Activities calendar

16 April 2016

21:33 - April 16, 2016

హైదరాబాద్ : ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో...హైదరాబాద్ సన్ రైజర్స్ వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్లతో చిత్తు చేసింది. హోంగ్రౌండ్లో ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. నోయిన్ మోర్గాన్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 143 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన నైట్ రైడర్స్ కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, గౌతం గంభీర్ 92 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.గంభీర్ 43 బాల్స్ లో ఏడు బౌండ్రీలతో.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తనజట్టు విజయంలో మరోసారి ప్రధానపాత్ర వహించాడు. 79 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచిన గంభీర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ ఇప్పటి వరకూ 35 మ్యాచ్ లు ఆడితే...ఇది 22వ పరాజయం కావడం విశేషం. 

కేసీఆర్ కు విశ్రాంతి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరం వచ్చింది. పరీక్షించిన వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో పలు కార్యక్రమాలను కేసీఆర్ రద్దు చేసుకున్నారు. 

ఆదివారం బెంగాల్ లో రెండో విడత పోలింగ్...

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఆదివారం పోలింగ్ ఎలా ముగుస్తోందనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి చేసుకున్న బెంగాల్ లో ఆదివారం నాడు 56 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది.  

21:26 - April 16, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఆదివారం పోలింగ్ ఎలా ముగుస్తోందనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి చేసుకున్న బెంగాల్ లో ఆదివారం నాడు 56 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఇవి ఏడు జిల్లాల్లో విస్తరించి వున్నాయి. ఈ 56 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వున్న వారి సంఖ్య కోటీ 21 లక్షలు. వీరి కోసం 13, 645 పోలింగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు ప్రతి 900 మందికి ఒక పోలింగ్ బూత్ అందుబాటులో వుంటుంది. రెండో విడతలో 33 మంది మహిళలతో సహా 383 మంది రంగంలో వున్నారు. వీరిలో 60 మందికి పైగా కోటీశ్వరులున్నారు. తృణమూల్ కాంగ్రెస్ 55, బిజెపి 53, కాంగ్రెస్ 23, సిపిఎం 17 స్థానాల్లో పోటీపడుతున్నాయి. రెండు విడత పోలింగ్ అన్ని పార్టీలకు అత్యంత కీలకం. మాల్దా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటకాగా, టీ ఎస్టేట్స్ ఎక్కువగా వున్న నియోజకవర్గాలు మమతాబెనర్జీ కి దడపుట్టిస్తున్నాయి. అధికార పార్టీని నిలువరించాలంటే వామపక్షాలు రెండో విడతలోనే తమ సత్తా చాటుకోవాల్సి వుంటుంది. ఇక బిజెపి ఎంతోకొంత ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ ఆదివారం నాడే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం ఓటర్లు అత్యధిక సంఖ్యలో వున్న ఉత్తర్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ నియోజకవర్గాల్లోనూ ఆదివారంనాడే పోలింగ్. ఉత్తర్ దినాజ్ పూర్, మాల్దాలలో 50 శాతం పైగా వున్న ముస్లింలు, ముర్షిదాబాద్ లో 66శాతం మంది వున్నారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ముస్లిం ఓట్లు భారీగా చీలితే కొన్ని నియోజకవర్గాల్లో తమకు లాభిస్తుందన్న అంచనాతో కమలనాధులున్నారు. ముస్లిం ఓటు బ్యాంక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన మమతాబెనర్జీ 57 మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించడం విశేషం.

పలు హింసాత్మక ఘటనలు..
ఆదివారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మక, సునిశిత ప్రాంతాలతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మక పోటీ జరుగుతున్న నియోజకవర్గాలు కూడా వున్నాయి. ఏప్రిల్ 4, 11 తేదీలలో 49 స్థానాలకు జరిగిన మొదటి విడత పోలింగ్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ఆదివారం నాటి పోలింగ్ ఎలా ముగుస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి విడత ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలన్నీ భారీ ఎత్తున రిగ్గింగ్, బూతుల ఆక్రమణ జరిగినట్టు ఆరోపిస్తున్నాయి. ఓటర్లే కాదు చివరకు అభ్యర్థులు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోయిందంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించిన తీరు తీవ్ర వివాదస్పదమైంది. మే 19 న ప్రజలే ఈసికి షోకాజ్ నోటీసు ఇస్తారంటూ ఆమె చేసిన విపరీత వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు తప్పుపడుతున్నారు. 

21:21 - April 16, 2016

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్ వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జలసాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చంద్రకుమార్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టిడిపి నేతలు పాల్గొన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సూచించారు. ప్రధాన ప్రాజెక్టును తుమ్మిడి హట్టి నుండి మేడి గడ్డకు మారిస్తే వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చారు. నేతల అభిప్రాయాలు వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:19 - April 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితులపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఎంపీ వీహెచ్‌ లేఖ రాశారు. తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఎదురవుతున్న పరిణామాలను వీహెచ్‌ లేఖలో వివరించారు. పార్టీ మారుతున్న నేతలు, పార్టీ బలోపేతం, కార్యకర్తలు నాయకుల్లో నెలకొన్న ఉత్సాహాన్ని ప్రత్యేక సమీక్ష జరిపి పోగొట్టాలని వీహెచ్‌ సూచించారు. వీలైనంత త్వరగా తెలంగాణ కాంగ్రెస్‌పై దృష్టిపెట్టి రాష్ట్రంలో పార్టీని బతికించాలన్నారు. ఒకవేళ తెలంగాణపై పార్టీ దృష్టి పెట్టకపోతే పార్టీకి గడ్డుకాలం మొదలవుతుందని లేఖలో సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారని వివరించారు. 

21:17 - April 16, 2016

హైదరాబాద్ : వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో దీనిని అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కరువు మండలాల్లోనే దీనిని కొనసాగించాలని సూచించగా....కరవు రహిత మండలాల్లో కూడా అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధులకే దీనిని పరిమితం చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే 9, 10 తరగతుల విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని రాష్ట్రం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు భోజనం పెట్టాలని నిర్ణయించారు. 

21:16 - April 16, 2016

హైదరాబాద్ : తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ పీసీసీ కార్యవర్గం ఏర్పాటైంది. 130 మందితో జంబో కమిటీని ప్రకటించింది హై కమాండ్. చిన్న లిస్టు కావాలన్న PCC సూచనను పక్కనబెట్టిన హస్తిన పెద్దలు.. ప్రజా ప్రతినిధులు, మాజీలతో కమిటీని నింపేశారు. కొత్త రాష్ట్రం వచ్చాక పీసీసీ సారధులు మారినా కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో బొత్స, కొత్త రాష్ట్రంలో పొన్నాల హయాంలోకూడా కార్యవర్గ ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత ఎట్టకేలకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ.
ఈ జంబో టీంలో జంబో చాలా మార్పులు జరిగాయి. గతానికి భిన్నంగా లిస్టును కుదించి చిన్న టీంను ఎంపిక చేయాలని ముందు హై కమాండ్ భావించింది. ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుంది. 130 మందితో కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో పీసీసీ ఉపాధ్యక్షులుగా 13మంది, ప్రధాన కార్యదర్శులుగా 31మంది, కార్యవర్గ సభ్యులుగా 35మంది, శాశ్వత ఆహ్వానితులుగా 22 మందిని హైకమాండ్‌ నియమించింది. గతంలో 8మందితో కొనసాగిన పీసీసీ కో ఆర్డినేషన్‌ కమిటీని ఈసారి ఏకంగా 31మందికి పెంచేసింది. అయితే ఈ టీంలో కేవలం ఎనిమిది మంది మహిళలకు మాత్రమే చోటు దక్కింది.
అందరినీ సంతృప్తి పరిచేలా.. ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్తగా టీంను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ హై కమాండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు.. మాజీలకు కమిటీలో స్థానం ఇచ్చింది.. ప్రధాన కార్యదర్శుల్లో సగంమంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది.. మిగిలిఉన్న అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మరో రెండు రోజుల్లో ప్రకటించి ఎంపికను పూర్తిచేయాలని అధిష్ఠానం భావిస్తోంది.. మొత్తానికి కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌ను ఈ జంబో టీం ఏమేరకు గట్టెక్కిస్తుందో వేచి చూడాలి.

20:39 - April 16, 2016

ఏ ఇంట్లో ఇళ్లాలు గౌరవించబడుతుందో..ఏ ఇంట్లో ఇళ్లాలు గౌరవించబడుతుందో..సంతోషంగా ఉంటుందో ఆ ఇళ్లు అష్టశ్వైర్యాలతో తుల తూగుతుందని అంటుంటారు. మరి అలాంటి సిరులొలికే సతికి ఎందుకంత దారుణమైన శిక్ష ? ఆమె చేసిన నేరం ఏంటీ ? తప్పించుకోని దుస్థితి కల్పించిన పరిస్థితులు ఏంటీ ? ఈ స్త్రీ విగతజీవిగా మారడానికి కారణం ఏంటీ ? ఎవరా హంతకుడు? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

దాసరి రవీందర్ మృతికి కేసీఆర్ సంతాపం..

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పీఆర్వో దాసరి రవీందర్(42) అకాల మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవీందర్ కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

ముదురుతున్న ఎండలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఇవాళ రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల 44, ఆదిలాబాద్ 43, హైదరాబాద్ 43, నిజామాబాద్ 41, ఖమ్మం జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

20:31 - April 16, 2016

వొక పోరడు ఏలెడంతనే వున్నడు గని.. పోలీసోల్ల మీద్కె కలెవడెతందుకు ఎగవడ్తుండు.. ఆడున్నోల్లు ఎవ్వలు ఆపినా.. ఆగకుంట ఎగిరెగిరి జబ్బల్ జరుస్తుండు.. దెగ్గర్కి వోదామంటెనే.. గజ్జున వొన్కుతున్నరు మమ్ముల గిట్ల తన్నగల్ల అని.. ఇంతకు ఎన్నేండ్లున్నడు అన్కుంటున్నరు... మా అంటే రొండేండ్లుంటడు.. రొండేండ్ల పోరడు పోలీసోల్లను బెదిరిచ్చుడు ఏంది మల్లన్నా.. అంటరా..అయితే ఈ ముచ్చట చూడండి. 

20:28 - April 16, 2016

అంబర్ పేట అన్మంతన్న సూర్యున్ని భయపెట్టినంత పనిజేశిండు సూడు..పోలవరం కథ జూస్తున్నరా..? ముంపు గ్రామాల మీద తక్వ గావురం గారుస్తున్నరా ఇప్పుడు..? మరి ఆ గావురం ఎన్క మత్లావేంది..?పాపం పాలోనికి గూడ రావొద్దు ఇసొంటి కష్టం.. ఆళ్ల కుటుంబం నల్పై ఏండ్లు వట్టి దేశాన్ని ఏలుతున్నా..? ఇప్పటికి ఇంటి కిరాయి గడ్దామంటె పైకమే లేదంటే..? శివుడు పార్వతి ఇద్దరు పోలీస్ స్టేషన్ కు ఎందుకొచ్చిండ్రు అనేది దెల్వాల్నంటే ఈ ముచ్చటొకటున్నది..పట్నం మహెందర్ రెడ్డి సారు.. ఉన్నట్టుండి బస్సుల ఎక్కిపోతున్నడు..నీళ్ల పార్కం శాఖ మంత్రి హరీషన్న.. తెలంగాణ బత్కమ్మ కవితక్క.. శెర్వు పనికి వొయ్యిండ్రట..పోలీసోల్లకు మొక్కుడు ఏంది అంటరా.. కొందరు పోలీసోల్లకు అట్ల మొక్కితెనే రాజన్న సామి దర్శనం ఐతున్నదట.. ఎన్నడన్న అడ్విలున్న శింపాంజీ వొచ్చి కరంటి పోల్ మీదికి ఎక్కి హంగామా శెయ్యంగ సూశిండ్రా...? ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అనే మాటను అక్షరాల నిజం జేశిండు వొకడు..వొక పోరడు ఏలెడంతనే వున్నడు గని.. పోలీసోల్ల మీద్కె కలెవడెతందుకు ఎగవడ్తుండు..వీటిపై టెన్ టివిలో మల్లన్న ముచ్చట్లులో మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. మరి ఆ ముచ్చట్లు వివరంగా చూడాలంటే వీడియో క్లిక్ చేయుండి. 

19:55 - April 16, 2016

తాను నటించిన చిత్రం ఈడో రకం..ఆడో రకం విజయవంతమైనందుకు చాలా హ్యాపీగా ఉందని నటుడు రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన ఈడో రకం..ఆడోరకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివి నిర్మాత అనీల్, రాజ్ తరుణ్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు..ఇతరత్రా విషయాలను వారు పంచుకున్నారు. వారు ఏమేమి చెప్పారో ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం..

హైదరాబాద్ : వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్నం భోజన పథకం కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష ముగిసిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో మధ్యాహ్న భోజనం కొనసాగిస్తామని ప్రకటించారు. 

పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం..

బీహార్ : రాష్ట్రంలోని రోహతస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. 

19:37 - April 16, 2016

తాను భవిష్యత్ లో డైరెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ నటుడు రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన ఈడో రకం..ఆడో రకం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రొడ్యూసర్ అనీల్, హీరో రాజ్ తరుణ్ తో ముచ్చటించారు. తాను దర్శకుడిగా కావాలని అనుకున్నానని, హీరోగా అయ్యాయన్నారు. కానీ భవిష్యత్ లో దర్శకుడిగా అవుతానని, ఎంత కాలం పడుతుందో చెప్పలేనన్నారు. 

సన్ రైజర్స్ పై కోల్ కతా విజయం..

హైదరాబాద్ : ఐపీఎల్ 9లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్ కతా రెండు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 

19:26 - April 16, 2016

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ టెండర్లలో అధికార పార్టీ నేతలు అవకతవకలకు పాల్పడ్డారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఈ టెండర్లలో సీఎం కేసీఆర్‌ బినామీలు ఉన్నారని ఆమె విమర్శించారు. వెంటనే పాలమూరు టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు 'జూలో పిల్లి' అని డీకే అరుణ సంభోదించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్నారు. 

19:23 - April 16, 2016

జమ్మూ కాశ్మీర్ : కుప్వార కాల్పుల్లో యువకుడి మృతికి నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళన ఉధృతమైంది. వేర్పాటు వాద సంస్థలు శ్రీనగర్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళనకారులపై భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కుప్వారాను సందర్శించారు. హంద్వారా కాల్పుల ఘటనకు నిరసనగా శుక్రవారం కుప్వారాలో ఆందోళన జరిగింది. ఆందోళనకారులపై భద్రతదళాలు జరిపిన కాల్పుల్లో లెవన్త్ క్లాస్‌ విద్యార్థి ఆరిఫ్‌ హుస్సేన్‌ దార్‌ మృతి చెందాడు. అయితే రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్‌పై ఆందోళనకారులు దాడికి దిగడంతో పాటు, గోడపైకి ఎక్కి క్యాపులోకి చొరబడే యత్నం చేయడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కుప్వారాలో 18 ఏళ్ల యువకుడి మృతికి నిరసనగా వేర్పాటు వాదులు సయ్యద్‌ అలీ గిలానీ, మిర్వేజ్‌ ఉమర్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ తదితరులు కశ్మీర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో అప్రమత్తమైన కేంద్రం అదనంగా పారమిలటరీ బలగాలను అక్కడికి పంపింది. పుకార్లు షికార్లు చేయకుండా ఉండేందుకు కశ్మీర్‌ లోయలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను అధికారులు రద్దు చేశారు.

కుప్వారలో కర్ఫ్యూ..
కశ్మీర్‌ యూనివర్సిటీ, ద బోర్డ్‌ ఆఫ్‌ స్కూలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. బారముల్లా, బనీహాల్‌, జమ్ము రీజన్‌ల మధ్య రైలు సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కుప్వారాను సందర్శించారు. కాల్పుల ఘటనను ఖండించారు. కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. భద్రతాదళాలు సంయమనం పాటించాలని సూచించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళవారంనాడు హంద్వారాలో ఓ బాలికను భద్రతా సిబ్బంది వేధించారన్న ఆరోపణలు ఆందోళనకు దారితీశాయి. ఆర్మీ పోస్టు, జవాన్లపైకి రాళ్లు రువ్వడంతో భద్రతాదళాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వర్ధమాన క్రికెటర్‌ 19 ఏళ్ల నయీమ్‌ భట్‌తో పాటు ముగ్గురు మృతి చెందారు. అయితే తనను జవాను వేధించలేదని, స్థానికుడే వేధించాడన్న విద్యార్థిని చెప్పిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది. హంద్వార ఘటనతో కశ్మీర్‌ లోయలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర కశ్మీర్‌లో చెలరేగుతున్న అల్లర్లలో 40 మంది జవాన్లతో పాటు మొత్తం 60 మంది గాయపడ్డారు. కుప్వారాలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

భారీగా ఎర్రచందనం స్వాధీనం....

తిరుపతి : చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కొందరు స్మగ్లర్లు, కూలీలూ పోలీసులపై రాళ్ళు రువ్వి పరారవ్వగా ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఓ ఇంట్లో భారీ దోపిడీ....

నల్లగొండ : సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల నగదు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్ధులపై స్వాత్ యూనివర్శిటీ నిబంధనలు...

హైదరాబాద్ : సంప్రదాయం పేరుతో మహిళలు, యువతుల పట్ల ఇస్లామిక్ మతపెద్దలు జారీ చేసే ఫత్వాలు చాలా కఠినంగా వుంటాయి. ఇప్పుడు తాజాగా అబ్బాయిలూ, అమ్మాయిలు కలిసి నడవడం, కలిసి కూర్చోడం నిషిద్ధమని పాకిస్థాన్‌లోని స్వాత్ యూనివర్శిటీ నిబంధన విధించింది. యువతీయువకులు ఒకరితో ఒకరు కలిసి తిరగకూడదని కలిసి కూర్చోకూడదని క్యాంపస్‌లో నోటీసులు జారీ చేసింది. ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. రూ.50 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. పాక్‌ మీడియా ప్రధానంగా ఈ విషయాన్ని ప్రముఖంగా పేర్కొంది.

18:43 - April 16, 2016

హైదరాబాద్ : టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్లు దాడికి పాల్పడ్డారు. ఈఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకుందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జూబ్లిహిల్స్ పీఎస్ లో పూరి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..వరుణ్ తేజ్ హీరోగా పూరి 'లోఫర్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించకలేదు. దీనితో ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తాము ఈ సినిమాతో నష్టపోయామని నష్టపరిహారం ఇవ్వాలని పూరిని డిస్ట్రిబ్యూటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అభిషేక్, ముత్యాలు, సుధీర్ లు దాడికి పాల్పడినట్లు పూరి జూబ్లిహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

18:38 - April 16, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుల్లో మెట్రో రైల్ ఒకటి. ఇందుకోసం అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పేరుతో ఓ బోర్డునూ ఏర్పాటు చేసినా పనులు మాత్రం ముందుకు కదలట్లేదు. జపాన్ బృందం అనేక సార్లు ప్రభుత్వంతో సమావేశం అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. మెట్రో ప్రాజెక్టుకు ఎందుకు ఇన్ని అడ్డంకులు.. దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యమా లేక అధికారుల అలసత్వమా తెలుసుకోవాలంటే చదవండి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఇప్పుడా ప్రాజెక్టుకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. ఏ ప్రాజెక్ట్‌కైనా మూలం భూసేకరణే.. మెట్రో ప్రాజెక్టు కింద భూసేకరణకు కనీసం రూ.700 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపరంగా చెరో సగం మేర ప్రాజెక్టు నాలుగేళ్ల కాలానికి ఏడాదికి రూ.300 కోట్లు చొప్పున బడ్జెట్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. తొలి ఏడాది ఒక్కసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.700 కోట్లు వ్యయం అవుతోంది. ఈ లెక్కన రాష్ట్ర వాటాగా మొత్తం రూ.1000 కోట్లను ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే రాష్ట్రం ఇంత మొత్తం విడుదల చేసేందుకు సిద్దంగా లేదు.

రూ.7వేల కోట్లు..
మెట్రోకు ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు, ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇవి ఏ మూలకు వచ్చే పరిస్థితి లేదు. ఐతే మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చడంలో విఫలమవుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అమరావతీ మెట్రో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7000 కోట్లకు గాను రూ.4000 కోట్లకు జైకా సంస్థ రుణం మంజూరు చేయనుంది. ఇదే అంశంపై ఆ సంస్థ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికనూ తయారు చేసింది. అయితే, రుణం మంజూరు చేయటానికి ఆరు నెలల సమయం పట్టవచ్చని సంకేతాలు ఇచ్చింది. దీంతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమయ్యేందుకు కనీసం ఆర్నెల్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది. మెట్రో నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రతిపాదనల పట్ల జపాన్‌ బృందం సుముఖంగా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మెట్రో ప్రాజెక్టు అమల్లో జాప్యం జరుగుతోందని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం త్వరత్వరగా మెట్రోను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతీ మెట్రో అడ్డంకులకు చిహ్నంగా మారుతోంది. ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం దీన్ని సవాలుగా తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లతుందో లేదో వేచి చూడాలి!

కోలుకుంటున్న నటుడు దిలీప్ కుమార్....

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన భార్య సైరాభాను ఈ విషయాన్ని వెల్లడించారు. ఈరోజు తెల్లవారు ఝామున శ్వాసతీసుకోవటంలో కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తమేననీ...వెంటనే చికిత్స అందటంతో కోలుకున్నారని ఆమె తెలిపారు. కాగా దిలీప్ కుమార్ కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

18:30 - April 16, 2016

విజయవాడ : ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు రావడం అంటే.. ఇదే మరి...! సరైనోడు ఆడియో ఫంక్షన్ బన్నీ అభిమానులకు ఆనందం పంచినా... రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ కు మాత్రం చీవాట్లు పెట్టేలా చేసింది.. ఈ ఆడియో ఫంక్షన్‌కు, గంటాపై సీఎం సీరియస్ అవడానికి లింక్ ఏంటనే కదా మీ అనుమానం. అయితే ఇది చదవండి!గంటా శ్రీనివాసరావు... ఒకప్పుడు ఎంపీ. టీడీపీలో కీలక నేత... ఆ తర్వాత పీఆర్పీలో చేరారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంతో కిరణ్ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల నాటికి మళ్లీ సైకిలెక్కి.. మంత్రి అయిపోయారు. చిరు కుటుంబంతో ఆయనకు సన్నిహత సంబంధాలున్నాయి. ఆ సంబంధాలే.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు ఆయనకు ఉన్న బంధాలను తెగ్గొట్టేలా మారాయని సమాచారం. ఈ మధ్య విశాఖలో చిరు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ నటించిన సరైనోడు ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌ను హైదరాబాద్ లో సాదాసీదాగా చేద్దామని ముందుగా అనుకున్నా.. చిరు ఫ్యామిలీ, అల్లు అరవింద్ తో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధంతో విశాఖలో నిర్వహిద్దామంటూ గంటా ప్రతిపాదించారు. అల్లు అరవింద్ కూడా ఓకే అనడంతో మొత్తం బాధ్యతను గంటా శ్రీనివాసరావే భుజాన వేసుకున్నారు. చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ కార్యక్రమానికి అభిమానుల తరలింపు నుంచి మొదలు... ప్రతి చిన్న విషయాన్ని గంటాయే దగ్గరుండి మరీ చూసుకున్నారు. చిరంజీవి కోసమే అభిమానులను భారీగా మోహరించారు.

బాబు ప్రశ్నలు...
ఆడియో ఫంక్షన్ కు గంటా హాజరవ్వడం తప్పు కాదు.. కానీ అన్నీ తానై.. టీడీపీ కార్యకర్తలను ఉపయోగించుకుని చిరంజీవి పాల్గొనే ఆడియో ఫంక్షన్ హిట్టయ్యేలా చూశారన్నదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌లా మారింది. సీఎం చంద్రబాబే ఈ విషయంలో గంటాకు క్లాస్ పీకారని సమాచారం. చిరంజీవికి పబ్లిసిటీ కోసం మీ తాపత్రయమేంటో అంటూ సీఎం మండిపడ్డారన్న ప్రచారం జోరందుకుంది. చిరు కుటుంబంతో సన్నిహితంగా ఉండటం తప్పుకాదు.. కానీ రాజకీయంగా వాళ్లు ప్రత్యర్థులుగా ఉండటం, అదే సందర్భంలో పవన్ కల్యాణ్ తాజా ధోరణి.. ఈ నేపథ్యంలో ఆ ఆడియో ఫంక్షన్, చిరంజీవిని హైలెట్ చేసే బాధ్యత ఎందుకు తీసుకున్నారంటూ చంద్రబాబు గంటాను ప్రశ్నించారట. చంద్రబాబు ప్రశ్నలకు గంటా నోరెత్తకుండా ఉండిపోయారన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది.

మినిష్టర్ పదవికి ఎసరు ? 
చిరంజీవికి చంద్రబాబు మొదట్లో చాలా సన్నిహిత సంబంధాలుండేవి. శ్రీజ వ్యవహరం సమయంలోనూ చిరును బాబు ఓదార్చారు. అయితే అదే చిరంజీవి పెట్టిన పీఆర్పీ 2009 ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీసింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో బాబుకు చిరంజీవి దూరం పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య రెండు మూడు సినిమా ఫంక్షన్స్ లో కలిసినప్పటికీ ... ఇద్దరూ కనీసం మర్యాదకైనా మాట్లాడుకోలేదు. అయితే ఈ మధ్యన జరిగిన చిరు కూతురు శ్రీజ వివాహా రిసెప్షన్ కు మాత్రం చంద్రబాబు హజరయ్యారు.  సరైనోడు వివాదం నేపథ్యంలో... గంటా అమెరికా టూర్ కు సీఎం అనుమతివ్వలేదని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన సిఫార్సు చేసే ఫైల్స్ పై తనకు సమాచారం ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారట. ఈ విషయంలో గంటా వియ్యంకుడు మంత్రి నారాయణ కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అలాగే ఈ మధ్యనే మంత్రి దేవినేని ఉమాపై కూడా సీఎం సీరియస్ అయ్యారట. జిల్లాలో నేతలను కలుపుకొని పోవాలని.. శాఖపై మరింత దృష్టి సారించాలని చెప్పారట. ఏదేమైనా చిరుతో గంటా ఫ్రైండ్ షిప్.. ఆయన మినిస్టర్ షిప్ కు ఎక్కడ ఎసరొస్తుందోనన్న గుసగుసలు ఎక్కువే వినిపించడం కొసమెరుపు.  

దర్శకుడు పూరీ జగన్నాథ్ పై దాడి...

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై దాడి జరిగింది. లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు,సుధీర్ లు పూరీపై దాడి చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆయన ఫిర్యాదు చేశారు. పూరీ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమా ద్వారా నష్టపోయామని రాబోయే సినిమా హక్కులు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు సమాచారం.

18:25 - April 16, 2016

విశాఖపట్టణం : అచ్యుతాపురంలోని బ్రాడిక్స్ సంస్థ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా ఉద్యోగులు తాత్కాలికంగా ఆందోళనల్ని విరమించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30వరకు బ్రాండిక్స్ సంస్థ యాజమాన్యం గడువు కోరింది. దీంతో ఉద్యోగులు తమ ఆందోళనల్ని విరమించారు. ఈనెల 30లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని మహిళా ఉద్యోగులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇక పీఎఫ్‌ చెల్లింపు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవులు, జీతాల పెంపుపై యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించాయి. 

దుశ్చర్యలకు పాల్పడిన మావోయిస్టులు...

వరంగల్ : జిల్లాలోని తాడ్వాయ్ మండలంలో మావోయిస్టులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అటవీ శాఖకు చెందిన గెస్టు హౌజ్, జీపును మావోలు తగులబెట్టారు. మావోయిస్టు నేత దామోదర్ పేరిట ఓ లేఖ సంఘటనా స్థలంలో లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ సందర్శించనున్నారు. ఇప్పటికే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రోడ్డుపై కూలిన చెట్టు. కారు ధ్వంసం....

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసమైంది. చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోవటంతో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలింగింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగించటంతో వాహన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

జపాన్ భూకంప బాధితులకు ప్రధాని మోదీ సంతాపం...

హైదరాబాద్ : జపాన్ దేశాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. గురువారం, శుక్రవారం సంభవించిన రెండు భూకంపాలు జపాన్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భూకంప మృతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. భూకంప బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వడగాల్పులకు 28,000 కోళ్లు మృతి...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ వడదెబ్బకు మనుష్యులే కాదు ఫౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. హయత్‌నగర్ మండలం గండిచెరువు గ్రామంలో ఈ రెండు రోజుల్లో 28,000 కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

18:03 - April 16, 2016

చిరు 150వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకూ కొద్దికాలంగా అందుతోన్న వార్తలు హుషారు పుట్టిస్తున్నాయి. ఇరుగు కథలు, పొరుగు కథనాలపై తర్జనభర్జనల అనంతరం తమిళ 'కత్తి'నే తెలుగులోనూ ఝుళిపించడానికి చిరు సిద్ధమవడంతో కథపై పెద్దగా కసరత్తు చేయాల్సిన పని తప్పింది. సో.. ఈనెల లేదా వచ్చె నెలలో సబ్జెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలూ గుప్పుమంటున్నాయి. 'కత్తి' టైటిల్‌తో గతంలో కల్యాణ్‌రామ్ ఒక సినిమా చేసి ఉండటం, ఇదే టైటిల్‌ను మరొకరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉన్నారన్న కథనాల నేపథ్యంలో టైటిల్‌పై మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అభిమానుల వర్షన్ కోసం 'కత్తిలాంటోడు' టైటిల్‌ని గాసిప్‌గా వదిలినా.. ఫ్యాన్స్ నుండి సంతృప్తి వ్యక్తం కాకపోవడం, ప్రస్తుత చిరు ఆహార్యానికి టైటిల్ ఆప్ట్ గా లేకపోవటంతో పునరాలోచనలు సాగుతున్నాయన్నది ఇండస్ట్రీ టాక్. ఇదిలావుంటే, డ్యాన్స్ ల్లో తన ఇమేజ్‌కి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఉండాలన్న యోచనతో 'జుంటా' డ్యాన్స్ పై చిరు దృష్టి పెట్టారన్నది మరో కథనం. బాడీని అదుపులోకి తెచ్చి, వయసు రీత్యా శరీరంలోని వివిధ భాగాల్లోకి చేరే ఫ్యాట్‌ను కరిగించి ఫిట్‌నెస్ అందించే లాటిన్ అమెరికన్ రిథమిక్ డ్యాన్స్ స్టయిల్ 'జుంటా'పై చిరు సీరియస్‌గానే వర్కవుట్స్ చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పుష్కరకాలం క్రితం 'ఠాగూర్'తో సెన్షేషనల్ హిట్‌నిచ్చిన వివి వినాయక్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ చిరు 150వ ప్రాజెక్టుపైనా అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమాలో జుంటా డ్యాన్స్ ఉందా ? లేదా ? చిరు చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో వేచి చూడాలి. 

ఐపీఎల్ 2016...

హైదరాబాద్ : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఐపీఎల్-9 లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ (13), శిఖర్ థావన్ (6), మోజెస్ హెన్రిక్ (6), మోర్గాన్ (51), దీపక్ హుడా (6), ఓఝా(37), ఆశిష్ రెడ్డి(13), శర్మ, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ గా నిలిచారు. కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 143 పరుగులు చేయాల్సి ఉంది.

టీ. పీసీసీ నూతన కార్యవర్గం ఎన్నిక....

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి విక్రమార్కను కొనసాగుతున్నారు. 13 మంది ఉపాధ్యక్షులు, 31 మంది ప్రధాన కార్యదర్శులు, కో ఆర్టినేషన్ సభ్యులుగా 31 మందిని ఏఐసీసీ నియమించింది.

లక్కీ నంబర్ కు 10 లక్షలు...

హైదరాబాద్ : ప్రముఖులు లక్కీ నంబర్ కోసం లక్షల రూపాయలు వెచ్చించటం అనేది కొందరు సెంట్ మెంట్ గా భావిస్తే మరికొందరు ప్రిస్టేజ్ ఇష్యూగా భావిస్తారు. జూనియర్ ఎన్టీఆర్  రీసెంట్‌గా  కొనుగోలు చేసిన బీఎండబ్యూ కారుకి టీఎస్ 09 ఈఎల్ 9999 నెంబర్ కోసం బిడ్ వేశారు. ఈ లక్కీ నెంబర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ.10.5లక్షలు ఖర్చు పెట్టిన ఎన్టీఆర్ వేలంలో దక్కించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు 9 నంబర్ సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ వద్దనున్న  కార్లు అన్నింటికీ ఇదే నంబర్ కావటం విశేషం.

17:31 - April 16, 2016

బాలకృష్ణ..వందో సినిమాకు రెడీ అవుతున్నారు. దీనిపై భారీగానే హోమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రవేశానికి ముందువరకూ సీనియర్ హీరోల్లో 'లెజెండ్'. ఆపై ఎమ్మెల్యే కావడం.. తర్వాత ప్లాప్ భుజానికెత్తుకోవడం జరిగిపోయాయి. తిరిగి డిక్టేటర్‌తో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు వందో చిత్రం కనుక ప్రతిష్ఠాత్మకమే. దీనిపై పరిశ్రమ నుంచి వినిపిస్తున్న షికార్లు ఫుకార్లకు ఉగాది రోజున అమరావతిలో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు బాలయ్య. ముహూర్తం షాట్‌కి డేట్ ఫిక్స్ కాకున్నా, సబ్జెక్టుపై తనంతట తనుగా క్లారిటీ ఇచ్చేశాడు. తన తండ్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు కలగా మిగిలిపోయిన కథనే వందో సినిమాగా చేస్తున్నానని ప్రకటించాడు. అదే శాతవాహనుల కథ. గౌతమీపుత్ర శాతకర్ణి గాథ. క్రిష్ దర్శకుడేనన్నదీ క్లారిటీ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ మొదలైందని, తెలుగు జాతి మొత్తం తెలుసుకోదగ్గ కథ, భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి గాథనే తన పాత్రగా ఎంచుకున్నట్టు ప్రకటించాడు బాలయ్య. గొప్ప పాత్రతో వందో చిత్రాన్ని రూపొందించటం అదృష్టమంటూనే, తన సినిమాల్లో అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని హామీ ఇచ్చేశాడు. వందో చిత్రాన్ని ప్రకటిస్తూనే నర్మగర్భంగా బాలయ్య చేసిన ప్రకటన సంచలనానికీ దారితీసింది. ప్రస్తుతం పరిశ్రమలో తనకెవరూ పోటీలేరని, తన సినిమాలే తనకు పోటీ అని మరోసారి గట్టిగా ప్రకటించడాన్ని చూస్తుంటే, రాబోయే చిరు 150వ చిత్రానికి పోటీలాంటిదేనన్న అంతరార్థం అర్థమవుతోంది. తెలుగు భాష, సంస్కృతి ఉన్నతికి కృషిచేసిన గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, భారతదేశమే గాదు ప్రపంచమంతా గర్వపడేలా సినిమా రూపొందనుందని ప్రకటించి అంచనాలను పెంచేశాడు బాలకృష్ణ.

మొరాకోలో షూటింగ్...
బాలకృష్ణ వందో చిత్రానికి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూనే, ఖండఖండాలుగావున్న భారతాన్ని అఖండ భారతావనిగా చేసిన చక్రవర్తి శాతకర్ణి కథను డీల్ చేయడం 'కత్తి'మీద సామేనని దర్శకుడు క్రిష్ సైతం ప్రకటించాడు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథనంతో ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నం చేస్తుండటం గర్వంగా ఉందనీ చెబుతూ దర్శకుడు క్రిష్ సెగ పెంచాడు. అయితే, ఈ సినిమాతో బాలయ్య వారసుడు ఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వందో చిత్రాన్ని బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టే తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. సినిమా షూటింగ్‌ను మొరాకోలో మొదలుపెట్టాలని కూడా క్రిష్ తలపోస్తున్నాడన్నది ఇండస్ట్రీ టాక్. శాతవాహనుల కాలంనాటి కథ. పైగా శాతకర్ణి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కథ. ఆడియన్స్‌ను ఆనాటి కాలానికి తీసుకెళ్లాలంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. భారీ సెట్లు, బడ్జెట్లు, కాల్షీట్లు.. ఇలా చాలా కావాలి. అందుకే ఆనాటి చారిత్రక నేపథ్యానికి దగ్గరగా వుండే మొరాకో ప్రాంతాన్ని ఎంచుకోవచ్చని అంటున్నారు.

బాలయ్య సరికొత్త గెటప్..
యుద్ధానికి సంబంధించిన మైదానాలకు అనుకూల ప్రాంతమైన మొరాకోలోనే కీలక ఘట్టాలైన శాతకర్ణి పట్ట్భాషేకం, వార్ ఎపిసోడ్లు పూర్తి చేయాలన్న యోచనతో ఉన్నారు. శాతవాహన సామ్రాజ్యాధినేత శాతకర్ణి పాత్రలో బాలకృష్ణను సరికొత్తగా డిజైన్ చేసేందుకు యూనిట్ వర్కవుట్స్ చేస్తుంటే, వయసును అధిగమించి పాత్రలో ఒకింత స్లిమ్‌గా రాజసాన్ని ప్రదర్శించేందుకు బాలయ్య ఫిట్‌నెస్ వర్కవుట్స్ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. ఒకపక్క గుర్రపుస్వారీ, మరోపక్క డైలాగ్స్‌ను అచ్చతెనుగు మాండలికంలో గంభీరంగా పలికే అంశంపై దృష్టి పెట్టారన్న కథనాలు వినవస్తున్నాయి. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులపరంగా వందో చిత్రం ప్రత్యేకత సంతరించుకోవాలనే తలంపుతో బాలకృష్ణ సరసన నయనతార, రాజమాత పాత్రలో హేమమాలినిని తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ప్రాజెక్టుపై ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తున్న దర్శకుడు క్రిష్ చారిత్రక కథను సంచలనం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడన్నది ఇండస్ట్రీ టాక్.

చిలుకూరు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం...

హైదరాబాద్ : వీసాల దేవుడిగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇరోజు రాత్రి 9 గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. వారంరోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈమేరకు భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా చిలుకూరులో కొలువైన బాలాజీని తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు.

టీ.ఎస్ ఎస్సై పరీక్షలు రేపే....

హైదరాబాద్ : రేపు ఎస్సై ప్రిలిమనరీ రాత  పరీక్ష తెలంగాణ సర్కారు నిర్వహించనుంది. 539 పోస్టులకు గాను 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉ.10గంల నుండి మ.1గంట వరకూ ఈ పరీక్ష జరుగనుంది. సివిల్,ఏఆర్ ,పీటీవో,కమ్యూనికేషన్ ఎస్సై పోస్టులకు మ.12.30 నుండి సా.5.30 వరకూ పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 321 సెంటర్లు ఏర్పాటయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఐడీ కార్డులు తప్పని సరిగా తీసుకోవాలని అధికారులు ప్రకటించారు.

17:16 - April 16, 2016

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై టెన్ టివి సమరభేరీ మోగించింది. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు...తల్లిదండ్రుల ఆవేదన వెలుగులోకి తీసుకొచ్చేందుకు టెన్ టివి కృషి చేస్తోంది. సమస్యలపై ఎల్ బినగర్ లో ఉంటున్న ప్రజల అభిప్రాయాలను టెన్ టివి తెలుసుకొంది. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

https://youtu.be/hyYWN5vZNhk

 

3వ వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ ...

హైదరాబాద్ : ఐపీఎల్ 39 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు 3వ వికెట్ ను కోల్పోయింది. 13 పరుగులకే వార్నర్ ఔటయ్యాడు. ధావన్-6, హెన్రిక్స్ -6 పరుగులకు ఔటయ్యారు.

రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం : అల్లం నారాయణ..

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్ మృతి చెందారు.  రవీందర్ మృతికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. రవీందర్ కుటుంబానికి అండగా వుంటామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణా ఉద్యమంలో, టీ.జర్నలిస్టులను ఐక్యం చేయడంలో రవీందర్ కృషి మరుమలేనిదన్నారు.

జర్నలిస్టు దాసరి రవీందర్ బ్రెయిన్ డెడ్....

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. రవీందర్ కు ఆరోగ్య పరిస్థితి విషయంగా వుందన్న సమాచారంతో ఈరోజు జరగాల్సిన మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

18.5 టన్నుల డ్రగ్స్ పట్టివేత..

మహారాష్ట్ర : థానే లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 18.5 టన్నుల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2వేల కోట్ల ఉంటుందని అంచనా. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

ద్వారకా మురికివాడలో భారీ అగ్నిప్రమాదం...

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా మురికి వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. బాధితులంతా నిరుపేదలే కావటంతో ఆస్తినష్టం తక్కువగానే వున్నా ఈ ఘటనతో వారంతా నిలువ నీడ కోల్పోయారు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో బాంబుల కలకలం...

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో హింస చెలరేగుతోంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన వాహనంలో నాలుగు బాంబులు కనిపించడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఎన్నికల అధికారులను తరలించే వాహనంలో డ్రైయివర్ సీటు క్రింద వున్న పాలిథిన్ కవర్ ను డ్రైవర్ గమనించాడు. డ్రైయివర్ అందించిన సమాచారంతో బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పాలిథిన్ కవర్ లో నాలుగు బాంబులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనతో ఎన్నికల వాహనాల తరలింపుకు డ్రైవర్లు భయపడుతున్నారు. తమకు తగినంత భద్రత కల్పించాలని లేకపోతే ముందుకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

టీ. సర్కారుపై డీకే అరుణ 'ఫైర్' అయ్యారు....

హైదరాబాద్ : టీ. సర్కారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని డీకే అరుణ విమర్శించారు. పాలమూరు పాజెక్టు విషయంలో సీఎం బినామీల పేరుతో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

గనిలో ప్రమాదంలో మృతదేహాలు వెలికితీత..

ఆదిలాబాద్ : జిల్లాలోని బెల్లంపల్లి శాంతిఖని బొగ్గు గనిలో ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. గత రెండురోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తోన్న సిబ్బంది ఇవాళ గని శిథిలాల నుంచి మరో ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మృతులను పోచయ్య, కిష్టయ్యగా గుర్తించారు. దీంతో బాధితుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

డాక్టర్‌ శాంతకు యల్లాప్రగడ అవార్డు....

నెల్లూరు : ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు, పద్మవిభూషణ్‌ గ్రహీత డాక్టర్‌ శాంతకు డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు అవార్డును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రధానం చేశారు. వైద్య రంగంలో డాక్టర్‌ శాంత చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు.

ఆందోళన విరమించిన బ్రాండిక్స్ కార్మికులు...

విశాఖ : బ్రాండిక్స్‌ సెజ్‌ వద్ద ఎట్టకేలకు మహిళా కార్మికులు ఆందోళన విరమించారు. ఈనెల 30న మరోసారి సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చిద్దామని యాజమాన్యం ప్రకటించడంతో గురువారం నుండి ఆందోళన చేస్తున్న దాదాపు 3 వేల మంది మహిళా కార్మికులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. పీఎఫ్ విషయంలో సంస్థ మోసం చేస్తుందని ఆరోపిస్తూ బ్రాండిక్స్ సంస్థ ఎదుట మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..

హైదరాబాద్ : నేడు ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో హైదరాబాద్ వెడ్స్ కోల్ కతా మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు.

సీపీ కార్యాలయం వద్ద వ్యక్తి దారుణ హత్య...

విజయవాడ : సీపీ కార్యాలయం సమీపంలో దారుణ హత్య జరిగింది. బండరాళ్లతో మోది గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

15:40 - April 16, 2016

మన పక్కింటి అబ్బాయిలా అనిపించే ఓ గోదావరి కుర్రోడు ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ హీరోగా చక్రం తిప్పుతున్నాడు. ఎవరి అండదండలు లేకుండా కేవలం టాలెంట్‌తో నెగ్గుకొస్తున్న ఈ స్టార్ ఇప్పుడు దర్శకనిర్మాతలందరికి మోస్ట్ వాంటెడ్ హీరో. అతడే రాజ్ తరుణ్. హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. లేటెస్ట్ ఈ ఈడో రకం.. ఆడో రకం హిట్‌ తో రేసులో సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంగా రాత్రి 7 గంటలకు టెన్‌ టీవీలో రాజ్‌ తరుణ్‌తో లైవ్ షో కార్యక్రమం జరగనుంది. రాజ్‌ తరుణ్‌తో మీరు మాట్లాడాలంటే 040-27609888, 040-27608999 కాల్ చేయవచ్చు.

15:39 - April 16, 2016

వరంగల్ : ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ఓ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. వరంగల్ జిల్లా వర్ధన్న పేట మండల గుబ్బడి తండాకు చెందిన మోతీలాల్‌, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి,పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించాడు. పెళ్లి చేసుకోమని అమ్మాయి అడిగినందుకు, తనకెలాంటి సంబంధంలేదని తెగేసి చెప్పాడు. తన కుమార్తె విషయంలో గ్రామపెద్దలు , పోలీసులను కలిసిన ఆమె తండ్రిని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని అమ్మాయి తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న చంద్రబాబు...

ప్రకాశం : కాసేపట్లో దోర్నాలకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో బాబు సమీక్షించనున్నారు.

15:34 - April 16, 2016

హైదరాబాద్ : తీవ్రదుర్భిక్షంతో తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఓవైపు తాగునీటికి అల్లాడుతుంటే....ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఏడు మ్యాచ్ ల కోసం లక్షలాది లీటర్ల నీరు సిద్ధంగా ఉంది. ఒక్కో మ్యాచ్ కోసం స్టేడియంలోని అవుట్ ఫీల్డ్, పిచ్ ను సిద్ధం చేయటానికి మూడులక్షల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఐపీఎల్ షో కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం నీటినిల్వల పై ప్రత్యేక కథనం..వందల కోట్ల రూపాయల వ్యాపారంలా సాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అంటే కేవలం సిక్సర్లు, బౌండ్రీలు, పరుగులు మాత్రమే కాదు....అమూల్యమైన లక్షలాదిలీటర్ల నీరు కూడా. ఐపీఎల్ కూ...నీటికీ సంబంధం ఏమిటబ్బా అంటూ ఆశ్చర్యపోకండి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటే..పచ్చికపరచిన తివాచీలాంటి అవుట్ ఫీల్డ్..పచ్చిక ఏపుగా పెరిగిన పిచ్ కమ్ వికెట్ సైతం ఉండితీరాలి. 

లక్షలాది లీటర్లు...
మ్యాచ్ కోసం అవుట్ ఫీల్డ్ తో పాటు పిచ్ ను సైతం సిద్ధం చేయాలంటే లక్షలాది లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అదే నీటికి కటకటలాడే వేసవికాలంలో అయితే మరింత ఎక్కువ అందుబాటులో ఉండితీరాలి. గత మూడేళ్లుగా తగిన వర్షాలు పడకపోడంతో..మహారాష్ట్ర...దాని పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం సైతం తీవ్రదుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కనీసం తాగునీరు అందుబాటులో లేక రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో...ఐపీఎల్ మ్యాచ్ ల కోసం లక్షలాదిలీటర్ల నీటిని వినియోగించడం, క్రికెట్ పేరుతో ప్రాణాధారమైన మంచినీటిని దుర్వినియోగం చేయడం ఎంత వరకూ న్యాయమంటూ...బాంబే హైకోర్టులో ఇటీవలే ఓ ప్రజాప్రయోజన వాజ్యం నమోదు కావడం, ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలోని నాగపూర్, పూణే, ముంబై నగరాలలో జరగాల్సిన మొత్తం 13 ఐపీఎల్ మ్యాచ్ లను వేరే చోట నిర్వహించాలంటూ హైకోర్టు ప్రకటించడం జరిగిపోయాయి.

నెలకు 2 లక్షల లీటర్లు..
అయితే...హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 16 నుంచి మే 12 వరకూ జరిగే ఏడు ఐపీఎల్ మ్యాచ్ లకు...సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆతిథ్యమిస్తోంది. రాష్ట్రంలో మాత్రమే కాదు...హైదరాబాద్ నగరం సైతం నీటికొరతతో అల్లాడిపోతున్నా...లక్షలాది లీటర్ల నీటినిల్వలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఐపీఎల్ మ్యాచ్ ల కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్, పిచ్ ల కోసం...నెలకు 2 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. నీటిని నిలువ చేసుకోడం కోసం..రాజీవ్ స్టేడియంలో రెండులక్షల లీటర్ల సామర్థ్యం కల రెండు భారీ నీటిసంప్ లను ఏర్పాటు చేశారు. ఈ నీటిని హైదరాబాద్ జలమండలి అందిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి తాము నెలకు రెండువందల కిలో లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు మెట్రోవాటర్ వర్క్స్ కు చెందిన జలమండలి విభాగం ప్రతినిధి చెబుతున్నారు. వెయ్యి లీటర్లను ఓ కిలోలీటర్ గా పరిగణిస్తారు.అంటే నెలకు 2 లక్షల లీటర్లను హెచ్ సీఏ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.

మంచినీరు ఉపయోగించడం లేదంటున్న అయూబ్..
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి సొంతంగా రెండు బోర్‌ వెల్స్ తో పాటు..వాటర్ కనెక్షన్ కూడా ఉందని...హెచ్ సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తెలిపారు. అయితే...తాము మంచినీటిని వినియోగించడం లేదంటూ ఓవైపు అయూబ్ అంటుంటే...ట్యాంకర్లతో తాము నీటిని అందిస్తూ వస్తున్నట్లు జలమండలి ప్రతినిధి మరోవైపు చెబుతున్నారు. ఏది ఏమైనా...రాష్ట్రంలోని సామాన్యజనం ఓవైపు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతుంటే...ఐపీఎల్ మ్యాచ్ లకు, బీరుతయారీ కంపెనీలకు జలమండలి లక్షలాది లీటర్లు నీరు సరఫరా చేయటం ఎంత వరకూ న్యాయమని పలు స్వచ్చంధ సంస్థలు, సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కరువు కాటకాలను, నీటి సమస్యను ఎదుర్కొనడంతో పాటు పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత...దుర్భిక్షం పేరుతో క్రికెట్ మ్యాచ్ లను రద్దు చేసుకొంటూ, వేరేచోట నిర్వహించుకోవాలంటూ ఆదేశించడం ఎంతవరకూ న్యాయమని భారత మాజీ క్రికెట్ గ్రేట్లు సునీల్ గవాస్కర్, వీవీఎఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్‌ సైతం ప్రశ్నిస్తున్నారు.

15:29 - April 16, 2016

హైదరాబాద్ : ప్రైవేటురంగంతో పాటు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ వీహెచ్ హైదరాబాద్‌ ఇందిరాపార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే బలహీన వర్గాలకు న్యాయం జరగదని ఆయన అంటున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే లాభం కలుగుతుందన్నారు. రిజర్వేషన్లు లేకపోతే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతుందని, న్యాయవ్యవస్థల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వీహెచ్ లేఖ రాశారని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను మనోభావాలను పెంచే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందుతోందని, దీనిపై రివ్యూ చేయాలని సూచించారు. 

టీ.ఎస్ లో టీడీపీ కరువు యాత్ర...

హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను టీఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు సమస్యలపై 10 బృందాలతో కరవు యాత్రలు చేస్తామని తెలిపారు. కేంద్ర నిధులు మంజూరు చేసినా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేని ఎద్దేవా చేశారు.

మాల్దాలో నాలుగు క్రూడ్ బాంబులు స్వాధీనం..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలోని సెంట్రల్ స్కూల్ లో నాలుగు క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు. 

15:09 - April 16, 2016

ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనుమళ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన నీరు - చెట్టు పనులను ప్రారంభించారు. అనంతరం పంట సంజీవని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కరవు ఉందని, సమస్యలు చాలా ఉన్నాయని అందుకే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. గతంలో తాను శంకుస్థాపన చేయడం జరిగిందని, కానీ పనులు చేయలేదన్నారు. పట్టిసీమతో గోదావరి, కృష్ణా జలాలు అనుసంధానించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అడుగంటిపోతున్న భూగర్భ జలాల విషయంలో ప్రజలు ఆలోచించాలని బాబు సూచించారు. 

కుప్వారాలో పర్యటించనున్న సీఎం ముఫ్తీ...

హైదరాబాద్ : కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పర్యటించనున్నారు. నిరసనలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఓ బాలిక‌పై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాయ‌ని ఆరోపిస్తూ శ్రీ‌న‌గ‌ర్‌లో కొంద‌రు చేస్తోన్న ఆందోళ‌న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీయడం, వారిపై జ‌రిపిన‌ కాల్పుల్లో ఐదుగురు మరణించడం తెలిసిందే. భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని ప‌లు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్ నెట్ సర్వీసులను సైతం నిలిపేసిన సంగ‌తి తెలిసిందే.

ప్రముఖ కవి శేషం రామానుజార్యులు మృతి...

హైదరాబాద్ : ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు మృతి చెందారు. ప్రముఖ కవులు, కళాకారులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, యాదగిరీశుని ఉత్సవాల్లో శేషం రామానుజాచార్యులు చేసిన వ్యాఖ్యానాలు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. చింతరామృతం, చైతన్య రేఖలు, సమాలోచన, రంగనాథ వైభవం మొదలైన రచనలు ఆయన చేశారు.

వడదెబ్బకు మహిళ మృతి...

శ్రీకాకుళం : కవిటి మండలం దోగానపుట్టుగలో వడగాల్పులకు ఓ మహిళ మృతి చెందింది. కాగా తెలుగు రాష్ట్రాలలో ఎండల తాకిడికి ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచనలిస్తూనే వుంది.  తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన అవుసరం వుండటంతో ప్రజలు ఈ వడదెబ్బకు గురయ్యి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలలోనూ దాదాపు 150 మంది వరకూ ఈ వడదెబ్బకు మృతి చెందిన విషయం తెలిసిందే.

14:33 - April 16, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు .. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తును ముమ్మరం చేశారా..? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈసారి క్యాబినెట్‌ రూపకల్పనలో తనదైన మార్కును వేయనున్నారని.. 2019 ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే రీతిలో మంత్రివర్గం ఉంటుందని అంటున్నారు. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తీసుకుంటారే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. తనకు ఎలాంటి సమాచారం అందలేదని, బయట అనుకుంటున్నారని తెలిపారు. 20 మంది మంత్రులున్నాయని, మరో ఆరుగురికి అవకాశం దక్కుతుందన్నారు. సమర్థవంతమైన పాలన చేయాలని భావించి సీఎం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. తన పేరు ఉందని ప్రచారం జరుగుతోందని, కానీ తనకు తెలియదన్నారు. 

14:30 - April 16, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులు..చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. దీనితో పలువురు ఆశావాహులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యకు మరో ఆరుగురు సభ్యులను తీసుకోనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరు బీజేపీ సభ్యులున్నారు. నాలుగు స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉంది. కొంతమంది మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు, వారి వ్యవహార శైలి వల్ల ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుందని బాబు భావిస్తున్నారు. వైజాగ్ కు చెందిన ఓ మంత్రి వివాదాస్పదమౌతున్నారని సమాచారం. ఓ సినిమా ఫంక్షన్ ను దగ్గరుండి నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. మరొక మంత్రి కుటుంబ వ్యవహారాలు పీఎస్ కు చేరడం..తదితర కారణాల వల్ల మంత్రులపై కొంత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. వీరిని పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొంతమంది సీనియర్లు మంత్రివర్గంలో చోటు దక్కేందుకు పోటీ పడుతున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు, పార్థసారధి సీనియర్లు పోటీల్లో ఉంటున్నారు. కళా వెంకట్రావు పని పట్ల బాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైజాగ్ కు చెందిన బండారు సత్యనారాయణమూర్తి, ఈస్ట్ గోదావరి నుండి గోరంట బుచ్చయ్య చౌదరి కూడా రేసులో ఉన్నారు. మరి ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారో వేచి చూడాలి. 

14:26 - April 16, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు .. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తును ముమ్మరం చేశారా..? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈసారి క్యాబినెట్‌ రూపకల్పనలో తనదైన మార్కును వేయనున్నారని.. 2019 ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే రీతిలో మంత్రివర్గం ఉంటుందని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వార్తలతో.. కొందరు సచివుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. ఎవరికి పదవీ గండం పొంచి ఉందోనన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఏపీ మంత్రివర్గం కొత్త కూర్పు ఎలా ఉండబోతోంది..? కొత్తగా ఎవరిని పదవులు వరిస్తాయి..? మాజీలయ్యేది ఎవరు..? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. .. మంత్రి మండలిని త్వరలోనే పునర్వ్యస్థీకరించాలని భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కసరత్తును ఆయన ఇప్పటికే మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. తాను ఎంతగా కష్టపడినా మంత్రివర్గ సహచరుల నుంచి సరైన సహకారం అందడం లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం. పదేపదే హెచ్చరిస్తున్నా పనితీరు మార్చుకోని వారిని మార్చాలన్నది చంద్రబాబు భావనగా చెబుతున్నారు. సమర్థ పాలనకు సమర్థులనే సచివులుగా ఎంచుకోవాలని చంద్రబాబు డిసైడైనట్లు సమాచారం.

కళా వెంకట్రావు...
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై జూన్‌ నాటికి రెండేళ్లు పూర్తవుతున్న దృష్ట్యా.. పార్టీ ఆనవాయితీ ప్రకారమే క్యాబినెట్‌ను విస్తరించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పునర్వ్యవస్థీకరణలో స్ట్రాంగ్‌ వాయిస్‌ కలిగిన వారికే ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లో భోగట్టా. 2019 ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న వారికే అవకాశం ఇచ్చే వీలుందనీ టీడీపీ శ్రేణుల టాక్‌. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఆరు ఖాళీలున్నాయి. ఆశావహుల సంఖ్యకు మాత్రం లెక్కే లేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావెంకట్రావు.. ఈసారి విస్తరణలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని వీరికి బంధువు కావడం.. ఇరు కుటుంబాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు.. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కళావెంకటరావు సైలెంట్‌గా ఉండిపోయారు. ఫలితంగా ఆయనకు పార్టీ ఏపీ శాఖ అధ్యక్ష పదవి దక్కింది. అయితే వెంకట్రావు మాత్రం మంత్రిపదవినే కోరుకుంటున్నారు. లోకేశ్‌తో సాన్నిహిత్యం.. ఆయనకీసారి కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరో సీనియర్‌ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు.

విజయనగరం...
ఇక విజయనగరం జిల్లాలో పతివాడ నారాయణస్వామి, కె.ఎ.నాయుడులు కూడా మంత్రిపదవులు ఆశిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని బండారు సత్యనారాయణమూర్తి కోరుతున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో ప్రాచుర్యం పొందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు బెర్త్‌ కన్ఫమ్‌ అన్న ధీమాలో అనిత ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దళిత నేత హోదాలో గొల్లపల్లి సూర్యారావు, కాపు కోటాలో తోట త్రిమూర్తులు మంత్రిపదవులను ఆశిస్తున్నారు. తాజాగా పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ కూడా రేసులో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కలవపూడి శివ.. క్షత్రియవర్గానికి ఈసారైనా ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతున్నారు.

ఆశలో కాగిత వెంకట్రావు...
కీలకమైన రాజధాని ప్రాంతానికి వస్తే... ప్రస్తుత కేబినెట్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఐదుగురు మంత్రులున్నారు. కృష్ణా జిల్లా నుంచి.. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈయనకు పెద్దగా పోటీ లేదు. ఇక గుంటూరు నుంచి మాత్రం మంత్రిపదవి కోసం పోటీ గట్టిగానే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర ఈసారి తనకు ఛాన్స్‌ తథ్యమన్న భావనతో ఉన్నారు. 2004లో జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడం.. కష్టకాలంలో వైఎస్‌పై పోరాటం తనకు కలిసొచ్చే అవకాశంగా నరేంద్ర భావిస్తున్నారు. కోడెల శివప్రసాదరావు కూడా మంత్రివర్గంలోకి వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు.. జివి అంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రావణ్ కుమార్ లూ మంత్రిపదవులు అశిస్తున్నారు. రాజధాని ప్రాంతం కాబట్టి సమీకరణలను పక్కనబెట్టి తమకు అదనంగా మరో మంత్రి పదవిని ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మంత్రిపదవులు ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్‌, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మంత్రిపదవులు ఆశిస్తున్నారు. తనతోపాటు పార్టీ జిల్లాల అధ్యక్షులుగా పనిచేసిన దేవినేని ఉమ, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావులకు మంత్రిపదవులు దక్కాయని.. అదే క్రమంలో తనకూ పదవి రావాలని దామరచర్ల జనార్దన్‌ కోరుకుంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక్కరే రేసులో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్‌పై పోరాటం.. సామాజిక వర్గం తనకు అవకాశం కల్పిస్తాయని సోమిరెడ్డి ఆశాభావంతో ఉన్నారు.

చిత్తూరు...
ఇక రాయలసీమ విషయానికి వస్తే.. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి.. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయడు, బీసీ కొటాలొ తంబళ్ళపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తనకు మంత్రి పదవి వస్తే జిల్లాలో పార్టీ క్యాడర్‌కు న్యాయం జరుగుతుందని.. తద్వారా జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందన్నది ముద్దుకృష్ణమ వాదన. ఇక అనంతపురం జిల్లాలో.. పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌లు విస్తరణలో తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శంకర్‌యాదవ్‌, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి ఇద్దరూ బీసీ కార్డులపై ఆశలు పెట్టుకున్నారు.

కర్నూలు..కడపలపై భారీ కసరత్తు..
తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న కర్నూలు, కడప జిల్లాలపై చంద్రబాబు భారీ కసరత్తునే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే టీడీపీలోకి చేరిన కర్నూలు జిల్లా నేత భూమా నాగిరెడ్డికి విస్తరణలో మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. విపక్ష వైసీపీ అధినేత సొంత జిల్లా కడపలో.. టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంత్రిపదవిని ఆశిస్తున్నారు. అయితే మైనారిటీలకు అవకాశం కల్పించాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో.. ఇటీవలే వైసీపీని వీడి సైకిలెక్కిన జలీల్‌ ఖాన్‌కు అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ కోటాలో పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కూడా మంత్రిపదవులు ఆశిస్తున్నారు.

కేబినెట్ లోకేష్...
ఇదంతా ఒక ఎత్తయితే.. లోకేశ్‌కు క్యాబినెట్‌లో చోటు కల్పించే అంశంపై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తే.. చినబాబు భవిష్యత్తు బాగుంటుందని పలువురు సీనియర్‌లు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు యూపీఏ అధికారంలోకి వచ్చినా.. రాహుల్‌ మంత్రి పదవి చేపట్టక పోవడం వల్ల.. ఆయన రాజకీయాల్లో అపరిపక్వ నేతగా ముద్ర వేసుకున్నారని వీరు ఉదహరిస్తున్నారు. అయితే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఎంపిక చేయించడం కన్నా.. ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిమండలిలో అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆచితూచి వ్యవహరించే చంద్రబాబు ఇప్పటికిప్పుడు తనయుడిని మంత్రిని చేసేస్తారా..? లేక మరింత జాప్యం చేస్తారా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.
ఈసారి మంత్రివర్గాన్ని 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉంటుందన్నది సుస్పష్టం. ఉగాది అవగానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని భావించినా.. ప్రస్తుతం ఈ ప్రక్రియ జూన్‌ నెలకు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

14:14 - April 16, 2016

రాముడు ఓ ఐకాన్. ఓ భర్తగా రాముడ్ని చూసి నేర్చుకోమంటారు, తమ్ముళ్లకి అన్నగా ఎలా ఉండాలో, రాజుగా ప్రజల్ని ఎలా పాలించాలో చిన్నతనం నుంచే కథలు కథలుగా చెబుతారు. ఇంత గొప్ప చరిత్ర పై మన తెలుగువాళ్లు ఎన్నో మంచి సినిమాలు తీశారు. సి.పుల్లయ్య నుంచి బాపు వరకు రాముణ్ణి తెరపై ఆవిష్కరించారు. మరి సకలగుణాభిరాముడిని తెరపై చూపించాలంటే ఆ నటులకు ఎంత టాలెంట్ ఉండాలో కదా..

రామారావు..
తెలుగు వారికి రాముడంటే రామారావే. అంతలా ఆడియన్స్ ని నమ్మించారు. ఇందులో ఆయన తప్పేం లేదు. ఆయన ముగ్థమనోహర రూపం, నటన.. ప్రేక్షకులకు రాముడంటే ఇలాగే ఉంటాడు అనిపించేటట్లు సమ్మోహన పరిచారు ఎన్టీఆర్. ఆయన తొలిసారి చరణదాసి అనే చిత్రంలో రాముడి గేటప్ వేశారు. ఆ తర్వాత 1963లో విడుదలైన లవకుశ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన నటనకు ముగ్ధులైన నాటి జనం సినిమా చూడటం కోసం ధియేటర్లకు ఎగబడి వెళ్లారట. ఇప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. లవకుశతో పాటు శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాల్లో ఆయన రామావతారంలో అదరగొట్టారు. నాటికి నేటికి ఏనాటికి తెలుగువారి దృష్టిలో శ్రీరాముడి గెటప్‌కి బ్రాండ్ అంబాసిడర్ నందమూరి తారకరామారావు అనడంలో డౌటేలేదు. 

హరనాథ్..శోభన్ బాబు..
శ్రీరాముడంటే అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారు అని జనం అన్నగారికి నీరాజనాలు పడుతున్న టైమ్ లో శ్రీరాముడి వేషం వెయ్యాలంటే ఎంత డేర్ కావాలి. మరి అలాంటి ఎన్టీ‌ఆర్‌కు సైతం పోటీ ఇచ్చిన నటుడు హరనాథ్. స్వయంగా ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన తొలి సినిమా సీతారామకళ్యాణంలో శ్రీరాముడి పాత్ర పోషించారు హరనాథ్. ఫ్యామిలీ హీరోగా స్టార్ ఇమేజ్‌లో ఉన్న ఆంధ్రా సోగ్గాడు శోభన్‌బాబు. వరుసగా కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాను కూడా శ్రీరాముడి గెటప్‌కి సెట్ అవుతానని ప్రూవ్ చేశారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్రలో ఒదిగిపోయాడు. రామయ తండ్రీ..ఓ రామయ తండ్రి అంటూ తెలుగు ప్రేక్షకుల్ని భక్తిరసంలో ఓలలాడించారు. నిజానికి శోభన్ బాబు వాయిస్ లో బేస్ గానీ.. ఆయన యాక్టింగ్ స్టైల్ గానీ పౌరాణిక పాత్రలకు పెద్దగా సూట్ కావు. అయినా..రాముడి లాంటి సౌమ్యమైన పాత్రను పోషించి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. తనుకూడా పౌరాణిక పాత్రలకు సూట్ అవుతానని ప్రూవ్ చేశాడు.

కృష్ణ..
ఫ్యామిలీ హీరోలు, టాప్ హీరోలు కూడా రాముడి క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. అయితే రాముడిగా తారకరాముడ్ని మాత్రం మరిపించలేకపోయారు. ఇప్పటివరకూ ఈ పాత్రలు చేసిన హీరోలే కాకుండా..సామాన్య ప్రేక్షకుడు ఊహించని హీరోలు కూడా రాముడి పాత్రల్లో మెప్పించారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ రేంజ్ లో ఫామ్ లో ఉన్న టైమ్ లోనే సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి గెటప్ వేశాడు. కృష్ణ సినీ జీవితంలోనే మైల్ స్టోన్‌గా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు సినిమా క్లైమాక్స్‌లో కొద్దిసేపు రాముడిలా కనిపించి అభిమానులను అలరించాడు సూపర్ స్టార్.

రవికుమార్...
ఈ మహామహులైన అగ్రహీరలే కాదు.. పెద్దగా సినిమాలు చెయ్యని రవికుమార్ కూడా రాముని క్యారెక్టర్ లో అలరించాడు. సీతాకళ్యాణం సినిమాలో జయప్రదకు జంటగా రాముని పాత్రలో రవికుమార్ నటన అందరినీ ఆకట్టుకుంది. పెద్దగా ఎక్స్ ప్రెసివ్ కాకపోయినా..ఆ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించాడు రవికుమార్.

సుమన్...
హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ చేస్తూ ఫేడ్అవుట్ అవుతున్న టైంలో సుమన్‌ని మళ్లీ జనంలో ఉంచాడు శ్రీరాముడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా శ్రీరామదాసు. ఈ సినిమాలో శ్రీరాముడిగా సుమన్ అద్భుతమైన నటనను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పౌరాణిక క్యారెక్టర్లకు తాను ప్రత్యామ్నాయం అని నిరూపించారు.

శ్రీకాంత్..
సినిమాల్లో ఫుల్ లెన్త్ రాముడి క్యారెక్టర్ కాకపోయినా.. అప్పుడప్పుడు సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రాముడిగా కూడా కనిపించారు మన హీరోలు. దేవుళ్లు సినిమాలో హీరో శ్రీకాంత్ ఇలా ఒక పాటలో కనిపించి రాముడి క్యారెక్టర్ లో మెరిశాడు.

బాలయ్య...
తండ్రి బాటలో వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్నదే తన కోరిక అంటూ తరచూ చెప్పే బాలకృష్ణ చాలాసార్లు అలాంటి పాత్రలు పోషించారు. కాని రాముడు పాత్ర అనేసరికి ఎలా పండిస్తారో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో రాముడి గెటప్‌ని అత్యద్భుతంగా పోషించి తాను తండ్రిని మించిన తనయుడిని అని ప్రూవ్ చేశారు బాలయ్య. ఆనాడు ఎన్టీఆర్ చేసిన లవకుశ సినిమాను శ్రీరామరాజ్యంగా రీమేక్ చేసి మంచి ఇమేజ్ ను సంపాదిచాడు బాలయ్య బాబు. మాస్ కమర్షియల్ సినిమాలతో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పిన బాలకృష్ణ రాముడి అవతారంలో సెటిల్డ్ గా ఎక్స్ ప్రెషన్స్ పలికించి అభిమానులను ఆకట్టుకున్నాడు. అందుకే ఈ సినిమా కూడా అభిమానుల మన్ననలు సంపాదించుకుంది.

జూనియర్..
తెలుగు నాట మహామహులే మేం చేయలేం బాబోయ్ అన్న శ్రీరాముడి పాత్రను అతి చిన్న వయసులోనే చేసి ఔరా అనిపించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో జూనియర్ బాల రాముడిగా ఆదరగొట్టారు. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. తాతకు తగ్గ మనవడు అంటూ జూనియర్‌ని అందరూ పొగిడేశారు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈ నాటి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరకూ వెండితెర మీద రాముడి క్యారెక్టర్ లో తమ యాక్టింగ్ తో అభిమానులను అలరించిన వారే. అయితే..ఎంతమంది నటించినా... ఇప్పటికీ రాముడిగా ఎన్టీఆర్ స్థానాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయారని అభిమానుల అభిప్రాయం.

భారీ స్థాయిలో మత్తుపదార్ధాలు స్వాధీనం...

ఢిల్లీ : డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అరెస్టు చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జాంబియా దేశీయుడైన మెందా పాల్‌ అనే వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అరెస్ట్ చేశారు. మెందాపాల్ పై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకుని విచారించగా... అతని వద్ద వున్న క్రికెట్‌ కిట్‌లో వున్న 35 కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని మాదకద్రవ్యాల వ్యతిరేక శాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.1.4కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జపాన్ కు సునామీ ప్రమాదం : అమెరికా జియలాజికల్ సర్వే

ఢిల్లీ : జపాన్ దేశాన్ని వరుస భూకంగా వణికిస్తున్నాయి. అమెరికా జియలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలను జారీ చేసింది. హైదరాబాద్ : జపాన్‌ వాసులు భూ ప్రకంపనలతో వణికిపోతున్నారు. దక్షిణ జపాన్‌లోని కుమమోటోలో వరుసగా రెండోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది.భూకంపం ధాటికి ఏడుగురు మృతిచెందగా, దాదాపు 400 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

13:26 - April 16, 2016

హైదరాబాద్ :జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గురువారం దక్షిణ జపాన్‌లో క్యుషు ద్వీపంలో మొదలైన ఈ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జపాన్‌లో తాజాగా..భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో సునామి హెచ్చరికల్ని అమెరికా జియాలజికల్ సర్వే జారీచేసింది. మరోవైపు భూకంప ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 400 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప ధాటికి కుప్పకూలిన భవనంలో 66 మంది స్థానికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. జపాన్‌ ప్రధాని షింజో అబే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూకంప ప్రభావంతో విద్యుత్,నీరు వంటి నిత్యవసరాలు లేకుండా 2లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

తూ.గోదావరి వైసీపీ అధ్యక్షుడిగా కురసాల....

తూ.గోదావరి : జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబుని,జెడ్పీలో ఫ్లోర్ లీడర్ గా ప్రసన్నకుమార్ ను జగన్ నియమించారు. కాగా గతంలో జిల్లా అధ్యక్షుడిగా వున్న జక్కంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ మారిన సంగతి తెలిసిందే.

10 సంవత్సరాలలో లేని ఉష్ణోగ్రతలు : ఐఎండీ

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇరు రాష్ట్రాలలో ఎండల తీవ్రత కొనసాగే అవకాశమున్నట్లు ఐఎంబీ పేర్కొంది. గత పదేళ్ళలో నమోదు కాని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. తుపాను, అల్పపీడనం ఏర్పడని పక్షంలో మే నెలాఖరు వరకూ వడగాలు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ పొడి వాతావరణ శాఖ అధికారి నర్శింహరావు తెలిపారు. కాగా సాధ్యమైనంతవరకూ ఎండలోకి రాకుండా వుండటానికి ప్రయత్నించాలని ఐఎండీ సూచించింది. 

13:21 - April 16, 2016

కడప : జిల్లాలోని కొత్తవడ్డె సమీపంలోని రోడ్లచెరెవు అటవీ ప్రాంతంలో రెడ్డయ్య అనే రైతుపై చిరుతపులి దాడి చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న రెడ్డయ్య పులి గ్రామంలోకి వచ్చిందని విని, దాన్ని చూడటానికి వెళ్లాడు. తమవైపే పులివస్తోందని తెలిసి స్థానికులు పరుగులు తీశారు. ఇతను కూడా పరుగెత్తడానికి ప్రయత్నించి , పొరపాటున కాలుజారి కిందపడ్డాడు. దగ్గరలోనే ఉన్న పులి రెడ్డయ్యమీద దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో,అక్కడి నుంచి అటవీప్రాంతంలోకి పారిపోయింది. 

13:18 - April 16, 2016

విజయవాడ :నకిలీనోట్లు చలామణి చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా నకిలీనోట్లను సరఫరా చేస్తున్న 13 మందిని ఆరెస్ట్ చేసారు. వీరి నుంచి 8 లక్షల నకిలీనోట్లు, 50 వేల నగదు, 16 సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఏపీలో నకిలీ నోట్లు చలామణి చేస్తోంది. నకిలీ నోట్ల చలామణిలో శేషుబాబు అనే మాజీ రైల్వే ఉద్యోగి కీలకపాత్ర వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

13:17 - April 16, 2016

విశాఖ : నగరంలో డ్రైనేజీ క్లీన్‌ చేస్తూ అప్పలకొండా మృతికి కారణమైన కాంట్రాక్టర్‌, హెచ్‌ఎస్‌బీసీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. మృతిని కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహరం చెల్లించి కుటుబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో యూజీడీ అండర్ గ్రౌండ్‌ క్లీనింగ్‌ చేస్తున్న ముగ్గురు కార్మికులు..విషవాయువులు వల్ల మృతి చెందారని కానీ వారికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. 

13:12 - April 16, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకశాముందని ఐఎండీ ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఉప్ణ్రోగ్రత నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. మరోవారం రోజులు పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారి నర్సింహరావు తెలిపారు. తుఫాను,అల్పపీడనం ఏర్పడకపోతే మే నెలాఖరు వరకు ఇలాగే ఎండలు కొనసాగుతాయని ఆయన అన్నారు. పొడి వాతావరణం కారణంగా గత పదేళ్లలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు.

ఇందిరాపార్క్ వద్ద ఎంపీ వీహెచ్ దీక్ష...

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద ఎంపీ వీహెచ్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ప్రయివేటు సెక్టార్ , న్యాయవ్యవస్థలలో ఒబీసీ,ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పీసీసీ చీఫ్ ఉత్తమ్,జానారెడ్డి, ఆనంద్ భాస్కర్ మద్ధతు తెలిపారు.

మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవం వాయిదా..

హైదరాబాద్ : ఈరోజు జరగాల్సిన మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీనియర్ జర్నలిస్టు రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.

13:07 - April 16, 2016

హైదరాబాద్ : మరోవారం రోజులు పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారి నర్సింహరావు తెలిపారు. తుఫాను,అల్పపీడనం ఏర్పడకపోతే మే నెలాఖరు వరకు ఇలాగే ఎండలు కొనసాగుతాయని ఆయన అన్నారు. పొడి వాతావరణం కారణంగా గత పదేళ్లలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఎండ తీవ్రతను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నగరంలో 70 శాతం రోడ్డు ప్రమాదాలు : ట్రాఫిక్ డీసీపీ చౌహాన్

హైదరాబాద్ : నగరంలో 70 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ లో కేంద్రమంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ పట్టుబడ్డారనీ...రూ.1000 జరిమానా విధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. 

భారీగా ఎర్రచందనం పట్టివేత...

కడప : రాజంపేట రైల్వే కోడూరు సమీపంలో 2.52 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ తనిఖీలలో 10 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 4 కార్లు, 4 బైక్ లు, ఓ ట్రక్కు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

టీ.కాంగ్ పై సమీక్షించాలని అధిష్టానానికి వీహెచ్ లేఖ...

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై అధిష్టానానికి రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు లేఖ రాశారు. పార్టీ మారుతున్న నేతలు, పార్టీ బలోపేతం చేయటానికి ప్రత్యేక సమీక్ష జరపాలని లేఖలో వీహెచ్ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో టీ.కాంగ్రెస్ పై దృష్టి పెట్టాలని ఏఐసీసీ అధ్యక్ష, ఉపాధ్యుక్షులైన సోనియా , రాహుల్ గాంధీలను ఆయన కోరారు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణాకు వచ్చిన ప్రతీసారి ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు పార్టీ వీడుతున్నారని వీహెచ్ లేఖలో పేర్కొనటం విశేషం.

గూడ్స్ రైలును ఢీకొన్న వ్యాగన్ రైలు...

ఖమ్మం : పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఈరోజు ఉదయం గూడ్స్ రైలును వ్యాగన్ ఢీకొట్టింది. కోల్ డంపింగ్ యార్డులో ఖాళీ వ్యాగన్‌ రైలు ఇంజన్ ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాగన్ తీవ్రంగా దెబ్బతినడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

చెరువు పూడిక పనులను ప్రారంభించిన బాబు...

ప్రకాశం : జిల్లాలో పర్యటనలో భాగంగా పంట సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు కుంటలను పరిశీలించారు. అనంతరం చెరువు పూడిక తీతల పనిని ప్రారంభించారు.

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు....

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. గత కొంతకాలంలో ఈ దందాలు నడుపుతున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు నిన్న రాత్రి 13 మంది ముఠా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వున్నారని పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున కరెన్సీ, 3 బైకులు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా సమాచారం.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ-టీడీపీ నేతల భేటీ...

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ-టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఎల్.రమణ,గరికపాటి. రావుల చంద్రశేఖర్ హాజరయ్యారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నేతలు చర్చించనున్నారు. 

నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు...

ప్రకాశం : జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్ళలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు.

వైభవంగా ప్రారంభమయిన రామయ్య పట్టాభిషేకం...

ఖమ్మం : భద్రాచలంలో కొలువైన భద్రాద్రి రాముడికి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. 

ఆందోళన విరమించిన బ్రాండిక్స్ కార్మికులు

విశాఖ :బ్రాండిక్స్ కార్మికులు తమ ఆందోళన విరమించారు.సమస్యల పరిష్కారానికి ఈ నెల 30 వరకు బ్రాండిక్స్ యాజమాన్యం గడువు కోరింది. పీఎఫ్ చెల్లింపు, ప్రభుత్వ నిబందనల ప్రకారం సెలవులు. జీతాల పెంపు వంటి అంశాలపై యాజమాన్యంతో కార్మికుల చర్చలు ఫలించాయి. ఈ నెల 30 లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే మళ్లీ ఆందోలనలు చేపడతామని సిఐటియు నేతలు హెచ్చరించారు.

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ప్రకాశం: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమల్లలో నీరు- చెట్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీ ద్వారకా సెక్టార్ -3లో అగ్ని ప్రమాదం...

ఢిల్లీ : ద్వారకా సెక్టార్ -3లోని సైనిక నగర్ లో భారీ అగ్నిప్రమదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 వాహనాలు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

11:07 - April 16, 2016

ఖమ్మం: భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిలా మండపంలో సీతారామచంద్రుని పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి పట్టాభిషేక క్రతువు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు పలువురు ప్రముఖులు పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

09:57 - April 16, 2016

విజయవాడ: కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాకం వల్లే తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలుగు రాష్టాల్లోని ప్రాజెక్టులను గుదిబండగా మార్చాయని విజయవాడలో అన్నారు. పోలవరం ప్రాజెక్టు లెప్ట్ కెనాల్‌ను 2017 జూన్‌లో పూర్తి చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణంలో కలిసి ముందుకు వెళతామని దేవినేని ఉమ సూచించారు. 

09:55 - April 16, 2016

హైదరాబాద్ :యూనివర్సిటీల్లో విద్యార్థులపై అడుగడుగునా ఆంక్షలు, సస్పెన్షన్ లు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్ సియూలో రోహిత్ ఘటన మరువక ముందే ఇఫ్లూలో దళిత విద్యార్ది సస్పెన్షన్ వివాదస్పదమవుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125 జయంతి వేడుకల్లో పాల్గొంటున్న ఓ దళిత స్కాలర్‌ను మెడ పట్టి లాక్కెళ్లి అవమానాల పాలుచేశారు. యూనివర్సిటీల్లో కొనసాగుతున్న వివక్ష పట్ల విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు.

వర్సిటీలా వివక్షలకు కేంద్రాలా ?.....

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీలో వివక్ష కొనసాగుతోంది. వర్సిటీ యాజమాన్యం ఎంపిక చేసుకున్న వారిపై తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది. తాజాగా కునాల్ దుగ్గల్ అనే ఓ స్కాలర్ విద్యార్థి యూనివర్శిటి ప్రాంగణంలోకి రానివద్దొంటూ సెక్యూరిటికి సర్క్యులర్ జారీ చేశారు ఇఫ్లూ అధికారులు.

అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటున్న సమయంలోనే అవమానం....

ఈ నేపథ్యంలో వర్సిటీలో 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటున్న కునాల్‌ అనే దళిత స్కాలర్‌ను సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చుకెళ్లింది. వేడుకల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇలా జరగడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కునాల్‌ ను వర్సిటీ నుంచి మార్చి 29 నుంచే బహిష్కరించినట్లు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం తెలిపింది. ఇదిలా ఉంటే కునాల్‌ కల్చరల్ స్టడీస్ పిహెచ్ డి కి సంబందించిన రికార్డులు సమర్పించి, వైవా కోసం సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ తనను సస్పెండ్‌ చేయడంపై కునాల్‌ నిశ్చేష్టుడయ్యాడు.

రోహిత్‌ వేముల న్యాయపోరాటంలో చురుగ్గా పాల్గొన్న కునాల్‌......

ఇటీవల రోహిత్ వేముల ఘటనపై జరిగిన కార్యక్రమాల్లో కునాల్ చురుగ్గా పాల్గొవడం వల్లనే యూనివర్శిటీ అధికారులు కక్ష గట్టి ఇలా చేస్తున్నారని వాపోతున్నాడు. తాను చేసిన నేరమెంటో కునాల్‌ చెప్పాలంటున్నాడు. నోటీస్‌ లేకుండా సస్పెండ్‌ ఎలా చేస్తారని నిలదీస్తున్నాడు.

ఇఫ్లూ వ్యవహారంపై పలు విమర్శలు......

ఇటీవల కాలంలో ఇఫ్లూలో జరుగుతున్న పరిణామాలపై సైతం పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. రెండు నెలల క్రితం 13 మంది విద్యార్దుల బహిష్కరించి , ఆ విషయం బయటకు పొక్కగానే తిరిగి విద్యార్దులపై సస్పెన్షన్ ను ఎత్తి వేశారు. కునాల్ దుగ్గల్ లోనికి రానివ్వకుండా అడ్డుకుంటే విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదురుగాక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. 

09:52 - April 16, 2016

తమిళనాట అన్ని పార్టీల చూపు మద్యనిషేధంపై పడింది. మేమంటే మేమంటూ మద్య నిషేదం తెగ హామీలిచ్చేస్తున్నాయి. గతంలో ఉచిత పథకాలతో ప్రభుత్వానికి పడిన గండిని మద్యం రెవన్యూతో పూడ్చిన ద్రవిడ పార్టీలు, ఈ ఎన్నికల్లో అదే మద్యంపై పోరుకు సిద్దమంటూ మహిళా ఓటర్లకు గాలం వేస్తున్నాయి. తమిళనాట వాడివేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో నేతలు మద్య నిషేధం అమలు చేస్తామంటున్నారు.                                       

ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంటుంది....

తమిళనాట ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంటుంది. టాస్మాక్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. దీంతో ప్రభుత్వానికి ఏటా దాదాపు 36 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. దీన్నే ప్రభుత్వం అతిపెద్ద ఆర్ధికనిధిగా తలుస్తూ ప్రతి ఎన్నికల్లో ఉచిత పథకాలను విచ్చలవిడిగా ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వానికి కల్పతరువుగా మారిన మద్యాన్ని నిషేదించాలని కొన్నేళ్లుగా పోరాటం జరుగుతుంది.

ఎన్నికల నేపధ్యంలో మద్య నిషేధంపై కన్నేసిన అన్ని పార్టీలు....

తమిళనాట ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అన్ని పార్టీలు మద్య నిషేధంపై కన్నేశారు. తమిళనాట మొదటగా ప్రచారం ప్రారంభించిన జయలలిత తాను తిరిగి అధికారంలోకి రాగానే విడతల మద్య నిషేదం అమలుకు కృషిచేస్తానని హామి ఇవ్వగా డిఎంకె ఛీప్ కరుణానిధితనదైన శైలిలో స్పందించి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో ప్రధాన అంశం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఎటువంటి ఆలోచనకు తావివ్వకుండానే సంపూర్ణ మద్యనిషేదం అమలు చేస్తామని హామి ఇచ్చారు. అదే సమయం పిఎంకె కూడా మద్యనిషేధం అమలు చేస్తామని హామీ చేసింది.

ఓటు బ్యాంకులో 60 శాతం మహిళలే...

ఓటు బ్యాంకులో 60 శాతం మహిళలు ఉండటంతో ఈ పార్టీలన్నీ మద్యం నిషేధం విధిస్తామని హామీ ఇస్తున్నాయి. మహిళౄ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పార్టీలు చెపుతున్నట్లు మద్య నిషేదం సాధ్యమా.. ఒకవేళ పార్టీలు హామీలు గుప్పించినా మహిళల ఓట్లు చీలకుండా ఒకే పార్టీకి వెళతాయా అన్నది ప్రశ్న. 

వర్ధన్న పేట మండలం బీసీ తండాలో విషాదం

వరంగల్ : వర్ధన్న పేట మండలం బీసీ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ల ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో కులపెద్దలు బాలుడికి రూ.50వేల జరిమానా విధించారు. మరో వైపు డబ్బులు వద్దని తన ప్రియుడితో వివాహం జరిపించాలని మైనర్ బాలిక పురుగుమందు తాగింది. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రాండిక్స్ సంస్థ ఎదుట మహిళా ఉద్యోగులు ఆందోళన

విశాఖ :పీఎఫ్ విషయంలో సంస్థ మోసం చేస్తుందని ఆరోపిస్తూ బ్రాండిక్స్ సంస్థ ఎదుట మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నిన్న నుండి కొనసాగుతుం వీరి ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. పరిశ్రమలోకి ఎవరూ వెళ్లకుండా సిబ్బంది కార్మికులను అడ్డుకుంటున్నారు.

పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచే తీవ్ర ఉక్కపోత ఉంటుందని పేర్కొంది. నేడు కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒడిశాలో నిన్న 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయని... అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.

జపాన్ లో మరోసారి భూకంపం

హైదరాబాద్ : జపాన్‌ వాసులు భూ ప్రకంపనలతో వణికిపోతున్నారు. దక్షిణ జపాన్‌లోని కుమమోటోలో వరుసగా రెండోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది.భూకంపం ధాటికి ఏడుగురు మృతిచెందగా, దాదాపు 400 మందికి పైగా గాయపడ్డారు.

ఎస్వీకే వద్ద అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన రాఘవులు

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీటి సమస్య తీవ్రంగా ఉందని, పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని... పెద్దలకు ఉపయోగపడే ప్రభుత్వం అని రాఘవులు విమర్శించారు.

హైదరాబాద్ స్పైస్ జట్ లో సాంకేతిక లోపం

ఢిల్లీ : హైదరాబాద్ స్పైస్ జట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతి తిరిగి ఢిల్లీలో విమానం ల్యాండైంది.

తాడ్వాయి మావోయిస్టుల దుశ్చర్య

వరంగల్‌ : తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అటవీశాఖ తాత్కాలిక అతిథి గృహం, ఒక జీపును దహనం చేశారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తాత్కాలిక అతిథిగృహం, జీపుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల మావోయిస్టు కమిటీ కార్యదర్శి దామోదర్‌ పేరిట ఘటనా స్థలంలో లేఖ లభ్యమైంది. తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు, అటవీశాఖ రేంజి అధికారి రాజారావు ఘటనాస్థలిని పరిశీలించి లేఖను స్వాధీనం చేసుకున్నారు.

08:58 - April 16, 2016

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనాచౌదరి కుమారుడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో అర్థరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుజనాచౌదరి కుమారుడు కార్తీక్‌ ర్యాష్‌ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కార్తీక్‌తో పాటు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్న మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ర్యాష్‌ డ్రైవ్‌ చేసిన కార్తీక్‌ కారును పోలీసులు సీజ్‌ చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. కారు నెంబర్‌ ఏపీ 09సీవీ 9699 నెంబర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలించగా..అది సుజనా యూనివర్సల్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ర్యాష్‌ డ్రైవ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ కార్తీక్‌పై ట్రాఫిక్‌ పోలీసులు...ఐపీసీ సెక్షన్‌ 184 (బి) కింద కేసు నమోదు చేశారు.  

08:56 - April 16, 2016

హైదరాబాద్ : సచివాలయంలో ఫైళ్లు పేరుకు పోతున్నాయి. సీఎం, ఆయన కార్యదర్శులు సెక్రటేరియట్ వంక రాకపోవడంతో..వేల సంఖ్యలో ఫైళ్లు సీఎం టెబుల్ మీద మూలుగుతున్నాయి. దీంతో ఫైళ్లు పంపిన అధికారులు నెలల తరబడి వేచి చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

క్యాంపు ఆఫీసుకే పరిమితం అవుతున్న సీఎం కేసీఆర్‌......

సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం నుంచే అన్నిపనులు చక్క బెడుతున్నారు. మంత్రిత్వ శాఖలపై సమీక్ష సమావేశాలను సైతం అక్కడ నుంచే నిర్వహిస్తున్నారు. అతి ముఖ్యమైన ఫైళ్లను సైతం క్యాంప్‌ ఆఫీసుకే తెప్పించుకుంటున్నారు. ఇదిలా సీఎం ఆమోదం కోసం పంపే ఇతర ఫైళ్లు మాత్రం సచివాలయంలోనే మూలుగుతున్నాయి.

ఫైళ్ల ట్రాకింగ్ కోసం బార్‌ కోడింగ్‌ ........

ఫైళ్ల ట్రాకింగ్ కోసం ఇరిగేషన్ వంటి శాఖల్లో బార్ కోడింగ్‌ వాడుతున్నారు. ఏ ఫైల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అదే సీఎం పేషిలో అలాంటి వ్యవస్థ లేకపోవడంతో అది సీఎం టేబుల్ మీదకి చేరిందా లేదా అన్న సంగతే తేలటం లేదు.

సచివాలయం రావడం మానేసిన సీఎం కేసీఆర్‌.........

ఇక కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి సచివాలయానికి పెద్దగా ప్రాముఖ్యత నివ్వలేదు. అత్యవసరమైతే తప్ప సచివాలయానికి రావట్లేదు. సీఎం కార్యదర్శులు కూడా సీఎంగా లాగనే సచివాలయాలనికి రావడం తగ్గించారు. ప్రిన్సిపల్ సెక్రటరి నరసింగరావు మొదలు అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి వరకు అధికారులు సైతం సీఎం క్యాంప్‌కు పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే పలు శాఖల కార్యదర్శులకు సీఎం సహాయకార్యదర్శులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సీఎం వద్ద ఫైల్ ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదు. రెండు మూడు సార్లు రిమైండర్ లెటర్స్ రాసినా పట్టించుకోవడం లేదు.

గతంలో పది పదిహేను రోజుల్లోనే ఫైల్స్‌ క్లియర్‌....

గత ప్రభుత్వాల హయంతో పది పన్నెండు రోజుల్లో ఫైల్లు క్లియర్ అయ్యే వని...అదే ఇప్పుడు ఆరు నెలలకు మించి పడుతుందని అధికారులు వాపోతున్నారు. చిన్నవి, పెద్దవి కలిపి కనీసం 6 వేల ఫైల్స్ సీ ఎం సంతకం కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం. జాప్య నివారణకు చర్యలు చేపట్టకపోతే పాలన పడకేయడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

08:51 - April 16, 2016

ముంబై : అలనాటి బాలీవుడ్‌ హీరో దిలీప్‌కుమార్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. 93 ఏళ్ల వయసున్న ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ చిత్రపరిశ్రమలో చేసిన కృషికిగాను ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును కూడా తీసుకున్నారు. 'ట్రాజెడీ కింగ్‌ ' గా పేరొందిన దిలీప్‌కుమార్ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 'కిషోర్‌కుమార్ జాతీయ అవార్డు ' ను అందుకున్నారు.

08:48 - April 16, 2016

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ షో...దేశంలోని వివిధ నగరాల మీదుగా హైదరాబాద్ నగరానికి చేరింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే పోటీకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ పోటీలో మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆతిథ్య సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ రెండురౌండ్లు ఆడి ఒక్కో గెలుపు, ఓటమితో నైట్ రైడర్స్ ఉంటే...రాయల్ చాలెంజర్స్ చేతిలో కంగుతిన్న సన్ రైజర్స్ విజయమే లక్ష్యంగా సమరానికి సిద్ధమయ్యాయి.

08:47 - April 16, 2016

హైదరాబాద్ : పోలీసులను చూస్తే ఎవరికైనా భయమే..ఏ కేసుపెట్టి జైల్లో కొడతారేమోనని...అలాంటి పోలీసులనే కొట్టబోయాడు ఓ ఐదేళ్ల బుడ్డోడు. తన వీరావేశంతో బెదిరించాడు కూడా ..చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. చైనాలో రోడ్డు పై షాప్‌పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అలా ఈ బుడ్డోడి తల్లిదండ్రుల షాప్ ను ఖాళీ చెయ్యమంటే , కోపం పట్టలేకపోయాడు. తన స్టైల్లో పోలీసులను కొట్టాడు. ఎందుకు ఖాళీ చెయ్యాలన్నట్లు, రెచ్చిపోయాడు.

భద్రాద్రి రాముడికి నేడు పట్టాభిషేకం

ఖమ్మం :భద్రాద్రి రాముడికి ఇవాళ పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు భద్రాచలం చేరుకుని మధ్యాహ్నం జరిగే పట్టాభిషేకంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. 

ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి గంటా

తిరుమల : మంత్రి గంటా శ్రీనివాస్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాతూ.. ఏపీని నాలెడ్జ్ హబ్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్నా విద్యకోసం రూ.21 వేల కోట్లు కేటాయించమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 3336 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అంగన్ వాడీ సెంటర్లలో ఎల్ కేజీ, యూకేజీ స్కూళ్లు, జూన్ లో 10వేల టీచర్ల అపాయింట్ మెంట్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

07:41 - April 16, 2016

ఈ వేసవి లో భానుడు తన వేడిమి తీవ్రతను చూపించడం ప్రారంభించాడు. భానుడి ప్రతాపం నుండి తట్టుకోవాలంటే తాటిజముంజలు ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో విరివిగా లభించే తాటిముంజల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. సమ్మర్‌లో మాత్రమే దొరికే కూలింగ్‌ ప్రూట్స్‌లో తాటిముంజలు కూడా ఒకటి. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు ... అందానికి ఎంతో మేలుచేస్తాయివి. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఐస్‌ ఆపిల్‌ అంటారు. ఈ ఐస్‌ ఆపిల్‌లో బోలెడు హెల్త్‌ బెనిఫిట్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఉండే ఈ తాటిముంజ జ్యూసీ లిచీ ఫ్రూట్‌లా ఉంటుంది రుచి తాజా లేలేత కొబ్బరి బోండాం టేస్ట్‌ కలిగి ఉంటుంది. సీజన్‌లో వచ్చే ఫలాలని, వాటి రసాలని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

పళ్ళల్లో అనేక విటమిన్లు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉండటమేకాకుండా పిండిపదార్థాలు 5నుంచి 20శాతం వరకు ఉంటాయి. పైగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌లు సమపాళ్ళలో ఉండటం, ఆర్గానిక్‌ ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల వేసవి తాపం కారణంగా శక్తి నశించిన వారికి వెంటనే చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి.

తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుం డా తినటం ఒక సరదా... వేసవిలో ప్రత్యేకం గా లభించే తాటిముంజలు, పుచ్చ కాయలు ప్రజలు భానుడి తాపన్ని తట్టుకునేందుకు అత్యంత ప్రియంగా వీటిని తింటారు. అదేవిధంగా శీతాల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది.

రక్తంలో పేరుకుపోయే కొవ్వుని తగ్గించడమే కాకుండా గుండెపోటుని తగ్గించే రసాయనాలు ఫలాలలో ఉన్నాయి.

క్యాన్సర్‌ కారకాలను తగ్గించడంలో ఫలాలు ముందుంటాయి.

చర్మం ఆరోగ్యవంతంగా తయారుకావటానికి.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పండ్లు ఉపయోగపడతాయి.

వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అతిసారం తదితర వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు పండ్లు ఉపయోగపడతాయి.

శరీరంలోని పొటాషియం, సోడియం తదితర రసాయనాలను నేరుగా రక్తంలో కలిసేలాచేస్తాయి పళ్ళు.

మధుమేహంతో బాధపడేవారు సైతం పళ్ళని తీసుకుంటే మంచిది.

వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నిధానంగా లివర్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు.

07:32 - April 16, 2016

హైదరాబాద్ : ఎలినినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని ఎండలు మనం ఇపుడు చూస్తున్నాం. దీంతో ప్రజలు తీవ్ర కరువు పరిస్థితిని ఎదురుకుంటున్నారు. కరువు పై వెంటనేఅ ఖిల పక్షం ఏర్పాటు చేసి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఏప్రిల్‌లోనే అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడడంతో సాగు, తాగునీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారన్నారు. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? కరువు లేనట్లు ప్రభుత్వం నటిస్తోందా? కరువు పరిస్థితులను వివరించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయా? బీవరేజెస్, కోలా కంపెనీలకు నీరు ప్రభుత్వం ఎలా కేటాయిస్తున్నారు? నీటి కరువు దెబ్బకి ఐపీఎల్ క్రిక్ ట్ కూడా పరారయ్యిందా? వసలు నివారణ, ఉపాధి పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్' చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు వినయ్ కుమార్, టి.కాంగ్రెస్ నూత కైలాష్, బిజెపి నేత రాకేష్ రెడ్డి, టిఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు అస్వస్థత

ముంబై : బాలీవుడ్ నటుడు దిలీప్(93) కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఆసీస్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఆడమ్‌

సిడ్నీ: ఆసీస్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఆడమ్‌ గ్రిఫిత్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా నియమించింది. జూన్‌లో వెస్టిండీస్‌లో నిర్వహించే దక్షిణాఫ్రికా, విండీస్‌ సిరీస్‌కు గ్రిఫిత్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉంటారు. ఆయనతో పాటు ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ గ్రేమ్‌ హిక్‌ను సహాయక కోచ్‌గా నియమించింది. వెస్టిండీస్‌ సిరీస్‌కు ఇన్‌ఛార్జ్‌ అయిన జస్టిన్‌ లాంగర్‌కు హిక్‌ సహాయంగా ఉంటారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2గంటల సమయం పడుతోంది. 

మరో నాలుగు రోజులు వడగాల్పులు

హైదరాబాద్ : రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా వడగాల్పులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ వాతావరణ నమోదు కేంద్రాల్లో రికార్డయిన ఉష్ణోగ్రతల ప్రకారం.. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోకెల్లా నిజామాబాద్‌లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు, అనంతపురంలలో 44, రామగుండం, రెంటచింతలలో 43, హైదరాబాద్, నందిగామలలో 41, తిరుపతిలో 40, నెల్లూరు, తుని, గన్నవరంలలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

కారు రేసింగ్.. పట్టుబడ్డ కేంద్రమంత్రి కుమారుడు

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో గత అర్థరాత్రి కారు రేసింగ్ చేస్తూ ఓ కేంద్ర మంత్రి కుమారుడు కార్తీక్ పట్టుబడ్డాడు. కారు నెం ఎపి09.సియు.9699, కార్తీక్ తో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రేపే ఎస్ఐ రాత పరీక్ష

హైదరాబాద్: సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ విభాగాల్లోని 539 ఎస్‌ఐ పోస్టులకు దాదాపు రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోలీసు శాఖ తొలిసారిగా నిర్వహించనున్న ఈ పరీక్ష పారదర్శకంగా జరిగేలా రిక్రూట్‌మెంట్ బోర్డు పటిష్ట చర్యలు తీసుకుంది. ఎలాంటి అవకతవకల్లేకుండా చూసేందుకు అభ్యర్థుల వేలిముద్రలు స్వీకరిస్తోంది. ఇందుకోసం అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు సూచించింది.

06:42 - April 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి తనిఖీల ఒత్తిళ్లు, మరోవైపు ఆర్ధిక సమస్యలతో కాలేజీల యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. వైఫల్యం ఎవరిదైనా విద్యార్ధులు మాత్రం భారీ స్థాయిలో నష్టపోయే సూచనలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జేఎన్ టియూ కాలేజీల జాబితా నుంచి ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి.                                                                                        

ఇంజనీరింగ్ కాలేజీల్లో దిగజారుతున్న ప్రమాణాలు...

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఓవైపు ఇంజనీరింగ్‌ కాలేజీలపై ప్రభుత్వం తనిఖీల పేరుతో కఠినంగా వ్యవహరించడం, మరోవైపు కోలుకోకుండా చేస్తున్న ఆర్ధిక సమస్యలు యాజమాన్యాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే కొన్ని యాజమాన్యాలు రేసు నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకుంటున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే జేఎన్టీయూ కాలేజీల జాబితా నుంచి 58 ఇంజనీరింగ్‌ కాలేజీలు తప్పుకున్నాయి.

జేఎన్ టియూ అఫిలియేషన్‌లేని కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి లేదు......

జేఎన్‌టీయు అనుబంధంగా ఉన్న బీటెక్ కాలేజీలన్నీ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. నిబంధనల ప్రకారం వర్సిటీ అఫిలియేషన్ లేని ఆ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు. గుర్తింపునకు దరఖాస్తు కోసం జేఎన్టీయూ` ఈ ఏడాది ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 20 వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయితే 266 కాలేజీలకుగాను 208 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

58 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు.....

మిగిలిన 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. ఈ కాలేజీల జాబితాను జేఎన్టీయూ బహిర్గతం చేసింది. దీంతో ఈ కాలేజీలకు నోటీసులు జారీచేసి, చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంజనీరింగ్‌ సెకండ్‌, థర్డ్‌, ఫోర్త్‌ ఇయర్‌ కోర్సులు నడుస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 7 వేల మంది విద్యార్థుల వరకు ఉంటారు. ఈ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం వుంది.

58 కళాశాలలు జేఎన్ టియూ అఫిలియేషన్ తీసుకునేందుకు నిరాకరిస్తే.....

ఈ కాలేజీలు జేఎన్టీయూ అఫిలియేషన్ తీసుకునేందుకు నిరాకరిస్తే ఇప్పటికే కాలేజీలో చదువుతున్న వారిని ఇతర కాలేజీల్లో చేర్చేందుకు సిద్దమవుతోంది జెఎన్‌టీయూ . లక్షా 26 వేల 468 సీట్లు అందుబాటులో ఉండగా 51 వేల 621 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్‌కు 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ కాలేజీల్లో ఉన్న 20 వేల సీట్లు తగ్గే అవకాశం ఉంది.

జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో నిర్వహిస్తున్న తనిఖీలు.....

ప్రభుత్వ ఆదేశాలతో జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో నిర్వహిస్తున్న తనిఖీలు.. మరో వారంలో పూర్తికానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలపై కొరడా ఝుళిపించనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మరిన్ని కాలేజీలు మూతపడి సీట్ల సంఖ్యలో కొతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

06:38 - April 16, 2016

హైదరాబాద్ : టెట్‌ అభ్యర్థులకు వింత పరీక్ష ఎదురైంది. ఓవైపు టెట్‌ పరీక్ష.. మరోవైపు ఇన్విజిలేషన్‌ విధులు.. రెంటిలో దేన్ని తేల్చుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడ్డారు. మామూలుగానే పరీక్షలు అనగానే అభ్యర్ధులు మానసికంగా ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఓ పరీక్ష తర్వాత ఇంకో పరీక్ష ఉందంటే మరింత టెన్షన్‌ పడుతుంటారు. అలాంటిది పరీక్షా.. విధి నిర్వహణా అన్నది తేల్చుకోవాల్సిరావడంతో.. టెట్‌ అభ్యర్థులు హైరానా పడిపోతున్నారు.

మే 1న టెట్‌ పరీక్ష.. రెండో తేదీన ఎంసెట్‌ ఎగ్జామ్స్‌..

మే 1న టెట్‌ పరీక్ష.. రెండో తేదీన ఎంసెట్‌ ఎగ్జామ్స్‌.. తెలంగాణ ప్రభుత్వం ముందే ప్రకటించిన షెడ్యూలిది. ఇదిప్పుడు టెట్‌ అభ్యర్థులకు విషమ పరీక్షగా మారింది. టెట్‌ పరీక్ష రాసే అభ్యర్థుల్లో చాలా మంది.. మర్నాటి ఎంసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ఇన్విజిలేటర్లుగా వెళ్లాల్సి ఉంది. దీంతో.. పరీక్ష పూర్తి చేసుకుని.. ఎంసెట్‌ ఇన్విజిలేషన్‌కు వెళ్లగలుగుతామా అన్న సంశయం టెట్‌ అభ్యర్థుల్లో నెలకొంది.

రాష్ట్రంలో పీజీ పూర్తి చేసుకున్న వందల మంది విద్యార్ధులు....

రాష్ట్రంలో పీజీ పూర్తి చేసుకున్న వందల మంది విద్యార్ధులు.. ఎంసెట్ ఇన్విజిలేషన్‌ కోసం.. దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ నాటికి టెట్‌ పరీక్ష తేదీలు రాకపోవడంతో.. వీరంతా ఇన్విజిలేషన్‌ విధుల నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే.. ప్రభుత్వం ఇప్పుడు టెట్‌ను మే ఒకటినే నిర్వహించనుండడంతో.. ఇన్విజిలేషన్‌కు దరఖాస్తు చేసుకున్న టెట్‌ అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు.

టెట్ పరీక్ష రాసేందుకు చాలామంది అభ్యర్ధులు తమ సొంత ప్రదేశాలకు....

ఇప్పటికే టెట్ పరీక్ష రాసేందుకు చాలామంది అభ్యర్ధులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చి ఎంసెట్ ఎంట్రెన్స్‌ ఇన్విజిలేషన్‌కి చేరుకోవడమంటే.. అంత తేలిక కాదని అంటున్నారు. రెండు పరీక్షల మధ్య ఒక్కరోజైనా వ్యవధి ఉంటే అటు పరీక్షకు.. ఇటు ఇన్విజిలేషన్ కు అవకాశం ఉండేదని అభ్యర్థులు వాపోతున్నారు.

టెట్ అభ్యర్ధులు నష్టపోయే వీలు...

ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల టెట్ అభ్యర్ధులు నష్టపోయే వీలుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్ష తేదీని సవరించాలని వారు కోరుతున్నారు. 

06:35 - April 16, 2016

విజయవాడ : అధికార పక్షం ఆపరేషన్‌ ఆకర్ష్‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలను లాగడంలో టీడీపీ మాంచి దూకుడుమీద ఉంది. మరోవైపు వైసీపీపై విమర్శలు చేయడంలోనూ టీడీపీ నేతలు అదే జోరును ప్రదర్శిస్తున్నారు. జగనే లక్ష్యంగా మాటల దాడి పెంచుతున్నారు.                                                                      

వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలిపై నమ్మకం లేకనే .....

వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలిపై నమ్మకం లేకనే వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పార్టీలో జగన్‌ ఒక్కడే మిగులుతాడని ఎద్దేవా చేశారు.

వైసీపీ మునిగిపోతున్న నావ అని మంత్రి రావెల...

వైసీపీ మునిగిపోతున్న నావ అని మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. వైసీపీలో ఉండటానికి ఎవరూ ఇష్టపడడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రగతిని కోరుకుంటున్న నేతలే టీడీపీలో చేరుతున్నారని రావెల అన్నారు.

వచ్చే నెలాఖరునాటికి వైసీపీ దుకాణాన్ని మూసివేత...

వచ్చే నెలాఖరునాటికి వైసీపీ దుకాణాన్ని మూసివేసుకోవాల్సి వస్తుందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. జగన్‌ నాయకత్వంపై నమ్మకంలేక ఆ పార్టీ ఎమ్మెలు వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్నారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మినహా... వైసీపీ నుంచి ఎవరు వచ్చినా టిడిపి లో చేర్చకుంటామని చెప్పుకొచ్చారు ఒకవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ..మరోవైపు ఆ పార్టీ అధినేతే లక్ష్యంగా విమర్శలు చేస్తూ అధికార పక్షం మొత్తానికి ద్విముఖ వ్యూహాన్ని పక్కగా ఫాలో అవుతోంది. 

06:30 - April 16, 2016

హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కుదేలైన తెలంగాణ టీడీపీకి... ఇప్పుడు మరో ముప్పు పొంచివుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల బాటలోనే పార్టీ నేతలు నడిచే అవకాశం ఉందని అనుమాస్తున్నారు. చాలా మంది తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వైపు కన్నెత్తి చూడకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. కొంతమంది టీ టీడీపీ నేతలు ఇతర పార్టీల నుంచి ఆఫర్ల కోసం వేచి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు పార్టీ నేతల వంతు .....

ఎమ్మెల్యేల వంతు అయిపోయింది. ఇప్పుడు పార్టీ నేతల వంతు వచ్చింది. తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం నెలకొన్న వింతపరిస్థితి ఇది. కొద్దో, గొప్పో ప్రజాదరణ ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

2014లో తెలంగాణలో 15 ఎమ్మెల్యేల గెలుపు ....

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విసిరిన రాజకీయ పునరేకీకరణ అస్త్రంతో అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. గులాబీ కండువా కప్పుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన ఆపరేషణ్‌ ఆకర్ష్‌లో భాగంగా 12 మంది శాసనసభ్యులు గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఎవరిదారి వారు చూసుకునే ఏర్పాట్లలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్న టీ టీడీపీ నేతలు....

పార్టీ నేతల్లో చాలా మంది టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వైపు కన్నెత్తి చూడటంలేదు. కొందరు అధికార టీఆర్‌ఎస్‌ వైపు చూస్తుంటే, మరికొందరు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఆఫరో, ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవో ఇస్తే అధికార టీఆర్‌ఎస్‌లోకి దూకేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే కాంగ్రెస్‌లో చేరేందుకైనా సంసిద్ధత వ్యక్తం చేసే నేతలు కూడా మరికొందరు ఉన్నారని వినిపిస్తోంది.

నేతల మధ్య సమన్యయ లోపంతో కార్యకర్తల్లో నైరాశ్యం.....

తెలంగాణ టీడీఎల్‌పీ నేత రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, ఇతర నాయకులు ఒకదారిలో వెళుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులుది మరోదారి. పార్టీలో ఉన్న నేతలే తక్కువ. వీరిలో కూడా సమన్వయం లోపించడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. వీరికి ధైర్యం చెప్పే నాయకులే లేకపోవడంతో కార్యకర్తలు కూడా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా పార్టీకి బలమైన నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ లేకపోవడంతో తెలంగాణ టీడీపీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నేటి నుండి తెలంగాణ లో వేసవి సెలవులు...

హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో షెడ్యూల్‌ కన్నా ముందుగానే సెలవులను ప్రకటించారు. జూన్‌ 13న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. 

06:25 - April 16, 2016

ఖమ్మం :భద్రాద్రి రాముడికి ఇవాళ పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు భద్రాచలం చేరుకుని మధ్యాహ్నం జరిగే పట్టాభిషేకంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. 

06:22 - April 16, 2016

అభిజీత్‌, రేష్మ జంటగా విజరు శ్రీనివాస్‌ దర్శకత్వంలో శ్రీచరణ్‌ కార్తికేయ మూవీస్‌ పతాకంపై ఏ.శోభారాణి, ఆళ్ళ నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జీలకర్రబెల్లం'. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతమం దించిన ఈ సినిమా పాటలను గురువారం హైదరాబాద్‌లో ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆళ్ల నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ, 'నేటి యువతకు చదువు, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి. ఏడడుగులు వేసి పెళ్ళి చేసుకున్న వారు ఎనిమిదో అడుగు వేసి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని మంచి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఆడియోను ఆవిష్కరించిన ఎం.పీ కవితగారికి థ్యాంక్స్‌. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. దర్శకుడు విజరు శ్రీనివాస్‌ చెబుతూ, 'దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. వందేమాతరం శ్రీనివాస్‌ మంచి బాణీలను అందించార'ని చెప్పారు. 'ఈ చిత్రానికి సంగీతమందించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో తెరపై చూడడానికి ఇంకా బాగుంటాయి' అని వందేమాతరం శ్రీనివాస్‌ తెలిపారు.

06:13 - April 16, 2016

నాని, సురభి, నివేదా థామస్‌ హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'జెంటిల్‌మన్‌' టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ, 'నాని, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'జెంటిల్‌మెన్‌' టైటిల్‌ను ఫైనల్‌ చేశాం. ఇదొక అందమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రం. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఆహ్లాదకరమైన రొమాన్స్‌, సెంటిమెంట్‌, వినోదం తగిన మోతాదులో మేళవించి సినిమాను రూపొందిస్తున్నాం. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మణిశర్మ మంచి సంగీతాన్ని అందించారు. పాటలను త్వరలో విడుదల చేయనున్నాం. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం' అని అన్నారు. అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్‌, ఆనంద్‌, రోహిణి, సత్యం రాజేష్‌, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీనాయర్‌, శ్రీముఖి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: పి.జి.విందా, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

06:07 - April 16, 2016

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటిస్తోన్న మూవీ సరైనోడు. శ్రీరామ నవమి విషెస్ చెబుతూ ఉన్న పోస్టర్ ను అల్లుఅర్జున్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లుఅర్జున్,రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సరైనోడు ఈ నెల 22న విడుదల కానుంది.

06:05 - April 16, 2016

ముంబై: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రుస్తుం’ చిత్రం చిత్రీకరణ పూరైంది. అక్షయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఓ ఓడలోని ఇనుప కడ్డీకి నౌకాదళ అధికారి ధరించే క్యాప్‌ తగిలించి ఉంది. ‘ఇది క్యాప్‌కు విశ్రాంతి ఇచ్చే సమయం, ఎందుకంటే.. చిత్రీకరణ నేటితో పూరైంది’ అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. ఫ్రైడేస్‌ ఫిలిం వర్క్స్‌ పతాకంపై టీనూ దేశాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కి జోడీగా ఇలియానా నటించారు. ఒక నౌకాదళ అధికారి దేశం కోసం పోరాడిన అంశం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆగస్టు 12న ‘రుస్తుం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

05:59 - April 16, 2016

ఈమధ్యకాలంలో అగ్ర హీరోల ట్రెండ్‌ మారింది. కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే పరిమితమైపోకుండా ఇతర భాషా చిత్రాల్లోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఒకే సమయంలో రూపొందే ద్విభాషా, త్రిభాషా చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. దీంట్లో భాగంగా రవితేజ సైతం బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే బాలీవుడ్‌ నుంచి పలు ఆఫర్స్‌ వస్తున్నాయని, అయితే వాటిల్లో 'కీ అండ్‌ కా' లేదా 'కపూర్‌ అండ్‌ సన్స్‌' వంటి స్క్రిప్ట్స్‌ దొరికితే నటించేందుకు తానెప్పుడూ సిద్ధమేనని రవితేజ తెలిపారు. తెలుగులో మాత్రం పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలే చేస్తానని, బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినప్పటికీ తెలుగుకే ఫస్ట్‌ ప్రయారిటీ అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిం చేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారాయన.

Don't Miss