Activities calendar

09 March 2016

23:02 - March 9, 2016

''గుంటూర్ టాకీస్' బోల్డ్ మూవీ ఫ్యామిలీతో వెళ్లొద్దు.. ఫ్రెండ్స్ వెళ్తే నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తారు' అని జబర్ధస్త్ ఫేం కం ఈ సినిమా హీరోయిన్ రేశ్మీ,  డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ చెప్పారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా 10టీవీ వీరిద్దరితో నిర్వహించిన చిట్.. చాట్ ఆసక్తికరంగా సాగింది. సరికొత్త జానర్ లో తెరకెక్కిర ఈ సినిమా సెన్సిటీవ్, మరియు ఇమ్మెచ్చూర్ మెంటాలిటీస్ ఉన్నవాళ్లకు అర్థంకాదని డైరెక్టర్ అన్నారు. రేశ్మీ మాట్లాడుతూ శ్రద్ధాదాస్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్లమ్ ఏరియా కొనసాగిన ఈ మూవీ ప్రేక్షకులనుంచి మంచి క్రెడిట్ ని అందుకుంటోంది. 'చందమామ కథలు'తో నేషనల్ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తార్ తానూ తీసిన తీయబోయే ప్రాజెక్ట్స్ గురించి డేరింగ్ అండ్ డాషింగ్ గా చెప్పుకొచ్చాడు.. రేశ్మీ పాడిన సాంగ్.. మరియు చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ఫన్నీ విషయాలు.. తెలుసుకోవాలంటే వీడియో చూసి తీరాల్సిందే. 

21:34 - March 9, 2016

ఢిల్లీ : కింగ్‌ఫిషర్‌ సంస్థల అధినేత విజయ్‌ మాల్యాపై బ్యాంకుల అనుమానం నిజమైంది. అతడు దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోయాడని రుజువైంది. విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోకుండా నిరోధించాలన్న 17 ప్రభుత్వ రంగ బ్యాంకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు జరిపిన విచారణలో ఈ విషయం తేలింది. మాల్యా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోస్తగీని కోర్టు ప్రశ్నించింది. మార్చి 2నే విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లిపోయినట్లు సీబీఐ అధికారులు వెల్లడించినట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. మాల్యా లండన్‌ వెళ్లి ఉంటారని సీబీఐ భావిస్తోంది.

9 వేల కోట్ల రుణాలు ఎలా ఇచ్చారు...

అప్పులు చెల్లించలేని మాల్యాకు సుమారు 9 వేల కోట్ల రుణాలు ఎలా ఇచ్చారని సుప్రీంకోర్టు బ్యాంకులను ప్రశ్నించింది. విదేశాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని, బ్యాంకులో తీసుకున్న రుణం కన్నా అధికమొత్తంలో ఆస్తులు కలిగి ఉన్నారని బ్యాంకులు పేర్కొన్నాయి. దీనిపై రెండు వారాల్లోపు వివరణ ఇవ్వాలంటూ మాల్యా అధికారిక రాజ్యసభ ఈమెయిల్‌ ఐడీకి కోర్టు నోటీసు పంపింది. లండన్‌లోని భారత హైకమిషనర్‌కు, సిబ్బందికి నోటీసులను మెయిల్‌ చేశారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 30కి వాయిదా వేసింది.

9 వేల కోట్లను రికవరీ చేసుకునేందుకు బ్యాంకులు...

మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్లను రికవరీ చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణం ఎగవేతకు పాల్పడ్డారని, ఆయన విదేశాలకు వెళితే కేసు నీరుగారిపోతుందని ఎస్‌బిఐతో సహా 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. మాల్యా బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌లో సెటిల్‌ కావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును జప్తు చేసి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని బ్యాంకులు కోర్టును అభ్యర్థించాయి. మాల్యాను డెబ్ట్‌ రికవరి ట్రిబ్యునల్‌లో హాజరు పరచి త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరాయి.

ఐడిబిఐ బ్యాంకులో తీసుకున్న 9 వందల కోట్ల రుణాలకు ...

ఇంతకుముందు ఐడిబిఐ బ్యాంకులో తీసుకున్న 9 వందల కోట్ల రుణాలకు సంబంధించి మాల్యాపై ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ డబ్బును మాల్యా విదేశాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై కూడా ఈడీ త్వరలోనే మాల్యాను విచారించనుంది.

21:30 - March 9, 2016

ఢిల్లీ : యమునా నదీ తీరంలో శ్రీ శ్రీ రవిశంకర్ ఏర్పాటు చేస్తున్న కల్చర్‌ ఫెస్టివల్‌పై రాజ్యసభ దద్దరిల్లింది. ఓ ప్రయివేట్‌ కార్యక్రమానికి ఆర్మీని ఎలా వినియోగిస్తారని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లనుందని మండిపడ్డాయి.

ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం....

ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమునా నదీ తీరానా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనంపై రాజ్యసభలో దుమారం రేగింది. వేయి ఎకరాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యమునా నదికి తీరని ముప్పు వాటిల్లుతోందని జెడియు నేత శరద్‌ యాదవ్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఓ వ్యక్తి కోసం సైన్యాన్ని వినియోగించడమేంటని ప్రశ్నించారు.

బైట్‌ శరద్‌యాదవ్, జెడియు చీఫ్

భారతీయ సైనికులతో బ్రిడ్జి నిర్మాణం పనులు చేయించడం చట్ట విరుద్ధం...

ఓ ప్రయివేట్‌ కార్యక్రమం కోసం భారతీయ సైనికులతో బ్రిడ్జి నిర్మాణం పనులు చేయించడం చట్ట విరుద్ధమని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి విమర్శించారు.ఆర్ట్ ఆఫ్‌ లీవింగ్‌కు కానీ, ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనానికి తాము వ్యతిరేకం కామని కాంగ్రెస్‌ సభ్యులు గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ దేశంలో పర్యావరణ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. విపక్షాల విమర్శలపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. ఈ వ్యవహారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చూస్తున్నందున రాజ్యసభలో ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రభుత్వ సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందలేదు.

150 దేశాలకు చెందిన 35 వేలమంది ప్రతినిధులు...

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 150 దేశాలకు చెందిన 35 వేలమంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. యమునా నదీ తీరాన వెయ్యి ఎకరాల ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం కోసం ఏడు ఎకరాల్లో 35 వేల మందికి సరిపడా భారీ స్టేజీని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని రాజకీయం చేయొద్దంటూ శ్రీ శ్రీ రవిశంకర్ విజ్ఞప్తి చేస్తున్నారు. 

11న దీక్ష చేసి తీరుతా: ముద్రగడ

తూ.గో : కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నా కుల నాయకులతో నాపై ఎదురుదాడి చేయిస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ప్రభుత్వానికి రేపటి వరకు గడువిచ్చానని...11న దీక్ష చేసి తీరుతానని ముద్రగడ హెచ్చరించారు. పదవుల కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని, కులాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందే వ్యక్తిని కానని ముద్రగడ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని నీరుగారిస్తే ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తామని నన్ను ప్రలోభపెడుతున్నారని మండి పడ్డారు. డబ్బులు, పదవుల ఆశతో నన్ను కొనలేరన్నారు.

21:22 - March 9, 2016

హైదరాబాద్ : టీఎస్ పిఇ సెట్‌, టీఎస్ పిజిఇ సెట్‌, ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్లతో పాటు రిజిస్ట్రార్‌ భేటీ అయి సెట్‌ పరీక్షలపై చర్చించారు. అయితే మొదటిసారి ఇంజనీరింగ్‌కు సంబంధించిన పీజీ ఈసెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. ప్రకటించిన సెట్లన్నింటికి ఈనెల 14నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. 

21:10 - March 9, 2016

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్దిపై ఇక్కడ బీద అరుపులు అరిచే చంద్రబాబు, ఢిల్లీలో మాత్రం డాంబికాలు చెబుతారని ప్రతి పక్ష నేత జగన్ విమర్శించారు. ఓటుకు నోటు కేసును చక్కబెట్టుకోవడానికే ఆయన ఢిల్లీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. బినామీల కోసమే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చేపట్టారని జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో జగన్ కురిపించిన విమర్శల వర్షాన్ని చూస్తూ.. వినాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి.

సీఎం పై ముద్రగడ వ్యక్తిగత ఆరోపణలు సరికాదు:చినరాజప్ప

హైదరాబాద్ : మంత్రి చినరాజప్ప నివాసంలో కాపు నేతలు సమావేశం అయ్యారు. ముద్రగడ లేఖ పై సమావేశంలో చర్చించామని చినరాజప్ప తెలిపారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చి కాపుతో సహా నాలుగు కులాలను వదిలేశారన్నారు. ముద్రగడ రెండు సార్లు ఎంపిగా పని చేశారని.. అపుడు కాపులను బీసీల్లో చేర్చాలన్న విషయం మరిచారా అని ప్రశ్నించారు. ముద్రగడ లేఖలో సీపెం పై వ్యక్తిగ ఆరోపణలు సరికాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని గవర్నర్ తన ప్రసంగలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాయల సుభాష్ చంద్రబోస్ కన్నుమూత...

హైదరాబాద్ : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్(70) కన్ను మూశారు. రాయల సుభాష్ 48 ఏళ్లుగా అజ్ఞాతంలో గడిపారు. సుభాష్ మృతి వామపక్ష నేతలు సంతాపం తెలియజేశారు.

హైకోర్టులో మందకృష్ణ పిటిషన్

హైదరాబాద్: హైకోర్టులో ఎమ్మర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిటిషన్‌ వేశారు. నారావారిపల్లె నుంచి విశ్వరూప చైతన్యయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విశ్వరూప చైతన్యయాత్ర పై తగు నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు సూచించింది.

20:44 - March 9, 2016

హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాద్వీ ప్రాచీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్‌కు సవాలు విసిరింది. అనుపమ్ ఖేర్‌కు ధైర్యముంటే తనను, యోగి ఆదిత్యానాథ్‌ను జైలుకు పంపించాలని సవాలు చేశారు. తాము ఎల్లపుడూ హిందుత్వాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉంటామని..అనుపమ్‌కు ధైర్యం ఉంటే జైలుకు పంపించాలని సవాలు విసిరారు. బీజేపీలో కొందరు వ్యక్తులు (సాద్వీప్రాచీ, యోగి ఆదిత్యానాథ్‌నుద్దేశించి) పిచ్చికూతలు కూస్తూ పార్టీ పరువును దిగజారుస్తున్నారని..వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇటీవలే అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

టి.టిడిపి నుండి ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్

హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ తెదేపా నుంచి సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, గాంధీలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సస్పెండ్‌ చేశారు.

17 వరకు బంగారు దుకాణాల బంద్

హైదరాబాద్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జెమ్స్ అండ్ జువెల్లర్స్ ఫెడరేషన్-జీజేఎఫ్) పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తుల బంద్ ఈనెల 17 వరకు కొనసాగనుంది. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన బంద్ మొదట్లో మూడు రోజుల వరకు మాత్రమేనని ప్రకటించారు.

ఆధారాలతో నిరూపిస్తాం : చెవిరెడ్డి

హైదరాబాద్‌ : భూ అక్రమాలపై అసెంబ్లీలో ఆధారాలు ఇస్తే దర్యాప్తులు జరగవని టీడీపీకి తెలియదా? అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నామని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధారాలు ఇస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలను సీబీఐ ముందు ఉంచుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు దర్యాప్తు వద్దని, ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు.

20:12 - March 9, 2016

మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న 'మల్లన్న ముచ్చట్లు' ఈ రోజు కూడా కొత్త కొత్త ముచ్చట్లతో మీ ముందుకొచ్చింది.. భూమి-సూర్యుడు నడుమ చంద్రుడు... సుడిపెట్టి తిరిగిన సూర్యగ్రహణానికి గల కారణాలేంటీ? అసలు సూర్య గ్రహణం రోజు గుడులను ఎందుకు మూసేస్తరు? అంటూ మల్లన్న చెప్పిన వార్త తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆ తర్వాత కార్పొరేషన్ ఓట్లల్ల కారుదే జోరు... ఇప్పట్లో అంబాసిడర్ ను ఆపలేరంటూ.. తెర్లు తెర్లు అయిన తెలంగాణ తెలుగుదేశం గోసను మల్లన్న కండ్లకు గట్టినట్టు సూపెట్టిండు.  కబ్జారాయుళ్లకు స్వర్గం అయిన మిర్యాలగూడ..లో మహిళలపై గుండా దాడి.., గర్భగుడిలో పూజలు చేస్తున్న పాము... దండలు ఇసిరి దండం పెట్టిన భయ భక్తులు, నడిరోడ్డుమీద కొట్టుకున్న ఆడోళ్లు.. లాంటి వాటితో 'మల్లన్న ఈ రోజు తీసుకొచ్చిన ముచ్చట్లు' కండ్లారా చూస్తేనే అద్భుతంగా ఉంటుంది కదా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేసి తనివితీరా చూడండి.

ఏపీ సర్కార్ పై బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఫైర్

హైదరాబాద్ : ఏపీ సర్కార్ బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్నవే చెబుతన్నామన్నారు. పోలవరంపై కేంద్రానికి బిల్లుల ఎందుకు సమర్పించలేదు. బిజెపీ పై అబాండాలు వేయడం సరికాదన్నారు.

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన అటు నుంచి లండన్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పై ఈవెంట్ పై రూ.5కోట్లు జరిమానా

ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) కోర్టు రూ. 5కోట్ల జరిమానాను విధించింది. కార్యక్రమానికి ముందే జరిమానాను చెల్లించి ఫెస్టివల్ ను ప్రారంభించుకోవచ్చని సూచించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)కి కూడా గ్రీన్ కోర్టు రూ. 5లక్షల జరిమానాను విధించింది. యమునా నదీ తీర ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అనుచరులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్స్ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

18:44 - March 9, 2016

తూ.గో :కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్ కలెక్టర్ కృష్ణ ACBకి చిక్కాడు. అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద బహిరంగంగా 30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పాయకరావు పేటకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తికి చెందిన ఇంటి స్థలం 47వార్డులో ఉండటంతో ఖాళీ స్థలానికి పన్ను వేయించడానికి కార్పొరేషన్ అధికారులను కలిశాడు. బిల్ కలెక్టర్ కృష్ణ తొలుత 80వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే చివరకు 30వేలకు బేరం కుదిరి అచ్యుతాపురం గేటు దగ్గర డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కృష్ణను పట్టుకున్నారు.

18:42 - March 9, 2016

హైదరాబాద్ : సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. రాజధాని భూములపై విచారణకు సిద్ధమేనా అంటూ అధికార.. విపక్ష సభ్యులు సవాళ్లు విసురుకున్నారు. అవినీతి పరులు మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు మండిపడ్డారు. భూముల దందా అంశంపై ఇద్దరు నేతలు విశ్వరూపం ప్రదర్శించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో ఇన్‌సైడెడ్‌ ట్రేడింగ్‌ అంశం సభను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని వీడియోలో చూడండి.

18:39 - March 9, 2016

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం జరుగుతున్న బలవంతపు భూ సేకరణపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. 15 లక్షల ఎకరాల భూసేకరణను నిరసిస్తూ విజయవాడలో భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం అక్రమంగా లక్షలాది ఎకరాలను లాక్కొనే ప్రయత్నం చేస్తుందని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు.

భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో....

బలవంతపు భూసేకరణను నిరసిస్తూ విజయవాడలో భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని ప్రభుత్వం లాక్కోవద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి....

ఆ తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీపీఎం, సీపీఐ నేతలు ప్రదర్శనగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ అక్కడే వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే తమ భూములను కాపాడుకునేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని పోలీసులతో రైతులు వాగ్వావాదానికి దిగారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా..రైతులను అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అరెస్ట్‌లు చేయడంపై రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు.

రైతుల దగ్గరి నుండి లాక్కొన్న వేలాది ఎకరాలు...

రైతుల దగ్గరి నుండి లాక్కొన్న వేలాది ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నారంటూ రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టి ప్రభుత్వం... టిడిపి నేతలకు, బడా బాబులకు భూములను కట్టబెడుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పచ్చని పొలాలను సేకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ విరమించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భూ హక్కుల పోరాట సమితి నేతలు హెచ్చరించారు.

మందడంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

గుంటూరు: మందడంలో రాజధాని ప్రాంత రైతులు జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాజధాని ప్రాంతంపై అవాస్తవ కథనాలు రాస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా 5 రీజనల్ సెంటర్లు...

ఢిల్లీ: నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)కు దేశవ్యాప్తంగా ఐదు రీజనల్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. బెంగళూరులో ఉన్న రిసోర్స్‌ సెంటర్‌ను రీజనల్‌ సెంటర్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపింది. ఎన్‌ఎస్‌డీ బోర్డ్‌ బోర్డ్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకుంది. ఈ ప్రాంతీయ కేంద్రాల్లో ఒకటి కోల్‌కతా, ముంబయి గానీ గోవాలో కానీ , జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారత దేశంలో ఏర్పాటు చేస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌ శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతే రీజనల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మమతా బెనర్జీ పై సుబాష్ చంద్రబోస్ మనవడు పోటీ...

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై పోటీ చేసేందుకు బిజెపి రెడీ అయ్యింది. బిజెపి తరపున సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ అభ్యర్థిత్వాన్ని బిజెపి ఖరారు చేసింది.

గూడూరులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

నెల్లూరు : గూడూరు ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ధర్మ శాల నుంచి కోల్ కతాకు మారిన వేదిక

ముంబై: భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చారు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు వేదికను మార్చాలని పాకిస్థాన్ చేసిన అభ్యర్థనపై ఇవాళ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే.

17:42 - March 9, 2016

హైదరాబాద్ : క్రికెట్ లో దాయాదుల మధ్య సమరం అంటే ఇరు దేశ అభిమానుల్తో పాటూ క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూస్తుంది. అదే ప్రపంచకప్ లో భారత్-పాక్ మ్యాచ్ అంటే మునివేళ్లపై నిల్చుని మ్యాచ్ ను తిలకిస్తారు. ఈ నేపథ్యంలో టీ-20 ప్రపంచకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందా ? జరగదా..! అన్న మీమాంస తొలగిపోయింది. 
ఈ నెల 19న భారత్-పాకిస్తాన్ మధ్య టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా ఈ  స్టేడియంలో సెక్యూరిటీపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి కోల్ కతాకు మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ధర్మశాల అభిమానులు ఒకింత నొచ్చుకున్నా.. మ్యాచ్ జరుగుతున్నందుకు క్రికెట్ అమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చివరగా భారత్ లో జరుగుతున్న ఈ టీ-20 మ్యాచ్ లో పాక్ పాల్గొంటుందా? లేదా అన్న సందేహాలను కూడా పటా పంచలు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్లు భారత్ కు వస్తున్నట్లు పిసిబి కూడా ప్రకటించింది.

17:34 - March 9, 2016

హైదరాబాద్ : పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి.. అన్ని డిపార్ట్‌మెంట్ల సేవల్ని ఆన్‌లైన్‌ చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు.. ఆన్‌లైన్‌ ద్వారా ప్రజల సమయం ఆదా అవుతుందని... అవినీతి ఉండదని చెప్పుకొచ్చారు..

17:33 - March 9, 2016

హైదరాబాద్ : తెరాసలోకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ తెరాస గూటికి చేరారు. తమను తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్‌ మధుసూదనాచారికి ఎమ్మెల్యేలు లేఖ రాశారు.

17:32 - March 9, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యేల ఫిరాయింపుతో కుదేలైపోయిన తెలంగాణ టిడిపికి మరో షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన టిటిడిఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కరే హాజరుకాగా మిగిలినవారు డుమ్మా కొట్టారు. ఒకపక్క టి.టిడిఎల్పీ ఖాళీ అయినా అసెంబ్లీలో మాత్రం ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీస్తామని రేవంత్ చెబుతున్నారు.

ఒకే ఒక్కడు.....

ఒకే ఒక్కడు. ఈ ఒక్కరే తెలంగాణ టిడిపి అసెంబ్లీ వ్యవహార సమావేశానికి హాజరయ్యారు. 17 మంది ఎమ్మెల్యేల స్థాయి నుంచి నేడు ఒకరిద్దరు ఎమ్మెల్యేల స్థాయికి తెలంగాణ తెలుగు దేశం పార్టీ దిగజారిపోయింది. కనీసం అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీకి క్యాబిన్‌ ఉంటుందో ఉండదో అన్న స్థాయికి పార్టీ పతనమైంది.

టిడిపి ఎమ్మెల్యేలంతా అధికార టిఆర్‌ఎస్‌లోకి క్యూ.....

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలంతా అధికార టిఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టగా కేవలం ఐదుగురు మాత్రమే నిన్నటిదాకా ఆ పార్టీ తరపున మిగిలారు. ఇప్పుడు వారిలో ఇద్దరు టిఆర్ఎస్ గూటికి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టిటిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీ సీఎం కేసీఆర్‌ను క్యాంప్‌ ఆఫీసులో కలిశారు. వీరిద్దరూ ఈ నెల 11న టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముంది. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. మాగంటి గోపీనాథ్, శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీకి అందుబాటులో ఉండటం లేదు. మంగళవారం నిర్వహించిన టీటీడీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టారు. సోమవారం నిర్వహించిన మాధవరెడ్డి వర్థంతి కార్యక్రమానికీ గైర్హాజరయ్యారు. వారిద్దరూ టీఆర్‌ఎస్‌లోచేరితే.. మిగిలేది రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య టిడిపికి చెందిన నేతే అయినా తాను తటస్థంగా ఉంటానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిటిడిఎల్పీ సమావేశం...

మిగిలిన ఎమ్మెల్యేలెవరూ రాకపోయిన ఒక్క రేవంత్‌రెడ్డి, మిగిలిన టిడిపి నేతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిటిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్ పేరుతో కెసిఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లను మెప్పించేందుకు మహారాష్ట్ర సర్కార్‌ వద్ద తెలంగాణ ప్రయోజనాలకు పణంగా పెడుతున్నారని ఆరోపించారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్‌ను 152 మీటర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరుసగా మహిళలపై దాడులు జరుగుతుంటే....

అమ్మాయిల వైపు చూస్తే కళ్లు పీకేస్తామన్న కెసిఆర్ వరుసగా మహిళలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. షీ టీమ్స్ షో టీమ్స్‌లా మారిపోయాయని విమర్శించారు. దాదాపుగా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలంతా కారెక్కేశారు. తమకంటూ బలం లేని స్థితిలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది చర్చనీయాంశంగా మారింది. 

17:28 - March 9, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో టపాసులు కాల్చి కార్యకర్తలు నృత్యాలు చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వరుస విజయాలు సాధించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. 

17:27 - March 9, 2016

హైదరాబాద్ :ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతూనే ఉంది. ఖమ్మం, ఓరుగల్లు ఖిల్లాపై గులాబీ దళం జయకేతనం ఎగురవేసింది. అచ్చంపేట నగర పంచాయతీలోనూ కారు జోరే కొనసాగింది. మొత్తం 20 వార్డులను గెలుచుకుని నగర పంచాయతీని క్లీన్‌స్వీప్‌ చేసింది. టీఆర్‌ఎస్‌ విజయంతో నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.

ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు టీఆర్‌ఎస్‌ కైవసం.....

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా చాటింది. ఖమ్మం కార్పొరేషన్‌ను గులాబీ పార్టీ దక్కించుకుంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం జిల్లాపై గులాబీ జెండా ఎగురవేసింది. మొత్తం 50 డివిజన్లకు గాను 34 డివిజన్లలో గెలుపొంది టీఆర్‌ఎస్‌ ఖమ్మం కార్పొరేషన్‌ను దక్కించుకుంది. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధులు 10 డివిజన్లలో గెలుపొందారు. 30, 43వ డివిజన్‌లలో సీపీఎం అభ్యర్ధులు అఫ్రోజ్‌ సమీనా, శైలజలు గెలుపొందారు. ఇక 28, 50వ డివిజన్‌లో సీపీఐ గెలుపొందింది. అదేవిధంగా 4, 34వ డివిజన్‌లలో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందారు. అయితే.. ఇక్కడ టీడీపీ, బీజేపీలు ఖాతా తెరవకపోవడం విశేషం.

44 డివిజన్లు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ .....

ఇక ఓరుగల్లు ఖిల్లాపై గులాబీ దళం జయకేతనం ఎగురవేసింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. వరంగల్ నగర ప్రజలు టీఆర్‌ఎస్‌కు అఖండ విజయం కట్టబెట్టారు. మొత్తం 58 డివిజన్లలో 44 డివిజన్లలో గులాబీ అభ్యర్ధులు విజయం సాధించారు. నాలుగు డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు విజయం సాధించగా.. ఒక్కొక్క డివిజన్‌లో సీపీఎం, బీజేపీ అభ్యర్ధులు గెలుపొందారు. ఇక 8 డివిజన్లలో స్వంతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ఇక్కడ టీడీపీ, బీజేపీలు ఖాతా తెరవకపోవడం విశేషం.

అచ్చంపేట నగర పంచాయతీ క్లీన్‌స్వీప్‌ .....

అచ్చంపేట నగర పంచాయతీలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 20 వార్డులలో కారుజోరు కొనసాగింది. 20 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధించారు. ఐక్య వేదిక పేరుతో ఇతర పార్టీలు ఏకమై పోటీ చేసినా కారు స్పీడ్‌కు బ్రేక్‌లు వేయలేకపోయారు. ఇక మూడో వార్డులో విజయం సాధించిన తులసీరామ్‌ను చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.

సీఎం కృతజ్ఞతలు....

ఖమ్మం, వరంగల్, అచ్చంపేటలో విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఓటర్లు దీవించారని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శ్రమించిన అందరికీ అభినందనలు తెలిపారు. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

సంబరాల్లో నేతలు, కార్యకర్తలు..

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంతో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. పటాకులు కాల్చుతూ.. మిఠాయిలు పంచారు. డప్పు దరువులకు స్టెప్పులేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

టిఆర్ ఎస్ లో అరికెపూడి, మాగంటి

హైదరాబాద్ : తెరాసలోకి తెదేపా ఎమ్మెల్యే వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ తెరాస గూటికి చేరారు. తమను తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్‌ మధుసూదనాచారికి ఎమ్మెల్యేలు లేఖ రాశారు.

16:58 - March 9, 2016

హైదరాబాద్ : నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో జగన్ లాంటి ప్రతిపక్ష నేతను ఎన్నడూ చూడలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన మాటల్లోనే...' ఎవరికైనా ఒక పద్ధతి వుంటుంది. వాస్తవాలు కానప్పడు తగ్గుతారు. వాస్తవాలు లేకపోయినా... అవాస్తవాలను రుద్దే ప్రయత్నం విపక్షం చేసింది.  ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పాలసీని అందరూ ఆమోదించారు. నా పై నమ్మకంతో భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని రాకూడదు... అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశ్యంతో విపక్షం ప్రవర్తించడం బాధాకరం. ఈ గొడవకు భయపడి వెనక్కి పోతే చరిత్ర క్షమించదు. నూతన రాష్ట్రంలో ఇలాంటి రాజధాని రాకపోతే చాలా గొడవలు వస్తాయి. ఒక హేతుపద్దతిలో విభజన జరగలేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. అనేక డిజట్వాంజేలు ఉన్నా దేశంలో అందరి కంటే గ్రోత్ రేటులో 11.99శాతం ముందు ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అర్బన్ ఆదాయం పెరగాల్సి ఉంది. అగ్రికల్చర్ ను కాపాడుకుంటూ ఆదాయం పెంచే మార్గాలను అణ్వేషించాలి. అర్బన్ ప్రాంతాలు పెరిగినపుడే ఆదాయం పెరుగుతుంది. రాజధాని నిర్మాణంలో రైతులకు లాభాలు వచ్చేలా, టూరిజం, హాస్పటల్స్, పరిశ్రమలు వచ్చేలా, ఆర్థిక రంగానికి సంబంధించిన పెట్టుబడులు రావాలి. రాజధాని మంచి నగరంగా తయారు కావాలంటే పెట్టుబడులు పెట్టాలి. దాని కోసం ఓ పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తున్నాం. ట్రాన్సఫరెంట్ ఉంటాం. కొంత మంది పని కట్టుకుని అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. మన దగ్గర ఐడియాలు ఉన్నాయి... కానీ డబ్బులు లేవు. అయినా ముందుకు పోతాం.ఎప్ ఆర్ బీఎం లోపే అప్పు చేయాలి. పోలవరం ప్రాజెక్టు పై కూడా లేనిపోని ఆరోపణలు చేశారు. సంవత్సరం కంటే ముందుగానే పోలవరం పూర్తి చేసిన నదుల అనుసంధానం ఘనత మాదే. పట్టి సీమను కూడా పూర్తి చేసి తీరుతాం' అని పేర్కొన్నారు.

నల్గొండలో భారీ చోరీ

నల్గొండ: నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీలో బుధవారం భారీ చోరీ జరిగింది. జెన్‌కో ఏడీ వెంకట్ భాస్కర్‌ ఇంట్లో రూ.10 లక్షలు విలువచేసే బంగారం, రూ.60 వేల నగదును దుండగులు పట్టుకుపోయారు. దీంతో బాధితుడు భాస్కర్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

'మా వాళ్లను పంపిస్తారా..? నేనూ వాకౌట్..'

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలను నేటి సభనుంచి స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా జగన్ మినహా అందరు వైసీపీ సభ్యులను స్పీకర్ నేటి సభ నుంచి సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ ఎయిమ్స్ వద్ద ప్రమాదం : ఇద్దరి మృతి

ఢిల్లీ: రాజధాని దిల్లీ నగరంలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న స్థలంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎయిమ్స్‌ మార్చురీకి సమీపంలో నిర్మాణస్థలంలో గుహలాంటి ప్రాంతంలో అయిదుగురు కార్మికులు విశ్రాంతి తీసుకుంటున్నారు. హఠాత్తుగా మట్టి పెళ్లలుగా విరిగి కార్మికులపై పడింది. దీంతో వారు మట్టికింద చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సభ్యులు వెంటనే రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. అయిదుగురిని బయటకు తీశారు కానీ ఒక కార్మికుడు ఘటనాస్థలంలోనే మృతిచెందారు.

16:22 - March 9, 2016

హైదరాబాద్ : సీపీ నేత జగన్ మినహా ఆ పార్టీ సభ్యులంతా అసెంబ్లీ నుండి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి యనమల స్పీకర్ కు ప్రతిపాదనలు చేశారు. రాజధాని భూముల కుంభకోణంపై సిబీఐ తో విచారణ జరపించాలని వైసీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరో వైపు ఈ అంశం పై 329 ప్రకారం డిబేట్ మిగిసిందని స్పీకర్ తెలిపారు. అయినా సభలో వైసీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కాగా తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు. 

సస్పెండ్ అయిన సభ్యుల పేర్లు..

'ఎస్బి అంజాద్ భాషా, పి.అనిల్ కుమార్, చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, ఛాందభాష, ఈశ్వరి, మేకపాటి గౌతమ్, కె గోవర్ధర్ నరెడ్డి, ఐశయ్య, జంగిరెడ్డి, జయరాం, కే జోగులు, వి.కళావతి, యు.కల్పన, ఎస్వీ మోహన్ రెడ్డి, షేక్ మహ్మద్ ముస్తాఫా, ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, జ్యోతుల నెహ్రూ, ఆర్. ప్రతాప్ రెడ్డి, పుష్పవాణి, కె.రఘుపతి, ఎస్.రఘురామ్ రెడ్డి, రాజన్న దొర, బి.రాజేంద్రనాథ్, బి. రాజేశ్వరి, కె. రక్షణ నిధి, సి.రామ చంద్రరెడ్డి, ఎ.రామక్రిష్ణా రెడ్డి, గొట్టిపాటి, రవీంద్రనాథ్ రెడ్డి, వైసాయి ప్రసాద్ రెడ్డి, కె. సర్వేశ్వర్, రావు, శివ ప్రసాద్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, సుబ్బారావు, పి.సునీల్, ఎ.సురేష్, దిబ్బారెడ్డి, వెంటప్రతాప్ అప్పారావ్, వెంకట్ రెడ్డి, వెంకట కృష్ణ రంగరావు, వై.విశ్వేశ్వర్ రెడ్డి' వున్నారు.

వైసీపీ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్ : వైసీపీ నేత జగన్ మినహా ఆ పార్టీ సభ్యులందరినీ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయలని మంత్రి యనమల స్పీకర్ కు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను స్పీకర్ ఆమోధించారు. రాజధాని భూముల కుంభకోణంపై సిబీఐ తో విచారణ జరపించాలని వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరో వైపు ఈ అంశం పై 329 ప్రకారం డిబేట్ ముగిసిందని స్పీకర్ తెలిపారు. అయినా సభలో వైసీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
సస్పెండ్ అయినవారు వీరే.. 

సభలో గందరగోళం

హైదరాబాద్ :రాజధాని భూముల కుంభకోణంపై సిబీఐ తో విచారణ జరపించాలని వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. అసెంబ్లీలో డిబేట్ రాంగ్ టర్న్ తీసుకుందని.. అన్ రీజన్ బుల్ అయ్యింది. 329 రూల్ ప్రకారం డిబేట్ క్లోజ్ చేసి రిప్లై తీసుకోవాలని మంత్రి యనమల స్పీకర్ ను కోరారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

 

16:06 - March 9, 2016

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో డిబేట్ రాంగ్ టర్న్ తీసుకుందని.. అన్ రీజన్ బుల్ అయ్యింది. డిబేట్ క్లోజ్ చేసి రిప్లై తీసుకోవాలని మంత్రి యనమల స్పీకర్ ను కోరారు. ప్రతిపక్ష నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 329 రూల్ ప్రకారం డిబేట్ ను క్లోజ్ చేయాలని స్పీకర్ ను కోరారు. దాన్ని కూడా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెంటనే స్పీకర్ 329 రూల్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజధాని భూముల కుంభకోణంపై సిబీఐ తో విచారణ జరపించాలని వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

చిక్కుల్లో హీరో శర్వానంద్

మెదక్ : హీరో శర్వానంద్ చిక్కుల్లో పడ్డాడు. జిల్లాలోని జిల్లా పటాన్ చెరూ మండలంలోని కర్దలూరు గ్రామస్తులు శర్వానంద్ కుటుంబం పై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. తమ ఊరిలోని పొలాలను శర్వానంద్ కుటుంబం ఆక్రమించిందని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. 

15:47 - March 9, 2016

హీరో శర్వానంద్ చిక్కుల్లో పడ్డాడు. ఓ భూ వివాదంలో శర్వానంద్ కుటుంబం పై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా పటాన్ చెరూ మండలంలోని కర్దలూరు గ్రామస్తులు శర్వానంద్ కుటుంబం పై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. తమ ఊరిలోని పొలాలను శర్వానంద్ కుటుంబం ఆక్రమించిందని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. 
కాగా ఇటీవల వైవిద్యమైన సినిమాలతో  ప్రేక్షకుల మన్ననలు పొందుతూ దూసుకెళ్తున్న శర్వానంద్ ఇలాంటి వ్యవహారంలో తలదూర్చడమేంటని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. 

సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు!

నల్గొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి... తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం.  

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

ప.గో: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు.

ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఐఎఫ్ టీయూ నేతలు..

ఖమ్మం : కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆరోపించారు. టేకులపల్లి మండలకేంద్రంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇబ్రహీంపట్నంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో డిగ్రీ విద్యార్థిని శారద(20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రాజేశ్ ప్రేమించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజేశ్ మోసం చేశాడని మనస్తాపంతో శారద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోటి ఉమెన్స్ కళాశాలలో శారద డిగ్రీ చదువుతుంది. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సీఎంకు సీపీఎం మధు లేఖ..

విజయవాడ : పోలవరం నిర్వాసితుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి .మధు లేఖ రాశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని లేఖలో పేర్కొన్నారు. 48,013 ఇళ్లు నిర్మించాల్సి ఉంటే 1,2245 ఇళ్లు మాత్రమే నిర్మించారని మధు ఆరోపించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 2,460 ఎకరాలు అవసరమైతే  కేవలం 616 ఎకరాలు మాత్రమే సేకరించారని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ లేఖలో మధు డిమాండ్ చేశారు. 

కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారు: కవిత

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ కె. కవిత బుధవారం హైదరాబాద్ లో స్పందించారు. టీఆర్ఎస్ విజయం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని ఆమె స్పష్టం చేశారు. ఈ మహా విజయం అందించిన ప్రజలకు కవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులను ప్రజలు విశ్వసిస్తున్నారని కవిత తెలిపారు.

15:28 - March 9, 2016

హైదరాబాద్: వందలాది మంది విద్యార్థినులతో కలిసి ఏక కాలంలో గోళ్లకు రంగు వేసుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గిన్నిస్ రికార్డుకెక్కింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలాండ్ కు చెందిన కాస్మోటిక్ బ్రాండ్ ఇంగ్లోట్, సోనాక్షి సిన్హా సంయుక్తంగా ముంబయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది విద్యార్థినులతో కలిసి ఈవిధంగా గోళ్లకు రంగు వేసుకోవడం అరుదైన సంఘటనగా గుర్తించడంతో సోనాక్షి సిన్హా గిన్నిస్ రికార్డుకెక్కింది.

'సీఎం సిద్ధంగా ఉన్నారు..'

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై  ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై  ప్రసంగిస్తూ మంత్రులపై జగన్ ఆరోపణలు చేశారని స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అన్నారు. ఆ ఆరోపణలను నిరూపించాలని ముఖ్యమంత్రి కోరుతున్నారని, నిరూపిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారి ఈ సందర్భంగా కోడెల జగన్ కు సూచించారు. 

'ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటీ..'

హైదరాబాద్ : ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో జగనే చెప్పాలని. ఇన్ సైడర్ ట్రేడింగ్ ల్యాండ్ పూలింగ్ కు వర్తించడని చంద్రబాబు వెల్లడించారు. 'రాజధాని నిర్మాణం, భూముల వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరుగతోంది. 10టీవీ లైవ్ లో మీరు అసెంబ్లీ లైవ్ చూడొచ్చు.

నకిలీ సాస్ పట్టివేత..

హైదరాబాద్  : పోలీసులు నకిలీసాస్ తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి, నిర్వాహకులను రెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే సరూర్‌నగర్ మండలం మీర్‌పేట ప్రశాంత్‌హిల్స్‌లో నకిలీ సాస్ తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు  నిర్వహించారు. దీన్ని నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా10 కిలోల నకిలీ సాస్, 10 కిలోల యాసిడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

15:14 - March 9, 2016

హైదరాబాద్ : జగన్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారని ధూళిపాళ్ల విమర్శించారు. గరవ్నర్ ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానం పై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ... రాజధానిలో వైసీపీ నేతలు ఎవరూ భూములు కొనలేదా? దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని మీద కక్షతో, ఆ ప్రాంతంలో మీద జగన్ కు ఉన్న ద్వేషంతో విషం కక్కుతున్నారు. అయినవోలు గ్రామంలో నా కుమార్తె పేరు మీద 3 ఎకరాల 50 సెంట్లు నేను కొన్నాను. దానిలో కొంత అమ్మి మరో చోట కొన్నాను. సాక్షి పత్రిక తనతో పాటు తన కుమార్తెలు, కుమారులపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. అన్యం, పుణ్యం ఎరుగని తన పిల్లలను నీచమైన రాతలతో బజారుపాలు చేస్తోందని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పిల్లలు ఏం తప్పు చేశారని వారి పేర్లు పత్రికలో రాస్తారు?’ అని ధూళిపాళ్ళ ప్రశ్నించారు. జగన్‌కు కూడా పిల్లలు ఉన్నారని, వారి పేర్లను కూడా ఇలా నీచంగా అసత్య ఆరోపణలతో పేపర్లో వేస్తే.. ఆయనకు ఎలా అనిపిస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వ్యాఖ్యానించారు. సాక్షి పత్రికను ఇలాగే కొనసాగిస్తే... రేపు తమ మనవళ్ల గురించి కూడా ఇలాగే అసత్యాలు ప్రచారం చేస్తుందని, ఆ పత్రికను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రకటనకు ముందే రాజధాని విషయాన్ని సాక్షి ప్రచురించిందని, రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీల నేతలు భూములు కొనుగోలు చేశారని, భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు..అమ్మొచ్చని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ అన్నారు. జగన్ మాదిరిగా అసైన్డ్ భూములను తాను కొనలేదని, తనకున్న కుటుంబ నేపథ్యంలో మూడు ఎకరాలు కూడా కొనలేనా? అని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ప్రశ్నించారు.

'తప్పుదోవ పట్టిస్తున్నారు..'

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత జగన్ శాసన సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అసత్యాలు పోగేసుకొచ్చారని అన్నారు. జగన్ ఆరోపణలు రాజకీయ కుట్ర ఆని అన్నారు. జగన్ చెప్పిన అసత్యాలకు సభకు క్షమాపణలు చెప్పాలని కాల్వ డిమాండ్ చేశారు. 

15:09 - March 9, 2016

హైదరాబాద్ : ఎకౌంట్స్ లో మాయలు చేయడం ఈ భూ ప్రపంచంలో జగన్ కు మాత్రమే తెలుసునని శాసనసభలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. శాసనసభను అడుగడుగునా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజధాని ప్రకటన తరువాత మాత్రమే మంత్రి నారాయణ బంధువులు భూములు కొన్నారని తెలిపారు. రాజధాని అక్కడ రావడం జగన్ కు ఇష్టం లేదని.. మంత్రులపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు.

'వాళ్లు నా బినామీలని నిరూపిస్తావా?' : బాబు

హైదరాబాద్ : ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి నారాయన తన బినామీలని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నారని వాళ్లు తన బినామీలైతే జగన్ నిరూపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

వైసీపీ వాళ్లు కొనలేదా..?

హైదరాబాద్ : 'రాజధాని ప్రాంతంలో భూములు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే కొన్నారా..? వైసీపీ వాళ్లు కొనలేదా' అని ఎమ్మెల్యే దూళి పాళ్ల నరేంద్ర  ప్రశ్నించారు. రాజధానిలో ఎవ్వరైనా భూములు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చునని ఆయన అన్నారు. జగన్ నడిపిస్తున్న పత్రిక, టీవీ ఛానెల్ తమ పిల్లల పేర్లను పత్రికల్లోకి చేర్చి తమ పరువు, ప్రతిష్టలకు నష్టం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

14:51 - March 9, 2016

హైదరాబాద్ : రాజధాని అక్కడ వస్తుందని తెలిసి తన బినామీలతో సీఎం భూములు కొనుగోలు చేయించడం దారుణమైన నేరం అని జగన్ అన్నారు. సభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ... దీనిపై సీబీఐ విచారణకుచంద్రబాబు సిద్ధమా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ నేరంలో చంద్రబాబే మొదటి దోషి అని జగన్ ఆరోపించారు.

'చంద్రబాబు లీక్ చేశారు'

హైదరాబాద్ : చంద్రబాబు రాజధాని ఎక్కడ వస్తుందో తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లీక్ చేశారని జగన్ ఆరోపించారు. దీన్ని ఆసరగా తీసుకుని ఆయా వ్యక్తులు రాజధాని ప్రాంతాల్లో భూములను సొంతం చేసుకున్నారని అన్నారు. ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వ వివరాలను లీక్ చేయడం నేరంగా పరిగణించబడుతుందని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని జగన్  స్పీకర్ ను కోరారు.

14:47 - March 9, 2016

హైదరాబాద్ : మా మంత్రులు బినామీ పేరుతో భూములు ఎక్కడ కొన్నారో ప్రతిపక్ష నేత జగన్ నిరూపించాలని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు. జగన్ కు అక్కడ రాజధాని పెట్టడం ఇష్టం లేదు. మంత్రులు పుల్లారావు, నారాయణ బినామీ పేర్లతో భూములు కొన్నామని తెలిపారు. ఎక్కడ కొన్నారో నిరూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సభకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ మంత్రులు ఏ సర్వే నెంబర్ లో బినామీ భూములు కొన్నారో నిరూపించే వరకు సభ జరగదన్నారు.

నిరూపించాలి.. లేదా చర్యలు : బాబు

హైదరాబాద్  : ప్రతిపక్ష నేత జగన్ తమ పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలపైన నిరాదారమైన ఆరోపణలు చేశారని, వారి వద్ద ఆదారాలుంటే నిరూపించాలని.. లేదంటే జగన్ పై సభాపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ ను కోరారు. సభ హుందాగా జరగాలని.. దిగజారుడు విమర్శలు చేయకూడదని బాబు అన్నారు. ప్రతి పక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రజల కోసం వింటున్నామని తెలిపారు. సభ ముందుకు జరగాలంటే ఆరోపణలు నిజం చేయాలని లేదా జగన్ క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

14:39 - March 9, 2016

హైదరాబాద్ : మంత్రుల పై సభలో చేసిన ఆరోపణలకు కట్టుబడి జగన్ వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్షమాపణ చెప్పాలి లేదా? సభకు రాజీనామా చేసి వెళ్లండని మంత్రి బచ్చుయ్య చౌదరి మండి పడ్డారు.

14:29 - March 9, 2016

హైదరాబాద్ :నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు నా మీద కేసులు లేవు. నేను కాంగ్రెస్ నువీడి తరువాత నా మీద కేసులు పెట్టారని జగన్ మండి పడ్డారు. అసెంబ్లీలో జరుతున్న సభలో మంత్రులు బినామీ భూములు కొన్నారన్న జగన్ ఆరోపణలు నిరూపించాలని చంద్రబాబు సవాల్ కు సమాధానం ఇస్తూ ఈ వాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో మీ మాదిరి నేను స్టే తెచ్చుకోలేదని ఆవేశంతో వూగిపోయారు.

14:27 - March 9, 2016

హైదరాబాద్ : రాజధాని మీద విషయం కక్కుతున్నారని...మంత్రులు బినామీ పేరుతో భూములు కొన్నారని మా మంత్రులపై అనవసర ఆరోపణలు చేసిన జగన్ వాటిని నిరూపించాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం పై చర్చ వాడి వేడిగా కొనసాగుతుంది. ఆరోపణలు నిరూపించిన తరువాతనే సభ జరుగుతుందని చంద్రబాబు హెచ్చరించారు. నా మీద నమ్మం తో ల్యాండ్ పూలింగ్ పిలుపు ఇస్తే 35 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. రాజధాని పై విషయం జల్లుతున్నారు. బినామీ పేర్ల మీద భూములు కొన్నామని ఆరోపించడం కాదు.. నిరూపించాలని సవాల్ విసిరారు. మంత్రుల పై ఆరోపణలు చేశారు. వూరికే జగన్ గుడ్డకాల్చి మొహం మీద వేయడం కాదని... నీవు అవినీతి పరుడవి కాబట్టి అందరిమీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వూరుకో అన్నారు. అభివృద్ధికి, ప్రాజెక్టులకు అడ్డపడొద్దని మండి పడ్డారు. చేసిన ఆరోపణలు రుజువు చేసిన తరువాతనే సభ జరగాలని హెచ్చరించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.గౌరవ సభ్యులను ఏకవచనం తో సంబోధించడం ప్రతిపక్షానికి తగదని హెచ్చరించారు.


 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలవల్లే గెలుపు: కేసీఆర్

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో టిఆర్ ఎస్ విజయబావుటా ఎగరవేసింది. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలుపు సాధ్యమయ్యిందన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడిన మంత్రులు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

పార్లమెంట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

ఢిల్లీ : పార్లమెంట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటి పై కిరోసిన్ పోసుకుని పార్లమెంట్ భవన్ లోకి పరిగెత్తేందుకు యువకుడు యత్నించాడు. పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  

జగన్ ది అవగాహనారాహిత్యం :అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : వైసీపీ నేత జగన్‌ అవగాహనారాహిత్యంతో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అచ్చన్నాయుడు మాట్లాఉడతూ.. రాష్ట్రాభివృద్ధికి విలువైన సూచనలు ఇవ్వాలన్న ఆయన ప్రతిపక్షం ప్రతి అంశాన్ని వివాదం చేయడం సరికాదన్నారు. మనం తప్పుచేస్తే భావితరాలకు నష్టం కలుగుతుందని అచ్చెన్నాయుడు చెప్పారు.

విజయ్ మాల్యాదేశం వదిలివెళ్లారట..!

ఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా ఇప్పటికే దేశం వదిలి వెళ్లారని సీబీఐ వర్గాల నుంచి సమాచారం. విజయ్‌ మాల్యా దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించాలంటూ ఎస్‌బీఐ సహా 17 బ్యాంకులు నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేతకు పాల్పడ్డారని, ఆయన విదేశాలకు వెళితే కేసు నీరుగారిపోతుందని బ్యాంకులు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి.సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

తిరుమల జేఈవో పదవి కాలం పొడిగింపు...

చిత్తూరు : తిరుమల జేఈవో శ్రీనివాస రాజు పదవీ కాలం రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఏప్రిల్ 19 వరకు జేఈవో గా కొనసాగనున్నారు. 

13:45 - March 9, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం నత్తనడకన ఎందుకు సాగుతుంది ? ఇందులో ప్రభుత్వ వైఫల్యం..ఇతరత్రా అంశాలను ప్రతిపక్ష నేత జగన్ శాసనసభకు వివరించారు. మూడో రోజు జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న తీరున ఎండగట్టారు. సొంత ఇమేజ్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతారా ? పోలవరం నత్తనడకన సాగుతుందని పోలవరం అథార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. 2015 అక్టోబర్, 10వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో పోలవరంపై రివ్యూ తీసుకోవడం జరిగిందని, పనులు 05.52 శాతం మాత్రమే జరిగిందని కేబినెట్ తెలుసుకుందని తెలిపారు. ఇలా జరిగినప్పుడు ట్రాక్టర్ ను తొలగించి కొత్త టెండరులను పిలిచి అథార్టీకి బాధ్యతలు అప్పచెప్పాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ కాంట్రాక్టర్ ను తీసివేయకుండా కొనసాగిస్తూ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు...సబ్ కాంట్రాక్టర్ తీసుకోవచ్చు..తెచ్చుకోవడమే కాకుండా ఈ విషయాలు పోలవరం అథార్టీకి తెలియచేయాల్సినవసరం లేదని కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందన్నారు. దీనిపై సంతకాలు చేయడానికి సంబంధిత అధికారి భయపడ్డాడని జగన్ పేర్కొన్నారు. 

13:33 - March 9, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో వ్యవహరించారు కాబట్టే పంట పొలాలకు నీళ్లు రావడం జరుగుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సెప్టెంబర్ 16వ తేదీన 8.8 టీంఎసీల నీరు వచ్చిందని తెలిపారు. కృష్ణా బేసిన్ లో పంటలను కాపాడిన ఘనత బాబుకు దక్కుతుందన్నారు. చేతనైతే అభినందించాలి కానీ ఇలా విమర్శించ కూడదన్నారు. గత సంవత్సరం మార్చి 29 పుట్టిన రోజున ప్రారంభించిన పట్టిసీమ ఈ సంవత్సరం మార్చి 29 నాటికి పూర్తవుతుందని దేవినేని ఉమ శాసనసభకు హామినిచ్చారు.

వారేం వెలుగపెట్టారు ? 
పులివెందుల నియోజకవర్గంలోని బలపనూరు, కామ సుముద్రం ఇతరత్రా గ్రామాల్లోని చీని చెట్లకు నీరు ఇవ్వడం జరిగిందని, వారేం ఏం చేశారని..30 సంవత్సరాలు వెలగబెట్టారని వైసీపీని ఉద్ధేశించి ప్రశ్నించారు. నీళ్లు ఇవ్వడం వల్ల అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గాలేరు, హంద్రీనీవా..ఇతరత్రా ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పాల్సిందిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. 21వేల కోట్ల నుండి 81వేల కోట్లు అంచనాలు పెంచి ప్రాజెక్టులను మూలన పడేసింది ఆనాటి వైఎస్ అని, కానీ టిడిపి ప్రభుత్వం 20 నెలల్లో 12వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తోటపల్లికి నీళ్లిచ్చామని దేవినేని ఉమ తెలిపారు. 

13:21 - March 9, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు బొంకుతున్నాడని ప్రతిపక్ష నేత జగన్ శాసనసభలో ప్రశ్నించారు. విపరతమైన గ్రోత్ రేట్ చూపిస్తూ..అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. మూడో రోజు ప్రారంభమైన సభలో జగన్ మాట్లాడారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏం సాధించారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దయనీయమైన పరిస్థితిలో ఉంటే గ్రోత్ రేట్ 10.99 శాతం ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. దేశం కన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామన్నారు. ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదని గుర్తు చేశారు. స్పిన్నింగ్..షుగర్ ..ఇతరత్రా పరిశ్రమలు మూత పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వరసగా కరవు..వరదలు వచ్చాయన్నారు. బాబు ఎందుకు బొంకుతున్నాడు ? ముందస్తు అంచనాల్లో వాస్తవాలు లేవని జగన్ తెలిపారు. 

భయం లేదు..
తమకు భయం లేదని, దీనిని చూసి ప్రత్యేక హోదా ఎగురగొడుతారమోనన్న భయం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. సొంత ఇమేజ్ పెంచుకుంటూ చేస్తున్నారని, కానీ తాము మాత్రం ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. యాక్టులో పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని..14 ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని..ఇత రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని..ఇలా రకరకాలుగా అంటున్నారని తెలిపారు. హోదాకు..యాక్టు కు సంబంధం లేదని చెప్పారు. ఇందుకు ఎన్డీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, దీనికి ఛైర్మన్ ప్రధాని ఉంటారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి అనుకొంటే ఒక నిమిషంలో జరుగుతుందని తెలిపారు.

13:02 - March 9, 2016

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది..ఇంకెప్పుడు హామీలు అమలు చేస్తారని ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు జగన్ మాట్లాడారు. ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న హామీలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పోలవరం నత్తనడకన సాగుతోందని, బాబు కాలయాపన చేస్తుంటే తాము చూస్తూనే ఉన్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పలు హామీలిచ్చారని గుర్తు చేశారు. బాబు తెస్తాడని..బాబు ఇస్తాడని ఎదురు చూస్తున్నారని, ఇలా రెండేళ్ల అయ్యిందని విమర్శించారు. ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇక్కడ బాధ వ్యక్తపరుస్తారని, అక్కడ మాత్రం వారిని పొగిడివస్తారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు కేసులో బయటపడేందుకు వెళుతున్నారా ? ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఒక్క ఇటుక పడలేదు..
గుంటూరు జిల్లాలో వినుకొండ 20వేల ఎకరాల అటవీ భూమి ఉన్నా కూడా అవసరం లేదని బాబు పేర్కొంటారని తెలిపారు. బినామీల కోసం ల్యాండ్ పూలింగ్ వద్దని అంటాడని, కేంద్ర వనరులు ఇచ్చినా చేయమని, సింగపూర్..చైనా..తో చేయిస్తామని బాబు పేర్కొంటున్నారని విమర్శించారు. రెండేళ్ల అయ్యింది..ఒక్క ఇటుక కూడా పడలేదన్నారు. ఫొటోలు చూపిస్తూ అదో బిల్డింగ్...ఇదే బిల్డింగ్ అంటూ చూపిస్తారని తెలిపారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్సు, కడప లో స్టీల్ ప్లాంట్ లపై పలు హామీలు గుప్పించినా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. హామీల్లో ఏ ఒక్కటి అన్నా సంతృప్తి కలిగేలా ఏ ఒక్కటైనా చేయగలిగారా ? అని ప్రశ్నించారు. ఎందుకు చిత్తశుద్ధి చూపించడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. గడువు ఇచ్చి కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పడం లేదని జగన్ ప్రశ్నించారు. జగన్ ఇంకా ఏమన్నారో వీడియో క్లిక్ చేయండి. 

దళితులపై మున్సిపల్ ఛైర్మన్ బాషా దౌర్జన్యం..

నల్గొండ : మిర్యాలగూడలో దళితులపై మున్సిపల్ ఛైర్మన్ మగ్దుంబాషా దౌర్జన్యానికి దిగారు. సీతారామపురంలో సర్వేనెంబర్ 884, 885లో దళితుల భూమిని బాషా కబ్జా చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. 

బాబుతో టిటిడిపి నేతలు భేటీ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో సీఎం, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లిలు హాజరయ్యారు. 

మరోసారికి ప్రభుత్వానికి పట్టం కట్టారు - ఎంపీ కవిత..

హైదరాబాద్ : కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలికారని ఎంపీ కవిత పేర్కొన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల మన్ననలు పొందుతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మానాలని సూచించారు. 2019 లో కూడా టీఆర్ఎస్ దే విజయమని ఎంపీ కవిత జోస్యం చెప్పారు.

 

హైకోర్టు మెట్లు ఎక్కిన మందకృష్ణ..

హైదరాబాద్ : నారావారిపల్లెలో విశ్వరూప యాత్రకు అనుమతించాలని హైకోర్టును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ అభ్యర్థించారు. 

వరంగల్ లో ముగిసిన కౌంటింగ్..

వరంగల్ : గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. టీఆర్ఎస్ 44, కాంగ్రెస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. 

12:25 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ ఎన్నికల్లో రెబల్స్ తమ ప్రభావం చూపించారు. వీరే తమ ప్రత్యర్థులని టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 58 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు బుధవారం కౌంటింగ్ జరిగింది. ఎనుమాముల మార్కెట్ లో జరిగిన కౌంటింగ్ లో ఆది నుండి కారు దూకుడు కొనసాగించింది. మొత్తం 36 డివిజన్ లలో విజయం కేతనం ఎగురవేసింది. ఏడు స్థానాల్లో రెబల్స్ విజియం సాధించడం విశేషం. అనూహ్యంగా 4 డివిజన్ లలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా సీపీఎం, బీజేపీ అభ్యర్థులు చెరో ఒక స్థానంలో విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసే వరకు టీఆర్ఎస్ 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు విజేతలు టెన్ టివితో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలిపారో ? విజయానికి కారకులు ఎవరో ? తెలిపారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:19 - March 9, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం జరుగుతున్న బలవంతపు భూ సేకరణపై ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. 'రైతుల దగ్గరి నుండి లాక్కొన్న భూములు విదేశీ కంపెనీలకు కట్టబెడుతారా ? రైతుల నోట్లో మట్టి కొట్టి ఇలా చేస్తారా ? భూములు నిరంతరం జీవనోపాధి..అలాంటి భూమిని బలవంతంగా లాక్కొని రైతులకు అన్యాయం చేస్తారా ? ఇదంతా చేస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చొవడానికి అనర్హుడు' అంటూ పలు సంఘాలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో బలవంతంగా జరుగుతున్న భూ సేకరణనను నిరసిస్తూ ఏపీ భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాము శాంతియుతంగా నిర్వహిస్తామని నేతల అభ్యర్థనకు పోలీసులు మొదట అనుమతించి చివరి నిమిషంలో అనుమతికి నిరాకరించారు. ఈ ప్రదర్శనకు వస్తున్న 13 జిల్లాలకు చెందిన రైతులు, రైతు కూలీలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి ప్రదర్శన నిర్వహించారు. బందర్ రోడ్డు వద్ద ఈ ప్రదర్శనను విచ్చిన్నం చేశారు. తాము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఎలాంటి శాంతిభద్రతకు విఘాతం కలగడం లేదని నేతలు పేర్కొన్నా పోలీసులు వినిపించుకోలేదు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పచ్చని పొలాలు సేకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని కన్నెర్ర చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని పలువురు నేతలు పేర్కొన్నారు. 

ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ కు అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లు దీవించారని, పార్టీ విజయం కోసం కష్టపడిన మంత్రులు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. 

సోషల్ మీడియాలో ఇంటర్ సెకండియర్ గణితం పరీక్ష పేపర్..

నల్గొండ : సూర్యాపేటలో ఇంటర్ సెకండియర్ గణితం పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పరీక్షకు అరగంట ముందుగానే ఇలా జరగడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు అధికారులు లొంగిపోయారని ఆరోపిస్తున్నారు. 

11:52 - March 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీ కనుమరుగుకానుందా ? ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జంప్ లు అవుతుండడం..ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుండడం బట్టి చూస్తే అదే నిజమౌతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలే జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో 90 స్థానాల్లో బరిలోకి దిగి ఒక్కస్థానంతో సరిపెట్టుకుంది. తాజాగా గ్రేటర్ వరంగల్..ఖమ్మం..మహబూబ్ నగర్ అచ్చంపేట నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెప్పుకున్న ఆ పార్టీ కనీసం బోణి కొట్టలేని పరిస్థితిలో పడిపోయింది. నేడు ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గట్టిపోటీ నివ్వలేకపోయారు. ఖమ్మంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా టిడిపి ఒక్కస్థానంలో విజయం సాధించలేకపోయింది. వరంగల్ లో 58 డివిజన్ లలో కూడా ఈ పార్టీది అదే పరిస్థితి ఉంది. ఇక మిత్రపక్షమైన బీజేపీ పార్టీ మాత్రం రెండు స్థానాల్లో విజయం సాధించడవం విశేషం. ప్రస్తుతం వచ్చిన ఈ ఫలితాలపై టి.టిడిపి నేతలు ఏమంటారో ? 

వరంగల్ టీఆర్ఎస్ 32 స్థానాల్లో విజయం..

వరంగల్ : మేయర్ పదవికి టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. టీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 3, సీపీఎం 1, బీజేపీ 1, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. 

మూడు గంటలకు సీఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : మధ్యాహ్నం మూడు గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. 

11:39 - March 9, 2016

తిరుపతి : సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన నారావారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టనీయమని టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. జాతీయ రహదారిపై బైఠాయించడంతో తిరుపతి - బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ మందకృష్ణ మాదిగ విశ్వరూప చైతన్యయాత్రను చంద్రగిరి నుండి నిర్వహించతలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం టిడిపి శ్రేణులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. న్యాయస్థానంలో ఉన్న సమస్య అని, కేవలం పబ్లిషిటి కోసం చేస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం తగదన్నారు.

11:33 - March 9, 2016

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. 34 స్థానాల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధించగా కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందారు. టిడిపి మాత్రం బోణీ కూడా కొట్టలేదు. మొత్తం 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ పత్తి మార్కెట్ లో ఉదయం 8గంటలకు నిర్వహించారు. ఆది నుండి టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఆయా డివిజన్లలో అభ్యర్థులు గెలుపొందుతూ వస్తున్నారు. మొత్తం 34 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. మొదటి నుండి 35 స్థానాలు గెలుచుకుంటామని చెబుతూ వస్తున్న అధికార పక్షం 34 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటికే పాపాలాల్ ను టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డిప్యూటి మేయర్ ఎవరవతారన్నది తెలియాల్సి ఉంది. 

291 మంది అభ్యర్థులు..
50 డివిజన్లకు గాను 291 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,79,827 మంది ఓటు వేశారు. 50 డివిజన్ లకు గాను 265 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్ లో 1-20 డివిజన్లు, రెండో రౌండ్ లో 21-40 డివిజన్ లు, మూడో రౌండ్ లో 41-50 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎంల కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 

11:20 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. 58 డివిజన్ లలో 29 స్థానాల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా 20 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఆయా స్థానాల్లో పోరు హోరాహోరీ కొనసాగుతోంది. ఎక్కువ సీట్లు సాధిస్తామని టీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మూడు స్థానాలు, బీజేపీ రెండు స్థానాల్లో, సీపీఎం ఒక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. 45వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థి స్వాతి గెలుపొందగా 33, 52,53 డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వరంగల్ మేయర్ సీట్లో ఎవరు కూర్చొంటారో తెలియడం లేదు. మేయర్ కోసం పలువురు పోటీ పడుతున్నారు. 
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ లెక్కింపు జరుగుతోంది. ఆరు గదుల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. 390 మంది సిబ్బంది పాల్గొంటున్న ఈ కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 

ఖమ్మంలో ముగిసిన కౌంటింగ్..

హైదరాబాద్ : గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. టీఆర్ఎస్ 34 డివిజన్లు, కాంగ్రెస్ 10 డివిజన్లు, సీపీఎం 2 డివిజన్లు, సీపీఐ 2 డివిజన్లు, వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. 

11:11 - March 9, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బలవంతపు భూ సేకరణ ఉద్యమాలు తీవ్రతరమౌతున్నాయి. ఏపీ భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు పాల్గొంటున్నాయి. తమ నిరసన తెలియచేసేందుకు..తమ బాధను ప్రభుత్వ దృష్టికి తెలిపేందుకు 13 జిల్లాల నుండి వస్తున్న రైతులు, రైతు కూలీలపై పోలీసులు నిర్భందం ప్రయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొంతమంది నేతలను గృహ నిర్భందం చేశారు. పోలీసుల వైఖరిని నేతలు తీవ్రంగా నిరసరించారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఈ ర్యాలీకి అనుమతినిచ్చిన పోలీసులు చివరి నిమిషంలో నిరాకరించారు. ఒక్క అడుగు ముందుకేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రంగా ఖండించారు. దీనితో కళాక్షేత్రం వద్దే బహిరంగసభ నిర్వహించారు. భూ సేకరణ జరుపుతున్న ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. తాము ఎలాగైనా ర్యాలీ నిర్వహిస్తామని, నిర్భందాలు..లాఠీ చార్జీలను లెక్క చేయమని నేతలు స్పష్టం చేస్తున్నారు. 

చలో విజయవాడ..ఉద్రిక్తం..

విజయవాడ : బలవంతంపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఏపీ భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు టీఆర్ఎస్ వశం..

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హావా చూపించింది. వరంగల్ లో టీఆర్ఎస్ 29 డివిజన్ లో విజంయ సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించగా బీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ఖమ్మంలో 30 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆరు డివిజన్ లో గెలుపొందగా వైసీపీ రెండు డివిజన్లు, సీపీఎం, సీపీఐ చెరో ఒకస్థానాన్ని గెలుపొందాయి. 

10:54 - March 9, 2016

ఖమ్మం : మహానగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 డివిజన్ లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా కాంగ్రెస్ 4, సీపీఎం, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. విజేతల వివరాలు...

డివిజన్  అభ్యర్థి పేరు పార్టీ
1 ధరావత్ రామ్మూర్తి టీఆర్ఎస్
2 గుగులోత్ పాపాలాల్ టీఆర్ఎస్
3 కొనకంచి సరళ టీఆర్ఎస్
5  నాగండ్ల కోటేశ్వరరావు టీఆర్ఎస్
6 ఆత్కూరి హనుమాన్ టీఆర్ఎస్
7 సీహెచ్. నాగేశ్వర్‌రావు టీఆర్ఎస్
8 కె. వలరాజు టీఆర్ఎస్
9 షేక్ జాన్ బీ టీఆర్ఎస్
10 కె. నీరజ టీఆర్ఎస్
11 మేడా ప్రశాంత లక్ష్మీ టీఆర్ఎస్
12 గాజుల వసంత టీఆర్ఎస్
13 ఆళ్ల నీరిష టీఆర్ఎస్
14 మందడపు మనోహర్‌రావు టీఆర్ఎస్
15 వి. రమణమ్మ టీఆర్ఎస్
16 కమర్తపు మురళి టీఆర్ఎస్
17 పునుకొల్లు నీరజ టీఆర్ఎస్
18 వడ్డెబోయిన నరసింహారావు టీఆర్ఎస్
19 సయ్యద్ మీరాబేగం టీఆర్ఎస్
20 దాదె ధనలక్ష్మీ టీఆర్ఎస్
21 కర్నాటి కృష్ణ టీఆర్ఎస్
22 చావా నారాయణరావు టీఆర్ఎస్
23 పోట్ల శశికళ టీఆర్ఎస్
24 బత్తుల మురళీ ప్రసాద్ టీఆర్ఎస్
25 మచ్చా నరేందర్‌రావు టీఆర్ఎస్
26 పగడాల నాగరాజు టీఆర్ఎస్
29 ఎండీ షౌకత్ అలీ టీఆర్ఎస్
32 కుమ్మరి ఇందిర టీఆర్ఎస్
33 శీలంశెట్టి రమ టీఆర్ఎస్
18 వరదా నరసింహారావు కాంగ్రెస్
27 బుర్రి కృష్ణవేణి కాంగ్రెస్
36 నాగండ్ల దీపక్ చౌదరి కాంగ్రెస్
39 పాలడుగు పాపారావు కాంగ్రెస్
28  బేతమళ్ల జార్జ్ క్లెమెంట్ సీపీఐ
30 అఫ్రోజ్ సమీనా సీపీఎం
4 సల్వాది వెంకయ్య వైసీపీ
     

 

10:40 - March 9, 2016

హైదరాబాద్ : మోసం చేసింది జగన్..వారి తండ్రి వైఎస్సార్ అని ఏపీ మంత్రి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుండి సరియైన సమాధానం రాకనందుక వైసీపీ వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడారు. జగన్ సభను పక్కదారి పట్టిస్తున్నారని, మోసం చేసిన ఘన చరిత్ర వారికి..వారి తండ్రికి దక్కుతుందన్నారు. ఎస్సీ జెడ్ ల పేరిట ప్రజలను మోసం చేశారని, రుణమాఫీ చేసిన చరిత్ర టిడిపికి దక్కుతుందన్నారు. 5 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇచ్చామని, రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పుల్లారావు చెప్పుకొచ్చారు. 

10:36 - March 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. అనుకున్న విధంగానే ముందుగా ప్రశ్నోత్తరాలను స్పీకర్ కోడెల చేపట్టారు. రైతు రుణమాఫీ అమలు విషయంలో వైసీపీ ప్రశ్న సంధించింది. దీనికి అధికార పక్షం నుండి సరియైన సమాధానం రానందుకు వైసీపీ నేత జగన్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే సమయం కేటాయించాలని, నిరసన తెలియచేస్తామని జగన్ స్పీకర్ ను కోరారు. ఇందుకు స్పీకర్ అనుమతించలేదు. సబ్జెక్ట్ కు పరిమితం కాకుండా నిరసన తెలియచేయాలని సూచించారు. ఈసందర్భంగా జగన్..స్పీకర్ కు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. 'ప్రశ్న చెప్పాలి కదా..మీకన్నా అర్థం కావాలి కదా' అని జగన్ వ్యాఖ్యానించారు. తనకు అంతా అర్థమైందని, సబ్జెక్ట్ మాట్లాడితే అనుమతించనని మరోమారు స్పీకర్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయనందుకు..రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైనందుకు ఈ ప్రశ్నకు వాకౌట్ చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. 

వరంగల్ లో టీఆర్ ఎస్ 14 స్థానాల్లో విజయం..

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 14 స్థానాల్లో విజయం సాధించగా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు చెరో ఒక డివిజన్ లో గెలుపొందాయి. 35వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థి శ్రీలేఖ గెలుపొందారు. 

ఖమ్మంలో టీఆర్ఎస్ ముందంజ..

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. డివిజన్ల వారీగా విజేతల వివరాలు..1 రామ్మూర్తీ నాయక్. 2 పాపాలాల్. 3 సరళ, 5 కోటేశ్వరరావు, 6 హనుమాన్, 7 నాగేశ్వరరావు, 8 వలరాజు, 9 ఎస్ కే జాన్ బీ, 10 నీరజ, 11 ప్రశాంత్ లక్ష్మీ, 12 గాజుల వసంత, 13 శిరీష, 14 మనోహర్, 15 రమణమ్మ, 16 మురళీ, 17 కె.నీరజ, 19 మీరాబేగం, 20 ధనలక్ష్మిలు విజయం సాధించారు. 

వైసీపీ వాకౌట్..

హైదరాబాద్ : రైతుల రుణమాఫీ విషయంలో తాము లేవనెత్తిన ప్రశ్నకు ప్రభుత్వం సరియైన విధంగా స్పందించనందుకు ఈ ప్రశ్నకు వాకౌట్ చేస్తున్నట్లు వైసీపీ నేత జగన్ వెల్లడించారు. 

విమ్స్ ను ప్రైవేటు పరం చేయం - కామినేని..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. విమ్స్ ను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

బీజేపీ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ కమిటీ హాల్ లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 

రుణమాఫీ విషయంలో మోసం చేశారు - జగన్..

హైదరాబాద్ : రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారని, కానీ రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారని వైసీపీ నేత జగన్ పేర్కొన్నారు. 

10:19 - March 9, 2016

వరంగల్ : తాను స్థానికుడైనందుకే విజయం సాధించినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తొట్ల రాజు పేర్కొన్నారు. వరంగల్ కార్పొరేషన్ లో 33వ డివిజన్ నుండి రాజు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు ప్రజలు సహకరించారని, 466 ఓట్ల మెజార్టీ సాధించడం జరిగిందన్నారు. స్థానికంగా ఉంటానని నమ్మకం, గతంలో వార్డు మెంబర్ గా పనిచేయడం విజయానికి కారణాలన్నారు. గతంలో తాను ఎలా పనిచేశానో అలానే వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:14 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 58 డివిజన్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 సీట్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

డివిజన్ అభ్యర్థి 
1 భిక్షపతి
2 బాలయ్య
మౌనిక
10  రాజేందర్
11  రాధిక
12  సులోచన
21  రజిత
22 భాగ్యలక్ష్మి
23 వేణుగోపాల్
49  కేశబోయిన అరుణ
50  దాస్యం విజయ్ భాస్కర్
41  సిరాజుద్దిన్
42 రవీందర్
సోమిశెట్టి శ్రీలత (సీపీఎం)
33  తొట్ల రాజు (కాంగ్రెస్)
34 రమేష్
36 అబుబకర్
43 విద్యాసాగర్
44 మురళి
51 స్వప్న

వరంగల్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు...

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ 9, సీపీఎం 1, కాంగ్రెస్ 1 డివిజన్ లలో గెలుపొందారు.

 

09:51 - March 9, 2016

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 50 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ పత్తిమార్కెట్ లో జరుగుతోంది. 18 డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా నాలుగో డివిజన్ లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ప్రస్తుతం మొదటి దశ కౌంటింగ్ పూర్తి చేశారు. రెండో దశలో టీఆర్ఎస్ ఇదే దూకుడు కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని సీపీఎం ఏజెంట్లు ఆరోపించారు. వారు టెన్ టివితో మాట్లాడారు. ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డా అని, ఒక్కో డివిజన్ లో ఓటింగ్ ఏజెంట్ ను పంపించలేదని పేర్కొన్నారు. ఓట్లు టీఆర్ఎస్ కు పడేటట్లు చేశారని, చీకటి రాజ్యం అయిపోయిందని విమర్శించారు. దుమ్ముంటే బ్యాలెట్ పత్రాలు పెట్టి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ సమయంలో ప్రింటింగ్ సిస్టంను ఆపారని, ప్రతి బూత్ లో జరగలేదని తెలిపారు. 

09:43 - March 9, 2016

మహబూబ్ నగర్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. ఫలితాలు ఏకపక్షంగా సాగాయి. అధికార పక్షానికి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మహా కూటమి అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కనీసం ఒక్క స్థానానికి కూడా కైవసం చేసుకోలేకపోయింది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం మూడు రౌండ్లలో లెక్కింపు చేపట్టారు. మొత్తం 20 వార్డుల్లో గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. 11 స్థానాలు సాధించే పార్టీ ఛైర్మన్ స్థానం దక్కించుకొనే అవకాశం ఉంటుంది. మొత్తం క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది. మొదటి నుండి చెబుతున్న తులసీ రాం మేయర్ అయ్యే అవకాశ ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరపున ఏడుకొండలు బరిలో నిలిచారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ ఛార్జీగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారం రోజు నుండి ఇక్కడే మకాం వేసి వ్యూహాలు రచించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ప్రణాళిక సంఘం సభ్యుడు కూడా ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వారిని టీఆర్ఎస్ లో వచ్చే విధంగా కృషి చేశారు. దీనితో టీఆర్ఎస్ విజయం సులువైందని పలువురు పేర్కొంటున్నారు. 

ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు - సీపీఎం..

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని సీపీఎం ఆరోపించింది. చీకటి రాజ్యం అయిపోయిందని, దమ్ముంటే బ్యాలెట్ పత్రాలు పెట్టి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని సీపీఎం నేత డిమాండ్ చేశారు. 

09:33 - March 9, 2016

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కొనసాగుతోంది. 50 డివిజన్ లకు ఎన్నికలు జరిగాయి. పత్తి మార్కెట్ లో ఉదయం 9గంటలకు కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. మొదటి 20 డివిజన్ లకు కౌంటింగ్ కొనసాగుతోంది.
మొత్తం 10 డివిజన్ లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1,2 డివిజన్ లో మేయర్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. ఇప్పటి వరకు 11 స్థానాలకు ఫలితాలు వెలువడగా ఇంకా 9 స్థానాలకు ఫలితాలు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు సాధించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 
ఖమ్మం స్థానిక పత్తి మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 50 డివిజన్ల వారిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు.

ఖమ్మం మొత్తం డివిజన్లు 50

పార్టీ  గెలుపు
టీఆర్ఎస్ 10
కాంగ్రెస్ 0
టిడిపి 0
సీపీఐ 0
సీపీఎం 0


పార్టీ గెలుపు

ఖమ్మం 18 డివిజన్ లలో టీఆర్ఎస్ విజయం..

ఖమ్మం : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 18 డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించగా నాలుగో డివిజన్ లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

09:25 - March 9, 2016

వరంగల్ : ప్రజలే తన గెలుపుకు కారణమని విజయం సాధించిన సీపీఎం అభ్యర్థి సోమిశెట్టి శ్రీలత పేర్కొన్నారు. వరంగల్ 58 వార్డులకు గాను ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. 9వ వార్డులో సీపీఎం అభ్యర్థి శ్రీలత 746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసందర్భంగా శ్రీలత టెన్ టివితో మాట్లాడారు. తన విజయానికి ప్రజలే కారణమని, పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపు జరుగుతోంది. ఆరు గదుల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది. 390 మంది సిబ్బంది పాల్గొంటున్న ఈ కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై...మధ్యాహ్నం వరకు ముగుస్తుందని అంచాన వేస్తున్నారు. 

09:17 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాలు ఆసక్తికంగా ఉంటున్నాయి. 1వ డివిజన్ లో భిక్షపతి, 21వ డివిజన్ లో రజిత (టీఆర్ఎస్) విజయం సాధించారు. 9వ డివిజన్ లో సోమిశెట్టి శ్రీలత (సీపీఎం) 746 ఓట్లతో గెలుపొందారు. 33వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి తొట్ల రాజు, 41 డివిజన్ లో సిరాజుద్దీన్, 49వ డివిజన్ లో కేశబోయిన అరుణ (టీఆర్ఎస్) గెలుపొందారు. 4 వార్డులో వైసీపీ విజయం సాధించినట్లు తెలుస్తోంది.
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపు జరుగుతోంది. ఆరు గదుల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది. 390 మంది సిబ్బంది పాల్గొంటున్న ఈ కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై...మధ్యాహ్నం వరకు ముగుస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ చెప్పారు.

వరంగల్ విజేతలు..

వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 1వ డివిజన్ లో భిక్షపతి, 21వ డివిజన్ లో రజిత (టీఆర్ఎస్) విజయం సాధించారు. 9వ డివిజన్ లో సోమిశెట్టి శ్రీలత (సీపీఎం) 746 ఓట్లు, 33వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి తొట్ల రాజు విజయం సాధించారు. 49వ డివిజన్ లో కేశబోయిన అరుణ (టీఆర్ఎస్) గెలుపొందారు. 

అచ్చంపేటలో 20 వార్డులో గులాబీ విజయం..

మహబూబ్ నగర్ : అచ్చంపేట మున్సిపాల్టీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 

ఖమ్మంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

ఖమ్మం : ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1,2,5,10 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 4వ డివిజన్ లో వైసీపీ విజయం సాధించింది.

 

08:53 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సీపీఎం అభ్యర్థి సోమిశెట్టి శ్రీలత 786 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు కౌంటింగ్ అధికారులు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు..అధికార పార్టీకి చెందిన నేతలు ఎంత మభ్యపెట్టినా ప్రజలు తనను ఆదరించారని శ్రీలత టెన్ టివికి పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 40 స్థానాలకు బెటర్ ఫ్రంట్ పేరిట వామపక్ష పార్టీలు పోటీ చేశాయి. 58 డివిజన్ లకు ఎనుమాముల మార్కెట్ లో ఉదయం గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 2 డివిజన్ లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపు జరుగుతోంది. ఆరు గదుల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. 390 మంది సిబ్బంది పాల్గొంటున్న ఈ కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై...మధ్యాహ్నం వరకు ముగుస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ చెప్పారు.

08:47 - March 9, 2016

మహబూబ్ నగర్ :అచ్చంపేట మున్సిపాల్టీలో టీఆర్ఎస్ జోరు సాగుతోంది. ఈనెల ఆరో తేదీన 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బుధవారం కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఫలితాలు వచ్చాయి. మొత్తం 20 వార్డుల కౌంటింగ్ కు నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 వార్డుల్లో కారు దూసుకపోయింది. మొదటి వార్డులో హన్మంతు, రెండో వార్డులో నిర్మల, మూడో వార్డులో తులసీ రాం, నాల్గో వార్డులో సుల్తాన్ బీ, ఐదో వార్డులో లావణ్య, ఆరో వార్డులో బాలరాజు, ఏడో వార్డులో మహ్మదా బేగం, ఎనిమిదో వార్డులో లక్ష్మమ్మ విజయం సాధించారు. 11 స్థానాలు సాధించిన పార్టీ ఛైర్మన్ అవకాశం దక్కించుకోనుంది. ఇప్పటికే 16 వార్డులను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోంది. తులసీరాం ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఛైర్మన్ అభ్యర్థిగా తులసీరాంను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగ తీర్మానంపై చర్చ జరగనుంది. వ్యవసాయ రుణాల మాఫీ, రాజధాని భూ సమీకరణపై వైసీపీ ప్రశ్నలు లేవనెత్తనుంది. 

అచ్చంపేట మున్సిపాల్టీ గులాబీ కైవసం..

మహబూబ్ నగర్ :అచ్చంపేట మున్సిపాల్టీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను 16 వార్డుల్లో గులాబీ రెపరెపలాడింది. మొదటి వార్డులో హన్మంతు, రెండో వార్డులో నిర్మల, మూడో వార్డులో తులసీ రాం, నాల్గో వార్డులో సుల్తాన్ బీ, ఐదో వార్డులో లావణ్య, ఆరో వార్డులో బాలరాజు, ఏడో వార్డులో మహ్మదా బేగం, ఎనిమిదో వార్డులో లక్ష్మమ్మ విజయం సాధించారు. 

అచ్చంపేట..8 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం..

మహబూబ్ నగర్ : అచ్చంపేటలో వరసుగా 8 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 వార్డులకు కౌంటింగ్ ప్రారంభమైంది. 1వ వార్డులో హన్మంత్ టీఆర్ఎస్ 190 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నిర్మల, మూడో వార్డులో తులసీరాం (టీఆర్ఎస్) 423 ఓట్ల తేడాతో గెలుపొందారు. 4వ వార్డులో సుల్తాన్ బీ (టీఆర్ఎస్) 431 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

08:24 - March 9, 2016

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పత్తి మార్కెట్ లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 11గంటల లోపు తుది ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మూడు రౌండ్లుగా విభజించారు. ఒక్కో రౌండ్ కు గంట చొప్పున సమయం కేటాయించింది. పోలింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్స్ లోకి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్లను లోనికి పంపించడం లేదని పలు పార్టీల నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
ఖమ్మం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు పత్తిమార్కెట్‌లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 50 డివిజన్లకు గాను 291 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,79,827 మంది ఓటు వేశారు. 50 డివిజన్ లకు గాను 265 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ లో 1-20 డివిజన్లు, రెండో రౌండ్ లో 21-40 డివిజన్ లు, మూడో రౌండ్ లో 41-50 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎంల కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 

08:15 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 8.30గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎనుమాముల మార్కెట్ యార్డులో జరగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు ఆరు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఒకటో హాల్లో 8 డివిజన్లు, 2 హాల్లో 12 డివిజన్లు, 3 హాల్ లో 12 డివిజన్లు, 4, 5 డివిజన్ లో చెరో 8 డివిజన్లు, 6 హాల్ లో 10 డివిజన్లు లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతీ కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లను వేశారు. ఆయా డివిజన్లలోని పోలింగ్ బూత్‌ల వారీగా టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 12 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన తొలి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 6న జరిగిన పోలింగ్ జరిగింది. 58 డివిజన్ లకు 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తామే విజయం సాధిస్తామని ఆయా డివిజన్ల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

కాసేపట్లో పుర ఎన్నికల ఫలితాలు...

హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును అచ్చంపేట ఎంఆర్‌సీ భవనంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఐదు రౌండ్లలో నిర్వహించే లెక్కింపు ఉదయం 10 గంటలకు పూర్తికానుంది. తొలి ఫలితం 8.20 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎయిమ్స్ వద్ద కారు దగ్ధం..

ఢిల్లీ : ఎయిమ్స్ వద్ద ఓ కారు దగ్ధమైంది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. 

07:57 - March 9, 2016

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె ఇటీవల 'త్రిపుల్‌ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో నటుడు విన్‌ డీజిల్‌ సరసన నటిస్తోంది. హాలీవుడ్‌లో నటించే అవకాశం రావడంతో హ్యాపీగా ఉన్న దీపికాకి ప్రస్తుతం గట్టి పోటీ ఎదురైంది. విన్‌ డీజిల్‌ సరసన కీలక పాత్ర కోసం 'మిస్‌ కొలంబియా' అరియడ్నా గుటిరెజ్‌ని ఎంపిక చేశారు. అరియడ్నా ఇటీవలే 'మిస్‌ వరల్డ్ -2015' పోటీ వేడుకల్లో కొద్దిలోనే కిరీటాన్ని చేజార్చుకుంది. ఈ పోటీల్లో మొదట హోస్ట్ పొరపాటున అరియడ్నాను 'మిస్‌ వరల్డ్'గా ప్రకటించారు. తప్పిదాన్ని గమనించిన హోస్ట్ వెంటనే 'మిస్‌ ఫిలిప్పీన్స్' పియా అలాంగో వుర్ట్‌బాష్‌ను విజేతగా ప్రకటించారు. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరియడ్నాను తాజాగా విన్‌ డీజిల్‌ సరసన ఎంపిక చేశారు. ఈ అవకాశం లభించడం పట్ల అరియడ్నా సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీపికా ఈ చిత్రంతోపాటు బాలీవుడ్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రేస్‌3'లో నటిస్తోంది.

07:56 - March 9, 2016

ఫాంటసీ చిత్రంగా వాల్ట్ డిస్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'జంగిల్‌బుక్‌' హిందీ వర్షెన్‌కు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఇందులో భాగంగా పైథాన్‌ 'కా'కి ప్రియాంక చోప్రా, బేర్‌'బాలూ'కి ఇర్ఫాన్‌ఖాన్‌, ఊల్ఫ్‌ 'రక్షా'కి షెఫాలి షా, బ్లాక్‌ పాంథర్‌కి ఓంపురి, షేర్‌ఖాన్‌ టైగర్‌కు నానా పటేకర్‌ డబ్బింగ్‌ చెబుతున్నారు. జాన్‌ఫావ్రూ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని యుఎస్‌లో కంటే వారం రోజులు ముందుగానే భారతదేశంలో విడుదల చేస్తున్నారు. 1990లో వచ్చిన 'జంగిల్‌ బుక్‌ : ద అడ్వెంచర్‌ ఆఫ్‌ మోగ్లి' యానిమేటెడ్‌ చిత్రానికి నానాపటేకర్‌ వాయిస్‌ఓవర్‌ అందించిన విషయం విదితమే. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌ 'బేవాచ్‌'లో విలన్‌గా నటిస్తోంది.

07:54 - March 9, 2016

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ను ట్రాన్స్ జెండర్‌ మ్యూజిక్‌ బాండ్‌ 'సిక్స్ ప్యాక్‌' బృందం కలిసింది. ఈ బృంద సభ్యులను షారూఖ్‌ ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా 'ఫ్యాన్‌' చిత్రంలోని 'జబ్రా ఫ్యాన్‌..' పాటకు సిక్స్ ప్యాక్‌ బృందంతో కలిసి షారూఖ్‌ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. భారతదేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్‌ మ్యూజిక్‌ బాండ్‌ను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్ సంస్థ ప్రారంభించడం విశేషం. షారూఖ్‌ ప్రస్తుతం 'ఫ్యాన్‌', 'రెయిస్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

07:54 - March 9, 2016

ఆదిత్య 369' సీక్వెల్‌లో తనతోపాటు తనయుడు మోక్షజ్ఞ కూడా కలిసి నటిస్తాడని బాలకృష్ణ తెలిపారు. అయితే ఈ చిత్రానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం వందో చిత్రం కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, వాటిల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' ఒకటి కాగా, క్రిష్‌ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' మరొకటి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వీటిల్లో ఏది వందో సినిమా చేయాలన్నది మరికొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటానని బాలకృష్ణ చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే యువ దర్శకుడు అనిల్‌రావిపూడి చెప్పిన కథతోపాటు 'సింహా' దర్శకుడు బోయపాటి శ్రీను తయారు చేసుకున్న కథలకి కూడా బాలకృష్ణ గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం.

07:53 - March 9, 2016

కథలను కాపీ కొట్టి సినిమాల్ని నిర్మిస్తే కోర్టు మెట్లెక్కాల్సిందే మరి. రచయితల కథలను కాపీ కొట్టి సినిమాల్ని నిర్మించే ట్రెండ్‌ కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో దర్శక, నిర్మాతలు, హీరోలకు కథలు చెప్పేందుకు వెళ్తున్న రచయితలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వెళ్ళి కథల్ని నెరేట్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ నటించిన 'లింగా' చిత్ర కథ తనదేనని, అనుమతి లేకుండా తన స్క్రిప్ట్‌ని వాడుకున్నారని రచయిత కె.ఆర్‌.రతిరతినమ్‌ కోర్టుని ఆశ్రయించారు. 'లింగా' సినిమా స్క్రిప్ట్ స్టోరీలైన్‌ మరో స్క్రిప్ట్ రచయితకు చెందినదని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి తమిళనాడులోని మధురైలో గల జిల్లా అదనపు మున్సిఫ్‌ కోర్టు రజనీకాంత్‌తోపాటు నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌, ఫిర్యాదుదారు కె.ఆర్‌.రవిరతినమ్‌లను కోర్టుకు హాజరు కావాల్సిందిగా మంగళవారం సమన్లు పంపింది. త్వరలోనే దీనిపై విచారణ జరగనుంది.
ఇదిలా ఉంటే, విజయ్ ద్విపాత్రాభినయంలో ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన 'కత్తి'చిత్రకథ తనదని రచయిత ఎన్‌.నరసింహారావు కూడా ఇదే తరహాలో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 151వ చిత్రంగా రీమేక్‌ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో రచయితకు న్యాయం జరిగే వరకు షూటింగ్‌ జరపకూడదని తెలుగు రచయితల సంఘం దర్శక, నిర్మాతలకు షరతు పెట్టింది.

07:52 - March 9, 2016

చెమట పడితే శరీరానికి మంచిదే. వ్యర్థాలు ఆ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ కొంతమందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. అవేంటంటే...
శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో 'బి' విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అరటి పండ్లు, గుడ్లు, గింజలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.
శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్‌ 'సి' ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అందుకోసం పాలు, క్యారెట్‌, ఆకుకూరలు, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.
జింక్‌ తగినంతగా ఉంటే నోటి, శరీర దుర్వాసనలు తొలగిపోవడంతో పాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. వేయించిన గుమ్మడి గింజల్లో, ఎండిన పుచ్చకాయ గింజల్లో జింక్‌ ఎక్కువగా దొరుకుతుంది. పది గ్రాముల గుమ్మడి గింజలని తింటే వాటి నుంచి రోజువారీ అవసరాలకు కావల్సిన జింక్‌లో డెబ్బై శాతం లభిస్తుంది.

07:52 - March 9, 2016

చికెన్‌, మటన్‌ అంటే లొట్టలేసుకుంటూ తినే అనేకమంది మాంసాహారులు చేపలు తినాలంటే మాత్రం వొక్కింత చిన్న చూపే. కానీ చేపల్ని వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్‌, డిప్రెషన్‌, అల్జీమర్స్ వ్యాధి వంటివి తగ్గుతాయని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు, రెగ్యులర్‌గా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి, సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఐతే చేపల నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందాలంటే వాటిని బేక్‌ చేసి లేదా బాయిల్‌ చేసి తినాలి అంతే కానీ వేయించకూడదు. 

07:38 - March 9, 2016

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని భూ దందాపై వైసీపీ పలు ఆరోపణలు గుప్పిస్తోంది. దీనిపై టిడిపి కూడా కౌంట్ ఇస్తోంది. ఈ అంశంతో పాటు ఇతర అంశాలపై టెన్ టివి చర్చా వేదికలో మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ) మన్నం సుబ్బారావు (టిడిపి) పలు అభిప్రాయాలు తెలిపారు. వారి ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

నేడు రావెల సుశీల్ విచారణ..

హైదరాబాద్ : నేడు ఏపీ మంత్రి తనయుడు రావెల సుశీల్ బాబును బంజారాహిల్స్ పోలీసులు విచారించనున్నారు. మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీ విధిస్తున్నట్లు మంగళవారం కోర్టు తీర్పు చెప్పింది. 

నేడు సూర్యగ్రహణం..

హైదరాబాద్ : నేడు సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాక వినాయక స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 10గంటలకు ఆలయం తెరుచుకోనుంది. కానీ సూర్యగ్రహణంలోనూ కాళహస్తి ముక్కంటి ఆలయంలో యదావిధిగా పూజలు జరగనున్నాయి. బుధవారం ప్రత్యేక అభిషేకాలు, రాహు - కేతు పూజలు యథాతథంగా జరగనున్నాయి. 

07:03 - March 9, 2016

వరంగల్ : గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎనమాముల మార్కెట్ లోని గోదాముల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆరు గదుల్లో ఓట్లను లెక్కిస్తారు. ప్రతి గదిలోనూ 14 టేబుళ్లను అమర్చారు. డివిజన్లలో 8-14 పోలింగ్ కేంద్రాలున్నాయి.

కొత్త విధానం..
ఆరు లెక్కింపు గదులకు ప్రతి రౌండ్ కు ఆరు డివిజన్లు పంచుతారు. ఇలా చేయడం వల్ల ఒక్కో రౌండ్ పూర్తయ్యే సరికి ఒక్కో గది నుండి ఒక డివిజన్ ఫలితం రానుంది. ఇలా ఆరు గదుల నుండి ఆరు డివిజన్లకు సంబంధించిన ఫలితాలు ఒకేసారి వచ్చేస్తాయి. కొత్త విధానం వల్ల ఏ డివిజన్ కు సంబంధించి ఓట్లను లెక్కిస్తున్నారో ఆ డివిజన్ ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఒక్కో రౌండ్ కు ఆరు డివిజన్లను లెక్కిస్తున్నందున వారే లోపల ఉంటారు. మిగిలిన డివిజన్ల వారంతా బయటే ఉండాల్సి ఉంటుంది. వారి డివిజన్ వంతు వచ్చినప్పుడు మాత్రమే అనుమతినిస్తారు.

విజయోత్సవాలకు చెక్..
గెలిచిన తరువాత సంబరాలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఈ సంబరాలు..ముఖానికి పూసుకొనే..చల్లుకొనే రంగును సైతం కోడ్ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయోత్సవాలకు వినియోగించే ఎలాంటి వస్తువులైనా కోడ్ పరిధిలోకి వస్తాయని అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
58 డివిజన్లకుగాను ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిపి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 390 మంది సిబ్బందిని నియమించారు. 

06:54 - March 9, 2016

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపక్షం ప్రలోభాలకు గురి చేసిందని సీపీఎం నేత నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పాడిన తరువాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయని, గతంలో ప్రజలపై భారాలు పడకుండా సీపీఎం పాలించిందని గుర్తు చేశారు. స్థానిక నాయకుడి నుండి మొదలుకొని సీఎం వరకు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని, డబ్బు నీళ్లలా ఖర్చు చేశారని..రూ. 150 కోట్ల వరకు పలు పార్టీలు ఖర్చు పెట్టాయని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు బెదిరింపులకు దిగారని, వ్యాపార వర్తకులను..ఇతరులను భయపెట్టారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా కొనుగోలు చేశారని, వారికి అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. ఇక్కడి పోలీసు యంత్రాంగం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించిందని, ఇంత జరుగుతున్నా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు స్థానాల్లో అధికార పక్షానికి సీపీఎం గట్టిపోటి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

06:53 - March 9, 2016

ఖమ్మం : గత పక్షం రోజులుగా రాజకీయ వ్యహ, ప్రతివ్యూహాలకు వేదికగా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కొద్దిసేపట్లో విడుదలకానున్నాయి. నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, టిడిపి, సీపీఎం, వైసీపీ, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. 50 డివిజన్ లలో 12 డివిజన్లలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.
50 డివిజన్ లకు గాను 265 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ లో 1-20 డివిజన్లు, రెండో రౌండ్ లో 21-40 డివిజన్ లు, మూడో రౌండ్ లో 41-50 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎంల కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద రెండు డివిజన్ల ఈవీఎం (బ్యాలెట్ కంట్రోల్ యూనిట్) లు లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. 50 డివిజన్ లలో 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 66 శాతం పోలింగ్ నమోదైంది. 

06:43 - March 9, 2016

హైదరాబాద్ : అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి హైద‌రాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం. భాగ్యన‌గరాన్ని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దడ‌మే త‌మ ల‌క్ష్యమంటూ పలు ప్రాజెక్ట్‌లకు రూపకల్పన చేస్తోంది. అయితే అవి పూర్తికావాలంటే భారీగా ధనం ఖర్చు చేయాల్సివున్న నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా జాతీయ అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థల త‌లుపు త‌ట్టేందుకు సిద్ధమైంది.ఇటీవ‌లే మున్సిప‌ల్ శాఖ బాధ్యత‌లు చేప‌ట్టిన కేటిఆర్ హైద‌రాబాద్ అభివృద్ధికి త‌న‌దైన శైలిలో పాల‌నప‌ర‌మైన సంస్కర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా హుస్సేన్ సాగ‌ర్ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, స్కైవేల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్‌ వేలు, బెంగళూర్ త‌ర‌హా స‌మ‌గ్ర రోడ్లనిర్మాణం, గ్రీన‌రీ డెవ‌ల‌ప్‌మెంట్, ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌నులు పూర్తి చేయడంతోబాటు శివారు ఏరియాల్లో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ స‌దుపాయం, మంచినీటి స‌ర‌ఫ‌రా వ్యవస్థను ఆధునీక‌రించే చ‌ర్యలు చేప‌డుతున్నారు.

జలమండలి, హెచ్ఎండిఎలకు ప్రభుత్వ నిధులు..
అయితే ప్రభుత్వం పూర్తిచేయాలనుకుంటున్న ఈ ప‌నుల‌న్నిటికీ వేల కోట్ల రూపాయలు అవ‌సరమవుతాయి. ఇప్పటి వ‌ర‌కు జ‌ల‌మండ‌లి, హెచ్ఎండిఏలు పూర్తిగా ప్రభుత్వంపై ఆధార‌ప‌డ‌గా జిహెచ్ఎంసి మాత్రం స్వంతంగానే మ‌న‌గ‌డ‌సాగిస్తోంది. అయితే కొత్తగా ప్రభుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాల‌కు నిధుల లేమి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. రోడ్ల స‌మ‌గ్రాభివృద్దికి 26వేల‌కోట్లు, హుస్సేన్ సాగ‌ర్ ప్రక్షాళ‌న‌కు 500కోట్లు, మూసీనది సుంద‌రీక‌ర‌ణ‌కు 3 వేల‌కోట్లు, మూసీ నది ఒడ్డుమీదుగా సిక్స్ లైన్ రోడ్లనిర్మాణానికి 6,500 కోట్లు అవ‌స‌ర‌మవుతాయని స‌ర్కార్ అంచ‌నా వేసింది.

మూసీ అభివృద్ధికి గ్రీన్ క్లైమేట్ ఫండ్..
ప్రభుత్వం ఈ ప‌నులన్నీ పూర్తి చేసేందుకు తాజాగా నిధుల సేక‌ర‌ణ‌పై దృష్టి పెట్టింది. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటూనే మ‌రోవైపు వివిధ ఆర్థిక సంస్థల‌నుండి అప్పులు తీసుకోవాల‌ని సర్కార్ భావిస్తోంది. రోడ్‌ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాంకు బ్రిక్స్ బ్యాంకు ద్వారా హూస్సేన్‌సాగ‌ర్ ప్రక్షాళ‌న‌కు ఆస్ట్రియా నుంచి మూసి క్లీనింగ్ మ‌రియు బ్యూటిఫికేష‌న్ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా డబ్బు అప్పుతీసుకునేందుకు అధికారులు ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్లకు రూ.17వేల కోట్లు..
అయితే భారీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వమే ప్రణాళిక బ‌డ్జెట్ ద్వారా నిధులు ఇవ్వాలంటున్నాయి పౌర‌సంస్థలు. ఇప్పటికే వాట‌ర్ బోర్డు, హెచ్ఎండిఎ సంస్థలు చేసిన అప్పులకు వ‌డ్డీలు క‌ట్టలేని దుస్థితిలో ఉన్నాయి. స్వావ‌లంబ‌న‌తో ఉన్న జిహెచ్ఎంసి ఇప్పటికే పలు ఆర్థిక భారాలు మోస్తోంది. ఆర్టీసీ, వాట‌ర్ బోర్డుకు చెల్లిస్తున్న నిధులేగాక తాజాగా హైద‌రాబాద్ మెట్రోరైల్ భూసేక‌ర‌ణ భారం కూడా జిహెచ్ఎంసిపై మోపేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మ‌రోవైపు సిటీలో నిర్మించత‌ల‌పెట్టిన ల‌క్ష డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు 17వేల‌ కోట్లు అవ‌స‌రం కానున్నాయి. వీటికి అప్పులు తీసుకొస్తే జిహెచ్‌ఎంసి కుదేలవకతప్పదంటున్నారు సుప‌రిపాల‌న వేదిక నేత‌లు. పలు భారీ ప్రాజెక్ట్‌లను తలకెత్తుకున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ నిధుల అన్వేష‌ణ‌లో పడింది. మరి స‌ర్కార్ ఆశ‌లు నెర‌వేరుతాయో లేదో చూడాలి. 

06:41 - March 9, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యేల ఫిరాయింపుతో కుదేలైపోయిన తెలంగాణ టిడిపికి మరో షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన టిటిడిఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కరే హాజరుకాగా మిగిలినవారు డుమ్మా కొట్టారు. ఒకపక్క టి.టిడిపి ఖాళీ అయినా అసెంబ్లీలో మాత్రం ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీస్తామని రేవంత్ చెబుతున్నారు. 17 మంది ఎమ్మెల్యేల స్థాయి నుంచి నేడు ఒకరిద్దరు ఎమ్మెల్యేల స్థాయికి తెలంగాణ తెలుగు దేశం పార్టీ దిగజారిపోయింది. కనీసం అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీకి క్యాబిన్‌ ఉంటుందో ఉండదో అన్న స్థాయికి పార్టీ పతనమైంది.

మాగంటి..గాంధీల చేరిక..
తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలంతా అధికార టిఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టగా కేవలం ఐదుగురు మాత్రమే నిన్నటిదాకా ఆ పార్టీ తరపున మిగిలారు. ఇప్పుడు వారిలో ఇద్దరు టిఆర్ఎస్ గూటికి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టిటిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీ సీఎం కేసీఆర్‌ను క్యాంప్‌ ఆఫీసులో కలిశారు. వీరిద్దరూ ఈ నెల 11న టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముంది. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. మాగంటి గోపీనాథ్, శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీకి అందుబాటులో ఉండటం లేదు. మంగళవారం నిర్వహించిన టీటీడీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టారు. సోమవారం నిర్వహించిన మాధవరెడ్డి వర్థంతి కార్యక్రమానికీ గైర్హాజరయ్యారు. వారిద్దరూ టీఆర్‌ఎస్‌లోచేరితే.. మిగిలేది రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య టిడిపికి చెందిన నేతే అయినా తాను తటస్థంగా ఉంటానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో..
మిగిలిన ఎమ్మెల్యేలెవరూ రాకపోయిన ఒక్క రేవంత్‌రెడ్డి, మిగిలిన టిడిపి నేతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిటిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్ పేరుతో కెసిఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లను మెప్పించేందుకు మహారాష్ట్ర సర్కార్‌ వద్ద తెలంగాణ ప్రయోజనాలకు పణంగా పెడుతున్నారని ఆరోపించారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్‌ను 152 మీటర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల వైపు చూస్తే కళ్లు పీకేస్తామన్న కెసిఆర్ వరుసగా మహిళలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. షీ టీమ్స్ షో టీమ్స్‌లా మారిపోయాయని విమర్శించారు. దాదాపుగా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలంతా కారెక్కేశారు. తమకంటూ బలం లేని స్థితిలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది చర్చనీయాంశంగా మారింది. 

06:28 - March 9, 2016

రంగారెడ్డి : జిల్లాలోని జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లి పారిశ్రామకవాడలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ నుండి కెమికల్ దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ కావడంతో మంటలు గౌడోన్ చుట్టూ అలుముకున్నాయి. సమీపంలో ఉన్న పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సుమారు నాలుగు గంటల శ్రమ అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక్కడ అనుమతులు లేకుండా పరిశ్రమలు నిర్వహిస్తున్నారని, అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమంగా గౌడోన్స్ లు ఏర్పాటు చేసుకోవడం..రాత్రి వేళల్లో కెమికల్స్ ను హడావుడిగా దించుతుంటారని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమంగా గౌడోన్స్ ఏర్పాటు చేసుకున్న వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

నేడు కాణిపాక వినాయక స్వామి ఆలయం మూసివేత..

చిత్తూరు : బుధవారం సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాక వినాయక స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10గంటలకు ఆలయం తెరుచుకోనుంది. 

నేడు రాజ్యసభలో మోడీ ప్రసంగం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో బుధవారం ప్రసంగించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రసంగ తీర్మానంపై మోడీ ధన్యవాదాలు తెలుపనున్నారు. 

నేడు బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. వివిధ రాష్ట్రాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై సమావేశం చర్చిస్తారని తెలుస్తోంది.

 

ధూలపల్లి పారిశ్రామకవాడలో ఫైర్ ఆక్సిడెంట్..

రంగారెడ్డి : ధూలపల్లి పారిశ్రామక వాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ నుండి కెమికల్ ను అన్ లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసపడిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 

ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా..

ఢిల్లీ : పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని నేడు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి పాల్గొననున్నారు. 

నేడు పుర ఎన్నికల ఫలితాలు..

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా... సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది. ఈ కార్పొరేషన్లు, నగర పంచాయతీకి ఈ నెల 6న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

Don't Miss