Activities calendar

11 April 2016

21:33 - April 11, 2016

ముంబై : స్టాక్‌ మార్కెట్లో బుల్ మళ్లీ విజృంభించింది. మిడ్ సెషన్ నుంచి అందిన బైయింగ్ సపోర్టురో... సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో.. మళ్లీ 25వేల మార్క్ దాటింది. ఈ సూచీ 25వేల 22 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 116 పాయింట్లు పెరిగి 7వేల 6వందల 71 వద్ద క్లోజైంది. బ్యాంకింగ్, ఇన్‌ ఫ్రా, ఆటో, ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. మిడ్ సెషన్ వరకు ట్రేడింగ్ మామూలుగానే సాగినా... మధ్యాహ్నం ఐరోపా సూచీలు లాభాల్లో ప్రారంభమవడంతో...దేశీయంగా సెంటిమెంట్ పెరిగింది. నిఫ్టీలో ఐడియా సెల్యులర్, బాష్, హిండాల్కో 5శాతం పెరిగాయి.

21:31 - April 11, 2016

హైదరాబాద్ : అసోం, పశ్చిమబెంగాల్‌లో రెండో దశ ఎన్నికల్లో రికార్డ్ స్తాయిలో పోలింగ్ నమోదైంది. అసోంలో 82శాతం ఓటింగ్ నమోదవగా... బెంగాల్‌ లో 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 31 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. అయితే బెంగాల్‌లో పలుచోట్ల అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సిపిఎం కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రకోణ జిల్లాలో ఉదయం సిపిఎం పోలింగ్‌ ఏజెంట్‌ను టిఎంసి కార్యకర్తలు చితకబాదడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. 

21:29 - April 11, 2016

కేరళ : కొల్లాంలోని ఓ ఆలయం సమీపంలో ఆగిన మూడు కార్లు కలకలం సృష్టించాయి. ఆ కార్లలో భారీ పేలుడు పదార్థాలు ఉండడంతో బాంబ్‌ స్క్వాడ్‌ తణిఖీలు చేపట్టింది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పుట్టింగల్‌ ఆలయంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై కేరళ హైకోర్టు రేపు విచారణ జరపనుంది.

పుట్టింగళ్ మళ్లీ కలకలం...

పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి కోలుకోకముందే కొల్లాంలో మళ్లీ కలకలం చెలరేగింది. పుట్టింగల్‌ దేవి ఆలయానికి అతి సమీపంలో మూడు గుర్తుతెలియని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా భారీగా పేలుడు పదార్థాలు ఉండటంతో అధికారులతోపాటు ప్రజల్లోనూ కలవరం మొదలైంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

108కి చేరిన మృతుల సంఖ్య....

కొల్లంలోని పుట్టింగల్‌ దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు బాణ సంచా పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. సుమారు 4 వందల మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు దాదాపు 15 వేల మంది భక్తులున్నారు. టపాసుల పేలుల్ల అగ్నికీలలు బాణసంచా స్టోరేజీపై పడడంతో భారీ విస్ఫోటం జరిగింది. పేలుడు ధాటికి ఆలయంతో పాటు పక్కనున్న భవనం ధ్వంసమైంది. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా పోటీలు నిర్వహిస్తుండగా.. ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలుడుకు సంబంధించిన ఆఖరు 30 సెకన్ల వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ పేలుడు ఘటన అనంతరం పుట్టంగిల్‌ ఆలయ బోర్డుకు చెందిన 10 మంది సభ్యులు కనిపించకుండా పోయారు. కేరళ కొల్లం జిల్లాలోని ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 30 మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఆలయ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. ఆలయంలో బాణసంచా పోటీలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి సహా, పలువురు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై క్రైం బ్రాంచ్‌ విచారణ జరుపుతోంది.

ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు ....

కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై మంగళవారం కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం అనాదిగా వస్తోన్న ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. 

21:20 - April 11, 2016

హైదరాబాద్ : దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు పూర్తైంది. ఈనెల 14న ఎన్టీఆర్‌ పార్క్‌లోని 35 ఎకరాల్లో విగ్రహ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌ పార్క్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కాంస్య విగ్రహ ఖర్చు, ఎక్కడ తయారు చేయించాలనే అంశాలపై కమిటీ సమావేశమై నిర్ణయిస్తుందన్నారు. ఈనెల 14 నుంచి వచ్చే ఏడాది ఏప్రియల్‌ 14 వరకు ఏడాది పాటు అంబేద్కర్‌ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు కడియం. ఇక లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ప్రస్తుతమున్న సంక్షేమ భవనాన్ని కూల్చి.. కొత్తగా టవర్లు నిర్మిస్తామని.. దానికి భూమిపూజ కూడా కేసీఆర్‌ చేస్తారన్నారు. 

20:56 - April 11, 2016

అబ్బా.. ఎవ్వలు గెలుస్తరు ఎవ్వలోడిపోతరు.. ఎవ్వలు సిద్దిపేట మున్సిపాల్టీ ఆపీసు మీద జెండ ఎగురేస్తరు. అని కడ్పుల ఉబ్బురాన్ని ఉగ్గవట్టుకున్న తెలంగాణ ప్రజల నెత్తి మీదికెల్లి కింటల్ బర్వు దిగినంత పనైంది. ఎందుకు అన్కుంటున్నరు.. 

పబ్లీకుకు మాట ఇచ్చుడు.. ఆ మాటను తప్పుడు మన రాజకీయనాయకులకు రాజకీయంతోని వెట్టిన విద్యనేగదా..? అగో గసొంటి మాటలు జెప్పొద్దు.. తర్వాత తిప్పలపాలు గావొద్దు అని అంటున్నడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. చేశేదుంటెనే చెప్పాలే.. చెప్పిందల్ల శేయాలే అని ఇయ్యాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నిప్కలేకుంటనే సుర్కు వెట్టిండు సారూ..

అభిమానుల ఆరాధ్య దైవం.. జనసేన సృష్టి కర్త.. అపర ప్రజా సేవకుడు.. నిత్య కృషీవలుడు అమరావతి భూములు కోల్పోయిన అన్నదాతలను ఆదుకున్న అపధ్బాంధవుడు.. ఫివ్వరు అదే అదే.. పవ్వరు స్టార్ పవనాలు జనసేన పార్టీ పెట్టినప్పటి సంది.. ఇప్పట్కి జనాన్కి ఎంత సేవ జేశే.. ఎంత మంది రైతులను నిరుపేదలను ఆదుకునే.. అంతటి మహానుభావుడు మల్లా ప్రజల పక్షాన నిలవడెతందుకు వొక బలమైన నిర్ణయం తీస్కున్నడు.

.ఎన్కట ఎండకాలం లేదు వాన కాలంలేదు.. అన్ని కాలాలళ్ల.. ఊటశెల్మెలు ఊరేది.. బావుల కాడ జనం దూపైతె.. ఊట శెల్మెల నీల్లే దాగుతుండె.. ఇప్పుడు ఊటశెల్మెలు ఏడనన్న గనిపిస్తున్నయా..?

బోడుప్పల్ జనం ఎమ్మెల్యేను బహిష్కరించినం.. మాకు ఇద్వర్ సంది ఎమ్మెల్యే లేడు అని ప్రకటించిండ్రంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనితనం ఎట్లున్నదో గమనించుండ్రి మీరే.. పబ్లీకుకు మాట ఇచ్చుడు.. ఆ మాటను తప్పుడు మన రాజకీయనాయకులకు రాజకీయంతోని వెట్టిన విద్యనేగదా..? అగో గసొంటి మాటలు జెప్పొద్దు.. తర్వాత తిప్పలపాలు గావొద్దు అని అంటున్నడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. చేశేదుంటెనే చెప్పాలే.. చెప్పిందల్ల శేయాలే అని ఇయ్యాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నిప్కలేకుంటనే సుర్కు వెట్టిండు సారూ..

మన టీజేఏసీ పెద్ద ముత్తయిదువు కోదండరాం సార్... మల్లా పోరాటాన్కి సిద్దమైండు.. కరీంనగర్ జిల్లాల ఊటె శెల్మె ఒక్కటి ఊరిస్తున్నది...ఇత్యాది అంశాలపై మల్లన్న ఘరం ఘరం ముచ్చట్లు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:42 - April 11, 2016

వెలుగు నింపాల్సిన వేడుకలు విషాదం నింపుతున్నాయ్, ప్రజానీకానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ ఏర్పాట్లు దానికి తగ్గట్లుగా చేశారా? బాణ సంచాపై నియంత్రణ ఉండాలని తెలియదా? పుణ్యక్షేత్రాల్లో ప్రమాదాలకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? కేరళ సర్కార్ భద్రతా ఏర్పాట్లు విస్మరించిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా బలితీసుకున్న కొల్లం విషాం అనేక హెచ్చకరికలు సూచిస్తోంది... ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్పెషల్ స్టోరీ... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:47 - April 11, 2016

విజయవాడ : వివాదాల్లో ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలను శ్రీచైతన్య విద్యాసంస్థలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధను అర్ధం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల విద్యార్థులు తమ అకడమిక్‌ కెరీర్‌ను నష్టపోకుండా ఉంటుందని అధికారులంటున్నారు. అయితే.. కేశవరెడ్డి ఆస్తులపై గానీ.. ఇతర అకౌంట్లపై గానీ శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఎలాంటి అధికారం ఉండదని.. కేవలం విద్యార్థుల అకడమిక్‌ నిర్వహణ బాధ్యతను మాత్రమే శ్రీచైతన్య విద్యాసంస్థలు చూస్తాయని అధికారులు తెలిపారు.

 

19:46 - April 11, 2016

సమానత్వం.. సమ సమాజం కోసం దాదాపు రెండు శతాబ్దాల క్రితమే నడుం బిగించిన ఘనుడాయన. కట్టుబాట్ల సమాజంలోనే ఆధునిక భావాలను అమలు చేసి, సామాజిక మార్పు కోసం అనితర కృషి చేసిన మహత్తర శక్తి అతను. అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే... మానవ సమాజం ఉన్నత స్థితికి చేరుకోగలదని సంకల్పించిన ధీరోదాత్తుడు అతను. అతనే మహాజన మహాత్ముడు.. జ్యోతిరావు పూలే.

1867 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలో జననం...

స్వతంత్ర దృష్టి. సమగ్ర ఆధునిక అవగాహన కలిగిన జ్యోతిరావు పూలే 1867 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలో జన్మించారు. కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించిన పూలే.. అది అంతం కావాలని పరితపించారు. అసమానతల కుల వ్యవస్థ అంతం కావాలని, శూద్ర, అతిశూద్ర ప్రజలకు జీవితం అంకితం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.

మనువాదుల కుతంత్రాలను ఎండగట్టడానికి....

మనువాదుల కుతంత్రాలను ఎండగట్టడానికి.. చీకటి శాసనాలతో ప్రజలను దోచుకుంటున్న తీరును తుద ముట్టించడమే లక్ష్యంగా తన కార్యాచరణను ప్రకటించిన పూలే.. ఆ దిశగా ఎనలేని కృషి చేశారు. ప్రతి రంగంలో స్త్రీలను అణగదొక్కిన తీరుపై పూలే పోరాడారు. అలాగే కులపరమైన అణచివేతకు వ్యతిరేకంగా తీవ్రమైన కృషి చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం.. వారి బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ధీరోదాత్తుడు జ్యతీరావ్‌ పూలే.

భార్య సావిత్రిభాయికి తానే గురువై....

మహిళలు చదవుకూడదన్న ఆంక్షలున్న ఆ రోజుల్లో తన భార్య సావిత్రిభాయికి తానే గురువై ఈ దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని అందించిన ఘనులు జ్యోతిరావు పూలే. బ్రాహ్మణుల ఇళ్లల్లో వితంతువులకు శిరోముండనం చేయడం, హీనంగా చూడటం, వారి పట్ల జరిగే అకృత్యాలను పూలే సాహసంతో ఎదుర్కొన్నాడు. అవమానాలు, నిందలకు భయపడి ప్రాణాలు తీసుకోకండి అంటూ వితంతు శరణాలయాన్ని నెలకొల్పినవాడు పూలే. వృద్ధులు, అనాధలు, వికలాంగులకు సేవ చేయడమే నిజమైన భగవంతుని ఆరాధనగా తలచిన ఆయన.. 1848లో మొట్టమొదటి సారిగా బాలికల పాఠశాల నెలకొల్పారు.

ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాగ్రహాన్ని పాటించడం పూలే అలవాటు....

ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాగ్రహాన్ని పాటించడం పూలే అలవాటు. ఆయన లేఖల మీద సత్యమేవజయతే అని రాసుకున్నారు. స్త్రీలు, కార్మికులు, రైతులు, శూద్రులు, అతిశూద్రులు వంటి వర్గాల గురించి, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల గురించి అనేక ఉద్యమాలు నిర్వహించి, అనేక చట్టాల రూపకల్పనకు కారకుడయ్యాడు. పూలే కర్తవ్యదీక్ష, నిరాడంబరతను, బీదల పట్లను ప్రేమను గమనించిన గాంధీజీ.. పూలే నిజమైన మహాత్ముడు అని ప్రశంసించారు. 1873లో బానిసత్వ విముక్తి జరగాలని భావిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని రాసిన పూలే..1880లో బొంబాయి నూలు మిల్లు కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.

1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపన....

శూద్రులను అగ్రవర్ణాల దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు పూలే. తక్కువ ఖర్చుతో వివాహం జరిపించడం, మత సహనం పాటించడం, మూఢనమ్మకాలను పారద్రోలడం ఈ సంస్థ లక్ష్యంగా ఆయన ఉద్యమించారు. నేటి తరానికీ.. పూలే జీవితం ఆదర్శప్రాయం.. అనుసరణీయం. 

19:42 - April 11, 2016

విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే జ్యోుతుల నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిలెక్కారు. చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెహ్రూతో పాటు 36మంది సర్పంచులు, 43మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ నుంచి ఇప్పటివరకు 11మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ దేశం తీర్థం పుచ్చుకున్నారు. 

19:40 - April 11, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రలోని లాతూర్‌లో గత కొన్నేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. వర్షాలు లేక నదులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోరుబావులు అడుగంటిపోయాయి. దీంతో ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రాజస్థాన్‌ నుంచి రైలు ద్వారా నీటిని సప్లయ్‌ చేయాలని నిర్ణయించాయి.

50 వ్యాగన్లతో కూడిన వాటర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌.....

ఇందులో భాగంగా 50 వ్యాగన్లతో కూడిన వాటర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ రాజస్థాన్‌ నుంచి బయలుదేరి పుణే సమీపంలోని మిరజ్‌కు చేరుకుంది. ఒక్కొక్క వ్యాగన్‌లో 54 వేల లీటర్ల నీటి కెపాసిటి ఉంది. వాటర్‌ ట్రెయిన్‌ ప్రస్తుతం లాతూర్‌కు 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి లాతూర్‌ చేరుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు. ఒక్క ట్రిప్పుకు 5 లక్షల లీటర్ల నీరు సప్లయ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 15 వరకు మరో వాటర్‌ ట్రెయిన్‌ లాతూర్‌ చేరనుంది.

ప్రారంభం కాని పైప్ లైన్ పనులు...

రైలులో నీరొచ్చినా లాతూర్‌ ప్రజలకు అప్పుడే దాహం తీరే అవకాశం లేదు. రైలులో తెచ్చిన నీటిని సప్లయ్‌ చేసేందుకు పైప్‌ లైన్‌ పనులే ఇంకా ప్రారంభించలేదు. మరో మూడు రోజుల్లో పైప్‌ లైన్‌ పనులు పూర్తి చేస్తామన్న ధీమాను అధికారులు వ్యక్తం చేశారు. నాలుగున్నర లక్షల మంది నివసించే లాతూర్‌తో పాటు పరిసర గ్రామాలకు నీటిని సప్లయ్‌ చేసే డామ్‌ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఇక బావులు, బోరు బావులే జనానికి దిక్కయ్యాయి. ఆ బావుల నుంచి జనానికి సరిపడా నీళ్లు సప్లయ్‌ కావడం లేదు. దీంతో నీటి కోసం పోటీ పడి జనం సిగపట్లకు దిగుతున్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు.

గత కొన్నేళ్లుగా కురవని వర్షాలు....

గత కొన్నేళ్లుగా వర్షాలు కురియక మరఠ్వాడాలోని జలాశయాలు ఎండిపోయి దుర్భర కరువు పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా చాలామంది రైతులు, పేదలు ఊళ్లు వదలి బతుకు తెరువుకోసం ముంబై చేరుకున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మరాఠ్వాడాలో కరువు కారణంగా గత ఏడాది 3 వేల 228 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరువు పీడిత ప్రాంతాలపై ప్రధాని నరేంద్రమోది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బుందేల్‌ఖండ్‌, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

19:36 - April 11, 2016

కర్నూలు : జిల్లా కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య వివాదం.. పెద్దదై... పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు.

కరువు,నీటిఎద్దడిపై కేంద్రం ఆరా

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా విషయాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.

శ్రీచైతన్యకు కేశవరెడ్డి విద్యాసంస్థలు

హైదరాబాద్‌ : కేశవరెడ్డి విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతను శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పగించింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వివాదాల్లో ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల అకడమిక్‌ నిర్వహణ బాధ్యత శ్రీచైతన్యకు అప్పగించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విద్యా సంబంధ కార్యకలాపాలను మాత్రమే శ్రీచైతన్య పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఖాతాలు, ఫీజుల విషయంలో శ్రీచైతన్య విద్యాసంస్థల జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

సైకిల్ ఎక్కిన జ్యోతుల నెహ్రూ

హైదరాబాద్ : వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరారు. ఏపీ సీఎంటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జ్యోతుల నెహ్రూ కు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. నెహ్రూతో పాటు 32 మంది సర్పంచ్ లు, 43 మంది ఎంపీటీసీలు, ముగ్గురు జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ వర్గీయులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తీర్పును ఉపసంహరించుకున్న సుప్రీం

ఢిల్లీ: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఒకే పరీక్ష నిర్వహించాలన్న తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఈ మేరకు2013లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ప్రస్తుతం సుప్రీం ఆ తీర్పును వెనక్కు తీసుకుంది.

నగర శివారులో ఐదు కొత్త మున్సిపాలిటీలు

హైదరాబాద్ : నగర శివారులో ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్త మున్సిపాలిటీల పరిధిలోని పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల్‌పల్లి, జిల్లెలగూడ, బోడుప్పల్, మీర్‌పేట్, ఫిర్దాజిగూడ కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడనున్నాయి. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోకి జల్‌పల్లి, కొత్తపేట, పహాడీషరీఫ్, బాలాపూర్ పంచాయతీలు రానున్నాయి. బోడుప్పల్ పరిధిలోకి బోడుప్పల్, చెంగిచర్ల, గ్రామ పంచాయతీలు రానున్నాయి. ఫీర్దాజిగూడ పరిధిలోకి మేడిపల్లి, పర్వతాపూర్, ఫీర్దాజిగూడ పంచాయతీలు రానున్నాయి.

హై ఓల్టేజీ తీగలు తెగిపడి 11 మంది మృతి....

హైదరాబాద్ : అసోంలోని టిన్‌సుకియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు ఫైరింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా హై ఓల్టేజీ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

టీటీడీ ఉద్యోగి హత్యకేసును ఛేదించిన పోలీసులు...

హైదరాబాద్ : టీటీడీ ఉద్యోగి మనోహర్ హత్య కేసును తిరుపతి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు మనోహర్ భార్య, ఇద్దరు కుమార్తెలు అని పోలీసులు తేల్చారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని మనోహర్ పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనను రుబ్బురోలు, సుత్తితో కొట్టి హతమార్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో వినియోగించిన రుబ్బురోలు, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

17:52 - April 11, 2016

మహబూబ్ నగర్ : కరవు వల్ల రైతుల అల్లాడిపోతున్నారని.. మేత లేక పశువులను సంతల్లో అమ్ముకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరవు తాండవిస్తుంటే.. ప్రభుత్వం ఎలాంటి సహాయకచర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మహబూబ్‌నగర్‌లో సీపీఎం ధర్నా చేపట్టింది. పనులు లేక ప్రజలు వలస వెళ్తున్నారని.. చేసిన పనులకు ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని తమ్మినేని ఆరోపించారు. ఓ వైపు సీపీఎం కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటుంటే.. ఇప్పుడు జిల్లా మంత్రి జూపల్లి సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. కరవు సహాయక చర్యల విషయంలో బహిరంగ చర్చకు మంత్రి జూపల్లి సిద్ధమా అని తమ్మినేని సవాల్‌ విసిరారు. 

17:50 - April 11, 2016

హైదరాబాద్ : ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌ నాచారం సేయింట్‌ పీటర్స్ స్కూల్‌ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. ఈ ఏడాది ఏకంగా 40శాతం ఫీజుల్ని పెంచేశారని ఆరోపించారు.. కారణమేంటని అడిగినందుకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని మండిపడ్డారు.. ఆస్పత్రిలో బిల్లు ఎంతైనా కడతారని... స్కూల్‌కు ఎందుకు కట్టరంటూ స్కూల్ యాజమాన్యం ప్రశ్నించిందని పేరంట్స్ విమర్శిస్తున్నారు.. 

సినీ నటుడు తారకరత్నకు రూ.700 జరిమానా...

హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ డీవీబీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా సినీ నటుడు తారకరత్న కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ వుండటంతో రూ.700 జరిమానా విధించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 25, 2012 నుంచి నగరంలో దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. కాగా దేశంలో నేర సంఘటనలు పెరిగి పోతుండటంతో కార్ల అద్దాలకు అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

17:49 - April 11, 2016

కరీంనగర్‌ : జిల్లా కేంద్రం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో జిల్లా ఎండలతో మండి పోతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతనెల మార్చిలోనే అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో..ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కరీంనగర్ జిల్లా ఎండలపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి సతీష్‌ అందిస్తారు. 

17:46 - April 11, 2016

హైదరాబాద్ : సుఖీభవ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంపూర్ణ శతావధానం కార్యక్రమం యాదాద్రి సన్నిధిలో ప్రారంభమైంది. స్థానిక సంగీత్‌ భవన్‌లో ఈ అవధానం రెండురోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ గౌరిభట్ల రామశర్మ అవధానిగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర కార్యక్రమమైన శతావధానానికి స్పాన్సర్‌ గా ఉండే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని సుఖీభవ ప్రాపర్టీస్‌ సీఎండీ గురురాజ్‌ తెలిపారు. 

17:43 - April 11, 2016

హైదరాబాద్ : పల్లె జీవులకు ఉపాధి కల్పించాలి.. ఉపాధి లేక ఏ ఒక్కరూ ఆకలిబాధతో అలమటించకూడదు.. పట్టణాలకు వలసెల్లకూడదు.. ఇలాంటి లక్ష్యాలతో ఉపాధి హామీ చట్టాన్ని తయారుచేశారు. ఇంతటి గొప్ప చట్టాన్ని కేంద్రమే నీరుగార్చుతోంది. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు చూస్తే.. ప్రభుత్వం ఉద్దేశమేంటో అర్థమవుతోంది. ఒకవైపు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా.. కేంద్ర ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావట్లేదు.

ఉపాధి లేక ప్రజలు పట్టణాలకు వలసలు...

ఒకపక్క కరువు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఉపాధి లేక ప్రజలు పట్టణాలకు వలసెల్లిపోతున్నారు. కూలీలు వలసలు పోవడం ఈనాడు కొత్తేమీ కాదు. గ్రామాల్లో ఉపాధి లేక వేలాది మంది పట్టణాలకు వెళ్లిపోవడం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలన్న సదుద్దేశంతో యుపిఎ హయాంలో వామపక్ష పార్టీల ఒత్తిడిమేరకు తీసుకొచ్చిన అద్భుత చట్టమే ఉపాధి హామీ యాక్ట్‌. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో కూలీల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. వలసలకు కొంతమేర అడ్డుకట్టపడింది. ఇంతటి విశేషమైన పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే ఉదాహరణ..

2015-2016లో రూ.41,371 కోట్ల ఖర్చు....

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కోసం ప్రభుత్వం 41,371 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. తద్వారా 239 కోట్ల ఉపాధి పనిదినాలు కల్పించినట్లైంది. ఈ సంవత్సరం 217 కోట్ల పనిదినాలు కల్పించాలన్నదే లక్ష్యంగా బడ్జెట్‌ను 38,500 కోట్ల రూపాయలమేర కేటాయించారు. దీన్నిబట్టి 2871 కోట్ల రూపాయలను తగ్గించినట్లైంది. ఒకపక్క దేశ జనాభా ఏటా కోటికి పైగా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగుపడట్లేదు. ఇలాంటి సమయంలో ఉపాధి హామీ పనిదినాలు కొద్దిమేరకైనా పెరగాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం పనిదినాలను కుదించడం... బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది.

మొదటి, చివరి ఆర్థిక త్రైమాసికాల్లో తగ్గిన పనులు.....

2016 ఆర్థిక సంవత్సరంలో మొదటి, చివరి త్రైమాసికాల్లో జరిగిన ఉపాధి హామీ పనిదినాలను బట్టి ప్రభుత్వం 2017 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కోత విధించింది. అయితే 2, 3 త్రైమాసికాల్లో జరిగిన పనిదినాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కానీ ప్రభుత్వం మాత్రం 22 కోట్ల పనిదినాలను తగ్గించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజానికి గత ఏడాది ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో విపరీతమైన ఎండల మూలంగా పశ్చిమ, ఉత్తర భారతదేశంలో ఉపాధి పని దినాలు భారీగా తగ్గాయి. దీన్నిబట్టి ఈ త్రైమాసికంలో పనులు తగ్గుతాయని అంచనావేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించింది.

త్వరితగతిన విడుదల చేయడకపోవడంతో.....

ఇక కేంద్ర ప్రభుత్వం పనిదినాలకు కేటాయించాల్సిన నిధులనూ రాష్ట్రాలకు త్వరితగతిన విడుదల చేయడకపోవడం మరో సమస్యను క్రియేట్ చేస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. పైగా కూలీలకు పనిచేసిన ఎన్నో నెలలకు వేతనాలు అందుతుండడంతో వారు ఉపాధి హామీ పనులంటేనే కొంత విముఖత చూపుతుండడం గమనార్హం. ఇలా ఎన్నో రకాలుగా ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్రం విఫలమవుతూ చివరకు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

17:38 - April 11, 2016

హైదరాబాద్: బాపు బొమ్మలతో భద్రాద్రికి కొత్త కళ వచ్చింది.. ఈ పుణ్యక్షేత్రంలో అడుగడుగునా ఆధ్యాత్మికత వెళ్లివిరిసేలా బాపూ బొమ్మలను పేయింట్ చేస్తున్నారు.. మంత్రి తుమ్మల ఆదేశాలతో ఆలయం ప్రహారీ గోడలపై రంగులు, బాపూ రామాయణ దృశ్య కావ్యాలను చిత్రీకరిస్తున్నారు.. రామాయణానికి సంబంధించిన 37 సన్నివేశాలు, దశావతారాలతోపాటు.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్లు వేస్తున్నారు.. ఆలయంలో అడుగుపెట్టిన భక్తులు ఈ పేయింటింగ్స్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఎలక్ట్రిక్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం...

ఆదిలాబాద్ : మంచిర్యాల శ్రీనివాస టాకీస్ రోడ్డులోని ఓ ఎలక్ట్రిక్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకురా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల విలువైన సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో దుకాణ యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

బాణసంచా దేవుడికోసం కాదు : మాతా అమృతానందమయి

హైదరాబాద్ : పుట్టంగళ్ ఆలయ ఘటనపై ఆథ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె బాణాసంచా కాల్చడం కేవలం మనుషుల ఆనందం కోసమే కాని భగవంతుడి కోసం కాదని ఆమె స్పష్టం చేశారు.  ప్రతి ఏటా దేవాలయాల్లో కాలుస్తున్న బాణాసంచా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనీ...ఇంకెందరో గాయాలపాలవుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆమె సూచించారు. దేవాలయాల్లో బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. పుట్టింగల్ ఆలయ ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చూడాలని ఆమె కోరారు. 

పుట్టంగళ్ ఆలయం సమీపంలో పేలుడు పదార్ధాలతో 3 కార్లు....

హైదరాబాద్ : కేరళలోని కొల్లం సమీపంలోని పుట్టంగళ్ ఆలయం వద్ద మూడు కార్ల నిండా పేలుడు పదార్ధాలు కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఆదివారం నాటు పుట్టంగల్ దేవాలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.కాగా  ఈరోజు పేలుడు పదార్ధాలతో కూడిన మూడు కార్లు దేవాలయం సమీపంలో కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కార్లు కంటపడ్డాయి. అనంతరం కారులను పరిశీలించగా బాంబులు తదితర పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇవ్వగా, వారు వీటిని నిర్వీర్యం చేశారు.

16:59 - April 11, 2016

హైదరాబాద్ : ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనిసింగణాపూర్‌ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించే మహిళలు అత్యచారాలను కొనితెచ్చుకున్నట్టేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు శని దేవాలయం గర్భగుడిలోకి వెళ్లడం సరైనది కాదని అది వారికి దురదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అన్నారు. శనిని కొలవడం వల్ల మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయన్నారు. శనిదేవుడిని పూజించేందుకు మహిళలకు మహారాష్ట్ర సర్కార్‌ అనుమతించింది. స్వరూపానంద వ్యాఖ్యలపై తృప్తి దేశాయ్‌ తీవ్రంగా మండిపడ్డారు.

రాజ్యంగం, చట్టం కంటే సంప్రదాయం గొప్పదా? : సుప్రీంకోర్టు

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 10-15 ఏళ్ళ మహిళలను అనుమతించకపోవటం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.రాజ్యంగం, చట్టం కంటే సంప్రదాయం గొప్పదా? అని సుప్రీంకోర్టు దేవాలయం ట్రస్ట్ కమిటీని న్యాయస్థానం ప్రశ్నించింది. దేవుడు సర్వాంతర్యామి అని, అలాంటి దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని స్పష్టం చేసింది. రాజ్యాంగ హక్కు కానంతవరకు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

16:54 - April 11, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి సుజనా చౌదరిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సుజనా కంపెనీలో రూ.7,602 కోట్ల అవకతవకలు జరిగాయని అడ్వకేట్ వినోద్ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం పర్యవేక్షణలో సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోర్టును పిటిషనర్ కోరారు. అయితే పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్బీఐ లేదా ఎస్‌ఎఫ్‌ఐవో సంస్థలకు ఫిర్యాదు చేయాలని కోర్టు ఫిర్యాదుదారుడ్ని ఆదేశించింది. 

16:53 - April 11, 2016

విశాఖ : నక్కపల్లి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. నక్కపల్లిలో ఆదివారం రోడ్డుప్రమాదం జరిగిన తీరు బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 18 లక్షల చెక్‌ను సీఎం అందజేసారు. ఆదివారం తునిలోని తలుపులమ్మలోవ ఆలయాన్ని దర్శించుకునేందుకు కారులో బయలుదేరిన శ్రీను కుటుంబం సభ్యులు నక్కపల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 9మందితో పాటు బైక్‌పై వెళ్తున్న తండ్రీ,కొడుకులు మృతి చెందారు. 

16:51 - April 11, 2016

కడప : జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పెద్ద దండ్లూరు సందర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆదినారాయణరెడ్డి ఇటీవలే వైసీపీ నుంచి టిడిపి లో చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఆదినారాయణరెడ్డిని సమస్యలపై ప్రజలు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఆయన అనుచరులు... ఎమ్మెల్యే ని ప్రశ్నించిన వారిపై దాడి చేసి, ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ దాడిని జమ్మలమడుగు టిడిపి ఇన్‌చార్జ్‌ పొన్నాల రామసుబ్బారెడ్డి ఖండించారు. గ్రామాన్ని సందర్శించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద దండ్లూరులో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

16:49 - April 11, 2016

మహబూబ్‌ నగర్‌ : వంగూర్‌ మండలం కోనేటి పూర్‌లో ప్రధాన రహదారిపై ఆగివున్నలారీని డీసీఎం ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఇల్లు ఖాళీ చేసి డీసీఎంలో సామాను తరలిస్తుండగా, డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని ఢీ కొట్టినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

16:47 - April 11, 2016

మహబూబ్‌ నగర్ : మెట్టుగడ్డ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హార్ట్ వేర్ షాప్‌ లో.. జరిగిన ఈ ప్రమాదంలో... షాపులో సామానుతో పాటు.. రోడ్డుపై పార్క్‌ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సుమారు గంట పాటు శ్రమించి.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో మహబూబ్‌ నగర్ నుంచి జడ్చర్ల వెళ్తున్న మంత్రి లక్ష్మారెడ్డి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 

చెన్నైలో ఘనంగా ఉగాది వేడుకలు...

చెన్నై : దుర్ముఖి నామ ఉగాది వేడుకలు చెన్నై లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు గాయని పి.సుశీల, సీనియర్ నటి కాంచన, ఘంటశాల రత్నకుమార్ పాల్గొన్నారు.  తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు నాలుగు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో గాయని సుశీలను పలువురు సత్కరించారు.

16:43 - April 11, 2016

విశాఖ : నర్సీపట్నంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. శివపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో రెండు పూరిళ్లు, ఓ బైకు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని వస్తుసామాగ్రి కాలిబూడిదయ్యింది. తులం బంగారు ఆభరణాలు కూడా కాలిపోయాయి. కట్టుబట్టలు మినహా ఏమీ మిగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలాని చేరుకుని మంటలను అదుపు చేశారు.

16:42 - April 11, 2016

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ ఈ అంశంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. చట్టం కన్నా సాంప్రదాయమే గొప్పదా అని ప్రశ్నించింది. ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు..? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిటని వ్యాఖ్యానించింది. పైగా దేశంలో తల్లికే మొట్టమొదటి గౌరవం అందిస్తామని, అలాంటప్పుడు స్త్రీలకు ఆలయ ప్రవేశం లేదని ఎలా అంటారని జస్టిస్‌ దీపక్‌మిశ్రా ప్రశ్నించారు.

ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి, ప్రభుత్వానికి, రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టేసే సంప్రదాయం ఏదైనా ఉంటుందా అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు.. మహిళలకు అనుమతి నిరాకరించడంపై.. గతంలోనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రుతు క్రమానికి లోనయ్యే 10 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను బోర్డు అమలు చేస్తోంది.

మహారాష్ట్ర శింగనాపూర్‌లోని శని ఆలయంలోకి కూడా మొన్నటి వరకూ మహిళలను అనుమతించేవారు కాదు. ఎన్నో ఉద్యమాల అనంతరం.. ఉగాది రోజున ఆలయ కమిటీ మహిళలను గుళ్లోకి అనుమింతించింది. ఈనేపథ్యంలోనే శబరిమల విషయంలోనూ సుప్రీంకోర్టు.. ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థించవచ్చని, రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను సంప్రదాయాల పేరుతో అధిగమించరాదన్న భావనను సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ తమకు ప్రవేశం లభిస్తుందన్న విశ్వాసాన్ని.. ఈ అంశంపై పోరాడుతున్న మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 

16:36 - April 11, 2016

చెన్నై : దుర్ముఖి నామ సంవత్స ఉగాది వేడుకులు చెన్నైలో ఘనంగా జరిగాయి. పడళవనిలోని విజయగార్డెన్‌లో నాలుగు రోజుల పాటు ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. చెన్నై తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమాలను పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ గాయని సుశీల, అలనాటి నటి కాంచన, విజయ సంస్థల అధినేత విశ్వనాథరెడ్డి, ఘంటసాల రత్నకుమార్‌ను నిర్వాహాకులు సన్మానించారు. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాందించిన గాయని సుశీలను పలువురు అభినందించారు. 

షిర్టీబాబాని పూజింటవల్లనే మహారాష్ట్రలో కరవు: స్వరూపానంద

హైదరాబాద్ : ద్వారకా శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్టీ సాయిబాబాని పూజింటవల్లనే మహారాష్ట్రలో కరవు రావటానికి కారణమని వ్యాఖ్యానించారు. శనిసింగణాపూర్ లో వున్న శనిదేవుని ఆలంలోకి మహిళలు ప్రవేశించడాన్ని ఆయన తప్పుపట్టారు. శనిదేవుని ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం అంటే వారు అత్యాచారాలను కోరి తెచ్చుకోవటమే అవుతుందని వ్యాఖ్యానించారు. శని దేవుడిని మహిళలు పూజించడం వల్ల వారిపై మరింత హింస పెరుగుతుందన్నారు.

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు : ఆర్టీసీ ఎండీ

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు. పుష్కరాల నేపథ్యంలో విజయవాడ శివార్లలో అదనంగా మరో బస్టాండ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు.

ఈదలాడ శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు...

విశాఖపట్నం : నక్కపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈదలాడ శ్రీను కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోవటం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిబంధనలకు అతిక్రమిస్తున్న సూల్స్ పై కఠిన చర్యలు : మంత్రి కడియం

హైదరాబాద్ : విద్యా ప్రమాణాలపై  మంత్రి కడియం  శ్రీహరి సమీక్షించారు.  నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రయివేటు పాఠశాలల్లో అడ్మిషన్లు, పుస్తకాల ముద్రణపై రెండు రోజుల్లో నివేదికను అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా పుస్తకాలు ముద్రించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు : తమ్మినేని

మహబూబ్ నగర్ : సీపీఎం మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కరవు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉపాధి లేక ప్రజలు వలస బాట పడుతుంటే కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారని విమర్శించారు. కరవుతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు.

15:14 - April 11, 2016

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ కోర్టులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉప్పర్‌పల్లికి సౌజన్య తన భర్త నాగేదర్‌పై కుటుంబ కలహాలతో 498 గృహహింస కేసు పెట్టింది. వాయిదా కోసం వచ్చిన భార్య,భర్తలు కోర్టు ఆవరణలో గొడవ పడ్డారు. గొడవలో ఆగ్రహంతో ఊగిపోయిన నాగేందర్ తన భార్య సౌజన్య గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌజన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగేందర్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

15:12 - April 11, 2016

విశాఖ :పూలే ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేయడం లేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పూలే జయంతి రోజున గొప్పగా ప్రసంగాలు చేయడం ద్వారా బీసీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసి.. నిధులు ఖర్చు చేయడం ద్వారానే వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు ధర్మాన. 

600ల మంది రైతులకు హైకోర్టులో ఊరట....

మహబూబ్ నగర్ : గట్టు మండలానికి చెందిన 600ల మంది రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను రెవెన్యూ అధికారులు రైతుల నుండి ఉచితంగా తీసుకున్న కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. భూసమీకరణ చేసిన తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని, ఈ కేసుకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.

15:09 - April 11, 2016

విశాఖ: ఉక్కు సిటీ విశాఖను హెల్త్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. షీలానగర్‌లో 300 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన చేశారు.. హనుమంతవాకలో విమ్స్ ఓపీ, అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, మంత్రులు పాల్గొన్నారు.. 

15:07 - April 11, 2016

హైదరాబాద్‌ :బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేసినవాళ్లే దళితులకు ఉరితాళ్లు వేస్తున్నారని.. కాంగ్రెస్‌ నేత మధు యాష్కి విమర్శించారు..తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.. జగ్జీవన్‌ రాంకు నివాళులు అర్పించే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు..

15:04 - April 11, 2016

వరంగల్ : మహత్మ జ్యోతిబా పూలే ఆశయాలను టిడిపి అనుసరించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వరంగల్ లో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు.

 

15:02 - April 11, 2016

వరంగల్ : నగరంలో కాంగ్రెస్ భవన్ లో మహాత్మాజ్యోతిబా ఫూలే 190 వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫూలే ఆశయాలను కోనసాగిస్తామని ప్రతిన బూనారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మహాత్మాజ్యోతిబా ఫూలే బడగుల బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. 

14:58 - April 11, 2016

విజయవాడ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. స్పీకర్‌ కోడెల నుంచి స్పందన లేకపోవడంతో.... జగన్‌పార్టీ ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు కోసం హైకోర్టును ఆశ్రయించాలని జగన్‌ నిర్ణయించారు.

వలసలకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ నేతల యత్నం.....

వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా సునీల్‌, సుబ్బారావుల చేరికతో.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారి సంఖ్య పదికి చేరింది. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కలవరపడుతున్న వైసీపీ నేతలు... వలసలను కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

అనర్హత వేటు వేయాలని కోరుతూ..

గతంలో పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. వైసీపీ నేతలు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు నోటీసు ఇచ్చారు. ఆయన స్పందించలేదన్న కారణంతో.. ప్రభుత్వంపైనా, స్పీకర్‌పైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విప్‌ జారీ ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం భావించింది. అయితే.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు పడకుండా.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో జగన్‌ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇద్దరు వైసీపీ శాసనసభ్యులు సునీల్‌కుమార్‌, వరుపుల సుబ్బారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ నాయకత్వం పావులు కదుపుతోంది.

న్యాయపోరాటమే సరైనదన్న భావనకువైసీపీ....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధినాయకత్వం.. దీనికోసం న్యాయపోరాటమే సరైనదన్న భావనకు వచ్చింది. దీనికోసం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి, మళ్లీ ప్రజా తీర్పు కోరాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఫిరాయింపులతో రాజకీయ నాయకులను ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టుల ద్వారానే కట్టడి చేయగలమని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరి వీరి అభ్యర్థనపై న్యాయస్థానాలు ఎలాంటి తీర్పునిస్తాయో వేచి చూడాలి. 

14:54 - April 11, 2016

కృష్ణా : విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు.. అభివృద్ధి పేరుతో భూములు లాక్కోవద్దంటూ ఉండవల్లి, పెనుమాక రైతులు నినాదాలు చేశారు.. ఇప్పటివరకూ సేకరించిన 33వేల ఎకరాల్లోనే పూర్తిస్థాయి రాజధాని నిర్మించుకోవాలని... ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోకి రావొద్దని హెచ్చరించారు.. ఈ అంశాలపై సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు.. తమ స్థలాల్లో చేపడుతున్న సర్వేలను ఆపేయాలని కోరారు.. రైతుల సమస్యలపై స్పందించిన కమిషనర్‌ ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.. 

14:53 - April 11, 2016

హైదరాబాద్ : పశ్చిమ్‌బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సిపిఎం కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రకోణ జిల్లాలో ఉదయం సిపిఎం పోలింగ్‌ ఏజెంట్‌ను టిఎంసి కార్యకర్తలు చితకబాదడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. మరోవైపు అసోంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అసోంలోని 61 శాసనసభ స్థానాలు, పశ్చిమ్‌బెంగాల్‌లో 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్‌ జరుగుతోంది. 

14:50 - April 11, 2016

హైదరాబాద్ : మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ అనేక వస్తువులకు కొత్త రూపమిస్తుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తారు. అలా బ్లేడ్ ను ఉపయోగించి అందమైన పెయింటింగ్ ను ఆవిష్కరిస్తోంది ఒక అతివ. అదెలాగో ఇవాళ్టి సొగసులో చూసి నేర్చుకుందాం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి

కొల్లం బాధితులను పరామర్శించిన సీపీఎం నేత సీతారాం ఏచూరి...

హైదరాబాద్ : కొల్లం బాధితులను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరామర్శించారు. కాగా కేరళ లోని కొల్లంలోని పుట్టింగల్ దేవీ ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

14:36 - April 11, 2016

హైదరాబాద్ : చిన్న నాటి కలలను సాకారం చేసుకుంది. మహిళలు అరుదుగా రాణించే రంగాన్ని ఎంపిక చేసుకుంది. నలుగురితో పాటు శిక్షణ తీసుకుంది. కానీ నలుగురికి భిన్నంగా అడుగులేసింది. ఆ అడుగులే ఆమెను ఈ రోజు ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. రాష్ట్ర రాజధాని శివార్లలో సువిశాల ప్రాంగణం ఆమె ప్రత్యేకతకు వేదిక. వేల మందికి శిక్షణనిస్తూ గగన తలంలో తనదైన ముద్రవేస్తోంది. విహంగయానంను కెరీర్ గా మలుచుకునే యువతకు శిక్షణనిస్తోంది. అలా వారి కలల సాకారానికి కృషి చేస్తోన్న వనితే కెప్టెన్ మమత. ఆమే ఫ్లైటెక్ ఏవియేషన్ ఎకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. ఇండియాలో ఫ్లైయింగ్ అకాడమీ రన్ చేస్తున్న ఒకే ఒక్క మహిళగా ప్రత్యేకత సాధించిన కెప్టెన్ మమతను మానవి అభినందిస్తోంది. భవిష్యత్ లో ఎయిర్ యూనివర్సిటీ స్థాపించాలనే ఆమె ఆశయం సాకారమవాలని మానవి కోరుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త...

హైదరాబాద్: రాజేంద్రనగర్ కోర్టులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉప్పర్‌పల్లికి సౌజన్య తన భర్త నాగేదర్‌పై కుటుంబ కలహాలతో 498 గృహహింస కేసు పెట్టింది. వాయిదా కోసం వచ్చిన భార్య,భర్తలు కోర్టు ఆవరణలో గొడవ పడ్డారు. గొడవలో ఆగ్రహంతో ఊగిపోయిన నాగేందర్ తన భార్య సౌజన్య గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌజన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగేందర్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

ఉండవల్లి, పెనుమాక రైతుల ఆందోళన....

విజయవాడ : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఉండవల్లి, పెనుమాక రైతులు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి పేరుతో మా భూములను లాక్కోవద్దంటూ సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

సింహ్రాది అప్పన్న సేవలో సినీ ప్రముఖులు....

విశాఖపట్నం : టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్‌ ఈరోజు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా విడుదలకు ముందు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవటం ఆనవాయితీ వస్తున్నట్లు బోయపాటి చెప్పారు. కాగా నిన్న విశాఖపట్నంలో అల్లు అర్జున్ హీరోగా త్వరలో రానున్న సినిమా 'సరైనోడు' చిత్రం ఆడియో వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు వారు తెలిపారు.

13:31 - April 11, 2016

హైదరాబాద్ : తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని..ఉన్నత స్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు..అధిక ఖర్చు అయినా ప్రైవేటు స్కూళ్లలో చేరిపిస్తుంటారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంతో వీరు ఫీజులను భారీగా పెంచేస్తున్నారు. నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్ యాజమాన్యం ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 40 శాతం పెంచడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. ఫీజుల పెంపుపై ప్రశ్నిస్తే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని, ఆసుపత్రి బిల్లులైతే కడుతారు కాని స్కూల్ ఫీజులు కట్టలేరా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుక రావాలని కోరుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

పసికందును ఆసుపత్రిలో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు...

కృష్ణా : జిల్లాలోని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చేటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఓమహిళ ప్రసవం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆ మహిళకు ఆడపిల్ల పుట్టింది. కాగా అప్పుడే పుట్టిన ఆ పసికందుకు తల్లిదండ్రులు ఆసుపత్రిలోనే వదిలి వెళ్ళారు. అనంతరం సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు పసికందుని అప్పగించారు.

13:19 - April 11, 2016

హైదరాబాద్ : డివిజన్ ను ఇళ్లుగా భావించాలని కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతి రిసార్ట్స్ లో కార్పొరేటర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని కార్పొరేటర్లకు దశ..దిశ నిర్ధేశం చేశారు. నగరానికి లక్ష ఇళ్లు మంజూరు చేసుకోవడం జరిగిందని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 4800 ఇళ్లు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ఒక్కరికి కూడా లంచం ఇవ్వవద్దని చెప్పడం జరిగిందన్నారు. మంచి కార్యక్రమాలు వస్తున్నాయంటై పైరవీ కారుడు పుడుతున్నాడని, ఎమ్మెల్యే పరిధి పెద్దదని కార్పొరేటర్ చూడాలని సూచించారు. మురికివాడలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలని, ఐడీహెచ్ కాలనీ తరహాలో ఇళ్లు కట్టిస్తామని ఆ పేదలకు చెప్పాలని సూచించారు. జాగాలు లేకుండా కిరాయికి ఉండే వారికి ఇళ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. డివిజన్ లో ఏ రకమైన ప్రజలున్నారో చూడాలని, సమావేశంలో ఒక నిర్ధారణ చేసుకుని బయటకు వెళ్లాలన్నారు. ఏం జరిగినా అందరూ కార్పొరేటర్లకు తెలిసే జరగాలని కేసీఆర్ సూచించారు. 

కంది జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య...

మెదక్ : సంగారెడ్డి మండలం కంది జైలులో విషాదం నెలకొంది. జైలు ఆవరణలో వున్న చెట్టుకు ఉరేసుకుని మొగులయ్య అనే జీవిత ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చౌతుట్లలో అగ్నిప్రమాదం...

నల్లగొండ : చందపేట మండలం చౌతుట్ల తండాలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా మరో ఐదు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

4గురు అంతర్రాష్ట్ర రెడ్ సాండల్స్ స్మగ్లర్ అరెస్ట్....

కడప : గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్క్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు. సుమారు రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను, ఒక లారీ, రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అనంతరం కేసు నమోదు చేశారు.

కోనేటిపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం 2 చిన్నారులు మృతి...

మహబూబ్‌నగర్‌ : జిల్లా కోనేటిపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆగి ఉన్న టిప్పర్‌ లారీని డిండి నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చికిత్స నిమిత్తం గాయపడినవారిని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను కూడా కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. 

12:40 - April 11, 2016

హైదరాబాద్ : కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించవద్దని ఓ ఎమ్మెల్యే తనతో అన్నాడని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సోమవారం ప్రగతి రిసార్ట్స్ లో కార్పొరేటర్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకంటే ముందు ఒక ప్రాంతానికి పోవడం జరిగిందని, కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడే నిర్వహించవద్దని తనతో పాటు కూర్చొన్న ఎమ్మెల్యే పేర్కొన్నాడని తెలిపారు. అంతా గజిబిజిగా ఉంటుందని..కన్ ఫ్యూజ్ క్రియేట్ అవుతుందని చెప్పాడని తెలిపారు. వెంటనే తాను ఒక సర్వే చేయించడం జరిగిందని, కార్పొరేషన్ ఎన్నికలు తొందరగా కాకపోతే మంచిదని ప్రజలు ఆ సర్వేలో పేర్కొన్నారని పేర్కొన్నారు. విముఖత ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని, ఇదే విషయాన్ని అధికారులను అడగడం జరిగిందన్నారు. గతంలో చాలా దుర్మార్గాలు జరిగాయని, అందుకే వద్దనుకుంటున్నారని అధికారులు తెలపడం జరిగిందన్నారు. 

12:35 - April 11, 2016

హైదరాబాద్ : నగరంలో కొత్తగా ఎన్నిక టీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ క్లాసు చెప్పారు. మంచి ప్రజాప్రతినిధులుగా ఎలా మెలగాలో..ప్రజలకు అందుబాటులో ఉండాలని..అవినీతికి దూరంగా ఉండాలని దశ..దిశా నిర్ధేశం చేశారు. ప్రగతి రిసార్ట్స్ లో ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. ఒక పదవి..అధికారం ఉన్నప్పుడు మంచి చేయకపోతే ఒక నేరం కిందకు వస్తుందన్నారు. ఎంతో మంది కృషి కారణంగానే మనుషులుగా బతుకుతున్నామని, రేపటి తరానికి మనం ఏం ఇవ్వాలనే దానిపై ఆలోచించాలని సూచించారు. నగర మేయర్ కు క్వార్టర్ దిక్కు లేదని ఈ విషయాన్ని గతంలో ఉన్నవారు ఎందుకు ఆలోచించలేదో తెలియదన్నారు. డివిజన్ ను ఒక ఇళ్లుగా కార్పొరేటర్ భావించాలని పద్మనాభం చెప్పిన సూచన బాగుందన్నారు. కార్పొరేషన్ కు ఎన్నికల నిర్వహించకూడదని ఓ ఎమ్మెల్యే గతంలో తనతో చెప్పారని, దీనిపై సర్వే చేయిస్తే అదే విషయం బయటపడిందన్నారు. గతంలో చాలా దుర్మార్గాలు జరిగాయని, ప్రజలు విముఖంగా ఉన్నారని అధికారులు పేర్కొనడం జరిగిందని తెలిపారు. నగరంలో ఒక పెద్ద వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు..సీఎం..రాజ్ భవన్..రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలంటే రూ.11 వేల కోట్లు ఖర్చు అధికారులు చెప్పడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. 

12:32 - April 11, 2016

మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా... ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరవు ప్రాంతమని చటుక్కున గుర్తుకొస్తుంది. ఆడపిల్లల పుట్టుకను కూడా కరవు కోరలు శాసిస్తున్న సంఘటనలు జిల్లాలో నెలకొన్నాయి. దీనికి పేదరికం ఒక కారణమయితే ఆడపిల్లలపై వున్న వివక్ష కూడా మరొక కారణం అనుకోవచ్చు. ఆడపిండాల హత్యలతో ఆడజాతి పుట్టుకే ప్రశ్నార్ధకమవుతుంటే..మరోపక్క పుట్టిన బిడ్డలను విక్రయాల రూపంలో వదిలించుకోవటానికి సాక్షాత్తు కన్నవారే ప్రయత్నిస్తున్న దారుణ ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మహబూబ్‌నగర్‌ డీఈవో కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన మల్లయ్య మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని మొదటి భార్య వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలున్నారు. రెండో భార్య కూడా వెళ్లిపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. నాలుగు నెలల పాపను చూసుకోవడం మరింత కష్టమైంది. విక్రయిస్తే చిన్నారి అక్కడైనా బాగుంటుందని అనుకుని విక్రయానికి పెట్టాడు. స్థానికుల సమాచారంతో అధికారులు పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. 

టీఆర్ఎస్ కార్పొరేట్లకు శిక్షణా తరగతులు ప్రారంభం...

హైదరాబాద్‌ : ప్రగతి రిసార్ట్స్ లో టీఆర్ఎస్ కార్పొరేట్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కార్పొరేటర్లను ఉద్దేశించి హైదరాబాద్ - స్వచ్ఛ తెలంగాణ వంటి పలు అంశాలపై మంత్రి సూచనలు చేయనున్నారు.

గెలుపొందిన కౌన్సిలర్లకు అభినందనలు: మంత్రి హరీష్ రావు

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్ధులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 16న సీఎం ఆదేశానుసారం చైర్మన్,వైస్ చైర్మన్ లను ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన నగర ప్రజలను మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో టీఆర్ఎస్ మరింత బాధ్యత పెరిగిందన్నారు. సిద్ధిపేటను మరింతగా ఆదర్శవంతగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఘనంగా జ్యోతిరావు పూలే 190వ జయంతి వేడుకలు...

విశాఖపట్నం : మహా జ్యోతిరావు పూలే 190వ జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

బురుండిలో బస్సు బోల్తా..18 మంది మృతి

ఆఫ్రికా : చీకటి ఖండమని పిలిచే ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 55 మందికి తీవ్రగాయాలయ్యాయి. బురుండి దేశ రాజధాని బుజుంబురా రూరల్‌ ప్రావిన్స్‌కి బస్సు వెళుతోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో సగానికి సగం మంది బుజుంబురాకి చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు.

చిన్నారిని విక్రయించటానికి యత్నంచిన తండ్రి...

మహబూబ్ నగర్ : చిన్నారిని విక్రయించటానికి యత్నించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ క్రమంలో ఓ ఆడపిల్లను విక్రయించటానికి మల్లేష్  యత్నించాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఐసీడీఎస్అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని తండ్రిపై కేసు నమోదు చేశారు. అనంతరం చిన్నారిని స్వాధీనం చేసుకుని శిశు విహార్ కు తరలించారు. 

11:09 - April 11, 2016

హైదరాబాద్ : తాను హీరో అనిపించుకోవాలని అనుకున్నాడో ఓ యువకుడు...రియాల్టీ షోలో ఎలా చేస్తారో అలాగే తన స్నేహితుల ఎదుట చేసి భేష్ అనిపించుకోవాలని అనుకున్నాడు..కానీ చివరకు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. గతంలో కిక్ బాక్సింగ్ కారణంతో ఒకరి ప్రాణం పోయిన సంగతి తెలిసిందే. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించుకోవాలని..దీని నుండి సురక్షితంగా బయట పడాలని 17 ఏళ్ల జలీలుద్దీన్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఈ నెల ఏడో తేదీన స్నేహితుల ఎదుట ఈ సాహస చర్యకు ఉపక్రమించాడు. అనుకోని విధంగా శరీరాన్ని మంటలు చుట్టుముట్టేశాయి. 80 శాతం శరీరం కాలిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. జలీలుద్దీన్ మృతి చెందడంతో వారి నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

కొల్లంలో 109కి పెరిగిన మృతుల సంఖ్య....

హైదరాబాద్ : కేరళలోని కొల్లంలో జరిగన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 107కు పెరిగింది. ఈ ఘటనలో పోలీసులు బాణసంచా కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంగణంలో బాణసంచా పోటీలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలిపారు. కాగా ఆ ఘటనలో 5గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ప్రాణం తీసిన ఫైర్ స్టంట్....

హైదరాబాద్ : పాతబస్తీలో రియాల్టీ షో ను అనుకరిస్తూ ఓ యువకుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. రియాల్టీ షోలలో చేసే ఫైర్ స్టంట్ అనుకరించే ప్రయత్నంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని యువకుడు మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా రియాల్టీ షోల ప్రయత్నాలు చేయకూడదన్న నిబంధనలు వున్నా అప్పుడప్పుడూ ఇటువంటి సన్నివేశాలు పరిపాటిగా మారుతున్నాయి.

10:47 - April 11, 2016

ముంబై : భారత్‌లో బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియమ్స్‌ దంపతుల పర్యటన మొదలైంది. ముంబైలోని ఓవల్‌ మైదానంలో సచిన్‌ టెండూల్కర్‌ను విలియమ్స్ దంపతులు కలిశారు. రాత్రి పలువురు బాలీవుడ్‌ నటులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నారు. నేడు ఢిల్లీలో గాంధీజీ సమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. అదేవిధంగా తాజ్‌మహల్‌ను కూడా వీరు సందర్శించనున్నారు. 

10:45 - April 11, 2016

వెనిజుల : లాటిన్‌ అమెరికా దేశాల్లోని వెనిజులా కొంతకాలంగా తీవ్ర విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందుకోసం విద్యుత్‌ ను పొదుపుగా వినియోగించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అయితే పనిలో పనిగా విద్యుత్‌ను ఆదా చేయాలంటూ మహిళలకు సూచిస్తూ జుట్టు తడి ఆరబెట్టుకొనే హెయిర్‌ డ్రైయర్‌ల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ చురకలంటించారు. విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో మహిళలకు పొదుపు పాఠాలు చెబుతున్నారు. కరెంటు సమస్యల నేపథ్యంలో మహిళలు హెయిర్ డ్రైయర్స్ వాడటం మానేయాలని సూచించారు. విద్యుత్ ఉపయోగించి చేసే ప్రతిపనికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. ఇలా కనీసం ఓ రెండు నెలలపాటు పాటించాలని జారీ చేశారు. దాంతో పాటు ఎయిర్ కండిషనర్స్ వంటివి ఉపయోగించడం కూడా తగ్గించాలని చెప్పారు.

ఏం చెప్పారంటే..
మహిళలకు సంబంధించి ఆయనేం చెప్పారంటే 'మహిళలు జుట్టును ఆరబెట్టుకునే హెయిర్ డ్రైయర్స్ ఉపయోగించడం కంటే వారి జుట్టులోకి చేతి వేళ్లను పోనిచ్చి సరి చేసుకోవడం ద్వారా సహజంగా ఆరిపోతుందని చాలా కాలంగా నాకున్న ఆలోచన. ఇదొక్కడే నా దగ్గర ఉన్న ఉపాయం కూడా' అని అన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనూహ్యంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెనిజులా వాసులు అనుసరిస్తున్న విధానాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే మంచిదని కూడా ఆయన చెప్పారు.

చౌకబాలు సలహాలు...
ఇదిలా ఉంటే వెనిజ్యులాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కొనేందుకు శని ఆదివారాలతో పాటు శుక్రవారం కూడా పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లలో సెలవులను ప్రకటించింది. ఎల్‌ నినో వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు లేక హైడ్రో ఎలక్ట్రిసిటీ దెబ్బతిన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రపతి సలహాపై ప్రతిపక్షాలు, మండిపడ్డాయి. విద్యుత్ సమస్యను తీర్చాల్సింది పోయి... ఇలాంటి చౌకబారు సలహాలు ఇవ్వడం మానుకోవాలని సూచిస్తున్నాయి. 

10:42 - April 11, 2016

కరీంనగర్ : వేదంలా ప్రవహించే గల గల గోదావరి ప్రస్తుతం వ్యర్థాలతో ఘోషిస్తోంది. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, పట్టణాలనుండి వస్తున్న మురికి నీరుతో గోదావరి కలుషితమవుతోంది. ఆరంభం ఎంత పవిత్రమైనదో ముగింపు అంత కలుషితమై ప్రవహిస్తోంది. మురుగు నీరుతో గోషిస్తున్న గోదావరిపై ప్రత్యేక కథనం. ఎంతో పవిత్రమైన గోదావరి మురికి కూపంలా మారిపోతోంది. గల గల గోదారి బిక్కు బిక్కుమంటోంది. ఎంతో పవిత్రత గల ఈ నది మురికి కూపంలా తయారవుతోంది. కరీంనగర్ జిల్లాలోని రామగుండం నుండి ధవళేశ్వరం వరకు గోదావరి వ్యర్థాలతో ప్రవహిస్తోంది. గోదావరి కలుషితం అంశాన్ని పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ కాగ్ తమ నివేదికలో మొట్టికాయలు వేసింది. అయినా చలనం లేదు సీన్ లో మార్పు లేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపిసి,ఏపీ జెన్‌కో,సింగరేణి పవర్ హౌజ్ ల పరిశ్రమల నుండి విడుదలైన వ్యర్థాలతో పాటు ఈ పట్టణాలనుండి వచ్చే మురుగు నీరు నేరుగా గోదావరిలో కలుస్తోంది.

గోదావరి నదిలోకి మురుగునీరు..
2 లక్షల పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఉన్నప్పటికి సీవరేజ్ ట్రీటెమెంట్‌ పాయింట్లు లేకపోవడంతో నేరుగా మురుగు నీరు గోదావరి నదిలో చేరుతోంది. ఇలా కలుషితం అయిన నీటినే పంపుల ద్వారా రామగుండం ప్రాంతానికి తాగు నీరు కోసం అందిస్తున్నారు. కేవలం క్లోరినేషన్ చేసి కలుషిత నీటిని పంపిణీ చేస్తున్నారు. పరిశ్రమలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యర్థ జలాలను నదిలోకి వదిలేసి ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నాయి. నది జాతీయ, నది పరిరక్షణ పథకం కింద కేంద్రనిధులతో రామగుండం కార్పోరేషన్ పరిధిలోని మల్కాపురం వద్ద 10కోట్ల రూపాయలు వెచ్చించి ట్రిట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు మాల్కాపురం వద్ద నిర్మించిన ట్రిట్ మెంట్ ప్లాంట్ వ్యర్థ జలాలను శుద్ధి చేసి నదిలోకి వదిలేసేవారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ప్లాంట్ మూతపడింది. దీంతో అంతు చిక్కని జ్వరాలు, కిడ్నిలు, కీళ్ల వ్యాదులతో నిత్యం ప్రజలు సతమతం అవుతున్నారు. జిల్లాలోనే అత్యధిక కిడ్ని వ్యాధిగ్రస్తులు ఈ ప్రాంతంలోనే ఉన్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రక్షాళణ చేయాలి..
గంగానది మాదిరిగానే గోదావరిని ప్రక్షాళన చేసి గోదావరి పవిత్రతను కాపాడతామని కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన కార్యరూపం దాల్చకపోగా కనీసం నిధులను కూడా విడుదల చేయలేదు. 70కోట్ల వ్యయంతో చేపట్టిన గోదావరి ఘాట్ల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసింది. ఇలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నిర్లక్ష్యం కారణంగా గోదావరి కలుషితం అవుతూనే ఉంది. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి పరిశ్రమల నుంచి వ్యర్థాలు గోదావరిలోకి రాకుండా చర్యలు తీసుకుని తమను కలుషిత నీరు నుంచి రక్షించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. 

ఈఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన కేంద్రమంతి దత్తాత్రేయ...

విశాఖపట్నం : షీలా నగర్ లో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

10:36 - April 11, 2016

వరంగల్ : ఓరుగల్లు నేతల ఫర్ ఫామెన్స్ పై జిల్లా అల్లుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటేనే వరంగల్ నేతలు వణికిపోతున్నారు. ముఖ్యమంత్రికి కనిపించాలంటే జంకుతున్నారు. మంచి జోష్ లో ఉండే నేతలకు క్లాస్ ల మీద క్లాస్ లు పడుతున్నాయి. వరంగల్ అంటేనే మామా, అల్లుళ్లు యమ సీరియస్ గా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది? పరుగు పెట్టించేదెవరు? పారిపోతున్నదెవరు.. వరంగల్ బై ఎలక్షన్ .. ఆ తర్వాత గ్రేటర్ ఎలక్షన్..ఎటు చూసినా గులాబీజెండా రెపరెపలాడింది. ఎక్కడ ఎన్నికలైనా.. టీఆర్ఎస్ ఎదురులేని పార్టీగా అవతరించింది. మరో రెండుమూడేళ్లవరకు ఇదే పరిస్థితి ఉంటుందనుకుంటే.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుకున్న సీట్ల కంటే తక్కువ రావడం.. వచ్చిన వాటి కోసం కూడా చాలా కష్టపడాల్సి రావడంతో.. ఎక్కడ లోపం జరిగిందన్న దానిపై సీఎం కేసీఆర్ నగరాన్ని స్కాన్ చేశారు. జరిగిన పరిణామాలన్నిటిపైనా సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నుపోటుదారులపై చర్యలకు సైతం సిద్ధమయినట్లు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 44 డివిజన్‌లు గెల్చుకున్న టీఆర్ఎస్ కు గెలిచిన ఉత్సాహం లేకుండాపోయింది.

ముఖం చాటేస్తున్న నేతలు..
మొత్తం 58 డివిజన్లలో 50 నుంచి 54 గెలుచుకుంటామని ఎన్నికల ముందు ధీమా వ్యక్తం చేసిన నేతలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.  మేయర్ అభ్యర్థిగా అనుకున్న వ్యక్తిని ఓడించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులే ప్రయత్నించడం.. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం వంటి విషయాలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా ప్రస్తుత మేయర్ నన్నపనేని నరేందర్ గెలిచిన 19 వ డివిజన్ లో మూడుకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యాయన్న సంగతి అధిష్టానానికి తెలిసింది. రెబల్ అభ్యర్థికి స్థానిక నేతలు సహకరించిన వైనాన్ని గమనించింది. చివరి నిమిషం వరకూ టెన్షన్ పరిస్థితి నెలకొనడానికి కారణాలను అధిష్టానం రాబట్టింది. నగరానికి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీని హైదరాబాద్ కు పిలిపించుకున్న కేసీఆర్ వారికి క్లాస్ ఇచ్చారు. వరంగల్ నగరంలో డిప్యూటీ సీఎం కడియం, కొండా దంపతులు, వినయ్ భాస్కర్ ల వర్గాలు ఉండగా.. తాజాగా నరేందర్ వర్గం కూడా తెరమీదకు రావడంతో గ్రూప్ వార్ సీరియస్ గా మారింది. ఎవరికివారే తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పార్టీ అధినేత వరకు రిపోర్ట్ ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.

10:32 - April 11, 2016

ఢిల్లీ : అసోం, పశ్చిమబెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 65 స్థానాలకు వారం రోజుల క్రితమే తొలి విడత పోలింగ్ పూర్తయింది. నేడు మిగిలిన 61 స్థానాల్లో ఎలక్షన్‌ జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్‌, బిజెపిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం జరిగే 61 స్థానాల్లో 30 నియోజకవర్గాల్లో ముస్లిముల ప్రాబల్యం ఉంది. ఆఖరి విడతలో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఇక పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా 31 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వాటిల్లో ఒకటి ఎస్టీ, 6 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. 31 స్థానాలకు గాను 163 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 69 లక్షలా 90 వేల 9 వందల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, ప్రధాన ప్రతిపక్షం సిపిఎం 19 స్థానాల్లో, కాంగ్రెస్ 8, సిపిఐ ఒక స్థానంలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. బిజెపి 31 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కాగా సిపిఎం కార్యదర్శి, ప్రతిపక్ష నేత సూర్యకాంత్ మిశ్రాతో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సినీయర్ కాంగ్రెస్ నేత మనస్ భునియా పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ఉన్నారు. 

సిద్ధిపేటలో గులాబీ జయకేతనం...

మెదక్ : సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. ఊహించిన విధంగానే మున్సిపల్ పీఠాన్ని అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలు సుదీర్ఘకాలంగా వాయిదా పడిన నేపథ్యంలో ఎట్టకేలకూ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీలో మొత్తం 34 వార్డులకు గాను 22 వార్డులలో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరొక రెండు స్థానాలకు పరిమితం కాగా ఎంఐఎం-1 స్థానంలో గెలుపొందగా మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. 

10:13 - April 11, 2016

మెదక్ : అందరూ ఊహించిందే జరిగింది. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడం విశేషం. బరిలో నిలుచున్న ఏడుగురు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల్లో ఆరుగురు విజయం సాధించారు. వీరూ టీఆర్ఎస్ లో తిరిగి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 22 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు స్థానాలు, 8 వార్డుల్లో స్వతంత్రులు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించారు. టి.టిడిపి ఖాతా కూడా తెరవలేదు.
జిల్లా సిద్ధిపేట మున్సిపాల్టీ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. మొత్తం 34 వార్డులకు 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 

బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకం - ఏఐయుడీఎఫ్..

అస్సాం : రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు రెండో విడత ఆఖరి పోలింగ్ కొనసాగుతోంది. హోజాయి ప్రాంతంలో ఏఐయుడిఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకమని, బీజేపీ తో జత కట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల విజేతలు వీరే...

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 17వ వార్డులో వెంకట్, 14వ వార్డులో దూది శ్రీకాంత్ రెడ్డి బీజేపీ తరపున గెలుపొందారు. కాగా 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాకి భాగ్యలక్ష్మి గెలుపు సాధించారు. స్వతంత్ర అభ్యర్ధులుగా 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధి సంధ్య,4వ వార్డులో దీప్తి, 5 వార్డులో స్వప్న,22వ వార్డులో ప్రవీణ్ , 25వ వార్డులో ప్రమీల స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపు సాధించారు. కాగా మొత్తం 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 6 వార్డులలో టీఆర్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

బెంగాల్ లో గన్ లతో తిరుగుతున్న వ్యక్తులు..

కోల్ కతా : బెంగాల్ లో 31 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక ప్రాంతంలో క్రూడ్ బాంబులు లభ్యం కాగా బంకురలో కొందరు వ్యక్తులు గన్ లతో సంచరిస్తున్నారు. 

సిద్ధిపేటలో స్వతంత్రుల విజయకేతనం..

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 34 వార్డులకు గాను ఆరు వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్ధులు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు హావా చూపెట్టారు. 1వ వార్డులో మల్లికార్జున రావు, 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్ధి లలిత, 7వ వార్డులో మల్యా ప్రసాద్, 8వ వార్డులో నర్సయ్య, 9వ వార్డులో ఉమారాణి, 10వ వార్డులో వేణుగోపాల్ రెడ్డి,11వ వార్డులో రవీందర్ , 12వ వార్డులో అక్తర్ పటేల్, 20వ వార్డులో జావిద్, 26వ వార్డులో టి.శ్రీనివాస్ లు టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపు సాధించారు.

సీపీఎం పోలింగ్ ఏజెంట్ పై దాడి..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో 31 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వెస్ట్ మిడ్నాపూర్ లోని చంద్రకోనలో సీపీఎం పోలింగ్ ఏజెంట్ పై తృణముల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ ఏజెంట్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సిద్ధిపేట మున్సిపల్ లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం..

మెదక్ : సిద్దిపేట మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ -9, బీజేపీ -2, కాంగ్రెస్ -1, స్వంతంత్ర అభ్యర్థులు 5 చోట్ల విజయం సాధించారు. 

కొనసాగుతున్న సిద్ధిపేట మున్సిపల్ కౌంటింగ్..

మెదక్ : సిద్దిపేట మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ -8, కాంగ్రెస్ -1, స్వంతంత్ర అభ్యర్థులు 3 విజయం సాధించారు. 

బెంగాల్ లో క్రూడ్ బాంబులు..

కోల్ కతా : 31 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బంకుర జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబులు జార విడిచారు. ఎవరికి ఎలాంటి అపాయం కలగలేదు. 

08:50 - April 11, 2016

మెదక్ : జిల్లా సిద్ధిపేట మున్సిపాల్టీ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. మొత్తం 34 వార్డులకు 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

వార్డుల వారిగా విజేతలు..

వార్డు  పార్టీ  అభ్యర్థి పేరు
1 టీఆర్ఎస్  మల్లిఖార్జున్
2 టీఆర్ఎస్ లలిత
స్వతంత్ర  సంధ్య
4 స్వతంత్ర దీప్తి
స్వతంత్ర స్వప్న
6 కాంగ్రెస్  కాకి బాగలక్ష్మి
టీఆర్ఎస్ ప్రశాంత్
టీఆర్ఎస్  నర్సయ్య
9 టీఆర్ఎస్ ఉమారాణి
10 టీఆర్ఎస్ వేణుగోపాల్ రెడ్డి
11 టీఆర్ఎస్ రవీందర్
12 టీఆర్ఎస్ అక్తర్ పటేల్
13 టీఆర్ఎస్ పల్లా వెంకట్ రెడ్డి
14 బీజేపీ దూది శ్రీకాంత్ రెడ్డి
15 టీఆర్ఎస్ భవానీ
16 టీఆర్ఎస్ రాజనర్సు
17 బీజేపీ వెంకట్
18 టీఆర్ఎస్ నల్లాల విజయలక్ష్మి
19 టీఆర్ఎస్ పూజల లత
20 టీఆర్ఎస్ జావిద్
21 టీఆర్ఎస్ నరేందర్
22 స్వతంత్ర ప్రవీణ్
23 టీఆర్ఎస్ తాళ్లపల్లి లక్ష్మి
24 టీఆర్ఎస్ బూర శ్రీనివాస్
25 స్వతంత్ర ప్రమీల
26 టీఆర్ఎస్ టి.శ్రీనివాస్
27 స్వతంత్ర విజయ
28 టీఆర్ఎస్ లక్ష్మి
29 టీఆర్ఎస్ ఉమారాణి
30 కాంగ్రెస్ వజీర్
31 టీఆర్ఎస్ కవిత
32 టీఆర్ఎస్ ప్రభాకర్
33 ఎంఐఎం అబ్దుల్ మోహిద్
34 స్వతంత్ర బి.విజయ

సిద్ధిపేట మున్సిపల్ కౌంటింగ్..టీఆర్ఎస్ 3 చోట్ల విజయం..

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ - 3, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. 1,2,8 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 

సిద్ధిపేట మున్సిపల్..ఫలితాలు..

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఒకటో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లిఖార్జున్, 8 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నర్సయ్య, 5 వార్డులో స్వతంత్ర అభ్యర్థి స్వప్న గెలుపొందారు.

 

పుట్టింగల్ ప్రమాదం..అదుపులో ఐదుగురు వ్యక్తులు..

కేరళ : పుట్టింగల్ ఆలయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కేరళ డీజీపీ ఏఎన్ఐ అనే వార్త సంస్థకు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో 110 మంది మృతి చెందగా 400 మందికి గాయాలయ్యాయి. 

08:06 - April 11, 2016

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 34 వార్డులకు 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందురూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.
రెండున్నర గంటల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 28 వార్డుల ఓట్ల లెక్కింపును మూడు రౌండ్లలో చేపడతారు. కౌంటింగ్‌ కోసం 10 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొత్తం 72 ఈవీఎంలను వార్డుల వారీగా విభజించి ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

సిద్ధిపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం...

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 34 వార్డులకు 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 

తృణముల్ నేతలు దాడి చేశారు - సీపీఎం..

కోల్ కతా : 31 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. బర్ధమాన్ జిల్లాలో తృణముల్ నేతలు లాఠీలతో దాడికి పాల్పడ్డారని సీపీఎం నేత ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. దాడుల్లో నలుగురికి గాయాలైనట్లు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:56 - April 11, 2016

2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టిడిపి, బిజెపికి మద్దతివ్వకుండా ఒంటరిగానే పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీ.జేఏసీ తెలంగాణ జేఏసీ ఇకపై పరిపూర్ణంగా ఉద్యమ సంస్థగానే కొనసాగబోతోంది. ప్రజల సమగ్రాభివృద్ధి కోసం.. మలిపోరుకు సన్నద్ధమైంది. రాష్ట్ర సాధన కోసం చేసినంతటి పోరాటాన్నే ప్రజల కోసం చేయాలని నిర్ణయించింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

సీపీఎం నేతలపై తృణముల్ నేతల దాడి ?

కోల్ కతా : 31 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. బర్ధమాన్ జిల్లాలోని ఐదుగురు సీపీఎం నేతలు, బూత్ ఏజెంట్ ను తృణముల్ నేతలు చితకబాదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

07:37 - April 11, 2016

సమ్మర్‌ వచ్చిందంటే అందరికీ హడలే. ఎండాకాలం అంటే బయట మాత్రమే కాదు. ఇంట్లో కూడా చాలా హాట్‌గా ఉంటుంది. చెమట, ఉక్కపోత కారణంగా.. ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా.. వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. తీవ్రస్థాయిలో ఉండే ఎండలకు వడదెబ్బ తగలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం..

ఆనియన్‌ జ్యూస్‌: వడదెబ్బ నివారించడానికి ఆనియన్‌ జ్యూస్‌ చక్కటి హోం రెమిడీ. ఆనియన్‌ జ్యూస్‌ని చెవుల వెనుక భాగం, ఛాతీ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి కడుపులోకి తీసుకోవచ్చు. 

చింతపండు రసం: చింతపండులో విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

మజ్జిగ : మజ్జిగలో ప్రొబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినీళ్లు : మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి.. ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.

కొత్తిమీర లేదా పుదీనా జ్యూస్‌ : కొత్తిమీరతో గానీ, పుదీనా ఆకులతో గానీ జ్యూస్‌ తయారుచేసుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగడం వల్ల వడదెబ్బ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ సింపుల్‌ హోం రెమిడీ బాడీలో హీట్‌ని తగ్గిస్తుంది.

తులసి విత్తనాలు : తులసి విత్తనాలను రోజ్‌ వాటర్‌లో కలిపి, తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

సోంపు : సోంపు గింజలు శరీరంలో ఉష్ణోగ్రతని వేగంగా తగ్గిస్తాయి. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. కాబట్టి గుప్పెడు సోంపు గింజలు తీసుకుని, రాత్రంతా నానబెట్టి..ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఫలితం ఉంటుంది.

07:27 - April 11, 2016

ముంబై : క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే. పదునైన వ్యాఖ్యలతో, విశ్లేష ణలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదిం చుకున్న వ్యాఖ్యాతల్లో ఇతనూ ఒకడు. గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌లో హర్షా భోగ్లే లేని కామెంటరీ బాక్స్‌ను అభిమానులు చూసుండరు!. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచి కాసుల లీగ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన హర్షా భోగ్లే కాంట్రాక్ట్‌కు అనూహ్యంగా ముగింపు పలికింది బీసీసీఐ అధినాయకత్వం. ఐపీఎల్‌-9 ఆరంభానికి ముందు హర్షా భోగ్లేను వ్యాఖ్యాతగా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో వ్యాఖ్యాతగా మన్ననలు పొందిన హర్షా భోగ్లేను ఐపీఎల్‌-9 నుంచి తప్పించటం అనూహ్య పరిణామమేనన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హర్షా భోగ్లే తొలగింపు విషయంపై స్పందించేందుకు ఐపీఎల్‌, బీసీసీఐ వర్గాలు నిరాకరించాయి. హర్షకు సైతం తనను ఎందుకు తొలగించారనే విషయాన్ని తెలియజేయలేదు. బీసీసీఐ నిర్ణయంగానే నాకు చెప్పారు, కానీ కారణం ఎంటో తెలియదని హర్ష వెల్లడించాడు. ఐపీఎల్‌ సహా బీసీసీఐ సిరీసుల్లోనూ ఇక నుంచి హర్షకు వ్యాఖ్యాతగా కాంట్రాక్టు లభించటం కష్టమేనని బోర్డు వర్గాల సమాచారం.

నాగ్‌పూర్‌ వివాదమే కారణం ?
భారత క్రికెట్‌ వ్యాఖ్యాతగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న హర్షా భోగ్లేను కీలక ఐపీఎల్‌-9 సీజన్‌కు ముందు తొలగించటంపై రాజకీయ కోణం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌ సందర్భంగా నాగ్‌పూర్‌ మైదానంలో ఓ అధికారితో హర్ష తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ విషయం బీసీసీఐ, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌ శశాంక్‌ మనోహర్‌ దాకా వెళ్లింది. దీంతో మనోహర్‌ తక్షణమే హర్షా భోగ్లేను వ్యాఖ్యాతగా తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంలో మరో కోణం సైతం ఉన్నట్టు తెలియవచ్చింది. పొట్టి ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ అనూహ్య విజయానంతరం హర్షా భోగ్లే టీమ్‌ ఇండియా ఆటగాళ్లకు గెలుపు ఘనతను ఇవ్వకుండా వ్యాఖ్యానించటం కొందరికి ఆగ్రహం తెప్పించిందని సమాచారం. ఈ విషయంపై అమితాబ్‌ బచ్చన్‌ సైతం ట్విట్టర్‌లో స్పందించాడు. ఐతే వరల్డ్ కప్‌ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు టెలివిజన్‌లో చూస్తుంటారు. హోరాహోరీ మ్యాచ్‌లో ఆఖరి బంతి గెలుపు.. సమతుల్యత పాటంచటం తప్పనిసరి, అందుకే విజయానంతరం భారత ఆటగాళ్లకు ఘనతను ఆపాదించటం కష్టమని హర్షా భోగ్లే సోషల్‌ మీడియాలో సైతం వివరణ ఇచ్చుకున్నాడు. వీటిలో కారణం ఏదనే విషయంపై స్పష్టత లేకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను కల్గివున్న హర్షా భోగ్లేను ఐపీఎల్‌ నుంచి తొలగించటం అనూహ్య పరిణామం. కామెంటరీ బాక్స్‌లో హర్ష లేని లోటు సుస్పష్టమని కొందరు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. 

07:22 - April 11, 2016

మహేష్‌కి జోడీగా నటించిన 'ఒన్‌.. నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి సనన్‌ ఆ తర్వాత నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలోనూ నటించింది. వీటితోపాటు బాలీవుడ్‌లో నటించిన 'దిల్‌వాలే', 'హీరోపంటి' చిత్రాలు కృతికి మంచి పేరే తీసుకొచ్చాయి. తాజాగా తమిళంలో అజిత్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను అందిపుచ్చుకుందని సమాచారం. అజిత్‌, శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'తలా 57' చిత్రంలో కృతిసనన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా తమన్నాని సెలెక్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ చిత్రంతో కృతి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మొత్తమ్మీద అజిత్‌ సరసన నటించే ఇద్దరు కథానాయికల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

గౌహతిలో భారీగా బారులు తీరిన ఓటర్లు..

అస్సాం : రాష్ట్రంలో 61 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. గౌహతిలో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. 

07:19 - April 11, 2016

విజయ్, సమంతా, అమీ జాక్సన్‌ హీరోహీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'థెరి' చిత్రాన్ని తమిళ నిర్మాత కలయిపులి ఎస్‌ థానుతో కలిసి దిల్‌ రాజు తెలుగులో 'పోలీసోడు' పేరుతో విడుదల చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ, 'దర్శకుడు అట్లీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన 'రాజా రాణి' చిత్రం తీసిన తీరు బాగా నచ్చింది. ఆ మధ్య చెన్నై వెళ్ళినప్పుడు ఈ కథ విని, కొన్ని సన్నివేశాలు చూశాను. ఎలాగైనా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. సాధారణంగా డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో విడుదల చేయాలంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకతలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఇది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించే చిత్రమవుతుంది. 'నేను నటించిన చిత్రం విడుదలయ్యే ముందు కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. మొదటి సారి ఈ సినిమా విషయంలో నాకా టెన్షన్‌ లేదు. అట్లీ ఈ సినిమాను అంత బాగా తీశారు. తెలుగులో అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను' అని సమంత తెలిపారు. దర్శకుడు అటీ చెబుతూ, 'రాజారాణి' సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ఆ తర్వాత ఇక్కడ చాలా ఆఫర్స్ వచ్చాయి. పిల్లల్ని మంచిగా పెంచడం ఎంత అవసరమో చెప్పే కథే ఈ 'పోలీసోడు'. మంచి ఎమెషనల్‌ థ్రిల్లర్‌. విజయ్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయనేది మాటల్లో కంటే సినిమా చూస్తేనే తెలుస్తుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.

బెంగాల్ లో పోలింగ్ ప్రారంభం..

కోల్ కతా : 31 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. వీటిలో ఆరు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్ డ్ నియోజవర్గం వున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 13, బంకుర జిల్లాలో 9, బర్ధమాన్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

07:01 - April 11, 2016

హమాలీ వర్కర్స్ పోరుబాట పడుతున్నారు. ఇప్పటికే బేవరేజెస్ హమాలీ కార్మికులు ప్రభుత్వానికి వినతిపత్రాలిచ్చి, తమ కోరికలు వినిపించారు. బీర్ అండ్ లిక్కర్ అసోసియేషన్ కి, హమాలీ వర్కర్స్ జెఏసి మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభణ ఏర్పడింది. ఈ సమయంలోనైనా ఆందోళన చేయడానికి వీరు సిద్ధమవుతున్నారు. హమాలీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? హమాలీ వర్కర్స్ సంక్షేమంలో ప్రభుత్వాల బాధత్య ఎంత? హమాలీ వర్కర్స్ సంక్షేమానికి బడ్జెట్ లలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తోంది ? హమాలీ వర్కర్స్ సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలేమిటి ? వాటి అమలు తీరు ఎలా వుంది ? బరువులు ఎత్తడం, దించడం లాంటి విషయాలలో అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా వున్నాయి? అవి ఎలా అమలవుతున్నాయి? హమాలీ వర్కర్ల శ్రేయస్సు కోసం పని స్థలాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో సిఐటియు నేత పాలడుగు భాస్కర్ విశ్లేషించారు. ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:42 - April 11, 2016

బరువు మోసినా కొద్దీ జీవితం కుంగిపోతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా పని భద్రత దక్కడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణే బెవరేజ్‌ కార్పొరేషన్‌లో పని చేసే హమాలీల జీవితాలు. సీడ్స్‌ కార్పొరేషన్‌లోనే అదే అభద్రత వెన్నాడుతోంది. ఈ రెండు సంస్థల్లోనే కాదు ఎక్కడైనా హమాలీలు ఎదుర్కొంటున్న కష్టాలు ఒకేరకంగా వున్నాయి. ఇంతకీ వీరి దుస్థితికి కారణం ఏమిటి? వీరి సమస్యలకు బాధ్యులెవరు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దాదాపు ఆరు లక్షల మంది హమాలీలున్నారు. ప్రభుత్వ గోదాములు, ప్రయివేట్‌ గోదాములు, మార్కెట్‌ యార్డులు, పండ్లు కూరగాయల మార్కెట్‌లు, రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, సిమెంట్‌ దుకాణాలు, పోర్టులు ఇలా ఎక్కడకు వెళ్లినా పెద్దపెద్ద బరువులు మోస్తూ మనకు హమాలీ కార్మికులు కనిపిస్తారు. . వారి సహకరం లేనిదే ఏ వస్తువూ మన ఇంటికి చేరుకోదు.

55 కిలోలే..
హమాలీలకు నిర్ధిష్టమైన పనిగంటలంటూ ఏమీ వుండవు. పనికి వేళా పాళా వుండదు. గోదాముకు ఎప్పుడు లారీ వస్తే అప్పుడు ఉరకాల్సిందే. ఇరవై నాలుగు గంటలూ రెక్కలు ముక్కలు చేసుకున్నా వారి చేతికొచ్చేది అంతంత మాత్రమే. ఎప్పుడైనా పొరపాటున పిలవగానే పనికి వెళ్లకపోతే, ఇక ఆ మరుసటి రోజు వారికి పని దొరకడమూ కష్టమే. ఇంతకంటే అభద్రతభావం వున్న పని మరొకటేదీ వుండదేమో. దాదాపు 98శాతం మంది హమాలీలకు పని భద్రత లేదంటే ఆశ్చర్యం కలగకమానదు.  మనుషులతో 55 కిలోలకు మించిన బరువులు మోయించకూడదని ఎప్పుడో 1967లోనే అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవా సదస్సులో తీర్మానించింది. కానీ, అది ఇప్పటికీ మన దేశంలో సంపూర్ణంగా అమలుకాకపోవడానికి మించిన దారుణం మరొకటి వుంటుందా? అసలు ఈ తీర్మానాన్ని ఆమోదించడానికే మన ప్రభుత్వానికి అక్షరాల 44 ఏళ్లు పట్టింది. 1967లో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన ఈ తీర్మానాన్ని మన కేంద్ర ప్రభుత్వం 2010 మార్చిలో ఆమోదించింది. 2011 మార్చి నుంచి అమలు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆచరణ రూపం దాల్చడం లేదు. దీంతో 60 నుంచి 140 కిలోల బరువుండే బస్తాలను కూడా మోయాల్సిన దారుణమైన పరిస్థితి హమాలీలది. వివిధ మార్కెట్‌ యార్డులకు వచ్చే కూరగాయలు, పండ్ల బస్తాల బరువు 60 నుంచి 140 కిలోల వరకు వుంటుందంటే హమాలీల వళ్లు ఏ స్థాయిలో హూనం అవుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక పత్తి, మిర్చి, పొగాకు బేళ్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్స్ బరువు 3 నుంచి నాలుగు క్వింటాళ్ల దాకా వుంటోంది. ఇలా శక్తికి మించిన బరువులు ఎత్తడం వల్ల హమాలీల వళ్లంతా పచ్చిపుండులా మారిపోతోంది. చిన్న వయస్సులోనే వృద్ధాప్యపు లక్షణాలు మీదపడుతున్నాయి. నరాలు సత్తువ కోల్పోతున్నాయి.

వ్యాధులు..
రైస్‌ మిల్లుల దగ్గర పని చేసే హమాలీ కార్మికులను ఊపిరితిత్తుల వ్యాధులు బాధిస్తున్నాయి. మిర్చి యార్డుల్లో పనిచేసేవారికి వళ్లంతా మంటలొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో పనిచేసేవారికి నిమ్ము వస్తోంది. సిమెంట్‌ గోదాముల్లో పనిచేసే హమాలీలకు శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక ఓడరేవుల్లో పనిచేసేవారి పరిస్థితి అత్యంత దారుణంగా వుంటోంది. నిత్యం ప్రమాదపు అంచుల్లో వారు పనిచేయాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి ప్రాణాలూ కోల్పోవాల్సి వస్తోంది. బెవరేజ్‌ కార్పొరేషన్‌లో పనిచేసే హమాలీలు నిత్య ప్రమాదాల్లో గాయపడుతూనే వుంటారు. గాజు సీసాలతో కూడిన బాక్స్ లను ఎగుమతి, దిగుమతి చేస్తున్న సందర్భాలలో అవి పగిలి కాళ్లకు, చేతులకు గాయాలవుతున్నాయి. బీరు బాటిళ్లు పగిలి, సీసా పెంకులు కాళ్లలో గుచ్చుకుని అంగవికలురైనవారూ వున్నారు. వీరికి కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ సౌకర్యం కూడా లేదంటే విస్తుపోకండి.

సంక్షేమాన్ని గాలికొదిలేశారు..
ఇన్ని ప్రమాదాల మధ్య ఇన్ని బరువులు మోస్తూ, ఇన్ని రకాల వ్యాధులతో అవస్థపడుతున్నన హమాలీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు గాలికొదిలేస్తున్నాయి. పని చేసుకోవడానికి కేవలం లైసెన్స్‌లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం లేదు. భద్రతచర్యలను పట్టించుకోవడం లేదు. కనీసం యూనిఫాంలు కూడా సరఫరా చేయని దుస్థితి. చీకట్లో పనిచేసేవారికి టార్చి లైట్లు ఇవ్వరు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయాలలో ప్రమాదవశాత్తు కాలిజారి కిందపడ్డా, వళ్లంతా చీరుకుపోయినా కనీసం పట్టించుకునే దిక్కు వుండదు. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లు కూడా అందుబాటులో వుండవు. తోటి కార్మికులే వారి బాగోగులు చూసుకోవాలి. ఇక పనిస్థలాలలో మలమూత్ర విసర్జనశాలలు కూడా ఏర్పాటు చేయడం లేదంటే అంతకు మించిన ఉదాసీనత మరొకటి వుంటుందా ?

06:36 - April 11, 2016

అస్సాం : సమరం ఆఖరి అంకంలో ప్రవేశించింది. ఇవాళ చివరి విడత పోలింగ్ జరగబోతోంది. తొలి విడతలో కాంగ్రెస్, బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగగా, ఆఖరి విడతలో ముక్కోణపు పోటీ ఆసక్తికరంగా మారుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో బిజెపి, కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అస్సాం రాష్ట్రాన్నే. 126 అసెంబ్లీ నియోజకవర్గాలున్న అస్సాంలో జైత్రయాత్ర సాగించేందుకు ఈ రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 65 స్థానాల్లో వారం రోజుల క్రితమే తొలి విడత పోలింగ్ పూర్తవ్వగా, ఇప్పుడు మిగిలిన 61 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలి విడతలో హోరాహోరీ పోరాడి, గెలుపు అవకాశాలను చెరి సమానంగా పంచుకున్న బిజెపి, కాంగ్రెస్ కు ఆఖరి విడత పోలింగ్ అత్యంత కీలకం కాబోతోంది. తొలి విడతలో 35 స్థానాలు వస్తాయన్నది కాంగ్రెస్ అంతర్గత అంచనా. బిజెపి కూడా 30 నుంచి 40 స్థానాల మీద ఆశలు పెట్టుకుంది. తమ అంచనాలకు తగ్గట్టుగా కాంగ్రెస్, బిజెపి తొలి విడతలో సీట్లు గెల్చుకుంటే, రెండో దశలో 30కి తక్కువ కాకుండా గెల్చుకోవాల్సి వుంటుంది. అంటే 61 స్థానాల్లో కనీస టార్గెట్ 30 సీట్లన్నమాట.

525 మంది అభ్యర్థులు..
అత్యంత కీలకంగా మారిన ఆఖరి విడతలో 61 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఇందులో 30 స్థానాలు ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు. వీటిలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎన్ని స్థానాలు గెలుస్తుందన్నది ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నది. కాంగ్రెస్ , ఏఐయుడిఎఫ్ మధ్య భారీగా ముస్లింల ఓట్లు చీలితే, తమకు లాభిస్తుందన్న అంచనాతో బిజెపి వుంది. అస్సాంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, తామే కింగ్ మేకర్ గా అవతరిస్తామన్న ధీమాతో ఏఐయుడిఎఫ్ నేత బబ్రుద్దీన్ అజ్మల్ వున్నారు.  ఆఖరి విడత పోలింగ్ లో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ 61 స్థానాల్లో కాంగ్రెస్ 57 సీట్లలో పోటీ చేస్తూ, మిగిలిన 4 నియోజకవర్గాలను మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీకి వదిలిపెట్టింది. బిజెపి 35 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. బిజెపి మిత్రపక్షమైన ఏజిపి 19, బిపిఎఫ్ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సిపిఎం 9, సిపిఐ 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 1, 04, 35, 271 మంది ఓటర్లున్నారు. వీరంతా ఎవరికి జై కొడతారా అన్నది ఆసక్తికరం. తొలి విడతలో కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరి పోరు జరగగా, ఆఖరి విడతలో త్రిముఖ పోటీ నడుస్తోంది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయాలన్న పట్టుదలతో తరుణ్ గొగాయ్ కృషి చేస్తుండగా, అస్సాం సింహాసనం మీద కూర్చోవాలన్న కోరికతో బిజెపి కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్ రగిలిపోతున్నారు. ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం సాగిస్తే, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ప్రచారం సాగించారు. 

06:30 - April 11, 2016

హైదరాబాద్ : బాబాసాహెబ్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు.. హైదరాబాద్‌లో స్థలం ఖరారైంది.. ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ సమీపంలోని 36 ఎకరాల స్థలంలో ఈ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని అంబేడ్కర్‌ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు.. పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనీ కమిటీ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కమిటీ సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఈ నెల 14న అంబేద్కర్‌ జయంతి రోజున సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహ రూపకల్పన కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు.
అటు లోయర్‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్‌ టవర్స్‌తో పాటు బోరబండలో నిర్మించనున్న దళిత్‌ స్టడీ సెంటర్‌ స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది. అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు.. శంకుస్థాపన పనుల అనంతరం.. నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

06:28 - April 11, 2016

విశాఖపట్టణం : మాటలు చెప్పడం కాదు చేతల్లో నిరూపించండి. రమ్మని పిలవడం కాదు ఏం చేస్తున్నారో చూపించండి. ఆహ్వానం పలకడం కాదు...ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో క్లారిటీ ఇవ్వండి. ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి మెగస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలివి. విశాఖకు రావడానికి తాము సిద్ధమేనంటూ సిగ్నల్‌ ఇచ్చిన చిరు...ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు. విశాఖలోనూ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఒక పక్క ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడికి వచ్చిన వారికి సకల సౌకర్యాలు కల్పిస్తామని పదే పదే స్పష్టం చేస్తోంది. ఐతే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏమి చేస్తోందని సూటిగా ప్రశ్నించారు మెగస్టార్‌ చిరంజీవి.

సక్సెస్ మీట్..
విశాఖలో సరైనోడు ఆడియో సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ విశాఖలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. సినీ పరిశ్రమ విశాఖకు రావాలంటే..ముందు మౌలిక సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. మాటల్లో కాదు చేతల్లో చూపించాలంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఆహ్వానం పలకడంతో సరిపోదని..స్టూడియోలతో పాటు ఇతర అవసరాల కోసం భూములు కేటాయించాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న చిరు..అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే చిత్ర పరిశ్రమ విశాఖకు రావడానికి సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపించారు. 

06:26 - April 11, 2016

కేరళ : అప్పటిదాకా ఆనందంతో కేరింతలు కొట్టారు. అంబరాన్నంటేలా సంబరాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మరుక్షణమే అంతా మారిపోయింది. ఒకే ఒక్క నిమిషంలో ఆనందం ఆవిరైంది. చిన్న నిప్పురవ్వ పెను విషాదాన్ని రగిలించింది. సుందర మందిరం కాస్తా మరుభూమిగా మారిపోయింది. కేరింతల స్థానాన్ని ఆర్తనాదాలు ఆక్రమించాయి. 110మందిని బలితీసుకున్న ఈ ఘోరానికి కారణం నిర్లక్ష్యం అంతకు మించిన లెక్కలేనితనం పుట్టింగల్ దారుణానికి కారణమయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఇలా మిరుమిట్లు గొలిపే కాంతులు అంబరాన్ని తాకేవి. ఇలాంటి వేడుకలు చూద్దామనే వేలాదిమంది తరలివచ్చారు. కానీ జరిగింది ఇందుకు పూర్తి భిన్నం. మృత్యువు పేలుడు రూపంలో విరుచుకుపడింది. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 

110 మంది మృతి..
కేరళలోని కొల్లాం జిల్లా పారావూర్‌లో ప్రసిద్ధిగాంచిన పుట్టింగల్‌దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మీనా భరణి ఉత్సవాల కోసం పెద్దయెత్తున తెచ్చి నిల్వ చేసిన బాణాసంచా ఒక్కసారిగా పేలిపోయి 110 మంది మృతి చెందారు. పుట్టింగల్ దేవి ఆలయంలో ప్రతియేటా మీనా భరణి ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా పేలుస్తుంటారు. పుట్టింగల్ దేవస్థానానికి చెందినవారు రెండుగా విడిపోయి పోటాపోటీగా బాణాసంచా పేలుస్తారు. అయితే ఈసారి మాత్రం స్థానికులు ధ్వనికాలుష్యం నేపథ్యంలో అభ్యంతరం తెలిపారు. పైగా ఎన్నికలు జరగనుండడంతో ఫైర్‌వర్క్స్‌కు కొల్లాం జిల్లా కలెక్టర్‌ అనుమతివ్వలేదు. ఆలయ అధికారులు మాత్రం అనుమతులొస్తాయన్న ఆలోచనతో భారీగా బాణాసంచా తెచ్చి సిద్ధంగా ఉంచారు. దేవస్థానం సిబ్బంది శనివారం రాత్రి 10 గంటలకు అనుమతులొచ్చాయంటూ మైక్‌లో ప్రచారం చేశారు. దీంతో వేడుకలు చూసేందుకు సుమారు 15 వేల మందిదాకా ఆలయానికి వచ్చారు. వేడుకలు జరుగుతాయంటూ అంతా ఎదురుచూస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఘోరం జరిగిపోయింది.

భారీ నష్టం..
గదిలో భద్రపరిచి ఉంచిన బాణాసంచాపై నిప్పురవ్వలు పడి పెద్ద శబ్దంతో మందు సామాగ్రంతా కాలిపోయింది. ఆ మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రజలు సజీవదహనమయ్యారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం...భక్తులు భయభ్రాంతులతో పరుగులు తీయడంతో పెద్దయెత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 110 మంది మృతిచెందగా 400 మందికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతను బట్టే నష్టం భారీగా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఆలయంతోపాటు చుట్టుపక్కల ఇళ్లు నెర్రలిచ్చాయి. రెండు కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినిపించింది. మందుసామాగ్రి ఆగకుండా చాలాసేపు పేలడంతో సహాయసహకారాలు చేపట్టడానికి అంతరాయం ఏర్పడింది. అయినా అగ్నిమాపక సిబ్బంది అతికష్టమ్మీద మంటలార్పారు. క్షతగాత్రులను కొల్లాం, త్రివేండ్రం ఆస్పత్రులకు తరలించారు. వేగవంతమైన సహాయకచర్యల్లో భాగంగా హెలికాప్టర్లను ఉపయోగించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో డిఎన్‌ఎ టెస్ట్‌ చేసి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. 

రేపు ఢిల్లీలో కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ భేటీ..

ఢిల్లీ : కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ మంగళవారం ఢిల్లీలో జరుగనుంది. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు దీనికి హాజరుకానున్నారు. 

నేడు టిడిపిలో చేరనున్న జ్యోతుల నెహ్రూ..

తూర్పుగోదావరి : జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో చేరనున్నారు. 

నేడు సిద్ధిపేట మున్సిపాల్టీ ఓట్ల లెక్కింపు..

మెదక్ : జిల్లా సిద్ధిపేట మున్సిపాల్టీ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 34 వార్డులకు 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 

నేటి నుండి టీఆర్ఎస్ కార్పొరేటర్లకు శిక్షణ..

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్థలకు ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ల శిక్షణ తరగతులు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ప్రగతి రిసార్ట్స్ ఈ తరగతులు జరగనున్నాయి.

 

నేటి నుండి భద్రాద్రిలో మహోత్సవాలు..

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి నవాహ్నిక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక నవమికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 14 న సాయంత్రం భద్రాచలం రానున్నారు. 

నేడు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించనున్న బాబు..

విజయవాడ : జిల్లాలోని తుమ్మళపల్లి కళాక్షేత్రంలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 

కోల్ కతా విజయం..

కోల్ కతా : ఐపీఎల్ 9లో జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ జట్టుపై కోల్ కతా జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 17.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. 

Don't Miss