Activities calendar

01 April 2016

యూడీఎఫ్ కు ఓటమి-ఇండియా టివి-సివి ఓటర్ సర్వే..

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టివి - సివి ఓటర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. కేరళలలో అవినీతిలో కుంభకోణాల్లో కూరుకపోయిన అధికార యూడీఎఫ్ కు ఓటమి తప్పదని సర్వే పేర్కొంది. కేరళ (140) : ఎల్డీఎఫ్ 86, యూడీఎఫ్ 53, బీజేపీ 1,
పుదుచ్చేరి 30 : కాంగ్రెస్ 17, ఏఐఎన్ఆర్ సి 7, ఏఐఏడిఎంకే 1 బీజేపీ 0, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధిస్తారని సర్వే తెలిపింది. 

ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ రాజ్ ఏఈ

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ ఏఈ వెంకటేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. సరూర్ నగర్ లోని తన ఇంట్లో రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిసున్నారు. 

4న వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 4న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటంపై దృష్టి సారించనున్నారని పేర్కొన్నారు.

శనివారం ఈడీ ఎదుట మాల్యా హజరౌతారా ?

ఢిల్లీ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా శనివారం ఈడీ ఎదుట హాజరు కావడం లేదని తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు ఈడీ మరింత గడువు పెంచే అవకాశాలున్నట్లు పీటీఐ వార్త సంస్థ ప్రచురించింది. మార్చి 18లోగా ఈడీ ముందు హాజరుకావాలని గతంలో కూడా మాల్యాకు నోటీసులు జారీ చేశారు. అయితే వీటిపై మాల్యా మరింత సమయం కావాలని కోరడంతో.. ఏప్రిల్ 2 లోగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

కోల్ కతాకు వెళ్లనున్న రాహుల్..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 2న కోల్‌కతాకు వెళ్లనున్నారు. గణేష్ పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయి 24 మంది మృతి చెందిన విషయం విదితమే.

 

21:32 - April 1, 2016

ముంబై : ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడింది. పాపులర్ హిందీ సీరియల్ 'బాలికా వధు'లో ఆనంది పాత్ర పోషించింది. 'చిన్నారి పెళ్లి కూతురు' పేరుతో తెలుగులో బాలికా వధు ప్రసారమౌతోంది. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

21:28 - April 1, 2016

హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నాయి..కోట్లు ఖర్చవుతున్నాయి. అయినా అన్ని అడ్డంకులే. ఇదీ చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు రెడీ అయింది సర్కార్. సరికొత్త ప్రణాళికలతో చార్మినార్ పరిసరాలను సుందరీకరించేందుకు సర్కార్‌ డిసైడ్ అయింది. ప్రాజెక్టు డిలే అవడానికి గల కారణాలను.. డీపీఆర్ ను సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న చార్మినార్ ఇప్పుడు ట్రాఫిక్ పొల్యూషన్‌తో పాటు నియంత్రణలేని వ్యవస్థతో కళను కోల్పోతోంది. ఈ చారిత్రక కట్టడం దాని పరిసరాల్లోని పరిస్థితులు నానాటికి మరింత దిగజారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ చార్మినార్ ను పరిశీలించారు. కేటీఆర్‌ తో పాటు మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యే పాషా ఖాద్రీ చార్మినార్ పరిసరాలను పరిశీలించారు.

వాహనాలను నిషేధించాలి..
చార్మినార్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాహనాలను నిషేధించాలన్నారు. అక్కడికి పర్యాటకులు కేవలం నడుచుకుంటూ వెళ్లేలా ప్లాన్ వేశారు. చార్మినార్ చుట్టూ వాటర్ ఫౌంటేన్ లు, కారిడార్ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 23 కోట్ల రూపాయల పనులు జరిగినట్లు చూపించారు కాని వాస్తవానికి సగం పనికూడా జరగలేదు.
పెడెస్ట్రియల్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు కిలోమీటర్ మేర పనులు చేసినట్లు అధికారులు తెలిపారు. లార్డ్ బజార్ ,శాలిబండ రూట్లలో పనులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు మంత్రి కేటీఆర్. పర్యాటకుల సౌకర్యార్థం బ్యాటరీ ఆటోలను అందుబాటులో ఉంచుతామన్నారు. మోడ్రన్ లైటింగ్ తో మౌలికవసతులు కల్పిస్తామని చెప్పారు. స్థానిక వ్యాపారులు, హాకర్ల అభిప్రాయాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. చార్మినార్‌ సమీపంలోని సర్దార్‌ మహల్‌లో ఫుడ్‌కోర్ట్‌, మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. చార్మినార్ అభివృద్దిని అంకెల్లో చూపించిన అధికారులు పర్యాటకుల వసతులను మాత్రం గాలికి వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అక్కడే కూర్చుని అందాలను చేసేందుకు వీలు లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పెడెస్ట్రియల్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు.

21:25 - April 1, 2016

హైదరాబాద్ : కోల్‌కతా ఫ్లై ఓవర్‌ దుర్ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో ఐవీఆర్సీఎల్ కంపెనీ ప్రతినిధులను కోల్‌కతా పోలీసులు విచారించారు. మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. కంపెనీ ఛైర్మన్‌ సుధీర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి పోలీసులు నోటిసులిచ్చారు. 4 రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కోల్‌కతాలో గురువారంనాడు ఫ్లైఓవర్‌ కూలి 24 మంది మృతి చెందారు. 85 మందికి గాయాలయ్యాయి. వంతెన నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీంతో కోల్‌కతా పోలీసులు విచారణ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు.

21:23 - April 1, 2016

నిజామాబాద్ : మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం వహించొద్దని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.. ఈ పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.. భగీరథ పైప్‌లైన్లు వెళ్లే రైతుల పొలాల్లో ఈ నెల 31లోపు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు.. విత్తనాలు వేసినతర్వాత పంట పొలాల్లో పైప్‌లైన్లు వేయొద్దన్నారు.. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సహకారం తీసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు.. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షలో వివిధ అంశాలపై సీఎం అధికారులకు సూచనలిచ్చారు..

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య..

ముంబై : ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడింది. పాపులర్ హిందీ సీరియల్ 'బాలికా వధు'లో ఆనంది పాత్ర పోషించింది. 'చిన్నారి పెళ్లి కూతురు' పేరుతో తెలుగులో బాలికా వధు ప్రసారమౌతోంది. 

సినీ నిర్మాత శింగనమలకు జైలు శిక్ష..

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ కు రెండు వేర్వేరు కేసుల్లో ఏడాది జైలుశిక్ష పడింది. రెండు చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయస్థానం రమేష్ ను దోషిగా నిర్ధారించింది. 

20:48 - April 1, 2016

రాష్ట్రంల పెద్ద రైతు మన కేసీఆర్ సారే.. ఐద్రావాద్ల నీళ్లకు పబ్లిక్కు.. ఇంత గోసవడ్తున్నరు... గదా.. బీర్లు కోటర్లు తయారు జేస్తందుకు నీళ్లు ఏడ్కెల్లి వొస్తున్నై గావొచ్చు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కజెయ్యని వీరుడు.. పోరాటాల శూరుడు తలసాని శ్రీనివాసన్నకు తల్కాయనొప్పొచ్చింది..టెక్నాలజీని వాడుకునుట్ల..ఈసారి బీజేపోళ్లే ఫస్టున్నరేమో అనుకున్నంగని..అమ్మో..టీఆర్ఎస్ పార్టీ గూడ ఏం తక్వలేదు..మన జైళ్ల శాఖోళ్లను ఏమో అనుకుంటంగని.. వాళ్లు మాత్రం సూపర్..అందరికి ఒక్కటే దమాకుంటే.. నరేంద్రమోడీ సారుకు.. నరనరంల ఒక్కొక్క దమాకు ఉండెతట్టున్నది..నిన్న వెస్టిండిస్ మీద ఓడిపోంగనే.. మీడియా సమావేశం బెట్టిన ధోని అండ్ల ఏం జేశిండో..

'రాసలీల' ఘటనలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..

విశాఖపట్టణం : ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాసలీల ఘటనలో ముగ్గురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రమణమూర్తి, నర్సీపురం సురేష్, మునికుమార్ లను సస్పెండ్ చేస్తూ టిటిడి ఈవో సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. 

అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ మరియు బిల్డింగ్ ఓవర్ సీర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్పీ విడుదల చేసింది. 123 పోస్టులకు గతేడాది టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో 121 మంది అభ్యర్థుల పేర్లను ఉంచింది. త్వరలో మరో రెండు పోస్టుల ఫలితాలను వెల్లడించనుంది. 

20:09 - April 1, 2016

మేడ్చల్ నియోజకవర్గంలో ఎవరూ చనిపోయినా వారికి రూ. 10వేలు ఆర్థిక సహాయం చేస్తే తనకు తృప్తి అని స్కైలాబ్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొని 'మల్లన్న'తో ముచ్చట్లు చెప్పిండు. నియోజకవర్గంలో పేద కుటుంబంలో ఎవరూ చనిపోయిన వారికి రూ. 10వేలు అందచేయడం జరుగుతుందని, అలాగే మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద కుటుంబంలో తాను జన్మించానని, ప్రజా సేవ చేయడంలో తృప్తి వస్తుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో పేదలు ఎవరూ చనిపోయినా తన నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. ఫోన్ నెంబర్ : 9848045569.

19:56 - April 1, 2016

గోదావరి కృష్ణా నీటిలో 954 టీఎంసీలు వినియోగించుకొని రాష్ట్రంలో 96 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల రీ డిజైన్‌ వంటి అంశాలపై గురువారం రాష్ట్ర శాసనసభలో దాదాపు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి మాట్లాడారు. గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కృష్ణా గోదావరి బేసిన్‌లలోని వివిధ ప్రాజెక్టుల గురించి కేసీఆర్‌ వివరించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లారెడ్డి (అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), వకుళా భరణం కృష్ణమోహన్ (టి.కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

ఐవీఆర్సీఎల్ ప్రతినిధులను ప్రశ్నించిన కోల్ కతా పోలీసులు..

హైదరాబాద్ : ఫ్లై ఓవర్ దుర్ఘటనలో కోల్ కతా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఐవీఆర్సీఎల్ కంపెనీ ప్రతినిధులను మూడు గంటల పాటు కోల్ కతా పోలీసు బృందం ప్రశ్నించింది. 41(ఎ) సీఆర్ పీసీ కింద ఐవీఆర్ సీఎల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఛైర్మన్ సుధీర్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 

పంజాబ్ లో బీజేపీకి షాక్..

పంజాబ్ : రాష్ట్రంలో బీజేపీ షాక్ తగిలింది. బీజేపీకి నవజ్యోత్ సింగ్ సతీమణి నవజ్యోత్ కౌర్ రాజీనామా చేశారు. సిద్ధూ దంపతులు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. 

పాక్ కు వెళ్లనున్న భారత దర్యాప్తు బృందం..

ఢిల్లీ : భారత దర్యాప్తు బృందం పాక్ దేశానికి వెళ్లనుంది. పఠాన్ కోట్ ఘటన దర్యాప్తులో భాగంగా పాక్ కు వెళ్లనుంది. 

చెరువుల అభివృద్ధికి టిటిడి ఖర్చుపై హైకోర్టులో పిల్...

చిత్తూరు : తిరుపతి చుట్టుపక్కల చెరువుల అభివృద్ధికి టిటిడి నిధులు ఖర్చు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సంఘం నేత గోపాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు.

 

కోల్ కతాలో బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ..

పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గురువారం సాయంత్రం ఉత్తర ప్రాంతంలోని గిరీష్ పార్కు సమీపంలోని బర్రా బజార్ లో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. వీరికి నివాళులర్పిస్తూ బీజేపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ పై దాడి..

హైదరాబాద్ : సంగీత దర్శకుడు శశిప్రీతమ్ పై దాడి జరిగింది. శశి ప్రీతమ్ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దాడిలో శశిప్రీతమ్ ముఖానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కుంభకోణం - ఉత్తమ్..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పెద్ద కుంభకోణమని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం భ్రమలు కల్పించారని, వీరి పాలనలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. 

ఏనుగు బీభత్సం..ఇద్దరు మృతి..

తమిళనాడు : రెండు వేర్వేరు సంఘటనల్లో ఏనుగు సృష్టించిన బీభత్సం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పండలూరు ప్రాంతంలో గురువారం రాత్రి ఓ ఘటన జరగగా ఈ ప్రాంతానికి సమీపంలో మరో మృతదేహం లభ్యమైంది. 

నిజాం సాగర్ కాల్వలు మరమ్మత్తు చేయాలి - కేసీఆర్..

నిజామాబాద్ : నిజాంసాగర్ కింద ఉన్న కాల్వలు పాడైపోయ్యాయని, వాటిని మరమ్మతు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో కరువు ఉందని, ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూపాయి ఖర్చు లేకుండా నిజాం సాగర్‌ను నింపుకోవచ్చని తెలిపారు. 

18:52 - April 1, 2016

వారం తిరిగేలోపు కొత్త సినిమాతో థియేటర్లోకి వచ్చేస్తున్నాడు నారా రోహిత్. ఈ వారం సావిత్రి సినిమాతో తెరపైకి వచ్చాడు. టైటిల్ చూసి లేడీ ఓరియెంటెడ్ సినిమా అనే అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో ఇలాంటి పేర్లతోనే స్టార్ హీరోలు సూపర్ హిట్స్ అందుకున్నారు. టైటిల్ పాజిటివ్ గా ఉంది...మరి సినిమా అలాంటి పాజిటివిటీనే కంటిన్యూ చేసిందా....చూద్దాం..

కథ..
కథ గురించి చెప్పుకుంటే...నందిత ఓ పల్లెటూరి అమ్మాయి. చిన్నప్పటినుంచి పెళ్లిపై కలలు కంటూ ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలన్నది ఆమె జీవిత లక్ష్యం. ఇలాంటి అమ్మాయికి నారా రోహిత్ ఎదురవుతాడు. నందితను చూడగానే లవ్ లో పడిపోతాడు. అనేక సందర్భాల తర్వాత నందిత కూడా రోహిత్ ను ఇష్టపడటం మొదలు పెడుతుంది. ఐతే...వాస్తవంలో తాను ఫీల్ అవుతున్న ప్రేమను కాదనుకుని...చిన్నప్పటి నుంచి ఊహించుకుంటున్న పెళ్లి తంతు గురించే ఆలోచిస్తుంటుంది. మరి ఈ అమ్మాయి మనసును హీరో ఎలా మార్చాడు. తనతో పెళ్లికి ఎలా ఒప్పించాడన్నది మిగిలిన కథ.

నటీ నటుల అభినయం..
కథ తెలిసినదే ఐనా...పాత్రలను ఆకట్టుకునేలా మలిచాడు దర్శకుడు పవన్ సాధినేని. కృష్ణ చైతన్య మాటలు సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. పెళ్లీడుకొచ్చిన హీరోయిన్ ఇంకా చిన్నప్పటి కలనే పట్టుకుని వేలాడటం ఓ మైనస్ పాయింట్. ఈ ఒక్క అంశం తప్ప కథలో ఎలాంటి సంఘర్షణ లేకపోవడం సినిమాను తేల్చేసింది. సెకండాఫ్ స్లోగా సాగినా....క్లైమాక్స్ ఆకట్టుకుంది. దీంతో అపజయం అంచు నుండి బయటపడింది సినిమా. నారా రోహిత్, నందిత, పోసాని, ప్రభాస్ శ్రీను సహా ఇతర ప్రధాన పాత్రల్లో నటులంతా బాగా ఫర్మార్మ్ చేశారు. సినిమాటోగ్రఫీ, మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఫ్లస్ పాయింట్స్
ఫస్టాఫ్
ప్రధాన పాత్రల చిత్రణ
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
పాత కథ
ఆకట్టుకోని కథనం
నెమ్మదించిన సెకండాఫ్
పాటలు

18:49 - April 1, 2016

కిల్లింగ్ వీరప్పన్ హిట్టు తరువాత రామ్ గోపాల్ వర్మ మళ్లీ పాత బాణీలోకి వచ్చేస్తాడని, మళ్లీ శివ, గాయం రేంజ్ లో సినిమాలు తీస్తాడని అనుకున్నారు జనం. ఎటాక్ సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. నిజమే మళ్లీ రాము పాత రాము అయిపోయాడు. అయితే ఇక్కడో ట్విస్టేంటంటే రామ్ గోపాల్ వర్మ పాత బాణీలోనే మళ్లీ గాయం, రౌడీ, బెజవాడ లాంటి సినిమాయే తీసాడు. అదే కథ, అవే చంపుకోవడాలు, అవే కక్షలు అవే గొడవలు. ఇంకా చెప్పాలంటే మళ్లీ అదే కథతో అదే సినిమా తీసాడు. కథ, కథనాల్లో కొత్త దనమేమీ లేదు. చూపిన సీన్సన్నీ అతడు తీసిన పాత సినిమాల్ని గుర్తుకు చేసి తరువాత జరగబోయేదేంటో ఊహించుకొనే రేంజ్ లో తీసాడు. అయితే రాము ట్రేడ్ మార్క్ షాట్స్, సినిమాలోవేగాన్ని మాత్రం వదిలిపెట్టలేదని చెప్పుకోవాలి. కొత్త దనం కొరవడిన ఈ సినిమాని జనం ఎలా రిసీవ్ చేసుకుంటరనేదే అసలు సమస్య.

కథ..
సినిమా ఓపెనింగ్ ఓపెనింగే ప్రకాష్ రాజ్ ను చంపే సీన్ తో మొదలౌతుంది. గతంలో రౌడీ షీటర్ గా ఉండే గురుదాస్ పాత గొడవలు వదిలిపెట్టి కుటుంబం కోసం ఓ బిజినెస్ చేసుకొని బతుకుతుంటాడు. అతడి హత్యతో మళ్లీ కుటుంబంలో కలకలం రేగుతుంది. పెద్ద కొడుకు జగపతిబాబు, రెండో కొడుకు వడ్డే నవీన్, ఆఖరి కొడుకు మంచు మనోజ్ లకు తండ్రంటే ప్రాణం. ముఖ్యంగా పెద్ద కొడుకు తండ్రి హత్యకు సమాధానం చెప్పాలని తండ్రి గురుదాస్ శత్రువైన నరసింహాన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. కానీ రెండో కొడుకు గొడవలన్నీ వద్దని అన్నతో గొడవపెట్టుకుంటాడు. ఆఖరి కొడుకు రాధకి ఈ గొడవలేమీ తెలియవు. ఈ క్రమంలో జగపతిబాబు ను కూడా హత్య చేస్తారు. చివరి కొడుకు మంచు మనోజ్ ఇవన్నీ ఎవరు చేసారని కూపీలాగి.. పగ తీర్చుకోవడమే ఎటాక్ .

నటీ నటుల అభినయం..
మంచు మనోజ్ కి నిజంగా ఇలాంటి సినిమాలు కొత్తే. అతడి క్రేజ్ ను బట్టి ఇందులో అతడికి హై ఓల్టేజ్ హీరోయిజం ఇచ్చాడా అంటే అదేమీ లేదు. కథను బట్టి పాత్ర స్వభావాన్ని బట్టే మనోజ్ పాత్ర నడుచుకుంటుంది. ఇందులో మనోజ్ మీద జరిగే ఎటాక్కే దీనికి ఉదాహరణ. వెనకాల ఎటాక్ చేయడానికి తరుముతూ ఉంటే మామూలు యాక్షన్ మూవీస్ లో చూపించినట్టు వాళ్ళమీద హీరో తిరగబడి కొట్టడు. మామూలు వ్యక్తిలాగానే ప్రాణం కాపాడుకోడానికి పరుగుతీస్తాడు హీరో. ఒక్క క్లైమాక్స్ కు ముందే కొంచెం హీరోయిజం చూపిస్తాడు. మొత్తం మీద మంచు మనోజ్ ఎలాంటి వెకిలితనానికి పోకుండా తన పాత్రను సహజమైన తీరులో రక్తికట్టించాడు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర ను డైరెక్ట్ గా చూపించడు.. చనిపోయిన తరువాత కట్ షాట్స్ లో మాత్రమే ఆ పాత్రను ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తాడు. ఇక ఇందులో రొటీన్ గా ఉండే పాత్ర మాత్రం జగపతిబాబుపాత్రే. ఆయన పాత్రకు ఇందులో పెద్దగా ప్రాధాన్యముండదు. ఆ ప్లేస్ లో వేరే ఎవరు చేసినా సరిపోతాడు అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాకి చెప్పుకోదగినవి మాత్రం ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు. వర్మ పాత సినిమాల తరహాలోనే సీన్స్ కు మంచి డెప్త్ తీసుకొచ్చాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకోసారి డైలాగ్స్ ను డామినేట్ చేసి చిరాకు తెప్పిస్తుంది. మొత్తానికి ఎటాక్ సినిమా వర్మ ఈ ట్రెండ్ లో తీస్తున్న మామూలు చవకబారు సినిమాల్లోనే కలిసిపోయింది.

ప్లస్ పాయింట్స్
ఫోటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
స్ర్కీన్ ప్లే
కొత్తదనం లేకపోవడం
పాటలు

18:21 - April 1, 2016

న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రోజా సస్పెన్షన్‌ అంశం సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. రోజా పిటిషన్‌ ఇవాళ విచారణకు రావాల్సి ఉంది. సమయం ముగియడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు గురించి అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని రోజా అన్నారు. 

18:19 - April 1, 2016

విజయవాడ : వరికి కనీస మద్దతు ధర కల్పన.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. సిమెంట్ రోడ్ల విస్తరణపై ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర విషయంలో రాజీపడొద్దని కలెక్టర్లను ఆదేశించారు. వరికి కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఆయన ఉండవల్లిలోని నివాస గృహం నుండి కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో తూర్పు, పశ్చిమ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ నెల 5 వ తేదీ నుంచి నెల్లూరు 164, పశ్చిమ గోదావరి 260, తూర్పు గోదావరి జిల్లాలో 284 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం. రబీ సీజన్ లో 30 నుంచి 35 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా వేశారు. మిల్లర్లు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు కాల్ సెంటర్లు నెలకోల్పాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల పురోగతిని సీఎం సంబంధిత అధికారులతో చర్చించారు. ముగ్గురు ఇంజనీరింగ్ నిపుణులతో తనిఖీ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలోను నిర్ణీత వ్యవధిలోగా లక్ష్యాలను సాధించాలని సీఎం ఆదేశించారు. వరికి మద్దతు ధర చెల్లింపులో రాజీపడొద్దని అవసరమైతే ఉన్నవాటి కంటే మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

'షాదీ ముబారక్' నిధులు గోల్ మాల్...

హైదరాబాద్ : షాదీ ముబారక్ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ లో జూనియర్ అసిస్టెంట్ షాదీ ముబారక్ నిధులను కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు డీసీపీ ప్రభాకర్ ఆదేశించారు. కాగా పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రతిష్ఠాత్మకరంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఇంద్రాణీకి మరోసారి 'షాక్' ఇచ్చిన కోర్టు...

ముంబై : ముంబై నగరంలో తీవ్ర సంచలనం కలిగించిన షీనాబోరా హత్య కేసు లో  ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీయాకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనారోగ్యం కారణాలతో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవుసరమైతే  ఇంద్రాణి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. 

17:41 - April 1, 2016

వరంగల్: అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు పస్తులు ఉండాల్సిన ఆగత్యం ఏర్పడింది. తినకుండానే పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మ గూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ బుధవారం పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండడం చూసిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ తో పాటు సిబ్బంది అక్కడికక్కడనే సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారి స్థానంలో ఇతరులను నియమించలేదు. దీనితో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సమయానికి ఆహారం అందించలేకపోయారు. విద్యార్థులు ఏమి తినకుండానే పాఠశాలకు వెళ్లారు. పదో తరగతి విద్యార్థులు కూడా ఖాళీ కడుపుతోనే పరీక్షకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థినిలు కోరారు. 

17:35 - April 1, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రొ.యోగంద్ర యాదవ్ కు వర్సిటీలోకి అనుమతించలేదు. దీనితో పరిపాలన విభాగం వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీసీ అప్పారావును తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యోగేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు యూనివర్సిటీని కంటోన్మెంట్ లుగా మార్చారని, తనను ఎన్నోసార్లు సెమినార్లకు పిలిచిన వీసీ అప్పారావు ప్రస్తుతం సెమినార్ లో పాల్గొనేందుకు వస్తే అడ్డుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ అంటే దేవుల గుడి అని, గుడిలోకి ప్రొఫెసర్లను రిటైర్డ్ ఐఏఎస్ లు వెళ్లకుండా అడ్డుకోడం దారుణమన్నారు. 

4న చలో 'రాజ్ భవన్' : వామపక్షాలు

హైదరాబాద్ : ఏప్రిల్ 4న చలో 'రాజ్ భవన్ 'కు వామపక్షాలు, ప్రజాసంఘాలు పిలునిచ్చాయి. రోహిత్ మృతికి కారణమైన వీసీ అప్పారావును అరెస్ట్ చేసి కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కాగా హెచ్ సీయూ పీహెచ్ డీ స్కాలర్  విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

17:17 - April 1, 2016

నిజామాబాద్ : జిల్లాలోని అధికారులు వేగవంతంగా పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వీరిని ప్రజలు గమనిస్తుంటారని తెలిపారు. లక్ష్యాలు సాధిస్తేనే గొప్పవాళ్లు అవుతారని నేతలకు సూచించారు. గత ప్రభుత్వాల వలే పనిచేయవద్దని అధికారులకు సూచించారు. తెచ్చుకున్న తెలంగాణ గెలిచి నిలవాలని, కొత్త రాష్ట్రమైనా తెలంగాణను ప్రధాన మంత్రిని అభినందించారని గుర్తు చేశారు. తెలంగాణ కావడం కావడంతోనే నెంబర్ వన్ లెవల్ కు వెళ్లినట్లు తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ రోస్ 23వేల ఎకరాల భూమి సేకరించారని, నల్గొండ, మహబూబ్ నగర్ కలెక్టర్లు 25వేల ఎకరాల భూమి సేకరణ చేసి పెట్టారని పేర్కొన్నారు. ఇదే స్పీడులో పని చేయాలని జిల్లా అధికారులకు కేసీఆర్ సూచించారు. 

అన్ని దేవాలయాలలోకి మహిళలకు ప్రవేశం : ముంబై కోర్టు

మహారాష్ట్ర : ముంబై హైకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. అన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని మహారాష్ట్ర  ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వివక్ష చూపరాదనీ...ఆలయాలలో ప్రవేశించే  మహిళలకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా మహారాష్ట్ర లోని షిర్డీకి సమీపంలోని శని దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు వెలువరించిన ఈ తీర్పు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావించవచ్చు. 

16:18 - April 1, 2016

అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. రైతుల ఆగ్రహానికి టిడిపి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. కరవు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సీపీఎం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేపట్టిన ధర్నా ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


 

ఏపీ పై కేంద్రానికి వివక్ష తగదు : సీపీఎం నేత మధు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం వివక్ష చూపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు వేలకోట్లు ఖర్చవుతుంటే కేంద్రం నామమాత్రపు నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటోందనీ...రాష్ట్రంపై వివక్ష ధోరణి కేంద్రం విడనాడాలని డిమాండ్ చేశారు.

16:14 - April 1, 2016

పశ్చిమగోదావరి : పట్టపగలే జిల్లాలో ఓ ప్రజాప్రతినిధిని దారుణంగా హత్య చేశారు. కొవ్వూరు మండలంలోని ఔరంగాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 వార్డు నుండి కొవ్వూరు నుండి కౌన్సిలర్ గా గోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బండి మీద వస్తున్న ఇతడిని గుర్తు తెలియని దుండగులు అడ్డుకున్నారు. అనంతరం తెచ్చుకున్న మారణాయుధాలతో ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. దీనితో గోపాలకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. హత్య ఎవరు చేశారన్నది తెలియరాలేదు. హత్య చేసిన అనంతరం నిందితులు నిడదవోలు వైపుకు పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇసుక ర్యాంపు నిర్వాహణే కారణమని తెలుస్తోంది. గోదావరి నది తీరంలో ఔరంగాబాద్ లో రెండు వర్గాల మధ్య వివాదం ఉన్నట్లు, ఈ నేపథ్యంలో గోపాలకృష్ణను హత్య చేసినట్లు సమాచారం. ఇతరత్రా కారణాలు ఏమున్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

తెగబడ్డ మావోలు ముగ్గురు సీఆర్పీఎఫ్ జావాన్ల మృతి...

ఛత్తీస్‌గఢ్‌ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో   సీఆర్పీఎఫ్ జవాన్లటార్గెట్ చేసి మావోయిస్టులు మందుపాతర పేల్చి దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.

వరికి కనీస మద్దతు ధరలో రాజీ వద్దు :చంద్రబాబు

విజయవాడ : వరికి కనీస మద్ధతు ధర చెల్లించే విషయంలో ఎటువంటి రాజీ పడవద్దనీ...ఈ నెల 5 నుండి గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాంరంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నెల్లూరు-164,తూ.గో-264, ప.గో-260 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాప్యం చేయకుండా రైతుల ధాన్యానికి చెల్లింపులు చేయాలని చెప్పారు. 

15:34 - April 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన జల దృశ్యాన్ని కాంగ్రెస్, టిడిపి పార్టీలు తప్పుబట్టడాన్ని ఎంపీ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు దద్దమ్మ పార్టీలని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని, తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డారని విమర్శించారు. అవగాహన రాహిత్యంతోనే మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పై అవాక్కులు చవాక్కులు పేలితే ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఆ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎంపీ బాల్క సుమన్ హితవు పలికారు. 

15:30 - April 1, 2016

హైదరాబాద్ : తాను టెంప్ట్ అయి టిడిపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ మాజీ నేత జ్యోతుల నెహ్రూ కొట్టిపారేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు రాజకీయ పరిణితి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పదవి అక్కర్లేదని, పోస్టులను ఆశించిన రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని, ఈనెల 11న సీఎం చంద్రబాబును కలిసిన తరువాత పూర్తి వివరాలు ప్రకటిస్తానని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
ఇటీవలే జ్యోతుల నెహ్రూ వైసీపీ పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

పోలీసు కంటోన్మెంట్ గా క్యాంపస్ - ప్రొ. యోగేంద్ర..

హైదరాబాద్ : యూనివర్శిటీలను పోలీసు కంటోన్మెంట్ లుగా మార్చేశారని ప్రొ.యోగేంద్ర పేర్కొన్నారు. గతంలో వీసీ అప్పారావు అనేక సెమినార్లకు నన్ను పిలిచారని, కానీ ఇప్పుడు సెమినార్ లో పాల్గొనేందుకు వచ్చిన తమను లోనికి అనుమతించకపోవటం విడ్డూరంగా వుందని మండిపడ్డారు. సెమినార్ కు హాజరయ్యేందుకు వచ్చిన ప్రొ.యోగేంద్రయాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శాంతాసిన్హాను క్యాంపస్ ప్రధాన గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో హెచ్ సియూ గేటు వద్దే నిరసన తెలిపారు. 

15:18 - April 1, 2016

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.

పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్ధకం తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు మటు మాయమౌతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు..

చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.

పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.

పెరుగులో పోషకపదార్థాలు

నీటిశాతం 89.1%

ప్రోటీన్ 3.1%

క్రొవ్వులు 4%

మినరల్స్ 0.8%

కార్బొహైడ్రేట్స్ 3%

కాల్షియం 149 మి.గ్రా

ఫాస్పరస్ 93 మి.గ్రా

ఇనుము 0.2 మి.గ్రా

విటమిన్ - ఎ 102 ఐ.యు

విటమిన్ - సి 1 మి.గ్రా

మూసీ నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్...

హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మూసీ నదిని కేటీఆర్ పరిశీలించారు. మూసీనది అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

15:00 - April 1, 2016

ఫ్యాషన్ ప్రపంచం ఎన్ని కొత్త రకాల డ్రెస్సింగ్ ను పరిచయం చేస్తున్నా సారీ స్పెషాలిటీ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి సారీస్ లో హ్యాండ్ పెయింటెడ్ సారీస్ సెలక్షన్స్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:58 - April 1, 2016

విధి నిర్వహణలో భాగంగా మహిళలు ఏ సమయంలోనైనా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిపై జరిగే దాడులను తిప్పికొట్టాలంటే ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాలి. అలాంటి పద్ధతులేమిటో వీడియోలో చూడండి. 

14:55 - April 1, 2016

ప్రముఖ గాయని పి.సుశీల అరుదైన ఘనత సాధించారు. అనేక భాషలలో అత్యధిక పాటలు పాడినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పలువురు అవార్డులను అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు మహిళల రక్షణ కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపదలో ఉన్న వారి కోసం ప్రత్యేక సేవలను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. పర్వత మార్గాలలో ప్రయాణం సాధారణమైన విషయం కాదు. సముద్ర మట్టానికి ఎన్నో మీటర్ల ఎత్తులో ఉన్న కొండ మార్గంలో మోటార్ సైకిల్ పై వెళ్లడం సాహసోపేతమైన చర్య. అటువంటి సాహసాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించింది ఒక అతివ. బీజింగ్ నగరంలో జనాభాను పెంచేందుకు కుటుంబ నియంత్రణ విధానంలో సరికొత్త నిబంధనలను స్థానిక పాలన యంత్రాంగం ప్రవేశపెట్టింది. పునర్వివాహం చేసుకొన్న దంపతులు మరింతమంది సంతానాన్ని కనడానికి అవకాశం కల్పించింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై తెలంగాణా శాసనసభలో చర్చ జరిగింది. బాధితురాలికి న్యాయం చేసందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దేశ రాజధానిలో మహిళల భద్రత అంతంతమాత్రమేనంటోంది తాజా నివేదిక. ఆన్ లైన్ లో ప్రచురితమైన ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ రివ్యూ ఈ విషయాన్ని వెల్లడించింది. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టంను రద్దు చేయాలంటూ సుదీర్ఘకాలంగా నిరహారదీక్ష చేస్తున్న మణిపూర్ మణిపూస ఇరోమ్ షర్మిలను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. 

జులైలో 12వేల మంది ఉద్యోగుల తరలింపు: మంత్రి నారాయణ

గుంటూరు : రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ  తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జులై నెలలో 12 వేలమంది ఉద్యోగులను హైదరాబాద్ నుండి అమరావతికి తరలిస్తున్నట్లు చెప్పారు.

14:36 - April 1, 2016

నిజామాబాద్ : కడుపులో నొప్పొచ్చినా ఇంకేదైనా ఉదర సమస్య తలెత్తినా సహజంగా అంతా దవాఖానా బాటపడతారు. లేదా ఇంట్లోనే ఏదో ఒక మందు వేసుకుంటారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఓ పెద్ద రాతిగుండును ఆశ్రయిస్తారు. కడుపులో వికారంగా ఉన్నా అదే రాతి గుండు.. ఇతరత్రా ఏవైనా సమస్యలున్నా అక్కడికే వెళ్తారు. అసలా రాతి గుండు వ్యవహారమే చిత్రమైనది. అయితే అదంతా మూఢనమ్మకమని కొందరు కొట్టిపారేస్తుంటారు. ఇంతకి ఏంటా రాతి గుండు వ్యవహారం.? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హెచ్ సియూ గేటు వద్ద యోగేంద్ర, ఛాయారతన్ నిరసన..

హైదరాబాద్: హెచ్ సియూ లో సెమినార్ కు హాజరయ్యేందుకు వచ్చిన యోగేంద్ర యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్ ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు హెచ్ సియూ గేటు వద్ద నిరసన తెలుపుతున్నారు.

14:34 - April 1, 2016

చిత్తూరు : చదువులో మెరుగ్గా రాణిస్తున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎంత కష్టమైనా సరే తమ కొడుకును ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. పెద్దయ్యాక తమకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాడని భావించారు. ఇంతలో ఓ పిడుగులాంటి వార్త ఆ తల్లిదండ్రులను కుదిపేసింది. స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కిందపడి చావు అంచుదాకా వెళ్లాడు. చివరికి కోలుకున్నా.. ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. అచేతనంగా పడివున్న బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. ఉన్న డబ్బులన్నీ వైద్యం కోసం ఖర్చు పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.

పిడుగులాంటి వార్త..
తిరుపతికి చెందిన మునిస్వామిరెడ్డి, మహేశ్వరిల కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలి పోయిన క్షణాలవి. పదో తరగతి చదువుతున్న కుమారుడు హరికృష్ణ.. రోజూలాగానే ఉత్సాహంగా స్కూల్ కెళ్లాడు. కొద్దిసేపటికే ఆ కుటుంబానికి.. స్కూలు నుంచి పిడుగులాంటి వార్త అందింది. తమ అబ్బాయి స్కూలు బిల్డింగ్‌ మీద పడిపోయాడని తెలియగానే.. ఆ తండ్రికి ఏం పాలుపోలేదు. కంగారుగా స్కూల్ కు వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.
హరికృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లిన మునిస్వామికి వైద్యులు చెప్పిన మాటలతో గుండె ఆగినంత పనియ్యింది. ఎడమచేయి మణికట్టు ముక్కలైంది. ఎడమ కాలు తొడ ఎముక రెండు భాగాలైంది. చేతి వేళ్లు విరిగిపోయాయి. ఎడమవైపు దవడలు విరిగిపోయాయి. ఇక లాభం లేదని డాక్టర్లు చెప్పేశారు. కానీ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలన్న నిశ్చయంతో చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

తండ్రి కార్మికుడు..తల్లి పారిశుధ్య కార్మికురాలు..
మునిస్వామి స్థానికంగా ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తుంటే.. ఆయన భార్య మహేశ్వరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ కుమారుణ్ణి ఎలాగైనా బతికించుకోవాలన్న లక్ష్యంతో.. తిండీతిప్పలు.. కుటుంబ పోషణను పక్కన పెట్టేసి వేతనమంతా కుమారుడి వైద్యానికే వెచ్చించారు. ఈ క్రమంలో కాయకష్టంతో కొన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేసి కొడుకుకు వైద్యం చేయించాడు. కుమారుణ్ణి కోమా నుంచి బయటకు రప్పించేందుకే ఇప్పటిదాకి సుమారు 17 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు మునిస్వామి. పూర్తిగా కోలుకోవాలంటే ఇంకో 10 లక్షలు ఖర్చుఅవుతాయని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నారు అవుతున్నాడు. కుటుంబాన్ని నడపడమే కష్టంగా మారిపోయిన మునిస్వామి ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని కృంగిపోతున్నాడు.

వెక్కిరించిన విధి..
ఆదాయం తక్కువే అయినా.. ఉన్నంతలో పిల్లలు ముగ్గురికీ మంచి చదువులు చెప్పించాలని.. తమలాంటి కష్టం వారికి రాకుండా చూడాలని తపించే ఆ దంపతులకు తీరని కష్టం ఎదురైంది. కుమారుడు హరికృష్ణ చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేవాడు. ఎంత కష్టమైనా బిడ్డను ప్రయోజకుడిని చేయాలని ఆ తల్లిదండ్రులు తాపత్రయపడేవారు. పెద్ద ఉద్యోగం చేస్తూ తమను బాగా చూసుకుంటాడని నమ్మకంగా ఉండేవారు. ఇంతలో వారిని విధి వెక్కిరించింది. చదువుతున్న పాఠశాల నాలుగో అంతస్తు నుంచి హరికృష్ణ అనుకోకుండా కిందపడిపోయాడు. దీంతో మంచానికే పరిమితమమైన కుమారుడిని ఎలాగైనా మామూలు స్థితికి తీసుకరావాలని ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు.  తమ ఆలనా పాలనా చూస్తాడనుకున్న అన్నయ్య ఇలా ఉలుకూ పలుకు లేకుండా మంచానికే పరిమితం కావడంతో ఆ ఇంటి ఆడపడుచులిద్దరినీ తీవ్రంగా కలతపరుస్తోంది. దాతలు పెద్ద మనస్సుతో ఆదుకోవాలని, కనికరించి తమ అన్నను బతికించమని ఆ ఇద్దరు చెల్లెళ్లు చేస్తున్న అభ్యర్థన ఎవరినైనా కదిలించక మానదు.

ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు కింది ఎకౌంట్ లో వేయగలరు.
పేరు: అటుపాకు మహేశ్వరి
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, తిరుమల హిల్స్, చిత్తూరు జిల్లా
అకౌంట్ నెంబర్- 34914160409
IFSC CODE- SBIN0002800

కన్నీళ్లకే కన్నీరు తెప్పించే దీన గాథ వీరిది. తమ బిడ్డ మళ్లీ లేవాలి.. బడికి పోవాలని... ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం ప్రతివారి కన్నీటిని చెమర్చుతోంది. ఈ కుటుంబపు కన్నీటిని తుడిచేందుకు సమాజం చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది. తద్వారా మనిషీ మనిషీ కలిసి బతికితేనే సమాజం.. సాటి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే సమాజ నైజం అని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

14:27 - April 1, 2016

చిత్తూరు : తిరుమలలో సామాన్య భక్తుల దర్శనం, వసతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టిటిడి ఈఓ డీ.సాంబశివరావు చెప్పారు. తిరుమలలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రస్తుతం ఉన్న యాత్రికుల వసతి సముదాయాల ద్వారా నిత్యం 20 వేల మంది సామాన్య భక్తులు వసతి సౌకర్యం పొందుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో మరిన్ని వసతి కేంద్రాలు పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్ కు మాజీ సీఎం నాదేండ్ల లేఖ

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను అభినందిస్తూ మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు లేఖ రాశారు. టి. అంజయ్య, చెన్నారెడ్డి వద్ద పని చేసిన సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం వచ్చిందని... ప్రాజెక్టులపూ కేసీఆర్ కున్న అవగాహన, స్పష్టత అభినందనీమన్నారు. హైదరాబాద్ కు మంచినీటి సమస్య లేకుండా చేయాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాన్ని నాదేండ్ల అభినందించారు.

14:13 - April 1, 2016

పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న కొద్దిభాగం ఫ్లై ఓవర్ కూలిపోవడంపై షాక్ తిన్నామని దీన్ని నిర్మాణం చేపడుతున్న ఐవీఆర్ సీఎల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉత్తర ప్రాంతంలోని గిరీష్ పార్కు సమీపంలోని బర్రా బజార్ లో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ ను ఐవీఆర్ సీ ఎల్ కంపెనీ చేపడుతోంది. ఈ ఘటనపై ఐవీఆర్ సీ ఎల్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశం జరిగింది. తాము 27 సంవత్సరాలుగా ఈ నిర్మాణ రంగంలో ఉన్నామని తెలిపారు. 2009 నుంచి ఈ ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయని కంపెనీ హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ పాండురంగారావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తమ టెక్నికల్‌ టీం వెంటనే కోల్‌కతకు బయలుదేరిందని తెలిపారు. ఎక్కడా డిజైన్ లో లోపాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకుని తాము షాక్ తిన్నామని, ఘటనపై ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ కంపెనీలో ఆరు వేల మంది పని చేయడం జరుగుతోందన్నారు. కంపెనీపై దుష్ర్పచారం సాగుతోందని, మీడియా కూడా ఒక్కటి చెబితే ఒకటు రాస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై కోల్ కతా ప్రభుత్వాధికారులు అన్వేషణలు మొదలు పెట్టారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న కంపెనీ కార్యాలయానికి కోల్ కతా నుండి రెండు బృందాలు వస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ సామాగ్రీని అధికారుల ఎదుట పెడుతామని కంపెనీ యాజమాన్యం పేర్కొంటోంది. ఇందులో ఎవరి వైఫల్యం ఉందో రానున్న రోజుల్లో తేలనుంది. 

ముఫ్తీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 4న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోడానికి మెహబూబా వెంటనే చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో సీఎంగా ఆమె ఈనెల నాలుగున బాధ్యతలు చేపట్టనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్‌ సింగ్‌ బాధ్యతలు చేపడతారు.

'గాలి బెయిల్' కేసు లో జోక్యం చేసుకోలేం: సుప్రీం

ఢిల్లీ : కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం అప్పటి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వ్వవహరించిన పట్టాభిరామారావు కోట్లాది రూపాయలను లంచంగా తీసుకుని పట్టుబడిపోయారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులకు ఏసీబీ కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇందూరుకు సీఎం కేసీఆర్ దంపతులు..

నిజామాబాద్: జిల్లాలోని ఇందూరు వెంకటేశ్వరస్వామి వార్షికోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. దేవాలయం వద్ద ఆయనకు స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇవాళ, రేపు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది.ఆయనకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం దంపతులు శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కూతురు, ఎంపీ కవితతోపాటు ఎంపీ బీబీ పాటిల్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఐవీఆర్ సీఎల్..

కోల్ కతా : నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనపై దాని నిర్మాణ సంస్థ ఐవీఆర్ సీఎల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అక్కడి ప్రభుత్వం సరిగ్గా సహకరించకపోవడం వల్లే నిర్మాణ పనుల్లో ఆలస్యమౌతోందని ఆరోపించింది. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు..

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్‌రావు మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. సిద్దిపేట టీఆర్‌ఎస్ కంచుకోట అని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. 

గాలి బెయిల్ కేసు.. సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : గాలి బెయిల్ కుంభకోణం కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు ప్రస్తుతం ప్రత్యేక న్యాయస్థానం విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

నర్సింగ్ పల్లికి చేరుకున్న కేసీఆర్...

నిజామాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలోని నర్సింగ్‌పల్లికి చేరుకున్నారు. ఇందూరు వెంకటేశ్వరస్వామి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

13:54 - April 1, 2016

మెదక్ : సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక డబుల్‌ బెడ్‌రూం పథకం. దీని అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కూడా భారీగానే నిధులు కేటాయించింది. అయినప్పటికీ పనుల వేగం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వీడట్లేదు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. దీంతో డబుల్ బెడ్‌రూం అమలుపై ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంతో పథకాని తూట్లు... 
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం.. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ కింది స్థాయి నేతల వరకూ అందరినోట ఒకటే జపం. కానీ డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకం లక్ష్యాన్ని మాత్రం అధికారుల నిర్లక్ష్యం తూట్లు పొడుస్తోంది. ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల కలను వాటి అమలు తీరు బేజారెత్తిస్తోంది. 
2015 దసరా రోజున భూమి పూజ  
మెదక్‌ జిల్లా కాగజ్‌ మద్దూరు గ్రామం గంగిరెద్దుల కాలనీలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరికీ గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల క్రితం 60 గజాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వీరందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. 2015 దసరా రోజున జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్ రాస్‌, ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ రాజమణి భూమి పూజ చేశారు. 
డబుల్‌ బెడ్‌రూం ఊసే లేదు
డబుల్‌ బెడ్రూం పనులు విడతల వారీగా కాకుండా ఒకే సారి పూర్తి చేస్తామన్నారు. గ్రామస్తులు సమీపంలోని పొలాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారుల అలసత్వం కారణంగా ఆరునెలలకు పైగా కాలం గడిచినా డబుల్‌ బెడ్‌రూం ఊసే ఎత్తడం లేదు. దీంతో గ్రామస్తులు తాత్కాలిక నివాసాల్లో ఇబ్బందులు పడుతున్నారు. 
డబుల్‌ బెడ్రూం ఇళ్లపై ప్రజల్లో అసహనం 
డబుల్‌ బెడ్రూం వస్తుందనుకుంటే ఉన్న నీడ కూడా పోయిందనే అసహనం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గంగిరెద్దుల కాలనీ వాసులు కోరుతున్నారు.

 

13:48 - April 1, 2016

హైదరాబాద్ : అంధత్వ నివారణపై ఎన్‌సీసీ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ వెస్లీ పాఠశాలలో అంధత్వ నివారణ ర్యాలీని ఎన్‌సీసీ మేనేజర్ మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. వెస్లీ పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ సంగీత్ కూడలి వరకు సాగింది. సామాజిక సేవ చేయడం ఎన్‌సీసీలో భాగమని చెప్పారు. 

 

13:46 - April 1, 2016

హైదరాబాద్ : పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినప్పటికీ పట్టించుకోలేదని టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తమ వాదనలు వినిపించే అవకాశం లేని కారణంగానే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు దూరంగా ఉన్నామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తే కేసీఆర్‌ పట్టించుకోలేదని, బాబ్లీ కారణంగానే ఉత్తర తెలంగాణకు చుక్కనీరు దక్కడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ ముందే పోరాడిందని.. బాబ్లీపై పోరాటం చేస్తే కేసీఆర్‌ అపహాస్యం చేశారని పేర్కొన్నారు. స్పీకర్ తమ హక్కులను కాపడడంలో విఫలమయ్యారని చెప్పారు. 
 

13:41 - April 1, 2016

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈనెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ మరణం తర్వాత.. మెహబూబా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు బీజేపీతో సయోధ్య కుదుర్చకున్న పీడీపీ.. సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మెహబూబా ముఫ్తీని పీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు  విషయాన్ని మెహబూబా ముఫ్తీ... రాష్ట్ర గవర్నర్‌ వోహ్రా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి పాలన తొలగించడానికి వీలుగా ఆయన కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత జరిగే కేబినెట్‌ భేటీలో రాష్ట్రపతి పాలన తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన  తర్వాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపముఖ్యమంత్రిగా నిర్మల్‌సింగ్‌ బాధ్యతలు చేపడతారు. 

 

13:36 - April 1, 2016

ఢిల్లీ : ఈ వేసవిలో ఎండలు మరింత ముదురనున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిల్లాడే పరిస్థితులు ఉత్పన్నం 
కాబోతున్నాయని భారత తావావరణ శాఖ హెచ్చరిస్తోంది. వాయువ్య, మధ్య భారత్‌తోపాటు.. కోస్తా ఆంధ్రా, తెలంగాణ జిల్లాల్లో నిల్పులు చెరిగే ఎండలు మండబోతున్నాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. 
ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వేసవి 
దేశంలో వేసవి తీవ్రత మరింత పెరగనుంది. మాడుపగిలే ఎండలతో మనుషులు, మూగజీవాలు విలవిల్లాడే రోజులు రాబోతున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వేసవి తీవ్రత కొనసాగుతుందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. 
వేసవిపై వాతావరణ శాఖ మొదటిసారి నివేదిక 
వేసవి తీవ్రతపై భారత వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్‌లో రుతుపవనాల రాక, వర్షాల పరిస్థితిపై ముందస్తు నివేదిక విడుదల చేసే వాతావరణ శాఖ..... ఈసారి వేసవిపై రిపోర్టు  ఇచ్చింది. వేసవి పరిస్థితులపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేయడం ఇదే మొదటిసారి. దీనిలో నివ్వెరపోయే అంశాలు ఉన్నాయి.  ఎల్‌ నినో ప్రభావంతో 2015  అత్యంధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డులకు ఎక్కింది. అయితే ఈసారి గతంలో కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. భయకంరమైన వడగాల్పులు వీసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని తెలిసింది. 
ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు 
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు కూడా రికార్డయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఇవి  ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్రతోపాటు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరాట్వాడ ప్రాంతాల్లో  అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో కూడా సాధారం కంటే  ఒకటి నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. 
ఈ వేసవి తర్వాత ఎల్‌ నినో ప్రభావం తగ్గే అవకాశం 
ఎల్‌ నినో ప్రాభావం కొనసాగడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కడాన్ని ఎల్‌ నినోగా పిలుస్తారు. దీంతో గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1972, 1973, 1994, 1995, 1997, 1998, 2002, 2003, 2009, 2010 సంవత్సరాల్లో  ఎల్‌ నినో ఏర్పడింది. ఆయా సంవ్సతరాల్లో కూడా మన దేశంలోని చాలా ప్రాంతాల్లో  అత్యధిక ఉష్టోగ్రతలు నమోదైన విషయాన్ని వాతావరణ శాఖ  వేసవి నివేదికలో గుర్తు చేశారు.  ఈ వేసవి తర్వాత ఎల్‌ నినో ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది క్రమంగా బలహీనపడి లా నినోగా మారితే మంచి వర్షాలు కురుస్తాయి. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల వాతావరణం చల్లబడటాన్నే  లా నినోగా పిలుస్తారు. పర్యావరణ కాలుష్యం  పెరగడం కూడా అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని వాతావరణ శాఖ నివేదికలో ప్రస్తావించారు. మొత్తంమీద ఈవేవిలో భీకరమైన ఎండల ప్రభావం తప్పదని తేల్చిన వాతావరణ శాఖ... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోపోతే ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. 

 

13:31 - April 1, 2016

సరైనోడు సినిమా పాటలు రిలీజైన గంటలోపు ఆడియన్స్ నుంచి స్పందన వస్తోందట. దీంతో ఆ సినిమా యూనిట్ ఖుషీగా ఫీలవుతోంది. స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్- రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘సరైనోడు’. ఈనెల థర్డ్ వీక్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఆడియో సాంగ్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇంటర్నెట్ అంతటా పాటలు చక్కర్లు కొడుతున్నాయి. బొలీవియాలో షూట్ చేసిన ‘తెలుసా తెలుసా’ అనే పాటకి మంచి స్పందన వస్తోంది. ఈ సాంగ్ విన్న సినీలవర్స్... బన్నీకి తగ్గట్టుగానే ఫాస్ట్, స్లో బీట్ సాంగ్‌గా వుందని అంటున్నారు. మరి సినిమా కూడా ప్రేక్షకులను ఆ ఫీల్‌‌ని కలిగిస్తుందా? లేదా అనేది చూడాలి. ఆడియో ఫంక్షన్ లేకున్నా.. నేరుగా మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం ప్రమోషన్ బాగా వస్తుందని చెబుతోంది యూనిట్. ఎట్ ప్రజెంట్ ఈ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు క్లైమాక్స్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 15న ‘సరైనోడు’ సెన్సార్ బోర్డు ముందు రావచ్చని తెలుస్తోంది.

రాష్ట్రాలకు కరువు నిధులు విడుదల....

ఢిల్లీ : 2015-16 ఖరీఫ్ పంటకు సంబంధించి కరువు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 9 రాష్ట్రాలకు ఎన్ డీఆర్ఎఫ్ నుండి నిధులు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. తెంగాణకు రూ.328.16 కోట్లు, ఏపీ-రూ.140 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సవివరంగా సమర్పించిన నివేదికలను పరిశీలించిన కేంద్రం కరువు నిధులను విడుదల చేసింది. కాగా గతంలో కేంద్ర కరువు బృందం రాష్ట్రాలలో పర్యటించిన విషయం తెలిసిందే. 

13:26 - April 1, 2016

హైదరాబాద్ : సెల్ఫీ...ఇది ఇప్పుడు ఫ్యాషన్...అదే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేవారికి కూడా వాంగ్మూలానికి ఆయుధంగా మారింది..తన పరిస్థితిని వివరిస్తూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృపామణి నుంచి మొదలు కొని ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.. హైదరాబాద్‌లో మరో ఇల్లాలు సెల్ఫీ వీడియో తీసి ఉరేసుకుంది. 'నా మరణానికి ఎవరికీ సంబంధం లేదు.. నిద్రపట్టడం లేదు..భయం..భయంగా ఉంది.. చావాలని నిర్ణయించుకున్నా'ని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
రిత్విక ఆత్మహత్య 
హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌ దుర్గా నగర్ కు చెందిన ఇల్లాలు రిత్విక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన చావుకు ఎవరూ కారణం కాదంటూ వీడియోను రికార్డు చేసింది. అనారోగ్య కారణాలతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ వీడియోలో పేర్కొంది. 
నా మరణానికి భర్త, అత్తమామలకు ఎలాంటి సంబంధం 
తన మరణానికి భర్త, అత్తమామలకు ఎలాంటి సంబంధం లేదంటూనే వారిని ఏమీ అనొద్దని వేడుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణమని రిత్విక వీడియోలో చెప్పిన ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా..., మానసికంగా కృంగిపోయిందా.., అనారోగ్య కారణమా...? కారణాలు తెలియదు. వీడియోలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాని తాను మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నానని రిత్విక చెప్పడంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

13:10 - April 1, 2016

హైదరాబాద్ : చార్మినార్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరుస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. చార్మినార్‌ పెడస్ట్రియన్‌ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో చార్మినార్‌ పెడస్ట్రియన్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. స్థానిక వ్యాపారులు, హాకర్ల అభిప్రాయాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా చార్మినార్‌ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఉన్నారు. 

 

డయల్ యువర్ ఈవో : టీటీడీ

తిరుమల : వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ యాజమాన్యం భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంది. భక్తులు 24 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. అన్నమయ్య భవన్ లో ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి శుక్రవారం ప్రోటోకాల్ అధికారులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని, వేసవి రద్దీ సందర్భగా సిఫార్సు లేఖలను అనుమతించేదిలేదని తెలిపారు.

13:01 - April 1, 2016

కృష్ణా : విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో సిబ్బంది పని తీరులో మార్పులకు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగులు, అర్చకుల్లోనూ పారదర్శకతను పెంపొందించేందుకు బయోమెట్రిక్ విధానానికి నాంది పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విధానం నేటి ఒకటి నుంచి అమలు చేయనున్నారు.
సిబ్బంది పనితీరులో మార్పు 
దేవస్థానంలో బినామీ అర్చకులతో పనులు చేయిస్తున్నారని వస్తున్న  ఆరోపణలకు ఈఓ చెక్‌ పెట్టారు. సిబ్బంది వచ్చిపోయే సమయాన్ని పూర్తిస్థాయిలో కంప్యూటీకరిస్తూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరచనున్నారు. భక్తులకు విశేష సేవలందిస్తున్న సిబ్బంది సమయపాలనకు అద్దంపట్టేలా, అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉద్యోగులను, అర్చకులను  షిఫ్టుల వారీగా విధులు నిర్వహించే విధంగా ప్రస్తుత కార్యనిర్వాహణాధికారి ఏర్పాట్లు చేశారు. 
ఇప్పటికే ఇంద్రకీలాద్రి పై మూడు బయోమెట్రిక్ మిషన్స్ 
ఇప్పటికే మూడు బయోమెట్రిక్ మిషన్స్‌ను ఇంద్రకీలాద్రి పైన, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గతంలో అటు ఉద్యోగుల్లో ,ఇటు అర్చకుల్లో వర్గపోరు వల్ల దేవస్థానంలో ఆందోళనలు జరిగాయి. సిబ్బంది ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేందుకు బయోమెట్రిక్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దేవస్థానం గొప్పతనానికి మచ్చ తేకుండా సిబ్బంది సరిగ్గా పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. తమకు  ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సిబ్బందికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని అంటున్నారు. 

12:59 - April 1, 2016

బీహార్‌ రాష్ట్రంలో నేటి నుంచి పాక్షికంగా మద్యం అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. బీహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మద్యంతోపాటు ఇతర స్పైస్ లిక్కర్ ను కూడా బ్యాన్ చేస్తున్నారు. ఎన్నికల హామీని నెరవేర్చే పనిలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి బీహార్ లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్... బిహార్ ను మద్య రహిత రాష్ట్రంగా మారుస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యనిషేధం విషయంలో తాము ఎలాంటి విమర్శలనూ పట్టించుకోబోమనీ, అనుకున్నది సాధించి తీరతామని బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ ఇప్ప‌టికే సెలవిచ్చారు. మద్యం బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజల ఆరోగ్యం పరిరక్షించాలన్న సదుద్ధేశంతో బీహార్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాల పై నిషేధం విధించింది. ఈ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే బిహార్ మద్యం పాలసీ సవరణ చట్టం 2016 ప్రకారం వారు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్, జీమెయిల్, టోల్ ఫ్రీ, ఫ్యాక్స్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మద్యం విక్రయాల వల్ల రాష్ట్ర ఖాజానాకు రూ.4000 కోట్ల ఆదాయం వస్తుందని.. కానీ మహిళల ప్రయోజనాల, పేదల దృష్ట్యా పేదల ప్రయోజనాల కోసం మద్య నిషేధం విధిస్తున్నామని నితీష్‌ కుమార్ తెలిపిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం తీసుకున్న నిర్ణయంతో మహిళల్లో హర్షం వ్యక్తమౌతోంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తమ నిర్ణయాలను మార్చుకుంటే మంచిదని తెలుగు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.

12:55 - April 1, 2016

పశ్చిమబెంగాల్ : కోల్‌కతా ఫ్లైఓవర్‌ కుప్పకూలిన సంఘటనలో విచారణను వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టు సంస్థ ఐవీఆర్‌సీఎల్‌పై చర్యలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని ఐవీఆర్‌సీఎల్‌ కేంద్రకార్యాలయానికి కోల్‌కతాకు చెందిన రెండు పోలీసు బృందాలు చేరుకున్నాయి. పోలీసులు బంజారాహిల్స్‌లో ఐవీఆర్‌సీఎల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఘటన బాధ్యులైన కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

 

కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : శుక్రవారం నాడు టీ.అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ హాజరుకాని విషయం తెలిసిందే.  సీఎం మాట్లాడిన విషయంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈరోజు స్పందించారు. అక్రమ బ్యారేజీ నిర్మాణాలను కొత్తగా తానే గుర్తించినట్లు కేసీఆర్ చెబుతున్నారనీ...గత పదేళ్లుగా టీడీపీ చెబుతున్నదే కేసీఆర్ సభలో చెప్పారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదని విమర్శించారు. ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని మేము ఆనాడే చెప్పామన్నారు.

12:46 - April 1, 2016

దేస్ పూర్ : అస్సాంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వచ్చే సోమవారం అక్కడ తొలి విడత పోలింగ్ జరగబోతోంది. కాంగ్రెస్, బిజెపి లను ఊరిస్తున్న ఈ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలు కూడా వున్నాయి. 
కాంగ్రెస్, బిజెపిలకు ప్రతిష్టాత్మకం
కాంగ్రెస్, బిజెపిలకు అస్సాం పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులై తలపడుతున్నది ఈ  ఒక్క రాష్ట్రంలోనే. ఈ రెండు పార్టీలు అస్సాం మీద గట్టిగానే ఆశలు పెట్టుకున్నాయి. గెలుపు ఓటమిలను ఈ రెండు పార్టీల ప్రతిష్టకు సవాలు విసురుతున్నాయి. 
అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం 
అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వుంది. కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన రాష్ట్రమిది. అస్సాంలో నాలుగో విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ప్రతిష్టను ఎంతో కొంత పునరుద్ధరించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అస్సాంలో కూడా ఓడిపోతే, దేశవ్యాప్తంగా తమ శ్రేణులు మరింత కుంగిపోతాయన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానానికి వుండడం సహజం. 
గ్రాఫ్ ను పెంచుకోవాలని భావిస్తోన్న బిజెపి నాయకత్వం 
బిజెపి మానసిక పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వుంది. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు అమిత్ షా ఇమేజ్ గ్రాఫ్ ను కొంత దెబ్బతీశాయి. అస్సాంలో విజయం సాధించడం ద్వారా తమ గ్రాఫ్ ను పెంచుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ వయస్సు గురించి మాట్లాడుతున్నారు. తరుణ్ గొగాయ్ కూడా లోకల్ లీడర్స్ మీద కాకుండా మోడీ మీదనే విమర్శనాబాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ పోటీ తనకూ మోడీకి మధ్యనే జరుగుతోందన్న వాతావరణాన్ని స్రుష్టించేందుకు తరుణ్ గొగాయ్ ప్రయత్నిస్తున్నారు. హ్యాట్రిక్ సిఎంగా తలపండిన ఈ వ్రుద్ధనాయకుడు పన్నిన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. తరుణ్ గొగాయ్ కుమారుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు, యువ ఎంపి  గౌరవ్ గొగాయ్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు.  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ , అమెరికాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన గౌరవ్ గొగాయ్ రాజకీయ ఉపన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. 
అస్సాంలో మారిన రాజకీయ సమీకరణలు 
2011నాటితో పోల్చుకుంటే అస్సాంలో రాజకీయ సమీకరణలు మారాయి. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బోడోల్యాండ్ పీపుల్స్ పార్టీ ఈసారి బిజెపితో దోస్తీ చేస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హిమంతబిశ్వశర్మ తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. ఇంకోవైపు గతంలో అస్సాం గణపరిషత్ లోనూ, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లోనూ కీలకంగా పనిచేసిన సర్వానంద సోనోవాల్ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ ని దెబ్బ తీసి, బిజెపికి సగం స్థానాలు సాధించిపెట్టడంలో సర్వానంద సోనోవాల్ పాత్ర చాలా వుంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేసులో వున్నారు. మరోవైపు అస్సాం గణ పరిషత్ తో పొత్తు కుదిరింది. 88 సీట్లలో బిజెపి, 24 సీట్లలో ఏజిపి, 14 స్థానాలలో బిపిఎఫ్ పోటీ చేస్తున్నాయి. మిత్రుల అండదండలు, 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద వున్న వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తాయన్న అంచనాతో కమలనాధులున్నారు. అస్సాం పాగా వేసి తీరాలన్న పట్టుదలతో వున్న బిజెపి హిందూత్వ సెంటిమెంట్ ను రగిలిస్తోంది. అస్సాంలో కోతి చనిపోయినా జై హనుమాన్ అంటూ అంత్యక్రియలు చేస్తున్నారు విహెచ్ పి కార్యకర్తలు . 
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు 
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 4న తొలి విడతలో 65 స్థానాలకు, 11వ తేదీన మిగిలిన 61 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అస్సాంలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 63 సీట్లు. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ 122 స్థానాల్లో పోటీ చేస్తూ, నాలుగు సీట్లను మిత్రపక్షానికి కేటాయించింది.  బిజెపి 88 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి, 38 సీట్లను మిత్రపక్షాలకు వదిలిపెట్టింది. 
ఒకవైపు ఎన్డీఏ, కాంగ్రెస్ హోరాహోరీ.... మరోవైపు వామపక్ష కూటమి 
ఒకవైపు ఎన్డీఏ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే మరోవైపు వామపక్షాలన్నీ కలిసి ఓ కూటమిగా ఏర్పడ్డాయి. సీపీఎం, సీపీఐ, ఎంఎల్, ఎస్ యుసిఐ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు వామపక్ష కూటమిలో వున్నాయి. ఇంకోవైపు బద్రుద్దీన్ అజ్మల్ నేత్రుత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ముస్లింలలో గట్టి పట్టున్న ఈ పార్టీకి గత అసెంబ్లీలో 18 స్థానాలున్నాయి. కాంగ్రెస్, బిజెపిలలో ఏ ఒక్కరికి స్పష్టమైన  మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈసారి అస్సాం రాజకీయాల్లో తామే చక్రం తిప్పుతామని బద్రుద్దీన్ అజ్మల్ భావిస్తున్నారు.  పెర్ ఫ్యూమ్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బద్రుద్దీన్ అజ్మల్ బీహార్ తరహాలో కాంగ్రెస్, ఏజిపితో కలిసి సెక్యులర్ కూటమి ఏర్పాటు చేయాలని భావించారు.  కానీ, అది సాధ్యం కాలేదు. అస్సాంలో 9 జిల్లాల్లోని  35  అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీల ప్రాబల్యం  ఎక్కువ. బద్రుద్దీన్ అజ్మల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్, బిజెపి సిఎం అభ్యర్థి సర్వానంద సోనోవాల్  భవిష్యత్ కి ఈ 35 సీట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. 

 

12:40 - April 1, 2016

కరీంనగర్ : ప్రముఖ చానల్‌లో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ టీం కు హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మొదటి అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంచె ప్రసాద్ నటులు, నిర్వాహకుల్లో 22 మందికి నోటీసులు జారీ చేసిన ట్లు న్యాయవాది యతిపతి అరుణ్‌కుమార్ గురువారం తెలిపారు. జబర్దస్త్ ప్రో గ్రాంలో కొన్ని ఎపిసోడ్స్‌లో న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా భగవద్గీతపై ప్రమాణం చేయమని చెప్పగా, మహిళ వేషధారిని నిమురుతూ ప్రమాణం చేయించడం నాలుగు గీతల మీద ప్రమాణం చేస్తానంటూ భగవద్గీతను అవమానపరిచారని న్యాయవాది యతిపతి అరుణ్‌కుమార్ హుజూరాబాద్ కోర్టులో గత ఏడాది ఫిర్యాదు దాఖలు చేశారు. పూర్వపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి ప్రోగ్రాం న్యాయనిర్ణేతలు కే నాగేంద్రబాబు, ఎమ్మెల్యే, నటి, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, కమెడియన్లు ధన్‌రాజ్, ఫణి, మల్లెమాల ప్రొడ్యూసర్ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు 22 మందికి సమన్లు పంపించారు.

12:38 - April 1, 2016

హైదరాబాద్ : చదువులో మెరుగ్గా రాణిస్తున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎంత కష్టమైనా సరే తమ కొడుకును ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. పెద్దయ్యాక తమకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాడని భావించారు. ఇంతలో ఓ పిడుగులాంటి వార్త ఆ తల్లిదండ్రులను కుదిపేసింది. స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కిందపడి చావు అంచుదాకా వెళ్లాడు. చివరికి కోలుకున్నా.. ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. అచేతనంగా పడివున్న బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. ఉన్న డబ్బులన్నీ వైద్యం కోసం ఖర్చు పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. 
నిరుపేద దంపతుల గుండెల్లో పిడుగులు..
నిరుపేద దంపతుల గుండెల్లో పిడుగులు..రోజులానే స్కూలు వెళ్లిన కుమారుడు.. మృత్యు ముఖంలో ఉన్నాడన్న వార్త... తిరుపతికి చెందిన మునిస్వామిరెడ్డి, మహేశ్వరిల కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలి పోయిన క్షణాలవి. పదో తరగతి చదువుతున్న కుమారుడు హరికృష్ణ.. రోజూలాగానే ఉత్సాహంగా స్కూల్ కెళ్లాడు. కొద్దిసేపటికే  ఆ కుటుంబానికి.. స్కూలు నుంచి పిడుగులాంటి వార్త  అందింది. తమ అబ్బాయి స్కూలు బిల్డింగ్‌ మీద పడిపోయాడని తెలియగానే..  ఆ తండ్రికి ఏం పాలుపోలేదు. కంగారుగా స్కూల్  కు వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. 
గుండె ఆగినంత పనియ్యింది
హరికృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లిన మునిస్వామికి వైద్యులు చెప్పిన మాటలతో గుండె ఆగినంత పనియ్యింది. ఎడమచేయి మణికట్టు ముక్కలైంది. ఎడమ కాలు తొడ ఎముక రెండు భాగాలైంది. చేతి వేళ్లు విరిగిపోయాయి.  ఎడమవైపు దవడలు విరిగిపోయాయి.. ఇక లాభం లేదని డాక్టర్లు చెప్పేశారు. కానీ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలన్న నిశ్చయంతో చెన్నైలోని  కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు..  
వచ్చిన వేతనమంతా వైద్యానికే ఖర్చుచేసిన కుటుంబం
మునిస్వామి స్థానికంగా ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తుంటే.. ఆయన భార్య మహేశ్వరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ కుమారుణ్ణి ఎలాగైనా బతికించుకోవాలన్న లక్ష్యంతో.. తిండీతిప్పలు.. కుటుంబ పోషణను పక్కన పెట్టేసి వేతనమంతా కుమారుడి వైద్యానికే వెచ్చించారు. ఈ క్రమంలో కాయకష్టంతో కొన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేసి కొడుకుకు వైద్యం చేయించాడు. కుమారుణ్ణి కోమా నుంచి బయటకు రప్పించేందుకే ఇప్పటిదాకి సుమారు 17 లక్షల రూపాయలు ఖర్చుచేశాడు మునిస్వామి. పూర్తిగా కోలుకోవాలంటే ఇంకో 10 లక్షలు ఖర్చుఅవుతాయని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నారు అవుతున్నాడు. కుటుంబాన్ని నడపడమే కష్టంగా మారిపోయిన మునిస్వామి.. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని కృంగిపోతున్నాడు.
మామూలు స్థితికి తీసుకురావాలని దంపతుల ప్రయత్నం 
ఆదాయం తక్కువే అయినా.. ఉన్నంతలో పిల్లలు ముగ్గురికీ మంచి చదువులు చెప్పించాలని.. తమలాంటి కష్టం వారికి రాకుండా చూడాలని తపించే ఆ దంపతులకు తీరని కష్టం ఎదురైంది. కుమారుడు హరికృష్ణ చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేవాడు. ఎంత కష్టమైనా బిడ్డను ప్రయోజకుడిని చేయాలని ఆ తల్లిదండ్రులు తాపత్రయపడేవారు. పెద్ద ఉద్యోగం చేస్తూ తమను బాగా చూసుకుంటాడని నమ్మకంగా ఉండేవారు. ఇంతలో వారిని విధి వెక్కిరించింది. చదువుతున్న పాఠశాల నాలుగో అంతస్తు నుంచి హరికృష్ణ అనుకోకుండా కిందపడిపోయాడు. దీంతో మంచానికే పరిమితమమైన కుమారుడిని ఎలాగైనా మామూలు స్థితికి తీసుకు రావాలని ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. 
దతలు పెద్ద మనసుతో ఆదుకోవాలంటున్న చల్లెళ్లు
తమ ఆలనా పాలనా చూస్తాడనుకున్న అన్నయ్య ఇలా ఉలుకూ పలుకు లేకుండా మంచానికే పరిమితం కావడంతో ఆ ఇంటి ఆడపడుచులిద్దరినీ తీవ్రంగా కలతపరుస్తోంది. దాతలు పెద్ద మనస్సుతో ఆదుకోవాలని, కనికరించి తమ అన్నను బతికించమని ఆ ఇద్దరు చెల్లెళ్లు చేస్తున్న అభ్యర్థన ఎవరినైనా కదిలించక మానదు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు కింది ఎకౌంట్ లో వేయగలరు.
 పేరు:    అటుపాకు మహేశ్వరి
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, తిరుమల హిల్స్, చిత్తూరు జిల్లా
కన్నీళ్లకే కన్నీరు తెప్పించే దీన గాథ 
కన్నీళ్లకే కన్నీరు తెప్పించే దీన గాథ వీరిది. తమ బిడ్డ మళ్లీ లేవాలి.. బడికి పోవాలని... ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం ప్రతివారి కన్నీటిని చెమర్చుతోంది. ఈ కుటుంబపు కన్నీటిని తుడిచేందుకు సమాజం చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తొలగించాలని భావించే వారు... తిరుమల హిల్స్‌లోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చెల్లుబాటయ్యేలా... అటుపాకు మహేశ్వరి, అకౌంట్‌ నెంబర్‌ 34914160409 కు తమ ఆర్థిక సాయం అందించి తమ వదాన్యతను చాటుకోవాలి. తద్వారా మనిషీ మనిషీ కలిసి బతికితేనే సమాజం.. సాటి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే సమాజ నైజం అని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

12:34 - April 1, 2016

'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల తర్వాత అనుష్క నటించిన భిన్నమైన చిత్రం 'సైజ్‌ జీరో'. ఆ సినిమా తర్వాత 'ఊపిరి' చిత్రంలో గెస్ట్ రోల్‌ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందని సమాచారం. విజరు కథానాయకుడిగా తమిళంలో సంచలన విజయం సాధించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. చిరంజీవి, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలుత చిరంజీవికి జోడీగా నయనతారని ఎంపిక చేశారు. భారీ రెమ్యూనరేషన్‌, డేట్ల సర్దుబాటు వంటి తదితర కారణాలతో నయనతారకి బదులుగా అనుష్కని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 'స్టాలిన్‌' సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌లో చిరంజీవికి జోడీగా అనుష్క ఆడిపాడిన విషయం విదితమే. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చిరంజీవి సరసన అనుష్క నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయట.

 

అదుపు తప్పిన స్కూలు బస్సు ఒకరు మృతి....

హైదరాబాద్ : విద్యానగర్ సమీపంలో  ఓ స్కూలు బస్సు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఢీకొని రమేశ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో విద్యార్ధులు తీవ్ర భయాందోలనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్ధులకు సురక్షితంగా బస్సులోనుండి కిందికి దించారు. అనంతరం పారిపోతున్న డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

12:26 - April 1, 2016

వరుసగా పదేండ్లపాటు సినీ 'మా' మీడియా డైరీ'పై ముఖచిత్రంగా వచ్చినందుకుగానూ 'మా' అధ్యక్షుడు, నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ 'బల్లెం వేణుమాధవ్‌ అర్ట్‌ థియేటర్‌' రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆయనకు ప్రపంచ రికార్డును అందజేశారు. ఈ వేడుకలు బుధవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగాయి. అతిథిగా విచ్చేసిన తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డా.పరుచూరి గోపాలకృష్ణ బల్లెం సినీ 'మా' మీడియా డైరీ-2016ని ఆవిష్కరించారు. తొలికాపీని 'మా' అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ అందుకున్నారు. వరుసగా పదేండ్లుగా ఇదే డైరీపై ముఖచిత్రంగా వచ్చినందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అధ్యక్షులు డాక్టర్‌ వెంకటాచారి ప్రపంచ రికార్డు జ్ఞాపికను, సర్టిఫికేట్‌ను రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. 'ప్రపంచ రికార్డ్‌లో నా పేరు నమోదు కావడం ఆనందంగా ఉంది' అని డా. రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రరావు, డి.విజయభాస్కర్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, సాయి వెంకట్‌, పూనమ్‌ కౌర్‌, వరప్రసాద్‌, సురేష్‌ కుమార్‌, అంబటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని, పైడి కృష్ణారావు, డాక్టర్‌ డ్యాని, మాధవరెడ్డి, అంజలిదేవి, వి.ఎస్‌.పి.తెన్నెటి, సి.వి.ఇగోవిందరావు, లయన్‌ వేణుమాధవ్‌, నిర్మాత రాజ్‌కందుకూరి, రాజ్‌ కిరణ్‌, ప్రసాద్‌, విజయకృష్ణలకు బల్లెం విశిష్ట పురస్కారాలను అందజేశారు.

 

చార్మినార్ కు కొత్త సొగసులు...

హైదరాబాద్ : చార్మినార్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చార్మినార్ ను సందర్శించేవారి సంఖ్య పెరుగుతోందనీ..వారి సౌకర్యానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్ పక్కనే వున్న జీహెచ్ ఎంసీ కార్యాలయం సర్కార్ మహల్ ను మరో ప్రాంతానికి తరలిస్తామన్నారు. పర్యాటకులకు అర్థమయ్యేలా బోర్డులను అందుబాటులో వుంచుతామని తెలిపారు. చార్మినార్ చీకటిలో కూడా అందంగా కనిపించటానికి ఆధునిక లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వైసీపీ కి మరో 'షాక్'

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు ఈనెల 8న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు  టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా గతకొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న విషయం తెలిసిందే.  జ్యోతుల నెహ్రూ రాకతో ప్రతిపక్షం నుండి మరింతమంది టీడీపీలోకి చేరే అవకాశాలున్నట్లు సమాచారం.

11:59 - April 1, 2016

హైదరాబాద్ : పేదలకు గోరంత.. పెద్దలకు కొండంత అండగా నిలుస్తూ కంపెనీలపై తన భక్తిని చాటుకుంటోంది హైదరాబాద్‌ జలమండలి... పేదలకు అరకొరగా నీళ్లిస్తూ వ్యాపార సంస్థలకు మాత్రం ఫుళ్లుగా సరఫరా చేస్తోంది.. గత ఏడాది నీటి లెక్కలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.. 
గ్రేటర్‌ లో నీటి వివక్ష 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి వివక్ష కొనసాగుతోంది.. పేదలకు ఒకలా... పెద్దలకు మరోలా జలమండలి నీటిని సరఫరా చేస్తోంది... అధికారుల లెక్కల ప్రకారం గచ్చిబౌలి, మాదాపూర్‌, బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మియాపూర్‌ లాంటి ప్రాంతాల్లో నెలకు ఒక్కో కుటుంబానికి 50వేల నుంచి 71వేల లీటర్లవరకూ నీరు సరఫరా అవుతోంది.. ఇక పేదలు, సామాన్యులు ఉండే ఎపి ఆర్ హిల్స్, బోరబండ, యాకుత్‌పురా, అల్వాల్‌ బాలయ్య నగర్‌, గౌలిపురా, అలియాబాద్‌, జియాగూడ పరిధిలోమాత్రం 14వేలనుంచి 16వేల లీటర్ల నీరు పంపిణీ అవుతోంది.. ఎండాకాలం అంతంతమాత్రంగా వస్తున్న ఈ నీరు సరిపోక ఈ కాలనీల ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు.. 
నిలిచిపోయిన 145 ఎంజీడీల నీటి సరఫరా 
ఎండలు పూర్తిగా ముదరకముందే నగరంలో నీటి కొరత మొదలైంది.. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌, మంజీరా, సింగూరు నుంచి వచ్చే 145 ఎంజిడిల నీటి సరఫరా ఆగిపోయింది.. ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి మాత్రమే నీరు వస్తోంది.. కృష్ణా నది నుంచి మూడు దశలద్వారా 265 ఎంజిడిల మంచినీరు సరఫరా అవుతోంది.. గోదావరినుంచి 86 ఎంజిడిల నీరు నగరానికి పంపిణీ జరుగుతోంది.. ఇలా మొత్తం 356 ఎంజిడిల నీరు వస్తుండగా.. డిమాండ్‌ మాత్రం 640 ఎంజీడీలుగా ఉంది.. ఈ నీటి సరఫరాలోనూ కొంత నీరు వృధా అవుతోంది.. అధికారుల లెక్కల ప్రకారం 215 ఎంజీడీల నీరు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.. మండు వేసవిలో ఈ కాస్త నీటిని సర్దుకోలేక ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు.
వ్యాపార సంస్థలకు సరఫరా తగ్గింపు
అయితే ప్రతి వేసవిలోనూ నీటి కొరతను తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక వేస్తారు.. నీరు ఎక్కువగా వాడుకునే వ్యాపార సంస్థలకు సరఫరా తగ్గిస్తున్నామని ముందే చెప్పేస్తారు.. అయితే ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది.. దీనిని పాటించకపోగా జలమండలి ఎక్కువ నీటిని పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కొకాకోలా, పెప్సికో, సౌత్ ఏషియా, క్రౌన్ బీర్స్, యునైటెడ్ బ్రెవ‌రీస్‌ లాంటి కంపెనీలకు గత ఏడాది ఫిబ్రవరిలో 13కోట్ల లీటర్లు... మేలో 4కోట్ల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేసింది. ఎండాకాలంలో జోరుగా బిజినెస్‌ చేసుకునే ఈ సంస్థలు... ఈ నీటిని వాడుకుంటూ మరింత డబ్బు సంపాదిస్తున్నాయి. ఒక నెలలో సరఫరా చేసిన ఈ నాలుగు కోట్ల లీటర్ల నీటిని దాదాపు 8వేల ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల నీటి అవసరాలు తీర్చవచ్చు.. అయినా కంపెనీలకే జలమండలి పెద్దపీట వేస్తోంది. ఇలా కోట్ల లీటర్ల నీటిని కంపెనీలకు మళ్లిస్తూ సామాన్యులకు మాత్రం జాగ్రత్తలు బోధిస్తోంది జలమండలి.. నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తోంది. ఈ ఏడాదైనా కంపెనీలను పక్కనబెట్టి... సామాన్యుల నీటి అవసరాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

 

11:53 - April 1, 2016

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం రాసలీలకు వేదికైంది. ఆలయ సత్రంలో ఓ మహిళతో ఆలయ ఉద్యోగులు వెలగబెడుతున్న రాసలీలలు బయటపడ్డాయి. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఇటీవలే టీటీడీ దత్తత తీసుకుంది. దీనిపై వేగంగా స్పందించిన టీటీడీ అధికారులు... ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.

 

11:50 - April 1, 2016

పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. నిన్న మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న  ఫ్లైఓవర్‌ కూలిపోయి 21 మంది మృతిచెందారు. ఈరోజు ఉదయానికి ఈ సంఖ్య 25కి చేరింది. శిథిలాల కింద 150 మందికిపైగా చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

11:47 - April 1, 2016

త్వ‌ర‌లో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య పెళ్లి పీఠ‌లెక్క‌నున్నాడా? అంటే అవు న‌నే అంటున్నారు. గతంలోనే నాగ‌చైత‌న్య పెళ్లి గురించి మీడియాలో వార్త‌లు హల్ చల్ చేశాయి. త్వరలోనే నాగచైతన్య పెళ్లిపీటలు ఎక్కనున్నాడు అనే వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయిపోయింది. చైతూ కు న‌చ్చిన అమ్మాయితోనే నాగార్జున పెళ్లి చేస్తాన‌ని ఓ మీడియా స‌మావేశంలో చెప్పారు. అయితే ఇక ఆ సంద‌ర్భం రానే వ‌చ్చిందని అంటున్నారు. ఈ నెల 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పెళ్లి విష‌యం ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయిని అంటున్నారు. అయితే పెళ్లికూతురు ఎవ‌ర‌న్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేదుగానీ..ఆమె కూడా ఓ స్టార్ హీరో కూతుర‌ని అంటున్నారు. మరింత సమాచారం తెలియాలంటే 23వ తేదీ వరకు ఆగాల్సిందే...

'భారత్ మాతాకీ జై' ముస్లింలకు వ్యతిరేకం : దారుల్ ఉలూమ్

హైదరాబాద్ :  'భారత్ మాతాకీ జై'నినాదంపై దారుల్ ఉలూమ్ అనే సంస్థ ఫత్వాను జారీ చేసింది. 'భారత్ మాతాకీ జై' అనే నినాదం ముస్లింలకు వ్యతిరేకమని ఈసంస్థ పేర్కొంది. భూమి ఎప్పటికీ తల్లి కాదనీ...ముస్లింలు కేవలం అల్లాని మాత్రమే నమ్ముతారనీ ఫత్వా తెలిపింది. కాగా  'భారత్ మాతాకీ జై' అనే నినాదంపై గత కొద్ది కాలంగా వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే. 

11:43 - April 1, 2016

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు కమల్‌హాసన్‌కి అరుదైన గౌరవం లభించింది. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో హెన్రీ లాంగ్లోయిస్‌ అవార్డును కమల్‌హాసన్‌ అందు కున్నారు. చలన చిత్రాలను భద్రపరిచే ప్రక్రియకు ఆద్యుడైన ఆర్చినిస్ట్‌ హెన్రీ లాంగ్లోయిస్‌ పేరుతో ఈ అవార్డును సినీ ప్రముఖులకు ప్రదానం చేస్తారు. అందులో భాగంగా కమల్‌ అందుకున్నారు. ఈ విషయాన్ని కమల్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'గురువు అనంతు ఆశీస్సుల వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని, ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో సంతోషించేవార'ని ట్వీట్‌లో పేర్కొన్నారు. అవార్డ్‌ అందుకున్న సందర్భంగా కమల్‌కి నటి ఖుష్బూ, రాధిక, శ్రుతిహాసన్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రశ్నాపత్రం 'లీక్' కలకలం...

కరీంనగర్ : సుల్తానాబాద్ లో పదో తరగతి పరీక్షా పత్రం 'లీక్' కలకలం. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో పదోతరగతి జీవశాస్త్రానికి చెందిన పేపర్ ను నిర్వాహకులు లీక్ చేసినట్లు సమాచారం.

11:32 - April 1, 2016

అమెరికా : ప్రపంచానికి  పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై ఐక్య పోరాటానికి సిద్ధంకావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. అమెరికాలోని వాషింగ్‌టన్‌లో జరుగుతున్న అణు భద్రతా సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ఉగ్రవాదం ఒక్క దేశానికే పరిమితమైన సమస్యకాదని... అన్ని దేశాలు దీని బారిన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాదుల అనుసంధాన వ్యవస్థను  కూటికివేళ్లతో పెకలించి వేయాల్సి ఉందన్నారు.   ఉగ్రవాదులు పెను హింసతోపాటు,  భారీ విధ్వంసం సృష్టిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా గుర్తించేందుకు కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరారు. ఉగ్రవాదులు అణ్వాయుధాల అక్రమ రవాణకు పాల్పడిదే ప్రపంచానికి పెద్దముప్పు తప్పదని ప్రధాని హెచ్చరించారు. 

 

ప్రాంరభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం.....

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యాలయం ఎంబీ భవన్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు జరుగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు,  బడ్జెట్ కేటాయింపులు, శుక్రవారం నాడు టీ.అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమావేశంలో నేతలు చర్చింనున్నట్లు సమాచారం.

11:22 - April 1, 2016

చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌... బత్తాయి... బనాన... కమలా... కర్బుజా ఆరోగ్యం కోసం ఇలా ఎన్నో పళ్లను తింటుంటాం. ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా చేసే సూచన ఇదే. ఇవే కాదు... ఎండుద్రాక్షనూ ఎంతెక్కువగా తింటే అంత మంచిది. ద్రాక్షపండ్లను ఎండబెట్టినపుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ఈ పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తిగల ఆమాల్లను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. అంతే కాకుండా మహిళల్లోని నెలసరి సమస్యలనూ దూరం చేస్తాయి. నెలసరి సమయంలో మహిళలు కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి సమస్య ఉన్న వాళ్లు ఎండుద్రాక్షను నీటిలో వేసుకుని వేడి చేసి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఎండుద్రాక్ష తింటే మంచిది కదా అని తినేయడం కన్నా ముందుగా నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత తినడం మంచిది. ఎండుద్రాక్షలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్‌ బి రక్తకణాల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసి లెఫ్టిన్‌ని ఎండుద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్‌ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడతాయి. ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరిచేరవు. రక్తంలో ఉండే యాసిడోసిస్‌ అనే టాక్సిన్‌ చర్మవ్యాధులు, ఆర్థరైటిస్‌, క్యాన్సర్‌ వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం యాసిడోసిస్‌ను నియంత్రించి, ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు ధృఢంగా అవుతాయి. ఎండుద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

11:22 - April 1, 2016

ఢిల్లీ : కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్‌ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. వాషింగ్‌టన్‌ నుంచి మమతకు ఫోన్‌ చేసిన ప్రమాద వివరాలు తెసుకున్నారు. సహాయ చర్యలు గురించి అడిగి  తెలుసుకున్నారు.  ఘటనపై  విచారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనలో మరణించిన వారికి సంతాపం ప్రకటించిన మోడీ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగ్రాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మమతను కోరారు. 

చార్మినార్ లో మంత్రి కేటీఆర్ పర్యటన...

హైదరాబాద్ : చార్మినార్ లో టీ. మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో పెడస్ట్రియన్ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మెహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

11:19 - April 1, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న గుంటూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడ రాబోతున్నాయి.. ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చలు జోరందుకున్నాయి. ఇంతకీ పొలిటికల్ ఖిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు ఎన్ని.? ఎక్కడెక్కడ నియోజకవర్గాలు పెరిగే అవకాశముంది.? వాచిట్..
నవ్యాంధ్రలో 50 నియోజకవర్గాల దాకా పెంపు
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న వార్త రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రలో కొత్తగా 50 నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చే అవకాశముంది. 
ప్రతి 2.19 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం
జనాభా దామాషా ప్రకారం ప్రతి రెండు లక్షలా 19 వేల జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 22కు చేరుతుంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలను కుదించి 17కు చేర్చారు. దుగ్గిరాల, కూచినపూడి నియోజకవర్గాలు రద్దయ్యాయి. అప్పటివరకు నాన్ రిజర్వేషన్‌ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ స్థానాల పెంపుతో లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపమే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ స్థానంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండే విధంగా  పునర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు కలవనున్నాయి. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు సెంట్రల్ నియోజకవర్గంగా మిగతా 4 పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, పెదకాకాని, నకరికల్లు కేంద్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది. 
5 నియోజకవర్గాల్లో ఒకటి ఎస్సీ రిజర్వ్ 
గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పడే 5 నియోజకవర్గాల్లో ఒకటి ఎస్సీలకు దక్కే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడ్‌లుగా ఉన్నాయి. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గం నాన్ రిజర్వ్‌ అయ్యే అవకాశముందని అదే జరిగితే పొన్నూరు ఎస్సీ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కొత్తగా వచ్చే ఐదిటిలో ఒకటి ఎస్టీలకు దక్కే ఛాన్స్‌ ఉంది. మాచర్ల లేదా వినుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఎస్టీ రిజర్వ్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. 
పొలిటికల్ ఆశావహుల్లో అనందం 
కొత్తగా నియోజకవర్గాలు వచ్చే అవకాశముండడంతో పొలిటికల్ ఆశావహుల్లో అనందం వెల్లివిరిస్తోంది. ఇప్పటికే కొత్త నియోజకవర్గాల స్వరూపం ఏవిధంగా ఉండబోతుందోనని చర్చలు జరుపుతున్నారు. వివరాలు తెలిసిన వెంటనే అక్కడ పాగా వేసి ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గాల పెంపు అంశం హాట్ టాపిక్‌లా మారుతోంది.

 

'గాంధీ'లో మంత్రి ఆకస్మిక తనిఖీలు...

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని  గాంధీ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రి అధికారులతో మంత్రి సమీక్షించారు. వార్డుల పెంపు, నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై మంత్రి చర్చించారు. 

ఐవీఆర్ సీఎల్ అధికారులను ప్రశ్నిస్తున్న పోలీసులు...

హైదరాబాద్ : కోల్ కతాలో ఫ్లైవర్ కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా విచారణ బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్ సీఎల్ కార్యాలయంలో అధికారులను కోల్ కతా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా నిన్న కోల్ కతాలో ఫ్లైఓవర్ కూలి 20 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

10:59 - April 1, 2016

ఎర్రగా నిగ నిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే 'దానిమ్మ' పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. అంతే కాదు దానిమ్మ చెట్టులోని బెరడు, తొక్కి, ఆకుల్లో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్, పార్కిన్సన్ జబ్బులను నియంత్రిస్తుంది. ఆల్జీమర్స్ జబ్బు అనగా మెదడులో చిన్న చిన్న తెల్లని గడ్డలుగా మారుతుంది.

దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.

ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధ పడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి, దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది.

క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది. వాపును అరికడుతుంది. దానిమ్మ ఆకుల నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.

దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు. దానిమ్మ వేరు బెరడు, కాండం, ఆకుల నుంచి టానిన్‌లను తయారు చేయవచ్చు. దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు. ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.

దానిమ్మ బెరడుతొక్కగింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారుదానిమ్మ వేరు బెరడుకాండంఆకుల నుంచి టానిన్‌లను తయారు చేయవచ్చుదానిమ్మ పండ్ల తోలుపూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారుపండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చుఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసంఅజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాకదగ్గువడదెబ్బనీరసం నుండి ఉపశమనం కలుగుతుందికాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.

 

తొలి ముస్లిం మహిళా సీఎం ...

హైదరాబాద్ : మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మొట్ట‌మొద‌టి మ‌హిళా ముఖ్యమంత్రిగా ఈ నెల నాలుగో తేదీన‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పీడీపీ అధినేత్రిగా వున్న ముఫ్తీ ఈనెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. భార‌త్‌లో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న రెండో మ‌హిళా ముస్లిం కూడా ఆమే కావడం విశేషం. ఇది శుభ‌మైన సంకేతాలనిస్తోంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. నెలల తరబడి రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తొల‌గిస్తూ..

10:44 - April 1, 2016

ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీపీసీసీ అధికారి ప్రతినిధి మహేశ్ గౌడ్, టీఆర్ ఎస్ నేత రాకేశ్, నవ తెలంగాణ ఎడిటిర్ వీరయ్యలు పాల్గొని, మాట్లాడారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పస లేదని ఎద్దేవా చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

'షార్' లో చిన్నారులపై ఉపాధ్యాయుల కీచకపర్వం..

హైదరాబాద్ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'షార్' లో ఉపాధ్యాయుల కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. షార్ లో కొనాసగుతున్న సెంట్రల్ స్కూల్లో అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు చదువుకుంటున్నారు. ఈ స్కూల్లోని చిన్నారులపై కొందరు ఉపాధ్యాయులు లైంగికవేధింపులకు పాల్పడుతున్నారు. ఉపాధ్యాయులకు భయపడి గత కొంతకాలంగా వేధింపులను భరిస్తున్న చిన్నారులు భరించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలిపజేశారు. దీంతో ఆగ్రహంచిన తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

10:24 - April 1, 2016

మనం పొద్దున్నే లేవగానే పాలు లేదా పాలతో చేసిన టీ, కాఫీలో తాగుతాం.  పాలు మనందరికీ నిత్యావసరమైతే, కొన్ని లక్షల కుటుంబాలకు జీవనాధారం. పాల వ్యాపారం మీద ఇప్పటికే ప్రయివేట్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తుండగా, విదేశీ సంస్థలు మన పాల మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. 
పాల ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్
ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశానిదే ఫస్ట్ ప్లేస్. వినియోగంలోనూ మనమే టాప్. మన దేశంలో పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ నమూనా సర్వే ప్రకారం మన దేశంలో 27.33 లక్షల కుటుంబాలకు పశు సంపదే జీవనాధారం.  తెలంగాణలో  64వేల కుటుంబాలు పశు సంపద మీద ఆధారపడి జీవిస్తున్నాయి.  తెలంగాణలో 1.27 శాతం కుటుంబాలకు,  ఆంధ్రప్రదేశ్ లో 1.99 శాతం కుటుంబాలకు  పశు సంపదే ఆలంభణ.  మన దేశంలో అయిదు ఎకరాల లోపు భూమి వున్నవారిదగ్గర 76శాతం పశుసంపద వుంది. ఇందులో 57 శాతం రెండున్నర ఎకరాల లోపు భూమి వున్నవారిదగ్గర వుంది. ఎక్కువ శాతం మంది రెండు లేదా మూడు పశువులున్నవారే కనిపిస్తారు.  
పాల వ్యాపారం.. వార్షిక టర్నోవర్ రూ.5 లక్షల కోట్ల 
మన దేశంలో పాల వ్యాపారం వార్షిక టర్నోవర్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు.  దేశంలో ఏడాదికి 138 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2020 నాటికి మన దేశంలో పాల వినియోగం 200 మిలియన్ టన్నులకు చేరుతుందన్న అంచనాలున్నాయి.    దేశీయ అవసరాలు తీర్చాలంటే  రాబోయే నాలుగైదేళ్లలో మన దేశంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సి వుంటుంది.  అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇదే తగిన సమయం. 
తగ్గుతున్న ఆవులు, గేదెల సంఖ్య 
గత మూడు దశాబ్దాలుగా మన దేశంలో ఆవులు, గేదెల సంఖ్య తగ్గుతున్నట్టు జాతీయ నమూన సర్వే తేల్చింది. ఇది ఆందోళనకర పరిణామం.   పోషణ ఖర్చులు పెరుగుతుండడమే ఆవుల గేదెల సంఖ్య తగ్గడానికి కారణం.   ఆవులను గోమాతగా   పూజించే సమాజంలోనూ అవి నిరాదరణకు లోనవుతున్నాయి.   ఆవుల సంఖ్య తగ్గడానికి కారణాలు సుస్పష్టం.   ఒకప్పుడు పశువులు మేయడానికి పచ్చికబయళ్లు వుండేవి. ఇప్పుడవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి.  ప్రతి రోజూ ఎండు గడ్డి, దాణా కొనుక్కోవాల్సి వస్తోంది. దాణా ధరలు మండిపోతున్నాయి.  ఇవాళ తెలంగాణలో ట్రాక్టర్ ఎండుగడ్డి పాతికవేల రూపాయలు దాటింది.  అంత ఖర్చు పెట్టగలిగే స్థితిలో పశు పోషకులు లేరు. నీళ్లు మరో అతి పెద్ద సమస్య.  ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ నీళ్లు లేక వెక్కిరిస్తున్నాయి. తమ దైనందిన అవసరాలకు సరిపడ నీళ్లు దొరక్క అవస్థ పడుతున్నవారు పశువులకు ఎక్కడ నుంచి తేగలరు?   అందుకే ఇవాళ చాలామంది తమ  కనుపాపల్లాంటి పశువులను సంతల్లో అమ్ముకుంటున్నారు.  
పశువులే వారికి సర్వశ్వం
ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేవారి దృష్టిలో ఆవులు గోమాతలు. కానీ, పశు పోషకులైన చిన్న రైతులకు అవి కనుపాపలు. పశువులే వారికి సర్వశ్వం. అవే వారి ఆర్థిక శక్తి . వారి సామాజిక హోదాను పెంచేవీ అవే.  ఏ కుటుంబమూ తమ పశు సంపదను సంతలకు, కబేళాలకు తరలించడానికి ఇష్టపడదు. అలాంటి విపత్కర పరిస్థితి వస్తే వారి హ్రుదయం ముక్కలవుతుంది. నీళ్లు నిండిన కళ్లతో, వెక్కివెక్కి ఏడుస్తూ వాటికి వీడ్కోలు పలుకుతారు. గో సంరక్షణ గురించి అనర్గళ ఉపన్యాసాలు ఇస్తున్నవారు, వేలాది మంది రుత్వికులతో యజ్ఇలు, యాగాలు చేస్తున్నవారు   పాలకులైన రోజుల్లోనే ఆవులను, గేదెలను సంతలకు తరలించాల్సి రావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న శాపం.       ఈ దుస్థితికి  కారణం ఎవరు? పశు పోషకులా?  తాము చెప్పే ఉపన్యాసాలను ఆచరణలో పెట్టని నాయకులా? 
హైదరాబాద్ లో రోజుకి పాతిక లక్షల లీటర్ల పాలు వినియోగం
మన హైదరాబాద్ లో రోజుకి పాతిక లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. హైదరాబాద్ లో విక్రయిస్తున్న పాలలో  తెలంగాణ నుంచి సేకరిస్తున్నవి చాలా తక్కువ.     తెలంగాణలోని పశు పోషకులను ప్రోత్సహిస్తే, హైదరాబాద్ అవసరాలు తీరడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ  పుంజుకుంటుంది.  నీటి వనరుల నిర్వహణను మెరుగుపర్చడం, పచ్చిక బయళ్లను   కాపాడడం,  కరవు కాలంలో గడ్డిని సమకూర్చిపెట్టడం, ప్రభుత్వరంగంలోని విజయ డైరీని మరింత సమర్ధవంతంగా నిర్వహించడం   ద్వారా పశుపోషకుల ప్రయోజనాలను కాపాడవచ్చు.   కానీ, ఇవాళ ప్రభుత్వాల ఆలోచనలు ఇలా లేవు. అవి, ప్రయివేట్ సంస్థలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. విదేశీ పాలను, పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. బహుళజాతి సంస్థలను పాల వ్యాపారంలోకి ఆహ్వానిస్తున్నాయి.  వాటి దెబ్బకు మన సహకార సంఘాలు హాహాకారాలు చేస్తున్నాయి.  మన దేశంలో మన రైతుల నుంచి  పాలు సేకరించే విధానానికి 1886లోనే బ్రిటీష్ వారు శ్రీకారం చుడితే, ఇప్పటి మన పాలకులు  విదేశీ బ్రాండ్లను పిలిచిమరీ, మన సహకార వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. 

సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల...

నల్గగొండ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఈ రోజు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా...మరో రెండు టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం.

10:20 - April 1, 2016

'సర్దార్' స్పీడు పెంచేసింది. సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ సెన్సారింగ్ కూడ అయిపోయింది. రెండు సాంగ్స్ లేకుండా బోర్డు అధికారులు U/A సర్టిఫికెట్ ఇచ్చేశారు. కుటుంబసమేతంగా అందరూ చూడదగిన ఫిల్మ్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న థియేటర్స్‌కి రానుంది. రిలీజ్ డేట్ ఓకే కావడంతో మరో రెండురోజుల్లో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలుకానుంది. పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌మరార్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఇప్పటికే సిడ్నీలో థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయగానే 80 శాతం టికెట్లు అయిపోయాయి. సిడ్నీతోపాటు పెర్త్ వంటి నగరాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా. ఎలాంటి కత్తెరలు పడకుండా సెన్సార్ పూర్తి చేయడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం యూరప్‌లో సాంగ్స్ చిత్రీకరణ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో వుంది. 

10:19 - April 1, 2016

పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలో ఘోరప్రమాదం జరిగింది. నిర్మాణంలోని ఫ్లై ఓవర్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో.. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకు పోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంద. ఘటన తీవ్రత తెలియగానే.. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు.. ఆర్మీ సిబ్బందీ రంగంలోకి దిగింది. 
కుప్పకూలిన నిర్మాణంలోని ఫ్లై ఓవర్
కోల్ కతా లోని గిరీష్ పార్క్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద కనీసం మరో 50 మంది వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఐదారు సెకెన్లలోపే మృత్యువు ముంచుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫ్లైఓవర్‌ కూలుతుండడంతో.. పాదచారులు దిక్కుకొకరుగా పారిపోయే ప్రయత్నాలు చేశారు. అయితే ఆలోపే భారీ ఇనుప, సిమెంటు దిమ్మెలు మీదపడిపోవడంతో.. శిథిలాల కింద కూరుకు పోయారు.
సహాయక చర్యలు ముమ్మరం 
ఘటన గురించి తెలియగానే.. స్థానిక పోలీసులకు ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది తోడై.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను రప్పించారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఫ్లైఓవర్ కూలిపోయిందని స్థానికులు ఆదరోపిస్తున్నారు. 
ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా సంస్థ
కోల్ కతాలోని రద్దీ ప్రాంతమైన గిరీష్ పార్క్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని చాలాకాలం క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. ఫ్లై ఓవర్ శంకుస్థాపన దగ్గర నుండి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనులలో వేగం పెంచాలని..ఈ డిసెంబర్ కల్లా ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయాలని మమతా సర్కార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగం పెంచిన కంపెనీ గత రాత్రి ఫ్లైఓవర్ పై భారీగా పరిమాణంలో సిమెంట్‌ను డంప్ చేసింది. ఈ కారణంగానే ఫ్లైఓవర్‌ కుప్పకూలిందని భావిస్తున్నారు. అయితే నాసిరకం పనుల వల్లే..  ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
నాసిరకం కాని పరికరాలు, సిమెంట్
ఫ్లై ఒవర్ కూలిపోయినప్పుడు చాలా మంది కంపెనీ ప్రతినిధులు ఆ పరిసరాల్లోనే పనులు నిర్వహిస్తున్నారు. దీంతో తామంతా హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని వారు తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణం  60 శాతం పూర్తయిందని.. గడ్డర్లు అమర్చుతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఐవీఆర్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణానికి అవసరమయ్యే ఏ పరికరాలను కాని.. సిమెంట్  కాని నాసిరకానివి వాడనేలేదని స్పష్టం చేశారు. 
ప్రమాద స్థలికి చేరుకున్న మమతాబెనర్జీ  
ఘటన గురించి తెలియగానే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. 
క్షతగాత్రులకు పలు ఆసుపత్రులలో చికిత్స
ప్రమాదంలో గాయపడ్డవారిని నగరంలో పలు ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది వరకు కూలీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రద్దీ ప్రాంతం కావడంతో వాహనాలలో ప్రయాణిస్తున్న వారూ ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 

 

కేటీపీఎస్ కార్మికుల సమ్మె....

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్ లో కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. షిఫ్ట్ లను పెంచడంపై నిరసన తెలియజేస్తూ 100 మంది కార్మికులు సమ్మె దిగారు. దీంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది.  

10:09 - April 1, 2016

హైదరాబాద్ : ఏపీలో కొలువుల జాతర ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలిచ్చారు. త్వరలో 25వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తామన్నారు. అవినీతి రహితంగా పనిచేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే గెలుస్తారని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. 
25 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి కసరత్తు
హైదరాబాద్ సచివాలయంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.. ప్రజాప్రతినిధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. సింగపూర్ తరహాలో ఏపీని అవినీతి రహితంగా తీర్చిదిద్ది, సమర్థవంతమైన పాలన అందించడమే లక్ష్యమని ప్రకటించారు.. పాలనలో ఉదాసీనంగా ఉంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.. రాష్ట్రంలో ఖాళీగాఉన్న 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, వచ్చే క్యాబినెట్‌ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఏడాదిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేతలు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూసి 80 శాతం మంది ఓటర్లు టీడీపీకి ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.. ఉగాది రోజున 6లక్షల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. ఈ గృహాలను ఏడాదిలోగా పూర్తి చేసి తీరతామని సీఎం స్పష్టం చేశారు.. ఈ నిర్మాణ పనుల్ని జీయో టాగింగ్‌ ద్వారా పరిశీలించాకే..  నిధులు విడుదల చేస్తామని చెప్పారు.. అలాగే 80 శాతం రోడ్లను ఏడాదిలోగా నిర్మిస్తామని ప్రకటించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు ఒకసారి సమావేశమై ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.. ఎంపీ నిధులను ఖర్చు పెట్టే సమయంలో తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులతో సమన్వయం చేసుకోవాలని ఇంచార్జి మంత్రులను ఆదేశించారు.
ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు 
అవినీతిపై కూడా నేతలకు చంద్రబాబు సీరియస్‌గా ఆదేశాలిచ్చారు.. అవినీతి పాలన అందిస్తే.. అదే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీ వివరాలతో యాప్‌ తీసుకువస్తామన్నారు. అంగన్‌వాడీ భవనాలను 750 నుంచి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని నేతలకు సూచించారు.. అయితే సీఎం కార్యాలయంనుంచి ముఖ్యమైన ఉత్తర్వులు తమకు అందడంలేదన్న కొందరు నేతల ఫిర్యాదుపై స్పందించిన సీఎం.. తక్షణమే దాన్ని పరిష్కరిస్తానన్నట్లు సమాచారం. తన మనవడి పుట్టినరోజు వేడుకలకు రావాలని చంద్రబాబు... నేతలను కోరారు.. ఉగాది రోజున అమరావతిలో జరగబోయే ఈ కార్యక్రమానికి సతీసమేతంగా రావాలని వారిని ఆహ్వానించారు.

 

దేవాలయ ప్రాంగణంలో సిబ్బంది రాసలీలలు..

విశాఖ : పవిత్రమైన దేవాలయల సన్నిధిలో దేవాలయ సిబ్బంది రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విశాఖజిల్లాలో నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధిన సత్రంలోని ఉద్యోగులు ముగ్గురు మహిళలతో కలిసి మద్యం తాగుతూ పట్టుపడ్డారు. దీనిపై భక్తులు మండి పడుతున్నారు. భక్తులు అందించిన సమాచారం మేరకు స్పందించిన అధికారులు వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జపాన్ లో భూకంపం

టోక్యో : జపాన్ నైరుతీ తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా సునామీ వచ్చే సూచనలు లేవని స్థానిక ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం సంభవించినట్లు సమాచారం లేదు.

గుంటూరులో గుమస్తా దారుణ హత్య..

గుంటూరు : నగరంలోని అరండల్‌పేటలో గుమస్తా శ్రీనివాసరావును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. శ్రీనివాసరావును హతమార్చిన ఘటనపై గుంటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు కోటప్పకొండ దగ్గర శ్రీనివాసరావు మృతదేహాన్ని తగులబెట్టారు. మినుముల వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఏపీలో నేటి నుంచి కరెంట్ ఛార్జీల బాదుడు

విజయవాడ: ఏపీలో నేటి నుంచి కొత్త విద్యుత్తు ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. గృహ వినియోగదారులకు ఛార్జీలను పెంచలేదు. కానీ గత ఏడాది వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని గ్రూపులుగా చేయడంవల్ల స్వల్ప భారంపడే అవకాశముంది. ఇకవాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో 2శాతం పెంపు అమల్లోకి వస్తోంది. రైల్వేలకు పెంపు నుంచి మినహాయింపు లభించింది. మొత్తంగా 3.4 శాతం మంది వినియోగదారులపై భారం పడనుంది. 96.6శాతం మంది వినియోగదారులపై నేరుగా ఛార్జీల భారం వేయలేదు. 

09:58 - April 1, 2016

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత చిన్న సన్నకారు రైతులు, చేతి వృత్తిదారులకు ఉపశమనం కల్పించే చట్టాన్ని ఆమోదించాయి తెలంగాణ శాసన మండలి, శాసన సభలు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రుణాల ఒత్తిడిని నివారించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు పలువురు సభ్యులు. 
రుణాల ఒత్తిడిని నివారించేందుకు చట్టం 
గ్రామీణ ప్రాంత చిన్న, సన్నకారు రైతులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఉపశమనం కల్పించే చట్టాన్ని తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రుణాల ఒత్తిడిని నివారించేందుకు తెచ్చిన చట్టాన్ని తెలంగాణ శాసన మండలి, శాసన సభలు ఆమోదించాయి. 
అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితి 
ఈ బిల్లు ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు, చేతివృత్తి దారులు అప్పులు తీసుకుని కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని రెవిన్యూ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గిరిజన రైతులకు ఐదెకరాల మాగాణి, పది ఎకరాల మెట్ట భూమి వరకు కలిగి ఉన్నవారు,..ఇతర సామాజిక తరగతులకు సంబంధించిన వారైతే..రెండున్నర ఎకరాల తరి, ఐదెకరాల మెట్ట ఉన్న వారు అర్హులని చట్టంలో పేర్కొన్నారు. కరువు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతం వారికి ఈ చట్టం ద్వారా సాయం అందుతుందన్నారు. 
ప్రైవేటు అప్పు 50వేలు ఉంటే...75శాతం సాయం 
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం గుర్తించిన ప్రాంతంలోని వారికి 50వేల వరకు ప్రైవేటు అప్పు ఉంటే వారికి 75 శాతం సాయం అందిస్తారు. 50వేలపై నుండి రెండు లక్షల వరకు 50శాతం రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని చట్టంలో పేర్కొన్నారు. ఇందుకోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జిని చైర్మన్ గానూ నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరికి మూడు సంవత్సరాల పదవీ కాలం పెట్టారు. అయితే చట్టంలో పేర్కొన్న అంశాలు రైతులకు మేలు చేకూర్చేవే అయినప్పటికీ వీటిలో కొంత అస్పష్టత ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏడాదికి 3కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొనడంతో సాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు సాయం చేయాలనుకున్న ప్రాంతాన్ని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారో  చెప్పలేదన్నారు. 
42 శాతం బ్యాంకులు, సహాకార సంస్థల రుణాలు  
అయితే పేద, సన్న, చిన్న కారు రైతులు, చేతి వృత్తిదారులు అధికంగా ప్రైవేటు వేటు అప్పులపై ఆధారపడుతుంటారు. బ్యాంకులు, సహాకార సంస్థల రుణాలు కేవలం 42 శాతం మాత్రమే రుణాలిస్తున్నాయి. అయితే ప్రైవేటు అప్పులు ఇచ్చే వారికి చట్టబద్ద గుర్తింపు ఉండాలని ప్రభుత్వం అంటోంది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి గుర్తింపు ఉన్నవారు ఎంతమంది అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ ఈ చట్టం అమలైతే  రైతులకు ప్రైవేటు అప్పులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారంటున్నారు ప్రతిపక్ష సభ్యులు. 

పఠాన్ కోట్ ఘటనపై సాక్షుల వాంగూల్మం రికార్డు

ఢిల్లీ : పఠాన్ కోట్ ఘటనపై సాక్షుల వాంగూల్మం రికార్డు నమోదు చేయనున్నారు. పాక్ దర్యాప్తు బృందం సాక్షుల వాంగ్మూలం స్వీకరించనున్నారు.

09:47 - April 1, 2016

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గులాబి దళపతి తన కనుసన్నల్లో పూర్తి చేశారు. మార్చి 10వ తేదీన మొదలైన ఈ సమావేశాలు గురువారంతో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో అన్ని పద్దులనూ చర్చకు తేవడంలో అధికారపక్షం విజయవంతమైంది. సమావేశాలు జరిగినన్ని రోజులూ దాదాపుగా రెండు పూటలా కొనసాగాయి.
12 బిల్లులకు సభ ఆమోదం 
సభ్యులు అడిగిన 48 ప్రశ్నలకు అధికారపక్షం సభలోనే సమాధానాలు ఇచ్చింది. నాలుగు షార్ట్ నోటీసు ప్రశ్నలతో పాటు 123 అనుబంధ ప్రశ్నలకు సభ ద్వారానే సమాధానం లభించింది. కాగా 161 సార్లు సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కగా మొత్తం 12 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో పార్టీల వారిగా ప్రసంగించేందుకు దక్కిన అవకాశాలను పరిశీలిస్తే టిఆర్ఎస్ మొత్తం 41 గంటా 53 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 19 గంటలా 35 నిమిషాలపాటు మాట్లాడారు. 
ఎంఐఎం 6 గంటలా 31 నిమిషాలు, బిజెపి 7 గంటలా 12 నిమిషాలు, టిడిపి 6 గంటలా 14 నిమిషాలు, వైసిపి సభ్యులు 2 గంటలా 59 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక సిపిఎం 2 గంటలా 7 నిమిషాలు, సిపిఐ 3గంటలా 7 నిమిషాలు మాట్లాడగా నామినేటెడ్ సభ్యుడు కేవలం నాలుగు నిమిషాలపాటే మాట్లాడారు. 
విపక్ష పార్టీలకు ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్
మొత్తం  సమావేశాల తీరును పరిశీలిస్తే... అధికార పార్టీ కంటే విపక్ష పార్టీలకే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దక్కింది. సభానాయకుడితో కలిపి మొత్తం 41 గంటల 49 నిమిషాలను అధికార పార్టీ నేతలు వినియోగించుకున్నారు. అయితే విపక్షపార్టీలకు మాత్రం 47 గంటలా 55 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం దక్కింది. సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలపై తాము చర్చకు అంగీకరించినా......తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రధాన ప్రతిపక్షం హాజరుకాకపోవడం దురదృష్టకరమని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావ్ అన్నారు.
33 నిమిషాలపాటు అంతరాయం
17 రోజుల సమావేశాల్లో కేవలం 33 నిమిషాలు మాత్రమే సభ్యుల ఆందోళనలతో సభకు అంతరాయం కలిగింది. కాగా అసెంబ్లీలో అత్యధికంగా 9 గంటలా 8 నిమిషాలు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు. ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డికి 4 గంటల 14 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రధాన ప్రతిపక్ష నేత కంటే మరో మూడు నిమిషాలు అధికంగా మాట్లాడే ఛాన్స్ లభించింది. కాగా చివరి రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశాలకు హైలెట్‌గా నిలిచింది.

 

09:41 - April 1, 2016

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం నేత పి.జంగారెడ్డి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో పాడి పరిశ్రమ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను చర్చించారు. ఈ సమావేశానికి  పి.జంగారెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పాలు, పాల ఉత్పత్తులు ఇక్కడి రైతుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:30 - April 1, 2016

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో జరిగిన చిన్నారి సహస్త్ర కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. డబ్బు కోసం సొంత బాబాయే ఈ అఘాయిత్యానికీ పాల్పడ్డాడు. నిందింతుడు రాజేష్ ని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సహస్త్ర నిన్న కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. 

 

 

కోల్ కతాలో ఫ్లైఓవర్ కూలి.. 21 మంది మృతి

పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలో పెను విషాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో 88 మందికి గాయాలు అయ్యాయి. మరో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు కోల్ కతా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. శిధిలాలను తొలగించే పనులు చేపట్టారు. అధికారులు సహాయ కార్యక్రమాల్లో మునిగారు.

డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

రంగారెడ్డి : మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి హయత్‌నగర్‌ రెండో మెట్రో పాలిటన్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. పెద్దఅంబర్‌పేటలో ఈ నెల 24న వనస్థలిపురం ట్రాఫిక్‌ సీఐ నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండ లం మాల్‌కు చెందిన లారీడ్రైవర్‌ నిక్కింరాంరెడ్డి(36) మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 52,397 మంది భక్తులు దర్శించుకున్నారు.

కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు : తహశీల్దార్‌ ఉపేందర్‌రెడ్డి

హైదరాబాద్‌ : కాప్రా చెరువులో కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కీసర తహశీల్దార్‌ ఉపేందర్‌రెడ్డి హెచ్చరించారు. కాప్రా కాలనీస్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సంజీ వారెడ్డి విజ్ఞప్తి మేరకు చెరువులో చేపడుతున్న ఫెన్సింగ్‌ పనులను గురువారం పరిశీలించి మాట్లాడారు. కార్వినవ్‌ క్లబ్‌ సమీపంలో చేపడుతున్న నిర్మాణాలను నిలిపేయాలని యజమానులను ఆదేశించారు. ఎస్‌టీఎల్‌ హద్దును నిర్ణయించి ఫెన్సింగ్‌ను పూర్తిగా వేయాలని సిబ్బందికి సూచించారు. కబ్జాలో ఉన్న నిర్మాణాల్ని గుర్తించి నోటీసులు ఇస్తామన్నారు.

విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం: ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం టౌన్‌లో నివాసం ఉండే రామారావు కుమార్తె శ్రావణి(18)బాచుపల్లిలోగల గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. నిజాంపేట రోడ్డులోగల త్రివేణి హాస్టల్‌లో ఉంటోంది. గురువారం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సాయంత్రం గమనించిన హాస్టల్‌ నిర్వాహకులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

ఉపరితల ద్రోణి... తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం అక్కడక్కడా ఉరుములతో కూడిన కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణకు శుక్రవారం వర్ష సూచన ఉన్నట్లు, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

కిడ్నాపైన బాలిక క్షేమం...

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో కిడ్నాపైన బాలిక సహస్ర క్షేమంగా ఇంటికి చేరింది. పోలీసులే సహస్రను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దగ్గరి బంధువులు డబ్బు కోసం సహస్రను కిడ్నాప్‌ చేశారని తేలింది. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

09:00 - April 1, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. 2016-17 విద్యుత్‌ టారీఫ్‌లను ఎపి ఈఆర్ సీ విడుదల చేసింది. చార్జీల  పెంపు నుంచి గృహ వినియోగదారులను మినహాయించింది. గృహేతర వినియోగదారులకు మాత్రం 2 శాతం ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
గృహ వినియోగదారులకు మినహాయింపు
గృహ వినియోగదారులపై ఏపీ ఈఆర్‌సీ కనికరం చూపించింది. 2016-17 సంవత్సరానికి గానూ విద్యుత్ ఛార్జీల మోత నుంచి గృహ వినియోగదారులను తప్పించింది. ఇక గృహేతర వినియోగదారులకు 2 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో ఎస్ పీడీసీఎల్, ఈపీడీసీఎల్ ప‌రిధిలో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఈఆర్‌సీ..కొత్త ఛార్జీల వివరాలను వెల్లడించింది. డిస్కంలు783కోట్ల మేర ఛార్జీలు పెంచాల‌ని  ప్రతిపాదించాయి. ఐతే పెంపును ఈఆర్‌సీ రూ.216 కోట్లకే పరిమితం చేసింది. 
మూడు గ్రూపులుగా విభజన
కొత్త విద్యుత్‌ ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.గృహేతర వినియోగదారులకు ఈఆర్‌సీ 2 శాతం ఛార్జీలు పెంచింది. గృహవినియోగదారులను మూడు గ్రూపులుగా విభజించింది. ఏడాదికి 900 లోపు వాడుకుంటే ఏ-గ్రూప్, 2700 వరకు బి-గ్రూప్, ఆపైన సి-గ్రూప్‌గా విభజించింది.
వాటికి ఈఆర్ ఫీ తగ్గింపు
చెర‌కును పిప్పి చేసే యూనిట్లు, ఎత్తిపోత‌ల ప‌థకాల‌కు ఈఆర్‌సీ టారిఫ్ ను త‌గ్గించింది. వాటితో పాటు కొత్తగా కేట‌గిరీల‌ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్వా కల్చర్‌, ప‌శు సంపద, పౌల్ట్రీ హెచ‌రీలు, ఫౌల్ర్టీ మిక్సింగ్  ప్లాంట్లు... విద్యుత్ ను అధికంగా ఉపయోగించే ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు కొత్త టారిఫ్ ల‌ను నిర్ణయించారు. గృహ వినియోగ ప‌రిమితుల‌ను సంవత్సరానికి 300 యూనిట్లు సవ‌రించారు.  నెల‌కు 100 యూనిట్లకు పైబడి ఉన్న వాణిజ్య కేట‌గిరికీ, అక్వా కల్చర్‌  మ‌రియు చెర‌కును పిప్పీ చేసే యూనిట్లు కాకుండా ఇతర పరిశ్రమలు, వీధి దీపాలు, ప్రభుత్వ తాగునీటి ప‌థకాలు, పరిశ్రమలు, ప్రభుత్వ మౌలిక స‌దుపాయాలు మ‌రియు ప‌ర్యాట‌క ఆధార విద్యుత్ పై రెండు శాతం  ఛార్జీల పెంపును ఈఆర్‌సీ అంగీక‌రించింది.

 

08:55 - April 1, 2016

నిజామాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కేసీఆర్‌ రాకకోసం.. అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వివిధ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. ప్రభుత్వ పథకాల అమలు తీరునూ సీఎం సమీక్షించనున్నారు. మొత్తం రోడ్డు మార్గం ద్వారా సాగే సీఎం పర్యటనకు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  
ఉ.9గం.లకు బయలుదేరనున్న బస్సు
తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించబోతున్నారు.. ఏప్రిల్‌ ఒకటి ఉదయం 9గంటలకు కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరతారు.. మధ్యాహ్నం 12గంటలకు జిల్లాలోని నర్సాంగ్‌పల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు.. ముఖ్యమంత్రి ఈ ఆలయానికి రావడం పట్ల సినీ నిర్మాత దిల్‌ రాజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
మ. 2 గం.లకు మాక్లూరు వెళ్లనున్న కేసీఆర్‌
ఆలయంలో కల్యాణం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్‌ మాక్లూరుకు వెళతారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త.. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు.. అక్కడినుంచి ఎంపీ కవిత ఇంటికి వెళతారు.. ఆ తర్వాత జడ్పీ హాల్‌లో అధికారులతో సమావేశమవుతారు.. అధికారులతో సమావేశంలో జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ సమీక్ష జరుపుతారు.. కరవు సహాయక చర్యల వివరాలు తెలుసుకుంటారు.. రాత్రి 7గంటలవరకూ తాగునీటి సరఫరా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, నిజాంసాగర్‌ ఆధునీకరణ కార్యక్రమాలను సమీక్షిస్తారు.. రాత్రి బాన్సువాడలోని మంత్రి పోచారం ఇంట్లో బస చేస్తారు.. శనివారం ఉదయం పదకొండు గంటలకు కేసీఆర్‌ బీర్కురు మండలం తిమ్మాపూర్‌లోని వెంకటేశ్వర ఆలయానికి వెళతారు.. అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.. అక్కడినుంచి మెదక్‌ జిల్లాకు వెళతారు..
గట్టి భద్రత ఏర్పాట్లు 
సీఎం టూర్‌కు అధికారులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.. బందోబస్తుకోసం 2వేల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు.. జిల్లాతోపాటు.. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పోలీసుల్ని రప్పిస్తున్నారు.. 15మంది డీఎస్ పీలు, 30మంది సీఐలు, వందమంది ఎస్ ఐలు, 18వందలమంది పోలీసుల్ని జిల్లాకు రప్పించారు.. గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసుల సేవల్నికూడా ఉపయోగించుకుంటున్నారు.

 

08:47 - April 1, 2016

హైదరాబాద్ : నగరంలోని విద్యానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెండాడు. కరీంగనర్ జిల్లా పెద్దపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సాయిప్రకాశ్ (20) విద్యానగర్ లో హైదరాబాద్ లో ఉంటూ... వీఎస్ టిలో టెక్నిషియన్ అప్రెంటీస్ గా పని చేస్తున్నాడు. విద్యానగర్ బస్సు స్టాప్ లో సాయిప్రకాశ్ బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. సెయిటాన్స్ స్కూల్ కు చెందిన వ్యాన్ విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యానగర్ వైపు వస్తోంది. వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా బస్సుస్టాప్ లో నిల్చున్న సాయిప్రకాశ్ పైకి దూసుకొచ్చింది... దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బస్సులోని విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి వీఎస్ టీ కార్మికులు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లాలోని సాయిప్రకాశ్ తల్లిదండ్రులకు, విద్యానగర్ లో ఉంటున్న అతని సోదరికి సమాచారం ఇచ్చారు. 

 

08:32 - April 1, 2016

రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, నల్గొండ జిల్లా తిరుమలగిరి నుంచి నగరానికి వస్తున్న కారు... హయత్‌నగర్‌ మండలం అనాజ్‌పూర్‌ సమీపంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న అక్రమ్‌, హరీష్‌, సురేష్‌ అనే ముగ్గురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌ ఎల్ బి. నగర్‌లోని ఎన్ టిఆర్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

రోడ్డు ప్రమాదం... యువకుడి మృతి

హైదరాబాద్ : నగంలోని విద్యానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడిక్కకడే మృతి చెందారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తి గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పతికి తరలించారు. మృతులు అక్రమ్, హరీష్, సురేష్ లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

తిరుమలలో 'డయల్ యువర్ టీటీడీ ఈవో' కార్యక్రమం..

చిత్తూరు : తిరుమలలో ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం జరుగనుంది. 

తిరుమలలో నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల

చిత్తూరు : తిరుమలలో నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల కానుంది. 

Don't Miss