Activities calendar

23 March 2016

23:26 - March 23, 2016

బెంగళూరు: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగా... లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

22:37 - March 23, 2016
రెండు రాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు మిన్నంటాయి.రంగుల పొడులు, గులాల్ నింపిన నీరు.. ఒకరి మీద ఒకరు హుషారుగా చల్లుకుంటూ ఆనందనృత్యం చేసే పండుగ హోలీని  ఘనంగా జరుపుకున్నారు . పిల్లలు, మహిళలు, వృద్ధులు హోలీ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా రంగుల పండుగ చేస్కున్నారు. రంగు డబ్బాలతో, కలర్ పౌడర్ లతో గల్లి గల్లి లో పిల్లలు సందడి చేసారు. పలు ప్రాంతాల్లో యువకులు డప్పు చప్పులతో, సౌండ్ సిస్టం లతో చిందులేసారు..
21:31 - March 23, 2016

బెల్జియం : బ్రసెల్స్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడుల అనంతరం బెంగళూరుకి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్ర గణేశన్‌ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాఘవేంద్ర బెల్జియంలో ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని ఆచూకీ కనిపెట్టడం కోసం భారత దౌత్య అధికారులు చర్యలు చేపట్టారు. రాఘవేంద్ర స్నేహితులతో మాట్లాడుతున్నామని ఇప్పటికీ అతని జాడ తెలియలేదని బెల్జియంలో భారత రాయబారి మంజీవ్‌ పూరి వెల్లడించారు. మరోవైపు నిన్నటి దాడిలో గాయపడ్డ ఇద్దరు జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది కోలుకుంటున్నారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. బ్రసెల్స్‌లో ఇరుక్కుపోయిన భారత ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వసతి కల్పించామన్నారు.

21:29 - March 23, 2016

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. విజయకాంత్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకోసం డీఎండీకే, పీడబ్ల్యూఎఫ్ మధ్య పొత్తు కుదిరింది.. 120 సీట్లలో డీఎండీకే, 110 సీట్లలో పీడబ్ల్యూఎఫ్ పోటీ చేయబోతున్నాయి. విజయకాంత్‌ను కలిసిన వైగో ఈ పొత్తుకు అంగీకారం కుదుర్చుకున్నారు. విజయ్‌కాంత్‌ సీఎం అభ్యర్థిగా కూటమి ప్రచారం చేయబోతోంది. అటు కాంగ్రెస్‌, డీఎంకే కలిసి బరిలోకి దిగబోతున్నాయి. పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది.. 

21:25 - March 23, 2016

ఢిల్లీ : హెచ్‌సీయూలో విద్యార్ధులపై లాఠీచార్జిని సీపీఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ సర్కార్‌కు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఫోన్‌ చేసినా సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదని ఏచూరి లేఖలో పేర్కొన్నారు. ఇక హెచ్‌సీయూలో జరుగుతున్న ఘటనలపై కేసీఆర్‌ స్పందించాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్ధినులను మగ పోలీసులు కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అరెస్ట్‌ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

21:24 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో పోలీసుల దాడిలో తీవ్రగాయాలపాలైన విద్యార్థి ఉదయ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మధినాగూడలోని ప్రణామ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. పోలీసుల దాడిలో తలకు తీవ్రమైన గాయం కావడంతో ప్రస్తుతం ఉదయ్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

21:23 - March 23, 2016

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి రణరంగంగా మారింది. వర్శిటీకి జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య రావడంతో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. అటు పోలీసులకు, ఇటు విద్యార్థులకు మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో వర్శిటీలోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులు అష్టకష్టాలు పడ్డారు. తినేందుకు తిండిలేక, తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడ్డారు. వర్శిటీ బోధనా సిబ్బంది ఆందోళనకు దిగడంతో 5వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బోధనేతర సిబ్బందిపై దాడికి నిరసనగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి భోజనం, నీళ్లు, విద్యుత్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్శిటీ ప్రాంగణంలో వంటచేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వావాదం జరిగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సౌకర్యాలు కల్పించాలి..
యూనివర్శిటీలో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. నిన్నటి నుంచి అన్నపానీయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వర్శిటీ సిబ్బంది కానీ.. పోలీసులు కానీ స్పందించడంలేదని వాపోయారు. వంట చేసుకొని తిందామన్నా.. వంట చేయోద్దంటూ తమపై లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. కనీసం తాగేందుకు వర్శిటీలోపల నీళ్లు కూడా లేవని బయటి నుంచి తెచ్చుకుందామన్నా పోలీసులు అందుకు అనుమతించడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ హాస్టల్లో చదువుకుంటున్న తమకు సర్వ హక్కులు ఉంటాయని కానీ వాటిని పోలీసులు కాలరాస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను కట్‌చేశారని..అంతేకాకుండా వర్శిటీ బయట ఉన్న స్టాళ్లను మూసివేయించారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వర్శిటీ వీసీ స్పందించి హాస్టల్‌కి వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ని పునరుద్దరించాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

21:21 - March 23, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి విద్యార్థులు ఆందోళనలతో మార్మోగింది. రోహిత్‌ తల్లికి మద్దతు తెలిపేందుకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హెచ్‌సీయూకు రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకవైపు పోలీసుల లాఠీలు..మరోవైపు విద్యార్థులు నినాదాలతో యూనివర్శిటీ ప్రాంగణం అట్టుడికిపోయింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదని వర్శిటి సెక్యూరిటీ సిబ్బంది తేల్చిచెప్పడంతో బహిరంగసభకు కన్హయ్య హాజరుకాలేదు. లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,.అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు నిరంతరం పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హైదరాబాద్‌ టూర్‌ ఊహించినట్లుగానే ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కన్హయ్యకు విద్యార్థి సంఘాలనేతలు స్వాగతం పలికారు. కన్హయ్య రాకతో ఎయిర్‌పోర్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

హెచ్ సీయూలో కన్హయ్య..
ఆ తర్వాత కన్హయ్య శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఆర్‌ ఫౌండేషన్‌ భవన్‌కు చేరుకున్నారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేముల తల్లి రాధిక, సోదరుడును కన్నయ్యకుమార్‌ పరామర్శించారు. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కన్హయ్య..రోహిత్‌ ఆత్మహత్యకు యూనివర్శిటీ వీసీ అప్పారావే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి కన్హయ్య చేరుకున్నారు. అయితే కన్హయ్య హెచ్‌సీయూకు వస్తున్నారన్న సమాచారంతో వర్శిటీ వద్ద భారీ ఎత్తున కేంద్ర పోలీసు బలగాలు మోహరించాయి. హెచ్‌సీయూకు కన్హయ్యతో పాటు రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు కూడా ఉన్నారు. హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద కన్హయ్య కుమార్‌ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కన్నయ్యకు హెచ్‌సీయూలోకి ప్రవేశం లేదని వీసీ అప్పారావు సర్క్యులేషన్‌ జారీచేసిన నేపథ్యంలో పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యార్థిని పరామర్శించిన కన్హయ్య..
లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,..అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. వీసీని తొలగించి... రోహిత్ చట్టం తెచ్చే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కన్హయ్యను వర్శిటీలోపలికి అనుమతించకపోవడంపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే వర్శిటీ లోపలికి వెళ్లేందుకు కన్హయ్య ఎంత ప్రయత్నించినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుచెప్పడంతో చివరకు కన్హయ్య వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడి మధినాగూడలోని ప్రణవ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధి ఉదయ్‌ను పరామర్శించారు. 

బంగ్లా టార్గెట్ 147పరుగులు..

బెంగళూరు : పసికూన బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 15.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. శర్మ (18), ధావన్ (23), కోహ్లీ (24), రైనా (30), పాండ్యా (15), యువరాజ్ సింగ్ (3), జడేజా (12) పరుగులు చేశారు. ధోని 13, అశ్విన్ 5 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్, ముస్తాఫిజుర్ తలా రెండు, షువగత, షకిబ్, మహ్మదుల్లా చెరో ఒక వికెట్ తీశారు. 

భారత్ 112/5..

బెంగళూరు : పసికూన బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ మ్యాచ్ లో టీమిండియా వికెట్లు పటపటా పడిపోతున్నాయి. 15.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. శర్మ (18), ధావన్ (23), కోహ్లీ (24), రైనా (30), పాండ్యా (15) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్, షకిబ్ తలా రెండు, అల్ అమీన్, ముస్తాఫిజుర్ చెరో ఒక వికెట్ తీశారు. 

నిలకడగా ఆడుతున్న భారత్..

బెంగళూరు : టీ-20వరల్డ్ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 45 పరుగులకే ఓపెనర్లు శర్మ (18), ధావన్ (23)లు వెనుదిరిగారు. అనంతరం వచ్చిన కోహ్లీ, రైనాలు నిలకడగా ఆడుతున్నారు. 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 80 పరుగులు చేసింది. కోహ్లీ 16, రైనా 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

20:29 - March 23, 2016

అయ్యా ఈసారి ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ నటులు ఎవ్వలు పోటీ వడ్తున్నరో జర్ర జాగ్రత్త సుమా.. ఎందుకంటే.. మీరు ఎంత కష్టపడ్డా..? ఇర్గదీశె యాక్టింగ్ జేశ్నా.. అది మీకు రాదు.. ఎంపిక జేశెటోళ్లకు ఎంట్రీలు అందకముందుకే.. ఎగురేస్కపోయిండు.. అగో మొన్ననే అయిపాయే గదా..? ఆస్కార్ అవార్డులు మల్లెక్కడియి అనుకునేరు.. ఇప్పుడు గాదు.. వచ్చేసారి ముచ్చట ముందే జెప్తున్న అన్నట్టు..

20:26 - March 23, 2016

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది...బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట...ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి...

వెనుదిరిగిన టీమిండియా ఓపెనర్లు..

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో పసికూన బంగ్లాదేశ్ కు టీమిండియా ఓపెనర్లు తలవంచారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. 6.6 ఓవర్ వద్ద ధావన్ (22) పెవిలియన్ చేరాడు. 

శర్మ అవుట్..

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్ 22, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

19:52 - March 23, 2016

హెచ్ సీయూలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ రీ ఎంట్రీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం హెచ్ సీయూలో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ అనుమతి నిరాకరించారు. సభకు కూడా అనుమతినివ్వలేదు. దీనిపై టెన్ టివి చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), కాశం వెంకటేశ్వర్లు (బీజేపీ), మల్లేపల్లి లక్ష్మయ్య (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో చూడండి. 

టీమిండియా 17/0...

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మూడు ఓవర్లలో 17 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడుతున్నారు. 

భారత్ 5/0..

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మొదటి ఓవర్ ముగిసే సరికి భారత్ 5 పరుగులు చేసింది. శర్మ 2, ధావన్ 2 పరుగులతో ఆడుతున్నారు. 

బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా..

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. 

19:24 - March 23, 2016

గుంటూరు : జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వస్త్రోత్సవం పేరుతో జాతీయ స్థాయి ఫ్యాషన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సక్కు గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నింగ్‌ మిల్స్ అసోసియేషన్‌ చైర్మన్‌ పర్చూరి ధర్మతేజ హాజరు కాగా.. వర్సిటీ డీన్‌ మధుసూదన్‌రావు అధ్యక్షత వహించారు. ఇక ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు కాలేజీల నుంచి వెయ్యి మంది విద్యార్ధులు తరలివచ్చారు. 

విజ్ఞాన ఉత్పత్తి కేంద్రం..
విజ్ఞాన్‌ యూనివర్సిటీ విజ్ఞాన ఉత్పత్తి కేంద్రంగా మారిందన్నారు ధర్మతేజ. తమ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నవారిలో ఎక్కువ మంది విజ్ఞాన్‌ విద్యార్ధులు ఉండడమే దీనికి నిదర్శనమన్నారు. దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుందని.. విద్యార్ధులు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలన్నారు. కొలువు సాధించడం కాదని.. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు ధర్మతేజ.

వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర బిందువు..
గుంటూరు జిల్లా వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర బిందువు అన్నారు విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. వందలాది స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిలుల్లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇందుకోసమే విజ్ఞాన్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

ఆకట్టుకున్న కార్యక్రమాలు..
ఇక ఈ వస్త్రోత్సవంలో విద్యార్ధులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధులు ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో బహుళ జాతి సంస్థల ఫ్యాషన్‌, వస్త్ర సంబంధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యర్ధాల ద్వారా తయారుచేసిన వస్తువులు అందిరినీ అమితంగా ఆకర్షించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. 

19:21 - March 23, 2016

కర్నూలు : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కర్నూలులో 23వ ప్రజాశక్తి బుక్ హౌస్ బ్రాంచిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకానికి మించిన స్నేహితుడు లేడని, పుస్తకాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. పుస్తకం వుంటే ఎన్ని సంవత్సరాలైన చరిత్రనైనా తెలుసుకోవచ్చని రచయిత తెలకపల్లి రవి అన్నారు. 

19:20 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కనీసం తిందామని వంట చేస్తుంటే కూడా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వర్శిటీలోకి సాయుధ బలగాలు ప్రవేశించొద్దని ఉన్నా..యథేచ్చగా కోర్టు ఉల్లంఘన జరుగుతుందన్నారు. 

గెలిచిన ఇంగ్లండ్..

ఢిల్లీ : టీ -20 వరల్డ్ కప్ లో అప్ఘనిస్తాన్ జట్టుపై ఇంగ్లండ్ 15 రన్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో అప్ఘనిస్తాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

రోహిత్ చట్టం కోసం పోరాటం - కన్హయ్య...

హైదరాబాద్ : యూనివర్శిటీల్లో ఇంకా ఎంతమంది విద్యార్థులు చనిపోవాలని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. హెచ్ సీయు కు చేరుకున్న అతడిని లోనికి అనుమతించ లేదు. దీనితో అతను రోడ్డుపై ప్రసంగించారు. వివక్షకు గురై చనిపోయిన స్కాలర్ రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోహిత్ చట్టం వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అణిచివేతతో పోరాటాన్ని అడ్డుకోలేరని, రోహిత్ కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. లాఠీలతో తమ గొంతును నొక్కటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యార్ధుల వేదన వినటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. 

18:28 - March 23, 2016

హైదరాబాద్ : 'అణిచివేత ఎన్నాళ్లు..తమ గొంతు నొక్కుతున్నారు..ఎంతకాలం..ఇలా...జాతీయవాద్ సే ఆజాదీ చాహియే' అని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. హెచ్ సీయూ ప్రధాన ద్వారం వద్ద చేరుకున్న కన్హయ్యను అక్కడున్న సెక్యూర్టీ అడ్డుకున్నారు. వర్సిటీకి రాకముందు కన్హయ్య కుమార్ సీఆర్ ఫౌండేషన్ లో ఉన్న రోహిత్ వేముల తల్లిని పరామర్శించారు. అనంతరం రోహిత్ కుటుంబంతో కలిసి కన్హయ్య హెచ్ సీయూకు వెళ్లారు. అడ్డుకోవడంతో కన్హయ్య తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కన్హయ్యతో పాటు వచ్చిన సీపీఐ నేత నారాయణ సెక్యూర్టీతో మాట్లాడారు. తాము పది మంది లోనికి వెళుతామని, దీనికి పోలీసులు అంగీకరించారని తెలిపారు. మొదట అంగీకరించినా ప్రస్తుతం అనుమతి నిరాకరించారని వారు తెలిపారు. చివరకు కన్హయ్య కుమార్ కారుపై నుండే ప్రసంగించారు. ప్రసంగం అనంతరం తిరిగి కారులో వెళ్లిపోయారు. 

అనుమతించకపోవడం దారుణం..
వర్సిటీల్లో ఇంకా ఎంత మంది చనిపోవాలని, దేశంలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదన వినే పరిస్థితి లేదని, అణిచివేతతో తమను ఆపలేరని పేర్కొన్నారు. క్యాంపస్ లోనికి వెళ్లేందుకు తమను అనుమతించక పోవడం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల గళాన్ని వినిపించకుండా ప్రభుత్వం నొక్కి పెడుతోందని, సామాజిక న్యాయం జరిగేంతవరకు, రోహిత్ యాక్టు తెచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్, అంబేద్కర్, భగత్ సింగ్ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

ఉదయం నుండి ఏం జరిగింది ? 

  • బుధవారం ఉదయం విమానాశ్రయం చేరుకున్న కన్హయ్య కుమార్ కు సీపీఐ, ఇతర నేతలు స్వాగతం పలికారు. 
  • ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల కుటుంబాన్ని పరామర్శిస్తానని కన్హయ్య తెలిపారు.
  • విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం కనిపించడం లేదని జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య పేర్కొన్నారు.
  • హెచ్ సీయూలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ చర్యలే రోహిత్ మరణానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. 
  • సభకు అనుమతి లేదని వర్సిటీ ప్రకటించింది. సభకు అనుమతి లేకపోయినా బయట నిర్వహించుకుంటామని జాక్ స్పష్టం చేసింది. 
  • హెచ్ సీయూలో పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. మీడియాను లోనికి అనుమతించలేదు.
  • నిన్న జరిగిన ఘటనలో 26 మంది విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ మియాపూర్ కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో వీరందరిని చర్లపల్లి జైలుకు తరలించారు.
  • వంట చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఈ ఘటనలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

హెచ్ సీయూకి చేరుకున్న కన్హయ్య...

హైదరాబాద్ : హెచ్ సీయూకి చేరుకున్న జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య కుమార్. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లిని కలవడానికి కన్హయ్య హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా హెచ్ సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు కన్హయ్య క్యాంపస్ కి వచ్చిన విషయం తెలిసిందే.

విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం: ప్రొ. కోదండరాం

హైదరాబాద్ : హెచ్ సీయూ ఘటనపై టీ.జేఏసీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం స్పందించారు. హెచ్ సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్ జరపడం అమానుషమని, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సాయుధ బలగాలు యూనివర్శిటీలోకి ప్రవేశించకూడదని ఆయన పేర్కొన్నారు. కన్హయ్య రాకను అడ్డుకోవటానికి కుట్ర పన్నారన్నారు. సాయుధ పోలీసు బలగాలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. త్వరలో టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశముంటుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. 

హెచ్ సీయూకి బయలుదేరిన కన్హయ్య...

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ కు వెళ్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల తల్లిని, సోదరుడిని పరామర్శించారు. అనంతరం కన్హయ్య రోహిత్ తల్లి, సోదరుడుతో కలిసి హెచ్ సీయూకు బయలుదేరారు. క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. బయటి విద్యార్ధులను, మీడియానులోనికి అనుమతించవద్దని వీసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అప్ఘనిస్తాన్ 82/6..

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

17:56 - March 23, 2016

బెల్జియం : రాజధాని బ్రెసిల్స్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం వేట కొనసాగుతోంది. సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా ఆత్మహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. దాడులకు పాల్పడిన వారిలో ఖలీద్, బ్రహిమ్ ఇల్ బక్రోయి సోదరులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడో ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రసెల్స్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 35 మంది మృతి చెందగా 200 గాయపడ్డారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

17:48 - March 23, 2016

మహబూబ్ నగర్ : మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల పలు ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. దీనితో ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు...

ఢిల్లీ : 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ విమానాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలే బెల్జియం రాజధాని  బ్రసెల్స్ లో జంట పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. 

17:20 - March 23, 2016

ఢిల్లీ : ఇప్పటికే రైల్వేలో ప్రయివేట్‌ పెట్టుబడులను ఆహ్వానించిన మోది సర్కార్‌ - తాజాగా ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్‌ ఇండియాను కూడా ప్రయివేటిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎయిర్‌ ఇండియాలో 49 శాతం వాటాని అమ్మకానికి పెట్టే ఆలోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేయనున్నట్టు సమాచారం. 2017 లోపు ఈ తంతు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అప్ఘనిస్తాన్ 15/3..

ఢిల్లీ : ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

17:14 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు. తిండి..నీళ్లు..ఇతర మౌలిక సౌకర్యాలపై కూడా ఆంక్షళు విధించారు. దీనితో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి తీర్చుకోవడానికి భోజనం చేసేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులపై ఖాకీలు తమ ప్రతాపం చూపెట్టారు. లాఠీలతో బాదడంతో 8మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇతడిని ఆసుపత్రికి తరలించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడంతో వర్సిటీ లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియరావడం లేదు.

దారుణం - విద్యార్థిని..
వంట చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దారుణమని ఓ విద్యార్థిని పేర్కొంది. లోపల జరుగుతున్న పరిణామాలు మీడియాకు వివరించారు. తినేందుకు తిండి లేకుండా అల్లాడుతున్నామని, బయటి నుండి భోజనం తీసుకొస్తామని చెబుతున్నా పోలీసులు అనుమతినివ్వడం లేదని తెలిపారు. వర్సిటీలో నిన్నటి నుండి అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, వాటర్ బాటిల్స్, అన్ని సౌకర్యాలు ఆపు చేశారన్నారు. 

వీసీగా వుండే అర్హత అప్పారావుకి లేదు: కన్హయ్య..

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీగా ఉండే అర్హ‌త అప్పారావుకి లేదని జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ వేముల ఆత్మ‌హత్య‌కు వీసీ అప్పారావే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. యూనివర్సిటీల్లో ఎటువంటి వివక్ష ఉండకూడదని, కానీ ఇప్పుడు యూనివర్శిటీల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందని విమర్శించారు. వర్శిటీల్లో చదువుకునే వాతావరణం కరువవుతోందని, ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి వేరే యూనివర్సిటీకి వెళ్లకూడదనే నిబంధన లేదన్నారు. ఒకవేళ వెళ్లకూడదన్న చట్టం వున్నట్లయితే తాను దానిని గౌరవిస్తానని చెప్పారు.

17:06 - March 23, 2016

విజయనగరం : జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పది గంటల తర్వాత కూడా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీ రేట్లకు అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో జరుగుతున్న జాతరలు వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని గజపతినగరం పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ అధిక ధరలు మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారికి నిర్వాహకుల నుంచి సరైన సమాధానం లభించడం లేదు. ఈ షాపుల్లో పసిపిల్లలను సైతం మద్యం విక్రయాలకు ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

చర్యలు తీసుకోవాలి..
ఇక జిల్లాలో జరుగుతున్న జాతరలు మద్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జాతరలో టెంట్లు వేసి మరీ వ్యాపారులు మద్యం అమ్ముతున్నారు. జాతర సమయంలో ఎటువంటి తగాదాలు జరగకుండా వైన్ షాపులను మూసేస్తారు. కానీ మద్యం సిండికేట్లు ఎక్సైజ్ అధికారులను సైతం మ్యానేజ్ చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు హాఫ్ లు ఆరు ఫుల్లులుగా సాగుతోంది. ఇక్కడ కూడా వ్యాపారులు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జిల్లాలోని బెల్ట్ షాపులను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. 

ముగిసిన సిద్ధిపేట నామినేషన్ల గడవు....

మెదక్ : సిద్ధిపేట పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల గడవు బుధవారం సాయంత్రంతో ముగిసింది. 34 వార్డులకు గాను 577 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 

17:00 - March 23, 2016

రాజమండ్రి : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అలజడి రేగడానికి ఆర్ఎస్ఎస్ కారణమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర రాజమండ్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి మతోన్మాధులను కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కన్నయ్య విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. వీసీగా అప్పారావును తిరిగి తీసుకరావడం రగిలే పుండు మీద గాయం చేసే విధంగా ఉందన్నారు. విభజించి సమాజాంలో కలతలు సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. 

16:53 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ రగులుతూనే ఉంది. నిన్న జరిగిన ఘటనకు 26 మంది విద్యార్థులు బాధ్యులని పోలీసులు గుర్తించారు. వీరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో వీరందరిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాసేపట్లో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ వర్సిటికి రానున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కుటుంసభ్యులు కూడా వర్సిటీకి చేరుకోనున్నారు. వర్సిటీ జాక్ నిర్ణయించతలపెట్టిన సభకు వర్సిటీ అనుమతి నిరాకరించింది. దీనితో తాము రోడ్డుపైనే సభ నిర్వహిస్తామని జాక్ పేర్కొంది. 
వీసీ రీ ఎంట్రీపై జాక్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఆందోళన చేశారు. పోలీసులు వీరిని తరిమితరిమి కొట్టారు. విద్యార్థినిలను కూడా లాఠీలతో..పిడిగుద్దులు కురిపించారు. ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మరోవైపు హెచ్ సీయూకు కన్హయ్య కుమార్ రానున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

16:48 - March 23, 2016

హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం కనిపించడం లేదని జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య పేర్కొన్నారు. హెచ్ సీయూలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ చర్యలే రోహిత్ మరణానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కూడా కేంద్రం అమలు చేయడం లేదన్నారు. రోహిత్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకే క్యాంపస్‌కు వెళ్తున్నట్టు కన్హయ్య తెలిపారు. వర్సిటీల్లో చదువుకొనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేయాలని కోరారు. రోహిత్ యాక్టు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రావడానికి అనుమతి లేదని వీసీ పేర్కొంటున్నట్లు తెలుస్తోందని, కానీ వర్సిటీకి వచ్చేందుకు వీసీకే అనుమతి లేదన్నారు. 

కేంద్ర ప్రభుత్వోద్యోగుల డీఏ పెంపు….

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు కూడా ఈ డీఏ వర్తింపుకానుంది. డీఏ పెంపుతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల పెన్షన్ దారులకు లబ్ధి కలుగుతుంది. కాగా కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.

ఇంగ్లండ్ 142/7..

కోల్ కతా : పసికూన అప్ఘనిస్తాన్ తో ఢీకొడుతున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఎంఎం ఆలీ 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నాబి, రషీద్ ఖాన్ రెండు, హమ్జ, షేన్ వారీ చెరో ఒక వికెట్ తీశారు. 

16:37 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపెడుతూనే ఉన్నారు. నిన్న ఇష్టమొచ్చినట్లుగా బాదిన ఖాకీలు నేడు అదే తీరుగా వ్యవహరించారు. వంట చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఈ ఘటనలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భోజనం తినే హక్కు లేదా ? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ లో భోజనం..నీటి సదుపాయం..వైఫై తదితర సౌకర్యాలను పోలీసులు నిలిపివేశారు. దీనితో ఆకలిగా ఉన్న విద్యార్థులు బుధవారం భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బీభత్సం సృష్టించారు. వంట సామాగ్రీ చెల్లాచెదురు చేశారు. ప్రతిఘటించిన విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. గాయపడిన 8మందిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ సీయూ ప్రధాన గేటు వద్దనే మీడియాను నిలిపివేయడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియరావడం లేదు.

వీసీ రీ ఎంట్రీపై ఆగ్రహాజ్వాలలు..
గత రెండు రోజులుగా హెచ్ సీయూలో పోలీసులు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ రీ ఎంట్రీపై జాక్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఆందోళన చేశారు. పోలీసులు వీరిని తరిమితరిమి కొట్టారు. విద్యార్థినిలను కూడా లాఠీలతో..పిడిగుద్దులు కురిపించారు. వీసీ కనుసన్నల్లో నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాసేపట్లో హెచ్ సీయూ కు కన్హయ్య...
మరోవైపు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కొద్దిసేపట్లో హెచ్ సీయూకు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించడం..హెచ్ సీయూ విద్యార్థులు ఏర్పాటు చేసిన సభలో తాను మాట్లాడడం జరుగుతుందని కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. కానీ సభకు అనుమతి లేదని వర్సిటీ ప్రకటించింది. కానీ సభ జరిపి తీరుతామని జాక్ ప్రతినిధులు పేర్కొన్నారు. హెచ్ సీయూలో కాకపోయినా బయటే సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో హెచ్ సీయూ అట్టుడుకుతోంది. 

గవర్నర్ నరసింహన్ తో సీఎం చంద్రబాబు భేటీ..

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్‌తో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.

కాసేపట్లో హెచ్ సీయూకి రోహిత్ తల్లి, సోదరుడు...

హైదరాబాద్ : కాసేపట్లో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ తల్లి, సోదరుడు హెచ్ సీయూకు రానున్నారు. జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ రోహిత్ వేముల తల్లిని కలిసేందుకు నేడు హెచ్ సీయూకి రానున్న సంగతి తెలిసిందే. 

హెచ్ సీయూ ఘటనలో విద్యార్థులపై కేసు నమోదు...

హైదరాబాద్ : హెచ్ సీయూలో నిన్నటి ఘటనపై ముగ్గురు ఫ్యాకల్టీలతో సహా 28 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

వితంతు మహిళల హోలీ అద్భుతం: కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్

హైదరాబాద్ : వితంతు మహిళలంతా కలసి హోలీ సంబరాలు జరుపుకోవడాన్ని జ‌మ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇది అందరూ గర్వించదగిన అద్భుత సంఘటన అన్నారు.  అలాగే అన్ని ఆలయాల్లో మహిళలను అనుమతించాలని అన్నారు. దేశం సానుకూల ప‌ద్ధ‌తిలో ముందుకెళుతోందనటానికి ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలో వున్న శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదనే నియమం వుంది.

16:05 - March 23, 2016

నిజామాబాద్ పెద్దసుపత్రిలో సమస్యలు తిష్ట వేసాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని నిర్మించి ఆదరణ మరిచారు. అన్ని హంగులతో ఆస్పత్రి భవనాన్ని నిర్మించి నిర్వహణ మరిచారు. ప్రతి ఏటా ఆస్పత్రి నిర్వాహాణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాసమస్యలు మాత్రం తీరడం లేదు. పైన పటారం లోన లోటారంగ మారుతున్న  నిజామాబాదు పెద్దాసుపత్రి నిర్వహణ తీరు పై 10 టీవి ప్రత్యెక కథనం.
జిల్లా కేంద్రం లో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడానికి అన్ని రకాల సదుపాయలను కల్పించినప్పటికీ అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందరగా ఆస్పత్రి పరిస్థితి మారింది. ఆస్పత్రి తీరులో ఎలాంటి మార్పులు రాకపోగా రోగుల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తుంది. జబ్బులతో వచ్చే రోగులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి... సిబ్బంది కొరత, సరైన నిర్వహణ లేమి రోగులకు చుక్కలు చూపుతున్నాయి.ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం యేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా సిబ్బంది కొరత మాత్రం తీరడం లేదు.వీటికి తోడు సిబ్బంది నిర్లక్ష్యంతో ఆస్పత్రి దిక్కు రావాలంటే రోగులు జంకుతున్నారు.దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికి తగ్గు ముఖం పడుతుంది. ఈ నేపథ్యం లో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం అనివార్యం అవుతుంది....

హెచ్ సీయూ ఘటన అనైతికం:ఎన్ఎస్ యూఐ నేత రోజీజోస్

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఘటనపై ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీరోజ్ ధ్వజమెత్తారు.విద్యార్థుల పట్ల పోలీసులు, వీసీ అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీజోస్ మండిపడ్డారు. విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నారని రోహిత్ ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా వున్న వీసీ అప్పారావుకు మరలా బాధ్యతలను అప్పగించటమేమిటని ఆయన ప్రశ్నించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్బంగా రోజీజోస్ డిమాండ్ చేశారు.

ఇంగ్లండ్ 48/4..

కోల్ కతా : పసికూన అప్ఘనిస్తాన్ తో ఢీకొడుతున్న ఇంగ్లండ్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 7.1 ఓవర్లలో నే నాలుగు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. 

ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం..

ప్రకాశం : తాళ్లూరు (మం) విటలాపురంరలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆతహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తండ్రి పరిస్థితి విషయమంగా వున్నట్లు సమాచారం.

15:26 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ రగులుతోంది. తాము సభ జరుపుతామని వర్సిటీ జాక్ ప్రతినిధులు..సభకు అనుమతి లేదని పోలీసులు..భారీగా పోలీసుల మోహరింపు తో వర్సిటీ ఉద్రిక్తంగా మారిపోయింది. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ నగరానికి చేరుకున్నారు. సాయంత్రం వర్సిటీలో జరిగే సభకు హాజరౌతానని కన్హయ్య కుమార్ మీడియాకు తెలిపారు. రాజకీయ ఉద్దేశ్యంతో తాను ఇక్కడకు రాలేదని, కేవలం విద్యార్థులతో మాట్లాడడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై వర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. సభకు ఎలాంటి అనుమతి లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. తాము ఎలాగైనా సభ నిర్వహించి తీరుతామని జాక్ పేర్కొంది. మరోవైపు కన్హయ్యను అరెస్టు చేయమని సీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. అరెస్టు చేయమని చెబుతున్నా సభకు వచ్చే కన్హయ్యను పోలీసులు అడ్డుకుంటారని తెలుస్తోంది. వర్సిటీలో సభ నిర్వహించకపోయినా రోడ్డు మీదనే సభ జరిపి తీరుతామని జాక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

హెచ్‌సీయూ అరెస్టులపై దళిత సంఘాల ఆగ్రహం...

హైదరాబాద్‌: హెచ్ సీయూలో సిబ్బంది, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి చేసి విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేయడంపట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ దళిత సంఘాలు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వీసీ అప్పారావును పదవి నుంచి వెంటనే తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు .

వీసీ అప్పారావుపై కేసు నమోదు చేయాలి: సీపీఎం పోలిట్ బ్యూరో

హైదరబాద్ : హెచ్ సీపీ ఘటనలో వీసీ అప్పారావుని విధులను తొలగించి కేసు నమోదు చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.హెచ్ సీయూ సిబ్బంది, విద్యార్థులపై లాఠీచార్జి ను సీపీఎం పోలిట్ బ్యూరో ఖండించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన 39 మంది విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వీసీ అప్పారావు నిన్న విధులకు హాజరైన సందర్భంగా క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

15:15 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల పట్ల వీసీ, పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఎన్ ఎస్ యు జాతీయ అధ్యక్షుడు రోజీ జోస్ అన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం వర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వీసీ అప్పారావు తిరిగి బాధ్యతలు ఎలా అప్పచెప్పారని ప్రశ్నించారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ విద్యార్థులతో తాము చర్చలు జరుపుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామని రోజీ జోస్ స్పష్టం చేశారు. 

బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్...

కోల్ కతా : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు అప్ఘనిస్తాన్ - ఇంగ్లండ్ జట్లు ఢీకొననున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

విద్యార్థులపై లాఠీఛార్జీని ఖండించిన సీపీఎం పొలిట్ బ్యూరో..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు..సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. అరెస్టు చేసిన 30 మందికి పైగా విద్యార్థులను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావును తొలగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

15:01 - March 23, 2016

విశాఖపట్టణం : బాబు వస్తే జాబు వస్తుంది... నిరుద్యోగుల కళ్లలో ఆనందం వస్తుంది.. ఇది టీడీపీ సర్కార్ మాట. కాని ఉన్న ఉద్యోగులు పోతున్నాయంటున్నారు విశాఖలోని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులు. సీఎండీ తీరుతో 324 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డున పడ్డారు. హుదూద్ తుఫాన్ విలయతాండవం చేసిన కాలంలో..రాష్ట్రానికి విద్యుత్ అందించేందుకు అహర్నిశలు కష్టపడిన సిబ్బందిని ఉన్నపలంగా ఉద్యోగాల నుండి తొలగించారు తూర్పు విద్యుత్ శాఖ అధికారులు. బ్రేక డౌన్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో విధుల్లోకి తీసుకున్న తూర్పు విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ ను అనుకూలంగా వివిధ జిల్లాలకు ఎలా సరఫరా చేయాలనేది బ్రేక్ డౌన్ ఉద్యోగుల పని. కాని ఉన్నపలంగా 324 మంది ఉద్యోగులను కారణం లేకుండా ఇటీవల ఉద్యోగాల నుండి తొలగించారు. దీనికి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎండీ నిర్లక్ష్యం...
విద్యుత్ ను సమంగా పంచేందుకు కండక్టర్లు పాడవకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లను ముందుగానే పసిగట్టే బ్రేక్ డౌన్ ఉద్యోగుల పేరిట విశాఖ తూర్పు విద్యుత్ కేంద్రం విధుల్లోకి తీసుకుంది. తమను అవసరమయిన కాలంలో సమర్థవంతంగా వాడుకుని రోడ్డున పడేశారని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఆగస్టు నుండి పనిచేస్తున్న వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. లైన లాస్ కాకుండా పర్యవేక్షించడం.. విద్యుత్ బ్రేక్ డౌన్ సిబ్బంది విధి. డీటీఆర్ సిబ్బంది కూడా విద్యుత్ సరఫరా సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషించారు. కాని తమను ఆకారణంగా విధుల నుంచి తొలగించి సీఎండీ ముత్యాల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు వాపోతున్నారు.

వేతనాల చెల్లింపులో అలసత్వం...
తమకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ... తొలగించి రెండు నెలలయినా వేతనాల చెల్లింపులోను ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. ఎస్ ఎస్టీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని సీఎండీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల నుండి తొలగించడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయంటున్నారు. ఒక్క సంతకంతో 324 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని.. సీఎండీ ముత్యాల రాజు పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామంటూ .. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని వాపోతున్నారు ఈపీ డీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగులు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. 

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య...

నెల్లూరు : బుచ్చిరెడ్డిపాలెం (మం) జొన్నవాడ గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

14:57 - March 23, 2016

దేశంలో చాలా కులాలు..మతాలున్నాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. టెన్ టివి 'మానవి' వేదిక కార్యక్రమంలో 'వివాహాలు..చట్టాలు' అనే అంశంపై మాట్లాడారు. హిందువుల కోసం కొన్ని చట్టాలున్నాయని, క్రిస్టియన్స్ కోసం వారి వివాహానికి వేరే చట్టం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. ముస్లింల కోసం వివాహం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. 1955 నుండి హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అంతేగాక ప్రజలు వ్యక్తపరిచిన న్యాయ సమస్యలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

వైసీపీలో చేరిన ఆనం విజయ్..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు చేరారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. 

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్..ముగ్గురు మృతి..

విజయనగరం : మెంతాడ (మం) చల్లపేట వద్ద విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొంది. ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు ఇద్దనవలస వాసులుగా గుర్తించారు. 

విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు...

విశాఖ : హుడా పార్కు సమీపంలోని బీచ్ లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఆచూకి కోసం గాలింపులు చేపట్టారు. గల్లంతయిన వారు జాలరిపేటకు చెందిన పెట్ల రాము (23) కార్తిక్ (17) గా గుర్తించారు. 

14:35 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ పోలీసు క్యాంపసా ? లేక విశ్వవిద్యాలయాలా ? అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. హెచ్ సీయూని పోలీసు క్యాంపస్ గా మార్చారని, అందర్నీ బయటకు పంపిస్తున్నారని తెలిసిందని తెలిపారు. ఎయిర్ పోర్టులో దిగిన కన్హయ్య కుమార్ కు ఆయన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. నిజంగా విశ్వవిద్యాలయాలు అయితే పోలీసు క్యాంపస్ తీసేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉదృతమౌతాయని హెచ్చరించారు. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ నగరానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవలే మృతి చెందిన విద్యార్థి రోహిత్ వేముల తల్లిని పరామర్శించడం..హెచ్ సీయూని సందర్శించడం..అక్కడ విద్యార్థులను రోహిత్ పరామర్శిస్తారని తెలిపారు. రోహిత్ జైలు నుండి విడుదలైన అనంతరం ఎక్కడకు వెళ్లలేదని, సాయంత్రం 5.30గంటలకు హెచ్ సీయూలో ఉన్న కార్యక్రమంలో రోహిత్ హాజరౌతారని తెలిపారు. 

14:25 - March 23, 2016

హైదరాబాద్ : 'హెచ్ సీయూ వర్సిటీకో..మై జరూర్ జావుంగా' అంటూ జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ తేల్చిచెప్పారు. ప్రతి విద్యార్థీ రోహిత్ వేముల కలలను సాకారం చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం హెచ్‌సియులో జరిగే మీటింగ్‌లో విద్యార్థులను ఉద్దేశించి తాను మాట్లాడబోతున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్యకు సీపీఐ నేతలు ఘన స్వాగతం పలికారు.
హెచ్ సీయూలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ జరిపిన సంగతి తెలిసిందే. వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే వర్సిటీ బయటనైనా సభను ఏర్పాటు చేసుకుంటామని హెచ్ సీయూ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు.

14:20 - March 23, 2016

నెల్లూరు : తాను గతంలో భయపడలేదు..ఇప్పుడు కూడా భయపడనని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. జిల్లాలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో చంద్రబాబును ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో ఏపీసీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో తాను బయటకు రాగానే తనపై లేనిపోని కేసులు పెట్టి వేధించారని తెలిపారు. అయినా తాను భయపడలేదని చెప్పుకొచ్చారు.. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్మానని తెలిపారు.

13:58 - March 23, 2016

హైదరాబాద్ : టీ 20 వరల్డ్ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ టీమ్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాయి.హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లన్నీ  ప్రస్తుతం డైలమాలోనే పడ్డాయి. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన నాలుగు టాప్‌ టీమ్స్‌...సెమీస్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. 
భారత్‌.....2007 టీ 20 చాంపియన్‌
భారత్‌.....2007 టీ 20 చాంపియన్‌, ఇంగ్లండ్‌ 2010 టీ 20 చాంపియన్‌. ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకూ చాంపియన్‌గా నిలవలేకపోయినా....ప్రస్తుత ప్రపంచకప్‌లో హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగాయి. టీ 20 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ నాలుగు జట్లు....తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించలేకపోయాయి.
భారత్ కు న్యూజిలాండ్ పెద్ద షాక్ 
ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఖచ్చితంగా టైటిల్‌ సాధిస్తుందనుకున్న భారత జట్టుకు....ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు పెద్ద షాకే ఇచ్చింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టును చిత్తు చేసి సెమీస్‌ రేస్‌లో నిలిచిన టీమిండియా....నాకౌట్‌ రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సిందే. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ కు కూడా అర్హత సాధించడం ...టీమిండియాకు ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారింది. ట్వంటీ ట్వంటీ  ఫార్మాట్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న ధోనీసేన...ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌లో ఓడినా సెమీస్‌ రేస్‌ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. పవర్‌ ప్యాకెడ్‌ సౌతాఫ్రికా, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్లదీ అదే పరిస్థితి. అందరూ మ్యాచ్‌  విన్నర్లతో కూడిన ఇరు జట్లు తొలి రౌండ్‌ పోటీల్లో చేతులెత్తేశాయి. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక... ఓడిన కంగారూ టీమ్‌ న్యూజిలాండ్‌ జట్టు చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పైనా చచ్చీ చెడీ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు ఊపిరి పీల్చుకుంది.
సౌతాఫ్రికాకు ఇంగ్లండ్‌ ఝలక్‌ 
ఇక తొలి మ్యాచ్‌లో 229 పరుగుల రికార్డ్ స్కోర్‌ నమోదు చేసిన సౌతాఫ్రికా జట్టుకు....ఇంగ్లండ్‌ జట్టు ఎలా ఝలక్‌ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. జాసన్‌ రాయ్‌, జో రూట్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో  ఇంగ్లీష్‌ 230 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసింది. రెండో మ్యాచ్‌లో మరోసారి 200 పరుగులకు పైగా స్కోర్‌ చేసిన సఫారీ టీమ్‌.... ఆఫ్గనిస్తాన్‌ను అతి కష్టం మీద అధిగమించింది. 
డైలమాలో ఆస్ట్రేలియా జట్టు  
బ్యాట్స్ మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు డైలమాలో పడింది. మరో వైపు బ్యాట్స్ మెన్‌ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా....బౌలర్లు దారుణంగా విఫలమవుతుండటం సఫారీ టీమ్‌ను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.
శుభారంభం చేయలేకపోయిన ఇంగ్లండ్‌ 
ఇక మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు కూడా తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయలేకపోయింది. కరీబియన్‌ బుల్‌...క్రిస్‌ గేల్‌ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌ ఆడి మెరుపు సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లీష్‌ టీమ్‌కు ఓటమి తప్పలేదు. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారీ స్కోర్‌ చేధించి....ఎట్టకేలకు టైటిల్‌ రేస్‌లో నిలిచింది. ఈ నాలుగు టాప్‌ టీమ్స్‌ మాత్రమే కాదు,  ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన.....మాజీ చాంపియన్లు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు  సైతం రెండో మ్యాచ్‌లో ఓడిపోయి సెమీస్‌ రేస్‌లో వెనుకబడ్డాయి. బలహీనంగా ఉన్న శ్రీలంక, ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేని పాకిస్థాన్‌ జట్లకూ ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ జట్లు మాత్రమే బ్యాక్‌ టు బ్యాక్ విజయాలతో టైటిల్‌ రేస్‌లో ముందువరుసలో నిలిచాయి.
సెమీస్‌కు అర్హత సాధించే జట్లేవో
రెండు గ్రూప్‌ల్లో ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ మినహా అన్ని జట్లకూ సెమీస్‌ చేరే అవకాశాలున్నాయి. కానీ హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆతిధ్య భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లకు మాత్రం సెమీస్‌కు అర్హత సాధించడం పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. మరి రెండు గ్రూప్‌ల్లో సెమీస్‌కు అర్హత సాధించే జట్లేవో తెలియాలంటే మాత్రం....సూపర్‌ టెన్‌ రౌండ్‌ ఆఖరి మ్యాచ్‌ వరకూ ఎదురు చూడాల్సిందే....

13:51 - March 23, 2016

బెంగళూరు : టీ-20 ప్రపంచకప్ మూడో రౌండ్ పోటీకి...ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, 10వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ధోనీసేన ఈమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. 
రెండో విజయంపై టీమిండియా గురి
భారతగడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ గ్రూప్- బీ లీగ్ లో రెండో విజయానికి ఆతిథ్య టీమిండియా గురిపెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి ధోనీసేన సిద్ధమయ్యింది.
సమరానికి సై
న్యూజిలాండ్,ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లున్న గ్రూప్- బీ నుంచి సెమీస్ బెర్త్ కోసం పోటీపడుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు...ఆసియాకప్ విన్నర్, రన్నరప్ హోదాతో సమరానికి సై అంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా...ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన కీలక పోటీలో విజయం సాధించి..సెమీస్ రేస్ లో కొనసాగుతోంది. మరోవైపు...పాకిస్థాన్, ఆస్ట్రేలియాజట్లతో ముగిసిన మొదటి రెండురౌండ్లలోనూ బంగ్లాజట్టు గట్టిపోటీ ఇచ్చినా పరాజయాలు తప్పలేదు. టాస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ లాంటి బౌలర్ల యాక్షన్ లోపభూయిష్టంగా ఉందంటూ ఐసీసీ ప్రకటించి, సస్పెన్షన్ విధించడంతో...బంగ్లా బౌలింగ్ ఎటాక్ నెత్తిన ఒక్కసారిగా పిడుగు పడినట్లయ్యింది. ఇద్దరు ప్రధాన బౌలర్లు జట్టుకు దూరం కావడంతో..బంగ్లా ప్రధానజట్టు బ్యాలెన్స్ తప్పిందని కెప్టెన్ ముష్రఫే మొర్తాజా వాపోతున్నాడు.
టీమిండియా విషయానికి వస్తే...
ఇక...టీమిండియా విషయానికి వస్తే...న్యూజిలాండ్ తో ముగిసిన మ్యాచ్ లో చేసిన పొరపాట్లను...పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా సవరించుకొన్నట్లే కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా...ఇటీవలే ముగిసిన ఆసియాకప్ ఫైనల్లో సైతం అలవోక విజయం సాధించడం ద్వారా. తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంది.
టీమిండియా.. బ్యాటింగే ప్రధాన ఆయుధం
మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా..బ్యాటింగే ప్రధాన ఆయుధంగా ప్రపంచకప్ వేటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ నిలకడలేమి జట్టును తడబాటుకు గురిచేస్తున్నా..వన్ డౌన్ విరాట్ కొహ్లీ కుదురైన, నమ్మదగిన బ్యాటింగ్ తో జట్టుకు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాడు. బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాలలో సైతం టీమిండియా సమతూకంతో కనిపిస్తోంది. పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ వరకూ టీ-20 ల్లో 70 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ..42 విజయాలు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్ లో 30 మ్యాచ్ ల్లో 18 విజయాలు సాధించింది.
చిన్నస్వామి స్టేడియం.. విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్ లాంటిదే
మ్యాచ్ కు వేదికగా ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్..ఒక విధంగా విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్ లాంటిదే. బ్యాటింగ్ కు అనువుగా ఉండే బెంగళూరు పిచ్ పై...భారీస్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే..బంగ్లా పై భారీఆధిక్యంతో విజయం సాధించాలన్న లక్ష్యంతోనూ పోటీకి దిగుతోంది. ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమైన బంగ్లాదేశ్...టీమిండియాకు ఏ రేంజ్ లో పోటీఇవ్వగలదన్నదే ఇక్కడి అసలు పాయింట్.

 

కన్హయ్యను ఆహ్వానించాం - హెచ్ సీయూ జేఏసీ..

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ను హెచ్ సీయూ కు ఆహ్వానించడం జరిగిందని హెచ్ సీయూ జేఏసీ ప్రకటించింది. కన్హయ్య ను క్యాంపస్ లోకి అనుమతించకపోతే తాము బయటకు వెళ్లి సభను నిర్వహించుకుంటామని తేల్చిచెప్పింది. హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విమర్శించింది. 

హెచ్ సీయూ ఆహ్వానం మేరకు వచ్చా - కన్హయ్య..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థుల ఆహ్వానం మేరకు తాను ఇక్కడకు రావడం జరిగిందని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. రోహిత్ ఘటనపై విద్యార్థులతో చర్చిస్తానని, రోహిత్ తల్లికి మద్దతు తెలిపుతానని, రోహిత్ చట్టం చేసే వరకు తాను పోరాటం జరుపుతానని పేర్కొన్నారు. 

తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు..

చెన్నై : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. డీఎండీకే నేత విజయ్ కాంత్ తో వైగో భేటీ అయ్యారు. డీఎండీకే, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ మధ్య పొత్తు కుదిరింది. డీఎండీకే 124, పీడబ్ల్యూ ఎఫ్ -110 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ - డీఎంకేలు కలిసి పోటీ చేస్తుండగా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది. 

రిటైర్డ్ ఫారెస్టు అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు..

గుంటూరు : తాడేపల్లిలో రిటైర్డ్ ఫారెస్టు అధికారి బసవయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

13:46 - March 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ప్రజలు హోలీ వేడుకలను ఘనం నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి హరీశ్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజలు కలలుగన్న ఆకుపచ్చ తెలంగాణదిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో హోలీ ఘనంగా జరిగింది.. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు..
ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో 
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరకుంటున్నానని చెప్పారు.. హైదరాబాద్‌ ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.. డప్పుకొట్టి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు..
కర్నూలులో 
కర్నూలులో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. నేలపై టమాటాలు పోసి వాటిపై డాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. 
విశాఖలో
విశాఖలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. 

13:41 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆంక్షలు కొనసాగుతున్నాయని...మీడియాను కూడా లోనికి అనుమతించడం లేదని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకురాలు అక్షిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వర్సిటీలో కావాలనే ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే...
'రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  
అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది' అని చెప్పారు.

13:36 - March 23, 2016

శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఎండలు హడలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సూర్యతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోడ్లపై అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మార్చి నెలలోనే సమ్మర్ ఎఫెక్ట్ ఇంతలా ఉంటే ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.  

13:33 - March 23, 2016

హైదరాబాద్ : ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌. 
భగత్‌ సింగ్‌... ధైర్యానికి ప్రతీక
భగత్‌ సింగ్‌... ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌... ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్‌ 28న జననం 
1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులకు భగత్‌సింగ్‌ జన్మించారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.  
ఉరకలేస్తున్న యవ్వనం దేశానికి అంకితం 
ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు. 
సైమన్‌ కమిషన్‌..పోలీసుల దాడి.. లాలాలజపతిరాయ్‌ మృతి
1928లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్‌ చనిపోవటంతో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1931 మార్చి 23న లాహోర్‌లో ఉరి 
బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరి తీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
పోరాట యోధుడు భగత్‌సింగ్ 
చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూలమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి భగత్‌సింగ్‌ నిదర్శనం. అదే నేటి వెలుగు దారి. 

 

13:33 - March 23, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్వయంగా హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర స్టోరీ లీకైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రతన్ పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ అనే విలన్ ప్రజలను హింసిస్తుంటాడు. ఎదురు చెప్పిన వారి అంతు చూస్తుంటాడు. అక్కడే ఉన్న ఓ యువరాణిపై ఇతని కన్ను పడుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఊహించుకుంటాడు. కానీ భైవర్ ఆగడాలను తెలుసుకున్న ఆ యువరాణి వ్యతిరేకిస్తుంది. తన కూతురిని కాపాడుకోవాలని యువరాణి తండ్రి నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రతన్ పూర్ గ్రామానికి పోలీసు ఆఫీసర్ గా హీరో వస్తాడు. అతని చేష్టలు చూసిన యువరాణి తండ్రి మొదట ఆశ్చర్యపోతాడు. అనంతరం అతని స్టెమినా చూస్తాడు. యువరాణికి ఇతడే కరెక్టు అని భావిస్తాడు. మరి భైరవ్ యువరాణిని పెళ్లి చేసుకున్నాడా ? భైరవ్ ఆటను 'సర్ధార్' కట్టించాడా ? యువరాణి తండ్రి కల నెరవేరిందా ? అనేది స్టోరీ అంట. మరి ఈ స్టోరేనా కాదా ? అనేది తెలియాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి చూడాలిల్సందే. అంతవరకు ఈ చిత్రంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. 

13:31 - March 23, 2016

ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌తో గడుపుతున్నారు. వ్యాయామం చేయడానికి కూడా చాలా మందికి టైమ్‌ సరిపోవడం లేదు. దీంతో పొట్ట, ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త స్మార్ట్‌యాప్‌ అందుబాటులో ఉంది. కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారికి, ఇప్పటికే చేస్తున్న వారికి ఎందెంతో ఉపయోగకరం. సులువుగా ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలో తెలియజేసేందుకు '7 డైలీ మూవ్స్‌' యాప్‌ దోహదపడుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓస్‌ వినియోగదారులకు ఆయా యాప్‌స్టోర్‌లో ఇది లభిస్తుంది. ఐఓఎస్‌ 8.0, ఆండ్రాయిడ్‌ 4.0 ఆ పైన వెర్షన్‌ కలిగిన డివైస్‌లలో ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. '7 డైలీ మూవ్స్‌' యాప్‌లో ఏయే ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో తెలిపే చిన్నపాటి జిఫ్‌ ఇమేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... వాటి కింద ఎక్సర్‌సైజ్‌ను ఏరోజు ఎంత సేపు ఎన్ని రౌండ్లు చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు. దాదాపు 50కి పైగా వివిధ రకాల వ్యాయమాల గురించి యానిమేటెడ్‌ బొమ్మల రూపంలో ఈ యాప్‌ ద్వారా వివరిస్తున్నారు.

13:30 - March 23, 2016

జుట్టు తొందరగా ఆరాలని డ్రయర్‌ను వాడితే అది బిరుసుగా మారుతుంది. డ్రయర్‌ తక్కువగా వాడి.. వీలైతే మానేసి.. సహజ గాలికి శిరోజాలను ఆరనివ్వాలి. వారానికి ఓ సారైనా కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాసి కనీసం ఐదు నిమిషాలు మర్దన చేయాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే పట్టుకుచ్చుల్లాంటి కురులు మీ సొంతమవుతాయి.

13:28 - March 23, 2016

ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అందుకోసం ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..
ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు. మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు లాంటి ద్రవ పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.
ఉదయం పూట తీసుకునే టిఫిన్స్‌ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్‌ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం.
బార్లీ గింజల్లో నీరుపోసి, ఉడికిన తర్వాత బార్లీ నీళ్లల్లో ఉప్పుగానీ, పంచదార కానీ, నిమ్మరసం కానీ వేసుకొని తాగితే చలువ చేస్తుంది. ఈ నీరు పిల్లలకి చాలా ఉపయోగకరం.
బి, సి, ఇ విటమిన్లు కెరోటిన్‌, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, యాపిల్‌, గ్రీన్‌ టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతి పండ్లు.. ఇలా ప్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటి వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. 

13:26 - March 23, 2016

ఈ ఫొటోలో ఉన్న ఎవరో గుర్తు పట్టారా ? టాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్ కాదు..బాలీవుడ్ యాక్టర్..సరే..ఇతని ఫొటో గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రోబో 2.0'. వీరి కాంబినేషన్ లోనే 'రోబో' వచ్చిందనే సంగతి తెలిసిందే. దీనికి స్వీక్వెల్ గా 'రోబో 2.0' గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్..పెద్ద కనుబొమ్మలు..వెరైటీ కనుగుడ్లు..వైట్ హెయిర్..చూడగానే భయం కలిగించేలా ఆ గెటప్ ఉంది. విచిత్ర వేషధారణతో వచ్చిన అతడిని ఎవరూ గుర్తు పట్టలేదంట. చివరకు 'అక్షయ్ కుమార్' అని తెలిసిపోయింది. అవును ఆ ఫొటోలో ఉన్నది 'అక్షయ్ కుమార్'. 'రోబో 2.0' సినిమాలో సైంటిస్టు పాత్రలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఫొటోను ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

కన్హయ్యను అరెస్ట్ చేయం : డీజీపీ అనురాగ్...

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి నేత  కన్హయ్యను అరెస్టు చేయబోమని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. హెచ్ సీయూలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య నేడు కన్హయ్య హెచ్ సీయూకి రానున్న సంగతి తెలిసిందే.

ఫ్రాన్స్‌ ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు....

హైదరాబాద్ : ఫ్రాన్స్‌లోని టులోస్‌ విమానాశ్రయంలో అధికారులు ఈరోజు విస్తృత తనిఖీలు చేపట్టారు. బ్రస్సెల్స్‌లో నిన్న జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

హెచ్ సీయూలో ఫాసిస్ట్ పాలన: విద్యార్థి జేఏసీ

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విద్యార్థి జేఏసీ పేర్కొంది. కన్హయ్యను హెచ్ సీయూకి ఆహ్వానించినట్లు విద్యార్థి జేఏసీ తెలిపింది. కన్హయ్యను క్యాంపస్ లోనికి అనుమతించకపోతే సభను క్యాంపస్ బయటే నిర్వహించుకుంటామని జేఏసీ స్పష్టం చేసింది. రోహిత్ వేముల తల్లి కలిసేందుకు జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈరోజు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. 

12:37 - March 23, 2016

హైదరాబాద్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం పోలీసులు తీసుకెళ్లారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేటుచేసుకుంది. దీంతో విద్యార్థులు పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు రువ్వారు. అక్కడున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  
 

12:35 - March 23, 2016

హైదరాబాద్ : రోహిత్ తల్లికి మద్దతు తెలిపేందుకే తాను వచ్చినట్లు జెఎన్ యూ నేత కన్హయ్య తెలిపారు. కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని చెప్పారు. హెచ్ సీయూ విద్యార్థుల ఆహ్వానం మేరకే వచ్చానని తెలిపారు. రోహిత్ ఘటనపై విద్యార్థులతో చర్చిస్తామని చెప్పారు. రోహిత్ వేముల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. రోహిత్ చట్టం చేసే వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. దళితుల పట్ల చూపుతున్న వివక్ష అంతరించాలని కాంక్షించారు. ఈరోజు సాయంత్రం కన్హయ్య హెచ్ సీయూకు వెళ్లనున్నారు. సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. 
హెచ్ సీయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత  
హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీకి సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. వర్సిటీలో మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను పోలీసులు గేట్ వద్ద ఆపేశారు. 

 

రోహిత్ వేముల తల్లిని కలిసేందుకు వచ్చా: కన్హయ్య

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ రోహిత్ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని, రోహిత్ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. కాగా కన్హయ్య రాక సందర్భంగా హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. పీహెచ్ బీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏసీబీ వలలో ఫారెస్ట్ శాఖ అధికారి....

గుంటూరు : రిటైర్డ్ అటవీశాఖ అధికారి బసవయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి లోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ లోని బసవయ్య నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తనిఖీలు కొనసాగిస్తున్నారు.

11:49 - March 23, 2016

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

 

11:47 - March 23, 2016

హైదరాబాద్ : ఇంద్రదనుస్సు ఆకాశాన్ని వీడి నేలపై వాలింది. దేశమంతటా హోలీ సంబరాలు మిన్నంటుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా జనం రంగుల్లో తడిచి ముద్దవుతున్నారు.  హరివిల్లును వంచి దానిపై నృత్యం చేస్తున్నారు. లైఫ్‌ ఈజ్‌ కలర్‌ఫుల్..బ్యూటీఫుల్‌ అంటు చిందులు వేస్తున్నారు. 
హైదరాబాద్‌లో...
హైదరాబాద్‌లో ఘనంగా హోళీ వేడుకలు జరుపుతున్నారు. మలక్‌పేటలో యువకులు, చిన్నారులు హోళీ సంబరాల్లో మునిగితేలుతున్నారు. రంగులు, రంగులు కలిసిన నీళ్లు చల్లుకుంటూ ఆనంద హర్షాతిరేకాల్లో మునిగిపోయారు. 
ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో 
ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుంటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

 

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కన్హయ్య....

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, విద్యార్థి సంఘం నేత కన్హయ్యకు ఘనంగా స్వాగతం పలికారు. కన్హయ్య కుమార్ రాకతో హెచ్ సీయూలో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. కాసేపట్లో హెచ్ సీయూకు కన్హయ్య చేరుకుంటారు.

11:37 - March 23, 2016

హైదరాబాద్ : జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. హెచ్ సీయూకు కన్హయ్య వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. కన్హయ్యకుమార్ రాకతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 విద్యార్థి సంఘాలు కన్హయ్య కుమార్ రాకను స్వాగతిస్తున్నాయి. కానీ ఎబివిపి నేతలు మాత్రం కన్హయ్య రాకను వ్యతిరేకిస్తున్నారు. వీసీ అప్పారావుకు బాసటగా నిలుస్తున్నారు. 
కాంగ్రెస్... వీ.హనుమంతరావు
కన్హయ్యకుమార్ మీటింగ్ ఫెయిల్ చేయాలనేది ఉద్దేశంతోనే వీసీ అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అందుకే  అప్పారావును వీసీగా మళ్లీ తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సీఎం కేసీఆర్... వీసీని రీకాల్ చేయాలి. హెచ్ సీయూ ఘటన వెనుకాల ఎన్ డీయే ప్రభుత్వం పాత్ర ఉందని.... కేంద్రం నాటకమాడుతుంది. వర్సిటీలో ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులను చదువుకోనివ్వాలని కోరారు. 

 

హోలీ సంబరాల్లో విషాదం...

గుంటూరు: గుంటూరు జిల్లాలో హోలీ పండుగలో విషాదం నెలకొంది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న అనంతరం ఆరుగురు విద్యార్థులు కలిసి కృష్ణానదికి స్నానానికి వెళ్ళారు. ఆరుగురు విద్యార్ధుల్లో ముగ్గరు విద్యార్ధులు మరణించగా మగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మరణించిన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హోలీ సంబరాల్లో సీఎం చంద్రబాబు...

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా  హోలీ సంబరాలు. రంగు రంగుల తలపాగా ధరించిన చంద్రబాబు డప్పు కొట్టి హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లంబాడీ మహిళలతో కలిసి చంద్రబాబు స్టెప్పులేశారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సీపీఐ నేత అజీజ్ బాషా అరెస్ట్....

హైదరాబాద్: జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య నేడు హెచ్ సీయూకి రానున్నారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరీక్షించటానికి వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారుహెచ్‌సీయూలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వర్సిటీ అధికారులు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. హెచ్‌సీయూకు వెళ్లే అన్ని గేట్లను పోలీసులు మూసివేశారు. వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హెచ్‌సీయూలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. యూనివర్సిటీలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

11:13 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శికి శనివారం వరకూ అధికారులు సెలవులు ప్రకటించారు. అటు హెచ్ సీయూ లోపలికి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడంలేదు. ప్రధాన గేటు దగ్గర మీడియాను పోలీసులు ఆపేశారు. లోపలికి అనుమతిలేదని తేల్చి చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు నగర పోలీస్‌ కమిషనర్‌కు యూనివర్శిటీ రిజిస్ట్రార్ లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉద్రిక్తత చల్లారేవరకూ వర్శిటీలోకి మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర విద్యార్థులను అనుమతించొద్దంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ లేఖ రాశారు.. ఈ లేఖపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
వర్సిటీలో కొనసాగుతోన్న ఉద్రిక్తత 
హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 
అప్పారావుకు మళ్లీ వీసీ బాధ్యతలా..? విద్యార్థిని 
'రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  
అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది' అని చెప్పారు.

 

హెచ్ సీయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత...

హైదరాబాద్: హెచ్ సీయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత. ఈ సందర్భంగా నిన్న 33 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నేడు 11.30 గంటలకు విద్యార్ధులు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేయటానికి  వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు రానున్నట్లు సమాచారం. కవరేజ్ కోసం వెళ్ళిన  మీడియాపై కూడా ఆంక్షలు విధించిన పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాన గేటు వద్దనే  మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిన వెళ్ళిన వీసీ అప్పారావు నిన్న విధులకు హాజరయ్యారు.

10:51 - March 23, 2016

నల్గొండ : వరుస సంఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.. వాటికి బ్రేక్ వేయడంలో ఖాకీలు జంకుతున్నారు.. వరుసగా దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, సుఫారీలు, రేప్ లు, గంజాయి తరలింపులు..ఎప్పుడూ ఏదో ఒక విధంగా.. వార్తల్లో నిలుస్తూనే ఉంది నల్లగొండ జిల్లా.   
నల్లగొండ జిల్లాలో క్రీయాశీల రాజకీయాలు 
తెలంగాణలో ఎన్నో క్రీయాశీల రాజకీయ పరిణామాలకు నల్లగొండ జిల్లా పెట్టింది పేరు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అనుకొని ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తుంటుంది. దాంతో పాటు నేరాల పట్టికలో జెడ్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత రెండేళ్లుగా జిల్లాలో నేరాల సంఖ్య అనూహ్యంగా రెట్టింపు అయింది. గతేడాది టెర్రరిస్టుల దాడినుంచి.. ఇటీవల అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్ వరకు.. అన్నీ సంచలనాలు ఈ జిల్లా నుంచే నమోదు కావడం గమనార్హం.
పెద్ద ఎత్తున్న దోపిడిలు, దొంగతనాలు
గత రెండేళ్ళ కాలంలో.. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున్న దోపిడిలు, దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో.. పట్టణ, గ్రామీణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఇళ్లు, దుకాణాలు, చైన్ స్నాచింగ్ ఘటనలతో పాటు.. దేవాలయాలను కూడా దొంగలు వదలడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి, అంతర్జాతీయ లింకులను సైతం చేధించిన కిడ్నీ విక్రయ ముఠా రాకెట్ ములాలు జిల్లాలోనే జరగడం గమనార్హం. 
అక్రమ ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తుల అరెస్టు 
సూర్యాపేట హైటెక్ బస్టాండ్, జానకిపురంలో సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ ..  సూర్యాపేట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారు నుంచి దాదాపు కోటిన్నర నగదును స్థానిక పోలీసులు సీజ్ చేశారు. మిర్యాలగూడ, సూర్యాపేట పట్ణణాల్లో అక్రమ ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
దోపిడీలు ,మర్డర్లు 
మిర్యాలగూడలో మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పన్నాగాన్ని పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు భగ్నం చేయగలిగారు. జిల్లాలో క్రైం రేట్ బాగా తగ్గిపోయిందని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్లతో ఊదరగొడుతున్నా.. వాస్తవానికి జిల్లాలో ఏదో ఒక చోట దోపిడీలు ,మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి.  
నేరగాళ్లతో పోలీసు అధికారులు కుమ్మక్కు...? 
జిల్లాలో నిఘా విభాగం పూర్తిగా నిద్రపోతుందన్న విమర్శలు.. ఇతర పోలీసు విభాగాల అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది ఎస్సైల నుంచి మొదలుకొని డీఎస్పీ స్థాయి అధికారులపైనా నేరగాళ్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ దేవుడెరుగు మా భద్రతకే బరోసా లేదంటున్నారు ప్రజలు. 

 

10:30 - March 23, 2016

హైదరాబాద : ఓయూలో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సిటీలోని లైబ్రరీ పక్కను ఉన్న వాటర్ ట్యాంకులో అతని  మృతదేహం లభ్యమైంది. ఓయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు విద్యార్థులను పోలీసులు అనుమతించడం లేదు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 
ఎమ్మెల్సీ రాంద్రరావు...
'హోలీ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో విద్యార్థి మృతి విషాదం. ఉద్యోగం రాక మనస్తాపం చెంది విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతి చెందినట్లు విద్యార్థులు భావిస్తున్నారు. 
ఘటనాస్థలం వద్ద  ఉన్న సూసైడ్ నోట్, ఐడెంటీ కార్డులున్నాయి.. వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత మృతదేహానికి  పోస్టుమార్టం చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని' అని తెలిపారు.  

 

హోలీ సంబరాల్లో తమిళ గవర్నర్ రోశయ్య...

ప.గోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరులో హోలీ సంబరాలలో  గవర్నర్హో కొటిజేటి రోశయ్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఘనంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. అధికారులు, మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో తమిళనాడు గవర్నర్  రోశయ్య పాల్గొన్నారు.

09:49 - March 23, 2016

మెదక్‌ : జిల్లాలోని సిద్ధిపేట పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడుతోంది. రెండో రోజున 170 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అత్యధికంగా 98 నామినేషన్లు, బిజెపి నుంచి 10, ఎంఐఎం 7, టిడిపి తరపున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 30 మంది, సిపిఐ తరపున 3, బిఎస్‌పి 3, ఆర్‌పిపి 1, కాంగ్రెస్‌ తరపున 17 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 186 మంది నామినేషన్లు వేశారని ప్రత్యేక అధికారి రమణాచారి తెలిపారు. 

09:45 - March 23, 2016

'స్టార్స్ కంటే సదరు సినిమాలోని క్యారెక్టర్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తాన'ని అంటోంది నిత్యమీనన్‌. భిన్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన నిత్యమీనన్‌ పై కారణంతో మహేష్‌బాబు సినిమాలో నటించేందుకు అంగీకరించలేదట. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కూడా నిత్య మాదిరిగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సంగతి విదితమే. మహేష్‌బాబు, ఏ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో దాదాపు 100 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రం కోసం నిత్యని చిత్రయూనిట్‌ ఎప్రోచ్‌ అయినప్పుడు కథ విని, కథలో తన పాత్రకు సరైన ఇంపార్టెన్స్‌ లేకపోవడంతో ప్రాజెక్ట్‌ని రిజెక్ట్‌ చేసిందట. 'స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్లు తీసుకుని కేవలం పాటల్లో గ్లామర్‌ షో చేయడానికి మాత్రమే పరిమితం చేస్తారు. నా కెరీర్‌ ప్రారంభం నుండి ఓ నిబద్ధతతో ప్రయాణిస్తున్నాను. బలమైన కథ, కథనం, పాత్రల్లో విభిన్నత లేకపోతే ఎవరి సినిమానైనా సరే అంగీకరించను. ఇదే నిబద్ధతను ఇప్పటికీ పాటిస్తున్నాను' అని నిత్య కరాఖండిగా చెప్పింది.

09:35 - March 23, 2016

శ్రీకాంత్‌... శతాధిక చిత్రాల హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు. విలన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి అలరించిన శ్రీకాంత్‌ ప్రస్తుతం కీలక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. తాజాగా 'టెర్రర్‌'చిత్రంతో గ్రాండ్‌ సక్సెస్‌ని అందుకున్న శ్రీకాంత్‌ పుట్టినరోజు నేడు (బుధవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్‌ సినీ జీవిత ఆసక్తికర విశేషాలు....
కర్నాటకలో శ్రీకాంత్ జననం
కర్నాటకలోని కొప్పల్‌ జిల్లా గంగావతి గ్రామంలో 1968లో జన్మించారు. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంట్లో అబద్దం చెప్పి సినిమా అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగారు. 1990లో చెన్నైలోని మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌'తో నటుడిగా తెరంగేట్రం చేశారు. అందులో నక్సల్స్‌కి లీడర్‌గా నటించి ఆకట్టుకున్నారు. 
తొలుత విలన్‌గా  
తొలుత 13 చిత్రాల్లో విలన్‌గా నటించి, తమ్మారెడ్డి భరద్వాజ రూపొందిం చిన '1/2' చిత్రంతో హీరోగా మారారు. 'తాజ్‌ మహల్‌', 'ఎగిరే పావురమా', 'వినోదం', 'ప్రేయసి రావే', 'ఆహ్వానం', 'పండగ', 'ఆమె', 'పిల్ల నచ్చింది' వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1996లో 'పెళ్ళి సందడి' భారీ విజయంతో శ్రీకాంత్‌ కెరీరే మారిపోయింది. ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'తాళి', 'ఊయల', 'శుభలేఖలు', 'కన్యాదానం' సినిమాలతో హిట్‌, ఫ్లాప్‌ అనే తేడా లేకుండా తన అద్భుతమైన నటనతో అలరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' శ్రీకాంత్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. దీంతోపాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చేసిన 'స్వరాభిషేకం', బాపు దర్శకత్వంలో 'రాధాగోపాళం', 'శ్రీరామరాజ్యం', కృష్ణవంశీతో 'ఖడ్గం', 'మహాత్మా', 'గోవిందుడు అందరి వాడేలే' వంటి చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. ముఖ్యంగా 'ఖడ్గం', 'రాధా గోపాలం', 'ఆపరేషన్‌ దుర్యోదన', 'టెర్రర్‌' చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి ప్రశంసలందాయి. 1997లో విడుదలైన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో పరిశ్రమ నుంచి వెళ్ళిపోదామనుకున్నారు. ఈ విషయం తెలిసి చిరంజీవి శ్రీకాంత్‌కి స్ఫూర్తినిచ్చే అంశాల్ని చెప్పారు. ఆయనతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌లను ఆదర్శంగా తీసుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. 
మల్టీస్టారర్‌ చిత్రాల్లో 
ఓ వైపు హీరోగా చేస్తూనే 'శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్‌', 'శంకర్‌దాదా జిందాబాద్‌', 'ఖడ్గం', 'నిన్నే ప్రేమిస్తా', 'షాడో', 'శ్రీరామరాజ్యం', 'గోవిందుడు అందరి వాడేలే వంటి మల్టీస్టారర్‌ చిత్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌చరణ్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి 'సరైనోడు' చిత్రంలో నటిస్తున్నారు.
ఊహతో శ్రీకాంత్ వివాహం 
'ఆమె' చిత్రం సమయంలో ఊహతో ఏర్పడిన పరిచయంతో పెళ్ళి చేసుకున్నారు. వీరికి రోషన్‌, మేధ, రోహన్‌లున్నారు. రోషన్‌ ప్రస్తుతం నాగార్జున నిర్మిస్తున్న 'నిర్మల కాన్వెంట్‌' చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వతహాగా శ్రీకాంత్‌కు క్రికెటర్‌ కావాలన్నది కల. ఆ కల తీరకపోవడంతో రోషన్‌ని క్రికెటర్‌ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి అప్పుడప్పుడు సెలబ్రిటీ లీగ్‌ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. శ్రీకాంత్‌ తెలుగు సెలబ్రిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 
వంద సినిమాలు పూర్తి చేయడం సంతోషం : శ్రీకాంత్
'తక్కువ సమయంలోనే వంద సినిమాలు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేనేదో సాధించానని భావించడం లేదు. 100 చిత్రాల వరకు ప్రేక్షకులు నన్ను ఇష్టపడి చూశారనే సంతృప్తి ఉంది. ఇకపై కూడా ప్రేక్షకులు నాపై ఇలాగే ప్రేమాభిమానాలు కురిపిస్తారని నమ్ముతున్నా'.
- శ్రీకాంత్‌

 

09:29 - March 23, 2016

కార్తీ, సాయిపల్లవి నాయకానాయికలుగా మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఓకే బంగారం' తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని, ఇందులో కార్తీ.. ఫైలట్‌గా, సాయిపల్లవి... డాక్టర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించుకునే ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే రవివర్మన్‌ తన అద్భుతమైన ఫొటోగ్రఫీతో ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. కార్తీ నటించిన 'ఊపిరి' చిత్రం ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ ఈనెల 25న విడుదలవుతోంది. దీంతోపాటు హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమిళం చిత్రం 'కాష్మోరా'లో నటిస్తున్నారు. మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో సాయిపల్లవి పాపులరైన విషయం విదితమే.

 

నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరిన జగన్

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గోనున్నారు. 

ఓయూలో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ : ఓయూ లైబ్రరీ ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ లో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 

 

09:12 - March 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 

 

 

హెచ్ సీయూలో కొనసాగుతోన్న ఉద్రిక్తత

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

 

హైదరాబాద్ నేరేడ్ మెట్ ప్రగతి నగర్ లో దారుణం

హైదరాబాద్ : నేరేడ్ మెట్ ప్రగతి నగర్ లో దారుణ జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నడిరోడ్డుపై భర్త గణేష్ .. తన భార్య వరలక్ష్మీ తల పగలగొట్టి హత్య చేశాడు. 

 

కర్నూలు 4 వ పట్టణ పీఎస్ నుంచి నిందితుడు పరారీ

కర్నూలు : 4 వ పట్టణ పీఎస్ నుంచి నిందితుడు నాగేంద్ర పరారయ్యాడు. పలు అత్యాచారాలు, దోపిడీ కేసుల్లో నాగేంద్ర నిందితుడుగా ఉన్నాడు. 

08:49 - March 23, 2016

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, టీ.కాంగ్రెస్ నేత కె.మహేష్, ఎబివిపి నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. రోహిత్ మృతి ఘనటలో ప్రధాన నిందితుడుగా ఉన్న వీసీ అప్పారావును అరెస్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:43 - March 23, 2016

దేశం స్వాతంత్ర్యం కోసం ఉరికంభమెక్కిన భగత్ సింగ్ అందరికీ ఆదర్శనీయమని ఎస్ ఎఫ్ ఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి కొనియాడారు. ఆయన దేశం కోసం త్యాగం అమోఘమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఇవాళ భగత్ సింగ్ వర్ధంతి.  ఆయనను ఉరితీసి 85 ఏళ్లయ్యింది. ఆయన ఇప్పటికీ ధ్రువతారగానే వెలుగొందుతున్నారు. భగత్ సింగ్ కి ఎందుకంత క్రేజ్ వచ్చింది? వామపక్షవాదులు, ఆర్ ఎస్ఎస్ వాదులు, గాంధేయవాదులు, విప్లవకారులు ఇలా ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ను ఎందుకని అభిమానిస్తారు? భగత్ సింగ్ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:12 - March 23, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ప్రధాని నరేంద్రమోదితో సమావేశమయ్యారు. మోదితో జరిపిన భేటిపై మెహబూబా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు నేతల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్టు ముఫ్తీ పేర్కొన్నారు.  దివంగత ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఆశయం మేరకు ఉమ్మడి ఎజెండాను కొనసాగించడానికి ప్రధాని అంగీకరించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి కొత్త షరతులేవీ విధించలేదు. గతంలో ఇరుపార్టీలు నిర్ణయించిన ఒప్పందం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో గురువారం పిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పిడిపికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారు.

 

08:09 - March 23, 2016

హైదరాబాద్ : పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డవారే బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? పారిస్‌ దాడుల వ్యూహకర్త అబ్దెస్లామ్‌ను బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేయడంతోనే ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు దిగారా? ఈ ఘటన యూరప్‌ను నివ్వెర పరచింది.
ఉగ్రవాదుల్లో కొందరు బెల్జియంలోకి ప్రవేశం..?
పారిస్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొందరు బెల్జియంలోకి ప్రవేశించినట్టు నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పారిస్‌ ఉగ్రదాడుల ప్రధాన వ్యూహకర్త అబ్దెస్లామ్‌ నాలుగు రోజుల క్రితం పట్టుబడ్డాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఆత్మాహతిదాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి కూడా. ఎంత అప్రమత్తంగా వున్నప్పటికీ ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమని బెల్జియం ప్రధాని ఛార్లెస్‌ మైకెల్‌ అన్నారు. పటిష్టమైన భద్రత వుండే విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడటం అందర్ని కలవరపరుస్తోంది. 
బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌
బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 
శరణార్ధుల్లో అనేకమంది ఉగ్రవాదులు...? 
మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది యూరప్‌ దేశాలకు శరణార్ధులుగా వస్తున్నారు. వీరిలో అనేకమంది ఉగ్రవాదులున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. యూరప్‌లోని పలుదేశాల్లో ఉగ్రవాదులను నిలువరిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపుచేయలేకపోవడం గమనార్హం.
బ్రస్సెల్స్ లో విషాదం 
యూరోపియన్‌ యూనియన్‌ ముఖ్యకేంద్రమైన బ్రస్సెల్స్ లోనే ఉగ్రవాదులు రెండు చోట్ల దాడులకు పాల్పడటంతో అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయింది. వరుస బాంబు పేలుళ్లతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో విషాదం అలుముకుంది. ఎయిర్‌పోర్టులో రెండు చోట్ల, మెట్రోస్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో 34 మంది మృతి చెందారు.

 

07:55 - March 23, 2016

హైదరాబాద్ : పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈదిశగా వచ్చిన రెండు అవకాశాలను.. ఆపార్టీ సద్వినియోగం చేసుకోలేక పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా టీడీపీ గూటికి చేరిన తమ ఎమ్మెల్యేలపై వేటు పడేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా.. చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సమాయత్తమైంది.
టీడీపీ గూటికి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు  
పార్టీకి ఝలక్‌ ఇచ్చి పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఆపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాలకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జలక్ తో కంగుతిన్న వైసీపీ... ఫిరాయింపుదారులకు షాక్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. విప్‌ జారీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా వ్యూహం రచించింది. అయితే ఈ విషయాన్ని పసికట్టిన టిడీపీ...  ఫిరాయింపుదారులను సభకు గైర్హజరయ్యేలా చేసి విప్‌ వేటు నుంచి బయటపడేసింది. 
మరో అస్త్రాన్ని తెర మీదకు తెచ్చిన వైసీపీ
ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో... మరో అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది వైసీపీ. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. సభకు ఎమ్మెల్యేందరూ హాజరుకావాలంటూ విప్ జారీ చేసింది. అయితే.. అప్పుడు కూడా వెంటనే చర్చకు అనుమతించడం ద్వారా.. పాలక పక్షం.. వైసీపీ వ్యూహాన్ని దెబ్బతీసింది. వైసీపీ కోరిక మేరకు ఓటింగ్‌ జరపగా.. అవిశ్వాస తీర్మానం 40 ఓట్ల తేడాతో వీగిపోయింది. వైసీపీ, విప్‌ జారీచేసినా.. ఆప్రతిని ఎమ్మెల్యేలకు స్వయంగా అందించ లేకపోయింది. దీంతో వలస వెళ్లిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరైనా.. వారిపై అనర్హత వేటుకు డిమాండ్‌ చేయలేక పోయింది. 
వైసీపీ ముచ్చటగా మూడో అస్త్రం  
రెండు అవకాశాలు చేజారి పోవడంతో.. వైసీపీ ముచ్చటగా మూడో అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించాలని భావిస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో...   ద్రవ్యనియమ బిల్లు ఆమోదించే సమయంలో... ఓటింగ్‌కు పట్టుబట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఆఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు సార్లు పార్టీ వ్యూహాలు దెబ్బతిన్న కారణంగా..  ఈ సారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. విప్ లు అందలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పించుకునే అవకాశం లేకుండా... ఐదు రోజులు ముందుగానే విప్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు తప్పదనీ నమ్ముతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాన్ని.. పాలక పక్షం ఎలా ఎదుర్కుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 

నేడు ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ మహిళా జట్లు ఢీ

టీ.20 వరల్డ్ కప్ : ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ మహిళా జట్లు ఢీకొననున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరుగనుంది. 

నేడు జగన్ నెల్లూరులో పర్యటన

హైదరాబాద్ : నేడు వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి అనుచరులు వైసీపీలో చేరనున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

 

విద్యార్థులపై లాఠీచార్జ్ కు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులపై లాఠీచార్జ్ కు నిరసనగా ఎస్ ఎఫ్ ఐ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. 

07:31 - March 23, 2016

హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణా అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకానొక ద‌శ‌లో వ్యక్తిగత అరోప‌ణ‌ల‌కు సైతం సభ్యులు దిగారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. 
అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు
ఇసుక అక్రమ రవాణాపై శాస‌న మండ‌లిలో వాడివేడి చర్చ జరిగింది. నూత‌న ఇసుక విధానం, గ‌తంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి పీత‌ల సుజాత స‌మాధానం ఇచ్చారు.  అనుబంధ ప్రశ్నల్లో భాగంగా కాంగ్రెస్‌ స‌భ్యుడు, మండ‌లి విప‌క్ష నేత సి రామ‌చంద్రయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక అక్రమాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. 
రామచంద్రయ్య, సోమిరెడ్డి మ‌ధ్య వాగ్వాదం
ఐతే సంబంధిత శాఖకు చెందిన మంత్రి పీత‌ల సుజాత మండలిలోనే ఉన్నా వైద్య అరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు స‌మాధానం ఇచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని గ‌త ప్రభుత్వం అనుస‌రించిన విధానాల వల్లే స‌హజ వ‌న‌రులు లూటి జ‌రిగింద‌ని విమర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య, సోమిరెడ్డి మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. 
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు 
ఇసుక అంశంపై చర్చ తప్పుదోవ పడుతోందని  పీడీఎఫ్ స‌భ్యులు ఛైర్మన్‌ చక్రపాణి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉప‌ముఖ్య మంత్రి కేఈ కృష్ణ మూర్తి జోక్యం చేసుకుని...ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ఇసుక అక్రమార్కుల పాలు కాకూడదనే ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మొత్తానికి ఇసుక మాఫీయాపై మండలిలో హాట్‌హాట్‌గా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. 

 

07:23 - March 23, 2016

హైదరాబాద్ : జెఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ సంతాప సభలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వస్తున్నారు. కన్హయ్య రాక సందర్భంగా  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీ భారీ భద్రత ఏర్పాటు చేశారు. 
రోహిత్‌ సంతాప సభలో పాల్గొనున్న కన్హయ్య
ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌.. బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం.. హైదరాబాద్‌ యూనివర్సిటీలో నిర్వహించే వేముల రోహిత్‌ సంతాప సభలో ఆయన పాల్గొంటారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై తన భావాలను విద్యార్థులతో పంచుకుంటారు. ప్రధాని మోదీ పాలనలో విద్యావ్యవస్థ కాషాయీకరణమై పోతోందని కన్హయ్య ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. కన్హయ్య రాక సందర్భంగా.. వర్సిటీలోను.. పరిసర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. 
భారీ పోలీసు బందోబస్తు 
కన్హయ్యకుమార్‌ రాక సందర్భంగా హెచ్‌సీయూలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేముల రోహిత్‌ ఆత్మహత్య తర్వాత సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి రావడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కన్హయ్య వచ్చిన తర్వాత ఈ ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. అందుకే వర్సిటీకి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అయితే కన్హయ్య రాక వ్యవహారానికీ, తనకు ఎలాంటి సంబంధంలేదని వీసీ అప్పారావు చెబుతున్నారు. దేశద్రోహ నేరంపై అరెస్టై.. ఆరు నెలల బెయిల్‌పై వచ్చిన కన్హయ్యకు.. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనంగా ఆహ్వానించేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు భారీ ఏర్పాట్లు చేశారు. 

 

నేడు తమిళనాడులో అమిత్ షా పర్యటన

హైదరాబాద్ : నేడు తమిళనాడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా పర్యటన జరుగనుంది. 

ఉ.10 గం.లకు ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్ లో హోలీ వేడుకలు

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు ఎన్ టిఆర్ ట్రస్ట్భవన్ లో హోలీ వేడుకలు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 

 

Don't Miss