Activities calendar

10 March 2016

గో ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ : గో ఎయిర్ సంస్థకు చెందిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ-భువనేశ్వర్‌ల మధ్య ప్రయాణిస్తున్న గో ఎయిర్ విమానానికి ఓ పక్షి తగిలిందని బిజుపట్నాయక్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

22:10 - March 10, 2016

ఢిల్లీ : తెలంగాణకు కేంద్రం ఏమాత్రం సహకరించడంలేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా లోక్‌సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు 450 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కవిత ఎఫ్ ఆర్ బిఎం పెంచాలని రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా స్పందించడంలేదని చెప్పారు. ట్యాక్స్ విధానంలో పద్ధతిలేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. వన్‌ ర్యాంక్, వన్‌ పెన్షన్‌పై మాట నిలబెట్టుకోలేదన్నారు. కేంద్రం జాతీయ విపత్తు నివారణ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

22:04 - March 10, 2016

ఢిల్లీ : బిల్డర్లకు ముకుతాడు వేసేందుకని తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. భూమి-భవనాల కొనుగోలు లావాదేవీల్లో నియమాలు మారనున్నాయి. కొత్త రియల్ ఎస్టేట్ చట్టం వల్ల ఆంక్షలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇండ్లు కొనుగోలు చేసేవాళ్లకు ఈ బిల్లు ఓ భరోసా ఇవ్వనుంది. అక్రమ డెవలపర్స్ నుంచి కొత్త బిల్లు రక్షణ కల్పించనుంది. ఇండ్లు కొనుగోలు చేసే లక్షలాది మందికి బిల్లు ఉపకరిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.  కాంగ్రెస్‌ నుంచి సానుకూల సంకేతాలు అందడంతో కేంద్రం రియల్‌ ఎస్టేట్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగలిగింది. ఈ బిల్లుకు లోక్‌సభ ఇదివరకే ఆమోదం తెలిపింది. 

22:03 - March 10, 2016

ఢిల్లీ : యమునా నదీ తీరాన జరిగే ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనంపై ఎన్‌జిటి విధించిన 5 కోట్ల జరిమానాను ఎట్టి పరిస్థితుల్లో కట్టేది లేదని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ ట్వీట్‌ చేశారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ జరిమానా చెల్లించేందుకు ఎన్‌జిటి శుక్రవారం వరకు  గడువిచ్చింది. ఎన్‌జిటి ఆదేశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రవిశంకర్ ఇందుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామన్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనానికి ప్రధాని నరేంద్రమోది హాజరవుతున్నారు. 37 వేల మంది కళాకారులతో కల్చరల్‌ ఒలెంపిక్స్‌ను తలపించేవిధంగా సాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని రవిశంకర్  పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం కోసమే తాము యమునా నదీ తీరాన్ని ఎంచుకున్నామని ఆయన చెప్పారు.

 

21:59 - March 10, 2016

ఢిల్లీ :  శ్రీ శ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో యమునా నదీ తీరాన జరిగే ప్రపంచ ఆధ్మాత్మిక సమ్మేళనం ఓ ప్రయివేట్‌ కార్యక్రమమని, దీనికి సైన్యాన్ని ఎలా వినియోగిస్తారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. దీనిపై కేంద్రం ఇంతవరకు జవాబు చెప్పలేదన్నారు. చట్టాలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమన్నారు. ఓ ప్రయివేట్‌ ఫంక్షన్‌ కోసం ఆర్మీని దుర్వినియోగం చేయడం తప్ప మరోటి కాదన్నారు.

 

21:56 - March 10, 2016

వాషింగ్ టన్ : అమెరికాలో పెన్‌సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధులైన ఇద్దరు దుండగులు తుపాకితో జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు.  మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పిట్స్‌బర్గ్‌కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న విల్కిన్స్‌బర్గ్‌లో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ప్రతియేటా కాల్పుల వల్ల 30 వేలమంది మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది 330 కాల్పుల ఘటనలు జరిగాయి. 

 

21:54 - March 10, 2016

దేశంలో వేడి రేపుతోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వ్యూహ, ప్రతి వ్యూహాలను పుదును పెడుతున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు, ఈ ఎన్నికల మోడీ సర్కారుకు సవాల్ గా మారాయా..? సెమీస్ రెడీ..! ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ముందున్న సవాళ్లు ఎంటీ..? ఢిల్లీ, బీహార్లలో వాడిన కమలం, ఈ ఎన్నికల్లో వికసించగలదా..? ఉనికి చాటుకోవటమే కష్టమైన చోట, బలం ప్రదర్శింకగలరా..? ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయలగలదా..? ఈ ఎన్నికల తర్యాత బీజేపీ భవిత్వం ఎలా ఉండబోతోంది.. ఈ అంశంపై ఈరోజు వైడాంగిల్ 

 

నిరాశపరిచిన గవర్నర్ ప్రసంగం : తమ్మినేని

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రజలను నిరాశపరిచిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం గురించి తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్రంలో వలసలను నివారించే చర్యలను చెల్పలేదన్నారు. మహిళల విద్య, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. దళితులకు 3 ఎకరాలు, కేజీ-పీజీ ఉచిత విద్య వంటి కీలక అంశాలు ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 
దళిత, గిరిజన మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు.

21:12 - March 10, 2016

యనమల 20-20 పార్మాట్, బడ్జెట్ పై జగన్ బేజారు, సర్కారు గొప్పదనం సద్విజెప్పిన గవర్నర్, వరంగల్ పీఠం మీద పెర్గిపోయిన పోటీ, లీడర్ల పరాష్కానికి బలైన ఉద్యమ బిడ్డ, నీళ్ల కోసం ఎర్రటెండలో నిరసనలు.. సాగునీటి తండ్లాట, ఉత్తమ తెలివైన ఎర్రచందనం స్మగ్లర్లు ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.... 

తెలంగాణలో 108 సిబ్బందికి ప్రభుత్వ ప్రోత్సాహకం..

హైదరాబాద్ : తెలంగాణలో 108 సిబ్బందికి ప్రభుత్వ ప్రోత్సాహకం లభించింది. 2015-16 ఉత్తమ పని తీరు కనబర్చినందుకు గాను రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఎపిలో ఉద్యోగుల పదోన్నతులు, నియామకాలపై నిషేదాన్ని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, సీనియారిటీల మార్పుపైనా నిషేధం సడలించారు. ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తైన విభాగాలకు గుర్తింపు. 

 

రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తదితర అంశాలపై చంద్రబాబు ఆయనతో చర్చించనున్నారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతిలతో భేటీ కానున్నారు.

ఒంటరిగానే పోటీ : విజయ్‌కాంత్‌

హైదరాబాద్‌ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయనున్నట్లు డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ ప్రకటించారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

 

ఖమ్మంలో అగ్నిప్రమాదం...

ఖమ్మం : జిల్లా టేకులపల్లి మండలం కొత్తూరు గ్రామంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పూరిళ్లకు కూడా అంటుకున్నాయి. ఫైరింజన్ వచ్చేలోగానే మొత్తం 8 ఇళ్లు కాలిపోయాయి. దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని తెలిసింది. ఈ ఘటనలో ఒక లేగ దూడ కూడా మృతిచెందింది.

20:50 - March 10, 2016

విశాఖ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా విశాఖలో కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ, ఎఐటీయూసీ, హెచ్ ఎంఎస్, ఐఎన్ టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కంపెనీలు మూసేస్తున్నారని  కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కార్మికులు రోడ్డున పడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

20:46 - March 10, 2016

కడప : మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అదీ ఆడపిల్లలా? అయితే జరా భద్రం. మీ కళ్లలో ఒత్తులు వేసుకుని మీ కంటి పాపలను కాపాడుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..ఏ మానవ మృగమో ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయొచ్చు. గంటలు రోజులు కాదు... అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి. కలలో కూడా ఊహించని దారుణాలు.. నిత్యజీవితంలో జరుగుతున్నాయి. కడప జిల్లాలో ఓ చిట్టితల్లిని కామాంధుడు కాటికి  పంపాడు. 
ఆరేళ్ల చిన్నారిపై మృగాడి పంజా.. 
నిర్భయ చట్టం వచ్చినా కామాంధుల పైశాచికానికి అడ్డు కట్ట పడటం లేదు. మనుషులమన్న సంగతే మరిచిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. కడప జిల్లాలో ఆరేళ్ల బాలికను పాశవికంగా అత్యాచారం చేసి  బలితీసుకున్న ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 
పసిదానిపై పైశాచికం
కడప జిల్లా సికె దిన్నె మండలం కొప్పర్తికి చెందిన షేక్‌ నాయబ్‌ రసూలు, మస్తానీ దంపతుల ఆరేళ్ల కూతురు షేక్‌ ఆస్మా ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చిన్నారిపై  కన్నేసిన కామోన్మాది ఓబులేసు చాక్‌లెట్‌ ఇస్తానంటూ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత పసిదానిపై పశువాంచ తీర్చుకున్నాడు. చిన్నారి కేకలు వేయడంతో నోరు మూసి ప్రాణాలు  తీశాడు. రాత్రిపూట బకెట్‌లో చిన్నారి శవాన్ని తీసుకెళ్లి ఊరిశివారులో గొయ్యితీసి పూడ్చేశాడు. 
పోలీసుల ఉరుకులు, పరుగులు.. 
చిన్నారి ఆస్మా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. సికె దిన్నె ఠాణాలో ఫిర్యాదు చేయగా... మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం  చేశారు. మరుసటి రోజు గ్రామానికి వచ్చిన పోలీసులు జాగిలాలతో దర్యాప్తు చేపడతామని ప్రకటించారు. దీంతో జాగిలాలు తనను పసిగడతాయోమోనన్న భయం ఓబులేసును  వెంటాడింది. ఆందోళనతోనే భార్యకు ఫోన్‌ చేసి జరిగిన దారుణాన్ని వివరించి పోలీసులకు చెప్పమన్నాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని  గుర్తించారు. అదే సమయంలో నిందితుడు లొంగిపోవడంతో.. ఊరి శివారులో తవ్వకాలు జరిపి చిన్నారిని బయటకుతీశారు. తమ గారాల పట్టి అత్యంత దారుణ  స్థితిలో విగతజీవిగా పడివుండటాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామస్తులు సహా చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.  
భగ్గుమంటున్న మహిళా సంఘాలు  
జరిగిన దారుణంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. పసిపిల్ల నుంచి పండు ముదుసలి వరకు ఎవ్వరిని వదలడం లేదు మదాందులు. ఏ దుర్మార్గుడి కన్ను తమ బిడ్డల మీద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంది. 

20:40 - March 10, 2016

విజయవాడ : కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి చేపట్టనున్న దీక్షను వాయిదా వేసుకున్నారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే దీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తర్వాత నిర్ణయాన్ని జెఎసిలో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. శుక్రవారం నుంచి దీక్ష చేపడతానని ముందుగా ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:36 - March 10, 2016

ఎపి వార్షిక బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహంచిన చర్చా కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, 
వైసీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, ఎపిసీసీ అధికార ప్రతినిధి రామశర్మ, టీడీపీ అధికార ప్రతినిధి జూపూడీ ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ ప్రజలకు మేలు జరిగేదిగా లేదన్నారు. అంకెల గారడిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది ఆచరణకు సాధ్యం కాని బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తింపు...

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించారు. టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఇటీవలే టీఆర్ ఎస్ లో చేరారు. అయితే తాము టీఆర్ ఎస్ లో విలీనం అవుతున్నామని.. తమను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ మధుసూదనాచారికి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ రాశారు. ఈమేరకు టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించారు. రేపు సభ్యులకు సీట్ల కేటాయింపులు జరుగనున్నాయి.  

20:12 - March 10, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించారు. 12 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ స్పీకర్‌ మధుసూదనా చారికి గతంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లేఖ రాశారు. ఎర్రబెల్లి లేఖను స్పీకర్‌ ఆమోదించారు. దీంతో తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, అరికెపూడి గాంధీ, సాయన్న, మాగంటి గోపీనాథ్‌, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్‌, ప్రకాశ్‌ గౌడ్‌లను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. వీరికి అధికార పార్టీ సభ్యులుగా శుక్రవారం అసెంబ్లీలో సీట్లు కేటాయించనున్నారు. 

 

19:54 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీ బడ్జెట్‌పై సీసీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయానికి, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు టెన్ న్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చనందుకే ఇలా లోటు బడ్జెట్‌ పెరుగుతోందని విమర్శించారు. ఆక్వా రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆక్వాతో ఉపాధి అవకాశాలు పెరగవన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు నాన్చడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

19:49 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో 2016-17 వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. 16 వేల 250 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. తక్కువ వ్యయం, అధిక దిగుబడి వచ్చేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. 
రూ.16,250.58 కోట్లతో బడ్జెట్‌ 
2016-17 వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. 16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయ శాఖ ప్రణాళిక వ్యయం 1,311 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.4,474 కోట్లు.  చంద్రన్న లక్ష్యం లాభసాటి వ్యవసాయం అన్నారు ప్రత్తిపాటి. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
నదుల అనుసందానంతో పట్టిసీమ పూర్తి 
నదుల అనుసందానం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేశామన్నారు ప్రత్తిపాటి. బడ్జెట్‌లో ఉచిత విద్యుత్‌కు రూ.3వేల కోట్లు , ఉపాధి హామీకి రూ.5,094 కోట్లు కేటాయించారు. రైతు రుణమాఫీతో అన్నదాతలను ఆదుకుంటామని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఇప్పటికే 7,433 కోట్లు మొత్తాన్ని మాఫీ చేశామని.. మిగతా మొత్తాన్ని నాలుగు దశల్లో విడుదల చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఓ విస్తరణ అధికారిని నియమించి రైతులకు సూచనలు సలహాలు ఇప్పిస్తున్నామన్నారు.  
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ.95 కోట్లు
రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ.95 కోట్లు, తుంపర సేద్యానికి రూ.369కోట్లు, ఆయిల్‌ఫాం మినీ మిషన్‌కు రూ.55 కోట్లు కేటాయించారు. పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయాన్ని రూ.125 కోట్లుగా చూపారు. వడ్డీలేని రుణాలకు రూ.177 కోట్లు, వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344కోట్లు కేటాయించారు.
శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.139కోట్లు 
శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.139కోట్లు, సూక్ష్మ పోషకాల సరఫరాలకు రూ.80కోట్లు, సేంద్రీయ, సహజ వ్యవసాయం కోసం రూ.68.67 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.161.25కోట్లు కేటాయించారు. సమగ్ర కరవు నివారణ చర్యలకుగానూ రూ.50కోట్లు, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది సామర్ధ్యం పెంపు, విస్తరణ కార్యక్రమాలకు రూ.61.71కోట్లు కేటాయించారు. వ్యవసాయ విస్తరణాధికారులకు 6 వేల ట్యాబ్‌లను ఇచ్చినట్లు చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరిచి .. అన్నదాతకు అండగా ఉంటామని ప్రత్తిపాటి అన్నారు.

19:45 - March 10, 2016

హైదరాబాద్ : 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షా 35 వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. గతేడాది కంటే 20 శాతానికి పైగా బడ్జెట్‌ కేటాయింపులు జరిపామన్న ఆర్థికమంత్రి యనమల...రాజధాని నిర్మాణానికి మాత్రం కేవలం 15 వందల కోట్లు కేటాయించారు. పోలవరానికి కేవలం 3 వేల 660 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణ, సాగునీరు, సంక్షేమ రంగాలకు ఘనంగా కేటాయింపులు జరిపామన్న యనమల...అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించకపోతే ఈ బడ్జెట్‌ను అమలు చేయడం చాలా కష్టమని చెప్పకనే చెప్పారు. 
తొలిసారిగా ఈ-బడ్జెట్‌ 
ఆంధ్రప్రదేశ్‌ 2016-17 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తొలిసారిగా ఈ-బడ్జెట్‌ను రూపొందించిన ప్రభుత్వం...ఎమ్మెల్యేలందరికీ ఈ-బడ్జెట్‌ కాపీలను ట్యాబ్స్‌ ద్వారా అందజేసింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటలతో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల...రాష్ట్ర విభజన కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సీఎం చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో సుస్థిర అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తోందని చెప్పారు. మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 35వేల  కోట్లుగా తెలిపారు. ఇందులో  ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ.49,134.44కోట్లు. గతేడాదితో పోలిస్తే 20.13శాతం బడ్జెట్‌ పెరిగింది. వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతమన్నారు యనమల. కేటాయింపుల్లో అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆకర్షణీయ వార్డులు, గ్రామాలకు రూ.3,100 కోట్లు, పారిశుద్ధ్యం కోసం రూ.320 కోట్లు, పట్టణ పరిపాలనకు రూ.4,728.95 కోట్లు,  ఉపాధి హామీ పథకానికి రూ.4,764.71 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195.63 కోట్లు,  గ్రామీణాభివృద్ధికి రూ.4,467 కోట్లు,  క్రీడా శాఖకు రూ.215 కోట్లు కేటాయిస్తున్నట్టు యనమల తెలిపారు.
కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు
కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు,  మైనార్టీ సంక్షేమానికి రూ.710కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.8,832కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 3,100 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 8,724కోట్లు, యువత సాధికారత కోసం రూ.252 కోట్లు, మహిళా సాధికారిత కోసం రూ.642కోట్లు, సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2,998 కోట్లు,  వైద్య ఆరోగ్యశాఖకు రూ.2,933 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,642 కోట్లు, ప్రాథమిక విద్యకు రూ.17,502 కోట్లు, చేనేత రంగానికి రూ.127 కోట్లు, ఐసీడీఎస్‌ పథకానికి రూ.772 కోట్లు, గనులు, భూగర్భ శాఖ ద్వారా 1,632 కోట్ల రాబడి ఆశిస్తున్నామన్న యనమల, ఆహార పరిశ్రమకు రూ.100 కోట్లను కేటాయించారు. కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు, భూపరిపాలనకు రూ.3,119 కోట్లు, విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు, శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు, రాష్ట్రాభివృద్దికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో ముందుకు పోతామన్న యనమల...ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2702.20 కోట్లు కేటాయించారు.
బడ్జెట్‌లో ఆర్థికలోటు లెక్కల వివరణ 
ఒకవైపు కేటాయింపులు ఘనంగానే ఉన్నాయంటూనే...ఆర్థికలోటు లెక్కలను కూడా బడ్జెట్‌లో వివరించారు యనమల. గతేడాది రాష్ట్ర ఆదాయం 16 శాతం మేర పెరిగిందన్న  యనమల   2014-15 ఏడాదికి గాను రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.3వేలకోట్లు ఇచ్చిందని తెలిపారు. తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లన్నారు. 2015-16 సంవత్సరపు ఆదాయ లోటు రూ.4,140 కోట్లని చెప్పారు. 2016-17 రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లుగా అంచనా వేశారు. 2016-17 వాస్తవ లోటు రూ.20,497 కోట్లని తెలిపారు.

 

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు ఆటంకాలు

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు ఆటంకాలు కలుగుతున్నాయి. భూసేకరణకు వచ్చిన తహసీల్దార్ , సర్వేయర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టుకు భూమలిచ్చేది లేదని గ్రామస్తులు తేగేసి చెబుతున్నారు. 

సాంకేతిక కారణాలతో నిలిచిన గూడ్స్ రైలు

నల్లగొండ : భువనగిరి మండలం పగిడిపల్లిలో సాంకేతిక కారణాలతో 45 నిమిషాలుగా గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 

 

రేపు భారత్ రానున్న పాక్ క్రికెట్ జట్టు

ఢిల్లీ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు రేపు భారత్ కు రానుంది. 19న కోల్ కతాలో భారత్, పాక్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనుంది. 

సూర్యపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటర్ విద్యార్థులు ధర్నా

నల్గొండ : సూర్యపేటలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటర్మీడియట్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థులకు చిట్టీలు అందిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 

గోవా ఎన్నికల్లో పోటీ చేస్తాం : అశుతోష్

హైదరాబాద్‌ : వచ్చే ఏడాది గోవాలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేత అశుతోష్ అన్నారు. దేశంలో అత్యంత అవినీతిమయిమైన రాష్ట్రం గోవాయేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ ఆరోపించారు. అటువంటి రాష్ట్రంలో మార్పు తేడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేయనుందని ఆయన అన్నారు. త్వరలోనే పొలిటికల్‌ ఎఫైర్స్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో ఓ నిర్ణయం తీసుకోనుందని ఆయన తెలిపారు. గోవాలో ప్రజలు ఓ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అశుతోష్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.

జేఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్యపై దాడికి యత్నం

ఢిల్లీ : జేఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్యపై దాడికి యత్నించారు. విజయ్ చౌదరి అనే వ్యక్తి జేఎన్ యూలో కన్హయ్యపై దాడికి యత్నించాడు. పోలీసులు విజయచౌదరిని అదుపులోకి తీసుకున్నారు.

19:06 - March 10, 2016

నల్గొండ : తెలంగాణ వస్తే బతుకు బాగుపడ్తదనుకున్నాడు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావించాడు. భవిష్యత్ బంగారంలా ఉంటుందని కలలు కన్నాడు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు. పోలీసుల లాఠీచార్జిలో దెబ్బలు తిన్నాడు... వెన్నెముకకు త్రీవంగా గాయమైంది. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వం అతనికి ఎలాంటి తోడ్పాటు అందజేయలేదు. అతన్ని పట్టించుకోనే లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందకపోవడంతో కలత చెంది ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ఉద్యమకారుడు జక్కుల యాకస్వామి తెలంగాణ మలి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు. మిలియన్‌ మార్చ్ సందర్భంగా పోలీసుల లాఠీచార్జిలో రామస్వామి వెన్నెముకకు తీవ్రగాయమైంది. అప్పటి నుంచి యాకస్వామి మంచానికే పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందకపోవడంతో కలత చెందిన యాకస్వామి భువనగిరిలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

18:51 - March 10, 2016

కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు కదం తొక్కారు. కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ఐఎన్ టీయూసీ, హెచ్ ఎంఎస్, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కార్మికులకు కనీసం వేతనం అమలు చేయడంలేదని.. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడంలో సర్కారు విఫలమైందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. 

18:48 - March 10, 2016

నిజామాబాద్‌ : ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్టుగా... నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని నిజామాబాద్‌లో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని ట్రేడ్ యూనియన్ల అద్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల పొట్టలు కొట్టె జీవోలను రద్దు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేసారు. 

 

18:45 - March 10, 2016

రంగారెడ్డి : జిల్లాలోన  మేడ్చల్‌ మండలంలో క్యాట్‌ ఫిష్‌ల ఉత్పత్తి కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. 2వేల 5వందల కిలోల చేపలతోపాటు.. ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చేపలకు చనిపోయిన పశువులు, కోళ్లను ఆహారంగా వేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఆహారంతో చేపల్లో హానికలిగించే వైరస్‌లు పెరుగుతాయని... వీటిని ఆహారంగా తీసుకుంటే అనారోగ్యం తప్పదని హెచ్చరించారు. ఈ చేపల్ని పెంచుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

 

18:40 - March 10, 2016

కరీంనగర్‌ : టీచర్‌ ట్రైనింగ్‌లోనే తన ప్రతాపం చూపాడో డీఈడీ విద్యార్థి.. డ్యాన్స్ చేయలేదంటూ ఎనిమిదేళ్ల చిన్నారిని చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాన్స్ వాడ మండలం ఇబ్రహీంపేట్‌ ప్రాథమిక పాఠశాలకు క్రాంతికుమార్‌ అనే యువకుడు ఉపాధ్యాయ శిక్షణ కోసం పాఠశాలకు వచ్చాడు. మూడో తరగతి చదువుతున్న దివ్యను నృత్యం చేయాలని ఆదేశించాడు. డ్యాన్స్ చేయకపోవడంతో పాపను చావబాదాడు. ఇంటికి వచ్చాక ఈ దెబ్బలు చూసిన తల్లిదండ్రులు దివ్యను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. క్రాంతి కుమార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..

 

18:34 - March 10, 2016

కరీంనగర్ : తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పులు మరింత పెరిగాయని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్టాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 60వేల కోట్ల రూపాయల అప్పుంటే.. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చార ఇది లక్షా అరవై వేలకోట్లకు చేరిందని ఆరోపించారు. రీ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పారు.

 

18:27 - March 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్బంగా గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. అసెంబ్లీ వేదికగా చేసిన గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఏవిధంగానూ ఊతమిచ్చేలా లేదని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగంలో అన్నీ గొప్ప గొప్ప మాటలే తప్ప..వాస్తవాలు లేవని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. 
విపక్షాలు పెదవి విరుపు 
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంపై విపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ ప్రసంగం నిరాశ పరిచిందని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నేతలు విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టలేదని, ప్రభుత్వం గవర్నర్ చేత అందంగా అబద్దాలు చెప్పించిందని మండి పడ్డాయి. వ్యవసాయం సంక్షోభంతో కూరుక పోయి రైతులు అత్మ హత్యలు చేసుకుంటుంటే..సాగులో వృద్ధి సాధించామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణి, ముస్లిం, గిరిజనుల 12 శాతం రిజర్వేషన్ల అంశం వంటి కీలక అంశాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. గవర్నర్ ప్రసగంలో ఉచిత విద్య, బీసీ సబ్ ప్లాన్, కరవు నివారణ చర్యలు, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాల ఊసేలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. పల్లెల్లో కరవు విలయ తాండవం చేస్తుంటే..ప్రభుత్వం మాత్రం నూతన పారశ్రామిక విధానం, ఇంటింటికి ఇంటర్ నెట్ అంటు కల్లబొల్లి మాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. 
ఆదివారం కూడా కొనసాగునున్న సభ..?
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే సందర్భంలో తమ నిరసనను తెలియ చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమయ్యాక... ఇటీవల మరణించిన పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. అనంతరం బీఏసీ సమావేశమై తదుపరి కార్యక్రమాలను ఖరారు చేయనుంది. సమయాభావం వల్ల ఈ ఆదివారం కూడా సభను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం సర్కార్ ఉంది.

 

17:47 - March 10, 2016

ముంబై : క్రియేటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. కరీనా కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమె భర్తగా ఇంటిదగ్గరే ఉండి అన్ని పన్నులు చేసే హౌస్‌ హజ్బెండ్‌గా అర్జున్‌ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కరీనా విలేకరులతో మాట్లాడుతూ 'మహిళను భూమాతతో పోలుస్తారు. మహిళలకు అధిక శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాళ్లు ఎన్నో పనులను ఏకకాలంలో చక్కబెట్టగలరు' అంటూ కీర్తించింది. ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్‌లో అర్జున్ కపూర్ మెడలో కరీనా తాళి కడుతూ కనిపించడం గమనార్హం. ఇలా భర్తకు భార్య తాళి కట్టడం గురించి కరీనాను అడిగితే.. 'ఇలాంటిదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా గొప్ప ఐడియా. (సినిమాలో) అతను తాళిని గర్వంగా ధరించడమే కాదు ఎంతో సెక్సీగా కూడా కనిపించాడు' అంటూ నవ్వులు రువ్వింది. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్‌ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

17:41 - March 10, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రభుత్వ మహిళా ఆశ్రమంలో దారుణం చోటుచేసుకుంది. వ్యభిచారం చేయాలంటూ తోటి మహిళలు ఓ మహిళను వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ మహిళ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే..
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సరోజ అనే మహిళ జీవనోపాధి కోసం 15 రోజుల క్రింతం హైదరాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ లోని జీహెచ్ ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ మహిళా ఆశ్రమంలో ఉంటుంది. ఈనేపథ్యంలో వ్యభిచారం చేయాలంటూ తోటి మహిళలు సరోజను వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని సరోజ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఆమెను పద్మారావు నగర్ లోని శివానందం ఆశ్రమానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే సరోజ మానసిక స్థితి బాగా లేదని తోటి మహిళలు ఆరోపిస్తున్నారు. 

 

ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు..

ఢిల్లీ: పీఎస్‌ఎల్వీ-సీ32 వాహక నౌక ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

సికింద్రాబాద్ ప్రభుత్వ మహిళా ఆశ్రమంలో దారుణం

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రభుత్వ మహిళా ఆశ్రమంలో దారుణం చోటు చేసుకుంది. సరోజ అనే మహిలను వ్యభిచారం చేయాలంటూ తోటి మహిళలు వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ మహిళ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.

ఏసీబీ కి చిక్కిన ఏడీ స్వరాజ్ బాబు

కృష్ణా : మచిలీపట్నం డీఈవో కార్యాలయలంపై ఏసీబీ దాడులునిర్వహించింది. రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏడీ స్వరాజ్ బాబు పట్టుబడ్డాడు.

16:50 - March 10, 2016

హైదరాబాద్ : ‘బ్యాంకు నుంచి తీసుకున్న లక్ష రూపాయల అప్పు తీర్చలేదని నా భర్తను పోలీసులు తీవ్రంగా కొట్టారు. మరి వేల కోట్ల అప్పు తీసుకుని దేశం విడిచి పారిపోయిన మాల్యాను ఏం చేస్తారు' అంటూ తమిళనాడులోని ఓ పేద రైతు భార్య పోలీసులను ప్రశ్నించింది. వివరాల్లోకి వెళ్తే... తంజావూరుకు చెందిన బాలన్ అనే రైతు పొలం పనుల నిమిత్తం బ్యాంకు నుంచి 3.4 లక్షల రూపాయల లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఇందులో కొంత మొత్తం చెల్లించగా 1.3 లక్షల రూపాయలు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. అయితే పంట దిగుబడి చేతికి అందకపోవడంతో రెండు నెలలుగా బాలన్ బ్యాంకు వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, బాలన్ పై కేసు నమోదుచేసి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని, అతనిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాలన్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారమైనందునే తన భర్తను తీవ్రంగా కొట్టారని అన్నారు. వేల కోట్లు దోచుకున్న విజయ్ మాల్యాను వదిలేసిన పోలీసులు తమలాంటి వారిపై ప్రతాపం చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకే తాము ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

16:38 - March 10, 2016

నెల్లూరు : పీఎస్ఎల్ వీ-సీ 32 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్ వీ-సీ 32 రాకెట్ ద్వారా ఇండియన్‌ రీజనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్ ఎన్ ఎస్ ఎస్)-1ఎఫ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సీ-32 రాకెట్.. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ లో ఇది ఆరో ఉపగ్రహం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. భూతలం, సాగరం, ఆకాశ మార్గాల్లో దిశా నిర్దేశ సేవలను అందించనుంది. విపత్తుల సమయంలో సహాయకారిగా పని చేస్తుంది. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఎఫ్ 12ఏళ్లపాటు సేవలు అందించనుంది. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఎఫ్ బరువు 1425 కిలోలు. దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో పీఎస్ఎల్ వీసీ-32 రాకెట్ ప్రయోగం కీలకం.  
శ్రీహరికోట షార్‌ నుంచి ప్రయోగం
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ - సి 32.. ఉపగ్రహవాహనక నౌకను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ - సీ 32.. ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ ఉప్రగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి దీనిని ప్రయోగించారు. సాయంత్రం 4 గంటలకు పీఎస్ఎల్వీ - సీ 32..ను ప్రయోగించారు. అయితే ఉప్రగహ ప్రయోగానికి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన 54 గంటల కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగింది. ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా మన దేశంలో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ మెరుగుపడుతుంది. ఈ శాటిలైట్‌ పొడవు 44.4 మీటర్లు. బరువు 1425 కిలోలు. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1జిని ప్రయోగించనున్నారు.

ఉచిత ఇసుక విధనం పై కలెక్టర్ కాంతిలాల్ సమీక్ష

గుంటూరు : ఉచిత ఇసుక విధానంపై గురువారం కలెక్టర్ కాంతిలాల్‌ దండే సమీక్ష నిర్వహించారు. మొత్తం 35 రీచ్‌లలో 34 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 7 రీచ్‌లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనువుగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో ఎక్కడైనా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ దండే హెచ్చరించారు.

మందకృష్ణను విడుదల చేయాలని ఆత్మాహత్యాయత్నం...

హైదరాబాద్ :ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పలు చోట్ల రాస్తారోకోలు చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా వైఎస్సార్ కడపజిల్లా రాజంపేటకు చెందిన ఎంఆర్‌పీఎస్ నాయకుడు చేమూరి వెంకటేష్ మాదిగ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్వీ సీ32

నెల్లూరు :దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌) నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ32 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 44.4 మీటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

దీక్షను వాయిదా వేసిన ముద్రగడ

తూగో : కాపులకు రిజర్వేషన్ల కోసం శుక్రవారం నుంచి దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చీకట్లో ఉన్న తమ జాతిని వెలుగులోకి మీడియానే తీసుకొచ్చిందన్నారు. అన్ని రకాల కులాల వారు తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చారన్నారు.

అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయితీల్లో పన్నుల చెల్లింపులపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. గత ఏడాది కన్నా బకాయిల వసూళ్లు పెరగాలని చెప్పారు.

15:47 - March 10, 2016

ఎపి బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఎపి బడ్జెట్-2016 పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎపి కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసీరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీరాములు, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు పాల్గొని, మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని రీతిలో బడ్జెట్ ఉందన్నారు. హామీలను నెరవేర్చే రీతిలో లేదని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజలకు మేలు జరిగే విధంగా లేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మరి కాసేపట్లో పీఎస్ ఎల్వీ సీ32 ప్రయోగం

నెల్లూరు :మరి కాసేపట్లో పీఎస్ ఎల్వీ సీ32 ను ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి ప్రయోగించనున్నపీఎస్ ఎల్వీ సీ32 కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

15:40 - March 10, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకిలెక్కల బడ్జెట్‌గా వైసీపీ విమర్శించింది. ఎపి బడ్జెట్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెదవి విరిచారు. ఈ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు. ఇళ్లకు రూ. 6 వేల కోట్లు అవసరం కాగా రూ. 1లక్ష 132 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆచరణకు సాధ్యంకాని బడ్జెట్ అని ఆయన విమర్శించారు. ఈ పథకానికి స్పష్టమైన కేటాయింపులు లేకుండా.. అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బడ్జెట్ మొత్తం అంకెల
గారడిని తలపించిందన్నారు.

 

మున్సిపల్ శాఖ ప్రణాళికపై కేటీఆర్ సమీక్ష...

హైదరాబాద్: మున్సిపల్ శాఖ వంద రోజుల ప్రణాళికపై మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో పన్నుల వసూలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీసీ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీసీ ఛార్జీలు చెల్లించాలని తెలిపారు.

శ్రీకాళహస్తిలో రంజితతో కలిసి నిత్యానంద స్వామి

చిత్తూరు: వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఈరోజు తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితతో కలసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యాడు. భారీ స్థాయిలో అనుచరులతో కలసి కాళహస్తికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. నిత్యానంద, రంజిత ఫోటోలు, వీడియోలను తీసేందుకు మీడియా ఉత్సాహం చూపగా, నిత్యానంద అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. మీడియాతో మాట్లాడకుండానే వీరిద్దరూ వెళ్లిపోయారు. కాగా, గతంలో నిత్యానంద, రంజితల రాసలీలల వీడియో బహిర్గతమై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

రావెల సుశీల్ కారు సీజ్

హైదరాబాద్: మహిళను వేధించాడనే ఆరోపణలపై అరెస్టయిన ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కారును బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. సుశీల్ తనను వేధించాడని ఓ ముస్లిం మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాను ఇంటికి వస్తుండగా సుశీల్‌తోపాటు కారు డ్రైవర్ తనను వెంబడిస్తూ వేధించారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.

15:10 - March 10, 2016

లాస్ ఏంజిల్స్ : మెన్స్ టెన్నిస్ నెంబర్ వన్ ప్లేయర్ జోకోవిచ్‌తో బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకునే డేటింగ్‌కు వెళ్లింది. ఇటీవల ఆ ఇద్దరూ ఓ నైట్ క్లబ్‌లో డిన్నర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాయి. అయితే అక్కడి స్థానిక పత్రిక ఆ జోడీపై ఓ స్టోరీ రాసింది. జోకోవిచ్ కొత్త స్నేహితురాలంటూ దీపికాపై ఆ కథనంలో పేర్కొంది. హాలీవుడ్ మూవీ త్రిబులెక్స్ కోసం షూటింగ్‌లో ఉన్న దీపికా పార్టీలో టెన్నిస్ హీరోతో హుషారుగా గడిపిందట. లాస్ ఏంజిల్స్‌లోని పాపులర్ సెలబ్రిటీలు సేదతీరే హోటల్‌కు ఈ కొత్త జంట వెళ్లినట్లు ఆ పత్రిక పేర్కొంది. రెస్టారెంట్ నుంచి బయకు వచ్చిన ఇద్దరూ ఒకే కారులో వెళ్లారట. అయితే డిన్నర్ డేటింగ్‌కు జోకోవిచ్ సాదాసీదాగా వచ్చినా.. మస్తానీ మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించింది. మోకాళ్ల వరకు ఉండే బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్‌లో అందర్నీ అట్రాక్ట్ చేసింది. అయితే జోకో-దీపికా మధ్య బంధం ఇప్పటిది కాదు. గత ఏడాది ఇద్దరూ ఢిల్లీ టోర్నమెంట్ సందర్భంగా కలుసుకున్నారు. జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలినాకు కూడా దీపికా డిన్నర్ ఇచ్చిందట.

నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్య

నల్గొండ :అప్పుల బాధ తాళలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ ఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పరమేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. ఈరోజు సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్ధిక బడ్జెట్‌, వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అనంతరం సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నటు స్పీకర్‌ ప్రకటించారు.

14:50 - March 10, 2016

'పవర్' సినిమా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియోను ఈ నెల 19 లేదా 20 తేదీల్లో విడుదల చేయనున్నట్టు తెలిసింది. చాలా రోజుల తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో 'సర్దార్ గబ్బర్ సింగ్‌'పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచింది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త పోస్టర్ ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.118 కోట్లు

హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణకు గాను రూ.118 కోట్లు కేటాయించారు. రైతును రాజుగా చేసే క్రమంలో ఈదొక చారిత్మాక ఘట్టం..అంతేకాకుండా వరుసగా మూడోసారి వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 

సీఎం కేసీఆర్ తో అరెకపూడి, మాగంటి భేటీ..

హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌లు సీఎం కె. చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. వారిద్దరూ గురువారం శుక్రవారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. 

జేఎన్‌యూ రీసెర్చ్ స్కాలర్‌ ఆత్మహత్య

ఢిల్లీ : జేఎన్‌యూ రీసెర్చ్ స్కాలర్‌ దుశ్యంత్ (25) ఆత్మహత్య చేసుకున్నారు. బెర్‌సరాయిలో తన నివాసంలో దుశ్యంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుశ్యంత్ స్వస్థలం యూపీలోని బరేలి. దుశ్యంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

14:31 - March 10, 2016

హైదరాబాద్ :ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారారు. తన సొంత సినిమా '99 సాంగ్స్' తొలి పోస్టర్ ను సామాజిక మాద్యమం వేదికగా ఆవిష్కరించారు. రెహమాన్ హిందీ, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు ఆయన సంగీతం, కథను అందించారు. ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ వైఎం మూవీస్ బ్యానర్ పై రూపొందించనున్నారు. ఈ సందర్భంగా 'మీ అందరి ఆశీస్సులు, మద్దతు కావాలని అన్నారు. నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పోస్టర్ ను మీతో పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంద'ని ఆయన పోస్టర్ పెట్టారు. ఈ సినిమాకు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించనున్నారు.

 

14:26 - March 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి గాను శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రైతును రాజుగా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ. 16,250.58 కోట్లుగా పేర్కొన్నారు. ప్రణాళిక వ్యయం రూ. 7,691.90 కోట్లు..ప్రణాళికేతర వ్యయం రూ. 8558.68 కోట్లుగా గా తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని సభకు తెలిపారు. 75 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేయడం జరిగిందని, రైతు ఉత్పత్తి దారుల సంస్థ ఏర్పాటు ద్వార అన్నదాతలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భూసార అంశాన్ని మెరుగుపర్చడం కోసం రూ. 80 కోట్లు. కరవును తట్టుకొనే పంటల అభివృద్ధి కోసం రూ.50 కోట్లు.
రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 3 వేల కోట్లు. విస్తృతంగా అందబాటులోకి రెయిన్ గన్స్.
పశు ఉత్పత్తుల స్థూల ఆదాయ విలువ రూ. 34,719 కేంద్రీయ, సహజ వ్యవసాయానికి రూ. 68.67 కోట్లు.
వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 161.25 కోట్లు. నీటి నిల్వ కోసం కుంటల తవ్వకాలకు ప్రోత్సాహం.
వాతావరణ బీమా పథకం కొనసాగింపు 
 

ఉపాధి హామీకి రూ.50.94 కోట్లు

రాష్ట్రంలో ఉద్యానవనాల ఆదాయం రూ.41, 478 కోట్లు. 

సమగ్ర కరువు నివారణకు రూ. 50 కోట్లు. 

16 లక్షల మందికి భూసార పరీక్షల కార్డులు.

తుంపర సేధ్యానికి రూ.369 కోట్లు.

వడ్డీలేని రుణాలకు రూ.177 కోట్లు.

75 వేల హెక్టార్లలో సూక్ష్మసేధ్యం.

భూసారాన్ని పేంచేందుకు రూ.80 కోట్లు.

ఆయిల్ ఫామ్ మినీ మిషన్ కు రూ.55 కోట్లు.

రెండో విడత రూణమాఫీకి రూ.3512 కోట్లు.

వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యం పెంపు. 

విస్తరణ కార్యక్రమాలకు రూ.61.71 కోట్లు. 

ఉద్యానవన శాఖకు రూ.550 కోట్లు.

ఆధునిక పద్ధతులను వినియోగించేలా ప్రోత్సాహం. అర్హత గల రైతులందరికీ రుణమాఫీ వర్తింపు. 

పాడి పరిశ్రమ ఉత్పాదకత పెరుగుతోంది. 

వ్యవసాయంలో అధునాతన సాంకేతిక. 

రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు.

సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ.95 కోట్లు.

పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు.

వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344 కోట్లు.

శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ. 139 కోట్లు. 

సూక్ష్మ పోషకాల సరఫరాలకు రూ.80 కోట్లు. 

 

 

వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన స్పీకర్

హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వంపై వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు అనుమతించారు. అవిశ్వాసంపై ఎప్పుడు చర్చించాలన్న దానిపై ఈనెల 14న స్పీకర్‌ సభ అభిప్రాయం తీసుకోనున్నారు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్..రూ.16,250.58 కోట్లు.

హైదరాబాద్ : 2016-17 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ ను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశ పెడుతున్నారు. మొత్తం బడ్జెట్ రూ. రూ.16,250.58 కోట్లు మంత్రి పేర్కొన్నారు. 

13:45 - March 10, 2016

హైదరాబాద్ : సుభాష్ చంద్రబోస్ మృతి తీరని లోటని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. గురువారం ఆయన భౌతికకాయానికి రాఘవులు, తమ్మినేని, చాడ, కోదండరాంలు నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం జిల్లా పిండిప్రోలులో అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రబోస్ మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఉద్యమాల్లో ఆయన పాత్ర మరవలేమని రాఘవులు పేర్కొన్నారు. చంద్రబోస్ మృతి ఐక్య కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, వామపక్ష ఐక్యతకు బోస్ ఎంతో కృషి చేశారని తమ్మినేని పేర్కొన్నారు. 

జైలుకెళ్తా.. జరిమానా కట్టను : రవిశంకర్

ఢిల్లీ : జైలుకైనా వెళ్తాను కానీ జరిమానా కట్టనని శ్రీశ్రీ రవి శంకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని యమునా తీరంలో సంస్కృతి ఉత్సవం నిర్వహిస్తున్న ఆధ్మాత్మిక గురువు అయిదు కోట్లు ఫైన్ చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మేం ఏమీ తప్పు చేయలేదని, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ ఒక్క పైసా కూడా జరిమానా కట్టేది లేదని రవిశంకర్ అన్నారు. శుక్రవారం వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. వేడుక మొదలయ్యే లోపే జరిమానా చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత ఎటువంటి చర్యలకు దిగుతారో ఆసక్తికరంగా మారింది.

అమెరికాలో కాల్పుల కలకలం:5గురి మృతి

హైదరాబాద్ : అమెరికాలోని పిట్స్ బర్గ్ లో నిన్న (భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం) ఆయుధాలు చేతబట్టి రంగంలోకి దిగిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పిట్స్ బర్గ్ కు 13 కిలో మీటర్ల దూరంలోని విల్కిన్స్ బర్గ్ లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డట్లు సమాచారం. మరణించిన వారిలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. 

సల్మాన్ 'కృష్ణ జింక' కేసు విచారణ వాయిదా

జోథ్పూర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణ జింక వేటాడిన కేసులో కోర్టు జోధ్‌పూర్‌ కోర్టు లో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా పడింది. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ను చూసేందుకు జోధ్ పూర్ కోర్టుకు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు తరలివచ్చారు. ఈ విషయంలో తనపై తప్పుడు అభియోగాలు నమోదు చేశారని సల్మాన్ కోర్టుకు చెప్పాడు. అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.

పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660కోట్లు

హైదరాబాద్‌: 2016-17 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ రంగానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రూ.3,660 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

పశు మాంసంతో నూనె తయారీ.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: పశు మాంసంతో అక్రమంగా నూనె తయారు చేస్తోన్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గా సమీపంలో అక్రమంగా నిర్వహిస్తోన్న ఈ కేంద్రంపై దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.

ఏపీ బడ్జెట్‌... ముఖ్యాంశాలు

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తొలిసారిగా ఈ-బడ్జెట్ ను యనమల ప్రవేశపెట్టారు. సభ్యులకు ట్యాబ్ లద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. రూ. లక్షా 35 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

2016-17 బడ్జెట్‌ లక్షా 35వేల కోట్లు

ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55 కోట్లు

ప్రణాళికా వ్యయం రూ.49,134.44 కోట్లు

గతేడాదితో పోలిస్తే 20.13 శాతం బడ్జెట్‌ వృద్ధి

శాంతి భద్రతలకు రూ.4,785.14 కోట్లు

'గవర్నరు ప్రసంగం టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను తలపించింది'

హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగంలో కొత్తదనం లేదని బీజేపీ నాయకుడు లక్ష్మణ్‌ విమర్శించారు. గవర్నరు ప్రసంగం టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను తలపించిందని ఆయన ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్లపై స్పష్టత లేదని, బీసీ సబ్‌ప్లాన్‌ ఊసేలేదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్‌ విమర్శించారు.

 

12:16 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో 2016-17 సంవత్సరానికి ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను శాసనసభ ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సారి అసెంబ్లీలో తొలిసారిగా ఈ - బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అబ్దుల్ కలాం సూక్తితో యనమల బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అనేక సమస్యలతో రాష్ట్రం ఆవిర్భవించడం జరిగిందని, అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళుతున్నామన్నారు. హుదూద్ తుపాన్ తో రాష్ట్రం అల్లాడిందని, 2029 నాటికి మోస్ట్ డెవలప్ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, ఏడాది పాలనలోనే రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని, రూ. 1.53వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఆర్థిక మందగమనంలోనూ వృద్ధి సాధించడం జరిగిందని, దేశంలోనే 10.9 వృద్ధి రేటు సాధించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఏడు మిషన్లు...ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేసుకున్నట్లు 2029 నాటికి ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో 8.4 శాతం సాధించడం జరిగిందని చెప్పారు. గత ఏడాది కంటే 20.13 శాతం ఏపీ బడ్జెట్ పెరిగింది.

రూ.1, 35,688 కోట్లతో ఏపీ బడ్జెట్     ప్రణాళిక వ్యయం రూ. 49,134 కోట్లు.          ప్రణాళికేతర వ్యయం రూ.86,554 కోట్లు.     
ఆర్థిక లోటు రూ. 20,491 కోట్లు       కేంద్రం నుండి వచ్చింది రూ.2,333 కోట్లు.      అమరావతి నిర్మాణానికి రూ.15-18 కోట్లు అవసరం.

కేటాయింపులు..

రుణమాఫీకి రూ.3,512 కోట్లు. సాగునీటి రంగానికి రూ. 3,512 కోట్లు.
తాగునీటికి రూ.3,300 కోట్లు. పారిశుధ్యానికి రూ. 320 కోట్లు.
ఇరిగేషన్ రంగానికి రూ. 7,325 కోట్లు. శాంతి భద్రతలకు రూ. 4,785.14 కోట్లు.
భూ పరిపాలనకు రూ. 3,119 కోట్లు. ఉపాధి హామీకి రూ.4,764.71 కోట్లు.
గ్రామీణాభివృద్ధికి రూ. 4,467 కోట్లు. స్మార్ట్ విలేజ్, వార్డులకు రూ.3,100 కోట్లు.
క్రీడాభివృద్ధికి రూ.215 కోట్లు. ఉన్నత విద్యకు రూ. 2,548 కోట్లు.
యువత సాధికారితకు రూ. 252 కోట్లు. పాఠశాల విద్యకు రూ. 11,702 కోట్లు.
పెన్షన్లకు రూ.2,098 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.1,132 కోట్లు.
గ్రామీణ తాగునీటికి రూ.1,195 కోట్లు. కాపు కార్పొరేషన్ కు రూ.1.000 కోట్లు.
బ్రాహ్మణ కార్పొరేషప్ కు రూ.65 కోట్లు. ఏస్సీ సంక్షేమానికి రూ.8,724 కోట్లు.
కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు. పట్టణ పరిపాలనకు రూ. 4,728 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ. 8,832 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి రూ.750 కోట్లు.
ఉద్యానవనాలకు రూ. 659 కోట్లు. మహిళా సాధికారతకు రూ.642 కోట్లు. 
ప్రాథమిక విద్య రూ. 17,502 కోట్లు. ప్రజా పంపిణీకి రూ. 2,702 కోట్లు.
ఉన్నత విద్యకు రూ. 2,642 కోట్లు. ఇంధన భద్రతకు రూ. 4,020 కోట్లు.
వైద్య ఆరోగ్య శాఖ కు రూ. 2,933 కోట్లు. టూరిజం రూ. 228 కోట్లు.
మైనార్టీల సంక్షేమానికి రూ. 710 కోట్లు. ఐటీ రంగానికి రూ. 360 కోట్లు.
ఆహార పరిశ్రమకు రూ.100 కోట్లు. చేనేతకు రూ. 120 కోట్లు.
రహదారి భద్రతకు రూ. 150 కోట్లు. రహదారుల అభివృద్ధికి రూ. 3,184 కోట్లు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 339 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,660 కోట్లు.
పట్టు పరిశ్రమ రూ. 147 కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 16,491 కోట్లు.
పశు సంవర్థక శాఖ కు రూ. 819 కోట్లు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ. 377 కోట్లు.
మహిళా సాధికారిత కోసం రూ. 642 కోట్లు. సాంఘీక భద్రత ఫించన్ల కోసం రూ. 2,998 కోట్లు.
ఎస్టీ సంక్షేమానికి రూ. 3,100 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి రూ. 8,724 కోట్లు.
ఐసీడీఎస్ పథకానికి రూ.772 కోట్లు. జలవనరుల శాఖకు రూ. 7,325 కోట్లు.
బెజవాడలో నీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థకు రూ. వేయి కోట్లు. పట్టిసీమ దేశంలో తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టు.
త్వరలో 20 వేల పోస్టులకు నోటిఫై. శేషాచలంలో స్మగ్లింగ్ నిరోధనానికి ఆదునిక పరిజ్ఞానంతో నిఘా.
2018 జూన్ కల్లా పోలవరం ఫేజ్ 1 పనులు పూర్తి. రాష్ట్ర సొంత ఆదాయం 16 శాతం పెరిగింది.
నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్ష మందికి శిక్షణ. మహిళా సాధికారిత కోసం ప్రత్యేక ప్యాకేజీ.
తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 13,897 కోట్లు. 2015-16 సంవత్సరం ఆదాయం లోటు రూ. 4,140 కోట్లు.
2015-16 బడ్జెట్ లోటు రూ. 17వేల కోట్లు. 2016-17 రెవెన్యూ లోటు రూ. 4,868 కోట్లు.
దుర్బిక్ష నివారణకు రూ. 50 కోట్లు. ప్రతి జిల్లా మెగాఫుడ్ పార్కు.
రాష్ట్ర వ్యాప్తంగా 432 వాటర్ షెడ్ ప్రాజెక్టులు. ప్రతి రంగానికి ప్రత్యేక పాలసీలు.
రాష్ట్రానికి రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు. మైనింగ్ ద్వారా రూ. 1,635 కోట్లు రాబడి అంచనా.
పెట్టుబడుల లక్ష్యం రూ.11,500 కోట్లు. ఐటీ రంగంలో రూ.3,780 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు.
ఐటీ రంగంలో రూ.7,700 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాకినాడలో ఠాగూర్ సాంస్కృతిక సముదాయ భవనం.
తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడలో కన్వెషన్ సెంటర్లు. విశాఖ – చెన్నై, కర్నూలు - బెంగళూరు కారిడార్ల అభివృద్ధి.

విశాఖపట్టణం, అనంతపురంలో ప్రాంతీయ సైన్స్ కేంద్రాలు.

2014 పోలిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగింది.
గతేడాది పర్యాటక రంగంలో 4661 ఉద్యోగ అవకాశాలు కల్పించాం.

ప్రకాశం జిల్లాలో 14,231 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మాన్యుఫాక్షరింగ్ జోన్.

పీపీపీ విధానంలో మచిలీపట్నం - భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి. దొనకొండలో పెనిన్సులార్ రీజియన్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్.
భోగాపురం, ఓర్వకల్లు, సాగర్, దొనకొండ దగదర్తిలో ఎయిర్ పోర్టులు. ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి.
2020 నాటికి 4.6 లక్షల విద్యుద్దీకరణ లక్ష్యం. మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు విద్యుత్.
విజయవాడ, రాజమండ్రి ఎయిర్ పోర్టులకు అధిక ప్రాధాన్యత. విశాఖపట్టణంలో ఎయిమ్స్.

 

వీటీపీఎస్‌లో రూ.80 లక్షల కుంభకోణం..నిందితుడి అరెస్ట్...

కృష్ణా : విజయవాడలోని వీటీపీఎస్‌లో రూ.80 లక్షల కుంభకోణంపై విజిలెన్స్‌, పోలీసులు స్పందించారు. ఇసుప మిల్‌ బాల్స్‌ను అక్రమ పద్ధతిలో పంపేందుకు ప్రయత్నించిన ఆర్‌ఎన్‌ మెటల్స్‌ ప్రతినిధి జైవీర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మెటల్స్‌ కంపెనీ మాణిక్‌ శర్మ, వీటీపీఎస్‌ ఏడీఈ గోవిందరాజులపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదు అయింది. 

తొలిసారి ఈ-బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన యనమల

హైదరాబాద్ :ఏపీ అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తొలిసారిగా ఈ-బడ్జెట్ ను యనమల ప్రవేశపెట్టారు. సభ్యులకు ట్యాబ్ లద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. రూ. లక్షా 35 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

11:46 - March 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉభయసభలను ఉద్ధేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న..చేపట్టే అంశాలను వివరించారు. 2016-17 బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్ కు రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో తెలంగాణ ఆవిర్భవించిందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, చిరకాల ఆకాంక్షలు సత్వరం నెరవేర్చే తరుణమిదని తెలిపారు. శాసనసభ, మండలినుద్ధేశించి ప్రసంగించడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

 • గోదావరి జలా ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకం. రాజనీతిజ్ఞతతో తమ ప్రభుత్వం వ్యవహరించింది.
 • అంతర్ రాష్ట్ర సమస్యలు విజయవంతంగా ప్రభుత్వం పరిష్కరించింది.
 • రూ. 1.15 లక్షల కోట్లతో బడ్జెట్..ఈసారి లోతుగా కసరత్తు చేసి బడ్జెట్ రూపకల్పన జరిగింది.
 • 11.7 శాథం వృద్ధి రేటు లక్ష్యం.
 • గత 21 నెలల్లో ప్రాధమ్యాలను గుర్తించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రభుత్వం చేపట్టింది. ప్రాథమ్యాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది.
 • వివాహ సమయంలో ఆర్థిక సమస్యలు లేకుండా కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకాన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా విస్తరిస్తాం.
 • గర్భిణల కోసం ఆరోగ్య లక్ష్మి పథకం.
 • ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల్లో సౌకర్యాలు ప్రభుత్వం మెరుగుపరుస్తుంది. నగరంలో కొత్తగా మూడు వెయ్యి పడకల ఆసుపత్రుల నిర్మాణం.
 • ప్రభుత్వ ఆసుపత్రులో మరింత మెరుగైన సేవలందిస్తాం.
 • నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు.
 • మిషన్ భగీరథకు అధిక ప్రాధాన్యత.
 • రాష్ట్రంలో శిశుమరణాలు తగ్గింపు.
 • హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం.
 • కాలేజీ విద్యార్థులకు సన్నబియ్యం.
 • పది జిల్లాలో 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు.
 • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కట్టుబడి.
 • పేదలకు ఆహార భద్రత.
 • మిషన్ ఇంధ్రదనస్సులో దేశంలో తెలంగాణ నెంబర్ వన్.
 • హైవేలపై 108 సేవలు మెరుగు.
 • స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంటింటికి చెత్తబుట్టలు.
 • రూ.200 కోట్లతో స్వచ్ఛ హైదరాబాద్.
 • పంచాయతీలస్థాయిలో పాలన సంస్కరణలు..
 • వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు.
 • మైనార్టీల కోసం 17 రెసిడెన్షియల్ స్కూళ్లు.
 • ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో పౌలీ హౌస్ పథకం.
 • రోజుకు 100 లీటర్ల నీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయడమే లక్ష్యం.
 • సోలార్ విద్యుత్ ను ప్రోత్సాహిస్తున్నాం.
 • సౌర విద్యుత్ కు రానున్న మూడేళ్లలో భారీగా ప్రోత్సాహం.
 • టీఎస్ఐపాస్ కింద ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం.
 • పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తెలంగాణ.
 • టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ హబ్ గా తెలంగాణ.
 • టీ హబ్, స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ ఏర్పాటు.
 • గచ్చిబౌలిలో స్టార్టప్ ల కోసం టి హబ్ ఏర్పాటు.
 • వరంగల్ లో టైక్స్ టైల్ పార్కు ఏర్పాటు.
 • ములుగులో ఉద్యానవన యూనివర్సిటీ.
 • మెదక్ జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ.
 • ఉద్యాన పంటల సేకరణ, గిడ్డంగుల సదుపాయం కోసం ప్రత్యేక నిధులు.
 • 45 వేల చెరువల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ.
 • గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధి.
 • కూరగాయల సాగుకు 75 శాతం రాయితీ.
 • తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా లక్ష్యం.

కాపు సద్భావన సంఘం నేతలతో ముద్రగడ భేటీ...

తూ.గో : కాపు సద్భావన సంఘం నేతలతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. రేపు తలపెట్టిన దీక్ష పై చర్చలుజరుపుతున్నట్లు సమాచారం. మరో వైపు ముద్రగడ దీక్ష చేపట్టకుండా ఉండాలని ముద్రగడ కుమారుడితో డీఎస్పీ సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు.

కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న యనమల

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రతిపాటి పుల్లరావు, కౌన్సిల్ బడ్జెట్ ను మంత్రి నారాయణ, మండలిలో వ్యవసాయ బడ్టెజ్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు.

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

20016-17బడ్జెట్ కు ఏపీ మంత్రివర్గం ఆమోదం...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2016-17కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. కాసేపట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చారిత్రాత్మకం : గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ఆయన మాటల్లో..'ఎన్నో ఆశలు, ఆశయాలతో రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర అభివృద్ధికి ఈబడ్జెట్ రోడ్ మ్యాప్, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చారిత్రాత్మకం. గోదావరి నదీ జలాలకు సంబంధించిన ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలం. రూ.1.15 కోట్లతో బడ్జెట్, 11.7 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం' అని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఈఈ పీర్ సింగ్ నివాసం ఏసీబీ సోదాలు...

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఈఈ పీర్ సింగ్ నివాసంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న పీర్ సింగ్ నివాసంలోకి వెళ్లిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టారు. పీర్‌సింగ్ వద్ద ఆదాయానికి మించి రూ.6 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్, కొండాపూర్, మాదాపూర్, శంషాబాద్‌లో విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

జోధ్‌పూర్‌ కోర్టుకు సల్మాఖాన్...

హైదరాబాద్ :కృష్ణజింకను వేటాడిన కేసులో నిందితుడైన సినీనటుడు సల్మాన్ ఖాన్ గురువారం జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరుకానున్నారు. సల్మాన్‌ఖాన్‌ను చూసేందుకు జోధ్ పూర్ కోర్టుకు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణ జింక వేటాడిన కేసులో కోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. 

10:47 - March 10, 2016

హైదరాబాద్ :పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఖుషి’ సినిమా సీక్వెల్ రూపంలో మరోసారి తెరమీదికి రానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్.జె.సూర్య ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసేసారట. నటీనటుల కోసం జల్లెడ పడుతున్న ఆయన హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదించే యోచనలో ఉన్నారట. ఆ దిశగా చర్చలు కూడా మొదలయ్యాయని వినికిడి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్, సమంతల కెమిస్ట్రీ ఎంతలా పండిందో తెలిసిందే. ఆ సినిమా చూసే ఈ కాంబినేషన్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట సూర్య. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న ‘సర్దార్’ షూటింగ్ చివరి దశలో ఉండగా, ‘అ..ఆ..’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో సమంత బిజీగా ఉంది. పవన్ ‘సర్దార్’ తర్వాత నటించబోయే సినిమా ‘ఖుషి’ సీక్వెల్ అని వినిపిస్తున్న తరుణంలో సమంత పవన్ ‘ఖుషి’ సమంత పాలు పంచుకుంటుందా లేదా అన్నది చూడాలి.

లోతుకుంట వాటర్ ట్యాంకులో మృతదేహం

హైదరాబాద్ :అల్వాల్ లోతుకుంట‌ వాట‌ర్ ట్యాంకులో మృత‌దేహం వెలుగుచూసింది. ఈ మృతదేహం పెయింట‌ర్ స‌త్యనారాయ‌ణ‌దిగా పోలీసులు గుర్తించారు. సత్యనారాయణది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. నీళ్లట్యాంకులో మృతదేహం వెలుగు చూడటంతో లోతుకుంట‌, అల్వాల్, బొల్లారం, తిరుమ‌లగిరి ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. 

మ.12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల

హైదరాబాద్ : మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రతిపాటి పుల్లరావు, కౌన్సిల్ బడ్జెట్ ను మంత్రి నారాయణ, మండలిలో వ్యవసాయ బడ్టెజ్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు.

ఏపీ సర్కార్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ : ఏపీ సర్కార్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హై అలర్ట్

హైదరాబాద్ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో సందర్శకుల అనుమతులు నిరాకరించి... పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అంతే కాకుండా అన్ని రకాల పాసులు రద్దు చేసినట్లు తెలిపారు.

10:25 - March 10, 2016

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శాసనసభ, మండలి సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం దాదాపు 45 నిమిషాలు ఉండే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు..సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ ద్వారా ప్రభుత్వం చెప్పనుంది. ప్రసంగంలో 'మహా' ఒప్పందం అంశాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశం ఏ రోజు ప్రవేశ పెట్టాలి ? అనంతరం ఎన్ని రోజులు సభలు జరపాలి..తదితర నిర్ణయాలు తీసుకొననున్నారు. 

భవనంపై నుండి దూకి మహిళ ఆత్మహత్య....

హైదరాబాద్: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలోని అమీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. విజయా డయాగ్నసిస్‌లో టెక్నిషియన్‌గా పనిచేస్తోన్న అరుణిని అనే మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కాసేపట్లో ప్రారంభం కానున్న టీఎస్ అసెంబ్లీ సమావేశాలు...

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈమేరకు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నల్గొండ : ప్రభుత్వం తనను ఆదుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ వికలాంగుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జక్కులస్వామి(45) చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

10:17 - March 10, 2016

పండు పండు పండు ఎర్రపండు దారి పేరు యాపిల్...ఏ పండుకూ లేని విశిష్టత ఒకటి యాపిల్‌కి ఉందంటే అతి శయోక్తి కాదేమో...రంగులోనూ, ఆకారంలో అంరది మదిని దోచే యాపిల్ పండు. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్‌ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. 19వ శతాబ్దం వచ్చే వరకూ ప్రపంచవ్యాప్తంగా 17 వేల రకాల యాపిల్స్ ఉండేవట! కానీ ఇప్పుడు 7,500 రకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అదేంటంటే, ఒక జాతికి చెందిన యాపిల్ విత్తనాన్ని నాటితే, అదే జాతికి చెందిన చెట్టు మొలుస్తుందనే గ్యారంటీ లేదట..పూర్వం చాలా ప్రాంతాల్లో యాపిల్‌ని ‘వింటర్ బనానా’ అని పిలిచేవారట.

కొలెస్టరాల్ ఆధిక్యత.....

ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను, కొలెస్టరాల్ వంటివి ఇతర కొవ్వు సంబంధిత పదార్థాలను శరీరం గ్రహిస్తుంటుంది. అయితే, యాపిల్స్‌ని తీసుకుంటే, దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థాల గ్రహింపును అడ్డుకుంటుంది. పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై అమాశయం గోడల మీద, చిన్న పేగు గోడలమీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.

క్యాన్సర్ల ఉనికి తక్కువగా..

రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.

రక్తహీనతకు...

యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.

మలబద్ధకం, విరేచనాలు....

యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి. దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది.

జిగట విరేచనాలు...

పిల్లల్లో తరచుగా జిగట విరేచనాలవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. బాగా మిగల పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఉదర సంబంధ సమస్యలు...

అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.

తల నొప్పి.....

యాపిల్స్ అన్నిరకాల తల నొప్పుల్లోను చక్కగా ఉపయోగపడతాయి. బాగా పండిన యాపిల్‌ని పైనా కిందా చెక్కు తొలగించి, మధ్యభాగంలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పుచేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తల నొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం రెండుమూడు వారాలు తీసుకోవాలి.

గుండె జబ్బులు....

 గుండె సమస్యలున్నవారు యాపిల్ తీసుకోవటం మంచిది. యాపిల్‌లో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు. యాపిల్‌కు తేనెను చేర్చి తీసుకుంటే ఫలితాలు మరింత బావుంటాయి. యాపిల్‌లోని పొటాషియంవల్ల గుండె కండరాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి.

అధిక రక్తపోటు....

రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.

వాపులతో కూడిన కీళ్ల నొప్పులు......

 గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్లనొప్పుల్లో యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్, గౌట్‌వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్‌ని తటస్థపరిచి నొప్పులను దూరంచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. యాపిల్స్‌ను ఉడికించి జెల్లిలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పొడి దగ్గు....

పొడి దగ్గులో తియ్యని యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు పావు కిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు....

కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు యాపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది. కంటి సమస్యలు.. కళ్ల కలకలు, కంటి ఎరుపులూ ఉన్నప్పుడు యాపిల్‌ను లోపలకూ బయటకూ వాడవచ్చు. పానీయంగా వాడటానికి కొంత తయారీ అవసరం. ముందుగా యాపిల్ చెక్కులను ఒక ప్యాన్‌లో ఉంచి నీళ్లుపోసి నీళ్లు మరిగేటంతవరకూ స్టవ్‌మీద ఉంచాలి. తరువాత దించి దానంతట అదే చల్లబడేలా చేయాలి. తరువాత వడపోసుకొని తేనె కలిపి తీసుకోవాలి. బాగా మిగల పండిన యాపిల్స్‌ను కళ్లమీద పట్టువేయటానికి ఉపయోగించవచ్చు. కంటి మంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

దంత సమస్యలు...

యాపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. పైగా యాపిల్‌లో ఉండే యాసిడ్స్‌వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది. ఏ ఇతర పండులోనూ లేని అద్భుతగుణమిది.

10:15 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఇచ్చిన తీర్మానాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల వైసీపీ మరింత బలహీనపడడమే కాకుండా అభాసుపాలవుతుందని తెలిపారు. రాజకీయ దురద్ధేశ్యం తప్ప ఏమీ లేదన్నారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు..ఏదో జరిగిపోతోందన్న భ్రమలను బయటకు పంపించడానికి కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈ తీర్మానానికి వైసీపీ సభ్యులు ఎంత మంది మద్దతినిస్తున్నారో తెలుసుకుని ముందుకు రావాలని సూచించారు. తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సభాపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఎప్పుడు చర్చకు అనుమతినిస్తే తాము సిద్ధమన్నారు. 

10:13 - March 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వాకౌట్ల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని వైసీపీ వాకౌట్ చేస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఉద్యోగాల భర్తీ..నిరుద్యోగ భృతి..ఆశా వర్కర్లపై వైసీపీ పలు ప్రశ్నలు సంధించింది. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైసీపీ వాకౌట్ చేసింది. అనంతరం పెన్షన్లు..తదితర దానిపై వైసీపీ ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ అంశంపై జగన్ సభలో మాట్లాడారు. గతంలో 43,13,292 పెన్షన్లు ఉండేవని ప్రస్తుతం 39,27,657 పెన్షన్లు ఉన్నాయని తెలిపారు. ఈసంఖ్య ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉందని, రెండు సంవత్సరాల్లో పెన్షన్ ల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గుతాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని జగన్ వెల్లడించారు. 

10:00 - March 10, 2016

హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని వైసీపీ జగన్ ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఉద్యోగాల భర్తీ..నిరుద్యోగ భృతి..ఆశా వర్కర్లపై వైసీపీ పలు ప్రశ్నలు సంధించింది. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైసీపీ వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా వైసీపీ నేత జగన్ సభలో మాట్లాడారు. బాబు వచ్చాడు..కానీ జాబు రాలేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ లో 2 లక్షల మంది ఎప్పుడు ఉద్యోగాలు పోతాయని భయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఔట్ సోరింగ్స్ అంశంలో రెగ్యులరైజ్ ఎప్పుడన్నామని పరిశీలిస్తామని ఈనాడు ప్రభుత్వం చెబుతోందన్నారు. వీఆర్ఏ జీతాల కోసం పోరాటాలు..గోపాల్ మిత్రలో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేశారని..ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు..ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. డీఎస్సీ రాసిన అభ్యర్థులు 18 నెలలుగా మెరిట్ లిస్టు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని జగన్ తెలిపారు. 

వెబ్ సైట్లో ఆర్ ఆర్ బి హాల్ టిక్కెట్లు...

హైదరాబాద్ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తన అత్యుత్సాహాన్ని సవరించుకుంది. హాల్‌టికెట్ల కేటాయింపులో అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నది. నాన్‌టెక్నికల్ పోస్టుల హాల్‌టికెట్లను తన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. డిగ్రీ, తత్సమాన అర్హతతో ఉద్యోగాలను భర్తీచేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఆర్‌ఆర్‌బీ నిర్ణయం తీసుకున్నది. అయితే పరీక్షకు హాజరయ్యేందుకు ఇచ్చే హాల్‌టికెట్లు మాత్రం ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచకుండా మరో ప్రైవేట్ వెబ్‌సైట్ వారికి ఇచ్చింది.

వైసీపీ వాకౌట్

హైదరాబాద్ : ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ అసెంబ్లీ నుంచి వైకాపా వాకౌట్‌ చేసింది. ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. డీఎస్సీ రాసినవారు 18 నెలలుగా మెరిట్‌ లిస్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు భయంతో ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షనేతకు కనీస అవగాహన లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

09:49 - March 10, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అర్చకులు ఆందోళనకు దిగారు. ఈవో వేధింపులు కారణంగా ఆసుపత్రిలో పాలైన మంగళంపల్లి సుబ్బారావుకు న్యాయం చేయాలని, ఈవోను సస్పెండ్ చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కనకదుర్గమమ్మ గుడిలో విచిత్రమైన పరిస్థతి నెలకొని ఉంది. తనను ఈవో మానసికంగా వేధిస్తున్నాడని, ఇంటికెళ్లి వేడుకున్నా ఈవో కనికరించలేదని సుబ్బారావు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈవో చర్యలకు నిరసనగా గురువారం ఉదయం దుర్గగుడిలో అర్చకులు ఆందోళన చేపట్టారు. ఈవో వేధింపులు చేయడం వల్ల తాము ఆందోళన చెందుతున్నామని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కమిషన్ వేశారు. ఏవో కమిషన్ కు విచారణాధికారిగా వ్యవహరించనున్నారు. విచారణ అనంతరం సమర్పించే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనిచ్చారు. 

ఐటీ అధికారులమంటూ ఆభరణాల దోపీడీ

చిత్తూరు :ఐటీ అధికారుల వేషంలో ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడి దోపిడీ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నాగులాపురంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆదాయపు పన్ను వివరాలు కావాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంబికా జ్యూయలర్స్ లోకి ప్రవేశించారు. యజమాని వివరాలు చెప్పేలోపునే ఆయన్ను కత్తులతో బెదిరించి కుర్చీకి కట్టేశారు. రూ. 7 లక్షల విలువైన నగలు, రూ. 5 వేలు అపహరించి పారిపోయారు. ఈ ఉదయం యజమాని బిగ్గరగా కేకలు పెడుతుంటే, స్థానికులు చూసి విడిపించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

09:44 - March 10, 2016

హైదరాబాద్ :స్వచ్ఛమైన మనసున్న నలుగురు వ్యక్తులు ఒకచోట చేరితే అక్కడ ఓ ఉత్సవశోభ కనిపిస్తుంది. అలాంటి నాలుగు కుటుంబాలు కలిసి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకుంటే అదే బ్రహ్మోత్సవం అంటున్నారు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరు నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతా, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. మే నెలలో ప్రేక్షకులముందుకురానుంది. ప్రస్తుతం వారణాసిలో చిత్రీకరణ జరుగుతోంది. మహేష్‌బాబుతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 13వరకు వారణాసిలో షూటింగ్ జరుగుతుందని, అనంతరం ఢిల్లీలో జరిగే షెడ్యూల్‌తో ఓ పాట మినహా టాకీ పార్ట్ పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సంగీతం: మిక్కీ జే మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సందీప్ గుణ్ణం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

09:42 - March 10, 2016

హైదరాబాద్: వంట వండటానికి.. రాయటానికి పెద్దగా తేడా ఏమీ లేదంటున్నాడు టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్. పురుషులు వంట చేయటంలో ఏమాత్రం తీసిపోరని చెప్పాలనుకుంటున్నాడో ఏమో అవసరాల వంట చేస్తూ ఉన్న ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అవసరాల నటుడిగానే కాకుండా ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అవసరాల తాజాగా నారారోహిత్, నాగశౌర్య లతో జో అచ్చుతానంద సినిమాను తెరకెక్కిస్తున్నారు.

09:41 - March 10, 2016

హైదరాబాద్ : తాము అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలుగో రోజు ప్రారంభమైన శాసనసభలో నిరుద్యోగ భృతి అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదని, తాము వాకౌట్ చేస్తున్నామని వైసీపీ ప్రకటించింది. వాకౌట్ చేసిన అనంతరం ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మేనిఫెస్టోలో చాలా సమస్యలు పేర్కొన్న వాటిని అన్నీ అమలుకు కృషి చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ..రైతులకు రుణమాఫీ..అంగన్ వాడీలకు వేతనాలు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలపై నిర్లక్ష్యంగా పసమాధానం చెప్పేవారని, కానీ తాము అలా చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు తీసేయడం లేదని, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. చదువుకున్న వారికి స్కిల్స్ పెంచడం..ఉపాధి కల్పించడం వంటివి చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య..

నల్గొండ : భువనగిరి తెలంగాణ ఉద్యమకారుడు జక్కుల రామస్వామి (40) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ మలి ఉద్యమంలో రామస్వామి కీలకంగా పనిచేశారు. మిలియన్ మార్చ్ సందర్భంగా పోలీసుల లాఠీచార్జీలో రామస్వామి వెన్నుముఖకు గాయమైంది. అప్పటి నుండి మంచానికి పరిమితం కావడంతో రామస్వామి తీవ్రమనస్థాపానిక గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

 

జీహెచ్ఎంసీ డిప్యూటి ఈఈ నివాసంపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటి ఈఈ నివాసంపై గురువారం ఏసీబీ దాడులు చేసింది. చందానగర్ సర్కిల్ లో 12వ డీఈగా పీర్ సింగ్ పనిచేస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీలోని పీర్ సింగ్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

09:23 - March 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని వైసీపీ సభ్యుడు చాంద్ బాషా పేర్కొన్నారు. నాలుగో రోజు ఏపీ శాసనసభలో ఉద్యోగాల కల్పనపై చాంద్ బాషా మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని..ఇవ్వకపోతే భృతి ఇస్తామని అధికారంలోకి రాకముందు టిడిపి పేర్కొందని గుర్తు చేశారు. దీనితో రాష్ట్రంలో నిరుద్యోగులు..వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూశారని పేర్కొన్నారు. కానీ ఉద్యోగాలు కల్పించకపోవడమే కాక భృతి ఇవ్వడం లేదని..ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని సభకు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన వారు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని బాషా తెలిపారు. 

09:21 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీలో నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న హామీ ఏమైందని వైసీపీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగో రోజు ఏపీ శాసనసభలో ఉద్యోగాల కల్పనపై మోహన్ రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగ భృతి లేదని చెప్పడం..అలాంటి పథకమే లేదని మంత్రి చెప్పడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల్లో ఛైన్ స్నాచింగ్ లు ఎక్కువగా జరుగుతున్నాయని, అందులో యువత ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదని, ప్రైవేటు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదని మోహన్ రెడ్డి విమర్శించారు. 

09:18 - March 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు టిడిపి యువతకు అనేక హామీలు గుప్పించిందని, ఆ హామీలేమయ్యాయని వైసీపీ సూటిగా ప్రశ్నించింది. నాలుగో రోజు శాసనసభా సమావేశంలో వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆనాడు చెప్పడం జరిగిందని, సదరు మంత్రి అలాంటి పథకం ఏదీ లేదని చెప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఏ ఒక్కటైనా చేశారా ? - శ్రీకాంత్ రెడ్డి..
ఆరోగ్య శ్రీ పనిచేసే వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి తీసేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. యువత నలిగిపోతోందని, యువతను చూస్తే చాలా బాధేస్తుందని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం డీఎస్సీ నడిపిస్తామని, ఉద్యోగాల కల్పన చేస్తామని ఎన్నో వాగ్ధానాలు గుప్పించారని గుర్తు చేశారు. వాళ్లు ఏ రకంగా బతకాలి అని ప్రశ్నించారు. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ జరగడం లేదని, డిగ్రీ చదివిన వారు అంగన్ వాడీలు దరఖాస్తు చేసుకుంటే వారిని పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 

యువతకు ఉద్యోగ హామీలేమయ్యాయి - వైసీపీ..

హైదరాబాద్ : టిడిపి అధికారంలోకి రాకముందు యువతకు ఎన్నో హామీలు గుప్పించారని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో వారు మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించలేదని, నిరుద్యోగ భృతి కల్పించలేదని తెలిపారు. అలాంటి పథంక లేదని మంత్రి చెప్పడం బాధాకరమన్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. అంతకుముందు వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందచేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను గురువారం శాసనసభ ముందు పెట్టనుంది. మధ్యాహ్నం 12గంటలకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు దీన్ని సభలో ప్రవేశ పెడుతారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందుంచనున్నారు. ఉదయం 10.30గంటలకు శాసనసభ ఆవరణలో మంత్రివర్గ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. 

ఇంద్రకీలాద్రిపై అర్చకుల ఆందోళన..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అర్చకులు ఆందోళనకు దిగారు. ఈవో వేధింపులు కారణంగా ఆసుపత్రిలో పాలైన మంగళంపల్లి సుబ్బారావుకు న్యాయం చేయాలని, ఈవోను సస్పెండ్ చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. 

వైసీపీ అవిశ్వాస తీర్మానం..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందచేశారు. 

జోద్ పూర్ కు సల్మాన్ పయనం..

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోద్ పూర్ కు పయనమయ్యారు. కోర్టులో హాజరయ్యేందుకు ఆయన వెళుతున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసుకు సంబంధించి కొన్నేళ్లుగా సల్మాన్ విచారణకు హాజరవుతున్నాడు.

08:29 - March 10, 2016

ఢిల్లీ : కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మొత్తం ఆరుగురికి ఢిల్లీ పాటియాలా కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ ఏడున వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అరుణ్‌జైట్లీ ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆప్‌ నేతలు ఆరోపణలు చేశారు. ఆప్‌ చేసిన ఆరోపణలపై అరుణ్‌జైట్లీ ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన సిఎం కేజ్రీవాల్, ఆప్‌ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్‌, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ 10 కోట్ల రూపాయలకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. 

07:57 - March 10, 2016

జుట్టు పొడిబారినట్లు ఉందీ అంటే జుట్టులో తేమ తగ్గినట్లే. తేమ తగ్గిన జుట్టు చిట్లిపోతుంది, రాలిపోతుంది కూడా. మరి, ఈ సమస్యకు పరిష్కారం...
గుడ్డులో ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, కరిగే కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి.
గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల వెనిగర్‌, ఒక చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది.
జుట్టు బాగా రాలిపోతుంటే... పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తెల్లసొన వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
కలబంద గుజ్జును నాలుగు స్పూన్లు తీసుకొని అందులో రెండు స్పూన్లు కొబ్బరి నూనె, ఒక స్పూను పెరుగు కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పొడిబారటం తగ్గుతుంది. తలస్నానం చేసే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే మృదువుగా ఉంటుంది. 

07:51 - March 10, 2016

న్యూఢిల్లీ : ఐసీసీ వరల్డ్ కప్‌ టీ20 మ్యాచుల్లో కీలకమైన భారత్‌, పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ వేదిక ధర్మశాల కాదు.. పాక్‌ క్రికెటర్ల భద్రత కారణాల దృష్ట్యా ఇప్పుడు కోల్‌కతాకు మారింది. ఈనెల 19న జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నిర్వహించే వేదిక విషయంలో పాక్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ధర్మశాల మినహా మరేచోటనైనా ఆడటానికి సిద్ధమేనని పీసీబీ ప్రకటించింది. దీంతో బీసీసీఐ అందుకు ఓకే అనటంతో.. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పచ్చజెండా ఊపారు. అయినా... పాక్‌ టీమ్‌ భారత్‌ పర్యటనపై ఇంకా సందిగ్దం వీడలేదు.

గొడవ ఎక్కడ మొదలైంది..వేదిక ఎందుకు మారింది..
ధర్మశాల వేదికగా భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించవద్దని కొన్ని సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీసీసీఐ ప్రత్యేక బృందాలను పంపి సీఎంను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపు ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌శుక్లా జోక్యం చేసుకుంటూ.. ధర్మశాలలోనే భారత్‌, పాక్‌ మ్యాచ్‌ కొనసాగుతుందని.. వేదిక విషయంలో ఎలాంటి అనుమానాలొద్దని స్పష్టం చేశారు. ధర్మశాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పాక్‌ టీమ్‌ను అక్కడికి పంపాలా.! వద్దా..అని తర్జనభర్జన పడింది. మరోవైపు పాక్‌ ప్రధాని నవాహజ్‌ షరీఫ్‌తో ఆ దేశ హోంమంత్రి చౌదరి నిసార్‌ బుధవారం కలిసి పాక్‌ టీం భద్రత ఏర్పాట్లకు సంబంధించి నివేదిక సమర్పించారు. మరోవైపు ఐసీసీ సీఈఓ డెవ్‌ రిచర్డ్‌సన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను చాలా ఆలస్యంగా ప్రకటించింది. అయినా ధర్మశాలలోనే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నాం. కానీ ఆటగాళ్ల భద్రత కారణాలు కీలకమైన అంశం కాబట్టి వేదికను మార్చి కోల్‌కతాలోనే మ్యాచ్‌ నిర్వహించబోతున్నామని ప్రకటించారు.

ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం: ఈనెల 12న బంగ్లాదేశ్‌, 14న శ్రీలంకతో పాక్‌ క్వాలిఫైయింగ్‌ మ్యాచులు ఆడాల్సి ఉన్నది. ఆ తర్వాత కీలకమైన గ్రూపు-ఎలో ఈనెల 16న పాక్‌ ఆడా ల్సి ఉన్నది. ధర్మశాల వేదిక మారటంతో.. మిగతా షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ఐసీసీ సీఈఓ భరోసా ఇస్తున్నారు.

కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా భారత్‌..పాక్‌ మ్యాచ్‌..
ఐసీసీ వరల్డ్ కప్‌ టీ20 భారత్‌-పాక్‌ ల మధ్య ధర్మ శాలలో జరగాల్సిన మ్యాచ్‌ ఇప్పుడు కోల్‌కతా నిర్వహించ నున్నారు. పాక్‌ క్రికెట్‌ టీమ్‌ ధర్మశాలలో ఆడటానికి నిరాకరించడటతో కీలకమైన ఈ మ్యాచ్‌కు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌ వేదికవ్వబోతోన్నది. 
250 మంది పాక్‌ ఫ్యాన్స్ కు అనుమతి: టీ.20 టోర్నమెంట్‌కు ఉగ్రదాడి హెచ్చరికల దృష్ట్యా. ప్రతి మ్యాచ్‌కు పాకిస్థాన్‌ ఫ్యాన్‌కు 250 మందికి వీసా ఇవ్వనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాక్‌తో నాగ్‌పూర్‌, ధర్మ శాల, మొహలీ, కోల్‌కతాలో ఈ మ్యాచ్‌లు ఆడబోతున్నారు. అయితే ధర్మశాల వేదిక మారటంతో...కోల్‌కతాలోనే మరో మ్యాచ్‌ నిర్వహించనున్నారు.

వేదిక మారటానికి సీఎంయే కారణం: అనురాగ్‌..
అన్నింటికన్నా దేశం ముఖ్యమని ఆలోచించాలి. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ పార్టీ, పరివార్‌ ముఖ్యమన్నట్టుగా ప్రవర్తించారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు వరల్డ్‌ కప్‌ నిర్వహించటానికి ఉత్సుకత చూపుతాయి. పోటీపడతాయి.ఈసారి టోర్ని నిర్వహణకు శాయ శక్తులా ప్రయత్నించాం. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, అక్కడి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదన్నారు. ఐసీసీ చరిత్రలోనే వేదిక విషయంలో ఇలాంటి వ్యతిరేక నిర్ణయం వచ్చిందని తెలిపారు.

పాక్‌ను వెంటాడిన ఆ మూడు భయాలేవి?

 • ధర్మశాలలో పాక్‌ ఆడే మ్యాచ్‌ను వ్యతిరేకించే శక్తులను కట్టడి చేయగలరా..?
 • హోటల్‌నుంచి గ్రౌండ్‌ దాకా టీమ్‌ చేర్చడం, ధర్మశాలలో పాక్‌ ఫ్యాన్స్‌కు భద్రత ఎలా?
 • పాక్‌ జెండాలు,డ్రెస్‌ ధరిస్తే మోడీ సర్కారు తీరు ఏవిధంగా ఉండబోతోంది.?

పాక్‌ డెలిగేషన్‌ టీం సందర్శన.
పాక్‌ టీం పర్యటిస్తే. అందుకు భద్రత ఏవిధంగా ఉండాలన్న అంశంపై పాక్‌ డెలిగేషన్‌ టీం మంగళవారం భారత్‌లో పర్యటించింది. వేదికల వద్ద తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లను పాక్‌కు వివరించింది.
ఐసీసీ వరల్డ్‌ కప్‌ టీ20 టోర్నమెంట్‌ నిర్వాహకులు ఎమ్‌.వి.శ్రీధర్‌ పాక్‌ సెక్యూరిటీ టీమ్‌ మెంబర్లు, బీసీసీఐ అధికారులు, హిమాచల్‌ ప్రదేశ్‌ సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యారు.

07:45 - March 10, 2016

కోల్‌కతా: ఆసియాకప్‌ గెలిచాక మంచి జోష్‌ మీద ఉన్న భారత్‌ టీమ్‌ గురువారం ఐసీసీ టీ..20 వరల్డ్‌ కప్‌లో వెస్టిండీస్‌తో తలపడనున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా, శ్రీలంకతో ఆడిన మ్యాచుల్లో భారత్‌ తడాఖా చూపింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆరో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అందరికళ్లు ఫాస్ట్ బౌలర్‌ మహమ్మద్‌ షమీపైనే ఉన్నాయి. షమీ గాయాల బారినపడి కీలక మ్యాచులకు దూరమయ్యాడు. అలాంటి షమీ తిరిగి తన ఏకాగ్రతను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. గురువారం ముంబయిలో జరిగే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కీలకం కానున్నది. ఇప్పటికే భారత్‌ టీంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆశిష్‌ నెహ్రాతో పాటు హార్దిక్‌ పాండ్య ప్రత్యర్థి టీములను చీల్చిచెండాడుతున్నారు. 11 మ్యాచులు ఆడిన పాండ్య, బుమ్రా 25 వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు.

భారత్‌: ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌), కోహ్లి, రోహిత్‌, యువరాజ్‌ ,అశ్విన్‌, బుమ్రా, ధావన్‌, హర్భజన్‌ , షమీ, పవన్‌ నేగీ, ఆశిష్‌ నెహ్రా, హార్ధిక్‌ పాండ్య, రహనే, రైనా,జడేజా
వెస్టిండీస్‌: సమీ(కెప్టెన్‌), బద్రీ, బెన్‌, బ్రేథ్‌వెట్‌, డ్రవెన్‌ బ్రెవో, చార్ల్స్‌, ఆండ్రో ఫ్లెచర్‌, క్రిస్‌ గెేల్‌ , జాన్సన్‌ హోల్డర్‌, ఎషిలో నర్స్‌, దినేష్‌ రామ్‌దిన్‌, రస్సెల్‌, మార్లెన్‌ సామ్యూల్స్‌, జోరోమ్‌ టెలర్‌, ఎవిన్‌ లూయిస్‌.

భారత్‌ × వెస్టిండీస్‌ (వార్మప్‌ మ్యాచ్‌)

వేదిక : కోల్‌కతా

సమయం : రాత్రి 7.00 గం..

స్టార్‌స్పోర్ట్స్ 1,3 లలో ప్రసారం.

 

07:41 - March 10, 2016

కోల్‌కతా: భారత క్రికెట్‌ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్‌ మొహిత్‌ శర్మ వైవాహికబంధంలో ఒక్కటయ్యాడు. కోల్‌కతాలో ఉంటున్న తన గర్ల్ ఫ్రెండ్‌ శ్వేతను పెండ్లి చేసుకున్నాడు. 27 ఏండ్ల మొహిత్‌ ఫరీదాబాద్‌ నివాసి. శ్వేత, మొహిత్‌ల మధ్య మూడేండ్ల నుంచి సాన్నిహిత్యం కొనసాగుతున్నది. రెండు నెలల కిందట వారిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో బుధవారం కుటుంబసభ్యుల మధ్య వారిద్దరూ వైవాహిక బంధంలో ఒక్కటయ్యారు.

బోరుబావిలో చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు..

మహారాష్ట్ర : గొండియా ప్రాంతంలో బోర్ బావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం నాలుగు సంవత్సరాల చిన్నారి బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. 

07:37 - March 10, 2016

సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువగా కాద'ని అంటోంది కంగనా రనౌత్‌. తను రాజకుటుంబంలో జన్మించినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కంగనా తన జీవిత విశేషాలను ఆవిష్కరించింది. 'చిన్నప్పుడు మా అమ్మానాన్నలకు రంగోలీ, అక్షత్‌లనే ఇద్దరు తోబుట్టువులు జన్మించారు. వారి కంటే ముందుగా ఓ బాబు పుట్టి చనిపోయాడు. దీంతో మా తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఆ తర్వాత నేను పుట్టినప్పుడు మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని, నన్ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఒక విధంగా నన్ను వద్దనుకున్నామని ఇంటికి వచ్చే వారితో చెప్పేవారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. మహిళ ఎప్పుడూ మగవారి సంతోషమే తన సంతోషంగా భావిస్తుంటుంది. ఇలాంటి ఆలోచనలు దూరమవ్వాలి. సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే ఉండాలి' అని పేర్కొంది. ప్రస్తుతం కంగనా 'రంగూన్‌' చిత్రంలో నటిస్తున్నారు.

07:36 - March 10, 2016

చాలా మంది తారలు ఏమాత్రం ఛాన్స్ దొరికినా తమలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అలా ఇటీవల శ్రుతిహాసన్‌, కాజల్‌, మంచు లక్ష్మీ, ఎన్టీఆర్‌, రవితేజ, పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు తమ సినిమాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో త్రిష చేరిపోయింది. తను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నాయకి' చిత్రం కోసం ఓ పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె సంగీత సారథ్యంలో రికార్డింగ్‌ చేయగా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో పాటపాడినట్టు త్రిష తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. గోవర్థన్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బైలింగ్వల్‌ హర్రర్‌, థ్రిల్లర్‌ కామెడీ చిత్రంలో త్రిషకు జోడీగా గణేష్‌ వెంకటరామన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. దీంతో పాటు త్రిష 'భోగి', ధనుష్‌తో కలిసి 'కోడి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

07:31 - March 10, 2016

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పక్షం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొంటే ఏడాది పాటు సస్పెన్షన్ అనే రూల్ ను తీసుకొచ్చారు. ఈ అంశాలపై టెన్ టివి చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ సంపాదకులు), రాకేష్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

06:50 - March 10, 2016

ఈ రోజు కార్మికులు దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటిస్తున్నారు.CITU, INTUC, AITUC, HMS, IFTU, TNTUC, TRSKV, AIUTUC కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు చేయబోతున్నారు. అసలు దేశవ్యాప్త కార్మికుల ఆందోళనకు కారణం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ముందు వీరు పెడుతున్న డిమాండ్స్‌ ఏమిటి? 7వ వేతన సంఘం సిఫార్సుల విషయంలో కార్మిక సంఘాలేమంటున్నాయి? కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలలో వచ్చిన మార్పులేమిటి? అవి కార్మికుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా లాంటి వినూత్న కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త నినాదాలిస్తున్నవేళ కార్మిక సంఘాలు ఎందుకు ఆందోళనలకు దిగుతున్నాయి? కార్మిక సంఘాలు అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయన్న విమర్శల్లో ఎంతవరకు నిజం వుంది? ఈ అంశాలపై జనపథంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విశ్లేషించారు. విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:44 - March 10, 2016

నెల్లూరు : జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ పీఎస్ఎల్వీ - సి 32.. ఉపగ్రహవాహనక నౌకను ప్రయోగించున్నారు. పీఎస్ఎల్వీ - సి 32.. ద్వారా ఇండియన్‌ రీజనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌...ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ ఉప్రగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడతారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి దీనిని ప్రయోగిస్తారు. సాయంత్రం 4 గంటలకు పీఎస్ఎల్వీ - సి 32..ను ప్రయోగిచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప్రగహ ప్రయోగానికి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన 54 గంటల కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా మన దేశంలో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ మెరుగుపడుతుంది. ఈ శాటిలైట్‌ పొడవు 44.4 మీటర్లు. బరువు 1425 కిలోలు. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఇది ఏడో ఉపగ్రహం. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1జిని ప్రయోగిస్తారు. 

06:41 - March 10, 2016

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ బ్రిటన్‌ పర్యటనకు బయలుదేరతారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ముందుగా ఢిల్లీ వెళ్లి, అక్కడ నుంచి లండన్‌ బయలుదేరతారు. ఈనెల 13 వరకు ఆయన లండన్‌లోనే ఉంటారు. అక్కడ జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానంపై కార్పొరేట్లతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, సానుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరిస్తారు. సర్కార్‌ తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంపై ప్రజంటేషన్‌ ఇస్తారు. రాష్ట్ర రాజధాని అవరావతిలో విద్య సంస్థల స్థాపన, ఐటీ కంపెనీల ఏర్పాటుపై పలు బృందాలతో భేటీ అవుతారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ మంత్రి పీ నారాయణ, ప్రభుత్వ సలహాదారు వేమూరి రవికుమార్‌, సీఎంఓలో ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌, తదితరులు చంద్రబాబు వెంట లండన్‌ వెళ్లే ప్రతినిధి బృందంలో ఉన్నారు.  

06:39 - March 10, 2016

ఢిల్లీ : ఏపీకి మంజూరైన మూడు కొత్త యూనివర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలతోపాటు పెట్రోలియం యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అమరావతి కేంద్రంగా ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఏపీ పునర్విభజన చట్టంలో జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు అంశంపై రాష్ట్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో గంటా భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేయతపెట్టిన సెంట్రల్‌ యూనివర్సిటీ, విజయనగరం జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాలపై స్మృతీ ఇరానీతో చర్చించారు. ఈ రెండు విద్యాసంస్థల బిల్లులు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయని స్మృతీ చెప్పగా.... ఆ శాఖ మంత్రి సదానందగౌడ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.
విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రోలియం యూనిర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించడానికి పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అంగీకరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెట్రోలియం యూనిర్సిటీలతో కలిపి ఏపీకి కూడా అడ్మిషన్లు నిర్వహించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ముందుగా ఆంధ్రా యూనివర్సిటీలో క్లాసులు నిర్వహిస్తారు. పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణం ఏర్పాటుకు సబ్బవరంలో భూమి కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకేసారి అధ్యాపకులను నియమించే విధంగా తీసురాదలసిన మోడల్‌ యూనివర్సిటీల బిల్లుపై యూనిర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌తో గంటా చర్చించారు. దీనికి యూజీసీ ఆమోదించింది. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి.. ఉపాధ్యాయుల ఎకీకృత సర్వీసులపై చర్చించనున్నారు. 

06:35 - March 10, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రతో గోదావరి జల ఒప్పందం... 16 లక్షల ఎకరాలకు సాగునీరంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. టిఆర్‌ఎస్ సేనలు అపర భగీరథుడంటూ కెసిఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి. ఇదేసమయంలో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇంతకు సర్కారు మాటల్లో నిజమెంత? 2012లో మహారాష్ట్ర ఒప్పందానికి... ప్రస్తుత ఒప్పందానికి మధ్య తేడాలేంటి? ఈ ఒప్పందం వెనక ఏదైనా మతలబు ఉందా. మహారాష్ట్రతో టీఎస్‌ సర్కారు ఒప్పందం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.. డిజైన్‌ మార్పుతో నష్టాలే తప్ప లాభాలు లేవని నిపుణులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? బచావత్‌ తీర్పు ప్రకారం రావాల్సిన నీటిని వినియోగించుకోవడానికి... ప్రాజెక్టు వ్యయం తగ్గించుకునే మార్గాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు.

6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది..
2012 ఒప్పందం ప్రకారం ప్రాణహితకు తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం జరగాలి.. ప్రస్తుతం దానిని 4మీటర్లకు తగ్గించారు.. ఇలా ఎత్తు తగ్గడంతో దాదాపు 6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.. అయినా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తమ్మినేని ప్రశ్నించారు..

డిజైన్‌ మార్పుతో 8వేల కోట్లు ఎక్కువ ఖర్చు..
ఇక పాత డిజైన్‌ ప్రకారం ప్రాణహిత దగ్గర 225 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని గతంలో వ్యాప్కోస్‌ చెప్పింది.. డిజైన్‌ మార్పుతో 5 టీఎంసీల నీటి నిల్వ తగ్గుతుందని స్పష్టం చేసింది. అలాగే డిజైన్‌ మార్పుతో 8వేల కోట్లు ఎక్కువ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయినా ఎందుకు ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని తమ్మినేని సర్కారును ప్రశ్నించారు.

పూడిక సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
ఇక నదికి అడ్డంగా నిర్మాణం చేసిన గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు పూడిక వస్తుందని కొన్నేళ్లుగా నిపుణులు చెబుతూనే ఉన్నారు.. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని తమ్మినేని సర్కారును నిలదీశారు. టీ సర్కారు వాదన ప్రకారం 5 ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం వల్ల 16.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఇందులో నిజమెంత? అని సీపీఎం ప్రశ్నిస్తోంది.. ఈ ప్రాజెక్టుపై సందేహాలను తీర్చి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
అటు విద్యుత్ చార్జీల పెంపు అంశంపై కూడా సీపీఎం మండిపడింది.. నిర్వహణలో అవకతవకలు చేసి ప్రజలపై భారం ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజలపై ఈ భారం మోపొద్దని కోరారు. 

06:32 - March 10, 2016

తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత నెలలో చేపట్టి దీక్ష సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీలను గురువారం సాయంత్రంలోగా నెరవేర్చకపోతే శుక్రవారం నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కాపులను వంచిస్తోందని ముద్రగడ మండిపడుతున్నారు. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆయన గత నెల 5 నుంచి 8 వరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో దీక్ష చేశారు. అప్పట్లో దీక్ష విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపిస్తున్నారు. కర్నాటక హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాపు కమిషన్‌ నివేదికను 9 నెలల్లో కాకుండా 7 మాసాల్లో వచ్చే విధంగా చూస్తామిన ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ దిశగా సర్కార్‌ చర్యలు తీసుకోవడంలేదనడానికి కాపు కమిషన్‌ ఇంతవరకు పని ప్రారంభించకపోవడమే నిదర్శనమని వాదాన్ని కాపు నేతలు వినిపిస్తున్నారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ సంస్థ ద్వారా తమ సామాజిక వర్గ యువతకు రుణాలు ఇచ్చే విషయంలో వివక్ష చూపుతున్నారన్న వాదాన్ని ఆయన వినిపిస్తున్నారు. వీటన్నింటపై ప్రభుత్వానికి లేఖ రాశారు. గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే శుక్రవారం 10 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం అరెస్టు చేసినా దీక్ష ఆపబోమనని ముద్రగడ చెబుతున్నారు. ఉద్యమాన్ని ఆపితే ఎమ్మెల్సీ తోపాటు మంత్రి పదవి ఇస్తామని తాను లేని సమయంలో తన కుమారుడితో టీడీపీ నేతల చర్చలు జరపడాన్ని ముద్రగడ పద్మనాభం తప్పుపడుతున్నారు. పదవులకు ఆశపడి ఉద్యమాన్ని తాకట్టు పెట్టేతత్వం తనకు లేదంటున్నారు.

ముద్రగడ రాసిన లేఖపై కాపు నేతల చర్చ..
మరోవైపు ముద్రగడ దీక్షపై టీడీపీలోని కాపు నేతలు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావుతోపాటు, మున్సిపల్‌ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ముద్రగడ రాసిన లేఖపై చర్చించారు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేయడంతోపాటు, అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా మళ్లీ దీక్ష ప్రకటించడాన్ని టీడీపీ కాపు నేతలు తప్పుపట్టారు. ముద్రగడను వైసీపీ అధినేత జగన్‌ రెచ్చగొడుతున్నారన్న అంశంపై చర్చించారు. దీక్షపై పునరాలోచన చేయాలని సూచించారు. ముద్రగడ లేఖపై సర్కార్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 

06:30 - March 10, 2016

హైదరాబాద్ : కేంద్రంపై ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసనమండలిలో ఫైరయ్యారు. పోలవరానికి కేంద్రం కేటాయించిన నిధులను ఎంతమేర ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలకన్నా అధికంగా ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం ఏకంగా లక్షా 40వేల కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ఆయన ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

06:28 - March 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ రూపకల్పనకు తుది కసరత్తు జరుగుతోంది. బడ్జెట్‌కు ఆర్థిక శాఖ మెరుగులు దిద్దుతోంది. ఈసారి బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి సీఎం హామీలకు ప్రత్యేకంగా ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. సుమారు లక్షా 30 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అందులో ప్రణాళికా వ్యయం 60 వేల కోట్ల కు పైగా ఉండే అవకాశం ఉంది. ప్రణాళికేతర వ్యయం కూడా అదే స్థాయిలో ఉండనుంది. బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత దక్కనుంది. మిషన్ కాకతీయ సహా వివిధ ప్రాజెక్టుల కోసం ఇరిగేషన్ శాఖ కు 25 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం హామీలకు రూ. 5 వేల కోట్లు..
అదే సమయంలో సీఎం హామీలకు ప్రత్యేకంగా రూ. 5 వేల కోట్లను కేటాయించనున్నారు. గతంలో సీఎం హమీల అమలు కోసం ఆయా శాఖల నుంచి నిధులు ఖర్చు చేసేవారు. ఐతే ఈ 5 వేల కోట్లు సీఎం పరిధిలో ఉండేలా ఈ సారి ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు 5 వేల కోట్ల రూపాయలను కేటాయించేలా ఆర్ధిక శాఖ కసరత్తులు జరుపుతోంది. విద్య, విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ శాఖలకు కూడా తగిన కేటాయింపులు ఉండనున్నాయి. పాఠశాల విద్యకు 12 వేల కోట్లు, విద్యుత్ శాఖ కోసం 8 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు.

ఇరిగేషన్‌, సంక్షేమ రంగాలకే ప్రాధాన్యత...
ఇక పౌర సరఫరాల శాఖకు 2500 కోట్లు, ఆసరా పెన్షన్లకు 4 వేల కోట్లు, రైతు రుణ మాఫీ కోసం 4 వేల కోట్లు, మిషన్‌ భగీరథకు 3 వేల కోట్ల రూపాయలను కేటాయించే యోచనలో సర్కార్ ఉంది. డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి వేయి కోట్ల రూపాయలు కేటాయించే అవకాశముంది. కేంద్రం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి కనీసం 28 వేల కోట్లు గ్రాంట్లు, పన్నుల్లో వాటా రూపంలో రానున్నాయి. వాటిని గ్రామీణాభివృద్ధి పథకాలకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక మిగిలిన అన్ని రంగాలకు ఇంచు మించుగా గత ఏడాది కేటాయింపులనే కొనసాగించనున్నారు. తుది బడ్జెట్‌ నాటికి చిన్న చిన్న మార్పులు జరిగినా..సింహ భాగం నిధులు ఇరిగేషన్, సంక్షేమ రంగాలకే దక్కనున్నాయి. 

06:26 - March 10, 2016

హైదరాబాద్ : ఏపీ సర్కార్‌ 2016-17 బడ్జెట్‌ను ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనుంది. లక్షా 32వేల కోట్ల రూపాయల జంబో బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేసింది. బడ్జెట్‌లో 65శాతం ప్రణాళికేతర వ్యయం, 35శాతం ప్రణాళిక వ్యయం కింద కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 2015-16లో ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కన్నా ఈసారి కొంత పెరిగింది. కాగా బడ్జెట్ తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫైనాన్స్ మినిస్టర్‌ యనమల రామకృష్ణుడు మధ్యాహ్నం 12 గంటలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మంత్రి నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీ ఆవరణలో సమావేశం కానున్న రాష్ట్రమంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. 2015-16ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయం కింద 78వేల కోట్ల రూపాయలు కేటాయించిన సర్కారు...ఆర్థిక సంవత్సరం చివరినాటికి 75వేల కోట్ల రూపాయలకు ఖర్చును తగ్గించింది. ప్రణాళికా వ్యయం కింద కేటాయించిన 34వేల కోట్ల రూపాయలకు మించి అదనంగా మరో 10వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇందుకు అనుగుణంగా తాజా బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయాన్ని కొంత తగ్గించి ప్రణాళిక వ్యయం కేటాయింపులు పెంచనున్నారు.

జలవనరుల శాఖకు రూ.7,625 కోట్లు..
ప్రస్తుత బడ్జెట్‌లో జల వనరుల శాఖకు 7,625కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో పోలవరం నిర్మాణానికి 3,300కోట్ల వరకు కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. జలవనరుల శాఖకు గతంతో పోల్చితే ఈసారి దాదాపు 62శాతం పైగా ఎక్కువ నిధులు కేటాయించనున్నారు. సామాజిక సంక్షేమ రంగాలన్నింటికీ 15వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి గృహనిర్మాణ రంగానికి చెప్పుకోదగ్గ నిధులు ఉంటాయని సమాచారం. కొత్త బడ్జెట్‌లో యువత, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతు, మహిళా సాధికార సంస్థల్లాగే యువత సాధికారతకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిద్వారానే నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అలాగే మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రత్యేక విధాన ప్రకటన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. క్రీడల అభివృద్ధి, స్టేడియంల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనను వేగవంతం చేయాలని చూస్తోంది. ఇప్పటివరకూ పేదలు, ధనికులు ప్రభుత్వం నుంచి ఏదో విధంగా లబ్ధిపొందుతున్నారు. కానీ మధ్య తరగతి వారికి మాత్రం ఇలాంటి చేయూత లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యం..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు అందుకనుగుణంగా పారిశ్రామిక, సేవా రంగాలకు కేటాయింపులు పెంచనుంది. గ్రామీణ ఉపాధి హామీ నిధులకు, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నిధులు జత చేసి ఓ విధాన ప్రకటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ను ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో ప్రవేశపెట్టనుంది. పుస్తకాల స్థానంలో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు బడ్జెట్‌ వివరాలను నింపిన ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.

06:23 - March 10, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వాడి వేడి చర్చలకు రంగం సిద్ధమైంది.. నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు సర్కారు రెడీ అయింది.. ప్రభుత్వ పథకాలను మరింత ప్రచారం చేయాలని సర్కారు.. ప్రజా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు.. అసెంబ్లీ వేదికగా సై అంటే సై అనబోతున్నాయి. ఉదయం గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.. ఆ తర్వాత బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ... బీఏసీ భేటీ కానుంది. ఇందులో సమావేశాల నిర్వహణ.. చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 45 రోజులపాటు సమావేశాలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

డబుల్‌ బెడ్‌ రూం పథకంపై చర్చ..
అటు ఈ సమావేశాల్ని సమర్ధంగా ఉపయోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది.. మహారాష్ట్రతో కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఒప్పందం... దానివెనక తమ కృషిని వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వంద రోజుల మాస్టర్‌ ప్లాన్‌.. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం లాంటి స్కీముల గురించి ఈ సమావేశాల్లో సవివరంగా చర్చించాలని సీఎం యోచిస్తున్నారు. ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న సీఎం కేసీఆర్‌ సభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలివ్వాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశాలిచ్చారు.

స్పీకర్‌కు లేఖలు రాసిన 12మంది నేతలు..
టీఆర్‌ఎస్‌ జోరు ఇలా ఉంటే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు. తాజాగా అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ కూడా పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. తమను అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాశారు. ఇలా ఇప్పటి వరకూ 12మంది సభ్యులు స్పీకర్‌కు లేఖలిచ్చారు. దీంతో అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీ నుంచి రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌ కృష్ణయ్య మాత్రమే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వీలుంది.

రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, ఉద్యోగుల విభజన..
బడ్జెట్‌ సమావేశాల్లో సర్కారును నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కసరత్తును పూర్తి చేశాయి. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, ఉద్యోగుల విభజన, విద్యుత్‌ చార్జీల పెంపు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే టీడీపీ తాము అసెంబ్లీలో లేనెత్తబోయే సమస్యల్ని ప్రకటించింది.. వామపక్షాలు కూడా ప్రజా సమస్యలతో ప్రభుత్వాన్ని కడిగేసేందుకు సిద్ధమయ్యాయి.. అధికార పార్టీ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేలా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా సమావేశాలకు సై అంటోంది. మొత్తానికి సభ్యులకు సరైన రీతిలో సమాధానమిస్తూ ముందుకు సాగాలని సర్కారు.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేయాలని ప్రతిపక్షాలు.. వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ప్రస్తుత తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశముంది.

నేడు, రేపు గ్రామీణ బ్యాంకుల బంద్..

హైదరాబాద్ : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగుల సమ్మెకు ది బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) మద్దతు పలికింది. గురు, శుక్రవారాల్లో సమ్మె చేస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ సిబ్బంది ప్రకటించింది. 

నేటితో ముగియనున్న ఎస్ఐ ఉద్యోగ దరఖాస్తుల గడువు..

హైదరాబాద్ : పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది. గత నెల 10 నుంచి సివిల్, ఏఆర్, బెటాలియన్స్, ఎస్‌సీఎఫ్, ఫైర్ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఎస్‌ఐ పోస్టులకు రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. 

నేటి నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

నల్గొండ : యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి కొండపై 11రోజుల జాతరకు నేడు అంకురార్పణ జరుగనున్నది. ఈ నెల 20 వరకు కొనసాగే ఉత్సవాల్లో 17న కల్యాణమహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీలక్ష్మీనారసింహుడికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా శ్రీవారి కల్యాణంలో పాల్గొంటారు.

 

నేడు ఏపీ బడ్జెట్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను గురువారం శాసనసభ ముందు పెట్టనుంది. మధ్యాహ్నం 12గంటలకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు దీన్ని సభలో ప్రవేశ పెడుతారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందుంచనున్నారు. ఉదయం 10.30గంటలకు శాసనసభ ఆవరణలో మంత్రివర్గ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. 

నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ సీ -32...

నెల్లూరు : జిల్లా శ్రీహరికోట రేంజ్ నుండి నింగిలోకి పంపనున్న పీఎస్ ఎల్వీ సీ 32 కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. 

నేటి నుండి టి.అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. సభ్యులకు అల్పాహర విందు అనంతరం ఉదయం 11గంటలకు ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సభలు ప్రారంభమౌతాయి. ఈనెల 14న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

మందకృష్ణ మాదిగ అరెస్టు..

నల్గొండ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడలోని ఎన్ ఎస్పీ క్యాంప్ గెస్ట్ హౌస్ లో ఉన్న ఆయన్ని అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఎమ్మార్పీఎస్ విశ్వరూప యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. 

Don't Miss