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టుకు డిఫెండింగ్ చాంపియన్‌ శ్రీలంక జట్టు సవాల్‌ విసురుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టి....ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన జోరు మీదుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టుపై చెమటోడ్చి నెగ్గిన శ్రీలంక జట్టు....రెండో మ్యాచ్‌లో ఆతిధ్య బంగ్లాదేశ్‌ జట్టు ఇచ్చిన షాక్‌తో డైలమాలో పడింది.

బౌలింగ్..బ్యాటింగ్ లో పటిష్టం..
ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, రహానే, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై సాధించిన విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. అన్ని విభాగాల్లోనూ శ్రీలంక జట్టు కంటే టీమిండియానే మెరుగ్గా రాణిస్తోంది. కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు.....జట్టులో 9 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమే. పేసర్లు నెహ్రా, బుమ్రా ...స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

శ్రీలంక అయోమయం...
ఆసియా కప్‌కు ముందు సొంతగడ్డపై జరిగిన టీ 20 సిరీస్‌లో శ్రీలంక జట్టును 2-1తో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాలని తహతహలాడుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక జట్టు పరిస్థితి మాత్రం అయోమయంలో ఉంది. తిలకరత్నే దిల్షాన్‌, దినేష్‌ చాందిమల్‌, ఏంజెలో మాథ్యూస్‌,లసిత్ మలింగా, తిసెరా పెరీరా, నువాన్‌ కులశేఖర వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా...నిలకడలేమీతో ఇబ్బందిపడుతోంది. చమీర, శనాక, కులశేఖర, రంగనా హెరాత్‌లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది.

శ్రీలంకకు మైనస్ పాయింట్...
దినేష్‌ చాందిమల్ మినహా లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరూ సరైన ఫామ్‌లో లేకపోవడంతో పాటు...సీనియర్లు దిల్షాన్‌,మాథ్యూస్‌ వరుసగా విఫలమవుతుండటం శ్రీలంక జట్టుకు మైనస్‌ పాయింట్‌లా మారింది. కెప్టెన్‌ మలింగా గాయం కారణంగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమవ్వడంతో లంక జట్టు మరింత కష్టాల్లో పడింది. ఇప్పటికే బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో టైటిల్‌ వేటలో దూసుకుపోతున్న భారత జట్టు...లంకను చిత్తు చేసి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఒక మ్యాచ్‌లో నెగ్గి మరో మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఫైనల్‌ రేస్‌ నుంచి నిష్ర్కమిస్తుంది. ప్రస్తుత ఫామ్‌, ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాను ఓడించాలంటే కుర్రాళ్లతో కూడిన శ్రీలంక జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే.

12:40 - March 1, 2016

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

12:36 - March 1, 2016

విజయవాడ : విభజన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. కష్టాలను అధిగమించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందని టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఏపీ టిడిపి కేంద్ర కమిటీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించలేదని.. అయితే నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. ఏపీని ఆదుకోవాల్సినవసరం ఉందని, ఈ బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ హామీలపై ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో ఫోన్ లో మాట్లాడి ప్రజల మనోభావాలను తెలియచేయడం జరిగిందని, ఏపీ ఆర్థిక పరిస్థితి తెలుసని శాఖల వారీగా కేటాయింపులు జరిపినట్లు జైట్లీ పేర్కొనడం జరిగిందన్నారు. 2018 లోగా పోలవరం తొలిదశ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 

12:34 - March 1, 2016

ఢిల్లీ : ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బు అందట్లేదని ఆ లోటును భర్తీ చేస్తూ డబ్బు విడుదల చేయాలని ఎంపి కింజారపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో కోరారు. ఫుడ్ యాక్టుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ యాక్ట్ ప్రకారం ఏపీకి 1.88 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సరిపడా డబ్బు రిలీజ్ కావాల్సి ఉందని అయితే 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులకు సరిపడ మొత్తమే రిలీజ్‌ అవుతోందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపైన 1500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందన్నారు.  

12:32 - March 1, 2016

ఢిల్లీ : లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్రమంత్రి స్మృతీఇరానీ వ్యవహారంపై దుమారం చెలరేగింది. స్మృతీఇరానీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అందుకు స్పీకర్, చైర్మన్‌లు అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫలితంగా రాజ్యసభ, లోక్‌సభలను వాయిదా వేయాల్సొచ్చింది. తిరిగి ప్రారంభమైనా నిరసనలు కొనసాగాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అయితే మళ్లీ విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో రెండు సభలూ వాయిదా పడ్డాయి. వేముల రోహిత్‌, జెఎన్‌యు వ్యవహారాలపై కొద్ది రోజుల క్రితం స్మృతీ మాట్లాడుతూ రోహిత్ మృతికి సంబంధించి కొన్ని అబద్ధాలు ఆడారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.  

12:31 - March 1, 2016

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలం నుండి ఏకే 47, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని, సెల్ ఫోన్ లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. 

12:30 - March 1, 2016

ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో ఇపుడు మరోకోణం వెలుగు చూసింది. ఐస్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ఉపయోగిస్తున్న బాంబుల తయారీకి హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీల ముడి సరుకును వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లం అయింది.

కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థ...

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వినియోగించే బాంబులు - ముడి పదార్థాలను కనిపెట్టేందుకు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థను యురోపియన్ యూనియన్ నియమించింది. కరుడు గట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మందు పాతర్లు - పేలుడు పదార్థాల సరఫరాపై నిషేధం ఉంది. అయినా ఈ సంస్థ ఇరాక్ సిరియా దేశాల్లో మారణహోమం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సిఏఆర్ సంస్థ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ తయారు చేస్తున్న బాంబులకు హైదరాబాద్కు చెందిన మూడు ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు చెందిన ముడి పదార్థం - విడిభాగాలు - మందు పాతర్లు - సేఫ్లీ ఫ్యూజులు సరఫరా అవుతున్నట్టు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థ గుర్తించింది.

3కంపెనీల ముడి పదార్థాలను...

హైదరాబాద్ కు చెందిన ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఇండియా - జిఓసిఎల్ కార్పొరేషన్ - ఐడిసి ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీల ముడి పదార్థాలను కనుగొన్నట్టు సమాచారం. పారిశ్రామిక అవసరాల పేరుతో టర్కీ లెబనాన్ దేశాలకు చెందిన పలు సంస్థలు డిటొనేటర్లు - డిటోనేటర్ కార్డులు - సేఫ్టీ ఫ్యూజులను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నాయి. అక్కడి నుంచి ఈ విడిభాగాలు ఐసిస్ కు చేరుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతున్న ఈ పేలుడు పదార్థాలు - బాంబుల తయారీకి ఉపయోగించే విడిభాగాలు ఎవరి చేతుల్లోకి చేరుతున్నాయన్నది ఈ కంపెనీలకు కూడా తెలిసే అవకాశం లేదని సీఆర్ ఏ సంస్థ పరిశోధనలో వెల్లడైనట్టు సమాచారం.

12:22 - March 1, 2016

హైదరాబాద్ : అక్కినేని అఖిల్ రెండో సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అక్కినేటి టీం, ఫైనల్ గా వంశీ పైడిపల్లికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో ఊపిరి సినిమా తెరకెక్కుతోంది. దీంతో వంశీ పైడిపల్లి వర్కింగ్ స్టైల్ మీద నమ్మకంతో అఖిల్ రెండో సినిమా అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇప్పటికే రెండో సినిమాకు సంబంధించి అఖిల్ లుక్ పై ఫోటో సెషన్ కూడా పూర్తి చేశారట. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. కేంద్ర మంత్రి రామ్ శంకర్ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం రేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ నేత అరుణ్ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఈ రోజు ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. సభలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

తన ఇమేజ్ కు భంగం కలిగింది - దత్తాత్రేయ..

ఢిల్లీ : కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాను రోహిత్ పేరిట హెచ్చార్డీకి ఎలాంటి లేఖ పంపించలేదని లోక్ సభలో దత్తాత్రేయ తెలిపారు. 

12:10 - March 1, 2016

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.

ప్రతి 100 గ్రాములలో లభ్యమయే పోషక విలువలు ఈ దిగువ చూపిన విధంగా ఉంటాయని అంచనా వేసేరు:

శక్తి 149 కేలరీలు

కర్బనోదకాలు (కార్బోహైడ్రేట్‌లు): 33.6 గ్రాములు

చక్కెర: 1.00 గ్రాము

పోషక పీచు (ఫైబర్‌): 2.1 గ్రాములు

కొవ్వు పదార్ధాల: 0.5 గ్రాములు

ప్రాణ్యములు (ప్రొటీనులు): 6.39 గ్రాములు,

బిటా కారొటిన్‌ 0%,

విటమిన్‌ బి: నిత్యావసరంలో 15%,

విటమిన్‌ బి2: నిత్యావసరంలో 7%,

విటమిన్‌ బి3: నిత్యావసరంలో 5%,

విటమిన్‌ బి5: నిత్యావసరంలో12%,

విటమిన్‌ బి6: నిత్యావసరంలో 95%,

విటమిన్‌ బి9: నిత్యావసరంలో 1%,

విటమిన్‌ సి: నిత్యావసరంలో 52%,

ఖటికం (కాల్షియం): నిత్యావసరంలో 18%,

ఇనుము (ఐరన్‌): నిత్యావసరంలో 14%,

మెగ్నీసియం: నిత్యావసరంలో 7%,

భాస్వరం (ఫాస్పరస్‌): నిత్యావసరంలో 22%,

పొటాషియం: నిత్యావసరంలో 9%,

సోడియం: నిత్యావసరంలో 1%,

యశదం (జింకు): నిత్యావసరంలో 12%,

మేంగనీస్‌: 1.672 మిల్లీగ్రాములు

సెలినియం: 14.2 మిల్లీగ్రాములు

అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వెల్లుల్లి

బరువు ను తగ్గించడంలో...

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేసే గుణం...

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

యాంటీ బాక్టీరియల్‌గా...

వెల్లుల్లి రసం బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల జలుబు,దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటిబాక్టీరియల్‌ పదార్థాలు గొంతు ఇన్ఫెక్షన్లను, శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. ముఖ్యంగా బ్రోంకైటిస్‌ నివారణకు వెల్లుల్లి మందులా పనిచేస్తుంది.

లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే విధంగా...

వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్‌, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే బైల్‌ అనే ఫ్లూయిడ్‌(కాలేయం ఈ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది)ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్‌, ప్రొటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.

నొప్పి ని తగ్గించడలో...

వెల్లుల్లిలో యాంటి ఆర్ధైటిక్‌ ప్రొపర్టీస్‌ బాగా ఉన్నాయి. ఇవి శరీరంలోని నొప్పిని తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీ-బాక్టీరియల్‌, ఎనాలజిస్టిక్‌ గుణాల వల్ల పంటి నొప్పి లాంటివి తగ్గుతాయి.

గుండెను కాపాడటంలో...

రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

బ్లడ్‌ షుగర్‌ని తగ్గించడంలో...

వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.

కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో...

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.

ఇంత విలువైన ఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

రాజ్యసభలో ఏఐఏడిఎంకే ఆందోళన..

ఢిల్లీ : వాయిదా పడిన అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. ఏఐఏడిఎంకే ఆందోళన కొనసాగించింది. కార్తి చిదంబరంపై ఐటీ, ఈడీ సోదాలు చేయడం జరిగిందని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐడిఎంకే ఆందోళన చేపట్టింది. 

ఖమ్మంలో తమ్మినేని ఎన్నికల ప్రచారం..

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. నగరంలో రోడ్ షో, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. 31,34,35 డివిజన్లలో రోడ్ షో, బైక్ ర్యాలీల్లో తమ్మినేని పాల్గొన్నారు. నీతివంతమైన పాలన అందించిన చరిత్ర సీపీఎంకే ఉందని, అవినీతి పరులు, అవకాశవాదులను ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టించలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి పంచలేదని, మచ్చలేని సీపీఎం అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. 

పెట్రోల్ పంప్ యజమానుల నిరవధిక సమ్మె..

త్రివేండ్రపురం : పెట్రోల్ పంప్ యజమానులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. లైసెన్స్ లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మె చేపడుతున్నారు. 

రాష్ట్రాన్ని ఆదుకోవాలి - బాబు..

విజయవాడ : ఏపీని ఆదుకోవాల్సినవసరం ఉందని, ఈ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ టిడిపి కేంద్ర కమిటీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. విభజన తరువాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, కష్టాలను అధిగమించుకుంటూ ముందుకెళుతున్నామని తెలిపారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించుకోవాల్సినవసరం ఉందన్నారు.

అల్వాల్ లోని అదృశ్యమైన చిన్నారి మృతి..

హైదరాబాద్ : అల్వాల్ లోని జవహార్ నగర్ లో నిన్న అదృశ్యమైన చిన్నారి ఏసుమని (6) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే ప్రాంతంలోనే చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. 

ఉభయసభల్లో గందరగోళం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. స్మృతి ఇరానీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలంలటూ లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.  

11:33 - March 1, 2016

హైదరాబాద్ : తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.

శ్వాస సంబంధిత జబ్బులకు...

దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

దెబ్బలు తగిలి....

దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

పులిపిరులున్నవారు....

పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారంపాటు ఆ పులిపిరులపై పూయండి. దీంతో పులిపిరులు రాలిపోతాయి.

తమలపాకు ఓ ఔషధంలాంటిది. కాని...

తమలపాకు ఓ ఔషధంలాంటిది. కాని దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు మరియు ముఖానికి సంబంధించిన రోగాలు వస్తాయంటున్నారు వైద్యులు. తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు. తమలాపాకునువేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.

11:26 - March 1, 2016

హైదరాబాద్ : కొత్త శోభలు..హంగులు దిద్దితూ హోలి టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం హెలి టూరిజాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విమానాయనం..గగనతల ప్రయాణం కేవలం సంపన్నులకు మాత్రమే ప్రయాణించే భావన రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం రూ. 3499 చెల్లించి హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ నగర అందాలు తిలకించవచ్చన్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూసీని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినవసరం ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
న్యూయార్కు, లండన్ తరహాలో నగరంలో హెలిటూరిజానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం - ఇండివెల్ ఏవియేషన్ సంయుక్త నిర్వహణ చేయనున్నారు. కుతుబ్ షాహీలు, నిజాంలు ఏలిన గడ్డపై నిర్మించిన పలు చారిత్రాత్మక కట్టడాలు, కోటలు ఈ పర్యటనలో ఉంచనున్నారు. హైదరాబాద్ నగర నలుమూలల ఉన్న పలు చారిత్మాత్మక కట్టడాలగుండా ఈ హెలికాప్టర్ ప్రయాణం సాగనుంది.

హెలీ టూరిజం సేవలను ప్రారంభించిన కేటీఆర్...

హైదరాబాద్ : నగరంలో హెలీ టూరిజం సేవలను పంచాయతీ రాజ్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త శోభలు..హంగులు దిద్దుతూ హోలీ టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. 

11:13 - March 1, 2016

హైదరాబాద్:సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న భారత్ లో నెట్ వినియోగంపై గుత్తాధిపత్యం సాధించేందుకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’కు ట్రాయ్ రెడ్ సిగ్నల్ వేసింది. తాజాగా తన వినియోగదారుల డేటాను ఏ విధంగా వినియోగించుకుంటున్న విషయాన్ని వెల్లడించేందుకు ససేమిరా అన్న ఆ సంస్థకు జర్మనీ కోర్టు భారీ జరిమానాను విధించింది. ఫేస్ బుక్ లో యూజర్లు పోస్టు చేస్తున్న మేధో సంపత్తి అంశాలను ఎలా వినియోగించుకుంటున్నారో తెలపాలని ఆ సంస్థను జర్మనీ రాజధాని బెర్లిన్ లోని రీజనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ వివరాలు వెల్లడించలేమని ఫేస్ బుక్ నిరాకరించింది. దీంతో కోర్టు ఫేస్ బుక్ కు 1.09 లక్షల డాలర్లు (రూ.74 లక్షలు) జరిమానా విధించింది.

11:10 - March 1, 2016

హైదరాబాద్ : ఆదిత్యారాయ్‌ కపూర్‌- శ్రద్ధాకపూర్‌ జంటగా బాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘ఓకే జాను’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సోమవారం రిలీజ్ చేశాడు. షాద్‌ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్టయిన ‘ఓకే బంగారం’ మూవీకి ఇది రీమేక్‌. ఆదిత్య-శ్రద్దా కెమిస్ర్టీ గురించి చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరు కలిసి ‘ఆషికి 2’లో నటించిన విషయం తెల్సిందే!  

11:09 - March 1, 2016

శ్రీకాకుళం : ఒక్క గంటల్లో చంద్రబాబు సర్కార్ ను కూలగొడుతాం..ఏమాత్రం అనుమానం లేదు..టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ చేసిన ప్రకటన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ కు ఝులక్ ఇస్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకొంటున్నారు. అప్రమత్తమైన జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అయి వారితో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే వెంకటరమణ ఝులక్ ఇచ్చారు. టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. పాతపట్నం నియోజకవర్గ సమస్యలు, ప్రధాన సమస్యగా మారిన వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కార కోసమే టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. తన తండ్రి మోహనరావుతో సహా టీడీపీలో చేరుతున్నట్లు.. నియోజకవర్గ అభివృద్ధే కారణమంటూ వివరించారు. నిన్న కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే.. నేడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 4వ తేదీన ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారా ? అనేది తెలియాల్సి ఉంది. 

నగర పోలీసు సిబ్బందిపై సీపీ సవాంగ్ కొరడా..

విజయవాడ : నగర పోలీసు సిబ్బందిపై సీపీ సవాంగ్ కొరడా ఝులిపించారు. ఐదుగురు పోలీసులను సీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. అక్రమ వసూళ్లు, దురుసుగా ప్రవర్తించారని వేటు వేశారు. సస్పెండైన వారిలో ఎస్ఐ మోహన్ రావు, ఆర్ఎస్ఐ సాగర్, ఎఆర్ఎస్ఐ రత్తయ్య, హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ప్రసాద్ లున్నారు. సీఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు. 

టి.గురుకుల సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. హాస్టళ్లలో వసతులు, రికార్డులు పరిశీలించారు. 

వైసీపీకి ఎమ్మెల్యే వెంకటరమణ ఝులక్..

శ్రీకాకుళం : వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే వెంకటరమణ ఝులక్ ఇచ్చారు. టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి, వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసమే టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. 

10:37 - March 1, 2016

హైదరాబాద్ : నాగశౌర్య - మాళవిక జంటగా రానున్న మూవీ ‘కళ్యాణ వైభోగమే’! ఈ ఫిల్మ్‌ని మార్చి 4న రిలీజ్ చేయాలన్నది ప్రొడ్యూసర్ ప్లాన్. దీనికి సంబంధించి ట్రైలర్ రిలీజైంది. డైలాగ్స్ బాగున్నాయి.. ట్రెండ్ కు తగ్గట్టుగా వున్నాయి. కాకపోతే.. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా వున్నాయి. నందినిరెడ్డి డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రాన్ని మార్చి 4న థియేటర్స్‌కు తీసుకురావాలని నిర్మాత ఆలోచన. నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అలనాటి నటి రాశి, రీఎంట్రీ ద్వారా ఎలా ఎట్రాక్ట్ చేసుకుంటుందో చూడాలి. 

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : బడ్జెట్ ప్రభావంతో స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు..నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

సీఎం చంద్రబాబుతో మంత్రులు భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయం మంత్రులు యనమలన, అచ్చెన్నాయుడు, శిద్ధారాఘవరావు భేటీ అయ్యారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కూడా బాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు. 

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

10:31 - March 1, 2016

ప్రకాశం : పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన అధ్యాపకులు నీచ పనులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినిలపై అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. జిల్లాలోని పుల్లలచెరువులోని గార్లపెంటలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు గిరిజన పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగుతున్నాడు. వేధింపులకు తాళలేక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమ్మాయిపై సంబంధిత ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం కుల పెద్దలు పంచాయితీ పెట్టి రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినట్లు, ఇది బెడిసి కొట్టడంతో తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పీఎస్ మెట్లు ఎక్కినట్లు సమాచారం. పరారీలో ఉన్న అధ్యాపకుడు నాగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

10:29 - March 1, 2016

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వూపిరి’. ఈ చిత్రంలోని ‘ఒక లైఫ్‌’ అనే పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి తమన్నాలు రేడియో సిటీలో సోమవారం విడుదల చేశారు. తమన్నా ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. ఈ మంగళవారం ‘వూపిరి’ ఆడియోను విడుదల చేయనున్నారు.

10:23 - March 1, 2016

మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార విహారాలు, ఎంత మాత్రం శారీరక శ్రమ లేని జీవన శైలి వంటి అనేక కారణాలతో వచ్చే ఈ సమస్య మరేదో కాదు అసిడిటి.మన సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. ఇంకా చెప్పాలంటే మధుమేహం, హైబీపీ, గుండె జబ్బుల కంటే కూడా ఎక్కువగా విస్తరించిపోయిన అతిపెద్ద బాధ ఇది. ఒకప్పుడు దీనికి ఏవేవో చిట్కా వైద్యాలూ, యాంటాసిడ్‌ మాత్రలూ తప్పించి పెద్దగా పరిష్కారాలేం ఉండేవి కాదు. మనలో ప్రతీ ఒక్కరూ జీవితంలోని ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా అసిడిటిని అనుభవించని వారు ఉండరంటే అది అతిశయోక్తి కానే కాదు. కానీ రోజురోజుకు ఈ సమస్య తీవ్రత పెరుగుతోంది. చాలా మంది తీవ్రమైన అసిడిటితో బాధపడుతున్నారు. అసిడిటిని చాలా చిన్న సమస్యగా భావిస్తారు చాలా మంది. ఏదో మందు వేసుకుంటే సరిపోతుంది అనే అనుకుంటారు. కానీ అసిడిటీ తరచుగా వేధిస్తుంటే మాత్రం అశ్రద్ధ కూడదనే అంటున్నారు నిపుణులు.

లక్షణాలు..

లక్షణాలు - పొట్టలో మొదలైన మంట నెమ్మదిగా ఛాతి నుంచి గొంతు వరకు వ్యాపిస్తుంది. తిన్న ఆహారం గొంతులోకి వస్తున్న భావన కలుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఒక్కోసారి ఛాతిలో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది గుండెపోటును తలపిస్తుంది. గొంతులో మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం, నోటి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసంగా ఉండడం, ఒక్కోసారి వాంతులు కూడా కావచ్చు. ఆహారం - కార్బోనేటెడ్ శీతల పానీయాలు, చాక్లెట్లు, సిట్రస్ పండ్లు, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ కొవ్వు, మసాలాలు కలిగిన ఆహారం తీసుకోవడం వంటివన్నీ కూడా అసిడిటిని పెంచుతాయి. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్ వల్ల కూడా ఆసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

జీవన శైలి - పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం కూడా అసిడిటికి కారణం అవుతుంది. పొగతాగడం వల్ల శ్లేష్మ పొరకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. గొంతులోపలి కండరాలు బలహీనపడిపోతాయి. అంతేకాక శరీరంలో ఆసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. నోటిలో లాలజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. పొగతాగడం వల్ల జీర్ణవ్యవస్థకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది.

స్థూలకాయం కూడా ....

స్థూలకాయం కూడా అసిడిటికి కారణం అవుతుంది. తిన్న వెంటనే పడుకోవడం, ఆలస్యంగా అంటే నిద్రకు ముందే భోజనం ముగించడం వంటి కారణాలు కూడా అసిడిటికి కారణమవుతాయి. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరుగుతుంది. అధిక బరువు వల్ల ఆహారనాళం చివరన ఉండే కవాటం బలహీన పడుతుంది. అందువల్ల గెర్డ్ సమస్య తీవ్రం అవుతుంది. దీనిని నిర్ధారించడానికి ఎండోస్కోపీ, మానోమెట్రీ అనే రెండు పరీక్షలు నిర్వహిస్తారు.

శరీరంలో జీర్ణవ్యవస్థ చాలా కీలకమైంది.....

శరీరంలో జీర్ణవ్యవస్థ చాలా కీలకమైంది. ఇది నోటి నుంచి ప్రారంభమై మల ద్వారం వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో చాలా రకాల అవయవాలు, గ్రంథులు భాగాలుగా ఉంటాయి. ఒక్కో అవయవంలో ఒక్కోరకమైన రసాయన ప్రక్రియ జరిగి ఆహార సంశ్లేషణ జరిగి శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందుతాయి. ఇందులో నోటి నుంచి ఆహారనాళం ద్వారా జీర్ణాశయం అనుసంధానించి ఉంటుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం చెయ్యడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పీహెచ్ విలువను కూడా సంతులన పరుస్తుంది. ఈ ఆసిడ్ లేదా ఆసిడ్‌తో కూడిన ఆహారం కానీ తిరిగి ఆహారనాళంలోకి చేరితే అందులో ఉండే ఆసిడ్ ప్రభావం వల్ల ఆహార నాళానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

తేలిగ్గా పోదు!

చాలామంది ఏదో మందుల షాపు నుంచి నాలుగు ‘యాంటాసిడ్‌’ మాత్రలు తెచ్చుకుని వేసుకుంటే అదే తగ్గుతుందని భావిస్తూ సొంత వైద్యాలు చేసుకుంటుంటారు. కానీ ఇదంత తేలికగా తగ్గదు, నిర్లక్ష్యం చేస్తే ఇతరత్రా సమస్యలకూ దారి తీస్తుంది. మాత్రలు వేసుకున్నప్పుడు బాధలు కొంత తగ్గినట్టే ఉండొచ్చుగానీ ఒకటిరెండు రోజుల్లోనే మళ్లీ మొదలవుతాయి. దీంతో మళ్లీ అవే మాత్రలు వేసుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే- అన్నవాహిక జీర్ణాశయాల మధ్య ఉండే కండర కవాటం కుచించుకుపోతుంది (స్ట్రిక్చర్‌). దీంతో ముద్ద సరిగా కిందికి దిగదు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో స్వల్పంగా రక్తస్రావం జరగొచ్చు. జీర్ణాశయంలో ఉండాల్సిన ఆమ్లం అన్నవాహికలోకి ఎగదన్నుకు రావటం వల్ల అన్నవాహికలో పుండ్లు పడొచ్చు. ఆమ్లం మరీ ఎక్కువగా ఎగదన్నుకొస్తే- మనం పడుకున్నప్పుడు అది గాలిగొట్టంలోకీ వెళ్తుంది. దీంతో దగ్గు, ఉబ్బసం వంటి బాధలూ కనబడతాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువ. ఆస్థమా బాధితుల్లో అసిడిటీ మూలంగా దాని బారినపడేవారు 5% ఉంటున్నారని అంచనా. అలాగే ఈ గర్డ్‌ సమస్య మూలంగా- నోటి దుర్వాసన, గొంతు నొప్పి, గొంతు బొంగురు, పొడి దగ్గు వంటివీ రావొచ్చు. కొన్నిసార్లు వీటికి మూలం అసిడిటీ అని డాక్లర్లూ గుర్తుపట్టలేకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితియ్యచ్చు. కాబట్టి ఈ అసిడిటీని తేలిగ్గా కొట్టెయ్యటానికి లేదు.

గుర్తించటమెలా?

అసిడిటీని గుర్తించటానికి చాలావరకూ రోగులు చెప్పే బాధలు, లక్షణాలే సరిపోతాయి. అవసరమైతే నోటి ద్వారా కిందికి కెమేరా గొట్టం (ఎండోస్కోపీ) పెట్టి చూస్తారు. జీర్ణాశయంలోంచి ఆమ్లం ఎలా పైకి తన్నుకొస్తోందో ఈ పరీక్షలో స్పష్టంగా కనబడుతుంది. దీని తీవ్రత కూడా తెలుస్తుంది. ఇక కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలుసుకునేందుకు పీహెచ్‌ పరీక్షలు, కండర కవాటం- సమర్థంగా ఉందా? లేదా? బలహీనపడిందా? అన్నది తెలుసుకోవటానికి ‘మ్యానోమెట్రీ’ అనే పరీక్ష వంటివి కొంత ఉపయోగపడతాయి. ఇవేవీ అసిడిటీ(గర్డ్‌)ని కచ్చితంగా నిర్ధరించేవి కాకపోయినా.. సమస్య అదేనా? కాదా? అదే అయిత ఎంత తీవ్రంగా, ఏ గ్రేడులో ఉందన్నది పట్టుకోవటానికి బాగానే ఉపకరిస్తాయి.

ఇంట్లో వుండే ఔషధాలను వాడి అసిడిటి మరియు గ్యాస్ కొంత తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు.

తులసి....

ఇండియాలో సాధారణంగా తులసి అంటే అందరికి తెలిసిందే, అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం. వైద్య విలువలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.

పుదీన.....

పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే. ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

కొబ్బరి నీరు....

కొబ్బరి నీరు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కాలి కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. కొబ్బరి నీటిని భోజన సమయంలో ఒలిచిన దోసకాయతో కలిపి కుడా తీసుకోవచ్చు. ఇలా తాగిన 15-20 నిమిషాల తరువాత భోజనం తీసుకోవటం వలన ఇది అసిడిటీకి వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

సంత్ర పండ్ల రసంతో జీలకర్ర...

ఒక గ్లాస్ తాజా సంత్ర పండ్ల రసాన్ని తీసుకొని, మరియు దీనికి కాల్చిన జీలకర్రని కలపండి. ఈ మిశ్రమాన్ని మొదట అసిడిటీ వచ్చినపుడు తాగండి మీరు త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఈ మిశ్రమాన్ని వరుసగా వారం రోజుల పాటు తాగండి.

ఆపిల్ సైడర్ వెనిగర్....

అసిడిటీని త్వరగా మరియు సులభంగా తగ్గించుకోటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక మంచి ఔషదం. త్వరగా ఉపశమనం కొరకు 2-3 చెంచాల వెనిగర్'ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగండి.

నిమ్మ రసం....

గ్యాస్ మరియు అసిడిటీలకు ఇది ఒక శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదం. భోజనానికి ముందుగా ఒక గ్లాసు వేడి నీటిలో రెండు లేదా మూడు చెంచాల నిమ్మరసాన్ని కలిపి తాగండి. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేయండి.

హోమియోపతి వైద్యంలో....

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తరువాత హోమియో మందులను ఇస్తారు. ఈవిధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకువస్తాయి. కండర కవాటాన్ని దృఢపరుస్తాయి. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా చేస్తాయని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు. 

10:16 - March 1, 2016

హైదరాబాద్: టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. ఆస్తి విషయంలో చక్రి కుటుంబం రోడ్డెక్కింది. గతంలో తగదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చక్రి ఆస్తి తనకే దక్కుతుందని ఆయన సతీమణి శ్రావణీ, తల్లిగా తనకే దక్కాలని ఆయన తల్లి విద్యావతి పరస్పరం గొడవ పడుతున్నారు. గతంలో జూబ్లిహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా చక్రి ఆస్తి కోసం ఆయన తల్లి విద్యావతి, భార్య శ్రావణిల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. ఆస్తి తనకే దక్కుతుందని విద్యావతి..శ్రావణి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ వివాదం ఎంతదాక వెళుతుందో చూడాలి. 

10:09 - March 1, 2016

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దండకారుణ్య ప్రతినిధి జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎన్ కౌంటర్ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. కాల్పుల అనంతరం జల్లెడ పట్టిన పోలీసులు ఏకే 47 రైఫిల్ తో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

భారీ ఎన్ కౌంటర్..

ఛత్తీస్ గఢ్ : తెలంగాణ ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. 

10:00 - March 1, 2016

ఢిల్లీ : తన బడ్జెట్ ప్రసంగంలో గ్రామీణ భారతానికి తియ్యటి కబుర్లు చెప్పిన అరుణ్ జైట్లీ చివరకు సామాన్యుడిని అంతులేని అసంతృప్తినే మిగిల్చారు. . గ్రామాలకు రోడ్లు, నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ మనందరిపై కృషి కళ్యాణ్ టాక్స్ పేరుతో మరో 0.5 శాతం చొప్పున అదనపు టాక్స్ వడ్డించారు. వ్యవసాయంలో రెట్టింపు ఆదాయాలు చూపిస్తామంటూ ఊహలపల్లకీలోకి తీసుకెళ్లినట్టే తీసుకెళ్లి ఎరువుల ధరలు పెంచేశారు. ఓ వైపు వ్యవసాయానికీ, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామంటూనే మరోవైపు ఎరువుల సబ్సిడీలలో కోతలేశారు. వ్యవసాయానికి రైతు సంక్షేమానికి దాదాపు 36 వేల కోట్ల రూపాయలు కేటాయించిన చేతులతోటే ఎరువుల సబ్సిడీని గతేడాది కంటే 2437 కోట్ల రూపాయలు తగ్గించారు. అంటే ఎరువుల ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి.

ఆహార సబ్సిడీ ఖాతాలో కోతలు..
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం ధరలు తగ్గుతున్నా, ఆ సంతోషం సామాన్యుడికి లేకుండా చేశారు. పెట్రోలియం సబ్సిడీని 26 497 కోట్లకు కుదించిన అరుణ్ జైట్లీ వాటి ధరలు మరింత పెంచబోతున్నట్టు సంకేతమిచ్చారు. గ్రామీణ నిరుపేద మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామంటూ ఆశ పెట్టిన అరుణ్ జైట్లీ అసలు అన్నం గిన్నెకే చిల్లు పెట్టారు. ఆహార సబ్సిడీ ఖాతా లో 5వేల కోట్ల రూపాయలు తెగ్గోసి, ఆ మేరకు సామాన్యుడి నోటి కాడ కూడు లాగేసుకున్నారు. కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ ఖాతాలో 8.33శాతం ప్రభుత్వమే జమ చేస్తుందంటూ తెగ ఊరించిన అరుణ్ జైట్లీ చివరకు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రాయల్స్ మీద పన్ను కట్టాల్సిందేనంటూ కరాఖండిగా చెప్పారు. వృద్ధాప్యంలో అక్కరకొస్తాయన్న ఆశతో ఉద్యోగులు, కార్మికులు రెక్కల కష్టంతో దాచుకున్న పీఎఫ్ సొమ్ము మీద కూడా పన్నులు వడ్డించడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం.

ఐసీడీఎస్ కి 1500 కోట్ల తగ్గింపు..
పసిపిల్లలు, గర్భిణీలకు కాస్తంత పౌష్టికాహారం అందించే ఐసీడీఎస్ కి 1500 కోట్లు తగ్గించారు. మైనార్టీ వెల్ఫేర్ కేటాయింపుల్లో కోతలేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 38 500 కోట్లు కేటాయిస్తున్నట్టు అరుణ్ జైట్లీ గొప్పలు చెప్పుకున్నప్పటికీ అవి వంద రోజుల పని కల్పనకు సరిపోవు. కేవలం 38 రోజుల పనిదినాలను మాత్రమే సృష్టిస్తాయి. ఇలా ఎవరికీ ఏమాత్రం సంతోషం మిగల్చలేకపోయిన బడ్జెట్ పరోక్ష పన్నుల రూపంలో వినియోగదారుల నుంచి మరో 21 వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయబోతోంది. అంటే, మనం హోటల్ కెళ్లినా, సినిమాకెళ్లినా, బ్యూటీ పార్లర్ కెళ్లినా, సెల్ ఫోన్ మాట్లాడినా, బట్టలు, కంప్యూటర్లు, కారు, బంగారం ఇలా ఏది కొనాలనుకున్నా ఇప్పుడు కడుతున్న టాక్స్ కి అదనంగా 0.5 నుంచి 1 శాతం దాకా చెల్లించాల్సి వుంటుంది. 

09:48 - March 1, 2016

తూర్పుగోదావరి : ఫేస్‌బుక్‌లో పలకరించాడు... మేసేజ్‌లతో ఆకట్టుకున్నాడు. చాటింగ్‌లతో మనసుదోచుకున్నాడు. వన్‌ ఫైన్‌డే హోటల్‌కు రమ్మని ఆహ్వానించాడు. నీతి వ్యాఖ్యలు పలికి నీచంగా ప్రవర్తించబోయాడు. కాదు కూడదన్న యువతికి ఫింగర్‌కు రింగ్‌ తొడిగి ఇదే మ్యారేజ్‌ అన్నాడు. ముగ్గులోకి దించిన ఆ పాస్టర్‌ ఓ అమాయకురాలి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నాలుగు మంచిమాటలతో చెడుదారుల్లో నడిచేవారిలోమార్పు తీసుకురావాల్సినవాడే దారి తప్పాడు..చెడు మార్గంలో నడిచాడు.. ఆలోచించాడు..ఫలితంగా ఓ అమాయకురాలి జీవితం బుగ్గిపాలయింది...ప్రేమించుకుందాం రా అంటూ కవ్వించాడు. చావైనా..బతుకైనా నీతోనే అంటూ భారీ డైలాగ్ లు కొట్టాడు. ఇలా నక్కజిత్తులన్ని ప్రదర్శించి మొత్తానికి ఈ యువతిని బుట్టలో వేసుకున్నాడు. తీరా లవ్‌లో పడ్డాక ఆమె జీవితాన్నే చిద్రం చేశాడు.

మాయమాటలు..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతికి స్థానికంగా ఉండే పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌లో మరింత దగ్గరయ్యాడు. ఓ వైపు దైవ సందేశాలు వల్లిస్తూనే మరోవైపు యువతితో ఐ లవ్‌ యూ అన్నాడు. ఆమె కూడా యూ2 అనడంతో ఎగిరిగంతేశాడు. లోబర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమెతో ప్రేమ నాటకం ఆడాడు. ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇస్తానంటూ హోటల్‌కు రమ్మన్నాడు. మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నించడంతో యువతి నిరాకరించడంతో ఉంగరం తొడిగి సగం పెళ్లయిందని చెప్పి ఆ తర్వాత ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు...పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ముఖం చాటేశాడు.

యువతి ఆత్మహత్యాయత్నం..
దీంతో తీవ్రమనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో...ప్రవీణ్‌ తన అనుచరులతో బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పాస్టర్‌ ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తుంది. మరో స్టేషన్‌లో తనపై చీటింగ్‌ కేసు పెట్టారని చెబుతోంది.
మరోవైపు బాధితురాలికి అండగా నిలబడ్డ మహిళా సంఘాలు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సో అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ ముసుగులో దగ్గరవ్వడానికి ఇలాంటి కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. వారి నక్కవినయాలను ఏ మాత్రం నమ్మారో.. ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఊహించండి. తస్మాత్ జాగ్రత్త. 

09:45 - March 1, 2016

ఢిల్లీ : అన్ని పథకాలకు ఇక ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కానుంది. ఆధార్‌ లేనిదే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడం ఇకపై కష్టమవుతుంది. దాదాపు అన్ని పథకాలతోనూ ఆధార్‌ అనుసంధానతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆదాయ పన్ను శ్లాబ్‌ను యథాతథంగా ఉంచి జైట్లీ వేతన జీవులనూ నిరాశపరిచారు. మరోవైపు.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే జైట్లీ ప్రసంగంలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నింటికీ..
ఆధార్‌... మనిషి నిత్య జీవితంలో ఇది ఓ భాగమయ్యింది. ఇప్పటి వరకు వంటగ్యాస్‌ సబ్సిడీతోపాటు ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే తప్పనిసరి చేసిన ఆధార్‌ను... ఇకపై అన్ని పథకాలకు విస్తరించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఉపకార వేతనాలు పొందాలన్నా, ఆదాయపన్ను చెల్లించాలన్నా ఇకపై ఆధార్‌ తప్పనిసరి అవుతుంది. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఇలా ఏ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా... ఇకపై ఆధార్‌ ఉండాల్సిందే.

ఆదాయ పన్నుకు పాన్‌తోపాటు ఆధార్‌..
ఆధార్‌ నంబర్‌ లేనిదే బ్యాంకు అకౌంట్‌ పొందడం కూడా కష్టమే. సెల్‌ ఫోన్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ఇప్పటివరకు ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో ఏదో ఒకటి చూస్తే సరిపోయేంది. ఇకపై ఆధార్‌ కార్డు ఉంటేనే సెల్‌ కనెక్షన్‌ ఇస్తారు. ఆదాయ పన్ను మినహాయింపు పొందాలంటే పాన్‌ నంబర్‌తోటు ఇకపై ఆధార్‌ నంబర్‌ను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు సక్రమంగా అర్హులకు చేరేందుకు వీలుగా ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

చట్టబద్ధత..
ఇప్పటి వరకు ఆధార్‌కు చట్టబద్ధతలేదు. ఇకపై దీనికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకొస్తారు. నగదు బదిలీ వంటి పథకాలకు మినహా మిగిలిన వేటీకి ఆధార్‌ ఐచ్ఛికమే కానీ, తప్పనిసరికాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల్లో నిలిపివేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తారు. ఆధార్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉంది.
మరోవైపు వేతన జీవులు కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్నడిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ అరుణ్‌ జైట్లీ వేతన జీవులపై కరుణ చూపలేదు. ప్రస్తుతం ఉన్న ఆదాయపస్ను పరిమితి 2.50 లక్షల రూపాయలను యథాతథంగా ఉంచారు. అద్దె ఇళ్లలో ఉండే ఉద్యోగులకు మాత్రం కొద్దిపాటి ఊరట కల్పించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80 GG ప్రకారం ప్రస్తుతం హెచ్‌ఆర్‌పై ఏడాదికి 24 వేల రూపాయల వరకు ఉన్న పన్ను వినహాయింపును 60 వేల రూపాయలకు పెంచారు. అలాగే సెక్షన్‌ 87 A కింది 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి టాక్స్‌ రిబేటు సీలింగ్‌ను 2 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు. ఇది సామాన్యులకు పెద్దగా ఉపయోగపడే అంశం కాదు. కోటి రూపాయల ఆదాయం దాటిన వారు చెల్లించాల్సిన సర్‌ చార్జీని 12 నుంచి 15 శాతానికి పెంచారు. ఏటా 30 లక్షల రూపాయల లోపు వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు స్పల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 44 AD ప్రకారం పిజంప్టివ్‌ టాక్సేషన్‌ పరిమితిని కోట రూపాయల నుంచి రెండు కోట్లకు పెంచారు.

నల్లధనం వెలికితీత..
ఇక నల్లధనం వెలికితీత ప్రస్తావనే బట్జెట్‌లో లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్ల కేబేరులు అక్రమంగా దాచుకున్న లక్షల కోట్ల రూపాయాల నల్లధాన్ని స్వదేశం తీసుకొచ్ని ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమచేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇంతవరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా...నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో కమిటీల ఏర్పాటుతో కాలక్షేపం చేస్తున్నదన్న వాదనలున్నాయి. నల్లధనం వెలికతీత విషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.... చేతలు గడపదాటడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

హెచ్చరికలు పనిచేస్తాయా ? 
జైట్లీ బడ్జెట్‌లో విదేశీ నల్లధనం వెలికితీతకు చర్యలు లేకపోయినా... స్వదేశీ నల్లధనాన్ని బయటకు తీసేందుకు కొన్ని చర్యలు ప్రకటించారు. వచ్చే జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఆదాయ పన్ను వెల్లడి పథకాన్ని ప్రకటించింది. భారతీయ నల్లకుబేరులు స్వదేశంలో చట్టవిరుద్ధంగా దాచుకున్న నల్లధనాన్ని ఈ కాలంలో స్వచ్ఛందంగా బయటపెడితే 30 శాతం పన్నుతోపాటు 7.5 శాతం సర్ చార్జి, మరో 7.5 శాతం జరిమానాతో కలిపి మొత్తం 45 శాతం చెల్లిస్తే సరిపోతుంది. లేకపోతే నల్లకుబేరులపై చట్టపరమైన చర్యలు తప్పవని అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో హెచ్చరించారు. గత బడ్జెట్‌లో కూడా జైట్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా... స్వదేశీ నల్లకుబేరులెవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు కూడా స్పందిస్తారన్న నమ్మకం ప్రభుత్వ పెద్దలకే లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తామన్న అరుణ్‌ జైట్లీ హెచ్చరికలు ఎంతవరకు అమల్లోకి వస్తాయో చూడాలి. 

09:41 - March 1, 2016

ఢిల్లీ : పేదల ప్రభుత్వమంటారు.. కానీ సమయమొచ్చినప్పుడు అసలు నైజాన్ని బయటపెడతారు. ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ.. ఎన్డీయే సర్కారు మరోసారి అంతర్ముఖానికి వేసిన ముసుగును తొలగించింది. ప్రభుత్వ సంస్థలకు దన్నుగా ఉండాల్సింది పోయి.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల బకాయిలపై సుప్రీం స్పందించినా.. ఆర్థిక మంత్రి మాత్రం బడ్జెట్‌లో పెదవి విప్పనే లేదు. పైగా 25వేల కోట్ల ప్రజాధనాన్ని... బడా ఎగవేతదారుల తరఫున బ్యాంకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తద్వారా కార్పొరేట్ రుణాల వసూళ్లలో తామేమీ చేయలేమంటూ పరోక్షంగా చేతులెత్తేసింది మోదీ సర్కారు. ఆర్థిక సంస్థల్లో సంస్కరణలతో పాటు... మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా... ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్లు కేటాయించారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచుకోవడం, బేసిల్-3 ప్రమాణాలు అందుకోవడం కోసం ఈ నిధులను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలను పరుగులు పెట్టించేందుకు ఐడీబీఐ బ్యాంకులో తమ వాటాను 50శాతం కంటే దిగువకు తగ్గించుకుంటామని కూడా ప్రకటించారు. భారత బ్యాంకులు ఇంకా బలంగా, పోటీదారులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు అరుణ్ జైట్లీ. అయితే తాము బ్యాంకుల కార్యాకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదని.. వాటిల్లో పోటీ తత్వం పెంచేందుకు మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. అందుకోసమే 25వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులను 3 భాగాలుగా పంచనున్నారు. మొదటి 40శాతం నిధులను ఏయే బ్యాంకులకు నిధులు అవసరమో వాటికే కేటాయించనున్నారు. మరో 40శాతం నిధులను కేవలం ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్ బీ, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు మాత్రమే కేటాయించమన్నారు. వచ్చే 3 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు చూపిన బ్యాంకులు మిగతా 20శాతం నిధులను అందిస్తామన్నారు.

సంస్కరణల పేరిట..
అయితే అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ఎక్కడా.. పీఎస్ యూ బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్థక ఆస్తుల గురించి ప్రస్తావించలేదు. కానీ పరోక్షంగా.. రుణాలు వసూలు చేసుకోలేక చేతులెత్తేసిన బ్యాంకులకు సహాయంగా ఉండేందుకే ఈ నిధులు కేటాయించారని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోలేక చతికిల పడితే ఆ నష్టం భర్తీకి ప్రజల డబ్బులను కేటాయించడం ఎంతవరకు సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ పెద్దలే కారణం. ఎన్డీఏ సర్కార్ తీరు చూస్తుంటే... రుణాలు ఎగ్గొట్టిన.. కార్పొరేట్ సంస్థల నుంచి ముక్కుపిండి డబ్బులను వసూలు చేయకుండా.. చేతులు దులుపుకున్నట్టుగా ఉంది. బడా బడా కంపెనీల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు రావల్సిన మొత్తం సుమారు 50వేల కోట్లకు పైగానే ఉంది. ఇప్పుడా మొత్తం రాకుంటే.. బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకోక తప్పుదు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండేందుకే ఆర్థికమంత్రి ఇలా సంస్కరణల పేరుతో దొడ్డిదారిన ఈ నిధులు కేటాయించారనిస్తోంది. ప్రజల ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా బడాబడా కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి.. వారి ఆగడాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

ఠాణా చెక్ పోస్టులో ఏసీబీ అధికారుల సోదాలు..

చిత్తూరు : ఠాణా చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇద్దరు అనధికారులను అరెస్టు చేసిన పోలీసులు రూ. 10వేలను స్వాధీనం చేసుకున్నారు. 

08:59 - March 1, 2016

వరంగల్ : మొన్నటి వరకు ఆశావహులు,.ఇప్పుడు రెబల్స్‌గా మారారు. అంతేకాదు బీ ఫామ్స్ లేకుండా వ్యక్తిగత చరిష్మాతో గెలుస్తామని సవాలు విసురుతున్నారు. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు భయపడిపోతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలు ఎంత నచ్చచెప్పినా..గ్రేటర్ వరంగల్ రెబల్స్ మాత్రం వినడంలేదు. గ్రేటర్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు. అయితే 20 డివిజన్లలో రెబల్స్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. వీరిలో అధికార పార్టీ అభ్యర్థుల కంటే 10 మంది బలమైన రెబల్స్ ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తలనొప్పిగా మారింది.

10మంది బలమైన రెబల్స్..
4వ డివిజన్‌లో టీఆర్ఎస్‌కు ఇద్దరు రెబల్ అభ్యర్థులున్నారు. ఇక 13వ డివిజన్‌లో భూక్య లక్ష్మికి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. అయితే ఈ డివిజన్ నుంచి టికెట్ వస్తుందని ఆశించి వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత, అతని భార్య ఇప్పుడు రెబల్స్‌గా ఉన్నారు. 15వ డివిజన్‌లో కూడా రెబల్ పోరు తప్పడం లేదు బీఫామ్‌ తీసుకున్న అభ్యర్థికి. 19,20వ డివిజన్‌లో పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవిందర్ కూడా రెబల్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని డివిజన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

రెబల్స్ గా మారిన ఇద్దరు దంపతులు..
టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వక పోవడం..కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద పీఠ వేస్తుండటం నచ్చకపోవడంతో రెబల్స్ గా మారారు చాలా మంది నామినేషన్ వేసిన అభ్యర్థులు. విరమించుకోండని గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు చెప్పినా రెబల్స్ మాత్రం వినడం లేదు. నామినేషన్ పోస్టులు ఇస్తామంటే కూడా నో చెప్తున్నారు రెబల్ అభ్యర్థులు. దీంతో అధికార పార్టీ నేతలతో పాటు, ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి మరి రెబల్స్ ను బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోస్టులు ఇస్తామంటే వద్దంటున్న వారికి డబ్బులను ఇచ్చేందుకు అధికార పార్టీ వెనకాడటం లేదు. రెబల్స్ ను ఎలాగైనా చల్లార్చాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా హమీలిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అలా కూడా వినని రెబల్స్ ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. మొత్తానికి ఎన్ని ప్రయాత్నాలు చేస్తున్నా..రెబల్స్ మాత్రం మాట వినడంలేదు. ఎన్నికల జరిగే నాటివరకైనా ఎంతవరకు రెబల్స్ ను కంట్రోల్‌ చేస్తుందో చూడాలి మరి. 

08:20 - March 1, 2016

హైదరాబాద్ : ఇక కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు కారెక్కపోతున్న రంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు హస్తం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెస్త్రిస్తున్నాయి.దింతో అలర్ట్ ఐన పార్టీ పెద్దలు బ్రేకులేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేసిన్నారు. రాష్ట్రము లో టీడీపీ బలహీన పడింది కాబట్టి ఫ్యూచర్ కాంగ్రెస్ దేనని ఆశలు రేకెత్తిస్తున్నారు భరోసా నింపుతున్నారు.తమ ఎమ్మెల్యే లు పార్టీ మారుతారంటూ రోజు వస్తున్న వార్తల కాంగ్రెస్ ను వణికి స్తున్నాయి. కారెక్కుతారంటూ రోజుకో నేత పేరు వార్తల్లో హల్ చల్ చేస్తుండటంతో ఆందోళలో ఉన్న హస్తం పార్టీ డామేజ్ జరగకముందే నష్టానివారణ ను నడుబిగించింది. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు తమ ఎమ్యెల్యేలతో టచ్ లో ఉండటమే కాకుండా వార్తల్లో వస్తున్న జుంపింగ్ లిస్టు నేతలతో.. మరింత క్లోజ్ గా ఉంటూ వారి మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ.

మైండ్ గేమ్..
ఇప్పటికే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే లలో నలుగురు ఎమ్మెల్యేలు కారెక్కిపోయారు.ఐతే ఏడాది నుంచి ఎమ్మెల్యే వలసలు ఆగిపోయాయి. కానీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ లోకి లైన్ కట్టడంతో ప్రభావం కాంగ్రెస్ పై పడింది. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్,వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే తో పాటు ఇంకా కొందరు టీఆర్ ఎస్ లో చేరుతారంటూ ప్రచారం అవుతోంది. ఇందులో వాస్తవం వుందా .. లేదనేది పక్కన పెడితే ఇదంతా టీఆర్ఎస్ మైండ్ గేమ్ అంటున్నారు హస్తం నేతలు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ల్లో ఒక్కరు గడప దాటినా వలసలు మొదలవుతాయని కాంగ్ నేతలకు గుబులు పట్టుకుంది. రాష్ట్రము లో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యం లో టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్ పార్టీ యే నని ధైర్యం చెబుతున్నారు.కొన్ని రోజులు ఆగితే ఫ్యూచర్ అంతా కాంగ్రెస్ దేనని నచ్చ చెబుతున్నారు. మాజీ లు పార్టీ వీడినా నష్టం లేదంటున్న నేతలు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ల పై పట్టు జరకుండా ప్రయత్నం చేస్తున్నారు.

నిజాంపేటలో క్రికెట్ బెట్టింగ్ పై దాడి..

హైదరాబాద్ : నిజాంపేట రోడ్ వర్క్ టెక్స్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. 

అమెరికాలో మళ్లీ కాల్పులు..

అమెరికా : ఓహాయోలోని ఓ స్కూల్ లో విద్యార్థి కాల్పులు జరిపాడు. నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వరంగల్, కరీంనగర్ లో అకాల వర్షాలు..

హైదరాబాద్ : వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, వేములవాడలో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

వరంగల్ కు ముగ్గురు మంత్రులు..

వరంగల్ : నేడు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల, కడియం శ్రీహరిలు పాల్గొననున్నారు. 

తెలంగాణలో హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి హెల్మెట్, లైసెన్స్ అమలు తప్పనిసరికానుంది. హైదరాబాద్ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా పట్టుబడితే అరెస్టు చేయనున్నారు. 

కొన్నచోటే రిజిస్ట్రేషన్..

విజయవాడ : నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నచోటనే వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. విశాఖపట్టణంలో నేడు అమలు చేయనున్నారు. 

తానా చెక్ పోస్టుపై ఏసీబీ రైడ్స్..

చిత్తూరు : గంగాధర నెల్లూరు మండలం తానా చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అనధికారికంగా ఉన్న రూ. పదివేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నేటి నుండి జర్మన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బాడ్మింటెన్ టోర్నీ..

జర్మనీ : మంగళవారం నాడు ప్రారంభం కానున్న జర్మన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌లో పాల్గొనే భారత బృందానికి పివి సింధూ, కె శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. 

07:33 - March 1, 2016

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.శ్రీరాములు (టిడిపి), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:27 - March 1, 2016

అల్లు అర్జున్‌ ఇప్పుడు 'సరైనోడు' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీను ఆలోచన. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే తమిళ దర్శకుడు లింగస్వామితో ఓ సినిమా చేయడానికి బన్ని అంగీకరించినట్టు తెలిసింది. ఈయనతో సినిమా చేస్తే తమిళనాడు మార్కెట్‌పై మరింత దృష్టి సారించవచ్చునని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు. ఈ సినిమా ఒకే సారి తెలుగు, తమిళంలో రూపొందనుంది. గీతా ఆర్ట్స్‌, స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

07:26 - March 1, 2016

ప్రస్తుతం చాలా మంది నటులు తమ చిత్రాల్లో ఏదొక పాటపాడడం, దాని ద్వారా ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి రేకెత్తించడం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఎన్టీఆర్‌ వరకు, అల్లు అర్జున్‌ నుంచి నారా రోహిత్‌ వరకు అందరూ పాడేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అంజలి కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న 'చిత్రాంగద' సినిమాలో ఓ పాట పాడింది. శనివారం చెన్నైలో ఈ పాటను రికార్డింగ్‌ చేశారు. ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలి. 'పిల్ల జమీందారు' దర్శకుడు అశోక్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

07:25 - March 1, 2016

చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించాడు అజయ్. సహాయక నటుడు నుంచి విలన్‌ వరకూ అన్ని పాత్రల్లో మెప్పించాడు. 'విక్రమార్కుడు'లో క్రూరుడిగా, ఆర్య-2లో విలనిజంతో, ఇష్క్ లో నెగిటివ్‌, పాజిటివ్‌ ఉన్న పాత్రలను పండించిన ఆయన 'సుబ్రహ్మణం ఫర్‌ సేల్‌'లో మాఫియా డాన్‌గా అలరించాడు. తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ '24'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇష్క్ లో ఆయన నటించిన పాత్రకు మెచ్చుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఇందులో కీలక పాత్రను ఇచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు వస్తుందని అజయ్ తెలియజేస్తున్నాడు.

07:25 - March 1, 2016

సందీప్‌ కిషన్‌, అనీషా అంబ్రోస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్‌'. ఎ.టి.వి. రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్‌, కాన్సెప్ట్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇందులో సంజు పాత్ర సందీప్‌ కిషన్‌, అమ్ము పాత్రలో అనీషా, వడ్డీరాజా పాత్రలో బాబీ సింహా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ వల్ల కథలో ఎలాంటి మలుపులు తిరిగాయనేది కథాంశమని దర్శకుడు చక్కటి స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా తెరకెక్కించారని నిర్మాతలు పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 23న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.

 

07:18 - March 1, 2016

ముల్హెయిమ్‌ అన్‌ డెర్‌ రుహర్‌ (జర్మనీ) : మంగళవారం నాడు ప్రారంభం కానున్న జర్మన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌లో పాల్గొనే భారత బృందానికి పివి సింధూ, కె శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. ఈ టోర్నికి ప్రపంచ నంబర్‌ టూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ దూరంగా ఉంది. గత ఏడాది నుంచి మోకాలి గాయం కారణంగా సైనా అంతర్జాతీయ టోర్నిలకు దూరంగా ఉంటుంది. మార్చి నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సైనా దృష్టి పెట్టింది. సైనా గైర్హాజరుతో ప్రస్తుత టోర్నిలో భారత మహిళ బృందానికి సింధూ నాయకత్వం వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా మాస్టర్స్ టోర్నిలో విజేతగా నిలిచిన సింధూ దక్షిణాసియా గేమ్స్‌లో యువ క్రీడాకారిణి రుత్విక శివాని గద్దె చేతిలో పరాభవం చెందింది. తరువాత హైదరాబాద్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓటమి చవిచూసింది. దీంతో జపాన్‌ ఓపెన్‌లో రాణించి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ టోర్నిలో తన ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన రోగ్‌ స్కాఫర్‌తో సింధూ తలపడుతుంది. ఈ టోర్నిలో పురుషుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రపంచ 6వ ర్యాంకర్‌ కె శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో తకుమ యెడ (జపాన్‌)తో ఢ కొంటాడు. అలాగే భారత్‌ నుంచి సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ పురుష సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి మను అత్రి- బి సుమిత్‌ రెడ్డి జోడీ పాల్గొంటుంది.

07:12 - March 1, 2016

పరీక్షల సీజన్‌ ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు, మరోవైపు పరీక్షలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడి.. పిల్లలు ఉత్సాహంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలంటే ఆహారం, విశ్రాంతి, వ్యాయామం ఎంతో అవసరం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్‌కు వెళ్ళే సమయంలో పిల్లలు ఇతర పిల్లలతో కలిసి తింటారు. ఒకటైమింగ్‌కు అలవాటు పడి ఉంటారు. మరి ఇంట్లో ఉండే సమయంలో, ముఖ్యంగా ప్రిపరేషన్‌ హాలిడేస్‌లో ఇంటివద్దనే ఉండే పిల్లలు సరైన ఆహారం తీసుకునేలా చూడాలి.

అల్పాహారం..
గ్లాస్‌ పాలు, నాలుగు బిస్కెట్లు కాకుండా అల్పాహారంలో ఇడ్లీ, దోశ, చపాతి, జొన్నరొట్టె , కిచిడి వంటివి ఉండేలా చూడాలి. అంతేకాదు అల్పాహారంతో పాటు ఫ్రూట్స్‌ , వెజిటేబుల్‌ సలాడ్స్, నానపెట్టిన ధాన్యాలు ఇవ్వాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిగానైనా ఆహారం తీసుకునేలా చూడాలి. ఉద్యోగాలు చేసే అమ్మలు ఏ టైమ్‌కు ఏం తినాలో చిన్న టైమ్‌టేబుల్‌ రాసి, ఆహారం వారికి అందుబాటులో ఉంచాలి. పండ్లు ఎక్కువగా ఇవ్వాలి.పిల్లల్లో చురుకుదనం పెంచేందుకు పోషకాహారం ఉపయోగపడుతుంది. మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.

ద్రవపదార్థాలు ఎక్కువగా..
చిన్నారుల్లో డీహైడ్రేషన్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగాలే వారికి అవగాహన పెంచాలి. కేవలం మంచినీళ్లు తాగమంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. కాస్త గ్లూకోజ్‌ కలిపిన నీటిని ఇవ్వొచ్చు. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, చెరుకురసం, మజ్జిగ, లస్సీ వంటివి ఎక్కువగా ఇవ్వాలి.

తేలికపాటి వ్యాయామం..
పరీక్షల సమయంలో పిల్లలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని జయించాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. స్ట్రెస్‌గా అనిపించినప్పుడు కాసేపు నడవడం ఎంతో మంచిది. అలసటగా కనిపిస్తే.. ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర ఎంతో ముఖ్యం. తప్పనిసరిగా రోజుకు ఆరుగంటల పాటు నిద్రపోవాలి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా శ్రద్దగా కొద్ది సమయం చదివినా మంచి మార్కులు సాధించవచ్చు.

07:11 - March 1, 2016

ఎండకాలం వచ్చిందంటే చెమట పట్టి చికాకుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వేడి తీవ్రత ఒక వైపు.. చెమట వాసన మరోవైపు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు చర్మసమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

  • చాలామంది ఎండాకాలం కాబట్టి చల్లనీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇది చర్మానికి మంచిది కాదు. సీజన్‌ను బట్టి స్నానం చేసే నీటి ఉష్ణోగ్రతను మార్చితే దాని ప్రభావం చర్మం మీద ఉంటుంది. అందుకే ప్రతిరోజూ గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • చెమట వాసన నుంచి రక్షణ పొందాలంటే.. ఈ సబ్బు వాడండి అంటూ మార్కెట్‌లో అనేక రకాల సబ్బుల గురించి ప్రకటనలు చూస్తుంటాం. వీటిని నమ్మకండి. చెమట వాసన నుంచి ఉపశమనంతోపాటు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేలా శాండిల్‌సోప్‌ వాడితే మంచిది.
  • వాడే సోప్స్, పౌడర్‌లోనే కాదు వేసుకునే దుస్తుల్లోనూ కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. చెమటను పీల్చే కాటన్‌ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  • మేకప్‌ వేసుకోవడం తప్పనిసరి అనుకునేవారు వాటర్‌ బెస్ట్‌ ఫౌండేషన్‌ లేదా ఆయిల్‌ ప్రీ ఫౌండేషన్‌ ఉపయోగించాలి.
  • లిప్‌స్టిక్‌ వాడే అలవాటు ఉన్నవారు తేలికపాటి రంగులను ఉపయోగిస్తే మంచిది.
  • హెయిర్‌ విరబోసుకోకుండా కాస్త టైట్‌గా నాట్‌ వేసుకుంటే హెయిర్‌ మెడమీద పడి చికాకు పెట్టకుండా ఉంటుంది.
  • ఫెర్‌ఫ్యూమ్‌ల్లో తక్కువ గాఢత ఉన్నవాటినే ఉపయోగించాలి.
  • వీటన్నింటితో పాటు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, సన్‌గ్లాసెస్‌ తీసుకువెళ్లాలి.
  • ఎక్కువగా నీళ్లు తాగాలి. తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. 
07:09 - March 1, 2016

మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగ పడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కను పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో గానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి, యాక్నె వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

నేడు, రేపు నీటి సరఫరా బంద్..

హైదరాబాద్: కృష్ణా ఫేజ్-1లో స్వల్ప మరమ్మతుల కారణంగా మంగళ, బుధవారాల్లో (మార్చి 1, 2 తేదీల్లో) 30 గంటలపాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు అధికారికంగా ప్రకటించారు. మార్చి 1న ఉదయం 6 గంటల నుంచి మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేయనున్నట్లు తెలిపారు. 

క్రమబద్ధీకరణకు నేటితో గడువు పూర్తి..

హైదరాబాద్ : అక్రమ భవన లేఔట్ల క్రమబద్ధీకరణ పథకాల(బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్) గడువు నేటితో పూర్తవుతోంది. సోమవారం సాయంత్రానికి రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఫీజుల రూపంలో రూ. 165 కోట్లు వసూలైంది.

06:59 - March 1, 2016

లాస్ ఏంజిల్స్ : ఉద్వేగ క్షణాలు...ఉల్లాసభరిత వ్యాఖ్యానాలు... నవ్వులు పూయించిన క్రిస్‌ చలోక్తుల మధ్య ప్రతిష్టాత్మక 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 2016 ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్‌ దిగ్గజాలు, అందాల తారలు సందడి చేశారు. మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ చిత్రానికి అవార్డుల పంట పడింది. ఇంద్రభవనాన్ని తలపించే డాల్బీ థియేటర్‌లో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన క్రిస్‌రాక్‌ ఆరోగ్యకరమైన చలోక్తులతో నవ్వులు పూయించాడు. మొత్తం 10 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'మ్యాడ్‌ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్‌' చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ, ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, ఉత్తమ్‌ సౌండ్‌ మిక్సింగ్‌ విభాగాల్లో మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ రోడ్‌ ఆరు ఆస్కారులను సొంతం చేసుకుంది.

ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియో..
ఉత్తమ నటుడుగా టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో తొలిసారిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ద రివెనంట్‌ చిత్రంలో అద్భుత నటనకుగాను డికాప్రియో ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన డికాప్రియో తొలిసారిగా అవార్డును సొంతం చేసుకొని తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.

ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌(రూం)..
ఇక ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌ తొలిసారిగా ఆస్కార్‌ను అందుకున్నారు. రూం చిత్రంలో వైవిధ్యభరితమైన నటనకు గాను బ్రిలార్సన్‌ను ఉత్తమనటిగా ప్రకటించింది జ్యూరీ. ఉత్తమచిత్రంగా స్పాట్‌లైట్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను అందుకుంది. ద రివెనంట్‌ చిత్ర దర్శకుడు అలజెండ్రొజీ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. 'బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా 'ద డానిష్‌ గర్ల్‌' చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి.

పలు విభాగాల్లో అవార్డులు..
ఉత్తమ యానిమేషన్‌ చిత్రంగా ఇన్‌సైడ్‌ అవుట్‌, ఉత్తమ విదేశీ చిత్రంగా హంగేరి ఆన్‌ ఆఫ్‌ సాల్‌, ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ యానిమేటెడ్‌ విభాగంలో బేర్‌స్టోర్‌ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నాయి. ఈసారి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా సందడి చేశారు. ఆస్కార్‌ విజేతకు అవార్డును ప్రదానం చేశారు. ఇక హాలీవుడ్ భామల కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్‌ ఎప్పటిలాగే అందరి మతిపోగొట్టాయి. తొలిసారి ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఆనందభాష్పాలు...ఆప్యాయ ఆలింగనాల మధ్య 2016 ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది.

06:44 - March 1, 2016

ఆంధ్రప్రదేశ్‌ లో కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మరోసారి పోరు బాటపట్టారు. ఈ నెల 3న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాదాపు మూడు లక్షల మంది వున్న కాంట్రాక్ట్ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళనకు కారణమేమిటి? గత ఎన్నికల సమయంలో వీరికి టీడీపీ ఇచ్చిన హామీలేమిటి? ఈ రెండేళ్ల కాలంలో అవి ఎంత వరకు అమలయ్యాయి? ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోరుతున్నదేమిటి? ఈ అంశాలపై జనపథంలో కాంట్రాక్ట్ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నేత బాలకాశి విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

06:38 - March 1, 2016

హైదరాబాద్ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పొలిట్‌బ్యూరో చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు చర్చించారు.

కాపుల సంక్షేమం, కమిషన్‌ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టీడీపీ కార్యకర్తల సంక్షేమం, బడ్జెట్‌ కేటాయింపులు, కాపుల సంక్షేమం, కమిషన్‌ ఏర్పాటు తదితర అంశాలను పొలిట్‌బ్యూరో భేటీలో చర్చించారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం..అమరావతి నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. ఇక అంగన్‌వాడీలు, గ్రాడ్యుయేట్లు, టీచర్ల విభాగంలో పార్టీ సభ్యత్వాలను విస్తృతం చేయాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ...
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై పొలిట్‌బ్యూరోలో చర్చించారు. సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తీర్మానం చేశారు. బీడీ కార్మికుల సంక్షేమం, బీడీ పరిశ్రమను కాపాడేందుకు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌పైనా పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

06:35 - March 1, 2016

హైదరాబాద్ : సామాన్యులపై కనికరం చూడకుండా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర బడ్జెట్‌పై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్టానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటా, సంక్షేమ పథకాలకు వచ్చే నిధులు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం మొత్తాన్ని ఫాలో అయిన సీఎం కేసీఆర్,..ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై ఆర్దిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధామ్యాలు, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వల్ల తెలంగాణ రాష్టానికి సంబంధించిన పథకాలపై పడే ప్రభావం గురించి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్టా వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు తదితర అంశాలను బేరీజు వేసారు.

రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి..
అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

బడ్జెట్ కుదించాలనే ఆలోచన ?
అందుకే తెలంగాణ బడ్జెట్‌ను వీలైనంతవరకు కుదించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని భారీ బడ్జెట్‌కు ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా శాఖల వారిగా ప్రతిపాదనలను సైతం సేకరించింది. కనీసం లక్షన్నర కోట్ల మేర బడ్జెట్ ఉండాలని ప్లాన్ చేసింది. అయితే కేంద్రం కోతల నేపథ్యంలో పరిమిత బడ్జెట్‌కే ప్రాథాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. లక్షా 25 వేల నుంచి 30 వేల కోట్ల లోపే బడ్జెట్ ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని అర్ధిక శాఖకు సూచించారు. అదే సందర్భంలో కేంద్రం సాగునీటికి 86,500 కోట్లు, రహదారులకు 27వేల కోట్లు, గ్రామీణ నీటి పారుదల కోసం 87 వేల కోట్లతో పాటు ఇతర పథకాలకు భారీ కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ని నిధులు రానున్నాయన్న విషయంలో స్పష్టత కోసం ఆర్ధికశాఖ ప్రయత్నిస్తుంది. ఆయా పథకాలకు తెలంగాణ పథకాలు అనుసంధానించడం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందాలని చూస్తుంది. అందుకే కేంద్రంతో సంప్రదింపులు జరిపి తెలంగాణ బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనుంది. అదే సయమంలో ఈ నెల 6న సాయంత్రం తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం జరుగునుంది. శాఖల వారిగా వచ్చిన ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది. మొత్తంగా భారీ బడ్జట్ పెట్టాలనుకున్న రాష్ట సర్కార్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందనే చెప్పాలి. అందుకే గత బడ్జెట్ కన్నా కేవలం 15 వేల కోట్లు అధికంగా నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 

06:32 - March 1, 2016

విజయవాడ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. రైల్వే బడ్జెట్‌లో జరిగిన అన్యాయమే సాధారణ బడ్జెట్‌ లోనూ పునరావృతమయ్యిందన్న అసంతృప్తి రాష్ట్ర పాలకుల్లో వ్యక్తమవుతోంది.

ఎన్నోసార్లు విన్నపాలు..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మొదలు రాష్ట్రానికి చెందిన కీలక నేతలంతా మోదీతోపాటు అరుణ్‌ జైట్లీని కలిసి ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా... ప్యాకేజీ ప్రకటించినా సర్దుకుపోవచ్చనుకున్న నేతల ఆశలు నెరవేరలేదు. ఈ రెండింటిలో ఏది వచ్చినా రాష్ట్రం కొంతవరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. పన్నుల రూపంలో కొద్దిగా ఆదాయం పెరిగినా రెవిన్యూలోటును స్వల్పంగా పూడ్చుకోవచ్చనుకున్నారు. కానీ జైట్లీ బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేకపోవడంతో పాలకుల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఏపీ రెవిన్యూలోటు 16,079 కోట్ల రూపాయలుగా ఉంది. దీని భర్తీకి గతేడాది కేంద్రం 2,303 కోట్లు ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు.

పోలవరం పూర్తయ్యేనా ?
2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీరు అందిచాలని చంద్రబాబు సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తారని ఆశించారు. జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పోలవరంకు వేల కోట్లు కావాలి. కానీ 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లెక్కనచూస్తే పోలవరంను 2018 నాటికి పూర్తి చేయడం కష్టమేనని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లకు భారీగా నిధుల కేటాయిస్తారని ఆశించారు. ఆరువేల కోట్ల రూపాయలు కావాల్సిన విజయవాడ మెట్రోకు 100 కోట్లు కేటాయించిన కేంద్రం... విశాఖ మెట్రోకు కేవలం లక్ష రూపాయలే కేటాయించారంటే కేంద్రం.... ఏపీ పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్ధం అవుతోంది.

విద్యా సంస్థల నిర్మాణం..
రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థల నిర్మాణానికి కూడా ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. ట్రిపుల్‌ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కోటి రూపాయలు ఇచ్చారు. కేంద బడ్జెట్‌లో ఏపీకి సబంధించిన ఏ పథకానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర పాలకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

06:29 - March 1, 2016

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రతిపాదనలు.. అంకెల గారడీని తలపించాయి. అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు... కానీ రైతులను ఆర్థిక ఇక్కట్లను గట్టెక్కించే నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. అటు పారిశ్రామిక వ్యవస్థను ఉత్సాహపరిచే కీలక నిర్ణయాలు లేవు.. ఉపాధి కల్పన ప్రతిపాదనలు అసలే లేవు.. వ్యక్తిగత ఆదాయాలకు సంబంధించిన ప్రోత్సాహకాలేమీ లేక వేతన జీవులు ఉస్సురమన్నారు.

సాగునీటి కోసం 86 వేల 500 కోట్లు..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. 2016-17 సాధారణ బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంటు ముందుంచారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న జైట్లీ.. రైతులకు నేరుగా ఉపయోగపడే ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఈ రంగానికి 35,985 కోట్ల రూపాయలు కేటాయించిన జైట్లీ.. వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాలను సేంద్రియ సాగు కిందకు తెస్తామన్నారు. దీనికోసం 412 కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అలాగే, ప్రధాని సించాయి యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం 86వేల500 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

ఈ ఫ్లాట్ ఫామ్..
జంతు ఆరోగ్య కార్డుల అందజేత, జంతువుల మార్కెటింగ్‌ను ఈ-ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం లాంటి ప్రతిపాదనలను చేసిన జైట్లీ.. ఈ-ప్లాట్‌ఫామ్‌ను ఎందరు రైతులు వినియోగించుకోగలుగుతారు అన్న విషయాన్ని విస్మరించారు. నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తామన్న జైట్లీ... ఇక్కడా పెట్టుబడిదారులకే దన్నుగా నిలిచారు. ఈ ఎరువులను రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీ ధరలపై అందిస్తామన్న ప్రకటన జైట్లీ నోటి వెంట రాలేదు. అదే విధంగా.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన జైట్లీ.. వ్యవసాయ రుణాల వితరణ లక్ష్యాన్ని 17.9 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే.. రైతుల ఆత్మహత్యలకు పురికొల్పుతున్న సమస్యల పరిష్కారానికి మాత్రం ఎలాంటి నిర్దిష్ట చర్యలనూ ప్రతిపాదించలేదు.

19వేల కోట్లతో రహదారుల మెరుగు..
వ్యవసాయంతో పాటు, గ్రామీణం, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని జైట్లీ ప్రకటించారు. గ్రామీణాభివృద్ధికి 87వేల 765 కోట్లు కేటాయించారు. 19వేల కోట్లతో గ్రామీణ రహదారులను మెరుగు పరుస్తామని, మరో 27వేల కోట్లతో సుమారు రెండున్నర లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తామని, 300 రూర్బన్‌ కస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 2018 మే నాటికి దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామాల్లో డిజిటిల్‌ విద్యావ్యాప్తి కింద వచ్చే మూడేళ్లలో ఆరు కోట్ల గృహాలను డిజిటల్‌ లిటరసీ స్కీం పరిధిలోకి తెస్తామని జైట్లీ ప్రకటించారు. కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు సంబంధించిన.. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి 1700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 5700 బహుముఖ నైపుణ్య శిక్షణాలయాల ద్వారా.. రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతీయువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. అయితే.. వీరికి ఉద్యోగాలు కల్పించే అంశంపై మాత్రం జైట్లీ పెదవి మెదపలేదు.

ప్రైవేటీకరణ దిశగా కొన్ని ప్రతిపాదనలు..
జైట్లీ ప్రైవేటీకరణ దిశగానూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్యాసింజర్‌ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు ఆయన పచ్చజెండా ఊపేశారు. తద్వారా ఆర్టీసీలు మరింత సంక్షోభంలో పడతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి రెండు లక్షల కోట్లకు పైగా కేటాయించిన జైట్లీ.. అసంపూర్తిగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణకు 150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామంటూ.. ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగే ప్రతిపాదనలు చేశారు. కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుందనడం కొంత ఊరట కలిగించే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందని, భారత వృద్ధిరేటు 7.6శాతం నమోదైందని జైట్లీ.. పార్లమెంటుకు వెల్లడించారు. 

నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్..

మిర్పూర్ : ఆసియా కప్ లో అతిథ్య బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ లపై అద్భుత విజయాలతో అదరగొట్టిన టీమ్ ఇండియాకు ఇప్పుడు డిఫెడింగ్ చాంపియన్ రూపంలో పరీక్ష ఎదురుకానుంది. తన మూడో మ్యాచ్ లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

10 నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

నల్గొండ : ఈనెల 10 నుండి జరగనున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సూచించారు. ఈనెల 10 నుండి ఉత్సవాలు మొదలు కానున్నాయి. 

కన్హయ్య బెయిల్ తీర్పు రిజర్వు

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. మార్చి రెండున తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ ప్రతిభారాణి వెల్లడించారు. 

నేటి నుండి హెలీ టూరిజం సేవలు..

హైదరాబాద్ : నగరంలో హెలీ టూరిజం సేవలను పంచాయతీ రాజ్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. 

ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2016 పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 28 నుండి ప్రారంభమైంది. రెండు రోజుల్లో 7,653 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. 

రేపటి నుండి ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,64,664 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరు కానున్నారు. 

5 నుండి డీఈఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో డీఎడ్ కాలేజీలలో తొలి విడతలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 5 నుండి 7 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

Don't Miss