Activities calendar

22 March 2016

22:40 - March 22, 2016

కేజ్రివాల్ బుడ్డమన్షేంగాదు..ఢిల్లీల ముఖ్యమంత్రి పీఠం మీద డిల్లక్ ఆడుతున్నడేమో... ప్రధాన మంత్రి కుర్సి మీద కన్నేసిండా.. 2019 వరకల్ల ప్రధాన మంత్రి అవ్వాలని సవాల్ విసురుతున్నడా .... గీ ముచ్చటేందో సుడాలంటే పక్కపోంటి ఉన్న వీడియో క్లిక్ సేయుoడ్రి

21:31 - March 22, 2016

బెల్జియం : రాజధాని బ్రస్సెల్స్‌ వరుస బాంబు పేలుళ్లతో బెంబేలెత్తింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో 34 మంది మృతి చెందారు. మరో 170 మంది వరకు గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా బెల్జియం పేర్కొంది. ఉగ్రవాదులు సూట్‌కేస్‌ బాంబును ఉపయోగించారని అమెరికా అధికారవర్గాలు తెలిపాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని జవెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబుల మోతతో భయభ్రాంతులకు గురైన జనం బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయంలోని డిపార్చర్‌ హాల్‌వద్ద అమెరికా ఎయిర్‌లైన్స్‌ డెస్క్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఎక్కడ చూసినా రక్తసిక్తమై కనిపించింది. పేలుడు ధాటికి 11 మంది మృతిచెందగా, 130 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను విమనాశ్రయంలోనుంచి బయటకు తరలించారు. ఎయిర్‌పోర్టు బాంబు పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికే మెట్రో స్టేషన్‌లో మరో పేలుడు ప్రజల్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఈ దాడిలో 15 మంది మృతి చెందారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడున్న ప్రయాణికులను బయటకు తరలించారు.

అప్రమత్తమైన అధికారులు...
పేలుళ్ల ఘటనతో భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని, మెట్రో స్టేషన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. బ్రస్సెల్స్‌లోని మెట్రో రైలు సేవలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇది ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యేనని, ఆత్మాహుతి దాడిగా బెల్జియం ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సూటు కేసులో బాంబును అమర్చడం ద్వారా పేలుళ్లకు పాల్పడ్డారని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. వరుస పేలుళ్లకు కొద్దిసేపు ముందు కొందరు అరబిక్‌ భాషలో నినాదాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రజలు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండిపోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాడులపై స్పందించిన బెల్జియం ప్రధాని ఛార్లెస్‌ మైఖేల్‌-తమ దేశానికి ఇది విషాదకర సమయమని పేర్కొన్నారు.

సహాయం అందిస్తామన్న మోడీ...
బ్రస్సెల్స్‌లో జరిగిన జంట పేలుళ్లు ఘటనలో గాయపడినవారిలో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. ఈయూ సదస్సు కోసం మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం వెళ్లాల్సి ఉందని విదేశాంగశాఖ తెలిపింది. బ్రస్సెల్స్ ఘటనను ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. బెల్జియానికి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ప్రకటించారు. 

అప్పారావుపై చర్యలు తీసుకోవాలి - హెచ్ సీయూ జేఏసీ..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి వీసీ అప్పారావే కారణమని హెచ్ సీయూ జేఏసీ పేర్కొంది. వీసీగా కొనసాగేందుకు అప్పారావుకు అర్హత లేదని, అప్పారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

పోలీసుల అదుపులో 25 మంది విద్యార్థులు..

హైదరాబాద్ : పోలీసుల అదుపులో 25 మంది హెచ్ సీయూ విద్యార్థులున్నారు. విద్యార్థులపై రెండు కేసులు నమోదు చేశారు. ఆస్తుల ధ్వంసం, పోలీసులను గాయపరిచినందుకు కేసులు నమోదు చేశారు. 

వెలివాడ వద్ద విద్యార్థుల నిరసన...

హైదరాబాద్ : హెచ్ సీయూ లోని వెలివాడ వేదిక వద్ద విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. హాస్టల్ మెస్ మూసివేత, పోలీసుల చర్యకు నిరసనగా ధర్నా చేపట్టారు. 

హెచ్ సీయూను సందర్శించిన సీపీ..

హైదరాబాద్ : హెచ్ సీయూను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఘటనపై అధికారులతో చర్చించారు. 

21:22 - March 22, 2016

విజయవాడ : ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేశారు. జల సంరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామని ప్రతినిబూనారు. ప్రపంచ జల వనరుల దినోత్సవం సందర్భంగా.. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాలక, ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా.. ఏపీ అసెంబ్లీలో.. నీటి వినియోగం, సంరక్షణ అంశాలపై చర్చ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల వనరుల సంరక్షణపై సభలో ప్రకటన చేస్తూ... భూగర్భ జలాలు పడిపోతున్న తీరును వివరించారు. నీటివనరులు లేక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కురిసే వర్షంలో కొద్ది శాతాన్నైనా భూమిలో ఇంకేలా చేసేందుకు పంట కుంటలను తవ్వాల్సిన అవశ్యకతను సీఎం గుర్తు చేశారు.

తీవ్రంగా స్పందించిన జగన్...
జల సంరక్షణ అంశానికి సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత జగన్‌ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపులో వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. జల సంరక్షణ చర్యలపై చంద్రబాబు చేసిన ప్రకటనను చర్చగా మార్చేందుకు జగన్‌ ప్రయత్నించారు. దీనిపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో చేసిన ప్రకటనపై సభ్యులు వివరణలు కోరాలేకానీ, చర్చ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని గుర్తు చేశారు. అయినా జగన్‌ చర్చదిశగా సాగడంతో.. స్పీకర్‌ కోడెల... ఆయన మైక్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. జలవనరుల దినోత్సవం ప్రతిజ్ఞ తర్వాత.. అసెంబ్లీ సమావేశాన్ని శనివారానికి వాయిదా వేశారు.

21:19 - March 22, 2016

హైదరాబాద్ : సంస్కారం లేని వాళ్లు సభ నడుపుతున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో దుమారాన్ని లేపాయి. డీకే అరుణ వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడిపెట్టారు. మరోవైపు అరుణ క్షమాపణలు చెప్పాలంటూ అధికార పక్షం పట్టుబట్టింది. మంగళవారం అసెంబ్లీలో తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతుండగా.. సభలో గందరగోళం నెలకొంది. గత పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని రసమయి ఆరోపించగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ సంస్కారం లేని వాళ్లు సభ నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. డీకే అరుణ వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి కంటతడి పెట్టారు. స్పీకర్‌ చైర్‌కు మర్యాద ఇవ్వాలని.. ఇది మంచి పద్దతి కాదని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. డీకే అరుణ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చెప్పారు.

వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన డిప్యూటి స్పీకర్..
సభను హుందాగా నడుపుకుందాం అంటూ ప్రతిపక్షనేత జానారెడ్డి.. ఇరుపక్షాలకు సూచించారు. గతంలో తాము పొరపాటుగా మాట్లాడితే మంత్రి స్థానంలో ఉండి కూడా క్షమాపణలు చెప్పామని.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు చెబితే తప్పేంటని హరీష్‌రావు ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఆఫ్‌ ద రికార్డులో ఓ సభ్యురాలు మాట్లాడితే ఏడాది సస్పెన్షన్‌ వేటు పడిందని గుర్తు చేశారు. అటు మంత్రి తుమ్మల కూడా డీకే అరుణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీకే అరుణను సభ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందే అంటూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్‌ చేశారు. తాను సభలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని డీకే అరుణ వివరణ ఇచ్చారు.కాంగ్రెస్‌ సభ్యులు క్షమాపణలు చెప్పకపోవడంపై వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి గొడవకు ఫులిస్టాప్‌ పెట్టారు. 

కివీస్ 180/5..

మొహాలీ : టీ -20 వరల్డ్ కప్ లో పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 

హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలు కూడా సప్తవర్ణ శోభితం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. 

ముగిసిన బాబు టెంపుల్ సర్క్యూట్ పై సమీక్ష..

విజయవాడ : శ్రీశైలం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాల బృహత్తర ప్రణాళికపై సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. శ్రీశైలాన్ని తిరుమలస్థాయిలో అభివృద్ధి చేయాలని, శ్రీశైలం చుట్టూ 8 కి.మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని బాబు సూచించారు. శ్రీశైలం, సున్నిపెంటను పట్టణాలుగా తీర్చిదిద్దాలని, అంతేగాకుండా సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాల్లో ఐదు టౌన్ షిప్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

గప్తిల్ హాఫ్ సెంచరీ..

మొహాలీ : టీ-20 ప్రపంచ కప్ గ్రూప్ 2 మ్యాచ్ లో పాక్ - కివీస్ జట్లు ఢీకొంటున్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అర్థశతకం సాధించాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ 93 పరుగులు చేసింది. 

20:29 - March 22, 2016

అతడు లేడు.. కానీ, అతడి కలలు ఇంకా మిగిలే ఉన్నాయి. అతడు అందించి స్థైర్యం నిలువెత్తు కొండలా అండగా ఉంది..అతడు ఉరికొయ్యను ముద్దాడిన ధైర్యం తరతరాలకు ప్రవాహంలా అందుతోంది..దేశం కోసం, దేశ ప్రజలకోసం సమానత్వం కోసం చేసిన పోరాటాలు నిత్యం మేల్కొలుపుతూనే ఉన్నాయి. కానీ, ఆ వీరుడి ఆశయాల సాధన ఇప్పుడు రాజద్రోహమవుతోందా? అసలు షహీద్ వారసులెవరు?

ఎగిసిన కెరటం..
దేశభక్తికీ, ద్రోహానికి మధ్య చర్చ తీవ్రమౌతోంది. ఇదే దేశభక్తి.. ఈ నినాదాలు చేస్తేనే దేశభక్తులనే మొండి వాదనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో నిస్వార్ధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడిని గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం.. అతడు నమ్మిన విలువలను గుర్తు చేసుకోవటం మరింత అవసరం.. గాలిని చేత్తో బంధించలేం..స్వేచ్ఛను కాంక్షించే గుండెల్లోంచి పొంగే శక్తినీ ఆపలేము..అది ఆకాశంనుంచి కాంతివేగంతో దూసుకొచ్చే గ్రహశకలం..దానికడ్డుపడే శక్తి ఇంకా పుట్టలేదు. అది నేలని తాకిందంటే ప్రళయమే..భగత్ సింగ్.. మండే అగ్ని గోళం.. జ్వలించే నిప్పుకణిక..రెపరెపలాడే విప్లవ పతాక.. తాను ముళ్ల బాటలో నడిచి ముందుతరాలకు పూలబాటను కాంక్షించిన స్వాప్నికుడు.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎగసిన కెరటం భగత్ సింగ్..

భగత్ సింగ్ అమరుడు.
ఆ వీరుడి వారసులం మేమే అంటూ ఇప్పుడు కొందరు వాదిస్తున్నారు. అతడి ఆశయాలు మేం నెరవేస్తున్నామంటూ బింకాలు పోతున్న సమయం ఇది . అసలు భగత్ సింగ్ ఏం కావాలనుకున్నాడు? ఈ దేశ భవిష్యత్తును ఎలా కలలుకన్నాడు? మరి భగత్ ఆశయ సాధనలో ఉన్నదెవరు? ఒక్కటి మాత్రం నిజం.... వ్యక్తులు మరణించవచ్చు. కానీ వారి మహోన్నతమైన ఆలోచనలు వందలు, వేలుగా పునరుజ్జీవనం పొందుతాయి. జాతిని, భవితను నడిపిస్తాయి..భగత్ సింగ్ అమరుడు. ఆయనకు జననమే కానీ మరణం లేదు. ఏ చరిత్ర పుస్తకం అయినా తెరిచి చూడండి. ఏ దేశభక్తుడినైనా తరచి తరచి అడగండి. ఇవాల్టికీ భగత్ సింగ్ స్పూర్తి భారతీయుల గుండెల్లో రగులుతూనే ఉంది.. అదే మువ్వన్నెల జెండా మధ్య ధర్మచక్రమై భారత గణతంత్రాన్ని నడిపిస్తోంది. భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో నిజమైన దేశభక్తులు మరింత పోరాడాల్సి ఉంటుంది. 

20:25 - March 22, 2016

హైద్రావాద్ సెంట్రల్ యూనివర్సిటీల పంచాది సల్లారిందేమో అనుకున్నంగని.. వామ్మో వామ్మో.. మళ్ల లేశింది భగ్గున..రోజాకు గాషారం కల్సిరాలె..కూకట్ పల్లి జేపీకి ఓట్లళ్ల తిర్గి తిర్గి చెప్పులు అర్గిపోయినంక జ్ఞానోదయం అయ్యినట్టే గొడ్తున్నది..కేజ్రివాల్ బుడ్డమన్షేంగాదు..ఢిల్లీల ముఖ్యమంత్రి పీఠం మీద డిల్లక్ ఆడుతున్నడేమో..బంగారు రాష్ట్రాలళ్ల పబ్లీకు బత్కులెట్లున్నయో సూడుండ్రి..ఇయ్యాళ నీళ్ల దినోత్సవం ఒక్కటొచ్చింది..బ్రెజిల్ దేశంల జూడుండ్రి జర్రంత ఎంత పనైందో..కోహ్లీకి ఇంత పైకం ఏడంగొస్తున్నది ఎవ్వలిస్తున్నరు..మహేష్ బాబు జేశ్నట్టే అతని కూతురు కూడా జేస్తున్నది.. ఈ అంశాలపై టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న విశ్లేషించారు. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:23 - March 22, 2016

సూపర్ స్టార్ మహేషు బాబు అంటె తెల్వనోళ్లున్నరా ఎవ్వలన్న... ఆయిన ఫైటింగులు.. ఆయిన డైలాగులు.. ఆయిన డ్యాన్సులు.. అబ్బో ఒక్కటా రెండా..? ఫ్యాన్స్ గూడ.. అదే రేంజిలున్నరు మహేష్ బాబుకు.. అయితే సింహం కడ్పుల సింహమే వుడ్తది.. పులి కడ్పుల పులే వుడ్తదంటరు సూడు.. అటో సేమ్ మహేష్ బాబు కడ్పుల అసొంటి పోల్కెలున్న బిడ్డెనే వుట్టింది..అచ్చం అయ్య జేశ్నట్టే ఏం జేసిందో వీడియోలో చూడండి.

 

బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..

కోల్ కతా : టీ -20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ - పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

టెంపుల్ సర్క్యూట్ పై బాబు సమీక్ష..

హైదరాబాద్ : ఏపీలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి మాణిక్యాలరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మెట్రో స్టేషన్లపై డీజీపీ సమీక్ష..

హైదరాబాద్ : మెట్రో స్టేషన్ స్టేషన్ల నిర్మాణంపై డీజీపీ సమీక్ష నిర్వహించాకర. సీసీ కెమెరాల ఏర్పాటు...పార్కింగ్ స్థలాల భద్రతపై సమీక్ష చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. మెట్రో స్టేషన్ లో భద్రతపై అధికారులు పలు సూచనలు చేశారు. ప్రతి 22 మెట్రో రైల్వేస్టేషన్ లకు ఒక పీఎస్ ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి. జూబ్లి, పంజాగుట్ట, ఎంజీబీఎస్ వద్ద మెట్రో పీఎస్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్ లో భద్రతకు 1525 మంది సిబ్బందితో పాటు రూ.54 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు.

19:42 - March 22, 2016

హైదరాబాద్ : పబ్లిక్‌ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసిన తీరు.. వైసీపీలో కలకలం రేపింది. ఓ వైపు ఎమ్మెల్యేల వలసలు, మరో వైపు రోజా వ్యవహారంతో సతమతమవుతున్న వైసీపీ అధినేత జగన్‌కు తాజాగా ఈ అంశం తలనొప్పిగా మారింది. అందరి ఆమోదంతోనే పీఏసీ పదవికి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు జగన్ వర్గాలు ప్రకటించాయి. అయితే జగన్‌ ఎవ్వరినీ సంప్రదించకుండానే నిర్ణయం తీసుకొని రాజేంద్రనాథ్‌రెడ్డిని తెరపైకి తెచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఈ వ్యవహారంలో పార్టీలోని సీనియర్లు ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ పీఏసీ చైర్మన్‌ పదవి ఆశించినా వారికి కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును ప్రకటించడం పట్ల వారు తీవ్ర అసంతృత్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల్లో అసంతృప్తి...
అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్ష పీఠాన్ని విపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. నవ్యాంధ్ర తొలి పీఏసీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డిని వైసీపీ ఎంపిక చేసింది. అయితే, ఆయన ఇటీవలే పార్టీని వీడటంతో.. జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన సుజయ కృష్ణ రంగారావులు పీఏసీ చైర్మన్‌ గిరీని ఆశించారు. ఏపీలో కాపు సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా జ్యోతులకు ఈ పదవి కచ్చితంగా దక్కుతుందని వైసీపీ నేతలు భావించారు. అసెంబ్లీ లాబీల్లోని చర్చల్లో ఈయన పేరే వినిపించింది. భూమా నాగిరెడ్డిని ఎంపిక చేసినప్పుడు కూడా జ్యోతుల ఈ పదవి ఆశించారు. అయితే అనూహ్యంగా జగన్‌ మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని పీఏపీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేయడంపై పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజేసింది.

పార్టీని వీడుతారా ? 
అయితే అమర్‌నాథ్‌రెడ్డి కంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక అంశాలతో సహా చాలా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం ఎక్కువన్నది జగన్‌ భావనగా చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్షాన్ని లెక్కలతో సహా ఎండగడుతూ రాజేంద్రనాథ్‌ చేసిన ప్రసంగానికి.. సీఎం చంద్రబాబు కూడా కితాబిచ్చారు. రాజేంద్రనాథ్‌రెడ్డైతే పీఏసీ చైర్మన్‌ పదవిని సమర్థవంతంగా నిర్వహించగలన్న ఆలోచనతోనే ఈ పదవికి ఆయన్ను ఎంపిక చేశామని జగన్‌ కూడా చెప్పుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, రాజేంద్రనాథ్‌రెడ్డి నమ్మకస్తుడు, పార్టీని అంటిపెట్టుకొని ఉండేవాడంటూ పార్టీ సమావేశంలోనే జగన్‌ వ్యాఖ్యానించడంపై నేతలు మండిపడుతున్నారు. ఇది మిగిలిన వారిని అవమానించడమే అవుతుందని అంటున్నారు. తమకు కూడా పార్టీ పట్ల, జగన్ నాయకత్వం పట్ల నమ్మకం ఉందని చెబుతున్నారు. జగన్‌ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.

ఎందుకంత ఆసక్తి...
పీఏసీ చైర్మన్‌ పదవిపై నేతలు ఇంత ఆసక్తి చూపడానికి కారణముంది. క్యాబినెట్ ర్యాంకు ఉండటంతో పాటు అన్ని శాఖల నిధుల వివరాలు, ఖర్చులను ఆ శాఖాధిపతులతో సమీక్షించే అధికారం ప్రజా పద్దుల కమిటీకి ఉంది. దీంతో ఇలాంటి పదవులను సీనియర్ ఎమ్మెల్యేలకు కట్టబెడతారు. కానీ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన రాజేంద్రనాథ్‌రెడ్డిని పబ్లిక్‌ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేసిన జగన్‌ తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీలో మరెన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 

19:36 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ అప్పారావు రీ ఎంట్రీపై జాక్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా గెస్ట్ హౌజ్ వద్ద 14 విద్యార్థి సంఘాల నేతలు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. వీసీ గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఉదయం నుండి చేస్తున్న సాయంత్రం అయ్యే సరికి ఉద్రిక్తతంగా మారిపోయింది. వెళ్లిపోవాలంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ప్రతిఘటించిన విద్యార్థులపై తమ ప్రతాపం చూపెట్టారు. లాఠీలతో బాదారు. విద్యార్థినిలను కూడా అదే రకంగా వ్యవహరించారు. రోడ్లపై లాక్కుంటూ వెళ్లడంతో పలువురు విద్యార్థినిలకు గాయాలయ్యాయి. ఇష్టమొచ్చినట్లుగా బాదారు. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీలు జరపడంపై తెలంగాణ సీపీఎం ఖండించింది. వీసీ అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. శాంతయుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఎందుకు లాఠీఛార్జీ చేశారని ప్రశ్నించింది. పోలీసుల తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ ప్రకటించింది.

శాంతియుతంగా ఆందోళన - విద్యార్థిని...
వీసీని అరెస్టు చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేపట్టడం జరిగిందని శిరీష (హెచ్ సీయూ మాజీ ప్రెసిడెంట్) టెన్ టివితో పేర్కొంది. విద్యార్థినిలపై పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారని, ఇది మాటల్లో చెప్పలేమని తెలిపారు. సుమారు 30 మంది దాక విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ రాకకు..ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లుగా అనిపించడం లేదని తెలిపారు. రెండు నెలలుగా కేసు బుక్ అయినా వీసీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

రేపటి నుండి నిరసన కార్యక్రమాలు...
హెచ్ సీయూ ఘటనకు బీజేపీ కారణమని సాంబశివ (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) తెలిపారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమని, రోహిత్ వేముల మృతిపై న్యాయవిచారణ జరిపించాలని తాము కోరడం జరుగుతోందన్నారు. వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పందించడం లేదని తెలిపారు. అందులో భాగంగా రేపు నిరసన కార్యక్రమాల చేపడుతున్నట్లు వెల్లడించారు. 

  • ఏం జరిగింది ?
  • వీసీగా బాధ్యతలు చేపట్టడానికి వర్సిటీకి అప్పారావు చేరుకున్నారు. అందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
  • సమాచారం అందుకున్న జాక్ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఫర్నీచర్ ధ్వంసమైంది.
  • పోలీసుల రంగ ప్రవేశం..విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు..
  • తాను ఎలాంటి తప్పు చేయలేదని, రోహిత్ వేముల ఆత్మహత్యకు తాను కారణం కాదని వీసీ అప్పారావు పేర్కొన్నారు.
  • వీసీ గెస్ట్ హౌజ్ ఎదుట విద్యార్థుల భారీ ఆందోళన.
  • సాయంత్రం విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ. విద్యార్థులకు గాయాలు. 

భారత్ కు పాక్ దర్యాప్తు బృందం..

ఢిల్లీ : పాక్ దర్యాప్తు బృందం ఈనెల 29న భారత్ కు రానుంది. పఠాన్ కోట్ ఘటనపై బృందం దర్యాప్తు చేయనుంది. ఐదుగురు సభ్యుల పాక్ దర్యాప్తు బృందానికి వీసా మంజూరైంది.

 

బ్రస్సెల్స్ పేలుళ్లు ఐఎస్ఐఎస్ పనే..

ఢిల్లీ : బ్రసెల్స్ లో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ బాధ్యత వహించింది. బ్రిస్సెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. ఎయిర్ పోర్టు నుండి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. జావెన్ట్ మ్ ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. బ్రిస్సెల్స్ లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 

తెలంగాణ అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ రోజు జరిగిన సమావేశల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సభలో కంట తడి పెట్టారు. టి.కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

ఏంసీఏ విద్యార్థిని ఆత్మహత్య..

గుంటూరు : ముప్పాళకు చెందిన ఎంసీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చంద్రిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న చంద్రిక బాలిక హాస్టల్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చంద్రిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

రాహుల్ ఉత్తరాఖండ్ పర్యటన వాయిదా..

ఉత్తరాఖండ్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన ఉత్తరాఖండ్ పర్యటన వాయిదా పడింది. హరిద్వార్ లో పార్టీ నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. పర్యటన ఎందుకు వాయిదా పడిందో తెలియరాలేదు. 

పోలీసుల అదుపులో 20 మంది హెచ్ సీయూ విద్యార్థులు..

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసీ అప్పారావు రీ ఎంట్రీపై విద్యార్థులు ఉదయం నుండి ఆందోళన నిర్వహిస్తున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైన అప్పారావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

లాఠీఛార్జీని ఖండించిన టి.సీపీఎం..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. వీసీ అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

18:41 - March 22, 2016

హైదరాబాద్ : రోజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సస్పెన్షన్‌పై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. సస్పెన్షన్‌ వ్యవహారంపై శాసనసభాపతిదే అంతిమ నిర్ణయమని కోర్టు తేల్చి చెప్పింది. ఇదే తరుణంలో... రోజా సభకు క్షమాపణలు చెబితే.. ఆమెను సమావేశాలకు అనుమతించే అంశంపై స్పీకర్‌ పునరాలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. రోజా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో సుప్రీంకోర్టు, వివిధ న్యాయస్థానాల్లో జరిగిన కేసులను సూచిస్తూ డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. అసెంబ్లీలో స్పీకర్ తీసుకున్న నిర్ణయమే అంతిమమని కోర్టు స్పష్టం చేసింది. రూల్ 340 క్లాజ్2 ప్రకారం ఒక సెషన్ బహిష్కరణ ఉన్నా.. సారాంశంలో ఏడాది పాటు సస్పెండ్‌ చేసినట్లు స్పష్టంగా ఉందని సీనియర్‌ న్యాయవాది పీవీ రావు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సింగిల్‌ బెంచ్‌కు వెళ్లాలని రోజాకు సూచించింది.

టిడిపి నేతల స్పందన..
రోజా కేసులో తీర్పు వెలువడగానే... టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద స్పందించారు. ఈరోజు తనకెంతో శుభదినమని ఎమ్మెల్యే అనిత అన్నారు. అహంకారం ఓడిందని.. తన ఆవేదన గెలిచిందని ఆమె తెలిపారు. హైకోర్టు తీర్పుతోనైనా వైసిపి కళ్లు తెరవాలని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. అహంకారంతో ఇష్టమొచ్చినట్లు అసెంబ్లీలో మాట్లాడడం శాసనవ్యవస్థకే మాయని మచ్చ అని ఆయన అన్నారు.

క్షమాపణ చెబుతారా ? 
ఇదిలావుంటే.. స్పీకర్‌ నిర్ణయమే అంతిమమని కోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రోజా ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. రోజా క్షమాపణ చెబితే.. స్పీకర్‌ ఆమెను సభకు అనుమతించే ఉద్దేశం కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే.. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ప్రతులు అందిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

18:39 - March 22, 2016

హైదరాబాద్ : ఏంటీ బ్యాంకు సిబ్బంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు ? వేతనాలు పెంచుకోవడానికా ? లేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో చేస్తున్నారా ? ఇవేమీ కాదు..అప్పులు చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో స్వయంగా బ్యాంకు అధికారులే రోడ్డెక్కారు. మొండి బకాయిల వసూలుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బ్యాంకుకు భారీగా బకాయిలున్న ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముందు బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ఈ సంస్థ బ్యాంకుకు 160 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ డీజీఎం రాజీవ్ పూరి నేతృత్వంలో... ఏజీఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం అమ్రిష్ ప్రసాద్ తో పాటు చీఫ్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది ప్రొగ్రెసివ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వీటితో పాటు బ్యాంకుకు బకాయిలు చెల్లించని సీఎస్సార్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందు కూడా ఆందోళన చేపట్టారు. రాబోయే రోజుల్లో బ్యాంకుకు బకాయిలున్న కోనసీమ గ్యాస్, అగస్టిన్ ఎడ్యుకేషన్ సొసైటీల ముందు ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. మరి ఈ ఆందోళనతోనైనా బకాయిలు చెల్లిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. 

18:34 - March 22, 2016

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటిఆర్ తెలంగాణ శాసనమండలిలో అన్నారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు వసతి సౌకర్యం కల్పించేందుకు బుద్వేల్‌లో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి నిధులు విడుదల చేయడం జరిగిందని, జాతీయ బ్యాంకుల్లో పెట్టి దీనిపై వచ్చే వడ్డిని జర్నలిస్టు సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆరోగ్య కార్డులను ప్రకటించిందని, నగదు రహిత చికిత్స అందిస్తున్నామన్నారు. సాంఘీకభద్రతా పథకంలో రూ. 5లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని, పథకం అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. 

ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాజయం..

మహిళా టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి చెందింది. రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 90 పరుగులు చేయగా ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. 

ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య...

కృష్ణా  : మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న  విద్యార్థిని చంద్రిక తన నివసిస్తున్న హాస్టల్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. సాయంత్రం కళాశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత చంద్రిక ఉరి వేసుకోవటాన్ని గమనించిన తోటి సహచరులు చంద్రికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చంద్రిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.చంద్రిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. చంద్రిక గుంటూరు జిల్లా ముప్పాళ్ళ గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు.

18:14 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ ఇంకా రగులుతోనే ఉంది. వీసీ అప్పారావు రీ ఎంట్రీ చిచ్చు రేపుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైన వీసీ ఎలా బాధ్యతలు తీసుకుంటారని జాక్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుండి వీసీ గెస్ట్ హౌజ్ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిని విద్యార్థులు బేఖాతర్ చేశారు. తాము చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని, అప్పారావు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులకు కరెంటు, భోజనం, తాగు నీరును పోలీసులు నిలిపివేసినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11.30గంటలకు తిరిగి బాధ్యతలను చేపడుతున్నట్లు వీసీ అప్పారావు మొదట ప్రకటించారు. ఏబీవీపీ, ఉద్యోగాల్లో ఉన్న అనుచరగణంతో అప్పారావు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రోహిత్ వేముల మృతి అనంతరం ఏర్పడిన టి.జాక్ ప్రతినిధులు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. వీసీ అప్పారావు గో బ్యాక్ అంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వర్సిటీ నుండి వెళ్లిపోవాలని, ఆందోళనను విరమించాలని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుండి చేస్తున్న ఆందోళన సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. వీసీ గెస్ట్ హౌజ్ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. విద్యార్థులను బలవంతంగా బయటకు గెంటివేసే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించారు. ఈడ్చుకుంటూ..నెట్టుకుంటూ విద్యార్థులను చెదరగొట్టారు. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.

రేపు కన్హయ్య రాక..
హెచ్ సీయూలో ఇటీవలే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారకులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరో మంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 14 సంఘాలు కలిసి టి.జాక్ గా ఏర్పడి పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రీ ఎంట్రి ఇచ్చేందుకు వీసీ అప్పారావు మంగళవారం ఉదయం చేరుకున్నారు. దీనిని జాక్ నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన అప్పారావు ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అప్పారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వెంకయ్య నాయుడు ఒక లాబీయింగ్ ప్రకారం నడిపిస్తున్నారని, అందులో భాగంగా వీసీకి తిరిగి బాధ్యతలు అప్పచెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు వస్తుండడం.. ఒక్క రోజు ముందు ఈ పరిస్థితి నెలకొనడంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లో అడుగు పెట్టగానే కన్హయ్యను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. 

పాకిస్థాన్ లో 24 మంది హిందువులు మృతి...

హైదరాబాద్ : పాకిస్థాన్ లోని కరాచీలో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మహిళలతో సహా, 24 మంది హిందువులు మృతిచెందిన దుర్ఘటన సింధ్‌ రాష్ట్రంలో జరిగింది. పాకిస్థాన్ లో నివసిస్తున్న హిందువులు హోలీ సంబరాల్లో చేసుకుంటు  మద్యం సేవించారు. మద్యం తాగిన కొద్ది సేపటికే వారు అనారోగ్యానికి గురవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 24 మంది మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. మిగతావారి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఆ ఏరియా స్టేషన్‌ హౌస్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు.

జెట్ ఎయిర్ వేస్ కు బాంబు బెదిరింపులు...

హైదరాబాద్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ దద్దరిల్లిపోతోంది. కాగా తాజాగా జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 5 విమానాలకు బాంబు బెదిరింపులు రావటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. డెహ్రాడూన్-ఢిల్లీ జెట్ ఎయిర్ వేస్ కు విమానానికి, చెన్నై-ఢిల్లీ జెట్ ఎయిర్ వేస్ కు విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమారం. డెహ్రాడూన్ ఎయిర్ పోర్టు ను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తవయిన అధికారులు తనిఖీలు చేపట్టారు.

17:32 - March 22, 2016

హైదరాబాద్ : మళ్లీ హెచ్ సీయూలో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ప్రొ. అప్పారావు వీసీగా కొనసాగడం ఊరుకోమని విద్యార్థులు తేగేసి చెబుతున్నారు. బాధ్యతలు చేపట్టడానికి వర్సిటీకి అప్పారావు వచ్చారు. సమాచారం అందుకున్న టి జాక్ నేతలు అప్పారావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో గెస్ట్ హౌస్ లోనే వీసీ అప్పారావు ఉన్నారు. సాయంత్రం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆందోళన చేస్తున్న వర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీలు జులిపించారు. ప్రతిఘటించిన విద్యార్థులపై పోలీసులు ప్రతాపాన్ని చూపెట్టారు. లాక్కొంటూ తీసుకెళ్లారు. గేటు బయట ఉన్న విద్యార్థులను లోనికి రాకుండా పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల వ్యవహార శైలిపై విద్యార్థులు మండిపడ్డారు. రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని అప్పారావు పోలీసులతో లాఠీ ఛార్జీ చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

హెచ్ సియూలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్

హైదరాబాద్ : హెచ్ సియూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు రీ ఎంట్రీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేసి.. అరెస్టులు చేస్తున్నారు. మరో వైపు ఇంత జరుగుతున్నా వీసీ అస్పారు గెస్ట్ హౌస్ లో వున్నారు. అప్పారావును బయటకు పంపేదుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

బ్రస్సెల్స్‌ ఘటనలో భారత హెల్ప్‌లైన్‌ నంబర్లు..

ఢిల్లీ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది.ఈ ఘటనలో భారతీయులు క్షేమంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. కాగా బెల్జియంలో వుండే తమ బంధువుల సమాచారం కోసం భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటుచేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. +32-26409140(పీఏబీఎక్స్‌), +32-26451850(పీఏబీఎక్స్‌), +32-476748575(మొబైల్‌) ఈ నంబర్లను కాంటాక్ట్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

17:23 - March 22, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని టాక్. అయితే హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్ తిరిగి ఈ చిత్రంలో కమెడియన్ గా కనిపిస్తారట. అది కూడా ప్రత్యేకించి మెగాస్టార్ అభ్యర్థన మేరకు. చిరు స్వయంగా పిలిచి మరీ సునీల్ ను తన 150వ సినిమాలో కమెడియన్ నటించమని అడిగారని సమాచారం. మొదటి నుంచి చిరంజీవికి ఫ్యాన్ అయిన సునీల్.. 'అన్నయ్య' అడగ్గానే నవ్వుతూ ఓకే చెప్పేశారట. ఇదే నిజమైతే తిరిగి మనం సునీల్ కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అవడం గ్యారెంటీ. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

ఛైర్ పై గౌరవం ఉంది: జానారెడ్డి..

హైదరాబాద్ : స్పీకర్ ఛైర్ పై తమకు గౌరవం ఉందని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. సభను హుందాగా నడపడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరి మాటలను పట్టించుకోకుండా సభను నడపాలన్నారు. తన వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు వక్రీకరిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీకే అరుణను సస్పెండ్ చేయాల్సిందేనని ఎమ్మెల్యే గొంగిడి సునిత డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ బెల్జియం పర్యటన వాయిదా?...

హైదరాబాద్ : ఈ నెల 30న భార‌త‌ ప్రధాని నరేంద్రమోడీ బెల్జియం రాజ‌ధాని బ్రస్సెల్స్‌ పర్యటన వాయిదా పడనుందా ? అమెరికా ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామా ఆధ్వ‌ర్యంలో జరగ‌నున్న‌ నాల్గవ యూరోపియన్‌ యూనియన్‌ సదస్సుకు మోదీ హాజరుకావాల్సి వుంది. బెల్జియం రాజ‌ధాని బ్రసెల్స్ లో ఈరోజు సంభవించిన పేలుళ్ళ నేపథ్యంలో మోదీ బ్రస్సెల్స్ ప‌ర్య‌ట‌న‌ వాయిదా పడే అవకాశముంది. ప్రధాని బెల్జియం పర్యటన వాయిదాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. 

17:02 - March 22, 2016

మలయాళ స్టార్ మోహన్ లాల్ కు జనతాగ్యారేజ్ రూపంలో జాక్ పాట్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రానుంది ‘జనతా గ్యారేజ్’. ఈ ఫిల్మ్‌లో నటించేందుకు మోహన్‌లాల్‌తో మైత్రి మూవీ మేకర్స్ రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.. అది ఏంటో తెలుసా? మోహన్‌లాల్‌కి కోటిన్నర రూపాయలతోపాటు మలయాళ రైట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మలయాళ రైట్స్ మహా అంటే కోటిన్నరకు మించబోదని, నటుడి రెమ్యునరేషన్ మరో కోటిన్నర ఓవరాళ్‌గా 3 కోట్లుగా లెక్కలు వేసుకున్నారు ఈ మూవీ మేకర్స్. ఐతే, ఇదే సరైన సమయమని భావించిన ఈ నటుడు, కేరళలో తన ఇమేజ్‌ని క్యాష్ చేసుకున్నాడు. తన సన్నిహితులకు జనతా‌గ్యారేజ్ మలయాళ డబ్బింగ్ రైట్స్‌ని ఏకంగా 4.5 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. ఈ లెక్కన ఒక్క సినిమాతో దాదాపు 6 కోట్లు జేబులో వేసుకున్నాడు మోహన్‌లాల్. మలయాళ మార్కెట్‌ని తక్కువ అంచనా వేసిన మైత్రి మూవీ మేకర్స్‌ ఆదిలోనే భారీ మూల్యం చెల్లించుకుందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

17:01 - March 22, 2016

హైదరాబాద్ : మార్చిలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు.. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. విపరీతమైన ఎండల ప్రతాపంతో జనాలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పదేళ్లలో ఈ స్థాయి ఉష్ణోగ్రత ఉండటం ఇదే మొదటిసారి. దీనికితోడు వడగాలులు మరింత విజృంభిస్తున్నాయి. ఇలా ఓవైపు ఎండలు... మరోవైపు వడగాలులు జనాల్ని అల్లాడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్చి 21కి ఓ ప్రత్యేకత ఉంది.. ఏడాదిమొత్తంలో ఈరోజు పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. 24గంటల్లో 12గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటాయి. మిగతారోజుల్లో రాత్రిగానీ పగలుగానీ ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది.. ఈరోజు సూర్యుడు భూమధ్య రేఖపైకి నిట్టనిలువుగా వస్తాడు. అంతటి ప్రత్యేకమైన ఈరోజు ఎండలతోనూ రికార్డు సృష్టించింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.4 డిగ్రీలు, ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో 43 డిగ్రీలు, గన్నవరంలో 42.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిగామలో పదేళ్ల అత్యధిక రికార్డు 2014 మార్చి 31న 41.9 డిగ్రీలుగా ఉంది.. దీనికన్నా ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
అటు గత పదేళ్లలో మార్చిలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... 25నుంచి 31 తేదీలమధ్య ఎండలు మండుతున్నాయి... 2009 మార్చి 2న కాకినాడ, గన్నవరంలలో, మార్చి ఒకటిన నల్గొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలుంటే ఎండలు అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తుంది. ఈసారి అంతకన్నా ఐదారు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.. ఇక తెలంగాణలో 40 డిగ్రీలు దాటితేనే ఉష్ణోగ్రతలు బాగా పెరిగినట్లు భావిస్తారు.. ఈసారి అంతకన్నా ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తగ్గిపోయిన వర్షాలు...
గత రెండేళ్లలో ఎల్‌నినోతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా తగ్గిపోయాయి.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈ జులైవరకూ ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయని అధికారులు భావిస్తున్నారు. అటు ఈసారికూడా వడగాలులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఈ గాలుల తీవ్రతకు 9మంది ప్రాణాలు కోల్పోయాయి.. నల్లగొండ జిల్లాలో 8మంది... ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారు. ఈసారి ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

16:54 - March 22, 2016

హైదరాబాద్ : తమకు స్వార్థం ఉందని శాసనసభలో టీఆర్ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ వ్యాఖ్యానించారు. స్వార్థం ఎందుకో కారణం తెలిపారు. మంగళవారం శాసనసభలో డీకే అరుణ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలాగే ఉంటుందని డీకే అరుణ వ్యాఖ్యలు చేసినట్లు, వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. ఈసందర్భంగా రసమయి మాట్లాడారు. పది జిల్లాల అభివృద్ధి కావాలన్నదే తమ స్వార్థమన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ దుఖం ప్రపంచం అంతా చూసిందని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం డిండి ఎత్తిపోతల పథకం..కృష్ణా జలాల ద్వారా సాగునీరందిస్తున్నామని తెలిపారు. రైతులకు భరోసా ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. డిజైన్ మారింది అంటున్నరు..పది జిల్లాల అవసరాలు తీర్చడమే తమ లక్ష్యమన్నారు. రాజోలి బండ నీళ్లను తలక్కాయలు పలగొట్టిన రోజు ఎవరు మాట్లాడలేదని, పాలమూరు జిల్లాకు భరోసా ఇచ్చిన నేత కేసీఆర్ అని కొనియాడారు.  

వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: డిప్యూటీ స్పీకర్

హైదరాబాద్ : డీకే అరుణ వ్యాఖ్యలపై తెలంగాణా అసెంబ్లీలో దుమారం రేగుతోంది. తన మాటలను మంత్రి హరీష్ రావు వక్రీకరిస్తున్నారని డీకే అరుణ పేర్కొన్నారు. సంస్కారం లేనివారు సభను నడుపుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. కాగా సభ్యులు చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ అనడం గమనార్హం.

16:48 - March 22, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకుంటున్నాయి. పక్కన అసెంబ్లీలో రోజా సస్పెండ్ వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టి. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ సభ్యురాలిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. కానీ ఆ సభ్యురాలి విజ్ఞతతకే వదిలేస్తున్నానని డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ప్రారంభమైన శాసనసభలో మధ్యాహ్నం ఛైర్ ను ఉద్ధేశించి డీకే అరుణ పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై సభ్యురాలిని అడిగి తెలుసుకున్నానని, డిప్యూటి స్పీకర్ నుద్దేశించి అనలేదని సభ్యురాలు అంటున్నారని జానారెడ్డి తెలిపారు. మరి ఎవరిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారో తెలుపాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సభ్యుల విజ్ఞతతకే వదిలేస్తున్నానని డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.
దీనిపై డీకే అరుణ స్పందించారు. తనపై అభియోగం మోపుతున్నారో అది అవాస్తవమన్నారు. తనను ఏమన్నారో రికార్డ్స్ ను చూడాలని అరుణ సూచించారు. 

16:44 - March 22, 2016

జీవజాతులన్నింటిలో ఎగిరే వాటిలో పక్షులు, చేపలు, జంతువుల పేర్లు విన్నాము. అదే కోవలోక పాము వచ్చి చేరింది. కానీ ఎక్కడైనా పాము ఎగరడం మీరు విన్నారా? అవునండి బాబూ పాము ఎగురుతుందట. నిజమే ఇది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని కాలపాళయంలో వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంటి సమీపంలో సోమవారం ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి ఎగురుతున్న ఓ అరుదైన పాము కనిపించింది. వింతగా కనిపించిన ఈ పాము గురించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇది శ్రీలంకన్ ఫ్లయ్యింగ్‌ స్నేక్‌ అని, ఈ జాతి పాములు 3.5 నుంచి 4 అడుగుల పొడవు పెరిగి ఏడేళ్ల వరకు జీవిస్తాయని తెలిపారు. ఇక్కడ తాము పట్టుకున్న పాము 2.5 అడుగుల పొడవు పెరిగి ఏడేళ్ల వరకు జీవిస్తుందని చెప్పారు. ఈ పాము రెండేళ్ల వయస్సు కలిగి ఉందని, సులభంగా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గాల్లో ఎగరగలదన్నారు. పసుపు రంగుపై నలుపు, ఎరుపు చారలు కలిగిన ఈ పాము ఎక్కువగా దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తాయని, వీటికి విషం ఉండదని అధికారులు పేర్కొన్నారు. 

16:39 - March 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి శాసనసభ సాక్షిగా కంట తడిపెట్టారు. దీనికంతటికి కారణం టి.కాంగ్రెస్ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలాగే ఉంటుందని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరికి వారు ఆత్మవిమర్శలు చేసుకోవాలని, సభను నడపడానికి ప్రారంభించాలని, గతంలో తాను సభ్యుల చేత క్షమాపణలు చెప్పించానని గుర్తు చేశారు. సంస్కారం లేని వారు సభను నడుపుతున్నారని, ఛైర్ పై గౌరవం ఉందని ఆవేశంతో సభ్యులు వ్యాఖ్యానాలు చేస్తే సరిదిద్దుతున్నామన్నారు. సభ హుందాగా నడవానికి కృషి చేస్తామన్నారు. దీనిపై డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. సభ్యుల విజ్ఞతకే వదిలేద్దామని తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల జోక్యం చేసుకున్నారు. ఛైర్ ను ఉద్ధేశించి అన్నారని, భేషజానికి పోకుండా క్షమాపణలు చెప్పాలని సూచించారు. సంస్కారాన్ని మన్నిస్తే కుసంస్కారం అవుతుందన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యురాలిని సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత పేర్కొన్నారు. 

16:35 - March 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 'సంస్కారం' పై రగడ చెలరేగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలాగే ఉంటుందని టి. కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము గౌరవంగా ఉన్నామని, చెప్పిందే నడవాలి..చెప్పిందే కావాలని అనడం మంచిది కాదని సూచించారు. పద్దుల మీద చర్చ కావాలని కోరుకుంటున్నామని, తప్పు ఒప్పులు చెప్పాలని తెలిపారు. సంస్కారం లేని వారు సభను నడుపుతున్న వారు అనడం సమర్థిస్తున్నారా అంటూ జానారెడ్డిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, తాము ఆ విధంగా చేయడం లేదన్నారు. గతంలో తాము క్షమాపణలు చెప్పడం జరిగిందని, ఛైర్ పట్ల ఉండాల్సిన గౌరవం, మర్యాద ఉండాలని..వ్యక్తుల మధ్య భాష కాదని, తాము ఏ తప్పు చేశామో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

గుర్రాన్ని గాయపరిచిన బిజెపి ఎమ్మెల్యే కు బెయిల్

ఉత్తరాఖండ్ : గుర్రంపై దాడి కేసులో ముస్సోరి బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషికి బెయిల్ మంజూరైంది. రూ. 25 వేల బాండ్, సొంత పూచీకత్తుపై జోషికి కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసుల గుర్రం శక్తిమాన్ పై దాడి కేసులో జోషిని ఉత్తరాఖండ్ పోలీసులు గత శుక్రవారం డెహ్రాడూన్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఉత్తరాఖండ్‌లో కొద్ది రోజుల క్రితం బీజేపీ నిరసన సందర్భంగా పోలీసు గుర్రం శక్తిమాన్‌పై జోషి దాడి చేశారు. తాను గుర్రంపై దాడి చేశాననడం సరికాదని, తాను కర్ర ఎత్తిన మాట నిజమే కానీ కొట్టలేదని అరెస్టుకు ముందు ఆయన తెలిపారు. ఇక గాయపడిన శక్తిమాన్‌కు వెనుక కాలు ఒకటి తొలగించారు.

16:30 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని వర్సిటీలో బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన ప్రొ. అప్పారావు వ్యాఖ్యానించారు. జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని, చట్టాలను అందరూ గౌరవించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, వర్సిటీలో మంచి వాతావరణం కల్పించడానికి తాను బాధ్యతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. చట్టాలను గౌరవించే ఓపిక ఉండాలని, కన్హయ్య కుమార్ తో తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఇతర వర్సిటీలు, రాజకీయాలతో తమకు సంబంధం లేదని అప్పారావు వ్యాఖ్యానించారు.
హెచ్ సీయూ వర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రెండు మాసాల అనంతరం బాధ్యతలు చేపట్టడానికి అప్పారావు వర్సిటీకి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న జాక్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ దశలో ఏబీవీపీ, జాక్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనితో వర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 

గుడ్ ఫ్రైడే ను సెలవుగా ప్రకటించిన ఏపీ సర్కార్

హైదరాబాద్ : గుడ్ ఫ్రైడే ను ఏపీ సర్కార్ సెలవు దినంగా ప్రకటించింది. ఎన్ ఐ యాక్ట్ కింద గుడ్ ప్రైడే ను సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

డీకే అరుణ క్షమాపణ చెప్పాల్సిందే: హరీష్ రావు

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను డీకే అరుణ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే అరుణ అన్నారు...సంస్కారం లేనిది ఆ వ్యాఖ్యలు చేసిన వారికా లేక సభ నడుపుతున్నవారికా అని హరీష్ ప్రశ్నించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హుందాగా సభ నడుపుతున్న వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డీకే అరుణ తన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు.

సభలో కంటతడి పెట్టిన పద్మాదేవేందర్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కంటతడి పెట్టారు. సంస్కారం లేనివారు సభను నడుపుతున్నారంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సభలో ప్రతిపక్షాలు చెప్పిందే నడవాలంటే కుదరదని స్పష్టం చేశారు. డీకే అరుణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్రస్సెల్స్ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం...

ఢిల్లీ : బ్రస్సెల్స్ పేలుళ్ళతో బెల్జియం దద్దరిల్లిపోతోంది. బ్రస్సెల్స్ పేలుళ్ళను భారత్ ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. పేలుళ్ళలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

16:18 - March 22, 2016

హైదరాబాద్: 2013 లో స్పాట్ ఫిక్సింగ్ లో పట్టుబడి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మనకు ఒక సింగర్ గానూ, డ్యాన్సర్ గానూ మాత్రమే మనకు పరిచయం. అంతేకాదు శ్రీశాంత్ సినిమాల్లో కూడా తనదైన స్టైల్ లో విజృభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇంతలోనే శ్రీశాంత్ మరో అవతారం ఎత్తనున్నట్లు సమాచారం. రాజకీల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశాంత్ ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ నాయకులు ఈ విషయంపై శ్రీశాంత్ ను సంప్రదించారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. మే 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో త్రిపునితుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ఢిల్లీ నుంచి శ్రీశాంత్ కు ఫోన్ చేశాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేరళ పర్యటనకు వచ్చినపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో శ్రీశాంత్ సమావేశం కావచ్చని తెలిపారు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్ చెప్పారు. శ్రీశాంత్ సెలెబ్రిటీ కావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా అతనితో సంప్రదించి ఉంటుందని మరో నేత అన్నారు. భారత బౌలర్ గా శ్రీశాంత్ స్టార్ రేంజికి చేరుతాడని అందరూ భావించారు కానీ హఠాత్తుగా స్పాట్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని తన క్రికెట్ కెరీర్ అనూహ్య మలుపులు తిరిగింది. తాజాగా శ్రీశాంత్ ఎత్తబోయే రాజకీయనాయకుడి కెరీర్ మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం. 

ప్రతీకారంతోనే బ్రస్సెల్స్ పేలుళ్ళు....

హైదరాబాద్ : వరుస పేలుళ్ళతో దద్దరిల్లితున్న బెల్జియం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో  వరుస పేలుళ్ళు సంభవించాయి. పారిస్ పేలుళ్ళకు ప్రధాన సూత్రధారి సలాహ్ అబ్దెస్లామ్ అరెస్ట్ కు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు సదరు ఉగ్రవాద సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగత్రల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం, నందిగామలో 43 డిగ్రీలు,విజయవాడలో 42, కర్నూలు, నంద్యాల, తిరుపతి,నెల్లూరు 40, విశాఖ 37,ఖమ్మం, రెంటచింతల 40, నిజామాబాద్‌, వరంగల్‌ 39,కరీంనగర్‌ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

విద్యార్థులతో చర్చలకు సిద్ధం: వీసీ అప్పారావు

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థులతో చర్చకు సిద్ధంగా ఉన్నాని ఆ యూనివర్శిటీ వీసీ అప్పారావు ప్రకటించారు. నాపై ఉన్న కేసులకు సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతోనే విధుల్లో చేరుతున్నాని అప్పారావు ప్రకటించారు. రేపు హెచ్ సియూలో కన్హయ్య పర్యటన విషయం తెలియదన్నారు.

15:59 - March 22, 2016

బెల్జియం : రాజధాని బ్రసెల్స్ వణుకుతోంది. ఉగ్రవాదుల విసిరిన పంజాకు 17 మంది మృతి చెందారు. మరో 25 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారు. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నరకు జవంతమ్ ఎయిర్‌పోర్టులో రెండుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల శబ్దంతో జనాలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుళ్ల అనంతరం.. ఎయిర్‌పోర్టు నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. పేలుళ్ల శబ్దం వినిపించగానే అధికారులు ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. డిపార్చర్ హాలు చెక్‌ ఇన్‌ ఏరియాలో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగానే మెట్రో రైలు స్టేషన్ లో మరో పేలుడు జరిగింది.
పారీస్ దాడిలో నిందితుడిగా ఉన్న సల్లాహ్ అబ్దెస్లామ్ ను బ్రసెల్స్ లో గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు సంభవించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇది ఉగ్రవాదుల పనేనని, ఆత్మహుతి దాడి జరిగి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పేలుళ్లతో దద్దరిల్లిన బెల్జియం

హైదరాబాద్ : బెల్జియం పేలుళ్లతో దద్దరిల్లింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మూడు పేలుళ్లు సంభవించాయి. జావెంటమ్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు సంభవించి 21 మంది మృతి చెందారు. యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ కు సమీపంలోనే ఉన్న మెట్రో స్టేషన్ లో మూడో పేలుడు సంభవించింది. అరబీ భాషలో అరుస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా బెల్జియం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పారిస్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి సలహ్ అబ్దెస్లామ్ అరెస్ట్ కు ప్రతీకారంగానే బెల్జియంలో దాడులకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం బెల్జియంలో సలాహ్ అబ్దెస్లామ్ అరెస్ట్ అయ్యారు.

సీమ వెనకబాటుకు నీటి సమస్యే కారణం:బాబు

హైదరాబాద్ : ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నేడు 22వ జలదినోత్సవం జరుపుకుంటున్నామని.. నీటి సంరక్షణకు ఎవరూ కృషి చేయడం లేదన్నారు. మనుషులు చేసే తప్పిదాల వల్లే ఇబ్బందులు అని అన్నారు. రాయలసీమలో నీళ్లు లేక ఎడారిగా మరిందని, రాయలసీమ వెనకబాటుకు నీటి సమస్యే కారణమని పేర్కొన్నారు. ఐదేళ్లలో కరువు రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యం అని బాబు తెలిపారు.

రోజా సస్పెన్షపై న్యాయపోరాటం చేస్తాం:జగన్

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా ఏడాది సస్పెన్షపై న్యాయపోరాటం కొనసాగిస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. న్యాయనిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌....

హైదరాబాద్ : టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత మహిళల జట్టు మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్‌ జట్టుతో భేటీకానుంది. ధర్మశాలలోని హిమచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత్‌ జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది.

రేపు హెచ్ సియూకి కన్హయ్య

హైదరాబాద్ : దేశద్రోహం ఆరోపణల కేసులో అరెస్టై, మ‌ధ్యంత‌ర బెయిలుపై విడుద‌లైన ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ బుధ‌వారం హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి రానున్నారు. వర్సిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై క‌న్న‌య్య ప‌లువురు విద్యార్థుల‌తో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రోహిత్‌ వేముల సంతాపసభలో కన్నయ్య పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రోప‌క్క హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేటి ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేటి ఉదయం వర్సిటీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వీసీ అప్పారావు... ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి బాధ్యతలు తీసుకున్నారు.

15:32 - March 22, 2016

మెటర్నిటీ లీవ్ లపై వెళ్లి వచ్చిన 13 మంది నర్సులను నిమ్స్ యాజమాన్యం తొలగించింది. ఈ ఒక్క రంగంలోనే అనేక రంగాల్లో కూడా మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివి మానవిలో 'వేదిక' కార్యక్రమంలో ఈశ్వర్ రావు (సీఐటీయూ), సుజావతి (ఆల్ ఇండియా నర్సస్ ఫెడరేషన్ సెక్రటరీ), జేఎల్ ఎన్ మూర్తి (హైకోర్టు అడ్వకేట్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

దిగ్భ్రాంతికి గురయ్యా: కామెరూన్

హైదరాబాద్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో బాంబు పేలుళ్లు సంభవించడంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ విచారం వ్యక్తం చేశారు. బాంబుదాడులపై సమాచారం అందగానే దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన తెలిపారు. బ్రస్సెల్స్ జరిగిన బాంబుదాడుల్లో విదేశీయులెవరూ మృతిచెందలేదని బెల్జియం ప్రకటించింది. అదే సమయంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. దేశం మొత్తం హైఎలర్ట్ ప్రకటించింది. 

ఏపీ శాసనసభ శనివారానికి వాయిదా

హైదరాబాద్: ఏపీ శాసనసభ శనివారానికి వాయిదా పడింది. ఈరోజు సభలో జల సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేశారు. జల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సభలో వివరణ ఇచ్చారు.

15:27 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వర్సిటీ వీసీగా వీసీ అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టడంపై విద్యార్థులు కన్నెర్ర చేశారు. రోహిత్ వేముల మృతికి కారకుడైన అప్పారావు ఎలా బాధ్యతలు చేపడుతారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం 11.30 గంటలకు అప్పారావు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సమావేశంలో ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న జాక్ ప్రతినిధులు అక్కడకు చేరుకోవడం..అప్పటికే ఉన్న ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా జాక్ నేత వెంకట్ టెన్ టివితో మాట్లాడారు. జనవరి 17వ తేదీన రోహిత్ వేముల చనిపోయాడని, అతడు ఆందోళన చేస్తుంటే వీసీ స్పందించలేదన్నారు. పదవిపై ఎందుకంత ఆశ అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ప్రీ ప్లాన్ గా పంపిస్తోందని తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారిని తొలగించాలని..రోహిత్ యాక్టుగా పోరాడుతున్నామని, వీసీని అరెస్టు చేయాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. హంతకులతో తాము ఏమి మాట్లాడుతామని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు చైతన్యవంతులవుతున్నారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా హెచ్ సీయూ కు కన్హయ్య కుమార్ రాకుండా అడ్డుకుంటున్నారని వెంకట్ తెలిపారు. 

హోటల్ 'వైశ్రాయ్' ఎండీ ఇంటిముందు బ్యాంకు సిబ్బంది ధర్నా...

హైదరాబాద్ : హోటల్ 'వైశ్రాయ్' ముందు ఓరియంటల్ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తీసుకున్న రుణాలను చెల్లించకుండా పెద్దపెద్ద వ్యాపారసంస్థలు బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్నాయి. లక్షల కోట్లు రూపాలు బ్యాంకుల నుండి రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ మాల్యా నుండి తమ సొమ్ము రాబట్టుకోవటానికి ఎస్ బీఐ బ్యాంకు కింగ్ ఫిషర్ హౌస్ ని ఆన్ లైన్ లో వేలానికి పెట్టిన రోజులైనా కాలేదు.

15:19 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీ అప్పారావు రెండు నెలల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు యూనివర్శిటీకి వచ్చారు. ఈ కోణంలోనే వర్శిటీలో సమావేశం ఏర్పాటు చేశారు. వీసీ బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలుసుకున్న జాక్ ఆధ్వర్యంలోని 14 విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇదే సమయంలో విద్యార్థులపై కొందరు దాడి చేశారని ఆ నేపథ్యంలోనే వర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. వీసీ అప్పారావుపై కేసు నమోదైందని దానిపై క్లారిటీ రాకముందే ఆయనకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రేపు హెచ్‌సియుకు వస్తున్న నేపథ్యంలో ఆయన రాకను అడ్డుకునేందుకే కావాలని ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ తాము సామరస్యపూర్వకంగా నిరసన తెలపడానికి వస్తే ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల చేత తమపై దాడి చేయించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు. 
ఇటీవల హెచ్ సీ యూ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే వైస్ ఛాన్స్ లర్, ప్రొ. అప్పారావు లీవ్ లో వెళ్లారు. 

15:15 - March 22, 2016

హైదరాబాద్ : వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు 22వ జలదినోత్సవం సందర్భంగా ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీళ్లందించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. నీటి సంరక్షణకు ఎవరూ కృషి చేయడం లేదని పేర్కొన్నారు. మనుషులు చేసే తప్పిదాల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని, రాయలసీమలో నీళ్లు లేక ఏడారిగా మారిందన్నారు. ఇందుకు వెనుకబాటుతనమే కారణమన్నారు. నదుల నుసంధాన విషయంపై దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి మాట్లాడుతున్నారని, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసిన ఘనత టిడిపికి దక్కుతుందన్నారు. 

15:11 - March 22, 2016

హైదరాబాద్ : సభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడొచ్చని భావించేవారి ఆటలు చెల్లవనే విషయం కోర్టు తీర్పు వల్ల నిరూపితమైందని ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్ అన్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు కొద్దిసేపటి కింద తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా ఆయన ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. సభా హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి అన్నారు. ప్రజా సమస్యల మీద హౌస్ లో ఏమాత్రం మాట్లాడినా చెల్లుతుందని రోజా రెడ్డి విర్రవీగారాని విమర్శించారు. శాసనసభా వ్యవహారాల్లో హైకోర్టు తలదూర్చదని స్పష్టమౌతుందని తెలిపారు.

వైసీపీ కళ్లు తెరవాలి - కూన రవికుమార్..
హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా ప్రతిపక్షం వైసిపి కళ్లు తెరవాలని టిడిపి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. అహంకారంతో ఇష్టమోచ్చినట్లు అసెంబ్లీలో మాట్లాడడం శాసనవ్యవస్థకే మాయని మచ్చని ఆయన అన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా ప్రవర్తించాలనే దానిపై శిక్షణాతరగతులు ఇప్పించాలన్నారు.

మహిళా లోకానికి విజయం - అనిత..
రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పు మహిళాలోకానికి విజయంగా భావిస్తున్నామన్నారు టిడిపి ఎమ్మెల్యే అనిత. హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపికి కనువిప్పు కలగాలని ఆమె అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాలని ఎన్నిసార్లు అవకాశం కల్పించినా రోజా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని ఎమ్మెల్యే అనిత అన్నారు. 
వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

15:03 - March 22, 2016

హైదరాబాద్ : లోక్‌సత్తా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తీర్మానించింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రకటించారు.. లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చూసి ప్రజలు ఓటేస్తారని, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనుకున్నంతగా జరగడం లేదని, కానీ నూటికి 80 మందికి ఆర్థిక ప్రగతిలో పాలు పంచుకొనే అవకాశం రావడం లేదన్నారు. కనీస ప్రమాణాలు కలిగిన విద్య, ఆరోగ్యం ప్రజలకు అందడం లేదని తెలిపారు. అధ్వాన్న దేశాల్లో భారతదేశం ఒకటని విమర్శించారు. 

15:01 - March 22, 2016

బెల్జియం : రాజధాని బ్రసెల్స్ పై ఉగ్రవాదాలు పంజా విసిరారు. ఉదయం 8 గంటలకు భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నరకు జవంతమ్ ఎయిర్‌పోర్టులో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల శబ్దంతో జనాలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు.  మరో 25 మందికి గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టు నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. పేలుళ్ల శబ్దం వినిపించగానే అధికారులు ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. డిపార్చర్ హాలు చెక్‌ ఇన్‌ ఏరియాలో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద దాడిగానే భావిస్తున్నారు. ఈ పేలుళ్లతో బ్రసెల్స్ లో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఎయిర్‌పోర్టులో ఎమెర్జెన్సీ ప్రకటించారు.

నీటి సంరక్షణకు ఎవరూ కృషి చేయడం లేదు - బాబు...

విజయవాడ : నేడు 22వ జలదినోత్సవం జరుపుకుంటున్నామని, నీటి సంరక్షణకు ఎవరూ కృషి చేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మనుషులు చేసే తప్పిదాల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని, రాయలసీమలో నీళ్లు లేక ఏడారిగా మారిందన్నారు. ఇందుకు వెనుకబాటుతనమే కారణమన్నారు. ఐదేళ్లలో కరవు రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమన్నారు. 

ఏపీ అసెంబ్లీ, మండలి వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఈనెల 26 వరకు వాయిదా పడింది. ఏపీ శాసనసమండలి వచ్చే సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. 

13:09 - March 22, 2016

హైదరాబాద్ : రోజా విషయంలో జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకనైనా జగన్ తన సభ్యులను పద్ధతి మార్చుకోవాలని చెప్పుతారా.. లేదా ? చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రోజారెడ్డిని ఛీ కొట్టే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. 'మీ సభ్యుల తీరు బాగోలేదని.... గతంలోనే జగన్ కు చెప్పామని...కానీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. రోజా సస్పెన్షన్ కు జగన్ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఎక్కడా కూడా రోజాలాగా ఇంత అసభ్యంగా మాట్లాడలేదని చెప్పారు. రోజా దళిత మంత్రికి చెప్పు చూపించిందని, అసభ్య పదజాలంతో దూషించిందని పేర్కొన్నారు. రోజాకు హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో ఏ మోహం పెట్టుకుని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ మొదటి నుంచి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాపు గర్జనలో రైలును తగల బెట్టారని, ముస్లీం, మైనారిటీలను రెచ్చగొట్టారని ఆరోపించారు. సాక్షి పత్రిక మొదటి నుంచి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురించి.. ప్రచారం చేసిందన్నారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్  ను జగన్ కూడా సమర్థించాలన్నారు. జగన్ తన సభ్యులురాలు రోజా చేసిన తప్పుని ఒప్పుకుని భవిష్యత్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా.. సభ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.

 

బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు

బెల్జియం : బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో పలువురికి గాయాలయినట్లు సమాచారం. 

వీసీ అప్పారావును అరెస్టు చేయాలి:హెచ్ సియూ జేఏసీ

హైదరాబాద్ :హెచ్ సియూ వీసీ అప్పారావును అరెస్టుచేయాల్సిందేనని హెచ్ సియూ జేఏసీ డిమాండ్ చేసింది. వీసీ అప్పారు గొడవలు సృష్టిస్తున్నారని...ఇదంతా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆడిస్తున్న గేమ్ అని జేఏసీ నేతలు విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించాలని నినదించారు.

జగన్ పత్రిక ప్రభుత్వంపై విషం చమ్ముతోంది: హెచ్ సియూ జేఏసీ

హైదరాబాద్ : జగన్ పత్రిక సాక్షి ప్రభుత్వం విషయం చిమ్ముతోందని..రోజా విషయంలో జగన్ ప్రజలకు క్షమాపణచెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా డిమాండ్ చేశారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ఉద్దేశ్యంతోనే జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రోజాకు హైకోర్టులో చుక్కెదురైనా ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు మాట్లాడతారు అని ఎద్దేవా చేశారు. ఇకనైనా జగన్ తన సభ్యులను పద్ధతి మార్చుకోమని చెపుతారా అని ప్రశ్నించారు.

12:43 - March 22, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించింది. డివిజన్ బెంచ్ తీర్పుపై రోజా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్.. రోజాను ఏడాడి పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాటి నుంచి రోజాపై సస్పెన్షన్ పై ఎపిలో రాజకీయ వాతావరణం వేడిక్కింది. ఆమె సస్పెన్షన్ ఎత్తివేయాలని వైసీపీ అనేక నిరసన కార్యక్రమాలు చేసింది. కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీకి కూడా రోజా హాజరు కాలేదు.  అడ్వకేట్స్.. 
 హైకోర్టులో 194 క్లాజ్ గురించి మాట్లాడారు. స్పీకర్ మోతాదుకు మించి శిక్ష వేసినట్లు సింగిల్ బెంచ్ భావించింది. స్పీకర్ పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆర్డర్ కాపీ ఇవ్వలేమని చెప్పారు. రోజాకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు సుప్రీం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ల్యాండ్ మార్క్ అవుతుంది.

 

చంచల్‌గూడ జైలుల్లో కొట్టుకున్న ఖైదీలు..

హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో మంగళవారం ఉదయం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది. విదేశీ ఖైదీలను ఉంచే బ్యారక్‌లో గొడవ తలెత్తటంతో అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన నైజీరియా దేశస్థుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో రోజా

హైదరాబాద్ :రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సర్కార్ అప్పీల్ పై సింగిల్ బెచం్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అభ్యంతరాలు ఉంటే సింగిల్ బెంచ్ కు వెళ్లాలని సూచించింది. అయితే.. డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో రోజా ఉన్నట్లు సమాచారం. 

మయన్మార్ క్యాబినెట్‌లో సూకీ..

హైదరాబాద్ : మయన్మార్ క్యాబినెట్‌లో ఎన్‌ఎల్డీ పార్టీ అధినేత ఆంగ్ సాన్ సూకీకి చోటు దక్కింది. గత నవంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌ఎల్డీ పార్టీ ఇటీవలే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీకి చెందిన హతిన్ కావ్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 18 మంది సభ్యులు ఉన్న క్యాబినెట్ జాబితాను హతిన్ కావ్ పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ జాబితాలో ఆంగ్ సాన్ సూకీ పేరు కూడా ఉంది. తాజా క్యాబినెట్‌లో సూకీ తప్ప మిగతా జాబితాలో మహిళలు ఎవరూ లేరు.

రోజాకు డివిజన్ బెంచ్ లో చుక్కెదురు

హైదరాబాద్ : రోజాకు డివిజన్ బెంచ్ లో చుక్కెదురు అయ్యింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది.

ఎన్నికలకు దూరంగా లోక్ సత్తా

హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని లోక్ సత్తా పార్టీ నిర్ణయించింది. ఇక పై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని ఆపార్టీ నేత జేపీ ప్రకటించారు. లోక్ సత్తాను రాజకీయ పార్టీగా చూడవద్దని జేపీ విజ్ఞప్తి చేశారు.

12:15 - March 22, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక దోమలు వీరవిహారం చేస్తున్నాయన్నారు. రాత్రిళ్లు దోమకాటుకు గురికావాల్సి వస్తుందన్నారు. ప్రొద్దుటూరుకు రూ.70 కోట్ల రూపాయలను  విడుదల చేసి... భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని కోరారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయాలన్నారు. అనంతరం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. ఎపిలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ థర్ద్ లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉంది. ఇప్పటివరకు ఎందుకు టెండర్లు పిలవలదేన్నారు. టెండర్లకు ఎక్కువ మందిని పిలవాలని కోరారు. 
ఆంజనేయులు..
'వినుకొండ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. తాగునీరు చెరువు ఎండిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అమృత్ స్కీమ్ పేరుతో లక్ష జనాభాకు పైగా ఉన్న పెద్ద మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు ఇచ్చారు. చిన్న మున్సిపాలిటీలు తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. వినుకొండ లాంటి చిన్న మున్సిపాలిటీలకు కూడా అమృత్ స్కీమ్ లో నిధులు ఇవ్వాలి' అని కోరారు. 
రాజేంద్రప్రసాద్ ..
తెనాలి పట్టణం నుంచి మూడు కాల్వలు వెళ్తున్నాయి. డ్రైనేజీ సిస్టమ్ కు సెకండరీ ప్రయారిటీ ఇస్తున్నారు. అలా కాకుండా మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. డ్రైనేజీ మంచినీటి కాల్వల్లో కలుస్తుందని చెప్పారు. డ్రైనేజీ శుద్ధి చర్యలు తీసుకోవాలన్నారు. 

 

చంద్రబాబును కలిసిన జానారెడ్డి

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన భూ సేకరణలో మిర్యాలగూడ వాసుల భూములన్నాయని వాటికి సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీని కల్సిన కన్హయ్య

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కలిశారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా తెలిపినందుకు రాహుల్ గాంధీకి కన్హయ్య ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మార్పీఎస్ విశ్వరూప యాత్రపై తీర్పు వాయిదా

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ విశ్వరూప యాత్రపై హైకోర్టు తీర్పు ఎల్లుండికి వాయిదా పడింది. ఏపీలో యాత్రకు అనుమతించాలని మందకృష్ణ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

మోడీ సానుకూలంగా స్పందించారు : ముఫ్తీ

న్యూఢిల్లీ : తమ ప్రతిపాదనలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని ముఫ్తీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీతో పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే గురువారం శాసనసభాపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి మోడీ సమావేశం సంతృప్తికరంగా ఉందన్నారు.

ఢిల్లీలో కుంగిన రోడ్డు..స్తంభించిన ట్రాఫిక్...

ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భైరోన్‌ మార్గ్‌ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగి భారీ రంధ్రం ఏర్పడింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరమ్మతులు పూర్తయ్యేవరకు వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు.. వైసీపీ విజ్ జారీ

హైదరాబాద్ : వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తాజాగా మరో విప్‌ జారీ చేసింది. ఈనెల 30న ఎమ్మెల్యేలంతా సభకు హాజరుకావాలని విప్‌ జారీ చేసింది. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలకూ కూడా విప్‌ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేసింది. 

11:47 - March 22, 2016

రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని నాన్చడం సరికాదని.. ఫుల్ స్టాప్ పెట్టాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నగేశ్ కుమార్, టీడీపీ తెలుగు విభాగం అధ్యక్షుడు పట్టాభిరామ్ పాల్గొని, మాట్లాడారు. రోజా సస్పెన్షన్ వ్యవహారానికి ముగింపు పలికి ...ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:39 - March 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్న విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. సెలవులు ముగించుకున్న వీసీ అయితే ఇవాళ ఉదయం తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. వీసీ అప్పారావు ఇంటిపి దాడి చేశారు.  ఇంట్లోని పర్నీచర్ ను ధ్వంసం చేశారు. అప్పారావుకు వ్యతిరేకంగా 'కిల్లర్ వీసీ గోబ్యాక్ అంటూ' నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. 

 

11:37 - March 22, 2016

ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లం దుంప లేదా వేరులాంటిది. ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది . రక్త శుద్దికి తోడ్పడుతుంది . రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియాస్ సంహరించి, దంటాలను ఆరొగ్యము గా ఉండేలా చేస్తుంది.

షుగర్ నియంత్రణకు అల్లం...

షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడయ్యింది. అల్లము నుంది తీసిన రసాన్ని , అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .

అజీర్తికి....

అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పని చేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.

11:32 - March 22, 2016

పంజాబ్ : ప్రపంచకప్ గ్రూప్-బీ లీగ్ లో మరో దాయాదుల సమరానికి ..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోటీ న్యూజిలాండ్ కు చెలగాటం, పాకిస్థాన్ కు సెమీస్ సంకటంగా మారింది.
న్యూజిలాండ్ తో పాకిస్థాన్ అమీతుమీ  
భారత్ వేదికగా..మొట్టమొదటిసారిగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ షో ....నాగపూర్, కోల్ కతా, ధర్మశాల, ముంబై, బెంగళూరు నగరాల మీదుగా..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి చేరింది. బ్యాటింగ్ తో పాటు పేస్ బౌలర్లకు అనువుగా ఉండే ఇక్కడి పిచ్ పైన జరిగే మూడోరౌండ్ పోటీలో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి.
పాకిస్థాన్ కు రెండు పాయింట్లు
టీమిండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటిజట్లు ప్రత్యర్థులుగా ఉన్న పూల్- బీ లీగ్ లో...ఇప్పటి వరకూ ఆడిన రెండుకు రెండురౌండ్లలోనూ.. న్యూజిలాండ్ విజయాలు సాధించి..నాలుగు పాయింట్లతో సెమీస్ కు అడుగుదూరంలో నిలిస్తే... పాకిస్థాన్ జట్టు మాత్రం..ఒక్కో గెలుపు, ఓటమి ద్వారా రెండు పాయింట్లు మాత్రమే సంపాదించింది.
న్యూజిలాండ్ అసాధారణ విజయాలు  
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల తో ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్స్ లో న్యూజిలాండ్ అసాధారణ విజయాలు నమోదు చేసింది. అయితే..ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ ను అలవోకగా అధిగమించిన పాక్ జట్టుకు..చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో మాత్రం పరాజయం తప్పలేదు. గ్రూప్- బీ నుంచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే..పాక్ జట్టును న్యూజిలాండ్ ఓడించగలిగితే చాలు. అదే పాక్ జట్టు..సెమీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే...న్యూజిలాండ్ ను ఓడించితీరాల్సిఉంది. 
న్యూజిలాండ్ నాలుగోస్థానం
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..న్యూజిలాండ్ నాలుగోస్థానంలోఉంటే...పాకిస్థాన్ మాత్రం ఏడో ర్యాంక్ లో కొనసాగుతోంది.
అన్ని విభాగాలలోనూ న్యూజిలాండ్ జట్టు సమతూకం 
నిలకడలేమికి మరో పేరైన పాక్ జట్టుతో పోల్చిచూస్తే..న్యూజిలాండ్ జట్టే అన్ని విభాగాలలోనూ సమతూకంతో కనిపిస్తోంది. కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని కివీజట్టుకు పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్ ఎటాక్, పాదరసంలా కదిలే ఫీల్డింగ్ బలం ఉన్నాయి. మరోవైపు షాహీద్ ఆఫ్రిదీ కెప్టెన్సీలోని పాక్ జట్టు..బౌలింగ్ లో మాత్రమే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో పాక్ జట్టు పరిస్థితి దైవాధీనం మోటార్ సర్వీస్ లా తయారయ్యింది.
మొహాలీ పిచ్.. బ్యాటింగ్, పేస్ బౌలర్లకూ అనువు  
ఈ మ్యాచ్ కు వేదికగా ఉన్న మొహాలీ పిచ్ ..బ్యాటింగ్ తో పాటు..పేస్ బౌలర్లకూ అనువుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచుప్రభావమూ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో..టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరు సాధించడం ద్వారా..ప్రత్యర్థిని ఒత్తిడిలో పడవేసే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఏదిఏమైనా..ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని పాక్ జట్టుకు..ఈ పోటీ చావోబతుకో సమరమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

11:20 - March 22, 2016

విజయవాడ : పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈమేరకు విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీ ప్రారంభం అయింది. జింకానా గ్రౌండ్ కు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు  వేలాది ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం.. పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలకు మాత్రం భూమి కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం విస్మరించిందన్నారు. నాడు వైఎస్ పాలనలో, చంద్రబాబు పాలనలో ఇళ్ల సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. బ్యూటిఫికేషన్ పేరుతో ఇళ్లను తొలగిసున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లకు కాదు.. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావాలని కోరారు. పేదలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 
చంద్రబాబు పేదవర్గాల వ్యతిరేకి : రామకృష్ణ 
సీఎం చంద్రబాబు పేదవర్గాల వ్యతిరేకని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ లకు కొమ్ముగాస్తుందని ఆరోపించారు. పేదల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందన్నారు. కార్పొరేట్ కు కొమ్ముకాస్తున్న వైఖరిని చంద్రబాబు మార్చుకోవాలని హితవు పలికారు. 

 

హెచ్ సియూ లో ఉద్రిక్త

హైదరాబాద్ : హెచ్ సియూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. తర్వాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా 'కిల్లర్ వీసీ గోబ్యాక్ అంటూ' నినాదాలుచేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

విజయవాడలో వామపక్షాల మహా ప్రదర్శన

విజయవాడ : పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ తో విజయవాడ నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో మహా ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత పి.మధు, సీపీఐ నేత రామకృష్ణ పాల్గొనున్నారు.

రైతులు సమయమనం పాటించాలి: బొల్లినేని రామారావు

హైదరాబాద్ : రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద నలెకొన్న సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని దృష్టికి తీసుకెళ్లినట్లు ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతులు సమయమనం పాటించాలని బొల్లినేని విజ్ఞప్తి చేశారు.

కాసేపట్లో రోజా సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం లో ఏపీ సర్కార్ అప్పీల్ పై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

మోదీతో పీడీపీచీఫ్ మెహబూబా ముఫ్తీ భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో పీడీపీచీఫ్ మెహబూబా ముఫ్తీ కలిశారు. జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు చర్చించనున్నారు.

10:47 - March 22, 2016

వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నా స్థూలకాయం సమస్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. చిన్నా, పెద్దా తేడాలేకుండా చాలామందిలో ఒబేసిటీ సమస్య ఇటీ వలి కాలంలో ఎక్కువైంది. ఆహార నియమాలు పాటించకపోడం, జంక్‌ ఫుడ్‌ తినడం వంటి కారణాలతో ఎక్కువమంది బరువు పెరిగిపోతు న్నట్లు వైద్యులు చెబుతున్నారు. టీవీలు, కంప్యూటర్‌ గేమ్‌లు, ఆటస్థలాలు కరువైపోవడం, ఎక్కువ కేలరీలు కలిగిన చిరుతిళ్లు, ఆహారం విషయంలో అవగాహన లేకపోవడం వంటివి స్థూలకాయానికి ప్రధాన కారణమని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం నివారించదగిన పది అనారోగ్య కారణాల్లో స్థూలకాయం ఒకటి ని చెప్తోంది. మరి దీని నివారణకు ఒక వారం రోజులు కింది చెప్పిన విధంగా డైట్ పాటిస్తే కొంత మేర ఊబకాయం నుండి ఉపసమనం పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎలానో చూద్దామా..

మొదటి రోజు....

అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు మీ ఆహారం గా తీసుకోఅవాలి. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటంవల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధ పరుస్తున్నట్టు అర్థం.

రెండవరోజు...

ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలిసి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును మొదలుపెట్టంది. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడకూడదు. మీకు నచ్చినంత తినవచ్చు.

మూడవ రోజు.....

అరటిపండు, బంగాళాదుపం తప్ప మిగిలిన పళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. మీకు కావలసినంత తినవచ్చు ఇప్పటి నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభం అవుతుంది.

నాల్గవ రోజు...

8 అరటిపళ్ళు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. నాల్గవ రోజు దాదాపు ఆకలి ఉండకపోగా రోజంతా హాయిగా గడిచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పాలి. తగ్గించగలిగితే మరింత మంచిది. మీకు ఏదైనా ఇంకా త్రాగాలనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్ సూప్ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి).

ఐదవ రోజు....

ఒక కప్పు అన్నం, 6 టమోటాలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తీసుకొన్డి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. కప్పు అన్నం మాత్రమే తినంది.

ఆరవ రోజు....

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. రెండవరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బంగాలా దుంప మినహా) తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే, కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల రెండవరోజు తిన్నంత అవసరం లేదు.

ఏడవ రోజు.....

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. ఆరవరోజులాగే తింటూ, ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోవాలి. మధ్యాహ్నం యథావిథిగా ఒకప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినటానికి ప్రయత్నించండి.

మీలో మార్పు మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం కనిపెట్టగలరు. వరం తర్వాత మీకు మీరే అవాక్కవుతారు.

10:47 - March 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వివిధ శాఖల పద్దులపై వరుసగా మూడోరోజు చర్చ చేపట్టారు. పురపాలక, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ, విద్యుత్‌, రహదారులు, భవనాల శాఖ పద్దులపై నేడు సభలో చర్చించనున్నారు. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం తగ్గిందనే విషయంలో అబద్దపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చెక్ పోస్టుల వద్ద డేరాలు వేసుకుని ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. చెక్ పోస్టులకు పక్కా భవనాలు నిర్మించాలి..
తలసాని శ్రీనివాస్ యాదవ్
గత ప్రభుత్వాల పాలనలో కమర్షియల్ ట్యాక్స్ వసూలు రూ.18 వేల కోట్ల వరకు ఉన్నదని.. కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం రూ.22 వేల 949 కోట్లు వసూలు చేశామని.. ప్రస్తుత సంవత్సరం 30 వేల కోట్ల వరకు వసూలు చేయాలని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ల పై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని ..కానీ తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ పలు సమావేశాలు నిర్వహిచారని తెలిపారు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో ఏడు చెక్ పోస్టులున్నాయని.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 14 చెక్ పోపస్టులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులున్నాయని చెప్పారు. రెండు ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ చెక్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.

 

శ్రీవారి సన్నిధిలో పాండిచ్చేరి సీఎం

తిరుమల : శ్రీవారిని మంగళవారం ఉదయం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

హోంగార్డు సురేష్ పై నిర్భయ కేసు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో హోంగార్డు సురేష్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. పోలీస్‌ రక్షణకోరి వచ్చిన వివాహితను హోంగార్డు సురేష్‌ లైంగికంగా వేధించారు. రాత్రి వివాహిత ఇంటికి వచ్చిన సురేష్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. వివిధ శాఖ పద్దులపై వరుసగా మూడోరోజు చర్చ చేపట్టనున్నారు. పురపాలక, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ, విద్యుత్‌, రహదారులు, భవనాల శాఖ పద్దులపై నేడు సభలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

10:18 - March 22, 2016

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని తప్పుగా పాడాడట.. ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-పాక్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా అమితాబ్ మన జాతీయ గీతాన్ని తప్పుగా పాడాడంటూ ఉల్లాస్ అనే వ్యక్తి ముంబైలోని జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రో-కబడ్డీ లీగ్ సమయంలోనూ ఆయన ఇలాగే చేశాడట. రూల్ ప్రకారం జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడాల్సి ఉండగా, అమితాబ్ ఒక నిముషం 22 సెకండ్లు ఆలపించాడని, పైగా సింధ్ బదులు సింధు అని తప్పుడు పదాలు ఉపయోగించాడని ఉల్లాస్ తన కంప్లయింట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.

హోటల్ లో అగ్రిప్రమాదం.. 6నెలల చిన్నారిమృతి

గుంటూరు : కాకుమాను మండలం బీకే పాలెం దగ్గర ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని జీజీహెచ్‌కు తరలించారు.

 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభ దశలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్లు, నిప్టీ 20 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 

10:10 - March 22, 2016

మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నా పెళ్లాం నా ఇష్టం’ పేరు మార్చుకొంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సుహాసిని జంటగా నటించిన రామకృష్ణ వీర్నాల దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించిన ఆ చిత్రం ‘హ్యాపీలైఫ్‌’ పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత ఎన్‌.దేవీచరణ్‌ మాట్లాడుతూ ‘‘ఇదివరకు పెట్టిన పేరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని అందుకే పేరు మార్చా అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. భార్యాభర్తల చుట్టూ సాగే కుటుంబ కథకి సందేశాన్ని మేళవించాం’’ అన్నారు. కృష్ణ భగవాన్‌, విశ్వేశ్వరరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి రమేష్‌ సంగీతం అందిస్తున్నారు.

కేబీఆర్‌ పార్కు నుంచి నీటి అవగాహన ర్యాలీ

హైదరాబాద్ : ప్రపంచ నీటి దినోత్సవాన్ని పుర్కరించుకుని కేబీఆర్‌ పార్కు నుంచి అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని మేయర్ రామ్మోహన్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.

 

యూపీలో ఇద్దరు చిన్నారుల సజీవదహనం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రమావశాత్తు నిప్పంటుకుని 30 ఇండ్లు దగ్దమయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

09:58 - March 22, 2016

భారతీయుడు, పెద్దరికం వంటి బిగ్గెస్ట్ హిట్ మూవీల్లో నటించి సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును తెచ్చుకున్న సుకన్య ఇలా సెక్స్‌రాకెట్‌లో పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సినిమాల్లో వస్తోన్న సంపాదన సరిపోకనే సుకన్య వ్యభిచారవృత్తిలోకి దిగినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో నటించిన సుకన్య నటిగానే కాకుండా గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా పేరొందింది.

09:51 - March 22, 2016

హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముద్దుల గారాలపట్టి సితార భలేగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన స్కూలు వార్షికోత్సవం సందర్భంగా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌తో ఉన్న డ్రెస్‌లో ‘క్లాప్ క్లాప్’ అన్న పాటకు డ్యాన్స్ చేసి అబ్బురపరచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చూడబోతే తండ్రిని మించిన తనయ కావచ్చు. బ్రహ్మోత్సవం షూటింగ్‌లో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ తన కూతురి డ్యాన్స్ ప్రోగ్రాం చూడడానికి రాలేకపోయాడట.

09:49 - March 22, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి హాజరుకానున్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సమస్యలపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

 

మధురవాడలో యువకుడి దారుణ హత్య

విశాఖ : మధురవాడ స్వతంత్ర నగర్‌లో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. దుండగులు యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నల్లబ్యాడ్జీలతో వైసీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కుట్ర పూరితంగా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటుండటమేగాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తున్నందుకు నిరసన తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో సమస్యలు, అభివృద్ధిపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ మొదలు కాగానే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులకు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

09:26 - March 22, 2016

హైదరాబాద్ : టీ.20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా నిలిచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. నిర్ణీత లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ పై చెమటోడ్చి 157 పరుగులు చేసి విజయం సాధించింది.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 66,656 మంది భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

 

ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం, సీపీఐ పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని సీపీఐ, నల్గొండలో చర్చి పాస్టర్లపై దాడి చేసిన ఆర్ ఎస్ ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 

ఎపి అసెంబ్లీలో నేటి వైసీపీ వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో నేడు వైసీపీ పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది.  

 

08:39 - March 22, 2016

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో 'బుడ్డా' వంటి చిత్రాన్ని రూపొందించిన పూరీ జగన్నాథ్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఓ బాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన బాలీవుడ్‌ మున్నాభాయ్ సంజయ్ దత్‌ కథానాయకుడిగా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే సంజరుదత్‌కి పూరీ కథ కూడా నెరేట్‌ చేశాడని, కథ నచ్చి మున్నాభారు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారని తెలిసింది. ఇదిలా ఉంటే, తెలుగులో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఓ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కళ్యాణ్‌రామ్‌ సరసన కథానాయికగా మెహరీన్‌ని ఎంపిక చేసిన ఈ చిత్రానికి 'రీమిక్స్‌' అనే టైటిల్‌ని ఖరారు చేయాలని దర్శక, నిర్మాతలు యోచిస్తున్నారట.

08:36 - March 22, 2016

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నే నిర్మిస్తున్న చిత్రం 'ఊపిరి'. సోమవారం హైదరాబాద్‌లోని ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, 'ఈ సినిమా చేసినందుకు చాలా గొప్పగా భావిస్తున్నాను. ఫ్రెంచ్‌ సినిమా 'ఇన్‌టచబుల్‌'కిది రీమేక్‌. ఇద్దరి మనుషుల మధ్య జరిగిన నిజమైన కథతో తెరకెక్కించారు. ఇప్పటికీ వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. కొన్ని కథలకు సోల్‌ ఉంటుంది. అలాంటి సోల్‌ ఉన్న సినిమానే 'ఊపిరి'. దర్శకుడు వంశీ తనని తాను పునరావిష్కరించుకుని తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటారో అలా ఈ చిత్రాన్ని రూపొందించారు. కార్తీ కథల పట్ల ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ చిత్రంతో తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయడం కరెక్ట్ అని భావించాడు. సెట్స్ లో కొన్ని సీన్స్ లో తను నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఆ టైమ్‌లో నాకు సిగ్గేసింది. తెలుగు రాకపోయినా నేర్చుకుని చక్కగా డైలాగ్స్ చెబుతున్నాడు. నేను తమిళంలో ఎందుకు సరిగ్గా చెప్పలేకపోతున్నానని అనుకునే వాడిని. తమన్నా కూడా కథలో లీనమై నటించింది. నా కెరీర్‌లో ఇదొక లైఫ్‌ చేంజింగ్‌ చిత్రమవుతుంది. నేను నటించిన 'శివ', 'గీతాంజలి', 'నిన్నే పెళ్ళాడతా', 'అన్నమయ్య' చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా వస్తుంది. ఇటీవల సినిమా చూశాను. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక తోడుంటే హ్యాపీగా ఉండొచ్చని చెప్పే ఈ చిత్రం అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'మొదటి సారి తెలుగులో స్ట్రయిట్‌ సినిమాలో నటిస్తున్నాను. ఒక డ్రీమ్‌లా ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది. నటుడిగా నాకు తృప్తినిచ్చిన చిత్రమిది. ఈ సినిమాతో గౌరవం వస్తుంది. ఇదొక ట్రెండ్‌ సెట్‌ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకు పనిచేయడం వల్ల నాగార్జునగారితో మంచి అనుబంధమేర్పడింది. వంశీ ప్రతి పాత్రను కొత్తగా డిజైన్‌ చేశారు. ఇదొక ఫ్రెష్‌ ఫీలింగ్‌నిచ్చే చిత్రం' అని కార్తీ తెలిపారు. వంశీపైడిపల్లి మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసిన వెంటనే నాగార్జున, పివిపి వచ్చి నన్ను హగ్‌ చేసుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈ చిత్రం. ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్‌కు ఊపిరిగా మారిందీ చిత్రం. గోపీసుందర్‌ తన మ్యూజిక్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్ళారు. నాగార్జున లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదు. మొత్తానికి అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'రెండేండ్లుగా అందరం కష్టపడి చేసిన చిత్రమిది. తమన్నా ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం విశేషం. తెలుగు, తమిళంతోపాటు అమెరికాలో 90థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని పివిపి తెలిపారు. 'నాగార్జున, కార్తీ లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేం. వాళ్ళిద్దరు పాత్రల్లో జీవించారు. నేనీ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని తమన్నా తెలిపారు.

 

08:34 - March 22, 2016

రామ్‌ కార్తీక్‌, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దృశ్యకావ్యం' చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, 'నాతో 'వీడికి దూకుడెక్కువ' చిత్రాన్ని నిర్మించిన రామకృష్ణారెడ్డి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. కలెక్షన్లు చాలా బాగున్నాయి. డైరెక్టర్‌గా రామకృష్ణారెడ్డి సక్సెస్‌ అయ్యారు. ఇలానే మంచి సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'అన్ని ఏరియాల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. దర్శకుడిగా నా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి కృతజ్జతలు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ విజయ స్ఫూర్తితో భవిష్యత్‌లోమరిన్ని మంచి చిత్రాల్ని నిర్మించేందుకు రెడీగా ఉన్నాను' అని దర్శక,నిర్మాత రామకృష్ణారెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ, 'సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రతి సీన్‌ను ఎలివేట్‌ చేశాయి. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌' అని చెప్పారు. 'సపోర్ట్‌ చేసిన టీమ్‌ అందరికి థ్యాంక్స్‌', పాటలు, సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని హీరో రామ్‌ కార్తీక్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌, కశ్మీరా, నాగిరెడ్డి పాల్గొన్నారు.

 

08:19 - March 22, 2016

పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సొంత ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని పేదల సమస్యలు మరోసారి ఎజెండా మీదకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది కుటుంబాల జీవితాలతో ముడిపడిన ఇదే సమస్య మీద ఇవాళ వామపక్షాలు విజయవాడలో బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి. సీపీఎం, సీపీఐ కలిసి నిర్వహిస్తున్న  ఈ సభ లక్ష్యాలేమిటి? ఈ సభ ద్వారా ప్రభుత్వం ముందు పెట్టబోతున్న డిమాండ్స్ ఏమిటి? పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వ విధానాలు ఎలా  వుంటున్నాయి? వివిధ అభివ్రుద్ధి కార్యక్రమాల కారణంగా  ఇల్లు, స్థలాలు కోల్పోతున్నవారి విషయంలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై బాబురావు మాట్లాడారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:15 - March 22, 2016

జీవితమంతా కష్టపడ్డా సొంత ఇల్లు సమకూర్చుకోలేని  రోజులివి.  సొంత ఇల్లు లేక, అద్దెలు భరించలేక, గుడిసెలలో జీవించలేక అవస్థపడుతున్నవారెందరో. ఇలాంటి వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేసిన పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదు. 
ఇల్లు సమకూర్చుకోవాలని ప్రతి కుటుంబమూ ఆరాటం
తమ కంటూ ఓ ఇల్లు సమకూర్చుకోవాలని ప్రతి కుటుంబమూ ఆరాటపడుతుంది. బ్యాచిలర్స్ గా అమ్మానాన్నల నీడన బతికిన యువతీయువకులు పెళ్లయిన మరుక్షణం నుంచి సొంత ఇల్లు సమకూర్చుకోవడం కోసం మదనపడుతుంటారు.    తమకొచ్చే సంపాదనలో కొంతభాగాన్ని పొదుపుగానో, మదుపుగానో కూడబెట్టి ఇల్లు కట్టుకోవడం అన్నది ఈ రోజుల్లో అయ్యే పని కాదు. అందుకే చాలా మంది బ్యాంక్ లోన్లను ఆశ్రయిస్తారు. ప్రతి నెలా తమ సంపాదనలో కొంత భాగం ఈఎమ్ఐల రూపంలో కడుతుంటారు. అయితే, ఇలా బ్యాంక్ ల అప్పులు తీసుకునే భాగ్యం అందరికీ వుండదు. ఎవరో కొందరు వేతన జీవులకు మాత్రమే వుంటుంది. మరి మిగిలినవారి పరిస్థితి ఏమిటి? 
చిరుద్యోగులెందరు...ఆరేడు వేల రూపాయల వేతనాలు 
మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో జీతాల్లో తీసుకునేవారున్నట్టే ఆరేడు వేల రూపాయల వేతనాలతో బతుకుబండిని లాగిస్తున్న చిరుద్యోగులెందరో.  సంపాదనలో సగభాగం పిల్లల ఫీజులకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఎవరి ఆరోగ్యమైనా దెబ్బతిని, వ్యాధులు చుట్టుముడితే, ఇక ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.  ఆ మాటకొస్తే మనదేశంలో సెంటు భూమికాని, నెలవారీ వేతనం కానీ లేని పేదల సంఖ్యే ఎక్కువ.  ఇలాంటి వారంతా సొంత గూడును సమకూర్చుకోలేక, అద్దె ఇళ్లలో బతకలేక పడుతున్న అవస్థలెన్నో.
ఒకే రూములో నిద్రిస్తున్న కుటుంబాలెన్నో
పెళ్లయిన జంటకు మరో ఇల్లు కట్టించే స్తోమతలేక, వయస్సొచ్చిన పిల్లలకు ప్రత్యేకంగా బెడ్ రూమ్ ను ఇవ్వలేక అంతా ఒకే రూములో నిద్రిస్తున్న కుటుంబాలెన్నో. మన దేశంలో లైంగిక నేరాలు పెరగడానికి కుటుంబ సభ్యులంతా  ఇరుకు ఇరుకు గదుల్లో ఒకే ఒక్క  రూమ్ లో నిద్రించడమూ   కారణమవుతోందన్న విశ్లేషణలూ వున్నాయి.   ఈ కోణంలో చూసిన్నప్పుడు ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగ్గరీతిలో ఇల్లు సమకూర్చిపెట్టడం అన్నది ప్రభుత్వాల సామాజిక బాధ్యత.  ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడం దయతోనో, జాలితోనో చేస్తున్న కార్యక్రమం ఎంత మాత్రం కాదు. సమాజం పట్ల బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా కచ్చితంగా తూ.చ. తప్పకుండా నిర్వర్తించాల్సిన కర్తవ్యం.  కానీ దురద్రుష్టవశాత్తు  మన దేశంలో ఇళ్ల నిర్మాణం అన్నది వట్టి ఎన్నికల వాగ్ధానంగా మిగిలిపోతోంది. లేదంటే,  చోటామోటా రాజకీయ నేతలకు ఫలహారంగా మారిపోతున్నది.  వానొచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా, చలి వణికిస్తున్నా తలదాచుకునే స్థలం లేక అవస్థపడుతున్న పేదల కష్టాలు తీర్చే లక్ష్యంతో చేపట్టే ఇళ్ల పథకాలలో కూడా అంతులేని అవినీతికి పాల్పడుతున్నారంటే, ఏమనాలి? 
వేలమంది ఇల్లు లేని నిరాశ్రయులు  
ఒక వైపు కొన్ని లక్షల కుటుంబాలు సొంత ఇల్లు లేక అవస్థపడుతుంటే, మరోవైపు  ప్రభుత్వాలు ప్రవచించే అభివృద్ధి నమూనా మరికొన్ని వేలమందిని ఇల్లు లేని నిరాశ్రయులుగా  మారుస్తోంది. జాతీయ రహదారుల పేరుతో, ఎక్స్ ప్రెస్ వే పేరుతో,  రింగ్ రోడ్ల పేరుతో, ఎయిర్ పోర్టుల పేరుతో అనేక వందల, వేల ఇల్లు కూల్చివేస్తూ, వారికి సరైన ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్వాసితులుగా వదిలేస్తున్న ద్రుశ్యాలెన్నో. ప్రభుత్వాలు ఇప్పటికైనా పేదలకు, నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక సంబంధాలను గాఢంగా ప్రభావితం చేసే ఈ సమస్యను ఇక ఏమాత్రం అలక్ష్యం చేయడానికి వీలులేదు. 

 

08:05 - March 22, 2016

హైదరాబాద్ : రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్ష్ చేయడంపై ఉమ్మడి హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు వాడివేడి వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది. రోజా అసెంబ్లీలో అడుగు పెడుతుందా.. లేదా.. అనే ఉత్కంఠ తెరపడాలంటే ఈ తీర్పు కీలకం కానుంది. 
ధర్మాసనం ఎదుట వాదనలు 
వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట వాదనలు ముగిశాయి. అనంతరం ఈ కేసు తీర్పును రేపటికి వాయిదా వేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
రోజా క్షమాపణ చెప్పేదిలేదన్న న్యాయవాది
క్షమాపణ చెబితే సభ్యురాలిని సభలోకి అనుమతిస్తామని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.వి.రావు నివేదిక అందజేశారు. పిటిషనర్‌ తప్పు చేయలేదు గనక క్షమాపణ చెప్పేదిలేదని రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ తన వాదనను ధర్మాసనం ఎదుట వినిపించారు. అసలు అసెంబ్లీ కార్యదర్శి అప్పిల్ కు రావాల్సి ఉండగా.. ప్రభుత్వం రావడంతో ఈ రిట్ పిటిషన్ విచారించదగ్గది కాదని రోజా తరపు న్యాయవాది వాదించారు. 
సహజ న్యాయానికి విరుద్దం 
ప్రివిలైజ్ కమిటిలో చర్చించడం.. సహజ న్యాయానికి విరుద్దమన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్యం అయినందన అనుమతి ఇవ్వాలని కోరారు. ఇరు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పు మంగళారానికి వాయిదా వేసింది. 

 

పఠాన్‌కోట్... మరణించిన నలుగురు టెర్రరిస్టుల ఫొటోలు రిలీజ్

ఢిల్లీ : పఠాన్‌కోట్ ఉగ్రదాడి సందర్భంగా ఎదురుకాల్పుల్లో మరణించిన నలుగురు టెర్రరిస్టుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు వివరాలు సేకరించేందుకు కొద్దిరోజుల్లో ఢిల్లీ రానున్న తరుణంలో ఎన్‌ఐఏ సమాచారంతో కూడిన కరపత్రాలు విడుదల చేయడం గమనార్హం. వారికి సంబంధించిన సరైన సమాచారం అందించినవారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని కూడా ఎన్‌ఐఏ ప్రకటించింది.

చైనాలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్

బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ దేశ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. వాతావరణం అనుకూలించక పోవడంతో షెంజన్‌ విమానాశ్రయంలో 200 విమానాలను అధికారులు రద్దు చేశారు. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఉత్తమంగా హెచ్ సీయూ

హైదరాబాద్‌ : క్యూఎస్‌ వరల్డ్ సంస్థ నిర్వహించిన యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉత్తమంగా నిలిచింది. ఇటీవల బ్రిటీష్‌ కంపెనీ క్యూఎస్‌ వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై పరిశోధనలు నిర్వహించింది. హెచ్‌సీయూలోని రెండు స్కూళ్లు, ఒక డిపార్ట్ మెంట్‌ భారతలోని నెంబర్‌ వన్‌ ర్యాకింగ్‌లో నిలిచాయి. హెచ్‌సీయూలోని డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ వంద పాయింట్లకు గాను 56.2 సాధించి ప్రథమంగా నిలిచింది. నేషనల్‌ యూని వర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌) ఏషియన్‌ యూనివర్సిటీలో ఉత్తమ ర్యాంకు సాధించింది.

07:48 - March 22, 2016

విజయవాడ : రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతానికి ఉద్యోగుల తరలింపులో మ‌రో ముంద‌డుగు ప‌డింది. ఉద్యోగ సంఘాల‌తో జరిగిన చ‌ర్చల‌్లో ఒక అంగీకారానికి ప్రభుత్వం, ఉద్యోగ వ‌ర్గాలు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణం శరవేగంగా సాగడం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమరావతికి తరలింపులో ముందుకు సాగాయి.
జూన్ 15 లోగా ఉద్యోగుల‌ త‌ర‌లింపు  
హైద‌రాబాద్‌లో ఉన్న ఏపి ఉద్యోగుల‌ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లించ‌డానికి ఏపి స‌ర్కారు వ‌డివ‌డిగా అడుగులేస్తోంది. ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో వ‌రుస భేటీలు అవుతూ.. జూన్ 15 లోగా స‌చివాల‌యం ఉద్యోగుల‌ను త‌ర‌లించ‌డానికి అన్నిచ‌ర్యలు తీసుకుంటోంది. అలాగే హెచ్ఓడీల త‌ర‌లింపుపై కూడా దృష్టి సారించింది.
వడివడిగా తాత్కాలిక స‌చివాల‌యం నిర్మాణం
గ‌తంలో రెండు స‌మావేశాలు నిర్వహించిన ప్రభుత్వం.. మ‌రోసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధుల‌తో స‌మావేశమైంది. వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని, జూన్ నాటికి అంతా సిద్ధం అవుతుంద‌ని మంత్రి నారాయ‌ణ ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు స్పష్టం చేశారు. జూన్ 15 నాటికి స‌చివాల‌యం ఉద్యోగులంద‌రూ స్వరాష్ట్రానికి రావ‌ల్సిందేన‌ని స్పష్టం చేశారు.
హెచ్‌ఓడీల తరలింపుపై దృష్టి
స‌చివాల‌యం ఉద్యోగులనే కాకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యాల‌యాల త‌ర‌లింపు కూడా దృష్టి పెట్టింది ఏపి స‌ర్కారు. హెచ్ఓడిల‌ను రెండు విడ‌త‌ల‌లో త‌ర‌లించ‌డానికి ప్లాన్ చేస్తోంది. మొద‌టి విడ‌త ప్రభుత్వ ప్రధాన‌ కార్యాల‌యాల‌ను జూలై 31 లోగా త‌ర‌లించ‌డానికి డెడ్ లైన్ పెట్టుకోగా..రెండో విడ‌త కార్యాల‌యాల‌ను ఆగ‌స్టు 31 లోగా త‌ర‌లించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. 
సచివాలయ ఉద్యోగులతో మరోసారి భేటీ 
స‌చివాల‌యం ఉద్యోగులు, హెచ్ఓడిల త‌ర‌లింపుపై ఉద్యోగసంఘాల నేత‌ల‌తో వ‌చ్చే సోమ‌వారం మ‌రోసారి ప్రభుత్వం భేటీ కానుంది. అయితే ఉద్యోగుల త‌మ‌కు  ఉన్న స‌మ‌స్యల‌ను ప్రభుత్వం దృష్టి తీసుకువ‌చ్చారు. పిల్లల స్థానిక‌త అంశం, 30 శాతం హెచ్ఆర్ఏ, ఐదు రోజుల ప‌నిదినాలు త‌దిత‌ర స‌మ‌స్యల‌ను చెప్పగా...అన్ని స‌మ‌స్యలు తీరుస్తామ‌ని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

07:42 - March 22, 2016

హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అక్రమార్కులు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టవద్దని సూచించారు. ఇసుక విధానంపై వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఇసుక విధానంపై సీఎం సమీక్ష
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక విధానంపై శాసనసభలోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ శాఖల ఉన్నతాధికారులో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు ఈ మూడు శాఖల అధికారులతో ప్రతి డివిజన్‌లోనూ  టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. అక్రమ రవాణాలో పట్టుబడే వాహనాలను సీజ్‌ చేయాలని, ఇసుకను 15 రోజుల్లో వేలం వేయాలన్నారు.  రెండో సారి దొరికితే వాహన యజమానులను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు 
ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీఎస్పీ, ఆర్డీవో బృందంతో ప్రతి వారం ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ ఈఈ ర్యాంపుల నిర్మాణం, నిర్వహణను చేపట్టవలసి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ పత్రికా సమావేశాలు నిర్వహించి ఉచిత ఇసుక విధానాన్ని వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. 
కాల్‌సెంటర్ల ఏర్పాటు
ఇసుక విధానంపై ఇక నుంచి ప్రతి వారమూ సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు, కాల్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దందాలో టీడీపీతో సహా ఏ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు డీజీపీ క్షేత్రస్థాయి చర్యలపై పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు.  

07:37 - March 22, 2016

రంగారెడ్డి : జిల్లాలోని పెండింగ్ మరియు ప్రతిపాదిత ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు జిల్లా ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విపక్షల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ.. రంగారెడ్డి జిల్లాకు సాగు తాగు నీరందించాలని అధికారులను ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్ల కేటాయింపు
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యతనిస్తుందని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు మంత్రి హారీష్ రావు. ఇప్పటికే బడ్జెట్ లో 25 వేల కోట్ల రుపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను చూసి విపక్షాలు రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
4 లక్షల 35 వేల ఎకరాలకు సాగు నీరు
జిల్లాలో 4 లక్షల 35 వేల ఎకరాలకు సాగు నీరందించడం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఇందుకోసం పలు ప్రణాళికలు రూపొందించినట్టు మంత్రి తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 75 వేల ఎకరాలు, డిండి నుంచి లక్ష ఎకరాలు ప్రాణహిత నుంచి గోదావరి ద్వారా 70 వేల ఎకరాలు రంగారెడ్డిలో ఈ ఏడాది పంటల సాగుకు నీరందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
కేసీఆర్ దూరదృష్టితో ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్
సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ చేపట్టారని తెలిపారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల పథకం పేరుతో కాంగ్రెస్ నాయకులు దాదాపు 1500 కోట్లు దోచుకున్నారని మంత్రి గుర్తు చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ , పరిగి నియోజకవర్గాలకు సాగునీరందుతుందని హరీష్ రావు తెలిపారు. గతంలో ప్రాణహిత పథకంలో కేవలం 2 లక్షల 10 ఎకరాలకే ప్లాన్ చేశారని రీ ఇంజనీరింగ్ లో భాగంగా 4 లక్షల 35 వేల ఎకరాలకు సాగు నీరందించనున్నామని మంత్రి తెలిపారు. 185 టీఎంసీల సామర్ధ్యoతో ప్రాణహిత కింద రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు హరీష్ రావుతెలిపారు.
రెండో పంటకూ సాగునీరు
ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణ మధ్య గోదావరపై చేపట్టబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులు మేడిగడ్డ, కాళేశ్వరంలను త్వరలో ప్రారంభిస్తామని హరీష్ రావు తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో మన వాటావాడుకుని రెండో పంటకు కూడా సాగునీరందించాలని రంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.

 

 

07:19 - March 22, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడత పెండింగ్ లో ఉన్న 50 శాతం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో మిషన్‌ కాకతీయ పనులపై మంత్రులిద్దరూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం 
మహబూబ్ నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశలో మంజూరయిన చెరువులను ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని.. మిగతావి వెంటనే పూర్తిచేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇక చెరువుల మరమ్మతుతో పాటు ఫీడర్ ఛానల్ ల పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. రెండో దశలో మంజూరయిన చెరువులకు సాంకేతిక అనుమతులు మంజూరు చేసి టెండర్లు పిలవాలని సూచించారు. 
వాస్తవ అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలి 
చెరువులకు సంబంధించి అంచనాలు తయారు చేసేటప్పుడు వాస్తవ అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని..  పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు త్వరితగతిన చెల్లింపులు చెయ్యాలని ఆదేశించారు.  ఇక మిషన్ కాకతీయ పనులకు కావలసిన ఇసుకను జిల్లా కలెక్టర్  అనుమతులతో తీసుకోవాలన్నారు. నియోజక వర్గానికి  ఒక మినీ ట్యాంక్ బండ్ ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.

 

07:12 - March 22, 2016

హైదరాబాద్ : తక్కువ రుణాలకు డిపాజిట్లు, ష్యూరిటీలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకులకు సూచించారు. రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో షరతులతో అవస్థలకు గురిచేయవద్దని కోరారు. సచివాలయంలో రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. 
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం
లక్ష నుంచి 3 లక్షల లోపు రుణాలకు డిపాజిట్లు అంటూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. తక్కువ రుణాలకే డిపాజిట్లు, ష్యూరిటీలు అంటూ రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజల్ని అవస్థలకు గురిచేయడం సరికాదన్నారు. ఈ విషయంపై తాను ఎస్‌ఎల్‌బిసి ఛైర్మన్‌తో మాట్లాడానని, దీనికి ఆయన అంగీకరించారని తెలిపారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్‌, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్‌ఎల్‌బిసి నిర్ణయాలు బ్యాంకులు అమలు చేయాలి
ఎస్‌ఎల్‌బిసి తీసుకున్న నిర్ణయాలను బ్యాంకర్లు అమలు చేయాలని చంద్రబాబు కోరారు. బ్యాంకింగ్‌ కన్సల్టెంట్లు లేని చోట స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను ఉపయోగించుకోవాలని, ఈ సంఘాల సభ్యుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థికంగా వారికి వెసులుబాటు కలుగుతుందని వివరించారు. 
కరువు రహిత రాష్ట్రంగా ఏపీ 
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సేద్యపు కుంటల తవ్వకాలకు, రెయిన్‌గన్స్‌తో పంట తడి అందించేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, బ్యాంకర్లు సహకారం అందిస్తే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, దీని వల్ల రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని చంద్రబాబు అన్నారు. 

నేడు భారత్, ఇంగ్లండ్ మహిళా జట్లు ఢీ

ధర్మశాల : మహిళా టీ.20 ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ ఢీకొననున్నాయి. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు న్యూజిలాండ్, పాకిస్తాన్ ఢీ

మొహాలీ : టీ.20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు న్యూజిలాండ్, పాకిస్తాన్ ఢీకొననున్నాయి. మొహాలీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు గద్వాల రైతుల 'చలో అసెంబ్లీ'

మహబూబ్నగర్ : గద్వాల రైతులు నేడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.  

 

హోలీ సందర్భంగా బార్లు, మద్యం షాపుల మూసివేత

హైదరాబాద్ : రేపు హోలీ సందర్భంగా బార్లు, మద్యం షాపుల మూసివేత. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు బార్లు, మద్యం షాపుల మూసివేత.

నేడు విభజన అడ్వయిజరీ కమిటీతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : నేడు విభజన అడ్వయిజరీ కమిటీతో కేసీఆర్ భేటీ కానుంది. వైద్యుల విభజన వివాదంపై చర్చించనున్నారు. 

Don't Miss