Activities calendar

24 March 2016

21:31 - March 24, 2016

జమ్మూ కాశ్మీర్‌ : ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ పేరు ఖరారైంది. శ్రీనగర్‌లో జరిగిన పిడిపి శాసససభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెహబూబా ముఫ్తిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. మెహబూబా ముఫ్తి జమ్ముకాశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. పిడిపి సమావేశానికి ముందు అనంత్‌నాగ్‌లో తండ్రి ముఫ్తి మహ్మద్‌ సయీద్‌ సమాధిని సందర్శించి మెహబూబూ నివాళులర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు పిడిపి చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శర్మలకు గవర్నర్‌ వోహ్రా లేఖ రాశారు. శుక్రవారం గవర్నర్‌తో వీరు భేటి కానున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదితో మెహబూబా జరిపిన సమావేశం అనంతరం జమ్ముకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. పిడిపి విధించిన కొత్త షరతులేవీ అంగీకరించడం లేదని బిజెపి స్పష్టం చేసింది.

21:28 - March 24, 2016

హైదరాబాద్ : ఈ నెల 26న తమ ఎదుట హాజరుకావాలని హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. హెచ్ సీయూ హాస్టళ్లలో భోజనం, నీటి సరఫరా నిలిపివేతపై హెచ్చార్సీ లో ఆప్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మానవ హక్కుల కమిషన్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు హెచ్ సీయూ విద్యార్థుల బెయిల్‌ పిటిషన్‌పై జరుగుతున్న విచారణను మియాపూర్‌ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  

21:27 - March 24, 2016

వరంగల్ : పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేసి సాగు నీరందిస్తామని.. దీని కోసం అధికారులు భూసేకరణను ముమ్మరం చేయాలన్నారు. మిషన్ కాకతీయ పనులు సక్రమంగా సాగేందుకు, టెండర్ల ప్రక్రియ త్వరతగతిన పూర్తయ్యేందుకు ఎప్పటికప్పుడు రివ్యూలు జరపాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

21:24 - March 24, 2016

విజయవాడ : రెండో విడత రైతు రుణమాఫీ రైతుల అకౌంట్స్ లో వేయటానికి రంగం సిద్ధం చేసినట్టు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ వర్తించని రైతులకు బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల నుంచి 10లక్షల వరకు వన్ టైమ్ సెటిల్ మెంట్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి లేకుండా ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రత్తిపాటి. మరిన్ని విషయాలకు వీడియోలో చూడండి. 

21:22 - March 24, 2016

విజయవాడ : దళితులు, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో ఇతరులతో సమానంగా ఎదిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితులు, గిరిజనులను సమాజంలోని మిగిలిన వర్గాలతో సమానంగా ఎదిగేలా..అంతరాలు తొలిగిపోయేలా చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సబ్‌ ప్లాన్‌ అమలు తీరుపై ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సబ్‌ప్లాన్‌ నిధులకు అదనంగా 60 శాతం నిధులు కేటాయిస్తున్నామని సీఎం తెలిపారు. అంబేద్కర్‌ 125వ జయంతిని పురష్కరించుకుని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మరింతగా కృషి జరపాలని సీఎం అన్నారు. ఇందుకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలు సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు అందించే అన్ని పథకాలను తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. 

21:20 - March 24, 2016

విజయవాడ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రాక సమయంలో విజయవాడలోని ఐవీ ప్యాలెస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్య అక్కడ నుంచి నేరుగా ఐవీ ప్యాలెస్‌కి చేరుకున్నారు. అయితే కన్హయ్య రాకను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలువురు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

21:19 - March 24, 2016

హైదరాబాద్ : దేశంలో ధనికులు, పేదల మధ్య తారతమ్యం తొలగిపోయే వరకు తన పోరాటం కొనసాగుతుందని జేఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ ప్రకటించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో కుల, మత వివక్ష అంతమయ్యే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. దేశంలో పెట్రేగిపోతున్న మతతత్వశక్తులను అడ్డుకునేందుకు ఐక్యపోరాటానికి అందరూ కలసిరావాలని హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో కన్హయ్య పిలుపునిచ్చారు. జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. హెచ్‌యూసీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ సంతాప సభలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన కన్హయ్య గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో ప్రసంగించారు.

స్పూర్తిదాయక ప్రసంగం..
ఎస్‌వీకేలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో కన్హయ్య స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. యువతలో నూతనోత్తేజాన్ని నింపేలా వివిధ అంశాలను ప్రస్తావించారు. పేదరికం నుంచి విద్యావ్యవస్థ కాషాయీకరణ వరకు అన్ని విషయాలను ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో మతతత్వశక్తుల ప్రాబల్యం నుంచి రాజకీయ జోక్యం వరకు దేశంలో జరుగుతున్న పరిణామాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదారవాద విధానాలతో కార్పొరేట్‌ శక్తులు చెలరేగిపోతున్నారని కన్హయ్య మండిపడ్డారు. దీంతో ధనికులు-పేదల మధ్య వత్యాసం పెరిగిపోతోందన్నారు. ఈ అంతరాలు తొలగిపోయే వరకు పోరాటం ఆగదంటున్నారు.

రోహిత్ ఆశయ సాధన కోసం కృషి..
హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఆశయసాధన కోసం అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరాన్ని కన్హయ్య గుర్తు చేశారు. రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకొచ్చే వరకు ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. హిందూ ధర్మానికి ప్రతీక, భారత సంస్కృతితో భాగమైన రాం.. రాం.. శబ్ధాన్ని జై శ్రీరాం.. అంటూ రాజకీయ నినదాంగా మార్చిన బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులపై కన్హయ్య మండిపడ్డారు. కుల, మతాల పేరుతో ప్రజలను చీల్చి...ఓట్లు అడగడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారిందని కన్హయ్య విమర్శించారు. వివేకానందుడు జీవించివున్న దీనికి మద్దతు ఇచ్చేవారు కాదన్నారు. మహనీయుల బాటలో నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన కన్హయ్య కుమార్‌ మనువాద సంస్కృతి నుంచి దేశం విముక్తి పొందాలంటున్నారు. ఆద్యంతం అందర్నీ ఆకట్టుకునేలా సాగిన కన్హయ్య ప్రసంగం చివర్లో ఆజాదీ నినాదాలతో ముగిసింది. వేదికపై ఉన్న అతిధులతోపాటు, సదస్సు హాజరైన వారంతా కన్హయ్యతో శృతి కలిపారు. 

20:42 - March 24, 2016

మార్చ్ నెలలోనే ఎండలు మండుతున్నాయి. మరి ఏప్రిల్ మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించటానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉదయం పది దాటితే బయటికి రావటానికి భయపడాల్సి వస్తోంది. చాలా చోట్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నిప్పులు చెరుగుతోంది. అంతే కాదు ఈ ఏడాది ఎక్కువ ఎండలు ఎక్కువ వర్షాలు ఉంటాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులకు కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు... కోస్తా జిల్లాలు.. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలు ఎండల్లో భగ భగ మండతున్నాయి. మార్చ్ నెలాఖరుకే ఈ పరిస్థితి ఏర్పడటంతో సామాన్య ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు. వచ్చే మూడు నెలల్లో జనజీవనానికి ఎన్ని అడ్డంకులు ఏర్పడుతాయా అనే ఆందోళన నెలకొంది.
ఎల్ నినో అంటే ఏమిటి? లానినో అంటే ఏమిటి?
పారిశ్రామిక అవసరాలు, రవాణా కోసం శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడం వల్ల వాతావరణంలో కార్బన్-డై ఆక్సైడ్‌, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ వంటి వాయువుల సాంద్రత పెరిగిపోతోంది. ఈ వాయువులు భూమి మీద పొరలాగా ఏర్పడి సూర్యుడి వేడిని పట్టి వుంచడం భూగోళాన్ని వేడెక్కిస్తోంది.. ఇదే గ్లోబల్ వార్మింగ్.. ఇదే ఇప్పుడు వాతావరణంలో అనేక మార్పులకు కారణమౌతోంది. జనాభా పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. సహజ వనరుల వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఇప్పుడు మనుష్యులు లేరు. కేవలం కన్స్యూమర్స్‌, ప్రొడ్యూసర్స్‌, బ్రోకర్స్ మాత్రమే ఉన్నారు. కన్స్యూమరిజాన్ని అలవాటు చేసే పెట్టుబడిదారీ వ్యవస్థ అన్ని రకాలుగా విధ్వంసానికి కారణమవుతోంది. నీతులు వల్లించటం, సదస్సులు పెట్టి ప్రపంచానికి సందేశాలివ్వటం తప్ప అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్నదేం లేదు. ఎవరో చేసిన తప్పుకు వర్థమాన దేశాలు శిక్షను అనుభవిస్తున్నాయి. ఎల్ నినోలు, లా నినో ల రూపంలో వాతావరణ సమస్యలు ఆయాదేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరగాల్సి ఉంది. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి. 

20:29 - March 24, 2016

అరె రామా.. ఈ కమలం పరందామయ్యలకు ఎంత జెప్పినా అర్థమైపాడైతలేదు..మొగులు మీదికెళ్లి ఎండను జంపికొడ్తున్న సూర్యుడు గూడ రాజకీయం జేస్తున్నాడంట..ప్రజలను ముంచిన ఓ మోసగాడు..హోలీ పండుగ నాడు అస్సల్ ఆట.. గొంగిడి సునితక్క.. శిలా పల్కలు పాతుకుంట.. పర్ధలు గుంజుకుంట వొస్తుంటె.. కొందరు పాతిన జెర్ర శేపట్కే పట్ట పట్ట కూలగొడ్తున్నరట..ఉష్కె మాఫియ..ఇటు సామాన్యులకు అటు సర్కారు ఆపీసర్లకు పెద్ద పర్షానే ఉన్నది దీన్తోని..ఊరి నౌకర్ని కట్టెతోని కొట్టిన తాసిల్దార్..తదితర అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న ముచ్చట్లు చెప్పాడు. మరి ఆ ముచ్చట్లు చూడాలంటే వీడియో చూడండి. 

20:23 - March 24, 2016

పశ్చిమగోదావరి : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ దందా సాగిపోతోంది.. దర్జాగా వందలాది లారీల మట్టి వేరే ప్రాంతాలకు తరలిపోతోంది.. డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్న మట్టిమాఫియా లక్షలు సంపాదిస్తోంది.. చెరువులను నిర్జీవంగా మారుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి పరిసరప్రాంతాల్లో మట్టిమాఫియా రెచ్చిపోతోంది.. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చెరువుల్ని తవ్వుతూ భారీ వ్యాపారం చేస్తోంది.. ఒకప్పుడు పచ్చని పరిసరాలు, నీటితో కళకళలాడే కొండుప్రోలు గ్రామ చెరువు ఈ మాఫియా రాకతో జీవం కోల్పోయింది.. 15 జేసీబీలు, ప్రొక్లెయనర్లతో రాత్రి, పగలు తేడాలేకుండా ఇక్కడ తవ్వుతూనే ఉన్నాయి. ఇలా తీసిన మట్టిని వెయ్యి నుంచి 14వందల రూపాయలకు అక్రమార్కులు అమ్మేసుకుంటున్నారు. ఇలా రోజూ 300 లారీలను మట్టిపనికోసం వినియోగిస్తున్నారు.

పంచాయతీకి రాని సమాచారం..
నిబంధనల ప్రకారం గ్రామపంచాయితీ తీర్మానం లేకుండా మట్టి తీసుకోవడానికి వీలులేదు.. అయినా పట్టించుకోని మాఫియా పంచాయితీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పని పూర్తిచేస్తున్నారు.. లారీలకొద్దీ మట్టి తరలించుకుపోతున్నారు.. ఇలా వందలాదిలారీల రాకపోకలతో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారుతున్నాయి.. పెద్దసంఖ్యలో వాహనాల రాకతో ప్రమాదాలుకూడా పెరిగాయి.. కొద్దిరోజులక్రితం ఈ మట్టి లారీ ఢీకొని స్కూల్‌ విద్యార్థి గాయపడింది. టెన్‌ టీవీ ద్వారా మట్టి దందా విషయం తెలుసుకున్న తహశీల్దార్... అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

20:19 - March 24, 2016

అమ్మరె కొడ్క.. మొగులు మీదికెళ్లి ఎండను జంపికొడ్తున్న సూర్యుడు గూడ రాజకీయం జేస్తున్నడంటే నమ్ముతరా మీరు.. మన తెలంగాణ రాజకీయాలళ్ల సూర్యభగవానుడు ఏలువెట్టనే వెట్టిండ్రు.. ఏకంగ నగర పంచాది చైర్మన్ పోస్టుకు ఎసరు వెట్టిండంటే.. సూర్యుడు ప్రతాపం జూడుండ్రి.. ఇది మజాక్ అనిపిస్తుండొచ్చుగని.. కాదు కాదు.. ఈ శెమ్టమీదొట్టు.. సూర్యుడు ఎంత పని జేశిండు వీడియోలో సూడుండ్రి.

ఏప్రిల్ 4న తెలంగాణ ఐటీ విధానం - కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధానాన్ని ఏప్రిల్ 4న ప్రకటించనున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ తో పాటు ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఐటీ విధానాన్ని ప్రకటిస్తారని తెలిపారు. 

20:03 - March 24, 2016

విజయవాడ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు..మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. అచ్చే దిన్ ఎక్కడున్నాయని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో నిర్వహించిన సభలో ఉద్దేజపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీకి కన్హయ్య పలు ప్రశ్నలు సంధించారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మౌన ముని అని విమర్శించే వారని, ప్రస్తుతం మోడీ ఫ్లైట్ మోడ్ లో ఉంటున్నారని దీనిని ఏమనాలని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ప్రధాని ఏఏ ప్రాంతాల్లో ఏఏ హామీలిచ్చారో పరిశీలించాలి అని తెలిపారు.
బడ్జెట్ లో కేవలం ఐదు శాతం ప్రజా సంక్షేమానికి కేటాయించారని, ఏడు శాతం ప్రజాపయోగమైన కార్యక్రమాలకు వినియోగించారని..మరి మిగిలిన బడ్జెట్ మొత్తం ఎవరి కోసం కేటాయించారని ప్రశ్నించారు.
ప్రజలతో బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించిన మోడీ అలా సమకూరిన డబ్బును ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. 

కన్హయ్య అంటే వణికిపోతున్నారు - సీపీఎం..

విజయవాడ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ అంటే బీజేపీ నేతలు వణికిపోతున్నారని, అందుకే కన్హయ్య ఎక్కడకు వెళ్లినా అడ్డుకోవాలని చూస్తున్నారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. స్టూడెంట్స్ ను చూసినా, స్టూడెంట్ యూనియన్ లీడర్లను చూసినా ప్రధాని మోడీకి గుండె దడగా ఉందన్నారు. 

ముగిసిన సిద్ధిపేట నామినేషన్ల పరిశీలన..

మెదక్: సిద్దిపేట పురపాలక ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 577 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బరిలో 315 మంది అభ్యర్థులు ఉన్నారు. 

పీడీపీ శాసనసభాపక్ష నేత గా ముఫ్తీ..

జమ్మూ కాశ్మీర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టడం ఇక లాంఛణప్రాయమే అని తెలుస్తోంది. 

ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ప్రకాశం : జిల్లాలో చిన్నకొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పంట పొలాల్లోకి కారు దూసుకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 

మోడీ పాలనలో మంచి రోజులు కరవు - కన్హయ్య..

విజయవాడ : ప్రధాన మంత్రి మోడీ పాలనలో మంచి రోజులు కరవయ్యాయని జేఎన్ యూ నేత కన్మయ్య కుమార్ విమర్శించారు. సమాజంలో దళితులుగా పుట్టడమే తప్పా అని ప్రశ్నించారు. హెచ్ సీయూలో దళిత విద్యార్థి ఎదుగదలను భరించలేకపోయారని, రోహిత్ వేముల ఆత్మబలిదానం వృధా కాదన్నారు. 

రేపు గవర్నర్ తో ముఫ్తీ భేటీ..

జమ్మూ కాశ్మీర్ : రేపు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ తో మెహబూబా ముఫ్తీ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముఫ్తీ సంసిద్ధత వ్యక్తం చేశారు.

 

వీసీ అప్పారావుకు హెచ్చార్సీ ఆదేశం..

హైదరాబాద్ : హెచ్ సీయూ హాస్టళ్లలో భోజనం, నీటి సరఫరా నిలిపివేతపై హెచ్చార్సీలో ఆప్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈనెల 26వ తేదీన హాజరు కావాలని వీసీ అప్పారావుకు హెచ్చార్సీ ఆదేశించింది. 

ఫేస్ బుక్ హీరో ఉదయ్ కిరణ్ అరెస్టు...

హైదరాబాద్ : 'ఫేస్ బుక్' సినిమా హీరో ఉదయ్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తాగి దస్పల్లా హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డాడు. హోటల్ అద్దాలను ధ్వంసం చేసి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హొటల్ మేనేజ్ మెంట్ ఫిర్యాదుతో ఉదయ్ కిరణ్ పై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్ లోనూ మద్యం మత్తులో ఉదయ్ కిరణ్ చిందులేశారు. గతంలోనూ డ్రగ్ కేసులోనూ ఉదయ్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

విద్యార్థుల బెయిల్ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థుల బెయిల్ పిటిషన్ పై మియాపూర్ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. 

18:59 - March 24, 2016

విజయవాడ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. మోడీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఉత్తేజపూరితంగా జరిగిన ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

 • రోహిత్ వేముల ఆత్మబలిదానం వృధా కాదు.
 • రోహిత్ ప్రారంభించిన పోరాటాన్ని ముందుకు తీసుకెళుతాం.
 • రోహిత్ తల్లికి న్యాయం జరగాలి.
 • యూనివర్సిటీలో జాతివాదం నశించాలి.
 • రోహిత్ చట్టం తెచ్చే వరకు పోరాడుదాం.
 • యూనివర్సిటీలో కుల వివక్ష నశించాలి.
 • దళిత విద్యార్థి ఎదుగుదలను ఓర్చుకోలేకపోయారు.
 • ప్రజల పైసతో జేఎన్ యూ విద్యార్థులు చదువుకుంటున్నారు. నేతల దయాదాక్షిణ్యాలతో నడవడం లేదు.
 • ఆర్ఎస్ఎస్ విధానాలు ఏమీ మారలేదు.
 • పీఎస్ డబ్బులను కూడా దోపిడి చేసే ప్రయత్నం.
 • మోడీ చెప్పిన మంచి రోజులు ఎక్కడ పోయాయి.
 • మోడీ అజెండాను పక్కకు పెట్టి మత ఎజెండా తెస్తున్నారు.
 • మనువాదాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం.
 • దేశాన్ని మోడీస్థాన్ చేయాలని అనుకుంటున్నారు.
 • దేశమంటే మోడీ ఒక్కరిదే కాదు..కోట్లాది మంది జనం.
 • చాయివాలా కొడుకు అని చెప్పుకొనే మోడీ లక్షల సూటు వేసుకుంటున్నారు.
 • అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి మతతత్వ ఎజెండాను తెస్తున్నారు.
 • డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇక్కడ మోడీ ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆలోచించాలి.
 • దేశభక్తి పక్షాన నిలబెడుతాం.
 • బ్రాహ్మణవాదం..జాతీయ వాదాన్ని ఉరి చేస్తాం.
 • పేద పొట్ట కొట్టి పెద్దలకు సబ్సిడీ ఇస్తున్నారు.
 • లోక్ తంత్రం, న్యాయ పక్షాన ఉన్నాం. 

మోదీ ప్రజలను 'ప్రజలను వైబ్రేషన్ మోడ్' వుంచారు: కన్హయ్య

విజయవాడ : ఐవీ ప్యాలెస్ లో యువజన శంఖారావ సభలో ప్రారంభమయ్యింది. హెచ్ సీయూలో పీహెచ్ డీ స్కాలర్ విద్యార్ధి రోహిత్ వేములకు సభ సంతాపం తెలపింది. అనంతరం సభలో కన్హయ్య మాట్లాడుతు మోదీ 'ఫ్లైట్ మోడ్' లో వుంటూ ప్రజలను 'వైబ్రేషన్ మోడ్' లో వుంచారంటు మోదీపై కన్హయ్య విమర్శనాస్త్రాలను సంధించారు. దళిత విద్యార్థి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకుని కూడా చదువు పూర్తి చేయలేని పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని రోహిత్ తల్లికి హామీ ఇచ్చామన్నారు.

18:34 - March 24, 2016

విజయవాడ : దేశంలో అచ్చే దిన్ ఎక్కడా అని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. ఐవీ ప్యాలెస్ లో 'విద్యార్థి యువజన శంఖారావం' కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. అనంతరం హిందీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..మోడీ..వెంకయ్య నాయుడులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లోనే...
''నాకు తెలుగు రాదు..హిందీలో మాట్లాడాలా ? ఇంగ్లీషులో మాట్లాడాలా ? తెలంగాణ, ఏపీ ప్రజలు జేఎన్ యూ, రోహిత్ వేముల నిలబడినందుకు జేఎన్ యూ తరపున అభినందనలు. కృతజ్ఞతలు. మీడియా కూడా తప్పు..ఒప్పులను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. జైలు విడుదలైన అనంతరం విశాలాంధ్ర...తెలంగాణ భూమి మీద అడుగు పెట్టాలని తాను నిర్ణయించుకోవడం జరిగింది. వేయి సంవత్సరాల తరువాత కూడా దళిత వ్యక్తిగా జన్మించడం తప్పా అని రోహిత్ ప్రశ్నించాడని తెలిపారు. బుధవారం తాను రోహిత్ వేముల తల్లిని కలవడం జరిగింది. రోహిత్ ఆశయాన్ని ముందుకు తీసుకెళుతామని చెప్పడం జరిగింది. జాతీయవాదం, మనువాదం తరిమికొడుతామని ఈ సందర్భంగా ఆమెకు హామీనిచ్చాను. దళితుడు విద్యాలయంలో సీటు సంపాదించినా చదువులేకపోతున్నాడు. తన ప్రసంగం.. చూడటానికి ఇక్కడకు రాలేదు. ఢిల్లీలో జరిగే ఆందోళన విజయవాడలో ఉన్న వారు అర్థం చేసుకుంటున్నారు. లోక్ తంత్రం కాపాడటానికి వచ్చారు. విశ్వ విద్యాలయంలో జరుగుతున్న పరిణామాలను అడ్డుకోవడానికి పోరాటం చేస్తున్నాం. 

ప్రజలను వైబ్రేషన్ మోడ్ లో ఉంచారు...
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గతంలో మౌనముని అన్నారు. ప్రస్తుతం మోడీ లైట్ మోడ్ లో ఉంటూ ప్రజలను వైబ్రేషన్ మోడ్ లో ఉంచారు. కానీ యువత వైబ్రైషన్ చేస్తే కుర్చీ కదులుతుంది. మోడీ గతంలో ఎన్నో హామీలు గుప్పించారు. అచ్చే దిన్..అన్నారు. ఎప్పుడొస్తాయి ? నిత్యావస వస్తువుల ధరలు తగ్గిస్తాం..అత్యాచారాలు జరగనివ్వమని చెప్పారు.. ఇవన్నీ జరుగుతున్నాయా ? స్వచ్ఛ భారత్ అంటే ఏమిటీ ? పేద ప్రజలు మురికవారని ప్రభుత్వం యోచిస్తోంది. పన్నుల రూపంలో దోపిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉన్నత విద్యపై 17 శాతం కోత..
చదువుకోవాలని..రాజనీతి వద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచనలు చేశారు. మరి 30 సంవత్సరాల కిందట ఈ ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది. గతంలో విద్యార్థి నేతగా ఉన్న నాయుడు ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్నారు. సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ఉన్నత విద్యపై 17 శాతం కోత విధించింది. మధ్య తరగతి..సామాన్య వాసులపై అణిచివేస్తున్నారు. వారి భారత మాతా సుందరంగా ఉంటుంది. కానీ తమ భారత మాత ఎంతో కష్టంగా, హృద్యంగా కనబడుతుంది. వ్యవసాయం చేసే మహిళ..చదువు చెప్పే మహిళ..విమానంలో ఉండే మహిళ భారతా మాతాయే''. అని రోహిత్ పేర్కొన్నారు. 

ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్....

విజయవాడ : ఐవీ ప్యాలెస్ లో యువజన శంఖారావం సభకు జేఎన్ యూ విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్ హాజరయ్యారు. కన్హయ్య ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు. కన్హయ్య వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ సంస్థలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర శక్తుల నినాదాలు. ఆర్ఎస్ఎస్ , ఏబీవీపీ నాయకులను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

18:15 - March 24, 2016

విజయవాడ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచె కట్టుకొని రావద్దని...ప్యాంటు వేసుకుని రావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి ఆరుడుగులు ఉంటాడని..కానీ కన్హయ్య మాత్రం జానెడు మాత్రమే ఉంటాడని..మరి కన్హయ్యకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఐవీ ప్యాలెస్ లో 'విద్యార్థి యువజన శంఖారావం' కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా 'సెక్యూలరిజం..డెమోక్రసీ' పుస్తకాన్ని సీపీఐ నేత నారాయణ ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని కన్హయ్యకు అందచేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సమావేశాలు పెట్టుకొంటే అడ్డుకొనే నీచ సంస్కృతికి బీజేపీ దిగజారిందని ఘాటుగా విమర్శించారు. ఫాసిస్టు పాలన వచ్చేది ఖాయమని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బావిలో కప్పలాగా బెక బెకలాడుతుంటారని విమర్శించారు. సమావేశం నిర్వహించకుండా ఉండేందుకు బీజేపీ నాయకులు, వెంకయ్య శిష్యులు రద్దు చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక మీదట సభలు పెట్టుకోరా అంటూ వెంకయ్య నాయుడునుద్దేశించి వ్యాఖ్యానించారు. పంచెకట్టుకుని వస్తే ఊడకొడుతారు అని నారాయణ పేర్కొన్నారు. 

బీజేపీ-వామపక్ష నాయకుల ఘర్షణ..

విజయవాడ : ఐవీ ప్యాలెస్ వద్ద జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నేతలు, ఏఐఎస్ఎఫ్ నేతలు ఏబీవీపీ కాక్యకర్తలను అడ్డుకున్నారు. బీజేపీ, వామపక్ష నేతలకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. సభాస్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.

17:54 - March 24, 2016

విజయవాడ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ఐవీ ప్యాలెస్ కు చేరుకున్నారు. ఆయన వెంట సీపీఐ నేత నారాయణ ఉన్నారు. కన్హయ్యను అడ్డుకోవడానికి కాషాయ మూకలు అడుగడుగునా ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలను వామపక్ష వాదులు, ప్రజాతంత్ర వాదులు తిప్పికొట్టారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేశద్రోహం కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన కన్హయ్యను విజయవాడకు ఎలా రానిస్తారని, ఇందుకు పోలీసులు ఎలా అనుమతినిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న సభను అడ్డుకోవద్దని, అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వామపక్ష నేతలు హెచ్చరించారు.

 • హైదరాబాద్ పర్యటన ముగించుకున్న కన్హయ్య గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కన్హయ్యకు వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
 • అనంతరం ఐవీ ప్యాలెస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 • కన్హయ్య సభను అడ్డుకోవడానికి ఐవీ ప్యాలెస్ వద్దకు వచ్చిన కాషాయ మూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 • హైదరాబాద్ లోని ఎస్వీకేలో కూడా కన్హయ్యపై కొందరు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.
 • కన్హయ్య ఆవేశపూరిత ప్రసంగాలు చేయోద్దని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
 • పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపి నాయకులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 

ఐవీ ప్యాలెస్ చేరుకున్న కన్హయ్య కుమార్...

విజయవాడ : జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నగరంలోని ఐవీ ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. వామపక్ష నేతలు, ప్రజాతంత్ర నేతలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికారు.

ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : నగరంలోని ఐవీఎస్ ప్యాలెస్ లో జరిగే సభలో జేఎన్ యూ నేత కన్హయ్య పాల్గొననున్నారు. కన్హయ్య సభను అడ్డుకుంటామని బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నేతల హెచ్చరికలతో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు పహారా కాస్తున్నారు. సభా వేదిక వద్దకు ఇద్దరు బిజెపి అనుబంధ కార్యకర్తలు రావడంతో వారిని పోసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సభావేదిక వద్ద ఉద్రికత్త నెలకొంది.

17:39 - March 24, 2016

విజయవాడ : కాషాయ మూకల్లారా ఖబడ్దార్ అంటూ వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. కన్హయ్య రాకను వ్యతిరేకిస్తున్న కాషాయ మూకలు సభా ప్రాంగణానికి చేరుకోవడంతో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం కన్హయ్య కుమార్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సభ నిర్వహించే ఐవీ ప్యాలెస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనితో సభను అడ్డుకోవడానికి కాషాయ మూకలు ప్రయత్నాలు చేపట్టాయి. సభా ప్రాంగణానికి బీజేపీ నేతలు, మహిళా మోర్చ నేతలు చేరుకున్నారు. అక్కడనే మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దేశద్రోహం కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన కన్హయ్యను విజయవాడకు ఎలా రానిస్తారని, ఇందుకు పోలీసులు ఎలా అనుమతినిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న సభను అడ్డుకోవద్దని, అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వామపక్ష నేతలు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

17:34 - March 24, 2016

విజయవాడ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కు ఎందుకు భయపడుతున్నారని సీపీఎం నేత వైవీ ప్రశ్నించారు. కాసేపట్లో ఐవీ ప్యాలెస్ కు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ రానున్నారు. ఈసందర్భంగా టెన్ టివితో వైవీ, వామపక్ష నేతలు మాట్లాడారు. రోహిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని, పలు ప్రజా సంఘాల ఆహ్వానం మేరకు విజయవాడకు వస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, సమావేశాలు విచ్చిన్నం చేయడం సభ్యత కాదన్నారు. బీజేపీకి ఇక్కడ శక్తి..బలం లేదని మరో వామపక్ష నేత పేర్కొన్నారు. కేంద్రం అండ తీసుకుని ఇక్కడ అల్లర్లు..చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఏమీ సాధించలేరని హితవు పలికారు. 

26న హెచ్ ఆర్సీ ముందుకు వీసీ అప్పారావు

హైదరాబాద్ : హెచ్ సియూ లో బుధవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో హెచ్ సియూ హాస్టల్ లో భోజనం, నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సమస్యలపై ఆప్ నేతలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో వీసీ అప్పారావును 26 న హాజరు కావాలని హెచ్ ఆర్సీ ఆదేశించింది.

17:26 - March 24, 2016

రంగారెడ్డి : క్షణికావేశాలు..మానసికంగా కృంగిపోవడం..ఇతరత్రా కారణాల వల్ల పలువురు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. అంతేగాకుండా తమ వారిని జీవితాలను కూడా మధ్యలోనే తుంచేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని తాండూరు మండలం జినగుర్తిలో విషాదం చోటు చేసుకుంది. సత్య విజయ్ కుమార్ అనే యువకుడు కుటుంబసభ్యులతో జినగుర్తిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తల్లి, చెల్లెలు, సోదరుడిపై విజయ్ కిరోసిన్ పోసి నిప్పటించాడు. అనంతరం తాను నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో తల్లి, చెల్లెలు, విజయ్ కుమార్ మృతి చెందగా సోదరుడు గాయలతో బయటపడ్డాడు.
విజయ్ కుమార్..భార్య మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఇటీవలే భార్య విజయ్ పై కేసు కూడా పెట్టింది. మరోవైపు భర్త వదిలేయడంతో సోదరి కూడా ఇంటి వద్దే ఉంటోంది. కుటుంబ పరిస్థితులకు మానసికంగా కుంగిపోయిన విజయ్ కుమార్ ఈ ఘటనకు పూనుకున్నాడు. కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

17:16 - March 24, 2016

విజయవాడ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ విజయవాడపై అడుగు పెట్టారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కన్హయ్యను అడ్డుకుంటామని ముందే హెచ్చరించిన కాషాయ మూకలు అనుకున్నట్లుగానే చేస్తున్నారు. కన్హయ్య సభా వేదిక వద్ద ఉన్న నలుగురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేగింది. వీరిని వెనక్కి తిరిగి వెళ్లాలని సూచించినా వెళ్లకపోవడంతో బీజేపీ యువమోర్చ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కన్హయ్యకు ఘన స్వాగతం..
మరోవైపు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కన్హయ్య కుమార్ కు ఘన స్వాగతం లభించింది. విద్యార్థి యువజన సంఘం నాయకులు, ప్రజా సంఘాల నేతలు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. సభ జరిగే ఐవీ ప్యాలెస్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అయితే పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జాతీయ వాదానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసంగించాలని ఆంక్షలు విధించారు. అదే విధంగా రెచ్చగొట్టే ప్రసంగం చేయరాదని పోలీసులు సూచనలు చేశారు. కన్హయ్య కుమార్, బీజేపీ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పలు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. 

ఐవీ ప్యాలెస్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘ నేతల పహారా

విజయవాడ : నగరంలోని ఐవీఎస్ ప్యాలెస్ లో జరిగే సభలో జేఎన్ యూ నేత కన్హయ్య పాల్గొననున్నారు. కన్హయ్య సభను అడ్డుకుంటామని బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నేతల హెచ్చరికలతో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు పహారా కాస్తున్నారు. సభా వేదిక వద్దకు ఇద్దరు బిజెపి కార్యకర్తలు రావడంతో వారిని పోసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విజయవాడ కు కన్హయ్య

విజయవాడ: నగరంలోని ఐవీ ప్యాలెస్ లో జరిగే సభలో పాల్గొనేందుకు జేఎన్ యూ నేత కన్హయ్య విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టునుండి విజయవాడకు భారీ ఊరేగింపు మధ్య ఐవీ ప్యాలెస్ కు చేరుకోనున్నారు. కన్హయ్య పర్యటన నేపథ్యంలో ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నాయకులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు షేన్ వాట్సన్ గుడ్ బై..

ఢిల్లీ : ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు త్వరలో గుడ్ బై చెప్పనున్నాడు. టీ-20 వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

16:13 - March 24, 2016

హైదరాబాద్ : నగరంలోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జరుగుతున్న సభలో కాషాయ కూటములు అలజడి సృష్టించాయి. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో ఆయన ఆశయ సాధన కోసం ప్రజా సంఘాలు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు చేపట్టాయి. సభలో పలువురు వక్తలు ప్రసంగించిన తర్వాత జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్ ప్రసంగం మొదలుపెట్టారు. ఇంతలో గోరక్షా దళ్‌ కార్యకర్తలు సభలోకి చొచ్చుకొచ్చారు. కన్హయ్యకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు సృష్టిస్తూ గందరగోళం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై సైతం దాడికి పాల్పడి కెమెరా స్టాండ్లను విరగ్గొట్టారు. సదస్సులో ఉన్న ఇతర విద్యార్థి సంఘాల నేతలు గోరక్షాదళ్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు కలగజేసుకుని అలజడి సృష్టించినవారిని అదుపులోకి తీసుకున్నారు. గోరక్షాదళ్‌ కార్యకర్తలను అరెస్ట్ చేసి హాల్‌లోంచి వెలుపలకి తరలించారు. నిరసనకారులను బయటకు తరలించడంతో తిరిగి సదస్సు ప్రారంభమైంది. 

ఎర్రచందనం స్మగ్లింగ్ .. కొత్తచట్టం: డీజీపీ రాముడు

కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు త్వరలో కొత్త చట్టం వస్తోందని డీజీపీ రాముడు తెలిపారు. ఎర్రచందనం స్మగర్లకు 5 నుంచి 10ఏళ్లు జైలు శిక్ష తో పాటు రూ.10లక్షల జరిమానా వంటి కఠిన శిక్షలు విధస్తామని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండ తీవ్రత

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్,నంద్యాల కర్నూలు, అనంతపురంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. భద్రాచలం, హన్మకొండ, మెదక్, నల్లగొండ, కడప, తిరుపతి, నందిగామ లో 41, హైదరాబాద్, రామగుండంలో 40, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

15:48 - March 24, 2016

కోల్ కతా : 2016 టీ-20 ప్రపంచకప్ సెమీస్ కు 4వ ర్యాంక్ న్యూజిలాండ్ చేరుకొంది. గ్రూప్ - బీ లీగ్ లో మూడుకు మూడు మ్యాచ్ లూ నెగ్గడం ద్వారా నాకౌట్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో రౌండ్ పోటీలో..మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా..ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ఈనెల 26న తలపడుతుంది. 

తొలి జట్టు...
భారత్ వేదికగా తొలిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరిన తొలిజట్టు ఘనతను నాలుగో ర్యాంకర్ న్యూజిలాండ్ సొంతం చేసుకొంది. టాప్ ర్యాంకర్ టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి హేమా హేమీజట్లున్న పూల్- బీ లీగ్ లో...న్యూజిలాండ్ వరుసగా మూడో విజయం సాధించడం ద్వారా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది. గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య టీమిండియాను, రెండో రౌండ్ పోటీలో ఆస్ట్రేలియాను కంగుతినిపించిన న్యూజిలాండ్ కు మూడోరౌండ్లో సైతం ఎదురేలేకపోయింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో..మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను 22 పరుగుల తేడాతో కివీటీమ్ చిత్తు చేసింది.

5 వికెట్లకు 180 పరుగులు..
ఈ కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గి..ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 48 బాల్స్ లో 10 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిడిలార్డర్ ఆటగాడు రోస్ టేలర్ 36 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. అంతేకాదు న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ గప్తిల్- కేన్ విలియమ్స్ సన్..మొదటి వికెట్ కు 7.2 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీ-20 క్రికెట్లో మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం సాధించడం.. గప్తిల్- విలియమ్స్‌ సన్ జోడీకి ఇది 10వసారి. 174.53 స్ట్రయిక్ రేట్ తో 80 పరుగులు సాధించిన గప్టిల్..పాకిస్థాన్ ప్రత్యర్థిగా మొత్తం 376 పరుగులు సాధించడం విశేషం.

పాక్ దూకుడుకు పగ్గాలు..
పాక్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ, కెప్టెన్ ఆఫ్రిదీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కివీ మిడిలార్డర్ ఆటగాళ్లు మున్రో, కోరీ యాండర్సన్ లను అవుట్ చేయడం ద్వారా...టీ-20 ప్రపంచకప్ లో ఆఫ్రిదీ పడగొట్టిన వికెట్ల సంఖ్య 39 కి చేరింది. 181 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన పాకిస్తాన్..20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షర్జీల్ ఖాన్ 47 పరుగుల స్కోరుతో మెరుపులు మెరిపించినా ప్రయోజనం చేయలేకపోయింది. విజయం సాధించాలంటే ఆఖరి ఐదు ఓవర్లలో 11.60 సగటు రన్ రేట్ తో పరుగులు సాధించాల్సిన పాక్ జట్టు కనీసం ఒక్క బౌండరీ కూడా చేయలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు, ఫీల్డర్లు సమన్వయంతో రాణించి పాక్ దూకుడుకు పగ్గాలు వేయడంలో సఫలమయ్యారు. కివీ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మిల్నీ, లెఫ్టామ్ స్పిన్నర్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మార్టిన్ గప్తిల్ కెరియర్ లో ఇది 7వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. న్యూజిలాండ్ జట్టు...పూల్- బీ ఆఖరిరౌండ్ పోటీలో...కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ఈనెల 26న తలపడుతుంది.

టైరుపేలి కారు బోల్తా:నలుగురు మృతి

ప్రకాశం : అద్దంకి మండలం గోవాడ వద్ద కారు టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కన్హయ్యపై దాడి చేసిన వారిపై చిక్కడపల్లి పీఎస్ లో కేసు

హైదరాబాద్ : ఎస్వీకే లో జేఎన్ యూ నేత కన్హయ్య పై చెప్పులు విసిరిన గోసంరక్షణ నేతలు పవన్ కుమార్ రెడ్డి, నరేష్ లపై చిక్కడపల్లి పీఎస్ లో 352,341,447,504 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

ఏపీలో రెండో విడత రుణమాఫీ : మంత్రి ప్రతిపాటి

గుంటూరు: ఏపీలో రైతులకు రెండో విడత రుణమాఫీ త్వరలోనే జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన గుంటూరులో ఆయన మాట్లాడుతూ జూన్‌, జులై నెలల్లో ప్రతి గ్రామంలో 100-200 సేద్యపు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 

15:25 - March 24, 2016

మహిళ జీవితంలో గర్భధారణ కీలకమైన దశ. బిడ్డకు జన్మనిచ్చే ఈ దశలో అనేక సమస్యలు ఎదురవటం సహజమే. వీటిలో లోయర్ బ్యాక్ పెయిన్ ఎంతో మంది గర్భిణులు ఎదుర్కొనే సమస్య. మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్యాక్ పెయిన్ ను అధిగమించవచ్చో వీడియోలో చూడండి..

15:23 - March 24, 2016

ఆకలి, కరువు, పేదరికం.. ఇలాంటి ఆర్థికాంశాలు కుటుంబాలను అతలాకుతలం చేస్తాయి. ఆడపిల్ల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.. ఇది అనేక సందర్భాల్లో రుజువయింది. రుజువవుతూనే ఉంది. ఇప్పుడు ఈ దయనీయమైన పరిస్థితులే చిట్టితల్లులను పెళ్లి పీటలెక్కిస్తున్నాయి. వారిని వైవాహిక బంధంలో బలిపశువులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బాల్యానికి మూడు ముళ్లు'. ప్రత్యేక కథనం..
తల్లిదండ్రుల తమ పిల్లల ముద్దు మురిపాలు తీరకుండానే, ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్ళి పీటలెక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కకు పెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహ బంధంలోకి నెడుతున్నారు. ఇదంతా మరెక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లో కరువు జిల్లాల్లో జరుగుతుంది. పాలమూరు ప్రాంతంలో కొనసాగుతోంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్తున్న పాలకులు ప్రమాదకరస్థాయిలో కొనసాగుతున్న బాల్యవివాహాల పట్ల శ్రద్ద చూపని స్థితి కనిపిస్తోంది. చట్టాలు చేయగానే సమస్య సమసిపోదని గుర్తించాలి. చట్టాలు ఖచ్చితమైన అమలుకు నోచుకునే స్థితిని కల్పించాలి. సమాజంలో బాల్యవివాహాలు జరిగితే కలిగే దుష్పరిణామాలపై అవగాహన తీసుకురావాలి. అందుకు అన్ని స్థాయిల్లో కృషి జరగాలని మానవి కోరుకుంటోంది.

ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి గంటా ఆగ్రహం..

విజయవాడ : అనంతపురం జిల్లా హిందూపురంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ చేపట్టాలని డీఈవోను గంటా ఆదేశించారు.

15:16 - March 24, 2016

విజయవాడ : నగరంలో ఎక్కడ చూసిన ఒకదానిపై చర్చ జరుగుతోంది..జిల్లాలో కన్హయ్య కుమార్ రాకపై హడావుడి నెలకొంది. ఇతని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న కాషాయ మూకలపై ప్రజా సంఘాలు..అభ్యుదయ వాదులు భగ్గుమంటున్నాయి. తాము ఎలాగైనా సభ నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ గురువారం సాయంత్రం నగరంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పర్యటన పూర్తి చేసుకున్న కన్హయ్య సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు, అభ్యుదయ వాదులు, ప్రజా సంఘాలు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఐవీ ప్యాలెస్ లో నిర్వహించే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. మతోన్మాద శక్తులు ఎలా విజృంభిస్తున్నాయి..వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై కన్హయ్య ప్రసంగించనున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పోలీసుల నిఘా..
అయితే కన్హయ్య కుమార్‌ బహిరంగ సభను అడ్డుకుంటామని ఇప్పటికే ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపి హెచ్చరించాయి. మరోవైపు కన్హయ్య కుమార్‌ సభను జరిపి తీరతామని ప్రొగ్రెసీవ్‌ ఫోరం స్పష్టం చేసింది. దీంతో కన్హయ్య విజయవాడకు వచ్చి వెళ్లే వరకూ నిఘా కెమెరాలతో రికార్డు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల హెచ్చరికలతో కన్హయ్యకుమార్‌ విజయవాడ పర్యటన ఎలా సాగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

 

 

 

15:16 - March 24, 2016

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి కూతురైంది. ఈనెల 28 ఆమె వివాహం జరగనుండగా, పెళ్లి కుతూరుగా ముస్తాబై నవ్వులు చిందిస్తోన్న శ్రీజ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీజ పెళ్లి విషయాన్ని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ పెళ్లికి సంబంధించిన కొన్నిఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. పింక్‌ కలర్‌ కాంజీవరమ్‌ చీరని ధరించిన శ్రీజ ఎంతో ఆకర్షణీయంగా ఉందంటూ ఈ వేడుకకు వచ్చిన వారు తెలిపారు. మార్చి 28న ఉదయం 9.18 నిమిషాలకు బెంగళూర్‌లోని ఓ ఫాం హౌస్‌ లో శ్రీజ కళ్యాణ్‌ల పెళ్లి వేడుక జరగనుండగా, ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ వేడుకకు ముఖ్యమైన అతిధులు, బంధువులు మాత్రమే హాజరు కానున్నట్టు సమాచారం. మార్చి 31న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించనున్నట్లు సమాచారం.

15:11 - March 24, 2016

గుంటూరు : అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి అడ్డదారి దొక్కాడు. పరీక్షల్లో పాస్ కావాలనే ఉద్ధేశ్యంతో కాపీ కొడుతూ ఓ మాజీ ఎమ్మెల్యే పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే...జిల్లాలోని జేఏసీ కళాశాలలో మొదటి సెమిస్టర్ లా పరీక్షలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఈ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం రోజున చివరి పరీక్ష జరుగుతోంది. స్వ్కాడ్ బృందం కళాశాలలో తనిఖీ చేపట్టింది. చూచిరాత రాస్తున్న మనస్తాన్ వలీని పట్టుకున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

 

హోలీ వేడుకల్లో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్...

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తన ప్రత్యేక భద్రతా సిబ్బందితో కలిసి హోలీని జరుపుకోగా కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కార్యకర్తలు, ఆటోవాలాలతో కలిసి రంగుల కేళీలో మునిగితేలారు.

15:04 - March 24, 2016

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు, నటి, నిర్మాత ఫరా ఖాన్‌ జాకీ చాన్‌ కోసం ఓ పాటకు కొరియోగ్రఫీ అందించనున్నారు. జాకీచాన్‌ నటిస్తున్న 'కుంగ్‌ఫూ యోగ' చిత్రంలో బాలీవుడ్‌ నటులు సోనూసూద్‌, అమైరా దస్తూర్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్‌ స్టయిల్‌లో ఉండే ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను రాజస్థాన్‌లో చాలా లావిష్‌గా షూట్‌ చేయనున్నారు. ఈ పాటను ఫరాఖాన్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రత్యేక పాటను రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు ఫరాఖాన్‌ తెలిపారు. ఇటీవల షారూఖ్‌ ఖాన్‌ నటించిన 'దిల్‌వాలే' చిత్రానికి కూడా ఫరా కొరియోగ్రఫీ అందించారు.

 

15:01 - March 24, 2016

సునీల్‌ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో నిర్మాత పరుచూరి కిరీటి ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి సునీల్‌ మాట్లాడుతూ, ''మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్‌ మరో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథను తయారు చేశారు. ఇందులో నా క్యారెక్టరైజేషన్‌ను విభిన్నంగా మలిచారు. భారీ చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్‌ హంగులతో నిర్మించేందుకు సన్నాహాలు చేయటం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. 'పాత్రను ప్రేమిస్తే సునీల్‌ ఎంత కష్టపడతారో మనకు తెలిసిందే. చాలా రోజులుగా ఆయనతో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. క్రాంతి మాధవ్‌ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. సునీల్‌కిది కరెక్ట్‌ స్క్రిప్ట్‌ అనిపించింది. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా తీర్చిదిద్దారు. పూర్తి కమర్షియల్‌ వాల్యూస్‌తో మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. మా బ్యానర్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ చిత్రం చేస్తున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని నిర్మాత తెలిపారు.

 

ఆనం కుటుంబంలో జగన్ చిచ్చు : సోమిరెడ్డి

హైదరాబాద్ : ఆనం కుటుంబంలో జగన్ చిచ్చు పెట్టాడని టీడీపీ నేత సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ మాజీ ఎంపీ సాయిప్రతాప్ రెడ్డి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

14:55 - March 24, 2016

విజయవాడ : మే నెల చివరికల్లా పోలవరం కుడికాల్వ పనుల్ని పూర్తి చేస్తామని ఏపీ నీటిపారదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడలో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయిన మంత్రి దేవినేని..రాష్ట్రంలో మంచినీటి కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పంటలకు నీరందిస్తున్నామని, నెల్లూరు జిల్లాకు మంచినీటి సమస్య లేకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి ఒక్క వానచుక్కను ఒడిసిపట్టుకుంటేనే నీటి కొరత లేకుండా చేయగలమని మంత్రి దేవినేని అన్నారు. 

14:52 - March 24, 2016

హైదరాబాద్ : ఈ దేశం మనువాదం, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ముక్తి పొందాలని, దేశంలో పేదల ముందు ధర్మం గురించి మాట్లాడమే అధర్మమని జేఎన్ యూ నేత కన్హయ్య అన్నారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కన్హయ్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
''మతం పేరిట ఓట్లను అడిగేవారికి వివేకనందుడు సైతం మద్దతివ్వరు. దేశంలోని మహనీయులంతా ప్రజలను విముక్తి చేయడానికే పాటు పడ్డారు. ఆ మహనీయుల బాటలో నడవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది''. అని పేర్కొంటూ తనదైన శైలిలో ప్రసంగాన్ని ముగించారు. 

14:48 - March 24, 2016

హైదరాబాద్ : రాం... రాం... అనే శబ్దం హిందూ ధర్మానికి, ప్రజల సంస్కృతి ప్రతీక... దాన్ని జై శ్రీరాం అనడం ద్వారా ఓ రాజకీయ నినాదాన్ని చేశారని బిజెపిపై కన్హయ్య విరుచుకు పడ్డారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కన్హయ్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందుస్థాన్‌ అంటే ఏంటో బైజు బావ్‌రా సినిమా గీతాన్ని కన్హయ్య ఉదహరించారు. ' మన్‌ తర్పత్‌ హరి దర్శన్‌ కో ఆజ్‌' అనే గీతాన్ని రాసింది ముస్లిమే... సంగీతం సమకూర్చింది ముస్లిమే...పాట పాడింది కూడా ముస్లిమేనని...అయితే అది హిందూ దేవాలయాల్లో ఆ పాట మోగుతుందని...ఇదే భారత్‌ గొప్పదనమని కీర్తించారు. భారత్‌ మాతకు కాషాయ రంగు అద్దుతున్నారని...కానీ భారత మాత 125 కోట్ల ప్రజలదని పేర్కొన్నారు. మనువాద జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తామన్నారు. తాము జాతీయ జెండాలోని అన్ని రంగులను ఆదరిస్తామని స్పష్టం చేశారు. 

14:45 - March 24, 2016

హైదరాబాద్ : రోహిత్‌ వేముల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కన్హయ్య కుమార్‌ను తెరపైకి తెచ్చారని కన్హయ్య తెలిపారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కన్హయ్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జైలుకు వెళ్లక ముందు... జైలు నుంచి విడుదలయ్యాక కూడా రోహిత్‌ వేములకు న్యాయం జరగడం కోసమే తమ పోరాటం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. రోహిత్‌ చట్టాన్ని తెచ్చే వరకు విశ్రమించమన్నారు. రోహిత్ వేముల అంశాన్ని పక్కదోవ పెట్టించేందుకు ఇదంతా చేస్తున్నారని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

14:41 - March 24, 2016

హైదరాబాద్ : ఇది గాంధీ దేశం...గాడ్సే మందిరాన్ని నిర్మించడం కుదరదని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కన్హయ్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
''మోడీ పోలీసులు తనకు పబ్లిసిటీ ఇచ్చారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు ఈ దేశంలో అగ్ర కులాలా వాళ్లు ఇంటిని అద్దెకిచ్చేవారు కాదు. ఆయన అబద్ధం చెప్పి ఇంట్లో ఉండేవారు. దళితుడు అని తెలియగానే ఇంటి యజమాని ఆయన సామాగ్రిని బయటకు విసిరేసినా అంబేద్కర్‌ ఆగ్రహం చెందేవారు కాదు. అంబేద్కర్‌ను ఆదరించేవాళ్లు దాడులకు పాల్పడ కూడదు'' అని కన్హయ్య తెలిపారు. 

కాపీయింగ్ కు పాల్పడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే

గుంటూరు : ఎల్ ఎల్ బీ పరీక్షలో కాపీయింగ్ పాల్పడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ పట్టుబడ్డారు. జేకేసీ కాలేజీలో ఎల్ ఎల్ బీ ఫస్టియర్ చదువుతున్నారు.

14:23 - March 24, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి సెగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఎండలు మాడపగిలేలా భగ్గుమనడంతో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుండి వేడిగాలులు వీస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కడపలో నిన్న అత్యధికంగా 45 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదు కావడంతో ఏప్రిల్‌, మేనెలలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అని జనం బెంబేలెత్తిపోతున్నారు. వేడి వడగాల్పులతో జనం ఉక్కిరిరవుతున్నారు. ఉదయం 7గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం బయటకు రాలేక ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటలదాకా బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే...తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తలకు ఖచ్చితంగా క్యాప్‌, లేదంటే రుమాలు, హెల్మెట్‌ పెట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక కూల్‌డ్రింక్స్‌, పళ్లరసాలతో జనం సేద తీరుతున్నారు. మరోవైపు ఎండలు మండుతుండడంతో కూలర్లు, ఏసీలకు ఫుల్‌ డిమాండ్ ఏర్పడింది. 
కడప జిల్లాలో ఎండలు 
కడప జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడు  మధ్య నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలకు బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది.
ఉత్తరాంధ్రలో హడలెత్తిస్తున్న ఎండలు 
ఉత్తరాంధ్ర జిల్లాలను ఎండలు హడలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సూర్యతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోడ్లపై అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మార్చి నెలలోనే సమ్మర్ ఎఫెక్ట్ ఇంతలా ఉంటే ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.  

 

 

14:20 - March 24, 2016

మెగాస్టార్ చిరంజీవి మరో శస్త్రచికిత్సకు రెడీ అవుతున్నట్లు సన్నిహత వర్గాల నుండి అందుతోన్న సమాచారం. కొద్ది రోజుల క్రితం తన కుడి భుజానికి గత నెలలో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎడమ భుజానికి కూడా త్వరలో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు చిరంజీవి తెలుస్తోంది. త్వరలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం జరగనుందని, ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకుంటారని సమాచారం. కాగా, చిరంజీవి కుడి భుజానికి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. చిరంజీవి ఎడమ భుజానికి కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన 150 వ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

14:17 - March 24, 2016

హైదరాబాద్ : జెఎన్ యూ నేత కన్హయ్యకమార్ పై దాడికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడిని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఖండించాయి. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై ఏర్పాటు చేసిన సెమినార్ లో కన్హయ్య ప్రసంగిస్తుండగా గోరక్షాదళ్ కు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారు. కన్హయ్యపైకి బూట్ విసిరివేయడం జరిగింది. ఆ బూటు కన్హయ్య ముందుపడింది. దాడికి పాల్పడిన వారిని చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. ఈ ఘటనను ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
'బూటు విసరాల్సింది... దేశభక్తులపై కాదని.. నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వంపై. భారత్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారు. నరేంద్రమోడీ రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామ్యవాదులు, మనువాదులు కన్హయ్య ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేశారు. దాడికి యత్నించారు. ఏం చేయాలన్న, ఏం తినాలన్నా ఆర్ ఎస్ ఎస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ స్వేచ్ఛను కాలరాసి.. స్వచ్ఛ భారత్ అంటున్నారు. కన్హయ్యపైకి దాడి చేసిన వారు...  దేశభక్తులు కాదు...  దేశద్రోహులు. బీజేపీ, అరాచకశక్తులు దాడులకు పాల్పడతున్నాయి. వీసీ అప్పారావు వచ్చిన తర్వాతే హెచ్ సీయూలో శాంతి భద్రతలు తోపించాయన్నారు. 

 

14:09 - March 24, 2016

నటుడు మోహన్ బాబు ఇడ్లీలు అమ్మారు. అవునా నిజమే అయితే ఏ సినిమాలో సినిమా షూటింగ్ లోనో, లేకపోతే ఆయన గత జ్ఞాపకమో కాదు. ఆయన కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం ఆయన ఇడ్లీలు అమ్మాల్సి వచ్చిందట. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఎదురుగా రోడ్డు మీద మోహన్ బాబు ఇడ్లీలు అమ్మారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ విషయాన్ని శ్రీ విద్యానికేతన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. కాగా, గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.

విజయవాడలో కన్హయ్య సభకు ఏర్పాట్లు పూర్తి

విజయవాడ : నగరంలోని ఐవీ ప్యాలెస్ లో కన్హయ్య సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు కన్హయ్య చేరుకోనున్నారు. అక్కడ నుండి విజయవాడకు భారీ ఊరేగింపు మధ్య ఐవీ ప్యాలెస్ కు చేరుకోనున్నారు. కన్హయ్య పర్యటన నేపథ్యంలో ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నాయకులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

14:00 - March 24, 2016

ఊపిరి.. ప్రయోగాత్మక సినిమా కాదని ఎంటర్ టైనర్ సినిమా అని హీరో యువ సామ్రాట్ నాగార్జున అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయనతో ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సినిమాకు సంబంధించిన పలు విషాయలను తెలిపారు. సినిమాలో తన రోల్ గురించి వివరించారు. ఈ సినిమా రెగ్యులర్, కమర్షిల్ సినిమా అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై సాయిప్రతాప్ చేరారు : కళావెంకట్రావ్

హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై సాయిప్రతాప్ టిడిపిలో చేరారని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. సాయిప్రతాప్ చేరికను కార్యకర్తలు స్వాగతిస్తున్నారన్నారు. సాయి ప్రతాప్ చేరికతో రాజంపేట నియోజకవర్గం మరింత బలోపేతమవుతుందన్నారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని కళా తెలిపారు. జగన్ నాయకత్వంలో పనిచేయలేక వైసీపీ నేతలు మమ్మల్ని కలుస్తున్నారని త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి భాగస్వామ్యమవుతానని టిడిపిలో చేరిన సాయిప్రతాప్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక సమస్యలు ఎదుర్కొంటోదని...

కన్హయ్యకు తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : ఢిల్లీ జేఎన్ యూ నేత కన్హయ్య వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. అయితే కన్హయ్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన గచ్చిబౌలీ సమీపంలో చోటు చేసుకుంది. మరో వాహనంలో కన్హయ్య ఎయిర్ పోర్టుకు వెళ్లారు.

13:39 - March 24, 2016

మెదక్ : అధికార పార్టీని ఇరుకున పెట్టే ఏ సమస్య వచ్చినా...రంగంలోకి దిగే  హరీష్‌రావుకు లోకల్ పాలిటిక్స్  సమస్యలు సృష్టిస్తున్నాయి. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎదురవుతున్న పరిణమాలతో ఎలా వ్యవహరిచాలో మంత్రికి కొత్త చిక్కులే ఎదురౌతున్నాయి. అభ్యర్థుల ఎంపిక హరీష్ కు పెద్ద సవాల్ ను విసురుతోంది.
ఎన్నికల బరిలో ఆశావహులు
మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికలు మంత్రి హరీష్ రావ్ కు కొత్త సమస్యలు  సృష్టిస్తున్నాయి. సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికల్లో ఆశావహులు పెద్దఎత్తున ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపు తున్నారు. ఒక్కో వార్డు నుంచి కనీసం పదిమంది అధికార పార్టీని నమ్ముకుని రంగంలోకి దిగినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు
నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే వరకు అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ నేతలు పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ఆసక్తి ఉన్న అభ్యర్తులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. 34 వార్డులకు అధికార పార్టీ టికెట్లు ఆశిస్తూ కనీసం 400 మంది నామినేషన్లు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారంతా మంత్రి హరీష్ ను ఒప్పించి పార్టీ టికెట్ సాధించాలన్న ఆశతో ఉన్నారు.
రెబల్స్ తో ముప్పు..
పార్టీ పరంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు బరిలో ఉండే రెబల్స్ తో ముప్పు ఉంటుందన్న ఆందోళన నేతలను అయోమయంలో వేస్తోంది. దీంతో రెబెల్స్‌ను కట్టడి చేసేందుకు మంత్రి హరీష్‌ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

రంగారెడ్డి జిల్లా జింగుర్తిలో విషాదం..

రంగారెడ్డి : తాండూరు మండలం జింగుర్తిలో విషాదం నెలకొంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి లక్ష్మి, పిల్లలు బొజ్జమ్మ, రాజు మృతి చెందగా.. మరో బాలుడు కిట్టు పరిస్థితి విషమంగా ఉంది.

13:30 - March 24, 2016

కృష్ణా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు ఐవీ ప్యాలెస్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే కన్హయ్య కుమార్‌ బహిరంగ సభను అడ్డుకుంటామని ఇప్పటికే ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపి హెచ్చరించాయి. మరోవైపు కన్హయ్య కుమార్‌ సభను జరిపి తీరతామని ప్రొగ్రెసీవ్‌ ఫోరం స్పష్టం చేసింది. దీంతో కన్హయ్య విజయవాడకు వచ్చి వెళ్లే వరకూ నిఘా కెమెరాలతో రికార్డు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల హెచ్చరికలతో కన్హయ్యకుమార్‌ విజయవాడ పర్యటన ఎలా సాగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

13:19 - March 24, 2016

విద్యాలయాల్లో రాజకీయ జోక్యం వల్లే రోహిత్ వేముల ఆత్మహత్యచేసుకున్నాడని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత ఎండాల లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ ఎపి నేత మాల్యాద్రీ, టీఆర్ ఎస్... అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎన్టీఆర్ వైద్యసేవలను కొనసాగించండి: పి.మధు

హైదరాబాద్ : నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే లక్ష్యం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు  సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు లేఖ రాశారు. గత కొంతకాలంగా రూ.350 కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రయివేటు యాజామాన్యాలు ప్రకటించాయి.  ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్య సేవలను అందించేలా ప్రభత్వం చర్యలు తీసుకోవాలనిచంద్రబాబును మధు కోరారు.

13:14 - March 24, 2016

హైదరాబాద్ : 'అఫ్జల్ గురు మాకు ఐకాన్ కాదు..రోహిత్‌ వేములే మా ఐకాన్' అని జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయకుమార్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటమే తమ లక్ష్యం తప్పించి.. హింసకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ తరహాలో సమస్యలపై పోరాడుతామని చెప్పారు. మోడీ మీద ఉన్న భక్తినే దేశ భక్తి అనుకుంటున్నారు..దేశభక్తి పూర్తిగా వేరన్నారు. రోహిత్ వేములకు న్యాయం జరిగేలా పోరాడేందుకే తాను హైదరాబాద్‌ వచ్చినట్లు  అన్నారు. 

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..

హైదరాబాద్ : హెచ్‌సీయూలో బుధవారం జరిగిన ఘటనల్లో అరెస్టయిన విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా ఆర్ట్సు కళాశాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులు, ఓయూ జేఏసీ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

పఠాన్ కోట్ లో అపహరించిన కారు లభ్యం..

హైదరాబాద్ : పఠాన్‌కోట్‌లో ఈ నెల 22న అపహరించిన కారు లభ్యమైంది. గురుదాస్‌పూర్‌లోని పశ్యల్ గ్రామంలో దుండగులు కారు PB06S 8982 ను విడిచిపెట్టారు. వ్యక్తిని తుపాకితో బెదిరించి ముగ్గురు దుండగులు కారు అపహరించిన సంగతి తెలిసిందే. దుండగుల ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు: హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో పద్మాక్షమ్మ గుండం వద్ద మిషన్ కాకతీయ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ రెండోదశ పనుసల్లో భాగంగా 824 చెరువులను పునరుద్దరిస్తున్నామని ఇందు కోసం రూ.313 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు.

13:06 - March 24, 2016

హైదరాబాద్ : భారత్ మాతా అంటే కాషాయ రంగు కాదని... భారత్ మాతా అందరిదని జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ అన్నారు. ఈ దేశం బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లది అన్నారు. హైదరాబాద్ లోని ఎస్ వికెలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భేదాభిప్రాయాలు తొలగించాలనేది తన లక్ష్యమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కోసం కృషి చేయాలని చెప్పారు. రాళ్లు, చెప్పులు విసిరినంత మాత్రానా ఏమీ కాదన్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. ఇలాంటి వాటి గూర్చి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరు భయపెట్టినా భయపడేవాన్ని కాదని.. మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. 'ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు.. నేను మాట్లాడుతూనే ఉంటానని' చెప్పారు. దేశంలో విభేదాలు తొలగించాలనేదే తన ప్రయత్నమన్నారు. రోహిత్ చట్టం తెచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇది గాంధీ దేశం... గాడ్సే మందిరం నిర్మించడం కుదరదన్నారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా పని చేస్తుందని విమర్శించారు. ఈ దేశం కులం, మతం, వర్గానికి సంబంధించింది కాదన్నారు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు ఎంతోమంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. దేశంలో పేదరికం నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పారాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతా హమారా హై అన్నారు. తమ పోరాటం అంతా దళిత, గిరిజనుల హక్కులు కాపాడేందుకేనని చెప్పారు. మతం మసుగులో దేశాన్ని రెండుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని రక్షించేందుకే తమ పోరాటం... రాజకీయ కోసం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లలేక జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ, ప్రభుత్వం తనకు పబ్లిసిటీ కల్పిందని చమత్కరించారు. ప్రసంగం చివర్లలో 'మనువాది సే ఆజాదీ'... అనే పాట పాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మాజీ రెవెన్యూ అధికారి దారుణ హత్య...

అనంతపురం : మాజీ ఎండీవో రామసుబ్బమ్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఇంటిలోనే మెడకు తాడు బిగించి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

కన్హయ్య సభ నిర్వహించి తీరుతాం: సీపీఎం,సీపీఐ

హైదరాబాద్: ఢిల్లీ జేఎన్‌యూ నాయకుడు కన్హయ్య కుమార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడలో అడుగుపెట్టనీయబోమని ఏపీ బీజేవైఎం శాఖ హెచ్చరించింది. కాగా, కన్హయ్య కుమార్ పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. కన్హయ్య సభను నిర్వహిస్తామని సీపీఐ, సీపీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

బిజెపి మైనార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తోంది : కన్హయ్య

హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తోందని జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య ఆరోపించారు. ఆయన హైదరాబాద్ ఎస్వీకే లో 'రాజ్యంగ పరిరక్షణ హక్కులు' అంశంపై జరుగుతున్న సెమినార్ లో మాట్లాడుతూ... మా పోరాటం అంతా దళిత, గిరిజనుల హక్కులను కాపాడేందుకేనన్నారు. క్రోనీ క్యాపిటలిజం నుంచి దేశాన్ని రక్షించాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలన్నారు. దేశాన్ని రక్షించాడనికే మాపోరాటం అని రాజకీయం కోసం కాదన్నారు. రోహిత్ ఆశయం మేరకు సామాజిక న్యాకం కోసం పోరాడతామన్నారు. సబ్సిడీ డబ్బులతో మాల్యాను విదేశాలకు పంపారని... ఇలాంటివి జరగనివ్వమని స్పష్టం చేశారు.

భారత్ మాతా అంటే అందరిదీ : కన్హయ్య

హైదరాబాద్ : మతం ముసుగులో దేశాన్ని రెండుగా విభజించాలని చూస్తున్నారని కన్హయ్య ఆరోపించారు. భారత్ మాత అంటే కాషాయరంగు కాదని... భారత్ మాత అంటే అందరిది అని కన్హయ్య తెలిపారు. హైదరాబాద్ ఎస్వీకే లో 'రాజ్యంగ పరిరక్షణ హక్కులు' అంశంపై జరుగుతున్న సెమినార్ లో మాట్లాడుతూ... రైతులు, విద్యార్థుల ఆత్మబలిదానాలు కూడా అమరుల కిందే వస్తాయాన్నరు. ఈ దేశం బాబాసాహేబ్ అంబేద్కర్ దని, సభను విచ్ఛిన్నం చేసందుకు దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని... ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

రోహిత్ చట్టం కోసం పోరాటం : కన్హయ్య

హైదరాబాద్ : రోహిత్ చట్టం తెచ్చే వరకు పోరాటం చేస్తానని జేఎన్ యూ నేత కన్హయ్య అన్నారు. ఆయన హైదరాబాద్ ఎస్వీకే లో 'రాజ్యంగ పరిరక్షణ హక్కులు' అంశంపై జరుగుతున్న సెమినార్ లో మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తోందని విమర్శించారు. మా పోరాటం అంతా దళిత, గిరిజనుల హక్కులను కాపాడేందుకేనని స్పష్టం చేశారు. అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లలేక జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ దేశం కులం, మతం వర్గానికి సంబంధించినది కాదన్నారు.

ఎవరు భయపెట్టినా భయపడేవాడిని కాదు : కన్హయ్య..

హైదరాబాద్ : ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు... నేను మాట్లాడుతూనే ఉంటా అని జేఎన్ యూ నేత కన్హయ్య అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాజ్యంగ పరిరక్షణ హక్కులు' అంశంపై జరుగుతున్న సెమినార్ లో పాల్గొన్నారు. అంతకంటే ముందు గోరక్షణ సమితి నేతలు కన్హయ్యపై రాళ్లు, చెప్పులతో దాడికి యత్నించారు. అనంతరం కన్హయ్య మాట్లాడుతూ... ఈదేశం బాబా సాహేబ్ అంబేద్కర్ దని, సభను విచ్చిన్నం చేసేందుకు దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. రాళ్లు, చెప్పులు విసిరినంత మాత్రానా ఏమీ కాదన్నారు.

12:13 - March 24, 2016

హైదరాబాద్ : మళ్లీ అదే జరిగింది. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది. గత కొంత కాలంగా పాలకుల విధానాలు..మతోన్మాదం..తదితర అంశాలపై జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఆయన రాకను కాషాయ ముష్కరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ముందే పేర్కొంటున్నారు. వారు అనుకున్న విధంగానే కన్హయ్యపై దాడికి యత్నించారు. కానీ ఈ దాడులకు..బెదిరింపులకు తాను భయపడడని కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు.

ఎస్వీకేలో దాడి...
గురువారం ఎస్వీకేలో 'రాజ్యాంగ పరిరక్షణ హక్కులు' సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ విచ్చేశారు. కన్హయ్య మాట్లాడుతుండగా కిందనున్న వారిలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జై శ్రీరాం..జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అక్కడనే ఉన్న మీడియాను సైతం వదలలేదు. చేతుల్లో ఉన్న కెమెరాలను లాక్కొని ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతరులు దాడి చేసిన వ్యక్తులను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. 'కుచ్ మత్ కరీయే..చోడ్ దీజియే' అంటూ కన్హయ్య సూచించారు. అక్కడనే ఉన్న పోలీసులు దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. కన్హయ్యపై జరిగిన దాడిని పలువురు ఖండించారు.

వీసీ రీ ఎంట్రీపై ఆందోళనలు...
హెచ్ సీయూ వీసీ అప్పారావు రీ ఎంట్రీని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీఛార్జీ చేశారు. విద్యార్థులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కన్హయ్య తీవ్రంగా నిరసించారు. లాఠీలు..తూటాలతో తమ గొంతులను నొక్కలేరని హెచ్చరించారు. ఈ సమావేశం అనంతరం కన్హయ్య కుమార్ విజయవాడకు వెళ్లనున్నారు. కన్హయ్యను అడ్డుకుంటామని పలువురు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

కన్హయ్య సభలో గందరగోళం

హైదరాబాద్ : 'రాజ్యంగ పరిరక్షణ హక్కులు' అంశంపై ఎస్ వికేలో  జరుగుతున్న సెమినార్ లో గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సెమినార్ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సభలోకి ప్రవేశించి కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన పై దాడికి యత్నించారు. అంతేకాకుండా అడ్డువచ్చిన విలేకరులపై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. రాళ్లు, చెప్పులు విసిరి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కన్హయ్య పై దాడికి యత్నించిన గోరక్షాదళ్ సమితి నేతలు నరేష్, ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఓయూలో 3కే రన్...

హైదరాబాద్ : టెక్నో ఉస్మానియా కార్యక్రమం సందర్భంగా ఓయూలో గురువారం 3కే రన్ నిర్వహించారు. ఓయూ ఎన్‌సీసీ గేట్ నుంచి టెక్నాలజీ కళాశాల వరకు రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. టెక్నో ఉస్మానియా కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనుంది.

11:51 - March 24, 2016

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నారు. కాసేపట్లో  రాజ్యాంగం హక్కులు పరిరక్షణ అంశం పై  జరగనన్న సెమినార్ లో ఆయన ప్రధాన ప్రసంగం చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి దేవినేని

విజయవాడ : నెల్లూరు జిల్లాకు మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటిమట్ట తక్కువగా వుందని... ప్రతి వర్షపు చుక్కను ఒడిపిపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత పంటలకు రాళ్ళపాడు ప్రాజెక్టు ద్వారా నీరందించామన్నారు. ఈ ఏడాది మే నెలాఖరుకు పోలవం కుడి కాల్వ పనులను పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ హామీ ఇచ్చారు.

'వేములవాడ'లో నాయి బ్రాహ్మణులు - భక్తుల మధ్య వివాదం..

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరశ్వర స్వామి దేవాలయంలో నాయి బ్రాహ్మణులకు భక్తులకు మధ్య వివాదం చెలరేగింది. మొక్కులు చెల్లించుకోవటానికి వచ్చిన వారి నుండి నాయిబ్రాహ్మణులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని భక్తులకు హామీ ఇచ్చారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.

హిందూపురంలో ఫుడ్ పాయిజన్:చిన్నారి మృతి

అనంతపురం : హిందూపురంలోని ఓ కోచింగ్ సెంటర్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ మూడో తరగతి విద్యార్థిని నిఖిత మృతి చెందింది. నిఖిత బ్రహ్మసముద్రం మండలం కపటాలపల్లి వాసిగా గుర్తించారు.

ఎస్ వికె లో కన్హయ్య కుమార్‌

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నారు. కాసేపట్లో రాజ్యాంగం హక్కులు పరిరక్షణ అంశం పై జరగనన్న సెమినార్ లో ఆయన ప్రధాన ప్రసంగం చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాసేపట్లో చలో విజయవాడ : కేవీపీఎస్

విజయవాడ :  ఎస్సీ, ఎస్టీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనే డిమాండ్ తో  కేవీపీఎస్ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. విజయవాడలోని  తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి భారీ ప్రదర్శన ప్రారంభం అయి అలంకార్ సెంటర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

దేశభక్తిని మోదీ భక్తిగా మార్చుతున్నారు : కన్హయ్య

హైదరాబాద్ : దేశభక్తిని మోదీ భక్తిగా మార్చేస్తున్నారని కన్హయ్య ధ్వజమెత్తారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పోరాడతామని పేర్కొన్నారు. మాకు రోహిత్ వేములే ఆదర్శం అని ఆఫ్జల్ గురు కాదని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళికతోనే వీసీ అప్పారావును హెచ్ సీయూకి రప్పించారని విమర్శించారు. సాయాజిక న్యాయం కోసం పోరాడేవారిపై దేశద్రోహ ముద్ర వేయటం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా యూనివర్శిటీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రోహిత్ వేముల ఘటనను మరుగుపరిచేందుకే జేఎన్ యూలో సంఘటనను కేంద్ర ప్రభుత్వం వివాదం చేసిందని కన్హయ్య మండిపడ్డారు.

మంత్రి ఈటెలను అడ్డుకున్న మహిళలు...

కరీంనగర్ : మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ లో మహిళలు అడ్డంగించారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామ మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

26వరకు బ్రసెల్స్ విమానాశ్రయం మూసివేత..

హైదరాబాద్ : బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ విమానాశ్రయాన్ని ఈనెల 26 వరకు మూసి ఉంచనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఐఎస్‌ ఉగ్ర దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి ఏ విమాన సర్వీసులను నడపనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విమానాశ్రయం, భూగర్భ రైల్వే స్టేషన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

టీడీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి ...

హైదరాబాద్ :  కడప జిల్లా కు చెందిన మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి  ప్రతాప్ రెడ్డి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో సాయిపత్రాప్ రెడ్డి టీడీపీలో చేరారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా ప్రతాప్ రెడ్డి పనిచేశారు. 

సర్పంచ్ ఇంట్లో బాంబు పేలుడు...

అనంతపురం:వైసీపీకి చెందిన ఓ స‌ర్పంచి ఇంట్లో బాంబుపేలుడు స్థానికంగా అల‌జ‌డి సృష్టించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం సర్పంచి నర్సింహులు ఇంట్లో బాంబుపేలింది. ఈ ఘ‌ట‌న‌లో స‌ర్పంచికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  

10:36 - March 24, 2016

హైదరాబాద్ : ఈటీవీలో ప్రసారమయ్యే కామిడిషో జబర్దస్త్ ద్వారా పేరు ప్రఖ్యాతలు సాధించిన చలాకీ చంటి ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నారు.

10:34 - March 24, 2016

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న '2.0' చిత్రానికి సంబంధించి రోజుకొక ప్రత్యేక వార్త పాఠకుల్లో అమితాసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన మరో వార్త మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈచిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ ఇద్దరూ నటిస్తున్నారట. ఇదే విషయంపై అమితాబ్‌ని మీడియా అడిగితే, ఆయన ఏ కామెంటూ చేయలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. నాయకుడు, ప్రతినాయకుడు రజనీ, అక్షయ్ కుమార్‌లపై ఓ ఫైట్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రజనీ, శంకర్‌లను కలిసేందుకు అమితాబ్‌, అభిషేక్‌ ఇద్దరూ వచ్చారట. దీంతో వీళ్ళు కూడా ఆ సినిమాలో నటిస్తున్నారంటూ సామాజిక మీడియా హల్‌చల్‌ చేసింది. 
ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంలో తీసిన కొన్ని ఫొటోలు సామాజిక మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్‌ గెటప్‌ అదుర్స్ అంటూ ట్వీట్స్, లైక్స్ కూడా వచ్చాయి. రాక్షసత్వానికి ప్రతీకగా ఉన్న అక్షయ్ కుమార్ గెటప్‌ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. '2.0' చిత్రానికి సంబంధించి శంకర్‌ చూపించబోయే స్పెషాలిటీస్‌లో అక్షయ్ గెటప్‌ ఒకటని అందరూ చెప్పుకోవడం విశేషం.

10:29 - March 24, 2016

ఎండాకాలం రానే వచ్చింది. ప్రాంభంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొంత మంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే... మరి కొంత ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బ తగిలిన వారికి పచ్చిమామిడి దివ్వౌషంధలా పని చేస్తుంది. వేసవి ప్రారంభంలో దొరికే పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.

పచ్చిమామిడితో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో...

వేసవిలో విరివిగా దొరికే పచ్చిమామిడికాయను వివిధ పద్ధతుల్లో వాడుకుంటే ఉపసమనం కలుగుతుంది. అసలు మామిడిలో సాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార ఫైబర్ మరియు విటమిన్ B6 , విటమిన్ A మరియు విటమిన్ C వంటి అద్భుతమైన వనరులు ఉన్నాయి. అంతే కాకుండా పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. మామిడిలో కెర్చెతిన్, బీటాకెరోటిన్ మరియు అస్త్రగాలిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడానికి ఉపయోగపడతాయి. గుండె వ్యాధి, అకాల వృద్ధాప్యం, క్యాన్సర్ మరియు ప్రమాదకరమైన వ్యాధుల వంటి సమస్యలలో కణాల నాశనం ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగా ఉంటుంది. ఈ మాజికల్ మామిడికాయతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.

టెంక ఏర్పడని పచ్చిమామిడికాయతో...

వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది.

మితంగానే తినటం మంచిది....

పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.

ఆరోగ్య ప్రయోజనాలు...

పచ్చి మామిడిలో ప్రధానం విటమిన్ సీ ఉంటుంది. ఇది వడదెబ్బ నుంచి మనిషిని రక్షిస్తుంది. సూర్యతాపం శరీరంపై చూపే ప్రభావాన్ని చాలా వరకూ తగ్గిస్తుంది. శరీరంలోకి విటమిన్ సీ చేర్చుకోవడం ఎండను ఎదుర్కోవడంలో చక్కటి ఆయుధాన్ని సంపాదించుకోవడమే!

వందగ్రాముల పచ్చిమామిడిలో 65 క్యాలరీలు మాత్రమే ఉంటాయి! క్యాలరీల లెక్కన ఆహారాన్ని తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగవంతమైనది, అలాగే పచ్చిమామిడి మంచి పీచు పదార్థం. ఆహారం జీర్ణం కావడంలో చక్కగా ఉపయోగపడుతుంది.

ఫైబర్ ను పుష్కలంగా కలిగి ఉన్న పచ్చిమామిడి పళ్లు షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడతాయి.

మళ్లీ ఫైబరే…నియాసిన్ ను కలిగి ఉండటంతో శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతుంది. దీంతో కార్డియక్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారికి మ్యాంగో మంచి మిత్రురాలు.

పచ్చిమామిడిలో పొటాషియం వంటి మినరల్స్ మంచిస్థాయిలో ఉంటాయి. దీంతో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది కూడా.

పచ్చిమామిడిలోని పొటాషియం, మెగ్నిషియంలు ఒత్తిడిని, గుండెజబ్బులను నిరోధిస్తాయి.

ఆకుపచ్చ లోని ఈ కాయ లో బీ1, బీ2 విటమిన్ లు పుష్కలంగా లభిస్తాయి.

నాలుకని చురచురమని పిస్తుండే మామిడిలో సీ విటమిన్ స్థాయి బాగా ఉందని అర్థం. ఇదియాంటిఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది బాడీని యాంటీ రాడికల్స్ గా నిలుపుతుంది.

కాలుష్యం, ఒత్తిడి, జంక్ ఫుడ్, స్మోకింగ్ ల వల్ల శరీరంలో రాడికల్స్ పేరుకుపోతాయి. వీటిని పచ్చిమామిడి నిరోధించగలదు!

విటమిన్ సీ వల్ల చర్మంలో జీవం వస్తుంది. స్కిన్ గ్లోతో మెరిసిపోతుంది. కళ్లు, చర్మం,వెంట్రుకలను ఆరోగ్యవంతం చేస్తంఉది ఈ విటమిన్. ఆకుపచ్చలోని విటమిన్ ఏతో కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

కాబట్టి పచ్చిమామిడి తినడంతో చాలా చాలా లాభాలున్నాయి. కార్బోహైడ్రేడ్ లతో మాగబెట్టిన మామిడిని తినడానికన్నా ముందు…పసందుకు పచ్చిమామిడి పనిపట్టం అన్ని విధాలా శ్రేయస్కరమే!

నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిఫ్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే మాడుపగిలేలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.  

సుకేశుల జలాశయంలో విద్యార్థులు మృతి....

మహబూబ్ నగర్ : సుంకేశుల జలాశయం లో గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నిన్న వడ్డేపల్లి మండలం రాజోలి వద్ద  శ్రీకాంత్, భార్గవ అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. 

వడదెబ్బ తగిలి లారీ డ్రైవర్ మృతి

నల్లగొండ :మిర్యాలగూడ పట్టణంలో ఓ లారీ డ్రైవర్ వడదెబ్బ తగిలి మృతి చెందాడు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య(43) బుధవారం మధ్యాహ్నం లారీ డ్రైవర్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అస్వస్థతగా ఉందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కుదుటపడటంతో సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో తిరిగి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సుంకేశుల జలాశయంలో ఇద్దరు గల్లంతు

మహబూబ్ నగర్ :సుంకేశుల జలాశయంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వడ్డేపల్లి మండలం రాజోలి వద్ద శ్రీకాంత్,భార్గవ్ గల్లంతయ్యారు. గల్లంతైనవారు కర్నూలు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

నెల్లూరులో వడదెబ్బతో ఇద్దరు మృతి

నెల్లూరు : కలువాయి మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. వెంకటరామరాజు పేటలో విజయమ్మ(60) అనే మహిళ, రామన్నగారిపల్లె గిరజన కాలనీలో వెంకయ్య(70)మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో వడదెబ్బతో 8 మంది మృతి చెందారు.

నేడు విజయవాడలో కన్హయ్యకుమార్ పర్యటన

కృష్ణా : జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఐవీ ప్యాలెస్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభను అడ్డుకుంటామని ఎబివిపి, ఆర్ ఎస్ ఎస్, బీజేపీలు చెబుతున్నాయి. కన్హయ్య సభ జరిపి తీరుతామని ప్రొగ్రెసివ్ ఫోరం తేల్చి చెప్పింది. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. 

 

09:29 - March 24, 2016

నీళ్లో రామచంద్రా! ఇప్పుడు ఎవరిని పలకరించినా ఈ మాటే వినిపిస్తోంది. ఏప్రిల్‌   రాకముందే పరిస్థితి ఇంత భీకరంగా వుంటే ఇక  రాబోయే రోజుల్లో  ఇంకెన్ని బాధలు పడాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
మంచినీటి సమస్య 
దాహం... దాహం.... దాహం.... ఇప్పుడు అందరీ సమస్యా ఇదే. ఎండలు ముదురుతున్నా కొద్ది నాలుకలు పిడచకట్టుకుపోతున్నాయి. ఈసారి మార్చిలో నీటి సమస్య తీవ్రమైంది. మంచినీటి సమస్యను తట్టుకోలేక, ట్యాంకర్ల ఖర్చులు భరించలేక అనేకమంది అపార్ట్ మెంట్లు ఖాళీ చేస్తున్న పరిస్థితి. చిన్న ఫ్యామ్లీలకు మాత్రమే ఇల్లుకు అద్దెకు  ఇస్తామనీ, నీళ్లు పొదుపుగా వాడుకోవాలని, టైమ్‌ ప్రకారం, కొలత ప్రకారం నీళ్లు పట్టిపెట్టుకోవాలనీ, బంధువుల రాకపోకలను నియంత్రించాలనీ ఇంటి యజమానులు పెడుతున్న షరతులు మంచినీటి సమస్య తీవ్రతకు అద్దంపడుతున్నాయి. 
అడుగంటిపోయిన భూగర్భజలాలు 
హైదరాబాద్‌లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చాలా అపార్ట్‌మెంట్లలో బోర్లు ఎండిపోయాయి. మరింత లోతుగా మరో బోరు వేసినా ప్రయోజనం దక్కడం లేదు. సింగూరు , మంజీరాలనుండి 120ఎంజిడిలు,   ఉస్మాన్ సాగర్, హిమాయ‌త్ సాగ‌ర్ నుండి వ‌చ్చే 45 ఎంజీడి    నీరు నిలిపోయింది. ఈ జలాశ‌యాలు పూర్తిగా ఎండిపోవ‌డంతో అక్క‌డినుండి చుక్కానీరు  హైదరాబాద్ కు రావ‌డం లేదు.  చాలా శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గిపోయింది. నాలుగైదు రోజులకొకసారి నీళ్లను సరఫరా చేస్తున్న దుస్థితి. దీంతో  జనం ట్యాంకర్లనుఆశ్రయించాల్సి వస్తోంది.  ట్యాంకర్ల ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. గతంలో వెయ్యి రూపాయలున్న మెయింటెనెన్స్‌ ఖర్చు  చాలా చోట్ల ఇప్పుడు రెండు వేలుదాటింది.  జలమండలి ద్వారా జనవరిలో 50 వేల ట్యాంకర్లు సరఫరా చేయగా, ఫిబ్రవరిలో 62వేల ట్యాంకర్లు సరఫరా చేశారు. మార్చి 15 నాటికే 40 వేల ట్యాంకర్ల సరఫరా చేశారు. జలమండలితో పాటు ఇతర ప్రయివేట్‌ సంస్థలు అమ్ముతున్నవి మొత్తం కలిపితే రోజుకు మూడు వేల ట్యాంకర్ల పై మాటే. 
హైదరాబాద్‌లో నీటి సరఫరా తక్కువ
నిజానికి మామూలు రోజుల్లోనే హైదరాబాద్‌లో నీటి సరఫరా తక్కువ. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకి మనిషికి సగటున 165 లీటర్ల నీళ్లు అవసరమైతే, హైదరాబాద్‌లో సరఫరా అవుతున్నది 135 లీటర్లే. ప్రాంతాలవారీగా లెక్కలు తీస్తే కొన్ని ఏరియాల్లో అందులో సగం కూడా దక్కడం లేదు. మంచినీటి సరఫరా విషయంలోనూ వివక్షను ప్రదర్శిస్తున్న మహానగరం మన భాగ్యనగరం.
గ్రేటర్ పరిధిలో  రోజుకి 490 ఎంజిడిలు   వాటర్‌ డిమాండ్‌ ఉండగా,  ప్రస్తుతం 346ఎంజిడిల నీరు మాత్రమే సరఫరా అవుతోంది.  అంటే నగరంలో దాదాపు 144 ఎంజీడిల  కొరత వుంది. హైదరాబాద్‌, విశాఖపట్టణాలల్లో 30శాతం నీటి కొరత వున్నట్టు సాక్షాత్తు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖే గతంలో పార్లమెంట్‌కి చెప్పింది. హైదరాబాద్‌ నగరానికి రోజుకి 480 ఎంజీడీల నీరు అవసరం కాగా 320- 350 ఎంజీడీలకు మించి సరఫరా చేయలేకపోతోంది మెట్రో వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సివరేజీ బోర్డు. ఇందులోనూ 45శాతం పంపిణీ నష్టాలుండడం మరో దురదృష్టం. 
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే మంచినీటి సమస్య 
హైదరాబాద్‌లో మంచినీటి సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే. నగర నిర్మాణంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చెరువులు కబ్జా చేస్తున్నా కళ్లు మూసుకున్నారు. వర్షపునీళ్లు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా చేశారు. పార్కుల ప్రాధాన్యతను విస్మరించారు.  జలాశయాల్లో విష రసాయనాలు కలుస్తున్నా నోరు మెదపలేదు. ప్రకటించిన ప్రకారం నీటి పథకాలను పూర్తి చేయలేదు. వాటికి సక్రమంగా నిధులు కేటాయించలేదు. ఆస్తిపన్నులో 25శాతం నీటి చార్జీల కింద వసూలు చేస్తున్నప్పటికీ ఆ నిధిని నీటి సరఫరా మెరుగుదలకు వినియోగించకపోవడం మరో లోపం.  అవినీతిని నిరోధించి, సరఫరా లోపాలను సవరిస్తే అందరికీ కావాల్సినన్న నీళ్లు అందించే అవకాశం వుందంటున్న నిపుణుల మాటలనూ పెడచెవిన పెడుతున్నారు.

 

09:19 - March 24, 2016

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ గెలుపుతో ఇండియా సెమీస్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. 

తిరుమలకు పోటెత్తిన భక్తులు....

చిత్తూరు : తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయానికి భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు పడుతుండగా.. కాలినడక భక్తులకు నాలుగు గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతోంది.

నేడు కన్నయ్యకుమార్ విజయవాడలో పర్యటన

కృష్ణా : జెఎన్ యూ నేత కన్నయ్య కుమార్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. గవర్నర్‌పేట ఐవీ ప్యాలెస్‌లో జరిగే సభలో కన్నయ్య పాల్గొననున్నారు. ఈ సభను అడ్డుకుంటామంటున్న ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ హెచ్చరించాయి. కాగా కన్నయ్య సభ జరిపి తీరుతామంటున్న ప్రోగెసివ్‌ ఫోరం చెపుతోంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కన్నయ్య ప్రసంగాన్ని పోలీసులు రికార్డ్‌ చేయనున్నారు. రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే కన్నయ్యను అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెపుతున్నారు.

08:43 - March 24, 2016

బెల్జియం : బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టుపై దాడి చేసిన టెర్రరిస్టులను గుర్తించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. బాంబుదాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్న ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రస్సెల్స్‌ దాడులకు పారిస్‌ దాడుల ఉగ్రవాదులకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. 
ఆత్మహుతి దాడి..?
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లకు పాల్పడ్డవారి కోసం వేట కొనసాగుతోంది.  సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను గుర్తించినట్టు బెల్జియం పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది. వీరికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.
ఖాలిద్, బ్రహిమ్ అల్‌ బక్రోయిగా గుర్తింపు
ఉగ్రవాదులను ఖాలిద్, బ్రహిమ్ అల్‌ బక్రోయిగా పోలీసులు గుర్తించారు. సోదరులైన వీరిద్దరు కూడా బ్రస్సెల్స్ కు చెందినవారే కావడం గమనార్హం. వీరిద్దరు తమని తాము పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వీరికి పారిస్‌ దాడుల సూత్రధారి సలా అబ్దెస్లమ్‌తో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అబ్దెస్లమ్‌ను గతవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదంతో సంబంధాలున్నట్టు పోలీసుల రికార్డుల్లో లేదు
ఉగ్రవాద సోదరుల్లో ఒకరు ఖాలిద్ బినామి పేరుతో బ్రస్సెల్స్ లోని మారుమూల ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ ఫ్లాట్‌లో నుంచి ఐసిస్‌కు చెందిన జెండాలు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బక్రోయి సోదరులిద్దరికి క్రిమినల్‌ రికార్డు ఉన్నప్పటికీ...ఉగ్రవాదంతో సంబంధాలున్నట్టు ఇంతవరకు పోలీసుల రికార్డుల్లో లేదు.
మూడో అనుమానితుడు అరెస్ట్ 
బాంబుదాడితో సంబంధమున్నట్టు భావిస్తున్న మూడో అనుమానితుడు నజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు తమ లగేజీతో కారులో జెవెన్‌టెమ్‌ విమానాశ్రయానికి వచ్చిన దృశ్యాలు అక్కడ అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. సూటుకేసు బ్యాగుల్లో బాంబులు పెట్టుకుని ఎయిర్ పోర్టులోకి వచ్చారు. లగేజీలను ట్రాలీల మీద పెట్టుకుని లోపలికి వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. మొదటి రెండు బాంబు పేలాయి. మరో ట్రాలీపై పెట్టిన మూడో బాంబు మాత్రం పేలలేదు. దీన్ని భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడో అనుమానస్పద వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి పారిపోయినట్టు ఓ అధికారి తెలిపారు.
యూరోపియన్‌ యూనియన్ సంస్థల వద్ద పటిష్టమైన భద్రత
బ్రస్సెల్స్ లో ఎయిర్‌పోర్టు, మెట్రో స్టేషన్‌లను బుధవారం కూడా మూసి వుంచారు. యూరోపియన్‌ యూనియన్ సంస్థల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బ్రస్సెల్స్ దాడులకు తామే కారణమని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. బ్రస్సెల్స్ లో ఎయిర్‌పోర్టు, మెట్రో స్టేషన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 34 మంది మృతి చెందగా, 2 వందలకు పైగా గాయపడ్డారు. 

08:36 - March 24, 2016

హైదరాబాద్ లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉందని... ప్రభుత్వం మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ రెసిడెన్స్ ఫోరం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. రిజర్వాయర్‌ లు క్రికెట్‌ మైదనాలుగా మారిపోతున్నాయి. మరోవైపు నీళ్ల వ్యాపారం జోరందుకుంది.   ఓ వైపు సామాన్యులను నీటి కష్టాలు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు నీళ్ల వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి?  అసలు నీటి సమస్యకు కారణం ఏమిటి? ఇది సూర్యభగవానుడి శాపమా? ప్రకృతి ప్రకోపమా? నిర్వహణాలోపమా?  నీళ్ల వ్యాపారులు రోజూ వేలాది ట్యాంకర్ల నీటిని ఎలా సరఫరా చేయగలుగుతున్నారు? అవి ఎంత వరకు సురక్షితం? నీళ్ల వ్యాపారాన్ని ప్రభుత్వాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? ఇలాంటి అంశాలపై శ్రీనివాస్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

https://youtu.be/XxpUGW9Ol54

 

08:29 - March 24, 2016

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో  కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సినీస్టార్ విజయ్ కాంత్ రాకతో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ మరింత బలోపేతమైంది. దీంతో చాలాచోట్ల త్రిముఖ పోటీ జరగబోతోంది.
పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఆవిర్భావం
తమిళనాడులో ఇంతకాలమూ డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలతో తమిళనాడులోని ఇతర చిన్నా చితక పార్టీలు ఈ రెండు ద్రవిడ పార్టీలతో దేనితో ఒకదానితో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. సొంతంగా పోటీ చేసినా, వాటికి తమిళ జనాదరణ లభించలేదు. అయితే ఈసారి ఎన్నికలు కొత్త మార్గం పడుతున్నాయి. డీఎంకే, ఏఐడీఎంకెలకు పోటీగా పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఆవిర్భవించింది. వైకో సారథ్యంలోని ఎండీఎంకే పార్టీ, దళితుల్లో పట్టున్న వీసీకే పార్టీలతో పాటు  ప్రస్తుత లోక్ సభలో 18 అసెంబ్లీ సీట్లున్న వామపక్షాలు కూడా ఈ ఫ్రంట్ లో వున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ లో సినీ యాక్టర్ విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకే కూడా  చేరడంతో అది మరింత ఆకర్షణీయంగా మారింది. 2005లో ఆవిర్భవించిన డీఎండీకే 2011లో ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం జయలలితకు లాభించింది. ఆ ఎన్నికల్లో డీఎండీకే కి కూడా 29 స్థానాలు లభించాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న విజయ్ కాంత్ దెబ్బతిన్నారు. ఎనిమిది నెలల క్రితం ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ ఫ్రంట్ లో విజయ్ కాంత్ కూడా చేరతారన్న ప్రచారం జరుగుతోంది. విజయ్ కాంత్ ను తమ వైపు తిప్పుకునేందుకు ఫ్రంట్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ కాంత్ నే పీపుల్స్ వెల్ఫేర్ ప్రకటించడం విశేషం. 
పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ కు 21శాతం పైగా ఓట్లు  
పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లోని ఎండిఎంకేకి 3.5శాతం ఓట్లు, సీపీఎంకు 2.4శాతం ఓట్లు, సీపీఐకి 1.9శాతం ఓట్లు, వీసీకేకి 1.5శాతం ఓట్లు, కొత్తగా చేరిన డీఎండీకేకి 8 శాతం ఓట్లు వున్నట్టు గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసిన్నప్పుడు పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ కి తమిళనాడులో 21శాతం ఓట్లకు పైగా వున్నట్టు స్పష్టమవుతోంది.  2011 ఎన్నికల్లో కరుణానిధి పార్టీ సాధించిన ఓట్ల శాతంతో దాదాపు ఇవి సమానం. ఈ ఫ్రంట్ లోని పార్టీలు అప్పుడు జయలలితతో పొత్తు పెట్టుకుని ఆమె అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి.  డీఎండీకే కలయికతో ఇప్పుడు ఈ మూడు కూటమిలు దాదాపు సమ ఉజ్జీలుగా మారాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  డీఎంకే, ఏఐడీఎంకేలకు  ప్రత్యామ్నాయ శక్తిగా తమను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఫ్రంట్ నేతలున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా, 124 స్థానాల్లో  విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకే పోటీ చేస్తుంది. మిగిలిన 110 స్థానాల్లో ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీ చేసేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. 

రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు : చంద్రగిరి మండలం బి.కొంగరాపల్లే వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీప్పర్ ను సీజ్ చేశారు. 

విద్యార్థులపై లాఠీచార్జ్ కు నిరసనగా నేడు ఓయూ వర్సిటీ బంద్

హైదరాబాద్ : ఓయూ విద్యార్థులపై లాఠీచార్జ్ కు నిరసనగా నేడు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. 

07:50 - March 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ జెఎసి మళ్లీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తోంది. జెఎసి నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లడంతో టీజాక్ ను  పటిష్టంగా తీర్చిదిద్దడంపై చైర్మన్ కోదండరాం దృష్టి పెట్టారు. త్వరలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 
టీ జాక్‌ నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నట్టు ప్రకటన
ఉద్యోగ సంఘాలన్నీ జాక్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, కార్మిక సంఘాలతో బలంగా ఉన్న తెలంగాణ జెఎసి ఇటీవల బలహీన పడుతోంది. అధికార పార్టీ నేతల సూచనలతో ఉద్యోగ సంఘాలన్నీ జెఎసి నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్లు ప్రకటన చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జెఎసిలో కీలకంగా వ్యవహరించిన సంఘాలు కూడా తమ రూటూ సపరేటు అంటూ వైదొలుగుతున్నాయి.
టీజాక్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు
గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలతో టీజాక్‌ బలహీన పడిందనే ప్రచారం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జాక్‌ను మరోసారి తెలంగాణాలో కీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దేందుకు చైర్మన్ కోదండరాం పావులు కదుపుతున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన నేతల వ్యవహారంపై జెఎసి నేతలు ఎదురు దాడి మొదలు పెట్టారు. సొంత అజెండాతో బయటకు వెళ్లే నేతలకు  కమిటీకి ఎలాంటి సంబంధం లేదని  స్పష్టం చేస్తున్నారు.
జాక్‌ నేతలతో కోదండరాం సమాలోచనలు
తాజా పరిణామాలపై చర్చించేందుకు గ్రేటర్ హైదరాబాద్ లోని  నియోజకవర్గాల నేతలతో కోదండరాం టీజాక్ కార్యాలయంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై  వారితో చర్చించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ పరిణామాలపై జాక్‌ ఖంఢించింది. మొత్తానికి టీజాక్ మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుండటంపై తెలంగాణవాదులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

07:42 - March 24, 2016

నెల్లూరు : ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం గొంతును టిడిపి ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్..ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని వైసిపిలోకి ఆహ్వానించారు. 
జగన్ కు ఘనస్వాగతం 
జిల్లాల పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా వచ్చిన వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి జిల్లా వాసులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయ్‌కుమార్‌తో పాటు ఆయన కుమారుడు ఆనం కార్తీక్‌రెడ్డి, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
సీఎం చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు
సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రలోభాలకు, అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన వాళ్లందరికి కనువిప్పు కలిగేలా ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే నీచమైన రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నాడని విమర్శించారు. అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని అన్నారు. 
2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం 
నాయకుడన్న తర్వాత వారిలో వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ సీఎం చంద్రబాబుకు ఇవి రెండూ లేవని జగన్‌ విమర్శించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు నాయుడుపేట అమరావతి సెంటర్‌ వద్ద పార్టీ కార్యాలయాలన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. 

 

07:37 - March 24, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు పథకం ప్రకారం జరిగాయా... వేముల రోహిత్‌ ఆత్మహత్య తర్వాత  సెలవుపై వెళ్లిన వీసీ.అప్పారావు అకస్మాత్తుగా ఎందుకు విధుల్లో చేరారు. కన్హయ్య రాకకు ఒకరోజు ముందే రావడంలో ఆంతర్యమేంటి..  వీసీ వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలు పరిశీలిస్తే... పక్కా పథకం ప్రకారమే గొడవలు జరిగాయన్న విషయం అర్థమవుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర 
జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ రాక సందర్భంగా హెచ్‌సీయూలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు పెద్ద కుట్ర జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. వేముల రోహిత్‌ ఆత్మహత్య తర్వాత సెలవుపై వెళ్లిన వీసీ... మళ్లీ కన్హయ్య కుమార్‌ రాకకు ముందురోజు విధుల్లో చేశారు. కన్హయ్య రాక సందర్భంగా ఘర్షణాత్మక పరిస్థితులు కల్పించేందుకు... ముందుగానే పోలీసులను మోహరించేలా వీసీ అప్పారావు, ఆయనకు సన్నిహింతంగా ఉండే సహోద్యోగులు పథకం ప్రకారం వ్యవహరించారని సమాచారం. 
అప్పారావు విధుల్లో తిరిగి చేరే విషయం గోప్యం 
వీసీ అప్పారావు విధుల్లో తిరిగి చేరే విషయాన్ని చివరి వరకు గోప్యంగానే ఉంచారు. కన్హయ్య జేఎన్‌యూ నుంచి మొదటిసారిగా హెచ్‌సీయూ వస్తున్నందున.. ఆయన పర్యటనను విఫలం చేసేందుకు... వీసీగా  బాధ్యతలు చేపట్టే విషయాన్ని రహస్యంగా ఉంచారని భావిస్తున్నారు. తన రాక సందర్భంగా ఎవరెవరు ఏయే కార్యక్రమాలు చేయాలన్న విషయాలపై అప్పారావు కింది ఉద్యోగులకు పంపిన   ఈ-మెయిల్స్‌ లీకయ్యాయి. ఇప్పుడు ఇవి విద్యార్ధులు చేతుల్లో ఉన్నాయి. 
అప్పారావు పంపించిన మరో ఈ-మెయిల్‌ బహిర్గతం 
యూనివర్సిటీ ఉద్యోగి కృష్ణరామ్‌ చేయాల్సిన విధులను నిర్దేశిస్తూ అప్పారావు పంపించిన మరో ఈ-మెయిల్‌ బయటపడింది. తనను తీసుకొచ్చేందుకు విజయ, ఏఆర్‌ రెడ్డి మంగళవారం ఉదయం 8 గంటల కల్లా సిద్ధంగా ఉండాలని ఈమెయిల్‌లో తెలుస్తోంది. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు.  వీసీ లాడ్జ్‌కి తీసుకెళ్లేందుకు ఆఫీసు డ్రైవర్‌తో మాట్లాడి  ఉదయం 8 గంటల రెడీ చేయాలని కోరారు. కేఆర్‌కు  డ్రైవర్‌ రిపోర్టు  చేయాలని సూచించారు. మంగళవారం ఉదయం 8.15 గంటలకు విజయ, ఏఆర్‌ రెడ్డితో కలిసి అప్పారావు లాడ్జికి చేరుకున్నారు. అప్పారావు బాధ్యతలు తీసుకుంటున్న వీసీ సెక్రటేరియట్‌ 8.30 గంటలకు సీఎన్‌ఎఫ్‌కు మెయిల్‌ చేసింది. వీసీ లాడ్జిలో  10 గంటలకు డీన్స్‌, సీఐఎస్‌ డైరెక్టర్‌, డీఎస్‌డబ్ల్యూ, రిజిస్ట్రార్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో  సమావేశం ఉన్నట్టు 8.30 గంటలకు ఈ- మెయిల్‌ పంపారు. అప్పారావు బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏఆర్‌ రెడ్డి 8.35 గంటలకు వీసీ సెక్రటేరియట్‌కు మెయిల్‌ పంపారు. దీనికి సంబంధించిన ప్రెస్‌నోట్‌ను 8.40 గంటలకు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఉదయం 11.30 గంటలకు మీడియా సమావేశం ఉన్నట్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉదయం 9.30 గంటలకల్లా విద్యార్ధుల క్యాంటీన్‌ నుంచి 150 స్పెషల్‌ టీతో పాటు, వాటర్‌ బాటిల్స్ తెచ్చే విధంగా 8.45 గంటలకు ఆర్డర్‌ ఇచ్చారు. 
అధ్యాపక సహోద్యోగులు చేయాల్సిన కార్యక్రమాలను అప్పారావు నిర్దేశం
అధ్యాపక సహోద్యోగులు చేయాల్సిన కార్యక్రమాలను కూడా అప్పారావు నిర్దేశించారు. రాజశేఖర్‌, రాజగోపాల్, ఏఆర్‌రెడ్డి, దయానంద్‌, ప్రకాష్‌బాబు, సంజయ్‌ సుబోధ్‌ ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో కలవాలని అప్పారావు ఆదేశించారు. కొద్దిగా ఆలస్యమైతే 8.05 గంటలకు చిన్న గేటు దగ్గర కలవాలని కోరారు. వీసీ చార్జి తీసుకున్నట్టు ఎన్‌ఎస్‌టీ నాయకులు గంగరాజు, నిరంజన్‌రెడ్డి, శివయ్య, పరశురామ్‌, రఘురామ్‌, నాగార్జున, డేవిడ్‌ రాజు, సూర్యనారాయణరాజు తదితరులకు చెప్పాలని 8.15 గంటలకు రాజ్‌గోపాల్‌ను ఆదేశించారు. ఈ విద్యార్ధులను మధ్యాహ్న భోజనానికి హాజరయ్యే విధంగా సమన్వయం చేయాలని కోరారు. విధుల్లో చేరే సమయంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తితే రమేష్‌, రమణకుమార్‌, కార్తీకేయల మద్దతు ఇచ్చే విధంగా చూడాలని 8.30 గంటలకు  ప్రకాష్‌బాబును ఫోన్‌లో ఆదేశించారు. సీహెచ్‌వీఆర్‌ పద్మజ, నరేష్‌, అనిల్‌, కృష్ణవేణి  మంగళవారం 9 గంటలకు వీసీ లాడ్జికి వచ్చే విధంగా చూడాలని  ఉదయం 7.30 గంటలకు రాజగోపాల్‌ను కోరినట్టుగా మెయిల్లో ఉంది. హోలీ సందర్భంగా ఈనెల 24న జరగాల్సిన అకడమిక్‌ కమిటీ మీటింగ్‌ వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని సంజయ్‌ సుబోధ్‌ను కోరారు. అలాగే  విపిన్‌ శ్రీవాస్తవ, అలోక్‌ పాండే ఉదయం 9 గంటలకు  సొంతంగా వీసీ లాడ్జికి వచ్చేలా చూడాలని కూడా మెయిల్స్‌ లో ఉంది. భావసారూప్యత ఉన్న అధ్యాపకులు ఉదయం 9.30 గంటలకు వీసీ లాడ్జికి చేరుకునేలా సమన్వయం చేయాలని సురేష్‌, గోపీనాథ్‌, రామాచారి, వాసుకిలను కోరారు. వీసీ లాడ్జి దగ్గర ఏర్పాటు చేయాల్సిన టెంట్‌ పనులను సమన్వయపరిచే బాధ్యతలను రాజ్‌గోపాల్‌కు అప్పగించారు. వీసీ లాడ్జి ప్రిడ్జ్ లో ఉంచాల్సిన పాలు, నీళ్ల బాటిళ్ల నుంచి పేపర్‌ పేట్ల వరకు ఎవరెవరు ఏయే సమయంలో ఏ  పనులు చేయాలన్న అంశంపై సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు వెళ్లాయి. 
కన్హయ్య రాకను రసాభాసగా మార్చేందుకు కుట్ర 
ఇదంతా చూస్తూంటే జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ హెచ్‌సీయూ సందర్శన కార్యక్రమాన్ని రసాభాసగా మార్చేందుకు పెద్ద రాజకీయ కుట్ర జరిగిందని అనుమానించాల్సి వస్తోంది. 

 

07:19 - March 24, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో పోలీసులు కొనసాగిస్తున్న దమనకాండపై  విద్యావేత్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. వీసీ అప్పారావు సెలవు నుంచి తిరిగొచ్చిన వెంటనే గొడవలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు  హాస్టళ్లను మూసివేసి నీరు, విద్యుత్‌ నిలిపివేయడం.. విద్యార్ధుల హక్కులను కాలరాయడమే అవుతుందని విమర్శిస్తున్నారు.  
విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణం : కోదండరాం 
హెచ్‌సీయూ విద్యార్ధులపై దఫదఫాలుగా పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తప్పు పట్టారు. యూనివర్సిటీ అధికారులు హాస్టళ్లను మూసివేసిన దరిమిలా వంటవార్పు చేసుకుంటున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. 
వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో అశాంతి : వీహెచ్
హెచ్‌సీయూకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీసీ అప్పారావు రాకతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిందని వీహెచ్‌ మండిపడ్డారు. 
అలజడికి సంఘ్‌ పరివార్‌ శక్తులే కారణం : జేడీ శీలం 
హెచ్‌సీయూలో అలజడికి సంఘ్‌ పరివార్‌ శక్తులు కారణమని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. విద్యావ్యవస్థలో మతోన్మాదుల జోక్యం  పెరగడంతోనే యూనివర్సిటీల్లో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
అరెస్టు చేసిన విద్యార్ధులను విడుదల చేయాలి : కాంగ్రెస్ 
హెచ్‌సీయూ ఘటనలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం... డీజీపీ అనురాగ్‌ శర్మను కలిసి వినతిపత్రం అందచేశారు. అరెస్టు చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ  విషయాల్లో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తెచ్చారు. 

 

నేడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మహిళా జట్లు ఢీ

న్యూఢిల్లీ : మహిళా టీ.20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఢీకొననున్నాయి. న్యూఢిల్లీలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

నేడు ఇంగ్లండ్-వెస్టిండీస్ మహిళా జట్ల మ్యాచ్

హిమాచల్ ప్రదేశ్ : మహిళా టీ.20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఇంగ్లండ్-వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. 

నేడు ఆస్ట్రేలియా-శ్రీలంక మహిళా జట్ల మ్యాచ్

న్యూఢిల్లీ : మహిళా టీ.20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

Don't Miss