Activities calendar

17 March 2016

21:23 - March 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా జరిగాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత రోడ్ల అభివృద్ధి గురించి సభ్యులు ప్రశ్నలు అడగగా.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిచ్చారు.

మిషన్‌ భగీరథ మొదటి దశ పనులు వేగవంతం....

మిషన్‌ భగీరథ మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయని రెండో దశను ప్రారంభించామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సభకు వివరించారు. మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తిలోని కొంతభాగం 2018లోపు మంచినీటిని అందిస్తామన్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి....

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. జాతీయ సంస్థలతో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవోల వెబ్‌సైటును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్ఙంచారు.

కాంగ్రెస్‌ పార్టీ తప్పదాల వల్లే ....

కాంగ్రెస్‌ పార్టీ తప్పదాల వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆలస్యమైందని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 2014 వరకు కేంద్రంలో.. ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నాయని, అప్పుడే ఎందుకు ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. వాదాలు ప్రతివాదాలతో సభ్యులు ఒకింత విమర్శలకు పదును పెట్టారు. అధికార విపక్ష సభ్యుల చర్చలతో అట్టుడికిన తెలంగాణ అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రకటించారు. 

ఖమ్మం లో పేలిన టిఫిన్ బాంబు : ఒకరి మృతి

ఖమ్మం: కుంట సమీపంలో మురళీగూడ వద్ద టిఫిన్ బాంబు పేలి బాలిక మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనతో తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

20:49 - March 17, 2016

యాదాద్రి గుట్టను చూసి జరంత నారాజైన సీఎం సారూ..లచ్చినారి స్వామి ఆశ్చర్యపోయేతట్టు చేస్తడంట తయార్. కేసీఆర్ సార్ సేవలకు గజ్జునొణుకుతున్న పేదరికం...డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఉందట మస్తు మైకం, ఎర్రని ఎండలో కష్టపడుతున్న నాయిని నర్సన్న... జాగ్రత్తలు చెప్పి మంచి చెడ్డలు అరుసుకున్న మల్లన్న, బయటదేశపోళ్ల మోడీ సార్ ఇచ్చిండు కొలతలు...బట్టల కోసం కాదు.. బతికుండగానే బొమ్మపెడతరంట, ఆడపిల్లలు స్నానాలు చేయంగా ఫోటోలు తీసిన పోరడు...దొరకబట్టి పోలీసోళ్లకు అప్పజెప్పిన హాస్టల్ వార్డెన్, చినవీరమ్మ ఇంటికాడ గుడ్లు పెడుతున్న కోడిపిల్లలు.. ఇదెక్కడి విచిత్రం అని ఇరగబడి చూస్తున్న జనాలు... ఇత్యాది అంశాలపై మల్లన్న మచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న తన వాక్చాతుర్యాన్ని చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:39 - March 17, 2016

హైదరాబాద్ : కుప్పపూసిన వెన్నెల అంటే ఎలా వుంటుందో తెలుసా! ఆకాశం నుండి ఊడిపడిన చలువరాతి కొండను చూశారా? ప్రేమకు నిలువెత్తు నిజరూపంలా నిలిచిన అపురూప నిర్మాణం గురించి తెలుసా? మీరే కాదు.. ప్రపంచమంతా మాకు తెలుసూ అని అంటోంది. ఎందుకంటే చరిత్ర ఘటనలను.. కొంత మంది వీరుల ఘటనలను మాత్రమే కాదు.. కొన్ని అపురూప నిర్మాణాలను కూడా భవిష్యత్ కు అందిస్తుంది. అవును అందుకే వాహ్ తాజ్ అంటూ నేటికీ గర్విస్తున్నాం. అనే ఘనకు రోజులు చెల్లాయా? తగ్గుతున్న విదేశీ టూరిస్టుల సంఖ్య ఏం చెప్తోంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ కథనం. పూర్తి విశ్లేషణను చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

19:56 - March 17, 2016

హైదరాబాద్ : సస్పెన్షన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ పరిణామం ఏం కాబోతోంది? అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందజేశారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వస్తే పరిణామలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆశక్తి అందరిలో నెలకొంది. ఈ అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో హిందూ మాజీ ఎడిటర్ నగేష్, వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ప్రముఖ న్యాయ విశ్లేషకులు విఆర్ మాచవరం, టిడిపి అధికార ప్రతినిధి అనురాధ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:33 - March 17, 2016

హైదరాబాద్‌: స్టార్ హీరోయిన్ త్రిష , గోవి గోవర్ధన్ దర్శకత్వంలో నాయకి అనే హర్రర్ కామెడీ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసారు. . మొదటిసారిగా తన కెరీర్లో ఓ లేడీ ఓరియంటడ్ సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై త్రిష భారీ ఆశలే ... పెట్టుకున్నారు. 80వ దశకం నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ సినిమాను గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. ఇంక ఈ చిత్రంలో సత్యం రాజేష్ , బ్రహ్మనందం ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఏపీ సెక్రటేరియట్‌లో స్ట్రాటజీ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఏపీ సెక్రటేరియట్‌లో స్ట్రాటజీ కమిటీ భేటీ అయ్యంది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు, కేఈ, చినరాజప్ప హాజరైనారు. 

జ్యుడీషియల్ కస్టడీకి ఛగన్ భుజ్బల్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత చగన్ భుజ్‌బల్‌ను మార్చి 31 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మనీలాండరింగ్ కేసులో ఛగన్ భుజ్‌బల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛగన్ భుజ్ బల్ కు చెందిన 26 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

18:58 - March 17, 2016

విశాఖ : సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందుడుగుగా భావించే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సిస్కో ఛైర్మన్‌ జాన్‌ టి చాంబర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే తక్కువ ధరకే కేబుల్‌ ప్రసారాలు, ఇంటర్‌ నెట్, ఫోన్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. దీన్ని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించనున్నారు. ఏయూ దూరవిద్య కేంద్ర ప్రాంగణంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ఏర్పాటుచేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. 

18:56 - March 17, 2016

హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో చూపిన లెక్కలు అంకెల గారడిని తలపించాయని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం విమర్శించింది. రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, నగరాల్లో పారిశుధ్యం కొరవడిందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి లేక యువత వలస బాటపట్టిందని వైసిపి ఎమ్మెల్యేలు అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు అంశాలపై నేతలు చర్చించారు.

అనేక అంశాలపై వాడివేడి చర్చ..

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అనేక అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. బడ్జెట్‌పై చర్చతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

కొరవడిన పారిశుధ్యం....

రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యం కొరవడిందని ప్రతిపక్షం విమర్శించింది. ఇందుకు మంత్రి నారాయణ బదులిస్తూ శానిటేషన్‌ మెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి కొరవడిందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా టూరిజం అభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి కోరారు. ఇందుకు మంత్రి అచ్చన్నాయుడు సమాధానమిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు. రంపచోడవరంలో ఎకో టూరిజం అభివృద్ధికి, వేసవి విడిది కేంద్రాలైన లంబసింగిలో 14 కోట్ల రూపాయలు, రాళ్లపల్లిలో పదిన్నర కోట్లు, మారేడుమిల్లిలో ఏడున్నర కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రెండేళ్లైనా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ .....

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ విధిస్తుండడం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా స్పీకర్‌ తిరస్కరించారు. వాయిదా తీర్మానం అంశంపై చర్చించడం సరికాదని చెప్పారు.

భూముల్లో వేసే బోర్లకు సంబంధించిన చర్చ ....

జలసిరి పథకం కింద రైతుల భూముల్లో వేసే బోర్లకు సంబంధించిన చర్చ జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల మంది రైతులు అప్లికేషన్లు పెట్టుకున్నారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ చిట్టిపొట్టి కథలు, వివిధ ప్రశ్నలతో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రాజేంద్రనాథ్ ప్రశ్నలకు మంత్రి పత్తిపాటి పుల్లారావు బదులు....

రాజేంద్రనాథ్ ప్రశ్నలకు మంత్రి పత్తిపాటి పుల్లారావు బదులిస్తూ 54 లక్షల 6 వేల మందికి రుణమాఫీ ద్వారా వారి ఖాతాల్లో వేసిన డబ్బు తమకు కన్పించట్లేదా అని ప్రశ్నించారు. ఒకదఫాలో 24వేల 5 వందల కోట్లు, మరోసారి 7,433 కోట్లు జమ చేసిన అంశాన్ని గుర్తించాలన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్ నిధి మాదిరే ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సూచించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

18:46 - March 17, 2016

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాలతో మంత్రి నారాయణ భేటీ ముగిసింది. స్థానికత సమస్య నెలరోజుల్లో పరిష్కారం అవుతుందని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే 30శాతం హెచ్ఆర్ ఏ, 5రోజుల పని దినాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

18:41 - March 17, 2016

తిరుమల : సినీనటుడు మోహన్ బాబు ఆయన తనయుడు మంచు విష్ణులు తిరుమలేసుని దర్శించుకున్నారు. తాను నటించిన తదుపరి చిత్రం వీడోరకం వాడోరకం చిత్రం ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో మంచు విష్ణు తెలిపారు. నటుడిగా 41 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నానని తన పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు డైలాగ్ కింగ్ మోహన్ బాబు తెలిపారు.

17:43 - March 17, 2016

ఢిల్లీ : తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఈ ఒక్క హామీ అమలు కాకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విచారం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఏపీ ఆందోళనలకు మేం మద్దతిచ్చినప్పుడు.. తెలంగాణ సమస్యలపై కూడా వారు సహకరించాలని కోరారు. ఈ ప్రాంత సమస్యలపై టీకాంగ్ నేతలు ఢిల్లీకి వచ్చి పోరాడాలని వీహెచ్ సూచించారు. 

17:40 - March 17, 2016

మహబూబ్ నగర్ : షాదీ ముబారక్ పథకంపై ఏసీబీ అధికారులు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో తనిఖీలు నిర్వహించారు. పేద మైనారిటీ వధువులను ఆదుకునేందుకు షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్... పథకం అమల్లో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. కలెక్టరేట్ లో ఉన్న లబ్దిదారుల ఫైళ్లను అధికారులు పరిశీలించారు. జాబితా ప్రకారంగా నేరుగా లబ్దిదారులను కలిసి విచారణ జరుపుతున్నారు. 

17:38 - March 17, 2016

హైదరాబాద్ : మండుతున్న ఎండలతో రాజధాని వాసులను త్రాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. దశాబ్ధాల తరబడి నగరవాసుల దాహార్తిని తీర్చుతున్న జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటికే అనేక నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు.. రానున్న రోజులు మరిన్ని కష్టాలు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక భూగర్భజలాలు సైతం అడుగంటిపోవడంతో నగరవాసుల గుండెల్లో దడ మొదలైంది.

పూర్తిగా ఎండిన జలాశయాలు...

భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నీళ్లు దొరకడం లేదు. రాజధానిలో నెలకొన్న నీటి కటకటతో నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో జలమండలి డే బై డే నీటిని సరఫరా చేసేది. శివారు ప్రాంతాల్లో అయితే వారానికి రెండు రోజులు నీటిని సరఫరా చేసేవాళ్లు. కానీ.. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయ్యింది. నగరానికి నీటిని అందించే సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు పూర్తిగా ఎండిపోవడంతో నగరానికి నీటి సరఫరా నిలిచిపోయింది.

ప్రతిరోజు 490 ఎంజీడీలు.....

గ్రేటర్‌ పరిధిలో ప్రతిరోజు 490 ఎంజీడీలు నీటి అవసరం ఉండగా.. 346 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. దాదాపు 144 ఎంజీడీల నీటి కొరత ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో మూడు రోజులకోసారి మాత్రమే త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక నీటి సప్లయ్‌ తగ్గిపోవడంతో భారమంతా భూగర్భజలాలపైనే పడింది. అయితే గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయని అధికారులంటున్నారు.

ట్యాంకర్లకు పెరిగిన గిరాకి.....

నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో నగరవాసులు వాటర్‌ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి భారీగా గిరాకి పెరిగింది. జలమండలి ట్యాంకర్లతో పాటు.. ప్రైవేట్‌ ట్యాంకర్లు ప్రతిరోజు 3 వేల ట్రిప్పులు వేస్తున్నాయి. జనవరిలో 50 వేల ట్యాంకర్లు నీటిని పంపిణీ చేయగా.. అది ఫిబ్రవరిలో 62 వేలకు చేరింది. మార్చి నెలలో ఇప్పటివరకు దాదాపు 40 వేల ట్యాంకర్ల నీటిని సరఫరా చేశారంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. నగరంలో నీటి సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమానంగా సరఫరా చేయడం లేదనే విమర్శలు...

మరోవైపు గ్రేటర్‌లోకి వచ్చే నీటిని అధికారులు అందరికీ సమానంగా సరఫరా చేయడం లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. బేవరేజెస్‌కు, కోలా కంపెనీలకు, నీటి సరఫరా కేంద్రాలకు నీటిని సరఫరా చేస్తున్న జలమండలి.. తమను పట్టించుకోవడం లేదని సామాన్యులంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటి సమస్యపై దృష్టి సారించి తమకు నీరు సరఫరా అయ్యేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. 

17:34 - March 17, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ లో బుధవారం కిడ్నాపైన అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహం బంధువులకు అప్పగించారు. ముక్కులో పేపర్లు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి అభయ్ ను హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. మరోవైపు అభయ్ ను కిడ్నాప్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

17:18 - March 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో 10 మంది బ్రోకర్లను సీఐడీ అరెస్ట్ చేయగా... మరో 11 మంది బ్రోకర్ల కోసం గాలింపు చేపట్టింది. 50 ఆసుపత్రుల్లో 73 లక్షలను బ్రోకర్లు స్వాహా చేసినట్లు సీఐడీ గుర్తించింది. 600 ఆస్పత్రుల్లో 12వేల సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్లను సీఐడీ పరిశీలించింది. దర్యాప్తు మొదటి నివేదికను సీఎం కేసీఆర్ కు సీఐడీ అందచేసింది. ఈ నివేదిక ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సిరిసిల్లలో ఐడీటీఆర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

కరీంనగర్ : సిరిసిల్లలో ఐడీటీఆర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందు కోసం రూ.17 కోట్లు కేటాయించినట్లు ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియాకు తెలిపారు. 25 ఎకరాల స్థలంలో ఐడీటీఆర్‌ను నిర్మించనున్నామని...ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీని వేయనున్నట్లు తెలిపారు.

అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

సికింద్రాబాద్ : అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. అనంతరం వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ముక్కులో పేపర్లు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి అభయ్ ను హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

16:46 - March 17, 2016

హైదరాబాద్ : కనీస వేతనాలు చెల్లించి , పెండింగ్ వేతనాలు, బకాయిలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మద్యాహ్న భోజన కార్మికులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. నెలల తరబడి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అప్పులు చేసి వండి పెడుతున్నారని సిఐటియు నేతలు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ సంస్థలకు పథకాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

16:44 - March 17, 2016

కృష్ణా : ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠిన చట్టాలను అమలుపరుస్తున్నా మహిళలు, బాలికలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో ఓ చిన్నారి అత్యాచారానికి గురైంది. మతిస్థిమితం లేని ఆ బాలికపై వరుసకు అన్న అయిన కొడాలి శ్రీను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

16:42 - March 17, 2016

మినీ భారత సంగ్రామం హోరెత్తుతోంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హొరాహోరీ పోరు జరగబోతోంది. ఏప్రిల్ , మే నెలల్లో జరిగే ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు సవాలుగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికలు...

తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 18 కోట్ల మంది ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. అందుకే ఈ ఎన్నికలను భారత మినీ సంగ్రామంగా వర్ణిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష కూటమిలకు ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కి ఈ అయిదు రాష్ట్రాల్లో వున్నది నామమాత్రపు బలమే. అస్సాం, కేరళలో కాంగ్రెస్ లో అధికారంలో వుండగా, మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్నాయి. తమిళనాడులో జయలలిత, పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ అధికారాన్ని నిల్పుకుంటారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు లెఫ్ట్ ఫ్రంట్ కి బలమైన స్థావరాలు. ఈ రెండు రాష్ట్రాల్లో 2011లో కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న పట్టుదల వామపక్ష శిబిరంలో కనిపిస్తోంది.

దేశ రాజకీయాలను ప్రభావితం...

బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, ప్రాంతీయ పార్టీలు సాధించే ఫలితాలు సమీప భవిష్యత్ లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ బలం లేకపోయిన్నప్పటికీ, ఈ ఎన్నికలు దానికి పెద్ద సవాలు. ఈ అయిదింటిలో కనీసం ఒక్క చోటైనా పాగా వేయడం ద్వారా బీహార్, ఢిల్లీలో రాష్ట్రాల్లో ఎదురైన పరాజయ భారాన్ని తగ్గించుకోవాలని కమలదళం ఆరాటపడుతోంది. అస్సాంలో పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన మీద వున్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందన్నది బీజేపీ ఆశ. అక్కడ ఏజీపీతో పొత్తు పెట్టుకుని, అద్రుష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలకు గాను ఏడింటిని గెల్చుకోవడం బీజేపీని ఉత్సాహపరుస్తోంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. తమిళనాడులో 2014 నాటి మిత్రులు ఇప్పుడు దూరమయ్యారు. అక్కడ ఏఐడీఎంకే, డీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ వుండబోతోంది. ఎండిఎంకే, వైసీకేలతో జట్టుకట్టిన వామపక్షాలు ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు ప్రయత్నిస్తుండడం తమిళనాట గమనించదగ్గ పరిణామం. తమిళనాడుతో పాటు పశ్చిమబెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీకి ఇప్పుడు పెద్ద సవాలు. అస్సాంలో అధికారంలోకి రావడం, మిగిలిన రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోవడం కమలదళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 2014 కంటే ఓట్ల శాతం తగ్గితే, ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ దెబ్బతింటుందన్న భయం ఆ పార్టీని వెన్నాడుతోంది.

కాంగ్రెస్ కు జీవనర్మరణ సమస్యగా....

ఇక 2014లో దేశమంతటా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కి తాము అధికారంలో వున్న అస్సాం, కేరళ రాష్ట్రాలు ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ రెండు రాష్ట్రాలను కూడా కోల్పోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఒకవేళ గెలిస్తే, 2019కి అదొక టానిక్ లా పనిచేస్తుంది. అస్సాంలో బీజేపీ, కేరళలో వామపక్షాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఒకసారి యుడీఎఫ్ ని, మరోసారి ఎల్ డీఎఫ్ ని గెలిపించడం కేరళ సంప్రదాయం. ఈసారి తామే అధికారంలోకి రాబోతున్నామన్న ధీమా ఎల్ డీఎఫ్ లో కనిపిస్తోంది. సర్వేలు కూడా యుడీఎఫ్ ను నిరుత్సాహపరుస్తున్నాయి.

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బెంగాల్, కేరళ...

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వున్నట్టుగానే పశ్చిమబెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. సుదీర్ఘకాలం పాటు వామపక్షాలకు అండగా నిలిచిన పశ్చిమబెంగాల్ 2011లో మమతాబెనర్జీని ఆదరించింది. అయితే శారదా చిట్ ఫండ్స్ స్కామ్, లంచాలు తీసుకుంటూ త్రుణమూల్ కాంగ్రెస్ ప్రముఖులు స్టింగ్ ఆపరేషన్ లో చిక్కడం లాంటి వి ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ వైపే మొగ్గు చూపిన బెంగాల్ ఓటర్లు ఈసారి తమ పాలకులుగా ఎవరిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు వ్యూహ రచన చేస్తున్నప్పటికీ, వామపక్షాలు, త్రుణమూల్ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోటీ వుంటుందని సర్వేలు సూచిస్తున్నాయి.

'టెన్త్ పరీక్షలకు అరగంట ఆలస్యమైనా అనుమతి'

హైదరాబాద్: ఏపీలో ఈనెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు మొదటి రోజు అరగంట ఆలస్యమైనా అనుమతిస్తామని, మరుసటి రోజు నుంచి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని సంధ్యారాణి స్పష్టం చేశారు. ఏపీ పాఠశాల విద్యా సంచాలకులు సంధ్యారాణి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్, క్యాలుక్యులేటర్ వంటి పరికరాలను అనుమతించమని, ఒక్క హాల్ టికెట్ తప్ప మరేఇతర కాగితాలను అనుమతించమని స్పష్టం చేశారు.

'హిమాయత్ బేగ్' ఉరి శిక్షను జీవితఖైదుగా

మహారాష్ట్ర: జర్మన్ బేకరీ పేలుళ్ల కేసులో నిందితురాలు హిమాయత్ బేగ్ కు విధించిన ఉరి శిక్షను జీవితఖైదుగా బాంబేకోర్టు మార్చింది. బేగ్ ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నది. 2010 ఫిబ్రవరి 13న పెణెలోని జర్మన్ బేకరీలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందగా, 65 మందికి గాయాలయ్యాయి.

16:11 - March 17, 2016

హైదరాబాద్ : న్యాయవ్యవస్థపై నమ్మకం రెట్టింపయ్యిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సస్పెన్షన్‌‌ను‌ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ మీడియాతో మాట్లాడుతూ...రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి హాజరవుతానని తెలిపారు. నా నుంచి ప్రశ్నలు తీసుకోలేదని, జీరో అవర్లో అయినా నా నియోజకవర్గ ప్రజల సమస్యలు ప్రస్తావించే అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లినా దాని పై కూడా పోరాడతానని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం వక్రీకరిస్తే కోర్టు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్ రద్దు చేయడం సంతోషంగా ఉందని మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఆర్డర్ కాపీలను అసెంబ్లీ సెక్రటరీకి అందజేసిన రోజా

హైదరాబాద్ : ఏడాది సస్పెన్షన్‌‌ను‌ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. రోజా వెంట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

15:53 - March 17, 2016

హైదరాబాద్‌ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడు వీడియోలు విడుదలయ్యాయి. మొదటి రెండు టీజర్లు దాదాపుగా ఒకే విధంగా ఉండగా, ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేసి సందడిని షురూ చేశారు. అయితే ఇప్పుడు మరో టీజర్‌ను విడుదల చేసి ఆ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ను నేడు విడుదల చేశారు. ఈచిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు జోడిగా కాజల్‌ నటిస్తుంది.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

విజయవాడ నగర పరిధిలో 5కు చేరనున్న మండలాలు

విజయవాడ : నగర పరిధిలో మండలాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు మండలాలను ఐదు కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రుడు ప్రతిపాదనలు పంపారు.

ఏపీ అసెంబ్లీకి రోజా....

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే  రోజా హైకోర్టు ఆర్డరు కాపీని తీసుకుని ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. గతంలో అసెంబ్లీ నుండి సంవత్సరం పాటు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

యాదాద్రి అభివృద్ధి పనులను వేగవంతం :ఎంపీ బూర

నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు. దుకాణాలు కోల్పోతున్నవారితో రేపు(శుక్రవారం) కేసీఆర్‌ సమావేశంకానున్నారు. వ్యాపారులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. యాదాద్రిలో టెంపుల్‌ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు. ఆలయ ప్లాన్‌లో కేసీఆర్‌ కొన్ని మార్పులను సూచించారన్నారు. ఒకేసారి 5వేల పెళ్లిళ్లు చేయడానికి వీలుగా కల్యాణమండపాన్ని నిర్మించాలని కేసీఆర్‌ సూచించినట్లు ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు.

కుషాయిగూడలో బాంబు కలకలం....

హైదరాబాద్ : కుషాయిగూడలోని ఎన్ఎఫ్ఐ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది.  సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ లు తనిఖీలు నిర్వహించారు.

మాల్యా నివాసం వేలం ప్రక్రియ ముగిసింది : ఎస్బీఐ

హైదరాబాద్ : లిక్కర్ డాన్ విజయ్ మాల్యా నివాసం వేలం ప్రక్రియ ముగిసినట్టు ఎస్బీఐ ప్రకటించింది. ముంబై శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని విజయ్ మాల్యా నివాసాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్బీఐ, దానికి ఆన్ లైన్ వేలం నిర్వహించింది. ఈ నివాసానికి ప్రారంభ ధరగా 150 కోట్ల రూపాయలను నిర్ణయించింది. ఈ వేలానికి కొనుగోలుదారుల నుంచి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో, ఎస్బీఐ వేలం ప్రక్రియ ముగిసినట్టు ప్రకటించింది.

ఆర్డర్ కాపీ అందుకున్న రోజా

హైదరాబాద్ : హైకోర్టు ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే రోజా అందుకున్నారు. దాన్ని తీసుకుని నేరుగా అసెంబ్లీకి చేరుకుంది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

15:06 - March 17, 2016

హైదరాబాద్ : హైకోర్టు ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే రోజా అందుకున్నారు. దాన్ని తీసుకుని నేరుగా లోటస్ పాండుకు బయలు దేరింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. 

14:56 - March 17, 2016

హైదరాబాద్ : రైజ్.. రిలీజ్.. డ్యాన్స్.. అంటూ మహిళా లోకం నినదిస్తోంది. తమ పై జరగుతున్న హింసను ప్రతిఘటిస్తోంది. అన్యాయాన్ని ఎదిరించమంటోంది. ఆధిపత్యాన్ని సహించమంటోంది. ఇవే నినాదాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరాలంటోంది. అందుకు మహిళలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు వచ్చింది.

దేనితో సంబంధం లేకుండా నేడు స్త్రీలపై దాడులు....

కులం, జాతి, వర్గం, వర్ణం, ప్రాంతం, దేశం.. ఇలా దేనితో సంబంధం లేకుండా నేడు స్త్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసిపాప నుండి పండు ముదుసలి వరకు వయసుతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు గురువుతున్నారు. ఎన్నో రకాల హింసలకు బలవుతున్నారు. తరతరాలుగా పురుషాధిక్య భావజాలం వేళ్ళూనుకున్న ప్రస్తుత సమాజంలో మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఇంటా బయటా భద్రత కరువవుతోంది. ఇలాంటి నేపథ్యంలో సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ప్రతి ఏటా మన ముందుకు తెస్తోంది 'వన్ బిలియన్ రైజింగ్ కార్యక్రమం'. ఇక ఇదే అంశంపై మానవి ఈ వారం 'ఫోకస్' లో విశ్లేషణ చేశారు. ..

బిలియన్ మహిళలను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో...

ఒక బిలియన్ మహిళలను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టిన వన్ బిలియన్ రేజింగ్ విజయవంతం కావాలని మానవి కోరుకుంటోంది. సమాజంలో మహిళల రక్షణకోసం సమూల మార్పులు రావాలని, పుట్టిన ప్రతి ఆడపిల్లకు భద్రమైన జీవితం కావాలని, మగువల పట్ల హింసకు చరమగీతం పాడాలని మానవి ఆకాంక్షిస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:53 - March 17, 2016

హైదరాబాద్ : ప్రతిక్షణం ఇంటిల్లి పాది ఆరోగ్యాన్ని, వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళలు, తమ ఆరోగ్యం, ఆహారం విషయంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ చూపరనేది వాస్తవం. ఫలితంగా దేశంలో నూటికి 80 శాతం మహిళలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. పోషకాహార లేమితో బాధపడుతున్నారు. కొన్ని జాగ్రత్తలుపాటిస్తూ, రోజూ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే, ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు.. ఆ వివరాలేంటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:31 - March 17, 2016

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టన్నారు...వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి శాసనసభ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ కాదని చెప్పుకొచ్చారు.. సభా నియమాలకు లోబడి పనిచేయాలని సర్కారుకు సూచించారు.

14:29 - March 17, 2016

హైదరాబాద్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో విమానాలను నుంచి ప్రయాణికులను దించేశారు. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. 

ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్‌ను నిలిపివేయడం సరికాదు-జానారెడ్డి

హైదరాబాద్ :జీవోల వెబ్‌సైటును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. వెబ్‌సైటును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సాధారణ బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జానారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. 

14:26 - March 17, 2016

హైదరాబాద్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు జానారెడ్డి.. జాతీయ సంస్థలతో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.. ప్రస్తుతం కట్టబోతున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందాన్ని జానారెడ్డి తప్పుబట్టారు. 

14:23 - March 17, 2016

హైదరాబాద్ : మిషన్‌ భగీరథ మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయని రెండో దశను ప్రారంభించామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సభకు వివరించారు. మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తిలోని కొంత భాగానికి మంచి నీటిని అందిస్తామన్నారు. 2018 చివరి నాటికి 99 నియోజకవర్గాలకు మంచి నీటిని అందిస్తామన్నారు. 

14:22 - March 17, 2016

నల్గొండ : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.. స్వామి తిరుకల్యాణోత్సవంలో పట్టువస్త్రాలు సమర్పించారు.. హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్‌లో వడాయిగూడెంకు సీఎం చేరుకున్నారు.. అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా దేవస్థానానికి చేరుకున్నారు.. కేసీఆర్‌కు మంత్రి జగదీశ్వర్ ఎడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, జడ్పీ ఛైర్మన్‌, ఇతర నేతలు, అధికారులు స్వాగతం పలికారు.. 

ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం

హైదరాబాద్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో విమానాలను నుంచి ప్రయాణికులను దించేశారు. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. 

హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్ కు శాసనసభ నిర్ణయం..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ లో హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లాలని ఏపీ శాసనసభ నిర్ణయించింది. 

13:40 - March 17, 2016

గుంటూరు : జిల్లా బుర్రిపాలెంలో సినీనటుడు మహేశ్‌ బాబు కుటుంబసభ్యులు పర్యటించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మహేశ్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌, సోదరి గల్లా పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక దేవాలయంలో పూజలు చేశారు. ఈ గ్రామాన్ని మహేశ్‌ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 

13:37 - March 17, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ఒప్పందంపై కాంగ్రెస్‌ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతల పాపాలను శాసనసభ సాక్షిగా బయటపెడతామని చెప్పారు. మహా ఒప్పందంపై సభలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. గోదావరి నీళ్లను మళ్లించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్లే ప్రాణహిత - చేవెళ్ల ఆలస్యం అవుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రాణహిత - చేవెళ్ల ఎత్తు 152 మీటర్లకు ఎందుకు పెంచలేదని, ఆంధ్ర పాలకులు నీళ్లురాని ప్రాజెక్టులకు కట్టారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాపై ప్రేమ వలకబోస్తున్న కాంగ్రెస్ నేతలు 2007 లో జీవో జారీ చేసి 2013 వరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. 

అసెంబ్లీ లో హైటెన్షన్...

హైదరాబాద్ : ఏడాది పాటు సభ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఉత్తర్వుల కాపీలు తీసుకుని నేరుగా అసెంబ్లీకి వెళతాని రోజా కోర్టు వద్దే ప్రకటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఓ వైపు వైసీపీ సభ్యులు రోజాకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తుంటే మరోవైపు రోజాను అడ్డుకునేందుకు అధికార పక్షం యత్నాలు చేస్తోంది.

ఎస్ ఐ ని కడిగి పడేసిన మహిళా ఎమ్మెల్యే...

ఉత్తర్ ప్రదేశ్ : నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ముందుంటారు. కానీ ఇప్పుడు తాజాగా అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే లక్ష్మీ గౌతం పబ్లిక్ లో ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ పై తిట్ల దండకం అందుకున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎమ్మెల్యే అయిన తనను పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే లక్ష్మీ గౌతం ఎస్ఐని ఇష్టమొచ్చినట్లు తిట్టేసారు. అదేమిటని ప్రశ్నించిన మీడియాపై కూడా ఘాటుగానే స్పందించారు. ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోనందుకే ఆయనను తిట్టానని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ తప్పిదం వల్లే ఆలస్యం - హరీష్ రావు..

హైదరాబాద్ : కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్లే ప్రాణహిత - చేవెళ్ల ఆలస్యం అవుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రాణహిత - చేవెళ్ల ఎత్తు 152 మీటర్లకు ఎందుకు పెంచలేదని, ఆంధ్ర పాలకులు నీళ్లురాని ప్రాజెక్టులకు కట్టారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాపై ప్రేమ వలకబోస్తున్న కాంగ్రెస్ నేతలు 2007 లో జీవో జారీ చేసి 2013 వరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. 

12:30 - March 17, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి రావడానికి సిద్ధమౌతున్నారు. హైకోర్టు అందించే కాపీ కోసం ఆమె ప్రస్తుతం నిరీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టివేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీకి హాజరు కావచ్చని సూచించింది. రోజా అసెంబ్లీలోకి రానీయకుండా ఉండేందుకు భారీగా మార్షల్స్ మోహరించారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద పోలీసులు మోహరించగా నెంబర్ 2గేట్ వద్ద మహిళా మార్షల్స్ నిలబడ్డారు. తమకు ఆర్డర్ కాపీ అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని..వెనక్కి వెళ్లాలని రోజాకు సూచించే అవకాశాలున్నాయి. మరి రోజా అసెంబ్లీకి వెళుతుందా ? లేదా ? ఉత్కంఠ నెలకొంది. 

12:12 - March 17, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల సమాలోచనలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో మంత్రి యనమల స్పీకర్ కోడెలతో భేటీ అయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. తీర్పుపై చర్చించారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం న్యాయసలహా తీసుకోనున్నట్లు, సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు తప్పుబడుతాయా ? అనే అంశంపై యనమల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అడ్వకేట్ జనరల్ వాదన పస లేదని అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సాయంత్రం ప్రివిలైజ్ కమిటీ సమావేశం జరగనుంది. రోజా వ్యవహారంపై ఈ కమిటీ చర్చిస్తోంది. రోజా వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి. 

సీఎంతో యనమల సమావేశం....

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటీషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును మంత్రి యనమల కలిశారు. హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం.  

యాదాద్రిలో సీఎం కేసీఆర్ దంపతులు..

నల్లగొండ : యాదాద్రి నరసింహస్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఛీఫ్ విప్ గొంగడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాదాద్రిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సీఎం భేటీ అయ్యారు.

11:56 - March 17, 2016

హైదరాబాద్ : ఏపీ ఆర్థిక మంత్రి, గతంలో స్పీకర్ గా పనిచేసిన యనమల..చేసిన చిన్న పొరపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వరంగా మారింది. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ చేసీన తీర్మానాన్ని హైకోర్టు కొద్దిసేపటి కిందట కొట్టివేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో రోజాను రూల్స్ లోని సెక్షన్ 340 ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కానీ ఈ సెక్షన్ కింద ఒక సెషన్ కు మాత్రమే సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రతిపక్షం పలుమార్లు వాదించింది. కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల సెక్షన్ 340 కింద రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రతిపాదించడం..దీనిపై స్పీకర్ కోడెల నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి.
దీనితో రోజా హైకోర్టును ఆశ్రయించారు. తదనంతరం సుప్రీంను కూడా ఆశ్రయించారు. వెంటనే విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలతో హైకోర్టు విచారణ చేపట్టింది. బుధారం రోజా, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. గురువారం రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

కింగ్ ఫిషర్ వేలానికి సర్వ సిద్ధం...

ముంబై : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నుంచి బకాయిలను రాబట్టటంలో భాగంగా ముంబైలోని విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న కింగ్ ఫిషర్ హౌస్ ను వేలం వేయటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వసన్నద్ధమయింది. 17 బ్యాంకుల నుండి రూ.6,963 కోట్లను కింగ్ ఫిషర్ సంస్థ రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకోవటానికి సుమారు 2,401.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వున్న కింగ్ హౌస్ విలువను రూ.150 కోట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 17న ఆన్ లైన్ లో జరిగే వేలంపాటలో కింగ్ ఫిషర్ ధర ఎంత పలుకుతుందోనని రుణాలు ఇచ్చిన  బ్యాంకులు ఆసక్తిగా  ఎదురు చూస్తున్నాయి.

బీజేపీ సీఈసీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ సీఈసీ సమావేశం కొనసాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు..తదితర అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరయ్యారు. 

వాయిదా తీర్మానాలు తిరస్కరించిన టి.స్పీకర్.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనాచారి తిరస్కరించారు. 

11:18 - March 17, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటిషన్ ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు సూచించింది. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ రోజా హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు తిరస్కరించింది. దీనితో రోజా సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, విచారణ చేయాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. బుధవారం దీనిపై విచారించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం మధ్యంతర తీర్పును వాయిదా వేసింది. గురువారం ఉదయం హైకోర్టు తీర్పును వెలువరించింది. సస్పెన్షన్ తీర్మానాలను కోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ మూడు గంటల్లో వస్తుందని, అనంతరం అసెంబ్లీకి వెళ్లవచ్చని రోజాకు హైకోర్టు తెలిపింది.
ఈ విజయం నియోజకవర్గాల ప్రజలది - రోజా..
తన సస్పెన్షన్ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేసింది. మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలదని తెలిపారు. న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గట్టిగానే తాను నిలదీయడం జరుగుతుందని, ప్రివిలైజ్ కమిటీ సమావేశానికి హాజరౌతానని రోజా పేర్కొన్నారు. 

యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్....

నల్లగొండ : సీఎం కేసీఆర్ దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. వీరికి పూర్ణకుంభంతో ఆయల అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

బుర్రిపాలెంలో మహేష్ కుటుంబసభ్యుల పర్యటన..

గుంటూరు : జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో సినీ నటుడు మహేష్ బాబు కుటుంబసభ్యులు పర్యటించారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై మహేష్ సతీమణి నమ్రత, సోదరి గల్లా పద్మావతి స్థానికులు, అధికారులతో చర్చించారు. 

హైకోర్టులో రోజాకు ఊరట..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. సస్పెన్షన్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. తదుపరిచ విచారణనను నాలుగు వారాల వరకు వాయిదా వేసింది. 

శ్రీశైలం ఘాట్ లోయలో పడిన లారీ....

కర్నూలు : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చిన్నారుట్ల వద్ద అదుపుతప్పి లారీ లోయలో పడిపోయింది. ఇద్దరు వ్యక్తులను స్థానికులు రక్షించారు. మరొక ముగ్గురు లారీలో చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 

శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు...

తిరుమల : టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు విష్ణు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నేటి ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం షాలిని, మోహన్ బాబుల కుటుంబ సభ్యులకు టీటీడీ దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

త్వరలో ఎయిర్ పోర్టు అథార్టీ సిబ్బంది నిరహార దీక్షలు..

ముంబై : ఎయిర్ పోర్టు అథార్టీ సిబ్బంది నిరహార దీక్షలు చేపట్టనున్నారు. బోనస్ ఇవ్వలేనిపక్షంలో ఏప్రిల్ 4వ తేదీ నుండి దీక్షలు చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. 

శ్రీవారి నకిలీ ప్రసాదం..ఒకరు అరెస్టు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న ఓ ఒప్పంద కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుచానూరులోని అతని నివాసంలో నకిలీ జిలేబీ తయారు చేసి శ్రీవారి ప్రసాదమంటూ భక్తులకు విక్రయిస్తున్నాడు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రసాదమని చెబుతున్న జిలేబీని స్వాధీనం చేసుకున్నారు. 

పీఆర్ అధికారిపై నిర్భయ కేసు ?

రంగారెడ్డి: జిల్లా ప్రజా సంబంధాల అధికారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదనట్లు తెలుస్తోంది. ఓ మహిళ అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

టూరిజంపై దృష్టి - అచ్చెన్నాయుడు..

హైదరాబాద్ : ఏపీకి టూరిజం ఒక వరంలాంటిదని దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో టూరిజంపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 

ఏపీ శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 1.36 జనాభా ఉంటే 9554 మంది పర్మినెంట్ వర్కర్లు, 23,964 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లున్నారని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో మున్సిపల్ శానిటేషన్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

09:35 - March 17, 2016

గుంటూరు : మిర్చి రైతులు రోడ్డెక్కారు. గత నాలుగు రోజులుగా యార్డులో కొనుగోళ్లు నిలిపివేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. పట్టాదార్ పుస్తకాలు, ఆధార్ కార్డులు కావాలని అధికారులు డిమాండ్ చేస్తుండడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా నుండి వచ్చిన తమకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని, ఆధార్ కార్డులు కావాలని అంటున్నారని ఓ రైతు పేర్కొన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. బంగారం వ్యాపారస్తులకు మద్దతు తెలుపుతూ కొనుగోళ్లు ఆపేశారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వర్షం పడితే మిర్చి మొత్తం నానిపోతుందని, మిర్చి యార్డు వద్ద లారీలు నిలిపివేయడంతో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కొనుగోళ్లు జరిపి తమ సమస్యలు తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

09:34 - March 17, 2016

హైదరాబాద్ : ఏపీకి టూరిజం ఒక వరంలాంటిదని దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో టూరిజంపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన వాటిపై తాము నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకున్నామన్నారు. పాడేరు, చింతపల్లిలో కాటేజీలు కట్టడానికి నిర్ణయం తీసుకున్నామని, కానీ స్థల వివాదం ఉండడంతో నిర్మాణం కావడం లేదన్నారు. రూ.300 లక్షలు ఖర్చు చేసి కాటేజీల నిర్మాణం చేస్తామన్నారు. హుదూద్ వల్ల ఎంతో నష్టం వాటిల్లిందని, ఇందుకు 17వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. లమ్మసింగి ఒక వరంలాంటిదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రూ.14 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మొదటి ఫేజ్ లో 8 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు సభకు తెలిపారు. 

09:31 - March 17, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా అరకు పేరు పొందిందని, కానీ లమ్మసింగిలో అభివృద్ధి ఎక్కడా అని వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరి ప్రశ్నించారు. ఏపీ శాసనసభలో ఆమె మాట్లాడారు. అరకు ఒక ఊటిగా చెబుతుంటారని, లమ్మసింగి చాలా పేరు పొందిందన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందలేని, ప్రధానంగా రోడ్లు బాగా లేవన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి చెబుతున్నారని, పర్యాటక రంగం చెబుతూనే గిరిజనులకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. బినామీలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని విమర్శించారు. ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడారు. గవర్నమెంట్ భవనాలు నిర్మాణం చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని సూచించారు. 

09:14 - March 17, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 1.36 జనాభా ఉంటే 9554 మంది పర్మినెంట్ వర్కర్లు, 23,964 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లున్నారని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో మున్సిపల్ శానిటేషన్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం 33,510 మంది వర్కర్లు ఉన్నారని సభకు తెలిపారు. 27284 మంది వర్కర్లు కావాలని, 6,226 ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 5,110 మంది కావాలని అడగడం జరిగిందని పేర్కొన్నారు. 2015, ఏప్రిల్ 2వ తేదీన 1,111 మందికి పర్మిష్ ఇచ్చామని, అవుట్ సౌర్సింగ్ కింద తాజాగా ఓ జీవో ఇవ్వడం జరిగిందన్నారు. జీవో ప్రకారం ఎవరైనా ఏరియా అవుట్ సోర్స్ పవర్ ను లోకల్ బాడీకి ఇవ్వడం జరిగిందని, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని మంత్రి నారాయణ తెలిపారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. సమావేశాల్లో మంత్రి యనమల బడ్జెట్ పై సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఏపీని కరవు రహిత రాష్ట్రంగా చేయడం..నదుల అనుసంధానంపై 344 రూల్ కింద టీడీపీ నోటీసు ఇచ్చింది. సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో అవకతవకలపై కాలింగ్ అటెన్షన్ కింద టీడీపీ నోటీసిచ్చింది. పెట్రోల్, డీజీల్ పెంపుపై 344 నిబంధన కింద అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ నోటీసు ఇచ్చింది. 

09:03 - March 17, 2016

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ బడ్జెట్ పై చర్చ ముగియనుంది. సమావేశాల్లో మంత్రి యనమల సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఏపీని కరవు రహిత రాష్ట్రంగా చేయడం..నదుల అనుసంధానంపై 344 రూల్ కింద టీడీపీ నోటీసు ఇచ్చింది. సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో అవకతవకలపై కాలింగ్ అటెన్షన్ కింద టీడీపీ నోటీసిచ్చింది. పెట్రోల్, డీజీల్ పెంపుపై 344 నిబంధన కింద అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా విప్ యామిని బాల టెన్ టివితో మాట్లాడారు. బడ్జెట్ పై వైసీపీ చర్చించలేదని, వాకౌట్ లు మాత్రమే చేస్తున్నారని తెలిపారు. ఇంకా ఎలాంటి విషయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

08:32 - March 17, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపుతోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పెరిగిన పెట్రో ధరలపై ఆయన స్పందించారు. గతంలో ఎవరైతే ఆధార్‌ లాంటి బిల్లుల్లి వ్యతిరేకించారో... ఇప్పుడు వాళ్లే ఆ బిల్లులను ఆమోదించారని దుయ్యబట్టారు. మెజారిటీ ఉంది కదా అని ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో సామాన్యుడి జీవితం భారంగా మారిందని ఆయన విమర్శించారు. 

హుబ్లీలో రైతుల రైల్ రోకో..

కర్నాటక : హుబ్లీలో రైతులు మంగళవారం రాత్రి రైల్ రోకో నిర్వహించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు రైతులను చెదరగొట్టారు. ఈ కారణంగా కలాసా బందురి రైలు రద్దయ్యింది. 

08:16 - March 17, 2016

'జనతా గ్యారేజ్‌' సినిమా షూటింగ్‌లో వున్న ఎన్‌టిఆర్‌ గాయపడ్డారనీ బుధవారం నాడు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ముంబైలో జరుగుతున్న యాక్షన్‌ సన్నివేశాల్లో భాగంగా ఆయన గాయపడ్డారనీ, దీంతో షూటింగ్‌కు అంతరాయం వాటిల్లిందని వచ్చిన వదంతులను నమ్మవద్దంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ తన ట్విట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేసింది. ఎన్‌టిఆర్‌ కెరీర్‌లో 26వ సినిమాగా తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్‌'కు సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా తాము మాత్రమే తెలియజేస్తామనీ, వదంతులను, ఫేక్‌ ఎకౌంట్‌లను నమ్మవద్దని ఎన్‌టిఆర్‌ అభిమానులకు ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందో! అని ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌కు కాస్త ఊరట లభించినట్లయింది. ఆగస్టు 12వ తేదీని విడుదల పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

సంతపాలెంలో యువకుడు దారుణ హత్య..

విశాఖపట్టణం : కోటపాడు మండలం సంతపాలెం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడు నాగేశ్వరరావును హత్య చేశారు.

మాల్యా ఇంటి వేలం..

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ఇంటిని భారతీయ స్టేట్ బ్యాంకు వేలానికి పెట్టింది. గత నెలలో ముంబైలో మాల్యా ఇంటిని ఎస్ బీఐ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఇంటి విలువ రూ.150 కోట్లుగా బ్యాంకు అధికారులు నిర్ధారించారు. ఆన్ లైన్ వేలానికి పెట్టినట్లు ఎస్ బీఐ స్పష్టం చేసింది. 

కాజీపేట వంతెనపై భారీ ట్రాఫిక్ జాం..

వరంగల్ : కాజీపేట వంతెనపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. బ్రిడ్జి మధ్యలో డీసీఎం నిలిచిపోయింది. దీనితో మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. 

మణుగూరులో జెన్ కో ప్రజాభిప్రాయ సేకరణ..

ఖమ్మం : భద్రాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులపై నేడు మణుగూరులో జెన్ కో అధికారుల ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 

07:47 - March 17, 2016

సహజంగా కాయగూరలు ఎలాంటివి తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నటైతే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. వంకాయలు వాడిపోకుండా, మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. తొడిమలు ఆకుపచ్చ రంగులో ఉండి తోలు నిగనిగలాడుతూ పుచ్చులు లేకుండా చూడాలి.
బంగాళాదుంపలు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పైపొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. బంగాళా దుంపపైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనకూడదు. దుంపలపైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనాలి.
అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేకుండా ముదురు రంగులో ఉన్న దానిని చూసి ఎంపిక చేసుకోవాలి. అల్లంపై పొర తీసి వాసన చూసి దాని ఘూటును బట్టి కొనాలి.
ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. వీటిపై పొరలో తేమ ఉంటే అసలు కొనకూడదు.
బీట్‌రూట్‌ కొనేముందు దాని కింద భాగంలో వేర్లు వున్న వాటిని ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.
బెండకాయలను కొనేటప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరినవి కొనకూడదు.
కాలిఫ్లవర్‌ కొనేముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో వుండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న వాటిని కొనకూడదు. పువ్వు విడిపోకుండా దగ్గరగా వున్న వాటినే కొనాలి.
ఆకుకూరలు కొనేముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా ఉండేటట్లు చూసుకోవాలి.

07:46 - March 17, 2016

''చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ ఉండే నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా'' అంటూ సందేశం ఇచ్చే ఓ వక్త బీట్‌రూట్‌. క్యారెట్‌, బీట్‌రూట్‌ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్‌రూట్‌ను వెలివేస్తుంటారు. బీట్‌రూట్‌ను తినొచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు, కూరగా వండుకోవచ్చు. ఎక్కువమంది దీన్ని కేవలం జబ్బులోస్తే పెట్టే వంటకంగా వాడుతున్నారు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మ సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే బీట్‌రూట్‌ చేసే మేళ్ళేంటో తెలుసుకుందాం!
గుప్పెడు ఓట్స్ ను, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే చర్మం కాంతులీనుతుంది.
బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.
బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరి పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

07:44 - March 17, 2016

నారా రోహిత్‌, నందిత నాయకానాయికలుగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో విజన్‌ ఫిలిం మేకర్స్‌ పతాకంపై డా||వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సావిత్రి'. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ,'ఇదొక క్యూట్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్‌ విడుదలైన రోజు దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. నారా రోహిత్‌, నందితల కాంబినేషన్‌ ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పవన్‌ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. సాయికార్తీక్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదలైన పాటలు సర్వత్రా ఆదరణ పొందాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలున్న ఈచిత్రాన్ని ఏప్రిల్‌ 1వ తేదీన వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌లెవెల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.

07:43 - March 17, 2016

బాలీవుడ్‌ బ్యూటీగా పేరొందిన జూహీ చావ్లా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఓ కన్నడ చిత్రంలో నటిస్తోంది. 1987లో రవిచంద్రన్‌ సరసన 'ప్రేమ లోక' చిత్రంలో జూహీ నటించింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కన్నడ ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో 'పుష్పక విమాన' చిత్రం రూపొందనుంది. ఈచిత్రంలోని ఓ కీలక పాత్రలో జూహీ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో తెరకెక్కే చిత్రమిదని దర్శకుడు రమేష్‌ అరవింద్‌ తెలిపారు. జూహీ ఇటీవల బాలీవుడ్‌లో నటించిన 'చాక్‌ అండ్‌ డస్టర్‌' చిత్రానికి మంచి స్పందన లభించింది.

07:42 - March 17, 2016

ఒకప్పుడు సినిమా పూర్తయిన తర్వాత పబ్లిసిటీని స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. సామాజిక మీడియా పుణ్యమా అని ఈ పబ్లిసిటీ మరింతగా ఊపందుకుంటోంది. సామాజిక మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకునే విషయంలో పెద్ద హీరోలు సైతం మినహాయింపు కాదు. షూటింగ్‌లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో పోస్ట్ చేసి అభిమానులతో పాటు ప్రేక్షకులతో కూడా షేర్‌ చేసుకుంటున్నారు. అగ్ర హీరోల్లో మహేష్‌బాబు సైతం తన సినిమాల గురించి తరచూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో అప్‌డేట్‌ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించి రకరకాల విశేషాల్ని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' చిత్రం తాజా షెడ్యూల్‌ హరిద్వార్‌, ఉదయ్ పూర్‌లలో జరిగింది. ఈ షెడ్యూల్‌ పూర్తయ్యిందని ట్విట్టర్‌లో మహేష్‌బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా సెట్‌లో దిగిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. 'లాంగ్‌ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌కి చేరుకున్నాం. ఇంకా కొంచెం షూటింగ్‌ బ్యాలెన్స్ ఉంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు' అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌.వి.పొట్లూరి, మహేష్‌బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలు. 

07:41 - March 17, 2016

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అర్జెంట్‌గా ఓ కూతురు కావాలట. అదీ మూడు రోజుల్లోనే. 'శనివారం లోగా నాకో బేబీ కావాలి. ఇప్పుడెలా అంటూ..' ట్వీట్‌ చేశారు సమంత. ఇంత అర్జెంట్‌గా సమంతకి కూతురి అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. మహేష్‌బాబు తనయ సితారతో గడిపేందుకు శనివారం సమయాన్ని కేటాయించింది. అయితే సితార తనతో ఆడుకోవడానికి సమంత కూతురిని కూడా తీసుకురమ్మని రిక్వెస్ట్ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలీయక సమంత పై విధంగా ట్వీట్‌ పెట్టింది. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్‌ ఫిక్స్ చేశా. కాని సితారకి నా కూతురు కూడా కావాలంట. శనివారంలోగా ఓ బేబీని ఎలా ఎరేంజ్‌ చేయాలి' అంటూ సితారతో దిగిన ఓ ఫోటోను సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది సమంత. 'బ్రహ్మోత్సవం'తోపాటు సమంత నితిన్‌ సరసన 'అ...ఆ' చిత్రంలోనూ నటిస్తున్న విషయం విదితమే.

07:40 - March 17, 2016

సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి ప్రధాన తారాగణంగా తమిళంలో నటించిన 'పసంగ2' చిత్రాన్ని 'మేము' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్న విషయం విదితమే. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ జ్ఞాన్‌వేల్‌ రాజాతో కలిసి తెలుగులో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ,'ఈనెల 18న ఈచిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇక సినిమా విషయానికొస్తే, ప్రతి తల్లితండ్రి చూడాల్సిన చిత్రమిది. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి మీడియా సైతం మంచి మంచి విశ్లేషణలు రాసింది. ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉండే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అకట్టుకునే రీతిలో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండిరాజ్‌ మలిచారు. సూర్య నటన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. 

07:38 - March 17, 2016

'ఏ నటీనటుడైనా ఒకే ఎక్స్ ప్రెషన్‌తో పది షాట్స్ తీయడాన్ని మెచ్చరు. ఈ డిజిటల్‌ యుగంలో రకరకాల కొత్త సాఫ్ట్ వేర్స్‌ని ఉపయోగించి నటీనటులను కూడా రోబోల్లా దర్శకులు తయారు చేస్తున్నార'ని అంటున్నారు బాలీవుడ్‌ సినీయర్‌ నటుడు రిషి కపూర్‌. ఆయన షకున్‌ బాత్రా దర్శకత్వంలో 'కపూర్‌ అండ్‌ సన్స్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న తరుణంలో దర్శకుడు రిషిని రెండు సార్లు షూటింగ్‌ నుంచి తప్పుకోమన్నారట. పైగా వీరిద్దరికి షూటింగ్‌ జరిగినన్ని రోజులూ గొడవ జరుగుతూనే ఉందట. ఇదే విషయాన్ని మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిషి చాలా ఘాటుగా చెప్పారు. 90 ఏళ్ళ వృద్ధుడిగా ఈ చిత్రంలో నటించాను. సన్నివేశానికి తగ్గట్టు ఎలాంటి హావ భావాల్ని చూపించాలనేది నటీనటులకు తెలుసు. అలాంటిది ఏ సన్నివేశానికైనా ఒకే ఎక్స్ ప్రెషన్‌ పెడితే చాలని దర్శకుడు చెప్పడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలాంటి సందర్భాల్ని ఈ షూటింగ్‌లో చాలా ఫేస్‌ చేశానన్నారు రిషి.

07:37 - March 17, 2016

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ చర్చలో కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి మాట్లాడారు. నేతలను పార్టీల్లో చేర్చుకోవడం..రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదా అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు మెదక్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపట్టారు. కనీస వేతనాలు ఇప్పించాలంటూ ఈ సమ్మె చేపట్టారు. ఈ అంశాలపై టెన్ టివి లో జరిగిన చర్చా వేదికలో లక్ష్మి నరసింహరావు (టీఆర్ఎస్), గోసల శ్రీనివాస్ యాదవ్ (టిడిపి), సాయిబాబా (సీఐటీయూ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నాగ్ పూర్ లో కొకైన్ స్వాధీనం..

నాగ్ పూర్ : ముగ్గురు వ్యక్తుల నుండి కొకైన్ ను నాగ్ పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

నేటి నుండి మహిళా రైతుల జాతీయ సదస్సు..

గుంటూరు : బాపట్ల వ్యవసాయ కళాశాలలో మహిళా రైతుల జాతీయ సదస్సు జరగనుంది. 20 రాష్ట్రాల నుండి 500 మంది రైతులు హాజరు కానున్నారు. 

నేడు ఢిల్లీకి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో భేటీ కానున్నారు. కేటీఆర్ వెంట జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లు కూడా వెళ్లనున్నారు. 

నేటి నుండి ఓయూ డిగ్రీ పరీక్షలు..

హైదరాబాద్ : ఓయూ డిగ్రీ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 26న ముగుస్తాయి. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కేంద్రాలు, సిబ్బంది, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి సంవత్సరం, మూడో సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. 

నేటి నుండి ఉత్తరాంధ్రలో ఫైబర్ గ్రిడ్..

విజయవాడ : కేవలం రూ.149 చెల్లింపుతో ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు టెలిఫోన్, కేబుల్ సౌకర్యాలను దగ్గర చేసే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. విశాఖలో జరిగే తొలి దశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ ను ఆయన ప్రారంభించనున్నారు. 

06:46 - March 17, 2016

తెలంగాణలో మధ్యాహ్న భోజనం పథకం వర్కర్లు పోరుబాట పట్టారు. ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత అయిదు నెలలుగా పెండింగ్ లో వున్న బిల్లులు, వేతనాలు చెల్లించాలన్నది వీరి డిమాండ్. మధ్యాహ్న భోజనం పథకం వర్కర్లు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమిటి? వీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? తెలంగాణలో మధ్యాహ్న భోజనం పథకానికున్న ప్రాధాన్యత ఏమిటి? మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్ నేత రమ విశ్లేషించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:44 - March 17, 2016

కోల్ కతా : విధ్వంసకర బ్యాట్స మెన్‌ క్రిస్‌గేల్‌ చెలరేగి సెంచరీ చేయడంతో.. టీ-20 ప్రపంచకప్‌లో విండీస్‌ శుభారంభం చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. శామ్యూల్స్‌, క్రిస్‌గేల్‌ చెలరేగి ఆడటంతో ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్రిస్‌గేల్‌ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడుగా క్రిస్‌గేల్‌ నిలిచాడు. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు శుభారంభం చేసింది.బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ జట్టు అహ్మద్‌ షెహజాద్‌, మహ్మద్‌ హఫీజ్‌ హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో పాటు ఆఖర్లో బూమ్‌ బూమ్‌ అఫ్రీది ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్ ఆడటంతో 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంత బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు ...పాక్‌ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 146 పరగులే చేయగలిగింది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రీదికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. 

06:41 - March 17, 2016

న్యూఢిల్లీ : ఆధార్‌ బిల్లుపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. వివాదస్పదరీతిలో లోక్‌సభలో ఆధార్‌ బిల్లును పాస్‌ చేశారని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లుపై సీపీఎం నేత సీతారాం ఏచూరి, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం జరిగింది. ఈ బిల్లులో మార్పులు చేయాలని సూచిస్తూ రాజ్యసభ లోక్‌సభకు తిప్పి పంపింది. ఆధార్‌ బిల్లును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆధార్‌ బిల్లును లోక్‌సభలో ద్రవ్యబిల్లుగా ఆమోదించడంలో ప్రభుత్వం ఉద్దేశమేంటో వెల్లడించాలని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆధార్ బిల్లును సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నందున ఇది లెజిస్లేటివ్ అధికార పరిధిలోకి రాదని ఏచూరి అన్నారు. ఆధార్ బిల్లు వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘిస్తుందా? అనే విషయాన్ని పార్లమెంటు ప్యానెల్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించజాలదని స్పష్టం చేశారు.

1977-78 లో..
ఏచూరి వ్యాఖ్యలను జైట్లీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది అసంబద్ధమైన వాదన అని, కోర్టుకు కేవలం జ్యుడీషియల్ సమీక్ష అధికారాలు మాత్రమే ఉంటాయని జైట్లీ బదులిచ్చారు. ఆధార్‌ ద్వారా సబ్సిడీ నిధులను నిర్దిష్టమైన పద్ధతిలో అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రైవసీ కచ్చితమైన హక్కు కాదని.. ప్రైవసీ విషయం సుప్రీం కోర్టు చూసుకుంటుందని జైట్లీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఆధార్‌ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లులో మార్పులు తేవడం కానీ, ఆపడం కుదరదన్న విషయం తమకు తెలుసన్నారు. గత శుక్రవారం ఆధార్ బిల్లును లోక్‌సభలో ద్రవ్యబిల్లుగా ప్రభుత్వం ఆమోదించింది. లోక్‌సభలో బిజెపి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యబిల్లును రాజ్యసభ ఎలాంటి మార్పు చేయడానికి వీలు లేదు. రాజ్యసభలో ఎన్డీయే మైనారిటీలో ఉండటంతో కేంద్రం ఈ ఎత్తు వేసింది. అయితే... రాజ్యసభ ఈ బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదిస్తూ లోక్‌సభకు పంపింది. ఈ సవరణలను ఆమోదించే, తిరస్కరించే అధికారం లోక్‌సభకు ఉంటుంది. 1977-78లో ద్రవ్యబిల్లును రాజ్యసభ తిప్పిపంపగా లోక్‌సభ తిరస్కరించింది.

06:39 - March 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ అవిశ్వాస బాణం ఎక్కుపెట్టింది. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్న ఆరోపణతో గులాబీ ప్రభుత్వానికి ఝలక్‌ ఇద్దామనుకుంది. కానీ అంతలోనే... మాట మార్చింది. అవిశ్వాసమా...? అబ్బే అదేం లేదే.. అంటూ యూ టర్న్‌ తీసుకుంది. ఇంతకీ అవిశ్వాసంపై హస్తం ఎందుకు వెనకడుగు వేస్టున్నట్లు. ? టీ సర్కార్‌ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయించుకుంది . కానీ సభలో ప్రతిపక్షాల స్వరం వినిపించే అవకాశం రాలేదని ఆ పార్టీ భావిస్తోంది. సభలో భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రభుత్వాన్ని పడగొట్టే బలం లేకున్నప్పటికీ..ప్రభుత్వ తప్పులను ఎండగట్టేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

అంతా సైలెంట్...
కానీ అంత‌లోనే ఏమైందో ఏమో గానీ... అంతా సైలెంట్ అయ్యారు. అవిశ్వాస‌మా అంతా తూచ్ అంటున్నారు. అసెంబ్లీకి వ‌చ్చిన జానా రెడ్డిని అవిశ్వాసం అంశంపై మీడియా ప్రశ్నించింది. అయితే అవిశ్వాసమా..? ఎవరు చెప్పారంటూ జానారెడ్డి సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్‌ యూ టర్న్ తీసుకున్నట్లైంది. అవిశ్వాసం పెడతామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డే స్వయంగా చెప్పడం.. అబ్బే అదేం లేదని సీఎల్‌పీ నేత జానారెడ్డి అనడం ఆ పార్టీలో నేతల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. అవిశ్వాసంపై చర్చ జరిగినా.. దానిపై ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు సమాచారం. అవిశ్వాసం పెడదామని కొందరు..వద్దని మరికొందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు అభిప్రాయపడ్డట్లు సమాచారం. 

వెనక్కి తగ్గిన కాంగ్రెస్...
కాంగ్రెస్‌ ప్రతిపాదనకు మిగతా ప్రతిపక్ష పార్టీల నుంచి అంత సానుకూలత రాలేదని తెలుస్తోంది. దానికి తోడు ఇప్పుడు సర్కార్‌పై అవిశ్వాసం పెడితే టీఆర్‌ఎస్‌ కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలను గులాబీ గూటిలోకి లాగేలా ఉందన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. ఇదే కారణంతో అవిశ్వాసంపై వెనక్కు తగ్గినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి.. తద్వారా కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకన్న భావనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు సమాచారం

06:36 - March 17, 2016

హైదరాబాద్ : ఒకరు అధికార పక్షం.. మరొకరు ప్రతిపక్షం. ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనకు అధికారపక్షం నుంచి పార్టీలో చేరాలని ఆహ్వానాలు వస్తున్నాయని ఎమ్మెల్యే అంటే.. అదే జరిగితే పార్టీ నాశనం అవుతుందని మంత్రి అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో జరిగిన ఈ హాట్‌ టాపిక్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య మాటల యుద్ధం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే మూడు రోజుల క్రితం శాసనమండలిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కోమటిరెడ్డి సోదరులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. అయితే వారిని చేర్చుకోవడం వల్ల పార్టీకి నష్టమని జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో వారి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

అసెంబ్లీ లాబీల్లో..
మరోవైపు జగదీష్‌రెడ్డి మాటలను కొట్టిపారేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. తనకు కేసీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని.. పార్టీలో చేరాలని ప్రతిరోజు ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. మంత్రి పదవి తనకు అవసరం లేదన్నారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరితే జగదీష్‌రెడ్డి మంత్రి పదవి ఊడడం ఖాయమన్నారు. ఇదిలావుండగా.. రౌడీలతో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదన్నారు. వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన రోజున రాజకీయాల నుంచి తప్పుకొని.. స్వచ్చంద కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ లాబీలో ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఎమ్మెల్యే వీరేశం స్పందించారు. ఇన్నాళ్లుగా జిల్లాలో ఎవరు రౌడీయిజం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత.. ప్రజలంతా సుఖంగా ఉన్నారని తన అభిప్రాయాన్ని చెప్పారు. మరోవైపు మంత్రి జగదీష్‌రెడ్డి , కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

06:30 - March 17, 2016

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిసాయి. సస్పెండ్ చేసిన రోజు ఏం జరిగిందన్న విషయమై జస్టిస్ రామలింగేశ్వర్‌రావు అసెంబ్లీ రికార్డ్స్‌ను పరిశీలించారు. న్యాయవాదులను ఎగ్జామిన్‌ చేస్తూ.. అసెంబ్లీల నిర్ణయాలు-ఉన్నత న్యాయస్థానాల జోక్యంపై గత కేసులను పరిశీలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు మధ్యంతర తీర్పు ప్రకటిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా ఏడాదిపాటు సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబుపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ కారణంతో ఆమెను సస్పెండ్ చేసేలా అసెంబ్లీ రూల్స్ సెక్షన్ 340 క్లాజ్ 2 ప్రకారం తీర్మానం చేశారు. ఈ సెక్షన్‌ ద్వారా ఒక్క సెషన్ మాత్రమే సస్పెండ్‌ చేసే అధికారం ఉందని రోజా తరుపు న్యాయవాది ఇందిరా జైసింగ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. బడ్జెట్ సెషన్ కీలకమైనదని ఆ సెషన్‌లో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

రికార్డ్స్ ను పరిశీలించిన న్యాయస్థానం..
తాము 394 క్లాజ్ 2 ప్రకారం సస్పెండ్ చేసినా.. అర్టికల్ 194 సబ్ క్లాజ్ త్రీ ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఒక తప్పుకు రెండు సెక్షన్ల కింద ఎలా చర్యలు తీసుకుంటారని.. జస్టిస్ రామలింగేశ్వర్ అసెంబ్లీ సెక్రెటరీ తరుపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీ, ప్రివిలైజ్‌డ్‌ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే 194 సబ్ క్లాసు 3 ప్రకారం సస్పెండ్ చేయడం ఆ క్రమంలో రూల్స్ కు విరుద్ధంగా మంత్రి యనమల వ్యవహరించినట్లు రోజా తరుపు న్యాయవాది వివరించారు. కావాలనే 194 ఆర్టికల్‌ను ముందుకు తీసుకొస్తున్నారని వాదించారు. ఈ నేపథ్యంలో రోజాను సస్పెండ్ చేసిన రోజున సభలో నమోదైన రికార్డ్స్‌ను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది.

నేడు తీర్పు..
రోజా సస్పెన్షన్ వ్యవహారంలో మంగళవారం సుప్రీం కోర్టు నుంచి వెలువడిన అత్యవసర ఆదేశాల నేపథ్యంలో టెంపరరీ చీఫ్‌ జస్టిస్‌ దిలీప్ బి.భోస్లే, నవీన్‌రావు డివిజన్ బెంచ్.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ తీరుపై ఆరా తీసింది. అనంతరం రామలింగేశ్వరరావు బెంచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తుర్వులు ఇచ్చింది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ రామలింగేశ్వరరావు తీర్పును గురువారానికి వాయిదా వేశారు. 

06:27 - March 17, 2016

హైదరాబాద్ : ఏపీ విభజన చట్టంతోపాటు, రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ఇచ్చిన అన్ని హామీలను త్వరితగతిన అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తీర్మానం చేసింది. చట్టపరమైన హామీల అమలుతోపాటు, రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని శాసనసభ కోరింది. అటు శాసన మండలిలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఇదే తీర్మానాన్ని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో ఆర్థికంగా, ఆదాయపరంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తీర్మానంలో కోరారు. రెవిన్యూ లోటు భర్తీకి నిధులు విడుదల చేయాలని, ఏపీలో ప్రస్తుతమున్న శాసనసభ స్థానాలను 175 నుంచి 225 కు పెంచాలని తీర్మానంలో కోరారు. విశాఖలో రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపిన అసెంబ్లీ.... ఏపీ కొత్త రాజధాని అమరావతి ఆర్థిక శక్తిగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు సహకరించాలని కోరారు. ఇందుకోసం పదేళ్లపాటు వంద శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. దక్షిణాదిలో అత్యంత వెనుకబడి ఉన్న ఏపీ.. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేలా ఇతోధికంగా సాయం చేయాలని చంద్రబాబు కోరారు.

కేంద్రానికి తీర్మానం..
రాష్ట్రానికి ఆర్ధిక సాయంచేసే విషయంలో ప్రభుత్వం చేస్తున్న విన్నపాలను కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. పత్యేక హోదా కోసం గతేడాది ఆగస్టు 31న అసెంబ్లీలో తీర్మానం చేసిన పంపిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నింటనీ నెల రోజుల్లోలోగా అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటానని అల్టిమేటమ్‌ జారీ చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు సాధించే విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిపై నమ్మకం లేకపోయినా.. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు జగన్‌ ప్రకటించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు తీర్మానాన్ని ఏక గ్రీవంగా ఆమోదించాలని కోరారు. విభజన చట్టంలోని హామీ అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. 

06:23 - March 17, 2016

హైదరాబాద్ : ఏడాది క్రితం భారీగా ప్రక‌ట‌న‌లు ఇచ్చి హంగామా చేసిన వెల్ఫేర్ గ్రూప్ కంపెనీల బాగోతం బ‌ట్టబ‌య‌లు అయింది. వెల్ఫేర్ గ్రూపు కార్యాలయాలపై సిబిఐ దాడులు చేసింది. 4 రాష్ట్రాల్లో 82 కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. గుడివాడ‌, విశాఖ‌, నెల్లూరు, రాజ‌మండ్రి త‌దిత‌ర ప్రాంతాల్లో వెల్ఫేర్ కంపెనీ కార్యాల‌యాలు మూత‌ప‌డ్డాయి. దీంతో ఖాతాదారులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్‌ సంస్థ చిట్‌ఫండ్‌ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా 82 కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది.

నిర్మాతగా వ్యవహరించిన ప్రసాద్..
ఝార్ఖండ్‌ కోర్టు ఆదేశాలతో ఈ సంస్థపై గతంలోనే సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. మల్ల విజయప్రసాద్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆర్.బి.ఐ. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేక‌రించిన ఈ కంపెనీపై కేసులు న‌మోద‌వుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి మళ్ల విజయప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీలో తరపున పోటీచేసిన మళ్ల విజయప్రసాద్ పరాజయం పాలయ్యారు. తెలుగులో వెల్ఫేర్ ప్రొడక్షన్స్ పేరుతో పలు సినిమాలకు నిర్మాతగా ప్రసాద్‌ వ్యవహరించారు.

06:16 - March 17, 2016

హైదరాబాద్ : నిత్యం రద్దీగా ఉండే అల్ఫా హోటల్ సమీపంలో బుధవారం రాత్రి కలకలం రేగింది. ఓ అట్టపెట్టేలో యువకుడి మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైన యువకుడు అభయ్ అని పోలీసులు తేల్చారు. గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్లిన అభయ్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. అభయ్ ను తాము కిడ్నాప్ చేసినట్లు..ఇందుకు రెండు..మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆగంతకులు తండ్రి రాజ్ కుమార్ కు ఫోన్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని పేర్కొన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా అభయ్ విగతజీవుడుగా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హత్య ఎవరు చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించనున్నారు. కుటుంబ తగదాలు..వ్యాపార విబేధాలున్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

06:11 - March 17, 2016

హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారులను కన్నతల్లి పొట్టన పెట్టుకుంది. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. తుకారంగేట్ పీఎస్ పరిధిలో రజనీ, రామకృష్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి తన్వి, శాన్విక కూతుర్లున్నారు. బుధవారం రాత్రి ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన రజని పరారైంది. ఇది చూసిన రామకృష్ణ పోలీసులకు సమాచారం అందించారు. ప్యారడైజ్ హోటల్ సమీపంలో రజనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంపత్య జీవనం సరిగ్గా జరగడం లేదని, తనకు జన్మించిన ఆడపిల్లలకు తాను ఎదుర్కొంటున్న పరిస్థితి రావద్దని ఇలా చేసినట్లు రజనీ పోలీసులకు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం ఆత్మహత్య చేసుకొనేందుకు ట్యాంక్ బండ్ కు వెళ్లినట్లు తెలిపినట్లు తెలుస్తోంది. కానీ ఆత్మహత్య చేసుకొనేందుకు వెళ్లిందా? లేక బెంగళూరులో నివాసం ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు రజనీ ప్రయత్నించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల హత్యపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.

హైదరాబాద్ : తుకారంగేట్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి ఇద్దరు పిల్లలను చంపేసి పరారైంది. పరారైన తల్లి రజినిని పోలీసులు పట్టుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

రోజా సస్పెన్షన్ పై నేడు కోర్టు ఆదేశాలు...

హైదరాబాద్ : శాసనసభ నుండి ఏడాది పాటు సస్పెన్సన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా..దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఆదేశాలను గురువారానికి వాయిదా వేశారు. 

మే 4 నుండి వరంగల్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్..

వరంగల్ : రాష్ట్ర స్థాయి ఆర్మీ ఎంపికలు మే 4 నుండి 14 వరకు వరంగల్ జిల్లాలో జరగనున్నాయి. ఈనెల 20వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 

టీ -20 ప్రపంచ కప్ లో నేడు..

నాగ్ పూర్ : టీ ప్రపంచ కప్ లో నేడు శ్రీలంక - అప్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ జట్లు ఢీకొననున్నాయి. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. 

రేపు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, ఏప్రిల్ లో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ వేదికను ఖరారు చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పార్టీ సమావేశం తెలంగాణ భవన్ లో జరగనుంది. 

విండీస్ విజయం..

ముంబాయ్ : వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టి-20 మ్యాచ్‌లో విండీస్ జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన విండీస్ టీం 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకుంది. గేల్ 47 బంతుల్లోనే సెంచరీ చేయడంతో సునాయాసంగా విండీస్ విజయం సాధించింది. 

Don't Miss