Activities calendar

03 April 2016

టీ.20 ప్రపంచకప్ వెస్టిండీస్ కైవసం..

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండోసారి వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలుచుకుంది. చివరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సివుండగా బ్రాత్ వైట్ నాలుగు సిక్సులు కొట్టాడు. ఇంగ్లాండ్ స్కోర్ :155/9, వెస్టిండీస్ : 161/6.

22:44 - April 3, 2016

'ఊపిరి' సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లితో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహిచింది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా విశేషాలు, అనుభవాలు తెలిపారు. మనసుతో, నమ్మకంతో ఈ సినిమా చేశామని చెప్పారు. ఈ సినిమాతో బాధ్యత పెరిగిందన్నారు. ప్రేక్షకులు తమకంటే ఇంటెలిజెన్స్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

22:27 - April 3, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్,  అస్సాం రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం ఈ రెండు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ మొదలవుతుంది. పశ్చిమబెంగాల్ లో 18 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 65 అసెంబ్లీ  నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. జంగల్ మహల్ గా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన ఏరియాలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పురులియా జిల్లాలో 9,  పశ్చిమ మిడ్నాపూర్ లో 6, బంకుర జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఈ 18 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  టిఎంసి, బిజెపి 18 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా,  సిపిఎం 11, సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎన్సీపీ ఒక్కొక్క  స్థానంలో పోటీ చేస్తున్నాయి.  కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు చెరో అయిదు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాయి. పశ్చిమ బెంగాల్ లో తొలి విడత పోలింగ్ జరిగే 18 స్థానాల్లో ఆరు ఎస్టీ రిజర్వ్ డ్ కాగా,  రెండు ఎస్సీ రిజర్వడ్ స్థానాలు. మిగిలి పది జనరల్ స్థానాలు. 
అస్సాంలో సగానికిపైగా స్థానాల్లో తొలి విడత పోలింగ్ 
అస్సాంలోని సగానికిపైగా స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలుండగా తొలి విడతలో 65 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  వీరిలో 43 మంది మహిళా అభ్యర్థులు అస్సాంలో తొలి విడతలో 95, 11, 732 ఓటర్లు ఓటు హక్కు వినయోగించుకోవాల్సి వుంది. వీరిలో 45, 95, 712  మంది మహిళా ఓటర్లు.  మొత్తం 12, 190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 48 వేల  మంది పోలింగ్ సిబ్బంది, 40 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. 
అస్సాంలో హోరాహోరి పోరు
అస్సాంలో అధికార కాంగ్రెస్, బిజెపి, ఏజెపి, బిపీఎఫ్ కూటమి మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. కాంగ్రెస్ 65 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బిజెపి 54 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.  మిత్రపక్షాలైన  ఏజిపి 11, బిపిఎఫ్ మూడుస్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆల్  ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేస్తున్న 27 ని యోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది.  సిపిఎం, సిపిఐ చెరో పది స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎంఎల్ పార్టీ ఆరు స్థానాల్లో బరిలోకి దిగింది.  కాంగ్రెస్, బిజెపి హోరాహోరీగా పోరాడుతున్న అస్సాంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ దక్కక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కింగ్ మేకర్ గా మారుతుందన్న అంచనాలున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి, కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్ తొలి విడతలోనే అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

 

22:11 - April 3, 2016

హైదరాబాద్ : సరైనోడు ఆడియో వేడుకలు ఈనెల 10న విశాఖ ఆర్కెబీచ్ లో నిర్వహిస్తున్నట్లు ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తెలిపారు. జిల్లా మంత్రి గంటా ఆద్వర్యంలో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ లో పాటు ముగ్గురు హీరోయిన్స్ వస్తున్నారని.. వారితో పాటు ముఖ్య అతిథిగా చిరంజీవి హజరుకానున్నారని అల్లు అరవింద్ తెలిపారు. 

 

22:06 - April 3, 2016

ఒకప్పుడు జనంతో కళకళలాడిన భవనాలు ఇప్పుడు మానవ సంచారం లేక కళావిహీనంగా మారాయి. అయితే భవనాల్లో ఏర్పాటు చేసిన సకల సౌకర్యాలు ఏ మాత్రం చెక్కుచెదరకపోవడంతో.. ఆ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికోసం ప్రభుత్వం అందుకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆ భవనాల్లో మనుషులు ఎందుకు ఉండడం లేదు ? ఒకప్పుడు చరిత్రలో నిలిచిన భవనాలు ఎందుకు మరుగునపడ్డాయనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 
దెయ్యాల దిబ్బ 
చూశారా. ఎత్తైన అపార్ట్ మెంట్లు.. వందలాది గదులు. సముద్ర తీరాన విశాల వాతావరణంలో నెలకొల్పిన ఈ భవనాలు ప్రస్తుతం మానవ సంచారం లేక దెయ్యాల దిబ్బగా మారాయి. ఇక్కడి ఎత్తైన భవనాలు,.. ప్రతి గదిలోని సౌకర్యాలను పరిశీలిస్తుంటే చరిత్రలో కలిసిపోయిన అద్భుత నగరంలా కనిపిస్తోంది. ఈ అపార్ట్‌మెంట్‌లలో హాస్పిటల్‌, సినిమా థియేటర్‌, డాన్స్‌హాల్‌తో పాటు ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇది జపాన్‌లోని నాగసాకికి సమీపంలో 16 ఎకరాల్లో నిర్మించిన దీవి. అయితే.. ఈ దీవి విశేషాలను పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. 
'హషిమా దీవి'
జపాన్‌ పారిశ్రామికీకరణలో భాగంగా 1890లో ప్రభుత్వం ఈ 'హషిమా దీవి'ని మిత్సుబిషి సంస్థకు అప్పగించింది. సముద్ర జలాల అడుగున భారీస్థాయిలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీసే పనిని మిత్సుబిషి చేపట్టింది. దీనికోసం వందలాది మంది కార్మికులను హషిమాకు తరలించారు. వీరికోసం జపాన్‌లోనే అతిపెద్దదైన 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. అదే ఈ భవనం. ఇక రోజురోజుకు ఇక్కడకు తరలివచ్చే కార్మికులు పెరిగిపోవడంతో ఈ దీవి కళకళలాడింది. ఈ దీవిలో ఒకప్పుడు 5,259 మంది కార్మికులు ఉండేవారట. వీరి కోసం ఈ దీవిలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 
15.7 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీత
ఇక ఇక్కడ 1960 వరకు దాదాపు 15.7 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీశారు. ఆ తర్వాత బొగ్గును తీయడం కష్టం కావడం.. వ్యయం పెరగడంతో బొగ్గును వెలికితీయడం తగ్గిపోయింది. అదే సమయంలో జపాన్‌లో ఇంధన అవసరాల కోసం పెట్రోల్‌ వాడకం ఎక్కువ కావడం కూడా ఈ దీవి మూతకు కారణమైంది. 1974లో మిత్సుబిషి సంస్థ తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో చేసేదేమీ లేక కార్మికులు ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ దీవి వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఈ భవనాలు పాడుబడ్డ భవంతులుగా మారాయి. మరోపక్క జపాన్‌ ప్రభుత్వం కూడా ఎప్పుడూ తమ పౌరులను బొగ్గు వెలికితీత పనులకు ఉపయోగించుకోలేదు. ప్రపంచ యుద్ధ కాలంలో బంధీలుగా పట్టుబడ్డ కొరియా, చైనాకు చెందిన యుద్ద ఖైదీలను మాత్రమే ఈ పనికి వాడుకున్నారు. బానిసలను చిత్రహింసలకు గురి చేసి బొగ్గు గనుల్లోకి పంపేవారు. దీంతో వారెప్పుడూ ఇక్కడ సంతోషంగా ఉండేవారు కాదట. ఈ తవ్వకాల్లోనే దాదాపు 200 మందికి పైగా చనిపోయారని అంచనా. అయితే ఈ విషయాలేవీ బయటకు పొక్కనీయలేదు. ఇక కొరియన్‌ కార్మికులైతే ఈ దీవిని జైలుగా భావించేవారు. అందుకే ఇక్కడి నుంచి బయటపడిన వారు మరోసారి ఈ దీవివైపు చూసే ప్రయత్నం చేయలేదు. ఇక ఈ దీవిలో ఎన్నో ఏళ్లుగా మానవ సంచారం లేకపోవడంతో దెయ్యాల దీవిగా పేరొచ్చింది. ఇక్కడి పరిస్థితుల గురించి అనేకమంది కథలు కథలుగా చెప్పుకునే వారు. భవనాల్లో పరిస్థితులు చూస్తుంటే అదే నిజమేనని అనిపిస్తోంది. భవనాల్లో నిశ్శబ్ధ వాతావరణం కూడా ఆ భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. ఇక అప్పుడప్పుడు భవనాల్లో వింతవింత శబ్ధాలు వినిపించేవని ఆ భవనాలను సందర్శించేవారు చెబుతున్నారు. 
ప్రాంతాన్ని సందర్శించేందుకు అమితాసక్తి 
ఇక ఈ దీవి గురించి తెలుసుకున్న ప్రజలు.. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. సముద్ర తీరాన విశాల వాతావరణంలో నిర్మించిన ఎత్తైన భవంతులు ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ దీవిని సందర్శించాలనుకునే వారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది. ఇది గమనించిన జపాన్‌ ప్రభుత్వం 2009 నుంచి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగ ప్రాంతంగా మార్చింది. ఈ దీవిని సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. అయితే పురాతన కట్టడాలు కావడంతో భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులంటున్నారు. దీంతో రాత్రిళ్లు ఇక్కడ సందర్శకులు ఉండేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. 

 

21:53 - April 3, 2016

మొబైల్ ఫోన్ లేకపోతే సమాజ గతి ఎలా ఉండేది..? అసలు మొబైల్ ఫోన్‌లు రాకుంటే మనం ఎక్కడుండే వాళ్లం..? అసలా మోబైల్స్‌ రాకుంటే..  మన సెల్ఫీల ఆనందాన్ని ఎలా పొందగలిగే వాళ్లం...? ఓసారి ఆలోచించండి.. ఆలోచించడం సంగతటుంచి.. అసలా ఊహనే మనసు అంగీకరించడం లేదు కదూ.. దీన్ని బట్టి మానవ సంబంధాలతో మొబైల్ ఫోన్ ఎంతలా ముడిపడిపోయిందో అర్థమైపోతోంది.  ఇంతకీ ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా వాచ్ దిస్ స్టోరి .... 
హలో ఏం చేస్తున్నావ్  నానా ... 
హలో ఏం చేస్తున్నావ్  నానా ... ఎక్కడ ఉన్నావ్ .. తిన్నావా అంటూ ఒక తల్లి కొడుకును ఆప్యాయంగా పలకరిస్తుంది... దానికి తనయుడు ఆ తిన్నానమ్మా అంటూ రిప్లై ఇస్తాడు.. ఆ తల్లి కడుపు నిండిపోతుంది.
హలో ఫ్రెండ్ ఎక్కడ ఉన్నావ్
మరో యువకుడు హలో ఫ్రెండ్ ఎక్కడ ఉన్నావ్ అంటూ పలకరిస్తాడు.. ఓ ప్రేయసి ఎక్కడ ఉన్నావ్ డార్లింగ్ అంటూ ప్రియుడితో ముచ్చటిస్తుంది. ఓ అధికారి టార్గెట్‌ పూర్తయిందా లేదా అని సమీక్షిస్తాడు. 
ఆ ఘనత మొబైల్ దే..
ఇలా ఒకటేమిటి.. అన్ని వర్గాల జీవితాలనూ దగ్గర చేసిన ఘనత మొబైల్‌ ఫోన్‌దే. ఇలా మనుషుల్ని ఫోన్‌ల ద్వారా కలిపిన ఘనత అమెరికాకు చెందిన మార్టిన్‌ కూపర్‌దే. ఆయన సరిగ్గా ఇదే రోజునే మొబైల్‌ ఫోన్‌ను కనిపెట్టాడు. 
సరికొత్త విప్లవానికి నాంది పలికిన మార్టిన్‌ కూపర్‌
ల్యాండ్‌ ఫోన్‌ల శకాన్ని ముగించేసి.. ఈ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు మార్టిన్‌ కూపర్‌. 1973 లో మార్టిన్ కూపర్ తొలిసారిగా  మొబైల్ ఫోన్ ను కనిపెట్టారు. మోటరోలా కంపెనీ లో ఉన్నత స్థాయిలో ఉన్న  కూపర్ కంపెనీ అభివృద్దికి.. మొబైల్ ఫోన్ అభివృద్దికి ఎనలేని కృషి చేశాడు. కూపర్ ను సెల్ ఫోన్ పితామహుడిగా పేర్కొంటారు. సమాచార రంగంలో అనేక పేటెంట్లను కూడా పొందారు కూపర్ . నేడు  సెల్ ఫోన్ సంఖ్య ప్రపంచ జనాభాను దాటిపోయింది.
అప్పట్లో కీరదోసకాయ సైజులో మొబైల్ ఫోన్  
అప్పట్లో కీరదోసకాయ సైజులో ఉండే మొబైల్ ఫోన్ నేడు అనేక రూపాంతరాలు  చెంది చిన్న సైజులోకి మారి .. అటునుంచి పొడవుగా మారి...  ఆ తర్వాత స్మార్ట్ సైజుకు మారిపోయింది. కెమెరా ఫోన్ల దగ్గరి నుండి ... అధునాతన సాఫ్ట్ వేర్ లతో టూ స్మార్ట్ గా మారిపోయింది. నేడు మనం తీసుకుంటున్న సెల్ఫీలు మార్టిన్ కూపర్ కారణంగా రూపొందినవేనంటే నమ్మక తప్పదు. అప్పట్లోనే సెల్ఫీ ఆలోచన చేసింది మార్టిన్ కూపరేనట. మొబైల్ ఫోన్ అంటేనే మనం... మనం అంటేనే మొబైల్ అన్నట్లుగా మారిపోయింది నేటి యుగం. ఎవరి సమాచారాన్నయినా ఉన్నచోటు నుంచే తెలుసుకుంటున్నాం... లైవ్ లో మాట్లాడుతున్నాం.. లైవ్ లో చూసుకుంటున్నాం.. ఇదంతా ఆనాటి కూపర్ ఆలోచనకు కొనసాగింపే అనడంలో సందేహమే లేదు. 

 

 

వారి వ్యాఖ్యలకు చచ్చిపోవాలనిపిస్తుంది : రోజా

హైదరాబాద్ : అసెంబ్లీలో, మీడియా పాయింట్ వద్ద అధికార పక్ష సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు తనను చాలా బాధిస్తున్నాయని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. టీడీపీ నేతలు పీతల సుజాత, అనిత చేస్తున్న వ్యాఖ్యలకు చచ్చిపోవాలన్నంత బాధ కల్గుతోందన్నారు. తన తల్లిదండ్రులు, భర్త ఎంతో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారని, తాను నంబర్ వన్ హీరోయిన్ నని.. తామందరం తలెత్తుకుని గౌరవంగా తిరిగే వాళ్లమని, ఇటువంటి వ్యాఖ్యలతో తమకు చాలా ఇబ్బంది ఉందంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.   

 

సికింద్రాబాద్ లో సైకో వీరంగం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని తుకారాం గేటు వద్ద ఆదివారం రాత్రి ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఇనుపరాడ్డు పాదచారులపై దాడి చేయడంతో ఆ మార్గంలో వెళ్లే ముగ్గురికి గాయాలయ్యాయి. అతికష్టం మీద స్థానికులు అతణ్ని పట్టుకునిదేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న దక్కన్ మోల్డింగ్ పరిశ్రమ లో పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.54,180,12 సెల్ పోన్లు,2 కార్లూ స్వాధీనం చేసుకున్నారు.

21:22 - April 3, 2016

కోల్ కతా : 2016 మహిళా టీ-20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్లతో చిత్తు చేసి...తొలిసారిగా ప్రపంచకప్ అందుకొంది. ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 149 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్..మరో మూడు బాల్స్  మిగిలిఉండగానే  ఓపెనర్లు మాథ్యూస్, టేలర్ వికెట్ల నష్టానికి విజేతగా నిలిచింది. మాథ్యూస్ 66, టేలర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్లతో పాటు..మొదటి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగిపోయారు. వెస్టిండీస్ కెప్టెన్ టేలర్ కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు దక్కింది.

 

21:03 - April 3, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులే కారణమని మేధాపాట్కర్ ఆరోపించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. హెచ్ సీయూలో బ్రాహ్మణవాదం చెలరేగినందుకే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. హెచ్ సీయూ వీసీ అప్పారావు స్థానంలో ఉన్నతమైన వ్యక్తిని వీసీగా నియమించాలని డిమాండ్ చేశారు. 

 

20:57 - April 3, 2016

స్మాల్ స్క్రీన్ చాటర్ బాక్స్ ప్రదీప్ తో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సంరద్భంగా ప్రదీప్ పలు ఆసక్తిర విషయాలు వివరించారు. చిన్న నాటి విషయాలు, కెరీర్ గురించి, యాంకరింగ్ అనుభవాలను తెలిపారు. తాను ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తున్నానని చెప్పారు. స్కూల్, ట్యూషనలలో బాగా అల్లరి చేసేవానని తెలిపారు.
ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'సినీ హీరోయిన్ కాజోల్ నా స్వీటెస్ట్ ఫ్రెండ్. ఒక వేల టైమ్ మిషన్ ద్వారా మళ్లీ వెనక్కి వెళితే.. సోగసరి అత్త.. గడసరి కోడలు ప్రొగ్రాం చేస్తాను. మళ్లీ జన్మంటూ ఉంటే పవన్ కళ్యాణ్ లా పుట్టాలనుకుంటాను. హీరోయిన్ సమంతను పార్ట్ నర్ గా ఎంచుకుంటాను.  స్కూల్, హాస్పిటల్ నిర్మించాలని డ్రీమ్ ఉందని' తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

వెస్టిండీస్ విజయలక్ష్యం 156 పరుగులు

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వెస్టిండీస్ విజయలక్ష్యం 156 పరుగులుగా ఉంది.  

 

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో 111 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో 110 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో 110 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది.  వద్ద  ఔట్ అయ్యాడు.

 

నాల్గో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నాల్గో వికెట్ కోల్పోయింది. 84 పరుగుల వద్ద బట్లర్ (36) ఔట్ అయ్యాడు.

19:48 - April 3, 2016

అనంతపురం : జిల్లా పుట్టపర్తిలో అగ్నిప్రమాదం సంభవించింది. విదేశీయులు బస చేసే ప్రేమ హిల్ ప్రాంతంలోని గుట్టపై మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండడంతో  విదేశీయురాలు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసింది. వెంటనే స్పందించిన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికులు సహకరించడంతో పెను ప్రమాదం తప్పిందని ఆమె  పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తులు గుట్టకు నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

 

19:43 - April 3, 2016

గుంటూరు : జిల్లాలోని మ్యాట్రిక్స్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్‌ విద్యార్థి నవీన్ మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారుతోంది. జనవరి 30న విద్యార్థి అదృశ్యమవగా అతనికి సంబంధించి ఏ కొద్ది సమాచారమూ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. నవీన్ పరారైపోవడానికి వెనకున్న కారణాలు... కాలేజీ యాజమాన్యం చెబుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఫొటోలోని విద్యార్థి నవీన్ అదృశ్యమైపోయి ఇప్పటికి రెండు నెలలవుతోంది. విద్యార్థి మిస్సయిపోయి ఇంతకాలమవుతున్నా అతనికి సంబంధించిన ఏ సమాచారమూ తెలియకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 
జనవరి 30న కళాశాల నుంచి అదృశ్యం
గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మల్లికార్జునరెడ్డి, సుజాత కుమారుడు నవీన్‌రెడ్డి... మ్యాట్రిక్స్ జూనియర్‌ కాలేజీలో ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంవత్సరానికి లక్ష రూపాయల దాకా ఫీజు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా నవీన్ రెడ్డి జనవరి 30 తెల్లవారుజామున కళాశాల నుంచి అదృశ్యమయ్యాడు. ఆ విషయాన్ని నవీన్‌ మిత్రుడొకరు అతని తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పాడు. ఇదే విషయాన్ని నవీన్ తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నలుగురు విద్యార్థులు టార్చర్‌ పెట్టడంతో పారిపోయాడని చెప్పారు. ఫిబ్రవరి రెండున పోలీస్‌ కేసు పెట్టగా అప్పటినుంచి విచారణ కొనసాగుతూ ఉంది. అయితే తమ కుమారుడు పారిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని అందుకు కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. 
పరారీలో ఆ నలుగురు విద్యార్థులు
కాగా తమ కుమారుడిని వేధించిన నలుగురు విద్యార్థులు కూడా పరారయ్యారని వారిని కాలేజీ యాజమాన్యమే తప్పించిందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆ నలుగురినీ అరెస్ట్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని చెబుతున్నారు. అయితే నవీన్‌రెడ్డి కొందరు విద్యార్థుల వద్ద డబ్బు దొంగిలించాడని వాళ్లు డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తేవడంతోనే పరారయ్యాడని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. సుమారు 25 వేల రూపాయలు పోగా తాను కేవలం 5 వేలే తీశానని ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని నవీన్ ఆ నలుగురు స్టూడెంట్స్‌తో అన్నట్లు యాజమాన్యం చెబుతోంది. కాగా మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని ఆ విద్యార్థులు బలవంతం చేయగా ఒత్తిడికి గురై నవీన్‌ పరారయ్యాడని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. 
నవీన్‌ కోసం పలు ప్రాంతాల్లో సెర్చింగ్
నవీన్ పరారయ్యాక నగరంలోని పలు ప్రాంతాల్లో వెతికించామని అయినా ఫలితం లేకుండాపోయిందని యాజమాన్యం చెబుతోంది. అయితే విద్యార్థుల మధ్య అంతపెద్ద గొడవ జరుగుతున్నా తమకు ఎందుకు కబురు చేయలేదని నవీన్ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. యాజమాన్యం మాత్రం ఈ విషయాలన్నీ తమకు తెలియదని చెబుతోంది. విద్యార్థి పారిపోయాక విషయం వెలుగులోకి వచ్చిందని ప్రిన్సిపాల్ అంటున్నారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం చెబుతున్న సమాధానాల్లో యథార్థం లేదని నవీన్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని తమకు అప్పగించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. 

 

19:39 - April 3, 2016

తూర్పుగోదావరి : అతని వృత్తి ఎకౌంట్స్ చూడడం.. ఆ పని సంగతేమో కానీ.. మహిళలను లైంగికంగా వేధించడాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. రేసు గుర్రాలపై పందాలు కాసే బడా వ్యక్తుల్లాగే.. తానూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. అయితే ఆశలు హద్దులు దాటి.. బుద్ధి వక్రమార్గం పట్టి..  ఎదుటివారిని హింసించే పర్వర్ట్‌గా మారాడు. దీంతో అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ బాధిత మహిళలు మీడియాను ఆశ్రయించారు. ఇంతకీ ఎవరతను..? వాచ్‌ దిస్‌ స్టోరీ. ఈ థియేటర్‌లో గుర్రపు పందాలను తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తాడు. ఇదే థియేటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగి మహిళలపై వేధింపులకు పాల్పడుతుంటాడు. ఆ హింసను భరించలేక వీరిలా మీడియా ముందుకొచ్చారు. 
జయరామ్ థియేటర్‌
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జయరామ్ థియేటర్‌లో గత కొన్నేళ్ళుగా కార్వే సంస్థ... హైదరాబాద్ రేస్ కోర్స్ గుర్రపు పందాలను తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయిస్తోంది. ఇందు కోసం థియేటర్‌లో 20 కంప్యూటర్లను అమర్చింది. వాటిని ఆపరేట్ చేసేందుకు 20మంది మహిళలను ఉద్యోగులుగా నియమించింది. అయితే ఇదే బ్రాంచ్‌లో పనిచేస్తున్న క్యాషియర్‌ రమేష్‌బాబు గత కొంతకాలంగా మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రోజురోజుకీ అతని ఆగడాలు శ్రుతిమించుతున్నాయంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్యాషియర్‌ రమేష్‌తో మేనేజర్ సురేష్ కుమ్మక్కు 
క్యాషియర్ ప్రవర్తనపై కార్వే సంస్థ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేయగా విచారణ నిమిత్తం హైదరాబాద్ నుంచి మేనేజర్ సురేష్‌ను పంపించారు. అయితే ఆయన కూడా క్యాషియర్‌ రమేష్‌తో కుమ్మకై తమను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమపై జరుగుతున్న వేధింపులను ప్రభుత్వం అడ్డుకోవాలని న్యాయ విచారణ జరిపించి ఆదుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

19:23 - April 3, 2016

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే నిర్వహిస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం జూన్‌ 15లోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తొలివిడతలో 4,500 మంది ఉద్యోగులను తరలిస్తామన్నారు. మరో రెండు భవనాల నిర్మాణాలకు ప్లాన్‌ సిద్ధం చేశామని, వచ్చేవారంలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ భవనాన్ని ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు.

 

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వద్ద మోర్గాన్ (5) ఔట్ అయ్యాడు.

 

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఎనిమిది పరుగుల వద్ద అలెక్స్ హాల్స్ (1) ఔట్ అయ్యాడు. 

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ టైటిల్ పోరు జరుగుతోంది. 

 

18:57 - April 3, 2016

నల్లగొండ : జిల్లాలోని కోదాడలో విషాద సంఘటన జరిగింది. తెల్లవారు జామున బయటకు వెళ్లిన తండ్రి కొడుకులిద్దరు బావిలో పడి మృతి చెందారు. కొడుకు అష్రఫ్ కాలుజారి బావిలో పడగా... రక్షించే క్రమంలో తండ్రి జానీబాషా కూడా జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో బావిలోనే ఇద్దరు తుది శ్వాస విడిచారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు  చనిపోవడం తో గ్రామంలో విషాదం నెలకొంది.  

 

18:53 - April 3, 2016

కరీంనగర్‌ : దేశమంతా తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రభుత్వంపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు కాబట్టే ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సఖ్యతతో మాట్లాడుతూ ప్రతి ఎకరానికి నీరు అందించే దిశగా ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్వాగతించి విమర్శలు చేయడం మానుకోవాలని లేదంటే చరిత్ర క్షమించదన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

కోల్ కతా : టీ.20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ టైటిల్ పోరు. 

బీడీ కట్టపై పుర్రె అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా : దత్తాత్రేయ

 హైదరాబాద్ : బీడీ కట్టపై పుర్రె అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీడీ పరిశ్రమపై చాలా మంది మహిళలు ఆధారపడ్డారని చెప్పారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని పేర్కొన్నారు. కొత్త పథకాలు తీసుకొచ్చి బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. 

 

దత్తాత్రేయ కేంద్రంపై ఒత్తిడి తేవాలి : ఎంపీ కవిత

 హైదరాబాద్ : తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడి కోటి మంది జీవనం సాగిస్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. బీడీ కట్ట మీద పుర్రె గుర్తుపై తాము ఎంత పోరాడినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. పుర్రె గుర్తు విషయంలో దత్తాత్రేయ కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 

 

రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులే కారణ : మేధాపాట్కర్

హైదరాబాద్ : హెచ్ సీయూ వీసీ అప్పారావు స్థానంలో ఉన్నతమైన వ్యక్తిని వీసీగా నియమించాలని మేధాపాట్కర్ డిమాండ్ చేశారు. హెచ్ సీయూలో బ్రాహ్మణవాదం చెలరేగినందుకే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులే కారణమని ఆరోపించారు. 
ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 

18:17 - April 3, 2016

జపాన్ : వయసులో ఎలాగైనా బతికేయొచ్చు.. మరి వృద్ధాప్యం సంగతేంటి? అందుకే జపాన్‌లోని వృద్ధులు వెరైటీ మార్గం ఎంచుకున్నారు. ఏదో ఒక తప్పుచేసి జైలులో కూర్చుంటున్నారు. వీళ్లంతా చెరసాలలో ఏం చేస్తున్నారు? స్పెషల్ స్టోరీ.
జపాన్‌లో ఆయుర్థాయం ఎక్కువ...
జపాన్‌లో ఆయుర్థాయం ఎక్కువ... వృద్ధాప్యం వరకూ జనాలు హాయిగా జీవించేస్తారు. ఆ ఏజ్‌ వరకూ బతకడం బాగానే ఉన్నా కూడు, గుడ్డకుమాత్రం వృద్ధులకు కష్టాలు తప్పడంలేదు. అరవై ఏళ్లు దాటాక ఉద్యోగం లేక... ఉన్న ఆ కాస్త డబ్బు తిండికే సరిపోక ముదిమి వయసులో ఇబ్బంది పడుతున్నారు. సొంత పనులు చేసుకునేందుకు శరీరంలో సత్తువలేక నీరసపడిపోతున్నారు.. ఒక పూట తింటూ మరోపూట పస్తులుంటూ నెట్టుకొచ్చినా కొద్దిరోజులు గడిచేసరికి ఇదికూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. 
వృద్ధులు కొత్త మార్గం 
ఇలా కడుపు మాడ్చుకొని బతకలేక వృద్ధులు కొత్త మార్గం ఎంచుకున్నారు. ఏదో ఒక నేరం చేస్తూ జైలుకు చేరుతున్నారు. అక్కడ టైంకు తింటూ కాలం గడిపేస్తున్నారు. మళ్లీ బయటకువచ్చాక మరో చిన్న తప్పు చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలా ఏళ్లకు ఏళ్లు జైలులో గడిపేస్తున్నారు. 
చిన్న నేరానికి పెద్ద శిక్షలు
జపాన్‌లో చిన్న నేరానికి పెద్ద శిక్షలుంటాయి. శాండ్‌విచ్‌ దొంగిలించినా రెండేళ్లు శిక్ష పడుతుంది.. ఈ కేసుల నిందితుల్ని జైలుకు పంపి అన్నీ ఫ్రీగా అందేలా చేస్తారు. ఆ తర్వాత వారిలో మార్పు తీసుకువచ్చేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు.. దీన్ని ఆసరాగా చేసుకున్న వృద్ధులు ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు.. ఈమధ్య షాప్‌ లిఫ్టింగ్‌ కేసుల్లో 35శాతంమంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని తేలింది. జపాన్‌లో వృద్ధులకు పని కల్పించడానికి కొన్ని పథకాలున్నా ఈ ఆదాయం ఎటూ సరిపోవడంలేదు. ఈ విషయంపై దృష్టిపెట్టిన జపాన్ ప్రభుత్వం వృద్ధులకు ఆదాయం పెంచే విషయంపై ప్రత్యేక అద్యయనం చేయిస్తోంది. 

పేదలపై కాంగ్రెస్‌కు ఎలాంటి అభిమానం లేదు : పార్థాచటర్జీ

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక బాలుడని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత పార్థా చటర్జీ ఎద్దేవా చేశారు. పేదప్రజలు, బలహీనవర్గాలపై కాంగ్రెస్‌కు ఎలాంటి అభిమానం లేదన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ ఒక వాల్‌పోస్టర్‌గా మిగిలిపోతుందని ఎద్దేవాచేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్‌-లెఫ్ట్‌ఫ్రంట్‌ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. తృణమూల్‌ హయాంలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని విమర్శించారు.

 

అమరవీరులకు హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ నివాళి

హైదరాబాద్‌ : గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు కోసం పోరాటం చేస్తామన్నారు. అమరుల కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం చేస్తామని వారు హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ నాయకులు చెప్పారు.

రేపు అస్సాం విధానసభకు ఎన్నికలు

దేస్ పూర్ : అస్సాం విధానసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం తొలిదశ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 126 స్థానాలకు గాను 65 స్థానాలకు తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 95,11,732 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిదశ ఎన్నికల సందర్భంగా కీలకమైన బంగ్లా సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అన్ని పోలింగ్‌కేంద్రాల్లోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

వడదెబ్బతో ఒకరి మృతి

ఖమ్మం : జిల్లాలో వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్‌కు చెందిన చేతుల రాఘవులు అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతతో కిందపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. రాఘవులును పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

కారు ఢీకొని కార్మికుడి మృతి

ఆదిలాబాద్‌ : జిల్లాలోని జైపూర్‌ శివారులో కారు ఢీకొన్న సంఘటనలో సింగరేణి కార్మికుడు గడ్డం సత్తయ్య(50) అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీరాంపూర్ సింగరేణి గనుల్లో కార్మికునిగా పనిచేస్తున్న సత్తయ్య జైపూర్‌లో బంధువుల పెళ్లికి వచ్చి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.

ప్రత్యూష బెనర్జీ పియుడుకు పోలీసులు క్లీన్‌ చిట్‌

ముంబయి : ప్రత్యూష బెనర్జీ పియుడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌కు ముంబై పోలీసులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఆయనను పోలీసులు 14 గంటలపాటు ప్రశ్నించారు. ప్రత్యూష ఆత్మహత్యకు రాహుల్‌కు ఎలాంటి సంబంధం లేదని, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నట్లు తమ విచారణలో తెలిసిందని పోలీసులు వెల్లడించారు. రాహుల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు సయితం రాహుల్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని పోలీసులు తెలిపారు.

 

టీ.20 మహిళల ప్రపంచకప్ విజేత వెస్టిండీస్..

హైదరాబాద్ : టీ.20 మహిళల ప్రపంచకప్ విజేత వెస్టిండీస్. ఫైనల్లో వెస్టిండీస్ ను ఆస్ట్రేలియాను ఓడించారు. 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై విండీస్ గెలుపొందింది. ఆస్ట్రేలియా స్కోర్ : 148/5, వెస్టిండీస్ : 149/2. విండీస్ మహిళా జట్టు తొలిసారి టీ.20 ప్రపంచకప్ గెలుచుకున్నారు. 4 వ సారి టీ.20 వరల్డ్ కప్ సాధించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలకు వెస్టిండీస్ గంటిగొట్టింది. 

 

తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో సూర్యప్రతాపం

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సూర్యప్రతాపం. నిజామాబాద్ లో గరిష్టంగా 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మెదక్, రామగుండంలో 42 డిగ్రీలు,  హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, భద్రాచలం, హన్మకొండలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనంతపురంలో గరిష్టంగా 43 డిగ్రీలు, కర్నూలు, నంద్యాలలో 42 డిగ్రీలు, కడప, నందిగామ, జంగమేశ్వరపురంలో 40 డిగ్రీలు, తిరుపతి 39 డిగ్రీలు, విజయవాడ 38 డిగ్రీలు, తుని, నెల్లూరులో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఆఫ్రిదీ

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి ఆఫ్రిదీ తప్పుకున్నాడు. ఆఫ్రిదీ జట్టులో కొనసాగనున్నారు. 

17:18 - April 3, 2016

హైదరాబాద్ : తెలంగాణకు అప్పు ముప్ప పొంచి ఉందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. గత ముఖ్యమంత్రులు అందరూ కలిసి 69 వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. సీఎం కేసీఆర్ 20 నెలల పాలనలో 1 లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజలపై మోపబోతున్నారని విమర్శించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని కాగ్ నివేదిక తెలిపిందని చెప్పారు.

16:53 - April 3, 2016

సౌదీఅరేబియా : యావత్ ప్రపంచానికే ఇపుడు భారత్ ఓ ఆశాజ్యోతిలా నిలిచిందని భారత ప్రధాని మోడీ చెప్పారు. రియాద్‌లో ఏర్పాటు చేసిన భారతీయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య భారత్‌ పటిష్ట ఆర్థిక వ్యవస్థగా ఎదిగింన్నారు. ప్రపంచానికి భారత్‌ ఎంతో ఇవ్వగలదని, ముఖ్యంగా ఆధునిక నైపుణ్యం కలిగిన సుశిక్షితులైన మానవ వనరులను అందించగలదని ఆయన చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఇండియా ముందంజలో ఉందన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ప్రధాని...ఆ దేశంతో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. 

16:42 - April 3, 2016

ఉత్తరప్రదేశ్ : రామ్‌దేవ్ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.. రామ్‌దేవ్‌ బాబా నూడుల్స్ ను నిషేధించింది. నూడిల్స్ లో మూడింతల యాష్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అఖిలేష్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. వాటన్నింటినీ నిషేధించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా ఏ ఉత్పత్తినైనా తొలుత ల్యాబ్‌లలో పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. అయితే రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తుల విషయంలో ఎలాంటి పరీక్షలు జరపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కుట్రపూరితంగానే ఇలాంటి వాదనలను వెలుగులోకి తెస్తున్నారని బాబా వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తమ ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నామని వెల్లడించారు. 

16:38 - April 3, 2016

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం అవినీతిపై కొరడా ఝళిపించింది. అవినీతి నియంత్రణ దళాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యపై కేసు నమోదు చేసింది. సిద్ధిరామయ్య చేతి గడియారం ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేయాలంటూ నటరాజశర్మ అనే న్యాయవాది డిజీపీకి ఫిర్యాదు చేశారు. ఖరీదైన చేతిగడియారానికి బిల్లు లేదని,  దాన్ని ఎవరు అందించింది తేల్చాలని ఆయన కోరారు. అవినీతి నియంత్రణ దళాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం నగర పోలీసు కమిషనర్‌ మేఘరిక్‌ను నగర స్థాయి అధికారిగా, ఆయా జిల్లాల ఎస్పీలను ఆ ప్రాంతాలకు ఉన్నతాధికారులుగా నియమిస్తూ  ఆదేశాలను జారీ చేసింది. నియామక ఉత్తర్వులు వెలువరించిన కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మొదటి కేసు నమోదు కావడం గమనార్హం. 

16:36 - April 3, 2016

ప్రకాశం : అసలే విపరీతమైన ఎండలు.. భూగర్భ జలాలు అంతంతమాత్రమే...చెరువులూ నీరు లేక వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీటినీ అపురూపంగా చూసుకోవాల్సిన తరుణంలో.. అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు వృథా అయితే ఎలా ఉంటుంది..? ప్రకాశం జిల్లా కేంద్రంలో అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సాగర్ జలాల సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కి గండిపడడంతో నీరు వృథాగా పోయింది. దీంతో జనం దాహార్తి వెతలు మరింతగా పెరిగాయి. 
తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజలు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి అవసరమైన నీటిని అందించే ప్రయత్నాలు చేయాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఉన్న కొద్దిపాటి నీరూ వృథా అయిపోయింది. 
ఐదు రోజులకొకసారి తాగునీరు  
లక్షకు పైగా జనాభా కలిగిన ఒంగోలు పట్టణంలో నీటి కొరత కారణంగా.. ప్రస్తుతం ఐదు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వం నాగార్జునసాగర్‌ జలాలను ఒంగోలుకు తీసుకు వచ్చారు. ఇక్కడి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు.. ఇలాగే ఐదు రోజులకోసారి సరఫరా చేస్తే మరికొన్ని రోజులైనా ప్రజల గొంతు తడుపుతాయని అంతా భావించారు. అయితే.. అధికారుల నిర్లక్ష్యంతో ఉన్న కొద్దిపాటి నీరూ.. బీడు భూముల పాలైంది. 
పైపు లీకేజీ.. నీరు వృథా
సాగర్ నీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఒక సమ్మర్ ట్యాంక్ నుండి మరో సమ్మర్ ట్యాంకుకు నీటిని పంపు చేసే క్రమంలో పైప్ లైన్ పగిలి కాలువ దెబ్బతింది. దీంతో నీరు వృథా అయింది. ఈ నీటి లీకేజీని అధికారులు అదుపు చేయలేకపోయారు. 
ఒంగోలు వాసులకు నీటి కష్టాలు 
సమ్మర్‌ స్టోరీజే ట్యాంకు పైపు లైను పగలడంతో.. ఒంగోలు వాసులకు  నీటి కష్టాలు మరింతగా పెరిగాయి. సమ్మర్ స్టోరేజిలో నీళ్లు తగ్గిపోవడం.. పరిసర చెరువులలో నీరు లేక ఎండిపోవడంతో ప్రజలకు ట్యాంకర్లే దిక్కయ్యాయి. అయితే అవి ప్రజల అవసరాలను సగం కూడా తీర్చలేక పోతున్నాయి. ఈ తరుణంలో నీటిని వృథా చేసిన అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మే నెలలో నీటి ఎద్దడి మరెంత దారుణంగా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో నీటి వృథాకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. నీటి సక్రమ సరఫరాకు ఉన్నతాధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. 

 

వెస్టిండీస్ టార్గెట్ 149 పరుగులు

హైదరాబాద్ : మహిళా టీ.20 ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 వోవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. వెస్టిండీస్ విజయలక్ష్యం 149 పరుగులుగా ఉంది. మొదటగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

 

16:21 - April 3, 2016

నిజామాబాద్ : తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖలోని 4 వేల పోస్టుల భర్తీకి కృషిచేయనున్నట్టు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి సత్వర చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లకుండా... మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డిలో ట్రామాకేర్‌ సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ఈ సెంటర్లలో త్వరలోనే డయాలసిన్, ఐసీయూలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైవే ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణకు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

 

రైతుల మేలు కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్‌ : ఈటెల

హైదరాబాద్‌ : ప్రాజెక్టుల రీ డిజైన్‌ రైతుల మేలు కోసమేనని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా ఏదీ చేయదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని 'ఊరంతా ఒకదారిలో ఉంటే... ఊసరవెల్లిది మరోదారి' అన్నట్లుగా ప్రతిపక్షాల తీరు ఉందని మంత్రి ఈటెల ఎద్దేవా చేశారు.

ప్రతి సీన్ కు తిట్లు తిన్నాను : నందిత

హైదరాబాద్‌ : దర్శకుడు తేజకు కోపం వస్తే తిడతారని హీరోయిన్ నందిత చెప్పింది. 'నీకు.. నాకు డాష్ డాష్' చిత్రం షూటింగ్ లో ప్రతి సీన్ కు దర్శకుడు తేజతో తిట్లు తిన్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందిత మాట్లాడుతూ, తేజకు కోపం వస్తే చాలా గట్టిగా తిడతారని చెప్పింది. తనకు వేరే వారితో ఎఫైర్లు ఉన్నట్లు వచ్చే వార్తలను అస్సలు పట్టించుకునే ప్రసక్తే లేదంది. ఆమె కళ్ల గురించి ప్రశ్నించగా, 'నా కళ్లు బాగుంటాయని చెప్పడం కన్నా, పెద్ద కళ్లు అని చాలా మంది చెప్పారు. అది నాకు బిగ్ కాంప్లిమెంట్' అని నందిత చెప్పింది.

ప్రమాద ప్రదేశాల్లో నాలుగు ట్రామా కేర్ సెంటర్‌ లు : లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌ : అతి త్వరలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నాలుగు వేల పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో నాలుగు ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

గ్యాస్ సిలిండర్ పేలుడు... ఒకరి మృతి

చిత్తూరు : జిల్లాలో మదనపల్లె రామారావు కాలనీలోని ఓ ఇంటిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు కూలడంతో ఇంట్లో నివశిస్తున్న ఒకరు మృతి చెందారు.

 

టీడీపీతో కలసి పోటీ చేయం : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయబోమని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఆయన అన్నారు. ఈ ఉదయం జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కోసం కేంద్ర పార్టీ ఏకాభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా మాయమైనట్టేనని వ్యాఖ్యానించిన ఆయన, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా తీరప్రాంతం వోర్లిలో భారీ భూకంపం

కాన్ బెర్రా : ఆస్ట్రేలియా తీరప్రాంతం వోర్లిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించినట్టు ఇంతవరకు సమాచారం లేదు.

15:23 - April 3, 2016

గుంటూరు : జిల్లాలోని ఓ జూనియర్‌ కళాశాలలో నవీన్‌ అనే ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. నవీన్ రెడ్డి అనే విద్యార్థి విద్యానగర్‌లోని మాట్రిక్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జనవరి 30 నుంచి నవీన్‌ కనిపించకుండా పోయాడు. కళాశాలలో ర్యాగింగ్‌ వల్లే తమ కుమారుడు వెళ్లిపోయాడని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కళాశాల ఎదుట బైఠాయించారు. 
ఇక్కడే ఉరివేసుకుని చస్తాం : విద్యార్థి తండ్రి  
'ఇంటర్ మొదటి సంవత్సరం వరకు మా కుమారునికి 420 మార్కులు వచ్చాయి. జనవరి 31 తర్వాత మా అబ్బాయి కనిపించకుండా పోయాడు. కళాశాల యాజమాన్యం పొంతనలేని సమాధానం చెబుతున్నారు. సరైన సమాధానం చెప్పడం చెప్పడం లేదు.  నేను 29 న కాలేజీ వద్దకు వవ్చాను. మా వాడు హ్యాపీగా, సంతోషంగా ఉన్నాడు. మా వాడి బట్టలను కూడా ఇంటి దగ్గరే ఉతికి తీసుకొచ్చాను. నన్ను ఫ్రెండ్ బైక్ పై తీసుకెళ్లి వదిలిపెట్టాడు. నెల్లూరుకు చెందిన నలుగురు విద్యార్థులు నవీన్ ను వేధిస్తున్నారని తోటి విద్యార్థులు నాకు ఫోన్ చేశారు. ఆ నలుగురు పిల్లలు కలిసి నా కొడుకును ఏదో చేశారు. నెల రోజుల్లో మూడు సార్లు నేను కాలేజీ వద్దకు వెళ్లాను. కానీ కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని నా దృష్టికి తేలేదు. మా అబ్బాయి పోయిన తర్వాత ఓ పిల్లవాడు మాకు ఫోన్ చేసి.. అదృశ్యమైన విషయం చెప్పాడు. కానీ కాలేజీ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. 
మా బాబు మాకు కావాలి. మా అబ్బాయిని తమకు అప్పగించే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే ఇక్కడే ఉరి వేసుకుని  చస్తామని' హెచ్చరించారు.  
తల్లి.. 
'మా అబ్బాయి ఎక్కడున్నాడో,  మాకు భయమేస్తుంది. మా బాబు.. మాకు కావాలి.  ఆ నలుగురు విద్యార్థులు ఎందుకు పారిపోయారు'. 
ప్రిన్సిపల్.. 
'మొదటిసారి అని ఎవరికి చెప్పలేదు. ఎగ్జామ్స్ టైమ్ కదా... గొడవ అవుతుందని... .పేరెంట్స్ కు చెప్పలేదు. తల్లిదండ్రులు భయపడతారని చెప్పలేదు. కొన్ని డబ్బులు తీసుకున్నానని పవన్ ఒప్పుకున్నాడు. విద్యార్థులు వీడియో కూడా తీశారంట నేను చూడలేదు. అర్ధరాత్రి పిల్లవాడు భయపడి పారిపోయాడు'. 

 

14:52 - April 3, 2016

మహబూబ్ నగర్ : కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి మార్కెట్‌లో సీపీఎం బృందం పర్యటించింది. అక్కడి రైతులను అడిగి సమస్యలు తెలుసుకుంది.. పశువులకు మేత, నీరులేక కబేలాలకు తరలిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ వెంటనే వలసలను అరికట్టి.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై ఏప్రిల్ 11న కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. 

 

వానువాటులో భూకంపం....

వానువాటు : ఎనభై ద్వీపాలు ఉన్న వానువాటు దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.2గా నమోదైంది. దీంతో పసిఫిక్‌ మహాసముద్రంలో 186 మైళ్ల మేరకు సునామీ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు.

పెళ్లి కొడుకు ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : జిల్లాలోని సిర్ఫూర్‌ టి.మండలం దబ్బ గ్రామంలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కొడుకు సదాశివ తనకు వివాహం ఇష్టం లేదంటూ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ లో ఈనెల 7, 14 తేదీలలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు

హైదరాబాద్ : జిల్లాలో ఏప్రిల్ నెల 7, 14 తేదీలలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 7న గోల్కొండ మండలం రిసాల్‌బజార్‌లోని ఓవైసీ గ్రౌండ్‌లో, 14వ తేదీన సైదాబాద్ అస్మాన్‌ఘాడ్ గాంధీనగర్‌లోని కమ్యునిటీ హాల్‌లో ఆరోగ్యశ్రీ క్యాంపులు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్..

మెదక్: టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున మంత్రి హరీష్‌రావు పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సిద్దిపేటను ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు.

సిద్ధిపేటలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రచారం..

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అభ్యర్థుల తరపున ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి వార్డుల్లో విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

7, 14 తేదీల్లో ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాలు..

హైదరాబాద్: జిల్లాలో ఏప్రిల్ నెల 7, 14 తేదీలలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 7న గోల్కొండ మండలం రిసాల్‌బజార్‌లోని ఓవైసీ గ్రౌండ్‌లో, 14వ తేదీన సైదాబాద్ అస్మాన్‌ఘాడ్ గాంధీనగర్‌లోని కమ్యునిటీ హాల్‌లో ఆరోగ్యశ్రీ క్యాంపులు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

యాదాద్రిలో ఏకాదశి వేడుకలు..

నల్గొండ : జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు చేసి గర్భాలయంలోని మూల మూర్తులకు నిజాభిషేకం చేశారు.

 

తేలికగా వదిలిపెట్టం - వంగవీటి రాధా..

మచిలీపట్నం : తన తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాధా రాకతో నిజాంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

13:26 - April 3, 2016

కోల్ కతా : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత కొద్ది వారాలుగా కదిపికుదిపేస్తూ వచ్చిన 2016 టీ-20 ప్రపంచకప్ పోటీలు ముగింపు దశకు చేరుకొన్నాయి. టాప్ ర్యాంకర్ టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ దశలోనే నిష్క్రమించడంతో....మాజీ చాంపియన్లు వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల టైటిల్ సమరానికి...భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో రంగం సిద్ధమయ్యింది.  క్రికెట్టే మతంగా భావించే భారత్ వేదికగా మొట్టమొదటి సారిగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అందరి అంచనాలు తలకిందులు చేసి ఫైనల్స్ చేరడం ద్వారా ప్రపంచ రెండో ర్యాంకర్ వెస్టిండీస్, ఆరో ర్యాంకర్ ఇంగ్లండ్ తుది సమరానికి సిద్ధమయ్యాయి. ఈ ఫైనల్లో విజేతగా ఏ జట్టు నిలిచినా అది సరికొత్త చరిత్రే అవుతుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లలో...ఏ జట్టుకు దక్కుతుందో మరి.

పతాకస్థాయికి..
ఇరవై ఓవర్లలో అరవై థ్రిల్స్ లా సాగే ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ టోర్నీ పతాకస్థాయికి చేరింది. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా...జరిగే సూపర్ సండే టైటిల్ సమరంలో మాజీ చాంపియన్లు వెస్టిండీస్, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రొఫెషనల్ క్రికెట్ కు మరోపేరుగా నిలిచే ఇంగ్లీష్ టీమ్ ఫ్లేర్ కు....రఫ్ అండ్ టఫ్ స్టయిల్ క్రికెట్ ఆడే కరీబియన్ పవర్ బ్రాండ్ కు మధ్య జరిగే ఈ పోరాటం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను ఇంగ్లండ్ అలవోకగా అధిగమిస్తే..ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో టీమిండియాను వెస్టిండీస్ టీమ్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన తీరు చూస్తుంటే..టైటిల్ సమరం..హోరాహోరాగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

సుడిగేల్..
సూపర్ టెన్ రౌండ్ ప్రారంభ రౌండ్ మ్యాచ్ లో...గేల్ సుడిగాలి సెంచరీతో ఇంగ్లండ్ ను ఊదిపారేసిన వెస్టిండీస్ టీమ్...మరోసారి ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతోంది. ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, క్రిస్ గేల్ లాంటి సూపర్ హిట్టర్లతో పాటు ..మర్లోన్ శామ్యూల్స్, లెండిల్ సిమ్మన్స్, యాండ్రీ రస్సెల్, డ్వయన్ బ్రావో, డారెన్ సామీ, బ్రాత్ వెయిట్ లతో కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. అయితే...కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మందకొడి పిచ్ పై కరీబియన్ టాపార్డర్ ఏమేరకు రాణించగలదన్నది అనుమానమే.

చైనా వాల్ లా కరీబియన్ టీమ్.
స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, లెఫ్టామ్ స్పిన్నర్ సులేమాన్ బెన్, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ జోడీ గేల్, శామ్యూల్స్ తో..కరీబియన్ టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. పేస్ బౌలింగ్ విభాగంలో యాండ్రీ రస్సెల్, బ్రాత్ వెయిట్, జెరోమీ టేలర్ ప్రధాన పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక..ఫీల్డింగ్ లో కరీబియన్ టీమ్..చైనా వాల్ లా తయారయ్యింది.ఆట అన్ని విభాగాలలోనూ వెస్టిండీస్ ఆల్ రౌండ్ పవర్ తో...రెండో టీ-20 టైటిల్ నెగ్గడానికి సిద్ధమని చెప్పకనే చెబుతోంది.

ఆరో ర్యాంకులో ఇంగ్లండ్..
మరో వైపు...ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఆరో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్..స్థాయికి తగ్గట్టుగా రాణించి..ఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది. కెప్టెన్ నోయిన్ మోర్గాన్ కూల్ కూల్ కెప్టెన్సీతో పాటు ఓపెనింగ్ జోడీ హేల్స్, జేసన్ రాయ్, వన్ డౌన్ జో రూట్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జో బట్లర్ లాంటి హిట్టర్లతో ఇంగ్లీష్ బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో స్పిన్ జోడీ మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, పేస్ త్రయం ఫ్లంకెట్, విల్లీ, జోర్డాన్, బెన్ స్టోక్స్ లతో సమతూకంతోఉంది. ఏవిధంగా చూసినా...ఇటు ఇంగ్లండ్, అటు వెస్టిండీస్ సమానబలం కలిగిన...అత్యంత ప్రతిభావంతమైన సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. సూపర్ టెన్ రౌండ్లో విండీస్ చేతిలో ఎదురైన ఓటమికి...టైటిల్ సమరంలో బదులుతీర్చుకోవాలన్న కసితో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది.
2009 టీ-20 ప్రపంచ విజేత ఇంగ్లండ్, 2010 ప్రపంచకప్ చాంపియన్ వెస్టిండీస్ జట్లలో...ఏ జట్టు విన్నర్ గా నిలిచినా..అది సరికొత్త చరిత్రే అవుతుంది. రెండోసారి టీ-20 ప్రపంచ చాంపియన్‌ గా నిలిచిన ఘనత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లలో...ఏ జట్టుకు దక్కుతుందో మరి.

13:19 - April 3, 2016

హైదరాబాద్ : ప్రపంచంలోనే టాప్‌ యూనివర్శిటీ స్టాన్‌ఫోర్డ్ లో తెలుగు తేజం సత్తా చాటాడు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశంకోసం నిర్వహించిన ఎంట్రన్స్‌లో సాయి ఆకాశ్ 36 మార్కులకు 36 మార్కులు సాధించాడు. శాట్ 2 పరీక్షలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 800మార్కులకు 800 మార్కులు తెచ్చుకున్నాడు. పది హేడేళ్ల వయసులోనే ఈ రికార్డు సృష్టించాడు. సూపర్ విజ్ వ్యవస్థాపకుడు గుప్తా కొడుకు. 

13:06 - April 3, 2016

కృష్ణా : జిల్లాలో వంగవీటి రంగ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై కాపు సంఘం నేతలు, వంగవీటి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. మచిలీపట్నంలోని నిజాంపేటలో ఉన్న వంగవీటి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త దావానంలా వ్యాపించడంతో వంగవీటి అభిమానులు పెద్ద ఎత్తున్న ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వంగ అభిమానులు, కాపు సంఘం నేతలు ఆయా ప్రాంతాల్లో ధర్నా చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగా బతికినప్పుడే రక్షించలేకపోయారని, పొట్టన పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధగా ఉందని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ అమలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి వ్యక్తులున్నా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. వంగవీటి అభిమానులు, కాపు సంఘం నేతలు ప్రశాంతంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని...ఎక్కడా విధ్వంసాలకు పాల్పడవద్దని సూచించారు. 

13:04 - April 3, 2016

ఇటీవల నెల్లూరులోని టి.వి.యస్ కళ్యాణ సదన్ లో ప్రముఖ కవి ఈతకోట సుబ్బారావ్ రాసిన కాకిముద్ద కవితా సంపుటిని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ ఆవిష్కరించారు. చిన్ని నారాయణరావ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వీరయ్య,డా.సుధాకర్,రచయిత్రి జయప్రభ తదితరులు పాల్గొన్నారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పుల్వామాలో పోలీసు శిబిరంపై ఉగ్రవాది దాడి..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా ప్రాంతంలో పోలీసు శిబిరంపై ఓ ఉగ్రవాదికి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:47 - April 3, 2016

సాహిత్యం సమాజానికి దిక్సూచిలాంటిది. ఉన్నత సమాజం ఎలా ఉండాలో సాహిత్యం తెలియజేస్తుంది. మానవ సమూహాలు విలువలవైపు ఎలా అడుగులేయాలో నేర్పిస్తుంది. ప్రజలను చైతన్య ప్రవాహాలుగా మార్చిన సృజనకారులలెందరో మన మధ్య ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ గేయకవి గంగిరెడ్డి సన్యాసరావ్ ఒకరు. కనుచూపు కోల్పోయిన కళాకారుడు. అయితేనేం తన మనోనేత్రాన్ని తెరిచాడు. సమాజాన్ని తన అంతర్ కళానేత్రంతో వీక్షించాడు. అద్భుతమైన పాటలు రాశాడు. తానే వాటికి స్వరకల్పన చేశాడు. గళమెత్తి గానం చేశాడు. అలా ప్రజాసమూహాలను తన గాన ప్రవాహంలో ఓలలాడించాడు. 

12:38 - April 3, 2016

తెలుగు కథకు స్థానికతను సంతరించిన కథన శిల్పి వారణాసి నాగలక్ష్మి. ఆమె కథలు మానవ సంబంధాల మధురిమల తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అంతరంగాల కల్లోలాలకు అద్దం పడతాయి. గతానికి వర్తమానానికి వారథిగా నిలుస్తాయి. విలువలను గుర్తు చేస్తాయి. గొప్ప ఈస్తటిక్ సెన్స్ తో చదువరుల మెదళ్ళకు పదును పెడతాయి. సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. సమాజంలోని అనేక కోణాలను, మధ్యతరగతి ప్రజల బతుకు చిత్రాలను కథలుగా శిల్పీకరిస్తున్న ప్రముఖ కవయిత్రి వారణాసి నాగలక్ష్మి కథా సాహిత్యం పై ప్రత్యేక కథనం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక చేయండి. 

టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించిన మోడీ..

సౌదీ అరేబియా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. రియాద్ లో టీసీఎస్ కార్యాలయాన్ని మోడీ సందర్శించారు. టీఎస్ ఉద్యోగులతో ముచ్చటించారు.

 

12:17 - April 3, 2016

కృష్ణా : జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నంలోని నిజాంపేటలో ఉన్న వంగవీటి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త దావానంలా వ్యాపించడంతో వంగవీటి అభిమానులు పెద్ద ఎత్తున్న ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వంగ అభిమానులు, కాపు సంఘం నేతలు ఆయా ప్రాంతాల్లో ధర్నా చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ అమలు చేశారు. లక్ష్మీ టాకీస్ సమీపంలో ఉన్న వంగవీటి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి వ్యక్తులున్నా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. వంగవీటి అభిమానులు, కాపు సంఘం నేతలు ప్రశాంతంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని...ఎక్కడా విధ్వంసాలకు పాల్పడవద్దని సూచించారు.

 

12:16 - April 3, 2016

కరీంనగర్ : వేముల వాడ ఆలయంలో ప్రేమ వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. ప్రియుడిపై దాడి చేశారు. దీనితో ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా కాజీపూర్ కు చెందిన రాజు, రమ్యలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు మందలించారు. కానీ ఇరువురూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ తరుణంలో కరీంనగర్ జిల్లాలో వేములవాడలో వివాహం చేసుకోవడానికి రమ్య, రాజులు వెళ్లారు. వీరి కోసం యువతి బంధువులు గాలింపులు చేపట్టారు. వేములవాడలో వీరి వివాహాన్ని అడ్డుకున్నారు. మరోకరితో వివాహం జరిగిందని, మోసం చేస్తున్నాడని యువతి బంధువులు రాజుపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కానీ యువతి మాత్రం తాను ఇష్టపడే వివాహం చేసుకుంటున్నాని, ఆ మహిళతో విడాకులైనట్లు పేర్కొంటోంది. 

వేములవాడలో వివాహాన్ని అడ్డుకున్న యువతి బంధువులు..

కరీంనగర్ : వేములవాడ ఆలయంలో ప్రేమ వివాహాన్ని బంధువులు అడ్డుకున్నారు. ప్రియుడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. రెండో వివాహం చేసుకుంటున్నాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. 

తెరచుకున్న బ్రసెల్స్ విమానాశ్రయం..

బెల్జియం : రాజధాని బ్రసెల్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పున:ప్రారంభమైంది. మార్చి 22వ తేదీన విమానాశ్రయం ఐసీస్ దాడులతో వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 32 మంది మృతి చెందారు. 

సీఐడీ సీఐపై నిర్భయ కేసు..

కరీంనగర్ : సీఐడీ సీఐ దయాకర్ రెడ్డిపై నిర్భయ కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనన్న అగ్రికల్చర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

కరీంనగర్ సబ్ రిజిష్ట్రార్ పై వేటు..

కరీంనగర్ : సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయంలో గోల్ మాల్ పై అధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సబ్ రిజిష్ట్రార్ నరేష్ ను డీఐజీ నాయుడు సస్పెండ్ చేశారు. 

మహబూబ్ నగర్ లో తమ్మినేని పర్యటన...

మహబూబ్ నగర్ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. కరవు పరిస్థితులపై అధ్యయనానికి పర్యటన చేస్తున్నారు. కల్వకుర్తిలో పశువుల సంత, కూరగాయల మార్కెట్ లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగు, తాగునీరు, కరవు సమస్యలపై రైతులు ఏకరువు పెట్టారు. 

వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం..

మచిలీపట్నం : వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనితో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని కాపు సంఘాల నేతలు ధర్నాలకు దిగారు. 

10:19 - April 3, 2016

ఖమ్మం : గుక్కెడు నీళ్లకోసం పడిగాపులు...పాలకవర్గం పంపే ట్యాంకర్ల కోసం ఎండలో ఎదురుచూపులు.. వారానికి ఒకసారి వచ్చే నీళ్ల కోసం అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం.. నగర పాలకవర్గం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోవడంతో... ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణం. సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లు. 40 వేల జనాభాలో సిరులు పండించిన నేలగా పేరొందిన ఈ ప్రాంతంలో నేడు తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇల్లందు పట్టణానికి.. ఇల్లెందుల పాడు చెర్వు, కోటిలింగాల బావుల నుండి నీటిని సరఫరా చేసేవారు. అయితే అవి ఎండిపోవడంతో నీటికి ఇబ్బందిగా మారింది. నగరంలోని అన్ని వార్డుల్లో 25 పబ్లిక్ నల్లాలు , 69 చేతి పంపులు ఏర్పాటు చేశారు. ఓపెన్ కాస్టుల్లో జరిగే బ్లాస్టింగ్‌ల కారణంగా బోర్లలో నీళ్లు అడుగంటి పోయాయి. 69 బోర్లలో 29 బోర్లు మరమ్మత్తు చేయాల్సి ఉండగా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఉన్న చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి.

3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు..
ఇల్లెందుపాడు మంచినీటి చెరువులో నీరు దగ్గర పడడం వల్ల 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీటిని పంపిణీ చేస్తున్నారు. వాస్తవంగా ఇల్లెందు పట్టణ ప్రజలకు రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్లు అవసరం. కాని కేవలం 75 లీటర్లు మాత్రమే అందిస్తున్నారు. వర్షాకాలంలోనే నీరు పుష్కలంగా ఉన్నా రెండు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చేవారు. వేసవి ఆరంభం నుంచే నీటిని విడుదల చేయకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించి దాహార్తిని తీర్చాలని ఇల్లందు ప్రజలు కోరుతున్నారు. 

10:16 - April 3, 2016

ఉత్తరప్రదేశ్‌ : బిజ్నూర్‌లో దారుణం జరిగింది. ఎన్‌ఐఏ అధికారి మహ్మద్‌ తంజీమ్‌ను దుండగులు హత్య చేశారు. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాలుల్లో తంజీమ్‌ అక్కడికక్కడే చనిపోయారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తంజీమ్ భార్యను చికిత్స నిమిత్తం నోయిడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందంలో తంజీమ్ ఉన్నారు.

రేణిగుంటలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్...

చిత్తూరు : జిల్లా రేణిగుంట మండలం మామండూరు దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

నెక్లెస్ రోడ్డులో ఎస్ బీహెచ్ ప్లాటినం జూబ్లీ రన్..

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంగా నెక్లెస్ రోడ్డులో జూబ్లీ రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుండి లుంబిని పార్కు వరకు నిర్వహించిన ఈ పరుగును టి. రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రారంభించారు. 

ప్రత్యూష అంత్యక్రియలు పూర్తి..

ముంబై : టీవీ నటి ప్రత్యూషన బెనర్జీ అంత్యక్రియలు ముగిశాయి. మృతదేహాన్ని కొత్తపెళ్లికూతురుగా అలంకరిలంచారు. ఓషివారా క్రిమెటోరియంలో ఆమె అంత్యక్రియలు జరిపించారు. 

07:30 - April 3, 2016

అలా మొదలైంది', 'ఇష్క్', 'జబర్దస్త్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నిత్యమీనన్‌ తాజాగా '100 డేస్‌ ఆఫ్‌ లవ్‌' చిత్రం కోసం ఓ పాట పాడారు. దుల్కర్‌సల్మాన్‌, నిత్యమీనన్‌ జంటగా మలయాళంలో రూపొంది మంచి విజాయన్ని సొంతం చేసుకున్న '100 డేస్‌ ఆఫ్‌ లవ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రం కోసం ఓ పాటను పాడినట్లు నిత్య స్వయంగా ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా పాటను రికార్డ్ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. అనూప్‌ రూబెన్స్, కృష్ణ చైతన్య ఈ పాటకు సంగీతం, లిరిక్స్‌ అందించారని నిత్య తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను నిత్యే పాడారు. అందులో భాగంగా ఈ చిత్రంలోనూ పాడినట్లు సమాచారం. నిత్యమీనన్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్‌', సందీప్‌ కిషన్‌కి జోడీగా 'ఒక్క అమ్మాయి తప్ప', తమిళంలో సూర్య సరసన '24', విక్రమ్‌తో 'ఇరుముగన్‌' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది.

07:28 - April 3, 2016

'మసాన్‌' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్‌లో బోల్డెన్ని ఛాన్స్‌లొస్తున్నాయని, అయితే వాటిల్లో మనసుకి నచ్చిన స్క్రిప్ట్‌లకే గ్రీన్‌సిగల్‌ ఇస్తున్నాన'ని అంటోంది నటి రిచా చద్దా. డాన్స్ నేపథ్యంలో పూజాభట్‌ నిర్మిస్తున్న 'క్యాబరే' చిత్రంలో రిచా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రిచా మాట్లాడుతూ, 'క్యాబరే' టీజర్‌ చాలా బాగుంది. నువ్వు చాలా బాగా చేశావ్‌ అని అందరూ ప్రశంసిస్తూ ట్వీట్స్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టే నా పాత్ర తీరు తెన్నులుంటాయి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా విడుదలైన ఈచిత్రం టీజర్‌కు రెండు రోజుల్లోనే రెండు మిలియన్‌ క్లిక్స్‌ లభించడం చిత్ర విజయంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రముఖ నృత్యకారిణి హెలెన్‌ జీవిత కథని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హెలెన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆమె స్థాయిలో కాకపోయినా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు నావంతు కృషి చేస్తున్నాను' అని చెప్పింది. రిచా ఈ చిత్రంతోపాటు 'సరబ్‌జీత్‌', 'ఔర్‌ దేవదాస్‌' చిత్రాల్లో నటిస్తోంది. బయోపిక్‌ 'సరబ్‌జీత్‌'లో సరబ్‌జీత్‌కి భార్యగా రిచా నటిస్తోంది. ఇదే చిత్రంలో సరబ్‌జీత్‌కి చెల్లెలుగా ఐశ్వర్యరాయ్ నటిస్తున్న విషయం విదితమే.

07:26 - April 3, 2016

ఎప్పుడైతే మనం విఫలమవుతామో అప్పుడే మనకు విజయమంటే ఏంటో తెలుస్తుంద'ని చెబుతోంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో 'బాజీరావు మస్తానీ', 'జై గంగాజల్‌' చిత్రాల తర్వాత హాలీవుడ్‌లో 'బేవాచ్‌' చిత్రంలో అవకాశాన్ని ప్రియాంక అందిపుచ్చుకుంది. దీనికి ముందు అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తో హాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'బాజీరావు మస్తానీ' చిత్రం అత్యధికంగా అవార్డులను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ గురించి మాట్లాడుతూ ప్రియాంక తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేసింది. 'అపజయం తర్వాతే విజయం విలువ తెలుస్తుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించేందుకు నిరంతరం కృషి చేయాలి. నీకు ఏదైన పర్వతం అడ్డుగా వస్తే.. దాన్ని ఎక్కేయాలి. అంతేతప్ప అడ్డుగా ఉందని మరో మార్గాన్ని ఎంచుకోకూడదు. సాధారణంగా విజయమే లక్ష్యమని చాలా మంది భావిస్తుంటారు. కాని అది జీవిత ప్రయాణంలో ఒక మైలు రాయి మాత్రమే. నా దృష్టిలో విజయాన్ని ఆస్వాదించడమంటే మరింత పని చేయడంతోపాటు మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చు కోవడమే. జయాపజయాలు ఎవరిపైనా ఆధారపడి ఉండవు. నా జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం విజయాల్ని సెలబ్రేట్‌ చేసుకునే సమయం, ఉద్దేశం కూడా లేదు' అని చెప్పింది.

07:24 - April 3, 2016

యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జలుబుతో బాధపడుతుంటే యాలకులు దివ్యౌషధంగా పనికొస్తాయి. యాలకులను నమిలితే పొడి దగ్గు, జలుబు తగ్గిపోతాయి.
జీర్ణావయవాల్లో ఏర్పడే రుగ్మతలే నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే యాలకులను నమిలి తినేస్తే సరిపోతుంది. ఆహార పదార్థాల్లో యాలకులు చేర్చడం మంచిది. అయితే ఇది మోతాదు మించకూడదు.
యాలకుల్లోని వాలట్టైల్‌ అనే నూనె వాసనతో పాటు రోగాలను దూరం చేయడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని కారం ఉదరంలోని రుగ్మతలను దూరం చేసి జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. యాలకులను టీ, పాయసంలో ఉపయోగించడం ద్వారా కొత్త ఉత్సాహం చేకూరుతుంది.
తేమ, పీచు, పిండి, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ కలిగివుంటాయి. సంతాన లేమికి యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అజీర్తిని దూరం చేసుకోవాలంటే యాలకులు చేర్చిన ఓ కప్పు టీని తాగితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

07:22 - April 3, 2016

తెల్లగా మిలామిలా మెరిసే దంతాలు అందాన్నే కాదు... ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. మీ టూత్‌ పేస్టులో ఉప్పుందా లాంటి యాడ్స్‌ను పక్కన పెడితే దంతాలు మెరిసేలా చేసే ఓ పండు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీలు దంతాలకు సహజమైన క్లెన్సర్స్‌. ఎంత రుచిగా ఉంటాయో అంతే బాగా దంతాలకు మేలు చేస్తాయి. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆరోగ్యాన్నిస్తాయి. బాగా పండిన స్ట్రాబెర్రీని తీసుకుని మెత్తగా పేస్ట్‌ చేయండి. దాంట్లో టూత్‌బ్రష్‌ ముంచి పళ్లను జాగ్రత్తగా తోమండి. రెండే వారాల్లో తెల్లని దంతాలు మీ సొంతమవుతాయి. స్ట్రాబెర్రీస్‌లో ఉన్న సిట్రిక్‌ యాసిడ్‌ దంతాల పైన గట్టిదనాన్ని పోగొడుతుంది. సహజమైన తెల్లదనం మీ సొంతమవుతుంది.

ఆసీఫ్ నగర్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : ఆసీఫ్ నగర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. 200 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో 72 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 32 మంది బీహార్ వాసులు ఉండగా 32 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నేడు జేఈఈ మెయిన్స్ పరీక్ష..

హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం మొదటి పేపర్‌, మధ్యాహ్నం రెండో పేపర్‌ జరగబోతోంది. దేశవ్యాప్తంగా 12లక్షలమంది ఈ ఎంట్రన్స్ రాయబోతున్నారు.

06:41 - April 3, 2016

విజయవాడ : బెజవాడలో కాల్‌నాగ్‌ రవికాంత్‌ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. అమాయక మహిళల అవసరాలు ఆసరాగా చేసుకుని...లైంగిక వేధింపులకు తెగబడుతున్న దుర్మార్గుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నగ్న దృశ్యాలు చిత్రించి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్న కాలాంతకుడిని ఇప్పటికే అరెస్ట్‌ చేయగా.. అతగాడికి సహకరించిన భార్యను అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బెజవాడలో కాల్‌మనీ వ్యాపారి రవికాంత్‌ దురాగతం కలకలం రేపుతోంది. కొన్నాళ్లుగా రవికాంత్‌ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నంటూ పరిచయం చేసుకునేవాడు. ఆ తర్వాత భార్యను రంగంలోకి దింపి.. మహిళలు స్నానం చేస్తున్న సమయంలో వారి నగ్నదృశ్యాలు రికార్డ్‌ చేయించేవాడు. వాటితో బాధిత మహిళలను బ్లాక్ మెయిల్‌ చేసి లోబరుచుకునేవాడు. బెజవాడ కృష్ణలంకలో ఇంటిసమీపంలో ఉన్న మహిళను ఇదే తరహాలో వేధించి 6 లక్షలు వసూలు చేశాడు. రవికాంత్‌ పైశాచిక చేష్టలు శృతిమించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అరెస్ట్ చేశారు. రవికాంత్‌ అరెస్ట్‌ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగాయి. రవికాంత్‌కు అన్ని విధాలా సహకరించిన అతడి భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. రవికాంత్‌కు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. 2 రూపాయల వడ్డీ చెల్లిస్తానని మహిళల వద్ద డబ్బులు వసూలు చేశాడు. సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసిన డబ్బును..కాల్మనీలో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. 10 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. మరి బాధితులు, మహిళా సంఘాల ఆందోళనతోనైనా రవికాంత్‌ భార్యను పోలీసులు అరెస్ట్‌ చేస్తారో లేదో చూడాలి. 

06:39 - April 3, 2016

హైదరాబాద్ : కన్నకొడుకే కాలయముడయ్యాడు. పేగు బంధాన్ని తెంచేశాడు. కనిపెంచిన కన్న తల్లికి బతికుండగానే గోరి కట్టేశాడు. ప్రాణముండగానే పాతిపెట్టేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతగాడి క్రూరత్వం బయటపడింది.  పురిటి నొప్పులు భరించి..తన రక్తాన్ని పాలగా మార్చి బతుకునిచ్చిన అమ్మ ఆ కర్కోటకులకు చేదైంది. ...ముదిమి వయస్సులో కన్నతల్లిని కంటిపాపలా చూసుకోవాల్సిన కొడుకులు దుర్మార్గులయ్యారు. గోరుముద్దలు పెట్టిన మాతృమూర్తిని భారమనుకున్నారు. పేగు బంధాన్ని మరిచిన ఓ రాక్షసుడు.. బతికుండగానే కన్నతల్లిని ఖననం చేశాడు. ఓరుగల్లు జిల్లాలో జరిగిన ఈ దారుణం మంటగలుస్తున్న మానవత్వాన్ని ప్రశ్నించింది.

రాక్షసత్వం..
కన్నకొడుకు రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన ఈమె పేరు సట్కూరి మల్లమ్మ. భూపాలపల్లిలో నివాసముంటున్న ఈమెకు నలుగురు కొడుకులు, నలుగురు బిడ్డలున్నారు. భర్త చనిపోవడంతో ఆమె పరిస్థితి తారుమారైంది. వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్న కొడుకులు ఆమెను గాలికొదిలేశారు. వంతుల వారీగా నెలకొకరి దగ్గర ఉండాల్సిన పరిస్థితిని కల్పించారు. ఈ క్రమంలో వృద్ధురాలు మల్లమ్మ భూపాలపల్లి ఎల్‌బీనగర్‌లో ఉంటున్న రెండో కొడుకు శ్రీనివాస్‌ ఇంటికి వచ్చింది. వయో భారంతో పాటు..తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె పరిస్థితి రేపో మాపో అన్నట్లుగా ఉండటంతో..కూతుళ్లు, బంధువులు వచ్చి చూసి వెళ్తున్నారు. ఆమె మళ్లి కొలుకుంటే పరిస్థితి ఏంటని భావించాడో.. మరో కారణమో కాని శ్రీనివాస్‌లో రాక్షసుడు నిద్రలేచాడు. కన్నతల్లిని మూటలో కట్టి సమీపంలోని శ్మశానానికి తీసుకెళ్లాడు. కాలువలో గొయ్యి తీసి బతికుండగానే పాతేశాడు.

చర్యలు తీసుకుంటామన్న పోలీసులు..
ఆ తర్వాత ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ స్నానం చేసి.. నీళ్లు చల్లుతూ ఇంటిని శుద్ధి చేశాడు. దీంతో అనుమానించిన స్థానికులు కూతుళ్లతో పాటు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. శవ పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం కోసం పరకాల ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చరమాంకంలో తోడుగా అండగా ఉండాల్సిన కొడుకు చేసే పనేనా ఇది...జన్మనిచ్చినందుకు కన్నతల్లి చేదయిందా..? కాసుల మీద ఉన్న ప్రేమ...కన్నతల్లి మీద లేకపోవడం కన్నా మరో దుర్మార్గం ఉండదు. 

06:37 - April 3, 2016

హైదరాబాద్ : భాగ్యనగరం వైఫై సిటీగా మారనుంది. ఇప్పటికే అనేక చోట్ల వైఫై ఫెసిలిటీ కల్పించిన జీహెచ్‌ఎంసీ,..ఏకంగా 3వేల ప్రదేశాల్లో వైఫై పెట్టడానికి రెడీ అవుతోంది. జీహెచ్‌ఎంసీ తీసుకున్న నిర్ణయం నెటిజన్లకు వరంగా మారనుంది. ఇప్పటికే 200 ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేసిన బల్దియా యంత్రాంగం,మరో మూడువేల ప్లేసుల్లో వైఫై ఏర్పాటు చేయనుంది. దీనికోసం జీహచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆధ్వర్యంలో కమిటీ నివేదికను తయారు చేసింది. వైఫై ఏర్పాటుతో పాటు నగరంలో చేపట్టే వివిధ అభివృద్థి ,సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ మరింత వేగంగా చేసేందుకు ప్రత్యేకంగా కన్వర్జెన్షన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పోర్టల్ ఏర్పాటులో ఇప్పటికే సాఫ్టవేర్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు త్వరలోనే దీనిని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. మూసీనది ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా పర్యాటక,వాణిజ్యపరమైన భవనాలు నిర్మించే ఆలోచనలో ఉంది జీహెచ్‌ఎంసీ. నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి, చిరువ్యాపారుల రక్షణ కోసం స్ట్రీట్ వెండర్స్ పాలసీని అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వైఫై సేవలు ఆయా ప్రాంతాల్లో కనెక్ట్ కావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

06:35 - April 3, 2016

హైదరాబాద్ : దేవుడు కరుణించినా పూజారి అడ్డుకోవడమంటే ఇదేనేమో.. తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. కాని హౌసింగ్ శాఖ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఊరంతా ఒకదారైతే తమది ఉలిపికట్టెది మరోదారిలా వ్యవహరిస్తున్నారు హౌసింగ్‌శాఖ ఉన్నతాధికారులు. సీఎం కేసీఆర్ ఏఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో లెక్కతీయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యడానికి సంబంధించిన సూచనలను కూడా అధికారులకు తెలియజేశారు. అయితే హౌసింగ్ శాఖలో మాత్రం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నివేదికను ప్రభుత్వానికి పంపకుండా, ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టే ప్రయత్నం జరుగుతోంది.

వేధిస్తున్నారంటున్న ఉద్యోగులు..
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా జరిగే నిర్మాణాల పర్యవేక్షణ,వాటి వ్యవహారాలు, అమ్మకం-కొనుగోలుకు సంబంధించి 2007 లో హౌసింగ్ శాఖ కాంట్రాక్ట్ పద్దతిన కొంతమందిని రిక్రూట్ చేసుకుంది. ఇందులో ఏఈ,ఏఈఈ,క్యాడ్ ఆపరేటర్స్‌,ఫీల్డ్‌లెవెల్ ఆఫీసర్స్‌,క్లర్క్,ఆఫీస్‌సబార్డినేట్ ఇలా 16 మందిని నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరిచేత చేయించుకోవాల్సిన చాకిరంతా చేయించుకుంది. ఇప్పుడేమో ఆయా కారణాలు చూపి కొంతమందిని పక్కన పెట్టారు అధికారులు. కార్పొరేషన్ నష్టాల్లో ఉంది..హౌసింగ్ శాఖ కట్టిన ఇళ్లు అమ్మకం కావడం లేదు.. ఇలా ఉంటే సంస్థ ఎలా నడుస్తుంది..అంటూ సంబంధంలేని కారణాలతో అధికారులు తమను వేధిస్తున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి, తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

06:33 - April 3, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చెయ్యాలనుకుంటోంది టీ-టీడీపి. అందుకోసం కలిసివచ్చే పార్టీలతో ప్రజా ఉద్యమం చేసేందుకు పావులు కదుపుతోంది. రెండేళ్లవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు తెలుగుతమ్ముళ్లు. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గొప్పలు తప్ప, ప్రజల తిప్పలపై చర్చలే జరగలేదని తెలంగాణ టీడీపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా,అన్ని సమకూర్చేశామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రజాసమస్యలపై ఒకరిద్దరు గట్టిగా ప్రశ్నిస్తున్నా, వారి గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలపై ,ఇతర పార్టీలతో కలిసి సంఘటితంగా పోరాటం చెయ్యడానికి ప్రయత్తిస్తున్నట్టు టీటీడీపి నేతలు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీల్లో ఏకాభిప్రాయం..
సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశంతో పాటు, అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షపార్టీల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి నిల్వలపై సీఎం వివరించిన అంశాలను వ్యతిరేకిస్తూ, ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి ప్రతిపక్షాలు . తద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఇతర పార్టీల సహకారం తీసుకొని ప్రజల్లో ఉద్యమాన్ని ఉధృతం చెయ్యడానికి టీ-టీడీపి సమాయత్తమవుతోంది. మొత్తానికి అధికార పార్టీపై సంఘటిత వ్యూహంతో పోరాటం చెయ్యాలనుకుంటోంది టీ-టీడీపి. అయితే టీడీపీతో జతకట్టే ఇతర పార్టీలు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తాయో చూడాలి.

06:28 - April 3, 2016

హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం మొదటి పేపర్‌, మధ్యాహ్నం రెండో పేపర్‌ జరగబోతోంది. దేశవ్యాప్తంగా 12లక్షలమంది ఈ ఎంట్రన్స్ రాయబోతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని సీబీఎస్ ఈ ప్రకటించింది. జాతీయస్థాయిలో ఎన్ఐటి లు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ ఆదివారం జరగబోతోంది.. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12లక్షలమంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు.. ఇందుకోసం 132 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఏపీ, తెలంగాణ నుంచి లక్షా 22వేలమంది ఈ ఎంట్రన్స్ రాయబోతున్నారు.. మహారాష్ట్ర, గుజరాత్‌ తర్వాత తెలుగు రాష్ట్రాలనుంచే ఎక్కువ మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. జేఈఈ మెయిన్స్ మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగాఉన్న 30 ఎన్‌ఐటీలు, 9 ట్రిపుల్‌ఐటీలు,14 కేంద్రీయ సంస్థల్లోని 20 వేల ఇంజినీరింగ్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి.

ఆన్ లైన్ లో పరీక్షలు..
ఆఫ్‌లైన్‌ విధానంలో జేఈఈ మెయిన్స్ మొదటి పేపర్ ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటలవరకూ... రెండో పేపర్‌ మధ్యాహ్నం రెండు నుంచి ఐదుగంటల వరకూ జరగనుంది.. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తిరుపతిలో ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.. ఆన్‌లైన్‌ పరీక్షలు ఈ నెల 9, 10 తేదీల్లో జరగబోతున్నాయి.. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన లక్షా 50వేలమందిని జేఈఈ అడ్వాన్స్‌కు ఎంపిక చేస్తారు.. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ సాధించినవారికి ఐఐటీల్లో సీటు దక్కుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని ఈ ఎంట్రన్స్‌ను నిర్వహిస్తున్న సీబీఎస్ ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు అరగంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తులు తీసుకురావొద్దని స్పష్టం చేసింది.

06:25 - April 3, 2016

గుంటూరు : తెలుగుదేశం పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయంగా గుంటూరు ఎన్టీఆర్‌ భవన కొత్త రూపును సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటయ్యేదాకా గుంటూరు భవన్‌ తాత్కాలిక కేంద్ర కార్యాలయంగా కొనసాగనుంది. పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నడుస్తాయని టిడిపి నేతలు చెప్తున్నారు. రాజధానిలో శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటయ్యేదాకా గుంటూరు భవనే తాత్కాలిక కేంద్ర కార్యాలయంగా కొనసాగనుంది. ఉగాది నుండి పార్టీ రాష్ట్ర, జాతీయ కార్యకలాపాలన్నీ ఇక్కడ నుండే నడుస్తాయి. పార్టీ సీనియర్‌ నేతలు వీవీవీ చౌదరి, టిడి జనార్థన్‌, రామిరెడ్డి శనివారం గుంటూరు ఎన్టీఆర్‌ భవనకు రాగా వారికి జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భవనానికి సంబంధించిన పత్రాలను వారికి అందచేసి..కార్యాలయాన్ని వారికి అప్పగించారు.

మూడు అంతస్థులు..
మొత్తం మూడు అంతస్థులుగా ఉన్న ఈ భవనంలో ఇక నుంచి పార్టీ, అనుబంధ సంస్థల సమావేశాలు, సమీక్షలు, టెలికాన్ఫరెన్సలు, మీడియా సమావేశాలన్నీ ఇక్కడే జరుగుతాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నాయకులకు గుంటూరు భవన్‌ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే పార్టీ అధినేత చంద్రబాబు దీనిని ఎంపిక చేశారని ఆపార్టీ నేతలు చెప్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ, తెలంగాణల్లో ఇదే పెద్ద కార్యాలయం అని పార్టీ నేతలు చెప్తున్నారు. మూడంతస్తుల భవనం, విశాలమైన పార్కింగ్‌ వసతి కూడా ఉంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాలు రాజధానిగా నిర్ణయించడంతో..పార్టీ రాష్ట్ర, జాతీయ కార్యక్రమాలు ఇక్కడ నుండే జరపాలని అధిష్టానం నిర్ణయించినట్లు జనార్థన్‌ తెలిపారు. అయితే గుంటూరులో ఉన్న ఈ కార్యాలయాన్ని త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సందర్శిస్తారని పార్టీ నేతలు తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మీటింగ్ హాల్‌ను పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా మార్పులు చేసి,.ఇక్కడే సమావేశాలు నిర్వహస్తామన్నారు. ఈనెల 8న ఉగాది రోజున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 

నేడు రాష్ట్ర తహశీల్దార్ల సంఘం సమావేశం..

హైదరాబాద్ : తహశీల్దార్ల సమస్యలు, డిమాండ్లపై చర్చించేందుకు ఆదివారం తెలంగాణ తహశీల్దార్ల సంఘం నాంపల్లిలోని కార్యాలయంలో సమావేశం కానుంది.

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు - సీఎం చంద్రబాబు..

విజయవాడ : పాతబస్తీలో ముస్లీంల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

అగ్రికల్చర్ ఉద్యోగినిపై సీఐ లైంగిక వేధింపులు..

కరీంనగర్ : అగ్రికల్చర్ ఉద్యోగినిపై సీఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారంలో బినామీగా వ్యవహరించిందని విచారణ పేరిట సీఐ వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్ లో అసభ్యపదజాలంతో వేధించాడు. కరీంనగర్ టూ టౌన్ పీఎస్ ళో ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. 

ఆలేరు మండలంలో బ్రిడ్జిపై నుండి పడిపోయిన టవేరా వాహనం..

నల్గొండ : ఆలేరు (మం) పెద్దవాగు సమీపంలో ఓ టవేరా వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుండి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుడు రాంపల్లి సురేష్ (32) గా గుర్తించారు. బాధితులు హైదరాబాద్ మల్కాజ్ గిరి వాసులని తెలుస్తోంది. 

40 హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు..

హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలో 40 హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్ లో ఈ దాడులు జరిగాయి. 

తెలంగాణ రాష్ట్రంలో నేడు వర్ష సూచన..

హైదరాబాద్ : మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. భూమికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఆవర్తనం వల్ల బం గాళాఖాతం నుంచి ఆదివారం చలిగాలులు వీస్తాయని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

 

Don't Miss