Activities calendar

13 March 2016

సాగర్ రోడ్డుపై ప్రమాదం..

హైదరాబాద్: హయత్‌నగర్ సాగర్ రహదారిపై రోడ్ ప్రమాదం సంభవించింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

 

సోమవారం ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని, అంతులేని అవినీతిలో ప్రభుత్వం కూరుకోపోయింది కాబట్టే నోటీసులు అందచేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. 

శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న కడియం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.35గంటలకు మండలి ఎదుట బడ్జెట్ పెట్టనున్నారు.

 

సోమవారం టి.బడ్జెట్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఈటెల రాజేందర్ 2016-17 సంవత్సరానికి ఈటెల బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.35గంటలకు శాసనసభ ఎదుట బడ్జెట్ పెట్టనున్నారు. 

21:29 - March 13, 2016

తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు లండన్‌ పర్యటన ముగిసింది. ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు వెంటనే.. యమునా నది తీరంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరయ్యారు. ఆ తరువాత సాయంత్రానికి రాజమండ్రి చేరుకున్నారు. లండన్‌ పర్యటనలో పలువురు పెట్టుబడిదారులు, ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు.. అమరావతిలో పెట్టుబడి పెట్టాలని కోరారు.

21:19 - March 13, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం అనంతరం.. తమను ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రెండున్నర గంటలు మాట్లాడేందుకు... కేసీఆర్‌కు అవకాశమిచ్చిన స్పీకర్‌.. తమకు మాత్రం అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేయటం సరికాదన్నారు. తమను ప్రశ్నలు అడిగే అవకాశం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసంగంలో కేసీఆర్ భాష కూడా సరిగ్గా లేదని, సీఎం ప్రసంగ తీరు అహంకార ధోరణితో, సీనియర్ నేతలను అవమానించే విధంగా ఉందని తెలిపారు. 

21:17 - March 13, 2016

హైదరాబాద్ : దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ అన్ని విధాలా వెనకబడిపోయిందని సిఎం కెసిఆర్ విమర్శించారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం సమాధానమిస్తూ కాంగ్రెస్‌ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ అన్ని రకాలుగా దగాకు గురైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్‌ కోసం ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేశారని, ప్రస్తుతం పరిశ్రమలకు 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని కెసిఆర్ అన్నారు. పంచాయతీరాజ్‌శాఖకు అతి ఎక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం తమదన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.

ముందుచూపు నిర్ణయాలు...
కాంగ్రెస్‌ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు ఇస్తే తమ హయాంలో 35.7లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అదీ 200 రూపాయల నుంచి వెయ్యికి పెంచి ఇస్తున్నామని బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నామని గుర్తుచేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన అన్నం పెడుతున్నామని వచ్చే సంవత్సరం నుంచి కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా ఆ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని గూగుల్‌, కాగ్నిజెంట్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ముందుచూపుతో తాము తీసుకున్న నిర్ణయం వల్ల విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా రైతులకు పంపిణీ చేశామని త్వరలో 21 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారోత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాంలు నిర్మిస్తామని చెప్పారు.

2016 నాటికి నీరందిస్తాం...
హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టం 218 కోట్లని ఆ సంస్థను పటిష్ట పరిచి లాభాల బాటలో నిలుపుతామని ప్రకటించారు. జహీరాబాద్‌ నిమ్స్ కు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని అన్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగమని తామెప్పుడూ చెప్పలేదని మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామని చెప్పారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా తెలంగాణలో సాగునీటి రంగం ఘోరంగా దెబ్బతిందని ఇకముందు ఆ పరిస్థితి ఉండబోదని కెసిఆర్ అన్నారు. ఆరునూరైనా మిషన్‌ భగీరథ పథకాన్ని పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని వివరించారు. 2016 డిసెంబరు నాటికి 6,182 గ్రామాలు, 12 పురపాలక సంఘాలకు నీరందించి చూపిస్తామన్నారు. 

20:54 - March 13, 2016

వెంకటేష్ కొత్త సినిమా జెట్ స్పీడ్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. బాబు బంగారం రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త మూవీలో వెంకీ తనదైన హాస్యంతో కితకితలు పెట్టిస్తాడని టాక్. ఇంతకీ వెంకటేష్ కొత్త మూవీ రిలీజింగ్ విశేషాలేంటో తెలుసుకోవాలని ఉందా? సీనియర్ స్టార్స్ లో బాలయ్య లెజెండ్, నాగర్జున సోగ్గాడే చిన్నినాయనాలతో బ్లాక్ బస్టర్స్ అందించారు. కానీ వెంకటేష్ నుంచి మాత్రం ఇలాంటి బ్లాక్ బస్టర్ రాక చాలా కాలం అవుతోంది. ఈ క్రమంలో వెంకీ తన కొత్త సినిమాతో బ్లాక్ బస్టర్ డెలివరీ చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వెంకటేష్ గత రెండు చిత్రాల్లో హాస్యానికి పెద్దగా స్కోప్ లేదు. దృశ్యం ఫ్యామిలీ థ్రిల్లర్ కాగా గోపాల గోపాలలో ఆధ్యాత్మిక బోధనలను చర్చించడానికే సరిపోయింది.

జులై 1న రిలీజ్..
దీంతో మారుతి డైరెక్షన్ లో చేస్తున్న బాబు బంగారం కొత్త సినిమాలో ఈ లోటును భర్తీ చేస్తున్నట్లు సమాచారం. బాబు బంగారంగా వెంకటేష్ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కొత్త సినిమాలో వెంకీ ఓ రేంజ్ కామెడిని వర్కవుట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ . ఇందులో మల్లీశ్వరీ సినిమాలో మాదిరి నవ్వుల పువ్వులు పూయిస్తాడని తెలుస్తోంది. బాబు బంగారం సినిమాను జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా 50 శాతం కంప్లీట్ అయినట్లు వినికిడి. తులసి, లక్ష్మీ లాంటి హిట్స్ సినిమాలో వెంకీ కి జోడిగా నటించిన నయనతార మరోసారి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టీం ని చూస్తుంటే వెంకటేష్ ఖాతాలో ఓ పెద్ద హిట్టు చేరబోతున్నట్లు కనిపిస్తుంది. మరి బాబు బంగారం ఏం చేస్తాడో చూడాలి.

20:50 - March 13, 2016

రకూల్ ప్రీతిసింగ్ పై ఇండస్ట్రీలో హాట్ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తెలుగులో ఈ బ్యూటీకి యంగ్ హీరో దగ్గరుండి మారీ ఛాన్స్ లు ఇప్పిస్తున్నట్లు సమాచారం. ఆ యంగ్ హీరో తో రకూల్ డేటింగ్ ఉన్నట్లు ఇండస్ట్రీ కోడైకూసుస్తోంది. ఇంతకీ రకూల్ ఏ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందో తెలుసుకోవాలంటే చదవండి..

రకూల్ హావా..
తెలుగులో ప్రస్తుతం రకూల్ హవా నడుస్తోంది. కేవలం రెండు సూపర్ హిట్స్ తో ఈ భామ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అయితే లౌక్యం మూవీ తరువాత ఈ భామకు ఆ స్థాయి హిట్టు పడలేదు. అయిన కూడా రకూల్ కి బడా ఛాన్స్ లు వచ్చిపడుతున్నాయి. ఇలా ప్లాప్స్ వస్తున్నప్పటికి ఈ భామకు బడా ఛాన్స్ లు రావడానికి ఓ యంగ్ హీరో కారణమని తెలుస్తోంది. రకూల్ ఈ ఎడాది స్టార్టింగ్ లో నాన్నకు ప్రేమతో సినిమాతో మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేస్తోంది. దీనితో పాటు లేటేస్ట్ గా రామ్ చరణ్ తో మరోసారి తనిఒరువన్ రిమేక్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఛాన్స్ రావడానికి సదరు యంగ్ హీరోనే కారణమని వినికిడి. రానా, త్రిష.. ఇదంతా ఒకప్పటి మాట. ఎట్ ప్రజెంట్ రానా, రకుల్‌ ఇది లేటేస్ట్ న్యూస్. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. నిజానికి తనిఒరువన్ రిమేక్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలియానాను తీసుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ రానానే ఆ ఛాన్స్ రకూల్ కి వచ్చేలా చేశాడని వినిపిస్తోంది. ప్రస్తుతం రానా, రకూల్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ భామ ఇటీవలే హైద్రాబాద్ లో ఓ హైటెక్ జిమ్ ఒపెన్ చేసింది. ఈ జిమ్ ప్లాన్ కూడా రానానే ఇచ్చినట్లు వినికిడి. ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇండస్ట్రీలో ఇలాంటి న్యూసే వినిపిస్తోంది. మరి నిజంగానే వీరు డేటింగ్ లో ఉన్నరా లేక కావాలనే ఎవరైనా క్రియేట్ చేస్తున్నరా అనేది మాత్రం వీరు నిజం చెప్తేనే తెలుస్తోంది. లేకపోతే ఇలాంటి వార్తలు రన్ అవుతునే ఉంటాయి.

20:46 - March 13, 2016

స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ మాస్ స్టార్ మరింత రేంజ్ పెంచుకోవాలనే ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఈ స్టార్ స్టోరీ ఏదైనా ఉతికి ఆరేయాల్సిందే అని చెప్పుతున్నాడట. నెంబర్ వన్ మాస్ స్టార్ అనిపించుకోవడానికి బన్నీ రచిస్తున్న ఆ ప్లాన్స్ ఏంటో వాచ్ దీస్ స్టోరీ. అల్లుఅర్జున్ అప్ కమింగ్ సరైనోడు టీజర్ లోని డైలాగ్ అదిరిపోతోంది. తెల్ల తోలు కదా స్టైల్ గా ఉంటాడనుకొన్నావేమో మాస్... వూరమాస్' అంటూ బన్నీ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు బన్నీ సినిమా సినిమాకి పక్కా ప్లాన్స్ రచిస్తున్నాడట. మామూలుగా బన్నీ ఎలాంటి రోల్ చేసిన కూడా చాలా స్టయిలిష్ గా మ్యానేజ్ చేస్తుంటాడు. మొదటగా ఈ స్టార్ తన లుక్స్ తోనే యూత్ ని కట్టి పడేస్తుంటాడు. అయితే స్టైలీష్ గా కనిపిస్తునే బన్నీ మాస్ ఆడియన్స్ లో తన రేంజ్ ని అంతకు అంతపెంచకుంటున్నాడు. అందుకోసం ఆయన ఎలాంటి స్టోరీ అయిన అందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నాడట.

మెగా స్కెచ్..
రేసుగుర్రం సినిమాతో 60కోట్లు కలెక్ట్ చేసిన ఈ స్టార్ మాస్ హీరోగా మరింత రేంజ్ కి ఎదిగాడు. ఈ క్రమంలో బన్నీ స్టోరీ మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా ప్లాన్ చేయాలని దర్శకులకు క్లియర్ గా చెప్పుతున్నాడట. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి లాంటి మూవీలో కూడా మాస్ చేత విజిల్ వేయించే ఫైట్స్ తో పాటు సాంగ్స్ డాన్స్ చేసి ఆ సినిమాను విజయపుతీరానికి చేర్చాడు. ఏ దర్శకుడు బన్నీకి స్టోరీ చెప్పడానికి వెళ్లిన కూడా మాస్ సూత్రం మిస్ కాకూడదని చెప్పుతున్నాడట. దీంతో భిన్నంగా ఉండే స్టోరీలోనే మాస్ అంశం జోప్పించి బన్నీని ఒప్పించడానికి దర్శకులు తిప్పలు పడుతున్నారట. మాస్ మంత్రంతో తన బాక్సాఫీస్ రేంజును బీభత్సంగా పెంచుకొని.. టాప్ హీరో అవ్వడానికి ఈ అల్లువారబ్బాయి మెగా స్కెచ్ వేస్తున్నాడు. మరి సరైనోడుగా బన్నీ బాక్సఫీసు వద్ద ఎలాంటి రికార్డ్స్ మోత మోగిస్తాడో త్వరలోనే తెలుస్తోంది.

20:42 - March 13, 2016

హైదరాబాద్ : ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం...పదేళ్ల అమలు, ఫలితాలు అన్న అంశంపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో గ్రామీణ ఉపాధి హామీ ఉద్యమకారిణి మాజీ ఐఎఎస్ అరుణ రాయ్‌, ఉపాధి హామీ కమిషనర్ అనితా రామచంద్రన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం వల్ల పదేళ్ల కాలంలో పేదల ఆర్థిక స్థితి మెరుగుపడిందని ప్రతి కుటుంబం నెలకు 2,500 వరకు సంపాదించుకుంటోందని అరుణ రాయ్‌ అభిప్రాయపడ్డారు. 52 శాతం మంది మహిళలు ఈ రంగంలో ఉన్నారని అన్నారు. 

20:40 - March 13, 2016

నల్గొండ : జిల్లాలో సూర్యాపేటలో రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం జిల్లాలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థి సోదరిని వేధిస్తున్నాడన్న కారణంతో సదరు విద్యార్థి స్నేహితులు వేధిస్తున్న వ్యక్తిని మందలించే ప్రయత్నం చేశారు. వేధిస్తున్న వ్యక్తి తనవారికి సమాచారం అందించడం..వారు చేరుకుని దాడి చేయడం ప్రారంభించారు. కత్తెరతో దాడి చేయడంతో ఉపేందర్ అనే విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు..బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

20:35 - March 13, 2016

నల్గొండ : జిల్లాలో అకాలవర్షం రైతులను భారీగా దెబ్బతీసింది. జిల్లాలోని మిర్యాల గూడ, నేరేడుచర్లలో మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. మామిడి కాయలు భారీగా రాలిపడటంతో... భారీ నష్టం వాటిల్లిందని రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

20:34 - March 13, 2016

హైదరాబాద్ : గత సాంప్రదాయాలకు భిన్నంగా ఆదివారం కూడా తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశం జరిగింది. టి అసెంబ్లీలో మెట్రో రైల్ ప్రాజెక్టు పై వాడివేడిగా చర్చ జరిగింది. మెట్రో రైల్‌ ఎలైన్‌మెంట్‌లలో మార్పుల మూలంగా ప్రజలపై పెనుభారం పడుతుందని విపక్షాలు విమర్శలు అందుకున్నాయి. మెట్రో రైల్ నిర్మాణంలో భారీ స్కాం జరుగుతోందని ఎంఐఎం అనుమానం వ్యక్తం చేసింది. విపక్షాల విమర్శలు ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ బదులిచ్చారు. వెయ్యి గ్రామపంచాయతీల్లో భవనాల నిర్మాణానికి 130 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. సర్పంచ్, సిబ్బంది, పౌరసేవలు అందించేందుకు ప్రత్యేకించి ఒక రూంతో చక్కని భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. 1650 గ్రామ పంచాయతీల్లో వెయ్యి భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. మెట్రోరైల్‌ అలైన్‌మెంట్ మార్పుతో నగర ప్రజలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసి జోక్యం చేసుకుని మెట్రో అలైన్‌మెంట్ ఇష్టారాజ్యంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుంభకోణమే జరుగుతోందని ఆరోపించారు.

చెన్నైలో 8కిలో మీటర్లకు 6 ఏళ్లు..
ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మున్సిపల్, పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మెట్రో అలైన్‌మెంట్ మార్చలేదని స్పష్టం చేశారు. మెట్రో పనులు శరవేగంతో జరగుతున్నాయని ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. 14,132 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టామని 2010లో అగ్రిమెంట్ కుదరగా రెండేళ్ల వరకు పనుల్లో ఎలాంటి పురోగతీ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామన్నారు. 15 రోజులకొకసారి సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో 25 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఏడున్నరేళ్లు, బెంగళూరులో 6 కిలోమీటర్లకు ఏడేళ్లు, చెన్నెలో 8 కిలోమీటర్లు పూర్తి చేయడానికి 6 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. అలాంటిది 72 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించారు. 43 కిలోమీటర్ల మేర మెట్రో పనులు వేగవంతంగా పూర్తిచేసి రికార్డు నెలకొల్పామని కెటిఆర్ అన్నారు. పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్టు మెట్రో రైల్ టికెట్ ధర 13 నుంచి 25 రూపాయల దాకా ఉండే అవకాశముందన్నారు. 

సూర్యాపేటలో విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ..

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

 

20:08 - March 13, 2016

ఢిల్లీ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రపంచ సంస్కృతి సంబరాలు తుది దశకు చేరుకున్నాయి. చివరి రోజు కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవి శంకర్ మాట్లాడారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్' 35వ వార్షికోత్సవం సందర్బంగా ఈనెల 11వ తేదీ నుండి 13 వరకు ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఏడు ఎకరాల్లో 35 వేల మందికి సరిపడే భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. స్టేజ్‌పైనా ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయడంతోపాటు భారత సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ ఉత్సవాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

సింగరేణి వైద్యురాలి మృతి కేసులో కొత్త మలుపు...

కరీంనగర్ : గోదావరిఖని సింగరేణి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. భర్త, అత్తమామలే హత్య చేశారని గోదావరిఖని వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

బాన్సువాడ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో కలుషిత ఆహారం..

నిజామాబాద్ : బాన్సువాడ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

కర్నూలులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

కర్నూలు : సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద కారు - బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

కడియం నివాసంలో వరంగల్ జిల్లా నేతల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం నివాసంలో వరంగల్ జిల్లా ఎమ్మెల్యే, నేతలు భేటీ అయ్యారు. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికపై చర్చించారు. 

ఐర్లాండ్ పై నెదర్లాండ్స్ విజయం..

ధర్మశాల : పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన గ్రూప్ ఏ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆరు ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

19:25 - March 13, 2016

హైదరాబాద్ : గాయని మధుప్రియ వివాదం నాటకీయఫక్కిలో సాగుతోంది. భర్త తనను వేధిస్తున్నాడని పీఎస్ లో ఫిర్యాదు చేసిన మధుప్రియ ప్రస్తుతం భర్త శ్రీకాంత్ 'గుడ్' అని అంటోంది. మధుప్రియ..భర్త శ్రీకాంత్ లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ కౌన్సెలింగ్ జరిగింది. సైక్రియాటిస్టు రాధిక ఆచార్య ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడింది. మొదటి కౌన్సెలింగ్ పూర్తయ్యిందని, సెకండ్ కౌన్సెలింగ్ తరువాత భర్త శ్రీకాంత్ పై ఉన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పేర్కొంది. కొద్ది రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు, శ్రీకాంత్ మంచివాడని తెలిపింది. సెకండ్ కౌన్సెలింగ్ వరకు తాను తల్లిదండ్రులతోనే ఉంటానని మధుప్రియ వెల్లడించింది.

ఆడపిల్లనమ్మా..
ఆడపిల్లనమ్మా... నేను ఆడపిల్లలను అంటూ అతివల కష్టాలను హృద్యంగా అలపించి అందరి మన్నలు పొంది, అందరికీ సుపరిచితమైన అమ్మాయి. అటువంటి మధుప్రియ తల్లిదండ్రులను ఎదిరించి తనను ప్రేమించిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుంది. జీవితం సుఖవంతంగా సాగుతుందనుకున్నారు. మూడు నెలలు సవ్యంగానే సాగిన వీరి వివాహ జీవితంలో కలతలు ప్రారంభమయ్యాయి. దీంతో కలకాలం కలిసి జీవించాల్సిన మధుప్రియ, శ్రీకాంత్‌ల వివాహ బంధం ఇబ్బందుల్లో పడింది. శారీరకంగా, మానసింగా వేధించాడని భర్త శ్రీకాంత్‌పై మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఆడపిల్ల పాటలు పాడతానని మధుప్రియ ప్రకటించారు. గతంలో ఏ బాధలు అనుభవించిన ఆడపిల్లగా పాటలు పాడితే ఈసారి బాధలు అనుభవించిన ఆడపిల్లగా తన గాధనే పాటగా మలిచి వేదికలెక్కుతానని తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో తాను పడిన బాధలు మరే ఆడపిల్లా పడకూడదని మధుప్రియ చెప్పింది. మధుప్రియ ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరి కథ సుఖాంతం అవుతుందా ? లేదా ? అన్నది చూడాలి. 

19:15 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ రంగానికి ఎంత కేటాయించారు ? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు నిధులు ఎంత కేటాయించా ? తదితర ప్రశ్నలకు కొద్దిగంటల్లో సమాధానం రానుంది. 2016-17 సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం ఉదయం 11.35 గంటలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆదివారం బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లక్షా 30వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో మూడు రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇరిగేషన్, ఆరోగ్య, విద్యా రంగాలకు అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇరిగేషన్ రంగం..భారీ ప్రాజెక్టులకు రూ. 25వేల కోట్లు రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. పది వేల కోట్లతో విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలని యోచించిందని సమాచారం. ఇక వైద్య రంగానికి రూ.5-6 వేల కోట్లు కేటాయించాలని తెలుస్తోంది. గతంలో రూ. 3వేల కోట్ల బడ్జెజ్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు మిషన్ భగీరథ కు రెండు నుండి మూడు వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

శ్రీకాంత్..మధుప్రియలకు ముగిసిన కౌన్సిలింగ్..

హైదరాబాద్ : తనను భర్త వేధిస్తున్నాడని పీఎస్ లో ఫిర్యాదు చేసిన మధుప్రియకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. భర్త శ్రీకాంత్ కు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నాలుగు గంటల పాటు సైక్రియాటిస్టు రాధిక ఆచార్య కౌన్సెలింగ్ నిర్వహించారు. 

బడ్జెట్ కు టి. కేబినెట్ ఆమోదం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. రేపు మంత్రి ఈటెల ప్రవేశ పెట్టబోయే 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉదయం 11.35 గంటలకు ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

టిటిడి ఉద్యోగ సంఘం నేతల అరెస్టు..

చిత్తూరు : టిటిడిలో టైం స్కేల్ ఉద్యోగుల సమస్యలపై చలో హైదరాబాద్ కు సీఐటీయు పిలుపునిచ్చింది. అందులో భాగంగా టిటిడి ఉద్యోగ సంఘం నేతలు నగరానికి బయలుదేరారు. నేతలను, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. 

శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న మంత్రి కడియం..

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.35గంటలకు ఆయన బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

షార్జాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి..

ఢిల్లీ : షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. భయంకరమైన కారు ప్రమాదంలో వీరు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు గల్ఫ్ మీడియాకు తెలిపారు. 

18:40 - March 13, 2016

తూర్పుగోదావరి : జిల్లా అధ్యక్షుడు పర్వతనేని చిట్టిబాబు గుండెపోటుతో కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు మృతి పట్ల మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్పలు సంతాపం తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.
చిట్టిబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తోపాటు ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిట్టిబాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వగ్రామగమైన శంకరవరంలో సాయంత్రం చిట్టిబాబు అంత్యక్రియల్లో సీఎం బాబు పాల్గొన్నారు. 

18:32 - March 13, 2016

గుంటూరు : జిల్లాలో చిరుధాన్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.. ఈ ధాన్యాల వంటకాలు ఎలా ఉంటాయి? వీటిని ఎలా వండాలి? లాంటి వివరాలను ఇందులో వివరిస్తున్నారు.. ఈ టేస్ట్‌ నచ్చిన నగరవాసులు ఈ వంటకాలు, ధాన్యాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు... ఎంతో బలవర్ధకమైన ఈ ధాన్యాలు ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌ రాకతో మరుగున పడిపోయాయి.. మారిన ఆహారపు అలవాట్లు జనాల్లో పోషకాహార లోపానికి దారితీశాయి. బీపీ, షుగర్‌లాంటి జబ్బులబారిన పడేలా చేశాయి. చిరు ధాన్యాల వాడకంతోనే అందం, ఆరోగ్యం సాధ్యమన్న వైద్యులు, నిపుణుల సలహా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఈ ధాన్యాలను మళ్లీ ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అటు ప్రభుత్వం కూడా ఈ ధాన్యాలకు ప్రోత్సాహం ఇస్తోంది.

ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి..
గుంటూరులో చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది. దీనిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. చిరు ధాన్యాలతో ఆయుష్షు పెరుగుతుందని ప్రత్తిపాటి చెప్పుకొచ్చారు. గుంటూరు చిరుధాన్యాల ప్రదర్శన నగరవాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో కేవలం ధాన్యాలగురించి చెప్పడమే కాదు. వీటిని ఎలా వండాలి? ఈ ధాన్యాలను ఆహారంలో తీసుకోవడంద్వారా ఏయే పోషక పదార్థాలు అందుతాయో వివరిస్తున్నారు. ఇక ఈ వంటకాల్ని రుచిచూస్తూ నచ్చినవాటిని కొనుగోలు చేస్తున్నారు స్థానికులు. ఈ ప్రదర్శనతో ఫాస్ట్‌ ఫుడ్‌ వద్దు.. చిరు ధాన్యాలే ముద్దు అంటున్నారు నగరవాసులు..

18:29 - March 13, 2016

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. కోటి రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు గొల్లపల్లి చెక్‌పోస్ట్‌ దగ్గర అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరిని చూసిన టాటా సుమో డ్రైవర్‌ వాహనాన్ని వెంటనే వెనక్కితిప్పారు. వెంటనే అధికారులు సుమోను వెంబడించారు. వేగంగా ప్రయాణీస్తున్న సుమో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం డ్రైవర్ పరారీ అయ్యాడు. వాహనంలో ఎర్రచందనం దుంగలతో పాటు మహిళని అరెస్ట్ చేశారు.

18:28 - March 13, 2016

విజయవాడ : దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్ తన పాలనను షురూ చేశారు. అక్రమార్కులు..అవినీతి పరులను పారదోలేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అర్చకుడిని వేధించిన ఆరోపణలతో ఈవో సెలవుపై వెళ్లడంతో ఇంఛార్జీగా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం దుర్గగుడి కేశఖండనశాలలో ఆజాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండగా నేరుగా పట్టుకున్న ఆజాద్ క్షురకుడు రాజును అక్కడే విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల నుంచి ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షిందిలేదని వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో ఆజాద్ హెచ్చరించారు. 

18:23 - March 13, 2016

నెల్లూరు : ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం వివేకానంద రెడ్డి స్టైలే వేరు. ఆయన పలు సందర్భల్లో విభిన్నంగా ప్రవర్తిస్తుంటడం చూస్తూనే ఉంటాం. మీడియా సమావేశంలో చెప్పనక్కర్లేదు. ఇటీవలే కాంగ్రెస్ కు ఆనం సోదరులు గుడ్ బై చెప్పి పచ్చకండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే రోజా టిడిపిపై విమర్శలకు ఆనం తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి మరోసారి తన స్టైల్ లో వైసీపీపై విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఎన్నాళ్లైన వైసీపీ... అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఆయన ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు గుప్పించారో వీడియోలో చూడండి. 

18:19 - March 13, 2016

విశాఖపట్టణం : రాజకీయ నిర్ణయంతో మినహా పరిపాలనాపరమైన అనుమతితో విశాఖకు రైల్వే జోన్‌ వచ్చే అవకాశం లేదని స్థానిక ఎంపీ కంభపాటి హరిబాబు చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్రజలు, నేతలు పెట్టుకున్న ఆశలపై రైల్వేబోర్డు నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. రైల్వేబోర్డు నియమించిన సాంకేతిక కమిటీ ప్రత్యేక జోన్‌ను వ్యతిరేకిస్తూ నివేదిక సమర్పించింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వేజోన్‌ను సాధిస్తామని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.

 

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రేపు మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

 

పర్వత చిట్టిబాబుకు బాబు నివాళి..

తూర్పుగోదావరి : శంఖవరంలో ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు భౌతికకాయానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. 

స్కేటింగ్ చేస్తూ రికార్డు సృష్టించిన చిన్నారి..

తమిళనాడు : కోయంబత్తూరులో ఆరేళ్ల చిన్నారి స్కేటింగ్ చేస్తూ రికార్డు సృష్టించింది. 10.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 41.03 నిమిషాల్లో చేధించి ఏషియా బుక్ ఆఫ్ లో స్థానం సంపాదించింది. 

ఎన్ఆర్ హెచ్ఎం ఉద్యోగులపై పోలీసుల లాఠీఛార్జీ..

లక్నో : తమను రెగ్యులరైజ్ చేయాలని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు. నిరసన చేపడుతున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. 

17:21 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సోమవారం మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టనున్నారు. ముచ్చటగా ఆయన మూడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఐదు గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం ప్రారంభం కాలేదు. శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించడం వల్ల భేటీ మొదలు కాలేదు. సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు సచివాలయానికి చేరుకుంటున్నారు. లక్షా ముప్పై వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని అంచనా. ఇరిగేషన్ శాఖకు రూ. 25వేల కోట్లు..ఆరోగ్య శాఖకు రూ.5వేల కోట్లు..సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కు రూ. 5వేల కోట్లు..రుణమాఫీకి రూ. 4,.200 కోట్లు..పౌరసరఫరాల శాఖకు రూ. 2,800కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం వివిధ రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని, కనీసం రూ. 25వేల కోట్ల బడ్జెట్ ఈ రంగానికి కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

17:16 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కావాలని కోట్లాడి ఉద్యమం చేసిన తాను నీళ్లు రాకుండా చేస్తానా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలపై ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర, కర్నాటక నుండి వచ్చే బ్యారేజ్ లలో భారీ భారీ లిఫ్ట్ లు పెట్టారని తెలిపారు. సాధారణ వర్షపాతానికి నీళ్లు రావని పేర్కొన్నారు. పాత నిజాం సాగర్ ను బతికించుకోవాలని, వరంగల్ జిల్లా నుండి మొదలు కొంటే నిజామాబాద్ వరకు రెండు పంటలు పండించుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని మరోవైపు 1460టీఎంసీల నీరు సముద్ర పాలైపోతోందని సభకు తెలిపారు. ప్రాణహిత - ఇంద్రావతి మించిన ప్రాజెక్టు లేదని, ఉత్తర తెలంగాణకు శాశ్వత కరవు నివారణ జరుగుతోందని తెలిపారు. కృష్ణా నదిలో నీరు లేకుండా అయిపోయిందిని, మెదక్ జిల్లా..పాలమూరు వద్ద చేపట్టే ప్రాజెక్టు 620 మీటర్ల ఎత్తులో ఉంటుందని,తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ లపై 20 మంది నీటిపారుదల రిటైర్డ్ ఇంజినీర్లు హెలికాప్టర్లలో తిరిగారని తెలిపారు. వారు ఇచ్చిన నివేదికల అనంతరం తాము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కేసీఆర్ సభకు తెలిపారు. 

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొద్దిసేపట్లో జరగనుంది. శాసనసమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తి అనంతరం ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోమవారం ప్రవేశ పెట్టే 2016-17 బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

రాజమహేంద్రవరంకు చేరుకున్న బాబు..

తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్ర వరంకు చేరుకున్నారు. కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు భౌతికకాయాన్ని సందర్శించేందుకు శంకరవరంకు బాబు వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో పర్వత చిట్టిబాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

మాల్యాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు..

హైదరాబాద్ : వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్స్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్ లో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఇష్యూ అయినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. తమకు మాల్యా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, తమను చీట్ చేసిన ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ హైదరాబాద్ జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

రేపు టి. బడ్జెట్..కేటాయింపులివేనా ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం ఉదయం 11.35 గంటలకు ప్రవేశ పెట్టనున్నారు. రూ. లక్షా ముప్పై వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని అంచనా. ఇరిగేషన్ శాఖకు రూ. 25వేల కోట్లు..ఆరోగ్య శాఖకు రూ.5వేల కోట్లు..సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కు రూ. 5వేల కోట్లు..రుణమాఫీకి రూ. 4,.200 కోట్లు..పౌరసరఫరాల శాఖకు రూ. 2,800కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. 

16:30 - March 13, 2016

హైదరాబాద్ : దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ఎన్నికల్లో పేదలకు హామీనిచ్చింది. కానీ ఈ భూ పంపిణీ తూతూ మంత్రంగా సాగుతోందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తమ ప్రభుత్వం 2500 కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వడం జరిగిందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి అంశంపై మాట్లాడారు. గతంలో భూములు అశాస్త్రీయంగా ఇచ్చారని, లక్షలాది ఎకరాలు పంచినట్లు రికార్డులున్నాయని తెలిపారు. భూముల పంపిణీలో అనుకున్న ఫలితం రాలేదని, అధికారంలో వచ్చిన తరువాత మూడెకరాల భూమి ఇచ్చి సంవత్సరం పాటు పెట్టుబడి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 2.500 కుటుంబాలకు 6,298 ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగిందని సభకు కేసీఆర్ తెలిపారు. 

ర్యాలీ నిర్వహిస్తున్న మమత బెనర్జీ...

పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలోని బెహలలో నిర్వహిస్తున్న ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ పాల్గోన్నారు. 

గౌహతిలో భూ ప్రకంపనలు..

అస్సాం : రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రకంపనాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

తెలంగాణ శాసనమండలిలో ప్రసంగిస్తున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగిస్తున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు..చేపట్టిన పథకాలపై ఆయన ప్రసంగిస్తున్నారు. 

సుకుమా జిల్లాలో ఎన్ కౌంటర్..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక నక్సల్ మృథి చెందాడు. ఘటనా ప్రాంతం నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

మల్కన్ గిరిలో నక్సల్స్ లొంగుబాటు..

ఒడిషా : రాష్ట్రంలోని మల్కన్ గిరిలో భారీగా నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 57 మంది నక్సల్స్ ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళలున్నారు. 

15:55 - March 13, 2016

హైదరాబాద్ : తనకిప్పుడు తల్లిదండ్రులు ముఖ్యమని, శ్రీకాంత్‌తో వివాహ బంధం దాదాపుగా ముగిసినట్టేనని గాయని మధుప్రియ అన్నారు. చంపుతామంటూ శ్రీకాంత్ కుటుంబం బెదిరిస్తోందని చెప్పారు. కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు తాను పీఎస్ కు వెళ్లడం జరుగుతోందని గాయని మధుప్రియ పేర్కొన్నారు. కత్తులు పట్టుకొని వచ్చారని, తాము కాపాడుకొనే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. చంపేంత మూర్ఖులు తాము కాదని, చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని..ఆ గొడవలే ఇంతవరకు దారి తీశాయని మధుప్రియ ఆ మనిషి మారడేమోనని ఫీలింగ్ ఉందని, శ్రీకాంత్ ఒకే అని తల్లిదండ్రులు అంటే అప్పుడు ఆలోచిస్తానని మధుప్రియ పేర్కొంది. 

15:52 - March 13, 2016

హైదరాబాద్ : సింగర్‌ మధుప్రియ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. భర్త వేధిస్తున్నాడంటూ శనివారం రాత్రి హుమాయిన్ నగర్ లో మధుప్రియ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మధుప్రియ తల్లిదండ్రులే తమపై దాడి చేయించారని భర్త శ్రీకాంత్ ఆరోపించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. మధుప్రియ తల్లిదండ్రులే తమపై దాడి చేయించారని ఆమె భర్త శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. తాను ఇప్పటివరకూ ఎవరిపై కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు.. ఫిర్యాదు విషయం తెలుసుకున్న అనంతరం మధు ప్రియ ఇంటికి వెళ్లానని, మధుప్రియ తల్లి..సోదరి అందరూ అక్కడ ఉన్నారని తెలిపారు. మధుప్రియ తల్లి తనపై దాడి చేసిందని, వెంటనే అక్కడున్న తరులు తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపించారు. తల్లి బాగా నూరిపోస్తుందని, తానే హింసకు గురయ్యానని, గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని తెలిపారు. కానీ తాను మాత్రం ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. హుమాయిన్ నగర్ పీఎస్ కు వెళుతున్నానని, తనతో వచ్చిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారని శ్రీకాంత్ తెలిపారు. 

15:47 - March 13, 2016

రంగారెడ్డి : వాళ్లు 48 రోజులుగా దీక్షలు చేస్తున్నారు..అయినా సర్కార్ లో చలనం లేదు. పట్టువిడవని విక్రమార్కుల్లా వారు పోరాటం చేస్తున్నారు. భూములు కొల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ వారు నినదిస్తున్నారు. వీళ్లందరూ ఫార్మా సిటీ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న బాధితులు. వీరు చేస్తున్న పోరాటానికి మేమున్నాం అంటూ తెలంగాణ సీపీఎం అండగా నిలిచింది. జిల్లా కందుకూరు మండలం ముచర్లలో రైతులు చేస్తున్న నిరహార దీక్ష శిబిరాన్ని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని సందర్శించారు. వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

15:38 - March 13, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రస్తుత బడ్జెట్‌ ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. టెన్‌ టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ పసునూరు శ్రీధరబాబుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడరు. అందరి అవసరాలూ తీర్చే రీతిలో తమ బడ్జెట్‌ ఉంటుందన్నారు. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాలకు నిధుల కొరత లేదని తెలిపారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో.. టెన్‌టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ పసునూరి శ్రీధరబాబు పూర్తి ఇంటర్వ్యూ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వన్ టూ వన్‌లో చూడొచ్చు.

15:22 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రారంభమైన సభలో గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రసంగంలో కాంగ్రెస్, టి.టిడిపి సభ్యులనుద్ధేశిస్తూ కేసీఆర్ పలు విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. సీఎం ప్రసంగం అనంతరం ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుందని స్పీకర్ మధుసూధనాచారి కాంగ్రెస్ సభ్యులకు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలోనే విపక్ష సభ్యులు బైఠాయించారు. ఎంఐఎం మినహా ఇతర సభ్యులందరూ సభలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

టి.అసెంబ్లీలో విపక్షాల ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వివరణ అడిగేందుకు తమకు తగిన సమయం ఇవ్వలేదని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమాధానం అనంతరం సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఎంఐఎం మినహా సభలో విపక్ష నేతలు బైఠాయించారు.

14:59 - March 13, 2016

హైదరాబాద్ : అంతా మీరే చేశారు..బాధ్యత మీదే అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. ఆదివారం ప్రారంభమైన శాసనసభలో గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రాజెక్టుల అంశంపై మాట్లాడిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు. సమైక్య పాలనలో రాష్ట్రం ఇలా ఏర్పడడటానికి టిడిపి, కాంగ్రెస్ పార్టీలే కారణమని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల అంశంపై శనివారం మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డిపై కేసీఆర్ పలు విమర్శలు చేశారు. పాలమూరు బిడ్డ గిదేనా మాట్లాడేది ? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నష్టం తెచ్చినట్లు మాట్లాడుతారా ? తెల్వకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ విపక్షాలకు సూచించారు. అన్నింటికి బాధ్యత మీదేనని, గతంలో మౌనంగా ఉన్నది మీరని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సీఎంలు చేస్తుంటే మౌనంగా ఉన్నది మీరేనని, మహారాష్ట్రకు తాకట్టు పెట్టామా ? గిదేనా మాట్లాడేది అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియాలని అందుకోసం ప్రాజెక్టులపై సుదర్ఘీంగా తాను మాట్లాడుతానని సభకు కేసీఆర్ తెలిపారు. 

తెలంగాణ అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. 

14:43 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలపై విపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రారంభమైన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంపై కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. ఈసందర్భంగా ఇటీవల మహారాష్ట్ర ఒప్పందంపై విపక్షాలు చేసిన విమర్శలపై స్పందించారు. 'మహా' ఒప్పందంపై మీడియాలో వచ్చిన కథనాలు చూసిన జీవన్ రెడ్డి బ్లాక్ డే..రెడ్ డే అంటారా ? అని ప్రశ్నించారు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని జీవన్ రెడ్డిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని, ముందుగా 'ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డు' ఉద్భవించి తొలి మీటింగ్ నిర్వహించి మినిట్స్ రికార్డు నిర్వహించడం జరిగిందన్నారు. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లవచ్చని 'మహా' సర్కార్ పేర్కొనడం జరిగిందన్నారు. ఈనెల 19వ తేదీన మూడు రకాల బృందం ఈ విషయంపై చర్చిస్తుందని తెలిపారు. తొలుత ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రిన్స్ పాల్ సెక్రటరీలు భేటీ అవుతారని తెలిపారు. అనంతరం అపెక్స్ బాడీలో మహారాష్ట్ర సీఎం, మంత్రులు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో నీళ్లు ఎలా వాడుకుంటారో తేలుతుందని పేర్కొన్నారు. 

14:36 - March 13, 2016

హైదరాబాద్ : తాము తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తామా ? అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రశ్నించారు. ఆదివారం ప్రారంభమైన సభలో గవర్నర్ ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ మాట్లాడారు. పక్క రాష్ట్రాలతో సహృద్భావ వాతావరణంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడలేదని, చంద్రబాబు నాయుడు బాబ్లీ పై పోరాటం చేసేందుకు పోయారని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు చెరిగిపోయి ఉన్నాయని, ఘర్షణ పడాల్సిన ధోరణిలో తాము లేమని..ఇచ్చి పుచ్చుకోనే ధోరణిలో ఉన్నామని మహారాష్ట్ర సీఎంతో తాను చెప్పడం జరిగిందన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లతో సర్వే చేయించడం జరిగిందని, ప్రాణహిత - చేవెళ్లపై నివేదిక ఇచ్చిన వ్యాప్కోస్ అధికారులను పిలిపించడం జరిగిందని సభకు తెలిపారు.

నీళ్లోచ్చే ప్రాజెక్టులు కట్టలేదు..
వారు ప్రతిపాదించిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లొచ్చే ప్రాజెక్టులు కట్టలేదని, మహారాష్ట్రతో గతంలో ఒప్పందేమీ లేదని, అనుమతులు లేకున్నా దౌర్జన్యంగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు కట్టారని అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తాము పోరాటాలు చేయడం జరిగిందని, కానీ ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆగలేదని సభకు తెలిపారు. కేవలం పదవుల కోసమే వైఎస్ భజన చేశారని విమర్శించారు. 35 ఏళ్ల చరిత్రలో తొలిసారి సింగూరు ప్రాజెక్టు ఎండిపోయిందని కేసీఆర్ సభకు వివరించారు. 

ఏస్ వీబీసీ కాలేజీలో బీసీ రుణమేళ..

కర్నూలు : ఎస్ వీబీసీ కాలేజీలో నిర్వహించిన బీసీ రుణమేళా కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో బీసీ భవన్ ను నిర్మిస్తామని, మూడో విడత బీసీ రుణమేళాలో జిల్లాకు రూ.33 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 

మధుప్రియ..భర్తకు పోలీసుల కౌన్సెలింగ్...

హైదరాబాద్ : మెహిదీపట్నం పీఎస్ లో గాయని మధుప్రియ, భర్త శ్రీకాంత్ కు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. భర్త వేధిస్తున్నాడంటూ నిన్న హుమాయున్ నగర్ పీఎస్ లో మధుప్రియ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

'గుంటూరు టాకీస్'పై పోలీసులకు ఫిర్యాదు..

హైదరాబాద్ : దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందించిన సినిమా 'గుంటూరు టాకీస్' చిత్రంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వికలాంగులకు కించపరిచేలా ఉన్నాయంటూ తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు ఆరోపించారు. ఈమేరకు ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

సింగరేణి బాయిలర్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

ఆదిలాబాద్ : జిల్లా జైపూర్ ఉన్న సింగరేణి యూనిట్ -1 బాయిలర్ లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

శంకరవరంకు వెళ్లనున్న బాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి రాజమహేంద్ర వరంకు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు భౌతికకాయాన్ని సందర్శించేందుకు శంకరవరంకు బాబు వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో పర్వత చిట్టిబాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

టీఎస్ ఐపాస్ పథకం అద్భుతం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : టీఎస్ ఐపాస్ విధానం అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. టీఎస్ ఐ పాస్ విధానంతో రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. వరంగల్ సమీపంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు దుస్థితిలో ఉన్నాయన్నాయని... వాటిని మెరుగుపర్చుతామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. మూడో విడతలో రైతు రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..

ఫార్మారైతుల దీక్షలో పాల్గొన్న తమ్మినేని

రంగారెడ్డి : కందుకూరు మండలం ముచ్చర్లలో చేపట్టిన ఫార్మారైతుల దీక్షలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

13:17 - March 13, 2016

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పని తీరును ప్రతిబింబిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. టీ.అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తీర్మానంపై చర్చకు సీఎం సమాధానం ఇస్తూ మాట్లాడారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టును మాత్రమే గవర్నర్ చదువుతారని తెలిపారు. కేబినెట్ ఆమోదించిన స్కిప్టును గవర్నర్ చదువుతారని పేర్కొన్నారు. గవర్నర్ స్ర్కిప్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరని.. ఉన్నది ఉన్నట్లుగా చదువుతారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ ఎస్ మేనిపెస్టోలో పేర్కొన్న హామీలే ప్రభుత్వం పాలసీలుగా  ప్రతిబింభిస్తాయని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసమే ప్రభుత్వ పాలసీలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలకు సింగిల్ ఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో లాగా శాసనసభకు కందిళ్లు, ఎండిపోయిన వరి కంకులు పట్టుకుని సభ్యులెవరూ రావటం లేదన్నారు. తెలంగాణలో 16 శాతం అదనపు విద్యుత్ వినియోగించపడుతుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో 'కేజీ టు పీజీ' తప్ప మిగతా వాటిని అమలు చేశామని చెప్పారు. 
తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం...
రాబోయే ఎన్నికల లోపు తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పేరు ఎత్తితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందన్నారు. ఆరునూరైన మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2016 డిసెంబర్ నాటికి 6182 గ్రామాలకు, 12 మున్సిపాలిటీలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. 
సంక్షేమానికి అగ్రతాంబూలం 
సంక్షేమానికి తమ ప్రభుత్వం అగ్రతాంబూలం అందిస్తుందని చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సన్నం బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. భవిష్యత్ లో కాలేజీ, యూనిర్సిటీల్లో కూడా సన్నం బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ కు నిధులు కేటాయించామని చెప్పారు. మార్చి చివరి నాటికి 8 చెరువులు పూర్తవుతాయని చెప్పారు. అమెజాన్ సంస్థ హైదరాబాద్ కు వస్తుందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు సాహసోపేతమైన కార్యక్రమం అన్నారు. కరువు తమను వెంటాడడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్ లో విత్తనాల కొరత లేకుండా చేశామని చెప్పారు. 
టీఎస్ ఐపాస్ పథకం అద్భుతం.. 
టీఎస్ ఐపాస్ విధానం అద్భుతమన్నారు. టీఎస్ ఐ పాస్ విధానంతో రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. వరంగల్ సమీపంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు దుస్థితిలో ఉన్నాయన్నాయని... వాటిని మెరుగుపర్చుతామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. మూడో విడతలో రైతు రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 
పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్ రూం ఇళ్లు 
పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతీ మండల కేంద్రంలో గోదాం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య విధానంలో కొంత మార్పు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తేల్చి ఇచ్చారు. 
హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలు దురదృష్టకరం
హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలు దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలను ఖండిస్తున్నామన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఇష్యూ చేయదలుచుకోలేదని చెప్పారు. పొట్టకూసి కోసం వచ్చిన వారిపై తమ పంచాయతీ కాదని... తమ పొట్ట కొట్టే వారిపైనే పంచాయతీ అన్నారు. 
అభివృద్ధిని అడ్డుకుంటారా..?
రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రుణాలు ఇవ్వవద్దని గతంలో కాంగ్రెస్ గుత్త సుఖేందర్ రెడ్డి హడ్కో కు లేఖ రాశారని... ఇది చాలా దారుణమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర అభివవృద్ధిని అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు విమర్శలు చేయడం మానుకొని విలువైన సలహాలు వారికే మంచిదని హితవు పలికారు.   
కాంగ్రెస్ పై సీఎం ఫైర్ 
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తమను తాము అగౌరవ పరుచుకుంటున్నామన్నారు. జీవన్ రెడ్డి రిపీట్ అంశాలను మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ .. 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చేయలేదన్నారు. ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ధర్నాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు 8 వేల కోట్లు.. కేటాయించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎయిర్ పోర్టుకు లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు. 

 

 

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

హైదరాబాద్ : కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తమను తాము అగౌరవ పరుచుకుంటున్నామన్నారు. జీవన్ రెడ్డి రిపీట్ అంశాలను మాట్లాడుతున్నారని చెప్పారు. 

 

అభివృద్ధిని అడ్డుకుంటారా..? సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా అని సీఎం కేసీఆర్ విపక్షాలను ప్రశ్నించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రుణాలు ఇవ్వవద్దని గతంలో కాంగ్రెస్ గుత్త సుఖేందర్ రెడ్డి హడ్కో కు లేఖ రాశారని... ఇది చాలా దారుణమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర అభివవృద్ధిని అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు విమర్శలు చేయడం మానుకొని విలువైన సలహాలు వారికే మంచిదని హితవు పలికారు.   

సంక్షేమానికి అగ్రతాంబూలం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సంక్షేమానికి తమ ప్రభుత్వం అగ్రతాంబూలం అందిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. టీఅసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తీర్మానంపై చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సన్నం బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. భవిష్యత్ లో కాలేజీ, యూనిర్సిటీల్లో కూడా సన్నం బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. 

తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల లోపు తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పేరు ఎత్తితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందన్నారు. ఆరునూరైన మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2016 డిసెంబర్ నాటికి 6182 గ్రామాలకు, 12 మున్సిపాలిటీలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. 

 

గవర్నర్ ప్రసంగం పై సీఎం కేసీఆర్ స్పీచ్....

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పని తీరును ప్రతిబింబిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టును మాత్రమే గవర్నర్ చదువుతారని తెలిపారు. కేబినెట్ ఆమోదించిన స్కిప్టును గవర్నర్ చదువుతారని పేర్కొన్నారు. గవర్నర్ స్ర్కిప్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరని.. ఉన్నది ఉన్నట్లుగా చదువుతారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ ఎస్ మేనిపెస్టోలో పేర్కొన్న హామీలే ప్రభుత్వం పాలసీలుగా  ప్రతిబింభిస్తాయని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసమే ప్రభుత్వ పాలసీలు ఉంటాయన్నారు.

12:41 - March 13, 2016

హైదరాబాద్ : రైతులను ఆదుకోవడంలో టీ.ప్రభుత్వ విఫలమైందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. టీఅసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికలముందు మేనిపెస్టోలో మంచి మంచి హామీలిచ్చిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. వాటిని మరిచిపోయారని పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్ వ్యవస్థను బతికించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎక్కడా తారు, సీసీ రోడ్డుల నిర్మాణం చేయలేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. 

 

టీ.ప్రభుత్వపై జీవన్ రెడ్డి ఫైర్...

హైదరాబాద్ : రైతులను ఆదుకోవడంలో టీ.ప్రభుత్వ విఫలమైందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. టీఅసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

11:55 - March 13, 2016

ఢిల్లీ : క్రికెటర్లకు జాతీయజట్టులో చోటు సంపాదించడం ఓ కల. ప్రపంచకప్ లో ఒక్కసారి పాల్గొన్నా జీవితం ధన్యమైనట్లే భావిస్తారు. అయితే...ఒకటి కాదు...రెండు కాదు..ఏకంగా ఆరు ప్రపంచకప్ ల్లో పాల్గొంటే...ఆ మజాయే వేరు. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి...2016 ప్రపంచకప్ వరకూ...వివిధ దేశాలకు చెందిన19 మంది క్రికెటర్లు వరుసగా ఆరో ప్రపంచకప్ కు సిద్ధమవుతున్నారు......  
మిగిలిన క్రీడలన్నింటికీ భిన్నమైంది క్రికెట్
క్రీడలు ఎన్నో రకాలు. అయితే మిగిలిన క్రీడలన్నింటికీ భిన్నమైనది క్రికెట్ మాత్రమే. వన్డే క్రికెట్లో ప్రపంచకప్ ను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తే...ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో రెండేళ్లకోసారి ప్రపంచకప్ పోటీలు నిర్వహించడం సాధారణ విషయంగా మారింది. 2007లో జరిగిన ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి..బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన 2014 ప్రపంచకప్ వరకూ...వరుసగా ఐదుటోర్నీల్లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన 19 మంది క్రికెటర్లు..2016 ప్రపంచకప్ కు సైతం సిద్ధమవుతున్నారు.
ముగ్గురు మొనగాళ్ళు..
దక్షిణాఫ్రికా గడ్డపై ముగిసిన ప్రారంభ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యులుగా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ ప్రపంచకప్ లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేయటానికి సిద్ధమవుతున్నారు. 2007, 2009, 2010, 2012, 2014 ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న ఈ ముగ్గురు మొనగాళ్ళు..2016 ప్రపంచకప్ లో సైతం పాల్గొనడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పబోతున్నారు.
అత్యధిక క్రికెటర్ల రికార్డు బంగ్లాదేశ్ జట్టు సొంతం
ఏకబిగిన ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న అత్యధిక క్రికెటర్ల రికార్డును బంగ్లాదేశ్ జట్టు సొంతం చేసుకొంది. టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ జరిగిన ఐదుటోర్నీల్లో పాల్గొన్న ముష్రఫే మొర్తాజా, ముష్ ఫీకర్ రహీం, షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా..2016 ప్రపంచకప్ లో పాల్గొనే తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు. ఆరవ ప్రపంచకప్ లో పాల్గొంటున్న ఇతర దేశాల క్రికెటర్లలో వెస్టిండీస్ కు చెందిన డ్వయన్ బ్రావో, క్రిస్ గేల్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ రాందిన్, న్యూజిలాండ్ కు చెందిన నేథన్ మెకల్లమ్, రాస్ టేలర్, శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, ఓపెనింగ్ బౌలర్ లాసిత్ మలింగ, సౌతాఫ్రికా ఆటగాళ్ళలో ఏబి డివిలియర్స్, డుమ్నీ, పాకిస్థాన్ కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ షాహీద్ ఆఫ్రిదీ, ఆస్ట్రేలియా సూపర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఉన్నారు. ఏదిఏమైనా..ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనడం అంటే మాటలా మరి.

 

టీఅసెంబ్లీకి పది నిమిషాలు టీ విరామం..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ మధుసూదనాచారి పది నిమిశాలు టీ విరామం ఇచ్చారు. అంతకముందు వామపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 

 

వాయిదా తీర్మానాలు తిరస్కరణ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలో వామపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో గాంధీ విగ్రహం వేదిక, అంబేద్కర్‌ భవన్‌ను కూల్చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని వామపక్షాలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. 

 

11:38 - March 13, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పీపుల్స్ ఫ్లాజాలో షీ టీమ్స్ అవగాహన సదస్సు జరుగుతోంది. ముఖ్య అతిథులుగా డీజీపీ అనురాగ్‌ శర్మ, సినీ నటులు రామ్‌చరణ్‌, మంచులక్ష్మీ హాజరయ్యారు. 

 

11:32 - March 13, 2016

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. గుల్మార్గ్ లో మంచు పేరుకుపోయింది. మంచు వర్షంతో కుప్వారా జిల్లాలోని తంగ్దార్‌, నాస్తచున్‌ జాతీయ రహదారిని మూసేశారు. దీంతో ఆ మార్గంలోని 70వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు ఇబ్బందుల్లో పడ్డారు. వారిని రక్షించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది.

 

కత్తులతో స్నేహితులు పరస్పర దాడి....

హైదరాబాద్ : స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి అది పెద్దదిగా మారి ఒకరిపై ఒకరు ప్రత్యక్ష దాడులకు దిగే వరకు వెళ్లింది. దీంతో ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు. నగరంలోని హుమాయున్‌నగర్‌లోగల లక్ష్మీనగర్‌కు చెందిన నలుగురు స్నేహితుల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇది పెద్దదిగా మారి ఒకరినొకరు దాడులు చేసుకోవడంతో అందులో ఒకరు కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం అతన్నిచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10:50 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. మెట్రోరైలు నిర్మాణం, అలైన్ మెంట్ పై చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ అలసత్వంతోనే మెట్రో జాప్యం : భట్టి విక్రమార్క
ప్రభుత్వ అలసత్వంతోనే మెట్రోరైలు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీ ముదు అలైన్ మెంట్ మార్పు , సుల్తాన్ బజార్ లో అలైన్ మెంట్ మార్పుతోపాటు పలు ప్రాంతాల్లో మెట్రోలైన్ అలైన్ మెంట్ మార్పు చేయాలని ప్రభుత్వం భావించడంతోటే మెట్రోలైన్ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. అలైన్ మార్పుతో 3 నుంచి 6 వేల కోట్ల భారం 
పడుతుందన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. 
మెట్రో రైలు పనుల్లో తీవ్ర ఆలస్యం : అక్బరుద్దీన్ ఓవైసీ 
మెట్రో రైలు పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మెట్రో పనుల పూర్తికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టులో ఎన్ని స్టేషన్లు రాబోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కనిష్ట చార్జీ ఎంత..? గరిష్ట చార్జీ ఎంత..? తెలపాలని కోరారు. కి.మీకి ఎంత మేర చార్జీ వసూలు చేస్తారో తెలపాలన్నారు.   

 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. మెట్రోరైలు నిర్మాణంపై చర్చ జరుగుతోంది. 

టీడీపీ తూ.గో జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి

కాకినాడ : తూర్పుగోదారి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 

 

09:46 - March 13, 2016

హైదరాబాద్ : ఎప్పటిలాగే అధికార పక్షం తన గొప్పతనాన్ని ఘనంగా చెప్పుకుంది. తమ పాలనా విజయాలను సభ ముందు ఉంచింది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సగర్వంగా చూపించింది. ఐతే ప్రతిపక్షాలు అదే స్థాయిలో స్పందించాయి. పాలనలో లోపాలను ఎత్తిచూపాయి. సంక్షేమ పథకాల్లో లోటుపాటులపై అధికార పక్షాన్ని నిలదీశాయి. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. ఇవాళ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. 
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ సాగింది. 21 నెలల్లో తమ ప్రభుత్వం ఎంతో సాధించిందని అధికార పక్షం చెప్పుకొచ్చింది. ఐతే ప్రభుత్వం మాటలకే పరిమితమయ్యిందని ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. కరువు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, సాగునీటి ఒప్పందాలు, యూనివర్శిటీల్లో ఇన్‌ఛార్జ్‌ వీసీల పాలన తదితర అంశాలపై  ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రశ్నోత్తరాల అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. చర్చను చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ మొదలుపెట్టారు.  
గవర్నర్‌ ప్రసంగంలో చాలా విషయాలు విస్మరించారు : చిన్నారెడ్డి 
గవర్నర్‌ ప్రసంగంలో చాలా విషయాలు విస్మరించారని కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి అన్నారు. కరువు, ఉద్యోగాల భర్తీ, ఫీ రీయింబర్స్ మెంట్‌ లాంటి అంశాలు గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనలేదని మండిపడ్డారు. మహారాష్ట్రతో సర్కార్‌ చేసుకున్న ఒప్పందం కొత్తదేమీ కాదన్నారు చిన్నారెడ్డి.
నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : సీఎం కేసీఆర్‌ 
సమైక్య పాలనలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. కృష్ణా నుంచి 368 టీఎంసీలే కేటాయించారన్నారు 
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదని కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.  లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే..కేవలం 14 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. 
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రులు 
ఐతే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు హరీష్‌రావు, ఈటెల అన్నారు.  ఈ అంశంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర కరువు ఉందని.. ఈ అంశాన్ని గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని భధ్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు.
ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వొద్దు : ఆర్.కృష్ణయ్య  
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇస్తే మొత్తం విద్యా వ్యవస్తే కుప్పకూలుతుందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడిన అనంతరం సభను డిప్యూటీ స్పీకర్‌ ఆదివారానికి వాయిదా వేశారు. 

09:34 - March 13, 2016

ఢిల్లీ : అండబలం.. దండ బలమే కాదు... అన్ని బలాలు ఉపయోగించి..  పవర్‌లోకి రావడానికి నానా పాట్లు పడుతుంటాయి రాజకీయ పార్టీలు.  అధికారమే పరమావధిగా నేరాలకు తెరలేపుతారు నేతాశ్రీలు. అందులో భాగంగా అనేక అక్రమాలకు పాల్పడతారు. కానీ ఇకముందు వాటికి చెక్‌పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది ఎలక్షన్ కమిషన్. 
కేసుల సత్వర పరిష్కారం కోసం రాజ్యాంగ ధర్మాసనం  
ఎన్నికల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల కేసుల సత్వర పరిష్కారం కోసం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతోంది. అక్రమాలకు తావు లేని విధంగా ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలని నిర్వాచన్‌ సదన్‌ యోచిస్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల్లో నేరస్తులు పాల్గొనకుండా నిరోధించడంతో పాటు ఓటింగ్‌ శాతాన్ని పెంచేవిధంగా ఈ  సంస్కరణలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేస్తున్నామని చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ నసీం జైదీ వెల్లడించారు. లా కమిషన్‌ సిఫారసు మేరకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జైదీ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజాస్వామిక హక్కులు, ఎన్నికల నిఘా సంస్థ వార్షికోత్సవంలో జైదీ పాల్గొన్నారు. 
ఎన్నికల అఫిడవిట్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు 
నామినేషన్‌ పత్రాల్లో పూర్తి సమాచారం అందించని వారిపై అనర్హత వేటు తప్పదని, ఎన్నికల అఫిడవిట్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలుంటాయన్నారు. ఎన్నికల్లో హింసను నిరోధించేందుకు పోలీసు బలగాలను కాకుండా కేంద్ర భద్రతా, పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నట్లు జైదీ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై మరింత నిఘా పెంచుతామని ఆయన తెలిపారు. 
పుట్టగొడుగుల్లా రోజుకో పార్టీ 
పుట్టగొడుగుల్లా రోజుకో పార్టీ ఆవిర్భవిస్తోందని, ఆయా పార్టీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందన్నారు జైదీ. 753 పార్టీలు ఇప్పటికీ ఒక్క ఎన్నికల్లో కూడా పాల్గొనలేదని, అలాంటి పార్టీలపై త్వరలోనే విచారణ జరపనున్నట్లు తెలిపారు.  

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వామపక్షాల వాయిదా తీర్మానం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు వామపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో గాంధీ విగ్రహం వేదిక, అంబేద్కర్ భవన్ కూల్చివేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని, కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మించాలని వామపక్షాలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి.  

08:50 - March 13, 2016

ఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. బ్యాంకులకు వేల కోట్ల బకాయిలు పడ్డ లిక్కర్‌ కింగ్ లండన్‌లోనే ఉన్నాడా..?  పెట్టా బేడా సర్దుకుని.. చెప్పాపెట్టకుండా మాయమైన కింగ్‌ ఫిషర్‌ అధినేతకు అక్కడ భారీ ఆస్తులే ఉన్నాయా..? ఇంతకీ విజయమాల్యా ఎక్కడ ..?  హార్ట్ ఫోర్డ్ షైర్‌లోని తన ఎస్టేట్‌ను చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈజీగానే వెతుక్కోవచ్చు. 
లండన్‌లోని టైవెన్‌లో సొంత ఎస్టేట్‌
ముప్పై ఎకరాల స్థలం.. విశాలమైన పచ్చిక బయళ్లు... ఎత్తైన ఇనుప గేట్లు.. చుట్టూ ప్రహారీ.. అక్కడక్కడ కెమెరా నిఘా నేత్రాలు. తరచూ...లోపలికి బయటకు వచ్చిపోయే ఖరీదైన కార్లు.. ఇదీ కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా రాజసం. వేల కోట్ల రూపాయలు బకాయి పడి విదేశాలకు చెక్కేసిన విజయమాల్యా ఎక్కడున్నాడన్నదే అసలు ప్రశ్న. అయితే అతను లండన్‌లోని టైవెన్‌లో తన సొంత ఎస్టేట్‌లో తలదాచుకున్నట్లు మీడియా వర్గాల సమాచారం.  హార్డ్‌ఫోర్డ్‌షైర్‌లోని బేక్‌ స్ట్రీట్‌లో గల తన నివాసంలో  కొన్ని రోజులు బస చేసినట్లు స్థానికుల టాక్‌.!
టెన్నిస్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, పచ్చిక మైదానాలు 
ముప్పై ఎకరాల సువిశాలమైన ఈ ఎస్టేట్‌లో టెన్నిస్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, పచ్చిక మైదానాలతో పాటు విశాలమైన గదులున్నట్లు తెలుస్తోంది. నిరంతరం కెమెరా కనుసన్నల్లో ఉండే ఈ ఎస్టేట్‌ ఆంథోనీ అనే వ్యాపారవేత్త నుంచి కొన్నట్లు సమాచారం. విలాసవంతమైన జీవితాన్ని గడిపే విజయ్‌ మాల్యా ఈ ప్రాంతంలో పేద్ద సెలబ్రెటీ. ఇక్కడ వేల కోట్లు బకాయిలు  పడ్డ మాల్యా అక్కడ భారీమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. 
ఎస్టేట్‌లో నిరంతరం సెక్యూరిటీ కట్టుదిట్టం 
ఖరీదైన కార్లలో తిరుగుతూ... అందమైన అమ్మాయిలతో పబ్‌లకు వెళ్లే మాల్యా కలర్‌ఫుల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటాడని, ఎస్టేట్‌లో నిరంతరం సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుందని స్థానికులు స్పష్టం చేశారు. 
 

ఏప్రిల్ 10 నుంచి భక్తి భజన సంకీర్తన పోటీలు

హైదరాబాద్ : భక్తి భజన సంకీర్తన పోటీలు ఏప్రిల్ 10 నుం చి 14 వరకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ అధ్యక్షురాలు జె.సుధారాణి తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఔత్సాహిక భజన సమాజం వారిని ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 9652027111, 9642326567 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

ముంబై అర్థర్‌రోడ్ జైలులో ఖైదీ అనుమానాస్పద మృతి

మహారాష్ట్ర : ముంబైలో గల అర్థర్‌రోడ్ జైలులో ఓ ఖైదీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మృతికి కారణాలు తెలియరాలేదు. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

గాయని మధుప్రియ ఇంటిపై దాడి

హైదరాబాద్ : గాయని మధుప్రియ ఇంటిపై శనివారం అర్ధరాత్రి దాడి జరిగింది. మధుప్రియ భర్త శ్రీకాంత్, అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడికి పాల్పడ్డట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఉప్పల్ లోని తమ ఇంటికి వచ్చిన శ్రీకాంత్.. వేధింపుల కేసు ఎందుకు పెట్టారంటూ నానా హంగామా సృష్టంచాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టే ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్ అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

తిరుమలకు పోటెత్తిన భక్తులు

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్ లో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇందిరానగర్‌, జవహర్‌నగర్‌లో శనివారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిలో 10 మంది రౌడీ షీటర్లు, ఇద్దరు విదేశీయులు ఉన్నారు. అలాగే 46 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

08:35 - March 13, 2016

ఢిల్లీ : ఒకటి తప్పితే.. మరోటి. వివాదాల పరంపరలో ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ దానికదే సాటి. ఉత్సవాల వేదిక స్థలం వివాదం ముగిసిందనుకుంటే...తాజాగా మరికొన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి. సాంస్కృతిక ఉత్సవాలకు అవినీతి అక్రమాలతో సంబంధం ఉన్నవారినే కాదు... అసలు భూమ్మీద జీవించి లేని వాళ్లకు కూడా ఆహ్వానాలు పంపారు నిర్వాహకులు. ఈ చనిపోయిన వారికి ఇన్విటేషన్‌ ఇవ్వడమేంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
మరో వివాదంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 
ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది.. ఢిల్లీలో ఈ సంస్థ ఘనంగా నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల ఆహ్వాన జాబితాలో ఈ మధ్యే కన్నుమూసిన ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి పేరు, భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే ఓ టర్కీ నేత, అలాగే.. భారీ కుంభకోణాలకు పాల్పడినవారి పేర్లు ఉండటంతో సంస్థ తీరుపై పలువరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
ఆహ్వాన జాబితాలో బౌత్రోస్ ఘలీ పేరు
గత నెల 16న కన్నుమూసిన ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ ఘలీ పేరును ఆహ్వాన జాబితాలో  పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వైఖరికి మద్దతుగా నిలుస్తున్న టర్కీలోని ఆర్గనైజేషన ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మాజీ కార్యదర్శి అక్మలుద్దీన్ ఇసానోంగ్లూకు సైతం పిలుపు అందింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో 2005లో ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న డచ్ ప్రధాని రుడ్ లుబ్బెర్స్ కు, అవినీతి ఆరోపణలపై పదవి నుంచి వైదొలగిన జపాన్ క్రీడలశాఖ మంత్రి షిమోమురాకు ఆహ్వానాలు పంపారు నిర్వాహకులు. 
షిమోమురాపై భారీ అవినీతి ఆరోపణలు 
2020లో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ఒలింపిక్స్ కు సంబంధించి ఓ స్టేడియం నిర్మాణంలో షిమోమురా భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గతేడాది జపాన్ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు. ఏకంగా డచ్ ప్రధాని రుడ్ లుబ్బెర్స్ కు ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. చివరి నిమిషంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారిలు హజరుకాబోమని ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సమర్థిస్తున్న సంస్థకు ఎలా ఆహ్వానం పంపుతారని.. ఇదేనా జీవించే కళంటే.. .అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.  
పర్యావరణానికి నష్టం వాటిల్లే విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మంగోలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రులు, ఆఫ్ఘనిస్థాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అబ్దుల్లా అబ్దుల్లా కూడా హాజరుకాబోమని వెల్లడించారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదట హజరవ్వాలని అనుకున్నప్పటికీ... వివాదాల నేపధ్యంలోనే హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని అధికారులంటున్నారు. ఏదెమైనా ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అంటూ పర్యావరణ విధ్వంసానికి నష్టం వాటిల్లే విధంగా వేడుకలు నిర్వహించడం, ఉత్సవాల్లో ఆర్మీని ఉపయోగించుకోవడంపై ఇప్పటికే దుమారం రేగింది. దేశ వైఖరికి విరుద్ధంగా ఉన్న సంస్థలను ఆహ్వానించడంపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో చూడాల్సిందే. 

 

08:21 - March 13, 2016

గుంటూరు : నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా పోకిరుల వేధింపులు ఆగడం లేదు..కఠిన శిక్షలు పడుతున్నా ప్రేమోన్మాదుల దాష్టీకాలకు అడ్డుకట్ట పడటం లేదు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయిల కలలన్నీ కల్లలవుతున్నాయి..గుంటూరు జిల్లాలో ఓ ఆకతాయి వేధింపులకు యువతి బలైపోతే.. మెదక్‌ జిల్లాలో మరో బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడింది. 
బీటెక్‌ విద్యార్థినికి పోకిరి వేధింపులు 
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామానికి చెందిన అమూల్య చీరాల ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫస్ట్ ఇయర్‌ వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన కూరపాటి సర్వోత్తమరావు యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమూల్య ఎక్కడికెళ్లినా నీడలా వెంటాడుతూ ఆమెకు మనశాంతిని దూరం చేశాడు. యువకుడి వెర్రి వేషాలు శృతిమించడంతో అమూల్య విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో భయపడిపోయిన వారు కూతురు చదువును మధ్యలోనే ఆపేసి ఆమెను హైదరాబాద్‌ పంపారు.  
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
విషయం తెలుసుకున్న సర్వోత్తమరావు హైదరాబాద్ వచ్చి అమూల్యను ప్రేమించాలంటూ వేధించాడు. పెళ్లి చేయడానికి నిశ్చయించిన యువతి తల్లిదండ్రులు ఆమెను కసుకర్రుకు తీసుకొచ్చారు. స్వగ్రామంలోనూ సర్వోత్తమరావు పైశాచికం ప్రదర్శించడంతో విసుగు చెందిన అమూల్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన దారుణాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. కసుకర్రులో అమూల్య మృతదేహాన్ని సందర్శించి.. తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. 
విద్యార్థిని అనుమానాస్పద మృతి 
మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలోని బీసీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని అరుణ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శుక్రవారం రాత్రి ముభావంగా ఉన్న బాలిక.. తోటి విద్యార్థినులు నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హడావుడిగా బాలిక మృతదేహాన్ని హాస్టల్‌ అధికారులు కిందకు దించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
అమ్మాయిల బలవన్మరణాలు... కన్నవారిలో కలవరం 
ఏదీ ఏమైనా అమ్మాయిల బలవన్మరణాలు కన్నవారిలో కలవరం రేపుతున్నాయి. పోకిరిల ఆటకట్టించడంతో పాటు.. విద్యాలయాలు, హాస్టళ్లలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పుడే విద్యాకుసుమాల బలవన్మరణాలు కొంతైనా తగ్గే అవకాశం ఉంది. 

 

08:04 - March 13, 2016

హైదరాబాద్ : ఎండల భగభగకు వాతావరణం హీటెక్కింది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సామాన్యుడిని ఓ చోట నిలువనీయడం లేదు. సెగలు చిమ్ముతూ సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో.. మార్చి నెల మొదట్లోనే అధిక ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే..  మే లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలపై స్పెషల్ స్టోరీ...
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు  
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే... నిప్పుల కొలిమిని తలపించే సెగలు మొదలయ్యాయి. సూర్యుని ప్రతాపానికి సామాన్యులు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. గతేడాది మార్చితో పోలిస్తే ఇప్పుడు సగటున మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. 
తెలంగాణలో సగటున 70 శాతం, ఏపీలో 90 శాతం 
కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఎండలకు అల్లాడుతున్నాయి. ఆదిలాబాద్‌, భద్రాచలం, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండం, అనంతపురం, కర్నూలు లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. హైదరాబాద్‌లో ఒక్క శనివారం నాడే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్ర ప్రాంతాల్లో 32 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 31 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వాతావరణంలో తేమ శాతం కూడా ఆందోళన కరంగా ఉంది. తెలంగాణలో సగటున 70 శాతం ఉండగా, ఏపీలో మాత్రం 90 శాతం వరకు తేమ ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 15 నుంచి 20 శాతం అధికమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. 

 

07:59 - March 13, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు ముగిసింది. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దరఖాస్తులు  కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఎస్‌ఐ పోస్టులకు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు సైతం పోటీపడుతున్నారు. దరఖాస్తు గడువు ముగియడంతో.. అభ్యర్థులంతా రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ కోసం కుస్తీలు పడుతున్నారు. 
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
తెలంగాణ పోలీస్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 539 ఎస్సై పోస్టులకు రెండు లక్షల దరఖాస్తులు అందాయి. ఇక 9,200 కానిస్టేబుల్‌ పోస్టులకు 5లక్షల 36 వేల దరఖాస్తులు అందాయి. ముఖ్యంగా ఇందులో ఎస్సై పోస్టులకు ఎంటెక్‌, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్‌, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం ఎస్‌ఐ పోస్టులకు పోటీ పడుతున్నారు. 
అభ్యర్థుల నుంచి భారీగా స్పందన 
తెలంగాణలో పోలీసుల రిక్రూట్‌మెంట్లకు అభ్యర్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. 9,200 కానిస్టేబుల్‌ పోస్టులకు ఒక్క బీటెక్‌ చదివిన అభ్యర్థులే ఏకంగా 43 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పోలీసు ఉద్యోగాలకు ఎంతగా డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి భారీ ఎత్తున దరఖాస్తులు రావంతో పరీక్షల ఏర్పాటుకు పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 
పోలీసు ఉద్యోగాలకు ఏప్రిల్‌ నెలలో రాతపరీక్షలు
పోలీసు ఉద్యోగాలకు ఏప్రిల్‌ నెలలో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 3న కానిస్టేబుళ్లకు, 14న ఎస్‌ఐ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం జేఎన్‌టీయూ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈసారి నిర్వహించే పరీక్షల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు 1,131 కేంద్రాలు, ఎస్సై పోస్టుల పరీక్షలకు 1065 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. పోలీసు నియామకాలు మొత్తం నాలుగు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటగా ప్రిలిమినరీ రాతపరీక్ష ఆ తర్వాత శరీర కొలతల పరీక్షలు, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి చివరగా మెయిన్స్‌ రాతపరీక్షలు నిర్వహిస్తారు. 
బయోమెట్రిక్‌ విధానంతో అక్రమాలకు చెక్‌ 
దరఖాస్తులకు గడువు పూర్తికావడంతో...అభ్యర్థులంతా రాత పరీక్ష,.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు రెడీ అవుతున్నారు. ఎలాగైన పోలీసు ఉద్యోగాన్ని దక్కించుకోవాలన్న కోరికతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 

 

07:52 - March 13, 2016

హైదరాబాద్ : దుకాణం ఖాళీ అయిన తర్వాత...తెలంగాణ తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని మార్చిందా ? ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలను పరిశీలిస్తే అది నిజమే అనే సమాధానం వస్తుంది. గడిచిన మూడు రోజులుగా పార్టీప్రభుత్వంపై టి టిడిపి నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేస్తుండడంతో అదంతా వ్యూహాంలో భాగంగానే చేస్తున్నారనేది టాక్‌. 
15 నుంచి ముగ్గురికి పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య 
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో 15మంది స‌భ్యుల నుంచి ప్రస్తుతం ముగ్గురికి ప‌డిపోయింది లెక్క. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడ‌ర్‌గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేవంత్ అన‌గానే  స‌హ‌జంగా నిత్యం విమ‌ర్శలు చేస్తూ... చర్చల్లో ఉండే వ్యక్తి. అయితే తాజ‌గా మారిన ప‌రిస్థితుల్లో పార్టీ వ్యూహాన్ని కూడా మార్చింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కో ఆర్డినేష‌న్ చేసుకుని అసెంబ్లీలో త‌మ పార్టీ వాయిస్‌ని వినిపించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆర్‌.కృష్ణయ్యను రంగంలోకి దించిన టిటిడిపి 
త‌మ ప్లాన్‌లో భాగంగానే ఇన్నాళ్లూ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవ‌హ‌రించిన ఆర్.కృష్ణయ్యను ముందుకు పెట్టింది. చిన్న విష‌యాన్ని కూడా పెద్దగా రాద్దంతం చేసే పార్టీ..తాజాగా ఫ్లోర్‌లీడ‌ర్‌తో స‌హా సీట్లను వెన‌క్కి వేసినా పెద్దగా ప‌ట్టించుకోన‌ట్లే వ్యవహరించారు. ఇక గ‌వర్నర్ ప్రసంగంపై చర్చలో అటు రేవంత్ రెడ్డి గానీ,..ఇటు సండ్ర వెంక‌ట వీర‌య్య పాల్గొనకుండా.. ఉద్యమ నాయ‌కుడిగా పేరున్న ఆర్‌.కృష్ణయ్యను రంగంలోకి దించారు. ఆయ‌నతోనే ప్రభుత్వంపై బాణం ఎక్కుపెట్టారు. అనేక ఉద్యమాల అనుభ‌వంతో ఆర్‌.కృష్ణయ్య చేసిన ప్రసంగం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. 
పార్టీ వాయిస్‌ వినిపించాలనే నిర్ణయంలో భాగమే
పార్టీ వాయిస్ వినిపించాల‌నే నిర్ణయంలో భాగంగానే టి టిడిపి వేసిన పాచిక పారింది. ఆర్ కృష్ణయ్య త‌నదైన శైలిలో స‌ర్కార్‌ను విమ‌ర్శిస్తూనే..స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. దీంతో అటు ప్రభుత్వం నుంచి కానీ,.ఇత‌ర విప‌క్షాల నుంచి కూడా మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో ఇక మొత్తం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే త‌ర‌హా వైఖ‌రితో ముందుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.

07:45 - March 13, 2016

హైదరాబాద్ : వచ్చే వర్షాకాలం ప్రారంభం లోగా జంటగనరాల్లోని అన్ని నాలాల్లో పూడికను తీసేయాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. ఇందు కోసం 30 కోట్ల రూపాయులు కేటాయించారు. మూడు లేదా నాలుగు వారాల్లో పనులు ప్రారంభించి... వర్షాకాలం ప్రారంభంలోగా పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ముర్షంనీటితోపాటు మురుగునీరు సాఫీగా మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
అన్ని నాలాల్లో చెత్తాచెదారం
హైదరాబాద్‌, సికింద్రబాద్‌లోని అన్ని నాలాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వర్షం వస్తే నాలాలు పొంగిపోయి పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. దీంతో జంటనగరాలు మురికికూపంగా మారుతున్నాయి. వచ్చే వార్షాకాలంలో ఈ సమస్య తలెత్తకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 
నాలాల్లో పూడిక తొలగించేందుకు చర్యలు
దీనిలో భాగంగా అన్ని నాలాల్లో పూడిక తొలగించేందుకు చర్యలు చేపడతారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతురామ్మోహన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జంటనగరాల్లోని నాలా దుస్థితిని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. నెల రోజుల్లోగా పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు ప్రారంభమైన తర్వాత పూడిక తొలగింపును అన్ని స్థాయిల్లో పర్యవేక్షించాలని ప్రతిపాదించారు. జంటనగరాల్లో 51 పెద్ద నాలాలున్నాయి. పెద్ద నాలాలతోపాటు చిన్న నాలాల్లో కూడా పూడిక తొలిస్తారు. పూడిక తొలగింపు కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పారిశ్రమిక రసాయన వ్యర్ధాలు నాలాల్లోకి వదలకుండా చూసేందుకు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

హైదరాబాద్ లో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : నేరెడ్ మెట్ వివేక్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 250 మంది పోలీసులు తనఖీల్లో పాల్గొన్నారు. నలుగురు రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 68 బైకులు, 4 కార్లు, 6 ఆటోలు, 40 మద్యం సీసాలతోపాటు రూ. 7 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

 

ప్రపంచ కప్ టీ.20లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ప్రపంచకప్ టీ-20లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్ తో, నెదర్లాండ్స్ ఢీ కొట్టనుంది. రాత్రి 7.30 గంటలకు బంగ్లాదేశ్ తో ఒమన్ తలపడనుంది.

 

07:30 - March 13, 2016

హైదరాబాద్ : ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రిటన్‌ పెట్టుబడిదారులను కోరారు. భారత్‌లోని ఏ రాష్ట్రంలో లేని వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని యూకే కార్పొరేట్ల దృష్టికి తెచ్చారు. పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని లండన్‌ పర్యటనలో చంద్రబాబు హామీ ఇచ్చారు. 
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన బాబు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్‌ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అన్ని అనుకూలతలు ఉన్నాయని కార్పొరేట్లకు వివరించారు. పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు. 
29 ఏళ్లుగా  క్యానరీ వార్ఫ్‌ బిజినెస్‌ సిటీ నిర్మాణం 
బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్యానరీ వార్ఫ్‌ బిజినెస్‌ సిటీ  ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. 29 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్  ఇప్పుడే కొలిక్కి వచ్చిందన్న విషయాన్ని  బిజినెస్‌ సిటీ ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. బ్రిటన్‌లో ఇప్పుడిది అంత్యంత కీలక స్థిరాస్తిగా మారి, ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న విషయాన్ని బిజినెస్‌ సిటీ ప్రతినిధులు ఆయనకు వివరించారు. 5.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 16 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన బ్రిటన్‌కు తలమానికంగా మారన విషయాన్ని బిజినెస్‌ సిటీ ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. 
అమరావతిలో పెట్టుబడులకు అంగీకరించిన బిజినెస్‌ సిటీ ప్రతినిధులు 
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని బిజినెస్‌ సిటీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఇందుకు వారు అంగీకరించారు. స్మార్ట్‌ సిటీ కాన్సెప్ట్‌తో 22కు పైగా టాప్‌ కంపెనీల అధిపతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు వీరు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే బ్రిటన్‌లో ఉంటున్న 200 మంది ప్రవాస భారతీయులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి ప్రవాసులు అంగీకరించారు. అమరావతిలో ఆస్పత్రులు నెలకొల్పడానికి కింగ్స్‌ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌, నైటింగేల్‌ నర్సింగ్‌ ఇనిస్టిట్యూట్‌  అంగీకరించాయి. 
ఏపీ అభివృద్ధిలో తెలుగువారు భాగస్వాములు కావాలి 
బ్రిటన్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు కూడా ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దాదాపు 60 వేల మంది తెలుగు ప్రజలు బ్రిటన్‌లో ఉంటున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జన్మభూమి అభివృద్ధిలో భాగస్వామలం అవుతామని వీరంతా హామీ ఇచ్చారు.  పెట్టుబడులతో ముందుకొస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుందని సూచించారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులతోపాటు, తెలుగువారు ఆసక్తి చూపుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 
అమరావతి గ్యాలరీని సందర్శించిన చంద్రబాబు బృందం
లండన్‌ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీని కూడా చంద్రబాబు బృందం సందర్శించింది. ఈ గ్యాలరీలోని అపురూప శిల్పాలను చూసి చంద్రబాబు మంత్రముగ్దులయ్యారు. 

07:21 - March 13, 2016

హైదరాబాద్ : గాయని మధుప్రియ వివాహబంధం ఇబ్బందుల్లో పడింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త శ్రీకాంత్‌ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ మధుప్రియ హయత్‌నగర్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైసా సంసాదించే సత్తా లేకపోయినా... డబ్బుపై వ్యామోహంతో తనకు నాలుగు నెలలకు నరకం చూపించిన నరరూప రాక్షసుడు శ్రీకాంత్‌తో ఇక ఇమడలేని మధుప్రియ తెగేసి చెప్పారు.  మళ్లీ గాయని అవతారమెత్తుతానని ప్రకటించారు. 
భర్త శ్రీకాంత్‌పై మధుప్రియ ఫిర్యాదు  
శ్రీకాంత్‌ తనను ప్రేమించి  పెళ్లి చేసుకున్నది ఆస్తికోసమేకానీ, తనలో కలసినడిచేందుకు కాదన్న గాయని మధుప్రియ.... ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. ఆడపిల్లనమ్మా... నేను ఆడపిల్లలను అంటూ అతివల కష్టాలను హృద్యంగా అలపించి అందరి మన్నలు పొంది, అందరికీ సుపరిచితమైన అమ్మాయి. అటువంటి  మధు ప్రియ....తల్లిదండ్రులను ఎదరించి... తనను ప్రేమించిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుంది. జీవితం సుఖవంతంగా సాగుతుందనుకున్నారు. మూడు నెలలు సవ్యంగానే సాగిన వీరి విహ జీవితంతో ఆ తర్వాత కలతలు ప్రారంభమయ్యాయి. దీంతో కలకాలం కలిసి జీవించాల్సిన మధుప్రియ, శ్రీకాంత్‌ల వివాహ బంధం ఇబ్బందుల్లో పడిండి. డబ్బుకోసం భర్త శ్రీకాంత్‌ హింసించడం ప్రారంభించాడు. శారీరకంగా, మానసింగా వేధించినా అన్నింటిని భరించారు. కానీ ఇలా రాజీపడి ఎంతో కాలం జీవించడం సాధ్యంకాదని....  భర్త శ్రీకాంత్‌పై  పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. 
శ్రీకాంత్‌తో మధుప్రియ సంబంధాలు శాశ్వతంగా తెగిపోయినట్టే..?  
శ్రీకాంత్‌ తనను ప్రేమించి  పెళ్లి చేసుకున్నది ఆస్తికోసమేకానీ, తనలో కలసినడిచేందుకు కాదన్న విషయం మూడు నెలలకే అర్థమయ్యిందంటున్నారు. 
శ్రీకాంత్‌తో తన సంబంధాలు శాశ్వతంగా తెగిపోయినట్టేనన్న నిర్ణయానికి మధుప్రియ వచ్చారు. మళ్లీ ఆడపిల్ల పాటలు పాడతానని ప్రకటించారు. గతంలో ఏ బాధలు అనుభవించిన ఆడపిల్లగా పాడులు పాడితే... ఈసారి బాధలు అనుభవించిన ఆడపిల్లగా తన గాధనే పాటగా మలిచి వేదికలెక్కుతానంటున్నారు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో తాను పడిన బాధలు మరే ఆడపిల్లా పడకూడదని మధుప్రియ చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఆహారం తీసుకోపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయిన మధుప్రియను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మధుప్రియ ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్ : నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 1న టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

గాయని మధుప్రియ భర్తపై దుండగుల దాడి

హైదరాబాద్ : గాయని మధుప్రియ భర్తపై దుండగులు దాడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సీఎం కేసీఆర్ సమాధానం

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సమాధానం చెబుతారు. 

Don't Miss