Activities calendar

16 March 2016

21:24 - March 16, 2016

హైదరాబాద్ : వెస్ట్‌ బెంగాల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌పై రాజ్యసభలో దుమారం రేగింది. లంచాలు తీసుకుంటూ వీడియోకు చిక్కిన టిఎంసి ఎంపీలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. స్టింగ్‌ ఆపరేషన్‌పై హౌజ్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. టిఎంసితో బిజెపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని, అందుకే ప్రభుత్వం విచారణపై స్పందించడం లేదని ఆరోపించారు. అంతకుముందు టిఎంసి ఎంపి డెరెక్‌ ఓబ్రిన్‌ స్టింగ్‌ వీడియోకు ఎలాంటి ఆధారం లేదని రాజకీయ లబ్దికోసమే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. టిఎంసి ఎంపీలు, నేతలు లంచం తీసుకుంటున్నట్టు నారదాన్యూస్‌.కామ్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో బయటపడింది.

21:23 - March 16, 2016

హైదరాబాద్ : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీల అవినీతి వ్యవహారం ఎథిక్స్‌ కమిటీకి చేరింది. దీనిపై విచారణ బాధ్యతను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎథిక్స్‌ కమిటీకి. ప్రైవేటు సంస్థకు సాయం చేసేందుకు తృణమూల్‌ ఎంపీలు లంచం తీసుకున్నారని నారదాన్యూస్‌.కామ్‌ స్టింగ్‌ ఆపరేషన్‌పై మంగళవారం లోకసభలో దుమారం రేగింది. దీనిపై సిపిఎంతో పాటు కాంగ్రెస్, బిజెపిలు విచారణ కమిటీ వేయాలని పట్టుబట్టడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సభలో అవినీతికి పాల్పడ్డ ఎంపీలతో కూర్చోవడానికి సిగ్గుతో తలవంచుకుంటున్నామని, సిబిఐతో విచారణ జరిపించాలని సిపిఎం సభ్యులు సలీం డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

21:17 - March 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ అధికార పక్షం నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన ప్రభుత్వమే చిరకాలం మన్నుతుందని హితవు పలికారు.

పలు కీలకాంశాలు ప్రస్తావనకు.....

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈటల రాజేందర్‌ బడ్జెట్‌పై చర్చ సహా.. ప్రశ్నోత్తరాలు సమయంలో.. నిత్యావసరాల ధరల పెరుగుదల, తాగునీటి ఎద్దడి తదితర అంశాలను సభ్యులు ప్రస్తావించారు. తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో.. విపక్ష ఎమ్మెల్యే భట్టివిక్రమార్క.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావించారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

బదులిచ్చిన ఈటల రాజేందర్...

సభ్యుడి ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ బదులిచ్చారు. తాను ఇప్పటికే 50 సార్లు అధికారులు, వ్యాపారులతో సమీక్షలు జరిపి నిత్యావసర వస్తువుల ధరల అదుపునకు కృషి చేశానన్నారు. ఇకముందూ ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మరొక ప్రశ్నకు న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బదులిస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. కేంద్రంతో మంతనాలు జరుపుతోందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సమస్య పరిష్కారానికి నీటిపారుదల శాఖ మంత్రి కర్నాటకతో చర్చలు జరిపి ఆల్‌మట్టి డ్యాం నుంచి నీళ్లు విడుదలయ్యేలా చూడాలని కోరారు.

ప్రశ్నోత్తరాల అనంతరం జానారెడ్డి బడ్జెట్‌పై చర్చ....

ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. ఆరంభం నుంచే అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో అధికార పార్టీ తప్ప మరో పార్టీ ఉండరాదనే భావన మంచిదేనా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అందుకు సహకరిస్తామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నిలదీస్తామని హెచ్చరించారు. తమ హయాంలో తెలంగాణలో ఆర్థికాభివృద్ధి 11.7, 11.9 శాతందాకా పెరిగిందని అంతకన్నా టిఆర్ఎస్ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌ అంతా అంకెల గారడీయేనని విమర్శించారు.

రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్నందున...

ఇండియన్ ఏవియేషన్‌ 2016 సందర్భంగా రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్నందున సభను వాయిదా వేయాలని సిఎం కెసిఆర్ కోరారు. దీంతో జానారెడ్డి ప్రసంగం తరువాత స్పీకర్‌ మధుసూదనాచారి సభను గురువారానికి వాయిదా వేశారు. 

సీతారాం ఏచూరిని కలిసిని విద్యార్థి కన్హయ్య

ఢిల్లీ : సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరిని విద్యార్థి నేత కన్హయ్య కలిశారు. ఈ సందర్భంగా కన్హయ్య విద్యార్థి పోరాటాలకు మద్దతివ్వాలని కోరగా దానికి ఏచూరి సానుకూలంగా స్పందించారు. యూనివర్శిటీల పరిరక్షన, ప్రజాస్వామ్య హక్కుల కోసం కన్హయ్య పోరాటాన్ని ఏచూరి అభినందించారు.

20:38 - March 16, 2016

హైదరాబాద్ : బలిపీటం పై ప్రజారోగ్యం.. అవును ప్రభుత్వాల నిర్లక్ష్యం..ఫార్మా కంపెనీల దురాశ కలిసి దేశ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు కొన్ని వందల మందులు ఈ జాబితాలో వున్నాయ్. నాణ్యతలేనివి కొన్ని.... ప్రమాదకర కాంబినేషన్లో కొన్ని, అస్సలు వాడకూడని డ్రగ్స్ ఇంకొన్ని వెరసి పబ్లిక్ హెల్త్ ను డేంజర్ జోన్ లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం తాజా గా బ్యాన్ చేసినవే కాదు.. ఇంకా చాలానే ఉన్నాయా? వాటిపై నిషేధం ఎప్పుడు ఇదే నేటి వైడాంగిల్ కథనం.. మరి పూర్తి విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:08 - March 16, 2016

హైదరాబాద్ : నాయిని నర్సన్న యిజ్జత్తును నిలబెడుతున్న పోలీసులు...టిఫిన్లు తినుకుంటా, ఛాయిలు తాగుకుంటా తనిఖీలు, చీపరి కట్టెలు మెలేస్తున్న సఫాయి కార్మికులు, బల్మీదికి దొరకబట్టి లోపలేస్తున్న పోలీసులు, గులాల్ రంగు శోభ తీసుకొచ్చిన శోభక్క..చెరువలల్లో తెలంగాణ తల్లి తలపించిన వైనం, ఆడోళ్లను అరగోసపెడుతున్న డాక్టర్ గాడ... గలీజుగాడని కచ్చేరీలకెక్కిన నర్సమ్మలు, మహబూబ్ నగర్ జిల్లాలో తూ... గలీజుదందా... వీళ్లు చేయంగా మంచోళ్లకు రాబట్టే నింద, మల్లన్న వాట్స్ ప్ లవీడియోల జోరు.. చూసినంక కడుపుబ్బ నవ్వుతరు... ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న ఎలాంటి మసాలాను దట్టించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:59 - March 16, 2016

హైదరాబాద్ : భారత్ మాతాకీ జై అని చెప్పబోనన్న ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది. తన మెడపై కత్తి పెట్టి చెప్పమన్నా తాను భారత్ మాతాకీ జై చెప్పబోనన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాలసీనే వారిస్ పఠాన్ కూడా అనుసరించారు. భారత్ మాతాకీ జై తాను చెప్పబోనని మహారాష్ట్ర అసెంబ్లీలో వారిస్‌ అన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేను స్పీకర్‌ సస్పెండ్ చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకమై పఠాన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేయడంతో స్పీకర్‌ ఆయన్ని సస్పెండ్‌ చేశారు.

19:58 - March 16, 2016

ఢిల్లీ : దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బలపడిందని, మోది బలపడ్డారనుకోవడం... కేవలం మన బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడమేనని జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ అన్నారు. మనం ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే వారు బలపడ్డారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటే వామపక్షాలకు తిరుగు లేదన్నారు. మతాల పేరిట సమాజాన్ని విడదీస్తున్నవారు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేనివారిని ఎండగట్టాలన్నారు. మతతత్వ శక్తుల నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు వామపక్షాలు ఏకతాటిపైకి రావాలని కన్హయ్య పిలుపునిచ్చారు. జెఎన్‌యు ఘటనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

19:56 - March 16, 2016

హర్యానా : రోహతక్‌లో ఓ జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. హర్యానాకు చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సుఖ్విందర్ రోహతక్‌ సమీపంలో రిఠాల్ గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. సుఖ్విందర్ నర్వాల్ ప్రాక్టీస్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నాడు. మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ రోడ్డు వెంట నడుస్తూ వెళుతుండగా అప్పుడే స్కూటర్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. బుల్లెట్ తగిలి అతడు కిందపడిపోగా వారు స్కూటర్ దిగి మళ్లీ తలపై, ఛాతీపై పదేపదే కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల శబ్దం విని గ్రామస్తులు ఘటనా స్థలం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసిటివి ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

19:55 - March 16, 2016

హైదరాబాద్ : రాజస్థాన్‌లో బీఫ్‌ వివాదం తెరపైకి వచ్చింది. చిత్తోర్‌ఘర్‌లోని మేవార్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో బీఫ్‌ వండుకుంటున్నారన్న పుకార్లతో నలుగురు కశ్మీర్‌ విద్యార్థులను చితకబాదారు. బీఫ్‌ వండుతున్నారనే ఆరోపణలతో పలువురు హిందూ కార్యకర్తలు క్యాంపస్‌కు వచ్చి వ్యతిరేక నినాదాలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితి అదుపులోనే ఉందని... విద్యార్థులు వండుతున్న మాంసాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించామని పోలీసులు తెలిపారు. 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారని, ఇదో మినీ ఇండియా లాంటిదని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దేశంలోని వివిధ సంస్కృతీ సంప్రదాయాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండడం వల్ల అప్పడప్పుడు ఇలాంటి గొడవలు జరగడం సాధారణమేనని పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

19:36 - March 16, 2016

విజయవాడ: బీసీ సబ్‌ ప్లాన్‌ను చట్టబద్ధం చేసి, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిజర్వేషన్ల సాధన కమిటీ వినతిపత్రం అందించింది. వృత్తిదారుల సంక్షేమానికి బ్యాంకునుఏర్పాటు చేసి విధానాలు ప్రకటించాలని .. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేధిక ఏపీ కమిటీ కోరింది. ప్రైవేటు రంగంలో 27 శాతం రిజర్వేషన్ల కోసం నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ చేసిన సిఫార్సులను బలపరుస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆ కమిటీ డిమాండ్‌ చేసింది. 

బాల్ నగర్ చౌరస్తాలో డీసీఎం దగ్ధం...

మహబూబ్ నగర్ : బాల్ నగర్ చౌరస్తాలో ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో డీసీఎంలో వున్న ప్లాస్టిక్ వస్తువులు దగ్ధం అయ్యాయి.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ సామి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

రాజంపేట బస్టాండ్ లో బ్రౌన్ షుగర్ కలకలం..

కడప: రాజంపేట బస్టాండ్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.వీరి వద్ద రూ.80లక్షల విలువలైన బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 

19:03 - March 16, 2016

హైదరాబాద్ :పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్ కు రూ.3.07 పైసలు, డీజిల్ లీటర్ కు రూ.1.90 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. ఒక వైపు ముడి చమురు రేటు భారీ స్థాయిలో పతనం అవుతున్నా... పెట్రోల్ ధరలను పెంచడంలో కంపెనీలు ముందుడటం గమనించాల్సిన విషయమే. తగ్గించేటపుడు రూపాయి.. లేదా యాభై పైసలు తగ్గిస్తారు... పెంచేటపుడు మాత్రం రూపాయిల్లో పెంచుతున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ :పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్ కు రూ.3.07 పైసలు, డీజిల్ లీటర్ కు రూ.1.90 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. ఒక వైపు ముడి చమురు రేటు భారీ స్థాయిలో పతనం అవుతున్నా... పెట్రోల్ ధరలను పెంచడంలో కంపెనీలు ముందుడటం గమనించాల్సిన విషయమే. తగ్గించేటపుడు రూపాయి.. లేదా యాభై పైసలు తగ్గిస్తారు... పెంచేటపుడు మాత్రం రూపాయిల్లో పెంచుతున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ విజయం

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 55 పరుగుల తేడాతో బంగ్లాదేవ్ ఓటమిపాలయ్యింది. పాక్ 201/5, బంగ్లాదేశ్ 146/6 సోర్లు చేశాయి.

18:39 - March 16, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పుష్కరాల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ ఉపసంఘంలో సభ్యులుగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల, నారాయణ ఉన్నారు. కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాల ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలు అద్భుతంగా ఉండాలని అధికారులకు సూచించారు. 

18:37 - March 16, 2016

చిత్తూరు : నలుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఎస్.షరీఫ్‌, కమల్ కిషోర్, ఆర్ముదం, మీర్జాబేగ్‌లపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. కాగా ఒక్కొక్కరిపైన సుమారు 30 దాకా కేసులు ఫైలయ్యాయి.

18:36 - March 16, 2016

హైదరాబాద్ :వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటీషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు 340 కింద తీర్మానం పెట్టి సస్పెండ్ చేశారని ఆ విషయాన్ని ఇప్పుడు మారుస్తున్నారని .. ఎలాంటి చర్యలు తీసుకున్నా...చట్ట ప్రకారం ఉండాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది.ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పొందుపర్చవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. 

'ఏపీ హౌసింగ్ కార్పొరేషన్' ఫోర్జరీ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ : ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ల ఫోర్జరీ కేసులో సీఐడీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పి.సుబ్రహ్మణ్యం, బి. నారాయణ, బి.శ్రీనివాసులు ఉన్నారు.

సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ వద్ద కారు దగ్ధం...

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

18:03 - March 16, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమకు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడంలేదని...టిడిపి నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.. సభలో ప్రతిక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.. సర్కారు తీరుకు నిరసనగా తాము సభనుంచి వాకౌట్‌ చేశామని ప్రకటించారు..

18:01 - March 16, 2016

హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందే అవకాశాలు కనిపించడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కింద మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన 70 టిఎంసీల వాటర్ ఒక్క మహబూబ్‌నగర్‌కే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఏదోరకంగా రంగారెడ్డి జిల్లాకు నీళ్లిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకోవాని చిన్నారెడ్డి కోరారు. 

17:58 - March 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడం సరికాదని టి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎత్తు తగ్గించడం మూలంగా రాష్ట్రం నష్టపోవాల్సొస్తుందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు కృష్ణా నీటికన్నా గోదావరి నీటిని అందించడం మూలంగా లాభముంటుందని ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దని అన్నారు. 

17:57 - March 16, 2016

హైదరాబాద్ : నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిరుద్యోగులు ఆరోపించారు. హైదరాబాద్‌ చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ వద్ద గ్రూప్‌-2 అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. అయితే గ్రూప్‌-2 అభ్యర్థులకు మద్థతు తెలిపేందుకు వచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌కృష్ణయ్య, విమలక్కలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం..మాట తప్పిందని నిరుద్యోగులు ఆరోపించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

17:55 - March 16, 2016

కరీంనగర్‌ : నగునూర్‌లో మెడికల్‌ విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య చేసుకుంది.... ఖమ్మం జిల్లా మన్రిల్లాగూడెంకుచెందిన సౌమ్యకు గత నెల వీణవంక మండలం మామిడాలపల్లికిచెందిన పవన్‌తో 17రోజులక్రితం వివాహం జరిగింది.. హానీమూన్‌కువెళ్లిన భార్యా భర్తలు నిన్న హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.. ఆ తర్వాత సౌమ్యను ఆమె భర్త కరీంనగర్‌కు పంపారు.. రూంకుచేరుకున్న సౌమ్య అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది... అయితే సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

17:49 - March 16, 2016

హైదరాబాద్ : ఓ మ్యూజిక్‌ చానల్‌లో తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ ప్రశంసలు పొందుతున్న యాంకర్ నిరోష సికింద్రాబాద్‌లోని తన హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది....

సిందికాలనీలోని దేవిమహిళ హాస్టల్ లో .....

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ సిందికాలనీలోని దేవిమహిళ హాస్టల్ లో కొన్నాళ్లుగా ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన నిరోష ప్రయివేటు మ్యూజిక్‌ చానల్‌లో యాంకర్‌గా చేస్తుంది..అంతకు ముందు జర్నలిజం కొద్ది కాలం చేసిన నిరోష ఆ తర్వాత యాంకర్‌గా సెటిలయింది..

గత నెలలో నిశ్చితార్థం...

యాంకర్‌ నిరోషకు గడిచిన నెలలో నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం నిశ్చయించారు... కెనడాలో ఉన్న బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త రిత్విక్‌తో ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా మాట్లాడినట్లు తెలుస్తుంది...ఫోన్ సంభాషణ సమయంలో తీవ్ర మనస్థాపం చెందిన నిరోష చనిపోతున్నట్లు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు...

ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా.....

నిరోష ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు... ఆత్మహత్యకు ముందు వీడియో కాల్‌లో ఏం మాట్లాడింది..కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది...

17:46 - March 16, 2016

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బాలికల హాస్టల్లోకి చొరబడి ఫోటోలు, వీడియో తీస్తున్న ఆకతాయిలను స్థానికులు దేహశుద్ధి చేశారు. హాస్టల్లో బాలికలు స్నానాలు చేస్తున్నప్పుడు ఫోటోలు తీస్తున్నారన్న సమాచారంతో హాస్టల్‌ వాచ్‌మెన్‌ ఆకతాయిలను రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..పట్టుబడ్డ బాలుడిని విచారణ చేస్తున్నారు. 

17:44 - March 16, 2016

కరీంనగర్: క్షణాల వ్యవధిలో రెండు ప్రమాదాలనుంచి ఇద్దరు మహిళలు తృటిలో తప్పించుకున్నారు.. కరీంనగర్‌ జిల్లాలో బైక్‌వెనక కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ జారి కిందపడింది.. అదే సమయంలో ఆమెపైకి టిప్పర్‌ దూసుకొచ్చింది.. డ్రైవర్‌ వెంటనే బ్రేక్‌ వేయడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.. తలకు గాయాలైన ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే అక్కడే మరో మహిళ బైక్‌నుంచి కిందపడింది.. ఆ సమయంలో బండి స్పీడ్‌ తగ్గడంతో ఆమె సురక్షితంగా బయటపడింది.. ఈ సీసీ ఫుటేజ్‌ వీడియోలు ఈ ప్రమాదాలు ఎలా జరిగాయో సీసీ ఫుటేజ్‌లో నమోదైంది.. 

కృష్ణా పుష్కరాలపై ప్రభుత్వం సమీక్ష...

హైదరాబాద్ : కృష్ణా నది పుష్కరాల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఉపసంఘ సభ్యులుగా . మంత్రులు మాణిక్యాలరావు, నారాయణలను చంద్రబాబు నియమించారు .

టీ-20 వరల్డ్ కప్ లో భారీ స్కోరు సాధించిన పాక్...

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ పై స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పాక్ బ్యాట్ మెన్స్ లో షెహజాద్ 39 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆఫ్రిదీ కేవలం19 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు.

రోజా పిటీషన్ పై తీర్పు రేపటికి వాయిదా...

హైదారాబాద్ : రోజా పిటీషన్ పై హైకోర్టులో పూర్తి అయిన వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం. 

స్వర్ణముఖినది పై చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్ :ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో స్వర్ణముఖినది పై చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆలూరు, థాంసా, సాకేర గ్రామాల వ్ద చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టి మేడ్చల్ నగర పంచాయతీలో నీటి సరఫరా వ్యవస్థకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. మిషన్ భగీరథలో భాగంగా నీటి సరఫరా వ్యవస్థను నెలకొల్పేందుకు రూ.44.50 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది.

16:33 - March 16, 2016

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు కొత్త జోన్‌ ప్రకటించకపోడం పట్ల ఏపీ అసెంబ్లీలో టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో కొత్త జోన్‌ ప్రకటిస్తారని ఆశిస్తే చివరికి నిరాశ ఎదురయ్యిందని టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. ఏపీ పునర్వస్థీకరణ చట్టంతోపాటు, పార్లమెంటులో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరూతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా బుచ్చయ్యచౌదరి రైల్వే జోన్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై విశాఖ బిజెపి విష్టుకుమార్‌రాజు స్పందిస్తూ... కేంద్రం రైల్వే జోన్‌ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

16:29 - March 16, 2016

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్ట్‌కు 2018 నాటికి పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ప్రాజెక్ట్‌కు పూర్తి చేస్తామంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి కూడా అభ్యంతరం లేదన్నారు. 

16:27 - March 16, 2016

హైదరాబాద్ :

హైదరాబాద్ : ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై రెండు గంటలకు పైగా కొనసాగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు.

అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 పెంచాలి ....

విభజనతో ఆర్థికంగా, ఆదాయపరంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తీర్మానంలో కోరారు. రెవిన్యూ లోటు భర్తీకి నిధులు విడుదల చేయాలని , ఏపీలో ప్రస్తుతమున్న శాసనసభ స్థానాలను 175 నుంచి 225 కు పెంచాలని తీర్మానంలో కోరారు. విశాఖలో రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపిన అసెంబ్లీ.... ఏపీ కొత్త రాజధాని అమరావతి ఆర్థిక శక్తిగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు సహకరించాలని కోరారు. ఇందుకోసం పదేళ్లపాటు వంద శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. దక్షిణాదిలో అత్యంత వెనుకబడి ఉన్న ఏపీ.. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేలా ఇతోధికంగా సాయం చేయాలని చంద్రబాబు కోరారు.

కేంద్రం ఎందుకు పట్టించుకోవడంలేదు...

రాష్ట్రానికి ఆర్ధిక సాయంచేసే విషయంలో ప్రభుత్వం చేస్తున్న విన్నపాలను కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. పత్యేక హోదా కోసం గతేడాది ఆగస్టు 31న అసెంబ్లీలో తీర్మానం చేసిన పంపిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నింటనీ నెల రోజుల్లోలోగా అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటాని అల్టిమేటమ్‌ జారీ చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

తీర్మానంపై చర్చలో పలువురు సభ్యులు....

ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు సాధించే విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిపై నమ్మకం లేకపోయినా.. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు జగన్‌ ప్రకటించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు తీర్మానాన్ని ఏకంగ్రీవంగా ఆమోదించాలని కోరారు. విభజన చట్టంలోని హామీ అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. 

ఎంపి అసదుద్దీన్ పై మల్కాజిగిరి లో కేసు నమోదు

హైదరాబాద్ :ఎంపి అసదుద్దీన్ ఓవైసీపై మల్కాజ్ గిరి కోర్టులో సాయిగౌడ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 'భారత్ మాతీకీజై' నినాదం చేయనున్న ఒవైసీ వ్యాఖ్యలపై 153-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నేరేడ్ మేట్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

ముషీరాబాద్ లో 150 బస్తాల ఎముకల పొడి స్వాధీనం

హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 150 బస్తాల ఎముకల పొడి స్వాధీనం చేసుకున్నారు. ఎముకల పొడితో టూత్ పేస్టులు, టీపౌడర్లు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాచరికంలో ఉన్నామని బాబు అనుకుంటున్నారు:జగన్

హైదరాబాద్ : రాచరికంలో ఉన్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని - మనం ఉన్నది ప్రజాస్వామ్యలో అనివైసీపీ జగన్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మంత్రులు నన్ను తిడితే మాటలు స్పీకర్ కు వినసొంపుగా ఉంటాయన్నారు. బీద అరుపులు అన్న నా మాటలను తప్పుపడుతున్నారు. బీద అరుపులని ఎవరైనా సాధారణంగా అనుకునే మాటే... సీఎం అన్నీ అపార్థాలే చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు.

హైకోర్టులో రోజా పిటిషన్ పై వాదనలు

హైదరాబాద్ : హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై వాదనలు ప్రారంభం అయ్యాయి. ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం పై రోజా హైకోర్టు ఆశ్రయించింది.

తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ ముందు వుందని సీఎం కేసీఆర్ అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఏవియేషన్ ఎక్స్ పో షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రక్షణ రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అని అన్నారు. అంతర్జాతీయ ఏవియేషన్ సో విజయవంతం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఆర్థిక రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి:రాష్ట్రపతి

హైదరాబాద్ : ఆర్థిక రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ఏవియేషన్ ఎక్స్ పో షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏవియేసన్ లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. పౌరవిమానయాన రంగంలో భారత్ ది 9వ స్థానం అని తెలిపారు. 2020 నాటికి భారత్ మూడో స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

15:29 - March 16, 2016

హైదరాబాద్: విభజన హామీలపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చాలామంది సభ్యులు సలహాలు, సూచనలు ఇచ్చారని.. వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన తాము కోరుకున్నది కాదని... రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశించి ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పక్షాలు ఆమోదం తెలపాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇది అత్యంత అవసరమైన తీర్మానమని పేర్కొన్నారు. విభజన తర్వాత మనకు అప్పులు ఎక్కువ, ఆస్తులు తక్కువ మిగిలాయన్నారు. సమస్యలను అధిగమించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో పెట్టుబడి పెట్టకపోతే ఆదాయం రాదు. కొన్ని ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి... కొంత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టుకోవాలి. మీరు తిట్టినా పడుతున్నానంటే రాష్ట్ర ప్రయోజనం కోసమే అన్నారు. మనకి కష్టపడేతత్వం ఉంది.. అంతే తెలివితేటలు కూడా ఉన్నాయ... అభివృద్ధి చెందుతామని తెలిపారు. విభజన చట్టంలోనివే కాకుండా అదనంగా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే వూరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు భాష మార్చుకోపోతే శాసనసభకు ఉన్న హుందాతనం పోతుందని చంద్రబాబు నాయుడు సూచించారు. ఆయన ముందుగా ఇతర సభ్యులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి వచ్చేవరకు ఆదుకోవాలన్నారు. 

ఏవియేషన్ ఎక్స్ పో షోను ప్రారంభించిన రాష్ట్రపతి

హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయంలో ఏవియేషన్ ఎక్స్ పో షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గరవ్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 25 దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. విభజన చట్టంలో చేసిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి శాసనసభ ఆమోదం తెలిపింది. 17 అంశాలతో సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష నేత జగన్ మద్దతు తెలిపారు.

ప్రధాని దిష్టిబొమ్మ దహనం....

ఢిల్లీ : ఏపీ భవన్ ముందు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిన ఏపీ కాంగ్రెస్ నేతలు . అనంతరం ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులను నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.

మెడికల్‌ విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య

కరీంనగర్‌ :నగునూర్‌లో మెడికల్‌ విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య చేసుకుంది.... ఖమ్మం జిల్లా మన్రిల్లాగూడెంకుచెందిన సౌమ్యకు గత నెల వీణవంక మండలం మామిడాలపల్లికిచెందిన పవన్‌తో 17రోజులక్రితం వివాహం జరిగింది.. హానీమూన్‌కువెళ్లిన భార్యా భర్తలు నిన్న హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.. ఆ తర్వాత సౌమ్యను ఆమె భర్త కరీంనగర్‌కు పంపారు.. రూంకుచేరుకున్న సౌమ్య అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది... అయితే సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ఢిల్లీలోని ఏపీ భవన్‌ దగ్గర కాంగ్రెస్‌ నేతల ధర్నా

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ దగ్గర ధర్నా చేపట్టారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌ గాంధీలను కాంగ్రెస్‌ నేతలు కలిశారు. 

14:46 - March 16, 2016

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ తప్ప మరో పార్టీ ఉండొద్దనే భావన మంచిదేనా అని టీ కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత జానారెడ్డి ప్రశ్నించారు.ప్రతిపక్షాలకు ఓట్లు అడగేహక్కు లేదనడం నియంతృత్వ ధోరణికి నిదర్శమన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అందుకు సహకరిస్తామని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ప్రతిపక్షంగా నిలదీస్తామని తెలిపారు. అసెంబ్లీలో సాధారణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. ప్రశ్నోత్తరాల తరువాత బడ్జెట్‌పై చర్చను జానారెడ్డి ప్రారంభించారు. జానారెడ్డి ప్రసంగం తరువాత స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రుణమాఫీపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ

హైదరాబాద్ : రుణమాఫీపై ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలను సభలో ఉంచుతానని జగన్‌ అన్నారు. తాను రుజువు చేస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా..అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా దేశంలో ఎక్కడా చేయని రీతిలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని టీడీపీ సభ్యులు ఎదురు దాడికి దిగారు. 

14:42 - March 16, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. విభజన హామీలపై సీఎం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.మొత్తం 18 అంశాలపై తీర్మానాన్ని సభలో పెట్టారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించారని చంద్రబాబు అన్నారు. విభజన జరిగిన తీరు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామన్నారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అలాగే రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం ఇవ్వాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని బాబు కోరారు.

14:40 - March 16, 2016

గుంటూరు : కేకేఆర్‌ ప్లాజాలో సమావేశమైన కాపు నేతలను సీఐడీ అధికారులు విచారించారు.తుని ఘటన వివరాలను అధికారులు తెలుసుకున్నారు. అయితే ఫొటోలో ఉన్నవారి వివరాలు తమకు తెలియదన్న కాపు నేతలు సీఐడీ అధికారులకు చెప్పారు. మరోసారి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కాపునేతలను అధికారులు ఆదేశించారు. తుని ఘటనకు కొందరినే బాధ్యులను చేయాలని చూస్తే ఊరుకోమంటున్న మనోహర్‌నాయుడు హెచ్చరించారు.

14:37 - March 16, 2016

హైదరాబాద్ : లైంగిక వేధింపులు అంటే ఏమిటి? పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురౌతోన్న మహిళలు ఎవరిని ఆశ్రయించాలి? వేటిని మనం లైంగిక వేధింపులుగా గుర్తించాలి? ఈ అంశాలపై వేదిక కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఏపీకి ప్రత్యేక హోదా పై అసెంబ్లీలో తీర్మానం..

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం ఇవ్వాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని బాబు కోరారు.

మ.2..30గంలకు రోజా కేసు విచారణ

హైదరాబాద్ :ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసు తదుపరి విచారణ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. హైకోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణలో రోజా తరపు వాదనలు పూర్తయ్యాయి. కాగా, సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు పరిశీలించింది. ఈ కేసును మరో బెంచ్ కు అప్పగించింది. అత్యవసర వ్యాజ్యంగా స్వీకరించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేసు విచారణ చేపట్టారు. 

ఆ పార్టీలోనే జాతివ్యతిరేకత ఎక్కువ : కేజ్రీవాల్..

ఢిల్లీ : బీజేపీలోనే జాతి వ్యతిరేకత ఎక్కువని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

బడ్జెట్ అంతా గందరగోళం - జానా..

హైదరాబాద్ : బడ్జెట్ అంతా గందరగోళంగా ఉందని కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బడ్జెట్ తీరుపై ఆవేదన చెందుతున్నట్లు, బడ్జెట్ కేటాయింపులన్నీ ఆవేశంగా చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది - బాబు..

హైదరాబాద్ : రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో విభజన హామీలపై ఆయన తీర్మానం చేశారు. మొత్తం 18 అంశాలతో తీర్మానం చేశౄరు. విభజన బిల్లులోని హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. 

13:24 - March 16, 2016

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగిన తీరు ఎవరూ మరిచిపోరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నుండి కోలుకోలే పోతున్నామని పేర్కొన్నారు. హేతుబద్ధత లేకుండా..ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. పార్లమెంట్ తలుపులు మూసేసి అరగంటలో తీర్మానం చేశారని సభకు తెలిపారు. అన్యాయం జరుగుతుంది..ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా చేశారని, ప్రజలంతా అభద్రతా భావానికి లోనయ్యారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉందని తెలిపారు. 14-15 సంవత్సరానికి పర్ క్యాపిటా ఇన్ కం పరిశీలిస్తే ఏపీ రూ. రూ. 95,689 ఉంటే తెలంగాణ రూ. 1,29,182 ఉందన్నారు. అదే తమిళనాడు రూ. 1,35,806, కేరళ రూ. 1,38,390 ఉందన్నారు. ఏపీ జనాభా 55.3 శాతం ఉంటే ఆదాయం 46.6 శాతం ఉందని, తెలంగాణకు 41.68 జనాభా ఉంటే ఆదాయం 53.40 శాతం ఆదాయం వచ్చిందని, అలాగే అప్పులను పరిశీలిస్తే ఏపీకి 19.4 శాతం, తెలంగాణకు 18.1 శాతం అప్పులు వచ్చాయని చంద్రబాబు సభకు వివరించారు. 

ఏపీ అసెంబ్లీలో విభజనపై తీర్మానం..

హైదరాబాద్ : విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారు. 

వచ్చే విద్యా సంవత్సరం నుండి కాపులకు స్కాలర్ షిప్ లు..

హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుండి కాపులకు స్కాలర్ షిప్ లు అందచేయనున్నట్లు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పేర్కొన్నారు. 

టి.అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం..

హైదరాబాద్ : అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత జానారెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. బడ్జెట్‌పై చర్చ ఈ నెల 16 నుంచి 19 వరకు చర్చ జరగనుంది. 

తుని ఘటనపై సీఐడీ అధికారుల విచారణ...

గుంటూరు : కాపులకు రిజర్వేషన్ల కావాలనే డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా తునిలో  జరిగిన అల్లర్ల విషయంలో కాపు నేతలను మరొకసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు. 

ఇంకో పార్టీ ఉండకూడదా - జానా..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉండకూడదా అని టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి ప్రశ్నించారు. ఇదేనా ప్రజా స్వామ్యమా ? ఇంకో పార్టీ ఉండటానికి వచ్చారా ? అని ప్రశ్నించారు. ప్రజలు ఏదైతే ఆశించారో అది చేయడానికి వచ్చారా ? అని ప్రశ్నించారు.

12:45 - March 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది ప్రజాస్వామ్యమేనా అని తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఒప్పించడానికి..మెప్పించడానికి..అవగాహన కల్పించడానికి మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలింబించాలని సూచించారు. ఈ రాష్ట్రంలో పార్టీ ఉండకూడదు..ఇదేనా ప్రజా స్వామ్యమా ? ఇంకో పార్టీ ఉండటానికి వచ్చారా ? ప్రజలు ఏదైతే ఆశించారో అది చేయడానికి వచ్చారా ? అని ప్రశ్నించారు. ఎన్నికలు లేకున్నా సరే..ఏ పార్టీ ఓట్లు అడగడానికి వీలు లేదు..పేర్కొనడం ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ ధోరణి అంటారని విమర్శించారు. పక్క అసెంబ్లీ జరుగుతున్న తీరు అందరూ చూస్తూనే ఉన్నారని, అలాంటి పరిస్థితి రాకుండా చూడటానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజా సమస్యలపై పట్టుదలతో పనిచేయడమే విధి అని తెలిపారు. ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగ స్పూర్తి, ఆత్మాభిమానం అందరికీ వర్తిస్తుందని జానారెడ్డి తెలిపారు. 

రేషన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడితే పీడీయాక్టు : మంత్రి ఈటెల....

హైదరాబాద్ : రేషన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడేవారిపై పీడీయాక్టు నమోదు చేస్తామని మంత్రి ఈటెల . పౌరసరఫరాల శాఖను అవినీతి రహితంగా మార్చి ఆహార భద్రత కార్డులను ఆధార్ తో అనుసంధానం చేస్తామని, నకిలీ రేషన్ కార్డులను తీసివేస్తామని, ఉల్లిపాయలు, కందిపప్పును సబ్సిడీపై అందించామని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన..

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కు సెలవు ప్రకటించి కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18న టీఆర్ఎస్ లెజిస్ట్రేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్‌ఎస్ లెజిస్ట్రేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ - కడియం..

హైదరాబాద్ : త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు.

12:17 - March 16, 2016

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ పీసీసీ నేత రఘువీరా అల్టిమేటం జారీ చేశారు. తమకు ఒంటి గంట లోపున అపాయింట్ మెంట్ ఇవ్వాలని..తమ సమస్యలు వినాలని లేనిపక్షంలో రేస్ కోర్సును ముట్టడిస్తామని రఘువీరా హెచ్చరించారు. ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఏపీ కాంగ్రెస్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మూడు రోజుల నుండి ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. జాతీయ పార్టీల నేతలు కలిసి మద్దతు కోరారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ హాజరయ్యారు. సమావేశం అనంతరం గోదావరి బ్లాక్ వద్ద ఏపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలని, వెనక్కి వెళ్లవద్దని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లు ఇస్తామన్న వెంకయ్య నాయుడు చట్టం లేదని పేర్కొనడాన్ని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకోవాలని, మట్టి సత్యాగ్రహం ద్వారా సేకరించిన మట్టి..నీరు..కోటి సంతకాలను తీసుకోవాలని కోరారు. ఒంటి గంట లోపున అపాయింట్ మెంట్ ఇవ్వాలని, ప్రధాని దగ్గరి నుండి తమకు సమాచారం రావాలని డిమాండ్ చేశారు. సమచారం రాకపోతే రేస్ కోర్సును ముట్టడిస్తామని హెచ్చరించారు. అపాయింట్ మెంట్ ఇస్తే ఎక్కడకు పిలిచినా వస్తామని..కోటి సంతకాలు..మట్టి నీటిని అందచేయడం జరుగుతుందని..ఇచ్చిన హామీలను గుర్తు చేస్తామని, అవకాశం ఇస్తారా ? లేదా ? అని రఘువీరా పేర్కొన్నారు. మరి ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అన్నది చూడాలి. 

ఢిల్లీలో ఏపీ నేతల ఆందోళన..

ఢిల్లీ  : ఏపీభవన్ ఎదుట ఏపీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వారు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. వెంకయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

12:00 - March 16, 2016

వరంగల్ : ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటనను వెలుగులోకి తెచ్చిన టెన్ టివి కథనంపై పోలీసులు స్పందించారు. సీపీ సుధీర్ బాబు ఈ ఘటనపై ఆరా తీశారు. అనుమానితులుగా భావిస్తున్న పసునూరి వెంకటేష్, సాయిరామ్, వెంకటేష్, మహేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మసాగర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.
ధర్మసాగర్ మండలం కరుణాపురంలో దళిత యువతిపై ఓ రాత్రి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వ్యాన్ రావడం చూసిన యువకులు పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ముళ్ల పొదల్లో వెతికారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించింది. వెంటనే ఈమెను వైద్య శాలకు తరలించారు. కోలుకున్న అనంతరం సదరు యువతిని ధర్మసాగర్ పీఎస్ కు తరలించి వివరాలు సేకరించారు. అత్యాచారం చేసిన వారిలో ఓ జవాన్ ఉన్నట్లు, రాజకీయ వత్తిళ్ల కారణంగా ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి.

11:54 - March 16, 2016

హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షం గొంతు తెలంగాణ ప్రభుత్వం నొక్కుతోందని టిటిటిడి సభ్యుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వడం లేదన్నారు. స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని..స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరసనగా తాము వాకౌట్ చేశామన్నారు. 

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల సమావేశం...

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు.  ఏపీ సమస్యలను పరిష్కరించేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే వుంటుందని, ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు మట్టి , నీరు మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సోనియా మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో మాత్రమే ఏపీకి న్యాయం జరుగుతుందని, విభజన జరిగి రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయలేదన్నారు.

11:51 - March 16, 2016

హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు సర్కార్ పక్కదోవ పట్టిస్తోందని, రెండేళ్లలో రాజధానిలో మొత్తం రూ.850 కోట్ల రూపాయలు దేని కోసం ఖర్చు చేశాని వైసీపీ సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఏపీ శాసనసభలో బుధవారం ఈ ప్రశ్నను ఆయన లేవనెత్తారు. రూ.2,200 కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్రం పేర్కొంటోందని సభకు తెలిపారు. తాత్కాలిక రాజధానికే రూ.200 కోట్లు పెడుతున్నారని, శాశ్వత రాజధానికి ఎక్కడి నుండి నిధులు తెస్తారని ప్రశ్నించారు. దుబారా చేయడం వాస్తవమేనా ? న్యాయమేనా ? ఇప్పటికైనా కరెక్టుగా డబ్బులు ఎంత వచ్చాయి ? ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. కేంద్రం నుండి కేవలం రూ. 850 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యాన్యూటీ కోసం రూ. 163 కోట్లు, పెన్షన్లకు రూ. 60.5 కోట్లు, రుణమాపీకి రూ. 75.6 కోట్లు, స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 3.5 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. 

11:34 - March 16, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై తామిచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రసంగించారు. విభజన చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సోనియా తెలిపారు. ప్రత్యేక హోదాపై తాము పోరాటం కొనసాగిస్తామని హామీనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి సహకారం అందించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలవరం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తోందని, ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంపై వత్తిడి తెస్తామని హామీనిచ్చారు. ఏపీకి ఇచ్చిన హమీలని కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన మంత్రి కేవలం వత్తిడిని మాత్రం పట్టించుకుంటారని, భాషను పట్టించుకోరని రాహుల్ ఎద్దేవా చేశారు. 

11:29 - March 16, 2016

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుండి సేకరించిన మట్టి..నీరు..కోటి సంతకాలను సోనియాకు చూపించారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ కాంగ్రెస్ కోటి సంతకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోనియా, రాహుల్, మన్మోహన్ లు కూడా సంతకం చేశారు. గత కొంతకాలంగా ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా కల్పించాలంటూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లి కేంద్రంపై వత్తిడి పెంచాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఏపీ కాంగ్రెస్ వత్తిడితో కేంద్రం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం దొంగల అరెస్ట్...

చిత్తూరు : ఐదుగురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లలను పోలీసులు అరెస్ట్ చేశారు. జలీల్ ఖాన్, ఆజిల్ ఖాన్, షేక్ అహ్మద్, కౌసీ ఉల్లాకాన్, మహ్మద్ యూసఫ్ ల నుండి రూ. కోట్లు విలువ గల ఏడు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11:16 - March 16, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సంవత్సర కాలం పాటు సస్పెండ్ చేయాన్ని రోజా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై రోజా సుప్రీంకోర్టు కు వెళ్లారు. అక్కడి నుండి అందిన ఆదేశాలతో హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రోజా తరపున లాయర్ ఇందిరా జైన్ వాదనలు వినిపించారు. గలంలో లంచ్ మోషన్, హౌస్ మోషన్ లలో జరిగిన జాప్యంపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఆరా తీశారు. సస్పెన్షన్ ఒక సెషన్ కు మాత్రమే పనిచేస్తుందని, రాజ్యాంగ హక్కులను..భావా ప్రకటనలను హరించే విధంగా చేస్తున్నారని రోజా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణను మరో కోర్టుకు బదిలీ చేసింది. 

జాతీయస్థాయి కబడ్డీ ప్లేయర్ హత్య...

హర్యానా : జాతీయస్థాయి కబడ్డీ ప్లేయర్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రోహతక్ లో ఈ ఘటన చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

మరో కోర్టుకు రోజా పిటిషన్..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో లంచ్ మోషన్, హౌస్ మోషన్ లలో జరిగిన జాప్యాన్ని జాప్యంపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఆరా తీశారు. విచారణనను మరో కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

హోదాపై ప్రభుత్వానికి ఇంట్రస్ట్ లేదు - రాహుల్..

ఢిల్లీ : తాను ఎన్నోసార్లు ఏపీ రాష్ట్రానికి రావడం జరిగిందని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంపై ఎన్నోసార్లు మాట్లాడినా ప్రభుత్వం స్పందించ లేదన్నారు. 

హైకోర్టు విభజన జరగాలి - జీవన్ రెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న న్యాయవాదులకు నష్టం వాటిల్లకుండా వుండాలంటే హైకోర్టు విభజన జరగాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో హైకోర్టు విభజనపై ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో ఎంపీ జితేందర్ రెడ్డి హైకోర్టు విభజన విషయాన్ని  ప్రస్తావించారని సభకు తెలిపారు. 

గాంధీ విగ్రహం ఎదుట తృణముల్ ఎంపీల నిరసన..

ఢిల్లీ : తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 

శ్రీవారిని దర్శించకున్న నటి భానుప్రియ..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని సినీ నటి భానుప్రియ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి వారి సేవలో ఆమె పాల్గొన్నారు. 

నూతన 108 అంబులెన్స్ లు ప్రారంభం..

హైదరాబాద్: నూతన 108 అంబులెన్సు సర్వీసులను మంత్రి లక్ష్మారెడ్డి నేడు ప్రారంభించారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో గల పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. 

10:42 - March 16, 2016

హైదరాబాద్ : రేషన్ సరుకుల్లో జరుగుతున్న అక్రమాలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేషన్ అక్రమాలపై మంత్రి ఈటెల మాట్లాడారు. ఇప్పటి వరకు 115 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 244 మందిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందన్నారు. 1,20,964 మెట్రిక్ టన్నులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో పెద్ద మొత్తంలో ఇంతగా రైడ్ చేయడం గాని, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం గాని జరగలేదన్నారు. గత సంవత్సరం రైడ్ లో సీజ్ చేసిన విలువ మొత్తం రూ.22 కోట్లు అయితే ఈ సంవత్సరం సీజ్ చేసిన విలువ మొత్తం రూ.45 కోట్ల 19 లక్షలని తెలిపారు. అంతేగాకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించామని, 6 మందిపై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగిందని మంత్రి ఈటెల సభకు తెలిపారు.

10:38 - March 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది పేదలున్నారని చెప్పిన ప్రభుత్వం కేవలం కోటి మందికి రేషన్ష కార్డులిచ్చారని, మరి మిగతా 2 కోట్ల మందికి ఏ కార్డులిస్తారని ఎఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రశ్నించారు. బుధవారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఏమీ ఇవ్వడం లేదని, రేషన్ దుకాణాల్లో బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ జరుగుతోందని తెలిపారు. రేషన్ దుకాణాలపై ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు. 

10:32 - March 16, 2016

హైదరాబాద్ : మహిళా సాధికారిత..మహిళలకు రుణ సదుపాయం గురించి అడిగితే మంత్రి కిమిడి మృణాళిని పెద్ద స్టోరీ చెప్పిందని వైసీపీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన విమర్శించారు. రూ.1,427 కోట్ల రుణమాఫీ ఉంటే కేవలం మాఫీ చేసింది రూ. 3,776 కోట్లు అని తెలిపారు. అంతకంటే ముందు ఏపీ శాసనసభలో ఉప్పులేటి కల్పన వేసిన ప్రశ్నకు మంత్రి కిమిడి మృణాలిని సమాధానం ఇచ్చారు. డ్వాక్రా బజార్ వెళ్లి చూస్తే మహిళలు చేస్తున్న కృషి తెలుస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో మహిళా దినోత్సవం రోజున తాను వెల్లడం జరిగిందని, వారు చేసిన ప్రదర్శనను చూసి ఎంతో సంతోషం కలిగిందన్నారు. మహిళలు కష్టపడుతున్న తత్వం, వారి ధైర్యం చూసి ఎంతో ముచ్చటపడ్డానన్నారు. దీనికంతటికి కారణం ప్రభుత్వం చేపడుతున్న విధానాలేనన్నారు. రూ. 5వేలు కాదు..రూ. 50 వేలు సంపాదిస్తున్నానని డ్వాక్రా సంఘ సభ్యురాలు పేర్కొందని సభకు తెలిపారు. దీనికి వైసీపీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

యువతిపై సామూహిక అత్యాచారం...

వరంగల్ : ధర్మసాగరం మండలం కరుణాపురంలో ఓ యువతికి మద్యం తాగించి ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన నిందితుల్లో ఓ ఆర్మీ జవాను కూడా ఉన్నాడనే కారణంతో కేసు నమోదు చేయటానికి పోలీసులు వెనుకాడుతున్నట్లు సమాచారం. 

10:22 - March 16, 2016

వరంగల్ : దళితులు..వీరిపై ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఓ 19 సంవత్సరాల దళిత యువతిపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఓ జవాన్ కూడా ఉండడం..పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి స్నేహితుడే మోసం చేశాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..ధర్మసాగర్ మండలం కరుణాపురంలో దళిత యువతిపై ఓ రాత్రి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వ్యాన్ రావడం చూసిన యువకులు పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ముళ్ల పొదల్లో వెతికారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించింది. వెంటనే ఈమెను వైద్య శాలకు తరలించారు. కోలుకున్న అనంతరం సదరు యువతిని ధర్మసాగర్ పీఎస్ కు తరలించి వివరాలు సేకరించారు. కానీ ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి కేసు నమోదు చేయలేదని ధర్మసాగర్ పోలీసులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:09 - March 16, 2016

హైదరాబాద్ : ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లో పనిచేస్తున్న ఓ యాంకర్ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిరోష..యాంకర్ గా పనిచేస్తోంది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రిపోర్టర్ గా కీలక బాధ్యతలు వ్యవహరించింది. ప్రస్తుతం జెమిని టీవీ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా విధులు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈమె సికింద్రాబాద్ లో సింధి కాలనీలో ఉన్న ఉమెన్స్ హాస్టల్ లో ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున నిరోష ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఉంటున్న బంధువులకు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందు వల్ల ఆత్మహత్య చేసుకుందా ? లేక ప్రేమ వ్యవహారం వల్ల ఆత్మహత్య చేసుకుందా ? అనేది తెలియాల్సి ఉంది. 

యాంకర్ నిరోష ఆత్మహత్య...

సికింద్రాబాద్ : రాంగోపాల్ పేట్ లోని ఉమెన్స్ హాస్టల్లో యాంకర్ నిరోషా ఆత్మహత్యకు పాల్పడింది. ఓ మ్యూజిక్ ఛానల్ లో కొంతకాలంగా నిరోషా పనిచేస్తోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమని తెలుస్తోంది. 

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్న సభ్యులు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేయాలని ఏపీ శాసనసభ విపక్ష సభ్యులు కోరారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రెవెన్యూ వ్యవస్థపై పలు ప్రశ్నలు అడిగారు.

నాలా ట్యాక్స్ ను తగ్గించాలి - విష్ణుకుమార్ రాజు...

హైదరాబాద్ : విశాఖపట్టణంలో నాలా ట్యాక్స్ కు ప్రజలు పది శాతం కడుతున్నారని, అలాగే మున్సిపల్ శాఖకు కూడా కడుతున్నారని తెలిపారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ లో మూడు శాతమే చేస్తున్నారని సభకు తెలిపారు. 

09:34 - March 16, 2016

హైదరాబాద్ : విశాఖపట్టణం ఎంతో అభివృద్ధి చెందుతోందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. బుధవారం ప్రారంభమైన ఏపీ శాసనసభలో స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అందులో భాగంగా సభ్యుడు విష్ణుకుమార్ రాజు నాలా ట్యాక్స్ అంశంపై ప్రశ్న లేవనెత్తారు. విశాఖపట్టణంలో నాలా ట్యాక్స్ కు ప్రజలు పది శాతం కడుతున్నారని, అలాగే మున్సిపల్ శాఖకు కూడా కడుతున్నారని తెలిపారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ లో మూడు శాతమే చేస్తున్నారని సభకు తెలిపారు. నాలా ట్యాక్స్ శాతాన్ని తక్కువ చేయాలని కోరారు. దీనిపై మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ అడిగిన విధంగా పాస్ బుక్ తీసివేయడం లేదని, ఆప్షనల్ గా చేస్తున్నామని పేర్కొన్నారు. అర్బన్ ఏరియాలో అడంగహళ్ ఉండాలని కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నాలా ట్యాక్స్ పరిశీలన చేయడం జరుగుతుందన్నారు.

09:30 - March 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా స్పీకర్ పై విపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతోందా ? ఏపీ రాష్ట్రంలో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఘాటు పదాలు వాడడం..దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై టి.కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగంలో సీఎం కేసీఆర్ విపక్షాలపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవర్ అభ్యంతరం తెలిపింది. సీనియర్ నేతలపై ఇలాంటి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. దీనిపై స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం ప్రారంభమయ్యే శాసనసభలో కొత్త జిల్లాల ఏర్పాటు, దుమ్ముగూడెం ప్రాజెక్టు, నిత్యాసవరాల పెరుగుదల ఇతర అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై సభ్యులు చర్చించనున్నారు. 

09:28 - March 16, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేయాలని ఏపీ శాసనసభ విపక్ష సభ్యులు ముక్త కంఠంతో కోరారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రెవెన్యూ వ్యవస్థపై పలు ప్రశ్నలు అడిగారు. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకోవాల్సినవసరం ఉందని సభ్యుడు పార్థసారధి తెలిపారు. 1954 లో పట్టాభూములు కొనడానికి అమ్మడానికి వీలు లేదని, కానీ కర్నాటక రాష్ట్రంలో వెసుబాటు ఉందన్నారు. మార్పు చేయడం వల్ల రిజిస్ట్రేషన్ లు పెరిగే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, మిగతా సభ్యులు ఆంజనేయులు రవికుమార్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. 

కాసేపట్లో టి.అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ పై చర్చ జరగనుంది. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని లెఫ్ట్ వాయిదా తీర్మానం ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. 

09:04 - March 16, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో మళ్లీ అధికార..విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించుకోనున్నారా ? లేక సజావుగా జరుగుతుందా ? గత రెండు రోజుల నుండి వైసీపీ ఇచ్చిన తీర్మానాలపై సభ జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం ప్రారంభమైన సభలో విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేయనున్నారు. నెరవేర్చని హామీలపై కేంద్రానికి పంపబోయే తీర్మానంపై చర్చించనున్నారు.
తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టానున్నారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రాజధానికి కేంద్ర సహాయం, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు, ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం..రహదారుల ప్రమాదాలపై సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. అనంతరం జీరో అవర్ కొనసాగనుంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై చర్చ జరగనుంది. మంగళవారం పార్లమెంట్ లో విభజనపై సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విభజన జరిగే సమయంలో యూపీఏ ఎలాంటి హామీలిచ్చింది ? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ఎన్ని హామీలు నెరవేర్చింది. ఏపీ రాష్ట్రానికి ఎంత సహాయం తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ తీర్మానం చేయడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందా ? అని వైసీపీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకుండానే తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. విభజన..ఏపీకి రావాల్సిన సహాయంపై సభలో సజావుగా చర్చ జరుగుతుందా ? లేదా ? అనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది. 

కాసేపట్లో ఏపీ శాసనసభా సమావేశాలు...

హైదరాబాద్ : ఏపీ శాసనసభ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేయనున్నారు. నెరవేర్చని హామీలపై కేంద్రానికి పంపబోయే తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రాజధానికి కేంద్ర సహాయం, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు, ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం..రహదారుల ప్రమాదాలపై సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.

 

ఉత్కంఠభరితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు..

అమెరికా : అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఐదు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవికి ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుండి రుబియో తప్పుకున్నారు. ఫ్లోరిడాలో ట్రంప్ విజయం తరువాత రుబియో తప్పుకున్నారు. ఫ్లోరిడా, ఒహియో, నార్త్ కరోలినాలో హిల్లరీ గెలుపొందారు. ఫ్లోరిడా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందారు. ఒహియో ప్రైమరీ ఎన్నికల్లో జాన్ కాషిష్ విజయం సాధించారు. 

08:09 - March 16, 2016

తెలుగులో ప్రస్తుతం ప్రతినాయకుడుగా మార్కులు కొట్టేస్తున్న వ్యక్తి ఎవరు అని అడిగితే జగపతిబాబే అంటారు. ఆయన గతంలో హీరోగా చేసిన పాత్రలను పక్కపెడితే ఇప్పుడు ప్రతినాయకుడుగానే బాగా రాణిస్తున్నారు. విలన్‌ అంటే జగపతి బాబే అన్నట్టుగా మారిపోయింది. లెజెండ్‌లో ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల చేసిన నాన్నకు ప్రేమతో..లో కూడా ప్రతినాయకుడుగా మెప్పించారు. ఇప్పుడు తెలుగులోనే కాకుండా తమిళంలో ప్రతినాయకుడుగా చేసేందుకు అవకాశాలు వస్తున్నాయి. ఈ భాషలో ఇది వరకే రజనీకాంత్‌ చిత్రం 'లింగ'లో నటించారు. ఇప్పుడు విజయ్ హీరోగా చేస్తున్న సినిమాలో విలన్‌గా చేయనున్నారు ఈ జగ్గూభాయ్. భరతన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్‌ చేయనుంది.

08:07 - March 16, 2016

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరు పరీక్ష రాసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఆవుకు మండలానికి చెందిన దాసరి రాముడు, రాజు, మద్దిలేటిలు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేందుకు కోవెలకుంట్లకు వెళుతున్నారు. కోవెలకుంట్ల రహదారిపై వెళుతున్న ట్రాక్టర్ ను క్రాస్ చేయబోయారు. అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో దాసరి రాముడు, రాజులు అక్కడికక్కడనే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మద్దిలేటి కన్నుమూశాడు. దీనితో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు..కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

07:59 - March 16, 2016

మెగాస్టార్‌ చిరంజీవి చేయబోయే చిత్రం ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రమే చిరు 150వ సినిమాగా చేస్తున్నారనే ప ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో ఏర్పడిన సమస్యకు పరిష్కారం లభించాక వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని దర్శకుడు వి.వి. వినాయక్‌ భావిస్తున్నట్లు టాక్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం. రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతారను కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలిసింది. చిరంజీవితో నయన తార జత కట్టడం ఇదే మొదట సారి. ప్రస్తుతం ఈమె తమిళం, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో వెంకటేష్‌తో 'బాబు బంగారం' చిత్రంలో చేస్తోంది. చిరంజీవి సరసన నటించేందుకు నయన గ్రీన్‌సిగల్‌ ఇచ్చిందని తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల మృతి..

కర్నూలు : సంజామల మండలం ఆకుమల్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను బైక్ ఢీకొట్టింది. ముగ్గురు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కోవెలకుంట్లకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సంతోష్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : సంతోష్ నగర్ డివిజన్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 30 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. 100 బైక్ లు, 10 తల్లార్లను స్వాధీనం చేసుకున్నారు. 

07:51 - March 16, 2016

నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసాకు సెప్టెంబర్ 4వ తేదీన పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌ హుడ్‌ను అధికారికంగా ప్రధానం చేయనుంది. మదర్‌ థెరిసాకు సెయింట్‌ హుడ్‌ హోదా ఇవ్వడానికి పోప్ ప్రాన్సిస్ అంగీకరించింది. గత ఏడాది మదర్‌ థెరిసాలోని అతీత శక్తిని గుర్తించిన పోప్‌ ఆమెను దైవ దూతగా ప్రకటించారు. ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా సెప్టెంబర్‌ 4 నుంచి ఇక దైవదూతగా అవతరించనున్నారు. థెరిసా ప్రార్థనల మహిమ వల్ల బ్రెజిల్‌కు చెందిన ఓ రోగి బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి నుంచి బయటపడగా... మోనికా అనే రోగికి కడుపులో కణతులతో వ్యాధితో విముక్తురాలైంది. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుదిశ్వాస విడిచారు. 

07:48 - March 16, 2016

మయన్మార్ నూతన అధ్యక్షుడిగా హితిన్‌ క్యా ఎన్నికయ్యారు. ఎన్‌ఎల్‌డి నేత ఆంగ్ సాన్ సూకి మాజీ డ్రైవర్ గా పనిచేసిన హితిన్‌ క్యా అత్యంత నమ్మకస్తుడు. చాలా కాలం తర్వాత సూకి నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూకి అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో 70 ఏళ్ల హితిన్‌క్యాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు. టిన్, సూకీతో కలిసి చదువుకున్నారు. చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మయన్మార్‌లో సైనిక పాలనకు తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం అవతరించింది. మయన్మార్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన యూ హితిన్‌ క్యాకి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-మయన్మార్‌ దేశాల సత్సంబంధాలను బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దాం.. అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. 

07:43 - March 16, 2016

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినప్పటికీ కొన్ని క్రిమి, కీటకాలు, ఎలుకలు, పిల్లులు వంటి జీవాలు దారితప్పో లేక, వాటి ఆహార వేటలో భాగంగానో ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే ఆ విధంగా వచ్చే వాటిని మనం తరిమికొడుతుంటాం. ఆ కోవలోనే వేసవికాలంలో ఇళ్లలోకి చీమలు ఎక్కువగా వస్తుంటాయి. వాటికి తాత్కాలికంగా మందు వేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. శాశ్వతంగా వాటి బారి నుండి తప్పించుకోవాలంటే ఇలా చేయండి.
ఇళ్లలో చీమలు వంట గదిలోను, చెత్తబుట్ట దగ్గర, తీయటి తినుబండారాలు పెట్టిన చోట గుట్టలు గుట్టలుగా చేరిపోతాయి. వాటిని ఊడ్చి బయట వేసినా కాసేపటిలో అవి మళ్లీ అక్కడ చేరుతాయి. అటువంటి సమయంలో కర్పూరం గుప్పెడు తీసుకుని చీమలు ఉన్న చోట, ఇంటి మూలల్లో వేస్తే సరి. కర్పూరం వాసనకు అర గంటలో చీమలు అన్నీ కనిపించకుండా పోతాయి. మళ్లీ ఆ వాసన పోయేంత వరకు చేరవు.

07:42 - March 16, 2016

బస్సెల్‌ : ఆల్‌ ఇంగ్లాండ్‌లో తీవ్ర నిరాశపరిచిన హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. తాజాగా స్విస్‌ ఓపెన్‌పై కన్నేసింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌తో నేడు మొదలయ్యే స్విస్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నీలో సైనా నెహ్వాల్‌ సహా భారత స్టార్‌ ప్లేయర్స్‌ కిదాంబి శ్రీకాంత్‌, పి.వి సింధులు సైతం బరిలోకి దిగుతున్నారు. డబుల్స్‌ స్టార్స్‌ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు టోర్నీలో పాల్గొనటం లేదు. స్విస్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కాగా.. 2011, 2012లలో ఇక్కడ విజేతగా నిలిచిన సైనా మూడో ట్రోఫీపై గురిపెట్టింది.
ఆల్‌ ఇంగ్లాండ్‌ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సైనా.. స్విస్‌ను నెగ్గాలని చూస్తోంది. బుధవారం జరిగే తొలి రౌండ్‌ పోరులో జర్మనీ షట్లర్‌ కరిన్‌తో టాప్‌ సీడ్‌ సైనా తలపడనుంది. పి.వి సింధు (6) తన తొలి మ్యాచ్‌లో రష్యా చిన్నది నటాలియాను ఢీ కొట్టనుంది. అంచనాలకు తగినట్టు రాణిస్తే.. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సైనా నెహ్వాల్‌, పి.వి సింధులు తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ఆరుగురు షట్లర్లు పోటీలో నిలిచారు. పదో సీడ్‌ శ్రీకాంత్‌ సహా పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ, హెచ్‌.ఎస్‌. ప్రణరు, అజరు జయరాం, ఆనంద్‌ పవార్‌, బి. సాయి ప్రణీత్‌లు టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లో మహ్మద్‌ (ఇండోనేషియా)తో ఆడనున్నాడు.

07:40 - March 16, 2016

తెలుగులో ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ సరసన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబుకి జోడీగా 'బ్రహ్మోత్సవం' చిత్రాలతోపాటు బాలీవుడ్‌లో రణ్‌దీప్‌ హుడా కాంబినేషన్‌లో 'దో లఫ్జోమ్‌కి కహానీ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్‌ తొలిసారిగా విక్రమ్‌ సరసన నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'గరుడ' చిత్రం తెరకెక్కనుంది. తిరు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు తిరు మాట్లాడుతూ,'ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ దర్శక,నిర్మాత, నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ను ఎంపిక చేశాం. నా కెరీర్‌లోనే ఇదొక భారీ బడ్జెట్‌ చిత్రం. ఈ చిత్రం కోసం వంద ఎకరాల్లో ఓ పెద్ద సెట్‌ని నిర్మిస్తున్నాం. ఈ సెట్‌ సినిమాకి చాలా కీలకం. అలాగే కథాపరంగా విక్రమ్‌ లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్‌టైమ్‌ విక్రమ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. పొల్లాచ్చి, అహ్మదాబాద్‌, లక్నో తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లతోపాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో షూటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.

07:39 - March 16, 2016

గతేడాది చైనాలో విడుదలైన ఘన విజయాన్ని సాధించిన 'ది మంకీ కింగ్‌' చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సి.హెచ్‌. సతీష్‌కుమార్‌ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, '500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం గతేడాది చైనాలో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అదే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా డబ్బింగ్‌ చేయడం జరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. 'బాహుబలి' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఎంజారు చేశారో దాన్ని మించి ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ని ఎంజారు చేస్తారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా రాజశ్రీ సుధాకర్‌ మాటలు రాశారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.

07:35 - March 16, 2016

విద్యాబాలన్‌ ప్రధాన పాత్రధారిణిగా ప్రముఖ మలయాళ రచయిత్రి కమల సూరయ్య జీవితం కథతో ఓ బయోపిక్‌ రూపొందుతున్న విషయం విదితమే. హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే ఈచిత్రంలో పృథ్వీరాజ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో పృథ్వీరాజ్‌, విద్యాబాలన్‌ 'ఉర్మి' చిత్రంలో నటించిన సంగతి విదితమే. ఈ చిత్రాన్ని నిర్మాత పృథ్వీరాజ్‌ నిర్మించారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ బయోపిక్‌లో రచయిత్రి కమల జీవితానికి సంబంధించి మూడు ముఖ్యమైన స్టేజ్‌లను ప్రధానంగా చూపనున్నారు. 15 సంవత్సరాల వయసులో వివాహం, ఆమె స్వయంగా రాసుకున్న ఆటోబయోగ్రఫి 'ఎంటి కథ', 67 ఏళ్ళ వయసుల్లో ఇస్లామ్‌ మతాన్ని స్వీకరించడం వంటి ముఖ్యమైన విషయాలను కూలంకషంగా వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

07:31 - March 16, 2016

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మంగళశారం ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ సాక్షిగా ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించింది. ఏపికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో ఆచారి (బీజేపీ), గఫూర్ (సీపీఎం), శైలజనాథ్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

పేలిన ఎయిర్ ఇండియా విమానం టైర్..

ముంబై : ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలింది. విమాన కిటికి వద్ద మంటలు కనిపించాయని, తీవ్రభయాందోళనలు చెందామని ఓ ప్రయాణీకుడు ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

మెదక్ లో నేటి నుండి కార్మికుల సమ్మె..

మెదక్ : నేటి నుండి అన్ని పరిశ్రమలలో కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. కనీస వేతనం చెల్లించాలంటూ సీఐటీయూ సమ్మెకు పిలుపునిచ్చింది. 

తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టెట్ దరఖాస్తులను అధికారులు నేటి నుండి స్వీకరించనున్నారు. మే 1వ తేదీన జరిగే పరీక్షకు దాదాపు 5 లక్షల మంది హాజరు కావచ్చని అంచనా.

టి.బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చించనున్నారు. ఈనెల 14వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

బంగారం వ్యాపారులతో నేడు కేంద్రం చర్చలు..

ఢిల్లీ : నేడు బంగారం వ్యాపారులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇంటర్ పరీక్షకు ప్రశ్నపత్రం ఎంపిక..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగే ఇంటర్ పరీక్షకు ప్రశ్నపత్రం - సిని అధికారులు ఎంపిక చేశారు. 

కొంపల్లిలో లారీ - కారు ఢీ..

హైదరాబాద్ : కొంపల్లిలో లారీ - కారు ఢీకొన్నాయి. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. సాయి కిరణ్ రెడ్డి, సాయికుమార్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు.

06:43 - March 16, 2016

మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖాధికారులు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రతి ఏటా అనేక స్కూళ్లలో చెట్ల కింద, బల్లలు లేని గదుల్లో, వరండాలలో, ఒక్కొక్కసారి ఆరుబయట కూడా పరీక్షలు రాయాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇలాంటి అసౌకర్యాలు సహజంగానే విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. నిమిషం లేటైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్న అధికారులు ముందుగా ఇలాంటి సమస్యలను పరిష్కరించడం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వుంది. పదో తరగతి విద్యార్థి దశలో అత్యంత కీలకమైంది. ఈ ఫలితాలు వారి భవిష్యత్ ను నిర్ధేశిస్తాయి. అయితే, పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదు. టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి మార్కులు సాధించాలంటే పరీక్ష రాసేటప్పుడు ఏయే మెళుకవలు పాటించాలి ? పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ ఉపాధ్యాయులు ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు? పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులకు ఇంట్లో అమ్నానాన్నలు, ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి సహకారం అందించాలి? అత్యంత కీలకమైన టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం వుంది? ప్రస్తుతం పరీక్షార్ధులు ఆయా పరీక్షా కేంద్రాలలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? మన పరీక్షా విధానంలో రావాల్సిన సంస్కరణలేమిటి ? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బాపురెడ్డి సూచనలు అందించారు. వివరాలకు వీడియోలో క్లిక్ చేయండి. 

06:37 - March 16, 2016

నాగ్ పూర్ : టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌ ఓటమితో ఆరంభించింది. నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తడబడిన టీమిండియా 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన భారత్‌ 18.1 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, ధావన్‌, రైనా, యువరాజ్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరి నిరాశపరచగా.. విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ ధోని ఫర్వాలేదనిపించారు. భారత్‌ తర్వాత మ్యాచ్‌ మార్చి 19న పాకిస్థాన్‌తో తలపడనుంది.

06:35 - March 16, 2016

చెన్నై : తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. మే 16 జరిగే పోలింగ్ లో విజయం సాధించేందుకు పార్టీలు పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధాన ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకెలు ఇతర చిన్న పార్టీల, కుల సంఘాల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు ఖాయం చేసుకున్న డీఎంకే అధినేత కరుణానిధి ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. మార్చి 21న పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ప్రచార వ్యూహం మీద ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్ తో సీట్ల పంపకాల వ్యవహారం కూడా చర్చించే అవకాశం వుంది. విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని చిన్నా చితక పార్టీల, వివిధ సంఘాల మద్దతు కూడగట్టేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది.

వ్యూహరచనలు...
మరోవైపు, ఇప్పటికే వైకో సారధ్యంలోని ఎండిఎంకే, వీసీకే తో కలిపి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన వామపక్షాలు కూడా ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఒంటరి పోరుకు సిద్ధమైన విజయ్ కాంత్ ను తమ వైపు తిప్పుకునేందుకు పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే ఎనిమిది నెలల ఫీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ కి కొత్త ఊపు వస్తుందన్న అంచనాలున్నాయి. ఇంకోవైపు అధికార పార్టీ ఏఐడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ఏడు మిత్రపక్షాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై, సీట్ల పంపకాల గురించి చర్చించారు. మరోవైపు బూతుల వారీగా వివిధ సామాజిక వర్గాల సంఖ్యను సేకరిస్తూ, కుల సంఘాల, కుల పెద్దల మద్దతు పొందేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 

06:31 - March 16, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ తొలి సమావేశం రసాభాసగా సాగింది. ఎంఐఎం తమ మిత్రపక్షమేనని చెప్పుకుంటున్న అధికార పార్టీపై.. కౌన్సిల్‌ సమావేశంలో మజ్లిస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. అడుగడుగునా అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. గత కౌన్సిల్‌లో చేపట్టిన పనులను సైతం ఇప్పటి జాబితాలో చేర్చడంపై మాజీ మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ప్రారంభమైన కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్లు ముందుగా అమరులకు నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌లో తలపెట్టిన ఎస్ఆర్ డీపీ ప్రాజెక్టుకు కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. ఇక మూసీనదిపై 5,916 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌లోని ఆరులైన్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని తీర్మానించింది కౌన్సిల్‌. అయితే.. అంతకుముందు కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ వందరోజుల ప్రణాళికపై అధికారులు ఇచ్చిన సమాధానాలను తప్పుపట్టారు. గత కౌన్సిల్‌లో చేపట్టిన పనులను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అంశాలను ప్రస్తావిస్తున్న మాజిద్‌ను కూర్చోవాలంటూ మేయర్‌ ఆదేశించడంతో సభలో వివాదం రగులుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మేయర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు ఎంఐఎం కార్పొరేటర్లు.

13 ప్రశ్నలు..9పై చర్చ..
ఇక కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మేయర్‌ను, అధికారులను కోరారు. వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కౌన్సిల్‌ కోరింది. అయితే వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో పాటు.. సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌పై తాము చేపడుతున్న కార్యక్రమాలను సభ్యులకు వివరించారు కమీషనర్‌ జనార్ధన్‌రెడ్డి. మరోవైపు ఎక్కువమంది కొత్త కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ఉండటంతో తమ ప్రాంతాల్లోని సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. సమయాభావంతో ఎక్కువమందికి మాట్లాడే అవకాశం లభించలేదు. మొత్తం 13 ప్రశ్నలు వచ్చినప్పటికీ.. 9 ప్రశ్నలపైనే చర్చ జరిగింది. ఏది ఏమైనా జీహెచ్‌ఎంసీ తొలి సమావేశం కొత్త ఉత్సాహంతో హాట్‌హాట్‌గా కొనసాగింది. 

06:29 - March 16, 2016

హైదరాబాద్ : రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి,.సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చలో అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన నేతలు,.కార్యకర్తలను ఇందిరా పార్కు వద్ద పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ తీరుపై వామపక్ష నేతలు మండిపడ్డారు. మహిళలున్నారన్న విచక్షణను కూడా పోలీసులు కనబరచలేదు. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన సీపీఎం నేతలు హరిబాబు, తస్లీమా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్య కారణంగా.. పలువురు కార్యకర్తలు సృహ తప్పి పడిపోయారు. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ, సీఐటీయూ కార్యదర్శి గపూర్‌తో సహా వందలాది మంది నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసుల చర్యను నేతలు తీవ్రంగా ఖండించారు.

అన్యాయం చేస్తే ఊరుకోబోమన్న నేతలు..
రాయలసీమ అభివృద్ధి కోసం వామపక్షాలు ఇచ్చిన ఛలో అసెంబ్లీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇందిరాపార్క్ కు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సభలో పలువురు నేతలు ప్రసంగించారు. సీఎం చంద్రబాబు తన అభివృద్ధినంతా అమరావతి చుట్టూనే తిప్పుతున్నారని దీని వల్ల ప్రాంతీయ విభేధాలు వస్తాయని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కడపలో ఉక్కు ప్యాక్టరీ, యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని,..సీమలో చంద్రబాబును తిరగనివ్వమని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి..రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

06:23 - March 16, 2016

హైదరాబాద్ : రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఒక ప్రజాప్రతినిధి పట్ల అలా ఎలా వ్యవహరిస్తారంటూ ఏపీ ప్రభుత్వపు న్యాయవాదిని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు హైకోర్టులో రోజా సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ఎపిసోడ్‌లో మరో మలుపు తిరిగింది. తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం అన్యాయమంటూ ఆమె తొలుత హైకోర్టును అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని ఈ బడ్జెట్ సమావేశాలకు తనకు సభలో అనుమతి లభించేలా చూడాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరుపైన మరికొన్ని అంశాలపైన అభ్యంతరం వ్యక్తం చేసింది.

సుప్రీంకు వెళ్లిన రోజా..
హైకోర్టులో బెంచ్‌పైకి కేసు రాకుండా జాప్యం చేశారని రోజా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఆ విడతకే పరిమితమవుతుందని రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. కాగా ఒక ప్రజాప్రతినిధి పట్ల ఇలా ఎలా వ్యవహరిస్తారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడానికి చాలా సమయమిచ్చినా ఎందుకు తాత్సారం చేశారని.. అసలు మీరు చెబుతున్నదానిలో పస ఉందా అంటూ నిలదీసింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ గోపాల్‌ గౌడ్, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం... రేపు ఉదయం 10 గంటలకల్లా రోజా పిటిషన్‌పై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను ఈ-మెయిల్‌ ద్వారా హైకోర్టుకు పంపింది. కోర్టు ఆదేశాలపట్ల ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బుధవారం రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపనుంది. ఈ విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందోనని వైసిపితోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. 

06:21 - March 16, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా వైసీపీ సభ్యుల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లు వచ్చాయి. 97 మంది సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు. దీంతో తీర్మానం వీగిపోయినట్టు సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ప్రకటించారు. సోమవారం చంద్రబాబు సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోగా, మంగళవారం స్పీకర్‌ కోడెలపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా అసెంబ్లీ తిరస్కరించింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన రోజునే స్పీకర్‌ చర్చకు అనుమతించారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసు అందిన 14 రోజుల్లోగా చర్చకు అనుమతించాలన్న నిబంధనలు ఉన్నవిషయాన్ని జగన్‌ గుర్తు చేశారు. తమ సభ్యులకు విప్‌ జారీ చేసే అవకాశం కూడా లేకుండా.. నోటీసు ఇచ్చిన రోజే చర్చకు అనుమతించడం నిబంధలనకు విరుద్ధమని వాదించారు.

ఓటింగ్ కు గైర్హాజర్ అయిన 8 మంది ఎమ్మెల్యేలు...
దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పదిస్తూ... నోటీసు ఇచ్చిన 14 రోజులకు చర్చకు అనుమించాలంటూ ఉన్న అసెంబ్లీ నిబంధనలను సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. యనమల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ నిబంధనలను సస్పెండ్‌ చేయడం పట్ల జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అయితే అధికార పక్షం తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఆ తర్వాత స్పీకర్‌ కోడెలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించారు. అయితే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభాధ్యక్ష స్థానంలో ఉండటం మంచి సంప్రదాయం కాదని భావించిన కోడెల... ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను సభాధ్యక్ష స్థానానికి ఆహ్వానించారు. మొత్తం రెండు గంటలకు పైగా కొనసాగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. దీంతో చాలా సందర్భాల్లో చర్చ పక్కదారి పట్టింది. ఇరుపక్షాల వాదోపవాదాల తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత సభ్యాధ్యక్ష స్థానంలోకి వచ్చిన స్పీకర్‌ కోడెలను అధికార పక్ష సభ్యులు అభినందించారు. 

నేడు అత్యాధునిక 108 అంబులెన్స్ ల ప్రారంభం..

హైదరాబాద్ : నేడు అత్యాధునిక 108 అంబులెన్స్ ల ప్రారంభోత్సవం జరగనుంది. మంగళవారం నాడు జరగాల్సిన ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది. విజయవాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓయూ మెడికల్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలిని, గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు మంత్రి లక్ష్మారెడ్డి విజయవాడకు వెళ్లడంతో కార్యక్రమం వాయిదా పడింది. 

మహిళా టీ -20 భారత్ శుభారంభం..

బెంగళూరు: టి20 ప్రపంచకప్ మహిళల టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు మంగళవారం జరిగిన తమ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 

22 వరకు అసెంబ్లీ సమీపంలో ఆంక్షలు..

హైదరాబాద్ : ఈ నెల 16 ఉదయం ఆరు గంటల నుంచి 22వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అసెంబ్లీ సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు నగర కమిషనర్‌ ఎం. మహేందర్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

కుప్పకూలిన ఈక్వెడార్ సైనిక విమానం..

ఢిల్లీ : అమెజాన్ అటవీ ప్రాంతంలో ఈక్వెడార్ కు చెందిన ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది సైనికులు, ఇద్దరు వైమానిక సిబ్బంది, మరొక మెకానిక్ ఉన్నారు. 

టీ -20 ప్రపంచకప్ లో నేడు..

నాగ్ పూర్ : టీ -20 ప్రపంచ కప్ లో నేడు బంగ్లాదేశ్ - పాక్ జట్లు ఢీకొనున్నాయి. సాయంత్రం మూడు గంటలకు కోల్ కతాల ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30గంటలకు జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ - ఇంగ్లండ్ జట్లు ఢీకొననున్నాయి.

 

రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సంవత్సర కాలం పాటు సస్పెండ్ చేయడంపై రోజా సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

కాపు నేతలను విచారించనున్న సీఐడీ..

గుంటూరు : నేడు తుని ఘటనపై పలువురు కాపు నేతలను సీఐడీ అధికారులు విచారించనున్నారు. కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలని కోరుతూ ముద్రగడ చేసిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. 

సోనియా, రాహుల్ తో నేడు ఏపీ పీసీసీ నేతల భేటీ..

ఢిల్లీ : నేడు సోనియా, రాహుల్ లతో ఏపీ పీసీసీ నేతలు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి..

హైదరాబాద్ : నేడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్నారు. ఇండియా ఏవియేషన్ షో -2016 విమానాల ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హాజరు కానున్నారు. ఐదు రోజుల పాటు ఈ షో జరగనుంది. 19,20 తేదీల్లో సందర్శకులకు అనుమతినివ్వనున్నారు. 

Don't Miss