Activities calendar

12 April 2016

22:53 - April 12, 2016

స్నేహం అనేది గొప్ప వరం..అది అందరికీ దొరకదు. అపార్థాలకు తావివ్వకుండా అనురాగంతో ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు. కాపురం సజావుగా ఉంటుంది. కానీ ప్రాణ స్నేహితులు ఇన్సూరెన్స్ చేయించుకున్న పాలసీపై కళ్యాణ్ భార్య కన్నుపడింది. మరి ఆమె ఏం చేసింది. ఎవరిని చంపాలని అనుకుంది. ఎవరు చనిపోయారు ? వీడియోలో చూడండి. 

22:49 - April 12, 2016

కళ్యాణ్..క్రాంతి అనే ఇద్దరు మంచి స్నేహితులు..కలిసి పెరిగారు..కలిసి చదివారు..కలిసి వ్యాపారం చేసేవారు..క్రాంతి మూగవాడైనా తెలివైన వాడు. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. సంతోషంగా ఉన్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ తరుణంలో కళ్యాణ్ గుండెపోటుతో మృతి చెందాడు ? ఎలా చనిపోయాడు. డిటెక్టివ్ బృందం ఎలా పరిశోధన చేసింది ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:11 - April 12, 2016

నిజాం చక్కెర ఫ్యాక్టరీ కోసం షురూ అయిన యుద్ధం..సర్కార్ తో సమరానికి రైతులు, కోదండరామ్ సిద్ధం, పాలమూరు గోసను చెప్పిన తమ్మినేని.. పక్కాగ పూర్తి చేసిరు పోలీసోళ్లు పని, పాదయాత్ర చేస్తాడట పవర్ స్టార్ పవనాలు... ఎపుడొస్తడని ఎదురు చూస్తున్నరు జనాలు, ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూలోళ్లు... పెంచిన ఫీజు కట్టలేమన్న పిల్లలు కన్నోళ్లు, రాముల వారి పుణ్యక్షేత్రంలో అపచారం... వుంటదా చెప్పురి ఇంత ఘోరం, యాప్రాల్ లో కొత్తరకం పాలు తయారీ.. పోలీసోళ్లు వచ్చి సీజ్ చేసిర్రు డైరీ ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన ఘాటు ఘాటు వ్యాఖ్యలు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

సీసీ టీవీల రూటర్లు, స్వీచ్ లను దొంగిలించే వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : చాదర్ ఘాట్, మలక్ పేట పీఎస్ ల పరిధిలో సీసీ టీవీల రూటర్లు, స్వీచ్ లను దొంగిలించే జంగయ్యను పోలీసులు అరెస్టు చేసి చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, 25 స్విచ్ లు స్వాధీనం చేసుకున్నారు.

'తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశం'

హైదరాబాద్ : తెలంగాణ లో రానున్న ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యేఅవకాశం ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశం వుందని స్పష్టం చేసింది. ఈ రోజు నల్లగొండ, రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

బెంగుళూరు: ఐపీఎల్ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా బెంగుళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరగనున్న టీ20 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ టీంకు డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తుండగా, రాయల్ చాలెంజర్స్ టీంకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా విజయం పట్ల ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. టోర్నమెంట్‌లో ఇది 4వ మ్యాచ్ కాగా ఇప్పటికే మిగతా జట్లన్నీ ఒక్కో మ్యాచ్ ఆడాయి.

19:48 - April 12, 2016

కర్నూలు : బి.తాండ్రపాడు వద్ద కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు.

19:44 - April 12, 2016

గుంటూరు : ఏది ఏమైనా కాపు సంరక్షణ కోసం తాము తలపెట్టిన ఉద్యమం మాత్రం ఆగదని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపుల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో కాపు నాయకులతో భేటీ అయిన తర్వాత ఆయన కసుక గ్రామంలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి, అదే గ్రామంలో కొత్తగా నిర్మించనున్న విఘ్నేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు. టెన్త్, ఇంటర్ , డిగ్రీ, ఎంసెట్, పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తాను ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు.  

19:41 - April 12, 2016

తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం చింతూరులో సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపి మిడియం బాబూరావు సహా ఐదుగురు సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నాయకులు మండిపడుతున్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ... అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

19:36 - April 12, 2016

హైదరాబాద్ : కోట్లు బకాయిలు పడ్డ వాళ్లని వదిలేసి.. తేలికపాటి రుణాలు తీసుకున్న రైతుల్ని వేధిస్తారా..? మీరు ఆస్తులు జప్తు చేయడం వల్ల.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..! అంటూ సర్వోన్నత న్యాయస్థానం.. బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వేల కోట్లు బకాయిలు పడి.. వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న బడాబాబులు, కార్పొరేట్లను బ్యాంకులు ఏం చేయలేక పోతున్నాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఐదు వందల కోట్లు పైబడి బకాయిపడ్డ వారి వివరాలను అందించాలని ఆదేశించింది.

రుణ ఎగవేత దారుల విషయంలో....

రుణ ఎగవేత దారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు వందల కోట్లకు పైగా బకాయిలున్న వారి పేర్లు వెల్లడించాలంటూ ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రుణ ఎగవేత దారుల వివరాలు వెల్లడించలేమన్న ఆర్‌బీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకున్న బడా బాబులు, కార్పెరేట్‌ కంపెనీలు వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల కోట్ల పైగా అప్పులు తీసుకున్న బడాబాబుల భరతం పట్టాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పది..పాతిక వేల అప్పులు తీసుకున్న రైతులు అవి కట్టలేకపోతే.. బ్యాంకులు ఆస్తులు జప్తు చేస్తున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చిన్న పాటి రుణాలు చేసిన రైతులు అవి కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ థాకూర్‌ అన్నారు.

వేల కోట్లు రుణాలు తీసుకున్నా....

వేల కోట్లు రుణాలు తీసుకున్న వారిని బ్యాంకులు ఏం చేయలేక పోతున్నాయని వ్యాఖ్యానించింది. వందలు.. వేల కోట్ల రుణాలు తీసుకున్న బడా బాబులు, కార్పొరేట్‌ కంపెనీలు మాత్రం రుణాలు ఎగ్గొట్టి ఎం చక్కా ఎంజాయ్‌ చేస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణ ఎగవేత దారుల అంశంపై వివరణ ఇవ్వాలని, ఐబీఏ, ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. రుణాల ఎగవేత దారుల జాబితా ఆర్‌బీఐ సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందించింది. అయితే బకాయిల మొత్తాన్ని వెల్లడించాలని, అవసరమైతే వారి పేర్లు గోప్యంగా ఉంచాలని సుప్రీం ఆదేశించింది. 

19:33 - April 12, 2016

హైదరాబాద్ సర్కార్‌ స్కూళ్లపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. తెలంగాణలోని 390 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో మౌళికసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది.                                                           

398 స్కూళ్లలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాలేదు....

తెలంగాణలో 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాకపోవడంపై సుప్రీంకోర్టు న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేకుండా జీవించడంలాంటిదేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానిదేనని తేల్చి చెప్పింది.

ఒక్క ప్రవేశం కూడా ఎందుకు నమోదు కాలేదు ....

తెలంగాణ రాష్ట్రంలోని 390 పాఠశాలల్లో ఒక్క ప్రవేశం కూడా ఎందుకు నమోదు కాలేదో కోర్టుకు తెలియచేయాలని న్యాయమూర్తి అన్నారు. అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రంలో పర్యటించి... నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమికస్‌ క్యూరీ నేతృత్వంలోని కమిటీలో తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ న్యాయవాదిని కూడా ఓ సభ్యునిగా చేర్చుతూ తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది కోర్టు.

స్కూళ్లను మూసివేసే ఉద్దేశ్యం లేదు-టీ సర్కార్....

అయితే కేసు విచారణ సందర్భంగా పాఠశాలలను మూసివేసే ఉద్దేశ్యం తమకు లేదని తెలంగాణ తరఫు న్యాయవాది విశ్వనాథశెట్టి వాదనలు వినిపించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..జూన్ 30 కల్లా భర్తీ చేస్తామని కోర్టుకు తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా విభేదిస్తూ..తన గ్రామంలో ఒక్క పాఠశాల మూతపడలేదని వ్యాఖ్యానించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే విధంగా యంత్రాంగం ప్రోత్సహించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గ్రామాల్లోనూ పాఠశాలలు కచ్చితంగా ఉండాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

19:30 - April 12, 2016

 

హైదరాబాద్ ఉమ్మడి సచివాలయం హౌసింగ్‌ సొసైటీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కొత్త పాలక మండలి ఏర్పాటు కోసం సంతకాలు సేకరిస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ఎంప్లాయీస్‌ అడ్డుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున... తామే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ ఉద్యోగులు చెప్పారు. అయితే ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తికానందున... గతంలో ఉన్న సభ్యులందర్నీ కొనసాగిస్తూ.. కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఉద్యోగులు పట్టుపట్టారు. రెండు వర్గాల వాదోపవాదాలు, నినాదాలతో పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. 

శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సీరియస్

ఖమ్మం : భద్రాచలం శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని ఈవో, డీఈ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో జ్యోతి, డీఈ రవీంధ్రనాథ్ ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ పై మంత్రి ప్రత్తిపాటి సమీక్ష

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ పై అధికారులు, కార్మికులు, పరిరక్షణ సమితి నేతలతో మంత్రి ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జూట్ మిల్లు యాజమాన్యం హాజరు కాలేదు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అధికారులు నిర్లక్ష్యం చూపినా, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించినా చర్యలు తప్పని హెచ్చరించారు. మిల్లులో సామాగ్రి యామంపై దర్యాప్తునకు త్రిసభ్య కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు జూట్ మిల్లును కొనుగోలు చేశారని కార్మికుల బాగును దృష్టిలో పెట్టుకుని పునరాలోచించాలని, 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని తెలిపారు.

తిరుపతి వాణిజ్యపన్నుల కార్యాలయంలో మంటలు

చిత్తూరు :తిరుపతి వాణిజ్యపన్నుల కార్యాలంలో మంటలు చెలరేగి ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్లు పూర్తి తగలబడిపోయాయి. దుండగులు కిటికి అద్దాలు పగులగొట్టి పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

104,108 సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: 104,108 సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలను మరింత విస్తృతం చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే వైద్యమందించాలని సీఎం కేసీఆర్ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. వేతనాల పెంపుపై అధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని సీఎం ఆదేశించారు.

భారత్ క్రికెట్ కోచ్ గా రవిశాస్త్రి

ముంబై: టీ20 వరల్డ్ కప్ వరకూ భారత జట్టుకు డైరెక్టర్‌గా కొనసాగిన రవిశాస్త్రికి కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. టీమిండియా కు డైరెక్టర్‌గా రవిశాస్త్రికి మంచి మార్కులు పడడంతో కోచ్ పగ్గాలు ఆయనకే అందించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ కూడా కోచ్ గా రవి శాస్త్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాస

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాస అయ్యింది. రిజిస్ట్రేషన్ల కోసం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగి అటెండెన్స్ రిజిస్టర్ ను ఉద్యోగులు చించివేశారు. దీంతో అర్థాంతరంగా సమావేశం వాయిదా వేశారు.

సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు...

కరీంనగర్ : కోర్టు మండలం జంగం పేటలో సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకుని టవర్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపైనా స్థానికులు దాడి చేయగా పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

కారు.. ఆటో ఢీ : ముగ్గురి మృతి

కర్నూలు: బి.తాండ్రపాడు వద్ద కారు.. ఆటో ఢీ కొని ముగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

అంబేద్కర్ దేశానికే ఆదర్శం : దిగ్విజయ్

హైదరాబాద్ : ఇంపీరియల్ గార్డెన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 125 జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్, ఉత్తమ్ కుమార్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. దళితులు, బలహీనవర్గాల కోసం అంబేద్కర్ కృషి చేసినట్లు తెలిపారు. యూపీఏ హయాంలో దళితులకు పెద్ద పీఠ వేశామని, కాంగ్రెస్ బడుగు, బలహీనవర్గాల కోసం పని చేస్తుందన్నారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడారని ఆరోపించారు.

ఏపీ పర్యాటక ప్రచార కర్తలుగా బాలీవుడ్ జంట...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రచార కర్తలుగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు వ్యవహరించనున్నారు. అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు ఏపీ ప్రచారకర్తలుగా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దీంతో చంద్రబాబు వారిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు..అజయ్‌దేవగణ్‌తో అన్నారు. ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని సీఎం కార్యాలయంలో అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరోసారి చంద్రబాబుని కలుస్తానని అజయ్ దంపతులు తెలిపారు.

పలు రాష్ట్రాలలో గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...

హైదరాబాద్ : కాలుష్యం పెరగడం, చెట్లు నరకడంతో అడవులు కుచించుకు పోవడం మొదలైన కారణాల వల్ల భూమిపై ఉష్ణోగ్రత నానాటికీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్ వాడకం నానాటికీ పెరిగిపోతుంది. దీనిపై నియంత్రణకు ప్రభుత్వం అరాకొరా చర్యలు తీసుకుంటున్నా జీవనశైలిలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారిపోయింద. తెలుగు రాష్ట్రాలో ఎండతాకిడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ 100 మందికి పైగా వడదెబ్బకు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఒడిసా రాష్ట్రంలో కూడా భానుడి దెబ్బకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ నెల 20 వరకు అక్కడ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

17:12 - April 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలో ప్రైవేటు స్కూళ్ల ఫీ'జులం' పై 10టివి సమరభేరీ మోగించింది. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు, తల్లిదండ్రుల ఆవేదనను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ సమస్యలపై మల్కాజిగిరిలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల మనోగతాన్ని మన ముందు వుంచే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి

17:09 - April 12, 2016

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రముఖంగా టూరిజంపై దృష్టి పెట్టారు. ఈ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ దంపతులు అజయ్ దేవ్ గన్, కాజల్ నియమితులయ్యారు. బాబు ఆహ్వానం మేరకు ఉదయం విజయవాడకు వచ్చిన అజయ్ దేవ్ గన్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తలుగా నియమిస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై అజయ్ దేవ్ గన్, బాబులు చర్చించినట్లు సమాచారం. ఇందుకోసం ఓ వీడియో తీయనున్నట్లు సమాచారం. ఈ వీడియోలో అజయ్ దేవ్ గన్, కాజల్ దంపతులు కనిపించనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అజయ్ పేర్కొన్నట్లు సమాచారం. 

టీవీ నటి ప్రత్యూష కేసులో రాహుల్ కు ఊరట...

హైదరాబాద్ : చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు ముంబై కోర్టులో ఊరట కలిగింది. వారం రోజుల వరకు రాజ్ సింగ్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా ఈ నెల 1న ముంబైలోని ఫ్లాట్ లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రత్యూష తల్లిదండ్రులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాజ్ సింగే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోని 6 జిల్లాల్లో వడగాలులు ...

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రలోని ఆరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. రెండురోజులపాటు ఈ ప్రభావం వుంటుందని తెలిపారు. వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

16:57 - April 12, 2016

హైదరాబాద్ : ఎస్ ఎఫ్ఐ నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌కు విద్యార్ధుల నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని 300 కేంద్రాల్లో ఇవాళ నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌కు 80 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. గత 15 ఏళ్లుగా ఎస్ ఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్‌ ఎంసెట్‌కు ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. మోడల్‌ ఎంసెట్‌ నిర్విహిస్తున్న ఎస్ ఎఫ్ఐ ని చుక్కరామయ్య అభినందించారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. విద్యార్ధులు తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునేందుకు ఎస్ ఎఫ్ఐ మోడల్‌ ఎంసెట్‌ దోహదం చేస్తుందని చుక్కారామయ్య చెబుతున్నారు. 

16:56 - April 12, 2016

వరంగల్‌ :తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుకు.. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యుల బృందం సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించింది. పోస్ట్‌మార్టం వీడియోతో పూర్తి నివేదికను ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌, పోస్ట్‌మార్టం నివేదిక సమర్పించి వైద్యులతో మాట్లాడించే వీలు కల్పిస్తే.. శృతి, విద్యాసాగర్‌రెడ్డిలు ఎలా మృతి చెందారో నివేదిక ఇస్తామన్నారు. దీంతో ఈనెల 15లోగా పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. 

కృష్ణానదిలో దూకి మహిళ ఆత్మహత్య...

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ పై నుండి కృష్ణానదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను రక్షించటానికి నదిలో దూకి ఆమెను బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.నదిలో దూకే క్రమంలో బ్యారేజ్ గేట్ పై పడటంతో తలకు బలమైన గాయాలవటంతో వెంటనే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం ఆందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

16:54 - April 12, 2016

హైదరాబాద్ : కమ్యూనిస్టు సీనియర్‌ నేత మాకినేని బసవ పున్నయ్య వర్థంతి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యాయంలో జరిగింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం మాకినేని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాకినేని గొప్ప మేధావి అని తమ్మినేని కొనియాడారు. దేశంలో విప్లవోద్యమానికి మార్క్స్‌, లెనినిజం నిర్దిష్టంగా అన్వయించడంలో అగ్రగణ్యుడని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన మాకినేనికి ఉండేదన్నారు. 

16:52 - April 12, 2016

హైదరాబాద్‌ : నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మాకినేని బసవపున్నయ్య వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు, ఏపీ సీపీఎం కార్యదర్శి మధు బసవ పున్నయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధ్యయనం, ఆచరణ మేళవించి పనిచేసిన గొప్ప నేత మాకినేని అని... రాఘవులు కొనియాడారు. అనునిత్యం పేదల, కార్మికుల సమస్యలపై పోరాడిన నేత మాకినేని బసవ పున్నయ్య అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. 

16:51 - April 12, 2016

విజయవాడ : సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌కు సినిమా చరిత్ర ముగింపు దశకు చేరుకోవడంతోనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి తరుపున ప్రచారం చేసిన పవన్‌ కల్యాణ్‌... రెండేళ్ల పాటు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. సినిమాలు లేకపోతే రాజకీయాలు గురించి మాట్లాడటం పవన్‌ కల్యాణ్‌కు రివాజుగా మారిందని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం సీపీఐ తో కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. 

16:49 - April 12, 2016

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణానదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అందరూ చూస్తుండగానే మహిళ నీటిలో దూకింది. పోలీసులు ఆమెను బయటకు తీసి... ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని పోలీసులు తెలిపారు.

16:46 - April 12, 2016

హైదరాబాద్: కేరళలో రాత్రివేళ పెద్ద శబ్దం చేసే బాణ సంచా కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. పుట్టింగల్‌లో ఘటనకు సంబంధించి కేరళ సర్కార్‌ పై... కోర్టు సీరియస్‌ అయింది. కొల్లం టెంపుల్‌ ఘటనపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. పుట్టింగల్‌ ఆలయ ఘటనపై ఎలా దర్యాప్తు చేయాలన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ తెలిపారు.

16:45 - April 12, 2016

హైదరాబాద్ : లక్నోలో బాణసంచా కాల్చడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. లక్నోలో ఎలాంటి ఉత్సవాల్లోనూ బాణసంచా కాల్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని పుట్టింగల్‌ ఆలయంలో బాణసంచా పేలి 109 మంది మృతి చెందిన నేపథ్యంలో అఖిలేష్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

చిన్నారి అ(హ)త్యాచారంలో నిందితుడికి మరణశిక్ష..

హైదరాబాద్ : మామిడి పండ్లు ఇస్తానని నమ్మించి ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన మధుర యాదవ్‌ అనే వ్య‌క్తికి ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా కోర్టు మ‌ర‌ణశిక్ష విధించింది. అతనికి స‌హ‌క‌రించిన అత‌ని తండ్రికి రెండేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించింది. 2011లో ఈ దారుణానికి ఒడిగట్టిన మధుర్ యాదవ్ అత్యాచారం చేసిన అనంతరం ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ చేప‌ట్టిన ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా కోర్టు నిందితునికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

ఈ ఏడాది భారీ వర్ష సూచన : ఐఎండీ

ఢిల్లీ : ఈ ఏడాది భారీ వర్ష సూచన వున్నట్లు ఐఎండీ పేర్కొంది. అనుకున్న సమయానికికంటే ముందుగానే వర్షాలు పడతాయని తెలిపింది. గత ఏడాది సామాన్య వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా నమోదయ్యిందనీ తెలిపింది. ఈ ఏడాది 6 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

16:20 - April 12, 2016

మెదక్ : మాట తప్పితే మెడ నరుక్కుంటానని గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు పేర్కొన్నారని, కరవు సహాయక చర్యలు తీసుకోకపోతే ఆ పని ప్రజలే చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జిల్లాలో కరవు విలయ తాండవం చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. 46 మండలాల నుండి వచ్చిన ప్రజలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న తమ్మినేని టెన్ టివితో మాట్లాడారు. కరవు తాండవం చేస్తుంటే మంచినీటి వ్యాపారం పేరిట కొంతమంది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఉచితంగా మంచినీరివ్వాలని, అలాగే గ్రామాలలో నోటి తొట్టెలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పశువుల సంఖ్య ఆధారంగా మూడు నెలలకు సరిపడా మేత, నీరు అందించాలని డిమాండ్ చేశారు. రూ. 50 కంటే ఎక్కువగా రావడం లేదని ఉపాధి కార్మికులు పేర్కొంటున్నారని, రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవరి ఫిడెల్ వాయించినట్లుగా ఉందన్నారు. కేసీఆర్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని, ఇక్కడ అంతా ఏదో అభివృద్ధి చెందుతోందని ప్రతి గ్రామానికి నీళ్లు అందిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. దీనిబట్టి చూస్తుంటే బయట పల్లకిల మోత..ఇంట్లో ఈగల మోత అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అత్యధికంగా కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ఇంకా ప్రాజెక్టుల మత్తులోనే ఉన్నారని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రజలు కీర్తిస్తున్నారనే మత్తులో ఉన్నారని విమర్శించారు. మాట తప్పితే మెడ నరుక్కుంటానని కేసీఆర్ పేర్కొంటుండాని, కరవు సహాయక చర్యలు తీసుకోకపోతే ప్రజలే ఆ పనిచేస్తారని తెలిపారు. సీపీఎం చేపట్టిన ఈ ధర్నాతో ప్రభుత్వం..జిల్లా అధికారులు మేల్కొంటారా ? లేదా ? అనేది చూడాలి. 

చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు : మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు: కృష్ణా పుష్కరాలపై మంత్రి ప్రత్తిపాటి సమీక్షించారు. ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్‌, కలెక్టర్‌ కాంతిలాల్‌దండే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పుష్కరాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు ఇప్పటి వరకూ రూ.255 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 70 పుష్కర ఘాట్లు నిర్మించాలని నిర్ణయించారు. 400 మీటర్లకు పైగా పొడవున్న అమరావతి, సీతానగరం, పెనుమూడి, సత్రశాల ప్రాంతాల్లో ప్రధాన స్నానఘట్టాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

హెచ్ సీయూలో ప్రశాంత వాతావరణంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం పునరుద్ధరించాలని దాఖలై వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూలో బయటి వ్యక్తుల సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మిషన్ కాకతీయపై ముగిసిన సమావేశం..

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. మిషన్ కాకతీయను స్పూర్తిగా తీసుకోవాలని సూచిస్తామని బృందం తెలిపింది. 

మిషన్ కాకతీయపై ముగిసిన సమావేశం..

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. మిషన్ కాకతీయను స్పూర్తిగా తీసుకోవాలని సూచిస్తామని బృందం తెలిపింది. 

బాబుతో అజయ్ దేవ్ గన్ భేటీ..

విజయవాడ : ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ విజయవాడలో అడుగు పెట్టారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. 

సీఎం చంద్రబాబుతో బాలివుడ్ నటుడు అజయ్ దేవగన్ భేటీ…

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలీవుడ్ ఏక్షన్ హీరో అజయ్ దేవగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో అజయ్ దేవగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

లుథియానలో అగ్నిప్రమాదం..

పంజాబ్ : రాష్ట్రంలోని లుథియానలో అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం ఘటనా స్థలికి చేరుకుని ఐదు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాణ, ఆస్తినష్టం గురించి వివరాలు తెలియరాలేదు. 

15:48 - April 12, 2016

ఢిల్లీ : సమాజంలో మహిళలు నిర్భయంగా జీవించే పరిస్థితులు వచ్చినప్పుడే స్త్రీలకు నిజమైన గౌరవమని స్వచ్చంధ సేవా సంస్థ ప్రజ్వల నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌ అంటున్నారు. ఆధునిక సమాజంలో కూడా మహిళను ఆటవస్తుగా చూసే ఆటవిక సంస్కృతి కొనసాగే పరిస్థితి పోవాలంటున్నారు. పద్మశ్రీ అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందంటున్నారు  సునీతా కృష్ణన్‌. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

తాడ్వాయి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టుకుi నివేదిక

హైదరాబాద్ : తాడ్వాయి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టుకు ఎయిమ్స్ వైద్యబృందం నివేదిక సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు ఎయిమ్స్ బృందం మరికొంత సమయాన్ని కోరగా దానికి కోర్టు అంగీకరించింది. ఈనెల 15 కల్లా అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా

మెదక్ : జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చుక్కా రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగునీరు లేక పశువులు, ప్రజలు అల్లాడిపోతున్నా సర్కార్ కరువు నివారణ చర్యలకు పూనుకోవడం లేదని మండి పడ్డారు. కరువు ప్రాంతాలను ప్రకటించినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే కరువు సహాయక చర్యలకు పూనుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల బకాయిలు చెల్లించకుంటే ఉద్యమిస్తామన్నారు.

మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మ దగ్ధం

నల్గొండ : సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్, టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్త లమధ్య ఘర్షణ జరిగింది. అంబేద్కర్, జగ్జీవన్ రావ్ విగ్రహాల ఏర్పాటు విషయంలో గొడవ ప్రారంభం అయ్యింది. చిలికి చిలికి గొడవ పెద్దది అయ్యి పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అంబేద్కర్, జగ్వీజన్ రావ్ విగ్రహావిష్కరణ వాయిదా పడింది.

నీటిపారుదల అధికారులతో నీతి ఆయోగ్‌ సలహాదారు సమావేశం

హైదరాబాద్ : తెలంగాణలోని చిన్న నీటి పారుదల, ఆర్థికశాఖ అధికారులతో నీతి ఆయోగ్ సలహాదారు ఏకే జైన్‌ సమావేశమయ్యారు.. మిషన్‌ కాకతీయపై సమీక్షించారు.. అధికారులు నీటిపారుదల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు.. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మిషన్‌ భగీరథపై నీతి ఆయోగ్‌ సభ్యులతో సమీక్ష జరపనున్నారు.. 

ముంబా దేవాలయాన్ని సందర్శించిన రాహుల్..

ముంబై : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముంబా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాహుల్ కు స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందచేశారు. 

పుట్టింగల్ ఆలయ కమిటీ లొంగుబాటు..

కొల్లమ్ : కేరళలోని పుట్టింగల్ ఆలయ కమిటీకి చెందిన ఏడు మంది పోలీసుల ముందు లొంగిపోయారు. దుర్ఘటనలో గాయపడ్డ వారి సంఖ్య వెయ్యి దాటింది. బాణాసంచా పేలుళ్ల వల్ల గాయపడ్డ క్షతగాత్రుల్లో సుమారు 350 మంది ఇంకా హాస్పటల్లోనే చికిత్స పొందుతున్నారు.

స్కూళ్లలో మౌలిక వసతులు..ఉపాధ్యాయుల భర్తీపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల భర్తీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 398 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై సుప్రీం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సిరియాలో హెలికాప్టర్ కూలి రష్యా పైలట్లు మృతి..

సిరియా : హెలికాప్టర్ కూలడంతో ఇద్దరు రష్యా పైలట్లు మృతి చెందారు. సిరియాలోని హోమ్స్ సిటీ సమీపంలో ఘటన జరిగినట్లు రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. 

ఎన్ఐఏ అధికారి హత్య కేసులో ఇద్దరి అరెస్టు..

లక్నో: ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్య కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తంజిల్ హత్యకేసులో శనివారం జైనుల్, రీయాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నూర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ మీనా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మునీర్ మాత్రం పరారీలోనే ఉన్నాడు. అతనిపై రూ.50వేల రివార్డు కూడా ఉంది. 

బాబును కలిసిన ఏపీ ఎస్ఈబీ ఇంజినీర్స్..

విజయవాడ : ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్ లోని ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కమ్ లకు చెందిన రూ.1000 కోట్లకు పైగా ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

 

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై రేపు కీలక సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై రేపు హైదరాబాద్ లో కీలక సదస్సు జరగనుంది. బిల్డర్లు, నిర్మాణ సంస్థలు, ఆర్థిక సంస్థలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమౌతారు. 

14:45 - April 12, 2016

కృష్ణా : నాగాయలంక మండలం హంసలదీవి వద్ద మత్స్యకారుల పడవ బోల్తా పడింది. పడవలోని ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. వేటకు వెళ్లిన సమయంలో మరో బోటు ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. గల్లంతైనవారికోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

14:44 - April 12, 2016

నల్గొండ : సూర్యాపేటలో అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఏర్పాటు సమయంలో ఘర్షణ జరిగింది. ఎమ్మార్పీఎస్, టిఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఒకరికొకరు కర్రలతో కొట్టుకున్నారు. మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను టిఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు. 

14:42 - April 12, 2016

హైదరాబాద్ : రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమని వైఎస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాద్‌ రావు అన్నారు. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించడం అవమానకరమని అన్నారు. న్యాయాన్ని ఆలస్యం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు, కానీ న్యాయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ధర్మాన పేర్కొన్నారు.   

14:41 - April 12, 2016

హైదరాబాద్‌ : నగరంలోని జలమండలి కార్యాలయంముందు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.. ప్రజలు నీటి కొరతతో ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ ధర్నాలో పాల్గొన్న నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. మంచినీటి సమస్యను తీర్చమని వస్తే అరెస్టులతో అడ్డుకోవడం దారుణమని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు..

14:39 - April 12, 2016

ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మం జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో జరిగే ఉపఎన్నిక ద్వారా బలాన్ని నిరూపించుకునేందుకు గులాబి దళపతి స్కెచ్ వేస్తున్నారు.                                      
                                                           
విపక్షాల చేస్తున్న ఆరోపణలను.. తుడిచిపెట్టే దిశగా....

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కొన్ని జిల్లాలకే పరిమితమైందంటూ.. విపక్షాల చేస్తున్న ఆరోపణలను.. తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీకి ముందు నుంచి మంచి పట్టు ఉంది. అయితే.. దక్షిణ తెలంగాణతోపాటు ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితి నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రమే. పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సహా.. గ్రేటర్ ఎన్నికలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా పట్టు సాధించింది.

అధికారపార్టీలో అంతర్గతంగా ఉపఎన్నిక పై చర్చ....

త్వరలో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి..ఉపఎన్నిక జరగనుంది. పార్టీలో అంతర్గతంగా ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైతే తప్ప ఇందుకు తగ్గ ఏర్పాట్లు మొదలు కావు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికను కూడా ఎదుర్కొని భారీ మెజార్టీతో విజయం సాధించింది టిఆర్ఎస్. పాలేరులో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. ఇందుకు సంబంధించి స్థానిక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మృతిచెందిన ఎంఎల్ రాంరెడ్డి వెంకట్ రెడ్డి ....

ఇటీవల మృతిచెందిన ఎంఎల్ ఏ రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబసభ్యులు గులాబి తీర్థం పుచ్చుకుంటే.. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామన్న సంకేతాలను టీఆర్ఎస్ పార్టీ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఎన్నికలు అనివార్యం అయితే.. పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఉపఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పక్కాగా ప్లాన్ చేసి పాలేరు ను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇందుకు జిల్లా మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

14:36 - April 12, 2016

గత కొన్ని శతాబ్ధాలుగా శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగింది. కానీ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతి లభించింది. కానీ కొన్ని దేవాలయాల్లో మహిళల ప్రవేశం నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎటువైపు దారితీస్తున్నాయి, ఇంకా ఎన్నాళ్లు ఈ నిషేధం కొనసాగుతుంది అనే అంశంపై వేదికలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పీఓడబ్ల్యు నేత సంధ్య, మార్గదర్శిని వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఎన్ కౌంటర్ ఘటనపై వాయిదా కోరిన ఎయిమ్స్ ...

హైదరాబాద్ : తాడ్వాయి ఎన్ కౌంటర్ ఘటనపై ఎయిమ్స్ బృందం హోకోర్టుకు నివేదిక అందజేసింది. ఎయిమ్స్ బృందం ఇచ్చిన నివేదికను కోర్టు పరిశీలించింది. కాగా పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వటానికి మరింత సమయం కావాలిన ఎయిమ్స్ న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సమ్మతించిన కోర్టు ఈ నెల 15కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2015 సెప్టెంబర్ నెలలో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వెంగళాపూర్ సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.

13:47 - April 12, 2016

'సర్ధార్ గబ్బర్ సింగ్' విడుదలై విజయవంతంగా ఆడుతున్న సందర్భంగా హీరోయిన్ కాజల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈనేపథ్యంలో 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా విశేషాలను ఆమె వివరించింది. సినిమా షూటింగ్ అంశాలను తెలిపారు. తన అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:38 - April 12, 2016

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈనెల 26కు బదులు మే 5న కోర్టుకు హాజరు కావొచ్చని హైకోర్టు తెలిపింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుజనా హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కానీ మే 5న మాత్రం తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సుజనా... మారిషస్‌ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. 
లాయర్...
ప్రస్తుతం కోర్టులో వాదనలు ఏమ జరగలేదు. వారెంట్ రీకాల్ చేయమని అడిగారు. క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న క్రమంలో నాంపల్లికోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. క్వాష్ పిటిషన్ పై జూన్ 6న వాదనలు జరుగనున్నాయి. 

 

కేంద్రమంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట ....

హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26కు బదులుగా మే 5వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోర్టు సూచించింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను హైకోర్టు రద్దు చేసింది. కాగా మారిషస్‌ బ్యాంక్‌ కేసులో వరుసగా మూడు వాయిదాలకు హాజరు కానందున ఆయనపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. తాను కోర్టుకు హాజరు కాకపోవడం ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదనీ...సుజనా చౌదరి చెప్పారు. తనకు కోర్టులపై గౌరవం ఉందని చెప్పారు.

13:32 - April 12, 2016

హైదరాబాద్ : పోలీసులు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు సహకరించే మరో యాప్‌ అందుబాటులోకి రాబోతోంది.. ఈ యాప్‌ ద్వారా పోలీసులకు కేటాయించిన విధులేంటి? వాటిని ఎంతవరకూ  పూర్తిచేశారు? తనిఖీలు చేయకుండా మిగిలిన ప్రాంతాలేమిటి? లాంటి పూర్తి వివరాలు ప్రతిక్షణం అప్‌డేట్‌ కానున్నాయి.. వీటిద్వారా మరింత బాగా గస్తీ నిర్వహించేలా పోలీసుల ఏర్పాట్లు  చేస్తున్నారు...                                              
పోలీసులంటే తనిఖీలు..  
పోలీసులంటే తనిఖీలు.. ఈ పని సరిగ్గా చేస్తే చాలావరకూ నేరాలు తగ్గిపోతాయి.. ఈ పనిని పోలీసులు పూర్తిచేస్తున్నా ఇందులో కొన్ని సమస్యలవల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదు.. సోదాల విధుల్లో గందరగోళంతో పోలీసుల్లో అయోమయం నెలకొంది.. కొన్ని లొసుగులను ఆధారం చేసుకొని పనిని తప్పించుకుంటున్నారనే విమర్శలుకూడా వచ్చాయి.. పైగా ఎవరు ఏ ప్రాంతాల్లో సోదా చేశారో తెలియక... తర్వాతి షిఫ్ట్‌వారు అక్కడికే వెళ్లడం.... సీరియస్‌గా కాకుండా తూతూ మంత్రంగా పని చేయడం సాధారంగా మారింది.. ఈ విషయాలపై  ప్రత్యేకదృష్టిపెట్టిన పోలీసు ఉన్నతాధికారులు టెక్నాలజీద్వారా ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టబోతున్నారు.. 
20నుంచి 30 పోలీస్‌స్టేషన్లలో పాయింట్‌ బుక్‌
నగరమంతా నిఘాకోసం ఇప్పటివరకూ పోలీసులు ఒక సిస్టమ్‌ ఫాలో అవుతున్నారు.. దీనిప్రకారం 20నుంచి 30 పోలీస్‌స్టేషన్లలో పాయింట్‌ బుక్‌ ఉంటుంది.. ఈ బుక్‌ ప్రకారం తమకు  కేటాయించిన ప్రాంతాలకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయాల్సి ఉంటుంది.. ఇదంతా పెద్ద ప్రహాసనంగా మారింది.. ఎవరు ఏయే కాలనీలకు వెళ్లారో తెలియక అయోమయం ఏర్పడింది.. ఎక్కడోఉంటూ నేరస్తులున్న ప్రాంతాల్లో చెకింగ్‌ చేశామంటూ రాయడం పోలీసుల దృష్టికొచ్చింది.. ఇలాగైతే పూర్తిస్థాయిలో తనిఖీలు సాధ్యం కాదని భావించిన పోలీసులు... ఇప్పుడు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి  తేబోతున్నారు.. 
కాప్‌ యాప్‌ ట్రయల్‌ రన్‌ 
పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచే కాప్‌ యాప్‌ ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తోంది.. ఈ యాప్‌కోసం పోలీసులు మొత్తం 4వేలమంది నేస్తుల డేటా తయారు చేశారు.. వీరి  పేర్లు, చిరునామా, వృత్తి డీటేయిల్స్‌ను యాప్‌లో పొందుపరుస్తున్నారు.. వీటికి నేరస్తుల ఇంటి అక్షాంశాలు, రేఖాంశాలను జత చేస్తున్నారు.. దీనివల్ల పోలీసులు ఆ ప్రాంతానికి వెళితేనే యాప్‌  ఓపెన్ అవుతుంది.. అప్పుడే రిపోర్ట్ సబ్‌మిట్‌ కావడానికి అవకాశం ఉంటుంది.. అలా ఈ వివరాలు షిఫ్టులవారీగా తనిఖీలు పూర్తయిన రిపోర్టులు ఎస్‌హెచ్‌వోకు అందుతాయి.. అంతే కాదు..  పోలీసులు తనిఖీ చేయని ప్రాంతాలను ఈ యాప్‌ ప్రత్యేకంగా చూపుతుంది.. ఇలా ఈ యాప్‌ సహాయంతో పూర్తి స్థాయిలో తనిఖీలు జరిగే అవకాశం ఉంటుంది. ట్రయల్‌ రన్‌ పూర్తయ్యాక ఈ యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 200మంది పెట్రోల్‌ మొబైల్‌ సిబ్బందికి ఈ యాప్‌లున్న ట్యాబ్‌లను అందజేశారు. 

13:19 - April 12, 2016

ముంబయి: మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో రెస్క్యూ టీం శ్రమించి 30 మందిని కాపాడారు. ఓ నివాస భవన సముదాయం పక్కనే ఉన్న వస్త్ర పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులున్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో నివాసముంటున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. కింది అంతస్తు నుంచి మంటలు వ్యాపించటంతో బిల్డింగ్‌లో ఉన్న సుమారు వంద మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కార్మికులు భవనంపైకి వెళ్లి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ టీం పలువురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. జనావాస ప్రాంతంలో వ్యాపారసంస్థ ఏర్పాటు చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కువారంతా వస్త్ర పరిశ్రమలో పని చేసేవారేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా భవన సముదాయంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు తగిన వీలు లేకపోవటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. 
నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించటం జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు భవన నిర్మాణ యజమానులు ఫైర్ స్టేషన్ అధికారుల అనుమతి కూడా తీసుకోవాలనే నిబంధనలను ఉల్లఘించి నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనుకూలంగా నిర్మాణాలు లేకపోవడం..అగ్నిమాపక సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురు కావడం వల్ల మృతుల సంఖ్య అధికంగానే వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితులలోనే మహారాష్ట్ర లో అగ్నిప్రమాదం జరిగినట్లుగా ఫైర్ సిబ్బంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అమెరికాలో భారత విద్యార్థి దారుణ హత్య..

న్యూయార్క్ : అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సంతతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రుత్గర్స్ యూనివర్సిటీలో చదువుతున్న షానీ పటేల్ (21) నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పటేల్ అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. 

నేపాల్ లో రోడ్డు ప్రమాదం..12 మంది మృతి..

ఖాట్మండు : ఖాటోంగో నుండి ఖాట్మండుకు వెళుతున్న బస్సు గొయ్యిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. మహాదేవస్థాన్ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో 24 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. 

12:57 - April 12, 2016

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా పార్టీ పటిష్టంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి ? అనే దానిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ యోచిస్తున్నారు. ఈమేరకు దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు జిల్లాకు సంబంధించిన ముఖ్యనేతలతో జగన్ భేటీ అయ్యారు. వీరితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో ఈ భేటీ జరిగింది. పార్టీ పరంగా బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. ఇటీవలే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. జ్యోతుల నెహ్రూ సామాజిక వర్గానికి చెందిన వారినే జిల్లా అధ్యక్షుడి నియమించాలని జగన్ భావిస్తున్నారు. కాగా వైసీపీ నుండి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళడానికి సమాయత్తమవుతున్నారనే వార్తల నేపథ్యంలోనే ఈ భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి జగన్ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో ? టీడీపీలోకి జంప్ కాకుండా జగన్ తీసుకొనే నిర్ణయాలు సత్ఫలిస్తాయా అనేది వేచి చూడాలి. 

రెండో రోజు గ్రేటర్ కార్పొరేషర్లకు శిక్షణా తరగతులు

రంగారెడ్డి : శంకర్ పల్లిలోని ప్రగతి రిసార్ట్ లో రెండో రోజు జీహెచ్ ఎంసీ కార్పొరేషర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులకు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, పద్మారావులు హాజరయ్యారు. 

 

12:49 - April 12, 2016

గుంటూరు : అది మండల స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించే ముఖ్యమైన రెవిన్యూ కార్యాలయం. వివిధ పనుల నిమిత్తం.. నిత్యం వందలాది మంది ఆ కార్యాలయానికి వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఉదయమే కార్యాలయానికి చేరుకున్నా... అక్కడ సమాధానం చెప్పే దిక్కూ, దివాణం ఉండదు. నిలదీస్తే నీకు దిక్కున్నచోట చెప్పుకో.. అంటూ జనంపైనే దౌర్జన్యానికి దిగుతారు అక్కడి సిబ్బంది. గుంటూరు జిల్లా కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యంపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయం
ఇది గుంటూరు జిల్లా కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయం. పల్నాడులోని పలు గామ్రాల నుంచి వివిధ పనుల మీద నిత్యం వందలాది మంది వస్తుంటారు. సమస్యలు చెప్పుకునేందుకు ఉదయం పది గంటలకల్లా ప్రజలు ఇక్కడకు చేరుకున్నా.... అధికారులు, సిబ్బంది మాత్రం సమయపాలన పాటించడం లేదు. ఇష్టమొచ్చినప్పుడు వచ్చి పోతుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఏనాడూ మధ్యాహ్నం లోపు ఆఫీసుకు రాని తహశీల్దార్‌ 
కారెంపూడి తహసీల్దార్ స్వర్ణలత స్థానికంగా నివాసం ఉండరు. గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో  రెండు, మూడు రోజులు ఆఫీసుకు రావడమే గగనంగా మారిందని ప్రజలు  చెబుతున్నారు. వచ్చినా కూడా మధ్యాహ్నం లోపు  ఆఫీసుకు హాజరయ్యే పరిస్థితులేవంటున్నారు. వచ్చినా ఎంతోసేపు ఉండరన్న ఫిర్యాదులున్నాయి. ఇలా వచ్చి.. అలా ముఖం చూపించి వెళ్లిపోతుంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో నెలకొన్న పరిస్థితి గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే దిక్కే లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డు జారీకి వసూళ్ల దందా
పైగా కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది చేయితడపందే ఏ పనీ కాదని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో పనికి ఒక్కోరేటు పెట్టి వసూళ్ల దందా సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డుకు ప్రభుత్వం నిర్ణయించింది పది రూపాలయలతై... వసూలు చేసేది  యాభై నుంచి వంద రూపాయలు ఉంటోందని ప్రజలు చెబుతున్నారు. 
భూ సర్వేకి రాని మండల సర్వేయర్‌- రైతులు 
దరఖాస్తు చేసుకున్న తర్వాత రోజుల తరబడి తిరిగినా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఇవ్వడంలేదని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  భూ సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే  చెప్పులరిగేలా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా మండల సర్వేయర్‌ దయచూపడంలేదని అంటున్నారు. ఒకవేళ సర్వే చేసినా సర్టిఫికెట్‌ కోసం నెలల తరబడి మళ్లీ కార్యాలయం చుట్టూ తిరగాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భూమిని సర్వే చేసిన మండల సర్వేయర్‌ తప్పుడు కొలతలు వేశారని ఫిర్యాదు చేయడానికి  ఇచ్చిన ఓ వృద్ధుడితో అధికారులు  ఏ విధంగా  దరుసగా ప్రవర్తిస్తున్నారో చూడండి.
ప్రతి సోమవారం ముఖాముఖి 
కారెంపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో  ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రతి సోమవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సమయానికి హాజరుకాని సిబ్బంది దీనిని ఓ మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని... ఈ కార్యాలయ వ్యవహారాలను చక్కదిద్దాలని కోరుతున్నారు. 

 

12:46 - April 12, 2016

హైదరాబాద్‌ : తాగునీటి కొరతను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట తేదేపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కొరత ఏర్పడినప్పటికీ సమస్యలను అధిగమించేందుకు సర్కారు తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ నేత మెత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. రాజధాని నగరంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్యను అధిగమించటంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. ఈ ఆందోళనలో ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని అడగటానికి వస్తే అరెస్టులతో అడ్డుకోవడం దారుణమని పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.

12:39 - April 12, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో 'పద్మ' అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులను అందచేశారు. పద్మ పురస్కారాల ప్రధానోత్సవానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.
శాస్త్ర సాంకేతిక, సాహిత్య, సినీ తదితర రంగాల్లో విశిష్ట సేవలు చేసిన ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పద్మ అవార్డులతో సత్కరించారు. తొలివిడతలో మార్చి 28న ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8 మందికి పద్మభూషణ్‌ 43 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. ఈ విడతలో 5 పద్మ విభూషణ్‌, 10 పద్మ భూషణ్‌, 40 పద్మశ్రీ అవార్డులు అందజేశారు.

రామోజీ రావుకు పద్మ విభూషణ్..
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, వాసుదేవ కలుకుంటే ఆత్రే, గిరిజా దేవి, వి.శాంత పద్మ విభూషణ్‌ అవార్డులు స్వీకరించారు. పద్మభూషణ్‌ అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణి సానియామీర్జా, సాహిత్య రంగానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. వీరితోపాటు ప్రజా వ్యవహారాల రంగానికి చెందిన రవీంద్ర చంద్ర భార్గవ్, పారిశ్రామిక రంగానికి చెందిన ఇందూజైన్‌, నేపథ్య గాయకులు ఉదిత్‌ నారాయణ్‌, కళా రంగానికి చెందిన కన్హయాలాల్‌, ఉన్నారు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన స్వామి తేజోమయానంద, శిల్పకళలో నిపుణులు రామ్‌.వి సుతర్, సాహిత్య రంగంలో ప్రొఫెసర్‌ రామానుజ తాతాచార్య పద్మభూషణ్‌ అవార్డులు స్వీకరించారు. ఇక 40 మంది ప్రముఖులకు రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. సినీరంగానికి చెందిన దర్శకుడు రాజమౌళి, నటి ప్రియాంక చోప్రా, నటులు అజయ్‌దేవ్‌గన్‌, వైద్య రంగానికి చెందిన మన్నం గోపీచంద్‌, మధు పండిట్ దాసా, ఉజ్వల్ దేవ్ రావ్‌ నికమ్‌, తదితరులు పద్మశ్రీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.

12:38 - April 12, 2016

ఎప్పటి నుండో సల్మాన్ అభిమానులు ఎదురు చూస్తున్న 'సుల్తాన్' టీజర్ వచ్చేసింది. ఇటీవలే సుల్తాన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అఫీషియల్ టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ లో సల్మాన్ కండలు తిరిగిన దేహంతో కనబడుతున్నాడు. వ్యాయామాలు చేస్తూ..కుస్తీలు పడుతూ డిఫెంటర్ లుక్స్ తో సల్లు భాయ్ కనిపిస్తున్నాడు. సుల్తాన్ ఆలీ ఖాన్ అనే మల్లయోధుని పాత్రలో సల్మాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కు జోడిగా అనుష్క శర్మ నటిస్తోంది. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో..యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 'సుల్తాన్' ను రంజాన్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

12:38 - April 12, 2016

ముంబయి : నీటి ఎద్దడి ఏ ప్రాంతాన్ని వదలడం లేదు .లారీల్లో, వ్యానుల్లోనే కాదు రైళ్లలోను నీటిని తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం కూడా అందుకు మినహాయింపు కాదు. వాడడానికే కాదు, తాగేందుకు నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో సుమారు 5లక్షల లీటర్ల నీటిని రైలు ద్వారా లాతూరుకు తరలించారు అధికారులు. 300 కిలోమీటర్ల దూరంలోని మిరాజ్‌స్టేషన్లో నీటిని నింపుకుని రైలు ఇవాళ లాతురు చేరుకుంది. మొదట 50 వ్యాగన్ల ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా, దూరం ఎక్కువగా ఉండటంతో 10 వ్యాగన్లకే పరిమితం చేశారు. ఈ నీటితో లాతూరు ప్రజల నీటి కష్టాలు తాత్కాలికంగా తీరనున్నాయి. 

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డు ప్రదానం ఘనంగా జరుగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ సినీ నటులు రజనీకాంత్‌, ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజీరావు, వాసుదేవ్‌ కలుకుంటే ఆత్రే, గిరిజా దేవి, సినీ నటి ప్రియాంక చోప్రా, క్రీడాకారిణి సానియా మీర్జా తదితరులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60కి పైగా పాయింట్లు, నిఫ్టీ 20కిపై పాయింట్లు లాభపడ్డాయి.

కరీంనగర్ జిల్లాలో దొంగల బీభత్సం

కరీంనగర్ : జిల్లాలోని రామగుండం మండలం ఎలుకలపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ మహిళపై దొంగలు దాడి చేసి నగదు, బంగారం అపహరించుకువెళ్లారు.స్థానికులు ఓ దొంగను వెంటాడి పట్టుకొని దేహశుద్ధి చేశారు.

ముంబయిలో అదుపులోకొచ్చిన మంటలు

మహారాష్ట్ర : ముంబై భివాండీలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న పరిశ్రమలో సుమారు గంట పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 9 ఫైరింజన్లు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. భవనంలో లోపల ఉన్న నలుగురితో పాటు పైన ఉన్న వారందరినీ ఫైర్ సిబ్బంది సురక్షితంగా కిందకు దించింది. సహాయక సిబ్బంది అప్రమత్తతో కార్మికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

12:17 - April 12, 2016

నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో కలిసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నవనీత, కన్నెకల్‌కు చెందిన నరేష్‌ లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈనేపథ్యంలో నవనీతకు తన భావతో ఈనెల 3న వివాహం జరిగింది. అయితే బావతో పెళ్లి ఇష్టం లేదని కూడా తల్లిదండ్రులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు బావతోనే నవనీత వివాహం చేశారు. ఈక్రమంలో ఈనెల 7న ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతో ప్రియుడు నరేష్‌ తో కలిసి నవనీత తిప్పర్తి మండలం మాడుగులపల్లి సమీపంలోని బత్తాయితోటలో ఆత్మహత్యకు పాల్పడింది. వీరు వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. 

 

ప్రేమజంట ఆత్మహత్య....

 నల్లగొండ : తిప్పర్తి మండలం మాడుగులపల్లి సమీపంలోని బత్తాయి తోటలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇష్టంలేని వివాహం చేసారని ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్యచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల క్రితమే  ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుపడ్డ మందమర్రి వీఆర్వో చందూ...​

ఆదిలాబాద్ : రూ.7 వేలు లంచం తీసుకుంటూ మందమర్రి వీఆర్ వో చందూ పోలీసులకు పట్టుపడ్డారు.

మరో 400 గ్రూపు-2 పోస్టుల భర్తీ...

హైదరాబాద్ : నిరుద్యోగులకు త్వరలో మరో శుభవార్త అందనుంది. ఇప్పటికే 432గ్రూప్2 పోస్ట్ లకి నోటిపికేషన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటికీ అదనంగా గ్రూప్-2 కొలువుల భర్తీలో భాగంగా మరో 400 పోస్టులు జతకానున్నట్లు సమాచారం. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు వారంరోజుల్లోగా రాష్ట్ర ఆర్థిక శాఖకు చేరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి సమాచారం ఇస్తుంది. అనంతరం సవరణ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

ట్రాక్టర్‌ ఢీకొని బాలుడి మృతి

గుంటూరు : రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మరణించిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బాపట్ల మండలం కొత్తపాలెం వద్ద ట్రాక్టర్‌ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందడంతో బాలుడు బంధువులు విషాదంలో మునిగారు.

11:51 - April 12, 2016

త్రివేండ్రం : కేరళలోని కొల్లం పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన విషాద ఘటనలో 13 మంది అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టింగల్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదంలో 109 మంది మృత్యావాత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కొల్లం కలెక్టర్ షాయినామోల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యవైఖరి స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. బాణాసంచా పోటీలకు అనుమతి నిరాకరించినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారని అన్నారు. స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఎందుకు ఆపలేకపోయారని పోలీసు కమిషనర్‌ను వివరణ అడిగారు.   

 

11:43 - April 12, 2016

గుంటూరు : ఆ మహిళ ఎన్నో సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తోంది. పార్టీయే సర్వస్వమని, తన పార్టీ అధికారంలోకి రావడంతో ఎంతో సంతోషించింది. కష్టకాలంలో పార్టీ నేతలు ఆదుకుంటారని భావించింది. కానీ అవన్నీ నిజం కాదని తెలుసుకుంది. నమ్ముకున్న పార్టీ తనను కాపాడలేనప్పుడు బ్రతికుండడం దండగని ఓ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏకంగా పార్టీ ఎమ్మెల్యే నివాసం ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. 
జిల్లా నిజాంపట్నం మండలానికి చెందిన నాగిడి విజయలక్ష్మి చాలాకాలంగా టిడిపి మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నారు. బిసి కార్పొరేషన్‌ లోన్‌ ఇప్పించాలంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆమెను కొత్తపాలెం సర్పంచ్‌ను కలవమని ఆ ఎమ్మెల్యే చెప్పారు. విజయలక్ష్మి... సర్పంచ్‌ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. తిరిగి ఎమ్మెల్యేను కలిసి పరిస్థితిని వివరిద్దామని... కనీసం కూతురి వివాహానికి సాయమైనా చేయాలని అడిగేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మి... ఎమ్మెల్యే ఇంటిముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడున్న కార్యకర్తలు ఆమెను రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

11:39 - April 12, 2016

కరీంనగర్ : జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సిరిసిల్ల పట్టణంలో అతి వేగంగా వచ్చిన డీసీఎం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడు డీసీఎం కింద ఇరుక్కుపోయాడు. దాదాపు 100 మీటర్ల దూరం డీసీఎం అతన్ని లాక్కెళ్లింది. తీవ్రగాయాలైన ఆ యువకున్ని ఆస్పత్రికి తరలించగా హాస్పిటల్ టల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

 

11:29 - April 12, 2016

చిత్తూరు : సంవత్సరమంతా చదువుకుని విద్యాసంవత్సం ఆఖరులో పరీక్షలు రాయటమనేది విద్యార్ధులు చేయాల్సిన పని. కాకపోతే ఈ మధ్య ఇనెస్టెంట్ ఫుడ్ లాగా ఇనిస్టెంట్ పరీక్షలు రాసేస్తున్నారు మన విద్యార్ధులు. దానికి తమవంతు సహకారాన్ని ఇన్విజిలేటర్లు అందించేస్తున్నారు. ఇలా పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు రేపు కొలువులు సంపాదించాక తమ విధులను కూడా మాస్ కాపీయింగ్ తోనే నిర్వర్తిస్తారా? యువత తెలిసో తెలియకో పెడదారి పెడుతుంటే ఉపాధ్యాయులు మంచిచెడులు చెప్పాల్సింది పోయి వారే సహకరిస్తుంటే రేపు విద్యార్ధుల భవిష్యత్తు ఎలా వుంటుందోకదా...తాజా ఘటనే దీనికి ఉదాహరణ అనుకోవచ్చు. పుత్తూరులోని ప్రభుత్వ ఎస్‌ఆర్‌ఎస్‌ హైస్కూల్ మాస్ కాపీయింగ్‌కు నిలయంగా మారుతోంది. ఓపెన్‌స్కూల్‌ పరీక్షలు తూతూమంత్రగా జరుగుతున్నాయి. పరీక్షరాసేవారికి ఏకంగా పుస్తకాలనే ఇచ్చి వారిచేత పరీక్ష రాయించేస్తున్నారు. పరీక్షకేంద్రానికి ఇన్‌చార్జ్ గా ఉన్న ఓ వ్యక్తి సహాయంతోనే ఈ వ్యవహారం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈమాత్రం దానికి పరీక్షకేంద్రాలకు రావటమెందుకు,ఇంటి దగ్గరే రాసుకోవచ్చుకదా అని కొందరు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

11:29 - April 12, 2016

బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో హాట్‌ హాట్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. పవర్‌ ప్యాకెడ్‌ రాయల్ చాలెంజర్స్  బెంగళూర్‌ జట్టుకు .....సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
క్రికెట్‌ అభిమానులకు ఆసక్తి 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎక్కడ లేని ఆసక్తి. ఎందుకంటే గత మూడు సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లన్నీ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఐపీఎల్‌ 9వ సీజన్‌లో ఈ  రెండు జట్ల మధ్య జరుగనున్న పోటీకి చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమైంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ....డాషింగ్ బ్యాట్స్‌మెన్‌  డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. 
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు కోహ్లీ నేతృత్వం 
ఈ సీజన్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అందరి హాట్ ఫేవరెట్ జట్టుగా టైటిల్‌ వేట స్టార్ట్ చేయబోతుండగా....సన్ రైజర్స్ జట్టు సైతం ఈ సారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని చాలెంజర్స్ జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. కరీబియన్‌ బుల్‌ క్రిస్‌ గేల్‌, సఫారీ సూపర్‌ మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌, కంగారూ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌,స్పీడ్‌ గన్స్‌ ఆడమ్‌ మిల్నే, కేన్‌ రిచర్డ్‌సన్‌, మ్యాజిక్‌ స్పిన్నర్‌ శామ్యూల్‌ బద్రీ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భీకరంగా ఉంది. వీరితో పాటు కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, అరవింద్‌ శ్రీకాంత్‌, మన్‌దీప్‌ సింగ్‌ వంటి ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో సమతూకంగా ఉంది.
కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో విరాట్‌ కొహ్లీ 
ఇక విరాట్‌ కొహ్లీ ప్రస్తుతం కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో ఉండటం చాలెంజర్స్ జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే గత మూడు నెలల్లో టీ 20 ఫార్మాట్‌లో కొహ్లీ.....ఏ స్థాయిలో చెలరేగాడో అందరికీ తెలిసిందే. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల క్రిస్‌ గేల్‌, డివిలియర్స్ లతో పాటు ఆల్‌రౌండర్‌  షేన్‌ వాట్సన్‌, టీ 20 నెంబర్ వన్‌ బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ వంటి ఆటగాళ్ల రాకతో బెంగళూర్‌ టీమ్‌ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. మిషెల్‌ స్టార్క్ గాయం కారణంగా సీజన్‌కు అందుబాటులో లేకపోయినా స్పీడ్‌ గన్స్ ఆడమ్‌ మిల్నే, కేన్‌ రిచర్డ్ సన్‌ వంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లతో చాలెంజర్స్ పేస్‌ బౌలింగ్‌ విభాగంలోనూ దుర్భేధ్యంగా ఉంది. 
బెంగళూరుకు ధీటుగా సన్‌రైజర్స్ జట్టు
డైనమిక్‌ బ్యాట్స్ మెన్‌  డేవిడ్ వార్నర్ సారధ్యంలోని సన్‌రైజర్స్ జట్టు బెంగళూర్‌ జట్టుకు ధీటుగా ఉంది. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో సన్‌రైజర్స్ జట్టు సమతూకంగా ఉంది. డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్‌సన్‌, ఓయిన్‌ మోర్గాన్‌, నమన్‌ ఓజా, బెన్‌ కట్టింగ్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో పాటు...కరణ్‌ శర్మ, అశిష్‌  నెహ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ వంటి అనుభవజ్ఞులైన పేసర్లతో బౌలింగ్‌ విభాగం సైతం పవర్‌ఫుల్‌గా ఉంది.
రైజర్స్ కు ఎదురుదెబ్బ
సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ గాయం కారణంగా  రెండు వారాలు దూరమవ్వడం రైజర్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దీంతో గత సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌పై రైజర్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ సారి కూడా భారీ  అంచనాలే పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌లో శిఖర్‌ ధావన్‌ , మోర్గాన్‌ మిడిల్‌ఆర్డర్‌లో నమన్‌ ఓజా  సైతం అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే హైదరాబాద్‌ జట్టుకు తిరుగుండదు. ఇక లేటు వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న అశిష్ నెహ్రా అనుభవం, కివీ స్పీడ్‌ గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, రైజింగ్ స్టార్‌ ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌లతో కూడిన పదునైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ రైజర్స్ జట్టుకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.బ్యాటింగ్‌ ఆర్డర్‌లో  కేన్‌ విలియమ్‌సన్‌, మోర్గాన్‌లలో ఒక్కరికే అవకాశం దక్కే చాన్స్‌ ఉండగా....ఈ ఇద్దరినీ కాదని పవర్‌ఫుల్‌ హిట్టర్‌గా పేరున్న ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కట్టింగ్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నెహ్రాతో పాటు బౌల్ట్, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌లలో ఒక్కరికే  స్పెషలిస్ట్‌ పేసర్‌గా చోటు దక్కే అవకాశం ఉంది. 
సన్‌రైజర్స్ సంచలన విజయం
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్ సైతం ఇరు జట్లకు సమానంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు ఆరు మ్యాచ్‌ల్లో పోటీపడగా....చాలెంజర్స్ జట్టు మూడు, సన్‌రైజర్స్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌ టైగా ముగిసినా...సన్‌రైజర్స్ జట్టు సూపర్‌ ఓవర్‌లో సంచలన విజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు...పేస్ బౌలింగ్ కు  అనువుగా ఉండే చిన్నస్వామి స్టేడియం పిచ్ పై...హైదరాబాద్ ఫాస్ట్‌ బౌలర్లకు..... పవర్ ఫుల్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌కు మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ స్కోర్లు నమోదు...? 
ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు.. 180 కి పైగా స్కోరు సాధించినా..చేజింగ్‌కు దిగే జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మరి ఈ మ్యాచ్‌లో  నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించే జట్టేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది సేపు సస్పెన్స్‌ భరించక తప్పదు. 

11:25 - April 12, 2016

శాస్త్ర విజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. అంతేగాకుండా ఆడపిల్లలపై వివక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల వస్త్రధారణపై పలు గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని బావ్లీ గ్రామ పంచాయతీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమౌతోంది. ఇటీవల బావ్లీ గ్రామ పంచాయతీ పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో కొన్ని ఆమోదయోగ్యం కాగా మరికొన్ని విమర్శలకు తావిచ్చేదిగా ఉంది. ఆడపిల్లలు జీన్స్ వేసుకోవద్దు...బిగుతైన దుస్తులు కూడా ధరించవద్దని తీర్మానించింది. తమ మాట కాదంటే ఆ కుటుంబాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. వరకట్నం తీసుకోవడంపై మంచి నిర్ణయం తీసుకుంది. వరకట్నం తీసుకోం..ఇవ్వం అని గ్రామంలో ఉన్నవారంతా ప్రతిజ్ఞ చేయాలని హుకుం జారీ చేసింది. ఆడశిశువని చెప్పి గర్భస్రావాలు చేయించరాదని స్పష్టం చేసింది. ఇక వివాహాల్లో డీజే సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని, ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దకర్మ సందర్భంగా నిర్వహించే తేర్ీ ఉత్సవానికి హాజరై భోజనాలు చేయవద్దని సూచించింది. ఈ నిర్ణయాలను పాటించని వారిని గ్రామం నుండి వెలివేస్తామని స్పష్టం చేసింది. 

11:19 - April 12, 2016

తిరుపతి: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని తత్వవేత్తలు చెప్పినవి అక్షరసత్యాలని నేటి సామాజిక పరిస్థితులను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఆస్థికోసం కన్నవారినే హతమారుస్తున్న పరిస్థితులు ఒకవైపు కాసుల కోసం నవమాసాలు కన్న బిడ్డలను అంగట్లో అమ్మకానికి పెడుతున్న కన్నవారు మరొకవైపు మన కళ్ళముందే కనిపిస్తున్నారు. కాగా తాజాగా నేడు కుమార్తెకు ఉద్యోగం కోసం నూరేళ్ళు కలిసి జీవించాల్సిన భర్తనే కడతేర్చటానికి భార్య సిద్ధపడింది. సగటు భారత స్త్రీ కడుపున పుట్టిన బిడ్డలకంటే భర్తనే ఎక్కువగా కోరుకుంటుంది. అలాగే పుట్టినప్పటి నుండి చేయిపట్టుకుని నడిపించి విద్యాబుద్ధులు నేర్పిన కన్నతండ్రిని తన భవిష్యత్తు కోసం హత్య చేసిన కుమార్తెను చూసి మానవత్వం మంటకలిసిపోయిందనుకోవాల్సి వస్తోంది.
టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న మనోహరయ్యకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె పావనికి వివాహమైంది. చిన్న కుమార్తె శిరీష బీటెక్ పూర్తిచేసింది. 10 ఏళ్లుగా భార్య, భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. చిన్న కూతురికి ఉద్యోగం రాసివ్వాలని, ఇప్పుడున్న ఇంటిని పూర్తి స్థాయిలో నిర్మించాలని శారద భర్తను కోరింది. ఇందుకు మనోహరయ్య నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆవేశంలో శారద కుక్కర్ మూతతో భర్తను కొట్టడంతో కిందపడిన అతనిపై తల్లి కూతుళ్లు దిండుతో ముఖాన్ని గట్టిగా అదమడంతో మనోహరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని శారద తమ్ముడైన బాబుకు చెప్పింది. హత్యకు ఉపయోగించిన వస్తువులను అతను మాయం చేశాడు. చివరకు పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. నిందింతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

11:09 - April 12, 2016

కరీంనగర్ : జిల్లాను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు అవుతుండడంతో  జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఎండలను చూడలేదని  ప్రజలు వాపోతున్నారు. 
నిప్పుల కొలిమిలా కరీంనగర్ జిల్లా
కరీంనగర్‌ జిల్లాలో భానుడు భగభగ మండే నిప్పులను కురిపిస్తున్నాడు. రామగుండంలో అత్యధికంగా 40-45డిగ్రీల ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టిస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, వేములవాడలో 41డిగ్రీలు, పెద్దపల్లిలో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 
ఎండవేడిమిని భరించలేకపోతున్న ప్రజలు
ఉపాధి కూలీలు, రోజు వారి కూలీలు, పశువులకాపారులు  ఎండ వేడిమి తట్టుకులేక అల్లాడుతున్నారు.. మూడేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూ గర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో ఎండలు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు
శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ
రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే 45డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయని రానున్న రోజుల్లో 50డిగ్రీల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేడి నుండి తట్టుకునేందుకు కూలర్లు, ఫ్రిజ్ లు, ఏసీలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు శీతలపానీయలకు బాగా గిరాకీ పెరిగింది. పాదచారుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రక్షణ చర్యలను పాటించాలి : వైద్యులు
ఎండ వేడిని తట్టుకువాలంటే రక్షణ చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీటినీ, పండ్ల రసాలను తీసుకోవాలని, ఒంటిలో తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలను తరచూ తీసుకోవడం మంచిదని... వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

 

11:07 - April 12, 2016

ఫేస్ బుక్..ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెలియని వారుండరు. కానీ ఫేస్ బుక్ లో 'మై ఫస్ట్ వీడియో' పేరుతో ఓ వీడియో హంగామా సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది డెస్క్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు వైరస్ బారిన పడిపోయాయంట. అయితే ఈ వీడియో వల్ల మరో ప్రమాదం కూడా ఉందంట. ఈ వీడియోను మీరు టాగ్ చేయకపోయినా..ఈ వీడియో క్లిక్ చేయగానే ఆటోమెటిక్ గా అందరికీ టాగ్ అవుతుందంట. అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఈ వీడియోను ఓపెన్ చేస్తారో వారి స్మార్ట్ ఫోన్ లు వైరస్ కు గురవుతాయి. చాలా మంది ఫేస్ బుక్ యూజర్లు ఈ వీడియో వైరస్ బాధితులుగా మారినట్లు సమాచారం. సో...ఆ వీడియోను మాత్రం ఓపెన్ చేయకండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

11:03 - April 12, 2016

ఢిల్లీ : సాగు తాగు నీటి రంగాల్లో తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు తదితర అంశాలపై కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ ఢిల్లీలో మరోసారి భేటీ అవుతోంది.పీఎం కేఎస్ వై కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 46 ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే అంశంపై  కమిటీ చర్చించనుంది. 
పలు కీలక నిర్ణయాలపై సమస్వయ కమిటీ భేటీ..
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం.. సత్వర అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంపై.. సీడబ్ల్యూసీ పనితీరు మెరుగుపరచడం కేంద్ర జలవనరుల శాఖ సామర్థ్యం పెంచడం వంటి పలు కీలక నిర్ణయాలపై సమస్వయ కమిటీ భేటీ కానుంది. ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల కోసం ఒక రాష్ట్రం ఎంతలా కష్టపడాలో చెప్పడం ద్వారా హరీష్ రావు కేంద్రం దృష్టిని ఆకర్షించారు. 
హరీష్ రావు సూచనలపై కేంద్రం సానుకూల స్పాందన
కేంద్రమంత్రి ఉమాభారతి... హరీష్ సూచనలు సలహాలు ఆయన లేవనెత్తిన సమస్యల పట్ల గతంలో సానుకూలంగా స్పందించారు.  ఒక్కొక్క ప్రాజెక్టు కోసం  కేంద్రం చుట్టూ తిరగాల్సి  రావడంతో అనుమతుల కోసం సీడబ్ల్యూసీ కి నివేదిక పంపితే రెండేళ్లు పడుతుందని  ఆయన కేంద్రానికి విన్నవించారు. ఇందుకు ఉమా భారతి వెంటనే రియాక్ట్ అయి హరీష్ సూచనల మేరకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.  ఛత్తీస్ గడ్ జలవనరుల శాఖ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో  ఈ కమిటీ ఏర్పాటైంది.
పీఎం కేఎస్ వై కింద 46 ప్రాజెక్ట్ లు ఎంపిక 
తెలంగాణ నీటి వనరుల శాఖ  మంత్రి హరీష్ రావు తో పాటు .. మహారాష్ట్ర మంత్రి గిరీష్ దత్తాత్రేయ మహాజన్ లు సమన్వయ కమిటీ లో సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్ - జమ్మూకశ్మీర్, అస్సాం , ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ  కార్యదర్శులకు కూడా కేంద్ర జలవనరుల కమిటీలో స్థానం కల్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను వాటి ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం పేరుతో 46 ప్రాజెక్టులను గుర్తించింది కేంద్రం.
తెలంగాణ నుంచి సెలక్ట్ అయిన దేవాదుల ప్రాజెక్టు
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ సస్టేనబుల్ వాటర్ మేనేజ్ మెంట్ పేరుతో జలమంథన్ 2 ను కూడా నిర్వహించారు. రాబోయే సంవత్సరంలో 23 ప్రాజెక్టులు.. 2020 కల్లా మొత్తం 46 ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీనిలో దేవాదుల మాత్రమే సెలక్ట్ అయింది.దీనిపై హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో 9 ప్రాజెక్టులను కూడా చేర్చాలని విజ్ఞప్తి  చేశారు. మిషన్ కాకతీయకు సహకరించాలని ఉమా భారతిని గత సమావేశంలో  కోరారు.
ప్రాజెక్టుల వైపు కేంద్రం దృష్టిని తిప్పిన మంత్రి హరీష్ రావు..
తన దైన శైలిలో కేంద్రం పెద్దల దృష్టిని తెలంగాణ ప్రాజెక్టుల వైపు తిప్పిన మంత్రి హరీష్ రావు.. సమన్వయ కమిటీలో మరోసారి కీలకంగా మారారు. దీంతో ఈ భేటీలో మరిన్ని ప్రాజెక్టులు ఈ కమిటీ పరిధిలోకి తీసుకుని సత్వరం పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మరి ఈ భేటీలో అయినా సరిహద్దు వివాదాలు తొలగి.. ప్రాజెక్టులు ముందుకు పడతాయో లేదో వేచి చూడాలి.

 

గుంటూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు..

గుంటూరు: జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. 

10:55 - April 12, 2016

నిజామాబాద్ : ఆర్థిక బాధలతో నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే పరిస్థితులు నేడు సమాజంలో కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ఒకవైపు.. పెరగని ఆదాయంతో అవసరాలు తీరలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి నూరేళ్ళ జీవితాలను కుటుంబాలతో సహా ఊపిరి తీసేకుంటున్న వైనం మరోవైపు తరచు ఏదోక ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. అటువంటి సంఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లీ కూతుళ్లు ఒకేసారి బావిలో దూకిన ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. పాత బాన్సువాడలో అద్దె ఇంట్లో ఉండే రాములు-రుక్కమ్మ దంపతులకు గత కొంతతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో గొడవలు జరుతుండేవి. దీంతో మనస్తాపం చెందిన రుక్కవ్వ తన చిన్న కూతురు లావణ్యలు సమీపంలోని పట్లోల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

10:52 - April 12, 2016

మెగా, నందమూరి సినియర్స్ బాక్సఫీసు యుద్దానికి సిద్దమవుతున్నారు. బాక్సాఫీసు వద్ద రెండు దశాబ్దాలు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడ్డ చిరంజీవి, బాలయ్య మరోసారి ఫైట్ కి కత్తులు దూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ సీనియర్ స్టార్స్ బాక్సఫీసు వార్ ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..

మాస్ లో పిచ్చ ఫాలోయింగ్..
మెగాస్టార్ చిరంజీవి, నటసింహా బాలకృష్ణ ఇద్దరు ఇద్దరే. మాస్ లో ఇద్దరి పిచ్చా ఫాలోయింగ్ ఉంది. ఇమేజ్ పరంగా స్టార్ డమ్ పరంగా మెగాస్టార్ బాలయ్య కంటే కాస్త పై చేయి సాధించాడు. అయిన కూడా బాలయ్య స్టార్ డమ్ ని ఏ మాత్రం తక్కువ చేయలేం. 90టీస్ లో ఈ స్టార్స్ సినిమాలు బాక్సఫీసు వద్ద హోరా హోరీగా తలపడ్డాయి. సేమ్ ఇలాంటి పరిస్థితే వీరి కొత్త సినిమాల విషయంలో మరోసారి పున:వృత్తమయ్యేలా కనిపిస్తున్నాయి.

బాలయ్య వందో సినిమా..
మెగాస్టార్, బాలయ్య ఇద్దరు తమ మైల్ స్టోన్ మూవీస్ కి సిద్దమైయ్యారు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' టైటిల్ తో తెరకెక్కబోతున్న తన వందో సినిమాని బాలయ్య ఆల్ రెడీ ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 22 నుంచి రెగ్యూలర్ షూటింగ్ కి సిద్దమవుతోంది. చారిత్రక నేపథ్యంలో రానున్న ఈ మూవీని నభూతో నా భవిష్యత్తే అనే విధంగా రూపొందించాలని దర్శకుడు క్రిష్, బాలకృష్ణ తప్పిస్తున్నారు.

తమిళ 'కత్తి'...
మూడేళ్ల చర్చ జరుగుతున్న చిరంజీవి 150 వ సినిమాపై క్లారిటి వచ్చింది. తమిళ 'కత్తి'నే తన150 వ సినిమాగా చేయాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యాడు. అయితే ఈ మూవీ ఒపెనింగ్ విషయంలోనే క్లారిటి రావడం లేదు. ఫీల్మ్ నగర్ సమాచారం ప్రకారం మెగాస్టార్ కూడా ఈ నెల రోజుల్లో ఈ కత్తి రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని వినిపిస్తోంది. అదే జరిగితే చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య మరోసారి బాక్సఫీసు పోటీ తప్పదు.

10:49 - April 12, 2016

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడంపై.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా..? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా...? చిన్నా..పెద్దా..కుల, మతంతో పాటు లింగబేధం కూడా ఉంటుందా..? అని ప్రశ్నాస్త్రాలను సంధించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడంపై కేసు విచారణ  సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.  
ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టు విచారణ
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ ఈ అంశంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. చట్టం కన్నా సాంప్రదాయమే గొప్పదా అని ప్రశ్నించింది. ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు..? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిటని వ్యాఖ్యానించింది. పైగా దేశంలో తల్లికే మొట్టమొదటి గౌరవం అందిస్తామని, అలాంటప్పుడు స్త్రీలకు ఆలయ ప్రవేశం లేదని ఎలా అంటారని జస్టిస్‌ దీపక్‌మిశ్రా ప్రశ్నించారు. 
మహిళలకు అనుమతి నిరాకరణపై గతంలోనూ తప్పుపట్టిన సుప్రీంకోర్టు 
ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి, ప్రభుత్వానికి, రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టేసే సంప్రదాయం ఏదైనా ఉంటుందా అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు.. మహిళలకు అనుమతి నిరాకరించడంపై.. గతంలోనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రుతు క్రమానికి లోనయ్యే 10 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను బోర్డు అమలు చేస్తోంది. 
ఎన్నో ఉద్యమాల అనంతరం గుళ్లోకి మహిళలకు ప్రవేశం
మహారాష్ట్ర శింగనాపూర్‌లోని శని ఆలయంలోకి కూడా మొన్నటి వరకూ మహిళలను అనుమతించేవారు కాదు. ఎన్నో ఉద్యమాల అనంతరం.. ఉగాది రోజున ఆలయ కమిటీ మహిళలను గుళ్లోకి అనుమింతించింది. ఈనేపథ్యంలోనే శబరిమల విషయంలోనూ సుప్రీంకోర్టు.. ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థించవచ్చని, రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను సంప్రదాయాల పేరుతో అధిగమించరాదన్న భావనను సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ తమకు ప్రవేశం లభిస్తుందన్న విశ్వాసాన్ని.. ఈ అంశంపై పోరాడుతున్న మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 

 

10:47 - April 12, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ యంగ్ డైరెక్టర్ తో కొత్త మూవీకి కమిట్ అయినట్లు టాక్. ఈ మధ్య రిలీజైన మూవీతో మెప్పించిన ఆ దర్శకుడితో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. యంగ్ టైగర్ తో మూవీ చేసే ఛాన్స్ కొట్టేసిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే చదవండి..
ఎన్టీఆర్ స్పీడ్ పెంచాడు. వెంట వెంటనే సినిమాలు చేసేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నాడు. గత ఎడాది టెంపర్ మాత్రమే చేసిన బుడ్డోడు సినిమా సంఖ్య పరంగా వేగం పెంచుతున్నాడు. అందుకే ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఓ కొత్త డైరెక్టర్ మూవీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎడాది 'నాన్నకు ప్రేమతో' సినిమా విజయం ఎన్టీఆర్ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ ఉత్సాహంలో ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న జనతా గ్యారేజ్ ని మూవీని జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కు రిలీజైయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూనియర్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
'అందాల రాక్షసి' సినిమాతో హను రాఘవపూడి క్లాస్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. కానీ నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో కమర్షయల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఈ డైరెక్టర్ ఇటీవలే ఎన్టీఆర్ ఓ స్టోరీ లైన్ చెప్పాడట. హను చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయిన జూనియర్ త్వరలోనే మూవీ చేద్దామని మాట ఇచ్చాడట. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ పూరీతో మూవీ చేస్తాడని వినిపిస్తోంది. మరి ఈ మూవీ తరువాత పూరీజగన్నాథ్ తో చేస్తాడా లేక హను రాఘవపూడితో చేస్తాడా అనేది చూడాలి.

10:44 - April 12, 2016

నాని జెంటిల్ మేన్ అనిపించుకోవాలనుకుంటున్నాడు. అందుకు కోసం ఈ యంగ్ హీరో అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో జోరుమీదున్న నాని జెంటిల్ మేన్ కహానీ ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్న ఈ మూవీ యూనిట్ టైటిల్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఫైనల్ గా ఈ మూవీ టైటిల్ ను కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. నాని కొత్త సినిమాకి నాని జెంటిల్ మేన్ అనే టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. మొదట ఈ సినిమాకి ఎవరితడు అనే టైటిల్ ని పరిశీలించిన చివరికి నాని జెంటిల్ మేన్ వైపే చిత్ర యూనిట్ మొగ్గుచూపారు. దర్శకుడు ఇంద్రగంటి ఇంతకు ముందు నానితో అష్టా చమ్మా సక్సెస్ పుల్ మూవీని తీసిన సంగతి తెలిసిందే. మరి భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాల సక్సెస్ లతో జోరుమీద ఉన్న ఈ మూవీతో హ్యట్రిక్ పై కంప్లీట్ చేస్తాడో చూడాలి.

10:16 - April 12, 2016

భోజనం తరువాత కచ్చితంగా కాసేపు కునుకుతీయాలనిపిస్తుంది. అయితే ఈ పగటినిద్ర మంచిదా కాదా అనే విషయమై అనేక రకాల అనుమానాలున్నాయి. కానీ.. ఇలా కునుకుతీయడం వల్ల మనసు కాస్త కుదుటపడుతుందంటున్నారు పరిశోధకులు. అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. మధ్యాహ్నం పూట కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరి మరింత సమర్థవంతంగా, సృజనాత్మకతతో పని చేయవచ్చు. పగలు కాసేపు పడుకోవడం కళ్లకు కాసింత విశ్రాంతి దొరుకుతుంది. దీంతో మొదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు.. గుండె పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. రక్తనాళాలు శుభ్రపరుస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. వారానికి కనీసం మూడురోజులు అరగంట సేపు పగలు నిదురపోయేవారిలో గుండెజబ్బులతో మరణించే అవకాశం మామూలుకంటే తక్కువ. మధ్యాహ్నం భోజనం మితిమీరి తినడం వల్ల నిద్రముంచుకొస్తుందని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. భోజనం చేయకున్నా మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. క్లిష్ట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరిగేందుకు పగలు నిద్ర పనికొస్తుంది. అలసటను తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. నిద్రించే సమయంలో ముఖంలోని రక్త కణాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. 

10:15 - April 12, 2016

వేసవిలో బయట అతిగా తిరగడం, తినడం ఈ రెండూ పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఆయిల్‌స్కిన్‌ ఉన్నవారిపై మాత్రం ఎండ ప్రభావం స్వల్పంగా ఉంటుంది. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. పాలిస్టర్‌, టెరీకాటన్‌, పట్టునైలాన్‌, షిఫాన్‌ వంటి చీరలను అస్సలు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు నూలు చీరలు మామూలు కాటన్‌ చీరలు వాడటం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు వస్త్రాలను, దుస్తులనుగానీ ఉపయోగించరాదు.
లేత రంగువి లేదా తెలుగు రంగువి ఎండ వేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. బ్రాలని, జాకెట్లను వదులుగా తొడుక్కోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే జాకెట్లు వాడకూడదు. వేసవిలో అలంకరణల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. నూనె పదార్థాలు తినటం అస్సలు మంచిది కాదు.
నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, పైనాపిల్‌, మ్యాంగో వంటి ఫ్యూట్‌ జ్యూస్‌లను తీసుకోవాలి. బాదం మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ వంటివి తీసుకోవచ్చు. మజ్జిగనీళ్ళు, పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయాలి. 

09:49 - April 12, 2016

కడప : అవినీతి తిమింగలాలు ఎసిబికి చిక్కాయి. జిల్లాలోని బద్వేలు రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీహరినాయుడుతోపాటు నలుగురు స్టాంప్ వెండర్ల వద్ద అదనంగా ఉన్న లక్షా 23 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. 

 

09:46 - April 12, 2016

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో ఎస్ ఆర్ బీసీ ఈఈ శేషుబాబు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. రెండు కోట్ల రూసాయల మేర అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. భార్య పేరుతో రూ.కోటి 20 లక్షలు విలువ చేసే భూములున్నట్లు గుర్తించారు. ఆంధ్రా బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకుల్లో శేషుబాబుకు లాకర్లు ఉన్నట్లు... ఆయన పేరు మీద రూ.50 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. 

 

బద్వేలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడప : జిల్లాలోని బద్వేలు రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీహరినాయుడుతోపాటు నలుగురు స్టాంప్ వెండర్ల వద్ద అదనంగా ఉన్న లక్షా 23 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

నంద్యాలలో ఎస్ ఆర్ బీసీ ఈఈ ఇంటిపై ఎసిబి దాడి

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో ఎస్ ఆర్ బీసీ ఇ.ఇ శేషుబాబు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. 

09:35 - April 12, 2016

విశాఖ : అక్రమాస్తుల దారులపై ఎసిబి దృష్టి సారించింది. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగింది. అవినీతి పరుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. సీఆర్ డీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రెహమాన్ ఇంటిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో విశాఖ, విజయవాడ, కర్నూలు సహా 11 చోట్ల తనిఖీలు నిర్వహించారు. రెహమాన్‌కు గుంటూరు కోబాల్ట్ పేటలో సొంత ఇల్లు, తుళ్లూరులో 70 సెంట్ల భూమి ఇటీవల కొనుగోలు చేసినట్లు ఎసిబి గుర్తించింది. విశాఖలోని సిబిఎం కాంపౌండ్‌లో ఇంటిపైనా దాడులు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెహమాన్‌ కుటుంబీకులు, బంధువుల ఇళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయని ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. గతంలో రెహమాన్.. జీవీఎంసీలో అసిస్టెంట్ ఈఈ గా పని చేశారు. 

ముంబయిలోని భివండిలో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర : ముంబయిలోని భివండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబయి సబ్ అర్బన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం.. పవర్ లూమ్ హబ్ లో ప్రమాదం జరిగింది. 80 మంది అగ్నికీలల్లో చిక్కుకున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 
ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

09:29 - April 12, 2016

మహారాష్ట్ర : ముంబయిలోని భివండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబయి సబ్ అర్బన్ భివండి ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం.. పవర్ లూమ్ హబ్ లో ప్రమాదం జరిగింది. 80 మంది అగ్నికీలల్లో చిక్కుకున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు పక్క బిల్డింగ్ కు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్నవారిని రక్షించేందుకు రెస్క్యూటీం ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నలుగురిని సురక్షితంగా కాపాడారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ల సహాయంతో పై అంతస్తుల్లో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

08:55 - April 12, 2016

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా మరోమారు ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇందుకుగాను ఆమె దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకుంది. 'బాజీరావు మస్తానీ' చిత్రంలోని ఉత్తమ నటనకు ప్రియాంక ఈ పురస్కారానికి ఎంపికైంది. దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏటా ఈ అవార్డుని అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రియాంకను ఈ అవార్డు వరించింది. 2011లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన 'సాత్‌ ఖూన్‌ మాఫ్‌' చిత్రంలోని ఉత్తమ నటనకు ప్రియాంక తొలిసారి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకి ఎంపికయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 24వ తేదీన ముంబైలో నిర్వహించే పురస్కార ప్రదానోత్సవంలో ప్రియాంక ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'బేవాచ్‌' హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

 

08:51 - April 12, 2016

బాలీవుడ్‌ టు హాలీవుడ్‌ ట్రెండ్‌ రోజు రోజుకి మరింత క్రేజ్‌ పెంచుకుంటోంది. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి త్వరలోనే బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ చేరనున్నారు. ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్ నిమిత్తం 'మ్యాట్రిక్స్' దర్శకులు లానా వాచౌస్కీ, లిల్లీ వాచౌస్కీ ఇటీవల షారూఖ్‌ని కలిశారు. వీరి మధ్య జరిగిన చర్చలు పాజిటివ్‌గా ఉన్నట్లు షారూఖ్‌ సన్నిహితులు చెబుతున్నారు. 'ఇప్పటివరకు విడుదలైన షారూఖ్‌ సినిమాలన్ని చూశాను, అన్నింటిలోనూ షారూఖ్‌ అద్భుతంగా నటించాడు. తనతో ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రపోజల్‌ పెట్టాం. షారూఖ్‌ కూడా సముఖంగానే ఉన్నారని ఆశిస్తున్నాను' అని 'మ్యాట్రిక్‌' దర్శకుల్లో ఒకరైన లిల్లీ వాచౌస్కీ తెలిపారు.

 

08:49 - April 12, 2016

'గోల్‌మాల్‌' సీక్వెల్స్, 'సింగం' సీక్వెల్స్, 'బోల్‌ బచ్చన్‌', 'చెన్నరు ఎక్స్‌ప్రెస్‌' వంటి వరుస హిట్లతో కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రోహిత్‌శెట్టి, 'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ' వంటి చిత్రాలతో వైవిధ్య పాత్రల కథానాయకుడిగా రణ్‌వీర్‌ సింగ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ బాలీవుడ్‌ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌ సరసన తమన్నా కథానాయికగా ఎంపికైంది. 'బాహుబలి', 'ఊపిరి' చిత్రాలతో దక్షిణాదిలో తమన్నా క్రేజీ హీరోయిన్‌గా మారిన నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి చేసే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 'చాంద్‌ సా రోషన్‌ చెహ్రా' చిత్రంతో తమన్నా బాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. దీని తర్వాత 'హిమ్మత్‌వాలా', 'హమ్‌షకల్స్', 'ఎంటర్‌టైన్‌మెంట్‌' వంటి తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్‌ శెట్టి మాట్లాడుతూ,'ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడప్పుడే వెల్లడించదల్చుకోలేదు. కాకపోతే నేను తెరకెక్కించబోయే చిత్రంలో తమన్నా, రణ్‌వీర్‌ జంటగా నటిస్తున్నారు. రణ్‌వీర్‌ ఎనర్జీకి, దక్షిణాదిలో తమన్నాకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ మా సినిమాకు హెల్ఫ్‌ అవుతాయి. ఓ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్‌తో రూపొందే బహుభాషా చిత్రమిది' అని చెప్పారు.

 

నేడు గుంటూరు జిల్లాలో దత్తాత్రేయ పర్యటన

గుంటూరు : జిల్లాలో నేడు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.  

నేడు వాటర్ బోర్డు ఎదుట టీడీపీ ధర్నా

హైదరాబాద్‌ : గ్రేటర్‌లో నీటి ఎద్దడి నివారణలో ప్రభుత్వవైఫల్యాలను నిరసిస్తూ ఖైరతాబాద్‌ వాటర్‌బోర్డు ప్రధానకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తునట్లు టీడీపీ నగర సెక్రటరీజనరల్‌ ఎమ్‌ఎన్‌ .శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంతరెడ్డి, రాష్ట్ర నాయకులు రావులచంద్రశేఖర్‌ రెడ్డి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు.

సీఆర్ డీఏ టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిపై ఎసిబి దాడులు

విశాఖ : సీఆర్ డీఏ టౌన్ ప్లానింగ్ అధికారి రెహమాన్ ఇంటిపై ఎసిబి దాడులు నిర్వహించింది. విశాఖ, కర్నూలు, విజయవాడ సహా 11 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. రెహమాన్.. గతంలో జీవీఎంసీలో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేశారు. 

గుత్తి టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు

అనంతపురం : జిల్లాలోని గుత్తి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీల నిర్వహించారు. బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో 30 మంది కూలీలు పరారయ్యారు. 

 

08:19 - April 12, 2016

అనంతపురం : జిల్లాలోని గుత్తి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేశారు. 30 మంది కూలీలు పరారయ్యారు. 

08:04 - April 12, 2016

ప్రభుత్వ-ప్రైవేట్ కళాశాలలో సరైన సిబ్బంది లేరని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు, హిందూ రెసిడెంట్ ఎడిటర్... నగేశ్ కుమార్, బీజేపీ నేత రాకేశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. విదేశాల్లో భారతీయ విద్యా వ్యవస్థలపై చిన్న చూపు ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు తెలంగాణలో నెలకొన్న కరవు పై గవర్నర్ సమీక్ష

హైదరాబాద్ : నేడు తెలంగాణలో నెలకొన్న కరవు పై గవర్నర్ సమీక్ష చేయనున్నారు. వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. 

నేడు ఆబ్కారీశాఖ సిబ్బందికి అవార్డులు

హైదరాబాద్ : నేడు ఆబ్కారీశాఖ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలను అందజేయనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబ్ నగర్ : జిల్లాలోని షాద్‌నగర్ శివారులో వేగంగా వచ్చిన అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వ్యాధిగ్రస్తురాలు రామసుబ్బమ్మ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులను కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

పంజాబ్ పై గుజరాత్ లయన్స్ గెలుపు

హైదరాబాద్ : ఐపీఎల్‌లో మొదటిసారి బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు పంజాబ్ పై ఘన విజయం సాధించింది. పంజాబ్ పై లయన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 162 పరుగులు చేసి విజయం సాధించింది.

 

07:46 - April 12, 2016

ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ చట్టానికి 11 సవరణలు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 425ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'దేవాదాయ చట్టానికి 11 సవరణలు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 425 ఆంధ్రప్రదేశ్ లో వివాదస్పదమైంది. ఇది అనేక మంది కౌలు రైతుల గుండెల్లో అలజడి సృష్టిస్తోంది. ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తున్న కౌలు వేలాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు పది శాతం కౌలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు దేవాదాయ భూముల కౌలు రైతులకు దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి రుణాలు మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో దేవాదాయ భూముల కౌలు రైతుల సమస్యలు చర్చించేందుకు ఈ నెల 16న గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నారు. గుంటూరు ఎన్ జీవో కళ్యాణమండపంలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కౌలు రైతుల సదస్సుకు కారణం ఏమిటి? ఈ సదస్సులో ఏయే అంశాలను చర్చించబోతున్నారు? దేవాదాయ భూముల కౌలు విషయంలో వున్న నియమ నిబంధనలేమిటి? చట్టాలేమి చెబుతున్నాయి? 425 జీవో ను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ కాని ఇస్తున్న ప్రోత్సాహకాలేమిటి?  దేవాదాయ భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇస్తున్న సూచనలేమిటి?' ఇలాంటి అంశాలపై కేశవరావు మాట్లాడారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సమానత్వం కోసం అంబేద్కర్ సెంటర్ నుంచి 5కే వాక్

గుంటూరు : డా.బిఆర్ అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆధ్వర్యంలో 5కె రన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొననున్నారు. 

07:35 - April 12, 2016

హైదరాబాద్ : విద్యారంగ ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్త రూల్స్‌ను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టి.. ప్రైవేట్‌ విద్యాసంస్థల భరతం పట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ ఏడాదిని విద్యా సంవత్సరంగా పాటించనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రాథమిక విద్య మొదలుకొని.. ఉన్నతవిద్య వరకు ఉన్న లోపాలను సరిదిద్దేందుకు..విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. ఈ ఏడాదిని విద్యా సంవత్సరంగా కడియం ప్రకటించారు. 
ప్రమాణాలు పాటించని స్కూళ్లపై చర్యలు 
ఇక ప్రమాణాలు పాటించని స్కూళ్లు, కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కడియం సూచించారు. అన్ని విద్యా సంస్థల్లో కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కడియం. మండలాల వారీగా ఎడ్యుకేషనల్‌ ప్రొఫైల్‌ తయారు చేయించనున్నట్లు మంత్రి తెలిపారు. 
టీచర్లకు శిక్షణా తరగతులు 
స్కూల్‌ విద్యను గాడిన పెట్టేందుకు టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కడియం తెలిపారు. అదేవిధంగా టీచర్ల కొరతను తీర్చేందుకు టెట్‌ నిర్వహించిన వెంటనే.. డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఇకపై ప్రతి నెలా సమీక్షాసమావేశాలు నిర్వహించి.. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తామన్నారు. జూనియర్‌, డిగ్రీ, ఫార్మా కాలేజీల్లో జూన్‌ 13లోగా బయో మెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు డిప్యూటీ సీఎం.
స్కూళ్ల ఫీజులపై వారం రోజుల్లో పాలసీ 
ఇక ఫీజుల పేరుతో జలగల్లా పీడిస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలను కట్టడి చేసేందుకు వారం రోజుల్లో ఒక పాలసీని ప్రకటిస్తామన్నారు కడియం. ప్రైవేట్‌ స్కూల్స్‌ పుస్తకాలను సొంతంగా ముద్రించినా.. అమ్మినా చర్యలు తప్పవన్నారు. వీటన్నింటిపై పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు కడియం. మరి విద్యాశాఖ ప్రక్షాళనకు సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. 

 

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

నిజామాబాద్ : మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పరిశ్రమల శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. 

07:26 - April 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో దళితులకు స్థానం కల్పించాలన్న డిమాండ్‌తో ఈనెల 14న నిరసనోద్యమాన్ని చేపట్టనున్నారు. దీని తర్వాత జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలపైనా ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. 
ప్రజా సమస్యలపై ఉద్యమాలు
పార్టీ ఎమ్మెల్యేల వలసలతో కొంతకాలంగా ఉద్యమాలకు దూరంగా ఉన్న తెలంగాణ టీడీపీ నేతలు మళ్లీ పోరు బాట పట్టాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పని చేసేసందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని నిరసనోద్యమాలకు రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ చెప్పిందొకటి... అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటిగా ఉందని తెలంగాణ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. 
కేసీఆర్‌ మంత్రివర్గంలో దళితులకు సముచిత స్థానంలేదు 
తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని ఉద్యమం సందర్భంగా చెప్పిన కేసీఆర్‌... పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో దళితులకు సముచిత స్థానం కల్పింలేదన్న వాదాన్ని లేవనెత్తుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125 వ జయంతి సందర్భంగా ఈనెల 14న మంత్రివర్గాన్ని విస్తరించి దళితులకు స్థానం కల్పించాలని టీ-టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఆరోజు నిరసన వ్రతం చేస్తామని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్‌ పాలనతో దొరల పెత్తనం మళ్లీ వచ్చిందని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. 
కరవు నివారణ చర్యల్లో సర్కార్‌ వైఫల్యం 
రాష్ట్రంలో తాండవిస్తున్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులపై కూడా ఉద్యమించాలని టీ టీడీపీ నేతలు నిర్ణయించారు. కరవు నివారణ చర్యలు చేపట్టడంలో కేసీఆర్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. జంటనగరాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడిపై జలమండలి దగ్గర ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజా కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలనీ టీడీపీ నాయకులు భావిస్తున్నారు. 

07:21 - April 12, 2016

హైదరాబాద్ : గ్రేటర్ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 11 గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాజధాని శివారు పంచాయితీలను మున్సిపాలిటీలు  చేయాలన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంతో అప్పటి నుండి ఆ అంశం ఎటూ  తేలకుండా ఉంది. తాజాగా ప్రభుత్వం  కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై చర్యలు చేపట్టింది.
పంచాయితీరాజ్‌ నుండి 11 గ్రామాలు రిలీవ్
గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాల్లో 11 గ్రామాలను మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలని టీఆర్‌ఎస్  ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 11 గ్రామాలను పంచాయితీరాజ్‌ నుండి రిలీవ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని 5 కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. జాల్లపల్లి, కొత్తపేట, పహాడీషరీఫ్, బాలాపూర్ లోని కొంత ప్రాంతం కలిపి జాలపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు  కానుంది. మీర్‌పేట,జిల్లేలగూడ గ్రామపంచాయితీ మున్పిపాలిటీలుగా ఏర్పాటు కానున్నాయి. ఇక  బోడుప్పల్,చెంగిచెర్ల కలిపి బోడుప్పల్ మున్సిపాలిటీగా  అవతరించనుంది.మేడిపల్లి,పర్వతాపూర్,పిర్జాదీగూడలు కలిసి  పిర్జాదీగూడ మున్సిపాలిటీగా  ఏర్పడనున్నాయి. 
గతంలో ఈ ప్రతిపాదనలకు హైకోర్టు తిరస్కరణ
గతంలో ఈ ప్రతిపాదనలనే సర్కార్ పంపగా హైకోర్టు వాటిని తిరస్కరించింది. ఆ గ్రామాలను ఏం చేయాలనే దానిపై సర్కార్ అనేక కసరత్తులు చేసింది. చివరికి వాటిని కొత్త మున్సిపాలిటీలుగా చేయాలని నిర్ణయించింది. అయితే గ్రామపంచాయితీను మున్సిపాలిటీగా విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
న్యాయపరమైన చిక్కులు..?
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరో వైపు ఆయా గ్రామాల్లో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను  మొదలుపెట్టడానికి లైన్ క్లియర్ కానుంది.

07:12 - April 12, 2016

హైదరాబాద్ : క‌థ రెడీగా ఉంది. క‌థ‌నం  రెడీగా ఉంది. కాని ప్రెజెంటర్ ఎవ‌ర‌నేది తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ . ఇరిగేషన్ పై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు  కౌంటర్ ప్రజెంటేషన్ రెడీ అయింది హస్తం పార్టీ. ఎవరు తెరముందు కథ నడపాలి.. తెరవెనక ఎవరు కథ నడపాలన్న దానిపై మీటింగ్ ల పై మీటింగ్ లు పెడుతున్నా ఓక్లారిటీకి రాలేకపోతున్నారు నేతలు. 
ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ ఝల‌క్ 
మొన్నటి బ‌డ్జెట్ స‌మావేశాల క్లైమాక్స్ లో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ తో ప్రతిపక్షాలకు ఝల‌క్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రజెంటేషన్ పై పెదవి విరిచిన కాంగ్రెస్ నేతలు అధికారప‌క్షంపై క‌త్తులు నూరుతున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ సటైర్లు.. పాలనదోపిడీ పాలన అంటూ వ్యాఖ్యానించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై అల‌ర్ట్ అయిన కాంగ్రెస్ గులాబి బాస్ ప్రజెంటేష‌న్ కు ధీటుగా.. కౌంట‌ర్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు  రెడీ అయ్యింది. కేసీఆర్‌ను మ‌రిపించే స్టాయిలో ఇవ్వాల్సి ఉండ‌టంతో.. ఇదే ఇప్పుడు హ‌స్తం పార్టీకి స‌వాల్ గా మారింది.
ప్రజెంటేషన్ ను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు 
ప్రజెంటేష‌న్ ను స‌క్సెస్ చేసేందుకు తీవ్రక‌స‌ర‌త్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇరిగేషన్ రంగ నిపుణులు, వ్యవ‌సాయరంగ నిపుణులతోపాటు ప‌లువురు మేధావులతో చర్చించి.. వివ‌రాల‌ను సేక‌రించింది. కేసీఆర్ ప్రజెంటేష‌న్ లో చెప్పినవాటికి .. ధీటుగా  కౌంట‌ర్ ఇచ్చేందుకు.. మీటింగ్ లు, రిహార్సల్స్ తో ఫుల్ గా ప్రిపేర్ అయ్యారు హ‌స్తంనేతలు. ఇక్కడే అస‌లు స‌మ‌స్య మొదలైంది. అంతా మాస్ మ‌సాలాతో  రెడీ గా ఉన్నా..దాని ప్రజెంట్ చేసేవారెవరన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారు నేతలు.
ప్రజెంటేషన్ కు అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ పేరు
మొదట పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ చేత ప్రజెంటేష‌న్ కు ప్లాన్ చేశారు పార్టీ నేత‌లు. కాని పార్టీ సీనియ‌ర్ నేత స‌ర్వేతో పాటు కొంద‌రు నేత‌లు శ్రవ‌ణ్ చేత ప్రజెంటేష‌న్ ను ఇప్పించాల‌నే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రుల‌ను వ‌దిలేసి కొత్తగా పార్టీలో చేరిన శ్రవ‌ణ్ కు ఆ బాధ్యత ఇవ్వొద్దని బ‌హిరంగంగానే పీసీసీ చీఫ్ కు చెప్పారు. 
పొన్నాలే బెటర్ అంటున్న పార్టీ నేతలు 
దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలలో ఎవరో ఒకరిచేత  ప్రజెంట్ చేస్తే బాగుంటుందన్న చర్చ నేతల్లో వ్యక్తమవుతోంది. ఐతే దీనిపై మొదటి నుండి జానారెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ్‌, పొన్నాలలో.. గతంలో భారీ,మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం పొన్నాలకు ఉంది. దీంతో  పొన్నాలైతే కొంత బెటర్ అన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. 

 

07:06 - April 12, 2016

మెదక్ : సిద్ధిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. 34 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 22 సీట్లతో ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. ఈ గెలుపుతో సిద్ధిపేటలో మంత్రి హరీష్‌ తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 22 స్థానాలను టీఆర్ ఎస్ గెలుచుకుంది. ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే... 18 సీట్ల బలం కావాలి. టీఆర్‌ఎస్‌ బలం అంతకన్నా ఎక్కువే ఉంది. 
టీఆర్‌ఎస్‌ కోరిక తీరలేదు
అయితే అన్ని వార్డుల్లో గెలుద్దామనుకున్న టీఆర్‌ఎస్‌ కోరిక తీరలేదు. అనూహ్య రీతిలో ఇండిపెండెంట్లు కొన్ని చోట్ల దూసుకుపోయారు. ఆ ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపే అవకాశం ఉంది. మొత్తం 7 వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ లు చెరి రెండు స్థానాల్లో గెలవగా, ఒక వార్డులో ఎంఐఎం గెలుపొందింది. ప్రస్తుతం ఛైర్మన్ పీఠం టీఆర్‌ఎస్‌ వశమైంది. పోలింగ్ కు ముందే టీఆర్‌ఎస్‌ ఆరింటిని ఏకగ్రీవంగా గెలుచుకుంది. 
గెలుపొందిన అభ్యర్థులకు హరీష్‌రావు శుభాకాంక్షలు  
సిద్ధిపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అన్ని పార్టీల అభ్యర్థులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు భారీ విజయం కట్టబెట్టిన సిద్ధిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెబల్స్ గా గెలిచిన అభ్యర్థులను త్వరలోనే పార్టీలోకి తీసుకుంటామని హరీష్ తెలిపారు. ఫలితాల వెల్లడితో ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రకటన విడుదల కానుంది. 

 

06:59 - April 12, 2016

రంగారెడ్డి: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లంతా నర్సింహావతారం ఎత్తాలని కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. నగరాల్లో దారుణంగా ఉన్న కాలనీలను మార్చేందుకు కార్పొరేటర్లు చాలా కష్టపడాల్సిన అవసరముందన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల శిక్షణా కార్యక్రమంలో సీఎం ఇలా దిశానిర్దేశం చేశారు. 
కార్పొరేటర్లు బావిలో కప్పల్లా ఉండొద్దు -కేసీఆర్‌ 
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆస్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో మొదటిరోజు సీఎం ప్రసంగించి.. కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. తన అనుభవాలను కార్పొరేటర్లతో పంచుకున్నారు కేసీఆర్‌. కార్పొరేటర్లు బావిలో కప్పల్లా ఉండొద్దని సీఎం సూచించారు. తమ డివిజన్‌తో పాటు.. మిగిలిన ప్రాంతాల్లోని సమస్యలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. తాను కూడా ఎమ్మెల్యే అయిన కొత్తలో కాస్తా ఇబ్బంది పడ్డానని.. సమీక్ష సమావేశాలకు వెళ్తే ఏమీ అర్ధం కాకపోయేదన్నారు. కానీ తర్వాత అన్నీ విషయాలపై అవగాహన పెంచుకున్నానని కేసీఆర్‌ తెలిపారు. 
మౌలిక వసతులు ఆశించన మేర లేవు 
హైదరాబాద్‌లో మౌలిక వసతులు ఆశించినంతగా లేవన్నారు కేసీఆర్‌. తాను పలు కాలనీల్లో పర్యటించిన సమయంలో దారుణ పరిస్థితులు చూశానన్నారు. నగర ప్రజల దుర్భర జీవితం కళ్లారా చూశానన్నారు. అలాంటి పరిస్థితులు మార్చే అవకాశం కార్పొరేటర్లకు ఉందన్నారు. 
సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా చూడాలి 
ఇక సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేటర్లపై ఉందన్నారు కేసీఆర్‌. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. పదవులు రావడం గొప్పకాదు.. దానిని కాపాడుకోవడం గొప్పని కార్పొరేటర్లు కేసీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలేనని.. అందులో తెలంగాణ, ఆంధ్ర అని వీడదీసి చూడొద్దని కార్పొరేటర్లకు కేసీఆర్‌ సూచించారు. ఆంధ్ర ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నమ్మడం వల్లే జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ గత రికార్డులను తుడిచిపెట్టిందని గుర్తు చేశారు. మొత్తానికి కార్పొరేటర్ల శిక్షణా కార్యక్రమాల్లో మొదటిరోజు సుమారు 2గంటల పాటు కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. మంగళవారం, బుధవారం కూడా కార్పొరేటర్లకు మరిన్ని విషయాలపై శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. 

06:55 - April 12, 2016

విశాఖ : బడుగుల అభ్యున్నతి కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావుపూలే అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. మంచిపనులు చేసేవారు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారని ఏయూలో నిర్వహించిన పూలే 190వ జయంతి సభలో అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు.. షీలానగర్‌లోని 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు విమ్స్ ఆసుపత్రి ఓపి సేవలను ప్రారంభించారు. 
విశాఖలో బిజిబిజిగా చంద్రబాబు పర్యటన  
విశాఖలో సీఎం చంద్రబాబు పర్యాటన బిజిబిజిగా సాగింది. ఉదయాన్నే విశాఖకు చేరుకున్న చంద్రబాబు షీలానగర్‌లో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆ ఆర్వాత నిర్మాణం పూర్తయి ఎప్పటి నుంచో ప్రారంభానికి నోచుకోని విమ్స్ ఆసుపత్రి ఓపి సేవలను సీఎం ప్రారంభించారు. ఆనంతరం ఏయూలో నిర్వహించిన పూలే 190వ జయింతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 
300 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి 
పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు..బడుగుల అభ్యున్నతి కోసం ఉద్యమించిన వ్యక్తి జ్యోతిరావుపూలే అని కొనియాడారు. మహిళాభ్యున్నతికి పూలే భార్య సావిత్రిబాయ్ పూలే విశేష కృషి చేశారన్నారు. పూలే బాటలో ముందుకు సాగాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. 
హెల్త్ సిటీగా విశాఖ 
విశాఖను హెల్త్ సిటీగా మార్చే ఉద్ధేశంతో 35 ఆసుపత్రులకు స్థలం కేటాయిస్తే.. కేవలం రెండు మూడు ఆసుపత్రులనే ప్రారంభించారని సీఎం చెప్పారు. మిగిలిన వారు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ సీరియస్‌ అయ్యారు. బీసీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన 8,832 కోట్లు.. జూన్‌ నుంచి విద్యార్థులకు నెలవారీగా స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ డబ్బులను నేరుగా విద్యార్థుల అకౌంట్లలోనే జమ చేయనున్నట్లు సీఎం చెప్పారు. 
ఏపీకి తలమానికంగా విమ్స్  
విమ్స్ ఆస్పత్రి ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా మారుతుందని,.చక్కని వసతులతో పాటు, మంచి అధ్యాపకులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖకు మరిన్ని కేంద్ర ప్రాజెక్టులు వస్తాయని..వాటితో పాటు విద్య, వైద్యం, రవాణా, మురుగునీటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, అంతర్జాతీయ విమాన సౌకర్యం వంటివన్నీ విశాఖకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ పర్యటనను పూర్తిచేసుకున్న సీఎం చంద్రబాబు అనంతరం విజయవాడ బయలుదేరారు. 

 

నంద్యాలలో ఎస్ ఆర్ బీసీ ఈఈ శేషుబాబు ఇంటిపై ఎసిబి దాడి

కర్నూలు : నంద్యాలలో ఎస్ ఆర్ బీసీ ఈఈ శేషుబాబు ఇంటిపై ఎసిబి దాడి చేసింది. ఎసిబి అధికారులు పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. 

నేడు హైదరాబాద్ లో నీతి ఆయోగ్ సమావేశం

హైదరాబాద్ : నగరంలో ఉదయం 11 గంటలకు నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం కానుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేయనుంది. టీఎస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. 

 

నేటి నుంచి సింగపూర్ బ్యాడ్మింటన్ సీరిస్

హైదరాబాద్ : నేటి నుంచి సింగపూర్ బ్యాడ్మింటన్ సీరిస్ ప్రారంభం కానుంది. పలు దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి.  

నేడు బెంగళూరు-హైదరాబాద్ ఢీ

హైదరాబాద్ : ఐపీఎల్ 2016లో భాగంగా నేడు బెంగళూరు-హైదరాబాద్ జట్లు ఢీకొట్టనున్నాయి. బెంగళూరులో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ వెళ్లనున్నారు. పీఎంకేఎస్ వై తుది సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 

06:31 - April 12, 2016

హైదరాబాద్ : నగరంలోని కృష్ణానగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 46 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 46 బైకులు, 12 ఆటోలతోపాటు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన 46 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 12 గంటలను నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. 

 

హైదరాబాద్ కృష్ణానగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : కృష్ణానగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. 46 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 46 బైకులు, 12 ఆటోలతోపాటు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన 46 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 12 గంటను నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు తనిఖీలు చేశారు. 

Don't Miss