Activities calendar

07 March 2016

21:36 - March 7, 2016

ఢిల్లీ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే డిపాల్టర్‌గా ముద్ర వేయించుకున్న మాల్యాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగలగా ఈ లిక్కర్ కింగ్ అక్రమాలపై విచారణకు ఈడీ రంగంలోకి దిగింది. కింగ్‌ఫిషన్ అధినేత విజయ్‌మాల్యా చిక్కులు రెట్టింపవుతున్నాయి. కింగ్ ఫిషర్ పీకల్లోతూ అప్పుల్లో ముంచేసి.. చేతులు దుపులుకున్న ఈ కార్పొరేట్ దిగ్గజం.. తీసుకున్న రుణాలను వదిలేసి.. లండన్ వెళ్లే ప్రయత్నాలు ఫలించేలా లేవు. అంతర్జాతీయ లిక్కర్ సంస్థ డియాజియో ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నందుకు వచ్చే 515 కోట్ల రూపాయలను తీసుకోవద్దంటూ.. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేసు విచారణ పూర్తయ్యేవరకు ఈ మొత్తం ఖాతాలోనే ఉంచారని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ట్రైబ్యునల్ ఈ నెల 28కి వాయిదా వేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం మాల్యా... ఎస్ బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల వద్ద 7 వేల కోట్ల రుణం తీసుకున్నాడు. నష్టాల సాకుతో కింగ్ ఫిషర్‌ ను మూసేసిన మాల్యా నుంచి ఆ రుణాల వసూలుకు... ఎస్ బీఐ డెట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.  ఓ వైపు మాల్యాకు డెట్ రివకరీ ట్రిబ్యునల్‌ లో ఎదురుదెబ్బ తగలగా.. మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. త్వరలోనే మాల్యాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మాల్యాకు లోన్‌ ఇచ్చిన ఐడీబీఐ బ్యాంకు అధికారులపైనా ఈడీ కేసు నమోదు చేసింది. 

21:31 - March 7, 2016

మహారాష్ట్ర : మహాశివరాత్రి సందర్భంగా భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ నాయకత్వంలో త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్రలోని నందూర్ షన్ గోట్ ప్రాంతంలో దాదాపు 100 మంది మహిళలను అరెస్ట్ చేశారు. తమను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారని తృప్తి దేశాయ్ మండిపడ్డారు. సీఎం జోక్యం చేసుకుని తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలను గర్భగుళ్లోకి నిరాకరించడానికి నిరసనగా భూమాత బ్రిగేడ్ సంస్థ ఉద్యమం చేస్తోంది. గత నెల శని సింగ్నాపూర్‌లో ఆలయ ప్రవేశాన్ని కోరుతూ తృప్తి దేశాయ్‌ ఆందోళన చేశారు. 

21:29 - March 7, 2016

నల్గొండ : ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. పెళ్లి చేసుకుంటానంటూ మాటలు చెప్పిన ప్రియుడు చివరికి ప్లేటు ఫిరాయించేశాడు. నల్లగొండకు చెందిన రణదీర్‌రెడ్డి అనే వైద్యుడు, కీర్తి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. మోసపోయిన ఆ యువతి ఎంత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. న్యాయం కోసం 4 నాలుగు నెలల పాటు పోరాటం చేసింది. ఎక్కడికి వెళ్లినా చీధరింపులే ఎదురవడంతో చివరికి చావే శరణ్యమనుకుంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఆవేదనను సెల్ఫీ రూపంలో పేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోంది. 

21:27 - March 7, 2016

హైదరాబాద్ : భాగ్యనగరం అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది మూసీనది. నగరం నడిఒడ్డున వెలసిన మూసీ నది ఒకప్పుడు... జలకలతో ఉట్టిపడేది. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా మురుగు నీరే కనిపిస్తోంది. విశ్వనగర లక్ష్యంతో ముందుకు పోతున్న తెలంగాణ సర్కార్‌ మూసీ నదిపై దృష్టి పెట్టింది. 100 రోజుల్లో పూర్తి చెయ్యాల్సిన పనులలో భాగంగా మూసీనదికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది. హైద‌రాబాద్ నగ‌రంలో మూసీనదీ ప్రవహించే ప్రాంతాల్లో నగర మేయర్, హెచ్ఎండీఏ, వాట‌ర్ బోర్డు అధికారులతో కలిసి మంత్రి కేటిఆర్ పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో మూసిన‌ది ప‌రిస్థితిని ప‌రిశీలించారు. న‌దిలో వెల‌సిన ఆక్రమణలు, మూసిలోకి చేరుతున్న మురుగు, దానిని నిలువ‌రించ‌డానికి తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు.

50 శాతం కాని శుద్ది..
రంగారెడ్డి జిల్లా వికారా‌బాద్ అనంత‌గిరి కొండల్లోపుట్టిన మూసీ.... హైద‌రాబాద్ న‌గ‌రంలో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోంది. నగరంలోని మురుగుతో పాటు పరిశ్రమల నుంచి వెడువడే వ్యర్థపదార్థాలన్ని మూసీలోనే కలుస్తాయి. దీంతో మూసీ నీటిలో బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ శాతం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా జాతీయస్థాయిలో అత్యంత ప్రమాదకరమైన నదుల్లో మూసీ నాలుగోదిగా నిలిచింది. మూసిలోకి చేరుతున్న మురుగులో 50 శాతం కూడా శుద్ధిచేయడం లేదు. నదీ పరివాహక ప్రాంతంలో అంబర్‌పేట, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, ఉప్పల్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఐదు మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించారు. న‌గ‌ర వ్యాప్తంగా మూసిలోకి 51 నాలాల ద్వారా మురుగు నీరు చేరుతుంది. మురుగుతో దుర్గంధం వెదజల్లుతూ.. ప్రమాదకరంగా మారింది. మూసీని ప్రక్షాళన చేసి కొన్ని ప్రాంతాల్లో సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా మూసీకి పూర్వవైభవాన్ని తెస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ప్రక్షాళన కోసం ఎదురు చూపు..
హుస్సేన్ సాగర్ లో కలుస్తున్న కూకట్ పల్లీ నాలా డైవర్షన్ నెల రోజుల్లోపు పూర్తవుతుందని, త్వరలోనే హుస్సాన్‌సాగర్‌ ప్రక్షాళన చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై 10 రోజుల్లో నివేదిక తయారు చేసి సీఎంకు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణకు ఇప్పటికే 700 కోట్లు ఖర్చయ్యాయి. ఇంకా 3 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈసారైనా మూసీ ప్రక్షాళన కావాలని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

21:25 - March 7, 2016

హైదరాబాద్ : ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని భూముల వ్యవహారంపై టిడిపి, వైసిపిల నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా భూముల వ్యవహారంపై అధికార, విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. దీంతో మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజధాని భూముల వ్యవహారంలో ప్రతిపక్ష వైసీపీ అసత్య కథనాల్ని ప్రచురించి ప్రజల్ని, రాజధాని ప్రాంత రైతులు తప్పుదోవ పట్టిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. రాజధాని భూ దందాపై సమగ్ర విచారణ జరగాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందే తెలుసుకుని.. మంత్రులు భూములు కొనుగోలు చేశారన్నది నిజమా కాదా తేల్చాలన్నారు. రాజధానికి తాము వ్యతిరేకంగా కాదని..అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతికే వైసీపీ వ్యతిరేకమని బొత్స చెప్పుకొచ్చారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన జగన్‌, బొత్సలు అధికార పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుగా ఉందని టిడిపి చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు.

నేతలు ఎలా స్పందిస్తారో ?
రాజధాని భూముల్లో అవినీతి జరగలేదని తేటతెల్లమైనా..జగన్ మాత్రం అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని భూ దందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. భూ దందాపై విచారణ జరిపి నిర్దోషులని తేలితే పత్రికలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అసలైన బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార, విపక్షాలు పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడే ఇంత హాట్‌ హాట్‌గా పోట్లాడుకున్న నేతలు..మరి మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో ఎలా ప్రవర్తిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. 

21:02 - March 7, 2016

స్వాతంత్ర్య ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టి, ఆరు దశాబ్దాలు గడిచింది. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లెవేస్తున్నాయి. మహిళల సంక్షేమమే తమ అజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ, ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యమని పదే పదే రుజువవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులు అని తీర్మానాలు నినదిస్తున్నాయి. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలను కూల్చండి, ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మించండి- అని డిక్లరేషన్ లుచేశారు. కానీ, వాస్తవంలో ఏం జరుగుతోంది? మహిళల సమానత్వం సిద్ధించేదెపుడు..? ఈ అంశంపై ప్రత్యేక కథనం.

నేపథ్యం..
చట్టాలు అదిలించలేకపోతున్నాయి. ఉరిశిక్షలు బెదిరించలేకపోతున్నాయి.దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులున్నారు. చట్టాలున్నాయి..కానీ, నేరాలూ జరుగుతూనే ఉన్నాయి నిస్సహాయ నిర్భయలు..అసహాయ అభయలు. ఇక్కడ కన్నీటి ప్రశ్నలుగా మిగిలిపోతున్నారు..లోపం ఎక్కడుంది?వ్యవస్థలోనా? వ్యక్తుల్లోనా?బాపూ కలల నిర్భయ భారతం.. ఎన్నాళ్లకి? ఎన్నేళ్ళకి...సాకారమవుతుంది..? అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నేపథ్యమేమిటి? ఆ ఉద్యమాలకు నాయకులెవరు ? ఆ స్ఫూర్తిని అందుకుని అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎగిసిన మహిళా ఉద్యమాలేంటి? సాధించిన విజయాలేంటి? మహిళా ఉద్యమాల ముందున్న కర్తవ్యమేమిటి? పోరాటాలెన్ని చేస్తున్నా, ఉద్యమాలెన్ని ఆకాశాన్నంటినా, మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేదు. చట్టసభల్లో మహిళల ప్రాతానిధ్యం పెరిగితే కానీ, మహిళా లోకానికి న్యాయం జరగదని, ప్రజాస్వామిక హక్కులు దక్కవనే అభిప్రాయం

మహిళలపై తాండవిస్తున్న హింస..
ప్రజాస్వామికవాదుల్లో ఉంది. కానీ, చిత్తశుద్ధి లేని రాజకీయ పక్షాలు మహిళాబిల్లును గట్టెక్కించటం లేదు. మహిళా దినోత్సవం స్ఫూర్తిగా ఎన్నో ఉద్యమాలు మరెన్నో పోరాటాలు. మనదేశాన్ని ఊపేశాయి. హక్కుల సాధన దిశగా, వివక్ష నుండి విముక్తే గమ్యంగా, సమానత్వ సాధనే లక్ష్యంగా ఈ ఉద్యమాలు మిన్నంటాయి. దేశాన్ని ఊపేశాయి. ఎన్నో మార్పులకు సరికొత్త చట్టాలకు, రక్షణల ఏర్పాటుకు దోహదపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై హింస తాండవిస్తోంది. అడుగడుగునా లైంగిక వేధింపులు. ఎక్కడ చూసినా అంతులేని గృహహింస. ప్రేమ పేరుతో అఘాయిత్యాలు. విద్యావకాశాల్లో వివక్ష.. పనిప్రదేశాల్లో వేధింపులు.. వీటన్నిటికంటే ముందు పుట్టుకనే నిరోధిస్తూ, పిండాన్నే చిదిమేస్తున్న దారుణాలు.. ఒకటా రెండా.. మహిళా లోకంపై జరుగుతున్న దాడులు..అనేకం. ఈ వివక్షను, ఈ దాడుల్ని నిరోధించి ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడిననాడే నిజమైన సమానత్వానికి బాటలు పడతాయి.

సమానత్వ దిశగా కృషి చేద్దాం..
ఒక మనిషి వేరొక మనిషిని, వివక్ష తో అణచివేయడమంటే, ఆధిపత్యం చలాయించడమంటే, అది ఆ సమాజ తిరోగమనానికే చిహ్నం. మహిళలపై హింస పెరుగుతోందంటే, వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడమంటే, అది కుటుంబంపై, ఆ సమాజం పై తీవ్ర ప్రభావాన్ని చూపే అంశం. మహిళల హక్కుల్ని మానవ హక్కులుగా గుర్తించనంత కాలం, వివక్ష ను అంతమొందించడానికి కృషి జరగనంత కాలం, ఆ పౌర సమాజం నిత్య వైరుధ్యాలు, సంఘర్షణలతోనే పయనిస్తుంది. చిన్నారులు, మహిళలపై హింసలేని సమాజాన్ని స్వప్నిద్దాం. స్త్రీ పురుష సమానత్వ దిశగా కృషి చేద్దాం. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

సీపీఎం అభ్యర్థుల ప్రకటన..

పశ్చిమబెంగాల్ : రానున్న అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాన సీపీఎం ప్రకటించింది. 294 స్థానాలకు గాను 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 

20:55 - March 7, 2016

హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..విమర్శలు చెలరేగడంతో సారీ చెప్పడం..సెలబ్రెటీలకు..రాజకీయ నేతలకు అలవాటై పోయింది. తాజాగా సినీ నటుడు బాలకృష్ణ కూడా అదే బాటలో చేరిపోయారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే 'సావిత్రి' ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం మండి పడింది. కన్నెర్ర చేసింది. ఓ లాయర్ ఏకంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే అతడికి శిక్ష వేయాలని మహిళా సంఘాలు నినదించాయి. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. చివరకు బాలకృష్ణ స్పందించారు. 
తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు తప్ప తాను ఎవర్నీ ఉద్ధేశించి చేసినవి కావని పేర్కొన్నారు. ఏ ఇంటి మహిళ అయినా తన ఇంటి ఆడపడుచేనన్నారు. తన వ్యాఖ్యలతో మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. 

 

క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

హైదరాబాద్ : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు తప్ప తాను ఎవర్నీ ఉద్ధేశించి చేసినవి కావని పేర్కొన్నారు. ఏ ఇంటి మహిళ అయినా తన ఇంటి ఆడపడుచేనన్నారు. తన వ్యాఖ్యలతో మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. 

దేవాదుల ప్రాజెక్టుకు రూ. 112.5 కోట్లు..

హైదరాబాద్ : ఏఐబీపీ కింద గుర్తించిన దేవాదుల ప్రాజెక్టుకు రూ. 112.5 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2015-16 సంవత్సరానికి రూ. 125 కోట్లను కేటాయించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 

20:35 - March 7, 2016

దేశ విద్యార్థి రాజకీయాల్లో ఒక స్టూడెంట్ 16 నిమిషాల ప్రసంగాన్ని ఒక అటెన్షన్‌ గా, కళ్లగప్పించి దేశమంతా విన్న సందర్భం లేదు. 20 రోజుల జైలు తర్వాత జేఎన్‌యూలో ఉత్తేజకరమైన ప్రసంగమించి దేశ యువతలో ఆవేశాగ్ని, ఆలోచనాగ్ని రగిలించాడు కన్హయ్య. మరి కన్హయ్య ఆ ప్రసంగంలో మోడీని, మోహన్‌ భగవత్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు?

ప్రశ్న : మీరు మోహన్ భగవత్, నరేంద్ర మోదీ, నాగపూర్‌ ఆరెస్సెస్ లపై విమర్శలు చేశారు. ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు కావంటారా?
కన్హయ్య : ఇది చాలా పెద్దమాట. దీంట్లో నేను కూడా ఒక చిన్న మాట చెప్పదల్చుకున్నాను. నా రాజకీయ ఆలోచన ప్రకారం...మేము ఎవరికీ వ్యతిరేకంగా రాజకీయం చేయడం లేదు. సమాజానికి మేలు చేయడానికే పోరాడుతున్నాం. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడుతున్నాం. మేము అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నాం. నరేంద్ర మోడీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇలాంటి వ్యక్తులు కూడా అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నారు. వీరు అంబేడ్కర్ చెప్పిన సత్యాలను పాటిస్తున్నారా? మా పోరాటం సంఘ్‌పరివార్‌తో కాదు. మా పోరాటం దేశానికి మేలు చేయడానికే.
ప్రశ్న : మీరు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఆందోళన చెందారా...ఆమెతో ఏం మాట్లాడారు?
కన్హయ్య : మా అమ్మతో నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఈ దేశంలో ప్రతి యువకుడు తన దేశ ఉన్నతి కోసం కలలు కంటాడు. అలాంటి వారు తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎలా సిద్దమవుతావో, నీ కుటుంబం కూడా అలానే సిద్దమవుతుంది. నేను జేఎన్‌యూలో పోరాడుతున్నాను. నా కుటుంబం గ్రామంలో పోరాడుతోంది. ఆ పోరాటంలో మా అమ్మ ముందు వరుసలో ఉంది. 

20:32 - March 7, 2016

కన్హయ్య దాదాపు 20 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉన్నప్పుడు కన్హయ్య ఎలా ఫీలయ్యాడు ? ఏమైనా ఆందోళన చెందాడా ? తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ? కన్హయ్య దృష్టిలో ఆదర్శ నేత ఎవరు ? ఎలా ఉండాలి.?

ప్రశ్న : జైల్లో ఉన్న మీకు మీ కుటుంబం నుంచి ఎలాంటి ఆదరణ లభించింది?
కన్హయ్య : మా అమ్మానాన్న జైల్లో ములాఖత్‌ కోసం ఢిల్లీ రాలేకపోయారు. మా అన్న, చిన్నాన్న వచ్చారు. ఎలాంటి ఆందోళనా వద్దు, చింత చెయ్యొద్దని వాళ్లు నాకు చెప్పారు. ఈ సమయంలో ఒక మానసిక శక్తి వస్తుంది. సత్యం మీద నమ్మకం అది. ఎలాంటి రోజులైనా ఎక్కువ కాలం ఉండవు. మోడీజీ చెప్పినట్టు అచ్ఛేదిన్ ఎలా రాలేదో, చెడ్డ రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు.

ప్రశ్న : ప్రధాని నరేంద్ర మోడీపై మీరు చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆయనపై మీ ఫిర్యాదులేంటి?
కన్హయ్య : మోదీ చాలా బలమైన నాయకుడు. దేశానికి ప్రధానమంత్రి. 130 కోట్ల ప్రజల బాధ్యత ఆయనపై ఉంది. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఆస్తులు, సూటుబూటు ముందు నాలాంటి సాధారణ విద్యార్థి నిలువలేడు. అలాంటి వాళ్ల ముందు మేము ఏపాటి వారం. ఆయన యువతకు ఉపాధి కల్పిస్తానని చెబుతారు. కానీ ప్రధాని అయ్యాక మర్చిపోతారు. దేశ ప్రజల ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఆయన చెబుతారు. ప్రధాని అయ్యాక ఆయన మర్చిపోతారు. ఆయన రైతుల సంక్షేమంపై మాట్లాడతారు. కానీ ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు, వారి కుమారులు జేఎన్‌యూలో చదువుతుంటే వారి ఫెలోషిప్‌ డబ్బులను బంద్ చేస్తారు.

ప్రశ్న : అసలు మీ దృష్టిలో ఆదర్శ నేత ఎవరు? ఎలా ఉండాలి?
కన్హయ్య : మీరు ఆదర్శ నేత గురించి అడిగితే...అసలు నాకు ఆదర్శ నేత ఎవరూ తెలీదనే చెబుతాను. ఎందుకంటే నేను కేవలం విలువలను మాత్రమే నమ్ముతాను. వ్యవహారం, సిద్దాంతం. వాటి మధ్య తారతమ్యత, ఏకరూపత. వాటి ఆధారంగా ప్రజలను పాలించడం. అలాంటి నాయకుల సిద్దాంతాలు, వ్యవహారాలతో ప్రజలు మెచ్చేలా పాలించే వారు నాకు ఆదర్శ నేత. కానీ సమాజాన్ని మనం బ్లాక్‌ అండ్ వైట్‌లోనే చూడకూడదు. మంచిని మంచి అని, చెడును చెడుగానే చూడాలి.

ప్రశ్న : ఈ దేశంలో దేశభక్తిని ఒకే కోణంలో చూస్తున్నారని మీకు అనిపిస్తోందా?
కన్హయ్య : దేశమంటే అదొక్కటే కాదు. రకరకాల పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తాయి. దేశ నాగరికత ఆలోచిస్తుంది. అసలు దేశమంటే అంటే ఏంటి ? దేశం ఎలా అవుతుంది ? దేశం ఆదర్శమేంటి? ఇలా వీటన్నింటి గురించి రాజ్యాంగంలో ఉంది. కానీ రాజ్యాంగం యొక్క మూల స్తంభాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. జాతీయవాదమైనా, ఒక సంస్కృతితో మరో సంస్కృతిని ధ్వంసం చేయడమైనా, దేశం ముందున్న సవాళ్లను, సమస్యలను వదలి, తప్పుడు గొడవలు పెడుతున్నారు. మందిర్, మసీదు వివాదం, మత గొడవలను రాజేయడం ద్వారా జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది మంచిది కాదు.

ప్రశ్న : కన్హయ్య ఒక ఆలోచనను దేశంలో చర్చకు పెడుతున్నారని, అది దేశానికి మంచిది కాదని, అందుకే అతనిపై దేశద్రోహం కేసు పెట్టారని ఒక మంత్రి అన్నారు?
కన్హయ్య : అవును నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన డిస్కవరి ఆఫ్‌ ఇండియాలోంచి ఆవిర్భవించింది. అసలు భరతమాత అంటే ఏంటి అనే దానిపై నేను ఆరోజు మాట్లాడాను. భరతమాత అంటే వాళ్లనుకున్నది కాదు. ఒక రాజకీయ పార్టీ ద్వారా భరతమాత ఎలా ఉంటుందో క్యాలెండర్‌లో ముద్రించి చూపిస్తున్నారు. భరతమాత ఒక గౌరీ కావచ్చు, ఒక కాళీ కావచ్చు. వాళ్లు నిగనిగలాడే పట్టుచీరలే కాదు కాదు సాదాసీదా చీరలూ ధరిస్తారు. సల్వార్ కమీజ్ ధరిస్తారు. భరతమాతను ఒక రూపంలో చూపెట్టడం సరికాదు. భరతమాత గురించి మాట్లాడితే...భారత సోదరీల గురించి మాట్లాడాలి. భ్రూణహత్యలకు గురవుతున్న పసికందుల గురించి మాట్లాడాలి. ఇదే భరతమాత కాన్సెప్ట్. దీన్ని మరింత విస్తృతార్థంలో చూడాలి. రాజ్యాంగంలోంచి ఈ అంశాలను చూడాలి. ప్రస్తావనలో పేర్కొన్న అంశాల ప్రాతిపదికనే వాటిని చూడాలి. సమాజంలో అమలు చేయాలి. కానీ ఒకే దృక్పథంలో భరతమాత, ఒకే దృక్పథంలో జాతీయవాదం, ఒకే దృక్పథంలోని సిద్దాంతాన్ని ప్రజలపై బలంగా రుద్దాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ అంశాలను నేను జాతీయవాదం అనను. సంఘిజం అంటాను. ఇది నా టెర్మినాలజీ. సంఘిజం అంటే...దేశం గురించి మాట్లాడరు. ఒక సిద్దాంతం కోసం మొత్తం దేశాన్నే విచ్ఛిన్నం చేయాలనుకోవడం. భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో చెప్పింది ఏంటంటే...భారత్ రాజ్యాల యొక్క సమూహము. ఇండియా నేషన్స్ ఆఫ్ స్టేట్. ప్రతి రాష్ట్రం దేనికదే భిన్న సంస్కృతుల సమ్మేళనం. మన జాతీయవాదం ఒక ఐడెంటిటీ మీద చలామణి కాకూడదు. నేషన్స్ ఆఫ్‌ నేషన్స్. మల్టీ నేషనాలిటీ. మనం భిన్న సంస్కృతుల తరపున మాట్లాడతాం. కానీ వారు వాటి మీద గుత్తాధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు. ఇంటర్వ్యూ విశేషాలను చూడాలంటే వీడియో చూడండి.

20:16 - March 7, 2016

నరేంద్ర మోడీ గురించి కన్హయ్య ఏమంటున్నాడు....స్మృతి ఇరానీతో గొడవేంటి....ఇక హిట్లర్ గురించి మాట్లాడమని మోడీకి కన్హయ్య ఎందుకు సలహా ఇచ్చాడు. 

ప్రశ్న : మీ ప్రసంగంలో మోడీ గురించి మాట్లాడారు. మీరిక స్టాలిన్ గురించి మాట్లాడ్డం మానేసి, హిట్లర్‌ గురించి మాట్లాడమన్నారు. మీరు మోడీని టార్గెట్ చేశారా?
కన్హయ్య : మోడీజీ నాకు విరోధి కాదు. ఆయనతో నాకు ఎలాంటి గొడవా లేదు. స్మృతి ఇరానీ నాకు బంధువు కాదు. వీరితో నాకు వ్యక్తిగత విభేదాల్లేవు. సైద్ధాంతికంగానే విభేదముంది. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని. వారు చెప్పుకుంటున్న దేశభక్తి.. దేశభక్తి కాదు. ఆరెస్సెస్ యూనిఫాం వేసుకోవడమే దేశభక్తి కాదు. హిందుస్థాన్‌లో ఉండాలనుకుంటే వందేమాతరం అనాల్సిందేనన్న ఆరెస్సెస్ నినాదం దేశభక్తి కాదు. ఒకరకమైన దేశభక్తిని దేశం మీద రుద్దాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో వారితో నేను విభేదిస్తాను.

ప్రశ్న : స్మృతి ఇరానీతో మీ గొడవేంటి?
కన్హయ్య : పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్‌ డబ్బు వస్తుంది. వీటిని బంద్ చేయాలని స్మృతి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మేం ఆందోళన చేశాం. అణగారిన వర్గాల చైతన్యం కోసం, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ కలల సాకారం కోసం సమాజంలో తన వంతు ప్రయత్నం చేస్తున్న రోహిత్ వేముల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించి ఆత్మహత్యకు పురికొల్పింది. అందుకే మేము న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టాం. నేను మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి ఒకే విషయం చెప్పదల్చుకున్నాను. మీ సిద్ధాంతాలను మీ దగ్గరే పెట్టుకోండి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిలబెట్టండి. వాటిని ఖతం చేసేందుకు ప్రయత్నించకండి. యూనివర్సిటీల స్వతంత్ర ప్రతిపత్తిపై దెబ్బకొట్టొద్దు. యూనివర్సిటీలపై మీ సిద్ధాంతాలను రుద్ది, వాటిని నకిలీ చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. చట్టం, పాలన, ప్రక్రియ వాటి పని వాటిని చేయనివ్వండి.

ప్రశ్న : పటియాల కోర్టులో మీపై లాయర్లు దాడి చేశారు. చట్టాలను రెప్రజెంట్ చేసే లాయర్లు మీపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో మీ ఆలోచనలేంటి.
కన్హయ్య : ఆరోజు చాలా దురదృష్టకరమైన రోజు. నేను వ్యక్తిగా చెప్పడం లేదు. ఎవరైతే నామీద దాడి చేశారో వారు రాజ్యాంగాన్ని రక్షించేవారు కాదు. సుప్రీంకోర్టుకు, రాజ్యాంగానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగకరంగా ప్రవర్తించారు. నేను వారికి ఒకటే చెప్పదల్చుకున్నాను. వారి సచ్ఛీలతను జనం చూశారు. జనమే తీర్పిస్తారు.

ప్రశ్న : మోడీజీకి మీరేం చెప్పదల్చుకున్నారు?

కన్హయ్య : మోడీజీకి ఒకటే విషయం చెప్పదల్చుకున్నాను. మీరు యువకుడిగా ఉన్నప్పుడు దేశాన్ని ఏ దృక్పథంలో చూశారో...ఇప్పుడున్న యువత కూడా వారి దృక్పథంలో దేశాన్ని చూస్తున్నారు. కాలంలో తేడా ఉంది. వయస్సులోనూ తేడా ఉంది. ఈ దేశ విభిన్నత, వైవిధ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయొద్దని ప్రధానికి మనవి చేస్తున్నా . మీరు దేశానికి ప్రధానమంత్రి, ఏదో ఒక సిద్ధాంతానికి ప్రధాన మంత్రి కాదు. కన్హయ్య కుమార్ మాటల్లోనే తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:11 - March 7, 2016

ఒక నిరుపేద కుటుంబం. తల్లి అంగన్‌ వాడీ వర్కర్. నెలకు మూడు వేల జీతం. ఆ కుర్రాడే కాదు, ఆ కుటుంబం కూడా ఊహించలేదు. తన కుమారుడు, సోదరుడు దేశంలో ఒక కొత్త విద్యార్థి విప్లవానికి నాంది పలుకుతాడని. ఆజాదికి సరికొత్త నిర్వచనమై నిలుస్తాడని. తన పోరాటం గురించి, తన భవిష్యత్తు కార్యాచరణ గురించి కన్హయ్య ఏమంటున్నాడో చూద్దాం.
ప్రశ్న : మీ భవిష్యత్ ఆలోచనలేంటి...క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా?
కన్హయ్య : ప్రస్తుతం నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుణ్ణి. నాకింకా పదవీకాలముంది. జేఎన్‌యూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్చి ఉంది. ప్రస్తుతం నా దృష్టి దానిపైనే ఉంది. దీనితో పాటు నేను పీహెచ్‌డీ పూర్తి చేయాలి. సమాజంలో సామాజిక న్యాయ స్థాపన కోసం పోరాడాల్సి ఉంది.

ప్రశ్న : కానీ మిమ్మల్ని చూసి ఒక పొలిటికల్ స్టార్ పుట్టాడని దేశ ప్రజలు అనుకుంటున్నారు.
కన్హయ్య : నేనిప్పుడు విద్యార్థి ప్రతినిధిగా ఉన్నాను. దేశం కూడా తన ప్రతినిధిగా ఉండాలని భావిస్తే...ప్రజాస్వామ్యమే అలా చేయొచ్చు. ఇప్పుడే దీని గురించి నేనేమీ చెప్పలేను.

ప్రశ్న : మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. మీ అమ్మ అంగన్‌వాడీ వర్కర్. మీ నాన్న పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. ఇలాంటి నేపథ్యమున్న మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఢిల్లీకి వచ్చి ఇంత పెద్ద విద్యార్థి నాయకుడిగా ఎదుగుతానని, జాతీయస్థాయిలో వెలిగిపోతానని. వీటన్నింటి కంటే ముందు మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి..?
కన్హయ్య : జైల్లో ఉన్నప్పుడు నాకు అనుభవమైంది. మనం అనుకున్నవన్నీ జరగవని. ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చదవాలనుకున్నాను. పీహెచ్‌డీ చేయాలనుకున్నాను. నేను జేఎన్‌యూ లాంటి గొప్ప విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయగలనని నా కుటుంబానికి చెప్పాను. జేఎన్‌యూకి కూడా వచ్చాను. ఇక్కడి రాజకీయాలు నాకు నచ్చాయి. ఇందులో చేరాను. ఇక్కడి విద్యార్థులు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇంతకంటే నాగురించి చెప్పడానికి ఏమీ లేదు. నేను మామూలు స్టూడెంట్‌ని.

ప్రశ్న : జైల్లో మీ సమయం ఎలా గడిచింది?
కన్హయ్య : ఎంతైనా జైలు జైలే. బయటి సమాజాన్ని సామాజిక కోణంలో చూస్తే, మొత్తం సమాజమే ఒక జైలులా కనపడుతుంది. అలాంటి సామాజిక బంధనాలను తెంచేందుకే ప్రయత్నం.

ప్రశ్న : ఇప్పటి వరకు మీరు మీ అనుభవాలతో పుస్తకం రాయబోతున్నారని తెలిసింది?
కన్హయ్య : నేను ఒక విషయం పదేపదే చెబుతున్నాను. ఈ దేశంలో చదువుకున్నవారు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రజలతో నిర్మితమవుతుంది. చర్చ జరగాలి. తప్పకుండా నేను నా అనుభవాలు రాస్తాను. ప్రజల కోసం రాస్తాను. సంవాదం కోసం రాస్తాను. కానీ ఈ పుస్తక రచన అత్యంత గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పలేను.

ప్రశ్న : మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడు కలబోతున్నారు?
కన్హయ్య : కుటుంబాన్ని కలవలేకపోతున్నా సంప్రదింపులు మాత్రం జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి జరిగిన కాలంలో అంతగా బాధ ఉండదు. మీతో పాటు ఈ ప్రసారం చూస్తున్న వారందరూ నా కుటుంబమే. ఒంటరినన్న ఫీలింగ్ నాకు లేదు.

ప్రశ్న : ఆజాదీ నిర్వచనం ఒక్క మాటలో.
కన్హయ్య : ఆజాదీ అంటే...రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా అమలు చేయడం. దేశం నుంచి కాదు దేశంలోనే స్వాతంత్ర్యం కావాలి. ఆయన మాటల్లోనే తెలుసుకోవాలంటే వీడియో చూడండి..

20:05 - March 7, 2016

పేదరికం నుంచి ఆజాది. నిరుద్యోగం నుంచి ఆజాది. ఆకలి మరణాల నుంచి ఆజాది. రైతు ఆత్మహత్యల నుంచి ఆజాది. భావప్రకటనా స్వేచ్ఛకు వేసిన సంకెళ్ల నుంచి ఆజాది. భిన్న సంస్కృతులను విఛ్చిన్నం చేసే అరాచక శక్తుల నుంచి ఆజాది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రల నుంచి ఆజాది. విశ్వవిద్యాలయాల్లో వివక్ష గురించి ఆజాది. దేశభక్తికి పేటెంట్ కోరే కాషాయ సిద్దాంతాల నుంచి ఆజాది. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టే కుతంత్రాల నుంచి ఆజాది. దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేసే ఛండశాసనుల నుంచి ఆజాది. ఆజాది ఆజాది ఆజాది. ఆజాదికి సరికొత్త నిర్వచనమిచ్చాడు దేశ విద్యార్థి రాజకీయాల్లో నిప్పై రవ్వై ఎగసిన, ఎర్ర జెండా బావుటాయై దూసుకొచ్చిన కన్హయ్య కుమార్. బీహార్‌లోని వెనకబడిన సామాజిక వర్గంలో పుట్టి, జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్న కన్హయ్య కుమార్‌ ఇప్పుడు దేశ యువతకు చోదకశక్తిగా నిలిచాడు. సరికొత్త ఆలోచనాగ్ని రగిలించాడు. కన్హయ్యను ఎన్నో జాతీయ ఛానెల్స్ ఇంటర్వ్యూ చేశాయి. దీనిపై ప్రత్యేక కథనం..
రోహిత్ వేముల తనకు ఆదర్శమని ఎలుగెత్తి చెబుతున్నాడు కన్హయ్య కుమార్. దళితులు, ఆదివాసీల కోసం పోరాడిన ఓ యువ మేధావిని బీజేపీ ప్రభుత్వం, కాషాయ సిద్దాంతాలు పొట్టనపెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే దేశంలో మరో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదంటూ పోరాటానికి నడుం బిగించాడు. దేశద్రోహం కేసు పెట్టి, పాలకులు జైల్లో వేసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పడి లేచిన కెరటంలా దూసుకొస్తానని, జేఎన్‌యూ కం బ్యాక్ స్పీచ్‌తో స్పష్టం చేశాడు.

ప్రశ్న : జేఎన్‌యూ పునరాగమన ప్రసంగంతో దేశంలో ఒక కొత్త పొలిటికల్ స్టార్ జన్మించాడని దేశ ప్రజలంతా భావిస్తున్నారు. మీలో మీరు, ఆంతరంగికంగా రాజకీయ నేతగా మిమ్మల్ని చూసుకుంటున్నారా?
కన్హయ్య : టీవీ మాధ్యమం ద్వారా నేను చెబుతున్నాను. ఎంతోమంది తమ సిద్ధాంతాల సరిహద్దులను దాటి మద్దతుగా నిలిచారు. విద్యార్థులు, వర్కర్లు, రైతులు, మేధావులు, కళాకారులు, పాత్రికేయులు, న్యాయం కోసం పోరాడే లాయర్లు, ఇలా వీరందరూ కన్హయ్య వైపో లేదంటే జేఎన్‌యూ వైపో నిలబడలేదు. ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డారు. వారు న్యాయం పక్షాన నిలబడ్డారు. మంచేదో, చెడేదో చెప్పే స్వేచ్ఛ వైపు నిలబడ్డారు. మొట్టమొదట వారందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను.
ఇక ప్రసంగం విషయానికి వస్తే...నేను ముందస్తుగా ఎలాంటి ప్రిపేర్ కాలేదు. అవి నా జీవిత అనుభవాలు. నేను సమాజం నుంచి నేర్చుకున్నవి, అష్టకష్టాలు పడుతున్న సామాన్యుల బాధలను చెప్పాను. నాక్కూడా అలాంటి అనుభవాలున్నాయి. ఇక స్టార్‌ గురించి చెప్పాలంటే...నేను విద్యార్థిని. జేఎన్‌యూ స్టూడెంట్స్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. జేఎన్‌యూలో కొన్ని ప్రాథమిక సమస్యలపై మేము దృష్టిపెట్టాలి. హాస్టల్ సమస్య, వైఫై, లింగ్డో కమిటీ సిఫారసులను వ్యతిరేకించాలి, సామాజిక న్యాయం కోసం పోరాడాలి. అవి మా ప్రాథమిక అంశాలు. వీటన్నింటిపై మేము పోరాడాల్సి ఉంది. నేను ఒక విద్యార్థినే కానీ, స్టార్‌ కాదు.

ప్రశ్న : మీరు జైల్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల భయపడుతున్నారని, ఆందోళన చెందుతున్నారని మీరు అనుకున్నారా....మనసులో మీరేమైనా ఆందోళనకు గురయ్యారా?
కన్హయ్య :
జేఎన్‌యూ వర్సెస్ ఆర్మీ అన్న కోణంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా అమ్మ, నేను చెప్పింది అదే. సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు ఎవరు? సామాన్యులు, మనలాంటి వారే, మనలాంటి కుటుంబాల నుంచి వెళ్లిన వారే. మా సోదరుడు కూడా ఆర్మీలో ఉన్నాడు. నా తండ్రి రైతు. నా తండ్రి లాంటి అన్నదాతలు ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారంతా అమరవీరులు. దేశ పురోభివృద్ధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారు. కానీ వారి ప్రాణాలను తీసే కొందరు నాయకులు నకిలీ తరహాలో దేశభక్తి మీద పేటెంట్‌ తీసుకోవాలనుకుంటున్నారు. ఇదే మమ్మల్ని బాధిస్తోంది. ఇలాంటి బాధ అనుభవిస్తున్న వారంతా జేఎన్‌యూ పక్షాన నిలబడ్డారు. మరింత బలపడాల్సిన గళమిది. ఇది ఎవరికీ వ్యతిరేకమైనది కాదు. ఇది మంచికి మంచి, చెడుకు చెడు అని చెప్పే మాట. సమాజాన్ని చైతన్యం చేసే పోరాటమిది.

ప్రశ్న : జేఎన్‌యూ ప్రసంగంలో మీరొక విషయం చెప్పారు. ఆలోచించడానికి నాకు సమయం దొరికిందని, త్వరలో అవి అక్షర రూపంలో వ్యక్తీకరిస్తారని చెప్పారు....అసలు జైల్లో మీరేం ఆలోచించారు...ఏం రాయబోతున్నారు?
కన్హయ్య
 : మొదట నేను ఆశ గురించి మాట్లాడతాను. నేను రైతు బిడ్డను. రైతు ఆశాజీవి. విత్తనాలు తీసుకెళ్తాడు. పొలం చదును చేస్తాడు. వారి ఆలోచనలు చాలా ఆశావహంగా ఉంటాయి. జైల్లోను ఎన్నో ఆశావహంగా ఆలోచించాను. రాజ్యాంగంలోనూ, న్యాయ ప్రక్రియలోనూ స్పేస్‌ ఉంది. ఈ వ్యవస్థలో స్పేస్‌ ఉంది. ఒక అంగన్‌వాడీ కొడుకు జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తాడు. సెడిషన్‌ అంటే దేశద్రోహం కాదు రాజ్యద్రోహం. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. స్వాతంత్ర్యం గురించి పోరాడే భారతీయులపై బ్రిటీష్ పాలకులు దేశద్రోహం చట్టంతో కేసులు వేశారు. ఇప్పుడున్న పాలకులు బ్రిటీషర్లు కాదు. వారి అనుచరులు. వాళ్ల గురూజీల నిర్దేశాలు, సిద్ధాంతాలను అమలు చేయాలనుకుంటున్నారు. రాజకీయ స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛగా పరివర్తన చెందాలని ఈ దేశ రాజ్యాంగంలోని ప్రస్తావనలో స్పష్టంగా లిఖించారు. వీటి కోసం పోరాడే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. దేశం లోపల పోరాడుతున్న దళితులు, ఆదివాసీలు, కళాకారులు, మేధావులను దేశద్రోహలుగా, రాజ్యద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. దేశద్రోహ చట్టాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ప్రయోగించాలనుకుంటున్నారు.

ప్రశ్న : మీరు ఆజాది గురించి సరికొత్త అర్థం చెప్పారు. అసలు ఆజాదిని మీరు ఎలా అభివర్ణిస్తారు?
కన్హయ్య : 
మనదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగంలో దాని పరిమితులేమిటో కూడా మాకు తెలుసు. ఈ దేశ ఐక్యత, అఖండత గురించి మాకు భరోసా ఉంది. అందుకే దేశం నుంచి కాదు దేశంలోనే స్వేచ్ఛ కావాలి. రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛను అమలు చేయాలని కోరుతున్నాం. డెమోక్రసీలో ఉన్న స్పేస్‌ గురించి మాట్లాడుతున్నాం. అమ్మాయిలు వస్త్రధారణ ఎంచుకునే స్వేచ్ఛ, పెళ్లి విషయంలో వద్దనడానికి, కాదనడానికి స్వేచ్ఛ, మహళలు అర్ధరాత్రి సంచరించే స్వేచ్ఛ, పురుషులతో సమానంగా ఎదిగే స్వేచ్ఛ, మహిళయినా, పురుషుడైనా, ట్రాన్స్ జెండరైనా, సమానంగా బతికే స్వేచ్ఛ కావాలని అడుగుతున్నాం. వీరిని అడ్డుకునే తత్వమున్న సంఘ్‌ శక్తుల నుంచి ఆజాదీ కావాలంటున్నాం. అలాంటి స్వేచ్ఛ గురించి మేం మాట్లాడుతున్నాం. మేము సామాజిక ఆజాదీ కోరుకునే జాతీయవాదులం. 

ఒక నిరుపేద కుటుంబం. తల్లి అంగన్‌ వాడీ వర్కర్. నెలకు మూడు వేల జీతం. ఆ కుర్రాడే కాదు, ఆ కుటుంబం కూడా ఊహించలేదు. తన కుమారుడు, సోదరుడు దేశంలో ఒక కొత్త విద్యార్థి విప్లవానికి నాంది పలుకుతాడని. ఆజాదికి సరికొత్త నిర్వచనమై నిలుస్తాడని. తన పోరాటం గురించి, తన భవిష్యత్తు కార్యాచరణ గురించి కన్హయ్య ఏమంటున్నాడో చూద్దాం.

ప్రశ్న : మీ భవిష్యత్ ఆలోచనలేంటి...క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా?
కన్హయ్య : ప్రస్తుతం నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుణ్ణి. నాకింకా పదవీకాలముంది. జేఎన్‌యూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్చి ఉంది. ప్రస్తుతం నా దృష్టి దానిపైనే ఉంది. దీనితో పాటు నేను పీహెచ్‌డీ పూర్తి చేయాలి. సమాజంలో సామాజిక న్యాయ స్థాపన కోసం పోరాడాల్సి ఉంది.

ప్రశ్న : కానీ మిమ్మల్ని చూసి ఒక పొలిటికల్ స్టార్ పుట్టాడని దేశ ప్రజలు అనుకుంటున్నారు.
కన్హయ్య : నేనిప్పుడు విద్యార్థి ప్రతినిధిగా ఉన్నాను. దేశం కూడా తన ప్రతినిధిగా ఉండాలని భావిస్తే...ప్రజాస్వామ్యమే అలా చేయొచ్చు. ఇప్పుడే దీని గురించి నేనేమీ చెప్పలేను.

ప్రశ్న : మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. మీ అమ్మ అంగన్‌వాడీ వర్కర్. మీ నాన్న పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. ఇలాంటి నేపథ్యమున్న మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఢిల్లీకి వచ్చి ఇంత పెద్ద విద్యార్థి నాయకుడిగా ఎదుగుతానని, జాతీయస్థాయిలో వెలిగిపోతానని. వీటన్నింటి కంటే ముందు మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి..?
కన్హయ్య : జైల్లో ఉన్నప్పుడు నాకు అనుభవమైంది. మనం అనుకున్నవన్నీ జరగవని. ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చదవాలనుకున్నాను. పీహెచ్‌డీ చేయాలనుకున్నాను. నేను జేఎన్‌యూ లాంటి గొప్ప విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయగలనని నా కుటుంబానికి చెప్పాను. జేఎన్‌యూకి కూడా వచ్చాను. ఇక్కడి రాజకీయాలు నాకు నచ్చాయి. ఇందులో చేరాను. ఇక్కడి విద్యార్థులు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇంతకంటే నాగురించి చెప్పడానికి ఏమీ లేదు. నేను మామూలు స్టూడెంట్‌ని.

ప్రశ్న : జైల్లో మీ సమయం ఎలా గడిచింది?
కన్హయ్య : ఎంతైనా జైలు జైలే. బయటి సమాజాన్ని సామాజిక కోణంలో చూస్తే, మొత్తం సమాజమే ఒక జైలులా కనపడుతుంది. అలాంటి సామాజిక బంధనాలను తెంచేందుకే ప్రయత్నం.

ప్రశ్న : ఇప్పటి వరకు మీరు మీ అనుభవాలతో పుస్తకం రాయబోతున్నారని తెలిసింది?
కన్హయ్య : నేను ఒక విషయం పదేపదే చెబుతున్నాను. ఈ దేశంలో చదువుకున్నవారు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రజలతో నిర్మితమవుతుంది. చర్చ జరగాలి. తప్పకుండా నేను నా అనుభవాలు రాస్తాను. ప్రజల కోసం రాస్తాను. సంవాదం కోసం రాస్తాను. కానీ ఈ పుస్తక రచన అత్యంత గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పలేను.

ప్రశ్న : మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడు కలబోతున్నారు?
కన్హయ్య : కుటుంబాన్ని కలవలేకపోతున్నా సంప్రదింపులు మాత్రం జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి జరిగిన కాలంలో అంతగా బాధ ఉండదు. మీతో పాటు ఈ ప్రసారం చూస్తున్న వారందరూ నా కుటుంబమే. ఒంటరినన్న ఫీలింగ్ నాకు లేదు.

ప్రశ్న : ఆజాదీ నిర్వచనం ఒక్క మాటలో.
కన్హయ్య : ఆజాదీ అంటే...రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా అమలు చేయడం. దేశం నుంచి కాదు దేశంలోనే స్వాతంత్ర్యం కావాలి. 

నరేంద్ర మోడీ గురించి కన్హయ్య ఏమంటున్నాడు....స్మృతి ఇరానీతో గొడవేంటి....ఇక హిట్లర్ గురించి మాట్లాడమని మోడీకి కన్హయ్య ఎందుకు సలహా ఇచ్చాడు. 

ప్రశ్న : మీ ప్రసంగంలో మోడీ గురించి మాట్లాడారు. మీరిక స్టాలిన్ గురించి మాట్లాడ్డం మానేసి, హిట్లర్‌ గురించి మాట్లాడమన్నారు. మీరు మోడీని టార్గెట్ చేశారా?
కన్హయ్య : మోడీజీ నాకు విరోధి కాదు. ఆయనతో నాకు ఎలాంటి గొడవా లేదు. స్మృతి ఇరానీ నాకు బంధువు కాదు. వీరితో నాకు వ్యక్తిగత విభేదాల్లేవు. సైద్ధాంతికంగానే విభేదముంది. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని. వారు చెప్పుకుంటున్న దేశభక్తి.. దేశభక్తి కాదు. ఆరెస్సెస్ యూనిఫాం వేసుకోవడమే దేశభక్తి కాదు. హిందుస్థాన్‌లో ఉండాలనుకుంటే వందేమాతరం అనాల్సిందేనన్న ఆరెస్సెస్ నినాదం దేశభక్తి కాదు. ఒకరకమైన దేశభక్తిని దేశం మీద రుద్దాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో వారితో నేను విభేదిస్తాను.

ప్రశ్న : స్మృతి ఇరానీతో మీ గొడవేంటి?
కన్హయ్య : పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్‌ డబ్బు వస్తుంది. వీటిని బంద్ చేయాలని స్మృతి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మేం ఆందోళన చేశాం. అణగారిన వర్గాల చైతన్యం కోసం, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ కలల సాకారం కోసం సమాజంలో తన వంతు ప్రయత్నం చేస్తున్న రోహిత్ వేముల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించి ఆత్మహత్యకు పురికొల్పింది. అందుకే మేము న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టాం. నేను మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి ఒకే విషయం చెప్పదల్చుకున్నాను. మీ సిద్ధాంతాలను మీ దగ్గరే పెట్టుకోండి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిలబెట్టండి. వాటిని ఖతం చేసేందుకు ప్రయత్నించకండి. యూనివర్సిటీల స్వతంత్ర ప్రతిపత్తిపై దెబ్బకొట్టొద్దు. యూనివర్సిటీలపై మీ సిద్ధాంతాలను రుద్ది, వాటిని నకిలీ చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. చట్టం, పాలన, ప్రక్రియ వాటి పని వాటిని చేయనివ్వండి.

ప్రశ్న : పటియాల కోర్టులో మీపై లాయర్లు దాడి చేశారు. చట్టాలను రెప్రజెంట్ చేసే లాయర్లు మీపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో మీ ఆలోచనలేంటి.
కన్హయ్య : ఆరోజు చాలా దురదృష్టకరమైన రోజు. నేను వ్యక్తిగా చెప్పడం లేదు. ఎవరైతే నామీద దాడి చేశారో వారు రాజ్యాంగాన్ని రక్షించేవారు కాదు. సుప్రీంకోర్టుకు, రాజ్యాంగానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగకరంగా ప్రవర్తించారు. నేను వారికి ఒకటే చెప్పదల్చుకున్నాను. వారి సచ్ఛీలతను జనం చూశారు. జనమే తీర్పిస్తారు.

ప్రశ్న : మోడీజీకి మీరేం చెప్పదల్చుకున్నారు?

కన్హయ్య : మోడీజీకి ఒకటే విషయం చెప్పదల్చుకున్నాను. మీరు యువకుడిగా ఉన్నప్పుడు దేశాన్ని ఏ దృక్పథంలో చూశారో...ఇప్పుడున్న యువత కూడా వారి దృక్పథంలో దేశాన్ని చూస్తున్నారు. కాలంలో తేడా ఉంది. వయస్సులోనూ తేడా ఉంది. ఈ దేశ విభిన్నత, వైవిధ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయొద్దని ప్రధానికి మనవి చేస్తున్నా . మీరు దేశానికి ప్రధానమంత్రి, ఏదో ఒక సిద్ధాంతానికి ప్రధాన మంత్రి కాదు. 

కన్హయ్య దాదాపు 20 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉన్నప్పుడు కన్హయ్య ఎలా ఫీలయ్యాడు ? ఏమైనా ఆందోళన చెందాడా ? తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ? కన్హయ్య దృష్టిలో ఆదర్శ నేత ఎవరు ? ఎలా ఉండాలి.?

ప్రశ్న : జైల్లో ఉన్న మీకు మీ కుటుంబం నుంచి ఎలాంటి ఆదరణ లభించింది?
కన్హయ్య : మా అమ్మానాన్న జైల్లో ములాఖత్‌ కోసం ఢిల్లీ రాలేకపోయారు. మా అన్న, చిన్నాన్న వచ్చారు. ఎలాంటి ఆందోళనా వద్దు, చింత చెయ్యొద్దని వాళ్లు నాకు చెప్పారు. ఈ సమయంలో ఒక మానసిక శక్తి వస్తుంది. సత్యం మీద నమ్మకం అది. ఎలాంటి రోజులైనా ఎక్కువ కాలం ఉండవు. మోడీజీ చెప్పినట్టు అచ్ఛేదిన్ ఎలా రాలేదో, చెడ్డ రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు.

ప్రశ్న : ప్రధాని నరేంద్ర మోడీపై మీరు చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆయనపై మీ ఫిర్యాదులేంటి?
కన్హయ్య : మోదీ చాలా బలమైన నాయకుడు. దేశానికి ప్రధానమంత్రి. 130 కోట్ల ప్రజల బాధ్యత ఆయనపై ఉంది. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఆస్తులు, సూటుబూటు ముందు నాలాంటి సాధారణ విద్యార్థి నిలువలేడు. అలాంటి వాళ్ల ముందు మేము ఏపాటి వారం. ఆయన యువతకు ఉపాధి కల్పిస్తానని చెబుతారు. కానీ ప్రధాని అయ్యాక మర్చిపోతారు. దేశ ప్రజల ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఆయన చెబుతారు. ప్రధాని అయ్యాక ఆయన మర్చిపోతారు. ఆయన రైతుల సంక్షేమంపై మాట్లాడతారు. కానీ ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు, వారి కుమారులు జేఎన్‌యూలో చదువుతుంటే వారి ఫెలోషిప్‌ డబ్బులను బంద్ చేస్తారు.

ప్రశ్న : అసలు మీ దృష్టిలో ఆదర్శ నేత ఎవరు? ఎలా ఉండాలి?
కన్హయ్య : మీరు ఆదర్శ నేత గురించి అడిగితే...అసలు నాకు ఆదర్శ నేత ఎవరూ తెలీదనే చెబుతాను. ఎందుకంటే నేను కేవలం విలువలను మాత్రమే నమ్ముతాను. వ్యవహారం, సిద్దాంతం. వాటి మధ్య తారతమ్యత, ఏకరూపత. వాటి ఆధారంగా ప్రజలను పాలించడం. అలాంటి నాయకుల సిద్దాంతాలు, వ్యవహారాలతో ప్రజలు మెచ్చేలా పాలించే వారు నాకు ఆదర్శ నేత. కానీ సమాజాన్ని మనం బ్లాక్‌ అండ్ వైట్‌లోనే చూడకూడదు. మంచిని మంచి అని, చెడును చెడుగానే చూడాలి.

ప్రశ్న : ఈ దేశంలో దేశభక్తిని ఒకే కోణంలో చూస్తున్నారని మీకు అనిపిస్తోందా?
కన్హయ్య : దేశమంటే అదొక్కటే కాదు. రకరకాల పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తాయి. దేశ నాగరికత ఆలోచిస్తుంది. అసలు దేశమంటే అంటే ఏంటి ? దేశం ఎలా అవుతుంది ? దేశం ఆదర్శమేంటి? ఇలా వీటన్నింటి గురించి రాజ్యాంగంలో ఉంది. కానీ రాజ్యాంగం యొక్క మూల స్తంభాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. జాతీయవాదమైనా, ఒక సంస్కృతితో మరో సంస్కృతిని ధ్వంసం చేయడమైనా, దేశం ముందున్న సవాళ్లను, సమస్యలను వదలి, తప్పుడు గొడవలు పెడుతున్నారు. మందిర్, మసీదు వివాదం, మత గొడవలను రాజేయడం ద్వారా జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది మంచిది కాదు.

ప్రశ్న : కన్హయ్య ఒక ఆలోచనను దేశంలో చర్చకు పెడుతున్నారని, అది దేశానికి మంచిది కాదని, అందుకే అతనిపై దేశద్రోహం కేసు పెట్టారని ఒక మంత్రి అన్నారు?
కన్హయ్య : అవును నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన డిస్కవరి ఆఫ్‌ ఇండియాలోంచి ఆవిర్భవించింది. అసలు భరతమాత అంటే ఏంటి అనే దానిపై నేను ఆరోజు మాట్లాడాను. భరతమాత అంటే వాళ్లనుకున్నది కాదు. ఒక రాజకీయ పార్టీ ద్వారా భరతమాత ఎలా ఉంటుందో క్యాలెండర్‌లో ముద్రించి చూపిస్తున్నారు. భరతమాత ఒక గౌరీ కావచ్చు, ఒక కాళీ కావచ్చు. వాళ్లు నిగనిగలాడే పట్టుచీరలే కాదు కాదు సాదాసీదా చీరలూ ధరిస్తారు. సల్వార్ కమీజ్ ధరిస్తారు. భరతమాతను ఒక రూపంలో చూపెట్టడం సరికాదు. భరతమాత గురించి మాట్లాడితే...భారత సోదరీల గురించి మాట్లాడాలి. భ్రూణహత్యలకు గురవుతున్న పసికందుల గురించి మాట్లాడాలి. ఇదే భరతమాత కాన్సెప్ట్. దీన్ని మరింత విస్తృతార్థంలో చూడాలి. రాజ్యాంగంలోంచి ఈ అంశాలను చూడాలి. ప్రస్తావనలో పేర్కొన్న అంశాల ప్రాతిపదికనే వాటిని చూడాలి. సమాజంలో అమలు చేయాలి. కానీ ఒకే దృక్పథంలో భరతమాత, ఒకే దృక్పథంలో జాతీయవాదం, ఒకే దృక్పథంలోని సిద్దాంతాన్ని ప్రజలపై బలంగా రుద్దాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ అంశాలను నేను జాతీయవాదం అనను. సంఘిజం అంటాను. ఇది నా టెర్మినాలజీ. సంఘిజం అంటే...దేశం గురించి మాట్లాడరు. ఒక సిద్దాంతం కోసం మొత్తం దేశాన్నే విచ్ఛిన్నం చేయాలనుకోవడం. భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో చెప్పింది ఏంటంటే...భారత్ రాజ్యాల యొక్క సమూహము. ఇండియా నేషన్స్ ఆఫ్ స్టేట్. ప్రతి రాష్ట్రం దేనికదే భిన్న సంస్కృతుల సమ్మేళనం. మన జాతీయవాదం ఒక ఐడెంటిటీ మీద చలామణి కాకూడదు. నేషన్స్ ఆఫ్‌ నేషన్స్. మల్టీ నేషనాలిటీ. మనం భిన్న సంస్కృతుల తరపున మాట్లాడతాం. కానీ వారు వాటి మీద గుత్తాధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు.

దేశ విద్యార్థి రాజకీయాల్లో ఒక స్టూడెంట్ 16 నిమిషాల ప్రసంగాన్ని ఒక అటెన్షన్‌ గా, కళ్లగప్పించి దేశమంతా విన్న సందర్భం లేదు. 20 రోజుల జైలు తర్వాత జేఎన్‌యూలో ఉత్తేజకరమైన ప్రసంగమించి దేశ యువతలో ఆవేశాగ్ని, ఆలోచనాగ్ని రగిలించాడు కన్హయ్య. మరి కన్హయ్య ఆ ప్రసంగంలో మోడీని, మోహన్‌ భగవత్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు?

ప్రశ్న : మీరు మోహన్ భగవత్, నరేంద్ర మోదీ, నాగపూర్‌ ఆరెస్సెస్ లపై విమర్శలు చేశారు. ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు కావంటారా?
కన్హయ్య : ఇది చాలా పెద్దమాట. దీంట్లో నేను కూడా ఒక చిన్న మాట చెప్పదల్చుకున్నాను. నా రాజకీయ ఆలోచన ప్రకారం...మేము ఎవరికీ వ్యతిరేకంగా రాజకీయం చేయడం లేదు. సమాజానికి మేలు చేయడానికే పోరాడుతున్నాం. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడుతున్నాం. మేము అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నాం. నరేంద్ర మోడీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇలాంటి వ్యక్తులు కూడా అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్నారు. వీరు అంబేడ్కర్ చెప్పిన సత్యాలను పాటిస్తున్నారా? మా పోరాటం సంఘ్‌పరివార్‌తో కాదు. మా పోరాటం దేశానికి మేలు చేయడానికే.

ప్రశ్న : మీరు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఆందోళన చెందారా...ఆమెతో ఏం మాట్లాడారు?
కన్హయ్య : మా అమ్మతో నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఈ దేశంలో ప్రతి యువకుడు తన దేశ ఉన్నతి కోసం కలలు కంటాడు. అలాంటి వారు తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎలా సిద్దమవుతావో, నీ కుటుంబం కూడా అలానే సిద్దమవుతుంది. నేను జేఎన్‌యూలో పోరాడుతున్నాను. నా కుటుంబం గ్రామంలో పోరాడుతోంది. ఆ పోరాటంలో మా అమ్మ ముందు వరుసలో ఉంది. కన్హయ్య కుమార్ మాటల్లోనే చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

సికింద్రాబాద్ లో తనిఖీలు..

హైదరాబాద్ : ఉగ్రవాదుల కదలికలపై ఐబీ హెచ్చరికలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ లో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. 

టి.టిడిపి సమావేశానికి హాజరు కాని నేతలు..

హైదరాబాద్ : టిటిడిపి నేతల సమావేశానికి గాంధీ, మాగంటి నేతలు హాజరు కాలేదు. కొద్ది రోజులుగా వీరు పార్టీకి దూరంగా ఉన్నారు. 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో రుద్రాభిషేకం..

బెంగళూరు : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆశ్రమంలో మహశివరాత్రి సందర్భంగా రుద్రపూజ ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

కేసీఆర్ కు మహారాష్ట్ర గవర్నర్ స్వాగతం..

ముంబై : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు స్వాగతం పలికారు. 

19:48 - March 7, 2016

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌...! ఈ పేరు వినగానే పసిపిల్లల చర్మానికి హాని కలగని సబ్బులు, పౌడర్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడా బ్రాండ్‌ ఉత్పత్తుల విశ్వసనీయతే ప్రశ్నార్థకమైంది. అమెరికాకు చెందిన ఓ మహిళ.. ఈ సంస్థ ఉత్పత్తులు వాడడం వల్ల యోని సంబంధ క్యాన్సర్‌కు గురై మరణించింది. కేసును విచారించిన న్యాయస్థానం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు 468 కోట్ల రూపాయల భారీ జరిమానాను విధించింది. పురిటి బిడ్డలు మొదలు దాదాపు ఐదేళ్ల వరకూ పిల్లలకు జాన్సన్ అండ్‌ జాన్సన్‌ వారి సబ్బులు.. పౌడర్లు వాడుతుంటారు. ఆ సంస్థ కూడా తమ ఉత్పత్తులు సురక్షితమైనవంటూ ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. దీన్ని నమ్మి ప్రజలు వేలం వెర్రిగా సదరు సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఈ సంస్థ ఉత్పత్తుల విశ్వసనీయతపై ఇప్పుడు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.

35 ఏళ్లుగా..
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌ చెందిన ఫాక్స్‌ అనే మహిళ.. 35 ఏళ్లుగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కం పౌడర్‌నే వాడేవారు. దీని కారణంగా ఆమె యోని సంబంధ క్యాన్సర్‌కు గురై.. మూడేళ్ల క్రితం మరణించారు. టాల్కం పౌడర్‌లో ఉపయోగించే మినరల్‌ కెమికల్స్‌... ఫాక్స్‌ శరీరంపై దుష్ఫలితాలు చూపడంతోనే ఆమె మృతి చెందిందని వైద్య పరీక్షల్లో తేలింది. వైద్యుల ధ్రువీకరణ అనంతరం.. ఫాక్స్‌ బంధువులు.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థపై కోర్టులో దావా వేశారు. కేసు విచారించిన మిస్సోరి జ్యూరీ బాధిత మహిళ కుటుంబానికి 72 మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 468 కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. టాల్కం పౌడర్‌ వల్ల సంభవించే దుష్ఫలితాపై వినియోగదారులను చైతన్య పరచాల్సిన బాధ్యత సదరు కంపెనీదే అంటూ తీర్పునిచ్చింది.

పెనాల్టీ తగ్గించాలంటున్న సంస్థ..
కోర్టు దెబ్బకు దిమ్మతిరిగిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ.. పెనాల్టీ మొత్తాన్ని తగ్గించాలంటూ అప్పీలు చేసింది. ఈ కేసు నేపథ్యంలోనే.. అటు న్యూజెర్సీలోనూ.. జాన్సన్‌ సంస్థ పౌడర్‌లపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. పౌడర్‌ దుష్పరిణామాల గురించి.. అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు 1200కు పైగా కేసులు నడుస్తున్నాయి. మన దేశంలోనూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ పౌడర్లు, సబ్బులను ఇబ్బడిముబ్బడిగా వాడుతున్నారు. అమెరికన్‌ కేసు తర్వాత.. భారత్‌లోనూ ఈ ఉత్పత్తులపై సందేహాలు మొదలయ్యాయి. మరి ఇక్కడి ఉత్పత్తుల గురించి సంస్థ ప్రతినిధుల స్పందన ఏంటో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 

19:45 - March 7, 2016

హైదరాబాద్‌ : కేరళలో వామపక్షకూటమి విజయం ఖాయమని సీపీఐ నేత నారాయణ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో సోమవారం సీపీఐ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. అయిదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సురవరంతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 

19:37 - March 7, 2016

హైదరాబాద్ : రాజధాని భూ దందాపై సమగ్ర విచారణ జరగాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందే తెలుసుకుని.. మంత్రులు భూములు కొనుగోలు చేశారన్నది నిజమా కాదా తేల్చాలన్నారు. రాజధానికి తాము వ్యతిరేకంగా కాదని.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతికే వైసీపీ వ్యతిరేకమని బొత్స చెప్పుకొచ్చారు. 

19:34 - March 7, 2016

న్యూఢిల్లీ : రాజధాని భూ దందాపై శాసనసభలో సమగ్ర చర్చ జరగాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్‌చేశారు. కేంద్రం వైఖరికి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండడ్ చేశారు. టెన్ టివితో రాఘవులు మాట్లాడారు. కొత్తగా ఏపీ ఏర్పడిన మొదటి సంవత్సరం సర్దుకోవడం..రెండో సంవత్సరం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆశలు వమ్ము చేసిందని, విభజన చట్టంలోని హామీలు అమలు జరగలేదని ఆ హమీలను సాధించడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకొంటోందో చెప్పాలని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చారని, బీసీ సబ్ ప్లాన్ తెస్తారని అంటున్నారని బడ్జెట్ లో జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీపై నిర్ణయాన్ని ప్రకటించాలని, అమరావతి రాజధాని పెద్ద భూ కుంభకోణంగా జరుగుతోందన్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వామపక్షాలు, ప్రజల తరపున నిలబడే వారు సభలో లేరన్నారు. ప్రతిపక్షం..అధికార పక్ష నేతలు సభలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, ఇదే టిడిపి కొరుకొంటోందన్నారు. ఈ ఉచ్చులో పడి ప్రజా సమస్యలను ప్రతిపక్షం మరిచిపోతుందా ? అనేది చూడాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్లపై వాగ్ధానాలు చేసిందని, బీసీలకు నష్టం కలగకుండా చేస్తామంటున్నారని, కానీ ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పకుండా ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా చేస్తోందని రాఘవులు తెలిపారు. 

ధర్మశాలకు చేరుకున్న పాక్ బృందం..

న్యూఢిల్లీ : ధర్మశాల క్రికెట్ స్టేడియానాకి ఇద్దరు సభ్యులతో కూడిన పాక్ బృందం చేరుకుంది. ఐసీసీ వరల్డ్ టీ 20 టోర్నమెంట్ లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్ - పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం భారత్ కు బృందం చేరుకుంది. స్టేడియాన్ని పరిశీలించిన అనంతరం హిమాచల్ ప్రదేశ్ సీఎం, పోలీసు అధికారులతో చర్చించనుంది. ఈ బృందం అనుమతినిస్తేనే పాక్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. 

త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద ఉద్రిక్తత..

మహారాష్ట్ర : త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తమను ఆలయంలోకి అనుమతించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనితో ఆలయానికి రాకుండా మహిళలను కొద్దిదూరం వద్ద నిర్భందించారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొంటుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

ఆదర్శ్ శర్మ అరెస్టు..

ఢిల్లీ : పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాల్చి చంపితే రూ. 11 లక్షల బహుమతి ఇస్తామని శర్మ పేరిట పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. 

నిధులు సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలం - రాఘవులు..

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కావాల్సిన నిధులు సాధించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, రాజధాని నిర్మాణం పేరిట భూ కుంభకోణం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రశ్నించాలని, భూ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. 

18:38 - March 7, 2016

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై నిర్భయ కేసు పెట్టాలని జేఏసీ ప్రతినిధి రవికుమార్ డిమాండ్ చేశారు. సావిత్రి ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మహిళలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై రవికుమార్ సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా రవికుమార్ టెన్ టివితో మాట్లాడారు. తన స్థాయిని మరిచిపోయి వేలాది మంది సమక్షంలో అడవారిని కించపరిచేలా బాలకృష్ణ వ్యాఖ్యానాలు చేశారని తెలిపారు. అందుకొరకు తాము సరూర్ నగర్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, నిర్భయ కేసు పెట్టాలని తాము ఫిర్యాదులో పేర్కొనడం జరిగిందన్నారు. మహిళల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వెంటనే మహిళా లోకానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు. 

18:37 - March 7, 2016

హైదరాబాద్ : ఆయనో ప్రజాప్రతినిధి..అందులో ఓ సినిమా యాక్టర్...ఎందరో అభిమానులు..స్టార్ హీరోలు ఒక మాట చెబితే..అదే అభిమానులు ఫాలో కావడం చూస్తుంటాం. ఇలా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సినీ నటుడు, రాజకీయ నేతలు ఎలా ఉండాలి ? కానీ సినీ నటుడు, తెలుగుదేశం నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళలను కించపరిచే విధంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారా రోహిత్ హీరోగా నిర్మితమౌతున్న 'సావిత్రి' ఆడియో ఫంక్షన్ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి 'బాలకృష్ణ' అతిథిగా వచ్చారు. అనంతరం ప్రసంగిస్తూ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యలను విన్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ''అమ్మాయిలు వెంటపడమంటే ఊరుకుంటారా ? మా ఫ్యాన్స్..వెళ్లి ముద్దాడ మంటారు..లేదా కడుపు చేయాలి..లేదా కమిట్ అయిపోవాలి''..అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఫిర్యాదు..
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఫిర్యాదు నమోదైంది. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారంటూ సరూర్ నగర్ పీఎస్ లో న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు చేశారు. సావిత్రి ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో బాలకృష్ణ ఆడజాతిని కించపరిచేలా కామెంట్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా దినోత్సవం జరుపుకొనే సందర్భంలో ఒకవర్గాన్ని కించపరిచే విధంగా బాలకృష్ణ మాట్లాడడం ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధి పది మందికి ఆదర్శంగా ఉండాలే తప్ప ఇలా వ్యవహరించవద్దని పలువురు సూచనలు చేస్తున్నారు.

శిక్షించాలి..
 మగాడు అంటే ఆంబోతు అని నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదని దేవీ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. సినిమా రంగంలో ఉన్న కొద్దిమంది వారికి మహిళలంటే గౌరవం ఉండదని, అదే దురంహాకారం కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తుంటున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏం జరిగినా దానికి భాద్యులు మహిళలే అని అభిప్రాయం ఉందని, మహిళలను కించపరిచే విధంగా బాలకృష్ణ మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు ఐద్వా నేత అరుణ జ్యోతి పేర్కొన్నారు. నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన బాలకృష్ణకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 
మరి చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

18:27 - March 7, 2016

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఫిర్యాదు నమోదైంది. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారంటూ సరూర్ నగర్ పీఎస్ లో న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు చేశారు. సావిత్రి ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో బాలకృష్ణ ఆడజాతిని కించపరిచేలా కామెంట్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా దినోత్సవం జరుపుకొనే సందర్భంలో ఒకవర్గాన్ని కించపరిచే విధంగా బాలకృష్ణ మాట్లాడడం ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి అయిన బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధి పది మందికి ఆదర్శంగా ఉండాలే తప్ప ఇలా వ్యవహరించవద్దని పలువురు సూచనలు చేస్తున్నారు.

శిక్షించాలి..
 మగాడు అంటే ఆంబోతు అని నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదని దేవీ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. సినిమా రంగంలో ఉన్న కొద్దిమంది వారికి మహిళలంటే గౌరవం ఉండదని, అదే దురంహాకారం కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తుంటున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏం జరిగినా దానికి భాద్యులు మహిళలే అని అభిప్రాయం ఉందని, మహిళలను కించపరిచే విధంగా బాలకృష్ణ మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు ఐద్వా నేత అరుణ జ్యోతి పేర్కొన్నారు. నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన బాలకృష్ణకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 

కొనసాగుతున్న వామపక్ష పార్టీల సమావేశం..

పశ్చిమబెంగాల్ : కోల్ కతా సీపీఎం హెడ్ క్వార్టర్స్ లో వామపక్ష పార్టీల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

కోల్ కతా విమానాశ్రయంలో నో ఎంట్రీ..

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్ కతాలోని ఎన్ఎస్ సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీనితో ముందుజాగ్రత్త చర్యలగా విమానాశ్రయంలోనికి ఎవరినీ వెళ్లనీయడం లేదు. మూడు రోజుల పాటు విమానాశ్రయంలోకి ప్రజలకు ప్రవేశం నిలిపివేశారు. ఆదివారం ఈ బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. 

17:55 - March 7, 2016

హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం ఆ కానిస్టేబుల్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన బహదూర్ పురా పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా కిషన్ బాగ్ లోని ఓ ఆలయాన్ని విద్యుదీకరించారు. ఆలయంలో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో విద్యుత్ తీగ పడి ఉండడాన్ని కానిస్టేబుల్ గమనించలేకపోయాడు. తీగపై అడుగు వేయడంతో విద్యుద్ఘాతానికి లోనై సృహ కోల్పోయాడు. వెంటనే అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ కానిస్టేబుల్ కన్నుమూశాడు. భక్తులపై పడితే పెద్ద ప్రమాదమే తప్పేది. నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలు తెలియాల్సి ఉంది. 

ఎస్‌ఆర్‌ నగర్‌లో నకిలీ ఎస్‌ఐ హల్‌చల్‌

హైదరాబాద్ : ఎస్‌ఆర్‌ నగర్‌లో సోమవారం నకిలీ ఎస్‌ఐ హల్‌చల్‌ సృష్టించాడు. వాహనాలను ఆపి ధ్రువపత్రాలను చూపాలంటూ పలువురిని డిమాండ్‌ చేశాడు. ఎస్‌ఐ అని చెప్పి ఓ హాస్టల్‌ యాజమాన్యాన్ని బొమ్మ తుపాకితో బెదిరించాడు. హాస్టల్‌లోకి వెళ్లి వివరాలు చెప్పాలంటూ విద్యార్థులను కూడా బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నకిలీ ఎస్‌ఐను అదుపులోకి తీసుకున్నారు.

17:33 - March 7, 2016

తెలంగాణలోని ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.. మహా శివరాత్రిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. స్వామివారిని దర్శించుకొని భక్తిభావంలో మునిగిపోయారు. మహాశివరాత్రి వేడుకలతో తెలంగాణలోని ఆలయాలన్నీ సందడిగామారాయి. వరంగల్‌ వేయి స్తంబాల గుడిలో శివుడి నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామునుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. అయితే రద్దీ పెరిగి దర్శనం కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ లోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌లో హరిత లింగం అందరినీ ఆకట్టుకుంది. కరీంనగర్‌ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేములవాడలో భక్తులు పోటెత్తారు. అధికారులు వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని. గంటకొద్దీ క్యూలో నిలబడ్డా దర్శనం కావడంలేదని ఆరోపించారు. అటు ఇంటెలిజన్స్ హెచ్చరికలతో ఇక్కడ గట్టి భద్రత ఏర్పాటుచేశారు పోలీసులు.

ప్రత్యేక పూజలు...
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా భక్తులతో కిటకిటలాడింది. గోదావరిలో స్నానం కోసం భక్తులు బారులు తీరారు. అయితే అక్కడ నీరు లేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనయ్యారు. కాళేశ్వరంలోకూడా శివరాత్రి వేడుకలు కొనసాగాయి. గోదావరిలో పుణ్యస్నానాలుచేసి స్వామివారిని దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో ఎక్కడచూసినా శివనామస్మరణే వినిపించింది. రామలింగేశ్వరుడి దర్శనంకోసం భక్తులు భారీగా తరలివచ్చారు. నల్లగొండ జిల్లాలో శివాలయాలు క్రిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. శివ నామ స్మరణతో నిజామాబాద్‌ జిల్లా ఆలయాలు క్రిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఏడు పాయలలో ఉత్సవాలు..
మెదక్‌ జిల్లా ఏడుపాయలలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నల్లమల శివ నామ స్మరణతో మర్మోగింది. ఉమా మహేశ్వరాలయంలో వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. దండేపల్లి, లక్షెట్టిపేట, గూడెం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి గూడెం ఘాట్‌లో స్నానాలకోసం తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు. 

17:28 - March 7, 2016

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల అనంతరం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ పటిష్టతపై సమీక్షలతో పాటు ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజులు బస చేసి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను ప్రవేశ పెట్టింది. మరో మూడేళ్లలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.

బడ్జెట్ సమావేశాలు..
ఈ నెల 10 నుంచి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి నెలాఖరు వరకు జరిగే సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల లోపే పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్, దేవాలయ కమిటీల నియమాకం కనీసం 50 శాతమైనా.. ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఒక్కో జిల్లాలో కనీసం మూడు రోజులకు తగ్గకుండా సీఎం అక్కడే బస చేయనున్నట్లు సమాచారం. అవసరమైతే మరో రెండు రోజులు అదనంగా కూడా ఆ జిల్లాకు కేటాయించి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనలో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంబర పడుతున్న నేతలు...
పార్టీలో అక్కడక్కడ ఉన్న అంతర్గత తగాదాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే గ్రూపు తగాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. అధికారులతో సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేలా సీఎం టూర్‌ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొదట రంగారెడ్డి జిల్లా నుంచే ఈ పర్యటనకు శ్రీకారం చుడతామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముగిసిన వెంటనే సీఎం జిల్లాల పర్యటన ఖరారవుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఏదేమైనా... జిల్లాల పర్యటనతో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో కొత్త ఊపు వస్తుందని, దాంతో పార్టీ ఇమేజ్‌ మరింత పెరుగుతుందని గులాబి నేతలు సంబరపడిపోతున్నారు  

17:23 - March 7, 2016

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వెళ్లిన బృందం ముంబయి చేరుకుంది. ఇవాళ రాజ్‌ భవన్‌లో విడిది చేయనున్న కేసీఆర్.. రేపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సమావేశం కానున్నారు. గోదావరిపై నిర్మించి ప్రాజెక్టు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటనలో మొత్తం 5 ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదరనున్నాయి. 

కీలకం కానున్న ఒప్పందాలు..
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఆనకట్టల విషయంపై తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు  ఒప్పందాలు చేసుకోనున్నాయి. అంతర్‌రాష్ట్ర సమస్యలు, వివాదాలకు తావులేకుండా నిర్మాణాలు చేపట్టేందుకు ఈ ఒప్పందాలు కీలకం కానున్నాయి. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, పెన్‌గంగ్‌పైన చేపట్టనున్న చనాఖా-కొరాటా, రాజుపేట, పెన్‌పహాడ్‌ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ముందుగానే ఒప్పంద ముసాయిదాలను తయారుచేసి.. మహారాష్ట్రకు పంపారు. వీటిని అధ్యయనం చేసిన  మరాఠా సర్కార్‌... ఒప్పందానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 
సూత్రప్రాయంగా అంగీకారం
ఒప్పందాల్లోని అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. అయితే ప్రతి బ్యారేజీకి ముఖ్యమంత్రులు, కార్యదర్శులు, చీఫ్‌ ఇంజినీర్ల స్థాయిలో కమిటీలు ఉండాలని మహారాష్ట్ర కోరుతోంది. ఇన్ని కమిటీలు అవసరంలేదని... అన్నింటికి కలిపి ఒకే కమిటీ ఉంటే పర్యవేక్షణ తేలిక అవుతుందని, సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలంగాణ సర్కార్‌ సూచిస్తోంది. వీటిపై ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. మంగళవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తుది విడత చర్చించిన తర్వాత అంతిమ నిర్ణయం తీసుకుంటారు. 

17:21 - March 7, 2016

హైదరాబాద్ : మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మూసీ రక్షణకు గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టూరిజం శాఖ సమన్యయంతో మొదట విడతలో 2 కిలోమీటర్ల వరకు సుందరీకరణ పనులు చేపడతామని కేటీఆర్‌ చెప్పారు. మున్సిపల్‌ శాఖ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటించారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పీజీమెట్ ఫలితాల విడుదల

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెంట్ ఫలితాలను మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. మొత్తం 13,252 మంది విద్యార్థులకు గాను 8,658 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఫలితాల్లో సీమెచ్ వెంకటరమణకు మొదటి ర్యాంక్ పొందినట్లు పేర్కొన్నారు.

విజయమాల్య ఆస్తులు ఫ్రీజ్ : డెట్ ట్రిబ్యునల్

ముంబై : విజయమాల్య ఆస్తుల కేసుపై డెట్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్తయ్యే వరకు మాల్యాకు సంబంధించిన అని అకౌంట్లను స్తంభింప చేయాలని ఆదేశించింది. రూ.515 కోట్లు ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది.

ట్రాన్స్ ఫర్ చేయలేదని ఎన్ ఎఫ్ సి ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ : తనును కోరుకున్న చోటకి బదిలీ చేయలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. స్థానిక ఎన్‌ఎఫ్‌సిలో నరేందర్ కుమార్(24) అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనను కోరుకున్న చోటికి యాజమాన్యం బదిలీ చేయకపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

16:26 - March 7, 2016

హైదరాబాద్ : హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో సంతోషాల వేడుక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి, దర్శక నిర్మాత మారుతీ, యువ హీరో నాగశౌర్యలు వేడుకల్లో పాల్గొన్నారు. హోమియో కేర్ వైద్యంతో సంతానం పొందిన దంపతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వన్ కోర్ స్మైల్ పేరిట కార్యక్రమం రూపొందించడం జరిగిందని హోమీయో కేర్ నిర్వాహకులు తెలిపారు. 

16:21 - March 7, 2016

హైదరాబాద్: మరో భక్తి ప్రధానమైన పాత్రలో అక్కినేని నాగార్జున నటించనున్నాడు. ఈ అంశాన్ని మహా శివరాత్రి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అక్కినేని అభిమానులకు, సినీ ప్రేమికులకు చెప్పారు. నాగార్జునతో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారందికీ అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి లాంటి భక్తి ప్రధానమైన సినిమానే చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం సెంటిమెంట్ గా తిరుపతి వెళ్లి స్టార్ట్ చేశామని చెప్పారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారని, మళ్లీ మా ముగ్గురు కలయికలో సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. దీనికి ప్రముఖ రచయిత జె.కె. భారవి కథను అందిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తానని చెప్పారు.

16:17 - March 7, 2016

హైదరాబాద్ : వైసీపీ..టీడీపీ మధ్య విమర్శలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సోమవారం రోజున ఇరు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీ అధ్యక్షుడు జగన్ పై పలు విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో..ప్రతిపక్ష పార్టీకి అంతే బాధ్యత ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య మూలసూత్రాలను పక్కన పెట్టి వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏమీ జరగకపోయినా..లేకపోయినా లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడం జగన్ కుచెల్లిందని తెలిపారు. అసత్యాన్ని..పదే పదే ప్రచారం చేయడం వల్ల సత్యం అనే భ్రమలు కల్పించడనికి జగన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. అమరావతి పరసరాల్లో వేల ఎకరాలు టిడిపి నేతలు, బినామీలు అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారని గుర్తు చేశారు. ఎవరు కొన్నారు ? ఎంత కొన్నారు ? అనేది తెలుపమంటే వెనుకంజ వేస్తున్నారని జగన్ నుద్దేశించి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. 

కృష్ణా నదిలో నాటుపడవ మునక..

కర్నూలు : మహాశివరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో నాటువపడవ మునిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్తితి విషయంగా ఉంది. వారి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పడవలో 50 మంది ప్రయాణకులు సురక్షితంగా ఉన్నారు.

వైద్యుల మధ్య కాల్పుల కేసు సీసీఎస్ కు బదిలీ

హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో వైద్యుల మధ్య జరిగిన కాల్పుల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరుగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 8న డాక్టర్ ఉదయ్‌పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపారని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే రోజు రాత్రి డాక్టర్ శశికుమార్ మొయినాబాద్‌లోని ఫామ్ హౌజ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కేసు విచారణను ఒకే ఏజెన్సీ కిందకు తెచ్చి విచారణ కొనసాగించాలని శశికుమార్ భార్య డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39 పాయింట్లు లాభపడి 24,646 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 7,485 పాయింట్ల వద్ద ముగిసింది.

ఫ్లోరైడ్‌ నిర్మూలనకు ఎలిమినేటి ఎనలేని కృషి : చంద్రబాబు

హైదరాబాద్ : నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ నిర్మూలనకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎనలేని కృషి చేశారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాకు మాధవరెడ్డి చేసిన సేవలకు గాను సాగర్ లెఫ్ట్ బ్యాంకుకు ఆయన పేరు పెట్టామని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావ్, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

వెలిమినేడు వద్ద కారుబోల్తా : నలుగురికి గాయాలు..

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

బాలయ్య పై లాయర్ల జేఏసీ ఫిర్యాదు..

హైదరాబాద్ : మహిళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పై న్యాయవాద జేఏసీ ఫిర్యాదు చేసింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో న్యాయ వాదులు తమ ఫిర్యాదు నమోదు చేశారు. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివని ఈ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు. కాగా.. నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగంలో అసభ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..’’ అని వ్యాఖ్యానించారు.

ఏజెన్సీలో ఓ వ్యాపారిని కాల్చి చంపిన మావోలు...

విశాఖ : ఏజెన్సీలో ఓ వ్యాపారిని మావోయిస్టులు కాల్చి చంపారు. గూడెం కొత్త వీధి మండలం కుంకుంపూడి వద్ద గుండూరావు అనే వ్యాపారి పోలీసుల ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారని మట్టుబెట్టారు. వ్యాపార నిమిత్తం పెద్దపాడు వెళ్లి వస్తుండగా మావోయిస్టులు ఆయనను కుంకుంపూడి వద్ద అడ్డగించారు. సమీప అడవీలోకి తీసుకువెళ్లి కాల్పులు జరపడంతో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తున్నందునే చంపామని ఆ స్థలంలో లేఖ వదిలి వెళ్లారు. వ్యాపారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

15:29 - March 7, 2016

ఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన సంఘటనలకు సంబంధించి మార్చిన వీడియోలను ప్రాసరం చేసిన మూడు టెలివిజన్ న్యూస్ చానళ్లపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 9న వర్శిటీలో 'పాకిస్థాన్ జిందాబాద్' అన్న నినాదాలు అనలేదని, వీడియో టేపుల్లో ఉన్న దృశ్యాలను మార్ఫింగ్ చేసి బయటి గొంతులను అతికించారని ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేయడంతో కేజ్రీవాల్ సర్కారు దృశ్యాలను ప్రసారం చేసిన చానళ్లపై చర్యలకు ఆదేశించింది. ఈ వీడియోలు బయటకు వచ్చిన తరువాతనే కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు, ఆపై అరెస్ట్, కోర్టులో దాడి తదితర ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

15:29 - March 7, 2016

ఢిల్లీ : సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను కలిశారు. జెఎన్‌యు ఘటనకు సంబంధించి ఫేక్‌ వీడియోను తెరపైకి తెచ్చిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్‌కు ఏచూరి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జెఎన్‌యు ఘటనకు సంబంధించి మూడు ఛానళ్లపై ఆప్‌ సర్కార్‌ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ వీడియోను మార్ఫింగ్‌ చేశారన్న కారణంతో కోర్టులో క్రిమినల్‌ కేసును కేజ్రీవాల్‌ ప్రభుత్వం వేయనుంది. జెఎన్ యు ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తరపున విచారణ జరిపినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు, ఢిల్లీ ప్రభుత్వ దర్యాప్తులో పోలీసులు సాక్ష్యులుగా భావిస్తున్న మూడు వీడియోలు మార్చినట్లు తేలిందని ఏచూరి పేర్కొన్నారు. వీడియోలను మార్చిన ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏచూరి తెలిపారు. 

గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు..

ఖమ్మం: మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.గల్లంతయిన వారు ప్రదీప్, నాగరాజులు అన్నారం వసులుగా గుర్తించారు.

15:21 - March 7, 2016

విజయవాడ : గుణదల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌పై విద్యార్థినిలు స్పందించారు. తాము ఎలాంటి బాధలు పడుతున్నామో టెన్ టివికి తెలిపారు. ఉదయం టిఫిన్ కు కర్రీ లేకపోవడంతో పప్పు తీసుకుని తిన్నామన్నారు. వెంటనే వాంతులు అయ్యాయని, వార్డెన్ కు విషయం తెలిపితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని వాపోయారు. మీరే ఆసుపత్రికి వెళ్లండని..టాబ్లెట్ వేసుకోవాలని సూచించిందన్నారు. తమకు ఇక్కడి ఆహారం భుజించడం వల్ల కడుపు నొప్పిగా ఉంటోందని, వార్డెన్ కు వేరే హాస్టల్ అప్పగించడం వల్ల ఈ హాస్టల్ అప్పుడప్పుడూ వస్తోందన్నారు. కూరగాయలు మేమే తెచ్చుకుంటున్నామని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఇప్పటికూడా వాంతులతో బాధ పడుతున్నారని, ఈ సమాచారం వార్డెన్ కు తెలిపినా స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేత పేర్కొన్నారు. వంట, మంచినీటి సౌకర్యం లేదని పేర్కొన్నారు. వెంటనే సమస్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.

14 మంది విద్యార్థినిలకు అస్వస్థత..
గుణదల సాంఘీక సంక్షేమ హాస్టలో సోమవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ 14 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని సమాచారం తెలుసుకున్న టెన్ టివి స్పందించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినిలను ఆసుపత్రికి తరలించింది. వార్డెన్‌ తీరుపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్డెన్ ధనలక్ష్మి హాస్టల్ కు ఎప్పుడో ఒకసారి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టెన్ టివి కథనాలకు స్పందన..
10 టీవీ కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినులు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పరామర్శించారు. హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కలుషితాహారంపై విచారణ జరిపించి బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కొల్లు రవీంద్ర. ఇక తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన 10 టీవీకి విద్యార్ధినులు కృతజ్ఞతలు తెలిపారు. 

15:09 - March 7, 2016

కృష్ణా : మహాశివరాత్రి పండుగ వారి కుటుంబాల్లో విషాదం నింపింది. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. దీనితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆవనిగడ్డ (మం) పాతయండ్లకలో పుణ్యస్నానాలు ఆచరించడానికి సమీప గ్రామస్తులు తరలివచ్చారు. అందులో భాగంగా కొంతమంది కృష్ణా నదిలోకి దిగారు. అదే సమయంలో ప్రవాహం పోటెత్తడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఇది చూసిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా ఒకరి ఆచూకి తెలియరాలేదు. మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఆవనిగడ్డ (మం) పాతయండ్లకలో పుణ్యస్నానాలు వెళ్లి చెరువులో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరొకరిని స్థానికులు రక్షించారు. తమ కళ్లెదుటే మృతి చెందడంతో వారి కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. 

వికారాబాద్ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి : వికారాబాద్ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఆర్టీఏ అధికారులు పట్టుకుని డిపోలో ఉంచిన యాబై ఆటోలు దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న పొలంలో మంటలు చెలరేగి డిపోలోకి ఎగిసి పడటంతో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

శివరాత్రి వేడుకల్లో విషాదం : ఇద్దరి మృతి

కృష్ణా : అవనిగడ్డ మండలం పాతయడ్లంకలో శివరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. పుణ్యాస్నానాలకు వెళ్లి చెరువులో ముగ్గురు గల్లంతయ్యారు.ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా... ఒకరిని స్థానికులు కాపాడారు.

జూపాక సుభద్రకు లాడ్లీ అవార్డు..

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ ఉప కార్యదర్శి జూపాక సుభద్రకు లాడ్లీ సంస్థ అవార్డు వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు లాడ్లీ అవార్డు ప్రకటించింది.

14:52 - March 7, 2016

హైదరాబాద్ : గత వారం విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర హీరో నాగశౌర్య యూనిట్‌ సభ్యుల కోసం స్వయంగా గరిట చేతపట్టి రంగంలోకి దిగారట. సినిమా దర్శకురాలు నందిని రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నాగశౌర్య వంట చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వాటికి లైకుల మీద లైకులొస్తున్నాయి. ఇక ఏం వండి పెట్టారో చెప్పాలని వందలాది మంది అభిమానులు ప్రశ్నించగా, నందినీ రెడ్డి స్పందించారు. ఆలూ ఫ్రై, పప్పు, టమోట రసం, ఎగ్‌ కర్రీలను నాగశౌర్య వండారని, అన్నీ అద్భుతంగా ఉన్నాయని, ఇక మావాడికి పెళ్లి చేసేయొచ్చని సరదా పోస్టులను పెట్టారు.

14:47 - March 7, 2016

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చెందిన కాన్వాయ్ రెండో రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని యుమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో స్మృతి ఇరానీ ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రమాదంలో ఆగ్రాకు చెందిన డాక్టర్ రమేశ్ నాగార్ మృతిచెందారు. అయితే ఇప్పుడా ఆ ఘటనకు సంబంధించి మరో కోణం బయటపడింది. మినిస్టర్ కాన్వాయ్ ఢీకొట్టడం వల్లే తన తండ్రి చనిపోయినట్లు ఆ డాక్టర్ కూతురు ఆరోపిస్తోంది. 15 ఏళ్ల సంథిలి నాగార్ అదే విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొంది. తాము ఎంత వేడుకున్నా మంత్రి తమ అభ్యర్థనలను పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో వెల్లడించింది. తమ బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు నుంచి దిగిన స్మృతి మరో కారెక్కి వెళ్లిందని సంథిలి మీడియాతో పేర్కొంది. ఒకవేళ కేంద్ర మంత్రి స్మృతి కనుక సాయం చేసి ఉంటే తన తండ్రి బ్రతికేవాడని ఆ అమ్మాయి తెలిపింది. మథురాలో జరిగిన బీజేపీ యువ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి తిరిగి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఆ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 

14:45 - March 7, 2016

తీరిక వేళల్లో మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తమలోని ప్రతిభను చాటుతుంటారు. అలా పెయింటింగ్ లో ప్రత్యేకత చాటుతున్న అతివ బ్లో పెయింటింగ్ తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

14:43 - March 7, 2016

దేశ అభివృద్ధి, సమాజ మనుగడ, జీవిత స్థితిగతులు, నాణ్యతా ప్రమాణాలను అక్కడి ప్రజల విద్యార్హతలు నిర్ణయిస్తాయి. మానవ అభివృద్ధి సూచికలోనూ విద్యది ప్రధాన పాత్ర. మరి అంతటి ప్రాధాన్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంటోందా? అందరికీ చదువుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉంటున్నాయా? ముఖ్యంగా ఆడపిల్లల చదువుల కోసం చేయూతనందించే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతోందా?ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సహకరించని స్థితిలో మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. కుటుంబ భారాన్ని మోసేందుకు పనికి వెళ్తున్నారు. కనీస వసతులు కరువైన సందర్భంలో అత్తెసరు మార్కులతో చక్కబెట్టుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఒక దారి చూపుతూ ఎంతో మంది జీవితాలలో చదువుల వెలుగులు నింపుతున్న సంస్థ కథనంతో ఇవాళ్టి స్పూర్తి మీ ముందుకు వచ్చింది.
నీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ ఆర్థిక లేమి కారణంగా చదువుకు దూరమవుతున్న చిన్నారులను చేరదీస్తున్న బిగ్ హెల్ప్ సంస్థ నిర్వాహకులకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. వీరి స్పూర్తిని మరింతమంది అందుకోవాలని కోరుకుంటోంది. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

బడ్జెట్ లో వైద్యశాఖకు భారీగా నిధులు: లక్ష్మారెడ్డి..

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు రూ.5వేల కోట్లు కేటాయించనున్నట్లు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అత్యవసరంగా వైద్యం అందించేందుకు ఈనెల 10లోగా 108 మోటార్‌ సైకిళ్లను ప్రారంభిస్తామన్నారు. బంజారాహిల్స్‌లో మహిళల కోసం ఏర్పాటుచేసిన దంత సంరక్షణ కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, చిన్నారుల దంత సంరక్షణ కోసం తొలిసారిగా దంత సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు నిర్వాహకుడు డాక్టర్‌ కుల్సమ్‌ మీర్జా తెలిపారు.

14:38 - March 7, 2016

ఏలూరు : అసలే శివరాత్రి.. వేలాదిగా ఆలయాలకు భక్తులు తరలివస్తుంటారు. ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఆలయాలకు వచ్చే సామాన్య భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు కల్పించాల్సి ఉంటుంది. అలాగే భీమవరం ఉమా మహేశ్వర ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గంటలకొద్దీ క్యూలో నిలబడలేక భక్తులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆలయ ఈవో ఎంచక్కా గురక పెట్టారు. పనుల్ని వదిలేసి కునుకు తీశారు. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:38 - March 7, 2016

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేసిన నిహారిక తాజాగా ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నిహారిక ప్రస్తుతం ఒక మనసు అనే చిత్రంలో నటిస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేసారు. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు చిత్రానికి దర్శకత్వం వహించిన రామ రాజు , నిహారిక చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్, ఓ ప్రముఖ ఛానెల్ సంయుక్తంగా ఒక మనసు చిత్రాన్ని నిర్మించనుండగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. తాజాగా విడుదలైన ఒక మనసు ప్రీ లుక్ మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఎైగ్జెట్‌మెంట్‌కు గురి చేస్తుండగా, ఈ చిత్ర రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

14:34 - March 7, 2016

వరంగల్ : జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌లో మహాశివరాత్రి వేడుకలు విభిన్నంగా జరుగుతున్నాయి. హరితహారం స్ఫూర్తితో నిర్వాహకులు పర్యావరణ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భద్రకాళి చెరువు నుంచి తీసుకువచ్చిన మట్టితో రెండు రోజుల పాటు శ్రమించి శివలింగాన్ని తయారు చేశారు. పచ్చదనం కనిపించేలా శివలింగానికి గడ్డిని అతికించారు. లింగాకారం చుట్టూ పూల మొక్కలను పెట్టారు. దీంతో హరితహారం శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. దీనిని చూసేందుకు నగరం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

విజయమాల్య పై మనీల్యాండరింగ్ కేసు నమోదు..

హైదరాబాద్ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కోట్లాది రూపాయల రుణాలను తీసుకున్న మాల్యా... పౌరవిమానయాన రంగంలో ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’ పేరిట గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే లిక్కర్ వ్యాపారంలో విజయవంతమైన మాల్యా, పౌరవిమానయానంలో మాత్రం రాణించలేకపోయారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆయన ఎయిర్ లైన్స్ వ్యాపారాన్ని మూసేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలతో బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాల్యా చెల్లించలేదు.

14:31 - March 7, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రి హరీశ్‌రావు, అధికారులతో కూడిన బృందం ముంబయి బయలుదేరింది. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లు సంతకాలు చేయనున్నారు. ముంబైలో భేటీ అనంతరం సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. ఇందుకోసం చైతన్యరథం రెడీ అయిందన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని భావించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారని తెలిపారు. ముఖ్యమంత్రి సాయంత్రం రావడం జరుగుతుందని, పెద్ద ఎత్తున్న రిసీవ్ చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు ఎంట్రీ వద్ద మాత్రమే స్వాగత కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తలసాని స్పష్టం చేశారు. 

14:27 - March 7, 2016

విజయవాడ : గుణదల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌పై 10 టీవీ కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినులు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పరామర్శించారు. హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కలుషితాహారంపై విచారణ జరిపించి బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కొల్లు రవీంద్ర. ఇక తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన 10 టీవీకి విద్యార్ధినులు కృతజ్ఞతలు తెలిపారు.
గుణదల సాంఘీక సంక్షేమ హాస్టలో సోమవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ 14 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వార్డెన్ ధనలక్ష్మి హాస్టల్ కు ఎప్పుడో ఒకసారి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ జరిగిందని సమాచారం తెలుసుకున్న టెన్ టివి స్పందించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినిలను ఆసుపత్రికి తరలించింది. వార్డెన్‌ తీరుపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే వార్డెన్‌ హాస్టల్‌కు వచ్చి.. విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

దేవాదులకు రూ.112 కోట్లు విడుదల

హైదరాబాద్ : పొరుగు రాష్ట్రాలతో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన శుభ సమయంలో ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీపి కబురు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు దేవాదులకు తొలి విడత నిధులను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని కరవు ప్రాంతాలను సాగు భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు తొలి విడతగా రూ.112 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది.

కేజ్రీవాల్ ను కలిసిన ఏచూరి..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, కేసీ త్యాగిలు కలిశారు. జేఎన్ యూ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తరపున విచారణ జరిపినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు, ఢిల్లీ ప్రభుత్వ దర్యాప్తులో పోలీసులు సాక్ష్యులుగా భావిస్తున్న మూడు వీడియోలు మార్చినట్లు తేలిందని ఏచూరి పేర్కొన్నారు. వీడియోలను మార్చి ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏచూరి తెలిపారు. 

గోదావరిలో యువకులు గల్లంతు..

ఖమ్మం : మణుగూడురు (మం) మల్లేపల్లి వద్ద గోదావరిలో ప్రదీప్, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరు అన్నారం వాసులుగా గుర్తించారు. 

గుణదల హాస్టల్ ఘటనపై ప్రభుత్వం స్పందన..

కృష్ణా : విజయవాడ గుణదల సాంఘీక సంక్షేమ హాస్టల్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రిలో విద్యార్థినులను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె పరామర్శించారు. హాస్టల్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు. కలుషితాహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. టెన్ టివి కథనాలు ప్రసారం చేసినందుకు విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలిపారు. 

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..

ఢిల్లీ : దేశ రాజధానిలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. దేశంలోని ఉగ్రవాదులు చొరబడ్డారనే నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

13:58 - March 7, 2016

కరీంనగర్ : వేములవాడ ఆలయంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచివున్నా తమను పట్టించుకోవడం లేదని.. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటున్నారు. కొంతమంది కళ్లు తిరిగి పడిపోయినా పోలీసులు, ఆలయ సిబ్బంది  పట్టించుకోవడ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి - మంత్రి పల్లె..

అనంతపురం : ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల ముస్లిం మైనార్టీ నేతలు మంత్రి పల్లెను కలిసి రిజర్వేషన్ల సమస్య పరిష్కరించాలని కోరారు.

13:53 - March 7, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి గంటా అధికారులతో సమీక్షించారు.. విశాఖ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. మార్చి 21నుంచి ఏప్రిల్‌ 7వరకూ పరీక్షలు నిర్వహించబోతున్నారు..  దాదాపు 6లక్షల 57వేలమంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు.. ఈ పరీక్షల పర్యవేక్షణకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు..

 

కోర్టులో ఆత్మహుతి దాడి..

పాకిస్తాన్ : ఖక్ష్మబర్ ఫంఖ్తువా ప్రావిన్స్ లోని షబ్ క్వాదర్ తాలుకా కోర్టులో ఓ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.

ఏపీలో టెన్త్ షెడ్యూల్ విడుదల..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 21 నుండి ఏప్రిల్ 7 వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 6,57,595 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,028 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.

13:48 - March 7, 2016

ఉత్తరాఖండ్‌ : కోట్‌ ద్వార్‌లోని గ్రామంలో ఓ చిరుత పులి జనావాసాల్లోకి ప్రవేశించింది. అటవీ సిబ్బంది చిరుతను బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. అన్ని  ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో చిరుత గ్రామస్తులకు హాని కల్పిస్తుందనే ఉద్దేశ్యంతో అటవీ సిబ్బంది తుపాకీతో కాల్చి చంపారు. 

 

13:46 - March 7, 2016

చెన్నై: తమిళనాడు మధురైలో విషాదం చోటు చేసుకుంది. శ్రీలంక నుంచి శరణార్థిగా వచ్చి మధురైలో నివసిస్తున్న రవీంద్రన్‌ హైటెన్షన్‌ వైరు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.    రవీంద్రన్ కుమారుడు ఆరోగ్యం బాలేక ఆస్పత్రి పాలయ్యాడు. అదే సమయంలో శరణార్థి శిబిరంలో ఆహార ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారిని తన కుమారుడికి గైర్హాజరు వేయొద్దని, అలా చేస్తే భోజనం దొరకదని బ్రతిమిలాడుకున్నాడు. తన కొడుకు నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడని రశీదు కూడా చూపించాడు. అయినా కనికరించని ఆ అధికారి గైర్హాజరైనట్లుగానే మార్క్ చేశాడు. దీంతో రవీంద్రన్‌ను సదరు రెవెన్యూ అధికారి కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు  అని దుర్భాషలాడాడు. దీంతో రవీంద్రన్‌ నిజంగానే వెళ్లి హై టెన్షన్ విద్యుత్ వైర్ల స్థంభాన్ని ఎక్కి ఆ వైర్లు పట్టుకొని సెకన్లలో చనిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ అధికారిని చుట్టుపక్కల వారు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వచ్చి అతడికి రక్షణ కల్పించగా చర్యలు తీసుకోవాల్సిందేనని వారు నిలదీశారు.

13:44 - March 7, 2016

కర్నూలు : శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మల్లన్న భ్రమరాంబికాదేవి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు దర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారీగా క్యూలైన్లలో వేచివున్నారు. ఉచిత దర్శనానికి ఐదు గంటలు,.. ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. మల్లన్న స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, పరిటాల సునిత స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న వారిలో ఉన్నారు. 

 

13:40 - March 7, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా మాట్లాడే భాష, పద్ధతి మార్చుకోకపోతే జబర్దస్త్ లో తప్ప ప్రజల్లో... మరెక్కడా తిరగలేరని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, మంత్రులపై విమర్శలు చేసిన రోజాపై బోండా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వంత నియోజకవర్గం నగరిలో కూడా రోజా తిరగలేని దుస్థితి నెలకొందన్నారు. మేకప్ తో ఆఫీస్ కు, అసెంబ్లీకి రావద్దన్న జగన్ కా... మహిళలను గౌరవించే తమకా మహిళలంటే మర్యాద లేనిదని ప్రశ్నించారు. రోజా ఇప్పుడు మేకప్ లేకుండా ఎలా తిరుగుతున్నారని అడిగారు. మహిళలంటే తమకు గౌరవం ఉందని... ఐరన్ లెగ్ ఆంటీలంటేనే తమకు గౌరవం లేదని స్పష్టం చేశారు. రోజాలో పరివర్తన రావాలన్నారు. రోజా తన భాష, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రోజా.. తన పద్ధతి మార్చుకోకపోతే బబర్దస్త్ లో తప్ప మరెక్కడా తిరగలేరని చెప్పారు. 
జగన్, ముద్రగడల తీరుపై బోండా ఫైర్
అంతకముందు జగన్, ముద్రగడల తీరుపై బోండా మండిపడ్డారు. కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధం లేదన్నారు. ముద్రగడ మాట్లాడే ప్రతి విషయాన్ని కాపులు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. అమరావతి భూములుకు, కాపు ఉద్యమానికి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. జగన్ రాసిన స్క్రిప్టును ముద్రగడ చదవుతున్నారని ఎద్దేవా చేశారు. ముద్రగడ కాపుల గురించి మాట్లాడడం లేదని వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చుతానని జగన్ కలలు కంటున్నాడని పేర్కొన్నారు. జగన్ ప్రతి విషయంలో ప్రభుత్వానికి అడ్డుగా వస్తున్నాడని మండిపడ్డారు.

 

తమిళనాడులో శ్రీలంక శరనార్థి ఆత్మహత్య

చెన్నై: తమిళనాగు రాష్ట్రంలో విషాద సంఘటన చోటుచేసుకంది. ఈ రోజు ఓ శ్రీలంక శరణార్థి విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి విద్యుత్ వైర్లను తాకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్థానిక అధికారి వేధింపుల వల్లేనంటూ మిగతా శరణార్థులు ఆందోళనకు దిగారు. అధికారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అధికారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై మధురై ఎస్పీ విచారణ చేపట్టారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

కర్నూలు : డోన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం గుంతకల్‌ నుంచి నంద్యాల వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 20, 21, 22 బోగీలు పట్టాలు తప్పాయి. 21వ బోగీలో సరిగా అన్‌లోడ్‌ చేయకపోవటంతో దాదాపు 20 టన్నులకు పైగా బొగ్గు మిగిలిపోయింది. దానిలో ఉన్న బొగ్గు ప్రమాదానికి కారణమైందని రైల్వే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరో ఇంజిన్‌ను తెప్పించి పట్టాలపైన ఉన్న బోగీలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

13:11 - March 7, 2016

హైదరాబాద్: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘సుప్రీమ్‌’ చిత్రం పోస్టర్‌ విడుదలైంది. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ ‘మహాశివరాత్రి శుభాకాంక్షలు’ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

13:01 - March 7, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన, మంత్రులు, ఎమ్మెల్యే తీరుపై విమర్శల వర్షం గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మహిళలంటే మొదటి నుంచి చంద్రబాబుకు చులకనే అని పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీచకపాలన సాగుతోందని... ఈ కీచకులందరికీ మెంటర్ చంద్రబాబని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే మహిలంటే ఆయనకు గౌరవం లేదన్నారు. మహిళలంటే గౌరవం లేని, మర్యాద లేని చంద్రబాబుకు మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు లేదని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత ఉంటుందని గెలిపించారు కానీ మహిళలు అంటే ఆయనకు మర్యాద లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు పదవులే ముఖ్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. రావెల కిషోర్ బాబు తనయుడు హైదరాబాద్ లో ఓ మహిళా టీచర్ పై వేధింపులకు పాల్పడుతూ చిత్తకార్తి కుక్కలా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గారి కొడుకు అఘాయిత్యం చేస్తే జగన్ కుట్ర ఉందని ఆరోపించడం దారుణమన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో రావెల్ సుశీల్ కుమార్ కారులో టీచర్ ను వెంబడించి వేధించిన వార్త మొదటగా టీవీ9 చానెల్ లో వచ్చిందని... ఆ తర్వాతే సాక్షి చానెల్ లో వచ్చిందని తెలిపారు. సాక్షిపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. మంత్రి రావెల కిషోర్ బాబును వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత మైనార్టి మహిళను ఎపి సీఎం కాని.. ముంత్రులు కానీ ఇప్పటివరకు పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని... అంత ధైర్యంగా ఉంటున్నాడంటే దానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. చింతమనేనిని అరెస్టు చేయాలన్నారు. బాలకృష్ణ మహిళల పట్ల నోరు జారడం దురదృష్టకరం... బాలకృష్ణ, లోకేష్ పాటు ఆ పార్టీ నేతలు ఎన్ టిఆర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. 

 

శివాలయంలో మంత్రి జగదీష్ ప్రత్యేక పూజలు

నల్లగొండ: సూర్యాపేట వద్ద ఉన్న పిల్లలమర్రి శివాలయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దర్శించుకున్నారు. మహా శివరాత్రి పర్వ దినం సందర్బంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగి పోతున్నాయి.

మంత్రి కేటీఆర్ కు భూనిర్వాసితుల వినతిపత్రం

హైదరాబాద్: ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నేడు మూసీ నదిని పరిశీలిస్తున్నారు. ఆయన వెంట ఉన్న అధికారులతో మూసీ నది సుందరీకరణ, తూర్పు, పశ్చిమ కారిడార్‌పై చర్చిస్తున్నారు. ఉప్పల్ భగాయత్ సమీపంలో మూసీనదిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఔటర్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు మంత్రికి తమ సమస్యలను ఏకరువు పెడుతూ వినతి ప్రతం అందజేశారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

 

పలునగరాలను అప్రమత్తం చేసిన భద్రతా సంస్ధలు

ఢిల్లీ :దేశంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో పలు నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాలను భద్రతాదళాలు అప్రమత్తం చేశాయి. ఈ నగరాలన్నీ 'ఉగ్రలిస్టు' ఉన్నాయని చెబుతూ, అక్కడి ప్రభుత్వాలను, పోలీసులనూ జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించగా, కొద్దిసేపటి క్రితం మరిన్ని నగరాలపై దాడులకు అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరించింది. వాటిల్లో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ కూడా ఉంది. విజయవాడతో పాటు లక్నో, జయపుర, భోపాల్, చండీగఢ్ లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో విజయవాడలో పోలీసులు సోదాలు జరుపుతున్నారు.

 

ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణ మంత్రి గంటా సమీక్ష

విశాఖ : పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించారు. విశాఖ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

12:17 - March 7, 2016

కృష్ణా : విజయవాడలోని గుణదల ప్రభుత్వ బాలికల సాంఘీక సంక్షేమ హాస్టట్ లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 14 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో మిగిలిన విద్యార్థులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఇదిలావుంటే తాను హాస్టల్ కు రాలేనని.. ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేయించుకోండని విద్యార్థులకు వార్డెన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హాస్టల్ లో మెరుగైన వసతులు కల్పించాలని ఎస్ ఎఫ్ ఐ నేతలు డిమాండ్ చేశారు.
 

వరల్డ్ కప్ మాదే... ధోనీ

హైదరాబాద్ : ఆసియా టీ-20 కప్ ను సాధించిన ఉత్సాహంతో వరల్డ్ టీ-20 కప్పును కూడా గెలుచుకొస్తామని, అందుకోసం టీమిండియా సర్వ సన్నద్ధంగా ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. 

చామవరంలో దంపతుల ఆత్మహత్య

తూ.గో: తుని మండలం చామవరంలో విషాదం అలముకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

12:08 - March 7, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ స్క్రీన్‌షాట్ ఒకటి ఇంటర్నెట్‌లో లీకయింది. దీంతో యూనిట్ షాక్‌కి గురైంది. అయితే ఇది ఎడిటింగ్ టేబుల్ వద్ద తీసిన ఫోటో అని ఆ తర్వాత తెలిసినా.. ఇది ఎలా లీకయిందో తెలియక యూనిట్ తల పట్టుకుంటోంది. ఇంకా సీక్రెట్‌గా ఉండే ఈ మూవీ రఫ్ ఫుటేజీ కూడా బయటకు పొక్కితే ఇంకేమైనా ఉందా అని సర్దార్ క్యాంప్ కలవరపడుతోంది. గతంలో పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సీన్స్ కూడా ముందుగానే లీక్ అయి పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఇప్పుడు దాదాపు అలాంటిదే జరగడం కాస్త ఆందోళనకరమైన విషయమే. దీంతో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఈ తాజా పరిణామం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని, ఎలర్ట్‌గా ఉండాల్సిందిగా సూచించాడని తెలిసింది.

12:03 - March 7, 2016

హైదరాబాద్ : జాతీయ ఉత్తమ దర్శకుడు బ్రహ్మ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక దంపతులు ఓ చిత్రం నటించనున్నట్లు సమాచారం. మొదటి చిత్రాన్ని నూతన తారలతో తెరకెక్కించి వారి నుంచి సహజత్వంతో కూడిన నటనను రాబట్టిన బ్రహ్మ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో ఆయన అర్ధాంగి జ్యోతిక ప్రధాన పాత్రను పోషించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఈమె సుదీర్ఘ విరామం తరువాత వివాహనంతరం 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆ తరువాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్న జ్యోతికను దర్శకుడు బ్రహ్మ చెప్పిన కథ బాగా ఇంప్రెస్ చేసిందని, ఆ కథలో నటించడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.

'పఠాన్ కోట్ ఆపరేషన్ ఖర్చులు చెల్లించండి'

హైదరాబాద్ : పఠాన్‌కోట్ ఉగ్ర దాడి సందర్భంగా మోహరించిన పారామిలిటరీ దళాల ఖర్చుల బిల్లు రూ.6.35 కోట్లు చెల్లించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం పఠాన్‌కోట్‌కు పంపించిన 20 కంపెనీల బలగాలు జనవరి 2 నుంచి 27 వరకు కార్యకలాపాలు నిర్వహించాయి. వీరికి రోజుకు రూ.1,77,143 ఖర్చయింది. ఈ ఖర్చులను చెల్లించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. కానీ పంజాబ్ ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దేశ ప్రయోజనాల కోసమే బలగాలు తమ రాష్ట్రంలోకి వచ్చాయని, అందుకు అయిన ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని లేఖ రాసింది.

11:51 - March 7, 2016

నిజామాబాద్‌ : ఇన్నాళ్లు జల సిరులతో గలగలలాడిన ఆ ప్రాజెక్టు కల తప్పింది. నిండకుండను   తలపించి పంటసిరులు పండించిన  ఆ జలాశయం నీటిమట్టంపూర్తిగా పడిపోయింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు...తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వట్టిపోయి ఎడారిని  తలపిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  నీటి మట్టం పడిపోయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపై స్పెషల్‌ స్టోరీ.....
డెడ్‌ స్టోరేజీకి శ్రీరాంసాగర్‌  నీటిమట్టం
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌  నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రోజురోజుకు పెరిగిపోతున్న మండుటెండలతో ప్రాజెక్టు ఎడారిలా మారింది. ఆరు  జిల్లాలకు  సాగు, తాగు నీరందించే ఈ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వట్టిపోయింది. రెండేళ్లు వర్షాలు కురవకపోవడంతో చుక్క నీరు కూడా రాక  ఆయకట్టు పంట పొలాలు  ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటి ప్రాజెక్టు మైదానంగా మారడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
9 లక్షల ఎకరాలకు సాగు నీరు కరువు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద సాగయ్యే దాదాపు 9 లక్షల ఎకరాలకు సాగు నీరు కరువైంది. దీంతో పచ్చని పంటపొలాలు బీడుభూములుగా మారాయి. ఆదిలాబాద్‌, వరంగల్, కరీంనగర్‌, ఖమ్మంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలకు ఇక్కడి నుంచే సాగు, తాగు నీరు అందుతుండేది. ఈసారి నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో రబీ పంటలకు చుక్క నీరు కూడా అందే పరిస్థితి లేదు. ఆయకట్టును  నమ్ముకున్న అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. ఖరీఫ్‌ కాలం  కూడా రైతులకు తీవ్ర  నష్టాన్నే మిగిల్చింది. 
ప్రాజెక్టు వట్టిపోవడంతో రైతులు ఆందోళన
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 91 టీఎంసీలు. గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు. అయితే గత వర్షాకాల సీజన్‌లో కేవలం 5.70 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రస్తుతం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ఆరు జిల్లాల్లోని18 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరందించే ప్రాజెక్టు వట్టిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఎండిపోయిన వ్యవసాయ భూములు 
ప్రాజెక్టులో నీరు నిండక పోవడంతో వ్యవసాయ భూములు పూర్తిగా ఎండిపోయాయి. ఈ సారి ఆరుతడి పంటలు వేద్దామన్నా.. పరిస్థితులు అనుకూలించేలా లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు లేనందున అక్కడి నుంచి వచ్చే వరద నీరు కూడా  రాకుండా పోయింది. ఆయకట్టును నమ్ముకున్న అన్నదాతలకు తిండి గింజలు కూడా  కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాగునీటికి సరిపడా కూడా ప్రాజెక్టులో నీరు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణలోని పలు పట్టణాలు, కామారెడ్డి నియోజకవర్గంలోని మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్‌, ఎన్టీపీసీకి ఎస్సీరెస్పీ నుంచే తాగునీరు అందుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేసవిలో శ్రీరాంసాగర్‌ నుంచి తాగునీరందే అవకాశం  ఏ మాత్రం లేదు. దీంతో ఆయా పట్టణాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

 

రేపు రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత...

తిరుమల: సూర్య గ్రహణం నేపథ్యంలో తిరుమల ఏడు కొండలపై కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం రేపు రాత్రి నుంచి మూసివేయనున్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. నిత్య అన్న ప్రసాద సముదాయాన్ని కూడా మూసివేసి ఉంచుతున్న కారణంగా ప్రసాద వితరణ ఉండదని అధికారులు తెలిపారు. సూర్య గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ తిరుమల పర్యటన రూపొందించుకోవాలని సూచించారు.

కోటప్పకొండను అభివృద్ధి చేస్తాం : కోడెల

గుంటూరు :కోటప్పకొండ క్షేత్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో నిర్వహించే జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నాలుగేళ్లలో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఉగ్రకదలికలపై హోంశాఖ అప్రమత్తం..

ఢిల్లీ : దేశంలో ఉగ్ర కదలికలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఎన్‌ఎస్‌జీ చీఫ్‌, హోంమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు.

11:34 - March 7, 2016

హైదరాబాద్ : ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగింది. 7/జీ బృందావన్ కాలనీ ఫేం శ్రీరాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలా బాలకృష్ణ, వామిక జంటా నటిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీవీ రెడ్డి ఆడియోను విడుదల చేశారు. బీప్ టౌన్ స్టూడియోస్, శ్రీకామాక్షి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమ్రిత్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వేద, పూనమ్‌కౌర్, అనంత్‌శ్రీరామ్ హాజరయ్యారు.

11:33 - March 7, 2016

హైదరాబాద్ : మూసీనదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ యత్నిస్తోంది. ఇందులో భాగంగా నేడు మంత్రి కేటీఆర్‌ మూసీ నది వెంబడి.. అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించనున్నారు. నది ప్రక్షాళన, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరు, సుందరీకరణ అవకాశాలను పరిశీలించనున్నారు. ఉప్పల్‌ నుంచి బాపుఘాట్‌ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. 

పంట కాలువలో మృతదేహం..

నెల్లూరు : మర్రిపాడు మండలం డీ.సీ పల్లి గ్రామంలో పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం కాలువలో తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడా.. లేక ఎవరైన హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

 

11:28 - March 7, 2016

విశాఖ : జిల్లాలో మళ్లీ మావోయిస్టులు చెలరేగిపోయారు. జికె వీధి మండలంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత మార్చారు. జికె వీధి మండలం కుంకుంపూడిలో కిరాణం వ్యాపారి గుండురావు పోలీసులతో సఖ్యతగా ఉంటున్నాడని.. పోలీసు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారన్న నెపంతో మావోయిస్టులు అతన్ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అక్కడ ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలలకం రేపింది.

 

11:15 - March 7, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శివాలయాలు శివనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి.
విశాఖపట్నంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముక్కంటి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు.
కీసర గుట్టలో శివనామ స్మరణం 
కీసర గుట్ట శివనామ స్మరణ మారుమ్రోగుతోంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పశ్చిమ ముఖాన ఉన్న శివలింగం అత్యంత శక్తివంతమైందని పూజరలంటున్నారు. ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించి.. తొలిపూజలు చేయడంతో ఈ ఆలయానికి శ్రీరామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందంటున్నారు. 
సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో తొలి పూజ అర్ధరాత్రి ఒంటిగంటకే ప్రారంభమైంది. హోంమంత్రి చినరాజప్ప తొలిపూజ చేశారు. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేటిలో స్నానాలు చేసి.. స్వామివారిని దర్శించుకున్నారు. శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులకు విశ్వాసం. దీంతో భీమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. 
పశ్చిమగోదావరి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు శివరాత్రి రావడంతో 'శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి'ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా స్వామివారి తలపై అన్నపూర్ణదేవి కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 
యాదాద్రిలో శివరాత్రి ఉత్సవాలు
యాదాద్రిపై కొలువైన శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక సేవపై కళ్యాణ మండపానికి చేరుకున్న శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. రకరకాల ఆభరణాలతో స్వామిఅమ్మవార్లను అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

365 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం..

కృష్ణా : రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు భారీగా బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చంద్రలపాడు మండలం బొబిళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బియ్యం అక్రమంగా లోడ్ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 365 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కారు - లారీ ఢీ: 5గురి మృతి

మహబూబ్‌నగర్‌ : కొండగల్‌ మండలం చిక్కపల్లి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా... మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇంకా లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

మూసీని పరిశీలించిన మంత్రికేటీఆర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ మూసీనది ప్రక్షాళనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మూసీనది మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీనది ప్రక్షాళనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్ పేటలో అధికారులు మంత్రి కేటీఆర్#కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

కృష్ణా నదిలో ముగిని విద్యార్థి మృతి..

గుంటూరు: కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగి పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ఈరోజు ఉదయం జరిగింది. మృతుడిని తాడేపల్లి మండలం కొలనుకొండ వాసిగా గుర్తించారు.

11:05 - March 7, 2016

అమెరికా : ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ రాయ్ టామ్లిసన్(74) ఆదివారం కన్నుమూశారు. అమెరికాలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కంప్యూటర్ ప్రోగామర్‌గా కెరీర్ ప్రారంభించిన రాయ్ ఆదిలోనే ఈ-మెయిల్‌ను కనిపెట్టారు. మెయిల్స్ వినియోగం విశ్వవ్యాప్తం కావడంలోనూ రాయ్ ప్రధాన పాత్ర పోషించారు. 1971లో బోస్టన్‌లో తాను పని చేస్తున్న సంస్థలోని తోటి ఉద్యోగికి తొలిసారిగా ఎలక్ట్రానిక్ మెయిల్‌ను విజయవంతంగా పంపారు. ఇక మెయిల్ ఐడీలోని ‘@’ ఈ గుర్తును వినియోగంలోకి తెచ్చింది కూడా రాయ్‌నే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్‌గా పని చేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత ఈమెయిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇంటర్నెట్ వ్యాప్తికి విశేష కృషి చేసినందుకుగానూ రాయ్ 2012లో ‘ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌’గా గుర్తింపు పొందారు. 1941 ఏప్రిల్ 23న రాయ్ న్యూయార్క్‌లో జన్మించారు. 

10:45 - March 7, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శివాలయాలు శివనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి.
కీసర గుట్ట
మహాశివరాత్రి సందర్భంగా కీసర గుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
శ్రీశైలాంలో భక్తుల సందడి 
శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మల్లిఖార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 
కోటప్పకొండకు భక్తుల తాకిడి
గుంటూరు జిల్లా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

 

10:30 - March 7, 2016

హైదరాబాద్ :విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గోవా ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విరాట్ ఉన్న వేళ, షిప్ బాయిలర్ రూము నుంచి ఆవిరి లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ నలుగురు ఉద్యోగులు ఉన్నారని, వారిలో చీఫ్ ఇంజనీరింగ్ మెకానిక్ ఆషూ సింగ్ మరణించారని అధికారులు తెలిపారు. మిగతా ముగ్గురూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం లేదని అన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఐఎన్ఎస్ విరాట్, దాదాపు 60 సంవత్సరాలుగా సేవలందిస్తోంది. ఈ సంవత్సరంలో రిటైర్ కానున్న నౌకను, విశాఖ తీరంలో టూరిజం అభివృద్ధి కోసం నిలపాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

10:29 - March 7, 2016

హైదరాబాద్ : ఎపి, తెలంగాణలో మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శివాలయాలు శివనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. 
తూర్పుగోదావరి 
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజశ్వేరిదేవి, దత్తాత్రేయస్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. ఇంకా భారీగా భక్తులు క్యూలైన్లలో వేచి వున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
కరీంనగర్‌ 
కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు వేచిఉన్నారు.  
ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు.
ఆఅయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడకక్కడ భక్తులు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. 
కీసర గుట్టకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్భంగా కీసర గుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కష్టాలు తొలిగిపోతాయని.. సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
శ్రీకాళహస్తికి భారీగా భక్తులు  
శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి వున్నారు. 
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు 
శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మల్లిఖార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 
'అనంత'లో  శివరాత్రివేడుకలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రివేడుకలు మొదలయ్యాయి. ముక్కంటి దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. పెన్నా నది ఒడ్డున వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామిని తెల్లవారుఝామునే అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
కృష్ణా నదీ తీరంలో పుణ్యస్నానాలు 
శివరాత్రి సందర్భంగా విజయవాడ కృష్ణా నదీ తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 
విజయవాడ కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. శైవక్షేత్రాలకు వెళ్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నర్సింహరావు అందిస్తారు. 
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శివరాత్రి వేడుకలు 
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. సత్యసాయి విద్యార్ధులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. శివుడి వేషదారణతో చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. 

10:27 - March 7, 2016

హైదరాబాద్ : సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింతా మొత్తానికి ఒప్పేసుకుంది. తన పెళ్లయినట్లు బాలీవుడ్ నటి ప్రీతీజింతా మీడియాకు స్పష్టం చేసింది. ఆమె తన భర్త ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఈమధ్య కబీర్బేడీ ట్వీట్తో ప్రీతి పెళ్ళయినట్లు అందరికీ తెలిసింది. కానీ, స్వయంగా ఆమె ఈ విషయం ముందు చెప్పలేదు. దీంతో అది నిజమా కాదా అని అందరూ సందేహంలో పడ్డారు. కానీ, ఈ సొట్ట బుగ్గల చిన్నది తాజాగా తన భర్త ఫొటోను పోస్ట్ చేసి తెరదించింది. ఆమె బ్యూ జీనే గూడెనఫ్ అనే అమెరికన్ ను వివాహం చేసుకుంది. ఈ వివాహం లాస్ ఎంజెల్స్ లో జరిగినట్లు తెలిపింది. ప్రీతీకి జీనే స్నేహితుడు కూడా. మీడియాలో వచ్చిన కథనాలపై అంతకుముందు చిర్రుబుర్రులాడింది. చివరకు పెళ్ళి నిజమే అని అంగీకరించింది.తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది ప్రీతీజింతా.

10:17 - March 7, 2016

చిలకడదుంప అనేది, ఎల్లపుడు లభించే, చవకైన, ప్రకృతి సిద్ద మరియు అధిక మొత్తంలో బీటా కెరోటిన్'లను కలిగి ఉండే ఆహార పదార్థంగా చెప్పవచ్చు. దీనిని తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని గనిసిగడ్డలు అని కూడా అంటారు. ఇవి తెల్ల, ఎర్రరంగుల్లో వుంటాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. సమతుల ఆహారంలో చిలకడదుంపలకు అగ్రస్థానముంది. వీటి ద్వారా తగినన్ని క్యాలరీలు మాత్రమే కాదు, బోలెడన్ని పోషకాలున్నాయి. సాధారణంగా సంప్రదాయ పండుగల సందర్భంగా, ఉపవాస దీక్షల తర్వాత సమతుల ఆహారం కోసం వీటిని తింటారు. పండుగల సమయాల్లో లేదా ఇతర ముఖ్యమైన సందర్భాలలో హిందూ కుటుంబాలలో ఉపవాసం ఉండటం గమనించవచ్చు. ఉపవాస సమయాల్లో ఆ తర్వాత కూరగాయలు,గింజ ధాన్యాలకు బదులుగా పండ్లు, ఎండించిన వివిధ రకాల పండ్లు, గింజలు, విత్తనాలు, పాలు, చిలకడదుంపలు, పెండలం, బంగాళాదుంపలు లాంటివి వాడతారు. చిలకడ దుంపలలో ఉండే అద్భుతమైన పోషకాలను పరిశోధించిన పౌష్టికాహార నిపుణులు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠం

చిలకడ దుంపలో బీటాకెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. కణజాల క్షీణత వల్ల కలిగే వ్యాధుల నివారణలో ప్రధానపాత్ర వహించే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్‌, బీటాకెరోటిన్‌,క్యాన్సర్‌పై పోరాడుతుంది. కంటికి సంబంధిం చిన ఆరోగ్యరక్షణలోనూ బీటాకెరోటిన్‌ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యరక్షణలో యాంటీ ఆక్సిడెంట్‌ యాంటీ కార్సిజెనిక్‌లలో పుష్కలంగా విటమిన్‌ ‘సి’ ఉంటుంది. పేగులు, పురీషనాళం, ప్రొస్టేట్‌, మూత్రపిండాలు, ఇతర లోపలి శరీరభాగాల్లో క్యాన్సర్‌పైన సమర్థవంతంగా పోరాడుతుందని పౌష్టికాహారనిపుణులు చిలకడదుంపను సిఫార్సు చేస్తున్నారు.

విటమిన్ 'D...

చిలకడ దుంప, విటమిన్ 'D'ని పుష్కలంగా కలిగి ఉండటమ వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది, అంతేకాకుండా, గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. విటమిన్ 'D', థైరాయిడ్ గ్రంధి, దంతాలు, ఎముకలు, కండరాలు మరియు చర్మం వంటి భాగాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

తాపం చల్లార్చే గుణం..

బంగాళాదుంపలోవలెనే చిలకడదుంపలో కూడా తాపం (మంట) చల్లార్చే గుణాలు ఉన్నాయి. ఇందులో గల ‘సి విటమిన్‌, మెగ్నీషియం, బీటాకెరోటిన్‌ మూలంగానే దీనికి ఈ గుణాలున్నాయి. శరీరం లోపలి, వెలుపలి తాపం తగ్గించడంలో చిలకడదుంపలో గల ఈ గుణాలు బాగాపనిచేస్తాయి.

ఆస్త్మా...

ముక్కుదిబ్బడ, శ్వాసనాళాల్లో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే జిగురులాంటి పదార్థాన్ని తగ్గించి ఆస్త్మా రోగులకు బాగా ఉపశమనం కలుగ జేస్తుంది. ఇందులో గల సువాసన ఈ క్రియకు దోహదం చేస్తుంది.

బ్రోంకైటిస్‌.....

చిలకడదుంపలో అధికంగా లభించే ‘సివిటమిన్‌, ఐరన్‌ తదితర పోషకాలు బ్రోంకైటిస్‌తో బాధపడేవారికి బాగా సహాయపడతాయి. బహుశా ఇందులోని తీపి దనం, ఇతర పోషకాల వల్ల శరీరం వెచ్చగా ఉండడానికి దోహదం చేస్తాయి. తద్వారా బ్రోంకైటిస్‌, శ్వాసనాళాల్లో ఇబ్బందులు తగ్గుతాయి.

ఆర్థరైటిస్‌....

ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచడంలో చిలకడదుంపలోని బీటాకెరోటిన్‌, మెగ్నీషియం, విటమిన్‌-బి కాంప్లెక్స్‌ తదితర విటమిన్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్‌ వల్ల కలిగేటువంటి నొప్పులు శమించ డానికి చిలకడదుంపలు ఉడికించిన నీటిని మర్దనా చేస్తే ఉపయోగం ఉంటుంది.

జీర్ణశక్తి.....

బంగాళాదుంపలో కంటే చిలకడదుంపలో ఫైబర్‌ ఎక్కువ. రుచి కూడా ఎక్కువే. జీర్ణశక్తికి బాగా ఉపకరిస్తుంది. చిలకడదుంపల అరుగుదల కూడా తేలిక. ఎందుకంటే ఇందులో పిండిపదార్థాలుంటాయి గనుక.

నీటి సమతుల్యత...

ఇందులో గల ఫైబర్‌ బరక అనిపించే గుణం వల్ల నీటిని శరీరంలో ఉంచుతుంది. అందువల్ల శరీరంలో నీటి సమతుల్యత ఉంటుంది.

పొట్టలో అల్సర్లు...

పొట్ట, పేగుల్లో మృదుత్వం పెంచడానికి చిలకడదుంపలు దోహదం చేస్తాయి. పొట్లలో అల్సర్లు మానడానికి బి కాంప్లెక్సు, విటమిన్‌ సి, బీటాకెరోటిన్‌, పొటాషియం, క్యాల్షియం సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేగాక ఇందులో గల గరుకుతనం మలబద్దకాన్ని నివారించి, పేగు అల్సర్లు ఏర్పడకుండా చూసి అల్సర్ల మంటల్ని తగ్గి గుణంతో పాటు నొప్పి తగ్గించే లక్షణం కూడా ఉంది.

షుగర్‌ వ్యాధి...

చిలకడదుంప షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదన్న నమ్మకం ప్రజల్లో ఉండిపోయింది. ఇది నిజం కాదు. వాస్తవంగా ఇది షుగర్‌ ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇన్సులిన్‌ సక్రమంగా స్రవించి పనిచేయడానికి దోహదం చేస్తుంది. రక్తంలో షుగర్‌ శాతాన్ని క్రమంగా చేస్తుంది. అయితే షుగర్‌ ఉన్నవారు ఎన్ని దుంపలైనా తినవచ్చని దీని అర్థం కాదు. వరి అన్నానికి బదులు కావాలనుకుంటే చిలకడదుంపలు తినవచ్చు.

బరువు పెరుగుదలకు...

బరువు పెరగడానికి కడదుంపలు ఉపయోగపడతాయి. ఇవి తియ్యగా ఉంటాయి. పలు విటమిన్లు గల పిండిపదార్థాలు మాత్రమే గాక ప్రొటీన్లు, ఖనిజాలూ వీటిలో వున్నాయి. మనిషికి శక్తినివ్వడమే పుష్టిని కల్గి స్తాయి. బరువు పెరగాలనుకునేవారు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తీసుకోవడం బదులుగా చిలకడదుంపలు తినవచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం లాంటి దురలవాట్లు నుండి దూరం కావడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆర్థరైటిస్‌, నరాలకు సంబంధించిన రుగ్మతల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందుకే గుండె ఆరోగ్య పరిరక్షణలోనూ ఇవి మేలైనవి. బహుళ ప్రయోజనకారి. పుష్కలంగా ఫైబర్‌ పోషకాలు ఉన్నాయి. అందువల్ల వీటిని హాయిగా వాడుకోవచ్చు.

ఎలా వాడుకోవాలి...

చిలకడదుంపలను కాల్చుకుని, ఉడికించి, పచ్చివి తినవచ్చు. ఎలా తిన్నా చాలా రుచిగా ఉండే పోషకవిలువలు గల ఆహారం, ఈ దుంపల్ని పాతకాలం నాటి నిప్పులమీద కాల్చుకుని తింటేనే ఆరోగ్యకరం.

294 అభ్యర్థుల పేర్లు ప్రకటించిన మమతా బెనర్జీ....

హైదరాబాద్ :పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయగానే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, తమ పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించేశారు. పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకూ, అభ్యర్థులు వీరేనని మమతా బెనర్జీ వెల్లడించారు. 

10 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 10నుంచి వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ, డిప్యూటీ కలెక్టర్ ఎన్.గీతారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వహణకు రూ.75లక్షల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 10నుంచి 20వ తేదీ ఉత్సవాలు జరుగుతాయన్నారు. శ్రీవారి కల్యాణోత్సవానికి కేసీఆర్ హాజరై పట్టువస్ర్తాలు సమర్పిస్తారని తెలిపారు. గవర్నర్ నరసింహన్ కూడా హాజరవుతారని చెప్పారు. 

దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. శైవక్షేత్రాల్లో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. వారణాసి, కాశీ, హరిద్వార్‌, ఉజ్జయినిలో భక్తులు పూజలు చేశారు. గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 

కొత్తూరు అభయాంజనేయస్వామి ఆలయంల చోరీ

ప్రకాశం: కనిగిరి సమీపంలోని కొత్తూరు అభయాంజనేయస్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు హుండి పగలగొట్టి నగదు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి: మోమిన్‌పేట మండలం మేకవానంపల్లి దగ్గర ఆటో- ట్రాక్టర్‌ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

నేటి నుండి ఏడుపాయల జాతర

మెదక్ : నేటి నుండి ఏడు పాయల జాతర ప్రారంభమయ్యింది. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు నేటి నుంచి 9 వరకు జాతర జరుగనున్నది. ఈ జాతరకు సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా వేస్తున్నారు.

09:37 - March 7, 2016

కర్నూలు : మది నిండా భక్తి పారవశ్యం... అణువణువునా శివనామ స్మరణలతో శ్రీశైలం పుణ్యక్షేత్రం మారు మోగుతోంది. శివ భక్తులంతా భూకైలాసంగా భావించే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. పిల్లలు పెద్దలతో పాటు శివమాల ధరించిన భక్తులు ఈ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. 
శివభక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం 
శ్రీశైల మల్లిఖార్జునుడి పుణ్యక్షేత్రం పాహిమాం.. పరమేశా అంటూ మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివభక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలిరావడంతో ఎక్కడ చూసినా భక్తి పారవశ్యం పరవల్లు తొక్కుతోంది. భూకైలాసంగా, శివుడికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశంగా విలసిల్లుతున్న ఈ క్షేత్రం శివరాత్రి పర్వదినం వచ్చిందంటే చాలు శివభక్తులతో కిటకిటలాడుతుంది. కోరిన కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా భావించి భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. 
దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు
బ్రహ్మోత్సవ వేడుకలకు తెలుగు రాష్ట్రాలనుండే కాక.. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. ప్రాంగణం, గోపురాలు విద్యుత్‌ కాంతులతో జిగేల్‌మంటున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. జానపద కళారూపాలు, చెంచు నృత్యాలు, బంజారానృత్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హరహర మహాదేవ... పాహిమాం పరమేశా అంటూ శివ భక్తులు చేసే శివనామ స్మరణ బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి రోజు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. 

ఆటో-ట్రాక్టర్ ఢీ.. ఇద్దరి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని మోమిన్‌పేట సమీపంలోని మేకవనంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

లిఫ్టులో చిక్కుకుని మహిళ మృతి

చైనా : లిఫ్టులో ఇరుక్కుపోయిన మహిళను ఎవరూ గమనించకపోవడంతో ఆమె శవమై నెలరోజుల తర్వాత కనిపించింది. ఈ దురదృష్టకర సంఘటన షియాన్‌ నగరంలో చోటుచేసుకున్నట్టు బీజింగ్‌ యూత్‌ డెయిలీ తెలిపింది. ఆ కథనం ప్రకారం జనవరి 30న నలభైమూడేళ్ల మహిళ ఓ భారీ భవంతిలోని పది, పదకొండో అంతస్తుల మధ్య లిఫ్టులో చిక్కుకుంది. ఇది గమనించని సిబ్బంది విద్యుత్తు ఆపేశారు. కొత్త ఏడాది వేడుకల కోసం వెళ్లిన వారు నెలరోజుల తర్వాతగానీ తిరిగి రాలేదు. విద్యుత్తు ఆపేసేముందు దాన్ని సరైన స్థానంలోకి తీసుకురాలేదనీ, ఈ నిర్వహణా లోపం క్షమించరాని నేరమనీ తమ విచారణలో వెల్లడైందని చైనా ప్రభుత్వం పేర్కొంది.

09:21 - March 7, 2016

కపడ : మనిషికి దెయ్యం పడుతుందా ? దెయ్యం పడితే అది భూత వైద్యుడి చికిత్సకు  పారిపోతుందా...? పూజలు చేస్తే.. పూనకం మటుమాయం అవుతుందా...? శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఈ దెయ్యాలూ, భూతాలు ఉన్నాయా అనే కదా మీ డౌట్‌.. అయితే మీరీ స్టోరీ చూడాల్సిందే...
పొలతల శైవక్షేత్రానికి పోటెత్తిన భక్తులు 
కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శైవక్షేత్రానికి ప్రతి శివరాత్రికి భక్తులు పోటెత్తుతారు. సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమ  శివుని స్మరిస్తూ పూనకంతో ఊగిపోతారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడుతుంటుంది. హిస్టీరియా లాంటి మానసిక రోగులు చిన్నా పెద్దా ఆడ మగా తేడా లేకుండా ఇదిగో ఇలా.. పూనకంతో ఊగిపోతారు. 
భూత వైద్యులు 
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు తమకు దెయ్యం పట్టిందని మొదట కోనేటిలో మునుగుతారు. దుర్గంధం వెదజల్లే కోనేటి నీటిలో మునిగి తడి బట్టలతో శివాలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండిపోతారు. అనంతరం సమీపంలో గల భూత వైద్యుల దగ్గరకు వెళతారు. వాయిద్యాల హోరు, శివుని గీతాలకు అనుగుణంగా భక్తులు ఊగిపోతూ నృత్యాలు చేస్తారు.   
భూత వైద్యులు... చిత్రహింసలు 
భూతవైద్యులు దెయ్యం పట్టిందంటూ మహిళల జుట్లు పట్టి లాగడం, చిత్రహింసలకు గురిచేయడం ఇక్కడ మామూలే. భూత వైద్యులు పెట్టె చిత్రహింసలకు భక్తులు అలసిపోయి పడిపోతారు. దీంతో దెయ్యం వదలిందని    భక్తులు భావిస్తుంటారు. ఈ తతంగంలో భూతవైద్యులు అందినకాడికి దండుకోవడమే కాక, పూనకం వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హిస్టీరియా లాంటి వ్యాధులతో బాధపడే మానసిక రోగుల జేబులు ఖాళీ అవడంతో పాటు ఒళ్లు గుళ్ల చేసుకుని వెళుతున్నారు.  మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయకపోవడం వల్లే ఇలా జరుగుతోందని జనవిజ్ఞాన వేదిక అభిప్రాయపడుతోంది. 
మూఢ విశ్వాసాలు విడనాడాలి : జెవివి
ప్రజలు మూఢ విశ్వాసాలు విడనాడాలని, ప్రజలను  చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జనవిజ్ఞాన వేదిక నాయకులు అంటున్నారు. 

 

08:43 - March 7, 2016

ప్రత్యేకహోదా, ప్యాకేజీ సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, వైసిపి నేత ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్ నేత కొండ వెంకట్వేర్ రావు, టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎపికి నిధులు ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రప్రభుత్వం ఎపికి అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో ఎపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేడు నల్లమల ప్రాంతంలో చెంచుల జాతర

మహబూబ్ నగర్ : జిల్లాలోని నల్లమల ప్రాంతంలో నేడు చెంచుల జాతర జరుగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల చెంచులు హాజరు కానున్నారు.  

గుంటూరు జిల్లాలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

గుంటూరు : జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయం, పెదకాకాని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం,  అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 

విశాఖ జిల్లాలోని శివాలయాల్లో భక్తుల కిటకిట

విశాఖ : మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు ఉదయం నుంచే దర్శనానికి వేచివున్నారు. సాయంత్రం బీచ్ రోడ్డులో అతి పెద్ద శివలింగానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు.

 

శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

కర్నూలు : శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

నీలకంటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు

నిజామాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నీలకంటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద బారులు తీరారు.  

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కరీంనగర్ : మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. 

07:41 - March 7, 2016

ఢాకా: సిరీస్ ఆసాంతం చక్కటి ప్రదర్శన చేసినా బంగ్లాదేశ్ కల నెరవేరలేదు. ఎలాగైనా ఆసియా కప్‌ను సాధించాలన్న బంగ్లా బెబ్బులులు... టీమిండియా ముందు తోక ముడిచాయి. మీర్పూర్ వేదికగా బంగ్లాతో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరోసారి ఆసియా కప్పును సొంతం చేసుకుంది. స్లాగ్ ఓవర్లలో ఫోర్లు సిక్సర్లు బాదుతుంటే విజయం తమదే అనుకున్నారు..
బంగ్లా అభిమానుల కల కల్లే
బంగ్లా స్కోరు ఒక్కసారిగా పెరిగిపోతుంటే భారత్‌కు కష్టాలు తప్పవని భావించారు.. కానీ ఏం లాభం ధవన్‌, కోహ్లీ, చివర్లో ధోనీ చెలరేగి ఆడటంతో బంగ్లా అభిమానులకు మిగిలింది ఈ నిరాశ నిస్పృహలే.. ఆసియా కప్‌ ఫైనల్‌లో ఏదైనా అద్భుతాలు నమోదవుతాయేమోనన్నబంగ్లా అభిమానుల కల కల్లే అయింది. విజయం భారత్ వశమైంది. 
అందరిలో అంచనాలు పెంచిన బంగ్లాదేశ్ 
శ్రీలంక, పాక్ లాంటి బలమైన టీమ్స్ ను వెనక్కు నెట్టి ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్ అందరిలోనూ అంచనాలు పెంచింది. ఈ బిగ్‌ ఫైట్‌ కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తగా మీర్‌పూర్‌ షేర్ ఏ బంగ్లా స్టేడియం నిండిపోయింది. వర్షం అడ్డంకిగా మారడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. అయితే టాస్‌ గెలిచిన ధోనీ మరో ఆలోచన లేకుండా ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌ బౌండరీలతో టీంకు శుభారంభాన్ని ఇచ్చారు. తమీమ్ ఇక్బాల్‌ 17 బంతుల్లో 13 రన్స్‌, సౌమ్య సర్కార్‌ 9 బంతుల్లో 3 ఫోర్లు బాది 14 రన్స్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీలో సౌమ్య సర్కార్‌ను నెహ్రా ఔట్‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన షబ్బీర్‌ అలీ 32 పరుగులు, షకిబ్ అల్‌ హసన్ 16 బంతుల్లో 21 పరుగులు చేసి స్కోర్‌ పెంచారు. వారు అవుటయ్యాక ముష్ఫికర్ రహీమ్‌ 4 పరుగుల వద్ద రనౌటవగా మోర్తజా కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 
భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మహ్మదుల్లా 
స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మదుల్లా భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 13 బంతులకే 33 పరుగులు చేశాడు. భారత్‌ బౌలర్లలో నెహ్రా, అశ్విన్‌, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు. 
ధవన్‌ చెలరేగాడు... 
బంగ్లా 120 పరుగులు చేయగా 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కూల్‌గా ఆడుతూ వచ్చింది. ఈసారి రోహిత్ శర్మ విఫలమైనా ధవన్‌ చెలరేగి ఆడాడు. రోహిత్‌ ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, ధవన్‌ చెలరేగి ఆడి స్కోర్‌ను తగ్గించేశారు. ధవన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు.
దూకుడుగా ఆడిన ధోని 
అయితే ఒక దశలో బంతులకు చేయాల్సిన రన్స్ కు మధ్య తేడా పెరిగిపోవడంతో భారత్‌ అభిమానులు కొద్దిగా కంగారుపడ్డారు. కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనుకుంటుండగా శిఖర్ 60 పరుగుల వద్ద టస్కిన్ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటై వెనుదిరిగాడు. అయితే 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజ్‌లో దిగిన ధోని దూకుడుగా ఆడి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
భారత్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర 
ధోని కేవలం 6 బంతులు ఎదుర్కొని 20 రన్స్ చేశాడు. అందులో ఒక ఫోరు, రెండు సిక్సర్లు ఉన్నాయి. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 41 రన్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
ఆరోసారి ఆసియా కప్‌ చేజిక్కించుకున్న భారత్ 
ఈ మ్యాచ్‌ గెలుపుతో ధోని కెప్టెన్సీలో రెండోసారి టోటల్‌గా భారత్ ఆరోసారి ఆసియా కప్‌ను చేజిక్కించుకున్నట్లైంది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 300 సిక్సర్లు బాదిన ధోని ఆ రికార్డ్ సృష్టించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్ ధవన్‌కు దక్కగా మ్యాన్ ఆఫ్‌ ద సిరీస్ మాత్రం బంగ్లా ఆటగాడు షబ్బీర్ రెహమాన్‌కు దక్కింది. 

07:32 - March 7, 2016

కేరళ : ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి కన్నుమూశారు. ఆయన వయసు 44 ఏళ్లు. కొంతకాలంగా  కాలేయ, మూత్రపిండాల వ్యాధితో  బాధపడుతున్న కళాభవన్‌ మణి... శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యలు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.  తెలుగులో జెమిని, ఎవడైతే నాకేంటి తదితర చిత్రాల్లో కళాభన్‌ మణి  నటించారు. 
అందరి ప్రశంసలు అందుకున్న మణి 
కళాభవన్‌ మణి... మలయాళ చిత్ర పరిశ్రమలో హాస్యాన్ని పండించి... అందరి ప్రశంసలు అందుకున్న నటుడు. ఈయన ఇకలేరు. తన 44వ ఏటనే కన్నుమూశారు. కళాభవన్‌ మణి కొంతకాలంగా కాలేయ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని అమిత్ర ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయూ అత్యవసర వైద్యసేవలు తీసుకుంటు ఆదివారం రాత్రి 7.15 గంటలకు కన్నమూసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 
మిమిక్రీ కళాకారుడిగా వృత్తి జీవితం ప్రారంభం 
మిమిక్రీ కళాకారుడిగా వృత్తి జీవితం ప్రారంభించిన కళాభవన్‌ మణి 200లకు పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ పండించారు. విలన్‌గా రాణించి, అభిమాలను మెప్పించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో విభిన్న ప్రాతల్లో నటించారు. తెలుగులో జెమిని తో కళాభవన్‌కు మంచి పేరు వచ్చింది. అర్జున్‌, నరసింహుడు, ఎవడైతే నాకేంటి... చిత్రాల్లో కూడా కళాభవన్‌ మణి నటించారు. 
కుటుంబ సభ్యులకు సానుభూతి 
కళాభవన్‌ మణి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరలిలోటంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

నేడు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేడు ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.45 గంటలకు సీఎం వెళ్లనున్నారు. రేపు మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఒప్పందాలు చేసుకోనున్నారు. 

07:23 - March 7, 2016

హైదరాబాద్ : అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది సంక్షేమ శాఖ అధికారుల పరిస్థితి. దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ఎదురౌతున్న చిక్కులతో సతమతమవుతున్న సిబ్బంది... క్షేత్రస్థాయిలో భూ సేకరణకు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మకందారులు ముందుకు రాకపోవడంతో ఆ ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు.
ప్రధాన సమస్యగా భూ సేకరణ
తెలంగాణలో దళితులకు భూ పంపిణీ ప్రక్రియ నత్తకు నడకలు నేర్పిస్తున్నట్లుగా తయారైంది. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ జిల్లాలోనూ టార్గెట్‌ను రీచవలేకపోయింది. అసలు భూ సేకరణే ప్రధాన సమస్యగా మారడంతో అధికారులకు ఇబ్బందులు తప్పట్లేదు.
పంపిణీపై నివేదిక ఇవ్వాలని సిఎస్ ఆదేశాలు
డబ్బు ఎంత ఖర్చైనా భూములు కొనుగోలు చేయాలని సిఎం కెసిఆర్ చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటివరకు ఏ జిల్లాలో ఎంతమేర పంపిణీ జరిగిందో వాటి వివరాలతో నివేదిక అందించాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశించారు. 2014 ఆగస్ట్‌ 15న ప్రారంభమైన ఈ పథకం అమలు తీరుపై కనీసం సమీక్షించిన దాఖలాలూ కనిపించడం లేదు. తాజాగా బడ్జెట్‌ సమావేశాలు వస్తుండడంతో అసెంబ్లీలో నివేదించేందుకు ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈమధ్యకాలంలో సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్న సిఎస్ రాజీవ్ శర్మ రీసెంట్‌గా భూ పంపిణీ అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినా ఆయనకింకా నివేదిక అందలేదు. 
కనీస లక్ష్యాలు అందుకోని వైనం
ఈ ఏడాది నిర్ణయించుకున్న లక్ష్యంలో కనీసం 30 శాతం కూడా రీచ్‌ కాకపోవడంతో సిఎస్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్పీడ్‌ పెంచాలని ఆదేశించారు. అయితే చాలా మంది అధికారులు తమ ప్రాంతాల్లో తగినంత ప్రభుత్వ భూమి లేదని ఎకరాకు 2 నుంచి 7 లక్షల మధ్య వెచ్చించి భూములు సేకరిద్దామన్నా అమ్మడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒక నివేదిక రూపంలో సిఎస్‌కు అందించినట్లు సమాచారం. 
2,878 మందికి భూ పంపిణీ చేసేందుకు సిద్ధం
ఇప్పటివరకు మొత్తం 2,878 మంది లబ్ధిదారులకు 8,634 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ఎస్సీ కార్పోరేషన్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సిఎస్‌కు తెలిపారు. గత నెల వరకు సుమారు 2 వేల మందికి 6100 ఎకరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అయితే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే 54 శాతం పంపిణీ చేశారు. మెదక్‌ జిల్లాలో 43 శాతం, ఆదిలాబాద్‌లో 42, వరంగల్‌ జిల్లాలో 29 శాతం మేర లక్ష్యాలను సాధించారు. మిగిలిన జిల్లాల్లో దళితులకు భూ పంపిణీ ప్రక్రియ 20 శాతంలోపే జరిగింది. రంగారెడ్డి జిల్లాలో కేవలం 12 మందికి మాత్రమే భూ పంపిణీ చేయడంతో ఆ జిల్లా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 
భూముల కొనుగోలుకు రూ.431 కోట్లు 
భూముల కొనుగోలుకు 431.70 కోట్ల రూపాయలు అందుబాటులో ఉండగా కేవలం 103.82 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు నివేదికలో తెలిపారు. తెలంగాణలో భూమిలేని దళిత కుటుంబాలు 8 లక్షలుదాకా ఉన్నాయి. ఇంతమందికి పంచాలంటే 24 లక్షల ఎకరాలు అవసరం. అన్ని ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద భూమీ లేదు. భూములు కొనుగోలు చేసేంత డబ్బూ లేదు. అంత భూమి కొనుగోలు చేయాలంటే కనీసం లక్షా 20 వేల కోట్ల రూపాయలు కావాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దళితులకు భూ పంపిణీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఏమని జవాబిస్తుందో చూడాలి. 

మూసీ నది వెంట నేడు మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన

హైదరాబాద్ : మూసీనదికి పూర్వవైభవం తేవాలన్న ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నది వెంబడి విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నది ప్రక్షాళన, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరు, సుందరీకరణకు ఉన్న అవకాశాలు పరిశీలించనున్నారు.

వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : మహా శివరాత్రి సందర్భంగా కరీంనగర్‌లోని వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నేడు, రేపు రాజన్న ఆలయంలో ఘనంగా జాతర జరగనుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక ఉదయం 7 గంటలకు టీటీడీ అర్చకులు రాజన్నకు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శేష వస్ర్తాలు సమర్పించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు లఘుదర్శనం అమలు చేయనున్నారు. సాయంత్రం 6.05 గంటల నుంచి ఆలయంలో మహా లింగార్చన కార్యక్రమం జరగనుంది.

07:12 - March 7, 2016

హైదరాబాద్ : ఉద్యమ పార్టే అధికార పార్టీగా అవతరించింది. ప్రభుత్వం మనదే..పార్టీ మనదే అనుకుని అంతా సంబరపడ్డారు. కానీ..అధికార పార్టీగా అవతరించి రెండేళ్లు పూర్తయినా..ఇప్పటికీ పార్టీ కార్యవర్గాలు నియామకం జరగకపోవడం గులాబీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో హోదా లభిస్తుందేమోనని నేతలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. 
తీవ్ర నిరాశలో టీఆర్‌ఎస్‌ నేతలు
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ పదవుల నియామకం చేపట్టకపోవడంతో.. నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. టిఆర్‌ఎస్ కార్యవర్గాలన్నీ రద్దు చేసి సుమారు ఏడాది అవుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం గతేడాది పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అంతేస్థాయిలో మొదటిసారి ప్లీనరీని నిర్వహించారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యం కావడంతో జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంది పార్టీ. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మినహా..రాష్ట్ర కార్యవర్గం ఏర్పడలేదు. అంతేకాదు..జిల్లాల్లో ఇప్పటివరకు కార్యవర్గాల ఏర్పాటుకు పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. ఒకటి రెండు జిల్లాల్లో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు అనధికారికంగా పదవుల పంపిణీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుపై ఇంకా పార్టీలో ఎలాంటి చర్చా జరగడంలేదు. 
గతేడాది సభ్యత్వ నమోదు 
అధికార పార్టీగా ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ అనేక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి రావడంతో పార్టీ పదవులపై సీఎం కేసీఆర్‌ అంతగా దృష్టిసారించలేదని పార్టీవర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతో పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండడంతో ఈ నెలాఖరు వరకు కూడా పార్టీపరంగా పెద్దగా కార్యక్రమాలు ఉండకపోవచ్చనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే వచ్చే నెలలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి రాష్ట్ర కార్యవర్గం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా..పార్టీ నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి రావడంతో అప్పుడే పార్టీ పదవులు భర్తీ కానున్నాయి. 
పార్టీ పదవులపై దృష్టిపెట్టని కేసీఆర్ 
అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పరంగా పదవులు పొందిన నేతలు మినహా...పార్టీలో ఇతరనేతలెవరికి పదవులు దక్కకపోవడంతో నేతల్లో అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. అది పెరగకముందే ఏదో ఒక పదవి కట్టబెడితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. 

07:06 - March 7, 2016

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్ట్ లకు సంబంధించి తెలంగాణ-మహారాష్ట్రల మధ్య కీలక ఒప్పందానికి   ముహూర్తం ఖరారైంది. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ సహా ఐదు ఆనకట్టల నిర్మాణానికి అంతర్‌ రాష్ట్ర జల ఒప్పందం కుదుర్చుకోవాలని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. మంగళవారం ముంబైలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల మధ్య ఒప్పందాలు జరుగుతాయి. ఇందుకోసం కేసీఆర్‌తోపాటు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు  ఇవాళ సాయంత్రం ముంబై బయలుదేరి వెళతారు. వీరి వెంట ఉన్నతాధికార ప్రతినిధి బృందం కూడా ఉంటుంది. 
తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు   
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఆనకట్టల విషయంపై తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు  ఒప్పందాలు చేసుకోనున్నాయి. అంతర్‌రాష్ట్ర సమస్యలు, వివాదాలకు తావులేకుండా నిర్మాణాలు చేపట్టేందుకు ఈ ఒప్పందాలు కీలకం కానున్నాయి. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, పెన్‌గంగ్‌పైన చేపట్టనున్న చనాఖా-కొరాటా, రాజుపేట, పెన్‌పహాడ్‌ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ముందుగానే ఒప్పంద ముసాయిదాలను తయారుచేసి.. మహారాష్ట్రకు పంపారు. వీటిని అధ్యయనం చేసిన  మరాఠా సర్కార్‌... ఒప్పందానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 
సూత్రప్రాయంగా అంగీకారం
ఒప్పందాల్లోని అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. అయితే ప్రతి బ్యారేజీకి ముఖ్యమంత్రులు, కార్యదర్శులు, చీఫ్‌ ఇంజినీర్ల స్థాయిలో కమిటీలు ఉండాలని మహారాష్ట్ర కోరుతోంది. ఇన్ని కమిటీలు అవసరంలేదని... అన్నింటికి కలిపి ఒకే కమిటీ ఉంటే పర్యవేక్షణ తేలిక అవుతుందని, సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలంగాణ సర్కార్‌ సూచిస్తోంది. వీటిపై ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. మంగళవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తుది విడత చర్చించిన తర్వాత అంతిమ నిర్ణయం తీసుకుంటారు. 
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరు కాళేశ్వరంగా మార్పు 
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పధకానికి 2012లోనే అప్పటి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పాజెక్ట్‌ పేరును ఇప్పుడు కాళేశ్వరంగా మార్చారు. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టంతో ఆనకట్ట నిర్మించాలని కాంట్రాక్టర్లతో ఒప్పందం కూడా చేసుకుంది. అయితే  ఈ ఎత్తుతో తుమ్మిడిహట్టి నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుందని ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలో చర్చలు జరిపినప్పుడు కూడా తుమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లపై అంగీకారం కుదరలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం కష్టమవుతుందని భావించిన తెలంగాణ సర్కార్‌.... 148 ఎత్తులోనే ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రీడిజైన్‌ చేసింది. ఈ ఎత్తులో ప్రాజెక్ట్‌ నిర్మిస్తే ఆదిలాబాద్‌ ఆయకట్టుకే పరిమితం అవుతుంది. 
మేడిగడ్డ దగ్గర 103 మీటర్ల ఎత్తు ఆనకట్ట 
కాళేశ్వరంకు దిగువన మేడిగడ్డ దగ్గర మరో బ్యారేజి నిర్మించి,  గోదావరి నీటిని ఎల్లంపల్లికి  మళ్లిస్తారు. మేడిగడ్డ దగ్గర 103 మీటర్ల స్థాయి నీటిమట్టంతో ఆనకట్ట నిర్మించి 28.26 టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. అన్నారం దగ్గర 124.5 మీటర్లతోఎ బ్యారేజీ నిర్మించి 11.77 టీఎంసీలు, సుందిళ్ల దగ్గర 134.5 మీటర్ల మట్టంతో ఆనకట్ట నిర్మించి 5.46 టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం తెలంగాణ సర్కార్‌ 5,813 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ-మహారాష్ట్రల మధ్య ఒప్పందాలు కుదిరిన తర్వాత నిర్మాణాలు చేపడతారు. తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుంది. 

 

07:01 - March 7, 2016

చిత్తూరు : జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటీశ్వరాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున అటవీశాఖ  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి....శ్రీకాళహస్తీశ్వరుడికి  ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. 
వైభవంగా మహా శివరాత్రి 
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముక్కంటేశ్వరుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 
మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పట్టవస్త్రాలు 
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పట్టవస్త్రాలు సమర్పించారు. త్రినేత్ర అతిధిగృహం నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చిన మంత్రికి ఆలయ చైర్మన్‌ గురవయ్యనాయుడు, పాలక మండి సభ్యులు, అధికారులు స్వాగతం పలికారు.
స్వామి అమ్మవార్ల చిత్రపటాల బహూకరణ
అనంతరం మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి భజంత్రీల మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయంలోని అలంకార మండలం దగ్గరకు చేరుకుని.. ప్రధాన అర్చకుడు బాబుగుర్‌కుల్‌కు పట్టువస్త్రాలు అందజేశారు. ఆ వస్త్రాలను స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వాయులింగేశ్వరున్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం దక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మంత్రికి ఆశీర్వదించి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఈవో బహూకరించారు. 
భక్తుల సౌకర్యార్ధం ఒకరోజు ముందుగానే 
సోమవారం మహాశివరాత్రి సందర్భంగా వాయులింగేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, భక్తుల సౌకర్యార్ధం ఒకరోజు ముందుగానే సమర్పించారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌ మరింత పురోగతి సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ముక్కంటీశ్వరుడిని ప్రార్ధించానన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం : ఆయల అధికారులు 
శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌక్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయల అధికారులు చెబుతున్నప్పటికీ... వీఐపీల సేవల్లో తరిస్తూ.... సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

06:52 - March 7, 2016

ఢిల్లీ : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం ఘనంగా ప్రారంభమైంది. ప్రజలు భక్తిప్రపత్తులతో శివరాత్రి పర్వదినాన్ని జరపుకుంటున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ, శంభోశంకర.. నాదాలతో ఆలయాలన్నీ మార్మోగిపోతున్నాయి. ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానాలు ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. శివమాల ధరులు దీక్షలు విరమించేందుకు శ్రీశైలానికి పోటెత్తారు. కొందరు సమీప ఆలయాల్లో దీక్షలు విరమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ, విజయవాడ తదితర క్షేత్రాలన్నీ భక్తజనాలతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోటప్పకొండ తదితర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ని భక్తి ప్రపత్తులతో పూజిస్తే కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

 

06:49 - March 7, 2016

 'సినీ జీవితంలో నేనెప్పుడూ అవార్డుల కోసం, బిరుదుల కోసం పాకులాడలేదు. అయినప్పటికీ గతేడాది తెలంగాణ ప్రభుత్వం 'నవరసరాయ'తో సత్కరిస్తే, తాజాగా అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంద'ని అంటున్నారు సీనియర్‌ నటుడు నరేష్‌. డాక్టరేట్‌ అందుకున్న నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'అమెరికా బేస్డ్‌ యూనివర్సిటీ 'అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌' డాక్టరేట్‌ను ప్రదానం చేయడం ఆనందంగా ఉంది. సౌత్‌ ఇండియా నుంచి ఇద్దరికి ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, తెలుగు రాష్ట్రం నుంచి నేను ఎంపికయ్యాను. శనివారం బెంగుళూరులో ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఏషియన్‌ చార్ట్‌లో డిగ్రీ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగంలో నాకు ఈ డాక్టరేట్‌ ఇవ్వడం గర్వంగా ఉంది. నాకు నటన నేర్పిన గురువులు విజయనిర్మల, జంధ్యాలకు, అండగా నిలిచిన కృష్ణగారికి, నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, మంచి పాత్రలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న దర్శకులకు ఈ డాక్టరేట్‌ను అంకితమిస్తున్నాను. ప్రస్తుతం ఇండిస్టీలో మంచి సినిమాలొచ్చి, పెద్ద విజయం సాధిస్తున్నాయి. సస్సెస్‌లతో ఇండిస్టీ కళకళలాడుతోంది. అలాగే నా కెరీర్‌ పరంగా కూడా చాలా బాగుంది. మంచి పాత్రలొస్తున్నాయి. తాజా డాక్టరేట్‌ మరింత బాధ్యతను పెంచడంతోపాటు టాలెంట్‌ను పెంచుకునే దిశగా మోటివేట్‌ చేసింది. ఈ అవార్డు నటుడిగా నన్ను మరో పది మెట్లు ఎక్కించింది. ఇటీవల నేను నటించిన 'గుంటూరు టాకీస్‌' విడుదలై మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం 'శ్రీ శ్రీ' చిత్రంలో కూడా అద్భుతమైన క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను చూడని విధంగా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను. అలాగే 'బ్రహ్మోత్సవం', 'అ.. ఆ' చిత్రాల్లో కూడా మంచి పాత్రల్నే చేస్తున్నాను. ఇలాంటి పాత్రలను ఇస్తున్నందుకు దర్శకులకు, ఆ పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను' అని అన్నారు.

 

06:43 - March 7, 2016

మానస్‌, సనమ్‌శెట్టి జంటగా 'కళా' సందీప్‌ బి.ఏ దర్శకత్వంలో డిజి పోస్ట్‌ సమర్పణలో ఎస్‌.ఎస్‌. సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'ప్రేమికుడు'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఓ అందమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వినూత్నమైన కథ, కథనాలతో, విజువల్‌ ట్రీట్‌తో, చక్కటి సంగీతంతో ఆహ్లాదంగా సాగే యూత్‌ఫుల్‌ చిత్రమిది. స్వచ్ఛమైన లవ్‌ ఫీలింగ్స్‌కి అద్దంలా ఉంటుంది' అని అన్నారు. 'దర్శకుడు 'కళా' సందీప్‌ ఈ చిత్రాన్ని నేటి యువతకి కనెక్ట్‌ అయ్యేలాగా అందంగా తీర్చిదిద్దారు.ఈ నెల 13న హైదరాబాద్‌లోని రాక్‌ హైట్స్ లో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. వేసవిలో సినిమాను విడుదల చేస్తున్నాం' అని నిర్మాత తెలిపారు.

06:39 - March 7, 2016

 బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ల మోత మోగించిన సిరీస్‌ 'రేస్‌' సిరీస్‌. హై ఇంటెలిజెంట్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 'రేస్‌', 'రేస్‌2' చిత్రాలొచ్చాయి. ఈ రెండు చిత్రాల రూపకల్పనకు హాలీవుడ్‌ చిత్రం 'గుడ్‌ బై లవర్‌' ఆధారం. ఈ సిరీస్‌లో భాగంగా 'రేస్‌ 3'ని నిర్మించేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాయకానాయికలుగా రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొనె నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని సమాచారం. 'రేస్‌2'లో కూడా సైఫ్‌ ఆలీఖాన్‌కి జోడీగా దీపికా నటించింది. 'బాజీరావు మస్తానీ' తర్వాత రణ్‌వీర్‌తో దీపికా నటించబోయే చిత్రమిది. దీపికా ప్రస్తుతం హాలీవుడ్‌ 'త్రిఫుల్‌ ఎక్స్‌'లో నటిస్తూ బిజీగా ఉంది.

'ఐఎన్‌ఎస్ విరాట్' లో అగ్నిప్రమాదం.. సైనికుడు మృతి

హైదరాబాద్ : నౌకాదళం నుంచి విరమణ చేసిన ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధవాహకనౌకపై ఆదివారం అర్ధరాత్రి చెలరేగిన మంటల్లో ఒక సైనికుడు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోవా తీరంలో నిలిపి ఉంచిన విరాట్ యుద్ధ నౌకలోని బాయిలర్ రూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

Don't Miss