Activities calendar

12 March 2016

21:30 - March 12, 2016

ఢిల్లీ : భారత్‌లో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అడ్వాన్సింగ్ ఆసియా సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఓ ఆశాకిరణంగా మారిందని, వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. దేశంలో రైతు ఆదాయం రెట్టింపు కావాలన్నదే తమ లక్ష్యమని.. ఇందుకోసం గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెడతామని చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గిందని, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకున్నామని తెలిపారు. అవినీతి, బ్యాంకుల మోసాలను సహించేది లేదంటూ మోది హెచ్చరించారు. 

21:29 - March 12, 2016

పశ్చిమ బెంగాల్‌ : ముర్షిదాబాద్‌ జిల్లాలోని ఫరక్కా పవర్‌ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లను మూసి వేశారు. ఫరక్క కెనాల్‌లో నీటి మట్టం పూర్తిగా అడుగంటి పోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు యూనిట్ల ద్వారా 16 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఐదు యూనిట్ల మూసివేత కారణంగా బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్, ఓడిషా రాష్ట్రాలపై విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలగనుందని అధికారులు పేర్కొన్నారు. 

కోల్ కతా చేరుకున్న పాక్ క్రికెట్ జట్టు

పశ్చిమబెంగాల్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కోల్‌కతాకు చేరుకుంది. పాక్ జట్టు రాకతో భారత్-పాక్ మ్యాచ్‌పై అనిశ్చితి తొలగింది. ఈ నెల 19న భారత్-పాక్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. పాక్ జట్టు రాక సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్ట్..

హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా, సీఎఫ్‌వో రఘునాథ్‌లకు నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఏప్రిల్ 13లోగా వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాలని పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శనివారం ఆదేశించారు. ఎయిర్‌పోర్టుకు చెల్లించాల్సిన పన్నుల్లో భాగంగా కింగ్‌ఫిషర్ ఇచ్చిన రూ.50 లక్షల చెక్కు బౌన్స్ కావడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.

గాయని మధుప్రియకు భర్త వేధింపులు

హైదరాబాద్: సింగర్ మధు ప్రియ భర్తపై హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్నది. ఆడపిల్లనమ్మా అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన సింగర్ మధుప్రియ.. 4 నెలల క్రితం తను ప్రేమించిన శ్రీకాంత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అంతేకాదు పెళ్లికూడా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది.

 

20:48 - March 12, 2016

హైదరాబాద్: సింగర్ మధు ప్రియ భర్తపై హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 4 నెలల క్రితం పేమ పెళ్లి చేసుకున్న తనను భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్నది. ఆడపిల్లనమ్మా అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన సింగర్ మధుప్రియ.. తను ప్రేమించిన శ్రీకాంత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అంతేకాదు పెళ్లికూడా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. 
మధుప్రియ తల్లి నూరిపోస్తుంది - శ్రీకాంత్.. 
మధుప్రియ తల్లిదండ్రులే తమపై దాడి చేయించారని భర్త శ్రీకాంత్ ఆరోపించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. మధుప్రియ తల్లిదండ్రులే తమపై దాడి చేయించారని ఆమె భర్త శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. తాను ఇప్పటివరకూ ఎవరిపై కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు.. ఫిర్యాదు విషయం తెలుసుకున్న అనంతరం మధు ప్రియ ఇంటికి వెళ్లానని, మధుప్రియ తల్లి..సోదరి అందరూ అక్కడ ఉన్నారని తెలిపారు. మధుప్రియ తల్లి తనపై దాడి చేసిందని, వెంటనే అక్కడున్న తరులు తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపించారు. తల్లి బాగా నూరిపోస్తుందని, తానే హింసకు గురయ్యానని, గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని తెలిపారు. కానీ తాను మాత్రం ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. హుమాయిన్ నగర్ పీఎస్ కు వెళుతున్నానని, తనతో వచ్చిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారని శ్రీకాంత్ తెలిపారు. 
తనతో బంధం ముగిసినట్టే - మధుప్రియ...
తనకిప్పుడు తల్లిదండ్రులు ముఖ్యమని, శ్రీకాంత్‌తో వివాహ బంధం దాదాపుగా ముగిసినట్టేనని గాయని మధుప్రియ అన్నారు. చంపుతామంటూ శ్రీకాంత్ కుటుంబం బెదిరిస్తోందని చెప్పారు. కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు తాను పీఎస్ కు వెళ్లడం జరుగుతోందని గాయని మధుప్రియ పేర్కొన్నారు. కత్తులు పట్టుకొని వచ్చారని, తాము కాపాడుకొనే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. చంపేంత మూర్ఖులు తాము కాదని, చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని..ఆ గొడవలే ఇంతవరకు దారి తీశాయని మధుప్రియ ఆ మనిషి మారడేమోనని ఫీలింగ్ ఉందని, శ్రీకాంత్ ఒకే అని తల్లిదండ్రులు అంటే అప్పుడు ఆలోచిస్తానని మధుప్రియ పేర్కొంది. 

20:41 - March 12, 2016

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం మేకింగ్ వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలవడం అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది. కాగా, బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

20:36 - March 12, 2016

హైదరాబాద్ : ఓ ఆడియో ఫంక్షన్ లో టంగ్ స్లిప్ అయిన హీరో బాలకృష్ణ, ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇన్ ఆర్బిట్ మాల్ వాచ్ దొంగతనం, జట్ ఎయిర్ లైన్స్ వారికి లక్ష రూపాయల ఫైన్ విధించిన కోర్టు.. అంతేకాకుండా ఇంకొన్ని అంశాలతో సాయికిరణ్ రడీగా ఉన్నారు. మరి ఇంక లేటెందుకు... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

నీటి కొరతతో మూతపడ్డ ఫరక్కా ఎన్టీపీసీ

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ లోని ఫరక్కా ఎన్టీపీసీ లో నీటి కొరత తీవ్రంగా ఉంది. నీటి సమస్య ఈరోజు మరీ ఎక్కువగా ఉండటంతో ప్లాంట్ లోని ఐదు యూనిట్లను మూసివేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ అధికారులు ఒక ప్రకటన చేశారు. కాగా, గత పదేళ్లలో ఈ ప్లాంట్ ను మూసివేయడం ఇదే మొదటిసారి అని, నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో కేవలం ఆరో యూనిట్ మాత్రమే నడుస్తుందని... 500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పారు.

లండన్ లో అమరావతి కార్యాలయం

హైదరాబాద్ : లండన్‌లో అమరావతి కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా పెట్టుబడిదారులతో ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ సంప్రదింపులు జరపనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

20:25 - March 12, 2016

హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను మే 1న నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్) నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. పాఠశాల విద్యాశాఖ రేపు టెట్ ప్రకటన జారీ చేయనుంది. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 20న హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్. మే 1న టెట్ పరీక్ష నిర్వహణ. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష.

20:22 - March 12, 2016

హైదరాబాద్ : వైజాగ్‌లో గత నెల 12న ఆత్మహత్య చేసుకున్న గీతం యూనివర్శిటీ విద్యార్థిని శ్రీయ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అమ్ముగూడా స్మశాన వాటిలో శ్రీయ మృతదేహాన్ని బయటకు తీసి మల్కజ్‌గిరి తహసీల్దార్‌ సమక్షంలో శవపంచనామా చేశారు. శ్రీయ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రీపోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. ఇరు రాష్ట్రాల మెడికల్‌ డైరెక్టర్ల సమక్షంలో మృతదేహాం నుంచి నమూనాలు సేకరించి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. 

20:20 - March 12, 2016

హైదరాబాద్ : విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను పెంచి పోషించింది కాంగ్రెస్, బీజేపీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విజయ్‌మాల్యా 7వేల కోట్ల రూపాయలు బ్యాంకర్లకు కట్టకుండా ఎగ్గొట్టడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే కారణమన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ కూడా విజయ్‌మాల్యాకు అండగా ఉన్నారని ఆరోపించారు. 

20:17 - March 12, 2016

హైదరాబాద్ :తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉద్యోగం వదిలేసిన మొట్ట మొదటి వ్యక్తుల్లో నేనొకడిని.., ఏనాడు ఎమ్మెల్యే, లేక ప్రజాప్రతినిధి కావాలని ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించానని మల్లన్న'రచ్చబండ'కార్యక్రమంలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, ఒకప్పటి ఉద్యమకారుడు యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన విద్యాభాస్యం అంతా ఉస్మానియా యూనివర్శిటీ, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో ఎంబిఏ చేసి అనంతరం బాంబే, ఢిల్లీల్లో కస్టమ్స్ ఆఫీసర్ గా చేస్తూ 2001 లో టిఆర్ ఎస్ పార్టీ స్థాపన సందర్భంగా ఉద్యమంలో చేరాని తెలిపారు.. ఇంకా ఆయన ఏఏ విషయాలను మల్లన్నతో పంచుకున్నారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:03 - March 12, 2016

హైదరాబాద్ : స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి దర్శక నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్ర 'దండకారణ్యం'. ఆర్. నారాయణమూర్తి, త్రినాథ్, ప్రసాద్ రెడ్డి, విక్రమ్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. మార్చి 18న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారని.. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌ గనుల తవ్వకాల్లో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుందని... ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'. ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపి అరణ్యంలో శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కారించాలన్నారు. ఆదివాసీయుల సంపద వారికే చెందాలనే చెప్పేదే ఈ చిత్రం అన్నారు. ఏడు పాటలున్న ఈ చిత్రంలో మూడు పాటలను గద్దర్‌ మూడు పాడగా, మరో నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారన్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఆ ఒప్పందాలను బహిరంగ పర్చాలి : తమ్మినేని

హైదరాబాద్ : ప్రాజెక్టులపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను తెలంగాణ సర్కార్ బహిరంగ పర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఒక పక్క ఒప్పందాలేమీ జరగలేదని మహారాష్ట్ర మంత్రి ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఇవ్వాలని, ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వాస్తవాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

షాదీముబారక్ పై ఏసీబీ కన్ను

హైదరాబాద్ : వరంగల్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది వరకే పెళ్లిళ్లు చేసుకున్న వారు షాదీ ముబాకర్ కింద లబ్ది పొందడానికి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

18:13 - March 12, 2016

కృష్ణా : ఏపీ రాజధాని ఏరియాలోని కంకిపాడు మండలం పొద్దుటూరు గ్రామంలో పొలంలోని బోరు నుంచి నీళ్లు ఎగజిమ్ముత్తున్నాయి. కరెంటు మోటర్ సహాయం లేకుండానే నీరు రావడాన్ని జనం ఆసక్తిగా చూస్తున్నారు. భూమి పొరల్లో గ్యాస్ ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఓ రైతు తన పొలంలో మూడు రోజుల క్రితం బోరుబావి వేశారు. దాదాపు 150 అడుగులు వేసిన బోరు వేశారు. అయితే బోర్‌కు మోటర్ బిగించి కరెంట్ సహాయంతో స్టాటర్ ఆన్ చేయగా మోటర్‌తో సహా బయటికి వచ్చిపడింది. అంతే కాదు ఎన్ని అడుగులు బోరు వేశారో అన్ని అడుగులు నీరు పైకి ఎగజిమ్ముత్తోంది. దీంతో ఈ విచిత్రాన్ని చూడటానికి జనాలంతా పెద్దఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. నీటితో పాటు గ్యాస్ కూడా వస్తుండటంతో ఓఎన్‌జీసీ, పోలీసు అధికారులతొ పాటు ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అమ్మకానికి పీటర్ ముఖర్జియా బంగ్లా...

ముంబై: స్టార్ టీవీ మాజీ సీఈవో పీటర్ ముఖర్జియాకు గడ్డుకాలం వచ్చింది. షీనా బోరా హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటోన్న ఆయన చివరికి కోర్టు ఖర్చుల కోసం తన బంగ్లాను అమ్మకానికి పెట్టాడు. కోర్టు ఖర్చుల కోసం ఆయన చేస్తోన్న ఖర్చు తడిచిమోపెడైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బంగ్లా మూడు వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఈ బంగ్లా సుమారు రూ.15 నుంచి 20 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. 

మే 1న తెలంగాణ టెట్ పరీక్ష

హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను మే 1న నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం మళ్లీ ప్రకటన జారీ చేయనుంది. టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రకటనను పాఠశాల విద్యాశాఖ ఆదివారం వెలువరించే అవకాశం ఉంది. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

వనస్థలీపురంలో రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

హైదరాబాద్: వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో భార్య మృతిచెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

17:40 - March 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర కరువు ఉందని..ఈ అంశాన్ని గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని భధ్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజయ్య మాట్లాడారు. కరువు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజయ్య అన్నారు. రీడిజైనింగ్‌ పేరుతో కాలయాపన చేయకుండా సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 

17:38 - March 12, 2016

మహబూబ్‌నగర్‌ : బిజ్నీపల్లి మండలం అట్టుపల్లి గ్రామంలో రసాయన గుళికలు కలిపిన నీళ్లు తాగడంతో కొంతమంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నీటిట్యాంకులో గుళికలు కలపడంతో...ఆ నీరుతాగిన 20మంది గ్రామస్తులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వెంటనే వారిని నాగర్‌కర్నూల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ట్యాంకులో రసాయన గులికలు కలిపిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ నీటినంతా పారబోశారు. దీనికి కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

17:36 - March 12, 2016

హైదరాబాద్‌ : వనస్థలిపురం ఆటో నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.. శ్రీ రాధాకృష్ణ ఆటోమొబైల్స్ వర్క్‌షాప్‌లో మంటలంటుకున్నాయి.. ఈ మంటల్లో మూడు లారీలు దగ్ధమయ్యాయి.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.. 

17:35 - March 12, 2016

వరంగల్ : ఆటపాటలతో అలరిస్తున్నారు. డ్యాన్సులతో దుమ్ము లేపుతున్నారు. సంగీతంతో సందడి చేస్తున్నారు. డీజేలతో హోరెత్తిస్తున్నారు. సినీ నటులు కూడా వీరికి జత కలుస్తూ జోష్‌ నింపుతున్నారు. ఇలా వరంగల్‌ నిట్‌లో స్ర్పింగ్‌ స్ర్పీ సందడి నెలకొంది. సాయంత్రం వేళల్లో సరికొత్త వేడుక ఉత్సాహంగా సాగుతోంది.

శుక్రవారం ప్రారంభం...

వరంగల్‌ నిట్‌లో స్ప్రింగ్‌ స్ర్పీ సందడి నెలకొంది. శుక్రవారం నాడు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్ప్రింగ్‌ స్ప్రీలో నిట్‌ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డ్యాన్స్ కార్యక్రమాలతో ఉర్రూతలూగిస్తున్నారు. స్పాట్‌ లైట్స్‌, ఎంజీల్‌ పాటలు, వర్స్‌షాప్స్‌ వంటి 30 రకాల ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. స్ర్పింగ్‌ స్ర్పిలో ముంబయ్‌ డీజే ప్రోగ్రామ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

ప్రముఖ దర్శకులు, సినీ నటులు కూడా....

ప్రముఖ దర్శకులు, సినీ నటులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం కళ్యాణ వైభోగమే టీమ్‌ స్ర్పింగ్‌ స్ర్పిలో సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన చిట్‌చాట్‌లో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సినిమా హీరో, దర్శకురాలు సమాధానాలు ఇచ్చారు.

వికలాంగ చిన్నారులకూ ప్రత్యేక కార్యక్రమాలు....

స్ర్పింగ్‌ స్ర్పిలో భాగంగా వికలాంగ చిన్నారులకూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. క్రికెట్‌, చెస్‌ వంటి ఈవెంట్లను నిర్వహించారు. మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌ ఆదివారంతో ముగుస్తుంది. 

కంకిపాడులో బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు...

కృష్ణా : కంకిపాడులో బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. సుమారు 50 అడుగుల ఎత్వు వరకు నీరు చిమ్ముతోంది. భూమి పొరల్లో గ్యాస్ ఉండవచ్చని శాస్త్రవత్తేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై రేపు సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.

21 నుండి తెలంగాణలో టెన్త్ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21 నుండి ఏప్రిల్ 9వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుండి మ.12.15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 5 నిమిసాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ తెలింపింది. విద్యార్థులో పాటు సిబ్బందికీ సెల్ పోన్లు అనుమతి లేదన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే కెమెరా లేని సెల్ పోన్ కు అనుమతి ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

17:02 - March 12, 2016

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడలో మరో నకిలీ పదార్థాల తయారీ కేంద్రం బయపడింది. కుషాయిగూడలోని ఓ ఇంటిపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు చేయగా... భారీగా నకిలీ తేనె, నెయ్యి పట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. 

16:59 - March 12, 2016

హైదరాబాద్ : బలహీన వర్గాల అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమయ్యిందని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో లక్ష్మణ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో పలు యూనివర్శీటీల్లో ఇన్‌ఛార్జ్‌ వీసీల పాలన సాగుతోందని లక్షణ్‌ అన్నారు. 2 పడకల ఇళ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తే..వాటిని మూటకట్టి పక్కన పెట్టారని మండిపడ్డారు. 

16:57 - March 12, 2016

వరంగల్‌ : జిల్లాలో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మకూర్‌ మండలం దామెరకు చెందిన సరిత వరంగల్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తుండేది. కుటుంబ పోషణ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చింది. అవి చెల్లించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే సరిత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సరిత మృతితో ఇద్దరు కుమార్తెలు వీధిన పడ్డారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం మార్చూరీకి తలరించారు. 

16:56 - March 12, 2016

ఢిల్లీ : యూనివర్సిటీల్లో చాలా కాలంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశద్రోహానికి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. జెఎన్‌యులో దేశ విభజనకు అనుకూలంగా నినాదాలు చేసినవారిని ఎలా సహిస్తారని ప్రశ్నించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను కూడా కట్టడి చేయాలని మోహన్ భగవత్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి చీఫ్‌ అమిత్‌ షా కూడా హాజరయ్యారు.

 

16:54 - March 12, 2016

టైటానిక్ పేరు తెలియని సినీ ప్రియులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి లేదు. ఆ సినిమాను చూడని ప్రేమ జంటలు ఉండరని కూడా వేరుగా చెప్పనక్కర్లేదు. మరి చరిత్రలో టైటానిక్ నిలిచిపోవడానికి, ఇంతగా గుర్తుంచుకోవడానికి కారణమయిన మంచు పర్వతం గుర్తులేకుండా పోదు. ఆ మంచు కొండ వయస్సు ఏకంగా లక్ష సంవత్సరాలట.

104 సంవత్సరాల క్రితం....

దాదాపు 104 సంవత్సరాల క్రితం సౌతాంఫ్టన్ నుంచి న్యూయార్క్ నగరానికి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి దాదాపు 1500 మందిని జలసమాధి చేసిన నౌక టైటానిక్. ప్రపంచంలో అత్యంత దురదృష్ట సంఘటనల్లో ఇదొకటిగా నిలిచిపోయింది.

1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ ....

అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైంది ఐస్‌బర్గ్. ఆ ఐస్‌ బర్గ్‌ ఇదే....ఇంతటి విషాదానికి కారణమైన ఐస్‌బర్గ్ కథేంటో తేల్చాలనుకున్నారు బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్ర్తవేత్తలు. తమ పరిశోధనలో ఈ మంచుకొండ లక్ష ఏళ్ల నాటి దని తేల్చారు. గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు.

మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై .....

మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాంట్ బిగ్ 'టైటానిక్' ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు వెల్లడించారు.

మంచు పర్వతం 1700 అడుగుల పొడవు....

ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు.

16:34 - March 12, 2016

హైదరాబాద్ : పాతబస్తీలోని హుస్సేనీఆలం పరిధిలోని కోకాకి తట్టి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ పురాతన భవనాన్ని కూల్చేశారు. మట్టి తవ్వుతుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫిరంగిని స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

16:32 - March 12, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలు వద్దని బిసీ సంఘం నేత, టిడిపిఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. టిఎస్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు. ప్రైవేటు యూనివర్శిటీలు వస్తే అటానమస్ యూనివర్శిటీలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి నిధుల కేటాయింపు సంతోషమే.. కానీ ప్రైయారీటీ ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ల కల్పన అంశం టీఆర్ ఎస్ మేనిఫెస్టోలో ఉందని కృష్ణయ్య గుర్తు చేశారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా..టిఆర్ ఎస్ ప్రభుత్వం బీసీలకిచ్చిన మామీలను మంరిచిపోయిందని, బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులేవని, చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ, రాయలసీమల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్ : తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండుతున్నాయి. రామగుండంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హైదరాబాద్ -38, నల్గొండ -37, అనంతపురం లో 40 , కర్నూలులో 39, నందిగామ -37, జంగమేశ్వరపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈఎస్ఐ ఆసుపత్రిల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం

హైదరాబాద్ : సనత్ నగర్, నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నిర్వహణకు సనత్ నగర్ ఆస్పత్రినికి కేంద్రానికి, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రినికి రాష్ట్రానికి అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. అదనంగా 500 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్రం నిర్మించనుంది. 2017 నుంచి భవన నిర్మాణ కార్మికులు ఈఎస్ఐ సేవలు అందించనున్నారు. సనత్ నగర్ మెడికల్ కాలేజీని సూపర్ స్పెషాలిటీఆసుపత్రిగా మారుస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం...

హైదరాబాద్  :మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంక్ తయారు చేసే ఓ కంపెనీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:53 - March 12, 2016

ముంబై: వివాదాల వర్మ కింగ్‌ఫిషర్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కారు. ట్విట్టర్‌ వేదికగా మాల్యాపై ఆయన పలు ట్వీట్లు చేశారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వమని అప్పుడు ఈ గొడవంతా సద్దుమణిగిపోతుందని ట్వీట్‌ చేశారు. మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అన్నారు. మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు. క్యాలెండర్‌ గర్ల్స్‌లో కొంత మంది బాలీవుడ్‌ నాయికల పేర్లను కూడా ప్రస్తావించారు. మాల్యా అప్పులపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్‌జీవీ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

15:47 - March 12, 2016

బీహార్‌: పాట్నా హైకోర్టు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోది పాల్గోనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకోసం జారీ చేసిన పాసుల్లో 25 పాసులు మాయం కావడం అధికారులను కలవరానికి గురి చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌తో పాటు దేశం నలు మూలల నుంచి జడ్జిలు, లాయర్లు పాల్గోనున్నారు. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాయమైన పాసుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతవరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.

15:45 - March 12, 2016

హైదరాబాద్ :ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తుందన్నారు మంత్రి ఈటెల. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఈటెల అన్నారు. 

15:43 - March 12, 2016

హైదరాబాద్ : సమైక్య పాలనలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు సీఎం కేసీఆర్‌. బచావత్‌ ట్రిబ్యూనల్‌ ఆంధ్రప్రదేశ్‌కే కేటాయింపులు జరిపిందని.. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. కృష్ణా నుంచి 368 టీఎంసీలే కేటాయించారని సీఎం కేసీఆర్ అన్నారు.

15:41 - March 12, 2016

గుంటూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొన్నూరు మండలం కసుకుర్రులో బీటెక్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ప్రేమ వేధింపులే కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అమూల్య ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఈ సంఘటన జరిగింది. ప్రేమ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నటుడు ఇమ్రాన్ హస్మీకి మాతృవియోగం...

ముంబై :బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తల్లి మహేరా హష్మీ మృతి చెందారు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హష్మీ సన్నిహిత వర్గాల సమాచారం. మహేరా హష్మీ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం రొమానియా పర్యటనలో ఉన్నారు. తన తల్లి మరణవార్త విషయం తెలియడంతో ఆయన తిరిగి భారత్ కు బయలుదేరినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 

పాతబస్తీలో నిజాం కాలం నాటి ఫిరంగి

హైదరాబాద్ : పాతబస్తీలోని హుస్సేనీఆలం పరిధిలోని కోకాకి తట్టి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ పురాతన భవనాన్ని కూల్చేశారు. మట్టి తవ్వుతుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫిరంగిని స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

కపిల్ చిట్ ఫండ్స్ ఆఫీసు ముందు నటి కరాటే కల్యాణి ఆందోళన

హైదరాబాద్‌: సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు రావాల్సిన తనకి రావాల్సిన 1.20 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ..అబిడ్స్‌లోని కపిల్‌చిట్‌ఫండ్స్‌ ఆఫీస్‌ ముందు బైఠాయించింది. తనకు రావాల్సిన డబ్బు ఇచ్చి తీరాల్సిందేనంటూ హల్ చల్ చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని సీసీఎస్‌ పోలీసులను నటి కల్యాణి ఆశ్రయించింది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పగా కళ్యాణి శాంతించింది.

15:34 - March 12, 2016

ఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కన్హయ్యను చంపుతామన్న పోస్టర్‌ కలకలం రేపింది. ''జేఎన్‌యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్‌లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని అందులో పేర్కొన్నాడు. పోస్టర్‌లో తన ఫోన్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు. ఆ పోస్టర్‌ను జంతర్‌ మంతర్‌ వద్ద నుంచి ఎవరో తొలగించారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15:32 - March 12, 2016

ఢిల్లీ: లోక్‌సభలో కేంద్రం ఆధార్‌ బిల్లును ఆదరా బాదరాగా ఆమోదించడాన్ని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఆధార్‌ బిల్లును మనీ బిల్లు రూపంలో పాస్‌ చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాజ్యసభను తక్కువ చేసి చూపడమే ప్రభుత్వ ఉద్దేశమని మండిపడ్డాయి. ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఇందుకోసం రాజ్యసభ సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని విపక్షాలు సూచించాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలివిడత సమావేశాలు మార్చి 16న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ బిల్లుపై చర్చించేందుకు సమావేశాలను పొడిగించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

15:28 - March 12, 2016

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 241కోట్లతో ఘాట్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.. మంత్రి దేవినేని ఉమ.. బెజవాడలో దుర్గా ఘాట్‌ నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు.. ఆలయంనుంచి భవానీపురంలోని కుమ్మరిపాలెం జంక్షన్‌వరకూ కాలివంతెన పనుల్నికూడా చూశారు.. దుర్గ ఘాట్‌నుంచి ఇబ్రహీంపట్నంవరకూ వివిధ స్థాయిల్లో పొడవాటి ఘాట్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. 

విజయవాడలో మంత్రి దేవినేని పర్యటన

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 241కోట్లతో ఘాట్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.. మంత్రి దేవినేని ఉమ.. బెజవాడలో దుర్గా ఘాట్‌ నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు.. ఆలయంనుంచి భవానీపురంలోని కుమ్మరిపాలెం జంక్షన్‌వరకూ కాలివంతెన పనుల్నికూడా చూశారు.. దుర్గ ఘాట్‌నుంచి ఇబ్రహీంపట్నంవరకూ వివిధ స్థాయిల్లో పొడవాటి ఘాట్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. 

కుషాయిగూడలో కల్తీ తేనె, నెయ్యి స్వాధీనం

హైదరాబాద్ : కుషాయిగూడలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ తేనె, నెయ్యి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా తేనె, నెయ్యి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

జీహెచ్ ఎంసీ అధికారులపై దాడి

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో జీహెచ్ ఎంసీ అధికారులపై దాడి జరిగింది. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లకు వెళ్లిన అధికారులపై ఖయ్యం, హకీం అనే ఇద్దరు వ్యక్తలు దాడి చేశారు. దీంతో ట్యాక్స్ కలెక్టర్ సురేష్ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై 323, 506,353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

ఏపీ కాపు కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ అమరేందర్

హైదరాబాద్: ఏపీ కాపు కార్పొరేషన్ ఎండీ నియామకం జరిగింది. డాక్టర్ ఆర్‌ అమరేందర్‌‌ను ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అమరేందర్‌ ప్రస్తుతం పర్యాటకశాఖలో విధులు నిర్వహిస్తున్నారు .

కాల్‌మనీ వేధింపులతో ఒకరి ఆత్మహత్య

గుంటూరు : కాల్‌మనీ వేధింపుల కారణంగా జిల్లా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బ్రాడీపేట్‌కు చెందిన శ్రీరాంమూర్తి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీరాంమూర్తి సూసైడ్ నోట్ రాశారు. ఈ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు :ప్రకాశం జిల్లా చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అమూల్య ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఈ సంఘటన జరిగింది. ప్రేమ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

14:53 - March 12, 2016

హైదరాబాద్ : అటెండెన్సేమో ఫుల్లు... వర్కర్లేమో నిల్లుగా తయారైంది గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిస్థితి.... లేని కార్మికుల పేరుతో సూపర్‌వైజర్లే జీతాలు భోంచేస్తున్నారు.. ఇక రాత్రంతా ఒళ్లు వంచే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.. రాత్రులు జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ పేరుతో ఏం జరుగుతోంది? టెన్‌ టీవీ పరిశోధనలో వెల్లడైన వివరాలతో స్పెషల్ స్టోరీ..

గ్రేటర్‌ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు....

గ్రేటర్‌ హైదరాబాద్‌... దేశంలోని టాప్‌ సిటీల్లో ఒకటి.. 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంఉన్న ఈ ప్రాంతంలో 20 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి.. 7వేల కిలోమీటర్ల రోడ్లు, 2లక్షలకుపైగా వ్యాపార కేంద్రాలున్నాయి.. గ్రేటర్‌ను క్లీన్‌గా ఉంచే పనుల్లో దాదాపు 22వేలమంది కార్మికులున్నారు.. ప్రతిరోజు వీరు 4టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.. సిటీ శుభ్రతకోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు..

ఇదంతా నాణేనికి ఒకవైపే..

అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. పైకి కనిపించేదొకటి.. లోపల జరుగుతున్నది మరొకటి.. ఈ సంగతేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది టెన్‌ టీవీ.. ఈ పరిశోధనలో అందరూ నివ్వెరపోయే నిజాలు బయటకొచ్చాయి.. సూపర్‌వైజర్లు, కొందరు అధికారుల అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.. అటెండెన్స్‌లో ఫుల్లుగా ఉన్న హాజరు... అసలు విషయానికి వచ్చేసరికి సగానికి సగం తగ్గుతోంది.. పనిచేసేది సగంమందే.... జీతాలు మాత్రం రెట్టింపు మందికి డ్రా అవుతున్నాయి..

గ్రేటర్‌లో శానిటేషన్‌ కార్మికులు గ్రూపులుగా....

గ్రేటర్‌లో శానిటేషన్‌ కార్మికులు గ్రూపులుగా పనిచేస్తారు... ఒక్కో గ్రూపులో ఏడుగురు సభ్యులుంటారు.. ఒకరు సెలవులో ఉన్నా ఆరుగురు పనిలో ఉండాలి.. అయితే గ్రౌండ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.. చాలా ప్రాంతాల్లో టెన్‌ టీవీకీమాత్రం కేవలం ముగ్గురే పనిచేస్తూ కనిపించారు.. మరికొన్ని చోట్ల ఒక్కరుమాత్రమే విధుల్లో ఉన్నారు.. మిగతా వారెక్కడ అంటే... వేరే ప్లేస్‌కు వెళ్లారన్న సమాధానం వచ్చింది.. అటెండెన్స్ చూపమంటే సమాధానం దాటవేశారు.. మరికొన్ని చోట్ల రాత్రి పదిగంటలకు తీసుకోవాల్సిన అటెండెన్స్ మీడియా వచ్చాక తెల్లవారుజామున రెండున్నర గంటలకు మొదలు పెట్టారు.. గ్రేటర్‌లోని చాలా ప్రాంతాల్లో కార్మికుల సంఖ్య గందరగోళంగానే ఉంది.. రిజిస్టర్‌లో చాలామంది కనిపిస్తారు.. తీరాచూస్తే అక్కడ ఒక్కరో ఇద్దరో కనినిస్తారు.. ఈ విషయంపై టెన్‌ టీవీ బృందం వివరాలు సేకరించింది...  

14:51 - March 12, 2016

హైదరాబాద్ : రాత్రిపూట విధులు.. ఎవరొచ్చి చూస్తారన్న ధైర్యం జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్లలో ధైర్యం పెంచుతోంది.. దీన్ని ఆధారంగా చేసుకొని మరికొన్ని అక్రమాలకు తెరతీస్తున్నారు.. తమ తెలివితేటలతో లేని కార్మికుల పేర్లు రాస్తూ సర్కారు సొమ్ము దర్జాగా భోం చేస్తున్నారు.. ఈ వివరాల్ని కూడా టెన్‌ టీవీ సేకరించింది..

అధికారులది ఇష్టారాజ్యంగా...

ఇలా సూపర్‌వైజర్లు, శానిటేషన్ అధికారులది ఇష్టారాజ్యంగా తయారైంది.. రాత్రి ఎవరు చూస్తారులే అన్న ధైర్యంతో లేనివాళ్లను ఉన్నట్లుగా రాసేస్తున్నారు.. ఎవరైనా చెకింగ్‌కు వచ్చినప్పుడు మాత్రమే అటెండెన్స్‌లో ఆప్సెంట్‌ కనిపిస్తుంది.. ఆ తర్వాతనుంచి మళ్లీ మొత్తం ప్రెజెంట్‌గానే దర్శనమిస్తుంది..

పనికిరాని కార్మికుల జీతం....

ఇక పనికిరాని కార్మికుల జీతం లాగేసుకునేందుకు సూపర్‌వైజర్లు సీక్రట్‌ ప్లాన్ అమలు చేస్తున్నారు.. ఉన్నతాధికారులకోసం ఒక రిజిస్టర్‌ రాస్తారు.. అందులో అంతా ప్రెజెంట్ వేస్తారు.. తమకోసం వేరే రిజిస్టర్‌ పెట్టుకుంటారు... అందులో కార్మికులు రానిరోజులు సరిగ్గా రాసుకుంటారు.. కార్మికులకు మొత్తం జీతం వచ్చాక వాళ్లు ఎన్నిరోజులు రాలేదో సూపర్‌వైజర్‌ లెక్క తేలుస్తాడు.. ఈ లెక్క ప్రకారం కార్మికులు ఆయా రోజుల డబ్బును సూపర్‌వైజర్‌కు ఇవ్వాలి.. లేకపోతే ఆ కార్మికులకు ఇబ్బందులు తప్పవు.. ఈ విషయంపై ప్రశ్నిస్తే సూపర్‌వైజర్లు అలాంటిదేమీలేదని సమాధానమిస్తున్నారు..

ఇంకో ప్లాన్‌తోకూడా ప్రభుత్వ సొమ్ము...

ఈ రకంగానే కాదు.. ఇంకో ప్లాన్‌తోకూడా ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు.. గ్రేటర్‌లో దాదాపు 950మంది సూపర్‌వైజర్లున్నారు.. వీరంతా డబ్బుకోసం మరో దారి కనిపెట్టారు.. కార్మికుల లిస్టులో తమ బంధువులు, తెలిసివారి పేర్లను రాస్తారు.. వీళ్లు రిజిస్టర్‌లో మాత్రమే ఉంటారు.. ఎప్పుడూ పనిలో కనిపించరు.. ఈ కార్మికుల ఏటీఎంకూడా సూపర్‌వైజర్‌ దగ్గరే ఉంటుంది.. ఇలా రెండు రకాలుగా సర్కారు సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారు..

గ్రేటర్‌ పరిధిలోని కార్మికుల్లో....

ఇలా గ్రేటర్‌ పరిధిలోని కార్మికుల్లో దాదాపు 40శాతంమంది పనుల్లోకి రావడంలేదు.. పనిచేయకపోయినా వీళ్ల జీతాలుమాత్రం డ్రా అయిపోతున్నాయి.. ఇలా కోట్లాదిరూపాయల ప్రజాధనం కొందరు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది.. ఇలా జగరకుండా తాము చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నారు..

కార్మికుల పరిస్థితి మరోరకంగా....

మరోవైపు సరిగ్గా పనికివచ్చే కార్మికుల పరిస్థితి మరోరకంగా ఉంది.. రానివాళ్ల పనిభారం ఉన్నవాళ్లపై పడుతోంది.. దీంతో పని రెట్టింపవుతోంది.. ఇలా ఏదో ఒకరోజు కాదు.. ప్రతిరోజూ ఇలాగే జరుగుతోంది.. రాత్రులు అధిక పనివత్తిడితో వీరంతా సతమతమైపోతున్నారు.. పైగా చీకట్లో ఎక్కడ ఏ చెత్తుందో... అందులో ఎలాంటి వస్తువులున్నాయో తెలియదు.. మాస్క్‌లు, గ్లౌజులు ఇవ్వరు.. రాత్రిపూట వాహనదారులకు వీళ్లు కనిపించేలా డ్రెస్‌లపై రేడియం స్టికర్లుండాలి.. అవి ఎక్కడా కనిపించలేదు.. దీంతో ఏ వాహనం ఎప్పుడు మీదకొస్తుందోనని కార్మికులు టెన్షన్ పడుతున్నారు.. మొత్తానికి జీహెచ్‌ఎంసీలో సూపర్‌వైజర్లు, కొందరు అధికారుల చేతివాటంతో సర్కారు సొమ్ముగా భారీగా గండిపడుతోంది.. అటు కార్మికులకూ ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది.. బయోమెట్రిక్‌ సిస్టంద్వారా మాత్రమే ఈ అక్రమాలకు చెక్‌ పడే అవకాశముంది..  

14:44 - March 12, 2016

తూ.గో : విద్యాసంస్థ ముసుగులో విద్యార్థినులపై అకృత్యాలకు పాల్పడుతున్న కరస్పాండెంట్‌ శ్రీధర్‌ ఎట్టకేలకు చిక్కాడు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కరస్పాండెంట్‌ శ్రీధర్‌ లొంగిపోయారు. ఇతనిపై విద్యాసంస్థ ముసుగులో మహిళలపై అనేక అకృత్యాలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరస్పాండెంట్‌ శ్రీధర్‌ను అరెస్టును పోలీసులు గోప్యంగా ఉంచారు. శ్రీధర్‌ను కోర్టులో హాజరు పర్చేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. 

14:42 - March 12, 2016

హైదరాబాద్ : లండన్‌లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బ్రిటన్‌లోని టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై అక్కడ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటన కొనసాగుతోంది.

హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్ : దక్షిణం, ఆగ్నేయం దిశలో పొడిగాలు వీస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారి ఐకే రెడ్డి తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల సాధారణ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

 

అనేక అభివృద్ధి పనులు చేపట్టాం : కొప్పుల

హైదరాబాద్ : 21 నెలల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగించామని, ప్రభుత్వాన్ని, ప్రోత్సహించేలా విపక్షాలు సలహాలివ్వాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం ఘనవిజయమన్నారు. ఐదు ప్రాజెక్టుల రూపకల్పనకుబీజం పడిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

13:55 - March 12, 2016

హైదరాబాద్‌ : వనస్థలిపురం ఆటో నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ రాధాకృష్ణ ఆటోమొబైల్స్ వర్క్ షాప్‌లో మంటలంటుకున్నాయి. ఈ మంటల్లో మూడు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

 

13:51 - March 12, 2016

హైదరాబాద్ : భువనగిరి వరకు ఎంఎంటీస్‌ పొడిగించాలని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. యాదాద్రి అభివృద్ధి నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తున్నామన్నారు. యాదాద్రి అభివృద్ధికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. 

 

13:47 - March 12, 2016

ఢిల్లీ : టీ 20 వరల్డ్ కప్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో పసికూన జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో  చిన్న చిన్న జట్ల ప్రదర్శన అంచనాలకు మించినట్టుగా ఉంది. 
టీ 20 ఫార్మాట్‌.. ధూమ్‌ ధామ్ బ్యాటింగ్‌
టీ 20 ఫార్మాట్‌ అంటేనే ధూమ్‌ ధామ్ బ్యాటింగ్‌.... పర్‌ఫెక్ట్ ఫీల్డింగ్‌, ఫటా ఫట్‌ బౌలింగ్‌. ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ రౌండ్‌ పోటీలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రౌండ్‌ పోటీలు జరుగుతున్నా.....క్రికెట్‌ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కానీ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో పోటీపడుతున్న జట్లు మాత్రం అంచనాలకు మించి అదరగొడుతున్నాయనే  చెప్పాలి. అసలు సిసలు సమరం ఆరంభం కాకముందే.....తమ ప్రదర్శనతో కాంపిటీషన్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. 
ఒమన్‌ జట్టు అద్భుత ప్రదర్శన 
ఐర్లాండ్‌తో ముగిసిన తొలి క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు ....తనకంటే పటిష్టమైన ఐర్లాండ్‌ జట్టును ఓడించడం మాత్రమే కాదు....ఆల్‌రౌండ్‌ షోతో క్రికెట్‌ అభిమానులకు అలరించారు.  మక్సూద్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టగా,పేస్‌ బౌలర్‌ అన్సారీ  డెడ్లీ యార్కర్లతో ఐరిష్‌ బ్యాట్స్ మెన్‌కు చెక్‌ పెట్టాడు. ఐర్లాండ్‌ జట్టు బ్యాటింగ్ సమయంలో ...పీటర్‌ స్టిర్లింగ్‌ కొట్టిన కవర్స్‌ వైపు షాట్‌ కొట్టగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న మక్సూద్‌ కళ్లు చెదిరే డైవ్‌ క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. ఆఖరి ఓవర్లో అన్సారీ లో స్పీడ్‌ యార్కర్‌తో ఐర్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ ఓబ్రెయిన్‌ను బోల్తా కొట్టించాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో ఐర్లాండ్‌ జట్టు ఒమన్ టీమ్‌ చేతిలో ఓడినా....ఐరిష్‌ ప్లేయర్‌ విల్సన్‌ మాత్రం తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒమన్ జట్టు బ్యాటింగ్‌ సమయంలో...17వ ఓవర్‌లో కెవిన్‌ ఓబ్రెయిన్‌ వేసిన బంతిని ఒమన్‌ బ్యాట్స్ మెన్‌ అమీర్‌ అలీ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. స్టేడియంలో ఉన్నవారంతా సిక్స్‌ ఖాయమనుకున్నారంతా...కానీ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న విల్సన్‌..గాల్లోకి ఎగిరి మరీ బంతిని బౌండరీ లైన్‌ లోపలకు వేశాడు. దీంతో ఆ బంతిని  సిక్స్‌ పోనివ్వకుండా ఆపడమే కాదు....ఐదు పరుగులు కాపాడాడు.  విల్సన్‌ ఇంతలా వీరోచితంగా ఫీల్డింగ్‌ చేసినా....ఐర్లాండ్‌ జట్టు ఆఖరి బంతికి ఓడిపోయింది. 
ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అదరగొట్టారు 
ఇక స్కాట్లాండ్‌, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అదరగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌ సమయంలో స్కాట్లాండ్‌ ఫీల్డర్‌ మైఖేల్‌ లీక్స్‌ అరుదైన రీతిలో క్యాచ్‌ పట్టాడు.  8వ ఓవర్‌లో  వాట్‌ వేసిన  రెండో బంతిని జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ ముటుంబామీ లాంగ్‌ ఆఫ్‌ మీదుగా షాట్‌ కొట్టాడు. సులువుగా పట్టాల్సిన క్యాచ్‌ను ...తొలి ప్రయత్నంలో మిస్‌ చేసిన లీక్స్‌...రెండో ప్రయత్నంలో సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ పట్టి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక స్కాట్లాండ్ జట్టు బ్యాటింగ్‌ సమయంలో.....జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రాజా మెరుపు వేగంతో క్యాచ్‌ పట్టాడు.కవర్స్‌ వైపు స్కాటిష్‌ బ్యాట్స్‌మెన్‌ కొయెట్జర్‌ షాట్‌ కొట్టగా....సికందర్ రాజా పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో ఫ్లైయింగ్‌ క్యాచ్‌ పట్టి వీక్షకులను అవాక్కయేలా చేశాడు. ఇప్పటికే క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లోనే మూడు కళ్లు చెదిరే క్యాచ్‌లు చూశాం. ఇక  మెయిన్‌ రౌండ్‌ ప్రారంభమయ్యాక ఇంకెన్ని అద్భతాలు నమోదవుతాయో చూడాలి. 

13:37 - March 12, 2016

హైదరాబాద్ : ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ డేట్‌ లేదన్నారు. పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు తెలంగాణ సర్కార్‌ కృషి చేస్తుందని తెలిపారు.

 

13:18 - March 12, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో రేషన్‌కార్డు దరఖాస్తులను ఇష్టమొచ్చినట్లు రిజక్ట్ చేశారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసలు కార్డులు ఎంతమందికి ఇచ్చారు ? ఏ ప్రాతిపదికన దరఖాస్తులను రిజక్ట్ చేశారో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక ఉన్న కార్డులలో కూడా చాలా వరకు డూప్లికేట్‌ కార్డులున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

 

13:14 - March 12, 2016

హైదరాబాద్ : ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ఆదాయ పరిమితిని పెంచాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని కొత్త రేషన్‌కార్డులు జారీ చేసిందో తెలపాని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు అర్హత ఏంటి.. గతంలో కంటే రేషన్‌కార్డుల సంఖ్య పెరిగిందా ? తగ్గిందా  అని ప్రభుత్వాన్ని అడిగారు. 

 

12:50 - March 12, 2016

గుజరాత్‌ : రాష్ట్రంలోని కాక్రపర్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో ప్రాథమిక హీట్‌ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌లో లీకేజీ ఏర్పడింది. బుధవారం ఉదయం ఈ లీకేజ్ జరిగిందని ప్లాంట్ అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం... అణువిద్యుత్‌ కేంద్రం పరిసరాల్లో రేడియేషన్‌ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, ప్రమాదమేమీ లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగానే ప్లాంట్‌ లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముంబైలోని బార్క్, అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిపుణులు రానున్నారు. 1993లో ప్రారంభమైన ఈ ప్లాంట్‌  220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 

 

12:45 - March 12, 2016

హైదరాబాద్ : నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. 21 నెలల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగించామని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదరడం ఘన విజయమని గర్వంగా చెప్పారు.  

ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ : అసెంబ్లీ లాబీల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారలేదని.. విలీనం చేశానని తెలిపారు. నాడు ఎన్ టీఆర్ విషయంలో చంద్రబాబు చేసినప్పుడు చారిత్రక అవసరమన్నారు. ఈరోజు చారిత్రక అంశమన్నారు. ఎన్ టీఆర్ విషయంలో చంద్రబాబు చేసింది తప్పయితే ఇప్పుడు తాను చేసింది కూడా తప్పు అని చెప్పారు. పార్టీ మార్పును అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నామని తెలిపారు. తాను మంత్రి పదవి ఆశించి రాలేదన్నారు. 

 

12:22 - March 12, 2016

కాకినాడ : అన్నవరం కొండపై అశ్లీల నృత్యాలపై ఎట్టకేలకు ఆలయ ఈవో స్పందించారు. కొండపై జరిగిన ఘటనపై ఎండో మెంట్ కమిషనర్ ఆలయ ఈవోతో మాట్లాడారు. దీంతో అశ్లీల నృత్యాలను నిర్వహించిన పెళ్లి బృందంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. పెళ్లి బృందంపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. పెళ్లి బృందం వివరాలను సేకరిస్తున్నారు. దిగువ స్థాయి ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది.

 

11:55 - March 12, 2016

హైదరాబాద్‌ : ఉప్పల్‌లో ఫినోలెక్స్ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ప్లంబింగ్‌ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. పనివేళల్లో కార్మికులు ఏ విధంగా వ్యవహరించాలి...కార్మికులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ కింద, కుశాల్ ప్లాన్ కింద ఫినోలెక్స్ కంపెనీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. ప్లంబర్లకు కూడా సమాజంలో ఇతర రంగాల వారికి మాదిరే సరైన గుర్తింపు లభించే విధంగా ఫినోలెక్స్‌ ప్రత్యేక కార్యాచరణ ఆచరిస్తోంది. ఈ క్రమంలో వృత్తిపర అవగాహన సదస్సు నిర్వహించారు. 

 

11:52 - March 12, 2016

హైదరాబాద్ : ఇద్దరితో పురుడుపోసుకుంది. ఆ తరువాత ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుంది. క్రమంగా ప్రతిపక్ష పార్టీ స్థాయికి చేరింది. ఐదేళ్లలో బలమైన ప్రాంతీయ పార్టీగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు అధికార పార్టీపై సై అంటే సై అంటోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. వైసీపీ పార్టీ ఆవిర్భవించి ఐదేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.                                                                                                
6 వార్షికోత్సవం జరుపుకుంటున్న వైసీపీ
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లు పూర్తిచేసుకుంది. శనివారం ఆ పార్టీ 6వ వార్షికోత్సం జరుపుకుంటోంది. 2011 మార్చి 12న జగన్‌ అధ్యక్షుడిగా వైసీపీ ఆవిర్భవించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీతో వచ్చిన విబేధాల కారణంగా జగన్‌ ప్రత్యేక పార్టీ పెట్టారు. 
ఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌తో విబేధాలు
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబ సభ్యులను ఓదార్చిచేందుకు జగన్‌ ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. అయితే ఈ యాత్రపై కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జగన్‌, హైకమాండ్‌ మధ్య విబేధాలు వచ్చాయి. చివరికి జగన్‌, విజయమ్మలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి..ప్రత్యేక పార్టీని స్థాపించారు. 
ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ
జగన్‌ పార్టీ పెట్టిన వెంటనే కాంగ్రెస్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు.ఈ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లో 18 స్థానాలకు గానూ వైసీపీ 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. నెల్లూరు ఎంపీ సెగ్మెంట్‌లో భారీ విజయాన్ని కైవశం చేసుకుంది. తర్వాత జరిగిన నెల్లూరు జిల్లా కొవూరు అసెంబ్లీ స్థానంలోనూ ఫ్యాను పార్టీ జెండా రెపరెపలాడింది. దీంతో జగన్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి క్రమంగా వలసలు ప్రారంభమయ్యాయి. 
జగన్‌ అక్రమాస్తులపై హైకోర్టులో పిటిషన్‌
వైసీపీ ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌, టీడీపీ నేతలు జగన్‌ అక్రమాస్తులపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ఉన్నత న్యాయం ఆదేశాలు ఇచ్చింది.  అక్రమాస్తులపై రెండేళ్లు విచారించిన సీబీఐ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జగన్‌ను అరెస్ట్ చేసింది. 16 నెలల జైలు జీవితం తరువాత జగన్‌ బెయిల్‌పై బయటకి వచ్చారు. జగన్‌ జైల్లో ఉన్న సమయంలో విజయమ్మ, షర్మిల పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాదయాత్రకు ధీటుగా షర్మిల ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం వరకు 3500 కి.మీ పాదయాత్ర నిర్వహించారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయం
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది. వైసీపీ నుంచి క్రమంగా అధికార పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీకి దూరమయ్యారు. తాజాగా వైసీపీ నుంచి వలసలు మరింత పెరిగాయి. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు. ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు. మిగిలిన ఒక ఎమ్మెల్యే, ఎంపీ కూడా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. 
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ యత్నం
ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. పలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. విభజన హామీలపై ఉద్యమాలు చేస్తోంది. తాజాగా రాజధాని భూ దందాపై అసెంబ్లీలో టీడీపీపై దాడి చేస్తోంది. కొద్దిరోజులుగా పార్టీ బలహీనమవుతున్నా... అధికార పక్షంపై పోరు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు.. ప్రజా సమస్యలపై ధర్నాలతో ప్రజలకు దగ్గరవుతోంది. 

 

టీఅసెంబ్లీకి 10 నిమిషాల టీ విరామం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో  స్పీకర్ సభకు 10 నిమిషాల టీ విరామం ప్రకటించారు. 

11:35 - March 12, 2016

చిత్తూరు : నిర్బయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కడపలో చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన మరువకముందే తాజాగా చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. దుండగులు బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత మార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని కుప్పం రైల్వే క్వార్టర్స్ లో పదేళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి.. అనంతరంపై ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మృతురాలు కర్ణాటక వాసిగా గుర్తించారు. 

 

మావోయిస్టులు, బీఎస్ ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు

ఛత్తీస్గఢ్ : కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, బీఎస్ ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈఘటనలో ముగ్గురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

11:03 - March 12, 2016

ఛత్తీస్గఢ్ : కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, బీఎస్ ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈఘటనలో ముగ్గురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

 

సంవత్సరంలోగా అన్ని పోస్టులు భర్తీ : ఈటెల

హైదరాబాద్ : రాష్ట్రంలో 7 లక్షల 744 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 14,789 ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరగుతోందన్నారు. సంవత్సరంలోగా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 

 

టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. టెట్ తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా ఆపోస్టులు ఖాళీ అయితే 6 నెలలో భర్తీ చేసేలా చట్టం తీసుకురావాలన్నారు. ఉద్యోగాల భర్తీ కోస లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు.

 

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : చిట్టెం రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వం రైతులకు చేయూతనిచ్చి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి కోరారు. తన నియోజకవర్గంలో 25 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం కోసం బయటి నుంచి అప్పులు తెచ్చి పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తే సంక్షోభం నుంచి బయటపడతారని సూచించారు.

 

టీ.అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. కరువు నివారణ, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌, వామపక్షాలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ చేపట్టారు.  

10:29 - March 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడో రోజు కొనసాగుతున్నాయి. కరువు నివారణ, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌, వామపక్షాలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానంపై చర్చ చేపట్టారు.  
చిట్టెం రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్)...
'నా నియోజకవర్గంలో 25 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 
వ్యవసాయం కోసం బయటి నుంచి అప్పులు తెచ్చి పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తే సంక్షోభం నుంచి బయటపడతారు. రైతాంగాన్ని ఆదుకోవాలి. 
టీడీపీ నేత ఆర్.కృష్ణయ్య 
తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలి. టెట్ తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలి. టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా ఆపోస్టులు ఖాళీ అయితే 6 నెలలో భర్తీ చేసేలా చట్టం చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 
సంవత్సరంలోగా అన్ని పోస్టులు భర్తీ : ఈటెల 
రాష్ట్రంలో 7 లక్షల 744 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 14,789 ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరగుతోందన్నారు. సంవత్సరంలోగా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో రాజీపడమని చెప్పారు. శాఖల వారిగా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల పై ప్రేమ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రిక్రూట్ మెంట్ ఎందుకు చేయాలేదో చెప్పాలని ప్రశ్నించారు. 
కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి.. 
టీఎస్ పీసీ ద్వారా ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 14, 789 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామనడం సిగ్గుచేటన్నారు. 

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడో రోజు కొనసాగుతున్నాయి. కరువు నివారణ, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌, వామపక్షాలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.

 

09:49 - March 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌కు సంబంధించి 18 ప్యాకేజీలకు ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. 29 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేశారు. అయితే రెండు ప్యాకేజీలకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. 

09:45 - March 12, 2016

కాకినాడ : పవిత్ర అన్నవరం కొండపై అపవిత్రత చోటుచేసుకుంది. పూజలు, పురస్కారాలు జరగాల్సిన చోటు సినిమా పాటల రికార్డింగ్ డ్యాన్స్ లకు వేదిక అయింది. దేవాలయం అనే ధ్యాసే లేదు. అశ్లీల నృత్యాలు చేశారు. కొండపై జరిపిన వివాహ వేడుకలో రికార్డింగ్ డ్యాన్స్ లు చేశారు. అధికార యంత్రాంగం నింబంధనలను తుంగలో తొక్కి పుణ్యక్షేత్రమని చూడకుండా రికార్డింగ్ డ్యాన్స్ లకు పర్మిషన్ ఇచ్చింది. తమకు ఆధికారులు అనుమతిచ్చారని వివాహ వేడుకల నిర్వహకులు రెచ్చిపోయారు. రాత్రి 3 గంటల వరకు వివిధ సినిమాల్లోని ఐటెమ్ సాంగ్స్ కు రికార్డింగ్ డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారంలో పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చూసిచూడనట్లుగా ఉండిపోయారు. అధికారం యంత్రాంగం తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

కష్టాల్లో అరకు ఎంపీ కొత్తపల్లి గీత

 విశాఖ : తన సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదని తేలడంతో విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇరకాటంలో పడ్డారు. వివేకానంద తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో బీమా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడని గిరిజన సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పు గోదావరి జిల్లా అధికారులు అతని సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆయన ఎస్టీ కాదని విచారణలో తేల్చి నోటీసులు పంపారు. కులం విషయంలో ఎంపీ గీత కూడా ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాలున్నందున విచారణకు హాజరుకాలేనని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

హిమాయత్‌నగర్‌ టీటీడీ బాలాజీ భవన్‌లో నేడు, రేపు శ్రీవారి లడ్డూల విక్రయం

హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌ లిబర్టీలోని టీటీడీ బాలాజీ భవన్‌లో నేడు, రేపు శ్రీవారి లడ్డూల విక్రయం ఉంటుందని టీటీడీ హైదరాబాద్‌ ఏఈఓ రమేశ్‌బాబు తెలిపారు. తిరుమల నుంచి వచ్చే శ్రీవారి లడ్డూలను నగరంలోని భక్తులకు అందించే లక్ష్యంతో ప్రతి నెలా రెండో శనివా రం, ఆదివారాల్లో లడ్డూలను విక్రయిస్తున్నామన్నారు.

నేటి నుంచి ఓయూ పిజి ఎగ్జామ్ ఫీజు స్వీకరణ

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ. 300 అపరాధ రుసుముతో వచ్చే నెల 7వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు మేలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వివరాలకు  www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.

రాజేంద్రనగర్‌లో బంగారు గొలుసు చోరీ

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీ వద్ద శనివారం ఉదయం బంగారు గొలుసు దొంగతనం జరిగింది. చెత్త పడేసేందుకు వచ్చిన మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల పుస్తెల తాడును దొంగలు లాక్కెళ్లారు. ద్విచక్ర వాహనంపై దొంగలు వచ్చినట్లు బాధిత మహిళ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు. కరువు నివారణ, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్, వామపక్షాలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.8 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.8 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అన్నవరం ఆలయంలో అశ్లీల నృత్యాలపై భక్తుల ఆగ్రహం

కాకినాడ : అన్నవరం ఆలయంలో అశ్లీల నృత్యాలు చేశారు. కొండపై జరిపిన వివాహ వేడుకలో రికార్డింగ్ డ్యాన్స్ చేశారు. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

ఛత్తీస్గఢ్ : కాంకేర్ జిల్లా చోటాబేట్లా సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. 

 

రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప : రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీప్రాంతంలో డంప్ చేసిన రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

08:26 - March 12, 2016

ఐదేండ్ల జైలు శిక్ష అనంతరం ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలో సంజయ్ సరసన శ్రద్ధాకపూర్‌ని తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఒక పెద్ద మనిషి, యంగ్‌ గర్ల్‌ మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, అందుకే సంజయ్ సరసన శ్రద్ధాని తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సంజయ్ తండ్రి పాత్ర పోషించబోతున్నారు. మరి శ్రద్ధా సంజయ్ సరసన నటిస్తుందా? లేక ఆయనకి కూతురిగా నటిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పాత్ర కోసం ముందు అలియా భట్‌, పరిణీతి చోప్రాలను అనుకున్నప్పటికీ ఫైనల్‌గా శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసినట్లు బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ 'రాక్‌ ఆన్‌ 2', 'బాఘీ' చిత్రాల్లో నటిస్తున్నారు.

 

08:21 - March 12, 2016

'బ్యాంగ్‌ బ్యాంగ్‌' చిత్రంలో నటించి ఆకట్టుకున్న హృతిక్‌ రోషన్‌, కత్రినా కైఫ్‌ మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్‌ కండల వీరుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన 'రాంబో' చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌ చిత్రంలో హృతిక్‌, కత్రినా జంటను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు తెలిపారు. 'ఇందులో సిల్వెస్టర్‌ పాత్రకు హృతిక్‌ అయితేనే న్యాయం చేస్తాడని ఆయన్ని ఫైనల్‌ చేశాం. ఆయనకి జోడీగా కత్రినా బాగా సూట్‌ అవుతుందనుకుంటున్నాం. హీరో హీరోయిన్లను ఫైనల్‌ చేశాక అన్ని వివరాలు తెలియజేస్తాం' అని దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెలిపారు. కత్రినా ప్రస్తుతం 'జగ్గాజాసూస్‌', 'బార్‌ బార్‌ దేఖో'లో నటిస్తున్నారు. 
'ఆషిఖి 3' కోసం.. ! 
ఓ వైపు 'రాంబో' బాలీవుడ్‌ రీమేక్‌లో నటించబోతున్న హృతిక్‌ రోషన్‌ మరోవైపు 'ఆషిఖి 3'లోనూ నటించేందుకు రంగం సిద్ధం చేసు కుంటున్నారు. ఇందులో అలియా భట్‌తో కలిసి నటించబోతున్నారట. ముందుగా హృతిక్‌ సరసన కంగనా రనౌత్‌ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నప్పటికీ కంగన పట్ల హృతిక్‌ ఆసక్తిగా లేకపోవ డంతో అలియా భట్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అలియా భట్‌ ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వంలో షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'మేరీ ప్యారీ బిందూ' చిత్రంలో నటిస్తున్నారు.

 

08:13 - March 12, 2016

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. సంజయ్ కు ఓ కథ నెరేట్‌ చేశారని, స్క్రిప్టు నచ్చడంతో ఆయన కూడా ఒప్పుకున్నాడని పూరీ జగన్నాథ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది యాక్షన్‌ చిత్రమని, ఇందులో సంజయ్ మునుపెన్నడూ కన్పించని రీతిలో ఆకట్టుకోనున్నారని, తొలిసారి కొత్త బృందంతో పనిచేయబోతున్నందుకు హ్యాపీగా ఉందని పూరీ తెలిపారు. ప్రస్తుతం పూరీ తెలుగు, కన్నడ భాషల్లో 'రోగ్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

 

08:10 - March 12, 2016

శ్రీ శ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం... ప్రైవేట్ కార్యక్రమమని.. అలాంటి ప్రైవేట్ కార్యక్రమానికి సైన్యాన్ని ఎలా ఉపయోగిస్తారని వక్తలు ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో విశ్లేషుకుడు వినయ్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి యశ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఈ కల్చరల్‌ ఫెస్టివల్‌కు ప్రధాని మోడీ హాజర్వవడాన్ని వక్తలు తప్పుబట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

బుల్లితెర నటి సెల్‌ఫోన్‌కు అసభ్యరమైన మెసేజ్‌లు

హైదరాబాద్ : బుల్లితెర నటి సెల్‌ఫోన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నారు. శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్‌ వద్ద నివసించే భారతి బుల్లితెరలో ప్రసారమయ్యే పలు షోలలో నటించారు. కొద్ది రోజులుగా ఆమె సెల్‌ఫోన్‌కు ఆగంతుకులు అసభ్యరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నట్టు బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. 

07:36 - March 12, 2016

చిత్తూరు : తిరుమలలో వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదలైంది. శ్రీవారి ఆలయం ఎదుటే వేయికాళ్ల మండపం నిర్మించాలంటూ గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే  నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపం నిర్మాణానికి టీటీడీ సిద్ధమైంది. దీంతో ఈ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. 
వేయికాళ్ల మండపం నిర్మాణంపై హైకోర్టు స్టే
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో 18 కోట్ల రూపాయల వ్యయంతో టిటిడి నిర్మించ తలపెట్టిన వేయికాళ్లమండపం నిర్మానానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. మండపం నారాయణగిరి ఉద్యానవనంలో నిర్మించరాదని, శ్రీవారి ఆలయం ఎదుటే నిర్మించాలని ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మండపం నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో మండపం నిర్మాణానికి పిలవాల్సిన టెండర్లను టిటిడి వాయిదా వేసింది. 
2002లో వేయికాళ్ల మండపం తొలగింపు
తిరుమల మాస్టర్‌ ప్లాన్ లో భాగంగా 2002లో వేయికాళ్ల మండపాన్నిటీటీడీ తొలగించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలువురి పీఠాధిపతులు సూచనలు పరిగణలోకి తీసుకొని శ్రీవారి ఆలయం ఎదుట మహామణి మండపం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.  ఇందుకు హైకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే శ్రీవారి ఆలయం ఎదుట మండపం నిర్మాణం జరగలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం వేయికాళ్ల మండపం పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు టిటిడి పాలకమండలిలో పలుదఫాలు చర్చలు జరిపారు. ఎట్టకేలకు నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులకు ఉపయోగపడే విధంగా మండపం నిర్మించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.  ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లతో డిజైన్ లు కూడా రూపొందించారు. పాలక మండలిలో సైతం ప్రత్యేకంగా కమిటీని నియమించారు. ఇటీవల ప్రవేశపెట్టిన టిడిపి వార్షిక బడ్జెట్ లో మండపం నిర్మానానికి 18 కోట్ల రూపాయలు కేటాంచారు. 
నిబంధనల్లో స్వల్పంగా మార్పులు 
ఐతే మండపం నిర్మాణానికి టెండర్లు పిలవగా ఒక్క కాంట్రాక్టరు కూడా టెండర్లలో పాల్గొనక పోవడం టీటీడీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేసి తిరిగి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. అంతలోనే నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. 

 

07:28 - March 12, 2016

కృష్ణా : తమ సమస్యలు పరిష్కరించాలంటూ బుడగ జంగాల నేతలు చేపట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలో కంట్రోల్ రూం వద్ద వారిని అడ్డుకుని కార్యక్రమాన్ని విరమించాలని పోలీసులు కోరగా అందుకు ఆ సంఘాల నేతలు తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. 
పోలీసులు లాఠీ ఛార్జ్
తమను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బుడగ జంగాల హక్కుల సంఘం తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదంటూ విజయవాడ కంట్రోల్ రూం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఆ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 
అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలి : మధు 
తమను ఎస్సీల్లో చేర్చాలని జీవో 84ను పునరుద్ధరించాలని కోరుతూ కొంతకాలంగా ఏపీలో బుడగ జంగం సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఆందోళన కాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో పలువురు బుడగ జంగాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఏపి కార్యదర్శి పి.మధు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన జరిపారు. శాంతియుతంగా జింఖానా గ్రౌండ్స్ లో సభ నిర్వహించేందుకు వారు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. సిపిఎం నేతలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తాము అరెస్ట్ చేసిన బుడగ జంగాల నేతలను విడిచిపెట్టారు. 

 

07:21 - March 12, 2016

హైదరాబాద్ : టిఆర్ఎస్‌లో టిటిడిపి ఎమ్మెల్యేల విలీనంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. స్పీకర్ నిర్ణయం అత్యంత దుర్మార్గమైందని ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని ప్రతిపక్ష నేతలు విమర్శలందుకున్నారు. స్పీకర్‌ నిర్ణయంపై మరింత రగిలిపోతున్నటిడిపి తాడోపేడో తేల్చుకునేందుకు గవర్నర్‌ని కలవాలని డిసైడైంది.
స్పీకర్ నిర్ణయంపై రాజ‌కీయ దుమారం
తెలంగాణ టిడిపికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల‌ను టిఆర్ఎస్ పార్టీ స‌భ్యులుగా గుర్తిస్తూ స్పీక‌ర్ మ‌ధుసూదనాచారి తీసుకున్న నిర్ణయం రాజ‌కీయ దుమారం రేపుతోంది. స‌భాప‌తి డెసిషన్‌పై అన్ని ప్రతిప‌క్షాలు ఒక్కటై నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు స‌భ‌లో విలీన‌మైన స‌భ్యుల‌తోపాటు... మిగిలిన టిడిపి స‌భ్యుల‌కు అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పీక‌ర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఘాటైన విమర్శలు
స్పీక‌ర్ మధుసూదనాచారి నిర్ణయంపై కాంగ్రెస్ ఘాటైన విమర్శలు చేసింది. సిఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల‌కు సంబంధించి తామిచ్చిన ఫిర్యాదులు ఇప్పటికీ స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. వాటిని ప‌క్కన‌బెట్టి టిడిపికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీలో క‌ల‌ప‌డంపై స‌భాప‌తి అత్యుత్సాహం చూపార‌ని జానా మండిప‌డ్డారు.
తెలంగాణకు త‌ల‌వంపులు తెచ్చేలా ఉన్నాయి : ల‌క్ష్మణ్‌ 
రాష్ట్రంలో జ‌రుగుతున్న పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు త‌ల‌వంపులు తెచ్చేలా ఉన్నాయని బిజెఎల్పీ నేత ల‌క్ష్మణ్‌ అన్నారు. స్పీక‌ర్ తన త‌ప్పుడు నిర్ణయాల‌తో తెలంగాణ‌ను అప్రదిష్టపాలు చేస్తున్నార‌ని  దీనిపై మేథావులు, రాజ్యాంగ నిపుణులు స్పందించాల‌ని లక్ష్మణ్‌ కోరారు.
గులాబీ ఏజెంట్‌గా స్పీక‌ర్ : రేవంత్‌రెడ్డి 
టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న స్పీక‌ర్ గులాబీ ఏజెంట్‌లా మారారని టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
స్పీక‌ర్‌ కు సండ్ర వెంక‌ట వీర‌య్య లేఖ 
స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల పిటీష‌న్లు... త‌ల‌సాని రాజీనామాల‌తో పాటు ఐదు అంశాల‌పై టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య స్పీక‌ర్‌ను క‌లిసి లేఖ ఇచ్చారు. ఇదిలా ఉండగా 12 మంది టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లో విలీనం చేసిన అంశంపై గవ‌ర్నర్‌కు ఫిర్యాదు చేయాల‌ని టి.టిడిపి నిర్ణయించింది. 

 

07:13 - March 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భా స‌మావేశాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. శని, ఆదివారాల్లో కూడా స‌భ‌ను నిర్వహించాలని శాస‌న‌స‌భా వ్యవహారాల క‌మిటి నిర్ణయించింది. స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల అజెండా, పని దినాలను ఖరారు చేశారు. 
బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వహణపై స్పష్టత
తెలంగాణ శాస‌న‌స‌భా బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వహణపై స్పష్టత వ‌చ్చింది. ఈ నెల 31 వ‌ర‌కు స‌మావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స‌హా విప‌క్ష పార్టీల నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. మొత్తం 16 ప‌నిదినాలుగా స‌భ‌ను నిర్వహించాలనే బీఏసి సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే స‌మావేశాలు ప్రారంభ‌మై రెండు రోజులు పూర్తయినందున మ‌రో 14 రోజుల పాటు శాస‌న‌స‌భా స‌మావేశాలు జ‌రుగనున్నాయి. 
ఈనెల 31వరకు అసెంబ్లీ సమావేశాలు 
గ‌వ‌ర్నర్ ప్రసంగం అనంత‌రం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెల‌ప‌డంపై చ‌ర్చ జ‌రగ‌నుంది. శ‌ని, ఆదివారాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈనెల 14వ తేదీన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ రాష్ట్ర బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్రవేశపెడతారు.15వ తేదీన శాస‌న‌స‌భ‌కు సెలవు ఉంటుంది. అనంత‌రం 16నుంచి 19వరకు నాలుగు రోజుల పాటు బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగ‌నుంది. 20న సెలవును ప్రకటించారు. 21, 22 తేదీల్లో వివిధ అంశాలపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత 23నుంచి 26వరకు మూడు రోజుల పాటు వ‌రుస‌గా శాస‌న‌స‌భ‌కు  సెలవులు ఇవ్వాల‌ని బీఏసీ నిర్ణయించింది. హోలీ, గుడ్‌ ఫ్రైడే సంద‌ర్భంగా  స‌భ‌కు విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 27నుంచి 31వరకు కరవుపై చర్చ ఉంటుంది. 

 

07:07 - March 12, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సిఎం చంద్రబాబు ఇంగ్లాండ్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంతాన్ని అన్ని అంశాలకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని అక్కడ సంస్థల స్థాపనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. బాబు ప్రతిపాదనలకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంగీకారం వ్యక్తం చేసింది. తొలిరోజు పర్యటనలో చంద్రబాబు తన బృందంతో లండన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు.
పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ..
ఏపీకి పెట్టుబడులను తెచ్చేపనిలో చంద్రబాబు బిజీ అయ్యారు. లండన్‌లో జరుగుతున్న పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తొలిరోజు పర్యటనలో భాగంగా లండన్‌లోని వార్ఫ్ లో 20 ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి ప్రాంతం గురించి వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని దాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగాభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. సులువైన పద్ధతుల్లో కంపెనీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. బాబు ప్రతిపాదనలకు యుకె కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అమరావతికి తమ బృందాలను పంపుతామని హామీ ఇచ్చాయి. వ్యాపారవేత్తలతో చర్చల్లో భాగంగా అమరావతికి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి సహకరిస్తామని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 
ఏపీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని అభిప్రాయం
చంద్రబాబుతో భేటీ అయిన కంపెనీల్లో గ్రేటర్ లండన్ అథారిటీ, రోల్స్ రాయిస్‌, ఐకామ్, బెనాయ్, మెక్ డొనాల్డ్, వోడాఫోన్, మోట్ మెక్‌డొనాల్డ్ తదితర ప్రముఖ కంపెనీలున్నాయి. చంద్రబాబు బృందం పర్యటించిన కానరీ వార్ఫ్ ప్రాంతం గురించిన ప్రస్తావన వారి చర్చల్లో వచ్చింది. కానరీ వార్ఫ్ ప్రాంతాన్ని ఫైనాన్షియల్ జిల్లాగా అభివృద్ధి చేసిన క్రమాన్ని అక్కడి ప్రతినిధులు వివరించగా అలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను ఏపీలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 
అమరావతిలో లండన్‌ ఐ తరహా టూరిజం సెంటర్‌
లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ ఐ ప్రాంతాన్ని సందర్శించింది. అమరావతిలో కూడా లండన్‌ ఐ తరహా టూరిజం సెంటర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

06:58 - March 12, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ పేట్ బషీర్‌బాగ్‌ సమీపంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ఉన్న లిఫ్ట్ వైర్‌ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో లిఫ్ట్ వేగంగా కిందకొచ్చి నేలకు ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

నేడు ఎపి పిసిసి ఛల్ ఢిల్లీ కార్యక్రమం

హైదరాబాద్ : ఎపి పిసిసి నేడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

 

నేడు లండన్ లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన

లండన్ : ఎపి సీఎం చంద్రబాబు బృందం లండన్ నేడు రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ ప్రవాసాంధ్రులతో చంద్రబాబు  భేటీ కానున్నారు. 

 

ధోని కేసు తదుపరి విచారణ మే 12కు వాయిదా

హైదరాబాద్ : వివాదాస్పద వాణిజ్య ప్రకటన కేసు టీమ్‌ఇండియా కెప్టెన్ ధోనీని నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకుడు శ్యాంసుందర్ సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోనీ తరుఫు న్యాయవాదులు కోరగా, అనంతపురం కోర్టులోనే విచారణ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు మే 12కు వాయిదా వేసింది. మూడేండ్ల క్రితం ఓ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్‌పేజీపై విష్ణుమూర్తి అవతారంతో ధోనీ ఫొటో వివాదస్పద రీతిలో ప్రచురితమైంది.

నేడు అలెగ్జాండర్ తో విజేందర్ ఢీ

లివర్ పూల్ : నేడు హంగెరీ బాక్సర్ అలెగ్జాండర్ తో భారత స్టార్ బాక్సర్ విజేందర్ ఢీకొట్టనున్నారు. రాత్రి 11.15 గంటలకు ప్రారంభం కానుంది. 

Don't Miss