Activities calendar

07 April 2016

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి అస్వస్థత..

శ్రీకాకుళం : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అస్వస్థతకు గురయ్యారు. గిరిజనోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లాలోని సీతం పేటకు ఆయన వచ్చారు. ఎండ తీవ్రతతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. 

జగన్ ఉగాది శుభాకాంక్షలు..

హైదరాబాద్: తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

రేపటి నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : మహానగరంలో మెట్రో పనుల వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 8 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నాగోల్ - రాయదుర్గం మెట్రో మార్గంలో పనుల వేగవంతానికే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

ఫీజీ రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలన్న కేసీఆర్..

హైదరాబాద్ : విద్యాశాఖ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. బకాయి పడిన రూ. 3,061 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు కేసీఆర్ ఆదేశించారు. సన్న బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది నుండి కాలేజీలు, యూనివర్సిటీ హస్టళ్లకు వర్తింప చేస్తామన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేయాలనే ఉద్ధేశ్యంతో కొన్ని విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 

21:33 - April 7, 2016

ఢిల్లీ : పనామా పత్రాల ప్రకంపనలు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. మొదటి లిస్టులో అమితాబ్‌, ఐశ్వర్యారాయ్‌ పేర్లు బయటకు రాగా.. తాజాగా బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌తో ఆమె సోదరి కరీనాకపూర్‌ల పేర్లు బయటపడటం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న పనామా పత్రాల్లో మరికొందరి భారతీయ ప్రముఖుల పేర్లు వెల్లడయ్యాయి. తాజాగా నాలుగో జాబితాలో బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లతో పాటు కరీనా సోదరి కరిష్మా కపూర్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీడియో కాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌కు చెందిన పలు సంస్థలు ఉన్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది.

వెనుక లలిత్ మోడీ..
2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు జట్టుకట్టారు. వీరితో పాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో రిజిస్టర్ అయిన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది. మొత్తం 10 మంది కలిసి పీ-విజన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి పుణె ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. అందులో ఈ సంస్థ విఫలమైంది. తాజాగా మోసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ సంస్థల పేర్లు వెలుగు చూశాయి. పీ-విజన్‌లో చోర్దియా కుటుంబం 33 శాతం వాటా కలిగి ఉంది. కరీనా, కరిష్మా 4.5 శాతం, సైఫ్ అలీఖాన్, ముంబై నివాసి మనోజ్ ఎస్ జైన్‌కు 9 శాతం చొప్పున వాటాలున్నట్లు పనామా పత్రాల ద్వారా వెల్లడైంది. దీంతో పాటు వేణుగోపాల్ ధూత్ రెండు గ్రూప్ కంపెనీల ద్వారా 25 శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అందుబాటులోని కరీనా..కరిష్మా..
అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కకపోవడంతో ఆ వెంటనే మూతపడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. దీనిపై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌ను వివరణ అడగగా... పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఓడ్బురేట్ సహా ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవన్నట్టు సమాచారం. దీనిపై స్పందించేందుకు సైఫ్, కరీనా, కరిష్మాలు అందుబాటులో లేరు.

21:29 - April 7, 2016

కేరళ : రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ ప్రచార భేరి మోగించింది. సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందన్ ఎల్ డిఎఫ్ ప్రచారం ప్రారంభించారు. పాలక్కడ్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన రాష్ట్రంలో యుడిఎఫ్, కేంద్రంలో బిజెపి పాలనపై నిప్పులు చెరిగారు. యుడిఎఫ్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు అవినీతిలో కూరుకుపోయిన వైనాన్ని తూర్పారబట్టారు. 2820 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టారంటూ యుడిఎఫ్ పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మత పరమైన విజభన సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

21:24 - April 7, 2016

విజయవాడ : వడగాల్పుల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హోం మంత్రి చినరాజప్ప హామీ ఇచ్చారు. తీవ్ర ఉష్ణం, వడగాల్పుల ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో 45 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది, ప్రకాశం జిల్లాలో 11, అనంతపురంలో నలుగురు మృతి చెందారు. అలాగే.. చిత్తూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10 మంది... శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్యం అందేలా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. చలి వేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

21:21 - April 7, 2016

హైదరాబాద్ : ఉగాది సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్, నరసింహన్ తదితరులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి యావత్‌ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని అభిలషించారు. 

21:18 - April 7, 2016

విజయవాడ : విద్యుత్‌ పొదుపుపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఈడీ బల్బుల పంపిణీలో ఏపీ మొదటి స్థానంలో నిలవడంతో...విద్యుత్‌ ఆదాపై మరింత దృష్టిపెట్టాలని సర్కార్‌ భావిస్తోంది. విజయవాడలో ఇంధన పొదుపుపై అంతర్జాతీయ సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. విద్యుత్ పొదుపుపై విజయవాడలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విశాఖలో హుద్ హుద్ తుఫాన్ సందర్భంగా 45 రోజుల్లో విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించి, ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న హయాంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టానని..దాని కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని చంద్రబాబు అన్నారు. సౌరశక్తి రంగంలో ఏపీ నెంబర్‌వన్ అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మించడమే కాకుండా..హరిత రాజధానిగా,.పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతామన్నారు.

విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించాలి..
రానున్న మూడేళ్లలో విద్యుత్‌ పంపిణీ నష్టాలను 5శాతానికి తగ్గించాలని ఇంధన శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వినియోగదార్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ పంపిణీ నష్టాలు తగ్గింపు వంటి అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. గ్రామీణ విద్యుదీకరణను నూటికి నూరుశాతం పూర్తి చేయాలని గిరిజన ప్రాంతాల్లో పూర్తి లక్ష్యాలను సాధించాలని సీఎం కోరారు. పంట కాలువల్లో నీరు ఆవిరి కాకుండా కాల్వలపై సోలార్‌ ప్యానల్స్ బిగించాలని తద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనను పెంచవచ్చన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 87లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశామని ఇంధనశాఖ ఎండీ అజయ్ జైన్ అన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 7.8లక్షలు మత్రమే ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ జరిగిందన్నారు. అయితే మార్చి 2017 నాటికి ఏపీలో అన్ని ప్రాంతాలలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా రైతులకు 2లక్షల పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ను ఆదాచేయడమే కాకుండా విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేవిధంగా రాష్ట్రంలో పలు విద్యుత్‌ ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

20:59 - April 7, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఏప్రిల్ 24 న తిరుపతి వేదికగా, మే 6 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పీవీపీ సినిమా, మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీతలు జంటగా నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు.

20:55 - April 7, 2016

వెంకటేష్‌, నయనతార నాయకా నాయికలుగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌ సంయుక్తంగా ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'బాబు బంగారం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు.
బాబు బంగారంగా వెంకటేష్ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కొత్త సినిమాలో వెంకీ ఓ రేంజ్ కామెడిని వర్కవుట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ . ఇందులో మల్లీశ్వరీ సినిమాలో మాదిరి నవ్వుల పువ్వులు పూయిస్తాడని తెలుస్తోంది. బాబు బంగారం సినిమాను జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా 50 శాతం కంప్లీట్ అయినట్లు వినికిడి. తులసి, లక్ష్మీ లాంటి హిట్స్ సినిమాలో వెంకీ కి జోడిగా నటించిన నయనతార మరోసారి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టీం ని చూస్తుంటే వెంకటేష్ ఖాతాలో ఓ పెద్ద హిట్టు చేరబోతున్నట్లు కనిపిస్తుంది. మరి బాబు బంగారం ఏం చేస్తాడో చూడాలి.

విద్యుత్ షాక్ తో ఇద్దరు కార్మికుల మృతి..

కరీంనగర్ : కరెన్సీ నగర్ వద్ద రోడ్డుపై చెట్లు నాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 

కరవు పరిస్థితులపై సుప్రీం విచారణ..

ఢిల్లీ : దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సుప్రీం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవు మండలాలు ప్రకటించడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవు, రైతుల సమస్యలపై సీరియస్ గా వ్యవహరించాలని, 12 రాష్ట్రాల్లో కరవు తీవ్రస్థాయిలో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. 

10న టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం..

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీన టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. నాచారంలో టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యాచరణ, జేఏసీ అంతర్గత నిర్మాణంపై చర్చించనున్నారు. 

మూడు నెలల్లో హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్ - కేటీఆర్..

హైదరాబాద్ : 2016-17 లో రూ. 2008 కోట్ల బడ్జెట్ తో హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్ ను మూడు నెలల్లో రూపొందిస్తామన్నారు. గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులిచ్చినా హెచ్ఎండీఏ ఆక్సుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. 30 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులిస్తామని, దరఖాస్తు చేసుకుని 30 రోజులు దాటితే అనుమతి లేకుండానే నిర్మాణ పనులు చేపట్టవచ్చన్నారు. 

కృష్ణా పుష్కరాలకు రూ. 231 కోట్లు కేటాయింపు..

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఘాట్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా తీరంలో ఉన్న ఘాట్ల నిర్మాణానికి రూ. 231 కోట్లు కేటాయించింది. కృష్ణా జిల్లాలకు రూ. 142 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ. 65 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ. 24 కోట్లు కేటాయించింది. 

తీరిక లేనందువల్లే కోర్టుకు హాజరు కాలేదు - సుజనా..

హైదరాబాద్ : ప్రజా సంబంధ విధులు..బాధ్యతల్లో తీరిక లేనందు వల్లే కోర్టుకు హాజరు కాలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. మారిషస్ బ్యాంకు కేసులో గత మూడు విచారణలకు హాజరుకానందున నాంపల్లి కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

పశ్చిమ బెంగాలో లో రెండు చోట్ల రీ పోలింగ్..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో రెండు ప్రాంతాల్లో రీ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలను తప్పుగా ఉపయోగించి..రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా ప్రాంతాల్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 11న రీ పోలింగ్ జరగనుంది. 

19:53 - April 7, 2016

ఢిల్లీ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. 9 వేల కోట్లు చెల్లించాల్సిందేనని బ్యాంకులు కోర్టుకు తెలిపాయి. విజయ్‌ మాల్యా ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింగ్‌ఫిషర్‌ సంస్థ యజమాని విజయ్‌మాల్యా రుణ ఎగవేత కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు 4వేల కోట్లు చెల్లిస్తానన్న విజయ్‌మాల్యా ప్రతిపాదనను 17 బ్యాంకులు తిరస్కరించాయి. బకాయి పడ్డ మొత్తం 9వేల కోట్లు చెల్లించాల్సిందేనని బ్యాంకులు కోర్టుకు తెలిపాయి. ఏదైనా ఒప్పందం చేసుకోవాలంటే మాల్యా వ్యక్తిగతంగా ఉండాల్సిందేనంటూ బ్యాంకులు స్పష్టం చేశాయి. అంతే కాదు...కొంత బకాయి మొత్తం కూడా కోర్టులో డిపాజిట్‌ చేయాలని తెలిపాయి.

సుప్రీం అసంతృప్తి..
విజయ్‌ మాల్యా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాల్యాతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద దేశ విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకులతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలంటే మాల్యా వ్యక్తిగత హాజరు తప్పనిసరని కోర్టు పేర్కొంది. డిపాజిట్‌ రూపంలో మాల్యా కోర్టుకు ఎంతమొత్తం చెల్లించేది రెండువారాల్లోగా తెలపాలని న్యాయస్థానం ఆదేశించింది. మాల్యా కోర్టుకు ఎప్పుడు హజరయ్యేది ఏప్రిల్‌ 22లోగా తేల్చాలని మాల్యా తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 26కు వాయిదా వేసింది.

రెండు వారాల గడవు..
బ్యాంకుల ప్రతిపాదనపై కింగ్‌ఫిషర్‌ యాజమాన్యం రెండు వారాల గడవు కోరింది. విదేశాల నుంచి మాల్యా ఎప్పుడు తిరిగొస్తారో చెప్పాలని ఆయన తరఫు న్యాయవాదిని బ్యాంకులు ప్రశ్నించాయి. కొన్ని సమస్యల వల్ల ప్రస్తుతం మాల్యా భారత్‌కు రాలేరని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆయన తప్పకుండా భారత్‌కు వస్తారని చెప్పారు. 17 బ్యాంకులకు దాదాపు 9వేల కోట్లు బకాయి పడ్డ విజయ్‌మాల్యా విదేశాలకు వెళ్లిపోయాడు. సమయానికి బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్‌గా ప్రకటించాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. విచారణకు హాజరవుతానన్న మాల్యా విదేశాల్లోనే ఉండిపోయారు. 

19:49 - April 7, 2016

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నపనామా పేపర్స్ కు హాలీవుడ్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ కు సంబంధం ఉందా ? లేటెస్ట్ అప్ డేట్స్ ఉందనే చెబుతున్నాయి. పనామాకు చెందిన న్యాయవ్యవహారాల సంస్థ మోసాక్ ఫోన్సెకా సృష్టించిన షెల్ కంపెనీలకు జేమ్స్ బాండ్ కూ సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చదవండి.. 

కంపెనీలకు ఈ పేర్లే..
స్కై ఫాల్.... స్పెక్టర్... ఇవి లేటెస్ట్ బాండ్ మూవీస్ టైటిల్స్. పనామా పేపర్స్ లో బయటపడిన అనేకానేక డొల్ల కంపెనీలకు ఈ పేర్లే పెట్టారు. మోసాక్ ఫోన్సెకా గుట్టు రట్టు చేసిన కోటీ పది లక్షల పత్రాలను శోధిస్తున్న కొద్దీ అనేక ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. విదేశీ కంపెనీలను అలవోకగా ఏర్పాటు చేయడంలో ఆరితేరిన మోసాక్ ఫోన్సెకా స్థాపించిన కంపెనీలకు జేమ్స్ బాండ్ చిత్రాల పేర్లు, అందులోని విలన్ల పేర్లు పెట్టారు. యాక్షన్ చిత్రాల అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన మూన్ రేకర్, గోల్డ్ ఫింగర్, గోల్డెన్ ఐ, స్పెక్టర్, స్కై ఫాల్... వంటి పేర్లతో పనామా లా ఫర్మ్ అనేకానేక షెల్ కంపెనీలను స్థాపించింది. బాండ్ సినిమాల పేర్లే కాదు... ఆస్టిన్ పవర్స్ వంటి కామెడీ మూవీ సిరీస్ పేరుతో కూడా ఈ కంపెనీల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అంతేకాదు, అమెరికాలో సూపర్ హిట్టయిన టీవీ సిరీస్ "24" (ట్వంటీ ఫోర్)లో కీఫర్ సదర్లాండ్ పోషించిన జాక్ బాయర్ పాత్ర పేరుతో కూడా ఓ వ్యక్తి మోసాక్ ఫోన్సెకాలో ఉండడం విచిత్రం.

తెలుగు వారు..
పనామా సీక్రెట్ పేపర్స్ గత ఆదివారం నుంచి మీడియాలో ప్రత్యక్షమవుతున్న కొద్దీ పరదేశీ కంపెనీల లీలలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. నల్లధనం తరలింపులో అక్రమార్కుల అత్యాధునిక విన్యాసాలపై పనామా లీక్స్ ప్రపంచమంతటినీ అలర్ట్ చేసేలా సైరన్ మోగించాయి. అదానీ బ్రదర్, సంతోష్ మోదీ, కె.పి సింఘాల్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లతో ఓ ముగ్గురు తెలుగు వీరులు కూడా ఈ కాంట్రావర్షియల్ కాగితాల్లో కనిపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ ఫుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ -అల్ అసద్ ల హితులు సన్నిహితుల కథలు కూడా వెలుగు చూశాయి. ఇప్పటికే, పనామా పేపర్ పవర్ కు ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. చూద్దాం... ఇంకా పనామా ప్రకంపనలు ఏ తీరాలకు విస్తరిస్తాయో... ఎంత మంది బ్లాక్ బాండ్స్ ను మనకు పరిచయం చేస్తాయో..!

19:46 - April 7, 2016

హైదరాబాద్ : పేద, మధ్య తరగతి విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇంతకాలం వైద్య విద్యే అందుబాటులో లేదనుకుంటే.. ఇప్పుడా జాబితాలోకి ఐఐటీ విద్య కూడా చేరింది. ఐఐటీ విద్యాసంస్థల్లో ఫీజులను కేంద్రం ఊహించని స్థాయిలో పెంచేసింది. ఫలితంగా ఇకపై ఐఐటీ విద్య కూడా ధనికులకు మాత్రమే సొంతం కానుంది. పేద మధ్యతరగతి విద్యార్థులను ఆ విద్యకు దూరం చేయాలనుకున్నదేమో అన్న అనుమానం కలిగేలా.. కేంద్రం ఏకంగా 300 శాతం మేర ఫీజులు పెంచేసింది. ప్రస్తుతం 90వేల దాకా ఉన్న ఐఐటీ విద్య ఫీజు ఇకపై ఏకంగా 3లక్షల రూపాయలకు చేరింది.

లక్షలకు చేరుతున్న ఫీజులు..
స్కూల్ ఫీజులు మొదలుకొని ఉన్నత విద్య వరకు ప్రతి విభాగంలోనూ ఫీజులు లక్షలకు చేరుతున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు టెక్నికల్ విద్యకు దూరం కావడం ఖాయమని విద్యావేత్తలు అంటున్నారు. ఫీజులను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్న ప్రభుత్వం కనీసం రుణ సదుపాయాన్నీ కల్పించడం లేదని విమర్శిస్తున్నారు. తగిన రీతిలో నిబంధనలు తయారుచేసి ఉన్నతవిద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని సూచిస్తున్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఫీజుల్ని పెంచడం ఇదే తొలిసారి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీపడుతూ ప్రభుత్వం కూడా ఫీజులను పెంచడం దారుణమని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. అన్ని వర్గాలకూ సాంకేతి ఉన్నత విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

19:42 - April 7, 2016

మెదక్ : రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మెదక్‌ జిల్లాలో నర్సాపూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వెంటనే ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో కరవు ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇది సరైన చర్య అని తెలిపారు. తాము జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించినట్లు తెలిపారు. వాస్తవానికి జిల్లాలో దుర్భిక్షం తాండవిస్తోందని, కరవు తాండవిస్తోందని తెలిపారు. పంటలు పూర్తిగా ఎండిపోయాయని, 7-8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు దివాళ తీశాడని పేర్కొన్నారు. పశువులకు మేత దొరకడం లేదన్నారు. ప్రభుత్వం కరవు ప్రాంతంగా పేర్కొన్నా ఎక్కడా కరవు సహాయ చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు... చేసిన వ్యాఖ్యలు సరైనవని, దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. తాము పర్యటించిన సమయంలో అధికారులకు మెమోరాండంలు సమర్పించడం జరుగుతోందని, అన్ని పార్టీల నేతలను పిలిచి ప్రభుత్వం వారితో చర్చించాలని డిమాండ్ చేశారు. 

19:38 - April 7, 2016

విజయవాడ : టిడిపిలో.. నాలుగు రోజులుగా లోకేష్‌ నామజపం మార్మోగుతోంది. పార్టీలో ఏ నేతను కదిపినా లోకేష్‌ జపం చేస్తున్నారు. చిన్నబాబుకు పెద్దపోస్ట్ ఇవ్వాలంటూ అధినేతకు విన్నవిస్తున్నారు. చినబాబు దృష్టిలో పడాలనుకునే నేతలే కాదు అమాత్యులూ లోకేశ్‌ నామజపంలో ఏమాత్రం తగ్గడం లేదు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టిమరీ లోకేష్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చినబాబు సమర్థతను తెగ పొగిడేస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా సైకిల్‌ పార్టీలో లోకేష్‌ పేరు మార్మోగిపోతుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడేం నడుస్తోంది..? తారాస్థాయిలో లోకేశ్‌ నామస్మరణ నడుస్తోంది. చినబాబు సమర్థతపై నేతలు అడపాదడపా మాత్రమే మాట్లాడేవారు. కానీ నాలుగు రోజులుగా పార్టీ నేతల్లో ఒక రకమైన ఊపు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా లోకేశ్‌.. లోకేశ్‌.. అన్న పదస్మరణమే. చినబాబును మంత్రిగా చూడాలన్న కోరికను బాహాటంగా చెప్పేస్తున్నారు. లోకేశ్‌ ఏపీ మంత్రివర్గంలో చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం ఓ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్న తీరులో లోకేశ్‌ నామస్మరణ సాగుతుండడం విశేషం.

సిఫార్సులు..
తెలుగు దేశం పార్టీలో నారా లోకేశ్‌.. ప్రస్తుతం కార్యకర్తల సంక్షేమ నిధి స‌మ‌న్వయ కర్తగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. త్వరలో జ‌రుగబోయే క్యాబినెట్ విస్తరణలో లోకేష్‌కు బెర్త్ ఖ‌రారు చేయాలంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు సిఫార్సులు వెళ్తున్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. లోకేశ్‌ను మంత్రిని చేయాలని కోరితే.. కృష్ణాజిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. చినబాబు కోసం మండలి సభ్యత్వాన్నే వదులుకుంటానన్నారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అయితే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పెనమలూరు నుంచే లోకేశ్‌ను గెలిపించుకు వస్తానని భరోసా ఇస్తున్నారు. లోకేశ్‌ విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు.. మంత్రులు.. పార్లమెంటు సభ్యులూ కూడా వెనక్కి తగ్గడం లేదు. లోకేశ్‌ మంత్రి పదవికి అన్నివిధాలా అర్హుడని ఎంపీలు అంటుంటే.. ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రి కాబట్టి... అనుభవం కోసం.. ఇప్పటి నుంచే మంత్రి పదవి అప్పగిస్తే బాగుంటుందని మరికొందరు సూచించేస్తున్నారు.

సునిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం..
విచిత్రమేమో కానీ నిన్న మొన్నటి వ‌ర‌కూ లోకేశ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి పంపాల‌న్న తెలంగాణ టిడిపి నేత‌లు కూడా ఇప్పుడు ఏపీ నేతల బాటనే పట్టారు. లోకేశ్‌కు ఏపిలో మంత్రి ప‌ద‌వి ఇస్తే మంచిదేన‌ని.. ఆయన ఏపిలో ఉన్నా..కేంద్రంలో ఉన్నా తెలుగు ప్రజలకు అందుబాటులోనే ఉంటారని టీటీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీలో లోకేశ్‌ నామస్మరణపై విపక్షం తీవ్రంగా మండిపడుతోంది. జిమ్మిక్కుల్లో చంద్రబాబును మించినవాడు లోకేశ్‌ కాబట్టి.. ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం సమంజసమేనంటూ వెటకరించింది. మరోవైపు.. లోకేశ్‌కు మంత్రిపదవిపై జరుగుతున్న చర్చ గురించి.. టీడీపీ అధిష్ఠానం అత్యంత సునిశితంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. లోకేష్‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా లోకేష్‌ని మంత్రి వ‌ర్గంలోకి తీసుకొని.. ఆరు నెలలలోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిపించి అసెంబ్లీలోకి అడుగు పెట్టించాల‌ని పార్టీ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. జూన్ 8 నాటికి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతోంది. ఆలోగానే మంత్రి వ‌ర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్‌కు మంత్రిపదవి గురించి టీడీపీ నేతలు జోరు పెంచారని సమాచారం. 

సర్పంచ్ చందూలాలపై దాడి..

మహబూబ్ నగర్ : వెల్దండ (మం) జూపల్లి సర్పంచ్ చందూలాల్ పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లి..

హైదరాబాద్ : పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. చాంద్రాయణగుట్టలో ఓ యువతిని ఒమన్ దేశస్తునికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. డబ్బుల కోసమే తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధమయ్యారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒమన్ దేశస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒమన్ దేశస్తుడు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు.

జీహెచ్ఎంసీలో ప్రక్షాళన..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో కమిషనర్ ప్రక్షాళన మొదలు పెట్టారు. లాంగ్ స్టాండింగ్ తో పాటు వివిధ ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు మొదలు పెట్టారు. ఒకేసారి 20 మంది ఇంజినీర్లకు స్థానచలనం చేశారు. డిపార్ట్ మెంట్ లలో మార్పులు చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. 

సిలిగురిలో మోడీ ఎన్నికల ప్రచారం..

పశ్చిమ బెంగాల్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సిలిగురిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్నారు. 

మిషన్ భగీరథ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : మిషన్ భగీరథ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలిదశ నీళ్లిచ్చే నియోజకవర్గాల్లో ఫైబర్‌గ్రిడ్ పనుల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. 

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ప్రారంభం..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ఉభయ రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 

శ్రీనగర్ ఎన్ఐటీ ఘర్షణలపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లోని ఎన్ఐటీలో గత శుక్రవారం నుండి చోటు చేసుకున్న ఆందోళనలపై విడి విడిగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

 

పాక్ లో భారీ వర్షాలు..100 మంది మృతి....

హైదరాబాద్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిలిగిత్‌-బాలిస్థాన్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి.  పాక్‌-చైనా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కారకోరం హైవే దాదాపు 50 చోట్ల ధ్వంసం కావటంతో పలు ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్థాలు, ఇంధనం సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అక్షయగోల్డ్ మాజీ డైరెక్టర్లకు అరెస్ట్ వారెంట్ జారీ ...

హైదరాబాద్ : అక్షయగోల్డ్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అక్షయగోల్డ్ సంస్థ మాజీ డైరెక్టర్లు శ్రీకాంత్, హరినాథ్, సుబ్రహ్మణ్యం లను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ సజావుగా సాగుటంలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే కేసును సీబీఐకు బదిలీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. ఈనెల 20,21 తేదీలలో తొలిదశ వేల నిర్వహించనున్నట్లు సంస్థ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. కాగా దర్యాప్తుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కమిటీ న్యాయస్థానానికి తెలిపింది.

ట్రిబ్యునల్ ఎదుట మా వాదనలు వినిపిస్తాం: మంత్రి దేవినేని

విజయవాడ : ఈ నెల 9న చంద్రబాబు జిల్లాలలో పర్యటించనున్నారు. శ్రీకాకుళ, చిత్తూరు, అనంతపురం,నెల్లూరు,ప్రకాశం,విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నట్లు మంత్రి దేవినేని తెలిపారు. పామూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల మూడవ వారంలో ట్రిబ్యునల్ ఎదుట మా వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా వుందనీ..ప్రస్తుతం 66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో వుందన్నారు. తెలుగు రాష్ట్రాలురెండింటికీ ఈ నీరే వినియోగించుకోవాలన్నారు. ఏపీకి తక్షణ సాయంగా 4 టీఎంసీల నీరు కావాలని కృష్ణా రివర్ బోర్డును కోరామన్నారు.

కిడ్నాప్ గురైన గిరిజన యువకుడు శంకర్ మృతి...

తూ.గోదావరి : కిడ్నాప్ కు గురైన గిరిజన యువకుడు శంకర్ మృతి చెందాడు. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో మర్రిగూడెంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శంకర్ ను రెండురోజుల క్రితం చింతూరు మండలం ఎదుగురాళ్ళపల్లిలో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

ఐపీఎల్ మ్యాచ్ కు ముంబై హైకోర్టు గ్రీన్ సిగ్నల్...

ముంబై : ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు ముంబై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 9న ముంబై వాంఖడీలో పూణే-ముంబై జట్ల మధ్య పోటీ జరుగనుంది. మహారాష్ట్రలో కరవుతో విలవిల్లాడుతుంటే ఐపీఎల్ పేరుతో నీటి దుర్వినియోగం చేస్తున్నారంటూ కోర్టులో పిల్ దాఖలైంది. ఏప్రిల్ 12 నుండి ఐపీఎల్ మ్యాచ్ లపై కోర్టు విచారణ జరుగనుంది. మహారాష్ట్రలోని మూడు స్టేడియాల్లో మొత్తం 20 మ్యాచ్ లు జరుగనున్నాయి.

17:45 - April 7, 2016

ముంబై : ఐపీఎల్..కొద్ది రోజుల్లో మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. కానీ అంతలోనే ఓ టెన్షన్..ప్రారంభ మ్యాచ్ ప్రారంభమౌతుందా ? లేదా ? అని.. దీనికి కొద్దిసేపటి క్రితం ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు ముంబై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 9వ తేదీన వాంఖడీ స్టేడియంలో పూణే - ముంబై జట్ల మధ్య పోటీతో పోటీలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో కరవు విలయతాండవం చేస్తుండడం..ఐపీఎల్ పేరిట నీటి దుర్వినియోగం చేస్తున్నారంటూ కోర్టులో పిల్ దాఖలైంది. మూడు వేదికల్లో మొత్తం 20 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

తొలుత ఆక్షేపణ..
మహరాష్ట్రలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై హైకోర్టు ఆక్షేపణ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజల జీవనం కన్నా ఐపీఎల్‌ మ్యాచ్‌లే ఎక్కువా అంటూ క్రికెట్‌ బోర్డును ప్రశ్నించింది. రాష్ట్రంలో దుర్భిక్షం తాండవిస్తున్న పరిస్థితుల్లో బాధ్యతారహితంగా నీళ్లను ఎలా వృథా చేస్తారంటూ హైకోర్టు నిలదీసింది. మూడు స్టేడియాల్లో పిచ్‌ల నిర్వహణకు రోజుకు 60వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని... నీటిని వాడితే లీటరుకు వేయి రూపాయల పన్ను చెల్లించేలా ఆదేశాలివ్వాలని లోక్‌సత్తా మూమెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థ పిల్‌ దాఖలు చేసింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు నీటిని ఉపయోగించకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ముంబై హైకోర్టు విచారణ జరిపింది.

తొలి మ్యాచ్ వాంఖడీ..
ఐపీఎల్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడీ మైదానంలో జరగనుంది. ఈ లీగ్‌లో 20 మ్యాచ్‌లు ముంబై, పుణె, నాగ్‌పుర్‌లో జరగనున్నాయి. మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలో జరుగనుంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం పూర్తయిందని, మ్యాచ్‌లను రద్దు చేస్తే భారీ ఎత్తున నష్టపోతామని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మంత్రులు,కలెక్టర్లు,అధికారులతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ....

విజయవాడ : తాగునీటి ఎద్దడి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులపై మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనీ...వాటికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ 50 మంది కూలీలు పనిచేసే ప్రదేశాలలో నీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 1000 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ పనివేళల్లో మార్పులు చేయాలనీ...వడగాల్పులపై ప్రజలలో అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు.

17:31 - April 7, 2016

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మారిషస్ బ్యాంకును మోసం చేసిన కేసులో మూడు సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. ఆ తేదీలో కోర్టు ఎదుట సుజనా హాజరు కావాలని, లేనిపక్షంలో అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.                                                                              

గతంలో...
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సూనేతె మారిషస్ దేశంలో ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. సుజనా చౌదరికి చెందిన కంపెనీ హేస్టియా పేరుతో మారిషస్‌ బ్యాంకు నుంచి 92 కోట్ల రూపాయల రుణం తీసుకోగా వడ్డీలతో కలిపి 106 కోట్లకు చేరింది. కాగా 2012 నుంచి హేస్టియా రుణాల చెల్లింపును నిలిపివేసింది. హేస్టియా జాప్యంపై హైకోర్టులో ఎంసిబి పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ జరుగుతోంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. అయితే 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసినట్లు, బకాయిల విషయంలో స్పందించాలంటూ హేస్టియాకు ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపినా బకాయిలు మాత్రం చెల్లించలేదని సమాచారం. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులోఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టులో హేస్టియా సంస్థ హైకోర్టు తీర్పు అమలుచేయరాదని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

17:30 - April 7, 2016

గుంటూరు : ఏంటీ నారా లోకేష్ ను కేబినెట్ లోకి చేర్చుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? అలాంటిదేమి లేదు. ఇటీవల లోకేష్ ను మంత్రివర్గంలోకి చేర్చుకోవాలంటూ పలువురు మంత్రులు కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ సామాన్యమైన వ్యక్తి కాదని, ఎంతో మేథస్సు కలిగిన వాడని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడికి కేవలం 64 విద్యలు మాత్రమే తెలుసని, కానీ లోకేష్ కు డబుల్ విద్యలు తెలుసని వ్యాఖ్యానించారు. అమెరికాలో చదువుకుని విద్యలన్నీ ఔపాసన పట్టిన లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే అన్యాయం జరిగిపోతుందని ఎద్దేవా చేశారు. ఆయనకు వచ్చిన విద్యను అన్నీ ఇన్నీ కావని, చంద్రబాబు నాయుడు ద్వారా కొన్ని విద్యలు వస్తే వైస్రాయ్ కొన్ని విద్యలు..ఎమ్మెల్యేల కొనుగోలు విద్యలో లోకేష్ ను మించిన వ్యక్తి దేశంలో లేరని తనదైన శైలిలో పేర్కొన్నారు. కబ్జాల్లో చంద్రబాబు డిగ్రీ మాత్రమే చదివారని, కానీ లోకేష్ మాత్రం పోస్టుగ్రాడ్యుయేట్ తెచ్చుకున్నారని తెలిపారు.

దుష్టపాలన..
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దుష్టమైన పాలన రెండు సంవత్సరాల్లో జరిగిందని, ఇందుకు లోకేష్ కారణమని దుయ్యబట్టారు. రాజ్యాంగేతర శక్తిగా ఉన్న లోకేష్ రాజ్యాంగ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకు మంత్రివర్గం భజన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడిని కేబినెట్ లో చేర్చుకోవడానికి ఇంత ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. ఆయన ఒక ఐరన్ లెగ్ అని, మనీ ట్రాన్స్ ఫర్ స్కీం ప్రవేశ పెట్టి వెనక్కి తగ్గిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి. 

కేంద్రమంత్రి సుజనా చౌదరికి అరెస్ట్ వారెంట్ జారీ...

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరిపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మార్షియస్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో మూడుసార్లు కోర్టు హాజరు కాని కారణంగా నాంపల్లి న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 26కు వాయిదా వేసింది.

ప్లీనరీ తీర్మానాల కమిటీ నియామకం..

ఖమ్మం : జిల్లాలో జరుగబోయే ప్లీనరీ సమావేశాలకు టీఆర్ఎస్ సిద్దం అవుతోంది. ప్లీనరీలోని తీర్మానాలకు ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, సభ్యులుగా ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వరరెడ్డి, రాములునాయక్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి, కృష్ణమూర్తి, ఫరీదుద్దీన్‌లు ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు ....

 ఢిల్లీ : ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈక్రమంలో సస్పెన్షన్ దారితీసిన పరిణామాలపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఏపీ అసెంబ్లీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

16:59 - April 7, 2016

ఉత్తర్ ప్రదేశ్ : గత వారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో షార్ప్ షూటర్‌తో పాటు... మరొకరు సమీప బంధువు రెహాన్‌ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిపిన సమయంలో తాను బైక్‌ నడిపినట్లు, ఎవరు గుర్తించకుండా ఉండేందుకు హెల్మెట్‌ పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. షార్ప్ షూటర్‌ మునీర్‌ బైక్‌పై వెనకాల కూర్చున్నాడు. మునీర్‌ అలీగఢ్‌ హత్య కేసులోను నిందితుడు. ఎన్‌ఐఏ అధికారి కారును ఛేజ్‌ చేయడానికి ఉపయోగించిన బైక్‌ను కూడా గుర్తించినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. తాంజిల్‌ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీకి తిరిగి వస్తుండగా దుండగులు మార్గ మధ్యలో కాల్పులు జరిపడంతో ఎన్‌ఐఏ అధికారి అక్కడికక్కడే మృతి చెందారు. తాంజిల్‌ భార్యకు బుల్లెట్‌ గాయాలవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి తగాదా విషయంలోనే తాంజిల్‌ హత్య జరిగినట్లు సమాచారం. 

వడదెబ్బకు ఏపీలో 45 మంది మృతి...

విజయవాడ : భానుడి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో వడదెబ్బకు 66 మంది చనిపోయారు. ఏపీలో వడదెబ్బకు 45 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కడప-16,ప్రకాశం-11, అనంతపురం-4,చిత్తూరు, విజయనగరం, కర్నూలు జిల్లాలో 9,శ్రీకాకుళం-2, కృష్ణా-2, ప.గోదావరి-1 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు.

భారత్ లోకి చొరబడిన ఉగ్రవాదులు...

జమ్మూకాశ్మీర్ : భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వేరినాగ్ అనే గ్రామంలో ఓ ఇంట్లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. వేరినాగ్ గ్రామాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

16:22 - April 7, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు మళ్లీ వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు చెల్లించాలని ఆదేశిస్తూ ఇందుకు ఓ కమిటీని కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కమిటీ వాదనలు వినిపించింది. కమిటీ భేటీ అయ్యేందుకు కనీస సౌకర్యాలు లేవని, గతంలో టి. సర్కార్ జీవో జారీ చేసినా అమలు చేయలేదని ఫిర్యాదు చేసింది. ఏడు వేల కోట్ల ఆస్తులు అమ్మి చెల్లించాలని, ఇందుకు సిబ్బంది కావాల్సి ఉంటుందని..ఇందుకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపింది. వెంటనే స్పందించిన కోర్టు కమిటీకి సహకరించాలని..సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20, 21 తేదీల్లో తొలి దశ వేలం నిర్వహించనున్నట్లు హైకోర్టుకు అగ్రిగోల్డ్ కేసు కమిటీ తెలిపింది. అనంతరం విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది. 

16:21 - April 7, 2016

ప్రకాశం : దళితులు, గిరిజనుల మీద దాడులు జరగకుండా చూసిననాడే అంబేద్కర్‌కు సరైన నివాళి అర్పించినట్లని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామజిక చైతన్య సైకిల్ యాత్రలో ఆయన పాల్లొన్నారు. కేవీపీఎస్ నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మర్ ను, గిరిజన సలహా మండలిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. దళితుల, గిరిజనుల కోసం ఉద్దేశించిన వసతి గృహాలను ప్రభుత్వం మూసివేస్తోందని వారిని విద్యకు దూరం చేస్తోందని వెంటనే వాటిని తెరవాలని డిమాండ్ చేశారు.

16:18 - April 7, 2016

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ లాయర్, రోజా లాయర్ లు వాదనలు వినిపించారు. సస్పెన్షన్ వ్యవహారం ఒక సెక్షన్ మాత్రమే పరిమితమౌతుందని రోజా తరపు లాయర్ వాదించారు. ఇరువురు వాదనలు విన్న సుప్రీం ఏపీ ప్రభుత్వానికి..అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.
డిసెంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కాల్‌ మనీ సెక్స్ రాకెట్‌ అంశంపై చర్చ కోసం వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో వ్యక్తిగత దూషణలకు దిగారు. తనను రోజా అసభ్యకరంగా దూషించారనీ..రోజా దూషణలతో తాను కలత చెందానని ఆరోపిస్తూ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. మరోపక్క, రోజా అసెంబ్లీలో వ్యవహరించిన తీరుని ఖండిస్తూ, ఏడాదిపాటు ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం జరిగిపోయింది. తన సస్పెన్షన్‌పై రోజా హైకోర్టుని, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టు సత్వర విచారణ చేపట్టి, రోజాకి ఊరటనిచ్చింది. దాన్ని సవాల్‌ చేసిన అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు రోజా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణలు చెప్పారని వార్తలు వచ్చాయి. దీనిపై కమిటీ స్పీకర్ నివేదిక అందించనున్నారు. ఈనెల 21 ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించనుందో వేచి చూడాలి. 

16:15 - April 7, 2016

హైదరాబాద్‌ : నేరేడ్‌మెట్‌లో బాలుడి హత్య చేసింది కన్న తల్లేనని పోలీసులు తేల్చారు.. పాప పుట్టలేదన్న బాధతో చిన్నారిని చంపివేసిందని స్పష్టం చేశారు.ఆపరేషన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేయడంతో ఆందోళన చెందిన ఆమె ఈ హత్య పాల్పడిందని చెప్పారు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో ఎలాంటి చైన్‌ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేశారు.

16:11 - April 7, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న కేసీఆర్‌..ఆ కోటి ఎకరాల లెక్క ప్రజలకు వివరించాలని టీడీపీ నేత రావులచంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో పూర్తి అయిన  ప్రాజెక్టులను లెక్కలోకి తీసుకుంటారా లేదంటే కొత్తగా కట్టే ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీళ్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

16:02 - April 7, 2016

హైదరాబాద్ : ఎఫ్‌ఆర్‌బీమ్‌ పరిధిని కేంద్రం 3 నుంచి 3.5 పెంచినందున రైతుల రుణమాఫీని పూర్తి చేయాలని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌బీమ్‌ను కేంద్రం 3.5కి పెంచడంతో తెలంగాణకు అదనంగా 3వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని...ఆ 3వేల కోట్లను రైతు రుణమాఫీకి బదలాయించి రైతులకు రుణవిముక్తి కల్పించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

15:54 - April 7, 2016

తూర్పుగోదావరి :  జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోనసీమ ఉత్సవాలు ముమ్మిడివరం మండలం గాడిలంక నదీపాయల మధ్య బుధవారం ఉదయం 2 కే రన్‌తో ప్రారంభమయ్యాయి. 50 ఎకరాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పర్యాటకులకు పలు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనా ఆలయాలను ఈ వేడుకల్లో  నిర్మించారు. సినీ కళాకారులు గాయనీ గాయకులు ఆహూతులను అలరించారు. కోనసీమ వైభవం ఉట్టిపడే విధంగా నిర్వహించిన 'లేజర్‍ షో' అందరినీ అలరించింది. ఈ వేడుకలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి.

టీఎస్పీ ఎస్సీ మరో నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 2,444 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ లో 758 పోస్టులు..పాఠశాల విద్యాశాఖ 313 పోస్టులు..బీసీ వెల్ఫేర్ - 307పోస్టులు..ట్రైబల్ వెల్ఫేర్ -436 పోస్టులు..మైనార్టీ వెల్ఫేర్ -630 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 

అగ్రిగోల్డ్ కేసు విచారణ వాయిదా..

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈనెల 20, 21 తేదీల్లో తొలి దశ వేలం నిర్వహించనున్నట్లు హైకోర్టుకు అగ్రిగోల్డ్ కేసు కమిటీ తెలిపింది. కమిటీకి సహకరించడం లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కమిటీ ఫిర్యాదు చేసింది. రెండో దశ వేలానికి ఆస్తుల వివరాలను తెలపాలని అగ్రిగోల్డ్ ను కోర్టు ఆదేశించింది. 

15:45 - April 7, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పాటియాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు ఆప్‌ నేతలకు కూడా బెయిల్‌ లభించింది. గురువారం ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణనను మే 19కి వాయిదా వేసింది. విచారణ నిమిత్తం కోర్టుకు కేజ్రీవాల్, ఆప్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో బీజేపీ - ఆప్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆప్‌ మద్దతుదారులు వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఏం జరిగింది ? 
డీసీఏ (ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ అక్రమాల్లో జైట్లీ పాత్ర ఉందంటూ సీఎం కేజ్రీవాల్ పలు వ్యాఖ్యాలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ సందర్భంగా తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనతోపాటు కుటుంబ పరువు తీసారని జైట్లీ పది కోట్లకు.. కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనికి కేజ్రీవాల్ స్పందించి.. ఇలాంటి కేసులతో తనను భయపెట్టలేరని.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని గతంలో పేర్కొన్నారు. డీడీసీఏ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు జైట్లీ హాజరై ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

రోజా సస్పెన్షన్ పై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత వారం సుప్రీంకోర్టును రోజా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

శ్రీవారి ఆయంలో ఉగాది ఆస్థానం..

చిత్తూరు : శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఉదయం 7 నుండది 9 గంటల వరకు ఉగాది ఆస్థానం ఉంటుందని జేఈవో వెల్లడించారు. బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం ఉంటుందని, మధ్యాహ్నం 12గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన క్యూ లైన్ లు ప్రారంభిస్తామన్నారు. ఉగాది ఆస్థానం కారణంగా రాత్రి ఒంటి గంటకు సుప్రభాత సేవ ఉంటుందని, సహస్ర దీపాలంకరణ సేవ మినహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. 

కేజ్రీవాల్ కు బెయిల్..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పాటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా బెయిల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు గురువారం విచారించింది. ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణనను మే 19కి వాయిదా వేసింది. 

త్వరలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక - మేయర్..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో మైనారిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఆహ్వానించడం జరిగిందని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయడం జరిగిందని, త్వరలో మరోసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

కృష్ణా పుష్కరాలపై మంత్రి యనమల సమీక్ష....

విజయవాడ : కృష్ణా నది పుష్కరాలపై మంత్రి యనమల సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాలలో జరిగిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల సంఘమ స్థానాన్ని రూ.20 కోట్ల ఖర్చుతో టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఘాట్ ను పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామన్నారు. 

కోర్టు మందలించినా సర్కారులో చలనం లేదు: తమ్మినేని

మెదక్ : కరువు అధ్యయన యాత్రలో భాగంగా సింగూరు ప్రాజెక్టును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందనీ...ఈ విషయంపై న్యాయస్థానం అక్షింతలు వేసినా సర్కారు చలనంలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కరవుపై నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

14:51 - April 7, 2016

ఆధునిక జీవన శైలిలో ఎంతో మంది తరచుగా ఎదుర్కొనే సమస్య బ్యాక్ పెయిన్. అనేకానేక కారణాలు ఈ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారమార్గాలున్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:50 - April 7, 2016

వైద్య రంగం అనేక కొత్త సేవలను ఆవిష్కరిస్తోంది. శాస్త్ర పరిశోధనలు అనేక ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో మానవాళి ఆయుర్ధాయాన్ని పెంచే అనేక అధ్యయనాలు ఒక వైపు జరుగుతుంటే అంతే స్థాయిలో ఆరోగ్య స్థితిగతులను సవాల్ చేస్తూ సమస్యలూ ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బీట్ ద డయాబెటిస్ అని పిలుపునిచ్చింది. ప్రపంచాన్ని ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ముందు వరుసలో నిలుస్తోంది. జీవనశైలిలో చిన్న మార్పులు, తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి బారిన పడిన వారు కూడా చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పని వ్యాయామంతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంది. రోజు రోజుకి ప్రమాదకరమైన సంకేతాలందిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను వెంటతెస్తున్న డయాబెటిస్ ఎందుకొస్తుంది? మహిళల ఆరోగ్యంపై ఈ వ్యాధి ప్రభావమెంత? దీనిపై ప్రత్యేక కథనం. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:33 - April 7, 2016

ముంబై : ప్రఖ్యాత భారతీయ సితార్‌ విధ్వాంసుడు పండింట్‌ రవిశంకర్‌ జయంతిని పురస్కరించుకుని గూగుల్‌ డూడుల్‌ ద్వారా నివాళి అర్పించింది. సితార్‌ వాయిద్యాన్ని డూడుల్‌లో అమర్చి గూగుల్‌ హోంపేజీలో ఉంచింది. భారతీయ సంగీత సాధనాలను పాశ్చాత్య సంగీతంలో ఉపయోగించి రవిశంకర్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హిందుస్థానీ సంగీతంలో గొప్ప విధ్వాంసుడుగా పేరు తెచ్చుకున్న ఆయన దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అందుకున్నారు. 

14:31 - April 7, 2016

రాజస్తాన్‌ : కల్తీ మద్యం ఏడుగురు ప్రాణాలు బలి తీసుకుంది. మృతుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారని తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన బార్మర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. మద్యం తాగి 29 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరిని బార్మర్‌, జోధ్‌పూర్‌ ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఏడుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 22 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి మద్యంలో కల్తీ జరగలేదని, మంచినీళ్లలో సెనైడ్ కలిపారని ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

14:28 - April 7, 2016

మెదక్ : కరవుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కరువుపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. జిల్లా హత్నూర మండలం శెరభాన్ పల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 46 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాలేదని చెబుతున్నారని, కేంద్రాన్ని కూడా అరకొర సహాయం అడిగారని విమర్శించారు. యుద్ధప్రాతిపదికన కదిలి చర్యలు చేపట్టాలని, ఈ నెల 12 వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతారని తెలిపారు. స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు ప్రజలు సిద్ధమౌతారని, ఇందుక నాయకత్వం వహించడానికి సీపీఎం సన్నద్ధమౌతుందన్నారు. 

14:24 - April 7, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన దళితులకు అన్యాయం చేసే విధంగా ఉందని ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇష్టం వచ్చినట్లు విలాసాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఆధారాలున్నాయని, దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతాలలో దళితులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు.. దళితుల కోసం రాష్ట్రంలో ఏం చర్యలు చేపడుతన్నారో తెలపాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

14:20 - April 7, 2016

హైదరాబాద్ : మాదిగల విశ్వరూప యాత్రకు హైకోర్టు సింగిల్‌ జడ్జ్ అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు లేని శాంతిభద్రతల సమస్య తాను యాత్ర చేస్తేనే వస్తుందా అని ప్రశ్నించారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు. యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ మందకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ యాత్రతో శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసుల తరపు లాయర్‌ వాదించారు. పోలీసుల వాదనలో నిజం ఉందన్న కోర్టు. విశ్వరూప యాత్రకు అనుమతి నిరాకరించింది. తమ ఆవేదనను అర్థం చేసుకోవాల్సినవసరం ఉందని, న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించామని, ఇక ఏ వ్యవస్థపై నమ్మకం పెట్టుకోవాలని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.  

బుర్ద్వాన్ లో స్థానికుల ఆందోళన..

పశ్చిమ బెంగాల్ : బుర్ద్వాన్ లో స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందడంపై వారు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేపడుతున్నారు. 

బీఎస్పీ ఎంపీ కశ్యప్ అరెస్టు..

ఉత్తర్ ప్రదేశ్ : బీఎస్పీ ఎంపీ నరేంద్ర కశ్యప్, ఆయన సతీమణిని పోలీసులు అరెస్టు చేశారు. గజియాబాద్ లో కోడలు మృతిపై వారిపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. 

13:51 - April 7, 2016

తూర్పుగోదావరి : 100 ఏళ్ల చరిత్ర ఉన్న మార్కెట్ ను స్మశానానికి తరలించేందుకు రంగం సిద్దమైంది. పెద్దల కన్ను పడడమే ఆలస్యం...అది మార్కెట్ అయినా బస్టాండ్ అయినా ఊరి బయటకు తరలిపోవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం సంత మార్కెట్ ను  శివారు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు అధికారులు. దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.  
సంత మార్కెట్ ను నమ్ముకుని జీవనం
ఏళ్ల  తరబడి సంత మార్కెట్ ను నమ్ముకుని వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దాపురం మున్సిపాలిటీకి ఎంత చరిత్ర ఉందో .. 150 ఏళ్ల  చరిత్ర కలిగింది సంత మార్కెట్ . తరతరాలుగా  మార్కెట్ ను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు.. మార్కెట్ మార్చాలనే ప్రతిపాదనతో    వారి బతుకులు అయోమయంలో పడ్డాయి. 
చుట్టు పక్కల గ్రామాల నుండి సంతకు ప్రజలు
చిన్న మార్కెట్ గా ఉన్న సంతలో.. కూరగాయలను , వస్తువులను కొనుగోలు చేసేందుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు వస్తుంటారు. దీంతో  మార్కెట్ బాగా  అభివృద్ది చెందింది. మార్కెట్ ను ఆనుకుని బంగారం నుండి బట్టల షాపుల వరకు అనేక వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రజలు. ఏడాదికి కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ..ఉన్నపలంగా మార్కెట్ ను తరలించి ఊరిబయట స్మశానం ప్రక్కన మర్కెట్ ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీనిపై  స్థానికులు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
బస్టాండ్ పేరిట భూమలకు ధరలు పెంచాలనే ఆలోచన
ఏ నాయకుడి కన్నుపడిందే.. ఏ బడా వ్యాపారస్తుడు.. మోజు పడ్డాడో తెలియదు కాని పెద్దాపురం సంత మార్కెట్ ను తరలించాలనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. ఊరిచివర ఉన్న బస్టాండ్ ను అభివృద్ది చేస్తామని నాయకుల మాటలు చెబుతున్నా... దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రైవేట్  భూముల ధరలు పెంచాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతం కావడం ...రవాణాకు అంతరాయం ఏర్పడే విధంగా ఉండడంతో .. ఆ ప్రాంతంలో సంతను ఏర్పాటు చేస్తే అనుకున్న స్థాయిలో వ్యాపారాలు జరగవని స్థానికులు వాపోతున్నారు. అధికారుల ఆలోచనల కారణంగా ఏళ్లుగా ఉన్న  మార్కెట్  తరలింపు కారణంగా వందల మంది జీవితాలు రోడ్డున పడతాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.  

 

వీసీ అప్పారావును తొలగించాలి – నారాయణ..

హైదరాబాద్ : యూనివర్సిటీలను పోలీసు క్యాంపులుగా మార్చారని, హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. 

కేరళ, బెంగాల్ లో వామపక్షాలదే విజయం - సురవరం..

హైదరాబాద్ : కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలు విజయం సాధించడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పనామా పేపర్స్ అంశం ఆందోళన కలిగిస్తోందని, పనామాకు డబ్బులు ఎలా వెళ్లాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు దేశభక్తి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నారని తెలిపారు. 

13:47 - April 7, 2016

చిత్తూరు : జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. చింటూ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మేయర్ దంపతుల హత్యకేసులో చింటూ ప్రధాన నిందితుడు. విచారణలో భాగంగా పోలీసులు చింటూను కోర్టుకు తీసుకువచ్చారు. చిత్తూరు కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో ఒక బాంబు పెట్టారు. కోర్టుకు సమీపంలో గొయ్యిలో మరో బాంబు పెట్టారు. విచారణలో భాగంగా పోలీసులు చింటూను కోర్టుకు తీసుకువచ్చారు. ఈక్రమంలో 11.30 గంటల ప్రాంతంలో ఒక బాంబు పేలింది. దీంతో బాలాజీ అనే ఓ లాయర్ గుమస్తాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ సిబ్బంది మరో బాంబును నిర్వీర్వం చేసేపనిలో ఉన్నారు. అయితే చింటూను హత మార్చేందుకే బాంబులను అమర్చినట్లు తెలుస్తోంది. ఒక చోట మిస్ అయినా... మరో చోట హత మార్చాలని రెండు బాంబులను అమర్చినట్లు కనిపిస్తోంది. పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. 

 

తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది వేడుకలు : మంత్రి పల్లె

విజయవాడ : ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది వేడుకలను నిర్వహిస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ కళారంగాల్లో నిపుణులైనవారికి ఉగాది పురస్కారాలను అందజేస్తామని మంత్రి తెలిపారు.

13:35 - April 7, 2016

విజయవాడ : విద్యుత్ రంగంలో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యుత్‌ ఆదాపై విజయవాడలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును సీఎం ప్రారంభించారు. విద్యుత్‌ను ఆదాచేసే పంపుసెట్లను, ఫ్యాన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఇంధన పొదుపు సదస్సు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హుద్ హుద్ తుపాన్ ప్రభావం నుంచి త్వరగా కోలుకునేలా వినూత్న ఆలోచన చేశామని చెప్పారు. వినూత్న ఆలోచనే కాదు... వాటిని అమలులో పెట్టాలని సూచించారు. 2 లక్షల మంది రైతులకు విద్యుత్ ఆదా పంపు సెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. దళలవారిగా మిగతా రైతులందరికీ అందిస్తామని తెలిపారు. ఎల్ ఈడీ బల్బుల పంపిణీతో విద్యుత్ ను ఆదా చేస్తున్నామని చెప్పారు. ఇంధన పొదుపుకు సంబంధించన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

 

పసికందుని వదిలి వెళ్లేందుకు యత్నించిన దంపతులు...

కడప : ఆడపిల్ల పుట్టిందని పసికందుని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఇది గమనించిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో పాపను తీసుకువెళ్ళారని వైద్యులు తెలిపారు.

ఇన్ కమ్ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలకు 2వస్థానం...

హైదరాబాద్ : ఇన్ కమ్ ట్యాక్స్ వసూళ్లపై ఇరు రాష్ట్రాల ఇన్ కంటాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్  మాట్లాడారు. పన్ను వసూళ్ళలో 15 శాతం వృద్ధిని సాధించామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఏపీలో రూ.4332 , తెలంగాణలో రూ.32,331కోట్లు పన్ను రూపంలో వసూలు చేశామని తెలిపారు. ట్యాక్స్ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు రెండవ స్థానంలోవున్నాయన్నారు. పన్ను ఎగ్డొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో 36 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 4,83,398 మంది కొత్తగా పన్ను చెల్లించినట్లు పేర్కొన్నారు.

13:12 - April 7, 2016

నిజామాబాద్‌ : జిల్లా అగ్నిమాపక శాఖపై తెలంగాణ ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోంది.. వాహనాలు సరిపోక... ఖాళీ పోస్టులు భర్తీ కాక ఈ విభాగం సమస్యల్లో చిక్కుకుంది.. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా ఈ శాఖను పట్టించుకునేవారే కరువయ్యారు. 
జిల్లాలో 9 అగ్నిమాపక కేంద్రాలు
ఎక్కడ ఏ చిన్న మంటలు అంటుకున్నా ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించకుంటే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.. మంటల తీవ్రతతో జనాల ప్రాణాలు పోవడంతోపాటు.. కోట్ల రూపాయల ఆస్తి బూడిదగా మారిపోతుంది.. అంతటి ముఖ్యమైన ఈ శాఖను తెలంగాణ ప్రభుత్వం గాలికొదిలేసింది.. నిజామాబాద్‌ జిల్లాలో ఈ శాఖ పరిస్థితి దారుణంగా మారింది.. జిల్లాలో మొత్తం 9 అగ్నిమాపక కేంద్రాలున్నాయి.. నిజామాబాద్, బోదన్, బాన్సువాడ, కామారెడ్డి, ఆర్మూరు, ఎల్లారెడ్డి, మద్నూరులో ఈ శాఖకింద కేంద్రాలు పనిచేస్తున్నాయి.. గాందారి, భీంగల్ కేంద్రాలను ప్రైవేటు ఏజన్సీలు నిర్వహిస్తున్నాయి.. ఇక వాహనాల విషయానికివస్తే నిజామాబాద్‌లో రెండు.. మిగిలిన కేంద్రాల్లో ఒక్కో వాహనాన్ని ఏర్పాటుచేశారు.
జిల్లా వ్యాప్తంగా 36 ఫైర్ మెన్ పోస్టులు ఖాళీ
నిపుణుల సూచనప్రకారం లక్ష జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి.. జిల్లాలో 25లక్షల మంది జనాభాకు కేవలం తొమ్మిది వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి.. ఇలా వాహనాల కొరతేకాదు.. ఖాళీ పోస్టులూ ఈ శాఖను ఇబ్బందిపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 36 ఫైర్ మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. బాన్సువాడ  స్టేషన్‌లో అగ్నిమాపక అధికారి, ఆపరేటర్ పోస్టులు ... ఎల్లారెడ్డిలో ఆపరేటర్ పోస్టు, మద్నూరులో మూడు ఆపరేటర్ పోస్టులు భర్తీకోసం ఎదురుచూస్తున్నాయి.. కొత్తగా ఏర్పాటు చేసిన మద్నూరు కేంద్రమైతే మొత్తం ఖాళీగా ఉంది.. ఇక్కడున్న సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఇతర ఫైర్‌ కేంద్రాలకు పంపారు.. 
2008-09 సంవత్సరంలో 1253 ప్రమాదాలు 
జిల్లాలో ఇలా సమస్యలమధ్య కొట్టుమిట్టాడుతున్న అగ్నిమాపక శాఖ తీరుతో ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందడంలేదు.. ఆరేళ్లకాలంలో అగ్ని ప్రమాదాల సంఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.. 2008- 09 సంవత్సరంలో 1253 ప్రమాదాలు సంభవించగా.. 6కోట్ల 46లక్షల ఆస్తినష్టం జరిగింది.. మంటల్లో చిక్కుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. 2011-12లో 955చోట్ల అగ్నిప్రమాదాలు జరగగా 6కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.. పదిమంది చనిపోయారు.. 2012-13లో 881 ప్రమాదాలు చోటుచేసుకోగా 6కోట్ల 74లక్షల ఆస్తి నష్టం జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. 2013-14లో 764చోట్ల మంటలంటుకోగా 11కోట్ల 42లక్షల ఆస్తి నష్టం సంభవించింది.. ఇద్దరు చనిపోయారు.. 2014 -15 లో 799చోట్ల ప్రమాదాలు సంభవించగా 6కోట్ల 82లక్షలవిలువైన ఆస్తి కాలిబూదిదైంది.. ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇలా జిల్లాలో ప్రమాదాలు పెరుగుతున్నా ఈ శాఖపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టిపెట్టడంలేదు. అగ్నిమాపక కేంద్రాలను పెంచి పోస్టులను భర్తీ చేసినప్పుడే ఈ ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వినూత్నంగా ముందుకెళుతున్నాం : సీఎం చంద్రబాబు

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఇంధన సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సదస్సులో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా 35 దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ఇంధన సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరంగా వుందన్నారు. విద్యుత్ రంగంలో వినూత్న ఆలోచనలో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎల్ ఈడీ బల్బులను పంపిణీ చేసి 21 మెగావాట్ల విద్యుత్ ను ఆదా చేయగలిగామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ ను ఆదా చేయాల్సిన అవుసరముందని సూచించారు.

12:58 - April 7, 2016

హైదరాబాద్ : మూసిన‌దిని ఆధారం చేసుకొని ప్రాణం పోసుకున్న మహానగరం హైదరాబాద్‌. నగరం విస్తరించి ఏకంగా మూసినే మురికి మ‌యం చేసింది. కాలుష్య వ్యర్థాల‌తో మూసి మురికి కూపంగా మారిపోగా, అధికారులు అలసత్వంతో క‌బ్జాకోర‌ల్లో మూసి బ‌క్కచిక్కిపోయింది. గత ప్రభుత్వాలు  మూసి ప్రక్షాళ‌న‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాయి. తాజా తెలంగాణ ప్రభుత్వం సైతం  క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. 
మూసినది 35 కిలో మీటర్ల మేర ప్రవాహం
నగరంలో మూసినది సూమారు 35 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించిన ఈ నది, ఇప్పుడు మురుగు నీటికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్య వ్యర్థాలతో ఈ మురుగు నీరు కాలకుట విషం లాంటిది. ఒకప్పుడు నది పరివాహ ప్రాంతంలో అనేక పంటలకు సాగునీటిని అందించిన మూసీ... ఇప్పుడు కలుషితమైన నీటితో దోమలకు కేంద్రంగా మారింది. 
ప్రతి రోజు మూసీలో 1350మిలియ‌న్ లీట‌ర్ల మురుగు
మూసిలోకి ప్రతిరోజు 1350మిలియ‌న్ లీట‌ర్ల మురుగు చేరుతుంది. ఇందులో మాన‌వ వ్యర్థాల‌తో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయి. న‌గ‌రంలోని 30కి పైగా ప్రధాన‌ నాలాల ద్వారా మూసిలోకి మురుగు చేరుతుంది. అత్తాపూర్, అంబ‌ర్ పేట్,  నాగోల్.., న‌ల్లచెరువు ప్రాంతాల్లో  మురుగును శుద్ది చేయడానికి  సివ‌రేజ్ ట్రీట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు అన్ని కూడా రోజుకు 600 మిలియ‌న్ లీట‌ర్లకు నీటిని శుద్ధి చేయాలి. కానీ ఆ పని జరగడం లేదు. 
సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరిట గత ప్రభుత్వం పనులు
సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయాలని తలపెట్టింది.  హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, జిహెచ్ఎంసి మూసీ ప్రక్షాళ‌న‌ పనులు చేపట్టాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేశించింది. గ్రేట‌ర్ ప‌రిధిలో ఉత్పత్తి అయ్యే ముర‌గును శుద్ధి చేయడానికి వాట‌ర్ బోర్డు ఇప్పటికే 400కోట్లకుపైగా ఖ‌ర్చుచేసింది.  మురుగును మ‌ళ్లించ‌డానికి  ప్రత్యేక పైపు లైన్లను ట్రిట్ మెంట్‌ ప్లాంట్స్ వ‌ర‌కు ఏర్పాటు చేశారు. కాని ప‌లు ప్రాంతాల్లో ఈ వ్యవ‌స్థ ప‌నిచేయక పోవ‌డంతో సివ‌రేజ్ వాట‌ర్ మూసిలోకి చేరుతుంది. స‌రైన నిర్వహ‌ణ లేని కార‌ణంగా  ఉన్న సౌక‌ర్యాలు కూడా  స‌రైన రీతిలో ఉప‌యోగప‌డ‌టం లేదనే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇప్పుడు కొత్తగా  చేపట్టే ప్రక్షాళ‌న‌లోనైనా చుక్క మురుగుకూడా మూసిలోకి వెళ్లన‌ప్పుడే మూసి స్వచ్ఛమైన నీటితో ఉంటుంది. 
నానాటికి హరించుకుపోతున్న మూసీ నది  
హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రవహించే నది మూసీ నది నానాటికి హరించుకుపోతోంది. ఒకప్పుడు నిండుగా ప్రవహించిన మూసీ ఇప్పుడు కబ్జాల గ్రహణం పట్టి పిల్ల కాలువలా మారుతోంది. నదికి ఇరువైపులా కబ్జాలు యధేచ్ఛగా సాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. హైదరాబాద్‌ న‌గ‌రం మ‌ధ్యలో ఉన్నమూసి చాలా విశాలంగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో 500మీట‌ర్ల నుండి 800మీట‌ర్ల వ‌ర‌కు వెడ‌ల్పు ఉండేది, రోజు రోజుకు పెరుగుతున్న క‌బ్జాలు మూసిని బ‌క్కచిక్కించాయి. ఓ వైపు నివాస స‌ముదాయాలు, మ‌రో వైపు వ్యాపారులు మూసిని పూడ్చిమ‌రి త‌మ ప‌నులు కానిచ్చేస్తున్నారు. న‌ది మ‌ధ్యలో బోర్లు వేసి మ‌రి నీటిని తోడుకుంటున్నా, చ‌ట్టాల‌ను ర‌క్షించే అధికార‌గ‌ణం  ప‌ట్టించుకోవ‌డం లేదు అధికార‌గ‌ణం. 
నది 10నుంచి 15శాతం వరకు కబ్జాకు
గత కొన్ని సంవత్సరాలుగా ఈ నది 10నుంచి 15శాతం వరకు కబ్జాకు గురైంది. రివ‌ర్ బెడ్ లోకి  నివాస స‌ముదాయాలు రావడం, వ్యాపార  అవ‌స‌రాల‌కోసం న‌దిని పూడ్చడం వంటి చ‌ర్యలు అనేకం జ‌రిగాయి. మూసి రివ‌ర్ బెడ్ లో దాదాపు 6వేల నివాసాలు వెలిశాయంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. 2005 ఆగస్ట్ లో ప్రారంభించిన మూసీ పచ్చదనం ప్రాజెక్ట్ 30నెలల్లో పూర్తి కావలసి ఉంది. అయినా ఇప్పటికి అనేక పనులు కొనసాగుతునే ఉన్నాయి. వాటర్ వర్క్స్ ద్వారా 367కోట్లు, జి హెచ్ ఎం సి 32కోట్లు ఖర్చు చేసింది. అయినా ఇప్పటికి మురుగు తగ్గలేదు సుందరీకరణ జరగలేదు. 
ప్రక్కనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు 
హైకోర్టు వద్ద భారీగా నిధులు వేచ్చించి రబ్బర్ డాం నిర్మించారు. ప్రక్కనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.  ఇది ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే అటకెక్కింది. మురుగు వెదజల్లే వాసనకు ప్రజలేవ్వరూ వాకింగ్‌ ట్రాక్‌ వైపు కన్నేత్తి చూడటంలేదు. దాంతో ట్రాక్ వృధా అయ్యింది.
మూసి ప్రక్షాళ‌న, సుంద‌రీక‌ర‌ణ 
రాష్ట్ర  ప్రభుత్వం మూసి ప్రక్షాళ‌న, మ‌రియు  సుంద‌రీక‌ర‌ణ అంశాన్ని మ‌రో సారి ముందుకు తెచ్చింది. మూసినదిని సుంద‌రిక‌రించి వివిధ ప్రాంతాల్లో పర్యాట‌క  అభివృద్ది కేంద్రాలుగా డెవ‌ల‌ప్ చేయడం  వంటి ప్రణాళిక‌లు రూపొందిస్తుంది.  అందుకోసం 3వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చిన ప్రభుత్వం  నిధుల‌ను విధేశి సంస్థల‌నుండి సేక‌రించాల‌ని ప్లాన్ చేస్తుంది. అయితే గ‌తంలో జ‌రిగిన ప‌నులు మాదికాకుండా నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసి దానిని అమ‌లు చేయ్యాలి. అందుకోసం  కేంద్రం నుంచి నేష‌న‌ల్ రివ‌ర్ క‌న్జర్వేష‌న్ డెవ‌ల‌ప్ మెంట్ మిష‌న్ ద్వారా వ‌చ్చే నిదుల‌ను రాబట్టడం ద్వారా ఆర్ధిక ఇబ్బందుల అధిక‌మించ‌వ‌చ్చు.

జిల్లా కోర్టులో బాంబు పేలుడు…..

తిరుపతి: చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసం అయింది. ఇద్దరు గాయాలపాలయ్యారు. చిత్తూరు మేయర్‌ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

12:47 - April 7, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో విజయ్‌మాల్యా రుణాల ఎగవేతపై విచారణ కొనసాగుతోంది. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానంటూ మాల్యా చేసిన ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. రూ.9వేల కోట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరాయి. అయితే బ్యాంకుల ప్రతిపాదనపై ఆలోచించుకునేందుకు తమకు 2వారాల గడువు కావాలని కింగ్‌ ఫిషర్‌ యాజమాన్యం కోర్టును కోరింది.

 

అవగాహన లేమితో మధుమేహం : మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జెండా వూపి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.... మధుమేహంపై ప్రజల్లో అవగాహన అవగాహన కల్పించాల్సి అవసరముందన్నారు. అవగాహన లేక చాలామంది ఈ వ్యాధికి గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నవదీప్ కూడా పాల్గొన్నారు.

12:44 - April 7, 2016

హైదరాబాద్ :  కోరిక తీరింది. కల నెరవేరింది. అనుకున్నది రానే వచ్చింది. ఇక మొక్కు తీర్చడమే మిగిలింది. ఆ ముచ్చటను కూడా పూర్తిచేయడానికి తెలంగాణ సీఎం రెడీ అయ్యారు. తిరుమలేశుడికి బంగారు ఆభరణాలను సమర్పించేందుకు అన్నీ సిద్ధం చేయించారు. 
తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు
తెలంగాణ వస్తే తిరుపతి వెంకటేశ్వరస్వామి వారికి ఆభరణాలు చేయించి కానుకగా ఇస్తామని మొక్కుకున్న కేసీఆర్‌..ఆ మొక్కును తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరున కేసీఆర్‌ తిరుమల వెళ్లనున్నారు. తిరుమలేశుడిని దర్శించుకుని ..ప్రభుత్వం తరుపున వెంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలను బహుకరిస్తారు. 
ఆభరణాలు తయారి బాధ్యత టీటీడీకి అప్పగింత
వెంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు తయారుచేయించే పని తెలంగాణ ప్రభుత్వం టీటీడీకే అప్పగించింది. దీని కోసం  5 కోట్ల రూపాయలను  దేవస్థానం ఖాతాలో జమ చేసింది. నగల తయారీకి టీటీటీ టెండర్లను కూడా పిలిచింది. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్‌ కాళిదాస్‌ జ్యువెలర్స్‌ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. 22 క్యారెట్ల బంగారంతో, గ్రాము రూ.2,611తో ఆభరణాలు తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. 
స్వర్ణాభరణాలను స్వామి వారికి సమర్పించనున్న కేసీఆర్‌
మొత్తం 19.02 కేజీల బంగారంతో సాలిగ్రామ హారం, ఐదు పేటల కంఠెను కీర్తిలాల్‌ జ్యువెలర్‌ సంస్థ తయారుచేసింది.  ఆభరణాలను ..తయారీ సంస్థ దేవస్థానం ఖజానాకు చేర్చింది. స్వర్ణ ఆభరాలు సిద్ధంగా ఉన్నాయన్న సమాచారాన్ని టీటీడీ తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఈ నగలను స్వామి వారికి సమర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెలాఖరున తిరుమల వెళ్లనున్నారు.  ఈ పర్యటనకు సంబంధించి సీఎం కార్యాలయం టీటీడీకి సమాచారం అందించింది. 

 

12:40 - April 7, 2016

కడప : కాచిగూడ, హంపి ఎక్స్ ప్రెస్‌ రైళ్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కడప జిల్లా పుల్లంపేట వద్ద కాచిగూడ ఎక్స్ ప్రెస్‌లో చోరీ జరిగింది. ఇద్దరు మహిళలను దుండగులు కత్తులతో బెదిరించి వంద గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద హంపి ఎక్స్ ప్రెస్‌ రైల్లో దోపిడీ జరిగింది. గార్లదిన్నె స్టేషన్‌ దగ్గర సిగ్నల్‌ వైర్లు కట్‌ చేసి హుబ్లీ నుంచి మైసూరు వెళ్తున్న హంపీ ఎక్స్ ప్రెస్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

 

12:36 - April 7, 2016

పశ్చిమగోదావరి : టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది.. అంతరిక్షంలోకి రాకేట్లను పంపుతున్నాము.. అత్యాధునిక సమాజంలో ఉన్నాము.. ఎంతో జ్ఞానం పొందాము.. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్ధాలు దాటింది. కానీ సమాజంలో ఇంకా మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఫరిడవిల్లుతున్నాయి. మంత్రాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో అమాయకులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పగో జిల్లాలో మరో ఘటన జరిగింది. జిల్లాలోని బుట్టాయగూడెం గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. గ్రామస్తుల దాడి నుంచి మరొకరు తప్పించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

 

నివేదికలు పంపిన రాష్ట్రాలకే నిధుల విడుదల : మంత్రి వెంకయ్య

ఢిల్లీ : కరువు సహాయ నిధుల విడుదలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపితేనే కేంద్ర కరువు బృందాలు ఆయా ప్రాంతాలలో పర్యటించి నివేదికను కేంద్రానికి అందజేస్తాయని తెలిపారు. నివేదికలు పంపిన రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తామన్నారు. గతంలో 50 శాతం పంట నష్టపోతేనే నష్టపరిహారం వచ్చేదనీ...కానీ మోదీ అధికారంలోకి వచ్చాక 30 శాతం పంట నష్టపోయినా పరిహారాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు. విపత్తు వల్ల మృతి చెందిన వారికి గతంలో రూ.1.20 లక్షల నుండి ఇప్పుడు రూ.4లక్షలకు పెంచామని పేర్కొన్నారు. 

12:22 - April 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ప్రజాక్షేత్రంలోకి దూకింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీ జేఏసీ..ఇప్పుడు ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మలి ఉద్యమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అధికార‌, విప‌క్ష పార్టీల మ‌ధ్య సాగునీటి ప్రాజెక్టులు ప్రకంపనాలు రేపుతున్నా.. ప్రజల్లోకి వెళ్లి అస‌లు స‌మ‌స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. టీ జేఏసీకి పూర్వ వైభ‌వం రావాలంటే  ప్రజా సమస్యల ఎజెండాగానే ప‌ని చేయాల‌ని జాక్ నిర్ణయించింది.   
టీ.ఉద్యమంలో కీల‌కంగా టీజాక్ 
తెలంగాణ ఉద్యమంలో కీల‌కంగా వ్యవహరించిన టీజాక్ మ‌రోసారి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఎలాంటి చురుకైన కార్యక్రమాల్లో పాల్గొనని టీ జాక్‌.. మరోసారి కీ రోల్‌ ప్లే చేసేందుకు ప్రణాళికల్ని  ర‌చిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన కార్యక్రమాల నిర్వహణ క‌మిటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 10కిపైగా కీల‌క అంశాల‌పై పనిచేయాలని టీ జేఏసీ దృష్టి పెట్టింది. వీటికి సంబంధించి స్పష్టమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టేందుకు టీ జేఏసి సిద్దమవుతోంది. అందులో భాగంగానే తాజాగా జిల్లాల పర్యటనకు టీ జాక్ శ్రీకారం చుట్టింది. తెలంగాణాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనే యోచనలో జాక్ ఉంది. 
కరువు పరిస్థితులే మొదటి ఎజెండా 
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితులను మొదటి ప్రాధాన్యతగా జాక్ తీసుకుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాల్లో కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రెండు రోజుల పాటు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటనలను పూర్తి చేసింది. ఇతర జిల్లాల్లో కూడా నెలకొన్న కరవు పరిస్థితులపై సమాచారాన్ని కూడా సేకరిస్తోంది.  త్వరలో నిర్వహించే జాక్ కీలక సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు జేఏసీ సిద్ధమవుతోంది. 
ప్రాజెక్టుల రీడిజైన్‌పై నిపుణులతో చర్చ 
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై త్వరలో సాగునీటిరంగ నిపుణులతో చర్చించాలని జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని జేఏసి నిర్ణయించినట్లు సమాచారం. విద్యుత్ ఒప్పందాలు, విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం తదితర అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వంపై ఒత్తడి పెంచేందుకు జాక్ సిద్ధమవుతోంది. అయితే ఈనెల 9న జరిగే  జేఏసీ విస్తృతస్థాయి సమావేశం తర్వాత... భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 

12:07 - April 7, 2016

దేస్ పూర్ : అస్సాంలో రెండో విడత పోలింగ్ ప్రచారం మరింత ఉధ్రుతమైంది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు మొదటి విడత పోలింగ్ లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లేయడం ఆసక్తికరంగా మారింది.
బిజెపి, కాంగ్రెస్ లకు పెద్ద సవాల్ 
బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అస్సాం పెద్ద సవాలుగా మారింది. ఈ రెండు పార్టీలు విజయం కోసం హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. మిగిలిన 61 నియోజకవర్గాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. మొదటి దశ పోలింగ్ సరళిని క్షుణంగా అధ్యయనం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీల వ్యూహకర్తలు, రెండో దశ పోలింగ్ కు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. తొలి విడతలో 65 స్థానాలకు పోలింగ్ పూర్తవ్వగా, భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. 2011 అసెంబ్లీ ఎన్నికల కంటే అధికంగానూ, 2014 లోక్ సభ ఎన్నికల కంటే తక్కువగానూ ఓటింగ్ నమోదవ్వడంతో కాంగ్రెస్, బిజెపి అంతర్మథనంలో పడ్డాయి. అస్సాంలో భారీ ఓటింగ్ జరిగిన ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీలు దెబ్బతిన్నాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన కాంగ్రెస్ 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ముందు తట్టుకోలేకపోయింది. ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగాయ్ నాలుగోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో శ్రమిస్తున్నారు. తనకూ , మోడీకి మధ్యనే పోటీ జరుగుతోందన్న రీతిలో తరుణ్ గొగాయ్ ప్రచారం సాగిస్తున్నారు. ఈ రెండేళ్ల లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను, అస్సాం పట్ల చూపిన వివక్షను ఆయన వివరిస్తున్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ తన వయస్సు గురించి వ్యాఖ్యలు చేయడంతో తరుణ్ గొగాయ్ అస్సామి సెంటిమెంట్ ను రగిలించడంతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసలను నివారించడంలో విఫలమైందంటూ తరుణ్ గొగాయ్ పై ఎదురుదాడికి దిగారు. ఇవి లోక్ సభ ఎన్నికలు కాదు, అసెంబ్లీ ఎన్నికలంటూ 15ఏళ్ల కాంగ్రెస్ పాలనను తూర్పారబడుతున్నారు. 
ఆసక్తికరంగా మహిళల ఓట్లు 
మరోవైపు తొలి విడత పోలింగ్ లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లేయడం ఆసక్తికరంగా మారింది. 65 స్థానాలకు తొలి విడత పోలింగ్  జరిగితే, 35 స్థానాల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం కనిపించింది. 13 జిల్లాల్లో పోలింగ్ జరగగా, తొమ్మిది జిల్లాల్లో మహిళాలోకపు సందడే ఎక్కువగా కనిపించింది. తొలివిడతలో 82.58శాతం మంది మహిళలు ఓట్లేస్తే, 81.84 శాతం మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి సర్వానంద సోనోవాల్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల ప్రభంజనం కనిపించడం మరింత ఉత్కంఠ రేపుతోంది. మహిళా ఓటర్లు ఎవరిని కనికరించారో, ఎవరిని శపించారో అర్ధం కాక అభ్యర్థులు టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు.  
65 స్థానాల్లో 55 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు 
తొలి విడత పోలింగ్ జరిగిన 65 స్థానాల్లో 55 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం.  ఈ 65 స్థానాల్లో కనీసం 40 గెలుచుకోలేకపోతే, అధికారంలోకి రావడం కష్టమన్నది బిజెపి నేతల అభిప్రాయం.  రెండో విడత లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం వున్న స్థానాలే ఎక్కువ.  ఆల్ ఇండియా  యునైటెడ్  డెమోక్రటిక్ ఫ్రంట్ కి మైనార్టీలలో గట్టు పట్టుంది. 

 

అంతర్జాతీయ ఇంధన సదస్సు ప్రారంభమైంది….

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో అంతర్జాతీయ ఇంధన సదస్సు ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సును ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా 35 దేశాల ప్రతినిధులుసదస్సులో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఇంధన పొదుపునకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.

12:00 - April 7, 2016

హైదరాబాద్ : టీచర్లకు ఏకీకృత సర్వీసుల ఫైల్‌పై సీఎం కేసిఆర్ సంతకంతో ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కేంద్రానికి సుప్రీం అక్షింతల తరువాత మరోసారి సర్వీస్‌ రూల్స్‌ విధానం తెరపైకొచ్చింది. దీనిపై రాష్ట్ర సర్కార్ సంతకాలు చేసి ఫైల్‌ను కేంద్రానికి పంపడంతో విషయం సెంట్రల్‌ కోర్టుకు చేరినట్లైంది. దస్త్రంపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే స్టేట్‌లో విద్యావ్యవస్థ గాడిన పడే అవకాశముంటుంది. 
ఫైల్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర తప్పనిసరి
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ దస్త్రం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్రం.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. ఇక ప్రణబ్‌ ఆమోదం తెలిపితే ఏకీకృత సర్వీస్‌ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఫలితంగా రాష్ట్ర విద్యాశాఖలో పదోన్నతులకు ఆటంకాలు తొలగిపోతాయి. దీనితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మరింత పెరిగే అవకాశముంది.
15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం
ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల మధ్య ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. గతంలో వైఎస్ హయాంలో కేంద్రం చేతికి ఈ ఫైల్ వెళ్లినప్పటికీ ఎటువంటి సిఫార్సులు లేకుండానే తిరిగి వచ్చింది. అప్పటినుంచి ఉపాధ్యాయుల ఎదురుచూపులు కొనసాగుతూనే వున్నాయి. ఈసారి తెలంగాణా ముఖ్యమంత్రి ఏకీకృత విధానంపై పట్టుబట్టి కేంద్రానికి మళ్లీ ఫైల్‌ను పంపారు. అయితే ఈ సంతకంతోనే అంతా పూర్తయిందనుకుంటే పొరబాటేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని కేంద్రం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సుంటుందన్నారు. 
కుంటుపడిన రాష్ట్ర విద్యావ్యవస్థ
టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్‌ లేకపోవటంతో స్కూళ్లలో పర్యవేక్షణ నిలిచిపోయింది. ఫలితంగా రాష్ట్ర విద్యావ్యవస్థ కుంటుపడింది. ఏకీకృత సర్వీస్ రూల్‌ వస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్ స్థాయి విద్యాధికారుల భర్తీకి లైన్ క్లియరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు గతయేడాది సెప్టెంబర్ 30నే తీర్పువెలువరించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి అనుమతితో లోకల్ బాడీ టీచర్ కేడర్‌ను ఆర్గనైజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ మూడు నెలల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై తాజాగా సీఎం కేసిఆర్ సంతకం చేసి కేంద్రానికి పంపడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ రూల్స్ ఎప్పటికి అమల్లోకి వస్తాయనేది తేలాల్సుంది. 

 

11:56 - April 7, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయంగా కనపడుతోంది. తెలంగాణా డిస్కంలు వార్షిక సంవత్సరంలో రెవెన్యూలోటు భర్తీకి ఛార్జీల పెంపుదల ప్రతిపాదనను ఈ ఆర్ సి ముందు ఉంచాయి. విద్యత్ కొనుగోళ్ళు విచక్షణారహితంగా చేయడంవల్లే రెవెన్యూ లోటు అని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. అలాగే గృహ వినియోగదారులపై పడే విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి.  ఈఆర్‌సి బహిరంగ విచారణకు ప్రతిపక్షలు హాజరుకాక పోవడం ప్రభుత్వానికి కలసి వచ్చింది. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయంగా కనపడుతోంది.
ఫ్యాప్సీ ఆఢిటోరియంలో బహిరంగ విచారణ 
రాష్ట్రం లో కొత్త విద్యుత్ ఛార్జీల ప్రక్రియ కోసం ఉద్యేశించిన ప్రక్రియలో అత్యంత కీలకమైన బహిరంగ విచారణ ఫ్యాప్సీ ఆఢిటోరియంలో జరిగింది. తెలంగాణా డిస్కమ్ లు సమర్పించిన స్తూల వార్షిక ఆదాయ అవసరాల నివేదిక పై ఈ ఆర్ సి ఆధ్వర్యంలో బహిరంగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులపై భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కం సమర్పించింది. 100 యూనిట్ల నుండి 400 యూనిట్లు విద్యుత్ వినియోగం పై యూనిట్ కు 65 నుంచి 72 పైసలు పెంచుతూ ప్రతిపాదించింది.
గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు పెంపు లేదు 
డిస్కం ల ప్రతిపాదనలో గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు చార్జీల పెంపు లేదని ప్రతిపాదించాయి. 101 యూనిట్ల నుండి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్ కు 65 పైసల నుండి 72 పైసలు అదనంగా పెరగనుంది. 400 యూనిట్లు ఆపైన వాడే వినియోగదారులకు యూనిట్ కు 1 రూపాయి పెరగనుంది. 2016 -17 సంవత్సరంలో యూనిట్ కు 42 పైసలు సగటున పెంచాలని నిర్ణయించాయి . ప్రతిసారి ఈఆర్ సి బహిరంగా విచారణ లో విద్యత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రతి పక్షాలు వాదించేవి అయితే ఈ సారి మాత్రం ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి వరంలా మారింది.
విచక్షణా రహితంగా విద్యుత్ కొనుగోళ్ళు 
విద్యుత్ కొనుగోళ్ళు విచక్షణా రహితంగా చేయడం వల్లే వ్యయం పెరుగుతోందని దీన్ని నియంత్రిస్తే చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని ప్రజాసంఘాల ప్రతినిధులు ఈఆర్సీతో అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సంస్థల ఖర్చుల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. గృహ వినియోగదారులపై చార్జీల మోత వద్దని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి అన్నారు.వ్యవసాయానికి విద్యత్ సరఫరా పగలే చేయాలని రాత్రిపూట ఇవ్వడం వల్ల రైతులకు ప్రాణహాని ఉందన్నారు. పంట పొలాల నుండి కరెంటు లైన్లు వేస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

'విశ్వరూప యాత్ర'కు అనుమతి నిరాకరించిన కోర్టు...

హైదరాబాద్ : హైకోర్టులో మందకృష్ణ మాదిగకు చుక్కెదురైంది. ఎస్సీ వర్గీకరణకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ నారావారి పల్లె నుండి యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాను తలపెట్టన 'మాదిగల విశ్వరూప యాత్ర' అనుమతినివ్వమని మందకృష్ణ కోర్టును ఆశ్రయించారు.  ఈ క్రమంలో శాంతి భద్రతలను దెబ్బతింటాయని పోలీసు శాఖ అభిప్రాయపడింది. దీంతో  ఏకీభవించిన కోర్టు యాత్రకు అనుమతిని నిరాకరించింది. కాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను మందకృష్ణ ఆశ్రయించనున్నారు.

11:40 - April 7, 2016

ముంబై : ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు బంగారుబాతు...ఐపీఎల్ తొమ్మిదో సీజన్ హంగామాకు...ముంబై వాంఖెడీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ జరిగే ఈ లీగ్ లో.. ఎనిమిది ఫ్రాంచైజీలజట్లు ఢీ కొంటాయి. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లేకుండా జరగబోతున్న తొలి ఐపీఎల్ లీగ్ ఇదే కావడం విశేషం........
వాంఖెడీ స్టేడియంలో ఏప్రిల్ 9న ప్రారంభం
క్రికెట్టే ఊపిరిగా భావించే భారత ప్రజల వేసవి వినోదం..ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ-20 హంగామాకు దేశంలోని వివిధ నగరాలు సకల హంగులతో ముస్తాబవుతున్నాయి. ముంబై ఇండియన్స్ హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియంలో ఏప్రిల్ 9న ప్రారంభమై..మే29న ముంబై వాంఖెడీ స్టేడియంలోనే ముగిసే ..ఐపీఎల్ 9వ సీజన్ పోటీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2008 సీజన్లో తొలిసారిగా ప్రారంభమైన ఐపీఎల్..ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా...కాలపరీక్షకు తట్టుకు నిలబడి...అప్పుడే తొమ్మిదోసీజన్లో ప్రవేశించాయి.
వాటి స్థానంలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్
మొదటి ఎనిమిది సీజన్లలో అత్యంత జనాదరణ పొందిన చెన్నై, జైపూర్ ఫ్రాంచైజీలు...బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, సుప్రీంకోర్ట్ దెబ్బతో...రెండేళ్ల సస్పెన్షన్ వేటుకు గురికావడంతో...ఈ రెండు జట్ల స్థానంలో...సరికొత్తగా గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లు..ప్రస్తుత 9వ సీజన్ పోటీల ద్వారా అరంగేట్రం చేయబోతున్నాయి. గుజరాత్ లయన్స్ జట్టుకు ఆల్ రౌండర్ సురేశ్ రైనా నాయకత్వం వహిస్తుంటే...పూణే సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతల్ని మహేంద్రసింగ్ ధోనీ తీసుకొన్నాడు.
పలు జట్లు సమరానికి సిద్ధం 
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, డెకన్ చార్జర్స్ కమ్ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లతో పాటు...బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డైనమైట్స్, కింగ్స్ పంజాబ్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. గత సీజన్ వరకూ చెన్నై, జైపూర్ జట్లలో సభ్యులుగా ఉన్న పలువురు స్టార్ క్రికెటర్లు...ప్రస్తుత సీజన్ నుంచి పూణే, గుజరాత్ జట్ల సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు. అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, స్టీవ్ స్మిత్, డూప్లెసీలను ..మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని పూణే జట్టు దక్కించుకొంది. మరోవైపు...డ్వయన్ బ్రావో, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, జేమ్స్ ఫాక్నర్ లాంటి మేటి ఆటగాళ్లను...సురేశ్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ జట్టు సొంతం చేసుకొంది. కోల్ కతా వేదికగా ఇటీవలే ముగిసిన 2016 టీ-20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ చాంపియన్ గా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన కరీబియన్ స్టార్ క్రికెటర్లు పలువురు...వివిధ ఫ్రాంచైజీల జట్లలో సభ్యులుగా తమ సత్తా చాటుకోడానికి సిద్ధమవుతున్నారు.
సత్తా చాటనున్న ఆటగాళ్లు...
గుజరాత్ లయన్స్ జట్టులో సభ్యులుగా డ్వయన్ స్మిత్, డ్వయన్ బ్రావో, బెంగళూరు ఓపెనర్ గా క్రిస్ గేల్, ఢిల్లీడైనమైట్స్ సభ్యుడిగా కార్లోస్ బ్రాత్ వెయిట్, ముంబై ఆటగాడిగా లెండిల్ సిమ్మన్స్, కీరాన్ పోలార్డ్, కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యుడిగా జేసన్ హోల్డర్ తమ సత్తా చాటుకోబోతున్నారు.
ముంబై ఇండియన్స్ తో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ పోటీ 
ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఏప్రిల్ 9న జరిగే సీజన్ ప్రారంభమ్యాచ్ లో..డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ పోటీపడుతుంది. మే 24, 25, 27 తేదీల్లో జరిగే క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లకు  బెంగళూరు, పూణే నగరాలు ఆతిథ్యమిస్తాయి. మే 24న తొలిక్వాలిఫైయర్ మ్యాచ్ ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో నిర్వహిస్తారు. మే 25 న జరిగే ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ కు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం ఆతిథ్యమిస్తుంది.
పూణే స్టేడియంలో క్వాలిఫైయర్ -2 మ్యాచ్
మే 27న క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ను సైతం పూణే స్టేడియంలోనే నిర్వహిస్తారు. మే 29న ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంతో...ఐపీఎల్ తొమ్మిదోసీజన్ కు తెరపడనుంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు లేకుండా జరిగే 2016 ఐపీఎల్ లీగ్ ఎంత రంజుగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

విజయ్ మాల్యా ప్రతిపాదన తోసిపుచ్చిన బ్యాంకర్స్...

ఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసు కొత్తమలుపు తిరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. రూ.4వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని మాల్యా ప్రతిపాదన చేశారు. దీన్ని బ్యాంకులు తిరస్కరించాయి. రూ.9వేల కోట్లు చెల్లించాలని ఉన్నత స్థాయన్యానాన్ని బ్యాంకర్స్ కోరారు. దీనిపై రెండు వారాలపాటు గడువు కావాలని కింగ్ ఫిషర్ యాజమాన్యం కోరింది.

ఎన్ఐఏ అధికారి తంజీల్ హత్యకేసులో పోలీసుల పురోగతి....

ఢిల్లీ : సంచలనం సృష్టించిన ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా వున్న తంజీల్ అహ్మద్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపారు. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ శరీం ఛిధ్రమైపోయి అక్కడికక్కడే మరణిచారు. భారత్ లోనేకాక పాకిస్థాన్ లో కూడా ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్య సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. 

10:42 - April 7, 2016

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ హంగామాకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబయ్యింది. ఏప్రిల్ 16 నుంచి మే 12 తేదీల నడుమ జరిగే మొత్తం ఏడుమ్యాచ్ లకు సన్ రైజర్స్ తరపున హైదరాబాదీ ఫ్రాంచైజీ ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ అంచె పోటీల వివరాలు ఓసారి చూద్దాం...
ఐపీఎల్ హంగామాకు...హైదరాబాద్ ముస్తాబు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ హంగామాకు...హైదరాబాద్ పూర్తిస్థాయిలో ముస్తాబయ్యింది. 2016 ఐపీఎల్ సీజన్లో జరిగే మొత్తం 60 మ్యాచ్ ల్లో...కేవలం ఏడుమ్యాచ్ లకు మాత్రమే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ...తన హోమ్ మ్యాచ్ లకు ...రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఎంపిక చేసుకొంది. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ అంచె తొలిపోటీ ఏప్రిల్ 16న సాయంత్రం 4 గంటల మ్యాచ్ గాను,.. ఆఖరిమ్యాచ్ ను మే 12న రాత్రి 8 గంటలమ్యాచ్ గానూ నిర్వహిస్తారు.
ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్ సన్ రైజర్స్ సమాయత్తం
శిఖర్ ధావన్, అశీష్ నెహ్రా, డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోజెస్‌ హెన్రికేస్, ఇయోన్ మోర్గాన్, కేన్ విలియమ్స్ సన్, ట్రెంట్ బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లాంటి ప్రపంచ మేటి టీ-20స్టార్లున్న హైదరాబాద్ సన్ రైజర్స్...ఆత్మవిశ్వాసంతో 2016 సీజన్ కు సమాయత్తమవుతోంది.
కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ 
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 16న..సాయంత్రం 4 గంటలకు జరిగే హైదరాబాద్ అంచె ప్రారంభమ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ కొంటుంది. ఏప్రిల్ 18న రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఏప్రిల్ 23న..రాత్రి 8గంటల నుంచి జరిగే పోటీలో కింగ్స్ పంజాబ్ తో  హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీపడుతుంది.
రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్
ఏప్రిల్ 26న జరిగే పోటీలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్ సైతం..రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30న రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు ఢీ కొంటాయి. మే 6న రాత్రి 8 గంటల నుంచి జరిగే పోటీలో గుజరాత్ లయన్స్ జట్టుతో సన్ రైజర్స్ తలపడుతుంది.
ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్
మే 12న రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఐసాపైసా తేల్చుకొంటాయి. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 9వ సీజన్ హైదరాబాద్ అంచె పోటీలకు తెరపడుతుంది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ ల టికెట్లను ...సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ కౌంటర్లో ..ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు టికెట్లు కొన్నవారికి...సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ టీ-షర్టును సైతం ఉచితంగా అందచేయాలని హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ సదుపాయం ఏప్రిల్ 10వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. జంటనగరాలలోని పలు ప్రాంతాలలో ఉన్న కేఫ్ కాఫీడే అవుట్ లెట్స్ ద్వారా కూడా టికెట్ల విక్రయిస్తున్నారు.

10:33 - April 7, 2016

హైదరాబాద్ : పనామా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల బాగోతాలను బయటపెట్టి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పనామా పత్రాల్లో మన తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఆఫ్‌షోర్‌ సంస్థలు పెట్టి డైరెక్టర్లుగా షేర్‌ హోల్డర్లుగా ఉన్నట్టు తేలింది
తెలుగు నేలను తాకిన పనామా ప్రకంపనలు
పనామా పేపర్స్ ప్రకంపనలు తెలుగు నేలను కూడా తాకాయి. పనామా జాబితాలోని ముగ్గురు తెలుగువారి పేర్లను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మోటూరి శ్రీనివాస్‌ ప్రసాద్‌కు బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో నాలుగు ఆఫ్‌షోర్‌ సంస్థలు ఉన్నట్లు మొసాక్‌ ఫోన్సెకా సంస్థ నుంచి లీకైన పత్రాల్లో తేలింది. వోలమ్ భాస్కర్‌రావు, భావనాసి జయకుమార్‌ కూడా అందులో డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొంది. యస్‌డీ వెంచర్స్, సికా సెక్యూరిటీస్, భాసు కేపిటల్స్ , పీపీ ఇన్వెస్టిమెంట్స్ లాంటి కంపెనీలను మోటూరీ శ్రీనివాస్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. నందన్ క్లీన్ టెక్ అనే కంపెనీకి శ్రీనివాస్ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బయో డీజిల్ ఎగుమతుల్లో అవకతవకలకు పాల్పడినందుకు శ్రీనివాస్ ప్రసాద్‌ 2012లో అరెస్టై బెయిల్‌ పొందారు. 2005-06లో ఆ సంస్థలను ప్రారంభించామని ప్రస్తుతం అందులో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని శ్రీనివాస్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. 
ఆరు కంపెనీలకు డైరెక్టర్‌గా జయకుమార్‌ 
నందన్‌ టెక్నాలజీస్‌కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీలకు భావనాసి జయకుమార్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే నందన్‌ టెక్నాలజీ 2014లోనే మూత పడిందని, మరో రెండు సంస్థలు తన భార్యకు చెందినవని భావనాసి జయకుమార్‌ చెప్పారు. అన్ని విషయాలు ఓలన్‌ భాస్కర్‌రావే చూసుకుంటారని విదేశీ ఖాతాల గురించి తనకు తెలియదని వివరణ ఇచ్చారు.
ఎండీగా ఓలన్ భాస్కర్‌రావు 
నందన్‌ టెక్నాలజీస్‌తో పాటు ఆరు అనుబంధ సంస్థలకు ఓలన్ భాస్కర్‌రావు ఎండీగా వ్యవహరించారు. 'మా నాన్న రిటైర్‌ అయినప్పటి నుంచి ఆ కంపెనీలను మోటూరి శ్రీనివాస ప్రసాద్‌ చూస్తున్నారని, నిబంధనల ప్రకారమే నడచుకున్నాని భాస్కర్‌రావు కుమారుడు వివరణ ఇచ్చారు.

 

కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ....

కడప : రైళ్లలో దోపిడీ దొంగలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. వీటిని నివారించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా కాచిగూడ నుండి మధురై వెళ్తున్న ఎక్స్ ప్రెస్ లో కడప జిల్లా పుల్లంపేట వద్ద దొంగలు దోపిడీ పాల్పడ్డారు. ఇద్దరు మహిళను కత్తులతో బెదిరించి 14 తులాల బంగారు నగలు దోచుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు...

ప.గోదావరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పథకాన్ని చేపట్టినా ఇసుక దళాలరులు మాత్రం వారి ధోరణి మార్చుకోవటంలేదు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులే స్వయంగా రంగంలోకి దిగారు. ఏలూరు లాకుల వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఎమ్మెల్యేలు చింతమనేని అడ్డుకున్నారు. లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

10:20 - April 7, 2016

మహారాష్ట్ర : అసలే ఎండాకాలం...  ఆ పై దుర్భర కరవు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేసేవాళ్లను ఏమనాలి...? ఒకటి కాదు.. రెండు కాదు రోజుకు అరవై వేల లీటర్ల నీటిని.. కేవలం పిచ్‌ల కోసం వాడటం ఎంతవరకు సమంజసం...? ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. నీటిచుక్కలేక విలవిల్లాడుతున్న జనం కంటే.. క్రికెట్‌ మ్యాచ్‌లు ఎక్కువనా అంటూ ప్రశ్నించింది.
ఐపీఎల్ మ్యాచ్‌లపై ముంబై హైకోర్టు ఆక్షేపణ 
మహరాష్ట్రలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. ప్రజల జీవనం కన్నా ఐపీఎల్‌ మ్యాచ్‌లే ఎక్కువా అంటూ క్రికెట్‌ బోర్డును ప్రశ్నించింది. రాష్ట్రంలో దుర్భిక్షం తాండవిస్తున్న పరిస్థితుల్లో బాధ్యతారహితంగా నీళ్లను ఎలా వృథా చేస్తారంటూ హైకోర్టు నిలదీసింది. మూడు స్టేడియాల్లో పిచ్‌ల నిర్వహణకు రోజుకు 60వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని... నీటిని వాడితే లీటరుకు వేయి రూపాయల పన్ను చెల్లించేలా ఆదేశాలివ్వాలని లోక్‌సత్తా మూమెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థ పిల్‌ దాఖలు చేసింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు నీటిని ఉపయోగించకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. 
తొలి మ్యాచ్‌ వాంఖడే మైదానంలో
ఐపీఎల్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే మైదానంలో జరగనుంది. ఈ లీగ్‌లో 20 మ్యాచ్‌లు ముంబై, పుణె, నాగ్‌పుర్‌లో జరగనున్నాయి. మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలో జరుగనుంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం పూర్తయిందని, మ్యాచ్‌లను రద్దుచేస్తే భారీ ఎత్తున నష్టపోతామని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ హైకోర్టుకు తెలిపింది.
బాంబే హైకోర్టులో కేతన్‌ తిరోద్కర్‌ మరో పిల్‌ దాఖలు
ఇదే అంశంపై కేతన్‌ తిరోద్కర్‌ అనే జర్నలిస్టు బాంబే హైకోర్టులో మరో పిల్‌ దాఖలు చేశారు. మ్యాచ్‌ల నిర్వహణకు వినియోగించే నీటికి ఐపీఎల్‌ కమిషనర్‌ నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. మహరాష్ట్రలో గత రెండు దశాబ్దాలుగా కరవు ఉందని, విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువని పిల్‌లో పేర్కొన్నారు. 2015లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన కరవు పరిస్థితుల కారణంగా 3228 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇదే అంశాన్ని న్యాయస్థానం కూడా సుమోటోగా విచారణకు స్వీకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నీటికొరతకు సంబంధించి మహారాష్ట్ర రైతులకు తమ మద్దతు ఉంటుందని... అయితే మ్యాచ్‌ల తరలింపుతో నీటిని ఆదా చేయడం వల్ల ఉద్దేశం నెరవేరదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా  అన్నారు.

రేపు విజయవాడలో దేవాన్ష్ జన్మదిన వేడుకలు ....

హైదరాబాద్ : ఏపీ సీఎం మనుమడు దేవాన్ష్ తొలి జన్మదిన వేడుకలు రేపు విజయవాడలో భారీ విందు జరుగనుంది. దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు తానే స్వయంగా ఆహ్వానించారు. తేదీల ప్రకారం పుట్టినరోజు పూర్తిగా తెలుగు తిధుల ప్రకారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మనుమడి జన్మదిన వేడులను చంద్రబాబు ఘనంగా నిర్వహించనున్నారు.

కరువు జిల్లాల్లో నివారణ చర్యలు చేపట్టాలి : తమ్మినేని

మెదక్ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటిస్తున్నారు. హత్నూరు మండలం షేర్ ఖాన్ పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరువు జిల్లాలో తక్షణమే నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కరువు ప్రాంతాలను ప్రకటించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు.  ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తున్న కేసీఆర్ ఉపాధిహామీ కూలీల బకాయిలు చెల్లిండంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 

09:47 - April 7, 2016

'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రంతో నూతన చిత్ర దర్శకురాలిగా గౌరీషిండే బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో శ్రీదేవి నటించిన చిత్రం 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'. ఈ చిత్రం సాధించిన విజయంతో ఉత్తమ దర్శకురాలిగా గౌరీషిండే పలు అవార్డుల్ని సైతం దక్కించుకున్నారు. తాజాగా షారూఖ్‌ఖాన్‌, అలియాభట్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా నటీనటులందరికీ (సీనియర్లు అయినప్పటికీ) నటనలో ఓ వర్క్ షాప్‌ నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు గౌరీ. సందర్భానికి అనుగుణంగా తనకి నచ్చే వరకు నటీనటుల దగ్గర్నుంచి నటనని రాబట్టుకోవడంలో గౌరీ స్టయిలే వేరట.. గౌరీని మెప్పించడం చాలా కష్టమని అంటోంది అలియాభట్‌. 
ఆ కష్టమేంటో అలియా మాటల్లోనే, 'గౌరీ తాను తీయబోయే సన్నివేశాల గురించి ముందుగానే ఆర్టిస్టులతో ఒక వర్క్‌షాపు నిర్వహిస్తుంది. ఈ వర్క్ షాప్‌లో ఇచ్చే శిక్షణ చాలా కచ్చితంగాను, కఠినంగా కూడా ఉంటుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో చాలా సార్లు గౌరిని మెప్పించలేకపోయాను. దీంతో భయమేసి చాలా సార్లు ఏడ్చేశాను కూడా. అయినప్పటికీ గౌరీ కరగలేదు. అప్పుడు నాకర్థమైంది ఒకటే.. నేనింకా చాలా నేర్చుకోవాలని. దీంతో శిక్షణలో నటనపై పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాను' అని చెప్పింది.

 

09:43 - April 7, 2016

హాలీవుడ్‌ చిత్రం 'జంగిల్‌ బుక్‌' ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాపులర్‌ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ చిత్ర సిరీస్‌లో భాగంగా వస్తున్న తాజా వెర్షన్‌ త్వరలో తెలుగులోనూ విడుదల కానుంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారి మోగ్లీకి తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ని హైదరాబాద్‌ కుర్రాడు చెప్పడం విశేషం. పదేండ్ల వయసు గల సంకల్ప్‌ వాయుపుత్ర అత్యద్భుతంగా మోగ్లీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు. 
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ స్పందిస్తూ, 'మోగ్లీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని చాలా మంది తెలుగు చిన్నారుల వాయిస్‌ని టెస్ట్ చేయగా సంకల్ప్‌ వాయుపుత్ర వాయిస్‌ బాగా సెట్‌ అయ్యింది. గత 15 ఏండ్లుగా తెలుగు డబ్బింగ్‌ విభాగంలో పలు హీరోలకు, అనేక అనువాద చిత్రాలకు పనిచేసిన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంకల్ప్‌. ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ తొలిసారి మోగ్లీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పి అంతర్జాతీయ సినీ పండితులను మెప్పించారు. సంకల్ప్‌ డబ్బింగ్‌ చెప్పిన తీరు మోగ్లీ పాత్రకు జీవం పోసింది. 'జంగిల్‌ బుక్‌' ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రఖ్యాత హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో ప్రియాంక చోప్రాతోపాటు ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు డబ్బింగ్‌ చెప్పారు. తాజా వెర్షన్‌ చిత్రంలోని మోగ్లీ పాత్రలో నీల్‌ సేథీ నటించారు. అత్యాధునిక గ్రాఫిక్స్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన సరికొత్త 'జంగిల్‌ బుక్‌' అందరినీ అలరిస్తుంది' అని అన్నారు.

 

09:35 - April 7, 2016

'సూర్య హీరోగా రూపొందుతున్న '24' తన కెరీర్‌కి బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుంద'ని అంటున్నారు నటుడు అజయ్. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషిస్తూ అజయ్ రాణిస్తున్నారు. హీరోగా 'సారాయి వీర్రాజు'లో కూడా నటించారు. సూర్య, విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న '24'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన '24' పోస్టర్స్ లో అజయ్ లుక్స్ కి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ,'సూర్య వంటి ఎక్స్ పర్‌మెంటల్‌ హీరోతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది' అని అన్నారు.

 

నేడు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న తమ్మినేని

మెదక్ : నేడు జిల్లాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటిస్తున్నారు. హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లిలో ఎండిపోయిన వరి పంటలను తమ్మినేని పరిశీలించారు. 

 

09:15 - April 7, 2016

యూనిర్సిటీలను అస్తవ్యస్తం చేయడానికే కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వక్తలు విమర్శించారు. సెంట్రల్ యూనివర్సీటీలు.... ఆందోళనలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతనిధి పున్న కైలాశ్, టీటీడీపీ అధికార ప్రతనిధి రాజారాంయాదవ్ లు పాల్గొని, మాట్లాడారు. దళితుల విషయంలో కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హెచ్ సీయూ వర్సిటీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి అప్పారావును మళ్లీ వీసీగా తెచ్చారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు తెలంగాణ, ఎపి కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణ, ఎపి కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. ఎపి, తెలంగాణలోని రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు మెదక్ జిల్లాలో తమ్మినేని పర్యటన

మెదక్ : నేడు జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించనున్నారు.  నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కరువు అధ్యయన నిమిత్తం పర్యటించనున్నారు. 

అధిక ధరలకు ఇసుక విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఆందోళన

ఏలూరు : అధిక ధరలకు ఇసుక విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేపట్టారు. 

 

భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.

08:41 - April 7, 2016

బంగారంపై ఎక్పైజ్ డ్యూటీని ఎత్తివేయాలని జ్వెల్లర్స్ అసోసియేషన్ నేత తాండూరు గోపీనాధ్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'బంగారం వ్యాపారులు 35 రోజులుగా సమ్మె చేస్తున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదించిన 1 శాతం ఎక్పైజ్ డ్యూటీని ఎత్తివేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. ఎక్సయిజ్ డ్యూటిని బంగారం వ్యాపారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మన దేశంలోకి ప్రవేశించిన బహుళ జాతి సంస్థలు బంగారం వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? బంగారం వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి?  బంగారం మార్కెట్ లో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలంటే వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇలాంటి అంశాలపై గోసినాధ్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:25 - April 7, 2016

నెల్లూరు : జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం బత్తినవారిపల్లి, ఊట్కూరు, వరికుంటపాడులో తెల్లవారుజామున 5 గంగటల ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 1.8 నుంచి 2.5 శాతం లోపు భూకంప తీవ్రత నమోదు అయింది. అయితే జిల్లాలో ఐదు నెలల నుంచి భూమి కంపించడం ఇది 12వ సారి. జిల్లాలో కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతం ఉంది కనుక వాటి మధ్య సర్దుబాటు జరగడంతో భూప్రకంపనలు సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు. 

 

08:16 - April 7, 2016

ఢిల్లీ : నల్ల కుబేరులు హవాలా సంస్థలను సృష్టించి అక్రమ మార్గంలో నల్లధనాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. నల్లధనం జాబితాలో ఉన్న నేతలు, ప్రముఖులు పైకి మాత్రం...వాటితో మాకు సంబంధమే లేదని బొంకుతున్నారు.  తాజాగా పనామా పత్రాల్లో వెల్లడైన భారతీయుల మూడో జాబితాను ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ విడుదల చేసింది.
పనామా పత్రాల్లో మోడీ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్‌ సతీష్ మోడీ
తాజాగా వెలుగు చూసిన పనామా పత్రాల్లో మోడీ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్‌ సతీష్ మోడీ పేరు వెలుగు చూసింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఆయన ఒక కంపెనీ తెరిచారు. 2010లో ఒక బ్రిటీషర్‌తో కలిసి ఛాలెంజ్ సోకర్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. తర్వాత లండన్ కేంద్రంగా ఆయన ఒక ఫుట్‌బాల్ క్లబ్ ప్రారంభించారు. గోల్డ్‌ పించ్‌ హోల్డింగ్‌ గ్రూప్‌లో షేర్‌ హోల్డర్‌గా ఉన్నారు. మోది ఎన్‌ఆర్‌ఐగా ఉన్నారని, భారత చట్టాల ప్రకారమే నడచుకున్నారని ఆయన కార్యదర్శి వివరణ ఇచ్చారు.
క్రిమినల్స్ కు విదేశాల్లో కంపెనీలు  
బళ్లారి మైనింగ్‌తో సంబంధం ఉన్న వి ఘొటగే, ఆయన సహచరుడు వనం కుమార్‌కు బ్రిటిష్ వర్జిన్‌ ఐలాండ్స్ లోని నార్డ్ బెల్ కమర్షియల్ లిమిటెడ్ అనే ఆఫ్‌షోర్ సంస్థలో షేర్లున్నాయి. వీళ్లకు చెందిన పివిజి గ్రూప్‌ సంస్థ మైనింగ్‌ గనుల నుంచి 3 వేల ట్రక్కులను నడిపేది. బ్లాక్ మనీని విదేశాలకు తరలించేందుకే ఆయన ఆఫ్‌షోర్ కంపెనీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలా క్రిమినల్ రికార్డు ఉన్న అనేక మంది విదేశాల్లో కంపెనీలు తెరిచినట్లు పనామా పేపర్స్ చెబుతున్నాయి.
విదేశాల్లో డైరెక్టర్లుగా చలామణి అవుతున్న పలువురు
వీరు కాకుండా వడోదరకు చెందిన ప్రదీప్‌ కౌశిక్‌రే బుచ్, అహమాదాబాద్‌కు చెందిన రాహుల్‌ అరుణ్‌ప్రసాద్‌ పటేల్, కోల్‌కతాకు చెందిన అశోక్‌ మల్హోత్రా, డెహ్రాడూన్‌కు చెందిన సంజయ్‌ పోఖ్రియాల్ తదితరుల పేర్లు కూడా పనామా పత్రాల్లో వెలుగు చూశాయి. వీరంతా కూడా విదేశాల్లో ఫౌండేషన్లు స్థాపించి డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు.
విదేశీ కంపెనీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు : బిగ్ బి  
పనామా కుంభకోణంలో కోడలు ఐశ్వర్యతోపాటుగా ప్రముఖంగా పతాక శీర్షికలకెక్కిన బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ విదేశీ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తనకు చెందినవిగా ప్రచారం జరుగుతున్న సీబల్క్ షిప్పింగ్, లేడీషిప్పింగ్, ట్రెజర్‌షిప్పింగ్, ట్రాంప్‌షిప్పింగ్ కంపెనీలలో తాను డైరెక్టర్‌గా ఏనాడూ లేనని చెప్పారు. తనపేరు వాడుకుని ఉండొచ్చని తెలిపారు. విదేశాలలో నేను పెట్టుబడి పెట్టిన మొత్తాలు కూడా భారతీయ చట్టాలకు లోబడే జరిగాయన్నారు. ఐశ్వర్యారాయ్ కూడా పనామా వార్తలను ఇదివరకే ఖండించారు.
ఐస్‌ల్యాండ్ ప్రధాని పదవికి రాజీనామా
పనామా పత్రాల లీకులతో ప్రజాగ్రహానికి గురైన ఐస్‌ల్యాండ్ ప్రధాని గున్‌లాగ్‌సన్ తన పదవికి రాజీనామా చేశారు. చిలీలో అవినీతి నిఘాసంస్థ ట్రాన్‌సరెంట్ చిలీ అధిపతి గొంజాలో డెలావ్యూ తప్పుకున్నారు. పనామా జాబితాలో తన ముగ్గురు కుమారుల పేర్లు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించనున్నట్టు పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ ప్రకటించారు.
పత్రాల వ్యవహారంపై మండిపడిన రష్యా, చైనా  
కాగా రష్యా, చైనా దేశాలు ఈ పత్రాల వ్యవహారంపై మండిపడ్డాయి. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సహా ఎనిమిది మంది కమ్యూనిస్టుపార్టీ పెద్దలపై వచ్చిన నల్లధనం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చైనా విదేశాంగశాఖ కొట్టిపారేసింది. గోబెల్స్ ప్రచారం ఇంతకన్నా నయమని, పశ్చిమదేశాలకు పుతిన్‌ఫోబియా పట్టుకున్నదని రష్యా దుయ్యబట్టింది.
చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని 
పనామా జాబితా నీడ తనమీద పడటంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చిక్కుల్లో పడ్డారు. పనామా పేపర్స్ ద్వారా వెల్లడైన వ్యక్తుల జాబితాల్లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తండ్రి ఇయాన్ కామెరాన్ పేరుండటం ఆయనను ఇరుకునపడేసింది. 30 ఏండ్లపాటు ఇయాన్ పనామాలో ఆఫ్‌షోర్ కంపెనీ నడిపినట్టు వెల్లడికావడంతో ప్రతిపక్షాలు కామెరాన్‌పై విమర్శలు చేస్తున్నాయి. 
పరువు దక్కించుకునే పనామా ప్రయత్నాలు 
నల్లధనం దాచుకునేవారికి అత్యంత అనువైన దేశంగా అపఖ్యాతి మూటగట్టుకున్న పనామా పరువు దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవకతవకలపై చర్య తీసుకుంటామని, దర్యాప్తు జరిపేవారందరికీ సహకరిస్తామని ప్రకటించింది. ఇంటర్నేషనల్ కన్సర్టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు విడుదల చేసిన నల్లకుబేరుల జాబితాలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. 

 

07:58 - April 7, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ కౌన్సిల్‌ కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునేందుకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ఇవాళ ప్రత్యేక సమావేశం కానుంది. మొత్తం ఐదుగురు సభ్యులలో.. ఇద్దరు మైనారిటీ సభ్యులను నేడు ఎన్నుకోనుంది. అందులో ఒకరు మహిళ ఉండనున్నారు. ఇక మిగిలిన ముగ్గురిని వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నుకోనున్నారు.  కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక 
కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం కాబోతుంది. స్థానిక పాలనలో వివిధ పక్షాలకు అవకాశం కల్పించేందుకు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందులో ప్రధానంగా మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరైన హిందూయేతర మతానికి చెందినవారు ఈ పదవికి అర్హులు. అయితే ముఖ్యంగా పార్టీ అండదండలున్న వారికే ఈ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన వారికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ మినహా అన్ని హక్కులుంటాయి. 
ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యుల కోసం 108 మంది దరఖాస్తు
మరో ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యుల కోసం 108 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మున్సిపల్‌ పాలనలో అనుభవంతో పాటు.. గ్రేటర్‌లోని పబ్లిక్‌ సమస్యలపై అవగాహన ఉండాలి. గతంలో కార్పొరేటర్లుగా పని చేసినవారు.. కాలనీ సంక్షేమ సంఘాల్లో పని చేసినవారికి ఇందులో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ.. అధికార పార్టీ అండదండలున్న వారికే ఈ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా టికెట్‌ ఆశించి విఫలమైనవారు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఇద్దరు మైనారిటీలకు కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం దక్కనుంది. మిగతా ఆ ముగ్గురు అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే.. వచ్చే కౌన్సిల్‌ సమావేశం వరకు ఎదురుచూడాలి. 

 

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

నెల్లూరు : జిల్లాలోభూప్రకంపనలు సంభవించాయి. వింజమూరు మండలం బత్తినవారిపల్లి, ఊట్కూరులో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 

07:45 - April 7, 2016

విజయవాడ : హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఏపీ సచివాలయ ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ఏపీ సచివాలయ ఉద్యోగులకి వారానికి ఐదు రోజులే పనిదినాలుగా పరిగణించబడతాయని ఏపీ మంత్రి నారాయణ స్పష్టంచేశారు. 
వారికి వారానికి ఐదు రోజులే పనిదినాలు 
జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరికను ఏపీ సర్కారు అంగీకరించింది. నూతన రాజధానిలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా నిర్మాణం కానందున వారు కొంతకాలం వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండేలా చూడాలని కోరారు. దీనికి రాష్ట్రప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 
నూతన రాజధానికి వెళ్లేందుకు సిద్ధంగా లేరు 
వారానికి ఐదు రోజుల పనిదినాల వల్ల హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు అక్కడికి వెళ్లకపోయినా..తాము ఎక్కువ సమయం పనిచేయడానికి సిద్ధమన్నారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాలు నూతన రాజధానికి వెళ్లేందుకు సిద్ధంగా లేవు. ఐదు రోజుల పనిదినాల పద్ధతి అమలు చేస్తే శని, ఆదివారాలు హైదరాబాద్‌లో తమ కుటుంబంతో గడపవచ్చని ఉద్యోగులు ప్రతిపాదించారు.
రాజధాని నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు..?
ఐదు రోజుల పనిదినాలు అమలుతో పాటు రాజధాని నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే ఆ రైలులో తాము హైదరాబాద్ వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం సాయంత్రం తొందరగా ఉద్యోగులను వదిలేస్తే మిగతా రోజుల్లో అదనపు గంటలు కూడా పనిచేయవచ్చుననే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన చంద్రబాబు 
హైదరాబాద్ నుంచి ఏపీ ఉద్యోగులని ఇక్కడికి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించినట్టుగా మంత్రి మీడియాకి తెలిపారు. ఉద్యోగులు కేవలం వసతులు చూసుకోవడం మాత్రమే తరువాయి అని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.

 

07:37 - April 7, 2016

విజయవాడ : ఏపీ సిఎం చంద్రబాబు కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీలు దొరికినప్పుడల్లా కేంద్ర వైఖరిపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు కాస్తా ఘాటుగా స్పందించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ, విభజన చట్టం అమలుతీరుకు సంబంధించి సెంట్రల్‌ గవర్నమెంట్ అధికారి సంజయ్‌ కొఠారితో వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని అంశాలపై కఠిన స్వరం వినిపించారు. 
సంజయ్‌కొఠారితో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
అడిగితేనే చేద్దాం అనే వైఖరి సరికాదంటూ ఏపి సిఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన స్వరం వినిపించారు. ఉద్యోగుల విభజన, విభజన చట్టం అమలు తీరును పరిశీలించడానికి హైదరాబాద్‌కు వచ్చిన డిఓపిటి సెక్రటరీ సంజయ్‌కొఠారి ఏపీ సచివాలయంలో అధికారులతో చర్చించారు. ఆయనతో సిఎం చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా... అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి సరికాదని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఉద్యోగుల విభజనైనా సక్రమంగా జరిగేలా... కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. 
కాంగ్రెస్ ప్రభుత్వ ఇష్టానుసారంగా రాష్ట్ర విభజన 
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించిందని ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయని చంద్రబాబు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీకి ఆదాయం లేదని పైగా 16 వేల కోట్ల ద్రవ్యలోటుతో ఉన్నందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా ఇంకా కల్పించనే లేదని రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకారం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అటు మౌలిక సదుపాయాలు లేక ఉన్నత విద్యా వైజ్ఙానిక పరిశోధనా సంస్థలు లేక రాష్ట్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని  కేంద్రమే ఆదుకోవాలని తమ ప్రజల మనోగతాన్ని కేంద్రానికి తెలియజేయాలని సంజయ్‌ కొఠారికి బాబు సూచించారు. 
ఉద్యోగుల విభజనైనా సక్రమంగా జరిగేలా చూడాలి...
రాష్ట్రాన్ని ఎటూ అడ్డగోలుగా విభజించారని కనీసం ఉద్యోగుల విభజనైనా సక్రమంగా జరిగేలా చూడాలని చంద్రబాబు... సంజయ్‌ను కోరారు. రాజధాని నిర్మాణంతోపాటు వివిధ సంస్థల ఏర్పాటుకు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయమవుతుందని ఆ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్రంతో పలుమార్లు చెప్పినట్లు గుర్తుచేశారు. వీటిన్నిటి దృష్ట్యా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి కేంద్రం సాయపడేలా చూడాలని సిఎం చంద్రబాబు... డిఓపిటి సెక్రటరీ విజయ్‌ కొఠారిని కోరారు.  

జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి తిమింగలం

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దాచ జనార్దన్‌మహేశ్ రూ.3 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది.

 

07:31 - April 7, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ మళ్లీ రణరంగమైంది. వీసీ అప్పారావును రీకాల్‌ చేసేంతవరకు ఉద్యమిస్తామన్న విద్యార్థులు మరోసారి వర్శిటీలో ఆందోళన చేపట్టారు. దీంతో చలో హెచ్‌సీయూ ఉద్రిక్తలతో ప్రారంభమై..అరెస్టులతో ముగిసింది. 
హెచ్ సీయూలో మరోసారి విద్యార్థుల ఆందోళనల 
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శింటీ మరోసారి విద్యార్థుల ఆందోళనలతో హోరెత్తింది. వీసీ అప్పారావును వెంటనే తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన చలో హెచ్‌సీయూ మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోహిత్ వేముల కేసులో నిందితుడిగా ఉన్న అప్పారావును రీకాల్ చేయాలని వామపక్ష విద్యార్ది సంఘాలు, ఓయూ జాక్, హెచ్‌సీయూ జాక్‌లు చలో హెచ్‌సీయూ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే భారీగా తరలివచ్చిన విద్యార్థులు వర్శిటీలోకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. అయినా విద్యార్థులు మాత్రం వర్శిటీలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 
విద్యార్ధి నేతలు అరెస్టు
దీంతో విద్యార్థులకు..పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొంతమంది విద్యార్థులు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. మరికొంత మంది ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకొని విద్యార్ధి నేతలను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ చేసిన విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోహిత్‌ మృతికి కారణమైన వీసిని వెంటనే రీకాల్‌ చేయాలని...లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘ నేతలు హెచ్చరించారు. 
వారిని మంత్రి పదవుల నుంచి తొలగించాలి : విద్యార్థులు
రోహిత్ వేముల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పారావును మళ్లీ వీసీ చైర్లో ఎలా కూర్చొబెడతారంటూ విద్యార్థులు మండిపడ్డారు. రోహిత్‌ మృతికి కారణమైన వీసీ అప్పారావు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను వెంటనే మంత్రి పదవులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రోహిత్‌ మృతికి కారణమైన వీసీ అప్పారావును రీకాల్ చేసేంత వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.  

07:23 - April 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వడదెబ్బకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 66 మంది ఎండలకు బలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. మండుటెండలకు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. 
మండిపోతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 66 మంది మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 28 మంది, మెదక్‌ జిల్లాలో 11 మంది, నిజమాబాద్‌ జిల్లాలో ఏడుగురు, కరీంనగర్‌లో ఐదుగురు వడదెబ్బకు తాళలేక మృతిచెందారు. ఆదిలాబాద్‌, వరంగల్‌లో నలుగురు చొప్పున మృతి చెందగా.. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
ప్రజలు తగిన జాగ్రత్తలు  
ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దృష్ట్యా.. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
గతేడాది 541 మంది వడదెబ్బతో మృతి 
గతేడాది 541 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇప్పుడున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు... వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, 108, ఫైర్‌ సర్వీసులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరపత్రాలు, వాల్‌ పోస్టర్లతో పాటు మీడియా సహకారంతో విస్త్రత ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
హీట్‌ వేవ్‌ యాప్‌ను ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకునే సౌకర్యం..
ఎండల తీవ్రత-జాగ్రత్తలను ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉపయోగించుకునే వారికి.. హీట్‌ వేవ్‌ యాప్‌ను ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే అన్ని సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్ కంపెనీలు తెలుగులో అందరికీ అర్ధం అయ్యేలా మెసేజ్‌లు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

 

07:19 - April 7, 2016

హైదరాబాద్ : కాపులకు చంద్రబాబు మరోసారి వరాల జల్లు కురిపించారు. జిల్లాకో కాపు సంక్షేమ భవన్‌ నిర్మించేందుకు అంగీకరించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు 10 లక్షలు స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని నిర్ణయించారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం కాపులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. 
రుణ వయో పరిమితి 50 ఏళ్లకు పెంపు 
కాపు కార్పొరేషన్‌ సమీక్షా సమావేశంలో కాపు వర్గీయులకు చంద్రబాబు మరిన్ని వరాలు కురిపించారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కాపు యువత వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నట్లు బాబు ప్రకటించారు. అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తామన్నారు చంద్రబాబు. ఆర్ధికంగా వెనకబడిన కాపు విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆర్ధిక చేయూతనిస్తామన్నారు.  ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌  ఎస్టేట్‌ ఏర్పాటు చేసి.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కాపులకు తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి జిల్లాలో సంక్షేమ భవన్‌ నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 
వెనకబడిన కాపులను ఆదుకోనున్న కార్పొరేషన్‌ 
ఇక ఆర్ధికంగా వెనకబడిన కాపులను ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్‌ పని చేస్తుందన్నారు చంద్రబాబు. బీసీలు, కాపులు ఎవరూ అంసతృప్తి చెందకుండా కార్యాచరణ ఉండాలని.. కులాల కుమ్ములాటలు లేని సమాజ స్థాపనే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు.  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొన్ని కుల సంఘాల నాయకులు తమ ఖాతాలు వేసుకుంటామంటే కుదరదని బాబు స్పష్టం చేశారు. ఇక బడ్జెట్‌లో కేటాయించిన వెయ్యి కోట్ల వినియోగంపై అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 25లోగా అన్ని జిల్లాల్లో పర్యటించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తానికి కాపు వర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల టీడీపీ కాపు నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

07:17 - April 7, 2016

హైదరాబాద్ : ప్రజావైద్యాన్ని మెరుగుపర్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ నడుం బిగించింది. వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు.. సూపరింటెండెంట్లకు అధికారాలను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఆస్పత్రుల మెడికల్‌ అధికారులతో సీఎం స్వయంగా సమావేశమై దిశా నిర్దేశం చేయనున్నారు. 
వైద్యారోగ్య శాఖపై కేసీఆర్‌ సమీక్ష 
బడ్జెట్‌లో ఆరోగ్య వైద్య శాఖకు ఆరు వేల కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత త్వరగా ప్రజావైద్యాన్ని మెరుగుపర్చేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. అందులో భాగంగా బుధవారం నాడు సీఎం కేసీఆర్‌ వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, ఆస్పత్రుల పనితీరుపై సీఎం అధికారులతో చర్చించారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 2400 పోస్టులను భర్తీ చేయాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ను ఆదేశించారు. 
ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా మందులు 
పీహెచ్‌సీ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు సూపరింటెండెంట్లకు నిర్వహణ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. టీచింగ్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను మాటిమాటికి బదిలీ చేయకుండా.. రెండేళ్లపాటు ఒకేచోట పనిచేసేలా చూడాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఇక అన్ని ఆస్పత్రుల్లో కొత్త బెడ్స్,బెడ్ షీట్స్, పరుపులు వెంటనే కొనాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులకు  పేదవాళ్లే ఎక్కువగా వస్తారు కాబట్టి.. బయట మందులు కొనకుండా ఆస్పత్రుల్లోనే అన్ని మందులు ఉచితంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఉస్మానియా ఆస్పత్రిలో పేషెంట్ల సహాయకుల కోసం బహుళ అంతస్తుల బిల్డింగ్‌ నిర్మించాలన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులకు అదనపు వేతనంతో పాటు.. సమీప పట్టణంలో నివాసముండే వెసులుబాటును కల్పించారు. ప్రజావైద్యాన్ని మెరుగుపరిచేందుకు త్వరలో అన్ని ఆస్పత్రుల మెడికల్‌ అధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 

 

సౌరవ్‌ గంగూలీ ర్యాంప్‌వాక్‌

హైదరాబాద్ : ఓ మంచి పని కోసం భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, క్యాబ్‌ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ర్యాంప్‌వాక్‌ చేయనున్నాడు. కాన్సర్‌ బాధితులకు సేవలందించే టాటా మెడికల్‌ సెంటర్‌ ఆంకాలజీ కేర్‌యూనిట్‌ విస్తరణకు విరాళాల కోసం దాదా నడుం బిగించాడు. శుక్రవారం ''దాదా షోంగే దిల్‌సే దీజీయే'' అనే పేరుతో ఈ ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం జరుగుతుంది. దీని కోసం గంగూలీ ప్రధాన ఆకర్షణగా ప్రత్యేక క్రికెట్‌ ఫీల్డ్‌ థీమ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

నేడు ఇంధనపొదుపుపై అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ : నేడు ఇంధనపొదుపుపై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. 

నేడు రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో సాయంత్రం 6 గంటలకు దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు జరుగునున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులను గవర్నర్ ఆహ్వానించారు. 

'మాదిగల విశ్వరూప యాత్ర'పై నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ  'మాదిగల విశ్వరూప యాత్రను తలపెట్టిట్టారు. ఈ యాత్రపై నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. 

 

నేడు కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఎపి ప్రభుత్వ వాదనలు

హైదరాబాద్ : నేడు కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఎపి ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.   

Don't Miss