Activities calendar

20 March 2016

22:24 - March 20, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ మినహా తెలంగాణ మొత్తం కరవు విలయ తాండవం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అన్నారు. కరవు నివారణ చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. పశుగ్రాసం లేక మూగజీవాలు చనిపోతున్నాయన్నారు. అసెంబ్లీలో సీఎం చర్చలో పాల్గొనక పోవడంపై రేవంత్‌ మండిపడ్డారు. 

 

22:09 - March 20, 2016

ఆర్థిక ఇబ్బందులు, పాశ్చాత్య పోకడలు, సోషిల్ మీడియా,సినిమాల ప్రభావంతో చిన్నారుల హత్యలు జరుగుతున్నాయని వక్తలు తెలిపారు. సమాజంలో పెరుగుతున్న చిన్నారుల హత్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐద్వా నేత హైమావతి, సామాజిక కార్యకర్త దేవి, సైక్రియాటిస్టు మురళీకృష్ణ, సినీ దర్శకుడు ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు. చిన్నారుల హత్యలు బాధాకరమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:56 - March 20, 2016

హైదరాబాద్ : త్వరలో తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెరగనున్నాయి. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో అసెంబ్లీ ఏమినిటీస్‌ కమిటీ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే జీతాల పెంపుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసిన అప్లికేషన్‌ను సీఎంకు అందించారు. జీతం నాలుగు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న జీతాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కరువుతో రైతులు అల్లాడుతుంటే ఈ సమయంలో జీతాలు ఎలా పెంచాలా అనే దానిపై సర్కార్‌ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 

 

21:54 - March 20, 2016

హైదరాబాద్ : గ్రామాల సమగ్రాభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో  సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలను బదలాయించాలని సూచించారు. పంచాయతీల్లో ప్రజలకు అందాల్సిన సేవలు వెంటనే అందేలా మార్గదర్శకాలుండాలని సీఎం సూచించారు. పంచాయతీల పటిష్టతకు అవసరమైతే ఈ సమావేశాల్లోనే చట్టం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని,..దీనిపై నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. చెత్త సేకరణకు 25వేల రిక్షాలను త్వరలోనే అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ రాజీవ్‌ శర్మ హాజరయ్యారు.  

 

21:50 - March 20, 2016

హైదరాబాద్ : కరవు అంశం తెలంగాణ అసెంబ్లీని దద్దరిల్లజేసింది. కరవు మండలాల ఎంపిక తీరుపై విపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టింది. నిబంధనలేవీ పాటించకుండా ఇష్టారాజ్యంగా కరవు మండలాలను ఎంపిక చేశారని ధ్వజమెత్తింది. 
కరవు మండలాల ఎంపిక విస్తృత చర్చ 
తెలంగాణలో కరవు మండలాల ఎంపిక అంశంపై.. రాష్ట్ర శాసనసభలో విస్తృత చర్చ సాగింది. కరవు మండలాల ప్రకటనలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని విపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తడంతో.. అది చర్చకు దారి తీసింది. కరవుతో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదంటూ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విపక్షాల విమర్శలకు.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం 
అయితే ఆయన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో.. కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం సీటు వద్దకు వెళ్లి అక్కడున్న పేపర్లు విసిరేశారు. ఈ చర్యను మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌లు తప్పుబట్టారు. దీంతో పాలక, ప్రతిపక్షాల మధ్య వివాదం తలెత్తి.. తీవ్ర గందరగోళానికి దారి తీసింది. 
కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ 
కరవు అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చ కొనసాగించాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రసంగిస్తుండగా.. విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే విపక్షాల డిమాండ్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి తోసిపుచ్చారు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా.. కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.  
సభ సోమవారానికి వాయిదా 
అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చ సందర్భంగానూ సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశంపై చర్చను సోమవారం చేపట్టాలని విపక్షాలు సూచించినా.. సభాపతి టీఆర్ఎస్‌ సభ్యుడు గువ్వల బాలరాజుకు అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా మరోసారి గందరగోళం రేగింది. దీంతో స్పీకర్‌.. సభను సోమవారానికి వాయిదా వేశారు. 

21:44 - March 20, 2016

విజయవాడ : 'పోలవరం' నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య దోరణిపై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనెల 28న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ముంపుకు గురయ్యే మండలాల ప్రజలందరికి పట్టిసీమ బాధిత కుటుంబాలకు ఇచ్చిన  మాదిరిగానే నష్టపరిహరం అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

 

21:33 - March 20, 2016

విశాఖ : బడుగు బలహీన వర్గాలు చైతన్యం కోసం అంబేద్కర్‌ 125వ జయింతి వేడుకలు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సాధికారిత బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఏపీ పీసీసి చీఫ్‌ రఘవీరారెడ్డి ప్రారంభించారు. దేశంలో దళితుల పట్ల పెరుగుతున్న కుల వివక్షను కూకటివేళ్లతో తొలగిస్తేనే నవ భారత నిర్మాణం ఏర్పాటు జరుగుతుందన్నారు. వచ్చే నెల 5వరకు జరుగనున్న ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తామన్నారు.

 

వెస్టిండీస్ విజయలక్ష్యం 123 పరుగులు

హైదరాబాద్ : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా శ్రీలంక, వెస్టిండీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక నిర్ణీత 20 వోవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వెస్టిండీస్ విజయలక్ష్యం 123 పరుగులుగా ఉంది. 

21:23 - March 20, 2016

విజయవాడ : నవ్యాంద్ర రాజధాని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. జూన్ ఒకటి కల్లా నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఉద్యోగులను ఇక్కడికి రప్పించేదుకు సంప్రదింపులు జరుపుతున్నామని,ఏయే శాఖలు ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలో పరిశీలిస్తున్నామన్నామని తెలిపారు.

 

అనంత జిల్లాలో అగ్నిప్రమాదం

అనంతపురం : విపనకళ్ మండలం అవలగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 గడ్డి వాముల దగ్ధం, సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. 

 

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ ఐ మృతి

కరీంనగర్ : మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ప్రమాదం జరిగింది. లారీ.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్ ఐ అబ్దుల్ బారి మృతి చెందాడు.  

20:49 - March 20, 2016

హైదరాబాద్ : పక్షుల సంరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పలురకాల పిచ్చుకలు, పక్షులు రోజురోజుకు కనుమరుగై పోతున్నాయని వాపోయారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ పక్షులకు నివాస గూళ్లు ఏర్పాటు చేసి, తాగేందుకు నీటిని అందించాలని సూచించారు. 

 

20:41 - March 20, 2016

హైదరాబాద్ : కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తయారు చేస్తామని ఎంపీ కవిత అన్నారు. సికింద్రాబాద్‌లోని ఓ  ప్రైవేటు ఆస్పత్రిలో కొత్త విభాగం ప్రారంభోత్సవానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులతో సర్కారు దవాఖానాలు పోటీ పడేలా చేస్తామని ప్రకటించారు. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పేదవారైనా, ధనవంతులైనా సరైన సమయానికి వైద్య సహాయం అందాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

 

20:38 - March 20, 2016

మెదక్ : జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికల నగారా మోగింది. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. రేపు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మున్సిపాలిటీలోని 34 వార్డులకు.. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 23 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ 6న పోలింగ్,11న ఫలితాలు వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలోని మొత్తం 88,982 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరు గ్రామాలను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివాదం కోర్టుదాకా వెళ్లింది. చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా... కోర్టు, స్టేని తొలగించడంతో సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. 

20:34 - March 20, 2016

ఢిల్లీ: పీఎంకేఎస్‌వై పై  కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండో దఫా సమావేశం ఢిల్లీలో జరిగింది. వేగవంతంగా దేశంలో అమలవుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి, రైతులకు సాగునీరందించాలని ఈ కమిటీలో చర్చించారు. ప్రాజెక్టులకు కావలసిన గ్రాంట్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ నెల 28 కల్లా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి అంచనాలను కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ లోగానే రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్లు మంత్రి చెప్పారు. 

 

20:29 - March 20, 2016

హైదరాబాద్ : శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కరవుపై చర్చ కొనసాగించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కరవుపై సుదర్ఘ చర్చ సాధ్యంకాదని స్పీకర్‌ మధుసూదనాచారి కాంగ్రెస్‌ సభ్యుల దృష్టికి తెచ్చారు.  నోటీసు ఇస్తే  ఈ అంశంపై స్వల్పవ్యవధి చర్చకు అనుమతిస్తామని చెప్పారు. చర్చ నిర్వహించే తేదీని తర్వాత ఖరారు చేస్తామన్నారు. కానీ ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చ కొనసాగించాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుపట్టారు. ఇందుకు స్పీకర్‌ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల చర్యను అధికారపక్షం తప్పుపట్టింది. 

20:26 - March 20, 2016

విజయవాడ : కృష్ణా  పుష్కరాల నాటికి ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పుష్కర పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల నాటికి ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్ పనులతోపాటు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల చరిత్ర, మహనీయుల జీవిత గాథలను తెలిపే విధంగా...ఇబ్రహీంపట్నం దగ్గర ప్రత్యేక స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పారు.

 

20:24 - March 20, 2016

విజయవాడ : జక్కంపూడి వైఎస్ ఆర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాలనీలోవాసులతో కలిసి కలిసి ధర్నా చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కనీస వసతులులేక జనాలు అల్లాడుతున్నారని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు మండిపడ్డారు.

 

సబ్ జైల్లో మద్యం సేవిస్తూ అధికారులకు చిక్కిన కానిస్టేబుళ్లు

నల్గొండ : మిర్యాలగూడ సబ్ జైల్లో మద్యం సేవిస్తూ..ముగ్గురు కానిస్టేబుళ్లు అధికారులకు చిక్కారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణతోపాటు కానిస్టేబుళ్లు అబ్దుల్, మోహన్ దాస్ లపై సస్పెన్షన్ వేటు పడింది.  

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేసి హత మార్చారు. తాడిపత్రిలో ఓ వైన్ షాప్ వద్ద నరసింహమూర్తి అనే ఆటో డ్రైవర్, వైన్ షాప్ కు చెందిన వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నరసింహమూర్తి బార్బర్ షాప్ కు వెళ్లాడు. అయితే  షాప్ లో ఉన్న నరసింహమూర్తిపై వైన్ షాప్ కు చెందిన వర్గం కత్తులతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందాడు.  

19:24 - March 20, 2016

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేసి హత మార్చారు. తాడిపత్రిలో ఓ వైన్ షాప్ వద్ద నరసింహమూర్తి అనే ఆటో డ్రైవర్, వైన్ షాప్ కు చెందిన వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నరసింహమూర్తి బార్బర్ షాప్ కు వెళ్లాడు. అయితే  షాప్ లో ఉన్న నరసింహమూర్తిపై వైన్ షాప్ కు చెందిన వర్గం కత్తులతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందాడు.  
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అక్కడున్న ఎవరు కూడా దుండగులను వారించలేదు. కాగా చనిపోయిన వ్యక్తిపై గతంలో రౌడీ షీట్ ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ఆఫ్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా విజయం

ఢిల్లీ : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 వోవర్లలలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత వోవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. 

 

పంచాయతీరాజ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : పంచాయతీరాజ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణం నెలకొల్పాలన్నారు. గ్రామ పంచాయితీలకు మరిన్ని అధికారులు బదలాయించాలని.. అధికారులకు సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న పంచాయితీ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామపంచాయితీలకు 25 వేల సైకిల్ రిక్షాలు అందించాలని 

కేంద్ర జలవనరుల శాఖ సమన్వయ కమిటీ సమావేశం

ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరామని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం 60 శాతం గ్రాంట్లు ఇవ్వాలని సిఫారసు చేశామని తెలిపారు. 

 

18:15 - March 20, 2016

హైదరాబాద్ : వైసీపీ మ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో సోమవారం శాసనసభ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థను గౌరవిస్తూనే రోజా అంశంపై సభలో చర్చ జరుగుతుందన్నారు. అలాంటి చర్చకు కూడా ప్రతిపక్ష నేత జగన్‌ రాననడం విడ్దూరంగా ఉందన్నారు. 

 

17:41 - March 20, 2016

హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు సాయి, రవి, మోహన్ లను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసమే అభయ్ ని కిడ్నాప్ చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత అభయ్ మృత దేహాన్ని అట్టపెట్టెలో చుట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద నిందితులు వదిలిపెట్టారు. 

 

17:37 - March 20, 2016

హైదరాబాద్ : కిచకిచలాడుతూ మన పల్లెటూర్లలో తిరిగాడే చిన్ననాటి జ్ణాపకం కనుమరుగవుతోంది. ధాన్యపు కంకుల గుచ్చాలపై పువ్వులా మెరిసే ఊర పిచ్చుక అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా చేరిపోతోంది. నగరాలు కాంక్రీట్ జంగిల్స్ కావడంతో వాటి అడ్రస్ గల్లంతైంది. మనం చేస్తున్న తప్పిదాలు చిన్నప్రాణి పాలిట శాపంగా మారుతోంది. చిన్ననాటి నేస్తం  పిచ్చుక దినోత్సవం సందర్భంగా.. స్పెషల్ స్టోరీ..
ఇంటి పిచ్చుకలు కనుమరుగు 
కిచకిచలాడుతూ రయ్ మంటూ తిరిగే పిచ్చుకల కోసం మన ఊర్లలో రైతన్నలు ధాన్యపుకంకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. పిచ్చుకలు మన జీవితంలో భాగమని భావిస్తారు. తొలిపంటలో పిచ్చుకలకు పెట్టడం శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి ఇంటిపిచ్చుకలు కనుమరుగవుతున్నాయి.
పిచ్చుకల ఆవాసాలకు చోటులేదు 
నేడు పూరిళ్ళూ లోగిల్ళూ సిమెంట్ ఇళ్ళుగా మారడంతో పిచ్చుకల ఆవాసాలకు చోటు లేకుండా పోయింది. విపరీతమైన సెల్ రేడియేషన్ ప్రభావం కూడా పిచ్చుకు ప్రాణాంతకంగా మారింది. ఎండవానల్లో  తడవకుండా ఉండటానికి రవ్వంత గూడు కోసం  చోటు కరవైంది. దీనివల్ల కూడా పిచ్చుకలు కంటికి కనిపించకుండా పోతున్నాయి. 
దేశంలో 25 రకాల పిచ్చుకలు
దేశంలో 25 రకాల పిచ్చుకలు ఉన్నాయి..  వాటి ఉపజాతులను బట్టి వీటి పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. నేడు పిచ్చుక దినోత్సవం సందర్భంగా.. సమైక్య అనే స్వచ్చంధ సంస్ధ ప్రజల్లో పిచ్చుకల జాతి ప్రత్యేకత, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తోంది. పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు, మంచినీటి  ఏర్పాట్లపై మట్టి పాత్రలను పంపిణి చేస్తోంది. జీవన విధానాన్ని పర్యావరణ హితంగా మార్చుకోకపోతే.. పిచ్చుకల లాగే ఒక్కో జాతిని కోలపోవలసి ఉంటుంది.

ఆఫ్గనిస్తాన్ టార్గెట్ 201 పరుగులు

ఢిల్లీ : టీ20 ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 వోవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ విజయలక్ష్యం 210 పరుగులగా ఉంది.

 

17:27 - March 20, 2016

ప్రకాశం : జిల్లాలో బాల కార్మికుల దయనీయ స్థితిపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందనొచ్చింది.. మిరప, శనగ తోటల్లో పనిచేస్తున్న బాల బాలికలపై బాల్యం బందీ పేరుతో టెన్‌ టీవీ కథనాలు ప్రసారం చేసింది.. దీనిపై స్పందించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి... చిన్నారులను ఆదుకుంటామన్నారు.. అటు చైల్డ్ లైన్‌ సిబ్బంది బాల బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.. 

 

16:58 - March 20, 2016

నల్గొండ : నీరులేక పంట ఎండిపోతోందని ఆ రైతు కుంగిపోలేదు.. సరికొత్త ప్రయోగం దిశగా అడుగులు వేశాడు.. ఎన్ని సమస్యలు ఎదురైనా వెనకడుగు వేయలేదు.. చివరికి అనుకున్నది సాధించి... మూడు రకాలుగా లాభం పొందాడు.. తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు.. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడు? అతడు సాధించిన లాభం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్పెషల్ స్టోరీ.. 
అడుగంటిన భూగర్భజలాలు
నల్లగొండ జిల్లా గురించి ప్రస్తావించగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు. చెంతనే నాగార్జున సాగర్‌ జలాశయమున్నా.. తమకు ఉపయోగపడని పరిస్థితి. అది కూడా గడచిన రెండేళ్లుగా సాగర్‌లో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పరిమితమైంది. జలాశయం ఒట్టిపోవడంతో.. భూగర్భజలాలూ అడుగంటాయి. దీంతో సేద్యం చేయడం వ్యర్థమన్న భావనకు రైతులు వచ్చారు. ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా మలచుకోవాలన్న పెద్దల సూక్తిని ఒడిసిపట్టుకున్నాడు.. ఇదే నేలకు చెందిన కాసర్ల మదన్‌రెడ్డి. 
వినూత్న రీతుల కోసం అన్వేషణ 
తనతోపాటు సాటి రైతుల కష్టాలు కుంగదీసినా.. వ్యవసాయాన్ని వదలలేక.. కాసర్ల మదన్‌రెడ్డి... సేద్యాన్ని లాభసాటి చేసేందుకు వినూత్న రీతుల కోసం అన్వేషించాడు. ఈ ప్రయత్నంలో అతడికి అద్భుతమైన ఉపాయం స్ఫురించింది. అంతే.. తక్షణమే దాన్ని అమలు చేసి మూడు రకాలుగా లాభాలు పొందుతున్నాడు. మదన్‌రెడ్డికి ఎనిమిది ఎకరాల పొలముంది. అందులోని ఆరు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. మిగతా రెండెకరాలు చౌడు భూమి.. ఈ భూమిలో ఎలాంటి పంటలు పండవు.. సేద్యాన్ని లాభసాటిగా మార్చాలన్న తపనతో.. మదన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న చేపల సాగు గురించి తెలుసుకున్నాడు. స్నేహితులతో కలిసి అక్కడి చేపల చెరువులను పరిశీలించాడు.. ఆ లాభాలుచూసి తన పొలంలోనూ చేపలు వేయాలని మదన్‌ నిర్ణయించాడు..
చెరువు తవ్వించాడు..
నీటికోసం కట కటలాడుతున్న పరిస్థితుల్లో చేపల చెరువు అంటే మాటలు కాదు.. అయినా ముందుకే సాగాడు మదన్‌.. తోటివారు నిరుత్సాహపరిచినా భయపడకుండా చెరువు తవ్వించాడు.. ఇందుకోసం 5లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.. సన్నగా పోస్తున్న బోరు నీటితో అతికష్టం మీద చెరువులో నీరు నిల్వ చేశాడు.. ఈ పనికి దాదాపు ఏడాది పట్టింది.. అయితే ఇక్కడ కూడా ఆయనకు సమస్యలు తప్పలేదు.... చెరువులోని నీరు భూమిలో ఇంకడం మొదలైంది.... దీనిపై చేపల సాగు చేస్తున్న రైతులను సంప్రదించాడు.. వారి సలహాతో చెరువు మట్టిని తెచ్చి చేపల చెరువులో పోయించాడు.. ఆ మట్టితో నీరు ఇంకిపోవడం తగ్గిపోయింది. చెరువునిండా నీటిని నింపిన మదన్‌ అందులో చేప పిల్లల్ని తెచ్చివేశాడు.. అల్యూమినియం రేకుల డబ్బాతో చిన్న పడవద్వారా చేపలకు దాణా వేశాడు.. ఇలా దాదాపు నాలుగు నెలలు జాగ్రత్తగా పనులు పూర్తిచేశాడు.. ఇప్పుడు ఈ చేపలు కిలో వరకూ బరువు తూగుతున్నాయి.. 
తన ఆలోచనతో మదన్‌ మూడు రకాలుగా లాభం
తన ఆలోచనతో మదన్‌ మూడు రకాలుగా లాభం పొందుతున్నాడు. చేపల పెంపకం ద్వారా ఆదాయం, చేపల చెరువు నీటిని వరిపొలానికి మళ్లించడం ద్వారా మరో రకం ఆదాయం సమకూర్చుకున్నాడు. వీటన్నింటికన్నా.. పొలంలో తవ్విన చెరువు వల్ల బోర్‌ నీరు సమృద్ధిగా ఉండడం.. మదన్‌ పొందిన మూడో లాభం. బీడు భూమిని లాభసాటిగా మార్చిన మదన్‌.. సాటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు.. ఇప్పుడిప్పుడే మిగతావారూ ఇతడి లాభసాటి వ్యవసాయ రీతుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. 

అభయ్ కిడ్నాప్, హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు సాయి, రవి, మోహన్ లను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసమే అభయ్ ని కిడ్నాప్ చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత అభయ్ మృత దేహాన్ని అట్టపెట్టెలో చుట్టి  సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద నిందితులు వదిలిపెట్టారు. 

15:54 - March 20, 2016

ఖమ్మం : భద్రాద్రి రామాలయంలో అధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. శ్రీరామ మహాక్రతువు శుక్రవారం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ముహుర్తాన్ని మార్చేసి శనివారం నిర్వహించారు. వందేళ్ల తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రచారం లేకుండా గోప్యంగా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
వైభవంగా ముగిసిన శ్రీరామ క్రతువు 
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ క్రతువు కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆలయ కమిటీ సభ్యులు... ఉత్సవమూర్తులకు 5 కేజీల స్వర్ణభద్రకవచాన్ని సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ కార్యక్రమం అత్యంతవైభవంగా  జరిగింది. 
ముహూర్తం మార్పు చేయడంపై అనేక విమర్శలు 
అయితే.. ఈ క్రతువు నిర్వహించే మూహుర్తం మార్పు చేయడంపై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా.. దానిని శనివారానికి మార్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ అధికారుల తీరుతో భద్రాద్రి ప్రతిష్ట మంటగలిసేలా ఉందని భక్తులంటున్నారు. 
కొంతమంది నుంచే బంగారం స్వీకరణ 
ప్రతి వందేళ్లకోసారి స్వామివారి పురాతన విగ్రహాలకు బంగారు కవచం తొడగటం ఆనవాయితీగా వస్తోంది. అయితే మొదటినుంచి దేవస్థాన అధికారులు ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారని భక్తులంటున్నారు. స్వామివారికి బంగారు కవచం వ్యవహారంలో అధికారులు గోప్యత పాటించారంటున్నారు. ఈ వ్యవహారంలో బంగారాన్ని తస్కరించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. 
బంగారు కవచం సమయానికి రాకపోవడంతో మార్పు  
ఇదిలావుంటే దేవాలయ ఈవో జ్యోతి మాత్రం.. బంగారు కవచం తయారీదారులు అనుకున్న సమయానికి ఇవ్వకపోవడంతే ఈ వేడుకను శనివారం నిర్వహించాల్సి వచ్చిందంటున్నారు. ఏదిఏమైనా రాములోరి బంగారు కవచం వ్యవహారంలో జరిగిన అవకతవకలు బయటపెట్టేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

15:48 - March 20, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ విద్యుత్‌ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. నగరంలో ప్రస్తుతం ఉన్న సోనిడియం వేపర్‌  వీధి  దీపాల స్థానంలో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందు ప్రయోగాత్మకంగా సెంట్రల్‌ జోన్‌లో ఎల్ ఈడీ లైట్లను ఏర్పాటుచేసి, వీటి పనితీరును పరిశీలిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ తర్వాత నగరమంతా విస్తరించాలన్న ప్లాన్‌లో జీహెచ్ ఎంసీ పాలకవర్గం ఉంది. 
విద్యుత్‌ పొదపు చర్యలకు ప్రాధాన్యత 
జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల విద్యుత్‌ బిల్లుల వ్యయం తడిచిమోపడువుతోంది. దీనిని కొంతవరకైనా తగ్గించుకోవాలని  మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నేతృత్వంలోని కొత్త పాలకవర్గం నిర్ణయిచింది. దీనిలో భాగంగా విద్యుత్‌ పొదపు చర్యలకు ప్రాధాన్యమిస్తోంది. 
వీధి దీపాల నిర్వహణ వ్యయం ఏటా రూ.185 కోట్లు 
జంటనగరాల్లో ప్రస్తుతం సోడియ వేపర్‌ వీధి దీపాలున్నాయి. ఎస్‌వీ ల్యాంప్స్‌కు విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటి  నిర్వహణ కోసం ఏటా 185 కోట్లు ఖర్చు అవుతోంది. ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తే ఈ వ్యయాన్ని చాలా వరకు తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా రుజువయ్యింది. గతేడాది చంద్రాయణగుట్ట, మాదాపూర్‌లో 750 ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. వీటి  పనితీరును పరిశీలించిన అధికారులు.. 40 నుంచి 50 శాతం విద్యుత్‌ పొదపు అవుతున్నదని గుర్తించారు. వెలుతురు కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ పాలకవర్గం మొగ్గుచూపుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి... అక్కడ ఎల్‌ఈడీ వీధి దీపాలను పరిశీలించారు. హస్తినలో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతుండటంతో.... జంట నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
ముందుగా సెంట్రల్‌ జోన్‌లో ఎల్‌ఈడీ బల్బులు 
ముందుగా హైదరబాద్‌ సెంట్రల్‌ జోన్‌లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ జోన్‌ పరిధిలోని 32 వేల ఎస్‌వీ ల్యాంప్స్‌ స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం  కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఆయా రోడ్ల వెడల్పును బట్టి 20 వాట్లు నుంచి  40, 70, 120 వాట్ల సామర్ధ్యం కలిగిన ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌కు అమలుకు 450 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రయోగం సక్సెసైతే నగరమంతా ఎల్‌ఈడీ  వీధి దీపాలను  విస్తరిస్తారు. 
గ్రేటర్‌లో 4,13,029 వీధి దీపాలు 
గ్రేటర్‌ పరిధిలో 4,13,029 వీధి దీపాలున్నాయి. వీటి నిర్వహణ కోసం 68 మంది అధికారులు, 715 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరి వేతనాల కోసం 10 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. విద్యుత్‌ పరికరాల కొనుగోలుకు 15 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  అభివృద్ధి పనులకు 35 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లులకు 125 కోట్లు చెల్లిస్తున్నారు.  ఇంత ఖర్చు చేస్తున్నా వీధి దీపాలు సరిగా వెలగని పరిస్థితి ఉంది. ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తే ఈ వ్యయంలో చాలా వరకు పొదపు చేయొచ్చని అంచనావేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి. 

 

15:42 - March 20, 2016

ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌  రూం ఇళ్ల నిర్మాణ పథకం చట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. దరఖాస్తుల స్వీకరణ  నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు అన్ని విషయాల్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.  ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు  ముందుకు రాకపోయినా... ఇళ్లు ఇప్పిస్తామంటూ మధ్య దళారీలు లక్షలు దండుకుంటున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రత్యేక కథనం. 
ఇళ్లు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయల వసూలు 
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం.... ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి అర్హులైనే పేదల నుంచి  దరఖాస్తులు కోరడంతో లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు ఇళ్లు ఇప్పిస్తామంటూ పేదల నుంచి లక్షల రూపాయలు దండుకొనే ప్రయత్నాలుచేస్తున్నారు. 
వేలాది మంది దరఖాస్తు
ఆదిలాబాద్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకానికి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్క నిర్మల్‌ పట్టణంలోనే పదివేలకుపైగా ఇళ్ల కోసం అర్జీలు ఇచ్చారు. తమకు వచ్చిన దరఖాస్తులను మున్సిపల్‌ అధికారులు రెవిన్యూ శాఖకు పంపారు. ప్రస్తుతం వీటి పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియను అధికారులు మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారన్న విమర్శలున్నాయి. దరఖాస్తులు స్వీకరణకు ముందే  లబ్ధదారుల ఎంపిక జరిగిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక  బాధ్యతలను అప్పగించారని టీఆర్‌ఎస్‌ నేతలే చర్చించుకుంటున్నారు. దీంతో అర్హుల ఎంపికలో పారదర్శకతకు పాతరేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మిల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
పాలకపక్షం చెప్పినట్టుగా అధికారుల వ్యవహారం 
ఆదిలాబాద్‌లో కూడా డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం లబ్ధిదారులు ఎంపికలో టీఆర్‌ఎస్‌ కౌన్సిర్లు చక్రం తిప్పారన్న విమర్శలున్నాయి. పాలకపక్షం నేతలు చెప్పినట్టుగానే అధికారులు వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. ఈ పథకాన్ని అడ్డంపెట్టుకుని కొందరు దళాలు దరఖాస్తుదారులను దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 
ఆదిలాబాద్‌ జిల్లాలకు 4 వేల ఇళ్లు 
ఆదిలాబాద్‌ జిల్లాలకు  భారీ ఇళ్లు మంజూరు చేశారు. జిల్లాకు  కేటాయించిన  4 వేల ఇళ్లలో ఆదిలాబాద్‌ నియోజవర్గానికి 500, నిర్మల్‌కు 250 ఇళ్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణ బాధ్యతను పట్టణాల్లో ఆర్‌ అండ్‌ బీకి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్‌ శాఖకు అప్పగించారు. అయితే టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం అమల్లో ప్రతిష్టంభన నెలకొంది. 

 

ఇద్దరు గిరిజనులను హత మార్చిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ : కాంఖేడ్ జిల్లా భానుప్రతాప్ పూర్ లో ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

11 ఏళ్ల తరువాత సిద్దిపేటకు మున్సిపల్‌ ఎన్నికలు

మెదక్ : సిద్దిపేటకు 11 ఏళ్ల తరువాత మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రేపటి నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి 11న ఫలితాలు వెల్లడించనున్నారు. సిద్ధిపేటలో మొత్తం 34 వార్డులకు మున్సిపాల్‌ ఎన్నికలు నిర్వహించానున్నారు.

ప్రభుత్వ అప్పులు పెరిగాయి... వడ్డీ రేట్లు తగ్గాయి : జైట్లీ

ఢిల్లీ : ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, వడ్డీ రేట్లు తగ్గాయని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు తగ్గింపు తప్పనిసరి అని జైట్లీ తెలిపారు.

యూపిలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేరర్‌లో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

 

సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. హజ్‌ యాత్రీకులతో వెళ్తున్న బస్సు జెడ్డా, మెడీనాకి ఆనుకుని ఉన్న హిజ్రా రహదారి వద్ద అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. మృతులంతా ఈజిప్టు వాసులుగా గుర్తించామన్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన 22 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సభను రేటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. అంతకముందు పలు అంశాలపై సభలో చర్చించారు. 

 

ప్రభుత్వ అప్పులు పెరిగాయి - జైట్లీ..

ఢిల్లీ : ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, వడ్డీ రేట్లు తగ్గాయని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు తగ్గింపు తప్పనిసరి అని జైట్లీ తెలిపారు.

 

యూపీలో రోడ్డు ప్రమాదం..

ఉత్త్ ప్రదేశ్ : మేరఠ్ జిల్లాలో ప్రయాణీకులతో వెళుతున్న ప్యాసింజర్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 

పీఎంకేఎస్ వైలో మరో ఆరు ప్రాజెక్టులు చేర్చాలి - హరీష్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం నుండి మరో ఆరు ప్రాజెక్టులు పీఎంకేఎస్ వై చేర్చాలని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జలవనరుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. 

శాసనసమండలి సోమవారానికి వాయిదా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సోమవారానికి వాయిదా పడింది. మండలిని వాయిదా వేస్తోన్నట్టు ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఈ రోజు సభలో బడ్జెట్‌పై చర్చ కొనసాగింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పత్తిపాడు - మంత్రి రావెల..

గుంటూరు : ఏపీలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పత్తిపాడును తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై పలువురు నేతలతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. 

ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది - మల్లు..

హైదరాబాద్ : తెలంగాణలోని కరువుపై చర్చ పెడితే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సభ్యుడు జీవన్‌రెడ్డిని అనవసరంగా టార్గెట్ చేశారని విమర్శించారు.

 

ప్రభుత్వం పారిపోతోంది - జీవన్ రెడ్డి...

హైదరాబాద్ : కరవుపై చర్చకు రమ్మంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పారిపోతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 

13:35 - March 20, 2016

ఢిల్లీ : మూడున్నర గంటల్లో ముగిసిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే..వీరబాదుడు, దంచికొట్టుడు, బండబాదుడు. అయితే..ప్రస్తుత ప్రపంచకప్ లో పాల్గొంటున్న సూపర్ హిట్టర్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ఎవరి స్టయిల్ ఏవిధంగా ఉన్నా..బంతి ఉన్నది సిక్సర్లు, బౌండ్రీలకు బాదడానికే. 2016 టీ-20 ప్రపంచకప్ లో వివిధ దేశాల బాదుడు మొనగాళ్లపై ప్రత్యేక కథం..హిట్టింగ్ ఇంత వయిలెంట్ గా ఉంటుందా? అంటూ ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. క్రికెట్ క్రేజీ భారత్ వేదికగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ తొలిరౌండ్ పోటీల్లోనే బౌండ్రీల బాదుడు, సిక్సర్ల మోత మొదలయ్యాయి. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా...బంగ్లాదేశ్ తో ముగిసిన గ్రూప్ -2 తొలిరౌండ్ పోటీలో పాకిస్థాన్ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ 4 సిక్సర్లు బాదితే.. ముంబై వాంఖెడీ స్టేడియంలో ఇంగ్లండ్ తోముగిసిన గ్రూప్ -1 తొలిరౌండ్ పోటీలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డుస్థాయిలో 11 సిక్సర్లు నమోదు చేసి వావ్ అనిపించాడు.

రోహిత్ శర్మ...
కేవలం మూడున్నర్ల గంటల్లోనే ముగిసేపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటేనే బాదుడు, వీరబాదుడు, బండకొట్టుడు, దంచుడే దంచుడు. ప్రస్తుతం 2016 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్లో పాల్గొంటున్న పదిజట్ల టాపార్డర్లో సూపర్ హిట్టర్లు ఎందరున్నా...బాదుడు స్పెషలిస్టులు అతికొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన రోజున బ్యాటుకు పూర్తిస్థాయిలో పని చెబితే బాదుడు ఇంత స్టయిలిష్ గా ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 56 టీ-20 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 106 పరుగులు అత్యధికస్కోరుతో ఒక సెంచరీ, పది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 42 సిక్సర్లు, 109బౌండ్రీలు బాదాడు. ఆన్ సైడ్, ఆఫ్ సైడ్ అన్నతేడా లేకుండా రోహిత్ శర్మ కొట్టే లాఫ్టెడ్ షాట్లు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి లేదు.

విరాట్ కోహ్లీ...
టీమిండియా సూపర్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని..కూల్ కూల్ హిట్టర్ గా చెప్పుకోవాలి. సిక్సర్ల కంటే బౌండ్రీల బాదుడుకే అధిక ప్రాధాన్యమిచ్చే...విరాట్ కొహ్లీ..ఫోర్లు కొడుతుంటే అసలు బాదుతున్నట్లే ఏమాత్రం అనిపించదు, స్కోరుబోర్డు మాత్రం టాప్ గేర్ లో పరుగుగెడుతూనే ఉంటుంది. తన టీ-20 కెరియర్ లో ఇప్పటి వరకూ 39 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 90 పరుగుల అత్యధిక స్కోరుతో 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో 27 సిక్సర్లు, 146 బౌండ్రీలు ఉండటం విశేషం.

ధోని..
హెలీకాప్టర్ కమ్ చోపర్ షాట్లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్లు బాదుతుంటే...పవర్ హిట్టింగ్ లో ఉన్న సొగసు ఏపాటిదో మనకు అర్ధమవుతుంది. బాదుడులోనూ ఇంత రాజసం ఉంటుందా! అనుకొనేలా చేస్తుంది. ఇప్పటి వరకూ తన టీ-20 కెరియర్ లో 64 మ్యాచ్ లు ఆడిన ధోనీ 66 బౌండ్రీలు, 31 సిక్సర్లు బాదాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 48 పరుగులంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి. బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన ఆసియాకప్ ఫైనల్లో రెండు భారీసిక్సర్లతో ధోనీ మ్యాచ్ ను ముగించిన తీరు చూస్తుంటే అహో మహీ అనుకోవాల్సిందే మరి.

ఏబీ డివిలియర్స్...
టీ-20 బ్యాటింగ్ లో బాదుడు ఎడాపెడా స్టయిల్ లో ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పిన మొనగాడు..సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ షాట్లు బాదడంలో డివిలియర్స్ కు డివిలియర్స్ మాత్రమే సాటి. ఏబీ తన బ్యాటుకు కానీ, పనికానీ చెప్పాడంటే ప్రత్యర్థి బౌలర్ల పని పచ్చడి పచ్చడే అనడంలో ఏమాత్రం సందేహంలేదు.

ఆఫ్రిది...
టీ-20 ఫార్మాట్లో పిచ్చకొట్టుడుకు మరోపేరు పాకిస్థాన్ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 95 మ్యాచ్ లు ఆడిన ఆఫ్రిదీ 54 పరుగుల అత్యధిక స్కోరుతో నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. 99 బౌండ్రీలు, 70 సిక్సర్లు సైతం బాదాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన ప్రపంచకప్ తొలిరౌండ్ పోటీలో ఆఫ్రిదీ నాలుగు బౌండ్రీలు, నాలుగుసిక్సర్లతో 49 పరుగుల స్కోరు సాధించి..తన బాదుడు రేంజ్ ఎలా ఉంటుందో గుర్తు చేశాడు.

డేవిడ్ వార్నర్...
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం బాదుడులో ఏమాత్రం తక్కువ కాదు. తనదైన రోజున అలవోకగా సిక్సర్లు, బౌండ్రీలు బాదేయడం వార్నర్ స్పెషాలిటీ. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 57 మ్యాచ్ ల్లో 90 పరుగుల నాటౌట్ స్కోరుతో 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 151 బౌండ్రీలు, 73 సిక్సర్లతో వార్నర్ బాదుడు మొనగాళ్ళలో ఒకనిగా నిలిచాడు.

క్రిస్ గేల్..
ఇక...బండబాదుడు, దంచికొట్టుడుకు పర్యాయపదం ఎవరంటే...వెస్టిండీస్ థండర్ ఓపెనర్ క్రిస్ గేల్ మాత్రమే అని చెప్పాలి. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 46 టీ-20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన గేల్...98 సిక్సర్లు, 127 బౌండ్రీలు బాదాడు.117 అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు...రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆరడుగుల ఆజానుబాహుడు గేల్ క్రీజులోనుంచి ఏమాత్రం కదలకుండా బరువైన తన బ్యాటును గదలా అటూఇటూ తిప్పుతూ షాట్లు కొడుతుంటే ఎంత భారీ బౌండ్రీలైన్ అయినా చిన్న బోవాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లకు సైతం..తర్వాతి బంతి ఎక్కడ..ఎలా వేయాలో అర్థంకాక జుట్టుపీక్కోవాల్సిందే. గేల్ తన సహజసిద్ధమైన శైలిలో ఆడుతుంటే..హిట్టింగ్ ఇంత వయిలెంట్ గా ఉంటుందా? అంటూ ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

13:29 - March 20, 2016

చెన్నై : తమిళనాడులో జయలలిత సారథ్యంలోని ఏఐడీఎంకే, కరుణానిధి సారధ్యంలోని డీఎంకే మధ్యనే ఇంతకాలమూ ప్రధాన పోటీ కొనసాగుతూ వచ్చింది. గత 30 ఏళ్లుగా అధికారం వీరిద్దరి మధ్యనే చక్కర్లు కొట్టింది. ఎంజీఆర్ మరణానంతరం ఈ రెండు పార్టీలు చెరో టర్మ్ చొప్పున పాలిస్తున్నాయి. జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో సైతం కాంగ్రెస్ ఈ రెండు ద్రవిడ పార్టీలలో ఏదో ఒకదాని పంచెన చేరి, పోటీ చేసేది. అలాంటి చోట ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీలను ఈసారి తమిళనాడులోని చిన్న చితకా పార్టీలు కలవరపెడుతున్నాయి. ఇంతకాలమూ కేవలం మద్దతుదారుల పాత్రకే పరిమితమైన అనేక పార్టీలు ఇప్పుడు భాగస్వామ్య పార్టీ హోదా కోసం తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న డిఎంకె మరో 20కి పైగా చిన్నచిన్న పార్టీల మద్దతు కూడగట్టింది. ఇక అధికార పార్టీ ఏఐడిఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా ఏడు పార్టీల నేతలతో సమావేశమై, సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో పది పార్టీలకు ప్రాతినిధ్యం వుంది. వామపక్షాలకు 18 సీట్లుండడం విశేషం. జయలలిత సారధ్యంలోని ఏఐడీఎంకె కి 149, కరుణానిధి సారథ్యంలోని డీఎంకే కి 23, విజయ్ కాంత్ కి చెందిన డీఎండీకే కి 20, సీపీఎంకి 10, సీపీఐకి 8, కాంగ్రెస్ కి 5, పీఎంకే , ఎంఎంకెలకు చెరి రెండు, పీటీ, ఫార్వర్డ్ బ్లాక్ లకు చెరో సీటున్నాయి.

మారే పొత్తులు..సమీకరణాలు..
తమిళనాడులో రాజకీయ పొత్తులు, సమీకరణలు ఎప్పటికప్పుడూ మారుతూ వుంటాయి. 2011లో ఏఐడీఎంకెతో కలిసి పోటీ చేసిన పార్టీలు 2014లో జయలలితకు దూరమయ్యాయి. కొందరు బీజేపీతో పొత్తు పెట్టుకోగా, మరికొందరు ఒంటరిగా బరిలోకి దిగారు. ఆరేడు నెలల క్రితమే పీపుల్స్ వెల్ఫేర్ ఫోరమ్ పేరుతో మరో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించింది. ఇందులో సీపీఎం, సీపీఎంతో పాటు వైకో సారథ్యంలోని ఎండీఎంకే, రామదాసు సారథ్యంలోని పీఎంకే , దళితుల్లో పట్టున్న వీసీకే పార్టీలు భాగస్వాములుగా వున్నాయి. వైకో పార్టీకి 2014 ఎన్నికల్లో 3.5శాతం ఓట్లు లభించాయి. పీఎంకేకి 3 నుంచి 4.5శాతం ఓట్లున్నాయి. 2011 ఎన్నికల్లో సీపీఐ 1.9శాతం ఓట్లు సాధించగా, సీపీఎం 2.4శాతం ఓట్లు సాధించింది. ఇక దళితుల్లో పట్టున్న వీసీకే పార్టీకి 1.5శాతం ఓట్లున్నాయి.

జయకు పెరిగిన ఓట్ల శాతం..
విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకేను కూడా చేర్చుకునేందుకు పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లోని భాగస్వామ్య పక్షాల ఓట్లన్నీ కలిపితే 15శాతం దాకా వుంటాయి. ఈ లెక్కలే ప్రధాన ద్రవిడ పార్టీలను కలవరపెడుతున్నాయి. విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకేకి గత ఎన్నికలలో 5 నుంచి 8 శాతం ఓట్లు పోలయ్యాయి. 2005లో ఆవిర్భవించిన ఈ పార్టీ 2011లో జయలలితతోనూ, 2014లో బీజేపీతోనూ పొత్తు పెట్టుంది. 2011లో 7.8 శాతం ఓట్లు , 2014లో 5.1 శాతం ఓట్లు లభించాయి. ప్రధాన ద్రవిడ పార్టీలకు తాము ప్రత్యామ్నాయ శక్తిగా తాము అవతరిస్తామన్న ధీమా పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నేతల్లో కనిపిస్తోంది. తాము 20శాతం ఓట్లు సాధిస్తే, హంగ్ అసెంబ్లీ ఏర్పడి, తాము కింగ్ మేకర్ లుగానో, కాలం కలిసివస్తే కింగ్ లుగానో అవతరిస్తామన్న అభిప్రాయం పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నేతల్లో వ్యక్తమవుతోంది. 2011 ఎన్నికల్లో ప్రస్తుత వెల్ఫేర్ ఫ్రంట్ లోని పార్టీలతో పొత్తు పెట్టుకున్న జయలలితకు 38.4శాతం ఓట్లు వస్తే, కరుణానిధి పార్టీకి 22.3శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో దేశమంతా మోడీ గాలి వీస్తే, తమిళనాడులో జయలలితకు తిరుగులేని ఆధిక్యం లభించింది. ఓట్ల శాతం 44.3శాతానికి పెరిగింది.

ఎవరకెన్ని సీట్లు వస్తాయో ? 
ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు తమిళనాడులో చెప్పుకోదగ్గ బలం లేదు. 2011లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 2.2 శాతం ఓట్లు రాగా, 2014లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కి 4.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 స్థానాలు మాత్రమే వుండగా, బీజేపీకి ఒక్కటి కూడా లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీలు జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు, సీట్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది. 

13:23 - March 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9 వరకు 20 రోజుల పాటు జరగనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల 56 వేల 757 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్ధులందరికీ హాల్‌టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్ధులు ఐదు లక్షల 21 వేల 46 మంది కాగా.. ప్రైవేట్‌గా పరీక్షకు హాజరయ్యేవారు 35,711 మంది ఉన్నారు. పరీక్షలకు మొత్తం 2,615 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గంట ముందే హాజరు కావాలి..
పరీక్షా కేంద్రానికి విద్యార్ధులంతా గంటముందే నుంచే హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. 9 గంటల 35 నిమిషాలు దాటితే విద్యార్ధులను అనుమతించేది లేదంటున్నారు. విద్యార్ధులు స్కూల్‌ డ్రెస్సులో కాకుండా సాధారణ దుస్తుల్లోనే రావాలని సూచించారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్షల తనిఖీ కోసం నలుగురు స్పెషల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పాటు.. 144 మంది స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇక వికలాంగ విద్యార్ధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పరిచారు. ఇక ఈ పరీక్షలు ఏప్రిల్‌ 9 వరకు 20 రోజులపాటు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11 నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం కానుంది. పరీక్షలు ముగిసిన ఏడు వారాల్లోపు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

13:19 - March 20, 2016

హైదరాబాద్ : మెదక్, నిజామాబాద్ జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాపై ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో కరవుపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశంపై కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. కరవు పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదని ఆయన ధ్వజమెత్తారు. 

13:14 - March 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ పై జీవన్ రెడ్డి పేపర్లు విసిరేయడాన్ని టి. మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరిలు తప్పుబట్టారు. ఆదివారం శాసనసభలో టి.కాంగ్రెస్ కరవుపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తదనంనతరం టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రవర్తించిన తీరును అధికారపక్షం తప్పుబట్టింది. ప్రశ్నోత్తరాల్లో కరవుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బెంచీ దగ్గరకు వెళ్లి పేపర్లు విసిరికొట్టడాన్ని మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరిలు తప్పుబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం చేయాలని భావిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి బెంచి వద్దకు వచ్చి పేపర్లు విసిరేయడం కరెక్టేనా ? ఇలా చేయడం సబబు కాదన్నారు. సభ్యుడు జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేయాల్సినవసరం ఉందని, ప్రవర్తనకు సిగ్గు పడాలని మంత్రి కడియం తెలిపారు. 

13:08 - March 20, 2016

ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో ప్రజలు దొరల దోపిడీకి గురయ్యారు. దొరల పీడనను అనుభవించారు. దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలకు బలయ్యారు.. నిజాం నిరంకుశ పాలనలో క్రూరంగా హింసించబడ్డారు. రజాకార్ల తుఫాకీ గుళ్లకు పిట్టల్లా రాలిపోయారు.. అలాంటి ప్రజల దుర్భర బతుకులను కథలుగా మలిచారు వుప్పల నరసింహం. ప్రముఖ కథకులు, సీనియర్ పాత్రికేయులు, పరిశోధకులు వుప్పల నరసింహంపై ప్రత్యేక కథనం. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:01 - March 20, 2016

ఒకప్పుడు సాహిత్యం కేవలం రాజాస్థానాలకే పరిమితమై ఉండేది. నేడది ప్రజాబాహుళ్యాన్ని మేల్కొలిపే పొద్దుపొడుపుగా మారింది. అణగారిన వర్గాలను ఆలోచింపజేస్తోంది. అందుకే అక్షరాస్యులుగా మారిన అట్టడుగు కులాల నుండి కలాలు ఎగసిపడుతున్నాయి. తరతరాలుగా తమ జాతి జనులకు జరిగిన చారిత్రక విద్రోహాలను ఎండగడుతున్నాయి. అలాంటి వారిలో దళితుల సాంస్కృతిక మూలాలను కవిత్వీకరించారు చిత్రం ప్రసాద్. దళిత కవులు నేడు తమదైన అభివ్యక్తితో అద్భుత కవిత్వం రాస్తున్నారు. దళిత భాషను, యాసను, జీవన సంస్కృతిని కవిత్వీకరిస్తున్నారు. అలాంటి వారిలో చిత్రం ప్రసాద్ ఒకరు. ఆయన దళిత ఈస్తటిక్ ను సంస్కృతిని తన కవిత్వంలో బలంగా వినిపించిన నిఖార్సయిన దళితకవి. ఆయన కవిత్వాన్ని నేటి ధిక్కార స్వరంలో ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:41 - March 20, 2016

విజయవాడ : నేటి తరం కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో క్రీడా అవగాహనా సదస్సులో ప్రసంగిస్తూ ఆయన కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గుతోందని... రాష్ట్రంలో కూడా జనాభా పెరగాల్సిన అవసరముందన్నారు. స్కూల్ స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జూన్‌ నాటికి క్రీడలపై అవగాహన క్యాలెండర్‌ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని క్రీడాంద్రప్రదేశ్ గా మారుస్తామని అందుకు వ్యాయమ ఉపాధ్యాయులు సహకరించాలని ఈసందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు..క్రీడారంగంలో మార్పులు తీసుకు వస్తామని తెలిపారు..భావితరాల భవిష్యత్తు కు అందరం కృషి చేయాలని ఆయన వ్యాయమ ఉపాధ్యాయులను కోరారు. మెదటిసారిగా ఫిజికల్ లిటరసీ పై మాట్లాడుకుంటున్నామని ఇందుకు కృషి చేసిన గోపీచంద్‌ను చంద్రబాబు అబినందించారు. రెండు నెలల కిందట చంద్రబాబు కాపు రుణమేళా సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉంది. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి సంతరించుకున్నాయి.  

12:37 - March 20, 2016

విశాఖపట్టణం : జూలో మృగరాజు నీటి కొలను నుంచి బయటకు రావటంలేదు. పులి గాండ్రించటంలేదు.. పక్షులు చురుగ్గా ఉండడంలేదు.. మిగిలిన జంతువులూ సేమ్‌ టు సేమ్‌..!! ఎందుకిలా..? విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్. సందర్శకులకు దర్శనమివ్వని వన్యప్రాణులు. నీడచాటున తప్ప మరెక్కడా కానరాని జంతువులు. ఈ పరిస్థితికి కారణం ఒకటే.. ! ప్రజలను చండప్రచండ వీక్షణంతో బెంబేలెత్తిస్తోన్న భానుడు.. జంతువులపైనా అంతే తీక్షణతను చూపుతున్నాడు. దీంతో మూగప్రాణులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. విశాఖపట్నంలో ప్రస్తుతం 37 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జంతువులు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అల్లాడుతున్నాయి. ఎండకు బెదిరి.. చెట్ల నీడన, బోనుల్లోనే ఉండిపోతున్నాయి. జంతువులకు నీరూ ప్రధాన సమస్యగా మారింది. జూపార్క్‌లోని నీటికొరత కారణంగా.. మూగజీవుల సంరక్షణ కష్టతరమైందని అధికారులు చెబుతున్నారు. అయినా.. వేసవితాపం నుంచి మూగజీవాలను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అంటున్నారు.

నెలకొరిగిన 2500 భారీ వృక్షాలు..
హూద్ హూద్ తుపాను వల్ల 2500 భారీ వృక్షాలు విశాఖ జూలో నేలకొరిగాయి. దీని వల్ల పచ్చదనం తగ్గి ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి జంతువులను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. వేసవిలో వన్యప్రాణులను కాపాడుకోవడం జూ అధికారులకు సవాల్ గా మారుతోంది. గత ఏడాది 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవి దాన్ని తలదన్నే రీతిలో ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూలోని అరుదైన జంతుజాలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

12:32 - March 20, 2016

విశాఖపట్టణం :  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ నేటి నుంచి బస్సు యాత్రను నిర్వహిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మాట్లాడారు. ముస్లీం మైనార్టీలకు మంత్రివర్గంలో చోటెందుకు కల్పించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముస్లీం మైనార్టీలకు, గిరిజనులకు, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. మంత్రివర్గంలో ముస్లింకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందని, బీజేపీ దానికి సంబంధించిన టిడిపి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. సుప్రీంలో వ్యతిరేకంగా తీర్పు వస్తే దీనికి కారణం టిడిపి, బిజెపి పార్టీలే కారణమన్నారు. ఈ రెండు పార్టీలను సంఘబహిష్కరణ చేస్తామని రఘువీరా హెచ్చరించారు. 

12:28 - March 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపణలపై అసెంబ్లీలో తీవ్ర రగడ జరిగింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి లేవనెత్తిన ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కరువుతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై వ్యవసాయం శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో కరవు మండలాలను ప్రకటించ లేదనడం సరికాదని పేర్కొన్నారు. రూ. 370 కోట్లు కేవలం మంచినీళ్లకే కేటాయించడం జరిగిందని, అదిలాబాద్ జిల్లాకు రూ. 25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ఒక రూపాయి ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 650 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చిందని మంత్రి పోచారం తెలిపారు. మంత్రి సమాధానంలో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం జరిగింది. కరవుపై చర్చకు అనుమతినిస్తామని చెప్పినా టి.కాంగ్రెస్ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం సరిగ్గా లేదని ఉప ముఖ్యమంత్రి కడియం పేర్కొన్నారు. సభ్యుడు జీవన్ రెడ్డి ప్రవర్తన ఆక్షేపణీయమన్నారు. 

12:12 - March 20, 2016

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రవర్తన సరిగ్గా లేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో కరవుపై టి.కాంగ్రెస్ సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఈ సమాధానం పట్ల టి.కాంగ్రెస్ సంతృప్తి చెందలేదు. దీనిపై మంత్రి పోచారం మాట్లాడారు. మంత్రి వద్దకు వచ్చి జీవన్ రెడ్డి పేపర్లు విసిరేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో కరవు మండలాలను ప్రకటించ లేదనడం సరికాదని పేర్కొన్నారు. రూ. 370 కోట్లు కేవలం మంచినీళ్లకే కేటాయించడం జరిగిందని, అదిలాబాద్ జిల్లాకు రూ. 25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ఒక రూపాయి ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 650 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చిందని మంత్రి పోచారం తెలిపారు. 

ప్రారంభమైన టి.అసెంబ్లీ..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. కరవుపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనాచారి తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 

ట్రంప్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు..

అమెరికా : అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు రిపబ్లికన్ పార్టీ నుండి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

మీడియా ముందుకు అభయ్ హత్య కేసు నిందితులు...

హైదరాబాద్ : పదో తరగతి అభయ్ హత్య కేసు నిందితులను ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

ఘనంగా ఈటెల జన్మదినోత్స వేడుకలు..

హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ కార్యకర్తల సమక్షంలో వేడుకలు నిర్వహించారు.

ఢిల్లీకి చేరుకున్న మంత్రి హరీష్..

న్యూఢిల్లీ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిమ హరీష్‌రావు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంపై జరగనున్న సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో మంత్రి హరీష్‌రావును సభ్యుడిగా నియమించిన సంగతి తెలిసిందే. 

టి.రాజకీయ వ్యవస్థకు ఒక విజన్ - ఈటెల..

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ వ్యవస్థకు ఒక విజన్ ఉందని మంత్రి ఈటెల రాజేందర్ శాసనమండలిలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని, మిషన్ భగీరథ పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. 

231 మండలాల్లో కరవు - మంత్రి పోచారం..

హైదరాబాద్ : రాష్ట్రంలో 231 మండలాల్లో కరవు ఉందని ప్రకటించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రూ. 3వేల కోట్లు అడిగితే రూ.791 కోట్లే - చిన్నారెడ్డి..

హైదరాబాద్ : కేంద్రాన్ని రూ. 3వేల కోట్లు కోరితే రూ. 791 కోట్లే ప్రకటించిందని, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయం చూపాలని చిన్నారెడ్డి సూచించారు. 

కరవు సహాయక చర్యలేంటీ - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : ప్రభుత్వం చేపట్టిన కరవు సహాయక చర్యలు ఏంటనీ కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏక మొత్తంగా ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 21 ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 448 మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 2 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

 

10:25 - March 20, 2016

హైదరాబాద్ : 'మీకే కాదు..మాకూ నీళ్లు లేవు' అంటూ టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కరవుకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ కలెక్టర్ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 40 మండలాల్లో కరవు ఉందని నివేదిక అందించారని తెలిపారు. శ్రీరాంసాగర్ ఆయుకట్టు ప్రాజెక్టులో గత రెండు సంవత్సరాల నుండి నీళ్లు చేరుకోలేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 21 మండలాలను గుర్తించకపోవడం వల్ల వాటిని గుర్తించాలని తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన స్పందన లేదన్నారు. తాను సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం జరిగిందని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్లడం జరిగిందని సభకు తెలిపారు. మూడు వారాల్లో పున:పరిశీలిస్తామని హైకోర్టు చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వం పనిచేయదు..న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ ద్వారా రైతులను ఆదుకొనే అవకాశం ఉంటుందని, ఏకమొత్తంగా రుణం మాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరవు మండలాలుగా ప్రకటించడం వల్ల పలు లాభాలు కలుగుతాయని, రుణాలన్నీ రీ షెడ్యూల్ వేయబడుతుందని..కొత్తగా అప్పు తెచ్చుకొనే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మంత్రి మాత్రం కరవు జిల్లాగా ప్రకటించుకున్నాడని జీవన్ రెడ్డి తెలిపారు. 

231 మండలాల్లోనే కరవు ఉందా - చిన్నారెడ్డి..

హైదరాబాద్ : 443 మండలాల్లో 309 మండలాల్లో కరవు ఉందని అందరూ చెప్పడం జరిగిందని, కానీ 2014-15 ఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించలేదని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, రెండో సంవత్సరం 364 మండలాల్లో కరవు నెలకొందని నివేదిక పేర్కొన్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 231 మండలాల్లో కరవు ఉందని ప్రకటించారని సభకు తెలిపారు.

10:14 - March 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ మధుసూధనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కరవు మండలాల ప్రకటనపై కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి వేసిన ప్రశ్నపై డిప్యూటి సీఎం మహ్మద్ ఆలీ సమాధానం ఇచ్చారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడారు. మంత్రి సమాధానం చాలా క్యాజువల్ గా ఉందని, వింటే బాధగా ఉందన్నారు. 58 సంతవ్సరాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం తెర్చుకోవడం జరిగిందని, కానీ రెండు సంవత్సరాలు వరసగా కరువు రావడం రైతాంగానికి బాధ కలిగించే విషమయన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. 443 మండలాల్లో 309 మండలాల్లో కరువు ఉందని అందరూ చెప్పడం జరిగిందని, కానీ 2014-15 ఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించలేదన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, రెండో సంవత్సరం 364 మండలాల్లో కరవు నెలకొందని నివేదిక పేర్కొన్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 231 మండలాల్లో కరవు ఉందని ప్రకటించారని సభకు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కరువు ప్రకటించలేదని..నల్గొండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ లలో అన్ని మండలాల్లో కరవు ప్రాంతాలుగా ప్రకటించారని తెలిపారు. మొత్తంగా కరవు మండలాల ప్రకటన అశాస్త్రీయంగా ఉందన్నారు. నవంబర్ లో కరవు నివేదికను కేంద్రానికి పంపించడం జరిగిందని, డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి రావడం జరిగిందని సభకు చిన్నారెడ్డి గుర్తు చేశారు. 

తెలంగాణ మండలి, శాసనసభా సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మండలి, శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్ కు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ జన్మదిన శుభాకాంక్షళు తెలిపారు. 

అభివృద్ధికి వ్యతిరేకం కాదు - ఎంపీ గుత్తా..

నల్గొండ : తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను మిషన్ భగీరథకు రుణం మంజూరు చేయవద్దని హడ్కోకు లేఖ రాసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కేంద్రానికి తాను లేఖ రాయడం జరిగిందని, గతంలో తాను రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించనందుకే కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూం, మిషన్ భగీరథకు ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 

వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..భర్త మృతి..

తూర్పుగోదావరి : రావులపాలెం జూనియర్ కళాశాల మైదానంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈమెను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..

ఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎన్ఎండీసీ కన్వెషన్ సెంటర్ లో జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. 

09:24 - March 20, 2016

రష్యా : రొస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది మృతి చెందారు. మృతుల్లో 44 మంది రష్యన్లతో పాటు ఇద్దరు భారతీయులున్నారు. బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం ల్యాండింగ్‌ అయ్యే సమయంలో ప్రమాదానికి గురైంది. దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం దుబాయ్‌ నుంచి ప్రయాణికులతో రష్యాలో రోస్తోవ్‌కు బయల్దేరింది. రష్యాలోని రోస్తోవ్‌ ఆన్ డాన్ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గురైన తక్షణమే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణికులతో సహా మొత్తం 61 మంది మృతి చెందారు.

దర్యప్తు ముమ్మరం..
మృతుల్లో 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెనియన్లు, ఇద్దరు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారు ఉన్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. అధికారులు, సిబ్బంది రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 20 నిముషాలకు విమాన ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఫ్లై దుబాయ్ సంస్థ 2009 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది. తమ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారని చెబుతోంది. రన్‌వేకు సుమారు 8 వందల అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలిపోయిందని స్థానిక పాత్రికేయులను ఉటంకిస్తూ రొస్తోవ్ ప్రాంత గవర్నర్ వాసిలీ గోలుబెవ్ తెలిపారు. హరికేన్ స్థాయిలో తీవ్రమైన గాలులు రావడంతో విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

టి.శాసనసభ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీఐ..వేసవిలో ప్రైవేటు పాఠశాలల తరహాలోనే..ప్రభుత్వ పాఠశాల్లోనూ తరగతులు నిర్వహించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పూంఛ్ ప్రాంతంలో పలు నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

తిరుపతి : శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, రాష్ట్ర మంత్రి మృణాళిని, సినీ నటి మంచు లక్ష్మి తదితరులు దర్శించుకున్నారు. 

నాంపల్లిలో రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : రవీంద్రభారతి చౌరస్తాలో ఆదివారం ఉదయం ఇంజనీరింగ్ కళాశాల బస్సును మెట్రో రైలుకు చెందిన క్రేన్ ఢీకొట్టింది. ఈఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. 

టప్పాచబుత్రలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : టప్పాచబుత్ర జోషివాడలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సుమారు 150 మంది పోలీసులు ఈ తనిఖీలు మొదలుపెట్టారు. తనిఖీలలో భాగంగా 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు రౌడీషీటర్లు, సరైనపత్రాలు లేని 20 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

07:54 - March 20, 2016

సన్నీలియోన్‌ ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షారూఖ్‌ ఖాన్‌తో నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 'రెయిస్‌' చిత్రంలో షారూఖ్‌తో కలిసి ఐటమ్‌ సాంగ్‌లో స్టెప్పులేయ బోతోంది. ఇప్పటి వరకు ఏ పెద్ద హీరోతో కలిసి నటించని సన్నీకి షారూఖ్‌తో ఆడిపాడే అవకాశం రావడంతో ఇప్పుడీ వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సన్నీకి ఛాన్స్ రావడానికి కారణం షారూఖ్‌ ఖాన్‌ ఇటీవల ఇచ్చిన స్టేట్‌మెంటేనని సామాజిక మీడియాలో పాజిటివ్‌ కామెంట్స్‌ రాస్తున్నారు. 'నా చిత్రంలో కాస్టింగ్‌ ఎవరుంటారనేది నేనెప్పుడూ చూడను. దర్శకుడి ఇష్ట ప్రకారంగానే నడుచుకుంటాను. అందులో భాగంగా సన్నీతో నటించాలని దర్శకుడు సూచిస్తే సంతోషంగా నటిస్తాను. తను వండర్‌ఫుల్‌ యాక్టర్‌. ఏ ఆర్టిస్టుకైనా వారిలో ఉండే క్యాలిబర్‌ని బట్టే ఛాన్స్‌లొస్తాయి. సన్నీకి అవకాశాలు రావడానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నాన'ని ఇటీవల ఓ షోలో షారూఖ్‌ పేర్కొన్న విషయం విదితమే. ఈ విషయంపై సన్నీ స్పందిస్తూ 'షారూఖ్‌ కామెంట్‌తో నేను విస్మయం చెందాను. ఆయనతో నటించే అవకాశం రావడం నా కెరీర్‌కో టర్నింగ్‌' అని అన్నారు. గతంలో అమీర్‌ ఖాన్‌ కూడా సన్నీతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్నీలియోన్‌ 'వన్‌ నైట్‌ స్టాండ్‌', 'టినా అండ్‌ లోలో', 'బైమాన్‌ లవ్‌' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లోకి అడిగిన దగ్గర్నుంచి సన్నీకి సర్వత్రా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. ఆ ప్రశంసలే ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావడానికి దోహద పడుతున్నాయని అంటున్నారు ఆమె సన్నిహితులు.

 

07:52 - March 20, 2016

నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దర్శకుడితోపాటు టైటిల్‌ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. 'గమ్యం', 'కృష్ణంవందే జగద్గురుం', 'కంచె' చిత్రాలతో వైవిధ్య చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న క్రిష్‌ బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రానికి తొలుత 'గౌతమి పుత్ర శాతకర్ణి' టైటల్‌ అనుకున్నారు..కాని దాన్ని 'యోధుడు'గా మార్చే అవకాశం ఉందట. దాదాపు 60కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అదనపు ఆకర్షణలున్నాయట. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈచిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు మే నెల నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది.

07:51 - March 20, 2016

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాలీవుడ్‌ సినిమాలకు సదరు దర్శక, నిర్మాతలు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఈ సంప్రదాయం అడపాదడపా బాలీవుడ్‌లోనూ కనిపిస్తుంది. తెలుగులో నాట కూడా అత్యవసర పరిస్థితుల్లోనూ చేసిన సందర్భాలున్నాయి. ఈ ఇన్సూరెన్స్ చేయించే ప్రాసెస్‌లోనూ రజనీకాంత్‌ తన సత్తా చాటారు. రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో అత్యంత భారీ వ్యయంతో 'రోబో 2.0' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. అందరూ ఆశ్చర్యపోయేలా 350 కోట్లరూపాయలకు ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ఇన్సూరెన్స్ చేశారు. దక్షిణాదిన ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసిన సినిమాగా రజనీ సినిమా నిలవడం విశేషం. 

07:49 - March 20, 2016

సమ్మర్‌ సీజన్‌.. ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతోపాటు వేసవి వినోదం కూడా ఊపందుకుంటోంది. ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు పుష్కలంగా వినోదాన్ని అందించేందుకు దర్శక, నిర్మాతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకుల్ని బాగా ఎట్రాక్ట్ చేసి హిట్లు కొట్టాలని చిన్న హీరోల దగ్గర్నుంచి పెద్ద హీరోల వరకు ఈ వేసవి బరిలో అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జయాపజయాల విషయం ఎలా ఉన్నా.. మండే ఎండలు, పరీక్షలు, క్రికెట్‌.. ఈ మూడు అవరోధాల్ని ఈ సీజన్‌లో విడుదలయ్యే ప్రతి సినిమా తప్పించుకోవాల్సిందే. వీటితోపాటు పరభాషా చిత్రాల తాకిడిని కూడా తెలుగు సినిమాలు తట్టుకోవాల్సి ఉంది. ఈసారి వేసవి వినోదం ఖర్చు దాదాపు 550 కోట్ల రూపాయల పైమాటే. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయగలమనే నమ్మకంతో భారీ బడ్జెట్‌ పెట్టేందుకు కూడా నిర్మాతలు వెనకాడలేదని వేరే చెప్పక్కల్లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 'నేను శైలజ', 'నాన్నకు ప్రేమతో', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'మలుపు', 'టెర్రర్‌' వంటి చిత్రాలు ప్రేక్షకుల మెప్పుని పొందాయి. వీటి మాదిరిగానే హిట్లు కొట్టేందుకు ఈ సమ్మర్‌ సీజన్‌లో 'సై' అంటున్న చిత్రాలేమిటో ఓసారి చూద్దాం..

విడుదలైన పలు చిత్రాలు..
ఈ మార్చి నెలలో ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. వీటి తర్వాత 'రన్‌' చిత్రం ఈనెల 23న విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్‌కిషన్‌, అనీషా ఆంబ్రోస్‌ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రానికి మాతృక తమిళ 'నేరమ్‌'. ఈ యేడాది సంక్రాంతి బరిలో దిగి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన అక్కినేని నాగార్జున అదే ఉత్సాహంతో ఈనెల 25న 'ఊపిరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పివిపి పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మించిన చిత్రమిది. ఫ్రెంచ్‌ సినిమా 'ద ఇన్‌టచ్‌బుల్స్' చిత్రం ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏప్రిల్‌ నెలలో కూడా పలు చిన్నా పెద్ద చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నారారోహిత్‌ నటించిన 'సావిత్రి' చిత్రం ఏప్రిల్‌ 1న విడుదలవుతోంది. ఈమధ్యనే నారా రోహిత్‌ 'తుంటరి'గా ప్రేక్షకుల్ని అలరించాడు. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొందిన 'సావిత్రి' చిత్రంలో నారా రోహిత్‌ సరసన నందిత నటించింది. క్యూట్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఈ చిత్రం రాబోతోంది.దీని తర్వాత ఇదే నెలలో మంచు మనోజ్‌ నటించిన 'ఎటాక్‌', సుమంత్‌ అశ్విన్‌ నటించిన 'రైట్‌ రైట్‌' చిత్రాలు విడుదలకు సమాయత్తం అవుతున్నాయి.

ఏప్రిల్ 8న సర్ధార్..
ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 8న పవన్‌కళ్యాణ్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' విడుదల కానుంది. పవన్‌కళ్యాణ్‌ సరసన తొలిసారి కాజల్‌ నటించిన ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ ఓ స్పెషల్‌ సాంగ్‌లో ప్రేక్షకుల్ని అలరించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత మరోమారు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కనిపించున్నారు. అటు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లోను, ఇటు ప్రేక్షకుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలోనూ అదే రోజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల గ్యాప్‌ తర్వాత మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రాలు పోటీగా సిద్దమవుతున్నాయి. వీటిల్లో ముందుగా నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఏప్రిల్‌ ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన రెండో చిత్రమిది. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతమందించిన ఈ చిత్రం తమిళంలోనూ శింబు హీరోగా రూపొందుతోంది. ఇక 'సరైనోడు'గా అల్లు అర్జున్‌ బరిలోకి దిగనున్నారు.

ఏప్రిల్ 29న బ్రహ్త్సోవం..
అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన ఈచిత్రంలోని పాటలను ఏప్రిల్‌ 1వ తేదీన నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. శరవేగంగా షూటింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యాక్షన్‌ ప్యాక్డ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌, ఫస్ట్ లుక్‌లు ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వేసవి బరిలో అమీతుమీ తేల్చుకోనుంది. దీని తర్వాత సరిగ్గా ఓ వారం రోజుల గ్యాప్‌తో 'బ్రహ్మోత్సవం' చిత్రంతో మహేష్‌బాబు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఏప్రిల్‌ 29న విడుదలయ్యే ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన సమంత, కాజల్‌, ప్రణీత నటిస్తున్నారు. మిక్కీ.జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 10న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు యోచిస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని పివిపి నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.


25 చిత్రాలు..
ఈ సినిమాలతోపాటు మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ నటించిన 'ఈడోరకం- ఆడోరకం' చిత్రాన్ని కూడా ఏప్రిల్‌ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌, సోనారిక, హేబాపటేల్‌ హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయికార్తీక్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందిన 'సుప్రీమ్‌' చిత్రం కూడా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుందని సమాచారం. సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీటి తర్వాత మే నెలలో నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అ..ఆ' చిత్రం, నాని, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంతోపాటు రజనీకాంత్‌ నటించిన ద్విభాషా చిత్రం 'కబాలి', సూర్య నటించిన మరో ద్విభాషా చిత్రం '24' విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా ఇదే సీజన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మొత్తమ్మీద 75 రోజుల కాల వ్యవథిలో దాదాపు 55 0కోట్ల రూపాయల వ్యయంతో 25కి పైగా చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

సత్తా చాటాలంటే అడ్డంకులు అధిగమించాల్సిందే..

రకరకాల స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌తో ఈ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాలకు మండేఎండలు, వరల్డ్‌ కప్‌ టి20, వివిధ పోటీ పరీక్షలు, పరభాషా చిత్రాల తాకిడి తదితర అడ్డంకులు గట్టి సవాల్‌నే విసురుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. థియేటర్‌కొచ్చి సినిమా చూసే ప్రేక్షకులపై ఈ మండే ఎండల ప్రభావం ఎంతో కొంత ఉండక తప్పదు. ఇప్పటికే కొన్ని పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు మరికొన్ని పరీక్షల కోసం విద్యార్థులు ముమ్మరంగా ప్రిపేర్‌ అవుతున్నారు. అలాగే క్రికెట్‌కి సంబంధించి వరల్డ్‌కప్‌ టి20 ఇప్పటికే షురూ అయింది. దీనికితోడు వచ్చే నెల నుంచి ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచెస్‌ స్టార్ట్‌ కానున్నాయి. కలెక్షన్ల వసూళ్ళపై ఎంతో కొంత ప్రభావం చూపించే ఈ అడ్డంకులతోపాటు పరభాషా చిత్రాల విడుదల కూడా తెలుగు సినిమాలకు ఒక అవరోధంగా నిలవనుంది. వీటిల్లో ముఖ్యంగా 'రాకీ హ్యాండ్సమ్‌', కరీనా కపూర్‌ నటించిన 'కీ అండ్‌ కా', సన్నీలియోన్‌ 'ఒన్‌ నైట్‌ స్టాండ్‌', షారూఖ్‌ ద్విపాత్రాభినయం చేసిన 'ఫ్యాన్‌', ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రధారిణిగా నటించిన బయోపిక్‌ 'సరబ్‌జీత్‌', అమితాబ్‌బచ్చన్‌, విద్యాబాలన్‌ ముఖ్యపాత్రధారులుగా నటించిన 'తీన్‌' వంటి బాలీవుడ్‌ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాయి. అలాగే జీవా, నయనతార నటించిన 'తిరునాళ్‌', విజరు, సమంత, అమీజాక్సన్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'థెరి', జి.వి.ప్రకాష్‌కుమార్‌ 'బ్రూస్‌ లీ' తదితర తమిళ చిత్రాలు కూడా తెలుగునాట విడుదలై గట్టిపోటీ ఇవ్వనున్నాయి.

07:45 - March 20, 2016

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన సమస్యలను దూరం చేసుకోవచ్చట. ముఖ్యంగా మహిళలు రోజూ కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్‌పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగు శక్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల కావలసిన శక్తి అందుతుంది. ఎండు ద్రాక్షలో బి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే గర్భిణులు ద్రాక్షపండ్లను తీసుకోవడం వల్ల గర్భంలోని శిశువుకు కావలసిన శక్తి లభిస్తుంది. ఎండు ద్రాక్షని పాలల్లో కలిపి వేడిచేసి తాగడం వల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని గోరు వెచ్చని నీటిలో వేసుకొని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే ఎండుద్రాక్ష తింటే మేలుకదా అని అలాగే తినేయకుండా వాటిని నీటిలో వేసి కడిగి తింటే మరింత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

07:44 - March 20, 2016

ఆధునిక జీవన విధానం గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో శరీర భాగాల్లో అన్నింటికన్నా వేగంగా పాడవుతున్న భాగం గుండె. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజూ 45 నుంచి 60 నిమిషాలు నడకకు కేటాయించాలి. నడిచేటపుడు కాస్త వేగాన్ని పెంచి నడిస్తే మంచిది. ఒక వేళ మధ్యమధ్యలో నడకను కొనసాగించలేకపోయినట్లయితే కనీసం వారంలో మూడు రోజులైనా దీనికి సమయాన్ని కేటాయించాలి.
తీసుకునే ఆహారంలో శాకాహారం ఎంతో మేలు చేస్తుంది. ఇక మాంసాహారాన్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. తరచూ కోడిమాంసం తినేవారు ఆ అలవాటును వారానికి ఒకసారికే పరిమితం చేసుకోవాలి. చేప మాంసాన్ని ప్రతి రోజూ తీసుకున్నా పర్వాలేదు.
ఉప్పు, నూనెలు అధికంగా వాడిన పదార్థాలను ఏమాత్రం తీసుకోకూడదు. పొగతాగే అలవాటున్నవారు ఆ అలవాటును మానుకోవాలి. బరువులో మార్పులు రానివ్వకూడదు. మత్తు పానీయం తీసుకునేవారు ఆ అలవాటుకు స్వస్తి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇక చిప్స్, పిజ్జాల వంటి జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా నిషేధించాలి.

07:43 - March 20, 2016

వేసవికాలం.. బరువు తగ్గాలనుకొనే వారికి ఇది సరైన సమయం. దీనికి అందరూ ఎంచుకునే మార్గం డైటింగ్‌. కానీ బరువు తగ్గాలనుకునేవారు కొవ్వును కరిగించే పదార్థాలతో పాటు పోషకాలున్న పదార్థాలైన కూరగాయలు, పండ్లను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం, కూరగాయలు, పండ్ల మోతాదును ఆహారంలో పెంచుకుంటే వాటిలో ఉండే పీచు వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా అందుతాయి.
'ఉన్న సమయం కాస్త ఇంటి పనులతోనే సరిపోతుంది. అదీకాక పిల్లలకు సెలవులు. దాంతో అన్ని చక్కబెట్టుకొని ఆఫీసుకి వెళ్లేసరికి కొన్నిసార్లు లేట్‌ కూడా అవుతుంది. ఇక వ్యాయామం, ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలు అంటూ లెక్కలేసుకొని తినే సమయం ఎక్కడుంటుంది' అంటుంటారు చాలామంది. కానీ వీటివల్ల అనుకున్న ఫలితాలు లభించవు. రోజూ పనిలో భాగంగానే పొద్దున్నే ఒక అరగంట ముందు లేచి వాకింగ్‌కి వెళితే.. అది కూడా వ్యాయామమే. అది కాదంటే మరోటి.. ఏదైనా ఒక అరగంట వ్యాయామానికి కేటాయించడం ముఖ్యం.

ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 బస్సులను సీజ్ చేశారు. 

06:42 - March 20, 2016

చెన్నై : ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత మంచి పాత్ర చేశామన్నదే ముఖ్యమని వెండితెర నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఇకపై ప్రతి సినిమా ఒక్కో పాత్రతో గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలని ఊపిరి చేశామన్నారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఊపిరి తమిళ వెర్షన్‌ తోళ చిత్ర మీడియా సమావేశం జరిగింది. మంచి పాత్రలతో ముందుకు వెళ్లాలన్న ధ్యేయంతోనే ఊపిరిలో నటించానని నాగ్‌ చెప్పారు. ఊపిరిలో ఆ పాత్ర చేయడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, కానీ చిత్రం చూశాక తనను చూసి గర్విస్తారని ఆయన అన్నారు. 

06:41 - March 20, 2016

ఉత్తరాఖండ్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రమాదం ముంచుకొచ్చింది. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపి పంచన చేరడంతో సంక్షోభం ముదిరింది. పైకి మాత్రం తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ ధీమాగా చెబుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ పరిస్థితి ఇక్కడ కూడా రిపీట్‌ అవుతుందా? ఉత్తరాఖండ్‌లో హరీష్‌ రావత్‌ ప్రభుత్వం ఊగిసలాడుతోంది. మాజీ సిఎం విజయ్‌బహుగుణ, ప్రస్తుత క్యాబినెట్‌ మంత్రి హరక్‌ సింగ్‌ రావత్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు 27 మంది బిజెపి ఎమ్మెల్యేలు ఢిల్లీలోని ఓ హోటల్‌లో తిష్ట వేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో భేటి అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి డెహ్రాడూన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. 27 మంది బిజెపి ఎమ్మెల్యేలు గవర్నర్‌ కె కె పాల్‌ను కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బిజెపి పక్షాన చేరారు. బడ్జెట్‌ ఆమోదించేందుకు ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం జరిగింది. స్పీకర్‌ ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో సభను మార్చి 28 వరకు వాయిదా వేశారు.

అవకాశం ఇవ్వాలన్న బీజేపీ..
ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ నైతికంగా బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని మాజీ సిఎం విజయ్‌ బహుగుణ డిమాండ్‌ చేశారు. మరో తిరుగుబాటు నేత హరక్‌ సింగ్‌ రావత్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనతో సంప్రదిస్తున్నారని.... వారు కాంగ్రెస్‌ను వీడిపోరన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం 76 మంది ఎమ్మెల్యేలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులున్నారు. ప్రభుత్వానికి కావలసిన మేజిక్‌ ఫిగర్‌ కన్నా ఒకే ఒక ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్నారు. బిజెపికి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. తమకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.

06:35 - March 20, 2016

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన టెన్త్ విద్యార్థి అభయ్‌ కిడ్నాప్, హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రధాన నిందితుడు సాయితో పాటు మరో ఇద్దరిని విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడిని కిడ్నాప్‌,హత్యకు ముందస్తు వ్యూహం ఏదీ లేదని.. కేవలం డబ్బు కోసమేనన్న విషయం బట్టబయలైంది. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో కూపీ లాగిన పోలీసులకు కొత్త కోణం వెలుగుచూసింది. నిందితులు కేవలం డబ్బు కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సీసీటీవీ పుటేజీలో రికార్డయిన అభయ్‌ను బైక్‌పై తీసుకెళ్తున్న వ్యక్తిని బాలుడి పేరెంట్స్ గుర్తించారు. ఇంటి సమీపంలో ఉండే సాయి అలియాస్‌ శేషుగా వారు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పెంచారు. కిడ్నాపర్ల కాల్‌డేటా ఆధారంగా విచారించడంతో డొంకంతా కదిలింది. విశాఖపట్నంకు చెందిన సాయి...హైదరాబాద్ షాహి-ఇనాయత్‌గంజ్‌ లో రాజ్‌ కుమార్‌ ఇంటిపక్కనే కొన్నాళ్లుగా నివాసముంటున్నాడు. వ్యాపారి రాజ్‌ కుమార్‌ ఆర్థిక లావాదేవీలపై కన్నేసి పూర్తి సమాచారం రాబట్టాడు. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ కొడుకు అభయ్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 16న హోటల్‌ వెళ్లిన బాలుడిని కిడ్నాప్‌ చేశారు.

పది కోట్లు డిమాండ్..
అభయ్‌ తండ్రికి ఫోన్ చేసి మొదట 10 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..చివరకు 5 కోట్లు ఇవ్వాలన్నారు. కానీ బేరసారాలు కుదరకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. తమ గుట్టు బయటపడుతుందనే భయం వారిని వెంటాడింది. దీంతో అభయ్‌ను కిరాతకంగా హతమార్చి డెడ్‌బాడీని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ దగ్గర పడేశారు. రైల్వే స్టేషన్ సమీపం నుంచి చివరిసారిగా అభయ్‌ తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అక్కడి నుంచి రైలు ఎక్కి ఉత్తరాంధ్రకు పారిపోయినట్లు టవర్‌ లొకేషన్‌ ద్వారా గుర్తించారు. విశాఖపట్నంలో సాయితో పాటు మరో ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. 

06:32 - March 20, 2016

హైదరాబాద్ : కేసుల విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడం న్యాయవ్యవస్థకు సవాల్‌ గా మారిందన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే. ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర స్థాయి జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సదస్సులో... బాధితులకు సత్వర న్యాయ సేవలను ఎలా అందించాలన్నదానిపై.. న్యాయమూర్తులు... సలహాలు, సూచనలు అందించారు.
పదేళ్ల తరువాత నిర్వహించిన స్టేట్ లెవల్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు ఇరు రాష్ట్రాలకు చెందిన 900 పైగా న్యాయమూర్తులు హాజరయ్యారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, కక్షిదారులకు అందించే సేవలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ దీపక్ మిశ్రాలు న్యాయవాదులకు పలు సూచనలు, సలహాలు అందించారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కొత్త రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల కోసం ప్రత్యేక సదుపాయలతో వసతి సౌకర్యాలు కలుగజేస్తామన్నారు.

న్యాయమూర్తుల పాత్ర ఎంతో కీలకం..
న్యాయస్థానాన్ని ప్రజలు దేవాలయాలుగా భావిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఆధ్వర్యంలో కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం సంతోషమని అభినందించారు. కేసులను సత్వరం పరిష్కరించి కక్షిదారులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంతో కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే అన్నారు. న్యాయం చేకూర్చి బాధితుల కష్టాలను తీర్చడం ఒక మహోన్నతమైన కర్తవ్యమన్నారు. పాజిటివ్‌ ఆలోచనలతో కేసులను పరిశీలించాలని న్యాయమూర్తులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 6 సెషన్స్ పై చర్చించనున్నారు. 

06:29 - March 20, 2016

హైదరాబాద్ : 2016-17 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ శాసనమండలిలో వాడివేడీ చర్చ జరిగింది. బడ్జెట్‌ పద్దులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించాయి. ఆచరణ సాధ్యం కాని అంశాలతో హామీలతో పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విపక్షాల విమర్శలను అధికారపక్షం తిప్పికొట్టింది. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని అధికారపక్షం సమర్ధించుకుంది. తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా పలు అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, రైతు రుణాల మాఫీ, అన్నదాత ఆత్మహత్యలు వంటి అంశాలపై విపక్షాలు సర్కార్‌పై దాడికి ప్రయత్నించాయి. దీనికి ప్రతిగా అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సభ్యులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలపక్షాన లేదని కాంగ్రెస్‌ సభ్యులు విమర్శించారు. పూర్తిగా కాంట్రాక్ట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత శాసనమండలిని వాయిదా వేశారు. ఆదివారం కూడా బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. 

06:27 - March 20, 2016

హైదరాబాద్ : గోదావరిపై నిర్మించనున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ది కేంద్రంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గోదావరి పరివాహాక జిల్లాల కలెక్టర్లు, సాంకేతిక నిపుణులు సమావేశమయ్యారు. భేటీలో ముంపు, అటవీ, పర్యావరణ అనుమతులపై చర్చ జరిగింది. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో నిర్మించే బ్యారేజీకి అభ్యంతరం లేదని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో అపోహలు తొలగించేందుకు మరింత చర్చించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. 

06:26 - March 20, 2016

కోల్ కతా : ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత్‌ మరోసారి ఘన విజయం అందుకుంది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనీసేన నిలకడగా ఆడి 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ వర్షం కారణంగా 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌ తొలుత తడబడినా విరాట్‌ కోహ్లి 37 బంతుల్లో 55 నాటౌట్‌, యువరాజ్‌ సింగ్‌ 23 బంతుల్లో 24 పరుగులు చేసి పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే కీలక సమయంలో యువరాజ్‌ ఔటైనా.. చివర్లో కెప్టెన్‌ ధోని 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

నేడు ఢిల్లీకి మంత్రి హరీష్ రావు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం అమలుపై కేంద్రం జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో మంత్రి హరీష్ సభ్యుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ పథకంపై ఆదివారం నాడు జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 

రేపు టి. అసెంబ్లీ ముందుకు బిల్లులు..

హైదరాబాద్ : శాసనసభలో బడ్జెట్ పై చర్చ శనివారం ముగిసింది. సభ్యుడు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారు. అనంతరం సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సంక్షేమానికి చెందిన డిమాండ్లపై చర్చ జరగనుంది. సోమవారం నాడు సభ ముందుకు వ్యాట్ కు చెందిన మూడు బిల్లుల, పురపాలనకు చెందిన రెండు బిల్లులు రానున్నాయి. 

నేడు శాసనమండలిలో బడ్జెట్ పై ఈటెల సమాధానం..

హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై శాసనమండలిలో శనివారం చర్చ ముగిసింది. ఆదివారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.

 

నేడు 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఆడియో విడుదల..

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఆడియో నేడు విడుదల కానుంది. సాయంత్రం నోవాటెల్ లో ఆడియో ఫంక్షన్ కార్యక్రమం జరగనుంది. పాస్ లు లేని వారు ఆడియో ఫంక్షన్ కు రావొద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

రేపటి నుండి పదో తరగతి పరీక్షలు..

హైదరాబాద్ : సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9వ తేదీతో ముగుస్తాయి. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 11,181 స్కూళ్ల నుంచి 5,56,757 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తంగా 2615 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

నేటి నుండి కాంగ్రెస్ బస్సు యాత్ర..

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వినయ్‌కుమార్ తెలిపారు. 

దేశ వ్యాప్తంగా నేటి నుండి మధుమేహం పరీక్షలు..

ఢిల్లీ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రత్యేక సామూహిక మధుమేహ పరీక్షలను ప్రారంభించనుంది. ఏప్రిల్ 5 వరకు 17 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 1,698 ఐఎంఏ కేంద్రాలలో శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

భారత్ విజయం..

కోల్ కతా : టీ -20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. కోహ్లీ 55, యువరాజ్ 24 పరుగులు, ధోనీ 13 పరుగులు, రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ ఆరు పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. 

Don't Miss