Activities calendar

06 March 2016

ఆసియా కప్ టీ.20 కప్ భారత్ కైవసం..

ఢాకా : ఆసియా కప్ టీ.20 ను భారత్ కైవసం చేసుకుంది. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ నిర్ణీత 15 వోవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్  కు దిగిన భారత్ 13.5 వోవర్లలో రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.  

22:01 - March 6, 2016

కేరళ : ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మణి  వందకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు. తెలుగులో జెమినీ, ఎవడైతే నాకేంటి చిత్రాల్లో నటించారు. జెమినీ సినిమాలో విలన్‌గా కామెడి,యాక్షన్‌ను కలగలపి ప్రేక్షకులను మెప్పించారు. 

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

ఢాకా : ఆసియా కప్ టీ.20లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 75 పరుగుల వద్ద మోర్తాజా ఔట్ అయ్యాడు. 

నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

ఢాకా : ఆసియా కప్ టీ.20లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రహీమ్(1) ఔట్ అయ్యాడు. 

21:53 - March 6, 2016

ఢిల్లీ : దేశంలో మరో ఉగ్రదాడికి తీవ్రవాదులు కుట్రపన్నారు. మహా శివరాత్రికి భారీ విధ్వంసం సృష్టించేలా దాడులు జరిగే అవకాశమున్నట్టు... నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్, ఢిల్లీలో దాడులకు అవకాశం ఉండటంతో.. భద్రత కట్టుదిట్టం చేశారు. 
కీలక నగరాల్లో హై అలర్ట్
దేశంలోకి పదిమంది ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కీలక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్ మీదుగా ప్రవేశించిన వీరు.. శివరాత్రి రోజు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదమున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికాలు జారీచేసింది. చొరబాటుదారులంతా లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. తీవ్రవాదులు గుజరాత్, ఢిల్లీలోనే విధ్వంసం సృష్టించేందుకే వచ్చారని హోంశాఖ అనుమానిస్తోంది. 
ఐబీ హెచ్చరికలతో ... గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తం
ఐబీ హెచ్చరికలతో ... గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా మహాశివరాత్రి రోజు రద్దీగా ఉండే సోమనాథ్ ఆలయం టార్గెట్ కావొచ్చనే అంచనాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్రం కూడా 4 ఎన్ ఎస్ జి కమెండో యూనిట్లను గుజరాత్‌కు పంపింది. వీటిలో ఓ యూనిట్‌ను సోమనాథ్ ఆలయం వద్ద మోహరించారు.  శివరాత్రి రోజు సోమనాథ్ ఆలయంతో పాటు... నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, ద్వారకా, జునాగఢ్‌లోని భగ్‌వత్‌ లో భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయాల వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. వీటితో పాటు తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ భద్రతను మరింత పెంచింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న్టటు గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ ప్రకటించారు. భుజ్‌ లో హోటళ్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 
ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం 
గుజరాత్ మీదుగా తీవ్రవాదులు ఢిల్లీకి వచ్చారన్న అనుమానాలతో...  దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. శివరాత్రితో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో దాడులు జరపడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని కేంద్రం అనుమానిస్తోంది.  ఉగ్రవాదులు భారీ లక్ష్యంతోనే వచ్చారన్న సమాచారంతో... రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్....

ఢాకా : ఆసియా కప్ టీ.20లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 64 పరుగుల వద్ద షకీబ్ (21) ఔట్ అయ్యాడు. 

21:46 - March 6, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శనివారం అర్ధరాత్రి యమునా ఎక్స్ ప్రెస్‌ హైవేపై ఢిల్లీ వెళ్తుండగా స్మృతి ఇరానీ వాహనం.. ముందున్న పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు స్మృతి ఇరానీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

 

21:40 - March 6, 2016

హైదరాబాద్ : ప్రధాని మోదీ పాలన కుబేరులకు భోజ్యంగా మారిందన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం విశాల రైతు ఉద్యమాల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.. దేశవ్యాప్తంగా రైతులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.. 
నిజాం కాలేజ్‌ గ్రౌండ్‌లో 29వ అఖిల భారత కిసాన్‌ సభలు
హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌ గ్రౌండ్‌లో 29వ అఖిల భారత కిసాన్‌ సభలు ముగిశాయి.. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, చాడా వెంకట్‌ రెడ్డి, జస్టిస్ చంద్ర కుమార్‌, ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌ వ్యవసాయ రంగానికంటే కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రాయితీలే ఎక్కువగా ఉన్నాయన్నారు.. సురవరం. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వందేమాతరం శ్రీనివాస్ తన మాటతో ఆహుతుల్లో ఉత్సాహం నింపారు.

 

21:38 - March 6, 2016

హైదరాబాద్ : ప్రధాని మోడీ పాలన కుబేరులకు భోజ్యంగా మారిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. నిజాంకాలేజీలో జరిగిన ఎఐకెస్ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం విశాల రైతు ఉద్యమాల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 

 

21:31 - March 6, 2016

హైదరాబాద్ : బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగా సమావేశం సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్‌పై చర్చించారు. ఈ నెల 10న ఉభయసభల్లో జరిగే గవర్నర్‌ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని తెలంగాణకు ఆపాదిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మిషన్‌ భగీరథకు నాబార్డు నుంచి రూ. 1900 కోట్ల రుణం తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. కొత్త ఐటీ పాలసీ, మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో టీఎస్ఐఐసీకి 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో కొత్తపోస్టులను భర్తిచేయడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. వేసవిలో తాగునీటి సమస్యపై  కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.

 

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

ఢాకా: ఆసియా కప్ టీ.20 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. బంగ్లాదేశ్  రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగుల వద్ద ఇక్బాల్ (13) ఔట్ అయ్యాడు. 

 

తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

ఢాకా: ఆసియా కప్ టీ.20 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగుల వద్ద సర్కార్ ఔట్ అయ్యాడు. 

 

ఫైనాన్స్ యజమాని కిడ్నాప్ కు యత్నించిన దుండగులు

కరీంనగర్ : జిల్లాలోని జగిత్యాలలో వారంరోజుల క్రితం ఫైనాన్స్ యజమానిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దుండగుల నుంచి 5 కార్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

రోడ్డు ప్రమాదం... ఇద్దరు వ్యక్తులు మృతి

కృష్ణా  : జిల్లాలోని నందిగామలోని రమణ కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

20:55 - March 6, 2016

ఢిల్లీ : తూటాల్లాంటి మాటలతో దేశ యువతలో సరికొత్త కెరటమై దూసుకొచ్చాడు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్. దేశ స్వేచ్ఛ గురంచి సరికొత్త అర్థమిచ్చిన యువతేజంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రోహిత్ వేముల తనకు ఆదర్శమని చెబుతున్న కన్హయ్య....ప్రజాస్వామ్య విలువల స్థాపన, రాజ్యాంగ కలల సాకారానికి అనునిత్యం కృషి చేస్తామని చెబుతున్నాడు. జేఎన్‌యూకు, తనకు, తన స్నేహితులకు అండగా నిలబడిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇంకా కన్హయ్య ఏమన్నారో ఒకసారి చూద్దాం.
దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు 
ముందుగా దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు. న్యాయం,సమానత్వం, మెరుగైన సమాజం కోసం ఎవరైతే నిలబడ్డారో వారందరికీ నా కృతజ్ఞతలు. జేఎన్‌యూకు, నాకు, నా స్నేహితులకు దేశ ప్రజలు అండగా నిలబడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు. జేఎన్‌యూ గురించి నేను దేశ ప్రజలకు హామి ఇస్తున్నాను. నాలాంటి పేద విద్యార్థి చదవడానికి జేఎన్‌యూ ఒక ఆశ్రయం. ఎలాంటి సమస్యా లేకుండా విద్యను అభ్యసించడానికి మహిళకు అవకాశం. చదువుకోవడానికి, పోరాటానికి జేఎన్‌యూ ఒక కేంద్రం. కాబట్టి ఈ క్యాంపస్ గురించి ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. జేఎన్‌యూ స్టూడెంట్స్ గురించి ఎలాంటి దురభిప్రాయాలూ వద్దని చెబుతున్నాను. మేము ఈ దేశ భవిష్యత్తు. ప్రజాస్వామ్య విలువలను స్థాపిస్తామని, రాజ్యాంగ స్వప్నం నెరవేరుస్తామని ఈ దేశ ప్రజలకు హామి ఇస్తున్నాము.
మోడీతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవు
ప్రధాని నరేంద్ర మోదీతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవు. దేశ ప్రధానిగానే మోదీని మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ వ్యక్తిగతంగా కాదు. దేశ ప్రజల మెరుగైన జీవితం కొరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. బడుగు బలహీనవర్గాల ప్రజల శ్రేయస్సుకు కృషి చేయడం లేదు. ప్రజానుకూల విధానాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. అందుకే ప్రభుత్వ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంతకుముందున్న ప్రభుత్వాల కంటే ఇది ఘోరమైన ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేస్తున్నది సమాజానికి మంచిది కాదు 
ఏమి చేయకుండా ఉంటే, అదొక ప్రత్యేకమైన రాజకీయంగా అభివర్ణిస్తారు. ఏమి చేసినా, ఏమి చేయకున్నా కూడా రాజకీయమే అంటారు. రాహుల్ గాంధీ రోహిత్ వేముల మృతిపై రాజకీయం చేస్తున్నారని కొందరంటున్నారు. కానీ నేను చెప్పేదేమంటే...రోహిత్‌ మృతికి బాధ్యులైన వారిదీ ఒక రకమైన రాజకీయమే. ఏ రాజకీయం మంచిది, ఏది చెడ్డది అన్నది నేను చెప్పడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేస్తున్నది సమాజానికి మంచిది కాదని మాత్రం చెప్పగలను. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఢాకా: ఆసియా కప్ టీ.20 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో జరుగనుంది. భారత్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మీర్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. 

20:40 - March 6, 2016

విజయవాడ : మహాశివరాత్రి ఉత్సవాలకు కృష్ణా జిల్లా సన్నద్ధమైంది. శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి వేడుకలకు  జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే  భక్తులతో శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగనున్నాయి. 
కృష్ణానదీ తీరాన మహాశివరాత్రి వేడుకలు 
మహాశివరాత్రి వేడుకలకు కృష్ణాజిల్లాలోని శైవక్షేత్రాలన్నీ సిద్ధమయ్యాయి. ప్రత్యేకంగా విజయవాడలో కృష్ణానదీ తీరాన మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేయనున్నారు. 
దివ్య కళ్యాణోత్సవాలు ప్రారంభం 
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయం వేడుకలకు ముస్తాబయింది. నదీతరంలో ఉన్న విజయేశ్వరి స్వామివారి ఆలయం, వందేళ్లకుపైగా చరిత్ర కల్గిన వన్ టౌన్ పాతశివాలయం, విజయవాడలో ప్రధాన శైవక్షేత్రాలుగా వర్థిల్లుతున్నాయి. 
దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు 
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గాఘాట్ లో భక్తులు స్నానాలు ఆచరించేందుకు స్నాన ఘాట్ లో పూడికలను తీయించారు. జల్లు స్నానాలు కోసం  ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేశారు. పూర్వికులకు పత్రాలు వదిలేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. రామలింగేశ్వరనగర్ లోని  అత్యధికంగా భక్తులు తరలివచ్చే అశకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు.
పోలీసులు పటిష్ట భద్రత
మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయవాడ నగరంలో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలోని శైవ క్షేత్రాల దగ్గర బందోబస్తును ఏర్పాటుచేశారు. కనకదుర్గమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ప్లైఓవర్ నిర్మాణ  పనులు జరుగుతున్న నేపధ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

20:34 - March 6, 2016

కరీంనగర్‌ : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిధుల కేటాయింపునకు సంబంధించి జెడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు 64 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపితే కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు అయ్యాయి. దీనిపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరుకాకుండా బయటే ఉండిపోయారు. దీంతో ఛైర్‌పర్సన్‌ తుల ఉమా జెడ్పీటీసీలతో చర్చలు జరిపారు. వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో జెడ్పీటీసీలు ఆందోళన విరమించి సమావేశానికి హాజరయ్యారు. 

 

20:32 - March 6, 2016

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంజయ్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యకేసులో ఐదుగురు నిందితుల్ని ఆదివారం అరెస్టు చేశారు. హత్య జరిగిన విధానాన్ని నింధితులు పోలీసుల ఎదుట వెల్లడించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందు పంజాగుట్ట దగ్గర సంజయ్‌ ఈ ముఠాను లిఫ్ట్ అడిగాడు. అడగగానే లిప్టు ఇచ్చిన ముఠా సభ్యుల స్వభావం కొద్ది సేపట్లోనే భయటపడటంతో.. సంజయ్ కారులోనే వారితో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహించిన ముబాషిర్‌ గ్యాంగ్‌ సంజయ్‌ను కొట్టారు. సంజయ్ ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి స్వప్నలోక్‌ దగ్గర హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై అక్కడ వదిలి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ముమ్మర గాలింపు నిర్వహించి నింధితులను సినిఫక్కీలో పట్టుకున్నారు. కాగా ముషిబార్‌ గ్యాంగ్‌పై గతంలో రేప్‌ కేసుందని పోలీసులు తెలిపారు.

 

20:29 - March 6, 2016

రంగారెడ్డి : ఆ మహిళ భర్త చనిపోయినా ధైర్యం కోల్పోలేదు. ఆటో నడుపుతూ కుటుంభాన్ని నడిపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. తన ఆదర్శాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ఉత్తమ మహిళా అవార్డుకు తారాబాయి ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన ఈ మహిళ భర్త పదహారేళ్లక్రితం మృతి చెందాడు. భర్త మరణంతో కుంగిపోయినా పిల్లల్ని చూసి ధైర్యం తెచ్చుకుంది. ఈ తరుణంలో కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆటో నడిపింది.  ఆటో నడపడం ద్వారా వచ్చిన సంపాదనతో తన పిల్లల్ని చదివించింది. స్పూర్తిదాయక జీవనానికి నిలువెత్తు రూపమైన తారాబాయి, తనకు 'తెలంగాణ ఉత్తమ మహిళ' అవార్డు దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ఆదర్శ మూర్తికి 10టీవీ సలాం చేస్తోంది. 

 

20:25 - March 6, 2016

హైదరాబాద్ : పోలవరం, పట్టిసీమ పనులు ఊపందుకున్నాయి. రాబోయే సీజన్ కల్లా కృష్ణా డెల్టాకు నీరందించే లక్ష్యంగా పోలవరం, పట్టిసీమ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టిసీమ వద్ద మోటార్లు బిగించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుండగా..మరో పక్క పోలవరం వద్ద మట్టి తవ్వకం పనులు జోరందుకున్నాయి. 2018 కల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నారు.  
2018 కల్లా పోలవరం మొదటి దశ పూర్తి 
2018 కల్లా పోలవరం మొదటి దశను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనుల్ని వేగవంతం చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మిషనరీతో పోలవరం, పట్టిసీమ పనుల్ని వేగవంతం చేశారు. పోలవరం రెండు కొండల మధ్య నిర్మించే స్పిల్ వే, స్పిల్ ఛానల్ నిర్మాణం, డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం జర్మనీకి చెందిన పార్, దేశీయ కంపెనీ ఎల్ అండ్ టీతో కలిసి పనులు ప్రారంభించాయి. డయాఫ్రం వాల్ నిర్మాణం 110 అడుగుల లోతున జరగాల్సి ఉండడంతో అమెరికా నుంచి పరికరాలను తెప్పించి పనులను చేస్తున్నారు.
110 అడుగుల లోతున డయాఫ్రం వాల్‌నిర్మాణం  
ఏడాదిలో 3నెలల పాటు గోదావరి నదికి వచ్చే వరదల్లో దాదాపు  5వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. దీంతో  కృష్ణా డెల్టాలో నీరందక పంట పొలాలు ఎండిపోయే పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. అయితే వృధాగా పోతున్న వరద నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి మళ్ళిస్తారు. దీని ద్వారా 80టీఎంసీల నీటిని అదనంగా అందించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా డెల్టాలో పొలాలను కూడా రక్షించుకోవచ్చు. మరోవైపు అంతర్గత జలరవాణా మార్గానికి కూడా ఈ కాలువను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. దీనికోసం ఇప్పటికే 40 మీటర్ల వెడల్పుతో తవ్విన కుడి కాలువను 77 మీటర్ల వెడల్పు ఉండేలా తవ్వకాలు జరుపుతున్నారు.  
కుడికాలువ ద్వారా కృష్ణానదికి మళ్లింపు 
గోదావరి, కృష్ణా డెల్టాలకు తాగు, సాగుకు ఉపయోగపడే విధంగా మొత్తం 350 టీఎంసీల లైవ్ స్టోరేజి ఉండే విధంగా పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం ముంపుకు గురయ్యే ఏడు గ్రామాల్లో ఇప్పటికే నాలుగు గ్రామాలను ఖాళీచేయించారు. మిగిలిన మూడు గ్రామాల ప్రజల కోసం 695 ఇళ్ళను నిర్మించే పనులను వేగవంతం చేశారు. పోలవరం డ్యామ్ వద్ద మళ్ళించే గోదావరిని 48 గేట్లతో నిర్మించబోయే స్పిల్ వే ద్వారా కిందకు విడుదల చేస్తారు. స్పిల్ వే పనుల కోసం రెండు కొండల మధ్య మట్టిని తవ్వే పనులను వేగవంతం చేశారు. జూలై నాటికి పనులను దాదాపు పూర్తి చేసి, మిగిలిన పనులను రెండో సీజన్‌లో పూర్తి చేస్తామని మంత్రి దేవినేని చెబుతున్నారు. 
350 టీఎంసీల లైవ్‌ స్టోరేజి కెపాసిటీ 
అయితే పోలవరాన్ని గడువులోపు పూర్తిచేస్తామని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి అన్నారు. గడువులోపు పోలవరం పూర్తి చేయాలంటే 30వేల కోట్లు కావాలని,..అన్ని నిధులు ఎక్కడనుంచి తెస్తారని ప్రశ్నించారు. 
పోలవరం పూర్తికి 30వేల కోట్లు 
అయితే ప్రభుత్వం చెప్తున్నట్లుగా 2018 కల్లా పోలవరం నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేది ప్రభుత్వ పెద్దలే చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు బడ్జెట్‌పై చర్చించారు. మొత్తం 22 అంశాలపై చర్చ జరిగింది.

 

19:43 - March 6, 2016

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి సహాయమూ చేయడం లేదని దుష్ప్రచారం జరుగుతోందని అమిత్‌షా అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఎపి అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉందన్నారు. పోలవరంకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. 
పేదల సంక్షేమనకి బిజెపి కట్టుబడిందన్నారు. 2019 నాటికి ఎపిలో మూడు ఫేజుల్లో అంతరాయం లేని విద్యుత్  ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలకు రూ.65 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. 1500 కోట్ల రూపాయలను ఎయిమ్స్ కు ఇచ్చామని పేర్కొన్నారు. ఎపికి  లక్ష 93 వేల ఇళ్లను కేటాయించామని గుర్తు చేశారు. అమృత్ పథకంలో ఎపిలో 31 నగరాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం లభిస్తుందన్నారు. కాకినాడ, విశాఖను స్మార్ట్ సిటీలుగా గుర్తించిందని చెప్పారు. 

 

19:31 - March 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం 3గంటలుగా కొనసాగుతోంది. పాలనాపరమైన అంశాలపై చర్చ ముగిసింది. నూతన ఐటీ పాలసీకి కేబినెట్ ఆమోదముద్రవేసింది. అలాగే మిషన్ భగీరథకు నాబార్డు నుంచి.. 1900 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తెలంగాణకు అనువదిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాజకీయ అంశాలపై చర్చ జరుగుతోంది. 

 

19:11 - March 6, 2016

హైదరాబాద్ : మహిళా టీచర్‌పై వేధింపుల కేసులో పోలీసులకు లొంగిపోయిన రావెల సుశీల్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు. బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగిపోయిన సుశీల్‌,ఆయన డ్రైవర్‌ రమేష్‌లను పోలీసులు మెజిస్ట్రేట్‌  ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐతే తన కుమారుడు ఎటువంటి తప్పూ చేయలేదని మంత్రి రావెల కిశోర్‌ బాబు అన్నారు. ఈ కుట్ర వెనుక జగన్‌ హస్తం ఉందని ఆరోపించారు. 
చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఓ మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్‌తో పాటు ఆయన డ్రైవర్‌ రమేష్‌కు  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుశీల్‌, అతని కారు డ్రైవర్‌ రమేష్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని ప్రశ్నించిన అనంతరం పోలీసులు తుర్కయాంజల్‌లోని మెజిస్ట్రేట్‌ ఇంటికి తరలించారు. మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 
దీని వెనుక జగన్‌ హస్తం : రావెల
అంతకుముందు స్టేషన్‌ బెయిల్‌ కోసం సుశీల్‌ తరపు న్యాయవాదులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు లొండిపోయాడు. ఐతే తన కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించారని ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. దీని వెనుక జగన్‌ హస్తం ఉందని ఆరోపించారు. 
రావెల కిశోర్‌బాబు ఆరోపణలక వైసీపీ ఖండన  
రావెల కిశోర్‌బాబు ఆరోపణలను వైసీపీ ఖండించింది. సుశీల్‌ కేసును మంత్రి రావెల వక్రీకరిస్తున్నారని మండిపడింది. నైతిక బాధ్యత వహిస్తూ కిశోర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేని కల్పన డిమాండ్‌ చేశారు.

రాజకీయ ఒత్తిళ్లు లేవు : డీసీపీ వెంకటేశ్వరరావు 
రావెల సుశీల్‌ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకే డ్రైవర్‌, సుశీల్‌పై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. 
సుశీల్, రమేష్  అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ పట్ల, కారులో వెళుతున్న మంత్రి కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్  అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. రోడ్డు పై వెళుతున్న తనను చేయిపట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె  ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు  రావెల సుశీల్‌తో పాటు డ్రైవర్ రమేష్ పై ఈవ్ టీజింగ్‌తో పాటు నిర్భయ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేశారు. ఈ కేసులో రెండు రోజుల పాటు కనిపించకుండాపోయిన సుశీల్‌, డ్రైవర్‌ రమేష్‌లు చివరికి పోలీసులకు లొంగిపోయారు. నిందితులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడంతో  14 రోజుల రిమాండ్‌ విధించారు. మరోవైపు రావెల సుశీల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 8న కోర్టు విచారణ జరపనుంది. 
 

నూతన ఐటీ పాలసీకి ఆమోదం..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు బడ్జెట్‌పై చర్చించి... దానికి తుది రూపునిస్తారు. మొత్తం 22 అంశాలపై చర్చ జరుగుతోంది.

 

రావెల సుశీల్ కుమార్ కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమారునికి తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళను వేధించారనే కేసులో సుశీల్ కు రిమాండ్ విధించారు. సుశీల్ తోపాటు అతని డ్రైవర్ కు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. రావెల సుశీల్ బెయిల్ పిటిషన్ పై ఈనెల 8న విచారణ జరుగనుంది. 

 

18:42 - March 6, 2016

విజయవాడ : ఎపి మహిళలు అరుదైన ఘనత సాధించారు. 6వందల అడుగుల కొండను తాళ్ల సహాయంతో దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు.. విజయవాడ మొగల్రాజపురంలోని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ర్యాపింగ్ జరిగింది.. దాదాపు 50మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.. తొలిసారి కొండదిగుతున్నవాళ్లు మధ్యలో కాస్త ఆందోళన చెందినా మొత్తానికి టాస్క్ పూర్తిచేశారు.. మహిళలు ఏదైనా సాధించగలరని నిరూపించారు.. 

 

18:40 - March 6, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలో బీజేపీ సభలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తన అన్ని పర్యటనల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టారని సీపీఎం నేత అరుణ్ ఆరోపించారు. గుజరాత్‌, బీహార్‌ ఎన్నికలకుముందు అమిత్‌ షా టూర్‌ తర్వాతే అల్లర్లు చెలరేగాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఏపీకి ఏం చేశారని సభలు పెడుతున్నారని మండిపడ్డారు..

 

18:37 - March 6, 2016

హైదరాబాద్ : వాస్తవాలు వెలుగులోకి తెస్తే ప్రాసిక్యూట్ చేస్తారా? అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసులు పెట్టించి వేధిస్తారా? అని నిలదీశారు. తప్పు చేయకుంటే చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధానిలో భూదందాపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

 

18:32 - March 6, 2016

ఆదిలాబాద్ : నిజాం కాలంలో నిర్మించబడిన సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు రేపో, మాపో ప్రారంభమవుతుందని ఆశించిన కార్మికులకు షాక్ తగిలింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఈ పేపర్ మిల్లు ఆస్తులు ప్రైవేట్ పరం కాబోతున్నాయా.. ఇక పేపర్ మిల్లు కనబడకుండాపోతుందా.. మరి కార్మికుల పరిస్థితి ఏంటి...?
మిల్లుపై వీడని సందిగ్థత  
18 నెలలుగా షెడ్ డౌన్ పేరుతో మూతపడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని  సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లుపై సందిగ్థత వీడడం లేదు.  కొంతకాలంగా అప్పుల్లో కూరుకుపోయిన పేపర్ మిల్లుకు.. తమకు రావాల్సిన బకాయిలను  వెంటనే చెల్లించాలని ఐడీబీఐ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. దీంతో  పేపర్ మిల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కార్మికుల జీవితాలతో చెలగాటం 
యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంది. సంవత్సరాల కొద్దీ భారం మోయలేమని నష్టాల్లో నడుస్తోంది చెబుతూ వస్తున్నారు. ఇక మావల్ల కాదంటూ యాజయాన్యం లాకౌట్ లు ప్రకటించింది.గత రెండు సంవత్సరాల కాలంగా ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు కూలీలుగా వలసలు పోతున్నారు కంపెనీ కార్మికులు. ప్రత్యేక రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ జీవితాలు మారుతాయనుకున్న కార్మికులపై ఐడీబీఐ బ్యాంక్ నీళ్లు చల్లింది. 
ప్రభుత్వం నోరు మెదపడం లేదన్న కార్మికులు 
త్వరలో ప్రభుత్వం కంపెనీ యజమానులతో చర్చలు జరిపి.. ప్రభుత్వపరం చేస్తుందని వస్తున్న వాదనల్లో నిజం లేదని తేలిపోయింది. తిరిగి ఉత్పత్తిని ప్రారంభించి అన్ని ప్రభుత్వకార్యాలయాల్లో ఈ కంపెనీ  కాగితాలనే ఉపయోగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేపర్ మిల్లును స్వాధీనం చేసుకుంటామన్న ఐడీబీఐ 
ఇది ఇలా ఉంటే ఐడీబీఐ బ్యాంక్ వారు తమకు 422 కోట్లకు పైగా బకాయిల కింది పేపర్ మిల్లును స్వాధీనం చేసుకుంటామని నోటీసులు అంటించారు. పలుమార్లు నోటీసులు పంపించినా కంపెనీ కాని ప్రభుత్వం కాని పట్టించుకోవడంలేదని నోటీసులో పేర్కొన్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే కలగజేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. సిర్పూర్ మిల్లు మూత పడకుండా ఆదుకోవాలని కార్మికుల జీవితాలను వీధిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
ఐడీబీఐ బ్యాంక్ నోటీసులపై సర్వత్రా నిరసనలు 
ఐడీబీఐ బ్యాంక్  సిర్పూర్ పేపర్ మిల్లును స్వాధీనం చేసుకుంటున్నట్లు  నోటీసులు  అంటించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ మిల్లును ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. బకాయిల విషయంలో ప్రభుత్వం  కలగజేసుకుని కార్మికులకు అండగా నిలవాలంటున్నారు. 

 

18:19 - March 6, 2016

విశాఖ : పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటికి అవస్ధలు అన్నీఇన్నీకావు. సర్కారు ముందు చూపులేని కారణంగా ఇటు ప్రజలకు, అటు పరిశ్రమలకు నీటి కష్టాలు తప్పేలా లేవు. పోలవరం ఎడమ కాలువను నిర్లక్ష్యం చేయడం, పట్టిసీమతో నీటి మళ్ళింపు ఉత్తరాంద్ర నీటి ప్రాజక్టులకు గ్రహణం పట్టేలా చేస్తోంది.
వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు
వేసవి ఆరంభంలోనే విశాఖ జనానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. కొండప్రాంత వాసులకు నీటిసరఫరా ఆగిపోతోంది. మంచినీటి సరఫరాలో సమయాన్ని కుదించేసారు. పరిశ్రమలకు పూర్తిగా నీరు సరఫరా చేసే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. రానున్న రోజుల్లో ఏం చేయాలనేదానిపై అధికారుల్లో భయం నెలకొంది. 
విశాఖ నగరానికి 200 ఎంజిడిల నీరు అవసరం
విశాఖ నగరానికి 200 ఎంజిడి ల నీరు తక్షణ అవసరం. కేవలం 120 ఎంజిడిలతోనే సరి పెట్టుకుంటున్నారు. ఇందులో 60 ఎంజిడిలు ఏలేరు కాలువ నుంచి వస్తుంది. ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ లో  డెడ్ స్టోరేజ్ కి వెళ్ళిపోయింది. తూర్పు గోదావరి రైతులకు  రెండో పంటకు నీరందించాల్సిన పరిస్ధితి ఉంది. ఇలా అయితే ఏలేరు నీటి సరఫరాకు బ్రేక్ పడుతుంది.
పోలవరం ఎడమకాలువను పట్టించుకోని ప్రభుత్వం
మరోవైపు పోలవరం కుడి కాలువ నుంచి పట్టిసీమ పేరుతో 24 పంపులతో లిఫ్ట్ చేస్తున్న ప్రభుత్వం.. పోలవరం  ఎడమకాలువ అభివృద్ధికి  ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. బచావత్ తీర్పు ప్రకారం విశాఖ నగరానికి 400 ఎంజిడిల నీరు అందివ్వాలి. కాని సర్కారు విఫలమైంది. యుద్ద ప్రాతిపదికన పనులు ఆరంభిస్తే ఈ వేసవికి నీటి కష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. 

 

18:06 - March 6, 2016

విజయవాడ : ఏపీ రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో 1200 ఎకరాలు సేకరించే ప్రక్రియను సీఆర్‌డీఏ వేగవంతం చేసింది. అయితే భూసమీకరణనే తీవ్రంగా వ్యతిరేకించిన ఈ గ్రామాల్లో భూ సేకరణ చేపడితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి ?.. అవసరాన్ని మించిన భూమిని ఎందుకు సేకరించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు తలెత్తున్నాయి.  
రాజధాని నిర్మాణం.. అత్యంత కీలకం.. భూ సమీకరణ. 
రాజధాని నిర్మాణంలో అత్యంత కీలక అంశం భూ సమీకరణ. అయితే అధికారులు ఇచ్చే ఆఫర్లకు తలొగ్గని మరో 1200 ఎకరాల రైతుల భూములను తీసుకునేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్లను సీఆర్‌డీఏ కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచారు.
ఎస్‌ఐఏ నోటిఫికేషన్లు
ఈ భూ సేకరణ లో అబ్బరాజుపాలెంలో 19.5 ఎకరాలు, బోరుపాలెంలో 23.6 ఎకరాలు, కృష్ణాయ పాలెంలో 94.6 ఎకరాలు, నేలపాడులో 39.8 ఎకరాల భూమిని సేకరించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే అనుమతితో సీఆర్‌డీఏ ల్యాండ్‌ పూలింగ్‌ యూనిట్ల కాంపిటెంట్‌ అథారిటీలు ఎస్‌ఐఏ నోటిఫికేషన్లను ప్రకటించారు.
మెట్ట, జరీబు భూముల వర్గీకరణ 
నోటిఫికేషన్‌లోనే మెట్ట, జరీబు భూముల వర్గీకరణను పేర్కొన్నారు. 2013 భూసేకరణ పునరావాస, పునర్నిర్మాణ చట్టం ప్రకారం స్థానిక సంస్థలు, భూయజమానులతో సంప్రదించాల్సి ఉన్నందున ఈ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 
బెదిరింపు ప్రయత్నాలు ఉండవు  
నోటిఫికేషన్‌ ప్రకారం ప్రజలతో సంప్రదింపులు, సర్వే, సామాజిక ప్రభావం అంచనా నివేదిక, నిర్వహణ ప్రణాళిక, బహిరంగ విచారణ, అధ్యయన నివేదిక, సామాజిక ప్రభావం నిర్వహణ ప్రణాళిక ప్రచురణ చేస్తామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్బంధం, బెదిరింపు ప్రయత్నాలు ఉండవని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చి భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం సిద్దమవుతుంటే.. మరోవైపు రైతులు ఎలాంటి పాకేజీలకు తలొగ్గేందుకు సిద్దంగా లేమని తేల్చిచెప్తున్నారు. 

 

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 22 అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

 

17:43 - March 6, 2016

హైదరాబాద్ : చెదురు ముదురు ఘటనలు మినహా ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌, అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్‌లో 57 శాతం, ఖమ్మంలో 67 శాతం, అచ్చంపేటలో 71 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ నెల 9 వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 15న ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అచ్చంపేట మున్సిపాలిటీకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 
వరంగల్ 
గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 58 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో పోలింగ్‌ కూల్‌గా ముగిసింది. 3360 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం పోలింగ్‌ కాస్త మందకొడిగా మొదలైనా సాయంత్రం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. 
టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం : విపక్షాలు
మరోవైపు గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపించాయి. చాలా డివిజన్లలో ఓట్లు గల్లంతు కావడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి కీర్తి కిరణ్‌ ఓటు గల్లంతైంది. 24వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి ఓడపల్లి సరళ గుర్తును సుత్తె కొడవలి నక్షత్రానికి బదులుగా కంకి కొడవళిగా అధికారులు ప్రదర్శించారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అటు 15వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థి శారదా జోషి భర్త సురేష్‌ జోషిని అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మునవరున్నీసా భర్త సాధిక్‌ దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 
వరంగల్‌ పశ్చిమలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓటు వేసి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆదర్శ్‌ కోటోలో ఉన్న హిజ్రాలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా వరంగల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను ఏనుమాముల మార్కెట్‌ యార్డ్‌కు తరలించారు. 
ఖమ్మంలో
అటు ఖమ్మంలోనూ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని ఇతర పార్టీలు ఆరోపించాయి. 11వ డివిజన్‌లో పువ్వాడ జయశ్రీకి మమతా మెడికల్‌ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు ఓట్లు వేస్తుండగా స్థానికులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అలాగే ఇందిరానగర్‌లో 720 నకిలీ ఓటరు ఐడీ కార్డులు బయట పడటం కలకలం రేగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నకిలీ ఓటర్‌ కార్డులతో దొంగ ఓట్లు వేశారని వైసీపీ, టీడీపీ, సీపీఎం ఆరోపించాయి. 
అచ్చంపేటలో 
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 వార్డులకు గాను 20 బూతులను ఏర్పాటు చేశారు. ఉదయం పోలింగ్‌ మందకొడిగా ఉన్నా.. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు సైతం ఓటు కోసం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  
ఈ నెల 9 వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 15న ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అచ్చంపేట మున్సిపాలిటీకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 

 

ముగిసిన ఖమ్మం, వరంగల్, అచ్చంపేట ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్, అచ్చంపేటలో పోలింగ్ ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి అధికారులు 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 4 గంటల వరకు ఖమ్మంలో 67, వరంగల్  లో 57, అచ్చంపేటలో 69.7 శాతం పోలింగ్ నమోదు అయింది.

ఖమ్మం 11, 31వ డివిజన్ లో దొంగ ఓట్లు

ఖమ్మం : నగరంలోని 11, 31 వ డివిజన్ లలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. 11 వ డివిజన్ లో మమత మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినిలు దొంగ ఓట్లు వేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 31వ డివిజన్ లో దొంగ ఓటు వేస్తున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఉదయం ఇందిరాగనర్ లో టీఆర్ ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. మొత్తంగా ఖమ్మంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగడాలు మితిమీరుతున్నాయని పలువురు అంటున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

16:51 - March 6, 2016

ఖమ్మం : నగరంలోని 11, 31 వ డివిజన్ లలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. 11 వ డివిజన్ లో మమత మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినిలు దొంగ ఓట్లు వేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 31వ డివిజన్ లో దొంగ ఓటు వేస్తున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఉదయం ఇందిరాగనర్ లో టీఆర్ ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. మొత్తంగా ఖమ్మంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగడాలు మితిమీరుతున్నాయని పలువురు అంటున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

16:40 - March 6, 2016

వరంగల్ : వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని నగర సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తున్నామని చెప్పారు. 15 వ డిజిజన్ లో చోటుచేసుకున్న వివాదం చిన్నదే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

 

వరంగల్ లో మ.3 గం.ల వరకు 47.05 శాతం పోలింగ్

వరంగల్ : జీడబ్ల్యుఎంసీ ఎన్నికల పోలంగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు వరకు 47.05 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. మొత్తం 22 అంశాలపై సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

 

16:11 - March 6, 2016

రంగారెడ్డి : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ ను తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ ఇంటికి బంజారా హిల్స్ పోలీసులు తరలించారు. కాపేపట్లో సుశీల్ ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. అనంతరం సుశీల్ ను రిమాండ్ కు తరలించనున్నారు. ఉదయం ఏడు గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో సుశీల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళను వేధించాడని సుశీల్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. 

15:55 - March 6, 2016

హైదరాబాద్ : అమ‌రావ‌తి భూముల వ్యవహారంలో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గలేద‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజ‌ధానితో పాటు ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని జగన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ మంచిత‌నాన్ని చేత‌గాని త‌నంగా భావించొద్దని.. అమ‌రావ‌తి భూముల‌పై దుష్పచారం చేసిన వారిపై చ‌ట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. 
రాజ‌ధాని భూముల వ్యవహారం కథనాలపై చంద్రబాబు ఫైర్‌ 
ఏపీ రాజధాని అమ‌రావ‌తి భూముల వ్యవహారంపై మీడియాలో వ‌చ్చిన క‌థనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. రాజ‌ధాని భూముల‌లో ఎలాంటి కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని తేల్చి చెప్పారు. తాము చేస్తున్న అభివృద్దిని తొలి నుంచి కొంతమంది అడ్డుకునే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యత‌లు స్వీక‌రించిన జూన్ 2, 2014 నుంచి రాజ‌ధాని ప్రక‌టించిన 2014, సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు 604 లావాదేవీల్లో 515 ఎకరాల భూముల క్రయ‌ విక్రయాలు జ‌రిగాయ‌ని సీఎం వివ‌రించారు. మొత్తం అమ‌రావ‌తి ప్రాంతంలో 20,306 లావాదేవీల్లో 6,573 ఎకరాల క్రయ, విక్రయాలు జ‌రిగాయ‌ని సీఎం గణాంకాల‌తో విశ్లేషించారు. 
అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం 
దోన‌కొండ ప్రాంతంలో త‌న కుంటుంబానికి ఆస్తులున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. గ‌త 6 సంవ‌త్సరాలుగా కేవ‌లం త‌మ కుటుంబం మాత్రమే ఆస్తుల ప్రకటన చేస్తున్నామ‌ని..ఇంతవరకు ఏ రాజ‌కీయ నేత అయినా చేశాడా అని ప్రశ్నించారు. అలాగే లోకేష్‌కు హాయ్‌లాండ్‌లో వాటా ఉంద‌ని రాయ‌టం సరి కాద‌న్నారు. అటాచ్‌లో ఉన్న ఆస్తుల‌ను..యాక్షన్‌ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నార‌న్నారు సీఎం. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయ‌ణ తమ‌కు బినామీలు ఉన్నట్లు నిరూపిస్తే..వారికే రాసిస్తామంటూ చెప్పార‌ని గుర్తు చేసారు. ప‌య్యావుల కేశవ్‌, దూళిపాళ్ల న‌రేంద్ర తాము కొనుక్కున్నామని స్పష్టం చేశారాన్నారు. 
దోనకొండ ప్రాంతంలో నాకు ఆస్తులు లేవు 
గ‌తంలో ఇడుపులపాయ భూముల‌ను ఆక్రమించుకొని 614 ఎక‌రాల భూమిని త‌ర్వాత చ‌ట్టం మార్పుతో నేరాన్ని అధిగ‌మించార‌ని సీఎం అన్నారు. అసైన్డ్ భూములు నోటిఫికేష‌న్ ముందు ఎవ‌రి పేరుతో ఉన్నాయో వారికే చెల్లుతాయ‌ని సీఎం స్పష్టం చేసారు. అభివృద్దికి అడ్డుప‌డితే ఉపేక్షించేది లేదన్నారు. కాపు ఉద్యమం, వర్గీక‌ర‌ణ వెనుక ఎవ‌రున్నారో  తెలుస‌న్నారు. జగ‌న్ మీడియా అటాచ్ లో ఉంద‌ని..అది ప్రజల ఆస్తుల‌ని..అవి ప్రజలకే  చెందేలా కేంద్రానికి లేఖ రాస్తున్నామ‌న్నారు సీఎం చంద్రబాబు. అయితే అమ‌రావ‌తి భూముల వ్యవహారంపై సీఎం చంద్రబాబు చెప్పిన అంశాల‌పై ప్రతిపక్ష వైసీపీ ఏరకంగా స్పందిస్తుందో చూడాలి. 

తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ ఎదుట సుశీల్ హాజరు

రంగారెడ్డి : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ ను తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మహిళను వేధించాడని సుశీల్ పై కేసు నమోదు అయింది. 

 

మైనింగ్ మాఫియా అరాచకం

గ్వాలియర్ : మైనింగ్ మాఫియా అరాచకానికి పాల్పడింది. అటవీశాఖ కానిస్టేబుల్ ను హత్య చేశారు. అక్రమ మైనింగ్ పై దాడుల నేపథ్యంలో ఘటన చోటుచేసుకుంది.

 

చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్

చత్తీస్ ఘడ్ : నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రోడ్డు పనులు చేస్తున్న ఇద్దరు గ్రామస్తులు మృతి చెందారు. 

 

వరంగల్ 24 వ డివిజన్ లో అధికారుల నిర్వాకం

వరంగల్ : నగరంలోని 24 వ డివిజన్ లో బోర్డుపై సీపీఎం పార్టీ అభ్యర్థి గుర్తును అధికారులు తప్పుగా పెట్టారు. సీపీఎం గుర్తుకు బదులుగా కంకి కొడవలి గుర్తు పెట్టారు. సీపీఎం నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. 

 

అచ్చంపేటలో మ.3 గం.వరకు 66.4 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ : అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 66.4 శాతం పోలింగ్ నమోదు అయింది. 

15:16 - March 6, 2016

వరంగల్ : పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మంత్రి కడియం శ్రీహరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన్ టెన్ టివితో మాట్లాడారు. 58 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కడియం ధీమా వ్యక్తం చేశారు. రానున్న మూడేళ్లలో వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ అభివృద్ధికి అని విధాలా కృషి చేస్తామన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

 

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో  ప్రారంభం కానుంది. సీఎం అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. బడ్జెటల్ పై చర్చించి.. మంత్రివర్గం దానికి తుది రూపం ఇవ్వనుంది. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టు డిజైన్లపై చర్చించనున్నారు. అజెండాలో విదేశీవిశ్వవిద్యాలయాల బిల్లు, కొత్త గనుల విధానం ఉన్నాయి. ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 

 

14:57 - March 6, 2016

హైదరాబాద్ : సుశీల్‌ కేసును మంత్రి రావెల వక్రీకరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఆయన కుమారుడు తప్పు చేస్తే.. జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సుశీల్‌ను ఇరికించాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు కల్పన. రావెల కిషోర్‌బాబు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

14:53 - March 6, 2016

హైదరాబాద్ : రావెల సుశీల్ కుమార్ మహిళను వేధించిన కేసులో పూర్వాపరాలు పరిశీలించామని.. కారు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు దిగా కారును గుర్తించామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు . ఐపీసీ 354 , 509  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు డీసీపీ. కారులోని వారిపై కేసులు నమోదు చేశామని..ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని యువతి ఫిర్యాదు మేరకే  డ్రైవర్ పై, రావెల సుశీల్ పై కేసులు నమోదు చేశామని డీసీపీ అన్నారు. కేసు పై పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని..నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని వెస్ట్ జోన్ డీసీపీ అన్నారు.

 

పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ ఎస్ నేతల ప్రచారం...

వరంగల్ : జిల్లాలోని 13, 14 డివిజన్ లలో పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. 

డ్రగ్స్ వాడుతున్న వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జర్నలిస్టు కాలనీ ప్రాంతంలో డ్రగ్స్ వాడుతున్న వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు అమ్మాయిలు పారిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుల వద్ద నుంచి రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తున్నారు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి శోభ

కరీంనగర్ : జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంకు శివరాత్రి శోభ సంతరించుకుంది. వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో మంగళవారం వరకు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, రేపటి శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

 

బీబీ నగర్ నిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

నల్గొండ  : జిల్లా భువనగిరి మండలం రంగాపూర్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓపీ సేవలను ప్రారంభించారు. దశల వారీగా సేవలను విస్తృత పరుస్తామని, వచ్చే బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి పూర్తిస్థాయి సేవలందిస్తామని హామీనిచ్చారు.

మహిళా సదస్సులో పాల్గొన్న మోడీ..

ఢిల్లీ : రెండో మహిళా సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మహిళలు తమలోని శక్తిని గుర్తించాలని, దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలు రాజకీయంగా అభివృద్ధి సాధించారని, సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని తెలిపారు. భిన్నరంగాల్లో మహిళలు, శక్తి, సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని పేర్కొన్నారు. 

దోషి అని తేలితే సుశీల్ కు శిక్ష తప్పదు - ఎంపీ కవిత..

న్యూఢిల్లీ: ఏపీ మంత్రి రావెల తనయుడు సుశీల్ దోషి అని తేలితే శిక్ష తప్పదని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 

13:49 - March 6, 2016

ఉన్నత చదువలంటూ ఊదరగొడుతుంటారు. ప్రచార ఆర్భాటాలతో తెగబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. డోనేషన్ల పేరిట ప్రారంభమయ్యే దోపిడికి అంతు లేకుండా పోతోంది. చదువుకోవాలన్న తాపత్రయం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో పేద విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అరబింద జుటా (ఛైర్ పర్సన్ జేఎసీ ఎస్ఎఫ్ఆర్), శివ మకుటం (అధికార ప్రతినిధి హెచ్ఎస్ పీఏ), గుండర్తి శారద (వైస్ ఛైర్ పర్సన్ జేఏసీ ఎస్ఎఫ్ఆర్), వెంకటసాయి నాథ్ (హెచ్ఎస్ పీఏ ప్రతినిధి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

పురపాలక ఎన్నికలు..పోలింగ్ శాతం..

హైదరాబాద్ : వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ లోని అచ్చంపేటలో మధ్యాహ్నం ఒంటి గంటకు 57.5 శాతం నమోదైంది. ఖమ్మంలో 47.33 శాతం పోలింగ్ నమోదైంది. 

తప్పుడు ప్రచారం చేస్తున్నారు - చంద్రబాబు..

విజయవాడ : పత్రిక మాధ్యమంగా తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో భూములను కొనుగోలు చేసిన మంత్రులు వాటిని వెనక్కి రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బాబు వెల్లడించారు. 

ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాలి - సీపీఐ..

అనంతపురం : ప్రత్యేక హోదాపై రాజమహేంద్రవరంలో సభలో సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. మోడీ, అమీత్ షా హిందూ తాలిబన్లలా ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు దృష్టంతా రాజధానిపై ఉందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. 

వరంగల్ ఎన్నికలు..టీఆర్ఎస్ అభ్యర్థి దాడి..

వరంగల్ : 44వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ పై టీఆర్ఎస్ అభ్యర్థి అనుశెట్టి మురళి అనుచరులు దాడికి పాల్పడ్డారు. 

సుశీల్ పై విచారణ జరుగుతోంది - డీసీపీ..

హైదరాబాద్ : మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్ కుమార్ పై విచారణ కొనసాగుతోందని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఘటనా సమయంలో సుశీల్ కారులోనే ఉన్నారని, సుశీల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకంగానే దర్యాప్తు కొనసాగుతుందని, సుశీల్ కుమార్ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రావెల సుశీల్ కుమార్, డ్రైవర్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. చేతిపై టాటూ వేసుకున్న వ్యక్తి చేయిపట్టి లాగాడని మహిళ ఫిర్యాదు చేసిందని, గత రాత్రి నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని డీసీపీ తెలిపారు. నిందితులపై నిర్భయ కేసు, సెక్షన్ 354 పెట్టడం జరిగిందన్నారు.

13:07 - March 6, 2016

కథ కంచికి అనే కాలం పోయింది. ఇవాళ కథలు ఇంటిల్లిపాది చదవాల్సిన అవసరం వచ్చింది. పిల్లలు పెద్దలు విధిగా కథలు చదివి తీరాలంటుంది కన్నెగంటి అనసూయ. సున్నితమైన భావాలను, అంతులేని అనుభూతులను తన కథల్లో పలికించే కన్నెగంటి అనసూయ... మనసులను కదిలించే కథలు రాస్తున్నారు. పాఠకుల మనసులు చూరగొంటున్నారు. మానవ సమూహాల మానసిక కల్లోలాలను, అనుభవాలను, ఆవేదనలను, అనుభూతులను అక్షరాల్లోకి వొంపి తెలుగు కథా పూతోటలో అద్భుత కథా సుమాలు పూయిస్తున్న ప్రముఖ కథా రచయిత్రి కన్నెగంటి అనసూయపై ప్రత్యేక కథనం. ఆమె గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:06 - March 6, 2016

నాకు సముద్ర సయ్యాటలు తెలియవు.. ఇసుకలో రాసుకున్న ప్రేమ గుర్తులు లేవు... అంటూ కవిత్వం వినిపిస్తున్నారు అదిలాబాద్ జిల్లాకు చెందిన డా. ఉదారి నారాయణ. వస్తు శిల్పవైవిధ్యంతో సరికొత్త అభివ్యక్తితో గుండెల్లోకి సూటిగా దూసుకెళ్ళే తూటాల్లాంటి కవితలు రాస్తున్న ఉదారి నారాయణ పరిచయ కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:02 - March 6, 2016

అక్షరాలు కొందరికి వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు.. అక్షరాలు కొందరికి పచ్చని తోటల్లో ఎగిరే సీతాకోక చిలుకలు కావచ్చు.. కాని నేటి కవులకు... రచయితలకు మాత్రం అక్షరాలు అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షాఫలాలు . అందుకే ..నేడు కవులు కథారచయితలు బరువైన గుండెలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఎనబయ్యవ దశకంలో దళిత కవిత్వం ఒక ఉప్పెనలా ఎగసిపడింది. ఒక ప్రభంజనంలా పెనుదుమారం రేపింది. అగ్రవర్ణ సాహిత్యంపై తన ధర్మాగ్రహం ప్రకటించింది. ఉగ్రరూపం చూపింది. మనువాద మదగజం పీచమణిచింది. నాల్గు పడగల హైందవ నాగరాజును నేలరాచింది. ఈ నేపథ్యంలో జి.వి.రత్నాకర్ లాంటి ఎందరో దళిత కవులు పుట్టుకొచ్చారు. తన పదునైన భాషతో, అద్భుత అభివ్యక్తితో, ధర్మాగ్రహంతో దళిత బహుజన కవిత్వం రాస్తున్న జి.వి.రత్నాకర్ కవిత్వంపై ప్రత్యేక కథనం. విశ్లేషణ కోసం వీడియో చూడండి.

36వ డివిజన్ లో పోలీసుల లాఠీఛార్జ్..

వరంగల్ : 36వ డివిజన్ లో గుంపులుగా ఉన్న ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులకు..ఓటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

వరంగల్ లో ఓటు వేసిన హిజ్రాలు..

వరంగల్ : గ్రేటర్ ఎన్నికల్లో నగరానికి చెందిన 400 మంది హిజ్రాలు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే పోటీ చేయడానికి సిద్ధమని హిజ్రా నాయకురాలు వెల్లడించింది. 

బీబీనగర్ నిమ్స్ లో ఓపీ సేవలు ప్రారంభం..

నల్గొండ : జిల్లా భువనగిరి మండలం రంగాపూర్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓపీ సేవలను ప్రారంభించారు. దశల వారీగా సేవలను విస్తృత పరుస్తామని, వచ్చే బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి పూర్తిస్థాయి సేవలందిస్తామని హామీనిచ్చారు.

ఢిల్లీ బయలుదేరిన ఉప రాష్ట్రపతి..

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు రోజుల నగర పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నగర మేయర్ రామ్మోహన్ తదితరులు వీడ్కోలు పలికారు. 

12:40 - March 6, 2016

ఖమ్మం : 22వ డివిజన్ లో ఇందిరానగర్ లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి పద్మజ డిమాండ్ చేశారు. ఇందిరానగర్ బూతు ఒక కిరాణ షాపులో 720 నకిలీ ఐడీలను స్థానికులు గుర్తించారు. స్థానిక ఆర్డీఓ ఐడీలను తీసుకెళ్లడం జరిగింది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టిడిపి బాగా పట్టు ఉందని ప్రచారం, పోటీ మొత్తం టిడిపి - వైసీపీ మధ్య ఉంటుందని ప్రచారం జరిగింది.

రీ పోలింగ్ నిర్వహించాలి..
ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన ఒక్క గంటలోనే 500 మంది అభ్యర్థులు ఒక్కసారిగా రావడం జరిగిందన్నారు. బయటకు రాగానే కారుకు ఓటు వేశామని చెబుతుండడంతో అనుమానం కలిగిందన్నారు. వెంటనే నలుగురు వ్యక్తులతో నిఘా పెట్టడం జరిగిందని, అనంతరం నకిలీ ఐడీలను గుర్తించడం జరిగిందన్నారు. ఎవరికి సంబంధం ఉందో పోలీసు విచారణలో తేలుతుందని, 22వ డివిజన్ లో సతీష్, తనకు మధ్య పోటీ ఉందని ప్రచారం జరిగిందన్నారు. 22వ డివిజన్ పోలింగ్ రద్దు చేసి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

12:35 - March 6, 2016

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో పలు పోలింగ్ బూత్ లలో నకిలీ ఐడీతో ఓట్లు వేస్తున్నారని ఎన్నికల అధికారులకు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దాదాపు 200 మందికి పైగా నకిలీ ఓటరు కార్డులతో ఓటు వేశారని ఫిర్యాదు చేశారు. వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేవిగా ఉన్నాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారి పేర్లమీద నకిలీ ఓటర్‌ ఐడీలు సృష్టించడం వెనుక మున్సిపల్‌ అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. దొంగ ఓటు వేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు.

అప్రజాస్వామికం - సండ్ర..
ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పక్షం టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పోకడలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఇందిరానగర్‌ పోలింగ్‌ బూత్‌లో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, దొంగ ఓట్లు ప్రింట్ వేసి రీ పోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. 

12:28 - March 6, 2016

పశ్చిమగోదావరి : ప్రేమోన్మాదుల దాడిలో బలైన ఇంటర్ విద్యార్థి ఇందుమతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించారు. ఏలూరు ఆసుపత్రి వద్ద బంధువులు..ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో మృతురాలి బంధువు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తమకు న్యాయం చేయాలని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆదివారం ఉదయం ఆందోళన చేశారు. బాధితురాలు స్పష్టంగా పేర్కొన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని మృతురాలి బాబాయి సుబ్బారావు పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదా అని నిలదీశారు. మాట్లాడుతూ మీడియా మైక్ కు చెందిన వైర్ తో ఉరి వేసుకొనే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన మీడియా..ఇతరులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది. మరోవైపు మంత్రి పీతల సుజాత, మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిలను బంధువులు నిలదీశారు.
ప్రేమించలేదన్న కారణంతో ఏలూరు గ్రామీణ మండలం చాటపర్రులో పైడాల ఇందుమతి (17)పై కొంతమంది కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం తీవ్రగాయాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. 

రాజధానిపై రాజకీయం తగదు - చంద్రబాబు..

విజయవాడ : రాజధానిపై రాజకీయం చేయడం తగదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వేలాది మంది రైతులు రాజధాని కోసం భూములిచ్చారని తెలిపారు. 

సంజయ్ జైన్ మృతి కేసులో ఐదుగురు అరెస్టు..

హైదరాబాద్ : స్వప్నలోక్ కాంపెక్ల్సు వద్ద సంజయ్ జైన్ ను దారుణంగా హతమార్చిన చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4వ తేదీన ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. 

11:52 - March 6, 2016

వెంకట్ మారోజు...పల్లె ప్రాంతంలో పుట్టి మధ్యతరగతి కుటుంబం నుండి పైకి వచ్చి తన మేథో శక్తితో ఉన్నత చదువులను అభ్యసించి యూఎస్ లో టాప్ యూనివర్సిటీ అయిన ఎంఐటీ వర్సిటీలో సీటు సాధించి ఓ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తూనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో సన్న, చిన్న కారు రైతులకు ఉపయోగపడే విధంగా సాప్ట్ వేర్ ను డెవలప్ మెంట్ చేసి తనవంతుగా సమాజానికి సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి 'అంతరంగం'లో ఆయన తన అనుభవాలను వెల్లడించారు. జనగాం నుండి ఇంజనీరింగ్ సీటు రావడం జరిగిందని, దీనివల్ల ఉస్మానియాలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. మా లాంటి వాళ్లు ఉస్మానియాలో చదువు కోవడం బాధేస్తుండేదన్నారు. ఇంకా ఎలాంటి విశేషాలు..అనుభవాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

గుజరాత్ పోలీసులు అలర్ట్ - హోం మంత్రి..

గుజరాత్ : రాష్ట్ర పోలీసులు అలర్ట్ గా ఉన్నారని హోం మంత్రి రజిని పటేల్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తమకు నిఘా వర్గాలు హెచ్చరించడం జరిగిందని, ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయని ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

పోలింగ్ శాతం..

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట పంచాయతీకి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు వరంగల్ కార్పొరేషన్ కు 22.60 శాతం..ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 25 శాతం..అచ్చంపేటలో 41.4 శాతం పోలింగ్ నమోదైంది.  

ఖమ్మం 22వ డివిజన్ పోలింగ్ లో స్వల్ప ఉద్రిక్తత..

ఖమ్మం : 22వ డివిజన్ ఇందిరానగర్ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటర్ ఐడీలతో అధికార పార్టీ అభ్యర్థి ఓట్లు వేయిస్తుండడంపై అఖిలపక్షాలు రోడ్డుపై బైఠాయించింది. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టిడిపి నేత సండ్ర పేర్కొన్నారు. స్థానికంగా లేని వారి ఓట్లు సైతం రిగ్గింగ్ చేస్తున్నారని, 22వ డివిజన్ లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎంపీ పొంగులేటి పేర్కొన్నారు. 

బోర్డు తిప్పేసిన వైవీఆర్ ఫైనాన్స్ సంస్థ..

శ్రీకాకుళం : కొత్తూరు ఏజెన్సీ ప్రాంతంలో వైవీఆర్ ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశలు చూపి రూ. కోటి వసూలు చేసి సంస్థ ఉడాయించింది. 

ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత..

పశ్చిమగోదావరి : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుమతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బంధువులు..విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందుమతి బంధువు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

అహ్మదాబాద్ లో భద్రత కట్టుదిట్టం...

గుజరాత్ : అహ్మదాబాద్ లో భధ్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్టు వద్ద సాయుధ బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఉగ్రవాదులు గుజరాత్ లో ప్రవేశించినట్లు ఐబీ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. 

11:05 - March 6, 2016

ఆయిల్‌ పుల్లింగ్‌ వల్ల శరీరంలోని బ్యాక్టీరియా పోయి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరంలో టాక్సిన్స్ పెరిగితే తలనొప్పి వస్తుంది. క్రమేణా అది మైగ్రేన్‌ నొప్పికి దారి తీస్తుంది. అటువంటి వారు ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల టాక్సిన్స్ తగ్గి తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
పళ్లు పసుపు పచ్చగా ఉన్నవారు రోజూ క్రమం తప్పక ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారి నిగారింపును సంతరించుకుంటాయి.
ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా నాశనమై నోరు శుభ్రపడటమే గాక నోటి ద్వారా శరీరానికి వ్యాపించే విష పదార్థాలు బయటకు పోతాయి.
ఎంత బ్రష్‌ చేసినా కొంతమంది నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతుంటారు. అటువంటి వారు క్రమం తప్పక ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుముఖం పడుతుందని డెంటిస్టులు అంటున్నారు.
దంత క్షయం, చిగుళ్ళ నుండి వచ్చే రక్తస్రావం, పెదవులు, నోరు పొడిబారటం వంటి సమస్యలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.

11:01 - March 6, 2016

పరీక్షలు దగ్గరకొచ్చాయి. బాగా రాయాలంటే రాయగలగనే విశ్వాసం ఉండాలి. దానికి మంచి ప్రిపరేషన్‌కు మించిన మార్గం లేదు. కాని ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. పుస్తకాలు ముందేసుకొని తెగ చదివేయాలని తటాలు పడుతుంటారు. దీని వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే గదిలో లైటు కాంతి కాగితం మీద పడకుండా చూసుకోవాలి. దానికి కాస్త దూరంగానే కూర్చొని చదవాలి.
అలాగే, పగటిపూట చదువుకొనేటప్పుడు కిటికీలకు దూరంగా కూర్చోవాలి. కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా తగినంత వెలుతురు వచ్చే ప్రదేశంలో కూర్చొని చదువుకోవాలి. అంతేకాదు, అరుబయట కూర్చొని అస్సలు చదవకూడదు. కారణం సూర్యకిరణాలు కళ్లలోకి పడి కంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి నీడలో చదవడం ఉత్తమం.
కొందరు పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని లేదా గోడకు అనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి సమస్యలు దరిచేరవు. ఏకాగ్రత కుదురుతుంది. ఇంకా, చల్లటి నీళ్లు, మెత్తటి వస్త్రం పక్కన పెట్టుకోవాలి. కళ్లు మంటగా అనిపించిన ప్రతిసారీ ఆ వస్త్రాన్ని నీళ్లలో ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. అంతేకాదు, కీరను గుండ్రంగా తరిగి కూడా కళ్ల మీద పెట్టుకోవచ్చు. ఫలితంగా కళ్లు వాయకుండా ఉంటాయి. చల్లదనం వల్ల కంటి నరాలకు సాంత్వన చేకూరుతుంది. అలసట కూడా దూరమవుతుంది.

10:58 - March 6, 2016

ప్లాప్ ఇచ్చిన ఓ డైరెక్టర్ కి మెగా ఫ్యామిలీ మరో ఛాన్స్ ఇచ్చింది. దర్శకులను ఎంకరేజ్ చేడయంలో మెగా హీరోల స్టైలే వేరు. అందుకే భారీ డిజాస్టర్స్ తరువాత కూడా ఓ డైరెక్టర్ కి పిలిచి ఛాన్స్ ఇవ్వడం విశేషం. ఇంతకీ మెగా ఫ్యామిలీతో మరో మూవీ చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే చదవండి..తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్న కూడా మెగా హీరోలదే అప్పర్ హ్యండ్. మెగా హీరోలకున్న క్రేజ్ తెలుగులో మరో ఫ్యామిలీ హీరోలకి ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే క్రేజ్ ని తలకెక్కించుకోకుండా మెగా హీరోలందరూ ప్రతిభ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో బడా ప్లాప్స్ తో వెనకపడ్డ ఓ ప్లాప్ డైరెక్టర్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

వరుస ఫ్లాపులు...
వరుస ఫ్లాపులతో దర్శకుడిగా శ్రీను వైట్ల బాగా డల్ అయ్యాడు. ఆగడు డిజాస్టర్ మరిచిపోకముందే ఈ దర్శకుడు గత ఎడాది బ్రూస్ లీ మూవీతో మరోసారి తీవ్రనిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో ఏ హీరో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీనే ఈ దర్శకుడిగా మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ ఫిక్స్ అయింది. బ్రూస్ తాలుకూ చేదు అనుభవం మనస్సులో పెట్టుకోకుండా మెగా ఫ్యామిలీ శ్రీనువైట్ల చేతిలో వరుణ్ మూవీని పెట్టడం విశేషం. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న స్టార్ట్ చేయాలని మెగా కాంపౌండ్ డిసైడ్ అయిందట. కంచె సినిమాతో ప్రశంసలు అందుకున్న వరుణ్ తేజ లోఫర్ తో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరోకి కూడా అర్జెంట్ గా భారీ కమర్షయల్ సక్సెస్ కావాలి. ఇలాంటి సందర్భంలో మెగా ఫ్యామిలీ డేర్ చేసి శ్రీనువైట్లకి దర్శకత్వం అప్పగించారు. మరి శ్రీనువైట్ల మెగా ఫ్యామిలీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈసారి భారీ హిట్టు కొడుతాడా చూడాలి.

కన్హయ్య వ్యాఖ్యలు తప్పు - జాహ్నవి బెహల్..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య చేసిన వ్యాఖ్యలు తప్పవని విద్యార్థిని జాహ్నవి బెహల్ పేర్కొంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో పాల్గొన్నందుకు గాను జాహ్నవి.. రిపబ్లిక్ డే రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకుంది. ఎన్ జీవో రక్షా జ్యోతి ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఇటీవలే దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్ జెఎన్ యూలో ప్రసంగించని సంగతి తెలిసిందే. దీనిపై జాహ్నవి ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడింది. మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలన్నీ తప్పని, ఆమోదనీయం కాదని తెలిపారు. భావా ప్రకటన స్వేచ్ఛపై తాను చర్చకు సిద్ధమని వెల్లడించింది. 

కోల్ కతా ఎయిర్ పోర్టుకు బెదిరింపు మెయిల్..

కోల్ కతా : ఎయిర్ పోర్టు మేనేజర్ కు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

గుజరాత్ కు ఐబీ హెచ్చరికలు..

గుజరాత్ : రాష్ట్రానికి ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పది మంది ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హన్మకొండ సెయింట్ థామస్ స్కూల్ లో మంత్రి కడియం..బొల్లికుంట 5వ డివిజన్ లో ఎంపీ పసునూరి దయాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్ పర్సన్ నాగమల్లిక, అఫ్రోజ్ సమీనాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఖమ్మంలో ఉద్రిక్తత..

ఖమ్మం : డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ 22వ డివిజన్ కు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇందిరానగర్ పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు.

 

రాజధానిపై ప్రతిపక్ష వైఖరిపై రైతుల ఆందోళన..

గుంటూరు : రాజధాని అమరావతిపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న వైఖరిపై రైతులు ఆందోళన చేపట్టారు. తుళ్లూరుకు రాజధానిని దూరం చేసేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 

10:35 - March 6, 2016

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముందా..ఉంటే తనను రాజకీయంగా ఎదుర్కొవాలని ఏపీ మంత్రి రావెల పేర్కొన్నారు. ఇటీవల అమరావతి భూ దందా తెరపైకి రావడం..ముద్రగడ దీక్ష చేస్తానని చెబుతుండడం..టీడీపీ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి రావెల కుమారుడు తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఛానెల్ లో సిసి ఫుటేజ్ లు ప్రదర్శించడంపై మంత్రి రావెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టను భంగం కలిగించడానికి తన కొడుకును పావుగా వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. కావాలంటే తనను విమర్శించవచ్చని..తన శాఖ పనితీరుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన టివి ఛానెల్ లో ఎక్కడో ఫుటేజ్ చూపిస్తున్నారని, చట్ట వ్యవస్థపై పూర్తిగా తనకు నమ్మకం ఉందన్నారు. తన కుమారుడు నిర్ధోషి అని, కానీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.

పార్టీలో ఎందుకు వస్తున్నారంటే..
ఏపీ రాష్ట్రంలో ప్రగతి చూసి వైసీపీ కార్యకర్తలు..నేతలు అందరూ క్యూ కట్టి టిడిపిలో చేరడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. జగన్ నియంతృత్వ ధోరణి, అసమర్థత వైఫల్యం వల్ల విసిగెత్తిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తున్న జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయగలిగిన సమర్థత..సంక్షేమ బాటలో తీసుకెళ్లే సుదీర్ఘమైన అనుభవం సీఎం చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ అభివృద్ధి విషయంలో వైసీపీ అడుగడునా అడ్డుకొంటోందని తెలిపారు. 12 కేసుల్లో ముద్దాయిన జగన్ లక్ష కోట్లు దిగమింగారని ఆరోపించారు. కులాలను రెచ్చగొడుతున్నారని, ముద్రగడ, మందకృష్ణ మాదిగలను రెచ్చగొడుతున్నారని, ఎస్సీ కార్పొరేషన్ ను వైఎస్ మూసివేశారని మంత్రి రావెల తెలిపారు. మంత్రి రావెల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. 

10:21 - March 6, 2016

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 9గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైంది. కాసేపటి క్రితం మంత్రి కడియం శ్రీహరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ లో 15వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థిని శారదా జోషి భర్త భాస్కర జోషిపై అధికార పక్ష అభ్యర్థి దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆరో డివిజన్ తిమ్మాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా గ్రామస్తులు చితకబాదారు.

ఖమ్మంలో..
ఇక ఖమ్మం జిల్లాలో కూడా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 9గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది. ఇందిరానగర్ లో నకిలీ ఐడీ కార్డులను ఉపయోగించి ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై విపక్ష అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 200కి పైగా నకిలీ ఐడీ కార్డులు దొరికినట్లు తెలుస్తోంది. 31వ డివిజన్ పోలింగ్ బూత్ ల వద్ద ప్రచారం నిర్వహిస్తుండడంతో పోలీసులు అధికార పక్షానికి చెందిన వారిని అరెస్టు చేశారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం - సీపీఎం..
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు సాగుతున్నాయని సీపీఎం నేత నున్న టెన్ టివికి తెలిపారు. ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా అధికార పక్షం డబ్బు పంపిణీ చేయడమే కాకుండా బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందిరానగర్ లో 200కి పైగా నకిలీ ఐడెంటిడి కార్డులు దొరికినట్లు తెలిపారు. పోలింగ్ బూత్ లలో విపక్షాలకు చెందిన వారిని పోలీసులు తరిమేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు అచ్చంపేట పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

జగన్ కు మతిభ్రమించింది - రావెల..

హైదరాబాద్: వైసీపీ నేత జగన్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి రావెల వ్యాఖ్యానించారు. టిడిపి పార్టీని భ్రష్టు పట్టించి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, జగన్ నియంతృత్వ ధోరణి, అసమర్థత వైఫల్యం వల్ల విసిగెత్తిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. 

ఖమ్మం ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ - సీపీఎం..

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోందని సీపీఎం నేత నున్న టెన్ టివికి తెలిపారు. ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా డబ్బు పంపిణీ చేయడమే కాకుండా బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందిరానగర్ లో 200కి పైగా నకిలీ ఐడెంటిడి కార్డులు దొరికినట్లు తెలిపారు.

వరంగల్ పోలింగ్..డబ్బుల పంపిణీ..

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఓ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆరో డివిజన్ తిమ్మాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా గ్రామస్తులు చితకబాదారు. 

10:00 - March 6, 2016

నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన' ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం విదితమే. 110 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవం వైపు దూసుకెళ్తున్న ఈ చిత్రం గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,''సంక్రాంతికి విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో 50 రోజులు పూర్తి చేసుకుని మా సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్‌ అయింది. నా అభిమానులంతా ఈ చిత్ర విజయాన్ని చూసి గర్వపడుతున్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా వుంది. ఈ సినిమాలో నాన్నగారి పంచెల్ని, వాచీని వాడాము. నాన్నగారి ఆశీస్సులు కూడా ఉన్నందువలనే ఇంత పెద్ద విజయం లభించిందని నా నమ్మకం. 'మనం' తర్వాత నాకు అన్నివిధాల సంతృప్తి కలిగించిన విజయమిది. హీరోగా, నిర్మాతగా నాకెంతో సంతోషాన్ని అందించింది. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు, నాన్నగారి అభిమానులకు, నా అభిమాను లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలోనే 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ 'బంగార్రాజు' వివరాలు తెలియజేస్తాను' అని అన్నారు. ''దర్శకుడిగా అవకాశమిచ్చిన నాగార్జునగారికి థాంక్స్ చెబుతున్నాను. 'సోగ్గాడే చిన్నినాయనా' అన్నపూర్ణ బ్యానర్‌లో చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. తొలి చిత్రంతోనే నాకింత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. 'సోగ్గాడే చిన్నినాయన'కి సీక్వెల్‌గా చేస్తున్న 'బంగార్రాజు' స్క్రిప్ట్ రెడీ అవుతోంది' అని దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ చెప్పారు.

09:57 - March 6, 2016

పలు రాష్ట్రాలు 'నీరజ' చిత్రానికి పన్ను రద్దు చేయడాన్ని ఓ మంచి సినిమాకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాన'ని అంటోంది సోనమ్‌కపూర్‌. ఆమె ప్రధాన పాత్రధారిణిగా రూపొందిన బయోపిక్‌ 'నీరజ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సమాజానికి స్ఫూర్తినిచ్చే చిత్రంగా పలు రాష్ట్రాలు భావించడంతో ఈ చిత్రానికి పన్ను రద్దు చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ, ఉత్తమ ప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే పన్ను రద్దు చేయగా, తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా పన్నుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిపై సోనమ్‌కపూర్‌ పై విధంగా స్పందించారు. అలాగే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సోనమ్‌తోపాటు చిత్రయూనిట్‌ ధన్యవాదాలు తెలిపింది. 'నీరజ' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కూడా సోనమ్‌ కృతజ్ఞతలు చెప్పారు.

09:55 - March 6, 2016

కపూర్‌ అండ్‌ సన్స్', 'కీ అండ్‌ కా', 'ఫ్యాన్‌' చిత్రాల్లోని 'కర్‌ గీ ఛుల్‌', 'హై హీల్స్..', 'జాబ్రా ఫ్యాన్‌' పాటలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. యూట్యూబ్‌లో కూడా విశేష ప్రేక్షకాదరణ పొంది అత్యధిక వ్యూస్‌ పొందిన పాటలుగా సందడి చేస్తున్నాయి. వీటి సరసన తాజాగా మరో పాట చేరింది. జాన్‌ అబ్రహం, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన చిత్రం 'రాకీ హ్యాండ్సమ్‌'. ఈ చిత్రంలో 'ర్యాకీ హ్యాండ్సమ్.' పాటకు యూ ట్యూబ్‌లో ఇప్పటికే రెండు మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. దీంతో ఈ పాట మోస్ట్ పాపులర్‌ సాంగ్స్ లిస్ట్ లో చేరింది. ఈ విషయం గురించి శ్రుతి మాట్లాడుతూ,'మా చిత్రానికి సంబంధించి పాట ఇంత ఆదరణ పొందినందుకు చాలా ఆనందంగా ఉంది. కంటెంట్‌ పరంగా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది' అని చెప్పారు. బాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు పొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా రీమేక్‌ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

09:52 - March 6, 2016

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌తో ఓ నూతన చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ తెలిపారు. షారూఖ్‌తో మీ కొత్త చిత్రం ఎప్పుడని ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు కరణ్‌ పై విధంగా స్పందించారు. త్వరలోనే షారూఖ్‌తో సినిమా ఉంటుంది. అలాగే షారూఖ్ తో స్నేహం జీవితాంతం కొనసాగుతుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అదే విధంగా 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన 'స్టూటెండ్‌ ఆఫ్‌ ద ఇయర్‌' చిత్రానికి సీక్వెల్‌ తీయానల్న ఆలోచన కూడా ఉన్నట్లు కరణ్‌ తెలిపారు. షారూఖ్‌, కరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌'. ఈ చిత్రంలో షారూఖ్‌ సరసన కాజోల్‌ కథానాయికగా నటించిన సంగతి విదితమే.

09:51 - March 6, 2016

పవన్‌కళ్యాణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రంలోని ఓ పాటను సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌, గాయని శ్రేయాఘోషాల్‌ కలిసి పాడారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా దేవీశ్రీప్రసాద్‌ తెలియజేశారు. అంతేకాకుండా పాట రికార్డింగ్‌ సమయంలో శ్రేయా ఘోషాల్‌తో దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. పాట రికార్డింగ్‌ చాలా బాగా జరిగిందని, శ్రేయా అద్భుతంగా పాడిందని దేవీశ్రీ చెప్పారు. కొత్తగా రికార్డ్ చేసిన పాట వినడానికి మీరంతా ఎదురు చూస్తున్నారా? అంటూ అభిమానుల్ని ఆయన సరదాగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, చిరంజీవి నటించిన 'కొండవీటి రాజా' చిత్రంలోని 'నా కోక బాగుందా..' పాటను రీమిక్స్ చేసి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో వాడనున్నట్లు సమాచారం. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై సంయుక్తంగా శరత్‌మరార్‌, సునీల్‌లుల్లా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఉదయం 9గంటల వరకు పోలింగ్..

హైదరాబాద్ : మహబూబ్ నగర్ అచ్చంపేట నగర పంచాయతి ఎన్నికల్లో ఉదయం 9గంటల వరకు 7.68 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 22 శాతం..వరంగల్ లో 13 శాతం పోలింగ్ నమోదైంది. 

ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

కడప : జిల్లాలో రాజంపేట మండలంలోని రామాపురం తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 

09:38 - March 6, 2016

కర్నూలు : దేశ విద్యావిధానాన్ని అనుకూలంగా మార్చడానికి బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు కుట్ర పన్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. కర్నూలు జిల్లాలో వామపక్షాలు నిర్వహించిన బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన టెన్ టివితో మాట్లాడారు. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పై దేశద్రోహం కేసు పెట్టినా బెయిల్ వచ్చిందని, సాధారణంగా ఈ కేసులో బెయిల్ రాదని స్పష్టం చేశారు. కేంద్రం ఒక గూడుపుఠాణిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఢిల్లీ, బీహార్ తరువాత మూడో పెద్ద అతిపెద్ద దెబ్బ ఇదని తెలిపారు.

 

09:34 - March 6, 2016

కాకినాడ : కాపు ఉద్యమంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో మరోసారి దీక్ష చేయడానికి ముద్రగడ సిద్ధమౌతున్నారు. దీక్షా సమయంలో ప్రభుత్వం పలు హామీలిచ్చి మాట తప్పారని..కేసులను ఎత్తివేస్తామని చెబుతూనే వరుసగా అరెస్టులకు పాల్పడుతున్నారని ముద్రగడ పేర్కొంటున్నారు. ఇదే నా చివరి దీక్ష అని టెన్ టివికి తెలిపారు. ఇచ్చిన హామీ నీరుగార్చడమే కాకుండా వారు మాట తప్పారని మళ్లీ రోడ్డెక్కడానికి అవకాశం కల్పించారని తెలిపారు. రూ. 500 కోట్లు పక్కకు పెట్టేసి రూ. 1000 కోట్లు బడ్జెట్ లో ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. వేలాది అప్లికేషన్ లు వచ్చినా కూడా దీనిని మరిచిపోయారని విమర్శించారు. వైజాగ్ నుండి కొంతమందితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేయించారని, రెండు లక్షల కోట్ల రూపాయల మాట లేవనెత్తవద్దని సూచించడం జరిగిందన్నారు. నోరు మూయించారని పేర్కొన్నారు. కానీ తాను మోసపోయానని, చచ్చే వరకు తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని ముద్రగడ సూచించారు. 

09:28 - March 6, 2016

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేసిన అల్టిమేటంపై అధికార పక్షానికి చెందిన నేతలు స్పందిస్తున్నారు. ముద్రగడపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. ముద్రగడ మళ్లీ దీక్షచేస్తాననడం సరికాదని పేర్కొన్నారు. ముద్రగడకు వైసీపీ ఎంపీ సీటు ఇస్తుందని వార్తలు వస్తున్నాయని, కానీ ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ ఒక పార్టీకి సపోర్టుగా మాట్లాడడం తగదని సూచించారు. జగన్ డైలాగ్ లను ముద్రగడ చెబుతున్నారని, కాపు రిజర్వేషన్ లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు కోసం ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాపు కమిటీ వేయలేదా ? నిధులు విడుదల చేయలేదా ? అని ప్రశ్నించారు. ఎవరు వెనుక నిలబడి నడిపిస్తున్నారని, కీలుబొమ్మ కావద్దని సూచించారు. పది మంది కాపులతో మాట్లాడి ముందుకు రావాలని సూచించారు. కాపు రిజర్వేషన్ కల ఫలించబోతోందని దీనిని చెడగొట్టవద్దని మంత్రి నారాయణ తెలిపారు. 

09:23 - March 6, 2016

వరంగల్: ఖమ్మం..వరంగల్ జిల్లాల కార్పొరేషన్ లకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వరంగల్ లో 58 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో 398 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. ఖమ్మంలో 50 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ లోని 15వ డివిజన్ లో కొంత అలజడి చెలరేగింది. టీఆర్ఎస్ అభ్యర్థిని ఉన్నీసా భర్త సాదిక్ స్వతంత్ర అభ్యర్థిని భర్త అశోక్ పై దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే 31 డివిజన్ కు సంబంధించిన పోలింగ్ బూత్ లో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన ఓ ఏజెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సీపీఎం అభ్యర్థి తమ్మినేని వెంకటేశ్వరరావుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇలాంటి ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

09:05 - March 6, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కిశోర్ కుమార్ తనయుడు సుశీల్, డ్రైవర్ లకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో వీరిద్దరినీ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రావెల సుశీల్‌ బంజారాహిల్స్ పీఎస్‌లో శనివారం అర్ధరాత్రి లొంగిపోయాడు. సుశీల్‌ సహా అతని డ్రైవర్‌ కూడా పోలీసులు ఎదుట లొంగిపోయాడు. రెండు రోజుల క్రితం ఓ మహిళను వేధించిన కేసులో రావెల్‌ సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సుశీల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే స్టేషన్‌ బెయిల్‌ కోసం రావెల సుశీల తరపు లాయర్‌ ప్రయత్నించారు. అయితే స్టేషన్‌ బెయిల్‌ను పోలీసులు నిరాకరించడంతో చేసేది లేక పోలీసులు ఎదుట లొంగిపోయాడు. జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

స్వతంత్ర అభ్యర్థిని భర్తపై టీఆర్ఎస్ అభ్యర్థిని భర్త దాడి..

వరంగల్ : 15వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థిని భర్తపై టీఆర్ఎస్ అభ్యర్థిని భర్త దాడికి పాల్పడ్డాడు. 

కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం - మంత్రి నారాయణ..

విజయవాడ : కాపు రిజర్వేషన్లుకు కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఐదేళ్లలో కాపులకు రూ.5వేల కోట్లు ఇస్తున్నట్లు, జగన్ డైలాగులనే ముద్రగడ చెబుతున్నారని తెలిపారు. కాపులు తలదించుకొనేలా ముద్రగడ వ్యాఖ్యలున్నాయని పేర్కొన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు ఉందని, మూడు నిమిషాల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న వారు దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ విసిరారు. 

08:19 - March 6, 2016

వరంగల్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 2010 తరువాత వాటికి ఎనిన్కలు జరగడం ఇదే ప్రథమం. అచ్చంపేటలో మినహా మిగిలిన రెండింటిలో ప్రతిపక్షాలు వేర్వేరుగా బరిలో దిగాయి. వరంగల్ లో 58 డివిజన్లు, ఖమ్మంలో 50, అచ్చంపేటలో 20 వార్డుల్లో మొత్తం 746 మంది అభ్యర్థులున్నారు. 9,28,422 మంది ఓటర్లు ఓటు వినియోగించుకోనున్నారు. పింగళి డిగ్రి కాలేజీలో 51 డివిజన్ కు సంబంధించిన ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు జగరకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వరంగల్ లోని 58 డివిజన్లలో 398 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 660 పోలింగ్ కేంద్రాల్లో 1011 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం 6లక్షల 44 వేల 980 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 15 జోన్లుగా విభజించారు. 3630 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు.

ఖమ్మంలో..
ఖమ్మం : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లు బారులు తీరారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందిరానరగ్ డివిజన్ లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు టెన్ టివితో మాట్లాడారు. ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, ఏదైనా ఇబ్బందులు కలిగితే సంబంధిత పోలీసులకు తెలియచేయాలని సూచించారు.
ఖమ్మంలో 50 డివిజన్ లలో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 265 మంది బరిలో ఉన్నారు. 3 నుంచి 4 వేల మంది పోలింగ్ సబ్బంది పాల్గోననున్నారు. మొత్తం 2 లక్షల 65 వేల 700 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఉస్మానియాలో మంత్రి రావెల తనయుడు సుశీల్..

హైదరాబాద్ : ఓ మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు సుశీల్, కారు డ్రైవర్ లు బంజారాహిల్స్ పీఎస్ లో లొంగిపోయారు. కాసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. 

మొరాయించిన ఈవీఎంలు..

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోంది. 13,26 డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సిబ్బంది యంత్రాలను ఆన్ చేసేందుకు ప్రయత్నించినా ఆన్ లేదు. దీనితో ఆ డివిజన్ లో పోలింగ్ ప్రారంభం కాలేదు. 

08:00 - March 6, 2016

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కాదని..అది టిడిపి పార్టీ అని టిడిపి పార్టీకి చెందిన ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరి మంత్రులుగా ఉన్నారని..అప్పుడు అది టిఆర్ఎస్ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. టెన్ టివిలో 'రచ్చబండ' కార్యక్రమంలో ఆయన పాల్గొని 'మల్లన్న'తో ముచ్చట్లు చెప్పారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా పల్లెల్లో సారా నడుస్తూనే ఉందని తెలిపారు. మూడెకరాలు పంపిణీ సర్కార్ మంచి స్కీంగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజక వర్గంలో 85 మంది రైతులు చనిపోయారని, ఇందుకు తాను రైతు దీక్ష పెట్టడం జరిగిందన్నారు. చనిపోయిన రైతులల్లో 65 మందికి తాము పరిహారం అందించడం జరిగిందని, అయినా సీఎం కేసీఆర్ మనస్సు కరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. పెన్షన్ ఇచ్చే విధానంలో మార్పు రావాలని సూచించారు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఫైనాన్షీయర్ వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం..

విశాఖపట్టణం : అనకాపల్లిలో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక విజయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. 

నల్గొండలో లక్ష్మారెడ్డి..జగదీష్ ల పర్యటన..

నల్గొండ : నేడు జిల్లాలో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డిలు పర్యటించనున్నారు. బీబీనగర్ నిమ్స్ లో ఓపీ సేవలను వారు ప్రారంభించనున్నారు. 

స్మృతి ఇరానికి తప్పిన ప్రమాదం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రమాదం తప్పింది. యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తుండగా ముందు వెళుతున్న పోలీసు వాహనాన్ని స్మృతి కారు ఢీకొంది. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. 

07:28 - March 6, 2016

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. ఓటు వేసిన అనంతరం ఓటరు తన ఓటు వేసిన వారికే పడిన విషయం ధృవీకరణకు వీలుగా 35 పోలింగ్ స్టేషన్ లో ప్రింటర్ సౌలభ్యం కల్పించారు. నయా బజార్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో ప్రింటర్ సౌలభ్యం కల్పించలేదని ఎన్నికల అధికారి టెన్ టివికి తెలిపారు. మాక్ పోలింగ్ 6.30 గంటలకు చేశామని, ఈ కేద్రంలో 800 ఓటర్లున్నారని తెలిపారు.

50 డివిజన్లు..
ఖమ్మంలో 50 డివిజన్ లలో 265పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 265 మంది బరిలో ఉన్నారు. 3 నుంచి 4 వేల మంది పోలింగ్ సబ్బంది పాల్గోననున్నారు. మొత్తం 2 లక్షల 65 వేల 700 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రచార రథాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

07:24 - March 6, 2016

వరంగల్ : జిల్లా కార్పొరేషన్ కు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఐదు గంటలకు ముగియనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతకంటే ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలించనున్నారు. పింగళి కాలేజీలో 6.30గంటలకే స్థానికులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. గతంలో తాము ఇక్కడే ఓటు వేశామని, ప్రస్తుతం ఇక్కడ తమ ఓటు లేదని సిబ్బంది పేర్కొంటున్నారని పలువురు ఓటర్లు పేర్కొన్నారు. ఓటు ఎక్కడ వేయాలో అర్థం కావడం లేదని పలువురు ఓటర్లు పేర్కొంటున్నారు.

398 మంది అభ్యర్థులు..
వరంగల్ లోని 58 డివిజన్లలో 398 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 660 పోలింగ్ కేంద్రాల్లో 1011 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం 6లక్షల 44 వేల 980 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 15 జోన్లుగా విభజించారు. 3630 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. ఒక్కొ పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు అబ్జర్వర్స్ ఉంటారు. భద్రత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 3వేల మంది పోలీసులను వినియోగించుకుంటున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. కొన్ని మద్యం కేసులు నమోదు అయ్యాయి. పోలింగ్ ప్రక్రియలో యువజన సంఘాలు పాల్గొంటున్నారు. 

07:19 - March 6, 2016

మీర్పూర్ : ఆసియా కప్‌ ఆఖరాటకు రంగం సిద్ధమైంది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టుకు ...ఆతిధ్య బంగ్లాదేశ్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. ఓ వైపు టైటిల్‌ ఫైట్‌లోనూ అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో సారి ఆసియాకప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్‌ జట్టు....తొలి టైటిల్‌ కోసం తహతహలాడుతోంది. ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, రహానే ,సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌ , జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం బలోపేతంగా ఉంది.

పటిష్టంగా ధోని సేన..
టాప్‌ ఆర్డర్‌లో కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు జట్టులో 9 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్ మెన్‌ ఉండటం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇక సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ సైతం ఫామ్‌లోకి రావడంతో మిడిలార్డర్‌ మరింత బలపడింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్య, రవీందర్‌ జడేజాతో పాటు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్నందించగల ధోనీ ఉండనే ఉన్నాడు. ఆరంభ ఓవర్లలో పేసర్లు నెహ్రా, బుమ్రా మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆల్‌రౌండ్ పవర్‌తో దుర్బేధ్యంగా కనిపిస్తోన్న ధోనీసేన 6వ సారి ఆసియాకప్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించాలని ధీమాగా ఉంది.

బంగ్లాదేశ్ తక్కువ అంచనా వేస్తే..
మరోవైపు ఆతిధ్య బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే తనకంటే పటిష్టమైన శ్రీలంక, పాకిస్థాన్‌ జట్టును చిత్తు చేసి...ఫైనల్స్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్‌ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఆరంభ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌....ఫైనల్స్‌కు అర్హత సాధించడం గగనమే అనుకున్నారంతా. కానీ అంతర్జాతీయ అనుభవం లేని యూఏఈ జట్టును ఓడించిన బంగ్లాదేశ్‌ జట్టు.....ఆ తర్వాత శ్రీలంక జట్టును చిత్తు చేసి ఫైనల్‌ రేస్‌లో నిలిచింది. ఇక డూ ఆర్‌ డై ఫైట్‌లో పాకిస్థాన్‌ జట్టును సైతం ఓడించిన బంగ్లాదేశ్‌ జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. మష్రఫే మొర్తజా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ జట్టు ప్రస్తుతం సమతూకంగా ఉంది. షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌,తమీమ్‌ఇక్బాల్‌, మహ్మదుల్లా ,మొర్తజా వంటి అనుభవజ్ఞులతో పాటు తస్కిన్‌ అహ్మద్‌, అల్‌అమీన్‌ హోసేన్‌ ,సబ్బీర్‌ రెహ్మాన్‌, సౌమ్య సర్కార్‌ వంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది.

ఇరు జట్ల రికార్డు..
ప్రస్తుత ఫామ్‌, ఇరు జట్ల ట్రాక్‌ రికార్డ్ చూస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకే ఆసియాకప్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయడంలో ఎటువంటి సందేహం లేదు. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాను అధిగమించాలంటే ఆతిధ్య జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే. కానీ బంగ్లాదేశ్‌ జట్టు ధోనీసేనను ఓడించాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అలా అని బంగ్లా టీమ్‌ను తక్కువ అంచనా వేస్తే ఫలితం తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఆఖరాటలో నెగ్గి ఆసియాకప్‌ చాంపియన్‌గా నిలిచే జట్టేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

07:16 - March 6, 2016

విజయనగరం : పట్టణంలో గుంటూరు సుజాత విద్యా సంస్థలకు చెందిన బెస్ట్ జూనియర్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూల్ డ్రింక్ పార్టీ చేసుకున్నారన్న కారణంగా కళాశాల ప్రిన్పిపాల్ పిఎ రావు విద్యార్థులను కర్రతో చితకబాదారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినీ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం నుంచి విద్యార్థులకు ప్రిపరేషన్ హాలీడేస్ ఇవ్వడంతో విద్యార్థులంతా సరదాగా కలిసి కూల్ డ్రింక్ పార్టీ చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్ సిబ్బంది కలిసి విద్యార్థులపై దాడి చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

07:08 - March 6, 2016

తూర్పుగోదావరి : గోదావరి తీరం రాజమహేంద్రవరం వేదికగా ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తుండడంతో..రాజమండ్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లక్షమందితో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సంబందించిన ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పరిశీలించారు. అలాగే మంత్రి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కూడా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.  

07:04 - March 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 14వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ సలహా సంఘం భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు కానుంది. మార్చి 31వ తేదీలోపు సమావేశాలను ముగించనున్నారు. 16 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన పలు ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పించనున్నారు. సాగునీటి రంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రాజెక్టులవారీగా తన వద్ద ఉన్న సమాచారాన్ని సభ్యులకు ఇవ్వనున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నాయి. 

07:03 - March 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్‌పై చర్చించి,..దానికి తుది రూపునిస్తారు. అలాగే ఈనెల 10నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు. కాళేశ్వరంతో పాటు ప్రాణహిత, తుపాకులగూడెం ప్రాజెక్టుల పునరాకృతిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన సాగునీటి పథకాలకు ఎంత మేరకు నిధులను వెచ్చించింది,..ఏయే గుత్తేదార్లకు చెల్లించింది, జరిగిన పనుల వివరాలను సైతం ఇందులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లు, కొత్త గనుల విధానం, పురపాలక శాఖ ఇటీవల జారీచేసిన ఎన్నికల చట్టం సవరణ, బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ చట్టసవరణను ఆమోదించనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో టీఎస్‌ఐఐసీకి 50 ఎకరాల భూ కేటాయింపును ఆమోదించనున్నారు. వ్యవసాయం, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన ఉత్తర్వులతో పాటు కొత్త నియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. 

ఎన్నికల పోలింగ్ ప్రారంభం...

హైదరాబాద్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది. 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

06:25 - March 6, 2016

వరంగల్ : తొలి ఎన్నిక..చారిత్రాత్మకం కాబోతోంది. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2005 తరువాత మళ్లీ ఇన్నాళ్లకు జరిగే ఈ ఎన్నిక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాజిపేటలోని ఓ స్కూల్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఓ అధికారి టెన్ టివితో మాట్లాడారు. అరగంట ముందే ఈవీఎంలను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ కు అనుమతినిస్తామన్నారు. ఎనుమాముల మార్కెట్ నుండి తాము బయలుదేరడం జరిగిందని, అన్ని సౌకర్యాలు కల్పించారని పోలింగ్ సిబ్బంది పేర్కొన్నారు.

గ్రేటర్ వరంగల్ లో మొత్తం ఓటర్లు 6,44,098
పురుష ఓటర్లు 3,23,165
మహిళా ఓటర్లు 3,20,814
ఇతరులు 119
మొత్తం పోలింగ్ కేంద్రాలు 653
సమస్యత్మాకం 429
సిబ్బంది 7,079
మొత్తం డివిజన్లు 58
బరిలో ఉన్న అభ్యర్థులు 398 
బీజేపీ 57
టిడిపి 51
కాంగ్రెస్ 49
సీపీఎం 11
వైసీపీ 11
సీపీఐ 6
బీఎస్పీ 1
స్వతంత్రులు 154

06:19 - March 6, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల తనయుడు సుశీల్ కుమార్ బంజారాహిల్స్ పీఎస్ లో లొంగిపోయాడు. సుశీల్ తో పాటు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళను వేధించిన కేసులో వీరు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. లొంగుబాటుకు ముందు స్టేషన్ బెయిల్ కోసం సుశీల్ తరపు న్యాయవాదులు ప్రయత్నించినా కుదరలేదు. చివరకు వీళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుశీల్ తో పాటు కారు డ్రైవర్ పైనా నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు టిడిపి పార్టీకి చెందిన నాయకులు సీఐతో మంతనాలు జరిపారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని వారు కోరారు. నిర్భయ కేసు పెట్టడం వల్ల స్టేషన్ కు రావాల్సి ఉంటుందని, 24గంటల్లో రాకపోతే కేసు మరింత ముదిరే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆదివారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఈసందర్భంగా సుశీల్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. కారు ఆపినట్టు గాని, గొడవ జరిగినట్లు కానీ తమదగ్గరున్న సిసి టివి ఫుటేజ్ లో ఉందన్నారు. సుశీల్ ఏంబీఏ చదువుతున్నాడని, చిన్న ఘటన ఆధారంగా తీసుకుని నిర్భయ కేసు పెట్టడం దారుణమని తెలిపారు. జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నామని, మంగళవారం బెయిల్ కోసం దరఖాస్తు చేస్తామన్నారు.
ఈనెల 3వ తేదనీ సాయంత్రం సమయంలో ఓ యువతిని వెంబడించిన దృశ్యాలు సిసి టివి ఫుటేజ్ లో రికార్డయిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులు స్పందించి వారిద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మొదట కేసు నమోదు చేయడానికి ఆలస్యం చేసిన పోలీసులు చివరకు స్థానికుల వత్తిడితో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మంత్రి రావెల కుమారుడికి ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలి. 

నేడు తెలంగాణ మంత్రిమండలి భేటీ..

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆదివారం సచివాలయంలో జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ పై చర్చించి దానికి తుది రూపునిస్తారు. 

రావెల కుమారుడు లొంగుబాటు..

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్ శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పీఎస్ లో లొంగిపోయాడు. సుశీల్ తో పాటు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళను వేధించిన కేసులో వీరు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. లొంగుబాటుకు ముందు స్టేషన్ బెయిల్ కోసం సుశీల్ తరపు న్యాయవాదులు ప్రయత్నించినా కుదరలేదు. చివరకు వీళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుశీల్ తో పాటు కారు డ్రైవర్ పైనా నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

నేడే స్థానిక పోరు...

హైదరాబాద్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్ నిర్శాహణకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది. 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

ఆసియా కప్ నేడే ఫైనల్..

మిర్పూర్ : ఆసియా కప్ లో ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర కొనసాగించిన టీమ్ ఇండియా ఇప్పుడిక సిసలైన సమరానికి సిద్ధమైంది. అతిథ్య బంగ్లాదేశ్ తో నేడు జరిగే ఫైనల్ ఫైట్ లో అమీతుమీ తేల్చుకోనుంది. 

ర్యాంప్ వాక్ చేయనున్న యాసిడ్ బాధిత మహిళలు..

భోపాల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాసిడ్ బాధిత మహిళలు తమ ఆత్మ స్థైర్యాన్ని చాటుతూ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ర్యాంప్ వ్యాక్ చేయనున్నారు. 

8న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు..

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 

ఈ విమానంలో అందరూ మహిళలే..

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. మహిళా శక్తి సామర్థ్యాలను నిరూపించడానికి అంత్యత పొడవైన విమానాన్ని అత్యధిక దూరం అంతా మహిళా సిబ్బందితో నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం న్యూఢిల్లీ నుండి మధ్యాహ్నం 2.35 గంటలకు విమానం బయలుదేరనుంది. సోమవారం ఉదయం ఆరు గంటలకు శాన్ ఫ్రాన్సిస్కో చేరుతుంది. 

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు..

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. రాజన్న సన్నిధిలో ఆదివారం నుండి మంగళవారం వరకు మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 

Don't Miss