Activities calendar

25 March 2016

21:33 - March 25, 2016

మొహాలీ : 2016 టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్లోనే మాజీ చాంపియన్ పాకిస్థాన్ పోటీ ముగిసింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ -2 నాలుగోరౌండ్ పోటీలో ఆస్ట్రేలియా 21 పరుగులతో పాక్ జట్టును చిత్తు చేసింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సమాధానంగా 194 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టు...మీడియం పేసర్ జేమ్స్ ఫాక్నర్ స్వింగ్ మ్యాజిక్ లో కొట్టుకుపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు ఓటమితో...పాక్ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ కంట తడిపెట్టుకొనీ మరీ...తన క్రికెట్ కెరియర్ ముగించాడు.

ఎన్ఎస్పీ కుడి కాల్వపై సీఈ పర్యటన..

గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వపై ఎన్ ఎన్ పీ సీఈ వీర్రాజు పర్యటించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి చెరువులకు రెండు వారాల పాటు సాగర్ జలాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

మన్ కీ బాత్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ నిబంధనలతో కూడిన అనుమతినిచ్చింది. ఈ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ కు కట్టుబడి ఉండాలని తెలిపింది. 

21:22 - March 25, 2016

హైదరాబాద్ : ఈనెల 30 తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశం జరుగనుంది. తెలంగాణ నూతన జల విధానంపై.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో జల వనరులు, నూతన ప్రాజెక్టుల వివరాలను ఉభయ సభల సంయుక్త సమావేశం ముందు ఉంచుతారు. ఈ సమావేశం గురించి తెలియచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌... గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణలో భూములను సస్యశ్యామలం చేసేందుకు సుదీర్ఘ కసరత్తు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ నూతన జల విధానానికి తుదిరూపు ఇచ్చింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించిన కొత్త జల విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌కు వివరించారు.

6 గంటల పాటు సీఎం కేసీఆర్‌ ప్రసంగం..
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ నీటి కేటాయింపులను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో జల విధానాన్ని తీసుకొచ్చినట్టు కేసీఆర్‌... గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులతోపాటు, నిర్మాణంలో ఉన్నవాటి వివరాలు, భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌ల గురించి కొత్త జల విధానంలో పొందుపరిచారు. ఈనెల 30న జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో సీఎం అన్ని వివరాలను వెల్లడిస్తారు. కేసీఆర్‌ ఏకధాటిగా 6 గంటలు ప్రసంగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మహా ఒప్పందాలు..
గోదావరి నదిపై చేపట్టనున్న ఆరు బ్యారేజీల వివరాలను కూడా ఉభయ సభల ముందు ఉంచుతారు. ఇందుకోసం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను విశదీకరిస్తారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో వివరిస్తారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల రీ-డిజైనింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో సంయుక్త సమావేశం దృష్టికి తెస్తారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను కేసీఆర్‌ ఈ సమావేశాల్లో తిప్పికొట్టే అవకాశాలున్నాయి. ఏయే ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తవుతాయన్న విషయాలను నూతన జల విధానంలో పొందుపరిచారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు అందించే పథకాలు గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు... కేసీఆర్‌ వివరిస్తారు. జంటనగరాలకు మంచినీరు అందించేందుకు రూపొందించిన ప్రణాళికలను కూడా ఉభయసభల సంయుక్త భేటీలో వివరిస్తారు. 

21:19 - March 25, 2016

హైదరాబాద్ : పోలీసులు మరోసారి పెట్రేగి పోయారు. మౌనంగా దీక్ష చేస్తున్న విద్యార్థినులపై దాష్టీకానికి తెగబడ్డారు. అమ్మాయిల జుట్టు పట్టి లాగుతూ.. ఈడ్చుకు వెళుతూ.. భయోత్పాతాన్ని సృష్టించారు. ఈ దురాగతం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. రెండురోజుల క్రితం వీసీ అప్పారావు బస చేస్తున్న అతిథి గృహం వద్ద.. ధర్నాకు దిగిన వర్సిటీ విద్యార్థినులపై మహిళా పోలీసులు జులుం ప్రదర్శించారు. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తూ.. మాటలతో తూలనాడుతూ.. చేతులతో బాదుతూ.. వెనకనుంచి కిందకు పడేలా తోసేస్తూ.. దాష్టీకాన్ని ప్రదర్శించారు. పోలీసుల చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలా ప్రదర్శించారో వీడియోలో చూడండి. 

21:17 - March 25, 2016

ఢిల్లీ : హెచ్ సీయూలో తాజా పరిస్థితులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. హెచ్ సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్య, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు. గత నెల 17 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ప్రణబ్‌ దృష్టికి తెచ్చారు. హెచ్‌సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని కోరారు. హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ హిందూ రాష్ట్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మారకుండా చూడాలని సీతారాం ఏచూరి విన్నవించారు. 

21:15 - March 25, 2016

హైదరాబాద్ : వీసీ అప్పారావుపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. హెచ్‌సీయూలో ప్రస్తుత పరిస్థితికి వీసీ నిరంకుశ వైఖరే కారణమని పలువురు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు అంటున్నారు. మరోవైపు తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన అప్పారావుపై చర్యలు తీసుకోవాలని రోహిత్‌ వేముల తల్లి రాధిక డిమాండ్‌ చేస్తున్నారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు నియంతృత్వ తీరుపై ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. వీసీ అప్పారావు ఆదేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు యూనివర్సిటీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో విద్యార్ధులపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేసి.. అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదంటున్నారు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినా ఇంతవరకు వీసీ అప్పారావును ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

కారకులపై చర్యలేవి ?
మరోవైపు తన కుమారుడి ఆత్మహత్య చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా కారకులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రోహిత్‌ వేముల తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వీసీ అప్పారావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. తమకు అండగా నిలుస్తున్న విద్యార్థులపై పోలీసులు అకారణంగా దాడి చేసి.. అరెస్టులు చేస్తున్నారంటున్నారు రాధిక. ఇంకోవైపు.. అరెస్టయిన ప్రొఫెసర్‌ రత్నం సతీమణి జయ కూడా వీసీ అప్పారావు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పారావును అరెస్ట్‌ చేయకపోవడం వల్లే.. ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టడం.. ఫలితంగా వర్సిటీ ఉద్రిక్తంగా మారడం జరిగిందని జయ ఆరోపిస్తున్నారు. తన భర్త ప్రొఫెసర్‌ రత్నంను అరెస్ట్‌ చేసినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. పోలీస్‌స్టేషన్ల చుట్టు తిరిగినా ఆయన సమాచారమే చెప్పలేదన్నారు. ఫ్యాకల్టీకే ఈ పరిస్థితి ఉంటే విద్యార్ధులకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చని జయ తెలిపారు.

ప్రశాంత వాతావరణం ఉండాలి..
వేముల రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో వీసీ అప్పారావు విధుల్లో చేరడాన్ని విద్యా పరిరక్షణ కమిటీ తప్పుపట్టింది. మొత్తానికి హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి వీసీ అప్పారావే కారణమని బయటి వారే కాదు.. అక్కడ పనిచేస్తున్న వారూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని వారు కోరుతున్నారు. 

21:08 - March 25, 2016

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. సొంత నిర్వచనాలతో, సొంత విలువల కోసం దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. మరి, దేశం ఇప్పుడు అలాంటి సంక్షుభిత పరిస్థితిలోనే ఉందా? యూనివర్సిటీల సాక్షిగా సాగుతున్న దమనకాండలేం చెప్తున్నాయి? ఇలాంటి సందర్భంలో కన్నయ్య లాంటి విద్యార్ధి నేత నినాదాలేం చెప్తున్నాయి? దీనిపై ప్రత్యేక కథనం..

మూల ఘటనలేంటీ ?
మాకు స్వాతంత్ర్యం కావాలి. అవును ముమ్మాటికీ మాకు ఆజాదీ కావలసిందే. అది దేశం నుంచి కాదు.. దేశం లోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యల నుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఇదీ కన్నయ్య ఉద్ఘాటిస్తున్న వాదనలు. రెండు నగరాలు.. రెండు వేదికలు..ఆ ఒక్కడే అందర్నీ రప్పించాడు.. ఆ ఒక్కడే కొత్త స్ఫూర్తిని నింపాడు..ఆ ఒక్కడే ఒక సైన్యంలా ఫాసిస్టు శక్తులపై విరుచుకుపడ్డాడు.. అసలైన దేశభక్తి అంటే ఏమిటో విడమర్చి చెప్పాడు..కొందరు తమకు తామే అపర దేశభక్తులమని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరికొందరిపై దేశద్రోహులని ముద్రవేస్తున్నారు. ఏది నిజమైన దేశభక్తి ? కన్నయ్యకు కావలసిందేమిటి? దేశభక్తి గురించి కన్నయ్య ఇస్తున్న నిర్వచనం ఏంటి? తెలుగు రాష్ట్రాల పర్యటనల్లో కన్నయ్య ఏం చెప్పాడు? అసలీ పరిణామాలకు మూల ఘటనలేంటి?

భావజాలాన్ని విమర్శిస్తే దేశ ద్రోహులా ?
తమ భావజాలాన్ని విమర్శిస్తే చాలు దేశద్రోహులుగా ముద్రవేసి, తమకు తాము దేశభక్తులుగా చిత్రించుకునే పరిణామాలు సాగుతున్నాయి. ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులుగా చెలామణి కావాలంటే ఆరెస్సెస్ వాదులు సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నట్టు పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నాయి. ఎర్రజెండా అనుక్షణం ఈ దేశం కోసం పాటుపడింది. బాబాసాహెబ్ అణగారిన ప్రజల విముక్తి కోసం ఎంతో తపించాడు. ఈ రెండు శక్తుల స్ఫూర్తిని కలగలిపి కన్నయ్యలాంటి విద్యార్ధులు ముందుకు సాగుతున్నారు. నేటి సమస్యనుండి పుట్టిన రేపటి హీరోని అడ్డుకోటానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ, కన్నయ్య పెయిడ్ ఆర్టిస్ట్ కాదు.. కడుపు కాలి వేదికపై నినదిస్తున్న నవయువకుడు. దేశం మీద ప్రేమతో, భక్తితో పోరు సల్పుతున్న ఉద్యమకారుడు. నేడు, రేపు కన్నయ్య లాంటి నవ యువకులదే. అలాంటి హీరోలే నిబద్ధతతో, నిజాయితీతో పోరాట పథంలో సాగితే ఎర్రజెండా రెపరెపలు, బాబా సాహెబ్ కలలు సాకారమయ్యే రోజులు సమీపంలోనే ఉంటాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి. 

20:52 - March 25, 2016

గూగుల్ మాప్స్ లో "ఆంటినేషన్" అని అనే పదం తో సర్చ్ చేస్తున్నారా ? వచ్చే రిజల్ట్ చూసి ఆశ్చర్య పోవాల్సిందే.. ఎందుకంటే ఆ పదంతో గూగుల్ మాప్స్ లో శోధిస్తే 'ఢిల్లి జవహర్ లాల్ విశ్వవిద్యాలయం' (jnu) లొకేషన్ ప్రత్యక్షమవుతోంది. ఈ విషయాన్నీ జేఎన్ యూ విద్యార్థులు శుక్రవారం గమనించి,  గూగుల్ అధికారులకు తెలియచేశారు. దీనిని వెంటనే పరిష్కరించాలని గూగుల్ అధికారులను కోరారు. హాకర్లు చేసిన పనై ఉంటుందని గూగుల్ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇది ఎలా జరిగిందో కనుక్కొంటామని, సమస్యను పరిష్కరిస్తామని వారు తెలిపారు.

కొద్దిరోజులుగా వివాదం..
గత కొద్ది రోజుల నుండి జేఎన్ యూ వివాదం దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో జాతి వ్యతిరేకత పై ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్యతో పటు మరి కొందరి విద్యార్థులు పై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. జైలు నుండి కన్హయ్య ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని అడ్డుకునేందుకు మతోన్మాదులు కుట్రలు రచిస్తున్నారు. దాడులు చేసినా, కేసులు పెట్టినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడం మతోన్మాదులు సహించలేక పోతున్నారని జేఎన్ యూ విద్యార్థులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇంటర్నెట్ లో ఈ పనికి ఒడిగట్టింది బీజేపి, ఆర్ఎస్ఎస్ వారేనని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దేశద్రోహం, రాజద్రోహం, భారత్ మాతాకి జై, దేశభక్తి అనే పదాలతో శోధిస్తే జేఎన్ యూ లోకేషన్ ప్రత్యక్షమవడం ఖచ్చితంగా మతోన్మాదుల కుట్రేనని విద్యార్థులు మండిపడుతున్నారు. దీనిని గూగుల్ అధికారులు పరిష్కరిస్తారా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

రాష్ట్రపతితో ముగిసిన ఏచూరి భేటీ..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. హెచ్ సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ను కోరినట్లు తెలిపారు. హెచ్ సీయూ ఘటనలో జోక్యం చేసుకుంటానని రాష్ట్రపతి చెప్పారని ఏచూరి తెలిపారు. హెచ్ సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని, వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని కోరితే తమకు సంబంధం లేదని హెచ్చార్సీ చెప్పిందని పేర్కొన్నారు. హెచ్ సీయూ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ ఘటనలో కేసీఆర్ కు లేఖ రాస్తే స్పందన లేదన్నారు. 

45 గ్రామాల్లో తాగునీటి సమస్య - మంత్రి పరిటాల..

అనంతపురం : 45 గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉందని, తాగునీటి కోసం ఖర్చుకు వెనుకాడమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. పశువులకు కూడా తాగునీటి సమస్య రాకుండా గ్రామాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా 'మీ ఇంటికి మీ రేషన్' విధానాన్ని అనంతలో ప్రారంభిస్తామన్నారు. 

ఐవీ ప్యాలెస్ లో ఏదీ దేశభక్తి అంశంపై సదస్సు...

విజయవాడ : ఈనెల 27వ తేదీన ఏదీ దేశ భక్తి అనే అంశంపై ఐవీ ప్యాలెస్ లో సదస్సు జరగనుంది. 18 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. 

20:34 - March 25, 2016

మీరు ఎన్నడన్న పెదరాయుడు మసాల దోష తిన్నరా.. పోనీ.. అసెంబ్లీ రౌడీ దోష.. అదిగుడ తినలేదా..అయ్యో సరె గని.. అల్లుడు గారు పూరి తిన్నరా.. పూరి గుడ తినలేదా.. అదంత కాదు గని రౌడీ వడ తిన్నరా.. తిన్లే.. ఇవ్వన్ని గాదు బ్రహ్మ కాపీ తాగిండ్రా.. అయ్యో.. కాపీ గుడ తాగలేదా.. ఏంది మల్లన్న టిఫిన్లకు కొత్త కొత్త పేర్లు వెట్టి తమాష జేస్తున్నవా అంటరా.. తమాష గాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు వోటల్ వెట్టిండట.. అండ్లనే ఉన్నయి ఇవ్వన్ని..విశేషాల కోసం వీడియో చూడుండి. 

20:31 - March 25, 2016

సుక్కురారం ఎన్క వొక శరిత్ర వున్నది. అందుకే దాన్ని గుడ్ ప్రైడే అంటరట.. ఆ డబల్ బెడ్రూం ఇండ్ల కోసం కండ్లళ్ల వత్తులేస్కోని ఎదురు సూస్తున్నోళ్లు ఎవ్వలున్నరో వాళ్లదే ఈ ముచ్చట..పాలమూరు జిల్లా రైతులు ఏం జేస్తున్నారు..ఆడోళ్లను గుర్రాలతోని తొక్కిచ్చిన ఘనత వొక్కటే శంద్రాలు శరిత్రల బండ గుర్తు లెక్క నిలిచిపోతదేమో అన్కుంటే.. తొక్కిచ్చుడు వొక్కటే గాదు ఆడోళ్లను భయ భ్రాంతులకు గురి చేసుడు..మాజీ ఎమ్మెల్యే చూచి రాతలు..ఆఫీసులోనే మద్యం సేవిస్తున్న అధికారి.. పంతులుకు కష్టమొస్తె ఎవ్వలికి జెప్పుకోవాలే.. మంచినీళ్ల కోసం జనం తన్లాడుతున్నరట..పెదరాయిడి దోశలు..తదితర అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చటు' కార్యక్రమంలో మల్లన్న తనదైన శైలిలో ముచ్చట్లు చెప్పిండి. మరి ఆ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

తిరుమల జింకల పార్కు వద్ద అగ్నిప్రమాదం..

చిత్తూరు : తిరుమలలోని జింకల పార్కు వద్ద విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

బీజేపీ సీఈసీ సమావేశంలో పాల్గొన్న మోడీ..

ఢిల్లీ : బీజేపీ సీఈసీ సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతం పలికారు. 

20:08 - March 25, 2016

సోము వీర్రాజు..బీజేపీ ఎమ్మెల్సీ..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్..బీజేపీ, తెలుగుదేశం బంధం కలకాలం ఉంటుందా ? రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి ? ఏపీ రాజధాని అంశంలో కేంద్రం ఇచ్చే నిధులు..పోలవరం నిర్మాణం..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో చేరుతారా ? 2019 సంవత్సరంలో బీజేపీ సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఉంటారా ? తదితర అంశాలపై టెన్ టివితో సోము వీర్రాజు విశ్లేషించారు. మరి ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

సౌతాఫ్రికా 34/3..

నాగ్ పూర్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. 4.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. 

రాష్ట్రపతితో ఏచూరి భేటీ..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. హెచ్ సీయూ ఘటనపై రాష్ట్రపతితో ఏచూరి చర్చించారు.

 

సౌతాఫ్రికా 13/1..

నాగ్ పూర్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. 1.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. 

19:38 - March 25, 2016

హైదరాబాద్ : ఏ రకంగా చూసినా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌ రాష్ట్రానికి పెను భారమేనన్నది ఇంజనీర్ల బృందం నిశ్చితాభిప్రాయం. భూసేకరణ, పరిహారం చెల్లింపు.. టన్నెళ్ల మూసివేత తదితర అంశాల్లోనే కాదు.. విద్యుత్‌ పరంగానూ రీ-డిజైనింగ్‌ పెను భారం కానుందని ఇంజినీర్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో హెచ్చరించారు. రీ-డిజైనింగ్‌ పుణ్యమా అని అదనపు విద్యుత్‌ వినియోగం వల్ల ఖజానాకు 450 కోట్ల రూపాయలకు పైబడే భారం పడబోతోందని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అయినా ప్రభుత్వం రీ-డిజైనింగ్‌కే మొగ్గు చూపడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విద్యుత్‌ వినియోగంపై పలు అంశాల ప్రస్తావన..
మరి ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌పై ఇంజనీర్ల బృందం ఆ నివేదికలో చాలా అంశాలను వివరించింది. రీ డిజైన్‌ వల్ల ఎంతమొత్తంలో అదనంగా ఖర్చు కానుందో అందులో పొందుపరిచింది. మొత్తానికి కొత్త డిజైన్‌ వల్ల విద్యుత్‌ వినియోగంపరంగానూ రాష్ట్రంపై విపరీతమైన భారం పడుతుందని ఇంజినీర్లు ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. నివేదికలోని 13 పేజీలో కొత్త విధానం వల్ల వచ్చే కరెంటు కష్టాలను వివరించారు. కనీసం 400 మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరం అవుతుందని ఇంజినీర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అంత విద్యుత్ కావాలంటే కనీసం 2400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని... ప్రతి యూనిట్ కు 5 రూపాయల చొప్పున, నీరు లభించే 90 రోజులు లెక్క వేసుకున్నా కనీసం 420 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి భారమే..
ఇక నిర్వహణ ఖర్చులు ప్రతి ఏడాదీ 5 శాతం పెరగనున్న దృష్ట్యా మరో 120 కోట్ల రూపాయలే కాకుండా ఇతారత్ర ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు ఒకటో రెండు సంవత్సరాలు కాకుండా..ప్రాజెక్టు ఉన్నంత కాలం భరించాల్సి రావడం ప్రభుత్వానికి భారమని ఇంజినీర్లు తెలిపారు. ఇలాంటి వ్యయభారాలను దృష్టిలో ఉంచుకుని పాత డిజైన్ లోనే ప్రాజెక్టును నిర్మించాలని సలహా లిచ్చారు. మొత్తానికి ప్రభుత్వ వాదనకు భిన్నంగా ఇంజినీర్ల నివేదిక ఉంది. ఏ విధంగా చూసినా ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్‌ రాష్ట్రానికి ప్రయోజనకరం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. 

19:35 - March 25, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని ఇంజినీర్ల బృందం విస్పష్టంగా సూచించింది. రీ-డిజైనింగ్‌ వల్ల.. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లుతుందో కూడా ఈ బృందం తమ నివేదికలో వెల్లడించింది. ప్రాణహిత-చేవెళ్ల రీ-డిజైనింగ్‌ వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందనీ హెచ్చరించింది. ప్రభుత్వ వాదనకు పూర్తి భిన్నంగా ఇంజనీర్ల నివేదిక ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌ తెలంగాణకు ఉపయోగకరం కాదని ఇంజినీర్ల బృందం సూచించింది. నివేదికలోని 12 వ పేజీలో 5 వ పాయింట్ ఆ విషయాన్ని తేట తెల్లం చేస్తుంది. ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల నిర్మాణం అంత సులువు కాదని పేర్కొంది. కొండలు గుట్టలు, టన్నెళ్లు దాటి..బొగ్గు గనుల గుండా గోదావరి జలాలు ప్రవహించడం అసాధ్యమని స్పష్టం చేసింది. మధ్యలోనే విరమించుకోవడమో లేక...ఎప్పడు పూర్తి అవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ఈ ప్రయాస రాష్ట ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదని ఇంజనీర్లు సూచించారు.

విబేధించిన ఇంజినీర్లు...
ఇక ప్రాజెక్టు వ్యయం విషయంలోనూ ప్రభుత్వ వాదనతో ఇంజనీర్లు విభేదించారు. రీడిజైన్ రాష్టానికి ఎలా భారం కానుందో లెక్కలతో సహ వివరించారు. కొత్త డిజైన్‌ ప్రకారం మేడి గడ్డ బ్యారేజీ నిర్మాణం.. అక్కడ నుంచి మిడ్ మానేరు వరకు జరిగే పనులకు కనీసం 24 వేల కోట్ల ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. పాత డిజైన్ ప్రకారం ప్రాణహిత వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు మిడ్ మానేర్ వరకు అన్ని పనులనూ 15 వేల 634 కోట్లలోనే పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. పాత కొత్త డిజైన్ల మధ్య తేడా 8 వేల 366 కోట్లు ఉంటుంది. ఇప్పటికే ఖర్చు చేసిన 6 వేల కోట్ల వ్యయం, పాత టన్నెళ్లను పూడ్చడానికి 1500 కోట్లు...ఇలా మొత్తం కలిపి 16 వేల కోట్లు రూపాయలు అదనంగా ఖర్చు కానుందని నివేదికలో పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమి, దానికి చెల్లించాల్సిన పరిహరం కలిపితే.. అది రాష్ట్రానికి పెను భారంగా మారుతుందని ఇంజనీర్లు నివేదించారు. 

19:33 - March 25, 2016

హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైనింగ్‌ వల్ల.. తెలంగాణకు నిజంగానే ప్రయోజనం ఉంటుందా..? మరి పాత రూపమే పర్ఫెక్ట్ అని విపక్షం ఎందుకు యాగీ చేస్తోంది ? నమూనా మార్చితే రాష్ట్రం నట్టేట మునిగి పోతుందని విపక్షం బల్లగుద్ది చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి..? ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైనింగ్‌.. రైతులకు కలిగించే ప్రయోజనం ఎంత..? రాష్ట్ర ప్రజలపై మోపే ఆర్థిక భారం ఎంత..? అసలు ఈ వ్యవహారంలో నిపుణులైన ఇంజినీర్లు ఏమంటున్నారు..? వారు సర్కారుకు అందించిన రహస్య నివేదికలో ఏముంది..? ఇంజినీర్లు సర్కారు వాదనకు సై అన్నారా..? విపక్షపు ఆందోళనే సరైందన్నారా..? ఇంతకీ నిప్పులాంటి ఆ నిజం ఏమిటి..?

కఠిన వాస్తవాలు..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌ వ్యవహారంపై తెలంగాణలో హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది. పాలక, ప్రతిపక్షాల మధ్యనైతే.. వాగ్యుద్ధమే జరుగుతోంది. పెద్దల జేబు నింపడానికే ప్లాన్‌ మార్చారని విపక్షం మండిపడుతుంటే... ఇరిగేషన్ ఇంజినీర్లు.. ఏరియల్‌ సర్వే నివేదిక ఆధారంగానే డిజైన్‌లో మార్పులు చేశామని సర్కార్‌ చెబుతోంది. ఇంతకీ, పాలకులు పదే పదే ప్రస్తావిస్తున్న ఇంజినీర్ల నివేదికలో ఏముంది..? నివేదిక చెబుతోన్న నగ్నసత్యం ఏంటి..? 10టీవీ చేతిలో ఉన్న ఇరిగేషన్‌ ఇంజనీర్ల నివేదిక ఎన్నో దిగ్భ్రాంతికరమైన కఠిన వాస్తవాలు వెల్లడిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌పై కాంగ్రెస్‌ వాదనలు చేస్తోంది. డిజైన్‌ మార్పు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ప్రధాన ప్రతిపక్షం అంటోంది.మరి రీడిజైనింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఏమి అంటున్నారు? పాత డిజైన్‌ను ఎందుకు మారుస్తున్నారు? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏమి చెప్పారు?

ఇంజినీర్ల నివేదికలో ఏముంది ?
రీ డిజైనింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాదించారు. ఇంజనీర్ల నివేదిక ఆధారంగానే నడుచుకుంటున్నామని సీఎం సభకు చెప్పారు. అసలు ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికలో ఏముంది..? రీడిజైనింగ్‌ను వారు సమర్థించారా...? ఇంజనీర్ల నివేదికలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టెన్ టీవీ. ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచిన ఇంజనీర్ల నివేదికను సంపాదించింది. దీనిపై ఐదుగురు ఇరిగేషన్ శాఖ సీనియర్ ఇంజనీర్లు సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రత్యేక హెలికాఫ్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహించి మరీ సమగ్ర నివేదికను రూపొందించారు. బీ అనంత రాములు, పీ వెంకట్ రామారావు, ఎస్ చంద్ర మౌలి, జీ దామోదర్ రెడ్డి, ఎం శ్యామ ప్రసాద్ రెడ్డి లు ఈ నివేదికను సిద్ధం చేశారు. నివేదికపై శ్యామ ప్రసాద్ రెడ్డి తప్ప మిగిలిన అందరు సంతకాలు చేసారు. ఐతే ఇంజనీర్లు సమర్పించిన నివేదిక ప్రభుత్వ వాదనకు పూర్తి భిన్నంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

14 పేజీల నివేదిక...
ఈ 14 పేజీల నివేదికలో పాత డిజైన్ నే కొనసాగించాలని ఇంజనీర్లు నివేదించారు. గోదావరి జలాల లభ్యత, గ్రావీటీ, ప్రాజెక్టు వ్యయం వంటి సాంకేతిక అంశాలను జోడిస్తూ పాత డిజైన్ కే జై కొట్టారు. పాత డిజైనే తెలంగాణకు రక్ష అని 11వ పేజీలో స్పష్టం చేశారు. ప్రాణహిత చేవేళ్ల పాత డిజైన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హట్టి ప్రాంతంలోనే ప్రాజెక్టు కట్టాలని...అది కూడా 152 మీటర్ల ఎత్తు ఉండేలా మహారాష్ట్రను ఒప్పించాలని సూచించారు. ఒక వేళ మహారాష్ట్ర అంగీకరించని పక్షంలో ఒక మీటర్ తగ్గించుకోవచ్చని.. దానికి కూడా మహారాష్ట్ర అంగీకరించకపోతే 150 మీటర్ల ఎత్తు వరకు కుదించుకోవచ్చని నివేదికలో సూచించారు. అప్పుడు ప్రాజెక్టు వ్యయం తగ్గటమే కాక సాగునీటి లభ్యతలోనూ తెలంగాణకు ఏలాంటి నష్టం ఉండదని ఇంజినీర్లు ఆ నివేదికలో తెలిపారు. 

టీఎస్ సీఎస్, సీఎస్ లకు ఎన్ హెచ్చార్సీ ఆదేశాలు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో హస్టల్స్ లో భోజనం, నీటి సరఫరా నిలిపి వేయడంపై మీడియాలో కథనాలను సుమోటోగా ఎన్ హెచ్చార్సీ స్వీకరించింది. హెచ్ సీయూలో అత్యవసర పరిస్థితిని తలపించేలా నిర్ణయాలు తీసుకోవడంపై ఎన్ హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలోగా నివేదిక ఇవ్వాలని టీఎస్ సీఎస్, హైదరాబాద్ సీపీలకు ఆదేశాలు జారీ చేసింది. 

టాస్ గెలిచిన వెస్టిండీస్..

నాగ్ పూర్ : టీ 20 వరల్డ్ కప్ లో గ్రూప్ 1లో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న సంక్షోభం..

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంక్షోభం తొలగిపోయినట్లు అనుకున్నప్పటికీ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. తాజాగా గవర్నర్ ఎన్ఎన్ వోరాతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఫ్తీ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ ను కలవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం వాయిదా పడింది. వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు.

మేకిన్ ఇండియాపై ఎగతాళి వద్దు - నిర్మలా సీతారామన్..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ఎగతాళి చేయవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీకి సూచించారు. 

18:57 - March 25, 2016

సినిమా అంటే మనం నమ్మిన అంశాన్ని తెరకెక్కించడం. అది రీమేక్ ఐనా....విదేశీ సినిమా ఐనా...ఈ నమ్మకమే ఫిల్మ్ మేకర్ కు కావాల్సింది. ఇలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమాలు నిరాశపర్చవు. పైగా కొత్త ప్రయత్నానికి ప్రశంసలు తెచ్చిపెడతాయి. కొంత తడబడినా...నాగార్జున కొత్త సినిమా ఊపిరి ఇలాంటి అప్రిషియేషన్స్ నే దక్కించుకునేలా ఉంది. ఫ్రెంచి ఫిల్మ్ ఇన్ టచబుల్స్ ని ఊపిరి పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. గతంలో ఫేస్ ఆఫ్ సినిమాను ఎవడు పేరుతో మన ప్రేక్షకులకు నచ్చేలా అడాప్ట్ చేసిన ఈ దర్శకుడు...ఇప్పుడు అలాంటి ప్రతిభనే చూపించాడు. సెకండాఫ్ లో కొద్దిగా కమర్షియల్ తప్పటడుగులు వేసినా....క్లైమాక్స్ వచ్చేసరికి ట్రాక్ లోనే నడిచాడు. కొత్త ప్రయత్నంతో ఆకట్టుకున్నాడు.

కథ..
ఇక ఊపిరి కథ విషయానికొస్తే విక్రమాదిత్య కోటీశ్వరుడు. ఓ ప్రమాదంలో ఇతని కాళ్లు చేతులు చచ్చుబడిపోతాయి. చక్రాల కుర్చీకి పరిమితమవుతాడు. జీవితాన్ని పోగొట్టుకున్నాననే బాధతో పాటు ఇతరులు చూపించే జాలి అతన్ని ఇబ్బందికి గురి చేస్తాయి. మాస్ ఏరియాలో పుట్టి పెరిగి అవారా లైఫ్ లీడ్ చేస్తున్న శీను విక్రమాదిత్యకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. తను ఎలా జాలీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడో..అలాగే విక్రమాదిత్యను చూసుకుంటూ అతనో అవిటివాడన్న ఆలోచనే రాకుండా చేస్తాడు. విక్రమాదిత్య ఏం చేయాలని అనుకుంటున్నాడో, ఏం కోరుకుంటున్నాడో అవన్నీ అతనితోనే చేయిస్తుంటాడు. జీవితంలోని సంతోషాలను పరిచయం చేస్తుంటాడు. దీంతో బాధనంతా మర్చిపోతాడు విక్రమాదిత్య. కానీ ఓ సందర్భంలో శీను విక్రమ్ ను వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులకు కారణం ఏంటి..విక్రమ్ లైఫ్ లోకి మళ్లీ శీను వచ్చాడా లేదా అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ...
రొమాటింగ్ హీరోగా ఇమేజ్ ఉన్న నాగార్జున వికలాంగుడి క్యారెక్టర్ చేయడం ఒక ఛాలెంజ్. ఈ పాత్రలో సహజంగా నటించాడు నాగ్. ఎక్కడా తన ప్రభావం కనిపించకుండా కేవలం విక్రమాదిత్యనే ప్రతిబింబించాడు. తన కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాల్లో ఊపిరి నిలవడం ఖాయం. ఇక సినిమాను నిలబెట్టిన మరో క్యారెక్టర్ కార్తీది. చూడగానే అవారా లక్షణాలతో ఉండే కార్తీ అదే పోలికలతో ఉన్న శీను క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. నాగ్ క్యారెక్టర్ భావోద్వేగాలు పలికిస్తే కార్తీ చలాకీగా నవ్వించాడు. తమన్నా కథకు తన గ్లామర్ జోడించింది. ఈ మూడు పాత్రలో ఊపిరి సినిమాకు ఊపిరిగా నిలిచాయి. దర్శకుడిగా వంశీ సక్సెస్ అయ్యాడు. ఐతే సెకండాఫ్ లో కొద్దిగా తప్పటడుగులు వేశాడు. మళ్లీ క్లైమాక్స్ కు తేరుకుని కథను ట్రాక్ లో పెట్టాడు. కొన్ని అవసర పాత్రలు కథలోని డెప్త్ ను తగ్గించాయి. మొత్తానికి ఊపిరి టాలీవుడ్ లో ఓ భిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుంది.

ఫ్లస్ పాయింట్స్
నాగార్జున, కార్తీ నటన
కథలోని భావోద్వేగాలు
హాస్య సన్నివేశాలు
దర్శకత్వం
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో నెమ్మదించిన కథనం
కొన్ని అనవసర పాత్రలు.

18:51 - March 25, 2016

తూర్పుగోదావరి : గోదారి తీరం సాక్షిగా ఆయనో పండుటాకు. జీవజలం పుష్కలంగా ఉన్న సమయంలో లక్షలాది మంది అన్నదాతలు అరక పడితే ఏడు పదుల వయసులో ఆ రైతు ఏరువాక విభిన్నంగా సాగుతోంది. తడారిపోయిన తల్లి గోదావరి గుండె గర్భమే పెట్టుబడిగా ఇసుక తిన్నెల్లో చలువ పళ్లు పండించే తీరు అబ్బురపరుస్తోంది. మండు వేసవిలో ఎడారి సాగు తమ వల్ల కాదంటూ సాటి రైతులు ఒక్కొక్కరుగా చేతులెత్తేసినా.. మలిసంధ్య వయసులోనూ గోదారమ్మ ఒడిలో చలువ పళ్లు సాగుచేస్తున్న ఒకే ఒక్కడిపై 10టీవీ ప్రత్యేక కథనం. నాగిరెడ్డి వెంకట్రావు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో తనకు పట్టాగా సంక్రమించిన గోదావరి ఇసుక లంక భూమిలో దేశవాళీ దోసకాయలను సాగు చేస్తున్నాడు. సీతానగరం మండలం పరిధిలోని లంకల భూ యజమానులంతా పుచ్చ, దోస సాగుకు స్వస్తి చెప్పినా.. ఆ భూమిపై ఉన్న మమకారంతో నాగిరెడ్డి ఇంకా సాగు చేస్తూనే వున్నాడు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దోస సాగు చేస్తున్న ఏకైక రైతుగా వెంకట్రావు నిలిచాడు.

ఆరోగ్యానికి ఎంతో మంచిది..
ఒకప్పుడు గోదావరి లంక భూముల్లో రైతులు విరివిగా సాగు చేసేవారు. గోదావరి ఎగువన ఉన్న ఈ ప్రాంతంలో ఇసుక తిన్నెల్లోని పొరల్లో దాగి ఉన్న నీటి చుక్కలు ఒండ్రుమట్టిని ఆధారంగా చేసుకుని చలువ పళ్లు పుచ్చకాయ, దోసకాయలను పండించేవారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలోని లంక భూములో.. ఏటా నవంబర్‌ నుంచి జూన్‌ మాసాల మధ్య దేశవాళీ పుచ్చ, దోసకాయలు పండించేవారు. అయితే కాలక్రమేణా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఈ సాగు అంతర్ధాన దశకు చేరుకుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఇసుక మాఫియా పంజా విసరడం కూడా ఈ చలువ పళ్ల సాగు అంతరించి పోయేందుకు కారణమైంది. ఒకరి వెంట ఒకరుగా ఎంతమంది ఈ సాగుకు దూరమైనా అన్ని కష్టాలనూ భరిస్తూ.. ఇసుక తిన్నెల్లో సేద్యానికి నేడు వెంకట్రావు ఒక్కడే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవడం విశేషం. వెంకట్రావు పండిస్తున్న దోసకాయలకు రాజమండ్రి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందంటున్నారు వ్యాపారులు. హైబ్రీడ్‌ కాయలతో పోలిస్తే వెంకట్రావు పండించే దోసకాయలు అరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.

జీవ వైవిధ్య సదస్సులో..
తూర్పు తీరంలో సాగు చేస్తున్న అరుదైన పంటల జాబితాలో ఈ పుచ్చ, దోసలు చేరాయి. గతంలో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిద్య సదస్సులో అంతరించుకుపోతున్న లంకల పంటల జాబితాలో వెంకట్రావు సాగు అంశం ప్రస్తావనకు వచ్చింది. 20 ఏళ్ల క్రితం వరకు లంక భూముల్లో విరివిగా రైతాంగం చేపట్టిన చలువ పళ్ల సాగు అంతరించిపోవడానికి గల కారణాలను ఆ సభలో విశ్లేషించారు. వేడిగాలుల ఉధృతితో లంకలోని భూముల్లోకి అడుగుపెట్టలేని పరిస్థితితో పాటు.. గోదావరి ఇసుక భూముల్లో దాగివున్న విలువైన ఖనిజ సంపదపై మైనింగ్‌ మాఫియా కన్నుపడడంతో కాలక్రమేణా ఈ సాగు తగ్గిపోయిందని నిపుణులు తేల్చారు. ఓ వైపు తరతరాల నుంచి వస్తున్న పంటను రక్షించేందుకు వెంకట్రావు ఒక్కడే తంటాలు పడుతుంటే.. మరోవైపు పలువురు వ్యాపారులు బెంగళూరు నుంచి హైబ్రిడీ రకాలను దిగుమతి చేసుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు లంక భూముల్లోని ఇసుక తిన్నెల్లో పండిన చలువపళ్లతో ఉపశమనం పొందిన ప్రజలు.. నేడు హైబ్రీడ్‌ పళ్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రోత్సాహం ఎక్కడ ? 
సంప్రదాయిక చలువ పళ్ల సేద్యాన్ని కాపాడేందుకు ఒంటరి పోరాటం చేస్తున్న వెంకటరావుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహమూ లభించలేదు. ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఇలాంటి సాగును రక్షించుకునేందుకు ఉద్యానవన శాఖ ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు లంక ఇసుక భూముల్లో కళకళలాడిన చలువ పళ్ల సేద్యం.. నేడు అంతరించిపోవడానికి గల కారణాలను తెలుసుకుని.. ఈ సాగును రక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గోదారి తీరంలోని తీగజాతి ఫలాల సాగు సంరక్షణపై దృష్టి సారించకపోతే వెంకట్రావుతోనే పళ్ల పాదులూ అంతరించేపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

18:45 - March 25, 2016

విశాఖపట్టణం : ఉక్కునగరం విశాఖలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది...ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు పోలీసుల పీకకు చుట్టుకుంటున్నాయి... కొందరు పోలీసు అధికారులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు..ఇక కొందరు బయటపడడం లేదు... కింది స్థాయి నుంచి పాలన గాడితప్పిందనడంలో పోలీసు విభాగంపై వస్తున్న విమర్శలే నిదర్శనం. సివిల్ కేసులు డీల్ చేయాలన్నా... మహిళను లొంగదీసుకోవాలన్నా.. అవినీతి సొమ్ము కూడబెట్టి కోట్లు జమచేయాలన్నా...ఉక్కునగర పోలీసును మించినవారు లేరేమో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాల్లో చిక్కకున్న విశాఖ పోలీస్‌ తీరు మారేదెన్నడు..??

ఏన్నో కేసులు...
స్మార్ట్‌ సిటీగా పేరొందిన విశాఖలో పోలీసింగ్ మాత్రం హార్డ్ గా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో కేసుల్లో పోలీసులు ఇరుక్కుపోయారు. కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలపై కొందరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అవినీతి నిరోధకశాఖ దాడుల్లో దొరికిపోవడంతో పోలీసుల అవినీతి బట్టబయలైంది. రోజుకో వివాదంలో విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ బాస్ లు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. నగర పోలీస్ వ్యవస్ధను దారిలో పెట్టాల్సిన పోలీస్‌ బాస్‌ పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అధికార పక్ష ఎమ్మెల్యేలు ఈ కమిషనర్‌ వద్దంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

పోలీసుల వ్యవహారంపై సర్వత్రా విస్మయం...
నగరంలో జరిగిన ఓ హిజ్రా మర్డర్‌ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇక సివిల్ తగాదాలు లేని పోలీసు స్టేషన్ లేదంటే నమ్మశక్యం కాదేమో. అవినీతి అరోపణలతో ఉక్కిరిబిక్కరవుతున్న విశాఖ పోలీసింగ్‌కు మరో షాక్. మధురవాడ ఎసిపి దాసరి రవిబాబు తనను మోసగించారంటూ ఓ మహిళ ఆందోళన చేపట్టడం పోలీసులను మరింత ఇరుకున పెట్టింది. ఇప్పటికే ఎన్నో అరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల వ్యవహారం మహిళ ఆందోళనతో మరింత చర్చనీయాంశమైంది. దళిత మహిళకు న్యాయం చేయాలంటూ ఐద్వా లాంటి సంస్ధలు ఆందోళనలు చేసాయి. ఎసిపి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన తీవ్రం చేయడంతో విషయం గ్రహించిన రవిబాబు 10 రోజుల సెలవుపై వెళ్ళిపోయాడు. అధికారుల తీరు ఇలానే ఉంటే రానున్న రోజుల్లో మరింత క్రేమ్ రేటు పెరిగే ప్రమాదం ఉందని సిటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీలో పోలీసులు మాత్రం అవినీతిలో చాలా స్మార్ట్ గా వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. విశాఖ పోలీసుల తీరుపై సర్కారు ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.

18:38 - March 25, 2016

ఛండీగఢ్ : టీ -20 వరల్డ్ కప్ లో కీలక పోరు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్..దీనితో ఆసీస్..పాక్ జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరకు పాక్ పై ఆసీస్ పై చేయి సాధించింది. శుక్రవారం గ్రూప్ 2లో భాగంగా పాక్, ఆసీస్ జట్లు ఢీకొన్నాయి. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అనంతరం విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ ఖాన్ రెచ్చిపోయి ఆడాడు. కానీ జట్టు స్కోరు 20 ఉండగా షెహజాద్ (1) అవుట్ అయ్యాడు. ఇక ఖాన్ కు లతీఫ్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. ఖాన్ వ్యక్తిగత స్కోరు (30) వద్ద పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం వచ్చిన అక్మల్ కూడా పోరాటే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోరు 85 రన్ల వద్ద అక్మల్ (30) వెనుదిరిగాడు. జట్టును కష్టకాలం నుండి గట్టెక్కిస్తాడని అనుకున్న ఆఫ్రిది (14) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. వికెట్లు పడుతున్నా మాలిక్ మాత్రం ఒంటరి పోరు చేశాడు. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాలిక్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (61 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు), మ్యాక్స్ వెల్ (30; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), షేన్ వాట్సన్ (44 నాటౌట్; 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. పరాజయం చెందిన పాక్ జట్టు టీ - 20 నుండి నిష్ర్కమించింది. 

18:27 - March 25, 2016

కర్నూలు : అదో ప్రభుత్వ ఆఫీసు..పలు గ్రామాలకు నీరందించే 'తెలుగు గంగ' పథకం కార్యాలయం..అందులో పనిచేసే వారు ఎలా ఉండాలి. బాధ్యతతో మెలగాల్సిన ఏఈ కార్యాలయంలో 'మందు' సేవించాడు. రికార్డు చేస్తున్నా ఏ మాత్రం బెదరని సదరు ఏఈ మందు సేవిస్తూ ఎంజాయ్ చేశాడు. తెలుగు గంగ ప్రాజెక్టు మూడో విభాగంలో ఏఈగా గణేష్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో సహచర సిబ్బందితో కార్యాలయంలోనే పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకుంది. దీనిని చూసిన ఇతరులు తుర్రుమన్నారు. కానీ గణేష్ రెడ్డి ఏ మాత్రం బెదరకుండా మందు సేవించాడు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎలా మందుకొట్టాడో చూడాలంటే వీడియో చూడండి. 

పాక్ ఓటమి..

ఛండీగఢ్ : టీ -20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ జట్టుపై ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు 172 పరుగులు చేసింది.

పాక్..7 బాల్స్ 34 పరుగులు..

ఛండీగఢ్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ ఓటమి అంచున నిలిచింది. ఏడు బాల్స్ లో 34 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ జట్టు 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ప్రస్తుతం మాలిక్ 33, అహ్మద్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

18:12 - March 25, 2016

విజయవాడ : అమరావతి..రాజధాని నిర్మాణంపై మూడు అంతర్జాతీయ సంస్థలు డిజైన్లను సమర్పించాయి. మాకీ అసోసియేట్స్ (జపాన్), రోజెస్ స్పిర్క్ హార్బర్ (లండన్), వాస్తు శిల్పి కన్సల్టెంట్ సంస్థ డిజైన్లను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మాకీ అసోసియేట్స్ డిజైన్ ను బాబు ఎంపిక చేశారు. శుక్రవారం రాజధాని నగర భవన నిర్మాణాలపై బాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టుతో పాటు పలు ముఖ్యమైన ప్రభుత్వ భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే విషయంలో గతంలో ప్రభుత్వం ఎంట్రీలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కేవలం భవనాలు, డిజైన్లను మాత్రమే ఎంపిక చేశారు. వారం రోజుల్లో మరొక రివ్యూ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. జులై నెల నుండి అమరావతి రాజధాని నగరం నుండి పరిపాలన జరుగుతుందని బాబు ఇదివరే చెప్పారు. అందుకనుగుణంగా దశల వారీగా ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణం - బాబు..

విజయవాడ : రాజధానిలో ప్రభుత్వ భవనాలకు సంబంధించిన డిజైన్లను మూడు అంతర్జాతీయ సంస్థలు మాకీ అసోసియేషన్ (జపాన్), రోజెస్ స్పిర్క్ హార్బర్ (లండన్), వాస్తు శిల్పి కన్సల్టెంట్ సంస్థ అప్పగించాయి. డిజైన్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం మాకీ అసోసియేట్ సమర్పించిన డిజైన్లకు బాంబు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతుందని బాబు తెలిపారు. 

లతీఫ్ 40 పరుగులు..పాక్ 123/4...

ఛండీగఢ్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ జట్టు 14.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ప్రస్తుతం లతీఫ్ 40, మాలిక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

పాక్ 104/3...

ఛండీగఢ్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ జట్టు 13 ఓవర్ ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ప్రస్తుతం లతీఫ్ 31, అఫ్రిది 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

పశ్చిమ బెంగాల్ లో పేలుడు ఒకరు మృతి..

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్లో ఈరోజు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందం గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సిద్ధిపేటలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

మెదక్ : సిద్ధిపేటలో మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఆరు వార్డుల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

హెచ్ ఎండీఏ లో గోల్ మాల్ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ : హెచ్ ఎండీఏ లో రూ.5.8 కోట్లు గోల్ మాల్ కేసులో ఓయూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.30లక్షలు, రూ.5 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, వాహనాలును పోలీసులు అరెస్టు చేసుకున్నారు.

ఖాన్ అవుట్..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ కు ధీటుగా బదులిస్తున్న పాక్ ఓపెనర్ ఖాన్ వెనుదిరిగాడు. ఆసీస్ నిర్ధేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి పాక్ ఓపెనర్లు ఆటను ఆరంభించారు. ఆరంభం నుండే ఎదురు దాడి చేశారు. ముఖ్యంగా ఓపెనర్ ఖాన్ రెచ్చిపోయి ఆడాడు. ఇతనికి లతీఫ్ చక్కటి సహకారం అందించాడు. జట్టు స్కోరు 40 స్కోరు వద్ద ఉన్నప్పుడు ఖాన్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. 

ప.గోదావరిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం: ప్రత్తిపాటి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ప్రవేటు రంగంలో అగ్రికల్చర్‌ బీఎస్సీ కోర్సుకు అనుమతిని ఇవ్వనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

17:10 - March 25, 2016

హైదరాబాద్ : మహా నగర అభివృద్ధి అథార్టీ (హెచ్ఎండీఏ) మరోసారి వార్తల్లోకెక్కింది. నిత్యం అవినీతి ఆరోపణలతో పత్రికల్లో పలు వార్తలు ప్రచురితమౌతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 5.8 కోట్ల మోసం చేసినట్లు గుర్తించారు. సెక్యూర్టీ ఏజెన్సీగా ఉన్న వ్యక్తులు ఈ డబ్బులు నొక్కేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ మోసాన్ని అకౌంటెంట్ గుర్తించినట్లు సమాచారం. పైస్థాయి అధికారులకు తెలియ చేయడం..తీగ లాగితే డొంకంత కదిలినట్లు అక్రమాలు బయటకు వచ్చాయి. చేయని పనులకు డబ్బులు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 30 లక్షల నగదు, రూ. 5 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం...

గుంటూరు : తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీ లో బీటెక్ విద్యార్థిని భవన్ పై నుండి దూకి ఆత్మహత్యకు యత్నించింది.  పరిస్థితి విషయమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

పాక్ 20/1..

ఛండీఘడ్ : టీ -20 వరల్డ్ కప్ లో ఆసీస్ విధించిన లక్ష్య చేధనలో బరిలోకి దిగిన పాక్ జట్టు ఒక వికెట్ ను కోల్పోయింది. 2.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన పాక్ 20 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. 

16:54 - March 25, 2016

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘వంగవీటి’. ఈ చిత్రంలో దేవినేని మురళి పాత్రలో ‘హ్యాపీడేస్‌’ ఫేం వంశీ చాగంటి నటిస్తున్నారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడిస్తూ...ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఉన్నది వంశీ అని వర్మ చెప్పే వరకూ అతడిని గుర్తు పట్టడం కష్టంగా ఉంది. అంతగా తనను తాను మార్చు కున్నారు నటుడు వంశీ. అభిమానులు సైతం ఈ ఫొటోకు అద్భుతం, ఆశ్చర్యంగా ఉంది అంటూ తెగ కామెంట్స్‌ పెట్టేశారు. ఈ విషయమై వర్మ స్పందిస్తూ.. ఈ క్రెడిట్‌ అంతా పాత్ర కోసం తనని తాను ఇంతగా మార్చుకున్న వంశీకే దక్కుతుందని ట్వీట్‌ చేశారు. మరో వంగవీటి రంగాజీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను తెలుసుకునేందుకు శుక్రవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వర్మను చూసేందుకు అధికసంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో భద్రత కోసం ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

16:43 - March 25, 2016

హైదరాబాద్ : టీ20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఈ నెల 19న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఇద్దరు భారతీయ విద్యార్ధులకు సమన్లు జారీ చేశారు. ఇద్దరు విద్యార్ధులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. కర్ణాటక మంగళూరు సమీపంలోని పుత్తూర్‌కు చెందిన సఫ్‌వాన్, అబ్దుల్ రషీద్ బికాం విద్యార్ధులు. మ్యాచ్ జరుగుతుండగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రాశారు. మెజిస్ట్రేట్ ముందు ఏప్రిల్ 28న మరోసారి ప్రవేశపెట్టాలని ఆదేశించారు. సెక్షన్ 107 కింద ఈ విద్యార్ధులపై చర్యలు తీసుకోనున్నారు.

ఆసీస్ భారీ స్కోరు..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో తలపడుతున్న ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఖజ్వా (21), ఫించ్ (15), వార్నర్ (9), మాక్స్ వెల్ (30) పరుగులు చేసి వెనుదిరిగారు. స్మిత్ 61, వాట్సన్ 44 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పాక్ బౌలర్లలో రియాజ్, వాసిమ్ లు తలా రెండు వికెట్లు తీశారు. 

16:37 - March 25, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆస్తుల విక్రయాలపై నియమించబడిన జస్టిస్ సీతాపతి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వాళ సమావేశమైన జస్టిస్ సీతాపతి కమిటీ.. వచ్చే నెల 20, 21 తేదీల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయించాలని నిర్ణయించింది. ఈ వేలం ద్వారా 6 అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రయాలు చేస్తే రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.
ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తులను విక్రయించి తమ సమస్యలను పరిష్కరించాలని గత కొన్నిరోజులుగా వారు కోరుతూ వస్తున్నారు. గతంలో కమిటీ సమావేశమైనా ఎక్కువ రేట్ కోట్ చేయడం వల్ల విక్రయాలు నిలిపివేశారు. మొత్తంగా ఉన్న 350 ఆస్తులలో ప్రధానంగా ఆరు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ ఆరు ఆస్తుల విక్రయాల విషయంలో టివి..వార్త పత్రికల్లో ప్రకటనలు విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. తదనంతరం పై ఆస్తులను అమ్మాలని కూడా నిర్ణయం తీసుకుంది. 

16:32 - March 25, 2016

విజయవాడ : రాజధాని ప్రాంత సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని ఏపీ పీసీపీ చీఫ్ రఘవీరా రెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంత రైతులతో రఘవీరారెడ్డి సమావేశమయ్యారు. రైతు సమైక్య సంఘానికి తమ సహకారం ఉంటుందన్నారు. రాజధానిని కేంద్రమే నిర్మించాలని విభజన చట్టంలో ఉందని, రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి అవ్వడమే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. ఏడు జాతీయ పార్టీల మద్దతుతో ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నామని చెప్పారు. సీఆర్ డీఏ చట్టంలోని అంశాలు అమలు కావడం లేదని.. ఓల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని రఘువీరాకు రైతులు విన్నవించుకున్నారు.

16:30 - March 25, 2016

హైదరాబాద్ : వేముల రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో హెచ్ సీయూ వీసీ అప్పారావు విధుల్లో చేరడాన్ని విద్యా పరిరక్షణ కమిటీ తప్పుపట్టింది. అప్పారావు యూనివర్సిటీకి తిరిగి రావడంతోనే క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం భగ్నం కలిగిందని విద్యా పరిక్షణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రమేయంతోనే అప్పారావు విధుల్లో చేరారని విమర్శించారు. జ్యుడిషియల్ విచారణ పూర్త కాకముందే వీసీని వెనక్కి ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు లేదు..క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొంటే అప్పారావు రావచ్చన్నారు. బాగుపడుతున్న విశ్వ విద్యాలయాన్ని పాడు చేయాలనే ఉద్ధేశ్యంతో ఇలా చేశారని, దీనికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమాధానం చెప్పాలని ప్రొ. హరగోపాల్ డిమాండ్ చేశారు. 

కాసేపట్లో గవర్నర్ తో ముఫ్తీ భేటీ...

హైదరాబాద్  : కాసేపట్లో జమ్మూ కశ్మీర్ గవర్నర్ తో మహబూబా ముఫ్తీ భేటీ కానున్నారు. పీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముఫ్తీ గవర్నర్ ను కలవనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి గవర్నర్ ను ముఫ్తీ కలవనున్నట్లు సమాచారం.

16:25 - March 25, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైల్లో విద్యార్థులను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వారు విమర్శించారు. వీసీ అప్పారావును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటోందని నేతలు ఆరోపించారు. అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు ఉందని, రోహిత్ వేముల మరణానికి కారణమైన ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ తెలిపారు. అమానుషంగా లాఠీఛార్జీ చేశారని విద్యార్థులు తెలిపారని, అక్రమ కేసుల్లో విద్యార్థులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఉత్తమ్ విమర్శించారు. 
ఇటీవల వీసీ అప్పారావు రీ ఎంట్రీపై విద్యార్థులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడైన అప్పారావు తిరిగి ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని, వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జీ జరిపారు. అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. 

'గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలి'

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఈ విధంగా ఉంది. '' గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలి, ఎస్సై పరీక్షలో ఇంగ్లీష్ మెరిట్ విధానం ఎత్తివేయాలి, ఎక్సైజ్ ఎస్సై అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, బోగస్ సిలబస్ తో అభ్యర్థులతో చెలగాటమాడుతున్న కోచింగ్ సెంటర్ల పై కఠినంగా చర్యలు తీసుకోవాలని'' డిమాండ్ చేశారు.

16:20 - March 25, 2016

విజయవాడ : ప్రజా రాజధాని అని చెప్పే 'అమరావతి'లో ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా అని సీపీఎం నేతలు నిలదీస్తున్నారు. తాత్కాలిక రాజధాని పనులను పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ముందస్తుగా సీపీఎం నేతలను అరెస్టు చేశారు. పలువురని నిర్భందించారు. దీనిపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా రాజధానిలో ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా ? సీఎం..మంత్రుల పర్యటనల నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు చేస్తారా ? అంటూ సీపీఎం నేతలు ప్రశ్నించారు. సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా టెన్ టివితో సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ బాబురావు మాట్లాడారు. ఆ అంటే అమరావతి..అంటున్నారని..కానీ ఆ అంటే అవినితి..అక్రమాలుగా మారిపోయాయన్నారు. సీఎం ఊళ్లోకి వస్తే సీపీఎం నేతలు జైల్లో ఉండడం ఏంటీ ? అని ప్రశ్నించారు. జీవనోపాధి చూపిస్తానన్న సీఎం చంద్రబాబు తప్పు చేయని వారిని జైల్లో నిర్భందిండం ఏంటనీ...సింగపూర్, జపాన్, చైనా, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే తిరిగే స్వేచ్ఛ ఉంటుందా ? స్థానిక ప్రజలకు స్వేచ్ఛ లేదా అని బాబురావు ప్రశ్నించారు. ఏ ఒక్క హామీని ప్రభుత్వం పరిష్కారం చేయలేదని, సమస్యల మీద అడగిగే వారిని..ఆందోళన చేసే వారిపై కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారని మరో నేత పేర్కొన్నారు. ఇళ్లపై దాడులు జరిపి నిర్భందం చేయడం దారుణమన్నారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి నిర్ణయం

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయించాలని కోర్టు కమిటి నిర్ణయించింది. ఇవాళ సమావేశమైన జస్టిస్ సీతాపతి కమిటి వచ్చే నెల 20,21 తేదీల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయించాలని నిర్ణయించింది. ఈ వేల ద్వారా 6 అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 1 వరకు రోజువారీగా ప్రకటన ఇచ్చి వేలయం వేయాలని.. వేలం ద్వారా రూ.100 కోట్లు వస్తాయని కమిటీ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

ఆసీస్ 137/4..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో తలపడుతున్న ఆసీస్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓపెనర్ ఖజ్వా (21), ఫించ్ (15), వార్నర్ (9), మాక్స్ వెల్ (30) పరుగులు చేసి వెనుదిరిగారు. ప్రస్తుతం స్మిత్ 43, వాట్సన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్, వాసిమ్ లు తలా రెండు వికెట్లు తీశారు. 

సల్వీందర్ సింగ్ కు క్లీన్ చిట్..

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్‌సింగ్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) క్లీన్ చిట్ ఇచ్చింది. పఠాన్‌కోట్ దాడి ఘటనలో ఆరోపణలెదుర్కొంటోన్న ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇవాళ ఎన్‌ఐఏ ఎదుట హాజరయ్యారు. సల్వీందర్‌సింగ్‌తోపాటు ఆయన వంట మనిషిని కూడా అధికారులు విచారించారు. లై డిటెక్టర్‌తోపాటు నిర్వహించిన ఇతర పరీక్షల్లో సల్వీందర్‌సింగ్‌కు పఠాన్‌కోట్ దాడులతో సంబంధలేదని రుజువైందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 

వారిని బేషరతుగా విడుదల చేయాలి: హెచ్ సియూ ప్రొఫెసర్లు..

హైదరాబాద్ : హెచ్‌సీయూలో అరెస్ట్‌ చేసిన విద్యార్థులను, ప్రొఫెసర్లను బేషరతుగా విడుదల చేయాలని హెచ్‌సీయూ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలు వెళ్లిపోవాలని వారు కోరారు. 22న జరిగిన సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.

కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం :5గురుమృతి

ఉత్తరప్రదేశ్‌ : కాన్పూర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హోలీ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండతా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న యువకులు మద్యం సేవించడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సచివాలయ పనులు పరిశీలించిన సీఎం..

విజయవాడ: గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. హెలీకాఫ్టర్ ద్వారా నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబుకు  పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ వివరించారు. సచివాలయ నిర్మాణ పనులపై కాంట్రాక్టర్లతో చంద్రబాబు చర్చించారు.

16:08 - March 25, 2016

హైదరాబాద్ : మెగ్యుల్ అనే 51ఏళ్ల వృద్ధుడు ఉదర భాగం నుంచి వైద్యులు 27బ్యాగుల హెరాయిన్‌ను బయటకు తీశారు. వివరాల్లోకెళితే.. మైగ్యుల్‌ తమిళనాడులోని సలేమ్‌ నుంచి అమెరికాకు అక్రమంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్‌) రవాణా చేయడానికి ఏకంగా 27 బ్యాగుల హెరాయిన్‌ను మింగేశాడు. మింగేసిన బ్యాగుల్లో ఓ బ్యాగు చిరిగిపోవడంతో ఆ డ్రగ్స్‌ అతని పొట్టలోకి వెళ్లాయి. ఓవర్‌డోస్‌ కావడంతో మైగ్యుల్‌ సలేమ్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడని అక్కడి వైద్యులు అతని పొట్ట నుంచి 27 బ్యాగుల హెరాయిన్‌ను బయటికి తీశారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.

ఆసీస్ 101/3..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో తలపడుతున్న ఆసీస్ జట్టు వంద పరుగుల స్కోరును దాటింది.  12.3 ఓవర్లలో మూడు వికెట్లకు 101 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10.4 ఓవర్లలోనే 3 మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్ ఖజ్వా (21), ఫించ్ (15), వార్నర్ (9) పరుగులు చేసి వెనుదిరిగారు. ప్రస్తుతం స్మిత్ 30, మాక్స్ వెల్ 20 క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు, వాసిమ్ ఒక వికెట్ తీశాడు. 

విద్యార్థులను అరెస్ట్ చేయటం అమానుషం: రోహిత్ తల్లి

హైదరాబాద్ : హెచ్ సీయూ లో విద్యార్థులను అరెస్ట్ చేయపట్ల రోహిత్ వేముల తల్లి రాధిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నా కుమారుడు మృతికి కారణమైన వీసీ అప్పారావును అరెస్ట్ చేయకుండా విద్యార్థులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల, అగ్రవర్ణాల పట్ల మరోలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ఆసీస్ 84/3..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో తలపడుతున్న ఆసీస్ 10.4 ఓవర్లలో 3 మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఖజ్వా (21), ఫించ్ (15), వార్నర్ (9) పరుగులు చేసి వెనుదిరిగారు. ప్రస్తుతం స్మిత్ 22, మాక్స్ వెల్ 12 క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు తీశాడు. 

సియాచిన్ మరో జవాన్ గల్లంతు..

జమ్మూ కశ్మీర్: లఢక్ ప్రాంతంలోని సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడటంతో గస్తీ కాస్తోన్న ఓ జవాను గల్లంతైనట్లు ఓ సైనికాధికారి వెల్లడించారు. నేడు సైనిక సిబ్బంది గస్తీలో ఉండగా అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడ్డాయి. మంచు చరియలు విరిగిపడటాన్ని గమనించి మరో ఇద్దరు సైనికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మరొకరిని మంచు చరియల నుంచి కాపాడారు. గల్లంతైన సైనికుని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని సైనికాధికారి వెల్లడించారు.

ఏపీ భానుడు భగ భగలు..

హైదరాబాద్ : ఏపీలో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్రలో కంటే రాయలసీమ జిల్లాల్లో ఎండ మరింత తీవ్రంగా వుంది. జంగమేశ్వరపురంలో 39, నందిగామ 38,విజయవాడ 37, నెల్లూరు 36, తుని 36, కాకినాడ 35, విశాఖ 32 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

15:36 - March 25, 2016

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజులో జరగబోతున్నాయి. దీనితో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డీఎంకే, కాంగ్రెస్ ఇదివరకే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సీట్ల పంపకాల విషయంలో చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం చెన్నైకి వచ్చారు. డీఎంకే చీఫ్ కరుణానిధితో భేటీ అయ్యారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి ప్రధానంగా చర్చించనట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు. తమకు నెంబర్లు ప్రధానం కాదని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కరుణానిధితో చర్చలు జరిపినట్లు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సీట్ల పంపకాల విషయంలో మరోసారి సమావేశం అవుతామని ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ 63 సీట్లు కావాలని పట్టుబడుతోంది. దీనికి డీఎంకే నిరాకరించింది. 30 సీట్లు ఇవ్వడానికి డీఎంకే ముందుకొచ్చింది. మరి సీట్ల పంపకాల సర్దుబాటు జరుగుతుందా ? బెడిసి కొడుతుందా ? వేచి చూడాలి. 

వీసీ అప్పారావుకు మంత్రి వెంకయ్య సపోర్ట్ : ప్రొ.హరగోపాల్

హైదరాబాద్ : హెచ్ సియూ వీసీ అప్పారావుకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అండగా వున్నారని  ప్రొ.హరగోపాల్ విమర్శించారు. జ్యుడిషియల్ కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వకముందే వీసీ అప్పారావు హెచ్ సీయూ క్యాంపస్ కి ఎందుకు వచ్చారో కేంద్ర చెప్పాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులే యూనివర్శిటీలను కాపాడాలని సూచించారు. దళితులకు విద్యను దూరం చేయటానికి హిందూత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు..

15:24 - March 25, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతి విషయంలో తమకు న్యాయం చేయరా ? అని తల్లి రాధిక ప్రశ్నించింది. ఇటీవల రోహిత్ వేముల ఆత్మహత్యలో విచారణ జరిపించాలని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాధిక శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండు నెలలవుతున్నా తమకు న్యాయం జరగలేదని, న్యాయ విచారణ జరుగుతుండగా వీసీ అప్పారావు విధుల్లో ఎలా హాజరౌతారని ప్రశ్నించారు. న్యాయం చేయాలని ఉందా ? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడితే 24 గంటల్లో అరెస్టు చేయాలి కానీ వీసీ అప్పారావును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఇష్టమొచ్చినట్లుగా కొట్టారని తెలిపారు. అంతేగాకుండా పకడ్బందీగా కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. వీసీని అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రోహిత్ సోదరుడు డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న వీసీ అప్పారావు తమతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 
జనవరి 17వ తేదీన న్యూ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ లోని రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావులే కారణమని, వీరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 

15:18 - March 25, 2016

సూరత్ లో హోలీ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన సన్నీ లియోన్ కు కోపాన్ని అణచుకోలేక జర్నలిస్టు చెంపచెల్లు మనిపించింది. ఓ నేషనల్ ఛానల్ చేసిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ ఎంతో సంయమనంతో సమాధానాలు ఇచ్చి అందరితో ప్రశంసలు అందుకుంది. అదే సన్నీ ఇప్పుడో రిపోర్టర్ ను లాగిపెట్టి గూబమీద ఇచ్చుకుంది. ఇదంతా హోలీ రోజున ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన సంఘటన. ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదే కరెక్ట్ సమాధానం అందరూ అంటున్నారు. కొన్ని బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు వేసి అందరినీ అలరించింది. సన్నీ జంట హోటల్ కు చేరుకున్న సమయంలో.. ఓ నేషనల్ ఛానల్ రిపోర్టర్ ఆమెను అడ్డగించాడు. నో ఇంటర్వ్యూ అని చెప్పినా.. వన్ మినిట్ మాత్రమే అనడంతో.. ఓకే అనింది సన్నీ. 'గతంలో మీరు పోర్న్ స్టార్.. ఇప్పుడు ఫిలిం స్టార్. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు' అని అడిగాడా రిపోర్టర్. ప్రశ్న అర్ధం కాకపోవడంతో.. సరిగా అడగమని చెప్పింది సన్నీ. దీంతో 'రాత్రి ప్రోగ్రాములకు ఎంత తీసుకుంటారు' అని అడిగాడా రిపోర్టర్. దీంతో సన్నీలియోన్ కి కోపం నషాళానికి అంటి.. లాగిపెట్టి గూబమీద ఒక్కటిచ్చుకుంది. చెంప ఎర్రగా కందిపోవడంతో.. తుడుచుకుంటూ వెళ్లిపోయాడతడు. తను పాల్గొన్న కార్యక్రమం కాలేజ్ విద్యార్ధులది కావడంతో.. కేసు పెట్టే ఉద్దేశ్యం లేదని సన్నీ లియోన్ భర్త డానియల్ వెబర్ చెప్పాడు. 

విష జ్వరాలతో 30 మందికి అస్వస్థత...

అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో విషజ్వరాలతో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. విషజ్వరాలు ప్రబలటంతో గ్రామస్తులలో భయాందోళనలు నెలకొన్నాయి.

15:14 - March 25, 2016

నెల్లూరు : నీటి ప్రమాదాలు అధికమౌతున్నాయి. స్నానాలకని వెళుతున్న వారు చెరువులు..నదుల్లో మునిగి మృత్యువాత పడుతున్నారు. హోలీ పండుగ రోజున కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన మరిచిపోకముందే నెల్లూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. కొవ్వూరు మండలానికి చెందిన సాయి వర్షిత్, ఫయాదుద్దీన్, లతీఫ్, మరో విద్యార్థి ఎండ వేడిమిని తట్టుకోవడానికి చెరువులో స్నానం కోసం వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదని తెలుస్తోంది. వర్సిత్, ఫయాదుద్దీన్, లతీఫ్ లు చెరువులో దిగగా మరొక విద్యార్థి గడ్డుపైనే నిలిచున్నాడు. అకస్మాత్తుగా ముగ్గురూ నీటిలో మునిగిపోతుండడం చూసిన సదరు విద్యార్థి రక్షించాలంటూ కేకలు వేశాడు. సమీపంలో ఉన్న వారు మునిగిపోతున్న వారిని రక్షించడం కోసం ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజఈతగాళ్లను రప్పించారు. నీటిలో దిగిన గజ ఈతగాళ్లు సాయి వర్షిత్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపులు చేపడుతున్నారు. వీరంతా 9వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. తమ వారు మృతి చెందారన్న తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

టీ-20 వరల్డ్ కప్:

హైదరాబాద్ : టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

15:04 - March 25, 2016

తీరిక వేళల్లో మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెడుతుంటారు. తమకు ఆసక్తి ఉన్న అభిరుచులకు మెరుగులు దిద్దుతుంటారు. అలాంటి వారి కోసం క్విల్లింగ్ ఆర్ట్ ఎలా నేర్చుకోవాలో వీడియోలో చూడండి. 

15:02 - March 25, 2016

“21F” మూవీలో యూత్ ని తన ఒంపు సొంపులతో బాగా రెచ్చగొట్టిన హేబా పాటిల్, ఇప్పుడు తన రేటు ను 25 లక్షలకు పెంచేసినట్లుగా తెలుస్తుంది. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీలోనే ఈ అమ్మడు ఆ రేటుకు ప్రొడ్యూసర్ ని కూడా ఒప్పించినట్లుగా ఫిలింనగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే నేటి యూత్ కి బాగా కనెక్ట్ అయిన హేబా, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కాదని కూడా తెలుస్తుంది. మరి ఈ మాత్రం దానికే పాతిక లక్షలు పట్టేసింది అంటే, మరో హిట్ కొడితే ఆ రేటును బాగా పెంచేసి, కోటి వైపు అడుగులు తప్పకుండా వేస్తుందని అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.

14:59 - March 25, 2016

విధి నిర్వహణలో భాగంగా మహిళలు ఏ సమయంలోనైనా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిపై జరిగే దాడులను తిప్పికొట్టాలంటే ఆత్మ రక్షణా పద్ధతులపై పట్టు సాధించాలి. అలాంటి పద్ధతులేమిటో వీడియోలో చూడండి..

అక్రమంగా ఇసుక తరలింపు, 30 లారీ లు సీజ్...

తూర్పుగోదావరి : సీతానగరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 30 లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక తవ్వకాలపై డీఎస్పీ అత్యవసరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అధికారులు సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

14:54 - March 25, 2016

మయన్మార్ కేబినెట్ లో ఆంగ్ సాన్ సూకీకి స్థానం దక్కింది. కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. మహిళలకు మాతృత్వం కూడా శాపంగా మారింది. ప్రసవానికి వెళ్లిన వారికి ఉద్యోగాలు ఊడే పరిస్థితి. ఇదెక్కడో కాదు.. రాష్ట్ర రాజధానిలో జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల అవసరాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం దేశంలోనే అతిపెద్ద సర్వేకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అద్దె భవనాలలో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించే ఉద్దేశ్యంతో వార్షిక బడ్జెట్ లో నిధులను కేటాయించారు. స్వదేశంలో జరగుతున్న టీ20 మహిళా ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు సెమీస్ అవకాశాలు క్లోజ్ అయ్యాయి. ఈ టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మహిళలకు నేటికీ అనేక దేవాలయాల్లోకి అనుమతి లేదు. అనేక ప్రాంతాల్లో మహిళలు తమకు అన్ని ఆలయాల్లోకి అనుమతి కావాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్ము కాశ్మీర్ లో మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 

లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం కమిటి...

హైదరాబాద్ : పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు యూజీసీ ఓ కమిటీ ఏర్పాటుచేసింది. ఐదుగురు సభ్యులుగల ఈ కమిటీకి యూజీసీ జాయింట్‌ సెక్రటరీ డా.రేణుబట్రా చైర్మనగా వ్యవహరిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులపై అందిన ఫిర్యాదులను ఈ కమిటీ పరిష్కరిస్తుంది.

నటుడు జయప్రకాశ్ రెడ్డికి మాతృ వియోగం

గుంటూరు : రాయలసీమ స్లాంగ్‌తో కమెడీయన్‌గా, విలన్‌గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించిన ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి తల్లి తాడిపర్తి సామ్రాజ్యమ్మ (84) అనారోగ్యంతో కన్ను మూశారు. సామ్రాజ్యమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా కాగా ఆమెకు నలుగురు సంతానం. వారిలో పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డి. సామ్రాజ్యమ్మ అంత్యక్రియలను శనివారం గుంటూరులో నిర్వహించనున్నట్టు సమాచారం.

పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్ : ఏపీ సీఎంనాయుడు పలుశాఖల పురోగతిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టుమెంట్స్ శాఖల పురోగతిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇ-ప్రగతికి సహకరించాలని ప్రపంచబ్యాంక్ భారత అధికారి రణదీప్ సూడాన్‌ను సీఎం చంద్రబాబు కోరగా ఏపీకి ఐటీ అంశాలలో సహకరించేందుకు రణదీప్ అంగీకారం తెలిపారు. అలాగే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రజల నుంచి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఫైబర్‌గ్రిడ్‌పై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

విజయవాడకు బయలుదేరిన బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. విజయవాడలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో బాబు పాల్గొననున్నారు. అంతకంటే ముందు ఈ ప్రగతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

14:29 - March 25, 2016

నెల్లూరు : తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా చెప్పుకునే రంగడి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం రంగనాయకులపేట నుంచి ప్రారంభమైన రథోత్సవం నెల్లూరు వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి కొద్దిదూరం రథాన్ని లాగారు. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్న దృష్ట్యా పోలీసులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

14:24 - March 25, 2016

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం..ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి. శ్రీవారిని దర్శించుకొనేందుకు దేశ, విదేశాల నుండి ఎంతో మంది వస్తుంటారు. వారు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులకు సేవలందించేందుకు..సౌకర్యాలు కల్పిలంచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటుంది. దీనికి సంబంధించిన లెక్కల వివరాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఆడిట్ జరగాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గోవింద స్కీమ్ కు ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదని, ఇకపై సమగ్రంగా ఆడిట్ ఉంటుందని పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో యనమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడికి ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ,ఆలయంలో ధరలు పెంచి మళ్లీ భక్తులపై భారం మోపడం సరికాదన్నారు. టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ పై కూడా ఆడిటింగ్ చేయాలని సూచించారు. గతంలో తాను మూడుసార్లు రివ్యూ చేయడం జరిగిందని మంత్రి యనమల తెలిపారు. 

14:18 - March 25, 2016

కర్నూలు : వేసవి కాలం వచ్చిందో లేదో..అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఒకవైపు భానుడు ప్రతాపం చూపెడుతుంటే..నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లా పత్తికొండ మండల ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. వేళాపాళా లేకుండా వస్తున్న నీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ పనులకు సైతం వెళ్లలేకపోతున్నారు. పత్తికొండ పట్టణంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ 20 వార్డుల్లో సుమారుగా 30 వేల మంది నివాసముంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో 6 ఓవర్‌ హెడ్ ట్యాంకుల వరకు నిర్మించగా అవి అలంకార ప్రాయంగా మారాయి. నీటి ఎద్దడిని తట్టుకోలేక మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించినా అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పంచాయతీ నీళ్లు సరిగా రాకపోవడంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే నీటి కొనుగోలుకే సగం కూలి డబ్బు ఖర్చైపోతోందని దినసరి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎందుకూ కొరగాకుండా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సరైన ప్రణాళికతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

తృప్తి దేశాయ్ ను అరెస్టు చేసిన పోలీసులు..

మహారాష్ట్ర : ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న తృప్తి దేశాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 

ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరవుతా - రోజా..

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా సుముఖత వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు ఇంకా నమ్మకం ఉందని తెలిపారు.

సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోలేదు - ఆజాద్..

చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. డీఎంకే అధినేత కరుణానిధితో ఆజాద్ భేటీ అయ్యారు. ఈ భేటీ కేవలం ఎన్నికల వ్యూహానికి సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేశారు.

 

13:51 - March 25, 2016

హైదరాబాద్ : గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ తదితర నగరాల్లో క్రైస్తవులు శిలువలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో జరిగిన ర్యాలీలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌, ఎంఎల్‌సి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. విశాఖలో రైల్వే న్యూ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. నేడు క్రీస్తు శిలువ వేయబడిన రోజు కావడంతో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. 

13:49 - March 25, 2016

విజయవాడ : జెఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదలు చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీపీఐ నేత నారాయణ విజయవాడలో అన్నారు. కన్హయ్య మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అందులో ఆఫ్జల్ గురు గురించి ఏ వ్యాఖ్యలూ చేయలేదని అన్నారు. 

13:44 - March 25, 2016

హైదరాబాద్ : ఎపి సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని... తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై దుర్మార్గంగా సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు రోజా మీడియాతో మాట్లాడారు. సీఎంపై విమర్శలు చేసినందుకే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కాల్ మనీ విషయం మూడు కోట్ల మహిళలకు సంబంధించిందని.. కాల్ మనీ అరాచకాలు తనను బాధించాయన్నారు. కాల్ మనీ అంశంపై చర్చకు పట్టుపట్టడంతో తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను ఓటర్లుగా కాదు మనుషులుగా చూడండని అడిగినందకు సస్పెన్షన్ వేటు పడిందని వాపోయారు. కాల్ మనీ అంశంపై సభలో మాట్లాడాలని కోరగా సభను రెండుసార్లు వాయిదా వేశారని.. మూడోసారి అంబ్కేదర్ పై చర్చ పెట్టారని తెలిపారు. అంబేద్కర్  కూడా ఇలాంటివి సహించరని...తనను సస్పెండ్ చేసినందుకు ఆయన మనసు క్షోభిస్తుంటుందని చెప్పారు. అంబేద్కర్ అంటే తమకు కూడా గౌరవమేనని... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పాటుపడారని తెలిపారు. అధికార పార్టీకి అంబేద్కర్ అంటే గౌరవం లేదని విమర్శించారు. కాల్ మనీ... సెక్స్ రాకేట్ లో అనేక మంది పేదలు ఉన్నారని తెలిపారు. ఈ అంశం నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు తన అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. 'కామా' సీఎం అన్నందుకు తనను సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కాల్ మనీ ఘటన జరిగినప్పుడు తాను లండన్ లో ఉన్నానని తెలిపారు. ఈ వార్తను ఈనాడు పేపరులో చూశానని.. అందులో కాల్ మనీ (కామా) అని రాశారని తెలిపారు. అలాంటప్పుడు ఈనాడుకు ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో 58 మంది స్లోగన్స్ ఇస్తే.... రోజాను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని జగన్ స్పీకర్ ప్రశ్నించారని... అప్పుడు తనను సస్పెండ్ చేసినా పరవాలేదు.. కానీ కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరిగేలా చూడాలని సూచించినట్లు రోజా తెలిపారు. టీడీపీ స్ట్రింగ్ అపరేషన్ చేస్తే.. కాల్ మనీ భాగోతం బయటపడలేదని.... గౌతం సవాంగ్ కు వచ్చిన కాంప్లెయింట్ ఆధారంగా రైడింగ్ చేస్తే.. కాల్ మనీ దురాగతాలు బయటికి వచ్చాయన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలు తీసుకుని రాజధానిని నిర్మిస్తే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. 

 

13:29 - March 25, 2016

హీరోయిన్‌గా సూపర్‌హిట్స్ కొట్టిన టాలీవుడ్ బొమ్మాళి, గెస్ట్‌గా కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేస్తోంది. ‘సోగ్గాడు’ తర్వాత తాజాగా ‘ఊపిరి’లో స్పెషల్‌గా కనిపించింది. సోగ్గాడులో రొమాంటిక్‌గా కనిపించిన అనుష్క, ఇందులో ఆమె లవ్ ట్రాక్ కాస్త బోరింగ్‌గా వుందని ప్రేక్షకులు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఓకే అంటున్నారు. తెరపై అనుష్క కనిపించేది 2 నిమిషాలైనా బెటరేనని టాక్. నాగ్- అనుష్కల మధ్య లవ్ ట్రాక్ సీన్స్ వుంటాయని చెబుతున్నారు. తమ హీరో సినిమాలో అనుష్క కనిపిస్తే ఆ మూవీ హిట్ అవుతుందనే నమ్మకం కింగ్ అభిమానుల్లో వుంది. దీనికితోడు నాగ్‌తోపాటు, పీవీపీ బ్యానర్‌లో అనుష్క కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఈమెని ఎంపిక చేశారనే వాదన లేకపోలేదు. మొత్తానికి నాగార్జున రాబోయే మూవీస్‌లోనూ అనుష్క గెస్ట్‌గా కనిపించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు ప్రేక్షకులు. 

వడదెబ్బతో పదో తరగతి విద్యార్థిని మృతి..

నల్గొండ : మిర్యాలగూడ రాఘవపురం తండాలో విషాదం నెలకొంది. వడదెబ్బతో పదో తరగతి విద్యార్థిని అంజలి(16) మృతి చెందింది.

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది : బాబూరావు

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ సీఎఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నేత బాబూరావు మాట్లాడుతూ... సీఆర్డీఏ ప్రాంతంలో రైతుల తరపున పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండి పడ్డారు. ఏపీ లో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.

రైతు సమస్యల పై ఉద్యమం: రఘువీరా

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంత రైతులతో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన భూముల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

13:16 - March 25, 2016

గుంటూరు : రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఆర్ డీఏ ఎట్టకేలకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. భూములిచ్చి ఏడాది అవుతున్నా అభివృద్ధి  ఊసెత్తని సీఆర్ డీఏ హడావిడిగా పనులు ప్రారంభించింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి చేతులు కాల్చుకున్నారు రైతులు. భూములను ప్రభుత్వానికి అప్పగించి ఏడాది అవుతున్నా ఇటుక కూడా పేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వీధుల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడం మినహా తమకు చేసిందేమిలేదని పెదవి విరుస్తున్నారు. 
భూములిచ్చిన గ్రామాల అభివృద్ధికి సీఆర్ డీఏ ప్రణాళిక
అయితే రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఆర్ డీఏ ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టడం రైతుల్లో కొంత ఆశలను చిగురింపజేస్తోంది. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఆర్ డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది .ఇందుకోసం గ్రామాల వారీగా సమగ్ర అధ్యయనం చేపట్టనుంది. ఏ గ్రామానికి ఎలాంటి అవసరాలున్నాయి..ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాలపై సమీక్షించనుంది.ఈ కార్యక్రమాల అభివృద్ధికి రూ.650 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. సెక్రటేరియట్ పూర్తయితే,ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరానున్నారు. ఉద్యోగుల రాకతో రాజధానిప్రాంత గ్రామాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.గ్రామాల్లో జనాభా పెరిగితే అందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పన చేపట్టాల్సి ఉంటుంది.
ప్రపంచబ్యాంకు నుంచి రుణసహకారం
రాజధాని ప్రాంతంలో ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాల్లో గ్రామాల అభివృద్ధి పనులను చేర్చారు. ఈ పనులను చేపట్టేందుకు అవసరమైన నిధులు సీఆర్ డీ ఏ వద్ద లేకపోవడంతో ప్రపంచబ్యాంకు నుంచి రుణసహకారం పొందనుంది. మొత్తానికి సీఆర్ డీఏ అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే పరవాలేదు. కాని  ఈ పనులకు ఏ మాత్రం బ్రేకులు పడ్డా మళ్లీ కథ మొదటికే వస్తుందనడంలో సందేహమే లేదు.

 

13:11 - March 25, 2016

ఖమ్మం : శాస్త్ర, సాంకేతిక రంగం దూసుకుపోతున్నా మూఢనమ్మకాలు, అనాగరిక ఆచారాలు గ్రామాలను ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయి. గ్రామ పెద్దల పైత్యానికి బలహీనవర్గాలు గ్రామ బహిష్కరణకు గురవుతూనే ఉన్నాయి. ఎదిరిస్తే చాలు ఆచారాల మాటున కాటువేస్తున్నారు పెద్దల మాటున ఊరిగద్దలు.
పాల్వంచలో అనాగరిక ఆచారం 
ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఖమ్మం జిల్లా,పాల్వంచ మండలం తుమ్మలగూడెం గ్రామం చంద్రగూడెం పంచాయతీకి చెందిన ఈ గ్రామం పూర్తిగా ఏజెన్సీలో ఉంది.ఆచారంగా వస్తోన్న గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన కోసం పెద్దలు చందాలు ఇవ్వమని కోరారు. అందుకు కొంతమంది నిరాకరించారు. తాము  అలాంటి ఆచారాలను పాటించమని,విరాళాన్ని ఇవ్వలేమని  తెలిపారు.దీంతో ఆగ్రహించిన పెద్దలు వారిని గ్రామ బహిష్కరణ చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా వారి ఇంటికి వెళ్లినా ,మాట్లాడినా పదివేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ప్రతిష్టాపన కోసం ఇంటికి రూ.6,000 చందా విధింపు
బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం కోసం ఇంటికి రూ.6000ఇవ్వాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇదే ప్రాంతంలో మరో వర్గానికి చెందిన 12 కుటుంబాలు తాము చందా ఇవ్వలేమని తెలిపాయి. ఆ కుటుంబాలను వెలివేసినట్లు పెద్దలు ప్రకటించారు. వారితో మాట్లాడొద్దని, శుభకార్యాలకు వెళ్లొద్దని ఆదేశించారు. బహిష్కరణకు గురైన వారిలో అంగన్‌వాడీ కార్యకర్త కూడా ఉన్నారు. గ్రామంలోని బోరునీటిని ముట్టుకోనివ్వడం లేదని బాధితులు కంటతడి పెట్టుకున్నారు. గ్రామ పెద్దల బహిష్కరణ వల్ల తాము తాగునీటిని పక్క గ్రామాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య...

ప్రకాశం : కంభం మండలం చిన్న కంభం గ్రామం సమీపంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని పోలుకూరి ఆంజనేయులు(35)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

దాడులకు భయపడం: సీపీఐ నారాయణ

విజయవాడ : బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధిగా మారుతున్నామని వామపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని దీనికి ఎంతమాత్రం భయపడమని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. జేఎన్ యూ నేత కన్హయ్య వాస్తవాలు చెబుతుంటే బీజేపీ భయపడుతోందన్నారు. ఢిల్లీ నుండి వచ్చిన సంకేతాలతోనే కన్హయ్యపై దాడులు జరిగాయన్నారు. నేడు సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా వామపక్ష నేతలను అరెస్టు ఖండిస్తు సీపీఐ నేత నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫార్చ్యూన్ జాబితాలో ఢిల్లీ సీఎం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో ఘనత సాధించారు. ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ 50 మందితో రూపొందించిన ప్రపంచ గొప్ప నేతల జాబితాలో కేజ్రీవాల్‌ చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సాధించిన ఏకైక భారతీయుడు ఆయనే కావడం విశేషం.

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటన కొండాగావ్‌ సమీపంలో కూదుర్‌-రాకస్‌మెట్‌ అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ ప్రాంత్రంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు మృతిచెందగా... మిగతా మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలం నుంచి తుపాకీ, టిఫిన్‌ బాంబు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు.

కరుణానిధితో ఆజాద్ భేటీ...

చెన్నై : డీఎంకే చీఫ్, తమళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ భేటీ అయ్యారు. డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో సీట్ల పంపిణీపై కరుణానిధి ఆజాద్ చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపిణీపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విజయ్‌కాంత్ నేృత్వంలోని డీఎండీకేతో జతకట్టాలని డీఎంకే ప్రయత్నించింది. అయితే విజయ్‌కాంత్ వేరే కుంపటి పెట్టుకోవడంతో కాంగ్రెస్‌తో సీట్ల పంపిణీకి కరుణానిధి చర్చలు జరుపుతున్నారు.

 

30 మంది ఏఎస్ఎఫ్ఐ నేతలపై కేసు!

విజయవాడ: నగరంలో గురువారం సాయంత్రం ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సభలో జరిగిన ఘటనపై 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ సభలో తనపై ఏఐఎస్‌ఎఫ్ నేతలు దాడి చేశారని, తను ప్రదర్శించిన జాతీయ జెండాను చించివేశారంటూ బీజేవైఎం నేత అనిల్ కుమార్ శుక్రవారం గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు... ఏఐఎస్‌ఎఫ్ నేత లెనిన్ సహా 30 మందిపై 324, 323, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

కొల్లేరు సమస్యను పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారాం

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్రమైన ఏలూరు సమీపంలోని కొల్లేరులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రాంత ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సమస్య కొనసాగుతోందన్నారు. దీన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని, ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

12:33 - March 25, 2016

రంగారెడ్డి : రోడ్డుపై నిల్చి ఉన్న యాష్‌ ట్యాంకర్‌ను ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం రాత్రి ఇదే ప్రాంతంలో ఒక యాష్‌ ట్యాంకర్ లారీని మరో లారీ ఢీకొట్టింది. అదే లారీని ఈరోజు తెల్లవారుజామున పూడూరు నుంచి కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన యాకూబ్‌ను వికారాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతులిద్దరూ పూడూరు మండల కేంద్రానికి చెందినవారే. 

 

12:17 - March 25, 2016

హైదరాబాద్ : టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ గ్రూప్ -బీ లీగ్ ఆఖరి రెండు రౌండ్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. గ్రూప్ టాపర్ గా న్యూజిలాండ్ ఇప్పటికే సెమీఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకోడంతో...రెండో బెర్త్ కోసం...మూడుజట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య టీమిండియా, మాజీ చాంపియన్ పాకిస్థాన్, ఆస్ట్రేలియాజట్ల మూడుస్తంభాలాటపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్....
టాప్ గేర్ లో సూపర్ టెన్ రౌండ్ పోటీలు 
భారత గడ్డపై తొలిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్ పోటీలు..టాప్ గేర్ లో పడ్డాయి. ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లతో కూడిన గ్రూప్ - బీ లీగ్ నుంచి....ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది. ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ ..మూడుకు మూడురౌండ్లూ ఓడి...సెమీస్ రేస్ నుంచి వైదొలగడంతో...రెండో సెమీస్ బెర్త్ కోసం..టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీకి తెరలేచింది.
లీగ్ టేబుల్ గ్రూప్ రెండోస్థానంలో  టీమిండియా
ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా...ఇప్పటి వరకూ ఆడిన మూడురౌండ్లలో రెండు విజయాలు సాధించి...లీగ్ టేబుల్ గ్రూప్ రెండోస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో ముగిసిన తొలిరౌండ్లో ఓడినా..ఆ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో ముగిసిన కీలక లీగ్ మ్యాచ్ ల్లో విజయాలు సాధించడం ద్వారా..ధోనీసేన నాలుగు పాయింట్లు సంపాదించింది. అయినా...సమీపప్రత్యర్థులు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ కంటే నెట్ రన్ రేట్ లో ఎంతో వెనుకబడి ఉంది. టీమిండియా సెమీస్ బెర్త్ సాధించాలంటే ...ఈనెల 27న మొహాలీలో జరిగే ఆఖరిరౌండ్ పోటీలో...ఆస్ట్రేలియాను ఓడించితీరడం మినహా వేరేదారే లేదు.
ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ అమీతుమీ 
ఇక..మాజీ చాంపియన్ పాకిస్థాన్ మాత్రం..ఇప్పటి వరకూ ఆడిన మూడురౌండ్లలో ఒక గెలుపు, రెండు పరాజయాల రికార్డుతో ఉంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓడి...బంగ్లాదేశ్ పైన మాత్రమే నెగ్గిన పాక్ జట్టు...ఈనెల 25 న జరిగే ఆఖరి రౌండ్ పోటీలో... ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆస్ట్రేలియా- పాక్ జట్ల పోటీ కీలకంగా 
ఒకవేళ ఆస్ట్రేలియాపై పాక్ నెగ్గి....కంగారూటీమ్ చేతిలో టీమిండియా ఓడితే..మెరుగైన రన్ రేట్ తో...సెమీస్ చేరే అవకాశాలు పాక్ జట్టుకే ఎక్కువగా ఉండడంతో.. ఆస్ట్రేలియా- పాక్ జట్ల పోటీ కీలకంగా మారింది. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా తయారైన ఆస్ట్రేలియా జట్టు మాత్రం..ఇప్పటి వరకూ ఆడిన రెండు రౌండ్లలో ఒక్కో గెలుపు, ఓటమి రికార్డుతో ఉంది. న్యూజిలాండ్ తో ముగిసిన పోటీలో ఓడినా...బంగ్లాదేశ్ ను అధిగమించిన ఆస్ట్రేలియా...ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లోనూ ఆసియా దిగ్గజాలు పాకిస్థాన్, టీమిండియాలను ఓడించగలిగితేనే...గ్రూప్ రన్నరప్ హోదాలో సెమీఫైనల్స్ చేరగలుగుతుంది. దీంతో...మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా మార్చి 25న పాకిస్థాన్, మార్చి 27న టీమిండియాతో ఆస్ట్రేలియా ఆడే..మూడు, నాలుగు రౌండ్ల పోటీలు..మూడుస్తంభాలాటలో విజేత ఎవరన్నది..? తేల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

12:08 - March 25, 2016

ఢిల్లీ : టీమిండియా కూల్‌ కూల్‌ కెప్టెన్‌ మహేందర్‌ సింగ్‌ ధోనీ ఎన్నడూ లేనంతలా సీరియస్‌ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం... భారత్‌ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంత చెత్తగా ఆడిన ఆఖరి బంతికి నెగ్గినందుకు ఎలా ఫీలవుతున్నారని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు...ధోనీ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు.  అజ్ఞానంతో ఈ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ధోనీ కాస్త ఘూటుగానే రిప్లై ఇచ్చాడు. 

కారుబోల్తా... ఇద్దరి మృతి

మహబూబ్ నగర్ : భూత్పూర్‌ సమీపంలో కారు బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మూసాపేట భవానీనగర్‌ వాసులుగా గుర్తించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

12:04 - March 25, 2016

అమెరికా : ఎప్పుడూ రాజకీయాలతో, విదేశి పర్యటనలతో తలమునకలై ఉండే అమెరికా దేశాధినేత బరాక్ ఒబామా తన స్టైల్‌ మార్చారు. ట్యాంగో నృత్యకారితో కలిసి స్టెప్పులేశారు.  ఒబామా సతీమణి మిషెల్ కూడా మరో డ్యాన్సర్‌తో కలిసి ట్యాంగో డ్యాన్స్ చేశారు.  అర్జెంటీనా పర్యటనలో ఉన్న ఒబామా దంపతులు ఉల్లాసంగా ఇలా కనువిందు చేశారు. తరువాత అర్జెంటీనాలో సైనిక ప్రభుత్వ నియంతృత్వ పాలనలో అమరులైనవారి కోసం కట్టిన స్మృతి వనాన్ని సందర్శించి, నివాళులర్పించారు. 

11:55 - March 25, 2016

అమెరికా : తనకు చిన్నతనం నుంచీ భారత్ అంటే ద్వేషమని పాక్‌-అమెరికా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ అన్నాడు. ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న హెడ్లీని 26/11 ముంబయి దాడులకు సంబంధించి ముంబయి కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హెడ్లీ మరికొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. 1971లో తాను చదువుకుంటున్న పాఠశాలపై భారత్‌ బాంబు దాడికి పాల్పడినట్లు తెలిపారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతోనే తాను లష్కర్‌-ఏ-తోయిబాలో చేరినట్లు హెడ్లీ వివరించాడు. మొదటినుంచీ భారత్‌కు వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని తాను ధ్యేయంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

 

11:54 - March 25, 2016

బ్రజెల్స్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నుంచి 70 మంది భారతీయులు ఇండియాకు తిరిగొచ్చారు. వారిని ప్రత్యేక జెట్ విమానంలో ఢిల్లీకి తరలించారు. గత మంగళవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. విమానాశ్రయంలో, మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ పేలుళ్లతో అక్కడున్న భారతీయులకు సంబంధించి ఇండియాలో బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుళ్ల తర్వాత బ్రస్సెల్స్ నుంచి అన్ని విమాన రాకపోకలను నిలిపేశారు. పరిస్థితులన్నీ అదుపులోకొచ్చాక విమానరాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన 70 మంది భారతీయులను సురక్షితంగా జెట్ విమానంలో ఢిల్లీకి తరలించారు.  

11:51 - March 25, 2016

ఖమ్మం : రాములోరి పెళ్లికి భద్రాచలం పుణ్యక్షేత్రం ముస్తాబైంది.  శ్రీరామనవమి సమీపిస్తుండటంతో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఏప్రిల్‌ 15న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు భద్రాద్రిలో అప్పుడే శాస్త్రోత్తకంగా ప్రారంభమయ్యాయి. 
శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు  ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారాములవారి కళ్యాణానికి తలంబ్రాలు కలిపే వేడుక అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రోకలిలో పసుపు కొట్టే ఉత్సవాన్ని శాస్త్రోత్తంగా ప్రారంభించారు.  శ్రీరామనామ జపంతో సుమారు 508మంది మహిళలు పసుపు కొమ్ములను దంచి రామయ్యకు పసుపు సమర్పించారు. ఆ తర్వాత రాములవారి పెళ్లికి అవసరమయ్యే కళ్యాణ తలంబ్రాలను కలిపే వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పసుపు, కుంకుమ, గులాం, సుగంధద్రవ్యాలు కలిపి గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా తయారుచేశారు. 
కన్నుల పండువగా ఉంజల సేవ 
అనంతరం రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో శ్రీ సీతారామ చంద్రలక్ష్మణ స్వాములకు కన్నుల పండువగా ఉంజల సేవ జరిగింది. పరిమళ పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. 
స్వామివారి వసంతోత్సవం వేడుక 
ఆ తర్వాత స్వామివారి వసంతోత్సవం వేడుక కూడా కన్నుల పండువగా జరిగింది. భక్తులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో భద్రాద్రి భక్తులతో రద్దీతో కిటకిటలాడింది. 
సీతారాముల కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు 
ఏప్రిల్‌ 15న జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

 

సర్వాయిపేట లో విషాదం..

కరీంనగర్ : మహదేవ్‌పూర్ మండలం సర్వాయిపేట వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం:యనమల

తిరుమల : అందుబాటులో వున్న నీటి వనరులను ఉపయోగించుకుని కరువు ప్రాంతాలను సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని మంత్రి యనమల తెలిపారు. ఆయన  తిరుమలలో టీటీడీ అధికారులతో మంత్రి యనమల సమావేశమయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ ఆదాయాలు, వ్యయాలపై సమగ్రంగా ఆడిట్ జరగాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా వున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. 

విద్యుత్ సబ్ స్టేషన్ మట్టడించిన రైతులు

తూర్పుగోదావరి: తుని మండలం తేటగుంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక రైతులు శుక్రవారం ముట్టడించారు. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో శుక్రవారం సుమారు 100 మంది రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. అయితే, సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

11:46 - March 25, 2016

కడప : ఆ..ఏఈ అంటే కార్మికులకు సింహ స్వప్నం. తన చేతి వాటంతో,..కావాల్సిన వారి కోసం కార్మికుల కడుపు కొడుతూ నాయకుల జేబులు నింపుతున్నాడు. మున్సిపల్ కార్మికులను బెదిరిస్తూ, నిలదీసిన వారి నోళ్లు నొక్కేస్తున్నాడు. కడప జిల్లాలో ఓ అసిస్టెంట్‌ ఇంజినీరు బాగోతంపై స్పెషల్‌ స్టోరీ. 
రాయచోటి మున్సిపాలిటీ అసిస్టెంటు ఇంజనీరు
ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ అసిస్టెంటు ఇంజనీరుగా. రాయచోటి మున్సిపాలిటీలో మొత్తం 84 మంది కార్మికులు పనిచేస్తుండగా అదనంగా మరో 35 మంది కూలీలను బినామీలుగా చేర్చాడు ఈయనగారు. అంతేకాదు..84 మంది కార్మికుల జీతాలను తగ్గించి, 119 మంది కార్మికులకు జీతాలిస్తున్నట్టు రికార్డుల్లో దొంగలెక్కలు రాయించాడు. దీంతో ఔట్ సోర్సింగ్ కార్మికుల మూడు నెలల జీతాల్లో  ప్రతి ఒక్కరు 1500 నుంచి 6వేల రూపాయల వరకు కోల్పోయారు. నెలంతా కష్టపడి పనిచేస్తే,..తమ కడుపులు కొట్టి జీతాల్లో కోత విధించడం ఎంతవరకు న్యాయమని ఏఈని ప్రశ్నించారు కార్మికులు. అయితే ఎక్కువ మాట్లాడితే,..విధుల నుంచి తొలగిస్తానని ఏఈ వీరిని బెదిరించాడు. దీంతో చేసేదేమిలేక,..మీడియాను ఆశ్రయించారు కార్మికులు. అయితే విషయం తెలుసుకునేందుకు అక్కడికెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం ఏఈ లెక్కచేయలేదు. 
హాజరు పుస్తకం చూపని అధికారి 
మున్సిపల్ ఆఫీసు రిజిస్టర్‌లో హాజరు వేయకుండా, తెల్లపేపరులో తమ పేర్లు నమోదు చేస్తుకున్నారని కార్మికులు తెలిపారు. తాము వెళ్లిపోయిన తరువాత రిజిస్టర్‌లో హాజరు లేనట్లు చేస్తున్నారని వారు వాపోతున్నారు. హాజరు పుస్తకం చూపమని అడిగిన విలేకర్లకు కూడా రిజిస్టర్ బుక్ చూపకుండా తన వద్ద లేదని ఏఈ బుకాయించాడు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసామని ఔట్ సోర్సింగ్ కార్మికులు తెలిపారు. దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా ఏఈపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి,.చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

11:43 - March 25, 2016

హైదరాబాద్ : ఆంధ్రా బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. చిక్కడపల్లిలోని ఆంధ్రా బ్యాంకు గోడకు అర్ధరాత్రి 
దుండగులు రంధ్రం చేసి.. లోపలికి దూరారు. అయితే స్ట్రాంగ్ రూం ఓపెన్ కాలేదు. తెల్లవారుజాము 4 గంటలకు వరకు ప్రయత్నించారు. ఎంతకీ స్ట్రాంగ్ రూం ఓపెన్ కాకపోవడంతో దుండగులు పారిపోయారు. దుండగులు పథకం ప్రకారమే చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.

 

జైల్లో హెచ్ సియూ విద్యార్థులను పరామర్శించిన ఎంపి అసదుద్దీన్

హైదరాబాద్ : చర్లపల్లి జైలు కు ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వెళ్లారు. జైల్లో హెచ్ సియూ విద్యార్థులను ఒవైసీ పరామర్శించి వారికి మద్దతు తెలిపారు. హెచ్‌సీయూ అతిథిగృహంపై ఈనెల 22న దాడి సందర్భంగా ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. 46 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు 27 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు అధ్యాపకులతో పాటు 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ న్యాయంస్థానం 14 రోజుల రిమాండ్ విధించి, చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

మిషన్ భగీరథపై మంత్రి కడియం సమీక్ష...

వరంగల్ : మిషన్ భగీరథపై జడ్పీ హాల్ లో మంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.  మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యేలు, అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

శ్రీవారి మాడవీధుల్లో పొంగుతున్న డ్రైనేజీ..

తిరుమల : శ్రీవారి తూర్పు మాడవీధిలో డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతోంది. అధికారుల పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

11:16 - March 25, 2016

హైదరాబాద్ : ట్రాఫిక్‌ పోలీసులకు భయపడో.. ఫైన్లు తప్పించుకునేందుకో ఏదో ఒక హెల్మెట్‌ ఉంటే సరిపోతుందనుకుంటున్నారా? తక్కువ ధరకే స్టయిలీష్‌ హెల్మెట్లు వస్తున్నాయని కొనుగోలుచేస్తున్నారా? అయితే జరభద్రం..! హెల్మెట్‌ స్టయిల్‌ కోసం కాదు...సెఫ్టీ కోసమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు సాంకేతిక నిపుణులు. 
గ్రేటర్‌లో హెల్మెట్‌ నిబంధన 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో హెల్మెట్‌ నిబంధన తప్పనిసరిచేయడంతో...ద్విచక్రవాహన దారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 200 నుంచి వెయ్యి వరకు వేస్తున్న జరిమానాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హెల్మెట్‌తో కనిపించేందుకు ఏదో ఒకటి కొనేస్తున్నారు. ఇదే అదనుగా నకిలీ హెల్మెట్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా తయారు చేసిన హెల్మెట్లు ప్రయోజనాలకన్నా..ప్రమాదాలే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
నగరంలో అక్రమార్కులు 
మరో వైపు నగరంలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఐఎస్‌ఐ మార్క్ పేరిట నకిలీవి అంటగడుతున్నారు. తక్కువ ధరకే శిరస్త్రాణాలు లభిస్తుండటంతో వాహనదారులు కూడా పరిశీలించకుండానే కొనుగోలుచేస్తున్నారు. నకిలీ హెల్మెట్లను నియంత్రించడానికి..నాణ్యతను పరిశీలించడానికి ఎలాంటి యంత్రాగం లేకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది. నాణ్యతా ప్రమాణాలు చూడాల్సిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తయారీ కంపెనీల్లో తనిఖీలు చేస్తామని, ఫుట్‌పాత్ వ్యాపారులు విక్రయిస్తున్న హెల్మెట్ల నాణ్యత పరిశీలించే బాధ్యత తమది కాదంటున్నారు. ప్రమాణాలను కొలిచే వ్యవస్థ తమ దగ్గర లేదని ఆర్టీఏ, పోలీస్‌ అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. 
ఐఎస్‌ఐ మార్క్ పేరుతో నకిలీ హెల్మెట్లు
మంచి ప్రమాణాలు ఉన్న హెల్మెట్ ఐఎస్‌ఐ మార్క్ తో పాటు పటిష్టంగా ఉంటుంది. షెల్ కింద ఉండే ప్యాడింగ్ సౌకర్యంగా ఉంటుంది. పాలిథిన్ ఫోమ్‌తో ప్యాడింగ్..గీతలు పడని, స్పష్టంగా కనిపించే మిర్రర్‌ ఉంటుంది. ప్రమాణాలతో కూడిన హెల్మెట్ చిన్‌ వద్ద 20 మీ.మీటర్ల మందంతో తయారవుతుంది. తయారీ సందర్భంగా 250 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. అల్ట్రావాయిలెట్ కిరణాలు పడ్డా ఎలాంటి ప్రభావం ఉండదు. హెల్మెట్‌ పై కంపెనీ పేరు, ట్రేడ్ మార్కు, సైజు, తయారు చేయబడిన సంవత్సరం ఉంటుంది. ఒరిజినల్‌ ఐఎస్‌ఐ హెల్మెట్లపై లేబుల్ తొలగించలేరని నిపుణులు అంటున్నారు. మీరు కొన్నది నకిలీదో అసలుదో చెక్‌ చేసుకునేందుకు బీఐఎస్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయనో.. ఏదో ఒకటి ఉంటే సరిపోతుందనే ఆలోచనలో నాసిరకం హెల్మెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని.. వాహనదారులకు నిపుణులు సూచిస్తున్నారు. 

11:10 - March 25, 2016

హైదరాబాద్ : నగర వీధుల్లో మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సమయం ఆసన్నమవుతోంది. మెలికలు తిరుగుతూ వయ్యారాలు పోయే మెట్రో అందాలు మరో మూడు నెలల్లో హైదరాబాదీలను కనువిందు చేయనున్నాయి. దీంతో మెట్రో రైలు వ్యవస్థను పూర్తి భద్రత వలయంలోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
జూన్‌ నెలలో రైళ్ల పరుగులు
మెట్రోరైలు మొదటి దశ నిర్మాణం పూర్తి కావడంతో జూన్‌ నెలలో..రైళ్లను పరుగులు పెట్టించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. లోపాలను గుర్తించేందుకు ఇప్పటికే 6 నెలలుగా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెట్రోరైలు పట్టాలెక్కే సమయానికి పూర్తిస్థాయిలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 60 కోట్ల ఖర్చుతో భద్రతా సిబ్బంది నియామకం జరుగుతోంది. 22 రైల్వే స్టేషన్లకు ఒక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎంజిబిఎస్, జూబ్లీ స్టేషన్‌, పంజాగుట్టలలో ఈ పోలీసు స్టేషన్లు ఉండనున్నాయి. ప్రతి మెట్రో రైల్వే స్టేషన్‌కు ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమిస్తున్నారు. ప్రతి రెండు రైల్వే స్టేషన్లకు ఒక ఎస్‌ఐ ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు. 
పర్యవేక్షించేందుకు పటిష్టమైన కార్యాచరణ
మెట్రో రైలు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇద్దరు డిసిపిలు, నలుగురు ఎసిపిలు, 35 మంది ఎస్సైలు, 64 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 250 మంది కానిస్టేబుళ్లు, వంద మంది మహిళా కానిస్టేబుళ్లతో రక్షణ చర్యలు చేపట్టనున్నారు. సుమారు 1600 మంది పోలీసులు నిరంతరం ప్రయాణీకుల కదలికలను గమనించనున్నారు. స్టేషన్లతో పాటు రైలు మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు హై డెఫినిషన్‌ సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణీకుల బ్యాగేజీ స్కానింగ్‌.. మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. సంఘవిద్రోహ చర్యలను అరికట్టేందుకు..రైల్వే స్టేషన్లు, ట్రాకులు, వయోడెక్ట్‌ల్లో పోలీస్‌ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహించనున్నాయి. 
మెట్రో పోలీసులు నేరుగా కేసులు నమోదు 
హైదరాబాద్‌ సిటీ పోలీసు యాక్ట్ ను మెట్రో రైల్వే ఫోర్స్ కు విస్తరింపచేస్తున్నారు. దీంతో మెట్రో పోలీసులు నేరుగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం కలుగుతుంది. మెట్రోరైలుకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు మెట్రోపాలిటన్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 

11:00 - March 25, 2016

గ్రామాల్లో ఇప్పటికీ చాలామందికి ఆకలితీర్చే ఆహారం రైస్‌వాటర్‌(గంజి). బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. గంజి నీటి ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు బియ్యం కడిగిన నీళ్లే రైస్‌ వాటర్‌ అనుకుంటే పొరబడ్డట్టే. దీన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా ఉడుకుతున్నప్పుడే ఆ నీటిని వేరు చేయాలి. అలా వేరు చేసిన నీటిని వేడిగా ఉన్నప్పుడైనా, చల్లార్చిన తర్వాతైనా తాగవచ్చు. ఈ బియ్యం నీళ్లు మన ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. పూర్వం ఇలాంటి రైస్‌ వాటర్‌తో చైనీస్‌ ట్రీట్మెంట్‌ చేసేవాళ్లట. ఇది శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. చౌకగా దొరికే మంచినీళ్లు, బియ్యం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, అందమైన, సున్నితమైన చర్మం పొందవచ్చు. అదేలాగో చూద్దాం.
ఈ నీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణ శక్తినివ్వడంతోపాటు ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది. అలాగే క్యాన్సర్‌ను నివారిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు, శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో బాగా పనిచేస్తుంది.
అంతేకాదు రైస్‌వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల, క్లెన్సింగ్‌ ఎఫెక్ట్‌ పొందవచ్చు. ముఖంపై గుంతలు ఏర్పడకుండా నివారించవచ్చు.
రైస్‌వాటర్‌తో జుట్టుని శుభ్రం చేసుకుంటే కురులు పట్టుకుచ్చులా మృదువుగా, ఆరోగ్యంగా మారతాయి.
రైస్‌వాటర్‌తో స్నానం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అందుకే గంజినీళ్ళే అని తీసిపారేయకండి. సహజమైన రైస్‌వాటర్‌ అవకాశం ఉన్నప్పుడల్లా తీసుకోండి!

చిక్కడపల్లి ఆంధ్రా బ్యాంక్ లో చోరీకి యత్నం...

హైదరాబాద్ : చిక్కడపల్లి ఆంధ్రాబ్యాంక్ లో దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంక్ గోడకు రంధ్రం చేసి లోపలికి దుండగులు లోపలికి ప్రవేశించారు. స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోకపోవడంతో దుండగులు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. 

విద్యార్థి తలపై పగిలిన బీర్ బాటిల్!

విశాఖ : నరవ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి సతీశ్, హాస్టల్ వార్డెన్ జగన్మోహన్ ల మధ్య నెలకొన్న చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఏటీఎం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన వార్డెన్ విద్యార్థి తలపై బీరు బాటిల్ తో దాడి చేశాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని ఆసుపత్రికి తరలించిన సహ విద్యార్థులు వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

10:48 - March 25, 2016

విశాఖ : నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో వార్డెన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఓ విద్యార్థిపై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. సతీష్ అనే విద్యార్థి నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీలో చీఫ్ వార్డెన్ గా పని చేస్తున్న జగన్ మోహన్ నుంచి సతీష్ రెండు వేల రూపాయలు తీసుకున్నాడు. అట్టి డబ్బులు ఇవ్వాలని నిన్న రాత్రి సమయంలో వార్డెన్ సతీష్ ను కోరాడు. అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని... తర్వాత ఇస్తానని చెప్పాడు. అయిఆన డబ్బులు ఇవ్వాల్సిందే అని వార్డెన్ పట్టుబట్టాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈనేపథ్యంలో జీర్ణించుకోలేని వార్డెన్ అక్కడే ఉన్న బీర్ బాటిల్ తో అతనిపై దాడి చేశాడు. సతీష్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని గోపాలపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సతీష్ కు వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్డెన్ బీర్ బాటిళ్లను హాస్టల్ లోకి ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు వార్డెన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

10:39 - March 25, 2016

కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్‌(35) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 8.15 గంటలకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో తుదిశ్వాసవిడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జిష్ణు ప్రముఖ నటుడు రాఘవన్‌ కుమారుడు. రెండేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడిన జిష్ణు సురక్షితంగా బయటపడ్డారు. 35 ఏళ్ల జిష్ణు తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులతో ప్రఖ్యాతి గాంచారు. రెండేళ్ల క్రితం ఆయన కేన్సర్ బారిన పడ్డారు. చికిత్స తీసుకోవడంతో కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని భావించారు. ఏడాది మళ్లీ కేన్సర్ తిరగబెట్టడంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టేవారు. 1987లో కిల్లిపట్‌ చిత్రం ద్వారా బాలనటుడిగా జిష్ణు మలయాళ తెరకు పరిచయమయ్యారు. హీరోగా నటించిన తొలిచిత్రం నమ్మల్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. పారాయమ్‌, చూండా తదితర చిత్రాల్లో జిష్ణు నటించారు. ఆర్కిటెక్ ధన్యరాజన్ ను ఆయన వివాహం చేసుకున్నారు. జిష్ను మృతితో మలయాళ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే విలక్షణ నటుడు కళాభవన్ మణి అనుమానాస్పద పరిస్థితుల్లో హఠాన్మరణం చెందారు. కల్పన, షాన్ జాన్సన్, వీడీ రాజప్పన్, రాజేశ్ పిళ్లై తదితర నటులు ఈ ఏడాదిలోనే మరణించడంతో మలయాళ సినిమా పరిశ్రమకు వరుసగా షాక్ తగిలినట్టైంది.

10:31 - March 25, 2016

హైదరాబాద్ : టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్ ..గ్రూప్- బీ లీగ్ లో మరో లోస్కోరింగ్ థ్రిల్లర్ నమోదయ్యింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన మూడోరౌండ్ పోటీలో ఆతిథ్య టీమిండియా...ఒకే ఒక్క పరుగుతేడాతో బంగ్లాదేశ్ కు షాకిచ్చింది. ఈమ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ...వెయ్యి పరుగుల క్లబ్ లో చేరిన ఐదో భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. బెంగళూరు మ్యాచ్ అరుదైన రికార్డులు ఓసారి చూద్దాం......
టీ-20 క్రికెట్ అంటే వీరబాదుడు..     
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే...కేవలం వీరబాదుడు మాత్రమే కాదు...సమయస్ఫూర్తి, తుదివరకూ పోరాడే తత్వం కూడా అని...బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా...టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ముగిసిన...గ్రూప్ -బీ మూడోరౌండ్ పోటీ ఫలితం చెప్పకనే చెప్పింది.
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో టీమిండియా 
ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..ఆతిథ్య టీమిండియా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉంటే...ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ మాత్రం 10వ ర్యాంక్ లో కొనసాగుతోంది. అయితే...ఈ రెండుజట్ల మధ్య ముగిసిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ మాత్రం..ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగింది.
గుండెపోటు తెప్పించినంత పని
దేశదేశాలలోని కోట్లాదిమంది భారత్, బంగ్లాదేశ్ అభిమానులకు..గుండెపోటు తెప్పించినంత పనిచేసింది. ప్రస్తుత ప్రపంచకప్ లోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా...బంగ్లాదేశ్ ముందుంచిన లక్ష్యం కేవలం 146 పరుగులు మాత్రమే. అయితే..బంగ్లా టాపార్డర్ తో పాటు..సీనియర్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, షకీబుల్, మహ్మదుల్లా, ముష్ ఫికర్ తమ బ్యాట్లకు పని చెప్పి..విజయానికి చేరువగా తీసుకువెళ్ళారు. భారత బౌలర్ల తప్పిదాలు, ఫీల్డర్ల వైఫల్యాన్ని బంగ్లా పూర్తిస్థాయిలో ఉపయోగించుకొంది.
అనుభవ లేమితో బంగ్లా ఓటమి
ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే...సంచలన విజయం సాధించే స్థితిలో ఉన్న బంగ్లాదేశ్..అత్యుత్సాహం, అనుభవం లేమితో అనుకోని ఓటమి కొని తెచ్చుకొంది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో...అదీ ఏమాత్రం అనుభవం లేని భారత యువ పేసర్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో..బంగ్లా బ్యాట్స్ మన్ బోల్తా కొట్టారు. 20వ ఓవర్ నాలుగో బంతికి ముష్ ఫికర్ రహీం, ఐదో బంతికి డేంజర్ మ్యాన్ మహ్మదుల్లాలను పాండ్యా పడగొట్టాడు.
కెప్టెన్ ధోనీ సమయస్ఫూర్తి ముందు బంగ్లా తెల్లమొకం 
దీంతో ఆఖరి బంతిలో 2 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ ఆఖరిజోడీ....టీమిండియా కెప్టెన్ ధోనీ అపారఅనుభవం, సమయస్ఫూర్తి ముందు తెల్లమొకం వేసింది. హార్ధిక్ పాండ్యా వికెట్ల మీదుగా వేసిన షార్ట్ పిచ్ బంతిని వికెట్ కీపర్ ధోనీ అందుకొని..స్టంపౌట్ చేసి...తనజట్టుకు ఒకే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం అందించాడు.
నాలుగో ఒక్క పరుగు గెలుపు
టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇది...నాలుగో ఒక్క పరుగు గెలుపుగా రికార్డుల్లో చేరింది. అంతేకాదు...టీమిండియాకు ప్రపంచకప్ టోర్నీలో రెండో ఒక్క పరుగు విజయం కావడం విశేషం. 2012 ప్రపంచకప్ లో సైతం...సౌతాఫ్రికా పై టీమిండియా ఒక్క పరుగు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా...టీ-20 చరిత్రలో ఇది...తొమ్మిదో ఒక్క పరుగు విజయం కావడం కూడా రికార్డే. బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా టీ-20 క్రికెట్లో టీమిండియాకు ఇది వరుసగా ఐదో గెలుపు. ఈ మ్యాచ్ ద్వారానే టీ-20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ...వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. అంతేకాదు.....టీ-20 ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ,యువరాజ్ సింగ్, విరాట్ కొహ్లీ, సురేశ్ రైనాల సరసన ధోనీ చోటు సంపాదించాడు.
ధోనీ వెయ్యి పరుగుల రికార్డు 
తన కెరియర్ లో వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడుతున్న ధోనీ 58 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగుల రికార్డు అందుకోగలిగాడు. ధోనీ 120.71 స్ట్రయిక్ రేట్ తో 34.75 సగటు సైతం నమోదు చేశాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగోసారి పడగొట్టడం విశేషం. భారత గడ్డపై గత 18 సంవత్సరాల కాలంలో...టీమిండియాను మొట్టమొదటిసారి ఓడించడానికి వచ్చిన గోల్డెన్‌ చాన్స్...చేతికి అందినట్లే అంది...చేజారిపోడంతో...బంగ్లాదేశ్ అభిమానులు చెప్పలేని గుండెకోతకు గురయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

10:18 - March 25, 2016

పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట. సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి. ప్రస్తుతం ఆస్థానాన్ని వియత్నాం స్వంతం చేసుకున్నది. సాధారణంగా మిరియాలంటే నల్లటి మిరియాలే తెలుసు. కాని వాటిలో తెల్లనివి, ఆకు పచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబి రంగువి కూడా వుంటాయి. మిరియాలకు పుట్టిల్లు మనదేశంలో మలబార్ ప్రాంతమైనా చాల ప్రాంతాలలో వీటిని పండిస్తున్నారు. పోషకాల విషయానికొస్తే చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. అన్ని సుగంధ ద్రవ్యలకన్నా అత్యధిక విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.

100 గ్రాముల మిరియాలలో...

పిండిపదార్థాలు: 49 గ్రాములు,

మాంసకృత్తులు: 10.5 గ్రాములు

కొవ్వు: 6.8గ్రాములు

ఖనియాలు: 4.4గ్రాములు

పీచు:14.9 గ్రాములు

క్యాల్షియం: 460 మిల్లీగ్రాములు

ఇనుము: 12.4మిల్లీగ్రాములు

ఫాస్పరస్‌: 198 మిల్లీగ్రాములు

కెరొటీన్లు:1080 మిల్లీగ్రాములు

మెగ్నీషియం: 171 మిల్లీగ్రాములు

శక్తి: 304 కెలొరీలు

ఉపయోగాలు ....

- జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడం, ఘాటైన వాసనను కలిగి ఉండడం వంటి గుణాల కారణంగా ఇవి శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. ఒక గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయి.

- లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి నెట్టి వేసే శక్తి మిరియాలకు ఉంది. రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడుతాయి.

- కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.

- అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

- ఉదరంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

- కండరాలు, నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది.

- అధిక దాహం ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి.

- చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.

- మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.

- చర్మవ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవే కాకుండా మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గా, అసిడిటీ సమస్యకు, శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.

- మిరియాలు తింటే కడుపులో మంటగా ఉంటుందేమోగానీ చర్మంపై వచ్చే తెల్లమచ్చల్ని తగ్గించటంలో మాత్రం ఇవి బాగా తోడ్పడుతాయని పరిశోధకులు అంటున్నారు. చర్మంపై కొన్నిచోట్ల రంగు తొలగిపోయి తెల్లని మచ్చల్లా ఏర్పడే బొల్లి వంటి మచ్చల్ని మిరియాలు తగ్గిస్తాయని లండన్‌ కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు గుర్తించారు.

- వేడి చేయడం గురించి.... కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మరీ వేడిని పెంచి.. సమస్య తీవ్రమయ్యే అవకాశం కలదు.

ఏపీ రాజధానిలో సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

గుంటూరు :  ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేతలను అరెస్టు చేసి తుళ్లూరు పీఎస్ కు తరలించారు. సీఎం పర్యటనకు సీపీఎం నేతల అరెస్ట్ లకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం నేత బాబూరావు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

లారీని ఢీకొన్న ఆటో : ఇద్దరి మృతి

రంగారెడ్డి: పూడూరు సమీపంలో కేశవరెడ్డి స్కూల్ వద్ద పక్కన నిలిపివున్న లారీని ఆటో ఢీ కొట్టింది.ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు పూడూరుకు చెందిన లక్ష్మయ్య(35), చౌకత్(42) అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరిని వికారాబాద్, పరిగి ఆసుపత్రులకు తలరించారు. మృతులు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

09:44 - March 25, 2016

హైదరాబాద్ : సూరన్న సుర్రుమనిపిస్తున్నాడు. కిరణాలతో ప్రజల మాడు మీద గురి చూసి కొడుతున్నాడు. ఉన్న ఫళాన ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తన ప్రతాపంతో  జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఎవరూ బయటకు రాకుండా బెదిరించేస్తున్నాడు. రోడ్లు మీద తిరగకుండా అడ్డం పడుతున్నాడు. మొత్తానికి మార్చిలోనే భగా భగా మండిపోతున్నాడు. ఎండలతో ఎడాపెడా మంటెక్కిస్తున్నాడు.                                                                                
మార్చిలోనే ఎండ‌ల తీవ్రత  
తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండ‌ల తీవ్రత పెర‌గ‌డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు  బ‌య‌టికి రావాలంటేనే ప్రజలు భ‌య‌ప‌డుతున్నారు. ఎండ‌తీవ్రతలకు రోడ్లుపై ట్రాపిక్ తగ్గింది. వాతావ‌ర‌ణంలో మార్పుల‌ కార‌ణంగానే గ‌త ప‌దేళ్లలో గ‌రిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు  పెరిగాయంటున్నారు నిపుణులు.  
ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటి ఉష్ణోగ్రతలు 
గ‌త కొన్నిరోజులుగా సూర్యుడు త‌న‌ ప్రతాపాన్ని చూపుతున్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద‌యం ప‌దిగంటల‌కే  ఎండ తీవ్రత పెరిగిపోతోంది. గ‌త రెండు మూడు నెల‌లుగా పొడి వాతావ‌ర‌ణం ఉండ‌టమే భానుడి ప్రతాపానికి  కారణమవుతోంది. సాధార‌ణంగా  ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే చివరి వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాని ఈ సారి మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
రికార్డు స్థాయిలో వాతావ‌ర‌ణంలో మార్పులు
ఈసారి గ‌త ప‌దేల్లో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చాయి. దాంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 
మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లలో 43 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత
తెలంగాణ‌లో అత్యధికంగా భద్రాచలం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లలో  43 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత న‌మోదయ్యింది. మిగ‌తా జిల్లాల్లోనూ  సూర్యుడు త‌న ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏపీలో రాయ‌ల‌సీమ ప్రాంతం లోని అనంత‌పూర్, క‌ర్నూలు,  తిరుపతి, నంద్యాల‌ల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అనంత‌పురంలో  42 డిగ్రీలు, క‌ర్నూల్‌, తిరుప‌తిలో 43 డిగ్రీల సెంటి గ్రేడ్‌  ఉష్ణోగ్రతలు  న‌మోదు అయ్యాయి. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పూడూరు నుంచి వికారాబాద్ వెళుతూ ఆగి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.

 

నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో వార్డెన్ దౌర్జన్యం

విశాఖ : నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో వార్డెన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సతీష్ అనే విద్యార్థి పై బీర్ బాటిల్ తో హాస్టల్ వార్డెన్ దాడి చేశాడు. దీంతో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సతీష్ ను ఆస్పత్రికి తరలించారు. 

 

09:13 - March 25, 2016

శ్రీ‌కాకుళం : జిల్లాలో ప‌నిచేయుట‌కు అధికారులు కావ‌లెను...ఇదేదో ఉద్యోగ భ‌ర్తీకి ప్రభుత్వ  ప్రకటన కాదు. రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గని వారు, అవినీతికి తావివ్వని వారుకావాలి. ఎందుకంటే గ‌డ‌చిన మూడు నెల‌ల్లో ఎనిమిది శాఖ‌ల ఉన్నతాధికారులు  వివిధ కార‌ణాల‌తో బ‌దిలీ, స‌స్పెన్షన్‌, దీర్ఘకాలిక సెల‌వుతో వెళ్లడంతో ఈ ప‌రిస్ధితులు ఏర్పడ్డాయి.
ప‌లు విభాగాధిప‌తుల సీట్లు ఖాళీ 
శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌లు విభాగాధిప‌తుల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వ‌రుస‌గా ఉన్నతాధికారులు వివిధ  కార‌ణాల రీత్యా వెళ్ళిపోవ‌డంతో త‌క్షణ భ‌ర్తీకి నోచుకోక ఇన్‌ఛార్జ్ ల‌తో నెట్టుకురావాల్సి వ‌స్తోంది. అయితే ఏకంగా  ఎనిమిది శాఖ‌ల‌కు ఉన్నతాధికారులు లేక‌పోవ‌డంతో పాల‌న కుంటుప‌డుతోంది. మ‌రోవైపు ఈ ఖాళీలు ఏర్పడ్డానికి రాజ‌కీయ వేధింపులు , అవినీతి ఆరోప‌ణ‌లు కార‌ణ‌మ‌వుతుండ‌డం విశేషం . గ‌తంలో జిల్లా , మండ‌ల స్థాయి అధికారులు అధికార పార్టీ ఒత్తిడిల‌కు గురై బ‌దిలీ అయ్యార‌న్న విమ‌ర్శలున్నాయి. అదే విధంగా  ప్రస్తుతం జిల్లా రెవిన్యూ అధికారి, డిఎస్ఓ, డిఎఫ్ స్థాయి అధికారులు దీర్ఘకాలిక సెల‌వుపై వెళ్లారు.
ఇద్దరు అధికారుల‌పై విచార‌ణ
అదేవిధంగా అవినీతి ఆరోప‌ణ‌ల న‌డుమ మ‌రో ఇద్దరు అధికారుల‌పై విచార‌ణ జ‌రుగుతోంది. ఇక విధుల్లో నిర్లక్ష్యం  వ‌హిస్తున్నందుకు ఐసిడియ‌స్ ప్రాజెక్టు అధికారి స‌స్పెన్షన్‌కు గుర‌య్యారు. ఇలా ప‌లు కీల‌క విభాగాల‌లో ఉన్నతాధికారుల పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదిలా  ఉండ‌గా జిల్లా మంత్రితో పాటు, కొంత‌మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వేధింపుల కార‌ణంగా ఉద్యోగులు స‌క్రమంగా ప‌నిచేయ‌లేక‌పోతున్నార‌ని, కొత్తగా ఖాళీలు ఏర్పడిన విభాగాల‌కు బ‌య‌ట‌వారు వ‌చ్చేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డంలేద‌ని విప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు.
ప్రజా సమస్యలు ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేదు 
ప్రభుత్వ శాఖ‌ల్లోని ఉన్నత‌స్థాయి అధికారుల సీట్లకు ఖాళీ ఏర్పడటంతో ప్రజా సమస్యలు ప‌రిష్కారానికి నోచుకోవ‌డంలేదు. ఇప్పటికైనా ఈవిష‌యంలో స్పందించి ఖాళీ ఏర్పడిన ఉద్యోగులు స్థానే కొత్తవారిని నియ‌మించి స‌మ‌ర్ధవంతంగా విధులు  నిర్వర్తించేలా చర్యలు చేప‌ట్టాల‌ని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

09:04 - March 25, 2016

ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వందమంది వ్యక్తుల జాబితాను 'టైమ్‌ 100'  పేరుతో వచ్చే నెలలో టైమ్స్ మ్యాగజైన్‌ విడుదల చేయనుంది. ఈ వందమంది ప్రతిభావంతుల జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఉండటం విశేషం. ప్రధాని నరేంద్రమోదీతోపాటు టెన్నీస్‌స్టార్‌ సానియా మీర్జాతోపాటు గుగూల్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, హ్యారీపోటర్‌ రచయిత జేకే.రోలింగ్‌ కూడా ఈ జాబితాలో స్థానంలో సొంతం చేసుకోవడం మరో విశేషం. బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా అదే ప్రయత్నం చేస్తోంది. 'క్వాంటికో' టెలివిజన్‌ సీరిస్‌తో ఇప్పటికే ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. దీంతోపాటు ప్రస్తుతం 'బేవాచ్‌' హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. 'బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ప్రియాంక ఆకర్షిం చడంతో 'టైమ్‌ 100'లో స్థానం లభించింది. ఇదిలా ఉంటే, హ్యారీపోటర్‌ సీరిస్‌ రచయిత జేకే రోలింగ్‌ కూడా ఈ జాబితాలో స్థానం సొంతం చేసుకోవడాన్ని స్ఫూర్తిదాయక విజయంగా హాలీవుడ్‌ నిర్మాతలు అభివర్ణించారు.

 

08:19 - March 25, 2016

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. కన్నడతోపాటు తెలుగులోనూ శతదినోత్సవ చిత్రంగా నిలిచిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2' చిత్రం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ప్రెసిడెంట్‌ గోవిందు క్లాప్‌ ఇచ్చారు. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, 'దండుపాళ్యం' సక్సెస్‌ తర్వాత దీనికి సీక్వెల్‌గా సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ వెంటనే చేయలేకపోయాను. ఆ సినిమా కోసం నేను కొన్ని వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్‌లో కూడా ఇంత పెద్ద స్పాన్‌ ఉంటుందా అనిపించింది. ఫస్ట్ పార్ట్ వెనుక ఉన్న కథను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఓ విషయంపై పోలీస్‌ డిపార్ట్ మెంట్‌, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా రన్‌ అవుతుంది. సాధారణంగా ఎవరైనా మంచి పనిచేస్తే దాన్ని ఎక్కువ చేసి మరీ చూపిస్తాం, చెబుతాం కూడా. అలాగే ఏదైనా క్రైమ్‌ జరిగినపుడు కూడా మీడియా దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది. ప్రజలు కూడా దాని గురించి ఎక్కువగా డిస్కస్‌ చేస్తారు. ఈ చిత్రంలో ఒక నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించబోతున్నాం. నిజానికి నేనీ స్టోరీని హేట్‌ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్‌ను డైలూష్యన్‌ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్‌ ఉండదు' అని అన్నారు. ''దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మూడేళ్ళ క్రితం విడుదలైన 'దండుపాళ్యం' కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ గా విజయం సాధించి శతదినోత్సవం కూడా జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. జూన్‌, జూలై నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని నిర్మాత వెంకట్‌ చెప్పారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ హెచ్‌.డి.గంగరాజు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎన్‌.సురేష్‌లతోపాటు నటులు డానీ కుట్టప్ప, ముని, జయదేవ్‌, పెట్రోల్‌ ప్రసన్న, సినిమాటోగ్రాఫర్‌ వెంకటప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

నేడు గవర్నర్ ను కలవనున్న మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : పీడీపీ శాసన సభాపక్ష నేత మెహబూబా ముఫ్తీ నేడు గవర్నర్ ను కలవనున్నారు. జమ్మూకాశ్మీర్ లో ముఫ్తీ తొలి మహిళా సీఎం కానున్నారు.  

నేడు కోరుట్లలో మంత్రి ఈటెల, ఎంపీ కవిత పర్యటన

కరీంనగర్ : నేడు కోరుట్లలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవిత పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేయనున్నారు. 

తిరుమలకు పోటెత్తిన భక్తులు

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 4గంటల సమయం పడుతోంది.

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు.  మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.  

నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

గుంటూరు : సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాత్కాలిక సచివాలయ పనులను సీఎం పరిశీలించనున్నారు. 

07:53 - March 25, 2016

ప్రధాని నరేంద్ర మోడీ పాలన.... అప్రజాస్వామికంగా కొనసాగుతోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. మోడీ వచ్చాక... భిన్నాభిప్రాయాలను సహించలేని పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నామనే ధైర్యంతో దళితులపై మరింత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళిత వ్యతిరేకవాదాన్ని, బ్రహ్మణ అనుకూల వాదాన్ని ముందుకుతీసుకొస్తున్నారని పేర్కొన్నారు. హిందూత్వ వాదులు కన్హయ్యపై చెప్పులు విసరడం ఎంతవరకు సబబు అని అన్నారు. దేశంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాలని పులుపునిచ్చారు. భిన్నత్వాన్ని గౌరవించాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:43 - March 25, 2016

తిరుపతి : పెదరాయుడి మసాలా దోశలు అదరగొట్టేశాయి. అసెంబ్లీ రౌడీ ఇడ్లీలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అల్లుడి గారి పూరీలు కొనేందుకు జనం క్యూ కట్టారు. రౌడీవడ, అధిపతి పొంగల్‌ నోరూరించేశాయి. ఇక పొగలు కక్కే బ్రహ్మ కాఫీ కోసం జనం పోటీ పడ్డారు. మొత్తానికి మంచువారి హోటల్‌లో టిఫిన్‌ ఆరగించేందుకు ఊరు మొత్తం తరలివచ్చేసింది. ఇంతకూ ఈ ఐటెమ్స్ ను అమ్మింది ఎవరో కాదు... సాక్షాత్తు సినీ నటుడు మోహన్‌బాబే. తిరుపతిలోని రంగంపేటలో మోహన్ బాబు.. ఆటోడ్రైవర్‌ మస్తానయ్యకు టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మస్తానయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు మోహన్ బాబు వంట మాస్టార్‌ అవతారమెత్తాడు. అమ్మిన మోహన్‌బాబు స్వయంగా ఆహార పదార్థాలను అమ్మారు. పెదరాయుడి మసాల దోశ, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ, అల్లుడి గారి పూరీ పేర్లతో వంటకాలు తయారు చేశారు. ఆహార పదార్థాలను అమ్మగా వచ్చిన సొమ్ము మస్తానయ్య కుటుంబానికి అందజేశారు.

 

07:36 - March 25, 2016

హైదరాబాద్ : మలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొలిటికల్ జేఏసీ రూటు మారుతోంది. ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటు వరకు  తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసిన జాక్... ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటోంది. ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించిన టీజాక్ .. తాజా సర్కార్‌ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది.  ఈ విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 
తెలంగాణా ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ కీలకపాత్ర
ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలోని పొలిటికల్ జేఏసీ తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషిచింది. ఉద్యోగ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను ఐక్యంచేసి... ఉద్యమానికి ఊపిరి పోసింది.   దాదాపు 120 ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లింది. అటువంటి  పొలిటికల్ జేఏసీ పంథా... ఇప్పుడు మారుతున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 
టీజాక్‌కు టీఆర్‌ఎస్‌ ఝలక్‌ 
రాష్ట్ర  ఆవిర్భావం వరకు  క్రియాశీలకంగా పనిచేసిన జెఎసి..... ఆ తర్వాత కొంత  సైలెంట్  అయ్యింది.   ఉద్యమంలో  టీజాక్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చి, సహకారం అందించిన  టీఆర్‌ఎస్‌...   ఎన్నికలకు ముందుగానే తమది  ఫక్తు రాజకీయ పార్టీ అంటూ....కమిటీకి ఝలక్‌ ఇచ్చి, క్రమంగా  దూరమైంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలు కూడా జాక్ వైపు కన్నెత్తి చూడలేదు. నిన్న మొన్నటి వరకు జెఎసి లో కొనసాగిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని టీ జాక్ చైర్మన్ కోదండరాం చేస్తున్న ప్రకటనలు ఉద్యోగ సంఘం నేతలను ఇరుకున పెడుతున్నాయి. దీంతో..... ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న సంఘాలన్నీ అదే దారిలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరవు  పరిస్థితులపై ఇప్పటికే కోర్టు తలుపులు తట్టిన  టీజాక్ చైర్మన్ కోదండరామ్‌....ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా వ్యాఖ్యలు చేస్తుండడంతో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు.
సర్కార్‌పై పోరాటానికి సిద్ధమంటూ పరోక్షంగా సంకేతాలు 
రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు  కూడా అధికార పార్టీ పై ఎదురు దాడి చేసేందుకు సాహసం చేయలేకపోతున్న తరుణంలో...  టీజాక్ మాత్రం  అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.  తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలను అనుగుణంగా స్పందిస్తున్నామని, ఇదే  తమ ప్రధాన లక్ష్యమని సంకేతాలు ఇస్తోంది. జాక్ నుంచి వైదొలుగుతున్న ఉద్యోగ సంఘాల గురించి ఏమాత్రం పట్టిచుకోని    కోదండరాం..... ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలను తప్పబడుతున్న  టీ జేఏసీ.. రాబోయే రోజుల్లో  సర్కారుపై  ఎలా  ఉద్యమిస్తుందో అన్న అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.   త్వరలో టీజాక్ విస్త్రృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని  చైర్మన్‌ కోదండరామ్‌ నిర్ణయించారు.  అన్ని స్థాయిల్లో కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. 

07:28 - March 25, 2016

నిజామాబాద్ : హోలీ అంటే అందరూ గులాల్ చల్లుకుంటారు. రంగు రంగుల నీళ్లు పోసుకుంటారు. కొంతమంది అయితే కోడిగుడ్లు విసురుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో హోలీనీ వింతగా జరుపుకుంటారు. ఏంటీ ఆ వింత అనుకుంటున్నారా! అయితే ఇటు ఓ లుక్ వేయండి! 
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు 
జిల్లాలోని బోధన్ మండలం హున్సా గ్రామంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం గ్రామంలోని మగాళ్ల అంతా ఓ చోట గుమిగూడి  పిడికిళ్లు బిగపట్టి మరీ కొట్టుకుంటారు. నడివీధిలో తాడుకట్టి తాడుకు ఇరువైపులా జనం చేరి ముఖాలు, వీపులపై బాదుకుంటారు. పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. ఆట ఆడకుంటే గ్రామానికి ఆరిష్టం అన్నది గ్రామస్థుల వాదన. 
అసలు ఈ ఆట ఎలా వచ్చిందంటే...
అసలు ఈ ఆట ఎలా వచ్చిందంటే... మంజీర నదిని ఆనుకుని ఉన్న హున్సా గ్రామం పూర్వం మహారాష్ట్రలో ఉండేది. అక్కడ పెద్దఎత్తున  వారాంతపు సంత జరిగేది. ప్రస్తుతం ఇక్కడ జరిగే పిడిగుద్దులాట మహారాష్ట్రలోని సగ్రోలిలో  నిర్వహించేవారు. కాలక్రమంలో ఈ వేడుకను... హున్సాలో కూడా నిర్వహించాలని ఆనాటి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతారు. హోలీ రోజున జరిగే ఈ పిడిగుద్దుల ఆటను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్రలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.

 

07:23 - March 25, 2016

హైదరాబాద్ : రోజా రూటెటు..?  ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఆమె హాజరవుతారా? క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? వైసీపీలో ఇప్పడిదే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. ఈ అంశంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో న్యాయపోరాటానికే వైసీపీ సిద్ధమవుతోంది. 
రోజా సస్పెన్సన్‌ పై వైసీపీలో తీవ్ర స్థాయి చర్చ
రోజా సస్పెన్సన్‌ వ్యవహారంపై వైసీపీలో చర్చ తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే సభ రోజా ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరుకావడానికి మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రోజా సభా హక్కుల కమిటీ ముందు హాజరవుతారా..లేదా అనే దానిపై చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. 
రోజా క్షమాపణ అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు
రోజా క్షమాపణ అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరయి.. క్షమాపణ చెబితేనే మంచిదని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. గతంలో చాలా మంది ప్రముఖులు  కూడా సభకు క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఐతే ఈ వాదనను మరికొంతమంది ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. రోజా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. క్షమాపణ చెప్పించి..ఆమె తప్పు చేశారనే అభిప్రాయం కలిగించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని..కాబట్టి రోజా క్షమాపణ చెప్పకపోవడమే బెటర్‌ అనే అభిప్రాయాన్ని ఆ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ క్షమాపణ చెప్పినా కనీసం ఆరు నెలలపాటైనా రోజాపై సస్పెన్షన్‌ వేటు వేసే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉందని సదరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రోజా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధం
మరోవైపు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని రోజా భావిస్తున్నారు. 

 

07:18 - March 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సరళమైన, పారదర్శకమైన పారిశ్రామిక విధానం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగినట్టు మైక్రోమాక్స్ కంపెనీ మంత్రి కేటీఆర్‌కు ఓ సందేశాన్ని పంపింది. ఉత్తరాఖండ్‌లో ప్లాంట్ ప్రారంభించడానికి రెండున్నరేళ్లు పడితే తెలంగాణలో కేవలం 6నెలల్లో పూర్తయిందని మైక్రోమాక్స్ పంపిన సందేశాన్ని మంత్రి కేటీఆర్ సీఎం కు వివరించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఐటీ, ఫార్మా కంపెనీల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 

 

07:05 - March 25, 2016

విశాఖ : నగరంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ తెరలేచింది. అధికారులు కావాలనే కళ్ళు మూసుకుని ప్రైవేట్ వ్యక్తులకు కోట్ల విలువైన దసపల్లా హిల్స్ భూములను అప్పగించడానికి రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఈ అవినీతికి బీజం పడగా.. ప్రస్తుతం న్యాయస్ధానంలో వాదనలు వినిపించకుండా ప్రభుత్వ అధికారులు తప్పించుకొని తిరుగుతున్నారు.
దసపల్లా భూములపై అక్రమార్కుల కన్ను 
విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములంటే.. బంగారంతో సమానం.  దీనిపై ఆక్రమణదారుల కన్నుపడింది. కాంగ్రెస్ హయాంలో పావులు కదిపారు. దొంగపత్రాలు తయారు చేసారు. కోర్టులను నమ్మించే ప్రయత్నం చేసారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు సహకరించారు. 18 ఎకరాల్లో సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం కానున్నాయి. 
అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణదారులకు అనుకూలం
విచిత్రం ఏమిటంటే దీనిపై అధికారులు న్యాయస్ధానంలో ప్రభుత్వం తరపు వాదనలు వినిపించకుండా కావాలనే తప్పించుకున్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ఐఎఎస్ అధికారిని న్యాయస్ధానానికి పంపించాల్సింది పోయి.. ఎమ్మార్వోను పంపారు. ఇక్కడే పరిస్థితి ఆక్రమణదారులకు అనుకూలంగా మారింది. దీంతో సర్కారుకు గట్టి దెబ్బ తగిలింది.
దసపల్లా భూములు సర్కారువని నిర్ధారణ
గిల్ మెన్  కాలంలోనే దసపల్లా భూములు సర్కారువే అని  తేల్చేసింది. కాని ఆక్రమణదారులు తప్పుడు సమాచారం అందించారు.  కొండప్రాంతాలు, వాగులు, వంకలు సర్కార్‌కు చెందుతాయి. ల్యాండ్ మాఫియా తప్పుదారి పట్టించింది. రెవిన్యూ నోరుమూసుకుంది. దీనిపై ప్రస్తుత సర్కారు విచారణ జరపాలని, సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని టిడిపి నేత డిమాండ్ చేస్తున్నారు.
బడా వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు అనుమానం
సర్వే నెంబర్ 1196లో ఉన్న 18 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలన్నది ల్యాండ్ మాఫియా ఫ్లాన్. ఇదే దసపల్లా హిల్స్ లో ప్రభుత్వ అతిథి గృహం, జివిఎంసి మంచినీటి ట్యాంకర్లు ఉన్నాయి. ఇవన్నీ సర్కారు స్ధలం అయినపుడు.. ప్రైవేట్ వ్యక్తులకు తమ స్ధలమని ఎలా వాదిస్తున్నారన్నది  గమనిస్తే అనుమానాలు బలపడతాయి. గత ప్రభుత్వానికి  చెందిన వ్యక్తులతోపాటు, కొందరు బడా వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు  కూడా ఇందులో భాగస్వాములనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తక్షణం ప్రభుత్వం  దసపల్లా భూముల్లో మోడ్రన్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలని విశాఖ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

 

06:59 - March 25, 2016

హైదరాబాద్ : వారంతా పేరొందిన వ్యక్తులు అంతా కలిసి ఒక్కతాటిపైకి వచ్చి సమాజ సేవకు కదిలారు. 'స్వచ్ఛభారత్‌'కే ఆదర్శంగా నిలుస్తూ చల్లపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో సైనికుల్లా పనిచేస్తున్నారు. డాక్టర్‌ డిఆర్‌కె ప్రసాద్‌, డాక్టర్ పద్మావతిలు చేపట్టిన ఈ కార్యక్రమం నేటితో 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్‌ రిపోర్ట్. 
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'స్వచ్ఛ' చల్లపల్లి... 
జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్‌ డిఆర్‌కె ప్రసాద్‌ , డాక్టర్ పద్మావతిలు చల్లపల్లిని సుందర చల్లపల్లిగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు.  తెల్లకోటు, స్టెతస్కోపుతో హాస్పటల్లో వైద్యసేవలు అందించే డాక్టర్లు చీపుర్లు పట్టుకుని వీధులు శుభ్రం చేస్తున్నారు. పుస్తకాలు పట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు గడ్డపార, గొర్రు చేతబూని డ్రెయిన్‌లోకి దిగి మురుగుతీస్తున్నారు. 
విరామం లేకుండా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం
చిత్తశుద్ధితో ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి ఉదయం ఆరింటి వరకు ఏనాడూ విరామం లేకుండా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. తాము తలుచుకుంటే టీచర్లుగా అజ్ఞానాన్ని, వైద్యులుగా అనారోగ్యాన్నే కాదు, పరిసరాల్లోని చెత్తనూ తుడిచేస్తామని డాక్టర్లు, టీచర్లు నిరూపిస్తన్నారు. వివిధ రంగాల ప్రముఖులు మేము సైతం... అంటూ ముందుకొస్తున్నారు. ఈ స్వచ్ఛ చల్లపల్లి నేడు జాతీయ స్థాయి గుర్తింపుని తెచ్చుకుంది.
స్వచ్ఛ చల్లపల్లి కోసం సైనికుల్లా పనిచేస్తున్నారు 
పది సంవత్సరాల పిల్లల నుంచి 80ఏళ్ళ వృద్ధుల వరకు స్వచ్ఛ చల్లపల్లి కోసం సైనికుల్లా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఎన్నో పండుగలతోపాటు తుఫానులు, భారీ వర్షాలు, విపత్తులు సంభవించినా ఏనాడూ విరామం ఇవ్వకుండా ముందుకు కదులుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామలు అయినందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్ధులు అంటున్నారు. 
స్వచ్ఛ చల్లపల్లికి 500 రోజులు  పూర్తి
స్వచ్ఛ భారత్ రాయబారులు, మంత్రులు చల్లపల్లి విచ్చేసి స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను పరిశీలించి అభినందించారు. ఇవాళ్టితో ఈ కార్యక్రమం 500 రోజులు  పూర్తి చేసుకోవడంతో వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

06:52 - March 25, 2016

కడప : టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా  కాంగ్రెస్ లో ఉన్న ఆయన పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదని నిర్ణయించుకొని సైకిలెక్కారు. సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజంపేట నుంచి ఆయన ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియారిటీని గుర్తించి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించింది.  సమైఖ్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం దూరం అయినా మళ్లీ  పార్టీ లోనే కొనసాగారు. 
వైఎస్ కు అత్యంత సన్నిహితుడుగా సాయి ప్రతాప్ 
30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం సాయిప్రతాప్ కు ఉంది. జిల్లాలో ఆయన వివాద రహితుడుగా పేరు సంపాదించారు.  వైఎస్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సాయి ప్రతాప్ టీడీపీలోకి చేరటంతో కడప జిల్లాలో సమీకరణాలు మారనున్నాయి. ఇప్పటికే  వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు. దీంతో జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  మరో వైపు సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీ లో చేరటంపై కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విమర్శలకు సాయి ప్రతాప్ సమాధానం చెప్పాల్సి ఉంది.  రాజకీయ నాయకులు పార్టీ మారటం తప్పు కాకపోవచ్చు. అయితే అందుకు దారితీసిన కారణాలు ప్రజలకు తెలియజేయాల్సిన నైతిక బాధ్యత ఉంది.

నేటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ లోభాగంగా నేడు మొహాలీలో మధ్యాహ్నం 3.30 గంటలకు పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఢీకొననున్నాయి. నాగపూర్ లో రాత్రి 7.30 గంటలకు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. 

నేడు కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాత్ భేటీ

చెన్నై : నేడు కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాత్ భేటీ కానున్నారు.  పలు అంశాలపై వారు చర్చించనున్నారు. 

నేడు సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ

మెదక్ : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు నేడు నామినేషన్ల ఉపసంహరణ జరుగనుంది. ఎప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. 11న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 

06:25 - March 25, 2016

మహబూబ్ నగర్ : గుడ్ ఫ్రైడే రోజున విషాదం నెలకొంది. జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొత్తకోటకు చెందిన హరీష్, నాని, షరత్ అనే ముగ్గురు యువకులు స్పోర్ట్స్ బైక్ పై జాతీయ రహదారిపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో కొత్తకోట మండలం నాటవెల్లిలో తెల్లవారుజామున 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హరీష్, నాని, షరత్ లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వవపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. వారు వనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లి కన్నీరుమున్నీరయ్యారు. 

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మహబూబ్ నగర్ :  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొత్తకోట మండలం నాటవల్లిలో లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో హరీష్,  నాని, షరత్ అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Don't Miss