Activities calendar

15 April 2016

21:19 - April 15, 2016

హైదరాబాద్ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 74 పైసలు,.. డీజిల్‌పై రూపాయి 1.30 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

 

21:17 - April 15, 2016

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటిపారుదల, భూగర్భ జలాలు, వ్యవసాయం, వైద్య శాఖల అధికారులతోపాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్లు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో లక్షన్నర పంట కుంటల నిర్మాణం పూర్తి .....

టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబునాయుడు ప్రధానంగా పంటకుంటల నిర్మాణం అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షన్నర పంటకుంటలు పూర్తైన విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మిగిలిన ఎనిమిదిన్నర లక్షల పంట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఐదు ఎకరాల విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు పొలాల్లో పంటకుంటులు తవ్వేందుకు యంత్రాలు వాడాలని సూచించారు. అంతకంటే తక్కువ భూమి ఉంటే మనుషులతోనే ఈ పనులు చేయించాలన్నారు. నీరు-చెట్టు కార్యక్రమానికి కేటాయించిన నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులనూ పంటకుంటల నిర్మాణానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఖరీఫ్‌ ప్రారంభంలోగా చెరువు కట్టలు, వాగులు, వంకలు, పంటకాల్వలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాలకు టాంకర్ల ద్వారా మంచినీరు.....

తీవ్ర మంచినీటి ఎద్దడి అంశాన్నీ చంద్రబాబునాయుడు సమీక్షించారు. తాగునీరు కొరత ఏర్పడిన గ్రామాలకు టాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యారోగ్య శాఖ అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. వడదెబ్బపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించిన చంద్రబాబు... ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఉచిత ఇసుక ప్రయోజనాలు పేదలకు దక్కేలా మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక అమ్మకానికి ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, డీఎస్‌పీలు సమన్వయంతో పనిచేస్తూ.... ఇసుక అక్రమ తవ్వకాలను కళ్లెం వేయాలని చెప్పారు.

20:44 - April 15, 2016

ఢిల్లీ : జెడియుకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్‌ సహానీ ఎల్‌టిసి స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనిల్‌ సహానీ విమానాల్లో ప్రయాణించినట్లు నకిలీ ఎయిర్‌ టికెట్లు పెట్టి పార్లమెంట్‌ నుంచి 23 లక్షలు క్లెయిమ్‌ చేసుకున్నారు. అయితే ఆయన విమానంలో అసలు ప్రయాణించనే లేదు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఎంపి అనిల్‌ సహానీపై సిబిఐ విచారణకు ఆదేశించారు. 53 ఏళ్ల సహానీ రెండుసార్లు ఎంపీగా ఎంపికయ్యారు. ఫేక్‌ ఎయిర్‌ టికెట్‌కు సంబంధించి ఢిల్లీలోని ఓ ట్రావెల్‌ కంపెనీ ఉద్యోగితో పాటు ఓ ఎయిర్‌ ఇండియా ఉద్యోగి ఎంపీకి సహకరించినవారిలో ఉన్నారు. ప్రతి పార్లమెంట్‌ సభ్యునికి తమ నియోజకవర్గాల్లో పర్యటించడానికి డోమస్టిక్‌ ట్రావెల్‌ కింద ప్రతి సంవత్సరం 34 ఎయిర్‌ టికెట్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఓ రాజ్యసభ సభ్యుడిపై సిబిఐ విచారణకు ఆదేశించడం ఇదే తొలిసారి. 

20:38 - April 15, 2016

కృష్ణా : బెజవాడలో నటి త్రిష సందడి చేసింది. బందర్‌ రోడ్డులోని ఓ షోరూమ్‌ను త్రిష ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. త్రిషకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమానులు పోటీ పడ్డారు. త్రిష కూడా కరచాలనం చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు.

20:37 - April 15, 2016

హైదరాబాద్ : మెదడు సంబంధిత వ్యాధితో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఈటెల రాజేందర్‌ పీఆర్వో రవీందర్‌ను మంత్రులు ఈటెల, లక్ష్మారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరామర్శించారు. రవీందర్‌ ఆరోగ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే రవీందర్‌ వైద్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎంత ఖర్చయినా సరే.. వెనకడుగు వేయకుండా మెరుగైన వైద్యమందించాలని మంత్రులు కోరారు. ఇదిలావుంటే రవీందర్‌ను పరామర్శించేందుకు పలువురు మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. 

20:35 - April 15, 2016

విశాఖ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని అప్పలకొండగా గుర్తించారు. సిరిపురం జంక్షన్‌ సమీపంలోని హెచ్ ఎస్ బీసీ దగ్గర ఈ ఘటన జరిగింది. మ్యాన్‌హోల్‌లో పనిచేస్తుండగా అప్పలకొండ జారిపడిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ ఘటనా స్థలానికి చేరుకున్నా.. దానిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో లేదని చెబుతున్నారు. దీంతో సకాలంలో ఆక్సిజన్‌ అందక అప్పలకొండ మరణించాడు. మ్యాన్‌హోల్‌ నుంచి అప్పలకొండ మృతదేహాన్ని బయటకుతీసి, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

20:33 - April 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన కడియం.. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కోసం 250 గురుకులాలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 6 వేల మంది టీచింగ్‌ స్టాఫ్‌,.. 4 వేల మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అవసరం ఉందన్నారు కడియం.

20:32 - April 15, 2016

విజయవాడ : వచ్చే నెలాఖరునాటికి వైసీపీ దుకాణాన్ని మూసివేసుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. జగన్‌ నాయకత్వంపై నమ్మకంలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్నారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మినహా... వైసీపీ నుంచి ఎవరు వచ్చినా టిడిపిలో చేర్చకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోబాలతో తమ ఎమ్మెల్యే లను లొంగిదీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించడాన్ని బుద్దా వెంకన్న తప్పుపట్టారు. టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. 

20:28 - April 15, 2016

విజయవాడ : పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డే అన్నారు. వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలిపై నమ్మకం లేకనే వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ లక్ష్యమన్నారు ప్రత్తిపాటి. 

20:25 - April 15, 2016

విశాఖ :ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌ పోటీలకు ఆతిధ్యమిచ్చే అవకాశాన్ని విశాఖపట్నం సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 9వ సీజన్‌తో అరంగేట్రం చేసిన పూణే రైజింగ్‌ సూపర్ జెయింట్స్‌ జట్టు మే నెలలో ఆడాల్సిన హోంగ్రౌండ్‌ మ్యాచ్‌లకు విశాఖ ఏసీఏ- విడిసిఏ క్రికెట్‌ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. ఐపీఎల్‌ 8వ సీజన్‌లో ఏసీఏ-వీడిసిఏ స్టేడియం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు హోంగ్రౌండ్‌గా కొన్ని మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టు జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంను హోంగ్రౌండ్‌గా ఎంచుకునే అవకాశముంది. ఫైనల్‌కు ముంబై వాంఖడే స్టేడియంకు బదులుగా....బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం ఆతిధ్యమిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

20:22 - April 15, 2016

హైదరాబాద్ : సుల్తాన్ అజ్లాన్ షా హాకీ గోల్డ్ కప్ ఫైనల్స్ కు ఐదుసార్లు చాంపియన్ భారత్ చేరుకొంది. ఇఫోలో జరిగిన ఏడుదేశాల ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ఆతిథ్య మలేసియాను భారత్ 6-1 గోల్స్ తేడాతో చిత్తు చేసి...ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో పోటీపడటానికి అర్హత సంపాదించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో భారత్ మూడో క్వార్టర్ ముగిసే సమయానికే 5-0 గోల్స్ తో పైచేయి సాధించింది. ఇప్పటి వరకూ ఆడిన ఐదులీగ్ మ్యాచ్ ల్లో జపాన్, కెనడా, పాక్ జట్లను ఓడించిన భారత్...ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓటమి పొందినా...ఆఖరిమ్యాచ్ లో మలేసియాను ఊదిపారేసింది. భారత ఆటగాళ్లు నాలుగు ఫీల్డ్ గోల్స్ తో పాటు రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించడం విశేషం....

పొలంలో రైతు పై చిరుతదాడి

కడప: లక్కిరెడ్డిపల్లె మండలం డి వడ్డే పల్లెలో పొలం పనులు చేసుకుంటున్న రైతు పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో రైతు కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

'సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో భారీ అవినీతి'

నల్గొండ : సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో బస్సు జాతా జరుగుతుంది. ఈ జాతాలో చెరుకు సుధాకర్, చెన్న శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో భారీ అవినీతి జరుగుతోందని తెలిపారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలని చెరుకు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు, తర్వాత వారి ఆస్తులు ఎంతో నిరూపించేందుకు మేం సిద్ధం అని చెరుకు స్పష్టం చేశారు.

ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఢిల్లీ: ఐపీఎల్‌-9లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన దిల్లీ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని ఆశిస్తోంది. మరోవైపు మిల్లర్‌ నేతృత్వంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కూడా గుజరాత్‌ చేతిలో ఓడి ప్రస్తుతం ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.

19:14 - April 15, 2016

హైదరాబాద్ : సంగీతంలో ఉద్దండుడు కాకున్నా..స్వరాలపై అభిమానం పెంచుకున్నాడు. ఎవరి అండ లేకున్నా...ఆత్మ విశ్వాసంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. పాటల కూర్పు ప్రారంభించాడు. భారీ లక్ష్యం వైపు వేసే ఒక అడుగైనా...గెలుపే అన్నట్లు...చాలా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి...స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ అయ్యాడు. ఫాస్ట్ బీట్ పాటలా 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు యంగ్ కంపోజర్ సాయికార్తీక్. ఆయన తో 'టెన్ టివి' చిట్ చాట్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

'హనుమంతరావు సూచనలు సీఎం ఆలోచనలు దగ్గరగా' ఉన్నాయి...

హైదరాబాద్: నీటిపారుదల నిపుణుడు హనుమంతరావుతో మంత్రి హరీష్ రావు భేటీ ముగిసింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ వివరాలను హనుమంతరావుకు హరీష్ రావు వివరించారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ వరకు బ్యారేజీలు కట్టాలని హనుమంతరావు సూచించగా ప్రభుత్వ పరిశీలనలో ఉందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ లో గోదావరి, ఉప నదులను జీవ నదులుగా మార్చే ప్రణాళికలను మంత్రి హరీష్ కు హనుమంతరావు వివరించారు. హనుమంతరావు సూచనలు సీఎం ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని హరీష్ రావు తెలిపారు.

చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

హైదరాబాద్ : హకీంపేట చెరువులో ఈతకెళ్లి యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడిని బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌కు చెందిన సాయిగౌడ్(19)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మాల్యాపై బాంబే హైకోర్టులో ఈడీ పిటిషన్

హైదరాబాద్ :బ్యాంకుల నుంచి దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో నిందితుడైన విజమమాల్యకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ పై రేపు బాంబే హైకోర్టు విచారణ జరపనుంది.

ఓజన్ కెమికల్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

మెదక్ : పటాన్ చెరువు మండలం పాశమైలారంలో ఓజన్ కెమికల్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పుణెలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను విశాఖకు

ముంబై : బీసీసీఐ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర నుంచి మ్యాచ్ ల తరలింపు పై చర్చ జరిగింది. విశాఖ ను హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న పుణె. పుణెలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను విశాఖకు తరలింపుకు బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరిగే అవకాశం వచ్చింది.

రంగారెడ్డి జిల్లాకు 9 మైనార్టీ గురుకుల పాఠశాలలు

రంగారెడ్డి : జిల్లాలో 9 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. రూ. 18 కోట్ల నిధులతో భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రతీ పాఠశాలకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 74 పైసలు, లీటరు డీజిల్ పై రూ.1.30 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుండి అమలులోకి వస్తాయి.

18:04 - April 15, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పై '10 టివి' సమరభేరి మోగించింది. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు,తల్లిదండ్రుల ఆవేదనను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ అంశంపై గుంటూరు లో రిపోర్టర్ రామకృష్ణ ఓపెన్ డిబేట్ చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

త్రయంబకేశ్వరుని సన్నిధిలో మహిళా మణులు...

హైదరాబాద్ : పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కావాలంటూ మహిళా సంఘాలు దశాబ్దాల నుండి పోరాడుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్నాయి. కాగా ఈ బిల్లు పార్లమెంట్ కోల్డ్ స్టోరేజ్ లోనే వుండిపోతోంది. కానీ మహిళలకు ప్రవేశ నిషిద్ధ దేవాలయాలలోకి మాత్రం నారీమణులకు చారిత్రక పుణ్యక్షేత్రాలు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని రోజులకు ముందుగానే శనీశ్వరాలయంలోకి మహిళలను అనుమతిస్తూ ఆ దేవాలయం ట్రస్టు అనుమతించిన విషయం తెలిసిందే.

17:43 - April 15, 2016

హైదరాబాద్ : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని.. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ నేత మందా జగన్నాథం అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలు కొన్ని పదవులు కోసం ఆశపడుతున్నారని.. ఆ పదవులు రాని రోజున వారు కూడా అదే బాటపడతారన్నారు జూపల్లి. 

40 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతి....

హైదరాబాద్ : ఆఫ్గనిస్థాన్ సైన్యం జరిపిన యుద్ధ విమాన దాడిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 40 మంది హతమయ్యారు. అచిన్ జిల్లా పిఖాలాతాబాండ్ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ రహస్యం సమావేశం సమాచారాన్ని అందుకున్న తమ సైన్యం చాకచక్యంగా వారిపై విరుచుపడినట్లు ఆఫ్గన్ రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ దాలత్ వజిరి వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చి ఈ సంస్థలో చేరినట్లుగా జన్ రల్ దాలత్ వజిరి పేర్కొన్నారు. కొన్ని మృతదేహాలను స్థానికులు గుర్తు పట్టి తీసుకెళ్లారని ఆయన తెలిపారు.

మ్యాన్ హోల్ లో పడి వ్యక్తి గల్లంతు....

విశాఖపట్నం : సిరిపురం హెచ్ఎస్ బీసీ సమీపంలో వున్న మ్యాన్ హోల్ పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతయిన వ్యక్తి కోసం సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

పెళ్లి వ్యాను బోల్తా 13 మంది మృతి...

ఛత్తీస్ ఘఢ్ : కంచేరు జిల్లా కూతూరుపేట వద్ద పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయాలయినవారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విజయ్ మాల్యా పాస్ పోర్ట్ రద్దు ...

ఢిల్లీ : కింగ్ ఫిషర్ హౌస్ అధినేత విజయ్ మాల్యా పాస్ పోర్ట్ ను  విదేశాంగశాఖ రద్దు చేసింది.  పలుమార్లు  నోటీసులు ఇచ్చినా  స్పందించలేదని ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈడీ ఇచ్చిన ఆదేశాలతోనే విదేశాంగ శాఖ మాల్యా పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. దీంతో మాల్యా మెడకు ఉచ్చు మరింతగా బిగుసుకోనుంది. రూ.9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిందుతుడిగా వున్న విషయం తెలిసిందే. 

రామాలయంలో బాంబుల కలకలం...

హైదరాబాద్ : సున్నంగూడా రామాలయంలో బాంబులు కలకలం రేపాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో వున్న సున్నంగూడా రామాలయంలో సంఘవిద్రోహ శక్తులు బాంబులను పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవాలయంలోని బాంబులను నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇది తెలుసుకున్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తన తెలుగు రాష్ట్రాలలో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కళ్యాణం జరిపినట్లుగానే సుకుమా జిల్లాలోని సున్నంగూడా రామాలయంలో కొలువైన రామయ్యకు కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దీన్ని టార్గెట్ చేసుకున్న సంఘవిద్రోహ శక్తులు రామాలయంలో బాంబులు పెట్టారు.

16:39 - April 15, 2016

ఢిల్లీ :

ప్రభుత్వ బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి విదేశాలకు వెళ్లిపోయిన కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యాపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన సిఫారసు మేరకు విదేశాంగ శాఖ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది.

మాల్యా సహకరించడం లేదని.....

మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి మాల్యా సహకరించడం లేదని, ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని ఈడీ రాసిన లేఖ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణకు హాజరు కావాలని మార్చి 18, ఏప్రిల్‌2, ఏప్రిల్‌ 9న మాల్యాకు మూడుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఏదో ఓ కారణంతో మూడు సార్లు కూడా ఈడీ ముందు హాజరు కాకుండా మాల్యా డుమ్మా కొట్టాడు. పాస్‌పోర్టు రద్దుతో మాల్యా కార్యకలాపాలు ఆగిపోయే అవకాశముంది. మాల్యా లండన్‌లోనే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

మాల్యాపై ఈడీ విచారణ.....

ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న 9 వందల కోట్ల రుణం ఎగవేత కేసులో మాల్యాపై ఈడీ విచారణ జరుపుతోంది. మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద నిందితుడు హాజరు కావడానికి ఈడీ మూడు సార్లు సమయమిస్తుంది....అప్పటికి హాజరు కాకుంటే పాస్‌పోర్టును రద్దు చేయడం లేదా...నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం జరుగుతుంది.

ఎస్‌బిఐతో సహా 17 బ్యాంకులకు 9వేల కోట్లు బకాయిలు....

మాల్యా ఎస్‌బిఐతో సహా 17 బ్యాంకులకు 9వేల కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్‌ 30 వరకు 4వేల కోట్లు చెల్లిస్తానన్న విజయ్‌మాల్యా ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. బకాయి పడ్డ మొత్తం 9వేల కోట్లు చెల్లించాల్సిందేనని బ్యాంకులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఏదైనా ఒప్పందం చేసుకోవాలంటే మాల్యా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేశాయి. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాల్యా విదేశాలకు బదిలీ చేశారన్న ఆరోపణలపై సిబిఐ కూడా విచారణ జరుపుతోంది.

కొనసాగుతున్న శోభాయాత్ర...

హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది.సీతారాంబాగ్ నుండి యాత్ర ప్రారంభమయిన ఈ యాత్ర సాయంత్రం 6 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. ఎటువంటి అవాంఛనీయమైన సంఘనలు జరుగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు.

పంట పొలంలో పేలుళ్లు..ఒకరు మృతి...

హైదరాబాద్ : మధ్యప్రదేశ్ లోని మెరానా జిల్లాలోని ఓ పంటపొలంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లాడ్జిలో యువకుడు ఆత్మహత్యా యత్నం...

కర్నూలు : నంద్యాలలోని ఓ ప్రయివేటు లాడ్జిలో ఓయువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యకు పాల్పడకముందు ప్రియురాలికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే యువకుడు బస చేసిన లాడ్జికి ఫోన్ చేసి విషయం చెప్పటంతో అప్రమత్తమైన వారు యువకుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. యువకుడు తిరుపతికి చెందిన వ్యక్తిగా లాడ్జి యాజమాన్యం తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సరి-బేసి లో 500ల వాహనాలకు జరిమానా....

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యసాకారంగా మారుతోంది. దీన్ని నియంత్రించటానికి కేజ్రీ సర్కారు వినూత్నంగా ప్రారంభించిన సరి-బేసి విధానం రెండవ విడతగా నేటి నుండి అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులు 5 గంటల్లో 500ల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానం ఈ ఏడాది జనవరిలో అమల్లోకి వచ్చిన విషయం విదితమే. మొదటి దశలో భాగంగా జనవరి 1 నుంచి 15 వరకు సరి-బేసి విధానానికి మంచి స్పందన వచ్చినా ఇప్పుడు కొంతమంది వాహనదారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

15:42 - April 15, 2016

ఢిల్లీ : దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థులు కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌కు భద్రత పెంచారు. ప్రతిరోజు జెఎన్‌యుకు వెళ్లే బస్సులో ఓ అజ్ఞాత బ్యాగు దొరకడంతో ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్యాగులో కంట్రీ మేడ్‌ పిస్టల్‌, కత్తులు, ఓ బెదిరింపు లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కన్హయ్య, ఖలీద్‌లను చంపుతామని ఆ లేఖలో రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. డిటిసి బస్సు డ్రైవర్ ఈ అజ్ఞాత బ్యాగును పోలీసులకు అప్పగించారు. అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

15:39 - April 15, 2016

నల్గొండ : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి అభివృద్ది పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించడంతోపాటు,ఆలయ అభివృద్దికోసం 'యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ' ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చూస్తోంది. స్వామివారిని దర్శించుకోవాలంటే షెడ్యూల్ ప్రకారం ఏడాదిన్నార పాటు ఆగాల్సిందే. దీంతో గర్భాలయానికి ప్రత్యమ్నాయంగా, అదేనమూనాతోకూడిన ''బాలాలయం''లోనే భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గర్భాలయానికి ప్రత్యమ్నాయంగా బాలాలయ నిర్మాణం ....

యాదాద్రి క్షేత్రాభివృద్దిలో భాగంగా ప్రధాన ఆలయాన్ని విస్తరించనున్నారు. గుట్టపైన పాత భవనాల కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి.ఆలయ విస్తరణలోభాగంగా, గర్భాలయం చుట్టూ నూతన నాలుగు మాడ వీధులు నిర్మించి గర్భాలయ విస్తరణ చేపడుతున్నారు. నిర్మాణ సమయంలో భక్తుల దర్శనాలకు ఆటంకం కలగకుండా,తాత్కాలికంగా బాలాలయాన్ని నిర్మిస్తున్నారు. దైవ దర్శనం సమయంలో భక్తులు క్యూ పాటించే విధంగా బారికేడ్ల ఏర్పాటు తో పాటు , తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు . ప్రస్తుతమున్న ప్రధాన ఆలయంలో నరసింహ్మస్వామి వారిని ఈ నెల 21 వరకే దర్శించుకునే అవకాశం ఉంది. దానికి ప్రత్యమ్నాయంగా బాలాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఆరు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి.

ఈనెల19 ,20 తేదీల్లో బాలాలయంలో ప్రత్యేక పూజలు .....

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. భక్తులు పూజలు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బాలాలయంలోనే పూజలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది ఆలయ సిబ్బంది.ఈనెల 19 ,20 తేదీల్లో బాలాలయంలో ప్రత్యేక పూజలు చేపడుతారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టకు చినజీయర్‌స్వామి విచ్చేయనున్నారు. ఆ తర్వాత భక్తులు దర్శించుకునేందుకు వీలు కల్పిస్తారు. నిత్య దైవదర్శనాలతో పాటు నిత్య కళ్యాణం, సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ మండపాలను కూడా బాలాలయంలోనే నిర్వహిస్తారు. తమ దర్శనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పూజలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనులకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

15:37 - April 15, 2016

సికింద్రాబాద్ : విద్యుత్‌ షాక్ తల్లి, కొడుకుల ప్రాణం తీసింది.. సికింద్రాబాద్‌ వారాసిగూడలో ఉండే నజీమా, తన కొడుకు రెహమాన్‌ని ఎత్తుకొని వాషింగ్‌ మిషిన్‌ ఆన్‌ చేసింది.. ఈ ప్రయత్నంలో బట్టలమధ్యలోఉన్న విద్యుత్‌ వైర్లతో వారికి షాక్‌ కొట్టింది.. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కరెంటు సరఫరా ఆపేశారు.. అప్పటికే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. మృతులను గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషణ చేస్తున్నారు.

15:34 - April 15, 2016

ఖమ్మం :భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ముగిసింది. సీఎం కేసీఆర్ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలం చాలా ప్రాముఖ్యత గల చారిత్రక ఆలయం. ఆలయఅభివృద్దికి బడ్జెట్ లో 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. చిన్నజీయర్ స్వామితో కలిసి మరోసారి ఆలయాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. రంగనాయకులగుట్ట, పర్ణశాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. ఖమ్మం జిల్లాపై ప్రతిపక్షాలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మిషన్ భగీరథను అమలు చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు.    

ధ్వజారోహణ తో ప్రారంభమైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు...

విజయవాడ : కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంరభమయ్యియి. ధ్వజారోహణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇంకా పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. ధ్వజారోహణ ప్రారంభమైన ఈ వేడుకలు చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ హాజరుకానున్నారు.

విద్యుత్ షాక్ తో తల్లీ కుమారుడు మృతి...

సికింద్రాబాద్ : వారాసిగూడలో విషాదం చేటుచేసుకుంది. ఓ ఇంట్లో జరిగిన విద్యుత్ షాక్ తగిలి తల్లీ కుమారుడు మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య...

రంగారెడ్డి : ఘట్ కేసర్ మండలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపింది. సింగపూర్ టౌన్ షిప్ లో 10వ అంతస్తులో నివాసముండే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈరోజు భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  స్థానికులు అందించిన సమాచారంతో చేరుకున్న పోలీసులు  సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

15:11 - April 15, 2016

కరీంనగర్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం జరిగింది. సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు వచ్చిన ఓ మహిళను మహిళా హోంగార్డులు అడ్డుకొని తీవ్రంగా కొట్టారు. కొట్టుకుంటూ భయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15:09 - April 15, 2016

హైదరాబాద్‌ : నగరంలో శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్‌ శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. సీతారాంబాగ్‌ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర..సాయంత్రం 6గంటలకు హనుమాన్‌ వ్యాయామశాలకు వరకు కొనసాగనుంది. అనంతరం హనుమాన్‌ వ్యాయామశాల పబ్లిక్‌ స్కూల్‌ వద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మహరాజ్‌ వైభవ్‌ బటిలే హాజరవుతారని నిర్వాహకులు భగవంత్‌రావు తెలిపారు. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా సాగేలా ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

గోదావరిలో స్నానానికి వెళ్ళిన ఇద్దరు గల్లంతు...

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు గల్లంతయినవారి కోసం గాలిస్తున్నారు.

భద్రాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు : కేసీఆర్

ఖమ్మం : భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణం ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం అభివృద్ధికి ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి అంశంలో చిన్న జియ్యర్ స్వామి సలహాలను తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగానే సాగునీటి ప్రాజెక్టులపై కూడా ఆయన మాట్లాడారు.  జిల్లాకు రెండు సాగునీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయనీ...ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవగాహన లేమితో చేసేవేనని కొట్టిపారేసారు.

14:53 - April 15, 2016

హైదరాబాద్ : గృహిణులు తమ సృజనాత్మకతకు తీరిక వేళ తోడైతే అనేక కళాకృతులను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి కళాకృతులను ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ్టి సొగసులో సంగీత తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:40 - April 15, 2016

మహిళలు ఇంటా, బయటా అనేక ఒత్తిడుల మధ్య పనిచేయాల్సిన స్థితి. ఇలాంటి స్థితిలో శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ కలిగి ఉంటేనే అనేక పనులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. అందుకోసం ఎలాంటి ఫిట్ నెస్ యాక్టివిటీని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలో ఇవాళ్టి 'నిర్భయ' తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:37 - April 15, 2016

హైదరాబాద్ : ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించే హక్కును రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయించాలి తప్ప, సనాతన ఆచారాల ప్రకారం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల ప్రవేశంపై నిషేధం ద్వారా లైంగిక సమానత్వం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది.

గత కొంత కాలంలో కొనసాగుతున్న ఆలయ ప్రవేశంపై మహిళలు విజయం సాధించారు. కోర్టు ఆదేశాలతో, ఆలయ ధర్మ కర్త సంఘం మహిళలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

పసి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లి పాలే కీలకం. దాని ప్రాధాన్యత పట్ల అందరికీ అవగాహన కలిగించడానికి ఏటా మన ప్రభుత్వాలు తల్లిపాల వారోత్సవాలను సైతం జరుపుతుంటాయి. అయితే.. ఈ బిజీ ప్రపంచంలో తల్లిపాలతో పెరుగుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోతోందనే చెప్పాలి. అందుకే.. ఆస్ట్రేలియాలోని ఓ కెఫే నిర్వాహకురాలు ప్రకటించిన ఆఫర్‌ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

దేశంలో టాప్‌ మహిళా బైక్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వనిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. బైక్ రైడింగ్ ను అమితంగా ప్రేమించే ఆమె ప్రయాణంలోనే అశువులు బాసింది.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయానికి చెల్లుచీటీ రాస్తూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న చారిత్రక మహాలక్ష్మీ ఆలయం గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించగలిగారు.

ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి చేతులమీదుగా పలువురు అవార్డులను అందుకున్నారు.

పేదరికం ఆమె ప్రతిభను ఆపలేదు. ఆర్థిక ఇబ్బందులు ఆమె పట్టుదలకు అడ్డు కాలేదు. రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమెను ఏకంగా 12 బంగారు పతకాలు వరించాయి.

ఇఫ్లూలో దళిత విద్యార్థి కునాల్ దుగ్గల్‌పై వేటు....

హైదరాబాద్ : దళిత, గిరిజన విద్యార్ధులపై వివక్ష కొనసాగుతోంది. హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన మరుగుపడనేలేదు. ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యపై నాగపూర్ యూనివర్శిటీలో  దాడి జరిగింది.  కన్హయ్యను చంపేస్తామంటూ ఈరోజు లేఖ రావటంతో ఢిల్లీ పోలీసు యాంత్రాంగం యూనివర్శిటీ క్యాంపస్ లో భద్రతను కట్టుదిట్టం చేసింది. తాజాగా హైదరాబాద్ లోని మరొక యూనివర్శిటీలో దళిత విద్యార్థిపై క్యాంపస్ బహిష్కరణ వేటు పడింది.

13:38 - April 15, 2016

హైదరాబాద్ : సంగీతంలో ఉద్దండుడు కాకున్నా..స్వరాలపై అభిమానం పెంచుకున్నాడు. ఎవరి అండ లేకున్నా...ఆత్మ విశ్వాసంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. పాటల కూర్పు ప్రారంభించాడు. భారీ లక్ష్యం వైపు వేసే ఒక అడుగైనా...గెలుపే అన్నట్లు...చాలా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి...స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ అయ్యాడు. ఫాస్ట్ బీట్ పాటలా 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు యంగ్ కంపోజర్ సాయికార్తీక్.
సూపర్ స్టార్ కృష్ణ మూడు షిప్టుల్లో పనిచేసిన చరిత్ర మనకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ సాయి కార్తీక్ ఆ ఇన్సిపిరేషన్ నే ఫాలో అవుతున్నాడు. ఎంత బిజీ టెక్నీషియన్ ఐనా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం చూస్తుంటాం...కానీ...సాయి కార్తీక్ గతేడాది ఏకంగా పదకొండు సినిమాలకు సంగీతాన్నందించాడు. సరైన గుర్తింపు రాలేదు గానీ....తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో ఎవర్ గ్రీన్ రికార్డ్. 2008 లో అబ్బో ఆడవాళ్లు అనే సినిమాతో స్వర కర్తగా అడుగు పెట్టారు సాయి కార్తీక్...ఒకటి రెండేళ్లు అవకాశాలు స్వల్పంగానే వచ్చినా...ఇక ఆ తర్వాత ఊహించని వేగాన్ని అందుకున్నారు. ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేయడం ఈ యంగ్ కంపోజర్ ప్రత్యేకత.

టెన్ టివి స్పెషల్ లైవ్ షో..
కళ్యాణ్ రామ్ ఓమ్ త్రీడీ తో ...సాయి కార్తీక్ పేరు టాప్ ఫిల్మ్ మేకర్స్ దృష్టికి వెళ్లింది. దర్శకుడు కృష్ణ వంశీ పైసా సినిమా రియల్ బ్రేక్ నిచ్చింది. పైసా సినిమాలో నీతో ఏదో చెప్పాలనిపిస్తుంది అంటూ సాగే పాట...చాలా మంది ఫేవరేట్ సాంగ్ అయ్యింది. రౌడీ, అసుర, దొంగాట, రాజు గారి గది, శంకర్, తుంటరి, జత కలిసే...ఇలా సాయి కార్తీక్ పాటల ప్రయాణం సూపర్ ఫాస్ట్ గా సాగిపోతోంది. ఈ యువ సంగీత దర్శకుడి కొత్త సినిమాలు ఆడో రకం ఈడో రకం హిట్టవ్వడం....త్వరలో రానున్న సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమా పాటలు బాగా క్రేజ్ తెచ్చుకోవడంతో....స్టార్ కంపోజర్ అయ్యాడు సాయి కార్తీక్. విడుదలకు సిద్ధమవుతున్న నారా రోహిత్ సినిమా రాజా చెయ్యి వేస్తే....సాయి కార్తీక్ కు యాభయ్యో సినిమా. అతి తక్కువ సమయంలో హాఫ్ సెంచరీ ఫిల్మ్మ్ చేసిన సాయి కార్తీక్ తో ఈ సాయంత్రం 7 గంటలకు టెన్ టీవీ స్పెషల్ లైవ్ షో కార్యక్రమం జరగనుంది. సంగత అభిమానులు, ప్రేక్షకులు మాట్లాడుకొనే వార 040-2760 9666, 040-2760 9888 కు ఫోన్ చేయవచ్చు. 

13:32 - April 15, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం అమల్లోకి వచ్చింది. ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ఈనెల 30వరకు అమలుకానుంది. రాజధానిలో కాలుష్య నివారణ కోసం రెండోసారి ఆడ్‌ ఇవెన్‌ సిస్టిమ్‌ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ఆదివారం మినహా..సరి సంఖ్య తేది రోజు సరి సంఖ్య వాహనాలు,..బేసి తేది రోజు బేసి సంఖ్య వాహనాలు మాత్రమే బయట తిరిగే అవకాశం ఉంది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు సరిబేసి విధానం ద్వారా వాహనాలను రోడ్లమీదకు అనుమతిస్తారు. వీఐపీలు, మహిళా డ్రైవర్లు, మోటారు వాహనదారులను, ఎమర్జెన్సీ వామనాలు, సీఎన్జీ వాహనాలు మినహా అన్నింటికీ ఈ నియమం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:30 - April 15, 2016

విజయవాడ : శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని బీసెంట్‌ రోడ్‌లో ఉన్న రాములవారి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడువేల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలంలో కల్యాణం ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే నిర్వహిస్తామని వేద పండితులు పేర్కొన్నారు. 

పటాన్ కోట్-కశ్మీర్ రైల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు....

ఢిల్లీ : పటాన్ కోట్ బీఎంయూ రైల్లో అనుమానాస్పదం ఓ బ్యాగ్ ను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో పటాన్ కోట్ నుండి జమ్మూ కాశ్మీర్ వెళ్తున్న రైలును ధనౌరీ స్టేషన్ లో అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ సంఘనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రయాణీలకు దింపివేసి బాంబ్ స్క్వాడ్ సోదాలు జరుపుతున్నారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అంగరంగ వైభోవంగా ముగిసిన రాములయ్య కళ్యాణం..

ఖమ్మం : భద్రాచల రాములోరి కళ్యాణం అశేష భక్తజనం మధ్య..వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ అత్యంత అంగరంగ వైభవోవేతంగా జరిగింది. ఈ వేడుకను తిలకించటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్ ఘడ్ , ఒడిషా నుండి కూడా భక్తులు తరలివచ్చారు. కళ్యాణ ఘట్టంలోని ఒక్కొక్క విశేషాన్ని వేదపండితులు భక్తులకు విశదీకరించారు. మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రోచ్చరణల నడుమ అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా... వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు.

ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె...

కరీంనగర్ : రామగుండం మండలం కుందనపల్లిలో ఆయిల్ ట్యాంకర్ యజమానులు సమ్మెను చేపట్టారు. ట్యాంకర్ల బాడుగలు చెల్లింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 4 జిల్లాలకు ఆయల్ సరఫరా నిలిచిపోయింది.

కేజ్రీ జిమ్మిక్కుల సీఎం : ప్రశాంత్ భూషణ్

ఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరి-బేసి విధానాన్ని ఓ సామాజిక ఉద్యమ కారుడు తప్పు పడుతున్నాడు. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు, సామాజిక ఉద్యమాకారుడు, అడ్వకేట్ అయిన ప్రశాంత్ భూషణ్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సరిబేసి విధానం అంతా ఓ జిమ్మిక్కు అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం నివారించేందుకు ఎన్నో మార్గాలున్నాయన్నారు. ఉత్తమ ప్రజా రవాణ వ్యవస్థకు పరిష్కార మార్గాలు చూపించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. గతంలో ప్రారంభించిన సరి బేసి విధానం కొన్ని రోజులు వాయిదా వేసి మరలా ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే.

సీతమ్మ మెడలో మంగల్య ధారణ చేసిన రాములోరు...

ఖమ్మం : భద్రాద్రిలో అంగరంగ వైభోగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కొనసాగుతోంది. సీతమ్మ వారి మెడలో రామయ్య మాంగల్య ధారణ ఘట్టం కన్నుల పండువగా జరిగింది. ఈ మహోత్సవాన్ని కన్నులారా తినకించిన భక్తులు ఆనందానికి లోనయ్యారు.

రోడ్డు ప్రమాదంలో 1 మృతి,4గురికి గాయాలు...

కడప : చెన్నూరు మండలం పాలంపల్లి వద్ద టాటా ఏస్ మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు వీరపునాయిని పల్లెకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

12:18 - April 15, 2016

ఖమ్మం : పుణ్యదంపతులుగా భక్తులు భావించే సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు. ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సులపైనుంచి జాలువారాయి. వేదమంత్రోచ్ఛరణలతో భద్రాద్రి మారుమోగింది. సీతారాముల కల్యాణ అపురూప ఘట్టాన్ని చూసి భక్తులు పులకించి పోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా వచ్చి స్వామి వారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. రేపు జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు.
మెదక్ జిల్లాలోని తన సొంత ఫాం హౌస్ నుండి హెలికాప్టర్ లో భద్రాచలంకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రులు తుమ్మల, కడియం, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎంపీ సీతారాంనాయక్ తదితరులు కళ్యాణోత్సవానికి విచ్చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12.00 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. శిల్పకళా శోభితమై అలరారే కల్యాణమండపంలో జరిగే జగదభి రాముడి కల్యాణాన్ని కనులారా తిలకించి తరించేందుకు భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

మృత్యుంజయురాలిగా 8 నెలల చిన్నారి...

హైదరాబాద్: జపాన్‌లో భూకంప శిథిలాల నుంచి ఎనిమిది నెలల చిన్నారి మృత్యుజయురాలిగా బయటపడింది. మాషికి ప్రాంతంలో జరిగిన భూకంపం సంఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 761 మంది గాయాలపాలయ్యారు. కాగా శిథిలాల క్రింద మరికొంతమంది ఉండొచ్చనే అనుమానంతో శిధిలాలను తొలిగిస్తున్న సహాయక సిబ్బంది 8 నెలల చిన్నారి సజీవంగా కనిపించింది. ఇంత తీవ్రంగా సంభవించిన ఈ ఘటనలో చిన్నారి ఎటువంటి గాయాలూ కాకుండా రక్షించబడటంతో సిబ్బంది ఆనందాశ్చర్యాలను లోనయ్యారు. కాగా జపాన్ లో ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదయిన విషయం తెలిసిందే.  

నవ్యాంధ్రకు కీలక విభాగం...

హైదరాబాద్ : లోటు బడ్జెట్ తో ప్రారంభమైన నవ్యాంధ్ర నిర్మాణం దశల వారీగా పెట్టుబడులకు రాజధానిగా మారుతోంది. రాష్ట్రాభివృద్ధికి నూతన పెట్టుబడులే ప్రధాన వనరులుగా భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే విదేశీ సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. విదేశాల పెట్టుబడులను ఆకర్షిస్తూ సీఎం చంద్రబాబు వినూత్నంగా, సమన్వయంగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా వున్న సమయంలో జాతీయ సంస్థలకు చెందిన విభాగాలు ఎక్కువ శాతం రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ పరిసరాల్లోనే వున్నాయి.

11:34 - April 15, 2016

భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణ సందర్భంగా వేద పండితులు కల్యాణ క్రతువు ప్రారంభించారు. వేదపండితులు స్వామివారికి విశ్వక్షేన ఆరాధనను పూర్తి చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం హెలికాప్టర్‌లో భద్రాచలం బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ వెంట కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మిథిలా స్టేడియం ప్రాంగణంలో 35 వేల మంది కూర్చొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణం తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంతమంతా చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాల అలంకరణతో శోభాయమానంగా మారింది. కల్యాణ మండపాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు. మండప ఆవరణ మొత్తం సెక్టార్లుగా విభజించి భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించేందుకుగాను ఏర్పాట్లు పూర్తి చేశారు.సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో వేచి ఉండే భక్తుల కోసమని స్వామివారి కల్యాణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

సీతారాములు కళ్యాణానికి హాజరయిన కేసీఆర్ దంపతులు..

ఖమ్మం : సీతా రాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. 12గంటలకు జరుగనున్న సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు హాజరయ్యారు. మహోత్సవ కార్యక్రమానలు మంత్రి తుమ్మల స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

దేశప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:,రాష్ట్రపతి ప్రణబ్,ప్రధాని మోదీ

ఢిల్లీ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సందర్భగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్...

ఖమ్మం : సీతా రాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మ.12గంటలకు జరుగనున్న సీతారాములు కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఒంటిమిట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు...

విజయవాడ : శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధిగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రభుత్వం తరుపున సమర్పించే రాములోరికి గంటా శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

భక్తులపై చేయి చేసుకున్న హోంగార్డులు...

కరీంనగర్: వేములవాడ రాజరాజేశ్వర ఆలయం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. భక్తులపై హోం గార్డులు చేయికున్నారు. దీంతో భక్తులకు హోం గార్డులకు మధ్య ఘర్షణ వాతావరణం చేటుచేసుకుంది.

రాములోరి కళ్యాణానికి 60 క్వింటాళ్ళ ముత్యాల తలంబ్రాలు...

ఖమ్మం : భద్రాచలంలో సీతారాముల కళ్యాణ క్రతువు ప్రారంభమయ్యింది. మ.12గంటలకు మిథాలా ప్రాంగణంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరుగనుంది.ఈ మహోత్సవానికి 60 క్వింటాళ్ల ముత్యాల తంబ్రాలు ఆలయ అధికారులు సిద్ధం చేశారు. 35 వేల మందికి స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా ఏర్పాటు జరిగాయి. 2 లక్షల లడ్డూలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. భక్తులకు తంబ్రాల పంపిణీకి 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 15 సీసీ కెమోరాల ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్ళలో ప్రాథమిక చికిత్స శిభిరాలను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. 

కన్హయ్యను చంపేస్తామని బెదిరింపు లేఖ...

ఢిల్లీ : జేఎన్ యూ ప్రాంగణంలోని ఓ బస్సులో తుపాకీ, తూటాలు, లేఖ ఉండటంతో కలకలం రేగింది. ఈ లేఖలో జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యను, ఉమర్ ఖలీద్ ను చంపేస్తామని బెదిరిస్తూ లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొనటంతో పోలీసులు కన్హయ్యకు భద్రతను పెంచినట్లుగా తెలిపారు.

ప్రారంభమైన సరి - బేసి విధానం..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుండి కాలుష్యం నుండి రక్షించడానికి మరోసారి సరి, బేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఉదయం 8 నుండి రాత్రి 8గంటల వరకు అమల్లో ఉండనుంది. వీఐపీలు, మహిళా డ్రైవర్లు, మోటారు వాహనదారులను, ఎమర్జెన్సీ వామనాలు, సీఎన్జీ వాహనాలు మినహా అన్నింటికీ ఈ నియమం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

రామతీర్థంలో రాములోరి కళ్యాణం..

విజయనగరం : రామతీర్థంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం ప్రారంభమైంది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సింహాచలం దేవస్థానం నుండి పట్టువస్త్రాలను మంత్రి మాణిక్యాలరావు సమర్పించనున్నారు. 

09:18 - April 15, 2016

నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన తారాగణంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం 'అ..ఆ'. ఈ చిత్రం టీజర్‌ను చిత్ర యూనిట్‌ బుధవారం విడుదల చేసింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రాన్ని మే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌ విడుదలైన సందర్భంగా,'అనసూయ రామ లింగం పాత్రను పోషించిన సుమంత, ఆనంద్‌ విహారిగా నటించిన నితిన్‌ని కలవడానికి పాతికేళ్లు పట్టింద'ని ట్విట్టర్‌ ఖాతా ద్వారా సమంత తెలిపారు.

09:16 - April 15, 2016

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'సచిన్‌' (ఎ బిలియన్‌ డ్రీమ్స్) చిత్రం టీజర్‌ గురువారం విడుదలైంది. ఈ టీజర్‌ను సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. స్వీయ కథలో సచిన్‌ నటిస్తున్న ఈ చిత్రానికి జేమ్స్ ఎర్‌స్కైన్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. చిన్న తనంలో సచిన్‌ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్ళడం, తొలిసారి బ్యాట్‌ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి క్రికెట్‌ ఆడటం, తోటి పిల్లలతో స్కూల్లో కొట్లాటలతోపాటు బీచ్‌లో తనకెంతో ఇష్టమైన నీలిరంగు షర్టు వేసుకున్న సచిన్‌.. వంటి షాట్స్ తో ఈ టీజర్‌ని రూపొందించారు. వీటితోపాటు 'మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు. నువ్వు క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నావు. కానీ అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఏదో ఒకటి మాత్రం శాశ్వతంగా నీతోనే ఉండిపోతుంది. అదే.. నీ వ్యక్తిత్వం' అని తన తండ్రి చెప్పిన సందేశాన్ని కూడా సచిన్‌ ఈ టీజర్‌లో వినిపించాడు. 200 నాట్‌ అవుట్‌, కార్నివాల్‌ మోషన్‌ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.

09:14 - April 15, 2016

రణ్‌దీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, రిచా చద్దా ప్రధాన పాత్రధారులుగా ఒమాంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'సరబ్‌జిత్‌' చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం ముంబైలో జరిగింది. ట్రైలర్‌ విడుదల చేసే ముందు సరబ్‌జిత్‌ మృతి పట్ల చిత్ర యూనిట్‌ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం ఐశ్వర్యరాయ్‌ మాట్లాడుతూ 'నా కెరీర్‌లోనే చాలా తక్కువ సమయంలో చేసిన చిత్రమిది. ఈ సినిమా కోసం నాతో సహా అందరూ రౌండ్‌ ద క్లాక్‌ పని చేశారు. ఒమాంగ్‌ కుమార్‌ ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చి నప్పుడు, ఇదొక దేవుడి ఆజ్ఞగా భావించాను' అని అన్నారు. ట్రైలర్‌ లాంచింగ్‌ వేడుకను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ట్రైలర్‌ లింక్‌ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్‌ హృదయాన్ని కలచివేసేలా ఉందని, ట్రైలర్‌లో ఐశ్వర్య నటన హైలైట్‌గా ఉందని బాలీవుడ్‌ సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సరబ్‌జిత్‌ సోదరిగా నటించిన ఐశ్వర్య తన అన్నయ్యను కాపాడుకోవడానికి ఏళ్ళ తరబడి అనేక ప్రయత్నాలు చేసిన ఘటనలు అందరి మనసుల్ని కదిలించేలా ఉన్నాయి. టెర్రరిస్ట్ అనే ముద్రతో పాకిస్తాన్‌ జైలులో మగ్గి, అదే జైల్లోని సహచర ఖైదీల చేతుల్లో దారుణంగా చనిపోయిన సరబ్‌జిత్‌ జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 20వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

09:12 - April 15, 2016

ఈ మధ్యకాలంలో అగ్ర హీరోల ట్రెండ్‌ మారింది. కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే పరిమితమైపోకుండా ఇతర భాషా చిత్రాల్లోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఒకే సమయంలో రూపొందే ద్విభాషా, త్రిభాషా చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. దీంట్లో భాగంగా రవితేజ సైతం బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే బాలీవుడ్‌ నుంచి పలు ఆఫర్స్ వస్తున్నాయని, అయితే వాటిల్లో 'కీ అండ్‌ కా' లేదా 'కపూర్‌ అండ్‌ సన్స్' వంటి స్క్రిప్ట్స్‌ దొరికితే నటించేందుకు తానెప్పుడూ సిద్ధమేనని రవితేజ తెలిపారు. తెలుగులో మాత్రం పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలే చేస్తానని, బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినప్పటికీ తెలుగుకే ఫస్ట్ ప్రయారిటీ అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారాయన.

09:10 - April 15, 2016

ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్‌, రాశీఖన్నా, అను ఇమ్మాన్యువల్‌లు నటిస్తున్న చిత్రం 'ఆక్సిజన్‌'. శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ, 'యాక్షన్‌ హీరో గోపీచంద్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్‌ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఒక నవ్యమైన కథాంశంతో రూపొందిస్తున్నాం. గోపీచంద్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా సినిమాను దర్శకుడు జోతికృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం' అని అన్నారు.

రాజ్ నాథ్ ను కలువనున్న కృపాల్ సింగ్ ఫ్యామిలీ..

ఢిల్లీ : పాక్ లో మృతి చెందిన కృపాల్ సింగ్ కుటుంబం నేడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలువనుంది. 

ఢిల్లీలో పాన్ మసాల..గుట్కాలపై నిషేధం..

ఢిల్లీ : దేశ రాజధానిలో పాన్ మసాల, గుట్కా, టొబాకో లపై ప్రభుత్వం నిషేధం విధించింది. సంవత్సరం పాటు ఈ నిషేధం అమలు కానుంది. 

08:14 - April 15, 2016

శ్రీకాకుళం : సెప్టిక్ ట్యాంకులో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..గాంధీ వీధిలో నారాయణ నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంకును శుభ్రపరిచేందుకు ఏడుగురు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం ఏడుగురు కార్మికులు సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. చాలా కాలం పాటు శుభ్రం చేయకపోవడం వల్ల విష వాయువులు వెదజల్లాయి. దీనితో లోన ఉన్న వారికి ఊపిరి ఆడలేదు. వెంటనే ఇంటి యజమాని గ్రహించి బయటకు లాగే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు నారాయణ కూడా అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించారు. కార్మికులను, ఇంటి యజమాని నారాయణను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అల్లూరయ్య, మనోహర్ లు మృతి చెందారు. ఇంటి యజమాని నారాయణ పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

సెప్టిక్ ట్యాంకులో పడి ఇద్దరు కార్మికుల మృతి..

చిత్తూరు : శ్రీకాళహస్తి గాంధీ వీధిలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 

08:04 - April 15, 2016

చాలా మంది స్త్రీలు ముఖం మీద కనబరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖంపై కూడా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అందుకే మెడపై కూడా శ్రద్ద పెట్టడం ముఖ్యమంటున్నారు.
పసుపు, నిమ్మరసం సమపాళ్లల్లో తీసుకొని మెడకు పట్టించి పావు గంట పాటు ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్లయితే మెడ రంగులో తేడాను గమనించవచ్చు.
ఏదైనా నూనెతో మెడపై మసాజ్‌ చేయడం కూడా మంచిదే. మసాజ్‌ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి శుభ్రంగా, అందంగానూ తయారయి ముడతలు తగ్గుతాయి.
నిద్రపోయే సమయంలో తల కింద దిండు లాంటిది పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రోజులో కొద్దిసేపయినా మెడ వ్యాయామాలు చేస్తే మంచిది. అయితే ఈ వ్యాయామాలు నిపుణుల సలహాతో చేయడం ఉత్తమం.
పనిచేసే ప్రదేశాలలో నిటారుగా కూర్చోవడం వల్ల నడుంకే కాక మెడకు కూడా లాభమేనని నిపుణులు అంటున్నారు.
బరువులు ఎత్తేటప్పుడు మోకాలు లేదా నడుం మీద ఎక్కువ బరువు వేయాలి. అంతేకాని, మెడ మీద మాత్రం బరువులు వేయకూడదు. 

08:02 - April 15, 2016

హార్మోన్ల మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల జుట్టు సమస్యలు ఏర్పడుతున్నాయి. నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనే ఆత్రుతతో అమ్మాయిలు ఎక్కువగా డైటింగ్‌ చేస్తుండటమూ దీనికి ప్రధాన కారణం. దానివల్ల ఏర్పడిన మెగ్నీషియం, విటమిన్‌ బి12, బి3, డి3 లోపం జుట్టు రాలటానికి కారణం అవుతోంది. వంశపారంపర్యంగా గాని, వ్యాధులవల్లగాని, తీసుకునే మందుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. తలను, జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల చుండ్రుతో పాటు అనేక రోగ కారకాలు తొలగిపోతాయి. ఇంకా జుట్టు ఊడిపోవటం కూడా తగ్గుతుంది. దాంతో ఒత్తుగా ఉన్న జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్యమైన జుట్టు కావాలంటే సమతుల్యమైన ప్రోటిన్స్‌ తీసుకోవాలి. ఉదా: జింక్‌, బయోటిన్‌, విటమిన్స్, సి, ఎ, ఇ, ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, ఎస్సెన్సియల్‌ ఆయిల్స్ లాంటివి శరీరంలోని పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేస్తాయి. అయితే ఇవి ఏయే ఆహారపదార్థాల్లో దొరుకుతాయో తెలుసుకుందాం.
 

 • జింక్‌: నట్స్‌, డ్రైసీడ్స్‌, సన్‌ప్లవర్‌ సీడ్స్‌, గోగునార విత్తనాలు, నువ్వులు, దేవదారు వృక్షపు గింజలను తినటం వల్ల జింక్‌ ఎక్కువగా లభిస్తుంది.
 • ఐరన్‌: రక్తహీనత వల్ల కూడా జుట్టు రాలుతుంది. బచ్చలికూర, ఆకు కూరల్లో ఎక్కువగా ఐరన్‌ లభిస్తూంది.
 • విటమిన్స్: విటమిన్‌ ఎ, బి, సి, క్యారెట్స్‌, మిరియాల్లో దొరుకుతాయి. వీటిని జ్యూస్‌లుగా గాని, సలాడ్స్‌లో గాని కలిపి తీసుకోవాలి. ద్రాక్ష గింజలు, గ్రీన్‌ టీలో విటమిన్‌ 'ఇ' ఎక్కువగా లభిస్తుంది. ఇది జుట్టు రాలటాన్ని నియంత్రిస్తుంది.
 • ఒమోగా-3 ఫ్యాట్‌ : గోగునార గింజల్లో, వాల్‌ నట్స్‌లో, గుమ్మడికాయ గింజల్లో లభిస్తుంది. ఇవి తీసుకోవటం వల్ల కూడా జుట్టు రాలటం తగ్గుతుంది.
 • బయోటిన్‌: గుడ్లు, బఠాణీ, సోయాబిన్స్‌లో అన్ని రకాల పప్పుగింజల్లో బయోటిన్‌ ఉంటుంది.
 • ప్రోటిన్స్: ప్రోటిన్స్ చేప, నట్స్‌, సోయాబీన్స్‌, చిక్కుడు జాతుల్లో ఎక్కువగా ఉంటాయి.
 • తడి జుట్టును దువ్వొద్దు : తడి జుట్టును దువ్వటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు.
 • వెడల్పు పళ్ల దువ్వెనతోనే దువ్వుకోవాలి. ఎక్కువసార్లు దువ్వటం వల్ల జుట్టు చిట్లిపోయి రాలిపోతుంది.
 • వారానికోసారి తలకు నూనెను పెట్టాలి. నవరత్న, బాదాం, ఆముదం తలకు పట్టించి బాగా మర్దన చేయటం వల్ల జుట్టు రాలటాన్ని నివారించవచ్చు.
 • మందార పువ్వుల పేస్టును, కొబ్బరి నూనెలో కలుపుకొని పెట్టుకోవాలి.
 • నిమ్మకాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించాలి.
 • ఎక్కువగా నీటిని తాగాలి. మునివేళ్ల గోళ్లనూ 10-20 నిమిషాల పాటు (నెయిల్‌ రబ్బింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి.
 • ఎక్కువసేపు నిద్ర పోవాలి. కాటన్‌ టవల్‌ని మత్రమే వాడాలి.
 • ఒత్తెన జుట్టు పొందటానికి. ఉసిరి, కుంకుడును వాడాలి.
 • ఉసిరి, కుంకుడు, గుడ్లను హెయిర్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు.
 • వేపాకులు కలిపిన నీళ్లను వాడాలి, ఇవి మంచి యాంటిబయాటిక్‌గా పనిచేస్తాయి.
 • అరటి, అలోవిరాజెల్‌, నూరిన మెంతులను తలకు పట్టించటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.

ఘనంగా శ్రీరామనవమి..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం, గంగా నదుల్లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. 

07:36 - April 15, 2016

అంబేద్కర్ జయంతిని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పలు కార్యక్రమాఒల్లో పాల్గొన్నారు. మరోవైపు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఎస్ కుమార్ (బీజేపీ),వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), శ్రీరాములు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారో వీడియోలో చూడండి. 

07:32 - April 15, 2016

రాజ్ కోట్ : ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌లో గుజరాత్ మరో విజయం సొంతం చేసుకుంది. రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ జట్టు పుణె సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పుణె 20 ఓవర్లకు 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్,మెక్‌కల్లమ్ ధాటిగా ఆడి లయన్స్ విజయానికి బాటలు వేశారు. ఫించ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. 

07:31 - April 15, 2016

చెన్నై : ఈసారి తమిళనాడు ఎన్నికలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. జయలలిత, కరుణానిధి వీరిద్దిరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆరవ సారి ముఖ్యమంత్రి అయిన రికార్డు సృష్టిస్తారు. ఒకవేళ హంగ్ ఏర్పడి, విజయ్ కాంత్ పంట పండితే సినీ రంగానికి చెందిన 6వ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుల కెక్కుతారు. ఇంతకీ విజయ్ కాంత్ కి అంత సీన్ వుందా? ఆయనకున్న మైనస్ లేమిటి? ప్లస్ లేమిటి? ఆరు పార్టీల పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధాన ద్రవిడ పార్టీలను ఢీ కొడుతున్న విజయ్ కాంత్ ప్రభావమెంత? తమిళనాడును అయిదు దశాబ్ధాలుగా రెండు ద్రవిడ పార్టీలు ఏలుతున్నాయి. 1967 నుంచి డిఎంకె, ఏఐ ఐడిఎంకె మధ్యనే అధికారం తిరుగుతోంది. సినీరంగానికి చెందిన అయిదుగురు తమిళనాడు ముఖ్యమంత్రులయ్యారు. కరుణానిధి, జయలలిత చెరో అయిదుసార్లు ముఖ్యమంత్రులయ్యారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆరవ సారి సింహాసనం అధిష్టించే అద్రుష్టం కరుణానిధి, జయలలితలలో ఎవరికి దక్కుతుంది? వీరద్దరినీ కాదని తమిళ తంబీలు సినీ రంగానికే చెందిన ఆరో వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ఇస్తారా?

రకరకాల విశ్లేషణలు..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు చాలామంది రాజకీయ పండితులు జయలలితనే హాట్ ఫేవరేట్ గా భావించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకె క్లీన్ స్వీప్ చేయడమే ఇందుకు కారణం. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గాలి మారుతోందన్న అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సినీరంగం నుంచే వచ్చిన విజయ్ కాంత్ , ఆరు పార్టీల పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో చేరడం, ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో త్రిముఖ పోటీ పసందుగా మారుతోంది. కింగ్ మేకర్ గా కాదు కింగ్ గా అవతరించాలన్న పట్టుదల, కసి విజయ్ కాంత్ మాటల్లో వ్యక్తమవుతోంది. కరుణానిధి, జయలలితల మీద తీవ్రస్థాయిలో ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. వారిని మోసగాళ్లను, అవినీతిపరులగానూ తూర్పారబడుతున్నారు.

విజయకాంత్ కు ప్రతిపక్ష హోదా..
ఇప్పుడు కరుణానిధి వయస్సు 94 ఏళ్లు. జయలలిత వయస్సు 68 ఏళ్లు. వీరద్దిరితో పోల్చుకుంటే విజయ్ కాంత్ 62 ఏళ్ల కుర్రాడు. స్పైనల్ సర్జరీ చేయించుకున్న తర్వాత కరుణానిధి వీల్ చైర్ దిగి నడవలేకపోతున్నారు. జయలలిత ఎన్నికల ప్రచార సభల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మీద ఎన్నో సందేహాలున్నాయి. ఇదే విషయాన్ని విజయ్ కాంత్ ఎన్నికల సభల్లో సూటిగా ప్రశ్నిస్తున్నారు. విజయ్ కాంత్ వాదనను తమిళ ఓటర్లు ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి. జయలలిత, కరుణానిధికి బలహీనతలు, మైనస్ పాయింట్లు వున్న మాట నిజమే అయినా వాటిని క్యాష్ చేసుకునే స్థితిలో విజయ్ కాంత్ వున్నారా? అన్నదీ సందేహమే. విజయ్ కాంత్ పార్టీ స్థాపించి పదేళ్లు దాటింది. 2005లో డిఎండికె పార్టీ స్థాపించిన విజయ్ కాంత్, 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనే చతికిలపడ్డారు. 234 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఆయన ఒక్కరే. 2009 లోక్ సభ ఎన్నికల్లో నూ ఒక్క ఎంపీ స్థానమైనా గెలిపించుకోలేకపోయారు. కాకపోతే, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 29 సీట్లు గెల్చుకున్నా, అవి జయలలితతో పొత్తు కారణంగా వచ్చినవే. ఆ ఎన్నికల్లో డిఎంకె ఘోరంగా ఓడిపోవడంతో విజయ్ కాంత్ కి ప్రతిపక్ష హోదా లభించింది. కానీ, ప్రతిపక్ష నేతగా వచ్చిన అవకాశాన్ని ఆయన సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని చెప్పలేం. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్న విజయ్ కాంత్ పార్టీ ఒక్క సీటూ గెల్చుకోలేకపోయింది. కాకపోతే, కురువృద్ధ నేత కరుణానిధి సారథ్యంలోని డిఎంకె చాలా స్థానాల్లో మూడో స్థానానికి దిగజారడం ఒక్కటే విజయ్ కాంత్ ని ఊరడించే అంశం. తమిళనాడులో గత ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల ఓట్లు పోలైతే, విజయ్ కాంత్ పార్టీ సాధించింది 30 లక్షల ఓట్లే. అంటే పదిశాతం ఓట్లే. ఆయన కల సాఫల్యం కావాలంటే ఇంకా 15 నుంచి 20శాతం ఓట్లు పెంచుకోవాలి. కోటికి పైగా ఓట్లు కొల్లగొట్టాలి.

1979లో సినీ రంగ ప్రవేశం..
1979లో సినీ రంగ ప్రవేశం చేసి 150 సినిమాల్లో నటించిన విజయ్ కాంత్ ఫ్యాన్స్ బాగానే వున్నారు. కానీ, ఫ్యాన్స్ అభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేకపోవడం విజయ్ కాంత్ పెద్ద బలహీనత. అంకితభావంతో పనిచేసే బలమైన కేడర్ లేకపోవడం మరో పెద్ద మైనస్ పాయింట్. తొలుత ఒంటరి పోరాటం, ఆ తర్వాత జయలలితతో స్నేహం, ఆ తర్వాత బిజెపితో పొత్తు, ఇప్పుడు వామపక్షాలున్న పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తో చెట్టాపట్టాల్ ఇవన్నీ చూస్తుంటే ఆయనకు స్పష్టమైన ఆదర్శాలుకానీ, సిద్ధాంతాలు కానీ, కమిట్ మెంట్స్ కానీ లేవన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే, జయలలితతోనో, కరుణానిధితోనో పొత్తు పెట్టుకుంటే విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకు వచ్చేవారు కాదు. ప్రధాన పార్టీలకు తోకగానే మిగిలిపోయేవారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో చేరడం వల్ల కెప్టెన్ కాగలిగారు. ఫ్రంట్ కే ప్రధాన ఆకర్షణ కాగలిగారు.

సెంటిమెంట్లు లేవు..
ఏ మాటకామాటే చెప్పుకోవాలి జయలలిత, కరుణానిధి లాంటి హెవీ వెయిట్స్ వున్న చోట పదేళ్ల పాటు పార్టీని నడపడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో వుండడం చిన్న విషయమేమీకాదు. అధికారం లేకపోయినా, తెలంగాణలో ఒక్క కేసీఆర్ మాత్రమే అనేక ఆటుపోట్ల మధ్య పదేళ్ల పాటు పార్టీని నడపగలిగారు. ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ కొండంత అండగా నిలిచింది. కానీ, విజయ్ కాంత్ కి అలాంటి సెంటిమెంట్లేవీ తోడుగా లేవు. విజయ్ కాంత్ కి మించిన పాపులార్టీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న మెగాస్టార్ చిరంజీవి కూడా పీఆర్ పి ని ఎక్కువ కాలం నడపలేకపోయారు. మరో టర్మ్ వరకు కూడా వేచిచూడలేకపోయారు. మూడేళ్లకు కాంగ్రెస్ లో విలీనం చేశారు. విజయ్ కాంత్ ని దెబ్బతీసేందుకు జయలలిత, కరుణానిధి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో కూడా పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీని వెనక కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ వున్నారన్న టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు సహజం. వాటన్నింటిని తట్టుకుని నిలబడేవాడే నాయకుడు.

గ్లామర్..ఛరిస్మా ఓట్లు రాలుస్తాయా ? 
బ్యాలెట్ వార్ లో సక్సెస్ కావాలంటే నాయకుడన్నవాడు ఓటర్ల ముందు ఏదో ఒక స్వప్నాన్ని వుంచాలి. హామీలతో ఆకట్టుకోవాలి. గ్లామర్ , ఛరిస్మా ఇవి మాత్రమే ఓట్లు రాల్చవు. తాము గెలిపిస్తే, ఆ నాయకుడు అందుకు ప్రతిగా తమకు ఏమిస్తాడన్నది ఓటర్లు ఆశించడం సహజం. ఓటర్ల నాడిపట్టుకుని వాగ్ధానాలు గుప్పించి, స్వప్నాలు ఆవిష్కరించేవాడే విజేతగా నిలుస్తాడు. పదేళ్లుగా రాజకీయాల్లో వున్న విజయ్ కాంత్ తమిళతంబీల కన్నుల్లో ఏ ఒక్క స్వప్నాన్నీ నింపలేదు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ నినాదాన్ని చాలా ఏళ్లపాటు సజీవంగా వుంచారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన స్వప్నాన్ని తెలంగాణ ప్రజల కళ్లముందు నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు తాను మాత్రమే హైదరాబాద్ కి ధీటైన రాజధాని నిర్మించగలనన్న నమ్మకాన్ని కలిగించారు. ఇలాంటి స్వప్నాలేవీ కళ్లముందు నిలపలేకపోవడం విజయ్ కాంత్ కున్న మరో మైనస్ పాయింట్.

ఆరు పార్టీలతో జత కట్టిన విజయ్ కాంత్...
విజయ్ కాంత్ ఆరు పార్టీలతో జట్టు కట్టారు. డిఎండికె, ఎండిఎంకె, సిపిఎం, సిపిఐ, విసికె, టిఎంసి ఇన్ని పార్టీలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది విజయ్ కాంత్ కాదు వైకో అన్న విషయాన్ని విస్మరించకూడదు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో పేరుకు ఆరు పార్టీలున్నా ఆయా పార్టీలు కొన్ని పాకెట్లకే పరిమితం. ఒకరి ఓట్లు ఒకరికి పూర్తి స్థాయిలో ట్రాన్స్ ఫర్ అయితేనే గెలిచే చాన్స్ వుంటుంది. ఈ నెల రోజులు విజయ్ కాంత్ చాలా శ్రమించాలి. తన పార్టీ అభ్యర్థులతో పాటు మిత్రపక్షాల అభ్యర్థులనూ గెలిపించుకోవడానికి అలుపెరగకుండా శ్రమించాలి. తమిళతంబీలకు నమ్మకం కలిగించాలి. విజయ్ కాంత్ కి గత పదేళ్ల రాజకీయ జీవితం ఒక ఎత్తు. రాబోయే 4 వారాలు ఒక ఎత్తు. 

07:24 - April 15, 2016

ఢిల్లీ : పశ్చిమబెంగాల్ రెండో విడత పోలింగ్ లో పై చేయి సాధించేందుకు టిఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. ఆదివారం పోలింగ్ ముహూర్తం దగ్గరపడుతుండడంతో అంతిమ వ్యూహాలు రచిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ లో రెండో విడత పోలింగ్ మమతాబెనర్జీకి, వామపక్షాలకు, కాంగ్రెస్ కీ అత్యంత కీలకం. ఆదివారం పోలింగ్ జరగబోయే 56 నియోజకవర్గాల్లో తేయాకు కార్మికుల, ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్ లో 276 టీఎస్టేట్ లున్నాయి. లక్షా 86వేల కుటుంబాలు వీటి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పదుల సంఖ్యలో టీ ఎస్టేట్ లు మూతపడడం, ఉపాధి దొరకక్క కూలీలు వలసపోవడం, అనేక మంది తేయాకు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం మమతాబెనర్జీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని స్రుష్టించాయి. తేయాకు కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు. తేయాకు కార్మికుల్లో వామపక్ష కార్మిక సంఘాలకు గట్టి పట్టుంది.

56 నియోజకవర్గాలు..
దినసరి కూలిని 122 నుంచి 132 రూపాయలకు పెంచడం ద్వారా తేయాకు కార్మికులను ఆకట్టుకునేందుకు మమతాబెనర్జీ ప్రయత్నించారు. రోడ్లు వేయడం, విద్యుత్ సరఫరాను మెరుగుపర్చడం లాంటి చర్యలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయన్నది త్రుణమూల్ కాంగ్రెస్ నేతల నమ్మకం. ఆదివారం పోలింగ్ జరగనున్న 56 నియోజకవర్గాల్లో మరో బలమైన వర్గం ముస్లింలు. పశ్చిమబెంగాల్ లో 27శాతం మంది ముస్లింలుంటారు. ఉత్తర్ దినాజ్ పూర్ లో 50 శాతం మంది, మాల్దాలో 51 శాతం మంది, ముర్షిదాబాద్ లో 66 శాతం మంది ముస్లింలే. వీరంతా రెండో విడత పోలింగ్ లో ఓట్లేయబోతున్నారు. పశ్చిమబెంగాల్ మొత్తం మీద 57 స్థానాల్లో ముస్లింల ఓట్లు గెలుపు ఓటమిలను నిర్ణయిస్తాయి. దీంతో ఈ ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులేశారు. 2011 ఎన్నికల్లో 38 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లిచ్చిన మమతాబెనర్జీ ఇప్పుడు 57మందికి టిక్కెట్లిచ్చారు. కాంగ్రెస్ కి కంచుకోటలాంటి మాల్దా ప్రాంతం మీద ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముస్లింలు ఓట్లన్నీ ఏకపక్షంగా పడే అవకాశం లేదు. వామపక్షాలు, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ మధ్య ఈ ఓట్లు చీలిపోతాయన్నది విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కన్యశ్రీ పేరుతో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ బాలికలకు స్కాలర్ షిప్స్ పథకం, సైకిళ్ల పంపిణీ వంటివి సానుకూల ప్రభావం చూపుతున్నా, నిరుద్యోగ సమస్య యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో, ఉద్యోగావకాశాలు కల్పించడంలో మమతాబెనర్జీ విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

07:21 - April 15, 2016

విజయవాడ : నేటి నుంచి ఏపీలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు.. నిషేధం మూలంగా లక్షలాది మత్య్సకారుల కుటుంబాలు కనీసం తినడానికి తిండిలేక అల్లాడనున్నాయి. ఆర్థిక సహకారం ఇవ్వకుండా రకరకాల ఆంక్షలు, కొర్రీలతో ప్రభుత్వం హామీలను దాటవేస్తున్నాయి. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందా...సర్కార్ కొత్తగా ఆలోచించి మత్స్యకారులను ఆదుకుంటుందా.. పాతపాటే పాడుతుందా.. అన్నది తేలాల్సి ఉంది .
రెండు నెలల పాటు వేటకు విరామం ప్రకటించానున్నారు. ఏప్రిల్ 15 నుండి రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తూ.. కేంద్ర మత్స్యశాఖ నిషేదాజ్ఞలు విధించింది. దీంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని లక్షలాది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కరవువనుంది. దాదాపు 700 మరబోట్లు ఫుల్ స్టాఫ్‌ చెప్పేసి ఫిషింగ్ హార్బర్ లోనే లంగరు వేయనున్నాయి. వీరిని ఆదుకోవడంలో ఏటేటా ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి.

ఇంటిపట్టునే ఉండనున్న మత్స్యకారులు...
నిషేధం సమయంలో మత్స్యకారులు పనిలేక ఇంటిపట్టునే ఉండిపోతారు. ఇలాంటి వారికోసం 40 కేజీల బియ్యం.... 2 వేల రూపాయలను ప్రతీ కుటుంబానికి ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నా పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించే విధానంపై మత్సకార కుటుంబాల్లో అసంతృప్తి నెలకొంది. వేటను రెండు నెలల పాటు నిషేధించకుండా చేపలు పడితే ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు మత్స్యకారులు. తమ పొట్టకొడుతున్నా ప్రభుత్వానికి సహకరిస్తున్నామని అంటున్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో కాలుష్యం పెరుగుతుండడంతో తీర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల వ్యర్థాల కారణంగా సముద్రం ఆటుపోటులకు గురవుతోంది. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడడంతో ప్రమాదకర రసాయనాలు సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో వివిధ రకాల జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ జలచరాల పరిరక్షణ పేరుతో మత్స్యకారుల ఉపాధికి మాత్రం ఎసరు ఎడుతోంది.

ఏప్రిల్ 16 నుండి జూన్ 15 వరకు నిషేధం..
ప్రతి ఏటా ఏప్రిల్ 16 నుండి జూన్ 15 వరకు సముద్రంలో వేట నిషేధిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో వాటి అభివృద్దికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో వేటను నిషేధించింది. కాని వేల మంది మత్స్యకారులు రెక్కాడితే కాని డొక్కాడని వారు ఈ వేటనే నమ్ముకుని జీవిస్తున్నారు. మరి ఇలాంటి వారిని పట్టించుకోని ప్రభుత్వాన్ని ఏమనాలని పలువురు మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 4 వేల రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అదీ ఎక్కడా అమలు కావడంలేదు. దీంతో పాటు మత్స్యకారుల వేటకు సంబంధించిన వలలు సహా అనేక ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ఏ మాత్రం సహాయం అందడం లేదని వాపోతున్నారు.
అనేక విషయాలలో వివిధ దేశాలతో పోల్చుకునే చంద్రబాబు నాయుడు మత్స్యకారుల కుటుంబాలు ఏమతవుతాయో అన్న అంశంపై చర్చించకపోవడం దారుణమంటున్నాయి సంఘాలు. తమిళనాడు మాదిరిగా నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి.  

07:16 - April 15, 2016

హైదరాబాద్ : నడవలేని గుర్రానికి కొత్త కల్లెం చేయించిన చందంగా ఉంది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. నగరంలో ఆర్టీసీకి భారంగా మారిన జెఎన్ఎన్‌యూఆర్ఎం పాత బస్సులకు కొత్త బాడీలు కట్టించే పనిలో పడ్డారు. దీంతో కొత్త బస్సులు కొనే యోచనే లేనట్లు తెలుస్తోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం అందించడంలో భాగంగా ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో వైఫై ప్రవేశపెట్టాలని ప్రణాళికలు తయారు చేసింది ఆర్టీసీ. త్వరలోనే బస్ ఫైండింగ్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

420 అద్దె బస్సులు..
420 అద్దెబస్సులు సహా మొత్తం 3 వేల 800 బస్సులు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో జెఎన్ఎన్‌యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 650 బస్సులు వచ్చాయి. అయిదేళ్ల కింద వచ్చిన ఈ బస్సులు నగర రోడ్లకు ఏమాత్రం పనికి రావని అప్పట్లో విమర్శలు వచ్చాయి. నగరంలో ఆర్టీసీ నష్టాలకు సగం కారణం ఈ బస్సులే అనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే ఈ బస్సులు వచ్చిన రెండేళ్లకే నడవలేని స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం రేకులు ఊడి రాడ్లు విరిగి ప్రమాదకరంగా మారాయి. వచ్చి ఐదేళ్లే కావడంతో వదిలించుకోలేని ఆర్టీసీ యాజమాన్యం వాటికి కొత్త బాడీలు నిర్మించాలని తలపెట్టింది. ఇందుకు గాను ఒక్కో బస్సుకు సుమారు పదిలక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు సంవత్సరాల్లో ఈ బస్సుల రూపు రేఖలను పూర్తిగా మార్చాలని నిర్ణయించారు.

మౌలిక వసతుల కల్పనపై దృష్టి...
నగరంలో ఉన్న బస్‌స్టాండ్లలో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించనున్నామన్నారు ఆర్టీసీ అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులను కూడా ఆధునీకరించనున్నారు. గో రూరల్ ఇండియా సంస్థ సహకారంతో మెట్రో డీలక్స్, అన్ని ఏసీ బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మొదట రెండు బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, అది విజయవంతమైతే మిగిలిన బస్సుల్లో అమలుపరచనున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తాము కొత్త బస్సులను కొనలేమంటున్నారు ఆర్టీసీ అధికారులు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పాత బస్సులకు సోకు చేసినంత మాత్రాన ఏం లాభమని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు .

07:13 - April 15, 2016

హైదరాబాద్ : ఉచిత విద్యంటూ ఊదరగొడుతున్న తెలంగాణ ప్రభుత్వం... సర్కారీ బడులను మూసివేసేందుకు సిద్ధమైంది. తగిన సంఖ్యలో విద్యార్ధులు లేరనే నెపంతో వేలాది పాఠశాలలను మూసివేతకు ప్రణాళికలు తయారు చేస్తోంది. నాలుగున్నర వేలకు పైగా స్కూళ్లు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాల నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు అధ్వానంగా తయారువుతోంది. వేలాది స్కూళ్లను మూసివేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యార్ధులు లేరనే ఉద్దేశంతో ఇప్పటికే 398 ప్రభుత్వ పాఠశాలను మూసేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఇటీవలే సుప్రీంకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆంక్షింతలు వేసింది. వందలాది స్కూళ్లలో విద్యార్ధులు ఎందుకు చేరడంతో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిచింది. సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం నడుస్తుండగానే... తాజాగా మరో 4 వేల స్కూళ్లను మూసివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.

రాష్ట్రంలో 19,400 ప్రాథమిక పాఠశాలలు..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ పాఠశాలను మూసివేయడానికి వీలులేదు. కానీ విద్యార్ధులు చేరడంలేదనే నెపంతో ఉన్న స్కూళ్లను కూడా మూసివేయాలని ప్రతిపాదించడాన్ని విద్యావేత్తలు తప్పుపడుతున్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయలు కల్పించి విద్యార్ధులను చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ పాలకులు, విద్యాశాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలకు కొదువలేదు. రాష్ట్రంలో 19,400 ప్రాథమిక పాఠశాలున్నాయి. వీటిలో 12,178 స్కూళ్లలో 60 మంది వంతున మాత్రమే విద్యార్ధులున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 60మంది విద్యార్ధులుంటే ఇద్దరు టీచర్లు వుండాలి. అందువల్ల ఈ స్కూళ్లను మూసివేసేందుకు అవకాశం లేదు. దీంతో 20 మంది, ఆ లోపు విద్యార్ధులున్నా పాఠశాలపై సర్కార్‌ దృష్టి పడింది. రాష్ట్రంలో పది మంది విద్యార్ధుల లోపువున్న స్కూళ్లు 980 ఉన్నాయి. 20 మంది లోపు పిల్లలు ఉన్న పాఠశాలు 2,333 ఉన్నాయి. మొత్తంమీద 20 మందిలోపు విద్యార్ధులున్న పాఠశాలలు 3,711 ఉన్నాయని లెక్క తేల్చారు. . నిర్ణీత సంఖ్యలో విద్యార్ధులు లేని స్కూళ్లను శాశ్వతంగా మూసివేయాలన్న ప్రతిపాదనలను విద్యావేత్తలు తప్పుపడుతున్నారు.

తప్పుబడుతున్న విద్యావేత్తలు..సంఘాలు..
తెలంగాణలో మూసివేత ప్రమాదం ఎదుర్కొంటున్న ఉన్నత పాఠశాలల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం హైస్కూళ్లలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ వుండాలి. కాని రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. కొన్ని స్కూళ్లలో విద్యార్ధుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి స్కూళ్లపై మూసివేత కత్తి వేలాడుతోంది. మూసివేత ప్రమాదం ఎదుర్కొటున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 4,481 ఉన్నట్టు సర్కార్‌ లెక్కలేత్చింది. హేతుబద్ధీకరణ పేరులో ఇలాంటి స్కూళ్లను సమీపంలోని వేరే పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. దీనిని విద్యార్ధి సంఘాలు నేతలు తప్పుపడుతున్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని....అవసరమున్న మేరకు స్కూళ్లను కొనసాగించాలని కొనసాగించాలని కోరుతున్నారు. విలీనం ప్రక్రియ శాస్త్రీయంగా చేయాలని అటు విద్యార్ధి సంఘాల నేతలతోపాటు, ఇటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు.
పాఠశాలల్లో విద్యార్ధులను చేర్చేందుకు ఏటా జూన్‌ 12 తర్వాత బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పటికే ఎక్కువ మంది విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్లలో చేరిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఇది కూడా ఒక కారణం. బడిబాట కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. పాలకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ సర్కారీ స్కూళ్లలో విద్యార్ధులను చేర్పించేందుకు ప్రయత్నిస్తే మూసివేత ప్రమాదం నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. 

07:04 - April 15, 2016

హైదరాబాద్ : కొంతమంది కాంగ్రెస్‌ నేతల వారసులు గులాబి గూటికి వెళతారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. రాజకీయ భవిష్యత్ కోరుకుంటున్న యువనేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వీరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ సముఖంగానే ఉన్నారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

రఘువీర్, కార్తిక్ లు కారెక్కుతారన్న ప్రచారం..
కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి మంత్రి పదవులు అనుభవించిన కొంతమంది నేతల తనయులు వచ్చే సాధారణ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. జానా, సబితా తమ వారసులకు రూట్‌ క్లియర్‌ చేయించే పనిలో పడ్డారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేయించాలనే యోచనలో సదరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కీలకంగా వ్యవహరించే నేతలు కావడంతో వారిని పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్‌ సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉంది. నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన యువ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు అధినేత సిద్ధంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

06:48 - April 15, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ స్కెచ్‌ మారుతోంది. ఇన్నాళ్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంటూ ఊదరగొట్టిన ప్రతిపక్ష పార్టీ.. ఇప్పుడు వ్యూహంలో మార్పులు చేసింది. కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు... పవర్ ప్రజంటేషన్‌ వాయిదా వేసుకుని.. ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ అతలాకుతలమవుతోంది. గులాబీ బాస్‌ రాజకీయాలతో ఇప్పటికే ఆ పార్టీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను టార్గెట్‌ చేసిన అధికార టీఆర్‌ఎస్‌... ఇరిగేషన్‌లో తనదైన ముద్ర ఉండేలా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.. అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో ఢీ కొట్టారు.

ప్రాజెక్టుల బాట..
గులాబీ బాస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్‌.. ఓ దశలో అధికార పార్టీ విమర్శలకు ఉక్కిరిబిక్కిరి అవుతూ కౌంటర్‌ కోసం ఎదురు చూస్తోంది. దీనిలో భాగంగా పీపుల్స్‌ ప్లాజాలో కౌంటర్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సాగునీటి రంగ నిపుణులు, మేధావుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. అయితే కౌంటర్‌ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్‌ ఉన్నపళంగా నిర్ణయాన్ని మార్చుకుంది. తాత్కాళికంగా దాన్ని వాయిదా వేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్‌కు కౌంటర్‌ ఇవ్వాలంటే బుక్‌ ఇన్‌ఫర్మేషన్‌, నిపుణుల అభిప్రాయాలు మాత్రమే సరిపోవని భావిస్తున్న కాంగ్రెస్‌.. గ్రౌండ్‌ సమాచారం కోసం ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తమ హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించాలని నిర్ణయించారు.

వర్కవుట్ అవుతుందా ? 
ఆ ప్రాజెక్టులు ఏ స్టేజిలోఉన్నాయి, వాటి లెక్కలు తీసుకోవడం వల్ల.. తాము తలపెట్టిన కౌంటర్‌ ప్రజెంటేషన్‌కు బాగా ఉపయోగపడుతోందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి...? కేసీఆర్‌ చెబుతున్న దాంట్లో నిజమెంత..? అన్నది కూడా జనానికి చెప్పినట్లు ఉంటుందన్న ఆలోచనలో హస్తం పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ నుంచి సడెన్‌గా రూటు మార్చి ప్రాజెక్టుల బాట పట్టనున్న కాంగ్రెస్‌.. త్వరలోనే బస్సు యాత్రకు సరంజామా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ యాత్ర కేసీఆర్‌కు ఎంతవరకు కౌంటర్‌ ఇస్తుందో కాలమే నిర్ణయించాలి. 

06:44 - April 15, 2016

విజయనగరం : వైసీపీకి మరో షాక్‌ తగలనుంది. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు త్వరలో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రెండు మూడు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోపక్క రంగారావు సోదరులను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు సోదరులు సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే టీడీపీ పెద్దలతో బొబ్బిలి రాజులు సంప్రదింపులు జరిపారు. కార్యకర్తలతో మంతనాలు కూడా చేశారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీ అయ్యారు.

మూడుసార్లు ఎమ్మెల్యే..
బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుజయకృష్ణ రంగారావు వరుసగా మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బొత్సతో పొసగక కాంగ్రెస్‌ నుంచి రంగారావు సోదరులు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిపొందినా..పార్టీ మారాలన్న ఆలోచన నేపథ్యంలో తరచూ వార్తల్లోకి ఎక్కారు. తమ ప్రత్యర్థి బొత్స కూడా వైసీపీలోకి రావడం బొబ్బిలి రాజులుకు మరింత ఆగ్రహం తెప్పించింది. బొత్స రాకను తీవ్రంగా ప్రతిఘటించిన బొబ్బిలి రాజులు..ఆ సమయంలోనే పార్టీ మారుతారన్న విస్తృత ప్రచారం జరిగింది. అయితే, అప్పట్లో ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆ తరువాత కూడా ఇటువంటి వార్తలు వచ్చినా వాటిని ఖండించారు.

పార్టీ మారడం ఖాయం..
ఈ సారి రంగారావు సోదరులు టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే వీరు టీడీపీ యువనేత లోకేష్ ను కలిసి తమ అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో మండలాల వారీగా మంతనాలు, సమాలోచనలు కూడా చేశారు. మరోపక్క బొబ్బిలి ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మానకృష్ణదాసు హుటాహుటీన బొబ్బిలి కోటకు చేరుకున్నారు. అయితే, రంగారావు సోదరులు అక్కడ లేకపోవడంతో వారి కోసం చాలాసేపు నిరీక్షించారు. ఫోన్ కి కూడా వారు అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే, బొబ్బిలి రాజులు పార్టీ మారడం ఖాయంగా తెలుస్తోంది. 

06:41 - April 15, 2016

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125 జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజన, మైనారిటీ విద్యార్ధులకు వరాల వర్షం కురిపించింది. ఈ వర్గాలకు 250 గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే దళిత విద్యార్ధులకు ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ముఖ్యంత్రి కేసీఆర్‌... లోయర్‌ట్యాంక్‌ బండ్‌ దగ్గర ప్రస్తుతం ఉన్న అంబేద్కర్‌ భవనం స్థానంలో 15 అంతస్థులు అంబేదర్‌ టవర్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోరబండలో భాగ్యరెడ్డి వర్మ సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌కు కూడా శంకుస్థాన చేశారు. ఈ కేంద్రం నిర్వహణకు 8 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన 125 అంబేద్కర్‌ కాంస్య విగ్రహ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు.

100 రెసిడెన్షియల్ స్కూళ్లు..
ఈ సందర్భంగా కేసీఆర్‌ దళిత విద్యార్ధులకు వరాల జల్లు కురిపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించే కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 100 రెసిడెన్షియల్ స్కూళ్లను వచ్చే జూన్‌ నుంచి ప్రారంభించనున్నట్టు విద్యార్ధులు హర్షధ్వానాల మధ్య కేసీఆర్‌ ప్రకటించారు. ఈ స్కూళ్ల నుంచి బయటకు వచ్చే బాలికల కోసం 25 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక చోట వీటిని ఏర్పాటు చేస్తారు. అలాగే బాలుర కోసం ఐదు రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తారు. గిరిజనుల కోసం 50, మైనారిటీల కోసం మరో 70 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఏడాది పొడవునా అంబేద్కర్‌ జయంతోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

06:39 - April 15, 2016

విజయవాడ : ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అంబేద్కర్‌ కృషి ప్రసంశనీయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్‌ 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేదల్లో తెలివైన పిల్లలున్నారని, వారికి సమాన అవకాశాలు కల్పిస్తే చరిత్ర తిరగ రాస్తారని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్‌ ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదవాళ్లలో తెలివైన పిల్లలున్నారని, సమాన అవకాశాలు కల్పిస్తే చరిత్ర తిరగ రాస్తారని ఆయన అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ప్రతి వ్యక్తికి న్యాయం..
రాజ్యాంగం వల్లే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతోందని, అందరూ రాజ్యాంగాన్ని వవిత్రంగా భావించాలని సీఎం అన్నారు. పేదలకు అండగా ఉండి ఆదుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఆరు లక్షల ఇళ్లకు విజయవాడ జక్కంపూడిలో శంఖుస్థాపన చేసిన ఆయన.. 16వేల కోట్లతో ఈ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అంబేద్కర్‌ స్ఫూర్తిని ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అందరు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహనీయులంతా సాధారణ కుటుంబాల్లోనే జన్మించారని, అయితే వారు అవలంభించిన విధానాలు, వ్యక్తిత్వం వల్లే మహానీయులుగా ఎదిగారని సీఎం గుర్తు చేశారు. 

06:32 - April 15, 2016

కడప : జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 24 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 20 న జరగనున్న కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి సీఎం సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కోదండరాముని ఆలయం విద్యుత్ దీపాలంకరణతో ధగధగలాడుతోంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు టెన్ టివితో మాట్లాడారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:31 - April 15, 2016

ప్రకాశం : అక్కడ చలువ పందిళ్లు కనపడ్డాయింటే సీతారాముల కల్యాణానికి సమయం ఆసన్నం అయినట్టే. ప్రకాశం జిల్లా చీరాలలోని కొట్లబజారులో కేవలం చలువ పందిరి కిందే మండపాన్ని ఏర్పాటు చేసుకుని రామనవమిని జరుపుకుంటున్నారు. వందేళ్లుగా అక్కడ రాములోరి కల్యాణం ఇలాగే జరుగుతోంది. శ్రీ సీతారామ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కల్యాణ వేడుకలు అత్యంత వైభంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వేడుకలు వంద సంవత్సరాలుగా అక్కడ చలువ పందిరి కిందే జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల కొట్లబజారులో ఏడాదికొకసారి చలువ పందిళ్లు దర్శనమిస్తాయి. ఇలా పందిళ్లు వేశారంటే సీతారామ కల్యాణ ఘడియలు సమీపించినట్టేనని భావించాలి.. 99 సంవత్సరాలుగా కేవలం చలువ పందిరి కిందే కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 101 మంది దంపతులు శ్రీ సీతారాముల వారి కల్యాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 1917వ సంవత్సరంలో తొలిసారి చుండూరు బూసి అనే రామ భక్తుడు కొట్ల బజారులో చలువ పందిరి కింద సీతారాముల వారి కల్యాణం నిర్వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు చలువ పందిళ్లు వేసి శ్రీరామనవమికి కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో దంపతుల తాంబూలాలకు,తలంబ్రాలకు ఎనలేని ప్రాముఖ్యత వుంది. 

06:29 - April 15, 2016

విజయవాడ : శ్రీ సీతారాముల కల్యాణానికి విజయవాడలో రాముల వారి మండపాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి వీధిల్లో కల్యాణ మండపాలు వెలిశాయి. శ్రీ రామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాలకు బెజవాడ సిద్ధమయింది. వీధి వీధినా కల్యాణ మండపాలు రెడీ అయ్యాయి. నగరంలోని రామాలయాలన్ని ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. బీసెంట్ రోడ్ లోని రామాలయం సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. స్వామివారికి ముత్యాల తలంబ్రాలతో కల్యాణ వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నగరంలో చలువ పందిళ్లు కొలువు దీరాయి. కొన్ని చోట్ల కల్యాణ వేదికలు సమస్త హంగులతో ముస్తాబయ్యాయి. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పెద్దస్థాయిలో ఉత్సవ ఏర్పాట్లు జరిగాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

06:28 - April 15, 2016

కరీంనగర్ : వేములవాడలో శ్రీరామనవమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరగనుంది. శైవ దేవాలయంలో జరిగే ఈ కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఉగాది రోజు ప్రారంభమై, నవమితో ముగిసే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
వేములవాడలో కామ దహనం, హోలి పండుగ తర్వాతి ఐదు రోజుల పాటు శివకళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది. శివ కల్యాణాన్ని తిలకించడానికి తక్కువ సంఖ్యలో వచ్చినా, ఆ తర్వాత జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి మాత్రం దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారు. శ్రీరామ నవమి రోజున జంగమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం కోసం అధికారులు దాదాపు 20 లక్షల రూపాయలతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్బంగా దేవాలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.   

06:26 - April 15, 2016

ఖమ్మం : రాములోరి పెండ్లికి భద్రాద్రి ముస్తాబైంది. ఇవాళ శ్రీరామనవమి, రేపు శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా సాగనుంది. ఆద్యంతం కన్నుల పండువగా సాగనున్న రామయ్య పెండ్లికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్నారు. తాటాకు చలువ పందిళ్లతో, మామిడి తోరణాలతో విద్యుత్ అలంకరణలతో భద్రాచలంలో కల్యాణ శోభ సంతరించుకుంది. సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియం సిద్ధమైంది. రాములోరి వివాహ వేడుకకు... రాష్ట్ర ప్రభుత్వం తరపున సీయం కేసీఆర్ సతీసమేతంగా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శనివారం జరిగే పట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. శ్రీరామనవమి కోసం భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది.రాములోరి కళ్యాణం నిర్వహించే మిధిలా స్టేడియంలో సెక్టార్లు ఏర్పాటు చేశారు. లక్షన్నర వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూర్చోనేందుకు 1 లక్షా 30 వేల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లు, 15 తలంబ్రాల కౌంటర్లు, 8 లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేసారు. వేడుకలో తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. 60 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. కళ్యాణం వీక్షించేందుకు ఎల్.ఈ.డీ స్క్రీన్లతో పాటు బందోబస్తులో భాగంగా 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.

06:11 - April 15, 2016

ఖమ్మం : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ వేడుక జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఈ మహాఘట్టాన్ని చూసి తరించేందుకని వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం ఇప్పటికే భద్రగిరికి చేరుకున్నారు.
మిథిలా స్టేడియం ప్రాంగణంలో 35 వేల మంది కూర్చొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణం తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో వేచి ఉండే భక్తుల కోసమని స్వామివారి కల్యాణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కల్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంతమంతా చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాల అలంకరణతో శోభాయమానంగా మారింది.
భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్నారు. అదే విధంగా శనివారం జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వ అతిథిగా గవర్నర్ నరసింహన్ రానున్నారు. దీంతో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

భద్రాచలంలో నేడు సీతారాముల కల్యాణం..

ఖమ్మం : నేడు భద్రాచలంలో సీతారాము కల్యాణం జరగనుంది. సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. 

ఢిల్లీలో నేటి నుండి మళ్లీ సరి, బేసి..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుండి కాలుష్యం నుండి రక్షించడానికి శుక్రవారం నుండి మరోసారి సరి, బేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వీఐపీలు, మహిళా డ్రైవర్లు, మోటారు వాహనదారులను, ఎమర్జెన్సీ వామనాలు, సీఎన్జీ వాహనాలు మినహా అన్నింటికీ ఈ నియమం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

పుణెపై లయన్స్ గెలుపు..

రాజ్ కోట్ : ఐపీఎల్ 9లో గుజరాత్ లయన్స్ జట్టు మరోసారి మెరిసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రైనా సారథ్యంలోని లయన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ధోని నేతృత్వంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టును చిత్తు చేసి లీగ్ లో వరసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

ఏపీలో ఇంటర్ ఫలితాలు 20న..

విజయవాడ : ఇంటర్మీడియట్‌ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ముగిసిందని, ఈ నెల 20న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

రేపటి నుండే స్కూళ్లకు సెలవులు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం (16వ తేదీ) నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Don't Miss