Activities calendar

11 March 2016

సంక్షోభంలో పామాయిల్ రైతులు - సీపీఎం..

విజయవాడ : రాష్ట్రంలో పామాయిల్ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రూ.8,400 ఉన్న ధర రూ. 5,600లకు పడిపోయిందని, పామాయిల్ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రభుత్వం స్పందించనిపక్షంలో 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మధు హెచ్చరించారు. 

పోలీసు ఉద్యోగ పరీక్షకు 1,131 పరీక్ష కేంద్రాలు - డీజీపీ..

హైదరాబాద్ : వచ్చే నెల ౩ న జరగబోయే 9,281 కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం మొత్తం 1,131 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 

శనివారం నుండి జాతీయ సమైక్యత క్యాంపు..

హైదరాబాద్ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ సమైక్యతా క్యాంపుకు నగరం వేదిక కాబోతోంది. ఈనెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు క్యాంపును నగరంలో నిర్వహించనున్నారు. 13 రాష్ట్రాలకు చెందిన 250 మంది యువజనులు క్యాంపులో పాల్గొననున్నారు. సికింద్రాబాద్ బోట్స్ క్లబ్‌లోని యూత్ హాస్టళ్లో ఈ క్యాంపును నిర్వహించనున్నట్లు జిల్లా నెహ్రు యువకేంద్ర కోఆర్డినేటర్ ఆర్.వెంకటేశం తెలిపారు. 

21:20 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్‌ మధుసూదనా చారిపై టీ.టీడీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌లో చేరిన తమ నేతల్ని అనుబంధ సభ్యులుగా ఎలా గుర్తిస్తారంటూ మండిపడుతోంది.. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్ అవుతోంది.. పార్టీ అధ్యక్షుని లేఖ లేకుండా విలీనం కుదరదని స్పష్టం చేస్తోంది. తమ ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదుపై 18 నెలలు నాన్చుతారు.. విలీనంపైమాత్రం 18 రోజుల్లో ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గులాబీ పార్టీలో చేరకముందే ఎలా అనుబంధ సభ్యులుగా గుర్తిస్తారని మండిపడుతున్నారు. ఈ విషయంలో స్పీకర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీటీడీపీ నేతలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

నిబంధనలు..
ఓ పార్టీ గుర్తుపై గెలిచిన కొందరు సభ్యులు వేరే పార్టీలో చేరాలంటే కొన్ని నిబంధలున్నాయని తెలంగాణ టిడిపి చెబుతోంది. ముందు పాత పార్టీ అభిప్రాయం తీసుకున్నతర్వాతే స్పీకర్‌ ముందుకు వెళ్లాలంటూ రూల్స్ చెబుతున్నాయని స్పష్టం చేస్తోంది.. ఇలా నిబంధనలున్నా స్పీకర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము 18 నెలల క్రితం ఫిర్యాదు చేశామని తెలుగు దేశం నేతలు గుర్తుచేస్తున్నారు.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అనుబంధ సభ్యుల లేఖపై స్పీకర్‌ అంత త్వరగా ఎలా నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు.

పదో షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపుల అంశం..
రాజ్యంగంలో కూడా పార్టీ ఫిరాయింపులపై స్పష్టంగా వివరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. పదో షెడ్యూల్‌ ప్రకారం పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆ సభ్యులు సభ్యత్వం కోల్పోతారు.. అలాంటిది 18 నెలల క్రితం రాజీనామా చేసిన తమ ఎమ్మెల్యేలు ఇప్పుడు అనుబంధ సభ్యులుగా ఎలా కొనసాగుతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభ్యులే కాదని.. సభలో కూర్చునే అర్హతేలేదని తేల్చి స్పష్టం చేస్తున్నారు. ఇక టీడీపీలోని ఐదుగురు సభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ ఎర్రబెల్లి గతంలో ఫిర్యాదు చేశారని నేతలు గుర్తుచేస్తున్నారు.. ఇప్పుడు అదే నేత విలీనంకోసం లేఖ ఇవ్వడం చెల్లదని స్పష్టం చేస్తున్నారు.. ఈ విషయంపై కోర్టులో తేల్చుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. 

21:18 - March 11, 2016

ఢిల్లీ : లండన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా లండన్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు..ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్, మౌళిక సదుపాయాల కల్పన కోసం లండన్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై వారితో చంద్రబాబు చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌళిక సదుపాయాల కల్పనపై విస్త్రతంగా చర్చించారు. అయితే అమరావతి నిధుల సమీకరణలో సహాయం అందించేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ అధికారులు అంగీకరించారు. ఈ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు లండన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. 

21:04 - March 11, 2016

తెలుగు బుల్లి తెర గుర్తొస్తే 'సుమ' గుర్తుకు రాని వారుండరు..ఆమె బుల్లితెరను ఏలబట్టి ఎంతోకాలం అవుతోంది. ఆమె కళ్ల ముందు ఎంతో వచ్చారు..పోయారు..కానీ 'సుమ' మాత్రం అప్పుడు ఎలా ఉందో..ప్రస్తుతం అలాగే ఉంది..అందమైన నటనతో..చలాకీతనంతో అందర్నీ టీవీలకు హత్తుకపోయే విధంగా చేస్తుంది. కేరళ అమ్మాయి అయినా 'సుమ' తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ప్రస్తుతం 'సుమ'కు చెందిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సుమ..గొంతు సమస్యతో బాధ పడుతోంద..త్వరలోనే యాంకరింగ్ కు గుడ్ బై చెబుతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలకు 'సుమ' చెక్ పెట్టింది. 'బాగానే ఉన్నాను..ఆరోగ్యం కూడా బాగానే ఉంది..తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధాలు..ఈ వార్తలను నమ్మవద్దు' అంటూ ఫేస్ బుక్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. 

20:56 - March 11, 2016

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాలర్ బ్రావో పట్టుకున్నాడా ? ఎందుకు ? ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల్లో టీ - 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసందే. అంతకంటే ముందు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ తో భారత్ జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును టీమిండియా ఖంగుతినిపించింది. మ్యాచ్ అనంతరం అందరూ అభినందిస్తుండగా బ్రావో ఏకంగా ధోని కాలర్ ను పట్టుకున్నాడు. క్షణంకాలం పాటు ధోని సీరియస్ అయ్యాడు. ఇంతలోనే చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నాడంట. ధోనీ, బ్రావో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ఆడిన సంగతి తెలిసిందే. కానీ కాలర్ పట్టుకోవడంపై మాత్రం ధోని అభిమానులు ఆగ్రహంగా ఉన్నారంట. 

ఆర్టిస్టు హేమ హత్య కేసులో ఛార్జీషీట్..

ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ్ హత్య కేసులో ముంబై పోలీసులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. హేమ ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీశ్ భంభానీ గత డిసెంబర్ 12న హత్యకు గురయ్యారు. వీరిద్దరి మృతదేహాలను ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి కందివళి ప్రాంతంలో మురికి కాలువలో పడేశారు. కిరాయి హంతకులతో ఈ హత్యలు చేయించినట్టు చింతన్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

20:46 - March 11, 2016

కమల్ హాసన్ హీరోగా రవి కె చంద్రన్ డైరెక్షన్ లో మూసిక్ మ్యాస్టో ఇలయరాజా మూజిక్ అందించిన మూవీ మరుధనాయగం. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేసింది. పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. పాటలో కమల్ హాసన్ యుద్ధ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. కేవలం మొలకు అడ్డంగా చిన్న గుడ్డను కట్టుకుని దున్నపోతుపై కమల్ హాసన్  చేసే స్వారి ఈ పాటకే హైలైట్ నిలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఈ పాట హైప్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే 8 లక్షల మంది వ్యూవర్స్ చూశారు. వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

నానాకు 'గోదావరి గౌరవ్' అవార్డు..

ముంబై : బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ కు గోదావరి గౌరవ్ అవార్డు లభించింది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును పాటేకర్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను జాతీయస్థాయిలో ఈ అవార్డును అందిస్తారు. 

ప్రపంచానికి భారత్ ఎంతో ఇచ్చింది - మోడీ..

ఢిల్లీ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సంస్థ ద్వారా రవి శంకర్ 35 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో ఇచ్చిందని పేర్కొన్నారు. 

20:41 - March 11, 2016

అది ఒక సాంస్కృతిక కార్యక్రమం. అలాంటిదిలాంటిది కాదు.. లక్షలాది మంది ఆహూతులు.. వేలాది సంగీత నిపుణులు.. ఆద్యంతం ఆహ్లాదకరం.. సమ్మోహనకరం..అత్యత్భుతం.. అమోఘం.. ఆంగ్లములో చెప్పాలంటే ఫెంటాస్టిక్, మార్వలెస్, వాటె గ్రాండ్ ఈవెంట్.. ఈ సంగీత హోరులో వినపడటం లేదు కానీ, పక్కనే కొందరు తమ పంటపొలాలను చిదిమేశారని ఏడుస్తున్నారు. ఆ మిరుమిట్లుగొలిపే లైట్లమధ్య కనబడటం లేదు కానీ, ఎండిన కన్నీటి చారికలు, అప్పుల కుప్పలైన నిలువెత్తు బతుకులు యమున ఒడ్డున చీకట్లో నిలుచున్నాయి. దీనిపై ప్రత్యేక కథనం..

వేడుక వెనుక విషాదం..
కళలు పలువిధములు..అవి అరవై నాలుగని మనవాళ్లు ఎప్పుడో చెప్పారు. బతుకునే కళాత్మకంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే మహానుభావులూ మన మధ్యే ఉన్నారు. కానీ, ఆ కళని సాధన చేసే క్రమంలో కొందరి బతుకులు ఎందుకు కళావిహీనంగా మారుతున్నాయి? లక్ష్యాలు ఘనం.. మాటలు ఉన్నతం.. కానీ, చేతల్లో తేడా వచ్చినపుడే ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. అలాంటి పరిస్థితులకు కారణమైన సందర్భమేంటి? ఏ సంస్థ ఈ వివాదాన్ని రగిల్చింది? వేదిక కళకళలాడుతోంది. సంగీతం మృదు మధురంగా చెవులకు ఇంపుగా వినిపిస్తోంది. వేలాదిమంది ఏక స్వరంతో వినిపించే సంగీతం నభూతో నభవిష్యత్ అనిపించుకుంటోంది. కానీ, ఈ వేడుక వెనుక వినిపించని విషాదం, కనిపించని నిర్లక్ష్యం దాగున్నాయంటే నమ్ముతారా?

కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థే కాదు.. ఏ సంస్థ అయినా ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండనవసం లేదు. కానీ, అది మరికొందరి బతుకులపై ప్రభావం చూపుతుంటే, ఓ నదీ పరివాహక ప్రాంతంలో పర్యావరణానికి హాని చేస్తుంటే ప్రశ్నించవలసిందే కదా.. అదే పని కొందరు పర్యావరణ కార్యకర్తలు చేశారు. కానీ, జరిగిందేమిటి? యోగా, ధ్యానం, సంప్రదాయ నృత్యాలు వంటివి అనేకం చోటు చేసుకునే ఈ వేడుక కోసం తీర్చిదిద్దిన ప్రధాన వేదికను చూస్తే ఇది ఎంత పెద్ద కార్యక్రమమో ఇట్టే అర్థమయిపోతుంది. ఈ భారీ వేడుకలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా చూడడానికి పోలీసులు భారీ ఎత్తు మొహరించారు. ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉండడంతో హెటెన్షన్ నెలకొంది. మరో పక్క యమునా నది పరిరక్షణను ఏ చర్యలు తీసుకున్నారంటూ సుప్రీం కేంద్రాన్ని నిలదీసింది.

రైతుల నోట్లో మట్టి కొట్టడం కరెక్టా..?
ఈ మాట కొంచె బరువుగా.. మరికొంచెం కళాత్మకంగా కనిపిస్తున్న పదం.. నిజమే.. పుట్టామా పెరిగామా.. నానా కష్టాలు పడుతూ బతుకుతున్నామా అనే కేటగిరీలో బడుగు జీవులు కోట్లాది మంది ఉన్నచోట ఎలా బతకాలో నేర్పాల్సిందే.. కష్టాలకు కుంగిపోకుండా నిలిచే ధైర్యాన్ని నేర్పాల్సిందే. కానీ, బుల్డోజర్లతో పొలాలు నాశనం చేయటం ఎలాంటి ఆర్ట్ అవుతుంది. కూరగాయలు, పంటపొలాలు చదును చేసి రైతుల నోట్లో మట్టికొట్టడం ఎవరి లివింగ్ కోసం ఉపయోగపడుతుంది? ఇవన్నీ సామాన్యుల నుండి వినిపిస్తున్న అతి సామాన్య ప్రశ్నలు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:24 - March 11, 2016

జయలలితపై సుబ్రమణ్య స్వామి కేసు..విజయ్ మాల్యా మోసం చేసిడంటున్న బ్యాంకులు..తెలుగు రాష్ట్రాల్లో లంచగొండులు.. ప్రకాశం జిల్లా కనిగిరి కాడ ఎట్లున్నదో బుడ్డ పోరగాండ్ల అవస్థ..నకిలీ ఓట్లతో జాగ్రత్త...రోడ్ల మీదకు వచ్చిన పులి..తదితర అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' లో మల్లన్న తనదైన శైలిలో ముచ్చట్లు చెప్పిండు. మరి ఆ ముచ్చట్లు చూడాలంటే వీడియోని క్లిక్ చేయుండి. 

20:07 - March 11, 2016

కోట్ల రూపాయలను గోల్ మాల్ చేయడంలో సిద్ధహస్తులు. ప్రజల సొమ్ముతో పైలా పచ్చీస్ చేయడం వాళ్లకు అలవాటైన వ్యవహారం. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరడంలో ముందుంటారు. రాజకీయ అండదండలతో చట్టసభల్లో చాలా ఈజీగా స్థానం సంపాదిస్తారు. ఆ తరువాత చల్లగా జారుకుంటారు. ఇవన్నీ మన దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేస్తున్న డిఫాల్టర్స్ కు సరిగ్గా సరిపోతాయి. ఆర్థిక మోసగాళ్ల అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), పి. వెంకటరామయ్య (బీఈఎఫ్ఐ), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శశి కుమార్ (ఆర్థిక నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

19:59 - March 11, 2016

హైదరాబాద్ : కోట్ల రూపాయలను గోల్ మాల్ చేయడంలో సిద్ధహస్తులు. ప్రజల సొమ్ముతో పైలా పచ్చీస్ చేయడం వాళ్లకు అలవాటైన వ్యవహారం. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరడంలో ముందుంటారు. రాజకీయ అండదండలతో చట్టసభల్లో చాలా ఈజీగా స్థానం సంపాదిస్తారు. ఆ తరువాత చల్లగా జారుకుంటారు. ఇవన్నీ మన దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేస్తున్న డిఫాల్టర్స్ కు సరిగ్గా సరిపోతాయి.                                                                
 
వసూలు చేసుకోవడానికి అష్టకష్టాలు..
కోట్ల రూపాయల రుణం తీసుకుని..ఆ తరువాత కుచ్చుటోపీ పెట్టే బడా బాబుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. పెద్ద పెద్ద వాళ్లకు ఇష్టానుసారంగా అప్పులిచ్చేస్తున్న బ్యాంకులు తిరిగి వసూలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. వాటి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన్న తయారవుతోంది. విజయ్‌ మాల్యా ఉందంతమే దీనికి ఉదాహరణ. వేలాది కోట్లు రుణం తీసుకున్న కింగ్‌ఫిషర్‌ పిట్ట లండన్‌కు తుర్రుమని ఎగిరిపోయింది.

రాజ్యాంగ సంస్థల్లోనూ రాజకీయ జోక్యం..
అసలు రుణ ఎగవేతదారుల్లో మంత్రులు, ఎంపీలు కూడా ఉంటున్నారు.పార్లమెంట్ లో కూర్చోని చట్టాలు చేసేవారు, క్యాబినెట్ మీటింగ్ లలో ప్రభుత్వ విధానాలు ఖరారు చేసేవారు బ్యాంకు లోన్లు ఎగ్గొడుతున్నారు.. విజయ్ మాల్యా కూడా రాజ్యసభ సభ్యుడే. ఇటువంటి వారు కొన్ని పార్టీల అండదండలతో, కోట్లతో చేతులు తడిపి రాజ్యసభ, లోక్ సభ టిక్కెట్లు సంపాందించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీటిని ఏ పార్టీ ఖచ్చితంగా ఖండించదు. ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడో.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తుతో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ల మాటలు ఈజీగా చెల్లుబాటు అవుతాయి.. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో రాజకీయ జోక్యమూ పెరిగిపోతోంది.దీంతో ఇలాంటి బడా చోర్ లు ఈజీగా తప్పించుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగవేతదారులు..
విజయ్ మాల్యా సంగతే చూశాం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఎగవేతదారులు ఉన్నారు.. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ 350 కోట్లు బకాయిలు పడింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హోస్కోటే హైవే సంస్థ 533 కోట్లు, ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంస్థల బకాయిలు 592 కోట్లు. ఇలా మరో 30 సంస్థల బకాయిలే దాదాపు దేశ వ్యాప్తంగా 95 వేల 122 కోట్లు. వీటితో మిగతా ఎగవేత దారుల మొండి బకాయిలు మొత్తం గత మార్చి నాటికే 2 లక్షల 67 వేల కోట్ల రూపాయిలు. ఇవి గత సమావేశాల్లో రాజ్యసభలో కేంద్రం చెప్పిన వివరాలు. ఈ బకాయిల్లో కేవలం 5 సంస్థల వాటానే 53 శాతం గా ఉందంటే.. వీళ్ల ఇష్టారాజ్యం ఎలా రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు.

మొండిబకాయిలపై రిజర్వ్ బ్యాంక్‌ ఆందోళన..
ఇటీవల కావూరి సాంబశివరావు మొండిబకాయిల విషయంలో నోరు మెదపకపోవడంతో కొన్ని బ్యాంకుల సిబ్బంది ఆయన సంస్థల కార్యాలయం ఎదుట మౌన ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఇలాంటి పేరుకుపోయిన జాబితాలో విజయ్ మాల్యాది మొదటి స్థానం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చాలా సందర్బాల్లో ఆందోళన వ్యక్తం చేసినా.. ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించే విషయంలో కేంద్రం, బ్యాంకుల తీరులో మార్పు రావడం లేదు. ఇంత పెద్ద ఎగవేత దారైన విజయ్ మాల్యాపై ఏ ఒక్కరూ కనీసం ఫిర్యాదు చేయలేదని, స్వయంగా సీబీఐ డైరెక్టర్‌ ప్రశ్నిస్తే బ్యాంకుల దగ్గర సమాధానమే లేదు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా డిపాల్టర్స్ విషయంలో సంస్థల తీరును ప్రశ్నించినా.. ఫలితం ఉండటం లేదు.

రుణాల కోసం బ్యాంకు అధికారులుపై ఒత్తిళ్లు..
బ్యాంకులకు భారీగా బకాయిల పడ్డవారి జాబితాలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన వారే ఎక్కువుగా ఉండటం మరో హైలెట్. కార్పోరేట్ సంస్థలకు, నేతలకు అడిగినంత లోన్లు ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులపై ఒత్తిడుళ్లతో పాటు , బ్యాంక్ బోర్డుల్లోకి రాజకీయనాయకుల అనుచరులను నియమించుకోవడం వంటి అంశాలు ఇలాంటి దుస్థితికి కారణమవుతున్నాయి. మొండి బకాయిల్లో మైనింగ్, స్టీల్, టెక్స్ టైల్స్, ఏవియేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఈ 5 రంగాలకు చెందిన కంపెనీలే 53 శాతం ఆక్రమించినట్లు ఓ సర్వేలో తేలింది.

సతమౌతున్న బ్యాంకులు..
ఇలా బడా బకాయిల బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక.. వస్తాయో రావో అన్న గ్యారంటీ లేక బ్యాంకులు సతమతమవుతున్నాయి. అదే రైతులు, సామాన్యులు రుణాలు ఎగ్గొడితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటాయి. కష్టాల్లో ఉన్న రైతన్నలు రుణాలు చెల్లించకపోతే ఇవే కొన్ని బ్యాంకులు వాళ్ల ఫోటోలను నోటీసు బోర్డుల్లో పెట్టిన సందర్భాలూ తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి.మొండి బకాయిల ఎఫెక్ట్ కేవలం ఆర్థిక ప్రగతిపైనే కాదు.. చిన్న చిన్న పరిశ్రమలకు లోన్లు ఇవ్వలేని దుస్థితిని కల్పిస్తోంది. నల్ల ధనం దేవుడెరుగు కనీసం మోడీ సర్కార్ బడాబాబుల మొండి బకాయిలనైనా వసూలు చేయకపోతే ఎలా.. 

కేఎఫ్ఈ సీఎఫ్ఓను ప్రశ్నించిన ఈడీ..

ముంబై : కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సీఎఫ్ఓ రఘునాథన్ ను ఈడీ ఏడు గంటల పాటు ప్రశ్నించింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా వ్యవహారంలో వివరాలు రాబట్టేందుకు ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. మాల్యా వ్యవహారం, సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్వో తల్లి మృతి..

ప్రకాశం : దోర్నాల మండలం చిన్నగుడిపాడు వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గుడివాడ ఎమ్మార్వోకు గాయాలు కాగా ఎమ్మార్వో తల్లి మృతి చెందింది. 

జవాన్ మృతి..

ఛత్తీస్ గఢ్ : మర్లగూడెం వద్ద మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చెన్నైకి చెందిన జవాన్ రంగరాఘవన్ కన్నుమూశాడు. 

సిద్ధిపేట మున్సిపాల్టీ ఎన్నికలకు తొలగిన అడ్డంకి..

హైదరాబాద్ : సిద్ధిపేట మున్సిపాల్టీ ఎన్నికలకు అడ్డంకి తొలిగింది. మున్సిపాల్టీలో ఆరు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : దిగ్విజయ్, జైరాం రమేష్ లతో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం చలో ఢిల్లీ కార్యక్రమంపై చర్చిస్తున్నారు. 

ప్రపంచమే తన కుటుంబం - శ్రీశ్రీ రవిశంకర్..

ఢిల్లీ : ప్రపంచమే తన కుటుంబమని శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యానించారు. మయూర్ విహార్ వద్ద యమునా తీరంలో ప్రపంచ సంస్కృతి ఉత్సవాన్ని శ్రీశ్రీ రవి శంకర్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రవి శంకర్ ప్రసంగించారు. మంచి కార్యక్రమానికి విఘ్నాలు కలగడం సహజమేనని, సమాజానికి మనం ఎంత ప్రేమను పంచుతామో..అది మనలో వంద రెట్లు పెరుగుతుందన్నారు. ప్రపంచ ప్రజలను ఏకం చేయడానికి ఐదు మాధ్యమాలున్నాయని తెలిపారు. అందులో కళలు, క్రీడలున్నాయని రవి శంకర్ తెలిపారు. 

పాతబస్తీలో నకిలీ నెయ్యి కేంద్రంపై దాడి..

హైదరాబాద్ : పాతబస్తీ చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 420 కిలోల నెయ్యిను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. 

18:43 - March 11, 2016

హైదరాబాద్ : నిర్జన ప్రాంతంలో ఉన్న ఏటీఎంలు.. నిఘాలేని సెంటర్లు.. సెక్యూరిటీ కానరాని బ్యాంకులు.. ఇవే లక్ష్యంగా కొనసాగుతున్న దాడుల వెనుకున్న గ్యాంగులు ఎక్కడవి.? తెలంగాణ ప్రాంతంలో ఉన్న బ్యాంకులు ఏటీఎంలపై పంజా విసురుతూ పోలీసులకే సవాలుగా మారిన ముఠాలు ఎక్కడ నుంచి వచ్చాయి. 
రాజధాని సహా శివారు ప్రాంతాల్లోని ఏటీఎంలపై పంజా విసిరే  అంతర్రాష్ట్ర ముఠాలు.. పోలీసుల పెట్రోలింగ్.. ప్రత్యేక బృంధాల నిఘాతో రూట్ మారుస్తున్నాయి. జిల్లా కేంద్రాలను టార్గెట్ చేస్తున్న దొంగలు వరుస చోరీలతో బీభత్సం సృష్టిస్తున్నారు. మూడు నెలలో జరిగిన కొన్ని ప్రత్యేక చోరీ ఘటనలు జిల్లా కేంద్రాలలో నిఘా డొల్ల తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. దొంగలు చెలరేగిపోయారు. దేవర కొండు రోడ్డురలోని ఎస్.బి.ఐ ఏటీఎంపై పంజా విసిరారు. ట్రాలీ వాహనాన్ని కొట్టేసి ఎస్బీఐ ఏటీఎంకు ఇనుప చువ్వతో కట్టీ లాగారు. యంత్రం బద్దలైనా క్యాష్ బాక్స్ తెరుచుకోక పోవడంతో వెనుదిరిగారు. నిజామాబాద్ లోనూ మూడు ఏటీఎంలపై విరుచుకుపడ్డారు. వీరు మహారాష్ట్ర దొంగలేననే అనుమానాల్ని పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. మెదక్ లోనూ దోపిడీ దొంగలు పంజా విసిరారు. వీరు ఎక్కడి వారు? పోలీసు నిఘా వీరిని ఎందుకు పట్టుకోలేకపోతోంది. వీటి పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో క్లిక్ చేయండి. 

పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు ప్రయత్నం..

గుంటూరు : రేపల్లెలో పదో తరగతి విద్యార్థినిని ఓ యువతి కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. ఒంగోలు ఎస్ఐ జగన్ మోహన్ రావు చెప్పినందుకే కిడ్నాప్ కు ప్రయత్రించినట్లు యువతి వెల్లడించింది. దీనితో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కాక్రాపర్ అణు విద్యుత్ కర్మాగారం మూసివేత..

గుజరాత్ : కాక్రాపర్ అణు విద్యుత్ కర్మగారాన్ని అధికారులు మూసివేశారు. భారీ నీటి లీకేజీ కారణంగా అణు కర్మాగారాన్ని మూసివేయించారు. దీని కారణంగా 220 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

18:31 - March 11, 2016

వేరే భాషలో ఓ సినిమా సూపర్ హిట్టై కోట్లు వసూలు చేస్తే చాలు ఇక దాన్ని రీమేక్ చేసేందుకు మన దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. అక్కడ రికార్డు విజయాలు సాధించిన తుపాకి లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ బొక్కబోర్లా పడటం చూసైనా మారరు. తమిళంలో హిట్టైన మాన్ కరాటే సినిమాను తెలుగులో తుంటరిగా రీమేక్ చేశారు...అక్కడి సక్సెస్ లో మూడో వంతు మాత్రమే దక్కించుకోలిగిందీ సినిమా.

కథ..
సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసే ఓ నలుగురు స్నేహితులు....విహారానికి వెళ్తారు. అక్కడ ఓ స్వామిజీ భవిష్యత్ గురించి చెప్తాడు. వీళ్లు నమ్మరు. టాప్ ప్లేస్ లో ఉన్న వీళ్ల కంపెనీ మూత పడుతుందని స్వామిజీ చెప్తాడు. ఆఫీస్ కెళ్తే అలాగే జరుగుతుంది. దీంతో అతని మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. ఫ్యూచర్ డేట్ తో స్వామిజీ ఇచ్చిన న్యూస్ పేపర్ లో రాజు అనే కుర్రాడు బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలిచాడని విజయాన్ని, పోటీలో వచ్చిన ఐదు కోట్ల రూపాయలను స్నేహితులకు ఇచ్చాడనే వార్త ఉంటుంది. చిత్రంగా ఆ పేపర్లో వచ్చిన స్నేహితుల వివరాలు వీళ్లవే. దీంతో...ఆ రాజును వెతికేందుకు ఊరిమీద పడతారు. ఏ పనీ పాటా లేకుండా తిరిగే కుర్రాడు రాజు ఈ నలుగురు స్నేహితులకు దొరుకుతాడు. అతన్ని పట్టుకుని నానా తంటాలు పడి బాక్సింగ్ నేర్పిస్తారు. ఈ క్రమంలో రాజు సిరి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి క్రీడాకారులంటే ఇష్టం. దీంతో ఇష్టం లేకున్నా బాక్సింగ్ కంటిన్యూ చేస్తాడు రాజు. ఈ ప్రేమ, పాటలతో క్లైమాక్స్ చేరుకుంటుంది కథ. స్వామిజీ చెప్పినట్లుగా రాజు బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడా ? ఆ నలుగురు స్నేహితులకు ఐదు కోట్ల డబ్బు దక్కిందా ? లేదా ? అన్నది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ..
ముందుగా అనుకున్నట్లు తమిళ సినిమా మాన్ కరాటే లో ఉన్న కామెడీ నేటివిటీ తెలుగులో లోపించింది. ఈ టైప్ ఆఫ్ కామెడీని మనం ఎంజాయ్ చేయలేం. కొన్ని సీన్లు నవ్వు తెప్పిస్తాయి. బాక్సింగ్ లో ఏమీ తెలీని కుర్రాడు ఛాంఫియన్ షిప్ గెలవడం ఊహాతీతంగా అనిపిస్తుంటుంది. రోహిత్ బాగా లావుగా ఉన్నాడు. సినిమాలో ఇదే మైనస్ గా కనిపిస్తుంటుంది. కామెడీ సీన్సుకు సరిపోయాడు. హీరోయిన్ లతా హెగ్డే గ్లామర్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ మాత్రమే. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడిగా కుమార్ నాగేంద్ర యావరేజ్ మార్కులు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ ను డీల్ చేయడంలో విఫలమయ్యాడు. మిస్ ప్లేస్ మెంట్ పాటలు సినిమాలోని ఇంట్రెస్ట్ ను పోగొడతాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు.

ఫ్లస్ పాయింట్స్..
ఫస్టాఫ్
కామెడీ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్..
ఊహాతీత కథనం
సెకండాఫ్
సాగదీసిన సన్నివేశాలు
మిస్ ప్లేస్ మెంట్ పాటలు
క్లైమాక్స్

18:24 - March 11, 2016

రాజమండ్రి : పేదల గృహాల కోసం సీపీఎం ఆందోళన బాట పట్టింది. రాజమండ్రిలోని వాంబే గృహాల సముదాయాలను అర్హులకు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఎం నేతలు ప్రశ్నించారు. ఈ ఇళ్లను శుక్రవారం భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు బృందం పరిశీలించింది. నెల రోజుల్లో అర్హులకు ఇళ్లు కేటాయించాలని, తామే వారితో గృహ ప్రవేశం చేయిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ హెచ్చరించారు. 

18:18 - March 11, 2016

అనంతపురం : జిల్లాలోని ఓ పాఠశాల పై కప్పు కూలడంతో ఆరు మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. ఉరవకొండలో ఎవీఆర్ పేరిట ఓ స్కూల్ ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా పై కప్పు కూలిపోయింది. కింద ఉన్న విద్యార్థులపై పడడంతో వారు గాయపడ్డారు. వీరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో శ్రావణి, హిమవర్షిణి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని బెంగళూరు లేదా అనంతపురం ఆసుపత్రికి తరలించాలని వైద్యులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
భవనం నిర్మించి నాలుగు సంవత్సరాలైందని, కొత్త భవనమని భావించామని ఇలా జరుగుతుందని అనుకోలేదని స్కూల్ యాజమాన్యం పేర్కొంటోంది. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాణ్యత పాటించని పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం..వెంటిలేషన్ లేని స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

18:12 - March 11, 2016

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, పురస్కారం అందచేసారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం 13 రంగాల్లో మహిళలకు అవార్డులు ప్రకటించింది.  భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం వీర తెలంగాణా విప్లవ పోరాటంలో పురుషులతో సమానంగా అదరక బెదరక పాల్గొని, అనేక చిత్రహింసలకు, లైంగిక దాడులకు గురైన వీరవనితలెందరో ఉన్నారు. తమ కళ్లముందే తమ ప్రాణంలో ప్రాణమైన కన్నబిడ్డలను, అన్నదమ్ములను, అప్తులను పోగొట్టుకున్న ధీరమాతలున్నారు. అందులో ఒకరు చెన్నమనేని కమలమ్మ. సాదాసీదా చదువు, అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి, ఒక్కగానొక్క బిడ్డ మృతి, అన్నీ తానైన జీవిత సహచరుడి అర్థాంతర మరణం ఒకదాని వెంట ఒకటి వెన్నంటి వేటాడే ఈ కష్టాలను తట్టుకోవడం ఓ సాధారణ గృహిణికి సాధ్యమవుతుందా? అంటే సాధ్యమేనని రుజువు చేసింది తారాబాయి. ఇంకా చెప్పాలంటే, సాధారణంగా మహిళలెవరూ ఎంచుకోని రంగంలోకి అడుగుపెట్టింది.

17:57 - March 11, 2016

హైదరాబాద్ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సంతాప తీర్మానాలతో ముగిసింది. పీఏసీ చైర్మన్, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డికి ఘన నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు బలపరుస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వెంకట్ రెడ్డి గొప్ప రాజకీయ నేతే కాకుండా స్వయాన రైతు అని కేసీఆర్‌ గుర్తుచేశారు. వ్యవసాయం అన్నా.. పశు పోషణ అన్నా ఎంతో మక్కువ చూపించేవారన్నారు. ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై చివరి వరకు ప్రజా సేవ చేసారని కొనియాడారు.

ప్రతిపాదనపై నిర్ణయం చెప్పని సర్కార్..
వెంకట్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. దాదాపు మూడు దశాబ్దాలుకు పైగా రాజకీయాల్లో కొనసాగారన్నారు. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే ఒంగోలు గిత్తలు ఎక్కడ పోటీలు జరిగినా గెలుపొందేవన్నారు. శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. వెంకట్ రెడ్డి గిరిజనుల అభివృద్దికి ఎంతో కృషి చేసారని.. వారితో తనకు ఎంతో అనుబందం ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఖమ్మం జిల్లాకే కాకుండా ముఖ్యంగా గిరిజనులకు ఆయన మృతి తీరని లోటన్నారు.  వెంకట్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన పేరుతో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని,..ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ఎవరూ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండానే సభ వాయిదా పడింది. 

17:54 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భా స‌మావేశాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. శని, ఆదివారాల్లో కూడా స‌భ‌ను నిర్వహించాలని శాస‌న‌స‌భా వ్యవహారాల క‌మిటి నిర్ణయించింది. స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల అజెండా, పనిదినాలను ఖరారు చేశారు. తెలంగాణ శాస‌న‌స‌భా బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వహణపై స్పష్టత వ‌చ్చింది. ఈ నెల 31 వ‌ర‌కు స‌మావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స‌హా విప‌క్ష పార్టీల నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. మొత్తం 16 ప‌నిదినాలుగా స‌భ‌ను నిర్వహించాలనే బీఏసి సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే స‌మావేశాలు ప్రారంభ‌మై రెండు రోజులు పూర్తయినందున మ‌రో 14 రోజుల పాటు శాస‌న‌స‌భా స‌మావేశాలు జ‌రుగనున్నాయి.

రెండు రోజులూ గవర్నర్ ప్రసంగంపై చర్చ..
గ‌వ‌ర్నర్ ప్రసంగం అనంత‌రం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెల‌ప‌డంపై చ‌ర్చ జ‌రగ‌నుంది. శ‌ని, ఆదివారాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈనెల 14వ తేదీన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ రాష్ట్ర బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్రవేశపెడతారు.15వ తేదీన శాస‌న‌స‌భ‌కు సెలవు ఉంటుంది. అనంత‌రం 16నుంచి 19వరకు నాలుగు రోజుల పాటు బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగ‌నుంది. 20న సెలవును ప్రకటించారు. 21, 22 తేదీల్లో వివిధ అంశాలపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత 23నుంచి 26వరకు మూడు రోజుల పాటు వ‌రుస‌గా శాస‌న‌స‌భ‌కు సెలవులు ఇవ్వాల‌ని బీఏసీ నిర్ణయించింది. హోలీ, గుడ్‌ ఫ్రైడే సంద‌ర్భంగా స‌భ‌కు విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 27నుంచి 31వరకు కరవుపై చర్చ ఉంటుంది.

విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన విపక్షాలు..
అయితే బ‌డ్జెట్ స‌మావేశాల‌ను మ‌రో వారం రోజులు పొడ‌గించాల‌ని బీఏసి సమావేశంలో విప‌క్షాలు డిమాండ్ చేశాయి. దీంతో అవ‌స‌ర‌మైతే మ‌రోసారి బీఏసిని నిర్వహించి నిర్ణయం తీసుకుందామ‌ని అధికార ప‌క్షం స్పష్టం చేసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ప్రతిపక్షనేత జానారెడ్డి, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీజేపి ఎమ్మెల్యే డాక్టర్‌ కే లక్ష్మణ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. 

భారత్ కు పాక్ జట్టు..

పాకిస్థాన్ : పాక్ జట్టు భారత్ కు రానుంది. ఈ మేరకు పాక్ బోర్డు కు అక్కడి ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ రోజు రాత్రికి భారత్ కు పాక్ క్రికెట్ జట్టు చేరుకోనుంది. 

యమునా తీరం వద్ద ప్రధాని మోడీ..

ఢిల్లీ : ప్రపంచ సంస్కృతి ఉత్సవాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మయూర్ విహార్ వద్ద యమునా తీరంలో ప్రపంచ సంస్కృతి ఉత్సవాన్ని శ్రీశ్రీ రవి శంకర్ నిర్వహిస్తున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం వేయి ఎకరాల్లో ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఏడు ఎకరాల్లో భారీ స్టేజ్ ను అలంకరించారు. 155 దేశాల నుండి 35 లక్షల మంది ఉత్సవాలకు హాజరయ్యారు. వివిధ దేశాలల కళల ప్రదర్శన కోసం 38 వేల మంది కళాకారులు ఇక్కడకు వచ్చారు. యోగా, ధ్యానం, శాంతి ప్రవచనాలను శ్రీశ్రీ రవి శంకర్ బోధించనున్నారు. 

మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..

మధ్యప్రదేశ్ : జైలో, స్కూల్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రహత్ గర్, సాగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

17:20 - March 11, 2016

హైదరాబాద్ :  ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా. ఇండియన్ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడు. అతను ఇండియా నుండి ఎలా వెళ్లాడు? ఎవరెవరు హెల్ప్ చేశారనే విషయాలపై మీడియా  అనేక కథనాలు వచ్చాయి. అయితే మాల్యా మార్చి 2న మధ్యాహ్నం 1.30కు ఢిల్లీ - లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానంలో బ్రిటన్ వెళ్లినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి దృవీకరించారు. 
'మాల్యాతో పాటు ఓ మహిళ ఉందని, మాల్యా ఏడు భారీ లగేజీ బ్యాగులను తనతో పాటు తీసుకెళ్లాడని వెల్లడయ్యింది.' మాల్యాకు లండన్ లోని హెర్త్ ఫోర్ షైర్  లో ఓ  విలాసవంతమైన నివాసం ఉంది. మీడియాలో కథనాలు చూసిన అక్కడి ప్రజలు మాల్యాను గుర్తించారు. అయితే లండన్ వెళ్లిన ప్రతిసారి పబ్ లు పార్టీలంటూ విలాసంగా గడిపే మాల్యా ఈ దెబ్బకు ఇంటినుంచి బయటకి రావట్లేదట. 

జేఎన్ యూ ఘటనపై నివేదిక - జేఎన్ యూ పీఆర్ ఓ..

ఢిల్లీ : ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్ యూలో జరిగిన ఘటనపై నియమించిన హై లెవల్ కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించిందని జేఎన్ యూ పీఆర్ ఓ పేర్కొన్నారు. ప్రస్తుతం నివేదిక అడ్మినిస్ట్రేషన్ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. 

17:10 - March 11, 2016

ప్రత్యామ్నాయ మహిళా కార్యక్రమంగా అందరి మన్ననలు అందుకున్న ’మానవి‘ ఈ ఏడాది లాడ్లీ మీడియా పురస్కారానికి ఎంపికైంది. చెన్నెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మానవి టీం ఈ పురస్కారాన్ని అందుకుంది. గ్లోబల్ రిక్రూట్ మెంట్ ఫ్లాట్ ఫామ్ మై హైరింగ్ క్లబ్. కమ్ భారత్ కు చెందిన జాబ్ పోర్టల్ కో.ఇన్ సంయుక్తంగా నిర్వహించిన వుమెన్ ఇన్ బోర్డు 2016 లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే భారత కంపెనీల బోర్డులో మహిళ డైరెక్టర్లు తక్కువేనని ఈ సర్వేలో తేలింది. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారు చదువుకునేందుకు అనర్హులా? కేరళ విద్యార్థిని ప్రభుత్వానికి సంధించిన ప్రశ్న ఇది. నిబంధనల ప్రకారం తన చదువు కొనసాగించేందుకు సహకరించాలని అధికారులకు విజ్నప్తి చేస్తోంది. మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు, కార్యాలయాల్లో వారికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు కార్పోరేట్ సంస్థలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. హెచ్ సీ యూ, జెఎన్ యూల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ విశ్వవిద్యాలయం లో ఇప్పుడు సరికొత్త వివాదం రాజుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా ఆమోదం పొందేలా ప్రభుత్వం చొరవ చూపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత అంశంపై మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు.

మార్చి 8న మహిళా దినోత్సవం..
లైంగిక వేధింపుల్లో తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు ముందున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలోని 23 రాష్ట్రాల్లో ఉన్న 32 విశ్వవిద్యాలయాల్లో 2014-16 మధ్య 376 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ తెలిపింది. మార్చి8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. శ్రామిక మహిళల పోరాటాలకు ప్రతీక. సమానత్వం కోసం నినదించే వారికి గొంతుక. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి పురస్కారాలు ప్రకటించింది.

యుమన వద్ద భారీ వర్షం..

ఢిల్లీ : రాష్ట్రంలోని యమునా నది ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరైన వారు వర్షం వల్ల పలు ఇబ్బందులు పడ్డారు. 

అగ్రిగోల్డ్ విచారణ వాయిదా..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ విచారణ కేసు మళ్లీ వాయిదా పడింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి వివరాలను ఈనెల 24వ తేదీన లోపున సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణనను 24కి వాయిదా వేసింది. 

మేనిఫెస్టో విడుదల చేసిన మమత..

కోల్ కతా : రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోను విడుదల చేశారు. కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

16:32 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అమరులైన వారిని, తీవ్రంగా గాయపడిన బాధ పడుతున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని టి.కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ష ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జక్కుల యాకస్వామి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మిలియన్ మార్చ్ లో పాల్గొన్న యాకస్వామి లాఠీఛార్జీలో గాయపడ్డాడు. కోలుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యాకస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. గుళ్లు గోపురాలు..యజ్ఞ యాగాదాలు చేయడానికి..అంబాసిడర్ సోనియాకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని ఆదుకోవడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. వీరిని మనసులు అనాలా ? వీరిని రాక్షసులు అనాలా ?అని విమర్శించారు. కేవలం 500 మందికి న్యాయం చేయడంలో ఆంతర్యం ఏంటనీ ప్రశ్నించారు. మూడు వేల మంది ఉద్యమంలో గాయపడిన వారున్నారని, వీరిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 1969లో జరిగిన ఉద్యమంలో 400 చనిపోయారిన తెలిపారు. ఇప్పటికీ తుపాకి గాయాలతో ఉన్న వారున్నారని తెలిపారు. పోరాటం చేసిన వారిని గౌరవించి..ఒక హోదా కల్పించి పెన్షన్ ఇవ్వాల్సినవసరం ఉందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. 

16:23 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదులు రోడ్డుపై భోజనం చేశారు. ఏంటీ వారు ఆందోళన ఇంకా చేస్తున్నారా ? వారు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కదా ? అని అనుకుంటున్నారా ? మీరన్నది కరెక్టే. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది..వారు కోరుకున్నది ఒక్కటి మాత్రం ఇంకా నెరవేరడం లేదు. అదే హైకోర్టు విభజన గత కొంత కాలంగా వీరు కోర్టు విభజన త్వరతగతిన పూర్తి చేయాలని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం హైకోర్టు ఎదుట వంట..వార్పు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 6 వద్ద న్యాయవాదులు రోడ్డుపై భోజనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు టెన్ టివితో మాట్లాడారు.
ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఉన్న 24 మంది జడ్జీల్లో ఆంధ్రవారు 20 మంది ఉంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 4గురు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు హైకోర్టు విభజనకు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై చంద్రబాబు నాయుడు గ్రిప్ ఉందని తెలిపారు. నియామకాల మధ్య వాదాలు జరుగుతున్నాయని, హైకోర్టు విభజించాలని తాము కోరడం జరుగుతోందని తెలిపారు.  

16:10 - March 11, 2016

ఢిల్లీ : లోక్ సభలో ఆధార్ కార్డు బిల్లు పాసైంది. శుక్రవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్రం బిల్లును ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. అంతకుముందు జైట్లీ లోక్ సభలో ఈ బిల్లుపై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా అసలు లబ్ధిదారులకు అందచేయడమే తమ లక్ష్యమని, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. దేశంలో 97 శాతం మందికి ఆధార్ కార్డులున్నాయని, పిల్లల వివరాలకు సంబంధించి త్వరలోనే ఆధార్ కార్డులను రూపొందిస్తామని తెలిపారు. ఆధార్ క్రెడిట్ అంతా నందన్ నీలేకన్ కు దక్కుతుందని జైట్లీ తెలిపారు. 

పార్లమెంట్ వద్ద యువకుడు హల్ చల్..

ఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత పార్లమెంట్ లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. ప్రధాన మంత్రి వచ్చే ద్వారానికి అతి సమీపంలో చేరుకున్న యువకుడిని భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు లాభ పడి 24,717 వద్ద ముగియగా నిఫ్టీ 24 పాయింట్లు లాభ పడి 7,510 వద్ద ముగిసింది. 

ధోనిపై సుప్రీంలో కౌంటర్..

ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ ధోని కేసుపై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలైంది. అనంతపురం జిల్లా వీహెచ్ పీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ కౌంటర్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచారని ధోనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును జిల్లా కోర్టులో విచారించాలని శ్యాం సుందర్ పిటిషన్ లో పేర్కొన్నారు. కేసును బెంగళూరుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ధోని కోరారు. విచారణనను మే 12వ తేదీకి సుప్రీం వాయిదా వేసింది. 

15:42 - March 11, 2016

చిత్తూరు : నిత్యానంద..వివాదాల స్వామి..ఈ స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో శిష్యురాలు రంజితతో ప్రత్యక్షమైన నిత్యానంద నేడు తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ లో ఆయన నిత్యానందకు దర్శన ఏర్పాట్లను టిటిడి అధికారులు కల్పించారు. వైకుఠం క్యూ కాంప్లెక్సు ద్వారా సామాన్యు భక్తులతో కలిసి ఆలయంలోకి వచ్చారు. అందరికీ ఆశీర్వాదాలు చేస్తూ ముందుకు కదిలారు. నిత్యానంద వేసుకున్న ఆభరణాలు..వస్త్రధారణను భక్తులు ఆసక్తిగా చూశారు.
గతంలో సినీ నటి రంజితతో ఆయన ఆశ్రమంలోని ఓ గదిలో నిత్యానంద స్వామి కలిసి ఉన్నట్లున్న ఓ వీడియోను ఆయన శిశ్యుడే గతంలో విడుదల చేయడం తెలిసిందే. ఆ వీడియోలో నిత్యానంద స్వామి, రంజిత సాన్నిహిత్యంగా ఉండటం గమనార్హం. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విచారించిన అనంతరం నిత్యానంద బెయిల్‌పై విడుదలయ్యారు. 

15:34 - March 11, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరామని టి.టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు ప్రకటించారు. శుక్రవారం వీరు సీఎం కేసీఆర్ ను కలిసి గులాబీ కండువాలు కప్పుకున్నారు. వివిధ అంశాలపై వీరు కేసీఆర్ తో మాట్లాడారు. ఈ భేటీలో ఇటీవలే చేరిన ఎర్రబెల్లి కూడా పాల్గొన్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు..కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని, నగరాన్ని, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నా అది టీఆర్ఎస్ తోనే సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, తమకు ఇచ్చిన హామీ..సహాయ సహకారాలు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్లు తెలిపారు. 

15:30 - March 11, 2016

విజయవాడ : దుర్గగుడి అర్చకులు చేస్తున్న ఆందోళన తాత్కాలికంగా తెరపడింది. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్ అర్చకులతో చర్చలు జరిపారు. దీనితో తాము ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు, ఈనెల 30 వరకు తాము ఆందోళన చేయమని అర్చకులు పేర్కొన్నారు. నెలాఖరులో గా సదరు ఈవోను సస్పెండ్ చేయాలని, ఎక్కడా పోస్టు ఇవ్వకూడదని అర్చకులు షరతులు విధించారు. మరోవైపు ఈ ఘటనపై కమిషన్ వేయడం జరిగిందని, నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి హామీనిచ్చారు.
ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో గురువారం నుంచి నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈవో నర్సింగరావు వేధింపుల కారణంగా ఆలయ అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు ఆస్పత్రిపాలు కావడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు దిగారు. అర్చకులు, వేద పండితులు, వివిధ శాఖలకు చెందిన ఆలయ అధికారులు, సూపరిండెంటెంట్లు, ఏఈవోలు, రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. వివాదం ముదరడంతో ఈవో సెలవుపై వెళ్లారు. నూతన ఈవోగా ఆజాద్ బాధ్యతలు చేపట్టారు. ఈవోను సస్పెండ్ చేస్తారా ? లేదా అన్నది వేచి చూడాలి. 

15:16 - March 11, 2016

ముంబై : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విజయ్ మాల్యా వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ రోజు మాల్యాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నష్టాల ఊబిలో కూరుకపోయి, ఎస్ బీఐ కాన్సార్టియం బ్యాంకులకు సుమారు రూ.900 కోట్ల బాకీ ఉన్న మాల్యా ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ సూచించింది. ఈనెల 18న విచారణ జరగనుంది. మాల్యా మార్చి 2వ తేదీన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు రుణాల వివరాలను తెలుపాలని రుణాలిచ్చిన 17 బ్యాంకులకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల విలువ లెక్కకట్టకుండా ఐడీబీఐ బ్యాంకు రుణం మంజూరు చేయడంపై కూడా కేసు నమోదైంది.
విజయ్ మాల్యా..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ నష్టాల ఊబిలో కూరుకపోయింది. ఈ నేపథ్యంలో వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడని..రుణాలు చెల్లించడం లేదని పలు బ్యాంకులు పేర్కొన్నాయి. దీనితో మాల్యాపై సుప్రీంకోర్టులో, బెంగళూరు హైకోర్టులో మాల్యాపై పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ లు దాఖలైన సమయంలోనే మాల్యా లండన్ కు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు భారత చట్టాలపై గౌరవం ఉందని, తాను ఎక్కడికి పారిపోలేదని మాల్యా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. మరోవైపు శుక్రవారం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సీఈఓను తమ కార్యాలయానికి పిలిపించింది. మాల్యా వ్యవహారం, సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదేశాల ప్రకారం మాల్యా ఈడీ ఎదుట హాజరౌతారా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

తాతాల్కింగా దుర్గగుడి అర్చకుల ఆందోళన విరమణ..

విజయవాడ : దుర్గగుడి అర్చకుల ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈనెల 30వరకు ఆందోళన విరమిస్తామని, నెలాఖరులో గా ఈవోను సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని అర్చకులు హెచ్చరికలు చేశారు. ఈవోగా బాధ్యలు చేపట్టిన ఆజాద్ అర్చకులతో చర్చలు జరిపారు. అనంతరం ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు. 

టీడీపీ అంటే ఎంతో గౌరవం - మాగంటి..

హైదరాబాద్ : టీడీపీ అంటే తనకెంతో గౌరవమేనని, అయితే విశ్వనగరాభివృద్ధి, బంగారు తెలంగాణ లక్ష్య సాధనకోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన అనంతరం మాగంటి మీడియాతో మాట్లాడారు. 

అభివృద్ధి కోసమే చేరా - గాంధీ..

హైదరాబాద్ : అభివృద్ధి ఎజెండాగా టీఆర్‌ఎస్‌లో చేరానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు టీడీపీలో అంకిత భావంతో పని చేశానని తెలిపారు. పార్టీలో సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

14:24 - March 11, 2016

మహబూబ్ నగర్ : అగ్రిగోల్డ్ కేసులో నిందితులను మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు సీఐడీ పోలీసులు. గద్వాలో గత కొంత కాలంగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు చేపడుతుండడంతో..ఇవాళ నిందితులను విచారించిన కోర్టు ఈ నెల 24 వ తేదీకి కేసును వాయిదా వేశారు. అనంతరం అగ్రిగోల్డ్ చైర్మన్ ఎండీని ఏలూరు కోర్టుకు తరలించారు. ఆగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు జిల్లా కేంద్రంలో కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఐడీలో రెండు కేసులున్నాయని, గద్వాలలో కేసు న్యాయవాది పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ అధిక వడ్డీల ఆశ చూపించి పొదుపు ఖాతా పేరిట పలువురి నుండి డబ్బులు వసూలు చేసింది. కానీ సమయం ముగిసిన తరువాత కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. పలువురు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తమ నుండి తీసుకున్న డబ్బును ఎలాగైనా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కేసులు నమోదయ్యాయి. దీనితో తెలంగాణ సీఐడీ మూడు రోజుల పాటు విచారణ చేపట్టేందుకు అగ్రిగోల్డ్ ఛైర్మన్ ను అదుపులోకి తీసుకున్నారు. 

14:03 - March 11, 2016


ఢిల్లీ : ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండే భారత గడ్డపై ...తొలిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య టీమిండియాతో సహా మొత్తం 16 దేశాల జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ సందర్భంగా సూపర్ టెన్ రౌండ్లో పాల్గొంటున్న మొత్తం పదిజట్ల బలాబలాలపై 10 స్పోర్ట్స్ స్పెషల్ లో భాగంగా..ఈరోజు..ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ టీమిండియా ట్రాక్ రికార్డు ఓసారి చూద్దాం....
మార్చి 8 న ప్రారంభం
ప్రపంచకప్ టీ-20 తుపాను తొలిసారిగా భారత్ ను కమ్మేసింది. మార్చి 8 న ప్రారంభమై... ఏప్రిల్ 3 న ముగిసే 2016 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను  రెండుదశలుగా నిర్వహిస్తున్నారు. టెస్ట్ హోదా పొందిన ఎనిమిదిదేశాలతో పాటు..బంగ్లాదేశ్, జింబాబ్వేలతో సహా మొత్తం 16 దేశాలజట్లు బరిలోకి దిగబోతున్నాయి. మార్చి 8 నుంచి 13 వరకూ ఎనిమిదిజట్ల క్వాలిఫైయింగ్ సమరం..., ఆ తర్వాత మార్చి 15నుంచి ఏప్రిల్ 3 వరకూ సూపర్ టెన్ కమ్ నాకౌట్ రౌండ్ నిర్వహిస్తున్నారు.
మార్చి 15 నుంచి సూపర్ టెన్ దశ పోటీలు
మార్చి 15 నుంచి రెండువారాలపాటు జరిగే సూపర్ టెన్ దశ పోటీల్లో ..ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకిదిగుతోంది. టీ-20 ఫార్మాట్లో.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ నెంబర్ వన్ జట్టు టీమిండియా...ఆసియాకప్ విజయంతో ప్రపంచకప్ టైటిల్ సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి 2014లో ముగిసిన ఐదవ ప్రపంచకప్ వరకూ...రెండుసార్లు ఫైనల్స్ చేరి..ఒకసారి విన్నర్ , మరోసారి రన్నరప్ గా నిలిచిన రికార్డు టీమిండియాకు ఉంది.
తొలి ప్రపంచ చాంపియన్ గౌరవం దక్కించుకున్న ధోనీసేన 
జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో...ఏమాత్రం అంచనాలు లేకుండా 2007 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఐదు పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. టీ-20 చరిత్రలోనే తొలి ప్రపంచ చాంపియన్ గౌరవం ధోనీసేన దక్కించుకొంది. ఆ తర్వాత జరిగిన 2009, 2010, 2012 ప్రపంచకప్ టోర్నీల్లో దారుణంగా విఫలమైన టీమిండియా...2014లో ముగిసిన ఐదవ ప్రపంచకప్ టోర్నీలో ఫైనలిస్ట్ గా, రన్నరప్ స్థానం సంపాదించింది.
టైటిల్ వేటకు దిగుతోన్న ధోని సేన
ప్రస్తుత 2016 ప్రపంచకప్ లో సైతం...ధోనీసేన టాప్ ర్యాంక్ జట్టుగా టైటిల్ వేటకు దిగుతోంది. 2016 సీజన్లో టీమిండియా రెండు సిరీస్ లతో పాటు ఆసియాకప్ టీ-20 టైటిల్ ను సైతం సొంతం చేసుకొని...హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన ధోనీసేన..ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో దక్కించుకొంది. అంతేకాదు..బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీని అలవోకగా గెలుచుకొంది. ఐదు జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ నెగ్గిన టీమిండియాకు...బంగ్లాదేశ్ తో ముగిసిన టైటిల్ సమరంలో ఎదురేలేకుండా పోయింది. ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గడం ద్వారా..ధోనీసేన ఆసియాకప్ సొంతం చేసుకొంది. 2016లో ఆడిన 11 మ్యాచ్ ల్లో పది విజయాలు సాధించిన ఒకే ఒక్కజట్టుగా...టీమిండియా ప్రపంచకప్ టైటిల్ వేటకు దిగుతోంది.
మార్చి 15న న్యూజిలాండ్ తో తొలిమ్యాచ్ 
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో ఉన్న టీమిండియాకు...స్వదేశీ పిచ్ లపైన ఆడటం అదనపు బలంగా ఉంది. ప్రపంచకప్ సూపర్ టెన్ పూల్-బీ లీగ్ లో..టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ను మార్చి 15న నాగపూర్ విదర్భ స్టేడియంలో ఆడుతుంది. నాలుగోర్యాంకర్ న్యూజిలాండ్ తో తొలిమ్యాచ్ ఆడుతుంది.
మార్చి 19న పాకిస్థాన్ తో గ్రూప్ రెండో మ్యాచ్ 
మార్చి 19న ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో గ్రూప్ రెండో మ్యాచ్ ఆడుతుంది.
మార్చి 27న ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ  
మార్చి 27న మొహాలీ పంజాబ్ క్రికెట్ సంఘం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ కొంటుంది. మార్చి 30న న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగే ఆఖరి రౌండ్ పోటీలో...క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి అర్హత సాధించిన జట్టుతో ధోనీసేన పోటీపడుతుంది.
17 విజయాలు, 9 పరాజయాలు 
2007 ప్రపంచకప్ నుంచి 2014 వరకూ జరిగిన ఐదుటోర్నీల్లో మొత్తం 28 మ్యాచ్ లు ఆడిన టీమిండియా..17 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో ఉంది. 64. 8 విజయశాతం సాధించిన టీమిండియా...2016 ప్రపంచకప్ లో నూటికి నూరుశాతం విజయాలతో...రెండోసారి టీ-20 విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. దేశంలోని కోట్లాదిమంది అభిమానులు సైతం అదే కోరుకొంటున్నారు. ఈ ధూమ్ ధామ్ సమరంలో ధోనీసేన శివమెత్తిపోవాలని కోరుకొందాం....

గాజువాకలో మంత్రి కేఈ..

విశాఖపట్టణం : గాజువాకలో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. గాజువాక భూ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని కేఈ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో పెరుగుతున్న అవినీతిపై కేఈ ఆందోళన వ్యక్తం చేశారు.

గులాబీ కండువా కప్పుకున్న మాగంటి..అరికెపూడి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షంలో టి.టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధిలు గులాబీ కండువా కప్పుకున్నారు.

సుప్రీంలో రోజా పిటిషన్ పై విచారణ..

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏడాది సస్పెన్షన్ పై సుప్రీంకోర్టును రోజా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణనను సోమవారానికి వాయిదా వేసింది.

 

13:57 - March 11, 2016

హైదరాబాద్ : బీఏసీ మీటింగ్ లో  అధికార పార్టీ అసెంబ్లీ సమావేశాలు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని కోరారన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. ప్రతిపక్షాలను టీఆర్ఎస్ సభ్యులుగా  గుర్తిస్తూ స్పీకర్ తసుకున్న నిర్ణయం దారుణమన్నారు జానారెడ్డి.  ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నారాయన. మేము పలుమార్లు పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు  విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన్ని నిలబెట్టే వారే తప్పులు చేస్తారా అని ప్రశ్నించారు జానారెడ్డి. స్పీకర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దీనిపై న్యాయనిపుణులతో చర్చిస్తామన్నారు జానారెడ్డి .  

చంచల్ గూడ జైలుకు ఏపీ మంత్రి తనయుడు..

హైదరాబాద్ : మహిళను వేధించిన కేసులో రెండు రోజుల పాటు రావెల సుశీల్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ నేటితో ముగియడంతో సుశీల్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

నాలుగు వారాల్లో డబ్బు చెల్లిస్తాం - ఆర్ట్ ఆఫ్ లివింగ్..

న్యూఢిల్లీ : నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కల్చర్ ఫెస్టివల్ ఆరంభం అయ్యేలోపు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కోర్టుకు పేర్కొంది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, ఇంత త్వరగా అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొంది.

పాక్ షరతులపై రాజ్ నాథ్ స్పందన..

ఢిల్లీ : టీ 20 ప్రపంచకప్ లో ఆడే నిమిత్తం భారత్ కు వచ్చేందుకు పాకిస్థాన్ పెడుతున్న షరతులపై భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. భారత్ లో భద్రత విషయంలో పాక్ ఆందోళనకు గురవాల్సినవసరం లేదని స్పష్టం చేశారు. భారత్ కు ఎవరూ వచ్చినా భద్రతను కల్పిస్తామని తెలిపారు. 

శని, ఆదివారాల్లోనూ టి. అసెంబ్లీ..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి సెలవులు రద్దయ్యాయి. ఈనెల 31వరకు జరగనున్నా సమావేశాలు శని, ఆదివారాల్లోనూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) తీర్మానించింది. ఈనెల 14వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

ఈడీ కార్యాలయంలో కింగ్ ఫిషర్ సీఈవో..

ఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయమాల్యా వ్యవహారంలో వివరాలు రాబట్టేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సీఈఓను తమ కార్యాలయానికి పిలిపించింది. మాల్యా వ్యవహారం, సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

13:48 - March 11, 2016

ఢిల్లీ : గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విధించిన ఐదు కోట్ల జరిమానాను చెల్లించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నిర్వాహకుడు రవిశంకర్‌ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అనేది ఒక ఎన్జీవో అని ఐదు కోట్లు జరిమానా చెల్లించేందుకు కనీసం నాలుగు వారాల సమయం కావాలని కోరారు. ఇదిలా ఉంటే పర్యావరణ అనుమతులను ఉల్లంఘించినందుకే ఐదు కోట్లు చెల్లించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మొట్టికాయ వేసింది. అయితే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ మాత్రం తాము పెనాల్టీగా భావించడం లేదని, 5 కోట్లతో బయోడైవర్సిటీ పార్క్‌ను పునరుద్ధరించాలని ట్రిబ్యునల్‌ ను కోరింది.   

ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై నిర్వహించిన తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 29వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా నెల 31 వరకు సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కోరింది. 14న బడ్జెట్‌, 16 నుంచి 19 వరకు బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. 23, 25, 26 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ నేత జానారెడ్డి, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. 

 

13:36 - March 11, 2016

యూఏఈ : ఏడారి దేశాలను వర్షం ముంచేసింది. వడగాల్పులు తప్ప వాన జాడలేని దేశాల్లో ఇప్పుడు రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. 2రోజులుగా కురుస్తున్న వర్షాలతో గల్ఫ్ దేశాల్లో కొత్త వాతావరణం కనిపిస్తోంది. 
తగ్గుముఖం పడుతున్న వరదలు
ఏడారి దేశం యూఏఈలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటలుగా స్తంభించిన జనజీవనం ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న షార్జాకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోగా, నేడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. జనాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకి వస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కొన్ని విమాన సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు.
యూఏఈ అతలాకుతలం
ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం అతలాకుతలమైంది. ఆ ఒక్కరోజే 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అటు వర్షాల కారణంగా దాదాపు 250  రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.
దుబాయ్ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం 
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరం దుబాయ్ సహా అక్కడి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, జోరువానలతో అక్కడి జనజీవనం స్థంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది. అయితే చాలా ఏళ్ల తరువాత ఇంతగా వర్షాలు పడటంతో... దుబాయ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

13:30 - March 11, 2016

హైదరాబాద్ : శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై నిర్వహించిన తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 29వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా నెల 31 వరకు సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కోరింది. 14న బడ్జెట్‌, 16 నుంచి 19 వరకు బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. 23, 25, 26 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ నేత జానారెడ్డి, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. 

13:24 - March 11, 2016

హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్‌కు పోలీస్‌ కస్టడీ ముగిసింది. బంజారాహిల్స్ పోలీసులు సుశీల్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సాయంత్రం సుశీల్ కు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశీల్ తరపు న్యాయవాది నాలుగు పేజీల బెయిల్ పిటిషన్ ను సిద్ధం చేసుకున్నారు. సుశీల్ పోలీసులు వాహనంలో కాకుండా ఆటోలో తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో హాజరుపరిచాక మళ్లీ ఆటోలోనే సుశీల్ ను పోలీసులు జైలుకు తరలించారు. అయితే సుశీల్ ను ఆటోలో ఎందుకు తీసుకొచ్చారన్న విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

 

ఛత్తీస్‌గఢ్‌లో మంతుపాతర పేల్చిన మావోయిస్టులు

రాయ్పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మర్లగూడెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

13:06 - March 11, 2016

రాయ్పూర్ : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఇవాళ సీఆర్ పీఎఫ్ వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగిన ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సీఆర్ పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మర్లగూడెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు.దీంతో సీఆర్‌పీఎఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రభాత్, త్రిపాఠి, శ్రీనివాస్, రంగ రాఘవన్ జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

 

 

విజయ్ మాల్యా పారిపోలేదు.. పంపించారు : కాంగ్రెస్

ఢిల్లీ : విజయ్ మాల్యా పారిపోలేదు.. పంపించారని కాంగ్రెస్ ఆరోపించింది. మాల్యా పారిపోయేందుకు బీజేపీ సహకరించిందని విమర్శించారు. 

 

ఎపి రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ

ఢిల్లీ : ఎపి రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగనుంది. 

 

12:28 - March 11, 2016

హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ లో నీరు పారుదల శాఖ డిప్యూటీ ఈఈ మాణిక్ ప్రభు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇటీవల కాంట్రాక్టర్ నుండి లక్షా 37 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఈఈ బెయిల్ పై విడుదలయ్యాడు. 

 

తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం పునర్‌ నిర్మాణానికి టెండర్ల నిలిపివేత

చిత్తూరు : తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపం పునర్‌ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీవారి ఆలయం ఎదుట కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో మండపం ఎందుకు నిర్మిస్తున్నారని పిటిషన్‌ దాఖలు అయ్యింది. కిషోర్‌ స్వామి, ఓలేటి లక్ష్మీనాథాచార్య హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు సమాచారం. కోర్టు స్టే విధించడంతో టీటీడీ టెండర్లను నిలిపివేసింది.  

12:05 - March 11, 2016

చిత్తూరు : తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపం పునర్‌ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీవారి ఆలయం ఎదుట కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో మండపం ఎందుకు నిర్మిస్తున్నారని పిటిషన్‌ దాఖలు అయ్యింది. కిషోర్‌ స్వామి, ఓలేటి లక్ష్మీనాథాచార్య హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు సమాచారం. కోర్టు స్టే విధించడంతో టీటీడీ టెండర్లను నిలిపివేసింది.  

 

11:57 - March 11, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగవిరుద్ధమని టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీలు ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ 20 నెలలుగా స్పందించలేదని, అదే ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోని టీడీపీ బృందం టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతామంటే మాత్రం స్పీకర్‌ వెంటనే అనుమతి ఇచ్చారని అన్నారు. ఎర్రబెల్లి బృందానికి స్పీకర్‌ అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విపక్షాల ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని రేవంత్‌ విమర్శించారు. 

రావెల సుశీల్ కు ముగిసిన పోలీసు కస్టడీ

హైదరాబాద్ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్ కు పోలీసు కస్టడీ ముగిసింది. సుశీల్ ను నాపంల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు హాజరు పరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.

11:45 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వెంకట్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం జానారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు,
పాషా ఖాద్రీ, సండ్ర వెంకటయ్య వీరయ్య, పువ్వాడ నాగేశ్వర్ రావు తోపాటు పలువురు సభ్యులు వెంకట్ రెడ్డికి మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకట్ రెడ్డి మృతికి సభలో సభ్యులు రెండు నిమషాలు మౌనం పాటించారు. అనంతరం సభను రేపు 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. 

టీ.అసెంబ్లీని రేపటికి వాయిదా వేసిన స్పీకర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకముందు కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వెంకట్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం పులువురు మాట్లాడారు. సభలో రెండు నిమషాలు మౌనం పాటించారు. అనంతరం సభను రేపిటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి 
ప్రకటించారు. 

 

11:06 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం తెలిపింది. వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వెంకట్ రెడ్డి మృతికి మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతునట్లు చెప్పారు. ప్రజా జీవితంలో ఆయన అనేక పదువులు అనుభవించారని పేర్కొన్నారు. ఐదు సార్లు శాసనభ్యుడిగా కొనసాగారని తెలిపారు. ఒక టర్మ్ మొత్తం మంత్రిగా పని చేశారని తెలిపారు. వెంకట్ రెడ్డి మిత భాషి, వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించారని పేర్కొన్నారు. రాంరెడ్డి వైద్యానికి రూ.24 లక్షలు ప్రకటించామని గుర్తు చేశామని తెలిపారు. వెంకట్ రెడ్డికి వ్యవసాయంమటే ఎంతో ఇష్టమన్నారు. దేశం, రాష్ట్రంలో ఎద్దుల పోటీలు జరిగితే.. రాంరెడ్డి పెంచిన ఎద్దులు విజయం సాధించాయని గుర్తుచేశారు. 
వెంకట్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు : జానా  
రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. ఆయన మృతికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటంచారు. రాంరెడ్డి మృతి మనందరికీ మనస్థాపం కలిగించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం అంటే వెంకట్ రెడ్డికి చాలా ఇష్టమని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా కూడా పని చేశారని తెలిపారు. వెంకట్ రెడ్డితో తనకు 33 సంవత్సరాలుగా పరిచయం ఉందన్నారు. అనుబంధం, ఆప్యాయతను కొనసాగించారని గుర్తు చేశారు.  విద్యార్థి దశ నుంచి రాంరెడ్డి రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారని పేర్కొన్నారు.
రాంరెడ్డి మరణం చాలా బాధాకరం : తుమ్మల 
రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణం చాలా బాధాకరం, దురదృష్టకరమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. గిరిజనులతో రాంరెడ్డి మమేకమయ్యారని చెప్పారు. ఖమ్మం రాజకీయాలను శాసించారని పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు వారు ఎంత అడిగితే ఇవ్వండని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని తుమ్మల గుర్తు చేశారు. 

 

రాంరెడ్డి మరణం చాలా బాధాకరం : తుమ్మల

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి  వెంకట్ రెడ్డి మరణం చాలా బాధాకరం, దురదృష్టకరమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపట్టారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ గిరిజనులతో రాంరెడ్డి మమేకమయ్యారని తెలిపారు. ఖమ్మం రాజకీయాల్లో విలక్షమైన పాత్ర పోషించారని తెలిపారు. ఆయన వైద్య ఖర్చులకు వారు ఎంత అడిగితే ఇవ్వండని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

వెంకట్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు : జానా

హైదరబాద్ : రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన మృతికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటంచారు. రాంరెడ్డి మృతి మనందరికీ మనస్థాపం కలిగించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం అంటే వెంకట్ రెడ్డికి చాలా ఇష్టమని చెప్పారు. 

రాంరెడ్డి మృతికి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వెంకట్ రెడ్డి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో ఆయన అనేక పదువులు అనుభవించారని పేర్కొన్నారు. ఐదు సార్లు శాసనభ్యుడిగా కొనసాగారని చెప్పారు.

 

రెండో రోజు ప్రారంభమైన టీ.అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వెంకట్ రెడ్డి మృతికి తన ప్రగాడ సానూభూతి ప్రకటించారు.

 

09:51 - March 11, 2016

ఢిల్లీ : టీ-20 ప్రపంచకప్ సునామీకి క్రికెట్‌ క్రేజీ భారత్‌ సిద్ధమయ్యింది. మూడుగంటల్లో ధూమ్ ధామ్ గా సాగిపోయే ఈ టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది నవతరం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడువారాలు...మూడువేదికల్లో జరిగే పదహారుజట్లు, రెండుదశల 2016 టీ-20 ప్రపంచకప్ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ 
భారత్‌లో రంగం సిద్ధం 
టీ 20 వరల్డ్‌ కప్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. చిట్టి పొట్టి ఫార్మాట్‌లో మహా సంగ్రామానికి క్రికెట్‌ క్రేజీ నేషన్‌ భారత్‌లో రంగం సిద్ధమైంది. ఈ చిట్టి పొట్టి ఫార్మాట్‌ గురించి తలచుకోగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇవే....
ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగే ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు నిజంగా పండుగే. 
బ్యాట్స్ మెన్‌దే డామినేషన్‌
ఎంతమంది కొమ్ములు తిరిగిన బౌలర్లున్నా ఈ ఫార్మాట్‌లో మాత్రం...బ్యాట్స్ మెన్‌దే డామినేషన్‌. వీరబాదుడు, బండబాదుడుకి టీ 20 ఫార్మాట్‌  కేరాఫ్‌ అడ్రస్‌. అందుకే మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు చూస్తున్న అభిమానులందరికీ ...నాన్‌ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అందుకే ఈ ఫార్మాట్‌కు అంత క్రేజ్‌. ముచ్చటగా మూడు గంటల్లో ముగిసిపోయె ఈ ఫార్మాట్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు...ఎందుకంటే బ్యాట్స్ మెన్‌ వీరలెవల్లో రెచ్చిపోయి బౌలర్లను చీల్చి చెండాడుతుంటే...ఆ మజానే వేరు. మామూలు మ్యాచ్‌ల్లోనే పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇంక ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అయితే పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2007లో భారత జట్టు బోణీ....
ఇప్పటివరకు జరిగిన ఐదు టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీల్లో ...ఐదు వేర్వేరు జట్లు విజేతలుగా నిలిచాయి. 2007లో భారత జట్టు బోణీ కొట్టగా....2009లో పాకిస్థాన్‌ జట్టు రెండో ప్రయత్నంలో టైటిల్‌ను దక్కించుకుంది.2010లో ఇంగ్లండ్‌ జట్టు తొలి ప్రధాన ఐసీసీ వరల్డ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోగా...2012లో  వెస్టిండీస్‌ జట్టు అదరగొట్టింది.2014లో శ్రీలంక వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. 
తొలి టీ 20 ప్రపంచ కప్‌లో టీమిండియా సంచలనం
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ 20 ప్రపంచ కప్‌లో టీమిండియా పెద్ద సంచలనమే సృష్టించింది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అదరగొట్టింది. అందరూ కుర్రాళ్లతో టోర్నీలో ఎంటరైన భారత్‌...అందరినీ ఆశ్చర్యపరచింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై ఆఖరి ఓవర్‌లో సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
రెండో టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌ విజయం 
ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన రెండో టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌ జట్టు...శ్రీలంక జట్టుపై సునాయాస విజయాన్ని నమోదు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 
మూడో టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ గెలుపు 
2010లో వెస్టిండీస్‌ వేదికగా జరిగిన మూడవ టీ 20 ప్రపంచ కప్‌  ఫైనల్‌లో పాల్‌ కాలింగ్‌వుడ్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు....చిరకాల ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి పెద్ద సంచలనమే సృష్టించింది. ఇంగ్లండ్ జట్టు సాధించిన తొలి ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఇదే కావడం విశేషం.
నాల్గవ ప్రవంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు విజయం 
ఇక 2012లో శ్రీలంక వేదికగా జరిగిన నాల్గవ ప్రవంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు...ఫైనల్‌లో లంక జట్టుకు షాకిచ్చి టైటిల్‌ను దక్కించుకుంది. కరీబియన్‌ టీమ్‌ 35 ఏళ్ల తర్వాత  ప్రపంచ కప్‌ సొంతం చేసుకుని అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.
2014 టోర్నీలో విజేతగా శ్రీలంక జట్టు 
బంగ్లాదేశ్‌ వేదికగా ముగిసిన 2014 టోర్నీలో....శ్రీలంక జట్టు అనూహ్యంగా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టును ఓడించి తొలిసారిగా టీ 20 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది.మూడో  సారి ఫైనల్‌ చేరిన శ్రీలంక ఎట్టకేలకు టైటిల్‌ నెగ్గి వెటరన్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కరలకు ఘనమైన వీడ్కోలు పలికింది. 
టీమిండియా చరిత్ర
తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ రెండు సార్లు ఫైనల్‌ చేరుకున్న జట్లుగా భారత్‌,పాకిస్థాన్‌ రికార్డ్‌ నెలకొల్పగా.....మూడు సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా  శ్రీలంక టీమ్‌ రికార్డులకెక్కింది. అంతే కాదు నాలుగు ప్రపంచ కప్‌ టోర్నీల్లోనూ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్టుగా పాకిస్థాన్‌ అరుదైన రికార్డ్ సృష్టించింది. 
ఉపఖండ జట్ల హవా
ఇక టీ 20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటివరకూ ఉపఖండ జట్ల హవానే కొనసాగింది. ఈ మెగా టోర్నీలో  భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లను మించిన జట్లు లేవనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్‌కప్‌ ట్రాక్‌ రికార్డ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు శ్రీలంక .ఐదు ప్రపంచ కప్‌ పోటీల్లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన లంక జట్టు...21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  26 మ్యాచ్‌ల్లో 17 విజయాలతో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు  మూడు,నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 
వ్యక్తిగత రికార్డులు.. శ్రీలంక ఆటగాళ్లదే పై చేయి
ఇక వ్యక్తిగత రికార్డుల్లోనూ శ్రీలంక ఆటగాళ్లదే పై చేయి. బౌలర్ల లిస్ట్ లో లంక యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగా.....38 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. బ్యాట్స్ మెన్‌ లిస్ట్ లో వెటరన్‌ బ్యాట్స్ మెన్‌ మహేల జయవర్ధనే 1016 పరుగులతో అందరి కంటే ముందున్నాడు. మరి ఈ సారి చిట్టి పొట్టి ప్రపంచ కప్‌ సాధించే జట్టేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

 

09:41 - March 11, 2016

తూర్పుగోదావరి : కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా దీక్షను వాయిదా వేస్తున్నట్లు ముద్రగడ చెప్పారు.                                                                                    
విద్యార్థులకు పరీక్ష నేపథ్యంలో వాయిదా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుంచి తలపెట్టిన ఆమరణ నిరహార దీక్షను వాయిదా వేసుకున్నారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున.. ఎవరికీ ఇబ్బంది కలుగకూడదనే దీక్షను వాయిదావేసుకున్నట్లు చెప్పారు. ఉద్యమం వాయిదా వేయాలని కాపు విద్యార్థులు కోరారని, తన జాతి కోసం ఇతర విద్యార్థులు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరీక్షల తర్వాత దీక్ష విషయంలో జేఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
హామీలను అమలు చేయిస్తారా?
తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై అమాయకులపై కేసు పెట్టి వేధిస్తే మాత్రం తాను రోడ్డెక్కుతానని ముద్రగడ హెచ్చరించారు. తాను దీక్ష చేయాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తాను రాసిన లేఖల వల్లే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని తెలిపారు. తనను తిడుతున్న మంత్రులు కాపులకిచ్చిన హామీలను అమలు చేయిస్తారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు. హామీలన్నీ అమలుచేస్తామని చెప్తే ఉద్యమం నుంచి తప్పుకుంటా' అని ముద్రగడ స్పష్టం చేశారు.

09:37 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై నేడు బీఏసీ భేటీకానుంది. స్పీకర్‌ మధుసూదనాచారి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలోనే శాసనసభను ఎన్నిరోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేడు శాసనసభలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతిపై సంతాపం తెలిపి సభను వాయిదా వేసే అవకాశం ఉంది.

 

నేటి నుంచి యమునా తీరంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

ఢిల్లీ : యమునా తీరంలో నేటి నుంచి శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రదాని మోడీ హాజరుకానున్నారు. 

 

సెలవుపై వెళ్లిన విజయవాడ దుర్గగుడి ఈవో

కృష్ణా : విజయవాడ దుర్గగుడి ఈవో నర్సింగరావు సెలవుపై వెళ్లారు. అర్చకులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. నిత్యపూజలకు అర్చకులు హాజరయ్యారు. 
ఈవో తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని నిత్యపూజలు నిలిపి వేసి.. గత కొన్ని రోజులుగా అర్చకులు ఆందోళన చేప్టారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో ఈవో నర్సింగరావు సెలవుపై వెళ్లారు. దీంతో అర్చకులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. 

09:28 - March 11, 2016

కృష్ణా : విజయవాడ దుర్గగుడి ఈవో నర్సింగరావు సెలవుపై వెళ్లారు. అర్చకులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. నిత్యపూజలకు అర్చకులు హాజరయ్యారు. 
ఈవో తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని నిత్యపూజలు నిలిపి వేసి.. గత కొన్ని రోజులుగా అర్చకులు ఆందోళన చేపట్టారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో ఈవో నర్సింగరావు సెలవుపై వెళ్లారు. దీంతో అర్చకులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. 

 

09:21 - March 11, 2016

లండన్ : తాను దేశం విడిచి పారిపోలేదని వ్యాపారవేత్త విజయ్ మాల్యా తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని.. వ్యాపారం నిమిత్తం లండన్ వచ్చానని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా చట్టానికి లోబడే ఉంటానని విజయ్ మాల్యా తెలిపారు.
 

08:40 - March 11, 2016

నితిన్‌, సమంత, అనుపమ పర్వమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా హసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చిన్న బాబు) నిర్మిస్తున్న చిత్రం 'అ..ఆ'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలో చిత్ర ఫస్ట్ లుక్‌, టీజర్‌ను విడుదల చేయనున్నాం. షూటింగ్‌ కంప్లీట్‌ చేసి మే 6న వేసవి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతమందిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన డైలాగ్స్ లు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తొలిసారి నితిన్‌, సమంతలు జోడీగా, అలాగే నితిన్‌, త్రివిక్రమ్‌ తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా కూడా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు.

08:36 - March 11, 2016

మహేష్‌బాబు, సమంత, కాజల్‌, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన తాజా షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహేష్‌బాబు, సమంతల మధ్య ప్రేమ సన్నివేశాలకు సంబంధించినట్లుగా ఆయా స్టిల్స్‌ ఉన్నాయి. కాశీలోని నది ఒడ్డున, వంతెనపై, గుడిలో మహేష్‌, సమంత మధ్య చోటు చేసుకునే ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే రెండు రోజుల క్రితమే కాశీలో చిత్రీకరణ ముగిసిందని, ప్రస్తుతం న్యూఢిల్లీలో షూటింగ్‌ జరుపుతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. మహేష్‌, సమంత గతంలో 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల్లో కలిసి నటించారు. వీళ్లిద్దరు జోడీగా ఇది మూడో చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సమ్మర్‌ స్పెషల్‌గా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
మరో రెండు ప్రాజెక్టులు..
ఆ మధ్య తమిళ ఇండిస్టీపై ఎక్కువ దృష్టి పెట్టిన సమంతా ఇప్పుడు మరోసారి టాలీ వుడ్‌పై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల తెలుగులో మరో రెండు కొత్త ప్రాజె క్టులకు ఓకే చెప్పిందట. పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో, అలాగే నాగచైతన్య హీరోగా, కళ్యా ణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం లోనూ సమంత ఎంపికైనట్లు తెలుస్తుంది.

08:29 - March 11, 2016

సినీ నటి ఆదాశర్మ హీరో శింబుతో కలిసి ఆడిపాడబోతుంది. 'గరం', 'క్షణం' వంటి చిత్రాలతో ఆదాశర్మ ఇటీవల తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా శింబు హీరోగా పాండ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో శింబుకి మాజీ ప్రియురాలి పాత్రలో ఆదా శర్మ కనిపించ నుందని, అలాగే 'మామన్‌ వెయిటింగ్‌..' అంటూ సాగే ఓ ప్రత్యేక పాటలో ఆయనతో కలిసి ఆడిపాడుతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌ చిత్రం 'హసీ తో ఫసీ' సినిమాలో ఆదా శర్మ నటనకు ముగ్ధులైన దర్శకుడు పాండ్యరాజ్‌ ఆమెను సెలక్ట్ చేసుకున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే ఆదాశర్మకు సంబంధించిన సన్నివేశాలను కూడా పూర్తి చేశారట. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు సరసన నయనతార, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

08:11 - March 11, 2016

ఎపి బడ్జెట్ చెప్పుకున్నంత ఘనంగా లేదని.. ప్రజలకు మేలు చేయలేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంప నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం నేత లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ గణాంకాలు ఘనంగా ఉన్నాయని... ఆచరణ  మాత్రం శూన్యంగా ఉందన్నారు. నిధుల సమీకరణ ఎలా చేయబోతున్నారనే విషయం ప్రశ్నార్థకంగా ఉందన్నారు. రైతుల ఆత్మహత్యకు పరిష్కార మార్గాలను బడ్జెట్ లో పేర్కొన లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రాజన్న హుండీ ఆదాయం రూ.కోటీ 13, 87, 257 లక్షలు

కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. కోటీ 13, 87, 257 లక్షలు సమకూరినట్లు ఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై గురువారం జరిగిన లెక్కింపులో బంగారం 284 గ్రాములు, వెండి 14, 750 కిలోలు సమకూరినట్లు వెల్లడించారు. ఓ అజ్ఞాత భక్తుడు కిలో వెండితో తయా రు చేసిన లింగం, నంది విగ్రహాలను హుండీలో వేసినట్లు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని 14 రోజుల్లో ఈ ఆ దాయం సమకూరిందనీ, గతేడాది శివరాత్రికి రూ. 97 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు.

నేడు తలపెట్టిన ముద్రగడ దీక్ష వాయిదా

హైదరాబాద్ : విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో శుక్రవారం తలపెట్టిన ముద్రగడ దీక్ష వాయిదా పడింది. దీక్షను వాయిదా వేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులకు రుణాలు ఇవ్వడంతోపాటు రిజర్వేషన్ కల్పించాలని డిమాండు చేస్తూ శుక్రవారం నుంచి దీక్ష చేపడతానని ముద్రగడ గతంలో ప్రకటించారు. ముద్రగడ దీక్ష వాయిదా వేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

07:47 - March 11, 2016

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రిటన్‌ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామును ఆయన ఢిల్లీ నుంచి లండన్‌కు పయనమయ్యారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఉండే చంద్రబాబు... రాష్ట్రానికి పెట్టుబడలు రాబట్టే అంశంపై కార్పొరేట్లతో చర్చలు జరుపుతారు. 
పెట్టుబడులపై విదేశీ కార్పొరేట్లతో చర్చలు  
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్‌ వెళ్లారు. అక్కడ జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొంటారు. పెట్టుబడులు రాబట్టేందుకు విదేశీ పారిశ్రాకమివేత్తలతో చర్చలు జరుపుతారు. ఏపీలో ఉన్న సానుకూలతలు, వనరులు గురించి కార్పొరేట్లకు ప్రజెంటేషన్‌ ఇస్తారు. పెట్టుబుడులను ప్రోత్సహించేందుకు వీలుగా సర్కార్‌ తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరిస్తారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, అభివృద్ధి ప్రాజెక్ట్ లకు జాప్యం లేకుండా మంజూరు చేస్తున్న  అనుమతులు వంటి అంశాలను విదేశీ పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళతారు. పర్యాటక రంగంలో రాష్ట్రంలో ఉన్నఅపార అవకాశాలను వివరించాస్తారు.  ఏపీ రాజధాని అమరావతిలో విదేశీ విద్యాసంస్థల స్థాపన, ఐటీ కంపెనీ ఏర్పాటుపై వివిధ ప్రతినిధి బృందాలతో చంద్రబాబు చర్చలు జరుపుతారు.  అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటా బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ గతంలో ప్రకటించిన నేపథ్యంలో... వీలుంటే  ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
చంద్రబాబు వెంట వెళ్లిన ఉన్నతాధికార ప్రతినిధి బృందం 
చంద్రబాబునాయుడు వెంట ఉన్నతాధికార ప్రతినిధి బృందం కూడా లండన్‌ బయలుదేరి వెళ్లింది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ మంత్రి పీ నారాయణ, ప్రభుత్వ సలహాదారు వేమూరి రవికుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయంతో ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న సతీష్‌చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్‌  కూడా చంద్రబాబు వెంట లండన్‌ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారు.  రాజధాని నగరాభివృద్ధి సంస్థ... సీఎండీ.. లక్ష్మిపార్ధసారథి, పర్యాటన శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ కూడా సీఎం వెంట లండన్‌ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈనెల 14న హైదరాబాద్‌ తిరిగి వస్తారు. 

07:42 - March 11, 2016

హైదరాబాద్ : విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్ధికంగా ఆదుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఏపీకి అదనంగా నిధులు ఇవ్వకపోయినా... దక్షిణాదిలో ఉన్న ఇతర రాష్ట్రాలతో  సమానంగా అభివృద్ధి చెందేవరకు చేయూత ఇవ్వాలని చంద్రబాబు.. కేంద్రానికి విన్నవించారు. 
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌ రూల్స్ 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రులుతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ముందుగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన బాబు... విభజన చట్టంలోని అంశాల అమలుపై చర్చించారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌, ఉద్యోగుల  పిల్లల స్థానికత వంటి అంశాలపై చర్చించారు. వచ్చే జూన్‌ నుంచి అమరావతి నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయించిన దృష్ట్యా... హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులను రాజధానికి తరలించనున్న అంశంపై రాజ్‌నాథ్‌లో చర్చించారు. ఉద్యోగులు పిల్లల స్థానికత సమస్యను  సత్వరం పరిష్కరించాలని చంద్రబాబు కోరగా... ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాజ్‌నాధ్‌సింగ్‌... చెప్పారు.
ఏపీకి రూ.16 వేల కోట్ల రెవిన్యూ లోటు 
రాజ్‌నాథ్‌సింగ్‌ తర్వాత ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి 16 వేల కోట్ల రూపాయల రెవిన్యూలోటు ఉన్న విషయాన్ని  గుర్తు చేశారు. ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా యూపీఏ ప్రభుత్వ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. దక్షిణాదిలో వ్యవసాయంపై ఎక్కువగా  ఆధారపడిన రాష్ట్రం ఏపీ ఒక్కటేని వివరించారు. పారిశ్రామిక, సేవా రంగాలపరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల ఆదాయం ఎక్కువగా ఉన్న విషయాన్ని అరుణ్‌ జైట్లీ దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కు కూడా ఎక్కువగా నిధులు ఇవ్వాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. విశాఖకు  రైల్వే జోన్‌ పై కూడా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. 

 

07:35 - March 11, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ పులు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం  జరిగిన కేబినెట్‌ భేటీలో  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి ఆమోదముద్ర లభించింది. ఈ పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు.  వచ్చే ఏప్రిల్‌ నుంచి మూడేళ్లపాటు అమలు చేసే ఈ పథకానికి  8 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు. ప్రతి కనెక్షన్‌కు 1600 రూపాయల ఆర్ధిక సహాయం అందచేస్తారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పథకం కింది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పగించారు. గ్రామీణ పేద మహిళలకు ఎల్ పిజి అందుబాటులోకి  తీసుకురావడంతోపాటు, ఆహారం  తయారీకి  వంట చెరకు వాడటంతో జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని  ప్రకటించారు. 

 

07:33 - March 11, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలు హడలెత్తిస్తున్నాయి. పోలీస్‌ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఒకరిని మట్టుబెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. వారి సానుభూతిపరులపై ప్రత్యేక నిఘా పెట్టడం కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నక్సల్స్‌కు వసతి లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
తిర్యాణి, ఖానాపూర్‌, కడెం అడవుల్లో సంచారం
ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. మావోయిస్టుల పేరు వినగానే కొందరు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల వ్యవహారం అలజడి రేపుతోంది. తిర్యాణి, ఖానాపూర్‌, కడెం, అడవుల్లో వాళ్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కుర్రెఘడ్‌, తిర్యాణి, ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవల తిర్యాణి మండలంలో పోలీసు ఇన్ఫార్మర్‌ నెపంతో బల్లార్షా అనే యువకుడిని హత్య చేశారు. అయితే మావోయిస్టులు కేవలం అటవీ ప్రాంతాల్లోనేగాక మైదాన ప్రాంతాల్లోనూ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మావోయిస్టు సానుభూతి పరుల సాయంతో వాళ్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని తేలింది. దీంతో సానుభూతిపరులపై పోలీసులు ఫోకస్ చేశారు. 
వేమనపల్లి, కోటపల్లికి చెందిన ముగ్గురి అరెస్ట్
నెన్నెల మండలం దమ్మిరెడ్డిపేటకు చెందిన పుల్లయ్య అనే మావోయిస్టు సానుభూతిపరున్ని పోలీసులు అరెస్టు చేసి అతని వద్దనున్న 9ఎం.ఎం రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే వేమనపల్లి, కోటపల్లి మండలాలకు చెందిన ముగ్గురు సానుభూతిపరులను చెన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు సంఘటనలే గాక నెల రోజుల కిందట మందమర్రికి చెందిన ఓ వ్యక్తి మెదక్‌ పోలీసులకు అనుకోకుండా పట్టుబడ్డాడు. విచారణలో ఆయన మావోయిస్టు సానుభూతిపరుడని తేలింది. 15రోజులుగా పోలీసులు వివిధ గ్రామాల్లో సానుభూతిపరుల వివరాలు సేకరించి వారిని పిలిపించి విచారిస్తున్నారు. 
బల్లార్షా హత్య తర్వాత పోలీసు చర్యలు ముమ్మరం
బల్లార్షా హత్య, తర్వాత చోటు చేసుకున్న వరుస సంఘటనల తర్వాత కొంతకాలంగా మావోయిస్టుల కదలికలు కొద్దిగా తగ్గాయి. అటవీ ప్రాంతంలో వారి కదలికలను ఎప్పటికప్పుడు కట్టడి చేసే పనిలో భాగంగా పోలీసులు నిరంతరం జల్లెడ పడుతున్నారు. ఇక జిల్లాలోని మావోయిస్టు అగ్ర నేతలు శోభన్‌, అడెల్లు, బండి ప్రకాష్‌ లాంటి వారు మందమర్రి, నెన్నెల మండలాల్లోని ప్రాంతాలకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు ఎవరైనా సహకారమందిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

07:28 - March 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంపై మూడున్నర వేల గంటలపాటు మేథోమథనం జరిగిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌ రాసిన డేట్ లైన్ హైదరాబాద్‌ పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాన్ని పంచాయతీ ఎన్నికలతో ప్రారంభించానని అన్నారు. 
2001 కంటే ముందే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2001 కంటే ముందే మొదలైంది.. దాన్ని మరింత ఉధృతం చేసి అందరి కలను సాకారం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రాసిన 'డేట్ లైన్ హైదరాబాద్‌' వ్యాస సంకలనాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్‌ అధినేత... తెలంగాణ ఉద్యమం గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
నిశిత పరిశీలనతో డేట్‌లైన్ హైదరాబాద్ పుస్తక రచన
నిశిత పరిశీలనతో దేవులపల్లి అమర్ డేట్‌లైన్ హైదరాబాద్ పుస్తకాన్ని రాశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని తొలుత పంచాయతీ ఎన్నికలతో ప్రారంభించానని కెసిఆర్ అన్నారు. ఆనాడు చంద్రబాబునాయుడు కరెంట్ ఛార్జీలు పెంచుతామంటే తెలంగాణలో టీడీపీ భూస్థాపితమవుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అలా చేయకపోతే రాష్ట్రం సాధించుకునే వాళ్లం కాదు 
ఉద్యమం వెల్లువలా పోటెత్తాలంటే వ్యక్తులు సరిపోరు.. సమూహం కావాలని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం పొలిటికల్ ఫార్మాట్ తీసుకుని ఉండకపోతే ఇప్పటికీ రాష్ట్రం సాధించుకునే వాళ్లం కాదన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నాను కాబట్టే జాతీయ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ కోసం అందరినీ ఏకం చేయగలిగానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఈ ప్రాంత ప్రజల పోరాటానికి ఏకైక పరిష్కారమని వారందరితో చెప్పించగలిగామన్నారు. డేట్ లైన్ హైదరాబాద్ పుస్తకావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

నేను ఎక్కడికి పారిపోలేదు : విజయ్ మాల్యా

లండన్ : తాను ఎక్కడికి పారిపోలేదని వ్యాపార వేత్త విజయ్ మాల్యా ప్రకటించారు. ఓ ఎంపిగా లా ఆండ్ ఆర్డర్ పై తనకు నమ్మకముందని చెప్పారు. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని తెలిపారు. 
 

టీటీడీలో సాధారణంగా భక్తుల రద్ధీ

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. 7 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంటే, నడకదారి భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం

హైదరాబాద్‌ : టీ20 ప్రపంచకప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు రోహిత్‌ శర్మ 98 పరుగుల చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 19.2 ఓవర్లలోనే 140 పరుగులకు కుప్పకూలింది. భారత్‌ బౌలర్లలో పవన్‌ నేగి, మహ్మద్‌ షమి, జడేజా, పాండ్య తలో రెండు వికెట్లు తీయగా.. హర్భజన్‌, బుమ్రా చెరో వికెట్‌ తీశారు.

ఎమ్మెల్లార్‌ ఐటీఎం కాలేజీలో ప్రత్యేక రిక్ర్యూట్ మెంట్ డ్రైవ్

హైదరాబాద్ : దుండిగల్ గ్రామ పరిధిలోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఎమ్మెల్లార్‌ఐటీఎం) కళాశాలలో శుక్ర, శని వారాల్లో 1000 జాబ్‌మేళా పేరుతో ప్రత్యేక రిక్య్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దేశంలోని పేరు పొందిన 26కు పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయన్నారు. బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

 

నేడు భారత్ కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఢిల్లీ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు నేడు భారత్ కు రానుంది. 19న కోల్ కతాలో భారత్, పాక్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనుంది. 

 

07:00 - March 11, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది అధికార పార్టీ గూటికి చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. అయితే  పార్టీ మారిన శాసనసభ్యుల విజ్ఙప్తి మేరకు స్పీకర్  టీఆర్ ఎస్ లో చేరిన టీడీపీ శాసనసభ్యులను అధికారపార్టీ సభ్యులగా గుర్తిస్తూ బులిటిన్ విడుదల చేశారు.
తీవ్రంగా నష్ట పోయిన టీడీపీ
తెలంగాణలో జోరుగా సాగిన వలసలతో టీడీపీ తీవ్రంగా నష్ట పోయింది. సాధారణ ఎన్నికల్లో 15  స్థానాల్లో విజయం సాధించారు టీడీపీ శాసనసభ్యులు. అయితే...... తెలంగాణ రాష్ట్ర సమితి  నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో  తెలుగుతమ్ముళ్లు పెద్ద ఎత్తున కారెక్కారు.  ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి టీడీపీ శాసనసభ్యులను టార్గెట్ చేస్తూ....గులాబి దళంలో ఆ పార్టీ శాసనసభ్యులను కలుపుకుంది.
మొదటి విడతలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరిక 
మొదటి విడతలో ఐదుగురు శాసనసభ్యులు అధికార పార్టీలో చేరారు. వీరిలో మంత్రిగా తలసానికి అవకాశం కల్పించారు. ఇటీవల కాలంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పది మంది శాసనసభ్యులు అధికార పార్టీలో చేరడంతో తమను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించాలని  స్పీకర్ మధుసూధనా చారికి ఎర్రబెల్లి లేఖ రాశారు. అనంతరం జరిగిన పరిణామాలతో  ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ ఎస్ లో చేరేందుకు  రెడీ అయ్యారు. శుక్రవారం ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో కారెక్కనున్నారు. దీంతో 12 మంది శాసనసభ్యులు తమను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించాలని మరో లేఖను స్పీకర్‌కు అందించారు.
టీడీపీ  శాసనసభ్యుల లేఖతో ఏకీభవించిన స్పీకర్ 
తెలుగుదేశం పార్టీ  శాసనసభ్యుల లేఖతో స్పీకర్ కూడా ఏకీభవించారు. గులాబీ పార్టీలో శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌ రావ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి,  కెపి వివేకానంద, రాజేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, మాగంటి గోపినాథ్, అరికపూడి గాంధీలను టీఆర్ ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ సభ్యులకు కేటాయించిన విధంగానే వారికి సభలో సీట్ల కేటాయింపు జరుపుతున్నట్లు స్పీకర్  బులిటిన్ విడుదల చేశారు.
ఇక టీ.టీడీపీకి మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే
ఇక తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలుగా రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్యలు మాత్రమే కొనసాగనున్నారు. శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎదురైంది. అప్పట్లో లైట్ గా తీసుకున్న టిడిపి తాజా నిర్ణయంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. మరోవైపు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల విలీనంతో టీఆర్‌ఎస్‌ బలం 84కు పెరిగింది.

 

06:50 - March 11, 2016


హైదరాబాద్ : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ సమాయత్తమవుతోంది. ఈనెల 14న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ కోడెల.. వైసీపీకి అనుమతించారు. తమకు తగినంత సంఖ్యాబలం లేకున్నా.. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులోనూ పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలన్న వ్యూహమూ దీని వెనుక ఉందని అంటున్నారు. 
ఈ నెల 14న అవిశ్వాసంపై చర్చకు స్పీకర్‌ అంగీకారం
ఎపి ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ రూల్స్ 75వ నిబంధన ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. దీనిపై 15మంది వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎంఎల్ఎలు సంతకాలు చేశారు. ఈ నోటీసు అందుకున్న స్పీకర్‌... ఈ నెల 14న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించారు. 
హామీలు నెరవేర్చడంలో టిడిపి విఫలలం : వైసీపీ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టిడిపి విఫలమైందని... ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని భూముల్లోకూడా భారీగా అవినీతి జరిగిందని, ఈ భూముల అక్రమాల్లో సీఎం చంద్రబాబు కుటుంబంతోపాటు... మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా ఉన్నారని వైసీపీ విమర్శిస్తోంది. ప్రభుత్వ తీరును బట్టబయలు చేసేందుకే అవిశ్వాసం తీర్మానం పెట్టామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..
ఓటింగ్‌కు ముందు విప్‌ జారీ చేయాలని వైసీపీ నిర్ణయం
ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.. అవిశ్వాసంపై ఓటింగ్‌కు ముందు పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.. ఒకవేళ విప్‌ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరిస్తోంది.
ఓటింగ్‌లో వైసీపీకి మద్దతిస్తారా? 
అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఏం చేస్తారో.. వారిని అధికార పక్షం ఎలా కాపాడుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్‌లో వైసీపీకి మద్దతిస్తారా? లేక టీడీపీకి జై కొట్టి పదవి కోల్పోతారా..? అన్నది ఈ నెల 14న తేలనుంది. 

టీఆర్ ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు నేడు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు నేడు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరుగనుంది. టీఆర్ ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ నిన్న టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించారు. 

తెలంగాణలో నేటి ఇంటర్ పరీక్షకు సెట్ ఏ-ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : తెలంగాణలో నేడు జరుగనున్న ఇంటర్ పరీక్షకు సెట్ నెంబర్ ఏ-ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. 

నేడు రెండో రోజు టీ.అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలపనుంది. 

Don't Miss