Activities calendar

09 April 2016

21:30 - April 9, 2016

ఢిల్లీ : హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన మైనర్‌ బాలుడి తండ్రిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కారు ఇచ్చి డ్రైవింగ్‌కు ప్రోత్సహించినందుకు మైనర్‌ తండ్రిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం17 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో వేగంగా వచ్చి రోడ్డు క్రాస్‌ చేస్తున్న సిద్ధార్థ్‌ శర్మను ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కుర్రాడు గతంలోనూ పలుమార్లు నిర్లక్ష్య డ్రైవింగ్‌తో పట్టుబడ్డట్లు, వెయ్యి రూపాయల చలాన్‌ కూడా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరిలో ఓ యాక్సిడెంట్‌ చేశాడని, తాను నడిపే కారుతో మరో కారును ఢీకొట్టి ధ్వంసం చేశాడని.... ఇరు వర్గాలు రాజీకి రావడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

21:27 - April 9, 2016

ముంబై : మెడపై కత్తి పెట్టినా కూడా 'భారత మాతాకీ జై' అనని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు రా.. నీ మెడపై నేను కత్తి పెడతానంటూ రాజ్‌ఠాక్రే అసదుద్దీన్‌కు సవాలు విసిరారు. మజ్లిస్‌ పార్టీకి బిజెపినే ఆర్థిక సహాయం చేస్తోందంటూ విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదిని విశ్వాసఘాతకుడిగా రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. నల్లధనం వెనక్కి తెస్తామని హామీ ఏమైందని మోడీని ప్రశ్నించారు. ఉద్ధవ్‌ ఠాక్రేను బిజెపి నిర్లక్ష్యం చేస్తోందని, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగాలని రాజ్‌ ఠాక్రే సూచించారు. 

హీరో వేణుపై పోలీసులకు ఫిర్యాదు...

హైదరాబాద్ : అద్దె ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన నగదును తిరిగివ్వకుండా వేధిస్తున్నారంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు వేణు తొట్టెంపుడి దంపతులపై ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

21:22 - April 9, 2016

నల్గొండ : తెలంగాణకు ద్రోహం చేసేవారిపై కూడా తెలంగాణ ప్రజలు తిరగబడతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం హెచ్చరించారు. నల్గొండ జిల్లా నకిరెకల్‌లో నర్రా రాఘవరెడ్డి తొలి వర్థంతి కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. మరుగున పడిపోయిన అంబేద్కర్‌ ఆశయాలు, సిద్ధాంతాలను రాబోయో కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అంబేద్కరిజం, మార్క్సిజం కలగలిపి ప్రజలకు మేలు చేసేలా పార్టీ ప్రణాళిక రూపొందిస్తోందని తమ్మినేని ప్రకటించారు. 

21:19 - April 9, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటి వరకూ ఐటీ, హైదరాబాద్‌ అభివృద్ధిపై విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా డిజైన్‌ మార్చిన సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికీ విదేశీ సంస్థలు నిధులు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చైనాకు చెందిన నిర్మాణరంగ సంస్థ గెజోబా ప్రతినిధులు.. శనివారం సీఎం కేసీఆర్‌ను కలిసి.. నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తమ ఆసక్తిని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచీ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పొరుగు దేశం చైనా నుంచి ప్రముఖ సంస్థలు.. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. గతంలో విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు చైనా సంస్థ ఆసక్తి చూపగా.. ఇప్పుడు నీటిపారుదల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి మరో చైనా సంస్థ ముందుకొచ్చింది.

టెండర్లలో పాల్గొనాలన్న కేసీఆర్..
చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగం సంస్థ గెజోబా ప్రతినిధులు హుయాంగ్‌ వాన్లిన్‌, వీమింగ్‌, ఆ సంస్థ భారతదేశ ప్రతినిధి సంపత్‌, వెంకటాచలం తదితరులు.. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో దాదాపు 10వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ఈ సంస్థ సుముఖతను వ్యక్తం చేసింది. చైనాలో తాము నిర్మించిన ప్రాజెక్టుల్లో అవలంబించిన పద్ధతులు, సాంకేతిక విధానాల అధ్యయనానికి ప్రతినిధుల బృందాన్ని పంపాలని సీఎంను కోరాయి. తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరి సహకారాన్నయినా స్వీకరిస్తామని సీఎం కేసీఆర్‌ ఈసందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు.. ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవమున్న చైనా కంపెనీలు తెలంగాణలో పని చేయడానికి ఆసక్తిని చూపడం హర్షణీయమన్నారు. కాళేశ్వరం, తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనాలని చైనా కంపెనీని ఆహ్వానించారు.

రీ డిజైన్ లపై కేసీఆర్ సమీక్ష..
మరోవైపు.. ప్రాజెక్టుల రీ-డిజైన్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను టార్గెట్‌ పెట్టుకుని పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. బ్యారేజీలతో సంబంధం లేకుండా పంప్‌ హౌజులు, పైపులైన్లు, కాల్వలు, లిఫ్టుల పనులు ప్రారంభించాలని సూచించారు. 2017 నాటికి కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లి, మల్లన్న సాగర్‌కు నీరందించాలన్నారు. అనంతరం.. హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సచివాలయంలో భేటీ అయింది. వివిధ బ్యారేజీల నిర్మాణానికి నిధుల కేటాయింపు, భూ సేకరణ వంటి అంశాలపై కమిటీ సభ్యులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. మహారాష్ట్రతో ఒప్పందం కోసం ముఖ్యమంత్రుల స్థాయిలో జరగాల్సిన సమావేశానికి ఏర్పాట్లపైనా కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది.

21:16 - April 9, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సొంత జిల్లా చిత్తూరులో పర్యటించారు. హంద్రినీవా, కుప్పం బ్రాంచ్‌ కాలువను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించిన చంద్రబాబు... మదనపల్లిలో హంద్రినీవా ప్రాజెక్టు సొరంగమార్గం పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతరం, చిత్తూరు సీఆర్‌ మండపంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువును కాపాడుకుంటేనే కరవును దూరం చేయగలుగుతామని ముఖ్యమంత్రి అన్నారు. పట్టాదారు పాసుబుక్‌ అవసరం లేకుండా.. నేరుగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాంతో భూమి రికార్డులను మాయం చేసే అవకాశం ఉండదని చంద్రబాబు తెలిపారు.

వంట గ్యాస్ సిలిండర్లు..
నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. వర్షపు నీటిని, భూగర్భజలాలను పరిరక్షించుకునేందుకు చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. చెరువుల పరిరక్షణకు సాగునీటి సంఘాలు కూడా బాధ్యత తీసుకోవాలని బాబు సూచించారు. విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో వచ్చామని, విభజన పద్ధతి ప్రకారం జరగలేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వచ్చే రెండు మూడేళ్లలో సగర్వంగా తలెత్తుకుని నిలిచేలా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని అన్నారు. పేదవాళ్లందరికీ కరెంటు, వంటగ్యాసు సిలిండర్లను ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇసుక వ్యవహారంలో కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఐదు నెలల్లోగా సోమశిల ప్రాజెక్టును పూర్తి చేసి.. గాలేరు నది ప్రాజెక్టునకు అనుసంధానిస్తామని ఆయన చెప్పారు. 

చంద్రవదన్ ను అభినందించిన కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ చంద్రవదన్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 104 శాతం ఆదాయ వృద్ధిని సాధించినందుకు అభినందనలు తెలిపారు. 

20:37 - April 9, 2016

పక్కపక్క కున్న శికన్ మటన్ షాపులోల్లకు పంచాదులు ఎందుకు ఐతయి శెప్పుండ్రి.. ఎవ్వలన్న కష్టమర్ మార్కట్లకు అడ్గువెట్టంగనే నా కష్టమర్ అంటే నా కష్టమర్ అని కయ్యం బెట్టుకుంటరు గదా.. అగో అట్ల మాటా మాటా వెర్గి ఖమ్మం జిల్లాల ఏం జర్గిందో సూడాలంటే వీడియో చూడండి. 

20:35 - April 9, 2016

పశ్చిమ గోదావరి జిల్లాల మాత్రం ఎంకటపురం ఊరోల్లంత ఏడ్పులు పెడ బొబ్బలతోని శోకసంద్రం అయ్యిండ్రు..సర్కారు కొల్వు జేస్కుంట సాడేసాత్ పనులకు ఎగవడ్తున్నరు..వరంగల్ జిల్లాల కొమ్రెల్లి మల్లన్న గుడి ముందట అగ్గి గుండాలు వర్శి.. నిప్కల మీద భరత నాట్యం జేస్తున్నరట భక్తులు..కలిసొచ్చె కాలమొస్తె నడిసొచ్చే కొడ్కు పుడ్తడు అంటరు సూడు అగో సేమ్ టూ సేమ్ గట్లనే అయ్యింది వొక తాన..పక్కపక్కకున్న శికన్ మటన్ షాపులోల్లకు పంచాదులు ఎందుకు ఐతయి శెప్పుండ్రి..ఇలాంటి అంశాలపై 'టెన్ టివి' మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో ముచ్చట్లు చూడాలంటే వీడియో చూడుండి. 

అస్సాంలో ముగిసిన ప్రచారం..

అస్సాం : అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈనెల 11న అస్సాంలో రెండో దశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలకు మిగిలిన 61 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి.

 

కేసీఆర్ తో సమావేశమైన చైనా కంపెనీ ప్రతినిధులు..

హైదరాబాద్ : అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చైనాకు చెందిన గెజౌభా గ్రూప్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రి హారీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని చైనా కంపెనీలను సీఎం ఆహ్వానించారు. తెలంగాణలో రూ.10వేల కోట్ల పెట్టుబడితో చైనా కంపెనీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా సంస్థల ఆర్థిక, సాంకేతిక సహకారం తీసుకుంటామని తెలిపారు.

చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభించిన హరీష్..

నిజామాబాద్: జిల్లాలోని గాంధారి మండలం పేట సంఘంలో మంత్రి హరీష్‌రావు చెరువుల పునరుద్దరణ పనుల్లో పాల్గొన్నారు. చెరువుల పునరుద్దరణ పనులకు అదనంగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నామని హరీష్ రావు ప్రకటించారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష చేపట్టారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల విషయమై అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అస్సాంలో ముగిసిన ప్రచారం..

అస్సాం : అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈనెల 11న అస్సాంలో రెండో దశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలకు మిగిలిన 61 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. 

19:59 - April 9, 2016

ఒక్క కుక్క ధర రూ. కోటి..కుక్క కోసం వ్యక్తిని పొడిచిన వ్యక్తి..రజనీ కటౌట్లకు పాలాభిషేకం చేయవద్దన్న కోర్టు..లక్షాధికారియైన బిక్షగాడు..ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోబో..పనామా పేపర్స్ కలకలం...వెస్టిండీస్ ప్లేయర్ల సంబరాలు..సాయికిరణ్ అందించే మరిన్ని వార్తలతో క్రేజీ న్యూస్... మరి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:47 - April 9, 2016

వెస్టిండిస్ - భారత్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి కుక్కతో స్టేడియానికి వచ్చాడు. మధ్య మధ్యలో కుక్క భౌ..భౌ..అనడంతో ఇతర ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది. దీనికి వారు అభ్యంతరం తెలిపాడు. వీరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆ వ్యక్తి బయటకు వెళ్లి స్నేహితులతో వచ్చి అభ్యంతరం తెలిపిన వారిపై దాడికి దిగాడు. ఓ వ్యక్తిని పొడిచి చంపేశాడు. కుక్కల పిచ్చి వల్లే ప్రాణాలు పోతున్నాయని..కాదు కాదు క్రికెట్ వల్లే ప్రాణాలు పోతున్నాయంటూ వాదనలు తెరమీదకు వచ్చాయి. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:38 - April 9, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతమే తన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. సీనియర్ నేతల సలహాలు, కార్యకర్తల సూచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడమే తమ లక్ష్యమంటున్నారు. గత 35 సంవత్సరాలుగా పనిచేయడం జరిగిందని, అనేక బాధ్యతలు కూడా చేపట్టడం జరిగిందన్నారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పచెప్పారని, కార్యకర్తలను కలుపుకొని పోతానని..సీనియర్ల అభిప్రాయాలను తీసుకుంటానన్నారు. ప్రత్యామ్నాయ లక్ష్యంతో పని చేయడం జరుగుతుందన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు అంకురార్పణ చేసింది బీజేపీ పార్టీయేనని, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణకు మద్దతివ్వలేదని తెలిపారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా పనిచేయడం జరుగుతుందన్నారు. రెండు బాధ్యతలు నిర్వహించడం వీలు లేదని, శాసనసభాపక్ష బాధ్యతలను ఇతరులకు అవకాశం కల్పిస్తామన్నారు. 

19:33 - April 9, 2016

ఢిల్లీ : బ్యాంకుల సొమ్ములు కాజేసి, విదేశాల్లో విలాస జీవితం గడుపుతున్న విజయ మాల్యాను భారత్‌కు తీసుకురావడం సాధ్యమేనా..? న్యాయ పరంగా ప్రక్రియ మొదలైనా కేంద్రం ఎందుకు తటపటాయిస్తోంది..? మాల్యాతో కేంద్ర న్యాయవాదులకు ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమా..? లేక అత్యున్నత చట్టసభ సభ్యుడు కావడమే మాల్యాకు రక్షణ కవచమైందా..? మాల్యా కేసును పరిశీలస్తున్న వారిలో ఇప్పుడీ ప్రశ్నలే వేధిస్తున్నాయి. ఇంతకీ మాల్యా కేసులో తాజా మలుపులేంటి..? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇన్‌పుట్‌ ఎడిటర్‌ కృష్ణ సాయిరాం విశ్లేషించారు. విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:14 - April 9, 2016

నల్గొండ : భారతదేశాన్ని తాము ముక్కలు కానివ్వమని..మతోన్మాదాన్ని ముందుకు తీసుకెళ్లనీయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ సీనియర్ నర్రా రాఘవరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు. అన్ని మతాల వారికి జీవించే హక్కు ఉందని, అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్చ ఉంటుందన్నారు. ఈ పోరాటంలో ఉన్నందుకు నరుకుతాం..చంపుతాం అని బెదిరిస్తున్నారని.. కానీ తాము చావడానికి..ముక్కలు కావడానికి సిద్ధమౌతామే కానీ దేశాన్ని ముక్కలు కానివ్వం..మతోన్మాదాన్ని ముందుకు తీసుకెళ్లనీయమన్నారు. హెచ్ సీయూలో ఉపద్రవం జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొంతమంది నేతలు ఎక్కడి నుండో హెచ్ సీయూకు వచ్చి దళితులను పరామర్శించారని గుర్తు చేశారు. హెచ్ సీయూలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోందని, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉన్నా హెచ్ సీయూకు రావడం లేదన్నారు. ప్రస్తుతం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, నమ్మటానికి ప్రజలు గొర్రెలు కాదని విమర్శించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు..విలువలపై చిత్తశుద్ధి ఉంటే దళితులను ఆత్మహత్యలు చేసుకొనే విధంగా ప్రవర్తిస్తారా ? అని ప్రశ్నించారు. అంబేద్కర్ పై గొప్ప గొప్పలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని, కుల నిర్మూలన కోసం అంబేద్కరిస్టులు..కమ్యూనిస్టులు పోరాటం చేయాలని వామపక్షాలు పిలుపునిస్తున్నాయన్నారు. 

తమిళనాడులో ప్రజాఫ్రంట్ కూటమిలో సీట్ల పంపకం..

చెన్నై : తమిళనాడులో ప్రజా ఫ్రంట్ కూటమిలో సీట్ల పంపకం కుదిరింది. డీఎండీకే 104, ఎండీఎంకే 29, టీఎంసీ 26 స్థానాలు, వీసీకే, సీపీఎం, సీపీఐలకు 25 చొప్పున సీట్లను కేటాయించారు. 

ముగిసిన టి. కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కొద్దిసేపటిక్రితం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై చర్చ జరిగింది. 

అందరికీ వంట గ్యాస్ - చంద్రబాబు..

చిత్తూరు : 'నీరు - ప్రగతి' సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఏడాదిలోగా రాష్ట్రంలో అందరికీ వంట గ్యాస్ అందిస్తామని, ఇసుక వ్యవహారంలో కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా ఉండాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జులై నుండి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించ బడుతుందని, వర్షాలకు చెరువులు తెగిపోతే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. 5 నెలల్లోగా సోమశిళ ప్రాజెక్టును పూర్తి చేసి గాలేరు నది ప్రాజెక్టుకు అనుసంధానిస్తామని, రాజధాని నిర్మాణం, రాయలసీమ ప్రాజెక్టులను ప్రతిపక్షం అడ్డుకొంటోందన్నారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని గన్ పౌడర్ సెక్షన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఆర్కే నగర్ లో జయ ప్రచారం..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఆర్కే నగర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. 

18:32 - April 9, 2016

హైదరాబాద్ : సత్వర న్యాయం కోసం లోక్‌ అదాలత్‌లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. న్యాయం అందరికి అందుబాటులో ఉండేలా...పేదలకు ఉచితంగానే సేవలు అందించాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 14వ జాతీయ న్యాయసేవా సదస్సులో పాల్గొన్న సీఎం కేసీఆర్‌..కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను లోక్‌ అదాలత్‌లకు బదిలీ చేయాలని సూచించారు. జాతీయ న్యాయ సేవా సదస్సు సమావేశాలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ ఎస్ ఠాకూర్‌తో పాటు కేంద్రమంత్రి సదానందగౌడ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, ఇతర న్యాయమూర్తులు సదస్సుకు హాజరయ్యారు.

అందరికీ న్యాయం..
ఈ సమావేశానికి గౌరవ అధితిగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రారంభోపన్యాసం చేస్తూ..చట్టం ముందు అందరూ సమానమేన్నారు. పేదలు, బలహీనులు అన్న తేడా లేకుండా అందరికి న్యాయం అందేలా చూడాలన్నారు. అందుకోసం పేదలకు ఉచితంగానే న్యాయ సేవలు అందించాలని కోరారు. వివాదాల పరిష్కారంలో లోక్ అదాలత్‌ ప్రత్యామ్నాయ వ్యవస్థగా నిలుస్తూ సత్వర న్యాయాన్ని అందిస్తున్నాయన్నారు.ఇదే సందర్భంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్నాయని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేసారు. వివాదాల పరిష్కారం కోసం కేవలం కోర్టుల మీదే ఆధారపడకుండా...ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హమీ ఇచ్చారు.

కీలక పాత్ర..
ఇక సమావేశానికి హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ స్పందిస్తూ..న్యాయ సహాయం, న్యాయసేవల్లో లోక్‌అదాలత్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. న్యాయసేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందన్నారు. పేదలకు న్యాయసహాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు తోడ్పాటు అందిస్తాయని జస్టిస్‌ ఠాకూర్‌ అన్నారు. వివాదాల పరిష్కారంలో లోక్‌అదాలత్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి సదానంద గౌడ అన్నారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

18:29 - April 9, 2016

ప్రకాశం : జిల్లా తాళ్లూరులో ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఆహుతులను అలరించాయి. జిల్లా నలుమూలలతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా ఒంగోలు జాతి ఆవులు అందాటీల్లో పాల్గొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆవుల అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడకు తరలివచ్చారు. ఎంతో ఘన చరిత్ర ఉండి అంతరించి పోతున్న ఒంగోలు జాతి పశువులను కాపాడేందుకే ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రోజురోజుకు తగ్గిపోతున్న ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై వుందన్నారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:26 - April 9, 2016

రాజమండ్రి : మండు వేసవిలో దాహంతో అల్లాడే మూగజీవాల దప్పిక తీర్చేందుకు గోదారి తీరంలో పంతం ఛారిటబుల్ ట్రస్ట్ ముందు కొచ్చింది. రాజమండ్రి వేదికగా పంతం సత్యన్నారాయణ ట్రస్ట్, కేబుల్ ఆపరేటర్లు సంయుక్తంగా నగరంలోని 112 కూడళ్ళలో మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. యేటా వేసవిలో పగటిపూట ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతుండడంతో ఆవులు, పక్షులు నీటికోసం కటకటలాడుతున్న పరిస్థితుల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని సంకల్పించామని పంతం కొండలరావు పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.

18:24 - April 9, 2016

విశాఖపట్టణం : సింహచలం పంచగ్రామాల సమస్యపై తాజాగా విశాఖ కలెక్టర్ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర పట్టపద్రుల ఎమ్మెల్సీ శర్మ. 1996లో అప్పటి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 8వేల ఎకరాలు దేవస్థానానికి చెందినవే అంటూ కలెక్టర్ యువరాజు ఇచ్చిన నివేదికను ఆయన తప్పుపట్టారు. అసలు దేవస్థానానికి 560 ఎకరాలు మాత్రమే ఉందని.. మిగలిన భూమి రెవెన్యూ,అటవీ శాఖలకు చెందినదన్నారు. ఇవన్నీ సర్వే చెయ్యకుండా కలెక్టర్ ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వానికి కొమ్మకాయడం మానేసి స్పష్టమైన నివేదిక ఇవ్వాలన్నారు.

 

18:23 - April 9, 2016

చిత్తూరు : రాష్ట్రంలో రైతులకు త్వరలోనే రెండో విడత రుణమాఫీ నిధులు కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. చిత్తూరు జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అప్పు చేయాలంటే ఎఫ్ఐఆర్ బీఎం నిబంధనలు ఉన్నాయని, రైతులు అప్పులు చేశారో వారికి రూ.24 వేల కోట్లు ఇచ్చి రైతులను విముక్తి చేశామని చెప్పుకొచ్చారు. త్వరలోనే రెండో ఇన్ స్టాల్ మెంట్ చేస్తామని, రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో రైతులను పూర్తిగా విముక్తి చేయడం జరుగుతుందన్నారు. ఇకపై రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం అక్కర లేదన్నారు. 1బీ ఉంటే నేరుగా భూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేసారు. సోమశిల స్వర్ణముఖి లిఫ్ట్ ఇరిగేషన్ ఐదునెల్లోగా పూర్తి చేసి.. ఆ నీటితో గాలేరు-నగరిని కలుపుతామన్నారు. వచ్చే మూడు నెలల్లో మదనపల్లె వద్ద టన్నెల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు చంద్రబాబు.

రాష్ట్రంలో నిధులు కొరత లేదు - కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రంలో నిధుల కొరత లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సినవసరం ఉందని, రాష్ట్రం నుండది కరవును తరిమికొట్టేందుకు ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సింగూరు ప్రాజెక్టును నింపుతామని, త్వరలో సంగారెడ్డిలో పర్యటిస్తానని తెలిపారు. సంగారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, కుత్బుల్లాపూర్ లో మంచినీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శివారు మున్సిపాల్టీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

కొండపల్లిలో అగ్నిప్రమాదం..

విజయవాడ : ఇబ్రహీంపట్నం కొండపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. 

చిత్తూరులో బాబు..

చిత్తూరు : హంద్రీనీవా, కుప్పం బ్రాంచ్ కాల్వలను సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో బాబు సమీక్షమా సమావేశాన్ని నిర్వహించారు.

 

ఓ వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన దుండగులు .....

మెదక్ : గజ్వేల్ మండలం గజగామలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్వామి అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం....

నిజామాబాద్‌: కాలూరు శివారులో వున్న పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలలో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో కాగితపు ముడి సరుకు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.6 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా.

17:22 - April 9, 2016

హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో 'రాంగోపాల్ వర్మ' ఒకరు. ఇటీవల 'పవర్' స్టార్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం 'వర్మ' ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. ఓపెన్సింగ్స్ రెండు శాతమేనని, తాను ఊహించిందే జరిగిందన్నారు. చుట్టూ ఉన్న వ్యక్తుల చేత పవన్ హిందీలో విడుదల చేశారని ట్వీట్స్ చేశారు. తెలుగు సినిమా చరిత్రను బాహుబలి ఆకాశానికి తీసుకెళితే 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం మాత్రం అథ:పాతాళానికి తీసుకెళ్లిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలను పట్టించుకోవాల్సినవసరం లేదని పలువురు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వర్మ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం

16:49 - April 9, 2016

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఆయనపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు నేతలపై ఇంక్ చల్లడం..చెప్పులు విసరడం పరిపాటిగా మారిపోయాయి. తాజాగా కేజ్రీవాల్ పైకి గుర్తు తెలియని వ్యక్తి 'షూ' విసిరాడు. కేజ్రీ సమీపాన షూ పడిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేజ్రీవాల్ సరి బేసి విధానంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతున్న సమయంలో విలేకరుల వెనుకాల కూర్చొన్న వ్యక్తి షూ విసిరాడు. కేజ్రీకి షూ తాకకుండా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. షూ విసిరిన వ్యక్తి ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. 

16:38 - April 9, 2016

నెల్లూరు : కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంఘటనలను చూస్తే మానవత్వం మరుగునపడి కిరాతకం పైచేయి సాధిస్తున్నట్లుంది. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కొడుకులే జన్మించారని..కూతురు లేదంటూ ఓ పసికందును దారుణంగా చంపేసిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కానీ అభం..శుభం...తెలియని ఆ పసికందును ఎందుకు హత్య చేశారో తెలియడం లేదు. వివరాల్లోకి వెళితే...వెంకటగరి మండలంలో గుర్తు తెలియని దుండగులు నెల క్రితం పుట్టిన చిన్నారి చేతులు, కాళ్లు నరికి దారుణంగా చంపారు. స్థానిక దొడ్డేరువాగు ప్రక్కన పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అభం శుభం ఎరుగుని చిన్నారని ఇంత దారుణంగా నరికి చంపాల్సిన అవసరం ఏం వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

16:32 - April 9, 2016

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్‌ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. తమను వేరే క్యాంపస్‌కు మార్చాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిరాహారదీక్షలు చేపట్టారు. అయినా.. అధికారులు దిగిరాకపోవడంతో విద్యార్థులు ఆందోళనను తీవ్రతరం చేశారు. స్థానికేతరులకు చదువుకునే వాతావరణంతో పాటు, రక్షణ కల్పించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీనగర్‌ నిట్‌లో స్థానికేతర విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను వేరే క్యాంపస్‌కు మార్చాలని, రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. చదువుకునే వాతావరణం కల్పించాలని, శ్రీనగర్‌లో పరిస్థితులు స్థానికేతరులకు అనుకూలంగా లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఈనెల ఒకటి నుంచి ఆందోళన చేపట్టారు. మరోవైపు నిట్‌ అధికారులు విద్యార్థుల సమస్యను ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు 60 మంది విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టినా.. అధికారులు ఇంతవరకు విద్యార్థుల దగ్గరకు రాలేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఘర్షణ..
ఇటీవల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోయిన అనంతరం ఎన్‌ఐటీలోని కాశ్మీర్‌ విద్యార్థులకు, స్థానికేతర విద్యార్థులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పటినుంచి క్యాంపస్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని నిరసిస్తూ కాశ్మీరేతర విద్యార్థులు ఆందోళనలకు దిగారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్ర మానవ వనరుల శాఖకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం నిట్‌ను సందర్శించింది. తమకు రక్షణ కల్పించాలని, లేదంటే తమను వేరే యునివర్సిటీకి మార్చాలని విద్యార్థులు విచారణ బృందం ముందు వాపోయారు.
డిమాండ్లను నెరవేర్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామన్న విద్యార్థులు తాజాగా నిరాహారదీక్షలు చేపట్టారు. అయినా అధికారులు దిగిరాకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేశారు. ఇప్పటికే శ్రీనగర్‌లో స్థానికేతర విద్యార్థుల పట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ వివాదం చల్లారే దాకా విద్యార్థుల చదువులు సాగేలా కనిపించడం లేదు.  

16:30 - April 9, 2016

చిత్తూరు : ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన చోట ఆధిపత్య తగాదాలు జరుగుతున్నాయి. అధికారం నిలుపుకొనేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తిరుమలలోని పుష్పగిరి మఠం ఇందుకు వేదికగా మారింది. అసలు పుష్పగిరి మఠంలో ఏం జరుగుతోంది. తిరుమల రింగ్‌రోడ్డులోని మేదరమిట్టలో పుష్పగిరి మఠం నిర్మించుకోవడానికి టీటీడీ అనుమతులు ఇచ్చింది. అందుకు మఠం నిర్వాహకులు ఏటా టీటీడీకి కేవలం 900 రూపాయలు మాత్రమే నెలకు అద్దెగా చెల్లిస్తున్నారు. టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో పుష్పగిరి మఠం నిర్వాహకులు ఏకంగా ఓ స్టార్‌హోటల్‌నే కట్టేశారు. ఇందులో కళ్యాణ మండపం, ఏసీ-నాన్‌ఏసీ గదులు ఉన్నాయి. తిరుమలలో సహజంగానే కళ్యాణ మండపాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇదే అదునుగా నిర్వాహకులు డబ్బులు గుంజేస్తున్నారు. ఏ రకంగా చూసినా మఠానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అందుకే ఇక్కడ మేనేజర్‌గిరి చేయడానికి రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. గతంలో మేనేజర్‌గా పనిచేసిన రాజగోపాల్ 13కోట్లు స్వాహా చేశాడని కొండలరావు వర్గం ఆరోపిస్తే, ప్రస్తుత మేనేజర్ కొండలరావు 6 కోట్ల రూపాయలు మింగేశాడని రాజగోపాల్ వర్గం ఆరోపిస్తోంది.

భారతి స్వామి మృతి అనంతరం విబేధాలు..
పుష్పగిరి మఠానికి దీర్ఘకాలం పీఠాధిపతిగా ఉన్న విద్యా భారతి స్వామి గత ఏడాది మృతి చెందిన తరువాత మఠ నిర్వాహకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. భారతి స్వామికి సన్నిహితంగా ఉన్న రాజగోపాల్,మొదలైన వారిని మఠం నుంచి తొలగించారు. అప్పటివరకూ కాస్త దూరంగా ఉన్న కొండలరావు మఠం నిర్వహణలో కీలకంగా మారారు. ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తోన్న రాజగోపాల్ వర్గం భారతి స్వామినే మోసం చేశారని కొండలరావు పేర్కొంటున్నారు. 2010లో తిరుమల, శ్రీకాళహస్తి మఠాలను అప్పట్లో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి తన పేరుతో రాసుకున్నారని ,ఈ మోసాన్ని స్వామి 2011 లో గుర్తించారని తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారని కొండలరావు చెబుతున్నారు. అప్పట్లోనే కొండలరావును మఠం ఉద్యోగం నుంచి తొలగించగా కోర్టు ఉత్తర్వులతో మళ్లీ వచ్చి చేరారని అంటున్నారు.
ఇంత జరుగుతున్నా టీటీడీ ఈ వ్యవహారాల్ని పట్టించుకోవడం లేదు. మఠాల వ్యవహారాల్లో తలదూర్చితే స్వామీజీల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీటీడీ అధికారులు చూసిచూడనట్లు ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీటీడీ దేవదాయ శాఖ మఠాల వ్యవహారం పై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

16:27 - April 9, 2016

విశాఖపట్నం : ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు వీసీ రవిరాజు విశాఖలో వెల్లడించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఏపీలో ఈనెల 20 నుంచి 23 వరకు సర్టిఫికెట్స్ పరిశీలన...21 నుంచి 25 మధ్య ఆప్షన్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఏప్రిల్‌ 27 నాటికి సీట్లు కేటాయిస్తామన్నారు.
తెలంగాణకు సంబంధించి విజయవాడ, వరంగల్‌, హైదరాబాద్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 23 నుంచి 25 మధ్య ధ్రువపత్రాల పరిశీలన...24 నుంచి 27 మధ్య ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 29న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. మే 2నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

మట్టిపెళ్లల కింద చిక్కుకున్న యువకుడు ...

ఖమ్మం: చింతకాని మండలం పాశర్లపాడు వద్ద బావిలో పూడిక తీస్తుండగా మట్టిపెళ్లలు పడి ఓ యువకుడు మృతి చెందాడు. అతడిని రక్షించేందుకు రెవెన్యూ, 108 సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.

కేజ్రీవాల్ పైకి షూ విసిరిన వ్యక్తి..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

మిషన్ కాకతీయ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు : మంత్రి హరీష్ రావు

నిజామాబాద్ : జిల్లాలోని పలు నూతన కార్యాలయాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, పశువుల ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.  మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ పథకానికి తొలి విడతగా రూ.2,608 కోట్ల నిధులు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు.  గోదావరి జలాల తరలింపుతో ప్రతీ చెరువు నీటితో కళకళలాడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పనులకు రుణం ఇవ్వటానికి ప్రపంచ బ్యాంక్, నాబార్డ్ లు సిద్ధంగా వున్నాయని తెలిపారు.

పసికందు కాళ్లు, చేతులు నరికివేసిన దుండగులు...

నెల్లూరు : వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ పసికందు కాళ్లు, చేతులు నరికివేసి కాంపాలెంలోని దొడ్డేరువాగు పక్కన పడవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఉరుసు రంగం సముద్రం చెరువులో 4గురు విద్యార్ధులు గల్లంతు....

వరంగల్ : నగరంలో విషాదం నెలకొంది. ఉరుసు రంగం సముద్రం చెరువులో ఈతకు వెళ్ళిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఒకరు శివనగర్ కు చెందిన పవన్ గా గుర్తించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కొనసాగుతున్న నిట్ విద్యార్థుల ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ నిట్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. 

'పూలే' జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..

హైదరాబాద్ : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల పోస్టర్ ను మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. ఈనెల 11న రవీంద్ర భారతి లో పూలే 190వ జయంతి వేడుకలు జరగనున్నాయి. బీసీ ఉప ప్రణాళికపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం పేర్కొన్నారని, ప్రతి జిల్లాలో రూ. 19.50 కోట్లతో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 

15:21 - April 9, 2016

నల్లగొండ : జిల్లాలో తీవ్ర స్థాయిలో కరువు నెలకొన్నా ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. జిల్లా నుంచి లక్షలాది మంది వలస వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదని, కరువు సహాయ చర్యల కోసం ప్రతి మండలానికి 15 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని జూలకంటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

కరవు నివారణలో ప్రభుత్వం విఫలం - తమ్మినేని..

నల్గొండ : కరవు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని తాగునీరు, పశుగ్రాసం, లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతు ప్రయోజాల కోసం ప్రాజెక్టులు రీ డిజైన్ చేస్తే మంచిదే కాని కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం రీ డిజైనింగ్ ను తప్పుబడుతున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటు సంస్థలు దోచుకుంటున్నాయని పేర్కొన్నారు.

రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తుల అరెస్టు..

ఢిల్లీ : ఓ వ్యాపార వేత్త నుండి రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసిన వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. 

మావోయిస్టు కీలకనేత కుడుముల రవి మృతి...

విశాఖపట్నం : మావోయిస్టు కీలకనేత కుడుముల రవి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రజాగెరిల్లా ఆర్మీ ప్లటూన్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్న రవి గత కొంత కాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం రవిని విశాఖ తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. 

మొబైల్ ఫోన్ ద్వారా పంపెసెట్లు ఆపరేటింగ్ : మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ : 21న గుంటూరు నుంచే అగ్రికల్చర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. రైతులకు త్వరలో 2 లక్షల పంపుసెట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆధునికమైన ఈ పంపుసెట్లు వున్నచోటు నుండే మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని ఆయన తెలిపారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడి త్వరలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తామని మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు

ఎర్ర చందనం నిందితులపై కఠిన చర్యలు : మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు : బొల్లాపల్లిలో ఫారెస్ట్ అధికారుల హత్య కేసులో మంత్రి పత్తిపాటి స్పందించారు.  ఫారెస్ట్ అధికారుల హత్య బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడినవారు బొల్లాపల్లి మండలానికి చెందిన సంగం ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తుల ప్రమేయం వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రచందనం కలపను నరుకుతుండగా  అటవీశాఖ అధికారులు లాజర్, బాజీలు అడ్డుకున్నారనే కారణంతోనే దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

14:28 - April 9, 2016

ఖమ్మం : ఆసరా పెన్షనర్లకు అంతులేని కష్టాలొచ్చాయి. ఖమ్మం జిల్లాలో రెండు నెలలుగా పెన్షన్‌ నిధులు విడుదల కాక లబ్దిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. పెన్షన్ డబ్బులకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. మండుటెండల్లో అడుగుకూడా వేయలేని స్థితిలో వృద్ధులు, వికలాంగులు అతి కష్టంమీద బ్యాంకులకు వస్తున్నారు.. నడవలేనివారు ప్రతిరోజూ ఆటో చార్జీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వం. జిల్లాలో 2లక్షల 72వేలమందికి 29కోట్ల 95లక్షల 16వేల రూపాయలను సర్కారు పెన్షన్‌ రూపంలో చెల్లిస్తోంది.

విడుదల కాని నిధులు..
ప్రతి నెలా మొదటివారంలో ఇవ్వాల్సిన పెన్షన్లను అధికారులు ఆఖరివారంలో ఇచ్చేవారు. రెండు నెలల నుంచి ఈ నిధులూ విడుదల కాలేదు. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక వీరంతా బ్యాంకులచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండిపోతున్న ఎండలు, ఉక్కపోతలు పైగా ఎవరో ఒకరి సహాయంలేకుండా బ్యాంకులు రాలేని పరిస్థితి. అయినా పెన్షన్‌కోసం చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఈ పెన్షన్లు సకాలంలో ఇవ్వక లబ్దిదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రతి నెలా మొదటివారంలో ఇవ్వాల్సిన డబ్బును నెలాఖరులో ఇచ్చారు.. ఇక వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వెయ్యి రూపాయలు చూసి కాస్త ఇంత ముద్ద పడేసే బిడ్డలు రెండు నెలలుగా డబ్బులు రాకపోవడంతో చీదరించుకుంటున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళ్లేందుకు ఆటో కిరాయిఅయినా ఇవ్వడంలేదని వృద్ధులు కన్నీరుమున్నీరవుతున్నారు.

14:22 - April 9, 2016

నల్గొండ : రాష్ట్రంలో కరువు సహాయక చర్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తిలో ఆ పార్టీ సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు సహాయక చర్యలను చేపట్టాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. మంచినీరు అందించాలని, కుటుంబాల వారీగా లెక్కలు తీసి పశువులకు సరిపడా మేతను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వ్యవపసాయ కూలీలందరికీ పనులు కల్పించాలని, రైతాంగాన్ని రీ షెడ్యూల్ చేయాలని..కొత్త రుణాలివ్వాలి..సూచించారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, తాను అనేక జిల్లాలు తిరగడం జరిగిందని తెలిపారు. పశువులను కబేళాలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

14:16 - April 9, 2016

జమ్మూ కాశ్మీర్‌ : రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. తమను వేరే క్యాంపస్‌కు మార్చాలని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీనగర్‌ నిట్‌లో స్థానికేతర విద్యార్థులు ఆందోళనకు దిగారు. చదువుకునే వాతావరణం కల్పించాలని, శ్రీనగర్‌లో పరిస్థితులు స్థానికేతరులకు అనుకూలంగా లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. మరోవైపు నిట్‌ అధికారులు విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు 60 మంది విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టినా.. అధికారులు ఇంతవరకు విద్యార్థుల దగ్గరకు రాలేదని విద్యార్థులు వాపోతున్నారు. 

122 మంది మావోయిస్టుల లొంగుబాటు..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. సుకుమా జిల్లా డోర్నపాల్‌లో 122 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ ఐజీ కల్లూరి ఎదుట వారు లొంగిపోయారు.

కొనసాగుతున్న నిట్ విద్యార్థుల ఆందోళన..

జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్ నిట్‌లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. క్యాంపస్‌లో చదువుకునే వాతావరణం కల్పించాలని ఆందోళన చేస్తోన్నా నిట్ నిర్వహకులు పట్టించుకోలేదు.

 

13:59 - April 9, 2016

ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. టోర్నీ ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, చీఫ్ కోచ్‌ టామ్‌ మూడీ, మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌తో పాటు కీలక ఆటగాళ్లు పాల్గొన్నారు. తొమ్మిదొ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తామని రైజర్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ధీమాగా చెబుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌....ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌లో ఓ సంచలనం. ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ సాధించలేకపోయిన సన్‌రైజర్స్‌ జట్టు.....గత 3 సీజన్లలో ఏ స్థాయిలో రాణించిందో అందరికీ తెలిసిందే. పటిష్టమైన జట్లను సునాయాసంగా చిత్తు చేయడం , లోస్కోరింగ్‌ మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం, ఆఖరి బంతికి  సంచలన విజయాలు సాధించడం సన్‌రైజర్స్‌ జట్టుకు కొత్తేమీ కాదు.
చాంపియన్‌గా నిలవాలని రైజర్స్ తహతహ 
కానీ  ఐపీఎల్‌ 9వ సీజన్‌లో మాత్రం చాంపియన్‌గా నిలవాలని రైజర్స్ టీమ్‌ తహతహలాడుతోంది. డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలో మరోసారి టైటిల్‌ వేటకు సిద్దమైంది. సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, సీనియర్‌ పేసర్‌ అశిష్‌ నెహ్రా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల రాకతో హైదరాబాద్‌ టీమ్‌.......మరింత పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, చీఫ్ కోచ్‌ టామ్‌ మూడీ, మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ 9వ సీజన్‌లో స్థాయికి తగ్గట్టుగా రాణిస్తామని ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు. కరువు కారణంగా నీటి కొరత వల్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లను పక్క రాష్ట్రాలకు మార్చినంత మాత్రమే అసలు సమస్య తీరదని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. పాత  స్నేహితులు యువరాజ్‌ సింగ్‌,అశిష్‌ నెహ్రాలకు మెంటార్‌గా దిశానిర్దేశం చేయబోతుండటం ఎలా ఉందని అడిగినప్పుడు లక్ష్మణ్‌ తనదైన శైలిలోనే సమాధానమిచ్చారు.
మెరుగైన ప్రదర్శన ఇస్తామన్న వార్నర్‌
అనుభవజ్ఞులు , ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని.....అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించి మెరుగైన ప్రదర్శన ఇస్తామని వార్నర్‌ చెప్పాడు. ఈ సీజన్‌లో తప్పకుండా టైటిల్‌ నెగ్గి తీరుతామని రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ హిందీలో చెప్పి అలరించాడు. అంచనాలకు మించి రాణిస్తామని ధీమాగా చెబుతున్న సన్‌రైజర్స్ టీమ్‌.....అసలు సిసలు సమరం ఆరంభమయ్యాక అదే స్థాయిలో రాణించాలని తెలుగు క్రికెట్‌ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. 

 

13:51 - April 9, 2016

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్ షెడ్యూల్‌ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్ మే 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు లీగ్‌లో ఈసారే కొత్తగా ప్రవేశించిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌ను ఢీకొననుంది. ఈ జట్టుకు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న వాంఖడే స్టేడియంలోనే ఫైనల్ కూడా జరుగుతుంది. 51 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. సన్‌రైజర్స్ జట్టు 7 హోమ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే ఆడుతుంది. ఈసారి వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు.
 

తేదీ   మ్యాచ్  వేదిక సమయం
ఏప్రిల్ 9  ముంబై -పుణె  ముంబై  రా. 8 గం..
ఏప్రిల్ 10  కోల్ కతా - ఢిల్లీ కోల్ కతా  రా. 8 గం
ఏప్రిల్ 11 పంజాబ్ - గుజరాత్ మొహాలీ రా.8గం.
ఏప్రిల్ 12  బెంగళూరు - హైదరాబాద్  బెంగళూరు  రా.8 గం.
ఏప్రిల్ 13  కోల్ కతా - ముంబై  కోల్ కతా  రా.8 గం.
ఏప్రిల్ 14  గుజరాత్ -పుణె  రాజ్ కోట్  రా. 8 గం.
ఏప్రిల్ 15   ఢిల్లీ - పంజాబ్ ఢిల్లీ  రా. 8గం.
ఏప్రిల్ 16   హైదరాబాద్ - కోల్ కతా హైదరాబాద్ సా. 4గం.
ఏప్రిల్ 16  ముంబై - గుజరాత్  ముంబై రా. 8 గం.
ఏప్రిల్ 17  పంజాబ్ - పుణె మొహాలీ  సా.4గం.
ఏప్రిల్ 17  బెంగళూరు - ఢిల్లీ  బెంగళూరు  రా. 8 గం.
ఏప్రిల్ 18  హైదరాబాద్ - ముంబై  హైదరాబాద్  రా. 8 గం.
ఏప్రిల్ 19  పంజాబ్ - కోల్ కతా మొహాలీ రా. 8 గం.
ఏప్రిల్ 20  ముంబై - బెంగళూరు  ముంబై  రా. 8 గం.
ఏప్రిల్ 21   గుజరాత్ -హైదరాబాద్ రాజ్ కోట్  రా. 8 గం.
ఏప్రిల్ 22   పుణె - బెంగళూరు పుణె  రా.8 గం.
ఏప్రిల్ 23 ఢిల్లీ - ముంబై  ఢిల్లీ  సా. 4 గం.
ఏప్రిల్ 23  హైదరాబాద్ - పంజాబ్  హైదరాబాద్  రా.8 గం.
ఏప్రిల్ 24   గుజరాత్ -బెంగళూరు రాజ్ కోట్ సా. 4 గం.
ఏప్రిల్ 24  పుణె - కోల్ కతా  పుణె  రా. 8 గం.
ఏప్రిల్ 25  పంజాబ్ - ముంబై  మొహాలీ  రా. 8 గం.
ఏప్రిల్ 26  హైదరాబాద్ - పుణె  హైదరాబాద్  రా. 8 గం.
ఏప్రిల్ 27  ఢిల్లీ - గుజరాత్  ఢిల్లీ  రా. 8 గం.
ఏప్రిల్ 28  ముంబై - కోల్ కతా  ముంబై రా. 8 గం.
ఏప్రిల్ 29  పుణె - గుజరాత్  పుణె  రా. 8 గం.
ఏప్రిల్ 30  ఢిల్లీ -కోల్ కతా  ఢిల్లీ  సా. 4 గం.
ఏప్రిల్ 30 హైదరాబాద్ - బెంగళూరు  హైదరాబాద్  రా. 8 గం.
మే 1  గుజరాత్ - పంజాబ్  రాజ్ కోట్  సా. 4 గం.
మే 1  పుణె - ముంబై  పుణె  రా. 8 గం.
మే 2  బెంగళూరు - కోల్ కతా  బెంగళూరు  రా. 8 గం.
మే 3  గుజరాత్ - ఢిల్లీ  రాజ్ కోట్ రా. 8 గం.
మే 4  కోల్ కతా - పంజాబ్  కోల్ కతా  రా. 8 గం.
మే 5  ఢిల్లీ - పుణె ఢిల్లీ  రా. 8 గం.
మే 6  హైదరాబాద్ - గుజరాత్  హైదరాబాద్  రా. 8 గం.
మే 7  బెంగళూరు - పుణె  బెంగళూరు  సా. 4 గం.
మే 7  పంజాబ్ - ఢిల్లీ  నాగ్ పూర్  రా. 8 గం.
మే 7  పంజాబ్ - ఢిల్లీ  నాగ్ పూర్ రా. 8 గం.
మే 8  ముంబై -హైదరాబాద్  ముంబై  సా. 4 గం.
మే 8  కోల్ కతా - గుజరాత్  కోల్ కతా  రా. 8 గం.
మే 9   పంజాబ్ - బెంగళూరు నాగ్ పూర్ రా. 8 గం.
మే 10  పుణె - హైదరాబాద్  పుణె  రా. 8 గం.
మే 11   బెంగళూరు - ముంబై బెంగళూరు రా. 8 గం.
మే 12   హైదరాబాద్ - ఢిల్లీ హైదరాబాద్  రా. 8 గం.
మే 13  ముంబై - పంజాబ్ ముంబై  రా. 8 గం.
మే 14  కోల్ కతా - పుణె  కోల్ కత రా. 8 గం
మే 14  బెంగళూరు - గుజరాత్ బెంగళూరు సా. 4 గం.
మే 15   పంజాబ్ - హైదరాబాద్ నాగ్ పూర్  రా. 8 గం.
మే 15 . ముంబై -ఢిల్లీ  ముంబై  సా. 4 గం
మే 16  కోల్ కతా - బెంగళూరు  కోల్ కతా రా. 8 గం.
మే 17.  పుణె -ఢిల్లీ  పుణె  రా. 8 గం
మే 18  బెంగళూరు -పంజాబ్  బెంగళూరు  రా. 8 గం.
మే 19  గుజరాత్ - కోల్ కతా    రా. 8 గం.
మే 20 ఢిల్లీ - హైదరాబాద్  రాయ్ పూర్  రా. 8 గం.
మే 21  పుణె - పంజాబ్  పుణె  సా. 4 గం.
మే 21  గుజరాత్ - ముంబై    రా. 8 గం.
మే 22 కోల్ కతా - హైదరాబాద్  కోల్ కతా సా. 4 గం.
మే 22   ఢిల్లీ - బెంగళూరు రాయ్ పూర్  రా. 8 గం.
మే 24 క్యాలిఫయర్ 1  బెంగళూరు రా. 8 గం.
మే 25 ఎలిమినేటర్ పుణె రా. 8 గం.
మే 27 క్వాలిఫయర్ 2 పుణె  రా. 8 గం.
మే 29  ఫైనల్  ముంబై  రా. 8 గం. 

 

13:50 - April 9, 2016

హైదరాబాద్ : న్యాయ సహాయం, న్యాయసేవల్లో లోక్‌అదాలత్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ అన్నారు. న్యాయసేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ అఖిలభారత న్యాయాధికార సంస్థ సదస్సును జస్టిస్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. పేదలకు న్యాయసహాయం అందించేందుకు లోక్‌ ఆదాలత్‌లు తోడ్పాటు అందిస్తాయని జస్టిస్‌ ఠాకూర్‌ అన్నారు. పేదలకు లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతోందని కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. అన్ని స్థాయిల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహించాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ వల్ల కోర్టులపై ఒత్తిడి తగ్గుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, ఇతర న్యాయమూర్తులు సదస్సుకు హాజరయ్యారు.

 

13:44 - April 9, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పార్క్ హయత్‌ హోటల్‌లో నిర్వహిస్తున్న 14వ జాతీయ లీగల్‌ సెల్‌ అథారిటీ సదస్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భోస్లే, న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

13:40 - April 9, 2016

గుంటూరు : ఇద్దరు అటవీశాఖ అధికారుల హత్య ఘటన దురదృష్టకరమని.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మృతులకు మంత్రి సంతాపం ప్రకటించారు. హత్య కేసు విచారణ కొనసాగుతుందున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఉద్యాన పంటలపై మాట్లాడారు. ఉద్యాన పంటలను సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలన్నారు. హార్టికల్చర్ లో ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. 

 

ఆర్టీసీ బస్-కారు ఢీ..ఇద్దరు మృతి...

చిత్తూరు : చంద్రగిరి మండలం పాకాలవారిపల్లె జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

13:27 - April 9, 2016

హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయ్‌ మాల్యా ఈడీని మరింత గడువు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు రాలేనని స్పష్టం చేశారు. బ్యాంకులతో చర్చలు నడుస్తున్నాయని... తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ ముందు హాజరు కావాలని మార్చి 18 న విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసింది. కానీ హాజరు కాలేదు. తాజాగా ఇవాళ విజయ్ మాల్యా ఈడీ ముందు హాజరుకావాల్సివుంది... కానీ హాజరు కాలేదు. తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ ముందు హాజరుకాకపోవడంతో విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, వీసా రద్దు చేసే అవకాశం ఈడీకి ఉంది. ఈడీ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి...

 

 

సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన తమ్మినేని...

నల్లగొండ : సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రథమ వర్థంతి సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.ఈ సందర్బంగా జిల్లాలోని చిట్యాల మండలం వట్టిమర్తిలో నర్రా రాఘవరావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో మాట్లాడారు. రాఘవరెడ్డి వ్యక్తిత్వం చాలా ప్రత్యేమైనదని పేర్కొన్నారు. ధనం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన ఎప్పుడూ పాకులాడలేదనీ...పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివనీ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయుధ తెలంగాణా సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య , ఇతర కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. 

వైద్య విద్య కోర్సులకు మెడికల్ వెబ్ కౌన్సిలింగ్

విశాఖపట్నం : 2016-17 సంవత్సరానికి గాను వైద్య విద్య కోర్సులకు మెడికల్ వెబ్ కౌన్సిలింగ్ జరుగనుంది. ఈ నెల 20 నుండి 23 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. 21 నుండి 25 వరకూ ఏపీలో 4 సెంటర్లలో కౌన్సిలింగ్ నిర్వహణ జరుగనుంది. కాగా తెలంగాణలో 2 సెంటర్లలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిరాజు పేర్కొన్నారు.

13:02 - April 9, 2016

నల్లగొడం : ఉగాది అంటే షడ్‌ రుచులు అంటారు. కానీ అక్కడ మాత్రం మద్యం, మాంసం ఉంటేనే పండుగ. బోనాల, ఊరేగింపులు, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలతో వేడుక చేసుకుంటారు. నల్లగొండ జిల్లాలో ఆనవాయితీగా జరుగుతున్న ఈ వేడుకలపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం.. 
పూర్తి భిన్నంగా వేడుకలు
ఉగాది పండగ అనగానే పచ్చడి, వెజిటేరియన్‌ వంటలు, పంచాంగశ్రవణం గుర్తుకొస్తుంది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలో మాత్రం పూర్తి భిన్నంగా వేడుకలు జరుగుతాయి.. బోనాలు, ఎడ్లబండ్ల ఊరేగింపులతో గ్రామాలన్నీ సందడిగా మారతాయి.
అరవైఏళ్లక్రితం కలరా వ్యాధి 
అరవైఏళ్లక్రితం ఈ ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వందలాదిమంది మృత్యువాత పడ్డారట. ముత్యాలమ్మ ఆగ్రహమే దీనికి కారణమని భావించిన ప్రజలు.. అమ్మవారికి బోనాలు సమర్పించారట.. అప్పుడు వ్యాధి తగ్గిందని... అలా ఈ ఆనవాయితీ కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు..
కోలాహలంగా గ్రామాలు
ఉగాది వచ్చిందంటే చాలు ఇక్కడ గ్రామాలన్నీ కోలాహలంగా మారతాయి.. ఉపవాసం ఉంటూ మహిళలు బోనాలు చేస్తారు. ఈ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి వస్తారు.. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.. అలంకరించిన ఎడ్లబండ్లు, వివిధ రకాల వాహనాలు, గ్రామంలోని బొడ్రాయిదగ్గర డప్పుల వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉగాది అంటే ఇక్కడ హంగామానే వేరు.. బంధువులు, స్నేహితులతో కలిసి అంతా మాంసాహారం ఆరగిస్తారు.. సాయంత్రం రామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచాంగశ్రవణంతో ఈ వేడుకలు ముగుస్తాయి.

12:57 - April 9, 2016

నాని, సమంత కాంబినేషన్‌లో రాజమౌళి దర్శ కత్వంలో రూపొందిన 'ఈగ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం నటీనటులకు పేరు తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఆ చిత్రానికి సీక్వెల్‌ వస్తుందని వార్తలు విన్పిస్తూనే వున్నాయి. ఆ తర్వాత 'బాహుబలి' పనిలో రాజమౌళి వుండడంతో ఆ చిత్రం తర్వాత ఆలోచిస్తానని ఆ మధ్య ప్రకటించాడు. దాన్ని బలాన్ని చేకూరుస్తూ.. ఆయన తండ్రి రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ మాట్లాడారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈగ-2 లో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నట్లు తెలిపారు. త్వరలో అందుకు సంబంధించిన విషయాలు తెలియనున్నాయి. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్‌ పనిలో ఉన్న రాజమౌళి ఆ తదుపరి చిత్రం ఈగ వుంటుందని ఫిలింనగర్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

12:57 - April 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్‌ కాకతీయ, ఇంటింటికి మంచినీరు సరఫరాల లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ పనులపై కేంద్రం ఈనెల 12న హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేసింది. 
మిషన్‌ కాకతీయ, భగీరథపై బెంగాల్‌, యూపీ అధ్యయనం 
తెలంగాణ సర్కార్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు వీటిపై అధ్యయనంచేసి వెళ్లాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పనులను పరిశీలించాలని ప్రతిపాదించాయి. మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు దిలీప్‌ పనగరియ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.
మిషన్‌ కాకతీయకు నిధులపై త్వరలో నీతి ఆయోగ్‌ నిర్ణయం
మిషన్‌ కాకతీయకు కేంద్రం నుంచి నిధులు అందే అవకాశం ఉందని పాలకులు భావిస్తున్నారు. దీనిపై నీతి ఆయోగ్‌ తర్వలోనే నిర్ణయం తీసుకోవచ్చిన ఆశిస్తున్నారు.  ఈ పథకానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు అందిచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌... కేంద్రాని లేఖ రాసిన విషయాన్ని హరీష్‌రావు గుర్తు  చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల పురోగతిని కేంద్రం కూడా సమీక్షిస్తుండటం మంచి పరిణామంగా భావిస్తున్నారు. కేంద్ర ప్రారంభించిన కృషి సించాయి యోజన పథకం కింది 18 వేల కోట్ల రూపాయలు నిధులు అందే అవకాశం ఉందని పాలకులు భావిస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి  ఈ పనులు చేపట్టిన విషయాన్ని హరీష్‌రావు గుర్తు చేస్తున్నారు. ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవడంలో ఒకప్పుడు ఇజ్రాయల్‌ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటే... ఇప్పుడు తెలంగాణ  ప్రపంచ దృష్టికి ఆకర్షిస్తున్నదని హరీష్‌రావు చెబుతున్నారు. 
ప్రజా ఉద్యమంగా మిషన్‌ భగీరథ పనులు 
మిషన్‌ కాకతీయ రెండోదశ పనుల్లో భాగంగా చెరువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ముందుకు వస్తున్న విషయాన్ని హరీష్‌రావు ప్రస్తావిస్తున్నారు. ప్రజా ఉద్యమంలా పనులు జరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జల వారోత్సవాల్లో మిషన్‌ కాకతీయపై ప్రత్యేక చర్చ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసిన అధికారులను హరీష్‌రావు అభినందించారు. దీనిని మరింత ప్రోత్సహించాలని కోరారు. మొత్తంమీద మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు రావడంతో పాలకులతోపాటు, అధికారుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. 

 

12:55 - April 9, 2016

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్న 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రంలో 'నాగార్జున' కాలేజీ ప్రిన్స్‌పాల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆ సన్నివేశాన్ని పబ్లిక్‌ గార్డెన్స్‌లో హాలులో చిత్రించినట్లు చిత్ర యూనిట్‌ తెలియజేసింది. యువతకు చక్కని సందేశాన్ని ఇచ్చే ఆ పాత్రకు నాగార్జున సరిపోయాడని చెబుతున్నారు. కాగా, మనం, సోగ్గాడే.. ఊపిరి చిత్రాల విజయపరంపరలో వున్న నాగార్జున.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయా' చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే కీరవాణి బాణీల పనిలో వున్నారు. దర్శకుడు లొకేషన్ల వెతుకులాటలో వున్నారు. 17వ శతాబ్దానికి చెందిన తిరుపతిని పెద్ద సెట్‌వేసి చిత్రించే పనిలో వున్నారు. దీనికి చిక్‌మగళూరు అడవుల్లో కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

12:55 - April 9, 2016

మొన్నీ మధ్య ఓ గోడపై కూర్చొని ఉన్న మహేష్‌బాబు, శ్రుతిహాసన్‌ కాలు పట్టుకుని లాగుతున్న స్టిల్‌ పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. అదే 'శ్రీమంతుడు' చిత్రం కోసం చేసిన సన్నివేశంలోది ఆ స్టిల్‌. ఈసారి మహేష్‌బాబు ఎవరో కాలికి చెప్పులు తొడుగుతున్న స్టిల్‌ గురువారం విడుదల చేశారు. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ ఇది. ఇప్పుడు మహేష్‌ బాబు చెప్పులు ఎవరికి తొడుగుతున్నారో...తెలియాల్సి ఉంది. జనవరి ఒకటిన బ్రహ్మోత్సవం టీజర్‌ విడుదల చేశారు. అందులో కన్పించిన డ్రెస్‌లోనే ఉన్న మహేష్‌బాబు మోకాలి మీదికి వంగి ఓ పెద్ద మనిషికి చెప్పులు తొడుగుతున్న చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. బహుశా.. తండ్రి సత్యరాజ్‌ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సత్యరాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆడియోను ఈనెల 24న తిరుపతిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 6న సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

12:53 - April 9, 2016

బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవెర్‌లు చాలా కాలం నుంచి వివాహం చేసుకుంటారని వస్తున్న రూమర్స్‌ నిజమయ్యాయి. ఒకటి కానున్నట్టు వీరిద్దరూ సంయుక్తంగా ప్రకటన చేశారు. ఈనెల 30న వివాహం చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వీరికి ముందుగా అభినందనలు చెబుతూ ట్వీట్‌ కూడా చేసింది. ''ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని పంచుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఈనెల 30న మాకు పెద్ద పండుగ రోజు. మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మీరంతా మా ప్రేమ విషయంలో మద్దతు తెలిపినందుకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. జీవితాంతం మాపై మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం'' అని పేర్కొన్నారు. హరర్‌ చిత్రం 'ఎలోన్‌' ప్రారంభం నుంచి బిపాసా, కరణ్‌ ప్రేమాయణం మొదలైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కరణ్‌కు ఇది మూడో వివాహం. మొదట టివి నటి శ్రద్ధా నిగమ్‌ను, రెండో సారి జెన్నీఫర్‌ విన్‌గెట్‌ను పెళ్లాడాడు. ఇప్పుడు బిపాసాను వివాహం చేసుకోనున్నాడు.

12:52 - April 9, 2016

మనకు కీరా దోసతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అని ఖచ్చితంగా తెలిసిందనుకోండి... కీరాను మన ఆహారంలో భాగం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించం?! తప్పక ప్రయత్నిస్తాం. అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలోను, శరీర సౌందర్యాన్ని పెంచడంలోనూ, చివరికి బరువు తగ్గించడంలోనూ దోహదపడే కీరాను ఎవరైనా కొనకుండా ఉంటారా? అస్సలు ఉండరు కదా! అందుకే కీరాలో ఉన్న సుగుణాలేంటో వివరంగా తెలుసుకుని మీరు కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి.
ఆరోగ్యపరంగా.... గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడే సుగుణాలు కీరాదోసలో ఉన్నాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  వీటిలోని పొటాషియం కండరాలకు మంచి చేయడమే కాదు, రక్తపోటును నియంత్రించడంలోనూ సాయపడుతుంది.  ఇందులోని మెగ్నీషియం రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.  కీరా కేన్సర్‌ వంటివాటిని రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలింది. చర్మం కాలినా, కమిలినా కీరారసాన్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఇందుకు కారణం కీరాలోని ఆస్కార్బిక్‌ యాసిడ్‌, సిలికాలే!
చిట్కా...
ఇంట్లో చీమలు ఉన్నాయా? అయితే, కీరాతొక్కలను గదిమూలల్లో ఉంచండి. చీమలు కనిపించవు.

12:51 - April 9, 2016

నల్గొండ : రాష్ట్రంలో అవకాశవాద, అవినీతి రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తిలో ఆ పార్టీ సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నర్రా రాఘవరెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. వ్యక్తుల ఆదర్శాలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశవాదులున్నారని పేర్కొన్నారు. ఉదయం ఏ పార్టీలో ఉంటాడో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటాడో... సాయంత్రం ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు.  అవకాశవాదం, అవినీతి చెదలపురుగులా తొలుచుతుందన్నారు. రాజకీయాలంటే పదవులొచ్చే వ్యవస్థ, వ్యాపారాలకు అనువుగా మార్చుకునేందుకు చూస్తున్నారని... అది కరెక్టు కాదన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే అసలైన రాజకీయాలన్నారు. ప్రజలను డబ్బు రాజకీయాలు పట్టిపీడిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, మల్లు స్వరాజ్యం, చుక్కా రామయ్యతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం విగ్రహ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

 

 

12:50 - April 9, 2016

రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే మిల్క్‌ బాత్‌ చేయండని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. మిల్క్‌ బాత్‌తో చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు రోజంతా తాజాదనం అలాగే ఉంటుందని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకున్నా రోజంతా తాజాగా ఉంటారు. అలాగే కాస్తంత కలబంద గుజ్జును బకెట్‌ నీటిలో వేసి స్నానం చేస్తే ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగ పడటమేగాక, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి. ఇక అలసత్వం దూరం కావాలంటే గుప్పెడు తులసి ఆకుల్ని స్నానం చేసే నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది. తులసి శరీరాన్ని శుభ్ర పరచడంతోపాటు మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇంకా కామొమైల్‌ ఆయిల్‌ను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడి చర్మంగల వారికి స్వాంత నివ్వడంతో పాటు అలసత్వం దూరమవుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

 

సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ సమావేశం...

ఢిల్లీ: కేంద్రమంద్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ రెండో సమావేశం జరిగింది. ఈ కమిటీకి ఒడిశా, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, కేరళ, గోవా,మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు , అధికారులు హాజరయ్యారు. ఏపీ నుండి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సాగరమాల కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, అనుసంధానించే పోర్టులు, జల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

12:35 - April 9, 2016

గుంటూరు G జిల్లా బొల్లాపల్లి మండలం నెహ్రూనగర్‌ తండాలో దారుణం జరిగింది. ఇద్దరు అటవీశాఖ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. మృతులు లాజర్‌, బాజీగా పోలీసులు గుర్తించారు. ఈ తండా అడవిలో కలప నరుకుతున్నారన్న సమాచారం మేరకు బీట్‌ సిబ్బంది లాజర్‌, బాజీ షాహీద్‌ అక్కడికి చేరుకుని కలప నరికివేతను అడ్డుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు బీట్‌ అధికారులతో వాదనకు దిగారు. అనంతరం.. ఇద్దరు ఫారెస్ట్‌ అధికారులను గొడ్డలితో నరికి స్మగ్లర్లు అక్కడినుంచి పారిపోయారు. 

స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు చేయూత....

విజయవాడ : స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు చేయూత కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి కామినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను, వీల్ చైర్లను పంపిణీ చేశారు.

ఈడీని మరోసారి గడువు కోరిన విజయ్ మాల్యా...

ఢిల్లీ : ఈ రోజు అంటే ఏప్రిల్ 9న తేదీన ఈడీ ఎదుట హజరు కావటానికి విజయ్ మాల్యా మరోసారి గడువు కోరారు. అనివార్య కారణాలతో హాజరుకాలేననీ...మే నెలలో హాజరవుతానని ఈడీ కి వివరణ ఇచ్చారు. బ్యాంకు రుణాల ఎగవేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ హౌస్ అధినేత విజయ్ మాల్యాకు ఈ నెల 9వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సింహాద్రి అప్పన్న భూములపై మరోసారి వివాదం...

విశాఖపట్నం : సింహాచలం దేవాలయ భూములపై వివాదం మరోసారి చెలరేగింది. దేవాలయం సరిహద్దులో వున్న ఐదు గ్రామాలకు సంబంధించిన భూముల తమవేనని దేవస్థానం కమిటీ పేర్కొంది. ఇది వాస్తవం కాదని ఎమ్మెల్యే శర్మ పేర్కొంటున్నారు. ఈ ఐదు గ్రామాలలో సుమారు లక్షకు పైగా ప్రజలు జీవనం సాగిస్తున్నారనీ...ఇప్పుడు హఠాత్తుగా వారిని ఖాళీ చేయమనటం న్యాయం కాదని ఆయన తెలిపారు. 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై ఏ ప్రభుత్వం పట్టించుకోవటంలేదనీ..దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సత్వరమే బాధిత గ్రామాల ప్రజలకు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కొన్ని దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది.

పుడ్ సేఫ్టీ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు...

ఛత్తీస్ ఘడ్ : 10 మంది పుడ్ సేఫ్టీ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 

న్యాయ సేవల్లో లోక్ అదాలత్ కీలకపాత్ర : జస్టిస్‌ ఠాకూర్‌

హైదరాబాద్‌: లోక్‌దాలత్‌లకు సవాళ్లు రెట్టింపవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌ పార్ హయత్ హోటల్లో నిర్వహించిన 14వ అఖిలభారత న్యాయాధికార సదస్సు జరిగింది.ఈ సదస్సును జస్టిస్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ... న్యాయ సహాయం, న్యాయసేవలు అందించడంలో లోక్‌అదాలత్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. న్యాయసహాకం కోసం వచ్చే పేదలకు సత్వరం సహాయం అందించేలా లోక్ అదాలత్ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయసేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని ఆయన తెలిపారు.

11:42 - April 9, 2016

కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఛోటేమియా అనే వ్యక్తి వివాహ శుభకార్యాలకు ఫొటోలు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఛోటేమియా.. తన బృందంతో కలిసి కారులో స్వస్థలానికి వస్తుండగా మార్గంమధ్యలో జిల్లాలోని ఇందుగులపల్లి వద్ద గల రహదారిపై తెల్లవారుజామున యూటర్న్ తీసుకుంటున్న ఓ లారీని కారు ఢీకొట్టింది. దీంతో ఛోటేమియా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

లోక్ అదాలత్ లకు మరింత కృషి జరగాలి : కేంద్రమంత్రి సదానంద్ గౌడ్

హైదరాబాద్‌: బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన 14వ అఖిలభారత న్యాయాధికార సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్ సైట్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ప్రారంభించారు. ఈసదస్సులో కేంద్రమంత్రి సదానంద్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... లోక్ అదాలత్ లక్ష్యసాధనకు మరింత కృషి జరగాలని అభిప్రాయపడ్డారు.న్యాయ సహాయం కావాల్సిన పేదలకు లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతుందనీ..అన్ని స్థాయిల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

బస్సు లోయలో పడి 23 మంది మృతి...…

హైదరాబాద్ : దక్షిణ అమెరికాలోని  పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. పెరూలోని ఆండిస్‌ పర్వత శ్రేణుల్లో ప్రయాణిస్తున్న బస్సు పుర్టో మాల్డొనాడో నగరం నుండి సుస్కో నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. కాగా బాధితుల్లో చాలామంది ఆదివారం పెరూలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్నట్లు సమాచారం.

అటవీశాఖ అధికారులు దారుణహత్య....

గుంటూరు : జిల్లాలోని బొల్లాపల్లి నెహ్రూనగర్‌ తండాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అటవీశాఖ అధికారులను గుర్తుతెలియని దుండగులు నరికి చంపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన అధికారులు లాజర్, బాజీలుగా పోలీసులు గుర్తించారు.

10:37 - April 9, 2016

చిత్తూరు : అంతర్జాతీయ స్మగ్లర్ లిన్ డాంగ్ ఫూ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కాడు. బెంగళూరులో లిన్ ను చిత్తూరు టాస్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిన్ వద్ద నుంచి వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. భారత్, చైనా స్మగ్లర్లకు మీడియేటర్ గా లిన్ వ్యవహరిస్తున్నారు. 

 

ఈజిప్టులో ఉగ్రవాదుల దాడి,4గురు ఆర్మీ జవాన్లు మృతి...

హైదరాబాద్ : ఈజిప్టులో ఉగ్రవాద ప్రభావిత ద్వీపకల్పంలో ఆర్మీ చెక్‌పోస్ట్‌ లను  లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని వారు తెలిపారు. కాగా 2011 నుంచి భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రయివేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు...

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్  ప్రాంతంలో ప్రయివేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు ప్రయివేటు బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

రోటీ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : పాతబస్తీ తలాబ్ కట్టలోని రోటీ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉస్మానియా, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. 12 మందికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

10:20 - April 9, 2016

మనిషిలో మార్పు అనేది సహజం. అయితే ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుందని భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం నటి నిత్యామీనన్‌లో అలాంటి మార్పే స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు చిత్ర వర్గాలు. ఎప్పుడూ కథలు వినడం, షూటింగ్‌లకు వెల్లడం అంటూ ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకునే నిత్య ప్రవర్తనలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందంటున్నారు.
 
ఇంతకు ముందు పొగరుబోతుగా పట్టం కట్టించుకున్న నిత్యామీనన్‌లో ఇప్పుడు పూజలు, పునస్కారాలు అంటూ భక్తి భావం పెరిగిపోయిందట. తన స్నేహితురాళ్లతో కూడా వేదాంత ధోరణితో మాట్లాడుతోందట. ఇంకా చెప్పాలంటే ఇటీవల నిత్యామీనన్ దోషనివారణ పూజలు చేయించారట. ఆ పూజలో ఆమె బంధువర్గాలు కూడా పాల్గొన్నారని తెలిసింది. ఇంతలో ఆమెలో అంత మార్పునకు కారణం ఏమైఉంటుందన్నదే అందరిలో కుతూహలాన్ని పెంచుతున్న అంశం.
 
 నిత్యామీనన్ తాజాగా అప్పావిన్ ఆశై, 24,ముడింజా ఇవనై పిడి తదితర తమిళ చిత్రాలతో పాటు కన్నడం, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ముడింజా ఇవనై పిడి చిత్రంలో సుధీప్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, అది త్వరలో పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి, నిత్యామీనన్ దోషనివారణ పూజలకు ఎమైనా సంబంధం ఉండి ఉంటుందా? అన్న కూపీ లాగే పనిలో పడ్డారు ఒక వర్గం.

చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్....

చిత్తూరు : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.చైనా దేశానికి చెందిన స్మగ్లర్ లిన్ డాండ్ పూ అనే స్మగ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లిన్ డాండ్ నుండి వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. భారత్ లోని పలువురు స్మగ్లర్ లిన్ కు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జాతీయ న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం....

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో 14వ జాతీయ న్యాయాధికారుల సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, హైకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ దిలీప్. చీఫ్ జస్టిస్ బి.భోస్లే ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.

09:42 - April 9, 2016

ప్రకాశం : నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలులో దోపిడీకి యత్నించారు. రైలులోకి ప్రవేశించిన  దొంగలు కరవది-ఒంగోలు స్టేషన్ల మధ్య దోపిడీకి యత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దోపిడీదారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.  

09:37 - April 9, 2016

ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అలాగే అదృష్టం ఎవరికీ సొంతం కాదు. ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వారు అర్హత కలిగుంటే మరో రంగంలోనూ సాధించగలరు.అలా సంగీత రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న విజయ్‌ఆంటోని, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకులుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది పయనించడానికి రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్వశక్తితో ఎదుగుతున్న సంగీత దర్శకుల్లో ఈయన ఒకరని చెప్పాలి.
 

మొదట్లో సొంతంగా పాప్ సాంగ్స్ ఆల్బమ్‌లతో తనకంటూ గుర్తింపు తె చ్చుకున్న ఆది ఇప్పుడు సినీ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. దర్శకుడు సుందర్.సీ విశాల్ నటించిన ఆంబళ చిత్రంతో ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు.ఆ తరువాత తనీఒరువన్, అరణ్మణ-2 చిత్రాలతో సక్సెస్‌ఫుల్ సంగీతదర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.ఈయనలో మంచి గాయకుడు,గీత రచయిత కూడా ఉన్నారన్నది గమనార్హం.
 
కాగా ఆదిని సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన సుందర్. సీనే ఇప్పుడు హీరోగా ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన అవ్నీ సంస్థలో స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న తాజా చిత్రంలో హిప్ హాప్ తమిళ్ ఆదిని కథానాయకుడిగా ఎంపిక చేసినట్లు తెలిసింది.అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

09:33 - April 9, 2016

వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ సరైనోడుతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిన ఈ సినిమా ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు బన్నీ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ దర్శకులతో బన్నీ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా అఫీషియల్ గా మాత్రం కన్ఫామ్ కాలేదు.
 
సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్ లో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు బన్నీ సినిమా కోసం లింగుసామి, విశాల్ సినిమాను కూడా పక్కన పెట్టేశాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న వార్త వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఏవీ సెట్స్ మీదకు రాలేదు.
 

తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా హారికా హాసిని క్రియేషన్స్ విడుదల చేసిన ఓ పోస్టర్, అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు, ఈ పోస్టర్ లో తమ బ్యానర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమాను నిర్మిస్తున్నట్టుగా హింట్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సక్సెస్ లు అందించిన ఈ కాంబినేషన్ లో త్వరలో హ్యాట్రిక్ మూవీ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.

 

09:21 - April 9, 2016

ముంబయి : ఐపీఎల్-9 సీజన్ ఆరంభ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ తారలు జాక్వలిన్ ఫెర్నాండెజ్, కత్రినాకైఫ్‌ నృత్యాలు,వెస్టిండీస్ ఆటగాడు బ్రావో పాడిన చాంపియన్ పాట అభిమానుల్ని అలరించారు. అతిథులు,అభిమానుల కేరింతల మధ్య వేదికపైకి ఎనిమిది జట్ల కెపెన్లు తరలివచ్చారు. టోర్నీలో తొలి మ్యాచ్ నేడు ముంబై-పుణె మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. మొత్తం 60 మ్యాచ్‌లు 51  రోజుల పాటు క్రికెట్ అభిమానులకు కనువిందు కానున్నాయి. 

 

09:19 - April 9, 2016

మహారాష్ట్ర : మహిళా భక్తులు విజయం సాధించారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారానికి చరమగీతం పాడేలా పోరాటంలో గెలిచారు. మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినం కానుకగా శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టారు . పురుషులతో పాటు తాము కూడా సమానమే అంటూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళకు అనుమతి
ఇక నుంచి మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని శనిసింగనాపూర్‌ ఆలయబోర్డు నిర్ణయించింది. ఏళ్ల తరబడిగా మహిళా భక్తులకు శని ఆలయంలోకి ప్రవేశం లేదు. దాంతో కొంతకాలంగా మహిళా భక్తులు పోరాటం చేస్తూ వస్తున్నారు. గుడిపడ్వా పర్విదినం సందర్భంగా పలువురు భక్తులు దర్శనానికి విచ్చేశారు. అయితే ఆలయ అధికారులు మాత్రం మహిళలతో పాటు పురుషులను కూడా ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. దాంతో పురుషులు పెద్దసంఖ్యలో ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో జలాభిషేకం చేసేందుకు వచ్చిన భక్తులు ఆలయ అధికారుల ఆజ్ఞలను పట్టించుకోకుండా ఆలయంలోకి దూసుకెళ్లారు.  ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు పురుషులు, మహిళలను కూడా ఆలయ ప్రవేశానికి అంగీకరించారు. 
తృప్తి దేశాయ్‌ హర్షం 
శని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై భూమాత మహిళా బ్రిగేడ్‌ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ, పురుష సమానత్వం దిశగా ఇది గొప్పవిజయమని ఆమె తెలిపారు. తృప్తి దేశాయ్‌ గత కొన్ని నెలలుగా ఆలయాల్లో మహిళల పట్ల నిషేధం  ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. ఇటీవల కోర్టు ఆదేశం తర్వాత తృప్తి దేశాయ్‌ సహా పలువురు మహిళా కార్యకర్తలు శని ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 

 

09:01 - April 9, 2016

టీసర్కార్ ఇష్టానుసారంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేస్తుందని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ..పాతూరు సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత కొండరాఘవరెడ్డి, బీజేపీ నేత రఘునందన్ రావు, రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డిలు పాల్గొని, మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో అఖిలపక్షం సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నేడు సికింద్రాబాద్ కోర్టుల నూతన భవనం ప్రారంభం

హైదరాబాద్ : కొత్తగా నిర్మించిన సికింద్రాబాద్ కోర్టుల నూతన భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభించనున్నారు. ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరి బలి

హైదరాబాద్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఎలాంటి సూచన లేకుండా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్న లారీ వేగంగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం ఇందుగులపల్లి వద్ద గల రహదారిపై శనివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది.

 

08:48 - April 9, 2016

విశాఖ : నగరంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న విమ్స్‌ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమయ్యింది.  విమ్స్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని ఈ నెల 11న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే  ఈ ఆస్పత్రి సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా... ఓపి సేవలకే పరిమితం చేయడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీని వెనుక కార్పొరేట్‌  మెడికల్‌ శక్తుల కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
విమ్స్ కు అరిలోవలో  110 ఎకరాల కేటాయింపు 
హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విశాఖలో విమ్స్‌  రూపుదిద్దుకుంది. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి అరిలోవ దగ్గర 110 ఎకరాలు కేటాయించారు. మొత్తం 450 కోట్ల నిధులతో 1300 పడకలతో నిర్మించాలనుకున్నారు. 24 సూపర్‌ స్సెషాలిటీస్‌తో 15 బ్లాకులు నిర్మించాలని నిర్ణయించారు.  2012 నాటికి 14 సూపర్‌ స్పెషాలిటీ  వైద్య సేవలతో 250 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు  దీనిని రోగులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో... ఈనెల 11న ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. 
రూ. 22 కోట్లతో వైద్య పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు 
అయితే విమ్స్‌లో పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా అవుట్‌ పేషెంట్‌ సేవలకు పరిమితం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు తప్పుపడుతున్నాయి. 22 కోట్ల రూపాయలంలో  వైద్య పరికరాలు  సహా ఆపరేషన్‌ థియేటర్లు, ఇతర మౌలికసదుపాయాలన్నీ సమకూర్చినా... 50 పడకలతో ఓపీ సేవలకే  పరిమితంచేయడం సరికాదంటున్నారు. కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం ఆస్పత్రుల నుంచి 30 మంది డాక్టర్లకు ఇక్కడకు రప్పిస్తున్నారు. కేజీహెచ్‌ కోసం నియమితులైన 20 మంది నర్సులను విమ్స్‌కు కేటాయించారు. మరో 150 మంది సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌పై నియమిస్తున్నారు. విమ్స్‌ వైద్య సేవలను ఓపీకే పరిమితం చేయడం వెనుక కార్పొరేట్‌ ఆస్పత్రుల కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమ్స్ కు కేటాయించిన 110 ఎకరాల భూమిలో  50 ఎకరాలపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను వేశారని  వామపక్ష నేతలు చెబుతున్నారు. విమ్స్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించారు. 

 

08:44 - April 9, 2016

పశ్చిమగోదావరి : పండుగ పూట వాళ్ల బతుకుల్లో విషాదం నెలకొంది. భారీ అగ్నిప్రమాదంతో కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు. చేతికి వచ్చిన పంట దగ్ధమై ఒకరు.. పెళ్లి కోసం దాచిన సొమ్ము తగలబడి మరొకరు లబోదిబోమంటున్నారు. ఆదుకునే నాధుడే కనిపించకపోవడంతో వారి వేదన అరణ్యరోదనగా మారింది.
వెంకటాపురం ఎస్సీ కాలనీలో భారీ అగ్నిప్రమాదం
రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిన కుక్కునూరు మండలం వెంకటాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎస్సీ కాలనీలోని సుమారు 85 ఇళ్లు అగ్గికి ఆహుతి అయ్యాయి. 
రోడ్డున పడ్డ బాధితులు 
సమీపంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ఇళ్లన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒకపక్క ఎండాకాలం కావడం.. మరోపక్క నీళ్లు లేకపోవడంతో మంటలను ఆపలేకపోయారు. ఇళ్లు మొత్తం దగ్ధం కావడంతో కాలనీవాసులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. 
మంటల్లో కాలి బూడిదైన రూ.3లక్షలు 
తన పెళ్లి కోసం పొలం అమ్మితే వచ్చిన 3 లక్షల రూపాయలు మంటల్లో కాలి బూడిదయ్యాయని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటోంది ఓ యువతి. చేతికి వచ్చిన పంటతో సహా.. ఇళ్లు, సామాన్లు అన్నీ తగలబడ్డాయని కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధికారులెవరూ పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు 
మరోవైపు ఇంత ప్రమాదం జరిగినా ఏ అధికారి కూడా స్పందించలేదని గ్రామస్తులంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతం ఏపీలో కలిసినప్పటికీ.. అక్కడి నుంచి ఫైరింజన్లు రాలేదని.. తెలంగాణకు చెందిన ఫైరింజన్లు ఘటనాస్థలానికి వచ్చాయంటున్నారు బాధితులు. ఇదిలావుంటే.. మంత్రి పీతల సుజాత ఈ ప్రమాద సమయంలో 35 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరులోనే ఉన్నారని.. సమాచారం తెలిసినా ఆమె ఇక్కడకు రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సామాజికవర్గానికి చెందిన తమకు ఇంత జరిగినా పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

08:39 - April 9, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వమే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  వీలైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టుకు నిర్దేశించింది. 
వేతనాల చెల్లింపు సమస్య
రాష్ట్ర విభజన అనంతరం వేతనాల చెల్లింపు సమస్య విద్యుత్ ఉద్యోగులను, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర  ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాధిస్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగులకు తాము ఎలా వేతనం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదన చేస్తోంది. దీంతో  విద్యుత్ ఉద్యోగుల సమస్య జఠిలం అవుతూ వస్తోంది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు 58-42 నిష్పత్తిలో రెండు ప్రభుత్వాలు  జీతాలివ్వాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
సుప్రీంకోర్టును ఆశ్రయించింన చంద్రబాబు ప్రభుత్వం 
హైకోర్టు ఉత్తర్వులపై చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులకు తామెలా వేతనాలిస్తామని సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించగా... స్థానికత ఆధారంగానే ఉద్యోగులను రిలీవ్ చేశామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ ఖలీపుల్లా, జస్టిస్ ఎస్.ఏ.బాబ్డేలతో  కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్థానికత అంశంపై సందేహం వ్యక్తం చేసింది. అనంతరం 1253 మంది విద్యుత్ ఉద్యోగులకు వేతనాలను తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశాలు జారీ  చేసింది.
టీ.ప్రభుత్వమే ఎపి ఉద్యోగులకు వేతనాలివ్వాలన్న సుప్రీంకోర్టు
రెండేళ్ల దోబుచులాటల అనంతరం విద్యుత్ ఉద్యోగులకు, ఏపీ ప్రభుత్వానికీ ఉగాది రోజున తీపి కబురు అందింది. తెలంగాణ ప్రభుత్వమే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టుకు నిర్దేశించింది. 

 

నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి దొంగల యత్నం

ప్రకాశం : నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి దొంగలు యత్నించారు. కరవది-ఒంగోలు స్టేషన్ల మధ్య దోపిడీకి యత్నించారు. దోపిడీదారులపై భద్రతా సిబ్బంది మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. 

నేటి నుంచి ఐపీఎల్-9 సీజన్ ప్రారంభం

ముంబయి : నేటి నుంచి ఐపీఎల్-9 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ముంబయితో పుణె తలపడనుంది. వాంఖడే వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి ఎస్ ఐ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్

హైదరాబాద్ : నేటి నుంచి ఎస్ ఐ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈనెల 17న దరాఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 

 

08:21 - April 9, 2016

అనంతపురం : జిల్లాలో విషాదం నెలకొంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు బలి అయ్యారు. బోర్ వెల్ వేసుకుని పంట పండించుకుని సుఖంగా బతకాలకున్నారు. అంతలోనే విషాదం నెలకొంది. అనంతలోకాలకు వెళ్లారు. మృత్యువు బోర్ వెల్ లారీ రూపంలో వచ్చింది. లారీని రివర్స్ చేస్తుండగా లారీ కిందపడుకున్న నలుగురు దుర్మరణం చెందారు. వీరి మృతితో గ్రామంలో, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని శెట్టూరు మండలం పరచేడులో సంజీవప్ప, అనంతప్ప అనే ఇద్దరు అన్నదమ్ములు తమ పొలంలో బోర్ వేయడానికి బోర్ వెల్ లారీని తీసుకెళ్లారు. పోలంలో రాత్రి ఆలస్యం కావడంతో సంజీవప్ప, అనంతప్పతోపాటు కార్మికులు ఆదిశేషు, మూర్తిలు బోర్ వెల్ లారీ కింద పడుకున్నారు. లారీ క్యాబెన్ లో డ్రైవర్ పడుకున్నాడు. అయితే లారీ కిందపడుకున్న వారిని గమనించకుండా తెల్లవారుజామున డ్రైవర్ లారీని రివర్స్ చేసే క్రమంలో వారిపై దూసుకెళ్లింది. దీంతో లారీ కింద పడుకున్న ఆ నలుగురూ మృతి చెందారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

 

నేడు జెఈఈ మెయిన్స్ పరీక్షలు

హైదరాబాద్‌ : ఐఐటీ, నిట్‌లో ప్రవేశానికినిర్వహించే జేఈఈ మెయిన్ (ఆనలైన్)ను శని, ఆదివారాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు తెలంగాణలో 5988 మంది, ఆంధ్రప్రదేశలో 14760 మంది విద్యార్థులు రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 60వేల మంది ఆనలైన పరీక్షకు హాజరుకానున్నారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ దీనిని నిర్వహిస్తోంది. ఏపీలో 34, తెలంగాణలో 13 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

నిజామాబాద్ : నేడు జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

అనంతపురంలో విషాదం..

అనంతపురం : జిల్లాలోని శెట్టూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోర్ వెల్ లారీ కింద నిద్రస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు సంజీవప్ప, ఆదిశేషు, మూర్తి 

07:47 - April 9, 2016

హైదరాబాద్ : దళితులను ఆకర్శించేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.. ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. 
125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం 
తెలంగాణలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణపై క్యాంప్‌ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాలను ఘనంగా జరపాలని అధికారుల్ని ఆదేశించారు.. దళితుల అభ్యున్నతికోసం కార్యక్రమాల్ని తయారు చేయాలని సూచించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తుగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేసి వచ్చే ఏప్రిల్ 14న విగ్రహ ఆవిష్కరణ చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.. 
కన్వీనర్‌గా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్ బొజ్జా
అంబేద్కర్ విగ్రహం స్థలం ఎంపిక, జయంతి ఉత్సవాల నిర్వహణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.. ఈ కమిటీకి కన్వీనర్‌గా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్ బొజ్జా, సభ్యులుగా పలువురు ప్రజాప్రతినిధులను సీఎం నియమించారు. 
లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో విగ్రహం ఏర్పాటు
దళితులను మంచి చేసుకునేందుకే కేసీఆర్‌ ఈ విగ్రహం ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ సమీక్షకే పరిమితమైంది.. మరికొన్ని హామీలుకూడా ఆచరణకు నోచుకోలేదు.. ఈ సమస్యలను పక్కదారి పట్టించేందుకే సీఎం విగ్రహం అంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ విగ్రహాన్ని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేయాలని సీఎం చూస్తున్నారు. విగ్రహంతో మరిన్ని వర్గాలను దగ్గర చేసుకోవాలన్న సీఎం ప్లాన్‌ ఎంతవరకూ నెరవేరుతుందో వేచిచూడాలి.

07:37 - April 9, 2016

విజయవాడ : రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. తూర్పుతీర ముఖద్వారంగా ఉన్న ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని, పారిశ్రామికవేత్తలకు అనుకూల అంశాలు అధికమని చెప్పారు. పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రంలో మౌలికసదుపాయాలు తీర్చిదిద్దుతున్న విషయాన్ని చైనా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. 
మౌలికసదుపాయాల కల్పనకు ప్రాధాన్యత 
విజయవాడలో చైనాలోని సిచువాన్‌ రాష్ట్ర పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన 40 మంది ప్రతినిధులు తమ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. పారిశ్రామీకరణ, పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రలో పెద్ద ఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చైనా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో నిపుణులైన మానవ  వనరులకు కొరతలేదని, ప్రగతిశీల కార్మిక విధానాలు, శాంతిభద్రతలు సానుకూల అంశాలని వివరించారు. వ్యాపారానుకూల విధానాల్లో ఏపీకి ప్రపంచ బ్యాంకు రెండో ర్యాంకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 
మెగా ప్రాజెక్ట్ లకు అప్పటికప్పుడే ప్రోత్సహకాలు 
పెట్టుబడిదారులకు కల్పిస్తున్న పన్నులు రాయితీలు, ఇతర ప్రోత్సహకాలను చంద్రబాబు వివరించారు. మెగా ప్రాజెక్ట్ లు ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అప్పడి కప్పుడే ప్రోత్సహకాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. విద్యుత్‌కు లోటులేదని, రాష్ట్రలో ఆటోమొబైల్‌ పరిశ్రమల ఏర్పాటు, ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని సిచువాన్‌ పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కోరారు. 
చైనా సిచువాన్‌ పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరణ 
ఏపీ రాజధాని అమరావతి భూసేకరణ నుంచి అక్కడ జరుగుతున్న పనుల వరకు అన్నింటిని చైనా సిచువాన్‌ పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరించారు. పెట్టుబడులకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సిచువాన్‌ గవర్నర్‌ వాంగ్‌నింగ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోడానికి ఏపీ, సిచువాన్‌ ప్రతినిధులు  అంగీకరించారు. 

07:30 - April 9, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై ఏర్పడిన కేబినెట్‌ సబ్‌కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రాజెక్టుల రీ-డిజైన్‌, ప్రాజెక్టుల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావులతో పాటు.. ఇరిగేషన్‌, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.                                                                
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ప్రాజెక్టుల రీ-డిజైన్‌, పనులపై నేడు కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత భేటీ కావడం మూడోసారి. అయితే గత సమావేశానికి ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్‌ వేరే కార్యక్రమాల వల్ల హాజరుకాకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోలేదు. నేడు జరగబోయే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పు, సీతారామ ప్రాజెక్ట్
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పు, ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌లను కలిపి సమీకృత సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులలో కొన్ని ప్యాకేజీల రీ-ఇంజనీరింగ్‌ వంటి అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేసేందుకు ఈ సబ్‌కమిటీ ఏర్పడింది. డిజైన్‌ మార్పుల వల్ల ప్యాకేజీల వారీగా, ప్రాజెక్టుల వారీగా తలెత్తే సమస్యలు.. ముఖ్యంగా ఆర్ధికపరమైన, న్యాయపరమైన చిక్కులు ఇతర అంశాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. రీ-డిజైన్‌ కారణంగా రద్దైన ప్యాకేజీల పనుల విషయంలో ఏం చేయాలనే అంశంపై కూడా అధికార యంత్రాంగంతో ఈ కమిటీ సమాలోచనలు చేస్తోంది. 
నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ నీటిపారుదల రంగంపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో తమ మీద మరింత బాధ్యత పెరిగినట్లు ఇరిగేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. మంత్రి హరీష్‌రావు, ఇతర అధికార యంత్రాంగం ఇకపై మరింత భాద్యతాయుతంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశం యావత్తూ తెలంగాణ ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ వైపు చూస్తుండడంతో ఎక్కడా రాజీపడకుండా పనులు చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా అదే స్థాయిలో పనిచేస్తోంది. 
వచ్చే ఏడాది మరో 30 వేల కోట్ల రూపాయలు 
బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించడమే కాకుండా.. వచ్చే ఏడాది మరో 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే అంశాన్ని కేబినెట్‌ సబ్‌కమిటీ పరిశీలిస్తోంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఒక్కో ప్రాజెక్టును ప్యాకేజీల కింద విభజించి త్వరితగతిన పూర్తి చేయడంపై సబ్‌కమిటీ ఫోకస్‌ పెట్టింది. 

 

నేడు మదనపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు : నేడు మదనపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హంద్రీనీవా కాల్వ పనుల ఏరియల్ సర్వే, బంగారుపాళ్లెంలో నీరు-మట్టి పనులు పరిశీలించనున్నారు. జన్మభూమి కమిటీలతో సీఎం సమావేవం కానున్నారు. 

నేటి నుంచి హైదరాబాద్ లో జాతీయ న్యాయ సదస్సు

హైదరాబాద్  : నేటి నుంచి హైదరాబాద్ లో జాతీయ న్యాయ సదస్సు జరుగనుంది.  ఈ సదస్సుకు కేంద్రమంత్రి సదానందగౌడ, తెలంగాణ సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ హాజరుకానున్నారు.

నేడు సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రథమ వర్థంతి

నల్గొండ : నేడు సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా వట్టిమర్తిలో ఆయన విగ్రహావిష్కణ జరుగనుంది. నకిరేకల్ లో సంతాప సభ నిర్వహించనున్నారు. 

Don't Miss