Activities calendar

26 March 2016

21:35 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో ఉద్రిక్తతలకు కారకులెవ్వరు..? ఇంకెవరు.. వర్సిటీ వైస్‌ చాన్సిలర్‌ అప్పారావే. ఇది విద్యార్థి సంఘాలో.. విపక్షాలో చేస్తున్న ఆరోపణ కానేకాదు. హెచ్‌సీయూ ఘటనలపై విచారణ జరిపిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక. పైగా అప్పారావు.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలనూ బేఖాతరు చేసి.. ఉద్రిక్తతలకు కారకుడయ్యాడని నివేదిక వెల్లడించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు.. పలు కీలక సంస్థలు సమగ్ర విచారణ జరిపి ఈ నివేదికను రూపొందించాయి.

ఉద్రిక్తతలకు వీసీ అప్పారావే కారణం....

సుప్రసిద్ధ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సహా.. కొన్ని కీలక సంస్థలు కమిటీగా ఏర్పడి జరిపిన విచారణలో... హెచ్‌సీయూ ఉద్రిక్తతలకు వైస్‌ చాన్సిలర్‌ అప్పారావే కారకుడని తేలింది. ఈ కమిటీ హెచ్‌సీయూ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పోలీసులు, హోంమంత్రిని కలిసి నిజాలను వెలికితీసే ప్రయత్నం చేసింది. అమ్నెస్టీ, దళిత, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు మూడు రోజుల పాటు అన్ని వర్గాలను కలిసి సమాచారాన్ని సేకరించారు.

బాధ్యతలు తీసుకునే ముందు నాయినిని కలిసిన వీసీ .....

నిజనిర్ధారణ కమిటీ వెలువరించిన మధ్యంతర నివేదికలో.. మరో దిగ్భ్రాంతికర విషయమూ వెలుగు చూసింది. వీసీ అప్పారావు.. తిరిగి బాధ్యతలు తీసుకునేముందు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారని... ప్రస్తుత పరిస్థితుల్లో వర్సిటీకి వెళ్లవద్దని.. ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దని.. నాయిని సూచించినా అప్పారావు వినలేదని నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది. హోంమంత్రి సూచనను పెడచెవిన పెట్టి.. అంగబలంతో క్యాంపస్‌లోకి వెళ్లారని, వీసీ గెస్ట్‌ హౌస్‌ ఎదుట కుర్చీలు, బెంచీలు అడ్డుపెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారని నివేదిక పేర్కొంది. కేవలం ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారనే నెపంతో విద్యార్ధులను దారుణంగా కొట్టినట్లు నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును సైతం కమిటీ తప్పుపట్టింది. విద్యార్ధుల కడుపులపై వీర కుమ్ముడు కుమ్మారని.. వారి శరీరాలను బ్లేడ్‌లతో కోశారని నివేదిక తేటతెల్లం చేసింది.

అన్ని వర్గాలనూ కలిసిన నిజనిర్ధారణ కమిటీ.....

అన్ని వర్గాలనూ కలిసిన నిజనిర్ధారణ కమిటీ.. వీసీ అప్పారావు వివరణను సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వెల్లడించింది. ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకుని వర్సిటీ గేటు ముందు గంటల పాటు వేచిచూసినా తమను ఆయన వర్సిటీలోకి అనుమతించలేదని కమిటీ సభ్యులు తెలిపారు.

వీసీని తక్షణమే తొలగించాలని నివేదిక....

హెచ్‌సీయూ ఘటనలకు ప్రధాన కారకుడైన వీసీని తక్షణమే తొలగించాలని నివేదిక సూచించింది. రోహిత్‌ వేముల మరణానికి కారణమైన అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేయాలని.. లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ హెచ్చరించింది. 

21:31 - March 26, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోది అస్సాంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా టిన్సుకియా ఎన్నికల సభలో మాట్లాడారు. తమ పోరాటం అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌పై కాదని, అవినీతి, పేదరికంపైనేనని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అసోం అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు ఆ రాష్ట్రం అత్యంత నిరుపేదగా మిగిలిపోయిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అవకాశం ఇచ్చారు...మాకు ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు...అస్సాంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అసోంలోని మజులి, బిహ్‌పురియా, బొకాఖట్‌, జొహ్రాత్‌లోని ఐదుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు. 

21:30 - March 26, 2016

చెన్నై : డిఎంకె చీఫ్‌ కరుణానిధి ఎండిఎంకె నేత వైకోపై పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వైకోకు నోటీసులు పంపారు. డిఎండికె నేత విజయ్‌కాంత్‌తో పొత్తు కోసం డిఎంకె, బిజెపిలు డబ్బుతో పాటు ఇతర ప్రలోభాలను ఎరగా చూపాయని వైకో ఆరోపించారు. కరుణానిధి విజయ్‌కాంత్‌కు 80 అసెంబ్లీ సీట్లతో పాటు 5 వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారని వైకో తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్‌కాంత్‌కు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని బిజెపి ఆశ చూపిందని వైకో అన్నారు. విజయ్‌కాంత్‌ ఈ ఆఫర్లను పక్కనబెట్టి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాతో చేతులు కలిపారని తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కరుణానిధి- తమపై చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, వైకో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

21:28 - March 26, 2016

తూర్పు గోదావరి : జిల్లాలో రెండుచోట్ల గ్యాస్ లీకైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 33వ నంబరు బావితో పాటు... కేశవదాసుపాలెం నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో రోడ్లపైకి వచ్చి... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగి పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

21:26 - March 26, 2016

హైదరాబాద్‌ : నగరంలో 'ఫ్రెండ్స్‌బుక్‌' హీరో ఉదయ్‌కిరణ్‌ తప్పతాగి వీరంగం సృష్టించాడు. లోనికి అనుమతించడం లేదంటూ హోటల్‌ దసపల్లాలో అద్దాలు ధ్వంసం చేశాడు.. సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో డ్రగ్స్‌ కేసులో ఉదయ్‌కిరణ్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.

21:25 - March 26, 2016

హైదరాబాద్ : ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐదు లక్షల ఎనభై వేల గృహాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సచివాలయంలో కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించిన సీఎం.. 15శాతం వృద్ధి రేటు సాధిస్తేనే రాష్ట్రానికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర అర్ధికలోటు 16వేల కోట్ల రూపాయలు ఉన్నా.... పక్కా ప్రణాళికతో పరిపాలన సాగించడంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.

 

తిరుమలలో లక్కీడిప్ సేవాటిక్కెట్ల భక్తుల ఆందోళన

తిరుమల : పీఆర్ ఓ కార్యాలయం ఎదుట లక్కీడిప్ సేవా టిక్కెట్ల భక్తులు ఆందోళన చేపట్టారు. లక్కీడిప్ లో పేరు నమోదు చేసుకున్న భక్తులకు మొండి చేయిచూపారు. సర్వర్ పనిచేయకపోవడంతో లక్కీడిప్ ను టిటిడి రద్దు చేసినట్లు తెలుస్తోంది.

అటవీ బీట్ అధికారి పై స్మగ్లర్ దాడి

ఆదిలాబాద్ : జైనథ్ మండలం సంతల వద్ద అటవీ బీట్ అధికారి రాందాస్‌పై కలప స్మగ్లర్ షకీల్ దాడి చేశాడు. స్మగ్లర్ దాడిలో బీట్ అధికారితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్మగ్లర్ షకీల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు షకీల్ కోసం గాలిస్తున్నారు.

రేపు ఢిల్లీకి పాకిస్థాన్ బృందం

ఢిల్లీ : రేపు ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు బృందం ఢిల్లీకి రానుంది. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తులో పాక్ బృందం సహకరించనుంది. సోమవారం పాక్ బృందం ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కార్యాలయానికి రానుంది. మంగళవారం పఠాన్‌కోట్ వెళ్లి దర్యాప్తు చేయనుంది

20:08 - March 26, 2016

మోడీ సార్ ను కాపీ కొడుతున్న కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం సార్ పై ప్రతిపక్షాల ఫైర్, ఏరులై పారుతుంది మద్యపానం... ఉంటేంది.. పోతేంది మందిపాణం, టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కబ్జా పెట్టిండంట భూమి.. మరిచినట్టుండు కేసీఆర్ సార్ హామీ, బట్టలు కుడుతున్న నన్నపనేని... షాపామె దగ్గరుండి నేర్పించింది పని, గోరేటిం ఎంకన్న పాటను యాది చేస్తున్న నల్లగొండ... కుతికెలు ఎండి కుములుతున్న గుండె నిండా, డబ్బులు కొట్టుకుంటూ రోడ్డెక్కిన కళాకారులు... గుర్తింపు కార్డుల కోసం సర్కారుకు విన్నపాలు..ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ఎలాంటి వివరణ ఇచ్చారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:38 - March 26, 2016

హైదరాబాద్ : అఖిలేష్ యాదవ్ టీంతో ఐఏఎస్ ఆఫీసర్లందరూ క్రికెట్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడి ఓడిపోయారంట, ఈ మధ్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కల్చరర్ ఫెస్ట్ ఒకటి చేశారు. అందులో చాలా మంది దొంగలు పడి దోచుకున్నారు. ఇవి కాకుండా సాయికిరణ్ అందించే మరిన్ని వార్తలతో క్రేజీ న్యూస్... మరి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:48 - March 26, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై వాడీవేడీ చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలు, ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొనుగోలు, పవర్‌ పర్చేజ్‌, AP ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అంశాలపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పర ఆరోపణలు, విమర్శలతో అసెంబ్లీ అట్టుడికింది.

పలు అంశాలు చర్చకు....

మూడు రోజుల విరామం తర్వాత శనివారం జరిగిన ఏపీ అసెంబ్లీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరంపై అధికార ప్రతిపక్ష సభ్యులు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. నిర్వాసితులకు పునరావసం కల్పించకుండా ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్‌ మండిపడ్డారు. ప్రాజెక్ట్‌ కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జరుగున్న జాప్యంపై ప్రతిపక్ష నేత జగన్‌... ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినినే ఉమామహేశ్వరావు తీవ్రంగా స్పందించారు. జగన్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. నిర్వాసితులకు మెరగైన ప్యాకేజీ ఇస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు.

పగలు యూనిట్‌ విద్యుత్‌ రూ.2.70 లభ్యం......

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. విద్యుత్‌ తక్కువ ధరకు లభిస్తున్నా..ఏపీలోని డిస్కంలు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న అంశాన్ని జగన్‌ ప్రస్తావించారు. పగలు యూనిట్‌కు 2 రూపాయల 70 పైసలకు, రాత్రి రూపాయి 90 పైసలకు లభ్యమవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. కానీ డిస్కంలు 5 రూపాయల 11 పైసలకు యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు చేయడం వెనుక వేల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.

జగన్‌ ఆరోపణలపై అధికార పక్షం తీవ్రం అభ్యంతరం.....

ఈ విషయంలో జగన్‌ చేసిన ఆరోపణలపై అధికార పక్షం తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. మామూళ్లు, ముడుపుల సంస్కృతి జగన్‌దేనని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

నెల రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు .....

విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అంశాన్ని ప్రస్తావించారు. నెల రోజుల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని సభ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. వచ్చే ఆగస్టు 15 నుంచి నెలకు 149 రూపాయలకే 15 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు అందరూ సహకరించాలని కోరారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్‌ స్పందిస్తూ... హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న వారికే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్‌ కాంట్రాక్ట్‌ అప్పగించారని ఆరోపించారు.

ఫైబర్‌ గ్రిడ్‌పై జగన్‌ ఆరోపణలను తిప్పి కొట్టిన చంద్రబాబు

ఫైబర్‌ గ్రిడ్‌పై జగన్‌ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. పారదర్శకంగానే ప్రాజెక్ట్‌ అమలు చేస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు. ఫైబర్‌ గ్రిడ్‌పై జగన్‌ చేసిన ఆరోణపలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. 

18:44 - March 26, 2016

కర్నూలు : లోడింగ్‌లో ఉన్న ఓ ట్రాలీని తీసుకెళ్లి దానికి ..ఏటీఎం మిషన్‌కు వైర్‌ చుట్టి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు దొంగలు..మెదక్ జిల్లాలో పోలీసులను..బ్యాంకు అధికారులనే కలవరపాటుకు గురిచేసిన ఘటన గురించి మర్చిపోకముందే కర్నూలులో దొంగలు మరో అడుగు ముందుకేశారు.. ఉన్న చోట కొల్లగొట్టి సమయం ఎందుకు వేస్ట్‌ చేసుకోవాలనుకున్నారో ..ఏమో.... ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు...

ఇండియావన్‌ ఏటీఎం సెంటర్....

కర్నూలు జిల్లాలో ఏటీఎం దొంగలు కొత్త రకం ఆలోచన చేశారు..ఏటీఎం వెళ్లడం ..అక్కడే కొల్లగొట్టడం... వీలుకాకుంటే వెనక్కి

తిరిగిపోవడం.. ఇదంతా ఎందుకనుకున్నారో ఏమో..ఏకంగా వాహనంలో వచ్చి ఏటీఎం మిషన్‌తో సహా ఉడాయించారు...

అంతర్‌రాష్ట్ర ముఠాలు....

ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో అంతర్‌రాష్ట్ర ముఠాలు సంచరిస్తున్నాయి...ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉండగా ఈ విషయం తెలుసుకున్న దొంగల ముఠాలు ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లాయి...వైర్లు కత్తిరించి ఏటీఎం యంత్రాన్ని పెకిలించినవారు వచ్చిన వాహనంలో ఎంచక్కా వెళ్లిపోయారు...దీంతో ఆ ఏటీఎం సెంటర్‌ కాస్త బోసిపోయి కన్పించింది...

క్లూస్‌టీమ్‌తో పోలీసుల దర్యాప్తు

ఏటీఎం మిషన్‌ చోరీ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. క్లూస్‌టీమ్‌తో ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆనవాళ్ల కోసం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. లక్షల రూపాయలు నిల్వవుండే ఏటీఎంల్లో కనీసం సెక్యూరిటీ గార్డ్స్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత నిర్లక్ష్యం...

18:40 - March 26, 2016

కర్నూలు : వేసవి వచ్చిందంటే చాలు ఎండలు ఓ వైపు ..నీటి కొరతలు ఇంకోవైపు .ఊర్లోనే ఉన్నా,ఎడారి బతుకులే..చుక్కనీటి కోసం ఎడారిలో ఒయాసిస్సులా వెతుక్కోవాల్సిన పరిస్థితి.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే పత్తికొండ గ్రామం.

అడుగంటిపోయిన భూగర్భజలాలు ....

భూగర్భజలాలు అడుగంటి పోయాయి. రక్షిత మంచినీటి పథకాలు అటకెక్కాయి.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల ప్రజలకు నెలరోజుల నుంచి నీళ్లు రావడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చే నీటి కోసం ప్రజలు కుస్తీలు పట్టాల్సిందే.ఎన్నో సార్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా,తాగునీటి కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు.రూ.2కోట్లు వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎన్నడూ గుక్కెడు మంచినీళ్లు అందించిన దాఖలాలు లేవు.

పత్తికొండ గ్రామంలో 30 వేల జనాభా .....

పత్తికొండ గ్రామంలో దాదాపు 30 వేలమంది నివాసముంటున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 6 ఓవర్ హెడ్ ట్యాంకులున్నాయి. దీని కింద 2వేల పబ్లిక్ కుళాయికనెక్షన్లు, 532 వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ,30 చేతిపంపులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అలంకారప్రాయంగానే ఉన్నాయి. నీటి ఎద్దడిని తట్టుకోలేక ఆగ్రహించిన మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఫర్నీచర్ ను బయట పడేసి నిరసన తెలిపారు. తమ దినసరి కూలీల్లో సగం డబ్బులు నీటి ఖర్చులకే సరిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులుస్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

18:38 - March 26, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు హార్బర్ నిర్మాణం దిశగా సర్కారు సాగుతోంది. దీనికి అవసరమైన భూసేకరణకు సన్నాహాలు చేస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు భూసేకరణ కోసం అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు ,సంతబొమ్మాళి మండలాల పరిధిలో 8 గ్రామాలలో హార్బర్‌ కోసం భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఆగస్టులో నోటిఫికేషన్‌నూ జారీ చేసింది. అయితే.. స్థానికంగా వచ్చిన వ్యతిరేకతో అధికారులు వెనక్కు తగ్గారు.

తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం కావడంతో...

ప్రజల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు రూటు మార్చారు. సర్కారుకు భూములు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రణాళికలు రూపొందించారు. ఈ దిశగా స్థానిక రైతులను కలిసి వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే..

రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ప్రజా సంఘాలు.. సర్కారు వాదనలను నమ్మడం లేదు. వేలాది ఎకరాలు భూమిని సేకరించి స్థానికులు, మత్స్యకారుల కడుపుకొడతారంటూ ఆందోళన చెందుతున్నారు.

స్థానికులకు అపోహలు లేవన్న మంత్రి అచ్చెన్నాయుడు.....

మరోవైపు భావనపాడు హార్బర్ విషయంలో స్థానికులకు ఎలాంటి అపోహలు లేవని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కావాలనే కొంతమంది, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పీపీపీ విధానంలో హార్బర్ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు.

స్థానిక రైతుల్లో అనుమానాలు....

మొత్తానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా.. స్థానిక రైతుల్లో అనుమానాలు నివృత్తి కావడం లేదు. భావనపాడు పేరుతో వేల ఎకరాల భూమిని సేకరించి.. కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు.. ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని మండిపడుతున్నారు. తమ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వం భూసేకరణకే ముందుకు వెళితే.. పోరాటాన్ని ఉధృతం చేస్తామని.. సర్కారీ కుట్రలను తిప్పికొడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 

తిరుమలలో కళ్యాణ పథకం : ఈవో సాంబశివరావు

తిరుపతి : తిరుమలలో త్వరలో కళ్యాపథకం ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఇక పై కళ్యావేదికలో ఎలాంటి రుసుము తీసుకోకుండా ఉచిత వివాహాలు నిర్వహిస్తామన్నారు. వధూవరులకు ఉచితంగా 10 లడ్డూలు, పసుపు, కుంకుమ ఇస్తామన్నారు. 

వీసీ మార్పుపై ప్రధానితో మాట్లాడతా :సీఎం కేసీఆర్

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీ నియామకం మార్పు తమ పరిధిలో లేదని అయినా అప్పారావు మార్పుపై కేంద్రం, ప్రధాని మోడీతో తానే స్వయంగా మాట్లాడుతానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. వీసీని వెనక్కి పంపడం తమ చేతిలో లేదని వివరణ ఇచ్చారు. అయినా సరే సభా నాయకుడిగా, అధికార, ప్రతిపక్ష సభ్యుల తరపున తాను ఈ విషయమై ప్రధానితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు.

ప్యానల్ స్పీకర్ గా గీతారెడ్డి...

హైదరాబాద్:తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి కాసేపు విరామం తీసుకున్న సందర్భంగా ఆమె స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్యానెల్ స్పీకర్ గా కార్యకలాపాలు నిర్వహించారు. శాసన సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లతో పాటు ఏడుగురు ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. వీళ్లని అధికార పక్షం, ప్రతిపక్షాల నుంచి ఎన్నుకుంటారు. అందులో భాగంగానే ఆ అవకాశం సీనియర్ కాంగ్రెస్ లీడర్ గీతారెడ్డికి లభించింది. స్పీకర్ మధుసూదనాచారి అనారోగ్య కారణాలతో ఈరోజు స‌భ‌లో అందుబాటులో లేని విష‌యం తెలిసిందే.

ఆనంద గజపతిరాజు అంతిమయాత్ర ప్రారంభం...

విజయనగరం : మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి మయూరి కూడలి మీదుగా కోట వరకు అంతిమ యాత్ర చేపట్టారు. కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున ఉత్తరాంధ్ర ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కోట సమీపంలో సాయంత్రం 6 గంటలకు ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం విశాఖలోని మణిపాల్‌ ఆస్పత్రితో ఆనంద గజపతిరాజు తుదిశ్వాస విడిచారు.

17:36 - March 26, 2016

హైదరాబాద్: చర్లపల్లి జైల్లో హెచ్‌సీయూ విద్యార్ధులను వామపక్ష నేతలతో పాటు వామపక్ష విద్యార్ధి నేతలు కలిశారు. విద్యార్ధులను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని పలువురు ఆరోపించారు. జైల్లో ఉండాల్సిన వీసీ అప్పారావు బయట ఉన్నారు.. విద్యార్ధులు జైల్లో ఉన్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏబీవీపీ నాయకుల డైరెక్షన్‌ ప్రకారమే పోలీసులు విద్యార్ధులను అరెస్ట్‌ చేశారన్నారు. రోహిత్‌ చట్టం వచ్చేవరకు.. వీసీ అప్పారావును అరెస్ట్‌ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని వామపక్షాల నేతలు హెచ్చరించారు. 

17:34 - March 26, 2016

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం పెద్దాపురంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదంటూ యువతి గొంతు, చేతులను రాజ్‌కుమార్ అనే యువకుడు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజ్‌కుమార్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17:28 - March 26, 2016

హైదరాబాద్ : ఏప్రిల్ 23,24 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్ -2 తో పాటు కానిస్టేబుల్ పరీక్షలనూ 2 నెలలు వాయిదా వేసినట్లు తెలిపింది. అంతే కాకుండా ఎస్సై పరీక్షలో ఇంగ్లీష్ వెయిటేజిని ఎత్తివేసింది. గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోటీ పరీక్షలను వాయిదా వేసినా.. ఉద్యోగాల సంఖ్యను పెంచుతున్నామని, ఇది అభ్యర్థులకు మేలు జరిగే అంశమని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అభ్యర్థులు చదువుకోవడానికి సమయం కూడా ఉంటుందని చెబుతున్నారు.

17:23 - March 26, 2016

హైదరాబాద్ : వివక్షలేని సమాజం కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. హెచ్ సియూ, ఓయూ లో జరిగిన ఘటనలపై సభలో ఆయన సమాధానమిచ్చారు. ఈ ఘటనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. విచారణ జరిపిస్తామని తెలిపారు. హెచ్ సియూ వీసీపై తాము యాక్షన్ తీసుకోలేమని.. అయితే ఈ విషయంపై ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడతామని హామీ ఇచ్చారు. రోహిత్ మరణ వార్త తనను కలిచివేసిందన్న కేసీఆర్... ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకునేందుకు కావల్సిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సభలో తెలిపారు.

తెలంగాణ లో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ లో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.గ్రూప్ -2 తో పాటు కానిస్టేబుల్ పరీక్షలనూ 2 నెలలు వాయిదా వేసినట్లు తెలిపింది. ఎస్సై పరీక్షలో ఇంగ్లీష్ వెయిటేజ్ ఎత్తివేశారు. గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Click hera to Video

https://youtu.be/LAYYYfMk7Zc

 

17:13 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో పోలీస్ క్యాంప్ ను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని.. వీసీ అప్పారావును బర్తరఫ్‌ చేయాలని డివైఎఫ్ ఐనాయకులు డిమాండ్ చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. సంకెళ్లతో మౌన ప్రదర్శన నిర్వహించారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని డివైఎఫ్ ఐ నాయకులు ఆరోపించారు. 

తెలంగాణ భవన్ ఎదుట జేఎన్ యూ విద్యార్థుల ధర్నా

ఢిల్లీ : తెలంగాణ భవన్ ఎదుట జేఎన్ యూ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. హెచ్ సియూ ఘటనలపై సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఓయూ, హెచ్‌సీయూ ఘటనలకు సంబంధించి విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం రేపటికి సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

జమ్మూకశ్మీర్ గవర్నర్ తో ముఫ్తీ భేటీ

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లో గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రతో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమైన పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గవర్నర్‌తో చర్చ సందర్భంగా ప్రమాణస్వీకారం తేదీని కూడా ఖరారు చేయనున్నారు. సీఎంగా మెహబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సీఎం చంద్రబాబుతో ప్రభుత్వ శాఖ కార్యదర్శుల భేటీ...

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుతో అన్ని ప్రభుత్వ శాఖ కార్యదర్శులు ఏపీ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏప్రిల్ లో ప్రారంభం కానున్న జన్మభూమి కార్యక్రమం, వేసవిలో నీటి ఎద్దడి నివారణ తీసుకోవాల్సిన చర్యలతోపాటు అమరావతికి ఉద్యోగుల తరలింపు వంటి పలు అంశాలపై భేటీలో చర్చించనున్నారు. 

ఓఎన్ జీసీ పైప్ లైన్ లీక్ …

తూర్పుగోదావరి : జిల్లాలోని అంతర్వేది వద్ద ఓన్జీసీ పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. ఓ ప్రైవేటు పాఠశాల వద్ద గ్యాస్‌ పెద్దఎత్తున బయటకు వెలువడుతోంది. సమాచారం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసుల తీరును ముక్త కంఠంతో ఖండించాలి :భట్టి

హైదరాబాద్ :హెచ్ సియూలో పోలీసులు హింసించిన తీరును విద్యార్థులు వివరిస్తుంటే చాలా బాధేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన టి.ఎస్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో మాట్లాడుతూ.. విద్యార్థులను కొట్టకండి అన్నందుకు ఓ ప్రొఫెసర్ నూ పోలీసులు చెంప చెల్లుమనిపించారని తెలిపారు. పోలీసుల తీరును ఈ సభ ముక్త కంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు.

క్యాంపస్ ను కాషాయీకరణ చేసే యత్నాలు:అక్బరుద్దీన్

హైదరాబాద్ : హెచ్ సియూ క్యాంపస్ ను కాషాయీకరణ చేసేందుకు ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఎంఐఎం నేత అక్బరుద్దీ ఆరోపించారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. హెచ్ సియూ వీసీ అప్పారావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసీ కేసు నమోదైనా ఎందుకు అరెస్టు చేయలేదు అన్ని ప్రశ్నించారు. కేంద్రం కావాలనే వీసీ అప్పారావును విద్యార్థులపైకి ఉసికొల్పుతోందని మండి పడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థినులపై పోలీసులు లైంగికంగా వేధించారు'

హైదరాబాద్ : హెచ్ సియూలో మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థినులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలంగాణ అసెంబ్లీలో అక్చరుద్దీన్ ఆరోపించారు. భారత్ మాతా అంటూ గుండెలు చీల్చుకునే వాళ్లు ఎక్కడ వున్నారు అని ప్రశ్నించారు. అరెస్టు అయినా విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వెంటనే హెచ్ సియూ హాస్టల్ ను తెరిపించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.

తిరుమలలో అగ్ని ప్రమాదం..

తిరుమల : మొదటి కనుమదారిలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. నరసింహస్వామి ఆలయం వద్ద కరెంటు తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న తితిదే అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

15:19 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ వీసీ అప్పారావును వెంటనే కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని సీపీఐ ఎమ్మెల్యే రవీందర్ డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో హెచ్ సియూ, ఉస్మానియా ల్లో జరుగుతున్న ఘటనలపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఆ చర్చలో మాట్లాడుతూ.. వీసీ అప్పారావు వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని... అలాంటి అప్పారావు పై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో ఆర్ ఎస్ఎ స్ భావజాలం చొప్పిస్తున్నారని ఆరోపించారు. హెచ్ సియూలో యుద్ధ వాతావరణ తలపించేలా పోలీసు క్యాంపును ఏర్పాటు చేశారని, వెంటనే ఆక్యాంపు తీసివేయాలని, విద్యార్థులపై పోలీసులు చేసిన దమనకాండను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సియూ లో శాంతి యుతవాతావరణం కల్పించేలా సీఎం కేసీఆర్ కలుగజేసుకోవాలని సూచించారు.

15:13 - March 26, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కావాలనే వీసీ అప్పారావును విద్యార్థులపై ఉసికొల్పుతోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. హెచ్ సియూ, ఉస్మానియాలో జరుగుతున్న ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కావాలనే వీసీ అప్పారావను రప్పించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉసికొల్పింది. వీసీ అప్పారావును మరళా రప్పించడం వల్లే మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయని రాజయ్య ఆరోపించారు. హెచ్ సియూ ఘటనలపై సీఎం కేసీఆర్ కలగ జేసుకుని సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ అప్పారావు ను అరెస్టు చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి, హెచ్ సియూలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలపైనా ఉందన్నారు. కన్హయ్యను హెచ్ సియూలోకి అనుమతింకపోవడం దారుణమన్నారు.

14:54 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ పిహెచ్ డి స్కాలర్ రోహిత్ వేముల తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో హెచ్ సియూ, ఉస్మానియా ఘటనలపై చర్చ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే ''రోహిత్ ఆత్మహత్య పై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. హెచ్ సియూలో దళిత, మైనార్టీ విద్యార్థులపై వివక్ష కొనసాగుతుంది. వివక్షపై పోరాడినందుకే ఐదుగురు దళిత విద్యార్థులను ఎందుకు సస్పెండ్ చేశారు. క్యాంపస్ ను కాషాయీకరణ చేసేందుకు ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. హెచ్ సియూ వీసీ అప్పారావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసీ కేసు నమోదైనా ఎందుకు అరెస్టు చేయలేదు? అప్పారావు పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు, మహిళా ప్రొఫెసర్లు, విద్యార్థినిలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును ఖండిస్తున్నాం. భారత్ మాతాకు జై అంటున్నా విద్యార్థినిలపై దారుణంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. భారత మాతను పూజించే దేశంలో ఆడబిడ్డలపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తారా? ఇదేనా భారత్ మాతకు ఇచ్చే గౌరవం. భారత్ మాతా అంటూ గుండెలు చీల్చుకునే వాళ్లు ఎక్కడ వున్నారు? పురుష పోలీసులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అరెస్టు అయినా విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. వెంటనే హెచ్ సియూ హాస్టల్ ను తెరిపించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని'' డిమాండ్ చేశారు.


 

ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. విద్యుత్ చార్జీల పెరుగుదల అంశంపై అధికార విపక్షం మధ్య వాడి వేడి చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

14:34 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్ సియూలో రోహిత్ ఆత్మహత్యకు కారణాలను విశ్లేషించి, నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందనిటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ సియూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి వివరణ ఇచ్చారు. అనంతరం జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... . రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రికి సంబంధం వున్నా ఎందుకు అరెస్టు చేయలేదని విమర్శించారు. రాజకీయ విషయవలంలో కూరుకుపోయిన పార్టీలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టం కనపడుతుందని ఆరోపించారు. యూనివర్శిటీలను రాజకీయాలకు వేదికలగా మార్చవద్దని, యూనివర్శిటీలను అభివృద్ధికి వేదికలగా మార్చాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు చనిపోయారని... తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న వారు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యువకులు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి, కేసులు పెట్టి జైళ్లలో తోస్తున్నారని మండి పడ్డారు.

14:24 - March 26, 2016

హైదరాబాద్  : హెచ్ సియూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనపై హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి వివరణ ఇచ్చారు. దీని పై స్పందించిన బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి...

14:22 - March 26, 2016

హైదరాబాద్: హెచ్ సియూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనపై హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి వివరణ ఇచ్చారు. సంపులో పడి మృతి చెందిన వ్యక్తిని తరలించకుండా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. మృతుడు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన శిలారి బాబు. మృతుడు విద్యార్థి కాదని... రోజువారి కూలీ అని పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు స్టూడెంటేనని ఎమ్మెల్యే సంపత్ పోలీసులతో వాదనకు దిగారు. మృతుడు విద్యార్థి కాదని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యే సంపత్ వినలేదు. అక్కడ విషయాన్ని రాజకీయం చేయాలని చూశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఛాంబర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. విద్యార్థులకు పోలీసులు సుమారు ఆరు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని వివరణ ఇచ్చారు.

జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నాం: అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : విద్యుత్‌పై విమర్శలను జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్ చార్జీలపై జగన్ వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ షార్టేజ్ ఉందని తెలిపారు. పది సంవత్సరాల్లో విద్యుత్ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. గతంలో ఎప్పుడు విద్యుత్ వస్తుందో...పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. పరిశ్రమలు మూతపడి నిరుద్యోగ సమస్య తలెత్తిందని గుర్తు చేశారు.

విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారు : జగన్

హైదరాబాద్ : ఏపీలో విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదన్నారు. రూ.2.40 పైసలకు అందుబాటులో ఉండే యూనిట్‌ను రూ.5.11 పైసలకు కొంటున్నారన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభించినా డిస్కంలు ఎక్కువ ధరకు కొంటున్నాయని జగన్ మండిపడ్డారు.

హెచ్ సియూ వద్ద పీడీఎస్ యూ ఆందోళన

హైదరాబాద్‌ : హెచ్ సియూ వద్ద పీడీఎస్‌యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. దళితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భద్రతా సిబ్బందికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఏప్రిల్ 1న ఆరోగ్య బీమా పథకం : వెంకయ్యనాయుడు

ఢిల్లీ: ఏప్రిల్ 1న ఆరోగ్య బీమా పథకం ప్రారంభించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రూ.లక్ష వరకు వైద్య ఖర్చులు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 3వేల జనరిక్ మెడికల్ దుకాణాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలో నాలుగు లక్షల మంది వైద్యుల కొరత ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

13:56 - March 26, 2016

హైదరాబాద్ : విద్యుత్ సంస్కరణలపై ఎపి అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షం వాదోపవాదాలు చేసుకున్నారు. వైసీపీ నేత జగన్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను దారుణంగా పెంచుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ పాలనలో విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్ రంగం ఆద్వానంగా ఉందని పేర్కొన్నారు.  విద్యుత్ కోతలను అధిగమించామని చెప్పారు. తాము అధికారంలోకి రాకముందు కొన్ని గ్రామాలు అంధకారంలో ఉండేవన్నారు. 
చంద్రబాబు.,..
ఫైబర్ గ్రిడ్ ఒక వినూత్న కార్యక్రమమని  సీఎం చంద్రబాబు అన్నారు. గ్రిడ్లు, మిషన్ల కింద కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఎపి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, ఈ-ప్రగతి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. 

13:43 - March 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌, సీఎం కేసీఆర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. హెచ్‌సీయూ ఘటనపై పూర్తిస్థాయి చర్చకు అక్బరుద్దీన్‌ డిమాండ్ చేశారు. సర్కారు దళితులను అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా స్పందించారు. ఏది పడితే అది మాట్లాడటం సరికాదని సూచించారు. అయితే తాను మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేసి కేసీఆర్‌కు ఎలా అవకాశం ఎలా ఇస్తారని అక్బరుద్దీన్‌ మండిపడ్డారు. 

 

13:37 - March 26, 2016

హైదరాబాద్ : త్వరలో ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీతాలు పెరగున్నాయి. రూ.95 వేల నుంచి 1.5 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. కారు లోను రూ.15 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశాలున్నాయి. 

ఏపీ శాసనసభ్యుల వేతనాలపై ఎమినిటిస్ కమిటీ సిఫార్సులు...

హైదరాబాద్ : ఏపీ శాసనసభ్యుల వేతనాలను పెంచాలని ఎమినిటిస్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో రూ.95వేల నుండి రూ.1.50 లక్షలకు పెంచాలని, కారు లోను నిమిత్తం రూ.15 లక్షల నుంచి 40 లక్షల పెంచాలని, హెచ్ ఆర్ ఏ రూ.25వేల నుండి రూ.50వేలకు పెంచాలని ఎనిమిటిస్ కమిటీ సిఫార్సు చేసింది.

13:28 - March 26, 2016

హైదరాబాద్ : రోజా అసభ్యపదజాలంతో తనను దూషించినట్లు నిరూపిస్తే రోజా రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని టిడిపి ఎమ్మెల్యే అనిత సవాల్‌ విసిరారు. ఇంతజరిగిన తర్వాత కూడా రోజా పశ్చాత్తపం పడడంలేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని సభ గౌరవమర్యాదలను కాపాడాలని ఆమె కోరారు. చంద్రబాబు తనను పావుగా వాడుకుంటున్నారన్న రోజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిత తీవ్రంగా స్పందించారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిలో భాగంగా పావుగా మారానన్నారు. 

 

13:23 - March 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు.. హెచ్ సీయూ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై దాడి అంశాలను చర్చించాలని డిమాండ్ చేశారు.. అటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కూడా ఈ రెండు అంశాలపై చర్చ జరగాలన్నారు. డిమాండ్లతో ఈ విషయాలు కలిపి చర్చ చేయలేమని స్పష్టం చేశారు.. ఎందుకు వీటిపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.. దీనిపై కేసీఆర్‌ కూడా సీరియస్‌గా స్పందించారు.

తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. నారాయణ గిరి క్యూలైన్ల వద్ద భక్తులు పడిగాపులు పడుతున్నారు. లగేజ్ డిపాజిట్ కు 3 గంటలు పట్టడంతో భక్తులు ఎండలో నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు ఉత్తరాలపై మంజూరు చేసే టికెట్లను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలియజేసింది.

వీసీ అప్పారావు బయట.. విద్యార్థులు జైల్లోనా.. ?: నారాయణ

హైదరాబాద్ : జైల్లో వుంచాల్సిన వీసీ అప్పారావును బయట వుంచి అమాయకులైన విద్యార్థులను జైల్లో పెట్టారంటూ సీపీఐ నేత నారాయణ విమర్శించారు. చర్లపల్లి జైలులో ఉన్న హెచ్ సీయూ విద్యార్థులను నారాయణతోపాటు ఆపార్టీ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏబీవీపీ నాయకుల సమాచారం మేరకే విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు.

హెచ్ ఆర్సీ ఎదుట హాజరైన హెచ్ సీయూ రిజిస్ట్రార్

హైదరాబాద్ : హెచ్ ఆర్సీ ఎదుట హెచ్ సీయూ రిజిస్ట్రార్ హాజరయ్యారు. వర్శిటీలో విద్యార్థులకు భోజన, మౌలిక సదుపాయాలు నిలిపివేశారని పిటీషన్ దాఖలైన సందర్భంగా హెచ్ ఆర్సీకి హాజరైనట్లు రిజిస్ట్రార్ వివరించారు.

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం...

తూర్పుగోదావరి : కాకినాడలోని సర్పవరం జంక్షన్‌ వద్ద వున్న సత్యమేఘన ఉమెన్స్‌వరల్డ్‌ వస్త్ర దుకాణంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు తెరుస్తున్న సమయంలో లోపలి నుంచి మంటలు వ్యాపించటంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, యజమానికి సమాచారమందిచారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదపు చేస్తున్నారు. 

12:26 - March 26, 2016

హైదరాబాద్ : ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఎపి సర్కార్ జీవో నెంబర్ 110 ను విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను జీవో 110 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో ద్వారా 99 ఏళ్ల వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. వెంటనే జీవో నెంబర్‌ 110ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. 
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నం 
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను జీవో 110 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో ద్వారా 99 ఏళ్ల వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. వెంటనే జీవో నెంబర్‌ 110ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. 
ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం లేదు-మంత్రి నారాయణ 
జీవో 110 ద్వారా ఇప్పటివరకు ఎలాంటి ప్రైవేటు వ్యక్తులకు భూముల్ని అమ్మడం కానీ,..అప్పచెప్పడంగానీ జరుగలేదని మంత్రి నారాయణ రామకృష్ణ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయడంలేదని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు...

కపడ : పదో తరగతి పరీక్షలలో అక్రమాలు బయటపడ్డాయి. పులివెందుల మండలం ఇస్లామాపురం జెడ్పీ హైస్కూలులో ఇద్దరు విద్యార్థులకు బదులుగా పరీక్ష రాస్తున్న మరో ఇద్దరు విద్యార్ధులను డీఈవో ప్రతాపరెడ్డి పట్టుకున్నారు. అక్రమానికి పాల్పడిన విద్యార్ధులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాలో నటుడు ప్రకాష్ రాజ్ జన్మదిన వేడుకలు

మహబూబ్ నగర్ : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో విద్యార్థుల మధ్య నటుడు ప్రకాష్ రాజ్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కొండారెడ్డి పల్లిలో పాఠశాల నిర్మాణానికి ప్రకాష్ రాజ్ రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతో రెండేళ్లలో కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ప్రకాష్ రాజ్ కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

12:17 - March 26, 2016

హైదరాబాద్ : మిస్సమ్మ బంగ్లా కేసుపై ఎపి అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. అనంతపురం జిల్లాలో 200 కోట్లు విలువ చేసే మిస్సమ్మ బంగ్లా కేసులో వైసిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఆరోపించారు. వైఎస్‌ హాయాంలో దీనికి బీజం పడిందన్నారు. రూ.200 కోట్ల ఆస్తిని అన్యాక్రాంతం చేసేవిధంగా వైసిపి వ్యవహరిస్తుందని..కానీ దాన్ని మైనార్టీలకు అప్పగించాలని ఆయన కోరారు. 
మిస్సమ్మ బంగ్లా కేసులో సీఐడీ విచారణ -జగన్ 
మిస్సమ్మ బంగ్లా కేసులో సీఐడీ విచారణ చేస్తోందని ప్రభుత్వమే చెప్తోందని వైఎస్‌ జగన్ అన్నారు. దర్యాప్తులో దోషులెవరైనా వారిపై యాక్షన్‌ తీసుకోవాలని..దానికి వైసిపి ఎలాంటి అభ్యంతరం చెప్పదని జగన్  అన్నారు. 

12:16 - March 26, 2016

విశాఖ : మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు ప్రస్తుతం మాన్సాస్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. రెండు సార్లు రాష్ట్రమంత్రిగా, రెండు సార్లు ఎంపీగా పని చేశారు. సింహాచలం, రామతీర్థం, అరసవల్లి, శ్రీకూర్మం దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించారు.

 

కాన్పూర్ లో అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

ఉత్తరప్రదేశ్‌ : కాన్పూర్‌ జిల్లాలోని ఓ బజార్‌లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దాదాపు 100 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరేడ్‌ బజార్‌లో హఠాత్తుగా మంటలు వ్యాపించటంతో కొద్దిసమయానికే దాదాపు 100 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు తెలియలేదు.

శంకర్ మఠం వద్ద చైన్ స్నాచింగ్...

హైదరాబాద్ : నల్లకుంటలోని శంకర్ మఠం వద్ద చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్ళారు. సదరు మహిళ స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  

12:05 - March 26, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో శానిటేషన్ పనులపై అర్ధరాత్రి మేయర్ బొంతు రామ్మోహన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ , మోండా మార్కెట్ , నారాయణగూడలలో తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న కార్మికులలో పలువురు డమ్మీలు ఉండడంతో సూపర్ వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  

 

హెచ్ సీయూ గేటు వద్ద సొమ్మసిల్లి పడిపోయిన రోహిత్ తల్లి రాధిక...

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు వర్సిటీలోకి క్యాంపస్ లోనికి రావటానికి ప్రయత్నించారు. కానీ ప్రధాన గేటు వద్ద వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమను లోపలికి అనుమతించాల్సిందేనని రాధిక వాదించారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో ఆమెను హెచ్ సీయూ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా అక్కడ మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

11:46 - March 26, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై చర్చించాలని కాంగ్రెస్ తోపాటు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ రెండు ఘటనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. వాయిదా తీర్మానాల రూపంలోనైనా సరే.. పద్దుల రూపంలోనైనా సరే కావాల్సింది ఘటనలపై చర్చ జరగడం, కాబట్టి ఏదో ఒక రూపంలో చర్చ జరగడం ముఖ్యమని సీఎం చెప్పారు. హెచ్ సీయూ ఘటన దురదృష్టకరమన్నారు. హెచ్ సీయూ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఓయూలో జరిగిన ఘనట జరిగివుండాల్సింది కాదన్నారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాహనంపై దాడిని ఖండించాల్సిందేనని....ఈ అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎక్కడ.. ఏ సభ్యునిపై దాడి చేసినా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుందామన్నారు. అయితే హెచ్ సీయూ, ఓయూ ఘటనలు రెండూ ఖండిచాల్సినవేనని చెప్పారు. ఈ ఘటనలపై ప్రభుత్వం చర్చ చేపట్టకపోయే సరికి చర్చించాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో మంత్రి హరీశ్ రావు కలుగజేసుకుని చర్చకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందన్నారు. అనంతరం బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ ఓయూ ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు.

 

అనంద గజపతిరాజు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం...

హైదరాబాద్ : ఆనంద గజపతిరాజు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు మృతి చెందిన వార్త విన్న చంద్రబాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే చంద్రబాబు ఆనంద గజపతిరాజు మృతికి సంతాపం తెలిపారు. ఈ విషయంగా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి ఫోన్ చేసి ఆయనను చంద్రబాబు పరామర్శించారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు, మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు ఈ రోజు ఉదయం మరణించిన విషయం తెలసిందే. మరొక టీడీపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం నిమ్మకాయ చినరాజప్ప కూడా ఆనంద గజపతిరాజు మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు.

ఏపీలో పెరగనున్న శాసనసభ్యుల వేతనాలు...

హైదరాబాద్ : ఏపీ శాసన సభ్యుల జీతాలు త్వరలో పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.95 వేల నుంచి రూ.1.5లక్షలకు పెంచే అవకాశమున్నట్లు సమాచారం.

ఇరాక్ లో బాంబు దాడి.... 30 మంది మృతి

ఇరాక్‌ : బాగ్దాద్‌ సమీపంలో మరోసారి ఉగ్రవాదులు దాడి చేశారు. ఇస్కాన్‌దరియా నగర సమీపంలోని ఓ గ్రామంలో ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నాయి. అనంతరం విజేతకు ట్రోఫీ అందజేస్తుండగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నగర మేయర్‌ సహా 30 మంది మృతి చెందారు. మరో 65 మందికి పైగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

సోదరుడి మరణంతో షాక్ గురైన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు....

హైదరాబాద్ : సోదరుడు, మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు మరణవార్త తెలిసిన వెంటనే కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఢిల్లీలో వున్న ఆయన సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరారు. ఆనంద గజపతి రాజు ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే.

వంద గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా....

మహబూబ్ నగర్ : గోపాల్ పేటలో నామన్ పేట మోటార్లు మరోసారి మరమ్మతులకు గురైయ్యాయి. దీంతో నాగర్ కర్నూలు, అచ్చంపేటతో పాటు వంద గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. 

స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ  ససమావేశాల ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే మొదటగా వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టాయి. స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలియజేస్తున్నారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి: జగన్

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలవరం అంశంపై జగన్‌ మాట్లాడుతు పోలవరం నిర్వాసితులు న్యాయం జరగటంలేదన్నారు. ఈ అంశంపై ఎప్పుడు మాట్లాడినా ప్రాజెక్టుకు వ్యతిరేకులనే ముద్రవేస్తున్నారని ఆరోపించారు.

టీ.అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. సమావేశాల ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మాణాలపై చర్చ చేపడతామని ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాలపైనే మొదటగా చర్చించాలని పట్టుబట్టారు. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించడం కన్నా కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేయడమే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. క్వశ్చన్ హవర్ తర్వాత అన్ని అంశాలపై మాట్లాడుదామని చెప్పారు.

10:30 - March 26, 2016

హైదరాబాద్ : పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై ఎపి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వాసితులకు మూడు రెట్లు అదనంగా పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల్ని కేంద్రానికి నివేదిక రూపంలో సమర్పిస్తున్నామన్నారు. 

10:24 - March 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మాణాలపై చర్చ చేపడతామని ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాలపైనే మొదటగా చర్చించాలని పట్టుబట్టారు. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు కలుగజేసుకుని మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించడం కన్నా కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేయడమే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. క్వశ్చన్ హవర్ తర్వాత అన్ని అంశాలపై మాట్లాడుదామని చెప్పారు. జానారెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రశ్నోత్తరాలను ఆపు చేసి.. ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన కోరారు. అయితే స్పీకర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టన్నుట్లు స్పీకర్ చెప్పారు. సభ్యులు వెల్ లోకి రావొద్దని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని.. కానీ విపక్ష సభ్యులు అలాగే వస్తున్నారని తెలిపారు. వెల్ లోకి రావొద్దని విపక్ష సభ్యులకు ఆమె హితవు పలికారు. సభ్యులు సభా సమయాన్ని పాటించాలని సూచించారు. స్పీకర్ ఎంత చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోకుండా వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభకు పది నిమిషాలపాటు టీ విరామం ఇచ్చారు. 

అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎంపీ..

హైదరాబాద్ : విజయనగరం రాజవంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు అనారోగ్యంతో మరణించారు. ఆనంద గజపతిరాజు గతంలో లోక్ సభ సభ్యుడి(ఎంపీ)గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సింహాచలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా సేవలందిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతునన్న ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో  ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. ఈయన ప్రస్తుతం టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు స్వంత సోదరుడు అయిన సంగతి తెలిసిందే.

10:00 - March 26, 2016

రంగారెడ్డి : మోమిన్ పేట మండలం జక్కంపల్లిలో సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. తెల్లవారు జామున ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేశారు. నవదీప్ తోపాటు పలువురు సినీ నటులు పరారైనట్లు సమాచారం. పోలీసులు భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని వీడియో లో చూడండి. 

 

09:48 - March 26, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను సంతృప్తి పరచాలన్నారు. బాధితులు రోజూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అందడం లేదన్నారు. అక్కడ జరుగుతున్న వాస్తవాలను  
గమనించాలని సూచించారు. అనంతరం టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టన్నారు. నిన్ననే ప్రాజెక్టు నిర్మాణం నిమ్తితం మూడు గ్రామాల ప్రజలు వారి గ్రామాలను ఖాళీ చేశారని చెప్పారు. అయితే నష్టపరిహారం గతంలో లాగా  మూడు, నాలుగు లక్షలు కాకుండా ప్రస్తుతం 14 నుంచి 15 లక్షల రూపాయల వరకు కోరుతున్నారని చెప్పారు. భూములు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే కొన్ని పార్టీలు, వామపక్ష భావాలు కలిగిన వారు అక్కడికి వెల్లి వారిని ఖాళీ చేయవద్దని చెబుతూ... రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇది సరైందని కాదని హితవు పలికారు.

 

పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి : జగన్

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఎపి అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. నిర్వాసితులను సంతృప్తి పరచాలన్నారు. బాధితులు రోజూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అందడం లేదన్నారు. 

ఎపి అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు మాట్లాడుతున్నారు. సభ్యులు అగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానలు ఇస్తున్నారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

 

సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ

రంగారెడ్డి : మోమిన్ పేట మండలం జక్కంపల్లిలో సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. తెల్లవారు జామున ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేశారు. నవదీప్ తోపాటు పలువురు సినీ నటులు పరారైనట్లు సమాచారం. పోలీసులు భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు అస్వస్థత

హైదరాబాద్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రకాశ్ గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. 

ఎపి అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు పున: ప్రారంభం అయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విద్యుత్ అంశంపై సభ్యులు చర్చిస్తున్నారు. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. 

   

 

నేడు ఎపి అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్ : 344 నిబంధన ప్రకారం... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఏపీ శాసన సభలో చర్చ జరుగనుంది.  నేడు సభలో 3 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సవరణ బిల్లు, భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 

08:44 - March 26, 2016

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులకు ఓ కుటుంబం బలైపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సంచార జాతికి చెందిన ఓ కుటుంబం గత కొద్ది రోజుల క్రితం భువనగిరి మండలం హుస్నాబాద్ కు వలసవచ్చింది. రమేష్ (42) అనే వ్యక్తి తన భార్యతోపాటు తల్లి పద్మ (62),  ముగ్గురు పిల్లలు స్వరూప (8), నందిని (2), కావేరి (4) కలిసి హుస్నాబాద్ లో నివాసముంటున్నారు. అయితే ఇటీవలే రమేష్ భార్య చనిపోయింది. కుటుంబ పోషణ మొత్తం అతనిపైనే పడింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు. ఈనేపథ్యంలో ఇవాళ రమేష్, తల్లి పద్మ, ముగ్గురు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి సంబంధించిన వారు ఎవరూ లేరు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు.  వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. 

08:25 - March 26, 2016

హైదరాబాద్ : టీడీపీ యువనేత, సీఎం తనయుడు లోకేష్ బాబు రాష్ట్ర క్యాబినెట్‌లో చేరనున్నారా..? త్వరలో జరిగే విస్తరణలో ఆయనకు బెర్త్‌ ఖరారైందా..? ఇద్దరు మంత్రులపై త్వరలో వేటు పడనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. 
క్యాబినెట్‌లో లోకేశ్‌కు చోటు
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు చోటు కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్‌ను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బాబు అండ్ టీంలో కలిగిందనే ప్రచారమూ గతంలో జరిగింది. ఐతే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే చినబాబు భవిష్యత్తుకు ఢోకా ఉండదని చంద్రబాబు భావిస్తున్నారనే టాక్‌ ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. 
పరిపాలన వ్యవహారాల్లో లోకేష్ జోక్యం
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పరిపాలన వ్యవహారాల్లోనూ లోకేష్ జోక్యం చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు లోకేష్ తో టచ్ లో ఉంటున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తే.. నేషనల్ ఫోకస్ వస్తుందని కొందరు బాబుకు సలహా ఇచ్చారంటున్నారు. అయితే అక్కడి కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే లోకేశ్‌ భవిష్యత్తుకు ఢోకా ఉండదని బాబు భావిస్తున్నారట... పైగా లోకేష్‌కు రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో వ్యతిరేకత వచ్చే ప్రమాదమూ ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 
ఆరు నెలల్లో లోకేష్ ఎమ్మెల్సీ..? 
లోకేశ్‌ ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. పైగా ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అందుకే, ఆయన్ను నేరుగా మంత్రి వర్గంలోకి తీసుకొని ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయడానికి బాబు స్కెచ్ వేశారనే టాక్ టీడీపీ అత్యున్నత వర్గాల్లో వినిపిస్తోంది.. లోకేష్ ను మంత్రిని చేసి ఐటీ, కమ్యూనికేషన్లు, యువజన సర్వీసుల శాఖను అప్పగించాలని.. తద్వారా యూత్ కు లోకేష్ దగ్గరవుతాడనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
దూసుకుపోతున్న కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌..ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఇప్పటికే దూసుకుపోతున్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులు, కొత్త సంస్థలను ఆకర్షించడంలో కేటీఆర్ మంచి పనితీరును కనబరుస్తున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా ఐటీ మంత్రిగా క్యాబినెట్ లోకి వస్తే... తెలుగు రాష్ట్రాల సీఎంల తనయులు ఒకే శాఖ చూసినట్టువుతుంది. ఏది ఏమైనా.. మే లేదా జూన్ లో జరిగే విస్తరణలో లోకేష్ తో పాటు మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకొని ఇద్దరిపై వేటు వేసే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.

 

08:19 - March 26, 2016

కరీంనగర్ : సిరిసిల్లలోని చేనేత కార్మికులకు 1500 డబుల్ బెడ్ రూం ప్లాట్ లను కట్టి  ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీర్ ప్రకటించారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో ఆయన  పర్యటించారు. అభివృద్ధి పనులపై పట్టణ  కౌన్పిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో రెండుకోట్ల అరవై లక్షల ఆస్తి పన్ను బకాయిలను ప్రజలు కట్టాలని కేటీఆర్ కోరారు. అప్పుడే పట్టణ అభివృద్ధి త్వరగా  జరుగుతుందని తెలిపారు. ప్రజలు  సహకరించినట్లయితే అభివృద్ధి పనులను మూడు నుండి ఆరు నెలల్లో  పూర్తిచేస్తామన్నారు.

08:16 - March 26, 2016

మెదక్ : సిద్దిపేట మున్పిపల్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ సత్తాచాటింది. 34 వార్డులకు కాను 6 వార్డులకు అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 323 నామినేషన్లు దాఖలు చేయగా 166 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారని మున్పిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు. 146 మంది ఎన్నికల బరిలో ఉన్నారని, 6 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. 

08:12 - March 26, 2016

నిజామాబాద్ : రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఓ కార్యక్రమం ఇప్పుడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.  అర్ధాంతరంగా తనువు చాలించిన వారి నుంచి అవయవాలను సేకరించి ఆపదలో ఉన్న వారికి అమర్చుతున్నారు. ఈ  ప్రక్రియకు జీవన్ దాన్ సంస్థ శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలో దీనికి అన్యూహ స్పందన వస్తోంది.
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో 'జీవన్ దాన్ఋ ప్రారంభం
జీవన్ దాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా రెండు వందల మందికి పైగా అవయవదానం చేశారు. వారి దగ్గర నుంచి  సేకరించిన అవయవాలను ఆపదలో  ఉన్న వారికి అమర్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 హాస్పిటల్స్ ఈ సంస్థలో పేర్లు నమోదు చేసుకున్నాయి. 
జీవన్ దాన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
నిజామాబాద్ జిల్లాలో జీవన్ దాన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవయవదానం పై నిర్వాహకులు అవగాహన కల్పించారు. దీంతో  పెద్ద ఎత్తున ప్రజలు అవయవదానానికి ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అవయవదానం చేయటం ఎంతో సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు
ప్రజలతో పాటు పోలీసులూ హాజరు
ఈ కార్యక్రమానికి ప్రజలతో పాటు పోలీసులు కూడా హాజరయ్యారు. ఏడవ బెటాలియన్ కు చెందిన దాదాపు వంద మంది  పోలీసులు అవయవదానానికి ముందుకు వచ్చారు. అవయదానం పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని వారు అంటున్నారు. అవయవాలు దానం చేయటం ద్వారా  ఇంకొకరిలోనైనా మనం జీవించవచ్చని  పోలీసులు చెబుతున్నారు..
అవయవదానానికి ముందుకు వస్తున్న జనం 
అవయవదానం పై పలు సంస్థలు చేస్తున్న అవగాహన సదస్సులతో చాలా మంది అవయవదానానికి ముందుకు వస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం అని అందరూ దీనికి సహకరిస్తే చాలా మందిని బతికించొచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

07:57 - March 26, 2016

పథకం ప్రకారమే హెచ్ సీయూ విద్యార్థులపై దాడులు జరిగాయని వక్తలు తెలిపారు. హెచ్ సీయూ ఘటన..పరిణామాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమన్నారు. ప్లాన్ ప్రకారమే.. అప్పారావుకు మళ్లీ వీసీ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. విద్యార్థుల్లో చీలికలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం

కరీంనగర్ : నేడు వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం అంగరంగవైభోగంగా జరుగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ..కళ్యాణోత్సవాన్ని వీక్షించనున్నారు. 

 

07:49 - March 26, 2016

ఆనంద్‌ బచ్చు, రాజ్‌బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్‌ ప్రధాన పాత్రధారులుగా విజరు శేఖర్‌ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం '7టు 4'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జరిగే పలు ఆసక్తికర సంఘటనలను థ్రిల్లింగ్‌ నెరేషన్‌తో తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, ఆడియోకు మంచి స్పందన వచ్చింది. పలు బ్లాక్‌బస్టర్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన సంస్థలు సైతం ట్రైలర్‌ని చూసి సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఏప్రిల్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కచ్చితంగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. 'మంచి సామాజిక సందేశమిస్తూ థ్రిల్లింగ్‌గా రూపొందించిన ఈ చిత్రంలో నేనూ భాగమవ్వడం ఆనందంగా ఉంది' అని సంగీత దర్శకురాలు స్నేహలత తెలిపారు. 'దర్శకుడి కష్టమే ఈ చిత్రం. సామాజిక స్పృహతో సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు' అని నటీనటులు చెప్పారు. 'ప్రస్తుతం హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసే హక్కులను తీసుకున్నాం. కొత్తదనంతో ఉన్న ఈచిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని పంపిణీదారులు పేర్కొన్నారు. శ్రీకాంత్‌, ప్రవీణ్‌, నివాస్‌, భరత్‌, కిరణ్‌, నితేష్‌, కార్తీక్‌, అనుష్‌, వెన్నెల, దివ్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరామెన్‌: ఇ.కె.ప్రభాత్‌, సంగీతం: స్నేహలతామురళి.

వచ్చే నెల 19న తెలంగాణ రేషన్ డీలర్ల 'చలో హైదరాబాద్'

హైదరాబాద్‌ : తెలంగాణలో రేష్ న్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రేషన డీలర్ల సంఘం ఆరోపించింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌ 19న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో విషాదం...

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. భువనగిరి మండలం హుస్నాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. మృతుల్లో రమేష్ (42), పద్మ (62), స్వరూప (8) నందిని 2, కావేరి (4) ఉన్నారు. 

07:35 - March 26, 2016

సినీ నటి కొంకణాసేన్ పై బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా ప్రశంసల జల్లు కురిపించింది. 'కొంకణాసేన్‌ ఓ అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం స్ఫూర్తినిస్తుంద'ని అంటోంది సోనాక్షి సిన్హా. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అకిరా' చిత్రంలో సోనాక్షితోపాటు కొంకణాసేన్‌ కూడా నటిస్తున్నారు. వీరిద్దరి కలిసి నటించిన సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయట. ఈ నేపథ్యంలో కొంకణా ప్రతిభ గురించి సోనాక్షి మాట్లాడుతూ,'ఇప్పటివరకు కొంకణా నటించిన చిత్రాల్నే చూశాను. స్క్రిప్ట్ ల ఎంపిక దగ్గర్నుంచి పాత్రల వరకు ఆమె సెలెక్ట్ చేసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె నటించిన ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆమెతో కలిసి స్క్రీన్‌ని షేర్‌ చేసుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'అకిరా'తోపాటు సోనాక్షి ప్రస్తుతం జాన్‌ అబ్రహం సరసన 'ఫోర్స్‌2' చిత్రంలో నటిస్తుండగా, కొంకణా సేన్‌ దర్శకురాలిగా మారి 'ఏ డెత్‌ ఇన్‌ ద గూంజ్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా నిర్మిస్తున్న 'లిప్‌స్టిక్‌ వాలే సప్నే' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

07:30 - March 26, 2016

అలీ రేజా, సీతా నారాయణన్‌ హీరో, హీరోయిన్లుగా ఎన్‌.లక్ష్మీనందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'రామ్‌ ఎన్నారై'. 'పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్స్' అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఏకధాటిగా జరుపు కుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'మానవ సంబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. కథాకథనాలు ప్రధాన బలంగా నిలుస్తాయి. శ్రావణ్‌ అందించిన పాటలు, సంగీతం చిత్రానికి మరో హైలైట్‌. పాలకొల్లు, చించినాడ, పెనుమర్రు, కవిటం, లక్కవరం, పేరుపాలెం, హైదరాబాద్‌, చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్‌ జరిపాం. కథ విషయానికొస్తే, రామ్‌ ఓ ఎన్నారై కుర్రాడు. ఇండియాలో ఉన్న తాతను కలవడం కోసం న్యూయార్క్ నుంచి కోనసీమకు వస్తాడు. ఊళ్ళో ఉన్న తండ్రి పేరు, ప్రఖ్యాతులు చూసి ఆశ్చర్యపోతాడు. అయితే ఆ పేరు, ప్రఖ్యాతులు రావడానికి కారణమైన వ్యక్తి గురించి తెలుసుకుని, తండ్రిని భారతదేశం రప్పించాలనుకుంటాడు. తల్లిదండ్రులను ఇండియా రప్పించ డానికి చేసే క్రమంలో ప్రేమలోనూ పడతాడు. అయితే ఆ ప్రేమ సఫలమైందా?, తల్లిదండ్రులను ఇండియాకి తీసుకురాగలిగాడా? అనే అంశాల సమాహారంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం' అని చెప్పారు. సూర్య, రఘు, జోగినాయుడు, వేణుగోపాల్‌, రవివర్మ, సన, మువ్వా సత్యనారాయణ, జయవాణి, రమేష్‌, కృష్ణచందు, శ్రీమణి, మైనా, రవికుమార్‌, బాలాజీ, వెంకట చలపతి, సునీల్‌ తదితరులు నటించిన ఈచిత్రానికి మాటలు : వీరబాబు బాసిన, సంగీతం: శ్రవణ్‌, కెమెరా : నాగబాబు, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎన్‌.లక్ష్మీనందా.

07:24 - March 26, 2016

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి సందర్శన గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు రాక సందర్భంగా సీపీఎంతో పాటు ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేయడం పై తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. 
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం 
ఏపీ రాజధాని అవరావతి ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం వెలగపూడి పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాల్లో సీపీఎంతోపాటు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు.  అరెస్టు చేసిన నేతలు పోలీసు స్టేషన్లలోనే నిరసన దీక్షలకు దిగారు. 
లోపాలను ఎత్తి చూపుతున్న వామపక్షాలు, ప్రజాసంఘాల
రాజధాని భూ సమీకరణ నుంచి శంకుస్థాపన, నిర్మాణం వరకు అన్ని విషయాల్లో జరుగుతున్న లోపాలను వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులుఎత్తి చూపుతున్నాయి. సీఎం పర్యటనలో కూడా వీరు ఆందోళన దిగుతారని ఆరోపిస్తూ.. ముందస్తు అరెస్టులకు దిగారు. ఆందోళనకు దిగకుముందే ఎలా అరెస్టులు చేయటం ఏంటంటూ... సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. 
అప్రకటిత ఎమర్జీ అమలు : సీపీఎం
ఏపీ రాజధాని ప్రాంతంలోకి ప్రజా సంఘాలను అనుమతించకుండా అప్రకటిత ఎమర్జీని అమలు చేస్తున్నారని సీపీఎం నేతలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లాలో తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోడారాడే వారిని అమరావతిలోకి అనుమతించరా... అని  ప్రశ్నిస్తున్నారు. సీపీఎం నేతల అరెస్టులను నిరసిస్తూ గంటూరు జిల్లా తుళ్లూరు అంబేద్కర్‌ విగ్రహం దగ్గర వామపక్షాల నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అక్రమంగా నిర్బంధించిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని  సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

07:18 - March 26, 2016

ప్రకాశం : జిల్లాలోని భైరవకోన పుణ్యక్షేత్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తున్న అన్నదానసత్రం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. నిర్మాణ పనుల్లో భాగంగా బాంబులను పేలుస్తున్నారు. ఈ క్రమంలో  పక్కనే ఉన్న పర్యాటక అతిధి భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్నదాన సత్రం నిర్మించాలని నిర్ణయం 
పుణ్యక్షేత్రమైన భైరవకోనలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆలయానికి కొద్ది దూరంలో అన్నదాన సత్రం నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవలే భూమి పూజ చేశారు. ఈ సత్రం నిర్మాణ స్థలానికి కూతవేటు దూరంలో పర్యాటక శాఖకు చెందిన అతిధి గృహం ఉంది.  సత్రం నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు వేయడానికి భూమిలోని రాళ్లను పగులకొట్టి పనులు చేపట్టారు. దీనికి గాను శక్తివంతమైన బాంబులను ఉపయోగించారు. దీంతో 14 లక్షలతో నిర్మించిన  పర్యాటక అతిధి భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. 
గాలికి అధికారులు పర్యవేక్షణ
ఆలయ ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టే క్రమంలో దేవస్ధాన అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పర్యవేక్షణను గాలికి వదిలేశారు. దీంతో లక్షల రూపాయలతో  నిర్మించిన అతిధి భవనం ఎందుకు పనికి రాకుండా పోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
 

07:16 - March 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు మళ్లీ ప్రారంభం కానున్నాయి. హాట్‌హాట్‌గా సాగుతున్న సమావేశాలకు మూడు రోజుల సెలవులు కొంత బ్రేక్‌నిచ్చాయి. దీంతో పునః ప్రారంభం తర్వాతైనా సమావేశాలు సజావుగా,  నిర్మాణాత్మకంగా సాగుతాయా..? రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. 
ఉ.10 గం.కు సమావేశాలు  
మూడు రోజుల సెలవుల అనంతరం శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడతారు. అనంతరం పలు పద్దులపై చర్చ జరగనుంది. 
పలు అంశాలపై చర్చ 
బీఏసీ నిర్ణయం ప్రకారం శనివారం నాడు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన సర్వీసులు, మెడికల్‌ అండ్‌ హెల్త్ పద్దులపై చర్చ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేజీ టూ పీజీ, ఫీజు రీయింబర్స్ మెంట్‌, ఆరోగ్యశాఖ పనితీరుపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో శనివారం నాటి సమావేశాలు సజావుగా సాగుతాయా.. లేదా  అనేది సందేహంగా మారింది. ప్రభుత్వం మాత్రం ఆయా బిల్లలుపై సమగ్ర చర్చ జరపాలని యోచిస్తుంది. కాంగ్రెస్‌ హయాంలో ఆయా రంగాలకు కేటాయించిన నిధులు,.. ఖర్చుచేసిన వ్యయాల జాబితాను సిద్ధం చేసింది.  విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు.. మంత్రులు పూర్తిస్థాయిలో జవాబిచ్చేలా కసరత్తు చేశారు. 
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ 
అటు కాంగ్రెస్‌ కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమకు మాట్లాడేందుకు సరిపోయినంత సమయం ఇవ్వకపోయినా.. మంత్రుల సమాధానాలు సంతృప్తికరంగా లేకపోయినా నిరసన తెలపాలని భావిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టడం లేదా వాకౌట్‌  చేయడం లాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి మూడు రోజుల సెలవుల తర్వాత పునః ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగనున్నాయోనన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

 

07:08 - March 26, 2016

హైదరాబాద్ : ఇందిరాపార్కు ఎండి పోతుంది. మ‌రికొద్ది రోజుల్లో అక్కడి ప‌రిస్థితుల్లో మార్పు రాకుంటే  భారీ వృక్షాలు మిన‌హా అన్ని మొక్కలు, చెట్లు ఎండిపోనున్నాయి. బోటింగ్ పాండ్ తో పాటు పార్కులో ఉన్న జ‌ల వ‌న‌రులు అడుగంటిపోయాయి. పది సంవత్సరాలుగా ఇందిరా పార్కుకు స‌ర‌ఫ‌రా అవుతున్న సాగ‌ర్ జ‌లాలు అగిపోయాయి. దీంతో ఇందిరాపార్కుకు నీటి ఎద్దడి ఏర్పడింది.                                                                             
పార్కు వెల వెల 
నిత్యం ప‌చ్చగా ఉండే పార్కు ఇప్పడు వెల వెల బోతుంది. మొత్తం 70ఎక‌రాల్లో ఉన్న పార్కులో ప‌చ్చిక బ‌య‌ళ్లు,  ప‌చ్చటి మొక్కలు, రంగురంగుల గులాబీ మొక్కలు ,  అంద‌మైన షోకేష్ మొక్కలు వంద‌ల సంఖ్యలో ఉన్నాయి. నీరు లేక‌  పార్కులోని  ప‌చ్చిక బ‌య‌ళ్లు క‌నుమ‌రుగ‌య్యాయి.  రంగు రంగుల పూల మొక్కలు క‌నిపించ‌డం లేదు. ఎక్కడ చూసిన ఎండి పోతున్న మొక్కలు , వాడిపోతున్న చెట్లు ద‌ర్శన‌మిస్తున్నాయి. దీంతో పార్కు రూపం పూర్తి స్థాయిలో మారిపోయింది.
ఎండిపోయిన చెరువు, బోటింగ్ పాండ్
ఇందిరా పార్కులో ఉన్న చెరువుతో పాటు, బోటింగ్ పాండ్ పూర్తిగా ఎండిపోయింది. బోటింగ్ ప్రియుల‌తో నిత్యం ర‌ద్దీగా ఉండే  చెరువు చుక్క నీరు లేక వెల వెల బోతుంది. గ‌డిచిన మూడు నెల‌లుగా ప‌రిస్థితులు ఇలానే ఉన్నాయి. సాగ‌ర్ నుండి వ‌చ్చేనీరు  త‌గ్గిపోంతుంద‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు ఎన్నిసార్లు చెప్పినా స్పందించ‌క‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్పడింది. ఏళ్ల త‌ర‌బ‌డి  టాంక్ బండ్ పై నుంచి వినాయ‌క విగ్రహాల‌ను సాగ‌ర్ లో నిమ‌జ్జనం చేయడం ద్వారా క‌ట్టమైసమ్మ వ‌ద్దగ‌ల తూమ్ మూసుకుపోయింది. దీంతో ఉస్మానియా క్యాంప‌స్, సుంద‌ర్యపార్క్, వియ‌స్టీ ప‌రిశ్రమలకు, ఇందిరా పార్కుకు  వెళ్లాల్సిన నీరు నిలిచిపోయింది.
నీరంద‌క ఎండిపోతున్న మొక్కలు
ఇందిరా పార్కులో ఉన్న ఐదు బోర్లలో రెండు మాత్రమే ప‌నిచేస్తున్నాయి. దీంతో నీరంద‌క మొక్కలు ఎండిపోతున్నాయి.  ఇప్పటికే ఇందిరా పార్కుకు నీరంద‌క  రెండునెల‌లు పూర్తి అయ్యింది.  అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే ఇందిరా పార్కులో ప‌చ్చద‌నం క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. 

 

07:04 - March 26, 2016

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్ట్ అనుకున్న దానికన్నా ముందుగానే పూర్తవుతుందా.. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేసే పట్టిసీమ పనులు నిర్దేశిత గడువునకు ముందే పూర్తవుతున్నాయంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటొంది. నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తూ, అంచనాలు సవరిస్తూ,  ఆర్థిక భారంగా సాగునీటి పథకాలు మారుతున్న తరుణంలో పట్టిసీమ ఏడాదిలో పూర్తవుతుందా.. 
80 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే పథకానికి శ్రీకారం
ప్రతి ఏడాది సరాసరి 2 వేల 500 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తుండడంతో ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది.  గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌లోని సెక్షన్ 7 (ఎ) ప్రకారం 80 టీఎంసీల గోదావరి నీటిని నదుల అనుసంధానం చేసే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా నదిలోకి మళ్లించేందుకు మార్గం సుగమం కావడంతో పనులను వేగవంతం చేసింది. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తువుతందంటూ ఊదరగొడుతోంది. ఇన్నేళ్లుగా కానిది ఏడాదిలో అవుతుందా...
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ పట్టిసీమ
కృష్ణా డెల్టాలో ప్రజల దాహార్తిని, సాగు కష్టాలను తీర్చే ప్రణాళికను ప్రభుత్వం రచించింది. సముద్రంలో కలుస్తున్న జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పట్టిసీమ పథకానికి పథక రచన చేసింది సర్కార్ . నవ్యాంధ్ర లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో దాదాపు  24 పంపులు, బావులకు సంబంధించిన నిర్వహణా ప్రాంతంతో కూడిన పంప్‌హౌస్‌. ఒక్కొక్కటి 6  వేల 300 హెచ్ పీ కలిగిన 24 మోటార్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువకు 1.5 కిలోమీటర్ల వద్ద విడుదల చేయాలనేది ప్లాన్.
డబుల్‌ సర్క్యూట్‌ ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణం
ఒక్కొక్కటి 3925 ఆర్‌.ఎం. గల 12 వరుసల పైప్‌లైన్లు గల మొత్తం ప్రెషర్‌ మెయిన్ పొడవు 4 వేల 7100 ఆర్‌ఎం. 30 కిలోమీటర్లదూరం వరకూ 220 కిలోవోల్టుల డబుల్‌ సర్క్యూట్‌ ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణం జరుగుతోంది. 60 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్సఫార్మర్లు గల మూడు 220/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేశారు. 
తొలి మోటారు ఏర్పాటు
పట్టిసీమ నిర్మాణం మొదలైన 161 వ రోజున తొలి మోటారు పని ప్రారంభించారు కాంట్రాక్టర్లు. 2015 సెప్టెంబరు 18 న పోలవరం కుడి కాల్వలోకి నీరు ప్రవహించింది. 2015 డిసెంబరు నాటికి మరో నాలుగు  మోటార్లు , పంపు ప్రారంభమయ్యాయి.. 2004లో రూ. 2,979.82 కోట్లతో చేపట్టిన గాలేరు-నగరి అంచనా వ్యయం ఇప్పుడు 4018.82 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకూ రూ.7,270.54 కోట్లను ఖర్చు చేసినా హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకానికి పూర్తి రూపం రాలేదు.  అయినా ప్రాజెక్టు పూర్తవుతోంది త్వరలోనే నీరు అందిస్తామంటున్నారు నీటి పారుదల శాఖా మాత్యులు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటికి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కాని కాలువలకు నీరుస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఏళ్లుగా జరగని పని ఏడాదిలో ఎలా పూర్తవుతుందనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

06:59 - March 26, 2016


హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో మ‌రోసారి అవినీతి భాగోతం బ‌య‌ట‌ప‌డింది. లక్షల రూపాయ‌లు వ‌సూలు చేసి ఉద్యోగాల‌ను అమ్ముకుంటున్నార‌న్న ఆరోపణ‌ల‌పై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు క‌మిష‌న‌ర్. ఇప్పటికే ఒక‌రిని ఉద్యోగంలోంచి తొల‌గించిన అధికారులు.. అస‌లు దొంగ‌ల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు . ఇంతకు బ‌ల్దియాలో ఏం జ‌రుగుతుంది.. ఇంకా ఎంతమంది బల్దియాలో కాసులకు కక్కుర్తిపడుతున్నారు. 
జీహెచ్ఎంసీలో భారీ స్థాయిలో అవీనితి 
జీహెచ్ఎంసీలో ఇంటిదొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి. జీహెచ్ఎంసీలో అవీనితి భారీ స్థాయిలో ఉంద‌ని  ముఖ్యమంత్రి కేసిఆర్ పాలుమార్లు అధికారులు దృష్టికి తీసుకురావ‌డంతో పాటు బ‌హిరంగంగానే చెప్పారు. దాంతో బ‌ల్దియా ఉన్నతాధికారులు అవినీతి ఆరోప‌ణలు వ‌స్తే చాలు వాటికిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నారు. దీనిలో భాగంగానే విజిలెన్స్ అధికారులు నగరంలో దాడులు నిర్వహిస్తున్నారు. 
పలు సర్కిళ్లలో శానిటేషన్ లో కొత్త ముఖాలు
ఇటీవల స‌మ్మె అనంత‌రం బ‌ల్దియా శానిటేష‌న్ లో కొత్తముఖాలు ద‌ర్శన‌మిస్తున్నాయి. ప‌లు స‌ర్కిళ్లలో  కొత్తవారిని ఉద్యోగాల్లో పెట్టుకుని వారినుండి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేశార‌నే ఆరోప‌ణలున్నాయి. ముఖ్యంగా కుక‌ట్ ప‌ల్లి స‌ర్కిల్ లో 48మందిని నూతనంగా నియ‌మించారు. వారి నియామకంలో ఉన్నతాధికారుల‌కు క‌నీస స‌మాచారం లేదు. ఈ చ‌ర్యల‌కు అప్పుడు  మెడిక‌ల్ అధికారిగా ప‌నిచేసిన ముర‌ళిధర్ గుప్తా కీల‌క సూత్రధారి. అదే విధంగా స‌ర్కిల్ 9 లో కూడా 100 మందికి పైగా కార్మికుల‌ను నియ‌మించార‌నే అరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
ఇంటిదొంగల మోసాలను గుర్తించిన సోమేష్ కుమార్ 
శానిటేష‌న్ కార్మికుల‌కు  12 వేల 5 వంద‌ల‌కు వేత‌నాలు  పెరిగాయి.  దీన్ని అదనుగా చేసుకున్న సూపర్ వైజర్లు , మెడిక‌ల్ అండ్ హెల్త్ అధికారులు కార్మికుల వద్దనుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి కార్మికులను  నియమించారు.  ఈ విభాగంలో జ‌రుగుతున్న ఇలాంటి మోసాల‌ను గుర్తించిన అప్పటి క‌మిష‌న‌ర్  సోమేష్ కుమార్ జోన‌ల్ క‌మిష‌నర్  అధ్వర్యంలో నియ‌మించిన క‌మిటీ అప్రూవ‌ల్ లేకుండా కొత్తగా కార్మికుల‌ను నియ‌మించ‌డానికి వీలు లేదని ఆదేశాలు జారీచేశారు. అధికారులు అప్పటి ఆదేశాలను పట్టించుకోకపోవడంతో  విచార‌ణ జరపాలని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు  పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేస్తున్నారు. 
డ్రైవర్ సర్లేశ్వర్ పై చర్యలు తీసుకున్న అధికారులు
అయితే  స‌ర్కిల్ 9 లో మెడిక‌ల్ అఫీస‌ర్ రామారావు  డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్న స‌ర్లేశ్వర్ ను విధుల‌ నుండి తొలగించారు. అయితే అస‌లు వారిని వ‌దిలేయడానికే డ్రైవ‌ర్ పై చ‌ర్యలు తీసుకున్నార‌నే ఆరోప‌ణలు వస్తున్నాయి . కాని డ్రైవ‌ర్ మాత్రం తాను ఎలాంటి త‌ప్పు చేయలేద‌ని..  కార్మికుల నియ‌మ‌కంలో త‌న పాత్ర లేదంటున్నారు.   అయితే చాలా కాలంనుండి ఇక్కడ ప‌నిచేస్తున్నందునే త‌న‌ను అక్కడి నుండి మార్చారంటున్నారు. ఇప్పటికే డ్రైవ‌ర్  స‌ర్లేశ్వర్ ను , మెడిక‌ల్ అఫీస‌ర్ రామారావును విజిలెన్స్ కార్యాల‌యానికి పిలిపించ‌గా..  జీహెచ్ఎంసీ నుండి ట్రాన్స్ ఫర్ అయిన ముర‌ళిధ‌ర్ గుప్తాను కూడా విచారించ‌డానికి సిద్దమౌతున్నారు. 
అధికారుల తీరులో మార్పు లేదు
ఇంటి దొంగలను పట్టుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. వీరి కారణంగా జీహెచ్ ఎంసీ  ఛీ హెచ్ ఎంసీ గా మారుతోంది.

06:55 - March 26, 2016

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొం డ, లంగర్‌ హౌస్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. ఎండీ ల్యాండ్స్, వాల్మీకీ నగర్లలలో తనిఖీలు నిర్వహించారు. 500 ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. 59 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. 

 

నేడు విశాఖలో 26 వ నేషనల్ ఏయిర్ లైన్స్ సమిట్

విశాఖ : నేడు విశాఖలో 26 వ నేషనల్ ఏయిర్ లైన్స్ సమిట్ జరుగనుంది. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు హాజరుకానున్నారు. 

నేటు నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం..

హైదరాబాద్ : నేటు నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం కానున్నాయి. పలు అంశాలపై సభలో చర్చ జరుగనుంది.

నేడు అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్న మోడీ

దేస్ పూర్ : నేడు అసోంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గోనున్నారు. ప్రచారంలో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. 

 

ఎపిలో ఇంధన అధ్యయనంపై నేడు కేంద్ర బృందం భేటీ

హైదరాబాద్ : ఎపిలో ఇంధన అధ్యయనంపై నేడు కేంద్ర బృందం భేటీ కానుంది. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

 

నేటి నుంచి టీ.అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

నేడు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మ్యాచ్

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Don't Miss