Activities calendar

14 March 2016

ఏపీ అసెంబ్లీ మంగళవారానికి

హైదరాబాద్  : నేడు సుధీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం ఉదయానికి వాయిదా పడింది. కాగా అంతకు ముందు వైసీపీ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రతిపాదించిన  అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ పార్టీ  అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై మూజువాణి ఓటు విధానంలో స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని కోరారు. ఓట్లు లెక్కించిన అనంతరం ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ ప్రకటించారు. 

20:47 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో సవాళ్లు రాజ్యమేలాయి. ఒకరిపైకొకరు సవాళ్లు విసురుకున్నారు. మగతనం ఉందా ? దమ్ముందా ? ఇలాంటి పదాలు ప్రజాప్రతినిధుల నోట్లోంటి ఊడిపడ్డాయి. ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడు ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్ష నేత జగన్ ఉద్ధేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ కొవ్వెక్కిందని..అందుకే అలా మాట్లాడరని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగడంతో జగన్ పై తాను చేసిన వ్యాఖ్యలను విరమించుకుంటున్నట్లు...సభ్యుడి మనోభావాలు నొప్పిస్తే తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

20:43 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభ సవాళ్లకు వేదికగా నిలిచింది. అధికార..విపక్ష సభ్యులు సవాళ్లు విసురుకున్నారు. దమ్ముందా అని బాబు అంటే బాబుకు దమ్ము లేదని జగన్ విమర్శలు గుప్పించుకున్నారు. ఏపీ శాసనసభలో వైసీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ఈ చర్చ పక్కదారి పట్టింది. జగన్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దీనిపై జగన్ కూడా అంతేధీటుగా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు తన పలుకుబడితో కేసులపై విచారణ జరపకుండా జడ్జిమెంట్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. 2006లో ఓఆర్ఆర్ విషయంలో ఏ ఆధారాలున్నాయని ఆనాడు వైఎస్ పై ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. వెంటనే వచ్చిన ఆరోపణలపై వైఎస్ సీబీఐ విచారణ చేయించారని సభకు తెలిపారు. బాబుకు దుమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బాబుకు ఆ ధైర్యం లేదని తెలుసని, రాజధాని భూములపై కూడా సీబీఐ విచారణ అడిగామని గుర్తు చేశారు. 

20:37 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దండం పెట్టి చెప్పడం ఏంటీ ? ఎవరికి చెబుతున్నారు ? అని ఆలోచిస్తున్నారా ? ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి బాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దండం పెట్టి చెబుతున్నా..మీకు మనస్సు ఉంది.. మీ మనసాక్షిని అడగాలి..జగన్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలి అంటూ విపక్ష సభ్యులకు సూచించారు. పనిలో పనిగా స్పీకర్ కు కూడా సూచనలు చేశారు. సరియైన సమయంలో నిర్ణయానికి రావాలని, దౌర్జన్యంగా చేస్తే మైక్ ఇచ్చేస్తారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 

బడ్జెట్ నిరాశ కలిగించింది - తమ్మినేని..

హైదరాబాద్ : టి. బడ్జెట్ నిరాశ కలిగించిందని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తప్పుడు అంచనాలతో భారీ బడ్జెట్ అంటూ భ్రమలు కల్పించారని, సమగ్రాభివృద్ధి సాధించేటట్లుగా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. సామాజిక, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని, దళితులు, గిరిజనుల మూడెకరాల భూ పంపిణీని మరిచారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయింపులు జరపకుండా అప్పులు చేసి ఇళ్లు నిర్మిస్తామనడం దారుణమని, కరవు నివారణ చర్యలు తగ్గట్టుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు లేవన్నారు.

20:13 - March 14, 2016

హైదరాబాద్ : ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎందుకు విచారం వ్యక్తం చేయడం లేదని టిడిపి సభ్యుడు ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. సభలో ప్రసంగించిన జగన్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. దీనితో చర్చ పక్కదారి పట్టింది. అధికార..ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. భాషపై సభ్యుడు విచారం వ్యక్తం చేశారని, విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించినా గందరగోళం ఎందుకు చేస్తున్నారని స్పీకర్ వైసీపీ సభ్యులనుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ధూళిపాల జోక్యం చేసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఓ పదం వాడితే వారంతా ఇక్కడకు వచ్చారని, మరి జగన్ ఎందుకు విచారం వ్యక్తం చేయడం లేదని పేర్కొన్నారు. వ్యవస్థను కించపరిచే విధంగా..సభ ప్రతిష్టకు భంగం కలిగివిధంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారని, సభా నాయకుడు విజ్ఞప్తి చేసినా జగన్ విచారం వ్యక్తం చేయడం లేదని తెలిపారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. 

ఏపీ శాసనసభ మళ్లీ వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ మళ్లీ వాయిదా పడింది. అసెంబ్లీలో వైసీపీ ఇచ్చిన వాయిదవా తీర్మానంపై చర్చ జరుగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు అన్ పార్లమెంటరీ భాష వాడడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీనితో స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేశారు. 

స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపదవాదాలు చోటు చేసుకున్నాయి. ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. చర్యలు తీసుకోవాలిన వైసీపీ కోరుతోంది. దీనితో సభలో గందరగోళం చోటు చేసుకుంది. 

జగన్ తెగించారు - యనమల..

హైదరాబాద్ : జగన్ తెగించారని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలపైనా ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వంపైనే కాదు జడ్జీలపైనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చివరికి జడ్జీలపైనే ఆరోపణలు చేస్తే జగన్ ను ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వపైనే నిరాధార ఆరోపణలు చేయడం..జడ్జీలపైన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.  

సోలార్ విద్యుత్ కేవలం టెండర్లు పిలిచాం - చంద్రబాబు..

హైదరాబాద్ : సోలార్ విద్యుత్ కు టెండర్లు మాత్రమే పిలిచామని కేటాయించలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోలార్ లో రూ. 7వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, గోదావరి పుష్కరాల నిర్వాహణపైనా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు చెల్లించలేదని, పారిశ్రామిక రాయితీలకు రూ. 2వేల కోట్లు ఇచ్చినట్లు సభకు తెలిపారు. రూ. 5వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారని, రాజధాని భూముల్లో ఏమీ జరగకపోయినా ఆధారాలు చూపకపోతే క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే జగన్ పై చర్య తీసుకోవాలని చంద్రబాబు స్పీకర్ ను కోరారు. 

బాబు జడ్జిమెంట్లు తెచ్చుకున్నారు - జగన్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తన పలుకుబడితో కేసులపై విచారణ జరపకుండా జడ్జిమెంట్లు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. 2006లో ఓఆర్ఆర్ విషయంలో ఏ ఆధారాలున్నాయని ఆనాడు వైఎస్ పై ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. 

సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం కొద్దిసేటి క్రితం ముగిసింది. బడ్జెట్ లో రూ. 25 వేల కోట్లు కేటాయింపు, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రాజెక్టు పనులకు వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 

19:42 - March 14, 2016

బంగారు తెలంగాణ లక్ష్యసాధనే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి ఈటెల అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి లక్షా 30 వేల కోట్లుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త రాష్ట్రం... సరికొత్త ప్రణాళికలు. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో తెలంగాణ బడ్జెట్‌ ఉందా ? లేదా ? అనే అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ కుమార్ (విశ్లేషకులు), తాడూరి శ్రీనివాసరావు (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

తీర్మానంపై చర్చను ముగించాలి - కోడెల..

హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానంపై చర్చను ముగించాలని స్పీకర్ కోడెల ప్రతిపక్ష నేత జగన్ కు సూచించారు. ఆరోపణలకు ఆధారాలు చూపించకుండా సభా సమయాన్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదని సూచించారు. 

పారిశ్రామిక వేత్తలను జగన్ బెదిరిస్తున్నారు - బోండా..

హైదరాబాద్ : పత్రికను అడ్డు పెట్టుకుని జగన్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. బాక్సైట్ కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి జగన్ రప. 50 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.

పారిశ్రామిక వేత్తలను జగన్ బెదిరిస్తున్నారు - బోండా..

హైదరాబాద్ : పత్రికను అడ్డు పెట్టుకుని జగన్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. బాక్సైట్ కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి జగన్ రప. 50 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. 

భూ దందాపై ఎందుకు వెనకడుగు - ఎమ్మెల్యే కె.శ్రీధర్..

హైదరాబాద్ : రాజధాని భూ దందాపై విచారణకు సీఎం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం సన్నిహితులు, మంత్రులు , ఎమ్మెల్యేల పిల్లలు రాజధానిలో భూములు కొన్నారని పేర్కొన్నారు. టిడిపి కడిగిన ముత్యం అయితే విచారణకు ఎందుకు భయపెడుతోందని ప్రశ్నించారు. 

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్ల విచారణ వాయిదా..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్ల విచారణ వాయిదా పడింది. ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలు జరిగాయింటూ నాగం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాదనలు వినిపించేందుకు న్యాయస్థానాన్ని ప్రభుత్వ అడ్వకేట్ గడువును కోరారు. 

18:39 - March 14, 2016

హైదరాబాద్: ఏపీ శాసనసభలో వేడి చల్లారలేదు. సోలార్ రంగంలో, కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపించడం ప్రకంపనాలు సృష్టించాయ. ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సరికాదని, నిరూపించాలని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఆధారాలు చూపెట్టిన తరువాతే ఇతర అంశాలపై మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సభలో గందరగోళం చెలరేగడంతో సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయిన తరువాత మంత్రి యనమల మాట్లాడారు. లేవనెత్తి అంశాలకు సంబంధించిన వివరాలు సభ ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా సీఎం సవాల్ విసిరినా విపక్ష సభ్యులు పారిపోయారని, చంద్రబాబు సవాల్ ను స్వీకరించాలని సూచించారు. అవినీతి జరిగినట్లు చూపిస్తే సభలో చర్చ జరిగే అవకాశం ఉందని లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఏదైనా ఉంటే సభకు సమర్పించాలని, సీబీఐ ఎంక్వయిరీ చేయాలని కోరడం దురదృష్టమని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 

18:38 - March 14, 2016

చిత్తూరు : రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం పది వామపక్షాలు మంగళవారం 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా పలువురు వామపక్ష నేతలు హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కానీ ఏపీ పోలీసులు ఇప్పటి నుండే నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారు. బస్ స్టేషన్ లు, రైల్వే స్టేషన్ లలో మోహరించిన పోలీసులు నగరానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వామపక్ష నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. వీరిని ఈస్ట్, వెస్ట్ పీఎస్ లకు తరలించారు.రాయలసీమ సమస్యల పరిష్కారానికి గత కొద్ది రోజుల కిందట వామపక్షాల ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగిన సంగతి తెలిసిందే. వెంటనే రాయలసీలమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వామపక్షాలు నినదించాయి. అసెంబ్లీ ఎదుట నిరవధిక ఆందోళన చేపట్టడానికి నిర్ణయించాయి. కానీ పోలీసులు దీనిపై నిర్భందం ప్రయోగించడం దారుణమని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

దశాబ్ధాల తరబడి..
దశాబ్దాల తరబడి రాయలసీమ జిల్లాలు అభివృద్ధి నోచుకోకుండా చాలా కాలం గడుపుతూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది ఈ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అయితే మాత్రం ఏం లాభం. లక్షలాది మంది అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు. ఇటువంటి గడ్డు కాలంలో పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు సిపిఎం నడుం బిగించింది. పేదల గొంతుకగా మారి నిత్యం వారి సమస్యలపట్ల పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య మత్తు తొలగించేందుకు బస్సు యాత్ర చేపట్టింది. అందులో భాగంగా రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. మరి రాయలసీమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విధంగా పోలీసులు సహకరిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. 

చిత్తూరులో సీపీఎం నేతల అరెస్టు..

చిత్తూరు : రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం పది వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నగరానికి బయలుదేరుతున్న వామపక్ష నేతలను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

18:22 - March 14, 2016

నల్గొండ : నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటికి విడుదల చేసి ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు.. సాగర్‌లోని చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జూలకంటి టెన్ టివితో మాట్లాడారు. గత సంవత్సర కాలంగా నీళ్లు లేకుండా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈవిషయాన్ని ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని జూలకంటి డిమాండ్ చేశారు.

 

18:18 - March 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ కేవలం అంకెలగారడీ బడ్జెట్‌ అని విపక్షాలు విమర్శించాయి. 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఈటెల..వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించాయి. సామాజిక వర్గాలకు కేటాయించడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం..సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణానికి వందలకోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.  అంకెలగారడీ బడ్జెట్‌తో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. గత బడ్జెట్‌లో 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని..ఈ బడ్జెట్ లో ప్రాక్టికల్‌గా ఖర్చు చేసేందుకు సాధ్యంకాదని ఆయన అన్నారు. 2016-17 బడ్జెట్‌ వాస్తవాలకు బహు దూరంగా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి కొత్తదనం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తక్కువ బడ్జెట్‌ కేటాయించి బీసీలను అవమానించారన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నా.. సహాయక చర్యలపై ఎటువంటి ప్రస్తావన చేయలేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ విమర్శించారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించిన విపక్షాలు... ఇప్పటికైనా బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి. 

18:16 - March 14, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణ లక్ష్యసాధనే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి ఈటెల అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి లక్షా 30 వేల కోట్లుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త రాష్ట్రం... సరికొత్త ప్రణాళికలు. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో తెలంగాణ బడ్జెట్‌ను రూపుదిద్దుకుంది. గతంలో రెండుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమం, వాస్తవికత ప్రధాన ఎజెండాగా బడ్జెట్‌ను రూపొందించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజెందర్‌ అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్‌ లక్షా ముప్పై వేల 415 కోట్లుగా ప్రకటించింది. ఇందులో ప్రణాళిక వ్యయం 67 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం 62 వేల కోట్లుగా కేటాయించింది. 20 వేల 497 కోట్లు ఆర్థిక లోటుగా చూపించిన ప్రభుత్వం, 3 వేల 718 కోట్ల రెవిన్యూ మిగులుగా వెల్లడించింది. ద్రవ్యలోటు 23 వేల 467 కోట్లుగా ప్రకటించింది. సాగునీటి రంగానికి 25 వేల కోట్లు కేటాయించింది.

మిషన్ భగీరథకు రూ. 40 వేల కోట్లు..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ పథకానికి 40 వేల కోట్లు కేటాయింపులు చేసింది. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖకు 6 వేల 759 కేటాయింపులు జరిపినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్‌ ఆరోగ్య రంగానికి 5 వేల 967 కోట్ల నిధులను కేటాయించింది. విద్యారంగంలో తెలంగాణపై రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సర్కార్‌ ఆ రంగానికి భారీగానే నిధుల రూపకల్పన చేసింది. విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం కింద ఒక వేయి 694 కోట్లు, ప్రణాళికేతర వ్యయంగా 9 వేల 44 కోట్ల కేటాయింపులు జరిపినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ సంక్షేమ కార్యక్రమాలనే ప్రకటించింది. ఎస్సీ సంక్షేమానికి 7 వేల 122 కోట్లు, ఎస్టీలకు 3 వేల 52 కోట్లు.. బీసీలకు 2 వేల 538 కోట్లు కేటాయించింది. ఆసరా పథాకానికి 4 వేల 693 కోట్లు దక్కనున్నాయి. కళ్యాణలక్ష్మి పథకానికి 738 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి 1 వేయి 553 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ నిధికి 100 కోట్లు నిధులు కేటాయించినట్లు ఈటల తెలిపారు. రోడ్లు, భవనాలు రంగాలకు 3 వేల 333 కోట్ల నిధులను కేటాయించింది. దాంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి 10 వేల 73 1 కోట్ల నిధులను ప్రకటించింది. పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పట్టణాభివృద్దికి 4 వేల 815 కోట్లు ప్రకటించింది. దేశంలో కంటే జీడీపీ రేటు తెలంగాణ రాష్ట్రంలో ముందుందని ఈటల అన్నారు. మరోవైపు అటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి పథంలో అసమాన్య ఫలితాలు సాధించేందుకు అందరి కృషి అవసరమని ఆయన అన్నారు. 

విజయవంతంగా క్షిపణి అగ్ని-1 ప్రయోగం...

బాలాసోర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన మధ్యంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1 ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన, అణ్వస్త్రాలను సైతం తీసుకుపోగల అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిషా తీరానికి దగ్గర్లోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న టెస్టు రేంజ్‌ నుంచి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ క్షిపణి 700కి.మీల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. భూఉపరితలం నుంచి ఉపరితలం మీద లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ లో రేపట్నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రేపట్నుంచి ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

17:16 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో వైసీపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోలార్ పవర్ రంగం, వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించడంపై బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని లేనిపక్షంలో సభకు రావద్దని సూచించారు. అసత్యాలు మాట్లాడుతుంటే... సిగ్గు లేకుండా చప్పట్లు కొడుతూ ఏం మాట్లాడుతారని వైసీపీ నేతలను చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం ఆరోపణలు చేయడం కాదని, వాటిని నిరూపించాలని చంద్రబాబు చెప్పారు. ఇలాగే అసత్య ఆరోపణలు చేస్తుంటే.. వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పీకర్ కోడెలకు సూచించారు. వైసీపీ దివాళుకోరతనం రాజకీయాలు చేస్తోంది. రౌడీయిజం చేస్తే కోరలు తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

17:11 - March 14, 2016

హైదరాబాద్ : వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఏపీ శాసనసభను కుదిపేసింది. ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. సోలార్ పవర్ రంగంలో, వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణం జరిగిందని జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రభుత్వం ధీటుగా స్పందించింది. నిరూపించాలని లేకపోతే హౌస్ కు రావద్దని క్షమాపణలు చెప్పాలని సీఎం బాబు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. సాక్ష్యాధారాలు పెట్టుకుని ఆరోపణలు చేయాలని, నిరూపించకపోతే క్షమాపణలు చెప్పాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేయకూడదని, తాను ఉదయం వేసిన ప్రశ్నపై వెంటనే విచారణకు బాబు ఆదేశించడం జరిగిందన్నారు.

ఆరోపణలు చేయడం తగదు - బుచ్చయ్య..
ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదని టిడిపి సభ్యుడు బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇందుకు నిబంధనలు చూపుతున్నాయని తెలిపారు. కాకి లెక్కలు తీసుకొచ్చి చెబుతున్నారని, ప్రజలను గందరగోళం పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

శతాబ్ది ఎక్స్ ప్రెస్ నుండి విడిపోయిన రెండు బోగీలు..

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నుంచి దిల్లీ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు ఉన్నంట్టుండి విడిపోయాయి. కాన్పూర్‌లోని రురా స్టేషన్‌ సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. ఎవ్వరికీ గాయలు కాలేదని తెలిపారు. 

ఏపీ అసెంబ్లీ 10నిమిషాల వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ 10నిమిషాలు వాయిదా పడింది. వైసీపీ అవిశ్వాసత తీర్మానం పై వాడి వేడి చర్చ జరిగిన అనంతరం 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు.

17:04 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైసీపీ పలు అంశాలను ప్రస్తావించింది. సోలార్, వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. దీనిపై బాబు ఘాటుగా స్పందించారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. సభ సంప్రదాయాలు లేవని, ఇష్టానుసారంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం జరిగిందని, నిన్న చేసిన ఆరోపణలను ఫ్రూవ్ చేయాలని డిమాండ్ చేస్తే పారిపోయారని వైసీపీనుద్దేశించి మాట్లాడారు. 12 కేసులో జగన్ నిందితుడని, సోలార్ పై చేసిన ఆరోపణలు నిరూపించలేపోతే హౌస్ కు రానని ఒప్పుకుంటారా అని జగన్ ఉద్ధేశించి ప్రశ్నించారు. దీనిపై జగన్ స్పందించడాన్ని బాబు తప్పుబట్టారు. ఏం సిగ్గు లేదా ? వందసార్లు ఏం మాట్లాడుతావు అంటూ కోపంగా ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడుతారా ? ఇష్టమొచినట్లు ఆరోపణలు చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల విషయంలో తమ తప్పులను నిరూపిస్తే తాను సభకు రానని, నిరూపించకపోతే మీరు రావద్దని బాబు సూచించారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 24,804 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 7,538 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రజాసంఘాల నేతల్ని హతమార్చే కుట్ర:వరవరావు

వరంగల్ : ప్రజాసంఘాల నేతల్ని హతమార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని విరసం నేత వరవరరావు విమర్శించారు. హన్మకొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లొంగిపోయిన మాజీ నక్సల్స్ ద్వారా ముఖ్యమైన ప్రజాసంఘాల నేతల్ని హతమార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దానికోసం 2004లో లొంగిపోయిన సారయ్య కుటుంబంపై ఓత్తిడి తెస్తూ పదేపదే బెదిరిస్తూ వారిని తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంఘాల నేతలకు ఏదైనా ప్రాణహాని జరిగితే ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

16:57 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో సోలార్ పవర్ రంగం...వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్ లో కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. మొత్తం రూ. 2600 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. దీనిపై తాను సవాల్ విసురుతున్నట్లు ప్రకటించారు. లేనిపోని విషయాలు ప్రస్తావించడం..ప్రభుత్వంపై అభండాలు వేయడం భావ్యం కాదన్నారు. సోలార్ విధానంలో అవినీతి జరిగిందని చెప్పిన జగన్ పూర్తిగా వివరించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

వైసీపీ ఒక దివాళ కోరు పార్టీ: చంద్రబాబు

హైదరాబాద్: వైసీపీ ఒక దివాళ కోరు పార్టీ, జగన్ ఒక దివాళాకోరు ప్రతిపక్ష నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాంన పై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ...సభలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. వందల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారు. 12 కేసులో జగన్ దోషిగా ఉన్నారు. రెండు విషయాల్లో జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. సోలార్, వీటీపీఎస్ కృష్ణపట్టణం యూనిట్ లో అవినీతి నిరూపంచండి..జగన్ కు ధైర్యం ఉంటే మా సవాల్ ను ఒప్పుకోండి చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు.

ఇసుక వేలంలో భారీ స్కాం :జగన్

హైదరాబాద్ : పరిశ్రమల పేరుతో వందల కోట్లు విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..రెండేళ్లలో ఇసుక వేలంలో భారీ స్కాం జరిగిందని...ఆ పాపాన్ని కడిగేసుకునేందుకు ఉచిత ఇసుక అంటున్నారని మండి పడ్డారు. సోలార్ విషయంలో నూ రూ.7వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

16:48 - March 14, 2016

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆయన తనయుడు జగన్ లు పందికొక్కుల్లా దోచుకతిన్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై జగన్ ప్రసంగించారు. ప్రసంగంలో జగన్ పలు ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ స్పందించారు. 2004 సంవత్సరంలో జలయజ్ఞం..ధనజజ్ఞం పేరిట రూ. 25వేల కోట్లు..2009-10 నాటికి 79, 613 కోట్లు ఇలా అంచనాలు పెంచుతూ వెళ్లారని విమర్శించారు. రూ. 63వేల కోట్ల అంచనాలు పెంచారని, దీనిని చూస్తుంటే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బెంగలూరులో 35 ఎకరాల బంగళా కూడా మెక్కిన డబ్బేనని జగన్ ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 

రావెల సుశీల్ కు బెయిల్ మంజూరు..

హైదరాబాద్‌ : ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ రావెల సుశీల్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు రావెల సుశీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని తనపై కావాలనే ఆరోపణలను చేస్తున్నారని సుశీల్ చెప్పిన విషయం తెలిసిందే.

16:33 - March 14, 2016

హైదరాబాద్ : సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి మంత్రి ఈటెల శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఈటెల సాగునీటి రంగంపై మాట్లాడారు. సాగునీటి రంగానికి ప్రతిపాదించిన రూ. 25,000 కోట్లలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 7861 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 6286 కోట్లు, సీతారామ మరి భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 1152 కోట్తు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు 20 సంవత్సరాల క్రితమే ఇచ్చారని, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనకు రూపం మిషన్ భగీరథ అని తెలిపారు. ఎల్ పిసిడి పట్టణాల్లో 135 ఎల్ పిసిడి మరియు నగరాల్లో 150 ఎల్ పిసిడి ప్రజలకు మంచినీళ్లు అందించడం ఈ పథక రచన అని తెలిపారు. 

16:31 - March 14, 2016

రోజూ గుప్పేడు లేదా.. నాలుగైదు బాదం పలుకులు తింటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం...బాదం గింజలు బలవర్థకమైన ఆహారం. జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. బాదం ఆరోగ్యానికి మరియు రుచిని కూడా ఇస్తుంది. శరీరానికి చాలా అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మరియు ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది.

ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు..

బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.

గుండెకు.....

పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌.

కొలెస్ట్రాల్‌ నియంత్రణ ...

వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.

రక్తప్రసరణ...

బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.

ఎముకల దృఢత్వానికి.....

ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది.

బరువుతగ్గడానికి....

బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.

తక్షణశక్తికి...

అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి.

మధుమేహానికి....

మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.

మెదడుకు మేత....

నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్ ......

బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది. అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అని పేర్కొన్నారు.

జుట్టుకి మంచి ఉపయోగం....

చాలా రకాల కాస్మోటిక్స్ తయారీల వాడకంలో ఉపయోగించే విటమిన్ ‘D’ మరియు మెగ్నీషియంలను బాదం ఎక్కువగా కలిగి ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం కొరత వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. బాదం ఆయిల్ జుట్టుకి చాలా మంచిది. వారానికి ఒక్కసారి బాదం ఆయిల్'ను తలకి అద్ధటం వల్ల తలని తేమగా ఉంచి, వెంట్రుకల సాంద్రతను పెంచి, జుట్టు రాలిపోవటాన్ని తగ్గితుంది.

మలబద్దకానికి...

బాదంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదం తినేపుడు ఎక్కువగా నీరు తాగటం వల్ల, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. పేగుల కదలికలకు, సరిపోయే మొత్తంలో అంటే 4-5 బాదం తింటే సరిపోతుంది.

16:17 - March 14, 2016

హైదరాబాద్ : కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన ఘటనపై సీఐడీ దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి చిన రాజప్ప స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో వైసీపీ సభ్యుడు కాపులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. తుని ఘటనలో వైసీపీ కార్యకర్తలపై అకారణంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని తెలిపారు. దీనిపై హోం మంత్రి చిన రాజప్ప సమాధానం ఇచ్చారు. దీనిపై సీఐడీ దర్యాప్తు జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తొందరలోనే నిందితుల వివరాలు బయటపెడుతామని మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. 

16:10 - March 14, 2016

హైదరాబాద్: పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకు లాహోర్ కు చెందిన ఒక న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. అందుకు కారణం... అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలే. టీ20 వరల్డ్ కప్ నిమిత్తం భారత్ కు వచ్చిన అఫ్రిదీ నిన్న విలేకరులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ లో కన్నా భారత్ లోనే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అఫ్రిదీకి సదరు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అఫ్రిదీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పాక్ కు క్షమాపణలు చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు. 

ఇక విద్యుత్ కోతలుండవ్ : ఈటెల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇక భవిష్యత్‌లో విద్యుత్ కోతలు ఉండవని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందని వెల్లడించారు. ఇందు కోసం కొత్త విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. కొత్తగా దిగువ జూరాల, పులిచింతల, హైడ్రో ప్రాజెక్టులు, భద్రాద్ది, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు 6160 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. 

16:04 - March 14, 2016

ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఉలవలు ఎక్కువగా తీసుకున్నవారి ఆరోగ్యం గుర్రంలా దౌడు తీస్తుందనే నానుండి ఉంది.  ఉలవలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యతే ఉంది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిలుపు తెలిపారు. ప్రత్యేకంగా మహిళల్లో వచ్చే నెలసరి సమస్యకు, అధిక చెమటకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం అని పేర్కొన్నారు. వందగ్రాముల పిజ్జాతింటే అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీల శక్తితో పాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్పొహైడ్రేడ్లు, 287 మిల్లీ గ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్పరస్ లతో పీటు పీచు పదార్థమూ లభిస్తుంది.

ఉలవలు ఐరన్, క్యాల్షియంలకు ,ప్రోటీన్లకు అందిస్తుంది. క్యాల్షియం, ఐరన్ ఇతర రసాయాన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల, శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పధ్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, క్యాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవల పోషక విలువ బాగా పెరుగుతుంది. అంతేకాక, మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్నిపెంచుతాయి. దీనివల్ల వర్షపు, మబ్బు వాతావరణంలో దగ్గు, జలుబులని తేలిగ్గా గట్టెక్కవచ్చు. అయితే, ఎండ తీవ్రత ఉన్నప్పుడు, ఉలవలు శరీరాన్ని వేడెక్కిస్తోంటే, మొలకెత్తిన పెసరపప్పుని తినడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

ఆహారంలో ఉలవలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు కలిపి కుక్కర్ లో ఉడికించి ఉలవకట్టు తయారు చేసుకోవాలి. దానిలో చిటికెడు ఉప్పు కలిపి దానిని రోజు ఉదయంపూట ఖాళీకడుపుతో తీసుకోవాలి. ఇలా డెయిలీ చేస్తే సన్నబడతారు. అలాగే ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. అలాగే కఫాన్ని తగ్గిస్తాయి. మూత్రాశయంలో రాళ్లను కరిగించడంలో కూడా ఉలవలు సహకరిస్తాయి. తరచూ వచ్చే ఎక్కిళ్లను కూడా ఉలవలు తగ్గిస్తాయి. బహిష్టు సమస్యలతో సతమతమయ్యే మహిళలకు ఉలవలు ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్నితగ్గిస్తాయి. వేడి శరీరం ఉన్నవారు మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉలవలు తీసుకోవడం మంచిది. దానికి తోడుగా గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది.

టి.సర్కార్ పై అవిశ్వాసతీర్మానం పెట్టే యోచనలో కాంగ్రెస్!

హైదరాబాద్ : టీఎస్ సర్కార్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపంఐ సీఎల్పీనేత జానారెడ్డి చాంబర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో మాదిరిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇతర పార్టీలతో చర్చించి బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

15:30 - March 14, 2016

హైదరాబాద్: 2016వ సంవత్సరానికి గాను అప్స‌ర అవార్డును  ప్రముఖ నేపథ్య గాయ‌ని సునీత ద‌క్కించుకున్నా‌రు. ఈ అవార్డు స్వీ‌క‌రించిన అనంతరం ఆమె మాట్లా‌డుతూ... 'నాకు ఈ అవార్డు అంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అప్స‌ర అవార్డు 2016ను అంద‌జేసినందుకు జీ టీవి వారికి నా ధ‌న్య‌వాదాలు. సంగీత ప‌రిశ్ర‌మ‌లో నమ్మకం, కొద్దిగా ఓపిక ఉంటే మీరు కోరుకున్నది ఖచ్చితంగా,విజయవంతంగా సాధించడానికి అవ‌కాశం ఉంటుంద‌ని న‌మ్ము‌తున్నా‌ను. నా వృత్తి న‌న్ను ఎప్పుడూ నిరాస‌ప‌ర‌చ‌లేదు. కాబ‌ట్టి ఇప్పుడు ఫ‌లితం ల‌భించింది. అందుకు చాలా ఆనందంగా' వుందని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ తో రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. మా విజ్ఞప్తులపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాయంత్ర 6 గంటలకు శరద్ యాదవ్ ను కలుస్తామని, 7 గంటలకు సీపీఐ నేత డి.రాజాను కలుస్తామని తెలిపారు. రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు సమయమివ్వాలని ప్రధానికి గుజరాతీలో లేఖ రాసినట్లు రఘువీరా తెలిపారు.

15:20 - March 14, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో లెక్కల మాస్టారు అవతారం ఎత్తారు. ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేత జగన్ సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎలాంటి హామీలిచ్చారో..ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ఎలా వ్యవహరిస్తున్నారో దానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు సరిగ్గా జరగలేదని, మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో సరిగ్గా నిధులు కేటాయించలేదన్నారు. డ్వాక్రా పెట్టుబడి నిధికి రూ. 10వేల రూపాయలు ఇస్తామని చెబుతూ ఇన్ స్టాల్ మెంట్ ల ద్వారా ఇస్తున్నారని గుర్తు చేశారు. 84 లక్షల డ్వాక్రా మహిళలున్నారని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం జరిగిందని, దీనిని బట్టి చూస్తే రూ. 2,940 పెట్టుబడి స్కీంకు కేటాయించాల్సి ఉందని, 2016-17 వేయి కోట్లు కేటాయించారని గుర్తు చేశారని తెలిపారు. రూ.1,947 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదని విమర్శలు గుప్పించారు. రూ.14,695 కోట్ల డ్వాక్రా రుణాలు మీద జీరో శాతం వడ్డీని కొనసాగించాలంటే వాళ్లకు బడ్జెట్ రూ. 1,103 కోట్లు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ 2016-17 బాబు కేటాయింపులు చేసింది రూ.110 కోట్లు మాత్రమేనని తెలిపారు. రూ. 1,328 కోట్ల వడ్డీలను కూడా కట్టామని ప్రసంగంలో పేర్కొన్నారు కానీ ఇది ఏ సంవత్సరానికి సంబంధించిందని ప్రశ్నించారు. అలా అనుకుంటే 2015-16 సంవత్సరంలో రూ. 1,328 కోట్లు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. జగన్ ప్రసంగం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

రాష్ట్రాన్ని తగలబెట్టాలని జగన్ చూస్తున్నాడు: అచ్చెన్నాయుడు

హైదరాబాద్: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థంతో రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే చాలు, దానికి అడ్డుతగలడం జగన్ కు అలవాటైందని.. రాష్ట్రాభివృద్ధికి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన పాపాన జగన్ పోలేదంటూ ఆయన మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు తమపై అభాండాలు వేయడం సబబు కాదన్నారు. 

వాస్తవాలకు దూరంగా బడ్జెట: చిన్నారెడ్డి

హైదరాబాద్ : గత బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని వారే ఒప్పుకున్నారని... ఈ బడ్జెట్‌ ఇంకా బహుదూరంగా ఉందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని వివక్ష చూపారని మండిపడ్డారు. రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పలేదన్నారు. బడ్జెట్‌లో కరువుసాయం ప్రస్తావనే లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు.

 

15:01 - March 14, 2016

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రసంగిస్తున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వం పేర్కొన్న పలు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిని అధికారపక్షం తప్పుబడుతోంది. జగన్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు.రాష్ట్రంలో 43,12,293 పెన్షన్లు ఉంటే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 39,27,657 పెన్షన్లు ఉన్నాయని జగన్ సభకు తెలిపారు. అంటే నాలుగు లక్షల పెన్షన్లు తగ్గాయని తెలిపారు. దీనిని బట్టి చూస్తుంటే పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. గుడిసెలేని పరిస్థితి వస్తుందని..అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని, అంతేగాక మూడు సెంట్ల భూమి ఇస్తామని ప్రగల్భాలు పలికారని తెలిపారు. కానీ అధికారంలో రాకముందు వివిధ దశల్లో నిర్మాణం 5,60,466 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. బాబు సీఎం అయిన తరువాత వాటిని పట్టించుకోలేదని జగన్ తెలిపారు.

అన్నీ అబద్ధాలే - అచ్చెన్నాయుడు..
ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. ప్రతిపక్ష నాయకుడు మొదటి అసెంబ్లీలో మాట్లాడిన తీరు..ఇప్పుడు ప్రసంగ తీరు చూస్తుంటే ఒక్కటే ఉందన్నారు. అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారని తెలిపారు. వేల సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్నామని, ఇళ్లు గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. అధికారంలోకి రాగానే 45 లక్షల ఇళ్లు తాము మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేగాక ఓ సబ్ కమిటీ వేసి 43 లక్షల ఇళ్లు ఎక్కడున్నాయో సర్వే నిర్వహించడం జరిగిందని, 15 లక్షల పేర్లు కూడా కనబడడం లేదన్నారు. దీనికంతటికి కారణం వైసీపీనేనని తెలిపారు. కష్టాల మీద రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

15:00 - March 14, 2016

ఆరోగ్యంగా ఉండాలని  ప్రతి ఒక్కరు కోరుకుంటాం.. మీరు తీసుకునే ఆహారంలో రెండు రోజులకోసారి ఆకు కూరలుండేలా చూసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. పోషకాహార నిధి అయిన పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర , spinach—ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి. విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది . ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి. మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా,గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ది చేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజ్ టెబుల్ సూప్ లోనూ, చపాతీలు చేసుకునే పిండీలోనూ, పకోడీల పిండోలోనూ, పన్నీర్ తో కలిపి వాడే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా వేపుడు చేసుకుని తినవచ్చు.

100 గ్రాముల పాలకూరలో ఉండే పోషకాలు:

పిండి పదార్థాలు - 3.6 గ్రా.

చక్కెరలు - 0.4 గ్రా.

పీచు పదార్థాలు - 2.2 గ్రా.

కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా.

మాంసకృత్తులు - 2.2 గ్రా.

విటమిన్ ఎ - 52 శాతం

ఫోలేట్ (విటమిన్ బి9) - 49 శాతం

విటమిన్ సి - 47 శాతం

విటమిన్ ఇ- 13 శాతం

విటమిన్ కె - 46 శాతం

కాల్షియం - 10 శాతం

ఐరన్ - 22 శాతం 

14:53 - March 14, 2016

హైదరాబాద్ : తమ పార్టీ గుర్తుతో గెలిచి టిడిపిలోకి వెళ్లిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలనే డిమాండ్ తో తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జగన్ ప్రసంగించారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టారని, అందుకోసం తాము విప్ జారీ చేయడం జరిగిందన్నారు. ఇక్కడకు రాకపోయినా వ్యతిరేకంగా ఓటు వేసినా ఖచ్చితంగా వారు తిరస్కరణకు గురౌతారని, ఇందుకోసమే తాము తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది అన్నారు. దీనిపై మంత్రి యనమల జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే తీర్మానం ప్రవేశ పెట్టినట్లు జగన్ చెప్పకనే చెప్పారని తెలిపారు. ప్రలోభాలు పెట్టి లాక్కొన్న తరువాత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేదా అని జగన్ ప్రశ్నించారు. వారిని డిస్ క్వాలిఫైయిడ్ చేయాలని కోరుతున్నట్లు జగన్ తెలిపారు.

ఎన్నో హామీలు..
టిడిపి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలిచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నెన్ని బాధలు పడుతున్నారో తెలిసిరా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలు పంచి పెట్టారని, బంగారం రావాలంటే బాబు రావాలి...రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని..జాబు రావాలంటే బాబు రావాలి..నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలా ఎన్నో హామీలు గుప్పించారని తెలిపారు. చంద్రబాబు సంతకం పెట్టిన కరపత్రాలు పంచారని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన తరువాత రైతులు తీసుకున్న రుణాలు కట్టలేదని, ప్రస్తుతం సున్నా..పావలా ఉన్న వడ్డీ 14-18 శాతంతో అపరాధ రుసుం కడుతున్నారని జగన్ విమర్శించారు. 

ప్రగతి కాముక బడ్జెట్‌ :సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ సమతుల్యత పాటించారని, ఇది ప్రగతి కాముక బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. సాగు, నీటిపారుదల, సంక్షేమ రంగాలకు అధిక నిధులు కేటాయించడం సముచితమన్నారు. సమైక్య పాలనలో ప్రణాళికాపద్దుల కింద రాష్ట్రానికి రూ.9వేల కోట్లే ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించడి : జగన్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మనం పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 67 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం నెగ్గుతామనుకోవడం లేదని తెలిపారు. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపాహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ము.. ధైర్యం ఉంటే ఆ 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. టిడిపిలో చేరిన 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలనే డిమాండ్ తోనే అవిశ్వాసం పెడుతున్నామని జగన్ తెలిపారు.

డాక్టర్ వేధిస్తున్నాడు.. నర్సుల ఆందోళన

కరీంనగర్ : చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వేధిస్తున్నారంటూ నర్సులు, ఏఎన్ఎం లు ఆరోపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే డాక్టర్ వసంతరావు లైంగికంగా వేధిస్తున్నారని వారు సోమవారం విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామంటూ కరీంనగర్ తరలి వెళ్లారు.

14:32 - March 14, 2016

హైదరాబాద్ : వంగవీటి రంగాను ఏ రకంగా హత్య చేశారో తదనంతర అంశాలను హరిరామ జోగయ్య విశ్లేషిస్తూ పుసక్తం రాశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈసందర్భంగా జగన్ ప్రసంగించారు. అందులో భాగంగా వంగవీటి అంశాన్ని లేవనెత్తారు. దీనికి టిడిపి తీవ్ర అభ్యంతరం తెలిపింది. జగన్ మాట్లాడేది పచ్చి అబద్ధాల అని, ఇలా మాట్లాడడం మర్యాద కాదని టిడిపి సభ్యుడు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రంగ హత్యను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆనాడు సీఎం చంద్రబాబు నాయడిపై యాక్షన్ తీసుకోవాల్సి ఉండేది కదా అని ప్రశ్నించారు. నరమేధం సృష్టించడానికి ఆనాడు వైఎస్ అధికారంలోకి వచ్చారని తెలిపారు. 

అసెంబ్లీ జరుగుతున్న తీరు బాధాకరం: జగన్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి నేతల ఆరోపనలు నిజమైతే అవే ఆరోపణలు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డిని టిడిపిలోకి ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం నాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారని హరిరామజోగయ్య పుస్తకంలో రాశారని తెలిపారు.

బాధ కలుగుతుంది - జగన్..

హైదరాబాద్ : ఏసీ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. పరిటాల రవి హత్య కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, టిడిపి నేతల ఆరోపణలు నిజమైతే అవే ఆరోపణలు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డిని టిడిపిలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

రంగా హత్యను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది - టిడిపి

హైదరాబాద్ : వంగవీటి రంగా హత్యను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని టిడిపి సభ్యుడు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు నాయుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి -సీపీఎం, సీపీఐ...

హైదరాబాద్ : రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం, సీపీఐ ఏపీ కార్యదర్శులు మధు, రామకృష్ణలు డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేయాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వైసీపీ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు - బోండా ఉమ..

హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ సభ్యులే వ్యతిరేకిస్తున్నారని టిడిపి సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. జగన్ వైఖరి నచ్చకే వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని, ప్రభుత్వాన్ని కూలుస్తానని రాజ్ భవన్ సాక్షిగా జగన్ అన్నారని గుర్తు చేశారు. అధికారకాంక్షతోనే సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారని, జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలియాలన్నారు.

రేపు వామపక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ..

విజయవాడ : రేపు పది వామపక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం జరగనుంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో ఈ కార్యక్రమం జరగనుంది.

సంక్షేమానికి ప్రాధాన్యత – ఈటెల..

హైదరాబాద్ : 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి ఈటెల తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వనరులు, సంపదకు కొదవలేదని, రెవెన్యూ సర్ ప్లస్ రాష్ట్రంగా ఉందన్నారు. మన్ముందు రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

ఈటెలను అభినందించిన కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ రోజు 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ను మంత్రి ఈటెల ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ప్రగతికాముక బడ్జెట్ అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు.

పాక్ లో వర్షాలు..50 మంది మృతి..

పాకిస్తాన్ : కొద్ది రోజులుగా పాక్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 50 మంది మృత్యువాత పడ్డారు.

13:53 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. అవిశ్వాసం తీర్మానంపై చర్చకు స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతించగా వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు. సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అనంతరం జగన్ మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై అసహనం వక్తం చేశారు. పార్టీ మారిన 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలో లేరని జగన్ అన్నారు. అనంతరం మంత్రి యనమల మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రూల్స్ తెలుసుకుని నోటీసులు ఇవ్వాలన్నారు.  
టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ..
వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పారు. జగన్ పై  కొందరు  ఎమ్మెల్యేలు అవిశ్వాసం పెట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత అవగాహన రాహిత్యంతోనే అవిశ్వాసం ప్రవేపెట్టిందని చెప్పారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితి లేదన్నారు. అవినీతి నిరోధక శక్తులుగా మారని విమర్శించారు. 

 

13:33 - March 14, 2016

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముచ్చటగా మూడో బడ్జెట్ (2016-17)ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభ ఎదుట ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లుగా తేల్చారు. ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లుగా తేల్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి,మలి బడ్జెట్ల కేటాయింపులు ఖర్చులను పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు వెల్లడౌతున్నాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు వివిధ శాఖలకు భారీగా కేటాయింపులు జరిపామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే చెప్తున్నప్పటికీ, వాటి ఖర్చును పరిశీలిస్తే ఆచరణలో ఆయన మాటలు నీటి మూటలేనని తెలుస్తోంది. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రంగాలకు కలిపి రూ.100637.96 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఖర్చు మాత్రం కేవలం రూ.57169.28 కోట్లు మాత్రమే అయ్యింది. దీన్నిబట్టి తొలి బడ్జెట్‌లో సుమారు 55 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారని స్పష్టమౌతోంది. ఇక 2015-16 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను పరిశీలిస్తే రూ.115689.19 కోట్లను కేటాయించి, రూ.71,302.31 కోట్లను మాత్రమే (జనవరి 29వ తేదీ నాటికి) ఖర్చు చేశారు. దీనిబట్టి తొలి, మలి బడ్జెట్లలో వివిధ రంగాలకు భారీగా కేటాయింపులు జరిపినప్పటికీ ఖర్చు మాత్రం అంతంత మాత్రమే ఉన్నట్టు స్పష్టమౌతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
గత సంవత్సరం (2015-16) కు ఈ సంవత్సరం  (2016-17) కొన్ని రంగాల వారీగా తేడాలను ఒకసారి గమనిస్తే...

రంగం 2016-17 (కోట్లు) 2015-16 (కోట్లు)
మొత్తం బడ్జెట్  రూ.1,30,415.87 రూ.1,15,689.
ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 రూ. 52,383
ప్రణాళికేతర వ్యయం రూ.62,785.14 రూ.63,306
ద్రవ్యలోటు రూ.23,467.29 రూ.16,969
బీసీ సంక్షేమం రూ.2,538 రూ.2,172
ఎస్సీ సంక్షేమం రూ.7,122 రూ.5,547
ఎస్టీ సంక్షేమం రూ.3,752 రూ.5,036 (ఎస్టీ ఉపప్రణాళిక)
మైనార్టీ సంక్షేమం రూ.1,204 రూ.1,165
మిషన్ కాకతీయ, చిన్ననీటి పారుదలకు  రూ.25,000 రూ.2083
వ్యవసాయం అనుబంధ రంగాలకు  రూ.6,759 రూ.8,432
పారిశ్రామికాభివృద్ది రూ.967 రూ.973.74
విద్యుత్ రంగం   రూ.7,400
ఆసరా ఫించన్ల కోసం రూ.4,693 రూ.4,000
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.738   
రుణమాఫీ రూ.3,718 రూ.4,250
రోడ్లు భవనాలకు రూ.3,333 రూ.4,980
     


 

13:28 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అప్పులు మరింత పెరిగిపోతున్నాయని ఆ పార్టీ విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు మరింత పెరిగే విధానాల్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి కరువులు, తుఫానులతో వందలాది మండలాల్లో నష్టం జరిగిందన్నారు. ఉపాది కరువైందని చెప్పారు. వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  విశ్వేశ్వర్ రెడ్డి బడ్జెట్‌లో కేటాయింపులు సరిగాలేవని మండిపడ్డారు.
అవాస్తవమైన బడ్జెట్‌ : ఎస్ వి మోహన్ రెడ్డి
ఏపీ బడ్జెట్‌ పూర్తిగా అవాస్తవమైన బడ్జెట్‌ అని వైసీపీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్‌ రెడ్డి విమర్శించారు.. ఏ రంగానికి పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు.. అమరావతికి 15వందల కోట్లు కేటాయించారని... అందులో ఈక్విటీ అంటున్నారని సరైన క్లారిటీ లేదని ఆరోపించారు. పూర్తి వివరాలు చెప్పాలన్నారు. 

 

13:24 - March 14, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అవకతవకలు ఎత్తిచూపితే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలోని కాంట్రాక్టర్లకే మళ్లీ వాటర్ గ్రిడ్ పనులు అప్పగించారని విమర్శించారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధిని తాము ఎందుకు అడ్డుకుంటామని పేర్కొన్నారు

 

వైసీపీ అవిశ్వాతీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం : శ్రవణ్ కుమార్

హైదరాబాద్ : వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రతిపక్ష నేత అవగాహన రాహిత్యంతోనే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినట్లు విమర్శించారు. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలే అవిశ్వాసం పెట్టి పార్టీ వీడారని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితి లేదని శ్రవణ్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: జ్యోతుల నెహ్రూ

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భగా నెహ్రూ మాట్లాడుతూ.. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నెహ్రూ ఆరోపించారు.

13:00 - March 14, 2016

చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. ఓ దళితుడిని నరికి చంపి.. అతడి భార్యపై ముగ్గురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే... తిరుపూర్ అత్యంత రద్దీగా ఉండే రహదారి. నడిరోడ్డుపై వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అనంతరం అతడి భార్యపైనా దాడికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. తమిళనాడులోని తిరుపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంజనీరింగ్‌ చదువుతున్న శంకర్‌ అనే యువకుడు పెద్దలను ఎదిరించి ఎనిమిది నెలల కిందట కౌసల్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం శంకర్‌, కౌసల్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ఆ ఆగంతుకులు పదునైన ఆయుధాలతో శంకర్‌పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం కౌసల్యపై దాడిచేసి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమేరాల్లో రికార్డైంది. ఈ ఘటనలో శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. కౌసల్య తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అదుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. యువతి తరఫు బంధువులే తమ కుమారుడిని చంపారని శంకర్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తాగునీటి చెరువులు నింపండి: జూలకంటి...

నల్గొండ : నాగార్జునసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు చీఫ్ ఇంజనీర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగునీటి చెరువులను నింపాలని జూలకంటి డిమాండ్ చేశారు.

అవిశ్వాస తీర్మానం ఏపీ అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ : వైసీపీ పెట్టిన అవిశ్వాస నోటీసు పై ఏపీ అసెంబ్లీలో చర్చ ప్రారంభం అయ్యింది. మరో వైపు అవిశ్వాస నోటీస్ పై వైసీపీ నేత జగన్ సంతకం పెట్టలేదు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక సభ్యుడు కూడా సంతకం పెట్టి ఇవ్వొచ్చు అని జగన్ తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ 16కి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు.

ఆజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..

న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల రాజ్యసభలో దుమారం లేచింది. ఆ వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఐసిస్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ను పోల్చిన ఆజాద్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభలో ఆజాద్ మాట్లాడుతూ తాను ఆ పోలికలు చేయలేదన్నారు. కావాలంటే ఆ ప్రసంగానికి సంబంధించిన సీడీలను పరిశీలించాలని ఆయన సభలో కోరారు. తన వ్యాఖ్యలను తప్పుగా తర్జుమా చేశారని ఆరోపించారు. ఎలాగైతే ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తామో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను కూడా వ్యతిరేకిస్తాం.

కొత్తగా 70 మైనార్టీ స్కూళ్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 70 మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆసరా ఫించన్ల వల్ల పేద జీవితాలకు భరోసా దొరికిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఫించన్ల వల్ల 37.7 లక్షల మందికి భద్రత ఏర్పడింది. ఆసరా ఫించన్ల కోసం ఈ ఏడాది 4300 కోట్లు ఖర్చు చేయనున్నారు. కళ్యాణలక్ష్మీ, సాదీ ముబారక్ పథకాలు పేద ఇంటి అమ్మాయిల పెళ్లికి ఎంతో ఉపకరిస్తున్నాయన్నారు. కళ్యాణలక్ష్మీ కోసం ఈ ఏడాది 738 కోట్లు ప్రతిపాదించారు. 

12:28 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళే చర్చించన్నుట్లు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఐదారు గంటలపాటు అవిశ్వాసం పై చర్చ జరుగుతోందన్నారు. బేఏసీ సామావేశంలో ఈ అంశాలపై చర్చించామని తెలిపారు. అవిశ్వాసంపై నేడే చర్చించాలని అభిప్రాయడ్డామని పేర్కొన్నారు. 

 

వివిధ శాఖలకు కేటాయింపులు ఈ విధంగా...

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.

మిషన్‌ భగీరథకు రూ.36,976కోట్లు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథకు రూ.36,976కోట్లు కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. 

వివిధ శాఖలకు కేటాయింపులు ఈ విధంగా...

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. 

12:08 - March 14, 2016

హైదరాబాద్:ఆడుకుందాం.. రమ్మని మభ్యపెట్టి మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి.. అంతటితో ఆగకుండా గొంతు కోసి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా కూరగాయలు వ్యాపారం చేసే ఓ వ్యక్తి ఆడుకుందామని చిన్నారిని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి గొంతుకోసి హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపుమడుగులో విలవిల్లాడుతున్న చిన్నారిని గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.

ఎస్సీ సంక్షేమానికి రూ.7122 కోట్లు

హైదరాబాద్ : 2016-17 బడ్జెట్‌లో తెలంగాణలో ఎస్సీ సంక్షేమానికి రూ.7122 కోట్లు కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. సోమవారం శాసనసభలో ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు

హైదరాబాద్ : 2016-17 బడ్జెట్‌లో తెలంగాణలో నీటిపారుదల రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. సోమవారం శాసనసభలో ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016 బడ్జెట్ అంచనా వ్యయం రూ.1,30,415,87 కోట్లు. ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.62,785.14 కోట్లని మంత్రి ఈటెల తెలిపారు. నీటి పారుదల రంగానికి రూ.25 వేల కోట్లు ప్రకటించారు.

-నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు

-పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు.

-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,150 కోట్లు

11:58 - March 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో 2016 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూడో సారి ఈటెల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వాస్తవాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర బకాయిలను ఇప్పుడు చెల్లించాల్సివస్తుందన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం గణనీయంగా పెరిగిందని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.67 శాతం మెరుగుపడిందన్నారు. నిశిత సమీక్షల అనంతరం 2015-16  బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రెండేళ్లలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉందని తెలిపారు. 2015-16 లో రాష్ట్ర తలసరి ఆదాయం 10.7 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి తగ్గిందన్నారు. బలహీన వర్గాల కోసం పించన్లు పెంచామని చెప్పారు. 

బడ్జెట్ ముఖ్యాంశాలు....

 • 2016-17 బడ్జెట్ అంచనా రూ.1,30,415.87 కోట్లు..
 • ప్రణాళిక వ్యయం రూ.67,630 కోట్లు..
 • ప్రణాళికేతర వ్యయం రూ.62.785 కోట్లు
 •  రెవెన్యూ మిగులు రూ.3318 కోట్లు
 • ద్రవ్యలోటు రూ.23,4672 కోట్లు...
 • నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు.
 • పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.7861 కోట్లు..
 • కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6286 కోట్లు..
 • సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1152 కోట్లు 
 • రూణమాఫీకి కేటాయింపులు రూ.3718 కోట్లు
 • ఎస్సీ సంక్షేమానికి రూ.7122 కోట్లు.. 
 • ఎస్టీ సంక్షేమానికి రూ.3752 కోట్లు.
 • బీసీ సంక్షేమానికి రూ.2538 కోట్లు 
 • మైనారిటి సంక్షేమానికి రూ.1204 కోట్లు
 • మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు..
 • భగీరథకు 42.27 టీఎంసీల నీటి సరఫరా
 • రాబోయే మూడేళ్లలో 23, 912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 
 • కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
 • సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే వారికి సత్వర అనుమతులు 
 • 2016-17 నాటికి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..
 • వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా 
 • వ్యవసాయం అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత..జ
 • రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా అభివృద్ధి చేస్తున్నాం..
 • రైతుల ఉత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయం పెంపు
 • రెండేళ్లలో వంద శాతం రుణమాఫీ అమలు
 • సూక్ష్మ సేద్యం సబ్బిడీ పరిమితి సడలింపు 
 • ప్రధాని ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతులు ఎంతో తోడ్పాటునిస్తుంది...
 • మార్కెటింగ్ శాఖ ద్వారా 300 చోట్ల గిడ్డంగులు నిర్మిస్తున్నాం..
 • చెరువుల పునరుద్ధరణ వల్ల మత్స్య పరిశ్రమ వృద్ధి చెబుతుంది..
 • సంచార పశువైద్య శాలలను పటిష్ట పరుస్తున్నాం..
 • ప్రజా వైద్యంలో సంస్కరణల అవసరం ఉంది..
 • ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగుదలకు చర్యలు 
 • 2016-17 రాష్ట్ర ఆదాయపు అంచనా రూ.72.412 కోట్లు
 • కేంద్రం ద్వారా అందే నిధుల అంచనా రూ.28,512,52 కోట్లు, 
 • ఆసరా పించన్ల కోసం రూ.4693 కోట్లు.
 • కళ్యాణలక్ష్మీ పథకానికి రూ.738 కోట్లు...
 • మహిళ శిశు సంక్షేమానికి రూ.1553 కోట్లు..
 • బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు..
 • రహదారులు-భవనాలకు రూ.3333 కోట్లు. 
 • వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖలకు రూ.6,759 కోట్లు
 • ప్రజారోగ్య రంగానికి సరిపడా నిధులు కేటాయిస్తాం...
 • పంచాయతీ, గ్రామీణాభివృద్ధికి రూ.10,731 కోట్లు.. 
 • వైద్య పరికరాల కొనుగోలుకు రూ.600 కోట్లు
 • వ్యాధి నిర్ధారణ పరికరాల కొనగోలుకు రూ.316 కోట్లు. 
 • మందులు, చికిత్స పరికరాల కోసం రూ.225 కోట్లు
 • 2016-17 లో ఆరోగ్య రంగానికి రూ.5,967కోట్లు 
 • పట్టణాభివృద్ధికి రూ.4815 కోట్లు...
 • విద్యాశాఖకు ప్రణాళిక వ్యయం కింద రూ.1694 కోట్లు 
 • విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.9,044 కోట్లు
 • ప్రత్యేక అభివృద్ధి కోసం రూ.4,675 కోట్లు...
 • హైదరాబాద్ మంచినీటి సరఫరా బోర్డుకు రూ.వెయ్యి కోట్లు...
 • మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అధారిటీకి రూ.650 కోట్లు..
 • ఖమ్మం జిల్లాలో మెగాఫుడ్ పార్కుకు కేంద్రం అనుమతి 
 • మెదక్ లో నిమ్జ్ ప్రారంభిస్తున్నాం...
 • మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాలకు ప్రణాళిక వ్యయం కింద కేటాయింపులు
 • వరంగల్ లో టెక్స్ టైల్ హబ్ ఏర్పాటు చేస్తాం.. 
 • చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు వన్ టైం గ్రాంట్ రూ.50 కోట్లు...
 • యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు..
 • కొత్త ఆశ్రమ పాఠశాలలకు రూ.350 కోట్లు...
 • నగరంలో సీసీ టీవీలకు రూ.225 కోట్లు..
 • పోలీసు స్టేషన్ లలో రిసెప్షన్ సెంటర్ల ఆధునీకరణ 
 • సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.140 కోట్లు...
 • పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి రూ.72 కోట్లు...
 • ఎస్పీ, నగర కమిషనర్లకు రూ.కోటి చొప్పున ఆకస్మిక నిధి 
 • డీజీపీకి రూ.10 కోట్ల చొప్పున ఆకస్మిక నిధి 
 • రూ.64 కోట్లతో కొత్తగా 63ఫైర్ స్టేషన్లు..
11:53 - March 14, 2016

చెన్నై : తమిళ టీవీ ఆర్టిస్ట్ సాయి ప్రశాంత్ తన నివాసంలో విషం తాగి మరణించాడు. మద్యంలో విషం కలుపుకుని ప్రశాంత్ తాగాడని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఒంటరితనాన్ని భరించలేక ఈ పని చేసుండవచ్చని పోలీసులు వ్యాఖ్యానించారు. ప్రశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిల్పుక్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్, మూడు నెలల క్రితం మరో విసాహం చేసుకున్నాడు. ఆమె కూడా ప్రశాంత్ తో ఉండటం లేదని తెలుస్తోంది. తమిళంలో అనమలై, సెల్వి, అరసి తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో పాటు నీరం, తేగిడి, వడాకర్రీ తదితర సినిమాల్లోనూ ప్రశాంత్ నటించాడు.

అవిశ్వాసం పై7గంటల పాటు చర్చ: కాల్వ

హైదరాబాద్ : వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పై ఏడు గంటల పాటు ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాస్ తెలిపారు. బిఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం పై చర్చకు సిద్ధమంటే ప్రతిపక్షం పారిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మండి పడ్డారు.

వరంగల్‌ మేయర్‌ నన్నపనేని నరేందర్ !

హైదరాబాద్: వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిగా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్‌ పదవిని ముస్లింలకు ఇవ్వాలని అసెంబ్లీ లాబీలో మంత్రి హరీష్‌రావు చాంబర్‌లో వరంగల్ నగర నేతలతో కేటీఆర్‌ జరిపిన సమావేశం నిర్ణయించినట్లు సమాచారం.

సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈటెల

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను మూడోసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వాస్తవాల ఆధారంగా రూపొందింన బడ్జెట్ అని, సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈటెల ప్రకటించారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య...

మెదక్ : జిల్లాలోని రామచంద్రపురం మండలం ఈదులనాగులపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఎస్. కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని జొన్నాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవిశ్వాసంపై ఈరోజే చర్చ: కాల్వ

హైదరాబాద్ : వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పై ఈ రోజే చర్చ జరగాలని బిఏసీ సమావేశం నిర్ణయించినట్లు చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాస్ తెలిపారు. కాసేపటిక్రితం జరిగిన బిఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు కాల్వ తెలిపారు.

స్పీకర్ కి బడ్జెట్ ప్రతులు అందజేసిన ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ప్రతులను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌.. సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లకు అందజేశారు. కాసేపట్లో ఈటల రాజేందర్‌ శాసనసభలో, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రూ.15కోట్లతో ఉడాయించిన ఎరువుల వ్యాపారి

గుంటూరు : కారంపూడి మండలం నరమాలపాడులో ఘరాన మోసం బయటకు పొక్కింది. రూ.15 కోట్లతో ఎరువుల వ్యాపారి సీతారామయ్య ఉండాయించాడు. దీంతో ఆందోళనకు దిగిన బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

భారీగా గంజాయి పట్టివేత

విశాఖ : పాడేరులోని వంటాడపల్లి చెక్ పోస్టు వద్ద తనికీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి గంజాయి మాఫియా ముఠా పరారయ్యింది. పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు పారిపోగా.. చెరువులో పడి ఒకరు మృతి చెందారు. వారి వద్ద నుండి రూ.10లక్షల విలువైన 200 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.

11:28 - March 14, 2016

వేరుశనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్‌, పోలీఫెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్‌ తొలగించడానికి పనిచేస్తుంది. అలాగే వేరుశనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

11:22 - March 14, 2016

న్యూఢిల్లీ: ఇప్పట్లో తాను ఇండియాలో అడుగు పెట్టనని వ్యాపార వేత్త, ఎంపీ విజయ్‌ మాల్యా స్పష్టం చేశారు. బ్యాంకులకు అప్పులు ఎగవేశాననే క్రిమినల్‌ ముద్ర తనపై పడిందని, దీనికి సంబంధించి పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాతే తాను భారత్‌ వస్తానని 'లిక్కర్ కింగ్' స్పష్టం చేశారు. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆదేశించగా, చెల్లని చెక్కు (చెక్‌ బౌన్సు) కేసు విచారణకు మాల్యా గైర్హాజరు అవ్వడాన్ని పరిగణనలోకి తీసుకొని నాంపల్లి కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. మన దేశంలోని వివిధ బ్యాంకుల్లో మాల్యాకు సుమారు రూ.9వేల కోట్ల అప్పులున్నాయని ఇటీవల పార్లమెంట్‌లో పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు మాల్యాపై 'లుక్‌ అవుట్‌' నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ మాల్యా మార్చి 2న లండన్‌ వెళ్లినట్టు అధికారులు పార్లమెంట్‌కు వివరాలు సమర్పించారు. తన ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బ్యాంకులు అప్పులు మంజూరు చేశాయని పేర్కొన్నారు. లండన్‌ వెళ్లినా, భారత్‌ మీడియా తనను వదిలి పెట్టలేదని మాల్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గతేడాది నాకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాని నేను పారిపోలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను క్రిమినల్‌గా చిత్రికరిస్తున్నారు. రుణ ఎగవేత అంశం వ్యాపార లావాదేవీలకు సంబంధించింది. రుణాలిచ్చేటప్పుడు నష్టభయం అంశం బ్యాంకులకు తెలుస్తుంది. మా సంస్థలతో ఇబ్బంది లేదనే అవి నిర్ణయించాయి. మా సొంత వ్యాపారం దేదీప్యమానంగా వర్థిల్లేది. అయితే అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడింది’ అని మాల్యా చెప్పారు. ‘నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి. ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు మరికొందరిని కష్టాల్లో పడేసే అవకాశం ఉంద’ని పేర్కొన్నారు. ‘నేనేమీ తప్పు చేయలేదు. నేనూ బాధితుణ్నే. ఎప్పడూ అందుబాటులో ఉండేవాడిని, దాక్కునేలా చేశారు. ఇందువల్ల నేను అనారోగ్యానికి గురయ్యా’ అని మాల్యా వివరించారు. మీడియా సంస్థల ప్రతినిధులతో తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ సంస్థలు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆయన ఉచిత సలహా ఇచ్చారు.

మరోవైపు భవిష్యత్‌ ప్రణాళికను తెలియజేయాలంటూ పీటీఐ వార్తా సంస్థ పంపిన ఇ-మెయిల్‌కు మాల్యా నుంచి స్పందన రాలేదు. అయితే తన కోసం బ్రిటన్‌లో ప్రసార మాధ్యమాలు (మీడియా) అన్వేషణ సాగిస్తున్నాయని మాల్యా ట్వీట్‌ చేశారు. ‘బ్రిటన్‌లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. విచారకరమైన విషయమేమిటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్‌లో తెలిపారు.

నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాల్యా తరుపు న్యాయవాది హెచ్‌.సుధాకర్‌ రావు చెప్పారు. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారులను న్యాయసానానికి రప్పించేందుకు చట్టాలను పూర్తి సాయిలో ఉపయోగిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.

11:18 - March 14, 2016

హైదరాబాద్‌ : నగరంలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. వనస్థలిపురంలో గంట వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మహిళలను టార్గెట్‌ చేసిన స్నాచర్లు..ముగ్గురు మహిళల నుంచి పన్నెండున్నర తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

11:13 - March 14, 2016

మహబూబ్నగర్ : గిరిజనుల బాట కోసం కేటాయించిన భూమి మటుమాయమైంది. తండాకు వెళ్లేందుకు వేసిన బండ్లబాట కనుమరుగై పోయింది. ఓ ప్రైవేటు వెంచర్‌ కబ్జా కోరల్లో చిక్కిన కోట్ల విలువైన భూమి నామరూపాలు లేకుండా పోయిన వైనం ఇది. అటు అధికారులను.. ఇటు కొనుగోలు దారులను నిండా ముంచిన వెంచర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని,   తమ బాటకోసం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. 
శ్రీబాలాజీ వెంచర్‌ స్థిరాస్తి వ్యాపార సంస్థ 
మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే జాతీయ రహదారి పక్కనే శ్రీబాలాజీ వెంచర్‌ స్థిరాస్తి వ్యాపార సంస్థ వెలసింది. గేటెడ్‌ కమ్యూనిటీ.. అంటూ ప్రకటనలు గుప్పించి అనేక మందికి ప్లాట్లు అమ్మిన నిర్వాహకులు.. ఆ పక్కనే ఉన్న గిరిజన తండా బండ్లబాటను కూడా ఆక్రమించారని స్థానికులు ఆవేదన వక్తం చేస్తున్నారు. నక్షా ప్రకారం సమీప తండాకు వేసిన బండ్లబాటను.. రియల్టర్‌ కలుపుకోవడం వెనుక అధికారుల హస్తం ఉందన్నది స్థానిక గిరిజనుల ఆరోపణ.
స్పందించని అధికారులు 
బండ్లబాట ఆక్రమణ విషయంలో అటు పురపాలక అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులు గానీ స్పందించడం లేదు. ముడుపులకు కక్కుర్తిపడి నాలుగేళ్ల క్రితమే అప్పటి తహసీల్దార్‌, వీఆర్‌వో అడ్డగోలు అనుమతులిచ్చారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే వెంచర్‌ నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు పంపించామని, గిరిజనుల బండ్లబాట స్థలంలో నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.
బండ్లబాట భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి 
వెంచర్‌ నిర్వాహకుల కబ్జా చేసిన స్థలం కోట్ల విలువ ఉంటుందని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని బండ్లబాట భూమిని స్వాధీనం చేసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. 

 

11:07 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ సభ అభిప్రాయం తెలుసుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై చర్చించాల్సిన తేదీ, సమయాన్ని ఖరారు చేయనున్నారు. 

 

11:01 - March 14, 2016

ఢిల్లీ: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు ఎక్కువైపోతున్నారు. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు కూడా కోహ్లీని అభిమానిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ పురుషుల టీమ్‌తో పాటు మహిళా టీమ్‌కు కూడా భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా పాక్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సనాను మీడియా పలకరించింది. మీకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడిగితే తడుముకోకుండా కోహ్లీ అని చెప్పేసింది. మా జట్టులోని క్రికెటర్లకు కోహ్లీ పాపులర్ క్రికెటర్. తనకు మాత్రం కెప్టెన్ ధోనీ ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చారు. ధోనీ మైదానంలో, బయటా హుందాగా ఉంటాడు అని.. అతని ప్రవర్తన బాగా నచ్చుతుందని సనా చెప్పారు. జూనియర్లతో కూడిన టీమ్‌ను ధోనీ బలమైన టీమ్‌గా మార్చాడు అని కొనియాడింది.

టీఎస్ ఎడ్ సెట్16 నోటిఫికేషన్ విడుదల...

హైదరాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్-2016 నోటిఫికేషన్ విడుదలైంది. 2016-17 సంవత్సరానికి గానూ రెండేళ్ల బీఎడ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 14 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 150. రూ. 500 అపరాధ రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్‌సెట్ పరీక్ష మే 27న జరగనుంది. తదితర వివరాల కోసం WWW.TSEDCET.ORG వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ లో వైసీపీ ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానంపై సభ అభిప్రాయం స్పీకర్ తెలుసుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించాల్సిన తేదీ సమయాన్ని బీఏసీ ఖరారు చేయనున్నదని స్పీకర్ తెలిపారు.

కడప జిల్లాలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం..

కడప : రైల్వేకోడూరు మండలం శాంతినగర్‌లో ఈనెల 9న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. అదృశ్యమైన చిన్నారుల్లో అజ్రీన్‌ హుస్సేన్‌, హజ్రత్‌ హుస్సేన్‌, జమీద్‌ హుస్సేన్‌లున్నారు. వారు మహారాష్ట్రలో ఉన్నారంటూ ఓ ఆగంతకుడి నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ మరి కాసేపట్లో అంటే ఉదయం11.35 నిమిషాలకు మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

హాస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ 3 గంటలు ఆలస్యం...

హైదరాబాద్:  హైదరాబాద్ - ముంబై హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరాల్సిన ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరనుంది. ప్రయాణికులు గమనించగలరని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

10:36 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రత్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీలో కౌలు రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్‌ ప్రశ్నించారు. దాదాపు 16లక్షలమంది కౌలు రైతులున్నారని మంత్రి ప్రత్తిపాటి చెప్పారని.. రుణాలు మాత్రం సుమారు 95 వేల మందినికి ఇచ్చారంటున్నారని గుర్తుచేశారు. రెండింటిమధ్య ఇంత తేడా ఎందుకుందని ప్రశ్నించారు. రుణాలు పొందినవారు ఇంత తక్కువగా ఎందుకున్నారని ప్రశ్నించారు.  కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ ఫుడ్ సబ్సిడీ పక్కదారి పట్టిస్తున్నందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ తోపాటు మిగిలిన వైసిపి సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లారు.
జగన్ కు అవగాహనకు లేదు : పత్తిపాటి
అనంతరం మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ కు అవగాహన లేదన్నారు. అనువభవం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2011లో ఎల్‌ఈసీ కార్డులు ప్రవేశపెట్టామని చెప్పారు. లోపాయికారి ఒప్పందంతో కౌలు రైతులు కొనసాగుతున్నారు. గతం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అంతకము ముందు ప్రభుత్వంపై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం జగన్ ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగియగానే అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపడతామని స్పీకర్ చెప్పారు. 

 

అవిశ్వాసతీర్మానం పై చర్చకు సిద్ధంకండి: చంద్రబాబు

హైదరాబాద్ : వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం చర్చను ఈ రోజే చర్చించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగియగానే అవిశ్వాసతీర్మాన అంశాన్ని తీసుకుంటమని స్పీకర్ తెలిపారు. అవిశ్వాస తీర్మాంపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని టిడిపి ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్నది.

10:29 - March 14, 2016

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ తో పాటు ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కొర్టు మెట్టెక్కించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోషాక్ ఇచ్చారు. బ్రిటన్ లో ఓ కంపెనీని ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ, సదరు కంపెనీ వార్షిక నివేదికలో తాను బ్రిటిష్ పౌరుడినేనని పేర్కొన్నారని స్వామి గతంలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాహుల్ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్వామి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన స్పీకర్ దానిని పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి పంపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎథిక్స్ కమిటీ రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. పౌరసత్వంపై వస్తున్న విమర్శలపై సమాధానమివ్వాలని ఆ లేఖలో కమిటీ రాహుల్ కు ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల జారీని ధ్రువీకరించిన ఎథిక్స్ కమిటీ చైర్మన్ అర్జున్ రామ్ మేఘవాల్... ఈ విషయం చాలా కీలకమైనదేనన్నారు. రాహుల్ గాంధీ వివరణ ఇచ్చాక దీనిపై తదుపరి చర్యల అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఏపీ శాసనసభ నుండి వైసీపీ వాకౌట్

హైదరాబాద్ : ఏపీ శాసనసభ నుండి వైసీపీ వాకౌట్ చేసింది. ఇన్ పుట్ సబ్సిడీ పక్కదారి పట్టించినందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

హాలీవుడ్ సింగర్ ఎర్నెస్టీన్ ఆండర్సన్ కన్నుమూత...

హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్ సింగర్, నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఎర్నెస్టీన్ ఆండర్సన్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో వచ్చే సమస్యల కారణంగా షోరెలైన్ లోని ది కింగ్ కౌంటీ మెడికల్ హాల్ లో చికిత్స పొందుతున్న ఆమె మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సభకు హాజరు కాకూడదని ఫిరాయింపు ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ఈ రోజు అవిశ్వాసంపై ఓటింగ్ ఉండే అవకాశం ఉన్నందున సభకు హాజరు కావొద్దని ఫిరాయింపు ఎమ్మెల్యేల నిర్ణయించినట్లు సమాచారం.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఈటెల

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు. కన్నీళ్లు, కష్టాలు లేని రాష్ట్రంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కాబోతుందని చెప్పారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. 

నేడు లాభాలతో స్టాక్ ప్రారంభం

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 203 పాయింట్లుకు పైగా లాభంలో సెన్సెక్స్, 62 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

రోజా పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీనేత, నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. తన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ, సస్పెన్షన్ ఎత్తివేయాలని రోజా దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే గతవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రోజా, విచారణ పూర్తి కాకముందే తన పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనైనా రోజాకు ఊరట లభిస్తుందా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. 

వనస్థలీపురంలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలో ఓ చైన్ స్నాచర్ హల్‌చల్‌ చేశాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ఉన్న 5తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకునే లోపే క్షణాల్లో మాయమయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి..పరారీలో ఉన్న చైన్ స్నాచర్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

09:39 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో షాదిఖానాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. షాదీఖానాలకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 146 షాదీఖానాలను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. ముస్లింల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. షాదిఖానాలకోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులనుకూడా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు మాట్లాడుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. 
వైసీపీ అవిశ్వాసంపై స్పీకర్ నిర్ణయం
ఎపి ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెతుతోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కైలు రైతుల రుణాలు, శ్రీకాకుళం జిల్లాలో సాండ్ మైనింగ్, రైతులకు వడ్డీలేని రుణాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతారు. ఈరోజే అవిశ్వాస తీర్మానంపై చర్చించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తీర్మానంపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశించారు. 

 

 

షాదీఖానాలకు బడ్జెట్ లో రూ.50కోట్లు : మంత్రి పల్లె

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ షాదీఖానాలకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 146 షాదీఖానాలను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు.  

09:25 - March 14, 2016

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెతుతోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కైలు రైతుల రుణాలు, శ్రీకాకుళం జిల్లాలో సాండ్ మైనింగ్, రైతులకు వడ్డీలేని రుణాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతారు. ఈరోజే అవిశ్వాస తీర్మానంపై చర్చించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తీర్మానంపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశించారు. 

 

09:15 - March 14, 2016

కడప : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లికి చెందిన పలువురు మైత్రి అనే పాపకు పాలతల క్షేత్రం వద్ద పుట్టువెంట్రుకలు తీసుకురావడానికి లారీలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గంమధ్యలో జిల్లాలోని రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద అదుపు తప్పి లారీ లోయలో పడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో 35 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

ఎపి అసెంబ్లీలో వైసీపీ అవిశ్వాస తీర్మానంపై నేడు నిర్ణయం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో వైసీపీ అవిశ్వాస తీర్మానంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. నేడు సభలో సాధారణ బడ్జెట్ పై చర్చ జరుగనుంది. 

రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

కడప : రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ లో ప్రమాదం జరిగింది. లారీ లోయలో పడడంతో నలుగురు మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. మృతులు లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లి వాసులుగా గుర్తించారు. 

 

పెళ్లి చేయడంలేదని తండ్రిపై కొడుకు దాడి

హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో ఓ యువకుడు పెళ్లి చేయడంలేదని కన్నతండ్రిపైనే కొడుకు కత్తితో దాడి చేశాడు. సుభా్‌సచంద్రబో్‌సనగర్‌కు చెందిన సహబుద్దీన్‌ పెద్ద కుమారుడు నజుద్దీన్‌ తాగుడికి బానిసయ్యాడు. పెళ్లి చేయడం లేదని, ఆస్తి పంచివ్వడం లేదని తండ్రిపై కత్తితో ఆదివారం దాడిచేశాడు. సహబుద్దీన్‌ చేయి, గొంతు, పొట్టపై గాట్లు పడ్డాయి. స్థానికులు 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కత్తి స్వాధీనం చేసుకుని నజుద్దీన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

08:28 - March 14, 2016

ఎమ్మెల్యేలు ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉంటే మంచిదని వక్తలు సూంచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీడీపీ అధికార ప్రతినిధి ఆనంద్ రావు, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. జాతీయ రహదారులకు ఇచ్చిన నిధులు కూడా ఎపికి కేటాయించామనడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. అమిత్ షా షో కాదు... అమిత్ షో అనాలని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేమని ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:17 - March 14, 2016

చిత్తూరు : కలియుగ దైవం వెంకన్న స్వామి సన్నిధిలో కూడా ఆకలి బాధలు తప్పడం లేదు. స్వామివారి సేవలు నిరాటంకంగా సాగేందుకు క్రుషి చేస్తున్నవారిని కూడా కాంట్రాక్ట్ భూతం పీడిస్తోంది. 
టీటీడీలో చాలీచాలని వేతనాలు
తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం. నిత్యం దాదాపు 40 వేలమంది భక్తులు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటారు. పండులు, పర్వదినాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య ఒక్కొక్కసారి లక్ష దాటుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఇసుకేస్తే రాలని రీతిలో భక్తులు తరలివస్తారు. ఏడాదికి ఒక్కసారైనా ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని ఆరాటపడేవారెందరో. 
ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం
వడ్డీకాసులవాడి దర్శనానికి వచ్చిన భక్తులు భారీగానే కానుకలు, విరాళాలు సమర్పించుకుంటారు. టీటీడీకి ఏడాదికి వచ్చే ఆదాయం 2700 కోట్ల రూపాయల దాకా వుంటోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే మరెన్నో ఆస్తులు స్వామివారి సొంతం. ప్రతి రోజూ కనీసం 20 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూ వుంటారు. 600 మంది క్షురకులు సేవలందిస్తూ వుంటారు. తలనీలాల ద్వారానే టీటీడీకి ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. 
తిరుమలకు భారీగా భక్తులు 
తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా అక్కడి ఉద్యోగులు, కార్మికులు, వేదపండితులు అహరహరం శ్రమిస్తుంటారు. తమ కళారూపాలతో, మ్రుదు మధురమైన గానాలతో కళాకారులు మానసికోల్లాసాన్ని కలిగిస్తుంటారు. 
ఉద్యోగ భద్రత లేదు 
తిరుమలలో దాదాపు 21 వేల మంది తమ విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వీరిలో సగానికంటే ఎక్కువ మందికి ఉద్యోగ భద్రత లేదు. 13వేల మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే సేవలందిస్తున్నారు. వీరికిచ్చే జీతాలు చాలా స్వల్పం. 1990కి పూర్వం తిరుమలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుండేవారు కాదు. వంద కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చిన రోజుల్లోనే పది వేల మంది పర్మినెంట్ ఉద్యోగులుండేవారు. కానీ ఇప్పుడు ఆదాయం భారీగా పెరిగింది. కానీ ఏం లాభం? పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 8వేలకు తగ్గిపోయింది.  
ఎక్కువ శాతం కాంట్రాక్ట్ ఉద్యోగులే 
క్షురశాల, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, పారిశుద్ధ్య నిర్వహణ, కళారూపాల ప్రదర్శన, వేదమంత్రాల పారాయణ, క్యాటరింగ్ , ప్రసాదాల తయారీ ఇలా ఏ విభాగంలో చూసినా ఎక్కువ శాతం మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే కనిపిస్తారు. ఆలయంలో పనిచేసే చాలామంది వేద పండితులు, పూజారులు కూడా  సంభావణలతోనే సంత్రుప్తి చెందాల్సిన పరిస్థితి. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల పరిస్థితి మరీ దయనీయం.  వీరికిచ్చే పారితోషకం చాలా స్వల్పం. కొన్ని ప్రోగ్రాములకు నామమాత్రపు పారితోషకం లభిస్తే, మరికొన్ని ప్రోగ్రామ్ లు ఉచితంగా చేస్తుంటారు. 
చాలీచాలని జీతాలు 
ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామంటూ పాలకమండలి చేసిన తీర్మానాలు ఆచరణ రూపం దాల్చడం లేదు. 

 

07:56 - March 14, 2016

ఢిల్లీ : ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని యమునా నదీ తీరంలో ప్రపంచ సాంస్కృతిక  ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు సభికులను  అలరించాయి. ప్రపంచ ప్రజలను కలపడమే తన లక్ష్యమని రవిశంకర్‌ ప్రకటించారు.
మూడోరోజు ఘనం ముగింపు ఉత్సవాలు 
యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవాల మూడోరోజు ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందరికీ ప్రేమను పంచడమే తన జీవిత లక్ష్యమని ఈ సందర్భంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ  ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. 
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు 
ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన ఉత్సవాల్లో పాల్గొనేందుకు 155 దేశాలకు చెందిన కళాకారులు, ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ముగింపు వేడుకులకు పలువురు ప్రముఖులు హాజరు
ముగింపు వేడుకులకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, హర్షవర్ధన్‌, దత్తాత్రేయ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. 

 

07:51 - March 14, 2016

టీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. ఇదే అంశం నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు చాలీచాలనీ వేతనాలతో సతమవుతున్నారని... వారి వేతనాలు పెంచాలని కోరారు. దళిత ఉద్యోగులకు పై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. 'తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇవాళ వేలాది ఉద్యోగులు, కార్మికులు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నుంచి చాలామంది హైదరాబాద్ చేరుకున్నారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? టీటీడీ పాలకమండలి నుంచి వీరు ఆశిస్తున్నదేమిటి?' ఇలాంటి అంశాలపై మురళి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.

 

రోడ్ ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్ : హయత్‌నగర్-సాగర్ రహదారిపై రోడ్ ప్రమాదం సంభవించింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పట్టగా,  నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

కడప జిల్లాలో కిడ్నాప్ కలకలం..

కడప : రైల్వే కోడూరు మండలం శాంతినగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. లారీ డ్రైవర్ నాజర్ హుస్సేన్ ముగ్గురు కుమారులు ఈనెల 10న అదృశ్యమయ్యారు. 

07:35 - March 14, 2016

ఢిల్లీ : పారిపోయాడంటూ తనపై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఖండించారు. ఇప్పట్లో భారత్‌కు వెళ్లడం మంచిదికాదన్నట్లు తాను భావిస్తున్నానని లిక్కర్ కింగ్ స్పష్టం చేశారు. సండే గార్డియన్‌కు ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. 
సండే గార్డియన్ పత్రికతో ఈ మెయిల్ ఇంటర్వ్యూ
వేటాడడానికి తానేమీ కరుడుగట్టిన తీవ్రవాదిని కానని.. తనపై ఇలాంటి ఆరోపణలు గతంలో ఎన్నో వచ్చాయి. ఇప్పుడూ వస్తున్నాయంటూ లిక్కర్ సామ్రాజ్యాధినేత విజయ్‌మాల్యా తనను తాను వెనకేసుకొచ్చారు. ఆయనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సండే గార్డియన్ పత్రిక ఆయనతో ఈ మెయిల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. తనపై నమోదైన కేసులకు స్పందిస్తూ తాను ఎక్కడ ఉన్నానో చెప్పడం తెలివైన పని అనిపించుకోదన్నారు. 
తాను పారిపోయానన్న ప్రచారం తప్పు 
తాను పారిపోయానని మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా తప్పని మాల్యా చెప్పారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక మార్చి 2న భారత్ నుంచి వెళ్లిపోయారా అన్న ప్రశ్నకు... తాను ఓ మిత్రుడితో కలిసి విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు. తాను 7 పెద్ద బ్యాగులతో వెళ్లిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇప్పటికే తనను క్రిమినల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ప్రస్తుతం తనకు భారత్‌లో అంతగా పనిలేదని మాల్యా స్పష్టం చేశారు. ఏదో ఒకరోజున కచ్చితంగా ఇండియాకు వెళ్తానని ఈ లిక్కర్ కింగ్ చెప్పారేకాని సమయాన్ని మాత్రం చెప్పక దాటేశారు. కొందరు కావాలనే తన గురించి రచ్చ చేస్తున్నారే తప్ప తానేమీ కరుడుగట్టిన నేరస్తుడిని కాదని చెప్పుకొచ్చారు. 
రుణాల చెల్లింపులు వ్యాపారానికే పరిమితం 
రుణాల చెల్లింపుల వ్యవహారాన్ని వ్యాపారానికే పరిమితం చేయాలని, వ్యక్తిగతంగా తనను నేరస్తుడిగా ముద్రవేయడం ఏంటని విజయ్‌మాల్యా ప్రశ్నించారు. తన వ్యాపారాలు నష్టాన్ని చవిచూడటంతో ఒక్కసారిగా బ్యాంకులు ఒత్తిడి తీసుకొచ్చాయని విజయ్‌మాల్యా చెప్పారు. ఆ కారణం చేత విలన్ గా చిత్రీకరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద ఈ ఇంటర్వ్యూ ఆసాంతం.. రాజ్యసభ ఎంపీ కం వ్యాపారవేత్త తనను తాను నేరస్తుడిని కాదంటూ చెప్పుకొచ్చారు. 

 

నేడు ఆదిలాబాద్ జిల్లాకు తమ్మినేని

ఆదిలాబాద్ : సీసీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. నిర్మల్ లో నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

07:23 - March 14, 2016

మహబూబ్నగర్ : పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రాజెక్టు పనులను స్వయంగా సమీక్షించడంతో పాటు.. అక్కడే నిద్రపోయేందుకు సిద్ధమవుతున్నారు హరీష్‌రావు.
అధికారులతో మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై మంత్రి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
జులైలోగా సాగు : హరీష్‌రావు
ఈ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసి జులైలోగా రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని.. వీటిని పూర్తి చేసేందుకు నిధుల కొరత లేదన్నారు హరీష్‌రావు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి ప్యాకేజీల వారీగా ప్రోగ్రెస్‌ కార్డులను తయారు చేయాలని.. ఆ తర్వాతే సమీక్షిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. జులైలోగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించని పక్షంలో.. అలసత్వం ప్రదర్శించిన అధికారులు, ఇంజనీర్లను ఉపేక్షించేది లేదని హరీష్‌రావు హెచ్చరించారు. 
వాట్సప్‌ గ్రూప్‌లోకి కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు 
ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులను కూడా వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చాలని మంత్రి సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హరీష్‌రావు హెచ్చరించారు. ఇక పనులు పూర్తయిన వెంటనే ఆయా సంస్థలకు బిల్లులు చెల్లించాలని.. కుంటిసాకులతో జాప్యం చేస్తే సహించబోమన్నారు. మరోవైపు ప్రతివారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ లేదా ఇరిగేషన్‌ సలహాదారు ఆయా ప్రాజెక్టులను సందర్శించి పురోగతిని సమీక్షిస్తారన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. తాను కూడా స్వయంగా ప్రాజెక్టులను సందర్శించి అక్కడే నిద్రపోతానని హరీష్‌రావు తెలిపారు. ప్రతి సోమవారం పెండింగ్‌ ప్రాజెక్టుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించాలని మహబూబ్‌నగర్‌ జాయింట్‌ కలెక్టర్‌ను హరీష్‌రావు ఆదేశించారు. 

 

07:18 - March 14, 2016

విశాఖ : బీజేపీ, టీడీపీ పొత్తు బెడిసి కొడుతోందా అంటే అందుకు టిడిపి వ్యవహారశైలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపి అభివృద్దికి బిజెపి సహకరిస్తున్నా టిడిపి నాయకత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏపీకి  కేంద్రం  ఎంతో సహకరిస్తున్నా, కేంద్రం సహకరించడంలేదని టీడీపీ ప్రచారం చేస్తోందని ఏపీ బీజేపీ భగ్గుమంటోంది. 
టీడీపీ సర్కారు తీరుపై వాడివేడి చర్చ 
విశాఖలో జరిగిన ఎపి బిజెఎల్పీ సమావేశంలో టీడీపీ సర్కారు తీరుపై వాడి వేడి చర్చ జరిగినట్లు సమాచారం. ఎపికి అన్ని రాష్ట్రాలకంటే నిధుల కేటాయింపులో కేంద్రం చొరవ  చూపిస్తున్నా రాష్ట్రంలో బిజెపిని కార్నర్ చేయడమే అవుతోందని పలువురు అభ్యంతరం వక్తం చేసినట్లు సమాచారం. ఎపి సర్కారు తీరును తొలి నుంచి మండిపడుతున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. శాసనమండలిలో తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం చేస్తున్న సహకారంపై బిజెపి సభ్యులు వివరించేలా  చూడాలని నిర్ణయించారు. మిత్ర పక్షంగా ఉంటున్న తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ బీజేపీ నేతలు వాపోయారు. జన్మభూమి నిధుల కేటాయింపులో  అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 
టీడీపీ పై బీజేపీ కౌంటర్ ఎటాక్...?
మిత్ర పక్షంగా ఉంటూనే టిడిపి పై కౌంటర్ ఎటాక్ చేయడానికి సిద్ధం కావాలని కేంద్ర బిజెపి అధిష్టానం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరి  నిమిషంలో  బిజెపిపై తప్పుతోసేయడానికి టిడిపి సిద్దమవ్వచ్చొనే అనుమానంతో బిజెపి శ్రేణులు ఉన్నాయి.

07:13 - March 14, 2016

హైదరాబాద్ : 'ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి తారలు ఒకే తెరపై ఆడిపాడితే ఇక వారి అభిమానుల ఆనందానికి హద్దే లేదు. '7 సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' సంస్థ ద్వారా అలాంటి సౌకర్యాన్ని కల్పి స్తున్నాం. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం భాషలకు చెందిన దాదాపు 18 మంది స్టార్‌ హీరోలతో 'లవ్‌ స్టార్‌' పేరుతో ఓ యానిమేషన్‌ ఆల్బమ్‌ను తయా రు చేశాం. హేమచంద్ర, శ్రావణి భర్గవి పాట పాడగా, బూర్గుపల్లి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్‌ రావుల ఆల్బమ్‌ను కంపోజ్‌ చేశారు' అని '7 సీస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సంస్థ అధి నేత మారుతి అన్నారు. 
ప్రస్తుతం ఈ 'లవ్‌స్టార్‌' యూ ట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు మాట్లాడుతూ, 'నేటి తరం దర్శకులు కొత్త ఆలోచనలతో వస్తున్నారు. అవకాశం కల్పిస్తే తెలుగు చిత్ర పరిశ్రమను కొత్తపుంతలు తొక్కంచే సత్తా నేటి దర్శకుల్లో ఉంది. మేం రూపొందించిన ఈ ఆల్బమ్‌ అందుకు ఓ ఉదాహరణ. నాలు గు నిమిషాల పాటు ఉండే ఈ ఆల్బ మ్‌ వీడియోకు తారల అభిమానులు తెగ బాగా ఎంజారు చేస్తున్నారు. అని అన్నారు.

 

07:11 - March 14, 2016

హైదరాబాద్ : ఇటీవల రైటర్స్ దర్శకులుగా మారుతున్నారు. 'కిక్‌', 'రేసుగుర్రం', 'టెంపర్‌' వంటి హిట్‌ చిత్రాలకు కథలు అందించిన రైటర్‌ వక్కంతం వంశీ దర్శకుడిగా మారబోతున్నారు. ఎన్టీఆర్‌.. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేయబోతు న్నారు. చాలా రోజులుగా వక్కంతం తనతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజీ' చిత్రంలో నటిస్తున్నారు. పూరీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

 

07:07 - March 14, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఏపీ నుండి ఢిల్లీ వచ్చిన 300 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు.. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధికి నివాళులర్పించి కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. 13 జిల్లాల నుంచి సేకరించిన కోటి సంతకాలు, మట్టి, నీరు ప్రధానికి అందజేయనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తారు. 15న పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాపైన డిమాండ్ చేస్తారు. 

07:04 - March 14, 2016

హైదరాబాద్ : ప్రతిపక్షాలు అన్నాక..అధికార పార్టీని నీడలా వెంటాడాలి. ఏపీలో ఇప్పుడదే పనిలో ఉంది వైసీపీ. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అవిశ్వాస అస్త్రాన్ని ఎంచుకుంది. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో నేడు చర్చ జరగనుంది. మరోవైపు పాలకపక్షం కూడా.. విపక్షం ఆరోపణాస్త్రాలను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా... ఆదివారం టీడీపీ కీలక నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ అయి వ్యూహరచనపై చర్చించారు. 
అవిశ్వాస తీర్మానంపై చర్చ 
ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు స్పీకర్‌ కోడెల.. వైసీపీకి అనుమతించారు. తమకు తగినంత సంఖ్యాబలం లేకున్నా.. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అందులోనూ పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలన్న వ్యూహమూ దీని వెనుక ఉందని తెలుస్తోంది.  తీర్మానంపై సమగ్ర చర్చ జరిగాక ఓటింగ్‌ వెళ్లేందుకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. 
హామీలు నెరవేర్చడంలో టిడిపి విఫలం 
15మంది  ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అసెంబ్లీ కార్యదర్శి ద్వారా అందుకున్న స్పీకర్‌... ఈ నెల 14న తీర్మానంపై చర్చకు అనుమతించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టిడిపి విఫలమైందని... ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని భూముల్లో కూడా భారీగా అవినీతి జరిగిందని, ఈ భూముల అక్రమాల్లో సీఎం చంద్రబాబు కుటుంబంతో పాటు... మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా ఉన్నారని వైసీపీ విమర్శిస్తోంది. ప్రభుత్వ తీరును బట్టబయలు చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..
ఓటింగ్‌లో వైసీపీకి మద్దతిస్తారా?
అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఏం చేస్తారో.. వారిని అధికార పక్షం ఎలా కాపాడుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.. ఓటింగ్‌లో వైసీపీకి మద్దతిస్తారా? లేక టీడీపీకి జై కొట్టి పదవి కోల్పోతారా..? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  
టీడీపీ వ్యూహరచన 
మరోవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, చర్చ నేపథ్యంలో టీడీపీ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తోంది. ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు.. ఎలాంటి సమాధానం ఇవ్వాలన్న అంశంపై సభ్యుల సమన్వయానికి వ్యూహం ఖరారు చేసింది. 
టీడీపీ ముఖ్యనేతల భేటీ
ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న అంశంపై ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు, ఛీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, మంత్రి రావెల కిశోర్‌బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి కీలక మంత్రులు రాకపోవటాన్ని కొందరు ఎమ్మెల్యేలు తప్పు పడుతున్నారు. సభలో ఎమ్మెల్యేలకంటే మంత్రులే కీలకమని, వైసీపీ చేసిన ఆరోపణలను వీలైనంతవరకు సభలో ఎండగట్టాలని వారంటున్నారు. మొత్తానికి సోమవారం నాడు.. ఏపీ అసెంబ్లీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

06:59 - March 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను నేడు శాసనసభలో, శాసన మండలిలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
ఒక లక్షా 30 వేల కోట్లతో బడ్జెట్  
ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలు ప్రతిబింబించేలా బడ్జెట్‌లో వివిధ రంగాలకు నిధులు కేటాయించనున్నారు. ఈ సారి బడ్జెట్‌ను ఒక లక్షా 30 వేల కోట్లతో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలైన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, నీటి ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు , సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం అలాగే హైదరాబాద్‌ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నారు.
గత సంవత్సరం ఒక లక్షా 15 వేల కోట్లతో బడ్జెట్‌ 
గత ఆర్థిక సంవత్సరం ఒక లక్షా 15 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా ఈ సారి మరో 15 వేల కోట్లు పెంచి లక్షా 30 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌కు కసరత్తు చేశారు. ఈ సారి ప్రతీ రంగానికి 5 నుంచి 10 శాతం కేటాయింపులు పెంచినట్లు చూపించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. 
కేంద్ర గ్రాంట్లు, నిధులపై టీసర్కార్ అంచనాలు 
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధుల విషయంలో గతంలో టీఆర్‌ఎస్‌ సర్కారు భారీ అంచనాలు వేసింది. అయితే ఆ అంచనాలు తలకిందులై ఆర్థిక పరిస్థితి కుదేలైంది. కాగా ఈ సారి బడ్జెట్‌ను వాస్తవాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ఈటెల ప్రకటించారు. 
భద్రత కట్టుదిట్టం 
బడ్జెట్‌ ప్రవేశపెట్టే నేపథ్యంలో సచివాలయంలోని ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. బడ్జెట్‌ ప్రతులు శాసన సభ చేర్చే వరకూ ప్రత్యేక భద్రతను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

 

తెలంగాణలో నేటి ఇంటర్ పరీక్షకు సెట్ ఏ-ప్రశ్నాపత్రం

హైదరాబాద్ : నేడు తెలంగాణలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షకు సెట్ నెంబర్ ఏ-ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.  

06:44 - March 14, 2016

'స్వాతిముత్యం'.. ఓ అద్భుతమైన సినిమా. కమల్‌ హాసన్‌, రాధిక జంటగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక ఆణిముత్యం. కుటుంబ కథా నేపథ్యంలో కమల్‌ హాసన్‌ మార్క్‌ నటనతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. తెలుగు చిత్ర సీమ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుకి పంపిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రం విడుదలై నేటితో ముఫ్పై ఏండ్లు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1986 మార్చి 13న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డును సృష్టించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారంతోపాటు ఉత్తమ తెలుగు చిత్రంగా నంది అవార్డులను, ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా పలు ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారాలను అందుకుంది. రష్యన్‌ భాషలో డబ్‌ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తమిళంలో 'సిప్పిక్కుల్‌ మత్తు'గా విజయఢంకా మోగించింది. తెలుగులో 25 థియేటర్లలో 500రోజులు ప్రదర్శించబడింది. అమాయకంగా సాగే కమల్‌ నటనకు రాధిక అభినయం తోడవ్వడంతో ఈ చిత్రం విజయపథంలో నిలిచింది. దీనికి మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయారాజా సంగీతం ప్రాణం పొసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్పీ శైలజ గాత్రం నుంచి జాలు వారిని ప్రతి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్ర పాటలన్ని అప్పట్లో బాగా పాపులరైయ్యాయి. నేటితో ఈ చిత్రం 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

 

నేడు పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీసీ ఎంపీల మౌనదీక్ష

ఢిల్లీ : నేడు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట బీసీ ఎంపీలు మౌన దీక్ష చేపట్టనున్నారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

నేడు 'చలో హైదరాబాద్' కు సీఐటీయూ పిలుపు

చిత్తూరు : నేడు చలో హైదరాబాద్ కు సీఐటీయూ పిలుపునిచ్చింది. టీటీడీలో టైంస్కేల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

భూసేకరణ బిల్లుపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : భూసేకరణ బిల్లుపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీ జరుగనుంది. పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss