Activities calendar

04 April 2016

21:31 - April 4, 2016

హైదరాబాద్ : హెచ్‌సియులో విద్యార్థులపై జరిగిన దాడులపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌...హెచ్‌ఆర్‌సికి నివేదిక ఇచ్చారు. 150 ఫొటోలు, వీడియోలను హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు అందజేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించలేదని వారిని మహిళా పోలీసులే అరెస్ట్‌ చేశారని నివేదించారు. వర్సిటీలో హక్కుల ఉల్లంఘన జరగలేదని పోలీసులు వెళ్లేసరికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని.. సీవీ ఆనంద్ రిపోర్టులో పేర్కొన్నారు. 

21:29 - April 4, 2016

విజయవాడ : గుంటూరు-ప్రకాశం జిల్లాల మధ్య నీటివివాదం మొదలైంది. తాగునీటి కోసం ప్రజలతో కలిసి వినుకొండ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. ప్రకాశంజిల్లా నుంచి తాగునీరు ఇవ్వాలంటూ... బొల్లాపల్లి మండలం గుట్లపల్లి వద్ద 20గ్రామాలతో ప్రజల ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా... రెండు జిల్లాల పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు.  

21:27 - April 4, 2016

హైదరాబాద్ : చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు కల్పించాల్సిన 25 శాతం కోటాను కేటాయించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరికీ సమాన విద్య అంటూ స్పీచ్‌లు ఇస్తున్న నేతలు, ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకూ సర్క్యులర్ జారీ చేయకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూన్ 13 లోపు ప్రకటన విడుదల చేసి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించాలనే చట్టాన్ని పాటించకపోవడంతో పిల్ దాఖలైంది. 

21:26 - April 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. పట్టిసీమ ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ పనుల విషయంలో ఇరు రాష్ట్రాల చొరవను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తమ పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు.

నదుల అనుసంధానంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి...

నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత జల వారోత్సవాలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. సాగు, తాగునీటి పథకాల అమలులో తెలుగు రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు పట్టుదలతో పూర్తిచేసి దేశంలో నదుల అనుసంధానానికి నాంది పలికారన్నారు. అదే రీతిలో పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తే అనంతపురం సహా కరువు పీడిత జిల్లాలకు నీటిని అందచేయోచ్చన్నారు.

పట్టిసీమను పట్టుదలతో చంద్రబాబు పూర్తిచేశారు ....

సాగు, తాగునీటి పథకాలపై అటు తెలంగాణ రాష్ట్రం కూడా బాగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కితాబిచ్చారు. తెలంగాణలో చేపట్టిన మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలపై ప్రశంసలు కురిపించారు. మధ్యప్రదేశ్‌లో కరువున్నా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 22 కంటే ఎక్కువే సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నీటి పారుదల, వ్యవసాయ రంగాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టినా వాటికి కేంద్రం మద్దతిస్తుందని అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టను పూర్తిచేసేందుకు కంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మరో మంత్రి ఉమాభారతి హామీ

సాగు, తాగునీటి పథకాలు .....

సాగు, తాగునీటి పథకాలను చేపట్టిన రాష్ట్రాలకు కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని అరుణ్‌జైట్లీ హామీ ఇవ్వడంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తే..రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. 

21:23 - April 4, 2016

హైదరాబాద్ : లక్ష కోట్ల ఎగుమతులే లక్షంగా నూతన ఐటీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఐటీ రంగాన్ని మరింత విస్తరించి సమ్మిలిత అభివృద్ధి సాధించడాన్నే కర్తవ్యంగా నిర్దేశించుకుంది. ఐటీ దిగ్గజాల నడుమ ఐటీ పాలసీని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిసి అభివృద్ధి సాధిద్దామని సీఎం పిలుపునిచ్చారు.

ఐటీ రంగంలో మరో ముందడుగు....

ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే సింగిల్ విండో విధానం ద్వారా పారిశ్రామిక రంగంలో శభాష్ అనిపించుకుంటున్న రాష్ట్రం ఇప్పుడు ఐటీ విస్తరణలోనూ ప్రత్యేకతను చాటుకుంది. లక్ష కోట్ల విలువ గల ఐటీ ఎగుమతులే లక్షంగా సరి కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించింది. ఐటీ రంగాన్ని కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశలో నూతన విధానం కృషి చేయనుంది. ఇన్ఫోసిస్ అధినేత నారయణమూర్తితో సహా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాల నడుమ నూతన ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణలో తయారు చేసిన రోబో నడుచుకుంటూ వచ్చి ఐటీ విధానాన్ని సీఎంకు అందజేయగా...దాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు తావులేకుండా...కేవలం 15 రోజుల్లోనే నూతన ఐటీ కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

నూతన ఐటీ పాలసికి అనుభంధంగా మరో నాలుగు...

నూతన ఐటీ పాలసికి అనుభంధంగా మరో నాలుగు విధానాలను మంత్రులు, ఐటీ దిగ్గజాలు ఆవిష్కరించారు. ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీ ద్వారా ఐటీతో పాటు అనుబంధ రంగాలకు సైతం రాయితీలు ప్రకటించింది ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం రాయితీలు మంజూరు చేసింది. 50 లక్షల టర్నోవర్‌లోపు గల ఐటీ కంపెనీలకు మొదటి మూడు సంవత్సరాల వరకు సర్వీస్ టాక్స్, వ్యాట్‌ నుంచి మినహయింపునిచ్చింది. ప్రభుత్వ భవనాల్లో వచ్చే స్టార్టప్ కంపెనీలకు మొదటి ఐదు సంవత్సరాలకు ఎలాంటి రెంట్ ఉండదు. అదే ప్రైవేట్ భవంతులైతే ప్రభుత్వమే మొదటి మూడు సంవత్సరాలు 25 శాతం మేర రెంట్ భరిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టాలంటే మరిన్ని ప్రోత్సహాలు అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఐటీ దిగ్గజాలు హర్షం....

ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన ఐటీ విధానం పట్ల ఐటీ దిగ్గజాలు హర్షం వ్యక్తం చేసాయి. తెలంగాణ ప్రభుత్వ విధానం చాలా వినూత్నంగా ఉందని కితాబిచ్చారు. డిజిటల్ తెలంగాణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తాము భాగస్వాములమవుతామని పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవతా విలువలు మరువరాదని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి యువ పారిశ్రామిక వేత్తలకు సూచించారు. సమ్మిళిత అభివృద్ధి సాధించే దిశలో నూతన ఐటీ విధానం విజయం సాధిస్తుందని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.

28 కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూ.....

ఐటీ విధాన ఆవిష్కరణ సభలోనే 28 కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ సహకారంతో మరిన్ని ఆవిష్కరణలు రూపొందిస్తామని కంపెనీలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. మొత్తంగా కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ఐటీ పాలసీని ప్రజల ముందుంచింది తెలంగాణ ప్రభుత్వం.

20:11 - April 4, 2016

హైదరాబాద్ : భారత స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ ప్రపంచ టీ20 ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. దీనికి కొనసాగింపు ఆనందంగా మన సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ టీ20 బ్యాట్స్‌మెన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను వెనక్కు నెట్టి మరీ టాప్‌లో నిలిచాడు కోహ్లీ. విరాట్‌కు ప్రస్తుతం 892 పాయింట్లు ఉండగా ఫించ్‌కు 868 పాయింట్లు ఉన్నాయి. టీ20ల్లో టాప్‌లో నిలిచిన కోహ్లీ వన్డే ర్యాంకిగ్స్‌లో సౌతాఫ్రికా ఆటగాడు డెవిలియర్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆటగాడిగా మన్ననలందుకుంటున్నాడు.

మాదాపూర్‌లో 4గురు దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్ : మాదాపూర్‌లో నలుగురు సభ్యులు గల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడతున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.

15 లోగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వండి : సీఎస్ రీజీవ్ శర్మ

హైదరాబాద్ : 9,10 షెడ్యూల్డ్ పరిధిలోని సంస్థలపై ఉన్నతాధికారులతో సీఎస్ రీజీవ్ శర్మ సమావేశం అయ్యారు. విభజన పెండింగ్లో ఉన్న సంస్థలపై సీఎస్ ఆరా తీశారు. అంతే కాకుండా ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 15 లోగా క్రమబద్దీకరించాల్సిన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను అందించాలని ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు అందించడంలో ఆలస్యమైతే చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు.

 

ఏప్రిల్ లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ : ఏప్రిల్ నెలలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలియజేసింది. ఉత్తర, మధ్య భారతంలో వేడి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని, వచ్చే 3,4 రోజుల్లో వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలియజేసింది.

రామగుండం ఎన్టీపీసీ ఆరో యూనిట్ వద్ద ప్రమాదం...

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీ ఆరో యూనిట్ టర్బైన్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రశ్నాపత్రం లీక్ కేసులో మంత్రి పీఏ అరెస్ట్

కర్ణాటక: గత వారం బెంగళూరులో జరుగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీకైన విషయంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి పీఏ కూడా ఉన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడటంతో అధికారులు పరీక్షను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

డీఎంయూ కార్యాలయం ఎదుట నర్సుల ఆందోళన

హైదరాబాద్ : శిక్షణ పేరుతో అధికారులు తమపై పని ఒత్తిడి పెంచుతున్నారని ఎఎన్‌ఎం నర్సులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన నర్సులు సికింద్రాబాద్‌లోని డీఎంయూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మిషన్‌ ఇంద్ర ధనస్సు శిక్షణ పేరుతో తీసుకువచ్చి బలవంతంగా ఇంటింటి సర్వే చేయిస్తున్నారని వారు ఆరోపించారు. చంటి పిల్లలతో ఇంటింటికి తిరగలేకపోతున్నామని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

19:43 - April 4, 2016

హైదరాబాద్ : యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయా, ప్రభుత్వ స్కూళ్లలో అరకొర వసతులు నెలకొన్నాయా, తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నారా, స్కూల్ యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయా, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంపై విమర్శల వెల్లువెత్తున్నాయా, ఫీజులపై ఉద్యమిస్తామంటున్న విద్యార్థి సంఘాలు ఇత్యాది అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ చాప్టర్ అధికార ప్రతినిధి శివామకుటం, ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:38 - April 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల హవా నడుస్తోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్న యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 13వేల 500 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటిలో దాదాపుగా 32 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అందులో అత్యధికంగా కార్పోరేటు పాఠశాలల బ్రాంచీలే కావడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న అనేక సమస్యల వల్ల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా స్కూల్ యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. చేసేది లేక విద్యార్థుల తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టైనా ఫీజులు చెల్లిస్తున్నారు.

ఫీజుల చిట్టా చూస్తే తల్లిదండ్రుల గుండె ఆగినంత పనవుతోంది.....

ఫీజుల చిట్టా చూస్తే తల్లిదండ్రుల గుండె ఆగినంత పనవుతోంది. కేవలం నర్సరీకే కొన్ని పాఠశాలలు 25 వేల నుంచి 30 వేల వరకు ఫీజు నిర్ణయించాయి. ఇక ఆ పై తరగతుల విషయానికి వస్తే అంతే సంగతులు. పదో తరగతి చదివించాలంటే తల్లిదండ్రులు ఆస్తులు కుదువ పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. నగరంలో బడా బడా పాఠశాలలో ఫీజులు చూస్తే కళ్లు భైర్లు కమ్ముతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కో స్కూల్‌లో లక్షల రూపాయల ఫీజులున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. అద్దాల మేడలు... ఏసీ గదులు అని ప్రచారం చేసుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బట్టీ విద్యకు తోడు అరకొర సౌకర్యాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ లో ...

హైదరాబాద్‌ లో ఓక్రిడ్జ్ , ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సుచిత్ర, గ్లెండాలే.. వంటి పాఠశాలల్లో కనీస ఫీజులు లక్షా 20 వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నాయంటే ఫీజుల జులుం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జైన్ హెరిటేజ్ , మెరిడియన్ వంటి స్కూళ్లలో 80 వేల నుంచి 90వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. నారాయణ ఒలంపియాడ్ లో 70 వేల నుంచి 80 వేల వరకు, హైదరబాద్‌ పబ్లిక్ స్కూల్ లో 45 నుంచి 65 వేల వరకు, సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో 40 నుంచి 45 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌లో 30 వేలు మొదలుకొని 53 వేల వరకు ఫీజులున్నాయి. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రైవేటు స్కూళ్లను నియంత్రించలేక పోతున్నారు.

ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు ఎప్పటకప్పుడు గగ్గోలు....

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు ఎప్పటకప్పుడు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫీజులపై అనేక జీవోలు వచ్చినా ఇంతవరకు ఒక్క జీవో కూడా అమలుకు నోచుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన కేసీఆర్‌ ప్రభుత్వం పాఠశాలల ఫీజులపై పకడ్బందీగా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామంటూ హెచ్చరిస్తున్నాయి. 

హెచ్ సియూలో హక్కుల ఉల్లంఘన జరగలేదు: సీవీ ఆనంద్

హైదరాబాద్ : హెచ్ సియూలో హక్కుల ఉల్లంఘన జరగలేదని హెచ్ ఆర్సీకి సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నివేదిక అందజేశారు. హెచ్ సియూ ఘటనలపై 150 ఫోటోలు, వీడియోలను హెచ్ ఆర్సీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించలేదని, వారిని మహిళా పోలీసులే అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసులు వెళ్లే సరికి వీసీ గెస్ట్ హౌస్ పై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. వీసీని చంపేస్తామని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఓ గదిలో వీసీ, ఫ్యాకల్టీ దాక్కురని... ఆ గదిలోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారని చెప్పారు.

పనామా పేపర్స్ స్కాంపై దర్యాప్తుం హోలాండే..

పారిస్: ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా వెలుగులోకి వచ్చిన పనామా పేపర్స్ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పందించారు. పనామా పేపర్స్ ఘటనపై తమ ప్రభుత్వం తప్పక దర్యాప్తును ముమ్మరం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టపరమైన విచారణను చేపడతామని వెల్లడించారు. ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారికి ఈ సందర్భంగా హోలాండే కృతజ్ఞతలు తెలిపారు. పన్నులు ఎగ్గొట్టి లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా దాచుకుంటున్న ప్రపంచ ప్రముఖుల వివరాలతో కూడిన రహస్య పత్రాలు పనామా పేపర్స్ పేరుతో బయటకొచ్చిన విషయం తెలిసిందే.

18:53 - April 4, 2016

కర్నూలు : భూగర్భజలాలు అడుగంటి పోయాయి. రక్షిత మంచినీటి పథకాలు అటకెక్కాయి.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల ప్రజలకు నెలరోజుల నుంచి నీళ్లు రావడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చే నీటి కోసం ప్రజలు కుస్తీ పడుతున్నారు. ఎన్నో సార్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా,తాగునీటి కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు. 2కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎన్నడూ గుక్కెడు మంచినీళ్లు అందించిన దాఖలాలు లేవు.

పత్తికొండ గ్రామంలో 30 వేల జనాభా .......

పత్తికొండ గ్రామంలో దాదాపు 30 వేలమంది నివాసముంటున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 6 ఓవర్ హెడ్ ట్యాంకులున్నాయి. దీని కింద 2వేల పబ్లిక్ కుళాయికనెక్షన్లు, 532 వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ,30 చేతిపంపులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అలంకారప్రాయంగానే ఉన్నాయి. నీటి ఎద్దడిని తట్టుకోలేక ఆగ్రహించిన మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఫర్నీచర్ ను బయట పడేసి నిరసన తెలిపారు.

కూలి డబ్బులో సగం నీటి ఖర్చులకే.....

తమ దినసరి కూలి డబ్బులో సగం నీటి ఖర్చులకే సరిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

18:50 - April 4, 2016

విజయవాడ : మద్యం అమ్మకాలు ఏపీ సర్కారులో జోశ్ నింపుతున్నాయి.. మద్యం మందు బాబులకే కాదు.. ప్రభుత్వానికి మాంచి కిక్‌ ఇస్తోంది.. ఈ విక్రయాలు చూసిన ప్రభుత్వం... మరింత ఆదాయంకోసం ధరలు పెంచేలా ప్లాన్‌ చేస్తోంది..

మద్యం అమ్మకాలద్వారా 12వేల 731కోట్ల ఆదాయం ......

మద్యం విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది..ఈ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా 12వేల 731కోట్ల ఆదాయం వచ్చింది.. గత ఏడాది 10.88 శాతం వృద్ధితో అదనంగా 1249కోట్లు సర్కారు ఖజానాలో చేరాయి.. ఒక్క మార్చిలోనే మద్యం ద్వారా వెయ్యి 72కోట్ల ఆదాయం సమకూరింది..

288 లక్షల మద్యం కేసుల అమ్మకాలు......

మద్యం విక్రయాలపై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంకూడా మరింత పెరుగుతోంది.. గత ఆర్థిక సంవత్సరం వ్యాట్ ద్వారా 7వేల 389కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి 8వేల 62 కోట్లకు పెరిగింది.. ఈసారి చీఫ్ లిక్కర్‌ను అమల్లోకితేవడంద్వారా మరింత డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. చీప్ లిక్కర్‌ కొరత రాకుండా డిస్టిలరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సర్కారు నిర్ణయించింది.. గత ఏడాదికూడా మందు విక్రయాలు భారీగానే కొనసాగాయి.. 288 లక్షల మద్యం కేసులు అమ్ముడుపోయాయి... ఈ సారి 305లక్షల మద్యం కేసుల అమ్మకాలు కొనసాగాయి.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈసారి విక్రయాలు మరింత జోరుగా సాగుతున్నాయి.. మద్యంపై వ్యాట్ ద్వారా వచ్చే ఇన్‌కంకూడా భారీగానే ఉంది.. గత ఆర్థిక సంవత్సరం వ్యాట్ ద్వారా 7వేల 389కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి 8వేల 62 కోట్లకు పెరిగింది.. ఈసారి చీఫ్ లిక్కర్‌ను అమల్లోకితేవడంద్వారా మరింత డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. చీప్ లిక్కర్‌ కొరత రాకుండా డిస్టిలరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సర్కారు నిర్ణయించింది.. మద్యం బాటిళ్ల ధరలు పెంచి మరింత ఆదాయంకోసం సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.. అన్నిరకాల మద్యం ధరలను 10 నుంచి 15 శాతంవరకూ పెంచాలని చూస్తోంది..   

18:48 - April 4, 2016

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఓటర్ల జాబితా సవరణ చేపడతామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌ లాల్. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లా కలెక్టర్లు, అధికారులతో తిరుపతిలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి కొత్త డోర్ నెంబర్లు ఇచ్చాకే సవరణ చేపడతామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ సరిహద్దు కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రయోగత్మకంగా ఏపీలో అమలు చేస్తున్నామని.. మరో మూడు నెలల్లో ఇది పూర్తవతుందన్నారు. త్వరలో కొత్త ఇంటి నెంబర్లు, కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ కార్డు ఇవ్వనున్నట్టు భన్వర్‌ లాల్ తెలిపారు.

18:46 - April 4, 2016

విజయవాడ: రంగా విగ్రహం ధ్వంసం ఘటనలో దోషులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఏపీ హోంమంత్రి చిన్న రాజప్ప అన్నారు. విగ్రహం ధ్వంసం అయిన ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి చిన్నరాజప్ప...మచిలీపట్నంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే..ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇలాంటి ఘటనల్ని అరాచక శక్తులు సృస్టిస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

18:44 - April 4, 2016

విశాఖ : ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నాని హామీ ఇచ్చారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆయన ... తిరుపతిలో నెలకొల్పనున్న ఐఐడిటీ లో రొబొటిక్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విశాఖ టెక్‌ మహీంద్ర ఫెసిలిటీ సెంటర్‌లో మరో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గుర్నాని చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీని నిర్మించి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధిని అందించారంటూ సీఎం చంద్రబాబును ప్రశంసించారు.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు మొట్టికాయలు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయివేటు స్కూల్స్ లో పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించపోవటంపై న్యాయస్థానం మండిపడింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలకు సర్క్యూలర్ జారీ చేయకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఇరు రాష్ట్రాల విద్యాశాఖల చీఫ్ సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది ఈ విషయంగా 13వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

4 రోజుల్లో వర్ష సూచన : వాతావణ శాఖ

హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 3, 4 రోజుల్లో వర్షం పడే సూచనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, మధ్య భారతంలో వేడి తీవ్రంగా వుండే అవకాశమున్నట్లు తెలిపింది. 

ముగిసిన టీ.జేఏసీ భేటీ....

హైదరాబాద్ : టీ.జేఏసీ కార్యనిర్వహణ కమిటీ భేటీ ముగిసింది. ఈ నెల 9న టీ.జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జేఏసీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కమిటీ పేర్కొంది.

సీఎం చంద్రబాబును కలిసిన బంగారు వర్తకులు…

విజయవాడ : బంగారు వర్తకులు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. ఎక్సైజ్ సుంకం రద్దుకు సహకరించాలని కోరారు. కాగా  ఎక్సైజ్ సుంకం రద్దు చేయాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా బంగారం వర్తకులు చేపట్టిన సమ్మె 100 రోజులు దాటిన విషయం తెలిసిందే.

17:49 - April 4, 2016

మెదక్ : బిందెడు నీళ్ల కోసం ఇలా కిలోమీటర్ల దూరం నడిస్తేకాని ఆ రోజు ఇళ్లు గడవని పరిస్థితి ఇక్కడిది. మెదక్‌ జిల్లాకే వరప్రదాయినిగా ఉన్న మంజీరానది నేడు చుక్కనీరు లేకుండా ఎండిపోవడంతో జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. దీంతో బిందెడు నీళ్లకోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు.

ఎండిన మంజీరా...

30 టీఎంసీల నీటితో నిత్యం జలకళతో ఉట్టిపడే మంజీరా ఎండిపోవడంతో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మంచినీరందంచే పథకాలకు గడ్డుకాలం ఎదురైంది. దీంతో నారాయణఖేడ్‌ పట్టణానికి పూర్తిగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు పట్టణంలోని బోర్లన్నీ ఎండిపోవడంతో..ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. పట్టణంలోనే ఇంత తీవ్రమైన సమస్య ఉంటే..ఇక పల్లెల్లో గుక్కెడు మంచినీరు దొరకడంలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు.

గిరిజన తండాల్లో నీటికష్టాలు ....

ఖేడ్‌ నియోజకవర్గం అంటేనే గుర్తుకు వచ్చేది గిరిజన తండాలు. మనూరు, కంగ్డి, నారాయణఖేడ్‌, కల్హేర్‌, పెద్ద శంకరంపేట మండలాల్లో ఉన్న గిరిజన తండాల్లో నీటికష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గుక్కెడు మంచినీళ్ల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఎండిన బావులు, చెలిమల్లో ఉన్న ఆ కొద్దినీటినే తోడుకొని రోజులను గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎడారిలో మారిన ఖేడ్‌ నియోజకవర్గం మంచినీటి దాహర్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే రాజకీయ నేతలను తమ ఊళ్లో అడుగుపెట్టనీయమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. 

17:42 - April 4, 2016

హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పాలసీని విస్తరించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఐటీ పాలసీతో పాటు నాలుగు అనుబంధ పాలసీలను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇన్నోవేషన్‌ పాలసీ ద్వారా స్టార్ట్‌అప్‌ కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. టీ-హబ్‌తో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాగే గేమింగ్‌, యానిమేషన్‌ పాలసీతో ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలకు ఊతం లభిస్తుందన్నారు. ఎలక్ట్రానిక్స్‌ పాలసీతో లక్షా 60 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాగే రూరల్‌ టెక్నాలజీ పాలసీతో గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్‌ తెలిపారు.

అధికారికంగా పూలే జయంతి : టీ.ప్రభుత్వం

హైదరాబాద్ : ఈ నెల 11న జ్యోతీరావ్ పూలే జయంతి ఉత్సవాలను టీ. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో  మంత్రి జోగు రామన్న నేతృత్వంలో టీ.సర్కారు ఓ కమిటీని కూడా  ఏర్పాటు చేసింది.

తల్లీబిడ్డల ఆత్మహత్య......

మెదక్‌: మెదక్‌ జిల్లా మిర్దొడ్డి మండలం చెప్యాలలో దారుణం నెలకొంది. కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడితో పాటు ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్మకు పాల్పడింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

వడదెబ్బకు 5గురు మృతి...

హైదరాబాద్ : తెలంగాణలో  ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా  ఐదుగురు మడదెబ్బతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం అంబరవల్లి గ్రామానికి చెందిన బానయ్య(55), నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇద్దరు, యాద్ గార్ పూర్ లో ఒకరు, కారేగాంలో మరొక వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. 

అగ్నిప్రమాద ఘటనలో 4 ఏళ్ళ బాలుడు సజీవదహనం...

ప.గోదావరి : దేవరపల్లి మండలం దుద్దుకూరులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో సలీం(4) మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. మరో రెండేళ్ల బాలికను స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఘటనాస్థలాన్ని చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధుతులకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రారంభమైన టీ.వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం...

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తెలంగాణ వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమయ్యింది. వైసీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య....

ప.గోదావరి : తాడేపల్లి గూడెంలో విద్యార్ధి ఆత్మహత్యా కలకలం. వాసవి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో రాహుల్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాహుల్ విజయనగరం వాసిగా పోలీసులు గుర్తించారు. 

హెచ్ సీయూకి 4వ ర్యాంక్ .....

హైదరాబాద్ : ఐఎన్ఆర్ఎఫ్ ప్రకటించిన ర్యాంక్ ల్లో హెచ్ సీయూ 4వ స్థానం పొందింది.  ఐఎన్ఆర్ఎఫ్ పేరుతో దేశంలోని విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంక్ ల ప్రకారం బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్  -1 ర్యాంక్, ముంబై ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- -2, ఢిల్లీ జేఎన్ యూ-3, హెచ్ సీయూ-4, హైదరాబాద్ ఉస్మానియా -33, తిరుపతి శ్రీ వెంకటేశ్వర-63, కాకినాడ జేఎన్ టీయూ-69లుగా యూనివర్శిటీలకు ప్రకటించింది. కాగా కళాశాల ర్యాంక్ లు ఈ విధంగా వున్నాయి.

'బొగ్గు' నిందితులకు శిక్ష ఖరారు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో నిందితులకు ఎట్టకేలకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.  బొగ్గు కుంభకోణంలో నిందితులుగా వున్న ఇస్పాత్ కంపెనీ డైరెక్టర్లు ఆర్ఎస్ రుగ్తా, ఆర్సీ రుగ్తాలను 4 సవంత్సరాల చొప్పున  జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.  అంతే కాకుండా వారు పని చేస్తున్న కంపెనీకి కూడా న్యాయస్థానం రూ.25 లక్షల జరిమానా విధించింది. కాగా ఈ కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు నిందితులుగా వున్న విషయం తెలిసిందే.

అగ్ని ప్రమాదం...30 పూరిళ్లు దగ్థం...

ప.గోదావరి : దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెరువు గట్టుపై వున్న తాటాకు ఇళ్ళకు ప్రమాదవశాత్తు మంటలంటుకుని దాదాపు 30 పూరిళ్ళు దగ్థమయ్యాయి. ఇళ్ళు దగ్గరదగ్గరగా వుండటంతో మంటలు తొందరగా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన స్థానికులు కొవ్వూరు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

15:24 - April 4, 2016

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. వినూత్న విధానాలకు పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో ఐటీ పాలసీ ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తిల సమక్షంలో ఐటీ దిగ్గజాల మధ్య ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే వెల్లడించారు.

టీ. కాంగ్రెస్, టీడీపీలపై ఎంపీ కవిత ఫైర్ ....

హైదరాబాద్ : టీ.కాంగ్రెస్, టీడీపీలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు . సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని  బహిష్కరించి ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ లపై అనుమానాలుంటే వాటిని నివృతి చేపటానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపారు. కాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సంగతి తెలిసిందే.

అడ్వకేట్ హత్యలో 4 గురు నిందితులు అరెస్ట్...

ప.గోదావరి :ఏలూరులో న్యాయవాది హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. హత్య జరిగిన కొద్ది గంటలలో 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో వున్న మరొక నిదింతుడి కోసం గాలిస్తున్నామని ఎస్పీ భరత్ భూషణ్ తెలిపారు. కాగా అడ్వకేట్ రాయల్ ని ఈరోజు దుండగులు నరికి చంపిన విషయం తెలిసిందే.

14:36 - April 4, 2016

ప.గో: పట్టపగలే  ఏలూరు  లో దారుణం జరిగింది...  ప్రముఖ న్యాయవాది రాయల్ సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గాంధీ స్కూల్ సమీపంలో ఉన్న ఓ షాప్ లో షట్టర్ వేసి  రాయల్ పై దుండగులు ఈ దారుణానికి పల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే మృతుడు రాయల్ గతం లో కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు . హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

అనంతపురం : అమరాపురం మండలం బసవన్నపల్లి- కనకన్నపల్లి గ్రామాల మధ్య రోడ్డుప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం చెల్లకెర తాలూకు రేణుకాపురం గ్రామానికి చెందిన నాగరాజు(40), ఈరన్న(38) మృతిచెందారు. బొలెరో వాహనంలో హిందూపూర్‌ మార్కెట్‌కి చింతపండు తీసుకొని వస్తున్న వాహనం టైర్‌ పేలటంలతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న అమరాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అడ్వకేట్ ని నరికి చంపిన దుండగులు...

ప.గోదావరి : ఏలూరులో పట్టపగలే దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. రాయల్ అనే అడ్వకేట్ గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

13:36 - April 4, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీ అప్పారావును తొలగించాలంటూ వామపక్షాలు రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. వామపక్షాల పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌వైపు వెళుతున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

 

13:33 - April 4, 2016

ఢిల్లీ : కోట్లలో పన్నులు ఎగ్గొడుతున్న స్టార్ ల భాగోతం బట్టబయలైంది. కోట్ల కొద్ది సంపదను అక్రమంగా కూడబెడుతున్న వారిలో సెలబ్రిటీలు ఉన్నట్లు వివరాలు బహిర్గతమయ్యాయి. అందుకు సంబంధించిన దాదాపు కోటీ 15 లక్షల రహస్య పత్రాలు పనామాకు చెందిన ప్రముఖ గూఢాచార సంస్థ మొస్సాక్‌ ఫోన్సీకా నుంచి లీకయ్యాయి. అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సన్నిహితులు.. హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ సహా.. 500మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. 

13:29 - April 4, 2016

హైదరాబాద్‌ : నగరంలో అక్రమ హోర్డింగ్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరంలో అక్రమ హోర్డింగ్‌లు లేవని జీహెచ్ ఎంసీ తెలిపింది. ఐతే జన్మదిన శుభాకాంక్షలకూ హోర్డింగ్‌లు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లో నిర్ణయం తెలపాలని జీహెచ్ ఎంసీని ఆదేశించింది. గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను కోర్టు ఆదేశించింది. నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. 

దోషులపై చట్టపరమైన చర్యలు : మంత్రి చినరాజప్ప

హైదరాబాద్‌: మచిలీపట్నంలోని నిజాంపేటలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. ధ్వంసం చేసిన స్థలంలోనే  త్వరలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ... నిందితులకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద వుందని తెలిపారు . అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆర్ బీఐ అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం చేసే సంస్థల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.

13:22 - April 4, 2016

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 57 మంది మృతిచెందారు. పాక్‌లోని పలు  జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల్లో పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరదలు తగ్గుముఖం పట్టేవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

 

13:18 - April 4, 2016

విజయవాడ : వాళ్లది 24 గంటల డ్యూటీ.... ఎప్పుడు తింటారో తెలియదు.. ఎన్నింటికి నిద్ర పోతారో తెలియదు... ఇంతా చేస్తే విధి నిర్వహణలో విపరీతమైన ఒత్తిడి.. ఇదీ పోలీసుల పనితీరు. తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా.. పోలీసులు మధ్యవయసులోనే తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పోలీసు సిబ్బంది కోసం ఆరోగ్య భద్రత పథకం ఉన్నా.. చిన్న వయసులోనే వచ్చిపడుతున్న రోగాలు వీరికి మనోవ్యధను కలిగిస్తున్నాయి. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఇంక్రిమెంట్లు.. ప్రశంసా పత్రాలు పొందే సంగతేమో కానీ.. అనారోగ్యాన్ని మాత్రం కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది.. తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. 
విజయవాడలో గణనీయంగా వాహనాల సంఖ్య 
విజయవాడలో ఇటీవలి కాలంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. వీటి నుంచి వెలువడే కాలుష్యం.. సాధారణ పౌరుల కన్నా.. ట్రాఫిక్‌ పోలీసులకు సంకటంగా మారింది. ఎండనక, వాననక... గంటల తరబడి ట్రాఫిక్‌ నియంత్రించే పోలీసులు.. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముక్కుకు మాస్క్ ధరించకుండా విధులు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సిబ్బంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. 
పని ఒత్తిడితో పోలీసులు మరింత అనారోగ్యం
దీనికి తోడు.. పని ఒత్తిడి కూడా పోలీసుల అనారోగ్యాన్ని మరింతగా పెంచుతోంది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక శాతం సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పోలీస్ అధికారులే అంగీకరిస్తున్నారు. సిబ్బంది రక్తపోటు, మధుమేహం, ఉదరకోశ, గుండె జబ్బులతో బాధపడుతున్నారని సాక్ష్యాత్తు డీజేపీ జేవీ  రాముడే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉచిత వైద్య పరీక్షల శిబిరానికి శ్రీకారం 
సిబ్బంది కోసం ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలో ఉచిత వైద్య పరీక్షల శిబిరానికి పోలీస్ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. డీజేపీ రాముడు,కమిషనర్ గౌతం సవాంగ్ కృషితో...  డీప్ అనే స్వచ్ఛంద సంస్థ పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ప్రత్యేక సాయుధ విభాగంలో ఏర్పాటు చేసిన పోలీస్ క్లినిక్‌లో... సిబ్బందికి ఇక నుంచి వారానికి 6 రోజుల పాటు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరి ఈ పథకాన్ని పోలీసులు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో.. అనారోగ్యం, మనోవ్యధల నుంచి ఏమేరకు దూరమవుతారో వేచి చూడాలి. 

13:10 - April 4, 2016

తూర్పుగోదావరి : జిల్లా ఏజెన్సీలో ఇందిర జలప్రభ పేరుతో ప్రభుత్వం చేసిన ప్రయోగం వికటించింది. గిరిజనులు, దళితుల భూములకు  నీరు అందించే  లక్ష్యంతో  చేపట్టిన  ఇందిర జలప్రభ పథకం సత్ఫలితాలివ్వకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం ఆవిరైపోయిందన్న ఫిర్యాదులున్నాయి. జలసిరుల పేరుతో కొండకోనల్లో తవ్విన బోర్లకు ఏళ్ల తరబడి మోటార్లు బిగించకపోవడం... అవి  నిరుపయోగంగా  మారాయి. దళితులు, గిరిజనుల పేరుతో జరిగిన ఇందిర జలప్రభ అడ్డగోలు దోపిడీ వ్యవహారంపై 10 టీవీ ప్రత్యేక కథనం.... 
ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్లు, మధ్య దళారీలపాలు 
పూర్వకాలంలో రాజుల సొమ్ము రాళ్లపాలైతే... ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్లు, మధ్య దళారీలపాలవుతోందని ప్రజలంటున్నారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో చేపట్టని ఇందిర జలప్రభ పథకమే నిదర్శనమని చెబుతున్నారు. విద్యుత్‌ సౌకర్యంలేని ప్రాంతాల్లో బోర్లు తవ్వడంతో ఈ పథకం కింద చేసిన ఖర్చు బూడిదలో పోసిన  పన్నీరు చందంగా మారిందన్న విమర్శలున్నాయి. పైగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించడంతో ఇందిర జలప్రభ అక్రమార్కులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ఇందిర జలప్రభ పథకానికి రూ. 5 కోట్ల కేటాయింపు
తూర్పుగోదావరి జిల్లాలోని కొండ జలధారలు, వాగులు ఆధారంగా గిరిజనులు, దళితులు దశాబ్ధాలుగా సంప్రదాయ సేద్యం సాగిస్తున్నారు. ఈవర్గాల రైతులకు చేయూతనిచ్చే లక్ష్యంతో రంపచోడవరంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇందిర జలప్రభ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2012-13లో ఈ పథకానికి  5 కోట్ల రూపాయలు కేటాయించారు. రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, దేవీపట్నం, రొజవొమ్మింగి, వై.రామవరం మండలాల పరిధిలో 240 వ్యవసాయ బోర్లు తవ్వాలని నిర్ణయించారు. రిగ్గుతో బోరు తవ్వడానికి 43,750 రూపాయలు, ఇంకుడు గుంతకు 29,479,  విద్యుత్‌ మోటారుకు 47,370 , చేతిపంపుకు 13,300 రూపాయలు కేటాయించారు. అలాగే లబ్ధిదారు నేమ్‌ బోర్డు ఏర్పాటుకు4,999 రూపాయులు, అటవీ ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు 1500 రూపాయలు కేటాయించారు. భూగర్భంలో నీటి లభ్యతను బట్టి  ఒక్కో బోరు తవ్వడానికి కనిష్టంగా  లక్షా40వేల398 రూపాయలు, గరిష్టంగా 2.90 లక్షల రూపాయలు  ఖర్చు చేయాలని  నిర్ణియించారు. 
పని చేస్తున్నవి బోర్లు 50 మాత్రమే
జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 240 బోర్లు తవ్వినా.. ప్రస్తుతం పని చేస్తున్నవి 50 మాత్రమే ఉన్నాయి. చాలా గిరిజన గూడేలకు విద్యుత్‌ సౌకర్యం లేకపోయినా... బోర్లు తవ్వారు. కరెంట్‌ సౌకర్యం లేకపోవడంతో అవన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు వృధాగానే పడివున్నాయి.  విద్యుత్‌ సౌకర్యం కల్పించి, మోటార్లు బిగిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఆ పని చేయకపోవడంతో గిరిజన రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. 
'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ'తో ఇందిర జలప్రభ అనుసంధానం 
ఇందిర జలప్రభను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేశారు. బోరు తవ్విన ప్రతిచోటా వృధాగాపోయే నీటిని భూగర్భంలో ఇంకిపోయేలా చేసేందుకు ఇంకుడు గుంతల తవ్వేపనిని కూలీలకు అప్పగించాలి. కానీ కాంట్రాక్టర్లు యంత్రాలతో చేసి గిరిజనుల పొట్టకొట్టారు. ఇలా అన్ని పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని గిరిజన, దళిత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 

పోలవరం నిర్వాసితులు ఆందోళ....

తూ.గోదావరి : రాజమహేంద్రవరం భూసేకరణ కలెక్టరేట్ వద్ద పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళ చేపట్టారు. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో ముంపుకు గురయ్యే భూములకు పట్టిసీమ ప్రాజెక్టు భూములకు ఇచ్చిన విధంగానే తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. 

జరిమాన కట్టలేదని కుల బహిష్కరణ...

ఖమ్మం :  జిల్లాలో దారుణం జరిగింది. జరిమాన కట్టలేదని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. త్రీటౌన్ వడ్డెర కాలనీలో వరుసు వెంకన్న అనే వ్యక్తికి ఓ సందర్భంగా కులపెద్దలు రూ. 3 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేదనే కారణంతో పెద్దలు అతన్ని కుల నుండి బహిష్కరించి గ్రామంలో వున్న గాంధీ విగ్రహానికి కట్టివేసారు.

12:43 - April 4, 2016

విజయ్‌ సేతుపతిని ఫ్లాప్‌ల నుంచి బయటపడేసిన చిత్రం నానుమ్ రౌడీదాన్. అందులో హీరోయిన్ నయనతార. ఆ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివ. అతడికి ఈ చిత్రంలో పరిచయమే నయనతారతో ప్రేమకు దారి తీసిందనే ప్రచారం హల్‌చల్ చేసింది. మొత్తం మీద నానుమ్ రౌడీదాన్ చిత్రం చాలా మార్పులకు కారణంగా నిలిచిందని చెప్పాలి.
 
నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత సేతుపతి, కాదలుమ్ కడందుపోగుమ్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నటుడు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న ఈ హీరో కోసం పలు అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత దర్శకుడు విఘ్నేష్ శివ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా మళ్లీ విజయ్‌సేతుపతినే ఎంచుకున్నారు. ఇక ఇందులో ఇద్దరు నాయికలు అవసరం కావడంతో తన ప్రేమికురాలిగా ప్రచారంలో ఉన్న నయనతారను ఒక నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం.
 
ఇకపోతే మరో నాయకిగా నయనతార స్నేహితురాలు త్రిషను నటింపచేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన నటి త్రిష తననెవరూ సంప్రదించలేదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా త్రిష, నయనతారతో కలసి విఘ్నేష్‌ శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాత్తువాక్కుల రెండు కాదల్ అనే పేరును నిర్ణయించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం తన శ్రీసాయిరామ్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇద్దరు టాప్ హీరోయిన్లతో ఒకే చిత్రంలో నటించే అవకాశం రావడంతో విజయ్‌ సేతుపతి యమ ఖుషీ అయిపోతున్నారట.

 

అన్ని శాఖల కార్యదర్శులతో టీ.ఎస్ సీఎస్ భేటీ....

హైదరాబాద్ : అన్ని శాఖల కార్యదర్శులతో టీ.ఎస్ సచివాలంలో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరుగబోయే ఉత్సవ ఏర్పాట్లు, ఉద్యోగుల విభజన వంటి పలు అంశాలపై సమీక్షించనున్నారు.

మచిలీపట్నం చేరుకున్న ఏపీ హోం మంత్రి....

కృష్ణా : ఏపీ హోం మంత్రి చినరాజప్ప మచిలీపట్నం చేరుకున్నారు. స్వర్గీయ వంగవీటి మోమన్ రంగా విగ్రహం విధ్వంసం నేపథ్యంలో బందర్ లో శాంతిభద్రతలను ఆయన పర్యవేక్షించటానికి ఆయన మంచిపట్నం చేరుకున్నారు. కాగా స్వర్గీయ  వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

12:37 - April 4, 2016

మొన్నటివరకు అతనో సాధారణ టీవీ సీరియల్ నటుడు. 'శరద్ కేల్కర్.. బాగా నటిస్తాడు' అనే కితాబులే తప్ప పెద్దగా అవకాశాలు చిక్కని పరిస్థితి. అయితే బాహుబలి- ది బిగినింగ్ విడుదలయ్యాక మాత్రం అతని దశ, దిశలు మారిపోయాయి. హిందీ బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పి తన గొంతుతో బాహుబలి పాత్రకు ప్రాణం పోసిన శరద్ కేల్కర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్(భైరవ్ సింగ్)గా నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే విలేకరులతో మాట్లాడిన శరద్ కేల్కర్ ఏమన్నాడంటే..
'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్.
 

హోర్డింగ్ లపై జీహెచ్ఎంసీకి హైకోర్టు మొట్టికాయలు....

హైదరాబాద్ : నగరంలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న అక్రమ హోర్డింగ్ లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. జన్మదిన శుభాకాంక్షలకు కూడా హోర్డింగ్ లను ఎందుకు పెడుతున్నారంటూ జీహెచ్ ఎంసీపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కాగా జీహెచ్ ఎంసీ అధికారులు అటువంటివేమీ లేవని ఇచ్చిన వివరణ ఇవ్వగా నమ్మశక్యంగా లేదంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నగరాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాల్సిన అవుసరం అందరిపైనా వుందంటూ కోర్టు సూచించింది. ఈ విషయంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నగరపాలక సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది

12:22 - April 4, 2016

హీరో విశాల్‌తో రొమాన్స్ కు రకుల్‌ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుందా? దీనికి కోలీవుడ్ నుంచి ఎస్ అనే సమాధానమే వస్తోంది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా తడయారు తాక్క చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు దిగుమతి అయిన ఉత్తరాది బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్. ఆ తరువాత పుత్తగమ్, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ కేక పుట్టించలేకపోయినా ఈ చిన్నది ఆపై టాలీవుడ్‌కెళ్లి అక్కడిప్పుడు కేక పుట్టిస్తోంది.
రకుల్‌ ప్రీత్ సింగ్ యమ బిజీ 
తెలుగు యువ హీరోలతో నటిస్తూ యమ బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్ సింగ్ కు కోలీవుడ్‌లో రాణించలేకపోయాననే బాధ చాలా కాలంగా వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య రామ్‌ చరణ్‌తో నటించిన బ్రూస్‌లీ చిత్ర తమిళ అనువాద ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు మంచి అవకాశం వస్తే తమిళంలో నటించడానికి రెడీ అని ఒక స్టేట్‌మెంట్ పడేసింది. అది ఇప్పుడు వర్కౌట్ అవుతున్నట్లు సమాచారం. రకుల్ త్వరలో విశాల్‌ తో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి తుప్పరివాలన్ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు.
కోలీవుడ్‌కు రీఎంట్రీ  
ఈ చిత్రం ద్వారా రకుల్‌ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. మిష్కిన్ చిత్రాల్లో కథానాయికలకు, కథానాయకులకు సమానంగా ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తన విజయ ఖాతాను తెరవాలని రకుల్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుప్పరివాలన్ చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, కాగా ఇంకా ఆమె ఒప్పందంపై సంతకం చేయలేదని విశాల్ వర్గం అంటోంది.

 

రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నం, వామపక్ష నాయకులు అరెస్ట్...

హైదరాబాద్‌: హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్‌ నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సీపీఐ నేత నారాయణ సహా పలువురు నేతలను, ప్రజాసంఘ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నల్లధనం లిస్టులో బిగ్ షాట్స్ : పనామా బ్యాంక్

హైదరాబాద్ : నల్లధనం కుబేరుల వివరాలు బయలుపడటంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నల్లకుబేరుల జాబితాను ‘పనామా పేపర్స్‌’ బహిర్గతం చేసింది. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని నవాష్ షరీఫ్, ఈజిప్టు మాజీ ప్రధాని హోస్నీ ముబారక్, సిరియా రాష్ట్రపతి బాషర్ అల్ అసద్, పాక్ మాజీ అధ్యక్షురాలు బెనజీర్ భుట్టో పేర్లు వెల్లడయ్యాయి. వీరితోపాటు భారత్‌కు చెందిన 500ల మందిలో వారిలో వున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వెల్లడైన సమాచారం మేరకు 500 మంది భారతీయులలో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌ ఉండటం సంచలనంగా మారింది.

అలిపిరి టోల్‌గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం...

చిత్తూరు : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి : జిల్లాలో వికారాబాద్‌ మండలం మదన్‌పల్లిలో అప్పుల బాధతో ఉరివేసుకుని గోపాల్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధే గోపాల్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌ 13వ సీఎంగా మెహబూబా ముఫ్తీ

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌ 13వ ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. జమ్ములోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ చేశారు. జమ్మూకశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. దేశంలోనే సీఎం పదవి చేపట్టిన రెండో ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 

 

12:04 - April 4, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో సీఎం మహబూబా ముఫ్తి రికార్డు సృష్టించారు. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కశ్మీర్‌కు మొదటి మహిళా సీఎంగా... దేశంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండో ముస్లిం నేతగా చరిత్రకెక్కారు. గవర్నర్ ఎన్ ఎన్ వోహ్ర ముఫ్తీతో ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ పక్ష నేత నిర్మల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థికశాఖ సహాయమంత్రిజయంత్‌ సిన్హా  పీడీపీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. 

వీసీ అప్పారావుని అరెస్ట్ చేయాలి: వామపక్షాలు

హైదరాబాద్ : చలో రాజ్ భవన్ వామపక్షాల పిలుపునిచ్చాయి. హెచ్ సీయూలో వీసీ అప్పారావుని విధులనుండి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని వామపక్షాలు, ప్రజాసంఘాలు చేట్టాయి. దీంతో రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

11:36 - April 4, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌, అసోంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. మొదటి దశలోభాగంగా పశ్చిమబెంగాల్‌లో 18 స్థానిలకు ఎన్నికలకు 133మంది అభ్యర్థులు బరిలోఉన్నారు.. అసోంలో 65 స్థానాలకు 539మంది పోటీ పడుతున్నారు.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7గంటలనుంచే పోలింగ్ కేంద్రాలదగ్గర క్యూకట్టారు.. సాయంత్రం 6గంటలవరకూ పోలింగ్‌ కొనసాగనుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పశ్చిమబెంగాల్‌లో 6 దశలు, అసోంలో 2 దశలకు ఎన్నికల నిర్వహించనున్నారు.  ఉదయం 9 గంటల వరకు బెంగాల్ లో 18 శాతం, ఆసోంలో 12 శాతం పోలింగ్ నమోదు అయింది. ఢిల్లీ నుంచి ఈసీ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ హక్కును వినియోగించుకుంటున్నారు. బెంగాలోని మూడు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. అసోంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగునుంది. 

కరుణానిధితో ముగిసిన ఆజాద్ భేటీ..

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధితో కాంగ్రెస్ నేత గులాంబీ ఆజాద్ చర్చలు ముగిసాయి. కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో 41 స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. తమకు 63 స్థానాలను కేటాయించాలని ఇప్పటికే చర్చలు జరిపినా కాంగ్రెస్ కోరినన్ని స్థానాలకు కేటాయించటానికి డీఎంకే అంగీకరించలేదు. గతంతో పోలిస్తే 20 శాతం సీట్లు తగ్గగా డీఎంకే ఇప్పుడు 41 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ కు కేటాయించింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాలకు పోటీచేయగా కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. 

11:27 - April 4, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూల వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. హెచ్ సీయూ వీసీని తక్షణమే తొలగించాలని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్  చేస్తున్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు బర్తరఫ్ చేయాలని కోరారు. రోహిత్ చట్టం తేవాలని పట్టుబడుతున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ జరుగనుంది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ ని వామపక్షాలు త్రీవంగా ఖండిస్తున్నాయి. 
సీపీఐ నేత నారాయణ.. 
'అప్జల్ గురు ఉరికి జెఎన్ యూ విద్యార్థులకు సంబంధం లేదు. కన్హయ్యకుమార్ కు అప్జల్ గురు ఉరికి సంబంధం లేదు. గాంధీజిని చంపిన గాడ్సేకు ఆర్ ఎస్ఎస్, బీజేపీ వారు వారసులు. గాంధీజి వారసులు దేశభక్తులా...  గాడ్సే వారసులు దేశభక్తులా.? విశ్వవిద్యాలయాలను వర్సిటీలుగా ఉంచుతారా.. లేదా పోలీసు క్యాంపసులుగా మార్చుతారా..? . మోడీకి భజన చేసే వారిని, వెంకయ్యనాయుడు చెంచాలను వర్సిటీ వీసీలుగా నియమిస్తున్నారు. 
వీరు వీసీలు కాదు..  పశువులకు కాపాల కాయాలని' ఎద్దేవా చేశారు. 

పాకిస్థాన్ లో వరదలు 57 మంది మృతి...

హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 57 మంది మృతిచెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని ఖైబర్‌ పక్తుంక్వా ప్రావిన్స్‌, షాంగ్లా జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ఈ వరదల కారణంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిత్‌ బల్తిస్థాన్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చిన్నారులతో సహా ఎనిమిదిమంది మృతిచెందారు. పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పాక్ లో వరదలు తగ్గుముఖం పట్టేవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

విజ్ఞాన భవన్ లో ప్రారంభమైన జల వారోత్సవాలు....

ఢిల్లీ : విజ్ఞాన భవన్ లో జాతీయ జల వారోత్సవాలు ప్రాంరభమయ్యాయి. ఈ వారోత్సవాలు 5 రోజులపాటు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యాసాగర్ రావు, టీ .ఎస్ ఢిల్లీ ప్రతినిధి రామచంద్రు తెజావత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జల వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు మిషన్ కాకతీయ పథకంపై విద్యాసాగర్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 

బెంగాల్ లో 23, అసోంలో 20 శాతం పోలింగ్ ...

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఉ.10 గంటల సమయానికి బెంగాల్ లో 23 శాతం పోలింగ్, అసోంలో 20 శాతం పోలింగ్ నమోదయినట్లు సమాచారం. 

10:59 - April 4, 2016

చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు అంశం కొలిక్కి వచ్చింది. చెన్నై వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ అజాద్‌.. కరుణానిధితో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు 41 సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. 

 

10:25 - April 4, 2016

కృష్ణా : ఎపి డిప్యూటీ సీఎం చినరాజప్ప విజయనగరం పర్యటన రద్దు అయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో చినరాజప్ప బందర్ బయలు దేరారు. నిన్న మచిలీపట్నం బందర్ లో దుండగులు వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విధితమే. రంగా విగ్రహం విధ్వంసం నేపథ్యంలో బందర్ లో శాంతిభద్రతలను స్వయంగా డిప్యూటీ సీఎం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగు చర్యలు తీసుకున్నారు. 

 

కరుణానిధితో గులాంనబీ ఆజాద్ చర్చలు

చెన్నై : కరుణానిధితో గులాంనబీ ఆజాద్ చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

చినరాజప్ప విజయనగరం పర్యటన రద్దు

కృష్ణా : ఎపి డిప్యూటీ సీఎం చినరాజప్ప విజయనగరం పర్యటన రద్దు అయింది. చినరాజప్ప బందర్ కు బయల్దేరారు. రంగా విగ్రహం విధ్వంసం నేపథ్యంలో బందర్ లో శాంతిభద్రతలను ఆయన పర్యవేక్షించనున్నారు. 

 

బెంగాల్ లో ఉ.9 గం.ల వరకు 27 శాతం పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్, ఆసోం రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్ లో ఉదయం 9 గంటల వరకు 27 శాతం పోలింగ్ నమోదు అయింది. 

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత చల్ చల్...

అదిలాబాద్ : జిల్లాలో చిరుత కలకలం రేపింది. జిల్లాలోని జన్నారం మండలం అలీపూర్ గ్రామంలో చిరుత సంచరిస్తుందనే వార్త గత కొన్ని రోజులుగా హల్‌చల్ చే స్తుండగా.. తాజాగా సోమవారం తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చిన చిరుత గొర్రెలపై దాడి చేసింది. చిరుత దాడిలో 24 గొర్లు మృతిచెందాయి. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఆటో బోల్తా... మహిళ మృతి

విశాఖ : జిల్లా కే. కోటపాడు మండలం చంద్రయ్యపేట దగ్గర ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం తరుణ్ గోగోయ్

దేస్ పూర్ : అసోం అసెంబ్లీకి తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేబీచరణ్ బార్హ్ బాలికల ఉన్నత పాఠశాలలో తరుణ్ గోగోయ్‌తో పాటు భార్య డాలీ, కుమారుడు గౌరవ్ ఓటు వేశారు. అనంతరం గోగోయ్ మీడియాతో మాట్లాడుతూ.. అసోంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 65 శాసనసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది.

ఉమెన్ చాందీ నా పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు : సరిత నాయర్‌

త్రివేండ్రం : కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోలార్‌ కుంభకోణంలో కీలక సూత్రధారి సరిత ఎస్‌ నాయర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి తన నివాసంలోనే ఈ ఘాతుకానికి తెగబడ్డారని ఆదివారం స్థానిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉమెన్‌ చాందీని తానెప్పుడూ తండ్రిగా భావించేదానినని సరిత తెలిపారు. పెరంబవూర్‌ పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు రాసిన లేఖలోని విషయాలు పూర్తిగా వాస్తవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయకులకు పలు సందర్భాల్లో రూ.2.16 కోట్లకు పైగా నగదు ముట్టజెప్పినట్లు తెలిపారు.

09:22 - April 4, 2016

ఎపికి అన్యాయం జరుగుతోందని.. కేంద్రప్రభుత్వం న్యాయం చేయడం లేదని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీడీపీ నేత విజయ్ కుమార్, వైసీపీ నేత అంబటి రాంబాబు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత కాశం వెంకటేశ్వర్లు పాల్గొని, మాట్లాడారు. బిజెపి బలం పరమితంగా ఉందన్నారు. జనాకర్షణ నాయకుల కోసం బిజెపి వెతుకుతుందని పేర్కొన్నారు. ఎపిలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య బంధం బలహీనపడుతుందని చెప్పారు. మోడీ ప్రభంజనం ఇంతకముందుంన్నంత విధంగా ఇప్పుడు లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:10 - April 4, 2016


కోల్ కతా : పశ్చిమబెంగాల్, అసోంలో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బెంగాల్-18, అసోం-65 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. బెంగాల్ తొలి విడత ఎన్నికల పోటీలో 133 మంది అభ్యర్థులు ఉన్నారు. అసోం తొలి దశ ఎన్నికల బరిలో 539 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘలను జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బెంగాల్ లోని మూడు సమస్యాత్మక జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం నేడు రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించింది. బెంగాల్ లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో వామపక్షాలకు అవకాశాలున్నాయి. టీఎంసీ, వామపక్షాల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీకి గెలుపు అవకాశాలు లేవని చెప్పవచ్చు. 

09:00 - April 4, 2016

హైదరాబాద్ : తెలంగాణా జెఎసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న జేఏసీ మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు  కోదండరామ్‌ సిద్ధమయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా టీ-జేఏసీ 
తెలంగాణా ఉద్యమంలో కీలకంగా వ్యవహించిన టీ-జేఏసీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సైలెంట్‌గా మారింది. దాదాపు రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉద్యమంలో అన్ని పార్టీలను పరుగులు పెట్టించిన ఐక్య కార్యాచరణ సమితి.. గ్రామ స్థాయి వరకు విస్తరించింది. ఉద్యమ వేడిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలపైనా ఆధిపత్యం చూపింది.
భవిష్యత్‌పై ప్రశ్నలు ? 
ఉద్యమ లక్ష్యం నెరవేరింది. టీ-జేఏసీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఉద్యమంలో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం అని ఆరోపణలు ఎదుర్కొన్న జేఏసీ.. దాదాపు అన్ని ఉద్యమ, ప్రజా సంఘాలతో బలంగా ఉన్న జేఏసీ.. ఇటీవల కాలంలో బలహీనపడుతోంది. కీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ ఇటీవల ప్రభుత్వానికి సన్నిహితంగా మారుతూ సమితి నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంకా జేఏసీలో కొనసాగి ప్రయోజనమేమిటని బయటకు వచ్చిన ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి.
మరోసారి యాక్టివ్‌ చేసే యోచన 
ఈ పరిస్థితుల్లో జేఏసీని మరోసారి యాక్టివ్‌గా చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం  అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు అంశాలపై విభేధిస్తున్న జేఏసీ చైర్మన్ ఎలాంటి  ప్రణాళికలను రచిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధాన సంఘాలనీ జేఏసీకి దూరం కావడంతో.. ఇప్పుడున్న సంఘాలతో మరోసారి పటిష్టం అవుతూనే ప్రభుత్వంపై  పోరాటానికి సిద్ధమనే సంకేతాలను టీ-జేఏసీ ఇస్తోంది. 
త్వరలో విస్త్రతస్థాయి సమావేశం  
త్వరలో విస్త్రతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే కార్యక్రమాల కమిటీ  నేడు భేటీ కానుంది. తెలంగాణ ప్రజల పక్షాన ఉంటామని చెబుతున్న టీ-జేఏసీ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎలా ముందుకెళ్లేది ఈ సమావేశం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

 

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం..

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 78,143 మంది దర్శించుకున్నారు.

 

08:39 - April 4, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన ముగిసింది. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించిన మోడీ... సోమవారం తెల్లవారు జామున ఢిల్లీ తిరిగి వచ్చారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది. 
మోడీ మూడు దేశాల పర్యటన విజయవంతం 
ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన విజయవంతమయ్యిందని ప్రభుత్వం ప్రకటించింది.  ముందుగా గత నెల 30 బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన ఇండో-ఐరోపా సదస్సుకు హాజరయ్యారు.  ఆతర్వాత గత నెల 31, ఈనెల 1 తేదీల్లో అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌లో జరిగిన అణు భద్రతా సదస్సులో పాల్గొన్నారు. చివరిగా ఈనెల 2, 3 తేదీల్లో సౌదీ అరేయాలోని రియాద్‌లో పర్యటించారు. ద్వైపాక్షిక అంశాలపై ఆయా దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరిపారు. 
ప్రధాని మోడీకి అరుదైన గౌరవం
సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, సత్కారం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీట్‌ అల్‌ సౌద్‌ ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. 
సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌తో మోడీ చర్చలు
సౌదీ పర్యటనలో ప్రధాని మోడీ.... ఆదేశ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక  వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ రాజును కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్-సౌదీ అరేబియా నిర్ణయించాయి. సైబర్‌ భద్రతపై కూడా సౌదీ  పాలకులతో మోదీ చర్చలు జరిపారు.  మనీ లాండరింగ్‌తోపాటు ఆర్ధిక నేరాలను అదపుచేసేందుకు నిఘా  సమాచారం మార్పిడి చేసుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి.  సౌదీ ఆరోగ్య మంత్రి అల్‌ ఫాలిహ్‌తో కూడా మోదీ చర్చలు జరిపారు. 
టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ కేంద్రాన్ని సందర్శించిన మోడీ
రియాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించారు. ఈ ఐటీ కేంద్రంలో అందరూ మహిళా  ఉద్యోగులే పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులతో సెల్ఫీలు దిగిన మోదీ.. కొద్దిసేపు వారితో మాట్లాడారు. మానవ వనరుల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. రియాద్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించిన ప్రసంగించిన మోడీ.. ప్రపంచం ఆర్ధిక మందగమని దిశగా పయనిస్తున్నా.. భారత్‌ మాత్రం ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ పురోగతి సాధిస్తోందని చెప్పారు. మూడు దేశాల పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న ప్రధాని మోడీ...ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 

 

08:32 - April 4, 2016

ముంబయి : బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకనే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. గొంతు బిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ను పోలీసుల విచారిస్తున్నారు. వారి మధ్య జరిగిన ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. 
రాహుల్‌ వాంగ్మూలం రికార్డు 
ఆత్మహత్య చేసుకున్న బాలికా వధు ఫేం నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకనే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. ఆమె గొంతు బిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని రిపోర్టు వెల్లడించింది. కేసుకు సంబంధించి ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ రాజ్‌సింగ్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రత్యూష సెల్‌ నుంచి వెళ్లిన చివరి కాల్స్, వారి మధ్య జరిగిన సందేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. 
బాయ్‌ఫ్రెండ్‌తో వివాహానికి ప్రత్యూష త్వరలోనే ముహూర్తం 
ప్రత్యూష తన బాయ్‌ఫ్రెండ్‌తో వివాహానికి త్వరలోనే ముహూర్తం కుదుర్చుకుందన్న వాదనా వినిపిస్తోంది. తన వివాహానికి దుస్తుల్ని డిజైన్‌ చేయమని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా అయిన స్నేహితుడు రోహిత్‌ను ఆమె కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రత్యూష ప్రియుడు రాహుల్‌రాజ్‌ కూడా ధ్రువీకరించినట్లు భోగట్టా. ప్రత్యూషకు, తనకు  ఎలాంటి గొడవ జరగలేదని, త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలకున్నట్లు అతను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రత్యూషను రాహుల్ చిత్రహింసలు పెట్టేవాడు : ప్రత్యూష తల్లిదండ్రులు 
మరోవైపు తన కుమార్తెను రాహుల్ చిత్రహింసలు పెట్టేవాడని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని చెప్పారు. ప్రత్యూష ముక్కు, కళ్లకింద గాయాలున్న ఫొటోలు కూడా మా దగ్గరున్నాయని ఆమె స్నేహితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.  

08:19 - April 4, 2016

గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గంమధ్యలో దాచేపల్లి మండలం దామాలపాడు వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిడుగురాళ్ల, గురజాల ఆస్పత్రులకు తరలించారు. 

 

08:13 - April 4, 2016

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ అప్పారావును తక్షణమే వీసీ పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఇదే అంశం నిర్వహించిన జరనపథ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంకా రగులుతూనే వుంది. రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో వైస్‌ చాన్సలర్‌ గా అప్పారావు తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించడం వివాదస్పదమైంది. విసి మీద అనేక ఆరోపణలు చేస్తున్న విద్యార్థి సంఘాలు ఆయనను పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెల 6న అంటే ఏల్లుండి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చలో హెచ్‌సియుకి పిలుపునిచ్చింది. 13వ తేదీన హైదరాబాద్‌ లో మహార్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో వివాదం ఇంకా సద్దుమణగకపోవడానికి కారణం ఏమిటి?  ఈ నెల 6న చలో హెచ్‌సియు, 13న మహార్యాలీ నిర్వహించడానికి కారణాలేమిటి? విసి అప్పారావు తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేయడానికి కారణం ఏమిటి? హెచ్‌ సియు వివాదం నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల విషయంలో విద్యార్థి సంఘాల అభిప్రాయాలేమిటి? హెచ్‌సియు లో  ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో సాంబశివ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

ఇబ్రహీంపట్నంలో విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా : ఇబ్రహీంపట్నం ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని వాహని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

బెంగాల్-అసోంలో కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్, అసోంలో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బెంగాల్-18, అసోం-65 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. బెంగాల్ తొలి విడత ఎన్నికల పోటీలో 133 మంది అభ్యర్థులు ఉన్నారు. అసోం తొలి దశ ఎన్నికల బరిలో 539 మంది అభ్యర్థులు ఉన్నారు. 

 

07:52 - April 4, 2016

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీని నేడు ఆవిష్కరించనున్నారు. వినూత్న విధానాలకు పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో ఐటీ పాలసీ ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తిల సమక్షంలో ఐటీ దిగ్గజాల మధ్య ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే వెల్లడించారు
ఐటీ రంగంపై రాయితీల జల్లు
ఐటీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీల జల్లు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించేలా కొత్త 'ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ'ని రూపొందించింది. ఐటీ పరిశ్రమను ఐదేళ్లలోనే రెండింతలకు విస్తరించాలని, ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఇందులో ప్రధానంగా ఐటీ కంపెనీలకు స్థలాలు, రిజిస్ట్రేషన్, పన్నులు, అద్దె, మూల ధనం, విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇవ్వడంతోపాటు, పెట్టుబడులకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందజేయనుంది.
యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు 
ఇక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నియామక సాయం అందించాలని సరికొత్త నిర్ణయం కూడా తీసుకుంది. పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు పీహెచ్‌డీ విద్యార్థులకు స్టైఫెండ్ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐసీటీ పాలసీని ఆవిష్కరించనున్నారు. గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్‌, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తితో పాటు ఐటీ రంగంలో పేరొందిన దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు.
ఐటీ కంపెనీలు.. ఆరు విభాగాలుగా వర్గీకరణ
ఐటీ పాలసీలో ప్రధానంగా ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆరు విభాగాలుగా వర్గీకరించింది. మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా-చిన్న-సూక్ష్మ కంపెనీలు, మహిళలు-ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా గుర్తించనుంది. ఐటీ కంపెనీలన్నింటికీ వర్తించే రాయితీలతో పాటు ఒక్కో కేటగిరీకి మరింత ప్రోత్సాహకంగా ఉండేలా ప్రత్యేక రాయితీలను అందించనుంది.
ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రభుత్వ భూములు 
అర్హతలను బట్టి ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకుని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో పేర్కొన్నట్లుగా విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తారు. ఏటా వందమంది విద్యార్థులను తెలంగాణ కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రిక్రూట్‌మెంట్ అసిస్టెన్స్ కింద ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల చొప్పున చెల్లించే ప్రతిపాదన కూడా ఉంది. 
పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకం  
ఇక 'రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్'కు అయ్యే ఖర్చులో పది శాతాన్ని కంపెనీలకు గ్రాంట్‌గా చెల్లించనున్నారు. పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకం అందిస్తుంది.  హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించనుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొత్త విధానంలో ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం కల్పించనుంది.

 

07:39 - April 4, 2016

కృష్ణా : వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన..  కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమైంది. రంగా అనుచరులు, అభిమానులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. బాధ్యులను గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు విగ్రహం ధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌ అయ్యారు. బాధ్యులను పట్టుకుని శిక్షించాలని డిజిపి రాముడును ఆదేశించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల్లో ఇదో భాగమని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
నిజాంపేటలో రంగా విగ్రహం ధ్వంసం  
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నిజాంపేటలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దిమ్మెపైనున్న విగ్రహాన్ని కూల్చివేయడంతో ముక్కలు ముక్కలయ్యింది. విగ్రహాన్ని నేలకూల్చారన్న  సమాచారం తెలుసుకున్న రంగా అభిమానులు, కాపు సంఘాల నేతలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. విగ్రహాన్ని నేల కూల్చినవారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అక్కడినుంచి నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రోడ్డుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విగ్రహం ధ్వంసానికి కారకులైన వారిని  గుర్తించి కఠిన చర్యలు తీసుకోపోతే రాష్ట్ర వ్యాప్తం  ఉద్యమం తప్పదని  కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. 
విగ్రహ పునఃస్థాపనకు చర్యలు : మంత్రి రవీంద్ర
మంత్రి రవీంద్ర... ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రశాంతతకు భంగం కలిగించాలన్న ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని  రంగా అభిమానులకు హామీ ఇచ్చారు. విగ్రహం పునఃస్థాపనకు కూడా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర చెప్పారు.
మచిలీపట్నంలో 144వ సెక్షన్‌ విధింపు 
జిల్లాలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు మచిలీపట్నంలో భారీగా బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పట్టణమంతటా 144 సెక్షన్‌ను విధించారు. రంగా విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులను గుర్తించేందుకు జాగిలాలను రప్పించారు. కొందరు వ్యక్తులు ఉద్రిక్తలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసుల అనుమానిసున్నారు. 
రంగా విగ్రహ కూల్చివేతపై చంద్రబాబు ఆగ్రహం 
మరోవైపు  మచిలీపట్నంలో రంగా విగ్రహం కూల్చివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన డీజీపీ రాముడుతో ఫోన్‌లో  మాట్లాడారు. నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. నిందితులు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ప్రకటించాలని సూచించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కొందరు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని, అప్రమత్తంగా  ఉండాలని కోరారు. ఇలాంటి వారిని ఉపేక్షించొద్దని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రాష్ట్రంలో శాంతిలేకపోతే పెట్టుబడుటు పెట్టేందుకు ఎవరూ ముందురారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబునాయుడు.... డీజీపీని ఆదేశించారు. 

 

రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు

గుంటూరు : దాచేపల్లి ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తరలించారు. 

ఎపిలో నేటి నుంచి రేషన్ డీలర్ల యాత్ర

విజయవాడ : ఎపిలో నేటి నుంచి రేషన్ డీలర్లు యాత్ర చేయనున్నారు. డీలర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి విడతలో ఆరు జిల్లాల్లో యాత్ర జరుగనుంది.

 

నేటి నుంచి ఢిల్లీలో జల వారోత్సవాలు

ఢిల్లీ : నేటి నుంచి ఢిల్లీలో జల వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ వారోత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మిషన్ కాకతీయ ఉంది. ముగింపు వేడుకల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు పాల్గొనున్నారు. 

 

07:20 - April 4, 2016

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌ రాజకీయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఆ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా మెహబూబాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్హానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ పాటికి రంగం సిద్ధమైంది. 
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు 
మెహబూబా ప్రమాణ స్వీకారంతో కశ్మీర్‌లో ఆమె తొలి మహిళా సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. అంతేకాదు.. తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా కూడా ఆమె రికార్డుకెక్కనున్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీతో కలిసి పీడీపీ రెండోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.  డిప్యూటీ సీఎంగా బీజేపీ శాసనసభా పక్షనేత నిర్మల్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ, పీడీపీ మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ సీఎంగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరి 7న ఆయన మృతి చెందడంతో.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఓ దశలో మెహబూబా కాంగ్రెస్‌తో జతకడతారనీ భావించారు. అయితే.. బీజేపీ నేతల మంత్రాంగం ఫలించి.. ఆమె సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారు. 

 

07:11 - April 4, 2016

 కోల్ కతా : పశ్చిమబెంగాల్,  అస్సాం రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం ఈ రెండు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ మొదలవుతుంది. పశ్చిమబెంగాల్ లో 18 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 65 అసెంబ్లీ  నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. జంగల్ మహల్ గా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన ఏరియాలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పురులియా జిల్లాలో 9,  పశ్చిమ మిడ్నాపూర్ లో 6, బంకుర జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఈ 18 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  టిఎంసి, బిజెపి 18 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా,  సిపిఎం 11, సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎన్సీపీ ఒక్కొక్క  స్థానంలో పోటీ చేస్తున్నాయి.  కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు చెరో అయిదు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాయి. పశ్చిమ బెంగాల్ లో తొలి విడత పోలింగ్ జరిగే 18 స్థానాల్లో ఆరు ఎస్టీ రిజర్వ్ డ్ కాగా,  రెండు ఎస్సీ రిజర్వడ్ స్థానాలు. మిగిలి పది జనరల్ స్థానాలు. 
అస్సాంలో సగానికిపైగా స్థానాల్లో తొలి విడత పోలింగ్ 
అస్సాంలోని సగానికిపైగా స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలుండగా తొలి విడతలో 65 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  వీరిలో 43 మంది మహిళా అభ్యర్థులు అస్సాంలో తొలి విడతలో 95, 11, 732 ఓటర్లు ఓటు హక్కు వినయోగించుకోవాల్సి వుంది. వీరిలో 45, 95, 712  మంది మహిళా ఓటర్లు.  మొత్తం 12, 190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 48 వేల  మంది పోలింగ్ సిబ్బంది, 40 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. 
అస్సాంలో హోరాహోరి పోరు
అస్సాంలో అధికార కాంగ్రెస్, బిజెపి, ఏజెపి, బిపీఎఫ్ కూటమి మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. కాంగ్రెస్ 65 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బిజెపి 54 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.  మిత్రపక్షాలైన  ఏజిపి 11, బిపిఎఫ్ మూడుస్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆల్  ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేస్తున్న 27 ని యోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది.  సిపిఎం, సిపిఐ చెరో పది స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎంఎల్ పార్టీ ఆరు స్థానాల్లో బరిలోకి దిగింది.  కాంగ్రెస్, బిజెపి హోరాహోరీగా పోరాడుతున్న అస్సాంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ దక్కక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కింగ్ మేకర్ గా మారుతుందన్న అంచనాలున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి, కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్ తొలి విడతలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

 

07:08 - April 4, 2016

కోల్ కతా : టీ20 ప్రపంచకప్‌ రెండోసారి కరేబియన్ల సొంతమైంది. ఇంగ్లాండ్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 19.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 161తో ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య నువ్వా? నేనా? అన్నంతగా జరిగిన తుది పోరులో విండీస్ ఆటగాడు శామ్యూల్స్ 85 నాటౌట్ పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రసవత్తరమైన విజయంతో ముగింపు
టీ20 ప్రపంచకప్‌కి కరీబియన్లు రసవత్తరమైన విజయంతో ముగింపు పలికారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో వరుసగా గెలుపొంది రెండోసారి టీ ట్వంటీ ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకుంది. 
బ్రాత్‌వైట్‌ తొలి నాలుగు బంతులు.. నాలుగు సిక్సులు 
విండీస్‌ విజయానికి చివరి 6 బంతుల్లో 19 పరుగుల అవసరమైన దశలో బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ తొలి నాలుగు బంతుల్ని సిక్సర్లుగా మలిచి కరీబియన్లను సంబరాల్లో ముంచెత్తాడు. ఛేదనలో వెస్టిండీస్‌ తొలుత తడబడింది. ఓపెనర్లు చార్లెస్‌, క్రిస్‌ గేల్‌తో పాటు సిమన్స్ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది.
శ్యామూల్స్ 85 పరుగులు... నాటౌట్‌   
ఈ దశలో మార్లోన్‌ శ్యామూల్స్ 66 బంతుల్లో 85 పరుగులు నాటౌట్‌ గా నిలిచాడు. 27 బంతుల్లో బ్రావో 25 పరుగులు చేయగా   కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని నాలుగో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 86 వద్ద బ్రావో ఔటవడంతో వెస్టిండీస్‌ మళ్లీ తడబాటుకు గురైంది. హిట్టర్‌ రసెల్‌, కెప్టెన్‌ సామీలను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి బౌలర్‌ డేవిడ్‌ విళ్లీ మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు. 
చివర్లో తీవ్ర ఉత్కంఠ 
ఈ దశలో శ్యామూల్స్ తో జత కలిసిన బ్రాత్‌వైట్‌ పరుగులు, బంతులు మధ్య అంత‌రం పెరుగుతున్నా ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా సింగిల్స్ తో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాదాపు మ్యాచ్‌ చేజారిపోతున్న తరుణంలో బ్రాత్‌వైట్‌ వరుస సిక్సర్లు బాది విండీస్‌కు కప్‌ అందించాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 
టాస్ గెలిచిన విండీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే జేసన్ రాయ్ వికెట్ ను కోల్పోయింది. అనంతరం అలెక్స్ హేల్స్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్  23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో జో రూట్ 36 బంతుల్లో 54పరుగులు, బట్లర్ 22 బంతుల్లో 36 పరుగులు చేసారు. 
విరాట్‌ కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌
ఇంగ్లీష్‌ బ్యాట్స్ మెన్‌ సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో,బ్రాత్ వైట్లు తలో మూడు వికెట్లు సాధించగా, బద్రికి రెండు, రస్సెల్కు ఒక వికెట్ దక్కింది. 85 పరుగులు చేసిన శామ్యూల్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో 273 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కించుకున్నాడు.

పశ్చిమబెంగాల్, అసోంలో నేడు తొలి దశ పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్, అసోంలో నేడు తొలి దశ పోలింగ్ జరుగనుంది. బెంగాల్ లో 18, ఆసోంలో 65 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల దృష్ట్యా జంగల్ మహల్ లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

 

రొమ్ముక్యాన్సర్ పై నేడు అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం : రొమ్ముక్యాన్సర్ పై నేడు అవగాహన సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొననున్నారు. 

 

సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ముఫ్తీ

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో నేడు కొత్త సర్కార్ కొలువుదీరనుంది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

నేడు నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించనున్న టీ.ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నేడు నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించనుంది. పెట్టుబడులను ఆకర్షిచడం, స్థానిక యువతకు ఉపాధి, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రధాన అంశాలు.

Don't Miss