Activities calendar

06 April 2016

ఏఆర్ రెహ్మాన్ షో వాయిదా....

హైదరాబాద్ : ఈ నెల 23న శ్రీలంకలో జరగాల్సి ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ షో వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ షో వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఏ తేదీన ఈ షో నిర్వహించే విషయం త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, శ్రీలంక వ్యతిరేక వర్గీయుల ఆందోళనల నేపథ్యంలోనే ఈ లైవ్ కన్సర్ట్ షో రద్దయినట్లు వస్తున్న వార్తలను నిర్వహాకులు తోసిపుచ్చారు.

వారితో కంగనా రనౌత్ డ్యాన్స్...

హైదరాబాద్ : ఇండియన్ స్టార్ క్రికెటర్స్ ధోనీ, కోహ్లీలతో బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ సినిమా చేయనుంది. సినీ ఇండస్ట్రీలో లేటుగా సక్సెస్ అందుకుంటున్న 29 సంవత్సరాల ఈ అమ్మడుకు అవకాశాలు తరుముకుంటూ వస్తున్నాయి. ఈ మధ్యనే 'తనూ వెడ్స్ మనూ రిటర్న్స్' కు జాతీయ అవార్డు దక్కడంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా ఐపిఎల్ సీజన్ మొదలు కానుండటంతో ప్రమోషన్‌లో భాగంగా చేయనున్న యాడ్ ఫిల్మ్‌లో ధోనీ, కోహ్లీ, కంగనాల త్రయం నటించనుంది. మరో విశేషమేమంటే దర్శకుడు రాజ్‌కుమార్ హీరానీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. పూర్తిగా ఒక రోజుపాటు ఈ షూటింగ్‌ను ఏప్రిల్ 7న చిత్రించనున్నారు.

బీహార్‌లో మద్యం పట్టివేత

పాట్నా : బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో మద్యం నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నారు. 17 వేల లీటర్ల మద్యాన్ని చాప్రాలో పట్టుకున్నట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ గుప్తా తెలిపారు. పట్నాలోని మల్సాలమి ప్రాంతంలో 90 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. కసింగని ప్రాంతంలో 150 కేసుల విదేశీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సొంత జిల్లా అయిన నలందలో ఓ హోటల్‌ నుంచి 1,115 బాటిళ్ల విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు.

22:01 - April 6, 2016

శ్రీనగర్‌ : విద్యార్థుల ఆందోళనతో శ్రీనగర్‌లోని నిట్‌ అట్టుడుకుతోంది. కశ్మీర్‌కు చెందని స్థానికేతర విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ జరపడం ఉద్రిక్తతకు దారితీసింది. టి-20 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఓటమితో కశ్మీర్‌, స్థానికేతర విద్యార్థుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. 
నిట్‌లో ఉద్రిక్తత
జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత శుక్రవారం టి-2- వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్స్‌లో భారత్‌ ఓటమి తర్వాత కశ్మీర్‌ విద్యార్థులు, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన స్థానికేతర విద్యార్థుల మధ్య ఏర్పడ్డ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. క్యాంపస్‌లో ఉద్రిక్తత కారణంగా గత శుక్రవారం ఎన్‌ఐటీని తాత్కాలికంగా మూసేసి సోమవారం తెరిచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అభద్రతా భావంతో మంగళవారం క్యాంపస్‌ విడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 5 వందల మంది విద్యార్థులు క్యాంపస్‌ బయట ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ జరిపారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీలతో కొట్టారని ఆరోపించారు. పోలీసులు హాస్టల్‌లోకి చొరబడి దాడి జరిపారని విద్యార్థులు తెలిపారు. తమకు మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.
సిఆర్‌పిఎఫ్‌ బలగాల మోహరింపు
పరిస్థితి విషమించడంతో నిట్‌ పరిసరాల్లో సిఆర్‌పిఎఫ్‌ బలగాలను మోహరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని మెహబూబా ముఫ్తి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి మెహబూబాకు ఫోన్‌ చేసి పరిస్థితిని సమీక్షించారు. 
నిజనిర్ధారణ కమిటీ
నిట్‌లో చోటుచేసుకున్న పరిస్థితులను తెలుసుకోవడానికి హెచ్‌ఆర్‌డీ ఇద్దరు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేసింది. హెచ్‌ఆర్‌డి డైరెక్టర్‌, డిప్యూటీ సెక్రటరీ స్థాయి ఇద్దరు అధికారులను క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థుల నుంచి సమాచారం రాబట్టనున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని స్థానికేతర విద్యార్థులు  కోరుతున్నారు. గత శుక్రవారం టి-20 మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చెందడంతో కశ్మీర్‌ విద్యార్థులు టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో నిట్‌లో వివాదం చోటుచేసుకుంది.

 

21:53 - April 6, 2016

మెదక్‌ : జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 71.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 74 వేల 710 ఓట్లకు గాను 53 వేల 327 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. సిద్ధిపేట మున్సిపాలిటీలో 34 వార్డులుండగా.. 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

21:49 - April 6, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్ క‌మిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా క్షమాప‌ణలు చెప్పారు. ఎమ్మెల్యే అనిత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ క‌మిటీ క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని సూచించిన నేప‌ధ్యంలో రోజా క్షమాప‌ణ‌లు చెప్పిన‌ట్లు సమాచారం. అయితే రోజా మాత్రం తాను క్షమాప‌ణ చెప్పలేద‌ని... అనిత‌పై చేసిన వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకుంటున్నట్లు మాత్రమే చెప్పాన‌ని రోజా అన్నారు. మ‌రోవైపు రోజా వివ‌ర‌ణ‌పై త్వర‌లోనే ప్రివిలేజ్ క‌మిటీ స్పీక‌ర్‌కు నివేదిక ఇస్తామంటోంది.
ప్రివిలేజ్ క‌మిటీ ముందు రోజా హాజ‌రు 
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ప్రివిలేజ్ క‌మిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజ‌రయ్యారు. గ‌తంలో మూడు సార్లు ప్రివిలేజ్ క‌మిటి.. సమావేశానికి పిలిచినా రోజా హాజ‌రుకాలేదు. దీంతో స‌భ ఆమెకు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చింది. దీంతో రోజా ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజరై త‌న వాద‌న‌ను వినిపించారు. అనిత‌పై చేసిన వ్యాఖ్యల‌కు ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా క్షమాప‌ణ చెప్పిన‌ట్లు అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే రోజా మాత్రం తాను ఏ త‌ప్పూ చేయ‌లేదని అంటున్నారు. అనిత అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని తన వ్యాఖ్యలు ఆమెకు బాధ‌క‌లిగించి ఉంటే వెన‌క్కి తీసుకుంటున్నట్లు రోజా  చెప్పారు. మ‌హిళ‌ల స‌మ‌స్యల‌పై పోరాటం చేస్తున్నందుకే అధికార పార్టీ తనను టార్గెట్ చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. శాస‌నస‌భ‌లో జ‌రిగిన విష‌యాలు సోష‌ల్ మీడియాలో ఎలా వ‌చ్చాయో చెప్పాల‌ని అసెంబ్లీ కార్యద‌ర్శిని నిల‌దీశారు.
హాజ‌రుకాకపోవడంపై రోజా వివ‌ర‌ణ 
మూడు సార్లు ప్రివిలేజ్ క‌మిటీ ముందుకు ఎందుకు హాజ‌రుకాలేదో రోజా వివ‌ర‌ణ ఇచ్చారు. ఆమె ఇచ్చిన వివ‌రణ‌పై క‌మిటీ మ‌రోసారి భేటీ అవుతుంద‌ని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ చైర్మన్‌ గొల్లప‌ల్లి సూర్యారావు తెలిపారు. క‌మిటీ నివేదిక‌ను వారం రోజుల్లో స్పీక‌ర్ కోడెల‌కు అందిస్తామ‌ని... స్పీక‌ర్ త‌మ నివేదిక‌పై తుది నిర్ణయం తీసుకుంటార‌ని తెలిపారు. రోజా ఇచ్చిన ఫిర్యాదులు మా ప‌రిధిలో లేవ‌ని, స్పీక‌ర్ ఆదేశించిన అంశాల మేర‌కే ప్రివిలేజ్ క‌మిటీ చ‌ర్చిస్తుంద‌ని గొల్లప‌ల్లి  సూర్యారావు అన్నారు.
తాను ఎవ‌రికీ క్షమాపణ చెప్పలేద‌న్న రోజా  
అయితే క‌మిటీ స‌మావేశం ముగిసిన త‌రువాత రోజా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తాను ఎవ‌రికీ క్షమాపణ చెప్పలేద‌ని.. నాడు స‌భ‌లో జ‌రిగిన విష‌యాల‌పై ఆధార‌ల‌తో క‌మిటీ స‌భ్యుల‌కు వివ‌రించాన‌ని అన్నారు. అధికార పార్టీ త‌న స‌స్పెన్షన్‌పై కావాల‌నే రాద్దాంతం చేస్తుంద‌ని, అనిత‌కు నాకు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని రోజా అన్నారు. అనిత వెనుక ఎవ‌రో ఉండి న‌డిపిస్తూ... తనను బ‌లిప‌శువును చేస్తున్నార‌ని క‌మిటీ ముందు రోజా ఆవేద‌న వ్యక్తం చేశారు.
రోజా వివ‌ర‌ణపై క‌మిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది...?  
మొత్తానికి గంట‌ పాటు జ‌రిగిన ప్రివిలేజ్ క‌మిటీ స‌మావేశం హాట‌్‌హాట్‌గా సాగింది. మొద‌ట్లో క్షమాప‌ణ‌లు చెప్పేందుకు అంగీక‌రించ‌ని రోజా... క‌మిటీ స‌భ్యుల సూచ‌న మేర‌కు చివ‌ర‌కు క్షమాప‌ణ చెప్పింది. రోజా వివ‌ర‌ణపై ప్రివిలేజ్ క‌మిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది...?  స్పీక‌ర్‌కు ఎలాంటి నివేదిక ఇస్తుందో వేచి చూడాలి.

 

కమలా అద్వానీ మృతి పట్ల జగన్ సంతాపం

హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మరణం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గుండెపోటుతో కమలా అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

వైద్య-ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

హైదరాబాద్ : అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, ఆస్పత్రుల పనితీరుపై సీఎం అధికారులతో చర్చించారు.

బస్సు ఢీకొని బాలుడు మృతి

నల్లగొండ : జిల్లాలోని ఆలేరు మండలం రెడ్డిగూడెంలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన హైటెక్ బస్సు ఐదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

21:40 - April 6, 2016

ఐదేండ్లు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగాలంటే.. ఈ మాత్రం పెట్టుబడి తప్పదనుకుంటున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఓటును ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడడం లేదు. కట్టల పాములు బయటపడుతున్నాయి. ఎక్కెడెక్కడో సొమ్మంత తవ్వి తీస్తున్నారు. నేటి ఐదు రాష్ట్రాల ఎన్నికలైనా.. గత సార్వత్రిక ఎన్నికలైనా... జరిగింది. జరుగుతున్నది ఇదే. సాక్షాత్తు ఆర్ బిఐ గవర్నరే ఈ అంశంపై చేసిన కామెంట్స్ సంచలనం కల్గిస్తుంది. ధనమయమవుతున్న ఎన్నికల తీరుపై ఈరోజు వైడాంగిల్ స్పెషల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:26 - April 6, 2016

నల్లధనాన్ని వెలికితీయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వక్తలు పేర్కొన్నారు. 'పనామా పేపరు లీక్స్'.. అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం ఎపి నేత బాబురావు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, సీఎ ఆండ్ ఫైనాన్స్ వ్యవహారాల విశ్లేషకులు ఆర్.శశికుమార్, బిజెపి నేత అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. నల్లధనాన్ని వెలికితీయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పనామా పేపర్ లీక్ వ్యవహారాన్ని మామూలే అన్నట్లుగా కేంద్రం భావిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

20:58 - April 6, 2016

పార, గడ్డపార పట్టిన పాలమూరు సీనన్న... సగం మట్టిని చెర్లనే ఒలకవోసిండు సూడన్న, సర్పంచును సంతాయిస్తునదట ఎమ్మెల్యే గొంగిడి.. మీడియా ముందడికొచ్చి చేసిండు అంగడంగడి, సీతం కోతులతో నిండిన బంగారి తెలంగాణ... అవిటికి కూడ చేస్తరట కుటుంబ నియంత్రణ, మానుకొండూరులో మునిగిన మామిడి తోట, మల్లన్నముచ్చట్లల రసమయి పాటామాట, పోరనిసేతిల మోసపోయిన పోలీసోల్లు.. కేటుగానికి సేవలు చేసిండ్రట ఫుల్లు. వింత జంతువు జననం... ఎగబడి జూసిండ్రు జనం.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:42 - April 6, 2016

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారకార్యక్రమాలకు...సీజన్ సీజన్ కూ ఆదరణ పెరగడం పట్ల..సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా...స్పోర్ట్స్ క్లస్టర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ప్రసాన కృష్ణన్ సంతృప్తి ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తమ వ్యూహాలను వెల్లడించారు. ప్రాంతీయభాషల్లో ప్రధానంగా తెలుగు ప్రత్యక్ష ప్రసారాలకు మరింతగా ఆదరణ పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. ఐపీఎల్ తొమ్మిదో సీజన్ పోటీలు ఈనెల 9న ముంబై వాంఖెడీ స్టేడియంలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే....

 

20:39 - April 6, 2016

అనంతపురం : ఆకాశగంగమ్మ నేలకు దిగిరానంటోంది. పాతాళ గంగమ్మ పైకిరానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు చూడాల్సివస్తోంది. రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలపై ప్రత్యేక కథనం.
రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలు 
ఇది కరవు సీమ అనంతపురం జిల్లాలోని పరిస్థితి.  మూడు నెలలుగా పదిలంగా ఉన్న భూగర్భ జలాలు వేసవి రావడంతో అమాంతంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో లోతుకు వెళ్లిపోయాయి. ఈ ఏప్రిల్,మే నెలల్లో మరింత క్షీణించే ప్రమాదముంది. జిల్లా వ్యాప్తంగా 191 గ్రామాల్లో బోరుబావులతో అనుసంధానించిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నీటి మట్టం వివరాలు సేకరించారు. వర్షాభావ ప్రభావం ఒకవైపు ఉంటే మరోవైపున భూగర్భ జలాలు లభ్యతకు మించి బోర్ల ద్వారా నీటి వాడకం ఉంది. జిల్లాలో ఒక లక్షా అరవై వేల బోర్లకు సరిపడా జలాలు మాత్రమే లభ్యమవుతుంటే, ప్రస్తుతం రెండు లక్షలా యాభైవేల బోర్ల ద్వారా నీటి వినియోగం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 
సగటు నీటిమట్టం 15.89 మీటర్లు
గత సంవత్సరం అక్కడక్కడా పడిన వర్షాల కారణంగా ప్రజలు కాస్తంత ఊపిరిపీల్చుకున్నా,పెరిగిన భూగర్భ జలాలు ఎక్కువ కాలం  అందుబాటులో లేవు. జిల్లా సగటు నీటి మట్టం 15.89 మీటర్లుగా నమోదైనా, చాలా ప్రాంతాల్లో సగటు గణనీయంగా తగ్గిపోయింది. సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో 56.22 మీటర్ల లోతులో కూడా నీరు కనిపించడం లేదు. లేపాక్షి మండలం శిరివరంలో 50.31 మీటర్లు,బుక్కపట్నంలో 42.93 మీటర్లలో నీళ్లున్నాయి. కళ్యాణదుర్గం మండలం మానిరేవు 28.08, బ్రహ్మసముద్రం27.84, యల్లనూరు మండలం తిమ్మంపల్లి 27.78, ఓబుళాపురం 25.74 లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత లోతుకు పడిపోయే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 
తాగునీటి సమస్యకు రూ.15 కోట్లు మంజూరు
జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇంకా ఎంత ఖర్చయినా వెనక్కితగ్గమని భరోసా ఇచ్చారు. గ్రామాల్లోని రైతులెవరైనా,తమ వ్యవసాయ బోర్ల ద్వారా ఆయా గ్రామ ప్రజలకు నీరందించేందుకు ముందుకువస్తే,వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని ఆమె తెలిపారు. 
జిల్లాలోని 14 మండలాల్లో తాగునీటి సమస్య
ప్రస్తుతం జిల్లాలోని 14 మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రానున్న రెండు నెలల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు యాభై గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో 250 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశమున్న కారణంగా,అన్ని గ్రామాల్లో కూడా ఎంత ఖర్చయినా నీటి సరఫరా చేస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో పాటు, భూగర్భ జలాలు కూడా ఎండిపోతే తమ పరిస్థితి మరింత దారుణమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. ప్రభుత్వం చొరవచూపి ,హంద్రీనీవా కాలువను త్వరగా పూర్తిచేసి,ఆ కాలువల ద్వారా వేలాది చెరువులను నింపాల్సిన అవసరముందని గుర్తు చేస్తున్నారు.

 

తెలంగాణలో వడదెబ్బకు 66 మంది మృతి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 66 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్లగొండ-2, ఖమ్మం-5గురి మృతి చెందగా ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా 28 మంది మృతి చెందారు. కీరీంనగర్-5, మెదక్-11, ఆదిలాబాద్-4, నిజామాబాద్ -7, వరంగల్ -4 మృతి చెందినట్లు సర్కార్ అధికారికంగా తెలిపింది.

గిన్నీస్ రికార్డులోకెక్కిన టెలినార్

హైదరాబాద్ : ప్రముఖ మొబైల్‌ కంపెనీ టెలికాంసంస్థ టెలినార్ (యూనినార్) ఒకే రోజు అత్యధిక ఔట్ లెట్లు ఓపెన్ చేసినందుకు గాను గిన్నీస్ రికార్డులో కెక్కింది. ఆ సంస్థ 26 అగస్టు 2015న ఆరు టెలికం సర్కిళ్లలో 472 స్టోర్స్ ఓపెన్ చేసింది. ఇది ప్రపంచంలో మే రిటైల్ రంగంలో నైనా ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేసిన ఘనత

కాపు కార్పొరేషన్ పై చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బుజ్జి పాల్గొన్నారు.

దంత వైద్యుడిపై నిర్భయ కేసు నమోదు

కరీంనగర్ : హుజూరాబాద్ లో ఓ దంత వైద్యుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళపై దంత వైద్యుడు శ్రీనివాస్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తప్పించుకున్న మహిళా అటెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న వైద్యుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

జూ.ఎన్టీఆర్‌కు రూ.700 జరిమానా

హైదరాబాద్‌ : సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కారుకు నల్లటి అద్దాలు ఉన్నందున రూ. 700 జరిమానా విధించారు.

ఈ నెల 15 నుంచి ఢిల్లీలో రెండో దశ సరి-బేసి విధానం

హైదరాబాద్ : దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సరి-బేసి వాహన విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. రెండో దశ సరి-బేసి విధానాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందులో మహిళలకు, పాఠశాల యూనిఫామ్‌ ధరించిన విద్యార్థులను తీసుకెళ్లే కార్లకు మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

19:30 - April 6, 2016

శ్రీకాకుళం : లక్షలాది ఎకరాలకు సాగునీరు ప్రసాదించే జలప్రదాయని.. వందలాది గ్రామాలకు తాగునీటి దాహాన్ని తీర్చే కల్పతరుణి. శ్రీకాకుళం జిల్లా వరాల జలసిరి వంశధార నది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇవాళ జలకళ లేకుండా మారిపోతోంది.
జలకళ లేకుండాపోయిన వంశధార 
వంశధార గొట్టా బ్యారేజ్ ఒట్టి పోతోంది. వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరైన ఈ జలాశయం కనీస నీటి మట్టం కన్నా తక్కువ స్థాయికి చేరడంతో జలవనరుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఆరు నెలలుగా వర్షాభావం నెలకొనడంతో నదీ గర్భం ఎడారిని తలపిస్తోంది. ఒడిశాతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం నమోదుకాకపోవడంతో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టం అట్టడుగుకు చేరింది. పూర్తిగా ప్రవాహం లేకపోవడంతో ప్రధాన కాలువలు బీటలు బారుతున్నాయి. దీంతో 18 మండలాల పరిధిలోని వ్యవసాయ పరిస్థితి ఆందోళనకరంగా  మారింది.
రెండున్నర లక్షల ఎకరాల వ్యవసాయం ప్రశ్నార్థకం
వంశధార నది నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలను పిల్ల కాలువలతో అనుసంధానం చేస్తూ మధ్యలో చెరువులు నింపి  పొలాలకు నీరందేలా చేస్తారు. ఇప్పుడు డెడ్ స్టోరేజ్‌కన్నా తక్కువ ప్రవాహం, రైతులను   మరింత  ఆందోళనకు గురిచేస్తోంది. గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, ఆమదాలవలస మండలాల పరిధిలోని దాదాపు 700 కు పైగా చెరువులకు సాగునీరు చేరుతోంది. ఎన్నడూ లేనంతగా వంశధార లాంటి నది, చిన్న వాగులా కనిపించడం తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నది పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో వరుణుడు కరుణిస్తే తప్ప గొట్టా బ్యారేజ్‌లో జలకళ కనిపించేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు . నదిలో పూర్తి స్థాయి ప్రవాహం రాకపోతే రెండున్నర లక్షల ఎకరాల పంట సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని అంటున్నారు. 

 

19:19 - April 6, 2016

హైదరాబాద్ : త్వరలో రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు మోహన్‌బాబు చెప్పారు. ఏపార్టీలో చేరేది ఇప్పుడే చెప్పనని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం హేయమైన చర్యగా మోహన్‌బాబు అభివర్ణించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం తగదన్నారు. మోహన్‌బాబు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ తనకు బంధువులే అయినా.. వారి నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని మోహన్‌బాబు అన్నారు. అయన చేసిన కామెంట్స్ వీడియో లో చూడండి.

 

19:12 - April 6, 2016

విశాఖ : మన్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని మంచంగిపుట్ట మండలంలోని దూలిపుట్టు సమీపంలో  మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవానుతో పాటు స్థానికుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి పాడేరులోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. ఏజెన్సీ ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 66 మంది మృతి: టీ.సర్కార్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 66 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్లగొండ-2, ఖమ్మం-5గురి మృతి చెందగా ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా 28 మంది మృతి చెందారు. కీరీంనగర్-5, మెదక్-11, ఆదిలాబాద్-4, నిజామాబాద్ -7, వరంగల్ -4 మృతి చెందినట్లు సర్కార్ అధికారికంగా తెలిపింది.

18:54 - April 6, 2016

వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా ఏస్ ప్యాసింజర్ వాహనంలో 14 మంది ప్రయాణికులు వరంగల్ నుంచి సంగం మండలం లోహితకు వెళ్తున్నారు. సంగం మండలం లోహిత నుంచి వరంగల్ వైపు టాటా ఏస్ గూడ్స్ వాహనం వస్తోంది. మార్గంమధ్యలో సంగం మండలం కాపులఘనపర్తిలో కార్నర్ వద్ద టాటా ఏస్ ప్యాసింజర్ వాహనాన్ని టాటా ఏస్ గూడ్స్ వాహనం ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ ప్యాసింజర్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బృందం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆర్ డీవో వెంకట మాధవరావు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి.. క్షతగాత్రుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ప్రయాణికులు లోహిత గ్రామానికి చెందిన తండా వాసులుగా భావిస్తున్నారు.

ఐఏఎస్,ఐపీఎస్ ల భోగోతాలు బయటపెడతా : నటుడు మోహన్ బాబు

చిత్తూరు : నటుడు మోహన్ బాబు సంచలన ప్రకటన చేశారు. అవినీతికి పాల్పడుతున్న ఐఏఎస్,ఐపీఎస్ ల భోగోతాలు బయటపెడతాననీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.  ఏ పార్టీలోకి వస్తానో చెప్పనన్న ఆయన రాజకీయాల్లో పార్టీలు మారటం తగదని పేర్కొన్నారు. దీంతో ఆయన ఏపార్టీలోకి వస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అప్పట్లో నన్ను కొందరు నన్ను టీడీపీ నుండి సాగనంపారని ఆయన అన్నారు. తెలంగాణలో వున్న ఆంధ్రప్రదేశ్ వారిని సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అనటం విశేషం. గతంతో కేసీఆర్ కు మోహన్ బాబుకు మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.

బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి భార్యా వియోగం....

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీకి భార్యా వియోగం కలిగింది. అద్వానీ సతీమణి కమలా అద్వానీ మృతి చెందారు.

మహిళపై దంత వైద్యుడు అత్యాచారయత్నం...

కరీంనగర్ : హుజూరాబాద్ లో ఓ దంత వైద్యుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళపై దంత వైద్యుడు శ్రీనివాస్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తప్పించుకున్న మహిళా అటెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న వైద్యుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

కాపు కార్పొరేషన్ పై ఏపీ సీఎం సమీక్ష...

విజయవాడ : కాపు కార్పొరేషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బుజ్జి పాల్గొన్నారు.

18:16 - April 6, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను తట్టుకోలేకే... కాంగ్రెస్‌ పార్టీ పోటీగా కవర్ పాయిట్‌ ప్రజెంటేషన్‌ కు సిద్ధమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్‌ సాక్షిగా ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని కాంగ్రెస్ నేతల్ని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాలతో కాంగ్రెస్‌ వాళ్లకు మైండ్‌బ్లాంక్‌ అయిందని ఎద్దేవా చేశారు. ఆనాడు ప్రాజెక్టులను అశాస్త్రీయంగా కాంగ్రెస్‌ నిర్మించిందని విమర్శించారు. కాలువల పేరుతో మొబిలైజేషన్‌ అడ్వాసుల్ని తీసుకొని జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. 

 

13 జిల్లాల రైతుసంఘం నాయకులతో కాంగ్రెస్ నేత రఘవీరా భేటీ...

విజయవాడ : ఏపీలోని 13 జిల్లాల రైతు సంఘం నాయకులతో కాంగ్రెస్ నేత రఘువీరా భేటీ అయ్యారు. తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారనుందని పేర్కొన్నారు. కేంద్రం అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులు చేపట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. దీనిపై చంద్రబాబు అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

రాజధాని ప్రాంతరైతులు,సీఆర్డీఏ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి....

విజయవాడ : రాజధాని ప్రాంత రైతులు, సీఆర్‌డీఏ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి సమావేశమయ్యారు.  అమరావతిలో ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి రైతుల వద్ద వివరాలను తెలుసుకున్నారు. 100 నుండి 2000 గజాల వరకూ ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 100 నుండి 500గజాలు నివాస స్థలంలో జీ ప్లస్-5 అనుమతి, 2వేల గజాలకు పైన వున్న స్థలాలకు జీప్లస్-11 విత్ పార్కింగ్, క్యాపిటల్ ట్యాక్స్ మినహాయింపుపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

17:59 - April 6, 2016

మెదక్ : సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 65శాతం వరకు జరిగి ఉంటుందని అంచనా. 5గంటల వరకు క్యూలైన్‌ లో ఉన్నవారికి ఓటింగ్ అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు 60.89 శాతం పోలింగ్ నమోదు అయింది. 17 వార్డుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 18 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. 400 మంది పోలింగ్, 500 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  గతంలో 80.59శాతం పోలింగ్ నమోదు అయింది. 

17:50 - April 6, 2016

విజయవాడ : టీడీపీలో ప్రజా ప్రతినిధులంతా లోకేష్‌ జపం చేస్తున్నారు. చినబాబుకు మంత్రిపదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇటీవలే టీడీపీలో చేరిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ సీఎంను కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ, ముస్లిం మైనార్టీ మీటింగ్‌లలో లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

 

17:43 - April 6, 2016

ఢిల్లీ : దేశానికి మరోసారి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిఘావర్గాలకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు పెద్దఎత్తున దాడులు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు కశ్మీర్‌వైపు కదులుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. వాళ్లు ప్రధానంగా అర్ధరాత్రి సమయంలోనే కదులుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడుల ముప్పు ఉందంటూ పంజాబ్‌లోని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. మందుగుండు సామగ్రితో కూడిన స్విఫ్ట్ కారులో ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులుతో పాటు ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు ఢిల్లీ, ముంబై, గోవాలే లక్ష్యంగా చొరబడే ప్రయత్నంలో ఉన్నట్లు ఏజెన్సీల నుంచి తమకు వార్తలు అదినట్లు అధికారులు చెబుతున్నారు.  
పోలీసులు అప్రమత్తం
బూడిద రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులతో పాటు, ఓ కాశ్మీరీ కూడా ప్రయాణిస్తున్నట్లు తమకు ఢిల్లీ స్పెషల్ సెల్‌ పోలీసుల నుంచి సమాచారం అందిందని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. దాడులకు కావలసిన ఆయుధాలతో పాటు, మందుగుండు సామగ్రిని కూడా ఉగ్రవాదులు తీసుకెళ్తున్నారని, వాళ్లు సూసైడ్‌ బాంబర్స్ అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలు, సామగ్రితో కూడిన ఆ ప్రత్యేక వాహనంలో పాక్ తీవ్రవాదులు బుధవారం రాత్రి తర్వాత బనిహాల్ టన్నెల్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని డీజీపీ వివరించారు. ఉగ్రవాద కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

17:38 - April 6, 2016

వాషింగ్టన్ : అమెరికాలో మరో నకిలీ యునివర్సిటీ భాగోతం బయటపడింది. అధికారులే ఓ నకిలీ యూనివర్సిటీని సృష్టించి ఒకే సమయంలో స్టూడెంట్‌, వర్క్‌ పర్మిట్‌ వీసాలు పొందిన 21 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో అమెరికా హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు... పదిమంది ఎన్నారైలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో దాదాపు వేయి మంది వరకు విదేశీయుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.  26 దేశాలకు చెందిన దాదాపు వేయిమందికి స్టూడెంట్ వీసాతో పాటు  వర్క్ పర్మిట్ వీసాలు కూడా ఇప్పించేందుకు ప్రయత్నించిన బ్రోకర్లు, రిక్రూటర్లు, అరెస్టయిన వారిలో ఉన్నారు. అమెరికాలో పనిచేసేందుకు వీసాలు, వర్క్ పర్మిట్లు పొందేందుకు భారతీయులు భారీ మొత్తంలో ఈ బ్రోకర్లకు సొమ్ము చెల్లించుకున్నట్లు తెలుస్తోంది.

 

17:37 - April 6, 2016

హైదరాబాద్ : ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. భేటీ ముగిసింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగిది. టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదుపై ఆమె వివరణ ఇచ్చారు. ఆ రోజు సభలో ఏం జరిగిందో రోజా... వివరించినట్టు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేల అనితకు రోజా క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. 
 

17:30 - April 6, 2016

హైదరాబాద్ : మగపిల్లలు పుట్టడం లేదని... వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని... అమ్మాయిలను హత మార్చుతున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వరుసగా మగ పిల్లలు పుడుతున్నారని.. ఆడ పిల్లలు పుట్టడం లేదని కన్న కొడుకును చంపేసింది ఓ తల్లి. ఆమెకు ఆడ పిల్లలంటే ఇష్టం. వరుసుగా మగపిల్లలు పుట్టారు. దీంతో అసహనం చెందిన ఓ మహిళ అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కన్న కొడుకునే కడ తేర్చింది. మొదటగా బుకాయించిన ఆమె.... చివరికి తానే కుమారున్ని హత్య చేసినట్లు ఒప్పుకుంది. నేరేడ్ మెట్ లో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లే నిందితురాలని తేలింది. తాను కొడుకును హత్య చేసినట్లు తల్లి అంగీకరించింది.
వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ నేరేడ్ మెట్ లో పూర్ణిమ్మ అనే వివాహిత నివాసముంటుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు పుట్టారు. అయితే ఆమెకు ఆడ పిల్ల పుట్టాలని ఉంది. ఆడ పిల్లలలు పుట్టడం లేదని అసహనం చెందిన పూర్ణిమ్మ ఆర్ కెపురం వద్ద తన మూడో కొడుకును తీవ్రంగా గాయపరిచింది. చనిపోతాడేమోనని చూసింది. కానీ చనిపోలేదు. అనంతరం తన భర్తకు ఫోన్ చేసింది. చైన్ స్నాచర్లు తనపై దాడి చేశారని.. పెనుగులాటలో బాబుకు తీవ్రగాయాలైనట్లు చెప్పింది. ఘటనాస్థలాన్ని చేరుకున్న భర్త పిల్లవాన్ని తార్నాకలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలై, రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. కానీ అసలు చైన్ స్నాచింగ్ ఆనవాళ్లు లేవని పోలీసులు భావించారు. తల్లిపైనే అనుమానం ఉందని వారు పేర్కొన్నారు. రాత్రి సమయమైనా ఆ ప్రాంతంలో రద్దీ ఉంటుందని, అంతేగాకుండా అక్కడ సంత కూడా జరుగుతోందని పోలీసులు తెలిపారు. చైన్ స్నాచింగ్ జరిగితే వెంటనే స్థానికులు స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆమె నివాసాన్ని కూడా తాము చెక్ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి విచారణలో వాస్తవాలు బయటపడుతాయని పేర్కొన్నారు. పూర్ణిమ్మపై పోలీసులు నిఘా పెట్టారు. చిన్నారిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం చేసే క్రమంలో పూర్ణిమ్మ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో పూర్ణిమ నేరం అంగీకరించింది. కుమారున్ని తానే హత మార్చినట్లు ఒప్పుకుంది. వరుసగా ముగ్గురు కొడుకులు పుట్టడంతో అసహనం చెందిన పూర్ణిమ... మూడో కొడుకును చంపేసింది. చైన్ స్నాచింగ్ దాడిలో కొడుకు చనిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు కుమారున్ని తానే హత మార్చినట్లు అంగీకరించింది.

 

రెండు టాటా ఏస్ వాహనాలు ఢీ, 6గురు మృతి....

వరంగల్ : సంగెం మండలం కాపులఘనపర్తిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు టాటా ఏస్ వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషయమంగా వున్నట్లు సమాచారం. గాయపడినవారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ డ్రైవర్లు, హెల్పర్లు ఆందోళన చేపట్టారు. చెత్త తరలింపుకు ప్రయివేటు వాహనాలను అనుమతించవద్దనీ..పాత వాహనాలకు బదులుగా కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనే డిమాండ్ చేశారు.

సింగపూర్ లో పర్యటించనున్న ఏపీ మంత్రులు...

హైదరాబాద్ : ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, నారాయణ మూడు రోజులపాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకూ వారి పర్యటన వున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడుల విషయంపై పలు కార్యక్రమాల్లో పాల్గొని మంత్రులు చర్చించనున్నారు.  

ఆర్‌ అండ్‌ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సస్పెండ్....

విశాఖపట్నం: రహదారులు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.చంద్రన్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. దీన్ని దృవీకరిస్తూ...ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. రహదారుల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చంద్రన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

16:19 - April 6, 2016

హైదరాబాద్ : నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. సంచలనం రేపిన పనామా జాబితాలో తెలుగువాళ్లు ఉండటం విస్మయ పరుస్తోంది. ఈ జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నట్లు ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ పేర్కొంది. నల్లధనాన్ని విదేశాల్లో దాచేస్తున్న వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్‌, ఓలన్‌ భాస్కర్‌రావు, భావనాశి జయకుమార్‌ల పేర్లు ఉన్నాయి. మోటూరి శ్రీనివాస్‌ ప్రసాద్ 2011లో నాలుగు సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. నందన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీలకు భావనాశి జయకుమార్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓలన్‌ భాస్కర్‌రావు సుమారు ఏడు సంస్థలకు ఎండీ ఉన్నట్లు సమాచారం. పనామా పేపర్స్ లీక్ బిజినెస్‌మెన్‌ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. 

 

టీడీపీ ఎమ్మెల్యే అనితకు క్షమాపణ చెప్పిన రోజా....

హైదరాబాద్ : గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటయిన ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రివిలేజ్ కమిటీకి వైసీపీ రోజా ఎట్టకేలకూ క్షమాపణ చెప్పారు. నా వ్యాఖ్యలు అనితను బాధించి వుంటే క్షమించాలని రోజా కోరారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యులైన బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...గతంలో కొన్ని కారణాల వల్ల రోజా కమిటీ ముందు హాజరుకాలేకపోయారని  తెలిపారు. మా ప్రశ్నలన్నింటికీ రోజా వివరణ ఇచ్చారనీ... మరొకసారి సమావేశం భేటీ అయిన అనంతరం తుది నివేదికను స్పీకర్ కు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. సభలో ఆరోజు జరిగిన విషయాన్ని కమిటీ రోజా వివరించారు.

నల్లధనం జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు...

హైదరాబాద్ : నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాల జాబితో తెలుగువారి పేర్లను ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. వీరిలో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు మోటూరి శ్రీనివాస్ పాటుగా నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కు సంబంధించిన ఆరు కంపెనీలకు డైరెక్టర్ గా వున్న భావనాసి జయకుమార్, దాదాపు ఏడు సంస్థలకు ఎండీగా వున్న వ్యాపారవేత్త ఓలన్ బాస్కర్ రావు పేర్లు వున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది.

15:48 - April 6, 2016

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్‌ కొఠారితో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి కోరారు. అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి సరికాదని చంద్రబాబు అన్నారు. సమన్యాయం లేని విభజనతో ప్రజల్లో కసి, ఆగ్రహం పెరిగాయని.. ఏపీ ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలియజేయాలని కోరారు. పొరుగు రాష్ట్రాల స్థాయికి ఏపీ ఎదిగే వరకు కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు.. కొఠారిని కోరారు.

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సురేశ్‌కుమార్‌....

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన హైదరాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

15:46 - April 6, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా.. కాసేపటి క్రితం ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదుపై ఆమె వివరణ ఇస్తున్నారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది.
స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

15:43 - April 6, 2016

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ప్రత్యేక వివాహ చట్టమని లాయర్ పార్వతి తెలిపారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ చర్చ కార్యక్రమంలో పార్వతి పాల్గొని, మాట్లాడారు. వివిధ మతాలకు చెందిన వారు వారి వారి పద్ధతులను అనుసరించి వివాహాలు చేసుకుంటారు. కానీ అన్ని మతాలకు చెందిన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చని తెలిపారు. 
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో అమల్లోకి వచ్చిందన్నారు. అన్ని మతాలు వారు కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్టు ప్రకారం వివాహం చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేరేడ్ మెట్ చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు...

హైదరాబాద్ : ఈరోజు నేరేడ్ మెట్ లో  చైన్ స్నాచింగ్ కేసును  అతి కొద్ది సమయంలో పోలీసులు  ఛేదించారు. ఈ ఘటనలో 23 రోజుల చిన్నారు మృతి చెందిన విషయం తెలిసిందే. పసికందు తల్లి పూర్ణిమను అనుమానించిన పోలీసులు ఆమెనే నిందితురాలుగా గుర్తించారు. వరుసగా ముగ్గరూ కుమారులే పుట్టటంతో అసహనం చెందిన ఆమె మూడో కుమారుడిని చంపివేసినట్లు పోలీసులు కనిపెట్టారు. చైన్ స్నాచర్ల దాడిలో కొడుకు చనిపోయాడని పోలీసులను నమ్మించిన పూర్ణిమను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

15:34 - April 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని సుధీర్ కమిషన్ తేల్చి చెప్పింది. విద్య, వైద్య రంగాల్లో వారు అత్యంత వెనకబడి ఉన్నారని స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటించి ముస్లింల స్థితిగతులపై నివేదిక తెలంగాణ సర్కార్ కు సమర్పించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పనిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తొంది.                                                                                                                         
సుధీర్ కుమార్ కమిటీ పనుల వేగవంతం 
ముస్లింల సామాజిక ఆర్ధిక పరిస్థితులకు అనుణంగా అధ్యయనానికి తెలంగాణ సర్కార్ నియమించిన సుధీర్ కుమార్ కమిటీ తన పనులను వేగవంతం చేసింది. ముస్లింలకు విద్యా ,ఉద్యోగ రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించే ఉద్దేశ్యంతో ఈ కమిటీని నియమించింది ప్రభుత్వం. అయితే పలు కారణాల  వల్ల  ఇంతకాలం పనులు ప్రారంభించలేదు. కమిషన్ నియమించి 20 నెలలు దాటినా తన తనులను ప్రారంభించలేదు కమిషన్ . 
పరిశోధనా పత్రాలు సేకరించిన కమిషన్ 
క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందే ముస్లింల స్థితిగతులపై పరిశోధనలు చేసిన మేధావుల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. అందులో భాగంగా పరిశోధనా పత్రాలు సేకరించింది. విద్యా, వైద్య సామాజిక భద్రత ఆర్థికరంగాల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉందన్న ఆంశాలపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ,ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సస్ , హైదరాబాద్ అర్బన్ లాబ్స్ ఆస్కి వంటి  ప్రముఖ సంస్థలతో  సంప్రదింపులు జరుపుతోంది. 
విద్య, వైద్య రంగాల్లో పరిస్థితి ఆందోళనకరం 
విద్య, వైద్య రంగాల్లో  ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సుధీర్ కమిషన్ తేల్చి చెప్పింది. పాఠశాలల్లో బాలికల పరిస్థితి ఇతర వర్గాలతో పోలిస్తే డ్రాప్ అవుట్ రేట్ ఇతర వర్గాలతో పోలిస్తే చాలా ఎక్కువగా  ఉందని తెలిపింది. వారి అభివృద్దికి సంక్షేమ హాస్టళ్లు లేకపోవడం డ్రాప్ అవుట్ కు కారణంగా తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఒక్కటి కూడా హాస్టల్ లేదని నివేదించింది. హోటళ్లు, మెకానిక్ షెడ్లు , కార్ఖానాల్లో ముస్లిం బాలలే అధికంగా ఉన్నట్లు కమిషన్ కు తెలిపాయి పలు సంస్థలు. వారికి బ్యాంకులు సైతం జీవనోపాధికి లోన్లు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయిని కమిషన్ కు నివేదికలు అందాయి. 
లక్షల సంఖ్యలో యువత గల్ఫ్ బాట 
లక్షల సంఖ్యలో యువత గల్ఫ్ బాట పడుతున్నారని.. మైనారిటీలకు ప్రభుత్వ పరంగా ఉపాధి పథకాలు లేవని.. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో  అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారని పలువురు మేధావులు కమిషన్ కు అభిప్రాయాలను తెలిపారు.  నేడో రేపో కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లనుంది. సుధీర్ కమిషన్ నివేదిక ఆధారంగానే ముస్లింల రిజర్వేషన్లపై ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

భారత్ లో మూడు నగరాలకు ఉగ్ర ముప్పు : నిఘా వర్గాలు

ఢిల్లీ : భారత్ లోని మూడు నగరాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి వున్నదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ, గోవా, ముంబై నగరాలలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ నుండి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు కశ్మీర్ నుండి కారులో ప్రయాణిస్తున్నారని సమాచారం. వారు ప్రయాణిస్తున్న కారు  జేకే-01 ఏబీ-2654 లైసెన్స్‌డ్‌ నెంబరు ప్లేటు కలిగి వుందని నిఘా వర్గాల సమాచారం. వీరి వద్ద పేలుడు పదార్ధాలు, సూసైడ్ బెల్ట్ ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో చంఢీఘడ్ పోలీసులు పంజాబ్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు.

15:25 - April 6, 2016

హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సంరద్భంగ ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్షకు  24 గంటల గడువులో ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడం దారుణమని విమర్శించారు. ఈ ఘటనను భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు తెలియజేసేందుకు కార్యాచరణ రూపొందించామని అన్నారు. 

 

15:20 - April 6, 2016

హైదరాబాద్ : టీడీపీ గూటికి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరేందుకు రెడీ అయ్యారు. ఈనెల 8న చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ తెలిపారు. వైసీపీలో ఇమడలేకే పార్టీ మారుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీలో తనను చిన్నచూపు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గ అభివృద్ధికి మంత్రి నారాయణ  సహకరిస్తానన్నారని.. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని ఎమ్మెల్యే సునీల్ ప్రకటించారు     

ప్రివిలేజ్ కమిటీకి హాజరైన రోజా...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది. కమిటీ ఇచ్చిన నోటీసుల మేరకు వైసీపీ ఎమ్మెల్యే రోజా కమిటీ సమావేశానికి హాజరయ్యారు. తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెలే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ ఎదుట హాజరైన రోజా ఎటువంటి వివరణను ఇస్తారనే విషయంగా ఉత్కంఠత నెలకొంది.

15:15 - April 6, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి  వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. చలో హెచ్‌సీయూను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు యూనివర్శిటీ నుంచి ర్యాలీగా సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

జలమండలి ఎండీ గా దాన కిషోర్ ....

హైదరాబాద్ : జలమండలి ఎండీగా దాన కిషోర్ ను టీ.ఎస్ ప్రభుత్వం నియమించింది. సీఎండీఏ నుండి కిషోర్ ను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ గా కిషోర్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది.

15:08 - April 6, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రొఫెసర్‌ కృష్ణా అన్నారు. అకడమిక్‌ కౌన్సిల్‌ సమవేశాన్ని నడుపుతున్న తీరును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. యూనివర్శిటీలో కౌన్సిల్‌ మీటింగ్‌ జరుగుతున్న విధానాన్ని  నిరసిస్తూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పదవికి ప్రొఫెసర్‌ కృష్ణ రాజీనామా చేశారు. ఈమేరకు టెన్ టివితో ప్రొ.కృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసులను మోహరించి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడం సరికాదన్నారు. పోలీసులను మోహరించి అకడమిక్‌ కౌన్సిల్‌ను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులతో హెచ్‌సీయూలో ర్యాంకులు రాలేదన్నారు. యూనివర్శిటీలో బలగాలను వెనక్కి పంపించాలని కోరారు. వీసీకి ఈ విషయం చెబుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. వర్సిటీలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. 

 

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్...

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమన్యాయం జరుగకుండా విభజన జరిగిన నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహావేశాలున్నాయని తెలిపారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయమని చంద్రబాబు కోరారు. పొరుగు రాష్ట్రాల స్థాయికి ఎదిగే వరకూ కేంద్రం సహాయసహకారాలను అందించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సంజయ్ కొఠారికి విజ్ఞప్తి చేశారు.

కొనసాగుతోన్న సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52 శాతం పోలింగ్ నమోదు అయింది. 

పనామా జాబితాలో ముగ్గురు తెలుగు వారు

హైదరాబాద్ : పనామా జాబితాలో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు మోటూరి శ్రీనివాస్, భావనాసి జయకుమార్, ఓలన్ భాస్కర్ రావు పేర్లు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడించింది. 

టీఎస్ పీఎస్సీ ద్వారా గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీ

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా గురుకుల విద్యాలయాల్లో 2,444 పోస్టుల భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోషల్ వెల్ఫేర్ 758, బీసీ వెల్ఫేర్ 307, ట్రైబల్ వెల్ఫేర్ 436 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 

సుష్మాస్వరాజ్ కు సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోటాను పెంచాలని లేఖలో కోరారు. హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 4500 కు పెంచాలన్నారు. 

13:41 - April 6, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు ఎదురుచుస్తున్నారు. రాష్ట్రానికో హైకోర్టు అనే ఆర్టికల్ 214ని అమలు చేయాలనే డిమాండ్ తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి సుమారు 22 నెలలు అవుతోంది. కానీ హైకోర్టు విభజన మాత్రం పూర్తికాలేదు. అయితే అందరి ఎదురుచూపులకు ఉత్కంఠకు కొద్ది రోజుల్లో తెరపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆస్తులు అప్పులు ఇలా అనేక అంశాల్లో విభజన వ్యవహారం పూర్తైపోయింది. కానీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన వ్యవహారం మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఇంకెంత కాలం ఆలస్యం చేస్తారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి కొశ్చన్స్‌కు మరికొద్ది రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

విభజన పర్యవేక్షణ కమిటీ..
హైకోర్టులో పనిచేస్తున్న సిబ్బంది, న్యాయాధికారుల విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో పనిచేయాలనుకునే జడ్జీలను ఇప్పటికే ఆప్షన్లు కోరారు. ఉమ్మడి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆప్షన్ల ప్రక్రియ గత నెల10న ముగిసింది. ఆప్షన్ ప్రక్రియను సీల్డ్ కవర్‌లో ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్ సీ హెచ్. మానవేంద్రనాథ్‌రాయ్ న్యాయాధికారులకు, జిల్లా జడ్జీలకు స్పష్టం చేశారు. వీటన్నింటినీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన విభజన పర్యవేక్షణ కమిటీ ముందుంచుతారు.

తాత్కాలిక కేటాయింపుల జాబితా..
విభజన పర్యవేక్షణ కమిటీ పరిశీలనానంతరం తాత్కాలిక కేటాయింపుల జాబితా విడుదలవుతుంది. ఈ నెల రెండో వారంలో కేటాయింపుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని కూడా ఆయా న్యాయాధికారులు జిల్లా జడ్జీలకు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తరువాత తుది జాబితా విడుదలవుతుంది. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 1,034 కోర్టులుండగా.. తెలంగాణలో 439, ఏపీలో 595 దాకా ఉన్నాయి. అన్ని కేడర్లలో న్యాయమూర్తులు 916 మంది ఉండగా తెలంగాణ వారు 242 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 674 మంది ఉన్నారు. ఇక ఉమ్మడి హైకోర్టులో 1467మంది పనిచేస్తుండగా వారిలో తెలంగాణ వారు 389, ఆంధ్రావారు 1079 మంది దాకా ఉద్యోగులు, న్యాయాధికారులున్నారు.

వేసవి సెలవుల్లో పూర్తి ? 
ఉద్యోగుల విభజన పక్రియ వేసవి సెలవుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. అయితే కేసులకు సంబంధించిన డాక్యుమెంట్ల విభజనకు వారం రోజులు పట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు ఉమ్మడి హైకోర్టును విభజించాలని ఆదేశాలు జారీ చేస్తే.. నాలుగు వారాల్లో పూర్తి చేసేందుకు ప్రాథమికంగా పని పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టుకు 49 బెంచ్‌లు కేటాయించగా 25 బెంచ్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. ఏపి విభజన చట్ట ప్రకారం 19 మందిని తెలంగాణకు 30 మందిని ఏపీకి కేటాయించే అవకాశాలున్నాయి. అయితే విభజనలో భాగంగా ఏ.పి. హైకోర్టును ప్రస్తుతమున్న హైకోర్టులోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

హెచ్ సీయూలో కౌన్సిల్ సమావేశం రసాభాసా...

హైదరాబాద్ : హెచ్ సీయూలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ తీరుకు నిరసిస్తూ కొందరు పాలకపక్ష సభ్యులు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. వీసీ నియంతా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. 

బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో ఇద్దరు మహిళలు అదృశ్యం...

హైదరాబాద్‌: హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. బీహెచ్‌ఈఎల్‌ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తల్లి జిందమ్మ(55), అమ్మమ్మ హనుమంతి(70) అనే ఇద్దరు మహిళలు మంగళవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళినవారు మళ్ళీ తిరిగిరాలేదు.దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

13:27 - April 6, 2016

హైదరాబాద్ : నగరంలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతూ.. జలమండలి ఎదుట ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన దీక్ష చేపట్టింది. మంచినీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని..ప్రజలకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని అందించకుండా బీవరేజస్ కంపెనీలకు, కూల్ డ్రింక్ కంపెనీలకు నీటిని తరలిస్తున్నారని మండిపడ్డారు నేతలు. ప్రజలకు రోజు విడిచి రోజు నీళ్లు బహుళ జాతి కంపెనీలకు రోజు నీళ్లివ్వడాన్ని అడ్డుకోవాలని నగర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఒక క్రౌన్ ఇంటర్నేషనల్ బీర్ కంపెనీకి ప్రతి నెలా రెండు కోట్ల లీటర్ల నీరు..సౌత్ ఏషియా బ్రేవరీస్ 2 కోట్ల 30 లక్షల లీటర్లు..యునెటైడ్ బ్రేవరీస్ 3 కోట్ల 80 లక్షల లీటర్లు..పెప్సీ కోలాకు 3 కోట్ల 72 లక్షల లీటర్లు...కోకాకోలకు 4కోట్ల 80 లక్షల లీటర్లు..ఇలా ప్రతినెలా కంపెనీలకు నీరు సరఫరా చేస్తున్నారని గణాంకాలతో సహా వివరించారు. 

13:19 - April 6, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమను లోనికి అనుమతించాలంటూ విద్యార్థులు ప్రధాన ద్వారాన్ని ఎక్కారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను లాక్కెళ్లి వ్యాన్ లలో పడేశారు. పోలీసుల వైఖరిని విద్యార్థులు తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు.

భారీగా తరలివచ్చిన విద్యార్థులు..
విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. భారీగా విద్యార్థులు వర్సిటీకి తరలివచ్చారు. ఎస్ఎప్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, పలు ప్రజా సంఘాలు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. ఉదయం నుండే భారీగా పోలీసులు మోహరించారు. 'హెచ్చరిక' బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వీసీ అకడమిక్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడాన్ని విద్యార్థులు తప్పుబట్టారు. తక్షణమే వీసీని తప్పించి వర్సిటీలో ప్రశాంత వాతావరణం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని, వీసీ అప్పారావును తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

ప్రొఫెసర్ రాజీనామా..
మరోవైపు వీసీ వైఖరిని పలువురు ప్రొఫెసర్లు కూడా తప్పుబడుతున్నట్లు సమాచారం. హెచ్ సీయూలో అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని నిరసిస్తూ..కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి ప్రొ.కృష్ణ రాజీనామా చేశారు. అకాడమిక్ కౌన్సిల్ నిర్వహించవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అకాడమిక్ కౌన్సిల్ నిర్వహించడానికి వీసీ అప్పారావు సరైన వ్యక్తి కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని ఇంట్లో వీసీ నిర్వహించడం సబబు కాదని పలువురు ప్రొఫెసర్లు పేర్కొంటున్నట్లు సమాచారం.

సీఎం కార్యాలయం ముట్టడి..
బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్‌సీయూ వీసీ అప్పారావును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ భవన్ వద్ద సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు నిరసన ...

హైదరాబాద్ : తెలంగాణ భవన్ వద్ద కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు నిరసన చేపట్టారు. మూతపడిన మిల్లును తిరిగి ప్రారంభించాలని డిమాండ్  చేశారు. 

మంటల్లో దగ్థమైన 'ఇంద్ర' బస్సు....

విజయవాడ: విజయవాడ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ సమీపంలో ప్రధాన రహదారిపై ఆర్టీసీ ఇంద్ర బస్సు దగ్ధమైంది. బస్సు ముందు భాగంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులను క్షేమంగా దించడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 

చైన్ స్నాచింగ్ వాస్తవం కాదు : సీఐ అశోక్

హైదరాబాద్: నేరేడ్ మెట్ లో చైన్ స్నాచింగ్ కేసు కొత్తమలుపు తిరింగింది.  చైన్ స్నాచర్ల దాడిలో తన 23 రోజుల  కుమారుడు చనిపోయాడని తల్లి పూర్ణిమ తెలిపింది. ఆమె చెబుతున్న వివరాలపై పోలీసులు సంశయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసలు చైన్ స్నాచింగే జరగలేదననీ ...పసికందు మృతికి తల్లే కారణమై వుంటుందనీ...ఆమెని విచారిస్తే నిజానిజాలు తెలుస్తాయని  సీఐ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే   పూర్ణిమ అదృశ్యమయ్యింది. దీంతో అనుమానాన్ని దృవీకరించుకున్న పోలీసులు కేసును చేదించే క్రమంలో దర్యాప్తుని ముమ్మరం చేశారు.

12:45 - April 6, 2016

ముంబై : 2002 ముంబై పేలుళ్ల నిందితులకు ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మాస్టర్ మైండ్ అన్సారీకి జీవిత ఖైదు విధించింది. మిగిలిన 9 మంది నిందితులకు పది ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.
పోటాలోని వివిధ సెక్షన్ల కింద పది మందిని దోషులుగా నిర్థారించారు. డిసెంబర్ 2002, మార్చి 2003 మధ్య కాలంలో ముంబైలో జరిగిన పేలుళ్ల కేసును విచారించిన పోటా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఆర్ దేశ్ ముఖ్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. నిర్దోషులుగా తేలిన వారిలో నదీం పోల్బా, హరుణ్ లోహార్, అద్నాన్ ముల్లాలు ఉన్నారు. డిసెంబర్ 2002, మార్చి 2003 మధ్య కాలంలో ముంబైలోని వివిధ ప్రాంతాలలో సంభవించిన పేలుళ్లలో 12 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముంబై సెంట్రల్ లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో డిసెంబర్ 6, 2002న మొదటి పేలుడు, వైలీ పార్లే ఈస్ట్ లో 27 జనవరి 2002న రెండో పేలుడు సంభవించింది. కాగా మూడో పేలుడు ములంద్ రైల్వే స్టేషన్ లో మార్చి 13న జరిగింది. 

ముంబై పేలుళ్ళ ఘటనలో నిందితులకు శిక్ష ఖరారు...

హైదరాబాద్ : 2002 ముంబై పేలుళ్ళ నిందితులకు  ప్రత్యేక పోటా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మాస్టర్ మైండ్ అన్సారీకి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగిలిన 9 మంది నిందితులకు 10 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

12:31 - April 6, 2016

హైదరాబాద్ : 'అప్పారావు ముర్దాబాద్..వీ వాంట్ జస్టిస్' అనే నినాదాలతో హెచ్ సీయూ మారుమోగిపోయింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. భారీగా విద్యార్థులు వర్సిటీకి తరలివచ్చారు. ఎస్ఎప్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, పలు ప్రజా సంఘాలు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. ముందస్తు చర్యలో భాగంగా గేటుకు తాళాలు వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎలాగైనా లోనికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. గేటు ఎక్కిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకోవడంతో ఇరువర్గాల తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. లోనికి పర్మిష్ లేదని, గేటు దూకేందుకు ప్రయత్నించారని దీనితో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసు అధికారి పేర్కొన్నారు. 

సీఎం కార్యాలయం వద్ద విద్యార్ధుల ఆందోళన...

హైదరాబాద్‌: బేగంపేటలోని టీ.ఎస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్ సీయూ క్యాంపస్ లో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో వీసీ అప్పారావును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంపు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

12:20 - April 6, 2016

హైదరాబాద్ : నేరేడ్ మెట్ లో చోటు చేసుకున్న ఛైన్ స్నాచింగ్ ఘటనలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఛైన్ స్నాచర్లు దాడి చేయడంతో 25 రోజుల బిడ్డ చనిపోయిందంటూ తల్లి పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ అసలు ఛైన్ స్నాచింగ్ ఆనవాళ్లు లేవని పోలీసులు భావిస్తున్నారు. తల్లిపైనే అనుమానం ఉందని వారు పేర్కొంటున్నారు. రాత్రి సమయమైనా ఆ ప్రాంతంలో రద్దీ ఉంటుందని, అంతేగాకుండా అక్కడ సంత కూడా జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఛైన్ స్నాచింగ్ జరిగితే వెంటనే స్థానికులు స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆమె నివాసాన్ని కూడా తాము చెక్ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి విచారణలో వాస్తవాలు బయటపడుతాయని పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన తరువాత గంట వరకు కుటుంబసభ్యులకు సమాచారం ఎందుకు తెలియ చేయలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తల్లి ఏమంటోంది ?
రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళుతున్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు స్ర్పే తో దాడి చేశారని తల్లి పూర్ణిమ పేర్కొంటోంది. తాను సృహ కోల్పోయానని లేచే వరకు తన ఒడిలో ఉన్న బిడ్డకు గాయమైందని, మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారని పేర్కొంటోంది. స్ప్రే చేయడంతో తాను వారిని గుర్తు పట్టలేదని తెలుపుతోంది. మృతి చెందిన పసికందుకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలు..ఇతరత్రా జరిగిన అనంతరం తల్లి పూర్ణిమను పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విచారణలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. 

చలో హెచ్ సీయూ కు విద్యార్ధి సంఘాల పిలుపు...

హైదరాబాద్ : హెచ్ సీయూలో ప్రధాన ద్వారం వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వీసీ అప్పారావుని తొలగించి,రోహిత్ యాక్ట్ తేవాలనే డిమాండ్ తో చలో హెచ్ సీయూకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాంపస్ గేటు వద్దకు చేరుకున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హెచ్ సీయూ ప్రొ.కృష్ణ రాజీనామా..

హైదరాబాద్ : హెచ్ సీయూలో అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని నిరసిస్తూ..కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి ప్రొ.కృష్ణ రాజీనామా చేశారు. విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.

11:29 - April 6, 2016

మెదక్ : సిద్ధిపేటలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే 17వ వార్డులో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వార్డులో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలింగ్ సమయంలో ఇరువర్గాలు భారీగా మోహరించడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఎలాంటి ఘర్షణ నెలకొన లేదని, పోటీ తీవ్రంగా ఉండడంతో వాతావరణం వేడిగా ఉంటుందని డీఎస్పీ టెన్ టివితో తెలిపారు.

 • 2010లోనే బల్దియా పాలక వర్గం పదవీకాలం ముగిసింది.
 • 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినా ఇక్కడ విలీన గ్రామాల కేసు హైకోర్టులో ఉండడంతో స్టే ఉన్న విషయం తెలిసిందే.
 • మొత్తం 34 వార్డులుండగా ఆరు ఏకగ్రీవమయ్యాయి.
 • దీనితో మిగిలిన 28కే పోలింగ్ నిర్వహిస్తున్నారు.
 • నామపత్రాల ఉపసంహరణ తరువాత స్వతంత్రులతో కలిపి 146 మంది బరిలో ఉన్నారు.
 • మొత్తం 34వార్డులు ... 6 వార్డులు ఏకగ్రీవం...
 • 28వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు.
 • మొత్తం 74,710 మంది ఓటర్లు.
 • 72 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటా వెబ్ కాస్టింగ్.
 • పోలింగ్ నిర్వహణలో 415 మంది సిబ్బంది.
 • ఇందూర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్.
 • భారీగా పోలీసు బందోబస్తు.
 • ప్రధాన మార్గాల్లో చెక్‌పాయింట్లు.

ఎంవీఐ అధికారి నివాసంపై ఏసీబీ దాడి...

విజయనగరం : ఎంవీఐ అధికారి పి.చిన్నోడు ఇంట్లో ఏసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఆరోపణలతో విశాఖ, శ్రీకాకుళంలోని చిన్నోడు ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

11:22 - April 6, 2016

హైదరాబాద్ : వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. భారీగా విద్యార్థులు వర్సిటీకి తరలివచ్చారు. ఎస్ఎప్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, పలు ప్రజా సంఘాలు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. వర్సిటీ లోపల సుమారు వేయి మంది పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు సమాచారం. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తామన్నా తమకు ఎందుకు అనుమతినివ్వడం లేదని, వీసీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘ నేతలు టెన్ టివితో మాట్లాడారు. సీటును పదిలం చేసుకొనేందుకే పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, వీసీ అప్పారావును తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అతడిని రీకాల్ చేసేంత వరకు పోరాటం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అప్పారావు ఆధ్వర్యంలో పాలక మండలి జరుగుతుండడం సబబు కాదని, ఆయన ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు భారీగా మోహరించారని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా విద్యార్థులు ప్రయత్నిస్తున్నారని వీసీ ఆరోపించడం దారుణమని, ఆయనే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు వీసీ అప్పారావు ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఉద్యమాల్లో విద్యార్థులపై చర్యలు..రోహిత్ వేముల స్థూపం తొలగింపు..తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

11:13 - April 6, 2016

హైదరాబాద్ : పసికందుకు మృతికి కారణమైన ఛైన్ స్నాచర్లను పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నేరేడ్ మెట్ లోని ఆర్కే నగర్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్ణిమ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. వెనుక నుండి వచ్చిన దుండుగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పూర్ణిమ ప్రయత్నించింది. ఈ తరుణంలో ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు మెడకు ఛైన్ చుట్టుకోవడం..కిందపడిపోవడం జరిగిపోయాయి. గాయాలపాలైన పసికందును గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ పసికందు మృతి చెందింది. దీనితో పూర్ణిమ కన్నీళ్లపర్యంతమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. స్నాచర్లను పట్టుకోవడానికి రెండు బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. 

మందుపాతర పేలి ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..

విశాఖ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం మంచంగిపుట్టు మండలం దూలిపుట్టు వద్ద మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్ఫీఎఫ్ జవాన్లకు, ఇద్దరు పౌరులకు గాయాలయ్యయి. కాగా మావోయిస్టులకు జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటాం: హెచ్ సీయూ జేఏసీ

హైదరాబాద్ : హెచ్ సీయూలో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. క్యాంపస్ లో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీసీ కార్యాలయానికి విద్యార్ధులు భారీగా చేరుకున్నారు. వీసీ తన పదవిని కాపాడుకొనేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని విద్యార్ధి జేఏసీ పేర్కొంది. రోహిత్ స్థూపం తొలగింపు, సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపుపై కౌన్సిల్ లో తీర్మానం చేసేందుకు కుట్ర జరుగుతోందనీ...అందుకే ఈ సమావేశాన్ని అడ్డుకుంటామని జేఏసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పోలీసు బలగాలు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే.

హెచ్ సీయూలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యింది. వీసీ అప్పారావును ప్రారంభించిన ఈ సమావేశంలో పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా వీసీని తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

10:38 - April 6, 2016

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఛైన్ స్నాచర్లు పంజా విసురుతున్నారు. తాజాగా ఛైన్ స్నాచర్ల ఆగడాలకు ఓ పసికందు బలైంది. ఈ ఘటన నేరెడ్ మెట్ లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఓ మహిళ ఆర్కేపురం వద్ద నడుచుకుంటూ వెళుతోంది. వెనుక నుండి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలో ఉన్న గొలుసును తెంపే ప్రయత్నం చేశారు. మహిళ పెనుగులాడింది. ఈ సమయంలో మహిళ ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు పడిపోయింది. అనంతరం దుండగులు మూడు తలాల గొలుసు లాక్కెళ్లారు. తీవ్రగాయాలపాలైన పసికందును గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాపీ అప్పటికే ఆ పసికందు అనంతలోకాలకి వెళ్లిపోయింది. కళ్లెదుటే పసికందు మృతి చెందడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు రెండు బృందాలు గాలింపులు చేపడుతున్నాయి.
ఛైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారు మాత్రం విజృంభిస్తునే ఉన్నారు. ఛైన్ స్నాచర్ల ఆగడాలకు పలువురు మృతి చెందడమే కాకుండా గాయాలపాలవుతున్నారు. దీనితో నగర పోలీసులు యాంటీ స్నాచింగ్ టీం ఏర్పాటు చేసింది. ఛైన్ స్నాచర్లను పట్టుకొనే ప్రయత్నంలో కాల్పులు చేసే అనుమతి ఈ టీంకు ఉంది. వనస్థలిపురంలో ఇలాగే ఓ ఘటనలో పోలీసులు కాల్పులు జరిపినా స్నాచర్లు పరారయ్యారు. 

టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద మృతి....

విశాఖపట్టణం : టీటీడీ దేవస్థానానికి చెందిన మనోహర్ అనే ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విశాఖ టీటీడీ ఎలక్ట్రసిటీలో విభాగంలో మనోహర్ పనిచేస్తున్నాడు. మనోహర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మహిళపై దాడి చేసిన చైన్ స్నాచర్లు..పసికందు మృతి....

హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు మళ్ళీ రెచ్చిపోయారు. నేరేడ్ మెట్ ఆర్కే పురంలో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును చైన్ స్నాచర్లు లాగుతుండగా మహిళ ప్రతిఘటించింది. విడిచిపెట్టని దొంగలు ఆమెపై దాడిచేసి మెడలో నుండి 3 తులాల గొలుసును లాక్కెళ్లారు .ఈ క్రమంలో ఆమె చేతిలో వున్న 25 రోజుల పసికందుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పసికందు మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం చైన్ స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.

10:29 - April 6, 2016

 

హైదరాబాద్ : చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా వారికి ఇంకా డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు. లంచం ఇవ్వాలంటూ ప్రజలను పీడిస్తున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది. జీహెచ్ ఎంసీ సర్కిల్ 18 సెక్షన్ ఆఫీసర్ జనార్ధన్ మహేష్ ఇంటిపై బుధవారం ఉదయం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. సఫీల్ గూడా, ఆర్కేపురం, లాలాగూడలోని నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు లభ్యమైనట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం రూ. 6-10 కోట్ల ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. కానీ బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 20-30 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు రూ.3 లక్షల నగదు..రెండు కార్లు..నాలుగు భవంతులున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులిచ్చే సమయంలో అధికారి మహేష్ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు ముగిసిన అనంతరం ఎంత అవినీతికి పాల్పడిందనేది తెలుస్తుంది. 

బీజేపీ ఆవిర్భావ వేడుకలు....

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. పార్టీ జెండాను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

10:09 - April 6, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ వర్సిటీ వీసీ అప్పారావును తొలగించాల్సిందేనని విద్యార్తులు స్పష్టం చేస్తున్నారు. విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవిన ఉండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించతలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారని, క్రిమినల్ అయిన వీసీకి ఎలా వత్తాసు పలుకుతారని ప్రశ్నించారు. చలో హెచ్ సీయూకి అనుమతులు అడిగితే నానా హింసలు పెడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనే ధోరణిలో పోలీసులున్నారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాతో నడుస్తున్న దానికి వ్యతిరేకంగా, రోహిత్ వేములకు మద్దతుగా ఈ పోరాటం జరుగుతుందన్నారు. విద్యార్థుల సమస్యలు, వర్సిటీ పరిస్థితులపై సమావేశం కావాల్సిన కౌన్సిల్ విద్యార్థుల ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలి ? అనే దానిపై సమావేశమౌతోందని విమర్శించారు. 

కాసేపట్లో ప్రివిలేజ్ కమిటీకి హాజరుకానున్న రోజా...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ లోని కమిటీ హాల్లో మ.2 గంటలకు ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ప్రివిలేజ్ కమిటీకి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల నుండి రోజా ఏడాది పాటు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్న విషయం కేడా తెలిసిందే.  ఈ క్రమంలో రోజా ప్రివిలేజ్ కమిటీకి హాజరుకాటానికి హాజరుకానున్నారు. ఈ కమిటీలో రోజా క్షమాపణ చెబుతారో లేదో అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.

09:36 - April 6, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విశ్వ విద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే పదవిన ఉండి బర్తరఫ్ చేయాలని, బుధవారం నిర్వహించతలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ చలో హెచ్ సీయూ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ, ఒయు ఐక్యకార్యాచరణ కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద దాదాపు వేయి మంది పోలీసులు మోహరించారు. ప్రధాన మార్గంలో వర్సిటీ సెక్యూర్టీ సిబ్బంది అణవణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐడీ కార్డు ఉంటేనే లోనికి అనుమతినిస్తున్నారు.
కొద్దిసేపట్లో జరగనున్న అకడమిక్ కౌన్సిల్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని తీసివేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వీసీ అప్పారావును తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాసేపట్లో అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వీసీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 

09:27 - April 6, 2016

నల్గొండ : రోడ్డు ప్రమాదంతో మునగాల మండలం మరోసారి వార్తల్లోకెక్కింది. టిడిపి నేత హరికృష్ణ కుమారుడు జానకి రామ్ మృతి చెందిన రహదారిపై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున గడ్డి లోడ్ తో ట్రాక్టర్ వెళుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీనితో ట్రాక్టర్ నడి రోడ్డుపై బోల్తాపడింది. వెనుకాలే వచ్చిన మరో బస్సు ముందున్న బస్సును ఢీకొంది. తీవ్రగాయాలపాలైన ట్రాక్టర్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ స్తంభించింది. గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మాణం చేయాలని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:17 - April 6, 2016

మెదక్ : సిద్ధిపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పదో పోలింగ్ బూత్ లో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఎండాకాలం కావడంతో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పదో వార్డు నుండి పోటీ చేయడం జరుగుతోందని అభ్యర్థి మచ్చ వేణుగోపాల్ టెన్ టివితో తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు..హరీష్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

2010లోనే..
2010లోనే బల్దియా పాలక వర్గం పదవీకాలం ముగిసింది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినా ఇక్కడ విలీన గ్రామాల కేసు హైకోర్టులో ఉండడంతో స్టే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఎన్నికలపై రాజకీయ పక్షాల్లో కుతూహలం నెలకొంది. మొత్తం 34 వార్డులుండగా ఆరు ఏకగ్రీవమయ్యాయి. దీనితో మిగిలిన 28కే పోలింగ్ నిర్వహిస్తున్నారు. నామపత్రాల ఉపసంహరణ తరువాత స్వతంత్రులతో కలిపి 146 మంది బరిలో నిలిచినా వారిలో 12 మంది పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

 • మొత్తం 34వార్డులు.. 6 వార్డులు ఏకగ్రీవం.
 • 28 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు.
 • మొత్తం 74,710 మంది ఓటర్లు.
 • 72 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటా వెబ్ కాస్టింగ్
 • ఉ. 7గంటల నుంచి సా. 5గంటల వరకు.
 • పోలింగ్ నిర్వహణలో 415 మంది సిబ్బంది.
 • ఇందూర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్.
 • భారీగా పోలీసు బందోబస్తు.
 • ప్రధాన మార్గాల్లో చెక్‌పాయింట్లు.

మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం..

నల్గొండ : జిల్లాలో మునగాల మండలంలో రెండు బస్సులు..ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

08:09 - April 6, 2016

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 34 వార్డులకు 6వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా, 28 వార్డులకు పోలింగ్ జరుగనుంది. 72పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 28 వార్డుల్లో మొత్తం 74,710 మంది ఓటర్లు ఇందులో పురుషులు 37,401, స్త్రీలు 37,303, ఇతరులు ఆరుగురు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనా సాయంత్రం వరకు పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 415 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. 18 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ గట్టి బందోబస్తు నిర్వహించారు. 

07:59 - April 6, 2016

తెలుగు తేజం స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ మోకాలు గాయం తిరగబెట్టడంతో ఒలంపిక్స్ ఆశలు సందిగ్ధంలో పడ్డాయి. ఒలంపిక్స్ కు ప్రాతినిథ్యం వహించాలన్న కశ్యప్‌ కలలు కలలయ్యే అవకాశం కనపడుతున్నది. గాయం కారణంగా ఆటకు దూరం కానున్నాడు. ఒలంపిక్స్ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లయిన మలేషియా, సింగపూర్‌ సూపర్‌ సిరీస్‌లకు పాల్గొనలేకపోతున్నాడు. దీంతో కశ్యప్‌ ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కశ్యప్‌ 17వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఒలంపిక్‌లో పాల్గొనాలంటే టాప్‌ 16లోపు ర్యాంక్‌ సాధించాలి. కశ్యప్‌ మాట్లాడుతూ.. గాయం నుంచి రెండు , మూడు వారాల్లో కోలుకుంటానని డాక్టర్‌ చెప్పాడు. కాని నావరకైతే రెండు వారాల్లో నే కోలుకుంటాననుకుంటున్నా. అందరూ నన్ను ఒలంపిక్స్ లో ఆడాలని కోరుకుంటున్నాను. ఆడటానికి ఇప్పటికీ నేను మానసికంగా సిద్ధంగానే ఉన్నాను. అని కశ్యప్‌ చెప్పాడు. గాయం కారణంగా 2015 లక్నోలో జరిగిన సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ఫ్రిక్స్ గోల్డ్ టోర్నీలో కూడా పాల్గొనలేకపోయాడు.

07:57 - April 6, 2016

సూర్య, సమంత, నిత్యా మీనన్‌ హీరో హీరోయిన్లుగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సమర్పణలో గ్లోబల్‌ సినిమాస్‌, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '24'. కథానాయకుడు సూర్య నిర్మాత. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను త్వరలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇదొక సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, 'కాలం నా ప్రేయసి..' అనే పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ స్వరపరిచిన ఈ చిత్రంలోని తెలుగు పాటలను ఈ నెల 11న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రెహ్మాన్‌ బాణీలు సినిమాకు ప్రాణం పోశాయి. అంతేకాదు రీ-రికార్డింగ్‌తో ప్రతీ సన్నివేశం అబ్బురపరుస్తుంది. చంద్రబోస్‌, శశాంక్‌ వెన్నెలకంటి మంచి సాహిత్యమందించారు. టైమ్‌ ఆధారంగా నడిచే ఈ చిత్ర కథలో హీరో సూర్య విభిన్నంగా కనిపించబోతున్నారు.  ఇప్పటి వరకు ఈ తరహా కథ, కథనాల్ని మనం చూడలేదు. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్‌ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

07:55 - April 6, 2016

వెంకటేష్‌, నయనతార నాయకా నాయికలుగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌ సంయుక్తంగా ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్‌, నయనతార మూడవ సారి జోడీ కడుతున్న చిత్రమిది. గతంలో 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో కలిసి నటించారు. ఆ చిత్రాలు ఘన విజయం సాధించినట్లుగానే ఈ సినిమా కూడా అదే తరహాలో పెద్ద హిట్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్‌లుక్‌ని ఉగాది పర్వదిన శుభ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మారుతి సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. 

07:47 - April 6, 2016

కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని పని చేసినా, ఎక్కువ సేపు చదివినా, బండిపై వేగంగా ప్రయాణం చేసినా చాలా మందికి కంటి నుండి నీరు కారుతుంది. ఈ సమస్య ఉన్న వారికి త్వరగా చూపు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్య నుంచి కొంతమేరకైనా విముక్తి పొందాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
కంప్యూటర్‌పై ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారు, ఎక్కువ సేపు పుస్తకాలు చదివే వారు ప్రతి అర్థగంట లేదా గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని నేత్ర వైద్యులు చూస్తున్నారు.
అలాగే, వాహనంలో వెళ్లే సమయంలో కంటిపై నేరుగా వేగంగా వచ్చే గాలి పడకుండా కంటి అద్దాలు ధరించడం లేదా హెల్మెట్‌ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళలోకి దుమ్మూధూళి పోకుండా ఉంటుంది.
అలాగే వెలుతురు సరిగా లేని ప్రాంతాలు, చీకటిలో చదవడం మానుకోవాలి. ఏసీ, వెంటిలెటర్‌ల నుంచి వచ్చే గాలి నేరుగా ముఖంపై పడకుండా చూసుకోవాలి. 

07:44 - April 6, 2016

నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, చంకల్లో ఎక్కువగా నల్లగా అవుతుంది. అయితే కింద సూచించిన పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు..

అలోవెరా..
ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి అలోవెరా జెల్‌ (కలబంద గుజ్జు) బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని నల్లబడ్డ శరీరంపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి.

బేకింగ్‌ సోడా..
ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్‌ సోడాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు రాస్తే ఫలితం ఉంటుంది.

నిమ్మకాయ..
చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా ఉన్నాయి. కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగి, తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.

కీరదోస..
కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో రాస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.

పాలు..
పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు, పెరుగును తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం కలవారికి మేలు చేస్తుంది.

ఆలుగడ్డ...
కొద్దిగా నీటిని, కొన్ని ఆలుగడ్డలను తీసుకుని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర భాగాలపై రాయాలి. కొద్దిసేపు ఆగాక కడిగేయాలి. ఇది మృత చర్మ కణాలను వేగంగా తొలగిస్తుంది.

జీహెచ్ఎంసీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ సర్కిల్ 18 సెక్షన్ ఆఫీసర్ జనార్ధన్ మహేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. సఫీల్ గూడా, ఆర్కేపురం, లాలాగూడలోని నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. 

నేటి నుండి ఆజ్లాన్ షా హాకీ కప్ మ్యాచ్...

మలేషియా : నేటి నుండి అజ్లాన్ షా హాకీ కప్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో జపాన్ తో భారత్ తలపడనుంది. 

నేడు హెచ్ సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం..

హైదరాబాద్ : నేడు హెచ్ సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అంబుడ్స్ మెన్ వ్యవస్థ, వివక్ష నిర్మూలన అంశాలపై చర్చించనున్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి..

నల్గొండ : మునగాల మండలం ఆకుపాముల వద్ద పాలిటెక్నిక్ విద్యార్థి వేణు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. భగత్ పాలిటెక్నిక్ కాలేజీలో వేణు ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీ సమీపంలోని పొలాల్లో వేణు మృతదేహం లభ్యమైంది. వేణు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వాసి. 

07:32 - April 6, 2016

పనామా పేపర్లు సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలకు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న పెను రాజకీయ విలయానికి ఐస్‌లాండ్‌లో మొదటి ప్రభుత్వం పతనమయ్యింది. పనామా పత్రాల్లో పేరు వెల్లడి కావడంతో ప్రజల నిరసలకు తలొగ్గిన ఐస్‌లాడ్‌ ప్రధాని సిగ్నండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో గఫూర్ (సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు), గోసాల శ్రీనివాస్ (టి.కాంగ్రెస్), పాదూరి కరుణ (బీజేపీ), పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి. 

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి. బుధవారం అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ముఖ్యమైన ఇతర ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సిద్ధిపేట మున్సిపాల్టీ పోలింగ్..

మెదక్ : సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుండి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34 వార్డులకు గాను ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 74,710 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 36 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 72 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు.

07:13 - April 6, 2016

ఈ ఏడాది ప్రకృతి పగబట్టింది. వానల్లేవు. నీళ్లు లేవు. వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయాయి. మరోవైపు కరవు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో గ్రామీణ జనం సొంత ఊళ్లను వదిలి దూర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఎండలు విజృంభిస్తున్నాయి. జలాశయాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రతిరోజూ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఒక్కొక్క ట్యాంకర్ కి 500 నుంచి వెయ్యి రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. పట్టణాల్లో ట్యాంకర్ల దగ్గర జనం బిందెలతో గుమిగూడుతున్నారు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో బిందెడు మంచినీళ్ల కోసం అయిదారు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కొక్క కుటుంబం వారి అసవరాలను బట్టి నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల దాకా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న నీటి సమస్యకు నిలువెత్తు దృశ్యాలు.

భయంకర పరిస్థితి..
ఏప్రిల్ మొదటివారంలోనే పరిస్థితి ఇంత భయంకరంగా వుంటే ఇక రాబోయే 60 రోజులను తలచుకుంటేనే భయం వేస్తోంది. రుతు పవనాలు అనుకూలించి, కాలం కలిసొస్తే జూన్ రెండో వారంలో నీటి సమస్య నుంచి ఎంతోకొంత తేరుకోగలం. ప్రక్రుతి సహకరించక వర్షాలు ఆలస్యమైతే నీటి కష్టాలు మరికొంతకాలం వెన్నాడుతాయి. వానలు, నీళ్లు, ఉపాధి ఒకదానికొకటి ముడిపడిన అంశాలు. సమృద్ధిగా వర్షాలు కురవకపోతే, నీళ్లకు కటకట తప్పదు. జలాశయాలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి పోతే, వ్యవసాయరంగం దెబ్బతింటుంది. పంటలు పండవు. రైతులు అప్పుల పాలవుతారు. కూలీలకు పనులు దొరకవు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో పనులు దొరకని పరిస్థితి వలసలను ప్రోత్సహిస్తుంది. పట్టణాల మీద నగరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒక చిన్న పనికి పది మంది పోటీ పడాల్సి వస్తుంది. పది మందికి సరిపోయే నీళ్లను వంద మంది పంచుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో మన పట్టణాలు చిక్కుకున్నాయి.

ప్రభుత్వాలకు ముందే తెలుసు..
ఈసారి ఎండాకాలంలో ఈ పరిస్థితి తప్పదని మన ప్రభుత్వాలకు ముందే తెలుసు. ఎందుకంటే, గత వర్షాకాలంలో సమృద్ధిగా వానలు కురవలేదు. ఎక్కడెక్కడ కరువు వుందో వివరిస్తూ ప్రభుత్వాలే కరవు మండలాల జాబితాను విడుదల చేశాయి. కరవు మండలాల సంఖ్యను కుదించే విషయంలో చూపిన శ్రద్ధ కరవు సహాయక చర్యల మీద చూపించలేదు. పడగవిప్పి బుసలు కొడుతున్న కరవు పరిస్థితులను సమర్ధమంతంగా ఎదుర్కొనే చర్యల మీద దృష్టి సారించలేదు. కరవు మండలాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలు పంపలేదంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం, తాము కోరిన రీతిలో కరవు సాయం చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఎక్కడ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే, అక్కడకు మంత్రులంతా పరుగులు పెడుతున్నారు. అక్కడే వారాల తరబడి మకాం వేస్తున్నారు. కానీ, కరవు కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలను పట్టించుకోవడం లేదు. సొంత ఊరిలో ఉపాధి దొరకక దూర ప్రాంతాలకు వలసపోయిన ఓటర్లను పోలింగ్ నాడు స్వగ్రామానికి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన నాయకులెవ్వరూ వలసలను అరికట్టే మార్గాల గురించి ఆలోచించడం లేదు.

దెబ్బతింటున్న పాడి పరిశ్రమ..
స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచి, పట్టణాల మీద ఒత్తిడి తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం, పని దినాల సంఖ్యను పెంచడం, కొత్త పనులను చేర్చడం కరవు కాలపు వలసలను అరికట్టడానికి చక్కటి మార్గం. పశువులకు ప్రభుత్వమే వీలైతే ఉచితంగానో, సబ్సిడీ ధరలకో గడ్డిని సరఫరా చేయడం వల్ల పశు సంపదను రక్షించుకునే అవకాశం వుంది. తెలంగాణలో ట్రాక్టర్ గడ్డికి పాతిక వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇంత డబ్బు పెట్టి గడ్డి కొనలేనివారు పశువులను సంతలకు తరలిస్తున్నారు. ఇది పాడి పరిశ్రమను దెబ్బతీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణకు పెట్టే ఖర్చులు పెరిగినా, పశు సంపద తగ్గిపోయినా, దాని ప్రభావం పట్టణ ప్రాంతాల్లోని పాల వినియోగదారుల మీద పడుతుంది. కరవు విశ్వరూపం చూపిస్తే, దాని దుష్ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి వస్తుంది. భీకరమైన తుపానులు, వరదలు చుట్టుముట్టిన్నప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక శిబిరాలు ఏర్పాటు చేయడం పరిపాటి. కరవు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నవారిని రక్షించేందుకు అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదన్నదే ప్రశ్న.

07:04 - April 6, 2016

కరవు బుసలు కొడుతోంది. నీళ్లు లేక, ఉపాధి దొరక్క జనం వలసపోతున్నారు. పట్టణాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కరవు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి? కరవు కష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటి? శాశ్వత కరవు నివారణకు దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలేమిటి? కరవు సహాయక చర్యలు అమలవుతున్న తీరు ఎలా వుంది? ప్రభుత్వం ముందు ప్రజా సంఘాలు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ విశ్లేషించారు. ఆయన..ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:57 - April 6, 2016

ఢిల్లీ : పనామా పేపర్లు సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలకు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న పెను రాజకీయ విలయానికి ఐస్‌లాండ్‌లో మొదటి ప్రభుత్వం పతనమయ్యింది. పనామా పత్రాల్లో పేరు వెల్లడి కావడంతో ప్రజల నిరసలకు తలొగ్గిన ఐస్‌లాడ్‌ ప్రధాని సిగ్నండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్నండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌, ఆయన భార్య అన్నాసిగుర్‌లాగ్‌ పల్స్‌డోట్టిర్‌ అఫ్‌షోర్‌ కంపెనీల్లో మిలియన్ల డాలర్లు వెనకేసుకున్నారని పనామా పత్రాల్లో ఆరోపించడంతో... ప్రజాగ్రహానికి గురయ్యారు. సిగ్నండర్‌ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. వీధుల్లోకి వచ్చిన భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఐస్‌లాండ్‌ రాజధాని రెక్‌జావిక్‌లోని అధ్యక్ష భవనపై కోడిగుడ్లు, పెరుగు డబ్బాలు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజాగ్రహానికి తలొగ్గిన సిగ్మండర్‌ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఐస్ లాండ్ లో నాటకీయ పరిణామాలు..
సిగ్మండర్‌ రాజీనామాకు ముందు ఐస్‌లాండ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐస్‌లాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇండిపెండెన్స్ పార్టీ మద్దతుతో ప్రోగ్రెసివ్‌ పార్టీ తరుపున సిగ్మండర్‌ ప్రధానిగా ఉన్నారు. సంకీర్ణ భాగస్వామి మద్దతు ఇవ్వకపోతే పార్లమెంటును రద్దు చేస్తారని బెదిరించారు. కానీ ఇండిపెండెన్స్ పార్టీ సిగ్మండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో రాజీనామా ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇండిపెండెన్స్ పార్టీ తరుపున ఆర్ధిక మంత్రిగా ఉన్న బజార్ని బెండిక్ట్‌సన్‌ పేరు కూడా పనామా పత్రాల్లో ఉంది. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సిగ్మండర్‌... పార్లమెంటును కూడా రద్దు చేయాలని దేశాధ్యక్షుడు ఓలాఫర్‌ రాగ్నార్‌ గ్రిమ్‌సన్‌ను కోరారు. కానీ గ్రిమ్‌సన్‌ ఇందుకు నిరాకరించారు. పనామా పత్రాల ప్రకంపనల నేపథ్యంలో అమెరికా పర్యటనను మధ్యలోనే ముగించుకుని స్వదేశం చేరుకున్న గ్రిమ్‌సన్‌... పరిస్థితిని సమీక్షించారు. పార్లమెంటును రద్దు చేయాలన్న ప్రధాని సిగ్నండర్‌ సిఫారసును తిరస్కరించిన అధ్యక్షుడు గ్రిమ్‌సన్‌.. సంకీర్ణ భాగస్వామై ఇండిపెండెండ్‌ పార్టీని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో సిగ్నండర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యింది. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో గున్లాగ్‌సన్‌, అతని భార్య 2007లో వింట్రిస్‌ ఇన్‌కార్పొరేట్‌ కంపెనీ కొనుగోలు చేశారు. వ్యాపారవేత్తైన తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తితో వింట్రిస్‌ కంపెనీని కొన్నాన్నది సిగ్మండర్‌ వాదన. 2009లో కంపెనీలో 50 శాతం వాటాను భార్యకు అమ్మినట్టు చెబుతున్నారు. 2009లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన సిగ్మండర్‌ ఈ విషయాలను ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించకుండా రహస్యంగా ఉంచారు. పనామా పత్రాల లీకేజీతో ఆయన గుట్టు రట్టు అయ్యింది. చివరికి ప్రధాన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 

06:36 - April 6, 2016

విజయవాడ : ఉచిత ఇసుక పాలసీని తెచ్చిన ఏపీ ప్రభుత్వం..అందులో మరికొన్ని నిబంధనల్ని చేర్చింది. ప్రజా అవసరాలకు పూర్తి ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చన్న ప్రభుత్వం.. ఇత‌ర రాష్ట్రాల‌కు ర‌వాణాను పూర్తిగా నిషేదించింది. మ‌న న‌దులు, మ‌న ఇసుక‌, మ‌న రాష్ర్ట అవ‌స‌రాలు అనే ల‌క్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఇసుక పాలసీలో కొన్ని మార్పులు చేసింది. అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిబంధనలు కఠినతరం చేసింది. ఇకపై రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇసుక గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఇసుక ఎక్కడ దొరకుతుందో వెతుక్కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చితంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి దర్జాగా తమ సొంతింటి కల నెరవేర్చుకోండని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏపీలో మొత్తం ఉచిత ఇసుక రీచ్‌లు 524 ఉన్నాయి. అందులో నదీ ప్రాంతాల్లో 166, వాగులు, వంకల్లో 358 ఉన్నాయి. ఈ ప్రాంతాల నుండి ప్రజలు తమ వ్యక్తిగత అవసరాలైన గృహ నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణము, అదే విధంగా స్థానిక ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వాల్టా చట్టానికి లోబడి ఇసుకను ఉచితంగా పొందవచ్చు. ఇక పర్యావరణ అనుమతుల్లేని ఇసుక రీచ్‌ల్లో మాత్రం తవ్వకాలు జరపడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

ఇతర  రాష్ట్రాలకు తరలింపుపై నిబంధనలు..
ప్రజలు వారి సొంత అవసరాల కోసం స్థానిక ఇసుక రీచ్ ఇన్‌ఛార్జీలను సంప్రదించి లోడింగ్ ఛార్జీలు చెల్లించి ఇసుకను తీసుకోవచ్చు. అయితే రాత్రిపూట ఇసుక లోడింగ్‌ను ప్రభుత్వం నిషేదించింది. దీంతో ఇసుక రీచ్‌లు సాయంత్రం 6 గంటలకు మూతపడనున్నాయి. అయితే ఇసుకను ఫిల్లింగ్ చేయడం, నిల్వ చెయ్యడం, ఇత‌ర రాష్ట్రాలకు అక్రమంగా తరలించడం చట్ట రీత్యా నేరం. ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా అక్రమంగా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ రవాణాతో మొదటిసారి పట్టుబడితే ఇసుక లారీలను సీజ్ చేయడంతో పాటు పట్టుబడ్డ ఇసుకను 15 రోజుల్లో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెండోసారి పట్టుబడితే వాహన యజమానులను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చెసి వాహ‌నాల‌ను సీజ్ చేయాలని నిర్ణయించింది. అవ‌సరం అయితే వారిపై క్రిమినల్ కేసును కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

06:33 - April 6, 2016

హైదరాబాద్ : ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసీఆర్‌ ప్రజంటేషన్‌తో మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌.. కోలుకునేందుకు చర్యలు చేపడుతోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు కౌంటర్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధం కావడమే కాకుండా.. దాన్ని సక్సెస్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తమ హయాంలో చేసిన పనులను లెక్కలతో సహా వివరించడమే కాకుండా.. ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించారు కాంగ్రెస్‌ నేతలు. అసెంబ్లీ వేదికగా సీఎం సాగునీటి ప్రాజెక్టుల స్వరూపాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో వివరించడమే కాకుండా.. కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కేసీఆర్‌కు కౌంటర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని భావిస్తున్న నేతలు.. దాన్ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తామిచ్చే కౌంటర్‌ ప్రజంటేషన్‌ ఆశామాషీది కాదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. కేసీఆర్‌ ప్రజంటేషన్‌లో ఎన్నో అబద్దాలు చెప్పారని.. వాటిని రుజువు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉందని టీ-పీసీసీ భావిస్తోంది. దీంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రజల్లో నవ్వులపాలు కాకతప్పదని.. అందుకే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇందుకోసం నీటి రంగ నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

సక్సెస్ అవుతుందా ? 
అంతేకాకుండా తమ హయాంలో ప్రాజెక్టులకు చేసింది ఏమిటి ? ఎన్ని ఎకరాలకు నీరిచ్చింది.. లెక్కలతో సహా సేకరిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ చెప్పినదాంట్లో వాస్తవం ఎంత ? దాంతో జరిగే నష్టం ఏంటి ? ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణాలేంటి అనే అంశాలను సూటిగా ప్రజలకు వివరించాలని నిర్ణయించింది టీ-పీసీసీ. దీన్ని నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో పెట్టడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతుందని నమ్ముతున్నారు హస్తం నేతలు. ఓ వైపు వరుస ఓటములు.. మరోవైపు వలసలతో ఊపిరాడని పరిస్థితుల్లో ఏకంగా గులాబీబాస్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు.. కౌంటర్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌ పార్టీ. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 

06:26 - April 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ పనులు అమలు జరుగుతున్న తీరుపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మినహా మిగిలిన ఎక్కడా కూడా చెరువుల్లో పూడికతీత పనులు సక్రమంగా అమలు జరగని విషయాన్ని ఆయన అధికారుల ముందు ప్రస్తావించారు. పనుల్లో జాప్యాన్ని సహించేందిలేదని హెచ్చరించిన హరీష్‌రావు... మొదటిదశ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనుల అమలు జరుగుతున్న తీరు తెన్నులపై మంత్రి హరీష్‌రావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొదటి దశ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. చాలా జిల్లాల్లో చెరువుల మరమ్మతులు పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిదశ పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూనే.. రెండోదశకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.

చెరువులను దత్తత తీసుకోవాలన్న హరీష్...
మిషన్‌ కాకతీయ పనులను పర్యవేక్షించాల్సిన అసిస్టెంట్‌, డిప్యూటీ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు స్థానికంగా ఉండకుండా... హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న విషయాన్ని హరీస్‌రావు ప్రస్తావించారు. ఈ పద్ధతి మార్చుకోపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మిషన్‌ కాకతీయ పనులను సక్రమంగా చేస్తున్న ఖమ్మం జిల్లా ఇంజనీర్లను అభినందించిన హరీష్‌రావు... అన్ని జిల్లాల్లో మొదటిదశ పనులను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. చెరవుల్లో పూడికతీతపై ఈనెల 13న మరోసారి వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. చెరువుల్లో పూడిక తీతపనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత మూడు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించిన హరీష్‌రావు... మిషన్‌ కాకతీయకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. చెరువుల దత్తతను ప్రోత్సహించాలని కోరారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంమ్మెల్సీలు, డాక్టర్లు, న్యాయవాదులు... ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు చెరువుల దత్తతకు చొరవ చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్‌ కాకతీయ పనుల్లో జాప్యం, నిర్లిప్తత, నిర్యక్ష్యాన్ని సహించేదిలేదని హరీష్‌రావు హెచ్చరించారు. 

06:23 - April 6, 2016

విజయవాడ : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు త్యాగాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు టిడిపి నేతలు. నారా లోకేశ్ కోసం మేం రాజీనామా చేస్తామంటే మేం రాజీనామా చేస్తామంటూ ప్రకటనలను గుప్పిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి లోకేష్‌ను మంత్రిగా చేసేందుకు త్యాగాలకు సిద్ధమంటూ ప్రకటిస్తన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లోకేశ్ కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్టీఆర్ సొంతజిల్లా నుంచి లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే నా స్థానంలో లోకేశ్‌ను ఎమ్మెల్సీగా నిలబెట్టాలని సూచించారు. నా రాజీనామా విషయాన్ని రేపు చంద్రబాబును కలిసి తెలియజేస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు.

లోకేష్ ఎంట్రీకి హైప్..
మరోవైపు లోకేశ్ కోసం రాజీనామాకు సిద్ధమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆయన ఆకాంక్షించారు. లోకేష్ లాంటి యువనాయకుల అవసరం పార్టీకి ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. లోకేశ్‌ను ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అభ్యన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ అవసరం రాష్ట్రానికి ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లోకి లోకేష్‌ను తీసుకోవాలన్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.మొత్తానికి లోకేష్‌ మంత్రి పదవి కోసం త్యాగాలకు వెనుకాడమంటున్న నేతలు అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో ఎంతమేర సఫలం అవుతారో తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంత్రి వర్గంలో లోకేష్‌ ఎంట్రీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ లోగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రకటనలతో లోకేష్‌ ఎంట్రీకి హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 

06:21 - April 6, 2016

విజయవాడ : ఏపీలో అధికార పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కగా.. తాజాగా ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరాడు. ఉగాది రోజున పసుపు కండువా కప్పుకునేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్‌.. మంత్రి నారాయణతో వచ్చి.. సీఎం క్యాంప్‌ ఆఫీసులో చంద్రబాబును కలిశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు సునీల్‌ స్పష్టం చేశారు. సైకిల్‌ ఎక్కేందుకు ఉగాది పండుగ రోజున ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. సునీల్‌ టీడీపీలో చేరేందుకు పూర్తి మంత్రాంగమంతా మంత్రి నారాయణ నడిపించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటీకే వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్సీలు, ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కగా.. తాజాగా సునీల్‌ ఆ జాబితాలో చేరారు. ఇక జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరనుంది.
ఇదిలావుంటే.. రానున్న రోజుల్లో మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సైకిల్‌ ఎక్కుతారని టీడీపీ నేతలంటున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్ కు కొంత బ్రేక్‌ పడిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ వలసల పర్వం కొనసాగుతుండడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. సైకిల్‌ ఎక్కే జాబితాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ లిస్ట్‌లో ఎవరున్నారోనన్న సందిగ్ధత కొనసాగుతోంది. మరీ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు జగన్‌ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. 

06:19 - April 6, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతకాలంగా వర్శిటీలో జరుగుతున్న ఆందోళనలు... వీసి అప్పారావు తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయ పక్షాలు, సామాజిక వేత్తలు, విద్యార్థి, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ జాక్‌, విద్యార్థి సంఘాలు చలో హెచ్ సీయూకి పిలుపునిచ్చాయి.

25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లపై కేసులు..
దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లో విద్యాపరంగా ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండే హెచ్‌సియు ఇప్పుడు నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. వర్సిటీ విద్యార్థి రోహిత్ మృతి తర్వాత ఆందోళనలు మిన్నంటడంతో సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి గత నెల 22న వీసీగా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చారు. దీంతో వర్శిటీలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. 25 మంది స్టూడెంట్స్‌తోపాటు ఇద్దరు అధ్యాపకులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదంతా రోహిత్ ఘటన జరిగినప్పుడు క్రియాశీలకంగా ఉద్యమించిన వారిపై వీసీ ప్రతికార చర్య అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు..
ఇదిలా ఉంటే హెచ్‌సియూలో జరిగిన ఘటనలపై విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, ప్రొఫెసర్లను సైతం వర్శిటీ లోనికి అనుమతించకుండా ఆంక్షలు విధించారు. మరో వైపు మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. ఇక క్యాంపస్‌కు వచ్చేవారిలో ఐడికార్డు లేనిదే ఎవరినీ లోనికి పంపడం లేదు. ఇదిలా ఉంటే విద్యార్థుల పోరాటానికి కేంద్రంగా నిలిచిన వెలివాడ, రోహిత్ స్థూపాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోణంలోనే ఈ నెల 6న అకడమిక్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ కౌన్సిల్‌లో యాజమాన్యం వర్శిటీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వీటన్నిటి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నాయి.

చలో హెచ్‌సియుకు పిలుపు...
వీసీ అప్పారావును విధుల నుంచి తొలగించాలని, రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితుడైన ఆయనపై చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు, హెచ్‌సియూ జాక్, ఓయూ జాక్‌లు చలో హెచ్‌సియూ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు తరలివచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. విద్యార్థులు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరో మారు సెంట్రల్ యూనివర్శిటీ ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి వర్శిటీలో పరిస్థితులు చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

06:16 - April 6, 2016

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్‌ పోరుకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. వెబ్ క్యామ్‌ ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు జరిగే పోలింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. పోలింగ్‌ ఏర్పాట్లను ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిద్ధిపేటలో మొత్తం 34 మున్సిపల్‌ వార్డులుండగా..ఇప్పటికే 6 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 28 వార్డులకు బుధవారం పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.
72 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లన్నింటిని ఎన్నికల సిబ్బంది ఇప్పటికే పూర్తిచేశారు. 72 వెబ్‌ కెమెరాలతో ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని పర్యవేక్షించనున్నారు. ఇక పోలింగ్ సందర్భంగా సిద్దిపేటలో ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా గట్టి పోలీస్‌ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 3 అడిషనల్‌ ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 250 మంది ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లను నియమించారు. సిద్ధిపేట మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌, బిజేపి, టిడిపి, సీపీఎం, సీపీఐలు బరిలో ఉన్నాయి. బుధవారం పోలింగ్ అనంతరం...ఈనెల 11న కౌంటింగ్ జరగనుంది. 

పిడుగురాళ్లలో లారీ - ఆర్టీసీ బస్సు ఢీ..

గుంటూరు : పిడుగురాళ్ల (మం) తుమ్మలచెరువు వద్ద లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. 

నేడే సిద్ధిపేట మున్సిపల్ పోలింగ్..

మెదక్ : జిల్లాలోని సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 34 మున్సిపల్ వార్డులున్నాయి. ఇందులో 6 వార్డులు టీఆర్ఎస్ వశం అయ్యాయి. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

విద్యుత్ ఛార్జీలపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ..

హైదరాబాద్ : రాష్ట్రంలో 68 శాతం మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ చేసిన చార్జీల పెంపు ప్రతిపాదనపై ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఎస్‌ఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. బుధ, గురువారాల్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. 

రేపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి లక్ష్మారెడ్డి భేటీ..

హైదరాబాద్ : ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీకి విధి విధానాల అమలులో అనుమానాల తొలగింపునకు గురువారం ఆయా సంఘాల నేతలతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సమావేశం కానున్నారు. 

టెన్త్ విద్యార్థులకు నేడు కెరీర్ గెడైన్స్..

హైదరాబాద్ : పదో తరగతి తరువాత ఏ కోర్సులో చేరాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ బుధవారం కెరీర్ గెడైన్స్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బుధవారం ఉదయం 10:30 నుంచి ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. 

నేటి నుండి మద్యం పంపిణీ బంద్..

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం బార్‌ కోడింగ్‌పై ఎక్సైజ్‌ శాఖ, దుకాణాల యజమానుల మధ్య నిబంధన చిచ్చు రేపుతోంది. షాపుల్లో కంప్యూటర్లు, 2డీ బార్‌కోడింగ్‌ స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసుకోక తప్పదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగ్జీవనరామ్‌ జయంతి కారణంగా సెలవు కావడంతో బుధవారం నుంచి అమలుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసుకోకపోతే మద్యం సరఫరా చేసేదిలేదని హెచ్చరించారు. 

టిడిపిలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరు : విపక్ష వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ఈనెల 8వ తేదీ... ఉగాది రోజున తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. 

శ్రీశైలం నుండి నీరు విడుదల..

కర్నూలు : తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని సంబంధిత అధికారులు విడుదల చేశారు. 

Don't Miss