Activities calendar

02 March 2016

పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం

బంగ్లాదేశ్ : ఆసియాకప్ టీ-20 మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరింది. పాకిస్తాన్ 129/7, బంగ్లాదేశ్ 131/5.

22:29 - March 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యం నిబంధనను అమలు చేయడంతో విద్యార్థులు... సమయం మించిపోతోందని పరుగెత్తడం కనిపించింది. నేడు జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, రేపటి నుంచి సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 
రేపటి నుంచి సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు 
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభయ్యాయి. మొదట జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, గురువారం నుంచి సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి పరీక్షకు ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. 
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానం 
ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేసింది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులను నిర్ధేశిత సమయం కన్నా పావుగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతించారు. 
అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలు  
అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోని విద్యార్థులను నిర్దాక్షణ్యంగా వెనక్కి పంపించి వేశారు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఫీజు చెల్లించకపోవడం లేదా ఇతర కారణాలతో ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వని పక్షంలో వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1363 కేంద్రాల్లో 5లక్షలకు పైగా విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇక తెలంగాణలో సైతం లేట్‌ గా వచ్చిన విద్యార్థులను హాలు లోకి అనుమతించలేదు. కొన్ని చోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిబంధనపై ఆందోళన వ్యక్తం చేశారు. 

22:15 - March 2, 2016

ఖమ్మం : నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో సీపీఎం దూసుకుపోతోంది. పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్ధులు తరుపున పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండో రోజు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. సీపీఎం పాలనలో ఖమ్మంలో ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. టీడీపీ,  కాంగ్రెస్‌ మున్సిపల్‌ చైర్మన్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని తమ్మినేని ఆరోపించారు. 

 

22:11 - March 2, 2016

హైదరాబాద్  : కాపులకు రిజర్వేషన్‌ల అంశం మళ్లీ జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం తనకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని.. మరోమారు దీక్షకు సమాయత్తమవుతున్నానని.. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ విశాఖలో హెచ్చరించారు. అయితే ముద్రగడ... విపక్షనేత జగన్‌ డైరెక్షన్‌లో.. ఇలాంటి పలుకులు వల్లిస్తున్నారంటూ మంత్రులు మండిపడుతున్నారు. 
కాపులను బీసీల్లో చేర్చాలంటూ.. 
కాపులను బీసీల్లో చేర్చాలంటూ.. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తనకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నాలు చేయడం లేదంటూ ఆయన మండిపడుతున్నారు. కాపు రుణాలు పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలకే అందుతున్నాయని ఆక్షేపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తానని.. ఈసారి ఏ అవాంఛనీయ ఘటన జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ముద్రగడ హెచ్చరించారు. 
మంత్రులు విమర్శలు 
ముద్రగడ వ్యాఖ్యలు ఆయన సొంతం కాదని.. వైసీపీ అధినేత జగన్‌ డైరెక్షన్‌లోనే ఆయనిలా మాట్లాడుతున్నారని మంత్రులు విమర్శించారు. నిజానికి ముద్రగడ ఆరోపణలపైన, లేఖాస్త్రంపైనా.. పార్టీకి చెందిన కాపు నేతలు తక్షణమే ఖండించక పోవడాన్ని.. సీఎం చంద్రబాబు తప్పుబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. మంత్రులు చినరాజప్ప, నారాయణలు ముద్రగడపై విమర్శలు గుప్పించారు. 
మంత్రుల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 
విజయవాడ, గుంటూరు జిల్లాల పర్యటన అనంతరం.. విశాఖలో పర్యటిస్తున్న ముద్రగడ.. మంత్రుల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రభుత్వం తమపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాపుల ఆకలిని తీర్చేందుకు చేపట్టే ఉద్యమంలో.. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ముద్రగడ హెచ్చరించారు. మొత్తానికి కాపుల రిజర్వేషన్‌ల అంశం.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల వేళ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.

 

22:06 - March 2, 2016

ఢిల్లీ : దేశద్రోహం నేరారోపణపై అరెస్టైన జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు కన్హయ్యకు ఆరు నెలలపాటు అమల్లో ఉండేలా మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. దీంతో ఆయన గురువారం తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 
మధ్యంతర బెయిల్‌ మంజూరు 
జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు బెయిల్‌ లభించింది. ఢిల్లీ హైకోర్టు కన్హయ్యకు  పది వేల రూపాయల పూచీకత్తతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరు నెలలపాటు  ఈ బెయిల్‌ అమల్లో ఉంటుంది. 
ఫిబ్రవరి 12న అరెస్టు 
దేశద్రోహ నేరారోపణలపై కన్హయ్య కుమార్‌ను ఢిల్లీ పోలీసులు గత నెల 12న అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన సభలో ఉమర్‌ ఖలీద్‌ నేతృత్వంలో కొందరు విద్యార్ధులు  పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌ గురుకు అనుకూలంగా  నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కన్హయ్య కూడా హాజరయ్యారు. కన్హయ్య కూడా దేశవ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై  ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, తీహార్‌ జైలుకు తరలించారు.  విచారణ కోసం కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు సంయుక్తంగా కన్హయ్యను  ప్రశ్నించారు. విచారణలో కన్హయ్య  పోలీసులకు సహకరించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. 
ప్రాసిక్యూషన్‌  వాదనతో విభేదించిన కన్హయ తరపు న్యాయవాదులు....
అయితే కన్హయ తరుపున కేసు వాదించిన న్యాయవాదులు.... ప్రాసిక్యూషన్‌  వాదనతో విభేదించారు. కన్హయ్య దేశవ్యతిరేక నినాదాలు చేయలేదని  నివేదించారు. కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం... కన్హయ్యపై పెట్టిన దేశద్రోహం నేరం కేసుకు సంబంధించి  పూర్తి ఆధారాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం...  కన్హయ్యకు మధ్యంతర  బెయిల్‌ మంజూరు చేసింది.  
జెఎన్‌యూలో విద్యార్థుల సంబరాలు 
జెఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ విడుదలపై విద్యార్థుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కన్నయ్యపై తప్పుడు కేసులు బనాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

 

21:44 - March 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం బోర్డ్ హైదరాబాద్‌లో మరో సేవను విస్తరించింది. నిన్న హెలీటూరిజం పేరుతో ఆకాశ వీధిలోంచి హైదరాబాద్ అందాలను చూడటానికి అవకాశం కల్పించిన డిపార్ట్‌మెంట్..... ఈ రోజు హుస్సేన్‌ సాగర్‌లో మోడ్రన్ బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఈ బోట్లను ప్రారంభించింది. 

21:41 - March 2, 2016

అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు..!! బాధితురాలినే గుచ్చి గుచ్చి వేధించారు.!! కాపాడ్సిన వారే మౌనం వహించారు..., వీణవంకలో ఖాకీల నిర్లక్ష్యంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

రైలు ఢీకొని ఒకరి మృతి

హైదరాబాద్‌ : కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెండాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గౌలిగూడ చమన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్‌నాథ్ కుమారుడు జయరామ్ (35) కాచిగూడ - మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌ : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు జిల్లాలోని పెద్దమునగల్‌చేడ్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి తన మూడెకరాలతో పాటు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసేవాడు. ఈ ఏడాది వర్షాలు కురవక పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు దక్కలేదు. రూ.5 లక్షల అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెంది బుధవారం తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎస్‌ఐ, ఎస్‌ఎఫ్‌వో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంపు

హైదరాబాద్ : ఎస్‌ఐ, ఎస్‌ఎఫ్‌వో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో ఏడాది పొడిగించినట్టు రిక్రూట్‌మెంట్ బోర్టు చైర్మన్ పూర్ణ చంద్రరావు వెల్లడించారు.

తెలంగాణ పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల చేశారు. 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 8 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్రిల్ 10. మే 24న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల టీఎస్ పీజీఎల్ ఉంటుంది. 

21:17 - March 2, 2016

వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోని పలు డివిజన్ లలో టెన్ టివి.. 'వరంగల్ గల్లీలో మల్లన్న కార్యక్రమాన్ని' నిర్వహించింది. 38 వ డివిజన్ తోపాలు పలు ప్రాంతాల్లో మల్లన్న ఎన్నికలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సంరద్భంగా ప్రజలు మంచినీరు, ఇళ్లు పట్టాలు, చెత్తకుండీ, మోరీలు క్లీనింగ్ తోపాటు పలు సమస్యలను ఏకరవు పెట్టారు. తమకు ఇళ్ల పట్టాలు కావాలని డబుబ్ బెడ్ రూం ఇళ్లు అవసరం లేదని తెలిపారు. 
ఎన్నికలప్పుడు అందరూ వస్తారని.. ఆ తర్వాత సమస్యలను ఎవరు పట్టించుకోరని వాపోయారు. తమకు అభిమానం ఉన్న నేతలకు ఓటు వేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బంగ్లాదేశ్ విజయలక్ష్యం 130 పరుగులు

బంగ్లాదేశ్ : ఆసియాకప్ టీ20 లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్  మధ్య మ్యాచ్ జరుగుతోంది. నిర్ణీత 20 వోవర్లలో పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయలక్ష్యం 130 పరుగులుగా ఉంది.  

 

20:23 - March 2, 2016

హైదరాబాద్ : టీడీపీ- బీజేపీ మైత్రి బంధానికి బీటలు వారుతున్నాయా? చంద్రబాబు సర్కార్‌పై బీజేపీ నేతలు అసంతృత్తి వ్యక్తం చేయడం.. వారిపై టీడీపీ ఎదురు దాడికి దిగడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమను ఎందుకు చూపలేదని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ప్రశ్నిస్తే.. చంద్రబాబు సర్కార్‌పై ఎందుకు అసహనం అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్‌ అయ్యారు. పురందేశ్వరికి ఇంకా కాంగ్రెస్‌ లక్షణాలు పోలేదని ఎద్దేవా చేశారు.

 

20:16 - March 2, 2016

కృష్ణా : విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత ఇసుక పంపిణీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నేటి నుంచి నెల రోజుల పాటు ఉచిత ఇసుక పంపిణీకి కేబినెట్‌ ఓకే చెప్పింది. నెల రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని దుర్వినియోగపరిస్తే పీడీయాక్టు నమోదు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

 

విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు : జిల్లాలోని ఫిరంగిపురం సెయింట్ జేవీఆర్ కాలేజీలో...బీ-ఫార్మసీ సెకండియర్ విద్యార్థిని సుమలత ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు 30 పేజీల సూసైడ్ నోట్ రాసిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థిని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని.. కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం మానసికంగా వేధిస్తోందని... నన్నపనేనికి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 

'రిషితేశ్వరి' ఘటనలో ప్రిన్సిపల్ బాబురావు అరెస్ట్

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ బాబురావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాబురావును కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు. 

 

20:11 - March 2, 2016

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ బాబురావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాబురావును కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు. 

20:09 - March 2, 2016

గుంటూరు : జిల్లాలోని ఫిరంగిపురం సెయింట్ జేవీఆర్ కాలేజీలో...బీ-ఫార్మసీ సెకండియర్ విద్యార్థిని సుమలత ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు 30 పేజీల సూసైడ్ నోట్ రాసిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థిని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని.. కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం మానసికంగా వేధిస్తోందని... నన్నపనేనికి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 

20:03 - March 2, 2016

ముంబై : స్టాక్ మార్కెట్ రెండోరోజు ఇన్వెస్టర్లకు లాభాలు పంచింది. బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలతో సెన్సెక్స్ ఇవాళ మరో 464 పాయింట్లు లాభపడింది. ఈ సూచి 24వేల మార్క్ దాటి 24వేల 243 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టి 146 పాయింట్ల లాభంతో 7వేల 369 వద్ద క్లోజైంది. నిఫ్టీలో ఎస్ బిఐ అత్యధికంగా 12శాతం పెరిగింది. ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిండాల్కో 7శాతం వరకు లాభపడ్డాయి. మహీంద్రా, కోల్ ఇండియా, సన్ ఫారమా, ఐటీసీ,  బజాజ్ ఆటో 5శాతం వరకు క్షీణించాయి. 

 

19:36 - March 2, 2016

హైదరాబాద్ : చత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధంగా జరిగిందని పౌరహక్కుల నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు మృతదేహాలను భద్రపరిచి రేపు నివేదిక సమర్పించాలని అదేశించింది. ఎన్ కౌంటర్ లో  ఎనిమిది మావోయిస్టులు చనిపోయారు. పోస్టుమార్టంను వీడియో రికార్డు చేసి ఆ తర్వాత మృతదేహాలను బందువులకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. 

 

19:21 - March 2, 2016

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థి కన్హయ్యకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ హైకోర్టు 6 నెలలపాటు మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. రేపు తీహార్ జైలు నుంచి కన్హయ్య విడుదల కానున్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదనే నిర్ధారణకు వచ్చాకే అతనికి కోర్టు బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కన్హయ్య పది వేల పూచికత్తును కోర్టుకు సమర్పించాల్సి వుంది. గత నెల 12న దేశ ద్రోహం కేసులో కన్హయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 
ఫిబ్రవరి 12న అరెస్టు 
దేశద్రోహ నేరారోపణలపై కన్హయ్య కుమార్‌ను ఢిల్లీ పోలీసులు గత నెల 12న అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన సభలో ఉమర్‌ ఖలీద్‌ నేతృత్వంలో కొందరు విద్యార్ధులు  పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌ గురుకు అనుకూలంగా  నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కన్హయ్య కూడా హాజరయ్యారు. కన్హయ్య కూడా దేశవ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై  ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, తీహార్‌ జైలుకు తరలించారు.  విచారణ కోసం కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు సంయుక్తంగా కన్హయ్యను  ప్రశ్నించారు. విచారణలో కన్హయ్య  పోలీసులకు సహకరించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. 
ప్రాసిక్యూషన్‌  వాదనతో విభేదించిన కన్హయ తరపు న్యాయవాదులు....
అయితే కన్హయ తరుపున కేసు వాదించిన న్యాయవాదులు.... ప్రాసిక్యూషన్‌  వాదనతో విభేదించారు. కన్హయ్య దేశవ్యతిరేక నినాదాలు చేయలేదని  నివేదించారు. కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం... కన్హయ్యపై పెట్టిన దేశద్రోహం నేరం కేసుకు సంబంధించి  పూర్తి ఆధారాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం...  కన్హయ్యకు మధ్యంతర  బెయిల్‌ మంజూరు చేసింది.  
జెఎన్‌యూలో విద్యార్థుల సంబరాలు 
జెఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ విడుదలపై విద్యార్థుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కన్నయ్యపై తప్పుడు కేసులు బనాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

 

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం...

చత్తీస్ ఘడ్ : నారాయపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ నెపంతో 16 మంది గిరిజనులను మావోయిస్టులను హత మార్చారు. బస్తర్ ఐజీ కల్లూరి ధృవీకరించారు. 

 

జెఎన్ యూ విద్యార్థి కన్హయ్యకు బెయిల్ మంజూరు

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థి కన్హయ్యకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ హైకోర్టు 6 నెలలపాటు మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. రేపు తీహార్ జైలు నుంచి కన్హయ్య విడుదల కానున్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

బంగ్లాదేశ్ : ఆసియాకప్ టీ.20 లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య కాసేపట్లో మ్యాచ్ జరుగునుంది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

 

18:43 - March 2, 2016

విశాఖ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు రాజమండ్రిలో ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం కేటాయించిన 70 కోట్లతో 2018 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ ఈ నెల 6న రాజమండ్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 

18:39 - March 2, 2016

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమి దక్కలేదని, ఇదంతా చంద్రబాబు అసమర్థ నాయకత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసి రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో మాజీ మంత్రులు శైలజానాధ్ , తులసి రెడ్డి మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మార్చాలని, అర్హ త నిర్ణయించే అధికారాన్ని సభాపతి నుంచి తొలగించి దానిని ఎన్నికల అధికారికి లేదా కోర్టుకు అప్పచెప్పాలని తులసిరెడ్డి అన్నారు.

 

17:48 - March 2, 2016

హైదరాబాద్ : రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఎం కుటుంబం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అందరూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. బినామీ పేర్లతో భూ దందా సాగిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ విషయాన్ని ప్రస్తావిస్తే తాము రాజధానికి వ్యతిరేకం అనే ముద్ర వేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

17:46 - March 2, 2016

విజయవాడ : వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారన్న అసహనంతోనే సాక్షిపత్రికలో ఎవేవో రాతలు రాస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. ఏపీ పాలకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసత్య వార్తలకు మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్‌ అవుతారని నారాయణ అన్నారు. 

17:42 - March 2, 2016

ఢిల్లీ : పాకిస్తాన్‌ మాటల్లో కాదు... చేతల్లో చూపితేనే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం ఉందని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన విదేశాంగ మంత్రిత్వ శాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. పఠాన్‌కోట్‌ ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల ఎన్‌ఎస్‌ఏ, విదేశాంగ కార్యదర్శుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాకిస్తాన్‌ ఓ వైపు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ మరోవైపు చర్చల పేరిట రాజనీతి ప్రదర్శించడం సబబు కాదన్నారు. ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్‌ టీం పఠాన్‌కోట్‌కు వెళ్లాక ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని పాక్‌ విదేశాంగ సలహాదారుడు సర్తాజ్‌ అజీజ్‌ వ్యక్తం చేశారు.

17:39 - March 2, 2016

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రియాక్షన్ అయ్యారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఎన్ డిఎ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు. మోడీ పాలనపై రాహుల్ ఫైర్ అయ్యారు. రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యపై మోడీ ఇంత వరకు స్పందించలేదన్నారు. కనీసం రోహిత్ తల్లితో కూడా ప్రధాని మాట్లాడలేదని పేర్కొన్నారు. రోహిత్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. 'నా తప్పేంటి అనీ అడగడమే రోహిత్ తప్పా..  అని నిలదీశారు. 
జెఎన్ యూ విద్యార్థులు, లాయర్లు, మీడియాపై దాడి అమానుషం 
జెఎన్ యూ విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. కోర్టులో జెఎన్ యూ విద్యార్థులు, లాయర్లు, మీడియాపై దాడి అమానుషమన్నారు. జెఎన్ యూలో విద్యార్థులు 60 శాతం దళితులు, వెనుకబడిన వర్గాల వారే అని తెలిపారు. 'తప్పులు చేయడానికి.. నేను ఆర్ ఎస్ ఎస్ నుంచి రాలేదన్నారు. ఆర్ ఎస్ ఎస్ కు ఎదుటివారిని గౌరవించడం తెలియదని విమర్శించారు. 
నల్ల ధనాన్ని తెల్లగా మార్చేందుకు కేంద్రం యత్నం 
నల్ల కుబేరులను జైల్లో పెడతామని అధికారంలోకి వచ్చి... నల్ల ధనాన్ని తెల్లగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. మోడీ ప్రధాని కాగానే కిలో కందిపప్పు ధర రూ.200 అయిందన్నారు. మోడీ ఎవరి అభిప్రాయాలు తెలుసుకోరని విమర్శించారు. ఎవరితో ఆలోచించకుండా మోడీ పాక్ వెళ్లారని చెప్పారు. దేశ ప్రజల గొంతును మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. యూపీఎ పాలనపై తాము సంతృప్తిగానే ఉన్నామని పేర్కొన్నారు.

 

ఎన్ డిఎ సర్కార్ పై రాహుల్ ఘాటు విమర్శలు

ఢిల్లీ : రోహిత్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రియాక్షన్ అయ్యారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఎన్ డిఎ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు. మోడీ పాలనపై రాహుల్ ఫైర్ అయ్యారు. నల్ల కుబేరులను జైల్లో పెడతామని అధికారంలోకి వచ్చి... నల్ల ధనాన్ని తెల్లగా మార్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందన్నారు. 

16:54 - March 2, 2016

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా... భారత్‌లో మాత్రం పెట్రోల్‌ డీజిల్ ధరలు తగ్గడం లేదని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. వినియోగదారులకు లాభం చేకూర్చకుండా కేంద్రం మాత్రం ఎక్సైజ్‌ డ్యూటీ పెంచుతూ పోతోందని ఆయన విమర్శించారు. 2013 ఫిబ్రవరిలో ఎక్సైజ్‌ డ్యూటీ 9 రూపాయల 28 పైసలుంటే 2016 నాటికి 21 రూపాయల 48 పైసలకు పెంచారని...అలాగే డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 3 రూపాయల 56 పైసలుంటే  ఇపుడది 17 రూపాయల 33 పైసలకు చేరిందన్నారు. వినియోగదారుల సొత్తును ప్రభుత్వం జేబులోకి వేసుకుంటోందని మండిపడ్డారు. దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానమిస్తూ.. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా కేంద్రానికి వస్తున్న ఆదాయాన్ని మౌళిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

 

16:48 - March 2, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన కార్యకర్తలు.. ఆ తరువాత పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వాటర్ క్యానన్లతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ఆత్మహత్య ఘటనలో... పార్లమెంటులో స్మృతి ఇరానీ తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారని.. ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

 

16:43 - March 2, 2016

విశాఖ : విమానయాన రంగం వచ్చే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించనుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. ప్రయాణికుల రవాణాకు చిన్న విమానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన ఉందని ఆయన ఢిల్లీలో చెప్పారు. మరమ్మత్తుల కోసం... ఇతర దేశాల విమానాలు మన దేశం వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్టు ఆయన తెలిపారు. ఎయిరిండియాకు ఈ ఏడాది కూడా నిర్వహణ నష్టాలు ఉండకపోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. 

 

జగన్ పత్రిక అవాస్తవాలు ప్రచారం : పత్తిపాటి

విజయవాడ : జగన్ పత్రిక అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సాక్షిపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. అవాస్తవాలు ప్రచురించిన వారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామన్నారు. దేశంలో జగన్ భూ భకాసురుడని విమర్శించారు. 11 కేసుల్లో జగన్ తొలి ముద్దాయిగా ఉన్నాడని గుర్తు చేశారు. పదేళ్లలో జగన్ లెక్కకు మించి బినామీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. క్విడ్ ప్రోకో జగన్ కు తెలిసినంతగా తమకు తెలియదన్నారు.  

16:30 - March 2, 2016

విజయవాడ : జగన్ పత్రిక అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సాక్షిపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. అవాస్తవాలు ప్రచురించిన వారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామన్నారు. దేశంలో జగన్ భూ భకాసురుడని విమర్శించారు. 11 కేసుల్లో జగన్ తొలి ముద్దాయిగా ఉన్నాడని గుర్తు చేశారు. పదేళ్లలో జగన్ లెక్కకు మించి బినామీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. క్విడ్ ప్రోకో జగన్ కు తెలిసినంతగా తమకు తెలియదన్నారు.  

 

15:57 - March 2, 2016

విడాకులకు ప్రత్యామ్నాయం... జ్యుడిషియల్ సపరేషన్ అని లాయర్ పార్వతి తెలిపారు. మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. విడాకులు తీసుకోకుండా భార్య, భర్తలు విడివిడిగా ఉంటే దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటారని చెప్పారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే...
సెక్షన్ 13ఏ ప్రకారం.. జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. విడాకులతో భార్యభర్తల సంబంధాలు తెగిపోయినట్లే భావించాలి. కానీ  విడాకులకు ప్రత్యామ్నాయంగా జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుంటే.. వివాహ బంధం రద్దు కాదు, చట్టం ప్రకారం.. వారు భార్యభర్తలుగానే ఉంటారు. అయితే వారు శారీరక సంబంధం కలిగి ఉండరు. లాయర్ పార్వతి తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:49 - March 2, 2016

నిజామాబాద్ : పదవి కోసం అడ్డదారి తొక్కాడు ఓ ప్రబుద్దుడు. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో సర్పంచ్‌ అయ్యాడు. హుందాగా పదవి అనుభవించడమే కాకుండా దొరికిన కాడికి దోచుకున్నాడు. అయితే కొందరి ఫిర్యాదుతో అసలు రంగు బయటపడింది. విచారణ జరిపిన కలెక్టర్‌.. అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. 
తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పదవి పొందారనే ఆరోపణలు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సర్పంచ్‌ మీర్జా కలాంబేగ్‌ తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పదవి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే గ్రామానికి చెందిన అహ్మద్‌పటేల్‌ కలెక్టర్‌ యోగితారాణాకు ఫిర్యాదు చేయడంతో కలాంబేగ్‌ మోసం బయటపడింది. పూర్తి స్థాయి విచారణ జరిపిన కలెక్టర్‌ కలాంబేగ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 
తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో నామినేషన్‌ 
2003లో జరిగిన ఎన్నికల సమయంలో కలాంబేగ్‌ అధికారుల కళ్లుగప్పి తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో నామినేషన్‌ దాఖలు చేశాడు. దీంతో అతను కందకుర్తి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అంతేకాకుండా రేంజల్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. మరోవైపు ఎంపీ కవిత దత్తత తీసుకున్న కందకుర్తి గ్రామ సర్పంచ్‌ వ్యవహారం బయటపడే సరికి ప్రజలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
ఇష్టానుసారంగా నిధుల ఖర్చు.. 
అయితే.. గతంలో పుష్కరాల సమయంలో గ్రామానికి వచ్చిన నిధులను కూడా ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారనే ఆరోపణలు కలాంబేగ్‌పై ఉన్నాయి. అడ్డదారులతో పదవి దక్కించుకున్న బేగ్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. నొక్కేసిన నిధులన్నీ రికవరీ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారుల కళ్లుగప్పి.. ప్రజలను మోసం చేయడమే కాకుండా హుందాగా పదవులు అనుభవించిన సర్పంచ్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. 

 

15:40 - March 2, 2016

ఖమ్మం : అప్పుల బాధ తాళలేక రైతు తనువు చాలించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వైరా మండలం దాసాపురం గ్రామానికి చెందిన రైతు వేంరెడ్డి రవీందర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఆరెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్న రవీందర్ పెట్టుబడుల కోసం ఆరు లక్షల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అయితే సరైన దిగుబడులు లేక రవీందర్ అప్పులు తీర్చలేకపోయాడు. మరొకవైపు వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో మనస్తాపానికి గురైన రవీందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని భార్యా ఇద్దరు పిల్లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

 

15:14 - March 2, 2016

హైదరాబాద్ : గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని రాణిమనీషా ఆత్మహత్యకు పాల్పడింది. ఇందిరానగర్‌లో అపార్ట్ మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాణి మనీషా విప్రో సంస్థలో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగినిగా పని చేస్తోంది. గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న రాణి మనీషాను.. స్వస్థలానికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు జార్ఖండ్‌ నుంచి  హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ఇంతలోపే మనీషా ఈ ఘటనకు పాల్పడింది. 
 

 

ఎస్సై ఆత్మహత్యాయత్నం

చిత్తూరు : జిల్లాలోని కల్యాణిడ్యాం పోలీస్‌ శిక్షణ కళాశాలలో ఎస్సై తులసిరామ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో తులసిరామ్‌ను రుయా ఆస్పత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని తులసిరామ్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం పుత్తూరులో ఉగ్రవాదుల ఆపరేషన్‌లో తులసిరామ్‌ కీలకపాత్ర పోషించారు. 

 

15:11 - March 2, 2016

చిత్తూరు : జిల్లాలోని కల్యాణిడ్యాం పోలీస్‌ శిక్షణ కళాశాలలో ఎస్సై తులసిరామ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో తులసిరామ్‌ను రుయా ఆస్పత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని తులసిరామ్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం పుత్తూరులో ఉగ్రవాదుల ఆపరేషన్‌లో తులసిరామ్‌ కీలకపాత్ర పోషించారు. 

 

కేసీఆర్‌కు.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఫోన్‌

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఫోన్‌ చేశారు. ఈనెల 8న మహారాష్ట్రకు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాలేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుపై ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 7వ తేదీ సాయంత్రం కేసీఆర్‌, హరీష్‌రావులు మహారాష్ట్ర వెళ్లనున్నారు. 

15:07 - March 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఫోన్‌ చేశారు. ఈనెల 8న మహారాష్ట్రకు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాలేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుపై ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 7వ తేదీ సాయంత్రం కేసీఆర్‌, హరీష్‌రావులు మహారాష్ట్ర వెళ్లనున్నారు. 

15:03 - March 2, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలో విద్యాసంస్థ ముసుగులో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడి అకృత్యాలు వెలుగు చూశాయి. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ కరెస్పాండెంట్‌ గుత్తుల శ్రీధర్‌..  చాలాకాలంగా విద్యార్థినులను బలవంతంగా లోబరచుకుంటూ.. దాన్ని చిత్రీకరిస్తూ.. ఆ దృశ్యాలు చూపి బెదిరిస్తున్నట్లు వెల్లడైంది. అతని వలలో చిక్కుకున్న విద్యార్థినులు పరువు పోతుందన్న భయంతో నోరు మెదపడం లేదు. ఈ కామాంధుడి అకృత్యాల గురించి.. అతడి సమీప బంధువు ద్వారా బయటికొచ్చింది.  విద్యార్థినులపై వేధింపుల నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం నేత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కరస్పాండెంట్‌పై కేసు నమోదైంది. 

 

సాగర్ లో మరో రెండు కొత్త బోట్లు..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో మరో రెండు కొత్త బోట్లు వచ్చాయి. ఈ బోట్లను టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ రాములు, క్రిస్టియానా పాల్గొన్నారు. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ఈ బోటులో లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. మొత్తం 12 మంది ప్రయాణించే అవకాశం ఉంది. బోటు పర్యటనకు ధర రూ. 100గా నిర్ణయించారు. బోటులో వేడుకలు నిర్వాహణకు ధర రూ.2వేలుగా నిర్ణయించారు. 

తన వ్యాఖ్యలను సి.రామచంద్రయ్య వక్రీకరించారు - శైలజానాథ్..

విజయవాడ : తన వ్యాఖ్యలను సి.రామచంద్రయ్య వక్రీకరించారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ పేర్కొన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకరాలేని సీఎం అసమర్థుడని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

తిరుపతిలో ఎస్ఐ ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు : తిరుపతిలోని కళ్యాణిడ్యాంలో విషం తాగి ఎస్ఐ తులసీరామ్ ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

ఉమాభారతితో చర్చిస్తాం - దేవినేని..

విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో నీటి పారుదల ప్రాజెక్టులకు సరిగ్గా నిధులు లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే కేంద్ర మంత్రి ఉమా భారతిని కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. 

ములుగులో మంత్రి చందూలాల్ పర్యటన..

వరంగల్ : ములుగు మండలం పందికుంట్లలో మంత్రి చందూలాల్ బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి పంటను మంత్రి పరిశీలించారు.

 

కేసీఆర్ కు ఫడ్నవీస్ ఫోన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఫోన్ చేశారు. ఈనెల 8వ తేదీన మహారాష్ట్ర కు రావాలని ఫడ్నవీస్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నారు. దీనితో ఈ నెల ఏడో తేదీన సాయంత్రం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు పలువురు అధికారులు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. 

13:23 - March 2, 2016

విజయవాడ : పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైసిపి అధినేత జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే మణిగాంధి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సిఎం క్యాంప్ ఆఫీస్‌లో చంద్రబాబును కలిసి పార్టీ మారారు. చంద్రబాబు... మణిగాంధీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మణిగాంధి చేరికతో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి కోరే తాను పార్టీ మారినట్లు మణిగాంధి తెలిపారు. 

13:20 - March 2, 2016

కరీంనగర్ : జిల్లా కోరుట్లలోని సినారె కళాభవన్‌లో ఫాల్కన్‌ ఆధ్వర్యంలో రైతులకు మెకానిక్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కంపెనీ సంబంధిత పంపుసెట్లు, స్టార్ రేటింగ్స్ పంప్స్‌, సోలార్ సిస్టం పంప్స్, డ్రిప్ సిస్టం, స్ప్రింకర్లకు సంబంధించిన పనితీరుపై అవగాహన కల్పించారు. పంపు సెట్లు పనిచేసే విధానం, విద్యుత్, నీటి సమస్యలను అరికట్టే పద్ధతులను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ నల్లపాటి బసంత్ వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, విశ్వనాథ్, ఫిరోజ్‌ఖాన్, రైతులు, మెకానిక్‌లు పెద్దఎత్తున హాజరయ్యారు. 

13:14 - March 2, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు..ఇతరత్రా వాటిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను ఎన్నోమార్లు బాబు బతిమాలాడారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా మరిచి ఎంతో మందితో బాబు మాట్లాడుతున్నారని, రాజధాని నిర్మాణానికి సింగపూర్ తో మాస్టర్ ప్లాన్ తయారు చేయించారని గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు భూములిచ్చారని తెలిపారు. మొదటిసారిగా రెండు నదులను బాబు అనుసంధానం చేశారని తెలిపారు. 

ఖమ్మంలో సీపీఎం ప్రచారం..

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఎం ప్రచారం ఊపందుకొంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం సీపీఎం మాత్రమేనని, గతంలో సీపీఎం నుండి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన వారు మచ్చలేని పాలన అందించారని తెలిపారు.

అంగన్ వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్..

విశాఖపట్టణం : వన్ టౌన్ సాయిబాబా గుడి వద్ద అంగన్ వాడీ కేంద్రంలో వంట చేస్తుండగా కుక్కర్ పేలడంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. 

టిడిపి, బిజెపి మైత్రి బంధం - వర్ల రామయ్య..

విజయవాడ : సీఎం చంద్రబాబుపై పురంధేశ్వరీ అసహనం వ్యక్తం చేస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. టిడిపి, బిజెపి మైత్రి బంధంతో వెళుతోందని, కాంగ్రెస్ నుండి వచ్చిన వారు టిడిపిని దూషిస్తున్నారని తెలిపారు. బీజేపీ అధిష్టానం వారిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. 

ఎన్ కౌంటర్..మరో ఇద్దరి గుర్తింపు..

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజన..కొత్తగూడకు చెందిన దాసరి ధనసరి సారక్కగా గుర్తించారు. ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు గుర్తించారు. మావోయిస్టు నేత హరిభూషణ్ కు సారక్క దగ్గరి బంధువు. 

యాదాద్రి అభివృద్ధి పనులు ప్రారంభం..

నల్గొండ : యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బాలాలయం కోసం పాతకట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా పది రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి చేయాలని ఈవో గీత ఆదేశాలు జారీ చేశారు. 

పాఠశాల విద్యా కమిషనరేట్ వద్ద ఏబీవీపీ ధర్నా..

హైదరాబాద్ : పాఠశాల విద్యా కమిషనరేట్ వద్ద ఏబీవీపీ ధర్నా చేపట్టింది. టెట్, డీఎస్సీ తేదీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు.

12:41 - March 2, 2016

తూర్పుగోదావరి : అద్దెకు అమ్మానాన్నలను తెచ్చేస్తాడు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెడతాడు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో అమ్మానాన్నలతో బిల్డప్ ఇచ్చి పెళ్లి పీటలు ఎక్కేస్తాడు. ఎందరో అమ్మాయిలను ప్రేమలోకి దించి వారికి మూడు ముళ్లు వేసి జీవితాలతో ఆడుకుంటాడు. ఇది అతనికి సరదా ఉద్యోగాలిప్పిస్తానని భార్య బంధువులకు శఠగోపం పెట్టాడు. ఇదే కాన్సెప్ట్‌తో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సీన్‌లోకి మొదటి భార్య ఎంటర్‌ కావడంతో అయ్యగారికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. అప్పరి శ్రీ కళ్యాణ్‌....తూర్పు గోదావరి జిల్లా రాజోలు. మనోడు చేసే చేష్టలు వింటే ఎవ్వరైనా షాక్ తినాల్సిందే. మాయమాటలతో అమ్మాయిలను బుట్టలో పడేస్తాడు. సినిమా, షికార్లు అంటూ కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగిస్తాడు. మాటలతో పరిచయమైన వ్యవహారాన్ని పెళ్లిపీటల దాక తీసుకెళ్తాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.

బిల్డప్ లు..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన దుర్గాదేవిని 2010లో పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్. అద్దె తల్లిదండ్రులతో పెళ్లి తంతు కానిచ్చాడు. కొన్నాళ్లు ఆమెతో బుద్దిగా కాపురం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని బిల్డప్‌ ఇచ్చాడు. తన చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగాలున్నాయంటూ కోతలు కోశాడు. బుట్టలోపడ్డ అమ్మాయి బంధువులు ఇతగాడికి లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు.
ఆ తర్వాత విశాఖకు చెందిన అపర్ణను ముగ్గులోకి దించాడు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నని నమ్మించి మనువాడాడు. ఈమె బంధువులకు కూడా ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టాడు. సెంట్రల్‌ వర్సిటీకి బదిలీ అయ్యిందని కథలు అల్లిన కళ్యాణ్‌... హైదరాబాద్ పర్వతపురంలో రెండో భార్యతో కాపురం పెట్టాడు. వెతికి వెతికి వేసారిపోయిన మొదటి భార్య మొత్తానికి ఇతగాడి ఆచూకీ కనిపెట్టింది. రెండో భార్యతో ఉన్న కళ్యాణ్‌ను పట్టుకుని బంధువులతో వీపు విమానం మోత మోగించింది. అనంతరం మాదాపూర్‌ పోలీసులకు అప్పగించింది.

పలు కేసులు..
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసినట్లు కళ్యాణ్‌పై చీటింగ్‌ కేసులున్నాయి. మారుపేర్లతో ఆధార్‌, పాన్‌ కార్డులు సృష్టించి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా ఇతగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇద్దరు భార్యలు వారి బిడ్డలకు న్యాయం చేయాలి. కళ్యాణ్‌కు అవకాశం ఇస్తే చాలు మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు.

12:36 - March 2, 2016

విశాఖపట్టణం : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమిస్తున్న ముద్రగడ మరోసారి గళం విప్పారు. ఏపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. కాపుల రిజర్వేషన్లపై నిరాహార దీక్ష చేస్తున్న తనను.. దీక్ష విరమించేందుకు ప్రభుత్వం అనేక హామీలిచ్చిందని.. కానీ వాటిని అమలు చేయడం లేదని, చాలా బాధ కలుగుతోందన్నారు. తమ వర్గ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏదీ కూడా వారిచ్చిన మాటలు అమలుకు నోచుకోవడం లేదని, వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. మోసపూరిత ఒప్పందం..హామీలను ఒప్పుకున్నారని, మరోసారి ఉద్యమం చేపట్టాని తనను కోరడం జరుగుతోందన్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో సమావేశమై కార్యాచారణ రూపొందిస్తామన్నారు. జాతి కోసం మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్ధమన్నారు. తాము చేపట్టే ఉద్యమం ఏ పార్టీకి వ్యతిరేకమో...అనుకూలం కాదని ముద్రగడ స్పష్టం చేశారు. 

12:33 - March 2, 2016

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి దేవినేని ఉమహహేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే.. నిరాశ, నిస్పృహలో ఉన్న జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఖచ్చితంగా జగన్‌కు బుద్ది చెబుతామన్నారు. మరోవైపు పోలవరంపై కొంతమంది ఇష్టమున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. తప్పకుండా త్వరలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. పోలవరం, పట్టిసీమలపై విమర్శలు చేస్తే తాను వాస్తవాలు తెలియచేయడం జరుగుతోందని తెలిపారు. అభివృద్దికి సహకరించాలని స్వచ్చందంగా కార్యకర్తలు, నేతలు టిడిపివైపు చూస్తున్నారని తెలిపారు. 

12:31 - March 2, 2016

ఢిల్లీ : విపక్ష సభ్యుల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ హోరెత్తాయి. రాజ్యసభ ప్రతిపక్షాల ఆందోళనలతో హోరెత్తింది. గుజరాత్‌లో జరిగిన ఇష్రత్‌ ఇజాజ్‌పై జరిగిన ఎన్‌కౌంటర్‌పై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు లోక్‌సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అంశంపై విపక్షాలు పట్టుబట్టాయి. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి కొద్ది రోజుల క్రితం స్మృతిఇరానీ అబద్ధాలు చెప్పారని ఆమెకు నోటీసులు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. 

12:29 - March 2, 2016

ఢిల్లీ : స్మృతి ఇరానీ అంశంతో పాటు ఇజ్రత్ జహాన్ ఎన్ కౌంటర్ పై చర్చించాలని విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్ సభ అట్టుడికింది. ఈ సందర్భంగా విపక్ష సభ్యులను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా మహజన్ పలు వ్యాఖ్యానాలు చేశారు. ప్రతొక్కరూ మాట్లాడాలంటే కుదరదని, అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ప్రభుత్వం..స్పీకర్ ను ఉద్దేశించి నినాదాలు చేయడం తగదని విపక్ష సభ్యులకు సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎలాంటి సమయంలో రద్దు చేయడం తగదని, ఈ విషయం గతంలోనే సూచించడం జరిగిందని తెలిపారు. ప్రశ్నోత్తారాల సమయం తరువాత నోటీసులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

12:07 - March 2, 2016

హైదరాబాద్ : మరిది..వదినలు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మరిది మృతి చెందాడు. బోయిగూడకు చెందిన నరేష్, శైలజలు వరసకు మరిది..వదినలు అవుతారు. వీరు బుధవారం ఉదయం ఆటో ఎక్కి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై దిగిన వీరు ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ వైపు పరుగులు తీసి దూకారు. అక్కడనే విధులు నిర్వహిస్తున్న లేక్ వ్యూ పోలీసులు దీనిని గమనించి సాగర్ లోకి దూకారు. అనంతరం శైలజను కాపాడగా నరేష్ మృతి చెందాడు. నరేష్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా శైలజకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. 

షారుఖ్ మామ మృతి..

ముంబై : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ తండ్రి కల్నల్ రమేష్ చిబ్బర్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న షారుఖ్ దంపతులు ఢిల్లీకి వెళ్లారు. 

అందరం సమన్వయంతో పనిచేస్తాం - శిల్పా చక్రపాణి..

విజయవాడ : జిల్లాలో అందరం సమన్వయంతో పనిచేస్తామని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు శిల్పా చక్రపాణి పేర్కొన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

ఎన్ కౌంటర్ పై హైకోర్టు లో పిల్ దాఖలు..

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై హైకోర్టులో ఏపీ సీఎల్ సీ పిల్ దాఖలైంది. మృతదేహాలను భద్రపరిచి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరిచ విచారణ రేపటికి వాయిదా పడింది. 

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉచిత ఇసుక విధానం..కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి..అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

హుస్సేన్ సాగర్ లో దూకిన వదిన..మరిది..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో వదిన..మరిది దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మరిది మృతి చెందగా మహిళను పోలీసులు కాపాడారు. బోయిగూడకు చెందిన వారుగా తెలుస్తోంది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

11:32 - March 2, 2016

మెదక్ : పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం..విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం..అని విద్యాశాఖాధికారులు పేర్కొంటుంటారు. కానీ వాస్తవానికి కొన్ని సందర్భాల్లో అవి నిజం కావని తేలుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కానీ సంగారెడ్డి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. తరగతి గదిలో లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో చీకట్లోనే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపటి నుండైనా పరీక్ష కేంద్రంలో లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

11:16 - March 2, 2016

హైదరాబాద్ : ఒక్క నిమిషం నిబంధన అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది విద్యార్థులకు నిమిషం నిబంధన నిజంగానే శాపంగా మారింది. ఆ ఒక్క నిమిషం.. విద్యార్థుల ఏడాది పడ్డ శ్రమను క్షణంలో ఆవిరి చేసింది. రంగారెడ్డి జిల్లాలోని తాండూరు సింధు జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను అధికారులు లోనికి అనుమతించ లేదు. దీనితో వారు కన్నీటిపర్యమంతమయ్యారు. నిమిషం నిబంధనను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హయత్ నగర్ ప్రభుత్వ కళాశాలలో పది నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులకు పది నిమిషాలు అదనపు సమయం ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు గదుల్లో 160 మంది విద్యార్థులను కూర్చొబెట్టారు. దీనిపై స్థానిక విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలియచేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను కూర్చొబెట్టారని ఉన్నతాధికారులకు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. 

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్షాలు పోడియాన్ని చుట్టుముట్టడంతో డిప్యూటి స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

హయత్ నగర్ లో ఆలస్యంగా ఇంటర్ పరీక్ష ప్రారంభం..

హైదరాబాద్ : హయత్ నగర్ ప్రభుత్వ కళాశాలలో పది నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులకు పది నిమిషాలు అదనపు సమయం ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

నిమిషం ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు..

రంగారెడ్డి : తాండూరు సింధు జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను అధికారులు లోనికి అనుమతించ లేదు.

సంవత్సరం తరువాత భూమికి చేరిన వ్యోమగామి..

ఢిల్లీ : ఒక సంవత్సరం పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ సురక్షితంగా భూమికి చేరుకున్నాడు. 

లోక్ సభలో ఏఐఏడీఎంకే వాయిదా తీర్మానం..

ఢిల్లీ : ఎయిర్ సెల్, మాక్సిస్ డీల్ లో మాజీ మంత్రి పి.చిదంబరంపై పాత్రపై చర్చించాలంటూ ఏఐఏడీఎంకే లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. 

10:28 - March 2, 2016

కరీంనగర్ : జిల్లాల్లో ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను విద్యామండలి పూర్తి చేసింది. బుధవారం ప్రథమ సంవత్సరం, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనన్నారు. జిల్లాలో 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 43,768 మంది, ద్వితీయ సంవత్సరంలో 52,511 మంది మొత్తం 96,279 మంది విద్యార్థులు పరీక్షలు రాయన్నారు. నిమిషం లైటైనా పరీక్షా కేంద్రానికి అనుమతించమని అధికారులు హెచ్చరించడంతో విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. అక్రమాలు, చూసి రాతలను నియంత్రించేందుకు హై పవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీతో పాటు అకస్మిక తనిఖీలు బృందాలు ఏర్పాటు చేశారు. 13 సమస్మాత్మక పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 

టిడిపిలో వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధి..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమై చర్చించిన అనంతరం కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధి టిడిపిలో చేరారు. బాబు ఆయనకు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

10:11 - March 2, 2016

విజయవాడ : ఏ ఎమ్మెల్యే ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితి వైసీపీ ఎదుర్కొంటోంది. రోజుకో ఎమ్మెల్యే టిడిపిలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పచ్చకండువాలు కప్పుకున్నారు. తాను ఈనెల 4వ తేదీన టిడిపిలో చేరుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకటరమణ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా టిడిపిలోకి జంప్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా మణిగాంధీ టిడిపిలో చేరుతారనే వార్తలు రావడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బుధవారం ఉదయం ఎమ్మెల్యే మణిగాంధీ తన అనుచరులతో బాబు నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ సమావేశానికంటే ముందే ఆయన టిడిపి కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే టిడిపిలో చేరితేనే బెటరని నేతలు పేర్కొంటున్నారు. వైసీపీ జంప్ జిలానీలను అధినేత జగన్ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి.

బీ ఫార్మసీ విద్యార్థిని మృతి..పలు అనుమానాలు..

గుంటూరు : ఫిరింగిపురం సెయింట్ జేవీఆర్ కాలేజీలో బీ ఫార్మసీ సెకండియర్ విద్యార్థిని సుమలత మృతి చెందింది. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సుమలత అనంతపురం వాసి. 

బాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే..

విజయవాడ : సీఎం చంద్రబాబును కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ కలిశారు. కాసేపట్లో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. 

09:26 - March 2, 2016

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో సర్కారు బంగారు ఆభరణాలపై ఒక్క శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆభరణాల వర్తకులు మూడు రోజుల దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వెనక్కి తీసుకోవాలని బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు బంగారం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించామని 'ఆల్‌ ఇండియా జెమ్స్ అండ్‌ జ్యువెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌' (జీజేఎఫ్‌) ఛైర్మన్‌ శ్రీధర్‌ జీవీ తెలిపారు. పాన్‌ కార్డు తప్పనిసరి చేయడంతో ఇప్పటికే 25-30 శాతం వరకు అమ్మకాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెలో దేశంలోని 300 అనుబంధ సంఘాలతో పాటు తయారీదార్లు, రిటైనర్స్ పాల్గొననున్నారని తెలిపారు. 

09:18 - March 2, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం పది గంటలకు జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఉచిత ఇసుక..గ్రూప్‌1, గ్రూప్‌2, పోలీసు పోస్టుల భర్తీ..రాష్ట్ర బడ్జెట్...కేంద్ర సహాయ సహాకారాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పేదలను గుర్తించడం..వారికి ఎంత ఇసుక ఇవ్వాలి అనే దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ నెల 5 వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతేగాకుండా వైసీపీ చేసే ఎదురుదాడిని ఎలా ఎదుర్కొవాలనే దానిపై కూడా చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు..కేంద్రం సహాయ సహాకారాలు లోపించడంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

09:13 - March 2, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 9,64,664 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 1257 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,56,655 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 5,08,008 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,93,891 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరానికి 5,00,419 మంది, రెండవ సంవత్సరానికి 4,93,472 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1363 సెంటర్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన 117 సెంటర్లలను ఇంటర్‌బోర్డు గుర్తించింది. అత్యంత సమస్యాత్మకమైన 35 సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 120 సెంటర్లు ఏర్పాటు చేశారు. 56 సిటీ పరిధిలో ఉండగా 41 రూరల్, 13 ఏజెన్సీ పరిధిలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 అతి సమస్యాత్మకమైన సెంటర్లుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,64,664 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు పరీక్షలకు హాజరుకానున్నారు. 

ఎన్ కౌంటర్ నేపథ్యంలో హై అలర్ట్..

ఖమ్మం : చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

07:33 - March 2, 2016

విభజన వల్ల హైదరాబాద్‌తోపాటు, ఆదాయాన్ని కోల్పోయి పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు వరసగా మూడోసారీ కేంద్ర బడ్జెట్‌లో అవమానం ఎదురైంది. ప్రత్యేకహోదా కల్పిస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు. పోలవరం సంగతి సరేసరి.. బాబు, వెంకయ్య చెప్పిన ప్రత్యేక ప్యాకేజీ జాడ లేదు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విల్సన్ (బీజేపీ), రామారావు (సీపీఎం), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి. 

నేడు కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ..

ఢిల్లీ : దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు ప్రశ్నాపత్రం ఎంపిక...

హైదరాబాద్ : ఇంటర్ మీడియట్ పరీక్షలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్ 'సి' ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 

లోక్ సభలో మాట్లాడనున్న మోడీ..

ఢిల్లీ : నేడు లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై మోడీ వివరణ ఇవ్వనున్నారు. 

నేడు కర్నూలుకు చేరుకోనున్న వామపక్షాల బస్సు యాత్ర...

కర్నూలు : వామపక్షాల బస్సు యాత్ర నేడు కర్నూలుకు చేరుకోనుంది. మద్దిగెర్ర, పత్తికొండ, ఆస్పర్రి, అదోనీలో యాత్ర కొనసాగనుంది. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామపక్షాలు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

 

06:47 - March 2, 2016

వ్యవసాయానికి, పల్లెల ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అలాంటి మహోన్నత లక్ష్యానికి ఈ బడ్జెట్ నిజంగా పునాది వేసిందా? ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించేలా బడ్జెట్ ప్రతిపాదనలున్నాయా? అసలు మనదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయా? పడిపోతున్నాయా? ఎగుమతులు, దిగుమతుల పరిస్థితి ఏమిటి? నిజంగా రైతులకు, వ్యవసాయ రంగానికి మేలు జరగాలంటే బడ్జెట్ ప్రతిపాదనల్లో చేయాల్సిన సవరణలేమిటి ? ఈ అంశంపై జనపథంలో రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి విశ్లేషించారు. 

06:45 - March 2, 2016

ఢిల్లీ : ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు.. పేలుడు సామగ్రి భారత దేశం నుంచే సమకూరుతోంది. దేశంలోని ఏడు కంపెనీల నుంచి ఈ ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. ఐసిస్‌కు పేలుడు పదార్థాలు సమకూరుస్తున్న ఓ కంపెనీ హైదరాబాద్‌లోనూ ఉంది. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించిన ఈ విషయాలు భారత నిఘా వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఆనవాళ్లు కనిపించినా.. దాని లింకులు భారత్‌లో బయటపడుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిన ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు.. భారతదేశం రిక్రూట్‌మెంట్‌ హబ్‌గా మారింది. ఈ విషయాన్ని యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కాన్‌ఫ్లిక్ట్‌ ఆర్నమెంట్‌ రీసెర్చ్‌ సంస్థ.. సీఏఆర్‌ తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు.. ముష్కరుల దాడులకు అవసరమైన పేలుడు ముడిసరుకూ ఇండియా నుంచే సరఫరా అవుతోందని... ఈ ఉగ్ర సంస్థకు హైదరాబాద్‌తో ప్రత్యక్ష కనెక్షన్లు ఉన్నాయని సీఏఆర్‌ నివేదించింది.

ఏడు ఆయుధ తయారీ సంస్థలు..
భారత దేశానికి చెందిన ఏడు ఆయుధ తయారీ సంస్థల నుంచి.. విదేశాలకు ఎగుమతి అయ్యే పేలుడు ముడి పదార్థాలు, బాంబులనే.. ఐసిస్‌ ఉగ్రదాడుల్లో వినియోగిస్తోందని సీఏఆర్‌ వెల్లడించింది. ఈ ఏడింటిలో మూడు సంస్థలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. భారత్‌లోని కంపెనీల నుంచి.. పారిశ్రామిక అవసరాల పేరిట.. టర్కీ, లెబనాన్‌ దేశాలకు చెందిన వివిధ సంస్థలు.. డిటొనేటర్లు, సేఫ్టీ ఫ్యూజులను దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి ఆ విడి భాగాలను ఐసిస్‌ సేకరిస్తోందని సీఏఆర్‌ వెల్లడించింది. భారత్‌తో పాటు.. 20 దేశాలకు చెందిన 51 ఆయుధ తయారీ సంస్థల నుంచీ విడిభాగాలు, పేలుడు ముడిపదార్థాలూ సేకరిస్తున్నట్లు సీఏఆర్‌ గుర్తించింది.
భారత్‌ సహా వివిధ దేశాల నుంచి సేకరించిన ఆయుధ విడిభాగాలతో ఐసిస్‌ నిపుణులు.. మందుపాతరలు తయారు చేస్తూ ఇరాక్‌, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్నారని సీఏఆర్‌ సంస్థ వెల్లడించింది. లెబనాన్‌, టర్కీ దేశాల్లోని అనుకూల చమురు క్షేత్రాల నుంచి ముడిచమురును దొడ్డిదారుల్లో ఎగుమతి చేస్తూ, ఐసిస్‌ పెద్ద మొత్తంలో నిధులు కూడబెడుతోందని.. ఆ నిధులతో ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కొనుగోలు చేస్తోందని సీఏఆర్‌ తెలిపింది.

హైదరాబాద్ యువత..
హైదరాబాద్‌తో పాటు.. నాగపూర్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ కంపెనీల నుంచి ఎక్స్‌ప్లోజివ్స్‌ సప్లై అవుతున్నాయి. తాము ఎగుమతి చేస్తున్న పేలుడు పదార్ధాలు, ఐఇడిలో ఉపయోగించే విడిభాగాలు ఎవరి చేతుల్లో పడుతున్నాయో భారతీయ కంపెనీలకు తెలిసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ యువతను ఐసిస్‌ ఆకర్షిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కొంతమందికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపాయి. అయితే ఇప్పుడు పేలుడు సామగ్రి కూడా భారత్‌ నుంచే ఐసిస్‌కు అందుతోందన్న సమాచారం.. నిఘా వర్గాల్లో ఆందోళనను మరింతగా పెంచింది. 

06:42 - March 2, 2016

బంగ్లాదేశ్ : ఆసియా కప్‌ టీ 20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌..142 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ రాణించి టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

06:40 - March 2, 2016

హైదరాబాద్ : మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి ఇంట్లో మళ్లీ ఆస్తి తగాదాలు అగ్గిరాజేశాయి. అత్తా కోడళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. పై చేయి సాధించేందుకు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు...ఆస్తిపై పూర్తి హక్కు తనదే అని ఒకరంటే... అసలు ఛాన్సే లేదని మరొకరంటూ వేడి పుట్టిస్తున్నారు...ఏడాదిన్నరగా కొనసాగుతున్న గొడవలు పోలీసు స్టేషన్ చేరాయి. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు ధర్నాకు దిగటం మరోసారి సంచలనం రేపింది. హైదరాబాద్‌ సోమాజిగూడలోని వరుణ్ సర్గం విల్లా అపార్ట్‌మెంట్‌ ఎదుట దీక్ష చేపట్టిన చక్రి తల్లి, తమ్ముడు నిరసన గళమెత్తారు. చక్రి ఆస్తి కోసం అత్తాకోడలి మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపం చెందిన చక్రి తల్లి విద్యావతి ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. చక్రి మరణానంతరం ఆస్తికోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. చక్రి భార్య, తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. చక్రి ఆస్తి తనకే చెందాలని భార్య శ్రావణి వాధిస్తుండగా, కొడుకు ఆస్తి తనకే రావాలంటోంది తల్లి విద్యావతి డిమాండ్‌ చేస్తోంది. చినికి చినికి గాలివానలా మారుతున్న ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. 

06:32 - March 2, 2016

విజయవాడ : అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 225కు పెరుగుతాయని.. పార్టీ మారే వారిని ఇన్‌డైరెక్ట్‌గా రమ్మంటూ సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ ఇకపై దూకుడు పెంచాలనుకుంటోంది. అందుకు తాము ఇంతవరకూ చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, లోటు పాట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు విజయవాడలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తనకు కుటుంబం కంటే పార్టీనే ముఖ్యమని రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పటిష్టం కావాలంటే నేతలంతా ఇగోను పక్కన పెట్టి కలిసిమెలసి ముందుకు సాగాలని సూచించారు.

చట్టం హామీల కోసం కృషి..
అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకే కొందరు నేతలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని... ఇంకా కొందరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. నేతల చేరికల వల్ల స్థానిక నాయకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 225కు పెరుగుతాయని తెలిపారు. పార్టీలో ఎవరెవరిని గౌరవించాలో తాను చూసుకుంటానన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు సాధించడం కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. కేంద్ర సాయంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి సహకారం, ఆర్థిక లోటు భర్తీ, పోలవరం నిర్మాణం తదితర విభజన హామీలు నెరవేర్చడం కోసం బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు సరిపోవని చంద్రబాబు అన్నారు.  తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

06:29 - March 2, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం ఇవాళ విజయవాడలో జరుగుతుంది. ఉదయం పది గంటలకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఇసుకను ఉచితంగా అందించే విధానంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్‌పైనా సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు గ్రూప్‌1, గ్రూప్‌2, పోలీసు పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

06:28 - March 2, 2016

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించేది లేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 9,93,891 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరానికి 5,00,419 మంది, రెండవ సంవత్సరానికి 4,93,472 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1363 సెంటర్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన 117 సెంటర్లలను ఇంటర్‌బోర్డు గుర్తించింది. అత్యంత సమస్యాత్మకమైన 35 సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. 13 జిల్లాలకు కలిసి విజయవాడ, హైదరాబాద్‌లలో హెల్ప్ లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి పరీక్షలకు 13 జిల్లాల్లో పరీక్షల కమిటీలతో పాటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీలను నియమించారు. మొత్తం 80 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పాటు 65 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద తక్షణ వైద్యసేవలు అందించేందుకు మెడికల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద జీరాక్స్‌్‌ సెంటర్లను అనుమతించేది లేదని, పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. మొదటి సంవత్సరం విద్యార్ధులకు 19వ తేదీ వరకు , రెండవ సంవత్సరం విద్యార్ధులకు 21వ తేదీ వరకు జరుగుతాయి.

తెలంగాణలోనూ..
తెలంగాణలోనూ ఇంటర్మిడియట్‌ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. బుధవారం ఫస్టియర్‌, గురువారం సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ఆరంభమవుతాయి. మొత్తం 9, 64, 664 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 4,56,655 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 5,08,008 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఇంటర్‌ ఒకేషనల్‌ మొదటి సంవత్సర విద్యార్థులు 36,494, రెండో సంవత్సరం విద్యార్థులు 34వేల మంది ఉన్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1257 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడే విద్యార్థులపై సెక్షన్‌ 25 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే 9 గంటల తరువాత ఒక్క నిమిషం లేటైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఐతే ఒక్క నిమిషం నిబంధనపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

రేపు ఆదిలాబాద్ లో పసుపు రైతుల సదస్సు..

హైదరాబాద్ : రాష్ట్రంలో పసుపు సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం ధనోరా గ్రామంలో పసుపు రైతుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, జోగు రామన్నలు పాల్గొననున్నారు. 

వీణవంకకు నేడు కాంగ్రెస్ మహిళా నేతల బృందం..

కరీంనగర్ : కాంగ్రెస్ మాజీ మహిళా మంత్రుల బృందం బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామాన్ని సందర్శించనుంది. 

4న అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థల పనితీరు చర్చించడానికి తెలంగాణ లెజిస్లేటివ్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశం కానుంది. 

నేటి నుండి బంగారం దుకాణాలు బంద్..

ముంబై : దేశ వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు బంగారం వ్యాపారస్తులు ప్రకటించారు. బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని నిరసిస్తూ బుధవారం నుండి శుక్రవారం వరకు అంటే మూడు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు జ్యువెల్లరి ట్రేడ్ ఫెడరేషన్ ఛైర్మన్ శ్రీధర్ జీవి పేర్కొన్నారు. 

వాటర్ బోర్డులో ఇంటర్వ్యూలు ప్రారంభం..

హైదరాబాద్ : వాటర్‌బోర్డులో మేనేజర్ పోస్టులకు మంగళవారం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ కోసం 1:2 నిష్పత్తిలో మొత్తం 300 మంది అభ్యర్థులను ఆహ్వానించారు. 

నేటి నుండి ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,64,664 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు పరీక్షలకు హాజరుకానున్నారు. వారికోసం 1,257 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. 

Don't Miss