Activities calendar

08 April 2016

దోర్నాల మండలంలో ఆటో - ఆర్టీసీ బస్సు ఢీ..

ప్రకాశం: దోర్నాల (మం) కోర్రపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. 

ఖాట్మండులో రూ. కోటి విలువైన నకిలీ కరెన్సీ..

నేపాల్ : ఖాట్మండులో కోటి విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు పాకిస్థాన్, ఐదుగురు నేపాల్ దేశస్తులను అరెస్టు చేశారు. 

21:24 - April 8, 2016

హైదరాబాద్ : మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉన్నా ఆ నీటిని పొలాలకు తరలించడానికి ఖర్చు ఎక్కువవుతుందని నీటి పారుదల శాఖ నిపుణులు టి హనుమంతరావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి. హనుమంతరావు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సందేహాలకు హనుమంతరావు నివృత్తి చేశారు.ప్రణాళిక ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద నుంచే నీటిని తరలించాలని సూచించారు.
నీటి వనరుల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు గోదావరి నుంచే నీటిని తరలించడం మేలని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి చేసిన నూతన డిజైన్‌ మూలంగా రాష్ట్రంపై అదనపు భారం తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ప్రొ. కోదండరాం, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

21:22 - April 8, 2016

రాజమండ్రి : ఓ వైపు తెలుగు ప్రజలు ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే.. మరోవైపు తెలుగు భాష నిర్లక్ష్యంపై రాజమహేంద్రవరంలో మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నిరసన దీక్షకు దిగారు. చంద్రబాబు సర్కార్ గతంలో తెలుగు భాష పరిరక్షణకు ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీ వేత్తలకు రాజమహేంద్రవరం నిలయం. అయితే తెలుగుభాషా పరిరక్షణ కోసం యార్లగడ్డ మండుటెండలో దీక్ష చేస్తున్నా ఆయనకు భాషాభిమానులు ఎవరూ సంఘీభావం ప్రకటించలేదు.

21:18 - April 8, 2016

విజయవాడ : వచ్చే మూడేళ్లలో 15లక్షల ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపుసెట్లను ఉచితంగా రైతులకు అందజేస్తామని... సీఎం చంద్రబాబు ప్రకటించారు.. డబ్బులేకపోయినా వినూత్న ఆలోచనలతో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.. ఈ ఏడాది జూన్‌కల్లా నెలకు 149 రూపాయల ఖర్చుతో ఇంటింటికీ నెట్‌ కనెక్షన్ ఇస్తామని తెలిపారు.

ఉగాది వేడుకలు..
విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.. ఎల్‌ఈడీ బల్బుల పంపిణీద్వారా విద్యుత్ ఆదా చేసి 40వేలకోట్ల రూపాయలను ఖజానాకు మిగిల్చామని బాబు చెప్పారు. ఈ డబ్బుతో రైతులకు అధునాతన ఎనర్జీ ఎఫిషియెన్సీ మోటార్లను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. అలాగే ఫైబర్‌ గ్రిడ్‌తో 149 రూపాయలకే ఇంటింటికీ నెట్‌ కనెక్షన్ ఇస్తామన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించాలని చెప్పారు.

చాగంటిపై బాబు ప్రశంసలు..
రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక, వికాస సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అంతకుముందు చాగంటి ఇచ్చిన ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయని బాబు ప్రశంసించారు. చాగంటిని కళారత్న-హంస పురస్కారంతో సత్కరించారు. అలాగే అలనాటి అగ్ర హీరోయిన్ కాంచనను కూడా సీఎం సన్మానించారు. పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేయీ కృష్ణ మూర్తి, శాసన సభాపతి డా. కోడెల శివప్రసాదరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి స్పీకర్ శ్రీ చక్రపాణి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

20:27 - April 8, 2016

విజయవాడ : ఆర్థిక లావాదేవీల వ్యవహారం కేంద్రమంత్రి సుజనా చౌదరి పదవికి గండికొట్టే అవకాశం ఉందా..? మరో దఫా రాజ్యసభ పదవిపై సుజనా పెట్టుకున్న ఆశలు అడియాసలు కానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. త్వరలో సుజనా రాజ్యసభ పదవీకాలం ముగియనుండటంతో మరో ఛాన్స్‌పై ఉత్కంఠ నెలకొంది.

కీలక నేతగా పేరు..
టీడీపీలో కీలక నేతగా పేరున్న సుజనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా అధినేత ముందుగా ప్రస్తావించేది కూడా సుజనా చౌదరినే. పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరున్న సుజనాకు చంద్రబాబు కేంద్రంలో సముచిత స్థానం కల్పించారు. స్వయంగా ప్రధానమంత్రి అభ్యంతరం చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టుబట్టి మరీ కేంద్ర మంత్రి వర్గంలో సుజనాకు స్థానం కల్పించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో సుజనా పేరు తెరపైకి రావడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జాతీయ స్థాయిలో సుజనాపై విభిన్న కథనాలు వినిపిస్తుండటం, ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనుండటంతో మరో అవకాశంపై నీలినీడలు కమ్ముకున్నట్లయ్యాయి.

సుజనా వివరణ..
మరోవైపు మారిషస్‌ బ్యాంకు వ్యవహారంపై సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. వ్యాపారంలో ఇవన్నీ కామన్‌ అని, అయినా తాను ఎలాంటి రుణం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కోర్టు ఇచ్చిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్ సుజనాను చిక్కుల్లో పడేసినట్లయింది. మారిషస్‌ బ్యాంకు రుణాల విషయంలో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చినప్పటికీ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సీనియర్‌ నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడగించడం కూడా అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. అయితే సుజనా చౌదరి మాత్రం ఇవన్నీ సర్వ సాధారణమని కొట్టిపారేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపవని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ నేతల హస్తం..
ఈ వ్యవహారంలో కొందరు పార్టీ నేతల హస్తం ఉందని సుజనా వర్గం భావిస్తోంది. సుజనాకు రాజ్యసభ స్థానం దక్కకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న పాయింట్‌ను సుజనా వర్గీయులు లేవనెత్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.  

20:23 - April 8, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, సునీల్‌కుమార్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సునీల్‌కుమార్‌ నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు 24 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు, ఓ జడ్పీటీసీ, మరో ఎంపీపీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను చూసి టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యేలు చెప్పారు. రాబోయే కాలంలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం తీవ్ర కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

అభివృద్దిని అడ్డుకుంటున్నారన్న బాబు...
కొందరు పదేపదే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అందిరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని, అనవసరంగా అభివృద్ధికి అడ్డుపడితే రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకెంత మంది విపక్ష నేతలు ఫిదా అవుతారో వేచి చూడాల్సిందే. 

కేసీఆర్ ను కలిసిన గెజౌభా కంపెనీ ప్రతినిధులు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గెజౌభా ప్రతినిధులు కలిశారు. నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు గెజౌభా కంపెనీ ఆసక్తి చూపిస్తోంది. చైనాలోని త్రీ గాడ్జెస్ బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములమని కేసీఆర్ కు ప్రతినిధులు తెలిపారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల గురించి ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. పెట్టుబడులు, విధి విధానాలు, నిర్మాణ సంబంధ విషయాలపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు. 

గౌహతిలో మోడీ ప్రచారం..

అస్సాం : ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గౌహతిలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 

శనిసింగ్నాపూర్ కాంప్లెక్సుకు చేరుకున్న తృప్తిదేశాయ్..

మహారాష్ట్ర : శనిసింగ్నాపూర్ కాంప్లెక్సుకు భూమాత బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్ చేరుకున్నారు. శని సింగ్నాపూర్ లో మహిళలు ఆలయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 

రీ డిజైన్..హనుమంతరావు సూచనలు..సలహాలు..

హైదరాబాద్ : తుమ్డిహట్టి నుండి ఎల్లంపల్లి వరకు రిజర్వాయర్ నిర్మిస్తే చాలని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి. హనుమంతరావు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సందేహాలకు హనుమంతరావు నివృత్తి చేశారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి నిర్మాణం వ్యయంతో కూడుకున్నదని, మేడిగడ్డ నుండి ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యారేజీలు ఎత్తిపోతలకు సరిపోవని తెలిపారు.

18:41 - April 8, 2016

నువ్వు నీలా నటించావు...సహజం....అందిరికీ నచ్చావు....నువ్వు ఎలా నటిస్తే అందరూ ఇష్టపడతారో..అలా కనిపించాలని ప్రయత్నిస్తే...అసహజం....ఎవరికీ నచ్చవు. స్క్రీన్ అప్పీయరెన్స్, డైలాగ్స్ డెలివరీ, హ్యూమర్ , స్టైలిష్ యాక్షన్ తో పవర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. రెండు దశాబ్దాల కెరీర్ లో పవన్ ను ప్రేక్షకులు, అభిమానులు ప్రేమించేలా చేసిన అంశాలివి. ఈ సినిమాలు...ఈ నటన...పవన్ కావాలని చేసినవి కాదు...అలా జరిగిపోయాయి. ఐతే తన నటనలోని ఏ క్వాలిటీస్ ను ఆడియోన్స్ ఇష్టపడ్డారో...అవన్నీ ఉండాలని..కలగలిపి..ఓ సినిమా చేస్తే...అది కృత్తిమమే అవుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ ఇదే జరిగింది.

కథ..
సర్దార్ గబ్బర్ సింగ్ కథ చెప్పుకుంటే....రతన్ పూర్ లో రాజ కుటుంబం రైతులకు, పేదలకు అండగా నిలబడుతుంది. తమ సొమ్ముతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆ రాజ కుటుంబ రాకుమారి అర్షీదేవి. అదే ఊరిలో ఉండే...భైరవ్ సింగ్ కుటుంబ సభ్యులు స్వార్థ పరులు. డబ్బు కోసం ప్రజల ధనాన్ని, భూములను దోచుకుంటుంటారు. రాజుల కుటుంబం భైరవ్ సింగ్ ను ఎదిరించలేకపోతుంది. ఇదే సమయంలో రతన్ పూర్ కు పోలీసుగా వస్తాడు సర్దార్ గబ్బర్ సింగ్. అన్యాయాలను ఎదిరించి...భైరవ్ సింగ్ మనుషుల్లో భయం పుట్టిస్తాడు. అర్షీ దేవితో ప్రేమలో పడతాడు. రాజ కుటుంబ ఆస్తి దక్కించుకునేందుకు అర్షీదేవిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు భైరవ్ సింగ్. ఈ క్రమంలో భైరవ్ సింగ్ నుంచి రతన్ పూర్ గ్రామాన్ని, తన ప్రేమను సర్దార్ ఎలా కాపాడుకున్నాడన్నది మిగిలిన కథ.

తారుమారైన కొలతలు..
ఈ సినిమా అభిమానులకు 'అంకితం' అనే టైటిల్ తో సినిమా మొదలవుతుంది. ఈ టైటిల్ పడగానే...పక్కా కమర్షియల్ కొలతలతో సినిమా చేశారన్న అంచనా ఏర్పడిపోతుంది. కానీ..ఈ కొలతలు తారుమారయ్యాయి. పవన్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఆ తర్వాత సన్నివేశాలు ఒక్కొక్కటిగా తేలిపోతుంటాయి. గబ్బర్ సింగ్ సక్సెస్ కు కారణమైన కామెడీ, యాక్షన్ మిక్సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో కుదరలేదు. ఫైట్లు, కామెడీ సీన్స్ తో మొదటి అర్థభాగం పర్వాలేదనిపిస్తే....సెకండాఫ్ తేలిపోయింది. బలహీనమైన స్క్రీన్ ప్లే...మిస్ ప్లేస్ మెంట్ పాటలు...బోర్ తెప్పిస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సంగీత్ పాటల ఎపిసోడ్...పవన్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఊహించలేం. రొటీన్ క్లైమాక్స్ ఉసూరుమనిపిస్తుంది.

ఆకట్టుకున్న పవన్..
ఏరి కోరి రాసుకున్న కథ కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ పాత్రలో పవన్ చాలా ఉత్సాహంగా నటించాడు. యాక్షన్, కామెడీ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అర్షీదేవి క్యారెక్టర్ లో కాజల్ బ్యూటిఫుల్ గా కనిపించింది. అలీ సహా గబ్బర్ సింగ్ గ్యాంగ్ లో జబర్దస్త్ టీం చేసిందేమీ లేదు. స్క్రీన్ ప్లే కుదరని ఈ కథలో...ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, కబీర్ సింగ్, రావు రమేష్ లాంటి ఆర్టిస్టులంతా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. రతన్ పూర్ సెట్టింగ్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ సినిమాను ఎలివేట్ చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ టాలెంట్ సర్దార్ గబ్బర్ సింగ్ కు పనికి రాలేదు. మొత్తానికి టైటిల్స్ లో వేసినట్లే...సర్దార్ గబ్బర్ సింగ్ స్ట్రిక్ట్లీ ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్.

ఫ్లస్ పాయింట్స్
రతన్ పూర్ సెట్టింగ్స్
కొన్ని కామెడీ సీన్స్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
దారి తప్పిన కథనం
సంగీత్ పాటల ఎపిసోడ్
క్లైమాక్స్.

బావిలో పడి అన్నదమ్ములు మృతి..

ఖమ్మం : బోనకల్ (మం) రావినూతలలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు రాజ్ కుమార్, పవన్ గా గుర్తించారు. 

సెమీ ఫైనల్ లో సైనా..

ఢిల్లీ : మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్ కు చేరుకుంది. కార్టర్స్ లో థాయ్ లాండ్ క్రీడాకారిణి పోన్టిప్ పై 19-21, 21-14, 21-14 తేడాతో సైనా గెలుపొందింది. 

ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఫలితాల్లో 80.47 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. 

18:09 - April 8, 2016

భారత ఎయిర్ ఫోర్స్ లో ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసి రిటైర్ మెంట్ పొందారు రామన్. కానీ రిటైర్ మెంట్ తరువాత కూడా సామాజిక సేవా దృక్పథంతో ఆయన చిరకాల వాంఛ అయిన సైనిక్ అకాడమీని స్థాపించారు. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. టెన్ టివిలో 'అంతరంగం' కార్యక్రమంలో రావు జీవిత విశేషాలు తెలిపారు. ఆయన ఎలాంటి విశేషాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

18:06 - April 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రీ డిజైన్ వల్ల ఒక ఎకరం ఖర్చు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని నీటి పారుదల రంగ నిపుణులు హనుమంతరావు పేర్కొన్నారు. రీ డిజైన్ లో సాదక బాధకాలపై ఎస్వీకేలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టి.హనుమంతరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న..చేపట్టే ప్రాజెక్టులపై కూలంకుషంగా..అర్థమయ్యే రీతిలో విశ్లేషించారు. ఎకరా పంట అంటే వర్షకాలంలో పండే పంట అని అంత ఖర్చు అవసరం ఎంటీ ?అని ప్రశ్నించారు. కానీ తాను చేసిన కొన్ని ప్రయోగాల వల్ల హెక్టార్ కు రూ. 12 వేలు ఖర్చు అవుతుందని, ఇక్కడ హెక్టార్ కు రూ. 12 లక్షలవుతుందన్నారు. ఈ పనులన్నీ జూన్ నాటికి పూర్తి చేస్తే భూగర్భ నీరు పెరుగుతుందని తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం తన సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రయోగాలు చేసిందన్నారు. అక్కడ హనుమంతరావు టెక్నాలజీ అని పేరు పెట్టారని తెలిపారు. అంతేగాకుండా కరకట్టలపై లోతుగా అధ్యయనం చేయాలని సంస్థలు సూచిస్తున్నాయన్నారు. కాల్వలు..చెరవులు ముంపునకు గురికాకుండా చూడాల్సి ఉంటుందని, కానీ అలా కావడం లేదన్నారు. రాజమండ్రి టౌన్ లో రెండు పట్టణాలున్నాయని, ఆర్యపురం, లింగాలా గుట్ట రెండు ప్రాంతాలు నీరు నిల్వ ఎప్పుడూ ఉంటుందన్నారు. రాజమండ్రి దగ్గర వర్షం కురిస్తే పల్లపు ప్రాంతాలకు నీరు వెళుతుందని, కానీ పంపులు పనిచేయవని తెలిపారు. ఇంకా ఎలాంటి విశ్లేషణ అందించారో వీడియో క్లిక్ చేయండి. 

17:55 - April 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల రీ డిజైన్ పై పలు విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అందరి సందేహాలను నివృత్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ఏకంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో సాదక బాధకాలపై ఎస్వీకేలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. నీటి పారుదల రంగ నిపుణులు టి. హనుమంతరావు పాల్గొని పలువురి సందేహాలన నివృత్తి చేశారు. వాప్కోస్ 2008 లో రిపోర్టు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 70-100 టీఎంసీల నీటి లభ్యత ఉందని నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేసి చెప్పాలని పేర్కొనడం జరిగిందని తెలిపారు. 110 టీఎంసీల నీరు లభ్యం అవుతుందని కానీ 160 టీఎంసీల నీరు కావాలంటూ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. ప్రాజెక్టు 160 టీఎంసీల నీటి కోసం డిజైన్ చేసి రూపకల్పన చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. ఇందులో కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోవాలని ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోని నీరు, దిగువ రాష్ట్రాలు ఉపయోగించుకోకుండా ఉన్న నీరు..మిగిలిన నీటిని ప్రాజెక్టు లభ్యత అని తేలుస్తారని వివరించారు. నిబద్ధతత రాకపోవడం ప్రభుత్వమే కారణమని తేల్చారు. 

సాగునీటి ప్రాజెక్టులపై టి.హనుమంతరావు సూచనలు..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి. హనుమంతరావు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సందేహాలకు హనుమంతరావు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ప్రొ. కోదండరాం, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

17:25 - April 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల రీడిజైన్ మూలంగా భారీగా ఆర్థిక భారం పడుతుందని నీటి పారుదల రంగ నిపుణులు టి. హనుమంతరావు పేర్కొన్నారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాదక బాధకాలపై ఎస్వీకేలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టి.హనుమంతరావు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో మొదట తప్పులు జరిగాయని, సరిదిద్దే చర్యల్లో భాగంగా రీ డిజైన్ చేస్తున్నామని..ప్రజలకు లాభాలు కలిగే విధంగా ఇది అవసరం పడుతోందని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఇందులో కొంత నిజముందని, కానీ తప్పులు సరిదిద్దు కోవాలని సూచించారు. ప్రయత్నం వాళ్లు చేస్తున్నారని, ఎక్కువగా మెరుగు దిద్దే చర్యలు ఏమన్నా ఉన్నాయా ? ఖర్చు తగ్గించవచ్చా ? అనేది ఆలోచించాలని సూచించారు. 

ఎస్వీకేలో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి. హనుమంతరావు రిటైడర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ప్రొ. కోదండరాం, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

'పవన్' కళ్లు తెరవాలన్న 'వర్మ'...

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. 'ఎస్ జీఎస్' హిందీ ఓపెనింగ్ 2 పర్సెంట్. ఒక నెల ముందే చెప్పడం జరిగింది. బాహుబలియన్ మిస్టేక్ అని. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్లు తెరిచి తన చుట్టూ ఉన్న చెడ్డ సలహా దారులను తెలుసుకోవాలి' అంటూ ట్వీట్ చేశారు. 

16:46 - April 8, 2016

హైదరాబాద్ : రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ప్రతొక్కరూ ఆలోచించాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. శుక్రవారం ఎస్వీకేలో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. కార్యక్రమానికి రావాలని పిలవడం జరిగిందని, ఉగాది పండుగైనా భారీ స్పందన వచ్చిందని తెలిపారు. రైతు ఆత్మహత్యలు..నివారణలపై హై స్కూల్ పిల్లలకు వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు పేర్కొన్న అభిప్రాయాలు చూసి ఆశ్చర్యం కలిగిందన్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. రైతుల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి దగ్గర చూస్తే నాలుగైదు ఎకరాల భూమి ఉన్నా ఈ పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. దీనిపై ప్రతొక్కరూ ఆలోచించాలని సూచించారు. 

ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం..10 మంది మృతి..

చెన్నై : కోయంబత్తూర్ లోని ఓ ప్లాస్టిక్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. పది మంది మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. 

టీనేజర్ల కాల్పులు..ఉబెర్ క్యాబ్ డ్రైవర్ మృతి..

ఢిల్లీ : నజుఫర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ పై ఇద్దరు టీజేర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. 

టిడిపిలో చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ టిడిపిలో చేరారు. వీరితో పాటు 24 మంది సర్పంచ్ లు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, ఎంపీపీ లు కూడా చేరారు. 

తుళ్లూరులో నూతన పీహెచ్ సీకి శంకుస్థాపన..

గుంటూరు : తుళ్లూరులో నూతన పీహెచ్ సీ భవనానికి మంత్రి కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత విస్తారిస్తామని తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో వెనుకడుగు వేయమని తెలిపారు. 

16:14 - April 8, 2016

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సమావేశమైన బీజేపీ కమిటీ ఐదు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. కర్ణాటక అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను, అరుణ్ చల్ ప్రదేశ్ రాష్ట్రానికి తపిరా గావ్..పంజాబ్ రాష్ట్రానికి విజయ్ సాంప్లాను..యూపీ రాష్ట్రానికి కేశవ్ ప్రసాద్ లను నియమిస్తున్నట్లు జాతీయ కమిటీ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి లక్ష్మణ్ కృషి చేస్తారని భావించిన అధినాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో తెలియడం లేదు. హరిబాబును తొలగించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొంటున్నట్లు సమాచారం. కానీ సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయాలను వెంకయ్య నాయుడు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 

అనంతనాగ్ లో గ్రనేడ్ పేలుడు..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లోని బిజ్ బెహ్రాలో గ్రనేడ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే భద్రతా దళాలు భద్రతను పటిష్టం చేశాయి 

శ్రీనగర్ లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల ప్రదర్శన..

జమ్మూ కాశ్మీర్ : మళ్లీ పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు దర్శనిమిచ్చాయి. శుక్రవారం శ్రీనగర్ లో జామా మసీదు ప్రాంతంలో కొందరు పాక్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడనే ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 

కాంగ్రెస్ అభ్యర్థి దీపా దాస్ మున్షి నామినేషన్..

పశ్చిమ బెంగాల్ : కాంగ్రెస్ లీడర్ దీపా మున్సి నామినేషన్ వేశారు. భవానీపూర్ నియోజవకర్గం నుండి ఆమె బరిలో నిలుచున్నారు. ఇదే నియోజకవర్గం నుండి సీఎం మమత బెనర్జీ కూడా నిలుచున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్..

ఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి కె. లక్ష్మణ్ ను నియమించారు. కర్ణాటక అధ్యక్షుడిగా యడ్యూరప్ప..అరుణ్ చల్ ప్రదేశ్ రాష్ట్రానికి తపిరా గావ్..పంజాబ్ రాష్ట్రానికి విజయ్ సాంప్లాను..యూపీ రాష్ట్రానికి కేశవ్ ప్రసాద్ లను నియమిస్తున్నట్లు జాతీయ కమిటీ ప్రకటించింది. 

15:42 - April 8, 2016

నల్గొండ : భర్తకు దూరం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ఓ వివాహిత ధర్నాకు దిగింది. నల్గొండ జిల్లా రాజంపేట మండలం బొందుగుల గ్రామంలో చోటు చేసుకుంది. బొందుగుల గ్రామ నివాసంలో ఉంటున్న ఓ యువతిని అదే గ్రామానికి గోపగాని వరుణ్ ప్రేమించాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో వరుణ్ తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు. దీనితో ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు మరొకరికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే వరుణ్ యువతి భర్తకు ఫోన్ చేసి తాను ప్రేమించిన యువతిని ఎలా వివాహం చేసుకుంటావంటూ బెదిరించాడు. దీనితో ఆమెను భర్త బయటకు గెంటేశాడు. ఫలితంగా తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు వరుణ్ ఇంటి ఎదుట వివాహిత ఆందోళనకు దిగింది. మాజీ సర్పంచ్ అని, రాజకీయ అండదండలున్నాయని, ఏమీ చేయలేవని పేర్కొంటున్నారని బాధితురాలు వాపోయింది. గతంలో కొడితే పావు గంట సృహ తప్పిపడిపోయాయని పేర్కొంది. తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని వివాహిత కోరింది. 

15:32 - April 8, 2016

విజయవాడ : 2029 నాటికి భారతదేశంలో ఏపీ మొదటిస్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. శ్రీనివాసగార్గేయ పంచాంగ శ్రవణం చేశారు. 2029 కల్లా దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కులం, మతం, ప్రాంతం ఈ మూడింటికి అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అందరం ఐకమత్యంగా ఉండాలని అన్నారు. ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టడం అందరూ హర్షించారని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును సీఎం నియమించారు. ఉగాది వేడుకల్లో చాగంటిని కళారత్న బిరుదుతో సీఎం సత్కరించారు. ఉగాది వేడుకల్లో సీఎం చేతుల మీదుగా పలువురికి కళారత్న, ఉగాది విశిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. వేదపండితులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులను సత్కరించారు.

15:31 - April 8, 2016

హైదరాబాద్ : వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తుతున్నామని సీఎం అన్నారు. రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్వంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఈ వేడుకలను ప్రారంభించారు. స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు శృంగేరి ఆస్థాన పండితులు సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.

ఆత్మహత్యలు కనిపించకూడదు - కేసీఆర్..
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అనేవి కనిపించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఐదేళ్లలో కరువు రక్కసిని తరిమికొడతామని చెప్పారు. తెలంగాణలో నీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతున్నామని కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే మహారాష్ట్రతో ఆఖరి ఒప్పందం చేసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదాయంలో 15 శాతం వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అర్చకులను సీఎం కేసీఆర్ సత్కరించారు. తొలిపొద్దు కవితా సంపుటిని, యాదాద్రి భక్తి గీతాల మాలికను సీఎం ఆవిష్కరించారు.

15:27 - April 8, 2016

కర్ణాటక : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో పావుగడ అలంకార్ థియేటర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం థియేటర్ వద్ద భారీగా పవన్ అభిమానులు గుమి కూడారు. ఒక్కసారిగా గేట్ తెరవడంతో టికెట్ల కోసం పరుగులు తీశారు. ఈ చిత్రాన్ని చూడటానికి రాకేష్ అనే యువకుడు కూడా వచ్చాడు. టికెట్ల కోసం వెళుతుండగా వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రాకేష్ మెడపై కత్తితో బలంగా పొడిచారు. అనంతరం ఆ గుంపులో పడి పరారయ్యారు. చుట్టుపక్కల ఉన్న జనానికి ఏమవుతుందో అర్థం కాలేదు. కొద్ది సేపటి తరువాత కుప్పకూలిన రాకేష్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రాకేష్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాకేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

15:23 - April 8, 2016

ఖమ్మం : గిరిజన రైతులను హార్టికల్చర్‌ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పరావుపేటలో నూతనంగా నిర్మించబోయే పామాయిల్‌ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు వ్యవసాయ పని ముట్లపై వంద శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు. పనులు వేగవంతం చేయాలని అక్కడి కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులకు ఉగాది పండుగ కానుకగా ఇక నుంచి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి విద్యుత్‌ బోర్డు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

 

15:17 - April 8, 2016

హైదరాబాద్ : మారిషస్‌ బ్యాంకు నుంచి తాను ఎలాంటి రుణం తీసుకోలేదని, వేరే సంస్థ తరపున మాత్రమే హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. మారిషస్ బ్యాంకును మోసం చేసిన కేసులో మూడు సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. రుణం తీసుకున్న కంపెనీలో తనకు ఒక్క శాతం మాత్రమే వాటా ఉందన్నారు. తాను సుజానా గ్రూప్‌ వ్యవస్థాపకుడిని మాత్రమేనని తర్వాత సంస్థలో చాలా మార్పులు వచ్చాయన్నారు. 2010 సంవత్సరంలో సుజనా గ్రూప్ నుండి తాను బయటకు రావడం జరిగిందని, 2012లో మారిషస్ బ్యాంకు నుండి ఆ గ్రూప్ లోన్ తీసుకుందని వివరించారు. మోసం చేయడం వేరు బ్యాంకులకు బకాయిపడటం వేరని, దీన్ని మీడియా అర్ధం చేసుకోవాలని సుజనా కోరారు. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజమని, తన న్యాయవాదుల సలహా మేరకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు ఆయన చెప్పారు. 

15:02 - April 8, 2016

'మిమిక్రీ' అతడి జీవితానికే దారిని చూపించింది. దాన్నే నమ్ముకొని ముందడుగు వేసిన అతడి ప్రతిభ 'జబర్దస్త్' షోతో వెలుగులోకి వచ్చింది. ఆ నవ్వుల సందడిలో తన ముద్ర వేసిన 'వెంకీ'ఇప్పుడో కామెడీ స్టార్‌. ఆడ వేషంతో అదరగొట్టడంలో మనోడిది అందెవేసిన చేయి. ఉగాది పండుగ సందర్భంగా టెన్ టివిలో 'వెంకీ అండ్ కో' సందడి చేశారు. వారు చేసిన సందడి..స్కిట్స్ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఐపీఎల్ మ్యాచ్ లపై సీఎం ఫడ్నవీస్ స్పందన..

ముంబై : ఐపీఎల్ మ్యాచ్ లపై సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ముంబైలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని పేర్కొన్నారు. ముంబై ప్రజలకు నీటి అవసరం ఎంతైనా ఉందని, ఐపీఎల్ మ్యాచ్ లు బయట నిర్వహించుకుంటామంటే అభ్యంతరం లేదని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

అలంకార్ థియేటర్ లో వ్యక్తి దారుణ హత్య..

కర్ణాటక : పావగడ అలంకార్ థియేటర్ లో సర్ధార్ గబ్బర్ సింగ్ టికెట్ల కోసం క్యూ లైన్ లో ఉన్న రాకేష్ అని వ్యక్తిని కత్తితో దుండగులు పొడిచి పరారయ్యారు. పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

శని సింగ్నాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం..

మహారాష్ట్ర: శనిసింగ్నాపూర్ ఆలయంలోకి మహిళలను ఆలయ ట్రస్టు అనుమతించింది. శనిసింగ్నాపూర్ లోని ఆలయంలోనికి మహిళలను అడ్డుకోవడం చెల్లదని, శనీశ్వరాయలంలోకి మహిళల ప్రవేశం నిరోధిస్తూ ఎలాంటి చట్టం కూడా లేదని, అంతర్ ఆలయంలోకి మహిళలను అడ్డుకోరాదని, తీర్పును అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

14:30 - April 8, 2016

తన కూతురికి పెళ్లి చేయాలని భావిస్తాడో పెద్దమనిషి..అందుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు..పెళ్లి చూపులకు వచ్చే వ్యక్తితో ఎలా ఉండాలో..ఎలా మాట్లాడాలో..ఎలా బిల్డప్ ఇవ్వాలో తనింట్లో పని చేసే పని మనిషితో చెబుతాడు..కానీ ఆ బిల్డప్ బెడిసికొట్టింది ఎలా ? అనే కామెడి స్కిట్ ను 'జబర్ధస్త్' వెంకీ చేసి చూపించాడు. చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

గార్లదిన్నె వద్ద రోడ్డు ప్రమాదం..దంపతులు మృతి..

అనంతపురం : గార్లదిన్నె వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కూకట్ పల్లికి చెందిన తాపేశ్వరరావు, శోభారాణి దంపతులు కారులో నగరం నుండి బెంగళూరు వెళుతుండగా గార్లదిన్నె సమీపంలో కారు టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. 

నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం - కేసీఆర్..

హైదరాబాద్ : అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా నగరంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  

సిచువాన్ రాష్ట్రంతో ఏపీ ఒప్పందం..

విజయవాడ : చైనాలోని సిచువాన్ రాష్ట్రంతో ఏపీ ఒప్పందం చేసుకుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిచువాన్ నిర్ణయం తీసుకుంది.

 

బీజాపూర్ లో పోలీసులపై మావోయిస్టుల కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు తీవ్రవగాయాలయ్యాయి.

 

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు..

హైదరాబాద్ : రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. స్పీకర్ మధుసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పండితులను సీఎం కేసీఆర్ ఘనంగా సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ సన్మానించారు. యాదాద్రి పంచాగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

 

తెలంగాణలో నీటి సమస్య ఉంది - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణలో నీటి సమస్య ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు తెలంగాణలో కనిపించకూడదని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళుతున్నామన్నారు. మహారాష్ట్రతో ఫైనల్ నీటి ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు.

 

13:43 - April 8, 2016

మహారాష్ట్ర : మహిళల పోరాటం ఫలించింది. వివక్షపూరిత వైఖరిపై విజయం సాధించారు. ఉగాది రోజున మహిళలు విజయం సాధించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్రను తిరగరాశారు. శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించాలన్న వారి కోరిక నెరవేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించారు. తృప్తి దేశాయ్ నేతృత్వంలో ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. ఆలయ కమిటీ నిర్ణయాన్ని మహిళా సంఘాలు స్వాగతించాయి. 
వివరాల్లోకి వెళితే...ఆలయంలోకి ప్రవేశం కోసం ఏడాది కాలంగా పోరాటం జరుగుతోంది. పలు ఆలయాల్లో మహిళల ప్రవేశించకూడదనే నిషేధాన్ని ఎత్తివేయాలి..వారికి ఆలయంలోకి ప్రవేశించాలి అంటూ భూ మాత బ్రిగేడ్ సంస్థ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శనిసింగ్నాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. పలుమార్లు ఆలయంలోకి ప్రవేశించాలన్న వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయాల్లో మహిళలకు అనుమతినివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇటీవల వీరి ప్రవేశాన్ని ఖాకీలు అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించారు. తృప్తి దేశాయ్ నేతృత్వంలో ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. ఉగాది పర్వదినాన మహిళలంతా ఆలయంలో అడుగు పెట్టారు. ఆలయంలో ప్రవేశించడంతో వీరి సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. 

13:39 - April 8, 2016

పని ఒత్తిడి ప్రభావం చర్మంపై పడుతుంది. దాంతో చర్మం తొందరగా ముడతలు పడి నిర్జీవంగా, కాంతిహీనంగా తయారవుతుంది. అందుకే చాలామంది తమ చర్మ రక్షణ కోసం బ్యూటీపార్లర్‌లపై ఆధారపడతారు. అయితే ప్రతి రోజు బ్యూటీపార్లర్‌కు వెళ్ళటం సాధ్యం కాదు. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే కాంతివంతమైన మృదువైన ముఖాన్ని పొందొచ్చు. దీని కోసం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. క్లీనింగ్‌, స్టీమింగ్‌, స్క్రబ్బింగ్‌, ఫేషియల్‌, మాయిశ్చరైజింగ్‌ వంటి వాటిని పాటించి ఇంట్లోనే అందమైన ముఖాన్ని పొందుతారు.
క్లీనింగ్‌: ముఖాన్ని ఫేస్‌వాష్‌తో నైనా, ఫేషియల్‌ క్లీనర్‌తోనైన శుభ్రంగా కడుక్కోవాలి. మెత్తగా ఉండే టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత పచ్చిపాలల్లో కాటన్‌ ముంచి ముఖానికి పట్టించి మెల్లగా తుడవాలి.
స్టీమింగ్‌: ఒక గిన్నె నిండా వేడి నీటిని తీసుకొని ముఖానికి 5-6 నిమిషాలు ఆవిరి పట్టించాలి. జిడ్డు చర్మం ఉన్న వారు మాత్రమే దీన్ని పాటించాలి. దీనివల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుంది.
స్క్రబ్బింగ్‌: రెండు టీ స్పూన్‌ల చక్కెర, రెండు టీ స్పూన్‌ల తేనెను కలిపి మిశ్రమం తయారు చేయాలి దీంతో ఐదునిమిషాల పాటు మెల్లగా ముఖానికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత కడగాలి. దీనివల్ల చర్మం నిర్జీవంగా కనిపించదు.
ఫేస్‌ప్యాక్‌: పొడి చర్మం ఉన్న వాళ్ళు గులాబీ నీటిలో గంధపు పొడిని కలిపి పేస్టులా చేసుకోని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు గులాబీ నీటిలో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించి తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు గ్రంధులు తొలగిపోతాయి.
ట్యూనింగ్‌: మీ ఇంట్లోనే ట్యూనర్‌ను తయారు చేసుకోవచ్చు. గులాబీ నీటిలో దోసకాయ రసాన్ని కలిపి ముఖానికి పట్టించాలి. ఇది శరీరంలో పిహెచ్‌ స్థాయిని సమానంగా ఉంచటానికి సహాయపడుతుంది.
మాశ్చరైజేషన్‌: చివరగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ముఖానికీ, మెడకు మాశ్చరైజర్‌ను పట్టించండి. ఇలా వారానికోసారి పడుకోనే ముందు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

13:37 - April 8, 2016

ఢిల్లీ: స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గాయం కారణంగా రెండు వారాల పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సన్‌రైజర్స్‌ కోచ్‌ టామ్‌ మూడీ తెలిపాడు. టీ 20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా గాయ పడిన యువీ కొలుకోవడానికి దాదాపు రెండు వారాలు పడుతుందని మూడీ వెల్లడించారు. యువరాజ్‌ లాంటి కీలకమైన ఆటగాడు ఏ జట్టులోనైనా అత్యంత కీలకమే. అతను బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా రాణించగల మ్యాచ్‌ విన్నర్‌ అని యువీని మూడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సీజన్‌లో యువీని సన్‌రైజర్స్‌ భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఏపీ విద్యుత్ ఉద్యోగుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ ఉద్యోగుల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఎపి ఉద్యోగులకు తెలంగాణ సర్కారే జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో పనిచేస్తున్నందున జీతాలివ్వాలని కోర్టు తెలిపింది. 48:52 నిష్పత్తిలో జనాభా ఉన్నందున జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. తెలంగాణలో 1150 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వారికి జీతాలివ్వాలని తెలిపింది. 

 

ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకలు సీఎం పాల్గొన్నారు. కేసీఆర్‌ జ్యోతిప్రజ్వలన చేసి ఉగాది వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయంలో 15 శాతం వృద్ధితో దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. పంచాంగ శ్రవణాన్ని వేదపండితులు చదవి వినిపించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు హాజరయ్యారు. 

13:28 - April 8, 2016

హైదరాబాద్ : రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకలు సీఎం పాల్గొన్నారు. కేసీఆర్‌ జ్యోతిప్రజ్వలన చేసి ఉగాది వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయంలో 15 శాతం వృద్ధితో దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. పంచాంగ శ్రవణాన్ని వేదపండితులు చదవి వినిపించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు హాజరయ్యారు. 

 

13:27 - April 8, 2016

అమ్మాయిల మనసు దోచుకున్న ఆర్య, కలెక్షన్లు కొల్లగొట్టిన దేశముదురు, తెలుగు సినిమాకు పరుగు నేర్పించిన జులాయి, బాక్సాఫీస్ రికార్డ్ లను తిరగరాసే సత్తా ఉన్న సరైనోడు.. తెలుగు సినిమాకు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్న స్టైలిష్ స్టార్.. ఇట్స్ నన్ అదర్ ద్యాన్ అల్లు అర్జున్. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా హీరో ఇమేజ్ కు స్టైల్ నేర్పించాడు బన్నీ. ఈ స్టైలిష్ స్టార్ బర్త్ డే నేడు.  ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడిగా ఇండిస్టీలోకి ఎంటరైన అల్లు అర్జున్‌ 1982లో చెన్నైలో జన్మించారు. బిబిఏలో గ్రాడ్యూయేట్‌ చేసిన బన్నీ తొలుత చిరంజీవి 'విజేత' చిత్రంలో బాలనటుడిగా చిన్న పాత్రలో మెరిసారు. ఆ తర్వాత 'డాడీ' చిత్రంలో డాన్సర్‌గా కనిపించారు. ముంబైలో నటనలో శిక్షణ తీసుకుని 2003లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'గంగోత్రి' చిత్రంతో హీరోగా మారారు. ఆకట్టుకునే నటన, డాన్సులతో అదరగొట్టారు. తొలి చిత్రమే బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో 'ఆర్య' చిత్రంలో సైకో లవర్‌బాయ్ గా కనిపించి లవ్‌ స్టోరీస్‌లోనే సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ను చేశారు. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'బన్నీ' చిత్రంతో మాస్‌ హీరోగా తనదైన మ్యానరిజాన్ని చాటుకున్నారు. 'హ్యాపీ'లో అల్లరి పిజ్జా డెలివరీ బాయ్ గా అలరించారు. 'దేశముదురు'తో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతోనే సిక్స్‌ ప్యాక్‌ బాడీని తెలుగు ఇండిస్టీకి పరిచయం చేశారు.

13 ఏండ్ల సినీ జీవితం..
వరుస హిట్లతో దూకుడు మీదున్న బన్నీకి 'పరుగు', 'ఆర్య 2', 'వరుడు' వంటి చిత్రాలు పూర్తి నిరాశపరిచాయి. క్రిష్‌తో 'వేదం', వినాయక్‌తో 'బద్రీనాథ్‌', త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', పూరీ జగన్నాథ్‌తో 'ఇద్దరమ్మాయిలతో', సురేందర్‌ రెడ్డితో 'రేసుగుర్రం' వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం 'సరైనోడు' చిత్రంతో రాబోతున్నారు. 13 ఏండ్ల సినీ జీవితంలో 16 సినిమాల్లో నటించిన బన్నీ సాధ్యమైనంత వరకు నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు నిదర్శనమే 'వేదం', 'వరుడు', 'ఎవడు', 'రుద్రమదేవి' చిత్రాలు. 'ఆర్య', 'పరుగు' చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డులను అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. యంగ్ హీరో మంచు మనోజ్ తో కలిసి వేదం సినిమాలో నటించాడు. ఐదు డిఫరెంట్ స్టోరీస్ తో ఎక్స్ పెరిమెంటల్ మూవీగా తెరకెక్కిన వేదం, బన్నీ కెరీర్ లో ఓ మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. స్పెషల్లీ కేబుల్ రాజుగా అర్జున్ యాక్టింగ్ కు క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అల్లు అర్జున్.. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ సొంతం ఇమేజ్ సంపాదించుకున్నాడు. పర్టిక్యులర్ ఇమేజ్ కే పరిమితం కాకుండా అన్ని రకాల సినిమాలతో అలరిస్తున్నాడు. తెలుగు సినిమాకు స్టైల్ ఐకాన్ గా మారాడు. టాలీవుడ్ లోనే కాదు మిగతా లాంగ్వేజెస్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇలా మాస్ క్లాస్ సినిమాలతో పాటు, స్పెషల్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరిన్ని మంచి చిత్రాలతో ఎంటర్ టైన్ చెయ్యాలని కోరుకుంటూ... ఈ స్టార్ హీరోకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు..

13:24 - April 8, 2016

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ ఉద్యోగుల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఎపి ఉద్యోగులకు తెలంగాణ సర్కారే జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో పనిచేస్తున్నందున జీతాలివ్వాలని కోర్టు తెలిపింది. 48:52 నిష్పత్తిలో జనాభా ఉన్నందున జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. తెలంగాణలో 1150 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వారికి జీతాలివ్వాలని తెలిపింది. 

 

13:16 - April 8, 2016

విజయవాడ : ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింభిస్తుందని ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ మాట్లాడారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడి జీవితాన్ని కాదు... సమాజం, రాష్ట్రం, దేశాన్ని ప్రతిబింభిస్తుందన్నారు. సమాజంలో ప్రతిఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు, పతనాలు అన్నింటిని చూస్తామని చెప్పారు.  దాన్ని ప్రతిబింభించేంది.. జాగ్రత్తగా ఉండమని చెప్పేది ఉగాది పచ్చడి అని తెలిపారు. రాబోయే సంవత్సరానికి పంచాంగం విన్నాము... దీన్ని అందరూ పరీక్షగా తీసుకోవాలని పేర్కొన్నారు. కష్టాలను చూసి కృంగిపోకూడాదని.. విజయాలను చూసి పొంగిపోకూడదని చెప్పారు. 

 

12:50 - April 8, 2016

విజయవాడ : రాష్ట్ర అభివృద్ధికి అందరూ పాటు పడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎన్ ఎసీ కళ్యాణమండపంలో నిర్వహించిన ఉగాది వేడుకలో ఆయన పాల్గొని, దీపాలంకరణ చేశారు. అనంతరం చంద్రబాబు  ప్రసంగించారు. అన్ని రుచుల సమ్మేళనం ఉగాది పండగ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక సంవత్సరం ఉగాది అని అన్నారు. రాష్ట్రం, సమాజం బాగుండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. 2029 నాటికి దేశంలో ఎపి తొలి స్థానంలో ఉండాలని చెప్పారు. 2050 నాటికి ఎపి అత్యతున్న స్థానంలో ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతాలకతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. 'మనం ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. 'ప్రపంచంలోనే మనది గొప్ప సంస్కృతని అభివర్ణించారు. ఎపి ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రజల బాగుకోసం చాగంటిని నియమిస్తున్నామని చెప్పారు. చాగంటి ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయంగా ఉన్నాయన్నారు. 

 

మోడల్ స్కూల్ టీచర్లకు టీ.ప్రభుత్వం ఉగాది కానుక

హైదరాబాద్ : మోడల్ స్కూల్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వ ఉగాది కానుక. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని వర్తింప చేస్తే జీవో నెం.15ను ప్రభుత్వ జారీ చేసింది. 

 

లోటస్ పాండులో వైసీపీ ఉగాది ఉత్సవాలు

హైదరాబాద్ : లోటస్ పాండులో వైసీపీ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. జగన్, విజయమ్మ, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. 

12:24 - April 8, 2016

అమరావతి : హీరో బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' గా ఖరారు అయింది. ఈమేరకు అమరావతి ధ్యానబుద్ధ ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రకటించారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. 
99 సినిమాల కృషి ఫలితం... వందో సినిమా అని తెలిపారు. తన వందో సినిమాకు ముందు గౌతమిపుత్ర శాతకర్ణి పేరు తాను అనుకోలేదని చెప్పారు. ఈ సినిమా నవరత్నాలు ఉన్న సినిమా అవుతుందన్నారు. నాన్న నందమూరి తారక రామారావును స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఎన్ టిఆర్ మహిళలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు. తనకు తెలిసిన దైవం ఎన్ టిఆర్ అని అన్నారు. 'చరిత్ర సృష్టించాలన్న మేమే... దాన్ని తిరగరాయాలన్న మేమే' అని అన్నారు. తెలుగు భాష కోసం ఎందరో పోరాడారని తెలిపారు. భారతదేశానికి తెలుగు భాష వెన్నెముక లాంటిదన్నారు.

 

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

11:24 - April 8, 2016

హైదరాబాద్ : ముక్కుపిండి పన్ను వసూలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌ పొజిషన్‌లో ఉన్నాయి. ఎగవేతదారులపై కేసుల ద్వారా ఒత్తిడి తెస్తూ.. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ ఘనతను సాధించారు. తమిళనాడు తర్వాత, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు సంయుక్తంగా పన్ను వసూళ్లలో టాప్‌లో నిలిచాయి. 
15 శాతం వృద్ధి రేటు 
ఆదాయ పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 15 శాతం వృద్ధి రేటు సాధించింది. అంటే.. గత సంవత్సరంతో పోలిస్తే.. 15 శాతం మేర అధికంగా పన్నులు వసూలు చేశారన్నమాట. ఇక పన్ను వసూళ్లలో.. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా.. దేశంలోనే సెకెండ్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. తెలంగాణలో 32వేల 331 కోట్లు, ఏపీలో 4వేల 332 కోట్లు వసూలయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కలిసి.. 4 లక్షల 83వేల 398 మంది కొత్తగా పన్నులు చెల్లించారు. ట్యాక్స్ ఎగవేతదారులను గుర్తించి.. వారికి హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికీ స్పందించని 36 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. తప్పుడు ఆధారాలు చూపించిన మరో పదిమంది పైనా కేసులు నమోదు చేశారు. పన్ను ఎగవేతదారుల్లో అత్యధికం.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలే కావడం విశేషం.
పన్ను చెల్లించిన వారి జాబితా 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించిన వారి జాబితాలో.. ఎన్‌ఎండీసీ, సింగరేణిల తర్వాత ఫార్మా కంపెనీలే అధికంగా ఉన్నాయి. ఎన్ ఎండిసి 1600 కోట్లు, సింగరేణి  కాలరీస్ 833 కోట్లు,అరబిందో ఫార్మా 469 కోట్లు, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్ 411 కోట్లు, హెటిరో ఫార్మా 363  కోట్లు, దివి ల్యాబ్స్ 280 కోట్ల రూపాయల మేర పన్నులు చెల్లించాయి. ఎగవేతదారుల పేర్లను తమ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. దీనివల్ల.. మరికొంతమంది ట్యాక్స్ కడతారని భావిస్తోంది. 

ఏడు గేదెలను గొంతుకోసి చంపారు...

హైదరాబాద్ : శంషాబాద్ మండలం మదన్ పల్లి వద్ద దారుణం చోటు చేసుకుంది. శంకరయ్యగౌడ్, ఈశ్వరయ్యగౌడ్ అనే ఇద్దరి అన్నదమ్ములకు చెందిన ఏడు గేదెలను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

11:04 - April 8, 2016

సూపర్‌హిట్‌ చిత్రాల కాంబినేషన్‌గా సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ కాంబినేషన్‌కి బాలీవుడ్‌లో మంచి పేరుతోపాటు క్రేజూ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఏక్‌ థా టైగర్‌', 'భజరంగీ భాయిజాన్‌' చిత్రాలు ప్రేక్షకాదరణతో సంచలన విజయాలు సాధించాయి. ఇటీవల ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'భజరంగీ భాయిజాన్‌' అవార్డుని దక్కించుకుంది. తాజాగా ఈ ఇద్దరూ మరో హిట్‌ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలోనే వీళ్ళ కాంబినేషన్‌లో తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ విషయాన్ని దర్శకుడు కబీర్‌ఖాన్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేస్తూ, 'అవును.. 2017 ఈద్‌కి మా సినిమా రాబోతోంది' అంటూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు సల్మాన్‌తో దిగిన ఓ సెల్ఫీని కూడా పోస్ట్ చేశారు.

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్ ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్ : జిల్లాలోని మంచిర్యాల శ్రీనివాస్ థియేటర్ ఎదుట శుక్రవారం తమ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్లు థియేటర్ యాజమాన్యం తనకు ఇవ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో థియేటర్ వద్ద ఉన్న వారు వెంటనే స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తూర్పుగోదావరి : జిల్లాలోని ఏలేశ్వరంలోని హనుమాన్‌ సెంటర్‌లో శుక్రవారం ఉదయం క్రేన్‌ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. బాలాజీ చౌక్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వైపు వెళ్తున్న క్రేన్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. భయంతో పాదచారులు పరుగు తీశారు. ఈ క్రమంలో బంగారు రాము(55)ని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. అంతకుముందు ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టగా అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

 

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల : శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం కార్యక్రమం జరుగుతోంది. బంగారు వాకిలి చెంత అర్చకులు ఆస్థానం నిర్వహించారు. 
 

రవీంద్రభారతిలో ఉ.10.30 గం.లకు ఉగాది వేడుకలు

హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు జరుగున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్  లు పాల్గొననున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.5 గా నమోదు అయింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. 

10:04 - April 8, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవంగా చైత్రమాస కళ్యాణ వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం మండపంలో శ్రవణ పంచాంగం నిర్వహించనున్నారు. అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించనున్నారు. 

 

09:50 - April 8, 2016

మల్లన్న పంచాంగంలో రాజకీయ పార్టీలు, నేతల జాతకాలను మల్లన్న వివరించారు. టీడీపీ పంచాగం.. రాజ్యపూజ్యం.. 0, అవమానం.. 6, టీఆర్ ఎస్ పంచాగం  10, అవమానం.. 0, వైఎస్సార్పీ పంచాగం రాజ్యపూజ్యం.. 3... అవమానం.. 6, లోక్ సత్తా పంచాగం రాజ్యపూజ్యం...0 అవమానం.. 0, లోక్ సత్తాలో లోకులు లేరు, కాంగ్రెస్ పంచాగం... రాజ్యపూజ్యం.. 5, అవమానం... 5, బీజేపీ పంచాంగం రాజ్యపూజ్యం.. 3,  అవమానం.. 2, వామపక్షాలు పంచాంగం. మోడీ.. పంచాంగం, కేసీఆర్ పంచాగం.. రాజ్యపూజ్యం.. 60, అవమానం... 0 , ఉత్తమ్ కుమార్ పంచాంగం.. రాజ్యపూజ్యం 6... అవమానం.. 0, చంద్రబాబు పంచాంగం.... రాజ్యపూజ్యం 2.. అవమానం... 5, జగన్ .. రాజ్యపూజ్యం.. 6, అవమానం... 6, ప్రజల జాతకం.. ఈ అంశాలపై మల్లన్న పంచాంగాన్ని వీడియోలో చూద్దాం...

 

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కళ్యాణ వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. 

 

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కరీంనగర్ : ఉగాది పర్వదినం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  పంచాంగం ప్రారంభం అయింది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరువు పోవాలని, వర్షాలు కురవాలని కోరుతూ యాగం చేస్తున్నారు. 

08:56 - April 8, 2016

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చర్యలు తీసుకోవాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, టీఆర్ ఎస్ నేత రాకేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ గౌడ్ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో కరవు విపరీతంగా తాండవిస్తుందన్నారు. పశుగ్రాసం, నీటి కొరత తీవ్రతరం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కరువుపై కేంద్రప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని తెలిపారు. కరువు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

08:49 - April 8, 2016

ఏకీకృత సర్వీస్ రూల్స్ రావడం చాలా అవసరమని యుటిఎఫ్ తెలంగాణ నేత చావా రవి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఏకీకృత సర్వీస్‌ రూల్స్ కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు ఒకింత శుభవార్త అందింది. ఈ ఫైల్‌ మీద ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతకం చేయడంతో ఇక అది రాష్ట్రపతి దగ్గరకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ అంటే ఏమిటి? వాటి ఆవశ్యకత ఏమిటి? ఏకీకృత సర్వీసు వల్ల ఎవరికి లాభం?  వీటివల్ల ఎవరైనా నష్టపోయే అవకాశం వుందా? ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలులోకి రావడానికి ఇంకెంత కాలం పట్టే అవకాశం వుంది? తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : శ్రీ దుర్మిఖినామ ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

08:26 - April 8, 2016

హైదరాబాద్ : విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజుల రీఎంబర్స్ మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజులు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల అంశం చర్చకు వచ్చింది. మొత్తం 3,061 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. ఈ మొత్తాన్ని  ఆయా కాలేజీలకు వెంటనే విడుదల కేసీఆర్ ఆదేశించారు. పరీక్షల సమయంలో కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను ఇబ్బంది పెట్టకుండా  ఫీజుల  రీఎంబర్స్ మెంట్‌ బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

08:15 - April 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపుపై రెండో రోజు కూడా బహిరంగ విచారణ కొనసాగింది. రెండో రోజు విచారణలో వివిధ పారిశ్రామిక సంఘాలు తమ వాదనలు వినిపించాయి. రాష్ట్రంలో పారిశ్రామికరంగం నిలదొక్కుకోవాలంటే విద్యుత్‌ చార్జీలు తగ్గించాలన్న వాదనను వినిపించాయి. 
నివేదికలపై బహిరంగ విచారణ
తెలంగాణలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17ఆర్ధిక సంవత్సరానికి గాను విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలపై బహిరంగ విచారణ జరిగింది. చార్జీల పెంపుదల ప్రతిపాదనలను డిస్కంలు సమర్ధించుకోగా... పారిశ్రామిక సంఘాలు వ్యతిరేకించాయి.  టెక్స్‌టైల్‌ అసోసియేషన్లు, ఆఫ్‌సెట్‌ ప్రింటర్లు, వాటర్‌ ప్లాంట్స్‌ యాజమాన్యాలు...వంటి పారిశ్రామిక సంఘాలు ఎవరివాదనలు వారు వినిపించారు.  కొన్ని సంఘాలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లోని లొసుగులను ఎత్తిచూపితే... మరికొందరు ఏఆర్‌ఆర్‌లోని లోపాలను ప్రస్తావించారు. ఫెర్రో ఎల్లాయిస్‌, స్టీల్‌ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఇంకొందరు విన్నవించారు. చిన్న తరహా పరిశ్రమలను ఎల్‌ టీ కేటగిరిలో కొనసాగించడంతో, ఎల్‌టీ సామర్ధ్యాన్ని 100 కేవీ నుంచి 250 కేవీకి పెంచాలని ఫ్యాప్సీ కోరింది. బొగ్గు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విద్యుత్‌ చార్జీలను పెంచడం సరికాదన్న వాదాన్ని కొందరు పారిశ్రామికవేత్తలు వినిపించారు. 
దక్షిణ మధ్య రైల్వేపై ఏటా రూ. 41 కోట్ల అదనపు భారం 
దక్షిణ మధ్య రైల్వే అధికారులు  కూడా  చార్జీల పెంపు ప్రతిపాదనపై తమ వాదాన్ని విపించారు. యూనిట్‌ విద్యుత్‌ను 7.48 రూపాయలు సరఫరా చేయాలని నిర్ణయించడం వలన ప్రతి యూనిట్‌పై  68 పైసలు అదనపు భారం పడుతుందని ఈఆర్‌సీ దృష్టికి తెచ్చారు.  దీని వలన దక్షిణ మధ్య రైల్వేపై ఏడాదికి 41 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌ కే శర్మ... వివరించారు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని కమిషన్‌ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌ మెట్రో రైలుకు సరఫరా చేసే విద్యుత్‌కు యూనిట్‌కు 7.07 రూపాయలు ప్రతిపాదించడంపై హెచ్‌ఎంఆర్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్రో రైలును ప్రత్యేక కేటగిరిలో చేర్చాలని  సంస్థ ప్రతినిధులు కోరారు. కొన్ని సంఘాల ప్రతినిధులు డిస్కం అవినీతి గురించి ప్రస్తావిస్తే... మరికొందరు విద్యుత్‌ సరఫరాలో హెచ్చతగ్గులతో ఎదురవుతున్న ఇబ్బందులను ఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. 

బీడీల తయారీ నిలిపివేత....

ఢిల్లీ : పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక చిత్రాన్ని 85% పెద్దదిగా ప్రచురించాలన్న ఆదేశాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీడీ కంపెనీలు ఉత్పత్తి నిలిపేశాయి. దాదాపు 240 కంపెనీలు బీడీల తయారీని నిలిపివేశాయని అఖిల భారత బీడీ పరిశ్రమ సమాఖ్య నిన్న వెల్లడించింది. దీంతో కంపెనీలకు రోజుకు రూ.200 కోట్లు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది.

మళ్లీ కలిసిన విరాట్, అనుష్క‌

హైదరాబాద్ : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మలు మళ్లీ కలిసిపోయారు ముంబైలోని బాంద్రాకు చెందిన ఓ రెస్టారెంట్ లో బుధవారం రాత్రి కలుసుకున్నారు. అక్కడ విందు చేసిన అనంతరం.. ఈ జంట బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఇంటికి వెళ్లినట్టు సమాచారం. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విరాట్‌, అనుష్క.. విడిపోయినట్లు రెండు నెలల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సంఘటన.. ఈ జంట మళ్లీ ఒక్కటవుతుందేమోనన్న వార్తలకు వూతమిస్తోంది. విరాట్‌, అనుష్కలు కలవడానికి సల్మాన్‌ చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

 

ఎపిలో పవన్ అభిమానులపై లాఠీచార్జీ

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందే ఏపీలోని పలు ప్రాంతాల్లో సందడి వాతావరణానికి తెర తీసింది. విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైన థియేటర్ల ముందు నిన్న సాయంత్రం నుంచే క్యూ కట్టిన అభిమానులు బెనిఫిట్ షోలకు ఎగబడ్డారు. ఈ క్రమంలో టెకెట్ల కోసం నెల్లూరులోని ఓ థియేటర్ వద్ద ఎగబడ్డ పవన్ అభిమానులపై పోలీసులు లాఠీ చార్జీ జరపాల్సి వచ్చింది. పోలీసుల లాఠీ చార్జీలో ఓ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ ను పిలిపించిన పోలీసులు సదరు అభిమానిని ఆసుపత్రికి తరలించారు. 

 

తిరుమలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

07:58 - April 8, 2016

హైదరాబాద్ : మూడు రోజుల వాదనల అనంతరం కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. తదుపరి విచారణ మే 9 నుంచి 11 వరకు చేపడతారు. కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వాదించగా... కర్నాటక వ్యతిరేకించింది. పునఃపంపిణీ అంశం కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశమని వాదించింది. మొదటి నుంచి నీటిపంపకాలు చేయాలన్న తెలంగాణ వాదానలపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 
వాదనలు వినిపించిన ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక 
జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ అధ్యక్షతన కృష్ణానది జలాల వివాదంపై ఏర్పాటైన ట్రైబ్యునల్‌లో మూడు రోజులపాటు కొనసాగిన విచారణలో ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. కృష్ణా జలాలను పునఃపంపకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఏపీ తరుపున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 262 ప్రకారం  1956లో  అంతరాష్ట్ర నదీ జలాల చట్టాన్ని చేసిన విషయాన్ని ట్రైబ్యునల్‌ దృష్టికి తెచ్చారు. మూడు, నాలుగు ఆర్టికల్స్‌ ప్రకారం ఏపీ పునర్వస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారమే తెలంగాణ ఏర్పాటైందని ట్రైబ్యునల్‌ ముందు గంగూలీ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వస్థీకరణ చట్టంలోని 89వ సెక్షన్‌లో జల వివాదాలను పరిష్కరించుకునే అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జలాల పునఃపంపిణీ కేవలం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా పరిగణించరాదని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది ఏకే గంగూలీ  వాదనలు వినిపించారు. ఇది నాలుగు రాష్ట్రాల వివాదంగా పరిగణించాలని  ట్రైబ్యునల్‌ దృష్టికి తెచ్చారు. 
నదీ జల వివాదాలను ట్రైబ్యునల్‌ పరిష్కరిస్తుంది.. 
పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు విడిపోయినప్పుడు రావి, బియాస్‌ నదులు నీటి పంపకాలు వివాదం తలెత్తిన అంశాన్ని గంగూలీ ప్రస్తావించారు. అప్పటికి ట్రైబ్యునల్‌ లేనందున... పార్లమెంటు చట్టం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఉనికిలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. నదీ జల వివాదాలను ట్రైబ్యునల్‌ పరిష్కరిస్తుందని ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని గంగూలీ వాదించారు. ట్రైబ్యునల్‌ కాలపరిమితి పొడిగింపుపై ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో ఎక్కడా లేకపోయినా... జలవనరుల శాఖ సర్క్యులర్‌ ద్వారా రెండేళ్లు పొడిగించిన అంశాన్ని గుర్తు చేశారు. పునర్వస్థీకరణ చట్టంలో ఇన్ని గందగోళ పరిస్థితులు ఉన్నందునే వివాదం తలెత్తిందని ట్రైబ్యునల్‌ దృష్టికి తెచ్చారు. 
మహారాష్ట్ర తరుపున అంధ్యార్జన వాదనలు
కృష్ణా జలాల పునఃపంపిణీ అన్న అంశమే ఉత్పన్నకాదని, ఇది కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశమని మహారాష్ట్ర తరుపున అంధ్యార్జన వాదనలు వినిపించారు. మొదటి నుంచి నీటి పంపకాలు చేపట్టాలన్న వాదనల్లో అర్ధం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోరాదన్న అంశం చట్టంలోనే  ఉందని వాదించారు. ట్రైబ్యునల్‌ తీర్పుపై తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ పదేళ్లపాటు మూడు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని తెలంగాణ వాదించడం సరికాదన్న వాదాన్ని అంధ్యార్జన వినిపించారు. ఏపీ, తెలంగాణ ఆస్తులు, అప్పులు పంచుకున్నట్టే... కృష్ణా జలాను కూడా పంచుకోవాలని సూచించారు. కర్నాటక న్యాయవాది అనిల్‌ దివాన్‌ కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు. మూడు రాష్ట్రాల వాదనలు విన్న బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌... తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మే 9 నుంచి 11 వరకు విచారణ జరపుతుంది. 

 

07:50 - April 8, 2016

గుంటూరు : అమరావతి రాజధాని రైతులకు ప్లాట్లు ఇవ్వడేమో గాని అవి తీసుకునేందుకు రైతులు మాత్రం పాట్లు పడాల్సి వస్తుంది. ప్రభుత్వ షడ్యూల్ ప్రకారం రైతుల ప్లాట్లు మర్చి 30 కల్లా లాటరీ పద్ధతిలో అందించాలి. అయితే ఈ ప్రక్రియ జీవిత కాలజాప్యం లాగా సాగుతోంది.  రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు పైన స్పష్టత ఇవ్వకపోగా రోజుకో హామీ ఇస్తున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్లాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు, విధివిధానాలు  
నవ్య రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు బదులుగా అందజేయాల్సిన ప్లాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు, విధివిధానాలు మొదలయ్యాయి. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రైతులు, అధికారులు, మంత్రులు భేటీతో కీలక సమావేశం జరిగింది. రైతులు తమ ప్లాట్ల గురించి ఉన్న సందేహాలను ప్రతిపాదించినప్పటకీ అవి ఇంకా పూర్తి స్థాయిలో నివృత్తి కాలేదు.
రైతులు ఆగ్రహం 
రాజధానికి భూములిచ్చినందుకు గాను తాము పొందబోతున్న ప్లాట్లకు క్యాపిటల్‌ గెయిన్ నుంచి కేంద్ర ఆర్థికశాఖ ద్వారా మినహాయింపు ఇప్పిస్తామన్న మంత్రులు, ఉన్నతాధికారుల హామీ నెలలు గడుస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రెల్ మొదటి వారం పూర్తయిన్నప్పటకీ అందని పాట్లు..
ప్రభుత్వ షడ్యూల్ ప్రకారం రైతుల ప్లాట్లు మర్చి 30 కల్లా లాటరీ పద్ధతిలో రైతులకు ప్లాట్లు అందించాలి. ఏప్రెల్ మొదటి వారం పూర్తయిన్నప్పటకీ వారితో ఇంకా భేరసారాలే జరుపుతున్నారు. ప్రాథమిక హామీ మేరకు భూములిచ్చిన 400 రోజుల్లోగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందించాలి. కాని ప్రభుత్వం ఆ గడువును పొడిగించుకుంటూనే ఉంది.
రైతులకు స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వ విఫలం 
మంత్రులు, అధికారుల హామీలు ఎలా ఉన్న ఎన్ని ప్రెజెంటేషన్లు చూసినా రైతులకు స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ హామీలు, సదస్సులు అన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయని చేతలలో మాత్రం చాలా వ్యత్యాసం వుంటుందని అన్నారు. ప్రభుత్వం సరైన పద్దతిలో రైతులకు ప్లాట్లు కేటాయించాలని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు పైన స్పష్టత ఇవ్వకపోగా ప్రభుత్వం రోజుకో హామీ ఇస్తోంది. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగుతోందా. లేక వేరే వ్యూహ రచనలో ఉందాఅనేది తేలాల్సి ఉంది. 

07:28 - April 8, 2016

హైదరాబాద్ : తెలుగు వారి ఆత్మీయ పండుగ ఉగాది.. తెలుగు వారి నమ్మకాలకు పునాది ఉగాది .. కోయిల పాడితే ఉగాది .. చెట్లు చిగురిస్తే ఉగాది .. ఆరు రుచులు కలబోస్తే ఉగాది .. ఆస్వాదించే మనసుంటే ... అడవేకాదు అపార్ట్ మెంటైన సరే అంటూ ఆమని ఇట్టే వచ్చేస్తుంది. సుఖ సంతోషాలను తన వెంట మోసుకొస్తున్న తెలుగు సంవత్సరాది ఉగాది.                                                                                         
నేటి నుంచి తెలుగు సంవత్సరం మొదలు 
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. మొదటిది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున .. బ్రహ్మ సృష్టి నిర్మాణం ఆరంభించాడని సూర్య సిద్ధాంతం అనే ఖగోళ జ్యోతిష గ్రంథం చెబుతోంది. దీని ఆధారంగానే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. 
ఉగాదితోనే వసంత ఋతువు మొదలు
వసంత ఋతువు కూడా ఉగాదితోనే మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉగాది మనిషికి కొత్త ఆశలు మోసుకోస్తుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని రుచులను పరిచయం చేస్తుంది. కోయిలమ్మల కమ్మనిగానం మనసును హాయిరాగాలు పలికిస్తుంది. 
ప్రకృతి పండగ
ప్రకృతికి దూరమౌతోన్న మనిషి తనకు తానే వికృతంగా మారిపోతున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు. తనను తాను ప్రేమించుకుంటే ప్రేమ పరమార్ధం అర్ధమౌతుంది. ఇలాంటి అద్భుతమైన భావనను మన సొంతం చేసే ఏకైక పండగ ఉగాది.
దేశంలో వివిధ పేర్లతో  ఉగాది పండుగ 
తెలుగువారికే కాదు .. ఇతర ప్రాంతాల వారు కూడా ఉగాది జరుపుకుంటారు. అయితే ... ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఈ పండుగను పిలుస్తారు. ప్రాంతాలు వేరైనా ... పేర్లు వేరైనా .... ఉగాది స్పెషాలిటీ ఉగాదిదే.
బెంగాల్ లో 'పొయ్లా బైశాఖ్'  
ఉగాది పండుగ తెలుగు వారొక్కరికే ఈ పరిమితం కాలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పండుగ చేసుకుంటారు. బెంగాలీయులు ఈ పండగని పొయ్లా బైశాఖ్ గా పిలిస్తే ... అస్సామీలు 'బిహు' అంటారు. మహారాష్ట్రీయులు 'గుడిపాడ్వ' అంటే .... ఉత్తరాది రాష్ట్రాల్లో 'నవ వర్ష'గా, పిలుస్తారు. కాశ్మీర్లో 'నవ్రేశీగా', సిక్కులు వైశాఖీగా ఉగాది పండుగను జరుపుకుంటారు. 
కన్నడిగులు కూడా ఉగాదిగానే పిలుస్తారు.. 
దక్షిణ భారతంలో మాత్రం తెలుగువారితో పాటు కన్నడిగులు కూడా ఈ పండుగను ఉగాదిగానే పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో ఈ పండుగని విషు అన్న పేరిట జరుపుకుంటారు. తమిళులు మాత్రం ఈ శుభదినాన్ని పుత్తాండుగా పిలుస్తారు.
దుర్ముఖి నామ సంవత్సరం ప్రారంభం
తెలుగు సంవత్సరాలు ప్రభవనుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో లెక్క మొదలవుతుంది. ఈ ఉగాదితో ప్రారంభయ్యే దుర్ముఖి నామ సంవత్సరం. ప్రకృతికి కృతజ్ఞతగా మనం జరుపుకునే పండుగ. రుతువుల రాణి వసంతకాలం ప్రకృతి రమణీయకతను రంగరించుకుని తనని తాను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటుంది.

 

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం వేడుకలు నిర్వహించనుంది. 

నేడు వాటర్ వీక్ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరు

ఢిల్లీ : నేటితో వాటర్ వీక్ కార్యక్రమం ముగియనుంది. నేడు వాటర్ వీక్ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. 

నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరుగనుది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్ ప్రారంభం అవుతుంది. 

Don't Miss