Activities calendar

27 March 2016

సెమీస్ కు టీమిండియా..

హైదరాబాద్ : భారత గడ్డపై జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత్ అద్వితీయ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే చేధించింది. విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చేదనలో మరోసారి ఓపెనర్లు తడబడినా జట్టును ఒంటి చేతితో ముందుకు నడిపిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 

21:31 - March 27, 2016

మొహాలీ : 2016 టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లోనే ఆతిథ్య భారత్ పోటీ ముగిసింది. మొహాలీ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన పూల్-బీ ఆఖరిరౌండ్ పోటీలో..భారత్ పై వెస్టిండీస్ 3 పరుగుల సంచలన విజయం సాధించింది. సెమీస్ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈపోటీలో..భారత్ 115 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్, పాక్, విండీస్ జట్ల చేతిలో ఓటమి పొందడం ద్వారా...భారత్...టోర్నీని నిరాశాజనకంగా ముగించింది.

21:29 - March 27, 2016

గుజరాత్ : రాష్ట్ర బీజేపీ ఎంపీ విఠల్ రాడాడియా మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలోని ఓ దేవాలయం వద్ద భజన కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ విఠల్. అక్కడ భజన చేస్తున్న ఓ వృద్ధుడిని ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ గద్దిస్తూ.. కాలితో తన్నాడు ఎంపీ. దేవాలయంలో భక్తులందరూ చూస్తుండగానే ఈ వృద్ధుడిని ఎంపీ ఇష్టం వచ్చినట్లు తన్నాడు. ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

21:27 - March 27, 2016

ఉత్తరాఖండ్‌ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనిని రాష్ట్రపతి సమ్మతి కోసం పంపించింది. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో ఉత్తరాఖండ్‌లో గవర్నర్‌ పాలన విధించారు. వాస్తవానికి సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆలోపే కేంద్రం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. 

21:21 - March 27, 2016

హైదరాబాద్ : తాగునీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లాకు సాగర్‌ నుంచి నాలుగున్నర టీఎంసీల నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. అసెంబ్లీలోప్రకటించారు. తాగునీటి అవసరాలతో పాటు.. వీణవంక ఘటన, రైతు సమస్యలపైనా అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది. వీణవంక ఘటనపై హోంమంత్రి సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ఆదివారం కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో.. విపక్ష సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. నల్లగొండ జిల్లాకు సాగర్‌ నీరు విడుదలపై.. కోమటిరెడ్డి వెంటకరెడ్డి వివరణ కోరారు. దీనికి స్పందించిన మంత్రి హరీష్‌రావు.. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 4.5 టీఎంసీల నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక కరీంనగర్‌ జిల్లా వీణవంకలో యువతిపై జరిగి సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటన అనంతరం, ఎస్సై నిర్లక్ష్యాన్ని సభ్యులు ఎత్తి చూపారు. దీనికి స్పందించిన హోంమంత్రి నాయిని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

కాంగ్రెస్ వాకౌట్..
నాయిని సమాధానంపై కాంగ్రెస్‌ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో.. సభ్యులు ప్రశ్నోత్తరాల అంశాన్నీ ప్రస్తావించారు. రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. స్పందించిన ప్రభుత్వం.. స్వామినాథన్‌ సిఫారసులను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ప్రకటించింది.  విత్తనాలు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా విత్తన చట్టం చేయాల్సిన అవసరముందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రుణమాఫీ త్వరగా చేస్తే రైతు ఆత్మహత్యలు తగ్గే అవకాశముందన్నారు. మరోవైపు విద్యాశాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బదులిచ్చారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 417 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను వచ్చే డీఎస్సీలో భర్తీ చేస్తామన్నారు. మే 1న ఉపాధ్యాయ ప్రవేశ పరీక్ష... టెట్‌ నిర్వహించిన తర్వాత డీఎస్సీ జరుపుతామన్నారు. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సమావేశమైన అసెంబ్లీ.. పలు పద్దులను ఆమోదించింది.

21:17 - March 27, 2016

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి జిల్లా కరిమంగళం దగ్గర కారు, వ్యాన్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కారులో వెళుతున్నవారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా సేలం వెళుతున్నట్లు తెలుస్తోంది. 

21:16 - March 27, 2016

ఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఎయిరిండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల్లో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. నేపాల్‌లోని ఖాట్మాండ్‌ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఫోన్‌ వచ్చింది. దీంతో పలు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేసి తనిఖీలు చేపట్టారు.  

21:10 - March 27, 2016

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని లాహోర్‌ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ పార్క్‌లో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో లాహోర్‌ రక్తసిక్తమైంది. ఈ ఘోర దుర్ఘటనలో 69 మంది మృతి చెందగా 200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. భద్రతాసిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి  చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు హుటాహుటిన తరలించారు. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియదు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
ఆత్మాహుతి దాడి 
గుల్షన్‌-ఇ-ఇక్బాల్‌ పార్క్‌లోని వాహనాల పార్కింగ్‌  స్థలంలో ఆదివారం సాయంత్రం ఓ ఉగ్రవాది తనకు తాను పేల్చేసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. పేలుడు జరిగిన ప్రాంతం చిన్నారుల ఆటస్థలానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. ఆదివారం కావడంతో పార్క్‌కు పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. దీంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. 
ఎక్కడ చూసినా మృతదేహాలే..
పేలుడు జరిగిన అనంతరం పార్క్‌లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరిని తాము రిక్షాలు, టాక్సీల్లో ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. పార్క్‌ ప్రాంతం చాలా పెద్దదని, దీనికి చాలా ప్రవేశద్వారాలు ఉన్నాయని భద్రత తక్కువగా ఉందని తెలిపారు. అయితే ఆదివారం ఈస్టర్‌ కావడంతో క్రిస్టియన్ల లక్ష్యంగానే దాడి జరిగి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాడి తీవ్రతను బట్టి చూస్తే ఎనిమిది నుంచి 10కిలోల పేలుడు పదార్థాలతో తనను తాను ఉగ్రవాది పేల్చుకొని ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. అయితే దాడికి పాల్పడింది తామేనంటూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. 

ఇండియా టార్గెట్ 161 రన్లు..

ఛండీగఢ్ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాటింగ్ : ఖజావా (26), ఫించ్ (43), వార్నర్ (6), స్మిత్ (2), మాక్స్ వెల్ (31), ఫాల్క్ నర్ (10), వాట్సన్ (18 నాటౌట్), నెవిల్ (18 నాటౌట్).
భారత్ బౌలింగ్ : పాండ్యా రెండు, నెహ్రా, బుమ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లు చెరో ఒక వికెట్ తీశారు. 

పాక్ లో పేలుడు పెరుగుతున్న మృతుల సంఖ్య..

పాకిస్తాన్ : లాహోర్ లోని గుల్షన్ ఇ ఇక్బాల్ పార్కులోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఆత్మహుతి దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వర కు 50 మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. 

ఆసీస్ 130/5..

ఛండీగఢ్ : ఇండియాతో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ ధీటుగా ఆడుతోంది. మాక్స్ వెల్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఆసీస్ 130పరుగులు చేసింది. ఖజావా (26), ఫించ్ (43), వార్నర్ (6), స్మిత్ (2), మాక్స్ వెల్ (31) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్, పాండ్యా చెరో ఒక వికెట్ తీశారు. 

ఆసీస్ 100..ఫించ్ అవుట్..

ఛండీగఢ్ : ఇండియాతో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మరో ఏడు పరుగులు సాధిస్తే అర్థ సెంచరీ పూర్తవుతుందనగా ఫించ్ (43) ను పాండ్యా అవుట్ చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆసీస్ 100 పరుగులు చేసింది. 

పాక్ లో పేలుడు 10 మంది మృతి..

పాకిస్తాన్ : లాహోర్ లోని ఓ పార్కులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆసీస్ 84/3..

ఛండీగఢ్ : ప్రధాన వికెట్లు పోయినా ఆసీస్ జట్టు స్కోరు పరుగెడుతోంది. ఇండియా తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఖజావా (26), వార్నర్ (6), స్మిత్ (2) పెవిలియన్ దారి పట్టారు. క్రీజులో ఉన్న ఫించ్, మాక్స్ వెల్ లు వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లకు 85 పరుగులు చేసింది. ఫించ్ 35, మాక్స్ వెల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆసీస్ 74/3..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ వికెట్లను కోల్పోతోంది. 74 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. ఇండియాతో తలపడుతున్న ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఖవాజా (26) వెనుదిరగగా వార్నర్ (6) పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం వచ్చిన స్మిత్ (2) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

ఆసీస్ రెండో వికెట్...

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఇండియాతో తలపడుతున్న ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఖవాజా (26) వెనుదిరగగా వార్నర్ (6) పెవిలియన్ దారి పట్టాడు. 

ఖవాజా అవుట్..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో ఆసీస్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఇండియాతో తలపడుతున్న ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఖవాజా, ఫించ్ లు ఆటను ఆరంభించారు. ఖవాజా భారత బౌలర్లను చీల్చిచెండాడే ప్రయత్నం చేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్ ను చీల్చిచెండాడు. అనంతరం నెహ్రా బౌలింగ్ లో ఖవాజా (26) ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఆసీస్ 59 పరుగులు చేసింది. 

బుమ్రా బౌలింగ్ లో వరుస ఫోర్లు..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ - భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ ఆశీష్ నెహ్రా వేశాడు. బుమ్రా రెండో ఓవర్ లో ఖవాజా వరసగా మూడు ఫోర్లు కొట్టాడు. మొత్తంగా రెండో ఓవర్ లో బుమ్రా మొత్తం 17 పరుగులు ఇచ్చాడు. 

ప్రారంభమైన ఆసీస్, భారత్ మ్యాచ్..

ఛండీగఢ్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ - భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ ఆశీష్ నెహ్రా వేశాడు. 

జెట్ ఎయిర్ వేస్ కు బాంబు కాల్..

ఖాట్మండు : ఢిల్లీ - ఖాట్మండు జెట్ ఎయిర్ వేస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఖాట్మాండు ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపడుతున్నారు. 

మహిళల టీ20..భారత్ నిష్ర్కమణ..

మొహాలీ : టీ 20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్లు మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్లు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత జట్టు 111/9 తో ఒటమి పాలైంది. ఈ పరాజయంతో టీ20 ప్రపంచకప్ నుండి భారత్ నిష్ర్కమించింది. 

18:36 - March 27, 2016

నాగ్ పూర్ : టీ -20 వరల్డ్ కప్ లో పసికూన జట్లు అదరగొడుతున్నాయి. మేటి జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న భారత్ ను బంగ్లాదేశ్ ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అప్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించి తామేమి తక్కువ తినలేదని నిరూపించింది. గ్రూప్ -1 నుండి ఇప్పటికే హ్యట్రిక్ విజయాలతో వెస్టిండీస్ జట్టు సెమీస్ చేరిన విషయం తెలిసిందే.
టి-20 ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో అప్ఘనిస్తాన్ నామమాత్రపు మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు పరుగులు సాధించడానికి నానా తంటాలు పడింది. ఓపెనర్ లూయిస్ డకౌట్ అయ్యాడు. ఛార్లెస్ (22), శ్యామూల్స్ (5), రమ్దీన్ (18) పరుగులు సాధించి పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడింది. వికెట్ పోకుండా బ్రావో జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అప్ఘన్ బౌలర్లకు విండీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. 5.6 ఓవర్ల వద్ద ఫ్లెచర్ 11 రిటైర్డ్ హార్డ్ అయ్యాడు. బ్రావో 28, రస్సెల్ 7, సామి 6 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రాణించిన జర్ధాన్..
తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ జట్టులో జర్దాన్ రాణించాడు. 45 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఓపెనర్ షెజాద్ 24 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అనంతర వచ్చిన కెప్టెన్ అస్ఘర్ (16: 22 బంతుల్లో 1x6) వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్ తో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు 50 వద్ద అస్ఘర్ వెనుదిరిగాడు. అనంతరం ఇతర బ్యాట్స్ మెన్స్ తడబడి వికెట్లు పొగొట్టుకున్నారు. అయితే చివరిలో నజీబుల్లా జర్ధాన్ (48 నాటౌట్ : 40 బంతుల్లో 4x4, 1x6) బ్యాట్ ఝులిపించాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 123 పరుగులు చేయగలిగింది.

స్కోరు బోర్డు : అప్ఘనిస్తాన్ 123/7..వెస్టిండీస్ 117/8
వెస్టిండీస్ బౌలర్లలో బద్రీ 3, రసెల్ 2, బెన్ సామి చెరో వికెట్ తీశారు.
అప్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్ రెండు, హమ్జా, హసన్, నయిబ్ లు చెరో ఒక వికెట్ తీశారు. 

అప్ఘన్ విజయం..

నాగ్ పూర్ : టి -20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టుపై అప్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన విండీస్ 117 పరుగులు చేసింది. అంతకుముందు అప్ఘనిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 123 రన్లు చేసింది. 

ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నలుగురికి జీవితఖైదు..

ఉత్తర్ ప్రదేశ్ : ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నలుగురు దోషులకు ప్రతాప్ గఢ్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మే 2007లో కమలేష్ ప్రతాప్ సింగ్ చిన్నారి కుటుంబ తగాదాల కారణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రకాశ్, అఖిలేష్ కుమార్, అభిషేక్ కుమార్, రాజేష్ కుమార్ లను కోర్టు దోషులుగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది. 

18:14 - March 27, 2016

హైదరాబాద్ : వాయిదా పడ్డ టీఎస్పీఎస్సీ గ్రూపు-2 పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశం నిరుద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను రెండు నెలలు వాయిదా వేశారు. దీంతో జులై వరకు ఈ పరీక్ష నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించి గ్రూప్‌-2 కొత్త తేదీలను ఖరారు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టీఎస్‌పీఎస్‌కీ ఆశనిపాతంగా మారింది. అయితే మూడు నెలల్లోగా ఈ పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని పబ్లిక్ సర్వీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. పరీక్షను సిద్ధమవుతున్న అభ్యర్ధులతో విన్నపంతోపాటు, మరికొన్ని పోస్టులు పెంచే ఉద్దేశంతో వాయిదా వేశారు.
అయితే గ్రూప్‌-2లో ఎన్ని పోస్టులు పెరుగుతాయన్న అంశంపై స్పష్టతలేదు. ఏయే శాఖల్లో కొత్త పోస్టుల ఖాళీలు ఉన్నాయన్న వివరాలు లేవు. కొత్త పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. అనంతరం ఖాళీలకు సంబధించిన వివరాలు, రిజర్వేషన్ల రోస్టర్‌ను టీఎస్‌పీఎస్సీ తెప్పించుకోడానికి కొంత సమయం పడుతుంది. ఇంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుబంధంగా కొత్త పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఎంతలేదన్నామూడు నెలలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే... జులై వరకు పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని టీఎస్‌పీఎస్పీలో చర్చ జరుగుతోంది. వర్షా కాలంలో పరీక్ష నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే మళ్లీ వాయిదా పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

439 పోస్టులకు ప్రకటన..
గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు భారీ స్పందన వచ్చింది. మొత్తం 439 పోస్టులకు ప్రకటన జారీ చేస్తే 5.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నాయి. పది జిల్లాల్లో 1600 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న టీఎస్‌పీఎస్సీ ఇందుకు ఏర్పాట్లు చేసుకుంది. పెరిగిన పోస్టులకు అనుగుణంగా దరఖాస్తులు పెరుగుతాయి కాబట్టి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. జూన్‌లో డిగ్రీ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరతారు. భవిష్యత్‌లో నిర్వహించే ఏ పరీక్షకు ఇబ్బంది లేకుండా గ్రూప్‌-2 తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వచ్చే సెప్టెంబర్‌ , అక్టోబర్‌ వరకు పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. పద్దెనిమిది శాఖల్లో కొత్త పోస్టులు ఉన్నాయని అంచనావేస్తున్నారు. రెవిన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, అస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్ ఆఫీసర్ల ఖాళీలను కొత్త నోటిఫికేషన్‌లో చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భారీ నష్టం..?
మరోవైపు వచ్చే నెలలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయడం వలన టీఎస్‌పీఎస్సీకి భారీ నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. నాలుగు పేపర్ల చొప్పున 5.60 లక్షల మందికి దాదాపు 24 లక్షల వరకు ప్రశ్న పత్రాల ముద్రణలకు టీఎస్‌పీస్సీ ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చింది. వీటి ముద్రణ కూడా పూర్తి కావచ్చిన తరుణంలో పరీలను వాయిదా వేయడంతో ఈ ప్రశ్నాపత్రాలన్నీ వృథా అవుతాయి. గ్రూప్‌-2 వాయిదా నిర్ణయం ఇలా రకరకాల సమస్యలకు దారితీస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 37.4, నెల్లూరులో 36.3 డిగ్రీలు, కాకినాడలో 35.6 డిగ్రీలు, కావాలిలో 34.2 డిగ్రీలు, ఒంగోలులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

వెస్టిండీస్..18 బాల్స్..29 రన్లు..

నాగ్ పూర్ : వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధించడానికి వెస్టిండీస్ కష్టపడుతోంది. టీ-20 వరల్డ్ కప్ లో పసికూన అప్ఘనిస్తాన్ తో ఢీకొంటోంది. 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 95 పరుగులు చేసింది. అంతకంటే ముందు అప్ఘనిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. 

17:59 - March 27, 2016

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తన బ్రెయిన్ తినేశారని సినీ నటుడు నాగార్జున తెలిపారు. నాగార్జున, కార్తీక్, తమన్నాలు నటించిన 'ఊపిరి' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర సక్సెస్ ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా నాగార్జున మాట్లాడారు. 'ఊపిరి' చిత్రం చూసిన అనంతరం రాఘవేంద్ర రావు తనకు ఫోన్ చేశారని ఆ సమయంలో తాను ఖతర్ లో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ కు వచ్చిన అనంతరం మాట్లాడుతానని చెప్పినా రాఘవేంద్ర రావు వినిపించుకోలేదని, ప్రశంసల జల్లు కురిపించారని పేర్కొన్నారు. డైరెక్షన్..కార్తీక్ గురించి మాట్లాడారని, నెక్ట్స్ మీ సినిమానే అనగానే రాఘవేంద్రరావు ఫొన్ పేట్టేశారని నాగ్ తెలిపారు. 'ఊపిరి' చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీను వైట్ల ప్రశంసిస్తూ మేసెజ్ పంపించాడని తెలిపారు. అలాగే ప్రిన్స్ మహేష్ తనకు ఫొన్ చేశాడని, మేము ఏం చేయాలని ప్రశ్నించాడని తెలిపారు. తమిళనాడు నుండి కూడా ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. వంశీ పైడిపల్లి, టీం తనకు చాలా బాగా నచ్చిందన్నారు. ఈ సినిమాలో తన కంటి దగ్గర నలుపు ఎలా తీసుకొచ్చేరో తనకు తెలియదన్నారు. తన సతీమణి అమల ఇప్పటికీ నా లెగ్స్ వంక చూస్తోందని, కార్తీక్ రోల్ ఎక్కువగా ఉన్నారని అడిగితే తన తమ్ముడే కదా అని చెప్పడం జరిగిందన్నారు. ప్రేమతో చేసిన చిత్రమని, రివ్యూ చూడడం జరిగిందని తెలిపారు. రివ్యూలో వ్యక్తుల గురించి రాయలేదని, సినిమా గురించి రాశారని నాగ్ పేర్కొన్నారు. ఇంకా నాగ్ ఎలాంటి విశేషాలు తెలియచేశారో వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

17:53 - March 27, 2016

హైదరాబాద్ : వీణవంక ఘటనపై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వకపోవడం దారుణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. వీణవంక ఘటనపై మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్‌ పట్టుబడింది. స్పీకర్‌ సమయం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఈసందర్భంగా మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. దీన్నిబట్టే దళితులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

17:52 - March 27, 2016

హైదరాబాద్ : 6 వేల 618 ఎకరాల భూమిని.. 2 వేల 229 మంది భూమి లేని దళితులకు పంపిణీ చేశామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 794 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు,179 కాలేజ్ హాస్టల్ నిర్వహణకు 395 కోట్లు కేటాయించామని, ఈ హాస్టళ్లలో 76 వేల మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ఫీజుల కింద కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 29,862 ఎస్సీ కుటుంబాల వారు లబ్దిపొందారని మంత్రి తెలిపారు. 5 జిల్లాలలో ప్రభుత్వ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేశామన్నారు.

వెస్టిండీస్ 50/3..

నాగ్ పూర్ : అప్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం 8.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ 50 రన్లు చేసింది. 

వెస్టిండీస్ 33/2..

నాగ్ పూర్ : అప్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం 5.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ 33 రన్లు చేసింది. 

ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఉత్తరాఖండ్ స్పీకర్..

ఉత్తరాఖండ్ : 9మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఇండియాకు సమాచారం అందించారు. 

ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ వద్ద గట్టి బందోబస్తు...

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

జూనియర్ కాలేజీలకు సెలవులు..

హైదరాబాద్ : జూనియర్ కాలేజీలకు ఎల్లుండి నుండి మే 31 వరకు వేసవి సెలవులిస్తున్నట్లు, జూన్ 1వ తేదీ నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమౌతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీలు వేసవి సెలవుల్లో కాలేజీల్లో తరగతులు నిర్వహించకూడదని, సెలవుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

రేపు గవర్నర్ ను కలుస్తాం - హరీష్ రావత్..

ఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ ను తాము సోమవారం కలుస్తామని హరీష్ రావత్ ప్రకటించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శాసనసభలో 70-90 సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. 

ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలనపై రాహుల్ ట్వీట్స్...

ఢిల్లీ : బీజేపీ ప్రభుత్వంపై ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆయన స్పందించారు. ప్రజల తీర్పును హత్య చేశారని, ఫెడరిలజాన్ని మోడీ హత్య చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలో, విశ్వ విద్యాలయంలో, రాజ్యాంగ అధికారాలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. 

అప్ఘనిస్తాన్ 123/7..

నాగ్ పూర్ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ నిర్ణీత 20ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జర్దాన్ 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

గొగోయ్ ప్రభుత్వంపై మోడీ విమర్శలు..

అస్సాం : తరుణ్ గొగోయ్ ప్రభుత్వంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అస్సాంలో రెండో రోజు పర్యటించారు. సోనిట్ పూర్ జిల్లాలోన రంగపరా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసగించారు. 

16:22 - March 27, 2016

మెదక్ : సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆదివారం కావడంతో పలువురు అభ్యర్థులు కాలనీలను చుట్టేస్తున్నారు. ప్రధానంగా రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న సీపీఎం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఆరో వార్డులో అభ్యర్థి విజాయన్ని కాంక్షిస్తూ సీపీఎం నేత చుక్కా రాములు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు టెన్ టివితో మీడియాతో మాట్లాడారు. ఉద్యమాల ద్వారా అనేక సమస్యలను పార్టీ పరిష్కారం చేసిందని గుర్తు చేశారు. ఆరో వార్డులో కళావతి, 31వ వార్డులో నిర్మల పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇరువురూ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. 

16:11 - March 27, 2016

హైదరాబాద్ : పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న వారికి ఆడపిల్ల అంటే చిన్న చూపే. ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. తాజాగా ఓ భర్త తనకు వారసుడు కావాలంటూ భార్యను హింసిస్తున్నాడు. హింసలకు తాళలేక ఆమె పోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. ఈ ఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. వారసుడు కావాలంటూ తన భర్త నిత్యం వేధిస్తున్నాడని, రోకలబండతో బాదుతున్నాడని లావణ్య వాపోయింది. భర్త అత్తామామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భర్త ఇంటి ఎదుట లావణ్య ఆందోళనకు దిగింది. ఈమెకు పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. సరూర్ నగర్లో పీఎస్ లో కేసు నమోదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తోంది. మరి ఈమెకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. 

ప్రజాస్వామ్యం హత్య - హరీష్ రావత్..

ఢిల్లీ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై హరీష్ రావత్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెలిసిందే. 

విజయకాంత్ సతీమణిపై కేసు..

చెన్నై : డీఎండీకే అధినేత విజయ్ కాంత్ సతీమణి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోవాలని ఓటర్లను ప్రోత్సాహిస్తున్నారన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. 

టి.శాసనమండలి వాయిదా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి రేపటికి వాయిదా పడింది. మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ ప్రకటించారు. సభలో జీహెచ్‌ఎంసీ-2016 బిల్లును ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంపై చర్చ జరిగింది.

15:45 - March 27, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో 'ఉన్నత విద్య – సవాళ్లు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్వీకేలో జరిగిన ఈ సమావేశంలో చుక్కా రామయ్య పాల్గొని ప్రసంగించారు. హెచ్ సీయూలోని విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రసంగించిన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు చుక్కా రామయ్య తెలిపారు. విశ్వవిద్యాలయాలు మార్కెట్ లా తయారయ్యాయని, ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసే విధంగా ప్రవర్తించడం సమాజ అభివృద్ధికి మంచిది కాదన్నారు.

 

15:43 - March 27, 2016

పశ్చిమగోదావరి : నరసాపురం నియోజవకర్గంలోని తూర్పుతాళ్ల గ్రామంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ గ్రామానిన్ ఆమె దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీతారామన్ ప్రసంగించారు. 255 మందికి పక్కా ఇళ్లు కట్టిస్తానని, రెండు మూడు నెలల్లో ఇళ్లు కట్టుకోవడానికి డబ్బు ఇప్పించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతొక్కరికి ఫించన్లు ఇప్పిస్తానని హామీనిచ్చారు. 

15:40 - March 27, 2016

హైదరాబాద్ : రహదారులపై నిబంధనలు పాటించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లపై వేగానికి మించి వాహనాలు నడుపుతున్న వారితో పాటు మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిలో చైతన్యం నింపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. గోషా మహల్ శిక్షణా కేంద్రంలో ఈ అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, సినిమాట్రోగఫర్ ఛోటా.కె.నాయుడు తదిరతులు హాజరయ్యారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

15:22 - March 27, 2016

విజయవాడ : బెజవాడ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపి పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. తాను టిడిపిలో చేరడం లేదని జ్యోతుల పేర్కొంటున్నా అది నిజం కాదని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో చేరే అంశంపై జ్యోతుల సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఏప్రిల్ మూడో తేదీన పార్టీలో చేరడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు జ్యోతుల నెహ్రూకు ప్రధాన అనుచరుడు వరుపుల సుబ్బారావు పార్టీ మారతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీనితో ఇంకా పలువురు కీలక నేతలు పచ్చకండువాలు కప్పుకొనేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. వీరు పార్టీ మారకుండా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తుందా ? లేదా వారు టిడిపిలో చేరడానికి నిర్ణయించుకున్నారా ? అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. 

టాస్ గెలిచిన వెస్టిండీస్..

ఢిల్లీ : టి-20 వరల్డ్ కప్ లో భాగంగా అఫ్ఘనిస్తాన్ - వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన వెస్లిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

కాంగ్రెస్ వాకౌట్..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ నుండి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. వీణవంకలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం సరియైన విధంగా వివరణ చేయలేదని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుండి బయటకు వచ్చేశారు. 

భారత్ గెలవాలంటూ పూజలు..

ఉత్తర్ ప్రదేశ్ : టీ-20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవాలని క్రికెట్‌ అభిమానులు కాన్పూర్‌లో ప్రార్థనలు నిర్వహించారు. క్రికెటర్ల ఫోటోలు పెట్టి పూజలు చేశారు. 

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన..

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం చివరకి రాష్ట్రపతి పాలన విధించేందుకు దారి తీసింది. ఈమేరకు ఇవాళ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. 

టిడిపి పార్టీలో జ్యోతుల నెహ్రూ ?

విజయవాడ : జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపి పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏప్రిల్ మూడో తేదీన చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 

14:31 - March 27, 2016

నల్గొండ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు తాగునీరు విడుదల చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాల మేరకు వినియోగించుకునే వీలు ఉంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా పట్ల చిన్నచూపు చూస్తోందని ప్రజలు పోరుబాట పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడడంతో కనీసం తాగునీటికి చుక్క నీరు లేని పరిస్థితి జిల్లాలో ఉంది. నాగార్జునసాగర్‌ జలాశయంలోని నీటిని పొదుపుగా వినియోగించుకునే అవకాశం ఉన్నా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, రిజర్వాయర్లకు రెండు టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఉభయ రాష్ట్రాలకు కేటాయించిన ఆరు టిఎంసిలకు గాను ఇప్పటికే సాగర్‌ నుండి కుడి కాల్వతో పాటు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. మళ్లీ రెండో దశ కుడికాల్వకు నీటిని ఇస్తున్నారు. నిత్యం హైదరాబాద్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. అయితే చట్ట బద్ధంగా ఎడమ కాల్వకు రావాల్సిన నీటిని మాత్రం విడుదల చేయడంలేదు.

ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి..
ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని, త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గత రెండు నెలలుగా జిల్లా ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్‌లోని ఎన్‌ఎస్‌పి చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని ముట్టడించి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆందోళనకు స్పందించిన సిఇ.. ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజులు గడుస్తున్నా నీరు విడుదల కాలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపొతే.. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి.. సాగర్‌ దిగ్భందిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ నెల 28 వరకు ప్రభుత్వం స్పందించకపోతే డ్యాం ను ముట్టడిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా.. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎడమకాల్వ ద్వారా త్రాగునీటి చెరువులు, కుంటలు నింపాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

14:28 - March 27, 2016

నల్గొండ : కూతవేటు దూరంలోనే రెండు రాష్ట్రాలకు వరప్రదాయిని వంటి సాగర్ రిజర్వాయర్ ఉన్నా నల్లగొండ జిల్లా వాసులకు మాత్రం తాగునీటి సమస్యలు తీరడం లేదు. అసలే వర్షాభావ పరిస్థితులతో బావులు, బోర్లు అడుగంటాయి.. బిందెడు నీటికోసం కిలోమీటర్ల దూరం వెల్లాల్సిన దుస్థితి. జిల్లాలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిపై టెన్ టీవీ స్పెషల్‌ రిపోర్టు. నల్లగొండ జిల్లా లో గుక్కెడు నీటికోసం ప్రజలు నానాయాతన పడుతున్నారు. గత రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్బజలాలు పాతాళంలోకి పడిపోయాయి. కృష్ణానది ఎగువ భాగంలో గతేడాది వర్షాలు కూడా లేకపోవడంతో.. జిల్లా త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చే నిండకుండలాంటి నాగార్జునసాగర్ జలాశయం వెలవెలబోతుంది. సాగర్ రిజర్వాయర్ కు లింక్ గా ఉన్న ఎమ్మార్పీ, చేపూర్, నిడమనూర్, ఉదయ సముద్రం, అయిటిపాముల చెరువు వంటి నీటి ప్రాజెక్టులు కూడా వెలవెలబోతున్నాయి. దీంతో జిల్లాలో వందలాది గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గొంతు తడుపుకునేందుకు తల్లాడిపోతున్నారు.

తగ్గిపోయిన భూగర్భ జలాలు..
వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు మరింత తగ్గిపోయాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా ఉన్న నాగార్జునసాగర్ కూడా అడుగంటిపోవడంతో.. ఎడమకాల్వకు త్రాగునీటి అవసరాల పేరుతో దశలవారీగా అరకొర నీటిని మాత్రమే వదిలారు. జిల్లాలో చాలావరకు చెరువులు ఎండిపోయాయి. దేవరకొండ నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అయిటిపాములు చెరువు కింద దాదాపు 200 గ్రామాలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. వాటర్ గ్రిడ్ అంటున్నారే తప్ప.. ఇంతవరకు తమ తాండాలకు కనీసం నల్లా కూడా లేదని విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొనడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో వ్యవసాయ బోర్లు, బావులు కూడా అడుగంటిపోయాయి. పలు గ్రామాలలో నీటిని సరఫరా చేసేందుకు ప్రయివేటు బోర్లను లీజుకు తీసుకున్నారు అధికారులు. అయితే బోర్లు కూడా కరెంట్ ఉన్న కొద్ది సమయంలో కొద్ది నీటిని మాత్రమే అందిస్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చందంపేట మండల బిలెంగి తండాకు టెన్ టీవీ బృందం చేరుకున్న సమయానికి అక్కడ వాటర్ ట్యాంకర్ దగ్గర గ్రామస్థులు గుమికూడి ఉన్నారు. తీరా చూస్తే.. వాటర్ ట్యాంకర్ లో నీరు అయిపోయినా.. చాలామంది ఖాళీ బిందేలతోనే ఉన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే తప్ప ఈ వేసవి గట్టెక్కలేమని జిల్లా వాసులు వాపోతున్నారు.  

14:24 - March 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం కొద్దిసేపటిక్రితం ముగిసింది. ఇందులో భాగంగా ఈనెల 30న కరువు, విద్యపై చర్చ చేపట్టనున్నట్లు నిర్ణయించుకున్నారు. అలాగే 31వ తేదీన ఇరిగేషన్‌పై చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఉభయ సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్... పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రజంటేషన్... సభలో కాకుండా కమిటీ హాల్లో ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో విపక్షాలకు అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్‌ చేశారు. 

14:20 - March 27, 2016

కాకినాడ : తెలుగు రాష్ట్రాల్లో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పార్టీ నుండి గెలిచిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. నియోజకవర్గ అభివద్ధి కోసమే తాము చేరుతున్నట్లు నేతలు పేర్కొంటున్నారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పచ్చకండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాను మాత్రం నియోజకవర్గం అభివృద్ధి కోసం త్వరలోనే టిడిపిలో చేరుతానని వైసీపీ ఎమ్మెల్యే సుబ్బారావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం టిడిపిలో సుబ్బారావు చేరనున్నట్లు తెలిపారు. పార్టీలో చేరమని తెదేపా నుంచి తనకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను పార్టీ మారుతున్నట్లు సుబ్బారావు స్పష్టం చేశారు. ఇదే జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
జ్యోతుల నెహ్రూ, సుబ్బారావులు ఎప్పటి నుండో టిడిపిలోకి చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. పీఏసీ ఛైర్మన్ గా జ్యోతుల నెహ్రూను నియమిస్తారని ఆయన అనుచరులు భావించారు. కానీ నెహ్రూకు ఛాన్స్ దక్కక్కపోవడంతో నెహ్రూ, ఆయన అనుచరులు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీనితో అధికార పార్టీలోకి జంప్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

సభను దుర్వినియోగం చేసింది జగన్ - బోండ ఉమ..

హైదరాబాద్ : జగన్ నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, సభను దుర్వినియోగం చేసింది జగనే అని బోండా ఉమ పేర్కొన్నారు. సభను దుర్వినియోగం చేసింది జగన్ అని విమర్శించారు. ప్రభుత్వంపై అవినీతి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అవిశ్వాస తీర్మానాలు, రోజా వ్యవహారం తప్ప ప్రజల సమస్యలు జగన్ కు పట్టడం లేదని తెలిపారు.

 

త్వరలో ఏపీలో పెనుమార్పులు - గోరంట్ల..

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. వైసీపీ అధినాయకత్వంపై నమ్మకం లేక చాలా మంది టిడిపిలో చేరనున్నారని తెలిపారు. 

తెలంగాణ పురోభివృద్ధి లక్ష్యంగా పని - కోదండరాం..

హైదరాబాద్ : తెలంగాణ పురోభివృద్ధి లక్ష్యంగా జేఏసీ పనిచేస్తోందని భవిష్యత్ లో క్రియాశీలకంగా పనిచేస్తామని ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ప్రజల తరపున వాచ్ డాగ్ లా పనిచేస్తామని, త్వరలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. కరవుపై అసెంబ్లీ చర్చ జరగాలని, 5,6న ఆదిలాబాద్, 11న నిజామాబాద్ లో పర్యటించడం జరుగుతుందన్నారు. హెచ్ సీయూలో విద్యార్థులపై లాఠీఛార్జీని ఖండిస్తున్నట్లు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 

14:02 - March 27, 2016

హైదరాబాద్ : ప్రజల కోసం జేఏసీ పని చేస్తుందని... వాచ్ డాగ్ గా పని చేస్తామని కోదండరాం తెలిపారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పురోభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. నిర్మాణాత్మక బాధ్యత పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎలా పని చేశామో భవిష్యత్ లో కూడా అలాగే చేస్తామని చెప్పారు. ప్రజల తరపున ఉంటామని.. ప్రజా సంఘాలుగానే పని చేస్తామని చెప్పారు. 
హెచ్ సీయూలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. 
హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య కేసు విచారణ జరుగుతుండగా అప్పారావు వీసీగా మళ్లీ బాధ్యతలు తీసుకోవడం సరైందని కాదన్నారు. మెస్ లు  మూసివేత సరైన చర్య కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా హెచ్ సీయూలో సాయుధ పోలీసు బలగాలను ప్రవేశింప చేయడం తగదన్నారు. 

 

13:53 - March 27, 2016

రాజమండ్రి : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. మెగా అభిమానులు రక్తదానం చేశారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు  వేడుకలను అభిమానులు సామాజిక దృక్ఫథంతో నిర్వహించారు. ఈ వేడుకలకు  రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హాజరయ్యారు.

 

13:51 - March 27, 2016

హైదరాబాద్ : కొత్త పోస్టులు కలిపేందుకు వీలుగా గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద్ర శాసనమండలిలో చెప్పారు. గ్రూప్‌-2లో కలిపే పోస్టుల వివరాలను శాఖవారీగా తెప్సిస్తున్నామని మండలి ప్రశ్రోత్తరాల సమయంలో సభ దృష్టికి తెచ్చారు. 

13:44 - March 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విజయ డెయిరీకి పాలు సరఫరా చేసిన రైతులకు చెల్లించాల్సిన 59 కోట్ల రూపాయల  నగదు ప్రోత్సాహక బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. లీటరుకు నాలుగు రూపాయల చొప్పున ఇస్తున్న మిల్క్ ఇన్సెంటివ్‌  ఇకపై కూడా కొనసాగుతుందని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ దృష్టికి తెచ్చారు. 

13:40 - March 27, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు...ఏపీ ప్రభుత్వం అడ్డంకిగా మారుతోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నఅన్ని ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం వాటర్ బోర్డులో ఫిర్యాదు చేస్తోందన్నారు. తెలంగాణ  శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నపై హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

13:38 - March 27, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో  ఖాళీగా ఉన్న 417 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను వచ్చే డీఎస్సీ లో భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో చెప్పారు. వచ్చే మే 1న ఉపాధ్యాయ ప్రవేశ పరీక్ష... టెట్‌ నిర్వహించిన తర్వాత డీఎస్సీ జరుపుతామని ప్రశ్నోత్తరాల సమయంలో  సభ దృష్టికి తెచ్చారు. 

మే 1న టెట్‌ పరీక్ష : కడియం

హైదరాబాద్ : రాష్ట్రంలో మే 1న టెట్‌ పరీక్ష నిర్వహించనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. అలాగే పాఠశాలల్లో వ్యాయామ విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటామని కడియం తెలిపారు.

13:33 - March 27, 2016

తూర్పుగోదావరి : వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలోని జ్యోతుల నెహ్రూ నివాసంలో పెద్దఎత్తున కార్యకర్తలు, జిల్లా నేతలు హాజరయ్యారు. జ్యోతులను బుజ్జగించేందుకు ఇప్పటికే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సైతం జ్యోతులను కలిసి బుజ్జగిస్తున్నారు. కాగా జ్యోతుల నెహ్రూ ఇంకా పార్టీ మారే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.   

13:12 - March 27, 2016

సాహిత్యం సామాజిక గమనాన్ని అక్షరీకరిస్తుంది. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. భావోద్వేగాలకు గురిచేస్తుంది. రసానందాన్ని కలిగిస్తుంది. కథైనా కవితైనా మనిషిని స్పందింపచేయాలి. అనుభూతుల్లో ముంచెత్తాలి. అలాంటి కథలు, కవితలు రాసిన వారెందరో ఉన్నారు. వారిలో అద్భుత కథలు రాసిన ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ ప్రత్యేక కథనంతో పాటు, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రముఖ రచయిత్రి బుక్కర్ ప్రైజ్ గ్రహీత అరుంధతీ రాయ్ కథనం, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.

ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవలా రచనతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత్రి అరుంధతీ రాయ్. ఒక రచయిత్రిగా ... ఉద్యమకారిణిగా, నటిగా, స్క్రిప్టు రచయితగా అరుంధతీరాయ్ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఆమె రాసిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవలకు బుక్కర్ ప్రైజ్ లభించింది. సంచలన రచయిత్రి  అరుంధతీ రాయ్ పై 10 టి.వి.ప్రత్యేక కథనం మీకోసం.

ఆధునిక తెలుగు కథా రచయిత్రుల్లో కుప్పిలి పద్మకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. వానచెప్పిన రహస్యం, సాలభంజిక ,మంచుపూలవాన, ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ లాంటి ఎన్నో కథాసంపుటాలు ఆమె వెలువరించారు. స్త్రీవాద రచయిత్రిగా అర్బన్ మహిళల జీవన చిత్రాలను కథలుగా అల్లారు. ప్రముఖ కాలమిస్టు, కవయిత్రి కథనశిల్పి  కుప్పిలి పద్మ సాహితీ  ప్రస్థానంపై ప్రత్యేక కథనం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాహితీ వేదికల వేడుకల విశేషాలు ఇప్పడు చూద్దాం. ఇదీ ఈ వారం అక్షరం. వచ్చేవారం మరిన్ని సాహితీ కథనాలతో మీ ముందుకొస్తుంది 10 టి.వి అక్షరం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:01 - March 27, 2016

కరీంనగర్ : జిల్లాలోని రామగుండం ఓపీ-3 ప్రాజెక్టులో 10మంది కాంట్రాక్ట్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఏఎమ్మార్ కంపెనీలో పనిచేస్తున్న వీరు.. బల్లిపడిన అల్పాహారాన్ని తీసుకోవడంతో అస్వస్థతకు గురైయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.

 

12:50 - March 27, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం అధికమైంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. తపస్య భవనం పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన శ్రావణి హైదరాబాద్ లోని కెపిహెచ్ బీ కాలనీలోని తపస్య సీఎ అకాడమీలో సీఎ చదువుతోంది. నాలుగు రోజుల క్రితం అకాడమీలో చేరింది. అకాడమీ ఐదో అంతస్తులోని హాస్టల్ భవనంలో ఆమె ఉంటుంది. ఈనేపథ్యంలో విద్యార్థిని అకాడమీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సి నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. 
 

12:34 - March 27, 2016

ఢిల్లీ : ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు ముందు కనిపించే మౌకా మౌకా యాడ్‌ పేరడీగా ఎన్నో స్పూఫ్‌ యాడ్స్ వచ్చాయి. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పూఫ్‌ యాడ్‌ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.   

12:30 - March 27, 2016

విజయవాడ : ప్రియురాలు మోసం చేసిందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ చిట్టీనగర్‌లో నివాసముంటున్న తాజుద్దీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రియురాలు మోసం చేసిందన్న మనస్తాపంతోనే రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజుద్దీన్‌పై సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఇటీవలే.. ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు... అతన్ని హెచ్చరించారు. దీంతో మనస్థాపానికి గురైన తాజుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. యువకుడి మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ అమ్మాయి తాజుద్దీన్ ను మోసం చేసిందన్నారు. మోసం చేసి.. మరణానికి కారణమైన అమ్మాయిని ఇంటి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. మొదట వివాహం చేసుకుంటానని చెప్పిన అతని ప్రియురాలు ఇప్పుడు కుదరదని చెప్పినందుకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇంటి నుంచి ఆ అమ్మాయి బయటికి రావాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

 

టీ.అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు.

టీబ్రేక్ సమయంలో బేఏసీ సమావేశం

హైదరాబాద్ : టీబ్రేక్ సమయంలో టీఅసెంబ్లీ బేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో సభ నిర్వహించే అంశంపై చర్చించనున్నారు. 

పగో జిల్లాలో కేంద్రంమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటన

ప.గో : నర్సాపురం మండలంలోని తూర్పుతాళ్ల, పెదమైనవానిలంకలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించారు. దత్తత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 

 

లోకేష్ తో తూగో జిల్లా టీడీపీ నేతలు సమావేశం

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో నారా లోకేష్ తో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలు సమావేశం అయ్యారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక, పార్టీలో చేరికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

11:37 - March 27, 2016

గిటారు లేకుండానే మెలోడి మ్యూజిక్‌ మనసును తాకింది. డ్రమ్స్, తబలా..పియోనో వంటి వాయిద్యాలేవి లేవు. అయినా ఓ అందమైన పాట అంతకంటే అందంగా రూపుదిద్దుకుంది. సంగీత దర్శకులకు మాత్రమే సాధ్యమైన సంగీతాన్ని కేవలం నోటి శబ్దాల ద్వారానే పుట్టించారు. కేరళ సింగర్‌ అంజు జోసెఫ్‌. భారతదేశంలో తొలిసారిగా సంగీత వాయిద్యాలు లేకుండా శబ్దాల ద్వారానే పుట్టించే కెపల్లా సంగీతాన్ని మనకు అందించారామె. బాహుబలి చిత్రంలోని ధీవర పాటను నవ్యరీతిలో అందించారు. ఈ ప్రయత్నాన్ని.. బాహుబలి చిత్ర యూనిట్‌ కృషికి అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

 

11:33 - March 27, 2016

ఖమ్మం : జిల్లాలో అప్పల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన వేములు నరసింహారావు అనే వ్యక్తికి రెండు ఎకరాల సొంత భూమి ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. పత్తి, మిర్చి సాగుచేశాడు. అయితే వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోయాయి. పంట కోసం చేసిన అప్పులు తీరేమార్గం లేదన్న మానసిక వేదనతో పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహారావు కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. 

 

11:27 - March 27, 2016

గుంటూరు : ఎపి రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక  సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న నిర్మాణ సంస్థలు భారీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాయి. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఆయా సంస్థల కార్మికులు, సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. 
వచ్చే జూన్‌ నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలన 
గుంటూరు జిల్లా వెలగపూడిలో ఏపీ  తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. వచ్చే జూన్‌ నుంచి  అమరావతి కేంద్రంగా పరిపాలన సాగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చకచకా నిర్మాణ పనులు సాగుతున్నాయి.  మున్సిపల్‌ మంత్రి నారాయణతోపాటు సీఆర్‌డీఏ అధికారులు  ఎప్పటికప్పుడు నిర్మాణాల పురోగతిని  పర్యవేక్షిస్తూ నిర్మాణ సంస్థలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా శుక్రవారం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఫిబ్రవరిలో నిర్మాణానికి శంకుస్థాపన  
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నెల 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే కాంట్రాక్ట్‌ దక్కించుకున్న నిర్మాణ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లొంజీల సిబ్బంది పనులు మొదలు పెట్టేశారు. ఆరు బ్లాక్‌ల నిర్మాణం వచ్చే జూన్‌ నాటికి పూర్తికావాల్సి ఉండటంతో... 800 మంది కార్మికులను మూడు షిప్టుల్లో పని చేయిస్తున్నారు. అన్ని భవనాలకు పునాదులు తవ్వకం దాదాపు పూర్తయ్యింది. మొదటి బ్లాక్‌ పునాదుల్లో కాంక్రీట్‌  ఫుటింగ్స్‌ వేస్తున్నారు.  ప్రస్తుతం జీ ప్లస్‌ వన్‌ పద్ధతిలో నిర్మాణాలు చేపడుతున్నా.... భవిష్యత్‌లో మరిన్ని అంతస్థులకు పెంచుకునే విధంగా  వంద మీటర్ల లోతున పునాదులు తవ్వారు. 
జూన్‌ నాటికి పూర్తి  
తాత్కాలిక సచివాలయ భవనాలను జీ ప్లస్‌ వన్ స్థాయిలో జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత జులై, ఆగస్టుల్లో మరో రెండు అంతస్థులు వేసే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులుతోపాటు, సచివాలయ ఉద్యోగులను మూడు దశల్లో తరలించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించిన తరుణంలో... ఇందుకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు సాధన, సంపత్తిని సమకూర్చుకున్నాయి. 

11:16 - March 27, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పోలీసుల చర్యపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. పోలీసులు అతిగా వ్యవహరించారని, విద్యార్థులను అకారణంగా కొట్టారని విపక్షాలు విరుచుకు పడ్డాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌... దీనిపై విచారణ జరుపుతామని, పోలీసులు అతిగా వ్యవహరించినట్లు తేలితే  తప్పనిసరిగా చర్యలు ఉంటాయని చెప్పారు. అసలు ఆరోజు హెచ్‌సీయూలో యూనివర్శిటీలో ఏం జరిగింది.?  హ్యావ్‌ ఏ లుక్‌..
అప్పారావు తిరిగి వీసీగా బాధ్యతలు
రోహిత్‌ వేముల ఆత్మహత్య తరువాత జరిగిన వరుస పరిణామాలతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. విశ్వవిద్యాలయంలో పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో గురువారం తిరిగి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో తాను విధుల్లో తిరిగి చేరిన విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు కొందరు ప్రొఫెసర్లు,. సిబ్బందితో తన ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ తరుణంలో విద్యార్థులు అక్కడికి సమీపంలోనే పెద్ద సంఖ్యలో గుమికూడారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు విసి కారకుడిగా భావిస్తున్న విద్యార్థులు ఆయన రాకను తీవ్రస్వరంతో అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ ఛాంబర్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు
విద్యార్థులపై విరుచుకు పడిన పోలీసులు  
సరిగ్గా ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో విసి ఛాంబర్‌ వద్ద రక్షణ వలయంగా నిలబడ్డారు. సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు అక్కడికి చేరి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరికొందరు విసి ఛాంబర్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈలోగా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో ఒక్కసారిగా పోలీసులు విద్యార్థులపై విరుచుకు పడ్డారు. లాఠీలు ఝులిపిస్తూ విద్యార్థులపైకి దూసుకువెళ్లారు. విచక్షణ రహితంగా వ్యవహరించారు. డొక్కల్లో తన్నుతూ గుండాల్లా వ్యవహరించారు. విద్యార్ధినుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. తమపై లైంగిక దాడులకు దిగినట్లు విద్యార్ధులు ఆరోపించారు. 
ప్రొఫెసర్ల పైనా దురుసు ప్రవర్తన
పోలీసుల తీరును తప్పుబట్టిన ప్రొఫెసర్ల పైనా దురుసుగా ప్రవర్తించారు. దళిత ప్రోఫెసర్ రత్నం, తాతగాతసేన్ పై దాడికి దిగారు. మహిళా ప్రొఫెసర్ శోభారాణి, సౌమ్య దేచమ్మల జుట్లు పట్టి ఇడ్చుకెళ్లారు.  హాస్టళ్లు మూత పడటంతో వంట చేసుకుంటున్న విద్యార్ధులపై పడి లాఠీలు ఝళిపించారు. విద్యార్ధుల తలలు, ముఖాలు పగిలిపోయి ఆసుపత్రి పాలయ్యారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం  కొనసాగింది. 25 మంది విద్యార్థులను, ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులో తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్ది సేపటి తరువాత మొయినాబాద్‌ పిఎస్‌కు తరలించారు. రాత్రి సమయంలో నాచారంలోని మెజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచి అర్థరాత్రి తరువాత చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ప్రభుత్వాన్ని తప్పు బట్టిన పోలీసులు 
పోలీసుల తీరు పట్ల విపక్షాలు ప్రభుత్వాన్ని తప్పు బట్టాయి. విద్యార్థులకు ఎటువంటి హెచ్చరికలు చేయకుండా లాఠీలను ప్రయోగించారని విపక్ష నేతలు ఆరోపించారు. రోహిత్ వేముల మరణానికి కారణమైన వీసీ అప్పారావును వదిలి విద్యార్ధుల పై దాడి జరపడమేమిటంటూ నిలదీశారు. దీంతో దిగొచ్చిన సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఉన్నతస్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ నిర్వహిస్తానని అసెంబ్లీలో ప్రకటించారు.  సీఎం కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా...విచారణ పూర్తి చేసి బాద్యులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

11:04 - March 27, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ గ్రామంలో  చెరువును తవ్వుకుంటూ తమ అవసరాలకు మట్టిని ఇవ్వడం లేదంటూ చిత్రాడ  గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పనులను పర్యవేక్షించడానికి వచ్చిన జిల్లా  కలెక్లర్, అధికారులను అడ్డుకున్నారు. సమగ్ర మంచినీటి పథకానికి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్  గా చిత్రాడ పాపయ్య చెరువును కేటాయించారు. ఇందులో ప్రస్తుతం వాటర్ వర్క్ కు  సంబంధించిన పనులు జరుగుతున్నాయి. చెరువు ప్రాంతంలోని ఈబీసీ కాలనీలో  ఇళ్లస్థలాలు కేటాయించారని... దీనిని ఎత్తు చేసేందుకు మట్టిని సరఫరా చేయాలని కోరినా  అధికారులు స్పందించడం లేదని గ్రామ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. 

10:38 - March 27, 2016

డైరెక్టర్ నందినిరెడ్డితో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా 'కళ్యాణవైభోగమే' సినిమా విశేషాలను ఆమె వివరించారు. సినిమా షూటింగ్ కు సంబంధించిన పలు విషయాలను తెలిపారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

జ్యోతుల నెహ్రూతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం...

కాకినాడ : జిల్లాలో వైసీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. జ్యోతుల పార్టీ మారుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జ్యోతుల ఇంటికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రెండు గంటలుగా సమావేశం కొనసాగుతోంది. 

 

10:27 - March 27, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. వైసీపీ నేత పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్త కథనాలు కూడా వస్తున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో జ్యోతుల నెహ్రూతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. జ్యోతుల పార్టీ మారుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జ్యోతుల ఇంటికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రెండు గంటల పాటు  సమావేశం అవుతున్నారు. 

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

09:45 - March 27, 2016

నల్గొండ : జిల్లాలో ఓ బాలిక అదృశ్యం అయింది. బాలిక రాకపోవడంతో 20 రోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేళ్ల చెరువు మండలం నక్కగూడెంకు చెందిన రేణుక అనే గిరిజన బాలిక ఏడో తరగతి చదువుతోంది. 2015 సెప్టెంబర్ లో పాఠశాలకు వెళ్లి తిరిగిరాలేదు. బాలిక అదృశ్యమైన విషయాన్ని బయటికి చెప్పొద్దని గ్రామ పెద్దలు తీర్మానించారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, పక్క ఊరులో వెతికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. 20 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు... కానీ బాలిక వార్త తెలియలేదు. దీంతో ఈనెల 20న నేళ్లచెరువు పీఎస్ లో ఆమె తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ లేకపోవడంతో సైదా అనే హెడ్ కానిస్టేబుల్ కు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ తెల్లకాగితంపై వారి చేత సంతకం చేయించుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ దురుసు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. 'పిటిషన్ ఇంత పొడుగుంది. నీ బిడ్డను ఎంతమందికి వద్దకు పంపుతావురా.'. అని హెడ్ కానిస్టేబుల్ దుర్భాషలాడడని ఆరోపించారు. రెండు వేలు రూపాయలు అడిగాడని.. వెయ్యి ఇచ్చామని పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై ఈనెల 24న ఎస్ పీ ని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఇదిలావుంటే బాలిక అదృశ్యమైన ఘటనలో స్థానిక ఎంపిపి అస్తం ఉందని.. అతని కుమారుడు కిడ్నాప్ చేసి... బాలికను నిర్బంధించారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ బతికుందో లేదో చెప్పాలని... తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

 

 

హుబ్లీ-మైసూర్ ప్యాసింజర్ రైలులో చోరీ

అనంతపురం : హుబ్లీ-మైసూర్ ప్యాసింజర్ రైలులో చోరీ జరిగింది. ప్రయాణికురాలి నుంచి 15 తులాల బంగారు నగలు ఉన్న బ్యాగ్ ను ఇద్దరు దుండగలు ఎత్తుకెళ్లారు. గార్లదిన్నె క్రాసింగ్ వద్ద రైలు దిగి దొంగలు పరాయ్యారు. ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

09:31 - March 27, 2016

మొహాలీ : టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్...గ్రూప్-2 లీగ్ లో అతిపెద్ద సమరానికి..ఆతిథ్య టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. సెమీఫైనల్స్ నాకౌట్ బెర్త్ సాధించాలంటే నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. మొహాలీ పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను కదిపికుదిపేస్తున్న 2016 టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్...గ్రూప్ లీగ్ పోటీలు క్లయ్ మాక్స్ దశకు చేరాయి. పూల్-1 నుంచి మాజీ చాంపియన్ వెస్టిండీస్, పూల్ -2 నుంచి న్యూజిలాండ్ జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోడంతో...మిగిలిన రెండుబెర్త్ ల కోసం ఆఖరిరౌండ్ పోటీలు హాట్ హాట్ గా మారాయి.
టీమిండియా, ఆస్ట్రేలియా ఢీ అంటే ఢీ 
ఆతిథ్య టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన..పూల్ - 2 నాకౌట్ రౌండ్ రేస్ నుంచి...మాజీ చాంపియన్ పాకిస్థాన్, ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ జట్లు నిష్క్రమించడంతో...సెమీస్ రెండో బెర్త్ కోసం..టీమిండియా, ఆస్ట్రేలియా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ ఆడిన మూడురౌండ్లలో రెండు విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉన్నాయి. చెరో నాలుగుపాయింట్లు చొప్పున సాధించినా..నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం కంగారూటీమ్ దే పైచేయిగా ఉంది. అయితే...సూపర్ టెన్ రౌండ్ లో పాకిస్థాన్ పోటీ ముగియడంతో...నెట్ రన్ రేట్ కు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్ లో నెగ్గిన జట్టు మాత్రమే..సెమీఫైనల్స్ చేరుకోగలుగుతుంది. ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, ఐదవ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లూ రెండూ....న్యూజిలాండ్ చేతిలో ఓడి...బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల పైనే మాత్రమే విజయాలు సాధించడం విశేషం.
అసలుసిసలు పోరాటానికి టీమిండియా సిద్ధం 
ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన టీమిండియా....ఇప్పుడు అసలుసిసలు పోరాటానికి సిద్ధమయ్యింది. విజయం మినహా వేరేదారి లేకపోడంతో...ఆరునూరైనా మ్యాచ్ నెగ్గితీరాలన్న కసితోనే రెండుజట్లూ సమరానికి సమాయత్తమయ్యాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో ఈ రెండుజట్ల ఆటతీరును బట్టి చూస్తే...బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలలో సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వలేకపోతుంటే...సురేశ్ రైనా వరుస వైఫల్యాలు భారత టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే...వన్ డౌన్ విరాట్ కొహ్లీ, యువరాజ్ సింగ్, కెప్టెన్ ధోనీ లపైనే టీమిండియా పూర్తిగా ఆధారపడి ఉంది. మరోవైపు..ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఓపెనర్ ఉస్మాన్ కాజా, కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ లపైనే ఆధారపడిఉంది. బౌలింగ్ స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్నర్ జంపా, పేస్ విభాగంలో పేసర్ జేమ్స్ ఫాక్నర్ అంచనాలకు మించి రాణిస్తూ...జట్టుకు కొండంత అండగా ఉంటూ వస్తున్నారు.
ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ గా ఆస్ట్రేలియా
ఇప్పటికే ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియాకు...టీ-20 ఫార్మాట్లో మాత్రం అంతంత మాత్రం రికార్డే ఉంది. టీమిండియా ప్రత్యర్ధిగా ఆడిన మొత్తం 12 టీ-20 మ్యాచ్ ల్లో కంగారూ టీమ్ నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాల రికార్డుతో ఉంది. ఇటీవలే ముగిసిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన ధోనీసేన కు..ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా మెరుగైన రికార్డే ఉన్నా...గ్రూప్-2 నుంచి సెమీఫైనల్స్ చేరాలంటే ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో మాత్రం నెగ్గితీరక తప్పదు. టీమిండియా సత్తాకు మాత్రమే కాదు...కెప్టెన్ గా ధోనీ ప్రతిభకూ ఈ పోటీ అసలు సిసలు పరీక్షే అవుతుంది.
భారీస్కోరింగ్ మ్యాచ్
మ్యాచ్ కు వేదికగా ఉన్న మొహాలీ స్టేడియం పిచ్..పేస్ బౌలర్లతో పాటు...స్ట్రోక్ మేకర్లకు అనువుగా ఉండటంతో..భారీస్కోరింగ్ మ్యాచ్ గా ముగిసే అవకాశాలు లేకపోలేదు. టాస్ తో పాటు...ఓపెనర్ల భాగస్వామ్యం సైతం మ్యాచ్ తుదిఫలితం పై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ప్రత్యర్థి ఎదుట భారీలక్ష్యం ఉంచే వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
రాత్రి 7 గంటలకు ప్రారంభం 
రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో రెండోఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టుకు..మంచుబెడద...సమస్యలు సృష్టించే ప్రమాదం సైతం ఉంది.
ఏదిఏమైనా... ఐదవర్యాంకర్ ఆస్ట్రేలియా కంటే...టాప్ ర్యాంకర్ టీమిండియా పైనే ఒత్తిడి అధికంగా ఉంది. అయితే..ఒత్తిడిలోనే అత్యుత్తమంగా రాణించే సత్తా ధోనీసేనకు ఉందనటానికి..బంగ్లాదేశ్ పై సాధించిన ఒకే ఒక్క పరుగు విజయాన్ని మించిన నిదర్శనం మరొకటి ఉండదు. శతకోటిమంది భారత క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈమ్యాచ్ లో టీమిండియా అత్యుత్తమంగా రాణించి..సెమీస్ చేరాలని 10 టీవీ సైతం కోరుకొంటోంది.

09:21 - March 27, 2016

హైదరాబాద్ : ఈస్టర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో తెల్లవారుజాము నుంచే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. శిలువ వేసిన తరువాత ఏసుక్రీస్తు ఇవాళ తిరిగి జన్మించిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మెదక్ చర్చిలో
ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిలువను ఊరేగించారు. ఈ వేడుకలకు తెలగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

09:18 - March 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభా సమావేశాల్లో అధికార పార్టీ వ్యూహాలు విజయవంతంగా అమలు చేస్తోంది. విపక్షాల్లోని అనైక్యతను అనుకూలంగా మార్చుకుంటుంది గులాబీ పార్టీ.  శాసనసభా వ్యవహారాల్లో అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలే గట్టెక్కించాయి. 
వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు 
యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ఎలాంటి చర్చ లేకుండానే రెండు సార్లు సభను వాయిదా వేయక తప్పలేదు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరిపి సభలో యూనివర్సిటీల అంశాన్ని చర్చిచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ వ్యవహారం అధికార పార్టీని ఇరుకున పెడుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం దక్కకుండా పోయింది. సభలో కాంగ్రెస్‌పై బిజెపి విరుచుకుపడింది.
విపక్షాల దాడిని తిప్పికొట్ట లేకపోయిన కాంగ్రెస్ 
చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విజయవంతం అయిన కాంగ్రెస్....చర్చలో మాత్రం విపక్షాల దాడిని తిప్పికొట్ట లేకపోయింది. అధికార పార్టీపై ఎంఐఎం నేరుగా విమర్శలు చేయకపోయినా....బిజెపి కుట్రలో భాగస్వామ్యం కావద్దని హెచ్చరించింది. విపక్ష పార్టీలే పరస్పర విమర్శలు చేసుకోవడంతో....అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. తమ వ్యూహంతో  కాంగ్రెస్ పార్టీని అడ్డుకోగలిగామని గులాబీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

09:11 - March 27, 2016

హైదరాబాద్ : తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహితపై పాత డిజైన్‌ ప్రకారమే ఆనకట్ట నిర్మించాలని అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ.. తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌తో ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.  తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచే విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ప్రాజెక్టుల డిజైన్‌ మార్పుపై పార్టీల నేతలంతా ఏకం కావాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

 

నల్గొండ జిల్లాలో బాలిక మిస్సింగ్

నల్గొండ : మేళ్ల చెరువు మండలం నక్కగూడెంలో ఓ బాలిక అదృశ్యం అయింది. 2015 సెప్టెంబర్ లో గిరిజన బాలిక రేణుక అదృశ్యమయింది. బాలిక అదృశ్యమైన విషయాన్ని బయటికి చెప్పొద్దని గ్రామ పెద్దలు తీర్మానించారు. బాలిక రాకపోవడంతో 20 రోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

08:39 - March 27, 2016

ఢీల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో శనివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బట్లర్‌ అజేయ అర్ధ శతకం బాదడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన శ్రీలంక ఆదిలోనే చండిమాల్‌ , దిల్షాన్‌ , సిరివర్ధనె , తిరిమానె వికెట్లు కోల్పోవడంతో  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో ఆరు పాయింట్లు సాధించి ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరగా.. పాయింట్ల పట్టికలో వెనకబడిన దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఇంటిబాట పట్టనున్నాయి. 

 

08:36 - March 27, 2016

ట్రిపోలీ : లిబియాలో ఉగ్రవాదులు జరిపిన షెల్‌ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. లిబియాలోని సబ్రతా నగరంలో ఉగ్రవాదులు జరిపిన షెల్‌ దాడిలో కేరళకు చెందిన తల్లీ కొడుకులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సును ఆమె 18 నెలల కుమారుడు అపార్టమెంట్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో భర్త విపిన్‌ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సును, విపిన్ దంపతులు 2012లో లిబియాకు వెళ్లారు. మృతి చెందిన మహిళ నర్సుగా పనిచేస్తోంది. లిబియాలో చిక్కుకున్న కేరళ వాసులను ఇండియాకు  రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ తెలిపారు. 

08:24 - March 27, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క్రీడాభివృద్ధికి  జీహెచ్ఎంసీ నయా ప్లాన్. ఇప్పటికే ఉన్న ప్లే  గ్రౌండ్స్ ను మెరుగుప‌రచ‌డంతో పాటు కొత్త గ్రౌండ్స్ నిర్మాణం పై ఫోక‌స్ చేస్తోంది. బ‌ల్దియాలోని ప్రతి డివిజ‌న్ లో జిమ్స్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక‌లు రూపోందిస్తున్నారు. స‌మ్మర్ లో నిర్వహించే క్రీడా కోచింగ్ సెంటర్ల ఏర్పాటు పై స‌మీక్ష చేశారు మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్. క్రీడ‌ల ప్రోత్సాహ‌నికి మ‌రిన్ని ప్లాన్ చేస్తోంది గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ .  ప్రతి ఏటా స‌మ్మర్ క్యాంపుల పేరుతో ల‌క్షాలాది మంది బాల బాలిక‌ల‌కు.. యువతీ,యువ‌కుల‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న జీహెచ్ఎంసీ స్పొర్ట్స్  డిపార్ట్ మెంట్ మ‌రిన్ని స‌దుపాయాల క‌ల్పన‌కు సిద్దమౌతుంది. 
150 డివిజ‌న్లలో నూత‌న జిమ్ ల ఏర్పాటు యోచన
కార్పొరేష‌న్ లోని 150 డివిజ‌న్లలో నూత‌న జిమ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బ‌ల్దియా. ఇందుకు  5ల‌క్షల వ్యయంతో  న్యూ ఎక్విప్ మెంట్ స‌మ‌కూర్చాల‌ని డిసైడ్  అయ్యారు అధికారులు. గుర్తింపు పొందిన కంపెనీల‌ నుండే  ప‌రిక‌రాలు  కొనుగోలు చేయాల‌ని నిర్ణయించారు మేయ‌ర్.  స్పోర్ట్స్ విభాగం అధికారుల‌తో స‌మావేశ‌మైన  మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్  ప‌నుల‌పై స‌మీక్ష నిర్వహించారు.
స‌మ్మర్  క్యాంపులకు అత్యాధునిక ప‌రిక‌రాలు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ ప‌రిధిలో నిర్వహిస్తున్న స‌మ్మర్  క్యాంపులకు అత్యాధునిక ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని అధికారులను మేయర్ ఆదేశించారు . ఏప్రిల్ 20వ తేదీ నుంచి న‌గ‌రంలోని అన్ని క్రీడా మైదానాల్లో స‌మ్మర్‌ కోచింగ్  సెంట‌ర్ లను  ప్రారంభిస్తున్నామ‌న్నారు మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్.  ఇందుకోసం  ఏప్రిల్ మొద‌టి వారం నుండి న‌గ‌రంలోని అన్ని క్రీడా మైదానాల‌ను స్వయంగా ప‌రిశీలిస్తాన‌ని.. కార్పొరేష‌న్ అద్వర్యంలో నిర్వహిస్తున్న సెంట‌ర్ లను అంద‌రూ ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. వివిధ పార్కుల్లో పాడైన క్రీడా ప‌రిక‌రాలను రిప్లేస్ చేయడానికి కూడా బ‌ల్దియా ప్లాన్ చేస్తోంది. ఇక క్రీడా సెంట‌ర్లలో  ఉచితంగా వైఫై సౌక‌ర్యాన్ని క‌ల్పించే ఆలోచ‌న‌లో జీహెచ్ఎంసీ ఉంది.  

 

08:14 - March 27, 2016

హైదరాబాద్ : దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న చందంగా మారింది అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. డబ్బులు చెల్లించాలని సాక్షాత్తు హైకోర్టే ఆదేశించినా బాధితుల గోడును ఆలకించే వారే కరువయ్యారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు స్పందించకపోవడం.. బాధితులకు శాపంగా పరిణమించింది. అరకొర సౌకర్యాల జూడిష్యియల్ కమిటీ... బాధితులకు పూర్తి న్యాయం చేయలేక సతమతమవుతోంది. 
హైకోర్టు సూచనలు బేఖాతరు 
అగ్రిగోల్డ్‌ అధిక వడ్డీల ఆశలో పడి నిండామునిగిన బాధితులకు న్యాయం అందని ద్రాక్షగా మారుతోంది. ఓవైపు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటి వేసి ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లించాలని ఉన్నత ధర్మాసనం సూచించింది. కోర్టు 10 నెలలుగా ఒత్తిడి పెడుతున్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. 2 నెలల క్రితం జూడిష్యియల్ కమిటీకి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఆదేశాలను పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న కమిటీకి తెలంగాణ సర్కార్‌ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, వాహనాలు, సమావేశాల నిర్వహణ అవసరాలు తీర్చే బాధ్యత ఏపీ సర్కారుదని చెప్పినా.. ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదు. వాహనాలు.. సహాయకులను కమిటి సభ్యులే వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో 20 రోజులకోసారి జూడిషియల్ కమిటీ చేయాల్సిన ఈవేలం ప్రక్రియ అలస్యమవుతోంది. 
హైకోర్టుకు ఫిర్యాదు చేసే యోచనలో కమిటీ సభ్యులు
ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీన వైఖరిపై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. వాస్తవానికి వేల కోట్ల రూపాయల ఆస్తుల అమ్మకం ప్రక్రియ అంత సులువైనది కాదు. మీటీంగ్‌లో జరిగే మినెట్స్ నోట్‌ చేసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సరైన సిబ్బంది ఉండాలి. సమావేశాలకు అధికారిక కార్యాలయం లేకపోవడంతో సభ్యులకు సమాచార లోపం ఏర్పడుతోంది. కనీసం వీరికి కాన్ఫరెన్స్ హాల్‌, రికార్డ్స్ రూమ్‌తో పాటు 15 మంది సహాయక సిబ్బంది అవసరం. 
76 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్య 
ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ మోసాల వలన 76 మంది బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. న్యాయం జరుగుతుందో లేదోనన్న మీమాంసలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారికి న్యాయం చేసే దిశగా.. జుడిషియల్‌ కమిటీకి పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

08:08 - March 27, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని నాగోల్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో 250మంది పోలీసులతో తనిఖీలు చేపట్టి.. ఏడుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 15 బైకులు, ఒక డీసీఎం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 
 

 

08:03 - March 27, 2016

ఓ సినిమా ప్రారంభం అవుతుందంటే ఆ సమయంలో జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా.. సదరు చిత్రానికి పని చేసే ప్రతి ఒక్కరూ కలిసే వేదికగా ప్రారంభోత్సవం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు టాలీవుడ్‌లోనూ అటు బాలీవుడ్‌లోనూ గుమ్మడికాయ ఫంక్షన్‌ అంటూ చేస్తున్నారు. సినిమా పూర్తయ్యాక గుమ్మడి కాయ కొట్టడం అనేది మన తెలుగువారి సంప్రదాయం. ఇదే సంప్రదాయాన్ని ట్రెండ్‌కి అనుగుణంగా బాలీవుడ్‌ కూడా ఫాలో అవుతోంది. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయిన తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ పాల్గొని కేక్‌ని కట్‌ చేస్తారు. తాజాగా ఇటువంటి సన్నివేశమే 'సరబ్‌జీత్‌' సెట్‌లో జరిగింది. సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా నటీనటులతోపాటు యూనిట్‌ సభ్యులందరూ కేక్‌ని కట్‌ చేసి ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాకుండా అందరూ కల్సి సెల్ఫీలు దిగారు. ఆ సెల్ఫీలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి అభిమానులతో కూడా ఆనందాన్ని పంచుకున్నారు. టెర్రరిస్ట్ అనే నెపంతో పాకిస్తాన్‌ జైలులో మగ్గి, అదే జైలులోని సహచరుల చేతుల్లో చనిపోయిన సరబ్‌జీత్‌ అనే రైతు జీవితం ఆధారంగా 'సరబ్‌జీత్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 'సరబ్‌జీత్‌' పాత్రధారిగా రణదీప్‌హూడా నటిస్తుండగా, అతనికి భార్యగా రిచా చద్దా, అతనికి చెల్లెలుగా ఐశ్వర్యరాయ్ నటిస్తోంది. ఒమాంగ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

07:58 - March 27, 2016

'ఓ కారు వల్ల నయనతార జీవితమే టర్న్ అవుతుంది. ఆ కారుకి ఉన్న నేపథ్యం ఏమిటి?, అసలా కారెందుకు నయనతార జీవితంలోకి వచ్చిందనే అంశాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందేనని' అంటున్నారు దర్శకుడు దాస్‌ రామస్వామి. హర్రర్‌, ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఓచిత్రంలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోంది. షూటింగ్‌ మొత్తం పూర్తయిన ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'ఇదొక హర్రర్‌ ప్రధాన చిత్రం. ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంలో ఓ కారు కూడా ముఖ్య భూమికని పోషించింది. అయితే ఇది దెయ్యమా లేక మరేంటి అనేది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. 'మాయ' తర్వాత నయనతార అత్యద్భుతంగా నటించిన చిత్రమిది' అని చెప్పారు.

07:55 - March 27, 2016

అల్లు అర్జున్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ త్రెస్సా హీరోహీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సరైనోడు'. ఈచిత్రం గురించి అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే తాజాగా రిలీజ్‌ చేసిన హీరోయిన్‌ అంజలి, అల్లు అర్జున్‌ డాన్స్‌స్టెప్‌తో 'బ్లాక్‌బస్టర్‌..' సాంగ్‌ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇతర పాటలను కూడా అదే రేంజ్‌లోనే సంగీత దర్శకుడు తమన్‌ అందించారు. ఈ ఆడియోని ఏప్రిల్‌ 1న డైరెక్ట్ గా మార్కెట్‌లోకి విడుదల చేసి, ఏప్రిల్‌ 10న విశాఖపట్నంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ 22న విడుదల చేస్తున్నాం. అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఆ అంచనాలను రీచ్‌ అవుతుందని ఆశిస్తున్నాం. ఇందులో బన్నీని చాలా కొత్తగా దర్శకుడు బోయపాటి ప్రజెంట్‌ చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్టేజ్‌ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ల అందాలు, తమన్‌ సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి' అని అన్నారు.

హైదరాబాద్ లో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని నాగోల్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 250మంది పోలీసులతో తనిఖీలు చేపట్టి.. ఏడుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో దారుణం...

కరీంనగర్‌ : జిల్లాలోని కమలాపూర్‌ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆరు బయట నిద్రిస్తున్న గ్రామానికి చెందిన కొండం మహేందర్‌రెడ్డి(46)పై అతడి మామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహేందర్‌రెడ్డిని వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఆస్తి వివాదాలే కారణమని గ్రామస్థులు పేర్కొన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

07:45 - March 27, 2016

హైదరాబాద్ : వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ నుంచి వలసల పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరగా... తాజాగా మరికొందరు శాసనసభ్యులు కూడా సైకిలెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ శాసనసభా పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూతోపాటు  మరికొందరు ఎమ్మెల్యేలు జగన్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇప్పుడు పార్టీలో  ఈ విషయమే హాట్‌ టాపిక్‌గా మారింది. 
వైసీపీకి ఎదురు దెబ్బలు
వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ  ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు అధికార టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే జగన్‌కు అత్యంత సన్నిహితుడైన నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డితోపాటు, ఆయన కుమార్తె   టీడీపీలో చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన పాలపర్తి డేవిడ్‌ రాజుతోపాటు మరికొందరు పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. 
జ్యోతుల పార్టీ మారే యోచనకు కారణాలు
జ్యోతుల నెహ్రూ పార్టీ మారే యోచనకు చాలా కారణాలున్నాయి. కేబినెట్‌ హోదా ఉండే అసెంబ్లీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఆయన ఆశించారు. మొదట్లో ఈ పదవిని భూమా నాగిరెడ్డికి కట్టబెట్టారు. ఈయన పార్టీ మారిన తర్వాతైనా తనకు పీఏసీ చైర్మన్‌ పదవి వస్తుందని జ్యోతుల నెహ్రూ ఆశించారు. కానీ ఈసారి కూడా ఈ పదవిని కర్నూలు జిల్లా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కట్టబెట్టడంతో జ్యోతుల నెహ్రూకు ఆశాభంగం ఎదురయ్యింది. వైపీసీకి విశ్వాసంగా పనిచేసినా, జగన్‌ను నమ్ముకున్నా లాభంలేదనుకున్న జ్యోతుల నెహ్రూ... సైకిల్‌ ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని అటు టీడీపీతోపాటు, ఇటు వైసీపీలో చర్చ జరగుతోంది. 
నెహ్రూ వైసీపీని వీడితే... పార్టీకి తీరని నష్టం
ఉభయ గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడితే.... పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి సరైన పట్టులేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు.  కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ, వరుపు సుబ్బారావు వైసీపీకి రాజీనామా చేసి... టీడీపీలో చేరితే.. పార్టీ పట్ల కాపుల్లో విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాపులు వైసీపీకి చేరువవుతున్న తరుణంలో... ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయోనన్న ఆందోళన పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. 
వైసీపీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు 
రాయలసీమ జిల్లాలకు చెందిన ఒకరిద్దరు వైసీపీ  ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పీఏసీ చైర్మన్‌ పదవి ఆశించిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా ఒకటి రెండు రోజుల్లో  పసువు కండువా కప్పుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.  మొత్తానికి పీఏసీ చైర్మన్‌ పదవి వ్యవహారం వైసీపీలో పెద్ద ఎత్తున్న చిచ్చు రేపుతూ భారీ వలసలకు బాటలు వేస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

 

07:31 - March 27, 2016

చిత్తూరు : తిరుమల పుష్కరిణిలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం లభ్యం అయింది. భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సివుంది. ఇటీవలే తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా వ్యక్తి పుష్కరిణిలో పడి మృతి చెందారేమోనని భావిస్తున్నారు. 

తిరుమల పుష్కరిణిలో మృతదేహం లభ్యం

చిత్తూరు : తిరుమల పుష్కరిణిలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం లభ్యం అయింది. భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సివుంది. ఇటీవలే తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా వ్యక్తి పుష్కరిణిలో పడి మృతి చెందారేమోనని భావిస్తున్నారు. 

నేడు బీసీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం

హైదరాబాద్ : నేడు బీసీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బీసీల సమస్యలపై చర్చించనున్నారు.

07:11 - March 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్‌-2, కానిస్టేబుల్స్ పరీక్షలు రెండు నెలలు వాయిదా పడ్డాయి. గ్రూప్‌-2 పరీక్షల్లో పోస్టుల సంఖ్యను పెంచేందుకే పరీక్షలను వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే ఎస్సై పరీక్షల్లో ఇంగ్లీష్‌ వెయిటేజీని కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ రద్దు 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలపాటు వాయిదా పడ్డాయి. వీటితో పాటు కానిస్టేబుల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
పోస్టుల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం   
గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని... ప్రస్తుతం ఉన్న 439 పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి గత కొంత కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో పాటు సిలబస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం... తదితర అంశాలతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై పరీక్షల్లో ఇంగ్లీష్‌ వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్‌లో ఎక్కువ ప్రావీణ్యం లేకపోవడంతో ఎస్‌ఐ పరీక్షల్లో నష్టపోతున్నారని.. అందుకే ఇంగ్లీష్‌ వెయిటేజ్‌ను తొలగిస్తున్నట్లు సమాచారం.

 

07:04 - March 27, 2016

హైదరాబాద్ : రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించేలా అధికారులు నిరంతరం శ్రమించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న పేదల గృహ నిర్మాణ పథకానికి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి 
రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉన్నతాధికారుతో ఉన్నస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో చేపట్టే జన్మభూమి కార్యక్రమంతోపాటు, పేదల గృహ నిర్మాణ పథకం అమలుపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 
ఏప్రిల్‌ 14న 5.80 లక్షల ఇళ్లకు శంకుస్థాపన 
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న  ఒకే రోజు 5.80 లక్షల పేదల గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం అమలుపై  అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికే పూర్తి చేసిన ఇళ్లను  అదే రోజు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇళ్లు అనే లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. 
వార్షికాభివృద్ధి రేటు లక్ష్యసాధన రేటు 15 శాతం 
రాష్ట్ర వార్షికాభివృద్ధి రేటును ఏటేటా పెంచుతూ  15 శాతం ఉండాలన్న లక్ష్యసాధనకు అందరూ శ్రమించాలని చంద్రబాబు కోరారు. అభివృద్ధికి ఇదే గీటురాయని అధికారుల దృష్టికి తెచ్చారు. సానుకూల దృక్పథంతోనే ఇది సాధ్యమని సూచించారు. రాష్ట్రం సుస్థిర అభివృద్ధి చెందేలా ప్రాధాన్యతా ప్రతి శాఖకు, ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు. వార్షికాభివృద్ధి రేటులో ఏపీ కంటే  ముందున్న రాష్ట్రాలను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహ రచన చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర విభజన తర్వాత 16 వేల కోట్ల రెవిన్యూ లోటు ఉంటే కేంద్రం 2,300 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. విద్యుత్‌ లోటును అధిగమించి, మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దిన అంశాన్ని ప్రస్తావించారు. 
సాగునీటి పారుదల రంగానికి ప్రాధాన్యత 
జనాభాలో ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందు కోసం నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు, మార్కెటింగ్‌ వివరాలపై ప్రత్యేక యాప్‌ను రూపొందించి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే దష్పచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలను చైతన్యతుల్ని చేసే బాధ్యత  ఉన్నతాధికారుపై ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భేషజాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలన్న చంద్రబాబు... టెకాలజీని ఉపయోగించుకుని కష్టపడి పనిచేస్తే రాష్ట్రాభివృద్ధిని ఏ శక్తులు ఆపలేవని అన్నారు.  

06:59 - March 27, 2016

హైదరాబాద్ : తెలంగాణా శాసనసభా నిర్వహణపై ఆదివారం స్పష్టత రానుంది. గతంలో నిర్ణయించిన ప్రకారం శాసనసభను 29 వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే....ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టులపై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనే యోచనలో ఉండడంతో ..సమావేశాలను మరో రెండు రోజులు పెంచే అవకాశం కనిపిస్తోంది.
ఈ నెల 31 వ తేదీ వరకు టీఅసెంబ్లీ...? 
తెలంగాణ శాసనసభా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 వ తేదీ వరకు జరిగేలా కనిపిస్తున్నాయి. 29 వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికార పార్టీ భావించిన మరో రెండు రోజులు పెంచేందుకు   అధికార పక్షం మొగ్గు చూపుతోంది. ఇందుకు గాను నేడు బీఏసీ సమావేశం నిర్వహిస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఈ మీటింగ్ లో చర్చించి పొడిగించడానికి ప్లాన్ వేస్తోంది. 
బడ్జెట్  పద్దులపై  చర్చ, ఆమోదంపై సమావేశం
చర్చలతో విపక్ష పార్టీలను ఆత్మరక్షణలో పడవేస్తున్న గులాబి దళం ఇదే దూకుడును సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్  పద్దులపై చర్చ,  ఆమోదం తదితర అంశాలపై చర్చించేందుకు బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తోంది సర్కార్. విపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్లను అంగీకరిస్తూనే తమ.. విధానాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ సర్కార్. విద్యా విధానం, కరువు అంశాలపై చర్చించడంతో పాటు..  31 వ తేదీ ముఖ్యమంత్రి జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
అందులో భాగంగానే  రెండు అంశాలను షార్ట్ డిస్కషన్ లో తీసుకునేందుకు సిద్ధమవుతోంది సర్కార్ . ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్ని బీఏసీలో ఆమోదం పొందితే..  ఈ నెల 31 వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి.

 

నేడు జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

నేడు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్

మొహాలీ : టీ.20వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మొహాలీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు వెస్టిండీస్-అఫ్గానిస్తాన్ మ్యాచ్

నాగపూర్ : టీ.20వరల్డ్ కప్ లో భాగంగా నేడు వెస్టిండీస్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. నాగపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం

ఢిల్లీ : నేడు ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని ఆయన మనసులోని మాటలను ప్రజలకు చెబుతారు. ఈ కార్యక్రమం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. 

Don't Miss