Activities calendar

19 March 2016

22:15 - March 19, 2016

హైదరాబాద్ : 2016-17 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం చెప్పారు.  పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు కేటాయింపులు లేవని ప్రతిపక్షాలు  పెదవి విరిచాయి. ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌ కేటాయింపులను సమర్థించుకుంది. 
వార్షిక బడ్జెట్‌పై నాలుగు రోజుల పాటు చర్చ
తెలంగాణ అసెంబ్లీలో 2016-17 వార్షిక బడ్జెట్‌పై నాలుగు రోజుల పాటు జరిగిన చర్చ ముగిసింది. చర్చలో పాల్గొన్న విపక్షాల సభ్యులు బడ్జెట్‌ కేటాయింపులపై అంసతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీగా మారిందని...  కేటాయింపులకు, చేసే ఖర్చులకు పొంతన లేకుండా పోతున్నదని  విపక్షాలు విమర్శించాయి. విద్యారంగం కుంటుపడిపోయిందని, వైద్యరంగం నీరసించిపోయిందని దుయ్యబట్టాయి. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి.
టీసర్కార్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు 
టీఆర్‌ఎస్‌ పాలనలో ఫీజులు రీయింబర్స్ మెంట్‌ ఫార్స్ గా మారిందని బీజేపీ విమర్శించింది. అర్హులైన పేద విద్యార్థులకు కూడా రీయింబర్స్ మెంట్‌ వర్తింపచేయకపోవడంతో ఉన్నత విద్య మధ్యలోనే మానేసే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షేమం కుంటుపడిందని సీఎల్‌పీ నేత జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే కేటాయింపులు పెరగలేదన్నారు. 
బడ్జెట్‌పై చర్చకు మంత్రి ఈటెల సమాధానం 
బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏవర్గాన్ని, ఏరంగాన్ని కూడా విస్మరించకుండా సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని సభ దృష్టికి తెచ్చారు.  సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపులు పెంచామన్నారు. 
సభ రేపటికి వాయిదా
బడ్జెట్‌పై చర్చ తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌  పద్మాదేవేందర్‌రెడ్డి...సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. దీనిపై ప్రతిపక్షాలు సభ వెలుపల  తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. బడ్జెట్‌పై తాము లేవనెత్తిన  అంశాలకు   ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుపట్టాయి. సర్కార్‌ సమాధానంతో సంతృప్తి చెందకపోతే నిరసన తెలిపి వాకౌట్‌ చేసేందుకు  కూడా అవకాశం ఇవ్వకపోవడం మంచి సంప్రదాయం కాదని ప్రతిపక్షాలు విమర్శించారు. 

 

22:09 - March 19, 2016

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీ నిరసనలు... అధికార పార్టీ పట్టుదల మధ్య ఏపీ అసెంబ్లీ అంతంతమాత్రంగానే కొనసాగింది. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ వైసిపి చేసిన ఆందోళనతో... సభలో హై డ్రామా నడించింది. చివరకు గందరగోళం మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది.
ప్రజా సమస్యలపై చర్చ ముందుకు సాగలేదు
ఏపీ అసెంబ్లీలో సీన్ మారలేదు. ప్రజా సమస్యలపై చర్చ ముందుకు సాగలేదు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఆందోళన అధికారపార్టీ కొద్దిసేపు జరిపిన ప్రశ్నోత్తరాలు తప్పించి మరే కొత్త అంశమూ సభలో కనిపించలేదు. 
వైసిపి ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరు
ప్రభుత్వం, స్పీకర్‌ వైఖరిని నిరసిస్తూ వైసిపి ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించడంతోటే వారి ఆందోళనా మొదలైంది. వుయ్‌వాంట్ జస్టిస్‌ అంటూ వైసిపి ఎమ్మెల్యేలు స్లోగన్స్ అందుకున్నారు. అనంతరం పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయింది. వారి ఆందోళన మధ్యనే మంత్రి యనమల ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బికె. పార్థసారథి, అనిత, శ్రావణ్‌కుమార్‌ మాట్లాడారు. అనంతరం బిజెపి ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు మాట్లాడుతుండగా వైసిపి ఆందోళన కొనసాగించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అరగంటకే పదినిమిషాలపాటు వాయిదా
ఎంతకూ వైసిపి ఆందోళన విరమించకపోవడంతో సభ మొదలైన అరగంటకే పదినిమిషాలపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష వైఖరిలో మార్పురాలేదు. దీంతో మళ్లీ వాయిదా వేయాల్సొచ్చింది. 
సభ సోమవారానికి వాయిదా 
వాయిదా అనంతరం సభ ప్రారంభంకాగా మంత్రులు పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఇదే సమయంలో వైసిపి భారీఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు అడ్డుతగలడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

 

22:04 - March 19, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై ప్రివిలేజ్ క‌మిటీ నివేదిక సిద్ధమైంది. ఛైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను కొనసాగించడం.. కొడాలి నానిపై శిక్ష ఖరారు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో  వారిని మందలించి వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం.   
ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక‌ ప‌రిశీలన 
శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై డిప్యూటీ స్పీక‌ర్ మండలి బుద్దప్రసాద్‌ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక‌ను... గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని ప్రివిలేజ్ క‌మిటీ  శ‌నివారం ప‌రిశీలించింది. దీంతో పాటే.. రోజాపై టిడిపి ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఇచ్చిన ఫిర్యాదు పైనా విచార‌ణ జరిపింది. తుది నివేదికను స్పీక‌ర్‌ కోడెల శివప్రసాదరావుకు అందించింది. ఈ నివేదిక‌ను సోమ‌వారం స‌భ ముందుంచి.. రోజా, నానిలపై చ‌ర్యకు సిఫార‌సు చేయ‌నున్నారని తెలుస్తోంది. 
అనారోగ్య కారణాలతో హాజరుకాని రోజా
రోజాను వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రివిలేజ్‌ కమిటీ సూచించింది. అయితే.. అనారోగ్య కార‌ణాల‌ వల్ల హాజరు కాలేక పోతున్నానని, 15 రోజుల గడువు ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ ఆమె విజ్ఞప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని తెలుస్తోంది. కమిటీ ముందు హాజరైనటీడీపీ ఎమ్మెల్యే అనిత.. త‌న‌పై ఇష్టానుసారంగా ఆరోప‌ణ‌లు చేసిన రోజాపై చర్య తీసుకోవాలని కోరారు.
కొడాలి నానిపై చర్యలకు సిఫారసు 
ఇక ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు హాజరైన మిగిలిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ విష‌యంలో వారు చెప్పిన సమాధానాలతో ప్రివిలేజ్‌ క‌మిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని వారిని కమిటీ మందలించినట్లు తెలుస్తోంది. మ‌రో ఎమ్మెల్యే కొడాలి నాని విషయంలో మాత్రం కమిటీ చర్యలకు సిఫార‌స్సు చేసింది. అయితే శిక్ష ఖ‌రారు చేసే నిర్ణయాన్ని శాసనసభకే  వదిలేసింది. రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో... ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేసిందని గుర్రుగా ఉన్న వైసీపీ.. ప్రివిలేజ్‌ కమిటీ సిఫారసులపై చర్చ సందర్భంగా ఎలా స్పందించనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.  

భారత్ విజయలక్ష్యం 119 పరుగులు

హైదరాబాద్‌ : టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌ను వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన నిర్ణిత ఓవర్లకు గాను పాకిస్థాన్ 118/5 పరుగులు చేసింది. భారత్ లక్ష్యం 119 పరుగులుగా ఉంది. 

ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

కోల్ కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 105 పరుగుల వద్ద మాలిక్ ఔట్ అయ్యాడు. 

నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

కోల్ కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 101 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ లో అక్మల్ (21) ఔట్ అయ్యాడు. 

 

21:36 - March 19, 2016

పదవులు పంచిపెట్టే కార్యమెత్తుకున్న సీఎం సారు... పండుగచేసుకునేటందుకు ఆశావహులు తయ్యారు, పోలీసును దొరకవట్టి పొట్టుపొట్టుగొట్టిన రౌడీలు.. కొడుతుంటే గూడ సూస్కుంట నిలవడ్డ తోటి పోలీసులు, కాలజ్ఞాన తాలపత్రాలువట్టిన బాలికాకయ్య.. హారతిచ్చి సాదర స్వాగతం పలికిన పంతులయ్య, గోడెల్లవోసుకున్న మహిళా రైతులు.. ఆగుతలేవట తెలంగాణల ఆత్మహత్యలు, వాషింగ్ మిషిన్ల ఇరికిన బుడ్డ పోరడు.... ఎల్లరాక ఎక్కెక్కి ఏడ్చిండు, ఇద్దరు ఆడోళ్ల నడుమ తోలు దొడ్డు లొల్లి, బక్కపొల్లకైంది మంచిగనే పెళ్లి ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

కోల్ కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 60 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్ లో ఆఫ్రిది (8) ఔట్ అయ్యాడు. ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరుగుతోంది. 

 

జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులు

హైదరాబాద్‌ : జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ వర్తకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

కోల్ కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో షెహనాజ్ (25) ఔట్ అయ్యాడు. 

 

తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

కోల్కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. రైనా బౌలింగ్ లో షర్జిల్ క్యాచ్ ను హార్దిక్ పాండ్య అద్భుతంగా పట్టాడు. 

 

20:59 - March 19, 2016

ఫ్లిప్ కార్టులో తనకు తాను అమ్మేసుకున్న వ్యక్తి, ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి గోల, అన్నవరంకొండపై రికార్డింగ్ డ్యాన్స్ లు, రాహుల్ గాంధీకి ఒక విషయంలో ట్రెయినింగ్ కావాలి, టీ.20వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, విజయ్ మాల్య దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడు, రోడ్డుపై గోతుల కుదుపులకు మహిళ ప్రసవం.. మరిన్ని క్రేజీ న్యూస్ ను వీడియోలో చూద్దాం.... 

20:55 - March 19, 2016

సినీ నటి దీక్షాపంత్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. తను నటించిన, నటించబోయే సినిమాల వివరాలను తెలిపారు. సినిమాలో తన పాత్రల గురించి వివరించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:21 - March 19, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. బిజెపికి చెందిన 28మంది ఎమ్మెల్యేలతో పాటు, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకామేశారు. ఉత్తరాఖండ్‌లోని హరీష్‌రావత్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు లేవదీశారు. శుక్రవారం బడ్జెట్‌ను ఆమోదించే సమయంలోనే నేతల అసమ్మతి ప్రస్ఫుటంగా కనిపించింది. ఎప్పటి నుంచో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్‌ నేత విజయ్‌బహుగుణ సహా మిగిలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ కూటమి ఢిల్లీలో మకామేసింది. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

కోల్కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా కాసేపట్లో భారత్, పాకిస్తాన్ ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ జరుగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ను 18-18 వోవర్లకు కుదించారు. సీఎం మమతా బెనర్జీ మాజీ క్రికెటర్లను సన్మానించారు. 

 

కాసేపట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్

కోల్ కతా : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా కాసేపట్లో భారత్, పాకిస్తాన్ ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ జరుగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ను 18-18 వోవర్లకు కుదించారు. సీఎం మమతా బెనర్జీ మాజీ క్రికెటర్లను సన్మానించారు. 

 

20:07 - March 19, 2016

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర సెక్రటేరియట్‌ సభ్యుడు నీలోత్పల్‌ బస్‌  ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పశ్చిమ బెంగాల్‌లో 2 వందల పొంజీ కంపెనీలు ఉన్నాయని పేర్కొన్న సిపిఎం- వాటిలో 44 కంపెనీలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మిగతా వాటిపై రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. ఎన్నికల నిధుల కోసం టిఎంసి వాటిలో కొన్ని కంపెనీలను బెదిరిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేసింది. టిఎంసికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తూ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిన వీడియో దృశ్యాలను ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన విషయాన్ని సిపిఎం గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్‌, మే నెలల్లో ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

 

ఢిల్లీ మంగోల్‌పూరిలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ : మంగోల్‌పూరిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షూ ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు 20 ఫైరింజన్లు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

భారత్ పై పాకిస్తాన్ మహిళా జట్టు విజయం

కోల్కతా : ప్రపంచకప్ టీ20 లో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిని వర్తింప చేశారు. దీంతో రెండు పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. భారత్ నిర్ణీత 20 వోవర్లలో 7 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 

 

18:58 - March 19, 2016

మహబూబ్ నగర్ : చిన్న వయసులోనే చిట్టి తల్లులు ఇల్లాలైపోతున్నారు.. చిరు ప్రాయంలో తాళిబొట్టుకు బందీ అయిపోతున్నారు.. ఇంట్లో పోరుపెట్టి మరీ చిన్నారి పెళ్లికూతుళ్లు బడికి వస్తుంటే... పెద్దల్ని ఎదిరించలేక మరికొందరు ఇంటికే పరిమితమైపోతున్నారు.. పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ఈ దురాచారం ఆడ పిల్లల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది.. 
ఆర్థిక ఇబ్బందులకు పసివాళ్లు బలి 
కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులకు పసివాళ్లు బలైపోతున్నారు. ఆడ పిల్లలు భారమన్న అభిప్రాయం ఇంకా తల్లిదండ్రుల్లో కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.. 13 ఏళ్లకే బాలికలు భార్యలైపోతున్నారు.. ముక్కుపచ్చలారని వయసులోనే తల్లులుగా మారుతున్నారు.. ఎదిగీ ఎదగని ప్రాయంలో అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు.. 18 ఏళ్లు నిండాకే వివాహం చేయాలన్న ప్రభుత్వ ప్రచారం గ్రామాల్లోకి చేరడంలేదు.. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని పేరంట్స్ బిడ్డ చదువుకంటే ఓ అయ్య చేతిలో పెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. 
మద్దూరు బాలికల ఉన్నత పాఠశాలలో పదిమంది విద్యార్థినిలకు మెట్టెలు
జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు ఆడ పిల్లల్ని గుండెలపై భారంగానే చూస్తున్నారు... అక్కడక్కడా అధికారులు బాల్య వివాహాల్ని అడ్డుకుంటున్నా చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్లూ జరిగిపోతూనే ఉన్నాయి.. ఒక్క మద్దూరు బాలికల ఉన్నత పాఠశాలలోనే దాదాపు పదిమంది విద్యార్థులు మెట్టెలతో పాఠశాలకు వస్తున్నారు.. వీరంతా తల్లిదండ్రులు, అత్తవారితో గొడవపడి ఒప్పించిమరీ బడిలో చేరుతున్నారు.. పెద్దల్ని ఎదిరించలేనివాళ్లు చదువు మానేసి పనిబాట పడుతున్నారు.. 
వందలమంది చిన్నారి పెళ్లికూతుళ్లు
జిల్లాలో వందలమంది చిన్నారి పెళ్లికూతుళ్లున్నారు.. ముఖ్యంగా నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌, గద్వాల్ నియోజవర్గాల్లో ఈ వివాహాల సంఖ్య ఎక్కువగా ఉంది.. మద్దూరు, కోస్లి, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, దామరగిద్దలాంటి కరువు ప్రాంతాల్లో ఏడో తరగతిలోనే ఆడ పిల్లలు తాలి బొట్లతో కనిపిస్తున్నారు.. అత్తవారింట్లో ఇంటిపనంతా పూర్తిచేసుకొని కొందరు బాలికలు స్కూల్‌కు వస్తున్నారు.. కొన్నిసార్లు మిగతా విద్యార్థుల ఎగతాళితో మానసికంగా కుంగిపోతున్నారు.. 
ఈ వివాహాలకు చాలా కారణాలు 
ఈ వివాహాలకు చాలా కారణాలున్నాయి.. జిల్లాలో ప్రతిఏడాది దాదాపు 15లక్షలమంది ముంబై, పూణేలకు వలసవెళుతున్నారు.. నాలుగు నెలలుమాత్రం సొంత గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తారు.. అప్పుడు పంట పండితే కాస్త తేరుకుంటారు.. లేకపోతే మళ్లీ వలసబాట పడతారు.. ఇలాంటి కుటుంబాల్లో పన్నెండేళ్లు దాటిన బాలికల్ని భారంగా భావిస్తున్నారు.. వలసపోయేముందు తమ దగ్గరి బంధువుల్లో ఎవరో ఒకరికి ఇచ్చి ముడి వేస్తున్నారు.. ఇలా చేస్తే బిడ్డకు రక్షణ దొరుకుతుందని నమ్ముతున్నారు.. అలాగే కూతురు పెరిగితే వరకట్నమూ ఎక్కువగా ఇవ్వాలని మరికొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.. కుటుంబ పెద్దలు చనిపోయిన ఇళ్లలో... ఎక్కువ మంది ఆడపిల్లలున్న కుటుంబాల్లో ఈ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి..
పెద్దల నిరక్షరాస్యత, అమాయకత్వం... 
పెద్దల నిరక్షరాస్యత, అమాయకత్వం చిన్నారుల జీవితాలను ఇలా చిదిమేస్తున్నాయి.. అక్షరాస్యతలో జిల్లా ఇంకా చివరి స్థానంలోనే కొనసాగుతోంది.. 15 మండలాల్లో అక్షరాస్యత యాభైలోపే ఉంటోంది.. గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలంలో మరీ 35శాతమే ఉంది.. ఈ పరిస్థితిపై హైకోర్టుకూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.. అక్షరజ్ఞానం లేని తల్లిదండ్రులు ఆడ పిల్లల్ని త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నారు.. అయితే అధికారులు మాత్రం గతంతో పోలిస్తే ఈ పెళ్లిళ్లు తగ్గాయని చెబుతున్నారు.. 
ఆశించిన ఫలితం రావడంలేదు.. 
బాల్య వివాహాలు, పిల్లలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడంలేదు.. గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయితీ కార్యదర్శికి ఈ వివాహాలను అడ్డుకునే అధికారముంది.. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, సబ్‌ఇన్స్‌పెక్టర్లు, తహశిల్దార్లూ వివాహాల్ని ఆపొచ్చు.. బాల్య వివాహం చేస్తున్నవారంతా చట్టప్రకారం శిక్షార్హులవుతారు.. ఈ విషయంపై అవగాహనలేక యధేచ్చగా ముక్కుపచ్చలారని వయసులోనే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో మరింత గట్టిగా ప్రయత్నిస్తే ఈ వివాహాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది. అలాగే నిరక్షరాస్యతను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

 

18:48 - March 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సెకండరీ బోర్డ్ సంచాలకులు నరేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 5 లక్షల 21 వేల 46 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఆయన తెలిపారు. ఇందుకోసం 11 వేల 181 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.   

 

18:42 - March 19, 2016

విజయవాడ : రోజాను అసెంబ్లీలోకి అనుమతించకుండా... టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలను ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేస్తోందని విమర్శించారు. ఈ సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 22న విజయవాడలో భారీ ప్రదర్శనతో పాటు బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చేసిన తీర్మానం నవ్వుకునే విధంగా ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

18:31 - March 19, 2016

హైదరాబాద్ : పేదలందికీ కార్పొరేట్‌ స్థాయి ప్రభుత్వం వైద్యం అందించమే లక్ష్యమంని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలకు ఆయన సమాధానం ఇస్తూ... వైద్యం అంశాన్ని ప్రస్తావించారు. బడ్జెట్‌లో వైద్యం కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఖమ్మం, కరీంనగర్‌లో కొత్తగా సూపర్‌ స్పెషాలిటీస్‌ ప్రభుత్వం ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 

18:23 - March 19, 2016

హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు మరింతగా పెంచాలని మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ సూచించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యలో మైనారిటీలకు కేటాయింపులు తగ్గాయని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని అక్బరుద్దీన్‌ కోరారు. 

 

18:20 - March 19, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని టిడిపి సభ్యుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐ లను ఏర్పాటు చేయాలని... ఆయన బడ్జెట్‌పై చర్చలో కోరారు. 

 

18:17 - March 19, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి తమను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సమావేశానికి వెళ్లే ముందు టెన్‌టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సభలో తామెవరిని దూషించలేదని... ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. ప్రివిలేట్ కమిటీ సమావేశానికి ముందు చెవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

గబ్బర్ సింగ్ వేదికపై 'మెగా' బ్రదర్స్?

హైదరాబాద్ : 'మెగా' అభిమాలు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఎందుకంటే సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ రేపు హోటల్ నోవాటెల్ లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి 'అన్నయ్య' చిరంజీవిని ఆహ్వానించినట్లు పవర్ స్టార్ తెలిపారు. 'తమ్ముడు' ఆహ్వానానికి 'అన్నయ్య' ఎలా స్పందిస్తారోనని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మెగా బ్రదర్స్ మెగా థమాకాతో అభిమానులను అలరిస్తారో లేదో ఎదురు చూడాల్సిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు పవన్ ఓ సూచన కూడా చేశారు.

17:45 - March 19, 2016

హైదరాబాద్ : నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చిన అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హైదరాబాద్ హుమాయూన్ నగర్ లో దారుణం జరిగింది. మాజీ నేవీ కమాండర్.. ఇంట్లో పని చేసే బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మాజీ నేవీ అధికారి అల్ కరీమ్.. హైదరాబాద్ హుమాయూన్ నగర్ లో నివాసముంటున్నాడు. అతని ఇంట్లో 8 నుంచి 9 మంది బాలికలు పని చేస్తున్నారు. వీరిలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ బాలిక పట్ల కరీమ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అధికారి తనపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తూ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. కరీమ్ పై నిర్భయ కేసు నమోదు చేసే అవకాశముంది.

 

17:35 - March 19, 2016

హైదరాబాద్ : హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పాస్ లు ఉన్నవారే 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఆడియో రిలీజ్  ఫంక్షన్ కు రావాలని కోరారు. రేపు సాయంత్రం నోవాటెల్ లో ఆడియో ఫంక్షన్ ఉంటుందని తెలిపారు. పాస్ లు లేని వారు ఆడియో ఫంక్షన్ కు రావొద్దని చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పాస్ లు ఉన్నవారే ఆడియో రిలీజ్ ఫంక్షన్ హాల్ లోపలికి రావాలని తెలిపారు. పాసులు లేని వారు గుమిగూడవద్దని కోరారు.
పాస్ లు లేని వారు టీవీల్లో చూడాలి 
పాస్ లు లేని వారు టీవీల్లో ఆడియో ఫంక్షన్ చూడాలని సూచించారు. ఆడియో ఫంక్షన్ కు అనుమతి ఇవ్వడానికి పోలీసులు కొన్ని అంశాలు ప్రస్తావించారని చెప్పారు. ఆడియో ఫంక్షన్‌ కార్యక్రమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఫంక్షన్ వద్ద చిన్న ఘటన కూడా పెద్ద అంశంగా మారుతుందన్నారు. ఫారిన్‌ డెలిగేట్స్‌ వస్తున్నందున భద్రతా కారణాలను పటిష్టం చేయడంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన అన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ  సీవీ ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. పొలిటికల్‌ సభకు మీటింగ్స్ ఎంత ముఖ్యమో.. వాణిజ్యపరంగా సినిమాకి ఆడియో ఫంక్షన్‌ అంత ముఖ్యమయ్యాయని పవన్‌కల్యాణ్‌ అన్నారు.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవికి ఆహ్వానం
ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని ఆహ్వానించానని పేర్కొన్నారు. చిరంజీవితో కలసి సినిమా తీస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ....చిరంజీవితో పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఖుషి తర్వాత రెండు, మూడు సినిమాలు చేసి వదిలేద్దామనుకున్నాను.. కానీ కుదర్లేదని చెప్పారు. ప్రస్తుతం డైరెక్షన్ చేయనని.. కథ వచ్చినప్పుడు డైరెక్షన్ ఉంటుందని చెప్పారు. తానెప్పుడు కూడా ఇంకో సినిమాతో పోటీ పడాలని ఆలోచించనని పవన్‌ తెలిపారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

 

 

అందుకే అలా మాట్లాడాం...

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ విచారణను చేపట్టింది.  వైసీపీ ఎమ్మెల్యే రోజా తనను అవమానించిన ఘటనను ప్రివిలేజ్ కమిటీ టీడీపీ ఎమ్మెల్యే అనిత కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. అనారోగ్య కారణాలతో ఈ సమావేశానికి రాలేకపోతున్నాని రోజా కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మాటలతో రెచ్చడటం వల్లనే తాము వివాదాస్పద వ్యాఖ్యలు చేసామని ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రివిలేజ్ కమిటీకి చెవిరెడ్డి వివరణ ఇచ్చారు.

16:39 - March 19, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ నగరవాసులకు మరో మెరుగైన సేవను అందించబోతుంది. పార్కులకు వచ్చేవారికి ఆహ్లాదం, ఆరోగ్యంతో పాటు.. వైఫై సేవలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే ఆక్ట్‌ ఫైబర్‌ నెట్‌తో ఒప్పందం చేసుకున్న జీహెచ్‌ఎంసీ.. తొలి విడతలో 19 పార్కుల్లో వైఫై ఫెసిలిటీని కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
నగరవాసులకు మరో సౌకర్యం
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరవాసులకు మరో సౌకర్యాన్ని కల్పించబోతుంది. ఇప్పటివరకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతున్న పార్కుల్లో వైఫై సేవలు అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది సందర్శకులు నగరంలో అనేక పార్కులకు వస్తుంటారు. పార్కుల్లో వైఫై సేవలు అందించడం వల్ల.. సందర్శకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. 
తొలి 45 నిమిషాలు ఉచితంగా వైఫై 
ఇకపై పార్క్ కు వచ్చేవారు తమ వద్ద స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ ఏది ఉన్నా.. ఎంచక్కా వైఫై సేవలు పొందవచ్చు. తొలి 45 నిమిషాలు ఉచితంగా ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. మొదటి దశలో 19 ప్రధాన పార్కుల్లో ఈ వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో ఇందిరాపార్క్‌, సుందరయ్యపార్క్‌, కృష్ణకాంత్‌ పార్క్‌, జలగం వెంగళరావు పార్క్, చాచానెహ్రూ పార్క్, ఇమ్లీబన్‌ పార్క్ లు ఉన్నాయి. 
19 పార్కుల్లో వైఫై సేవలు 
ఇక ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలైన నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, బిర్లామందిర్‌, పబ్లిక్‌ గార్డెన్‌, శిల్పకళావేదిక, శిల్పారామంలలో వైఫై అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లలో బీఎస్‌ఎన్‌ఎల్‌, క్యాడ్‌జెన్‌ సంస్థ సంయుక్తంగా వైఫై సౌకర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా ఆక్ట్‌ ఫైబర్‌ నెట్‌ సంస్థ సిటీలోని 19 పార్కుల్లో వైఫై సేవలను అందించేందుకు ముందుకువచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం 45 నిమిషాలు ఉచితంగా వైఫైని అందిస్తోంది. ఇక్కడి అనుభవాలతో పార్కుల్లోనూ వైఫై విస్తరణకు జీహెచ్‌ఎంసీ పచ్చజెండా ఊపింది. ఏదిఏమైనా గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వైఫై సేవలు ఉండగా.. ఆ జాబితాలోకి పార్కులు కూడా చేరబోతున్నాయి. ఇకపై పార్కులకు వచ్చే సందర్శకులు ఆహ్లాదం, ఆరోగ్యంతోపాటు.. వైఫైను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. 

 

బాలికపై ఆర్మీ అధికారి అత్యాచారయత్నం...

హైదరాబాద్ : హుమాయూన్ నగర్ లో నివాసముంటున్న అలికరిమ్ అనే ఓ ఆర్మీ మాజీ కమాండర్ తన ఇంట్లో కొంతకాలం పనిచేస్తున్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి హుమాయూన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొనసాగుతున్న ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అనిత, వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. జ్యోతుల నెహ్రూ గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంతో తను హాజరుకాలేకపోతున్నాని రోజా కమిటీకి లేఖ రాసింది. తనను అసెంబ్లీకి అనుమతించని కారణంగా రోజా అసెంబ్లీ ఆవరణలో వున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలసిందే.

ప్రారంభమైన ప్రివిలేజ్ కమిటీ....

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ప్రారంభమైంది. టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అనిత, వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అనారోగ్య కారణంతో తను హాజరుకాలేకపోతున్నాని రోజా కమిటీకి లేఖ రాసింది. తను అసెంబ్లీకి అనుమతించని కారణంగా అసెంబ్లీ ఆవరణలో వున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలసిందే.

16:01 - March 19, 2016

కరీంనగర్ : కరువుతో అల్లాడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీజాక్ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కరువుతో దెబ్బతిన్న పంటలను కోదండరామ్ పరిశీలించారు. అమ్మక్కపేట గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన పసుపు, అరటిపంటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కురిసిన వర్షపాతం, కరువుకు గల కారణాలను నమోదు చేసుకున్నారు. 

 

15:56 - March 19, 2016

హైదరాబాద్ : గోదావరిపై నిర్మించనున్న ప్రాజెక్టులపై చర్చించేందుకు.. గోదావరి ప్రాజెక్టుల సమన్వయ కమిటీ తొలిసారి సమావేశమైంది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్ఈలు, సాంకేతిక నిపుణులు సమావేశమయ్యారు. వీరితో పాటు తెలంగాణ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగర్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోషిలు కూడా పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి, చనాఖ, కోరాట, లోయర్ పెన్ గంగా, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. 

15:53 - March 19, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రన్నింగ్‌ కామెంటరీతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో రన్నింగ్‌ కామెంటరీ చేయడం తగదని హితవు పలికారు. అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకే మాట్లాడే అవకాశం ఎక్కువగా వస్తున్నదని ఆయన గణాంకాలు వివరించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వాస్తావాలు చెబుతుంటే ఓపికతో వినాలని కేసీఆర్ సూచించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నాలకు సర్కార్‌ సావధానంగా సమాధానం చెబుతుందన్నారు. 

 

ఏసీబీ వలలో పియూడిఏ వైస్ చైర్మన్...

అనంతపురం : పుట్టపర్తి అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (పియూడిఏ) వైస్ చైర్మన్ రామాంజనేయుల్ని పట్టుకున్న సీఐడీ అధికారులు. రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  సీఐడీ అధికారులు పట్టుకున్నారు.

సీఎం చంద్రబాబుతో ఎస్సెల్ ప్రతినిధులు...

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుని కలిసిన ఎస్సెల్ గ్రూపు ప్రతినిధుల బృందం. ఏపీ టూరిజం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎస్సెల్ గ్రూపు అంగీకారం తెలిపింది. అమరావతిలో ఫన్ అండ్ రిక్రియేషన్ కోసం మల్టీ స్టోరేజ్ భవన నిర్మాణానికి ఎస్సెల్ గ్రూప్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. సమగ్ర ప్రతిపాదనలతో రావాలని ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. భారత్ లో స్మార్ట్ సిటీల నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని అందించటానికి ఎస్సెల్స్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈమేరకు సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకముందు సభలో బడ్జెట్ పై సభ్యులు చర్చించారు.  

ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : టీ. టీడీపీ నేతలు...

హైదరాబాద్ : టీడీపీ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలపై అనర్హతవేటు వేయాలని స్పీకర్ ను తెలంగాణా టీడీపీ నేతలు కోరారు. ఎ.గాంధీ, మాగంటి గోపీనాథ్ లు ఇటీవల తెలుగుదేశం పార్టీనుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. 

15:01 - March 19, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నిమ్స్ లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గాయి. రోజాను పరామర్శించేందుకు వైసీపీ నేతలు నిమ్స్ కు వెళ్తున్నారు. అసెంబ్లీలోకి తనను అనుమతించనందుకు నిరసనగా రోజా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. నాలుగు గంటలకుపైగా ఎండలో దీక్ష చేశారు. దీంతో ఆమె సొమ్మసిల్లిపోయి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ లో రోజాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ తగ్గాయని.. నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతోపాటు మరికొంతమంది వైసీపీ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి రోజాను పరామర్శించారు.  

 

రోజాకు నిమ్స్ లో వైద్య పరీక్షలు పూర్తి

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె బీపీ, షుగర్స్ లెవల్స్ తగ్గాయి. రోజాను పరామర్శించేందుకు వైసీపీ నేతలు నిమ్స్ కు వెళ్తున్నారు. అసెంబ్లీలోకి తనను అనుమతించనందుకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తుండగా రోజా అనారోగ్యానికి గురయ్యారు. 

 

14:13 - March 19, 2016


తనను సభలోకి అనుమతించని కారణంగా వైసిపి ఎమ్మెల్యే రోజా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన లో రోజా సొమ్మసిల్లి పడిపోయింది. బీపి లెవెల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా దీక్ష చేస్తున్న రోజా ను జగన్ తో పటు పలువు ఎమ్మెల్యేలు పరామర్శించారు. రోజా ఆరోగ్య పరిస్థితి  నిలకడగా ఉండటం తో వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరో పక్క  వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలి చేపట్టారు. అనంతరం అంబెడ్కర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించి నిరసన తెలిపారు. రాజ్యాంగ పరంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిక్కరించి రోజాను సభలోకి అనుమతిన్చాకపోవడం దారుణమని వైసిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు.

'కాంగ్రెస్ చరిత్ర డబ్బుచుట్టే'..

హైదరాబాద్ : పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రతి పక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ చరిత్ర అంతా డబ్బు చుట్టే తిరిగిందని ఈటెల ఆరోపించారు. సంక్షేమానికి భారీ నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ సంక్షేమ రాష్ట్రమని ఈటెల ప్రకటించారు.

బడ్జెట్ పై కొనసాగుతున్న చర్చ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెబుతున్నారు. 

కోర్టు తీర్పుపై చర్చించటం దుర్మార్గం : జగన్

హైదరాబాద్ : రోజాను సభలోనికి అనుమతించకపోవడంతో అసెంబ్లీనుండి ట్యాంక్ బండ్ వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రగా బయలుదేరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసన తెలియజేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం చర్చ చేపట్టటం దుర్మార్గమైన చర్య అన్నారు.  కాబట్టి సోమవారం అసెంబ్లీని బహిష్కరిస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోజా ఎలా సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. రోజాను సస్పెండ్ చేసిన తీరుపై స్పీకర్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. 

సొమ్మసిల్లి పడిపోయిన రోజా...

హైదరాబాద్ : తనను అసెంబ్లీలోని అనుమతించని కారణంగా అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఎమ్మెల్యే రోజా దీక్ష చేస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం రోజాను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  

12:19 - March 19, 2016

హైదరాబాద్  : అడుగడుగునా అవాంతరాలతో ప్రారంభమైన నేటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని వైసీపీ సభ్యులు సభ ప్రారంభం నుండి నినాదాలు  చేశారు. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో రోజాను సభలోకిని రానివ్వడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. 'వీ వాంట్ జస్టిస్' అనే నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను ముట్టడించడంతో సభలో గంధరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ తరుణంలో రోజా సస్పెన్షన్ పై సోమవారం సభలో చర్చిద్దామని స్పీకర్ కోరారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల సభను రెండు సార్లు వాయిదా వేశారు. అయిననూ సద్దుమనుగకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా..

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ సోమవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను ముట్టడించడంతో సభలో గంధరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలో రెండు సార్లు వాయిదా వేసిన స్పీకర్ సభ సద్దుమనుగకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

అసెంబ్లీలో జీహెచ్ఎంసీ బిల్లు...

హైదరాబాద్ : నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  2016 సంవత్సరానికి గాను మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును  మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు.

11:27 - March 19, 2016

హైదరాబాద్ : జగన్ ఆద్వర్యంలో నడుస్తున్న మీడియా పరిదిని అతిక్రమించి ప్రవర్తిస్తున్నాయని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. మీడియా పాయింట్ వద్ద అయన మాట్లాడారు. 'సభను అప్రజాస్వామ్యయుతంగా అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం. కోర్టు తీర్పుపై సోమవారం డిస్కషన్ చేద్దామని స్పీకర్ గారు చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు చేస్తోంది. జగన్ నిర్వహిస్తున్న సాక్షి ఛానెల్ చీఫ్ మార్షల్ మరియు జగన్ ల మధ్య సంభాషనలను టీవీలో ప్రసారం చేశారు. మీడియాకు నిషిద్ద ప్రదేశంలో ప్రసారాలు చేయకూడదని తెలియదా?. చట్టానికి ప్రకారం లోబడి పని చేయాలి. రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించాలి. పరిది అతిక్రమించి జగన్ ప్రవర్తిస్తున్నారు. దీనిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాము' అని కాల్వ అన్నారు. 

విజన్ వున్న సీఎంలు : జస్టిస్ రమణ

హైదరాబాద్ : హోటల్ మారియట్ లో న్యాయాధికారుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో జస్టిస్ ఎన్ వీ రమణ మాట్లాడుతూ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. న్యాయం అందించడంలో పేదలు, ధనికులు అనే వ్యత్యాసం న్యాయస్థానానికి వుండదన్నారు. న్యాయశాఖలో పనిచేయటమంటే ప్రజాసేవ చేయటమేనని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన న్యాయాధికారుల సదస్సులో పాలుపంచుకోవటం చాలా సంతోషంగా వుందని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా జస్టిస్ రమణ హామీ ఇచ్చారు.

అంతర్రాష్ట్ర భేటీ ప్రారంభం..

హైదరాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సాగునీటి నిపుణుల భేటీ ప్రారంభమయ్యింది. ఇరు రాష్ట్రాల నదీ జలాల ఒప్పందంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 

దేశ పురోగతిలో న్యాయస్థానాలు కీలకం : కేసీఆర్...

హైదరాబాద్ : హోటల్ మారియట్ లో న్యాయాధికారుల సదస్సు జరుగుతుంది. సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశ పురోగతిలో న్యాయస్థానాలు కీలకమైనవన్నారు. ఇటువంటి సదస్సుల వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల 72 వేల కేసులు పెండింగ్ లో వుండగా తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత 5 లక్షల కేసులు పెండింగ్ లో వున్నట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలియజేశారు. వీటిని సత్వరంగా పరిష్కరించాలని ఆయన న్యాయ శాఖను కోరారు. దీనికి తమ ప్రభుత్వం న్యాయ శాఖకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

10:47 - March 19, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వివాదం దుమారం రేపుతుంది. వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో నేటి అసెంబ్లీ పలు మార్లు వాయిదా పడింది. తాజాగా ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలపాటు వాయిదా పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత 10టీవీతో మాట్లాడారు. వైసీపీ సభ్యులది అజ్ఞానమో అవగాహనా రాహిత్యమో అర్థం కావడంలేదన్నారు. అసెంబ్లీని వైసీపీ సభ్యులు గౌరవించడంలేదని అనిత ఆరోపించారు. వారు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. సస్పెన్షన్ పై సోమవారం డిస్కషన్ జరుగుతుందని  వెల్లడించారు. ఆ అసెంబ్లీ డిస్కషన్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం ప్రకారమే రోజాను అనుమతించాలా వద్దా అనేది తేలుతుందని అనిత ఈ సందర్భంగా తెలిపారు.

10:34 - March 19, 2016

హైదరాబాద్ : కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తనను అసెంబ్లీలోకి రానివ్వడంలేదని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో రోజా మాట్లాడారు. 'మహిళల్ని గౌరవించే సంస్కృతి టీడీపీకి లేదు. మా నియోజక వర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు నన్ను అసెంబ్లీలోకి అనుమతించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు తూట్లు పొడుస్తోంది. నన్ను అసెంబ్లీలోకి రాకుండా మార్షల్స్ అడ్డుకుంటున్నారు. నన్ను గంటన్నర పాటు ఎండలో కూర్చోబెట్టారు. కోర్టు ఆర్డరిస్తే మీరెందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలి'.. అని రోజా డిమాండ్ చేశారు. రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద దర్నా కు దిగారు. 

ఏపీ రాజధానిలో ఆధునిక న్యాయస్థానం: సీఎంచంద్రబాబు

హైదరాబాద్ : హోటల్ మారియట్ లో న్యాయాధికారుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిలో ఆధునికమైన హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.సాంకేతికతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

10:22 - March 19, 2016

హైదరాబాద్  :  పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సులో పాల్గొన్న కేసీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు. 'రాష్ట్రంలో ఐదు లక్షల కేసులు పెండింగ్ లోఉన్నాయి. హైకోర్టుల్లో 2.77 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. న్యాయ స్థానానికి వెళ్లినప్పుడు.. న్యాయ మూర్తులు సమర్థవంతంగా పని చేస్తే స్పీడ్ గా ప్రజలకు న్యాయం చేకూరుతుంది. ''గెలిచిన వాడు ఇంటిదగ్గర ఏడిస్తే.. ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు''.. అనే నానుడిని తుడిచేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్వర న్యాయం అందించాలి. న్యాయ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. కాన్ఫరెన్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను'.. అని కేసీఆర్ అన్నారు. 

ట్యాంక్ బండ్ పై జగన్..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఈ రోజు కూడా అసెంబ్లీలోనికి అనుమతించని నేపథ్యంలో కాసేపట్లో జగన్ ఎమ్మెల్యేలతో కలిసి ట్యాంక్ బండ్ కు పాదయాత్రగా వెళ్ళనున్నారు. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ అధినేత ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలుపనున్నారు.

09:55 - March 19, 2016

హైదరాబాద్ : టీ-20 ప్రపంచకప్ ఫీవర్ తో భారత ఉపఖండ దేశాలు ఊగిపోతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి  7 గంటలకు జరిగే  సూపర్ డూపర్ ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. సూపర్ టెన్ పూల్-2 నుంచి సెమీఫైనల్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లూ నెగ్గితీరాల్సి ఉంది. ఈ పోటీ కోసం శతకోటి భారత అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
అభిమానులతో పాటు భారత అభిమానులు సైతం ఉత్కంఠతో ఎదురుచూడక తప్పదు.
ఇండో-పాక్ బిగ్ ఫైట్..
బంగ్లాదేశ్ లోని మీర్పూర్ వేదికగా ముగిసిన ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో అధిగమించింది. అయితే కొద్దిరోజుల వ్యవధిలోనే 2016 టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ పోటీలో సైతం ఈ రెండుజట్లే తలపడాల్సి వస్తోంది. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో మాజీ చాంపియన్లుగా ఉన్న ఈ రెండుజట్లూ ఇప్పుడు తాజాగా 2016 ప్రపంచకప్ టైటిల్ కోసం కొండంత ఆశతో పోటీకి దిగాయి.
ఇది ఇలా.. అది అలా..
గ్రూప్ ప్రారంభమ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా ఒక్కసారిగా డీలా పడింది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం బంగ్లాదేశ్ పై భారీవిజయం సాధించడం ద్వారా టీమిండియాతో సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ షాహీద్ ఆఫ్రిదీ నాయకత్వంలోని పాక్ జట్టులో అపార అనుభవం ఉన్న మహ్మద్ హఫీజ్‌,ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, అసాధారణ ఆటగాళ్ళు  సర్ఫ్రాజ్  అహ్మద్, మహ్మద్ నవాజ్, అన్వర్ అలీ, ఇమాద్ వాసిం లాంటి యువఆటగాళ్ళు ఉన్నారు. అంతేకాదు పాక్ జట్టుకు మెరుపు ఫాస్ట్ బౌలర్  మహ్మద్ అమీర్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ సమీ, వహాబ్ రియాజ్ లతో కూడిన పదునైన పేస్ బౌలింగ్ ఎటాక్ ప్రధానఆయుధంగా ఉంది.
అసలు సిసలు పోరాటం..
ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్థాన్ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు..మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా మాత్రం యువత, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల మేళవింపుతో అత్యంత బలమైనజట్టుగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తో ముగిసిన తొలిరౌండ్ పోటీలో అదీ నాగపూర్ స్పిన్ పిచ్ పైన భారత టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. తొలిదెబ్బతో కంగుతిన్న ధోనీసేన ఆత్మవిశ్వాసం కూడదీసుకొని అసలుసిసలు పోరాటానికి సిద్ధమయ్యింది. లోపాలను సరిచేసుకొని పాకిస్థాన్ ను ఎదుర్కోగల సత్తా, ఆత్మవిశ్వాసం తమజట్టుకు ఉందని టీమిండియా కెప్టెన్ ధోనీ ధీమాగా చెబుతున్నాడు.

అందరి చూపు అతడిపైనే..
బంగ్లాదేశ్ లో ముగిసిన ప్రారంభ ఆసియాకప్ టోర్నీలో సైతం టీమిండియా చెలరేగి ఆడి నాలుగుకు నాలుగూ నెగ్గి తానేమిటో నిరూపించుకొంది.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ ను తన పరుగుల అడ్డాగా మార్చుకొన్న  ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కీలకం కానున్నాడు. అయితే కోల్ కతా వేదికగా భారత్ ప్రత్యర్థిగా మాత్రం పాకిస్థాన్ దే పైచేయిగా ఉంది. ఆసియాకప్ ఓటమికి ధోనీసేనపై ఈమ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో పాక్ జట్టు బరిలోకి దిగుతోంది.
ఒత్తిడి అదిగమిస్తేనే..
అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఉందంటే చాలు ధోనీసేనపైన అనవసరపు ఒత్తిడి వచ్చి పడుతుంది. పాక్ జట్టుకు సైతం ఇదే పరిస్థితి అనివార్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమితో దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్న టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఆడి మరోసారి పాక్ ను ఓడించగలిగితేనే ప్రపంచకప్ సెమీస్ బెర్త్ రేస్ లో నిలువగలుగుతుంది. ఓడితే మాత్రం ప్రపంచకప్ ఆశలకు నీళ్ళు వదులుకోక తప్పదు.
చూసి తీరాల్సిందే.. 
70 వేల సీటింగ్ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే  ఈ కీలక సమరంలో సమానబలంకలిగిన కొదమసింహాల్లాంటి రెండుజట్లు ఢీ కొంటే ఆ పోటీ ఎంత రసపట్టుగా ఉంటుందో తెలుసుకోవాలంటే టీమిండియా, పాక్ జట్ల సమరం చూసితీరాల్సిందే. మరెందుకు ఆలస్యం దాయాదుల ఈ సమరం కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో పాటు భారత అభిమానులు సైతం ఉత్కంఠతో ఎదురుచూడక తప్పదు.

అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట..

హైదరాబాద్ : అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే రోజా, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆందోళనుకు దిగారు. ఓ మహిళా ఎమ్మెల్యేను అకారణంగా అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సరికాదన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 

10 నిమిషాలు వాయిదా..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలపాటు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గంధరగోళవాతావరణం నెలకొంది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆ సదస్సులో కేసీఆర్, బాబు..

హైదరాబాద్ : హోటల్ మారియట్లో న్యాయాధికారుల సదస్సు ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్, 900 మంది న్యాయ మూర్తులు పాల్గొంటున్నారు. 

స్పీకర్ పోడియాన్ని ముట్టడించిన వైసీపీ

హైదరాబాద్ : తమ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. నలుపు దుస్తువులు దరించిన వైసీపీ ఎమ్మెల్యేలు 'వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గంధరగోళం నెలకొంది. 

'నన్ను ఎందుకు అనుమతించరు..'

హైదరాబాద్  : తనను అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించడంలేదో తనకు రాత పూర్వకంగా ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజా అసెంబ్లీ గేట్ నెం.2 వద్ద ఆందోళను దిగారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. 

09:21 - March 19, 2016

హైదరాబాద్ : నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమయ్యింది. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నలుపు దుస్తువులతో అసెంబ్లీలో నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గంధరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించగా.. అసెంబ్లీ గేట్ నెం.2 వద్ద మార్షల్స్ రోజాను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ.. రోజా మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించడంలేదో తనకు రాత పూర్వకంగా ఇవ్వాలని మీడియా ద్వారా రోజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

రోజాను అడ్డుకున్న మార్షల్స్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ గేట్ నెం.2 వద్ద మార్షల్స్ ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు. కాగా రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నినాదాలు చేస్తున్నారు. 

నలుపు దుస్తువులతో వైసీపీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : వైసీపీ ఎంఎల్యేలు నలుపు దుస్తువులతో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో స్పీకర్, ప్రభుత్వం తీరుకు నిరసనగా వైసీపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో అసెంబ్లీలో గంధరగోళం నెలకొంది. 

రాష్ట్ర వ్యాప్త నిరసనలు..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్త నిరసనకు వైసీపీ పిలుపునిచ్చింది. అసెంబ్లీలో స్పీకర్, ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నిరసనలకు దిగనున్నారు. కాగా నేటి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు నలుపు దుస్తువులతో వెళ్లనున్నారు. నేటి అసెంబ్లీ సమావేశాలకు రోజాను అనుమతించనట్లయితే ధర్నాకు దిగాలనే వ్యూహంతో వైసీపీ ఉన్నట్లు సమాచారం. 

భారీ భూకంపం..

హైదరాబాద్ : అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. అలస్కాలోని దక్షిణ అట్కాలో నేటి ఉదయం భూమి కంపిచింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైనట్లు సమాచారం. కాగా ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం కోసం 13 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గం.ల సమయం తీసుకుంటుంది. అలాగే నడకదారి భక్తులకు కూడా 3 గం.ల సమయం పడుతుంది. 

08:25 - March 19, 2016

యూత్ ఫుల్ ఫిల్మ్ గుంటూర్ టాకీస్ లో ఓ సీన్ తొలగించారు. చందమామ కథలుతో జాతీయ అవార్డు దక్కించకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో.. జబర్ధస్త్ రేష్మి, సిద్దు, శ్రద్దాదాస్, నరేష్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రదారులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
కాగా ఈ చిత్రంలో వికలాంగుల మనోభాలను దెబ్బతీసే సన్నివేశం ఉందంటు తెలంగాణ వికలాంగ సంఘం అద్యక్షుడు వెంకన్న కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ సీన్ క్యారెక్టర్లకు అనుగుణంగా తీశామే తప్ప ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశ్యం కాదని, ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని చిత్ర యూనిట్ కోరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి ఆ సీన్ తొలగించి సినిమాను ప్రదర్శిస్తున్నామని ఈ మూవీ ప్రొడ్యూసర్లు వెల్లడించారు. 

రైళ్ల రద్దు.. సమాచారం..

వరంగల్ : రామగుండం మూడో లైన్ పనుల కారణంగా  పెద్దపల్లి వరకే  రామగిరి, సింగరేణి ప్యాసింజర్ లు నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన బెల్లంపల్లి ఇంటర్ సిటీ కాజీపేట వరకే పరిమితం చేశారు. కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ పెద్దపల్లి వరకే పరిమితమవుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాగా ఈ సందర్భంగా బల్లార్ష-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు. 

ఘోర విమాన ప్రమాదం..

హైదరాబాద్ : దక్షిణ రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ బోయింగ్ ప్యాసింజర్ విమానం కూలిపోయిన ప్రమాదంలో 55 మంది ప్రయాణికులతో పాటు 62 మంది మృతి చెందారు. ఈ విమానం దుబాయి నుంచి వచ్చి రష్యాలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎందుకంటే..?

హైదరాబాద్ : నేటి తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. బడ్జెట్ పై సమగ్ర చర్చకోసం ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయించినట్లు స్పీకర్ వెల్లడించారు. బడ్జెట్ పై ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రసంగించనున్నాయి. తదనంతరం విపక్షాల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు చెప్పనున్నారు. 

అసెంబ్లీకి నల్ల దుస్తువులతో..

హైదరాబాద్ : నేడు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు నలుపు దుస్తువులతో వెళ్లాలని వైసీపీ  నిర్ణయించింది. అలాగే రోజా సస్పెన్షన్ పై కోర్టు తీర్పులను ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నందున నేటి సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా..

హైదరాబాద్  : జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు 10 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

07:53 - March 19, 2016

అఖిల్ రెండో మూవీపై నాగర్జున హింట్ ఇచ్చాడు. ఓ యంగ్ డైరెక్టర్ తో అఖిల్ స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నట్లు నాగ్ క్లారిటి ఇచ్చాడు. మరి అఖిల్ ఏ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాకి రెడీ అవుతున్నాడో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇక చదవండి..

స్కై రేంజ్ అంచనాలతో ఏంట్రీ ఇచ్చిన అఖిల్ ఏంట్రీ తీవ్రమైన నిరాశను మిగిల్చింది. దీంతో సినిమా రిలీజై ఆరు నెలలు గడుస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా స్టార్ట్ చేయడం లేదు. అయితే ఇంతకాలానికి ఈ యంగ్ నెక్ట్స్ మూవీపై తండ్రి నాగర్జున ఓ హింట్ ఇవ్వడం విశేషం.

వరస సక్సెస్ లతో నాగర్జున మంచి ఉత్సాహంలో ఉన్నాడు. ఈ క్రమంలో తన కొత్త మూవీ ఊపిరి ప్రమోషన్ లో భాగంగా నాగ్, అఖిల్ రెండో మూవీకి సంబంధించి క్లారిటి ఇచ్చాడు. ఊపిరి మూవీని రూపొందించిన వంశీ పైడిపల్లి, అఖిల్ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్లు మ్యాటర్ ఒపెన్ చేశాడు. మరి వంశీ చెప్పిన స్టోరీకి నాగ్ సిగ్నల్ ఇచ్చాడంటే అఖిల్ రెండో మూవీ సెట్స్ పైకి వెళ్లినట్లే.

07:50 - March 19, 2016

క్వీన్ రిమేక్ కహానీ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ రిమేక్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్స్ త్రిష, నయనతారలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ క్వీన్ డైరెక్టర్ స్టార్స్ హీరోయిన్స్ కి ఇచ్చిన ఝలక్ ఏంటో ఈ మూవీ రిమేక్ సంగతేంటో చదవండి..
 
సౌత్ లో రెండేళ్లుగా బాలీవుడ్ సూపర్ హిట్టు క్వీన్ రిమేక్ పై చర్చా జరుగుతునే ఉంది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీ రిమేక్ పై క్లారిటి వచ్చినట్లు వినిపిస్తోంది.ఈ రిమేక్ ని సినియర్ నటి రేవతి డైరెక్ట్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

తమిళంలో క్వీన్ రిమేక్ త్రిష,లేదా నయనతార నటిస్తోందా చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ మూవీ రిమేక్ దర్శకురాలు రేవతి వీరిద్దరికి ఝలక్ ఇచ్చినట్లు టాక్. మలీయాళంలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ షేన్ అవుతున్న పార్వతి క్వీన్ రిమేక్ కి ఎంపికైనట్లు సమాచారం.

పార్వతి బెంగుళూర్ డేస్ తో పాటు కమల్ హాసన్ ఉత్తమవిలన్ లో కూడా నటించింది. ఈ భామ అయితే క్వీన్ పాత్రకు న్యాయం చేస్తుందని రేవతి భావించిందట. అన్నట్లు ఈరిమేక్ సినిమాకి సినియర్ నటి సుహాసిని మాటలు అందిస్తుండడం విశేషం. మరి ఈ సౌత్ క్వీన్ ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

07:46 - March 19, 2016

యంగ్ హీరో రామ్ డైలామాలో పడ్డట్లు సమాచారం. తను చేయబోయే న్యూ మూవీ విషయంలో ఈ హీరో కన్ ప్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ కన్ ప్యూజన్ ని కారణం ఏంటో చూద్దాం..

ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ హీరోగా స్టార్టింగ్ నుంచే  దూకుడు చూపిస్తూనే వచ్చాడు. అపజయాలు ఎదురైనా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. అలాంటి రామ్ ప్రస్తుతం చేయబోయే కొత్త మూవీ విషయంలో మాత్రం డైలామాలో పడినట్లు తెలుస్తోంది. 

ఎడాది ప్రారంభంలోనే రామ్ నేను శైలజ మూవీతో బిగ్ సక్సెస్ కొట్టాడు. ఈ మూవీ సక్సెసే ఈ యంగ్ హీరోని డైలామాలో పడేసినట్లు తెలుస్తోంది. హీరోగా రామ్ ఆటిట్యూడ్ కి భిన్నంగా చేసిన  నేను శైలజ ఊహించని విధంగా బిగ్ సక్సెస్ కావడంతో కొత్త సినిమా స్టోరీ విషయంలో రామ్ అంచనాకి రాలేకపోతున్నాడట.

నేను శైలజ మూవీ రిలీజై మూడు నెలలు దాటుతోంది. ఈ మూవీ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఈ యంగ్ భావిస్తున్నడట. అందుకోసం రామ్ రకరకాల స్టోరీస్ విన్నట్లు సమాచారం. అయితే కొన్నిస్టోరీస్ నచ్చినా కూడా ఆడియన్స్ కి ఆ స్టోరీ ఎక్కుతోందా లేదా అని థింక్ చేస్తున్నట్లు టాక్. మరి కొత్త మూవీ స్టోరీ విషయంలో రామ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో ఈ మూవీ ఎప్పుడు  సెట్స్ పైకి వెళ్లుతోందో చూడాలి.

07:44 - March 19, 2016

చిన్న సినిమాలకు రెజీనా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. అందుకే ప్లాప్స్ వచ్చిన కూడా ఈ బ్యూటీకి ఏరికోరి కొత్త ఛాన్స్ లు ఇస్తున్నారు. లేటేస్ట్ గా ఈ చెన్నై పొన్ను మరో క్రేజీ ఛాన్స్ అందుకోంది. రెజీనా చేయనున్న ఆ న్యూ మూవీ ఏంటో ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం..
టాలెంట్ ఉన్నా..
గ్లామర్ తో పాటు స్టార్ హీరోయిన్ కి అయ్యేంత టాలెంట్ ఉన్న హీరోయిన్ రెజీనా. ఈ రెండు కూడా ఈ బ్యూటీకి స్టార్ స్టేటస్ అందుకునే సక్సెస్ లక్ మాత్రం లేదని  చెప్పాలి. అయితే సక్సెస్ ల పరంగా అదృష్టం కలిసిరావడం లేదు కానీ ఎన్ని ప్లాప్స్ వచ్చిన కూడా కొత్తగా ఛాన్స్ లు అందిపుచ్చునే లక్ మాత్రం రెజీనాకు బాగానే ఉంది.
క్రిటిక్స్ ను తలకిందులు చేస్తూ..
కొత్త ఛాన్స్ లు అందిపుచ్చుకోవడంలో రెజీనాకు అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ భామ ఇటీవల నటించిన రెండు సినిమాలు బాక్సఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. గోపీచంద్ తో చేసి సౌఖ్యం కానీ మంచుమనోజ్ నటించిన శౌర్య కానీ ఈ చెన్నైభామకు సక్సెస్ అందించలేకపోయాయి. దీంతో రెజీనాకు కొత్తగా అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ క్రిటిక్స్ కామెంట్స్ ని తలకిందులు చేస్తూ రెజీనా కొత్త ఛాన్స్ లు అందుకుంటోంది.
శౌర్య ప్లాప్ అయినా..
శౌర్య ప్లాప్ తరువాత రెజీనాకు అవకాశం రాదేమో అనుకుంటే ఈ బ్యూటీ మరో ఛాన్స్ అందుకుంది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా జో అచ్యుతానంద లో ఈ బ్యూటీనే హీరోయిన్ గా తీసుకున్నారు. అవసరాల శ్రీనివాస్ ఆప్టర్ లాంగ్ టైం ఊహాలు గుసగుసలాడే తరువాత ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తుండడం విశేషం.
పిలిచి మరీ.. 
చిన్న సినిమాలకు బిజినేస్ పరంగా రెజీనా లాంటి హీరోయిన్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే ప్లాప్స్ వచ్చిన ఈ భామను పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్నారు. అయితే రెజీనా మాత్రం హిట్టు కొట్టి స్టార్ హీరోయిన్ లీగ్ లోకి ఏంట్రీ సాధించాలని ఆశపడుతోంది. మరి అవసరాల శ్రీనివాస్ అయిన రెజీనా ఆశలను నేరవేస్తాడో చూడాలి. 
 

07:39 - March 19, 2016

గ్లామర్ బ్యూటీ తాప్సీ, హ్యండ్ సమ్ హీరో రానా టేస్ట్ తన టేస్ట్ ఒక్కటే అంటోంది. అంతేనా శ్రియ కన్నా రానా తనతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటాడని ఒపెన్ అయింది. అంతేకాదు ఈ యంగ్ హీరోతో ఉండటాన్ని ఈ సొట్టబుగ్గల సుందరి బాగా ఎంజాయ్ చేస్తోందట. మరి రానా టేస్ట్ ఏంటో ఈ బ్యూటీ టేస్ట్ ఏంటో వీరిద్దరి మధ్యలో శ్రియను ఎందుకు లాగిందో తెలియాలంటే చదవండి..
కలల రాకుమారుడు..
ఏ ముహుర్తన రాజమౌళి బాహుబలి మొదలెట్టాడో కానీ ఈ మూవీ అందరి కంటే ఎక్కువగా రానాకే పేరుతెచ్చింది. ఈ మూవీ దెబ్బతో ఈ ఆరడగుల అందగాడు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా స్టార్ అయ్యాడు. అంతేకాదు బాహుబలి లో భల్లాలదేవుడి పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికి, ఆ క్యారెక్టర్ చేయడం వల్ల రియల్ లైఫ్ లో మాత్రం రానా తోటి హీరోయిన్స్ కలల రాకుమారుడిగా మారిపోయాడు.
ఎవరూ అడక్కపోయినా..
బాహుబలి తరువాత రానా ఏదో విధంగా వార్తలో ఉంటూనే ఉన్నాడు. ఈ యంగ్ హీరో తన కొత్త సినిమాల కంటే హీరోయిన్స్ తో ఎఫైర్స్ విషయంలో జనాల్లో ఎక్కువగా నానుతున్నాడు. రానాతో ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్స్ నేమ్స్ లింకప్ అవుతున్నాయి. లేటేస్ట్ ఈ కోవలోకి తాప్సీ చేరింది. విశేషమేటంటే ఎవరు అడక్కపోయిన ఈ బ్యూటీ రానా తనకు చాలా క్లోజ్ చెప్పుతోంది.
తాప్సీ శ్రియను లాగింది..
గతంలో రానా,తాప్సీ బాలీవుడ్ మూవీ బేబీ కోసం కలిసి వర్క్ చేశారు. ప్రస్తుతం వీరు ఘాజీ చిత్రంలోనూ కలిసి నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలో వీళ్లు బాగా దగ్గరయ్యారని టాక్. కలిసే తినడం. బ్రేక్ లో గంటల కొద్ది కబుర్లు చెప్పుకుంటున్నరట. దీంతో వీళ్లద్దరి మధ్య సంథింగ్ స్పెషల్ ఉందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఈ విషయం పై స్పందించిన తాప్సీ వీరి మ్యాటర్ లోని  శ్రియను లాగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ ను మించిపోతున్నాడు...
రానాతో తనకున్న క్లోజ్ నెస్ చెప్పిన తాప్సీ శ్రియను టార్గెట్ చేయడం గమనార్హం. మా టేస్ట్ శ్రియ లా కాదని చెప్పింది. శ్రియ,రానా అభిరుచుల్లో తేడా ఉంటుందేమో కానీ మా అభిరుచులు మాత్రం ఒక్కటే. అందుకే రానా తో నేను, నాతో రానా ఉండటానికి బాగా ఇష్టపడతామని చెప్పుతోంది. దీన్ని బట్టే రానా శ్రియ కంటే తనకే క్లోజ్ అని తాప్సీ చెప్పకనే చెప్పుతోంది. రానాను చూస్తుంటే హీరోయిన్స్ తో క్లోజ్ నెస్ విషయంలో బాలీవుడ్ హీరోలను దాటిపోయేలా కనిపిస్తున్నాడు. అంతా బాహుబలి మహిమా.

07:33 - March 19, 2016

తెలుగు రిమేక్స్ తో కండలవీరుడు సల్మాన్ ఖాన్ మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో సల్లూభాయ్ మరో తెలుగు రిమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.తెలుగులో ఇటీవల మంచి విజయం సాధించిన ఓ చిన్న మూవీని రిమేక్ చేయాడానికి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ కండలవీరుడు చేయనున్న ఆ తెలుగు రిమేక్ ఏంటో చూద్దాం..

సల్మాన్ కెరీర్ కి తెలుగు రిమేక్స్ చాలా ఉపయోగపడ్డాయి., ఆయన స్టార్ డమ్ కి బీటలు వారుతున్న టైంలో పోకిరి మూవీని బాలీవుడ్ లో వాటెండ్ గా రిమేక్ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తెలుగులో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసిన పోకిరి రిమేక్ సల్మాన్ ఖాన్ కి అలాంటి భారీ విజయమే అందించింది.

సల్మాన్ ఖాన్ ఏదైనా సౌత్ సినిమా నచ్చితే చాలు వెంటనే దాన్ని బాలీవుడ్ లో దించేస్తాడు. అలా ఇప్పటికే కిక్ మూవీ కిక్ టైటిల్ తోనే రిమేక్ చేశాడు. చిరంజీవి స్టాలిన్ మూవీని జయహో గా రిమేక్ చేశాడు. అంతేకాదు తెలుగు రచయిత విజేంద్రప్రసాద్ అందించిన భజ్ రంగ్ భాయిజాన్ స్టోరీతో మూవీ చేసి అతి పెద్ద విజయం దక్కించుకున్నాడు.

ఇలా సల్మాన్ ఖాన్ ఎప్పటికప్పుడు తెలుగు మూవీస్ ఫోకస్ చేస్తునే ఉంటాడు. లేటేస్ట్ గా ఈ బాలీవుడ్ భాయిజాన్ కి ఇటీవల రిలీజైన తెలుగు మూవీ క్షణం  పిచ్చాపిచ్చగా నచ్చినట్లు టాక్. సన్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ విమర్శలకుతో పాటు కమర్షయల్ గా విజయం సాధించింది. ఈ మూవీని రిమేక్ చేసేందుకు కండలవీరుడు ప్లాన్ చేస్తున్నడట.

క్షణం బాలీవుడ్ రిమేక్స్ రైట్స్ సాజిద్ నడియవాల తీసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కోసమే సాజిద్ ఈ హక్కులు తీసుకున్నడని తెలుస్తోది. గతంలో సాజిద్, కండలవీరుడితో తెలుగు మూవీ కిక్ ని రిమేక్ చేసి హిట్టు కొట్టాడు. అదే సక్సెస్ ను క్షణం రిమేక్ తో రిపీట్ చేయాలని ఈ జోడి భావిస్తున్నట్లు వినికిడి. 

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు..

తిరుమల : నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో నేడు వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. 

నదీ జలాల ఒప్పందంపై సమీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సాంకేతిక నిపుణుల భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులు పాల్గొంటారు. రెండు రాష్ట్రాల నదీ జలాల ఒప్పందంపై సమీక్షించనున్నారు. 

జ్యుడిషియరీ అధికారుల సమావేశం..

హైదరాబాద్ : నేడు రెండు రాష్ట్రాల జ్యుడిషియరీ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు హాజరుకానున్నారు. 

07:11 - March 19, 2016

హైదరాబాద్ : అనుక్షణం ఉత్కంఠ మధ్య సాగిన థ్రిల్లర్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు సఫారీలను చిత్తు చేసింది. సఫారీలు ముందుంచిన 230 పరుగుల లక్ష్యాన్ని వికెట్లు కోల్పోతున్నా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారీ లక్ష్యాన్ని ముందుంచిన మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయామనే బాధ సఫారీలకు మిగిలింది.  
కసితో ఇంగ్లండ్..
టీ20 ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌లోనైనా కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఆడిన ఇంగ్లాండ్‌ జట్టు.. సఫారీలు తమ ముందుంచిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడి అర్ధశతకం సాధించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జోరూట్‌ 44 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. 
ఉత్కంఠ పోరు..
జోరూట్‌తో 5వ వికెట్‌కు బట్లర్‌ తో కలిసి 36 బంతుల్లో 75 పరుగులు, ఆరో వికెట్‌కు మొయిన్‌అలీ కలిసి 18 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇంగ్లాండ్‌ ఉత్కంఠపోరులో విజయం సాధించింది. 
చివరి ఓవర్ కు ఒకే పరుగు చేయాల్సి ఉన్నా..
చివరి ఓవర్‌లో గెలుపునకు ఒకే పరుగు అవసరం ఉన్న సమయంలో వరుస బంతుల్లో 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్‌ శిబిరంలో కాస్త కంగారు నెలకొంది. మొయిన్‌అలీ వచ్చి పరుగు తీసి లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ విజయంతో టీ20 చరిత్రలో అత్యధిక భారీ స్కోరు ఛేదించిన రెండో జట్టుగా ఇంగ్లాండ్‌ నిలిచింది.
పరుగుల వరద..
అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్లు ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు.  ఆమ్లా 31 బంతుల్లో 58 పరుగులు, డికాక్‌ 24 బంతుల్లో 52 పరుగులు సాధించారు. ఆ తర్వాత డుమిని 28 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌ టోర్నీలో సూపర్‌ 10 మ్యాచ్‌లు ప్రారంభమైన తర్వాత ఒకే మ్యాచ్‌లో నాలుగు అర్ధశతకాలు నమోదవడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌, ఆమ్లా, డుమిని అర్ధశతకాలు సాధించగా.. ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో జోరూట్‌ 83 పరుగులు చేశాడు.

ఎర్త్ అవర్.. భూతాపంపై అవగాహన..

హైదరాబాద్ : భూతాపంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా 'ఎర్త్‌ అవర్‌'ను నిర్వహించనున్నారు. WWF, ఇతర స్వచ్చంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువగా పరిమితం చేయాలంటూ గత డిసెంబర్‌లో 195 దేశాలు వాతావరణ ఒప్పందం రూపంలో ప్రతిన పూనిన నేపథ్యంలో ఈ సారి కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. 172 దేశాలు  ఇందులో పాలు పంచుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈఫిల్‌ టవర్‌, ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌తో ప్రముఖ కట్టడాల వద్ద రాత్రి 8.30 నుంచి గంటపాటు  విద్యుత్‌ దీపాలను ఆర్పివేస్తారు. 

07:02 - March 19, 2016

హైదరాబాద్ : భూతాపంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా 'ఎర్త్‌ అవర్‌'ను నిర్వహించనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇతర స్వచ్చంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువగా పరిమితం చేయాలంటూ గత డిసెంబర్‌లో 195 దేశాలు వాతావరణ ఒప్పందం రూపంలో ప్రతిన పూనిన నేపథ్యంలో ఈ సారి కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. 172 దేశాలు  ఇందులో పాలు పంచుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈఫిల్‌ టవర్‌, ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌తో ప్రముఖ కట్టడాల వద్ద రాత్రి 8.30 నుంచి గంటపాటు  విద్యుత్‌ దీపాలను ఆర్పివేస్తారు. భారత్‌లోని రాష్ట్రపతి భవన్‌, ప్రధాని నివాసం, సీఎంల గృహాలు, గేట్‌వే ఆఫ్‌ ఇండియా, హౌరా వంతెనలపై కూడా అంధకారం అలుముకోనుంది. ఇలాంటి చర్యల వల్ల ధనిక దేశాల్లో చాలా ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

06:59 - March 19, 2016

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ కేసులో లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు  ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 2న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా మాల్యాకు ఉత్తర్వులు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఏప్రిల్‌ వరకు గడువు కావాలని విజయ్‌మాల్యా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈడీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మనీలాండరింగ్‌ కేసులో మార్చి 18న హాజరవ్వాలని మాల్యాకు ఈడీ ఇంతకు ముందు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఐడిబిఐ బ్యాంకుకు 9 వందల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన కేసులో మనీలాండరింగ్‌ యాక్టు కింద మాల్యాపై సీబీఐ గతేడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో విజయ్‌మాల్యాను ఏప్రిల్‌ 2న ఈడీ ప్రశ్నించనుంది.

06:54 - March 19, 2016

నల్గొండ : కబ్జాకు గురైన యాదాద్రి ఆలయ భూములకు త్వరలో విముక్తి లభించనుంది. అన్యాక్రాంతమైన ఆలయ భూములను వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని సిఎం కేసిఆర్ అధికారుల‌ను అదేశించారు. యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ జరిపిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు.
కేసీఆర్ సమీక్ష..
యాదగిరిగుట్టను ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా నల్గొండ జిల్లా నేతలు, యాదాద్రి అభివృద్ధి క‌మిటీ, దేవాదాయశాఖ అధికారుల‌తో క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్న స్థానికులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. యాదాద్రిలో రవాణా వ్యవస్థను పటిష్టపరచడం, నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాలు నిర్మించడం, ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను సుందరీకరించడం తదితర విషయాలపై నేతలు, అధికారులు చర్చించారు. 
భారీ సాంస్కృతిక కార్యక్రమాలు..
వివిధ సందర్భాల్లో భారీఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దాల‌ని సీఎం సూచించారు. దీనితోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. ప్రధాన ఆలయ ఫ్రంట్ ఎలివేషన్ వీధిపోటు వాస్తు సూత్రాలను సమీక్షించారు. గిరి ప్రదక్షణ కోసం గుట్ట చుట్టూ వున్న రోడ్లను వెడల్పు చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపడమే గాక వారికి కొత్త ఇళ్ల నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 
టెండర్ల ద్వారానే..
గుట్ట మీదకి వెళ్లే దారి వన్‌వేనే వుండాలని సిఎం అన్నారు. టువే ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. అలాంటి భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అందులో నివాసాలేర్పాటు చేసుకున్న వారికి మానవతాదృక్పథంతో ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించారు. గుట్ట మీద దుకాణాలను టెండ‌ర్ల ద్వారానే కేటాయించాల‌ని సూచించారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన టెంపుల్‌ సిటీలో వ్యాపారాల నిర్వహణకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని కెసిఆర్ అన్నారు. ఆల‌య గోపురాల నమూనాలను అధికారులు వీడియో ద్వారా చూపారు. 

06:50 - March 19, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా స‌స్పెన్షన్‌ వ్యవహారం టిడిపి ప్రభుత్వం మెడకు చుట్టుకుందా ? సస్పెన్షన్‌పై శాసనసభ తీసుకున్న నిర్ణయం అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టనుందా ? ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అది నిజమనే భావన వస్తోంది. హ‌డావుడిగా నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నాలుక క‌ర‌చుకున్న చందంగా త‌యారైందని ఆపార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.                                                                               
హైకోర్టు మొట్టికాయలు..
శాసనసభ తీసుకున్న సస్పెన్షన్‌ నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుద‌ల చేయ‌డంతో అధికార పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సస్పెన్షన్‌పై ఇప్పుడేం చేయాలో తేల్చుకోలేక సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఓవైపు న్యాయ వ్యవస్థ,.మ‌రోవైపు శాసనవ్యవస్థ..ఈ రెండింటి మధ్య ఇప్పుడు పోరాటం అన్నట్లుగా వ్యవహారం తయారైంది. అయితే ఈ ప‌రిస్ధితిని నివారించేందుకు పరిష్కార మార్గాలను ప‌రిశీలిస్తోంది ప్రభుత్వం. ఇదే స‌మ‌యంలో చ‌ట్ట స‌భ‌ల గౌర‌వాన్ని కాపాడేవిధంగా నిర్ణయం తీసుకునేలా జాగ్రత్త ప‌డుతోంది. ఎమ్మెల్యే రోజా ప్రవర్తనపై రూల్‌ 340 స‌బ్ క్లాజ్ కింద ఏడాది సస్పెన్షన్‌ను శాసనసభ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూల్ కింద ఒక్క సెషన్‌ వరకు మాత్రమే స‌స్పెండ్ చేసే అవకాశం ఉంద‌ని విప‌క్షం వాదిస్తోంది. చివ‌ర‌కు అటు కోర్టులోనూ వైసిపి ఇదే వాద‌న వినిపించ‌డంతో..కోర్టు వీరి వాద‌న‌తో ఏకీభ‌వించింది. అయితే సర్కార్‌ దీనినుంచి బయటపడేందుకు రూల్ 212ను తెర‌పైకి తెస్తోంది. ఈ రూల్‌ ద్వారా కోర్టు తమకు డైరెక్షన్‌ ఇచ్చే అవకాశం లేదని సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించింది.
అత్యవసర భేటీ..
ఇదిలా ఉంటే రోజా సస్పెన్షన్‌ విషయంలో శ‌నివారం మధ్యాహ్నం 3గంటలకు అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ అత్యవసరంగా భేటీ కానుంది. చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి రోజా సహా..మరో నలుగురు వైసీపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా టిడిపి ఎమ్మెల్యే అనిత కూడా హాజరుకావాలని ఆదేశించారు. 
బాబుతో పాటు.. మంత్రులకూ నోటీసులు..
ప్రభుత్వం తీరు ఇలా ఉంటే... వైసిపి తనదైన శైలిలో సర్కార్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు సహా ముగ్గురు మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడులపై సహా హక్కుల నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత జగన్‌ను, ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ..అసెంబ్లీ కార్యదర్శికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు అందచేశారు. తక్షణమే ప్రివిలేజ్‌ కమిటీ భేటీ అయి వీరిపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శిని కోరారు. 
వాడీవేడిగా..
మొత్తానికి అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో శనివారం అసెంబ్లీ వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మూడుసార్లు నోటీసులు అందినా ప్రివిలేజ్ క‌మిటీ ముందు ఎమ్మెల్యే రోజా హాజరుకాలేదు. ఇదే ప‌రిస్ధితి పున‌రావృతం అయితే సోమ‌వారం ఆమెపై వేటు త‌ప్పదని అసెంబ్లీ వ‌ర్గాలు అంటున్నాయి. మరోవైపు  రోజాను స‌భ‌లోకి రానివ్వకపోవడంపై కోర్టుధిక్కార కేసు వేయ‌డానికి వైసిపి రెడీ అవుతోంది.    

'మహిళా' సమరం కూడా నేడే..

హైదరాబాద్ : ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా నేడే జరగనుంది. మధ్యాహ్నం 3 గం.లకు ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. ఇప్పటికే ఒక విజయంతో మిథాలి సేన ఉత్సాహంగా ఉంది. 

నేడే భారత్×పాక్ మ్యాచ్..

హైదరాబాద్ : టీ-20 ప్రపంచకప్ లో భాగం నేడు భారత్-పాకిస్థాన్  ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతా వేదికగా రాత్రి 7గం.లకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకోవాలంటే భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంది. 

అక్రమ విద్యుత్ సరఫరా చేస్తున్నారని..

కరీంనగర్ : సిరిసిల్లలో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. రుద్రారంలో క్రషర్ కు అక్రమంగా విద్యుత్ సరఫరా చేశారని ఎఈ తిరుపతి, అసిస్టెంట్ లైన్ మెన్  దేవయ్యలను ఎండి సస్పెండ్ చేశారు. 

రెండు వైన్సుల యాజమాన్యం కొట్టుకున్నారు..

నెల్లూరు : ఆత్మకూరులో ఇద్దరు వైన్స్ యాజమానుల మధ్య ఘర్షన నెలకొంది. మద్యం ధరల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఘర్షనను నివారించడానికి వచ్చిన పోలీసులపై కూడా వైన్స్ సిబ్బంది దాడికి దిగింది. 

సఫారీలపై ఇంగ్లండ్ గెలుపు..

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా 229 పరుగులు చేసింది. దీనికి బదులుగా ఇంగ్లడ్ 230 పరుగులు చేసింది. 

Don't Miss