Activities calendar

05 March 2016

భారత్‌ ఎంతో సహనం గల దేశం : అమీర్‌ ఖాన్‌

ఢిల్లీ : భారత్‌ ఎంతో సహనం గల దేశమని అమీర్‌ ఖాన్‌ అన్నారు. కాని దేశంలో విద్వేషాలు విస్తరింపజేసే వారు కొందరు ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఇలాంటి వారు ఉన్నారు. వీరిని నియంత్రించేదుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ప్రభుత్వం తనను ప్రచారకర్తగా తొలగించినప్పుటికీ తాను ఇప్పటికీ భారత్‌కు బ్రాండ్‌ అంబాసీడర్‌ అనే విశ్వసిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ సేవల నుంచి తొలగించడానికి భారత్‌ బ్రాండ్‌ కాదని, తన తల్లి అని అన్నారు. ఇండియా టీవీలోని ఓ షోలో మాట్లాడుతూ ఆమీర్‌ఖాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీ.అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 10 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.

22:17 - March 5, 2016

కర్నూలు : సీఎం చంద్రబాబు ఏపీకి, సీమకు అన్యాయం జరుగుతున్నా మట్లాడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  విమర్శించారు. కర్నూలులో వామపక్షాల బస్సుయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మాటలకు ఢిల్లీలో ఏమాత్రం విలువ లేదని ఎద్దేవా చేశారు. 

 

22:13 - March 5, 2016

కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలో కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కానీ నేటికీ అమలుకు నోచుకోలేదని సీపీఎం నేత గఫూర్‌ మండిపడ్డారు. ఒక ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే పాతిక వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, కానీ కేంద్రం ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.  

22:10 - March 5, 2016

ఢిల్లీ : దేశభక్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే మోడీ ప్రభుత్వం సైన్యంపై కోత విధించేందుకు కసరత్తు చేస్తోంది. సైనిక దళాల్లో కోత విధించాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ స్వయంగా ఓ ఛానల్‌కు వెల్లడించారు. ఈ కోతను ఆర్మీ నుంచి ప్రారంభిస్తామన్నారు. రాత్రికి రాత్రి చేసే పని కాదని కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌  అమలు చేయనున్న నేపథ్యంలో ఆర్థికభారం పెరిగిపోతుండడమే ఇందుకు కారణమని పారీకర్‌ తెలిపారు. ఈ ఏడాది సైన్యానికి వేతన రూపంలో సుమారు 95 వేల కోట్లు ఖర్చవుతోంది. భారత్‌లోని త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో కలిపి మొత్తం 13 లక్షల మంది సైన్యం పనిచేస్తోంది. ప్రపంచంలో అత్యధిక సైన్యం ఉన్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

 

22:08 - March 5, 2016

ఢిల్లీ : జె ఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌కు అంతమొందిస్తే 11 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌ గోడలపై పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లకు బాధ్యత వహిస్తూ ఫోన్‌ నంబర్‌ ఉంచిన పూర్వాంచల్‌ సేన అధ్యక్షుడు ఆదర్శశర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్హయ్యకు వస్తున్న బెదిరింపులను సీపీఐ జాతీయ నేత నారాయణ ఖండించారు.  కన్హయ్యను కమ్మూనిస్టు పార్టీ కాపాడుకుంటుందని నారాయణ అన్నారు. 

 

22:05 - March 5, 2016

పశ్చిమగోదావరి : నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా పోకిరుల వేధింపులు ఆగడం లేదు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో మరో విద్యార్థిని పోకిరుల వేధింపులకు బలైపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను కటకటాల్లోకి నెట్టారు. 
ఇంటర్ విద్యార్థినిపై దాష్టీకం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రేమించడం లేదన్న కారణంతో యువతి ఒంటికి నిప్పు పెట్టారు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన ఇందుమతి అనే యువతి ఇంటర్‌ చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన చిన్న విక్కీ, పెద్ద విక్కీ అనే ఇద్దరు యువకులు ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రేమించాలని వెంటపడుతున్నారు. అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో.. స్నేహితుడితో వచ్చి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించింది. 
పోలీసులు దర్యాప్తు ముమ్మరం
యువతిపై హత్యాయత్నం ఘటన జిల్లాలో సంచలనం రేపడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన వారు నిందితులు పెద్ద విక్కీ, చిన్న విక్కీలను అరెస్ట్ చేశారు. మరోవైపు జరిగిన దారుణంపై ఏపీ మంత్రి పీతల సుజాత ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అమ్మాయిలపై ఆగడాలు పెరుగుతుండడాన్ని ఖండించిన మహిళా సంఘాలు నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

భారత జట్టు సరికొత్త చరిత్ర..

హైదరాబాద్‌ : ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో విశేషంగా రాణించిన భారత జట్టు రెండు స్వర్ణాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రెండో డివిజన్లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో తొలుత భారత మహిళల జట్టు 3-1తేడాతో లక్సెంబర్గ్‌పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకోగా, ఆపై పురుషుల జట్టు 3-2 తేడాతో బ్రెజిల్ను మట్టికరిపించి పసిడిని సొంతం చేసుకుంది. 

 

21:46 - March 5, 2016

ఎటిఎం నుంచి వాటర్, హైదరాబాద్ లో మహిళలకు మద్యం టెంటర్లు, కొడుకు కోసం పరీక్ష రాసిన తండ్రి, కొడుకు కోసం డ్యాన్స్ చేసిన తండ్రి.. పోలీసులు, షాప్ కీపర్ పై శివసేన కార్యకర్తల దాడి, ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, శ్రీమంతుడు ప్రాజెక్టు... వంటి కేజ్రీన్యూస్ లను వీడియోలో చూద్దాం.....

 

21:37 - March 5, 2016

మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులైనా... తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని వక్తలు తెలిపారు. అరాచ'కుమారులు' అన్న అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నగేశ్ కుమార్, సామాజిక కార్యకర్త దేవి, ఐద్వా సంఘం నాయకురాలు  రమాదేవి పాల్గొని, మాట్లాడారు. మంత్రులు కొడుకులు తప్పుడు చేయడం సిగ్గు చేటన్నారు. సుశీల్ కుమార్ మహిళపై ఈవ్ టీజింగ్ కు పాల్పడడ్డం దారుణమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:12 - March 5, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా తరలివచ్చారు. ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ అధినేత జగన్ పాదయాత్రగా సమావేశాలకు హాజరయ్యారు. రాజధాని భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని.. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. 

21:08 - March 5, 2016

హైదరాబాద్ : ముద్రగడ  పద్మనాభం మళ్ళీ ఆమరణ దీక్షకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని దీక్ష సమయంలో హామీ ఇచ్చి సీఎం మాట తప్పారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం తనను మోసం చేశారని వాపోయారు. కేసులు ఎత్తి వేస్తామని చెప్తూనే వరుసగా అరెస్టులకు సిద్ధపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే తన చివరి దీక్ష అన్నారు. 

 

కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో మహిళ మృతి

హైదరాబాద్‌ : అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని మహిళ కాచిగూడ-మలక్‌పేట రైల్వేస్టేషన్‌ల మధ్య నింబోలిఅడ్డ రైల్వేట్రాక్ గోడ పక్కన శవమై పడింది. పట్టాలు ప్రక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఉండవచ్చునని రైల్వేపోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పొస్ట్‌మార్టం నిమిత్తం మృత దేహన్ని ఉస్మానియా అసుపత్రి మార్చురిలో భద్రపరిచారు. హత్య...ఆత్మహత్య అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

20:57 - March 5, 2016

కర్నూలు :  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే మత కల్లోలాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. హత్యలతో బెదిరింపులతో వామపక్ష, ప్రజాతంత్ర వాదులను అడ్డుకోలేరని అన్నారు. ప్రభుత్వం రాయలసీమకు ఇచ్చిన వాగ్ధనాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కర్నూలులో వామపక్షాల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నుంచి ఖనిజ సంపదను దోచుకెళ్లడం తప్ప..ఆ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాయలసీమలో కరువు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. కాలేజీలు, స్కూళ్లు ప్రైవేట్ రంగంలో ఉన్నాయని... విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. పసి పిల్లలను స్కూళ్లలో చేర్పించాలంటే 25 వేల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మోడీ వాగ్ధాటి కాదని.. పనికి మాలిన మాటలు చెప్పే వాగాంబారుడని ఎద్దేవా చేశారు. రాయలసీమ అభివృద్ధికి చేస్తున్న పోరాటానికి ఇది నాంది అన్నారు. ఇది అంతం కాదు... ఆరంభం మాత్రమే అన్నారు. 

20:36 - March 5, 2016

కర్నూలు : రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. కర్నూలులో వామపక్షాల బస్సుయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు. వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ హక్కుల సాధన కోసం చేపట్టిన వామపక్షాల బస్సు యాత్ర కర్నూలు జిల్లా నంది కొట్కూరుకు చేరుకుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. బస్సు యాత్రలో భాగంగా రాష్ట్ర నాయకులు పలు సభల్లో ప్రసంగించారు. 

 

20:30 - March 5, 2016

కర్నూలు : మోడీ పాలనలో దేశంలో మళ్లీ కొత్త రకమైన ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. కర్నూలులో వామపక్షాల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోశిస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామని చెప్పారని.... కానీ ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. విద్య, ఉద్యోగాలు కావాలంటే దేశ ద్రోహులుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ తో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరుగుతుందన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరోక్ష పన్నుల రూపంలో ప్రజలపై 26 వేల 600 కోట్ల రూపాయల భారాన్ని మోపారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అంబేద్కర్ ను కీర్తిస్తూ.. మరోవైపు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇందుకు ఉదాహరణ జెఎన్ యూలో కన్హయ్యకుమార్ పై దాడి, హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలే అన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గడం లేదన్నారు. సరిహద్దుల్లో పోరాడుతున్న వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

నీటి సమస్యతో రైతుల ఆత్మహత్య

విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. రాయలసీమకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు గాలేరు - నగరి, హంద్రీనీవా పూర్తిచేసేందుకు కేంద్రం నిధులు కేటాయిస్తామని విభజన సమయంలో హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదని ఏచూరి ఎద్దేవా చేశారు. నీటి సమస్యతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా వాగ్ధానాలు చేశారని తెలిపారు. రాయలసీమకు కేంద్రం నుంచి నిధులు ఇస్తామని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాయలసీమలో కరువు తాండవిస్తోందన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేయమంటే డబ్బులు లేవంటున్నారని తెలిపారు.

రాయలసీమ అభివృద్ధి ప్రజా ఉద్యమాలతోనే సాధ్యం..

ప్రజా ఉద్యమాలతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ యాత్రతో కర్నూలుకు పూర్వ వైభవం తిరిగివస్తుందన్నారు. ఉభయకమ్యూనిస్టుల ఉద్యమాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. చేసిన వాగ్ధానాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కర్నూలుకు పాత వైభవం ఎర్రజెండానే తీసుకొస్తుందన్నారు.

కర్నూలు అంటే నాకు ప్రత్యేక అభిమానం...

కర్నూలు అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. 1975, 76 సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో నెల రోజులు కర్నూలులో అండర్ గ్రౌండ్ లో ఉన్నానని.. తెలిపారు. తనకు అరెస్టు కాకుండా ప్రజలు తనను కాపాడారని గుర్తు చేశారు. కర్నూలులో అనేక సహజ వనరులున్నాయని తెలిపారు. ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికే యాత్రలు చేపట్టామని.. ప్రజలు ఉద్యమాలను బలపరచాలని కోరారు.

 

మతోన్మాదాన్ని పెంచిపోశిస్తున్నారు : ఏచూరీ

కర్నూలు : మోడీ పాలనలో దేశంలో మళ్లీ కొత్త రకమైన ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. కర్నూలులో వామపక్షాల బస్సుయాత్ర ముగింపు సంరద్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోశిస్తున్నారని పేర్కొన్నారు.

18:48 - March 5, 2016

హైదరాబాద్ : అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల్లోభాగంగా మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రక విజయమని తెలంగాణ అంతర్రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్‌ అన్నారు. 5 బ్యారేజీల నిర్మాణానికి ఈ ఒప్పందం జరగనుందని ప్రకటించారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నామని చెప్పారు..

18:44 - March 5, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీఏసీ సమావేశంలో కోరామని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 30 అంశాలపై చర్చ జరగాలంటూ వివరాలిచ్చామని తెలిపారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

18:42 - March 5, 2016

హైదరాబాద్ : బిఎసి సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక వాయిదా తీర్మానాలు ఇవ్వాలన్న సభాపతి సూచనకు సభ్యులందరూ ఆమోదం తెలిపారు.. 

 

18:39 - March 5, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి రేపు ఎన్నికలు జరుగున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. 
వరంగల్ లో
వరంగల్ లోని 58 డివిజన్లలో 398 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 660 పోలింగ్ కేంద్రాల్లో 1011 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం 6లక్షల 44 వేల 980 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 15 జోన్లుగా విభజించారు. 3630 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. ఒక్కొ పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు అబ్జర్వర్స్ ఉంటారు. భద్రత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 3వేల మంది పోలీసులను వినియోగించుకుంటున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. కొన్ని మద్యం కేసులు నమోదు అయ్యాయి. పోలింగ్ ప్రక్రియలో యువజన సంఘాలు పాల్గొంటున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింట్ చేయనున్నారు. 
ఖమ్మంలో
ఖమ్మంలో 50 డివిజన్ లలో 265పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 265 మంది బరిలో ఉన్నారు. 3 నుంచి 4 వేల మంది పోలింగ్ సబ్బంది పాల్గోననున్నారు. మొత్తం 2 లక్షల 65 వేల 700 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రచార రథాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అచ్చంపేటలో
అచ్చంపేటలోని 20 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

 

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి రేపు ఎన్నికలు

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి రేపు ఎన్నికలు జరుగున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. 

17:56 - March 5, 2016

ఖమ్మం : అనారోగ్యంతో కన్నుమూసిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.. చివరిసారి తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. 

17:52 - March 5, 2016

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ మహిళా కార్యక్రమంగా అందరి మన్ననలు అందుకున్న 'మానవి'  ఇప్పటికే  ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ ఏడాది కూడా లాడ్లీ మీడియా పురస్కారానికి ఎంపికైంది. చెన్నెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మానవి టీం ఈ పురస్కారాన్ని అందుకుంది. 
'మానవి'కి లాడ్లీ మీడియా పురస్కారం 
మహిళల ప్రియనేస్తంగా అనతి కాలంలోనే అన్ని వర్గాల మహిళల ప్రశంసలు అందుకున్న 'మానవి' కార్యక్రమం మహిళల ఆరాటాలకు, పోరాటాలకు ఆలంబనగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రసారం చేసిన మహిళలే నిర్వహించిన మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ పై ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి లాడ్లీ మీడియా పురస్కారం దక్కింది. 
ముందడుగు వేసిన మహిళలు 
వేటమామిడి గ్రామంలోని మహిళలు ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యుత్ సంస్ధ సహకారంతో పాటు, నాబార్డు 2.90 కోట్ల రూపాయల రుణసౌకర్యం కల్పించడంతో పాటు, ఎం.యన్.ఆర్.ఇ డిల్లీ సంస్ద 3.10 కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తుందని గిరిజనులకు అధికారులు భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తిగా మహిళల పర్యవేక్షణలో నడుస్తుందని  చెప్పారు. ఉపాధితో పాటు, వేటమామిడి గ్రామాన్ని అబివృద్ధి  చేసుకోవడానికి వీలుగా మహిళలనే ప్రాజెక్టుకు యజమానులుగా చేస్తామని ఆదివాసీ ఆడబిడ్డల్లో కొత్త ఆశలు రేపారు. దీంతో గ్రామంలోని 19మంది మహిళలు ట్రైబల్ ఉమెన్స్‌ పవర్ ప్రాజెక్టు కమిటి అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఒకవైపు ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే, ఇంకోవైపు మహిళలు అడవి తప్పితే మరే లోకం తెలియక పోయినా, అధికారుల సూచనల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు మినీ జలవిద్యుత్ కేంద్రాల్లో 19మంది 3నెలల పాటు శిక్షణ పొందారు. ఆ సమయంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్ధిక యాజమాన్య పద్దతులపై  కూడా శిక్షణ తీసుకున్నారు. ఇలా శిక్షణను పూర్తి చేసుకున్న 19మంది ఆదివాసీ మహిళల్లో ఎవ్వరూ 5వ తరగతికి మించి చదువుకోకపోవడం విశేషం. 
సామాజిక బాధ్యత వైపు మొగ్గు చూపిన మహిళలు
ఈ సందర్భంగా ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరముంది. పట్టుదలతో శిక్షణ కోసం వెళ్లిన మహిళల కుటుంబాల్లోని పురుషులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మూడు నెలలపాటు ఇంటిని, కుటుంబ బాధ్యతలను వదిలేసి వెళ్లడమేంటని ఆ మహిళలను నిలదీసారు. అయినా, ఆ మహిళలు వెనకడుగు వేయలేదు. తమ కుటుంబ సమస్యకన్నా, సామాజిక బాధ్యత, పదిమందికి మేలుచేయడమే ముఖ్యమనుకున్నారు. ఈ క్రమంలో కుటుంబాలకు దూరమైన వారు కూడా ఉన్నారు. కానీ, ఆ తరువాత కొంత కాలానికే వారిని ఈ ప్రాజెక్టుకు దూరం చేసారు నిర్వాహకులు. సాంకేతిక విజ్ఞానంతో నడవాల్సిన పవర్ ప్రాజెక్టుల నిర్వహణకు అక్షర జ్ఞానం లేని అడవి బిడ్డల శక్తియుక్తులే సరిపోకపోవచ్చు. వారి శ్రమతోనే విద్యుతుత్పత్తి జరగకపోవచ్చు. కానీ, వారికి మరికొంత శిక్షణ ఇచ్చి, వారినీ కూడా విద్యుతుత్పత్తిలో భాగస్వాములను చేయాల్సిన అవసరమైతే ఉంది. టెక్నీషియన్ల సాయంతోనే ప్రాజెక్టు నిర్వహించినా, నాన్ టెక్నికల్ పనుల్లోనైనా  గిరిజన మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తృత పరచాల్సిన అవసరముందని 10టీవీ 'మానవి'లో కథనం ప్రసారమైంది. ఈ కథనం లాడ్లీ మీడియా పురస్కారానికి ఎంపికైంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మానవి ప్రతినిధులు పురస్కారాన్ని స్వీకరించారు. 

 

17:47 - March 5, 2016

హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్టలో సీఎం కొత్త క్యాంపు కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ దంపతులు శంకుస్థాపన చేశారు.. ప్రస్తుతం ఉన్న కార్యాలయం సమీపంలోని ఐఎఎస్ క్వార్టర్స్ కూల్చివేసి ఈ కొత్త భవనాన్ని నిర్మించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి సీఎస్ రాజీవ్ శర్మతోపాటు.. ఇతర అధికారులు హాజరయ్యారు.. 

 

17:45 - March 5, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అద్భుతంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవల్ని నరసింహన్‌ వివరించారని ప్రశంసించారు. ఏపీని ముందుకు తీసుకువెళుతున్న వైనాన్ని గవర్నర్ ప్రసంగం వివరించిందన్నారు. ప్రసంగం పారదర్శకంగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఏవిధంగా పూర్తిచేయబోతున్నామో స్పష్టం చేశారని తెలిపారు.. 

 

ప్రేమించలేదన్న కోపంతో యువతిపై హత్యాయత్నం...

పశ్చిమగోదావరి : ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏలూరులోని రూరల్ మండలం చాటపర్రులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు  కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువతి 80 శాతం కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించలేదన్న కారణంతోనే యువకుడు దాడికి పాల్పడినట్లు యువతి బంధువు ఆరోపిస్తున్నారు.

17:41 - March 5, 2016

పశ్చిమగోదావరి : నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏలూరులోని రూరల్ మండలం చాటపర్రులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు  కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువతి 80 శాతం కాలిపోయింది. చికిత్స నిమ్తితం ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించలేదన్న కారణంతోనే యువకుడు దాడికి పాల్పడినట్లు యువతి బంధువు ఆరోపిస్తున్నారు. అతని వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి తల్లిదండ్రులు వాపోయారు. మరోవైపు ఘటనపై యువతి బంధువులు, ఎస్ ఎఫ్ ఐ నేతలు మండిపడుతున్నారు. విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

 

కరువు జిల్లాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు

ముంబై : మహారాష్ట్రలో కరువుతో ఇబ్బంది పడుతున్న జిల్లాలకు అదనంగా నిధులు కేటాయించాలని ఫడ్నవీస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరువు జిల్లాల్లోకి వాటర్‌ ట్యాంకర్లను పంపించడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు చదువు చెప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న కరువు ప్రాంతాల్లో పర్యటింనిచ 28 మంది మంత్రులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. ఆ నివేదికల ఆధారంగా ఫడ్ణవీస్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

ఉపరాష్ట్రపతి నగర పర్యటన... ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నగర పర్యటన సందర్భంగా శని, ఆది, సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

కరువు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు

ముంబై : మహారాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170 మంది రైతులు కరువు కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా కానుండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. మరాట్వాడా డ్యామ్‌లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఆ యా ప్రాంతాలకు అవసమైతే రైల్వే వ్యాగన్‌ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

 

16:54 - March 5, 2016

ఢిల్లీ : కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుపిఎ స్కీముల పేర్ల మార్పుకు శ్రీకారం చుట్టింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరిట ఉన్న స్కీములకు పేర్లను మార్చుతోంది. పాత సీసాలో కొత్త నీరు పోసినట్టు స్కీముకు ముందున్న రాజీవ్‌గాంధీ పేరును మాత్రం కేంద్రం తొలగించింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాలుగు స్కీములకు రాజీవ్‌గాంధీ పేర్లను తొలగించింది. రాజీవ్‌గాంధీ పంచాయత్ సశక్తీకరణ్‌ అభియాన్‌ పేరు ఏప్రిల్‌ ఒకటి నుంచి పంచాయత్‌ సశక్తీకరణ్‌ గా మారనుంది. అలాగే రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫర్‌ సూడెంట్స్‌ విత్‌ డిస్‌ ఎబిలిటీస్‌, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌, రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌ స్కీములకు సంబంధించి మోదీ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ పేరును తొలగించింది. రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌ పేరును కాస్తా 'ఖేలో ఇండియా'గా మార్చింది.

16:52 - March 5, 2016

ఉత్తరప్రదేశ్ : బిజెపి నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. జేఎన్‌యూ ఘటనపై ఇప్పటికే పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కోగా.. వీరి జాబితాలోకి మరో నేత చేరారు. తాజాగా...బదౌన్‌ జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షుడు కులదీప్‌ వష్ణేయ్‌... జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ నాలుకను ఎవరైనా కోస్తే.. వారికి 5లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అఫ్జల్‌గురుకు మద్దతుగా కన్హయ్య  జాతి వ్యతిరేక నినాదాలు చేశారని కులదీప్‌ ఆరోపించాడు. బెయిల్‌పై విడుదలైన కన్హయ్య .. బిజెపికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడని, కన్హయ్య  తగిన శిక్ష అనుభవిస్తాడని కులదీప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన బిజెపి కులదీప్‌ను పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు బహిష్కరణ వేటు విధించింది. దేశద్రోహం కేసు కింద ఫిబ్రవరి 12న అరెస్ట్ అయిన కన్నయ్యకు ఢిల్లీ హైకోర్టు మార్చి 3న షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. 

 

సుశీల్ కుమార్ వేధింపుల ఫుటేజ్ బహిర్గతం...

హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ వేధింపుల ఫుటేజ్ బహిర్గతమైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13, అంబేద్కర్ నగర్ లో సీసీ కెమెరాల్లో సుశీల్ కారు వెంబండించిన వీడియోలు రికార్డ్ అయ్యాయి. బాధితురాలు ఫాతిమాను కారు కిలో మీటర్ వరకూ వెంబండింది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదుతో సుశీల్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.

16:42 - March 5, 2016

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ ఘనుడు ఓ మహిళను వేధించినందుకు గానూ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. కాగా తాజాగా సుశీల్ కుమార్ వేధింపుల ఫుటేజ్ బహిర్గతమైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13, అంబేద్కర్ నగర్ లో సుశీల్ మహిళను కారుతో వెంబండించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు ఫాతిమాను కారు ఒక కిలో మీటర్ వరకూ వెంబడించింది. ఈ విషయం మీడియాకు పొక్కడంతో ఇప్పటికే అన్ని ఛానెల్స్ లో, సోషల్ మీడియాలో మంత్రి తనయుడి తీరుపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సుశీల్ పై నిర్భయ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 

స్పీకర్ కోడెల అధ్యక్షతన బీఏసీ సమావేశం

హైదరాబాద్ : ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వైసిపి నుంచి జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి, బిజెపి నుంచి విష్ణు కుమార్ హాజరయ్యారు. 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని వైసిపి సభ్యులు కోరారు. కానీ వైసీపీ సభ్యుల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. 18 రోజులపాటు సమావేశాలు జరుపనున్నట్లు అధికార పక్షం తెలిపింది. ఎదురుదాడి చేయకుండా.. సమస్యలపై చర్చించాలని అధికారపక్షం ప్రతిపక్షాలకు సూచించింది. గవర్నర్ ప్రసంగంపై 9న సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించనున్నారు. 

16:32 - March 5, 2016

హైదరాబాద్ : ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వైసిపి నుంచి జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి, బిజెపి నుంచి విష్ణు కుమార్ హాజరయ్యారు. 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని వైసిపి సభ్యులు కోరారు. కానీ వైసీపీ సభ్యుల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. 16 రోజులపాటు సమావేశాలు జరుపనున్నట్లు అధికార పక్షం తెలిపింది. ఎదురుదాడి చేయకుండా.. సమస్యలపై చర్చించాలని అధికారపక్షం ప్రతిపక్షాలకు సూచించింది. గవర్నర్ ప్రసంగంపై 9న సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించనున్నారు. 
 

16:00 - March 5, 2016

హైదరాబాద్ : విభజన చట్టంలో కేంద్రం హామీలు ఇచ్చిందని... విభజన హేతుబద్ధంగా జరగలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎసి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు రూ.13,716 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండంకెల వృద్ధి రేటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరవు రహిత రాష్ట్రంగా ఎపిని తయారు చేస్తామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. 
ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన రాష్ట్ర విభజన  
రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు. 7 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి అవుతుందని తెలిపారు. రూ.150 లతో టెలిఫోన్, నెట్ సేవలు అందిస్తామని చెప్పారు. 
హాస్టళ్ల ఆధునీకరణకు కృషి 
హాస్టళ్ల ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని గరవ్నర్ పేర్కొన్నారు. విద్యుత్ పొదుపులో ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్నామని తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందకు కృషి చేస్తామని.... కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.  15 శాతం వృద్ధి రేటు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
నాలెడ్డ్ హబ్ గా ఎపి 
ఎపిని నాలెడ్డ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని నరసింహన్ చెప్పారు. ఇంటింటికీ ఎల్ ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తల్లీ బిడ్డ సంరక్షణకు 102 సర్వీసు అందిస్తున్నామని చెప్పారు. 5 విమానాశ్రాయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 
ఘనంగా అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ
హైదరాబాద్ : అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. మూడు వేల సోలార్ సెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమరావతి, బెంగళూరు మధ్య హైవే నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ 4.37 లక్షలతో ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. 

 

అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించాం : గవర్నర్

హైదరాబాద్ : అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఎపి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. మూడు వేల సోలార్ సెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమరావతి, బెంగళూరు మధ్య హైవే నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ 4.37 లక్షలతో ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. 

 

నాలెడ్డ్ హబ్ గా ఎపి : గవర్నర్

హైదరాబాద్ : ఎపిని నాలెడ్డ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఎపి అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ఇంటింటికీ ఎల్ ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తల్లీ బిడ్డ సంరక్షణకు 102 సర్వీసు అందిస్తున్నామని చెప్పారు. 5 విమానాశ్రాయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

 

హాస్టళ్ల ఆధునీకరణకు కృషి : గవర్నర్

హైదరాబాద్ : హాస్టళ్ల ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని గరవ్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఎపి అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యుత్ పొదుపులో ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్నామని తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందకు కృషి చేస్తామని.... కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 15 శాతం వృద్ధి రేటు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

 

 

కరవు రహిత రాష్ట్రంగా ఎపి :గవర్నర్

హైదరాబాద్ : కరవు రహిత రాష్ట్రంగా ఎపిని తయారు చేస్తామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఎసి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం హామీలు ఇచ్చిందని... విభజన హేతుబద్ధంగా జరగలేదని తెలిపారు. 7 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి అవుతుందని తెలిపారు. రూ.150 లతో టెలిఫోన్, నెట్ సేవలు అందిస్తామని చెప్పారు. 

రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది : గవర్నర్

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందని గవర్నర్ పేర్కొన్నారు. ఎసి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ.13,716 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండంకెల వృద్ధి రేటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  

 

ఎపి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం...

హైదరాబాద్ : ఎసి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 

ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశంచి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నాం : జగన్

హైదరాబాద్ : ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో భూదందా చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. 

అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు. ఎపి అసెంబ్లీ సమావేశాల కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సామావేవాలు వాడి వేడిగా కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.  

14:53 - March 5, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. స్పీకర్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్‌ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. 

14:48 - March 5, 2016


హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్‌ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. ఇది వేరే రాష్ట్రంలో జరిగిన అంశం.. ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తప్పు జరిగినట్లు తేలితే శిక్షిస్తారు లేకపోతే.. విచారించి వదిలేస్తారన్నారు. 

 

14:44 - March 5, 2016

హైదరాబాద్ : రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్‌ను అరెస్ట్ చేయాలని కార్పొరేటర్ గద్వాల విజయ డిమాండ్ చేశారు. ఈమేరకు బాధితురాలు ఫాతిమాతో కలిసి కార్పొరేటర్ బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అయితే ఎఫ్ ఐఆర్ లో కారు డ్రైవర్‌ పేరు మాత్రమే నమోదు చేశారని.. రావెల కొడుకు పేరు పెట్టలేదని విజయ అంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుశీల్‌ను శిక్షించాల్సిందేనని, తనకు జరిగిన అవమానం ఇంకెవ్వరికి జరగొద్దని బాధితురాలు ఫాతిమా డిమాండ్‌ చేశారు.

 

14:38 - March 5, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ తన కారు డ్రైవర్ తో కలిసి బంజారాహిల్స్ లో ఓ మహిళపై ఈవ్ టీజింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. 

 

పంజాగుట్టలో సీఎం క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన

హైదరాబాద్ : పంజాగుట్టలో సీఎం క్యాంపు కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. 

14:24 - March 5, 2016

హైదరాబాద్ : రాష్ట్రాన్ని స్టార్టప్ కేంద్రానికి గమ్యస్థానంగా మారుస్తామని ఏపీ సీఎ చంద్రబాబు తెలిపారు. స్టార్ట్ ఏపీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. డిజిటల్ ఏపీ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు, ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

 

కాసేపట్లో ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వాడివేడిగా సమావేశాలు కొనసాగున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అధికార, విపక్షాలు అస్త్రవస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.  

13:30 - March 5, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్‌ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సుశీల్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ క్రింద నోటీసులు జారీ చేశారు. నిన్న బంజారాహిల్స్‌ రోడ్డు నెం.13లో మహిళను వేధించిన కేసులో.. సుశీల్‌తో పాటు డ్రైవర్‌ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న సుశీల్‌ కోసం రెండు బృందాలు రంగంలోకి దిగాయి.

రెండు బృందాలతో గాలింపు..

బంజారాహిల్స్‌ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశామని బంజారాహిల్స్‌ ఏసీపీ తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయన్నారు.

బాధితురాలు ఫాతిమాను తీసుకొని బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లిన కార్పొరేటర్‌ విజయ

రావెల కుమారుడు సుశీల్‌ను అరెస్ట్ చేయాల్సిందేనంటూ కార్పొరేటర్ గద్వాల విజయ బాధితురాలు ఫాతిమాతో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అయితే ఎఫ్ఐఆర్ లో కారు డ్రైవర్‌ పేరు మాత్రమే నమోదు చేశారని, రావెల కొడుకు పేరు పెట్టలేదని కార్పొరేటర్ విజయ అంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుశీల్‌ను శిక్షించాల్సిందేనని, తనకు జరిగిన అవమానం ఇంకెవ్వరికి జరగొద్దని బాధితురాలు ఫాతిమా డిమాండ్‌ చేశారు.

రావెల కుమారుడి వ్యవహారం వేరే రాష్ట్రంలో జరిగింది -ఏపీ మంత్రి చినరాజప్ప

ఇక రావెల కుమారుడు సుశీల్‌ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. ఇది వేరే రాష్ట్రంలో జరిగిన అంశం.. ఏం జరిగిందో నాకు తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పు జరిగినట్లు తేలితే శిక్షిస్తారు లేకపోతే.. విచారించి వదిలేస్తారన్నారు చినరాజప్ప. 

13:27 - March 5, 2016

హైదరాబాద్ : ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మహిళా దినోత్సవం పురస్కరించుకుని రెండురోజుల ముందు దేశ వ్యాప్తంగా ఉన్న చట్ట సభల మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు జరుగుతోంది. బిల్డింగ్ రిసర్జెంట్ ఇండియా పేరుతో రెండు రోజులపాటు సాగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. సాధికారత సాధించిన చట్టసభల్లోని మహిళా ప్రతినిధులు దేశ నిర్మాణంలో నిర్వర్తించాల్సిన బాధ్యతపై ఈ సదస్సులో చర్చించనున్నారు. మహిళలు గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని.. మహిళా సాధికారత కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటు పడాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని.  

13:24 - March 5, 2016

విశాఖ : మద్దెలపాలెం జంక్షన్‌లో యువకుడు హల్‌చల్‌ చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఓ హోర్డింగ్‌ ఎక్కాడు. లేకపోతే దూకుతానని బెదిరించాడు. అక్కడకు భారీగా స్థానికులు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 

13:23 - March 5, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, సంగీత దర్శకుడు కీరవాణి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఉదయం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తుందని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీ ట్వంటీ వాల్డ్ కప్‌లోనూ టీంఇండియానే ఫేవరెట్‌ అన్నారు శ్రీకాంత్.

పోలీసులు అధికార పార్టీకి తొత్తులు: కోమటిరెడ్డి

నల్గొండ : జిల్లా పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్గొండలో నిప్పులు చెరిగారు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక దందాల్లో పోలీసులే ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10 జాతీయ రహదారులు దిగ్బంధిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం...

శ్రీకాకుళం : కొత్తూరు మండలం గొరండి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంటి ముందు ఉంచిన ధాన్యం కుప్పల పై దాడి చేసిన ఏనుగుల గుంపు 50 బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి. అనంతరం గ్రామంలోకి ప్రవేశించి కనిపించిక వాడిని తొక్కుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్థులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ సమయంలో దాడి చేస్తాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు. 

సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్....

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌ సంజయ్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో నలుగురు నిందితులను శనివారం అరెస్ట్‌ చేశారు. హంతకులు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కారులో ఉన్న యువకుల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు చెప్పారు. యువకుల మధ్య వాగ్వాదమే హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. 

12:42 - March 5, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్‌ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సుశీల్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ క్రింద నోటీసులు జారీ చేశారు. నిన్న బంజారాహిల్స్‌ రోడ్డు నెం.13లో మహిళను వేధించిన కేసులో.. సుశీల్‌తో పాటు డ్రైవర్‌ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న సుశీల్‌ కోసం రెండు బృందాలు రంగంలోకి దిగాయి. బాధితురాలికి మద్దతుగా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి నిలిచారు. రెండు గంటల లోపు నిందితులను అరెస్టు చేయకపోతే ధర్నాచేపడతామని హెచ్చరించారు. అంతే కాక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న రావెల కిశోర్ బాబు తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

12:39 - March 5, 2016

హైదరాబాద్ : ఐదు రాష్గ్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది. పశ్చిమ బెంగాల్‌ లోనూ అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న వెస్ట్‌ బెంగాల్‌లో పూర్వవైభవం కోసం లెఫ్ట్‌పార్టీలు పక్కా స్ట్రాటజీనీ రూపొందిస్తున్నాయి. ..

మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు....

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం ఆరు విడతల్లో పోలింగ్‌ జరిపాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. దీంతో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌ రాజకీయాల్లో రాజకీయ వేడి రాజుకుంది. అధిక జనసాంద్రత గల రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ అంటేనే ఒకప్పుడు కామ్రేడ్ల కంచుకోటగా పేరున్న రాష్ట్రం. గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన సీపీఎం.. ఆ పార్టీ చేతిలో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. గడచిన ఐదేళ్లుగా సీపీఎం ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు రంగం సిధ్దం చేస్తోంది సీపీఎం. ఈ ఎన్నికల్లో ప్రజామోదం పొందేందుకు రచించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే దృష్టి పెట్టింది. కార్మిక, కర్షక వర్గాలతో పాటు బడుగు బలహీన వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు పక్కా వ్యూహాన్ని రచిస్తోంది. అంతేకాదు... గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఓ సారి సమీక్షించుకుంటూనే మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కార్యాచరణ మొదలు పెట్టారు కమ్యూనిస్టులు.

టీఎంసీ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేకత....

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, సర్కారుపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సీపీఎం ఒడిసి పట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మలచుకునేందుకు కామ్రేడ్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్న మమతా బెనర్జీ అధికారాన్ని తుద ముట్టించేందుకు కామ్రేడ్లు పథక రచన చేస్తున్నారు. సొంత పార్టీలో ఉన్న లోపాలను అధిగమించి ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలన్న దానిపై కమ్యూనిస్టులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో అధికారం చేజారి విపక్ష హోదాకే పరిమితమైన లెఫ్ట్‌... అప్పటి ఓటమికిగల కారణాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గత తప్పిదాలను పునరావృతం కాకుండా సీపీఎం ఆచి తూచి అడుగులు వేస్తోంది . కార్యకర్తలు, పార్టీ కేడర్‌తో పాటు ముఖ్యనాయకులను ఎన్నికలకు సమయాత్తం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు... ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ... ప్రజానాడీని పట్టేందుకు లెఫ్ట్ పార్టీలు వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. కార్మికులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి భవిష్యత్‌ ప్రణాళిక ఖరారు చేసే పనిలో లెఫ్ట్‌ పార్టీలు ఇప్పటికే తలమునకలైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి అందిన స్నేహ సంకేతాలను సానుకూలంగా మలచుకుని కలిసి కట్టుగా పోరులో నిలిచి విజయం సాధించాలన్నది లెఫ్ట్‌ పార్టీల ఆలోచనగా తెలుస్తోంది.

బెంగాల్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ....

ఇక బీజేపీ మాత్రం పశ్చిమబెంగాల్‌ లో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటుంది. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌ విషయానికి వచ్చేసరికి మాత్రం వెనుకముందాడుతోంది. దానికి ప్రధాన కారణం అక్కడ కామ్రడ్ల హవా కొనసాగడమే. బెంగాల్‌లో సుదీర్ఘకాలంగా లెఫ్ట్‌ పార్టీలు ప్రజలతో మమేకమై ఉండటమే బీజేపీకి వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే బీహార్‌లో పరాభవం ఎదుర్కొన్న కమలనాథులు బెంగాల్‌లో పోటీకి తటపటాయిస్తున్నట్లు సమాచారం. బెంగాల్‌లో పరిస్థితులు తమకేమాత్రం అనుకూలంగా లేవని ఆ పార్టీ వర్గాలే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్‌ , లెఫ్ట్‌ పార్టీల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

12:31 - March 5, 2016

హైదరాబాద్ : వైకాపా నుంచి తెదేపాలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు.  అనంతరం నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ... నిబంధనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారని నెహ్రూ చెప్పారు. ప్రజస్వామ్య విలువలను కాపాడాలనే ఉద్దేశ్యంతో స్పీకర్ నిస్పక్షపాతంగా వ్యవహరించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకు ఓ చెంపపెట్టు అవుతుందని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని చెప్పారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలా..వద్దా..అన్న అంశం తమ సభ్యుల విషయంలో స్పీకర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ వివరించారు. 

మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు ప్రారంభం...

హైదరాబాద్ :ఢిల్లీలో మహిళా ప్రజాప్రతినిధుల సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన ఈ సదస్సు ఆరంభమైంది. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఏపీ, తెలంగాణ మహిళా నేతలు పాల్గొన్నారు. 

11:47 - March 5, 2016

విజయవాడ : రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తరవాత అసైండ్ భూములను ఎవరు కొనుగోలు చేసినా చెల్లవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జీవో 41 ప్రకారం అసైన్డ్ భూములు ఎవరి ఆధీనంతో ఉన్నాయో వారికే ప్రభుత్వం నుండి అందే అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయన్నారను మంత్రి నారాయణ. మొత్తం 194 ఎకరాలు మాత్రమే అసైన్డ్ భూములు ఉన్నాయని వాటికి సంబంధించి ఇప్పటికే లబ్దిదారులకు అందజేశామని తెలిపారు. అసైన్డ్ భూములపైఅనవసర రాద్దాంతం చేయొద్దన్నారు మంత్రి నారాయణ.

11:45 - March 5, 2016

విజయనగరం : అంగవైకల్యం అతడి పట్టుదల ముందు తలవంచింది. చదువుపై ఉన్న అతడి ఆసక్తి అంగవైకల్యాన్ని ఓడించింది. పుట్టుకతోనే రెండు చేతులూ పనిచేయకపోయినా..ఉన్నతాశయం అతడిని కార్యోణ్ణుముఖుడ్ని చేసింది. చేతులు పనికిరాకపోయినా..కాళ్లతో తన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగిపోతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి..తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

పుట్టుకతోనే పోలియో....

విజయనగం జిల్లా కొత్తవలసలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సింహాచలంనాయుడుది అదే మండలంలోని గనిశెట్టిపాలెం. పుట్టకతోనే పోలియో సోకడంతో రెండు చేతులూ చచ్చుపడిపోయి పోవడంతో తల్లిదండ్రులను తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. చిన్నతనంలో మిగిలిన పిల్లలంతా స్కూల్ కి వెళ్తుంటే, చేతులు పనిచేయని సింహాచలం ఇంటివద్దనే గడపాల్సిన దుస్థితి తలెత్తింది. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చిన్నాన్న నరసింగరావు సింహాచలం దుస్థితి చూసి చలించిపోయాడు. ఎలాగైనా సింహాచలాన్ని చదివించాలనుకున్నాడు. కాలివేళ్ల మధ్య చాక్‌పీస్ పెట్టి సున్నాలు చుట్టమని సింహాచలానికి ఉచిత సలహా ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి కాళ్లతో సాధన చేయడం ప్రారంభించిన సింహాచలం..కొద్దికాలంలోనే కాళ్లతో రాయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇక అప్పటి నుంచి సింహాచలం వెనుతిరిగి చూడకుండా..ఏ పనైనా కాళ్లతో చకచకా కానిచ్చేవాడు.

అలా 10వ తరగతిలో పాస్‌అయిన సింహాచలం....

అలా 10వ తరగతిలో పాస్‌అయిన సింహాచలం..ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కాళ్లతోనే రాస్తుండటంతో అతడి పట్టుదలకు తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రముగ్ధులవుతున్నారు. చేతులతో ఎంతవేగంతో రాస్తారో..కాళ్లతో కూడా అంతే వేగంతో ఏమాత్రం తడబాడకుండా రాస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇలా ఒక్క రాయడమే కాదు,.చిత్రలేఖనం కూడా కాళ్లతోనే వేయగలడు. ప్రభుత్వపరంగా తనని ప్రోత్సహిస్తే చదువులో రాణించి ఐఏఎస్ సాధించాలన్నది తన స్వప్పమని విద్యార్థి సింహాచలంనాయుడు చెబుతున్నాడు.

పట్టుదల ఉంటే కానిది లేదని....

పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపిస్తున్నాడు సింహాచలం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి చదువుకు దూరమవుతున్న ఈ రోజుల్లో...రెండు చేతులు పనిచేయకున్నా సింహాచలం మాత్రం పట్టుదలతో సాధన చేసి కాళ్లతో చదువు సాగిస్తున్నాడు. ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులను గుర్తించి ఆదుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

11:43 - March 5, 2016

హైదరాబాద్ : రసవత్తర రాజకీయాలకు నెలవు తమిళనాడు. ప్రతి ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతుందక్కడ. ఒకసారి డీఎంకే అయితే మరోసారి అన్నాడీఎంకేకు పగ్గాలు అప్పగిస్తారు తమిళ ప్రజలు. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట.

తమిళనాడు శాసనసభ సమరానికి తెర ...

తమిళనాడు శాసనసభ సమరానికి తెర లేచింది. దక్షిణాదిలో అతిపెద్ద ఎన్నికల యుద్ధానికి నగారా మోగింది. తమిళ మార్కు ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారం కోసం పార్టీల ఎత్తులు, పైఎత్తులకు సర్వం సిద్దమైంది.

తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234.....

తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. దాదాపు 18 ప్రధాన పార్టీలు పోరులో తలపడుతున్నాయి. జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే, కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే, విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకేలు బలంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ పార్టీలతో పాటు జీకే మణి పీఎంకే, వైకో ఎండీఎంకే, శరత్‌ కుమార్ నేతృత్యంలోని ఎస్‌ఎంకేతో పాటు అనేక చిన్నాచితకా పార్టీలు శాసన సభా సమరంలో తలపడుతున్నాయి.

జాతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ద్రవిద పార్టీలు....

తమిళనాడులో జాతీయ పార్టీలను ఊడ్చేశాయి ప్రాంతీయ పార్టీలు. వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. ద్రవిడ పార్టీల నేతృత్వంలోని పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారు. ముఖ్యంగా సినీ తారల నాయకత్వంలోకి ప్రధాన పార్టీలు తమిళనాడును ఏలుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకూ అధికారం మారుతున్న సందర్భాలు కనిపిస్తాయి. ఒకసారి డీఎంకే, మరోసారి అన్నాడీఎంకే ఇలా ప్రతి పర్యాయం ప్రత్నామ్నాయ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అయితే ఈసారి అలాంటి సంప్రదాయాన్ని ప్రజలు బద్దలు కొడతారన్న అంచనాలు పెరుగుతున్నాయి.

జయలలిత నియంతృత్వ పోకడలపై విమర్శలు....

ప్రస్తుతం జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే అధికారంలో ఉంది. అనేక అవినీతి ఆరోపణలతో పాటు జయలలిత నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఏకంగా జైలు జీవితం గడిపారు. ఇక అంతటితో జయలలిత రాజకీయ జీవితం సమాధే అనుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ చుక్కాని లేని నావలా తయారవుతుందని, ఆటోమేటిక్‌గా డీఎంకేకు మంచిరోజులు వస్తాయని, లేదంటే ప్రముఖ కథానాయకుడు రాజకీయ ఆరంగేట్రం చేసి, సంచలనం సృష్టిస్తారన్న అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు జయలలిత సెకండ్‌ ఇన్నింగ్స్‌ కు అవకాశమిచ్చింది. ఈ తీర్పుతో ఏకంగా అనర్హత వేటును తప్పించుకున్నారు జయలలిత. తర్వాత ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. ఇప్పడు అదే ఉత్సాహంతో అసెంబ్లీ పోరుకు సిద్దమవుతున్నారు.

పురుచ్చితలైవిపై వ్యతిరేకత బలంగా లేదా?.....

జయలలిత జైలు జీవితం గడిపినా, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా, చెన్నై వరదల సమయంలో చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని పురుచ్చితలైవిపై అనేక ప్రతికూల పవనాలు వీచినా....ప్రజల్లో ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకే ఆ స్థాయిలో ప్రజల్లో ఆదరణ పొందలేకపోతోంది. జయ వైఫల్యాలను తనకు అనుకూలంగా మలుచకోలేక కరుణానిధి బృందం చతికిలబడింది. డీఎంకేలో వారసుల గొడవ, కరుణానిధి వృద్దాప్యం, గ్రూపు గొడవలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు జయలలిత అమ్మ పేరుతో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. పేదలు, మహిళలు, వృద్దులు, చిన్నారులు, యువతీయువకులు, ఇలా అన్ని వర్గాల ప్రజలకూ జయలలిత పథకాలు చేరాయి. దీనికి తోడు మరిన్ని ఆకర్షణీయ పథకాలకు ఎన్నికల సమయంలో శ్రీకారం చుట్టారు. దీంతో విజయం ఈసారి కూడా తమదేనన్న భరోసాను అన్నాడీఎంకే శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. సుస్థిర అభివృద్దికే ఓటేయండన్న నినాదంతో జయ పార్టీ ప్రజ్లలోకి వెళుతోంది.

జయను ఢీకొనేందుకు డీఎంకే అస్త్రశస్త్రాలు.....

అయితే డీఎంకే కూడా జయను ఢీకొనేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు మిగతా విపక్ష పార్టీలతో జట్టుకట్టి అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పొత్తులపై చర్చించి కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటోంది. భావసారూప్య పార్టీలతో కలిసి మహా కూటమి ద్వారా అన్నాడీఎంకేను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోంది. గల్లీగల్లీలోనూ బలమైన క్యాడర్ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో ప్రభంజనం మోగించేందుకు సిద్దమవుతున్నాయి.

విపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో జయ....

మరోవైపు జయలలిత విపక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని ముందే మొదలపెట్టారు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను గట్టి దెబ్బ తీసింది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు తమ పార్టీలోకి చేర్చుకుంది. డీఎంకేతో పాటు మిగతా అన్ని పార్టీల నుంచి నేతలనూ తమ పార్టీలోకి ఆహ్వానించి విపక్షాలకు కీలకమైన అభ్యర్థులను దూరం చేసింది. తన కూటమిలో ఇన్నాళ్లూ నమ్మినబంటుగా సాగిన శరత్‌ కుమార్ నేతృత్వంలోని ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి ..ఏఐఎస్ఎంకెను పొమ్మన లేక పొగపెట్టింది. ఆ పార్టీలోని శాసన సభ్యున్ని తన బుట్టలో వేసుకుంది.

అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూసిన రజినీ......

ఇక తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి ప్రముఖంగా వినిపించే పేరు రజినీకాంత్. 2016లో తప్పకుండా ఆయన సొంత పార్టీ పెట్టి, ఎన్నికల బరిలోకి దిగుతారని గతేడాది వరకు అంచనాలు వినిపించాయి. అయితే తనకు అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూశారు రజినీ. చిరంజీవిలా తన పరిస్థితి కాకూడదని నిదానిస్తున్నారు. అందుకే ఎన్నికల హడావుడికి దూరంగా కబాలీ, రోబో టు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ కూడా గతంలో రజినీకాంత్‌ను రాజకీయ రంగంలోకి దింపాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ వర్కవుల్ కాలేదు. వారి ఆఫర్‌కు రజినీ నిర్మోహమాటంగా నో చెప్పినట్టు సమాచారం. పోటీ చేయకపోయినా ఈసారి ఆయన మద్దతు ఎవరికన్నది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి తమిళనాడులో అధికారం కోసం రసవత్తరమైన పోరుకు తెరలేచింది. ఎత్తులుపైఎత్తుల సమరం రెండు నెలల పాటు సాగబోతోంది. రకరకాల ఆకర్షణీయ పథకాలను ఓటర్లను ఊరించేందుకు సకల ప్రయత్నాలకూ నగారా మోగింది.

11:36 - March 5, 2016

హైదరాబాద్ : సాధారణంగా చిన్నపిల్లలు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్తవాళ్లని చూసినప్పుడు వెంటనే ముడుచుకుపోతుంటారు. తల్లి ఒడిలోంచి దిగమంటూ మారాం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ 16 నెలల చిన్నారి షాపింగ్ మాల్‌లో కనిపించిన ప్రతివారిని పలుకరించుకుంటూ వెళ్తున్నఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బుడిబుడి అడుగులతో షాపింగ్ మాల్ మొత్తం కలియతిరుగుతున్నజాయ్ అనే చిన్నారి.. కనిపించిన ప్రతివారిని పలకరిస్తోంది. షాపింగ్ చేస్తున్న వారిని, షాప్‌లో పనిచేస్తున్న వారిని ఇలా తనకు ఎదురు పడిన ప్రతివారిని పలకరిస్తోంది. చివరికు అక్కడ షాపింగ్ చేస్తున్న ఓ మహిళ వద్దకు వెళ్లి ఏ మాత్రం బెరుకు లేకుండా హగ్ కూడా చేసుకోవడం విశేషం. 'లవ్ వాట్ మ్యాటర్స్' పేరుతో ఫేస్‌బుక్‌ పేజీలో మూడు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోను.. ఇప్పటివరకు 46 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. 

అందుబాటులో మంత్రులో ఏపీసీఎం భేటీ

హైదరాబాద్ : అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం చినరాజప్ప, రావెల, పల్లె, ప్రత్తిపాటి హాజరయ్యారు.

రావెల సుశీల్ అరెస్టుకు రంగం సిద్ధం..

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్ అరెస్టుకు రంగం సిద్ధమయ్యింది. దీంతో సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. సుశీల్ ను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సుశీల్ పై సెక్షన్ 354 కింద కేసు నమోదు అయ్యింది.

స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

అసైన్డ్ భూములు ఎవరికి అమ్మినా చెల్లవు: మంత్రి నారాయణ

విజయవాడ: 1954వ సంవత్సరం నుంచి అసైన్డ్‌ భూములు ఎవరికి అమ్మినా చెల్లవని మంత్రి నారాయణ ప్రకటించారు. అసైన్డ్‌ భూములు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతాయని మంత్రి పేర్కొన్నారు. 1974 నుంచి పట్టాల కోసం పోరాడుతున్న సివాయి జమీందార్లకు చెందిన 194 ఎకరాలకే ప్యాకేజీ ఇస్తున్నామని ఆయన చెప్పారు. జీవో నెం.41 ప్రకారం అసైన్డ్‌ భూములు ప్రభుత్వానివేనని నారాయణ ప్రకటించారు. అసైన్డ్‌ భూములపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

10:54 - March 5, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. మహిళను వేధించిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. మంత్రి తనయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వివాహిత ఆరోపించింది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై మంత్రి తనయుడు చేయి పట్టి కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని ఆమె తెలిపింది. ఈ ఘటనలో స్థానికులు అతడిని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అయితే తన యజమాని కుమారుడిపై కొందరు దాడి చేశారని కారు డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈఘటనపై బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

10:34 - March 5, 2016

కర్నూలు : వైసీపీ సీనియర్ నేత, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితమే సదరు స్కార్పియో కారును ఎస్వీ మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన సదరు కొత్త కారును గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం కారు చోరీకి గురైందని గ్రహించిన ఎస్వీ మోహన్ రెడ్డి చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు కోసం ముమ్మర గాలింపు ప్రారంభించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన కారు చోరీకి గురికావడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఎ. రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎస్వీ మోహన్రెడ్డి నివాసం ఉంది. 

10:30 - March 5, 2016

హైదరాబాద్ :పన్ను ఎగవేత దారుల నుండి ఆరునూరైనా పన్నులను వసూలు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడి అవుతుంది. సినిమా టిక్కెట్ల తరహాలోనే హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆసుపత్రుల నుండి ప్రభుత్వానికి పన్ను వసూళ్ళను వంద శాతం వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు విడతల వారీగా అన్ని విభాగాల్లో ప్రభుత్వం ఆన్ లైన్ చేయాలని భావిస్తోంది.

పన్ను వసూలుపై సర్కార్‌ సీరియస్‌.....

తెలంగాణలో ప్రజల నుండి వసూలు చేస్తోన్న పన్నులు ప్రభుత్వానికి అంతంత మాత్రంగానే చేరుతున్నాయి. విపరీతంగా పన్నులు బాదుతున్నా..కొన్ని రంగాలు మాత్రం ప్రభుత్వానికి చిల్లిగవ్వా చెల్లించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రజలనుండి వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. తొలుత సినిమా థియేటర్లలో టిక్కెట్ల విక్రయంపై ప్రధానంగా దృష్టిసారించనుంది ప్రభుత్వం. ఈ మేరకు సినీ పరిశ్రమ పెద్దలతో ఇప్పటికే ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. టిక్కెట్ల విక్రయాలను ఎఫ్ డిసి కంప్యూటర్లతో అనుసందానం చేయనున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల విక్రయం ద్వారా వంద శాతం ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పద్దతులతో పాటు..రాష్ట్రంలో ఉన్న అవకాశాలకు అనుగుణంగా దేన్ని అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 532 థియేటర్లు ....

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 532 సినిమా థియేటర్లున్నాయి. ఈ థియేటర్లలో టిక్కెట్ల విక్రయంపై పన్ను వసూలును వంద శాతం వసూలయ్యేలా సర్కార్ చర్యలు తీసుకోనుంది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ల విక్రయాన్ని FDC కంప్యూటర్‌కు అనుసందానం చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి టిక్కెట్ల విక్రయం ద్వారా 50 నుండి 70 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. ఆన్ లైన్ చేయడం ద్వారా మరో 100 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆసుపత్రులు, రెస్టారెంట్లపై పన్ను వసూలు....

సినిమా థియేటర్లతో పాటు..ఆసుపత్రులు...రెస్టారెంట్లు తదితర వాటి నుండి వంద శాతం పన్నులను వసూలు చేసే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజల నుండి వివిధ రకాల పన్నుల పేరుతో వసూళ్ళు చేస్తోన్నా...ప్రభుత్వానికి మాత్రం నామమాత్రంగానే పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో ఆయా విభాగాల్లో ఏ మేరకు ప్రజల నుండి వివిధ రూపాల్లో వసూళ్ళు చేశారో...వాటిని వంద శాతం ప్రభుత్వానికి చేరేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారం పూర్తైన తర్వాత ఇతర విభాగాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

కాసేపట్లో స్పీకర్ ను కలవనున్న వైసీపీ నేతలు

హైదరాబాద్ : కాసేపట్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వైసీపీ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం: ఒకరి మృతి

మెదక్‌ : జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడలోని ఫార్మా పరిశ్రమలో ఈరోజు ఉదయం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో మృతుడి బంధులు పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు.

09:58 - March 5, 2016

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రెండు రోజులు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి.. అనంతరం పాతబస్తీలో తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శిస్తారు. ఇక నగరంలోని చార్మినార్‌, కుతుబ్‌షాహీ సమాధులతో పాటు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

09:54 - March 5, 2016

ఖమ్మం :శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన.. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. వెంకటరెడ్డి స్వస్థలమైన పాతలింగాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. 

09:50 - March 5, 2016

హైదరాబాద్ : సంచలనం రేపిన వీణవంక ఘటనపై ఎస్సీ కమిషన్ సభ్యురాలు కన్నీటి పర్యంతమైంది...బాధితురాలు చెప్పిన విషయాలు విన్న ఆమెలో దుఖ్ఖం ఆగలేదు...గుండెలోతుల్లోంచి వచ్చిన బాధను ఆపులేకపోయారు... బాధితురాలి కన్నీటి వ్యథను చూసి తట్టుకోలేకపోయారు...ఇలాంటి కేసుల్లోని కన్నవారు పడుతున్న వేదన ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు... జరిగిన ఘోరంపై అధికారులు స్పందించిన తీరును ఆమె తప్పు పట్టారు.

హైదరాబాద్‌ చేరిన వీణవంక బాధితురాలు...

కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనలో బాధితురాలు హైదరాబాద్‌ నగరానికి చేరింది...జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు కమలమ్మను కలిసి వినతి పత్రం సమర్పించింది..న్యాయం చేయాలంటూ వేడుకుంది... బాధితురాలు వచ్చిన సమయంలో కమ్మలమ్మ జరిగిన ఘటనపై ఆరా తీసింది.. జరిగిన తీరు విన్న ఆమె కళ్లలో నీళ్ల చెలిమలు చేరుకున్నాయి... ఉద్వేగంతో మాట్లాడింది..బాధితురాలిని ఓదార్చిన ఆమె మీడియాతో మాట్లాడే సమయంలో కూడా ఉద్వేగానికి లోనయ్యారు....సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఘటనపై కరీంనగర్‌ కలెక్టర్‌, ఎస్పీ పూర్తి స్థాయిలో నివేదికలు అందించలేదని విమర్శించారు..ఈ సంఘటనపై శనివారం వివరణ ఇవ్వాలని కలెక్టర్‌, ఎస్పీ లను ఆదేశించామని చెప్పారు..

న్యాయం చేయాలని బాధితురాలి డిమాండ్..

తనకు న్యాయం చేయాలంటూ వీణవంక బాధితురాలు కోరింది...తనపై జరిగిన ఘోరానికి బాధ్యులైనవారిపై ఉండే కఠిన చర్యలతో ప్రతీ ఒక్కరిలో భయాన్ని సృష్టించేలా ఉండాలని వేడుకుంది... ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రతీ ఒక్కరినీ కదిలించింది....

వీణవంకలో జరిగిన ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలించింది..దీనికి సంబంధించి ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేయగా.. విచారణ కొనసాగుతోంది... ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కామాంధుల వెన్నులో వణుకుపుట్టించేలా శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది..

రావెల సుశీల్, డ్రైవర్ అప్పారావు కు నోటీసులు

హైదరాబాద్ : మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు సుశీల్, డ్రైవర్ అప్పారావుకు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు.

ఢిల్లీ బయలుదేరిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దేశ రాజధాని దిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

వికలాంగురాలిపై అత్యాచారం.. హత్య

రంగారెడ్డి : పరిగి మినీ స్టేడియంలో వికలాంగురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం జరిపి, హత్య చేశారు. ఈ సంఘటన పరిగిలో సంచలనం సృష్టించింది. పోలీసులు వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

09:23 - March 5, 2016

ఢిల్లీ : పార్లమెంట్ దాడులకు పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురు తనకు ఆదర్శప్రాయుడు కాదని.. తన ఐకాన్ రోహిత్ వేముల అని జేఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ స్పష్టం చేశారు. ప్రజలిచ్చే పన్నులతో చదువుకుంటున్నామని, జేఎన్‌యు విద్యార్థులు జాతి వ్యతిరేకులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు కాదన్నాడు. ప్రభుత్వం తరపున కార్లు, విమానాల్లో తిరిగేవాళ్లను సబ్సిడీ లెక్కలు అడగాలన్నారు. రాజ్యాంగం వీడియో కాదని, దాన్ని ఎవరూ మార్ఫింగ్‌ చేయలేరని కన్నయ్య తెలిపాడు. మహానుభావులు రాసి పెట్టిన రాజ్యాంగ ప్రతులను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం తమ కుందన్నారు. జాతి వ్యతిరేకులు ఎవరన్నది కోర్టు తేల్చుతుందని పేర్కొన్నాడు. బెయిలుపై విడుదలైన కన్నయ్య జెఎన్‌యు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనకు మద్దతిచ్చినవారికి ధన్యవాదాలు తెలిపాడు. 

బాలానగర్ లో లారీ బోల్తా....

హైదరాబాద్ : బాలానగర్‌ ఐడీపీఎల్‌ కంపెనీ దగ్గర వేగంగా వస్తున్న లారీ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. 

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ

కర్నూలు : వైసీపీ సీనియర్ నేత, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితమే సదరు స్కార్పియో కారును ఎస్వీ మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన సదరు కొత్త కారును గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ఎత్తుకెళ్లారు. కారు చోరీకి గురైందని గ్రహించిన ఎస్వీ మోహన్ రెడ్డి చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు కోసం ముమ్మర గాలింపు ప్రారంభించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన కారు చోరీకి గురికావడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది.

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...

తిరుమల : తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితోపాటు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

హుజూరాబాద్ లో బోర్డు తిప్పేసిన అవని సంస్థ

కరీంనగర్ : హుజూరాబాద్ లో అవని మల్టీపర్పస్ మల్టీ స్టేటస్ కోఆపరేటివ్ సంస్థ వెయ్యి మంది నుంచి రూ. కోట్లలో డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

08:33 - March 5, 2016

హైదరాబాద్ : అనారోగ్యం పాలైన ఆరోగ్య శాఖకు శస్త్ర చికిత్స చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిధుల లేమితో వెంటిలేటర్‌ మీదున్న వైద్య శాఖకు ఊపిరి పోసేందుకు సర్కార్‌ పూనుకుంది. కనీసం 5 వేల కోట్ల రూపాయలతో ప్రజా వైద్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. నిధుల కొరత లేకుండా చేయడానికి విదేశీ సంస్థల సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తోంది.

వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు....

ప్రజా వైద్యాన్ని బలోపేతం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని నిర్ణయించింది. గతేడాదితో పోల్చితే రెట్టింపు నిధులు ఇవ్వాలని డిసైడ్‌ అయ్యింది. కనీసం 5 వేల కోట్లకు తగ్గకుండా ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

వైద్య శాఖ ప్రక్షాళన....

మరోవైపు వైద్య శాఖ ప్రక్షాళనకు సర్కార్‌ సిద్ధమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తమిళనాడు, శ్రీలంకలను సందర్శించారు. అక్కడ ప్రజా వైద్యం బలంగా ఉండటంపై అధ్యయనం చేశారు. ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో దశల వారీగా అమలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

వైద్య శాఖకు నిధుల సేకరణ.....

ఇదిలా ఉంటే వైద్య శాఖకు నిధుల కొరత లేకుండా చేసేందుకు విదేశీ సంస్థల సహకారం తీసుకొనేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోంది. నెదర్లాండ్‌కు చెందిన ఎన్‌ రాఫ్‌ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది. వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న ఆ కంపెనీ 5 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో వేయి పడకల ఆసుపత్రులను నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు నెదర్లాండ్‌కే చెందిన రోబో బ్యాంకు.. వైద్య శాఖకు 5 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వైద్య రంగానికి నిధుల కోసం ఈ రెండు సంస్థలతోనూ ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.  

08:32 - March 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీసర్కిళ్ల పెంపునకు రంగం సిద్ధమయ్యింది. సర్కిళ్ల సంఖ్య 30కి పెరగనుంది. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా సర్కిళ్లను కూడా పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు

సర్కిళ్ల పెంపునకు సంబంధించి బల్దియా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా కొత్త సర్కిళ్ల ఏర్పాటును కూడా పూర్తి చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు సిద్ధమయ్యాయి. కొత్త సర్కిళ్ల పరిధిపై డీపీఆర్‌ ఇవ్వాలని జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

సర్కిళ్ల విభజనపై చర్చ.....

కొత్త సర్కిళ్ల ఏర్పాటు కోసం ఏయే సర్కిళ్లను విభజిస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో విభజించని సర్కాళ్లను రెండుగా చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు అధికారుల కొరత సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోయే 6 సర్కిళ్లకు అధికారులను ఎలా సర్దుబాటు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు సర్కిళ్లకు పూర్తి స్థాయి డీసీలు లేరు. ఇంఛార్జ్‌ డీసీల పాలనే కొనసాగుతోంది. గతంలో సర్కిళ్ల సంఖ్యను పెంచినప్పుడు కింద స్థాయి అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి డీసీలుగా సర్దుబాటు చేశారు. అది పెద్ద వివాదానికే దారి తీసింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కిళ్లకు డీసీలు..ఇతర అధికారుల కేటాయింపులపై ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐతే ఈ సమస్యపై ఇప్పటికే కమిషనర్‌ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 

08:17 - March 5, 2016

నెల్లూరు : కావలిలోని పాతూరులో దారుణం జరిగింది. ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కవిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్‌కార్డు వెరిఫికేషన్‌ కోసం వచ్చామని ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దుండగులు కోసం గాలిస్తున్నారు. 

08:11 - March 5, 2016

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేబినేట్ సమావేశం కానుంది. బడ్జెట్ తేదీల ఖరారుతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించనున్నారు. సభలో ప్రవేశ పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించనున్నారు.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు .....

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ కేబినేట్ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ జరగనుంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. బడ్జెట్ స్వరూపంతో పాటు శాఖల వారీగా వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

కేబినేట్లో చర్చించి బడ్జెట్ తేదీలను ఖరారు...

కేబినేట్లో చర్చించి బడ్జెట్ తేదీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహలపై చర్చలు సాగించనున్నారు మంత్రులు.

పలు బిల్లులను కూడా సభలో ప్రవేశ పెట్టాలని....

అదే సందర్భంలో పలు బిల్లులను కూడా సభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లులపై కాబినేట్ లో చర్చించి పచ్చ జెండా ఊపనున్నారు. ఇక మేడిగడ్డ వద్ద 5800 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ఆమోదం తెలపనున్నారు. ఆర్టీసీకి 500 కోట్ల లోన్ ను ఇచ్చే అంశానికి సైతం పచ్చజెండా ఉపనున్నారు. మిషన్ భగీరథకు హడ్కో నుంచి 1900 కోట్ల అప్పులను తీసుకునే ఫైల్‌కు సైతం కేబినేట్ ఆంగీకారం తెలపనుంది. అదే సందర్భంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పూర్తి పట్టు సాధించేలా..విపక్షాలను మెప్పించే రీతిలో సమాధానాలు ఇచ్చేలా సీఎం మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్‌భవన్‌ నుంచి పాత నగరంలోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్‌, కుతుబ్‌ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్‌ శాఖ రాజ్‌భవన్‌ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు అక్కడి నుంచి కుతుబ్‌షాహీ సమాధుల వరకు కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించింది.

గ్లోబల్ యూనివర్సిటీల జాబితాలో హెచ్ సియూ....

హైదరాబాద్: భారతదేశంలోని గ్లోబల్ యూనివర్సిటీల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చోటు దక్కించుకుంది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2016వ సంవత్సరానికిగాను విడుదల చేసిన గ్లోబల్ యూనివర్సిటీస్ ఎడిషన్ సంచికలో హెచ్‌సీయూ చోటు దక్కించుకుంది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ ప్రతి సంవత్సరం ఉత్తమ యూనివర్సిటీలు, కళాశాలలు, ఆస్పత్రుల జాబితాలలో హెచ్‌సీయూ 6వ స్థానాన్ని దక్కించుకుంది. 

07:34 - March 5, 2016

హైదరాబాద్ : రాజధాని భూ దందాపై వస్తున్న కథనాలతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయిందా? సీఎం తనయుడు లోకేశ్‌తో పాటు మంత్రులు, టీడీపీ నేతలపై వస్తున్న ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతోందా? విచారణ అవసరం లేదని సీఎం అంటున్నా.. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. మరో వైపు నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశం సభను కుదిపేయనుందా? ఈ అంశంపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత విజయకుమార్, వైసీపీ నేత అంబటిరాంబాబు పాల్గొన్నారు. వీరు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

06:59 - March 5, 2016

హైదరాబాద్ : ఏపి ఆసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు స‌ర్వం సిధ్ధమైంది. ఇవాల్టి నుంచి 18 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు పాలక ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సమాయత్తమయ్యాయి. టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌.. వైసీపీ ఆరోపించిన అమరావతి భూ దందా అంశాలపై.. ఈసారి సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2016-17 ఆర్థిక సంవ‌త్సరానికి ఏపి బ‌డ్జెట్ స‌మావేశాలు...

2016-17 ఆర్థిక సంవ‌త్సరానికి ఏపి బ‌డ్జెట్ స‌మావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ల‌క్ష్యాల‌ను, సిద్ధాంతాల‌ను గ‌వ‌ర్నర్ త‌న ప్రసంగంలో వివ‌రించ‌నున్నారు. అన‌ంత‌రం రెండు రోజులు పాటు స‌భ వాయిదా ప‌డి తిరిగి మంగ‌ళ‌వారం ప్రారంభం కానుంది.

ఈసారి స‌మావేశాలలో....

ఇదిలా ఉంటే ఈసారి స‌మావేశాలలో పార్టీ ఫిరాయింపులు, రాజ‌ధాని భూముల వ్యవహారం, అవిశ్వాస తీర్మానం, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి అంశం అలాగే కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి స‌రైన కేటాయింపులు లేక‌పోవ‌డంపైనా విపక్ష స‌భ్యులు ప్రభుత్వాన్ని నిలదీసే అవ‌కాశం ఉంది.

రెండు రాష్ట్రాల శాస‌న స‌భ‌లు ఒకేసారి ....

రెండు రాష్ట్రాల శాస‌న స‌భ‌లు ఒకేసారి కొలువు తీరుతుండ‌డంతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఇప్పటికే స్పీక‌ర్, ఛైర్మన్ లు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో... పోలీసు ఉన్నతాధికారులు భ‌ద్రతా చ‌ర్యల‌ను స్వయంగా ప‌ర్యవేక్షించారు. అటు మీడియాకు ఇచ్చే పాసుల విష‌యంలోనూ.. ఈసారి హ‌లోగ్రామ్ ను ప్రవేశ పెడుతున్నారు. హోలోగ్రామ్‌లతో కూడిన పాసులు లేని మీడియా వారినీ అసెంబ్లీ పరిసరాల్లో అనుమతించబోమని పోలీసు అధికారులు తేల్చిచెప్పారు.

అటు మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు నిర్దేశిత....

అటు మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల‌ను కేటాయించ‌డంతో పాటు... రెండు స‌భ‌లు ఒకేసారి కొలువైన‌ప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏపి తెలంగాణ శాస‌న‌స‌భ‌లు దాదాపు 20 రోజులు పాటు నిర్వహించ‌నుండ‌డంతో అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ చుట్టుప‌క్కల ఎలాంటి ధ‌ర్నాలు, ప్రద‌ర్శన‌ల‌కు అనుమ‌తులు లేవని అధికారులు స్పష్టం చేశారు. 

అచ్చంపేటలో అధికారపార్టీ ప్రలోభాల పర్వం

మహబూబ్‌ నగర్‌ : అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేచింది. నిన్న కరెన్సీ నోట్లు కరాళ నృత్యం చేస్తే.. నేడు మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీకి చెందిన కొంత మంది 5 కాటన్ల మద్యం పంపిణీ చేస్తుండగా.. మహాకూటమికి చెందిన కార్యకర్తలు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. గురువారం టీఆర్‌ఎస్‌ పేరుతో కరెన్సీ నోట్లు పంచుతున్న ఓ వ్యక్తిని మహాకూటమి నేతలు పట్టుకున్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మహాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు. 

06:55 - March 5, 2016

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి డెడ్ లైన్ విధించారు. ఈ నెల 10వ తేదీలోపు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. లేకుంటే 11 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. అయితే కాపుల అభివృద్ధిపై తాము చిత్తశుద్ధితోనే ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది.

కాపు ఉద్యమాన్ని మరోసారి రగిల్చేందుకు ......

కాపు ఉద్యమాన్ని మరోసారి రగిల్చేందుకు కాపునేత ముద్రగడ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని ముద్రగడ హెచ్చరించారు. కాపులకు ఇచ్చిన హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు.

టీడీపీ నేతలు ఘాటుగానే.....

ముద్రగడ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. ఈ తంతంగం వెనక.. జగన్ ఉన్నారని ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. ముద్రగడ జగన్‌తో కలిసి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం కాపులను వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరికీ భయపడరని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. జగన్‌ డైరెక్షన్‌లోనే ముద్రగడ నడుస్తున్నారని ఆరోపించారు.

గత 22 ఏళ్లుగా కుంభకర్ణుడిగా ...

గత 22 ఏళ్లుగా కుంభకర్ణుడిగా నిద్రపోయిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు కాపుల పేరుతో రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. మరోవైపు కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చాలని వైసీపీ డిమాండ్ చేసింది. ముద్రగడ లేఖ వెనక.. జగన్ ఉన్నారని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

ముద్రగడ ఆమరణ అస్త్రాన్ని....

మొత్తానికి మరోసారి కాపు ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ముద్రగడ ఆమరణ అస్త్రాన్ని బయటకు తీశారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

06:51 - March 5, 2016

హైదరాబాద్ : రాజధాని భూ దందాపై వస్తున్న కథనాలతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయిందా? సీఎం తనయుడు లోకేశ్‌తో పాటు మంత్రులు, టీడీపీ నేతలపై వస్తున్న ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతోందా? విచారణ అవసరం లేదని సీఎం అంటున్నా.. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే అంటున్నారు విశ్లేషకులు.

కొత్త రాజధాని పేరుతో భూ దందాకు పాల్పడ్డారంటూ...

కొత్త రాజధాని పేరుతో భూ దందాకు పాల్పడ్డారంటూ టీడీపీ ప్రభుత్వం, నేతలపై ఓ పత్రికలో వస్తున్న కథనాలు.. తెలుగు దేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక... ఓటుకు నోటు వ్యవహారం తర్వాత.. పార్టీలో ఇప్పుడు ఈ అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతోందని స్వయానా టీడీపీ నేతలే చెబుతున్నారు.. ఆరోపణలపై విచారణ అనకుండా ఆస్తులు సంపాదిస్తే తప్పా... భూములు కొనుక్కోకూడదా అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు చేస్తున్న ప్రకటనలు రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదమని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందంటున్నారు. సవాళ్లకు సై అంటున్న వాళ్లు.. తప్పు జరిగితే విచారణ చేస్తామని ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

డబ్బులుంటే కొనుక్కోవడం తప్పేంటని అంటున్న సీఎం ....

డబ్బులుంటే కొనుక్కోవడం తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు... కానీ కీలక అంశాలపై ఆయన దాట వేత ధోరణి ప్రదర్శిస్తున్నారని భవిష్యత్తులో అది ఆయనకు ఇబ్బంది కల్గించే అంశమని విశ్లేషకులంటున్నారు. రెండు రోజుల క్రితం తాను భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మంత్రి రావెల.. నిన్న తన భార్య భూములు తీసుకుంటే తప్పేంటంటూ మీడియా ముందుకొచ్చారు... అలాగే మంత్రి నారాయణ తన కాలేజీల్లో పనిచేస్తున్న వ్యక్తి పేరుతో భూములు కొనుగోలు చేశారని, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ పేరుతో భూములు కొన్నారన్న ఆరోపణలపై ఇప్పటి వరకు అటు పార్టీ నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ నిర్దిష్ట వివరణ రావడం లేదు.

టిడిపి నేతలకు ముందుగానే స్పష్టమైన సమాచారం.....

టిడిపి నేతలకు ముందుగానే స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ప్రాంతంలో వారు భూములు కొన్నారన్న ఆరోపణలకు మంత్రుల నుండి కానీ, ముఖ్యమంత్రి నుండి గానీ సమాధానం రాలేదు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారన్న సమాచారం ముందుగా తెలిసి ఉంటే అధికారిక రహస్యాలను దుర్వినియోగపరచడమే అవుతుందని మరికొందరి వాదన. ఆర్థిక సామర్థ్యంతో పని లేకుండా మంత్రి నారాయణకు చెందిన కళాశాల సిబ్బంది రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలోచ్చాయి. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్న మంత్రి నారయణ.. కీలక ఆరోపణలపై సరైన సమాధానం చెప్పలేదు. అవినీతి డబ్బుతో భూములు కొనలేదని, తన సంస్థలో పనిచేసే వారు ఎక్కడెక్కడ భూములు కొన్నారో తెలుసుకోవడమే తన పనికాదని చెప్పడం తప్పించుకోవడమేనని విపక్షాలు దుయ్యబడుతున్నాయి..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.....

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాజధాని ఎక్కడో అధికారికంగా ప్రకటన వెలువడక ముందే చోటుచేసుకున్న ఈ కొనుగోళ్లపైనా ఎప్పటి నుంచో ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి.. బాధితుల తరపున ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.

అగ్రిగోల్డ్‌ తమను మోసం చేసిందంటూ....

అగ్రిగోల్డ్‌ తమను మోసం చేసిందంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకం పెద్దఎత్తున ఆందోళనకు దిగినా నెలల తరబడి ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. తాజా ఆరోపణల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్ ల్యాండ్ లోకేష్ పేరుతో బదలాయించారని కథనాలు వచ్చాయి.. అయితే సీఎం దీనిపై వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని లోకేష్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారం మళ్లీ చర్చలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

అసైన్డ్‌ భూముల అసలు యజమానులకే పరిహారం....

అసైన్డ్‌ భూముల అసలు యజమానులకే పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. రాజధాని ప్రాంతంలో అక్రమ కోనుగోళ్లు ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇదే విషయాన్ని డిమాండ్‌ చేశాయి. అప్పట్లో రాష్ట్ర మంత్రులు ఈ విషయమై పెదవి విప్పలేదు. ఆ తరువాత కూడా అసైన్డ్‌భూములకు పరిహారం ఇస్తామన్నారే కాని, ఆ భూమి చేతులు మారితే ఎవరికి ఇస్తామన్నదానిపై క్లారిటీ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అసైన్డ్ భూముల అసలు యజమానుల పరిహారంపై సర్కార్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.

భూదందా కథనాలతో తమ ఇమేజ్‌లు డ్యామేజ్ అయ్యాయని.....

రాజధాని భూదందా కథనాలతో తమ ఇమేజ్‌లు డ్యామేజ్ అయ్యాయని టీడీపీ నేతలు అంటున్నారు. అంతర్జాతీయ రాజధాని రావడం వైసీపీకి ఇష్టం లేదని సీఎం, మంత్రులు, నేతలంటున్నారు.. ఒకటి మాత్రం నిజం ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారం కాదు.. ఎంతో మంది రైతులు, దళితులు, వెనుకబడిన వర్గాల ఆక్రందన. నేతల భూదాహం ఆరోపణలపై విచారిస్తే నిజనిజాలు బయటకొస్తాయి. మరి ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తుందా.. ఆరోపణలపై విచారణకు సిద్దమవుతుందా అనేది వేచి చూడాలి. 

06:47 - March 5, 2016

హైదరాబాద్ : ఈవీఎం మిషన్లలలో టాంపరింగ్ జరుగుతోందనే ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు ఈసీఐఎల్ కొత్త ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివి పాట్ ప్రింటింగ్ యంత్రాన్ని ఈ సంస్థ తయారు చేసింది. ఓటేసిన తర్వాత ఆ ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం వివి పాట్ యంత్రం ద్వారా ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఈ నేపథ్యంలో వీవీ పాట్‌ ప్రింటింగ్‌ యంత్రం ఎలా పనిచేస్తుందో ఒక సారి చూద్దాం..

ఓటరు ఓటు వేసిన తరువాత..

ఓటరు ఓటు వేసిన తరువాత..ఆ ఓటు ఎవరికి వెళ్లిందో తెలిపేదే వివి పాట్‌ ప్రింటింగ్‌ యంత్రం. ఈవియం మిషన్‌కి వివి పాట్ ప్రింటింగ్ యంత్రాన్నిఅనుసంధానం చేస్తారు. ఓటు వేయగానే..చిన్న స్లిప్ ప్రింటింగ్‌ యంత్రంలో కనిపిస్తుంది. ఆ స్లిప్‌ ఐదు సెకన్ల నుండి పది సెకన్ల వరకు వివిపాట్ యంత్రంలో కనిపించి తరువాత క్రింద ఉన్న బాక్స్ లో పడిపోతుంది. ఈ స్లిప్ ని ఓటరుకు ఇవ్వకుండా బాక్స్ లో భధ్రపరుస్తారు.

వివి పాట్ ప్రింటింగ్ యంత్రాలను.....

వివి పాట్ ప్రింటింగ్ యంత్రాలను ఇప్పటికే బీహార్ , మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్త లేదు. ఖమ్మంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ యంత్రాలను మరోసారి ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు.

ఐదు లక్షల ప్రింటింగ్ యంత్రాలు....

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు లక్షల ప్రింటింగ్ యంత్రాల కోసం ఈసీఐఎల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటిని అందించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఈసీఐఎల్‌కు నెలకు 20,000 వేల యంత్రాలను తయారుచేయగల సామర్థ్యం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అన్ని ఈవియంలకు.. వివి పాట్ యంత్రాలను తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ అధికారులు చెబుతున్నారు. 

06:44 - March 5, 2016

హైదరాబాద్ :అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఏప్రిల్ 4న, రెండో దశకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయి.                                                                                 

     పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ....

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు రోజుల పాటు పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 4, 11న జరగుతాయి. ఏప్రిల్ 17, 21, 25, 30, మే 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ర్టాల్లో ఒకే దశలో...

కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ర్టాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ర్టాలకు మే 16న ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది.

అన్ని రాష్ర్టాల్లోనూ మే 19న ఓట్లను...

అన్ని రాష్ర్టాల్లోనూ మే 19న ఓట్లను లెక్కిస్తారు. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎన్నికల ప్రక్రియ మే 21వ తేదీలోపు ముగుస్తుందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ పేర్కొన్నారు.ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీమ్ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్రం ఎలాంటి పథకాలను ప్రకటించడానికి వీలు లేదు.

తొలిసారి ఎన్నికల్లో నోటాకు సింబల్‌ను కేటాయించారు....

తొలిసారి ఎన్నికల్లో నోటాకు సింబల్‌ను కేటాయించారు. అభ్యర్థుల జాబితాలో చిట్ట చివరగా నోటా బటన్‌ ఉంటుంది. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డిజైన్ నోటా గుర్తును డిజైన్ చేసింది. ఈవీఎం మెషిన్లపై అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయి.

మొత్తం 824 నియోజకవర్గాలకు ఎన్నికలు....

అయిదు రాష్ర్టాల్లో మొత్తం 824 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 17 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌకర్యం కోసం పోలింగ్ స్టేషన్లను పెంచారు. ప్రతి జిల్లాకు అయిదుగురు కేంద్ర అబ్జర్వర్లు ఉంటారు. ఫ్లయింగ్ స్కాడ్‌లు, మొబైల్ టీమ్‌లకు జీపీఎస్ సౌకర్యం కల్పిస్తున్నారు. పెయిడ్ న్యూస్‌పై ఎన్నికల సంఘం నిఘా పెడుతుందని ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ తెలిపారు.

పశ్చిమబెంగాల్‌లో ఆరు విడతల్లో ఎన్నికలు.....

మావోయిస్టు ప్రభావిత పశ్చిమబెంగాల్‌లో ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి శాంతి భద్రతల కారణంగా అసోంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాంతి భద్రతలకు సంబంధించిన ఇబ్బందులు లేకపోవడంతో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 

అలనాటి నటుడు మనోజ్‌కుమార్‌కు దాదా సాహెబ్ అవార్డ్

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు ఎంపికయ్యారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్‌ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం...

హైదరాబాద్ : ఏపి ఆసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు స‌ర్వం సిధ్ధమైంది. శనివారం నుంచి 18 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. శనివారం మధ్యాహ్నం 3గంటలకు గవర్నర్ ప్రసంగం తరువాత మంగళవారానికి వాయిదా పడనుంది. మరో వైపు అసెంబ్లీ సమావేశాలకు పాలక ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సమాయత్తమయ్యాయి. టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌.. వైసీపీ ఆరోపించిన అమరావతి భూ దందా అంశాలపై.. ఈసారి సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జేఎన్ యూ వివాదంలో స్మృతి సహాయకురాలు..

న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) వివాదంగా మారిన నకిలీ వీడియో రికార్డింగ్ వెనుక కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గతంలో సహాయకురాలిగా పనిచేసిన శిల్పితివారీ హస్తమున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన రోజు శిల్పి తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి చూపించారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. శిల్పి తీసిన విడియో ఆధారంగానే వివాదం చెలరేగినట్టు సమాచారం. అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగడంతోపాటు, కన్హయ్యపై దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే.

Don't Miss