Activities calendar

03 March 2016

యూఏఈ పై భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ : ఆసియా కప్ టీ.20 లో భాగంగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది. 10.1 వోవర్లలోనే భారత్ విజయలక్ష్యాన్ని చేధించింది. యూఏఈ స్కోర్, 81/9, భారత్ స్కోర్ 82/1.

21:52 - March 3, 2016

కర్నూలు : వామపక్షాలు చేపట్టిన రాయలసీమ బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు కూడా కొనసాగింది. కోడుమూరు నియోజకవర్గంలోని  పలుగ్రామాల్లో సీపీఎం, సీపీఐ నేతలు యాత్ర చేశారు. రాయలసీమలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని వామపక్ష నేతలు విమర్శించారు. కరవుతో రాయలసీమ ఎడారిగా మారుతున్నా.... టిడిపి పాలకుల్లో స్పందించడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. రాయలసీమ అభివృద్ధిపై లేదనని మండిపడ్డారు. 

 

21:44 - March 3, 2016

ఢిల్లీ : కన్హయ్యపై దేశద్రోహ ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలూ లభించలేదని.. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం తేల్చి చెప్పింది. విచారణ జరిపిన డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ సంజయ్‌ కుమార్‌.. ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఫిబ్రవరి 9 నాటి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో.. ఉమర్‌ ఖలీద్‌ చాలా చోట్ల కనిపించాడని.. కశ్మీర్‌, అఫ్జల్‌గురు అంశాల్లో అతడి అభిప్రాయాల నేపథ్యంలో.. మరింత విచారణ జరపాల్సి ఉందని సంజయ్‌కుమార్‌ వెల్లడించారు. అలాగే జెఎన్‌యూ క్యాంపస్‌లో దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని వర్సిటీ అధికారులు గుర్తించారని.. వారిని విచారించాల్సి ఉందని సంజయ్‌కుమార్‌ నివేదించారు. 

 

21:40 - March 3, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో సాగునీటి ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ సంరద్భఎపిని గొప్ప జలమార్గం ఉండే రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పారు. దేశంలో నదులు, సరస్సులు, సముద్రాలు ఉన్నప్పటికీ జలరవాణాను ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. నదుల అనుసంధానానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. 

మొదటి వికెట్ కోల్పోయిన భారత్

బంగ్లాదేశ్ : ఆసియా కప్ టీ20లో భాగంగా భారత్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఔట్ అయ్యాడు. 

సినీ నిర్మాత బెల్లకొండ సురేష్‌ కార్యాలయం సీజ్ చేసిన బ్యాంకు అధికారులు

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత బెల్లకొండ సురేష్‌ కార్యాలయాన్ని గురువారం కొటక్‌ మహీంద్రా బ్యాంకు అధికారులు సీజ్‌ చేశారు. రూ.7కోట్ల వరకు బ్యాంకు రుణం చెల్లించలేదని, అందుకే కార్యాలయాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. బెల్లంకొండ సురేష్‌ తెలుగులో ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహా, గోలిమార్‌, అల్లుడుశీను సహా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తనయుడు బెల్లకొండ శ్రీనివాస్‌ 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు' చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.

బినామీ ఆస్తులున్నాయని నిరూపిస్తే వారికే రాసిస్తాను : మంత్రి నారాయణ

హైదరాబాద్‌ : బినామీ ఆస్తులున్నాయని నిరూపిస్తే వారికే రాసిస్తానని మంత్రి నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షిలో తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. త్వరలో జగన్‌ పార్టీ ఖాళీ కావడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు.

21:08 - March 3, 2016

ఖమ్మం : కార్పొరేషన్‌పై... పార్టీ పతాకాన్ని ఎగురవేసేందుకు అన్ని రాజకీయ పక్షాలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించిన పట్టును.. కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పాలక టీఆర్ఎస్‌ పట్టుదలగా ఉంది. అందుకే.. పార్టీ తురుపు ముక్క కేటీఆర్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్‌ అభ్యర్థుల తరఫున వాడవాడలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.                                                                                            
రసవత్తరంగా ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు 
ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగుస్తుండడంతో.. అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పాలక టీఆర్ఎస్‌ అభ్యర్థుల తరఫున.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల తరహాలోనే ఖమ్మంలోనూ గెలుపును సాధించాలన్న తపనతో వాడవాడలా కలియ తిరుగుతున్నారు. 
విపక్ష అభ్యర్థులపై టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ 
టీఆర్ఎస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే.. విపక్ష అభ్యర్థులపై ఆపరేషన్‌ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ.. కేటీఆర్ ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పోలింగ్‌కు ఇక రెండు రోజులే గడువు ఉన్న ప్రస్తుత తరుణంలో.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 16 డివిజన్‌లో పోటీకి దిగిన విజయ్‌పాల్‌.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ వలకు చిక్కుకున్నారు. ఈయన అనూహ్యంగా ప్రచార కావడిని పక్కన పెట్టేసి.. కారెక్కేశారు. 
ఖమ్మంలో రోడ్‌షో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్
ఖమ్మం నగరంలో రోడ్‌షో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే... నగరాన్ని హైదరాబాద్‌లో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తెరాస అభ్యర్థులకు వేసే ప్రతి ఓటూ.. కేసీఆర్‌కు వేసినట్లేనని అన్నారు. గోదావరి జలాలను తెచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ప్రతిపక్షాల వల్ల ఒరిగేదేమీ లేదని విమర్శలు గుప్పించారు. 
క్లీన్‌స్వీప్‌ చేస్తామని పాలక పక్షం ధీమా 
గడువు ముగిసేలోపు... వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో అగ్రనాయకులతో ప్రచారం చేయించాలని టీఆర్ఎస్‌ స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో క్లీన్‌స్వీప్‌ చేస్తామని పాలక పక్షం నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే.. తమ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో.. పాలక పక్షం లోపాయకారీ ప్రలోభాలకు తెరతీస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తమ్మీద ఎన్నికల ప్రచారంతో ఖమ్మం కార్పొరేషన్‌ హోరెత్తిపోతోంది.  

 

20:59 - March 3, 2016

ఖమ్మం : కామ్రేడ్ల అడ్డా.. ఖమ్మం గడ్డపై ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని సీపీఎం భావిస్తోంది. పార్టీ అగ్రనాయకులు రంగంలోకి దిగి.. రోడ్‌షోలు, పాదయాత్రలతో కాలనీ వాసులను స్వయంగా కలుస్తున్నారు. అవినీతి రహిత పాలన కావాలంటే తమను గెలిపించాలంటూ సీపీఎం నేతలు ప్రచారం చేస్తున్నారు. పార్టీ ప్రచారానికి కాలనీల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.                                                                           
గల్లీ గల్లీ తిరుగుతున్న సీపీఎం నేతలు  
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంతో ఖమ్మం హోరెత్తిపోతోంది. సీపీఎం నేతలు, కార్యకర్తలు గల్లీ గల్లీ తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.. తమ పార్టీతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని చెబుతున్నారు..
తమ అభ్యర్థులకు మద్దతుగా తమ్మినేని ప్రచారం
తమ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రచారం చేశారు.. త్రీటౌన్‌లోని వివిధ డివిజన్లలో రోడ్‌ షో నిర్వహించారు.. అవినీతి రాజకీయాలను ఓడించాలని పిలుపునిచ్చారు.. కార్యకర్తలతో కలిసి కాలనీలన్నీ చుట్టేశారు.. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. తమ్మినేనితోపాటు... పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని, ఇతర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.. తమను గెలిపిస్తే స్థానిక సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇస్తున్నారు.. 

 

20:53 - March 3, 2016

భారతీయుల ఉద్యోగాలు రిస్క్ లో పడతాయా..? విదేశాలతో సంబంధాలు రివర్సౌతాయా..? ట్రంప్ గెలిస్తే..? ఈదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

20:45 - March 3, 2016

జీడబ్ల్యుఎంసీ ఎన్నికల నేపథ్యంలో టెన్ టివి వరంగల్ గల్లీల్లో మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ పార్టీల ప్రచార తీరును మల్లన్న వివరించారు. బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న కోలాటం బృందంతో ముచ్చటించారు. అనంతరం ప్రజలు టెన్ టివితో మాట్లాడుతూ పలు సమస్యలను ఏకరువుపెట్టారు. మరిన్ని మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:19 - March 3, 2016

ఉత్తర కొరియా : ఉత్తర కొరియా దూకుడును కొనసాగిస్తోంది. ఈ ఉదయం మరిన్ని మిసైల్స్ ను పరీక్షించింది. సుమారు పది గంటల ప్రాంతంలో.. తూర్పు తీరంలోని వాన్సన్‌ ప్రాంతంలో ఆరు స్వల్పశ్రేణి క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించింది. ఇవి రాకెట్లు గానీ, గైడెడ్‌ మిస్సైల్స్ కానీ కావచ్చని దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. అణు పరీక్షలు, ఉపగ్రహ ప్రయోగాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే ఉత్తర కొరియా మరిన్ని పరీక్షలు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది.

 

20:15 - March 3, 2016

కోల్ కతా : పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ పార్టీ సీనియర్‌ నేత, కురువృద్ధుడు కామ్రేడ్‌ అశోక్‌ఘోష్‌ ఇకలేరు.  అనారోగ్యంతో ఫిబ్రవరి 2న ఓ ఆస్పత్రిలో చేరిన 94 ఏళ్ల అశోక్‌ఘోష్‌ చికిత్స పొందుతూ ఇవాళ కన్ను మూశారు. కామ్రేడ్‌ అశోక్‌ ఘోష్‌ మృతిపై సిపిఎం పొలిట్‌ బ్యూరో సంతాపం వ్యక్తం చేసింది. వామపక్షాలను బలోపేతం చేసేందుకు  ఆయన చేసిన కృషిని కొనియాడింది. బెంగాల్‌ రాజకీయాల్లో ఏడు దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన ఘోష్‌ సాధారణ జీవితం గడిపారు. పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకొని ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరిన ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అశోక్‌ఘోష్‌1952లో ఫార్వర్డ్ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌ నేతల్లో ఘోష్‌ అత్యంత సీనియర్ నేత.
 

20:00 - March 3, 2016

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతితో బినామీ పేర్లతో తాను భూములు కొన్నట్టు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ తోసిపుచ్చారు. తాను భూములు కొన్నట్టు నిరూపిస్తే వాటిని వైసీపీ నేతలకు రాసిస్తానని ఆయన సవాల్‌ విసిరారు. నీతిగా బతికేవారిపై వైసీపీ నేతలు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. నీతి, నిజాయితీగా బతికితే బతకన్వివరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

19:27 - March 3, 2016

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ విడుదలయ్యారు. తీహార్ జైలు నుంచి కన్హయ్య బెయిర్ పై విడుదలయ్యారు. కన్హయ్య 23 రోజులపాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. నిన్న ఢిల్లీ హైకోర్టు కన్హయ్యకు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు తీహార్ జైలు నుంచి కన్హయ్యను మధ్యంతర బెయిర్ పై విడుదల చేశారు. జైలు వద్ద కన్హయ్య భద్రత కోసం రెండు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసు కమాండోలు భద్రతను కట్టుద్టిటం చేశారు. మరోవైపు ఢిల్లీ సర్కార్ కన్హయ్యకు క్లీన్ చీట్ ఇచ్చింది. కన్హయ్య నేరుగా జెఎన్ యూకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీలో ఒక సభను నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు కన్హయ్య విడుదల సందర్భంగా జెఎన్ యూలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలతోపాటు మరికొంతమందిపై పెట్టిన దేశం ద్రోహం కేసులను ఎత్తివేయాలని ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను కూడా విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

 

ఎపిలో గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -4 సిలబస్ మార్పులు

హైదరాబాద్ : గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -4 సిలబస్ మార్పులను ఎపిపిఎస్సీ వెబ్ సైట్ లో ఉంచింది. కొత్త సిలబస్ పై అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 15 వరకు గడువు పొడిగించారు. 

జమ్మూకాశ్మీర్ కిరణ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : కిరణ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. 

తీహార్ జైలు నుంచి కన్హయ్య విడుదల

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టు కన్హయ్యకు ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు తీహార్ జైలు నుంచి కన్హయ్యను విడుదల చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ

బంగ్లాదేశ్ : ఆసియా కప్ టీ.20లో భాగంగా కాసేపట్లో భారత్, యూఏఈ మధ్య మ్యాచ్ జరుగనుంది. యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

18:36 - March 3, 2016

హైదరాబాద్ : గోల్కొండలో ఆస్ట్రేలియా మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆస్ట్రేలియాకు చెందిన మాథేర్ లిండా మార్గరేట్ (52) టూరిస్టు వీసాపై ఫిబ్రవరి 15న హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళ ఓ నైజీరియన్ తో కలిసి ఉంటున్నట్లు సమాచారం. మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. 

 

సీఎం చంద్రబాబును కలిసిన సూరీడు

విజయవాడ : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు వద్దకు చేరుకున్నాడు. సూరీడు సీఎం చంద్రబాబును కలిశారు. 

 

18:18 - March 3, 2016

వరంగల్ : జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గెలుపు ఓటములకు తమదే బాధ్యత అని అన్నారు. 2019 నాటికి 900కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధికి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వరంగల్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచన కేసీఆర్ కు ఉంది కాబట్టే టీఆర్ ఎస్ కు ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని చెప్పారు.

 

18:10 - March 3, 2016

బంగ్లాదేశ్ : ఆసియా కప్‌ టీ-20 టైటిల్‌ ఫేవరెట్ టీమిండియా ..ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమయ్యింది.వరుసగా నాలుగో విజయంతో టైటిల్ ఫైట్ కు సమాయత్తం కావాలన్న పట్టుదలతో ఉంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే నాలుగో రౌండ్ పోటీలో పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టుతో ధోనీసేన తలపడుతుంది. రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన యువఆటగాడు పవన్ నేగీ, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పేసర్ భువనేశ్వర్ కుమార్ లకు..తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.... 
టీమిండియాకు యూఏఈ సవాల్
ఆసియా కప్‌లో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో భారత జట్టు ఆఖరాటకు సిద్ధమైంది. పవర్‌ ప్యాకెడ్‌ టీమిండియాకు ...యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ జట్టు సవాల్‌ విసురుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టి, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన......డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకను సైతం ఓడించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు  ఆడిన మూడు రౌండ్ల మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూఏఈ జట్టు ఢీలాపడింది.  
అదరగొడుతున్న టీమిండియా
ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా....అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌,విరాట్‌ కొహ్లీ, రహానే ,సురేష్‌ రైనా,  యువరాజ్‌ సింగ్‌,హార్ధిక్‌ పాండ్యా,  ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌ , జడేజాలతో  బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. 
ధోనీ సేన పట్టుదల
రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై , మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై సాధించిన విజయం ...భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ప్రస్తుత ఆసియా కప్‌లో అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించిన ఏకైక జట్టు భారత్‌ మాత్రమే. ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌లోనూ నెగ్గి ఫైనల్‌కు ముందు పూర్తి స్థాయిలో సమాయత్తమవ్వాలని ధోనీ సేన పట్టుదలతో ఉంది. 
మరింత బలపడిన భారత జట్టు బ్యాటింగ్‌ 
విరాట్‌ కొహ్లీ కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో ఉండటంతో పాటు.....మూడో మ్యాచ్‌తో యువరాజ్‌ సింగ్‌ ఫామ్‌లోకి రావడం భారత జట్టు బ్యాటింగ్‌ మరింత బలపడిందనే చెప్పాలి.  పేసర్లు నెహ్రా, బుమ్రా,పాండ్య ...స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.
రహానే,  నెగీ, పార్థీవ్‌ కు అవకాశం..? 
గాయాలతో ఇబ్బందిపడుతున్న రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, ధోనీలకు విశ్రాంతినిచ్చి..... ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌కు వారి స్థానంలో రహానే, పవన్‌ నెగీ, పార్థీవ్‌ పటేల్‌కు అవకాశమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జడేజా, అశ్విన్‌లలో ఒకరిని తప్పించి హర్భజన్‌ సింగ్‌ను తుది జట్టులో చోటు కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. 
తొలి విజయం కోసం యూఏఈ తహతహ 
మరోవైపు ఆసియా కప్‌ టోర్నీ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచి....మెయిన్‌ రౌండ్‌కు అర్హత సాధించిన అరబ్‌ ఎమిరేట్స్ జట్టు తొలి విజయం కోసం తహతహలాడుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఎమిరేట్స్ జట్టు.....బౌలింగ్‌ విభాగంలో మాత్రం నిలకడగా రాణించింది.
కీలక సమయాల్లో చేతులెత్తేసిన యూఏఈ
తనకంటే పటిష్టమైన శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లను దాదాపుగా ఓడించినట్లే కనిపించిన....యూఏఈ టీమ్‌ అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో కీలక సమయాల్లో చేతులెత్తేసింది. బౌలర్లు మహమ్మద్‌ నవీద్‌,జావెద్‌, షెహజాద్‌ నిలకడగా రాణిస్తూ....యూఏఈ జట్టును పోటీలో నిలుపుతుంటే, బ్యాట్స్ మెన్‌ వైఫల్యం కారణంగా ఎమిరేట్స్ జట్టు తేలిపోతోంది. బ్యాటింగ్‌లో షైమన్‌ అన్వర్‌...కెప్టెన్‌ అంజద్‌ జావెద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా...మిగతా బ్యాట్స్ మెన్‌  విఫలమవ్వడంతో యూఏఈ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లను సైతం ఓడిపోయింది. 
భారత జట్టుకే విజయావకాశాలు 
ఆసియా కప్‌లో ప్రస్తుత ఫామ్‌, ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే....ఈ మ్యాచ్‌లో భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాను ఓడించడం మాట పక్కన పెడితే....అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

 

18:05 - March 3, 2016

విజయవాడ : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు వద్దకు చేరుకున్నాడు. సీఎం చంద్రబాబుతో సూరీడు భేటీ కానున్నారు. 

 

సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సూరీడు

విజయవాడ : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు వద్దకు చేరుకున్నాడు. సీఎం చంద్రబాబుతో సూరీడు భేటీ కానున్నారు. 

 

17:54 - March 3, 2016

విజయవాడ : ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. 10 వ పిఆర్సీ ప్రకారం సంబంధిత ఉద్యోగులకు కనీస బేసిక్ ను వర్తింపచేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ను రెగ్యులైజ్ చేయాలనే డిమాండ్ తో ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌
చేశారు. 

 

భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మురళీమోహన్

ఢిల్లీ : భూ ఆరోపణలపై ఎంపీ మురళీమోహన్ స్పందించారు. నీతి, నిజాయితీగా బతుకుతున్నానని చెప్పారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 
1993 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని... ఎలాంటి ఇబ్బందులు లేని భూములు కొని వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబుకు, తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఆనాడు పీజేఆర్, వైఎస్సార్ కూడా తనపై ఆరోపణలను నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. 

 

17:14 - March 3, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో చేరిన 5గురు టీటీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ మధుసూదనా చారి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నవారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్‌ రెడ్డి, వివేకానంద, సాయన్న, ప్రకాష్ గౌడ్‌ లు ఉన్నారు. వీరంతా టీఆర్‌ఎస్‌ లోకి ఎందుకు చేరారో వారంలోగా వివరణ ఇవ్వాలని స్పీకర్‌ మధుసూధనాచారి ఆదేశించారు. 

టీఆర్ ఎస్ లో చేరిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో చేరిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి నోటీసులు అందజేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని ఆదేశించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డి, వివేకానంద, సాయన్న, ప్రకాశ్ గౌడ్ లకు నోటీసులు అందజేశారు. 

16:59 - March 3, 2016

హైదరాబాద్ : రాజధాని భూములపై దమ్ముంటే పయ్యావుల కేశవ్‌ చర్చకు రావాలని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. భూముల కొనుగోళ్లపై సీబీఐ చేత విచారణ జరిపించాలని అంబటి డిమాండ్‌ చేశారు. బహిరంగ చర్చకు ఎక్కడ జరిపిన వచ్చేందుకు సిద్ధమేనని అన్నారు.

16:56 - March 3, 2016

ఉత్తరప్రదేశ్‌ : మాథురలో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మాథురలో ఇంటర్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు బయట నుంచి గోడలెక్కి మరీ చిట్టీలు అందిస్తున్నారు. ఇన్విజిలేటర్ల కనుసన్నల్లోనే మాస్‌ కాపీయింగ్‌ జరగడం గమనార్హం. మాస్‌ కాపీయింగ్‌ వెనక స్థానిక నేతలు, పోలీసుల సహకారం ఉందని బిజెపి ఆరోపిస్తోంది.

16:53 - March 3, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన అనిత ప్రభుత్వ వెనకబడిన తరగతుల సంక్షేమహాస్టల్ లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఉదయం అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో హాస్టల్ వార్డెన్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి ప్రేమ విఫలమే కారణంగా భావిస్తున్నారు పోలీసులు.  

 

జలాలాబాద్‌లో ఉగ్రవాదుల దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు విడుదల

ఆప్ఘనిస్తాన్‌ : జలాలాబాద్‌లో భారత కాన్సులేట్‌ వద్ద జరిగిన దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసలు విడుదల చేశారు. ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నట్లు కెమెరాలో కనిపించింది. ఆ దాడిలో 15 మంది ఉగ్రవాదులను ఆప్ఘనిస్తాన్‌, భారత భద్రతాదళాలు హతమార్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం ఉగ్రవాదులు తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌ దగ్గర దాడికి దిగిన విషయం తెలిసిందే.

16:26 - March 3, 2016

వైద్యశాస్త్రం కొంత పుంతలు తొక్కుతోంది. అనేక ఆరోగ్య సమస్యలకు సరికొత్త పరిష్కారమార్గాలనందిస్తోంది. ఇందులో భాగంగానే సంతానలేమికి అనేక చికిత్సా మార్గాలను సూచిస్తోంది. అలాంటి చికిత్సా పద్ధతులేమిటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం...

16:22 - March 3, 2016

 ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అదృశ్యం, బడికి వెళ్ళిన పాప కనిపించటం లేదు, పక్కింటికి వెళ్ళిన బాబు తిరిగి రాలేదు.. ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అదృశ్యమవుతున్నారు. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్న ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?  
అంగడి సరుకులుగా మనుషులు
మనుషులను అంగడి సరుకులుగా మారుస్తున్న నేపథ్యంలో చిన్నారులను అపహరించడం నిత్యకృత్యమయ్యింది. వారి భవిష్యత్ ను చిదిమేస్తున్న ఈ ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి. తాజాగా వెలువడిన గణాంకాలు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితిని మరో సారి గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మానవి ఈ వారం ఫోకస్
కఠిన చట్టాలను రూపొందించాలి
బాలల అపహరణకు సంబంధించి కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. అదృశ్యం కేసులను వెంటనే నమోదు చేయాలి. ఇలాంటి కేసులపై పోలీసు వ్యవస్థ వెంటనే  స్పందించేలా చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.

 

16:16 - March 3, 2016

ప్రకాశం : బడిలో పాఠాలు చదువుకోవాల్సిన పసిమొగ్గలు భగభగ మండే ఎర్రని ఎండలో బాల్యాన్ని వెల్లదీస్తున్నారు. ఒక వైపు ఎండ మరోవైపు మిరపపంట ఘాటు చేలలో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బడికెళ్లాల్సిన వయసులో కుటుంబపోషణకు తల్లిదండ్రులతో కలిసి కూలీలుగా మారుతున్నారు.  మిరప తోటల్లోనో.. శనగ పంటల్లోనో వారి బాల్యం నీరుగారిపోతోంది. పలకలు పట్టుకోవాల్సిన బాలలు మిరప తోటల్లో మగ్గిపోతున్నారు. 
బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు
బాల్యం అంటేనే ఆటపాటలు, పలకాబలపాలు.. చక్కని విద్యాబుద్దులు.. కాని అలాంటి అందమైన బాల్యాన్ని పిల్లలందరూ అనుభవిస్తున్నారా... అందరూ పలకలపై అక్షరాలు దిద్దుతున్నారా.. అంటే  సమాధానం లేని ప్రశ్నే. కొందరు పాఠశాలలకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటుంటే మరి కొందరు బాలకార్మికులుగా మారుతున్నారు. వారి జీవితాలు ఏ మిరప తోటలకో, శనగ తోటలకో పరిమితం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో హాయిగా బడికివెళ్లి పాఠాలు నేర్వాల్సిన చిన్నారులు వలసలబాట పడుతూ... కుటుంబ పోషణకు కూలీలుగా మారుతున్నారు.
కూలీలుగా మారుతున్న చిన్నారులు
ప్రకాశం జిల్లాకు బతుకు దెరువు కోసం పొట్టచేతపట్టుకుని కర్నూలు జిల్లాకు వలసగా వచ్చిన కుటుంబాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుటుంబపెద్దలతో పాటు కూలీలుగా మారుతున్నారు వారి చిన్నారులు. ప్రకాశం జిల్లాలోని నిడమనూరు, కోణికి , రాచపూడి దుద్దుకూరు, ఇంకొళ్లు  వంటి ప్రాంతాల్లో పదేళ్ల వయసులోనే పార చేతబట్టి.. మిరప తోటల్లో కూలీలుగా మారుతున్న దయనీయస్థితి. భగభగ మండే మిరప తోటల్లో తలకు కండువా కట్టుకుని కొంత మంది మిరప తోటల్లో కాయలు కోస్తూ మరికొంత మంది శగన తోటల్లో కలుపులు తీస్తూ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇది ఇలా ఉండే మరికొందరు తమ చంటి పిల్లలను సైతం తీసుకుని మిరపతోటల్లో పని చేస్తూ దీనిస్థితిలో కాలం  వెల్లదీస్తున్నారు. పాలు తాగే చిన్నారుల బాల్యం సైతం మిరపతోటలకు అంకితమవుతోంది. 
తోటల్లో మగ్గిపోతోన్న బాల్యం 
కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి తాము కూలి పనుల కోసం వచ్చామని రోజుకు 170 రూపాయల చొప్పున కూలీ ఇస్తారని ఆ చిన్నారులు అంటున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు ఎండలో పనిచేస్తేనే తమకు కూలీ ఇస్తారని లేకపోతే సగం కూలీ ఇచ్చి పొమ్మంటారని వాపోతున్నారు. నిత్యం ఆడుకుంటూ.. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారుల బాల్యం తోటల్లో నే మగ్గిపోతోంది. 
ఆర్భాటాలకే పరిమితమైన ప్రభుత్వం ప్రచారం   
ప్రభుత్వాలు ఎంతో ఆర్భాటంగా కేజీ టు పీజీ విద్యా అని కేరళ మాదిరిగానే సంపూర్ణ విద్య అందించాలనే ఉద్దేశ్యంతో  పలుపథకాలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్నా అవి ఇలాంటి చిన్నారులకు అందడం లేదు. బడి బాటల పేరుతో ఉపాధ్యాయులు భారీ ర్యాలీల చేపడుతున్నా బడికెళ్లే వారి సంఖ్య రాను రాను తగ్గుతూనే ఉంది. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే ఉందే తప్ప ఇటువంటి చిన్నారులకు ఏ విధంగా ఉపయోగపడట్లేదు.  నిత్యం భగభగ మండే ఎండలో చిన్నారులు మిరపకాయలు కోస్తూ.. కొందరు నీళ్లు సరఫరా చేస్తూ కొందరు గంపలకెత్తుతూ.. అత్యంత దయనీయ స్థితిలో కనిపిస్తున్నారు. రెండు పూటలా తిండి తినాలన్నా.. బతుకు వెళ్లదీయాలన్నా ... పని చేయకతప్పడం లేదు ఈ విద్యా కుసుమాలకు.  
మాకు చదువుకోవాలని ఉందన్న బాలకార్మికులు
బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నా ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. తమకు చదవుకోవాలని ఉందని.. మంచి ఉద్యోగం చేయాలని ఉందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని అంటున్నారు బోసిమాటలతో. కరువు ప్రాంతాలని అధికారులు రాసుకువెళ్లారే తప్ప ఎలాంటి సాయం అందించలేదని వాపోతున్నారు వారి తల్లిదండ్రలు. తమ పిల్లలను బతికించుకునేందుకు .. నాలుగు వేళ్లు నోటికి వెళ్లాలంటే తాము పనిచేయకతప్పదంటున్నారు .

 

16:06 - March 3, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులు, పోలీసులతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశం అయ్యారు. ఈనెల 5న సాయంత్రం గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. 10 న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 18 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నట్లు పేర్కొన్నారు. 

కాసేపట్లో జైలు నుంచి కన్హయ్య విడుదల

ఢిల్లీ : జెఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కాసేపట్లో విడుదల కానున్నారు. తీహార్ జైలు నుంచి కన్హయ్య విడుదల కానున్నారు.

రోజా సస్పెన్షన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సింగిల్‌ బెంచ్‌లో వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు డివిజన్‌ బెంచ్‌ సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

15:55 - March 3, 2016


గుంటూరు : జిల్లాలోని సీతానగరం వద్ద ఓ వ్యక్తి రైలు వంతెనకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న రైలు వంతెనకు ఆ వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వ్యక్తి మృతి వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా లేక అతనే ఉరేసుకుని చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి సంబంధించిన ఏ వివరాలూ లభ్యం కాలేదు. 

 

15:53 - March 3, 2016

ఢిల్లీ : జెఎన్‌యులో దేశానికి సంబంధించిన అనేక సమస్యలపై డిబేట్స్ జరుగుతుంటాయని ఆ యూనివర్శిటీ విద్యార్థులు అంటున్నారు. అంతమాత్రాన అక్కడ దేశ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయంటే అర్థం లేదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు కుల, మత అంశాలకు ప్రాతిపదికగా చేసుకుని ఓట్లు సంపాదించాలని చూస్తున్నాయని విమర్శించారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ కుమార్ జైల్ నుంచి విడుదల కాబోతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

15:49 - March 3, 2016

విశాఖ : ముద్రగడ పద్మనాభంపై ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం అసలు లక్ష్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. జగన్ కు పరోక్షంగా సహకరించడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నారని మంత్రి గంటా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన ఆరు అంశాలతో కూడిన లేఖ పరిశీలిస్తే కాపులకు మేలు చేయాలన్నది ముద్రగడ లక్ష్యంగా కనిపించడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూడడం సరికాదన్నారు.  

 

15:44 - March 3, 2016

హైదరాబాద్ : వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఆస్తులపైనా తన ఆస్తులపైనా దమ్ముంటే ప్రకాశం బ్యారేజీ పై చర్చకు రావాలని పయ్యావుల సవాల్ విసిరారు. తన ఆస్తులపై సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొగతనం కాదని మండిపడ్డారు. '1950 లో నా తండ్రి చేసే వ్యవసాయాన్ని చూసేందుకు మీ తాత వచ్చి వెళ్లారని.. అప్పట్లోనే 100 జతల ఎడ్లను పెంచిన నికార్సయిన వ్యవసాయ కుటుంబం మాదని' ఎద్దేవా చేశారు. 'నీ పేరు మీద ఏది లేని నువ్వు అన్ని ఉన్న నాపై కథనాలు రాయడం విడ్డూరంగా ఉందని' అన్నారు. 

15:38 - March 3, 2016

హైదరాబాద్ : ఏపీ రాజధానిలో సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, టిడిపి నేతలు కోట్ల రూపాయల భూదందాకు పాల్పడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి నారాయణ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వ అక్రమాలు అసంఖ్యాకంగా బయటపడుతున్నాయని చెప్పారు. టిడిపి నేతలు భూములు కోల్పోకుండా ఉండేందుకు అలైన్‌మెంట్లలో భారీగా మార్పులు చేశారని విమర్శించారు. 

 

15:34 - March 3, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సింగిల్‌ బెంచ్‌లో వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు డివిజన్‌ బెంచ్‌ సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

 

ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులు, పోలీసులతో స్పీకర్

హైదరాబాద్  : ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులు, పోలీసులతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశం అయ్యారు. ఈనెల 5న సాయంత్రం గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. 10 న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 18 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నట్లు పేర్కొన్నారు. 

 

చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్

చత్తీస్ ఘడ్ : సుకుమా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్ పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. 

జెవివి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.రఘురాములు అస్తమయం

హైదరాబాద్  : జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డా.రఘురాములు (77) అస్తమించారు. 

ఖమ్మంను హైదరాబాద్ లా తీర్చిదిద్దుతాం - కేటీఆర్..

ఖమ్మం : జిల్లాను హైదరాబాద్ లా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగర పాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు కేసీఆర్ కు వేసినట్లేనని, ఖమ్మం కార్పొరేషన్ లో ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. 

కేజ్రీవాల్ పై క్రిమినల్ కేసు..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై క్రిమినల్ కేసు నమోదైంది. మాజీ ఖలిస్తానీ ఉగ్రవాది జర్నల్ సింగ్ బింద్రాన్ వాలా పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న ఆప్ నేతలు సంజయ్ సింగ్, భగవత్ మాన్ లు పోస్టర్లు పంచారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాజ్ జాగృతి అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు జగ్దీప్ సింగ్ గిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

గోదావరి ఆనకట్టల నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం - జగదీష్ రెడ్డి..

హైదరాబాద్ : గోదావరి ఆనకట్టల నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం అంగీకరించారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరిపై 5 ఆనకట్టల నిర్మాణానికి మార్గం సుగమైందని, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గోదావరి నీటి సమస్య తీరనుందన్నారు. 

రాజధాని భూముల్లో అవినీతి - రోజా..

హైదరాబాద్ : రాజధాని భూముల్లో అవినీతి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. రూ. లక్షల కోట్ల కుంభకోణం బయటపడిందని, రెవిన్యూ మంత్రితో సంబంధం లేకుండానే భూ సేకరణ చేశారని విమర్శించారు. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ల్యాండ్ పూలింగ్ కు సహకరించని రైతుల భూములను గ్రీన్ జోన్ లో చేర్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రెవెన్యూ మంత్రిని తప్పించి నారాయణ, పుల్లారావులకు ఎందుకు బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. అవినీతి మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయలేదని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో రికార్డులు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

13:28 - March 3, 2016

ఖమ్మం : నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 30 వ డివిజన్ లో ప్రచారం సీపీఎం పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ అఫ్రోజ్ సమీన బరిలో ఉన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మచ్చలేని పాలన సాగించామని అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఈ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి అయిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:26 - March 3, 2016

హైదరాబాద్ : పక్కాప్లాన్‌ ప్రకారమే సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి సంజయ్‌ జైన్‌ హత్య జరిగిందని నార్త్ జోన్‌ డీసీపీ చెప్పారు. స్వప్న లోక్ కాంపెక్లు వద్ద సంజయ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి కారులో పరారైన సంగతి తెలిసిందే. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుల కోసమే గాలిస్తున్నామని అన్నారు. హత్యకుగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, సంజయ్‌ జైన్‌ వివాదాస్పద వ్యక్తి కాదని తమ ప్రాథమిక పరిశోధనలో తేలిందన్నారు.

13:24 - March 3, 2016

ఢిల్లీ : జెఎన్‌యు స్టూడెంట్ లీడర్ కన్హయ కుమార్‌ ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో జెఎన్‌యులో ఆయన రాకను స్వాగతిస్తూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే కన్హయ ఎటువంటి తప్పూ చేయలేదని తేలిందని జెఎన్‌యును నాశనం చేసేదిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని విద్యార్థి సంఘం నేత బాలాజీ పేర్కొన్నారు. దేశంలోని లౌకికత్వానికి భంగం కలిగించేలా కేంద్రం తీసుకుంటున్న ప్రతి చర్యనూ తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. టెన్ టివితో బాలాజీ మాట్లాడారు. జేఎన్ యూ సంస్థపై అటాక్ అని మొదటి నుండి చెప్పడం జరుగుతోందన్నారు. కొన్ని ఇష్యూలపై ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు. 9వ తేదీన ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, చివరి నిమిషంలో దీనిని రద్దు చేస్తున్నట్లు రిజిష్ట్రార్ పేర్కొనడం జరిగిందన్నారు. దేశం మెరుగుపరచుకోవడానికి మాత్రమే తాము మాట్లాడుతామని, ఈ ప్రోగ్రాంతో తమకు సంబంధం లేదన్నారు. జాతి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయని, తాము నినాదాలు చేసినట్టు వచ్చిన వీడియోలు ఫేక్ అని నిరూపితమైందన్నారు. దేశాన్ని వెనుకాల తీసుకొచ్చే విధంగా తాము రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. 

13:21 - March 3, 2016

ఢిల్లీ : దేశంలో నెలకొన్న సమస్యలు కాంగ్రెస్ తెచ్చినవేనని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రసంగంలో తనదైన శైలిలో కాంగ్రెస్ పలు విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ చెప్పిన మాటలను సభలో ఉటంకించారు. బంగ్లాదేశ్ తో సరిహద్దు వివాదం కాంగ్రెస్ తెచ్చిందేనని తెలిపారు. ప్రధానిగా కాకుండా ఓ సభ్యుడిగా అభిప్రాయాలు సభలో పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. విద్యావిధానం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని, సభలో గందరగోళం సృష్టిస్తే ప్రజలకే నష్టమన్నారు. ప్రతి ఎంపీ తమ అభిప్రాయాలను సభలో చెప్పే విధంగా ఉండాలని తెలిపారు. పార్లమెంట్ గందరగోళంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, సభలో బిల్లులు త్వరగా పాస్ అయ్యేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, జీఎస్టీ బిల్లు కాంగ్రెస్ ప్రతిపాదించేదేనని, దీనిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను విపక్షాలు అపహాస్యం చేయవద్దని, మేకిన్ ఇండియా కార్యక్రమం దేశం కోసం తీసుకొచ్చామని, ఇది విజయవంతం కాకపోతే సూచనలివ్వాలని సూచించారు. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లో మహళలే మాట్లాడాలని సూచించారు. మహిళల వికాసానికి కేంద్రం చర్యలు తీసుకొంటోందని చెప్పుకొచ్చారు. 

12:41 - March 3, 2016

ఢిల్లీ : ప్రతొక్క సభ్యుడూ సభా మర్యాదలను పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళా వికాసానికి కేంద్రం చర్యలు తీసుకొంటోందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. చర్చలో పాల్గొన్న ప్రతొక్కరికీ అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో జరగుతున్న తీరుపై బాధ, విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సభను అడ్డుకోవడం వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతుందని, ఇందులో విపక్ష, స్వపక్షానికి కూడా నష్టం కలుగుతుందన్నారు. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా ? లేదా ? అని ఆత్మపరిశీలన చేసుకోవాలని, సభా మర్యాదలకు భంగం కలుగకుండా ఉండేందుకు సభ్యులు ప్రవర్తించాలని..ఇలా ఎన్నో విషయాలు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. సభలో బిల్లులనుఆ మోదించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, అక్రమార్కులకు కళ్లెం పడుతుందని వీటిని అడ్డుకోవద్దని ఈ విషయం కూడా రాజీవ్ గాంధీ పేర్కొన్నారని తెలిపారు. ముఖ్యమైన అంశాలపై చర్చ జరగకుండా అడ్డుకోవడం బాధ్యతారాహిత్యమని మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. నేషనల్ వాటర్ బిల్లు ఆమోదం పొందలేదు ఎందుక ? అని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లు కూడా కాంగ్రెస్ దేనని, దీనిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. 

రాష్ట్రపతి సూచనలు స్వీకరిస్తాం - మోడీ..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచనలను స్వీకరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు చేసే తీర్మానంపై ఆయన మాట్లాడారు. సభను స్తంభింప చేయడం బాధాకరమని, పార్లమెంట్ సజావుగా సాగాలని, మహిళా వికాసానికి కేంద్రం చర్యలు తీసుకొంటోందని తెలిపారు. 

మోడీ..బాబు దగా జోడి...

ఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులది దగా జోడి అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీకి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంటే దానికి బాబు వంత పాడుతున్నారని విమర్శించారు. 

నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా - రావెల..

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానిలో తనకు భూములు ఉన్నాయని జగన్ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాయం తీసుకుంటానని ఏపీ మంత్రి రావెల పేర్కొన్నారు. పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండడంతో నైరాశ్యంలో ఉన్న జగన్ ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారని విమర్శించారు. గత పదేళ్ల నుండి తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, తాము అక్రమ లావాదేవీలు చేయలేదన్నారు. 

12:06 - March 3, 2016

విశాఖపట్టణం : మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపుకు ఏపీ ఈపీడీసీఎల్ ప్రతిపాదించింది. చార్జీలు పెంచే దిశగా ఆ సంస్థ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని జిల్లాల్లో ప్రజాభిప్రేయ సేకరణ చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీలో రూ. 294 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉంటుందన్న ప్రభుత్వం డిస్కంల సహాయంతో విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించడాన్ని సీపీఎం, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. గత ఏడాది ఆరు శాతం ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మళ్లీ నాలుగు శాతం పెంచాలనే ప్రతిపాదనను నిరసిస్తూ సీపీఎం, ప్రజా సంఘాలు విశాఖలో ఆందోళన చేపట్టాయి.

ముద్రగడపై గంటా ఆగ్రహం..

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా తమ వెనుకే ఉన్నారని ప్రచారం చేస్తున్న ముద్రగడ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. కాపులను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 

క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లే అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని టీఎస్ ప్రభుత్వం పేర్కొంది. గత మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 

ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలు ఉండాలి - కడియం..

వరంగల్ : ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలు ఉండాలని, ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు కూడా అవసరమని మంత్రి కడియం తెలిపారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తమకు ప్రతిపక్షాల నుండి పోటీ లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులే తమకు పోటీ అని తెలిపారు. 

కింగ్ ఫిషర్ పై కేసు నమోదు.

ఢిల్లీ : కింగ్ ఫిషర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులకు రూ.7 వేల కోట్ల మోసం చేయడంపై సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కింగ్ ఫిషర్ పై ఫిర్యాదు చేయాలని కోరినా స్పందించకపోవడంతో సీబీఐ స్వయంగా కేసు నమోదు చేసింది. 

11:44 - March 3, 2016

వరంగల్ : జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఏడాదికి రూ. 300 కోట్లు కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గురువారం ఆయన జిల్లాలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వరంగల్ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు. రానున్న వేసవిలోనూ 24గంటల పాటు విద్యుత్ అందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 10 వేల ఇళ్ల చొప్పున 30 వేల నివాసాలు నిర్మాణం చేస్తామన్నారు. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా మారుస్తామని, అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏదైనా ప్రారంభించదలచుకుంటే అది వరంగల్ జిల్లా నుండే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. 

గాంధీనగర్ లో మహిళ ఆత్మహత్య..

కరీంనగర్ : సిరిసిల్ల గాంధీనగర్ లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కూతురిని అత్తింటి వారిని వేధిస్తున్నారనే మనస్థాపంతో రమ అనే మహిళ నిప్పంటించుకుంది. 

బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

తూర్పుగోదావరి : పెద్దాపురం బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థిని అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థి అనితను కలెక్టర్ అరుణ్ కుమార్ పరామర్శించారు. 

గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసన..

ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి కఠారియా వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

11:26 - March 3, 2016

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు టెన్ టివితో మాట్లాడారు. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, ప్రతి సంవత్సరం ప్రజాభిప్రేయ సేకరణ జరపడం..ఛార్జీలు పెంచడం సర్వసాధారణమైందన్నారు. వెంటనే ఛార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. 

11:16 - March 3, 2016

మహిళలు తమ చర్మాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. ఇటీవల కాలంలో మహిళలే కాదు మగవారు కూడా తమ అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ క్రమంలో రకరకాల క్రీములు, సౌందర్య సాధనాలు అంటూ మార్కెట్లో లభించే రకరకాల వస్తువుల మీద ఆసక్తి చూపుతున్నారు. అటువంటి సౌందర్య సాధనాల్లో ముఖ్యంగా ఉపయోగించేది రోజ్‌ వాటర్‌. ఈ రోజ్‌ వాటర్‌లో సౌందర్య పోషకాలే కాదు ఔషధగుణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.
రోజ్‌ వాటర్‌లో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రోజ్‌ వాటర్‌ చుక్కలను చల్లటి నీటిలో వేసి ముఖాన్ని కడగటం వల్ల వయసు కారణంగా వచ్చే ముడతలూ, వలయాలూ దరిచేరకుండా ఉంటాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఎండలో తిరగడం వల్ల బాడీ టాన్‌ అయిపోతుంది. అటువంటి వారు టాన్‌ అయిన ప్రదేశంలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ను అప్లై చేసి మర్దన చేస్తే టాన్‌ తగ్గే అవకాశం ఉంటుంది.
మొటిమల వల్ల చర్మం మీద దురద పెడుతుంటే రోజ్‌ వాటర్‌ మిక్స్‌ చేసిన నీటితో ముఖాన్ని కడిగితే తగ్గుతుంది. రోజ్‌ వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నాలుగైదు చుక్కల రోజ్‌ వాటర్‌ను కాటన్‌ పై వేసి... గాయాలు, కాలిన ప్రదేశాల్లో సున్నితంగా రుద్దితే అవి త్వరగా మానటానికి అవకాశం ఉంటుంది. శరీరం దుర్వాసనగా అనిపిస్తుంటే కొన్ని రోజ్‌ వాటర్‌ చుక్కలను శరీరానికి అప్లై చేయడం వల్ల దుర్వాసన తగ్గి, సువాసన వ్యాపిస్తుంది. 

11:14 - March 3, 2016

హైదరాబాద్ : సంజయ్ జైన్ కు ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని అతని స్నేహితులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్వప్న లోక్ కాంపెక్సు వద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ స్నేహితులు టెన్ టివితో మాట్లాడారు. సంజయ్ జైన్ తన నివాసం పక్కనే ఉంటున్నాడని, అందరితో కలిసిమెలిసి ఉండేవాడని ఓ స్నేహితుడు తెలిపారు. ఇలాంటి వ్యక్తిని హత్య చేశారని వచ్చిన సమాచారం నమ్మలేదని, కానీ ఇది నిజం అని తెలుసుకున్న తరువాత తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాయమని తెలిపారు. సదరన్ ల్యాండ్స్ లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో అనుష్క అనే ఫ్రెండ్ పరిచయమైందని సంజయ్ పేర్కొన్నాడని, కానీ లవ్ ఎఫైర్ కాదని పేర్కొన్నారు. 

11:11 - March 3, 2016

మెదక్ : ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు కల్పించామని అధికారులు చెబుతున్న మాటలు కేవలం మాటలే అని తేలిపోతోంది. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డిలోని ఓ జూనియర్ కాలేజీలో కరెంటు లేకపోవడంతో చీకట్లోనే విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్ష రాశారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సదుపాయాలు లేకుండానే విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క నిమిషం నిబంధన తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమౌతున్న దృష్ట్యా కలెక్టర్ కు గతంలోనే తాము వినతిపత్రం అందించడం జరిగిందని పీడీఎస్ యూ నేత టెన్ టివికి తెలిపారు. నీస సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారని తెలిపారు. కానీ పరీక్షలు ప్రారంభమైనా మౌలిక వసతులు కల్పించడంలో విద్యాశాఖాధికారులు విఫలం చెందారని పీడీఎస్ యూ నేత విమర్శించారు. 

11:00 - March 3, 2016

వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి వెలుగులోకి వచ్చారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించాను. నైనా గంగూలీ ఈ పాత్రకు న్యాయం చేయగలదనిపించింది. కళ్ళతోనే హావభావాలను అద్భుతంగా వ్యక్తం చేయగల సిత్మాపాటిల్‌లా నైనా నటించగలదు' అని చెప్పారు.

10:57 - March 3, 2016

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకోవడం కోసం బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలాండ్‌కి చెందిన ప్రఖ్యాత కాస్మెటిక్‌ బ్రాండ్‌ ఇంగ్లోట్‌, మేజర్‌ బ్రాండ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో సంయుక్తంగా ముంబైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది మంది మహిళలతోపాటు సోనాక్షి సిన్హా కూడా పాల్గొననుంది.

అధిక సంఖ్యలో మహిళలు ఒక చోట చేరి గోళ్ళకు రంగు వేసుకోవడంతో గిన్నిస్‌ రికార్డ్ సాధించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. ఇది సాధిస్తే మోస్ట్‌ పీపుల్‌ పెయింటింగ్‌ దెయిర్‌ ఫింగర్‌ నెయిల్స్ సైమల్‌ టేనియస్లీ అనే రికార్డ్ సోనాక్షి బృందానికి దక్కుతుంది. 'మహిళా దినోత్సవం నాడు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది' అని సోనాక్షి తెలిపారు. సోనాక్షి ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో 'అకీరా' చిత్రంతోపాటు 'ఫోర్స్‌2' చిత్రంలోనటిస్తోంది.

10:56 - March 3, 2016

'ఒకప్పుడు నేను కూడా వివక్షకు గురయ్యాను. శరీర ఛాయ కారణంగా నన్ను అరబ్‌ టెర్రరిస్ట్‌ అన్నార'ని చెప్పింది బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్న ప్రియాంక ఇటీవల ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక వివక్ష గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించింది. నల్లజాతీయులకు ఆస్కార్‌ అవార్డుల్ని ఇవ్వడంలో వివక్షత చూపిన నేపథ్యంలో కొంతమంది నల్లజాతీయులు ఆస్కార్‌ వేడుకలో హాజరవ్వడానికి నిరాకరించారు.'2013లో నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ తరుణంలో 'ఇన్‌ మై సిటీ' అనే థీమ్‌ సాంగ్‌ని పాడాను. అప్పుడు కొంతమంది ఫుట్‌బాల్‌ అభిమానులు 'ఎవరీ అరబ్‌ టెర్రరిస్ట్‌' అంటూ లీగ్‌కి మెయిల్స్ పంపారు. అది తెలియగానే అందరినీ బయటికి పిలిచి, 'ప్రతీ అరబ్‌వాసి టెర్రరిస్ట్ ఎందుకవుతాడు?, నేను చామనఛాయలో ఉన్నాననేగా నన్ను టెర్రరిస్ట్ అంటున్నారు?' అని ఘాటుగా ప్రశ్నించాను' అని ప్రియాంక తెలిపింది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ 'బేవాచ్‌' చిత్రంలో ప్రతినాయకురాలిగా నటిస్తోంది.

చెట్టుకు ఢీకొన్న కారు ఆరుగురు మృతి..

మధ్యప్రదేశ్ : పంచ్ మర్హి ప్రాంతంలో ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. చంద్రాపూర్ మాథా నుండి పంచమర్హికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కన్హయ్యకు క్లీన్ చిట్ త్వరలో వస్తుంది - సోదరుడు..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కు త్వరలోనే క్లీన్ చిట్ వస్తుందని అతని సోదరుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎలాంటి ఆధారాలు లేవని ఓ జాతియ ఛానెల్ తో పేర్కొన్నారు. 

10:29 - March 3, 2016

వరంగల్ : జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల శివారు మద్దు తండాలో ఆడ శిశువు మృతి కలకలం రేపింది. కుటుంబ సభ్యులే ఆ శిశువును చంపేశారని గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో ఐడీడీఎస్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇవాళ శిశువు మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆడ కవల పిల్లలు పుట్టారనే కారణంతోనే కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

ఇద్దరు కవల పిల్లలు..
వావిలాల మద్దు తండాకు చెందిన వాంకుడోతు సరిత, బాలాజీలకు 2012లో వివాహం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల క్రితం బాలుడు జన్మించాడు. రెండో సంతానంలో భాగంగా 2016 ఫిబ్రవరి 20న మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సరిత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఓ శిశువు ఫిబ్రవరి 28న మృతి చెందగా పూడ్చిపెట్టారు. అయితే ఇద్దరు ఆడ శిశువులు జన్మించారన్న ఉద్దేశ్యంతో కుటుంబసభ్యులే ఒక శిశువును హత్యచేసి ఉంటారని ప్రచారం జరిగింది. దీంతో ఐసీడీఎస్‌ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టుమార్టం..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. గురువారం తహసీల్దార్‌ సమక్షంలో శిశువు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి పంపించనున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మద్దు తండాలో శిశువు మృతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇది హత్యా..లేక సహజ మరణమా అన్న విషయం పోస్టు మార్టమ్‌ నివేదికలో వెల్లడి కానుంది. 

10:22 - March 3, 2016

వరంగల్ : జిల్లాలో ఏప్రిల్ నుండి 24 గంటల కరెంటు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం సరియైన స్టోరేజ్ లు లేవని, ఉన్న రిజర్వాయర్లలో నీరు లేదన్నారు. గోదావరి నది నుండి నీటిని లిఫ్ట్ చేయడానికి, జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ సంవత్సరం 8.60 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ప్రతి రోజు తాగునీరు అందచేస్తామన్నారు. శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కాబోతోందని, మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని కడియం తెలిపారు.  

కఠారియా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఐ నోటీసులు..

ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి రామ్ శంకర్ కఠారియా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఐ నోటీసు అందచేసింది. 

10:13 - March 3, 2016

హైదరాబాద్ : తన కుమారుడు సంజయ్ చాలా మంచోడని..సాఫ్ట్ గా ఉంటాడని తండ్రి పేర్కొన్నారు. స్వప్న లోక్ కాంప్లెక్సు వద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహాంకాళీ పీఎస్ లో ఉన్న మృతుడి తండ్రి టెన్ టివితో మాట్లాడారు. ఏం జరిగిందో మాకు ఏం తెల్వదని, మంచి పిల్లోడు అని తెలిపారు. ఏవ్వరితోనూ గొడవలు పెట్టుకోడని, అందరితో సాఫ్ట్ గా ఉంటాడన్నారు. బేగంపేటలో ఓ ఎగ్జామ్ రాస్తున్నాడని, ఎవ్వరిపైనా కూడా అనుమానం లేదన్నారు. సదరన్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు.

దర్యాప్తు చేస్తున్నాం..
సంజయ్ జైన్ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతోందని మహాంకాళీ సీఐ పేర్కొన్నారు. ఉదయం 5గంటలకు ఈ ఘటన జరిగిందని, వైట్ స్విఫ్ట్ కారులో నిందితులు వచ్చారని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఇతరత్రా వాటిని పరిశీలించి నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే సంజయ్ జైన్ ఇంటర్ అంధ విద్యార్థులకు సహాయ పడేందుకు బేగంపేటలో పరీక్ష కేంద్రానికి వెళుతున్నట్లు సమాచారం. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 238 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 68 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభాలలో ట్రేడవుతున్నాయి. 

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం సీపీఎం - తమ్మినేని..

ఖమ్మం : టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం సీపీఎంనేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం పాలనలో ఖమ్మం మున్సిపాల్టీ అభివృద్ధి చెందిందని, 40 ఏళ్ల చరిత్రలో సీపీఎం కౌన్సిలర్లు, ఛైర్మన్ లపై అవినీతి ఆరోపణలు రాలేదని తెలిపారు. ఖమ్మం ప్రజలు వినూత్నమైన తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. 

వరంగల్ లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల సస్పెండ్..

వరంగల్ : ముగ్గురు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులను పార్టీ నుండి జిల్లా అధ్యక్షుడు రవీందర్ సస్పెండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో 41,42,46 డివిజన్ల నుండి ప్రభాకర్, లక్ష్మీనారాయణ, రమేష్ లు పోటీ చేస్తున్నారు. 

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు..

హైదరాబాద్ : సైదాబాద్ శ్రీ పద్మావతి కళాశాలలో ఇంటర్ పరీక్షకు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు.

 

మక్కాలో మాక్ డ్రిల్..

హైదరాబాద్ : పాతబస్తీ మక్కా మసీదు లో అక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు ఆయుధాలతో ప్రవేశిస్తే ఎలా అడ్డుకోవాలనే దానిపై ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..నాలుగో రోజు..

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు చండీశ్వర పూజ, పంచావరణార్చనలు జరగనున్నాయి. జపానుష్టానములు, స్వామి వారికి విశేషార్చనలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారికి నవావరణార్చనలు చేయనున్నారు. 

అమ్యూజ్ మెంట్ ప్రదర్శన..

ముంబై : ఇవాళ్టి నుండి అమ్యూజ్ మెంట్ ప్రదర్శ న జరగనుంది. ఈనెల 5 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఇందులో 19 దేశాలకు చెందిన 100 కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి.

 

రెండో రోజు ఆభరణాల వర్తకుల సమ్మె..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఆభరణాల వర్తకుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. బడ్జెట్ లో ప్రకటించిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులు సమ్మె బాట పట్టారు. 

09:40 - March 3, 2016

ఖమ్మం : ప్రస్తుత పరిస్థితుల్లో అంతటా అవకాశ వాదం..అవినీతి ప్రథమ స్థానం ఆక్రమించిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మీట్ ద ప్రెస్ లో పాల్గొన్నారు. 50 స్థానాల్లో ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ గా ఏర్పడడానికి, ఖమ్మం మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఖమ్మం అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల సాధన కోసం కృషి చేసే అభ్యర్థులను గెలిపిలంచాలని కోరుతున్నామన్నారు. సీపీఎం గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదని, గతంలో సీపీఎం పాలన చేయడం అందరికీ తెలిసిందేన్నారు. గత మున్సిపల్ పాలక వర్గం ఐదు సంవత్సరాల పాటు పనిచేసిందని గుర్తు చేసిందన్నారు. 40 సంవత్సరాల చరిత్రలో సీపీఎం పార్టీ..ఛైర్ పర్సన్..ఛైర్మన్..వార్డు కౌన్సిలర్లపై అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. అవినీతి జరగకపోవడమే కాక..కనీసం ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు గుర్తు చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

డబ్బే సర్వస్వం..
కానీ ఖమ్మం మున్సిపాల్టీ పరిధే కాకుండా అవకాశ వాదం..అవినీతి అనేది ప్రముఖంగా ముందుకొచ్చిందన్నారు. డబ్బే సర్వస్యం అయిపోయిందని, ఓ అభ్యర్థి ఒక పార్టీలో ఉండి సాయంత్రం వరకు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారని విమర్శించారు. గెలిచిన తరువాత కూడా పార్టీలు మారే అవకాశం ఉందని, ప్రస్తుతం ఫిరాయింపుదారులే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల్లో కూడా చిన్న స్థాయి నాయకులు కూడా చెదిరిపోతున్నారంటే రాజకీయ వ్యవస్థ ఎలా మారుతుందనేది అర్థం చేసుకోవాలని సూచించారు.
20 ఏళ్ల క్రింద చాలా మంది ప్రజా సేవకులు పార్లమెంట్ లో కనిపించే వారని, పేద, మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారని తెలిపారు. కానీ ప్రస్తుతం 89 శాతం ఎంపీలు శతకోటీశ్వర్లుగా ఉన్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులే రాజకీయ శక్తులుగా మారిపోయారని పేర్కొన్నారు.

రోహిత్ వేముల ఘటనపై స్పందనేది ? 
అభ్యర్థుల నియామకం చేసే విషయంలో ఎంత డబ్బు ఖర్చు పెడుతాడు ? తదితర అంశాలు ముందుకొచ్చాయన్నారు. వ్యవస్థలో ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్లి డబ్బు అధిక ప్రాధాన్యం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. డబ్బు రాజకీయాలను ఎదుర్కొవడమే లక్ష్యంగా తాము ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రయత్నాలు చేయడం జరిగిందన్నారు. డబ్బు రాజకీయాలను ప్రజలు అసహ్యంచుకొనే పరిస్థితి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. హెచ్ సీయూ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అందరికీ తెలిసిందేనని తెలిపారు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉండదా ? అని ప్రశ్నించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న వారు హెచ్ సీయూకు రావడం జరిగిందని, నగరంలో ఉన్న సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు రాలేదని తమ్మినేని విమర్శించారు. 

09:33 - March 3, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయా ? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు డిస్కంలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పదే పదే విద్యుత్ వినియోగదారులపై భారం వేయడం దారుణమని పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా ప్రతి సంవత్సరం ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. ప్రజాభిప్రేయ సేకరణ తూ.తూ మంత్రంగా కాకుండా స్వేచ్ఛగా జరిపించాలని సీపీఎం, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. 

09:29 - March 3, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్..స్వప్న లోక్ కాంప్లెక్స్..ఉదయం..రద్దీ తక్కువగా ఉంది..కొందరు మార్నింగ్ వాక్ చేస్తున్న వారు..మరికొందరు ఇతర పనులపై వెళుతున్నారు...ఒక్కసారిగా అక్కడ అలజడి..ఏమైందో తెలిసే లోపు ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు..యువకుడిని దారుణంగా చంపారన్న వార్త సికింద్రాబాద్ లో సంచలనం సృష్టించింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ జంగ్ ఉదయం సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంపెక్స్ వద్ద నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో తెలుగు రంగుతో ఉన్న ఓ స్విఫ్ట్ కారు వచ్చింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సంజయ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సంజయ్ పరుగులు తీశాడు. కానీ వారు సంజయ్ ను పట్టుకుని కత్తులతో ఇష్టమొచ్చినట్లుగా పొడిచారు. దీనితో అతను అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. వెంటనే నిందితులు అదే కారులో ట్యాంక్ బండ్ వైపుగా పారిపోయారు. సంజయ్ వద్ద లభించిన ఐడీ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాంప్లెక్సు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎవ్వరితోనూ శత్రుత్వం లేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. నిందితులను పట్టుకున్న తరువాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ ను ఎందుకు హత్య చేశారో తెలుస్తుంది. 

ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రేయ సేకరణ..

విజయవాడ : ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు రంగం సిద్ధ: చేసుకుంటున్నాయి. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రూ. 270 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదించనున్నాయి. 

శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్..

చిత్తూరు : శేషాచల అటవీ ప్రాంతంలో ప్రత్యేక కార్యదళం కూంబింగ్ నిర్వహించింది. ఆరుగురు తమిళ కూలీలను కార్యదళం పట్టుకుంది. 

గొందిపాలెంలో అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి : పి.గన్నవరం (మం) గొందిపాలెంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్లు దగ్ధమయ్యాయి. రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.

 

స్వప్నలోక్ కాంపెక్స్ వద్ద దారుణ హత్య..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్సు వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంజయ్ జైన్ ను గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్న సంజయ్ జైన్ ను కారులో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. 

నేటి ద్వితీయ ఇంటర్ పరీక్షకు సెట్ బి ప్రశ్నపత్రం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి పరీక్షకు సెట్ బి ప్రశ్నపత్రం ఎంపిక చేశారు. ఉదంయ 9గంటల నుండి 12గంటల వరకు పరీక్ష జరగనుంది. 

క్రికేటర్ మార్టిన్ క్రో కన్నుమూత..

ఢిల్లీ : న్యూజిలాండ్ క్రికేటర్ మార్టిన్ క్రో (53) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. 
22 సెప్టెంబర్ 1962లో ఆయన జన్మించారు. ఫస్ట్ క్లాస్  కెరీర్ లో 71 సెంచరీలతో 20 వేల పరుగులు పూర్తి చేశారు. 1982 ఫిబ్రవరిలో అంతర్జాతీయ కెరీర్ ను క్రో ప్రారంభించారు. 1995 నవంబర్ లో రిటైర్ మెంట్ ప్రకటించారు. 

07:32 - March 3, 2016

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, కార్మిక వర్గాల్లో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్ పై 60 శాతం పన్ను విధించడంతో తమకు ఎంత నష్టం జరుగుతుందన్న కోణంలో లెక్కలేస్తున్నారు. పీఎఫ్ విత్ డ్రాయల్ విషయంలో ఆర్థిక శాఖ కొత్త వివరణ ఇచ్చినప్పటికీ వడ్డీకి పరిమితం చేస్తామని చెబుతున్నప్పటికీ ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ విత్ డ్రాయల్ పై కాని వాటిపై వచ్చే వడ్డీపై కానీ పన్ను విధించడం ఎంత వరకు సమంజసం..ఉద్యోగ, కార్మిక ఆర్థిక భద్రతను ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ? ఫించన్ విధానంలో ఉన్న లోపాలేంటీ ? పెన్షన్ విధానంలో తీసుకరావాల్సిన మార్పులేంటీ ? తదితర అంశాలపై టెన్ టివి జనపథంలో ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ నేత ఎం.ఎన్.రెడ్డి విశ్లేషించారు. ఆయన అభిప్రాయాలు తెలసుకోవాలంటే వీడియో చూడండి. 

07:24 - March 3, 2016

రాజధాని భూ దందాకు సంబంధించి ఓ పత్రిక పలు కథనాలు ప్రచురిస్తోంది. దీనిపై వైసీపీ, టిడిపి పలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ పెద్ద భూములు ఆక్రమించుకోలేదా..అవినీతికి పాల్పడలేదా ? అని టిడిపి నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు ఇలాంటి పరిణామాలు ఇలాంటి చేసుకున్నాయా ? మరోవైపు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కు బెయిల్ మంజూరైంది. తదితర పరిణామాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో సాంబమూర్తి (బీజేపీ), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

06:55 - March 3, 2016

ఆసియా కప్‌ ట్వంటీ 20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్‌ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌జట్టు 19.1 ఓవర్లలో చేధించింది. సౌమ్య సర్కార్‌ , మహ్మదుల్లా రాణించడంతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. మార్చి 6న భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

06:53 - March 3, 2016

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడి వేడిగా సాగనున్నాయి. ప్రతిపక్షం వైసీపి ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని స్పష్టం చేస్తోంది. అటు రాజధాని భూదందాపైనా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షం దాడిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సైతం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. దీంతో ఈసారి సుధీర్ఘంగా జరిగే బడ్జెట్ సమావేశాలు..రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. ఈనెల 5నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సన్నద్దం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి యనమల ఈనెల 10న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెడతారు. అయితే సుధీర్ఘంగా సాగే ఈ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం వైసిపి మరోసారి అవిశ్వాసాన్ని ఆయుధంగా ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే స్పీకర్ కోడెలపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన ఆ పార్టీ..అటు ప్రభుత్వంపైనా అవిశ్వాసానికి సిద్ధమవుతోంది. అయితే విపక్షం ప్రయోగించే అవిశ్వాసాస్త్రాన్ని అంతే ధీటుగా, సమర్ధవంతంగా ఎదుర్కొంటామంటోంది అధికార పార్టీ టిడిపి. అవిశ్వాసం అవకాశం ఇవ్వడం ద్వారా తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందో ప్రజలకు చెప్పే అవకాశం లభిస్తుందని చెప్తున్నారు టిడిపి నేతలు.

సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారంట..
ఇదిలా ఉంటే వైసిపి అవిశ్వాస నిర్ణయాన్ని ఆపార్టీ సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని టిడిపి నేతలు చెప్తున్నారు. ఈసమావేశాల్లో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌ సమయంలో జరిగే చర్చలో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉందని వైసిపి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే వైసిపి అధినేత మాత్రం అవిశ్వాస తీర్మానం విషయంలో వెనెక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఆపార్టీ ఎమ్మెల్యేలకే అధినేత వైఖరి మింగుడుపడడం లేదంటున్నారు టిడిపి నేతలు. దీంతో బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపార్టీనుండి మరింత మంది ప్రభుత్వ పనితీరుకు మద్దతు పలుకుతారంటున్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ ఆకర్ష్ విషయాన్ని జగన్ సభలో ప్రస్తావిస్తే ఆయన తండ్రి వైఎస్సార్‌ ఇలాంటి ఆకర్ష పథకాలకు ఆధ్యుడంటూ ఎదురు దాడికి సిద్ధమవుతున్నారు టిడిపి నేతలు.

గట్టిగా జవాబిస్తున్నామంటున్న అధికారపక్షం..
మరోవైపు రాజధాని విషయంలో ప్రతిపక్షం చేస్తున్న భూదందా ఆరోపణలపైన అధికార పార్టీ గట్టిగానే జవాబివ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చిన వార్తల్లో వాస్తవమెంతో చెప్పడంతో పాటు దాన్ని నిరూపించాలని విపక్షానికి సవాలు విసరాలని నిర్ణయించింది. ఇదే అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే పూర్తి ఆధారాలతో ధీటుగా జవాబివ్వాలని నిర్ణయించింది. ఏది ఏమైనా..అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొడతామంటోంది టిడిపి. తమ నాయకుడి వైఖరి నచ్చక వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపలేక తమపై ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోందని ఆరోపిస్తోంది. 

06:51 - March 3, 2016

విజయవాడ : ఏపీ క్యాబినెట్‌ భేటీ హాట్‌హాట్‌గా సాగింది. మంత్రుల భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఓ పత్రికలో కథనాలు రావడంపై ఆయన సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముద్రగడ బహిరంగ లేఖ రాసినా కాపు మంత్రులు స్పందించపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ అంశాలపై మంత్రులు స్పందించకపోవడాన్ని సిఎం తప్పుపట్టారు. మంత్రి రావెల కిషోర్‌, పుల్లారావులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భూముల కొనుగోళ్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రులు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీపై ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు మీడియా ముందుకు వచ్చి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.

కాపు మంత్రులకు క్లాసులు..
మరో వైపు కాపు మంత్రులకు కూడా చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి రాసిన లేఖపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై వ్యక్తిగతంగాను., ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగాను కామెంట్లు చేస్తున్నా.. ముద్రగడ వ్యాఖ్యల్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని మంత్రుల్ని ప్రశ్నించారు. కాపులకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదా అంటూ సిఎం ప్రశ్నించారు. వైసీపీ చేస్తోన్న విమర్శలే ముద్రగడ నోటి వెంట కూడా రావడం వెనుక ఆంతర్యమేంటో ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. కేబినెట్‌ భేటీలో మంత్రి గంటాపై కూడా సిఎం విరుచుకుపడ్డారని సమాచారం. గంటా ఇన్‌చార్జిగా ఉన్న కడప జిల్లాలో.. సి.రామచంద్రయ్య వ్యాఖ్యలపై కూడా స్పందించకపోవడాన్ని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మందకృష్ణ ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని సిఎం ప్రశ్నించినట్లు సమాచారం. మందకృష్ణకు ఆంధ్రాలో ఏం పని ఉందని వైసీపీ అజెండాను మందకృష్ణ అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. 

06:48 - March 3, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై అందరికీ ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో 157 ఇసుక రీచ్‌లు ఉన్నాయని.. అక్కడ నిర్ణీత లోతులో ఇసుకను తీసుకునే వెసలుబాటు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిడ్జీలు, రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల్లో ఇసుకను తీయకూడదని నిర్ణయించారు. ఇసుకను వేరే ప్రాంతాలకు తరలించినా నిల్వ చేసినా మాఫియాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడినా పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్‌గా ఏర్పడి మానిటరింగ్‌ చేస్తామని.. ఇసుక అక్రమ రవాణాను నివారిస్తామని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు.

పలు నిర్ణయాలు..
ఇక జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్లను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 29 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం 5 వేల కిలోమీటర్లు నిర్మిస్తామని పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 2 వేల 107 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నివారణకు ఫారెస్ట్ యాక్టులో కొత్త నిబంధనలు తీసుకువస్తూ కేబినెట్‌లో నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ మొదటిసారి పట్టుబడితే 3 లక్షల జరిమానా 5 ఏళ్ల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే 5 లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు, మూడోసారి పట్టుబడితే 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడేలా నిబంధనలను సవరిస్తూ కేబినెట్‌లో నిర్ణయించారు.

లా యూనివర్సిటీ చట్టానికి సవరణలు..
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ లా యూనివర్శిటీ చట్టానికి సవరణలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. యూనివర్శిటీ ఛాన్సలర్‌గా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను నియమించనున్నారు. వర్సిటీలో 50 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు..40 శాతం సీట్లు ఇతర రాష్ట్రాలకు, 10 శాతం ఎన్‌ఆర్‌లకు కేటాయించాలని విధి విధానాలను ఖరారు చేశారు. దీంతో పాటు ఐటీలో కొత్తగా ఐవోటీ పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌, ఫిక్కీ, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ సంయుక్తంగా ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

06:46 - March 3, 2016

హైదరాబాద్‌ : నేరాలను అరికట్టడానికి పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్భంద తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల వల్ల నేరాలు అదుపులోకి వస్తున్నాయని, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి ఎస్‌ఆర్‌నగర్‌ దాసారం బస్తీలో పోలీసులు నిర్బంధ తనఖీలు చేపట్టారు. వెస్టు జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. కార్డన్‌ సెర్చ్ లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 79 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 బైకులు, మూడు ఆటోలను సీజ్‌ చేశారు. 

06:44 - March 3, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 7,8 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. తమ్మిడిహట్టితో పాటు మేడిగడ్డ, పెన్‌గంగ, గోదావరిపై నిర్మించతలపెట్టిన డ్యామ్‌ల గురించి ఫడ్నవీస్‌తో కేసీఆర్ చర్చలు జరుపుతారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు కూడా కేసీఆర్ తోపాటు ముంబై వెళతారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఆనకట్టల నిర్మాణంపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల ముసాయిదాలను ఇప్పటికే తెలంగాణ సర్కార్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కేసీఆర్‌ ముంబై పర్యటనలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఎత్తు అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎత్తు 148 మీటర్లుగా ప్రతిపాదించారు. దీంతో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.

ప్రాజెక్టులను నిర్మిస్తున్న మహారాష్ట్ర సర్కార్..
మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, పెన్‌గంగపై రాజాపేట, పింపరాడ్‌ ప్రాజెక్ట్‌లు మహారాష్ట్ర నిర్మిస్తోంది. చనాఖా కొరట ప్రాజెక్ట్‌ను తెలంగాణ నిర్మిస్తుంది. ఒక్కో ప్రాజెక్ట్‌ను 1.5 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజపేట బ్యారెజ్‌ కింద 2,500 ఎకరాలు, పింపిరాడ్‌ ప్రాజెక్ట్‌ కింది 4,500 ఎకరాలు, చనాఖా కొరట బ్యారేజ్‌ ద్వారా 13,500 ఎకారాలకు నీరు ఇస్తారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో వివిధ స్థాయుల్లో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. 500 కోట్ల రూపాయలతో చేపట్టే చనాఖా కొరట ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు 2,597 కోట్లు రూపాయలు, అన్నారం ప్రాజెక్టుకు 1798 కోట్లు, సుందిళ్ల ప్రాజెక్ట్‌కు 1457 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తైతే తెలంగాణలో వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుంది. 

06:41 - March 3, 2016

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌కు బెయిల్‌ రావడంపై విద్యార్థుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కన్నయ్యపై తప్పుడు కేసులు బనాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. మిగతా విద్యార్థులు కూడా విడుదలయ్యే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. 

06:35 - March 3, 2016

తూర్పుగోదావరి : జిల్లా రాజమండ్రి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై విశాఖ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు దండేపల్లి సమీపంలో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

దాసారం బస్తీలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో దాసారం బస్తీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 79 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 బైక్ లు, మూడు ఆటోలు సీజ్ చేశారు. 

నేడు 29వ కిసాన్ జాతియ మహాసభలు ప్రారంభం..

హైదరాబాద్ : నేటి నుండి 29వ కిసాన్ జాతియ మహాసభలు జరగనున్నాయి. ఉదయం 11గంటలకు బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో సభలను సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో నేడు విచారణ..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లే అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ జరగనుంది. 

ఖమ్మం..వరంగల్ లో మంత్రి కేటీఆర్ ప్రచారం..

హైదరాబాద్ : నేడు, రేపు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. 

నేడు కన్హయ్య కుమార్ విడుదల..

ఢిల్లీ : నేడు తీహార్ జైలు నుండి జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ విడుదల కానున్నారు. గత కొన్ని రోజులుగా దేశద్రోహం ఆరోపణలపై ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

Don't Miss