Activities calendar

29 March 2016

వీసీని సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమం - విద్యార్థులు..

హైదరాబాద్ : వీసీని సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్ సీయూ విద్యార్థులు పేర్కొన్నారు. చర్లపల్లి జైలు నుండి 25 మంది విద్యార్థులు, ఇద్దరు ఆచార్యులు విడుదలయ్యారు. రేపటి నుండి ఉద్యమ కార్యచరణ మొదలు పెడుతామన్నారు.

21:32 - March 29, 2016

ఢిల్లీ : ఆఫ్గనిస్తాన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ షెహజాద్‌...తన బ్యాటింగ్‌తో ఎంతలా అభిమానులను అలరిస్తాడో అందరికీ తెలిసిందే. వెస్టిండీస్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ జట్టు సంచలన విజయం సాధించడంతో..డ్వేన్‌ బ్రావో పాడిన చాంపియన్‌ పాటకు స్టెప్పులేసి సందడి చేశాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం హోటల్‌ రూమ్‌లో కరీబియన్ బుల్‌ క్రిస్‌ గేల్‌, కెప్టెన్‌ డారెన్‌ శామీలతో కలిసి మరోసారి చాంపియన్‌ సాంగ్‌కు...ఎనర్జిటిక్‌ స్టెప్పులేసి షెహజాద్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

21:29 - March 29, 2016

ఈజిప్టు : ఎంఎస్‌ 181 విమానం ఈ ఉదయం హైజాక్‌కు గురైంది. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 82 మంది ప్రయాణీకులు ఉన్నారు. కొన్ని గంటలు గాల్లో ప్రయాణించిన తర్వాత హైజాకర్లు విమానాన్ని సైప్రస్‌లోని లానాక‌ ఎయిర్‌పోర్టులో దింపారు. తమ డిమాండ్లను చెప్పకుండానే.. విమానంలోని స్త్రీలు, పిల్లలను వదిలేస్తున్నట్లు ఏటీసీకి సమాచారమిచ్చాడు. అయితే కొద్దిసేపటికే.. ఏడుగురు మినహా అందరినీ వదిలేశాడు.

ఆశ్చర్యం..
తొలుత ఉగ్రవాదుల ముఠా ఈ దురాగతానికి పాల్పడ్డట్లు అంతా భావించారు. అయితే.. హైజాకర్‌ ఒక్కడే అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అంతకు మించి హైజాక్‌కు అతను చెప్పిన కారణం విని అందరూ అవాక్కయ్యారు. సైప్రస్‌లోని మాజీ భార్యతో కలిసి జీవించాలన్న ఉద్దేశంతోనే.. ఈ చర్యకు పాల్పడ్డట్లు హైజాకర్‌ ఇబ్రహీం సమాహ్‌ తెలిపాడు. ఈమేరకు అతను విమాన సంస్థకు ఓ లేఖను పంపాడు. హైజాక్‌కు కారణం తెలియగానే.. విమానసంస్థతో పాటు.. ప్రభుత్వమూ ఇబ్రహీం మాజీ భార్యను విమానాశ్రయానికి రప్పించారు. చివరికి హైజాకర్‌ ఇబ్రహీం పోలీసులకు లొంగిపోవడంతో హైజాక్‌ కథ సుఖాంతమైంది. 

21:27 - March 29, 2016

ఉత్తరాఖండ్ : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రపతి పాలనపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 31న శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని పదవీచ్యుత ముఖ్యమంత్రిని హైకోర్టు ఆదేశించింది. కేంద్రం నిరంకుశంగా వ్యవహరించి తన ప్రభుత్వాన్ని కూల్చిందని.. కేంద్ర నిర్ణయాన్ని రద్దు చేయాలని రావత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్రపతి పాలనపై తాత్కాలికంగా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెలలుగా ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి.. సెగలు కక్కతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో 356 అధికరణ ప్రయోగానికి సంకల్పించింది. దీన్ని సవాల్ చేసిన హరీశ్‌ రావత్‌కు ఉన్నత న్యాయస్థానంలో ఊరట కలిగింది. రావత్ సర్కార్‌ విశ్వాసపరీక్షలో నెగ్గేది లేనిది మార్చి 31 న తేలనుంది. 

21:25 - March 29, 2016

కర్నూలు : జిల్లాలో పాత కక్షలు పడగ విప్పాయి. ఇవి టీడీపీలో ముఠా పోరును బట్టబయలు చేశాయి. నంద్యాలలో టీడీపీ లీగల్‌ అడ్వైజర్‌ తులసిరెడ్డిపై హత్యాయత్నం.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతోనే హత్యా రాజకీయాలకు తెర లేచిందని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఆరోపించారు. అయితే దీన్ని భూమా తోసిపుచ్చారు. ప్రత్యర్థులు కంట్లో కారం చల్లి తులసిరెడ్డిని ఇనుమ రాడ్లతో మోది హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తులసిరెడ్డికి ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స జరుగుతోంది. నంద్యాల మండలం కొత్తపల్లికి చెందిన తులసిరెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. 2014 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ తరపున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేస్తే, వైకాపా తరపున భామానాగిరెడ్డి పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు స్థానికంగా చక్రం తిప్పడం మొదలు పెట్టారు. ఈక్రమంలో భూమా టీడీపీలో చేరడంతో సమస్య మొదలైంది. తాజాగా టీడీపీ లీగల్‌ సెల్‌ అడ్వయిజర్‌ తులసిరెడ్డిపై హత్యాయత్నానికి భూమాయే కారణమని శిల్పామోహన్‌రెడ్డి బాహాటంగానే విమర్శించారు.

ఎనిమిది మందిపై కేసు..
జిల్లాలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో శిల్పామోహన్‌రెడ్డి, బాధితుడి కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తమ వాదనను వినిపించి భూమాను కట్టడి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే భూమా నాగిరెడ్డి మాత్రం.. తులసీరెడ్డిపై దాడికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు... తులసీరెడ్డిపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న కర్నూలు జిల్లా పోలీసులు.. దీనిపై విచారణ ప్రారంభించారు. గ్రామంలోని పాతకక్షలే ఈ దాడికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ దాడికి సంబంధించి పోలీసులు కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలవెంకటరెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. 

21:21 - March 29, 2016

హైదరాబాద్ : యూనివర్సిటీల చట్ట సవరణ, ఎమ్మెల్యేల వేతనాల పెంపు సహా పలు కీలక బిల్లులను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ప్రజాప్రతినిధుల జీతాల పెంపు బిల్లుకు సభ్యులందరూ మద్దతు ఇచ్చారు. యూనివర్శిటీల చట్ట సవరణపైమాత్రం సభలో హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ వ్యతిరేకించినా మూజువాణి ఓటుతో సభ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం లక్షలోపున్న ఎమ్మెల్యేల వేతనాలు రెండు లక్షల 58 వేల రూపాయలకు పెరుగుతాయి. మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్‌ మొత్తాన్ని కూడా పెంచాలని సభ్యులు ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలకు ఇంటి అలవెన్సులు, కారు లోన్‌ను పెంచాలని బీజేపీ కోరింది.. ఈ బిల్లును సభ యధాతథంగా ఆమోదించింది. ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల మొత్తాన్ని కోటిన్నర నుంచి మూడు కోట్లకు పెంచాలని కూడా సభ నిర్ణయించింది. కాంగ్రెస్‌ సభ్యుడు జానారెడ్డి చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే జానా కోరినట్లు ఐదు కోట్లు కాకుండా.. మూడు కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిర్ణయానికి సభ ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది.

యూనివర్సిటీల బిల్లుపై చర్చ...
యూనివర్శిటీల చట్ట సవరణ బిల్లుపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. యూనివర్శిటీలకు ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ తెచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ వ్యతిరేకించాయి.. కేసీఆర్‌ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సభ్యులు ఒప్పుకోలేదు.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సభనుంచి వాకౌట్ చేసింది. అనంతరం బిల్లును మూజువాణీ ఓటుతో సభ ఆమోదించింది. మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్ల బిల్లునూ సభ ఆమోదించింది. మార్కెట్‌ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లులో మహిళలకూ రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది.. దీనికి సీంఎం కేసీఆర్‌ వెంటనే అంగీకరించారు.. 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరించిన బిల్లును ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.

21:19 - March 29, 2016

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. జగన్‌, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా సీఎం శాసనసభలో ప్రకటన చేశారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏడాదిలోపే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయిన సందర్భంగా సీఎం సభలో ప్రకటన చేశారు. 2019 మార్చి 29 కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజ్టెకుకు ప్రతిపక్ష నేతలు రాక్షసుల్లా అడ్డుపడ్డారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటన అనంతరం మాట్లాడిన జగన్‌... పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజీ సామర్థ్యం లేదన్నారు. నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోయినా 1600 కోట్ల రూపాయలు మట్టిపాలు చేశారని మండిపడ్డారు.

భయపడనన్న బాబు..
జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌ సబ్జెక్ట్‌ నేర్చుకొని మాట్లాడితే మంచిదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. లేకపోతే ప్రతిపక్ష సభ్యులను బలవంతగానైనా బడికి పంపించి సాగునీటి పాఠాలను నేర్పించాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచినా సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని జగన్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా చంద్రబాబు, జగన్‌ల మధ్య వాడివేడి చర్చ జరిగినా.. మధ్య మధ్యలో నేతలు వేసిన జోకులు సభను ఆహ్లాదపరిచాయి. ఇరు పక్షాల సభ్యులనూ నవ్వుల్లో ముంచెత్తాయి. 

21:17 - March 29, 2016

హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. బిల్లుపై సభ్యుల సందేహాలకు సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు.. లక్ష ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చర్చలోభాగంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రైతుల సమస్యలను ప్రస్తావించారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, కరువు మండలాల ప్రకటన సరిగాలేదని విమర్శించారు. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు..ఆ తర్వాత సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టులపై ఈ నెల 31న అసెంబ్లీలో పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పారు. అలాగే తెలంగాణలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరతామని కేసీఆర్‌ తెలిపారు. గ్రూప్స్ కు సంబంధించి వెయ్యి ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. పదివేల టీచర్‌ పోస్టుల భర్తీ ప్రకటన విడుదల చేస్తామని వివరించారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమిని ఎప్పటిలోగా పంపిణీ చేస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేటాయింపులకు తగినంత ఖర్చులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

21:15 - March 29, 2016

హైదరాబాద్: అంబేద్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. గిరిజనులు, దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ అనంతరం అంబేద్కర్‌ జయంతిపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్‌, చంద్రబాబు మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, ఉపాధి హామీ నిధులపై ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ ఏడాది అంతా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ,ఎస్టీ గ్రామాలన్నిటికీ 2018 లోగా సిమెంట్‌ రోడ్లు వేస్తామని తెలిపారు.

నిధులు ఖర్చు చేయడం లేదన్న జగన్..
పేదల జీవితాలను మార్చేందుకు అంబేద్కర్‌ కృషిచేశారని విపక్ష నేత జగన్‌ అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఇతర అభివృద్ది పథకాలకు మళ్లించడం సరికాదని జగన్‌ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని రావెల కిషోర్‌బాబు, అ అన్నారు. ఆయనపై చర్చను సాగకుండా జగన్‌ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై జగన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చర్చ ముగిసిన తర్వాత.. జాతీయ అవార్డులు సాధించిన బాహుబలి, కంచె చిత్రాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక సిబ్బందిని సభ అభినందించింది. అనంతరం సభను స్పీకర్‌ బుధవారానికి వాయిదా వేశారు. 

హెచ్ సీయూ పరిస్థితిలు వివరించాం - షిండే..

ఢిల్లీ : సోనియా, రాహుల్ తరపున తాము రాష్ట్రపతిని కలవడం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి షిండే పేర్కొన్నారు. హెచ్ సీయూలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించడం జరిగిందని, రోహిత్ వేముల చనిపోయి రెండు నెలలవుతున్నా యూనివర్సిటీలో పరిస్థితులు మారలేదని తెలియచేసినట్లు పేర్కొన్నారు. హెచ్ సీయూ ఘటనపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరడం జరిగిందని, వీసీపై పోలీసులు, హెచ్ఆర్డీ మంత్రి చర్యలు తీసుకోలేదన్నారు. 

రాష్ట్రపతితో కాంగ్రెస్ సీనియర్ల బృందం..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ సీనియర్ల బృందం భేటీ అయ్యింది. హెచ్ సీయూ ఘటన, ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మల్లిఖార్జునఖర్గే ఆధ్వర్యంలో బృందం రాష్ట్రపతిని కలిసింది. 

సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : జిల్లాల అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సమస్య, పశుగ్రాసం కొరత, ఉపాధి హామీలపై సమీక్ష నిర్వహించారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎండవేళల్లో ఉపాధి పనులు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

 

ప్రియురాలిని అరెస్టు చేయాలంటూ బంధువుల ఆందోళన..

విశాఖపట్టణం : అరిలోవ పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రియురాలు మోసం చేసిందని సోమవారం పార్థసారధి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియురాలిని అరెస్టు చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టిడిపి ఆవిర్భావ సభ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టిడిపి ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

 

20:24 - March 29, 2016

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం.. కానీ, ఒక్క కలంపోటుతో రాత్రికి రాత్రి రద్దు చేయటం ఎంతవరకు సరైన నిర్ణయం..? రాష్ట్రాల్లో విపక్షాలు అధికారంలో ఉండటం ఎంతమాత్రం సహించలేని బిజెపి ఎన్ని అడ్డదారులనైనా ఆశ్రయిస్తోందా? అడ్డొచ్చిన రాజ్యాంగం, నైతిక విలువలు, సహజ న్యాయ సూత్రాలు అన్నింటినీ చుట్టచుట్టి తుంగలో తొక్కుతోందా? వరుసగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి? తాజాగా ఉత్తరాఖండ్ సంక్షోభం ఏ సంకేతాలిస్తోంది? దీనిపై ప్రత్యేక కథనం. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారా? రాష్ట్రాల హక్కుల గొంతు నులుముతున్నారా? బలపరీక్షకు కొంచెం ముందు రాష్ట్రపతి పాలన విధించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హైకోర్టు స్టేతో ఉత్తరాఖండ్ పరిణామాలు చక్కబడతాయా?

అవకాశం ఎదురు చూపు..
అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడేందుకు ప్రయత్నాలు జరిగాయా? ఉత్తరాఖండ్ లో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినప్పటి నుంచీ రావత్ సర్కార్ అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగానే కొనసాగిందని కేంద్రం వాదిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం రావత్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైతే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందనే వాదనల్లో నిజమెంత? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కాంగ్రెస్‌ రెబల్స్ పై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో సీన్ మారిందా? రావత్‌ సభ విశ్వాసం పొందడం ఖాయమైనందున బిజెపీ ఈ ఎత్తుగడ వేసిందా? తనకు దక్కని పీఠం కాంగ్రెస్‌కు దక్కకూ డదన్న దురుద్దేశంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిందా? కాంగ్రెస్‌ కంటే భిన్నమైన పార్టీ అని, ప్రత్యామ్నాయం కూడా తామేనని మోడీ పరివారం ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ కంటే కూడా దిగజారి ప్రవర్తిస్తోందా?

గురువారం తేలనున్న కాంగ్రెస్ భవితవ్యం..
రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగా గానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కానీ, రాజ్యాంగంలోని ఈ 356 అధికరణం వివాదాస్పదం గా ఎందుకు మారుతోంది? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారా?  ఫెడరల్ రాజ్యంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలి. అంతే కానీ, కక్ష్య సాధింపుతో రాష్ట్రాల గొంతు నులమటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉత్తరాఖండ్ లో సరైన కారణాలు లేకుండానే రాష్ట్రపతి పాలన విధించినట్టు పరీశీలకులు భావిస్తున్నారు. ఆఖరికి హైకోర్ట్ జోక్యంతో ఈ అంశం ఓ మలుపు తిరిగింది. ఏది ఏమైనా గురువారం జరిగే విశ్వాస తీర్మానంలో ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ భవితవ్యం, బీజెపీ ఎత్తుగడల పలితం తేలనుంది. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:10 - March 29, 2016

కడ్పులు సల్లగుండ.. ఓదిక్కు ఎండలు గొట్టి.. పంటలు ఎండిపోయి కర్వు కతర్నాక్ గ డ్యాన్సు జేస్తుంటే జనం ఏడ గూడ కాంప్రమైజ్ అయితలేరు.. పైస పుట్టువడే లేదు జనంతాన అనుకుంటున్నంగని.. తినెకాడ తాగెకాడ మాత్రం తక్లీవ్ లేకుంట దింటున్నరట.. ఈ ఎండకాలంల వైన్సు దుక్నాల పొంట జనం కిటకిటలాడుతున్నరట.. అన్ని బీరకాయలే గొంచవోతున్నరట.. ఎంత తాగుతున్నరో..లెక్కలు తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి.

20:10 - March 29, 2016

ఏం పాడో మనమీద వడవట్టే.. ఎట్ల మండుతున్నయుల్లా ఎండలు..పైస పుట్టువడే లేదు జనంతాన అనుకుంటున్నంగని.. తినెకాడ తాగెకాడ మాత్రం తక్లీవ్ లేకుంట దింటున్నరట..పైకం కోసం మాత్రం ఏది దినుమన్న తినెతట్టు తయ్యారైండ్రు కొంతమంది..తెలంగాణలో సర్కారు బడుల సంరక్షణ కార్యక్రమం..దూపైతుందిరా వారీ అంటె జర్రాగు బాయి తొవ్వుతున్నా అన్నడట ఎన్కటికి ఎవ్వడో... అగో అట్లనే అనిపిస్తున్నది మన ప్రభుత్వాల పనితనం జూస్తుంటే..కూలినాలి సంగతి అటువెడ్తె అస్సల్ కష్టాల్ సుర్వైనయి అడ్విబిడ్డలకు..ఇంతిత దొడ్డున్న ఇన్ప శీకుల ఈపుల కడ్పుల కుచ్చుతె ఎట్లుంటదుల్లా.. శెప్తుంటె రోమాలు నిక్కపొడుస్తలేవు..ఎన్నడన్న దేవున్ని కిడ్నాప్ శెయ్యింగ సూశిండ్రా..పొద్దుగాళ్ల లేశి నాష్ట జేస్తం.. ఇడ్లో పూరో.. లేకపోతె ఇంత సలన్నం దింటం..మరి జూపార్కులున్న జంతువులు ఏం దింటుండొచ్చు.. ఈ అంశాలపై టెన్ టివిలో మలన్న ముచ్చట్లు కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో ముచ్చట్లు చెప్పిండు. ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ కొట్టండి. 

20:03 - March 29, 2016

జాతీయ ఉత్తమ చిత్రంగా 'బాహుబలి' ఎంపికవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 'ఈ సారి అవార్డులన్ని కమర్షియల్‌ చిత్రాలకే వచ్చాయి. 'బాహుబలి' మొత్తంగా చెత్త సినిమా. అయినప్పటికీ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఈ అవార్డు బిజేపీ అవార్డే తప్ప జాతీయ అవార్డు కాదు. ఈ అవార్డుల ప్రకటనే ఒక పెద్ద జోక్‌' అని పంజాబీ దర్శకుడు గురువిందర్‌ సింగ్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ పంజాబీ చిత్రంగా 'చౌత్తీకూట్‌' ఎంపికైంది. ఈ చిత్రానికి గురువిందర్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు గురువిందర్‌సింగ్‌ చేసిన కామెంట్స్ ను చాలా మంది సమర్థించడం గమనార్హం. విజువల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో 'బాహుబలి'కి అవార్డు రావడం సబబే కాని, ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడంలోనే పారదర్శకత లోపించిందని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ సమగ్రతని చాటే విధంగా రూపొందిన 'భజరంగీభాయిజాన్‌', 'కంచె' చిత్రాల్లో ఏదో ఒకదాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేస్తే బాగుండేందని అభిప్రాయపడుతున్నారు. నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి కమర్షియల్‌ చిత్రాలకు పెద్ద పీట వేసి, ప్రాంతీయ చిత్రాలను నిర్లక్ష్యం చేశారని సినీ విమర్శకులంటున్నారు.

గవర్నర్ సీఎస్ గా హర్ ప్రీత్ సింగ్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శిగా హర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. 

విండీస్ జట్టులో ఒక మార్పు..?

ముంబై : వాఖండే స్టేడియం వేదికగా టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ - వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. వెస్టిండీస్ జట్టులో ఒక మార్పు చేశారు. గాయంతో బాధ పడుతున్న ఫ్లెచర్ స్థానంలో ఆల్ రౌండర్ సిమ్మన్స్ జట్టులోకి తీసుకొనే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు వాయిదా..

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

ప్రలోభాలకు నెహ్రూ ప్రభావితం అయ్యారు - జగన్..

హైదరాబాద్ : ప్రలోభాలకు నెహ్రూ ప్రభావితం అయ్యారని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రూ.20 నుండి రూ. 30 కోట్లు ఇస్తే ఎవరైనా కాదంటారా ? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న వారికి వ్యక్తితత్వం, విశ్వసనీయత ఉండాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ము లేదని, ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. 

19:26 - March 29, 2016

విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు టి.సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రైమరీ స్కూళ్లు మొదలు యూనివర్సిటీ వరకు విద్యా విధాంలో ఉన్న లోపాలు వాటి సరిదిద్ధడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఒక్కో గ్రామ పంచాయితీకి ఒకే ప్రైమరీ స్కూల్ ఉండేలా ప్రతిపాదిస్తోంది. ఈ దిశగా పాఠశాలలతో పాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో కూడా ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశ పెట్టాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. మరి విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలి ? ప్రక్షాళన ఏ విధంగా ఉండాలి ? అనే అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), నారాయణ (టిపిఇఆర్ఎమ్) ప్రొ.హరగోపాల్ (సామాజిక విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.  

19:03 - March 29, 2016

గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల బరువు పెరుగుతున్న వారు ఎందరో. వారంతా ఇప్పుడు బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే గ్రీన్‌ టీని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ మంచి ఔషధమని ఆరోగ్యనిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే ఈ కాలంలో గ్రీన్‌ టీకి క్రేజ్‌ బాగా పెరిగింది. గ్రీన్‌ టీ ప్రస్తుతం అనేక ఫ్లేవర్స్‌లో కూడా లభ్యమవుతుంది. అయితే ఈ గ్రీన్‌ టీని పంచదార కలిపి తీసుకోవడంతో ప్రయోజనం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గ్రీన్‌ టీ మనల్ని ప్రకాశవంతంగా, ఉత్సాహాకరంగా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని చక్కెర లేకుండా తీసుకోవడమే ఉత్తమం. అంతేకాదు, గ్రీన్‌ టీకి మంచి కాంబినేషన్‌ ఏమిటంటే... కొద్దిగా నిమ్మరసం లేదా కొద్దిగా తేనె. వీటిని టీకి కలుపుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఒత్తిడి కూడా దూరమవుతుంది. గ్రీన్‌ టీతో తేనె కలిపి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఫ్యాట్‌ను కరిగిస్తుంది. క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. పంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. బరువు తగ్గడానికి వెంటనే గ్రీన్‌ టీని పంచదార లేకుండా తీసుకోవడం అలవాటు చేసుకోండి. 

19:02 - March 29, 2016

వేపచెట్టును సర్వరోగ నివారిణిగా వైద్యులు చెబుతుంటారు. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు ఇలా అన్నీ కూడా మనకు ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్‌ చేస్తే జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది.
జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి 20నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.
తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నానపెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది.
ఒక బౌల్‌లో వేపాకు ముద్దని తీసుకుని అందులో గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే.. జుట్టు సమస్యలు తొలగిపోతాయి.
వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం - కేసీఆర్..

హైదరాబాద్ : అంబేద్కర్ 125వ జయంతిని ఈసారి ఘనంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ఛత్తీస్ గడ్ లో కాల్పులు..ముగ్గురు నక్సలైట్లు మృతి..

రాయ్ పూర్ : నారాయణపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. 

ప్రాక్టిస్ చేస్తున్న మనీష్ పాండ్యా..

ఢిల్లీ : భారత క్రికెటర్ మనీష్ పాండ్యా ప్రాక్టిస్ లో నిమగ్నమయ్యాడు. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో యువీ గాయపడిన సంగతి తెలిసిందే. దీనితో వెస్టిండీస్ తో జరిగే సెమీస్ మ్యాచ్ లో యువీ ఆడడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అతని స్థానంలో పాండ్యాను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. 

16.1 శాతమే అప్పు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 16.1 శాతమే అప్పు ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెవెన్యూలో 15 శాతం వృద్ధి ఉందన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతోందని, 2019 నాటికి 2 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండబోతుందని ముందుగానే ప్రకటించారు. 24,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందని..10వేల టీచర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. గ్రూప్ 2లో మరో వేయి పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.

18:37 - March 29, 2016

హైదరాబాద్ : భారత్‌, బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక వాణిజ్య, వ్యాపార కార్యక్రమాల్లో చారిత్రక అంశానికి కృష్ణపట్నం పోర్ట్ సాక్షీభూతమైంది. దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఇరుదేశాల మధ్య మొట్టమొదటిసారిగా సముద్రమార్గంలో రవాణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తద్వారా గత సంవత్సరం ఢాకా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లైంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య తొలిసారిగా సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ నుంచి ప్రారంభమయ్యాయి. భారత దేశపు ద్వైపాక్షిక వాణిజ్య వ్యాపార కార్యక్రమాలలో చారిత్రక సందర్భానికి వేదికగా నిలిచింది కృష్ణపట్నం పోర్ట్. కోస్టల్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా ఇండియా బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యం సులభతరం చేయడానికి మొట్టమొదటి కంటెయినర్ వెసల్ కృష్ణపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించింది.

1974లో...
1974లో నాటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధి బంగ్లాదేశ్‌తో తొలుత వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని 4 దశాబ్దాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరం ఢాకా పర్యటనలో భాగంగా పునరుద్ధరించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని ఇరు దేశాలూ అనుసరించడానికి పాటించాల్సిన నిబంధనలు, విధి విధానాల గురించి గత నవంబర్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా కొన్ని నిబంధనలను సడలించారు. దాని ప్రకారం ఇరు దేశాల నౌకలు దేశీయ ఓడలుగానే పరిగణిస్తారు తప్ప విదేశీ ఓడలుగా భావించరు. ఇప్పటివరకు భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య రోడ్డు మార్గంలోనే రవాణా కార్యకలాపాలు కొనసాగాయి. అయితే అత్యంత ఖర్చుతో కూడుకున్న రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా నౌకాయానాన్ని మెరుగుపరచాలని ఇరు దేశాలు ప్రయత్నించినా ఇప్పటివరకూ ఫలితం రాలేదు. అలాంటిది మోడీ బంగ్లా పర్యటన తర్వాత ఆ ప్రయత్నాలు ఫలించాయి. గతంలో భారతీయ నౌకాశ్రయాల నుంచి బంగ్లాదేశ్‌కు రవాణా చేయాలంటే శ్రీలంక రాజధాని కొలంబో లేదా సింగపూర్‌ మార్గాల ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రత్యక్ష సేవలను ప్రారంభించడం ద్వారా రవాణాకు అయ్యే సమయాన్ని 2 నుంచి 5 రోజులకు తగ్గించినట్లైంది. దీనికితోడు వస్తువుల రవాణాకు అయ్యే ఖర్చు కూడా తగ్గనుండడంతో వినియోగదారులపై భారం కొంత తగ్గుతుంది. 

18:32 - March 29, 2016

హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్‌ సంస్థల ప్రతినిధులు ఏపీ రాజధాని అభివృద్ధి నిధికి మార్చి నెల గౌరవ వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు 7 కోట్ల 77 లక్షల 10 వేల రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. పార్టీలకు అతీతంగా అందరు సర్పంచ్‌లు, ఎంపీటీసలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్లు ఈ సహాయం చేశారు. 

ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాన్ని సీఎం బాబు ఆవిష్కరించారు.

 

18:27 - March 29, 2016

కడప : అర్థరాత్రి ఓ కిరాతకం జరిగిపోయింది...అన్యోన్యంగా ఉంటున్న దంపతులు రాక్షసుల చేతిలో బలయ్యారు..ఎదిగిన పిల్లల భవిష్యత్తు కోసం కష్టం చేసుకుంటున్న ఆ కుటుంబంపై బంధువులే పగబట్టారు..అయినవారే అంతం చేసి కసి తీర్చుకున్నారు..ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారు..ఓవైపు తల్లిదండ్రుల పోస్టుమార్టం...మరోవైపు ఆ ఇంటి బాలుడి భవిష్యత్తును నిర్ధారించే పదోతరగతి పరీక్ష...ఇంత ఘోరం జరిగినా విలవిలలాడుతున్న ఆ పసి హృదయం పరీక్ష రాసింది...స్టూడెంట్‌ పరిస్థితి చూసిన పరీక్షా పర్యవేక్షకులే కన్నీటి పర్యంతమయ్యారు. కడప మైదుకూరులోని సాయినాథపురంలో నిశిరాత్రిలో ఆ ఇంట్లో జరిగిన ఘోరం తెలియనివాడు ఒకరున్నారు. ఆ ఇంట్లోనే గాఢనిద్రలో ఉన్నాడు. తెల్లారేసరికి మేల్కొని చూసేసరికి కన్నతల్లిదండ్రులు రక్తపు మడుగులో కన్పించారు. ఆ పసిహృదయం విలవిలలాడింది. ఈ బాలుడే హత్యకు గురయిన ఆ దంపతుల గారాలపట్టి వెంకటేష్.

తల్లిదండ్రుల హత్య..
అమ్మా నాన్నలు హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో విలవిలలాడినట్లు అక్కడి ఆనవాళ్లు చెబుతున్నాయి. ఇవేం తెలియని పసివాడు కాదు..పదో తరగతి చదువుతున్న వెంకటేష్‌కు అన్నీ అర్థమయ్యాయి. అన్నింటికి మించి ఇక తనకు తల్లిదండ్రులు లేరన్న బాధ దిగమింగలేక పోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. రోదించాడు. అందరూ ఆ బాలుడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాని వారి వల్ల కాలేదు. మైదుకూరులోని టీవిఎస్‌ఎం హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న వెంకటేష్‌కు జడ్పీ హైస్కూలులో పరీక్షలు రాస్తున్నాడు. స్కూళ్లోనే చదువుకుంటూ అక్కడే పడుకున్నవాడు వెంకటేష్. తెల్లారితే గణితం పేపర్‌ ఉండడంతో ఎగ్జామ్ రాయాలి. లేదంటే ఏడాది చదివుకున్నదంతా వృధా అవుతుంది. దీంతోనే అక్కడే ఉన్న బాలుడికి కన్నవారు హత్యకు గురయ్యారని తెలిసి దుఖ్ఖం ఆగడం లేదు. కన్నవారి డెడ్‌బాడీలు చూసిన ఆ పసిహృదయం విలవిలలాడుతోంది. 

పరీక్ష రాసిన వెంకటేష్..
వెంకటేష్‌ బాధను దిగమింగుకోలేకపోయాడు. పసివాడు అమ్మానాన్నలను తలుచుకుని కృంగిపోతున్నాడు. స్కూలు కరస్పాండెంట్‌ వెంకటేశ్వర్లు బాలుడికి ధైర్యం చెప్పారు. పరీక్షా కేంద్రం వెళ్లేట్లు సహకరించాడు. కేంద్రం నిర్వాహకులు వెంకటలక్ష్మమ్మ కూడా మనోధైర్యం చెప్పి బాలుడిని పరీక్ష రాసేందుకు తోడ్పాటు అందించారు. బాలుడిని చూసిన నిర్వాహకురాలు కూడా బాధను తట్టుకోలేక కన్నీరుమున్నీరయింది. తల్లిదండ్రులు హత్యకు గురయినా పరీక్షకు హాజరైన వెంకటేష్‌కు జిల్లా విద్యాశాఖాధికారులు వెసులుబాటు కల్పించారు. అరగంట ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అరగంట సమయం అదనంగా కేటాయించారు.

18:18 - March 29, 2016

హైదరాబాద్ : గిరిజనులు, దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ,ఎస్టీ గ్రామాలన్నిటికీ 2018 లోగా సిమెంట్‌ రోడ్లు వేస్తామని చెప్పారు. ఏడాదిలోగా అన్ని గ్రామాలకు ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా రక్షిత మంచినీరు సౌకర్యం కల్పిస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియం విశాఖలో పెట్టడం జరుగుతుందని బాబు పేర్కొన్నారు.

గిరిజనుల హక్కును కాలరాస్తున్నారు - జగన్..
పేదల జీవితాలను మార్చేందుకు అంబేద్కర్‌ కృషిచేశారని విపక్ష నేత జగన్‌ అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. సబ్‌ప్లాన్‌ అనేది దళితులు, గిరిజనుల రాజ్యాంగపరమైన హక్కు అని జగన్‌ అన్నారు. ఆ హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. సబ్‌ ప్లాన్‌ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఇతర అభివృద్ది పథకాలకు మళ్లించడం సరికాదని జగన్‌ అన్నారు.

 

18:13 - March 29, 2016

హైదరాబాద్ : అంబేద్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా సభలో సీఎం ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది అంతా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతామని, అమరావతిలో 15 ఏకరాల భూమి కేటాయించి అంబేద్కర్ స్మృతి భవనం ఏర్పాటు చేస్తామని బాబు సభలో చెప్పారు. 

ఈజిప్టు విమానం హైజార్ అరెస్ట్.....

హైదరాబాద్ : ఈజిప్టు విమానం హైజాక్ కథ సుఖాంతమయ్యింది. ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం సమాహాను సైప్రస్ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. నేటి ఉదయం అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. విమానం హైజాక్ అయ్యిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. సైప్రస్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికి ఐదుగురు విదేశీ ప్రయాణికులు, విమాన సిబ్బంది మినహా మిగిలిన వారందరినీ హైజాకర్ వదిలిపెట్టేశాడు. ఈ క్రమంలో తన భార్యను తీసుకువచ్చి, తనకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశాడు.

బాహుబలి, కంచె చిత్ర బృందాలకు అభినందనలు : ఏపీ అసెంబ్లీ

హైదరాబాద్ : బాహుబలి, కంచె చిత్ర బృందాలకు అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు సభలో చదివి వినిపించారు. తెలుగు జాతి గర్వించేలా తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని అద్భుత చిత్రాలు రూపొందించాలని ఈ సందర్భంగా స్పీకర్‌ ఆకాంక్షించారు. ‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ప్రతిభలో తెలుగువాళ్లు ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదని దర్శకులు రాజమౌళి, క్రిష్ లు, నిరూపించారన్నారు.

నిర్మాత జయకృష్ణ మృతి...

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జయకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. మేకప్‌మెన్‌గా కెరీయర్ ప్రారంభించిన జయకృష్ణ ‘మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు, సీతారాములు, కృష్ణార్జునులు, వివాహభోజనంబు’ వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన చివరిగా నిర్మించిన సినిమా దాసు. అతని ఏకైక‌ కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపిన విష‌యం తెలిసిందే. 

17:33 - March 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, పెత్తందారులకు కొమ్ముకాస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.తెలంగాణ బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25వేల కోట్లు కేటాయించడం హర్షణీయమే కానీ దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పుడో పూర్తయ్యే ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు.

 

ఏపీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అంబేద్కర్‌ జయంతి రోజున 6లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 

17:29 - March 29, 2016

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పీఎంజీఎస్ వై కింద రూ. 3వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని, రోడ్ల అనుసంధానికి 172 బ్రిడ్జీలను ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. 172 బ్రిడ్జీలకు మరో రూ. 5 వందల కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరడం జరిగిందని, దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవాలని, ఇందుకు ప్రతిపాదనలు తీసుకరావాలని సూచించారని తెలిపారు. 

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి తుమ్మల

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో జల వివాదంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ...పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రాజెక్టులపై 31న పూర్తి వివరణ ఇస్తామని తెలిపారు. 

17:18 - March 29, 2016

హైదరాబాద్ : పేద ప్రజలకు లక్ష ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తామే స్థలం సమకూర్చి ఈ పని పూర్తి చేస్తామని ప్రకటించారు... అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలనుకూడా ఉపయోగించుకొని ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని అసెంబ్లీలో చెప్పారు.

ప్రాణహిత-చేవెళ్ల అదనపు ఖర్చుతో ప్రభుత్వానికి భారం : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : జల విధానంపై టీ.అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై పెట్టిన అదనపు ఖర్చుతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.మహారాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టులపై ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై 400 ల అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టులను తొలగించాలని మహారాష్ట్ర ప్రభత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

17:11 - March 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. గిరిజనులకు విద్య, వైద్యం మెరుగు పరచాల్సినవసరం ఉందని, 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని..స్పెషల్ డీఎస్సీ చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టం అమలు జరపాలని, పెరుగుతున్న ధరలకునుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో గుడ్డు కేటాయించాలని..జీవ నెంబర్ 141 పునరుద్ధరించాలి...25వేల మంది వీఆర్ఏ లు ఉన్నారని, వీరికి కనీస వేతనం 15వేలు ఇవ్వాలని..గ్రామం పంచాయతీల వేతనాలు పెంచాలని..ఆశా వర్కర్లు గౌరవ వేతనం ఇవ్వడం లేదని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెండింగ్ వేతనాలివ్వాలన్నారు. ఐకేపీలు 24లవేల మంది ఉన్నారని, ఐదు వేల రూపాయలిస్తామని చెప్పి ఇవ్వడం లేదని సభకు తెలిపారు. వెంటనే అమలు చేయించాలని రాజయ్య కోరారు. 

టీ.స్పీకర్ కు కాంగ్, టీడీపీల లేఖ....

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో స్పీకర్ మధుసూధనాచారికి కాంగ్రెస్, టీడీపీలు లేఖ రాశాయి. జల విధానంపై ప్రభుత్వానికి సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతినిస్తే...తమకు కూడా అనుమతినివ్వాలని లేఖలో కోరారు. 

ఏపీ కి షాక్ ఇచ్చిన క్యాట్ .…

హైదరాబాద్ : గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన సోమేశ్  కుమార్ తో పాటు 11 మంది ఐఏఎస్ లు, నలుగురు ఐపీఎస్ లు ఏపీకి కేటాయించడాన్ని క్యాట్ కొట్టివేసింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)లో ఏపీకి షాక్ కిచ్చింది. తెలంగాణలోనే కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్న ఐఏఎస్ అధికారులకు క్యాట్ తీర్పుతో ఊరట లభించింది. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ విభజన చట్టం ప్రకారం ఏపీ కేడర్ కు వెళ్లాల్సివుండగా కేసీఆర్ ప్రభత్వం ఆయనను రిలీవ్ చేయలేదు.

16:41 - March 29, 2016

హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏడాదిలోపే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో మంగళవారం ప్రకటన చేశారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. 2019 మార్చి 29 కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజ్టెకు ప్రతిపక్ష నేతలు రాక్షసుల్లా అడ్డుపడ్డారని మండిపడ్డారు. జూన్ నెలలో నీళ్లు వస్తాయని, అసూయతో బాధ పడే పరిస్థితి వస్తుందని వైసీపీనుద్ధేశించి వ్యాఖ్యానించారు. 24 పంపులతో 8500 క్యూసెక్కుల నీటిని తీసుకరావడం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు.

16:39 - March 29, 2016

హైదరాబాద్ : పట్టిసీమకు పెట్టిన ఖర్చు గాలేరు మీద ఖర్చు పెడితే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని జగన్‌ అన్నారు. అదే ఖర్చుతో హంద్రీనీవా కూడా కొలిక్కి వచ్చేదన్నారు. నాలుగు టీఎంసీల నీటిని పట్టిసీమ నుంచి తరలించి.. కృష్ణా డెల్టాను కాపాడామని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏపీ శాసనసభలో ప్రాజెక్టుల అంశంపై సీఎం చంద్రబాడు నాయుడు ప్రసంగంపై జగన్ స్పందించారు. రూ. 1600 కోట్లు పెడితే హింద్రీ నీవా, గాలేరు ప్రాజెక్టులు పూర్తయ్యేవని, డబ్బు అంతా నీళ్ల పాలు చేశారని తెలిపారు. 40 టీఎంసీల నీరు తెచ్చి కాపాడారంటా ? అని ఎద్దేవా చేశారు. 180టీఎంసీల నీరు ఎలా కాపాడుతారు ? అని సభలో జగన్ ప్రశ్నించారు. 

16:35 - March 29, 2016

హైదరాబాద్ : జగన్‌ సబ్జెట్‌ నేర్చుకొని మాట్లాడితే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. లేకపోతే ప్రతిపక్ష సభ్యులను బలవంతగానైనా బడికి పంపించి సాగునీటి పాఠాలను నేర్పించాలన్నారు. ఏపీ శాసనసభలో ప్రాజెక్టులపై జగన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ మాట్లాడుతుంటే తనకు మతిపోయిందని, పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మీకేమన్నా అర్థమైందా ? అంటూ వైసీపీ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ''పట్టిసీమ లాభం అర్థమైందా, పోలవరం అర్థమైందా ? కృష్ణా డెల్టాలు అర్థమైందా ? బలవంతంగా క్లాసులు పెట్టాల్సినవసరం ఉంది..ఇరిగేషన్ బడికి పంపించాల్సి ఉంటుంది'' అంటూ బాబు పేర్కొన్నారు. 

16:13 - March 29, 2016

హైదరాబాద్ : అరకు కాఫీ తాగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అరకు కాఫీని తాను ప్రమోట్ చేసే విధంగా వ్యవహరించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో విద్య..ఇతర రంగాలను ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందనే దానిపై బాబు మాట్లాడారు. రాబోయే మూడు సంవత్సరాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామన్నారు. గిరిజన విద్యా సంస్థలన్నింటినీ ఒకే మేనేజ్ మెంట్ కిందకు తీసుకరావడం జరుగుతుందన్నారు. పరిశుభ్రమైన ఆహారం ఇవ్వడానికి సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రవేశ పె ట్టడం జరుగుతుందని తెలిపారు. గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం లభించేందుకు ఆహారం అందించడం జరుగుతుందని, పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. అన్ని స్కూల్స్, విద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని, ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు అందచేస్తామన్నారు. డిజిటల్ క్లాసులు, కూచిపూడి, యోగా, ఎన్ సీసీ తదితర వాటిని స్కూల్లో అమలు చేస్తామన్నారు. విద్య..ఆరోగ్యం రంగాలపై శ్రద్ధ చూపించడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ. పదివేల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, 43 లక్షల కుటుంబానికి రూ. వేయి చొప్పున ఫించన్, ఐదు కిలోల బియ్యం అందించడం జరుగుతుందన్నారు. అరకు కాఫీ ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని, ఇటీవల దావోస్ పర్యటించిన సందర్భంలో అరకు కాఫీ విషయాన్ని తాను ప్రస్తావించడం జరిగిందన్నారు. 13 రకాల ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకరావడం జరిగిందన్నారు. ఎస్సీ కుటుంబం నుండి డ్వాక్రాలో మెంబర్ చేగా నైపుణ్యాన్ని పెంపొందిస్తామని, ఉపాధి కల్పించి ఆదాయం పెంచుతామని బాబు స్పష్టం చేశారు. 

గోదావరి-కృష్ణాలను కలిపిన ఘనత టీడీపీదే : సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌ : పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసిన ఘనత ఈ టీడీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నదుల అనుసంధానంపై చాలా విమర్శలు వచ్చాయని..అయినప్పటికీ సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ పట్టిసీమపై ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గోదావరి జిల్లాలకు రావాల్సిన నీరు రాయలసీమకు తరలిస్తున్నారని కొందరు విమర్శించారన్నారు.

కేంద్ర మంత్రితో ముగిసిన కేటీఆర్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టీ.మంత్రి కేటీఆర్ భేటీ ముగిసింది. ఈ భేటీపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 172 వంతెల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని, ఏప్రిల్ 20న మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించటానికి రాష్ట్రానికి రావాల్సిందిగా మంత్రిని కోరామని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 31న శాసనసభలో ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని కోర్టు ఆదేశించింది.

15:50 - March 29, 2016

ఒకప్పుడు విలన్‌ అంటే ప్రేక్షకులు భయపడిపోయేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. విలన్లు కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అంతే కాదు..ఒకప్పుడు విలన్లుగా చేసిన వాళ్లు హీరోలుగా సెటిలై పోతే.. ఇప్పుడు యంగ్ హీరోలే విలన్లుగా టర్న్ అవుతున్నారు. అలా రీసెంట్ గా విలన్ ల లిస్ట్ లో యాడ్ అయిన హీరోలెవరో చూద్దాం.

తారకరత్న..
నందమూరి నటవారసుడు తారకరత్న ఈ లిస్ట్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాడు. ఈ హీరో కూడా ఇప్పుడు మళ్లీ విలన్ గా మారాడు. నారా రోహిత్ మూవీ రాజా చెయ్యి వేస్తే సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో అసలు తారకరత్నేనా అని ఆశ్చర్యపోయే రేంజ్ లో మేకోవర్ అయ్యి మరో స్టైలిష్ విలన్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేసిన తారక్ ఈ మధ్య డిసప్పియర్ అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూనే అమరావతి సినిమాలో ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాలో యాక్టింగ్ కు నంది అవార్డు కూడా అందుకున్నాడు. మళ్లీ రోహిత్ సినిమాలో ఈ ట్రెండ్ కు తగ్గట్టు స్టైలిష్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చెయ్యబోతున్నాడు.

రాజశేఖర్..
ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా ఎంటర్ అవ్వబోతున్న మరో హీరో రాజశేఖర్. హీరోగా సూపర్ సక్సెస్ సాధించి విలన్ గా మారబోతున్నాడు ఈ హీరో. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యాంగ్రీ యంగ్ మెన్ ఇప్పుడు నెగెటివ్ రోల్ లో ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ క్యారెక్టర్స్ చేసినా..తరువాత హీరోగా సెటిలైపోయారు. మళ్లీ ఇప్పుడు తేజ డైరెక్షన్ లో అహం మూవీతో విలన్ గా మారబోతున్నాడట. లాస్ట్ ఇయర్ గడ్డం గ్యాంగ్ సినిమా చేసినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకేనేమో మళ్లీ స్క్రీన్ మీద అప్పటి ఫామ్ రావాలంటే విలన్ గా తప్ప ఇంకో ఆప్షన్ లేదనుకున్నట్టున్నాడు.

రానా..
హీరోలు విలన్లు గా మారిన ఈ ట్రెండ్ లో నెగెటివ్ క్యారెక్టర్ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేసింది మాత్రం రానా. విలన్ గా రానా సూపర్ క్రేజ్ కొట్టేశాడు. ఇండియన్ ప్రైడ్ మూవీ బాహుబలిలో భల్లాలదేవ గా నెగెటివ్ రోల్ లో అదరగొట్టాడు మన టాలీవుడ్ హంక్ రానా. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా టర్న్ అయ్యాడు ఈ టాల్ హీరో. బాహుబలితో ఒక్కసారిగా ఇప్పటి వరకూ చేసిన హీరో పాత్రలను ప్రక్కన పెట్టి నెగెటివ్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేసినా.... విలన్ గా అతనికొచ్చిన ఇమేజ్ తో మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో నెగెటివ్ షేడ్ చూపించినా.. నెక్ట్స్ ఇయర్ వస్తున్న సెకండ్ పార్ట్ లో క్రూయల్ విలన్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే టాలీవుడ్ టాక్.

జగపతిబాబు..
నిజానికి ఒకప్పటి హీరోలు.. స్టైలిష్ విలన్లుగా మారడానికి ఇంట్రస్ట్ చూపించడానికి కారణం జగపతిబాబు. అలా విలన్ గా టర్న్ అయిన సీనియర్ హీరో జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా ఇప్పటివరకూ సాఫ్ట్ ఇమేజ్ ఉన్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో ఈ తన యాక్టింగ్ లోని కొత్త యాంగిల్ ని చూపించాడు. విలన్ క్యారెక్టర్ తో సినిమా సక్సెస్ లో షేర్ కొట్టేశాడు. బాలకృష్ణకు ఈక్వల్ గా లెజెండ్ లో జగపతి చేసిన విలనిజం చూస్తే..వావ్ అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్స్ చేశాడు. ఇక నెక్ట్స్ రీసెంట్ హిట్ మూవీ నాన్న కు ప్రేమతో సినిమాలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆపోజిట్ గా నెగెటివ్ షేడ్స్ లో ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేశాడు జగ్గూభాయ్. ఇప్పుడు టాలీవుడ్ జనానికి లవబుల్ విలన్ జగపతిబాబు.

హిందీలో సుధీర్ బాబు...
జగపతిబాబు సక్సెస్ చూసిన తరువాత అంతగా సక్సెస్‌లు లేని హీరోలు కొందరు విలన్స్‌గా నటించడానికి ఇప్పటికే రెడీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ సంగతి అలా ఉంచితే.. బాలీవుడ్ హీరోలు కూడా విలన్లుగా ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ లో విలన్స్ గా కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. బాహుబలి ప్రభాస్ కెరీర్లోనే మర్చిపోలేని సూపర్ హిట్ వర్షం. దీన్ని హిందీలో బాఘీ పేరుతో రీమేక్ చేసిన చేశారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో మన తెలుగు హీరో సుధీర్ బాబు విలన్ గా న్యూ లుక్ తో కనిపించాడు. తెలుగులో హీరోగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ లేటెస్ట్ తెలుగు సినిమా భలే మంచి రోజు.  సినిమా బేసిక్ లైన్ ని తీసుకుని మిగిలిన కంటెంట్ మొత్తం బాలీవుడ్ నేటివిటీకి తగినట్టు మార్చేశారు మేకర్స్. వర్షం సినిమాలో విలన్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. బాఘీ సినిమాలో కూడా సుధీర్ ది మెయిన్ విలన్ రోల్. ఈ బాఘీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో పాటు, సుధీర్ బాబు తన బాడీని ఫుల్ గా మౌల్డ్ చేసేశాడు. ఇక్కడి వాళ్లు బాలీవుడ్ నుంచి విలన్లను తెచ్చుకుంటుంటే.. అక్కడ వాళ్లు వెతుక్కుంటూ వచ్చి సుధీర్ ని సెలక్ట్ చేసుకున్నారు.

అక్షయ్ కుమార్...
ఇక బాలీవుడ్ నుంచి సౌత్ వైపు వస్తున్న మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్. శంకర్ మ్యాజిక్ మూవీ రోబో సౌత్ లో పెద్ద సంచలనం. ఈ సినిమాలో రజనీకాంత్ చేత డ్యూయల్ రోల్ చేయించాడు. అవి కూడా హీరో, విలన్ .. ఇలా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయించాడు. ఇప్పుడు రోబో కి సీక్వెల్ రెడీ అవ్వబోతోంది. రోబోలో హీరో.. విలన్ రెండూ రజనీకాంతే. బట్ ఈ రోబో 2 లో మాత్రం విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడు. ఈ మధ్యే అక్షయ్ సినిమాలో చేస్తున్న క్రూయల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే ..మరో వైపు విలన్ గా కూడా చేస్తున్నారు హీరోలు.

అరవింద్ స్వామి..
టాలీవుడ్ , బాలీవుడ్ హీరోలే కాదు.. కోలీవుడ్ హీరోలు కూడా విలన్లుగా ఫుల్ ఇమేజ్ కొట్టేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఒకప్పటి స్మార్ట్ హీరో అరవింద్ స్వామి ఉన్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత తమిళ్ లో తని ఒరువన్ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ గా కొత్త లుక్ తో కనిపించి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. హీరోగా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. విలన్ గా కూడా అంతే ఇమేజ్ ని యాడ్ చేసుకుంటున్నాడు అరవింద్. స్టైలిష్ విలన్ గా ఈ సినిమాలో వావ్ అనిపించాడు. అందుకే ఈ సినిమా రీమేక్ లో కూడా ఈ హీరోనే విలన్ గా చూపించాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఈ డీల్ కి అరవింద్ ఫస్ట్ నో అన్నా.. పట్టుబట్టి ఒప్పించారని టాలీవుడ్ టాక్. టాలీవుడ్.. కోలీవుడ్, బాలీవుడ్ … ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా .. హీరోలు కాస్తా విలన్లుగా మారిపోతున్నారు. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ విలన్లుగా టర్న్ అవుతున్నారు. 

ఇద్దరు చిన్నారులతో తండ్రి ఆత్మహత్య.....

మహబూబ్ నగర్ : మానవపాడు మండలం పల్లెపాడులో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి తండ్రి ఇసాన్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు : టీ. మహిళా ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టీ. మహిళా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

15:27 - March 29, 2016

పరిశోధనలు జరగాల్సిన విశ్వ విద్యాలయాల్లో లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో ఉన్న 32 వర్సిటీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. 2014-2016 సంవత్సరంలో దాదాపు 376 లైంగిక వేధింపులు నమోదయ్యాయి. ఇదంతా మీడియా చెప్పడం లేదు. సాక్షత్తూ రాష్ట్ర మహిళా కమిషణ్ లెక్కలు చెప్పి భయంకర వాస్తవాలు. మరి ఎందుకు వర్సిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది ? దీనిని నివారించలేమా ? దీనిపై టెన్ టివి 'వేదిక' కార్యక్రమంలో చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో కావేరి (ఓయూ), రవళి (హెచ్ సీయూ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

15:22 - March 29, 2016

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు నవ్వుతాడో అర్థం కాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రామాయణం అంత విని సీత ఏమైంది అనే తీరుగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. జూన్ లో కృష్ణా డెల్టాలో పంటలు ప్రారంభమౌతాయన్నారు. 150 టీఎంసీల నీరు అవసరం ఉంటుందన పేర్కొన్నారు. 100 టీఎంసీల నీటిని శ్రీశైలంలో పెట్టుకుంటామన్నారు. శ్రీశైలంలో నాగార్జున సాగర్, పులిచింతలలో నీళ్లు పెట్టుకోవచ్చన్నారు. గోదావరిపై పోలవరం వస్తుందని, కృష్ణా నదిపై నీళ్లు రావడం లేదని సభకు తెలిపారు. 66 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయని, తాగడానికి నీళ్లు రాలేదన్నారు. కర్నాటక రాష్ట్రం 524 ఎత్తులో ఆల్మట్టి కడితే వచ్చే నీళ్లు రావని, దీనిపై పోరాటం చేస్తున్నామని సభకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారని, దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

మీతో ఏకీభవించలేను : జ్యోతుల నెహ్రూ

హైదరాబాద్ : తూర్పుగోదావరి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పీఏసీ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవులకు రాజీనామా ఆయన చేశారు. రాజీనామాను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు పంపారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా తాను ఇమడలేకపోతున్నానీ...అందుకే పార్టీని వీడుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.

కాసేపట్లో హెచ్ సీయూ విద్యార్ధుల విడుదల....

హైదరాబాద్ : కాసేపట్లో చర్లపల్లి జైలు నుండి హెచ్ సీయూ విద్యార్థులు విడదల కాబోతున్నారు. వీరికి స్వాగతం పలకటానికి సహచర విద్యార్థులు చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు.  హెచ్ సీయూలో జరిగిన ఆందోళన నేపథ్యంలో విద్యార్థులను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రితో టీ.మంత్రి కేటీఆర్ భేటీ....

ఢిల్లీ : కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, త్రాగునీరు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

14:49 - March 29, 2016

తూర్పుగోదావరి : వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేస్తారు ? వైసీపీలో కొనసాగుతారా ? లేదా ? గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. పార్టీకే కాకుండా ఇతర పదవులకు కూడా రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలకు..ఇతరత్రా వల్ల తాను పనిచేయలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనితో జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరుతారని స్పష్టమైంది.
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన వారిని టిడిపి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కొంతమంది ఇప్పటికే పచ్చకండువాలు కప్పుకున్నారు. ఇటీవలే పీఏసీ ఛైర్మన్ నియామకంలో జగన్ వ్యవహరించిన తీరుపై జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను కాదని ఇతరులను నియమించడం పట్ల ఆయన మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీనితో పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. తాను టిడిపిలో చేరుతున్నట్లు జ్యోతుల నెహ్రూ సమీప బంధువైన వరుపుల సుబ్బారావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జ్యోతుల నెహ్రూ లోటును వైసీపీ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. 

అసెంబ్లీ స్థానాల పెంపులో సమస్యలు రాకుండా చూస్తాం : వెంకయ్య

ఢిల్లీ : ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య బేదాభిప్రాయాలు లేవని ఆయన పేర్కొన్నారు. అటార్నీ జర్నల్ అభిప్రాయం వచ్చిన తరువాత దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై నేడు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో మంత్రి వెంకయ్య నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే.

14:36 - March 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు పెంచింది. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి మాట్లాడారు. ఐదు కోట్లకు పెంచాలని కోరారు. దీనికి అన్ని పక్షాల సభ్యులు మద్దతిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. కోటి 50 లక్షలున్నాయని, రెండు కోట్ల వరకు సర్దుబాటు చేయవచ్చని అధికారులు సూచించడం జరిగిందన్నారు. నాలుగు కోట్లు పెంచడం వల్ల అధిక భారం పడుతుందని, మూడు కోట్లు పెంచేందుకు అనుమితిస్తున్నట్లు ప్రకటించారు.

14:33 - March 29, 2016

కర్నూలు : జిల్లా కొత్తపల్లి సర్పంచ్ తులసిరెడ్డిపై దాడి వెనక ఇటీవలే టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి హస్తం ఉందని శిల్పామోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశామన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని బాబు హామీ ఇచ్చినట్లు శిల్పామోహన్‌రెడ్డి చెప్పారు. తమను అణగ తొక్కేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయ వర్గాల్లో పార్టీ బలోపేతం అనుకుంటే టిడిపి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా చేరిక వల్ల ఇబ్బంది పడుతామని గతంలోనే తాము సీఎం చంద్రబాబుకు తెలియచేయడం జరిగిందని, సర్దుబాటుగా ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వీరు వచ్చిన తరువాత తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూమా ఎమ్మెల్యే అయిన తరువాత నంద్యాలలో ఇలాంటి ఘటన జరగడం ఐదో సారి అని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగిందని, తప్పక న్యాయం చేస్తానని..మరొక్క సారి రేపు కలవాలని బాబు సూచించారని తెలిపారు. అధికారాన్ని అడ్డు పెట్టుకని ఏమైనా చేయవచ్చని అనే ధోరణిలో భూమా ఉన్నాడని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి. 

జ్యోతుల నెహ్రూ రాజీనామా..

విజయవాడ : వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

కోస్గి పాఠశాలలో మాథ్స్ పరీక్ష లీక్ కు ప్రయత్నం..

మహబూబ్ నగర్ : కోస్గి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పేపర్ -1 లీక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పరీక్షకు అరగంట ముందే ప్రశ్నాపత్రాన్ని సెల్ ఫోన్ లో ఫొటో తీసేందుకు హెడ్ మాస్టర్ నారాయణ ప్రయత్నించాడు. నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తెలంగాణలో నియోజకవర్గ నిధుల పెంపు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో శాసనసభ్యులకే పూర్తి అధికారం ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నియోజకవర్గ నిధులు రూ. 3 కోట్లకు పెంచుతున్నట్లు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ప్రొటోకాల్ పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 

13:59 - March 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల జీత భత్యాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఈ బిల్లును మంగళవారం శాసనసభ ఆమోదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను ఒక్కసారిగా రూ. 95వేల నుండి రూ. 2.5 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఈ వేతనాల పెంపును సీపీఎం వ్యతిరేకించింది. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన తెలంగాణలో పెంచాల్సినవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు.
జీతాల పెంపు ఇలా ఉంది...

ప్రస్తుత జీతభత్యాలు...బిల్లులో ప్రతిపాదించిన మొత్తం..

ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు  ప్రస్తుతం  ప్రతిపాదన
జీతం  రూ.12,000  రూ.20,000
నియోజకవర్గ అలవెన్స్  రూ.83,000  రూ.2 లక్షల 30వేలు
మొత్తం  రూ.95వేలు  రూ. 2.5 లక్షలు.
మంత్రులు చీప్ విఫ్, విప్ లకు ప్రస్తుతం ప్రతిపాదన
జీతం రూ.14,000   రూ.30,000
నియోజకవర్గ అలవెన్స్  రూ.83,000  రూ. 2.30 లక్షలు
ప్రత్యేక అలవెన్స్  రూ.8,000  రూ.8,000
వ్యక్తిగత అలవెన్స్  రూ.7,000  రూ.7,000
క్యాంపు కార్యాలయ  అలవెన్స్ రూ.10,000  రూ.10,000
సెక్యూర్టీ కారు అలవెన్స్  రూ.25,000  రూ.25,000
సొంత వాహన అలవెన్స్  రూ. 30,000  రూ.30,000
ఇంధన అలవెన్స్  రూ.15,000  రూ.10,000
ఇంటి అద్దె భత్యం  రూ.50,000  రూ.50,000
ముఖ్యమంత్రికి  ప్రస్తుతం  ప్రతిపాదన
జీతం  రూ.16,000  రూ.51,000
నియోజకవర్గ అలవెన్స్  రూ.83,000 రూ. 2.30 లక్షలు
ప్రత్యేక అలవెన్స్  రూ.8,000  రూ.8,000
వ్యక్తిగత అలవెన్స్  రూ.7,000  రూ.7,000
క్యాంపు కార్యాలయ అలవెన్స్  రూ.10,000  రూ.10,000
సెక్యూర్టీ కారు అలవెన్స్  రూ.25,000  రూ.25,000
సొంత వాహన అలవెన్స్  రూ. 30,000  రూ.30,000
ఇంధన అలవెన్స్  రూ.15,000  రూ.10,000
ఇంటి అద్దె భత్యం  రూ.50,000  రూ.50,000
మొత్తం  రూ. 2.44 లక్షలు  రూ.4.21 లక్షలు
శాసనసభాపతి/మండలి ఛైర్మన్లకు  ప్రస్తుతం  ప్రతిపాదన
జీతం  రూ.14,000  రూ. 41,000
నియోజకవర్గ అలవెన్స్  రూ.83,000  రూ. 2.30 లక్షలు
ప్రత్యేక అలవెన్స్  రూ.8,000  రూ. 8,000
వ్యక్తిగత అలవెన్స్  రూ.7,000  రూ.7,000
క్యాంపు కార్యాలయ అలవెన్స్  రూ.10,000  రూ.10,000
సెక్యూర్టీ కారు అలవెన్స్  రూ.25,000  రూ.25,000
సొంత వాహన అలవెన్స్  రూ. 30,000  రూ.30,000
ఇంధన అలవెన్స్  రూ.15,000  రూ.10,000
ఇంటి అద్దె భత్యం  రూ.50,000  రూ.50,000
మొత్తం  రూ. 2.42 లక్షలు  రూ. 4.11 లక్షలు.
     

 

13:43 - March 29, 2016

హైదరాబాద్: పఠాన్‌కోట్‌ ఘటనపై విచారణ చేపడుతున్న పాకిస్తాన్‌ దర్యాప్తు బృందం ఎయిర్‌ బేస్‌కు చేరుకుంది. ఏయిర్‌బేస్‌ లోపలకు అనుమతించే విషయంపై రాజకీయ రగడ చెలరేగింది. పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అధికారి కూడా జాయింట్ ఇన్వెస్టిగేషన్‌ టీంలో ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎయిర్‌బేస్‌ దగ్గర  పాక్‌ టీంకు  ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. జాతీయ భద్రతపై రాజీ పడుతున్నారని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పఠాన్‌కోట్‌ దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా పలువురు సాక్షులను  పాక్‌ బృందం విచారించనుంది. 

హైజాక్ విమానం సైప్రస్ లో ల్యాండింగ్...

హైదరాబాద్ : ఈజిప్టు విమానం హైజాక్ కు గురైంది. సైప్రస్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో హైజాకర్లు ల్యాండ్ చేశారు. దాదాపు 40 మందిని విడుదల చేశారు. విడుదల అయిన వారిలో మహిళలు. చిన్నారులు వున్నారు. ఐదుగురు ప్రయాణీలు, విమాన సిబ్బంది మినహా మిగతా వారందరినీ హైజాకర్లు విడుదల చేశారు. కాగా ఈజిప్టుకు చెందిన సలాహ్ అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. తన డిమాండ్లు నెరవేర్చే వరకూ తన కస్టడీలో వున్నవారిని విడిచిపెట్టననీ..ఈ లోగా తనను పట్టుకోవటానికి ప్రయత్నిస్తే విమానాన్ని పేల్చివేస్తానని హైజాకర్ ప్రకటించినట్లు సమాచారం. కాగా తన డిమాండ్లను మాత్రం హైజాకర్ ప్రకటించలేదు.

13:34 - March 29, 2016

హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధుల జీతాల పెంపు బిల్లును మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై పలువురు సభ్యులు సూచనలు చేశారు. మాజీ ప్రతినిధులకు పెన్షన్లు పెంచాలని సభ్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే.. సూచనలన్నింటిని వచ్చే సమావేశాల్లో చర్చించి అమలు చేద్దామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ బిల్లును యథాతథంగా సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా గతంలో కంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు రెట్లు అదనంగా వేతనాలు పెరగనున్నాయి. 
సమర్థిస్తున్నాం..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపును పూర్తిగా సమర్ధిస్తున్నామని కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌కుమార్‌ అన్నారు. దీనివల్ల సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు పెన్షన్‌ 30 వేల నుంచి 50 వేలకు పెచాలని సంపత్ కుమార్ కోరారు.
హౌస్ అలవెన్స్ పెంచాలి..
ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతం సరిపోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేలకు ఇచ్చే హౌస్‌ అలవెన్స్‌ పెంచాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా కారు లోన్‌ను కూడా పెంచాలని చింతల తెలిపారు.
వచ్చే సమావేశాల్లో..
మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్‌ పెంపు అంశాన్ని వచ్చే సమావేశాల్లో పరిశీలిద్దామని సీఎం కేసీఆర్‌ అన్నారు. సభలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల సూచనలపై సీఎం జవాబిచ్చారు. ఏవైనా సవరణలు ఉంటే వచ్చే సమావేశాల్లో చేసుకుందామని తెలిపారు కేసీఆర్‌. 

కరవుపై టి.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం : తమ్మినేని..

మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కరువుపై ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
నేడు మహబుబ్ నగర్ లో కరువు, పెండింగ్ ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమ్మినేని మాట్లాడారు. పెండింగ్ లో వున్న పాజెక్టులను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వదిన..మరిది ఆత్మహత్య..

కరీంనగర్ : రామగుండం మండలం బసంత్ నగర్ లో ఆత్మహత్య ఘటన కలకలం రేగింది. రైలు కింద పడి వదిన, మరిది ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

13:05 - March 29, 2016

హైదరాబాద్: తన మీద మూడు సార్లు హత్యాయత్నం జరిగింది కానీ తనకు కేటాయిస్తున్న గన్ మెన్ల సంఖ్య నామమాత్రంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే అసెంబ్లీలో శాంతి భద్రతల గురించి మాట్లాడారు. ''నాపై హత్యాయత్నం చేసిన కిరాయి హంతకుల వద్ద శక్తివంతమైన బాంబులు, తుపాకుల లబించాయి. నాపైన హత్యా యత్నం చేసిన వ్యక్తికి టు ప్లస్ టు ఇచ్చారు. నాకు మాత్రం ఒన్ ప్లస్ వన్ కేటాయించారు. కనీసం కార్బన్ గన్ అయినా ఇవ్వకుండా సాధారణ పిస్టల్స్ కేటాయించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. పౌరులు అంతర్గత విషయాల్లో పోలీసుల ప్రమేయం పెరిగిపోయింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతియుత వాతావరణాల్లో 'శాంతియుత'వాతావరణం గొప్పది. అధికారపార్టీ నాయకుల సిఫార్సుల మేరకు వైసీపీ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలి'' అని శివ ప్రసాద్ కోరారు. 

13:00 - March 29, 2016

హైదరాబాద్: ఐటీ అంటే చంద్రబాబు అని చంద్రబాబు అంటే ఐటీ అని ఊదరగొడుతున్నారని కానీ అవి ఉత్త మాటలే అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ మంగళవారం ఏపీ శాసన సభలో ఐటీ గురించి మాట్లాడారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. ఆ కాలంలో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు బాబూ మోహన్ ఉన్నా ఐటీ అభివృద్ధి జరిగేదని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో గూగుల్, అమెజాన్ లాంటి సంస్థల హెడ్ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నాయని.. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో దేశాలు తిరిగిన చంద్రబాబు ఏపీకి ఏ ఐటీ సంస్థను తీసుకొచ్చారని ప్రశ్నించారు. కాబట్టి కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెల్లదీయొద్దంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 

 

ప్రకటనలకే పరిమితం : తమ్మినేని

మహబూబ్ నగర్ : నేడు మహబూబ్ నగర్ లో కరువు, పెండింగ్ ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువుపై ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. పెండింగ్ లో వున్న పాజెక్టులను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా వున్నందువల్లనే టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుస్తోందన్నారు.

12:51 - March 29, 2016

మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా.? అయితే  ఈ వార్త మీకోసమే. ఈ మధ్య అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం వాట్సాప్. యూజర్లు ఉపయోగిస్తున్న సంఖ్యతో పాటు.. వాట్సాప్ లో చాలా ఫీచర్లు అప్డేట్ చేస్తూ వస్తోంది సదరు సంస్థ.
వాట్సాప్ ద్వారా మెసేజీలు, ఫైల్స్, రికార్డింగ్స్ తో పాటు రీసెంట్ గా డాక్యుమెంట్లను కూడా పంపించుకునే సౌలభ్యం అందించింది. అంతే కాకుండా వాట్సాప్ టు వాట్సాప్ వాయిస్ కాల్స్ ఎనేబుల్ చేసి అద్భుత విప్లవం తీసుకొచ్చారు. 
ఈ నేపథ్యంలో వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్ చేర్చబోతోంది. మొబైల్ లో బ్యాలెన్సు లేకున్నా వాట్సాప్ ద్వారా మొబైల్ కు లేదా ల్యాండ్ లైన్ కు కాల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వనున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మొబైల్ లో డేటా ఉంటే  చాలు సాధారణ కాల్ మాట్లాడుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి టెలికం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఇది యూజర్లకు ఎంత వరకు ఉపయోగపడుతుందో ఫీచర్ వచ్చినప్పుడు తెలస్తుంది. 

సీఎం చంద్రబాబును కలిసిన సర్పంచ్ తులసిరెడ్డి బంధువులు....

హైదరాబాద్ : మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుతో తులసిరెడ్డి కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. తులసిరెడ్డిపై భూమా అనుచరులే దాడి చేశారని సీఎంకు ఫిర్యాదు చేశారు. కాగా నంద్యాల మండంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ , టీడీపీ నేత అయిన తులసిరెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. 

12:32 - March 29, 2016

హైదరాబాద్ : ఓ ఈజిప్టు విమానం హైజాక్  కు గురయ్యింది. ఈ నేపథ్యంలో హైజాకర్లు చిన్న పిల్లల్ని, మహిళలను విడిచిపెట్టారు. అలెగ్జాండ్రియి నుంచి సైప్రస్ మీదుగా కైరో వెళ్తున్న ఈ ఎమ్ఎస్ 181 విమానం హైజాక్ కు గురయ్యింది. ఈ విమానంలో 82 మంది ప్రయాణిస్తున్నారు.. కైరో నుంచి బయలుదేరిన విమానం మార్గం మధ్యలో దుండగులు దారిమళ్లించారని అధికారులు వెల్లడించారు. దుండగులు మారణాయుదాలు, బాంబులతో విమానంలోకి ప్రవేశించారు. కాగా మానవ బాంబు దరించిన వ్యక్తి విమానంలో సిబ్బంధిని భయ పెడుతున్నట్లు సమాచారం. హైజాకర్లు ఇంత వరకు ఎలాంటి డిమాండ్లను వినిపించలేదు. 
దేశంలో అలెర్ట్..
ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశంలో హై అలెర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానాల్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో ఎయిరిండియాకు కూడా ఐబీ అలెర్ట్ చేసినట్లు సమాచారం. 
 

హెచ్.సీ.యూ ఘటనలో వారికి హైకోర్టు నోటీసులు...

హైదరాబాద్ : హెచ్.సీ.యూ రిజిస్ట్రార్, వీసీ అప్పారావు, సైబరాబాద్ సీపీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హైకోర్టులో కేసు దాఖలైన సంగతి తెలసిందే.

ప్రజాప్రతినిధుల జీతభత్యాల బిల్లుకు టీ.శాసనసభ ఆమోదం...

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలు రూ.2.30లక్షలకు పెరగనున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.42.67 కోట్ల అదనపు భారం పడనుంది.

ఈజిప్టు విమానం హైజాక్....

హైదరాబాద్ : ఈజిప్టు విమానం హైజాక్ గురైంది. అలెగ్జాండ్రియా నుండి కైరో వెళ్తున్న విమానం హైజాక్ గురైంది. విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. హైజాక్ సంబంధించిన ఏవిధమైన సమాచారం అందలేదు.  సమాచారం తెలుసుకున్న ప్రయాణీకుల బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

12:00 - March 29, 2016

హైదరాబాద్: రాష్ట్రంలో కరవు సహాయ కార్యక్రమాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ప్రతిపక్ష నేత జగన్‌ ఆరోపించారు. అసెంబ్లీ ప్రశ్నత్తరాల సమయంలో కరవుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకున్నారు. అక్టోబర్‌ 5 లోపు కరవుపై కేంద్రానికి నివేదిక పంపాల్సి  ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి బదులుగా అక్టోబర్‌ 28, నవంబర్‌ 21 తేదీల్లో కరవు మండలాల్ని ప్రకటించాడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే చాలీ చాలని నిదులు విదిల్చి చేతులు దులుపుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. పలు జిల్లాల్లో నీటి సమస్య విలయ తాండవం చేస్తోందని ప్రభుత్వం దాన్ని తీర్చడంలో విఫలమైందని తెలిపారు. కరువుపై ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

11:56 - March 29, 2016

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు నగరపాలక సంస్థలకు వచ్చే మే తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ అసెంబ్లీలో చెప్పారు. ఓటర్ల జాబితాల సవరణ, డివిజన్ల పునర్వభజన, రిజర్వేషన్ల ప్రక్రియను మే 16 నాటికి  పూర్తి చేస్తామని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉందని సభ దృష్టికి తెచ్చారు. 

టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ...

కర్నూలు : ఎమ్మిగనూరు మండలం బసవాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో 10 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.

11:54 - March 29, 2016

వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఇంటి పన్ను బాకీ ఉన్నారన్న కారణంతో.. ఇంటి తలుపులు విరగొట్టి లాక్కెళ్లారు. రెండు వేల రూపాయలకు మించి  బకాయిలు ఉన్న వారి ఇంటి తలుపులు తీసుకెళుతున్నారు. అయితే మార్చి 31వ తేదీ వరకు గడువున్నా అధికారులు మాత్రం బలవంతపు వసూళ్లకు  పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు కమర్షియల్, షాపింగ్ ఎలాంటి ప్రామాణికత లేకుండా పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. అయితే మాల్యాలాంటి వాళ్లు ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతుంటే తమ లాంటిపట్ల ఇలా వ్యవహరించడం పై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

రాజకీయంగా అణచి వేయాలనుకుంటున్నారు : రోజా..

ఢిల్లీ : రాజకీయంగా తనను అణచివేయాలని చూస్తున్నారని టీడీపీ పార్టీని ఉద్ధేశించి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందుకే సస్పెండ్ చేశారని, శాసనసభలో వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం కొనసాగిస్తానని ఆమె తెలిపారు. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను అధికారపక్షం కొంటున్నారని...చంద్రబాబు పేరిట ఉన్న పథకాలకు నిధులు కేటాయిస్తూ...ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నీరు గారుస్తున్నారని విమర్శించారు. సస్పెన్షన్ పై ఆమె మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటీషన్ ను పరిశీలించిన న్యాయస్థానం కేసును శుక్రవారం నాటికి వాయిదా వేసింది.

'మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు'

హైదరాబాద్ : టీ. అసెంబ్లీలో తెలంగాణా మార్కెట్ చట్ట సవరణ బిల్లును మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని ముఖ్యమంతి కేసీఆర్ పేర్కొన్నారు.

11:29 - March 29, 2016

హైదరాబాద్: మార్కెట్ కమిటీల అనుసంధానం, రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును మంత్రి హరీష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తదనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నా రెడ్డి మాట్లాడుతూ. ఎస్సీ ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పించాలని కోరారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. చిన్నారెడ్డి సూచనను ప్రభుత్వం స్వీకరిస్తోందంటూ తెలిపారు. కాగా ఈ సందర్భంగా చిన్నారెడ్డి కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. మంచి సూచిన అందించినందుకు చిన్నారెడ్డికి కేసీఆర్ కూడా 'థ్యాంక్స్' చెప్పడంతో సభలో నవ్వులు విరిసాయి. ప్రతిపక్షాలు ఈ బిల్లుకు మద్ధతు తెలిపాయి. వెంటనే మార్కెట్ యార్డు ఎలక్షన్లకు సంబంధించిన మరో సూచనను చిన్నారెడ్డి చేయగా.. దానిని తరువాతి ఫేస్ లో చూద్దామని కేసీఆర్ తెలిపారు. 

మరోసారి సుప్రీం కోర్టుకు రోజా....

ఢిల్లీ : హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. గత సమావేశాల్లో ఏపీ అసెంబ్లీ నుండి రోజా సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో రోజా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కాగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసును హైకోర్టు పరిధిలో తేల్చుకోమని తెలిపింది. ఈ క్రమంలో హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో  రోజాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారిచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ అసెంబ్లీ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం పలు పరిణామాలు చోటు కున్నాయి.

ముఖ్యమంత్రికి థ్యాంక్స్ : చిన్నా రెడ్డి

హైదరాబాద్ : మార్కెట్ కమిటీల మార్పుకు సంబంధించిన సవరణ బిల్లు కు సంబంధించిన అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దన్యవాదాలు చెప్పారు. అంతకు ముందు చిన్నా రెడ్డి మహిళలకు కూడా మార్కెట్ కమిటీలో మహిళా రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరారు. కాగా వెంటనే స్పందించిన కేసీఆర్ చిన్నారెడ్డి సూచనను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

టీ.అసెంబ్లీ నుండి కాంగ్రెస్ వాకౌట్...

హైదరాబాద్ : టీ. అసెంబ్లీ నుండి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లు ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో చాన్సలర్ గా గవర్నర్ ను తొలగించే అంశాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

పనితీరును మెరుగుపరిచేందుకే ఆ బిల్లు..

హైదాబాద్ : టీ. అసెంబ్లీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలకు సమాధానం చెబుతూ కడియం మాట్లాడారు. పనితీరును మెరుగుపరిచేందుకే అమెండ్ మెంట్ బిల్లును తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలలో యూనివర్శిటీ యాక్ట్ ను సవరణ చేశాయని కడియం తెలిపారు. గవర్నర్ పై మాకు అపారమైన నమ్మకముందని తెలిపారు. 

10:55 - March 29, 2016

హైదరాబాద్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 సవరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. వైస్ ఛాన్సలర్ల నియమకాన్ని ఛాన్సలర్ గవర్నర్ ఆధారంగా కాకుండే నేరుగా ప్రభుత్వం నియమించేట్లు ఈ సవరణలో ప్రతిపాదించారు. కాగా దీనిపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు ఈ క్రింది విదంగా స్పందించారు.
జీవన్ రెడ్డి (కాంగ్రెస్) : వీసీల నియామక అధికారాలను ఛాన్సలర్ అయిన గవర్నర్ నుంచి ప్రభుత్వం చేజిక్కించుకోవాలనుకోవడం దురదృష్టకరం. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. గవర్నర్ పరిపాలన దక్షత పట్ల ప్రభుత్వానికి అనుమానం వస్తుంది. 
సున్నం రాజయ్య : యూనివర్సిటీలపై ఛాన్సలర్ (గవర్నర్)  అధికారలను తొలగించడం సబబు కాదు. వీసీల నియామకంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలి. 
రవీందర్ (సీపీఐ) :  గవర్నర్ అధికారాలను తీసుకోవడం సరికాదు. ఈబిల్లుపై ప్రభుత్వం పునరాలోచించాలి. 11యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ లేరు. వారిని సాధ్యమైనంత త్వరగా నియమించాలి. 
కె లక్ష్మణ్ (బిజేపీ):  రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలను అభివృద్ధి చేయాలి. ఛాన్సలర్ నియమకాన్ని ప్రభుత్వం గవర్నర్ చేతి నుంచి తీసివేయడం సరికాదు. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ యదావిదిగా చాన్సలర్ గా కొనసాగే విధానమే కొనసాగాలి. 
సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ) : ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలను నడపాలి. విద్యా వ్యవస్థను పక్కదారి పట్టించినట్లవుతుంది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఈ బిల్లును పునరాలోచించాలి. 
రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్) : నవనిర్మాణంలో భాగంగానే సవరణలో కొన్ని మార్పులు తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు సహకరించాలి. 

విద్యాహక్కు చట్టాన్ని సర్కారు నిర్వీర్యం చేస్తోంది: జీవన్ రెడ్డి

హైదరాబాద్ : టీ. అసెంబ్లీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లు ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టాన్ని సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఏ వర్శిటీల్లోనూ పాలకమండలి లేదన్నారు. వీసిని గవర్నర్ నియమించినా ప్రభుత్వమే ప్రతిపాదిస్తుందన్నారు. వీసీతో పాటు ఛాన్సలర్లను కూడా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 

గవర్నర్ నే కొనసాగించాలి...

హైదరాబాద్ : టీ. అసెంబ్లీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ట్ట సవరణ బిల్లు ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడారు. వర్శిటీల చాన్సలర్ గా గవర్నర్ నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఛాన్స్ లర్ల నియామకం సర్కారే చేపట్టాలనుకోవటం సరికాదని సూచించారు. దీని వల్ల వర్శిటీల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని ఆయన అన్నారు. 

10:34 - March 29, 2016

కర్నూల్ : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి, కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో తులసిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసింది భూమా నాగిరెడ్డి అనుచరులేనని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయం టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. కాగా ఈ హత్య కేసులో పోలీసులు 9 మందిపై కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ప్రతి దాడులు జరగకుండా కొత్త పల్లి గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

ఏపీ శాసన సభ స్థానాల పెంపుపై..

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో శాసనసభ స్థానాల పెంచే విషయంపై చర్చించనున్నారు. ఏపీలో శాసనసభ స్థానాలకు పెంచాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ప్రారంభమైన టీ.శాసనసభ...

హైదరాబాద్ : నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ కార్యక్రమాలు ప్రాంరంభమయ్యాయి. ప్రతిపక్షాలు ప్రారంభించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని  స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు.

వైసీపీ వాకౌట్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. కరువు చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామంటూ వెల్లడించారు. 

ఆ ఖైదీల విడుదల..

హైదరాబాద్ : తెలంగాణలో సత్ ప్రవర్తన గల ఖైదీల విడుదలకు జీవో జారీ చేశారు. ఇందులో భాగంగా నేడు 200 మంది సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల కానున్నారు. చర్లపల్లి జైలు నుంచి నుంచి 26 మంది ఖైదీలు విడుదల అవుతున్నతున్నట్లు అధికారులు తెలిపారు. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి  39 మంది విడుదల అవుతున్నట్లు సమాచారం. 

హెచ్.సీ.యూలో స్వాగత ఏర్పాట్లు..

హైదరాబాద్: అరెస్టయిన హెచ్.సీ.యూ విద్యార్థులు చర్లపల్లి నుంచి నేడు విడుదల కానున్నారు. విడుదల సందర్భంగా సహచర విద్యార్థులు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రమే సాయంత్రమే విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల రిత్యా నేటి మధ్యాహ్నం 25 మంది విద్యార్థులు, ఇరువురు అద్యాపకులు విడుదల కానున్నారు. 

09:14 - March 29, 2016

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతకు వడగాలులు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో వృద్థులు, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారంటూ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. వడగాల్పుల నేపథ్యంలో వెంటనే కార్యచరణ ప్రణాళిక అమలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. ఎండ దెబ్బ తగలకుండా ఎలా వ్యవహారించాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రతకు సంబంధించిన పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
వడదెబ్బ..
వడగాలులకు మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వడదెబ్బపై ఎలాంటి అవగాహాన లేకపోవడం వల్ల గత నాలుగేళ్లలో 1232 మంది చనిపోయారని సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2003లో డాక్టర్ పషోరీ కమిటి నిబందనలు తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదన్నారు. వడగాల్పుల నుండి ప్రజలను రక్షించడంలో ఒడిస్సా ప్రభుత్వం మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు. ఇక్కడ కూడా అలాంటి ఆదేశాల్ని జారీచేయాలని కోరారు. దీంతో గతంలో పలుమార్లు విచారణ చేపట్టిన ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం..తాగాజా కౌంటర్లు దాఖలు చేసి నివేదికలు ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని అదేశించింది. అయితే గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తాజాగా సోమవారం ఏ.పి. అమలు చేయనున్న యాక్షన్ ప్లాన్ ను కోర్టుకు సమర్పించింది. 
అవగాహన కల్పించాలి..
ఇరు రాష్ట్రాల యాక్షన్ ప్లాన్స్‌లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 3 గంటల వరకు పనులకు వెళ్లకుండా ప్రజలకు అవగాహాన కల్పిస్తున్నామని తెలిపాయి. అన్ని విభాగాలను హెల్త్ సెంటర్స్ ను, హాస్పటల్స్ ను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎండకు వెళ్లే సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడాదో ప్రజలకు చెప్తున్నామని నివేదిక ఇచ్చారు. ఇక మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు మీడియాతో, రేడియోలతో అప్రమత్తం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అయితే ఇవి ఎలా అమలు చేస్తున్నారో చూడాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. పిటిషనర్ కూడా గ్రామాలకు వెళ్లి అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు కూలీల్లో 12 గంటల తర్వాత పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. గ్రామాల్లో వాల్ పోస్టర్లు, పనులు జరిగే ప్రదేశాల్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే బోర్డులు ఏర్పాటు చేయాలని చీఫ్ జస్టిస్ దిలీప్.బి.బోసలే, నవీన్ రావుతో కూడిన బెంచ్ సూచించింది. వడగాల్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన యాక్షన్ ప్లాన్ మూడు వారాలు సిరియస్ గా అమలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు. 

నేటి ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్ : నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో సభలో చర్చకు వచ్చింది. 

అసెంబ్లీలో నేటి ప్రధాన ప్రశ్నలు ఇవే..

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో నేటి ప్రధాన ప్రశ్నలు ఇవి.. 'చేతి వృత్తిదారుల సంక్షేమం', 'పేదలకు ప్రత్యేక పథకాలు' 'కరువు మండలాలలకు నిధుల మంజూరు', 'కృష్ణానదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు', 'గోదావరి జలాలు కలుషితం' మొదలైన అంశాలపై నేటి సభ లో చర్చ జరగనుంది.  

బడ్జెట్ డిమాండ్లపై చర్చ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరగనుంది. బిసి సంక్షేమం, పాఠశాల విద్య, రెవెన్యూ, ఎక్సైజ్ వాణిజ్య పన్నుల రవాణాపై సభలో చర్చించనున్నారు.

'బాహుబలి' గర్వ కారణం : బాబు..

హైదరాబాద్ : బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు రావడం గర్వకారణమని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే సందర్భంలో 'కంచె'కు కూడా ప్రాంతీయ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. ఇది తెలుగు వారి సత్తా అని కొనియాడారు. 

08:48 - March 29, 2016

హైదరాబాద్ : 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒడిదుడుకులను, సమస్యలను తట్టుకుని నిలబడిందంటే దానికి కారణం కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు తెలుపారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసిన అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  ''తెలుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభా కాంక్షలు.. ప్రతి ఒక్క కార్యకర్తకు శిరసు వంచి పాదాభివందనంచేస్తున్నాను. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. అధికారం, రాజకీయం, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా.. తెలుగుఆవారి ఆత్మ గౌరవం కోసం, పేదరిక నిర్మూళన కోసం టీడీపీ ఆవిర్భవించింది. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో కీలక బాధ్యతలుఅ ప్పగించి రాజకీయ చరిత్ర సృష్టించాం.దేశ రాజకీయాల్లో టీడీపీ పార్టీ పాత్ర కీలకం. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటాడు. ఆయన ఆశయాల్ని సాధించాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉంది.'' 
బాహుబలికి జాతీయ అవార్డు గర్వ కారణం..
''బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు గర్వకారణం. 'కంచె'కు ప్రాంతీయ అవార్డు.. ఇది తెలుగు వారి సత్తా. దేశానికి దిక్సూచిగా తెలుగువారు ముందుకు వెళ్లాలి'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన బాబు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఆవిర్భావ సభ జరుగుతోంది. ముఖ్య అథితిగా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. 'మా తెలుగు తల్లికి' గీతం ఆలపించిన అనంతరం కేక్ కట్ చేశారు. కాగా నేటితో టీడీపీ ఏర్పడి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

'కరువు-పెండింగ్ ప్రాజెక్టులు'పై సదస్సు..

మహబూబ్ నగర్ : నేడు మహబుబ్ నగర్ లో కరువు, పెండింగ్ ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అథితిగా పాల్గొంటారు. 

లారీలు ఢీకొని..

ఖమ్మం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లూరు మండలం రామకృష్ణాపురం వద్ద.. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  

08:03 - March 29, 2016

ప్రిన్స్ మహేష్ బాబు కచ్చితంగా హ్యట్రిక్ అందించాలనుకుంటున్నాడట. తన కొత్త మూవీ బ్రహ్మోత్సవంతో సక్సెస్  హ్యట్రిక్ సంబరాలు చేయాలని ఈ స్టార్ భావిస్తున్నాడట. మహేష్ బాబు ఆగడు ప్లాప్ అయింది. ఆ తరువాత శ్రీమంతుడుతో సక్సెస్ కొట్టాడు కదా మరి హ్యట్రిక్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి.

ఇప్పుడో హ్యాట్రిక్ ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై పడింది. అయితే ఇది తన పర్సనల్ హ్యాట్రిక్ కాదు. ఎందుకంటే ఆగడు ఫ్లాప్ తర్వాత మహేష్ ఖాతాలో ఉన్నది శ్రీమంతుడు హిట్ ఒకటే. కానీ తనతో మూవీ చేస్తున్న బ్రహ్మోత్సవం నిర్మాతలకు మహేష్ బాబు హ్యట్రిక్ అందించాలని తపన పడుతున్నాడట.

వరుస ఫ్లాపుల తర్వాత నిర్మాతగా పొట్లూరి వరప్రసాద్ కి క్షణం మూవీ రూపంలో హిట్టొచ్చింది. లో బడ్జెట్ గా వచ్చిన ఈ మూవీ బంఫర్ కలెక్షన్లను రాబట్టి పీవీపీని ఆనందంలో ముచ్చేసింది. దీంతో పాటు ఇటీవలే వచ్చిన మరో సినిమా ఊపిరితో పీవీపీ రెండో హిట్టు అందుకున్నాడు.

నాగార్జున,కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి మూవీ విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షయల్ గా లాభాలు ఆర్జిస్తోంది. ఇలా క్షణం. ఊపిరి మూవీస్ తో నిర్మాతగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న పీవీపీకి మహేష్ బాబు తన బ్రహ్మోత్సవం మూవీతో ఎలాగైనా హ్యట్రిక్ అందించాలనుకుంటున్నాడట. మరి ప్రిన్స్ ఈ నిర్మాతకు హిట్టు ఇచ్చి హ్యట్రిక్ సంబరాలు చేస్తాడో చూడాలి.

నేటి నుంచి వేసవి సెలవులు..

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని అధికారులు ప్రైవేటు కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. 

భక్తుల రద్దీ సాధారణం..​

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3గం.లకు సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 2గం.ల సమయం పడుతుంది. 

07:47 - March 29, 2016

మెగా తనయుడి సన్పెన్స్ తో మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. చెర్రీ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడటంతో అసలు మ్యాటర్ ఏంటో తెలియక మెగా ఫ్యాన్స్ లో డైలామా మొదలైనట్లు వినికిడి. చెర్రీ ఇవ్వాల్సిన క్లారిటి ఏంటో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడటానికి రిజన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..
 
రామ్ చరణ్ ఎప్పుడూ అభిమానులను కాస్త టెన్షన్ పెడుతూనే ఉంటాడు. అసలే గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. దీంతో చెర్రీ కొత్త సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఆత్రుతకి అపోజిట్ గా చెర్రీ వ్యవహరిస్తుండడంతో మెగా ఫ్యాన్స్  టెన్షన్  పడుతున్నరట.

బ్రూస్ లీ సినిమా రిలీజై ఆరు నెలలు గడుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తని ఒరువన్ రిమేక్ లో నటిస్తున్నట్లు చరణ్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ లేదు. మరో వైపు చిరంజీవి 150 వ సినిమా గురించి మూడేళ్లుగా ఊరిస్తునే ఉన్నారు.  

చరణ్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు తప్పా కొత్త మూవీ స్టార్ట్ చేయడం లేదనేదే మెగా ఫ్యాన్స్ బాధగా కనిపిస్తోంది. ఓ వైపు బాబాయి సర్ధార్ గబ్బర్ సింగ్ తో రెడీ అవుతున్నాడు. బన్నీ సరైనోడిగా రంగంలోకి దిగబోతున్నాడు. ఆఖరికి బావ సాయిధరమ్ తేజ్ కూడా సుప్రీమ్ గా సిద్దంగా ఉన్నాడు. ఇలా మెగా హీరోలందరూ కొత్త సినిమాలతో సిద్దంగా ఉంటే బిగ్ బాస్ చోటా బాస్ కొత్త సినిమాలెప్పుడు స్టార్ట్ అవుతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. మరి ఫ్యాన్స్ బాధను అర్ధం చేసుకుని చెర్రీ త్వరగాసినిమా స్టార్ట్ చేస్తాడో చూస్తాడో చూడాలి.

07:40 - March 29, 2016

ఆ ఛాన్స్ అందాల రాక్షసినే వరించినట్లు తెలుస్తోంది. ఓ క్రేజీ ఛాన్స్ కోసం ముగ్గురు భామల మధ్య పోటీ జరిగింది. కానీ చివరకు ఆ ఛాన్స్ లావణ్య త్రిపాఠీకే దక్కినట్లు టాక్. అందాల రాక్షసి భామ అందుకున్న ఆ క్రేజీ ఛాన్స్ ఏంటో ఈ వార్త చదువుదాం..

హీరోయిన్  లావణ్య త్రిపాఠి క్రమంగా పెర్ఫామెన్స్ పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది.  అంతేకాదు సినిమాల ఎంపికలో ఈ భామ ఆచితూచి అడుగులేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్న లావణ్యత్రిపాఠీ స్పీడ్ పెంచుతోంది.

లావణ్య త్రిపాఠీ భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో వరుస హిట్స్ దక్కించుకుని లక్కీడాళ్ అనిపించుకుంది. ఈ బ్యూటీ మెగా హీరోయిన్ అనిపించుకోవాలని ఆరాటపడుతోంది.  ప్రస్తుతం ఈ భామ మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ సరసన శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు మరో మెగా  ఛాన్స్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మొదట రకూల్ ప్రీతిసింగ్, కాజల్ లాంటి హీరోయిన్స్ ని పరిశీలించారు. కానీ చివరికి ఈ ఛాన్స్ లావణ్యత్రిపాఠీ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. అల్లుశిరీష్, వరుణ్ తేజతో చేసే సినిమాలు హిట్టు అయితే లావణ్య మెగా హీరోయిన్ అయిపోయిట్లే మరి.

టీడీపీ లీగల్ సెల్ అడ్వైజర్ పై దాడి..

కర్నూల్ : నంద్యాలలోని రైతు నగర్ వద్ద  టీడీపీ లీగల్ సెల్ అడ్వైజర్ తులసీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. తులసీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 

బాలుడు కిడ్నాప్..

హైదరాబాద్ : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోల బాలుడు కిడ్నాప్ కు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు అజిత్ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

07:26 - March 29, 2016

సిని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఎక్కువ. సేమ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ కూడా ఓ సెంటిమెంట్ ని వదలడం లేదు. అచ్చొచ్చిన ఓ సెంటిమెంట్ ని ఈ డ్యాన్స్ మాస్టర్ తన నెక్ట్స్ మూవీకి కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ లారెన్స్ ఫాలో అవుతున్న ఆ సెంటిమెంట్ ఏమిటో ఈ వార్త చదవండి..

స్టార్ కొరియెగ్రఫర్ గా హవా సాగించిన లారెన్స్ కొరియోగ్రఫి కి పుల్ స్టాప్ పెట్టి యాక్టింగ్, డైరెక్షన్ బాట పట్టిన విషయం తెలిసిందే. దర్శకుడిగా స్టార్టింగ్ లో మంచి సక్సెస్ లే కొట్టాడు. ఈ క్రమంలో ఆయన డైరెక్ట్ చేసిన డాన్, రెబల్ సినిమాలు లారెన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతేనా ఈ సినిమాల రిజల్ట్ వల్ల లారెన్స్ తెలుగులో ముఖం చూపించలేకపోయడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ముని సీక్వెల్ కాంచన2  సినిమా లారెన్స్ కి దర్శకుడిగా నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.  గంగ టైటిల్ తో తెలుగులో డబ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ లను రాబట్టింది. అయితే ఇప్పుడు లారెన్స్ ఈ మూవీ సెంటిమెంట్ ని ఫాలో అవుతుండడం విశేషం. 

మెట్ట శివ కెట్టా శివ టైటిల్ తో లారెన్స్ కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతోంది. విశేషమేంటి ఈ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నప్పటికి లారెన్స్ గుండుతోనే కనిపించబోతున్నడట. కలిసొచ్చిన గుండు తనకు మరో సక్సెస్ ఇస్తోందని ఈ డాన్స్ మాస్టర్ నమ్ముతున్నాడట. మరి లారెన్స్ నమ్మకం ఎంత వరకు నిజం అవుతోందో చూడాలి.
 

07:11 - March 29, 2016

బడి సమాజాన్ని ప్రతిబింబించాలని, అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలతో ఒకే స్కూళ్లో చదివినప్పుడు విద్యావ్యవస్థ పురోగాభివృద్ధి సాధిస్తుందని యూటిఎఫ్ నేత నర్సిరెడ్డి అన్నారు. 'విద్యా వ్యవస్థ'పై నిర్వహించిన 'జనపథం' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. '62 లక్షల మందికి ప్రభుత్వ స్కూళ్లలోనే చెప్పొచ్చు. కొత్త బడులు అవసరం లేదు. ఉన్న స్కూళ్లను బాగు చేయాలి. మధ్య తరగతి చదువులపై భారం పడుతుంది. జీతంలో 30శాతం నుంచి 50 శాతం ఫీజులకే వెచ్చించాల్సి వస్తోంది. టీచర్లను ఇవ్వకుండా సక్సెస్ స్కూళ్లు ఫెయిల్ అయ్యాయనడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం గతేడాది కంటే బడ్జెట్ లో విద్యకు 445 కోట్లు తగ్గించింది. ఉపాధ్యాయుల, ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల పిల్లలు గవర్ణమెంటు స్కూళ్లలో చదవాలని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. పాఠ్య పుస్తకాలు పెద్ద వ్యాపారం అయిపోయింది. వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.' అని తన అభిప్రాయాల్ని వెల్లడించారు.  ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు ఫోన్ చేసి తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. విద్యా వ్యవస్థ సమగ్ర విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో చూడండి. 

07:05 - March 29, 2016

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుతున్న మొత్తానికి మూడింతలకు పైగా త్వరలో జీతాలు పెంచుతూ శాసనసభ తీర్మానం చేయనంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపు బిల్లును మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంగళవారం ఆ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. 
జీతం చాలడం లేదు..
ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు అన్నీ కలిపి నెలకు 83 వేల రూపాయలు అందుతున్నాయి. అయితే ఈ జీతం చాలడంలేదంటూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు గత సమావేశాల్లో ముఖ్యమంత్రిని కోరారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాల పెంపుదలపై ఎమినీటీస్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
42 కోట్ల 67 లక్షల భారం..
ఇటీవల భేటీ అయిన కమిటీ.. ఇకనుంచి నెలకు కనీసం 3.5 లక్షల రూపాయల వేతనంతో పాటు.. అదనంగా వాహనం కోసం రుణసౌకర్యం,.. సొంత ఇంటి కోసం రుణ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి 2.30 లక్షల రుపాయల వేతనంతో పాటు అదనంగా మరో 50 వేల రూపాయల వరకు అలవెన్స్ రూపంలో దాదాపు 3 లక్షల రూపాయలు ప్రతినెలా  అందేలా ప్రతిపాదించింది. అలాగే ముఖ్యమంత్రికి 2లక్షల 58వేలు వేతనం ఉండాలని ఇదే వేతనం ఇతర క్యాబినెట్‌ హోదాలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, చీప్‌విప్‌, ప్రతిపక్ష నేత, తదితరులకు వర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మాజీలు 30 నుంచి 50వేల వరకు అందుకోనున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన వారికి 30వేలు ఉంటే.. రెండుసార్లు ఎన్నికైన వారికి 35వేలు ఉంటుంది. ఏడాదికి ఐదువేల చొప్పున వేతనం పెరుగుతుంది. ఇది 50వేలకు మించదు. ఇవే ప్రతిపాదనలకు అంగీకరిస్తూ శాసనసభలో ఈ బిల్లును సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై మంగళవారం చర్చ జరుగనుంది. ఆ తర్వాత బిల్లు ఆమోదం పొందనుంది. కొత్త వేతనాల బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 42 కోట్ల 67 లక్షల భారం పడనుంది. 
ఇళ్లు కూడా..
అంతేకాదు.. శాసనసభ్యలకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ సమీక్షలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. మంత్రి హరీష్‌రావ్ నేతృత్వలో పలువురు శాసనసభ్యులు భేటీ అయ్యారు.  ఇప్పటివరకూ మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించారు. వీటిలో ఓ స్థలాన్ని త్వరలోనే  ఫైనల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
వేతనాల కోసం కాదు : సున్నం..
మరో రెండు రోజుల పాటు  సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో బిల్లుకు ఆమోదం వేయడం ఇక లాంఛనంగానే భావించవచ్చు. అయితే వేతనాల పెంపు బిల్లుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శాసనసభ్యులు గెలిచింది వేతనాల కోసం కాదని.. త్యాగనిరతితో ప్రజలకు సేవ చేసేందుకే అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. కొత్త రాష్ట్రంలో వీలున్నంతవరకు ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించాలి తప్ప..పెద్ద మొత్తంలో వేతనాలు, ఇతర సౌకర్యాలు పెంచడాన్ని ప్రజలు హర్షించబోరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

06:56 - March 29, 2016

హైదరాబాద్ : విద్యా వ్యవస్థపై తెలంగాణ శాసనమండలిలో వాడివేడిగా చర్చలు సాగాయి. ఎడ్యుకేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని అధికార పక్షం స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికార పార్టీ... ప్రతిపక్ష సభ్యుల సూచనలు కోరింది. 
అక్షరాస్యత శాతాన్ని పెంచాలి..
విద్యావ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అక్షరాస్యత శాతాన్ని భారీగా పెంచాలి. ఇలాంటి అనేక లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికార పక్షం టిఆర్ఎస్ శాసనమండలిలో స్పష్టం చేసింది. దేశ అక్షరాస్యత శాతం 73 కాగా మన రాష్ట్రంలో 66 శాతానికి దిగువనే ఉండిపోయిందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు విద్య కోసం చేసే ఖర్చును పెట్టుబడిగా భావించడమే విద్యావ్యవస్థ నీరుగారడానికి ప్రధాన కారణమని ఆరోపించారు.
ప్రైమరీ స్కూళ్ల విలీనం..
ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరు అవుతుండడం, పాఠాలు సరిగ్గా చెప్పకపోవడం, ఇంగ్లీష్ మీడియంపై ఆదరణతో ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చేరుస్తున్నారని కడియం సభకు వివరించారు. ప్రైమరీ స్కూళ్లను విలీనం చేయడం ద్వారా వాటి శాతాన్ని తగ్గించి మెరుగైన ఫలితాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కేజీ టు పీజీ విధానాన్ని రెసిడెన్షియల్‌ పద్ధతిలో ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. 
ప్రమాద ఘంటికలు..
విద్యా వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని వెంటనే మేల్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. అత్యవసరంగా తీసుకోవలసిన, రెండేళ్లలో చేపట్టాల్సిన చర్యలపై మేథావులతో చర్చించాలన్నారు. మ్యానిఫెస్టోలో గొప్పగా చెప్పుకున్న కేజీ టు పీజీ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాలయాల్లో ఉచితంగా సీట్ల కేటాయింపు జరగడం లేదని ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు మూడు వేల కోట్లదాకా పెండింగ్ ఉందన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీలను అరికట్టేందుకు విద్యా నియంత్రణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని సూచించారు.
అందుకే విద్యా వ్యవస్థ పతనం..
ప్రైవేట్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడం వల్లే విద్యావ్యవస్థ పతనమైందని టీఆర్‌ఎస్ సభ్యుడు కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యావ్యవస్థకు సంబంధించిన 60 పేజీల బుక్‌లెట్‌ను కడియం సభ్యులకు పంపిణీ చేశారు. సభ‍్యులు ఆ పుస్తకాన్ని చదివి సూచనలు అందజేయడానికి వీలుగా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

06:48 - March 29, 2016

హైదరాబాద్ : 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుదేశం పిలుస్తోంది..రా.. కదలిరా అంటూ ఎన్టీఆర్  ఇచ్చిన పిలుపుతో వచ్చిన జ‌న‌సందోహం మ‌ధ్య 1982 మార్చి 29న టిడిపి పురుడు పోసుకుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఝలక్ ఇస్తూ ఆవిర్భవించిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారానికొచ్చింది. మళ్లీ ఒకదశలో తెలుగు దేశం పనైపోయింది.. ఇక ఆ పార్టీ మనుగడ కష్టమే అన్న స్థాయి నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో విజయంతో తిరిగి ఫామ్‌లోకొచ్చింది. మరోవైపు ఇలాంటి పార్టీకి ఇప్పుడు తెలంగాణలో కష్టమొచ్చిపడింది. ఆ కష్టాలకు చెక్‌ పెడుతూ ఇరు రాష్ట్రాల్లోనూ ప్రబలంగా ఎదగడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. 
ఎన్టీఆర్ ముద్ర.. 
తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక చిన్న గదిలో ప్రారంభమైంది. తద్వారా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఏపీ రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఆవిర్భవించారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు టిడిపికి బ్రహ్మరథం పట్టారు. అనంతర కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా కొనసాగుతూ వచ్చింది.  తొలుత ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు సారథ్యంలోజాతీయస్థాయిలో సైతం టిడిపి త‌న ముద్రవేసింది. అయితే 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు అధికారానికి దూరం కావడం... వైఎస్ హవాతో టిడిపి పనైపోయిందనే చర్చ ప్రారంభమైంది. ఇలాంటి స్థితిలో 2014లో జరిగిన ఎన్నికల్లో అంచనాలు తారుమారు చేస్తూ విజయం సాధించింది. నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ఇదే సమయంలో తెలంగాణ‌లో మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీగా టిడిపి అవతరించింది. కానీ తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితులు అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు నేతలను కలవరపెడుతున్నాయి. ఏపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ సంస్థాగత కమిటీలను వేసుకుని పునాదులను బలపరుచుకుంటున్నా తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో తిరిగి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడింది టిడిపి. ఇక కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట అభ్యర్థులను నిలబెట్టాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. ఇప్పటికే అండమాన్ దీవుల్లో కార్పొరేటర్ స్థానాన్ని గెలవటంతోపాటు చాలా స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలో కీలక నేతగా ఎదిగేందుకు ప్రజలకు దగ్గరయ్యేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శితో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
జాతీయ స్థాయిలో..
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించినా జాతీయ స్థాయిలో రాజకీయాలపై తన ముద్రవేసింది. ఏపీ విభజనతో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరుణంలో భవిష్యత్తులో త‌న‌దైన ప్రత్యేక‌త‌ను చాటుకోవడానికి టిడిపి ప్రయ‌త్నం చేస్తోంది.

06:35 - March 29, 2016

హైదరాబాద్ : అల్వాల్ రైతు బజార్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లారం రైల్వే వంతెనపైనుంచి ఓ కారు, బైక్ కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ 10 ఏళ్ల బాలిక కూడా ఉంది. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదులో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. యాక్సిడెంట్ దృష్యాలు చూడాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి.

06:32 - March 29, 2016

కడప : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్యా, భర్తలను అతి కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మైదుకురు పట్టణంలో అయ్యవారయ్య, నాగులు దంపతులు సోమవారం రాత్రి మేడపైన నిద్రిస్తున్నారు. అర్థరాత్రి దుండగులు  కత్తులు గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియోలు క్లిక్ చేయండి. 

ఘోర రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : అల్వాల్ రైతు బజార్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లారం రైల్వే వంతెనపైనుంచి ఓ కారు, బైక్ కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై వెళ్తున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఢిల్లీకి టి.కాంగ్రెస్

హైదరాబాద్ : నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి వెళ్లనున్నారు. హెచ్.సి.యు ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ టి.కాంగ్రెస్ సభ్యులు కలవనున్నారు. 

నేడు టిడిపి 35వ వార్షికోత్సవం

హైదరాబాద్ : నేడు తెలుగుదేశం పార్టీ 35వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా టిడిపి వార్షికోత్సవ సంబరాలు జరిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. 

టి.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు

హైరదాబాద్ : నేడు కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లు స్పీకర్ మధు సూధనాచారి తెలిపారు. సోమవారం కూడా టి.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

లంకపై సౌతాఫ్రికా ఘన విజయం

హైదరాబాద్ :టి-20 ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన నామ మాత్రపు మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా లంకను 120 పరుగులకే కట్టడి చేసింది. తదనంతరం బ్యాటింగ్ కు దిగి 18 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. 

Don't Miss