Activities calendar

08 March 2016

రాజ్యసభలో రేపు మోడీ ప్రసంగం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో రేపు ప్రసంగించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రసంగ తీర్మానంపై మోడీ ధన్యవాదాలు తెలుపనున్నారు. 

రేపు బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. వివిధ రాష్ట్రాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై సమావేశం చర్చిస్తారని తెలుస్తోంది. 

ఆర్జిత సేవా టికెట్ల కొనుగోళ్లకు ఆధార్ తప్పనిసరి..

తిరుమల : ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్ల కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి అని టిటిడి పేర్కొంది. 

సూర్యగ్రహణం..కాళహస్తిలో యథావిధిగా పూజలు..

తిరుపతి : సూర్యగ్రహణంలోనూ కాళహస్తి ముక్కంటి ఆలయంలో యదావిధిగా పూజలు జరగనున్నాయి. బుధవారం ప్రత్యేక అభిషేకాలు, రాహు - కేతు పూజలు యథాతథంగా జరగనున్నాయి. 

బుధవారం కాణిపాక ఆలయం మూసివేత..

చిత్తూరు : బుధవారం సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాక వినాయక స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10గంటలకు ఆలయం తెరుచుకోనుంది. 

బినామీ ఆస్తులుంటే నిరూపించాలి - నారాయణ..

విజయవాడ : బినామీ ఆస్తులుంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తానని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అలా నిరూపించలేకపోతే వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. 

21:30 - March 8, 2016

ఢిల్లీ : దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనకపోవడం శోచనీయమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హెచ్‌సియు, జెఎన్‌యు, తాజాగా అలహాబాద్‌ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఘటనలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. మోది ప్రభుత్వం హిందూ రాజ్యస్థాపనే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేస్తోందని ఏచూరి విమర్శించారు. ఆయన ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

21:29 - March 8, 2016

ఢిల్లీ : ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. అన్నివర్గాల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో దీనిపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ ఘనత తమకే దక్కుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈపీఎఫ్‌లో 60 శాతం మొత్తంపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. 2016-17 బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఏప్రిల్‌ 1 తర్వాత ఈపీఎఫ్‌లో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపై పన్ను విధిస్తామని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదన్నారు. దీనిపై విపక్షాల నుంచే కాకుండా మధ్యతరగతి ఉద్యోగులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అందరి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు జైట్లీ వెల్లడించారు.

మంచి నిర్ణయమన్న రాహుల్..
తమ ఒత్తిడి వల్లే మోడీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. మధ్యతరగతి ప్రజల్ని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూసిందని, ప్రభుత్వంపై తాను చేసిన ఒత్తిడి పనిచేసిందని రాహుల్‌ చెప్పుకున్నారు. కేంద్ర ప్రతిపాదనను తప్పుపడుతూ రాహుల్‌ పార్లమెంట్‌లో నరేంద్రమోదిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ సోమవారం జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన కూడా చేసింది.

పలు విమర్శలు..
ఈపిఎఫ్‌లో 60 శాతం మొత్తంపై పన్ను విధించాలన్న ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో- ప్రధాని మోడీ సూచన మేరకు ఈ ప్రతిపాదనను జైట్లీ వెనక్కి తీసుకున్నారు. పెన్షన్‌ స్కీముకు ప్రోత్సాహం ఇవ్వడానికే పన్ను విధించినట్టు కేంద్రం తమ ప్రతిపాదనను సమర్థించుకుంది. ఈపీఎఫ్‌ చందాదారుల్లో కేవలం 60 లక్షలమందిపైనే పన్ను ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిర్లక్ష్య పూరిత వ్యయాల్ని పరిహరించేందుకే ప్రభుత్వం పన్ను ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పుకుంది. కేంద్ర నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు రావడంతో పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీంతో 6 కోట్ల మంది ఉద్యోగులకు ఊరట కలగనుంది.

21:25 - March 8, 2016

హైదరాబాద్ : మహిళలు మరిన్ని పోరాటాలకు సిద్దమవ్వాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి విభాగం నిర్వహించిన మహిళా దినోత్సవ సదస్సులో బృందాకరత్ పాల్గొన్నారు. సమానత్వం ఇప్పటికీ ఎండమావిగానే మిగిలిందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అటకెక్కడమే అందుకు నిదర్శనమన్నారు. భారతదేశంలో మహిళా స్వేచ్ఛ పోరాటాలకు ఇతర స్వేచ్ఛలతో ముడిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. స్త్రీల ఉద్యమాలను ఎప్పటికప్పుడు బలహీనం చేస్తూ, అణచివేస్తున్నారని విమర్శించారు. అయినా మహిళలు అన్ని సమస్యలకూ ఎదురొడ్డి పోరాడుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలలు మరింత సంఘటితమై అస్థిత్వ పోరులో దూసుకెళ్లాల్సి ఉందన్నారు బృందాకరత్.

21:24 - March 8, 2016

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు గదుల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది. 390 మంది సిబ్బంది పాల్గొంటున్న ఈ కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై...మధ్యాహ్నం వరకు ముగుస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ చెప్పారు.

ఖమ్మం..పత్తి మార్కెట్లో లెక్కింపు..
మరోవైపు ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఖమ్మం స్థానిక పత్తి మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. 50 డివిజన్ల వారిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు.
అటు అచ్చంపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సైతం బుధవారం వెలువడనున్నాయి. 20 వార్డుల కౌంటింగ్‌ ఫలితాలు 11 గంటలలోపే వచ్చే అవకాశముంది. ఫలితాల అనంతరం ఈనెల 15న ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అచ్చంపేట మున్సిపాలిటీకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 

21:22 - March 8, 2016

కర్నూలు : ఆడపిల్ల పుడితే భారమనే అభిప్రాయం సమాజానికి మంచిది కాదన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళా సాధికారిత కోసం తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని భరోసా ఇచ్చారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో డ్వాక్రా సంఘాలకు భారీ నజరానా ప్రకటించారు. అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని ఔట్‌డోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా కార్యక్రమంలో ఏపీ సీంఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలంతా సంఘటిత శక్తిగా తయారై అభివృద్ధి సాధించేందుకే.. పొదుపు ఉద్యమం చేపట్టామని ఆయన ఈ సంధర్భంగా గుర్తు చేశారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఎన్టీఆర్‌ మహిళలకు ఎంతో మేలు చేశారని, ఐటీ కంపెనీల్లో ఎక్కువగా మహిళలకే ఉద్యోగాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఆడపిల్ల పుడితే భారమనే అభిప్రాయం మంచి సంప్రదాయం కాదన్నారు. పెట్టుబడి నిధి కింద డ్వాక్రాసంఘాలకు 8,800 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల అభివృద్ధికి, సాధికారితకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను సీఎం పరిశీలించారు.

21:20 - March 8, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్రాష్ట్ర జలాల వివాదాల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక విజయం సాధించారు. గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, దేవేంద్ర ఫడణవీస్ గోదావరి నదిపై నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నీటిపారుదల నిపుణులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందం పట్టాలెక్కింది. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలను, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలో హర్షం..
గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ 1979 పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ర్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికీ ఈ బోర్డు సర్వ పర్యవేక్షణ సంస్థగా పనిచేస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఆరు ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. వాటిలో లెండి, ప్రాణహిత, పెన్‌గంగ రాజుపేట బ్యారేజీ, పెన్‌గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజీ, పెన్‌ గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజీ, లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టులున్నాయి. వీటిపై తలెత్తే వివాదాలు, సాంకేతికాంశాల పరిష్కారానికి అంతర్రాష్ట్ర బోర్డు కృషి చేస్తుంది. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను కూడా ఈ బోర్డు పరిగణలోకి తీసుకుంటుంది. బోర్డుకు ఒక ఏడాది తెలంగాణ సీఎం, మరుసటి ఏడాది మహారాష్ట్ర సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉన్న కాలంలో మరో ముఖ్యమంత్రి కో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, పలు శాఖ అధికారులు బోర్డులో సభ్యులుగా వ్యవహరిస్తారు. గోదావరి నది ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు హర్షం వ్యక్తం చేశారు. గోదావరి జలాల ఒప్పందంపై కేసీఆర్ కృషి పట్ల తెలంగాణలో హర్షం వ్యక్తమవుతోంది.

అచ్చంపేటలో పోలీసుల దాష్టీకం.

మహబూబ్ నగర్ : అచ్చంపేటలో పోలీసులు వినోద్ అనే యువకుడిని చితకబాదారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా వినోద్ పోలీసులకు పట్టించాడు.

సిండికేట్ బ్యాంకు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు..

ఢిల్లీ : సిండికేట్ బ్యాంకు కార్యాలయాలూ, అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. వేయి కోట్ల రూపాయల నిధులు కాజేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్వీ20 వరల్డ్ క్వాలిఫయిర్ మ్యాచ్..

నాగ్ పూర్ : టీ ట్వంటి వరల్డ్ కప్ క్వాలిఫయిర్ మ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హాంకాంగ్ జట్టు తడబడింది. ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

20:54 - March 8, 2016

సర్కారు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఒప్పందంలో ఏముంది? దీనివల్ల సర్కారు చెప్తున్న ప్రయోజనాలు సాధ్యమేనా? ప్రభుత్వం లక్షల ఎకరాలు సాగవుతాయని చెప్తుంటే, నిపుణులు భిన్నవాదనలు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ఈ ఒప్పందం వల్ల తెలంగాణ కంటే మహారాష్ట్రకే ఎక్కువ లాభమా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..గతంలో ఒప్పందాలు చాలా జరిగాయి..వాటి బాటలోనే ఇది కూడా నడుస్తుందా..? లేక సక్సెస్ అవుతుందా? మహా ఒప్పందం ఫలితం మాట అటుంచి.. రాష్ట్రాలు ఇలా సమస్యల సాధనకు ముందుకు రావటం సమాఖ్య స్ఫూర్తిని చాటుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కోటి ఎకరాలకు సాగునీరు..
దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్నారు.. దాదాపు ఏడాదిన్నర పాటు రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశామని సర్కారు చెప్తోంది. ఈ ఒప్పందం ఫలించి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగం సాకారమౌతుందని సర్కారు చెప్తోంది. మహా ఒప్పందంతో ఎన్ని లక్షల ఎకరాలకు నీరందుతుంది? మహాసర్కార్‌తో ఒప్పందం చేసుకుని నిర్మించే ఐదు ప్రాజెక్టులు తెలంగాణాకు ఎంతమేరకు ఉపయోగపడతాయి? రీడిజైన్ చేసి మరీ నిర్మిస్తున్న వీటి వల్ల సర్కారుపై అదనపు భారం పడుతుందా?

విపక్షాల విమర్శలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మం అంటోంది.. ఘనమైన లక్ష్యానికి సులభమైన మార్గం అని చెప్తోంది..లక్షల ఎకరాలకు నీరంది బంగారు తెలంగాణ సాధన సాధ్యపడుతుందని చెప్తోంది. కానీ, విపక్షాలు ఈ ఒప్పందంలో పసలేదని, పెద్దగా విషయంలేదని విమర్శిస్తున్నాయి..నదీ వివాదాలు మనదగ్గర చాలా సాధారణంగా మారాయి.. నది పుట్టిన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక రాష్ట్రాలకు ఆధారం, అనుబంధంగా మారుతున్న సందర్భంలో వివిధ రాష్ట్రాలు నదీ జలాలకోసం కొట్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతోంది.

నదీ వివాదాలు కొత్తేమీ కాదు...
నదీ వివాదాలు మనదగ్గర కొత్త విషయమేం కాదు. నది పుట్టిన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక రాష్ట్రాలకు ఆధారం, అనుబంధం. ఇక ఆనకట్టలు కట్టి బతుకుల్ని పునర్వచించుకునే చోట సమస్య మరింత జటిలంగా మారుతోంది. ఇదే అనేక వివాదాలకు కారణమవుతోంది. ఇలాంటి సమయంలో వివిధ రాష్ట్రాలు చొరవగా, తమ సమస్యల సాధనకు ముందుకు రావటం, ఒప్పందాలు చేసుకోవటం సమాఖ్య వ్యవస్థలో ఆరోగ్యకరపరిణామం. అదే సమయంలో ఈ ఒప్పందాల్లో నిజాయితీ, పారదర్శకత, దూరదృష్టి లేకపోతే అంతిమంగా మోసంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. మరింత విశ్లేషణకు వీడియో చూడండి. 

20:31 - March 8, 2016

దెయ్యాలు ఉన్నాయా. ? యే గవన్నీ పాత ముచ్చట్లు..అంటరు..కదా..కానీ కడప జిల్లాలో మాత్రం దెయ్యాలు కొందరికి ఆవహించాయంట..జిల్లాలో పొణతల సాంబయ్య స్వామి ఆలయం వద్ద శివరాత్రి పండుగ సందర్భంగా పలువురు ఊగిపోయారు. వీరకందరికీ దెయ్యాలు పట్టాయని..అందుకే ఇలా చేస్తారంట. దెయ్యాలు..ఎక్కడివి..ఇదంతా కేవలం మంత్రాల పేరిట కొంతమంది మోసం చేస్తున్నరని జన విజ్ఞాన వేదిక పేర్కొంటోంది. మరి వారు దెయ్యాలు పట్టాయంటున్న వారు ఎలా చేశారో వీడియో చూడండి. 

20:29 - March 8, 2016

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.ఆడోళ్లకు ఆదరణ లేదు. చిన్నచూపు చూస్తుండ్రు..ఆడ బిడ్డ పుడితే సంతోషం వ్యక్తం చేస్తేలే. చంపేస్తున్నారు..ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నడు..ఏడాదిలో కరవును ప్రారదోలుతాం అంటోంది తెలంగాణ ప్రభుత్వం..కేసీఆర్ కు ప్రస్తుతం ఉన్న ఇళ్లు నచ్చలే..అందుకోసం రూ.30 కోట్లతో మరొక ఇళ్లు కడుతున్నరంట..కర్నూలు జిల్లాలో బాలసాయిబాబా ఆత్మలింగం..ఆటో నడిపిన మహిళ..మంత్రగాడి మోసం..కడప జిల్లాలో పొణతల సాంబయ్య స్వామి ఆలయం వద్ద శివరాత్రి..అమ్మలోని విలువ తెలుసుకో అంటున్న ఓ యువకుడు..ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరు..తదితర అంశాలపై మల్లన్న తనదైన శైలిలో విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:18 - March 8, 2016

కర్నూలు జిల్లా..అక్కడో బాబ ఉంటడు..ఆయనే బాల సాయిబాబా..శివరాత్రి రాగానే లోపలి నుండి లింగం తీస్తుంటాడు. ఈసారి శివరాత్రి పండ్గకు కూడా లింగాన్ని తీశాడు. ఈ తీసిన లింగం తులం సైజులో ఉందంట..కిలో సైజులో తీస్తారా అని కొందరు చెవులు కొరుక్కున్నారంట. లింగం ఎలా తీశాడో వీడియో క్లిక్ చేయండి.

 

వెబ్ సైట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనిరీంగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా..

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను అధికారులు పొందుపర్చారు.

 

19:59 - March 8, 2016

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు పూజింపబడతారంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి...? ఆకాశంలో సగభాగం అంటూనే మహిళను అధఃపాతాళానికి తొక్కేయడం. లేడీస్‌ ఫస్ట్ అంటూనే... వెకిలి మాటలు మాట్లాడటం. సృష్టికి మూలం అంటూనే.. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలువురు మహిళలను కించపరిచే విధంగా పలు కామెంట్స్ చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఇందిర (టిపిసిసి), సంధ్య (పీవోడబ్ల్యూ), అనురాధ (టిడిపి), మల్లికా (సినీ నటి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

19:55 - March 8, 2016

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు పూజింపబడతారంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి...? ఆకాశంలో సగభాగం అంటూనే మహిళను అధఃపాతాళానికి తొక్కేయడం. లేడీస్‌ ఫస్ట్ అంటూనే... లేకి మాటలు మాట్లాడటం. సృష్టికి మూలం అంటూనే.. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. మహిళలపై సెలబ్రిటీల తీరు మారడం లేదు. నోటికి ఏదొస్తే అది.. ఎంతొస్తే అంత చాలా చీఫ్‌గా మాట్లాడుతున్నారు. అనేదంతా అనేసి...ఆ తర్వాత ఓ సారీతో సరిపెడుతున్నారు. ఏంటీ.. వీళ్లు మారరా...? వీళ్ల మైండ్‌ సెట్‌ మారదా..?

బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఎవరి నోటికైనా హద్దుంటుంది కానీ మా నోటికి అడ్డూ ఆపూ ఉండదన్నట్లుంది కొందరి నేతల ధోరణి. మహిళల పట్ల సెలబ్రిటీల తీరు మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంటుంది. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. గతంలోనూ చాలా మంది నేతలు, సెలబ్రెటీలు ఇలాంటి కూతలే కూశారు. అమ్మాయిలు వెంటపడితే.. ముద్దయినా పెట్టాలి లేకపోతే కడుపైనా చేసేయాలి... ఇది ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్య. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తన వ్యాఖ్యలు వివాదం కావడంతో వెంటనే నాలుక్కరుచుకున్నారు బాలకృష్ణ. తన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించాలంటూ వివరణ ఇచ్చారు. బాలకృష్ణ నటుడే కాదు ఓ బాధ్యతగల శాసనసభ్యుడు కూడా. ఇటీవలే మంత్రి రావెల కిషోర్ బాబు పుత్రరత్నం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఊచలు లెక్కపెడుతున్నాడు. నేతలు, సెలబ్రెటీలు అయినంత మాత్రానా, నేతల బంధువులు, పిల్లలు అయినంత మాత్రానా ఏమైనా మాట్లాడొచ్చా ? ఏమైనా చేయొచ్చా ? ఇప్పుడిదే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. 

కొత్తేమీ కాదు...
మహిళలపై ఈ విధంగా నోరు పారేసుకోవడం, నోటి దురుసును ప్రదర్శించడం మన నేతలకు కొత్తేమీ కాదు. సినీ నటుడు అలీ.. యాంకర్ సుమతో వ్యవహరించిన తీరు, నటి అనుష్క, సమంతపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్నే లేపాయి. దాంతో ఈ మధ్య జరిగిన ఓ సినీ ఫంక్షన్ కు అలీని దూరంగా పెట్టారనేది సినీ ఇండస్ట్రీ టాక్. ఇలాంటి సినీ ఫంక్షన్స్ లో సెలబ్రెటీలమనే సో కాల్డ్ నటులు నోటికి నచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. వీళ్ల మైండ్ సెట్ ను మార్చేదేవరు ?

గతంలో బొత్స..
గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యనారాయణ అర్థరాత్రి తిరిగితే స్వాతంత్ర్యం వచ్చినట్లు అంటే అమ్మాయిలను అర్థరాత్రి తిరగమని అర్థమా ? అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అమ్మాయిలు బయటతిరగడం ఎందుకు ? ఢిల్లీ నిర్భయ ఘటన చిన్న విషయమే అనడంతో వివాదానికి తెరలేచింది. రెచ్చగొట్టేటట్టు మహిళలు బట్టలేసుకుంటే రేప్ లు నివారించడం పోలీసు చేతిలో ఉండదు. ముందు డ్రెస్ కల్చర్ ను మార్చాలంటూ ఉమ్మడి ఏపీలో డీజీపీగా ఉన్న దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా అడపా దడపా నేతలు మహిళలపై వ్యవహరించే తీరు జుగుప్సాకరంగా ఉంటుంది.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం...
మన దేశంలో ఇలాంటి పిచ్చి కూతలు కూసే వాళ్లకు కొదవే లేదు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న గౌర్ కూడా మహిళపై పిచ్చి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ రష్యా మహిళ గౌర్ పంచకట్టు చూసి ఎలా కట్టుకుంటారంటూ అడిగారట.. పంచ కట్టడం కాదు... విప్పడం నేర్పిస్తా నంటూ సదరు రష్యా మహిళతో మంత్రి గౌర్ వ్యాఖ్యానించారట. అది ఇప్పుడు కుదరదన్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కార్యకర్తల సమావేశంలో చెప్పుకున్నారు. రష్యా మహిళలు చాలా అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఓ రష్యా మహిళ తనను బహిరంగంగా ముద్దు పెట్టుకొందని అదే సమావేశంలో గౌర్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే అది రేప్ అంటారని తమిళనాడులో అత్యాచారాలు తక్కువని అక్కడి ప్రజల వస్త్రదారణే దానికి కారణమంటూ గతంలో స్వయంగా గౌర్ వ్యాఖ్యానించారు.

ఆశారాం బాపు వ్యాఖ్యలు..
మహిళల పట్ల చులకనా భావంతో చాలా మంది నేతలు, మాజీ అధికారులు నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి. ములాయం సింగ్ యాదవ్ నుంచి మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ దాకా ఎవరూ అతీతులు కారు. నిర్భయ ఘటన సమయంలో బాధితురాలు అన్నయ్య అంటే నిందితులు వదిలేశేవారంటూ ఆశారాం బాపు వ్యాఖ్యానించారు. దీన్నెందుకు అంత పెద్ద విషయంగా చూస్తారంటూ కూడా సెలవిచ్చారు. కుర్రాళ్లు వయస్సులో ఉన్నపుడు ఉడుకు రక్తంతో ఉంటారని, వాళ్లూ తప్పులు చేస్తారని మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌ వ్యాఖ్యానించారు. రేప్‌ చేస్తే ఉరిశిక్ష వేయాలా అంటే ఆయనే వ్యాఖ్యానించి తర్వాత నాలుక్కరుచుకున్నారు.

అనుచితంగా మాట్లాడిన గోవా మంత్రి..
అంతేకాదు.. అమ్మాయిలు కురచ దుస్తులతో పబ్బులకు వెళితే తప్పులు జరుగుతాయని గోవా మంత్రి సుదీన్‌ దవాల్కర్‌ అనుచితంగా మాట్లాడారు. అమ్మాయిలపై జరిగే నేరాలకు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు అంతే బాధ్యత ఉందంటూ ఛత్తీస్‌గఢ్‌ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ విభారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేత ధర్మవీర్‌ గోయాత్‌ అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలూ తీవ్ర దుమారాన్నే రేపాయి. రేప్‌ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా 90 శాతం మంది అమ్మాయిలు అబ్బాయిలతో వెళుతున్నారన్నారు. అమ్మాయిలు జీన్స్ వేసుకోవడం నిషేధించాలని హర్యానా నేత రణవీర్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. అమ్మాయిలకు 16 ఏళ్లకే పెళ్లి చేసి పంపిస్తే భర్త దగ్గర రక్షణగా ఉంటుందని, అప్పుడు అమ్మాయిలు బయటకు వెళ్లరని హర్యానాకే చెందిన మరో నేత సుభ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడి సైతం మహిళలపై తన అనుచిత వ్యాఖ్యలను వదలలేదు. మగపావురాలు ఆడ పావురాలను వెతుక్కుంటూ వెళతాయని, అది సహజమని అనడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

వీళ్ల తీరు మారదా ? 
ఒక వైపు మహిళా సాధికారికత.. అంటూ తెగ లెక్చర్లిచ్చే సదరు నేతలు.. నోటికి వచ్చినట్లు మాట్లాడాడాన్ని ఏమనాలి..? వీళ్ల తీరు మారదా..? వీళ్ల మైండ్‌ సెట్‌ మార్చేదెలా...? చట్టాల రూపకల్పన, అమలుదో కీలక పాత్ర పోషిస్తున్న అధికార, ప్రతిపక్ష నేతలూ, రాజకీయ గణం.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. ఆకాశంలో సగమని మహిళను పోల్చడం కాదు... స్త్రీల పట్ల నోటి దురుసుతో కాకుండా.. మన తల్లి, చెల్లితో పాటు మనల్ని కట్టుకున్న భార్య కూడా ఓ మహిళే అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. 

కేసీఆర్ ను కలిసిన టి.టిడిపి ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టి.టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు కలిశారు. వీరు ఈనెల 11న టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

19:32 - March 8, 2016

హైదరాబాద్ : తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని..నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని..పార్టీలు..నేతలు పేర్కొంటుంటారు. కానీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ మరిచిపోతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. సుమారు 19వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కానీ పేద, మధ్య తరగతి వారిపై భారం పడకుండా ఉండేందుకు ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. వంద యూనిట్లు వాడే వారిని మినహాయించారు. అదే వంద నుండి నాలుగు వందల యూనిట్లు వాడే వారికి మాత్రం 65-72 పైసలు పెంచాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. పరిశ్రమలకు..వాణిజ్య సంస్థలకు మాత్రం భారీగా వడ్డన ఉండనున్నట్లు సమాచారం. దీనిపై డిస్కంలు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఈ సేకరణలో వ్యతిరేతక వస్తే మాత్రం నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. 

గొగోయ్ సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు విద్యార్థుల చేరిక..

గౌహతి : రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సమక్షంలో మాజీ విద్యార్థుల నేతలు, యూత్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

రేపు బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. వివిధ రాష్ట్రాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై సమావేశం చర్చిస్తారని తెలుస్తోంది.

 

హార్ధిక్ పటేల్ బెయిల్ తిరస్కరణ..

గుజరాత్ : పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు అహ్మదాబాద్ సెషన్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. దేశద్రోహం కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. బెయిల్ పై తాము హైకోర్టుకు వెళుతామని హార్దిక్ తరపు న్యాయవాది వెల్లడించారు. 

ఛగన్ భుజ్ బుల్ కు ఈడీ సమన్లు..

మహారాష్ట్ర : ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్‌భుజ్‌బల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈడీ అధికారులు విచారణ జరుపుతోంది. మార్చి 14వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది.

 

తెలంగాణ సీఐడీ కస్టడికి అగ్రిగోల్డ్ నిందితులు..

మహబూబ్ నగర్ : అగ్రిగోల్డ్ నిందితులను తెలంగాణ సీఐడీ కస్టడీకి అప్పగించాలని మహబూబ్ నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవ్వా వెంకటరమణ, శేషు నారాయణలను పీటీ వారెంట్ పై నగరానికి తరలించారు. 

ఛగన్ భుజ్ బుల్ కు ఈడీ సమన్లు..

మహారాష్ట్ర : ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్‌భుజ్‌బల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈడీ అధికారులు విచారణ జరుపుతోంది. మార్చి 14వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. 

మాదిగల విశ్వరూప చైతన్యయాత్రకు అనుమతి నిరాకరణ..

తిరుపతి : ఈనెల 10వ తేదీన నారావారిపల్లెలో మందకృష్ణ తలపెట్టిన మాదిగల విశ్వరూప చైతన్య యాత్రకు అనుమతిని నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతినివ్వబోమని, ఎమ్మార్పీఎస్ నేతలకు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ పేర్కొన్నారు. 

ప్రతి పేదింటి మహిళకు గ్యాస్ కనెక్షన్ - చంద్రబాబు..

కర్నూలు : ప్రతి పేదింటి మహిళకు గ్యాస్ కనెక్షన్ ను 2016-17 సంవత్సరంలో అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగుతోందని ఇది శుభ పరిణామం కాదన్నారు. మహిళా యూనివర్సిటీ పెట్టి ఎన్టీఆర్ మహిళలకు మేలు చేశారని తెలిపారు. ఐటీ కంపె నీల ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులే అధికమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని బాబు ఆకాంక్షించారు. 

18:34 - March 8, 2016

విజయవాడ : రాజధాని భూమి కొనుగోలు కు సంబంధించి తమపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని లింగంనేని సంస్థ ఎండి లింగంనేని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో 2003 తరువాత ఎలాంటి భూములు కొనుగోలు చేయలేదన్నారు. సీఎం నివాశిత భవనం సైతం ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వానికే చెల్లుతుందని, తాము భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూములు వారికే ఇస్తామన్నారు. అవి వాస్తవాలు కావని సంస్థ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వాళ్లు తప్పు తెలుసుకుని ప్రచురించాలని కోరారు. కబ్జాలు..ఏ రకమైన కార్యక్రమాలు సంస్థ చేయదని..చేయలేదని తెలిపారు. ఏ రకంగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందలేని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి..ప్రజలకు అందరికీ తెలుసని లింగంనేని తెలిపారు. 

18:29 - March 8, 2016

కర్నూలు : పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు రూ. 8,800 కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో బాబు మాట్లాడారు. సంఘానికి రూ.8,500 కోట్ల అప్పుంటే రూ.8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇస్తున్నామన్నారు. సంఘానికి రూ. 10వేలు ఇవ్వడం జరుగుతోందని, ఎస్టీ, ఎస్టీ సంఘాలకు కూడా రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. మొదటి విడతగా రూ. 3వేలు ఇచ్చినట్లు, త్వరలోనే రూ. 7వేలు ఇస్తామన్నారు. ఈ నెలలో రూ. 370 కోట్ల రూపాయలు వడ్డీకి రిలీజ్ చేయడం జరిటగిందన్నారు. ప్రభుత్వానికి చాలా కష్టాలున్నాయని, అయినా ఫర్వాలేదన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగుతోందని ఇది శుభ పరిణామం కాదన్నారు. మహిళా యూనివర్సిటీ పెట్టి ఎన్టీఆర్ మహిళలకు మేలు చేశారని తెలిపారు. ఐటీ కంపె నీల ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులే అధికమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని బాబు ఆకాంక్షించారు. 

రథోత్సవ వేడుకలో అపశృతి..

గుంటూరు : అమరలింగేశ్వర స్వామి రథోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో ఓ భక్తుడికి తీవ్రగాయాలయ్యాయి.  

19న ధర్మశాలలో భారత్ - పాక్ మ్యాచ్..

ఢిల్లీ : ఈనెల 19వ తేదీన ధర్మశాలలో భారత్ - పాక్ టీ 20 మ్యాచ్ జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. మ్యాచ్ కు భద్రతపై హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీసీసీఐ వెల్లడించింది. 

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సమావేశం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. దీనితో కమిటీ సమావేశం ఈనెల 14కి వాయిదా పడింది. ఆ రోజు సమావేశానికి హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా, జ్యోతుల నెహ్రూలకు ఆదేశాలు జారీ చేసింది. 

రాజ్యసభలో రేపు మోడీ ప్రసంగం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో రేపు ప్రసంగించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రసంగ తీర్మానంపై మోడీ ధన్యవాదాలు తెలుపనున్నారు. 

నారీ శక్తి పుష్కర్ 2015 విజేతలతో మోడీ..

ఢిల్లీ : నారీ శక్తి పుష్కర్ 2015 విజేతలతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ పాల్గొన్నారు. 

కర్నూలులో సీఎం బాబు..

కర్నూలు : నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు రూ.8,800 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. 

18:01 - March 8, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కిశోర్ కుమార్ తనయుడు రావెల సుశీల్ కు కోర్టు పోలీసు కస్టడీ విధించింది. మహిళను వేధించిన కేసులో రావెల సుశీల్, డ్రైవర్ అప్పారావులు బంజారాహిల్స్ పీఎస్ లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కస్టడీ కావాలని నాంపల్లి కోర్టును పోలీసులు అభ్యర్థించారు. కానీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది. మహిళతో వీరికి ఏవైనా సంబంధాలున్నాయా. ? ఆ విధంగా ఎందుకు వ్యవహరించారు ? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. తనను అకారణంగా ఈ కేసులో విధించారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. కానీ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించి పై విధంగా తీర్పు చెప్పింది.

3వ తేదీన ఘటన..
ఈనెల 3వ తేదీన సాయంత్రం సమయంలో ఓ యువతిని మంత్రి తనయుడు రావెల, డ్రైవర్ అప్పారావులు కారులో వెంబడించిన దృశ్యాలు సిసి టివి ఫుటేజ్ లో రికార్డయిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులు స్పందించి వారిద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మొదట కేసు నమోదు చేయడానికి ఆలస్యం చేసిన పోలీసులు చివరకు స్థానికుల వత్తిడితో కేసు నమోదు చేశారు. మార్చి 6వ తేదీన బంజారాహిల్స్ పీఎస్ లో వీరు లొంగిపోయారు. అంతకుముందు నేతలు, న్యాయవాదులు సీఐతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని వారు కోరినట్లు, నిర్భయ కేసు పెట్టడం వల్ల స్టేషన్ కు రావాల్సి ఉంటుందని..24గంటల్లో రాకపోతే కేసు మరింత ముదిరే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. కారు ఆపినట్టు గాని, గొడవ జరిగినట్లు కానీ తమదగ్గరున్న సిసి టివి ఫుటేజ్ లో ఉందని సుశీల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే విచారణలో సుశీల్ ఎలాంటి అంశాలు వెల్లడిస్తారో చూడాలి. 

17:52 - March 8, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మంత్రులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథంపై కేసీఆర్ మాట్లాడారు. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ కల సాకారం ఏర్పాటు చేకోవడం జరిగిందని, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం తెలంగాణలో సువర్ణక్షారాలతో లిఖించవచ్చన్నారు. పంటపొలాల మీదకు గోదావరి, కృష్ణా నదులు పారాలని కోరుకోవడం జరిగిందన్నారు. అది సాకారం అవుతోందని, ఇతర రాష్ట్రాలతో కయ్యం పెట్టుకుని ఇచ్చంపల్లి ప్రాజెక్టు దక్కకుండా చేశారని విమర్శించారు. గత సంవత్సరం మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని, స్నేహపూర్వకంగా ప్రాజెక్టులను కట్టుకుందామని కోరినట్లు తెలిపారు. శత్రువైఖరి మొదటి సమావేశంలో తీసివేసినట్లు, రాత్రింబవళ్లు పనిచేసి ఆ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారని కొనియాడారు. ఒప్పందానికి ప్రధాన కారకుడు హరీష్ రావేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు...
ప్రాజెక్టులు కట్టుకోవడానికి సమయం ఆసన్నమైందని, చర్చలు జరుపుదామని స్వయంగా సీఎం ఫడ్నవీస్ పేర్కొనడం జరిగిందన్నారు. సముద్రం పాలైన గోదావరి నీళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉందన్నారు. రెండు పంటలు పండే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కేసీఆర్ సూచించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలు అత్యధికంగా లాభాలు పొందుతాయని, తరువాత మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. మంచినీటి సమస్య తీర్చడానికి శామిర్ పేట గోదావరి నది జలాల కోసం త్వరలో రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామన్నారు. మహా ఒప్పందం ద్వారా నగరానికి కూడా తాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ముందుకు సాగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. 

17:47 - March 8, 2016

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా పేర్కొన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకే కృష్ణను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2003, అక్టోబర్ 1వ తేదీన బాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి నుండి ఈ కేసు కొనసాగుతోంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధాలు చూపించకపోవడంతో సాకే కృష్ణను నిర్ధోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సివిల్ జడ్జి తీర్పు వెలువరించారు. సాకే 25వ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

2003లో ఘటన..
2003 అక్టోబర్ 1వ తేదీన ఆనాటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగింది. అనేక వాదనల అనంతరం ప్రభుత్వం సిట్ కు ఈ కేసు ను అప్పగించింది. 13 ఏళ్లుగా ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కొంతమంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 52 మంది సాక్షులను విచారించారు. అనంతరం కొంతమంది విడుదల కాగా మరికొందరు మృతి చెందారు కూడా. దామోదరం అలియాస్ సాకే కృష్ణను బెంగళూరులో 2014 సంవత్సరంలో అరెస్టు చేశారు. 

మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు..

హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీష్‌రావు అహర్నిశలు కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మహారాష్ట్రతో ఇవాళ చేసుకున్న ఒప్పందం విషయంలో యువ నాయకుడు హరీష్‌రావు రాత్రింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం, అక్కడి నీటి పారుదల శాఖ అధికారులతో అనేకసార్లు చర్చించిన అనంతరం ఒప్పందం జరిగిందన్నారు. పలుమార్లు హరీష్‌రావు మహారాష్ట్రకు వెళ్లి అనుమానాలను నివృత్తి చేశారని తెలిపారు. హరీష్ చొరవతోనే మహారాష్ట్ర సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు రాష్ర్టాలకు న్యాయం జరుగుతుందని మహారాష్ట్ర సర్కార్‌కు వివరించామని చెప్పారు.

17:42 - March 8, 2016

హైదరాబాద్ : ఉద్యోగ భర్తీ చేయాలంటే ఎందుకు ఆలస్యమౌతోందో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు శాసనసభకు తెలిపారు. మంగళవారం ఆయన సభలో మాట్లాడారు. ఉద్యోగ భర్తీకి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు స్పష్టం చేశారు. డీఎస్సీ, టెట్‌ పరీక్షలపై కొందరు కోర్టుకు వెళ్లారని అందుకే పోస్టుల భర్తీ ఆలస్యమవుతుందన్నారు. ట్రైబల్‌ డీఎస్సీ ద్వారా 326 పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. గతంలో వైఎస్‌ ప్రభుత్వం మ్యాన్‌పెస్టోలో పెట్టినన్ని పోస్టులను భర్తీ చేయలేదని రావెల ఆరోపించారు.

17:36 - March 8, 2016

హైదరాబాద్ : రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా ఎవరికీ న్యాయం జరగడం లేదని బీజేపీ సభ్యుడు పెన్మత్మ విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. అధికారుల తీరుతో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు నష్టపోయారన్నారు. పనులు పూర్తయినా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పెన్మత్స వాదనకు వైసీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి కూడా మద్దతిచ్చారు. 

వైఎస్ ఆర్ నిధులు కేటాయించలేదన్న మంత్రి..
2006లో ప్రారంభమైన రాజీవ్‌ స్వగృహ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ సరైన నిధులు కేటాయించనందునే.. పథకం కుంటుపడిందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఏపీకి కేవలం 105 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ప్రస్తుతం 906 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీటిని కాంట్రాక్టర్లకు టెండర్ల ద్వారా ఇస్తామని కిమిడి మృణాళిని చెప్పారు.

'మహా' ఒప్పందంతో భవిష్యత్ నాశనం : కాంగ్రెస్

కరీంనగర్‌: రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, భవిష్యత్‌ను నాశనం చేసేదే మహా ఒప్పందమని కాంగ్రెస్‌ నేతలు జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్షంగా కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంపుపై అనుమానాలున్నాయని అన్నారు .

అమరలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలో అపశృతి

గుంటూరు : అమరలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగే సందర్భంలో తోపులాట లో రథం కింద పడి ఓ భక్తుడికి తీవ్ర గాయలయ్యాయి.

మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మరో చరిత్ర

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మరో చరిత్ర అని సీఎ కేసీఆర్ అన్నారు. ఆయన ముంబై నుండి బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం అందుకున్న ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే 'మహారాష్ట్రతో ఒప్పందం వల్ల తెలంగాణ లోని హైదరాబాద్ మినహా.. 9 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.జంట నగరాల ప్రజల నీటి సమస్యను తీర్చేందుకు షామీర్ పేట వద్ద 20 టీఎంసీని నిల్వ చేసే ప్రాజెక్టును నిర్మిస్తాం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు త్వరలోనే నీటి సమస్య తొలిగిపోతుంది. కృష్ణా, గోదావరి జిల్లాలతో తెలంగాణ లో పంటలను పండించుకుందాం.

ముగిసిన ప్రివిలేజ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ హాలులో ప్రివిలేజ్ కమిటీ భేటీ ముగిసింది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై చర్చించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేనని రోజా లేఖ రాసింది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం 14వ తేదీకి వాయిదా పడింది.

రావెల సుశీల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

హైదరాబాద్ : మహిళను వేదించిన కేసులో ఏపీ మంత్రి రావెల కొడుకు సుశీల్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా 2 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. 9,10 తేదీల్లో సుశీల్ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు. అనంతరం బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

17:09 - March 8, 2016

హైదరాబాద్ : ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రస్తావించారు. మంగళవారం నాడు జరిగిన సభలో జగన్ పలు విమర్శి గుప్పించారు. ఎమ్వార్వో వనజాక్షి ఇసుక మాఫియాకు అడ్డుగా ఉందన్న కారణంతో ఓ ఎమ్మెల్యే దాడి చేసినా చర్యలు లేవని వైసీపీ నేత జగన్ పేర్కొన్నారు. అంగన్ వాడీ కార్మికులను దుర్భాషలాడినా చర్యలు లేవని, రాష్ట్రంలో మహిళల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదని జగన్ విమర్శించారు. ఇసుక మాఫియాకు అడ్డు తగుతుందన్న కారణంతో ఓ శాసనసభ్యుడు ఎమ్మార్వో వనజాక్షి జట్టు పట్టుకున్న తీరు హేయమైందన్నారు. అయినా ఆ శాసనసభ్యుడి మీద కేసులు లేవని..అరెస్టు లేవని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఇదే శాసనసభ్యుడు అంగన్ వాడీ కార్మికులను దుర్భాషలాడుతూ తిడితే ఆ కార్మికులు వ్యతిరేకంగా ధర్నా చేశారని గుర్తు చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేపై చర్యలు లేవన్నారు.

నేను దాడి చేయలేదు..
దీనిపై టిడిపి సభ్యుడు చింతమనేని స్పందించారు. డ్వాక్రా సంఘాల మధ్య గొడవని, గొడవ పడింది డ్వాక్రా సంఘాలు..వనజాక్షి అని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున సరియైన సూచనలు ఇస్తారని అనుకుంటే సభను పక్కదోవ పట్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాను ఎమ్వార్వోను కొట్టలేదని, చట్టం ప్రకారం ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. జగన్ పిచ్చ పిచ్చగా మాట్లాడతున్నారని విమర్శించారు. కొట్టానని..ఈడ్చానని తనపై వనజాక్ష్ఙి ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బృందం హైదరాబాద్ చేరుకుంది. ముంబై పర్యటన ముగించుకుని బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కళాకారులు డప్పు, వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. బేగంపేట నుంచి క్యాంపు ఆఫీస్ వరకు గులాబీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు.

17:01 - March 8, 2016

హైదరాబాద్ : మొన్న ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు దేవీ ప్రసాద్ కూడా ఇదే మాటన్నాడు. ఇప్పుడది నిజమేనని మరోసారి నిరూపితమయ్యింది. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో యంగ్‌టైగర్ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. నిన్న (సోమవారం) అర్దరాత్రి విడుదలైన ఈ గీతం కన్నడ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘గెలయా... గెలయా.. గెలువే నమదయ్యా’ అంటూ సాగే ఈ గీతం ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. థమన్ ఎన్టీఆర్‌తో పాడించింది ఆ ఎనర్జీ కోసమే కాబోలు. ‘అదుర్స్’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల్లో ఎన్టీఆర్‌తో పాడించిన దేవీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’లోనూ ఎన్టీఆర్‌కి సింగర్ బాధ్యత అప్పగించే అవకాశం లేకపోలేదు. నటన, పాటలు, డాన్స్ ఇలా అన్నిట్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు ఎన్టీఆర్ ....

16:59 - March 8, 2016

హైదరాబాద్ : మంత్రి కొడుకు ఓ మహిళ చేయిపట్టి బలత్కారం ప్రయత్నం చేస్తే స్థానికులు కొట్టి స్టేషన్‌లో అప్పగించారని.. ఆ కుమారుని తండ్రి మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటని వైఎస్‌ జగన్‌ అన్నారు. జగన్‌ వ్యాఖ్యలను మంత్రి రావెల కిశోర్‌బాబు ఖండించారు. తన కుమారుడు తప్పు చేస్తే ఏ శిక్ష వేసినా సరేనన్నారు. తన కుమారున్ని స్టేషల్‌లో అప్పగించింది కూడా తనేనని రావెల చెప్పారు. వారు ఇంకా ఏమన్నారో చూద్దాం..

చితకబాదారు...
కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులు..వనజాక్షి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇక్కడే ఉన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాగి..మహిళను వెంటపడి ఆమెను కారులోకి లాగి..బలాత్కరం చేసే సమయంలో స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాది పీఎస్ లో అప్పగించారన్నారు. ఆ వ్యక్తి తండ్రి మంత్రిగా కొనసాగుతుండడం సిగ్గు చేటన్నారు.

ఎంతటి శిక్షకైనా సిద్ధం..
తన కుమారుడు తప్పు చేస్తే తాను ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని, ఆరోపణలు చేసిన స్త్రీ తనకు కూతురులాంటిదన్నారు. అలాంటి చర్య చేస్తే ఎలాంటి శిక్ష విధించడానికి తాను ముందుంటానన్నారు. తానే స్వయంగా తన కుమారుడిని తీసుకెళ్లి స్టేషన్ లో అప్పగించినట్లు మంత్రి రావెల చెప్పారు. 

16:52 - March 8, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో రిషితేశ్వరీ ఘటనపై అసెంబ్లీలో నేతల మధ్య సంవాదం చోటు చేసుకుంది. వైసీపీ నేత జగన్..మంత్రి అచ్చెంన్నాయుడుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కామాంధుల అరాచకానికి రిషితేశ్వరీ విద్యార్థి బలైనా కాలేజీ ప్రిన్స్ పాల్ పై కేసు పెట్టలేదని వైసీపీ సభ్యుడు జగన్ ఆరోపించారు. విజయవాడ కాల్‌మనీ కేసులో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉన్నా.. కేసులు పెట్టలేదని జగన్‌ ఆరోపించారు. కేసులు పెట్టినా స్టేషన్‌ బెయిల్స్ ఇచ్చి పంపిస్తున్నారని విమర్శించారు. జగన్‌ విమర్శలను మంత్రి అచ్చె న్నాయుడు తిప్పికొట్టారు. మహిళా భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అబద్ధాలు చెబుతున్నారని..అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవగాహన లేకపోతే కామ్ గా కూర్చొవాలని సూచించారు. ప్రిన్స్ పాల్ బాబు రావును అరెస్టు చేయడమే కాకుండా కేసు రిజిష్టర్ అయ్యిందని మంత్రి అచ్చెం నాయుడు పేర్కొన్నారు. 

'తుమ్మడిహట్టి' ఎత్తు తగ్గింపు తెలంగాణకు నష్టం:చాడ

హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తుమ్మడిహట్టి బ్యారేజీ ఎత్తు తగ్గింపుతో తెలంగాణకు నష్టమని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వ ఇంకా స్పష్టత ఇవ్వలేని అన్నారు. బాబ్లీ సహా ఇతర ప్రాజెక్టుల సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించాల్సిన అవసరం ఉందని చాడ అన్నారు. 

నారీ శక్తి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురు మహిళలకు నారీ శక్తి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లుగా జాతి నిర్మాణంలో పాల్గొంటున్న స్త్రీశక్తికి కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశంలో పురతన కాలం నుంచి మహిళలకు సమున్నత గౌరవమర్యాదలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. మహిళాసాధికారికతను పెంచేందుకు, లింగ వివక్షను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కోరారు. స్త్రీలు సమున్నతంగా జీవించేలా, వారికి సమాన హక్కులు కల్పించేలా చూడాలని అన్నారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 12 పాయింట్లు లాభపడి 24,659 పాయింట్ల వద్ద, నిఫ్టీ .05 శాతం లాభపడి 7,485 వద్ద ముగిశాయి. 

కంటెయినర్ లో మంటలు : 15 ఆటోలు దగ్ధం...

ఆదిలాబాద్ : కంటెయినర్‌కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అందులో తీసుకెళ్తున్న ఆటోలు అగ్నికి ఆహుతయ్యాయి. భైంసా చెక్‌పోస్టు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. చెక్‌పోస్టు దగ్గర కంటెయినర్‌కు విద్యుత్ తీగలు తాకడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 15 ఆటోలు దగ్ధమయ్యాయి.

16:21 - March 8, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై టి.టిడిపి శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టిటిడిపి ఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రతో ఒప్పందం సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్..గోదావరి నది జలాల వినియోగం..ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చర్చించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలను శాసనసభలో ప్రస్తావిస్తామని రేవంత్ తెలిపారు. గోదావరి నది జలాలను కొలంబస్ గా ఆయన గుర్తించినట్లు, ఆ నదీ జలాలను చంద్రుడి నుండి భూమి మీదకు తీసుకొస్తున్నట్లు...అపర భగీరథుడై అయిపోయినట్లు..ఆయన నడిచి వెళుతుంటే వెనుకాల భూములు పచ్చగా అయిపోయినట్లు..ఆయన టివి ఛానల్..పత్రికలు చూపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరవు నిధులు పంపలేదని..కేంద్రం నిధులు ప్రకటించలేదన్నారు. జనాలు శ్మశానాలకు వెళుతుంటే పట్టించుకోలేదని రేవంత్ పేర్కొన్నారు. 

హసన్‌పర్తిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ : హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో డి.సందీప్ గౌడ్(19) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సందీప్ ప్రస్తుతం బీటెక్(సివిల్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గులాబీమయం అయిన బేగంపేట ఎయిర్ పోర్ట్

హైదరాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్టు గులాబీమయమైంది. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి మొదలుకొని క్యాంపు ఆఫీస్ దాకా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక వందలాది మంది కళాకారులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తమ దేవుడు కేసీఆరే అని రైతులు నినదిస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లు నెరవేరని కల ఈనాడు నెరవేరడం సీఎం కేసీఆర్‌తో సాధ్యమైందని పేర్కొన్నారు.

16:12 - March 8, 2016

హైదరాబాద్ : టి.టిడిపిలో ఏం జరుగుతోంది ? వరసగా జరుగుతున్న పరిణామాలపై టి.టిడిపి షాక్ తింటోంది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ తీర్థం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంత మంది పోయినా తమ పార్టీకి ఫర్వాలేదని, కార్యకర్తల బలం ఉందని పార్టీ సీనియర్ నేతలు ధీమాగా చెబుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారన్న వార్త ప్రకంపనాలు సృష్టిస్తోంది. వీరిద్దరూ చేరితే అసెంబ్లీలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
టి.టిడిపికి చెందిన మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధిలు గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. సోమవారం పార్టీకి చెందిన మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి హాజరు కాలేదు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ సమావేశానికి సండ్ర వెంకట వీరయ్య హాజరు కాలేదు. ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నిక ఫలితాలు విడుదలవుతున్న దృష్ట్యా తాను సమావేశానికి హాజరు కావడం లేదని సండ్ర పేర్కొన్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తటస్థంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. మిగిలిన మాగంటి, గాంధి లు కూడా కారెక్కెతే ఆ సంఖ్య 12కు చేరనుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

మహిళా కండక్టర్లకు గ్రీన్ టాయిలెట్లు...

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో మహిళల పాత్ర ఎంతో కీలకమని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో కీలకంగా మారిన మహిళా కండక్టర్ల కోసం ప్రత్యేకంగా గ్రీన్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవానిక హాజరైన ఎమ్మెల్సీ పూల రవీందర్ ఉత్తమ టీచర్లను సన్మానించారు. 

హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్

ముంబై : సీఎం కేసీఆర్ ముంబై పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపనకు విద్యాసాగర్‌రావును సీఎం ఆహ్వానించారు. 

నా ఒత్తిడి వల్లే ఈపీఎఫ్ పై వెనక్కి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ఈపీఎఫ్ విత్ డ్రాపై పన్ను వేయాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతం విరమించుకుంది. ఈమేరకు ఇవాళ లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ తాను ఒత్తిడి చేయడంవల్లే కేంద్రం ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకుందని వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి వేతన జీవులకు దీని వల్ల ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ పన్ను వేయడం వారిపై భారం పడుతుందని తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు. 

టిఆర్ ఎస్ లోకి అరెకపూడి, మాగంటి...!

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో రెండు ఎదురు దెబ్బలు తగిలేలానే ఉన్నాయి. మాజీ హోంమంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు మరో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కూడా హాజరు కాలేదు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ టికెట్లపై విజయం సాధించిన మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని టీఆర్ఎస్ లాగేసింది. తాము వద్దనుకున్న ముగ్గురు మినహా మిగిలిన ఇద్దరు కూడా కారెక్కడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

మదనపల్లెలో 45 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

చిత్తూరు :గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి 45 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 75 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

15:09 - March 8, 2016

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం..మార్చి 8 స్పూర్తిని అందుకుని వందేళ్లు దాటిన తరువాత కూడా సమానత్వం కోసం నినదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై టెన్ టివి మానవి కార్యక్రమంలో గిరిజ (సామాజిక కార్యకర్త), సంధ్య (పీవోడబ్ల్యూ), గోగు శ్యామల (రచయిత్రి), లక్ష్మీ (ప్రొపెసర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది ? ఆనాటి నుండి ఈ నాటి వరకు జరుగుతున్న పరిణామాలను విశ్లేషించారు. ప్రస్తుతం సమాజ పరిణామాలపై మహిళలు ఏ విధంగా స్పందించాలనే దానిపై అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

14:51 - March 8, 2016

ఢిల్లీ : గ్రామ పంచాయితీలు, నగర పాలక సంస్థలకు మహిళా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోక్‌సభనుద్దేశించి సోనియా ప్రసంగించారు.ఈ కారణంగా దేశంలో 40 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారని తెలిపారు. తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా భారతి, లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరా కుమార్‌ను నియమించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని సోనియాగాంధీ అన్నారు.

14:49 - March 8, 2016

ఢిల్లీ : మొదట నిర్ణయాలు తీసుకోవడం..వ్యతిరేకత రావడంతో వాటిని ఉపసంహరించుకోవడం పరిపాటై పోయింది. ఈపీఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై 60 శాతం పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. దీనిపై పునఃసమీక్షించిన ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆరు కోట్ల మంది ఉద్యోగులకు ఊరట లభించనుంది.

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్ : ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కరవు భత్యం(డీఏ) పెంచింది. 3.144 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది.

14:47 - March 8, 2016

మెదక్ : జిల్లా నంగునూర్ మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లవ్వ ఆదర్శ మహిళా రైతుగా ఎంపికయింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం రేపు అవార్డు ఇవ్వనుంది. అధునాతన పద్ధతుల్లో 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ వివిధ రకాలపంటలను పండిస్తున్నందుకు గాను ప్రభుత్వం ఆదర్శరైతుగా ఎల్లవ్వను ప్రకటించింది. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందంటోంది ఆదర్శ రైతు ఎల్లవ్వ.

14:45 - March 8, 2016

హైదరాబాద్ : తన మాటలను ఎంజాయ్ చేశారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభా సాక్షిగా పేర్కొన్నారు. ఫంక్షన్ కార్యక్రమంలో ఉన్న కొంతమందికి తెలుగు రాదని కూడా చెప్పారు. 'సావిత్రి' సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో బాలకృష్ణ మహిళలను ఉద్ధేశిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో సోమవారం క్షమాపణలు చెప్పారు. మంగళవారం ఏపీ శాసనసభలో మహిళలను అవమానించే విధంగా ఓ ఎమ్మెల్యే మాట్లాడాడని వైసీపీ నేత జగన్‌ పేర్కొన్నారు. దీనిపై బాలకృష్ణ పై విధంగా వివరణనిచ్చారు. ఆడియో పంక్షన్‌లో మహిళల పట్ల తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. మహిళలు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం..

న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మంగళవారం సీబీఐ అధికారులు ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ లలో దాడులు చేశారు. సిండికేట్ బ్యాంకు కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం పది ప్రాంతంలో తనిఖీలు చేసినట్టు సీబీఐ ప్రతినిధి దేవ్ ప్రీత్ సింగ్ తెలిపారు.

ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళ మృతి

కరీంనగర్: జగిత్యాల మండలం పొలాస వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు నుంచి మహిళ జారిపడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

14:35 - March 8, 2016

ఢిల్లీ : రాజ్యాంగ స్పూర్తిని కాలరాస్తున్నారని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారం ఏచూరి బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మంగళవారం రాజ్యసభలో ఏచూరి ప్రసంగించారు. ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. దేశభక్తి ఏదో వీళ్లే నిర్ణయిస్తున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మీ (బీజేపీ) హాయాంలో చట్టాన్ని గౌరవిస్తామని, అమలు చేస్తామని దేశ ప్రజలకు హామీనివ్వాలని ఏచూరి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చట్టాలను యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, కాషాయ సిద్ధాంతాల అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

14:31 - March 8, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. అధికార..విపక్ష సభ్యుల మధ్య ఎప్పటిలాగే మాటలు తూటాలు పేలాయి. మధ్యాహ్నం సమయం కేటాయించడంపై రగడ నెలకొంది. బీఏసీ సమావేశం ప్రకారం సమయం నిర్ణయిస్తామని తెలిపారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు తాను సూటి ప్రశ్నలు వేస్తున్నానని తెలిపారు. ఎవరు చేత మాట్లాడిస్తారు ? ఎంత సేపు మాట్లాడుతారో ముందు స్పష్టం చేయాలని సూచించారు. గతంలో వైఎస్ వాచి చూసి మద్యాహ్నం 1.30కాగానే బెల్ కొట్టండి..అంటూ చూసేవారని, ఆకలి అవుతుందని వెళ్లిపోయే వారని యనమ గుర్తు చేశారు. ప్రస్తుతం 20నిమిషాలు ఆలస్యం కావడానికి జగన్ కారణమన్నారు. దీనిపై జగన్ స్పందించారు. ఆనాడు వైఎస్ హాయాంలో సెషన్ రాత్రి ఎనిమిది గంటల దాక జరిగాయని, 75 రోజుల దాక కూడా జరిగాయని తెలిపారు. మీలాగా (టిడిపి) మూసివేయలేదని జగన్ పేర్కొన్నారు. దీనిపై టిడిపి సభ్యుడు నరేంద్ర కూడా స్పందించారు. జగన్ పేర్కొనడం చాలా విచిత్రంగా ఉందని, ఆయన నేర్చుకోవాలని కొత్తగా వచ్చారని జగన్ ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. . 1994 నుండి ఈ రోజు వరకు సభలో ఉన్నామన్నారు. 8 గంటల దాక సభ జరిగిందంటే సీఎం చంద్రబాబు నాయుడు హాయాంలోనే జరిగిందన్నారు. వైఎస్ ఉన్న హాయంలో 01.30 గంటలు కాగానే హౌస్ మూసివేశారని, దీనిని తాము ఆనాడు ప్రశ్నించడం జరిగిందన్నారు. 

14:28 - March 8, 2016

హైదరాబాద్ : తుని ఘటన కేసులో ఏపీ సీఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమౌతోంది. కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతికి చెందిన మాజీ కౌన్సిలర్, మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ నివేదిక అందచేసినట్లు సమాచారం.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం పూర్తిగా హింసాయుత్మకంగా మారిపోయింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ఆందోళన కారులు పూర్తిగా దగ్ధం చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనివెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీనిపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. 

టి.ఉద్యోగులకు డీఏ..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర్వులు జారీ చేసింది. 3.14 శాతం డీఏ పెంచింది. పెరిగిన డీఏ ఈనెల నుండి అమలు కానుంది. 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సమయం కేటాయింపై సభలో కొద్దిసేపటి కింద రగడ చెలరేగింది. అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అనంతరం స్పీకర్ కోడెల సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

రాజీవ్ హంతుకురాలికి మరోసారి పెరెల్..

ఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న నళినికి మరోమారు పెరోల్ లభించింది. ఇటీవలే నళిని తండ్రి మరణించిన నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమెకు ఒకరోజు పెరోల్ ను మద్రాస్ హైకోర్టు మంజూరు చేసింది.

త్వరలో మహిళా భరోసా సెంటర్ - సీపీ మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : హాకా భవన్ వద్ద త్వరలో మహిళా భరోసా సెంటర్ ను ప్రారంభిస్తామని సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు అండగా ఉండేందుకు ఈ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, లీగల్, పోలీసు, వైద్య పరంగా ఈసెంటర్ పనిచేస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మహిళా భరోసా సెంటర్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

లోక్ సభలో ఎంపీ కవిత...

ఢిల్లీ : స్వాతంత్ర్య పోరాటం నుండే మహిళలు చురుకుగా పనిచేస్తున్నారని, సోనియాగాంధీ మహిళ కాబట్టే తమ బాధను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఎంపీ కవిత లోక్ సభలో పేర్కొన్నారు.

ఈపీఎఫ్ పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్రం..

ఢిల్లీ : బడ్జెట్ లో ప్రతిపాదించిన ఈపీఎఫ్ పన్నుపై కేంద్ర వెనక్కి తగ్గింది. లోక్ సభలో ఈపీఎఫ్ పన్నుపై ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేశారు. అన్ని వర్గాల నుండి వ్యతిరేకత రావడంతో ఈపీఎఫ్ పన్నును విరమించుకున్నట్లు జైట్లీ వెల్లడించారు.

13:53 - March 8, 2016

హైదరాబాద్: మహిళలంటే తనకు గౌరవం ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శానససభలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించారు. తనకు, తన కుటుంబానికి మహిళలపై పూర్తి గౌరవం ఉందని... తమ తండ్రి ఎన్టీఆర్‌ను మహిళలు అన్నగా ఆరాధించే వారని పేర్కొన్నారు. మహిళా హక్కులు, మహిళా యూనివర్శిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆరేనని ఆయన తెలిపారు. తన చిత్రాల్లోనూ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు.

13:50 - March 8, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్‌ అయ్యారు. లోకేష్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రోజాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నగరి నియోజకవర్గంలో నీ క్యారెక్టర్‌, మా క్యారెక్టర్లపై చర్చకు సిద్ధం ? నీవు సిద్ధమా' అని రోజాకు బుద్ధా సవాల్‌ విసిరారు. పూర్తి కామెంట్స్ వీడియో లో చూడండి. 

13:46 - March 8, 2016

ఢిల్లీ : విజయ్ మాల్యాపై బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విజయ మాల్యా దేశం నుంచి విడిచి వెల్లకుండా చూడాలని కోరాయి. విజయ్ మాల్యాపై 17 బ్యాంకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. బ్యాంకుల పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా రూ.700కోట్లు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని వాటిని చెల్లించకుండా విజయ్ మాల్యా లండన్ వెళ్లి పెటిల్ అవుదామని అనుకున్నారు. ఈనేపథ్యంలో విజయ్ మాల్యాపై 17 బ్యాంకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. విజయ మాల్యా దేశం నుంచి విడిచి వెల్లకుండా చూడాలని కోరాయి. 

విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదనలు

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌-సీ)కి వివిధ డిస్కంలు మంగళవారం తమ ప్రతిపాదనలు ఇస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు ప్రతిపాదిస్తున్నాయి. ఇందులో గృహ వినియోగదారుల మీద తక్కువ భారం మోపి వాణిజ్య,పారిశ్రామిక వినియోగదారులపై కొంత ఎక్కువ భారం మోపాలని ప్రతిపాదిస్తున్నారు. వీటిని ఈఆర్‌-సీ చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల నుండే విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎమ్మెల్యే ఈశ్వరి

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. మంగళవారం ఏపీ శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళగా జన్మించి, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని, తనకు ముగ్గురు ఆడపిల్లలుండటం సంతోషంగా ఉందని అన్నారు.

తుని ఘటన.. భూమన కు బిగిస్తున్న ఉచ్చు!

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తునిలో నెల కిందట జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమ సభ సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ముఖ్యనేత భూమన కరుణాకర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన నాటి కార్యక్రమం నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి ఆయనతో పలుమార్లు టచ్‌లోకి వచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కరుణాకర్ రెడ్డికి నేడో, రేపో సీఐడీ నోటీసులిచ్చి ప్రశ్నించనున్నట్లు సమాచారం. 

13:36 - March 8, 2016

విశాఖ : మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో పలు మహిళా సంఘాలు ప్రజానాట్యమండలి ఉమ్మడిగా కలిసి విశాఖనగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. అనాదిగా మహిళలు చిన్న చూపుకు గురవుతూ వస్తున్నారని.. నేటికి కేంద్ర ప్రభుత్వం మహిళలకు , యువతులకు పథకాల పేరిట ప్రకటించడమే కాని ఆచరణలో అలసత్వం ప్రదర్శిస్తోందని అంటున్నాయి. ఈ సందర్భంగా ఐద్వా కార్యకర్త ఓ మహిళ ఎలాంటి బాధలు ఎదుర్కొంటుందో తన గానంతో వినిపించారు. ఆ పాట మీరు వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:31 - March 8, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలను కించపరుస్తూ.... మహిళలపై గౌరవ, మర్యాదల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మహిళకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక వైపు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడి చేస్తూ, అవమానిస్తూ...  మరోవైపు మహిళల గౌరవం పట్ల సీఎం చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. స్త్రీలు అంటే తల్లి...అని తల్లి అంటే ఓపిక అని అభివర్ణించారు. కానీ రాష్ట్రంలో స్త్రీలను గౌరవిస్తున్నామా అని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇదే సభలో రోజాను రూల్స్ ఒప్పుకోకపోయినా.. సంవత్సరంపాటు సస్పెండ్ చేశారని తెలిపారు. ఇసుక మాఫియాకు అడ్డుపడుతుందని.... ఎంఆర్ వో వనజాక్షి జుట్టు పట్టుకుని ఓ శాసనసభ్యుడు ఈడ్చుకెళ్లి దాడి చేసినా పట్టించుకోలేదన్నారు. విజయవాడలో వడ్డీ వ్యాపారాల పేరుతో సెక్స్ రాకెట్ లోకి దింపి.. వీడియో రికార్డు చేసి... బ్లాక్  మెయిల్ కు పాల్పడిన నిందితులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటోలు దిగినా వారిపై చర్యలు లేవన్నారు. రిషితేశ్వరీ కామాంధులకు బలైందని..  
ప్రిన్సిపల్ బాబురావుపై కేసులు లేవు, అరెస్టు లేదన్నారు. హైదరాబాద్ లో ఒక వ్యక్తి మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ... ఆమెను బలత్కారం చేయబోయిన కుమారున్ని మంత్రి వెనకేసుకురావడం.. ఇంకా మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. అంగన్ వాడీలపై శాసససభ్యుడు దాడి చేసినా స్పందించలేదన్నాడు. 
ఈశ్వరి....
మహిళగా పుట్టడం పట్ల నేను అదృష్టంగా భావిస్తున్నాను. 33 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేసినందుకు సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. దాన్ని 50 శాతానికి చేయాలని కోరారు. ఆడ పిల్లలకు ఆస్తి హక్కు ఉండడం శభుపరిణామం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మహిళలకు ఆస్తి హక్కు అమలు కావడం లేదన్నారు. 
అయితే హైదరాబాద్ లో టీచర్ ఫాతిమాభేగం పై జరిరిగన ఘటనను మంత్రి రావెల కిషోర్ బాబు సమర్థించుకోవడం దారుణమన్నారు. 
జగన్ పై అధికాపక్ష నేతలు ఎదురు దాడి..
జగన్ పై అధికాపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. జగన్ సభను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై జగన్‌ చేసిన ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. మంత్రి అచ్చెన్నాయడు..మాట్లాడుతూ ప్రతి పక్ష నేత జగన్ ఒక మనిషిగా, మంచి సూచనలు ఇవ్వాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
చింతమనేని ప్రభాకర్
ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. తహశీల్దార్‌ వనజాక్షిపై తాను దాడి చేసినట్లు జగన్‌ ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసులో విచారణలో ఉండగానే తనను కించపరిచే విధంగా ఆరోపిస్తున్నారన్నారు చింతమనేని. 
'జగన్ సభను తప్పుదోపట్టిస్తున్నాని.. అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి...పిచ్చపిచ్చగా మాట్లడుతన్నాడు. నేను కొట్టానని.. ఈడ్చానని వనజాక్షి పేర్కొనలేదన్నారు. జగన్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడతున్నాడు. 11 కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నాడు. జగన్ కు తన చెల్లినే గౌరవించడం రాదన్నారు'.
రావెల్ కిషోర్ బాబు...
తనపై జగన్‌ చేసిన ఆరోపణలను మంత్రి రావెల ఖండించారు. నా కుమారుడు తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఇప్పటికే చెప్పానని రావెల ప్రకటించారు. ఆరోపణలు చేసిన మహిళ కూతురులాంటిదన్నారు. నా కుమారుడిని స్వయంగా నేనే పోలీసులకు అప్పగించానని.. నాపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు రావెల. 
మంత్రి గంటా..శ్రీనివాస్
జగన్... అవాస్తవాలు మాట్లాడుతూ సభను తప్పదోవపట్టిస్తున్నాడని ఆరోపించారు. సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పారు.

 

 

నాలుగు దశాబ్దాల కల నెరవేరింది :సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర తో ప్రాజెక్టుల పై జరిగిన ఒప్పందాల పై తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఏడాది కాలంగా మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తున్నామని... నాలుగు దశాబ్దాల కల నెరవేరిందన్నారు. 2 నుంచి 4 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుల వల్ల రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మహిళా సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి : ఎంపి కవిత

న్యూఢిల్లీ : మహిళా సమస్యలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోకసభలో ఆమె ఇవాళ మాట్లాడారు. మహిళా ప్రతినిధులతో పార్లమెంట్‌లో రెండు రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. అత్యంత శక్తివంతమైన సీటులో మహిళలు ఉంటే దేశానికి మేలు జరుగుతుందన్నారు. స్వాతంత్రోద్యమంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారన్నారు. సరోజినీనాయుడు నేతృత్వంలో మహిళా బృందాలు స్వాతంత్రోద్యమంలో పోరాటం సాగించాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ప్రముఖ పాత్ర పోషించారని ఆమె అన్నారు.

మహిళల పట్ల నాకు గౌరవం ఉంది:బాలకృష్ణ

హైదరాబాద్: మహిళలంటే తనకు గౌరవం ఉందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శానససభలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించారు. తనకు, తన కుటుంబానికి మహిళలపై పూర్తి గౌరవం ఉందని... తమ తండ్రి ఎన్టీఆర్‌ను మహిళలు అన్నగా ఆరాధించేవారని పేర్కొన్నారు. మహిళా హక్కులు, మహిళా యూనివర్శిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆరేనని బాలకృష్ణ తెలిపారు. తన చిత్రాల్లోనూ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ :రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఏయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అస్సాం వెళ్తున్న శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ వద్ద రెండు బుల్లెట్లు లభించడంతో.. అప్రమత్తమైన ఏయిర్‌పోర్టు సిబ్బంది విచారణ చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ శంషాబాద్ నుంచి బయలుదేరుతున్న సమయంలో చెకింగ్‌లో బుల్లెట్లు బయటపడ్డాయి. 

రోజా తనపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా?: ఎమ్మెల్యే అనిత

హైదరాబాద్ : మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న జగన్ ఎమ్మెల్యేరోజా తనపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని ఎమ్మెల్యే అని ప్రశ్నించారు. ఈ సమాజంలో మంచి గురించి ఎలా మాట్లాడతారో? చెడు గురించి కూడా అలాగే మాట్లాడతారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ... ఈ దేశంలో మహిళగా పుట్టినందుకు తాను గర్వపడుతున్నానన్నారు. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళలకు పవిత్రమైన పసుపు రంగును ఎంచుకోవడంతోనే వారిపై తెదేపాకు ఉన్న గౌరవం స్పష్టం చేస్తోందన్నారు.

ఆదిత్య 369 స్వీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ : బాలకృష్ణ

హైదరాబాద్‌: ఆదిత్య 369 సీక్వెల్‌ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తన వందో చిత్రం కోసం రెండు కథలు సిద్ధమైనట్లు బాలకృష్ణ తెలిపారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’, క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే వీటిలో ఏది వందో సినిమాగా చేయాలన్న దానిపై అమావాస్య తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించాలని యునెస్కోకు ప్రతిపాదనలు పంపినట్లు బాలకృష్ణ తెలిపారు.

నిమ్స్ లో నర్సుల ఆందోళన

హైదరాబాద్ : పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో నర్సులు ఆందోళన చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తమకు సెలవు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. నర్సుల పట్ల నిమ్స్‌ డైరెక్టర్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డైరెక్టర్‌ తీరును నిరసిస్తూ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని నర్సుల ఆందోళన విరమించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పోలీసులు, నర్సుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

మహిళలు ఎన్నో ఘనతలు సాధించారు: సోనియా

ఢిల్లీ: దేశంలో మహిళలు ఎన్నో ఘనతలు సాధించారని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ... దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, సరోజిని నాయుడు వంటివారు దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. దేశంలో తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ పనిచేశారని గుర్తుచేశారు. మహిళలు ఆర్థికవృద్ధి చెందేలా విధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు.

12:52 - March 8, 2016

హైదరాబాద్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తామని ఎపి సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎపి అసెంబ్లీలో సీఎం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావంతో మహిళలకు న్యాయం జరిగిందన్నారు. దేశంలో మొట్టమొదటగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్ టిఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థలో ఎన్ టిఆర్ మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఆర్థికంగా పైకి వస్తే సెల్ప్ రెస్పెక్ట్ ఉంటుందన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించామని తెలిపారు. అన్ని ఐటీ కంపెనీల్లో అమ్మాయిలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్త్రీల ఎంపవర్ మెంట్ కాకుండా మహిళల సంఖ్య తగ్గిపోతుందన్నారు. నిరాధరణకు గురవుతున్నారని వాపాయారు. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే రోజులొస్తాయని చెప్పారు. మహిళా సాధికారతోపాటు ఆత్మవిశ్వాసం పెరగాలన్నారు. ప్రతి ఒక్కరు టాయిలెట్ నిర్మించుకోవాలన్నారు. ఇటీవలే మహిళా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సభలోనే 33 శాతం రిజర్వేషన్ కోసం ప్రతిపాదనలు  చేస్తే బాగుంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. 200 మంది గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2016 అంతర్జాతీయ మహిళ దినోత్సవం నూతన అధ్యాయానికి నాంది పలకాలన్నారు. 

జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: చింతమనేని

హైదరాబాద్ : తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి ఘటనలో ప్రతిపక్ష నేత జగన్‌ శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. తహసీల్దార్‌ను డ్వాక్రా మహిళలుఅడ్డుకుంటే... దానిని తనపై ఆపాదించడం అన్యాయమని అన్నారు. వనజాక్షి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్న విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలని సూచించారు. ఆ కేసులో విచారణ జరుగుతుందని... దానిని ఎదుర్కుంటున్నాని స్పష్టం చేశారు. మహిళలపై ఏమాత్రం గౌరవం లేని జగన్‌కు వారిపై మాట్లాడే హక్కు లేదన్నారు.

బైక్ పై పార్లమెంట్ కు వచ్చిన లేడీ ఎంపి...

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బిహార్ ఎంపీ రంజీత్ రంజన్ వైరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ మహిళా ఎంపీ ఇవాళ పార్లమెంట్‌కు హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై వచ్చారు. మహిళలు ప్రతి అంశంలోనూ ముందంజలో ఉన్నారన్న విషయాన్ని ఆమె మరోసారి రుజువు చేశారు. బీహార్‌లోని సుపౌల్ నియోజకవర్గానికి చెందిన రంజీత్ రంజన్‌కు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె భర్త పప్పూ యాదవ్ కూడా ఎంపీనే.

ఆ మంత్రి ఇంకా సభలోనే ఉన్నాడు : జగన్

హైదరాబాద్ : మంత్రి రావెల కుమారుడు సుశీల్ కుమార్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినా అతను మంత్రిగా సభలో ఉన్నాడు. మరో సభ్యుడు మహిళలను అవమానించేలా మాట్లాడినా అతని పై చర్యలు లేవన్నారు. దీనికి స్పందించిన మంత్రి రావెల నా కుమారుడు తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్ష విధించినా ఫర్వాలేదన్నారు. నా కుమారుడిపై ఫిర్యాదు చేసిన మమహిళ నాకు కూతురుతో సమానం అన్నారు.

నళినికి పెరోల్

చెన్నై : రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళినికి పెరోల్ లభించింది. తండ్రి దహన సంస్కార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు సాయంత్ర 4 గంటల వరకు మద్రాస్ కోర్టు అనుమతించింది.

విజయమాల్యపై సుప్రీం ను ఆశ్రయించిన 16 బ్యాంకులు

ఢిల్లీ : లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్య దేశం విడిచి వెళ్లకుండా చూడాలని 16 బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేతకు పాల్పడ్డారని... ఆయన విదేశాలకు వెళ్తే కేసు నీరుగారిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈపీఎఫ్ పన్నుపై వెనుక్కు తగ్గిన కేంద్రం

ఢిల్లీ : ఈపీఎఫ్ పన్ను పై కేంద్రం వెనక్కు తగ్గింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈపీఎఫ్ పన్నును విరమించుకున్నట్లు లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : జగన్

హైదరాబాద్ :ఏపీ అసెంబ్లీ : మహిళా సభ్యులకు విపక్ష నేత వైఎస్ జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. నిజంగానే మహిళలను గౌరవించి ఉంటే రోజాను అన్యాయంగా సస్పెండ్ చేసేవారా అని ప్రశ్నించారు.

12:08 - March 8, 2016

కాలం మారింది. వేగం పెరిగింది. రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు సైతం దూసుకుపోతున్నారు. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. పురుషులతో సమానంగా ప్రోత్సాహం, ఆదరణ,ప్రచారం లేకున్నా..వివిధ క్రీడల్లో భారత మహిళలు సైతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మువ్వన్నెల జాతీయ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశానికి ఖ్యాతి తెచ్చిన నవతరం చాంపియన్ క్రీడాకారుల ఘనతను ఓసారి గుర్తు చేసుకొందాం.....
మహిళలు లేని జీవితం అసాధ్యం 
ప్రకృతిలో సగం, మానవజీవితంలో మాత్రం పరిపూర్ణపాత్ర పోషించే మహిళలు లేని జీవితాన్ని ఊహించడం అసాధ్యం. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్. 123 కోట్ల జనాభాలో మహిళలు సైతం సగభాగం ఉన్నారు. అయితే పురుషులతో సమానంగా మహిళలకు అందాల్సిన ప్రోత్సాహం, ప్రచారం అందకపోయినా...కాలానుగుణంగా మారుతూ వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తూ మహిళలా..మజాకానా అనిపించుకొంటున్నారు. దానికి భారత క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు..
క్రీడారంగంలో భారత మహిళా శక్తి 
ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లో భారత బృందం సాధించే పతకాలలో సగం మహిళలే అందిస్తున్నారంటే..క్రీడారంగంలో భారత మహిళా శక్తి ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.
సానియా మీర్జా 
గ్లోబల్ గేమ్ టెన్నిస్ మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ ఎవరంటే మన హైదరాబాదీ షాన్ , తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా పేరు మాత్రమే ముందుగా గుర్తుకు వస్తుంది. మార్టీనా హింగిస్ తో జంటగా ఇప్పటికే వింబుల్డన్,అమెరికన్, ఆస్ట్రేలియన్ డబుల్స్ టైటిల్స్ సాధించిన సానియా..2016 ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సైతం నెగ్గితే...మహిళల డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ సాధించిన అరుదైన ఘనత సొంతం చేసుకోగలుగుంది. ఇప్పటికే అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అసాధారణ పురస్కారాలు అందుకొని భారత మహిళా టెన్నిస్ కే మారుపేరుగా నిలిచింది, దేశంలోని కోట్లాదిమంది మహిళల్లో  ఆత్మవిశ్వాసాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపగలుగుతోంది.
 సైనా నెహ్వాల్
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో రెండోర్యాంకర్ గా దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన సైనా నెహ్వాల్..ఇప్పటికే లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గి..ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచింది. అదృష్టం కలసివస్తే..2016 రియో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలని కలలు కంటోంది.
తెలుగుతేజం పీవీ సింధు, డబుల్స్ జోడీ గుత్తా జ్వాల-అశ్వినీ చిన్నప్ప సైతం..ప్రపంచ వ్యాప్తంగా భారత పతకాన్ని రెపరెప లాడిస్తున్నారు.
మిథాలీ రాజ్ ఎన్నో అరుదైన రికార్డులు 
ప్రపంచ మహిళా క్రికెట్ వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్స్ విమెన్ గా గుర్తింపు తెచ్చుకొన్న మన హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ సైతం..ఎన్నో అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2016 టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను సెమీఫైనల్స్ చేర్చగలనన్న ధీమాతో ఉంది. ఇప్పటికే అర్జున అవార్డు అందుకొన్న మిథాలీ...భారతజట్టుకు కెప్టెన్ గా కూడా సేవలు అందిస్తోంది.
కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక
మేధోక్రీడ చదరంగంలో సైతం..పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరనడానికి నిదర్శనమే తెలుగుతేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అరుదైన విజయాలు. గ్రాండ్ మాస్టర్ల స్థాయికి ఎదగడంతో పాటు..ప్రపంచ పోటీల్లో ఎన్నో అసాధారణ రికార్డులు సాధించారు.
దీపికకుమారి
విలువిద్యలో జార్ఖండ్ సంచలనం దీపికకుమారి ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచ ఆర్చరీలో రజతపతకాలు సాధించింది. 2016 ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో పాటు...అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకొంది. అదృష్టం కలసివస్తే రియో ఒలింపిక్స్ లో ఏదో ఒకపతకం సాధించగలనన్న ధీమాతో ఉంది.
హీనా సిద్ధూ, అపూర్వి చండీలా
ప్రపంచ మహిళల షూటింగ్ లో హీనా సిద్ధూ, అపూర్వి చండీలా సైతం అద్భుత విజయాలతో భారతకే గర్వకారణంగా నిలిచారు. 2016 ఒలింపిక్స్ కు అర్హత సంపాదించి..వారేవ్వా అనిపించుకొన్నారు.
మేరీ కోమ్ కు రాజీవ్ ఖేల్ రత్న 
మహిళల బాక్సింగ్ లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక గ్రహీత మేరీ కోమ్..దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న ను అందుకొని..మహిళా బాక్సింగ్ కే గర్వకారణంగా నిలిచింది. ఇద్దరు బిడ్డల తల్లిగా ఒలింపిక్స్ పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచింది.
స్క్వాష్ క్రీడలో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప
స్క్వాష్ క్రీడలో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప, మహిళా కుస్తీలో గీతా పోగట్, గీతికా జాఖడ్, వీనేష్ పోగట్, బబితాకుమారి తమవంతు పాత్ర పోషిస్తూ భారత మహిళలకే గర్వకారణంగా నిలుస్తున్నారు. పలురకాల ఆటంకాలు, సవాళ్ళు ఎదురైనా..వివిధ క్రీడల్లో రాణిస్తున్న భారత మహిళామణులకు ..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 10 స్పోర్ట్స్ హ్యాట్సాఫ్ చెబుతోంది. లేచింది మహిళాలోకం..నిదుర లేచింది మహిళాలోకం అంటూ వెన్నుతడుతోంది.

 

11:53 - March 8, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎల్ ఈడీ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, జగన్‌ మధ్య వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్కామ్‌లకు పాల్పడుతుందని జగన్‌ అన్నారు. బొగ్గు, విద్యుత్‌ వ్యవహారాలలో అక్రమాలు జరిగాయన్నారు. అయితే సరైన పద్ధతిలో చర్చకు వస్తే అన్ని విషయాలు చెబుతామని అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్‌ ఆదా కోసం రాష్ట్రంలో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

 

11:49 - March 8, 2016

హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నగేశ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్, ఐఎఫ్ టీయూ నేత ఎస్.ఎల్ పద్మ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:46 - March 8, 2016

హైదరాబాద్ :దాదాపు మూడుదశాబ్దాల కిందట వైద్య జీవశాస్త్రంలో జరిగిన ఈ అద్భుతం... అలుపెరగక జనాభా వృద్ధి చెందుతున్న దేశంలోనూ కొందరు అభాగ్య నిస్సంతు తల్లిదండ్రులకు ఆశాకిరణంగా నిలిచింది. అలా తొలిసారి ఉదయించిన ఆ ఆశాకిరణమే ‘హర్షా చావ్డా’. 1986లో ముంబైలో పిల్లలు లేని ఓ జంటకు కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడామె మరో బిడ్డకు తల్లయింది. ఆమె పుట్టినప్పుడు వైద్య సాయం చేసిన డాక్టర్ల బృందమే, ఇప్పుడు సిజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు. "మహాశివరాత్రి పర్వదినం నాడు మా కుటుంబానికి పరమశివుడు ఇచ్చిన ఓ గొప్ప బహుమతి ఇది" అని హర్షా భర్త దివ్యపాల్ షా తన అనందాన్ని వెలిబుచ్చారు. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త డాక్టర్ ఇందిరా హిందుజా, ఆ బేబీ పెరిగి పెద్దయి గర్భవతిగా వస్తే, తిరిగి ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఇందిర మాట్లాడుతూ, "హర్షా పుట్టిన రోజు నాకింకా గుర్తుంది. అప్పుడామె బరువు 3.18 కిలోలు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందించారో, నేను అంతకన్నా ఎక్కువగా ఆనందపడ్డా. ఆ తరువాత మేము 15 వేలకు పైగా టెస్ట్ ట్యూబ్ బేబీలను అందించాం" అన్నారు.

11:26 - March 8, 2016

హీరో సందీప్ కిషన్ హీరోగా, అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రన్’ సినిమాను హోలి సంద‌ర్భంగా మార్చి 23న విడుదల గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, కాన్సెప్ట్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సినిమా ఎలా ఉంటుందోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సంజు అనే పాత్ర సందీప్ కిషన్, అమ్ము పాత్రలో అనీషా అంబ్రోస్, వడ్డీ రాజా పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ లో టైమ్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనే కథాంశాన్ని దర్శకుడు అని కన్నెగంటి చాలా టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు. అన్ కాంప్రమైజింగ్ నిర్మాతలు సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. 

11:22 - March 8, 2016

ముంబై : గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఒప్పందాలు కుదిరాయి. గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందాలపై సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సంతాకలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సభ్యులుగా అంతరాష్ట్ర జలమండలి బోర్డు ఏర్పాటు అయింది. గత ఒప్పందాలు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు, సాంకేతిక సమస్యలను బోర్డు పరిష్కరించనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ధన్యావాదాలు తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. ఏడాదిన్నర కాలంగా మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్ధాల కల నెరవేరిందన్నారు.

పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన కేసీఆర్, ఫడ్నవీస్

ముంబై: మహారాష్ట్ర-తెలంగాణ రాష్ర్టాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. ఈమేరకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ అయ్యారు. కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు ఒప్పంద (ఎంవోయూ) పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఇరువురు సీఎంలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.

11:07 - March 8, 2016

మాస్కో : ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా, ప్రపంచంలో అత్యధిక సంపాదన గల మహిళా అథ్లెట్ గా షరపోవా కీర్తికెక్కింది. ఆటతీరు, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్యా టెన్నిస్ స్టార్.. డ్రగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. డోపింగ్ లో అడ్డంగా బుక్కైన టెన్నిస్ బ్యూటీ క్వీన్ మారియా షరపోవాకు తొలి షాక్ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న సందర్భంగా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డొనియంను వాడినట్లు తేలింది.

28 ఏళ్ల మారియా షరపోవా...

28 ఏళ్ల మారియా షరపోవా 17 ఏళ్ల వయసులో 2004లో మొదటి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాతి ఏడాది 2005 నుంచి వరుసగా 11 ఏళ్లు ప్రపంచ నెం.1 ర్యాంకులో కొనసాగారు. ఇప్పటి వరకు మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు మరెన్నో ప్రపంచ టైటిళ్లను షరపోవా సాధించారు. ఎన్నో అఖండ విజయాలను నమోదు చేసిన ఆమె కెరీర్ ఇలా అర్ధాంతరంగా ముగియనుండటం శోచనీయం. అయితే ఈవ్యవహారంపై క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘నైక్’ వేగంగా స్పందించింది. షరపోవాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆ సంస్థ కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది. డోపింగ్ వార్తలు వాస్తవమే అంటూ షరపోవా ప్రకటించిన కొద్దిగంటల్లోనే నైక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

2001లో డబ్ల్యూటీఏ టూర్ లో..

2001లో డబ్ల్యూటీఏ టూర్ లో పాల్గొన్న షరపోవా తక్కువ కాలంలోనే ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఈ రష్యా బ్యూటీ ఆ మరుసటి ఏడాదే 2005లో 18 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014ల్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలిచింది. గత లండన్ ఒలింపిక్స్ లో రజత పతకం నెగ్గింది. షరపోవా తన కెరీర్లో 4 ఐటీఎఫ్, 35 డబ్ల్యూటీఏ టైటిల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏడో ర్యాంక్ లో ఉంది. ఇక ధనార్జనలో షరపోవాదే అగ్రస్థానం. ఫ్రైజ్ మనీతో పాటు ఎండార్స్ మెంట్ల ద్వారా ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న క్రీడాకారిణి షరపోవానే. 2005 నుంచి వరుసగా 11 సంవత్సరాలు అగ్రస్థానంలో ఉండటం విశేషం. గతేడాది ఆమె సంపాదన దాదాపు 200 కోట్ల రూపాయలు. డోపీగా తేలడంతో షరపోవా కెరీర్ ప్రమాదంలో పడింది. అంతేగాక, ఎండార్స్ మెంట్లను సంబంధింత కంపెనీలు రద్దు చేసుకునే అవకాశముంది. షరపోవా డోపీగా తేలిన విషయం తెలిసిన వెంటనే నైక్ రద్దు చేసుకుంది.

నేను చాలా పెద్ద తప్పు చేశా...

లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షరపోవా మాట్లాడుతూ… నేను చాలా పెద్ద తప్పు చేశాను. డోపింగ్ టెస్ట్‌లో విఫలమవ్వడంలో పూర్తి బాధ్యత నాదే. నా అభిమానులను బాధపెట్టానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరైన ఆటగాళ్లు డ్రగ్స్ వాడినట్లు తెలితే ఎదురయ్యే పరిణామాల గురించి తనకు తెలుసని, అయితే కెరీర్ అర్దాంతరంగా ముగించాలనుకోవట్లేదని…తనకు మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జనవరిలో నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో షరపోవా విఫలం అయినట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ధ్రువీకరించింది. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినందున 4 ఏళ్ల వరకు వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డోపిగా తేలడంతో ప్రముఖ సంస్థ నైక్ ఆమెతో యాడ్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేటి ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 120 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. 

బాలికపై అత్యాచారం..ఆపై నిప్పంటించాడు

నోయిడా: దేశరాజధాని దిల్లీ సమీపంలోని నోయిడా పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి... అనంతరం నిప్పంటించి పరారయ్యాడు. 95శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గౌతమబుద్ధనగర్‌లోని ఓ ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 

10:56 - March 8, 2016

ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిది సహజమరణం కాదంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. మణి మృతిపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో మణికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టు మార్టం ద్వారా సేకరించిన శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా శరీరంలో రసాయన పదార్థం ఉన్నట్టు గుర్తించామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆస్పత్రి వర్గాలు మణిది అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మణి ఆఖరి క్షణాల్లో గడిపిన ఫాంహౌస్‌లో ఇవాళ ఉదయం ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్కాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. కళాభవన్‌మణి కాలేయ సంబంధ వ్యాధితో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా, కళాభవన్ మణి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. త్రిశూర్ జిల్లా చలక్కుడిలోని మణి సొంత నివాసంలో అంత్యక్రియలు నిర్వహించారు. కళాభవన్ మణి సోదరుడి కుమారుడు దినేశ్.. ఆయన చితికి నిప్పటించారు. ఈ సమయంలో అభిమానుల రోదనలు మిన్నంటాయి. మండుతున్న చితికి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులను పోలీసులు వెనక్కు లాక్కేళ్లారు. అభిమానులు, సన్నిహితులు, సహనటులు ఆయనకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. చివరిసారిగా 'పేదల సూపర్ స్టార్'ను దర్శించుకునేందుకు జనం పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మూడు ప్రాంతాల్లో ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు కళాభవన్ మణి పార్థీవదేహానికి నివాళి అర్పించారు.

10:48 - March 8, 2016

ఒకప్పుడు కథానాయికలు కోటి రూపాయల పారితోషికం తీసుకొంటారంటే నమ్మేవాళ్లు కాదు. ఆ సంఖ్యను సాకారం చేసిన కథానాయికల జాబితాలో తొలివరసలో వినిపించే పేరు నయనతార. ప్రస్తుతం భిన్న భాషల్లో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈ సొగసరి తన స్టార్‌డమ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. పారితోషికాన్ని రెట్టింపు చేసినట్లుగా సమాచారం. ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆమె నటిస్తున్న సినిమాలు వరుస సక్సెస్‌లుగా నిలుస్తుండటంతోనే నయనతార తన పారితోషికాన్ని పెంచినట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం తమిళంలో ఇదు నమ్మ ఆలు, కాష్మోరా, ఇరు ముగన్‌తో పాటు తెలుగులో బాబూ బంగారం చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు పదమూడేళ్లు గడిచినా నయనతార జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతోంది ఈ సుందరి. గ్లామర్, అభినయ ప్రధాన పాత్రలతో సత్తా చాటుతూ అగ్రకథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోంది నయన్....

10:47 - March 8, 2016

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.  ప్రతి ఏటా మార్చి 8న వచ్చే మహిళా దినోత్సవం ఈ ఏడాది కూడా అనేక సవాళ్లను మరింత తీవ్రంగా మనకు గుర్తు చేస్తోంది. దాదాపు 66 కోట్ల మంది పురుషులు, 62 కోట్ల మంది స్త్రీలు వున్న దేశం మనది. ఈ లెక్కను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మనం ఇక ఏమాత్రం అలక్ష్యం చేయడానికి వీలులేని ఓ హెచ్చరిక ఈ లెక్కల్లో దాగి వున్నది. స్మార్ట్ సిటీలు, అమృత నగరాలు సృష్టిస్తామని చెప్పే నాయకులు చాలామంది వున్నారు. కానీ, ఓ అయిదేళ్లకో, పదేళ్లకో స్త్రీ పురుష జనాభాను సరిసమానం చేస్తామని హామీ ఇచ్చే నాయకుడు ఒక్కడైనా వున్నాడా? లేడు గాక లేడు. 
ఇంకా తగ్గిపోతున్న స్త్రీల సంఖ్య
అవును. ఇది పచ్చినిజం. మనదేశంలో జనాభాను లెక్కగట్టిన ప్రతిసారీ ఆవేదనే మిగులుతోంది. ఆ గణాంకాలు పరిశీలించిన ప్రతి సందర్భంలోనూ మన మనస్సు చెదిరిపోతోంది. లెక్కవేసినా కొద్ది స్త్రీల సంఖ్య ఇంకా ఇంకా తగ్గిపోతోంది.  ఇంకోవైపు హింస పెరుగుతోంది.  ఏ ఇంటిలో ఎప్పుడు గ్యాస్‌ పేలుతుందో తెలియదు. ఇలాంటి గ్యాస్‌ పేలుళ్లల్లో ఎప్పుడూ కొత్త కోడళ్లే చనిపోతూ వుంటారు. ఇంటిలో భద్రతలేదు. వీధిలో రక్షణలేదు. బడిలో, గుడిలో, బస్సులో, ట్రైన్‌లో ఎక్కడికివెళ్లినా యాసిడ్‌ దాడి చేయడానికో, అత్యాచారం చేయడానికో ఎవడో ఒకడు కాచుకునేవుంటాడు. 
అష్టకష్టాలకోర్చి విజయాలు సాధిస్తున్న స్త్రీలు 
వాస్తవిక లెక్కలు, వాస్తవిక దృశ్యాలు ఇంత కఠోరంగా వుంటే- కొంతమంది స్త్రీలు అష్టకష్టాలకు ఓర్చి , కొన్ని రంగాలలో సాధించిన విజయాలను చూసి స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయని మురిసిపోదామా?  545 మంది ఎంపీలున్న లోక్‌సభకు 60మంది స్త్రీలు ఎన్నికవ్వడమే అబ్బురంగా కనిపిస్తుంటే విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం ఎక్కడ వచ్చినట్టు? 
ప్రతి మహిళా నిజంగా స్ఫూర్తిదాతే
మన దేశంలోని మొత్తం ఎగ్జిక్యూటివ్ స్థానాల్లో స్త్రీలకు కనీసం ఆరేడు శాతమైనా దక్కడంలేదన్నది నిష్టూర సత్యం. ఆ కొద్దిమంది స్త్రీలైనా అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి  ఎన్ని విషనాగులను తప్పించుకోవాల్సి వచ్చిందో, ఎన్ని రోజులు కలతతతో, వేదనతో నిద్ర పట్టని రాత్రులు గడపాల్సి వచ్చిందో. ఇవాళ వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఏ మహిళ హ్రుదయాంతరాలను కదలించినా తాను ఆ స్థితికి చేరుకోవడానికి పడిన వేదననీ, తాను భరించిన అవహేళనలనూ, తాను ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంటుంది. భరించలేనంత బాధనీ, ఆపుకోలేనంత దు:ఖాన్ని గుండెల్లో దాచుకుంటే తప్ప  ఉన్నత స్థానాలకు చేరుకోవడం, అక్కడ నిలదొక్కుకోవడం సాధ్యంకానిపని. ఇన్ని బాధల సుడిగుండాల మధ్య, కన్నీటి కొలనులను ఈదుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ప్రతి మహిళా నిజంగా స్ఫూర్తిదాతే. 
ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అవమానాలు
తాను ఎంచుకున్న ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే ఎన్నో అవరోధాలు. ఎన్నెన్నో అవమానాలు. మరెన్నో అవహేళనలు.  వీటికి తోడు తాను వేసుకునే డ్రస్సుల మీద కామెంట్స్. చీకటిపడ్డ తర్వాత రోడ్డు వెంట కనిపించడం నేరం. పట్టపగలైనా ఒంటరిగా ప్రయాణించడం పాపం. నలుగురితో కలిసి నవ్వుతూ మాట్లాడడం మహా ఘోరం. వళ్లంతా పశుత్వం నింపుకుని, క్రూరాతిక్రూరంగా ప్రవర్తిస్తున్నరాస్కెల్స్ కూడా  ఆడపిల్లల డ్రస్సుల గురించి, స్నేహాల గురించి మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్లను ఏమనాలి? ఏం చేయాలి?  ఆడపిల్లను చూడగానే రంకెలేసే ధైర్యం ఈ మృగాలకు ఎక్కడి నుంచి వస్తోంది?  సాయంత్రం చీకటి పడ్డ తర్వాత బయటకు రావద్దు, స్నేహితులతో కలిసి తిరగొద్దు అంటూ వెర్రిమొర్రి ఆంక్షలు పెట్టే  సాహసం ఈ కామాంధులు ఎలా చేయగలుతున్నారు? ఆడపిల్లను చూడగానే సొంగగార్చే బలహీనుడు, డ్రస్‌లను చూసి మృగంగా మారేవాడు, అలాంటి అర్భకుల పక్షాన వకాల్తాపుచ్చుకుంటున్నవాడు అసలు మన మధ్య తిరగడానికి అర్హుడేనా ?  కనీసం తన జుత్తు తాను దువ్వుకోలేని, తన గౌను తాను వేసుకోలేని పసిబిడ్డల మీద కూడా అత్యాచారం చేస్తున్నారంటే ఆ లోపం ఎవరిది? 
పిల్లలను పెంచే విధానంలోనే తప్పు 
పిల్లలను పెంచే విధానంలోనే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మన కడుపున పుట్టిన మన పిల్లల్లోనే ఒకడికి అంతులేని స్వేచ్ఛనిస్తున్నాం. వాడు ఆడపిల్ల డ్రస్ చూడగానే సొల్లగార్చేంత మానసిక దుర్భలడిగా తయారవుతున్నాడు. బలాదూర్ గా తిరిగినవాడు మృగంగా మారుతున్నాడు. మరొకబిడ్డకు అడగడుగునా ఆంక్షల సంకెళ్లు బిగిస్తున్నాం. .   అణకువ నేర్చుకున్న పిల్ల బాధితురాలవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలా? అమ్మాయిలు స్వేచ్ఛగానూ, అబ్బాయిలు మనుషుల్లాగానూ బతికే  వాతావరణాన్ని మనం సృష్టించుకోలేమా? ప్రతి స్త్రీని తన తోటి మనిషిగా గుర్తించి గౌరవించే  సంస్కారవంతుడైన  పరిపూర్ణ పురుషుడిని మనం ఆవిష్కరించుకోలేమా?  

 

10:42 - March 8, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు మెస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మ్యారేజ్‌కి వేదిక ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌కే మొగ్గుచూపిన ఇరు ఫ్యామిలీలు.. వెన్యూని ఫైనల్ చేశారట. బెంగుళూరులోని చిరు ఫామ్‌హౌస్‌లో శ్రీజ-కల్యాణ్ వివాహం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కల్యాణ్ కుటుంబసభ్యులు ఓకే అన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు చిరంజీవి పెద్ద కూతురు, కోడలు ఉపాసనలు వేదిక కోసం పలు ప్రాంతాలను పరిశీలించారట. ముఖ్యంగా రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్ ప్రాంతాలు పర్యటించినా, అక్కడ వాతావరణం వేడిగా వుండడంతో డ్రాపైయ్యారు. చివరకు బెంగుళూరు ప్రశాంతంగా వుండడమేకాదు.. కూల్‌గా వుంటుందని, అభిమానుల తాకిడి పెద్దగా వుండదన్నది మెగా క్యాంప్ ఆలోచన. ఎట్ ప్రజెంట్ వెడ్డింగ్ పనుల్లో నిమగ్నమైన మెగా ఫ్యామిలీ.. ఈనెల 27న హైదరాబాద్‌లో జరగనున్న సంగీత్ ఈవెంట్‌కి చిరు ఫ్యామిలీ దగ్గర బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ హాజరవుతారని టాక్. 

10:40 - March 8, 2016

మహిళలపై వేధింపులు ఆపాలని ఐఎఫ్ టీయూ నాయకురాలు ఎస్ఎల్.పద్మ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవానికున్న ప్రాధాన్యతేమిటి? ప్రస్తుతం మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యేలేమిటి? స్త్రీ స్వేచ్ఛకు , స్త్రీల అభ్యున్నతికి, స్త్రీల భద్రతకు అడ్డంకిగా వున్న అంశాలేమిటి'? ఇలాంటి అంశాలపై పద్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాసేపట్లో ఫడ్నవీస్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: కాసేపట్లో సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. వీరి భేటీలో గోదావరి బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకుంటుంది. ఇది తెలంగాణ సాగునీటి రంగం దశదిశను మార్చే మహా ఒప్పందం ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇరు రాష్ర్టాల సీఎంల సమక్షంలో ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం 3గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి అధికార నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

పశ్చిమబెంగాల్ లో బాంబు పేలుడు : ముగ్గురి మృతి

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మూడు కంటెయినర్లలో ఉన్న నాటుబాంబులు ఒకేసారి పేలినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగిరం చేశారు. గాయపడిన వారిని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. కేంద్ర బలగాలు సైతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

10:32 - March 8, 2016

కీరదోసకాయలు, ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయలలో నాలుగో స్థానాన్ని పొందింది మరియు మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఉత్తమ ఆహారాలలో ఇది ఒకటి అని, తరచుగా దీనిని ఒక సూపర్ ఆహారంగా సూచిస్తుంటారు. కీరదోసకాయను ఎక్కువగా సలాడ్స్ లో, రైతాలు తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. సలాడ్స్ తినడానికి ప్రధాన కారణం మన శరీరంలో న్యూట్రీషినల్ విలువలు పెంచడం కోసమే. ముఖ్యంగా గ్రీన్ సలాడ్స్ లో కీరదోసకాయను మరియు టమోటోలను ఖచ్చితంగా చేర్చుకోవాలి . వీటి వల్ల శరీరానికి అనేక న్యూట్రీషినల్ విలువలు అందుతాయి. నిజానికి, చాలా మంది ఉదయం వివిధ రకాల జ్యూసులు త్రాగుతుంటారు. ఈ జ్యూసులు రోజంతా అవసరం అయ్యే ఎనర్జీని అందించడంలో గొప్పగా సహాయపడుతాయి. అస్సలు దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీరదోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంట్లో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరానికి నీటిని అందిస్తుంది.

శరీరంలో ఏర్పడే వేడిని కీరదోసకాయ తగ్గిస్తుంది. ఛాతిలో మంట కూడా తగ్గుతుంది. కీరదోసను చర్మంపై రుద్దితే సన్‌బర్న్ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

దేహంలోని విషపదార్థాలను బయటకు పంపివేస్తుంది. క్రమం తప్పకుండా కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

మనకు నిత్యం కావల్సిన అనేక విటమిన్లు, పోషక పదార్థాలను కీరదోస కాయ అందిస్తుంది. విటమిన్ ఎ, బి లతోపాటు విటమిన్ సి కూడా దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి.

చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్యసాధనంగానూ అనేక చోట్ల వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు తక్కువ ఉండడం చేత కీరదోసకాయ బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కీరదోసకాయలను నమిలితే దవడలకు మంచి వ్యాయామం జరుగుతుంది. మలబద్దకం కూడా పోతుంది.

దృష్టి సంబంధ సమస్యలను కీరదోసకాయ దూరం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు కూడా పోతాయి. కీరదోసను అడ్డంగా కోసి ఒక్కో ముక్కను కళ్లపై పెట్టుకుని కొంత సేపు ఉండాలి. తరచూ ఇలా చేస్తే కంటి సమస్యలు దూరమవుతాయి.

క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కీరదోసలో ఉన్నాయి. ప్రధానంగా అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో ఉన్నాయి.

మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుంది. నోటిని రిఫ్రెష్ చేయడంతోపాటు చిగుళ్ల సమస్యలను కూడా దూరం చేస్తుంది. నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

వెంట్రుకలు, గోర్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కీరదోసలో ఉండే సిలికా వల్ల ఇది సాధ్యమవుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. తలనొప్పి, హ్యాంగోవర్ వంటి సమస్యలను మాయం చేస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కీరదోసకాయలు పరిరక్షిస్తాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

10:32 - March 8, 2016

విజయవాడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో మాతృమూర్తులను సన్మానించారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని, అవసాన దశలో పిల్లల ఆదరాభిమానాలకు నోచుకుని వృద్ధ మహిళలను సత్కరిరంచారు. 
నూరేళ్లు పూర్తి చేసుకుని, దీర్ఘాయుషుతో జీవనం 
ఇక్కడ ఉన్న వీరంతా మాతృమూర్తులు. వీరిలో నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని, దీర్ఘాయుషుతో జీవిస్తున్నవారకు కూడా ఉన్నారు. పిల్లలను కనిపెద్దచేసి, వారికి విద్యా బుద్దులు చేర్పించారు. ఆస్తులు పంచిచ్చారు. వృత్తివ్యాపకాలు, ఉద్యోగులు, వ్యాపారాల రీత్యాల ఎవరికి వారు  రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోయారు. దీంతో వీరంతా ఆత్మీయతను కోల్పోవాల్సి వచ్చింది.  అవసాన్న దశలో కూడా పిల్లల ఆదరాభిమానాలకు నోచుకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు. కొడులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నా... ఎవరి ఆలన,పాలనకు నోచుకోలేదు. ముద్దు మురిపాలకు కూడా  ముఖంవాయాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్లవాళ్లు ఉన్నా చివరికి వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీయాల్సిన ధీనావస్థలో ఉన్నారు. 
వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్
విశేష పర్వదినాల సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులను సన్మానించడం తరచు జరుతుంది. కానీ  విజయవాడలోని వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్ దీనికి భిన్నంగా ఈ మాతృమూర్తులను సన్మానించింది. ప్రతినెలా వీరికి నిత్యావసరాలు అందించడంతోపాటు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మందులు పంచుతోంది. వృద్ధులకు సన్మానాన్ని వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్‌ నిర్వాహకులు అదృష్టంగా భావిస్తున్నారు. వృద్ధుల ఆలన, పాలన చూస్తున్న వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్ సేవలను ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ ప్రశంసించారు. 
కన్నవారిని మరచిపోవడం మంచిదికాదు 
సంతానం ఎత్త ఉన్నత స్థాయిలో ఉన్నా.... ఎన్ని శిఖరాలు అధిరోహించినా... కన్నవారిని మరచిపోవడం మంచిదికాదని కొందరు సూచిస్తున్నారు. సన్మాన, సత్కారాలు అందుకుంటున్న సమయంలో తన సంతానం వెంట ఉంటే ఎంత  సంతోషంగా ఉండేదో ... అంటూ కొంత మంది మాతృమూర్తుల కళ్లు చమర్చాయి. పెల్లుబుకుతున్న కన్నీటిని దిగమింగుకుని, ఒకరినొకరు ఓదార్చుకుని, ఉపశమనం పొందారు. 

 

అలిపిరి ఘటన కేసులో నేడు తుది తీర్పు..

తిరుపతి: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్1న తిరుపతి అలిపిరి సమీపంలో జరిగినపేలుడు ఘటన కేసులో తిరుపతి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి సదానందమూర్తి మంగళవారం తుది తీర్పు వెలువరించనున్నారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న చంద్రబాబు, మంత్రి బొజ్జల సాక్ష్యమివ్వలేదు. దీంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.

10:20 - March 8, 2016

నిజామాబాద్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇల్లాలిగా, గృహిణిగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆకాశంలో సగం, భూమిపైనా సగం తమదేనంటున్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తున్న నిమాజామాబాద్‌ జిల్లాలో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.                                                                                  
జిల్లాలో ఎక్కువగా మహిళా ప్రజా ప్రతినిధులు  
నిజామాబాద్‌ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. నగర ప్రథమ పౌరురాలుగా మహిళ ఉన్నారు. జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మహిళ రాణిస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత  తనదైన శైలిలో ప్రత్యేక నిరూపించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా పరిపాలనలో ప్రత్యేక ముద్ర వేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్‌పీటీసీల్లో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. కామారెడ్డి, ఆర్మూర్‌  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కూడా మహిళలు రాణిస్తున్నారు.  
ఎంపీగా కల్వకుంట్ల కవిత 
కల్వకుంట్ల కవిత ఎంపీగా ప్రజల్లో తనకుంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతూ అందిదృష్టికి ఆకర్షిస్తున్నారు. జిల్లా నుంచి గల్లీ వరకు అన్ని సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అటు ప్రజల నుంచి  ఇటు రాజకీయ నేతల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ... పాలన వ్యవహారాల్లో ముందుకుసాగుతున్నారు. జిల్లా అభివృద్ధిపథంలో పయనించేలా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. 
నగర పాలక సంస్థ మేయర్‌ గా ఆకులు సుజాత..
ఆకులు సుజాత.. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ మేయర్‌గా రాణిస్తున్నారు. నిత్యం  నగర ప్రజలో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటున్నారు. 
జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా గడ్డం సుమనారెడ్డి
నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా గడ్డం సుమనారెడ్డి పని చేస్తున్నారు. గతంలో దర్పల్లి ఎంపీపీగా కూడా  పని చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా... ఇంకా వివక్ష కొనసాగుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పిప్పర సుష్మ 
కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పిప్పర సుష్మ పనిచేస్తున్నారు. మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, కొన్ని సందర్భాల్లో వారికి వంటే ఎక్కువగానే రాణిస్తున్నారని చెబుతున్నారు. 
ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా స్వాతిసింగ్‌ బబ్లూ 
ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా స్వాతిసింగ్‌ బబ్లూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో మహిళా క్రీడాకారులకు కొదువలేదు. యెండల సౌందర్య హాకీలో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని దేశానికి మంచిపేరు తెచ్చారు. ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తామని నిరూపిస్తున్నారు. 

 

వివాదంలో మరియా షరపోవా

హైదరాబాద్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ డోప్ టెస్ట్ లో షరపోవా ఫెయిల్ అయ్యింది. నిషేధిత ఉత్ర్పేరకం మెల్డోనియం వాడినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా 2006 నుంచి ఈ డ్రగ్ తీసుకుంటున్నాని షరపోవా తెలిపారు. ఈ ఏడాది నుంచే డ్రగ్ ను నిషేధిత జాబితాలో టెన్నీస్ అసోసియేషన్ చేర్చినట్లు తెలిపింది. అంతే కాకుండా దీనికి పూర్తి బాధ్యత తనదేనని షరపోవా తెలిపింది. దీంతో నైక్ కంపెనీ షరపోవాతో ఒప్పందం రద్దు చేసుకుంది. మార్చి 12 వరకు మ్యాచ్ లపై నిషేధం విధించింది.

సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కార్యాలయ సిబ్బందికి సిబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ కు సిబీఐ ఫోన్ ద్వారా తెలిపింది. సీఎంతో పాటు పలువురు మంత్రుల కార్యాలయాల సిబ్బందికి కూడా సీబీఐ ఈ నోటీసులు జారీ చేసింది. గత డిసెంబర్ లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. సీఎం కేజ్రీవాల్ కార్యాలయ సిబ్బందికి మేము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని సిబిఐ తెలిపింది.

13 జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం : మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నియోజకవర్గాల్లో స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించామని, ప్రతి జిల్లాలో జాతీయ క్రీడలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

09:50 - March 8, 2016

హైదరాబాద్ : విఖ్యాత రచయిత విలియం షేక్ స్పీయర్ జీవిత రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన సమాధిని అత్యాధునిక రాడార్‌తో పరీక్షించారు. షేక్ స్పీయర్ 400వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న ప్రపంచస్థాయి సదస్సులో ప్రదర్శించే ప్రత్యేక డాక్యుమెంటరీ కోసం ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. రాడార్‌ పరీక్షతో ఏయే అంశాలు వెల్లడయ్యాయో ప్రస్తుతానికి తెలియరాలేదు. షేక్స్‌పియర్‌ ఇంగ్లండులోని ఏవన్‌ నదీతీరాన గల చిన్న పట్టణం ''స్ట్రాట్‌ఫర్డ్‌'' లో 26 ఏప్రిల్ 1564 న జన్మించి, 23 ఏప్రిల్ 1616న మరణించారు. యాజ్ యు లైక్ ఇట్, ది మర్చంట్ ఆఫ్ వెనైస్, ది టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, జూలియస్ సీజర్, హామ్లెట్, ఆంటోనీ అండ్ క్లియోపాత్ర, ఇతని ప్రముఖ రచనలు. బ్రిటన్‌లోని స్రాట్‌ఫోర్డ్‌-అపాన్‌-అవాన్‌ పట్టణంలోని హోలీ ట్రినిటీ చర్చిలో షేక్స్‌పియర్‌ సమాధి ఉంది.

'సాక్షి'కి మంత్రులు ప్రతిపాటి, నారాయణ లీగల్‌ నోటీసులు

విజయవాడ : రాజధాని భూములపై రాసిన అసత్య కథనాలపై సాక్షి పత్రికకు మంత్రులు పుల్లారావు, నారాయణ లీగల్‌ నోటీసులు జారీ చేశారు. సాక్షిలో తమపై తప్పుడు కథనాలు రాశారంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు. 

'ముందు ప్రశ్నోత్తరాలు... తరువాత వాయిదా తీర్మానాలు'

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై అర్థవంతమైన, వేగవంతమైన చర్చకోసమంటూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదించిన ‘ప్రశ్నోత్తరాలు ముందు... వాయిదా తీర్మానాలు ఆ తర్వాతే’’ అన్న సంప్రదాయానికి కొద్దిసేపటి క్రితం సభ శ్రీకారం చుట్టింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు నాటి కార్యక్రమాల్లో భాగంగా జాతీయ గీతాలాపన తర్వాత పాత సంప్రదాయానికి భిన్నంగా వాయిదా తీర్మానాలను ప్రస్తావించని స్పీకర్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు: పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ ప్రయోగానికి మంగళవారం కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. శాస్త్రవేత్తలు ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 10న సాయంత్రం 4గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-32 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. 

ఎపి అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఆయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మంత్రి అచ్చెంన్నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో షార్ప్ ఎక్విప్ మెంట్ కింద 500 కోట్ల రూపాయలు ఉన్నాయని... అందులో ఎపి వాటాగా 250 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు. ఎప్రిల్ నాటికి ప్రతి నియోజకవర్గంలో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని చెప్పారు. 13 జిల్లాల్లో ఈవెంట్స్ జరిగేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. క్రీడా శాఖను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోచ్ లు, పరికరాలను సమకూర్చుతామని చెప్పారు.  

 

09:34 - March 8, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఆయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మంత్రి అచ్చెంన్నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో షార్ప్ ఎక్విప్ మెంట్ కింద 500 కోట్ల రూపాయలు ఉన్నాయని... అందులో ఎపి వాటాగా 250 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు. ఎప్రిల్ నాటికి ప్రతి నియోజకవర్గంలో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని చెప్పారు. 13 జిల్లాల్లో ఈవెంట్స్ జరిగేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. క్రీడా శాఖను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోచ్ లు, పరికరాలను సమకూర్చుతామని చెప్పారు.  

09:27 - March 8, 2016

ఖమ్మం : జిల్లాలో ఓ టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా పీవీకే కళాశాలకు చెందిన మొత్తం 45 మంది భీ.ఫార్మసీ విద్యార్థులు టూరిస్టు బస్సులో విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రలో భాగంగా రాజమండ్రి వెళ్లారు. అనంతరం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుగుప్రయాణంలో తల్లాడ మండలం లక్ష్మీనగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ అస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఆయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పలు అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. వాడివేడిగా చర్చలు జరుగనున్నాయి. 

09:00 - March 8, 2016

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1914  మార్చి 8 నుంచి దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అంతకు ముందు కూడా మహిళా దినోత్సవం లేకపోలేదు. పలు  దేశాల్లో వివిధ తేదీల్లో మహిళా  దినోత్సవాన్ని జరుపుకునేవారు. 
1914 మార్చి 8 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం... మహిళ సాధికారత కోసం ఏర్పాటు చేసుకున్న రోజు. వివక్షకు వ్యతిరేంకగా, పౌర హక్కుల సాధన, ఓటు హక్కు కోసం మహిళల ప్రత్యేకంగా నిర్ణయించుకున్న రోజు. వివక్ష పీడన నుంచి విముక్తి కల్పించాలంటూ మహిళలు నినదించిన రోజు. 1914 మార్చి 8 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 
వివక్షతకు వ్యతిరేకంగా పౌర అవగాహన దినోత్సవం 
1914 మార్చి 8కి ముందు కూడా మహిళా దినోత్సవం ఉన్నా వివిధ దేశాల్లో పలు తేదీల్లో దీనిని నిర్వహించేవారు.  మహిళు ఎదుర్కొంటున్న వివక్షతకు వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో దీనిని పౌర అవగాహన దినోత్సవం... సివిల్‌ అవేర్‌నెస్‌ డే అన్ని, మరికొన్ని దేశాల్లో యాంటీ సెక్సిజం డే అని, ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవం.. యాంటీ డిస్క్రిమినేషన్‌ డే.. అని ఇలా రకరకాల పేర్లతో జరుపుకునే వారు. వేతనాల్లో అసమానతలకు వ్యతిరేకంగా 1908లో ఇంటర్నేషనల్‌ లేడీస్‌ గార్మెంట్‌ వర్కర్స్ యూనియన్‌ ఆధ్వర్యంలో  అమెరికాలో సమ్మె జరిగింది. దీనిని మరచిపోకుండా  1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్ లో అమెరికా సోషలిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1910 ఆగస్టులో డెన్మార్క్‌ రాజధాని కోహెన్‌ హేగన్‌ అంతర్జాతీయ మహిళా మహాసభ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం... అంటే 1911 మార్చి 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటికి కొన్ని దేశాల్లో  మహిళలకు ఓటు హక్కులేదు. పురుషులతో సమానంగా తమకు ఓటుహక్కు కాలాని మహిళలు నినదించారు. అయితే అమెరికన్లు మాత్రం చాలాకాలం పాటు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా పాటించేవారు. 1913 చివరి శనివారాన్ని రష్యన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. 1914కు పూర్వం మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఏటా మార్చి 8వ తేదీనే ఇంటర్నేషనల్‌ ఉమెన్స్ డేని జరుపుతున్నారు. వివక్షతకు వ్యతిరేకంగా  1914 మార్చి 8న లండన్‌లోని ట్రఫాల్గర్‌ స్క్వేర్‌లో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించిన  తర్వాత నుంచే  ఎక్కువ దేశాల్లో ఆదే రోజును అంతర్జాతీయ  మహిళా దినోత్సవంగా జరపడం ప్రారంభించారు. 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించే వరకు వివిధ దేశాల్లో పలు తేదీల్లో దీనిని జరుపుకునేవారు. ఐక్యరాజ్య సమితి ప్రకటన తర్వాత నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 

 

08:44 - March 8, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్ట్ ల విషయమై నేడు మహారాష్ట్ర ప్రభుత్వంతో సిఎం కేసిఆర్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇప్పటికే ముంబైలో ఉన్న కెసిఆర్ బృందం... 5 ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. అయితే మహాసర్కార్‌తో ఒప్పందం చేసుకుని నిర్మించే ఐదు ప్రాజెక్టులు తెలంగాణాకు ఎంతమేరకు ఉపయోగపడతాయి? రీడిజైన్ చేసి మరీ నిర్మిస్తున్న వీటి వల్ల సర్కారుపై పడే భారమెంత.? ఇలాంటి పలు అంశాలపై 10టీవి స్పెషల్ స్టోరీ.
గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై ఒప్పందాలు 
గోదావరి నదిపై నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో పొరుగున ఉన్న మహారాష్ట్ర సర్కారుతో ఒప్పందాలు చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ముంబై వెళ్లారు. మహా సర్కార్‌తో చర్చించి పలు కీలక ఒప్పందాలపై సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లు సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఒక దఫా మహారాష్ట్ర వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చించారు. ఈ తర్వాత మంత్రి హరీశ్‌రావు, అధికారుల బృందం పలు దఫాలు మహా సర్కార్‌తో భేటీ అయి చర్చలు జరిపాయి. చివరకు ఇరు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చి ఒప్పందాలకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ బృందం మహారాష్ట్రకు వెళ్లింది. మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. 
మేడిగడ్డ వద్ద 103 మీ.ఎత్తులో బ్యారేజీ 
కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజి 103 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యాక్ వాటర్ ఆధారంగా అన్నారం వద్ద మరో ప్రాజెక్టును నిర్మిస్తారు. అక్కడనుండి నీటిని ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేస్తారు. అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో చివరన సుందిల్ల వద్ద మరో ప్రాజెక్టు నిర్మిస్తారు. అక్కడ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటాయి. నదిలోని నీటిని ఎగువకు పంపింగ్ చేసే విధంగా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. ఇలా దాదాపు 140 కిలోమీటర్ల దూరం నీటిని వెనక్కి పంపింగ్ చేస్తారు. ఈ ప్రాజెక్టులకు ఎగువన మహారాష్ట్ర ఉండడంతో ఆ రాష్ట్ర అనుమతి కోసమే ముఖ్యమంత్రి ముంబై వెళ్లారు. 
లోయర్‌పెన్‌గంగా నదిపై సంయుక్తంగా ప్రాజెక్టుల నిర్మాణం 
ఇవే కాకుండా మరో మూడు ప్రాజెక్టులకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్‌ ఒప్పందం చేసుకోనున్నారు. లోయర్ పెన్‌గంగా నదిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్మించే ప్రాజెక్టుపైనా కూడా చర్చలు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు 37టీఎంసీలు, తెలంగాణకు 5 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. దీనిపైన ఇరు రాష్ట్రాల అధికారుల ఇప్పటికే కసరత్తు చేశారు. అయితే ఈ సమావేశంలోనే ఇరు రాష్ట్రాల సీఎంలు వీటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇవే కాకుండా చనాఖ-కోరాట వద్ద మరో బ్యారేజీ నిర్మించనున్నారు. పెన్ గంగా నదిపై రాజాపేట వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరందించే ప్రణాళికల్ని తెలంగాణం ప్రభుత్వం తయారు చేసింది. 
ప్రాజెక్టుల రీడిజైన్‌తో ఒరిగేదేమీ ఉండదు-సారంపల్లి 
ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల రాష్ట్రానికి కొత్తగా ఒరిగిందేమీ లేదంటున్నారు నిపుణులు. దాదాపు 8వేల కోట్ల రూపాయల అదనపు భారం తప్ప..అదనంగా వచ్చే నీరు కానీ..ఆయకట్టు కానీ ఉండదంటున్నారు. మహారాష్ట్ర సర్కారుతో చేసుకునే ఒప్పందాల మాటెలా ఉన్నా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే విధంగా నిధుల కేటాయింపు ఉండాలంటున్నారు. 
ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు 
మరోవైపు సీఎం కేసీఆర్‌ మహాసర్కార్‌తో కీలక ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్‌ మహా పర్యటనను సక్సెస్ చేసుకొని వస్తున్న సందర్బంగా సీఎంకు బేగంపేటలో ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
ప్రజల కల నెరవేరబోతుందంటున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు 
మొత్తానికి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఇరురాష్ట్రాల సమస్యలు కేసీఆర్‌ పర్యటనతో పరిష్కారం అవుతాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటన ద్వారా తెలంగాణ ప్రజల కల నెరవేరబోతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

08:37 - March 8, 2016

హైదరాబాద్ : రేపు ఉదయం సూర్యగ్రహణం నేపథ్యంలో ఈరోజు రాత్రి పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8.30 నుంచి మూసివేసి రేపు ఉదయం 10 గంటల తెరుస్తారు. బుధవారం ఉదయం నిర్వహించాల్సిన సహస్రకలశాభిషేకాన్ని టిటిడి రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. బాసర సరస్వతీ ఆలయాన్ని ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం ఏడున్నర వరకు, వేములవాడ రాజన్న ఆలయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం వరకు మూసివేయనున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని ఈరోజు రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 7.30 వరకు మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే అమ్మవారి దర్శనానికి మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తారు. సూర్యగ్రహణం దృష్ట్యా దేవాలయాల మూసేస్తున్న నేపథ్యంలో భక్తులు తమ పర్యటనలను రూపొందించుకోవాలని ఆయా ఆలయాల అధికారులు సూచించారు. సూర్యగ్రహణం మనదేశంలో బుధవారం ఉదయం 5.46 నిమిషాల నుంచి 6 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. 

 


 

నేడు సీఎం ఫడ్వవీస్ తో కేసీఆర్ భేటీ

ముంబై : తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఫడ్వవీస్ తో భేటీ కానున్నారు. మేడిగడ్డ సహా 5 బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనునన్నాయి.

 

తెలంగాణలో ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు సెట్ నెంబర్- సీ ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ్టి ఇంటర్మీడియట్ పరీక్షకు సెట్ నెంబర్- సీ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. 

 

నేడు ఎపి అసెంబ్లీలో వైసీపీ అవిశ్వాస నోటీసులు

హైదరాబాద్ : నేడు ఎపి అసెంబ్లీలో వైసీపీ అవిశ్వాస నోటీసులు ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఎపి ప్రభుత్వ పాలన, సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఖమ్మం జిల్లాలో టూరిస్టు బస్సు బోల్తా..

 
ఖమ్మం : జిల్లాలోని తల్లాడ మండలం లక్ష్మీనగర్ సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అనంతపురం జిల్లా పీవీకే కళాశాలకు చెందిన భీ.ఫార్మసీ విద్యార్థులుగా గుర్తించారు. 

నేటి రాత్రి 8.30 నుంచి రేపు ఉ.10 గం.వరకు శ్రీవారి ఆలయం మూసివేత

తిరుపతి : సూర్యగ్రహణం సందర్భంగా నేడు రాత్రి 8.30 నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం జరుగనుంది. 

సూర్యగ్రహణం దృష్ట్యా నేడు బాసర ఆలయం మూసివేత

ఆదిలాబాద్ : సూర్యగ్రహణం దృష్ట్యా నేడు బాసర ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రేపు 7.30 గంటల మరకు మూసివేయనున్నారు. 

నేటి ఉ.10 గం.లకు టీటీడీఎల్పీ భేటీ

హైదరాబాద్ : నేటి ఉదయం 10 గంటలకు తెలంగాణ టీడీఎల్పీ భేటే జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగనుంది. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

కర్నూలు : జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నబోదనంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Don't Miss