Activities calendar

13 April 2016

21:34 - April 13, 2016

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకేసింది. ఈసారి వర్షాలు బాగుంటాయన్న సమాచారం, ఎగుమతులు పెరగడం మార్కెట్‌ను ఉరకలెత్తించింది. దీంతో సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా పెరిగింది. చివర్లో స్వల్పంగా తగ్గి.. 481 పాయింట్ల లాభంతో 25వేల 627 వద్ద ముగిసింది. అటు నిఫ్టి 141 పాయింట్ల వృద్ధితో 7వేల 850 వద్ద క్లోజైంది.

ఐఎండీ అంచనాలే కాకుండా.. ఇండస్ట్రియల్‌ గ్రోత్ రేట్ పెరగడం కూడా....

మార్కెట్ జోరుకు ఐఎండీ అంచనాలే కాకుండా.. ఇండస్ట్రియల్‌ గ్రోత్ రేట్ పెరగడం కూడా కలిసొచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయంగా లభించిన పాజిటివ్ సంకేతాలతో పాటు... త్వరలోనే రానున్న నాలుగో త్రైమాసికం ఫలితాలు కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రోత్సహించాయి. ట్రేడింగ్‌లో.. బ్యాంకింగ్, ఆటోమోబైల్, అగ్రికల్చర్, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి.

నిఫ్టీలో మహీంద్రా అత్యధికంగా ఏడున్నర శాతం పెరిగింది.....

నిఫ్టీలో మహీంద్రా అత్యధికంగా ఏడున్నర శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బీహెచ్ ఈఎల్, హిండాల్కో 5శాతం వరకు పెరిగాయి. నిఫ్టీలో 50షేర్లలో 4మాత్రమే నష్టాలు చూశాయి. జీ ఎంటర్ టైన్‌మెంట్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, ఆదానీ పోర్ట్స్ స్వల్పంగా నష్టపోయాయి. బిఎస్సీలో 15వందల 68 కంపెనీలు లాభాల్లో ముగియగా... 11వందల 07 సంస్థలకు నష్టాలు తప్పలేదు. 

21:31 - April 13, 2016

ఢిల్లీ : త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిఎస్‌పి అధినేత్రి మాయావతిని అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. మాయావతి అక్రమాస్తులకు సంబంధించి కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఆధారమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మాయావతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ బీఎస్పీ మాజీ సభ్యురాలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే మాయావతి ఆదాయ పన్ను కట్టారని.. విరాళాలకు సంబంధించి కూడా విచారణ జరిగిందని, కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన అవసరం ఏముందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతోనే పిటిషనర్‌ ఈ కేసు పెట్టారని మాయావతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

21:29 - April 13, 2016

ఢిల్లీ : హిందూ మతంలో పురుష హిందువు, మహిళా హిందువు అన్న భేదం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందువు అంటే హిందువేనని...ఇందులో స్త్రీ పురుష తారతమ్య భేదాలుండవని స్పష్టం చేసింది. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవాలయాల్లోకి మహిళల రాకను అడ్డుకోవడమంటే రాజ్యాంగం వారికి ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. శబరిమలలోకి మహిళల రాకను నిషేధించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ఆలయ ట్రస్టు, కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించాయి. శబరిమలలో కొలువైన అయ్యప్ప బ్రహ్మచారి అని, పిల్లలకు జన్మనిచ్చే మహిళల రాక వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లవచ్చునని పేర్కొన్నాయి. రాజ్యాంగం కన్నా సాంప్రదాయం గొప్పదా అంటూ ఆలయ ట్రస్టును సుప్రీంకోర్టు నిలదీసింది. 

21:27 - April 13, 2016

ఢిల్లీ : శ్రీనగర్ నిట్‌ను వేరే చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ... విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద... జరిగిన ధర్నాలో నిట్ తెలుగు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. స్థానికేతరులకు అక్కడ భద్రత లేదన్నారు. వెంటనే క్యాంపస్‌ను వేరేచోటుకు తరలించాలని వారు హెచ్ ఆర్డీ శాఖను డిమాండ్ చేశారు.

 

21:25 - April 13, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఎస్సీలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు క్షమాపణలు చెప్పకుండా.. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టినా అది చిత్తశుద్ది లేనట్టేనని అంబటి విమర్శించారు. 

21:23 - April 13, 2016

విజయవాడ : రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులతో చర్చించారు. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని,.. జూన్‌ 5లోగా వర్షాలు కురుస్తాయన్నారు ప్రత్తిపాటి. దీంతో రైతులందరూ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇక వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రెయిన్‌గన్లు, పంట కాలువల ద్వారా నీరందించే ఏర్పాటు చేస్తామన్నారు ప్రత్తిపాటి.

21:22 - April 13, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజన అంశం మరోసారి రసాభాస అయింది. రెండు రాష్ట్రాల మద్య జరగాల్సిన ఉద్యోగుల విభజన ప్రక్రియ నత్తనడక నడుస్తుండటంతో.... తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు విభజన ప్రక్రియ అంటూ నిలదీయటంతో కమలానాథన్ కమిటీ సమావేశం అర్థాంతరంగా వాయిదాపడింది.

కమలనాథన్‌ కమిటీకి ఉద్యోగుల సెగ......

ఉద్యోగుల విభజనపై పనిచేస్తున్న కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగుల సెగ తగిలింది. చాలా రోజులుగా విభజన ప్రక్రియ నత్తనడక నడుస్తుండటంతో.... ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్, జీఎడీ, పోలీస్ శాఖలోని విభాగంతో పాటు మైన్స్ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల విభజన పై కమలనాథన్ కమిటీ సమావేశమయింది.

ఏపీలో పనిచేస్తున్న 67 మంది తెలంగాణ ఎఎస్‌వోలు...........

రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల విషయంలో ఆలస్యం అవుతుండటంతో తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు 67మంది ఎఎస్ఓలు ఏపీలో పనిచేస్తున్నారు. వారంతా ఏపీ ఉద్యోగులతో పాటు జూన్‌లో అమరావతికి వెళ్లాల్సి వుంది. దీంతో తమ విభజన త్వరగా పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం..............

తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.వోలు, ఎ.ఎస్.వో లు గొడవకు దిగటంతో కమలనాథన్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఉద్యోగులు నేరుగా ధర్నాలకు, వాగ్వాదాలకు దిగటంతో... ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది.

21:20 - April 13, 2016

చింతూరు : గిరిజన ప్రాంతాల్లో 50 యూనిట్‌ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పోలవరం ముంపు మండలాల్లో అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయనన్నారు. ఇప్పటికే ఈ మండలాల్లో ఐటీడీఏ, కాలేజీల అప్‌గ్రెడేషన్‌లాంటి చర్యలు తీసుకున్నామన్నారు.

పోలవరం ముంపు మండలాల్లో పర్యటన....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బుధవారం పోలవరం ముంపు మండలాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ముంపు ప్రాంత ప్రజల పునరావాసం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీలో విలీనమైన మండలాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. గిరిజనులను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నిలుపుతామని, విద్యార్థులు విదేశాల్లో చదువుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజనులకు 50 యూనిట్‌ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించేందుకు నిధులు మంజూరు...

శబరి, పీలేరు నదులపై పని చేయని ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా మెరుగైన వైద్యం అందించేందుకు చింతూరులో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేశామన్నారు. అనంతరం ఆయన కుక్కునూరులో పర్యటించారు. అక్కడ నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వెంకటాపురం బాధితులకు ఇందిరా ఆవాస్‌ యోజన కింద ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పర్యటనలో సీఎం వెంట హోంశాఖ మంత్రి చినరాజప్ప, గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తదితరులు ఉన్నారు.  

21:17 - April 13, 2016

హైదరాబాద్ : మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భారత్‌- మయన్మార్‌ సరిహద్దులో ఏర్పడ్డ భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేలుపై 6.9గా నమోదైంది. భూ ప్రకంపనలు భారత్‌ను కూడా తాకాయి. గౌహతి, కోల్‌కతా, పాట్నా, ఢిల్లీ, చెన్నై షిల్లాంగ్‌, డెహ్రాడూన్‌, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్ తదితర ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది. భూకంపంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

20:34 - April 13, 2016

ఆయన ఎజెండా నెరవేరలేదు? ఆయన కలలు సుదూర తీరంలో అసంపూర్ణంగా ఉన్నాయి. ఆయన స్వప్నించిన ఆశయాలకు స్థానం లేకుండా పోతోంది. కేవలం మాటలకే పరిమితం అవుతున్న రాజకీయ పార్టీలు జయంతులు, వర్థంతులు మాత్రం ఘనంగా చేస్తున్నాయి. విగ్రహాల ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. ఆ దార్శకుడిని తన వాడిని చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. కానీ.. అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎవరు? అంబేద్కర్ ఆశయాలు నెరవేరే మార్గం ఏంటి? బాబా సాహేబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

మయన్మార్ లో భూకపం

హైదరాబాద్ : మయన్మార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.8గా నమోదైంది. కాగా, మనదేశంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, పాట్నా, గువాహటి, షిల్లాంగ్, ఐజ్వాల్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో.. విశాఖపట్టణంలో తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో,శ్రీ కాకుళం జిల్లాలోని సోంపేట, పలాస, నరసన్నపేట మండలంలోని గుర్లాం, చింతలవానిపేట, నడగాం, కుమ్మరిపేటలో స్వల్పంగా భూమి కంపించింది. కాగా, భారత్- మయన్మార్ సరిహద్దులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.95లక్షలు పట్టివేత..

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 95 లక్షల అక్రమ రవాణా చేస్తున్నా ఓ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి తన వెంట రూ. 95 లక్షలను తీసుకువెళ్తున్నాడు. నగదును స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

20:15 - April 13, 2016

మెదక్ జిల్లా కరువును వివరించిన తమ్మినేని... కేసీఆర్ ఒక్కటి కూడా చేయలేదట చెప్పిన పని, ఇంకా జరంత తక్కువతదట ఫ్యాన్ గాలి... వైసీపీలో మళ్లో సీటు ఖాళీ, తెలంగాణ లో అస్సలే దొరుకతలేవట నీళ్లు..పట్టించుకుంటనే లేరట హామీలిచ్చినోళ్లు, చెత్తంత సాఫ్ సఫాయి చేస్తున్న కేటీఆర్... స్పీడు చేసేందుకుండ్రి తయార్, చంద్రాలను పొగిడిన అజయ్ దేవగన్..ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మసాలా ముచ్చట్లు చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:24 - April 13, 2016

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అలాగే తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నాయి. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా రెండు రాష్ట్రప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయా? అస్సలు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు ఎలా ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు? ఇదే అంశంపై హెడ్ లైన్ ఫోలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బెల్యానాయక్, తెలంగాణ కేవీపీఎస్ నేత జాన్ వెస్లీ, టిడిపి నేత జూపూడి ప్రభాకర్, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

అంబేద్కర్ ఉత్సవాలను అడ్డుకుంటాం: హెచ్ సియూవిద్యార్థి సంఘాలు

హైదరాబాద్ : హెచ్ సియూలో రేపు జరిగే అంబేద్కర్ ఉత్సవాలను అడ్డుకుంటామని హెచ్ సియూ విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. యూనివర్శిటీల్లో విద్యార్థులను అణచివేస్తూ అంబేద్కర్ ఉత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని మాండి పడ్డాయి. వీసీ అప్పారావును బదిలీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు.

రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ లో మాల, మాదిగ, మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం స్థానం కల్పించకపోవడంపై రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్శింహ నిరసన దీక్ష చేపట్టనున్నారు. మోత్కుపల్లి దీక్షకు సంఘీభావంగా రేపు అన్ని మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని ఎల్.రమణ, రేవంత్ రెడ్డి లు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కింగ్ కోఠీ వద్ద కార్డన్ సర్చ్

హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు పలుచోట్ల కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని కింగ్‌కోఠీ వద్ద కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

18:40 - April 13, 2016

హైదరాబాద్ : రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛాదర్‌ను పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాదర్‌ను, నగదు నజరానాను అధికారులకు ఇచ్చి అజ్మీర్‌కు సాగనంపారు. అంతకు ముందు ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఛాదర్‌ను అజ్మీర్‌కు తీసుకెళ్తున్నారు. రేపటితో అజ్మీర్ దర్గా ఉత్సవాలు ముగియనున్నాయి.

18:39 - April 13, 2016

హైదరాబాద్ : నగరంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఎన్టీఆర్‌ సమాధి ప్రాంతంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటు హర్షణీయమేనని అయితే అందుకు నగరంలోని నెక్లెస్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, పబ్లిక్‌ గార్డెన్స్‌ అనేక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. దీని వెనుక కుట్ర ఉందని అన్నారు. 

18:38 - April 13, 2016

హైదరాబాద్ : ప్రధాని మోడీ దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. దళితులు స్వశక్తితో ఎదిగి అసమానతలు లేని సమాజం సాధించేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

18:34 - April 13, 2016

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబోయే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం వర్క్‌షాప్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు నిర్మాణరంగంలో అనుభవం ఉన్న పలు సంస్థలతో పాటు ఇన్వెస్టర్లు, టెక్నికల్‌ నిపుణులు పాల్గొన్నారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇళ్లను ఎలా నిర్మించాలి అనే అంశంపై చర్చించారు.

18:31 - April 13, 2016

ఆదిలాబాద్: బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కృష్ణయ్య, హరి, రాము తెలుస్తోంది. అప్రమత్తమైన రిస్క్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. గనిలో రాతి పొర పడటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. కార్మికులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించలేదు.

18:11 - April 13, 2016

తిరుపతి : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల ఫీజులపై '10 టివి' సమరభేరీ మోగించింది. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు, తల్లిదండ్రుల ఆవేదనలను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ సమస్యలపై తిరుపతిలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల మనోగతాన్ని అందించే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

చివరి వరకు కాంగ్రెస్ లోనే: కోమటిరెడ్డి

నల్గొండ : కోమటిరెడ్డి సోదరులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారతామన్నది అవాస్తవమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యమని, కేసీఆర్‌ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

17:47 - April 13, 2016

ముంబై : ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో బీసీసీఐకి బోంబే హైకోర్టు షాకిచ్చింది. ఏప్రిల్‌ 30 తర్వాత మహారాష్ట్రలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశిచింది. మహారాష్ట్రలో తీవ్ర కరవు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. మే నెలలో నిర్వహించే 13 మ్యాచ్‌లను వేరే రాష్ట్రాలకు తరలించాలని ఆదేశించింది. మహారాష్ట్రలో మ్యాచ్‌లకు అనుమతిస్తే కరవు ప్రాంతాలకు 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని బీసీసీఐ హైకోర్టుకు తెలిపింది. దీంతో పాటు రూ.5కోట్లు కరవు సాయం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపై ఏకీభవించని హైకోర్టు ఏప్రిల్‌ 30 తర్వాత నిర్వహించే మ్యాచ్‌లనుఎట్టి పరిస్థితుల్లోనూ తరలించాల్సిందేనని బీసీసీఐని ఆదేశించింది. ముంబై హైకోర్టు నిర్ణయంతో బీసీసీఐకి రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది.

ముగిసిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం

ఢిల్లీ : పేదరిక నిర్మూలనపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం ముగిసింది. పేదరిక నిర్మూలనపై తమ అభిప్రాయాలను తెలియజేశాయని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద పనగారియా తెలిపారు. దార్రిద్యరేఖతో నిమిత్తం లేకుండా ప్రజల కనీస అవసరాలు తీర్చాలని సూచించినట్లు పేర్కొన్నారు.

మత్తయ్య క్యాష్ పిటీషన్ పై వాదనలు పూర్తి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో మత్తయ్య క్యాష్ పిటీషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. అయితే తీర్పును మారత్రం హైకోర్టు రిజర్వ్ చేసింది.

మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు తరలింపు

హైదరాబాద్ : ఏప్రీల్ 30 తర్వాత మహాష్ట్ర నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.

మహారాష్ట్రకు కరువు సాయంగా రూ.5 కోట్లు: బీసీసీఐ

హైదరాబాద్ : ఐపీఎల్ మ్యాచ్ లపై మహారాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామని బీసీసీఐ ప్రకటించింది. లాతూరు సహా ఇతర ప్రాంతాలకు 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. నాగ్ పూర్ లోని మ్యాచ్ లను మరో చోటికి మార్చేందుకు వీసీఏను సంప్రదిస్తామని స్పష్టం చేసింది. మహారాష్ట్రకు కరువు సాయంగా రూ.5 కోట్లు చెల్లిస్తామని బీసీసీఐ తెలిపింది.

తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఏసీ జనరేటర్ల ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ తో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కరువు నిధులున్నా ఖర్చు చేయడం లేదు: దత్తాత్రేయ

హైదరాబాద్ : కరువు నిధులున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని కేంద్ర దత్తాత్రేయ విరుచుకుపడ్డారు. కరువు నిధులు ఖర్చు పెడితే అదనపు నిధులు ఇస్తామని కేంద్ర మంత్రులు తెలిపారని దత్తాత్రేయ తెలిపారు. కేంద్రానికి రబీ పంట నష్ట నివేదిక ఇంకా అందలేదని, తెలంగాణ లో కేంద్ర మంత్రులను పర్యటించాలని కోరినట్లు తెలిపారు. ఉపాధిహామీ పనులకు రూ.615 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్‌మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుల్‌ పరుగులు పెట్టింది. బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 481 పాయింట్ల లాభంతో 25,626 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 141 పాయింట్లు లాభపడి 7,850 వద్ద ముగిసింది. 

బొగ్గుగనిలో ప్రమాదం : ముగ్గురి మృతి

ఆదిలాబాద్: బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కృష్ణయ్య, హరి, రాము తెలుస్తోంది. అప్రమత్తమైన రిస్క్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. గనిలో రాతి పొర పడటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. కార్మికులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించలేదు.

20 టన్నుల కల్తీ నూనె స్వాధీనం....

హైదరాబాద్ : నగరంలో కల్తీ నూనెల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిపై పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం అరికట్టలేకపోతున్నారు. దీంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్దర్‌నగర్‌లో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పశువుల కొవ్వు, ఎముకలతో నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 20 టన్నుల కల్తీ నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

17:01 - April 13, 2016

నీట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విద్యార్థులకు లబ్ది చేకూరుతుందా ? టెస్ట్‌ ఏదైనా మన సీట్లు మనకే వస్తాయా ? అసలు నీట్‌ వల్ల ప్రయోజనాలేంటి... వచ్చే నష్టాలేంటి..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. నీట్‌ని నిర్వహణ ప్రయోజనాలు.. నష్టాలేంటో ఓసారి చూద్దాం.

ఎంబీబీఎస్‌, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశం.....

నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌...నీట్‌. మన దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సంబంధిత పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష. దీన్ని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా ఉపసంహరించుకుంది. నాటి తీర్పును తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని..తాజాగా విచారణ జరుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో నీట్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. నీట్‌ అమలు చేస్తే తెలుగు విద్యార్థులకు లాభమా, నష్టమా అన్న సందేహం.. తల్లిదండ్రుల్లో నెలకొంది.

ఎంసెట్‌తో పాటు 10 టెస్టులు .....

వాస్తవానికి మెడిసిన్‌ రాయాలనుకునే రెండు రాష్ట్రాల విద్యార్థులు స్థానిక ఎంసెట్‌తో పాటు పది దాకా జాతీయ స్థాయి టెస్టులు రాసేవారు. వీటి కోసం విద్యార్థులు రకరకాల మెటీరియల్‌పై దృష్టి సారించాల్సి వచ్చేంది. ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలయ్యే.. ఈ మెడికల్‌ ఎంట్రెన్స్‌లు మే చివరి వరకు కొనసాగేవి. నీట్‌ అమల్లోకి వస్తే ఈ పది టెస్టులకు బదులు ఒకటే టెస్టు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాలు సహా మరి కొందరి విజ్ఞప్తి మేరకు తెలుగుకు తోడు ఆయా భాషల్లోనూ పరీక్ష నిర్వహించేందుకు నీట్‌ నిర్వాహక మండలి గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది తెలుగు విద్యార్థులకు అతిపెద్ద విజయమనే చెప్పాలి. నీట్‌ను కొత్తగా ప్రవేశపెడుతున్నందున కష్టమైనా, నష్టమైనా అందరికి ఒకేలా ఉంటుంది. ఇది విద్యార్థులకు వరం లాంటిది.

నీట్‌తోనే మెడిసిన్‌, డెంటల్‌ సీట్లు భర్తీ .....

ఇక నీట్‌తో మాత్రమే మెడిసిన్‌, డెంటల్‌ సీట్లు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించినా..అది రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడంపై కొన్ని సందేహాలున్నాయి. అందుకు 371-డి ఆర్టికల్‌ అడ్డం వచ్చే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ ఆర్టికల్‌ అమలవుతోంది. సాధారణంగా నీట్‌లో పాల్గొనాలనుకునే రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న మెడికల్‌ సీట్లలో 15శాతం సీట్లను జాతీయ పూల్‌కు ఇవ్వాలి. కానీ ఆర్డికల్‌ 371-డి పరిధిలో ఉన్న రాష్ట్రాలు ఈ 15శాతం సీట్లను ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో వందకు వందశాతం సీట్లు మనకే దక్కనున్నాయి. ఇక నష్టం విషయానికొస్తే...పలు టెస్టులకు బదులుగా నీట్‌ రాయాలి. అంటే ఏ కారణం చేతనైనా ఈ టెస్టు సరిగ్గా రాయలేకుంటే ..మెడిసిన్‌పై కన్న కలలకు నీళ్లు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఒకటి కాకుంటే మరొకటి అనే ఆప్షన్‌ ఇక్కడ ఉండదు.

ఈ ఏడాది నీట్‌ నిర్వహణ అసాధ్యం......

నీట్‌ను నిర్వహించుకునే విధంగా సుప్రీంకోర్టు తీర్పుఇచ్చినా...అది ఈ ఏడాది సాధ్యం అయ్యేలా కన్పించడంలేదు. ఈ ఏడాది నీట్‌ నిర్వహణ ఆచరణలో అసాధ్యమని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చిచెప్పింది. వైద్య కళాశాలల్లో ప్రవేశపరీక్షలకు సంబంధించి డిసెంబర్‌ నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఒకటి రెండు పరీక్షలు ఇప్పటికే అయిపోయాయని కేంద్రం తెలిపింది. దీంతో ఈ ఏడాది నీట్‌ లేనట్లేనని తేలిపోయింది. ఏది ఏమైనా నీట్‌ పరీక్ష మెడిసిన్‌, డెంటల్‌ రాయాలనుకునే విద్యార్థులకు ఓ గొప్ప వరమేనని విద్యావేత్తలు చెప్తున్నారు. 

మణుగూరులో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు...

ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈక్రమంలో మణుగూరు పట్టణంలో అత్యధికంగా 50 డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఎండల పట్ల అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే.

16:57 - April 13, 2016

హైదరాబాద్ : తొమ్మిది పదులు. తొంభై ఏళ్లు. బాపురే ఇంత లేటు వయస్సులోనూ తామింకా కుర్రాళ్లమేనని నిరూపిస్తున్నారు ముగ్గురు నాయకులు. సిఎం పదవి రేసులో వున్న ఆ ముగ్గురు నేతలు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్ధులను కలవరపెడుతున్నారు. ఎవరా ముగ్గురు? ఏమిటా వారి స్పెషాల్టీ?

ఈ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి పదవి రేసులో ....

ఈ ముగ్గురూ ఇప్పుడు అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నారు. మూడు రాష్ట్రాలకు చెందిన ఈ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి పదవి రేసులో వుండడం విశేషం. వీరు ముగ్గురూ ముఖ్యమంత్రులుగా ఎన్నికైతే బహుశా భారతదేశంలో ఓ అరుదైన రికార్డు నమోదవుతుందేమో. కరుణానిధి పేరు వినగానే ఒక్కసారిగా తమిళనాడు కళ్లల్లో మెదులుతుంది. . తమిళనాడు రాజకీయాల్లో ఆయన తలపండిన నాయకుడు. 20 ఏళ్ల చిన్న వయస్సులోనే సినిమా స్క్రిప్టు రైటర్ గా సంచలన విజయం సాధించిన కరుణానిధి రాజకీయాల్లోనూ కళైంజర్ గా తన ముద్ర వేశారు. ఇప్పుడు కరుణానిధి వయస్సు 94 ఏళ్లు. 75 సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన కరుణానిధి అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 ఏళ్లకు మించిన రాజకీయ అనుభవం వున్నవాడు. తనకు మాదిరిగానే అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితను ఓడించి, ఆరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును తన సొంతం చేసుకోవాలన్నది ఈ పెద్దమనిషి పంతం. 2009 లో స్పైనల్ సర్జరీ చేయించుకున్న కరుణానిధి వీల్ చైర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుండడం విశేషం.

అచ్యుతానందన్, కరుణానిధి ఒకే వయస్సు వారు...

కేరళలో అచ్యుతానందన్ ది ఇంచుమించే కరుణానిధి వయస్సే. కరుణానిధి 1922లో జన్మిస్తే, అచ్యుతానందన్ 1923లో జన్మించారు. కళైంజర్ కి 94 అయితే, ఈ కామ్రేడ్ కి 93 ఏళ్లు. ఆయనదీ సుదీర్ఘ రాజకీయ అనుభవమే. 1967లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అచ్యునందన్ ఒకసారి ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ త్రుటిలో తప్పిపోయింది. 1996 ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ సిఎం అభ్యర్ధిగా రంగంలోకి దిగిన్నప్పటికీ, తమ కూటమికే మెజార్టీ దక్కిన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవి మిస్ అయ్యారు. అప్పుడు ఈకె నయనార్ ను ఆ పదవి వరించింది. ఆ తర్వాత 2006లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్యుతానందన్ ఇప్పుడు మరోసారి పోటీపడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే అచ్యుతానందన్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు 30 ఏళ్ల కుర్రాడిలా ఆయన హ్రుదయం పనిచేస్తోందంటూ కితాబివ్వడం విశేషం. మండుటెండల్లో యువకులతో పోటీ పడి ప్రచారంలో పాల్గొంటున్న అచ్యుతానందన్ రోజుకి కనీసం అయిదారు సభల్లో ప్రసంగిస్తున్నారు.

మరో నాయకుడు తరుణ్ గొగాయ్.....

ఇక కరుణానిధి, అచ్యుతానందన్ తర్వాత అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్న మరో నాయకుడు తరుణ్ గొగాయ్. ఈయన వయస్సెంతో ప్రపంచానికి గుర్తు చేసిన ఘనత మాత్రం ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుంది. 90 ఏళ్ల వయస్సు ముఖ్యమంత్రి ఎందుకంటూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తరుణ్ గొగాయ్ నెత్తిన పాలు పోస్తాయో లేదో కొద్ది రోజుల్లో తేలిపోతుంది. 1931లో జన్మించిన తరుణ్ గొగాయ్ వయస్సు 81 ఏళ్లు. అయితేనేం డిజిటల్ యుగపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న నాయకుడాయన. సోషల్ మీడియాను వాడుకోవడంలో దిట్ట. దివంగత రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగాయ్ అస్సాంలో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ని గెలిపించి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడుసార్లు సింహాసనం అధిరోహించిన తరుణ్ గొగాయ్ లక్షణం నాలుగోసారి ఆ కోరిక తీర్చుకోవాలని ముచ్చటపడుతున్నారు. 2011 ఎన్నికలకు ఆరు నెలల ముందే తనకు హార్ట్ సర్జరీ అయిన్నప్పటికీ ప్రచారాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం విశేషం. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టయిల్, జీన్స్, విల్ పవర్, మేధో శ్రమ 90 ఏళ్ల వయస్సుల్లోనూ తరగని ఉత్సాహానికి కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్. కరుణానిధి కి యోగా చేస్తారు. నాలుగున్నరకే నిద్ర లేవడం, గంట సేపు యోగా, ముప్పై నలభై నిమిషాలు వాకింగ్ అచ్యుతానందన్ కి అలవాటు. తరుణ్ గొగాయ్ కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మార్నింగ్ వాకింగ్ కి బ్రేక్ ఇవ్వరట.  

కృష్ణా నగర్ లో నిర్భంద తనిఖీలు...

హైదరాబాద్ : కృష్ణానగర్ లో పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో 300ల మంది పోలీసులు పాల్గొన్నారు.

16:37 - April 13, 2016

హైదరాబాద్ : మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో చిట్టెం టీఆర్‌ఎస్‌లో చేరారు. అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చిట్టెం తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డితో చర్చల అనంతరం ఇరువురు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ తన సోదరి డీకే అరుణ రాజకీయం తన రాజకీయం వేరు వేరని తెలిపారు. 

ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన : మంత్రి కడియం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లపై 21 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయ్యింది. ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు టీ.సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానకి శంకుస్థాపన చేయస్తారని కడియం పేర్కొన్నారు. ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి అనే విషయం తెలిసిందే.

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై సుప్రీంకోర్టులో పిటీషన్...

ఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. కొత్తగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా గతంలో కూడా ఇదే అభియోగంపై సీబీఐ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మాయావతికి వ్యతిరేకంగా సీబీఐ మోపిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదని, అందువల్ల ఈ కేసును ఆమెపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పటం గమనించదగిన విషయం.

గని ప్రమాదంలో కార్మికుడికి గాయాలు...

ఆదిలాబాద్ : భూగర్భ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. మందమర్రిలోని గని పైకప్పు కూలి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కార్మికుడి సహోద్యోగులు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు గనిలో చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సహాయక చర్యలను ముమ్మరం చేశారు

రూ.110కోట్ల చేనేత రుణాలు మాఫీ : మంత్రి కొల్లు

విజయవాడ : విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమం, ఎక్సైజ్‌, చేనేత సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...త్వరలో చేనేత రుణాలు మాఫీ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రూ.110 కోట్ల చేనేత రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ రుణమాఫీలో 25వేల మంది లబ్ది పొందనున్నట్లు ఆయన తెలిపారు.

అరటన్ను ఎర్రచందనం దుంగలు స్వాధీనం....

తిరుపతి : చంద్రగిరి మండలం చీకటీగలకోన అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూబింగ్ చేపట్టింది. 500ల కిలోల ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని..ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. 

మాల్యాపై ఈడీ 'ఫైర్' అయ్యింది…...

హైదరాబాద్ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై ఈడీ 'ఫైర్' అయ్యింది. బ్యాంకుల‌కు చెల్లిచాల్సిన కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల‌కు చెక్కేసిన వ్యాపారి విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) మ‌రింత ఫైర్ అయింది. మాల్యా విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంపై మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలని సంబంధిత అధికారుల‌ను కోరింది.  ఇప్ప‌టికి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా విజ‌య్‌మాల్యా ఈడీ ముందు హజరుకాని విషయం తెలిసిందే. దీంతో విజ‌య మాల్యా ఈడీ మ‌రింత ఉచ్చు బిగుసుకోనుంది.

రైల్ రోకో కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు...

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, సోలీపేట రామలింగారెడ్డిపై వున్న కేసును సికింద్రాబాద్ రైల్వే కోర్టు కొట్టివేసింది. రైల్ రోకో కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర విమోచన సందర్భంగా జరిగిన 'రైలు రోకో' చేపట్టిన విషయం తెలిసిందే.

ఇంజనీరింగ్ విద్యార్ధి ఆత్మహత్య...

శ్రీకాకుళం : రాజాంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. జీఎమ్ ఆర్ ఐటీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న శ్రీకర్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పరిశీలించారు. అనంతరం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

14:54 - April 13, 2016

చింతూరు : తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని... వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.చింతూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పాపి కొండలను పర్యాటక కేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు. అడవులపై ఆధారపడి చాలామంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారని... వారందరికీ జీవనోపాధి కల్పిస్తామన్నారు. కరవును తట్టుకుని వ్యవసాయం చేసేలా రైతులను ఆదుకుంటామన్నారు. గిరిజన పిల్లలు మట్టిలో మాణిక్యాలని... వారికి నాణ్యమైన విద్యనందిస్తే పిల్లలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారన్నారు. గిరిజన విద్యార్థులను అన్ని రకాల పరీక్షలకు సన్నద్ధం చేస్తామన్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అస్సాంలో బ్రిటన్ విలయం దంపతులు..

అస్సాం : భారతదేశ పర్యటనలో ఉన్న బ్రిటన్ రాకుమారుడు విలియం, కేట్ మిల్టిన్ దంపతులు అస్సాంలో పర్యటిస్తున్నారు. కాజిరంగ అనే గ్రామంలో వీరు పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. వారి హస్త కళలను పరిశీలించారు. 

14:48 - April 13, 2016

చెన్నై : తమిళనాట ఎన్నికల ప్రచార యుద్ధం షురూ అయింది. ఇప్పటి వరకు పొత్తులు, సీట్ల పంపకాలపైనే దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల రణరంగానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలు డిఎంకె, అన్నాడిఎంకేలతో యుద్ధమేనంటూ డిఎండికె అధినేత విజయ్‌కాంత్‌ ప్రచార భేరీ మోగించారు. ఎలక్షన్ క్షేత్రంలో తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామంటూ సవాలు విసిరారు.

వేడెక్కిన ఎన్నికల ప్రచారం...

తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రచారాన్ని ముందుగా జయలలితే ప్రారంభించినా రెండవవాడిగా డిఎండికె అధినేత విజయ్‌కాంత్ మాటల యుద్ధానికి తెరదీశారు. గుమ్మిడిపూండిలో ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ను ఆర్భాటంగా ప్రారంభించిన కెప్టెన్... 40 ఏళ్లుగా మార్చి మార్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న పార్టీలకు ఇకనైనా స్వస్తిపలకాలని పిలుపునిచ్చారు.

సీఎం అభ్యర్థిగా విజయ్ కాంత్....

తమిళనాట కెప్టెన్‌గా ప్రసిద్ధికెక్కిన విజయ్‌కాంత్ పద్నాలుగేళ్ల కిందట డిఎండికె పార్టీని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతూ ఫేట్‌ను పరీక్షించుకోబోతున్నారు. డిఎంకె, అన్నాడిఎంకెలకు ప్రత్యామ్నాయం తమ కూటమేనని చెప్పుకుంటున్నారు. వైగో నేతృత్వంలోని ప్రజా సంక్షేమ కూటమిలో డిఎండికేనే ప్రధాన పార్టీగా మారింది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్‌ బరిలో నిలుస్తున్నారు. తన పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నా అదంతా ప్రత్యర్థి పార్టీల కుట్రలో భాగమేనని చెబుతున్నారు. 40 ఏళ్లుగా విడతలవారిగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న డిఎంకె, అన్నాడిఎంకేలకు ఈ ఎన్నికల్లో చెక్‌ పెట్టాలని విజయ్‌కాంత్ ప్రచారసభల్లో చెబుతున్నారు. తనకో అవకావం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చేసి చూపిస్తానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ఇంటికి పంపేందుకే ఆరు పార్టీలతో ప్రజా సంక్షేమ కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజా సంక్షేమమంటే ఏంటో డిఎంకె, అన్నాడిఎంకేలకు తెలియదు: విజయ్ కాంత్

ప్రజా సంక్షేమమంటే ఏంటో డిఎంకె, అన్నాడిఎంకేలకు తెలియదని విజయ్‌కాంత్ ఆరోపిస్తున్నారు. మద్య నిషేధంపై 30 ఏళ్లుగా నోరెత్తని ఆ రెండు పార్టీలు ఇప్పుడు కొత్తగా ఆ విషయాన్ని తెరపైకి తెచ్చి బొంకుతున్నాయని విమర్శించారు. తమిళనాట దశాబ్దాలుగా అధికారాన్ని డిఎంకె, అన్నాడిఎంకేలే పంచుకుంటున్నాయి. మరి కొత్తగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి ఆ రెండిటికీ చెక్‌ పెట్టగలుగుతుందో లేదో చూడాలి. 

14:44 - April 13, 2016

బాబీ సింహా, నటి రేష్మి మేనన్ వివాహానికి ముహూర్త కుదిరింది. ఈనెల 22వ తేదీన తిరుపతిలో వీరి కళ్యాణం జరగనుంది. కుటుంబసభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరుగుతుందని తెలుస్తోంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ యాక్టర్ బాబీ సింహా, హీరోయిన్ రెష్మిలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు కలిసి నటించిన 'ఉరుమీన్' అనే తమిళ సినిమా షూటింగ్ మొదలయినపుడే వీరి మధ్య ప్రేమ పుట్టిందని టాక్. వాస్తవానికి రేష్మి మీనన్ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదని..ఇద్దరూ సీరియస్ గా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతో చేసేది ఏమీ లేక ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

14:43 - April 13, 2016

ఢిల్లీ: ఎన్‌ఐఏ అధికారి తంజిల్‌ అహ్మద్‌ భార్య ఫర్జానా కన్ను మూశారు. ఏప్రిల్‌ 3న తంజిల్‌ కుటుంబంతో కలిసి అల్లుడి వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తంజిల్‌ అహ్మద్‌ అక్కడికక్కడే మృతి చెందగా...ఆయన భార్యకు బుల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తంజిల్‌ అహ్మద్‌కు 24 బుల్లెట్లు తగిలాయి. ఈ దాడి ఘటనలో ఆయన పిల్లలు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. ఈ ఘటనను ముందు టెర్రరిస్టు దాడిగా భావించినా ఆస్తి తగాదాలే హత్యకు దారితీసాయని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి షూటర్‌ మునీర్‌, రిజ్వాన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

14:42 - April 13, 2016

హైదరాబాద్ : కమలనాథన్‌ కమిటీ తీరుపై ఏపీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా కమిటీ వ్యవహరిస్తోందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పదవీ కాలాన్ని పెంచుకునేందుకే ఉద్యోగుల విభజనను పొడిగిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం గైడ్‌లెన్స్‌ ప్రకారం ఉద్యోగుల్ని విభజించాలని డిమాండ్‌ చేశారు. 

14:40 - April 13, 2016

ఢిల్లీ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ పాస్‌పోర్టు ఆఫీస్‌కు ఈడీ లేఖ రాసింది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి మాల్యా ఈడీకి సహకరించడం లేదని లేఖలో పేర్కొంది. మూడు సార్లు ఈడీ ముందు హాజరు కాకుండా మాల్యా డుమ్మా కొట్టాడని తెలిపింది. మార్చి 18, ఏప్రిల్‌2, ఏప్రిల్‌ 9న ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరు కావాలని మాల్యాకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న 9 వందల కోట్ల రుణం ఎగవేత కేసులో మాల్యాపై ఈడీ విచారణ జరుపుతోంది. మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద నిందితుడు హాజరు కావడానికి ఈడీ మూడు సార్లు సమయమిస్తుంది....అప్పటికి హాజరు కాకుంటే పాస్‌పోర్టును రద్దు చేయడం లేదా...నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉంది.

14:38 - April 13, 2016

హైదరాబాద్ :మన సమాజంలో ప్రస్తుతం రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అస్సలు దీనికి గలకారణాలు ఏమిటి? దీనిపై తల్లిదండ్రులు, సమాజం యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది? ఇలాంటి అంశాలపై 'మై రైట్' కార్యక్రమంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ పార్వతి గారు వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...


 

విలీన మండలాల అభివృద్ధికి కృషి - బాబు..

తూర్పుగోదావరి: విలీన మండలాల అభివృద్ధికి ప్రత్యేక శద్ధ కనబరుస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విలీన మండలాల్లో నాణ్యమైన విద్యనందిస్తామని, కొత్త చట్టాల ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీనిచ్చారు. పోలవరంలో 190 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందచేయడం జరుగుతుందన్నారు. 18,500 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని, గిరిజనులు కొరుకొంటే మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామన్నారు. భూమికి బదులు భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. 

అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన బాబు..

తూర్పుగోదావరి : చింతూరులో అంగన్ వాడీ కేంద్రం ఐటీడీఏ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

నెల్లూరు : వెంకటగిరి (మం) వడ్డిపల్లిలో నలుగురు ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. రూ. 7.4 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

తులసీరెడ్డి హత్యాయత్నం కేసులో 9 మంది అరెస్టు..

కర్నూలు : జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు తులసీరెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. ఆరుగురు కిరాయి హంతకులు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో భూమా వర్గీయులున్నారు. ఆరు వేట కొడవళ్లు, 2 బైక్ లు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తులసీరెడ్డి హత్యకు రూ. 12 లక్షల సుఫారీ తీసుకున్నారు. 

కమల్ నాథన్ కమిటీ తీరుపై ఏపీ ఉద్యోగుల అసంతృప్తి..

విజయవాడ : కమల్ నాథన్ కమిటీ తీరుపై ఏపీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, పదవీ కాలాన్ని పెంచుకొనేలా కమల్ నాథన్ వ్యవహరిస్తున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే ఉద్యోగుల విభజన చేయాలని, కమల్ నాథన్ తీరుపై సీఎస్, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరస్పర అంగీకారంతో వందేళ్లయినా ఉద్యోగుల విభజన జరగదని తెలిపారు. 

నిరసన వ్యక్తం చేస్తే 'రేప్' చేస్తామంటున్నారు: నిట్ విద్యార్ధులు

ఢిల్లీ : శ్రీనగర్ ఎన్ ఐటీలో తెలుగు విద్యార్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. స్థానికేతర విద్యార్ధుల పరిస్థితి దారుణంగా వుంటోందని వారు పేర్కొన్నారు. క్యాంపస్ నుండి ఢిల్లీ రావటానికి అష్టకష్టాలు పడ్డామని తెలిపారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన 30 మందికి పైగా విద్యార్థులకు ఏపీ భవన్ అధికారులు ఆశ్రయం కల్పించారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. నిరసన కార్యక్రమాలలో అమ్మాయిలు పాల్గొంటే వారిపై అత్యాచారాలు చేస్తామని సాక్షాత్తు ఫ్యాకల్టీలే హెచ్చరిస్తున్నారని వారు వాపోయారు. "మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం.

13:52 - April 13, 2016

హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని యేరేకా ఫోబ్స్ కి సంబంధించిన ఆక్వాప్యూర్  వాటర్‌ఫిల్టర్స్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. కరెంట్‌ షార్ట్ సర్క్యూట్  కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాములోని ప్లాస్టిక్‌సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేయడానికి ఫైర్‌సిబ్బంది ప్రయత్నిస్తోంది. రూ. 10లక్షల నుంచి 20 లక్షల ఆస్తి నష్టం జరినట్లు అంచనా వేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  

 

13:47 - April 13, 2016

హైదరాబాద్ : టీ.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఆశయాలను అణగదొక్కుతున్న కేసీఆర్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రహీనుడి పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ మూర్ఖంగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. మహిళలు లేకుండా కేబినెట్ ఉందన్నారు.

 

13:42 - April 13, 2016

హైదరాబాద్ : ఎపి, తెలంగాణలో నేతల వలసలపర్వం కొనసాగుతోంది. తెలంగాణలో టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు పలు పార్టీలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్ ఎస్ లోకి వలసలు కొనసాగున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ ఎస్ గూటికి చేరనున్నారు. మాజీ మంత్రి డీకే.అరుణ సోదరుడు, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరనున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. మంత్రి లక్ష్మారెడ్డి రామోహన్ రెడ్డితో ఇప్పటికే మంతనాలు జరిపారు. కార్యకర్తలతో రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే సమావేశం అయ్యారు. అయితే కాంగ్రెస్ ను వీడవద్దని.. టీఆర్ ఎస్ లో చేరవద్దని సోదరుడు రామ్మెహన్ రెడ్డితో డీకే అరుణ మంతనాలు సాగించారు. కానీ ఆమె సాగించిన మంతనాలు ఫలించనట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా చిట్టెం రామ్మెహన్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీఆర్ ఎస్ లో ఆయన చేరిక దాదాపు ఖరారైనట్లని చెప్పవచ్చు. ఇదిలావుంటే చిట్టెం రామ్మోమన్ రెడ్డితోపాటు మహబూబ్ నగర్ జిల్లాలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ కు మొత్తం ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

 

ఎన్‌ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ భార్య మృతి….

ఢిల్లీ : చంచలనం సృష్టించిన ఎన్‌ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్య కేసులో తీవ్ర గాయాలపాలైన తంజీల్  భార్య ఫర్జానా ఈరోజు ఉదయం మృతి చెందారు . ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 3న యూపీలోని బిజ్నూర్‌లో తంజీల్ అహ్మద్‌ కుటుంబంతో సహా ఓ వివాహానికి హాజరయి వస్తూండగా దారిలో మాటువేసిన అంగంతకులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తంజీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా....ఆయన భార్య ఫర్జానా తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అప్పటినుండి చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె మృతి చెందారు.

13:22 - April 13, 2016

మారుతున్న కాలంలో ఫ్యాషన్ కూడా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ ఫ్యాషన్ ను అనుకరిస్తుంటుంటారు. 'స్కార్ఫ్' అనే ఫ్యాషన్ కు అమ్మాయిలు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. డ్రైవింగ్ చేసిన యువతులు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు..సూర్యరశ్మి నుండి తట్టుకొనేందుకు..చర్మాన్ని రక్షించేందుకు పలువురు స్కార్ఫ్ లు కట్టుకుని వెళుతుంటారు. కానీ ఈ ముసుగులు వేసుకుని రావద్దని సీఐఎస్ఎఫ్ హుకుం జారీ చేసింది. మెట్రో రైలులో సర్జికల్ మాస్క్, మఫ్లర్, స్కార్ఫ్ కట్టుకున్నా..దుపట్టా ధరించినా రైల్వే స్టేషన్ లోనికి అనుమతించమని స్పష్టం చేసింది. ఇటీవలే రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ లో రూ. 12 లక్షల దోపిడి జరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారి పేర్కొంటున్నారు. ఈ నిర్ణయంపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో వేచి చూడాలి. 

బెడ్ రూమ్ ఇళ్ళపై సర్కారు షురూ....

హైదరాబాద్ : నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో భవన నిర్మాణ సంస్థలు, ఆర్థిక సంస్థలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక భాగస్వామ్యం, నిర్మాణ సహకారంపై ఆయా సంస్థలు పలు ప్రతిపాదనలను మంత్రి ముందుకు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంపై కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది.

కేంద్రమంత్రి సుజనపై సుప్రీంలో మరోకేసు....

ఢిల్లీ : కేంద్రమంత్రి సుజనా చౌదరిపై సుప్రీకోర్డులో మరో కేసు విషయంలో పిటీషన్ దాఖలయ్యింది. మంత్రికి సంబంధించిన కంపెనీలో రూ.7,602 కోట్లు అవకతవకలు జరిగాయని అడ్వకేట్ వినోద్ కుమార్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని వినోద్ కుమార్ కోర్టును కోరారు. కాగా కోర్టు ఈ పిటీషన్ ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ఆర్ బీఐ లేదా ఎస్ఎఫ్ఐవో సంస్థలు  ఫిర్యాదు చేయాలని పిటీషనర్ వినోద్ కుమార్ కు కోర్టు సూచించింది. సదరు సంస్థలు స్పందించని పక్షంలో  కోర్టును ఆశ్రయించ్చని సూచన చేసింది. 

12:42 - April 13, 2016

సినిమాలో నటన చేయడం తనకు విసుగు తెప్పించిందని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవలే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని, రాజకీయాల్లోనే ఉంటారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిట్ చాట్ కార్యక్రమంలో పవన్ పలు విషయాలను వెల్లడించారు. చాలా బలవంతంగా తాను సినిమాల్లోకి రావడం జరిగిందన్నారు. దేనికి సరిగ్గా లేననే బాధ ఉండడం..యాక్టింగ్ నేర్చుకొవాలని అన్నయ్య సలహా ఇచ్చాడని తెలిపారు. తన పరిమితులలో మాత్రమే చేయడం జరుగుతుందని, కొంతమంది నటులు కాని పాత్రలు చేస్తారని పేర్కొన్నారు. సంతోషంగా యాక్టింగ్ చేయాలని, కూర్చొబెట్టి నటన చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు. తనకు నచ్చేలా చేయలేను..ఏదో వాళ్లు చేసి పెడితే తనకు నచ్చదు అని తెలిపారు. ఈ రెండు కారణాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 

టీఆర్ఎస్ లోకి డీకే అరుణ సోదరుడు....

హైదరాబాద్ : ఏపీలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసల పరంపరం కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణలో అధికారపార్టీలోకి ప్రధానప్రతిపక్షం నుండి వలసలు కొనగుతున్నాయి. తాజాగా మక్తల్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపు ఎన్నికయిన ఎమ్మెల్యే రామ్మెహన్ రెడ్డి త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడైన రామ్మోహన్ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఈరోజు ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీ అవ్వటంతో అనుమానాలు బయపడుతున్నాయి.

12:18 - April 13, 2016

సినిమాలు చేయకుండా పారిపోవాలని అనిపించిందని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఇటీవలే విడుదలైంది. ఈసందర్భంగా పవన్ చిట్ చాట్ నిర్వహించారు. సినిమాకు సంబంధించిన విశేషాలు తెలిపారు. తనతో సినిమాలు తీయడానికి ( గతంలో) ఎవరూ ముందుకు రాలేదని, దీనితో సినిమాల కోసం వెతికేవాడినని తెలిపారు. తను తెలియని దానిపై చేయాలని చెప్పేవార, రోడ్ల మీద డ్యాన్స్ లు చేయాలంటే విసుగు పెట్టించిందని పారిపోవాలని అనిపించేదని తెలిపారు. ఈ తరుణంలో 'తొలి ప్రేమ'సినిమా వచ్చిందని, అప్పుడు తన బలాలేంటీ ? తెలిసినవి చేసుకుంటూ వెళ్లడం జరిగిందన్నారు. కొత్త డైరెక్టర్లైతే కూర్చొని మాట్లాడడానికి వీలుంటుందని, తనకు బాబి కరెక్టు అనిపించే సెలక్ట్ చేయడం జరిగిందన్నారు. 

ముసుగు వేసుకుంటే మెట్రోరైలు ఎక్కనివ్వం : సీఐఎస్ఎఫ్

ఢిల్లీ : ఎండ, శీతల వాతావరణం నుండి రక్షణ పొందేందుకు నేడు ముఖాలకు ముసుగులు వేసుకోవటం సర్వసాధరణమయిపోయింది. ఈ నేపథ్యంలో ముఖాలు కనిపించకుండా మెట్రోరైలు ఎక్కటానికి వచ్చే వారిని రైలు ఎక్కటానికి అనుమతించబోమని ఢిల్లీ మెట్రోరైలు నిర్వహణా బాధ్యలు చేపట్టిన సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది.  ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖానికి సర్జికల్ మాస్క్, మఫ్లర్ లేదా స్కార్ఫ్ కట్టుకున్నా, ఆఖరికి దుప్పట్టా కట్టుకున్నా రైల్వే స్టేషన్ లోనికి ప్రవేశించేందుకు అనుమతించబోమని సీఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది. గతంలో రాజేంద్ర మెట్రో స్టేషనులో రూ.

12:09 - April 13, 2016

బ్రదర్ ఇబ్బందుల్లో ఉండడం..సినిమా తీసి అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో సినిమా చేయడం జరిగిందని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. రెండు 'గబ్బర్ సింగ్' లు అవసరాల మీద వచ్చాయన్నారు. మొదట్లో సల్మాన్ నటించిన 'దబంగ్' సినిమా చూసినట్లు, కానీ ఆసక్తి లేదన్నారు. ఈ తరుణంలో అప్పులు తీర్చాలని ఉద్ధేశ్యంతో 'దబంగ్' సినిమా చూడడం జరిగిందన్నారు. తరువాత తీయాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇంకా పవన్ ఫుల్ ఇంటర్వ్యూ ని  వీడియోలో చూడండి. 

12:03 - April 13, 2016

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్ నిట్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. 35 మంది తెలుగు విద్యార్థులు ఏపీ భవన్‌కు చేరుకున్నారు. శ్రీనగర్ నిట్‌లో స్థానికేతర విద్యార్థులపై దాడులను నిరసిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టనున్నారు. నిట్‌ను మరో చోటుకి తరలించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. గన్‌ పాయింట్‌లో అభద్రతా భావంతో చదువుకోలేమని విద్యార్థులు అంటున్నారు. తమను వేరే నిట్‌కు మార్చాలని కోరుతున్నారు. ఈమేరకు హెచ్ ఆర్ డీ మినిస్టర్ స్మృతి ఇరానీని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కలవనున్నారు. 
విద్యార్థులు..
'శ్రీనగర్ నిట్ లో స్థానిక విద్యార్థులకు, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడానికి క్రికెట్ మ్యాచ్ వన్ ఆఫ్ ద రీజన్. ఇండియా ఫ్ల్యాగ్ ఘటన కూడా కారణం అయింది. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం సరికాదు. శ్రీనగర్ నిట్ నుంచి తమను వేరే నిట్ కు మార్చాలి. గన్ పాయింట్ లో అభద్రతా భావంతో చదువుకోలేం.  వెస్టిండీస్, ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వెస్టిండీస్ గెలిస్తేనే సరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్ లో పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగితే  ఒక వేల పాకిస్తాన్ గెలిస్తే.. పరిస్థితి ఎలా వుంటుందో చూడాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఇక్కడ ఉండటానికి ఇష్ట పడడం లేదు. వేరే నిట్ మార్చాలి' అని విద్యార్థులు అంటున్నారు. 

యురేఖా ఫోర్బ్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం...

హైదరాబాద్ : జీడిమెట్లలోని యురేఖా ఫోర్బ్స్ పరిశ్రమకు సంబంధించిన గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. సిబ్బంది అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనకు సంబంధించిన విచారణను దర్యాప్తు చేపట్టారు.

11:57 - April 13, 2016

ప్రేమ పేరిట ఎందరో అమ్మాయిలు మోస పోతున్నారు. మాయగాళ్లకు బలౌతున్నారు. స్నేహం..అనురాగం..అనుబంధం..జీవితం..ఇలాంటవన్నీ పుస్తకాల వరకు..ఛాటింగ్ వరకు బాగుంటాయి. రియల్ లైఫ్ కు ..రీల్ లైఫ్ కు చాలా తేడా ఉంది. మోసగాళ్లున్నారు తస్మాత్ జాగ్రత్త..అమ్మాయిలు జాగ్రత్త పడండి..హీరోయిన్ వారిని ఎందుకు చంపేసింది ? కారణం ఏంటీ ? అనేది చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:51 - April 13, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం నెలకొంది. బాలుణ్ణి రక్షించబోయి తల్లీకూతుళ్లు మృతి చెందారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిపోయిన బాలుణ్ణి కాపాడేందుకు రైల్లోంచి దూకిన తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడాది వయసున్న బాలుడు ప్రమాదవశాత్తూ రైల్లోంచి కిందపడిపోయాడు. అది గమనించిన తల్లీ కంగారుగా తన కూతురితో సహా రైల్లోంచి కిందకూ దూకింది. అయితే కిందకు దూకిన తల్లీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో తొలుత ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి ఉన్న బాలుడిని ఆర్ధరాత్రి  స్థానికులు గుర్తించారు. చికిత్స నిమిత్తం అతన్ని విశాఖ ఆసుపత్రిలో చేర్చించారు. బాలుడు క్షేమంగా ఉన్నాడు. అయితే స్వల్ప గాయాలతో బాలుడు మృత్యుంజయుడిగా బయటపడడం స్థానికులకు సంతోషాన్నిచ్చినా...తల్లి, మరో కూతురు చనిపోవడం విషాదంగా మారింది.

 

త్వరలో వైసీపీకి మరో షాక్?.....

హైదరాబాద్ : వైసీపీ నుండి టీడీపీలోకి వససల పరంపర ఆగేలా సూచనలు ఇప్పట్లో కనిపించటం లేదు. తాజా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు సర్పంచ్ లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొబ్డిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం స్థానిక టీడీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. త్వరలోనే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు…..తనతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ మారే యోచనలోవున్నట్లు సమాచారం. దీంతో వైసీపీకి మరోదెబ్బ ఖాయమని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

టీ.సర్కారు నుండి రూ.2,500కోట్లు వసూలు చేయండి : చంద్రబాబు

హైదరాబాద్ : నగరంలోని విద్యుత్ సంస్థల విభజన తరువాత, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించగా, ఆయన స్పందించారు. ఆస్తుల విభజగ కూడా ఉద్యోగుల విభజన జరిగిన నిష్పత్తిలోనే సక్రమంగా జరిగేలా చూడాలని, అందుకు ఓ సంయుక్త కమిటీని నియమించాల్సి అవుసరముందని సంఘం నేతలు సూచించారు.

11:34 - April 13, 2016

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో వైసీపీకి షాక్ తగలనుంది. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు సోదరులు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను సమకూర్చుకొని టీడీపీలో చేరనున్నారు. సాయంత్రం బొబ్బిలికోటలో కార్యకర్తలతో రంగారావు సోదరులు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 

 

11:32 - April 13, 2016

నేరాలు..ఘోరాలు జరుగుతున్నా స్పందించడం లేదు. ఎందుకు స్పందించరు ? ఏమైనా చిక్కులు వస్తాయోమోనన్న భయం. వీళ్లు చూస్తుండగానే నేరం జరుగుతుంది. సమాజంలో మనమూ ఒక భాగమే అనే ఆలోచన ఎందుకు రావడం లేదు. చుట్టూ వందమందికి పైగా జనం. అందరూ చూస్తుండగానే జూనియర్ ఆర్టిస్టును హత్య చేశారు ? ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అతను ఎవరు ? ఆమె ఎవరు ? ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది ? ఈ నేరాన్ని క్రైం డిటెక్టివ్ బృందం ఎలా చేధించిందా ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సోమేశ్వరంలో అగ్నిప్రమాదం....

తూర్పుగోదావరి : రాయవరం మండలంలోని సోమేశ్వరంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 పూరిళ్లు, ఓ ప్రయివేటు బస్సు దగ్థమయ్యాయి. సమాచాం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసుకున్నారు.

11:26 - April 13, 2016

రంగనాథ్ ఆత్మహత్యకు గల కారణాలేంటీ ? ఆత్మహత్యా ? హత్యా ? రంగనాథ్ కు తనయుడు భూపాల్ ఉన్నాడు. వీరిద్దరూ ఆత్మీయంగా ఉండే వారు ? కానీ భూపాల్ కు రంగనాథ్ ఏదో చెప్పాలని అనుకున్నాడు. చనిపోయిన తల్లి ఆత్మతో తండ్రి రంగనాథ్ తో మాట్లాడుతున్నాడని, తన తండ్రిపై నమ్మకం ఉందని డిటెక్టివ్ బృందంతో పేర్కొంది. కానీ రంగనాథ్ మాత్రం ఆత్మ హత్య చేసుకోలేదని, అతడిని హత్య చేశారని డిటెక్టివ్ పేర్కొంది. తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు ? ఏమైంది ? అనేది తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

శ్రీచైతన్య ఆధ్వర్యంలో కేశవరెడ్డి విద్యాసంస్థలు...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కేశవరెడ్డి పాఠశాలల నిర్వహణ బాధ్యతను శ్రీచైతన్య విద్యాసంస్థలకు అప్పగిస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల తమ విద్యా సంవత్సరం నష్టపోకుండా వుండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేలమంది విద్యార్ధుల భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకుని వివాదాల్లో ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల అకడమిక్ నిర్వహణ బాధ్యతను శ్రీచైతన్యకు అప్పగించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీచైతన్య సంస్థ కేవలం పర్యవేక్షణకే పరిమితమవుతుందనీ….ఫీజుల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు.

ఎంబీబీఎస్ పరీక్షలపై తీర్పును ఉపసంహరించుకున్న సుప్రీం...

ఢిల్లీ : వైద్య పరీక్ష నిర్వహణలో భాగంగా  ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఒకే పరీక్ష నిర్వహించాలన్న తన తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. పలు రాష్ట్రాలు ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నిర్వహించనందుకు ఉన్నత న్యాయస్థానం ఏడాది మినహాయింపును ఇచ్చింది. వచ్చే సంవత్సరం నుండి ఎంబీబీఎస్ పరీక్షను ఖచ్చితంగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2013లో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

10:58 - April 13, 2016

షవర్‌ కింద నిలబడి చల్లటి నీళ్లు తలపై వాన జల్లులా జారుతుంటే బాత్‌రూమ్‌లో కూనిరాగాలు తీస్తూ స్నానం చేయడం... ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఎంత సేపు స్నానం చేసినా తనివి తీరదు, ఎంతకీ బాత్‌రూంలో నుంచి బయటకు రావాలని అనిపించదు. ఈ అనుభూతుల వెనుక అనర్ధాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. కుళాయి మూతికి చివర నీరు జల్లులా పడేందుకు రంధ్రాలు ఉన్న గుబ్బను బిగిస్తారు, దీనినే షవర్‌ అంటారు. షవర్‌ను ఉపయోగించి నిలుపు చేసిన తరువాత కూడా ఈ గుబ్బలో నీటి బిందువులు రోజుల తరబడి ఆవిరి కాకుండా ఉండిపోతాయి. అందువల్ల షవర్‌ లోపల చీకటితోపాటు నిరంతరం చల్లదనం ఉంటుంది. ఈ అనుకూల వాతావరణానికి సూక్ష్మక్రిములు ఆకర్షించబడి దట్టంగా చేరుకుని లోపల తిష్ట వేస్తాయి. మనం షవర్‌ తిప్పిన వెంటనే కింద నిలబడి ఆ నీళ్లతో స్నానం చేస్తే సూక్ష్మక్రిమలు మన శరీరాన్ని ఆశ్రయించి, అనేక రకాల జబ్బులకు కారణం అయ్యే అవకాశం ఉంది. అదే కుళాయిల చివరల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. అందువల్ల సూక్ష్మక్రిములు చేరే అవకాశం చాలా తక్కువ. అయినా కొద్ది నీరు బయటకు ఒదిలి ఆ తరువాత కుళాయి నీళ్లయినా వాడుకోవడం ఉత్తమం. షవర్‌ను వినియోగించేటప్పుడు ఆన్‌ చేసిన తరువాత తప్పనిసరిగా కొంత నీటిని బయటకు పోనివ్వాలి. ఆ తరువాత స్నానం చేయడం వల్ల సూక్ష్మక్రిముల బారిన పడే అవకాశం చాలా వరకూ తగ్గుతుంది. స్నానం చేసేముందు గ్రీజర్‌ ఆన్‌ చేసి, మసిలే నీటిని షవర్‌ ద్వారా ఒదిలి ఆ తరువాత స్నానం చేస్తే సూక్ష్మ క్రిముల బెడద పూర్తిగా తప్పుతుంది.

10:57 - April 13, 2016

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవచ్చట. దీనిని గుర్తించటానికి బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యిమంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసు కున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్న వారిలో మానసిక సమస్యలు సమారు 60 శాతం వరకూ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో గంట కన్నా తక్కువ సమయం వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరకశ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల కుటుంబంతో పిల్లలు కలసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయంటున్నారు.

10:55 - April 13, 2016

వరుణ్‌ తేజ్‌, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ సినిమా తీస్తారన్న విషయం తెలిసిందే. 'ఆగడు', 'బ్రూస్‌ లీ' లాంటి పరాజయాల తర్వాత ఎలాగైనా తన స్థాయి సినిమా తీయాలన్న ఆలోచనతో శ్రీను వైట్ల ఈ ప్రాజెక్టు కోసం చాలా నెలలుగా కష్టపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 27న హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ఒక్కో సినిమాకూ ఒక్కో తరహా పాత్రను ఎంచుకుంటూ హీరోగా తనదైన మార్క్‌తో మూడు సినిమాలు చేశాడు వరుణ్‌. శ్రీనువైట్ల సినిమాలో మరో కొత్త తరహా పాత్రతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు.

10:52 - April 13, 2016

శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ లేదట. ఆమె చేతి నిండా సినిమా ఉన్నాయి. అందువల్ల రోజులో 16 గంటల పాటు షూటింగ్‌లకే కేటాయిస్తుందట. మిగిలిన సమయంలోనే విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం చేస్తున్నానని తనే స్వయంగా వెల్లడించింది. ప్రియాంకా చోప్రా లాగే శ్రద్ధా కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా చేస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం శ్రద్ధా నాలుగు చిత్రాల్లో చేస్తోంది. ఆదిత్యా కపూర్‌తో కలసి చేస్తున్న 'ఓ జాను' చిత్రీకరణ పూర్తకానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబాయిలో జరుగుతోంది. హీరో హీరోయిన్లు పాల్గొనే క్లయిమాక్స్‌ సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. మరో పక్క బయోపిక్‌ చిత్రం 'బాఘి'లో నటిస్తోంది. టైగర్‌ ష్రాప్‌తో కలిసి చేస్తోన్న ఈ చిత్రంలో ఆమె ఓ ఫైటర్‌గా కన్పించబోతుంది. సినిమాలో సగం పోరాట సన్నివేశాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దీంతో పాటు ఏ ఫ్లయింగ్‌ జాట్‌, రాక్‌ ఆన్‌ చిత్రాల్లో చేస్తుంది. మొత్తం నాలుగు సినిమాల్లో ఒకే సారి చేస్తుండడంతో ఈమెకు విశ్రాంతి దొరకడం లేదు.

10:50 - April 13, 2016

కడప : భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు భద్రాచలంలో శ్రీరామనవమిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో భద్రాచలంలో యధావిధిగానే తెలంగాణా సర్కారు నవమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. కాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో అధికారికంగా శ్రీరామనవమి నిర్వహిస్తోంది. ఈ నెల 20న అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 14 నుంచి 24 వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే శ్రీరాముని కల్యాణానికి ఆహ్వాన పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం తరపున ఏపీ సీఎం చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరగడం మరో విశేషం. 

10:38 - April 13, 2016

హైదరాబాద్ : కుల్సుంపురా కబేళా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో సుమారు 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరంతా పేదవారే. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధిన పడడం స్థానికులను కలిచివేసింది. వివారల్లోకి వెలితే..కబేళా ప్రాంతంలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఒక ఇంటిలో వంట చేసుకునే సమయంలో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం జరిగింది. 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపిస్తుండడంతో పోలీసులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 50 కుటుంబాలు వీధిన పడ్డాయి. 50 కుటుంబాలలో దాదాపు 1000 మంది నిస్సహాయస్థితిలో రోడ్డున పడ్డారు. వీరందరికీ ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినా వేసవి తాకిడికి మంటలు మళ్లీ విజృంభించే అవకాశముండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

10:36 - April 13, 2016

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం రెండు నెలల బకాయిలను చెల్లించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బడ్జెట్‌ నిధులు కేంద్రం నుంచి విడుదల కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఫిబ్రవరి, మార్చి నెలల బకాయిలను చెల్లించనున్నారు. సత్వరమే ఈ నిధులను ఉపాధి హామీ కూలీలకు చెల్లించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. తెలంగాణలో సుమారు 22 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పని కార్డులున్నాయి. అందులో 100 రోజులు ఉపాధి పొందిన కుటుంబాలు 93 వేలు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇవ్వాల్సిన కూలీ సుమారు 250 కోట్ల రూపాయల మేర బకాయి ఉంది. తాజాగా కేంద్రం రాష్ట్రానికి 615 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తంలోంచి బకాయిలను చెల్లించాలని రాష్ట్రం నిర్ణయించింది.

ఈ ఏడాది 27 మంది కూలీలు మృతి...
ఇక ఉపాధి హామీ పనుల్లో కేంద్రం నిర్దేశించిన పనుల కన్నా.. రాష్ట్ర అధికార యంత్రాంగం రెట్టింపు పనులు చేపట్టింది. ఈ పథకానికి 13 వేల కోట్ల విలువ చేసే పనులు చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ.. ఆ పనులు సక్రమంగా జరగలేదని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు మూడు నెలలుగా కూలీలకు బకాయిలు ఉండడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక ఈ పనుల్లో 27 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మరోవైపు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోయే వారి సంఖ్య ఈ ఏడాది బాగా పెరిగింది. మొత్తానికి.. కేంద్రం నుండి విడుదలైన నిధుల నుంచి వెంటనే తమ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీ పనుల్లో యంత్రాలకు బదులు తమకే పని కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

10:29 - April 13, 2016

ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో మరో హాట్ హాట్ సమరానికి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ సవాల్ విసురుతోంది. తొలిసారిగా ఐపీఎల్ లీగ్ లో పాల్గొంటున్న రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు తొలివిజయాలతో శుభారంభం చేశాయి. మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ సైతం తొలివిజయంతో టైటిల్ వేటను ప్రారంభించింది. అయితే...హోంగ్రౌండ్ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కీలక పోటీలో నైట్ రైడర్స్ కు ముంబై ఇండియన్స్ సవాలు విసురుతోంది. గౌతం గంభీర్ నాయకత్వంలోని నైట్ రైడర్స్ బ్యాక్ టు బ్యాక్ విజయానికి ఉరకలేస్తుంటే...ముంబై ఇండియన్స్ మాత్రం తొలివిజయానికి తహతహలాడుతోంది.

విజయమే లక్ష్యంగా..
ప్రారంభ మ్యాచ్ లో పూణే జెయింట్స్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి తేరుకొన్న ముంబై ఇండియన్స్...తన లక్కీగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పైగా...ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం...కోల్ కతా వేదికగా భారీగా పరుగులు సాధించిన రికార్డు ఉంది. తొలిమ్యాచ్ లో ఎదురైన బ్యాటింగ్ లోపాలను సవరించుకొని..ప్రత్యర్థి పనిపట్టాలన్న లక్ష్యంతో ముంబై సిద్ధమై వచ్చింది. మరోవైపు...గౌతం గంభీర్ కెప్టెన్సీలోని కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం..స్థానబలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని వరుసగా రెండో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, యాండ్రీ రస్సెల్, షకీబుల్ హసన్, జాన్ హేస్టింగ్స్, సునీల్ నరైన్..స్పిన్ జోడీ బ్రాడ్ హాగ్, పియూష్ చావ్లా లాంటి మేటి ఆటగాళ్ళు నైట్ రైడర్స్ కు ప్రధానబలంగా ఉన్నారు.ప్రస్తుత ఐపీఎల్ ప్రారంభమ్యాచ్ ల ట్రెండ్ చూస్తుంటే...ముందుగా బ్యాటింగ్ చేసిన జట్ల కంటే ఛేజింగ్ కు దిగినజట్ల విజయశాతమే ఎక్కువగా ఉండటం చూస్తే...కోల్ కతా మ్యాచ్ లో సైతం టాస్ కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వ్యూహాలు..
టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని...ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువస్కోరుకు పరిమితం చేసే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. కోల్ కతా వేదికగా అత్యుత్తమ రికార్డు ఉన్న ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే....నైట్ రైడర్స్ ను అధిగమించడం ఏమంత కష్టం కాబోదు. ముంబై బ్యాటింగ్ పవర్ కు, కోల్ కతా నైట్ రైడర్స్ పదునైన బౌలింగ్ కు మధ్య జరిగే ఈ పోటీ..హోరాహోరీనా...లేక ఏకపక్షమా? అన్నదే ఇక్కడి అసలు పాయింట్.

10:27 - April 13, 2016

పశ్చిమగోదావరి : ముక్కుపచ్చలారని పసికందులు తల్లిదండ్రుల చేతుల్లోంచి దూరమైన సంఘటనలు పలు సందర్భాలలో జరుగుతున్నాయి. కాకుంటే పసిబిడ్డలను వదిలించుకోవాలని కొందరు ప్రయత్నిస్తుండడం విచారకరం. ప్రమాదవశాత్తు కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. కాగా ఏ కారణాలో జరిగిందో తెలీదుకానీ జిల్లా కేంద్రమయిన ఏలూరులో రైల్వేస్టేషన్‌లో ఓ బాలుడు రైలుపట్టాలపై పడి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడు పట్టాలపై ఎలా చేరాడో తెలియడం లేదు. ఏడాది వయసున్న బాలుడు రైలుపట్టాలపై పడడాన్ని అర్థరాత్రి గుర్తించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే విశాఖ వైపు వెళ్లే రైలు నుంచి బాలుడు కిందం పడ్డాడా ? లేక తల్లిదండ్రులు బాలుడిని విడిచి పెట్టారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

10:25 - April 13, 2016

చెన్నై : డిఎంకె, ఏఐఏడిఎంకె అనే రెండు ద్రవిడ పార్టీల చుట్టూ తిరిగే తమిళనాడు రాజకీయాల్లో కులాల పాత్రను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. పది పన్నెండు సామాజిక వర్గాలు గెలుపు ఓటమిల్లో తమవంతు పాత్ర పోషిస్తుంటాయి. దీంతో ఆయా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు డిఎంకె, ఏఐఏడిఎంకె వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమిళానాడులో అతి పెద్ద సామాజిక వర్గం ఎస్సీలు అతి స్వల్ప సంఖ్యలో వున్న సామాజికవర్గం ఎస్టీలు. పరయార్స్, పల్లార్స్ తో కూడిన ఎస్సీ సామాజికవర్గంలో 20శాతం ఓటర్లున్నారు. ఉత్తర తమిళనాడులోని పట్టణ ప్రాంతాల్లో పరయార్స్ ప్రభావం కనిపిస్తే, దక్షిణ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పల్లార్స్ ప్రభావం కనిపిస్తుంది. ఏడు జిల్లాలున్న ఉత్తర తమిళనాడులో డిఎంకెకు పట్టు వుంటే, మరో ఏడు జిల్లాలున్న దక్షిణ తమిళనాడు ఏఐఏడిఎంకెకి అండగా నిలుస్తోంది. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఉత్తర తమిళనాడు సైతం జయలలితకే జై కొట్టడం విశేషం.

ఒంటరిగా పిఎంకే..
1980లో సాగించిన రిజర్వేషన్ పోరాటాల కారణంగా వనియార్స్ కి ఎంబిసి హోదా లభించింది. కుడలేరు, తిరువన్నమళై, విల్లుపురం, సాలెం, ధర్మపురి, క్రిష్ణగిరి ఈ ఆరు జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. సాలెం, క్రిష్ణగిరి జిల్లాల్లోని వనియార్స్ ఏఐఐడిఎంకెకి అనుకూలం కాగా, కడలూర్, తిరువనమలై, విల్లుపురం వనియార్స్ డిఎంకెకి మద్దతుదారులు. 2014 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు మొత్తం స్వీప్ చేయగలిగిన జయలలిత వనియార్స్ ప్రాబల్యం వున్న ధర్మపురి, కన్యాకుమారి లోక్ సభ నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో బిజెపితో పొత్తుపెట్టుకున్న పిఎంకె ధర్మపురిని గెలుచుకోగా, బిజెపి కన్యాకుమారిలో విజయం సాధించింది. ఇప్పుడు పిఎంకె ఒంటరిగా పోటీ చేస్తోంది. జయలలిత వనియార్స్ ఓట్ల మీద గురిపెట్టారు. మునుపెన్నడూ ఏ పార్టీ ఇవ్వని రీతిలో వనియార్లకు 42 సీట్లిచ్చారు. జయలలిత పన్నిన వ్యూహం కరుణానిధి ఓటు బ్యాంక్ ను ఎంతవరకు దెబ్బతీస్తుందన్నది ఆసక్తికరం.

తేవార్స్..
వనియార్స్ కంటే ఆర్థికంగా కాస్తంత పై మెట్టులో వున్నారు తేవార్స్. తమిళనాడులో వీరు 9శాతం మంది. పెద్ద రైతులుగా ప్రసిద్ధి చెందిన తైవార్స్ దక్షిణ, మధ్య తమిళనాడుల్లో ఎక్కువగా కనిపిస్తారు. తంజావూర్, తిరువరూర్, పుడుకొట్టాయ్, మధురై, రామాంతపురం ఈ అయిదు జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. తేవార్స్ ఏఐఏడిఎంకెకి ఓట్లేస్తారన్న పేరుంది. తేవార్స్ తర్వాత ఎక్కువ ఓట్లున్న సామాజికవర్గాలు నాదర్స్, గౌండర్స్. ఈ రెండు సామాజికవర్గాలకు చెరో ఏడు శాతం ఓట్లున్నాయి. గౌండర్స్ ఏఐఏడిఎంకె వైపు మొగ్గు చూపితే, నాదర్స్ డిఎంకె కి అనుకూలం. పిల్లై, ముదిలియార్స్ 5శాతం మంది వుంటారు. మత్స్యకారులు, యాదవులు, ముత్తరాయర్స్ తలా మూడు శాతం చొప్పున వుంటారు. చెట్టియార్స్, ఉదయార్స్, మూపనార్స్, బ్రాహ్మిణ్స్ తలా రెండు శాతం చొప్పున కనిపిస్తారు. వన్నియార్స్, గౌండర్స్, ముదిలియార్స్, ఉదయార్స్ ను ఆకర్షించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. 

10:20 - April 13, 2016

పవన్‌ కళ్యాణ్‌ చేసిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ఇటీవల విడుదలయింది. ఇక తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమైన స్నేహితులు ఇద్దరు. త్రివిక్రమ్‌ మొదట వాడు. ఎస్‌.జె.సూర్య రెండో వ్యక్తి. ఇప్పుడు వీరిద్దరితో సినిమాలు చేయనున్నాడు. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఇది ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమని పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరొక చిత్రం తివ్రికమ్‌తో చేయనున్నారు. ఈ మాటల మాంత్రికుడు, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో గతంలో సినిమా నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే వీరిద్దరికీ అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' చిత్రం చేస్తోంది. తర్వాత చిత్రం పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోనే చేయనుంది. కానీ కారణాలు బయటకు రావడం లేదు గానీ వీరికిచ్చిన అడ్వాన్సును తిరిగి మైత్రీమూవీస్‌వారికి తిరిగి ఇచ్చేశారని తెలిసింది. ఇప్పుడు త్రివిక్రమ్‌తీసే పవన్‌ సినిమాను మరో నిర్మాత నిర్మిస్తారని సమాచారం. పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌గా మారుదా మనుకుంటున్న మైత్రీ మూవీస్‌కు ఇది పెద్ద షాక్‌ అనే చెప్పాలి.

10:08 - April 13, 2016

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, కృతిసనన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రాబ్తా' షూటింగ్‌ మంగళవారం ప్రారంభ మైంది. 'నేనెంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది' అంటూ కథానాయిక కృతిసనన్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ, ఈ సినిమా కోసం మేకప్‌ వేసుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. హోమీ ఆదాజానియా, భూషణ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేశ్‌ విజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

10:03 - April 13, 2016

నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ వయసు అడ్డు కాదు. రాణించాలన్న ఆశ ఉండాలేకానీ పెళ్లి ఆటంకం కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వీణు పాలివాల్‌.. దేశంలోని అతికొద్దిమంది మహిళా బైక్‌రైడర్స్‌లో ఒకరు. ప్రమాదవశాత్తు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. స్ఫూర్తినందించే ఓ బైక్‌రైడర్‌ పరిచయం..
జైపూర్‌కు చెందిన 44 ఏళ్ల వీణు పాలివాల్‌.. లేడీ ఆఫ్‌ హ్యార్లీగా పేరు తెచ్చుకున్నారు. వీణు తండ్రికి కూడా బైక్‌ రైడింగ్‌ అంటే పిచ్చి. అలా చిన్నతనంలోనే తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన వీణు.. కాలేజ్‌ ఫ్రెండ్స్‌ దగ్గర బైక్‌ రైడింగ్‌ నేర్చుకుంది. అయితే సొంత బైక్‌ లేకపోవడంతో తన ప్యాషన్‌ను కొనసాగించలేకపోయింది. తరువాత పెళ్లి కావడంతో బైక్‌ రైడింగ్‌ అన్నమాటే పక్కకు పోయింది. ఒక బాబు, పాప కూడా పుట్టారు. కానీ బైక్‌రైడింగ్‌ మీద ఉన్న ప్యాషన్‌ మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. తన ఆసక్తిని, మనసులో మాటను భర్త ముందు ఈ వయసులో ఆ బైక్‌ రైడింగ్‌లేంటి? వద్దన్నాడు. తరువాత ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు విడాకులు తీసుకునేదాక వచ్చాయి. భర్తతో విడిపోయిన తరువాత పిల్లల పెంపకంలో బిజీ అయిపోయింది. జైపూర్‌లోనే 'విక్టోరియన్‌ టీ రూమ్‌' చారు బార్‌ను కూడా నిర్వహిస్తుండేది. అయితే పిల్లలు చదువులకోసం వెళ్లిపోవడంతో తన బైక్‌రైడింగ్‌ను కొనసాగించాలనుకుంది వీణు. వెంటనే హ్యార్లీడేవిడ్‌సన్‌ను కొనుగోలు చేసింది. పిల్లలను చదివిస్తూనే తన ఆసక్తిని కొనసాగించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో హ్యార్లీని నడపడంలో వీణు దిట్ట. అందుకే ఆమెను డేర్‌ డెవిల్‌ అనేవారు తోటి బైకర్స్‌. ఫెలో డ్రైవర్‌ దీపేష్‌ తన్వర్‌తో కలిసి నేషన్‌వైడ్‌ ట్రిప్‌లో ఉండగా... సోమవారం భోపాల్‌వైపు వస్తుండగా బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా తన మోటార్‌ బైక్‌ జర్నీకి సంబంధించిన అనుభవాలతో డాక్యుమెంటరీ కూడా తీయాలనుకున్నారు వీణు. ఆలోపే ఈ హఠాన్మరణం సంభవించింది. 

వైసీపీ-టీడీపీ వర్గీయుల ఘర్షణ..4గురికి గాయాలు...

కర్నూలు : కోడుమూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కళ్ళల్లో కారం చల్లుకొని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురుకి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

09:49 - April 13, 2016

'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్‌ తర్వాత సినిమాలు చేసే విషయంలో మహేష్‌ దూకుడు పెంచారు. తన సినిమాలు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళంలోనూ విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి తెరకెక్కుతోంది. దీని తర్వాత ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించే చిత్రం కూడా ద్విభాషా చిత్రమే. 'థెరి' (తెలుగులో 'పోలీసోడు') దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు మహేష్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా ద్విభాషా చిత్రమేనట.

 

మలింగ ఆశలపై నీళ్లు చల్లిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు

హైదరాబాద్ : ఐపీఎల్‌లో ఆడాలన్న లసిత్‌ మలింగ ఆశలపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు నీళ్లు చల్లింది. మలింగ తనకు నచ్చిన టోర్నీని ఆడుతుండడంతో లంక బోర్డు ఈ స్టార్‌ బౌలర్‌పై కోపంతో ఉంది. ఈ నేపథ్యంలో అతనికి ఐపీఎల్‌ ఆడేందుకు 'నిరభ్యంతర పత్రం' ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. 'శ్రీలంక క్రికెట్‌ బోర్డు అనుమతి లేకుండా మలింగ ఐపీఎల్‌లో ఆడలేడు. ఒకవేళ ఆడితే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం' అని బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల అన్నాడు. ఆసియా కప్‌ నుంచి బోర్డుకు మలింగకు మధ్య పొసగట్లేదు. ఆసియా కప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మలింగ.. టీ20 ప్రపంచకప్‌లో ఆటగాడిగా ఆడతానని చెప్పాడు.

పాయకరావుపేట కాలనీ వాసుల మధ్య ఘర్షణ

విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలోని పాయకరావుపేట కాలనీ వాసుల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

కెనరా బ్యాంకు ఏటీఎం చోరికి యత్నం

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని ప్రగతినగర్ లో కెనరా బ్యాంకు ఏటీఎం చోరికి యత్నం చేసి దుండుగులు ఏటీఎం మిషన్ ధ్వంసం చేశారు.

09:40 - April 13, 2016

సామాన్య రైతు బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే వంద సార్లు తిరగాలని.. కానీ బడా వ్యాపారులకు మాత్రం సులువుగా రుణం లభిస్తుందని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిర పాల్గొని, మాట్లాడారు. చట్టాలను మారుస్తేనే విజయ్ మాల్యా లాంటి వాళ్లపై చర్యలు తీసుకోగలరని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

09:31 - April 13, 2016

సముద్రంలో చేపట వేట నిషేధం సమయంలో మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం నేత అప్పలరాజు డిమాండ్ చేశారు. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఎల్లుండి నుంచి సముద్రంలో చేపలు వేటాడడానికి వీల్లేదు. రెండు నెలల పాటు ఈ నిషేధం అమలులో వుంటుంది. దీంతో మత్స్యకారులతో పాటు చేపలు అమ్ముకునేవారు, ప్రాసెసింగ్‌ చేసేవారు, ఇతర అనుబంధ వృత్తుల వారి ఉపాధికి ఇబ్బంది కలుగుతుంది. ఇది ప్రతి ఏటా ఎదురవుతున్న అనుభవమే. చేపల వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులకున్న ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలేమిటి? చేపల పరిశ్రమ మీద ఆధారపడ్డవారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తోంది? ప్రభుత్వం నుంచి మత్స్యకారులు ఏమి ఆశిస్తున్నారు? మత్స్య సంపదకు హాని కలిగిస్తున్న అంశాలేమిటి? మత్స్య సంపద అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?' ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:22 - April 13, 2016

60 రోజులుఉపాధి లేకపోతేకటుంబ  ఆర్థిక పరిస్థితైనా , ఏ తలకిందులవుతుంది. రెండు నెలలు ఆదాయ మార్గాలు మూసుకుపోతే ఇల్లు గడవడం కష్టం. ఇవాళ మత్స్యకారులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. 
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు నిషేధం
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకారులకు అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన కాలం. మత్స్య సంపద వృద్ధి చెందేది, చేపలు పిల్లలు పెట్టేది ఈ సమయంలోనే. ఇది చేపల పునరుత్పత్తి కాలం. అందుకే ఈ అరవై రోజులూ సముద్రాల్లో చేపల వేటను నిషేధిస్తుంటారు.   జూన్ 15వరకు మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లడానికి వీలులేదు. 
దేశంలో చాలామంది నిరుపేదలకు చేపే జీవితం
మన దేశంలో చాలామంది నిరుపేదలకు చేపే జీవితం. కోటిన్నర కుటుంబాలకు అదే జీవనాధారం. దాదాపు పాతిక కోట్ల మందికి చేప ఇష్టమైన ఆహారం. సీఫుడ్‌కి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌ వుంది. మత్స్యసంపద విషయంలో చైనా తర్వాతి స్థానం మనదే. ఏటా మన దేశం నుంచి 18, 856 కోట్ల రూపాయల  విలువైన మత్స్య సంపద ఎగుమతి అవుతోంది. వ్యవసాయరంగం ఎగుమతుల్లో  జలచరాలది 17శాతం వాటా. జీడీపీలో మత్స్యసంపద వాటా ఒక శాతానికి చేరింది.  విదేశీ మారకద్రవ్యం ఆర్జించి, దేశాభివృద్ధికి తోడ్పడడంలోనూ, పోషక విలువలున్న ఆహారాన్ని అందించడంలోనూ తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న మత్స్యకారులకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వాల మీద వుంది.  దురదృష్టవశాత్తు ఇవాళ అలాంటి శ్రద్ధే లోపిస్తోంది. 
ఎపిలో పది లక్షల కుటుంబాలకు చేపలే జీవనాధారం
ఆంధ్రప్రదేశ్ లో పది లక్షల కుటుంబాలకు చేపలే జీవనాధారం. వలలేసి చేపలు పట్టేవారు, వాటిని అమ్ముకునేవారు, ప్రాసెసింగ్ చేసేవారు, ఐస్  బాక్స్ ల్లో భద్రపరిచేవారు, బోట్లు కట్టేవారు ఇలా రకరకాల వ్రుత్తులవారికి చేపలే సర్వశ్వం. మత్స్య పరిశ్రమ బాగుంటే వీరందరికీ కాస్త తిండి దొరుకుతుంది. 
చేపల వేటపై నిషేధం... పది లక్షల కుటుంబాలపై ప్రభావం 
చేపల పునరుత్పత్తి కాలంలో చేపల వేటను నిషేధిస్తుండడంతో పది లక్షల కుటుంబాల మీద దాని ప్రభావం పడుతోంది. ఈ అరవై రోజులూ వీరికి పని వుండదు. దీంతో ఈ  రెండు మాసాల్లో అనేక కుటుంబాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. సంవత్సరమంతా కష్టపడి సంపాదించుకుని, నిల్వ చేసుకున్న సొమ్ము ఈ రెండు నెలల్లో కరిగిపోతుంది. అయితే, చేపలు పట్టేవారి అందరి జీవితాలు నిండు కుండలా వుండవు. చాలామందికి ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోతుంది. ఇలా అంతంత మాత్రపు సంపాదనతో బతికేవారికి ఈ రెండు నెలలు అత్యంత గడ్డుకాలమే. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పస్తులుండాల్సి వస్తుంది. 
చేపల వేట నిషేధ కాలంలో ఆదుకోవాలి  
అందుకే చేపల వేట నిషేధ కాలంలో వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సి వుంటుంది. ఈ కాలంలో వారి కుటుంబాలు వీధిన పడకుండా సాయం అందించాల్సి వుంటుంది. ప్రతి ఏటా వీరికి సాయం చేస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా ఆచరణలో అమలు కావడం లేదు. చేపల వేట నిషేధ కాలంలో ఒక్కొక్క కుటుంబానికి వంద కేజీల బియ్యం, పది కేజీల పప్పులు, 20 లీటర్ల కిరోసిన్ ఇవ్వాలనీ,  ఆరు వేల రూపాయల చొప్పున నగదు పరిహారం చెల్లించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే అక్కడక్కడ ఎవరో కొందరికీ పాతిక, ముప్పై కేజీలిచ్చి చేతులు దులుపుకునే వ్యవహారమే సాగుతోంది. ఈ మాత్రం భ్రుతి చెల్లించే విషయంలోనూ అధికార యంత్రాంగం నానా రకాల ఆధారాలు చూపాలంటూ కొర్రీలు పెడుతూ, లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తోంది.  చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయి అవస్థపడుతున్న మత్స్యకారులను గుర్తించడం, వారికి సహాయం అందిచడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే, మత్స్యకారులను ఆదుకునే విషయంలో చిత్తశుద్ధే లోపిస్తోంది. 
సముద్ర జలాల్లో పేరుకుపోతున్న కాలుష్యం
చేపల పునరుత్పత్తి పేరుతో చేపల వేటను నిషేధిస్తున్న ప్రభుత్వం వివిధ రూపాల్లో సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలు చేయడం లేదు. సముద్ర జలాల్లో పేరుకుపోతున్న కాలుష్యం కారణంగా చేపలు కుప్పలు కుప్పలుగా చనిపోతున్నాయి. వాటి పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. కాబట్టి, సముద్ర జలాల్లో కాలుష్య నివారణ చర్యల మీద కూడా ద్రుష్టి సారించాల్సి వుంటుంది.

 

09:15 - April 13, 2016

హైదరాబాద్ : నగరంలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 ఇల్లు దగ్ధం అయ్యాయి. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. పాతబస్తీలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో 200 వందల మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు రోజువారి కూలీలు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 5 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపిస్తున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలికి రాలేదు. 

 

08:59 - April 13, 2016

త్రిష టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'నాయకి'. గోవి దర్శకత్వంలో రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం త్రిష పాడిన ఓ పాటను దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ, 'త్రిష తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. ఇందులో ఆమె లుక్‌ చాలా బాగుంది. అలాగే ఆమె తొలిసారి పాడిన పాట కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా త్రిషతోపాటు చిత్ర దర్శకనిర్మాతలకూ అభినందనలు తెలియజేస్తున్నాను' అని అన్నారు. 'త్రిష పాడిన పాటకు మంచి స్పందన వస్తోంది. అనుభవం ఉన్న రెగ్యులర్‌ నేపథ్య గాయని పాడినట్లుగా త్రిష చాలా చక్కగా పాడారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా ఈ నెల 19న హైదరాబాద్‌లో ఆడియోను చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. వేసవి సందర్భంగా మేలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం' అని నిర్మాత గిరిధర్‌ తెలిపారు. దర్శకుడు గోవి మాట్లాడుతూ, 'హర్రర్‌ జోనర్‌ చిత్రాలలో కొత్తరకమైన చిత్రమిది. కెరీర్‌లోనే అత్యున్నత నటనను త్రిష ఈ చిత్రంలో కనబరిచింది' అని చెప్పారు. గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేష్‌, బ్రహ్మానందం, జీవీ, జయప్రకాష్‌, కోవై సరళ, మనోబాల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: జగదీష్‌ చీకటి, ఎడిటింగ్‌: గౌతంరాజు.

 

08:57 - April 13, 2016

హైదరాబాద్ : మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 45 పరుగుల తేడాతో  హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్,విరాట్ కోహ్లి  మెరుపులకు తోడు కుర్రాడు సర్ఫారాజ్ ఖాన్ ఆఖర్లో విజృంభించడంతో బెంగుళూరు 227 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 182 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ వార్నర్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

 

08:43 - April 13, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్‌, దళితులపై బూటకపు ప్రేమ కురిపిస్తున్నాయని టీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళిత వ్యతిరేకులకు మోడీ బాసటగా నిలుస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ దళితులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ 125 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీ  కాంగ్రెస్... అదే వేదికగా మోడీ, కేసీఆర్‌లపై విమర్శలు గుప్పించింది. 
మోడీ పాలనలో దళితులపై దాడులు : దిగ్విజయ్ సింగ్  
అంబేద్కర్ 125 వ జయంతి వేడుకలను టీ కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో  ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కొప్పులు రాజు, కుంతియా హాజరయ్యారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగి పోయాయని దిగ్విజయ్ ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. 
దళితులపై కేసీఆర్‌ బూటకపు ప్రేమ : ఉత్తమ్
దళితులపై కేసీఆర్‌ బూటకపు ప్రేమను కురిపిస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో సీఎం కమిషన్‌లను దండుకుంటున్నారని ఆరోపించారు. 
అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : జానా 
అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. దళిత నాయకుడిగా జనాన్ని కదలించిన మానవతా వాది అంబేద్కర్‌ అని జానా కొనియాడారు. దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. హైద్రాబాద్‌లో  125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని టీ కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు. 

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

గుంటూరు : జిల్లాలోని గురజాల మండలం అంబాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, జీపు ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న గుడిసెలకు వ్యాపిస్తున్నాయి. గుడిసెల్లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. 

నేడు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం అమలు దిశగా.. ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పథకం విధివిధానాలు, నిధుల ఆవశ్యకత తదితర అంశాలతో.. అధికారులు సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. దీనికోసం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బిల్డర్లు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, ఇంజినీర్లు, నిర్మాణ రంగ నిపుణలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

 

08:24 - April 13, 2016

హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం అమలు దిశగా.. ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పథకం విధివిధానాలు, నిధుల ఆవశ్యకత తదితర అంశాలతో.. అధికారులు సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. దీనికోసం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బిల్డర్లు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, ఇంజినీర్లు, నిర్మాణ రంగ నిపుణలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 
అధికార యంత్రాంగం కసరత్తు 
కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై.. అధికార యంత్రాంగం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా.. మిగతాచోట్ల స్థలసేకరణ చేపట్టే పనిలో పడింది ప్రభుత్వం. 
ఈ ఏడాది రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 
ఈ ఏడాది ఎలాగైనా రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఒక్క భాగ్యనగరంలోనే లక్ష ఇళ్లు.. మిగిలిన 9 జిల్లాల్లో మరో లక్ష ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం 14 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమగ్ర నివేదిక సమర్పిస్తే రుణం గురించి ఆలోచిస్తామని హడ్కో అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల డిజైన్‌, వ్యయం, లొకేషన్‌, కాలపరిమితి తదితర అంశాలను ఫైనలైజ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించేందుకు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, బిల్డర్లు, కంపెనీ యాజమాన్యాల సలహాలు తీసుకోవాలని గృహ నిర్మాణశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం బుధవారం ఆయా సంస్థల ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరిస్తారు. 
పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరణ 
నిర్మాణ ప్రతిపాదనలను బిల్డర్లు, సంస్థల ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో.. ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం నాడు జరిగే వర్క్‌షాపులో అన్ని విషయాలపై చర్చించి సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. 

08:19 - April 13, 2016

తూర్పుగోదావరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు కేంద్రంగా ఏర్పడిన కొత్త ఐటీడీఏను సీఎం ప్రారంభిస్తారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పోలవరం ముంపు మండలాలైన కూనవరం, చింతూరు, వర రామచంద్రపురం, భద్రాచలం మండలాలు ఈ కొత్త ఐటీడీఏ పరిధిలోకి రానున్నాయి. 

 

నేడు పోలీసు మొబైల్ యాప్ ప్రారంభం..

హైదరాబాద్ : పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జేఎన్‌టీయూహెచ్ సహకారంతో టీ-హబ్ స్టార్టప్ కంపెనీలోని యాప్‌స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీ ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. దీనిని బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మ తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారా సంబంధిత పరీక్షా కేంద్రం ఫోన్ నంబర్‌తో పాటు గూగుల్ నేవిగేషన్‌ను కూడా పొందవచ్చు.

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

విజయనగరం : జిల్లాలోని గజపతి నగరం మండలం సీతారాంపురంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 పశువుల పాకలు, 4 పూరిళ్లు, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో సుమారుగా 50 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిలినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

08:09 - April 13, 2016

హైదరాబాద్ : పన్నుల వసూళ్లు, లక్ష్యాల సాధనలో ఆధునిక విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వ్యాపారులకు నష్టం కలుగకుండా సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఆదాయ వనరుల శాఖల పనితీరు,ఫలితాలపై మంత్రులు,అధికారులతో  సీఎం సమీక్ష నిర్వహించారు. 
వర్తక వ్యాపారుల కోసం అధునిక సాంకేతికత
ఏపీలోని వర్తక వ్యాపారులకు నష్టం రాకుండా ఆధునిక సాంకేతికత విధానాలను ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.  ఆదాయ వనరుల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు యనమల, పీతల సుజాత, కొల్లు రవీంధ్ర, శిద్దా రాఘవరావు, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.           
సాంకేతికతో అవినీతికి చెక్ పెట్టేలా చర్యలు-సీఎం 
చిన్న చిన్న వ్యాపారులను అధికారులు వేధిస్తున్నారనే అపప్రథ తొలగిపోయేలా అన్ని స్థాయిలలో పారదర్శక విధానాలను అమలుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇ-వే బిల్స్, టాక్స్ అనలిటిక్స్, చెక్‌పోస్టుల ఆధునికీకరణ, యాప్స్ వినియోగాన్ని విస్తృతం చేసి అవినీతికి స్వస్తి చెప్పే విధానాలను అమలుచేయాలని సూచించారు. అమ్మకందారు ఇన్ వాయిస్ అప్‌లోడ్ చేయకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని..అప్పటికి పద్ధతి మార్చుకోకపోతే పెనాల్టీ విధించాలని చెప్పారు. చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
ఏపీఆర్‌డీసీకి చెక్‌పోస్టుల ఆధునికీకరణ బాధ్యతలు 
ఏపీఆర్‌డీసీకి చెక్‌పోస్టుల ఆధునికీకరణ బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు సీఎం దృష్టికీ తీసుకొచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న 10వేల మంది వర్తకుల లైసెన్సులు రద్దుచేశామని తెలిపారు. సాంకేతికత వినియోగం వల్ల చెక్‌పోస్టుల వసూళ్లు రూ.8.72 కోట్ల నుంచి రూ. 46 కోట్లకు పెరిగిందని సీఎంకు వివరించారు. ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా అవినీతికి చెక్‌ పెడుతున్నామని,ఛత్తీస్‌గఢ్‌ తరహాలో సాస్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి మంచి ఫలితాలు రాబట్టామని అధికారులు సీఎంకు తెలిపారు.

 

08:05 - April 13, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో 108,104 సర్వీసులను పటిష్ట పరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధంగా పోలీస్,వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య శాఖ, పోలీసు శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం : సీఎం కేసీఆర్
108,104 సేవలు, వాటి పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 108 వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని... ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఉద్యోగులు,అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. 
104 వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చర్యలు : సీఎం కేసీఆర్
నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్లి వైద్య సేవలందించే 104 వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు,వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
వైద్య సేవలు మెరుగపడాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగపడాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగదు ప్రోత్సహం అందించేందుకు  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని..అదే సమయంలో డాక్టర్లు కచ్చితంగా సమయపాలన పాటించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో నాలుగు కొత్త ఆస్పత్రులు నిర్మాణానికి తగిన స్థలాల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని సీఎం తెలిపారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని స్థలాల వివరాలను మంత్రి లక్ష్మారెడ్డి సీఎంకి తెలిపారు.

 

08:00 - April 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను నీతి అయోగ్‌ అధికారులు ప్రశంసించారు. చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయ పనులను కేంద్రం ఆసక్తిగా గమనిస్తున్న విషయాన్ని నీతి ఆయోగ్‌ సభ్యులు ప్రస్తావించారు.
పథకాల అమలుపై ప్రశంసలు 
తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను నీతి ఆయోగ్‌ సలహాదారులు సమీక్షించారు. పథకాల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ప్రణాళిక శాఖ ఏర్పాటుచేసిన  సమావేశంలో నీతి ఆయోగ్‌ సలహాదారుడు ఏకే జైన్‌, ఉప సలహాదారుడు పీకే ఝా పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాలను  రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 
ఆర్థిక సహాయం అందించాలని కోరిన రాష్ట్ర అధికారులు 
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర అధికారులు నీతి ఆయోగ్‌ సలహాదారులను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన నీతి అయోగ్‌ సభ్యులు..ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను ఇప్పటికే ప్రశంసించిందని, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పన్‌గారియా వీటి గురించి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని సలహాదారులు తెలిపారు. 
చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాల పెంపు
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కేంద్రం ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూడాలని నీతి ఆయోగ్‌ సలహాదారులను రాష్ట్ర అధికారులు కోరారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, రైతులకు అదనపు ఆదాయం, ఆయకట్టు పెంపు, మత్స్య, పాడి పరిశ్రామాభివృద్ధి వంటి ప్రయోజనాలు కలుగతాయని వివరించారు. మిషన్‌ భగీరథ కార్యక్రమానికి కూడా కేంద్ర సాయం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 

 

07:41 - April 13, 2016

ఢిల్లీ : భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
వాతావరణ శాఖ నుంచి చల్లని కబురు
ఈసారి రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.. గత రెండేళ్లుగా తక్కువ వర్షపాతంతో ఇబ్బందిపడ్డ వ్యవసాయ రంగానికి ఈసారి ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది. 
104 నుంచి 110 శాతం వరకు వర్షపాతం
ఈసారి 104 నుంచి 110 శాతం వరకు వర్షపాతం నమోదు కానుంది. కరువుతో అల్లాడిపోతున్న మరాఠ్వాడా, విదర్భ, బుందేల్‌ ఖండ్‌ తదితర ప్రాంతాలలో కూడా వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్‌నీనో ప్రభావం తగ్గుముఖం పడుతోందని, దీనివల్ల రుతుపవనాల్లో మార్పు రానుందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.  
రెండేళ్లుగా దేశంలో కరువు
గత ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత రెండేళ్లుగా దేశంలో కరువు తాండవిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు ఎక్కువుగా నమోదు కావడం వల్ల వర్షాలు కూడా అధికంగా పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం కరువుతో అల్లాడుతున్న 10 రాష్ట్రాలకు ఊరటనిచ్చేలా ఉంది.

 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

నేడు పోలవరం ముంపు మండలాల్లో చంద్రబాబు పర్యటన

హైదరాబాద్ : నేడు పోలవరం ముంపు మండలాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చింతూరు, కుక్కనూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు తెలంగాణ పలు జిల్లాల్లో వడగాలులు

హైదరాబాద్ : నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాలులు వీయనున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

నేడు కోల్ కతా-ముంబై మధ్య క్రికెట్ మ్యాచ్

కోల్ కతా : ఐపీఎల్-2016 లో భాగంగా నేడు కోల్ కతా, ముంబై మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు కేంద్రక్యాబినెట్ సమావేశం..

ఢిల్లీ : నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss