Activities calendar

18 March 2016

మరో నలుగురు అమరవీరుల కుంటుంబాలకు ఆర్థికసాయం

హైదరాబాద్ : మరో నలుగురు అమరవీరుల కుంటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బీసీ విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 290 కోట్లు విడుదలకు ఆదేశాలిచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్ల పురస్కారాల ఎంపిక కోసం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇండో పాక్ మ్యాచ్ తిలకించేందుకు రానున్న ప్రముఖ క్రికెటర్లు

హైదరాబాద్ : భారత, పాక్‌ దేశాల మధ్య జరిగే హైఓల్టేజ్‌ మ్యాచ్‌ ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్‌ ప్రముఖులు తరలి రానున్నారు. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్స్ సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌లతో పాటు పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజాలు ఇమ్రాన్‌ ఖాన్‌, వకార్‌ యూనస్‌, వసీం అక్రమ్‌, ఇంతికాబ్‌ ఆలం తదితరులు ఈడెన్‌ గార్డెన్‌లో దర్శనమివ్వనున్నారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, పాకిస్తాన్‌ ప్రఖ్యాత క్లాసికల్‌ సింగర్‌ షఫాఖత్‌ అమానత్‌ అలీ భారత పాక్‌ జాతీయ గీతాలను ఆలపించనున్నారు. 

22:04 - March 18, 2016

హైదరాబాద్ : వచ్చేనెల నుంచి ఏపీలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాయలసీమ నుండి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. సచివాలయంలో వ్యవసాయఅధారిత పరిశ్రమల సీఈవోలు , రీజనల్ హెడ్స్ తో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 

 

22:00 - March 18, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై బిజెపి-పిడిపిల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని పిడిపి వర్గాలు ధృవీకరించాయి. బిజెపి నేత రామ్‌మాధవ్‌ కూడా చర్చలు విఫలమైనట్టు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోందని, పిడిపి చేస్తున్న కొత్త డిమాండ్లను అంగీకరించడం అసంభవమన్నారు. జనవరిలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్‌ సయీద్‌ మృతి చెందాక రాష్ట్రంలో గవర్నర్‌ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెహబూబూ ముఫ్తీ బిజెపికి కొత్త షరతులు విధించారు. ఇందుకు బిజెపి అంగీకరించడం లేదు.

 

21:58 - March 18, 2016

హర్యానా : జాట్ నేతలతో హర్యానా ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రిజర్వేషన్ల కోసం జరుపుతున్న తమ ఆందోళనను ఏప్రిల్‌ 3కి వాయిదా వేశాయి. రిజర్వేషన్ల బిల్లు పాస్‌ చేయడం కోసం అసెంబ్లీకి ఎక్కువ సమయం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మార్చి 31 వరకు గడువిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అదే రోజున ముగియనున్నాయి. అప్పటి వరకు ఆందోళనలకు దూరంగా ఉంటామని జాట్ నేతలు హామీ ఇవ్వడంతో ఖట్టర్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 

21:56 - March 18, 2016

ఢిల్లీ : ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలలో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటోలు పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఇంతకుముందు ప్రభుత్వ ప్రకటనలలో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించాలి తప్ప గవర్నర్, ముఖ్యమంత్రి తదితరుల ఫొటోలు వాడకూడదని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులు దేశ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులో వాదించాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ రంజన్‌ గగోయి ధర్మాసనం ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సవరించింది. 

 

21:52 - March 18, 2016

మీరు హ్యాపీగా ఉన్నారా..?! మీ ఫ్యామిలీ సంతోషంగా ఉందా..?! సంతోషం కరవు అవుతుంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:46 - March 18, 2016

తెలంగాణల పెరిగిపోతున్న బాల్య వివాహాలు, ఉపాసం ఉంటున్న ఏడుకొండల ఎంకన్న .. నాయిని నర్సన్న మీద పగవట్టిన నేరగాళ్లు, ఇద్దరు ఆడోల్ల నడ్మ తోలు దొడ్డు లొల్లి, ప్యాన్ గుర్తు రోజమ్మకు ప్రీగ అయిన పబ్లిసిటీ, లీడర్లు రాక ఆగిపొయ్యిన లచ్చిమి నర్సింహ సామి లగ్గం అంశాలను మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:39 - March 18, 2016

ధర్మశాల : బౌద్ధమతగురువు దలైలామా నివాస పట్టణం ధర్మశాలకు...టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ మ్యాచ్ లు రావడంతో...అక్కడి అభిమానులు మాత్రమేకాదు...దలైలామా శిష్యులు, యువలామాలు సైతం పొంగిపోతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో యువలామాల బృందం కాసేపు క్రికెట్ ఆడి సందడి సందడి చేశారు. ప్రపంచకప్ లో పోటీపడుతున్న జట్లకు బెస్టాఫ్ లక్ చెప్పారు. యువ లామాల క్రికెట్ హంగామా ఏంటో మీరూ ఓసారి చూడండి.....

 

21:25 - March 18, 2016

కడప : కళ్లు మూసుకుని చెక్కినా కృష్ణుడి విగ్రహంలో ఎన్టీఆర్‌ పోలీకలే కనిపిస్తాయని అంతగా ఆయన రూపం ప్రజల మనసుల్లో నిండిపోయిందని సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. కడప జిల్లా కమలాపురంలో టిడిపి నేత పుత్తా నరసింహారెడ్డి నూతనంగా నిర్మించిన రాధాకృష్ణ దేవాలయాన్ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ముందుగా ఆలయంలో కుంభాభిషేకం చేశారు. అనంతరం ఎడ్ల పందాలు ప్రారంభించారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని బాలయ్య కొనియాడారు. అభిమానుల కోరిక మేరకు సింహా సినిమాలో డైలాగులు చెప్పి అలరించారు. 

 

ఇంగ్లండ్ విజయలక్ష్యం 230 పరుగులు

ముంబై : టీ20 ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 వోవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయలక్ష్యం 230 పరుగులుగా ఉంది.   

21:08 - March 18, 2016

హైదరాబాద్ : అధికార, విపక్షాల మాధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై అటు విపక్షం వైసిపి, ఇటు అధికార పక్షం టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సస్పెన్షన్‌ సరైందే అని టిడిపి వాదిస్తుంటే.. ప్రజాస్వామ్యాన్ని అధికారపక్షం ఖూనీ చేస్తోందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 
అధికార విపక్షాల మధ్య వివాదం
వైసిపి ఎమ్మెల్యే రోజా ఏడాది సస్పెన్షన్‌ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినా..అసెంబ్లీకి వెళ్లకుండా రోజాను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 
టిడిపి ఎదురుదాడి
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారం సరైనదే అంటూ విపక్షంపై టిడిపి ఎదురుదాడికి దిగింది. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు మంత్రి రావెల కిశోర్‌ బాబు. రోజాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో సభకు సూచన మాత్రమే చేసిందని ఆమెకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజా అంశంపై సభలో చర్చజరగాలని ఆమె అన్నారు. 
వైసిపి ఎమ్మెల్యేలు భేటీ
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై వైసిపి ఎమ్మెల్యేలు లోటస్‌పాండులోని కార్యాలయంలో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు, రోజా వ్యవహారంపై చర్చించారు. అయితే ఎమ్మెల్యే రోజాను శనివారం కూడా తమతో పాటు తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలిపారు. రోజాను అనుమతించకపోతే ఏంచేయాలనే దానిపై శనివారం నిర్ణయం తీసుకుంటామన్నారు.  
సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : స్పీకర్‌ కోడెల
ఎమ్మెల్యేల రోజా అంశంపై సోమవారం సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు స్పీకర్‌ కోడెల. కోర్టు ఆర్డర్‌ కాపీ అందిందని..వాటిని సభ్యులందరికీ పంపుతున్నామన్నారు. అయితే స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం నడచుకుంటామని సభా వ్యవహారాల మంత్రి యనమల తెలిపారు. మరోవైపు రోజాను సభకు అనుమతించనందుకు నిరసనగా శనివారం శాసనసభకు నల్లదుస్తులతో వెళ్లి నిరసన తెలపాలని వైసిపి నిర్ణయించింది. అంతే కాకుండా కోర్టు ధిక్కరణ కింద న్యాయ పోరాటం కూడా చేయాలని నిర్ణయించింది. 

 

20:51 - March 18, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో ఆశావర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యలు తీర్చాలని.. వేతనాలు పెంచాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చూపట్టారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు  ఎంత అడ్డుకున్నా నిరసనను విరమించకపోవడంతో...  ఆశావర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేశారు.

 

20:48 - March 18, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఆవిర్భావ ఉత్సవాలకు ఖమ్మం వేదిక కాబోతోంది. తెలంగాణ భవన్‌లో టీఆర్ ఎ స్ ఎల్ పీ సమావేశం ముగిసింది. ఖమ్మంలో పార్టీ ఆవిర్భా దినోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఖమ్మంలో ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభను నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 
  

20:29 - March 18, 2016

హీరోయిన్ 'తమన్నా'తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఊపిరి సినిమా వివరాలను తెలిపారు. తన పాత్ర గురించి వివరించారు. మెసేజ్ ఓరియెంట్ సినిమా కాదని... ఫన్, హ్యాపిఫుల్ సినిమా అని పేర్కొన్నారు. సినిమా బాగుంటుందని.. అందరూ చూడాలన్నారు. ఊపిరిలో సినిమాలోని ఐటెమ్ సాంగ్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఫుడ్, నిద్ర, ఎక్సర్ సైజ్ తన అందం రహస్యమని తెలిపారు. మరన్ని వివరాలకు వీడియోలో చూద్దాం...

 

కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాల భర్తీపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు కల్పించడంపై కూడా చర్చ జరుగుతోంది. 

ఘట్‌కేసర్‌లో ఎంపీపీ కార్యాలయంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు

రంగారెడ్డి : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో ఎంపీపీ కార్యాలయంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎంపీపీ సోదరుడు సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 20 వేలు, 5 బైక్‌లు, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

20:07 - March 18, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఆవరణలో హైడ్రామా నడిచింది.. సభలోకి వెళతానంటూ రోజా.. కుదరదంటూ మార్షల్స్ హంగామా సృష్టించారు.. సస్పెన్స్ త్రిల్లర్‌లా నడిచిన వ్యవహారం సభలో స్పీకర్‌ వివరణతో ముగిసింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశంపై నిరసనలు, ధర్నాలతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఉదయం 8గంటల 50 నిమిషాలకు రోజా అసెంబ్లీకి వచ్చారు.. రెండో గేటు ద్వారా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమెను అక్కడున్న మార్షల్స్ అడ్డుకున్నారు. రోజాకు సభ ఆవరణలోకి మాత్రమే ప్రవేశం ఉందని.. సభలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య వాగ్వాదం జరిగింది. 
రోజాను ఎందుకు అడ్డుకుంటున్నారు : జగన్‌
రోజాను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని జగన్‌ డిమాండ్ చేశారు.. అనుమతి లేదని స్పీకర్ ఆదేశాలు రాతపూర్వకంగా ఉంటే చూపించాలంటూ నిలదీశారు... కోర్టు తీర్పునుకూడా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.. ఈ విషయంపై స్పష్టత వచ్చాకే లోపలకు వెళతామని తేల్చి చెప్పారు.. అయినా మార్షల్స్ పట్టించుకోలేదు... దీంతో పార్టీ ఎమ్మెల్యేలతోకలిసి గాంధీ విగ్రహం ముందు గంటసేపు జగన్‌ ఆందోళన చేపట్టారు.
రాజ్‌భవన్‌ కార్యదర్శికి ఫిర్యాదు లేఖ
రోజాను సభలోకి అనుమతించకపోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే గవర్నర్‌ బెంగళూరులో ఉండటంతో రాజ్‌భవన్‌ కార్యదర్శికి ఫిర్యాదు లేఖను అందించారు. రోజా విషయంలో ఏపీ అసెంబ్లీ తీరును జగన్‌ ఖండించారు. కోర్టు ధిక్కారం కింద సోమవారం మళ్లీ న్యాయస్థానానికి వెళ్తామని వైసీపీ నేతలు చెప్పారు.
మళ్లీ న్యాయస్థానంలో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్‌ 
మరోవైపు రోజా విషయంపై మళ్లీ న్యాయస్థానంలో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్‌ వేశారు. ఈ అంశంపై సోమవారం విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.. అటు అసెంబ్లీలో రోజా సస్పెన్షన్‌పై స్పీకర్‌ వివరణ ఇచ్చారు.. కోర్టు ఉత్తర్వుల కాపీ తమకు అందిందని.. దీనిపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. 
వైసీపీ నేతల భవిష్యత్తు కార్యాచరణ 
లోటస్‌పాండ్‌లో భేటీ అయిన వైసీపీ నేతలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. శనివారం నల్ల దుస్తులతో సభకు హాజరు కావాలని సభ్యులు నిర్ణయించారు.. సభా కార్యక్రమాల్ని అడ్డుకుంటామని ప్రకటించారు.. 

 

19:54 - March 18, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు.  న్యూఢిల్లీలో మూడు రోజుల పర్యటన అనంతరం రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎపీ ఎక్స్ ప్రెస్‌లో విజయవాడ చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఏపీసీసీ చీఫ్‌కు విజయవాడలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంలోని పెద్దలను కలవడం సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. టీడీపీ నేతలు ఏపీ ప్రజలను మోసం చేయడం ఆపాలని హితవు పలికారు.

19:48 - March 18, 2016

విజయనగరం : జిల్లాలో ఆశా వర్కర్ల చలో కలెక్టరేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. దీక్షలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ధర్నా చేపట్టారు. ఆందోళన ఉధృతం కావడంతో...పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరగడంతో సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశావర్కర్లు పోలీసువాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

 

19:44 - March 18, 2016

కర్నూలు : కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో  కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎఎన్ ఎంలు ఆందోళనకు దిగారు. తాము కాంట్రాక్ట్ పద్దతిన 8 ఏళ్లుగా పని చేస్తున్నా.. తమను  రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని మండిపడ్డారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 

 

19:42 - March 18, 2016

కర్నూలు : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ను ఆశావర్కర్లు ముట్టడించారు. కనీస వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా తమను పట్టించుకోవడం  లేదని మండిపడ్డారు. పెండింగ్ లో నాలుగు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

19:40 - March 18, 2016

హైదరాబాద్ : ఉన్నత విద్యాశాఖకు చెందిన 140 కోట్ల రూపాయల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఎపి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇది తమ విజయమే కాదు మొత్తం ఉన్న విద్యా శాఖది అని అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. ఫ్రీజ్ చేసిన ఎకౌంట్లను వెంటనే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

ఎప్రిల్ 27 లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ : కడియం..

హైదరాబాద్ : ఎప్రిల్ 27 లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కార్యకర్తల ఇన్సురెన్స్ ప్రీమియం కోసం టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులంతా నెల జీతం విరాళం ఇవ్వాలని కోరారు. 

 

ముగిసిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహంచాలని నిర్ణయించారు. ఎప్రిల్ 27న ప్రతినిధుల సమావేశం, భహిరంగసభ నిర్వహించనున్నారు. 

పీఎఫ్ వడ్డీ రేటును తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును తగ్గించింది. 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించారు.

ఏపీ సిఎం సహా ముగ్గురు మంత్రులకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

హైదరాబాద్ : మొన్న అధికారపక్షంపై అవిశ్వాస తీర్మానాలు పెట్టిన వైసిపి నేడు సభా ఉల్లంఘన హక్కుల నోటీసులు అస్త్రాన్ని ఎంచుకుంది. ఏపీ సిఎం చంద్రబాబుతో సహా ముగ్గురు మంత్రులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. సభలో ప్రతిపక్ష సభ్యులపై అసభ్య పదజాలం వాడారని ఫిర్యాదు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి వైసిపి నాయకులు నోటీసులు అందజేశారు. సిఎం చంద్రబాబుతో సహా మంత్రులు కామినేని, దేవినేని, అచ్చన్నాయుడులపై ఫిర్యాదు చేశారు. 

19:13 - March 18, 2016

హైదరాబాద్ : మొన్న అధికారపక్షంపై అవిశ్వాస తీర్మానాలు పెట్టిన వైసిపి నేడు సభా ఉల్లంఘన హక్కుల నోటీసులు అస్త్రాన్ని ఎంచుకుంది. ఏపీ సిఎం చంద్రబాబుతో సహా ముగ్గురు మంత్రులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. సభలో ప్రతిపక్ష సభ్యులపై అసభ్య పదజాలం వాడారని ఫిర్యాదు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి వైసిపి నాయకులు నోటీసులు అందజేశారు. సిఎం చంద్రబాబుతో సహా మంత్రులు కామినేని, దేవినేని, అచ్చన్నాయుడులపై ఫిర్యాదు చేశారు. 

 

18:43 - March 18, 2016

హైదరాబాద్ : 'దున్నేవాడిదే భూమి' అనే నినాదం తెలంగాణ నుంచే పుట్టిందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో 'రైతులు-రాజ్యం' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రైతుల పాత్ర గురించి చెప్పుకోక తప్పదన్నారు. కె. సీతారామారావు రచించిన ఈ పుస్తకంలో తెలంగాణ భూసంస్కరణలు గురించి సవివరంగా వివరించారని పేర్కొన్నారు. 

 

18:36 - March 18, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్... కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. టీ హబ్‌కు ఆర్థిక సాయం, ఈ-సిటీ అంశాలపై రవిశంకర్‌ప్రసాద్‌తో కేటీఆర్ చర్చించారు. ఐటీ పాలసీ ప్రారంభోత్సవానికి రవిశంకర్‌ను ఆహ్వానించారు. అనంతరం వెంకయ్యనాయుడుతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. జీహెచ్ ఎంసీ అభివృద్ధి నిధులు, స్మార్ట్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు అంశాలపై చర్చించారు. స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ కు బదులు.. కరీంనగర్‌ ను చేర్చాలని కోరారు. కేటీఆర్ వెంట రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు, నగర మేయర్ రామ్మోహన్ ఉన్నారు.

 

18:21 - March 18, 2016

ముంబై : టీ 20 వరల్డ్ కప్‌ సూపర్‌ టెన్‌ రౌండ్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టుకు పవర్‌ ప్యాకెడ్‌ సౌతాఫ్రికా జట్టు సవాల్‌ విసురుతోంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇచ్చిన షాక్‌తో ఇంగ్లీష్‌ టీమ్‌ షాక్ లో ఉంటే...టైటిల్ వేటను విజయంతో ఆరంభించాలని సఫారీ టీమ్ తహతహలాడుతోంది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ సూపర్ ఫైట్ ప్రారంభమవుతుంది.
సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్‌ 
ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సూపర్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికా జట్టు...మాజీ చాంపియన్‌  ఇంగ్లండ్‌తో పోటీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్న దక్షిణాఫ్రికా జట్టు.....ఆరంభ మ్యాచ్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాలని ప్లాన్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇచ్చిన షాక్‌తో ఇంగ్లీష్‌ టీమ్‌ డైలమాలతో ఉండగా...టోర్నీని విజయంతో ఆరంభించారని సఫారీ టీమ్ తహతహలాడుతోంది.  
సఫారీ టీమ్‌లో అందరూ మ్యాచ్‌ విన్నర్లే
టీ 20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయె ఆటగాళ్లున్న సఫారీ టీమ్‌లో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. ఫాఫ్‌ డు ప్లెసి నాయకత్వంలోని సఫారీ టీమ్‌ .... అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో  సమతూకంగా ఉంది.డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌,డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ హషీమ్‌ ఆమ్లా, డు ప్లెసి, క్వింటన్‌ డి కాక్‌, డేవిడ్‌ మిల్లర్‌,డుమినీతో పాటు..... స్పీడ్‌ గన్‌  డేల్‌ స్టెయిన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ ,కగిసో రబద,క్రిస్‌ మోరిస్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భీకరంగా ఉంది. 
ఫీల్డింగ్‌ విభాగంలోనూ సఫారీ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా 
ఫీల్డింగ్‌ విభాగంలోనూ సఫారీ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా. ఆటగాళ్లందరికీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉండటంతో .....సౌతాఫ్రికా జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. 
తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విఫలం
మరోవైపు ఓయిన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టులో టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు, ట్వంటీ ట్వంటీ స్పెషలిస్ట్ లున్నా.....తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్‌ చేసినా.... బౌలర్ల వైఫల్యంతో కరీబియన్‌ టీమ్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌ జట్టు  రెండో మ్యాచ్‌లో నెగ్గితీరాలని పట్టుదలతో ఉంది. అలెక్స్‌ హేల్స్‌, జో రూట్‌, మోర్గాన్‌, జోస్ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ వంటి హిట్టర్లు.....టోప్లే, డేవిడ్‌ విల్లీ వంటి మెరుపు ఫాస్ట్‌ బౌలర్లతో పటిష్టంగా ఉంది. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీ ఆరంభ మ్యాచ్‌లో నిరాశపరచడంతో ఇంగ్లీష్‌ టీమ్‌ శుభారంభం చేయలేకపోయింది.
టీ 20 ఫార్మాట్‌లో సఫారీ టీమ్‌దే పై చేయి 
ఇక టీ 20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్లలో సఫారీ టీమ్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లూ ఇప్పటివరకూ 11 మ్యాచ్‌ల్లో పోటీ పడగా దక్షిణాఫ్రికా జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...ఇంగ్లీష్ టీమ్‌ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌ల్లో తేలిపోయె సఫారీ టీమ్‌....రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో ఏ స్థాయిలో  చెలరేగుతుందో అందరికీ తెలిసిందే. అందుకే ఇంగ్లండ్‌ కంటే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

టీ-20 ప్రపంచ కప్ :

ఢిల్లీ : టీ-20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫ్లిప్‌కార్ట్‌ లో ఆర్డర్, అపోలోలో డెలివరీ...

హైదరాబాద్ : ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా వస్తువులను బుక్ చేస్తున్నారా? అయితే మీకు దగ్గరలో వుండే అపోలో ఫార్మాకు వెళ్ళండి. ఆన్ లైన్ షాపింగ్ చేస్తే మన ఇంటికో లేదా మనం పనిచేసే ప్రదేశానికి సంబంధించిన చిరునామాను ఇస్తూంటాం. కానీ డెలివరీ బాయ్స్‌కు మనం ఇచ్చిన చిరునామా కనుక్కోవడంలో డెలివరీ బాయ్ కు ఆలస్యం అవుతుంటుంది. కస్టమర్లు కూడా సంతృప్తిని వ్యక్తం చేసే అవకాశముంది. ఇకపై ఆ ఇబ్బందుల్లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ వినూత్న చర్యలు చేపట్టింది. బుక్ చేసిన వస్తువులను మీ అందుబాటులో వుండే అపోలో ఫార్మాకు వస్తాయి. అక్కడ మీరు అమౌంట్ చెల్లించి ప్రొడక్ట్‌ను తీసుకోవచ్చు.

17:35 - March 18, 2016

ఢిల్లీ : దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీల్, భట్టాచార్యకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 6 నెలల పాటు బెయిల్ ఇస్తూ.. పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. ఫిబ్రవరి 21న ఉమర్ ఖలీల్, భట్టాచార్యలు అరెస్టు అయ్యారు. 28 రోజుల పాటు విద్యార్థులు జైలులో ఉన్నారు. ఉమర్ ఖలీల్, భట్టాచార్యకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 6 నెలల పాటు బెయిల్ ఇస్తూ.. పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరికి కలిపి మొత్తం 50 వేల రూపాయల పూచికత్తు, షూరిటీతో ఇరువురికి బెయిల్ మంజూరు చేశారు. యూనివర్సిటీ దాటి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు తెలిపింది. ఇదే కేసులో ఇంతకముందు జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్య కూడా మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 

 

ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చే అంశంపై కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.33 వేల కోట్లు'

హైదరాబాద్ : ఈ ఏడాది వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.33 వేల కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గత ఏడాది కంటే రూ.12వేల కోట్లు పన్నులు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే సంస్థలకు 8 శాతం మినహాయింపు ఇవ్వాలని, జిల్లాకో ఐటీ డిప్యూటీ కమిషనర్ ను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

17:25 - March 18, 2016

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. వైసిపి కార్యాలయం లోటస్‌పాండులో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. హైకోర్టు తీర్పు, రోజా వ్యవహారంపై ఎమ్మెల్యేలు చర్చించారు. రేపు కూడా ఎమ్మెల్యే రోజాను తమతో పాటు సభకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలిపారు. రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోతే ఏంచేయాలనే దానిపై రేపు ఓ నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. చంద్రబాబు దళిత ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మద్దిలేటి ఈశ్వరి ఆరోపించారు. సాక్షాత్తు ప్రభుత్వం, స్పీకర్‌లు హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం దారుణమని ఆమె అన్నారు.  

 

కీచక వైద్యుడికి రిమాండ్...

కరీంనగర్ : చొప్పదండి ఆస్పత్రి సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యుడు వసంతరావుపై గత కొన్ని రోజులుగా సిబ్బంది నిరసన తెలుపుతున్న విషయం విదితమే. ఆయన లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

 

'చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై సభాఉల్లంఘన నోటీసు'

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులపై వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు తో పాటు కామినేని, దేవినేని, అచ్చెన్నాయుడులపై అసెంబ్లీ కార్యదర్శికి సహా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేసింది. ఈ నోటీసులో సభలో ప్రతిపక్ష సభ్యులపై అసభ్య పదజాలం వాడారని ఫిర్యాదు చేసింది.

17:19 - March 18, 2016

గుంటూరు : జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగింది. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి... మోసం చేశాడని ఆరోపిస్తూ భవాని అనే మహిళ డీఈవో కార్యాలయం ఎదుటల ఆందోళన చేపట్టింది. మహిళ తనను వేధిస్తుందని పోలీసులకు డీఈవో ఫిర్యాద చేశారు. దీంతో పోలీసులు భవానీని అదుపులోకి తీసుకున్నారు. భవాని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించారు. 

 

17:13 - March 18, 2016

చిత్తూరు : ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, అత్యవసర ధరల పెంపునపై బోర్డ్ సభ్యులు వెనక్కి తగ్గారు. టీటీడీ బోర్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ లడ్డూ ధరలు పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయానికి 86లక్షల వ్యయంతో బంగారు తాపడం జరుగుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను మరో ఏడాది పాటు పొడిగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

 

17:05 - March 18, 2016

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్ర యూనిట్ తెలుగు టైటిల్ సాంగ్ విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడు వీడియోలు విడుదలయ్యాయి. మొదటి రెండు టీజర్లు దాదాపుగా ఒకే విధంగా ఉండగా, ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేసి సందడిని షురూ చేశారు. అయితే ఇప్పుడు మరో టీజర్‌ను విడుదల చేసి ఆ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. ఈచిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు జోడిగా కాజల్‌ నటిస్తుంది.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

16:52 - March 18, 2016

దుక్కి దున్నే వేళ.. విత్తు నాటే వేళ..
కోత కోసే వేళ.. నూర్పు చేసే చోట..
కుప్ప ఎత్తే చోటు.. విత్తనం దాచే చోట
విత్తనం నుండి ధాన్యం దాకా
ధాన్యం నుండి విత్తనం దాకా.. అన్నింటా ఆమె సగభాగం..
అయినా ఆమెకున్న హక్కెంత? దక్కుతున్న వాటా ఎంత? మానవి ప్రత్యేక కథనం..నేను రైతును.. అదే అస్తిత్వం..
మహిళా రైతుల హక్కుల కోసం అన్ని వైపుల నుండి ఐక్య గళం వినిపిస్తున్న సందర్భంలో గుంటూరు జిల్లాలోని బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో మహిళా రైతుల జాతీయ సదస్సు హైలెట్స్ తో ఇవాళ్టి మానవి మీ ముందుకొచ్చింది.

మహిళల హక్కులు మానవ హక్కులు. మహిళా రైతుల హక్కులను గుర్తించాలి. ఉత్పత్తి వనరులపై మహిళా రైతులకు హక్కులను కల్పించాలి. మద్ధతు వ్యవస్థల్లోనూ, నిర్ణయాధికారాల్లోనూ మహిళా రైతులకు సమస్థానం కల్పించాలంటున్న మకాం నినాదంతో మానవి ఏకీభవిస్తోంది. మరిన్ని వివరాలకు వీడియోలో చూద్దాం...

16:47 - March 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు 'చాకలి ఐలమ్మ' పేరుతో ఓ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని రాక్‌జిల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొని క్లాప్‌ కొట్టారు. లక్ష్మీ నిఖిల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని పగడాల ముత్తు నిర్మిస్తున్నారు. ఐలమ్మ పాత్రలో సుమనా నటిస్తున్నారు.

16:46 - March 18, 2016

కుల వివక్షకు బలైన రోహిత్ మరణం సమాజంలో ఒక మార్పుకు కారణం కావాలంటూ అతని తల్లి పోరాడుతోంది. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో వివక్షను అరికట్టేందుకు చట్టం తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేస్తోంది.

అనేక రంగాలలో సత్తా చాటుతున్న మహిళలు యుద్ధ విమాన పైలెట్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్నారు. అయితే వారు శిక్షణాకాలం పూర్తి చేసుకునే వరకు గర్భదారణకు దూరంగా ఉండాలంటోంది వైమానిక దళం.

రొమ్ము క్యాన్సర్ ను ఎదుర్కునేందుకు కొత్త ఔషధాన్ని ఆవిష్కరించారు మాంచెష్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. శస్త్రచికిత్సతో పనిలేకుండా వ్యాధిని నిర్మూలించటం సాధ్యమంటున్నారు ఈ శాస్త్రవేత్తలు.
యాంకర్: సైన్యంలో యుద్ధ విభాగంలో మహిళల ప్రవేశంపై నిబంధనలు రద్దయ్యాయి. ఈ రంగంలో వారి ప్రవేశాన్ని అనుమతిస్తూ కేంద్రం నిర్ణయాన్ని తెలిపింది.

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

నానాటికీ పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కునేందుకు పంజాబ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. అక్కడి మహిళలందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.

16:40 - March 18, 2016

హైదరాబాద్ : విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో... పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పాతబస్తీకి చెందిన వ్యక్తి పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. పాతబస్తీకి చెందిన వ్యక్తి పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. కుట్రలో ముగ్గురి భాగస్వామ్యం ఉందని భావించారు. పక్కా ప్రణాళికతో అభయ్ ను కిడ్నాప్ చేసి... హత్య చేశారని తెలిపారు. నిందితుడు ఉత్తరాంధ్రలో తలదాచుకున్నట్లు సమాచారం. నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు 2 బృందాలు బయల్దేరారు. 

 

16:36 - March 18, 2016

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియాన్ని సీజ్ చేయనున్నారా..? ఇక ఉప్పల్ స్టేడియంలో క్రీడలను చూడలేమా..? ఆస్తిపన్ను చెల్లించనందుకుగాను జీహెచ్ఎంసీ అధికారులు... ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు నోటీసులు ఇచ్చారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కొన్నేళ్లుగా జీహెచ్ ఎంసీకి  ప్రాపర్టీటాక్స్ ను చెల్లించకపోవడంతో బకాయిలు 14 కోట్లకు చేరాయి. టాక్స్ ను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్టేడియం అధికారులు స్పందించలేదు. దీంతో గ్రేటర్ అధికారులు స్టేడియంను సీజ్ చేసేందుకు సిద్ధమవడంతో.. స్టేడియం యాజమాన్యం 24 గంటల గడువును కోరారు. ఉప్పల్ స్టేడియం వ్యవహారం ఎమవుతుంతో చూడాలి..

16:34 - March 18, 2016

కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి దేహంలో విషపదార్ధాలు ఉన్నట్టు టాక్సీకాలజీ రిపోర్ట్ లో వెల్లడైంది. ఆయన మృతదేహం నుంచి సేకరించిన నమూనాకు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రంలో టాక్సికాలజీ టెస్టులు చేశారు. ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో పాటు మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్టు తేలిందని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె. మురళీధరన్ నాయర్ చెప్పారు. ఎవరైనా ఆయనకు విషపదార్దాలు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

16:29 - March 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో డీకే అరుణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దాదాపు లక్షా 7వేల ఖాళీలున్నాయని చెప్పారు. ఇప్పటివరకూ వివిధ డిపార్ట్ మెంట్ల నుంచి 58వేల ఖాళీల వివరాలు అందాయని స్పష్టం చేశారు. కొత్త పోస్టులను క్రియేట్‌ చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ శాఖలో వెయ్యి పోస్టులు సృష్టించామని తెలిపారు. 

 

రేపు టీఎస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు..

హైదరాబాద్ : టీఎస్ శాసనసభలో రేపు ప్రశ్నోత్తరాలను ప్రభుత్వం రద్దు చేసింది. సభ ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్‌పైనే చర్చ చేపట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం చెబుతారు.

16:25 - March 18, 2016

హైదరాబాద్ : కలిసొచ్చే శక్తులతో ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటం చేస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు సర్వీస్ రూల్స్ నిబంధనల కారణంగానే వారు జేఏసీ నుంచి వైదొలిగి ఉంటారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలతో ముందుకు సాగుతామని చెప్పారు. తెలంగాణ సాధనతో పాటు తెలంగాణ అభివృద్ధిలో సైతం తెలంగాణ జేఏసీ భాగస్వామ్యం అవుతుందన్నారు.
   

 

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో వేసవిలో తాగునీరు, ఉగాది వేడుకలు, కృష్ణ పుష్కరాలపై ప్రధానంగా చర్చించున్నట్లు సమాచారం. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు, ఉచిత ఇసుక పాలసీ అమలు తీరు తెన్నులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ భేటీ....

ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగం కేంద్రమంత్రులు రవిశంర్ ప్రసాద్, వెంకయ్య నాయుడులతో తెలంగాణా ఐటీ శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఐటీ పాలసీ ప్రారంభోత్సవానికి మంత్రి రవిశంకర్ ను కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు నిధులు, ఔటర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ వంటి పలు అభివృద్ధి అంశాలపై కేటీఆర్ చర్చించారు. 

ఉమర్ ఖలీల్, భట్టాచార్యలకు మధ్యంతర బెయిల్

ఢిల్లీ : దేశద్రోహం కేసులో ఫిబ్రవరి 9న అరెస్టయిన జేఎన్ యూ విద్యార్థులు ఉమర్ ఖలీల్, భట్టాచార్యలకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ముగిసిన టిటిడి ధర్మకర్తల మండలి...

తిరుమల : టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఆర్జిత సేవ, లడ్డూ ప్రసాదం ధరల పెంపు సిఫార్సులను తిరస్కరించింది. శ్రీవారి ఆలయం వాకిలి బంగారు తాపడానికి రూ. 86 లక్షలు కేటాయింపు, టీటీడీ అటవీశాఖలో 172 మంది కాట్రాక్టు కార్మికుల పదవీకాలం మరో ఏడా పొడిగించాలని నిర్ణయం, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర 2.74 ఎకరాల టీటీడీ స్థలాన్ని రైల్వేకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం, నెల్లూరు పెంచులకోనలో రూ.3.37 కోట్లతో డార్మెంటరీ. రూజ2.8 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

15:43 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. గొల్లపల్లి సూర్యరావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. రోజాపై సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించనున్నారు. సమావేశానికి రోజా సహా ఐదుమంది వైసీపీ ఎమ్మెల్యేలను రావాలని ఆదేశించారు. అలాగే టీడీపీ నుంచి ఎమ్మెల్యే అనిత హాజరు కానున్నారు. ఇదిలావుంటే ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని సోమవారం జరపాలని అనుకున్నారు. కానీ రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఉత్తర్వులతో రేపే సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 

పక్కా ప్రణాళికతో అభయ్ కిడ్నాప్, హత్య...

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో కిడ్నాప్ కు గరయి అల్ఫా హోటల్ వద్ద అట్టపెట్టెలో శవమై తేలిన అభయ్ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. పాతబస్తీకి చెందిన వ్యక్తి పనేనని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో అభయ్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కుట్రలో ముగ్గురి భాగస్వామ్యం ఉందని, ప్రధాన నిందితుడు ఉత్తరాంధ్రలో తలదాచుకున్నట్లు సమాచారం. నిందితుడిని పట్టుకోవడానికి రెండు బృందాలు బయలు దేరినట్లు తెలిపారు.

15:29 - March 18, 2016

'గబ్బర్ సింగ్' కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సందడి మొదలయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న తెలుగుతో పాటు హిందీలోనూ హల్ చేసేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రోమోలకు ఆమోఘమైన రెస్పాన్ వచ్చింది. హిందీలో సర్దార్ కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. హిందీలో ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూసిన సల్మాన్ కి మైండ్ బ్లాంక్ అయ్యిందట. సినిమా హక్కులను కూడా సల్మాన్ సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం.

రేపు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి భేటీ

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 3గంటలకు మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రోజా వ్యవహారం చర్చ జరగనుంది. రేపు ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని రోజా సహా 5గురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. టిడిపి తరుపున ఎమ్మెల్యే అనిత హాజరుకానున్నారు.

15:14 - March 18, 2016


హైదరాబాద్ : బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాదోపవాదాలు చేసుకునన్నారు. బడ్జెట్ పై టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్ అంబేద్కర్ అన్నట్లుగా.. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని... పౌరుల నైతిక అభివృద్ధిని కోరుకుంటున్నామని తెలిపారు. దళిత అభివృవృద్ధికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు. బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని.. గొప్పలకు పోయినట్లు ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఎన్నికల అనంతరం 4 దఫాలుగా రుణమాఫీ చేస్తామన్నారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన ఉండాలని సూచించారు.
ఈటెల రాజేందర్
బడ్జెట్ విపక్షాలు మాట్లాడిన అనంతరం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. విపక్షాలు ప్రజలను తప్పుదోవపట్టించవద్దని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీసర్కార్ డబుల్ బెడ్ రూం ఇళ్లకు శ్రీకారం చుట్టి అమలు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిచాంరు. మీరు డబుల్ బెడ్ రూం ఇళ్లు, తొమ్మిది గంటల విద్యుత్ కు వ్యతిరేకమా... అని విపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు. మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 

 

 

ఉప్పల్ స్టేడియంకు మళ్లీ జీహెచ్‌ఎంసీ నోటీసులు

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంకు మళ్లీ జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. గత కొంత కాలం నుంచి పన్ను చెల్లించటం లేదని నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఉప్పల్ స్టేడియంను సీజ్ చేసేందుకు అధికారులు వచ్చారు. రూ. 14.5 కోట్ల పన్ను చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. తక్షణమే పన్ను చెల్లించాలని ఆదేశించారు.

టీఎస్ అధికారులతో మంత్రుల భేటీ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో అధికారులతో మంత్రులు తలసాని, హరీష్ రావు, ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటు పై చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అనంతపురంలో 41 డిగ్రీలు, కర్నూలు, నంద్యాలలో 40 డిగ్రీలు, నరసాపురం, కాకినాడల్లో 35డిగ్రీలు, నందిగామ, కడప-38 డిగ్రీలు, విజయవాడ, తుని ల్లో 36 డిగ్రీలు, నెల్లూరు, ఒంగోలు, విశాఖ ల్లో 35 డిగ్రీలు, బాపట్ల, మచిలీపట్నం లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మాల్యాకు గడువు పెంచిన ఈడీ

హైదరాబాద్ : కింగ్ ఫిషర్, అధినేత, మద్యం డాన్, బ్యాంకులకు 9వేల కోట్లు కుచ్చు టోపీ పెట్టిన విజయ మాల్యాకు ఈడీ గడువు పెంచింది. ముంబైలో తన కార్యాలయంలో ఏప్రిల్ 2న హాజరు కావాలని తాజా సమన్లు జారీ చేసింది. ఈ దఫా తన న్యాయవాదిని పంపడానికి వీల్లేదని, స్వయంగా హాజరు కాలని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.

14:45 - March 18, 2016

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో వైసీపీ సభ్యుల సమావేశం కొనసాగుతోంది. రోజా వ్యవహారంలో ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. రేపు నల్లదుస్తులతో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. స్పీకర్ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రోజా సస్పెన్షన్ ను వైసీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

 

బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

హైదరాబాద్ : ధర్మశాల వేదిక గా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిల్యాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదు : లక్ష్మణ్ హైదాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే లక్ష్హణ్ మాట్లాడుతూ… ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా బడ్జెట్ లేదని లక్ష్మణ్ ఆరోపించారు. బడ్జెట్ అంకెల గారడీలా ఉందని ఎద్దేవ

హైదాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే లక్ష్హణ్ మాట్లాడుతూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని లక్ష్మణ్ ఆరోపించారు. బడ్జెట్ అంకెల గారడీలా ఉందని ఎద్దేవా చేశారు. లక్షా 30వేల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టారని..ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 36 శాతం నిరక్షరాస్యత ఉందని తెలిపారు. బడ్జెట్ లో గత ఏడాది కంటే 30.3% సవరణ అంచానలు పెంచారన్నారు.

కోనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల భేటీ...

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ కొనసాగుతోంది. రోజా వ్యవహారంలో స్పీకర్, ప్రభుత్వం తీరుకు నిరసనగా రేపు నల్లదుస్తులతో అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం.

వాస్తవాలకు విరుద్ధంగా బడ్జెట్ : రేవంత్

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ గొప్పలకు పోయినట్లు ఉందని, ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఎన్నికల అనంతరం 4 దఫాలుగా రుణమాఫీ చేస్తామన్నారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ డిమాండ్ చేశారు.

13:49 - March 18, 2016

నల్గొండ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు భక్తి ఎంతో ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు సతీసమేతంగా వెళుతుంటారు. ఇలాగే యాదాద్రిలో జరుగుతున్న కళ్యాణోత్సవానికి కూడా హాజరయ్యారు. కానీ అలిగి వెళ్లిపోయారు. ఎందుకు ? ఏమైంది ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
యాదాద్రిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు గవర్నర్ సతీసమేతంగా హాజరయ్యారు. దీని కోసం గురువారం రాత్రి 8.30 గంటలకు యాదాద్రి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 9.45 గంటలకు స్వామివారు కల్యాణమండపానికి రావాల్సి ఉంది. కానీ… స్వామివారి విగ్రహ రూపులు మండపానికి రాలేదు. 18 నిమిషాలు ఆలస్యంగా దేవతామూర్తుల్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలస్యానికి కారణం ఏంటి అని ఆలయ ఈవో గీతారెడ్డిని వివరణ కోరగా… కొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉండడంతో ఆలస్యం అయ్యిందని ఈవో చెప్పడంతో గవర్నర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతే కాదు మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఎవరింట్లో పెళ్లి అనుకుంటున్నారు? అన్ని టైం ప్రకారం ఎందుకు జరపటం లేదు? అని ప్రశ్నించి ఆ వేడుక నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. స్వామివారి మాంగళ్య ధారణ పూర్తి కాకముందే పెళ్లికి వచ్చిన సంప్రదాయ దుస్తులతోనే గవర్నర్ తిరిగి వెళ్లిపోవటం హాట్ టాపిక్ గా మారింది.

13:39 - March 18, 2016

హైదరాబాద్ : 'సోగ్గాడు'లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఈమె, 'క్షణం'లో దుమ్ము దులిపిన అనుసూ తాజాగా ఓ యాక్షన్ మూవీకి కమిటైనట్టు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్, స్టోరీ ఫైనల్ అయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించి డీటైల్స్ వెల్లడికానున్నాయి. ఇందులో ఈమె నటించేందుకు భారీ మొత్తాన్నే పీవీపీ ఆఫర్ ఇచ్చినట్టు ఇన్‌సైడ్ సమాచారం. మరోవైపు ఒకటి తర్వాత మరొకటి ఆఫర్స్ రావడంతో గ్లామర్ ఇండస్ర్టీలో అనసూయ బిజీ కావడం ఖాయమనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. వెండితెరపై ఎంత బిజీగావున్నా.. బుల్లితెరపై కంటిన్యూ అవుతానని చెబుతోంది అనసూయ.

మెదక్ లో పోస్టల్ ఏటీఎం ప్రారంభం..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోస్టల్ ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ, తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వైపీ రాయ్ అన్నారు. మెదక్ హెడ్ పోస్టాఫీస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాన్ని హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఈలీషాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో ఈ ఏడాది ఏర్పాటు చేయాల్సిన 95 ఏటీఎం కేంద్రాలకుగాను ఇప్పటికే 65 ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

13:25 - March 18, 2016

హైదరాబాద్ : శాసనసభలోకి సభ్యురాలు రోజాను అనుమతించకపోవడంపై వైసీపీ నిరసనలు చేపట్టింది. శనివారం కూడా నిరసనలు చేపట్టనుంది. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ శాసనసభలోకి రోజాను అనుమతించలేదు. దీనితో వైసీపీ అసెంబ్లీ ప్రాంగణం..గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టింది. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు పార్టీ సభ్యులతో లోటస్ పాండ్ లో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. రేపు కూడా నిరసనలు చేయాలని నిర్ణయించారు. సోమవారం నాడు అసెంబ్లీకి హాజరు కావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

 • కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
 • 340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
 • కానీ ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని వైసీపీ పేర్కొంది.
 • సస్పెండ్ చేసిన తీర్మానం ప్రతి కోసం మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
 • ఈ నేపథ్యంలో రోజా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు కేసును విచారించడం జరిగాయి.

ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా తెలుగు రాష్ట్రాలు: ప్రొ. కోదండరాం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్ర ఆదిపత్యం కోరుకుంటున్నాయి. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు చైర్మన్ కోదండరాం. జేఏసీ కోర్ కమిటీ సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై పోరాడుతామని తెలిపారు. వారితో మాకు ఎటువంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా కోదండరాం స్పష్టం చేశారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని కోదండరాం గుర్తుచేశారు. సెక్షన్-8పై ఏపీ ప్రభుత్వ తీర్మానం హాస్యాస్పదంగా వుందన్నారు. టీ..జేఏసీ కొనసాగుతుందని తెలిపారు. ప్రజల కోసం జేఏసీ ఎప్పటికీ పోరాడుతూనే వుంటుందని కోదండరాం పేర్కొన్నారు. 

13:23 - March 18, 2016

హైదరాబాద్ : టిడిపి ప్రభుత్వంపై వైసీపీ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని టిడిపి సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. సభలోకి అనుమతినివ్వకపోవడంపై వైసీపీ చేపట్టిన ఆందోళనపై ఆయన స్పందించారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బయట ధర్నా చేయమని చెప్పిందా ? గొడవ చేయమని కోర్టు చెప్పిందా ? అని ప్రశ్నించారు. సెక్షన్ వరకు మాత్రమే కోర్టు ఆర్డర్ పరిమితమని, ఆ రూల్ ను మాత్రమే కోట్ చేయడం జరిగిందని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సభ చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ కోడెల పేర్కొన్నారని తెలిపారు. 

బాబు సర్కార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ : జగన్ !

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖరు చేయాలని జగన్ నిర్ణయినంచినట్లు సమాచారం. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ తో పాటు చంద్రబాబు సర్కార్ అమలు చేయలేదని జగన్ ఆరోపిస్తున్నారు. స్పీకర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం లోటస్ పాండ్ లో తన పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ నిర్వహించారు.

13:05 - March 18, 2016

హైదరాబాద్ : హీరో నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దర్శకుడు బోయపాటిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ముందుగా తన వందో చిత్రానికి బోయపాటిని అనుకున్నా తరువాత నలుగురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. క్రిష్, కృష్ణవంశీ వంటివారి వారంతా బాలయ్య మూవీకి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. తన వందో చిత్రం కోసం మంచి స్ర్కిప్ట్‌తో రావలసిందిగా బాలకృష్ణ ఆమధ్య కృష్ణవంశీని కోరాడట. అదే సమయంలో క్రిష్‌తో తన వందో సినిమా చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాడు. కానీ మొదట అనుకున్న బోయపాటినే ఫిక్స్ చేశారని సమాచారం.

12:51 - March 18, 2016

హైదరాబాద్ : ఓయూలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నీళ్లు..నిధుల..నియామకాలు..కోసం ఆనాడు పోరాటం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యార్థులు గళమెత్తుతున్నారు. నియామాకాల కోసం వీరు ఉద్యమం చేపడుతున్నారు. పలు డిమాండ్లతో ఓయూ నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరింది. ఈ ముట్టడి కార్యక్రమం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని....గ్రూప్ 2 వాయిదా వేయాలని...డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ నిరుద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విద్యార్థులను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్ లలో పడేశారు. రాళ్ల దాడిలో ఓ మీడియా ప్రతినిధి కూడా గాయాలయ్యాయి. 450 పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 

12:49 - March 18, 2016

చిట చిట పట చినుకులు పడుతుంటే..వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటుంటే ఆ రుచే వేరు.. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. అన్ని దేశాల్లో నూ దీన్ని పండిస్తారు. ఇది చాలా విరివిగా, అతిచౌకగా లభించే ఆహారం. మొక్క జొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్ , జీక్జాన్‌డిన్ " అనే ఎమినో యాసిడ్స్ ... మంచి యాంటి-ఆక్షిడెంట్లు గా పనిచేస్తాయి .

విటమిన్లు :

లినోలిక్ ఆసిడ్ ,/విటమిన్ ఇ ,బి 1, బి 6,/నియాసిన్ ,/ఫోలిక్ ఆసిడ్ ,/రిబోఫ్లావిన్ .. ఎక్కువ . మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు. మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది. గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. ఇన్ని రకాలుగా మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు. మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది.

జీర్ణక్రియను పెంపొందించడంలో....

మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.

ఎముకల బలానికి.…

మొక్కజొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్‌ వుంటాయి. పసుపురంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్‌ అధికం. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.

చర్మ సంరక్షణకు.…

మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను, లేదా ర్యాష్‌లను కూడా తగ్గిస్తుంది.

రక్తహీనతను అరికట్టడంలో....

రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.

కొల్లెస్టరాల్‌ తగ్గించడంలో...

శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

గర్భిణీలకు.…

గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

కోలన్ క్యాన్సర్ కు...

మొక్కజొన్నలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

డయాబెటిస్ కు ....

మొక్కజొన్న, తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది.

గుండె పదిలాంగా…

మొక్కొజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల, తగిన పరిమానణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్(రక్తకాణాల ఆరోగ్యానికి) చాలా మంచిది.

లోటస్ పాండ్ లో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ....

హైదరాబాద్ : కాసేపట్లో లోటస్ పాండ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. రోజాను అసెంబ్లీకి అనుమతించని నేపథ్యంలో రేపు కూడా నిరసన చేపట్టాలనే యోచనలో వైసీపీ వున్నట్లుగా సమాచారం.

12:22 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని శుక్రవారం సభలో స్పీకర్ కోడెల ప్రస్తావించారు. సస్పెన్షన్ తీర్మానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రోజాను మాత్రం అసెంబ్లీలోనికి అనుమతినివ్వలేదు. దీనిపై కోడెల మాట్లాడారు. అనుచిత ప్రవర్తన..హావాభావాలు..గౌరవసభ్యురాలిపై చేసిన వ్యాఖ్యల సందర్భంలో సభలో చర్చ జరిగిన అనంతరం రోజాను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. సభ్యురాలిని సస్పెండ్ చేయాలని సభ కోరడం..దానిని అమలు చేయడం జరిగిందన్నారు. వారు కోర్టుకు వెళ్లి ఆర్డర్ కాపీని తీసుకొచ్చారని తెలిపారు. జడ్జిమెంట్ కాపీని సభ్యులందరూ చదువుకోవాలని, దీనిపై సోమవారం చర్చ చేపట్టడం జరుగుతుందని స్పీకర్ కోడెల వెల్లడించారు. 

12:14 - March 18, 2016

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. అసెంబ్లీ లోనికి తనను రానివ్వకపోవడం దుర్మార్గమన్నారు. రోజాను అసెంబ్లీ లోనికి రానివ్వకపోవడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ భవన్ కు చేరుకున్న వైసీపీ బృందం గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆర్డర్, లేఖను గురువారం సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడం జరిగిందని, కానీ శుక్రవారం ఉదయం తనను లోనికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. చీఫ్ మార్షల్ గణేష్ బాబు టిడిపి కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడని, గతంలో సస్పెన్షన్ విషయంలో స్పీకర్ ఛాంబర్ కు వెళితే మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ రోజు కూడా తమను అడ్డగించాడని, న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పవర్ ఎక్కువ ఉందని భావిస్తే కోర్టులో కేసు వేసినప్పుడు లాయర్లను ఎందుకు పంపించి వాదనలు వినిపించారని ప్రశ్నించారు. మంత్రి రావెల కిశోర్ బాబు మంత్రివర్గంలో కూర్చొవడానికి అర్హుడా ? ఎమ్మార్వో దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో కూర్చొన్నాడని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రోజా తెలిపారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న స్పీకర్ : జగన్

హైదరాబాద్ : సీఎంతో కలిసి స్పీకర్ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ అధినేత మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించని నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగన్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో వున్నామా? లేదా రాచరికంలో వున్నామా? అంటు వ్యాఖ్యానించారు. అధికారం తమ చేతుల్లో వుందనే అహంకారంతో ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోజాను సస్పెండ్ చేసి న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని జగన్ తెలిపారు.

టీఎస్ అసెంబ్లీ.. వాయిదా తీర్మానాల తిరస్కరణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనాచారి తిరస్కరించారు. సభ ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. అనంతరం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

12:09 - March 18, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ తీర్మానంపై మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన దానిపై ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రోజా అసెంబ్లీ లోనికి రానీయకుండా ప్రభుత్వం చేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి వైసీపీ రాజ్ భవన్ కు వెళ్లింది. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఇస్తే అదే రోజు చర్చకు స్పీకర్ అనుమతినిచ్చారని గుర్తు చేశారు. 14 రోజుల తరువాతే చర్చ చేయాలని ఉన్నా, విప్ జారీ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు. ఆ ఎమ్మెల్యేలకు వెసులుబాటు కల్పించేందుకు శాసనసభను జరిపించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు వినిపించకూడదని..ప్రతిపక్ష గొంతును ప్రభుత్వం నొక్కుతోందన్నారు. కాపాడాల్సిన స్పీకర్ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అనరాని మాటలను వక్రీకరించారని తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం హైకోర్టు రోజా సస్పెన్షన్ పై విచారించిందని, సస్పెన్షన్ చేయడం అన్యాయమని ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడం జరిగిందన్నారు. కానీ రోజాను సభలోకి అనుమతినివ్వకుండా కోర్టుల ఆర్డర్ ను బేఖాతర్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందన్నారు.

సోమవారం కంటెంట్ పిటిషన్..
శుక్రవారం ఉదయం రోజాను సభలోనికి రానీయకుండా చేయడం గమనించానని, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని తాను ప్రశ్నించడం జరిగిందన్నారు. అనంతరం గంట సేపు ధర్నా చేయడం జరిగిందని, గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్ భవన్ కు రావడం జరిగిందన్నారు. సోమవారం కంటెంట్ పిటిషన్ వేయాలని కోర్టు సూచించడం జరిగిందని, దీనిపై వాదనలు జరుగుతాయన్నారు. అనంతరమే తాము సభలోకి హుందాతనంగా వెళుతామని, రోజాకు అండగా తామంతా ఉంటామన్నారు. చీఫ్ మార్షల్స్ తో మాట్లాడే సమయంలో వాయిస్ రికార్డు చేయడం జరిగిందని, శనివారం ఎలా నిరసన వ్యక్తం చేయాలి ? పోరాటం ఎలా చేయాలనే దానిపై లోటస్ పాండ్ లో కూర్చొని నిర్ణయిస్తామని జగన్ తెలిపారు. 

అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జగన్ ధర్నా

హైదరాబాద్ : రోజా పై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసినా సభాపతి ఆమెను లోపలికి అనుమతించడం లేదని వైసీపీ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గరవ్నర్ లేకపోవడంతో రాజ్ భవన్ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆ పార్టీ అధినేత జగన్ ధర్నా చేపట్టారు.

పలమనేరు చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు..

చిత్తూరు : పలమనేరులోని రవాణా, కమర్షియల్ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. అధికారుల వద్ద అనధికారికంగా ఉన్న రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి కొనసాగుతోంది.

నీళ్లు..నిధులు..నియామకాల కోసమే ఉద్యమం - ఈటెల..

హైదరాబాద్ : నీళ్లు, నిధులు నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రాష్ట్రంలో 25,589 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, 2014, జూన్ 2 నాటికి పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాలు, అంగన్ వాడీల జీతాలను పెంచడం జరిగిందన్నారు. ఇంటికో ఉద్యోగం హామీ ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఎత్తివేసినా రాష్ట్రం వాటిని నడిపే ప్రయత్నం చేస్తోందన్నారు. 

టీ.జేఏసీ కోర్ కమిటి భేటీ....

హైదరాబాద్ : టీ జేఏసీ నుండి ఉద్యోగ సంఘాలు బయటకు రావడంతో జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ భవిష్యత్ కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

మహిళను అరెస్ట్ చేసిన పఠాన్ కోట్ ఆర్మీ...

పంజాబ్ : పాక్-భారత్ సరిహద్దు ప్రాంతమైన పఠాన్ కోట్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 డిసెంబర్ లో పటాన్ కోట్ మీద ఉగ్రదాడిలో ఏడుగురు జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పఠాన్ కోట్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ఓ మహిళ సీఆర్పీఎఫ్ దుస్తులు వేసుకుని ఆర్మీ ఏరియాలో సంచరిస్తుండగా గమనించిన ఆర్మీ సిబ్బంది గమనించారు. అనంతరం ఆ మహిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

11:30 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఎదుర్కొనేందుకు తాను చాలని టిడిపి ఎమ్మెల్యే అనిత తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద 'టెన్ టివి'తో ఆమె మాట్లాడారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై శాసనసభలో చర్చ జరుగుతుందని, సభాపతి నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. జగనన్నా..నీపక్కన రోజాలాంటి ఆడదాన్ని పక్కన పెట్టుకుంటే ప్రతిపక్ష కుర్చీ కూడా వూడుతుందని హెచ్చరించారు. రోజా విషయంలో సభా నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో రోజా తన నియోజకవర్గం అయిన నగరి గురించి, అక్కడ ప్రజా సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా ? అని ప్రశ్నించారు. రోజా ఇచ్చిన అవకాశాన్ని..ఇచ్చిన వేదికను ఉపయోగించుకోకపోవడం దారుణమన్నారు. కోర్టు ఎపడూ ఆర్డర్ ఇవ్వదని..సూచనలు మాత్రమే ఇస్తుందని అనిత తెలిపారు.

11:28 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు దారుణంగా ఉందని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. రోజాను అసెంబ్లీకి అనుమతించలేదన్న కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మంత్రి పీతల వైసీపీపై పలు విమర్శలు చేశారు. టెన్ టివితో ఆమె మాట్లాడారు. రోజాను ప్రివిలేజ్ కమిటీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఆగంతకులు ప్రవేశిస్తారన్న కారణంతో అసెంబ్లీలో ఆంక్షలు ఉంటాయని, ఆమె కోసం ప్రత్యేక చట్టాలు లేవన్నారు. పొగరుగా బిహేవ్ చేసిందని, రోజాపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిందని, దళిత వర్గానికి చెందిన తనపై విమర్శలు చేసినా జగన్ స్పందించలేదన్నారు. స్పీకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతానన్నారు. జడ్జిమెంట్ కాపీ వచ్చిందని పొగరుగా రోజా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే అనిత తెలిపారు. 

న్యాయస్థానాన్ని రోజా తప్పుదోవ పట్టించింది : టీడీపీ

హైదరాబాద్ : ఏడాది పాటు సస్పెండ్ అయిన వైసీపీ నేత రోజాను సభకు హాజరుకావొచ్చని కోర్టు అనుమతి ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. రోజా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. రోజా సభకు రావాలా వద్దా అనేది స్పీకర్ కార్యాలయం చూసుకుంటుందని, దానిని ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదని ఆమె అన్నారు. న్యాయస్థానం కేవలం సూచనలు మాత్రమే చేస్తుందన్నారు. దళిత మహిళగా అగ్రవర్ణాల వివక్షను ఎదుర్కొని ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని ఆమె వ్యాఖ్యానించారు. రోజాను అరెస్ట్ చేయించటం నాకు చేతకాదనుకున్నారా?, తనకు జరిగిన అవమానానికి రోజా శిక్ష అనువించాల్సిందేనని అనిత తెలిపారు. 

సభకు హాజరు కావచ్చని కోర్టు పేర్కొనలేదు - ఎమ్మెల్యే అనిత..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సభకు హాజరు కావొచ్చని కోర్టు పేర్కొనడం లేదని ఎమ్మెల్యే అనిత తెలిపారు. రోజాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసనసభలో చర్చ జరగాలని, అనంతరం స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఈ విషయం రోజాకు తెలియదా ? అని ప్రశ్నించారు. ఈ విషయం కోర్టు ఆర్డర్ లో ఉందని తెలిపారు. ఓపిక లేకుండా ఏదో రాద్ధాంతం చేయాలని మీడియా కెమెరాల ఎదుట వస్తున్నారని విమర్శించారు. 

 

టి. శాసనసభ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నొత్తరాలను స్పీకర్ మధుసూధనాచారి చేపట్టారు. అంగన్ వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హామీలు నెరవేర్చాలని సీపీఎం..డిండి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు ఇవ్వాలని సీపీఐ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

10:13 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేయించలేమా ? తమకు చేతకాకనా అని టిడిపి ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. శుక్రవారం రోజాను అసెంబ్లీలోనికి అనుమతించకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యేలు గేట్ నెంబర్ 2 వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడారు. రోజాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసనసభలో చర్చ జరగాలని, అనంతరం స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఈ విషయం రోజాకు తెలియదా ? అని ప్రశ్నించారు. ఈ విషయం కోర్టు ఆర్డర్ లో ఉందని తెలిపారు. ఓపిక లేకుండా ఏదో రాద్ధాంతం చేయాలని మీడియా కెమెరాల ఎదుట వస్తున్నారని విమర్శించారు. రోజా అంశంపై గతంలో రెండు సార్లు వైసీపీ వాకౌట్ చేసిందని, ప్రస్తుతం బయట కూర్చొని న్యాయపోరాటం చేస్తామనడం సరికాదన్నారు. హైకోర్టును రోజా తప్పుదోవ పట్టించిందని, సభలో ప్రవర్తించిన తీరును ఎట్టిపరిస్థితుల్లో సమర్థించనీయమని కోర్టు పేర్కొందని తెలిపారు. సెక్షన్ 344 ను ఒకసారి చూడాలని సూచించడం జరిగిందన్నారు. తనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరిని అడగాలని, రోజాను అరెస్టు చేయలేమా ? అని తెలిపారు. సభలో న్యాయం జరగాలనే ఉద్ధేశ్యంతో తాను వ్యవహరిస్తున్నారని, న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. 

మార్షల్స్ పై ఫైర్ అయిన జగన్ ....

హైదరాబాద్ : అసెంబ్లీకి హాజరుకావటానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా సంవత్సరం పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. రోజా సభలోనికి రావటానికి తమ వద్ద సరైన ఆధారాలున్నాయని.. మీ వద్ద ఏ ఆధారాలున్నాయని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. స్పీకర్ ఆదేశాలే తమకు ముఖ్యమని ఇతర విషయాలను మేం పట్టించుకోమని మార్షల్స్ పేర్కొన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అవమానపరుస్తోందంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ నేతలు బైఠాయించారు. ఈ విషయంపై గవర్నర్ ను కలిసే యోచనలో వైసీపీ వర్గం ఉన్నట్లు సమాచారం.

09:53 - March 18, 2016

హైదరాబాద్ : తమ సభ్యురాలు రోజాను అసెంబ్లీలోకి అనుమతిస్తారా ? లేదా ? అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. తన దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని చూపెట్టినా అనుమతినివ్వలేదు. దీనితో వైసీపీ ఎమ్మెల్యే గేట్ నెంబర్ 2 వద్ద బైఠాయించారు. ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ కావాలని వైసీపి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కోర్టు తీర్పు..ప్రభుత్వం వ్యవమరిస్తున్న తీరును గవర్నర్ కు వివరించనున్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు - ముత్యం నాయుడు..
చట్టాల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే ముత్యం నాయుడు పేర్కొన్నారు. గేట్ నెంబర్ 2 వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. కోర్టు ఆర్డర్ ను ధిక్కరించడం సరికాదని, ఇక్కడ బైఠాయించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రోజాను అసెంబ్లీలోనికి అనుమతినివ్వాలని, ఎట్టిపరిస్థితుల్లో తాము వెనుకంజ వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. 
 

 • కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
 • 340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
 • కానీ ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని వైసీపీ పేర్కొంది.
 • సస్పెండ్ చేసిన తీర్మానం ప్రతి కోసం మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
 • ఈ నేపథ్యంలో రోజా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు కేసును విచారించడం జరిగాయి.

 

ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 11.45గంటలకు ఢిల్లీకి చేరుకున్న అనంతరం కేందమంత్రులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 03.45గంటలకు వెంకయ్య నాయుడు..సాయంత్రం 4.30గంటలకు రవిశంకర్ ప్రసాద్..సాయంత్రం 5గంటలకు అరుణ్ జైట్లీతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

రోజాను అనుమతించాలి - వైసీపీ..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ ప్రారంభమైంది. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎమ్మెల్యే రోజాను అనుమతించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు గేట్ నెంబర్ 2 వద్ద బైఠాయించారు. అనుమతించే వరకు తాము సభకు వెళ్లమని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. 

టి. అసెంబ్లీ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. అంగన్ వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హామీలు నెరవేర్చాలని సీపీఎం..డిండి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు ఇవ్వాలని సీపీఐ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

గేట్ నెంబర్ 2 వద్ద బైఠాయించిన ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : తమ పార్టీకి సంబంధించిన సభ్యురాలు రోజాను అసెంబ్లీలోనికి అనుమతించకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ నెంబర్ 2 వద్ద బైఠాయించారు. 

09:21 - March 18, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ లోనికి అనుమతించబోమని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. దీనితో గేట్ నెంబర్ 3 వద్ద వచ్చిన రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. రోజాతో పాటు వచ్చిన న్యాయవాదులను సైతం లోనికి అనుమితించలేదు. అదే సమయంలో అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ పోలీసులతో మాట్లాడారు. తనతో పాటు న్యాయవాదులను తీసుకెళుతానని పోలీసులకు జగన్ తెలిపారు. దీనికి పోలీసులు అభ్యంతరం తెలిపారు. తన పాస్ తో తీసుకెళుతానని, తనకు అన్ని రైట్స్ ఉన్నాయని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. 

09:15 - March 18, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వెళుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. సస్పెన్షన్ తీర్మానంపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను శుక్రవారం నుండి అసెంబ్లీకి హాజరౌతానని రోజా పేర్కొన్నారు. కానీ అసెంబ్లీలోనికి అనుమతినివ్వమని స్పీకర్ కార్యాలయం పేర్కొంటోంది. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడనే మోహరించిన పోలీసులు రోజాను అడ్డుకున్నారు. కోర్టు సంబంధించిన కాపీని పోలీసులకు చూపించి గేట్ నెంబర్ 2కు రోజా చేరుకున్నారు. కానీ మార్షల్స్ రోజాను అడ్డుకున్నారు. దీనితో ఏపీ శాసనసభ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నేత జగన్ కూడా అసెంబ్లీ గేట్ వద్ద నిలిచిపోయారు. అక్కడ ఉన్న పోలీసులతో జగన్ మాట్లాడారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. డీసీపీ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్యాయం జరిగితేనే హైకోర్టుకు వెళ్లాను - రోజా..
చట్టసభలో అన్యాయం జరిగిన సమయంలో తాను హైకోర్టుకు వెళ్లడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందచేయడం జరుగుతుందన్నారు. ఆర్డర్ కాపీని మంత్రి యనమల చదివితే అన్నీ అర్థమౌతుందన్నారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని భావిస్తున్నట్లు చెప్పారు. 

తీర్పు కాపీని యనమల చదవాలి - రోజా..

హైదరాబాద్ : హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని మంత్రి యనమల చదివితే అంతా అర్థమౌతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అసెంబ్లీకి వెళ్లనీయకుండా రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈసందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. చట్టసభలో అన్యాయం జరిగిన సమయంలో తాను హైకోర్టుకు వెళ్లడం జరిగిందని, కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందచేయడం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని భావిస్తున్నట్లు చెప్పారు.

09:01 - March 18, 2016

హైదరాబాద్ : హైకోర్టు ఇచ్చిన ప్రకారం తాను అసెంబ్లీకి వెళ్లడం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కానీ అసెంబ్లీ ఆవరణలోకి మాత్రమే రోజాకు అనుమతి ఉంటుందని..అసెంబ్లీలోకి మాత్రం అనుమతి లేదని స్పీకర్ కార్యాలయం పేర్కొంటోంది. దీనితో ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం సభ్యుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి రోజా అసెంబ్లీకి చేరుకున్నారు. తనదగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని పోలీసులకు తెలిపి రోజా లోనికి వెళ్లారు. కానీ మరో గేట్ వద్ద మోహరించిన మార్షల్స్ రోజాను అడ్డుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శిని తాను కలుస్తానని రోజా అక్కడున్న మార్షల్స్ తో తెలిపారు. రోజా అసెంబ్లీలోనికి వెళుతారా ? లేదా ? అన్నది చూడాలి. 

 • కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
 • 340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
 • కానీ ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని వైసీపీ పేర్కొంది.
 • సస్పెండ్ చేసిన తీర్మానం ప్రతి కోసం మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
 • ఈ నేపథ్యంలో రోజా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు కేసును విచారించడం జరిగాయి.

హంద్వారాలో ఇద్దరు మిలిటెంట్ల మృతి..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలో హంద్వారాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. 

అసెంబ్లీకి చేరుకున్న రోజా..

హైదరాబాద్ : వైసీసీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి చేరుకున్నారు. సస్పెన్షన్ వ్యవహారంపై చేసిన తీర్మానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రోజాను సభలోకి అనుమతించబోమని స్పీకర్ కార్యాలయం తేల్చిచెప్పింది. 

పురుషుల టీ20 వరల్డ్ కప్ లో నేటి మ్యాచ్ లు..

పురుషుల టీ20 వరల్డ్ కప్ లో నేడు న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ధర్మాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ Vs దక్షిణాఫ్రికా మ్యాచ్ ముంబైలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 

మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేటి మ్యాచ్ లు..

మహిళల టీ20 వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ - ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మొహాలి వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మ్యాచ్ నాగ్ పూర్ లో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 

 

కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : కుప్వార జిల్లాఇని హంద్వారా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇద్దరి నుండి నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. 

అసెంబ్లీ వద్ద పోలీసుల భద్రత..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు అసెంబ్లీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద భారీగా పోలీసులు, మార్షల్స్ మోహరించారు. అసెంబ్లీకి అనుమతించవద్దంటూ పోలీసులకు స్పీకర్ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. 

08:13 - March 18, 2016

గతేడాది 'ఐ' సినిమాతో అలరించిన అమీ జాక్సన్‌ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న అమీ తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అమీ జాక్సన్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా దిగిన ఓ ఫొటోను కూడా ట్వీట్‌ చేసింది. 'గోల్ఫ్' నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గోల్ఫర్‌గా నటిస్తుండగా సోహా ఆలీఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమీ ప్రస్తుతం రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంలోను, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'థెరి' చిత్రంలోనూ నటిస్తోంది.

 

08:11 - March 18, 2016

పవన్‌ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా రంగంలోకి వచ్చాన'ని చెబుతున్నారు హీరో సతీష్‌బాబు. ఆయన, మెరినా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్ధన్‌ మందుముల నిర్మించిన చిత్రం 'రొమాన్స్ విత్‌ ఫైనాన్స్'. నేడు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో సతీష్‌బాబు గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..'మాది తూర్పు గోదావరి జిల్లాలోని కడియం. తరచూ అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుండటంతో సినిమాలపై ఆసక్తి పెరిగింది. పవన్‌ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇండిస్టీలోకి వచ్చాను. ఛాన్స్‌ల కోసం మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. 'ప్రేమ ఒక మైకం' చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. పాత్ర చిన్నదే అయినా నటనకు మంచి స్కోప్‌ ఉండటంతో అందరూ మెచ్చుకున్నారు. ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నా. అందమైన ప్రేమ వెనుక దాగి ఉన్న రొమాన్స్, దానిపై కప్పి ఉన్న ఫైనాన్సే ఈ సినిమా కథ. ఇందులో నేను జై అనే పాత్రలో కనిపిస్తాను. ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడతాను. ఇద్దరి మధ్య కొన్ని అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఏమైందనేది మాటల్లో కంటే సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంతో నటుడిగా మరింత మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతోఉన్నాను. ఇందులో లవ్‌, రొమాన్స్‌తో మంచి కామెడీ కూడా ఉంటుంది. మొత్తం ఐదు పాటలుంటాయి. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా జాన్‌ వినసొంపైన మ్యూజిక్‌ అందించారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కే క్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని చెప్పారు.

08:08 - March 18, 2016

విద్యాబాలన్‌ ప్రధాన పాత్రధారిణిగా 2012లో వచ్చిన 'కహాని' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న 'కహానీ 2' చిత్రం బుధవారం కోల్‌కతాలో ప్రారంభమైంది. ఇందులో విద్యాబాలన్‌కి జోడీగా నవాజుద్దీన్‌ సిద్ధిఖ్‌ బదులు అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నారు. వీళ్ళిద్దరి జోడీ తొలిసారి నటించడం విశేషం. 'కహాని' చిత్రానికి దర్శకత్వం వహించిన సుజయ్ ఘోష్‌ దర్శకత్వంలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. సీక్వెల్‌ ప్రారంభమైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ' ప్రేక్షకులెంతో ప్రేమతో మొదటి చిత్రాన్ని భారీ హిట్‌ చేశారు. మీరిచ్చిన ఆ ఉత్సాహంతోనే సీక్వెల్‌ని ప్రారంభించాం. అందరి అంచనాలను అందుకునేలాగానే కాకుండా ఎంటర్‌టైన్‌ చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'కహాని' చిత్రం వంద కోట్ల కలెక్షన్లతోపాటు 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో నయనతారతో 'అనామిక'గా రూపొందించారు.

08:05 - March 18, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని తిరుమల గిరిలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదుగురు అభ్యర్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా గేట్లు తెరవడమేనని తెలుస్తోంది. స్థానిక పోలీసులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించలేదు. 29 పోస్టుల కోసం 10వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెల్లవారుజామున నుండే  భారీగా అభ్యర్థులు తిరుమలగిరి ప్రాంతానికి చేరుకున్నారు. దీనితో ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ నెలకొంది. 

08:00 - March 18, 2016

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ తీర్పుపై ఉత్కంఠ వీడింది. సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పుకు సంబంధించిన కాపీని అసెంబ్లీ కార్యదర్శికి రోజా అందచేశారు. శుక్రవారం నుండి అసెంబ్లీకి హాజరవుతానని రోజా ప్రకటించగా తాము అనుమతినిచ్చే ప్రసక్తే లేదని టిడిపి పేర్కొంటోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మాల్యాద్రి (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ), వీఆర్ మాచవరం (న్యాయ నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:46 - March 18, 2016

రోజూ లీటర్ల కొద్ది మంచినీళ్లు తాగాలని అందరూ చెబుతారు. కొందరూ ఉదయాన్నే పరగడపున తాగమని చెబితే.. మరికొందరు భోజనం చేసే ముందు తాగాలని చెబుతారు. మరి ఎప్పుడు తాగితే మంచిది అన్న అనుమానంతో చాలా మంది నీళ్లు తాగడం ఎదో మొక్కబడిగా చేస్తారు. కానీ, నీళ్లు ఎప్పుడు ఎలా తాగినా మంచిదే. ముఖ్యంగా ఎండాకాలం రోజూ ఆరు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. పరగడపున రెండు గ్లాసుల నీటితో రోజుకు స్వాగతం పలికి.. రోజంతా వీలైనప్పుడల్లా గ్లాస్‌కు తక్కువ కాకుండా నీళ్లు తాగుతూ.. రాత్రి నిద్రించే ముందు కనీసం నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలట. ఇలా తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు..
- నిద్రకు ముందు నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావల్సిన ఖనిజాలు అందడంతోపాటు హార్మోన్ల అసమానత లోపాలు ఉంటే తగ్గుతాయి.
- కండరాలు, కీళ్లు ఉత్తేజితమై మంచి నిద్ర వస్తుంది.
- ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరధర్మప్రక్రియలన్నీ సజావుగా సాగుతాయి.
-శరీరంలోని వ్యర్థాలు త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతాయి.
- రాత్రివేళ శరీరం రిలాక్స్‌ అవుతుంది. అదే సమయంలో మెదడు రిలాక్స్‌ కావాలంటే తగినంత ఆక్సిజన్‌ శరీర కణాలకు అందాలి. ఎక్కువగా తీసుకునే నీళ్ల వల్ల శరీరకణాలకు కావల్సినంత ఆక్సిజన్‌ అందుతుంది.
- మల బద్ధకం సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా రాత్రివేళ ఎక్కువగా నీళ్లు తాగాలి.
- బరువు తగ్గాలి అనుకునేవారు భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే.. కడుపు నిండిన ఫీలింగ్‌తో తక్కువగా తింటారు.
- రాత్రి భోజనానికి ఉదయం అల్పాహారం తీసుకునే సమయానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి శరీరానికి తగినంత తేమ కావాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. 

07:44 - March 18, 2016

కాలానికనుగుణంగా ప్రకృతి మనకు వివిధ రకాల ఫలాలను ఇస్తుంటుంది. వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి పండ్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం పుచ్చకాయలు వచ్చేశాయి. మృదువుగా, తీయగా, రసపభరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు క్యాన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెల్చాయి. వాటిలో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్‌ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92 శాతం నీరు ఉంటుంది. పైగా కొలెస్ట్రాల్‌ లాంటివి అందులో ఉండవు. వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఎంపిక: సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పినప్పుడు ఒక పక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్యకిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా? కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈ సారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో తొక్కిసలాట..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని తిరుమల గిరిలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదుగురు అభ్యర్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా గేట్లు తెరవడమేనని తెలుస్తోంది. స్థానిక పోలీసులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించలేదు. 29 పోస్టుల కోసం 10వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఢిల్లీకి వెళ్లనున్న మేయర్ బొంతు..

హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు కమిషనర్ జనార్ధన్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లిన్ సెంటర్, స్లాటర్ హౌస్ నిర్వాహణలను పరిశీలించనున్నారు. 

ఉద్యోగాల భర్తీపై నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..

విజయవాడ : ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం నాడు జరగనుంది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంపై ప్రధానంగా చర్చిస్తాని తెలుస్తోంది. 

నేడు తెలంగాణ ఐకాస కోర్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ ఐకాస కోర్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం జరగనుంది. ఐకాస ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. 

07:12 - March 18, 2016

ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీలకు కొత్త కష్ట మొచ్చింది. వారి తెల్ల రేషన్ కార్డులకు ఎసరొచ్చింది. ఎంతో కొంత జీతం పెరిగిందన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ప్రభుత్వం షాకిచ్చింది. తెల్ల రేషన్ కార్డులు తొలగిస్తామంటూ తహశిల్దారులు నోటీసులిస్తున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? అంగన్ వాడీల తెల్ల రేషన్ కార్డులు తొలగించడాన్ని సమర్ధించవచ్చా? అంగన్ వాడీలకు తెల్ల రేషన్ కార్డులను కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? అంగన్ వాడీల వాస్తవిక ఆదాయ పరిస్థితులేమిటి? తెల్ల రేషన్ కార్డు తొలగించడం వల్ల వారికి ఎదురయ్యే సమస్యలేమిటి? అంగన్ వాడీల వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? ఉద్యోగభద్రత ఎంత వరకు వుంది? ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే వీరికి ఎలాంటి సౌకర్యాలున్నాయి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఆంద్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేత సుబ్బారామమ్మ విశ్లేషించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:56 - March 18, 2016

రాజస్థాన్‌ : మేవార్ యూనివర్సిటీలో తలెత్తిన బీఫ్ వివాదం సద్దుమణుగుతోంది. యూనివర్సిటీ హాస్టల్ గదిలో బీఫ్‌ వండుకొని తిన్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు కశ్మీరీ విద్యార్థులు విడుదలయ్యారు. విద్యార్థులు వండుకొని తిన్న మాంసం బీఫ్ కాదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించడంతో చిత్తోర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. మేవార్ యూనివర్సిటీలో మాంసం తినడం నిషిద్ధం. ఇక్కడ డిగ్రీ చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు షకీబ్ అష్రఫ్‌, హిలాల్ ఫరుఖ్, మహమ్మద్ మక్బూల్, షౌకత్ అలీ తమ హాస్టల్ గదిలో బీఫ్ వండుకున్నారన్న కారణంతో వారిని కొందరు విద్యార్థులు చితకబాదారు. వారు తిన్నది ఆవు మాంసం కాదని స్థానికంగా లభించే మాంసాన్ని వండుకున్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు.

06:55 - March 18, 2016

హర్యానా : ఓబీసీ రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జాట్ల రిజర్వేషన్లపై ప్రభుత్వమిచ్చిన గడువు ముగియడంతో జాట్‌ నేతలు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జాట్‌ బిల్లును తప్పకుండా తెస్తామని కాకపోతే ఇవాళ తీసుకురావడం కుదరదని ఖట్టర్‌ సర్కార్‌ పేర్కొంది. ఇప్పటికే జాట్‌లకు మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళన ప్రారంభించింది. జాట్ల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం- హర్యానాలో హై అలర్టు ప్రకటించింది. రోహ్‌తక్‌, హిస్సార్‌లో 144 సెక్షన్ విధించి శాంతి భద్రతల పరిస్థితిని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సమీక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. సైనిక బలగాలను పంపాలని హర్యానా ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత నెల జాట్ల ఆందోళన సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

06:53 - March 18, 2016

నేపాల్ : భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ విదేశ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు సహా ద్వైపాక్షిక అంశాలపై సుష్మా, సర్తాజ్ చర్చలు జరిపారు. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోది హాజరు కావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వాన ప్రతిని సర్తాజ్ అజీజ్‌ సుష్మాకు అందజైశారు. అలాగే ఈ నెల 31న అమెరికాలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశముందని సర్తాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ బృందం ఈ నెల 27న భారత్‌కు రానుంది. 

06:51 - March 18, 2016

ముంబై : బ్యాంకులకు 9వేల కోట్లకు ఎగనామం పెట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఇంటిని ఎస్‌బిఐ వేలం పెట్టింది. అయితే ఈ డిఫాల్టర్‌ ఇల్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఈడీ ముందు విచారణకు హాజరయ్యేందుకు మాల్యా ఏప్రిల్‌ వరకు గడువు కోరాడు. బ్యాంకులకు 9 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఆస్తులకు వేలంపాట మొదలైంది. ముంబై అంధేరిలో 17 వేల స్క్వేర్‌ ఫీట్లు కల కింగ్‌ ఫిషర్‌ హౌజ్‌కు ఎస్‌బిఐ ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. వేలం ప్రారంభ ధర 150కోట్లుగా నిర్ధారించిన ఎస్‌బీఐ- వేలంలో పాల్గొనేవాళ్లు 5 లక్షలు చెల్లించి 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బిఐ నిర్వహించిన ఈ వేలానికి ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. సమయం ముగియడంతో వేలం ప్రక్రియ పూర్తయినట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది కింగ్‌ఫిషర్ భవనాన్ని ఎస్‌బీఐ స్వాధీనం చేసుకుంది.

 గడువు కావాలన్న మాల్యా..
మనీ లాండరింగ్‌ కేసు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఏప్రిల్‌ వరకు గడువు కావాలని విజయ్‌మాల్యా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను కోరాడు. ఈ కేసులో మార్చి 18న హాజరవ్వాలని మాల్యాకు ఈడీ ఇదివరకే సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యా.. తనకు మరింత గడువు కావాలంటూ ఈడీని అభ్యర్థించాడు. మాల్యా అభ్యర్థనపై ఈడీ ఎలా స్పందింస్తున్నది వేచి చూడాలి. ఐడిబిఐ బ్యాంకుకు 9 వందల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన కేసులో మనీలాండరింగ్‌ యాక్టు కింద మాల్యాపై సీబీఐ గతేడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసును ఈడీ విచారణ జరుపుతోంది. విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే మాల్యా దేశంవిడిచి పారిపోయాడా అన్న ప్రశ్నపై స్పందించేందుకు మాత్రం జైట్లీ నిరాకరించారు. మాల్యా వివాదంపై ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

17 బ్యాంకులు..
కింగ్ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 17 బ్యాంకుల నుంచి దాదాపు 9వేల కోట్ల వరకు బకాయి పడింది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తోపాటు విజయ్‌మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్‌ లిమిటెడ్‌ పూచికత్తు దారులుగా ఉన్నాయి. మాల్యా తీసుకున్న రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఈక్విటి షేర్లు అమ్మడం ద్వారా 16 వందల కోట్ల రూపాయలను బ్యాంకులు రికవరీ చేశాయి. ఈ నేపథ్యంలో కింగ్‌ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయారు. తాను డిఫాల్టర్‌ను కాదని, స్వదేశానికి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని మాల్యా గతవారం ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించాయి. 

06:47 - March 18, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అర్చకులకు, మాజీ ఈవో నర్సింగరావుకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. కొండపై పోలీసులు ఆంక్షలు విధించడంతో మరోసారి అర్చకులకు, ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇంద్రకీలాద్రిపై పట్టుకోసం మాజీ ఈవో నర్సింగరావు అనుచరగణంతో అలజడి సృష్టిస్తున్నారు. అర్చకులు, ఉద్యోగులపై బెదిరింపులకు దిగడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా పేరున్న ఇంద్రకీలాద్రిలో అర్చకుల, మాజీ ఈవో మద్య వివాదం సద్దుమణిగిందనుకున్న తరుణంలో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. సుబ్బారావు అనే అర్చకుడు హాస్పిటల్ పాలు కావడంతో ప్రారంభమైన వివాదం.. అర్చకులు ఆందోళన దిగడం..ఆతర్వాత ఈవో నర్సింగరావును సెలవుపై పంపడంతో కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత నర్సింగరావును విధుల్లోంచి తొలగించాలని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకూడదని షరతు విధించారు. దీంతో ఇంఛార్జ్ ఈవోగా ఆజాద్ ను నియమించడం జరిగింది.

మరింత పెరిగే అవకాశం. ? 
మాజీ ఈవో నర్సింగరావు తమకు అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇప్పించడంతో మళ్లీ అర్చకులు ఆగ్రహానికి గురయ్యారు. తమ ఆవేశాలను మీడియాముందు ఉంచాలనుకున్నారు. కాని పోలీసులు అర్చకుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈవో ఆజాద్ అనుమతి లేకుండా అర్చకులు ఆందోళనకు దిగితే అరెస్ట్ చేసి కేసులు పెడతామనడంతో సైలెంట్ అయ్యారు అర్చకులు. ఇదే సమయంలో అర్చకులకు మద్దతు పలికిన విశ్వధర్మ ప్రచార సమితి అధ్యక్షులు జగన్మోహన్ రాజును పోలీసులు అడ్డుకున్నారు.  దుర్గ గుడిలో జరుగుతున్న తంతుపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దేవాలయం పాలకవర్గంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. దీంతో దేవాదాయశాఖలోను మార్పులు తప్పవని తెలుస్తోంది. మార్పుల కారణంగా అర్చకులు.. గత పాలకవర్గాల మద్య రాజీ కుదురుతుందా..చిలికి చిలికి అర్చకుల మద్యే వివాదంగా మారుతుందా అన్న సందేహం భక్తులలో నెలకొంది.

06:43 - March 18, 2016

విజయవాడ : అంగన్ వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. అనేక పోరాటాలు, ఉద్యమాల నేపథ్యంలో అంగన్ వాడీల జీతాలు పెంచినట్టే పెంచి, ఇప్పుడు రేషన్ కార్డులకు ఎసరు పెడుతోంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి, మీ రేషన్ కార్డులు తొలగిస్తామంటూ తహశీల్దార్ లు అంగన్ వాడీలకు నోటీసులిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఈ నోటీసులిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం దాదాపు లక్ష మంది అంగన్ వాడీల మీద ప్రభావం చూపించే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్ లో 55వేలకు పైగా మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు అల్పాదాయ వర్గాలవారే. బడుగు బలహీనవర్గాలకు చెందినవారే. గతంలో అంగన్ వాడీ వర్కర్లకు 4200, హెల్పర్లకు 2,200 రూపాయల గౌరవ వేతనం లభించేది. తమ వేతనాలు పెంచాలంటూ అంగన్ వాడీ వర్కర్లు అనేక ఏళ్లుగా పోరాడుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా వీరి వేతనాలు పెంచాలంటూ సిఫార్సు చేసిన నేపథ్యంలో చివరకు ప్రభుత్వం అంగన్ వాడీల వేతనాన్ని 7200లకు, హెల్పర్ల వేతనాన్ని 4500 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.

వేతనం అందుకోని అంగన్ వాడీలు..
పెరిగిన వేతనాన్ని ఇంకా అంగన్ వాడీలు అందుకోలేదు. అసలు వీరికి ప్రతి నెలా 1వ తేదీన వేతనాలివ్వడం లేదు. మూడు నాలుగు నెలల కోసారి ఇస్తున్నారు. పెంచిన వేతనాలను లెక్కలోకి తీసుకున్నా కనీస వేతన చట్టంలో సగం కూడా వీరు పొందడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా వీరికి పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డులాంటి సౌకర్యాలేమీ లేవు. ఆ మాటకొస్తే ఉద్యోగ భద్రత అసలే లేదు. ఎవరి ఉద్యోగం ఎప్పుడు వుంటుందో ఎప్పుడు ఊడుతుందో అర్ధం కాని పరిస్థితి. స్థానిక రాజకీయ నేతల జోక్యం ఎక్కువ. అధికారుల వేధింపులు, బెదిరింపులు షరా మామూలు. ప్రభుత్వాలు మారిన్నప్పుడల్లా చాలామంది అంగన్ వాడీల ఉద్యోగాలు పోతుంటాయి. ఇంతటి అభద్రత మధ్య, అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల తెల్ల రేషన్ కార్డులు తొలగించడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు.

అనేక పథకాలకు ఆధారం..
అల్పాదాయవర్గాలకు తెల్ల రేషన్ కార్డుల వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. కేవలం రేషన్ బియ్యం కొనుక్కోవడానికే కాకుండా ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలకు ఇవే ఆధారం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతన చట్టాన్ని అమలు చేసి, పీఎఫ్, ఈఎస్ ఐ, హెల్త్ కార్డు లాంటి సౌకర్యాలు కల్పిస్తే, తెల్ల రేషన్ కార్డు అవసరం వుండదు. కానీ, ఇలాంటి సౌకర్యాలేవీ వారికి లేవు కాబట్టి, ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎందుకంటే, వీరికున్న తెల్ల రేషన్ కార్డులను తొలగిస్తే లక్ష కుటుంబాల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయే ప్రమాదం వుంది. వారు మరింత పేదరికంలోకి జారిపోయే ప్రమాదం వుంది. 

06:41 - March 18, 2016

హైదరాబాద్ : జూన్ 15 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ హైద‌రాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులను త‌ర‌లించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక స‌చివాల‌యంలోనే శాఖాధిప‌తుల కార్యాల‌యాలు కూడా ఏర్పాటు చేయాల‌ని సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చలు జ‌రిపిన ప్రభుత్వం వ‌చ్చే సోమ‌వారం నాటికి రూట్ మ్యాప్ ఇస్తామ‌ని స్పష్టం చేసింది.

వసతి, శాఖాధిపతుల కార్యాలయాలపై వివరణ..
సిఎస్‌, మంత్రితో జరిగిన స‌మావేశంలో ఉద్యోగులు ప‌లు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఎప్పటినుంచో కోరుతున్న స్థానిక‌త అంశంపై స్పష్టత ఇవ్వాల‌ని ఉద్యోగులు కోరారు. అలాగే తమకు కావ‌ల‌సిన వ‌స‌తి, స‌చివాల‌యం కాకుండా శాఖాధిప‌తుల కార్యాల‌యాలు ఎక్కడ పెడ‌తార‌నే దానిపై స్పష్టత ఇవ్వాల‌న్నారు. ఇక వారానికి ఐదురోజుల ప‌నిదినాలు... రెండు మూడేళ్లలో రిటైర‌య్యే వారిని త‌ర‌లించ‌కుండా హైదరాబాద్‌లోనే ఉంచడం తదితర డిమాండ్లను చర్చలో ప్రస్తావించారు.

ఉద్యోగులతో మరో సమావేశం..
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. స్థానిక‌త అంశంపై మ‌రో 15 రోజుల్లోగా స్పష్టత వ‌స్తుంద‌ని ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపింది. అలాగే శాఖాధిప‌తుల కార్యాల‌యాలు కూడా ప్రస్తుతం వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న భ‌వ‌నాల్లోనే నిర్మిస్తామని స్పష్టం చేసింది. అయితే స‌చివాల‌యంలోనే శాఖాధిప‌తుల కార్యాల‌యాలు పెట్టొద్దని సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అభ్యంత‌రం తెలిపింది. వ‌చ్చే సొమ‌వారం ఎల్‌ అండ్ టీ, ప‌ల్లోంజి కంపెనీలు, ఉద్యోగుల‌తో మ‌రో స‌మావేశం ఏర్పాటుచేస్తామ‌ని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న భ‌వ‌నాల్లో అద‌నంగా మరో మూడంత‌స్తులు నిర్మించి అక్కడే శాఖాధిప‌తుల కార్యాల‌యాలు ఏర్పాటుచేసే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. వ‌చ్చే సొమ‌వారం జ‌రిగే స‌మావేశంలో ఉద్యోగుల త‌ర‌లింపుపై రూట్ మ్యాప్ ప్రక‌టిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఉద్యోగుల త‌రలింపులో మాత్రం ఎలాంటి ఆల‌స్యం ఉండ‌ద‌ని మరోసారి స‌ర్కార్ స్పష్టం చేసింది. దీంతో వ‌చ్చే జూన్ నుంచి ఏపీ పాల‌న అమ‌రావ‌తికి పూర్తిస్థాయిలో షిఫ్టయ్యే అవకాశం క‌నిపిస్తోంది.

06:39 - March 18, 2016

విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌లో చూపిన లెక్కలు అంకెల గారడిని తలపించాయని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం విమర్శించింది. రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, నగరాల్లో పారిశుధ్యం కొరవడిందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి లేక యువత వలస బాటపట్టిందని వైసిపి ఎమ్మెల్యేలు అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు అంశాలపై నేతలు చర్చించారు.  రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యం కొరవడిందని ప్రతిపక్షం విమర్శించింది. ఇందుకు మంత్రి నారాయణ బదులిస్తూ శానిటేషన్‌ మెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి కొరవడిందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా టూరిజం అభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి కోరారు. ఇందుకు మంత్రి అచ్చన్నాయుడు సమాధానమిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు. రంపచోడవరంలో ఎకో టూరిజం అభివృద్ధికి, వేసవి విడిది కేంద్రాలైన లంబసింగిలో 14 కోట్ల రూపాయలు, రాళ్లపల్లిలో పదిన్నర కోట్లు, మారేడుమిల్లిలో ఏడున్నర కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ఎక్కడ ?
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ విధిస్తుండడం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా స్పీకర్‌ తిరస్కరించారు. వాయిదా తీర్మానం అంశంపై చర్చించడం సరికాదని చెప్పారు. జలసిరి పథకం కింద రైతుల భూముల్లో వేసే బోర్లకు సంబంధించిన చర్చ జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల మంది రైతులు అప్లికేషన్లు పెట్టుకున్నారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ చిట్టిపొట్టి కథలు, వివిధ ప్రశ్నలతో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

పత్తిపాటి సమాధానం..
రాజేంద్రనాథ్ ప్రశ్నలకు మంత్రి పత్తిపాటి పుల్లారావు బదులిస్తూ 54 లక్షల 6 వేల మందికి రుణమాఫీ ద్వారా వారి ఖాతాల్లో వేసిన డబ్బు తమకు కన్పించట్లేదా అని ప్రశ్నించారు. ఒకదఫాలో 24వేల 5 వందల కోట్లు, మరోసారి 7,433 కోట్లు జమ చేసిన అంశాన్ని గుర్తించాలన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్ నిధి మాదిరే ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సూచించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

06:32 - March 18, 2016

హైదరాబాద్ : అమెరికా వెళ్లే ఉద్యోగార్థులకు శుభవార్త.. 2017 సంవత్సరానికిగానూ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి హెచ్ వన్‌ బీ వీసాల కోసం అమెరికా దరఖాస్తుల్ని స్వీకరించనుంది. ఉద్యోగుల కోసం హెచ్ వన్‌ బీ కింద ఏటా 65 వేల వీసాల్ని జారీచేస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన 65 వేల మందికి వీసాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఈ వీసాలకు భారత సాంకేతిక నిపుణులు అత్యంత ప్రాధాన్యమిస్తుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను అమెరికా సంస్థలు ఈ వీసాల ద్వారానే ఎక్కువగా తమ దేశానికి రప్పించుకుంటాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వారి కోసం మొదటి 20వేల వీసాలను కేటాయిస్తారు. మొదటి ఐదు రోజుల్లోనే 65 వేలకు మించి దరఖాస్తులు వస్తాయని తాము భావిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసల విభాగం సేవలు ఓ ప్రకటనలో తెలిపింది. తాము నిర్దేశించిన పరిమితికి అభ్యర్థనలు చేరుకున్నప్పుడు తెలియజేస్తామని పేర్కొంది.

06:30 - March 18, 2016

నల్గొండ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవం మహావైభవంగా సాగింది. ముక్కోటి దేవతల సాక్షిగా వేద పండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అశేష భక్తకోటి తిలకించగా ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా సాగింది. స్వామివారి కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కల్యాణోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంగ్రాలు అందజేశారు.

ఆశీర్వచనాలు..
అనంతరం వేద పండితులు సీఎం కేసీఆర్ దంపతులు, సీఎం మనవడు హిమాన్షురావుకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్బంగా స్వామివారి ప్రతిమను సీఎం దంపతులకు అందజేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవంలో అర్థరాత్రి వరకు జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కొండపై సంగీత భవన్‌లో నిర్వహిస్తున్న ధార్మిక సభ కార్యక్రమాలను భక్తులను అలరించాయి. ఉదయం భజన, భక్తిగీత కీర్తనలు, వైదిక ప్రార్ధన, నాదస్వర కచేరి, భక్తరామదాసు హరికథాగానం, భక్తి సంగీతం, శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ముకాభి నయం, చిందు యక్షగానం, వేణుగానం అత్యంత వైభవంగా నిర్వహించారు.

06:27 - March 18, 2016

విజయవాడ : సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకోసం ఏపీ ప్రభుత్వ ముందడుగు వేసింది. దానిలో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకే కేబుల్ ప్రసారాలు, ఇంటర్ నెట్ అందుబాటులోకి రానున్నాయి. సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందుడుగుగా భావించే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిస్కో ఛైర్మన్‌ జాన్‌ టి చాంబర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఐదు గ్రిడ్లలో ఇదొకటి..
ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే తక్కువ ధరకే కేబుల్‌ ప్రసారాలు, 15ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌, ఫోన్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదు గ్రిడ్లల్లో ఫైబర్‌ గ్రిడ్‌ ఒకటి. ఈ గ్రిడ్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదట ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా విశాఖ కేంద్రంగా సంబంధిత వర్గాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. విశాఖలోని ఏయూ దూరవిద్య కేంద్ర ప్రాంగణంలో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో 2661 కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు ఏర్పాటు చేశారు. వీటిని సమీపంలో గల విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో అనుసంధానం చేసి అక్కడి నుంచి కేబుల్‌ ఆపరేటర్లు ఇప్పటికే ఇళ్లకు వేసిన తీగలకు మరోసారి అనుసంధానిస్తారు. మారుమూల ప్రాంతాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలీ మెడిసిన్‌, ఈ-మెడిసిన్‌ కార్యక్రమాలకు వూతమివ్వడమే కాకుండా ఈ-తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌, టెలీ కాన్ఫరెన్స్‌ వంటివి నిర్వహణకు ఈ వ్యవస్థ కీలకంగా మారనుంది.

లంక విజయం..

నాగ్ పూర్ : టీ -20 వరల్డ్ కప్ లో అప్ఘనిస్తాన్ పై శ్రీలంక జట్టు విజయం సాధించింది. అప్ఘనిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో లంక గెలుపు సాధించింది. అప్ఘనిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా శ్రీలంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. 

వాంబే కాలనీలో కారు బీభత్సం..

విజయవాడ : వాంబే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ కారు వేగంగా నడిపి చెట్టు, డివైడర్ ను ఢీకొట్టాడు. అనంతరం కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

బాలుడి హత్య కేసులో అనుమానితుడి ఫొటో విడుదల..

హైదరాబాద్ : బాలుడు అభయ్ హత్య కేసులో బైక్ పై తీసుకెళ్లిన అనుమానితుడి ఫొటోను సీపీ విడుదల చేశారు. ఫొటోను గుర్తించి ఆచూకి తెలిపిన వారికి రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు. అనుమానితుడి ఆచూకి తెలిసిన వారు 9490616552, 9490616555 నెంబర్లకు ఫొన్ చేయాలని సూచించారు. 

నేడు కేటీఆర్ ఢిల్లీ పర్యటన..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11.45గంటలకు ఢిల్లీకి చేరుకున్న అనంతరం కేందమంత్రులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 03.45గంటలకు వెంకయ్య నాయుడు..సాయంత్రం 4.30గంటలకు రవిశంకర్ ప్రసాద్..సాయంత్రం 5గంటలకు అరుణ్ జైట్లీతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

Don't Miss