Activities calendar

04 March 2016

22:07 - March 4, 2016

పూచిన పిడికిళ్ల పూలు ఆకాశాన్ని సవాల్ చేశాయి. అణచివేతతో నిప్పులాంటి నిజాన్ని కప్పిపుచ్చలేరని చాటాయి. మాకు ఆజాదీ కావలసిందేనని నినదించాయి. విద్యార్థులు అకాంక్షపు వెల్లువలో జెఎన్యూ పులకిచింది. కన్హయ్య కుమార్ విడుదలయ్యారు. జెఎన్యూలో విద్యార్థుల మధ్య నుంచి గర్జించిన తీరు అబ్బుర పరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ గా వెళ్తోంది. మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే జెఎన్ యూ ఘటనపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేకం కథనం... వీడియోలో చూడండి. 

 

22:00 - March 4, 2016

హెల్మెట్ దుకాణపోడ్తా ఎగవడ్తున్న జనం..సర్కార్ పనికి సమాన్యుడి సూటి ప్రశ్న... ఖమ్మంల దిరుగుతున్న డూబ్లికేట్ కేసీఆర్, కథ, కదలికంతా సేమ్ టూ సేమ్, తాగుబోతులకు రుణపడిబోయిన తెలంగాణ ప్రభుత్వం, కాళ్లు కడిగిననెత్తిన చల్లుకుంటెనే బెటరంటున్న మనోళ్లు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:53 - March 4, 2016

యెమెన్‌ : యెమెన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు భారతీయ నర్సులతో పాటు 16 మంది మృతి చెందారు. సాయుధులైన నలుగురు తీవ్రవాదులు అడెన్‌ నగరంలోని ఓ వృద్ధాశ్రమంపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు సెక్యూరిటి గార్డును చంపి ఆశ్రమంలోకి చొరబడి కాల్పులు జరిపినట్టు సమాచారం. ఐసిస్‌ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

21:51 - March 4, 2016

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ 2015 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది. ఉపకార్‌, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి, హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ,  హిమాలయా కీ గోద్‌ మే వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన మనోజ్ కుమార్ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. ఉపకార్ సినిమాలో నటనకు గాను మనోజ్‌కుమార్‌ నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. 1992 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. సినీ పరిశ్రమలో విశేష కృషి చేసినవారికి భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేస్తుంది. 

 

21:49 - March 4, 2016

రంగారెడ్డి : తెలంగాణలో అభివృద్ధిచూసి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ టీఆర్ ఎస్ లో చేరారని చెప్పారు.. సీఎం కేసీఆర్‌.. మైలార్‌దేవ్‌పల్లిలో ప్రకాశ్‌గౌడ్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్‌.. ప్రకాశ్‌గౌడ్‌తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. 

 

21:46 - March 4, 2016

గుంటూరు : రాష్ట్రాభివృద్ధికి.. ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతోందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించబోనని ఆయన హెచ్చరించారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఆయనివాళ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
కాపు కల్యాణ మండపం ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గుంటూరు జిల్లా కోటప్పకొండలో పర్యటించారు. అక్కడ నిర్మించిన కాపు కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.. టూరిజం కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు.. కోటప్పకొండ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.. కొండ దగ్గర చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.. 
వైసీపీపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు
గుంటూరు జిల్లా పర్యటనలో.. ప్రతిపక్ష వైసీపీపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి సంపాదనతో పెట్టిన ఓ పత్రిక, ఛానల్‌ రాజధానిపై విషం కక్కుతోందని మండిపడ్డారు.. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కోటప్పకొండ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు.. కొండపై పార్క్ ను సందర్శించారు.. ట్రైన్‌లో ప్రయాణిస్తూ సరదాగా గడిపారు... 

 

21:43 - March 4, 2016

మెదక్ : భారత దేశానికి ఎర్రవెల్లి గ్రామం కొత్త పాఠాన్ని నేర్పాలన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గ్రామంలో ఎక్కడచూసినా పచ్చదనం కనిపించేలా తయారు చేస్తామని ప్రకటించారు.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు..   
ఎర్రవెల్లి, నర్సన్నపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటన
మెదక్‌ జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్‌.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని పరిశీలించారు.. ఎర్రవెల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను చూశారు.. ఆ తర్వాత గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఉన్న 2వేల 800 ఎకరాల వ్యవసాయ భూమికి ఉదయం 5నుంచి 11గంటలవరకూ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. మే 15లోపు ఇండ్లు పూర్తి చేస్తామన్నారు కేసీఆర్‌.. మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుమీదకొస్తే సర్పంచ్‌లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. సీఎం టూర్‌లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

21:39 - March 4, 2016

హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. మద్యం మత్తులో ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు కేసు నమోదు చేశారు. సుశీల్‌ డ్రైవర్‌ అప్పారావును స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. 

 

21:35 - March 4, 2016

హైదరాబాద్ : ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా వరుస విజయాలతో చెలరేగిపోతోంది. ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీలో వరుసగా నాలుగో విజయంతో టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది. స్వదేశంలో జరిగే 2016 టీ-20 ప్రపంచకప్ సమరానికి తాము సిద్ధమని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రకటించాడు. ఆసియాకప్ ఫైనల్లో సైతం హాట్ ఫేవరెట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
టీమిండియా టాప్ గేర్ 
మూడున్నర గంటల్లో ముగిసిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో టీమిండియా టాప్ గేర్ అందుకొంది. బంగ్లాదేశ్ లోని మీర్పూర్ వేదికగా జరుగుతున్న ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ నెగ్గిన ఒకే ఒక్కజట్టుగా ..ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. భారత్ వేదికగా మార్చి 15 నుంచి జరిగే 2016 టీ-20 ప్రపంచకప్ కు తాను పూర్తిస్థాయిలో సిద్ధమని జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా..చెప్పకనే చెప్పింది. 2016 సీజన్ ను ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించడం ద్వారా ప్రారంభించిన టీమిండియా...ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. అంతేకాదు..ఆసియాకప్ కు సన్నాహకంగా శ్రీలంకతో ముగిసిన స్వదేశీ సిరీస్ లో సైతం టీమిండియా 2-1 విజయం సాధించింది.
ఆసియాకప్ టీ-20 టోర్నీలో అదే దూకుడు
ఆ తర్వాత...బంగ్లాదేశ్ లోని మీర్పూర్ షేరే బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీలో సైతం అదేదూకుడు కొనసాగించింది. ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 45 పరుగులతో చిత్తు చేయడం ద్వారా టీమిండియా శుభారంభం చేసింది. ఆ తర్వాత...చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో మరో 27 బాల్స్ మిగిలిఉండగానే 5 వికెట్ల విజయంతో వరుసగా రెండో విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ శ్రీలంకతో ముగిసిన మూడో లీగ్ మ్యాచ్ లో..మరో నాలుగు బంతులు మిగిలిఉండగానే 5 వికెట్ల తో నెగ్గి విజయాల హ్యాట్రిక్ పూర్తి చేసింది.
యూఏఈపై అలవోక విజయం 
ఇక..పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన ఆఖరిరౌండ్ పోటీలో టీమిండియా అలవోక విజయమే సాధించింది. మరో 59 బాల్స్ మిగిలిఉండగానే 9 వికెట్ల తో నెగ్గి..వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగుకు నాలుగురౌండ్ల మ్యాచ్ లూ నెగ్గిన ఏకైక జట్టుగా ధోనీసేన..టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది. 2016 సీజన్లో ఇప్పటి వరకూ పది టీ-20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా తొమ్మిది విజయాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. ఇందులో గత ఆరుమ్యాచ్ ల్లో నెగ్గి విజయాల డబుల్ హ్యాట్రిక్ సైతం పూర్తి చేయడం విశేషం. టీ-20 ఫార్మాట్లో తమ ఈ వరుస విజయాలకు ...జట్టు సమతూకంతో ఉండటమే కారణమని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెబుతున్నాడు.
టీమిండియాకు కొత్త ఊపిరి
హార్థిక్ పాండ్యా , బుమ్రా లాంటి యువపేసర్ల చేరికతో తమజట్టుకు కొత్త ఊపిరి వచ్చిందని, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు తోడు...రోహిత్ శర్మ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ ల రూపంలో సైతం తమకు పార్ట్ టైమ్ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారని ధోనీ గుర్తు చేశాడు. తమ బ్యాటింగ్ ఆర్డర్లో 8వ నెంబర్ వరకూ బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నవాళ్లు ఉన్నారని...మొత్తం మీద యువత, అనుభవజ్ఞులైన ఆటగాళ్ళతో తమజట్టు చక్కగా అమరిందని చెప్పాడు.
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే టీ-20 ప్రపంచకప్ లో ..తాము ర్యాంకు, స్థాయికి తగ్గట్టుగా రాణించడం ఖాయమని టీమిండియా కెప్టెన్ ధీమాగా ప్రకటించాడు. గత పది మ్యాచ్ ల్లో తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా..ఆసియాకప్ ఫైనల్లో సైతం హాట్ ఫేవరెట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

21:23 - March 4, 2016

నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌... షార్‌లో దొంగలు పడ్డారు. అది కూడా ఎక్కడో మారుమూల కాదు.. అత్యంత కీలకమైన, విలువైన, పేలుడు పదార్థాలుంచే మ్యాగ్‌జైన్‌ భవనాన్నే చోరులు లక్ష్యంగా ఎంచున్నారు. భద్రత బలగాల పహారాలో ఉండే భవనంలోకి దొంగలు ప్రవేశించడంతో షార్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం..
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం..ఇస్రోకు ఎంతో కీలకం. ఇస్రో ప్రయోగాల పరంపరకు ప్రధాన వేదిక.. ప్రస్తుతం ఇక్కడ అభద్రత రాజ్యమేలుతోంది. దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం... మూడు, నాలుగు చోరీలు షార్ లో సాధారణం అవుతున్నాయి. 
షార్‌లో మరోసారి దొంగలు 
తాజాగా షార్‌లో మరోసారి దొంగలు పడ్డారు. మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌లోని తలుపులకు ఉన్న తాళాలను పగలగొట్టి... భవనంలో లభించిన టూల్‌ కిట్‌ సాయంతో రాగి ప్లేట్లు, తీగలను కత్తిరించుకుని వెళ్లినట్లు సమాచారం. దొంగలు వారితో పాటు తీసుకొచ్చిన గడ్డపారలు, ఇతర సామగ్రిని మాత్రం మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌ వద్దే వదిలి వెళ్లినట్లు తెలిసింది. సెల్ ఫోన్లు సైతం రిస్ట్రిక్షన్ లో ఉన్న ప్రాంతంలో చోరీ చేయడమంటే బయటి వారికి అసాధ్యం. ప్రస్తుతం చోరీ జరిగింది పేలుడు పదార్థాలు దాచే మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్ ప్రాంతంలో కావడంతో కలకలం రేగింది. రాకెట్ ప్రయోగాల్లో వినియోగించే అత్యంత కీలకమైన పేలుడు పదార్థాలను ఇక్కడ నిల్వ ఉంచుతారు. ఇంత ముఖ్యమైన విభాగంలో.. దొంగలు పడిన విషయం బయటకు పొక్కకుండా షార్‌ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంది. 
దొంగలు ఎలా ప్రవేశించారనే సందేహాలు
ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉందంటూ... కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో.. ఓ విజిలెన్స్‌ అధికారి పర్యవేక్షణలో ఉండే షార్‌లో దొంగలు ఎలా ప్రవేశించారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాగ్‌జైన్‌ భవనాన్ని షార్‌ ఉన్నతాధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌, తదితరులు పరిశీలించి చోరీ విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. 

21:20 - March 4, 2016

కర్నూలు : రాష్ట్రంలో ఆశావర్కర్ల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బకాయిల కోసం ఆశావర్కర్ల పోరాటాన్ని పోలీస్ బలంతో అణిచివేయాలని చూస్తే.. తాము ఊరుకోబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని నెలకొల్పాలని చంద్రబాబు చూస్తున్నారని... ఇదో దుర్మార్గమైన చర్యగా మధు అభివర్ణించారు. 

 

21:16 - March 4, 2016

హైదరాబాద్ : మంత్రి రావెల కిషోర్‌ బాబును... చంద్రబాబు మంత్రివర్గం నుంచి వెంటనే తప్పించాలని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా.. ఏపీ సర్కార్ సమర్థించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ ను కాస్త.. మంత్రి నారాయణ.. నారాయణ పూలింగ్ గా మార్చాలని అంబటి ఆరోపించారు. 

 

గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

విశాఖ : జిల్లాలోని చోడవరంలో గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుచ్చింతోట గ్రామం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి నుంచి 242 కేజీల గంజాయి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

20:48 - March 4, 2016

కొత్తరకం వంటకం చేయాలని బిర్యానీలో బెల్లం వేస్తే దరిద్రంగా ఉంటుంది. అలాగే...ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నామనే పేరుతో తలతిక్క ప్రయోగాలను చేస్తే తిరస్కరిస్తాం. తన ఇమేజ్ కు భిన్నంగా మంచు మనోజ్ చేసిన శౌర్య...ఇలాగే తలతిక్కగా తయారైంది. తన సినిమా కాని సినిమాను దశరథ్, తన ఇమేజ్ కు పనికిరాని సబ్జెక్ట్ ను మనోజ్ చేయడం వల్ల శౌర్య ఎవరికీ అర్థం కాని సినిమాగా తయారైంది. 
కథ....
శౌర్య విదేశాల్లో డిగ్రీ చదివిన కుర్రాడు. ఇక్కడ ఇనిస్ట్యూట్స్ లో పనిచేస్తుంటాడు. నేత్ర అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఓ పెళ్లి సందర్భంలో కలిసిన శౌర్యను నేత్ర కూడా ఇష్టపడతుంది. వీళ్లిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. నేత్ర పెళ్లికి వెళ్లిన ఇంట్లో...పెళ్లికూతురు మరో కుర్రాడితో లేచిపోతుంది. ఈ విషయంలో పెళ్లి కూతురికి శౌర్య సహకరిస్తాడు. శౌర్య  ఫ్రెండ్ అయినందువల్ల నేత్రను కుటుంబ సభ్యులంతా నిందిస్తారు. ఐతే  పెళ్లి కూతురుకు లవ్ మ్యారేజ్ చేయడంలో వాస్తవాన్ని తెల్సుకున్న నేత్ర ..శౌర్యను అర్థం చేసుకుంటుంది. వీళ్లిద్దరి స్నేహం ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని నేత్ర బాబాయ్ సుబ్బరాజు నేత్రను హత్య చేయిస్తాడు. ఐతే...ఆ హత్య  నేనే చేశానని కోర్టులో చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేస్తాడు శౌర్య. తన ప్రేమికురాలిని తానే హత్య చేశానని శౌర్య ఎందుకు చేశాడు..అసలు జరిగిందేంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
శౌర్య సినిమాను థ్రిల్లర్ గా ప్రచారం చేసుకున్నాడు దర్శక నిర్మాతలు ఐతే..ఇందులో థ్రిల్లింగ్ చేసే అంశాలేవీ ఉండవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలైన ఈ సినిమా...ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఫ్లాష్ బ్యాక్ లో మళ్లీ రెండు మూడు ఫ్లాష్ బ్యాక్ లు ఉండటం వల్ల ఇంటర్వెల్ టైం కే...అంతా గందరగోళంగా తయారయ్యింది. నేత్ర, శౌర్య ఒకరినొకరు ఇష్టపడ్డా.. సగం సినిమా అయ్యేదాకా చెప్పుకోరు. దీంతో లవ్ ట్రాక్ ఎక్కేందుకే హాఫ్ పార్ట్ అయిపోతుంది. స్లో నెరేషన్ సినిమాను చంపేసింది. థియేటర్లోకి వెళ్లిన కాసేపటికే సినిమా ఎప్పుడు పూర్తవుతుందిరా బాబోయ్ అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత పనికిమాలిన బ్రహ్మానందం ఎపిసోడ్ ఒకటి తగిలించి ప్రాణాలు తీస్తారు. హీరోను వదిలేయాలి కాబట్టి...అన్ని హత్యలు చేసినా..హీరోను పోలీసులు వదిలేస్తారు. మనోజ్ బాగా ఉబ్బిపోయి ఉన్నాడు. హార్వర్డ్ లో చదివిన యువకుడిలా అస్సలు లేడు. రెజీనా బాగా ఎడవడానికి పనికొచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెత్తగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సీరియల్ ను తలపించాయి. డైలీ సీరియల్ ఇంతకంటే బాగుంటుందేమో. శౌర్య దర్శకుడిగా దశరథ్ కు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నటుడిగా మనోజ్ కూ అంతే. ఈ డైరక్టర్ తనకు వచ్చిన ఫ్యామిలీ సబ్జెక్టులే చేసుకుంటే బెటర్. ఇక మనోజ్ బాబు థ్రిల్లర్ అనే పేరుతో ఇలాంటి విష ప్రయోగాలు ప్రేక్షకుల మీద చేయకుండా ఉంటే ఇంకా మంచిది.
 

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

1. మనోజ్ యాక్టింగ్
2. నేలబారు ప్రొడక్షన్ వ్యాల్యూస్
3. క్లారిటీ లేని దర్శకత్వం
4. గందరగోళమైన స్క్రీన్ ప్లే 
5. విసుగెత్తించే స్లో నెరేషన్
6. బ్రహ్మానందం సీన్స్

20:41 - March 4, 2016

దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఫ్యామిలీ డ్రామా కథలు ఓ సక్సెస్ ఫుల్ ఫార్ములా. వేరే జానర్ సినిమాలు పక్కాగా కుదిరితేనే బాగుంటాయి....కానీ ఈ తరహా కథలు కాస్త అటు ఇటైనా....విజయంలో తేడా ఉండదు. ఐతే...కథా స్క్రీన్ ప్లే లలో చేసే తప్పులకు తగిన రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి ఉంటుంది. టోటల్ గా క్రెడిట్ మాత్రం స్టోరీ ఐడియాకే దక్కుతుంది. ఇలా దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించిన కళ్యాణ వైభగమే  పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది..
కథలోకి వెళ్తే
కథలోకి వెళ్తే ….శౌర్య, దివ్య...వేర్వేరు ప్రొఫెషనల్స్ లో బిజీగా ఉంటారు. ఇంట్లో వీళ్లిద్దరికి పెళ్లి చూపులు చూస్తారు. కెరీర్ లో ఎదగాలని కోరుకునే శౌర్య, దివ్య ఈ పెళ్లిని నిరాకరిస్తారు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని ఇంట్లో చెప్పి పెళ్లి  రద్దయ్యేలా చేస్తారు. ఈ పెళ్లి కాన్సిల్ అయ్యాక...ఇంట్లో వాళ్లు ఇద్దరికీ డజన్ల కొద్దీ సంబంధాలు చూస్తూనే ఉంటారు. ఎలాగైనా పెళ్లి తప్పదని తెల్సుకున్న ఇద్దరు...ఓ రోజు కలిసి ప్లాన్ వేస్తారు. పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించి...పెళ్లి చేసుకుని...కొన్ని రోజులకు విడిపోవాలనేది ఆ ప్లాన్. విడిపోయాక...కెరీర్ లో తమకు నచ్చినట్లు ఉండొచ్చని ఆలోచిస్తారు. పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైనా...స్నేహితుల్లాగే ఉంటారు. కానీ ఇరు కుటుంబాల  బంధువులు మాత్రం బాగా కలిసిపోతారు. ఈ క్రమంలో శౌర్య, దివ్య మధ్య కూడా ఒక అట్రాక్షన్, రిలేషన్ ఏర్పడతాయి. తన కూతురు, అల్లుడు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారని, విడాకులకు ప్రయత్నిస్తున్నారని తెల్సుకున్న దివ్య తండ్రి...తనని ఇంటికి తీసుకెళ్లి వేరే పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. శౌర్య అమెరికా ప్రయాణమవుతాడు. మరి ఈ ఇద్దరు చివరకు ఎలా కలిశారన్నది క్లైమాక్స్.
విశ్లేషణ...
ముందు చెప్పుకున్నట్లు కథలోని బ్యూటీనే ఇది. స్క్రీన్ ప్లే తో మరింత అందంగా తీర్చిదిద్దింది దర్శకురాలు నందినీ రెడ్డి. ఐతే పస్టాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలతో సినిమా సాగినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ లో మళ్లీ కథ పుంజుకుంటుంది. నాగశౌర్య, మాళవిక నాయక్, రాశి తమ పాత్రల్లో బాగా నటించారు. సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. కొన్ని పాత్రలు ఎమోషన్ లేకుండా ప్రవర్తించడం, పాటలు బాగా లేకపోవడం మైనస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. మొత్తానికి కళ్యాణం బాగా జరిగి...వైభవం కాస్త లోపించింది.

ఫ్లస్ పాయింట్స్

1. మాళవిక నాయర్
2. కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్

1. స్లో స్క్రీన్ ప్లే
2. పస్టాఫ్
3. ఎమోషన్ లేని పాత్రలు
4. సంగీతం

టీఆర్ఎస్‌లో చేరిన పలు పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు

నల్గొండ : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్‌లో చేరారు. నల్గొండ జిల్లా సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ నేరేళ లక్ష్మీ సహా ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. అలాగే మోతె జడ్పీటీసీ శీలం ఉమా సైదులు, ఎంపీటీసీ నోముల వెంకన్న, సర్పంచ్‌ కృష్ణ తదితరులు కూడా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఈనెల 6న ఎండీసెట్‌ : వీసీ రవిరాజు

హైదరాబాద్‌ : ఈనెల 6న ఎండీసెట్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రవిరాజు వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎండీసెట్‌కు 1,670మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. ఎండీసెట్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లో 556 సీట్లు భర్తీ చేస్తామన్నారు. హాల్‌టికెట్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో సమర్పించాలని రవిరాజు స్పష్టం చేశారు.

 

ఐఎస్ఐఎస్ సంస్థల యూనిఫాంలను పట్టుకున్న స్పెయిన్ పోలీసులు

స్పెయిన్ : సిరియా, ఇరాక్ దేశాల్లో అల్లకల్లోలం రేపుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలకు చెందిన 20,000 యూనిఫాంలను స్పెయిన్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న ఈ దుస్తులను వాలెన్సియా, అల్జేసిరస్ పోర్టుల్లో పట్టుకున్నారు. పోర్టుల్లో ఎక్కించి, దిపించేటప్పుడు కస్టమ్స్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికీ అనుమానించకుండా ఈ కంటెయినర్లపై సెకెండ్ హ్యాండ్ దుస్తులు అంటూ లేబుళ్లు అతికించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్టు స్పెయిన్ పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురు స్పెయిన్ దేశీయులుని వారు వెల్లడించారు.

19:40 - March 4, 2016

హైదరాబాద్ : వీణవంక బాధితురాలిని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి ఈటల రాజెందర్‌ భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జగరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాలను కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్‌ వినియోగం శృతి మించుతోందన్నారు. 

 

19:37 - March 4, 2016

హైదరాబాద్ : వీణవంక ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యురాలు కమలమ్మ అన్నారు. యువతిపై జరిగిన అత్యాచారం తనను కంట తడి పెట్టించిందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తాము అప్పుడే స్పందించామని.. కరీంనగర్‌ కలెక్టర్‌, ఎస్ పీ పూర్తి స్థాయిలో నివేదికలు అందించలేదని విమర్శించారు. ఈ సంఘటనపై రేపు వివరణ ఇవ్వాలని కలెక్టర్‌, ఎస్ పీలను ఆదేశించామని చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ వీణవంక బాధితురాలు.. కమలమ్మను కలిసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. 

టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

రంగారెడ్డి :  టీఆర్ ఎస్ లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్..  కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 

19:23 - March 4, 2016

హైదరాబాద్ : ఏపి ఆసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు స‌ర్వం సిధ్ధమైంది. శనివారం నుంచి 18 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు పాలక ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సమాయత్తమయ్యాయి. టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌.. వైసీపీ ఆరోపించిన అమరావతి భూ దందా అంశాలపై.. ఈసారి సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
2016-17 ఆర్థిక సంవ‌త్సరానికి ఏపి బ‌డ్జెట్ స‌మావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ల‌క్ష్యాల‌ను, సిద్ధాంతాల‌ను గ‌వ‌ర్నర్ త‌న ప్రసంగంలో వివ‌రించ‌నున్నారు. అనంత‌రం రెండు రోజులు పాటు స‌భ వాయిదా ప‌డి తిరిగి మంగ‌ళ‌వారం ప్రారంభం కానుంది. 
ప్రభుత్వాన్ని నిలదీయనున్న విపక్షాలు..?
ఇదిలా ఉంటే ఈసారి స‌మావేశాలలో పార్టీ ఫిరాయింపులు, రాజ‌ధాని భూముల వ్యవహారం, అవిశ్వాస తీర్మానం, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి అంశం అలాగే కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి స‌రైన కేటాయింపులు లేక‌పోవ‌డంపైనా విపక్ష స‌భ్యులు ప్రభుత్వాన్ని నిలదీసే అవ‌కాశం ఉంది. 
మీడియా పాసులకు ఈసారి హ‌లోగ్రామ్ 
రెండు రాష్ట్రాల శాస‌న స‌భ‌లు ఒకేసారి కొలువు తీరుతుండ‌డంతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఇప్పటికే స్పీక‌ర్, ఛైర్మన్ లు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో... పోలీసు ఉన్నతాధికారులు భ‌ద్రతా చ‌ర్యల‌ను స్వయంగా ప‌ర్యవేక్షించారు. అటు మీడియాకు ఇచ్చే పాసుల విష‌యంలోనూ.. ఈసారి హ‌లోగ్రామ్ ను ప్రవేశ పెడుతున్నారు. హోలోగ్రామ్‌లతో కూడిన పాసులు లేని మీడియా వారినీ అసెంబ్లీ పరిసరాల్లో అనుమతించబోమని పోలీసు అధికారులు తేల్చిచెప్పారు.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు 
అటు మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల‌ను కేటాయించ‌డంతో పాటు... రెండు స‌భ‌లు ఒకేసారి కొలువైన‌ప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. 
అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్రత‌ క‌ట్టుదిట్టం 
ఏపి తెలంగాణ శాస‌న‌స‌భ‌లు దాదాపు 20 రోజులు పాటు నిర్వహించ‌నుండ‌డంతో అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ చుట్టుప‌క్కల ఎలాంటి ధ‌ర్నాలు, ప్రద‌ర్శన‌ల‌కు అనుమ‌తులు లేవని అధికారులు స్పష్టం చేశారు. 

 

19:12 - March 4, 2016

ఆదిలాబాద్ : జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు ఐడీబీఐ బ్యాంకు నోటీసులు అందాయి. కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం రూ.400 కోట్లకు పైగా రుణాలు తీసుకుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించలేదని నోటీసులు పంపారు. మిల్లును స్వాధీన పరుచుకుంటున్నట్లు నోటీసులు జారీ చేశారు. అయితే  
మిల్లు యాజమాన్యం స్పందించలేదు.  

సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు ఐడీబీఐ బ్యాంకు నోటీసులు

ఆదిలాబాద్ : జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు ఐడీబీఐ బ్యాంకు నోటీసులు అందాయి. కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం రూ.400 కోట్లకు పైగా రుణాలు తీసుకుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించలేదని నోటీసులు పంపారు. మిల్లును స్వాధీన పరుచుకుంటున్నట్లు నోటీసులు జారీ చేశారు. అయితే మిల్లు యాజమాన్యం స్పందించలేదు.  

బల్దియా సమావేశం వాయిదా

హైదరాబాద్‌ : జీహెచ్ ఎంసీ పాలక మండలి సమావేశం వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ హైదరాబాద్‌ నగరంలో పర్యటిస్తుండటంతో శనివారం జరగాల్సిన బల్దియా సమావేశాన్ని వాయిదా వేశారు. నగర ప్రథమ పౌరుడి హోదాలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఉప రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి రావటంతో పాటు సమయం తక్కువ ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని కార్పొరేటర్లు కోరటంతో పాలక మండలి సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్‌ను వివాహ మాడిన ఉతప్ప

మహారాష్ట్ర : ముంబైకి చెందిన పేసర్ ధవళ్ కులకర్ణి, కర్ణాటక బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్పలు గురువారం పెళ్లి పీటలెక్కారు. బెంగళూరులో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతి ప్రకారం జరిగిన కార్యక్రమంలో టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్‌తో 30ఏండ్ల ఉతప్ప పెండ్లి ప్రమాణాలు చేశాడు. నాలుగేండ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ శ్రద్ధా కార్పుడేను 27ఏండ్ల కులకర్ణి వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైన ఈ వివాహ కార్యక్రమం మరాఠీ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.

18:54 - March 4, 2016

రాజమండ్రి : గోదావరి నదిలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను వెలికి తీశారు. 
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు.  

18:52 - March 4, 2016

ప్రత్యేక సందర్భాలలో నలుగురిలో ప్రత్యేకంగా కన్పించాలనుకునే వారు తమ వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అలాంటి వారి కోసం డిజైనర్ సారీస్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:50 - March 4, 2016

అన్ని రంగాలలో తమ ప్రత్యేకత నిరూపించుకుంటున్న మహిళలు ఏ సమయంలోనైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం. ఇలాంటి స్థితిలో  ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎవరికి వారు స్వంతంగా ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆత్మరక్షణా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇవాళ్టి నిర్భయ మీ ముందుకు వచ్చింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:48 - March 4, 2016

తాజా ఆర్థిక సర్వే అనేక విస్మయకర వాస్తవాలను తేల్చింది. మహిళల ఆరోగ్య స్థితిగతులు, కాన్పులకు సంబంధించి వెలువడిన గణాంకాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.

కరవు  తీవ్ర ప్రభావాలు ఎలా ఉంటాయో వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆడపిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో, ఇప్పుడు మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రామీణాభివృద్ధి పరిధిలోని స్త్రీనిధి సహకార బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రత్యేక అధ్యయంన చేయాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. థర్డ్ పార్టీ ఏజెన్సీతో పరిశీలింపచేయాలని తీర్మానించింది. 

ప్రకృతి రమణీయతకు మారుపేరైన హిమాచల్‌ప్రదేశ్‌ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అభివృద్ధే కాదు.. ఆదాయం బాటలోనూ పరుగులు తీస్తున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. 

ప్రముఖ భరత నాట్యకారిణి రుక్మిణీదేవి అరుండాలే కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె జయంతి ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఆమెకు ప్రత్యేక నివాళి అర్పించింది.

18:34 - March 4, 2016

మెదక్ : జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం పర్యటించారు. ఎర్రవెల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సీఎం పరిశీలించారు. గ్రామాభివృద్ధిపై ప్రజలతో సమావేశం అయ్యారు. మే 15లోపు ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు. ఎర్రవెల్లిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను సీఎం ప్రజలకు వివరించారు. కూడవెల్లి వాగుమీదుగా చెక్‌ డ్యాం కడుతున్నామని ప్రకటించారు. 

18:32 - March 4, 2016

ఢిల్లీ : కుట్రలపైనే తమ ఉద్యమమని జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా, కళాకారులు, సంఘీభావం తెలిసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. జెఎన్ యూలో విద్యార్థులు ఎప్పటికీ దేశ ద్రోహులు కారని స్పష్టం చేశారు. నీలాకాశంలో ఎర్రసూరీడిని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని పేర్కొన్నారు. రాజ్యాంగం వీడియో కాదని దాన్ని మార్పింగ్ చేయలేరని అన్నారు. ప్రజల హక్కులని కాలరాయాలనుకుంటే సహించబోమని కన్హయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు. 

గోదావరి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

రాజమండ్రి : గోదావరి నదిలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు.  

17:58 - March 4, 2016

విజయవాడ : డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఆశావర్కర్లు చేసిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌ నుంచి ఆశా వర్కర్ల భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆశావర్కర్లు గాయపడ్డారు. ర్యాలీకి బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లకు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. 300 మంది ఆశాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 4 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని, ఆకలి దప్పులతో బ్రతుకులు వెళ్లదీస్తున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు మద్దతుగా నిలిచిన సీపీఎం కన్వీనర్ బాబూరావు, ఎంఎల్‌సి శర్మ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

 

17:55 - March 4, 2016

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి క్షణం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ఏర్పాట్లలో  అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 9 న కౌంటింగ్ జరుగనుంది. వరంగల్ లో టీఆర్ ఎస్ తరపున మంత్రి కేటీఆర్, ఎర్రవెల్లి దయాకర్ రావు, బీజేపీ తరపున కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం ప్రచారం చేశారు. కాజీపేట, హన్మకొండ, ట్రైసిటీ జనంతో కిక్కిరిసిపోయింది. 49 వ డివిజన్ లో అధికార టీఆర్ ఎస్ సభ్యులు డుబ్బులు పంచుతుండగా విపక్షాలు పట్టుకున్నారు. 

బెంగాల్, కేరళలో కన్నయ్య ఎన్నికల ప్రచారం..

ఢిల్లీ : జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య వామపక్షాల తరపున పశ్చిమబెంగాల్, కేరళలో ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. బిజెపి, ఆర్ఎస్ఎస్, మోదీలకు వ్యతిరేకంగా గట్టిగా యువవాణి వినిపిస్తుండటంతో కన్నయ్యతో ప్రచారం చేయించాలని వామపక్షాలు నిర్ణయించినట్లుసమాచారం.

నాఐకాన్ రోహిత్ వేముల.. ఆప్ఝల్ గురు కాదు..

న్యూఢిల్లీ: తన ఐకాన్ రోహిత్ వేముల అని, అఫ్జల్ గురు కాదని ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య చెప్పారు. రోహిత్ త్యాగాన్ని వృధా పోనివ్వనన్నారు. జమ్ముకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నారు. తాను విద్యార్ధినని, రాజకీయ నేతను కాదని చెప్పడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశంపై సస్పెన్షన్‌లో పడేశారు. తనకు టీచర్ కావాలనుందని చెప్పారు. ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధులు దేశ వ్యతిరేకులు కాదని, దేశ భక్తులని చెప్పారు.

17:17 - March 4, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను స్కామ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పంచభూతాల్లో అవినీతిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశాల్లో జగన్‌పై ఎలా ఎదురు దాడి చేయాలో ఆలోచిస్తారు.. కానీ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులకు ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. 

 

17:13 - March 4, 2016

గుంటూరు : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో కల్యాణమండపాన్ని సీఎం ప్రారంభించారు. కోటప్పకొండ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాల్ని ఆయన అభినందించారు. ఇలా ప్రజలకోసం నిస్వార్ధంగా పనిచేసేవారు కొందరే ఉంటారని.. స్థానిక నేతలను ప్రశంసించారు. 

 

మనోజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్...

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ అవార్డ్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డ్ ప్రకటించారు. నటుడిగా, డైరక్టర్‌గా ఆయన భారతీయ సినిమాకు సేవలందించారు. హరియాలీ ఔర్ రాస్తా, వో కౌన్ తీ, హిమాలయ్‌ కీ గోద్ మే, పత్తర్ కే సనమ్, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.

16:58 - March 4, 2016

వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలతో పోరుగల్లుగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో నగరం అట్టుడుకుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం వాడి వేడిగా మారింది. ప్రచారం ముగింపు దశలోను టీఆర్ ఎస్, టీడీపీ ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తోంది. టీడీపీ రేపు, మాపో మునిగిపోయే పడవని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీపీ నేత రేవంత్ ఆ పార్టీలో ఉండడని, చచ్చేంత వరకు పసుపు జెండా కప్పుకుంటానని ఆయన ప్రమాణం చేస్తాడా ... అంటూ ఎంపీ సవాల్ చేశారు. 

 

ఎమ్మెల్యే రాంరెడ్డి మృతికి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అందరితో అన్యోన్యంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వెంకట్‌రెడ్డి పట్ల రాజకీయాలకతీతంగా అందరికీ ఎంతో గౌరవముందున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

యోగాపై పాట కట్టండి.. 5 లక్షలు గెలవండి

న్యూఢిల్లీ : యోగాపై పాట కట్టండి.. 5 లక్షలు గెలవండి. ఇదో కాంటెస్ట్. కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీకి ఆహ్వానాలు కోరుతోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఎంట్రీని విజేతగా ప్రకటిస్తారు. ఆ విన్నర్‌కు అయిదు లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. వ్యక్తి లేదా గ్రూప్ ఎవరైనా యోగాపై 3 నుంచి 5 నిమిషాలు ఉండే సాంగ్‌ను పోటీకి పంపవచ్చు. ఎంపీ3 ఆడియో ఫార్మాట్‌లో ఉండే ఆ సాంగ్ సైజ్ 5ఎంబీ దాటకూడదు. పోటీలో పాల్గొనేవాళ్లు INF-MOAYUSH@GOV.IN వెబ్‌సైట్‌కు తమ పాటను మెయిల్ చేయాలి. మార్చి 31వ తేదీలోపు ఆ సాంగ్‌ను పంపాలి.

16:45 - March 4, 2016

విజయవాడ : కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఫైరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళన చేస్తానని ముద్రగడ ప్రకటించడంపై బోండా తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ దీక్ష వెనుక జగన్ హస్తముందని ఆరోపించారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కాపు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

 

సిర్పూర్ పేపర్ మిల్లును స్వాధీనంచేసుకుంటున్నాం: ఐడీబీఐ

ఆదిలాబాద్ : జిల్లాలోగల సిర్పూర్ పేపర్ మిల్లును స్వాధీనం చేసుకుంటున్నట్లు ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పద్రీప్ తెలిపారు. ఈమేరకు తమ బ్యాంకుకు పేపర్ మిల్లు రూ. 420 కోట్లు బకాయిలు ఉన్నదని, వీటిని చెల్లించకపోవడం దృష్ట్యా పేపర్ మిల్లును స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పేపర్ మిల్లు గేటుకు నోటీసులు శుక్రవారం అంటించారు.

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

హైదరాబాద్ : 2016-17 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి మొదలైన లాభాల పర్వం కొనసాగింది. నాలుగు రోజుల వ్యవధిలో స్టాక్ మార్కెట్లు 7 శాతం వరకూ పెరిగిన సమయంలో లాభాల స్వీకరణ జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కొనుగోళ్లు సైతం వెల్లువెత్తిన వేళ, తీవ్ర ఒడిదుడుకుల మధ్య నేటి సెషన్ స్వల్ప లాభాల్లో ముగిసింది.

 

జింబాబ్వేలో రెండు బస్సులు ఢీ: 30 మంది మృతి

హైదరాబాద్ : జింబాబ్వేలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి బులవాయో నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు డ్రైవర్లతో కలిపి 28 మంది ప్రమాదస్థలంలో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ఈరోజు వెల్లడించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

16:18 - March 4, 2016

హైదరాబాద్ : రజనీకాంత్ స్టైల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. దాదాపు నలభై ఏళ్లుగా ఆయన ఓ స్టైలిష్ హీరో. ఇన్నేళ్లు అదే ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయడం, కొత్త స్టైల్స్ చూపడం ఒక్క రజినీకే చెల్లింది. ఇప్పటికీ తన స్టైల్ తో అభిమానులను అలరిస్తున్న రజినీ, ఒక స్టైల్ ఐకాన్ గా కబాలి మూవీలో కనిపించబోతున్నారు. తాజాగా కబాలి షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికొచ్చాయి. పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న కబాలి సినిమాకు సంబంధించి రజనీకాంత్‌ డిఫరెంట్‌ లుక్‌తో ఉన్న పోస్టర్ లు విడుదల కావడంతో 'కబాలి'పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కబాలి లో రాధిక ఆప్టే, తనిష్క, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల 20 రోజుల పాటు చెన్నైలో చిత్ర షూటింగ్ జరిగింది. ఆ తర్వాత మలేషియాలో షూటింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఉల్లి ధరల నియంత్రణకు టి.సర్కార్ చర్యలు..

హైదరాబాద్ : ఉల్లి ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఉల్లిగడ్డ వ్యాపారులకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 'ఎ' కేటగిరి వ్యాపారులు 75కేజీలు, 'బి' కేటగిరి 40 కేజీలు,'సి' కేటగిరి వ్యాపారులు 30 కేజీలు మాత్రమే నిల్వ ఉంచుకోవాలని సూచించింది. అంతకు మించి నిల్వలు ఉంచితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. 'ఎ' కేటగిరిలో నగరాలను, 'బి' కేటగిరిలో పట్టణాలను, 'సి' కేటగిరిలో గ్రామీణ ప్రాంతాలను చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్ పీఎస్సీ భవన్ ను ముట్టడించిన బీసీ విద్యార్థులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ ను బీసీ విద్యార్ధులు శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ... గ్రూప్‌-2 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్‌-2 పరీక్షల ప్రిపరేషన్‌ కోసం 3 నెలల సమయం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

16:05 - March 4, 2016

ఖమ్మం : పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధితో కిమ్స్ లో 15 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. వైఎస్, కిరణ్ హాయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడిగా పనిచేశారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు పెట్టుకున్న రాంరెడ్డి మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు. 

హుజూరాబాద్ లో బోర్డు తిప్పేసిన ఏజీస్ పరివార్ సంస్థ

కరీంనగర్ :హుజూరాబాద్ కేంద్రంగా పనిచేసిన ఏజిస్ పరివార్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏజిస్ పరివార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. హుజూరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 2వేల మంది నుంచి సుమారు కోటి రూపాయల వరకు డిపాజిట్లుగా కంపెనీ ప్రతినిధులు సేకరించారు. కాగా... ఈ సంస్థ కార్యాకలాపాలన్నీ కూడా విజయవాడ కేంద్రంగా నిర్వహించారు. ప్రస్తుతం సంస్థ ఎండీ పరారీలో ఉండడంతో డిపాజిట్లు చేసిన వారంతా పోలీసులను ఆశ్రయించారు.

ఏపీ అసెంబ్లీ... భద్రతా ఏర్పాట్ల పరిశీలన..

హైదరాబాద్: శనివారం నుంచి ప్రారంభంకానున్న ఏపీ శాసనసభా సమావేశాలకు భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లే ద్వారాల వద్ద బందోబస్తు అధికార్ల నియామకం వంటి వాటిని సమీక్షించారు. శాఖపరమైన గుర్తింపు కార్డులతో పాటు, అసెంబ్లీ విధులకు అనుమతితో ప్రత్యేకంగా జారీ చేసిన కార్డులు ఉంటేనే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. రెండు శాసనసభల సమావేశాలు జరుగుతున్నందున ఎక్కడా ఇబ్బంది రాకుండా బయట హైదరాబాద్‌ నగర పోలీసులు, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ పోలీసులు భద్రతా విధులను నిర్వర్తిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: నక్సల్స్ ప్రభావిత పశ్చిమబెంగాల్‌లో ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ నాలుగున జరగనుంది. రెండో విడత ఏప్రిల్ 17న, మూడో విడత ఏప్రిల్ 21న, నాలుగో విడత ఏప్రిల్ 25న, ఐదో విడత ఏప్రిల్ 30న, ఆరో విడత మే ఐదున జరగనున్నాయి. మే 19న కౌంటింగ్ ఉంటుంది. కేరళ అసెంబ్లీకి ఒకే విడతలో మే 16న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఒకే విడతలో మే 16న అసెంబ్లీ జరగనున్నాయి. మే 19న కౌంటింగ్ ఉంటుంది. శాంతి భద్రతల విషయం కారణంగా అసోంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్ : ఎర్రవల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా అక్కడ జరిగిన గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. అలాగే ఆ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా ఆయన పరిశీలించారు. గ్రామంలో బిందు సేద్యంను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

15:37 - March 4, 2016

డిల్లీ : తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమీషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ నదీమ్ జైదీ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ 294, తమిళనాడు 234, కేరళ 140, అస్సాం 126, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్లు గందరగోళం చెందకుండా ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎలక్షన్లో మొదటి సారి నోటా విధానాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాల్లో మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు ఏప్రిల్ -మే నెలలో జరుగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

13:33 - March 4, 2016

వరంగల్ : అడ్డమీదకు రావడం ఆలస్యం మాతో పాటు వచ్చేయ్ అనేవాళ్లు ఎక్కువయ్యారు. రోజు కూలి కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. రోజూ కిలోల కొద్దీ బరువులు ఎత్తినా 300 రాని పరిస్థితి. కాని ఇప్పుడు రోజుకు 500 వస్తున్నాయ్ దాంతో పాటు భోజనం కూడా దొరుకుతోంది. ఏంటా అనుకుంటున్నారా వాచ్ దిస్ స్టోరి.ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేళ అన్ని వర్గాలకు ఉపాధి దొరకుతోంది. అటు చోటా మోటా లీడర్లకు ఇటు క్యాడర్ కు చేతి నిండాపని దొరుకుతోంది. ప్రతి ఒక్కరు ఎలక్షన్ ఎప్పుడొస్తుందా అన్నట్లు వేయికళ్లతో ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే ఎన్నికలు వచ్చాయి. ప్రచారానికెళ్లాలంటే విపరీతమైన ఎండలు.. ఎండలకు బయపడి కేడర్ ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. ఓటు వేస్తాం కాని ఎండలో వెనకాల తిరగడం మావల్ల కాదంటూ తేల్చేస్తున్నారు. ఈ సమయంలోనే నేతలకు వచ్చిన బృహత్తర ఆలోచనే కూలీ తో కదం.

జెండాలు మోస్తే రూ.500..
ఎలాగో నేతలకు ప్రచారం అవసరం పనికోసం వచ్చే వారికి కూలీ అవసరం. దీంతో ఖమ్మం నగరానికి వచ్చే వారిని సంప్రదించి వెంటబెట్టుకుని తీసుకెళుతున్నాయి రాజకీయ పార్టీలు. ఓటరుదేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటి ముందు క్యూ కట్టాల్సిన నాయకులు కూలీ అడ్డాల వద్ద క్యూ కడుతున్నారు. రోజు కూలీ కోసం అడ్డా మీదకు వస్తున్న వారిని వచ్చినట్లుగా వెంటబెట్టుకుని వెళుతున్నారు. దాంతో పాటు వారికి మద్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఎలాగో ఎండలో పనిచేస్తే 300 వస్తాయి.అదే ఈ రాజకీయ పార్టీల జెండాలు మోస్తే 500 రూపాయలు వస్తున్నాయి. దీంతో కూలీలంతా ప్రచార కార్యకర్తలుగా మారుతున్నారు.

ప్రచారం ఫల్లు..
ఇది ఇలా ఉంటే.. డబ్బులు పోతేపోయాయ్ కాని జనం, ప్రచారం మాత్రం ఫుల్లుగా దొరుకుతున్నారని హ్యాపీగా ఫీలయ్యే నేతలు ఉండడం విశేషం. అందుకే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో జనం దర్శనమిస్తున్నారు. దీంతో ఒరిజినల్ ఓటర్లెవరో బయటివాళ్లు ఎవరో అర్థం కాని పరిస్థితినెలకొంది. క్యాంపెయినింగ్ కు వచ్చే లోకల్ ఓటర్లు వీళ్లని మన ఏరియాలో ఎప్పుడూచూడలేదే అని చెవులు కొరుక్కుంటున్నారు. 

13:29 - March 4, 2016

హైదరాబాద్ : సిపిఎం నేతలపై 2003లో నమోదైన ఓ కేసును నాంపల్లి అడిషనల్ మేజిస్ట్రేట్‌ కోర్టు-2 కొట్టివేసింది. 13 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను, దానికి చైర్మన్‌ను నియమించాలని కోరుతూ సిపిఎం నేతలు చలో అసెంబ్లీ నిర్వహించారు. ఇందిరాపార్క్‌ నుంచి జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు శాంతియుతంగా చేపట్టిన ఆ ర్యాలీపై ఆనాటి తెలుగు దేశం ప్రభుత్వం లాఠీఛార్జీ చేయించింది. ఉద్యమకారులపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు. వారిలో సిపిఎం నేతలు మధు, పుణ్యవతి, బి.వెంకట్‌, జి.రాములు, టి.సాగర్‌, పివి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా నేతలపై ఉన్న కేసును కొట్టేయడంతో సిపిఎం వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. 

13:27 - March 4, 2016

విశాఖపట్టణం : రైల్వే బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై వైసీపీ నిరసనలు చేపట్టింది. గురువారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టింది. ఏపీకి రైల్వే బడ్జెట్ లోను, ఆర్థిక బడ్జెట్ లోను కేంద్రం అన్యాయం చేసిందని తెలిపారు. వందలాది మంది వైసీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయానికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టెన్ టివితో వైసీపీ నేత మాట్లాడారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు బాబు కుట్రపన్నేందుకు తెరదీశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని, అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి కేంద్రం మేలు చేయడం లేదన్నారు. అమరావతి రాజధాని పేరిట కోట్ల రూపాయల స్కాంకు బాబు తెరలేపారని ప్రజలు గమనించారని తెలిపారు. 

13:19 - March 4, 2016

హైదరాబాద్ : అమరావతి రాజధాని భూ దందాపై న్యాయవిచారణ జరిపించాలని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో భూ దందా చేస్తున్నారని కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ..టిడిపి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. గురువారం బోత్స మీడియాతో మాట్లాడారు. రాజధాని పెడుతామని అనుయాయులు..మంది మార్బలానికి చెప్పి రైతులను బెదిరించి వందల ఎకరాల భూములు కొనుక్కొన్నారని తెలిపారు. రాజధాని ప్రకటన కంటే ముందే ఎందుకు భూములు కొనుక్కొన్నారని ప్రశ్నించారు. దానిపై తాము ప్రశ్నిస్తున్నామన్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలని, సీబీఐ ఎంక్వయిరీ చేపట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్న వారి గురించి మాట్లాడడం లేదని, రైతుల భూములతో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తి ఇలా చేయడం దేశంలో ఏ ముఖ్యమంత్రి లేడని విమర్శించారు. భూ బాగోతంపై న్యాయ విచారణకు ఆదేశించి నిజాయితీ పరులుగా నిరూపించుకోవాలని బోత్స సూచించారు.

 

13:07 - March 4, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫకేషన్ విడుదల కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా ఎన్నికల నోటిఫకేషన్ విడుదలవుతోంది. ఐదు నుండి ఆరు దశల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏప్రిల్ - మే నెలల్లో మొత్తం ఈ ఎన్నికల వ్యవహారం ముగుస్తుంది. హోం మంత్రిత్వ శాఖతో పలు దఫాలుగా ఈసీ చర్చలు జరిపింది. చివరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. మేలో ఎన్నికలు జరిపి జూన్ ఐదులోపు కొత్త అసెంబ్లీల ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు బెంగాల్ లో శాంతి భద్రతల సమస్యపై సీపీఎం ఈసీకి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. టీఎంసీ గూండా గిరిపై సీపీఎం నివేదిక ఇచ్చింది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరింది. 

కన్హయ్య స్పీచ్ కు స్పందన..

ఢిల్లీ : జైలు నుండి విడుదలైన అనంతరం జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ఇచ్చిన స్పీచ్ కు స్పందన వ్యక్తమౌతోంది. పలువురు రాజకీయ నేతలు కొనియాడుతున్నారు. అద్భుతమైన ప్రసంగం అని కొనియాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బాటలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ సాగారు. ప్రసంగంలో పేర్కొనవన్నీ కరెక్ట్ అని తెలిపారు.

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. జ్యోతుల, రామచంద్రారెడ్డి, రామకృష్ణ, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదికపై చర్చించారు. 

12:42 - March 4, 2016

హైదరాబాద్ : సోషల్ మీడియాలో తన సినిమాలకు ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. అలాంటి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘గవర్నమెంట్’కు సంబంధించిన ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటో ఎవరిదనుకుంటున్నారు? అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంది... కాదుకాదు.. ఆ పాత్ర పోషిస్తున్న నటుడిదంటూ వర్మ ట్వీట్లు చేసి తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు. స్వయంగా దావూదే తన సినిమాలో నటించడానికి ముందుకొచ్చాడని ఒక ట్వీట్... ఆయనెందుకు నటిస్తాడంటూ మరో ట్వీట్ వర్మ చేశాడు. తన సినిమాలో దావూద్ పాత్రను పోషిస్తున్న నటుడికి సంబంధించిన రెండు, మూడు ఫొటోలను వర్మ పోస్ట్ చేశాడు. కాగా, దావూద్, చోటా రాజన్ ల మధ్య శత్రుత్వం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

తెలంగాణలో రాచరిక పాలన - రేవంత్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారంలో నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని వరంగల్ ప్రజలను కోరారు. 

త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న బాబు..

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. 

పాక్ జిందాబాద్ అంటే తలు నరుకుతా - దిలీప్ ఘోష్..

కోల్ కతా : భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారి తలలు నరుకుతానని..ఖంఖండాలుగా చేస్తానని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీష్ ఘోష్ పేర్కొన్నారు. 

చిదంబరం సతీమణికి సీబీఐ సమన్లు..

ఢిల్లీ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సతీమణి నళిని చిదంబరంకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. పదో తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఈ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్ అభ్యర్థన మేరకు శారదా కేసులో నిళిని చిదంబరం కోర్టులో వాదనలు వినిపించారు. ఇందుకోసం చిట్ ఫండ్ ఆమెకు రూ.1 కోటిని ఫీజుగా చెల్లించింది. దీనిపై ఆధారాలు సేకరించిన సీబీఐ శారదా చిట్ ఫండ్ యాజమాన్యం..మనోరంజన్ సింగ్ లతో పాటు నళిని చిదంబరం పేర్లను రెండు నెలల క్రితం చార్జీషీట్ లో చేర్చింది. 

12:33 - March 4, 2016

మంత్రాలకు చింతకాలయు రాలవు అనే సామెత మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము.. నిజమే. కానీ చింతకాయలు మాత్రం ఎండాకాలం వచ్చిందంటే మంత్రాలు లేకుండానే రాలిపోతుంటాయి. ప్రకృతి వనరుల్లో మనకి నిత్యం ఉపయోగపడే వృక్ష సంతతిలో చింతచెట్టు ఒకటి. దీనిని వాడని భారతీయుడంటూ ఎవరూ ఉండరు. తెల్లారి వంట పూర్తికావాలంటే చింతపండు లేకపోతే చింతతో అల్లాడిపోతాం. ఇటువంటి చింత గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, ఈ చెట్టు ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం అన్ని ప్రయోజన కరమైనవిగానే చెప్పుకోవాలి. ఇది ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం. దీనిని సంస్కృతంలో తింత్రిణీ అని, తెలుగులో చింత అని, కన్నడంలో హుళి అని, తమిళంలో పుళి అని, మరాఠీలో చించి అని, హిందీలో ఇంమ్లి అని అంటారు. చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

ఉపయోగాలు

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు.లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. వాటి గుజ్జును పప్పులో కలుపుతారు, అయితే, లేత చింతకాయలను అధికంగా వాడకూడదు.

చింతకాయపచ్చడి...

ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిలవ పచ్చడిని తయారుచేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తాయి.

చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని తయారుచేస్తారు కొంతమంది. ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వరగా జీర్ణంకాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది. చింతగుల్లనుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. చింతపండు తేలికగా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.

చింతాకుతో: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.

చింతకాయతో: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు. చింతచెట్టులోని ప్రతి భాగామూ ఉపయోగపడుతుంది. చింతచెట్టు వుంటే చింతే ఉండదంటారు పెద్దలు. ప్రతిరోజు వండే ఆహారపదార్థాల్లో చింతపండుకు ప్రత్యేకస్థానం ఉంది. చింతచిగురు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, పండిన చింతగుల్లలు, చింతపువ్వు, చింతగింజలు ఎంతో ఉపయోగపడతాయి.

చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.

12:28 - March 4, 2016

ఢిల్లీ : టిడిపి సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి సుజనా చౌదరీకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ బ్యాంకుకు బకాయి ఉన్న రూ. 100 కోట్లు చెల్లించాల్సిందేనని సుజనా గ్రూపును అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మారిషస్ రుణాల బకాయి చెల్లింపు విషయంలో కింది కోర్టు విధించిన ఆరు నెలల గడువును పెంచాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఆయన సంస్థలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రుణంపై మారిషస్ బ్యాంకు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. గడువు పెంపునకు నిరాకరించిన హైకోర్టు సుజనాకు షాకిస్తూ ఆరు నెలల గడువును మరో నెల కుదిస్తూ ఐదు నెలల గడువునే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుజనా గ్రూప్స్ సుప్రీంను ఆశ్రయించారు. వంద కోట్ల రుణంతో ఓ కంపెనీ నెలకొల్పేనేందుకు తాము కేవలం ష్యూరిటీ మాత్రమే ఉన్నామని సుజాన గ్రూప్స్ పేర్కొంది. మారిషస్ బ్యాంకుకు తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. కానీ హైకోర్టు తీర్పు కరెక్టేనని పరోక్షంగా సుప్రీం తేల్చిచెప్పింది. 

సుజనా చౌదరీ సుప్రీంకోర్టులో చుక్కెదురు..

ఢిల్లీ : టిడిపి సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి సుజనా చౌదరీకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ రుణాల బకాయి చెల్లింపు విషయంలో కింది కోర్టు విధించిన ఆరు నెలల గడువును పెంచాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఆయన సంస్థలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

12:15 - March 4, 2016

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై కొనసాగుతున్నారని తెలిపారు. గురువారం ఉదయం ఆయన మృతి చెందాడని వార్తలు వచ్చాయి. దీనిని సోదరుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖండించారు. తన అన్న పరిస్థితి విషమంగా ఉందని, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి గత 15 రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్నారు. వైఎస్, కిరణ్ హాయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడిగా పనిచేశారు. 

12:14 - March 4, 2016

విజయవాడ : టిడిపి ప్రారంభించిన ఆకర్ష్ కు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకోగా నేడు వైసీపీకి చెందిన పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పచ్చకండువా కప్పుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టిడిపి పార్టీలో చేరిపోయారు. తాను టిడిపిలో చేరుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కలమట తండ్రి, మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు కూడా టిడిపిలో చేరారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టిడిపిలో చేరినట్లు మీడియాకు వెంకటరమణ ప్రకటించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలో బాబు ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియచేస్తున్నానని తెలిపారు. ప్రలోభాలకు గురి చేశారన్న వారు తన ముందుకు రావాలని, తనపై విమర్శలు చేసే వారు పార్టీ ఎందుకు మారారో వివరణనివ్వాలని సూచించారు. ఎవరి ప్రలోభాలకు లొంగాల్సినవసరం లేదని స్పష్టం చేశారు. 

12:05 - March 4, 2016

గుమ్మడి కాయ .. ఇవి రెండు రకాలు.. ఒకటి బూడిద గుమ్మడి, మరొకటి తీపి గుమ్మడి. గుమ్మడి కాయ అనగానే మనకు గుమ్మడి పులుసు, ఒడియాలు, ఒరుగులు చేస్తూ ఉంటాం. అంతే కాకుండా వీటిని దిష్టితీయడానికి కూడా విరివిగానేఉపయోగిస్తాం. అంతే కాకుండా ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. కానీ దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉందని తెలుసా! అవునండి రోజువారీ ఆహారంలో గుమ్మడిని చేర్చితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా ఉప‌యోగాలున్నాయి. చైనావారు సుగ‌ర్ నియంత్రించే ఔష‌ధాల‌లో గుమ్మ‌డిని ఉప‌యోగిస్తున్నారు. గుమ్మ‌డిలో బీటా కెరోటిన్ పుష్క‌లంగా ఉంటుంది , శరీరానికి తక్కువ‌ క్యాలరీలు అందిస్తుంది. కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా స‌మృద్ధిగా లభిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి దానిని అదుపులో ఉంచుకునేందుకు గుమ్మ‌డి ఉప‌యోగ‌ప‌డుతుంది. బి.పి.ని నియంత్రిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంబంధ‌ వ్యాధులు తగ్గుతాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకుంటే మంచిది. గుమ్మడి విత్తనాలు తింటే ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

రాంరెడ్డి చనిపోలేదు - దామోదర్ రెడ్డి..

ఖమ్మం : రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోలేదని సోదరుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రకటించారు. తన అన్న పరిస్థితి విషమంగా ఉందని, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

 

ఆశా వర్కర్ల దిగ్భందం..

విజయవాడ : చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో మిల్క్ ప్రాజెక్టు సమీపంలో 300 మంది ఆశా వర్కర్లను పోలీసులు నిర్భందించారు. దీనితో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. 

ముద్రగడ వెనుక జగన్ - బోండా..

విజయవాడ : ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని టిడిపి నేత బోండా ఉమా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ముద్రగడ మానుకోవాలని హితవు పలికారు. దరిద్రపు జాతి అని కాపులను అవహేళన చేశారని, ఫోన్ కాల్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ సారి ముద్రగడ దీక్షను అడ్డుకోమని, టిడిపి ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. 

ఏడాది సస్పెన్షన్ పై రోజా లంచ్ మోషన్ పిటిషన్..

హైదరాబాద్ : ఏడాది సస్పెన్సన్ పై లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్యే రోజ దాఖలు చేశారు. దీనిని కోర్టు అనుమతించింది. మధ్యాహ్నాం 02.30 విచారణ జరగనుంది. 

11:28 - March 4, 2016

హైదరాబాద్ : నిద్ర క‌రువైతే బ‌రువెక్కుతార‌ని ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని ప‌రిశోధ‌న‌లు రుజువుచేశాయి. అయితే అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు చికాగో యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు తేల్చారు. నిద్ర త‌క్కువైన‌పుడు ఎవ‌రికైనా చాలా రుచిక‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌నే కోరిక బ‌లంగా ఉంటుంద‌ట‌. డ్ర‌గ్స్ తీసుకోవాల‌నిపించేంత తీవ్రంగా ఈ తినాల‌నిపించే కోరిక ఉంటుంద‌ట‌. డ‌యాబెటిస్‌, మెటబాలిజం, ఎండోక్రినాల‌జీల‌కు సంబంధించి జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు తేలాయ‌ని యూనివ‌ర్శిటీ ఒక నివేదిక‌లో తెలిపింది.

ఆరోగ్యానికి హానిచేసే రుచిక‌ర‌మైన ఫుడ్‌...

తక్కువ నిద్ర పోతే ఎక్కువ ఆహారం, అదీ ఆరోగ్యానికి హానిచేసే రుచిక‌ర‌మైన ఫుడ్‌ తింటార‌ని, తద్వారా బ‌రువు పెరుగుతార‌ని ఇప్ప‌టికే కొన్ని అధ్య‌యనాల్లో తేలినా ఎందుకు అలా చేస్తారో వెల్ల‌డి కాలేదు. కానీ ప్ర‌స్తుత ప‌రిశోధ‌న‌ల్లో నిద్ర త‌క్కువైతే బ్ల‌డ్‌లో కొన్ని ర‌కాల ర‌సాయ‌నాల సంకేతాలు పెరుగుతున్న‌ట్టుగా గ‌మ‌నించారు. ఇవి ఆనందాన్నిచ్చే ఆహారాన్ని తీసుకునేందుకు పురికొల్పుతాయి. అందుకే స్వీట్లు, ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న స్నాక్స్ ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా తీసుకుంటార‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది.

స‌రిప‌డా నిద్ర‌లేన‌పుడు...

స‌రిప‌డా నిద్ర‌లేన‌పుడు క‌డుపు నిండా ఆహారం తిన్నా కాని, అద‌నంగా స్నాక్స్ తీసుకోవ‌డం కొంత‌మంది వలంటీర్ల‌లో ప‌రిశోధ‌కులు గ‌మ‌నించారు. ముఖ్యంగా మ‌ధ్యాహ్న భోజనం త‌రువాత ఇలాంటి కోరిక మ‌రింత పెరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తానికి నిద్ర త‌క్కువైతే రుచిక‌ర‌మైన ఫుడ్ విష‌యంలో మ‌నం కంట్రోల్‌లో ఉండ‌లేమ‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు.

ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత..

ఖమ్మం : పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ హాయంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధితో కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

11:23 - March 4, 2016

వరంగల్ : అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛమైన నీతింతమైన పాలన అందించే సీపీఎంకు ఓటేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో డబ్బున్న వారికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయని విమర్శించారు. పార్టీల మధ్య పోటీ కాకుండా గత కొంతకాలంగా విలువల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీలు ఏవీ ఉండకూడదని, విపక్షాలు ఉండకూడదనే ప్రయత్నం అధికార పక్షం చేస్తోందన్నారు. దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని వామపక్షాలు ప్రజలు ఎదుట పెట్టాలని భావిస్తోందన్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయడానికి వ్యతిరేకమని, ఈ రోజు చెబుతున్నది అధికార పక్షానికి రేపటి వరకు గుర్తు ఉండడం లేదని తమ్మినేని ఎద్దేవా చేశారు. 

11:17 - March 4, 2016

ఢిల్లీ : లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఏ.సంగ్మా కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల లోక్ సభ సంతాపం తెలిపింది. పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. ఇక సంగ్మా విషయానికి వస్తే 1947, సెప్టెంబర్ 1వ తేదీన జన్మించారు. 1988 నుండి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా, 1996-1998 వరకు 11వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు. 8 సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన సంగ్మా ప్రస్తుతం మేఘాలయలోని తురా (ఎస్టీ) నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నారు. 2012లో రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె అగాంధ సంగ్మా 15వ లోక్ సభకు ఎంపికై యూపీఏ హాయంలో మంత్రి పదవి చేపట్టారు. సంగ్మా కుమారుడు కోర్నాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. 

11:15 - March 4, 2016

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వచ్చిందంటే మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తాయి. వీటిని చూడగానే నోరూరుతుంది. పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి ‘గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువ. వీటిల్లో కేలరీలు కూడా తక్కువే. ఈ పండ్లలో విటమిన్‌ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్ర‌మాదం ఉండ‌దు. ఆల్‌బ‌క‌రా పండ్ల‌లో మెండుగా ఉండే ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఆల్‌బ‌క‌రా పండ్ల‌లో జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఎక్కువ‌గా ఉంటుంది. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది. ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మాజీ స్పీకర్ సంగ్మా కన్నుమూత..

ఢిల్లీ : లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఏ.సంగ్మా కన్నుమూశారు. 11వ లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన సంగ్మా సెప్టెంబర్ 1, 1947లో జన్మించారు. మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1996-1988 వరకు స్పీకర్ గా పనిచేశారు. ఎన్సీపీ పార్టీని స్థాపించారు. లోక్ సభకు ఎనిమిదిసార్లు ఎంపికయ్యారు. 1973 లో మేఘాలయ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1975-1980 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

10:39 - March 4, 2016

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఓ రహస్య సొరంగం బయటపడటంతో ఆర్మీ దిగ్భ్రాంతికి గురైంది. సరిహద్దులను దాటి ఇండియాలోకి ఉగ్రవాదులు సులువుగా ప్రవేశించేందుకు దీన్ని తవ్వి ఉండవచ్చని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. భూమికి 10 అడుగుల కింద ఈ సొరంగం ఉంది. 30 అడుగులకు పైగా పొడవైన ఈ సొరంగం విశాలంగా ఉంది. నిమిషాల్లో వందల మంది సరిహద్దులు దాటేందుకు వీలుండేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి అధునాతన ఆయుధాన్నైనా ఈ సొరంగం ద్వారా సరిహద్దులను దాటించవచ్చు. అయితే, ఈ సొరంగ నిర్మాణం పూర్తి కాకుండానే తాము గుర్తించగలిగామని, దీంతో జమ్మూ నగరంలోకి ఉగ్రవాదులు రాకుండా అడ్డుకున్నామని జమ్మూ రేంజ్ బీఎస్ఎఫ్ ఐజీ రాకేష్ శర్మ తెలిపారు. సొరంగం పనులు మరికొన్ని రోజులు సాగితే పాక్ వైపు కూడా పూర్తయి ఉండేదని అన్నారు. కాగా, భారత్, పాక్ సరిహద్దుల్లో సొరంగాలు బయటపడటం ఇదే తొలిసారి కాదు. అఖ్ నూర్ సెక్టారులో 2009లో, సాంబా సెక్టారులో 2012లోనూ ఇలాగే సొరంగాలు వెలుగులోకి వచ్చాయి. సొరంగం విషయమై పాక్ రేంజర్లకు నిరసన తెలిపామని, విచారణ జరుపుతున్నామని రాకేష్ శర్మ తెలిపారు.

10:37 - March 4, 2016

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వంపై విరుచకపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన ఇటీవలే ఆమరణ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఆయన దీక్ష విరమించారు. కానీ హామీలు అమలు కాకపోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాను లేఖ రాయడంతోనే ఏపీ సీఎం చంద్రబాబుకు కాపులకు ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయని ముద్రగడ పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన వాగ్ధానాలతోనే గద్దెనెక్కారని, తక్షణమే కాపులకు రూ. 500 కోట్లు విడుదల చేస్తామన్నారని గుర్తు చేశారు. లోతైన విచారణ పూర్తయిన తరువాతే అరెస్టులు అన్నారని, ఏలూరు సభలో ఓ ఎమ్మెల్యేలతో తనను తిట్టించారని తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం తాను ఎవర్నీ ఒక మాట అనలేదని స్పష్టం చేశారు. తనపై దాడి ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు.

బాబు డిక్టేట్ చేయడం లేదా ? 
ఆకలి తీరుస్తారని..బాధల నుండి బయటపడేస్తారని ఆనాడు తమ జాతి అనుకుందన్నారు. చీకటి ఒప్పందాల్లో జాతికి రుణాలు ఇవ్వమనడం లేదని..వచ్చే ఆదాయంలో జాతికి ఉపయోగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని..భిక్ష..కాదు..తమ హక్కు అని తెలిపారు. డిక్టేట్ చేస్తున్నారని తనను అంటున్నారని ఏం ఆయన (చంద్రబాబు)డిక్టేట్ చేయడం లేదా ? అని ప్రశ్నించారు. భూమి ఇస్తావా ? లేవా ? అంటూ బెదిరించి చేసి భూములు తీసుకోవడం లేదా ? 33వేల ఎకరాలు ఎందుకు అక్కడ డ్యాన్స్ చేస్తారా ? అని తనదైన శైలిలో ప్రశ్నించారు.

హామీలపై స్పందించాలి..
భూ దందాపై ఎందుకు ఎదురుదాడి చేయడం లేదని ప్రశ్నించారు. తనపై ఎదురు దాడి చేయాలని చెప్పడం ఎంతవరకు సబబ అన్నారు. దేశంలో పౌరసత్వం రద్దు చేశామని చెప్పండి..ఇక్కడి నుండి తరిమి వేయండి అని తెలిపారు. పచ్చ చొక్కా ఉంటే అన్నీ కల్పిస్తారా ? రావాణ రాజ్యం అనుకోవాలంటే ఎంతోకాలం ఉండవని చంద్రబాబునుద్దేశించి హెచ్చరించారు. ఇచ్చిన హామీల అమలు చేయాలని, మార్చి 10 సాయంత్రంలోపు రాతపూర్వకంగా అధికారికంగా పంపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 11వ తేదీన ఉదయం పది గంటలకు ఆమరణ నిరహార దీక్ష కూర్చొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. 

10:30 - March 4, 2016

వేసవికాలం వస్తోందంటే చాలు ప్రపంచంలో అందరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనికి వాటర్‌ మెలోన్‌ అనే పేరు స్థిరపడింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మనకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారట.

100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో

నీరు - 95.2 గ్రా., ప్రోటీన్ - 0.3 గ్రా., కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా., పీచు పదార్థాలు - 0.4 గ్రా., కెరోటిన్ - 169 మైక్రో గ్రా., సి విటమిన్ - 26 మి.గ్రా., కాల్షియం - 32 మి.గ్రా., ఫాస్ఫరస్ - 14 మి.గ్రా., ఇనుము - 1.4 మి.గ్రా., సోడియం - 104.6 మి.గ్రా. ,పొటాషియం - 341 మి.గ్రా. , శక్తి - 17 కిలోకాలరీలు వున్నాయి.

రక్తపోటు వున్నవారు...

రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. ఒక గ్రాము టమాటో లో 40 మైక్రో గాములుంటే కర్బూజా లో 72 మైక్రోగ్రాములు ఉన్నది .మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది. లైకోపీన్ అనబడే ఈ ఫైటో కెమికల్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత క్యాన్సర్లనుంచి కూడా రక్షణనిస్తుంది. ఇంకా పుచ్చకాయ వేసవినుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాలిన గాయాలమీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలంటే...

సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా?. కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈసారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

కాపులకు ఇచ్చిన వాగ్ధానాలతో గద్దెనెక్కారు - ముద్రగడ..

కాకినాడ : తాను లేఖ రాయడంతోనే ఏపీ సీఎం చంద్రబాబుకు కాపులకు ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయని ముద్రగడ పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన వాగ్ధానాలతోనే గద్దెనెక్కారని, తక్షణమే కాపులకు రూ. 500 కోట్లు విడుదల చేస్తామన్నారని గుర్తు చేశారు. లోతైన విచారణ పూర్తయిన తరువాతే అరెస్టులు అన్నారని, ఏలూరు సభలో ఓ ఎమ్మెల్యేలతో తనను తిట్టించారని తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం తాను ఎవర్నీ ఒక మాట అనలేదని స్పష్టం చేశారు. తనపై దాడి ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. 

సంజయ్ హత్య కేసులో విచారణ వేగవంతం..

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ జైన్ హత్య కేసును చేధించడానికి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మారుతి స్విఫ్టు 0855 నెంబర్లు ఉన్న36 మంది కారు యజమానులను మహంకాళీ పీఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. 

మాదాపూర్ లో వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్ : మాదాపూర్ పీఎస్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శవాన్ని పెట్రోల్ పోసి దుండగులు తగుబెట్టారు. 

10:06 - March 4, 2016

హైదరాబాద్‌: నటి శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారట. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు. స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా. ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

దేశం లోపల స్వేచ్ఛ కోరుతున్నాం - కన్హయ్య

ఢిల్లీ : తనకు సహకరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, ఏబీవీపీ అంటే ధ్వేషం లేదన్నారు. భారతదేశం నుండి స్వేచ్ఛ కాదని, భారతదేశం లోపల స్వేచ్ఛ కోరుతున్నామన్నారు. ఆకలి..అవినీతి..మతతత్వం.. పెట్టుబడి దారీ వ్యవస్థ నుండి స్వేచ్ఛ కోరుతున్నామన్నారు. 

లింగంపేట సర్పంచిపై వేటు..

నిజామాబాద్ : లింగంపేట సర్పంచి బాలమణిపై వేటు పడింది. 13వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని విచారణల తేలడంతో పదవి నుండి జిల్లా కలెక్టర్ తొలగించారు. 

కర్నూలులో వామపక్షాల బస్సు యాత్ర..

కర్నూలు : జిల్లాలో మూడో రోజు వామపక్షాల బస్సు యాత్ర కొనసాగనుంది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల, బండి ఆత్మకూరు, నంద్యాల సభలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొనున్నారు. 

09:59 - March 4, 2016

‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన అలనాటి అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కనుందిట. యాడ్ ఫిల్మ్ మేకర్ రవి ఉద్యావర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ కనపడనున్నాడు. అక్షర హాసన్ కీలక పాత్ర పోషిస్తుండగా, సవతి తల్లి పాత్రలో శ్రీదేవి మెప్పించనుంది. బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా అసాధారణ కథ, కథనాలతో రూపొందనున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మామ్ (MOM) పేరుతో నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ మీదికి వెళ్లనుంది.

09:56 - March 4, 2016

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరైనోడు'ఈ సినిమా షూటింగ్.. చివరిదశకు చేరుకోవడంతో తన తదుపరి చిత్రానికి సిద్ధమౌతున్నాడట బన్నీ. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు అల్లు అర్జున్ అంగీకరించినట్లు తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయంపై ఆసక్తి నెలకొంది. రెండు భాషల్లోనూ క్రేజ్ ఉన్న కథానాయికను పరిశీలిస్తుండడతో.. ఆ ఛాన్స్ అమీజాక్సన్‌కు దగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమీ ప్రస్తుతం రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో తమిళనాట బిజీగా ఉంది. దీంతో.. అమీజాక్సన్ అయితే తమిళ వెర్షన్‌కు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక ‘ఎవడు’ సినిమాతో అమీజాక్సన్ టాలీవుడ్‌కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అప్పుడు ‘ఎవడు’ సినిమాలో చరణ్‌తో చిందేసిన అమీజాక్సన్.. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన బన్నీ సరసన మురిపించబోతోంది. మొత్తానికి.. ఓ మెగాఫ్యామిలీ హీరో సరసన ఛాన్స్ దక్కితే చాలు... ఎప్పటికైనా ఈ ఫ్యామిలీ నుంచి మరో ఆఫర్ రావడం ఖాయమైనట్టే. దీంతో ఇప్పటికే పలుమార్లు రుజువైన ఈ విషయం.. అమీజాక్సన్‌తో మరోసారి ప్రూవ్ కాబోతోంది.

09:14 - March 4, 2016

హైదరాబాద్ : ప్రజా ధనాన్ని వేతనంగా పొందుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు..ఉద్యోగుల్లో కొందరు విద్యుక్త ధర్మాన్ని విడనాడి లంచాలు ఆశిస్తున్నారు. బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారుల్లో కొంతమంది మానవత్వం లేకుండా ప్రజలను లంచాల కోసం పీడిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వీరిపై దాడులు చేస్తూ కటకటాల్లోకి నెడుతున్నారు. అయినా లంచావతారాలు పట్టుపడుతూనే ఉన్నారు. తాజాగా నగరంలోని ఆర్టీఏ అధికారి నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. గురువారం ఉదయమే బోయిగూడలోని నరేందర్ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. సుమారు ఐదు కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్, పీల్ ఖానాతో పాటు ఐదు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరేష్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. నరేందర్ కు సంబంధించి నగరంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.22 లక్షల నగదు, 60 తులాల బంగారం, మూడు ప్రాంతాల్లో ప్లాట్లు గుర్తించినట్లు తెలిపారు. 

వాహనాలను దగ్ధం చేసిన మావోయిస్టులు..

జార్ఖండ్ : మావోయిస్టులు రెచ్చిపోయారు. బుందు ప్రాంతంలో ఐదు వెహికల్స్ ను దగ్ధం చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదని తెలుస్తోంది. 

కాసేపట్లో ముద్రగడ మీడియా సమావేశం..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడనున్నారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట ఉద్యమాన్ని చేపట్టిన ఆయన తుని గర్జన చేపట్టిన సంగతి తెలిసిందే. 

46 మంది బాల కార్మికులను మోక్షం కల్పించిన ఖాకీలు..

గయా : 46 మంది బాల కార్మికులకు పోలీసులు మోక్షం కల్పించారు. గాజుల పరిశ్రమపై జైపూర్ పోలీసులు దాడులు చేసి బాల కార్మికులను స్వస్థలాలకు తరలించారు. 

08:34 - March 4, 2016

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ కార్యాలయాన్ని కొటక్ మహేంద్ర బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. సోమాజిగూడ బ్చాంచీలో బెల్లంకొండకు రూ. 11 కోట్ల అప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. అప్పు చెల్లించకపోవడంతో ఫిల్మ్ నగర్ ఉన్న ఆయన కార్యాలయాన్ని సీజ్ చేశారు. 

08:32 - March 4, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక భూమిక పోషిస్తున్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో చోరీ జరిగింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షార్ లో మరోసారి భద్రత లోపాలు బట్టబయలయ్యాయి. కేంద్ర బలగాల నిఘా నీడలో పటిష్ట భద్రత కలిగిన షార్ లో ప్రవేశించడం దుర్లభం. కానీ గుర్తు తెలియని వ్యక్తులు మ్యాగజైన్ భవనం డోర్ బద్దలు కొట్టి డిగ్నేటర్లు ఎత్తికెళ్లారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే షార్ కు ఉగ్రవాదుల నుండి ముప్పు ఉందని ఐబీ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. 

షార్ లో చోరీ ?

నెల్లూరు : శ్రీహరికోటలోని షార్ లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. మ్యాగజైన్ భవనం తలుపులు పగులగొట్టి డిగ్నేటర్లు ఎత్తికెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి..

ఢిల్లీ : తిమ్రాపూర్ లో ఓ ట్రక్ ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆర్టీఏ అధికారి ఇంటిపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : ఆర్టీఏ అధికారి నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. రూ. 5 కోట్ల అక్రమ ఆస్తున్నట్లు గుర్తించారు. నెల రోజుల క్రితం రూ.8వేలు లంచం తీసుకుంటూ నరేందర్ పట్టుబడ్డారు. గాంధీనగర్, పీల్ ఖానాతో పాటు ఐదు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరేష్ బంధువల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నరేందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. 

వరంగల్ లో నేడు కేటీఆర్ పర్యటన..

వరంగల్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. 

నేడు శ్రీశైలంకు డిప్యూటి సీఎం కేఈ..

కర్నూలు : నేడు ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి శ్రీశైలంకు వెళ్లనున్నారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

పిఠాపురం జంక్షన్ వద్ద బోల్తా పడిన ఆర్టీసీ బస్సు...

తూర్పుగోదావరి : పిఠాపురం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఇచ్చాపురం నుండి రామచంద్రాపురం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఎర్రవెల్లిలో నేడు కేసీఆర్ పర్యటన..

మెదక్ : నేడు ఎర్రవెల్లి, నర్సన్నపేటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించనున్నారు. 

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

చిత్తూరు : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో బుకింగ్ జరగనుంది. 

టి.స్పీకర్, మండలి ఛైర్మన్ ఢిల్లీ పర్యటన..

హైదరాబాద్ : నేడు తెలంగాణ స్పీకర్ మధుసూధనచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ లు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో వీరు పాల్గొనున్నారు. 

పోలీసుల అదుపులో చక్రి తల్లి..సోదరుడు..

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్‌ నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని విల్లా కోసం వారిద్దరూ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు కోటప్పకొండకు వెళ్లనున్న సీఎం బాబు..

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కోటప్పకొండకు చేరుకుంటారు.

ఛత్తీస్ గడ్ లో ఇద్దరు జవాన్ల మృతి..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోలు కాల్పులు జరిపారు. ఈఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. 

07:32 - March 4, 2016

అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ మంత్రులు, నేతలు భూ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కొన్ని పార్టీలు, పత్రికలు తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), మల్యాద్రి (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:28 - March 4, 2016

కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. తెలంగాణలో దాదాపు పది లక్షల మంది కౌలు రైతులుంటే 2015లో కేవలం 44వేల మందికే గుర్తింపు కార్డులిచ్చారు. అందులో కేవలం 8 వేల మందికే పంట రుణాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారైనా తమకు సకాలంలో గుర్తింపు కార్డులివ్వాలంటూ కౌలు రైతులు కోరుతున్నారు. అసలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులెందుకివ్వాలి? దీనివల్ల వారికి జరిగే ప్రయోజనాలేమిటి? గుర్తింపు కార్డులు పొందడానికి ఎవరెవరు అర్హులు? కౌలుదారుల గుర్తింపు కార్డుల జారీలో వున్న మార్గదర్శకాలేమిటి? వీరికి పంట రుణాల లభ్యత ఎలా వుంది? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ కౌలు రైతు సంఘం నేత టి. సాగర్ విశ్లేషించారు. ఆయన విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

07:26 - March 4, 2016

ఆసియా కప్‌ ట్వంటీ 20 మ్యాచ్‌లో పసికూన యూఏఈపై పై భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలింగ్‌తో యూఏఈను బెదరగొట్టిన భారత్‌..అటు తరువాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. యూఏఈ విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్‌లు మరో వికెట్ పడకుండా 39 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 10.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

07:22 - March 4, 2016

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో తెలుగుతమ్ముళ్లను కారెక్కించుకున్న టీఆర్‌ఎస్‌ మరో అడుగు ముందుకు వేసింది. టీడీపీని మరింత ఇరకాటంలో పెట్టేందుకు స్కెచ్ వేసింది. పార్టీ మారిన శాసనసభ్యులకు స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. ఇంతకీ ఆ నోటీసుల లోగుట్టు ఏమిటంటారా.. వాచ్‌ దిస్‌ స్టోరీ. తెలంగాణా రాష్ట్ర సమితి విపక్ష పార్టీలపై పైచేయి సాధించేందుకు మరోసారి తన అస్త్రాలను ప్రయోగిస్తోంది. తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బ తీసిన గులాబి పార్టీ, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా తెలుగు తమ్ముళను కిమ్మనకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది ఇప్పటికే కారెక్కారు. వీరిలో ఐదుగురికి స్పీకర్‌ మధుసూదనాచారి గురువారం నోటీసులు జారీ చేశారు.

పెద్దల మంత్రాంగం..
స్పీకర్‌ నోటీసుల వెనుక తెరాస పెద్దల మంత్రాంగం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని సార్లు నెత్తీ నోరు మొత్తుకున్నా స్పందించని స్పీకర్‌ ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వడం వెనుక.. వలసొచ్చిన టీడీపీ వారిపై వేటు పడకుండా చూసే వ్యూహం ఉందని భావిస్తున్నారు. టీడీపీ సభ్యులు ఇప్పటికే తాము టీడీపీ టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా.. టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు పడకుండా.. విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందీ రాకుండానే ఈ వ్యూహం రచించారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనర్హత ఫిర్యాదుపై స్పీకర్ మధుసూదనాచారి... ఎర్రబెల్లి దయాకర్ రావ్, సాయన్న, కె.పి. వివేకానంద, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లకు నోటీసులు పంపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. 

07:19 - March 4, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న వైసిపి ఆరోపణలపై... టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. టిడిపి, వైసిపి నేతల మధ్య 'రాజధాని యుద్ధం' సాగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. రాజధాని పరిసరాల్లో భూముల కొనుగోలు అంశం... ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిగ్గా మారింది. ఈ అంశంపై టీడీపీ.. వైసీపీ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు సహా.. పలువురు కీలక మంత్రులు, నేతలు రాజధాని ప్రాంత భూములను.. రాజధాని ప్రకటనకు ముందే దక్కించుకుని బినామీల పేరిట ఉంచారని.. వైసీపీ నేతలు ఆరోపించారు. ఎవరెవరు ఎంత భూమని కొనుగోలు చేశారో తమ వద్ద ఆధారాలున్నాయంటూ వెల్లడించారు.

చర్చలకు సిద్ధం..
వైసీపీ నేతల ఆరోపణలను తెలుగుదేశం నాయకులు గట్టిగా తోసిపుచ్చారు. తమకు రాజధాని ప్రాంతంలో భూమి లేదని, తమకు బినామీలు ఎవరూ లేరని పత్తిపాటి, నారాయణ తదితరులు స్పందించారు. మంత్రి దేవినేని ఉమ కూడా.. తనకు రాజధాని ప్రాంతంలో భూమి లేదన్నారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... జగన్ పైన దుమ్మెత్తిపోశారు. తాను తన కొడుకు పేరు మీద మగాడిలా కొన్నానని చెప్పారు. రాజధాని ప్రకటన అసెంబ్లీలోనే సెప్టెంబర్ నెలలో చేశారని, ఆ తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత తాను కొన్నానని చెప్పారు. ప్రకాశం బ్యారేజీపై బహిరంగ చర్చకు పయ్యావుల బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. పయ్యావుల కేశవ్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ కాదనుకుంటే.. ఆయన నియోజకవర్గం ఉరవకొండలోనైనా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

అసత్య ప్రచారమన్న ఎంపీ మురళీ మోహన్..
అమరావతి భూముల విషయంలో తన పైన అసత్య ప్రచారం సరికాదని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌ అన్నారు. తాను 1993 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని... తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి బినామీని కాదన్నారు. ఆయనతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడమే సింగిల్‌ ఎజెండాగా ప్రతిపక్షం పనిచేస్తోందని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణనాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ ఇలాంటి ఆరోపణలకు దిగుతోందని గాలి విమర్శించారు. రాజధాని భూముల వ్యవహారం మొత్తానికి టీడీపీ నేతలను ఇరుకున పెట్టేందుకు వైసీపీ చేతికి ఒక అస్త్రంగా దొరికింది. వారం రోజుల్లోగా ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశం రాజకీయ కాకను తారాస్థాయికి చేర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

07:17 - March 4, 2016

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్‌ నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని విల్లా కోసం వారిద్దరూ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరితే అదుపులోకి తీసుకుంటారా అని చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ ప్రశ్నించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము న్యాయపోరాటం..మౌన పోరాటం చేస్తున్నామని చక్రి సోదరుడు మహిత్ నారాయణ టెన్ టివితో తెలిపారు. తమది ఆస్థి పోరాటం కాదని పేర్కొన్నారు. నడి రోడ్డుపై పడిన తమను పోలీస్ స్టేషన్ కు తరలించడం సబబు కాదని, శ్రావణి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతోందని..ఇదేనా న్యాయమా అని ప్రశ్నించారు. ఒక తల్లి గూడు కోసం చేస్తున్న పోరాటమని మహిత్ నారాయణ స్పష్టం చేశారు. 

07:14 - March 4, 2016

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ కాపు కళ్యాణమండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారు. ఘాటు రోడ్డు ద్వారా త్రికోటేశ్వరుని సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరువాత కోటప్పకొండ దిగువున్న ఉన్న జడ్‌పి హైస్కూల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 

07:14 - March 4, 2016

విజయవాడ : అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ మంత్రులు, నేతలు భూ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కొన్ని పార్టీలు, పత్రికలు తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం భూములు కొనుగోలు చేస్తే దానిపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ, సాక్షి పత్రికపై ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా రాతలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది ఇష్టప్రకారం బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో పెట్టుబడుల అంశంపై బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ వచ్చారని.. తనను లండన్‌లో సమావేశాలకు పిలిచారని దీనికి తాను హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఇష్టప్రకారం రాస్తే విలువ ఎక్కడుంటుందని ప్రశ్నించారు.

సాక్షి పత్రిక ఆస్తులు ప్రభుత్వ ఆస్తే..
సాక్షి పత్రిక ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది కాబట్టి అది ప్రభుత్వ ఆస్తేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆస్తి అయి ఉండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై చర్యలు ఎలా ఉండాలన్నది ఆలోచిస్తున్నామని తెలిపారు. అమరావతి భూముల కొనుగోలుపై ఏదేదో రాసి విచారణ చేయమంటే ఎలా చేస్తామని చంద్రబాబు అన్నారు. భూములు కొనుక్కుంటే చర్యలు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. ఆస్తులు కొనగూడదు, వ్యాపారం చేయరాదంటే ఎలా అని ఎదురు ప్రశ్న వేశారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. విపక్షాలు రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

07:12 - March 4, 2016

ఢిల్లీ : దేశ ద్రోహం కేసులో అరెస్టై..మధ్యంతర బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీహార్‌ జైలు నుంచి నేరుగా జేఎన్‌యూ వర్శిటీకి వచ్చిన కన్నయ్య కుమార్‌..వేలాది మంది జేఎన్‌యూ విద్యార్థుల మధ్య..పవర్‌ఫుల్‌ స్పీచ్‌ ఇచ్చారు. తనదైన స్టైల్లో మోడీ సర్కార్‌పై కన్నయ్య విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపైన తనకు పూర్తి నమ్మకం ఉందని..త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయన్నారు. 6నెలల మధ్యంతర బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌..గట్టి పోలీసు బందోబస్త్ మధ్య నేరుగా జెఎన్‌యూ వర్శిటికి చేరుకున్నారు. ఆ తర్వాత వర్శిటీ విద్యార్థులనుద్దేశించి 50నిమిషాలపాటు ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. ఇన్ని రోజులు తనకు మద్దతుగా నిలిచిన విద్యార్థిలోకానికి, దేశప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

మన్ కీ బాత్ కాదు..మాకీ బాత్..
దేశద్రోహం కింద తనను అరెస్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కన్నయ్య కుమార్‌ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. మోడీ మాటి మాటికి మన్‌కీ బాత్‌ అంటూ రేడియోలో దేశప్రజలకు చెప్తున్నారే కానీ..మాకీ బాత్‌ గురించి చెప్పడంలేదని అన్నారు. దేశంనుంచి నుంచి స్వాతంత్ర్యం కాదు..ఇండియాను దోచుకునే వాళ్లనుంచి మనకు స్వాతంత్ర్యం కావాలని కన్నయ్య అన్నారు. తనకు ఏపార్టీతోనూ సంబంధంలేదని కన్నయ్య కుమార్‌ స్పష్టం చేశారు. అయినా..తప్పొప్పుల గురించే మాట్లాడేవాళ్లను కేంద్రం దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఏది తప్పో..ఏది ఒప్పో అని మాట్లాడిన సీతారాం ఏచూరి, రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై కూడా దేశద్రోహం కేసు పెట్టడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. వీళ్లంతా తనకు మద్దతుగా మాట్లాడలేదని..కానీ తప్పొప్పుల గురించే మాట్లాడడమే వీళ్లు చేసిన నేరమా అని ప్రశ్నించారు.

రోహిత్ ను కేంద్రం చంపేసింది..
ఇప్పటికే రోహిత్‌ను కేంద్రం చంపేసిందని కన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్‌ మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఎంతపెద్ద ఉద్యమం ప్రారంభమైందో కేంద్రం గుర్తుంచుకోవాలన్నారు. ఒక దేశాధ్యక్షుడి కుమారుడు, ఒక కార్మికుడి కుమారుడు ఇద్దరూ ఒకే స్కూల్లో చదివిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు అవుతుందన్నారు కన్నయ్య. ఒక పేద విద్యార్థి జేఎన్‌యూ లాంటి వర్శిటీలో పీహెచ్‌డీ చేయోద్దా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి లోక్‌సభలో ప్రసంగింస్తూ సత్యమేవ జయతే అని గొప్పగా అన్నారని కానీ...అదే నినాదం మాలాంటి విద్యార్థులు అంటే దానికి రాజకీయ రంగు పులుముతారని విమర్శించారు. పార్లమెంటులో కూర్చున్న ప్రతిఒక్కరూ ఎంతో అదృష్టవంతులని...దేశానికి ఏది మంచో ఏది చెడో చెప్పే శాసనాలు చేసే అధికారం ఉన్నందుకు వారంతా గర్వపడాలన్నారు. చివర్లో కన్నయ్య కుమార్‌ ప్రసంగానికి మంత్రముగ్దులైన జేఎన్‌యూ విద్యార్థులు ఆజాదీ లాల్‌ సలామ్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే న్యాయం కోసం పోరాడే దేశప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ తన ప్రసంగాన్ని ముగించారు కన్నయ్య కుమార్‌. 

నేడు కమల్ నాథన్ అడ్వైజరీ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నేడు కమలనాథన్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఉద్యోగుల విభజనపై చర్చ జరగనుంది. తెలంగాణ ఏపీ సీఎస్ లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 

Don't Miss