Activities calendar

21 March 2016

21:33 - March 21, 2016

ఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోది విమర్శించారు. దళితులు, గిరిజనుల నుంచి రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని, రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఢిల్లీ అంబేడ్కర్‌ జాతీయ స్మారక స్తూపానికి మోది శంకుస్థాపన చేశారు. దేశంలోని ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలని అంబేడ్కర్‌ కోరుకునేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ వెబ్‌పోర్టల్‌ను ప్రధాని ప్రారంభించారు. 

21:32 - March 21, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చారు. ఆదివారం జెఎన్‌యులో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపితో పాటు సొంతపార్టీలోను విమర్శలు వచ్చాయి. భగత్‌సింగ్‌ ఒకే ఒక్కరని--- ఆయనను ఎవరితోనూ పోల్చలేమని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. శశిథరూర్‌ కన్హయ్యను భగత్‌సింగ్‌తో పోల్చడం సిగ్గుచేటని బిజెపి ధ్వజమెత్తింది. 'భారత్‌ మాతాకీ జై' అనాలా వద్దా అన్నది జాతీయవాదం నిర్ణయిస్తుందని శశిథరూర్‌ అన్నారు. 

21:30 - March 21, 2016

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో రాజకీయం ఢిల్లీకి చేరింది. బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిశారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రణబ్‌ను కలిశారు. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న కారణంతో మాజీ సిఎం విజయ్‌ బహుగుణ కుమారుడు సాకేత్‌ను కాంగ్రెస్‌ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు సిఎం హరీష్‌ రావత్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌ నేతలతో సమావేశం కానున్నారు. 

21:24 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో పలు రకాల బిల్లులపై చర్చ జరిగింది. వ్యాట్ సవరణ బిల్లుతో పాటు.. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక సభలో సంక్షేమ పద్దులు, ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలపై చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ, సీపీఎం సభ్యులు రవీంద్రకుమార్‌, సున్నం రాజయ్య అన్నారు. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలు పెంచాలని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఇక ప్రభుత్వ చర్యలతో సంక్షేమ రాష్ట్రంగా ఉండాల్సిన తెలంగాణ.. సంక్షోభ రాష్ట్రంగా మారుతుందేమోనని అనుమానంగా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై....

ఇక పలువురు సభ్యులు ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై అడిగిన ప్రశ్నలకు మంత్రి కడియం సమాధానమిచ్చారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా.. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విద్యావిధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.

యాదగిరిగుట్ట అభివృద్ధిపై....

ఇక యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ జవాబిచ్చారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్‌.

సర్కార్‌ చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించిన అక్బరుద్దీన్‌.....

సర్కార్‌ చేస్తున్న అభివృద్ధిని అక్బరుద్దీన్‌ ప్రశంసించారు. ఇక సంక్షేమ పద్దులపై చర్చ సందర్భంగా గీతారెడ్డి, మంత్రి హరీష్‌రావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని గీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. గీతారెడ్డి క్షమాపణ చెప్పాలని.. ఆమె వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు

ఇందిరమ్మ బిల్లులు, సబ్‌ప్లాన్‌ల నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదని ....

ఇక ఆ తర్వాత.. ఇందిరమ్మ బిల్లులు, సబ్‌ప్లాన్‌ల నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదని నిరసన తెలియజేస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం పలు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. అనంతరం స్పీకర్‌ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

21:21 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల వేతనం మూడున్నర లక్షలకు చేరనుంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ జీతభత్యాలు పెంచాలని కోరుతున్న సభ్యుల విజ్ఞప్తిపై అసెంబ్లీ కమిటీ సానుకూలంగా స్పందించింది.

జీతాల పెంపుపై చర్చించేందుకు...

శాసనసభ్యులకు జీతాల పెంపుపై చర్చించేందుకు శాసనసభ సౌకర్యాల కమిటీ అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్‌తో పాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని వస్తువుల ధరల పెరిగాయని, వాటికనుగుణంగా తమ జీతభత్యాలు పెంచాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు.

ప్రస్తుతమున్న లక్షా 25 వేల నుంచి మూడున్నర లక్షలకు....

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు ప్రస్తుతమున్న లక్షా 25 వేల నుంచి మూడున్నర లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వాహన రుణాన్ని 15 లక్షల నుంచి 40 లక్షలకు పెంచాలని కూడా సిఫారసు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను 50 వేల నుంచి 65 వేలకు పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. వీటితో పాటు అపరిమిత ఉచిత వైద్యసేవలను కల్పించాలని శాసనసభ్యులు కోరారు. ఎమ్మెల్యేల పీఎ జీతం నెలకు పదివేల నుంచి 20 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. నూతన క్వార్టర్లు నిర్మించాలని ఎమ్మెల్యేలు కోరారు.

ఎమ్మెల్యే క్వార్టర్‌ల కోసం 125.33 కోట్లు.....

హైదర్‌గూడలో నూతనంగా నిర్మించే ఎమ్మెల్యే క్వార్టర్‌ల కోసం 125.33 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజెందర్‌ తెలిపారు. లక్షా 25 వేల చదరపు అడుగులతో నూతన ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 120 వాచ్‌మెన్‌ క్వార్టర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. జీతాల పెంపునపై సభ్యుల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన స్పీకర్‌ మధుసూదనాచారి.. వాటిని ప్రభుత్వానికి పంపనున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత సమావేశాల్లోనే వీటిపై నిర్ణయం వెలువడే అవకాశముంది.

కావూరి నివాసం ఎదుట బ్యాంకు ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు నివాసం ఎదుట పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కావూరి రూ.160కోట్లకు పైగా బకాయిపడిన విషయం తెలిసిందే.

ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం..

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (ఎఐ840) విమానం ఆలస్యం కానుంది. పరిమితికి మించి 11 మంది ప్రయాణికులకు బోర్డింగ్ ఇవ్వడంతో మిగతా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ 11మందిని మరో విమానంలో ఢిల్లీ చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

20:40 - March 21, 2016

దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో వుంది. ఇది సినిమా డైలాగ్ కాదు... వాస్తవం. యాభైవేలు లేక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. నిత్యావసరాలు కొనలేక కోట్లాది మంది విలవిలలాడుతున్నారు. చిన్నా చితక అప్పులే కాల్ మనీ గా ఉసురు తీస్తున్నాయి. కనీస వేతనం కై వీపుల పై లాఠీలు విరిగినా నినాదాలు ఆగడం లేదు. దేశం ఇలాంటి పరిస్థితులు వున్న తరుణంలో ఎన్నో సౌకర్యాలు, భద్రత, విఐపీ ట్రీట్ మెంట్ అందుకునే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీతాలను లక్షల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం వుందా? అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మన నేతలు వున్నారా? ఇదే అంశాలపై నేటి వైడాంగిల్ స్టోరీ... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:17 - March 21, 2016

హైదరాబాద్: బడిచదువు బతుకు చదివిన అసెంబ్లీ... సర్కార్ ను వశపోకుండా చేసిన వంశీ, యాదగిరి గుట్ట మీద వలపోసుకుంటున్న జనం, పాలకమండలికి లీడర్లు అంటే మహాప్రాణం, తణుకు జనానికి వణుకు పుట్టిస్తున్న లేడీస్.. బట్టల దుకాణ లో బట్టలన్నీ కలాస్, అన్నంపెట్టిండని .. సున్నం పెట్టిన పోలీస్, అన్నలపేరుతో ఆగమైతున్న బతుకులు, బరువు తగ్గి బక్కగయిన అనంత అంబానీ... చేతిలో పైకముంటే ఇదో లెక్కనా గానీ, పాకిస్తాన్ లో కిరికిరి పెట్టిన క్రికెట్ ఆట, ఛాయిద్ అఫ్రిది వస్తే తోలుతీస్తరట ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మసాలా ముచ్చట్లు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:53 - March 21, 2016

హైదరాబాద్ : ప్రజాస్వామిక ఉద్యమాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే వారి తరపున పోరాడే శక్తుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఆందోళనలకు అనుమతులు నిరాకరిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై వామపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే...పెద్ద ఎత్తున సర్కార్‌పై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత బి.శ్రీరాములు, సీపీఎం నేత సిహెచ్ బాబూరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:17 - March 21, 2016

హైదరాబాద్ :నల్గొండలో.. కాషాయమూక పెట్రేగిపోయింది. ఓ ఇంట్లో సమావేశమైన క్రిస్టియన్ పాస్టర్లపై... ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్లపై.. విచక్షణ రహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఫాస్టర్ ప్రభాకర్ సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు.. మహిళలను కూడా వదలకుండా అసభ్యంగా అవమానించి.. కులం పేరుతో దూషించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి సహా.. పలువురు వామపక్ష నేతలు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకమరన్నారు. మరోవైపు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా.. పది వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. విధ్వంసం ద్వారా బలపడాలన్న బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తుల కుట్రల్లో భాగంగానే నల్లగొండ ఘటన జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాతంత్ర, లౌకిక వాదులంతా నిరసనలు వ్యక్తం చేయాలని.. నల్లగొండ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు. 

చర్చిఫార్లపై దాడి దురదృష్టకరం :జూలకంటి

నల్గొండ : పట్టణంలోని ఎస్ ఎల్ బీసీ ఓ ఇంట్లో సమావేశమైన ఫాదర్లపై ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫాస్టర్ ప్రభాకర్ సహా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చర్చి ఫాదర్లపై దాడి దురదృష్టకరమని వామపక్ష నేతలు అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటన గత రాత్రి జరిగింది.

ప్రాజెక్టులపై ఏకపంక్షంగా వ్యవహరిస్తోంది: ఉత్తమ్

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్ట్ పలు అనుమానాలకు తావిస్తోందని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టులో దేశంలోనే పెద్ద అవినీతి జరుగుతోందన్నారు. అవినీతికి పాల్పడిన వారికే మళ్ళీ కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహితపై ఇంజినీర్ల కమిటీ రిపోర్ట్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ ఎత్తు ఎందుకు తగ్గించారని, దీనిపై సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలను పెంచి నామినేషన్‌పై ఎలా ఇస్తారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిలదీశారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ రేపటి (మంగళవారం)కి వాయిదా పడింది. అసెంబ్లీలో ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరో అవకాశం ఇస్తున్నట్లు యనమల తెలిపారు. అప్పటి వరకు రోజాపై సస్పెన్షన్‌ను కొనసాగించాలని స్పీకర్‌ను ఆయన కోరారు. అయితే కొడాలి నాని విషయం శాసనసభ నిర్ణయం తీసుకుంటుందని యనమల తెలిపారు. జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి క్షమాపణలు చెప్పారని ఆయన తెలిపారు.

రేపు సభకు వెళ్తాం:వైసీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : రేపు(మంగళవారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ..ఈ రోజు సభ జరిగిన తీరు భాకరమని .. రోజాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు రోజా అంటే భయం అని.. రాజకీయంగా ఎదుర్కోలేక రోజాను హింసిస్తున్నారని ఆరోపించారు. ప్రివిలేజ్ కమిటీకి 20 నోటీసులు ఇచ్చామని ఒక్క నోటీసునూ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అధికార పంక్షం ఇచ్చే నోటీసులే ముఖ్యమా అని ప్రశ్నించారు.

18:46 - March 21, 2016

హైదరాబాద్ :

ఏపీ అసెంబ్లీ రోజాకు మరో అవకాశాన్నిచ్చింది. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై... తన సస్పెన్షన్‌పై వాదనను వినిపించుకోవచ్చని సూచించింది. ఈరోజూ.. అసెంబ్లీ సమావేశాలు రోజా సస్పెన్షన్‌ అంశంపైనే సాగింది. ఈ చర్చలో 15 మంది సభ్యులు 4 గంటల పాటు మాట్లాడారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఈ చర్చను బహిష్కరించింది.

రోజాపై సస్పెన్షన్ అంశంపై ....

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ అంశంపై ప్రివిలేజ్‌ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ సాగింది. రోజాపై సస్పెన్షన్‌ వేటు కొనసాగుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈమేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే.. ఇప్పటివరకూ మూడు సార్లు పిలిచినా ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరు కాని రోజాకు.. మరో అవకాశాన్ని ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించింది.

ప్రివిలేజ్‌ కమిటీ విచారణను ఎదుర్కొన్న ....

ప్రివిలేజ్‌ కమిటీ విచారణను ఎదుర్కొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ్యోతుల నెహ్రూలపై ఎలాంటి చర్య తీసుకోరాదని.. క్షమాపణ కోరినందున వారి అంశాన్ని ఇంతటితో ముగించాలని నిర్ణయించింది. అయితే ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్య విషయంలో వెనక్కి తగ్గరాదని సభ తీర్మానించింది. కొడాలి నాని ఇచ్చిన వివరణతో ప్రివిలేజ్‌ కమిటీ సంతృప్తి చెందనందున ఆయనపై చర్య తథ్యమని.. అయితే.. ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై సభానిర్ణయమే అంతిమమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

రోజా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారని...

సస్పెన్షన్ వ్యవహారంలో రోజా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యో రోజాకు మరో అవకాశం ఇచ్చిందని అన్నారు. అసంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభకు రాకపోవడం నిజంగా దురదృష్టకరం అన్నారు. ఇదిలా ఉంటే రోజా వ్యవహారంపై జరిగిన చర్చలో 15మంది నాయకులు పాల్గొన్నారు. వీరిలో ప్రధానంగా ఎమ్మెల్యే వెలగపూడి అనిత మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా తనపట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా రోజా తీరును తప్పుబట్టారు.

అసెంబ్లీ ఇచ్చిన అవకాశాన్ని రోజా ఉపయోగించుకుంటారని.

ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అసెంబ్లీ ఇచ్చిన అవకాశాన్ని రోజా ఉపయోగించుకుంటారని.. వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే.. జగన్ అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం భేటీ అయ్యింది. రోజా అంశంపైనే సుదీర్ఘంగా చర్చించింది. మంగళవారం సభకు హాజరవ్వాలని.. రోజా కూడా ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం. 

తీర్పు రేపటికి వాయిదా...

రోజా సస్పెన్షన్ వ్యవహారంలో తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట నేడు వాదనలు ముగిశాయి. వాయిదాల అనంతరం ఈ కేసు తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 

18:44 - March 21, 2016

అనంతపురం : సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో...ఎమ్మార్వో తిమ్మప్ప ఆత్మహత్యాయత్నం చేశారు. రహదారి విషయంలో ఓ వర్గంతో మాట్లాడుతుండగా... మరో వర్గం విమర్శలు చేసింది. దీంతో మనస్థాపంతో తన చాంబర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా... కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. 

18:42 - March 21, 2016

తూర్పుగోదావరి :జిల్లాలోని దివాన్‌ చెరువు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. చెట్లు, ఆకులు ఎండిపోయి ఉండటంతో ఒక్కసారిగా అడవిలో మంటలు అంటుకున్నాయి. అటవీశాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

18:17 - March 21, 2016

హైదరాబాద్ : రెడ్‌ టేప్‌ విధానంపై యనమల స్పందించారు. తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు పోడియం ఎదుట రెడ్‌ టేప్‌ పెట్టానని అది దాటిన వారిని సస్పెన్షన్‌ వేటు పడేదని పేర్కొన్నారు. అయితే సభ్యుల విన్నపం మేరకు రెడ్‌ టేప్‌ తొలగించడం అయ్యిందని యనమల అన్నారు. అయితే రెడ్‌ టేప్‌ విధానం కాలగర్భంలో కలిసిపోలేదని అన్నారు. 

18:12 - March 21, 2016

హైదరాబాద్ : మంత్రి నారాయణతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అమరావతికి తరలింపుపై ఉద్యోగ సంఘాలు ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. జూన్‌ 25 వరకు సచివాలయం ఉద్యోగుల తరలింపు పూర్తవుతుందని అంచనా. ఈ విషయమై మరింత స్పష్టత కోసం... వచ్చే సోమవారం ప్రభుత్వంతో మరోసారి ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి.

మరొక్క అవకాశం: స్పీకర్ కోడెల...

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరొక్క అవకాశం ఇస్తున్నట్లు ఏపీ శాసనసభ తెలిపింది. అప్పటివరకూ ఆమెపై వున్న సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ కోడెల వెల్లడించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, శీధర్ రెడ్డిలు సభకు క్షమాపణ చెప్పినందున వారి క్షమాపణలను అసెంబ్లీ ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు. శాసనసభ వాయిదా అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానిపై సభ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పీకర్ కోడెల ప్రకటించారు. రోజాపై సస్పెన్షన్ పై ప్రివిలేజ్ కమిటీ నివేదకపై సభలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

18:07 - March 21, 2016

హైదరాబాద్ : ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. అర్ధశతాబ్ధికి పైగా ఎడమొహం.. పెడమొహం. కయ్యానికి కాలు దువ్వుతూ.. సై అంటే సై అనుకున్న వైనం. కానీ ఇప్పుడు టైం మారింది. గత చరిత్రను తిరగరాసేంత అద్భుతం ఆవిష్కృతమైంది. అగ్రరాజ్యం అమెరికా, కమ్యూనిస్టు కంట్రీ క్యూబా ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది..

చిరకాల ప్రత్యర్థులు....

చిరకాల ప్రత్యర్థులైన అమెరికా, క్యూబా దేశాల మధ్య చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పక్కా పెట్టుబడిదారీ దేశమైన అమెరికా, సామ్యవాదమే ఊపిరిగా ముందుకు పోతున్న కమ్యూనిస్టు దేశం క్యూబా మధ్య ఇంతకాలం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం క్యూబాకు ఒబామా....

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రెండు రోజుల పర్యటన నిమిత్తం క్యూబా వెళ్లారు. వాషింగ్టన్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం క్యూబాకు చేరుకున్నారు. ఒబామాకు క్యూబా అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో ఘన స్వాగతం పలికారు. ఒబామాతో పాటు ఆయన సతీమణి మిచెల్లీ, ఇద్దరు కూతుళ్లు వెంట ఉన్నారు.

దాదాపు 88 ఏళ్ల తర్వాత....

దాదాపు 88 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు క్యూబాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1929లో చివరిసారిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్‌ కూలిడ్జ్‌ క్యూబాలో పర్యటించారు. 1959లో అమెరికా అనుకూల బాటిస్టా ప్రభుత్వాన్ని తొలగించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి క్యూబా, అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బరాక్‌ ఒబామా, రౌల్‌ క్యాస్ట్రోల మధ్య 2014లో ఓ అవగాహన కుదిరింది. ఆ అవగాహన ప్రకారం క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పలు అంశాలపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు.....

ఈ పర్యటనలో పలు అంశాలపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదురనున్నాయి. టెలికమ్యూనికేషన్స్‌ , ఏయిర్‌లైన్‌ సేవలు, పలు కీలక చట్టాల అమలుతో పాటు పర్యావరణ పరిరక్షణపై ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. వాటితో పాటు పలు అంశాలపై క్యూబా అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రోతో ఒబామా అధికారిక చర్చలు జరపనున్నారు.

క్యూబాలోని పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటన....

ఒబామా రెండు రోజుల పర్యటనలో భాగంగా...క్యూబాలోని పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటించనున్నారు. ఒబామా పర్యటనతో అటు అమెరికా, ఇటు క్యూబాలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఒబామా పాలనలో సాధించిన అతిపెద్ద దౌత్య విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. తన క్యూబా పర్యటనను ఓ చారిత్రాత్మక సన్నివేశంగా వర్ణించారు బరాక్‌ ఒబామా.  

రోజాకు మరొక అవకాశం: మంత్రి యనమల..

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ముందు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరొక అవకాముందని దానిని ఆమె సద్వినియోగపరుకోవాలని మంత్రి యనమల సూచించారు. కాగా అప్పటి వరకూ ఆమెపై వున్న సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీపై సభలో జరుగుతున్న చర్చ సందర్భంగా యనమల పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ తెలిసిందే.

చిన్న సినిమాలకు 48 గంటల్లో అనుమతి: టి.కేబినెట్ ఉపసంఘం

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర అభివృద్ధిపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఇకపై చిన్న సినిమాలకు 48 గంటల్లో అనుమతులు ఇవ్వాలని ఈ సమావేశం నిర్ణయించింది. చిన్న సినిమాలకు ప్రతీ సినిమాహాలులోనూ ఐదు ఆట ప్రదర్శించాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా చిత్రపురి కాలనీలో 9 ఎకరాల స్థలాన్ని సినీకళాకారుల సంక్షేమానికి కేటాయించాలని, చిన్న సినిమాల విషయంలో 30 స్క్రీన్ల నిబంధనను 50 స్క్రీన్లకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.

17:40 - March 21, 2016

రంగారెడ్డి : కొంపల్లి శివసాయి బాయ్స్ హాస్టల్‌లో కలకలం రేగింది. బీటెక్ సెకండియర్ విద్యార్థి రాకేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో వెనకబడి తల్లిదండ్రులకు భారంగా ఉన్నానని.. రాకేష్ రాసిన సూసైడ్ నోట్‌ ఘటనా స్థలంలో లభించింది. 

17:38 - March 21, 2016

హైదరాబాద్ : శాసనసభలో సంక్షేమ పద్దులపై చర్చ సందర్భంగా గీతారెడ్డి, హరీష్‌రావు మధ్య వాగ్వాదం జరిగింది. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని గీతారెడ్డి అనడాన్ని హరీష్‌రావు తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు హరీష్‌రావు. దానిపై గీతారెడ్డి స్పందిస్తూ.. తాను అలా అనలేదన్నారు. అయితే గీతారెడ్డి క్షమాపణ చెప్పాలని.. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. 

17:37 - March 21, 2016

హైదరాబాద్ : ఒక్క ఓల్డ్‌ సిటీ పరిధిలోనే 8,866 కోట్ల రూపాయలను ఫ్లైఓవర్లు తదితర అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టబోతున్నట్లు మంత్రి కెటిఆర్ అసెంబ్లీలో అన్నారు. ఎక్కడెక్కడ ఏఏ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.? ఓల్డ్‌ సిటీలో ఏ పనులు నిర్వహించబోతున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కెటిఆర్ బదులిచ్చారు. మూసీపై నిర్మించబోతున్న స్కై వే మూలంగా ఓల్డ్ సిటీ అభివృద్ధిచెందబోతున్నట్లు తెలిపారు. 

17:35 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సింగిల్‌విండో విధానం ద్వారా సినిమాలకు 48 గంటల్లోనే అనుమతులు లభించనున్నాయి. చలనచిత్ర అభివృద్ధిపై ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 48 గంటల్లో అభ్యంతరాలు చెప్పకపోతే... అనుమతి వచ్చినట్లే పరిగణించాలని సూచించారు. చిన్న సినిమాలకు ప్రతి సినిమాహాలులో ఐదో ఆట వేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి 200 సీట్లతో మినీ కల్చరల్‌ సెంటర్ల ఏర్పాటుకు కమిటీ సిఫార్సు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సినీరంగం నుంచి దాసరి నారాయణరావు, మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు పాల్గొన్నారు.

ఆత్మహత్యకు యత్నించిన తహశీల్దార్ తిమ్మప్ప....

అనంతపురం : సోమందేపల్లి  కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన తహశీల్దార్ తిమ్మప్ప. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఓ గ్రామానికి చెందిన మహిళలు దారి వివాదంలో తనను దూషించారని మనస్థాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.

17:34 - March 21, 2016

హైదరాబాద్ : నగర శివారులోని అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ కార్మికురాలు కొమురమ్మను బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం కొమురమ్మ రోడ్డు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కమెరాలో రికార్డయ్యాయి. 

17:32 - March 21, 2016

మెదక్ : జిన్నారం మండలంలో వివేకానంద ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధమైంది. బస్సు కింది భాగంలో రాడ్ విరిగి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్ కు గురైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పిల్లలను ఎమర్జెన్సీ ద్వారం ద్వారా బయటకు పంపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ కొన్నిరోజులుగా రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. అధికారులు తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

17:31 - March 21, 2016

ఆదిలాబాద్ : మావోయిస్టులను అరెస్ట్ చేయడం వారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మరిచిపోయి బలహీనులపై విరుచుకుపడుతున్నారు. అనవసర అనుమానాలతో అమాయక జనాలతో ఆడుకుంటున్నారు. వారి వేధింపులను భరించలేక ఒకరు ఆత్మహత్యాయత్యానికి ప్రయత్నిస్తే మరొకరు తనకేమీ తెలియదంటూ లబోదిబోమంటున్నారు. మావోయిస్ట్‌ సానుభూతిపరులంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఖాకీలు రెచ్చిపోతున్న వైనంపై ప్రజాసంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి.

మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టుల మకాం....

నిజమేంటో ఆలోచించరు.. అనుమానమొస్తే చాలు చితకబాదేస్తారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లాలో కొందరు పోలీసుల వైఖరి. ఆ జిల్లా మహారాష్ట్రకు దగ్గరగా ఉండడం, ఆ రాష్ట్ర అడవుల్లో మావోయిస్టులు మకాం వేయడం పోలీసులకు పెద్ద సమస్యలా మారింది. అయితే వారిని ఎలా ఎదుర్కోవాలో అంతుబట్టక మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ సామాన్యులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇందుకు దహేగాం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటనే ఉదాహరణ.

ఎస్‌ఐ రమేష్‌ని పొలం వద్దకు తీసుకెళ్లిన శ్రీనివాస్....

దహేగాం మండలం రావులపల్లికి చెందిన సిడాం శ్రీనివాస్‌, టేపర్‌గాంకు చెందిన సుగుణయ్యలను మావోయిస్టు సానుభూతిపరులని అనుమానిస్తూ శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని నిజంచెప్పాలంటూ చితకబాదారు. పోలీసుల దెబ్బలకు తాళలేక మావోయిస్టులను చూపిస్తానని చెప్పి శ్రీనివాస్‌ ఎస్‌ఐ రమేష్‌ను తన పొలం వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే ఎస్‌ఐ ముందరే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన శ్రీనివాస్‌ను మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ ఆస్పత్రిపాలుగావడానికి పోలీసుల వేధింపులే కారణమంటూ అతని బంధువులు, గ్రామస్తులు, ఆదివాసీ గిరిజన సంఘం నేతలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక మావోయిస్టు సానుభూతిపరుడంటూ అదుపులోకి తీసుకున్న సుగుణయ్యను పోలీసులు చెరనుంచి విడిచిపెట్టారు. అతనికేమీ తెలియదని అన్యాయంగా అరెస్ట్ చేశారని సుగుణయ్య బంధువులు ఆందోళన చేపట్టడంతో విడిచిపెట్టాల్సొచ్చింది.

సుగుణయ్య భార్య ఎంపిటిసి

కాగా సుగుణయ్య భార్య లక్ష్మి అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసి. తన భార్య ప్రజాప్రతినిధి అని తానెలాంటి తప్పూ చేయలేదని శ్రీనివాస్ పోలీసుల ఎదుట వాపోయినా వారు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఇక్కడదాకా వచ్చింది. 

17:28 - March 21, 2016

 

హైదరాబాద్ : బల్దియాలో చెత్తనుంచి సేంద్రియ ఎరువులు తయారు కాబోతున్నాయి... గ్రేటర్‌లోని 12 ప్రధాన కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయబోతున్నారు.. ఇది విజయవంతమైనే మిగతా ప్రాంతాల్లో విస్తరించేదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ను క్లీన్‌ సిటీగా మార్చేందుకు....

గ్రేటర్‌ హైదరాబాద్‌ను క్లీన్‌ సిటీగా మార్చేందుకు అధికారులు సరికొత్త విధానాలు అమలు చేస్తున్నారు.. తాజాగా చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు.. నగరంలోని 12 ప్రధాన కేంద్రాల్లో ఈ ఎరువు తయారీని చేపట్టబోతున్నారు.. పెద్ద పార్కుల్లో చెత్తను వేసేందుకు రెండు నుంచి మూడు గుంతలు, చిన్న పార్కుల్లో రెండు గుంతలు తవ్వబోతున్నారు.. ఇందులో చెత్తా చెదారం వేసి ఎరువుగా మార్చేలా ఏర్పాట్లు చేశారు..

1244 ఉద్యానవనాల్లో 12 ప్రధాన పార్కులు.....

బల్దియా పరిధిలోని 1244 ఉద్యానవనాల్లో 12 ప్రధాన పార్కులున్నాయి.. వీటికి అదనంగా 12 థీమ్‌ పార్కులు, 11 బయోడైవర్శిటీ పార్కులు, 773 కాలనీ పార్కులు, 428 ట్రీ పార్కులున్నాయి.. ముఖ్యంగా 8 ప్రధాన పార్కుల్లో ఒక్కో ఉద్యానవనం నుంచి రెండురోజులకు ఒక లారీ చెత్త చొప్పున జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు వెళుతోంది.. ఇలా అన్ని పార్కులనుంచి భారీగా చెట్ల వ్యర్థాలు బయటకు పంపుతున్నారు.. దీంతో డంపింగ్‌ యార్డులో గుట్టలకొద్దీ చెత్త పేరుకుపోతోంది.. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరగడంతోపాటు... చెత్త రవాణాకు ఖర్చు మరింత పెరిగిపోతోంది.. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. పరిష్కారంకోసం అన్వేషించారు.. మైసూర్‌ నగర పాలక సంస్థలో చెత్తనుంచి ఎరువు తయారీ వీరిని ఆకట్టుకుంది.. స్వయంగా మైసూరులో పర్యటించిన మేయర్‌ ఈ పద్ధతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.. గ్రేటర్‌లో అమలు చేయాలని ఆదేశించారు.. మేయర్‌ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు..

సేంద్రియ ఎరువుల తయారీతో చాలా లాభాలు...

ఈ సేంద్రియ ఎరువుల తయారీతో చాలా లాభాలున్నాయని అధికారులు చెబుతున్నారు.. చెత్త రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు.. రసాయన ఎరువులు కొనే డబ్బు ఆదా అవుతుంది.. అలాగే చెత్త తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.. పైగా చెట్లకు నాణ్యమైన ఎరువు అందుతుంది.. ఏఎస్‌ రావు నగర్‌, ఇమ్లిబన్‌, లక్ష్మీనగర్‌ కాలనీ,మాధవ నగర్‌, ఇందిరాపార్కు, ఉషోదయ నగర్‌ కాలనీ, నవోదయ కాలనీ, సుందరయ్య పార్కు, హుడా కాలనీ పార్కు, హెచ్‌టీసీ, పద్మారావు నగర్‌ పార్కుల్లో ప్రారంభం కానుంది.ఈ ఎరువుల తయారీని దశలవారీగా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.. మొదటిదశలో ఏఎస్‌ రావు నగర్‌, ఇమ్లిబన్‌, లక్ష్మీనగర్‌ కాలనీ, మాధవ నగర్‌, ఇందిరాపార్కు, ఉషోదయ నగర్‌ కాలనీ, నవోదయ కాలనీ, సుందరయ్య పార్కు, హుడా కాలనీ పార్కు, హెచ్‌టీసీ, పద్మారావు నగర్‌ పార్కుల్లో ప్రారంభం కాబోతోంది..

పథకం విజయవంతమైతే పార్కులు మరింత పరిశుభ్రంగా....

ఈ పథకం విజయవంతమైతే పార్కులు మరింత పరిశుభ్రంగా మారే అవకాశముంది... చెత్తను ఊడ్చడం... అదంతా ఒక చోట చేర్చడం... అక్కడినుంచి లారీలోకి పంపడంలాంటి పనులు తప్పనున్నాయి.. ఆ పార్కులో చెత్త అక్కడే ఎరువుగా మారుతుంది.. ఈ ఎరువు చెట్లకు మరింత బలాన్ని ఇవ్వనుంది.. 

రోజా బాధితులు చాలామంది వున్నారు: టీడీపీ సభ్యులు ధూళిపాల

హైదరాబాద్ : ఏపీ శాసనసభలో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ శాసన సభ్యుడు ధూళిపాల నరేంద్ర మాట్లాడుతు ఈ సభలో రోజా బాధితులు చాలామంది ఉన్నారన్నారు. చట్టసభ సాక్షిగా రోజా అసహ్య పదజాలం వాడారని సభలోనే కాక బటయ కూడా ఆమె అహకారంగా ప్రవర్తించారని తెలిపారు. ఆమె ప్రవర్తన మార్చుకోవటానికి సభ చాలా అవకావాలు కల్పించిందని అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. శాసనసభా హక్కుల కమిటీ ఇచ్చిన నోటీసులను కూడా ఆమె ఖాతరు చేయలేదని ఇది ఎంత వరకూ సబబు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

శాసనసభను ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు: ఛీప్ విప్ కాల్వ...

హైదరాబాద్‌: శాసనసభలో జరిగే కార్యక్రమాలను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శాసనసభలో ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఆయన మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా శాసనసభ్యులు ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం చట్టసభలకు ఉందని పేర్కొన్నారు. ఏదైనా సందర్భంలో ఉద్వేగానికి గురైయి సభ్యులు మాట్లాడినా, ప్రవర్తించినా సదరు సభ్యులు సభను క్షమాపణలు కోరడం కూడా కొన్ని సందర్భాలలో జరుగుతూంటుందని ఛీప్ విప్ కాల్వ పేర్కొన్నారు. 

16:31 - March 21, 2016

హైదరాబాద్ : నవ తెలంగాణ పత్రిక మొదటి వార్షికోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.చంద్రు, వివిధ పత్రికల ఎడిటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పత్రికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. వాటికి స్వాతంత్ర్యం ఉండాల్సిన అవసరముందని చంద్రు అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం పత్రికల స్వేచ్చను హరిస్తుందని.. పాలకులను విమర్శించే పత్రికలపై కేసులు పెడుతున్నారని చంద్రు అన్నారు.

16:27 - March 21, 2016

తూ.గో :గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సోమయాజులు కమిషన్.. బాధితులు, అఫిడవిట్లు దాఖలు చేసిన వారితో సమావేశమైంది. అయితే వాదనలు వినిపించడానికి రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది అభ్యర్ధించడంతో విచారణ అర్థాంతరంగా ముగిసింది. కమిషన్ 6 నెలల గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇప్పడు మళ్లీ గడువు పెంచడంతో నివేదిక ఆలస్యం అవుతుందని సీపీఎం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

16:24 - March 21, 2016

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు కేటాయింపులు చేసినా వాటిని ఖర్చు చేయకపోవడంతో.. నిధులన్నీ మురిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. సబ్‌ప్లాన్‌ సక్రమంగా అమలు చేసి ఉంటే దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేవారన్నారు. 

16:22 - March 21, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న నిధులు ఖర్చు కావట్లేదని అన్ని రంగాల్లోనూ వారు అన్యాయానికి గురవుతూనే ఉన్నారని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీల పరిస్థితీ దయనీయంగానే ఉందని అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు.   

16:21 - March 21, 2016

కర్నూలు : జిల్లాలో భారీ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. నంద్యాలలో ఎలక్ట్రికల్ ఈఈ రామచంద్రుడు... లక్ష రూపాయలు లంచం తీసుకొంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. స్థానిక గోస్పాడు గ్రామంలో ఓ రైతు... కొత్తగా నిర్మించుకున్న గోడౌన్‌కు విద్యుత్ కనెక్షన్ కోరగా.. రామచంద్రుడు.. లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ డబ్బులు ఇస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో భానుడి తీవ్రత....

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఆదిత్యుడు తన  ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణ స్థాయికంటే 3 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో 42 డిగ్రీలు, నందిగామ, తునిలలో 41 డిగ్రీలు, విజయవాడ, సంగమేశ్వరపురంలో 40 డిగ్రీలు, తిరుపతిలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కావలి,ఖమ్మం, ఆదిలాబాద్ లలో 41 డిగ్రీలు, నల్లగొండ, వరంగల్ లలో 40, కరీంనగర్ , నిజామాబాద్ లలో 39, మహబూబ్ నగర్ లో 38 డిగ్రీలు, హైదరాబాద్ లో 37 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య...

రంగారెడ్డి : కొంపల్లి బాలుర వసతి గృహంలో బిటెక్ విద్యార్థి రాకేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేష్ నిజామాబాద్ జిల్లా బీంగల్ వాసిగా గుర్తించారు. చదువులో వెనుకబడి తల్లిదండ్రులకు భారంగా వున్నాని సూసైడ్ లేఖ రాకేష్ పేర్కొన్నట్లు సమాచారం. 

ఉద్యోగ సంఘాలతో మంత్రి నారాయణ భేటీ...

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణతో ఉద్యోగుల కమిటీ భేటీ అయ్యింది. జూన్ 15 వరకూ సచివాలయం ఉద్యోగులను ఏపీకి తరలించే అవకాశమున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ 1 కల్లా హెచ్ వోడీలు, ఆగస్టు 31 కి ప్రధాన కార్యాలయాలను ఏపీ రాజధానికి తరలించటానికి ప్రయత్నిస్తున్నామని.. వచ్చే సోమవారం మరొకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమయి దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. 

15:37 - March 21, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు టీఎస్ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రతిపక్షాల ప్రశ్నకు బదులిచ్చారు. 

15:35 - March 21, 2016

హైదరాబాద్ :విద్యావ్యవస్థ, గత యుపిఎ ప్రభుత్వం తెచ్చిన విద్యా హక్కు చట్టంపై సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. 

ప్రివిలేజ్ కమిటీకి ధన్యవాదాలు : టీడీపీ ఎమ్మెల్యే అనిత...

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదకపై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోం. ఈ సందర్భంగా ప్రివిలేజ్ ఫిర్యాదుదారు, బాధితురాలు అ టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ తనకు నాకు న్యాయం చేయటానికి ప్రయత్నిస్తున్న ప్రివిలేజ్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన మొదటిసారే తన జీవితంలో మరపురాని చేదు అనుభవాన్ని చవిచూసానని ఆమె అన్నారు. రోజాకు ఏ శిక్ష పడినా తాను పడిన మానసిక క్షోభకు తీరేదికాదని క్షమాపణ కోరే అర్హత కూడా రోజా కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు

15:15 - March 21, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు జుగుస్పాకరం అని ఎమ్మెల్యే అనిత అన్నారు. ప్రివిలైజ్ కమిటీ నివేదికపై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ... నాకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రివిలేజ్ కమిటీ ధన్యావాదాలు తెలిపారు. మొదటి సారి ఎమ్మెల్యేలగా ఎన్నికైన కొన్ని రోజులకే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాన్నారు. రోజా నాపైన చేసిన వ్యాఖ్యలు వినడానికే చాలా జుగుస్పాకరంగా ఉన్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ దళిత మహిళలనుకించపరిచేలా మాట్లాడినా ప్రతిపక్ష నేత పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి గానీ, నగరి నియోజకవర్గం ప్రజల సమస్యలు కానీ సభలో చర్చించకుండా ఎపుడూ ఎవరోఒకరి పై తిట్టడానికి సభకు రోజా వస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సభలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఏపీ అసెంబ్లీలో చర్చ...

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ రోజా కోసం జగన్ నాలుగు రోజుల సభా సమయాన్ని వృధా చేశారన్నారు. సమాజంలో చట్టసభలకు చాలా గౌరవముందన్నారు. ఆ గౌరవాన్ని కాపాడటం ప్రజాప్రతినిధుల కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. రోజా సస్పెన్షన్ పై సభలో చర్చ జరుగుతుంతే జగన్ సభకు హాజరుకానందుకు ప్రజల సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా ఉమ డిమాండ్ చేశారు.

14:51 - March 21, 2016

హైదరాబాద్ : వేసుకున్న డ్రెస్ కు తగిన యాక్సెసరీస్ ధరించటానికి కొందరు అతివలు ఆసక్తి చూపుతుంటారు. వారి కోసం ఎన్నో మ్యాచింగ్స్ మార్కెట్ లో ఉన్నప్పటికీ వాటిని మనేమే తయారు చేసుకోవటం కాస్త కొత్త గా ఉంటుంది. అలా థ్రెడ్ తో ఇయర్ రింగ్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇవాళ్టి సొగసులో సందీప చూపించారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:47 - March 21, 2016

హైదరాబాద్ : చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతన మనదే ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఏపీ శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజా కోసం జగన్ 4 రోజుల సభా సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు. ఇపుడు రోజా సస్పెన్షన్ పై చర్చ జరుగుతుంటే సభ నుండి పారిపోవడం పై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టసభలకు సమాజంలో అత్యున్నత గౌరవం ఉందని... చట్టసభలో వాడే భాసపై కోట్లాది మంది గమనిస్తుంటార ని ఉమ తెలిపారు. ఎవరూ వాడని భాషను సభలో రోజా వాడరని, అలా మాట్లాడటానికి రోజాకు నోరెలావచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

14:40 - March 21, 2016

హైదరాబాద్ :వాయవును స్వరాలుగా మలచడం ..సుమధుర రాగాలుగా పలికించడం ..శ్రమతో కూడినది.. సాధనతో మాత్రమే సాధ్యపడేది.. అంకుఠిత దీక్షతో మాత్రమే సొంతమయ్యేది.. అలాంటి వేణుగానంతో మంత్రముగ్దులను చేస్తున్న ఫ్లూటిస్ట్ స్వరవిన్యాసంతో , మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.

సంప్రదాయ సంగీత ప్రపంచంలో....

సంప్రదాయ సంగీత ప్రపంచంలో ఆడపిల్లలు, గాత్రానికో, లేక నాట్యానికో పరిమితమవడమే సహజంగా కనిపిస్తుంది. కానీ, అసాధ్యమనిపించిన దాన్ని సుసాధ్యం చేసుకుని, వేణుగానంలో అత్యున్నత స్థాయికి చేరడం మాత్రం అరుదుగానే జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫ్లూటిస్ట్ గా....

తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫ్లూటిస్ట్ గా ప్రత్యేకత సాధించిన జయప్రద కు మానవి అభినందనలు తెలియచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తోంది. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది.  

పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

టీఎస్ శాసనసభ్యుల జీతభత్యాపెంపునకు సిఫార్సు

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపునకు శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ సిఫార్సు చేసింది. సోమవారం అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన సమావేశంలో సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లతో సహా మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, ఆయా పార్టీల శాసనసభాపక్ష నేతలు ఇందులో పాల్గొన్నారు.

చలనచిత్ర రంగం సమస్యలపై కేబినెట్ ఉపసంఘం భేటీ...

హైదరాబాద్‌: చలనచిత్ర రంగం అభివృద్ధిపై ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయ్యింది. సినీరంగ సమస్యల పరిష్కాం దిశగా సాగిన ఈ సమావేశం టీ.అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సినీరంగం నుండి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, నిర్మాతలు మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

14:26 - March 21, 2016

హైదరాబాద్ : రాజ్యాంగానికి లోబడే ప్రతి వ్యవస్థ పని చేయాలి శాసనసభ్యులు శివాజీ అన్నారు. ఆయన ప్రివిలేజ్ కమిటీ నివేదికపై ఏపీ శాసనసభలో చర్చ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. సభా నియమాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. సభలో రోజా తీవ్ర పదజాలం వాడరని... రోజా ప్రవర్తన నిబంధనలకు విదర్ధుం అని తెలిపారు.

13:55 - March 21, 2016

విజయవాడ : ప్రజాస్వామిక ఉద్యమాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే వారి తరపున పోరాడే శక్తుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఆందోళనలకు అనుమతులు నిరాకరిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై వామపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే...పెద్ద ఎత్తున సర్కార్‌పై ఉద్యమిస్తామని హెచ్చరించారు. 
ప్రజాస్వామిక ఉద్యమాలపై ఎపి ప్రభుత్వం ఉక్కుపాదం 
ప్రజాస్వామిక ఉద్యమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.  ప్రజల తరుపున పోరాడే గొంతులను నొక్కేందుకు ఏపీ సర్కార్‌ నడుం బిగించింది. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసే ఉద్యమకారుల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఏది చెప్తే అదే శిలా శాసనం, ఏం చేసినా ఎవరికి అడిగే హక్కే లేదనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజా ఆందోళనలకు అనుమతుల్ని నిరాకరిస్తూ ఏపీ హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల తరపున నిత్యం పోరాడే వామపక్షాలు మండిపడుతున్నాయి. 
వామపక్ష నేతలు ఆగ్రహం 
ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై పోరాడే శక్తుల్ని  ప్రభుత్వం తన ఉక్కు సంకెళ్లతో బంధించాలని చూస్తే ఊరుకోం అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహకరించుకోకపోతే..పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే కుయుక్తుల్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని...లేకపోతే దానికి తగిని మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇండ్ల స్థలాలు, కౌలురైతుల సమస్యలు, అంగన్‌వాడీ వెతలు, అగ్రిగోల్డ్ బాధితుల వ్యధలు, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసితుల సమస్యలపై పోరాడేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం దారుణమని..వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య ధోరణికి భిన్నంగా పోతున్న ప్రభుత్వానికి త్వరలోనే బుద్దిచెప్తామని నేతలు అంటున్నారు. సామాన్యుల వాణిని వినిపించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందని..అది లేదని చెప్పడానికి సర్కార్‌కు హక్కు లేదని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని..లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. 

రోజా సస్పెన్షన్ కేసు వాయిదా...

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం కోర్టులో వేసిన పిటీషన్ పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి. రోజా తరపున జరుగబోయే వాదనలను మ.2.30గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది.  వైసీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభ నుండి ఏడాదిపాటు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 

13:50 - March 21, 2016

హైదరాబాద్ : ఈనెల 24 న ఎపి అసెంబ్లీకి బిఏసీ సెలవు ప్రకటించింది. ఎపి బిఏసీ  సమావేశం ముగిసింది. 24 న అసెంబ్లీకి సెలవు ప్రకటించినందుకు గానూ వచ్చే సోమవారం రెండు పూటలు సభ నిర్వహించాలని నిర్ణయించారు. 

 

13:44 - March 21, 2016

హైదరాబాద్ : నాడు తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న వారే నేడు ఆ లక్ష్య సాధన కోసం టీసర్కార్ వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. తీవ్ర కరువు భారంతో ఉన్న రైతాంగం మద్దతు ధర కోసం, ఇన్ ఫుట్ సిబ్సిడీ కోసం ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని రక్షించుకునేందుకు పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రాణాలు పోయినా పరవాలేదు తెలంగాణ కావాలి, ఉద్యోగాలు రావాలని ఉద్యమించిన నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చేస్తున్నారని తెలిపారు. సబ్ ప్లాన్ , మూడు ఎకరాల భూమికోసం దళితులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. గిరిజనులు 12 శాతం రిజర్వేషన్ కోసం వేచిచూస్తున్నారు. జనాభాలో సంగం మందిగా ఉన్న తమకు మంత్రి పదవి చేపట్టే అర్హత తమకు లేదా అని మహిళలు అడుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని.. 2012 సంవత్సరంలో పార్లమెంట్ లో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. తమ క్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అమరవీరుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. 

 

వాట్స్ ఏప్ లో ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం...

తూ.గోదావరి : నేడు ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తూర్పు మన్య ప్రాంతంలో వాట్స్ ఏప్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కలకలం మొదలయ్యింది. ఈ సందర్భంగా కూనవరం గ్రామంలో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

13:14 - March 21, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్‌  కమిటీ రిపోర్ట్‌పై చర్చను ప్రారంభించే ముందు స్పీకర్‌ కోడెల శివస్రసాద్ రావు రెండు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. ఇంటర్మీడియేట్‌ విద్య సవరణ బిల్లు, అటవీచట్టం సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపాదించారు. వెంటనే వాటిని స్పీకర్‌ మూజవాణి ఓటుతో ఆమోదించారు. 

 

13:09 - March 21, 2016

హైదరాబాద్ : ఒక్క ఓల్డ్ సిటీ పరిధిలోనే 8,866 కోట్ల రూపాయలను ఫ్లైఓవర్లు తదితర అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టబోతున్నట్లు మంత్రి కేటిఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ఎక్కడెక్కడ ఏఏ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.? ఓల్డ్ సిటీలో ఏ పనులు నిర్వహించబోతున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేటిఆర్ బదులిచ్చారు. మూసీపై నిర్మించబోతున్న స్కై వే మూలంగా ఓల్డ్ సిటీ అభివృద్ధిచెందబోతున్నట్లు తెలిపారు. రూ.2 వేల కోట్లతో హైదరాబాద్‌లో స్కైవేలు, ఫ్లైఓవర్లు, రవాణా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

 

రోజా సస్పెండ్ పై కోర్టులో కొనసాగుతున్న వాదనలు...

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టులో వాదనలు  కొనసాగుతున్నాయి. ఏడాదిపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభ నుండి సస్పెండ్ అయ్యారు . ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రోజాకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

13:04 - March 21, 2016

హైదరాబాద్‌ : నగర అభివృద్ధి పనుల్లో ఓల్డ్ సిటీని విస్మరిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అన్ని అభివృద్ధి పనులూ న్యూ సిటీలోనే జరుగుతున్నాయని ఓల్డ్ సిటీని విస్మరిస్తున్నారని ఆరోపించారు. స్కైవేలు, ఫ్లైఓవర్లు, ఇంకా ఏవేవో నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం అవి ఎక్కడెక్కడ నిర్మించబోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. 

 

12:59 - March 21, 2016

హైదరాబాద్: యాదాద్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను రేండేలలో పూర్తిచేస్తామని మంత్రి కేటిఆర్ అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

12:52 - March 21, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. పీహెచ్‌సీల్లో ఉచిత రోగనిర్థారణ పరీక్షలు చేయడానికి చర్యల్ని వేగవంతం చేశామన్నారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల్ని ఇప్పటికే భర్తీచేశామని..అన్ని ఆసుపత్రుల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. 

 

12:49 - March 21, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంస్కరించే దిశగా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసిందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో అవినీతికి తావులేకుండా విద్యానిపుణులతో ఓ కమిటీని వేశామన్నారు మంత్రి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి సమాధానం చెప్పారు. అతి త్వరలో కమిటీ రిపోర్ట్‌ ఇస్తుందని...దాని ప్రకారం సంస్కరణల్ని చేపడపడతామన్నారు. 

 

12:46 - March 21, 2016

హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో దాన్యపు గోదాములను ప్రభుత్వం నిర్మిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ...జిల్లాలో కోల్ట్‌ స్టోరేజీలను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు మేలు జరుగుతుందన్నారు. 

 

12:42 - March 21, 2016

హైదరాబాద్ : రేషన్‌ దుకాణాల్లో కార్డు లబ్దిదారులకు సరుకులు ఒకే సారి ఇవ్వాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పౌరసరఫరాల శాఖ మంత్రిని కోరారు. పదే పదే రేషన్‌షాపుకు చుట్టూ లబ్దిదారులు తిరగడం వల్ల వారు ఎంతో శ్రమపడాల్సి వస్తుందన్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి పరిటాల సునీత ఫిబ్రవరి నుంచే రేషన్‌ షాపుల్లో అన్ని సరుకులు ఒకేసారి అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. 

 

12:39 - March 21, 2016

హైదరాబాద్ : విద్యావ్యవస్థ, గత యుపిఎ ప్రభుత్వం తెచ్చిన విద్యా హక్కు చట్టంపై సిఎం కేసిఆర్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం పలు ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. విపక్షాలు ఇచ్చిన మూడు ముఖ్య వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనారి తిరస్కరించారు. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ వద్దంటూ టిడిపి వాయిదా తీర్మానం, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. వీఆర్వోలకు 010 వేతనాలు ఇవ్వాలని సిపిఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మూడు తీర్మానాలను తిరస్కరిస్తున్న స్పీకర్ ప్రకటించారు. గతంలో యూపీఏలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. విద్య విషయంలో సమగ్ర చర్చ జరగాలన్నారు. 

 

 

ముగిసిన వైసీపీఎల్పీ సమావేశం...

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో వైసీపీఎల్పీ సమావేశం ముగిసింది. పీఏసీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పీఏసీ సభ్యులుగా ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్ లను వైసీపీఎల్పీ సమావేశం నిర్ణయించింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కోర్టు ఇచ్చిన తీర్పుపై  ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ సందర్భంగా స్పీకర్ తీసుకోనున్న నిర్ణయం అనంతరం జగన్ మరోసారి ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమవుతారని సమాచారం. 

12:27 - March 21, 2016

హైదరాబాద్ : ఎపి సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని వైసీపీ నేత ఆరోపించారు. ప్రభుత్వ పాలన, తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వైసీపీపై ప్రభుత్వం క్షక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. 

 

12:23 - March 21, 2016

హైదరాబాద్ : పీఏసీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నియమించింది. లోటస్ పాండ్ లో వైసీపీఎల్పీ సమావేశం ముగిసంది. పీఏసీ సభ్యులుగా దాడి శెట్టి రాజా, ఆదిమూలపు సురేష్ నియామకం అయ్యారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. 

 

అగ్రిగోల్డ్ బాధితులు ర్యాలీ...

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ, తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి జింఖానా గ్రౌండ్స్ వరకూ అగ్రిగోల్డ్ బాధితులు ర్యాలీని  నిర్వహించారు. అనంతరం జింఖానా గ్రౌండ్ లో బహిరంగ ప్రదర్శన నిర్వహించనున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధింన బాధితులు ర్యాలీలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతి తక్కువ కాలంలో సొమ్మును రెట్టింపు చేస్తామని లక్షలాది మంది ఏజెంట్ల వద్దనుండి కోట్లాది రూపాయలను డిపాజిట్ గా తీసుకున్న అగ్రిగోల్డ్ సంస్థ ఏజెంట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే.

12:15 - March 21, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై న్యాయవాది గోపాలకృష్ణ పిల్ వేశారు. ఎపి సర్కార్ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించారంటూ పిల్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ ల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

11:44 - March 21, 2016

ఢిల్లీ : విద్యార్థుల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని జెఎన్ యూ నేత కన్హయ్య ఆరోపించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలుగెత్తేవారి గొంతుల్ని అణచివేయడంలో కేంద్రం ఏ మాత్రం సంకోశించడం లేదన్నారు. ప్రజాస్వామ్య మౌలిక అంశాలపై కేంద్రం దాడి చేస్తోందని చెప్పారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే బీజేపీ సర్కార్‌ విద్యార్థుల గొంతు నొక్కుతోందని దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో బీజేపీ.. విద్యార్థులను అణచివేస్తోందని విమర్శించారు. భగత్‌సింగ్, అంబేద్కర్‌ల స్ఫూర్తితో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.

 

11:29 - March 21, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. నాలుగు సార్లు నోటిసు ఇచ్చినా రోజా హాజరు కాలేదని కమిటీ తెలిపింది. రోజా సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పినందుకుగానూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి, జ్యోతుల నెహ్రూలపై చర్యలు అవసరం లేదని కమిటీ తెలిపింది. కొడాలి నానిపై చర్యలకు సంబంధించిన బాధ్యతలను సభకు అప్పగించారు. కాసేసట్లో ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చ జరుగనుంది. 

 

10:56 - March 21, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఎపి అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. రోజా వేసిన కోర్టు ఉత్తర్వుల ధిక్కరణపై నేడు హైకోర్టులో సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనున్నారు. 

 

రోజా సస్పెండ్ పై ప్రివిలేజ్ కమిటీ నివేదిక....

హైదరాబాద్ : ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఏపీ అసెంబ్లీకి నివేదికను అందజేసింది. రోజాను సస్పెండ్ చేయమని నివేదికలో పేర్కొన్న కమిటీ. ఎమ్మెల్యే కొడాలి నానిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో సభ నిర్ణయించుకుంటుందని ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా తనను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది.

10:48 - March 21, 2016

హైదరాబాద్ : టిఎస్ అసెంబ్లీలో నేడు మూడు ముఖ్య వాయిదా తీర్మానాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ వద్దంటూ టిడిపి వాయిదా తీర్మానం, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. వీఆర్వోలకు 010 వేతనాలు ఇవ్వాలని సిపిఎం వాయిదా తీర్మానం ఇచ్చింది.

 

10:45 - March 21, 2016

హైదరాబాద్ : నేడు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సభ ముందుకు ప్రివిలేజ్ కమిటీ నివేదిక రానుంది. రోజాపై టిడిపి సభ్యురాలు అనిత ఇచ్చిన ఫిర్యాదును, బుద్ధప్రసాద్‌ కమిటీ నివేదికను గొల్లపూడి సూర్యారావు సభకు సమర్పించనున్నారు. 

వజ్రాల దొంగలు అరెస్ట్.....

హైదరాబాద్ :.నగరంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు. వారి వద్ద నుండి సుమారు రూ. 2.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరీక్షా కేంద్రం వద్ద విద్యార్ధుల పేరెంట్స్ ఆందోళన...

కరీంనగర్ : నేటి నుండి తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. జమ్మికుంట ప్రభుత్వ హైస్కూలు పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు తొలగించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. 

పరీక్ష కేంద్రం పేరు హాల్ టికెట్లలో తప్పుగా నమోదు

హైదరాబాద్ :  సికింద్రాబాద్ సీతాఫల్ మండి వీఎంపీఎస్ పరీక్ష కేంద్రం పేరు హాల్ టికెట్లలో తప్పుగా నమోదు కావడంతో విద్యార్థులు గందరగోళ పడ్డారు. 

నేడు ఎపి అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు

హైదరాబాద్ : నేడు ఎపి అసెంబ్లీ ముందుకు అటవీ సవరణ బిల్లు, ఇంటర్మీడియట్ బిల్లులు రానున్నాయి. అలాగు రోజా సస్పెన్షన్, జరుగుతున్న పరిణామాలపై సభలో చర్చ జరుగనుంది. ఇప్పటికే సభ్యులందరికీ కోర్టు ఆర్డర్ కాపీలు జారీ చేశారు.  కోర్టు తీర్పుకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 

 

జీహెచ్‌ఎంసీ కార్మికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ : రామంతాపూర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దూరదర్శన్‌ కేంద్రం దగ్గర ఆర్టీసీ బస్సు జీహెచ్‌ఎంసీ కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

08:47 - March 21, 2016

తెలుగులో తొలి 70 ఎం.ఎం చిత్రంగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన 'సింహాసనం' చిత్రం నేటితో (1986, మార్చి 21) 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. నటిస్తూనే కృష్ణ ఈ చిత్రానికి కథ, కథనం, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహించడం విశేషం.

08:45 - March 21, 2016

తమిళ అగ్ర హీరో అజిత్‌ 57వ చిత్రంలో నటించేందుకు అనుష్క గ్రీన్‌సిగల్‌ ఇచ్చిందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఎన్నై అరిందాల్‌' చిత్రం తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. 'వీరమ్‌', 'వేదాలమ్‌' చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ దర్శకత్వంలో అజిత్‌ 57వ చిత్రం కూడా తెరకెక్కనుంది. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు జూన్‌లో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంతోపాటు అనుష్క 'బాహుబలి2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

 

08:44 - March 21, 2016

'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రం కచ్చితంగా మరో 'షోలే' అవుతుందనే ఫీలింగ్‌ కలిగింద'ని అన్నారు చిరంజీవి. పవన్‌కళ్యాణ్‌,కాజల్‌ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌మరార్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన చిరంజీవి తెలుగు, హిందీ భాషల థియేట్రికల్‌ ట్రైలర్‌ను, ఆడియో బిగ్‌ సీడీతోపాటు పాటల సీడీలను కూడా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ఈమధ్యకాలంలో నేనెక్కువ సార్లు చూసిన సినిమా 'గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ విశ్వరూపం చూశాను. ఇలా పవన్‌కళ్యాణ్‌ అభిమానులను అలరించాలనే నేను కోరుకున్నాను. ఒరిజినల్‌ 'దబాంగ్‌'కి పూర్తి భిన్నంగా పవన్‌ దీన్ని మార్చేశాడు. అందుకే పవన్‌ ట్రెండ్‌ని ఫాలో అవ్వడు. ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తాడు. అది 'గబ్బర్‌సింగ్‌'తోనే నిరూపితమైంది. ఈ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పవన్‌ మనసుకి చాలా దగ్గరైన సినిమా. కథ, కథనం, స్క్రీన్‌ప్లే.. ఇలా ప్రతీదాన్ని ఎంతో ప్రేమించి స్క్రీన్‌మీద ప్రజెంట్‌ చేశాడు. దర్శకుడు బాబీ కూడా పవన్‌ ఇన్‌ఫుట్స్‌ తీసుకుని పవన్‌ అనుకున్న రీతిలోనే తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సెట్స్‌కి వెళ్ళాను. రతన్‌పూర్‌ సెట్‌ని చూసి నాకు 'షోలే' గుర్తొచ్చింది. ఆ ఫీలింగ్‌ని ఈ సినిమా నాకు కల్గించింది. ఇది మరొక 'షోలే' అవుతుందనడటంలో ఏ మాత్రం సందేహం లేదు. పవన్‌లో హుమనిజం ఉంది. హ్యూమర్‌ యాంగిల్‌ కూడా ఉంది. హీరోయిజానికి హ్యూమర్‌, మాస్‌ తోడై ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వగలిగితే ఆ వినోదం ఏ స్థాయికి వెళ్తుందో మనం ఊహించలేం. ఈ సినిమాలో అంత వినోదం ఉంది. ఈ సినిమా కోసం నేనూ మీలాగే ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో పవన్‌కళ్యాణ్‌ కనీవినీ ఎరుగని రికార్డులని క్రియేట్‌ చేయాలి. 'బాహుబలి'ని మించి కలెక్షన్లను రాబట్టాలి. పరిశ్రమలో ప్రస్తుతం ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. అలాగే పవన్‌ సినిమా రికార్డులను, కలెక్షన్లను బీట్‌ చేసే మరో హీరో సినిమా రావాలి. ఈ సినిమాలో పవన్‌ 'ఇంద్ర'లోని స్టెప్‌ వేశాడని తెలిసింది. ఆ స్టెప్‌ కోసం నేనూ ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. నిర్మాత శరత్‌మరార్‌ మా కుటుంబంలోని సభ్యుడు. ఈ సినిమాతో అగ్ర నిర్మాతగా శరత్‌ పేరు సంపాదిస్తాడు. రచయిత సత్యమూర్తి ఓ రోజు వాళ్ళబ్బాయిని తీసుకొచ్చి వీడు ఒక ట్యూన్‌ చేశాడు. విని బాగుంటే సినిమాలో వాడుకోవచ్చు అనడిగితే, ఆ ట్యూన్‌ విన్నాను. విన్న వెంటనే ఎలా స్పందించాలో తెలియక చేతికి ఉన్న గడియాన్ని ఇచ్చి, ఇక నుంచి నీ టైమ్‌ మారిపోతుందన్నాను. 
ఆ అబ్బాయి ఎవరో కాదు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండిస్టీని ఏలుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌. 
నా తదుపరి చిత్రానికి దేవినే సంగీతమందించాలని సభాముఖంగా అడుగుతున్నాను' అని అన్నారు. 'పవన్‌తో ఈ సినిమా చేయడం వండర్‌ఫుల్‌ జర్నీ. పవన్‌ పైకి అలా కనిపిస్తారుగానీ చాలా టఫ్‌. ప్రతి రోజూ ఆయనిచ్చే ఛాలెంజ్‌లను టీమ్‌ అంతా ఫుల్‌ఫిల్‌ చేయడానికి కష్టపడింది. ఇటువంటి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన పవన్‌కి కృతజ్ఞతలు. మాతో భాగస్వామ్యమైన సునీల్‌లుల్లాకి థ్యాంక్స్‌'అని నిర్మాత శరత్‌మరార్‌ చెప్పారు. 
'నామీద నమ్మకంతో 14 ఏళ్ళు కష్టపడి రాసుకున్న ఈ కథని పవన్‌కళ్యాణ్‌ అప్పగించారు. ఈ అవకాశం రావడానికి కారకులైన కన్న తల్లిదండ్రులకు, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని దర్శకుడు బాబీ అన్నారు. 'మెగాస్టార్‌, పవర్‌స్టార్‌లతో ఈ వేడుక మీదున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి మ్యూజిక్‌ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ చెప్పారు. 'పవన్‌కళ్యాణ్‌తో స్క్రీన్‌ని షేర్‌ చేసుకునే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది' అని హీరోయిన్‌ కాజల్‌ అన్నారు. పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ, 'యాక్టింగ్‌ అంటే చిరంజీవిగారు తప్ప నాకు మరొకరు తెలియదు. అమితాబ్‌ బచ్చన్‌ అంటే పిచ్చి ఇష్టం. కాని అన్నయ్య హీరో అయ్యాక ఆయన ఒక్కడే హీరోగా కనిపించే వారు. నేను ఖాళీగా తిరుగుతున్నప్పుడు ఒక రోజు పిలిచి సినిమాల్లో యాక్ట్‌ చేయొచ్చు కదా అన్నారు. నేను యాక్టర్‌ అని నాకెప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు నటిస్తున్నానంటే దానికి అన్నయ్య, వదినలే కారణం. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంట్లోకి వెళ్ళి దాక్కునే వాడిని. అంత భయం. అన్నయ్య గురించి మాట్లాడడం తక్కువే. ఇష్టం అనేది లోపల ఉంటుంది. బహిరంగంగా చెప్పడం ఇష్టముండదు. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్‌. చిన్నప్పుడు ఏం పనిచేయకుండా తిని కూర్చునే రోజుల్లో.. అన్నయ్య రాత్రనక, పగలనకా రోజూ కష్టపడి ఇంటికి వచ్చిన అలసిపోయి అలానే పడుకున్నప్పుడు నేను వెళ్ళి ఆయన షూస్‌ తీసేవాడిని అప్పుడు సాక్స్‌ల్లో ఉండే చెమట నాకు సువాసనలా అనిపించేది. ఎలాంటి ఫ్లాట్‌ఫామ్‌ లేని ఒక సాధారణ పోలీస్‌ కొడుకు ఈ స్థాయికి వచ్చి అందరికి స్ఫూర్తిగా నిలిచారు. అన్నయ్యలో ఒక లక్ష్యాన్ని చూశాను. ఆయన నాకు స్ఫూర్తినిచ్చారు. రాజకీయంగా ఆయనకు నచ్చని పని చేశాను. ఏ రకంగా చేశాననేది తెలుసుకున్నాను. అయితే మా బంధం వేరు, దారులు వేరు. ఆయనెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. అందరినీ అలరిస్తుందని 'జానీ' చిత్రాన్ని తీశా. ఫెయిల్‌ అయ్యింది. అయితే ఈ సినిమా మాత్రం అలా ఎవ్వరినీ డిజాప్పాయింట్‌ చేయదు. మూడు నెలల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సింది ఉంది. నేనే ఆపాను. ఏప్రిల్‌8న సినిమా విడుదల చేయాలని నాతోపాటు ఎవ్వరినీ నిద్రపోనివ్వలేదు. సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌' అని అన్నారు. 'ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని మరో నిర్మాత సునీల్‌ లుల్లా చెప్పారు. వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. 
సినిమాలను వదలొద్దు..
   ఒక టైంలో ఎటువంటి కెరీర్‌ని డిసైడ్‌ చేసుకోవాలని నేను, వాళ్ళ వదిన ఉన్నప్పుడు వచ్చి పవన్‌ ఆడిగాడు. హీరో అవ్వమని సలహా ఇచ్చాను. నా సలహాని పాటించి అహర్నిశలు శ్రమించాడు. హీరోగా ఈరోజు ఇంతమంది అభిమానుల్ని అలరించే స్థాయికి ఎదిగాడు. అదే చనువుతో ఇప్పుడు కూడా ఓ సలహా ఇస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నా సరే సినిమాల్ని మాత్రం వదలొద్దు. అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని రెండింటిని ఒకేసారి హ్యాండిల్‌ చేయగల సత్తా నీకు ఉంది.

08:35 - March 21, 2016

బెంగుళూరు : శ్రీలంక వెస్టిండీస్ మద్య జరిగిన టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించింది.  లక్ష్య చేధనలో 84 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఫ్లెచర్ . 122 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన  వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి  రెండు ఓవర్లు మిగిలి ఉండగానే  127 పరుగులు సాధించి విజయ ఢంకా మోగించింది. 

08:33 - March 21, 2016

ముంబై : టీ 20 ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-1 రెండో రౌండ్‌  మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన  సఫారీ టీమ్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్‌ డికాక్‌, డు ప్లెసి అదరగొట్టడంతో పాటు....డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌ డివిలియర్స్ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్ ఆడటంతో సౌతాఫ్రికా జట్టు...20 ఓవరల్లో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ జట్టుకు మహమ్మద్‌ షెహజాద్‌ అదిరిపోయె ఆరంభాన్నిచ్చాడు. షెన్వారీ,నయీబ్‌,అలీ జద్రాన్‌ పోరాడినా కీలక సమయంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. 37 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా జట్టు...బోణీ కొట్టింది.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చిన 4 కీలక వికెట్లు పడగొట్టిన  క్రిస్‌ మోరిస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.  

 

08:28 - March 21, 2016

రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని వక్తలు తెలిపారు. 'ఎపి అసెంబ్లీ.. రోజా సస్పెన్షన్.. రాజకీయ పరిణామాలు' అనే అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు ముల్లపూడి రేణుక, విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాదూరి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత గౌతంరెడ్డి పాల్గొని, మాట్లాడారు. చట్ట సభలను సవ్యంగా నడిచే విధంగా చూడాలన్నారు. భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉంటారో... ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో చెప్పలేమని పేర్కొనారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..... 

 

08:21 - March 21, 2016

ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించుకోవాలని తెలంగాణ యుటీఎఫ్‌ నేత చావ రవి పిలుపునిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఇవాళ తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ర్యాలీలు, ప్రదర్శలు నిర్వహిస్తు న్నాయి. తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా, ప్రభుత్వ స్కూళ్ల పరిరక్షణలో భాగంగా ఈ ర్యాలీలు జరగబోతున్నాయి. జూన్‌ 12కి బదులుగా మార్చి 21 నుంచే   అంటే ఇవాళ్టి నుంచే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలంటూ ఉపాధ్యాయలోకం కదం తొక్కుతోంది.   ఇవాళ్టి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు కోరుతున్నాయి? దీనివల్ల విద్యార్థులకు జరిగే మేలేమిటి? ఇవాళ్టే నుంచే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి వున్న అవరోధాలేమిటి? ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?  ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై రవి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:13 - March 21, 2016

అంతా సవ్యంగా జరిగి వుంటే  తెలంగాణలో ఇవాళ సరికొత్త అధ్యాయం మొదలై వుండేది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సరికొత్త ఉత్సాహంతో, తమ భవిష్యత్‌ కు చక్కటి భరోసా లభించిందన్న ఆనందంతో బడికి బయలుదేరే వారు. కానీ, ఇవాళ్టి డైరీలో విద్యార్థులు తమ పాత బాధాయమ అనుభావాలనే తిరిగి రాసుకోవాల్సి వస్తోంది. 
ఆరంభ శూరత్వం 
ఆరంభ శూరత్వం అన్నది తెలంగాణలో సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ఇది  చేస్తాం అది చేస్తాం అంతా మార్చేస్తాం అంటూ అద్భుతమైన మాటలతో కోటలు దాటించడం, ఆ తర్వాత చప్పగా ఉన్నచోటనే కూలబడడం తెలంగాణలో గత రెండేళ్లుగా సాగుతున్న ప్రక్రియ. ఇందుకు తిరుగులేని ఉదాహరణ విద్యాశాఖ. 
విద్యకు బడ్జెట్‌ కేటాయింపుల్లో పురోగతి లేదు 
ఒకే క్యాంపస్‌ లో కేజీ టు పీజీ. రెండేళ్ల క్రితం నాటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాగ్దానమిది. ఇప్పటికి టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికి ముచ్చటగా మూడుసార్లు బడ్జెట్‌ లు ప్రవేశపెట్టింది. కానీ, ఒక్క చోట కూడా కేజీ టు పీజీ క్యాంపస్‌ కు కనీసం శంకుస్థాపన అయినా చేయలేదు.  కేజీ టు పీజీ గురించి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మాట్లాడినంత హుషారుగా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడడం లేదు.  కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటూ చక్కటి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఈ దేశంలో బహుశా కేసీఆర్‌ ఒక్కరే కావచ్చు. కానీ ఈ రెండే ళ్ల   కాలంలో  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికీ, నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు ఎలాంటి    చర్యలు తీసుకున్నారంటే అత్యంత నిరుత్సాహకరమైన సమాధానం వస్తుంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏమాత్రం పురోగతి లేదు. 
అవసరమైన ఏ ఒక్క చర్యా తీసుకోలేదు 
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ఉద్యోగులు కాదుకదా- కనీసం దినసరి కూలీలైనా తమ పిల్లలను ధైర్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేందుకు, అక్కడ చదువుకుంటున్న వారిని ఉత్సాహ పరిచేందుకు అవసరమైన ఏ ఒక్క చర్యా తీసుకోలేదు. నిజానికి, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యారంగ మేధా వులు ఇప్పటికే చాలా రకాల సూచనలు సలహాలు ఇచ్చి వున్నారు. అనేక కోరికలను ప్రభుత్వం ముందు వుంచారు.   ప్రభుత్వ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఎప్పటికప్పుడు వినతిపత్రాలు సమర్పిస్తూ, ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వాటి తీవ్రతను  ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే వున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తావించిన సమస్యల్లో కనీసం సగం పరిష్కరించినా విద్యార్థులు అనేక స్కూళ్లను మూతపెట్టుకోవా ల్సిన అవమానకర పరిస్థితి ప్రభుత్వానికి వచ్చేది కాదు. 
మరికొన్ని స్కూళ్ల విలీనానికి ప్లాన్
తమ ఆధ్వర్యంలోని ఒక సంస్థ మూతపడుతోందంటే ఎవరైనా సహజంగానే బాధపడతారు. అదొక అవమానంగానూ, దాన్నొక పరాజయంగానూ భావిస్తుంటారు. కానీ,  ప్రభుత్వ సం స్థలను మూతపెట్టడాన్ని మహా విజయంగా భావించుకునే ప్రభుత్వాలు ఏర్పడడం మన దురదృష్టం. విద్యార్థులు తగినంత సంఖ్యలో లేరన్న పేరుతో కొన్ని స్కూళ్లను, హాస్టళ్లను   మూసేసిన  విద్యాశాఖ మరికొన్ని స్కూళ్లను విలీనం చేసేందుకు, మూసివేసేందుకు లెక్కలేస్తోంది.  ఎన్ని స్కూళ్లను మూసివేస్తే, ఎంత డబ్బు ఆదా అవుతుందన్న కోణంలో ఆలోచించే ప్రభుత్వాలు ఏర్పడం, అలాంటి సలహాలిచ్చే  అధికారులు వుండడమే మన దురదృష్టం. తమ స్కూళ్లకు విద్యార్థులు రావడం లేదని వాపోతున్న     ప్రభుత్వం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తోందన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది.
ఆడపిల్లలకు టాయ్‌ లెట్స్ లేవు.. 
ఆడపిల్లలకు టాయ్‌ లెట్స్ వుండవు. బడికి వెళ్లిన్నప్పటి నుంచి ఇంటికి తిరిగివచ్చేదాకా కడుపు బిగపట్టుకోవాల్సిన దుస్థితి. ఈ బాధ భరించలేక మధ్యలోనే బడిమానేస్తున్న బాలికలెందరో. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత తాగడానికి మంచినీళ్లుండవు. మరికొన్ని చోట్ల టీచర్లుండరు. వారు ఎప్పుడొస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో, ఏం చెబుతున్నారో , ఏం చేస్తున్నారోపట్టించుకునే యంత్రాంగం వుండదు.  కొన్ని లక్షల మంది      విద్యార్థుల భవిష్యత్‌ తో ముడిపడిన వ్యవహారంలో ప్రభుత్వం, విద్యాశాఖ ఎందుకింత నిర్లిప్తంగా ప్రవర్తిస్తున్నాయి.?
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ విధానం.. 
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ విధానం ప్రవేశపెట్టాలని, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల సంఖ్యను పెంచాలని, సీబీఎస్‌ఈ స్కూళ్లతో పాటే మార్చిలోనే ఎడ్యుకేషన్‌ కేలండర్‌ ప్రారంభించాలనీ ఉపాధ్యాయ సంఘాలు గతకొంతకాలంగా సూచిస్తున్నా యి. మొదట ఇందుకు సానుకూలంగా స్పందించిన  ప్రభుత్వం చివరి క్షణాల్లో మనస్సు మార్చుకుంది. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగి వుంటే, విద్యా శాఖ చిత్తశుద్ధితో ప్రయత్నించి వుంటే ఇవాళ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. విద్యార్థులు ఇవాళే హుషారుగా కొత్త క్లాసులో కూర్చునేవారు. కానీ, తెర వెనక ఎలాంటి కథ నడిచిందో ఏమో కానీ, ప్రభుత్వ పాఠశాలల ఎడ్యుకేషన్‌ కేలండర్‌ వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది. ప్రయివేట్‌ పబ్లిషర్స్‌ లాబీయే విద్యాశాఖ మనస్సు మార్చేసిందన్న విమ  ర్శలొస్తున్నాయ్‌.  కొద్ది మంది పుస్తక వ్యాపారుల లాభాలను కాపాడడం కోసం   విద్యాశాఖ తమ జీవితాలతో ఆటాలడుకుంటోందన్న అభిప్రాయం పిల్లల హృదయాల్లో నాటుకోవడం ఏ ప్రభుత్వా నికీ మంచిది కాదు. 

 

07:53 - March 21, 2016

నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో మహిళలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. కొందరు యువకులు ఓ ముఠాగా ఏర్పడి మహిళలే టార్గెట్‌గా  స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గతంలో నిర్మానుష్య  ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దుండగులు, నేడు రద్దీగా ఉండే ప్రాంతాలు..  వ్యాపార కూడళ్ల వద్ద  గొలుసు దొంగతనాలు చేస్తున్నారు. 
నగరంలో ఎక్కడపడితే అక్కడ గొలుసు దొంగలు
నగరంలో ఎక్కడపడితే అక్కడ గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. గతంలో చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించి వారివద్ద నుండి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొని  జైలుకు పంపించారు. అయినా సరే కొందరు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఓ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి ముందు మహిళలు వివిధ పనులు చేసుకుంటుండగా అడ్రస్ కావాలని కొందరు, తాము పోలీసులమని తనిఖీల పేరుతో ఇంకొందరు మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కొని పారిపోతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం వల్లనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
వ్యసనాలు, ఈజీ మనీ కోసం దొంగతనాలు 
వ్యసనాల బారిన పడిన కొందరు యువకులు ఈజీ మనీ కోసం గొలుసు దొంగతానాలకు పాల్పడటం సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశం. ఈ బిజీ లైఫ్‌లో తమ పిల్లల పట్ల తల్లితండ్రులు నిరంతర పర్యవేక్షణ పెట్టాలి. అప్పుడే ఇలాంటి ఘటనలను నిలువరించవచ్చు. ఇప్పటికైనా పోలీసులు గస్తీ పెంచి చైన్ స్నాచర్స్ ఆగడాలకు చెక్ పెట్టాలని మహిళలు కోరుతున్నారు.

 

07:50 - March 21, 2016

హైదరాబాద్ : సినిమా యాక్టర్ కావాలనే ఓ యువకుడి దురాశ.. టెన్త్ విద్యార్ధి కిడ్నాప్‌, హత్యకు దారితీసింది. సినిమాను ఆదర్శంగా తీసుకొని పక్కా ప్లాన్‌తో అమలు చేసిన ఈ ఘటనలో... ముగ్గురు యువకులు కటకటాల పాలయ్యారు. తెలిసిన వారే కదా అని నమ్మి వెళ్లినందుకు ఓ అమాయకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 
ముగ్గురు నిందితులు అరెస్ట్
సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ దగ్గర అట్టపెట్టెలో విద్యార్ధి అభయ్‌ హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 
ఈజీగా మనీ సంపాదించాలనే కోరికతో ఘాతుకం 
సినిమాల్లో నటించాలనే ఆశ.. ఈజీగా మనీ సంపాదించాలనే కోరికతో ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అభయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు శేషుకుమార్‌... తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పదో తరగతి వరకు చదివాడు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి..  కార్తికేయ ఓల్డ్‌ ఏజ్‌ హోంలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలోనే హన్మంత్‌దాస్‌ అనే వ్యక్తి కుటుంబానికి శేషు చాలా దగ్గరయ్యాడు. ఆ ఇంటి పక్కనే నివసించే అభయ్‌తోనూ స్నేహం పెంచుకున్నాడు. 
'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌' కథ అనే సినిమా ఆధారంగా 
ఈ కేసులో ఇతర నిందితులు రవి, మోహన్‌లు బీహారీలు.  ఫిబ్రవరి 18న సిటీకి వచ్చి.. కొన్నాళ్లపాటు ఇక్కడే హోటల్‌లో మకాం వేశారు. ఆ తర్వాత హిందూనగర్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌' కథ అనే సినిమాను చూసిన ముగ్గురు యువకులు.. సినిమాలో చూపిన విధంగా ఎవరినైనా కిడ్నాప్‌ చేసి.. డబ్బు సంపాదించాలని ఆశపడ్డారు. అంతే ఈనెల 16న అభయ్‌ను కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు సాయంత్రం టిఫిన్‌ కోసం బటయకు వచ్చిన అభయ్‌ను మాయమాటలు చెప్పి శేషు తన రూమ్‌కు తీసుకెళ్లాడు. అభయ్‌కు కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. స్నేహపూర్వకంగానే మెలిగారు. ఆ తర్వాత తనను కిడ్నాప్‌ చేసినట్లు చెప్పారు. అయితే.. అభయ్‌ తననేమీ చేయవద్దని.. తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తే డబ్బులు ఇస్తారని బతిమాలాడు. అయితే సినిమాలో చూపిన విధంగా అభయ్‌ నోరు, ముక్కుకు ప్లాస్టర్‌ వేశారు దుండగులు. ఎలా డబ్బులు డిమాండ్‌ చేయాలో ముగ్గురు యువకులు చర్చించుకున్నారు. అయితే ఈలోపే ఊపిరి ఆడక పోవడంతో అభయ్‌ మృతిచెందాడు. 
అట్టెపెట్టెలో అభయ్ మృతదేహం 
అభయ్‌ మృతితో ఏమి చేయాలో దిక్కుతోచని కిడ్నాపర్లు ఒక అట్టెపెట్టెలో అతడి మృతదేహాన్ని సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు. అక్కడ వేరే సిమ్‌కార్డులు కొని అభయ్‌ ఇచ్చిన నెంబర్‌తో 10 కోట్లు ఇవ్వాలని తల్లిదండ్రులను డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేమంటే.. కనీసం 10 లక్షలైనా ఇవ్వాలన్నారు. కానీ.. అక్కడ నిలవకుండా.. అభయ్‌ మృతదేహాన్ని అక్కడే వదిలేసి  హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ పారిపోయారు నిందితులు. 
ముగ్గురినీ నిందితులకు జుడిషియరీ రిమాండ్‌ 
సినిమాలపై మోజు.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న అత్యాశ ఈ ముగ్గురు యువకులను కటకటాల పాలు చేసింది. తెలిసిన వాడు కదా అని నమ్మి వెళ్లినందుకు పాపం అభయ్‌ అమాయకంగా ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు.. జుడిషియరీ రిమాండ్‌కు తరలించారు. 

 

నేడు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్

కర్నాటక : ప్రపంచకప్ టీ.20 లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేటి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

మెదక్  : నేటి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.  ఈనెల 23 వరకు నామినేషన్లు స్పీకరించనున్నారు. 

 

నేడు టీఎస్ అసెంబ్లీలో పలు కీలక బిల్లులు

హైదరాబాద్ : నేడు టీఎస్ అసెంబ్లీలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అమెన్ మెంట్ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అమెన్ మెంట్ బిల్లు, సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ అమెన్ మెంట్ బిల్లు, మున్సిపాలిటీల అమెన్ మెంట్ బిల్లు, వ్యాట్ బిల్లు వంటి తదితర బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

07:29 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ నుంచి మరో 9 ప్రాజెక్టులు ప్రధానమంత్రి కృషి సంచయ్‌ యోజన- పిఎంకెఎస్ వైలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నిర్వహించిన జలవనరుల సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధులు, రాష్ట్రాల ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.
కేంద్ర జలవనరుల సమన్వయ రెండో కమిటీ భేటీ 
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర జలవనరుల సమన్వయ రెండో కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో..తెలంగాణలోని రాజీవ్‌ బీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, ఇందిరా ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌, కొమరంబీం, పెద్దవాగు, మత్తడివాగు, పాలెంవాగు, గొల్లవాగు, గాలివాగు ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన పథకంలో చేర్చాలని మంత్రి హరీష్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు గిరిజన, కొండప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం 60 శాతం గ్రాంటు ఇవ్వాలని మంత్రి కోరారు. వీటన్నింటిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దాంతో పాటు 2012 మార్చి 31కల్లా  ప్రాజెక్టులయ్యే ఖర్చుకు అదనంగా 20శాతం డీపీఆర్‌ను పరిగణలొకి తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ప్రాజెక్టులకు సైతం ఆర్దిక సంవత్సరం ప్రారంభమయ్యే  ఏప్రిల్‌లోనే 50శాతం నిధులివ్వగలిగితే రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించగలుగుతాయన్నారు. ఈనెల 28కల్లా రాష్ట్రంలోని ప్రాజెక్టుల వివరాలను కేంద్రానికి పంపిస్తామని మంత్రి అన్నారు. 
కాంగ్రెస్‌ నేతల విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు
మిషన్‌ కాకతీయలో అక్రమాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో 1500 కోట్లతో కాంగ్రెస్‌ నేతలు జేబులు నింపుకున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన 9 ప్రాజెక్టులను పిఎంకెఎస్ వైలో చేర్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో  కేంద్రానికి మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. 

07:20 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ‌లో గోదావ‌రి న‌దిపై నిర్మించ‌ త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల విష‌యంలో ఎవ‌రెన్ని విమ‌ర్శలు చేసినా ప‌ట్టించుకోకుండా జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తోంది సర్కార్. ఒక వైపు మహారాష్ట్రతో ఒప్పందం పై అసెంబ్లీలో విప‌క్షాలు విరుచుకుప‌డుతుంటే...అవేమి ప‌ట్టన‌ట్లు సీఎం కేసిఆర్ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్రతో చర్చలు సఫలం కావడంతో..  త్వర‌లోనే మ‌హారాష్ట్ర సీఎం ను తెలంగాణ కు ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. ఎవ‌రు అడ్డుప‌డిన మేడిగ‌డ్డ,కాళేశ్వరం నిర్మించి తీరుతామ‌ని స్పష్టం చేశారు.
బ్యారేజీల పై విప‌క్షాలు అభ్యంతరాలు 
గోదావరిపై నిర్మించాలనుకుంటున్న బ్యారేజీల పై విప‌క్షాలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ సర్కార్ తమ దైన స్టైల్ లో దూసుకెళ్లోంది. మ‌హారాష్ట్రతో చేసుకునే ఒప్పందంలో అనేక ఇబ్బందులు ఉన్నాయ‌ని ప్రతిపక్షాలు  ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల‌ని ఎంత కోరిన ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపిస్తున్నాయి. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఇవేమి ప‌ట్టన‌ట్లుగా త‌న ప‌ని తాను చేసుకుపోతుంది.
కరీంనగర్ జిల్లాలో రైతుల పాదయాత్ర
గోదావ‌రి పై నిర్మించ త‌ల పెట్టిన ప్రాజెక్టుల‌తో త‌మ ప్రాంతాలు సస్యశ్యామ‌లం అవుతాయ‌ని ...దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్నిఅభినందిస్తూ కరీంనగర్ జిల్లా రైతులు పాదయాత్ర నిర్వహించారు. క‌రీంనగర్ నుంచి హైద్రాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌రకు  210 కి.మీ  రైతులు యాత్ర చేశారు. ఇత్తడి, వెండి పాత్రల్లో పవిత్ర గోదావరి జలాలను సిఎం కు అందజేశారు. 
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను  ఆహ్వానించిన కేసీఆర్
ఇక మహారాష్ర్ట - తెలంగాణ రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తదుపరి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఇందుకు  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు త్వరలోనే హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. ఈ ఎండాకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు నిర్మిస్తామని సిఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ర్టంతో గత పాలకులు పరిష్కరించలేని దశాబ్దాల నీటి జగడానికి తెరపడడంతో తనకు ఎంతో ఆనందంగా వుందన్నారు సీఎం. 
కోటి ఎకరాలను సాగు నీరిస్తానన్న కేసీఆర్
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాల్సిన చారిత్రక అవసరాన్ని కరీంనగర్ వాసుల పాదయాత్ర ప్రజలకు మరోసారి గుర్తు చేసిందన్నారు సీఎం. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో తమకు పుట్టగతులు లేకుండా పోతాయనే నిరాశతో ప్రతిపక్ష నేతలు అడ్డగోలు వాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణకు సాగునీళ్లు అందివ్వాలనే చిత్తశుద్ది ప్రతిపక్షాలకు  యేనాడూ లేదన్నారు. ప్రాజెక్టులు కట్టుకోని ముందుకు పోకుండా ప్రాజెక్టు ఎత్తు పేరుతో సమస్యను సృష్టించి సాగతీయడం గత పాలకుల నైజమన్నారు. దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసి వలస రహిత  తెలంగాణను తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం తెలిపారు. రైతులు తెచ్చిన పవిత్ర గోదావరి జలాలలను స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాదయాద్రకు నాయకత్వం వహించిన జల్లేపల్లి రైతులు శాలువాతో సత్కరించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతానని కేసీఆర్ అన్నార.  

ట్రాక్టర్, లారీ ఢీకొని ముగ్గురి మృతి

ప్రకాశం : కనిగిరి ఏబీఆర్ కాలేజీ వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికిగాయాలయ్యాయి. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘటన చేటుచేసుకుంది. 

 

07:08 - March 21, 2016

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు, పంచాయతీరాజ్ విధానంపై  సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, ఈటెలరాజేందర్ , సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల విధుల అధికారాలపై సమగ్రంగా చర్చించింది ప్రభుత్వం. 
స్థానిక సంస్థలు బలోపేతం 
స్థానిక సంస్ధల‌కు అధికారాలు బ‌ద‌లాయించిన‌ప్పుడే..రాష్ట్రంలో స‌మాగ్రాభివృద్ధి సాధ్యమౌతుంద‌ని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసిఆర్. సెక్రటేరియట్ లో స్థానిక సంస్థల పంచాయతీల విధులు, అధికారాలు, అభివృద్దిపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం 
పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి, గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం సాధించ‌వ‌చ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి కూడా ఖచ్చితమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులకు, మంత్రులకు  సూచించారు. 
గ్రామ పరిధిలో, పాఠశాలల్లో పారిశుద్ద్య నిర్వహణ
గ్రామాల్లో అభవృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు.. గ్రామ పరిధిలో, పాఠశాలల్లో పారిశుద్ద్య నిర్వహణ, మొక్కల పెంపకం, పిచ్చికుక్కల నివారణ, మురికి గుంటలు లేకుండా చూడడం లాంటి కార్యక్రమాలను గ్రామపంచాయతీలే నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రజలు అంటూ వ్యాధుల బారిన పడుతున్నారని, పరిశుభ్ర వాతావరణం నెలకొల్పితే.. ఆ దుస్థితి ఉండదని సీఎం మంత్రులతో  చర్చించారు.  గ్రామ సర్పంచ్ లు, గ్రామకార్యదర్శులు గ్రామాభివృద్ది విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకు అవసరమైన విధంగా ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  
చెత్త సేకరణకు 25 వేల సైకిల్ రిక్షాల పంపిణీ
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీలకు 25 వేల సైకిల్ రిక్షాలను వీలైనంత త్వరగా అందించాలని నిర్ణయించారు.  ఖాళీగా ఉన్న పంచాయతి కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేయాలని,  క్లస్టర్ల వారీగా  కార్యదర్శులను నియమించాలని, అవసరమైతే  మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాల‌ని సిఎం చెప్పారు.  గ్రామాల్లో డంప్ యార్డుల ఏర్పాటు స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  గ్రామపంచాయతీల ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు, రావాల్సిన అనుమతులు సకాలంలో వచ్చే విధంగా కూడా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
విధి విధానాలు ఖరారు..?
గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడం కోసం, వారి బాధ్యతను మరింత పెంచే విధంగా విధి విధానాలు ఖరారు చేయాలని భేటీలో చర్చించారు. అవసరమైతే ఈ అసెంబ్లీ  సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలని  సీఎం నిర్ణయించినట్లు సమాచారం. పంచాయితీ రాజ్ వ్యవ‌స్ధ  బ‌లోపేతం కోసం మ‌రింత అధ్యాయ‌నం చేయాల‌ని మంత్రులు, అధికారుల‌కు సూచించారు కేసీఆర్ .

 

07:02 - March 21, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ విషయంలో తన పట్టు నిలుపుకొనేందుకే తెలుగుదేశం ప్రభుత్వం పావులు కదుపుతోంది. కోర్టు ఆగ్రహానికి గురి కాకుండా సస్పెన్షన్‌ను కొనసాగించే దిశగా వ్యూహం రచిస్తోంది. సస్పెన్షన్‌ సందర్భంగా చేసిన తప్పును సరిదిద్దుకుంటూనే మరో వైపు తాను ఓడిపోలేదని చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సోమవారం శాసనసభ వేదిక కానుందని తెలుస్తోంది. 
నానిపై ఏడాది పాటు సస్పెన్షన్‌ అమలు..? 
రోజాతోపాటు వైసిపికి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపై ఏడాది పాటు సస్పెన్షన్‌ను అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సభా హక్కుల కమిటీ, గత శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యేకంగా వేసిన మండలి బుద్ధప్రసాద్‌ కమిటీ నివేదికలను ఆగమేఘాల మీద సభ ముందుకు తీసుకొచ్చి, దానిపై చర్చపెట్టాలని భావిస్తోంది. ఈ చర్య ద్వారా  హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరోక్షంగా గౌరవించినట్లవుతుందని, ఇదే సమయంలో ప్రివిలైజ్‌ కమిటీ సిఫారసుతో రోజా సస్పెన్షన్‌పై వెనక్కిపోకుండా తన పంతం నెగ్గించుకున్నట్లూ ఉంటుందని అధికారపక్షం యోచిస్తోంది. 
రెండు పిటిషన్లపై కోర్టులో నేడు విచారణ 
మొత్తమ్మీద రోజాను తాను అనుకున్నట్లు సంవత్సరంపాటు సభకు రానీకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రోజా విషయంలో టిడిపి పట్టుదల, వైసిపి నిరసనలు, న్యాయపోరాటం మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆర్డర్‌పై సోమవారం సభలో చర్చిస్తామని ఇప్పటికే స్పీకర్‌ ప్రకటించారు. ఈ లోపే సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు సర్కారు అప్పీల్‌కు వెళ్లింది. కాగా కోర్టు తీర్పును స్పీకర్‌, ప్రభుత్వం ఉల్లంఘించారంటూ వైసిపి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లూ సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి.
రోజాపై ఏడాది సస్పెన్షన్‌ కొనసాగించేందుకు ప్రభుత్వం దారులు 
జ్యుడీషీయరీ, లెజిస్లేచర్‌ మధ్య గొడవగా చెబుతూ, రోజాపై ఏదోక విధంగా ఏడాది సస్పెన్షన్‌ కొనసాగించేందుకు ప్రభుత్వం దారులు వెతికింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో 'సభా కమిటీల్లో విచారణకు తమ ఆర్డర్‌ అడ్డంకి కాబోదు' అన్న పాయింట్‌ను పట్టుకొని బుద్ధప్రసాద్‌, ప్రివిలైజ్‌ కమిటీలను ముందుకు తెచ్చింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన విచారణ జరిపిన ప్రివిలైజ్‌ కమిటీ సైతం బుద్ధప్రసాద్‌ కమిటీ సిఫారసులకనుగుణంగా నివేదిక రూపొందించినట్లు సమాచారం. ఈ కమిటీల నివేదికలను సోమవారం సభలో పెట్టి, రోజా, నానిపై ఏడాదిపాటు సస్పెన్షన్‌కు తీర్మానం ఆమోదించనున్నట్లు సమాచారం. 

 

06:54 - March 21, 2016

హైదరాబాద్ : ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9 వరకు 20 రోజుల పాటు జరగనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల 56 వేల 757 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. 
తెలంగాణలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు  
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల 56 వేల 757 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యార్ధులందరికీ హాల్‌టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్ధులు ఐదు లక్షల 21 వేల 46 మంది కాగా.. ప్రైవేట్‌గా పరీక్షకు హాజరయ్యేవారు 35,711 మంది ఉన్నారు. పరీక్షలకు మొత్తం 2,615 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
గంట ముందే పరీక్ష కేంద్రానికి 
పరీక్షా కేంద్రానికి విద్యార్ధులంతా గంటముందే నుంచే హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. 9 గంటల 35 నిమిషాలు దాటితే విద్యార్ధులను అనుమతించేది లేదంటున్నారు. విద్యార్ధులు స్కూల్‌ డ్రెస్సులో కాకుండా సాధారణ దుస్తుల్లోనే రావాలని సూచించారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్షల తనిఖీ కోసం నలుగురు స్పెషల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పాటు.. 144 మంది స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇక వికలాంగ విద్యార్ధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పరిచారు. 
20 రోజుల పాటు పరీక్షలు
ఇక ఈ పరీక్షలు ఏప్రిల్‌ 9 వరకు 20 రోజులపాటు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11 నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం కానుంది. పరీక్షలు ముగిసిన ఏడు వారాల్లోపు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. 
ఎపిలో పదో తరగతి పరీక్షలు
ఏపీలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్‌ 7 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు హాల్‌ టిక్కెట్‌తో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఏపీఎస్‌ ఆర్టీసీ విద్యార్థులకు కల్పిస్తోంది. 
విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లోనూ నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్‌ ఏడో తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,57,595 మంది విద్యార్థులు 3,028 కేంద్రాల్లో ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 3,14,555, బాలురు 3,44,140 మంది ఉన్నారు. 
ఉ.9.30 మ. 12 గం.ల వరకు పరీక్షలు
ఉదయం 9.30 మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయి. పరీక్ష కేంద్రం వద్దకు ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థులకు సూచించింది. ఏ కారణం వల్లనైనా ఆలస్యమైతే తొలిరోజు మాత్రమే అరగంట వరకు ఆలస్యానికి అనుమతిస్తారు. మిగిలిన రోజుల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని అధికారులు ఇప్పుటికే స్పష్టం చేశారు. విద్యార్థులు తమ సూళ్ల యూనిఫాం దుస్తుల్లో కాకుండా సివిల్‌ దుస్తుల్లో మాత్రమే ఈ పరీక్షలకు హజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌ను విద్యాశాఖ నియమించింది. సమస్యత్మాకంగా ఉన్న పరీక్షా కేంద్రల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు. 
ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం
పరీక్షా కేంద్రాల సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. హల్‌ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఎపిఎస్‌ ఆర్టీసీ కల్పించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో మంచినీరు, మరుగుదొడ్లు, మెడికల్‌ సదుపాయాలను కల్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ  చేసింది. 

తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30  నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 9.35 దాటితే పరీక్ష కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నారు.  ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగనున్నాయి.  

 

ఎపిలో టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం..

హైదరాబాద్ : ఎపిలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. 

 

ఎపిలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్ : ఎపిలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరుగునున్నాయి. 

 

నేడు టీ.అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ భేటీ

హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ భేటీ కానున్నారు. ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపుపై చర్చించనున్నారు. 

Don't Miss