Activities calendar

15 March 2016

టీమిండియా భారీ ఓటమి

నాగ్ పూర్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా భారీ ఓటమి మూట గట్టుకుంది. 126 పరుగుల్ని చేధించే క్రమంలో 79 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో 47 పరుగుల తేడాతో భారత్ ఈ వరల్డ్ కప్ లో తొలి ఓటమి చవిచూసింది. 

చివరి ఆశ కూడా పోయింది..

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : టీ-20 ప్రపంచకప్ భారత్ తొలి మ్యాచ్ లో ఓటమి ఖాయం అయ్యింది. ఇప్పటి వరకు పోరాడి ఆడిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (30) సాంట్నెనర్ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి మిడాన్ లో మెక్ కల్లమ్ పట్టిన అద్భుత డైవ్ క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ తరుణంలో ప్రస్తుతం భారత్ 12 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది. కాగా చేతిలో మరో వికెట్ మాత్రమే ఉంది. 

అశ్విన్ స్టంపౌట్

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 73 పరుగుల వద్ద అశ్విన్ (10)  సోది బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. 

జాడేజా ఔట్

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : టీమిండియా బ్యాట్మెన్స్ ఫెవిలీయన్ కు క్యూ కడుతున్నారు. ఆల్ రౌండర్ జడేజా (0) ని సోది కాట్ అండ్ బౌల్డ్ గా ఫెవీలియన్ కు చేర్చాడు. 

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : సాంట్నెర్ టీమిండియాను మరో దెబ్బ తీశాడు. ఆల్ రౌండర్ పాండ్య (1)ను వికెట్ల ముందు దొరికించుకున్నాడు. దీంతో 42 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కాగా పిచ్ స్పిన్ కు అనుకూలిస్తోంది. 

ఫెవీలియన్ కు చేరిన కోహ్లీ

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : విరాట్ కోహ్లీ (20) సోది బౌలింగ్ లో కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. తొలి ఓవర్ తొలిబంతికే సోది కీలక వికెట్ ను తీశాడు. 39 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 

యూవీ కాట్ అండ్ బౌల్డ్

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : కివీస్ స్పిన్నర్ సాంట్నెర్ భారత బ్యాట్మెన్లను ఫెవిలియన్ కు క్యూ కట్టిస్తున్నాడు. యువరాజ్ సింగ్ (4) ను కాట్ అండ్ బౌల్డ్ గా ఔట్ చేశాడు. దీంతో 26 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా సాంట్నెర్ కు ఇది మూడో వికెట్. 

వెనుదిరిగిన రైనా..

టీ-20 వరల్డ్ కప్ అప్డేట్స్ : టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్ ఐదో బంతిని ఆపడానికి ప్రయత్నించిన రైనా (1) గుప్తిల్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి డగౌట్ కు చేరుకున్నాడు. 

శర్మ స్టంపౌట్

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : టీమిండియా ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. 5 పరుగులు చేసిన రోహిత్ సాంట్నెర్ బౌలింగ్ లో ముందుకు వచ్చి బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కాగా బంతి అనూహ్యంగా ఎక్కువ టర్న్ కావడంతో కీపర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో 10 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 

21:28 - March 15, 2016

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. బెంగాల్‌ రాజకీయాల్లో ఊహించని కుదుపు. మమతా సర్కార్‌లో.. ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బెంగాల్‌లో హల్‌చల్‌ చేస్తున్న టీఎంసీ నేతల లంచాల వీడియో ఆ పార్టీని కలవరపెడుతోంది. వెస్ట్‌బెంగాల్‌ లో స్టింగ్‌ ఆపరేషన్‌పై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ.

మమతా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి....

బెంగాల్‌లో ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ మమతా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లు వెల్లడించే ఓ వీడియో పశ్చిమబెంగాల్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీఎంసీ ఎంపీలు సౌగత్‌రాయ్‌, అహ్మద్‌ మిజ్రా, బెంగాల్ మంత్రి సుబ్రతముఖర్జీ , కోల్‌కతా మేయర్‌ శోవన్‌ ఛటర్జీ ఓ లాబీకి హామీలిస్తూ లంచాలు తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్‌.కామ్‌ అనే వెబ్‌ ఛానల్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ను నిర్వహించింది.

2014 లోక్‌సభ ఎన్నికల ముందు మొదలు ....

2014 లోక్‌సభ ఎన్నికల ముందు మొదలు పెట్టిన ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఇంపెక్స్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నట్లు నారదాన్యూస్‌ వెల్లడించింది. కంపెనీకి అనుకూలంగా పనులు చేసి పెట్టాలంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు టీఎంసీ సీనియర్‌ నేతలను కలిసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో అహ్మద్‌ మిజ్రా అనే సీనియర్‌ పోలీసు అధికారి కంపెనీ ప్రతినిధుల నుంచి 5 లక్షల లంచం తీసుకున్నారని నారదాన్యూస్‌ వెల్లడించింది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మద్‌ మిజ్రాను మమతా బెనర్జీ కాపాడినట్లు తెలుస్తోంది. స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోల్లో కేంద్ర మాజీ మంత్రి , మమతకు అత్యంత నమ్మకస్తుడైన ముకుల్‌రాయ్‌ కూడా 20 లక్షల లంచం తీసుకున్నట్లు బయటపడింది. బెంగాల్‌ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి సుబ్రతాముఖర్జీ 5 లక్షల లంచం తీసుకుంటున్న వీడియో వెల్లడి కావడంతో టీఎంసీ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో నారదాన్యూస్‌ దాదాపు దాదాపు 52 గంటల వీడియో రికార్డు చేసింది.

ఏప్రిల్‌ 4 నుంచి ఆరు దఫాలుగాఎన్నికలు....

ఏప్రిల్‌ 4 నుంచి ఆరు దఫాలుగా జరగనున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ వామపక్షాల కూటమి, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో మమతా వెంటనే సీఎం పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాస్తామని బీజేపీ జాతీయ కార్యదదర్శి సిద్ధార్ధ్‌నాథ్‌సింగ్ తెలిపారు.

ఆపరేషన్‌ బయటపడటంతో....

ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ బయటపడటంతో వచ్చే ఎన్నికలు... ఏ మేరకు నిష్పక్ష పాతంగా జరుగుతాయో తేటతెల్లమవుతోందని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. స్టింగ్‌ ఆపరేషన్‌ కలకలంతో బెంగాల్‌ రాజకీయాలు వేడెక్కాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలపై ఈ స్టింగ్ ఆపరేషన్‌ ప్రభావం ఏ మేరకుంటుందో చూడాలి. 

ధావన్ ఎల్బీడబ్ల్యూ

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (1) మెక్ కల్లమ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ కు చేరుకున్నాడు. ఇరు జట్లూ తొలి ఓవర్ లోనే ఓపెనర్ ను కోల్పోయాయి.

21:24 - March 15, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ సాక్షిగా ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించింది. ఏపికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని....

ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని, ఏపీలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక హోదా అని తాము అంటే పదేళ్లు అని వెంకయ్యనాయుడు అన్నారని, దానిని అరుణ్ జైట్లీ కూడా సమర్థించారని పేర్కొంది. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆజాద్‌ స్పష్టం చేశారు.

కేంద్రం పూర్తి స్థాయి నిబద్ధతతో కట్టుబడి ఉంది...

ఏపికి సహాయం చేసేందుకు కేంద్రం పూర్తి స్థాయి నిబద్ధతతో కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆర్థిక లోటును దశలవారిగీ భర్తీ చేస్తున్నామని... రాజధాని, పోలవరం నిర్మాణాలకు నిధులిచ్చామని, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని జైట్లీ ప్రస్తావించలేదు.

ప్రభుత్వాన్ని నిలదీసిన దిగ్విజయ్...

ఏపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ సభ్యులు దిగ్విజయ్‌సింగ్, కేవీపి రామాచంద్రారావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదాపై అరుణ్‌జైట్లీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంపీలు కేవిపి, జెడి శీలం, సుబ్బిరామిరెడ్డి, రేణుకాచౌదరి వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.ప్రత్యేక హోదాపై లోక్‌సభలోను చర్చ జరిగింది. విభజన జరిగి రెండేళ్లయినా ప్రత్యేక హోదాను మర్చిపోయారని కాంగ్రెస్‌ సభ్యులు ఖర్గే కేంద్రాన్ని విమర్శించారు.

ప్రతీ హామీని నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది...

విభజన చట్టంలోని ప్రతీ హామీని నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయడు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, సంస్థల వివరాలను సభకు వివరించారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని టిఆర్‌ఎస్‌ ఎంపి జితేందర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు ఇస్తామని చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటనతో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న అంశం స్పష్టమైంది. 

21:20 - March 15, 2016

ఢిల్లీ :ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర హామీలు అమలు పరిచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన ఏపీ కాంగ్రెస్ నేతలు... సీతారాం ఏచూరిని కలిసి తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. తమ సహకారం ఉంటుందని ఏచూరీ స్పష్టం చేశారు.

 

మూలపల్లి అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్

తిరుపతి : చంద్రగిరి మండలం మూలపల్లి అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ కూబింగ్ లో 30 మంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతిలోని పల్లి వీధిలో దారుణ

తిరుపతి : పల్లి వీధిలో దారుణ జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెప్తున్నారు.

టీమిండియా టార్గెట్ 127

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ టీమిండియాకు 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్ లో 15 పరుగులు రావడంతో ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది.

న్యూజీలాండ్ 126/7 (20)

గుప్తిల్

పరకాలలో విద్యుత్ ఉద్యోగులపై ఎస్పై దాడి

వరంగల్ : పరకాలలో విద్యుత్ ఉద్యోగులపై ఎస్పై దాడి చేశారు. అకారణంగా లైన్ మెన్, అసిస్టెంట్ లైన్ మెన్ ను చితకబాదినందుకు నిరసనగా పరకాలలో విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపివేశారు.

ఏడో వికెట్టూ పడిపోయిందోచ్..

టీ-20 వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్ : నెహ్రా వేసిన బంతిని రాంచి లాంగాన్ వైపు భారీ షాట్ ప్రయత్నించాడు. వన్ బౌన్స్ తో అందుకున్న ధావన్ నేరుగా నాన్ స్ర్టైకర్ ఎండ్ కు విసిరాడు. ఒదుపుగా అందుకున్న నెహ్రా ఎలియట్ క్రీజులోకి రాకముందే క్షణాల్లో వికెట్లను గిరాటేశాడు. 

కరీంనగర్ జిల్లాలో గాలులతో భారీ వర్షం

కరీంనగర్ : జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో మర్చి, మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

20:35 - March 15, 2016

హైదరాబాద్ : బిల్డర్లతో వచ్చే అనేక సమస్యలకు చెక్.. రియాల్టీలో నల్లధనానికి పూర్తిగా బ్రేక్ లు, కస్టమర్లు ఆల్వేస్ సేఫ్ సైడ్, రియాల్టీ బిల్లు చెప్తున్నది ఇదేనా? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న నానా గందరగోళాలు ఈ బిల్లుతో మాయం కానున్నాయా? అస్సలు ఈ రియాల్టీ బిల్లు స్వరూపం ఏమిటి? స్థిరాస్థి అభివృద్ధి నియంత్రణ బిల్లు 2016 ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? నేటి 'వైడాంగిల్' ఈ అంశాలపై విశ్లేషణ చేశారు. మరి పూర్తి సమాచారం కావాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

గ్రేట్ రనౌట్

లైవ్ అప్డేట్స్ : న్యూజీలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అండర్సన్ బౌలర్ ప్రక్క నుండి బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం చేయగా.. లెఫ్ట్ సైడ్ అద్బుతమైన డైవ్ చేసి బంతిని అందుకున్న రైనా వికెట్లను గిరాటేశాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న టెయిలర్ క్రీజు బయట ఉండటంతో థర్డ్ ఎంపైర్ ఔట్ గా ప్రకటించాడు.  

ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బలపర్చుతాం: సీతారం ఏచూరి

ఢిల్లీ :ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బలపర్చుతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలు సీతారం ఏచూరిని కలిసి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. పోలవరానికి సరిగ్గా నిదులు కేటాయించలేదన్నారు. చట్టంలో ప్రత్యేక హోదా లేదని వెంకయ్య చెబుతున్నారని... ఆనాడు సహలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎలా అన్నారు అని ప్రశ్నించారు. రాజధాని భూసేకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారని...వామపక్షాలతో సహా ఇతర పార్టీలు కలిపి పోరాడితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఏచూరి పేర్కొన్నారు.

20:10 - March 15, 2016

హైదరాబాద్ : 12 శాతం రిజర్వేషన్ మీద లేసిన పంచాయతీ, కేసీఆర్ సార్ మీద నమ్మకం కోల్పోతున్న జనం, నాయిని నర్సన్న యిజ్జత్తు మొత్తం తీస్తున్న దొంగలు..శాంతిభద్రతల ముచ్చట చెప్పినెంటనే చైన్ స్నాచింగ్..., పశ్చిమగోదావరి జిల్లాలో పైశాచిక కులబహిష్కరణ... మనుషలల్లో మార్పుకోసం ఇది మల్లొక ఉదాహరణ., బిందెలు పట్టుకుని రోడ్లమీదకొస్తున్న ఆడోళ్లు... కేసీఆర్ సార్ ఎపుడు తెస్తడో తెలంగాణకు నీళ్లు... నీళ్లు దొరకక తెట్టగిళ్ల పడ్డ నాగుపాము.. నీడ పంటుకు పట్టుకొచ్చి నీళ్లు పోసిన జనం, నారా చంద్రాల వారి రాజ్యంలో జీవిడిచిన చిరుత... దాని మీద కూడా రాస్తారు కావొచ్చు పేద్ద చరిత.. ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న చెప్పే ఘరం.. ఘరం ముచ్చట్లు మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

లైవ్ అప్డేట్స్ : రైనా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడటానికి ప్రయత్నించిన కెప్టెన్ విలియమ్సన్ ను ధోని స్టంపౌట్ చేశాడు. 35 పరుగుల వద్ద న్యూజీలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 

రంగారెడ్డి జిల్లా దరూర్ లో దారుణం

రంగారెడ్డి : దరూర్ లో దారుణం జరిగింది. ఓ యువకుడు చింత పండు దొంగలించాడని పంచాయతీ పెట్టి గ్రామస్థులు జరిమానా విధించారు. ఆ అవమానం భరించలేక ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రెండో వికెట్ కోల్పోయిన కివీస్

లైవ్ అప్డేట్స్ :  కివీస్ బ్యాట్స్ మెన్ కోలిన్ మన్రో 7 పరుగులు చేసి నెహ్రా బౌలింగ్ లో హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెను దిరిగాడు. 1.3 ఓవర్లలో 13/2 పరుగులతో న్యూజీలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. 

ఫస్ట్ బాల్ సిక్స్.. సెకండ్ బాల్ ఔట్..

నాగ్ పూర్ : భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో మ్యాచ్ ఫస్ట్ బాల్ ను సిక్సర్ బాదిన గుప్తిల్.. రెండో బంతికి అశ్విన్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 

బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్

నాగ్ పూర్ : టీమిండియాతో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, విలియమ్ సన్ బ్యాటింగ్ ఆరంభించారు. కాగా టీమిండియా కెప్టెన్ ధోని తొలి ఓవర్ ను అశ్విన్ తో ప్రారంభించాడు. 

జాతీయ గీతాలపన

నాగ్ పూర్ : టీమిండియా-కివీస్ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో ఇరు జట్లు తమ తమ జాతీయగీతాలపనలు చేశారు. న్యూజీలాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా వీరిని గౌరవిస్తూ  ప్రేక్షకులందరూ తమ తమ సీట్ల వద్ద నిశ్శబ్దంగా నిల్చున్నారు. భారత జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు మాత్రం గొంతు కలిపారు.  స్టేడియమంతా 'జనగనమన'తో మార్మోగింది.

ముగిసినన టీడీఎల్పీ సమావేశం

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్ లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఇక నుంచి పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని సీఎం చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరు కావాలని, సభలో రెండు రోజులు పార్టీ సమర్థవంతంగా పనిచేసిందని పేర్కొన్నారు.

19:23 - March 15, 2016

హైదరాబాద్ : విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర వేస్తున్న పిల్లిమొగ్గలకు నిరసనగా వామపక్షాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే 15 రోజులు పోరుబాట పట్టిన ఆ పార్టీలు మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాయి. రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు. బస్సు యాత్ర సందర్భంగా ప్రజలు ఎలాంటి సమస్యలు ప్రస్తావించారు.అనంతపురం యూనివర్శిటీపై చెప్ని కబుర్లు ఏమయ్యాయి? ప్రత్యేక రాయలసీమ అనడం దండగమారి వ్యవహారమా? గ్రాడ్యుయేట్లు రాయలసీమలో పళ్లు అమ్ముకుంటున్నారా? నిరుద్యోగ భృతి అన్న చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఇప్పటికే ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటాలు కొనసాగుతున్నాయా? త్వరలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోనూ భారీ ఉద్యమాలు చేపట్టనున్నాయా? సీమ ప్రజలను మోడీ, చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారు. విభజన చట్టంలో ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ సంగతి ఏమైంది? 23 వలే కోట్లు అడిగితే బిచ్చం వేసినట్లు యాభై కోట్లు ఇస్తారా? ఈ అంశాలపై 'టెన్ టివి' హెడెలైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీరాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

వరల్డ్ కప్ లైవ్ అప్డేట్స్.. ఇరు జట్లు ఇవే..

నాగ్ పూర్ : టీ-20 వరర్డ్ కప్ లో భాగంగా భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఫైనల్ ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

భారత్ : రోహిత్, ధావన్, కోహ్లీ, ధోని, రైనా, యువరాజ్, హార్దిక్ పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.

న్యూజీలాండ్ : గుప్తిల్, విలియమ్ సన్, మన్రో, టెయిలర్, అండర్సన్, ఎలియట్, సాంటర్, రోంచి, ఎన్ఎల్ మెక్ కల్లమ్, మిన్లే, సోథి.

బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

నాగ్ పూర్ : టీ-20 వరర్డ్ కప్ లో భాగంగా భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ విలయమ్ సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

18:47 - March 15, 2016

బెంగళూరు: టీ-20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మిథాలీసేన 72 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు మిథాలీ రాజ్(42 ), వెల్లస్వామి వనిత(38)తో తొలి వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత దిగిన మందన డకౌట్ తో నిరుత్సాహ పరిచిన హర్మాన్ ప్రీత్ కౌర్(40), వేద కృష్ణమూర్తి(36 నాటౌట్) నిలకడగా ఆడి టీమ్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బంగ్లా బౌలర్లలో రుమన అహ్మద్, ఫహిమా కౌతన్ రెండేసి వికెట్లు తీయగా నహిదా అక్తర్ ఒక వికెట్ తీసింది. తరువాతి మ్యాచ్ శనివారం ఢిల్లీలో మధ్యాహ్నం 3.30గంటలకు భారత్ క్రీడాకారిణిలు పాకిస్తాన్ తో తలపడనున్నారు. అదే రోజు ధర్మశాలలో సాయంత్రం 7.30 ని.లకు భారత్ పురుషుల జట్టు, పాకిస్తాన్ జట్టుతో ఆడనున్నారు.

నిజాంపేటలో చైన్ స్నాచింగ్....

హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న స్వాతి అనే మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. చోరీపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

కొనసాగుతున్న టీడీఎల్పీ సమావేశం..

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో టిడిపి శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై రేపు అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏపీకి సహకరించిన కేంద్రానికి ధన్యవాద తీర్మానం పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలుగుగంగ కాలువలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

నెల్లూరు : ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు కుమార్, బాలాజీగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లా డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

సమస్యలపై పోరాడుతున్నందుకే సస్పెండ్ : రోజా

హైదరాబాద్ : రెండు నెలలకుగా సస్పెన్షన్ కాపీ ఇవ్వలేదని మండి పడ్డారు. నేను కోర్టుకు రాలేదనడం సరికాదని, ఏడాది పాటు నన్ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. సమస్యలపై పోరాడుతున్నందుకే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముందన్నారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభను పక్కదోవ పట్టించేందకు కులరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

హంద్రీనీవా డీఈఈ ఇంటిపై ఏసీబీ తనిఖీలు

చిత్తూరు : హంద్రీనీవా డీఈఈ మద్దిలేటి ఇంటిపై ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. బెంగళూరులోని మద్దిలేటి ఇల్లు, కుప్పం, మదనపల్లిలోని హంద్రీనీవా కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది.

ఏపీలో తెలంగాణ ఎంసెట్ కేంద్రాలు...

హైదరాబాద్: ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏపీ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మే 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది.

కోదాడలో నకిలీ నోట్ల కలలకం..

నల్లగొండ: కోదాడ బస్టాండ లో నకిలీ నోట్ల కలకం రేగింది. బస్టాండ్ లో నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 3.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

17:34 - March 15, 2016

వరంగల్ : గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ ఎన్నిక పూర్తయింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తకే నగర మేయర్‌ పదవి దక్కింది. గ్రేటర్‌ వరంగల్ నగర మేయర్‌గా నన్నపునేని నరేందర్‌ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మేయర్‌ ఎన్నిక పూర్తికావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో....

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొలువుదీరింది. మేయర్‌గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌గా నరేందర్, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్‌రావుతో పాటు జిల్లా టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

58 డివిజన్లకుగానూ 44 డివిజన్లలో టీఆర్‌ఎస్ విజయబావుట....

గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకుగానూ 44 డివిజన్లలో టీఆర్‌ఎస్ విజయబావుట ఎగురవేసింది. గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నన్నపునేని నరేందర్... తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గుర్తింపు నన్నపునేనికి ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్నపనేనికి అవకాశం వచ్చింది. కానీ, కొండా సురేఖ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో వరంగల్ తూర్పు టికెట్ ఆమెకు దక్కింది. తనకొచ్చిన అవకాశాన్ని... నగరాభివృద్ధికి ఉపయోగిస్తానని నన్నపునేని నరేందర్‌ స్పష్టం చేశారు.

డిప్యూటీ మేయర్ గా ఖాజాసిరాజొద్దీన్...

ఇక డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపికైన ఖాజా సిరాజొద్దీన్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. సిరాజ్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. పార్టీ వరంగల్ నగర, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు.

ఉద్యమ నేతలే మేయర్లుగా...

మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కార్యకర్తే ఈరోజు నగర మేయర్‌గా ఎన్నిక కావడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నన్నపునేని ఆధ్వర్యంలో గ్రేటర్‌ వరంగల్‌ హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

17:31 - March 15, 2016

హైదరాబాద్: ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌గా డాక్టర్‌ పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌గా బత్తుల మురళి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక సమావేశం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ లను... ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అంతకు ముందు నగరపాలక కమిషనరు వేణుగోపాలరెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్లను జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు.

17:29 - March 15, 2016

వరంగల్ : భూపాలపల్లి మండల కేంద్రంలో రాత్రి కురిసిన వడగళ్ల వానకు.. మిర్చి రైతులు భారీగా నష్టపోయారు. కల్లాల్లో ఉన్న మిర్చి.. రాత్రి వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. అటు భారీగాలులకు కాయలు కూడా రాలడంతో.. భారీగా నష్టపోయామని తెలిపారు. చేతికొచ్చిన పంట దెబ్బతిన్నదని... ఈ పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

17:26 - March 15, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి నిజ స్వరూపం ఏంటో బయటపడిందని ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఢిల్లీలో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయబద్ధంగా కేటాయించాల్సినవి కేటాయించకుండా అధికార బిజెపి మోసం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఏపీ కోసం గళం విప్పారని అన్నారు. 

17:25 - March 15, 2016

నెల్లూరు : అత్తింటివారి వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలేనికి చెందిన అశోక్‌, మౌనికకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 70 సవర్ల బంగారం, 20 లక్షల రూపాయల నగదు, 8 లక్షల విలువ చేసే కారు... కట్నం కింద ముట్టజెప్పారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కాగా రెండు ఎకరాల పొలం, 20 లక్షల నగదు అదనపు కట్నంగా తేవాలంటూ అత్తమామలు మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అదే ఊళ్లో నివాసముంటున్నా వారు బాధపడతారని మౌనిక వేధింపుల విషయం తెలియజేయలేదు. కాగా ఈ రోజు తెల్లవారుజామున మౌనికను భర్త అశోక్‌, అత్తమామలు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆపై ఇంట్లోని ఓ గోడౌన్‌లో సజీవ దహనం చేశారు. గోడౌన్‌ లోంచి మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఆరాతీయగా ఘోరం వెలుగులోకి వచ్చింది. భర్త అశోక్‌, అతని తల్లి పరారవగా మామ సుధాకర్‌ను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మౌనిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

17:23 - March 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేలా బడ్జెట్ లేదని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్ ఎంబీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని అన్నారు. డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పథకానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రస్తావించలేదని గుర్తుచేశారు. 

నేరేడ్ మెట్ సీఐ సస్పెండ్

హైదరాబాద్: నగరంలోని నేరేడ్‌మెట్ సీఐ చంద్రబాబు సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. భూతగాదాల్లో ఓ వృద్ధుడిని కిడ్నాప్ చేసిన కేసు విషయంలో సీఐ స్వయంగా ఇన్‌వాల్వ్ అయినందున చర్యలు. కేసుపై మొత్తం విషయం తెలిసిన నిందితుడి గురించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకుండా ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా విషయం మొత్తం వెలుగులోకి రావడంతో సీఐ హస్తం బయటపడింది. దీంతో సీఐను సస్పెండ్ చేస్తూ శాఖపరమైన దర్యాప్తునకు సీపీ ఆదేశాలు జారీచేశారు.

16:58 - March 15, 2016

హైదరాబాద్: దివంగత మాజీసీఎం ఎన్టీఆర్ పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చానని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఏపీ అ సెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం కోడెల మాట్లాడుతూ...నాపై నమ్మకం ఉంచిన సభ్యులకు ధన్యవాదాలు అని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57ఓట్లు, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. 40 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. తనది సామాన్య మధ్యతరగతి కుటుంబం అని... పట్టుదలతో డాక్టర్ వృత్తిని చేపట్టానని తెలిపారు. రాజకీయాలకన్నా.. సమాజ సేవ పెద్దదని తెలిపారు. నాకు చేతనైనంత వరకు సభలో నిష్పక్షపాతం పని చేస్తానని తెలిపారు. నాపై అవిశ్వాసం పెట్టినప్పటికీ నా ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన వైసీపీకి నా కృతజ్ఞతలు అని తెలిపారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం బాధించిందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. స్పీకర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనపై ప్రతిపక్షం అవిశ్వాసం ప్రవేశపెట్టగానే... సభ విశ్వాసం పొందాకే తిరిగి స్పీకర్‌ స్థానంలో కూర్చోవాలని నిశ్చయించుకున్నానన్నారు. అందుకే ఈరోజే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టినట్లు చెప్పారు. రాజకీయాల్లోకి తాను కావాలని రాలేదని... ఎన్టీఆర్‌ పిలుపుతోనే వచ్చినట్లు చెప్పారు. రాజకీయాల కంటే తాను సామాజిక సేవకే ప్రాధాన్యత ఇస్తానన్నారు.

16:56 - March 15, 2016

హైదరాబాద్ : స్పీకర్ ఛైర్ కు హుందాతనాన్ని తీసుకురావాలని.... అన్ని విధాలా సహకరింస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెలపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అవిశ్వాసం పై కొంత బాధగా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఇదో ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా, డాక్టర్ గా కోడెల ప్రజాదరణ పొందారని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్మశానవాటికలు కట్టాలనే నిర్ణయం, మహిళల కోసం మీరు నిర్మిస్తున్న మరుగుదొడ్లు నిర్మించడం చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. బసవతారంక ఆస్పత్రిలో నిస్వార్థ సేవలు అందించారని గుర్తు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్నంత వరకు ధర్మాన్ని, న్యాయాన్ని కాపటానికి నిర్మోహమాటంగా పనిచేయాలని సూచించారు. ఈ రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకోవద్దని సూచించారు.


 

16:55 - March 15, 2016

హీరోయిన్ త్రిష సంచలన ట్వీట్ చేసింది. అదీ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేపై.. సదరు ఎమ్మెల్యే ఓ మూగజీవాన్ని విచక్షణా రహితంగా బాదడంతో చలించిపోయిన త్రిష వెంటనే ట్విట్టర్ కు పని చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరఖాండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ పోలీసు గుర్రాన్ని విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆ గుర్రం ఎడమకాలు ఎముక విరిగిపోయింది. గుర్రాన్ని స్థానిక మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ గుర్రం ఎడమ కాలి ఎముక విరిగిందని నిర్ధారించాడు.'
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ లో ఈ ఘటనను చూసి చలించిపోయిన హీరోయిన్ త్రిష వెంటనే తన ట్విట్టర్ లో ఆ వార్త లింక్ పెడుతూ ''నీకు (ఎమ్మెల్యేకు) నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నాను, ఇది సిగ్గుచేటు అయిన చర్య'' అంటూ ట్వీట్ చేసింది.
కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మూగజీవం అని చూడకుండా విచక్షణా రహితంగా కొట్టడానికి ఆ ప్రజా ప్రతినిధికి చేతులెలా వచ్చాయంటూ పలువురు సోషల్ మీడిచయాలో విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ పై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ, అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

16:29 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీఅ సెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57ఓట్లు, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. 40 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై సభలో దాదాపు రెండున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసిపీ అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరిగింది. టీడీపీలోకి వెళ్లిన 8 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు అయ్యారు. ఇప్పటి వరకు అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.  

వీగిపోయిన స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ : ఏపీఅ సెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసిపీ అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరిగింది. టీడీపీలోకి వెళ్లిన 8 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు అయ్యారు. ఇప్పటి వరకు అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేటి ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు సాయంత్రం ముగిసే వరకూ అదే పరంపరను కొనసాగించాయి. సెన్సెక్స్‌ 253 పాయింట్ల నష్టంతో 24,551 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 7,460 వద్ద ముగిసింది. 

16:20 - March 15, 2016

న్యూఢిల్లీ : వైసిపి ఎమ్మెల్యే రోజాకు సుప్రీంలో ఊరట లభించింది. రోజా సస్పెన్షన్‌ పిటిషన్‌పై రేపు(బుధవారం) విచారణ జరపాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా చీఫ్ జస్టిస్ ఎదుట విచారణకు వచ్చేలా చూడాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు సూచించింది. రోజా మొదట దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదన్నహైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై జడ్జి గోపాలగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీలోకి వెళ్లిన 8 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసిపీ అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ కొనసాగుతుంది. టీడీపీలోకి వెళ్లిన 8 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు అయ్యారు. ఇప్పటి వరకు అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.

 

స్పీకర్ అవిశ్వాస తీర్మానం పై ప్రారంభమైన ఓటింగ్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసిపీ అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.

టిడిపి కార్యకర్తగా స్పీకర్ : జగన్

హైదరాబాద్ : టిడిపి కార్యకర్తగా స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను నడుపుతున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మా హక్కులను కాలరాస్తున్నారని మండి పడ్డారు. విప్ జారీ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. రూల్స్ అతిక్రమిస్తూ రోజాను సస్పెండ్ చేశారని, అవిశ్వాసం పెట్టినపుడు ఓటింగ్ ఎందుకు పెట్టరని జగన్ ప్రశ్నించారు.

సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే రోజాకు ఊరట

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఊరట లభించింది. రోజా పిటిషన్ ను రేపు ఉదయం విచారించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది.

మదర్ థెరిస్సాకు సెయింట్ హోదా

హైదరాబాద్: మదర్‌థెరిస్సాకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 4వ తేదీన సెయింట్ హోదా ఇవ్వనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం కార్డినల్స్, వాటికన్ చర్చి అధికారులతో సమావేశమై సెయింట్ హోదాపై అధికారిక ప్రకటన చేశారు. పేదల సేవకు తన జీవితాన్ని అంకితం చేసి మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను మదర్ థెరిస్సా స్థాపించారు. 

ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్నాయత్నం....

కర్నూలు : ఆస్పరి మండలం రాచర్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల కారణం ఇద్దరు కుమారులతో సహా పురుగుల మందు తాగి తల్లి ఆత్మహత్యఆయత్నం, తల్లీ ఒక కుమారుడు మృతి, మరొక కుమారుడి పరిస్థితి విషయం. ఆస్పత్రికి తరలించిన స్థానికులు.

ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి

కర్నూలు : అస్పిరి మండలం రాచర్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకులతో సహా తల్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా...మరో కొడుకు పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

15:20 - March 15, 2016

హైదరాబాద్ : ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కోడెలను కావాలనే అప్రదిష్టపాలు చేస్తున్నారని మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసీపీ పెట్టిన అవిశ్వాసతీర్మానం పై చర్చ జరుగుతుందోంది. ఈ చర్చలో ప్రతిపాటి మాట్లాడుతూ... సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిపై అనుచిత నినాదాలు చేశారని మండి పడ్డారు. నిజాయితీ పరుడైన వ్యక్తిపై అవిశ్వాసం వెనక్కి తీసుకోవాలని, కావాలనే స్పీకర్ పై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణా అమర వీరులు, ప్రభుత్వం ఆర్థిక సహాయం ...

హైదరాబాద్ : వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 29 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందజేత. రూ.2.90 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.మహబూబ్ నగర్-1, వరంగల్-21, నిజామాబాద్-7 కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

చలో అసెంబ్లీ, వామపక్ష నేతల అరెస్టు, విడుదల...

హైదరాబాద్ : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, రామకృష్ణ. నేడు వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు అయిన వామపక్ష నేతలు.

స్పీకర్ స్థానంలో ఎవరు ఉన్నా గౌరవించాలి:గౌతు

హైదరాబాద్ : శాసనసభలో స్పీకర్‌ స్థానం ఎంతో ఉన్నతమైనదని..ఆ స్థానంలో ఎవరు ఉన్నా గౌరవించాలని తెదేపా ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ అన్నారు. గతంలో స్పీకర్‌ హోదాలో ఉన్నవారిపై సభ్యులు ఎంతో మర్యాదగా నడుచుకునేవారని... ప్రస్తుతం ఆ సంప్రదాయం కనుమరుగవుతోందన్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులను స్పీకర్‌ కోడెల సమానంగా చూస్తున్నారని... ఆయనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. సభలో తాము చెప్పినట్లు చేయడం లేదని స్పీకర్‌ అవిశ్వాసం పెట్టడం ప్రతిపక్షానికి తగదన్నారు.

రీసైక్లింగ్ గోడౌన్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: శంషాబాద్ మండలం సాతంరాయ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత డ్రమ్ముల రీ సైక్లింగ్ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వం ఏం చెబితే అది స్పీకర్ చదువుతున్నారు : రాచమల్లు

హైదరాబాద్ : స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడం మా సంస్కారం అని..... సభా నాయకుడికి పక్షపాత ధోరణి ఉండకూదని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. స్పీకర్ పై వైసీపీ పెట్టి అవిశ్వాస తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ... ప్రతిపక్ష నాయకుకుడికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాదివ్వలేదన్నారు. ప్రతిపోం పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడారని... సభలో లేకున్నా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు. స్పీకర్ ప్రభుత్వం ఏం చెబితే అది చదువుతున్నారు

రూల్స్ కూడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేత : బండారు సత్యనారాయణ

హైదరాబాద్ : రూల్స్ కూడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మా దురదృష్టకరంగా భావిస్తున్నామని టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పై జరుగుతున్న చర్చలో బండారు మాట్లాడారు. సభాపతికి కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష నేత కనీసం చట్టాలు తెలుసుకోవాలన్నారు. 

14:40 - March 15, 2016

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేటాయించిన బడ్జెట్ మొత్తం రూ.1.48 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా రూ.707 కోట్లు. ఇందులో బాలికా విద్యాకు ప్రాధాన్యం ఎంత?, మహిళల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? డయాలసిస్ కేంద్రాల కన్నా ప్రసూతి కేంద్రాల అవసరం లేదా?, ఉద్యోగినులకు ఎలాంటి ప్రత్యేక పథకాలు ఉన్నాయి? మహిళల భద్రతకు కేటాయింపులు ఎక్కడ?, మహిళల ఉపాధికి భద్రత ఎక్కడ? ఇత్యాది అంశాలపై మానవి 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మి, ఐద్వా నేత హైమావతి పాల్గొన్నారు.

జగన్ పై అవిశ్వాసం పెట్టాలి: అచ్చెన్నాయుడు

హైదరాబాద్ :ప్రతిపక్ష నేత జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాసం పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పై అవిశ్వాసం పెడితే సభకు పట్టిన దరిద్రవం వదులుతుందని తెలిపారు.

14:25 - March 15, 2016

హైదరాబాద్ : స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఅ న్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల పై ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ మొదలైంది. ఈ చర్చ లో మొదటగా వైసీపీఎ మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైసీపీ ఆరోపించారు. అసెంబ్లీలో పరిణామాలు బాధ కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అసెంబ్లీ ప్రసారాలు ఎడిట్ చేయకుండా ప్రసారాలు చేయాలని.. అపుడే వాస్తవాలేంటో ప్రజలే నిర్ణయిస్తారు అని కోటం రెడ్డి అన్నారు. అధికార పక్షానికి స్పీకర్ కొమ్ముకాస్తున్నారని దానిపైనే స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమ సభ్యురాలు రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్‌ చేశారని అందుకే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టినట్లు చెప్పారు. అధికార పార్టీ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించినా స్పీకర్‌కు వారి తప్పులు కనిపించడం లేదన్నారు. సభకు తండ్రి స్థానంలో వ్యవహరించాల్సిన సభాపతి... ప్రతిపక్ష సభ్యులు ఏం మాట్లాడినా తప్పు అనేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 గంటల సమయం కేటాయించారు. టిడిపికి గంట, వైసీపీకి 40 నిమిషాలు, బిజెపి, ఇతరులకు 20 నిమిషాలు కేటాయించారు.

నోటీసులిచ్చాక ఎపుడైనా చర్చకు సిద్ధంగా ఉండాలి: యనమల

హైదరాబాద్ : నోటీసుపై ఈ రోజు చర్చ ఎందుకు వద్దంటున్నారని యనమల ప్రశ్నించారు. నోటీసులిచ్చాక ఎపుడైనా చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. నోటీసుఇవ్వటం, పారిపోవటం ప్రతిపక్ష నేతకు అలవాటైందన్నారు. స్పీకర్ పై పదే పదే ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఎమ్మెల్యేలను రక్షించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. మిమ్మల్ని మీ ఎమ్మెల్యే నమ్మడం లేదని యనమల ఎద్దేవా చేశారు.

నోటీసులు ఇచ్చిన రోజే చర్చ ఎందుకు :జగన్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ పై పెట్టిన వైసీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. అవిశ్వాసంపై నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాతే చర్చించాలని నిబంధన ఉందని జగన్ తెలిపారు. అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన రోజే చర్చ చేపట్టడంలో ఆంతర్యమేంటి అని జగన్ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ మండి పడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మా పార్టీ బీఫామ్ లపై గెలిచి వారిని ప్రలోభపెట్టారని జగన్ ఆరోపించారు.

ఎంపీ ఓవైసీ నోట, 'జైహింద్' మాట, హైకోర్టు పిటీషన్,

హైదరాబాద్ : తన పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’’ అన్న పదం తన నోట వినపడదని సంచలన వ్యాఖ్య చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోట 'జైహింద్' అనే మాట వినిపించింది. గతవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓవైసీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ను ఉద్ధేశిస్తూ 'భారత్ మాతాకీ జై' అనే మాటను నేను ఎన్నటికీ ఉచ్చరించను అన్నారు. దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను రసిస్తూ అలహాబాదు హైకోర్టులో ఐపీసీ సెక్షన్ 124ఏ కింద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కౌన్సిల్ నిర్వహించిన పనులనే చూపించారని మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆరోపించారు. ప్రతి కార్పొరేటర్ కు రూ. 5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

చర్చ ఎందుకు వద్దంటున్నారు - యనమల..

హైదరాబాద్ : నోటీసుపై ఈ రోజే చర్చ ఎందుకు వద్దంటున్నారని, తనపై అవిశ్వాసం పెండింగ్ లో ఉండగా స్పీకర్ సభను ఎలా నడుపుతారని మంత్రి యనమల ప్రశ్నించారు. స్పీకర్ పై వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చ జరగనుంది. 

13:41 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు అందచేసిన వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఏపీ శాసనసభలో తమకు న్యాయం జరగలేదని సోమవారం ప్రతిపక్ష నేత జగన్‌ పేర్కొన్నారు. అందుకనే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు వైసీపీ పేర్కొంది. అందులో భాగంగా మంగళవారం ఉదయం 27 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో శాసనసభా కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. దీనిపై 14 రోజుల తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా స్పీకర్ కు ఉన్న విచక్షణాధికారాల ప్రకారం నేడు చర్చకు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తనపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం..అందుకు 14 రోజుల పాటు స్పీకర్ ఛైర్ లో కూర్చొవడం భావ్యం కాదని కోడెల భావించినట్లు సమాచారం. 50 మంది మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతినివ్వనున్నారు. 50 మంది తక్కువగా ఉంటే తీర్మానం వీగిపోనుంది. దీనితో వైసీపీ వెంటనే పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. కానీ ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. నోటీసుకు 53 మంది వైసీపీ సభ్యులు లేచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో సభలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. 

13:37 - March 15, 2016

హైదరాబాద్ : రాయలసీమ సమస్యలు పరిష్కరించాలి..ప్రాజెక్టులు నిర్మించాలని..గత కొన్ని రోజులుగా వామపక్షాలు కోరుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు భారీగా నగరానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా పలువురు ఇందిరాపార్కు వరకు చేరుకున్నారు. అనంతరం బహిరంగసభ ఏర్పాటు చేసిన అనంతరం ప్రదర్శనగా అసెంబ్లీకి బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాయలసీమ సమస్యలు ప్రభుత్వానికి తెలియచేసేందుకు తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని నేతలు పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం కనికరించలేదు. ప్రదర్శనను అడ్డుకున్నారు. బలవంతంగా వారిని వ్యాన్ లలో ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని వామపక్ష నేతలు తీవ్రంగా నిరసించారు. రాయలసీమ సమస్యలు పరిష్కరించాలని..కరవు ప్రారదోలే విధంగా చేయాలని..ప్రాజెక్టులు కట్టాలని కోరితే పోలీసులు తమను బలవంతంగా అరెస్టు చేయడం కరెక్టు కాదన్నారు. కేవలం రాజధాని అమరావతి చుట్టే అభివృద్ధి చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెల్లుబికే ప్రమాదం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో 168 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..సీఎం చంద్రబాబుకు పరామర్శించే టైం లేదా అని ప్రశ్నించారు. 

13:32 - March 15, 2016

ఢిల్లీ : ఓ వైపు రాజ్యసభలో ప్రత్యేక హోదా..మరోవైపు విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో నిలదీశారు. దీనితో ఒకే రోజు ఏపీ, తెలంగాణ అంశాలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రత్యేక హోదా అంశంపై లోక్ సభలో సింధియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు. లోక్ సభలో టీఆర్ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఎదురు దాడి చేశారు. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేర్కొన్న హామీలను సభకు చదివి వినిపించారు. విభజన చట్టంలో ప్రకటించిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపుతోందని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒకే దృష్టితో చూడాలని కేంద్రానికి సూచించారు. 

13:19 - March 15, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విషయ విభజన చట్టంలో లేదని..ఇది హామీ మాత్రమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తాడోపేడో తేల్చుకొనేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ కు నోటీసులు ఇచ్చింది. లోక్ సభలో సింధియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీకి పలు ప్రాజెక్టులు మంజూరు చేశామని సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా తెలంగాణలోని ముంపు గ్రామాలను ఏపీలో చేర్చామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై తాను పదేళ్లు ఇవ్వాలని కోరడం జరిగిందని..ఇది గుర్తు ఉందని సభకు చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని రాజ్యసభలో తాను ప్రస్తావించడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ చట్టంలో పెట్టడం మరిచిపోయారని కానీ ఆ బాధ్యత తమకు గుర్తు ఉందన్నారు. 

13:15 - March 15, 2016

పశ్చిమగోదావరి : ఉపాధ్యాయుడు అంటే నలుగురికి జ్ఞానాన్ని పంచేవారు. గ్రామానికి దివిటీలాంటి వాడు. కానీ..పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ టీచర్‌..గ్రామంలో ఓ అనాగరిక చర్యకు కారకుడయ్యాడు. నాలుగు కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించడంలో తనదైన పాత్రను పోషించాడు. తమ గ్రామ బహిష్కరణకు..సదరు ఉపాధ్యాయుడే కారకుడంటూ..బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన..సమాజాన్ని విస్మయపరుస్తోంది. నిరక్షరాస్య సమాజాన్ని తన అక్షర జ్ఞానంతో చైతన్యపర్చాల్సిన ఉపాధ్యాయుడే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు. తన కులానికి చెందిన గ్రామపెద్దల్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా శాసనాలు చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వంకతళ్లచెరువు గ్రామానికి చెందిన కేతా వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. కుట్రలు, కుతంత్రాలతో పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. గ్రామంలో తను చెప్పిందే వేదం అన్నట్లుగా కులపెద్దల చేత ఇష్టమెచ్చినట్లుగా తీర్పులిప్పిస్తూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.

గ్రామ బహిష్కరణ..
ఆచంట మండలం వంకతళ్ళచెరువు అనే గ్రామానికి చెందిన వారిని ఇటీవలే ఈ గ్రామపెద్దలు వెలివేశారు. ఫలితంగా పసిపిల్లలకు పాలు కావాలన్నా..ఇంట్లోకి కిరణాసామాను తెచ్చుకోవాలన్నా వీరికి అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు ఈ నాలుగు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా ఇతరులెవరూ వెళ్లడానికి వీల్లేకుండా గ్రామ బహిష్కారం విధించారు. గ్రామ బహిష్కరణ తీర్పు ఇచ్చింది కులపెద్దలే అయినా..వారి వెనకాల మాత్రం ఉపాధ్యాయుడు కేతే వెంకటేశ్వరావు పాత్ర ఉందని గ్రామ బహిష్కరణకు గురైన బాధితులు చెప్తున్నారు. కుల సంఘం పెద్దలు విధించిన జరిమానా చెల్లించకపోవడంతో, ఎన్నో తరాలుగా వస్తున్న భూములను సంఘానికి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని..అయితే దానికి అంగీకరించకపోవడమే వెలికి ప్రధాన కారణం అని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. మారు మూల పల్లెల్లో నేటికీ ఇలాంటి అసాంఘిక చర్యలు కొనసాగుతుండడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఇలాంటి అకృత్యాలకు గురుస్థానంలో ఉన్న వ్యక్తే కారణం కావడం విచారకరం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా గ్రామంలోని పరిస్థితిని చక్కదిద్ది, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:12 - March 15, 2016

ఢిల్లీ : విభజన సమయంలో ఏపీకి అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు టీడీపీ సభ్యుడు సీఎం రమేష్. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందని విమర్శించారు.

13:09 - March 15, 2016

ఢిల్లీ : విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హమీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు సాయంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాలు అడిగిన ప్రశ్నలకు అరుణ్‌జైట్లీ సమాధానం చెప్పారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు అందిస్తామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని, రెవెన్యూ లోటుకు సంబంధించి ప్రతిపైసా చెల్లిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. 

13:02 - March 15, 2016

ఢిల్లీ : రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం కోరుతూ.. కాంగ్రెస్ సభ్యులు.. వెల్‌ లోకి దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్‌... కాంగ్రెస్ సభ్యులను ఆందోళన విరమించాలని... పదేపదే విజ్ఞప్తి చేశారు.

 

12:52 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీ కామ్రేడ్లు నగరంలో కదం తొక్కారు. రాయలసీమ సమస్యల పరిష్కారం, విభజన హామీలు నెరవేర్చాలంటూ 10 వామపక్ష పార్టీలు 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చాయి. ఇందిరాపార్క్‌ దగ్గరకు చేరుకున్న కామ్రేడ్లు అక్కడ ధర్నా అనంతరం చలో అసెంబ్లీ బయల్దేరారు. అప్పటికే మోహరించిన పోలీసులు లెఫ్ట్ నేతలను, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపైనే బైఠాయించిన నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. 

బంగ్లాదేశ్, పార్లమెంట్ ఎన్నికలు..హితిన్ విజయం...

ఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా, తనకు అత్యంత నమ్మకస్తుడు, తన మాజీ డ్రైవర్ అయిన యు హితిన్ క్యాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు ఉదయం బంగ్లాదేశ్ పార్లమెంటు ఉభయసభల్లో జరిగిన ఎన్నికలలో మొత్తం 652 ఓట్లు పోలవగా, అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీని హితిన్ క్యా దక్కించుకున్నారు. మొత్తం 360 ఓట్లను ఆయనకు లభించాయి. ఇటీవలి ఎన్నికల్లో సూకీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిన.

పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు : జైట్లీ....

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించామని కేంద్రమంతి అరుణ్ జైట్లీ తెలిపారు. విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తామని, ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించిన ప్రతీ పైసా చెల్లిస్తామన్నారు.

ఏపీకి సంబంధించిన విషయం కాదు - కేవీపీ..

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, సభా గౌరవానికి సంబంధించిన అంశమని రాజ్యసభ సభ్యుడు కేవీపీ పేర్కొన్నారు. హామీల అమలు కావాలంటే చట్ట సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. 

విభజన అనంతరం ఏపీకి నష్టం - ఆజాద్..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత ఏపీకి నష్టం వాటిల్లిందని రాజ్యసభ సభ్యుడు ఆజాద్ తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ఏపీ ఏర్పడిందని, 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సభకు గుర్తు చేశారు. 5 సంవత్సరాలు ఇవ్వాలని..వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని..పోలవరం ముంపు మండలాల ప్రజలకు పరిహారం ఇవ్వాలని..తదితర నిర్ణయాలను ఆనాటి ప్రధాని మన్మోహన్ పేర్కొనడం జరిగిందన్నారు.

ఖమ్మం నగర పాలక మేయర్ గా పాపాలాల్..

ఖమ్మం : గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటి మేయర్ గా బత్తుల మురళీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళశారం ప్రత్యేక సమావేశం జరిగింది. అంతకుముందు నగర పాలక కమిషనర్ వేణుగోపాల రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. 

11:46 - March 15, 2016

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు సంవత్సరాల తరువాత రాజ్యసభలో మళ్లీ ఈ అంశంపై కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశంపై తాడోపేడో తేల్చుకొనేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ కు నోటీసులు ఇచ్చింది. లోక్ సభలో సింధియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు. జేడీయూ, ఎన్ సీపి, సీపీఐ మద్దతు కోరింది. ఈ సందర్భంగా సభ్యులకు మాట్లాడేందుకు డిప్యూటి స్పీకర్ కొద్ది సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత ఏపీకి నష్టం వాటిల్లిందని ఆజాద్ తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ఏపీ ఏర్పడిందని, 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సభకు గుర్తు చేశారు. 5 సంవత్సరాలు ఇవ్వాలని..వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని..పోలవరం ముంపు మండలాల ప్రజలకు పరిహారం ఇవ్వాలని..తదితర నిర్ణయాలను ఆనాటి ప్రధాని మన్మోహన్ పేర్కొనడం జరిగిందన్నారు. దీనికి ప్రతిపక్ష నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు. పది సంవత్సరాలు కావాలని కోరినట్లు తెలిపారు. తాను మాట్లాడుతున్నది ఆఫ్ రికార్డ్..ఆన్ రికార్డా ? అని ప్రశ్నించారు. దీనికి ఆన్ రికార్డ్ అని డిప్యూటి స్పీకర్ పేర్కొన్నారు. మరి తాను మాట్లాడుతున్నప్పుడు తన మైక్ ఎందుకు కట్ అయ్యిందని ప్రశ్నించారు. విభజన హామీ చట్టంలోని హామీలు అమలు చేయాలని ఆజాద్ డిమాండ్ చేశారు.

కేబినెట్ సమావేశం నిర్ణయం - దిగ్విజయ్..
ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఐదు సంవత్సరాలు అని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే కాదు..కాదు..పది సంవత్సరాలు ఇవ్వాలని ఆనాడు వెంకయ్య నాయుడు మాట్లాడడం జరిగిందని తెలిపారు.

ఏపీకి సంబంధించిన విషయం కాదు - కేవీపీ..
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, సభా గౌరవానికి సంబంధించిన అంశమని కేవీపీ పేర్కొన్నారు. హామీల అమలు కావాలంటే చట్ట సవరణ లు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. 

11:34 - March 15, 2016

విజయవాడ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ మెడికో కుటుంబసభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించాలని పలువురు కోరుతున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉస్మానియా వైద్య విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద ధనుంజయ్ ట్రావెల్స్ బస్సు చెట్టుకు ఢీకొంది. ఘటనలో గాయపడైన వారు ఆంధా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో వైద్యుడు మాట్లాడారు. నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం బాధాకరమని, 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 8 మంది ఐసీయూలో ఉన్నారని, ఇద్దరు మాత్రం సీరియస్ గా ఉన్నారని పేర్కొన్నారు. వారు రాజేష్, సుజీత్ లని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం అభినందనీయమని, మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు.

ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న ఆజాద్..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి ఆజాద్ రాజ్యసభలో మాట్లాడుతున్నారు. లోక్ సభలో సింధియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు.

11:15 - March 15, 2016

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి సంవత్సరాలు గడుస్తోంది. ఈ అంశాన్ని తాడోపేడో తేల్చుకొనేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ కు నోటీసులు ఇచ్చింది. లోక్ సభలో సింధియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు. జేడీయూ, ఎన్ సీపి, సీపీఐ మద్దతు కోరింది. ప్రత్యేక హోదాపై చర్చించకపోతే వాకౌట్ చేయాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు..నెరవేరుసాతమని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కదలాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి పలువురు పార్టీ నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. 

10:59 - March 15, 2016

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కొబ్బరి బోండాంలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉంటాయి. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్‌ పెడతాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న కొబ్బరి బోండాంను వేసవిలో తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కొబ్బరి నీళ్లలో దాగివున్న బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చూద్దాం...
వేసవిలో ప్రతిరోజూ కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల తర్వాత మర్దన చేయాలి. తద్వారా సూర్యరశ్మితో నల్లగా మారిన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. వేసవిలో చెమటతో పాటు చర్మంపై పేరుకుపోయే మురికి వల్ల మొటిమలు ఏర్పడుతుంటాయి. దీనినుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది.

10:58 - March 15, 2016

ఈ యేడాది వేసవి త్వరగా వచ్చేసింది. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. వేసవి తనతో పాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల్లా ఆస్వాదించొచ్చు. వేసవి చిట్కాలు: ఆహార పదార్ధాలల్లో నూనె కొంచెం తగ్గించి వాడాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు, ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి. కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్‌ ఎ, డిలు ఎక్కువగా శరీరానికి అందుతాయి. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి. కాఫీ, టీలకు వీలైనంత దూరంగా ఉండాలి. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళు తెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీయకుండా, చల్లదనాన్ని ఇస్తుంది. సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో ఎండలోకి వెళ్ళి ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్‌ గేమ్స్ ఆడించాలి. పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ రసం, ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి పిల్లలు, పెద్దలు తాగితే ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో కూరగాయలతో జ్యూస్‌లు చేసుకుని తాగాలి. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్‌ నీళ్ళు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్ళు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్ళలో చిటికెడు ఉప్పు, ఓ స్ఫూన్‌ పంచదారం కలిపి ఒ.ఆర్‌.ఎస్‌ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది. తాటి ముంజలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్‌ గ్లాస్‌, టోపీ వంటివి ధరించండి. వయసు 50 దాటిన వారు తమ ప్రయాణాలలో తప్పక ఓఆర్‌ఎస్‌ పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే మాత్రం, ఎండలో ఎక్కువగా తిరగకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండ సమస్యలున్నవారు ఎండలో ఎక్కువగా తిరగడం వలన త్వరగా డీ-హైడ్రేషన్‌కు గురయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి. వేసవి కాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించకండి. వదులుగా, కాటన్‌తో తయారు చేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్‌ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లేటపుడు మీతో వాటర్‌ బీటిల్‌ తీసుకెళ్ళడం మరవకండి. 

ఏబీవీపీ నేత శర్మకు షాకాజ్ నోటీసు..

ఢిల్లీ : ఏబీవీపీ నేత సౌరవ్ శర్మకు జేఎన్ యూ చీఫ్ ప్రొటక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన ఘటనపై ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిటీ ఎదుట హాజరై వివరణనివ్వాల్సిందిగా నోటీసులో సూచించినట్లు తెలుస్తోంది. 

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ కమిటీ హాల్ లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

మధుప్రియ తండ్రి అరెస్టు..

హైదరాబాద్ : గాయని మధుప్రియ తండ్రిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ అనే యువకుడిపై దాడి కేసులో అరెస్టు చేశారు. మల్లేశ్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మధుప్రియ భర్త శ్రీకాంత్ అనుకుని నయీమ్ పై మధుప్రియ తండ్రి, బంధువులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

కార్పొరేటర్లతో కడియం భేటీ..

వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భేటీ అయ్యారు. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికపై చర్చిస్తున్నారు. 

కార్పొరేటర్ ఆందోళన..

ఖమ్మం : టీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఒకటో డివిజన్ కార్పొరేటర్ రామూర్తి నాయక్ ఆందోళన నిర్వహించాడు. మేయర్ పదవి తనకే ఇవ్వాలని రామ్మూర్తి డిమాండ్ చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

కుప్పం బ్రాంచ్ కెనాల్ టెండర్లలో భారీ అవినీతి - వైసీపీ..

హైదరాబాద్ : కుప్పం బ్రాంచ్ కెనాల్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచుతున్నారని తెలిపారు. 

10:28 - March 15, 2016

హైదరాబాద్ : రాయలసీమ అభివృద్ధి కోసం వామపక్షాలు నడుం బిగించాయి. గత కొన్ని రోజులుగా వామపక్ష పార్టీలు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బస్సు యాత్రను ముగించుకున్న పది వామపక్ష పార్టీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు 'చలో హైదరాబాద్' కు పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనేందుకు రాయలసీమ జిల్లాల నుండి వస్తున్న వామపక్ష నేతలు, ప్రజ సంఘాలు..ఇతరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. పోలీసుల నిర్భంద కాండ నుండి ఎలాగలాగో బయటపడి హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నారు. రాయసీమ సమస్యలు తీర్చాలని, విభజన హామీలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ధర్నా చౌక్ వద్ద టెన్ టివితో వామపక్ష నేతలు మాట్లాడారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, యూనివర్సిటీలు, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు.. తదితర హామీలు గుప్పించారని తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని..ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీరందిస్తామని ఎన్నో సందర్భాల్లో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. రాయలసీమలోని తదితర ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని సంవత్సరాలైనా కూడా రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి కావని ఈసారి బడ్జెట్ ను చూస్తే తెలుస్తుందన్నారు. అందుకనే తాము పోరాటం చేస్తున్నామని అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. 

10:20 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు పెంచుతోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఏపీ శాసనసభలో సింగిల్ సప్లిమెంటరీ కింద రాయలసీమ ప్రాజెక్టుల అంశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లేవనెట్టారు. రాయలసీమ ప్రాంతానికి ఒక వరంలాంటిదని, గతంలో ఎన్టీరామారావు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. నిధులు కేటాయిస్తే ఆనాటి సీఎం వైఎస్ పరుగులు తీయించారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ రెండు సంవత్సరాల్లో నిధులు కొద్దిగానే కేటాయించారని, అంచనాలు విపరీతంగా పెంచారని విమర్శించారు. నీళ్లు వస్తాయంటే తాము అంగీకరించడమే కాకుండా సహకరిస్తామని, అభివృద్ధికి ఆటంకులు అనే విమర్శలు మానాలని సూచించారు. ప్లానింగ్ కమిషన్ ఒక లెటర్ పంపించినా సీడబ్ల్యూసీ కి ఒక కాపీ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్లపై వత్తిడి తెస్తే పని చేయించే అవకాశం ఉంటుందన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతుండడంపై స్పీకర్ కోడెల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగిల్ సప్లిమెంటరీ కనుక షార్ట్ లో ప్రశ్నలు అడగాలని, దీనిపై చర్చించాలని అనుకుంటే ఇతర మార్గాంలో రావాలని స్పీకర్ కోడెల సూచించారు. 

వైసీపీ వాకౌట్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైసీపీ వాకౌట్ చేసింది. 

09:59 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శాసనసభా సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సాంఘీక సంక్షేమ శాఖకు కేటాయించి నిధులు ఎంత ? ఖర్చు చేసిందెంత అనే దానిపై వైసీపీ ప్రశ్న లేవనెత్తింది. దీనిపై మంత్రి రావెల కిశోర్ బాబు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్ష నేత జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఎలాంటి కోతలు పెట్టారో నిన్న చేసిన ప్రసంగంలో తాను పేర్కొనడం జరిగిందన్నారు. 2014-15 సంవత్సరానికి సాంఘీక సంక్షేహానికి రూ. 2,673 కోట్లు మొత్తాన్ని కేటాయించడం జరిగితే కేవలం రూ. 1,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని..అలాగే 2015-16 సంవత్సరానికి సాంఘీక సంక్షేమానికి రూ. 2,124 కేటాయింపులు జరిపితే కేవలం రూ. 1,090 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటిలో ఉందన్నారు. అంటే రూ. 1,100 కోట్లు పంగనామాలు పెట్టారని జగన్ విమర్శించారు. 

09:25 - March 15, 2016

విజయవాడ : ఆంధ్రా ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది. గొల్లపూడి వద్ద ధనుంజయ ట్రావెల్స్ కు చెందిన బస్సు చెట్టుకు ఢీకొన్న ఘటనలో నలుగురు ఉస్మానియా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందిన సంగతి తెలిసింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ల్లపూడికి సమీపంలో ఉన్న ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 41 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హైదరాబాద్ కు తరలించాలా ? వద్దా ? అనే దానిపై వైద్యులు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. మరో 8 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకుని శోక సంద్రంలో మునిగిపోయారు. ఉన్నత విద్య చదివి ఆసరగా ఉంటాడని అనుకున్న కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు.

  • ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బృందం అమలాపురంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చింది.
  • అనంతరం ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో విహార యాత్రకు బయలుదేరారు.
  • తిరిగి సోమవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు.
  • బస్సులో విలువైన వస్తువులు చోరీకి గురి కావడంతో బస్సు డ్రైవర్..క్లీనర్ లను విద్యార్థులు ప్రశ్నించారు.
  • అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వేగంగా బస్సును నడపడం..అంతే వేగంగా స్టీరింగ్ ను తిప్పడంతో బస్సు చెట్టుకు ఢీకొంది.
  • ఎంబీంబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న ముచ్చా ప్రణయ్ రాజారాం, హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్న గిరి లక్ష్మణష్, మూకా విజయ్ తేజ సంఘటనా స్థలంలో మృతి చెందారు. మరో వైద్య విద్యార్థి విజయ్ కృష్ణ మోహన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
  • ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని, పరిస్థితిని సమీక్షించాలని మంత్రి లక్ష్మారెడ్డి, హోం మంత్రి నాయినీలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
  • ఆదేశాలు అందుకున్న మంత్రి లక్ష్మారెడ్డి విజయవాడకు వెళ్లారు. ఘటనాస్థలిని పరిశీలించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థులను పరామర్శించారు.
  • వైద్య చికిత్స ఖర్చులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 

టీమిండియా గెలుపు కోసం పూజలు..

ఉత్తర్ ప్రదేశ్ : ట్వీ -20 వరల్డ్ కప్ పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. మొదటగా న్యూజిలాండ్ తో భారత్ ఢీకొననుంది. ఈ సందర్భంగా గోరఖ్ ప్రాంతంలో టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ పలువురు పూజలు చేస్తున్నారు. 

గొల్లపూడి ప్రమాదంపై విచారణ - మంత్రి లక్ష్మారెడ్డి..

విజయవాడ : కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఉస్మానిఆయ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణమైన ధనుంజయ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. 

09:03 - March 15, 2016

హైదరాబాద్ : తాను సభకు రాకపోయినా ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, గుడ్డి ప్రభుత్వం అని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ మేరకు మంగళశారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందచేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి టెన్ టివితో మాట్లాడారు. జనరంజకమైన పాలన చేయడం లేదని, రాష్ట్ర ప్రజలకు అనేక కష్టాలున్నాయని ఈ నేపథ్యంలో తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. శాసనసభ వేదికగా అధికారపక్షాన్ని స్పీకర్ కోడెల వెనుకొసేకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, కాపాడాల్సింది శాసనసభ అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఉమా మహేశ్వరరావు తదితర సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేసినా స్పీకర్ సరియైన విధంగా స్పందించడం లేదన్నారు. తాను సభకు రాకపోతే సస్పెండ్ చేశారని, నాలుగు సార్లు తనపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. జగన్ ను మానసిక వేదనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారని, డివిజన్ వారీగా ఓటింగ్ చేయాలని కోరినా స్పీకర్ కోడెల స్పందించలేదని ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. 

శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభం..

జమ్మూ కాశ్మీర్ : జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కొండచరియలు విరిగి పడడంతో జాతీయ రహదారిని మూసివేశారు. 

ఏపీలో అసెంబ్లీలో ప్రధాన ప్రశ్నలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రధాన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పట్టణ పేదలకు గృహాలు, రాజధాని ప్రాంతంలో రైతు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుపై ప్రశ్నలున్నాయి. 

08:49 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలను వైసీపీ టార్గెట్ చేసింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్‌సీపీ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మంత్రులు దుర్షలాడుతున్నా స్పీకర్ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అధికార పార్టీకి సహకరించారని, ఇలాగే జరిగితే ప్రజలకు న్యాయం జరగదని తెలిపారు. అందుకనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందని, వీలైనంత త్వరగా నిర్ణయం వెలువరించాలని కోరారు. స్పీకర్ రూల్ 71(1), రాజ్యాంగంలోని ఆర్టికల్ 179(సి) ప్రకారం నోటీసు అందచేశారు.

08:42 - March 15, 2016

చిత్తూరు : అతి వేగం ప్రమాదకరం..నిండు జీవితాలను బలి చేసుకోవద్దు అని అధికారులు..ఇతరులు..హెచ్చరిస్తున్నా పలువురు వాహనదారులు బేఖాతర్ చేస్తూ ఇతరుల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఏపీ రాష్ట్రంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లారీ - టెంపోలు ఢీకొన్నాయి. వీరందరూ శ్రీవారు దర్శనం కోసం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

బెంగళూరు నుండి తిరుపతికి ప్రయాణం..
బెంగళూరులోని యలహంకకు చెందిన కొంతమంది యాత్రికులు టెంపో వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. సోమవారం రాత్రి 10.30గంటలకు బయలుదేరినట్లు సమాచారం. వీరు ప్రయాణిస్తున్న వాహనం చంద్రగిరి మండలం రాయలవారి కోట రెండో మలుపు వద్దకు రాగానే గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుండి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో వాహనం నుజ్జునజ్జైంది. వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీరిని రుయా ఆసుపత్రికి తరలించారు. సురేష్, శ్రీజ, గౌరమ్మ, పార్వతమ్మ, రమ్య, కిరణ్ మృతి చెందిన వారిలో ఉన్నారు.

సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ డ్రైవర్ అతివేగమే అని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో పూతలపట్టు - నాయుడిపేట జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. 

స్పీకర్ పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైసీపీ..

హైదరాబాద్ : స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నోటీసును అందచేశారు.

 

08:22 - March 15, 2016

విజయవాడ : నలుగురు వైద్య విద్యార్థులను బలిగొన్న కృష్ణా జిల్లా గొల్లపూడి ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ధనుంజయ ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిన ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మరో 20 మంది మెడికోలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య, సహాయక చర్యలను పర్యవేక్షించాలని హోం మంత్రి నాయినీ ని సీఎం ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

ఘటనాస్థలిని సందర్శించిన మంత్రి...
ఆదేశాలు అందుకున్న మంత్రి లక్ష్మారెడ్డి హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. మంగళవారం ఉదయం గొల్లపూడి ఘటనాస్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎంఈ రమణిలు కూడా ఉన్నారు. 

స్టోర్ట్స్ మీట్..
స్టోర్ట్స్ మీట్ కోసం ఉస్మానియా మెడికో విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు వెళ్లారు. అనంతరం పలు ప్రాంతాలు చూసేందుకు వెళ్లారు. భవానీ ద్వీపం చూసిన అనంతరం ధనుంజయ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. కానీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం విద్యార్థులు గ్రహించారు. ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసి మరో డ్రైవర్ ను పంపాలని విద్యార్థులు కోరినా యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సులో చోరీ కావడం..ఈ విషయంలో డ్రైవర్ తో విద్యార్థులు ఘర్షణ పడినట్లు సమాచారం. అనంతరం బస్సు వేగంగా చెట్టును ఢీకొనడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న మచ్చా ప్రణయ్ రాజారాం, హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్న గిరి లక్ష్మణ్, మూకా విజయ్ తేజలు అక్కడికక్కడనే మృతి చెందగా మరో వైద్య విద్యార్థి మోహన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలియడంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సులో మొత్తం 48 మంది విద్యార్థులున్నారని తెలుస్తోంది. మృతి చెందిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
డ్రైవర్ కావాలనే చేశాడు...
బస్సులో చోరీ జరగడంతో తాము ప్రశ్నించడం జరిగిందని, అప్పటికే క్లీనర్ పరారయ్యాడని విద్యార్థులు తెలిపారు. దీనితో డ్రైవర్ ను ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని తెలుస్తోంది.  ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడమే కాకుండా బస్సు స్టీరింగ్ బలంగా తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. బస్సు విజయవాడ నుండి బయలుదేరడానికి ముందే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు పేర్కొంటున్నారు. 

విజయవాడకు చేరుకున్న మంత్రి లక్ష్మారెడ్డి..

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి విజయవాడకు చేరుకున్నారు. రాయనపాడు వద్ద బస్సు బోల్తా ఘటనాస్థలిని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎంఈ రమణిలు కూడా ఉన్నారు. 

చిత్తూరులో రోడ్డు ప్రమాదం..

చిత్తూరు : అగరాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - టెంపో ట్రావెల్ ఢీకొన్నాయి. ఈ ఘటనలు ఆరుగురు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. సురేష్, శ్రీజ, గౌరమ్మ, పార్వతమ్మ, రమ్య కిరణ్ మృతి చెందిన వారిలో ఉన్నారు. వీరందరూ బెంగళూరు ఎలహంక వాసులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

సంయుక్త కమిటీ గడువు పొడిగించే అవకాశం ?

ఢిల్లీ : సంయుక్త కమిటీ గడువు పొడిగించే అవకాశం ఉంది. కమిటీ ఛైర్మన్ ఆహ్లువాలియా లోక్ సభలో తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నేటి నుండి శ్రీనివాస కళ్యాణాలు..

తిరుపతి : నేటి నుండి శ్రీనివాస కళ్యాణాలు జరగనున్నాయి. ఈనెల 28 వరకు వివిద ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణాలు నిర్వహించనుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీనివాస కళ్యాణం జరగనుంది. 

నేటి నుండి తెలంగాణలో ఒంటిపూట బడులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి ఒంటిపూడ బడులు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు జరగనున్నాయి. 

విజయవాడ మృతులు వీరే..

విజయవాడ : గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు ఉస్మానియా మెడికో విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. మృతుల వివరాలు : విజయ్ తేజ, లక్ష్మణ్, మూకా విజయ్, ప్రణయరాజు, విజయకృష్ణలున్నారు. 

07:41 - March 15, 2016

రాయలసీమ అభివృద్ధి కోసం గత పదిహేను రోజుల నుండి వామపక్షాలు బస్సు యాత్ర చేపట్టాయి. అనంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు పది వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. రాయలసీమ హక్కుల గురించి..అభివృద్ధి గురించి టెన్ టివిలో 'జనపథం' కార్యక్రమంలో రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ గేయానంద్ విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

జనాలపైకి దూసుకెళ్లిన కారు...

గుజరాత్ : రాష్ట్రంలోని కచ్ జిల్లాలో సోమవారం రాత్రి ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 3 ముగ్గురు మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 

07:37 - March 15, 2016

విజయవాడ : గొల్లపూడి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు మెడికో విద్యార్ధులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఉస్మానియా మెడికల్‌ కాలేజి విద్యార్ధులు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు అమలాపురంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొని.. తిరిగి హైదరాబాద్‌ వస్తున్నారు. వీరంతా ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో నగరానికి బయలుదేరారు. కానీ గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద చెట్టుకు బస్సును ఢీకొంది. అక్కడికక్కడనే నలుగురు మెడికోలు, డ్రైవర్ దుర్మరణం చెందారు. డ్రైవర్‌ మద్యం మత్తులో అతివేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది వైద్య విద్యార్ధులున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్ - పోలీసులు..
మద్యం మత్తులో డ్రైవర్ బస్సును నడిపాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. కంట్రోల్ కాకపోవడంతో చెట్టుకు ఢీకొట్టాడని తెలిపారు. అమలాపురంలో క్రీడల్లో పాల్గొనేందుకు వీరంతా ఇక్కడకు రావడం జరిగిందన్నారు.

చోరీ జరిగింది - విద్యార్థులు...
బస్సులో చోరీ జరిగిందని ప్రమాదం అనంతరం విద్యార్థులు టెన్ టివికి తెలిపారు. సెల్ ఫోన్స్ , నగదు చోరీ కావడంతో తాము ప్రశ్నించడం జరిగిందని అప్పటికే క్లీనర్ పరారీ అయ్యాడని పేర్కొన్నారు. ఇతని కోసం వెతికి పట్టుకున్నామని, అనంతరం బస్సు వెనక కూర్చొబెట్టామన్నారు. అనంతరం ఈ విషయంపై డ్రైవర్ ను ప్రశ్నించడం జరిగిందని, కానీ డ్రైవర్ రాష్ గా బస్సును నడిపించాడని తెలిపారు. కావాలనే ఇదంతా చేశాడని పేర్కొన్నారు.
కానీ డ్రైవర్, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రాష్ గా నడపడంతో బస్సు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్లు తెలుస్తోంది.

07:32 - March 15, 2016

మాటలకు చేతలకు పొంతన లేని బడ్జెట్‌.. ఆసాంతం అర్ధం పర్థం లేని అంకెల గారడీ. ఇవీ..టీ సర్కార్‌ బడ్జెట్‌పై విపక్షాల పెదవి విరుపులు. రూపాయి రాకడ..పోకడపై ఆదాయ వ్యయాలను చూపకుండా.. తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర లేపిందంటూ విమర్శించాయి. అర్థం పర్థం లేని అంకెలు గారెడితో కేసీఆర్‌ ప్రభుత్వం మాయ చేసిందంటున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), నాగేందర్ గౌడ్ (టీఆర్ఎస్), సతీష్ మాదిగ (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నేటి నుండి మహిళల టీ-20 ప్రపంచకప్ పోటీలు..

బెంగళూరు : నేటి నుండి మహిళల టీ-20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు బంగ్లాదేశ్ - భారత్ ఢీకొననున్నాయి. 

పాలమూరు రంగారెడ్డి టెండర్ల అక్రమాలపై నేడు విచారణ..

హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరగనుంది. 

వాణిజ్య పనుల చెక్ పోస్టుపై ఏసీబీ దాడి..

గుంటూరు : దాచేపల్లి (మం) పొందుగుల వాణిజ్య పన్నుల చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

 

నేడు స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం..

హైదరాబాద్ : నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. ఏపీ శాసనసభలో తమకు న్యాయం జరగలేదని ప్రతిపక్ష నేత జగన్‌ అన్నారు. మంగళవారం సభలో స్పీకర్‌ కోడెలపై అవిశ్వాస తీర్మానం ఇస్తామని చెప్పారు.

నేడు కాంగ్రెస్ సీఈసీ భేటీ..

ఢిల్లీ : నేడు కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. త్వరలో అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. 

మెడికోల మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి..

హైదరాబాద్ : విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉస్మానియా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం, సహాయక చర్యలను పర్యవేక్షించాలని హోం మంత్రి నాయినీని సీఎం ఆదేశించారు. దుర్మరణం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం సానుభూతి తెలిపారు. 

07:12 - March 15, 2016

శరణు శరణు వో కేసీఆరు.. శరణు కేసిఆరు.. శరుణు కేసిఆరు.. కరుణ జూపు మా పైనా నువ్వు సారు కేసిఆరు.. ముఖ్య మంత్రి కేసిఆరు.. అగో ఏంది మల్లన్న ఒగ్గోల్ల పాట వేరే వుంటది నువ్వు గిట్ల పాడవడ్తివి అంటరా.. ఇట్ల నేను గాదు ఒగ్గు కళాకారులే పాడ్తున్నరు.. వాళ్ల గోసలు జెప్పుకుంటున్నరు ఎట్ల ఏం కత అనేది వీడియోలో సూడుండ్రి.

07:09 - March 15, 2016

తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర సారు తోలు సంచిల వట్కొచ్చిండు పైకం లెక్క.. తెచ్చి అసెంబ్లీల గుమ్మరించిడ్రు...తెలంగాణ – మహారాష్ట్ర ఒప్పందం కథ..ఎంపీ కవితక్క జన్మదిన వేడుకలు...ఒగ్గు కళాకారుల గోసలు..అనంతపురం జిల్లా తాడిపత్రి కాడ లాటరీ...కోళ్ల పందేలు...కోతి హనుమంతుని ముచ్చట...తదితర అంశాలపై టెన్ష టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న తనదైన శైలిలో విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:45 - March 15, 2016

నాగ్ పూర్ : భారత్ వేదికగా మొదటిసారిగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను..ఆతిథ్య టీమిండియా నేటినుంచి ప్రారంభించనుంది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా..రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే గ్రూప్ -2 ప్రారంభలీగ్ పోటీలో న్యూజిలాండ్ తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ధూమ్ ధామ్ టీ-20 టాప్ ర్యాంకర్ టీమిండియా ఈ పోటీలోహాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా కివీస్‌ టీమ్‌ 4వ స్థానంలో ఉంది. గత 7 టీ20 మ్యాచ్‌ల్లో ఓటమంటూ ఎరుగని ధోనీ సేన టీ 20 వరల్డ్‌కప్‌లోనూ ప్రత్యర్ధి జట్లకు అసలే మాత్రం అవకాశమిచ్చేలా కనిపించడంలేదు. గత 11 టీ 20 మ్యాచ్‌ల్లో 10 విజయాలు. ఈ ప్రదర్శన చాలు ధోనీసేన ఈ ఫార్మాట్‌లో ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శిస్తోందో చెప్పడానికి. ఈ మెగా టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్న భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం బలోపేతంగా ఉంది.

బలబలాలు..
టాప్‌ ఆర్డర్‌లో కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు జట్టులో 8 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటం భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంత పటిష్టంగా ఉందో కు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇక హార్డ్ హిట్లర్లు సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా సైతం ఫామ్‌లోకి రావడంతో మిడిలార్డర్‌ మరింత బలపడింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్య, రవీందర్‌ జడేజాతో పాటు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్నందించగల ధోనీ ఉండనే ఉన్నాడు. ఆరంభ ఓవర్లలో పేసర్లు నెహ్రా, బుమ్రా ...మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తున్నారు. ఎలా చూసినా ప్రస్తుత టీమిండియా జట్టు అన్ని విభాగాల్లో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. మరోవైపు కేన్‌ విలియమ్‌సన్‌ నాయకత్వంలోని న్యూజిలాండ్‌ జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం. మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మున్రో, రాస్‌ టేలర్‌ వంటి హిట్టర్లతో పాటు.....కోరీ యాండర్సన్‌, గ్రాంట్‌ ఎలియట్‌ వంటి ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఉంది. స్పీడ్‌ గన్స్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ మిల్నే, టిమ్‌ సౌథీ వంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లతో బౌలింగ్‌ విభాగం పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌తో పాటు మార్టిన్‌ గప్తిల్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉండటం కివీ టీమ్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లెవరికీ భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేకపోవడంతో పాటు టాప్‌ క్లాస్‌ స్పిన్నర్‌ లేకపోవడం పెద్ద మైనస్‌ పాయింట్‌ అనే చెప్పాలి.

ధోని సేనకే విజయావకాశాలు..
ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లో మాత్రం న్యూజిలాండ్‌ జట్టుకు ఘనమైన ట్రాక్‌ రికార్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకూ న్యూజిలాండ్‌తో నాలుగు టీ 20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గింది లేదు. ట్రాక్ రికార్డ్ పరంగా చూస్తే కివీస్‌ టీమ్‌కు అనుకూలంగా ఉన్నా ప్రస్తుతం ఫామ్‌ చూస్తే మాత్రం ధోనీ సేనకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్‌రౌండ్ పవర్‌తో దుర్బేధ్యంగా కనిపిస్తోన్న భారత జట్టు న్యూజిలాండ్‌పై టీ 20ల్లో తొలి విజయం సాధించాలని తహతహలాడుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలంటే మాత్రం న్యూజిలాండ్‌ జట్టు ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించాల్సిందే. మరి ధోనీసేన స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే....టీ 20 వరల్డ్‌ కప్‌ టోర్నీని విజయంతో ఆరంభించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

06:40 - March 15, 2016

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ల మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. సొంత బలంతోనే ఈ పదవులను అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. ఇక ఇప్పటికే మేయర్‌ అభ్యర్ధుల పేర్లు ఖరారు కాగా.. డిప్యూటీ మేయర్‌ కోసం పోటీ కొనసాగుతోంది. వరంగల్‌లో మొత్తం 58 డివిజన్లకు గాను 44 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. ఇక ఇక్కడ గెలిచిన 8 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా అధికార పార్టీలో చేరనున్నారు. దీంతో గులాబీ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. దీంతో మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అనేక మంది నేతలు ప్రయత్నాలు కూడా చేశారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా.. మేయర్‌ ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. అనేక విధాలుగా సమాచారం సేకరించడమే కాకుండా.. ఇంటెలిజెన్స్‌ నివేదికలు కూడా తెప్పించుకుంది. ఇక ప్రధానంగా 19వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన నన్నపునేని నరేందర్‌ పేరును ప్రధానంగా పరిశీలించిన టీఆర్‌ఎస్‌.. చివరకు ఆయనకే మేయర్‌ పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా 41వ డివిజన్‌ కార్పొరేటర్‌గా సిరాజుద్దీన్‌లను ఖరారు చేసింది. ఇక వీరి ఎన్నికే లాంచనమే కానుంది.

ఖమ్మం కార్పొరేషన్..
ఇక ఖమ్మం కార్పొరేషన్‌ కొత్త పాలకవర్గం నేడు కొలువుతీరనుంది. 2011లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ స్థాయికి పెరిగినా.. ఐదేళ్ల నుంచి ఎన్నికలు జరగలేదు. దీంతో మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు గాను.. 34 డివిజన్లను కైవసం చేసుకుంది. దీంతో సొంతంగానే మేయర్‌ పదవిని దక్కించుకోబోతుంది. ఇక ప్రతిపక్షాలతో ఎలాంటి ఇబ్బంది మేయర్‌ ఎన్నిక ప్రశాంతంగా జరగనుంది. అయితే మేయర్‌ పదవి ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో.. 2వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన డాక్టర్‌ పాపాలాల్‌కు ఈ పదవి దక్కించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు డిప్యూటీ మేయర్‌ కోసం మాత్రం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికీ వారు పదవి దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇక మేయర్‌ ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో.. డిప్యూటీ మేయర్‌ పదవి జనరల్‌ అభ్యర్ధికి దక్కే అవకాశాలున్నాయి.

అచ్చంపేట నగర పంచాయతీ..
ఇక అచ్చంపేట నగర పంచాయతీ పాలకవర్గం కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అయితే ఇక్కడ చైర్మన్‌ ఎంపిక నామమాత్రమే అయినప్పటికీ .. వైస్‌ చైర్మన్‌ కోసం పోటీ నెలకొంది. 3వ వార్డు నుంచి గెలుపొందిన తులసీరామ్‌కు చైర్మన్‌ బెర్త్‌ ఖరారైంది. ఇక వైస్‌ చైర్మన్‌ రేసులో చాలా మంది ఉన్నారు. అయితే పట్టణంలోని ప్రముఖ వ్యాపారి రాజు పేరు ఖరారైనప్పటికీ.. ఇంకా డాక్టరైన విష్ణు కూడా పోటీ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజుకే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను లాంచనంగా ఎన్నుకోనున్నారు. 

06:36 - March 15, 2016

చిత్తూరు : వామపక్షాలు పోరుబాట పట్టాయి. రాయలసీమ సమస్యల పరిష్కారం, విభజన హామీలు నెరవేర్చాలంటూ 10 వామపక్ష పార్టీలు 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చాయి. మరోవైపు హైదరాబాద్‌కు తరలివస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని నేతలు స్పష్టం చేస్తున్నారు. 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్బంధకాండను ఎదురించైనా.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఇప్పటికే సీమ డిమాండ్లపై 15 రోజులు బస్సు యాత్ర నిర్వహించామని.. అందులో భాగంగానే 'చలో అసెంబ్లీ' నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ.. తిరుపతిలో ఐఐటీ,.. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, కర్నూలులో ట్రిపుల్‌ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు మధు.

వివక్ష చూపిస్తుందంటున్న నేతలు..
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించకుండా.. కేవలం 50 కోట్లు ముష్టి విదిల్చి అదే ప్రత్యేక ప్యాకేజీగా చెప్పుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా సాగునీటి ప్రాజెక్టులకు అరకొర నిధులే కేటాయించారన్నారు. రాయలసీమ పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. గతేడాది రాయలసీమలోని అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 'చలో అసెంబ్లీ' కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులను ఉసిగొల్పి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. 

06:34 - March 15, 2016

హైదరాబాద్ : మాటలకు చేతలకు పొంతన లేని బడ్జెట్‌.. ఆసాంతం అర్ధం పర్థం లేని అంకెల గారడీ. ఇవీ..టీ సర్కార్‌ బడ్జెట్‌పై విపక్షాల పెదవి విరుపులు. రూపాయి రాకడ..పోకడపై ఆదాయ వ్యయాలను చూపకుండా.. తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర లేపిందంటూ విమర్శించాయి. అర్థం పర్థం లేని అంకెలు గారెడితో కేసీఆర్‌ ప్రభుత్వం మాయ చేసిందంటున్నాయి. రూపాయి రాకడ పోకడ గురించి ఎలాంటి వివరాలు చెప్పకుండా.. కొత్త సంప్రదాయానికి తెర లేపాయంటూ టీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. కీలకమైన రంగాలకు సంబంధించి ఆదాయ వ్యయాలను బడ్జెట్‌లో పొందుపర్చలేదని, భారీ అంచనాలున్న డబుల్‌ బెడ్‌రూం స్కీం, మిషన్‌ భగీరథ విషయంలో చిల్లి గవ్వ కూడా కేటాయించలేదని పెదవి విరుస్తున్నాయి ప్రతిపక్షాలు. మిషన్‌ భగీరతకు ఎంత ఖర్చు చేస్తారు..? నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం ఎందుకు స్పష్టం చేయలేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

నిధులపై తీవ్ర విమర్శలు...
ఇక స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ పేరిట కేటాయించిన నిధులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం, మంత్రుల విచక్షణాధికరం కింద అంత పెద్ద మొత్తాన్ని కేటాయించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సొంత అవసరాల కోసం, విపక్ష సభ్యులను లొంగదీసుకోవడం కోసం ఈ నిధులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ అంచనాలను సైతం భారీగా చూపించడంపై ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 30 వేల కోట్ల ఆదాయం పెరుగుతుందని బడ్జెట్‌లో చూపడం ఏంటని అంటున్నాయి. ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నది ప్రతిపక్షాల వాదన.  కల్యాణలక్ష్మీ పథకాన్ని దారిద్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తింప చేయడం మినహా బడ్జెట్‌లో పెద్దగా మార్పులు లేవు. బ్రాహ్మణ సంక్షేమం కోసం 100 కోట్లతో పాటు.. మైనారిటీ శాఖకు గతేడాదితో పోలిస్తే 150 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశాఖకు అదనంగా వేయి కోట్లు తప్పా మిగిలిన రంగాలకు ఇంచుమించుగా ఒరిగిందేమి లేదని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. బడ్జెట్‌పై విపక్షాల అసంతృప్తి చూస్తుంటే... సభలో వాడీ వేడీ చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

06:32 - March 15, 2016

హైదరాబాద్ : ఏపీలోని విద్యుత్‌ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేత జగన్‌ దుయ్యబట్టారు. దీనిపై ప్రభుత్వం తరపునుంచి సీఎం సహా మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల తీవ్రంగా స్పందించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. అవిశ్వాస తీర్మణంపై జరిగిన చర్చలో ఇరు పక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. దీనిపై సీఎంతో సహా మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత పైన తీవ్రంగా స్పందించారు. జగన్ పైన మండిపడ్డారు. ప్రాజెక్టులపై జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా జీవోలు విడుదలచేస్తున్నారన్నారు. సోలార్ స్కాం అందరూ చూశామన్నారు. ఇది రూ.750 కోట్ల స్కాం అన్నారు. తెలంగాణలో, గుజరాత్‌లో 4.4 కోట్లు పర్ మెగావాట్ ఉంటే, ఏపీలో మాత్రం రూ.5.82 కోట్లుగా ఉందని విమర్శించారు.

నిరూపించాలన్న బాబు..
చంద్రబాబు మాట్లాడుతూ... సభలో ఓ సంప్రదాయం లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. వందల కోట్ల రూపాయల ఆరోపణలు జగన్ చేశారని, వాటిని నిరూపించాలన్నారు. జగన్‌ పన్నెండు కేసుల్లో దోషి అన్నారు. ఈడీ వెబ్ సైట్ చూస్తే ఆయన పైన ఉన్న కేసులన్నీ తెలుస్తాయన్నారు. జెన్కో, ఎన్టీపీసీ తదితర విషయాల పైన జగన్ ఆరోపణలు సరికాదన్నారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... జగన్ ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబు స్పందించారని, ఆయన సవాల్‌కు స్పందించాలన్నారు. ఆరోపణలు చేసినప్పుడు సాక్షాలు లేకుండా చేస్తే సరికాదన్నారు. సోలార్ కుంభకోణంలో రూ.7 కోట్ల అవినీతి జరిగితే నిరూపించాలని, లేదంటే అప్పటి వరకు సభ ముందుకు జరగనివ్వవద్దన్నారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలపై వైసిపివి అసత్య ఆరోపణలన్నారు. వాటిని నిరూపించాలన్నారు. 

06:30 - March 15, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై శాసనసభలో వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు అనుమతించగా... సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అవిశ్వాస తీర్మానంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, దానిపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టినప్పటికీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చకు చేపట్టగా, రాత్రి 9గంటల 30 నిమిషాల వరకూ తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సుదీర్ఘంగా సాగింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది.  వైసీపీ నుంచి ప్రతిపక్ష నేత జగన్ అధికార పక్షంపై ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు సంధించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం నుంచి మరెవరికీ అవకాశం ఇవ్వకుండా జగన్‌ వన్‌ మ్యాన్‌ షో నడిపించారు. అయితే అధికార పక్షం నుంచి మాత్రం సీఎం, మంత్రులు, ఇతర సభ్యులు అధికార పార్టీ తరపున మాట్లాడారు.

కోడెలపై అవిశ్వాస తీర్మానం..
ఒక దశలో ప్రతిపక్షనేత జగన్‌ న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానించారంటూ అధికార పక్ష నేతలు విరుచుకుపడ్డారు. అయితే తాను చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, న్యాయవ్యవస్థలపై తనకు అపారమైన నమ్మకం ఉందని జగన్ పదే పదే చెప్పినప్పటికీ అదే విషయంలో క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.  అవిశ్వాస తీర్మానంపై చర్చను ముగించి ఓటింగ్ కు వెళ్లాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరగా ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్మానంపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టింది. అయితే చర్చ తర్వాత మూజువాణి ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బడ్జెట్‌పై చర్చను స్పీకర్‌ ప్రారంభించారు. అయితే స్పీకర్‌ పోడియం దగ్గర వైసీపీ సభ్యుల ఆందోళన చేయడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఏపీ శాసనసభలో తమకు న్యాయం జరగలేదని ప్రతిపక్ష నేత జగన్‌ అన్నారు. ప్రభుత్వంపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం సభలో స్పీకర్‌ కోడెలపై అవిశ్వాస తీర్మానం ఇస్తామని చెప్పారు.

విజయవాడలో రోడ్డు ప్రమాదం..హెల్ప్ లైన్ ఏర్పాటు..

విజయవాడ : గొల్లపూడి వద్ద బస్సు బోల్తా పడిన ఘటనా వివరాల కోసం స్థానిక అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 9440752310 ద్వారా సంప్రదించవచ్చని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పేర్కొన్నారు. ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిన ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మంది మెడికోలకు గాయాలయ్యాయి.

ప్రమాదస్థలికి బయలుదేరిన మంత్రి లక్ష్మారెడ్డి..

విజయవాడ : గొల్లపూడి వద్ద బస్సు బోల్తా పడిన ఘటనాస్థలికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడద్డి, ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారు. వీరితో పాటు ప్రమాద సమాచారం అందుకున్న ఉస్మానియా అధ్యాపక బృందం కూడా ఘటనాస్థలికి బయలుదేరింది. 

చెట్టును ఢీకొన్న బస్సు..నలుగురు వైద్య విద్యార్థుల మృతి..

విజయవాడ : ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిన ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 20 మంది మెడికోలకు గాయాలయ్యాయి. ఈ ఘటన గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద సోమవారం రాత్రి పదకొండు గంటలకు చోటు చేసుకుంది. 

రేపటి నుండే ఇండియా ఏవియేషన్ షో...

హైదరాబాద్ : ఐదో విడత 'ఇండియా ఏవియేషన్' ప్రదర్శనకు రెడీ అయ్యింది. 'భారతీయ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎంఆర్‌ఒ హబ్‌కు అవకాశాలు’ అనే అంశంతో ఈ నెల 16 న హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ ప్రారంభంకానుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్ ఆఫ్‌ కామర్స్ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహించనున్న ఈ సదస్సును బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో యుకెకు చెందిన మార్క్‌ జెఫ్రీస్‌ ఏరోబాటిక్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

 

నేడు ఉభయసభల్లో ప్రత్యేక హోదాపై చర్చ.. ?

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేడు చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఎట్టిపరిస్థితిలోనూ చర్చించాల్సిందేనని పేర్కొంటూ కాంగ్రెస్‌ ఇప్పటికే ఉభయ సభల్లోనూ నోటీసు ఇచ్చింది. మంగళవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉభయ సభల్లో నోటీసు ఇచ్చింది. 

రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

విశాఖపట్టణం : రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుంచి కొమరిన్ వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోనూ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురవవచ్చని పేర్కొంది.

నేరు పుర సారథుల ఎన్నిక..

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీల సారథులను మంగళవారం ఎన్నుకోనున్నారు. తొలుత గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశాక, మేయర్, డిప్యూటి మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఒకరు ప్రతిపాదించడం..మెజార్టీ సభ్యులు మద్దంతు పలకగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు మేయర్ గా నన్నపునేని నరేందర్, డిప్యూటి మేయర్ గా ఖాజా సిరాజుద్దీన్, అచ్చంపేట నగర పంచాయతీకి ఛైర్మన్ గా తులసీరాం, వైస్ ఛైర్మన్ గా బంధం రాజు, ఖమ్మం మేయర్ గా పాపాలాల్ లకు అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. 

నేడు న్యూజిలాండ్ తో భారత్ పోరు..

నాగ్ పూర్ : పొట్టి ప్రపంచకప్ లో టీమ్ ఇండియా సిసలైన పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై కప్ వేటను న్యూజిలాండ్ తో మొదలు పెట్టనుంది. జామ్తా స్టేడియంలో సాయంత్రం 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

కానిస్టేబుల్ దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి..

హైదరాబాద్ : పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుంది. అర్ధరాత్రి 12గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. 

రోడ్డెక్కనున్న అత్యాధునిక '108'

హైదరాబాద్ : అత్యాధునిక 108 అంబులెన్స్ లు మంగళవారం నుండి రోడ్డెక్కనున్నాయి. ఉదయం పది గంటలకు 145 అంబులెన్స్ లను మంత్రులు కేటీఆర్, సి.లక్ష్మారెడ్డిలు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Don't Miss